Activities calendar

24 June 2017

22:18 - June 24, 2017

నాలుగు దశాబ్ధాలుగా ఓ కుటుంబాన్ని విధి ఆడుకుంటుంది. కష్టాలు వెంటాడుతున్నాయి. నిండు కుటుంబంలో జరుగుతున్న ఒక్కో ఘోరం.. కన్న పేగును పిండేస్తున్నాయి. అన్నింటినీ ఎదుర్కుంటూనే కాలం వెల్లదీస్తున్న ఆ దంపతులు ఇప్పుడు వృద్ధాప్యం చేరుకున్నారు. అయినా వారి రెక్కాడితేనే డొక్కాడేది.. సమస్యల సుడిగుండంలో సంసార నావను నడుపుకుంటూ వచ్చిన ఆ దంపతులను మాత్రం విధి పగ బట్టింది. కన్న కొడుకు, కూతురు కళ్ల ముందే చనిపోయారు. కృంగిపోతున్న ఆ ముసలి గుండెకు మరోగాయమైంది. ఎప్పుడేమౌతుందో తెలియదు. శ్వాస పీల్చేందుకు భయంతో వణుకుతున్న ఆ దంపతుల పరిస్థితిని తెలుసుకుని కలుసుకుంది టెన్ టివి. ఆకలితో అల్లాడుతూ ఒకే ఒక ఆశతో బతుకుతున్న వారిలో ధైర్యాన్ని నింపింది టెన్ టివి. ఇది కథకాదు ఏ రియల్ స్టోరీ .. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - June 24, 2017

పోర్చుగల్ : మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోర్చుగల్‌ చేరుకున్నారు. లిస్బన్‌ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. పోర్చుగీసు ప్రధాని ఆంటానియో కోస్టాతో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల నేతల మధ్య ప‌లు విష‌యాల‌పై ఒప్పందాలు జ‌ర‌గ‌నున్నాయి. అక్కడి నుంచి మోది అమెరికా వెళ్లనున్నారు.  రెండు రోజులపాటు మోదీ అమెరికాలో పర్యటిస్తారు. జూన్‌ 26న ప్రధాని మోది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటి అవుతారు.  ట్రంప్‌ హెచ్‌-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

21:57 - June 24, 2017

ఢిల్లీ : జులై 17 నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరిపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. జులై 17న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ జరగనుంది. 

 

21:54 - June 24, 2017

పశ్చిమగోదావరి : దళితులు.. అగ్రవర్ణాల మధ్య ఘర్షణతో పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామం యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. అగ్రవర్ణాల కులబహిష్కరణతో బహిష్కరణకు గైరన దళితులు..అగ్రవర్ణాలపై మండిపడుతున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలలుగా తమను బహిష్కరించిన అగ్రవర్ణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బహిష్కరణకు వ్యతిరేకంగా రేపు ఛలో గరగపర్రుకు దళిత, ప్రజా సంఘాలు పిలుపునివ్వగా..ఇదే అంశంపై స్పందించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విచారణకు ఆదివారం గ్రామంలో విచారణ జరపనుంది. 
దళితులు, అగ్రవర్ణాల ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామం దళితులు, అగ్రవర్ణాల ఆందోళనలతో అట్టుడికిపోతుంది. దళితులపై అగ్రవర్ణాలు విధించిన కులబహిష్కరణకు వ్యతిరేకిస్తూ దళితులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గరగపర్రు గ్రామంలోని దళితులకు జరిగిన అన్యాయాన్ని 10టీవీ మూడు రోజుల క్రితం వెలుగులోకి తీసుకురాగా..దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.  
విచారణను వ్యతిరేకించిన దళితులు
అయితే శనివారం ఉదయం ఉండి ఎమ్మెల్యే కల్వపూడి శివ, పాలకొల్లు తహశీల్దారు గ్రామాన్ని సందర్శించి విచారణ ప్రారంభించగా.. దళితులంతా విచారణను వ్యతిరేకించారు. రెండు నెలల క్రితం..అగ్రవర్ణాలు తమను బహిష్కరించగా..ఇన్ని రోజులుగా గ్రామాన్ని సందర్శించకుండా ఏం చేశారని ఎమ్మెల్యేను, తహశీల్దారును దళితులు ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా బహిష్కరణకు కారణమైన..భూస్వామి బలరామరాజును వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే గ్రామానికి ఎస్సీ, ఎస్టీ, దళిత, ప్రజా సంఘాలు, వామపక్షాలు, కేవీపీఎస్‌ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో గాంధీ  
ఆ తర్వాత..నర్సాపురం ఆర్డీవో గాంధీ కూడా గ్రామాన్ని సందర్శించి విచారణకు ఒప్పుకోవాలని దళితులను కోరారు. అయితే అప్పటికే అక్కడికి వచ్చిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌..అధికారులతో వాగ్వావాదానికి దిగారు. దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేసిన బలరామరాజును అరెస్ట్‌ చేయడంతో పాటు దళితులపై విధించిన బహిష్కరణను వెంటనే ఎత్తివేయాలని వారికి గ్రామంలో పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులపై విధించిన బహిష్కరణకు వ్యతిరేకంగా ఆదివారం ఛలో గరగపర్రుకు పిలుపునిచ్చామన్నారు హర్షకుమార్‌. 
గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ 
గరగపర్రు గ్రామంలో దళితుల బహిష్కరణపై ఆలస్యంగా స్పందించిన జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌ ఎట్టకేలకు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వీధులన్నీ తిరిగి వాస్తవ పరిస్థితులను దళితులను అడిగి తెలుసుకున్నారు. అయితే గ్రామంలోని దళితుల ఇళ్లల్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించారని ప్రభుత్వం చెప్పుకుంటోందని అదంతా అవాస్తవమని దళితులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అయితే దళిత వాడల్లోని వాస్తవ పరిస్థితిని గమనించిన కలెక్టర్‌..త్వరలోనే దళితులందరికి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత దళితులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌, దళిత, ప్రజా సంఘాల నాయకులు కత్తి పద్మారావుతో పాటు  కేవీపీఎస్‌, సీపీఎం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..దళితులపై విధించిన బహిష్కరణను వెంటనే ఎత్తివేయడంతో పాటు..అగ్రకుల నాయకుడు బలరామరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
అగ్రవర్ణాలు పెద్ద ఎత్తన ఆందోళన 
ఇదిలా ఉంటే మరోవైపు గరగపర్రులో అగ్రవర్ణాలు పెద్ద ఎత్తన ఆందోళనకు దిగారు. భీమవరం-తాడేపల్లిగూడెం రోడ్డుపై అగ్రవర్ణాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోడ్డు పొడవునా టెంట్లు వేయడంతో  పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి టెంట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులకు అగ్రవర్ణాలకు మధ్య తీవ్ర వాగ్వావాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్‌పై అగ్రవర్ణాల నాయకులు దాడికి దిగడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు గరగపర్రులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆదివారం విచారణ జరుపనున్నారు. ఈ విచారణకు జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌, ఎస్పీ హాజరుకానున్నారు. 

 

21:43 - June 24, 2017

రంగారెడ్డి : బోరుబావిలో మృత్యువుతో పోరాడుతోన్న చిన్నారి మీనాను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందానికి ఓఎన్జీసీ అధికారులు తోడయ్యారు. బాలికను బయటకు తీసేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అధికారులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చిన్నారి బోరుబావి నుంచి బయటపడటం లేదు. దీంతో గంటగంటకూ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది.
చిన్నారిని చెరవీడని బోరుబావి
నిమిషాలు గంటలయ్యాయి...గంటలు రోజులుగా మారాయి...చిన్నారిని చెరవీడని బోరుబావి. రెండు రోజులుగా ఫలించని అధికారుల ప్రయత్నాలు. ఏడ్చిఏడ్చి కన్నవారి కన్నీరు ఇంకిపోయింది. రాష్ట్ర ప్రజల గుండెలు బాధతో బరువెక్కాయి. అందరిదీ ఒకే ఆశ. బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా బయటకురావాలన్న ఆకాంక్ష. 
చిన్నారి బోరుబావిలోపడి రెండు రోజులు 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో చిన్నారి మీనా బోరుబావిలోపడి రెండు రోజులు గడిచిపోయాయి. అయినా ఇంతవరకు పాప మాత్రం బోరుబావిలోనే ఉండిపోయింది. మరోవైపు గంటలు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రులతోపాటు ప్రజల్లోనూ అంతకంతకు ఆందోళన పెరుగుతోంది. బాలిక ప్రాణాలతో బయటకు క్షేమంగా వస్తుందన్న ఆశలు అడుగంటుతున్నాయి. చిన్నారికోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. 
చిన్నారిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు 
బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి సహాయ చర్యలు నిరాటంకంగా సాగుతున్నాయి. అయితే చిన్నారిని బయటకు తీసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుండడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో అధికార యంత్రాంగం మల్లగుల్లాలుపడుతోంది.
తీవ్రంగా శ్రమిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు  
రెండు రోజులుగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. శనివారం వారికి ఓఎన్జీసీ అధికారులు తోడయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని తమదైన శైలిలో చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.  బోరుబావిలోకి 200 అడుగుల మేర వాటర్‌ ప్రూఫ్‌ కెమెరాను పంపారు. అంత లోతులోనూ చిన్నారి జాడ కనిపించలేదు. దీంతో ముందు నీటిని తోడేయాలని  డిసైడ్‌ అయ్యారు. దీంతో బోరుబావిలో సూపర్‌ జెట్‌ మోటార్‌ దించి నీటిని తోడేస్తున్నారు. మరోవైపు  డెమో లిఫ్ట్‌ద్వారా చిన్నారిని పైకి లాగేందుకు అధికారులు చేసిన  ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాలేదు. చిన్నారి జాడ కనిపించకపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతుండడంతో పాప మట్టిలో కూరుకుపోయిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రెస్క్యూటీమ్‌ కూడా ఆ దిశగా ప్రత్యామ్నాయ చర్యలను ముమ్మరం చేసింది. పాపను బయటకు తీసేవరకు సహాయ చర్యలు కొనసాగుతాయని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా బోరుబావిలో చిక్కుకుపోయి చావుబతుకుల మధ్య పోరాడుతోన్న చిన్నారి క్షేమంగా రావాలని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. 

 

21:40 - June 24, 2017

రంగారెడ్డి : బోరుబావిలో ఉన్న చిన్నారిని బయటకు తీసేందుకు అధికారులు చివరి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. కేఎల్‌ఆర్‌ బోర్‌వెల్స్‌ ఆధ్వర్యంలో రెస్క్యూఆపరేషన్‌ జరుగుతోంది. నీళ్లలోపలే చిన్నారి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో బోరు బావిలోకి ఆక్సీజన్‌ సరఫరా చేస్తున్న పైప్‌ను తొలగించారు. ఎయిర్‌ లిఫ్టింగ్‌ టెక్నాలజీతో పాపను బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్‌ ప్రయత్నిస్తోంది. 

 

21:32 - June 24, 2017

ప్రెస్ అకాడమీ పేరు మార్పు

హైదరాబాద్ : ప్రెస్ అకాడమీ పేరు మార్చారు. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. 

 

21:25 - June 24, 2017
21:14 - June 24, 2017
21:09 - June 24, 2017

బోనాలపై మల్లన్నముచ్చట్లలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జానపద సింగర్స్ వడ్డేపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి శ్రీనివాస్ కూతరు మానసతో చిట్ చాట్ నిర్వహించారు. పలు బోనాల పాటలు పాడి వినిపించారు. బోనాల పండుగ ఎలా వచ్చింది, బోనాలు విశిష్టతను శ్రీనివాస్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:56 - June 24, 2017

బాహుబలి సింగర్ మోహనతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మోహన పలు విషయాలు తెలిపారు. పలు పాటలను పాడి వినిపించారు. తాను పాడిన అన్నీ పాటలు ఇష్టమని చెప్పారు. కొంతమందితోనే చనువుగా ఉంటానని తెలలిపారు. అందరూ బెస్టు ఫ్రెండ్స్ అని పేర్కొన్నారు. డబ్బింగ్ చెప్పడంపై ఇంట్రస్ట్ ఉంద కానీ.. అది చాలా కష్టటమన్నారు. చిన్మయి వాయిస్ లో డైలాగ్ చెప్పింది. సింగర్ నోయెల్ ఫ్రాంక్ కాల్ చేశారు. అనంతరం మోహన, నోయెల్ కలిసి పాట పాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:50 - June 24, 2017

ఢిల్లీ : సంఘ్‌ పరివార్‌ అండతో దేశంలో మతపరమైన దాడులు పెరిగిపోయాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ-మధుర లోకల్‌ ట్రైన్‌లో జరిగిన మతపరమైన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. సంఘ్‌ పరివార్‌ కార్యకర్తల దాడిలో మృతి చెందిన జునైద్‌ కుటుంబాన్ని సిపిఎం నేతలు పరామర్శించారు. రంజాన్‌ పండగ షాపింగ్‌ వెళ్లి లోకల్‌ ట్రైన్‌లో తిరిగి వస్తున్న ముస్లిం యువకులపై సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో  15 ఏళ్ల జునైద్‌ మృతి చెందగా...అతని సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. మతపరమైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం విమర్శించింది. రైల్వే కంపార్ట్‌మెంట్లను మతపరమైన ప్రాంతాలుగా మారుస్తున్నారని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ మండిపడ్డారు. రైళ్లలో భద్రత పెంచాలని, జునైద్‌ హత్యకు కారణమైన వారిని శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

 

20:45 - June 24, 2017

హైదరాబాద్ : పోడు వ్యవసాయదారులకు ఎర్రజెండా అండగా ఉంటుందని... వారి జోలికొస్తే ఊరుకునేది లేదని వామపక్ష నేతలు హెచ్చరించారు. అడవినే నమ్ముకుని బతుకుతున్న పోడు సాగుదారులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని... అటవీ హక్కుల చట్టాన్ని పకడ్భందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 
పోడు వ్యవసాయదారుల సమస్యలపై రాష్ట్ర సదస్సు 
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోడు వ్యవసాయదారుల సమస్యలపై రాష్ట్ర సదస్సు జరిగింది. తెలంగాణ వచ్చాక పోడు భూముల సమస్య, గిరిజనులపై దాడులు ఎక్కువయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిని హరితహారం పేరుతో లాక్కుంటున్నారన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని కాపాడవలసిన సీఎం.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. పోడు వ్యవసాయదారులపై దాడులు చేస్తే సహించమని హెచ్చరించారు. 
గిరిజనుల హక్కులను కాలరాస్తోన్న ప్రభుత్వం : చాడా 
పోడు సాగుదారులకు న్యాయం చేయడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ రాష్ట కార్యదర్శి చాడ అన్నారు. ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ఫారెస్ట్‌, పోలీస్ అధికారులు, ప్రభుత్వం మధ్య గిరిజనులు నలిగిపోతున్నారని చాడ అన్నారు. హరిత హారం పేరిట లక్షలాది ఎకరాలు లాక్కుంటున్నారు. 
పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు : సున్నం రాజయ్య  
అలాగే ప్రతిఘటన చేయకపోతే గిరిజనులకు భూములు దక్కే పరిస్థితి లేదని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. భూపాల్‌పల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనుల భూములపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని.. పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.  
ఆదివాసీ ఉద్యమానికి శ్రీకారం : పోటు రంగారావు 
అలాగే ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఆదివాసీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు అన్నారు. ఆదివాసీలను అడవి నుంచి గెంటి వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.  పోడుదారులపై దాడులు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఈ  సదస్సులో వామపక్ష నేతలతో పాటు, గిరిజన, పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్భందంపై పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.

 

20:38 - June 24, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు గ్రామాన్ని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. అయితే ఈ సందర్భంగా కలెక్టర్‌ను 10టీవీ ప్రశ్నించింది. గ్రామంలో ఎలాంటి పరిస్థితులను గమనించారని మా టెన్‌టీవీ ప్రతినిధి రాజు ప్రశ్నించగా..దానికి సమాధానం చెప్పకుండా మైక్‌ను పక్కకు లాగి వెళ్లిపోయారు. 

 

ఇంకా బోరుబావిలోనే చిన్నారి మీనా

రంగారెడ్డి : చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. మొన్న సాయంత్రం 6 గంటలకు చిన్నారి బోరుబావిలో పడింది. చిన్నారిని బటయకు తీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారిని బటయకు తీసేందుకు కేఎల్ ఆర్ బోర్ వెల్స్ రంగంలోకి దిగింది. 

ఇంగ్లండ్ టార్గెట్ 282 పరుగులు

ఢిల్లీ : మహిళల క్రికెట్ ప్రపంచ కప్ భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ మూడు వికెట్లు కోల్పోయి 281పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్, పూనమ్, మంధన అర్ధసెంచరీలు చేశారు. ఇంగ్లండ్ టార్గెట్ 282 పరుగులుగా ఉంది. 

 

టీజేఏసీ ఆధ్వర్యంలో అమరుల స్ఫూర్తి యాత్ర

సిద్ధిపేట : టీజేఏసీ ఆధ్వర్యంలో అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. సిద్ధిపేటలో ప్రొ.కోదండరాంకు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో సిద్ధిపేట పాత బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. 

 

బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు.. నిందితులకు పోలీస్ కస్టడీ

హైదరాబాద్ : బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ లకు పోలీస్ కస్టడీకి విధించారు. రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. 26, 27 తేదీల్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 

వరల్డ్ హాకీ లీగ్ సెమీస్...పాకిస్థాన్ పై భారత్ గెలుపు

హైదరాబాద్ : వరల్డ్ హాకీ లీగ్ సెమీస్ లో పాకిస్థాన్ పై భారత్ గెలుపొందింది. పాక్ పై 6...1 గోల్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 

స్నానానికి వెళ్లి ముగ్గురు యువకుల గల్లంతు

నెల్లూరు : విడదలూరు మండలం రామతీర్థంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయ్యారు. ఒక మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో ఇద్దరి కోసం మత్స్యకారులు, పోలీసులు గాలిస్తున్నారు. 

జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవం

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడాది కాలం పాటు స్టాండింగ్ కమిటీ కొనసాగనుంది. 

 

పాంథాచౌక్ లో ఉగ్రవాదుల దాడి

శ్రీనగర్ : పాంథాచౌక్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా దాడి చేశారు. ఈ ఘటనలో జవాన్ మృతి చెందారు. ఇద్దరికి గాయాలు అయ్యాయి. 

కల్తీ పన్నీర్‌, నెయ్యి, పెరుగు తయారీ

హైదరాబాద్‌ : నగర శివారుప్రాంతం జీడిమెట్ల..సుభాష్‌నగర్‌లో కల్తీ పన్నీర్‌, నెయ్యి, పెరుగు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భారీగా కల్తీ నెయ్యి, పెరుగు, పన్నీర్‌ స్వాధీనం చేసుకున్నారు.

18:27 - June 24, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిప‌డ్డారు. ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీని తీసుకువచ్చారన్నారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయన్న రోజా... నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోందన్న రోజా... మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం చంద్రబాబు, లోకేశ్‌ వాటా ఎంత అని ప్రశ్నించారు. బార్లకు ఐదేళ్లపాటు లైసెన్సులు ఇస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని రోజా అన్నారు.  బార్ల నూతన పాలసీ వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. 

18:24 - June 24, 2017

హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షన్‌  అనేది చిన్న కార్యక్రమం కాదని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి అన్నారు. ఇది మహాఉద్యమం.. మహా యజ్ఞం అన్నారాయన. దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ శాఖ ప్రతినిధులతో జాతీయ సమ్మిట్‌ను నిర్వహించింది జిహెచ్‌ఎంసి. మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఈ సదస్సులో పలు అంశాలపై నిపుణులు చర్చించారు. జిహెచ్‌ఎంసి నిర్వహించిన ఈ సమ్మిట్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

 

18:19 - June 24, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు గ్రామంలో దళితులపై అగ్రవర్ణాలు విధించిన కులబహిష్కరణపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కుల బహిష్కరణకు గురైన దళితులను కలెక్టర్‌ కలిసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండు నెలలగా గ్రామంలోని దళితులపై అగ్రవర్ణాలు కులబహిష్కరణపై 10టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. 3రోజుల తర్వాత ఆలస్యంగా స్పందించిన కలెక్టర్ ఎట్టకేలకు గ్రామాన్ని సందర్శించారు. అగ్రవర్ణాలకు, దళితులకు మధ్య జరుగుతున్న వాటిపై కలెక్టర్ ఆరా తీశారు. 

 

18:17 - June 24, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం...తాడేపల్లిగూడెం రోడ్డుపై అగ్రవర్ణాలు ఆందోళన దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు పొడవునా టెంట్లు వేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే పోలీసులకు అగ్రవర్ణాలకు మధ్య తీవ్ర వాగ్వావాదం జరగడంతో తోపులాట చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్‌పై అగ్రవర్ణాలు దాడి కూడా చేశాయి. గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సంఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు గరగపర్రులో కుల బహిష్కరణపై 10టీవీ కథనాలకు స్పందించిన జాతీయ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌..దళితుల బహిష్కరణపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎస్సీ, ఎస్టీ ఆదేశాలు జారీచేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:13 - June 24, 2017

రంగారెడ్డి : నిమిషాలు గంటలయ్యాయి. ఆ గంటలు రోజులుగా మారాయి. రెండు రోజులు కావొస్తున్నా అధికారుల ప్రయత్నాలేవీ  ఫలించలేదు. దీంతో చిన్నారిని బోరుబావి చెరవీడలేదు. ఇంకా బాలిక బోరుబావిలోనే ఉండిపోయింది. చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని తల్లిదండ్రులతోపాటు రాష్ట్ర ప్రజానీకమంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే  గంటలు గడిచేకొద్దీ ఈ ఆశలు అడుగంటుతున్నాయి. మరోవైపు చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు చిన్నారిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  180 అడుగుల లోతులో నీరు కనిపించినా చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో అత్యాధునిక కెమెరాలతో అధికారులు  గాలిస్తున్నారు.   మ్యాట్రిక్స్‌ కెమెరా సాయంతో మీనా ఎంత లోతులో ఉందోనని ఓఎన్జీసీ నిపుణులు పరిశీలిస్తున్నారు.  చిన్నారిని బయటకు తీసేందుకు మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి హుక్‌ను పాప డ్రెస్‌కు తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చిన్నారి ఎంత లోతులో ఉందో కూడా గుర్తించలేకపోవడంతో బయటకు తీసేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. 

 

18:09 - June 24, 2017

కాకినాడ : ఏపీ మున్సిపల్ స్కూల్స్‌లో తెలుగుమీడియం రద్దు చేయడంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తెలుగు, ఇంగ్లీష్‌ రెండు మీడియంలు ఉండాలని డిమాండ్ చేస్తున్న విద్యార్ధులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

18:07 - June 24, 2017

హైదరాబాద్ : గిరిజనులపై పోలీసుల దాడులు ఆపాలని భద్రాచలం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. నగరంలోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర సదస్సులో రాజయ్య మాట్లాడారు. భూపాల్‌పల్లి, భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాల్లో గిరిజనుల భూములపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని.. పోలీసులు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిఘటన చేయకపోతే గిరిజనులకు భూములు దక్కే పరిస్థితి లేదన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం కావాలని ఆయన కోరారు. సదస్సులో వామపక్షాల నేతలు, రైతు, గిరిజన సంఘాలు పాల్గొన్నారు. 

 

17:57 - June 24, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో కులబహిష్కరణపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, ప్రజాసంఘాలు. రెండు నెలలుగా గ్రామంలో దళితులపై కులబహిష్కరణ జరిగినా..ప్రభుత్వం స్పందించకపోవడం దారుమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. గరకపర్రులో జరుగుతున్న అన్యాయాన్ని 10టీవీ వెలుగులోకి తెచ్చి మూడు రోజులవుతున్నా...జిల్లా కలెక్టర్‌ గ్రామాన్ని సందర్శించకపోవడం అన్యాయన్నారు. కలెక్టర్‌ గ్రామాన్ని.. సందర్శించకపోవడం వెనక ప్రభుత్వ కుట్ర అర్థమవుతోందని అన్నారు. గరకపర్రు అన్యాయన్ని వెలుగులోకి తీసుకొచ్చిన 10టీవీకి హర్షకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గరకపర్రులో అగ్రకులాలు దళితులపై విధించిన కుల బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రేపు చలో గరకపర్రుకు పిలుపునిచ్చాయి. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారంటూ దళితులపై అగ్రకులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం నుంచి అగ్రకులస్తులు దళితులను పనుల్లోకి రానివ్వడం లేదు. పనులు లేక కాలనీవాసులు పస్తులుంటున్నారు. క్రిస్టియన్‌పేట వాసులకు దళిత సంఘాలు
అండగా నిలిచారు. అగ్ర కులస్తులపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

17:49 - June 24, 2017

హైదరాబాద్‌ : నగర శివారుప్రాంతం జీడిమెట్ల..సుభాష్‌నగర్‌లో కల్తీ పన్నీర్‌, నెయ్యి, పెరుగు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఇందులో భారీగా కల్తీ నెయ్యి, పెరుగు, పన్నీర్‌ స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:45 - June 24, 2017

కృష్ణా : జిల్లాలోని మచిలీపట్నం..మంగినపూడి బీచ్‌లో విషాదం జరిగింది. స్నానానికి వెళ్లిన అన్నా చెల్లెలు సందీప్‌, విద్య గల్లంతయ్యారు. చెల్లెలు విద్య మృతి చెందింది. అన్న సందీప్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. సందీప్‌, విద్యలది పెడన మండలం మందావానిపాలెం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:42 - June 24, 2017

రంగారెడ్డి : నిమిషాలు గంటలయ్యాయి. ఆ గంటలు రోజులుగా మారాయి. రెండు రోజులైనా అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చిన్నారిని బోరుబావి చెరవీడలేదు. ఇంకా బాలిక బోరుబావిలోనే ఉండిపోయింది. చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని తల్లిదండ్రులతోపాటు రాష్ట్ర ప్రజానీకమంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే  గంటలు గడిచేకొద్దీ ఈ ఆశలు అడుగంటుతున్నాయి. మరోవైపు చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు చిన్నారిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  180 అడుగుల లోతులో నీరు కనిపించినా చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో అత్యాధునిక కెమెరాలతో అధికారులు  గాలిస్తున్నారు.  మాట్రిక్స్‌ కెమెరా సాయంతో మీనా ఎంత లోతులో ఉందోనని ఓఎన్జీసీ నిపుణులు పరిశీలిస్తున్నారు.  చిన్నారిని బయటకు తీసేందుకు మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి హుక్‌ను పాప డ్రెస్‌కు తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చిన్నారి ఎంత లోతులో ఉందో కూడా గుర్తించలేకపోవడంతో బయటకు తీసేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. 

 

17:32 - June 24, 2017
17:26 - June 24, 2017

రంగారెడ్డి : బోరుబావి దగ్గర సహాయక చర్యల్ని మంత్రి మహేందర్‌ రెడ్డి, కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 180 ఫీట్ల దగ్గర ఒక బాడీ కనిపించినట్లుగా అనిపిస్తోందని... మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు. బోరుబావిలోనుంచి నీటిని బయటకుతీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాపను కాపాడేందుకు ఎవ్వరు సలహా ఇచ్చినా స్వీకరిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. చిన్నారిని బయటకుతీసేందుకు కొన్ని పరికరాల్ని ఇక్కడే తయారుచేస్తున్నామని చెప్పారు.

 

17:16 - June 24, 2017

ఢిల్లీ : స్కేటింగ్‌ వరల్డ్ చాంపియన్స్‌, ర్యాన్‌ షెక్లర్‌ అండ్‌ కో....ఓ ఫ్యాక్టరీలో డేర్‌డెవిల్‌ ఫీట్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్కేటర్లుగా పేరున్న జాన్‌ రైట్‌, అలెక్స్‌ సోర్జెంటీ, ర్యాన్‌ షెక్లర్‌ ఈ ఫీట్స్‌తో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. టర్బైన్‌ ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్న సమయంలోనే స్కేటింగ్‌ చేసి ఔరా అనిపించారు. 

 

17:12 - June 24, 2017

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్‌, నెదర్లాండ్స్‌, అమెరికా దేశాల్లో ఆయన పర్యటిస్తారు. ముందుగా పోర్చుగల్‌ వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. రెండు రోజులపాటు మోడీ అమెరికాలో పర్యటిస్తారు. జూన్‌ 26న ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటి అవుతారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. భారత్‌, అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని మోడీ ట్వీట్‌ చేశారు. ట్రంప్‌ హెచ్‌ 1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

17:09 - June 24, 2017

సౌదీ అరేబియా : సౌదీ అరేబియాలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం మక్కా మసీదులో ఉగ్రవాదులు దాడికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మక్కా నగరంలోని ఓ భవనంలో దాక్కున్న ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేశారు. దీంతో ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడడంతో ఐదుగురు పోలీసులతో సహా 11 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఆరుగురు విదేశీ యాత్రికులున్నారు. దాడికి యత్నించిన మహిళతో సహా ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రంజాన్‌ పండగ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో  ఉగ్రవాదులు దాడికి కుట్ర చేశారని పోలీసులు వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్‌ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

 

17:07 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల బహిష్కరణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుల బహిష్కరణ, పనుల్లోకి రానివ్వకపోవడంపై దళిత సంఘాలు, స్థానికులు అగ్రకులాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దళితులపై విధించిన కుల బహిష్కరణ ఎత్తివేయడంతో పాటు దళితులను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారంటూ అగ్ర కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం నుంచి అగ్రకులస్తులు దళితులను పనుల్లోకి రానివ్వలేదు. పనులు లేక కాలనీవాసులు పస్తులుంటున్నారు. క్రిస్టియన్‌పేట వాసులకు దళిత సంఘాలు అండగా నిలిచారు. అగ్ర కులస్తులపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

17:00 - June 24, 2017

యాదాద్రి భువనగిరి : తెలంగాణ ప్రభుత్వం చేనేత, జౌళి కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భూదాన్‌ పోచంపల్లిలో నేతన్నకు చేయూత పథకాన్ని మంత్రి ప్రారంభించారు. త్వరలో భూదాన్‌ పోచంపల్లిలో నాలుగు ఎకరాల స్థలంలో అద్భుతమైన నేతబజార్‌ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో చేనేత,  జౌళి మీద జిఎస్‌టిని ఉప సంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే అభినందించాల్సింది పోయి కొంతమంది నేతలు, పార్టీలు గొంతెత్తి అరుస్తున్నారని విమర్శించారు. 

16:45 - June 24, 2017

రంగారెడ్డి : జిల్లాలోని ఇక్కారెడ్డిగూడలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు చిన్నారిని బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  అయినా ఇంతవరకు చిన్నారిని బయటకు తీయలేకపోయారు. 44 గంటలుగా  చిన్నారి బావిలోనే ఉండిపోయింది. బోరుబావిలో చిన్నారి మరింత లోతుకు వెళ్లినట్టు తెలుస్తోంది.  200 అడుగుల లోతులోనూ బాలిక జాడ కనిపించలేదు. దీంతో అత్యాధునిక కెమెరాలతో అధికారులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక 180 అడుగుల లోతులో నీరు ఉందని.. వాటిని తోడుతున్నామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. 
 

కాసేపట్లో ముగియనున్న అమరుల స్ఫూర్తి యాత్ర

సిద్ధిపేట : కాసేపట్లో టీ.జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర ముగియనుంది. కాసేపట్లో భారీ బహిరంగ సభ అనంతరం ముగియనుంది.

16:42 - June 24, 2017

ప్రకాశం : వేమవరం ఘటనలో గాయపడి డిశ్చార్జ్‌అయి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లుపై మరోసారి దాడి జరిగింది. గొట్టిపాటి వర్గీయులే వెంకటేశ్వర్లుపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మోటార్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంబడించడంతో నిందితులు పరారయ్యారు. వెంకటేశ్వర్లును చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులు గొట్టిపాటి రవికుమార్‌ మైనింగ్‌ క్వారీ ఉద్యోగులుగా అనుమానిస్తున్నారు. వేమవరంలో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.. 

 

16:30 - June 24, 2017

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో.. టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కొత్త భవనాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర డీజీపీ సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే, డీజీపీలు స్వయంగా పరిశీలించారు. స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, స్థానిక నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు శాఖ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని.. ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. 

 

రైతు రుణ మాఫీ ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ ప్రకటించింది. రూ.1.5 లక్షల వరకు రైతులకు రుణాలు మాఫీ చేయనుంది. దీంతో 89 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. మొత్తం రూ.34 వేల కోట్ల మేర రైతు రుణాలు మాఫీ కానున్నాయి.

16:27 - June 24, 2017

హైదరాబాద్ : పోడు భూముల సమస్య తెలంగాణ వచ్చాక ఎక్కువైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హైదరాబాద్‌ ఎస్ వీకేలో పోడుభూముల సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు తమ్మినేని హాజరై, మాట్లాడారు. ఏళ్ల తరబడి సాగు చెసుకుంటున్న సాగు భూమిని హరిత హారం పేరిట లాక్కుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అడవి భూములపై గిరిజనులకు హక్కు లేదని అన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని కాపాడవలసిన సీఎం.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. గిరిజనుల పై దాడులు ఎక్కువయ్యాయని వాపోయారు. 2006సం.లో చేసిన గిరిజన చట్టాన్ని సీఎం కేసీఆర్ చదవాలని సూచించారు. గిరిజనులపై దాడులు చేస్తే సహించమని తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని.. భూముల్ని మాత్రం వదలమని స్పష్టం చేశారు. 

 

ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

ఢిల్లీ: ఓ కారు ఏకంగా ఫుట్ పాత్ మీద కూర్చున్న న‌లుగురు వ్య‌క్తుల‌ మీదికి వెళ్లింది. ఈ ఘ‌ట‌న ఢిల్లీ లోని కశ్మీర్ గేట్ వ‌ద్ద జ‌రిగింది. ఫుట్ పాత్ మీద కూర్చున వాళ్ల మీదికి కారు వెళ్ల‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌ర‌ణించారు.. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకొని కారు డ్రైవ‌ర్ ను అరెస్ట్ చేశారు.

ఏసీబీ పట్టుబడ్డ కాజీపేట డిప్యూటీ తహశీల్దార్

వరంగల్: రూ.6లక్షలు లంచం తీసుకుంటూ కాజీపేట డిప్యూటీ తహశీల్దార్ అనిల్ కుమార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హన్మకొండ టీచర్స్ కాలనీ ఫేజ్ -2లోని అనిల్ కుమార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

16:04 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో ఎమ్మెల్యే కలవపూడి శివ పర్యటిస్తున్నారు. కుల బహిష్కరణ, పనుల్లోకి రానివ్వకపోవడంపై ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారు... స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.. అటు దళిత సంఘాలు క్రిస్టియన్‌పేట గ్రామస్తులకు మద్దతుగా నిలిచాయి.. దళితులను గ్రామంనుంచి బహిష్కరించిన కులపెద్దలపై ఎస్ సీ, ఎస్ టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. మరిన్ని వివరాలను వీడియో చూడండి..

 

ఎంపీలకు టెలిఫోన్ అలవెన్స్ పై సోషల్ మీడియాలో విమర్శలు

ఢిల్లీ: ఎంపీలకు టెలిఫోన్ అలవెన్స్ పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. రూ.ం 350 కే అన్ లిమిటెడ్ కాల్స్, డేటా ఆఫర్లు ఉంటే ఎంపీలకు రూ. 15వేలు ఎందుకు చెల్లించాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలవెన్సులపై సోషల్ మీడియాలో పోస్టులు చక్కెర్లు కొడుతున్నాయి.

గంగపర్రులో ఉద్రిక్తత

ప.గో : గంగపర్రులో ఉద్రిక్తత నెలకొంది. భీమవరం- తాడేపల్లి గూడెం రోడ్డు పై అగ్రవర్ణాలు ఆందోళన చేపట్టాయి. రోడ్డు పొడవునా టెంట్లు వేయడంతో ట్రాఫిక్ స్థంభించింది. పోలీసులు, అగ్రవార్ణల మధ్య తోపులాట జరిగింది. కానిస్టేబుల్ పై అగ్రవర్ణాలు దాడి చేశారు. దీంతో కలెక్టర్ సంఘటనా స్థలికి చేరుకున్నారు. గత నెల రోజులుగా గరగపర్రులో దళితుల బహిష్కరణ పై '10టివి' కథనాలకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించింది. దళితుల బహిష్కరణపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్, ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ లకు కూడా ఆదేశాలు జారీ చేసింది.

వీనస్ బ్లడ్ బ్యాంక్ పై ఎస్ వోటీ పోలీసుల దాడి...

హైదరాబాద్: చాదర్ ఘాట్ లోని వీనస్ బ్లడ్ బ్యాంక్ పై ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులు దాడి చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణల నేపధ్యంలో దాడులు చేసిన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ కు సంబంధించిన ఫైళ్లు, పరికరాలను సీజ్ చేశారు.

 

వీనస్ బ్లడ్ బ్యాంక్ పై ఎస్ వోటీ పోలీసుల దాడి...

హైదరాబాద్: చాదర్ ఘాట్ లోని వీనస్ బ్లడ్ బ్యాంక్ పై ఎల్బీనగర్ ఎస్ వోటీ పోలీసులు దాడి చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణల నేపధ్యంలో దాడులు చేసిన బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, శ్రవణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లడ్ బ్యాంక్ కు సంబంధించిన ఫైళ్లు, పరికరాలను సీజ్ చేశారు.

సుకుమా జిల్లాలో ఎదురుకాల్పులు 5గురు జవాన్లకు గాయాలు..

చత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లాలో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇక్కడి చింతగుఫాలో మావోయిస్టులు- భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

వెంకటేశ్వర్లు పై గొట్టిపాటి వర్గీయుల దాడి?

ప్రకాశం జిల్లా : వేమవరం ఘటనలో గాయపడి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు పై మరో సారి దాడి జరిగింది. మోటారు సైకిల్ తో వెంకటేశ్వర్లును ఢీ కొట్టడంతో గాయాలు కావడంతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్తులు వెంబడించడంతో నిందితులు పరారయ్యారు. నిందితులు గొట్టిపాటి రవికుమార్ మైనింగ్ క్వారీ ఉద్యోగులుగా గుర్తించినట్లు సమాచారం. దాడిలో గొట్టిపాటి శ్రీను పాల్గొన్నట్లు అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

బద్వేల్ సబ్ జైల్లో ఖైదీ ఆత్మహత్య

కపడ : బద్వేల్ సబ్ జైల్లో ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో రమణయ్య అనే వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడు. రమణయ్య బ్రహ్మంగారి మఠం మండలం చౌదరివారి పలెల్ల వాసి.

14:14 - June 24, 2017

రంగారెడ్డి : బోరు బావిలో పడ్డ చిన్నారి మీనాను రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, సింగరేణి నిపుణులు కలిసి పాపను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బోరు మోటారు తీసే క్రమంలో చిన్నారి మీనా 200అడుగుల క్రిందకు జారినట్టు తెలుస్తోంది. 170 అడుగుల దూరంలో నీరు కనిపిస్తుంది. ప్రస్తుతం బోరు బావిలోని వాటర్ ను బయటకు తీస్తున్నారు. మ్యాట్రిక్స్ కెమెరాను 215 అడుగుల వరకు పంపించారు. చిన్నారి ఎక్కడ కనపించ లేదు. దాదాపు పాప నీటిలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉండాలని అధికారులు పాప కుటుంబ సభ్యులకు తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.  

 

ఇరిగేషన్ పై మంత్రులు జూపల్లి,పోచారం సమీక్ష

పాత మహబూబ్ నగర్ : జిల్లా హార్టీ కల్చర్ అధికారులతో మంత్రులు జూపల్లి, పోరాచం సమీక్ష నిర్వహించారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో డ్రిప్, స్పింక్లర్ ఇరిగేషన్ ప్రగతి పై చర్చించారు. నాలుగు జిల్లాల రైతాంగానికి లక్ష్యానికి అనుగుణంగా డ్రిప్, స్పింక్లర్ యూనిట్స్ మంజూరు చేయాలని జూపల్లి ఆదేశించారు. వెనుక బడ్డ జిల్లాలకు అదనంగా 4 వేల యూనిట్స్ మంజూరు చేస్తామని మంత్రి పోచారం హామీ ఇచ్చారు.

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్న పై వేటు

అనంతపురం : పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్న పై వేటు పడింది. టిడిపి నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలని సీఎం వారం రోజుల క్రితమే ఆదేశించారు. అయినా సీఎం ఆదేశాలను గంగన్న పట్టింకోలేదు.

13:54 - June 24, 2017

కొమురం భీం ఆసిఫాబాద్‌ : జిల్లా చింతలమానేపల్లి మండలంలో.. విషాదం చోటు చేసుకుంది. బాలాజీ అనకోడ గ్రామంలో, పొలంలోని వ్యవసాయ బావిలో పడి.. ఏడేళ్ల వయస్సున్న బాలుడు మృతి చెందాడు. నిర్లక్ష్యానికి బాలుడి ప్రాణం బావిలో కలిసింది. ఆత్మరావు-పెంటక్క దంపతుల కుమారుడు గణేశ్‌.. తన తాత రామయ్యతో కలిసి పొలానికి వెళ్లాడు. గణేశ్‌ ఆడుకుంటుండటంతో.. అందరూ పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఇంటికెళ్తానని చెప్పి వెళ్లిన బాలుడు.. ఇంటికి వెళ్లే సరికి అక్కడ లేడు. చివరకు పొలం దగ్గర ఉన్న బావిలో గణేశ్‌ మృతదేహం దొరికింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేశారు. 

13:52 - June 24, 2017

విశాఖ : నగరలంలో ఎన్‌ఏడి జంక్షన్‌లో కంటైనర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్‌ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది.

 

13:51 - June 24, 2017

రంగారెడ్డి : జిల్లా పెద్ద అంబర్‌పేట్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో.. ఒకే చోట 20కి పైగా బోర్లు వేసి వాటిని అలాగే వదిలేశారు. ఆ బోరు గుంతలలో ఎవరూ పడకముందే.. అధికారులు గుర్తించి వాటిని మూసేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. స్థానిక కంపెనీలలో పని చేసే వారి పిల్లలు అక్కడ ఆడుకుంటారని తెలుస్తోంది. స్థానికంగా బోర్‌ లారీల రిపేర్‌ షెడ్ ఉంది. రిపేర్‌ అయిన తరవాత టెస్టింగ్‌ కోసం సుమారు 40 ఫీట్ల నుంచి 50 ఫీట్ల లోతు బోర్‌లు వేస్తారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మరో ప్రమాదం జరగకుండా ఉంటుంది. 

కర్నూలు ప్రభుత్వాసుపత్రి పవర్ కట్ పై మంత్రి కామినేని ఆగ్రహం

అమరావతి: కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో తరచూ పవర్ కట్ పై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ నిలిపివేతపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎల్లుండి ఆసుపత్రిని తనిఖీ చేయనున్నట్లు కామినేని తెలిపారు.

గ్రేటర్ నోయిడాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం

ఢిల్లీ : గ్రేటర్ నోయిడాలోని జెవార్ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

ప్రకాశంజిల్లా దేవరపల్లిలో ఉద్రిక్తత

ప్రకాశం: పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో పాతిన బోర్డులను సీపీఎం నేతలు, దళిత సంఘాలు, విపక్షాలు తొలగించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.

13:32 - June 24, 2017

రామగుండం ఎఫ్ సీఐ ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి : వివేక్

ఢిల్లీ : రామగుండం ఎఫ్ సీఐ ని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అంగీకరించారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.200 కోట్లు ఈక్విటీ రామగుండం ఎఫ్ సీఐలో పెట్టాలని నిర్ణయించిట్లు పేర్కొన్నారు. నూతన జీఎస్టీ విధానం ప్రభుత్వానికి తోడ్పడుతుందని, పరిశ్రమలు, పెట్టుబడులకు ఐపాస్ యాక్ట్ బాగుందని, పారిశ్రామిక వేత్తలు భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని, గవర్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొందరగా సమస్యలు పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తాయని వివేక్ పేర్కొన్నారు.

13:27 - June 24, 2017

పెద్దపల్లి : వారసత్వ ఉగద్యోగల కోసం గత పది రోజులుగా సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెను కార్మికులు తత్కాలికంగా విరమించారు. గోదావరిఖనిలో ఐదు జాతీయ సంఘాల నేతలు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న హైదరాబాద్ లో సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో వారు ట్రిబ్యునల్ కు వెళ్లాలని నిర్ణయించారు. నెల రోజులు వరకు యాజమాన్యం చర్యలు, కోర్టు తీర్పును బట్టి తమ తదుపరి నిర్ణయం ఉంటుందని నేతలు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

గిరిజనులపై దాడులు చేస్తే సహించం : తమ్మినేని..

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక పోడు భూముల సమస్యలు గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న భూమిని హరితహారం పేరుతో ప్రభుత్వం లాక్కుంటోదని.. గిరిజనులపై దాడులు చేస్తే సహించం అని తమ్మినేని హెచ్చరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోడు భూములపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రధాన వక్తలుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంటక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్టాలుడుతూ...పది వామపక్ష, ఇతర పార్టీలు, గిరిజన, పౌరహక్కుల సంఘాలు పోలీసుల దుశ్చర్యను ఎదర్కోవాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

గొర్రెల పంపిణీ పథకం పై మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ రాజయ్య యాదవ్, పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, ఎండీ హాజరయ్యారు.

13:03 - June 24, 2017

రాజన్న సిరిసిల్ల :  జిల్లాలో కరెంట్‌ షాక్ దంపతుల ప్రాణాలుతీసింది.. బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్‌లో వ్యవసాయ పనులు చేసేందుకు మల్లయ్య, లత దంపతులు వెళ్లారు.. వారికి కరెంట్‌ వైర్‌ షాక్‌ కొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

13:01 - June 24, 2017

హైదరాబాద్ : ఎస్ వీకే  పోడుభూముల సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు కొనసాగుతోంది.. వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సు ఏర్పాటైంది.. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి..... పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి... ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలన్న డిమాండ్ల పై చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

 

 

 

12:54 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లా గరగపర్రులో కొందరు వ్యక్తులు చిన్న విషయాన్ని పెద్దది చేశారని ఎమ్మెల్యే శివప్రసాద్‌ అన్నారు.. సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. బయటి వ్యక్తులు వచ్చి సమస్యను పెద్దదిగా చేస్తున్నారని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

జులై 17 నుంచి పార్లమెంట్ సమావేశాలు...

ఢిల్లీ: జులై 17న పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరిపేందుకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసినట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో పార్లమెంట్‌ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు.

12:50 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లా గరగపర్రులో ఎమ్మెల్యే కలవపూడి శివ పర్యటిస్తున్నారు.. కుల బహిష్కరణ, పనుల్లోకి రానివ్వకపోవడంపై ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారు... స్థానికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.. అటు దళిత సంఘాలు క్రిస్టియన్‌పేట గ్రామస్తులకు మద్దతుగా నిలిచాయి.. దళితులను గ్రామంనుంచి బహిష్కరించిన కులపెద్దలపై ఎస్సీ , ఎస్టీ కేసు పెట్టాలని దళితులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

సింగరాయకొండ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రకాశం: జిల్లాలోని సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో గూడ్స్ రైలు శనివారం ఉదయం పట్టాలు తప్పింది. సూపర్ ఫాస్ట్ ట్రైన్ వెళ్లేందుకుగానూ గూడ్స్ రైలును లూప్ లైన్ లో పెడుతుండగా పట్టాలు తప్పింది. కాగా... గూడ్స్ రైలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో పట్టాలు తప్పడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. సమాచారమందుకున్న రైల్వేశాఖ ఉన్నతాధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

 

12:43 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో గత రెండు ఎలలుగా సామూహిక కుల బహిష్కరణ చేయడం పై టెన్ టివి రెండు రోజులుగా వరుస కథనాలతో అధికారులు, రాజకీయ నాయకుల్లో కదలిక రావడంతో ఎమ్మెల్యే, నర్సాపురం ఆర్డీవో గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇన్నీ రోజులుగా గ్రామ బహిష్కరించడం మీ కంటి కనింపించలేదా అని బాదితులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఓ డాక్టర్ దలితులకు వైద్యం చేస్తే ఆయనను సైతం ఊరు నుంచి పంపించారని వారు తెలపారు. టెన్ టివిని ప్రశ్నించడంతో ఊరులో ప్రశాంతంగా ఎటువంటి బహిష్కరణ లేదని చెప్పడంతో దళితులందురు ఆందోళన చేశారు. దీంతో ఆయన మీ సమస్యను తీరుస్తామని, పని కల్పిస్తామని ఎమ్మెల్యేల తెలపారు. బాదితులు మొటగా రామారాజు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

సింగరేణి సమ్మె తాత్కాలిక విరమణ

పెద్దపల్లి: గోదావరి ఖనిలో సింగరేణి జాతీయ సంఘాల నేతల నిర్ణయం మేరకు సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించారు. వారసత్వ ఉద్యోగాల కోసం పది రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే యాజామన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ట్రిబ్యునల్ కు వెళ్లాలని జాతీయ సంఘాలు నిర్ణయించినట్లు సమాచారం.

విత్తన దుకాణాల్లో తనికీలు..

మహబూబాబాద్ : జిల్లాలోని విత్తన దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. బయ్యారం, గన్నపల్లిలోని నాలుగు దుకాణాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 3 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు నిల్వ చేసి ఉన్న దుకాణాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

నేతన్నకు చేయూత పథకానికి జ్యోతి ప్రజ్వలన చేసిన కేటీఆర్

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు చేయూత పథకానికి శ్రీకారం చుట్టింది. భూదాన్ పోచంపల్లి వేదికగా మంత్రి కేటీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, గాదరి కిశోర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దళితుల మధ్య పోటీ కాదు, సైద్ధాంతిక పోరు: రఘువీరా

విజయవాడ: రాష్ట్రపతి పదవి అత్యంత కీలకమైందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. రామ్ నాధ్, మీరాకుమార్ మధ్య దళితుల పోటీ కాదని, సైద్ధాంతిక పోరు అని రఘువీరా పేర్కొన్నారు. రామ్ నాధ్ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతాలతో కూడిన మనువాది బిజెపికి మద్దతిచ్చే పార్టీలు మనువాదానికి మద్దతు తెలిపేవారు అని స్పష్టం చేశారు. ముస్లింలు, దళితుల గురించి అవహేళనగా మాట్లాడిన రామ్ నాధ్ కోవింద్ కు రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత లేదని, రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హతలు మీరాకుమార్ కే ఉన్నాని రఘువీరా చెప్పారు.

12:15 - June 24, 2017

రంగారెడ్డి : బోరు బావిలో పడ్డ చిన్నారి మీనాను రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ, సింగరేణి నిపుణులు కలిసి పాపను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. బోరు మోటారు తీసే క్రమంలో చిన్నారి మీనా 100అడుగుల క్రిందకు జారినట్టు తెలుస్తోంది. 170 అడుగుల దూరంలో నీరు కనిపిస్తుంది. పాప నీటిలో ఉందా లేక ఎకడైనా చిక్కుకుందా అనేది తెలియటం లేదు. మ్యాట్రిక్స్ కెమెరాలను అధికారులు తెప్పించి లోపలికి పంపుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

'210 అడుగుల లోతుకు కెమెరా పంపాం అయినా ..జాడలేదు'

రంగారెడ్డ్ : 210 అడుగుల లోతుకు కెమెరా పంపామని అయినా చిన్నారి జడ కనిపించడం లేదని మంత్రి మహేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కాసేపట్లో సీసీ ఫుటేజ్ ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరో రెండు గంటల్లో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీడియాకు తెలుపుతామని మహేందర్ రెడ్డి తెలిపారు.

గరగపర్రులో ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: జూపూడి

తూ.గో : గరగపర్రులో దళితుల సాంఘి బహిష్కరణ పై 10టివి కథనాలు చూశానని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు.

రైస్ పుల్లింగ్ పేరుతో మోసం.. ముఠా అరెస్ట్...

హైదరాబాద్ : నగరంలో రైస్‌పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి నుంచి రైస్‌పుల్లింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గంగపర్రులో శాంతి కమిటీని ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ డొక్కా...

తూ.గో : గరగపర్రులో దళితుల సాంఘి బహిష్కరణ దారుణం అని దీనిపై పూర్తి స్తాయి దర్యాప్తు జరగాల్సి ఉందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టర్, ఎస్పీ వెంటనే చొరవ తీసుకుని గంగపర్రులో శాంతి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు.

పీఎస్ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలయ్య

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ శనివారం పర్యటించారు. ఈ సందర్బంగా పట్టణంలో నిర్మించిన టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని బాలకృష్ణతోపాటు డీజీపీ సాంబశివరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నిమ్మల కిష్టమ్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గౌస్‌ మొయినుద్దీన్‌, బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ రంగనాయకులుతోపాటు పలువురు పాల్గొన్నారు.

విశాఖ ఎన్ఏడీ జంక్షన్ లో కంటైనర్ బోల్తా

విశాఖ : ఎన్ఏడీ జంక్షన్ లో కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కంటైనర్ కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం:16మంది మృతి

హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రక్‌ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ సంఘటన రాంగ్‌పూర్‌ జిల్లాలోని ఢాకా-రాంగ్‌పూర్‌ రహదారిపై శనివారం ఉదయం చోటు చేసుకుంది. కాలిగంజ్‌కు చెందిన కార్మికులు ఢాకాలోని వస్త్ర పరిశ్రమలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

11:40 - June 24, 2017

రంగారెడ్డి : బోరుబావిలో పాపను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి మహేందర్‌ రెడ్డి తెలిపారు.. 110 ఫీట్లవరకూ కెమెరాలు పంపామని అందులో పాప కనిపించలేదని స్పష్టం చేశారు.. అంతకుమించిన లోతులో స్పష్టమైన వీడియోలకోసం మరో కెమెరా పంపుతున్నామని ప్రకటించారు.. మరో గంటలో పాప పరిస్థితిపై వివరాలు తెలిసే అవకాశముందని అన్నారు.

11:38 - June 24, 2017

రంగారెడ్డి :  జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చిన్నారి మీనా ఆచూకీ 200 అడుగుల వరకు లేకపోవడంతో చిన్నారి నీటిలో ఉందా లేక చిన్నారి మట్టిలో కూరుకుపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు..పాప జాడ తెలుసుకునేందుకు బోర్ బావిలో 200 అడుగులవరకూ లేజర్‌ కెమెరాను అధికారులు పంపారు.. అంతలోతులోనూ పాప ఆచూకీ కనిపించలేదు.. కెమెరాలో ఫుటేజ్‌లో అక్కడ బురద, నీరుమాత్రమే కనిపిస్తున్నాయి.. అయినా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:34 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో గత రెండు ఎలలుగా సామూహిక కుల బహిష్కరణ చేయడం పై టెన్ టివి రెండు రోజులుగా వరుస కథనాలతో అధికారులు, రాజకీయ నాయకుల్లో చలనం వచ్చింది. కలవపూడి ఎమ్మెల్యే శివ గరగపర్రులో పర్యటింస్తున్నారు. ఎమ్మెల్యే కుల బహిష్కరణ, పనుల్లోకి రానివ్వకపోవడం పై ఆరా తీశారు. ఈ సందర్భంగా దళితలు ఇన్నీ రోజులు ఏం చేశారని ప్రశ్నించారు. గత రెండు నెలలుగా తాము పనిలేక, పస్తులు ఉంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేల ప్రతినిధి రామారాజును వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులు , పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారంటూ అగ్రకులస్తులు అగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ బహిష్కరణ చేశారు. మరో వైపు రేపు గ్రామంంలో ఎస్పీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పర్యటించానున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

శంషాబాద్ మండలంలో మరో భూ కుంభకోణం

రంగారెడ్డి: శంషాబాద్ మండలంలో మరో భూ కుంభకోణం వెలుగు చూసింది. మదనపల్లిలోని సర్వే నంబర్ 50 లో 559 ఎకరాల భూమిని 40 ఏళ్ల క్రితం 140 మంది గిరిజనులకు ప్రభుత్వం కేటాయించింది. బెంగుళూరు హైవే వెంటన ఉండటంతో గిరిజనులను బెదిరించి స్థానిక ప్రజా ప్రతినిధి భూమిని లాక్కొన్నాడు. అంతే కాకుండా యధేచ్ఛగా ప్రభుత్వ భూమిలో గోడలు, కంచె ఏర్పాటు చేశాడు. తమ భూమి తమకు ఇప్పించాలని గిరిజనులు ఆందోళనకు దిగారు.

మంత్రి పోచారంను కిలిసిన నిజాంసాగర్ ఆయకట్టు రైతులు

హైదరాబాద్: నిజాంసాగర్ ఆయకుట్టు రైతులు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు సింగూర్ నుంచి నీటిని విడుదల చేయాలని మంత్రిని రైతులు కోరారు. రాష్ట్ర నీటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో మంత్రి పోచారం ఫోన్లో మాట్లాడారు. సానుకూలంగా హరీష్ స్పందించారని, సీఎం కేసీఆర్ ఢిల్లీ నుండి రాగానే చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా పై ఈసీ వేటు

హైదరాబాద్: మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా పై ఈసీ వేటు వేసింది. మూడేళ్ల పాటు అనుర్హుడుగా ఈసీ ప్రకటించింది.

గరగపర్రులో ఎమ్మెల్యే కలవపూడి శివ పర్యటన

ప.గో : గరగపర్రులో ఎమ్మెల్యే కలవపూడి శివ పర్యటించారు. క్రిస్టియన్ పేట గ్రామస్తులతో ఎమ్మెల్యే శివ మాట్లాడారు. కుల బహిష్కరణ, పనులు చూపించకపోవడం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంటన రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా వున్నారు.

11:00 - June 24, 2017

కర్నూలు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లి కరెంట్ పోయింది. మాతా శిశుసంరక్షణ విభాగంలో రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, చిన్నారులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తరచు ఆసుపత్రిలో కరెంటు పోవడం పై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

10:54 - June 24, 2017

విపరీతమైన ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం శరీరానికీ, మనసుకీ ఎంతో హాయిగా ఉంటుంది. తొలకరి జల్లు చిందికే మట్టివాసన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందాన్ని పూర్తిగా పొందాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇలా సీజన్‌ ఏదైనా ప్రజల్ని పలు రకాల వ్యాధులు చుట్టుముడుతూనే ఉంటాయి. సహజంగానే సీజన్‌ మారినప్పుడు జలుబు, దగ్గు, తుమ్ములు, వాంతులు, నీళ్ల విరేచనాలు, టైఫాయిడ్‌, మలేరియా, డెంగ్యు, మెదడువాపు లాంటి వ్యాధులు సంభవిస్తాయి. ఇవన్నీ కూడా నీరు కలుషితం కావడం కారణంగానే సంభవిస్తాయన్నది యదార్థం. నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వ్యాప్తి చెందుతాయి. అందుకని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు వాలిన ఆహార పదార్థాలను, శీతల పానీయాలను తీసుకోకూదని వైద్యులు చెప్తున్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం చాలా మందిచింది. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, మెదడువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఆహారం తీసుకునే ముందు, మల విసర్జన చేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

వేడి ఆహార పదార్థాలను మాత్రమే తినాలి.

ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

క్లోరినేషన్‌ చేసిన నీటినే తీసుకోవాలి.

కాచి వడబోసిన నీటినే తాగాలి.

డయేరియా వ్యాధి బారిన పడిన వారికి రోజుకు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగించాలి.

శుభ్రమైన చోట మాత్రమే మంచినీటిని పెట్టాలి. అలాగే నీటిపై మూత పెట్టడం మరవొద్దు.

మంచినీరు ఉంచిన చోట స్నానం చేయడం, బట్టలు ఉతకడం చేయొద్దు.

కాయగూరలు, పండ్లను శుభ్రంగా కడగాలి.

సాధ్యమైనంత వరకు అప్పుడే వండిన ఆహారాన్ని తీసుకోవాలి.

రాత్రి పూట నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసాన్ని తినొద్దు.

భోజనం చేసే సమయంలో చేతులను సబ్బుతో కడుక్కోవాలి.

ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూత పెట్టాలి.

16 మంది ఎర్రచందనం కూలీలు అరెస్ట్

చిత్తూరు: బాకరాపేట అటవీప్రాంతంలో పోలీసులు కూబింగ్ చేపట్టారు. ఈ కూబింగ్ లో పోలీసులకు 16 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. పోలీసులపై కూలీలు రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. 16 మంది కూలీలను అరెస్ట్ చేసి వారి వద్ద వున్న 4 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

పొలంలో విద్యుత్ షాక్ : దంపతులు మృతి

రాజన్న సిరిసిల్ల :బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ లో విషాదం నెలకొంది. వ్యవసాయ పొలంలో విద్యుత్ షాక్ తో దంపతులు మృతి చెందారు. మృతులు మల్లయ్య, లతలుగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో మళ్లీ పవర్ కట్

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిలో మళ్లీ పవర్ కట్ అయ్యింది. మాతా శిశు సంరక్షణ విభాగంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు అవస్థలు వర్ణణాతీతం.

10:26 - June 24, 2017

హైదరాబాద్: వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పార్టీ మారుతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీలైనంత త్వరగా వైసీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటునట్లు తెలుస్తోంది. పలు విషయాలపై రోజాకు జగన్ క్లాస్ పీకారని, పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరించారనే వార్తలు ఇప్పటికే సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే, విశాఖలో జగన్ నిర్వహించిన మహా ధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. పార్టీ మైలేజ్ కోసం తనను ఉపయోగించుకున్న జగన్... ఇప్పుడు అవసరం తీరిపోయాక, తనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె భావిస్తున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా, తనను మనస్తాపానికి గురి చేస్తున్నారని రోజా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో, ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనే సంచలన వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యారని, త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రోజా విషయంలో ఏం జరగబోతోందో కొన్ని రోజుల్లోనే తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.

 

మీరా కుమార్ కే ఆప్ మద్ధతు...

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ కే తమ మద్దతునివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే క్యాండి డేట్ రామ్ నాథ్ కు మద్దతు నిచ్చే ప్రసక్తి లేదని ఆప్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికను బాయ్ కాట్ చేయబోమని, ఈ ఎలెక్షన్ లో పాల్గొంటామని ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి.

10:16 - June 24, 2017

రంగారెడ్డి : బోరు బావిలో పడిన మీనా బయటకు తీసెందుకు ఓఎన్జీసీ బృందం రంగలోకి దిగింది. నీటిలో ఉన్న వస్తువులు తీయడంలో వారు నిపుణులు కాబట్టి వారి అధికారుల రప్పించారు. అయితే 170 అడుగుల వరకు లేసర్ కెమెరాలు వెళ్లిన పాప ఆచూకీ మాత్రం తెలియడం లేదు. చిన్నారి మీనా 200అడుగుల లోతులో నీటి ఉన్నట్టు తెలుస్తోంది. అధికారులు తల్లిదండ్డులతో మాట్లాడి తదుపరి చుర్య తీసుకోవడానిక సిద్ధం అవుతున్నారు. తమ బిడ్డ వస్తుందని తల్లిదండ్రులు ఎంతో ఆశ ఉన్నారు. తమ బిడ్డను కాపాడండి అంటూ అందరిని వేడుకుంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

09:57 - June 24, 2017

హైదరాబాద్ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి సీబీఎస్ఈ నిర్వహించిన నీట్‌ ఫలితాల్లో నారాయణ, శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఓపెన్‌ క్యాటగిరీలో వందలోపు 22 ఆలిండియా ర్యాంకులు సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటి నుంచి పదిలోపు అన్ని ర్యాంకులు శ్రీచైతన్య, నారాయణ విద్యార్థులే సాధించారు. నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈ రెండు విద్యా సంస్థల యాజమాన్యాలు అభినందించాయి. 

09:53 - June 24, 2017

చెన్నై : నటుడు భరత్, సంధ్య జంటగా నటించిన కాదల్ సినిమా 2004లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఆ చిత్రంలో నటించిన ఓ నటుడు ఎప్పుడు భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాదల్ సినిమాలో చిన్న వేషం వేసిన పల్లుబాబు ఇప్పుడు గుడి ముందు భిక్షాటన చేసుకుంటూ జీవవనం గడుపుతున్నాడు. ఆ సినిమాలో అవకాశాలు వెతుక్కుంటూ చెన్నైకి వచ్చి ఓ మ్యాన్సన్ లో ఉండే యువకుడిగా పల్లుబాబు నటించాడు. అందులో విరుచ్చికాంత్ అనే పేరను పెట్టుకుని నేను నటిస్తే హీరోగానే, ఆ తరువాత రాజకీయం, సీఎం అంటూ అతను చెప్పే మాటలు బాగా ప్రచుర్యం అయ్యాయి. కానీ అతను మాత్రం పపులర్ కాలేపోయాడు. కాదల్ చిత్రం తరువాత పల్లుబాబుకు అవకాశాలు రాలేదు. పేదరికం, తల్లిదండ్రుల మరణంతో పల్లుబాబు మానసికంగా కుంగిపోయాడు. చివరికి కడుపు నింపుకోవడానికి స్థానిక చూలైమేడులోని గుడి ముందు భిక్షాటన చేస్తూ ఉన్నాడు. 

09:52 - June 24, 2017

చంద్రబాబుకు టి.టిడిపి నేతల అభినందనలు

హైదరాబాద్: బేగంపేట ఎయిర్ పోర్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ టిడిపి నేతలు మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబుకు నేతలు అభినందనలు తెలిపారు.

చైనాలో విరిగిన కొండ‌చ‌రియ‌లు:100మందికిపైగా గల్లంతు...

సిచువాన్: చైనాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో సుమారు వంద మందికిపైగా గ‌ల్లంతు అయిన‌ట్లు అధికారులు చెప్పారు. సిచువాన్ ప్రావిన్సులోని గ్జిన్మో గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కొండ‌లు విరిగిప‌డ‌డంతో సుమారు 40 ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. బుల్డోజ‌ర్ల‌తో శిథిలాల‌ను తొలిగిస్తున్నారు. సుమారు రెండు కిలోమీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న చెరువుకు అడ్డంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీగా వ‌ర్షాలు కురుస్తున్న కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ‌ట్లు తెలుస్తున్న‌ది.

తెలంగాణకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్

హైదరాబాద్: వచ్చే నెల 4వ తేదీన తెలంగాణ కు ఎన్టీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్ నాథ్ మాధవ్ రానున్నారు. బిజెపి, టీఆర్ ఎస్, టిడిపి ఎమ్మెల్లేతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సింగరేణి యాజమాన్యంతో కార్మికుల చర్చలు విఫలం

పెద్దపల్లి : సింగరేణి యాజమాన్యంతో కార్మికుల చర్చలు విఫలం కావడంతో రామగుండం 7ఎల్ ఈసీ గనిలో స్వచ్ఛందంగా కార్మికులు విధులు బహిష్కరించారు.

ఎర్రచందనం స్మగ్లర్ కన్నన్ కు 14 రోజుల రిమాండ్

చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కన్నన్ కు 14 రోజుల రిమాండ్ విధించాడు. నిన్న కన్నన్ ను సత్యవేడు పోలీసులు అరెస్టు చేశారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న కన్నన్ పై 25కు పైగా కేసులు ఉన్నాయి. 10 ఏళ్లుగా కన్నన్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో కి శ్రీకాంత్

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో కి శ్రీకాంత్ ప్రవేశించాడు. సెమీస్ లో చైనా సీడ్ యుకి పై శ్రీకాంత్ గెలుపొందాడు. 21-10,21-14 తేడాతో విజయం సాధించాడు.

సీపీ సుధీర్ బాబు పై అవినీతి ఆరోపణలు ?

వరంగల్ : సీపీ సుధీర్ బాబు పై అవినీతి ఆరోపణలు సోషల్ మీడియాలో ఫిర్యాదు లేఖ హల్ చల్ చేస్తోంది. కిందిస్థాయి అధికారులపై వేధింపులు చేస్తూ లక్షల రూపాల విరాళాలు సేకరించచారని, ఎవరెవరి వద్ద ఎంత వసూలు చేశారో వివరాలతో సహా సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ కు, పి. శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ ఫిర్యాదు లిఖిత పూర్వ లేఖ ఒకటి హల్ చల్ చేస్తోంది. హోంమంత్రి నాఇని, డీజీపీ అనురాగ్ వర్మ సహా మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలకు లేఖ ప్రతులను పంపినట్లు ప్రచారంలో ఉంది. సీపీ సుధీర్ బాబు పై సీబీఐ విచారణకు లేఖ లో డిమాండ్ చేస్తున్నారు.

09:30 - June 24, 2017

ముంబై : సీనియర్ నటి శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటే చూడాలనుందని చేసిన వ్యాఖ్యల చర్చలకు దారి తీశాయి. కూతురు భవిష్యత్ అభివృద్ధి కోరుకోకుండా సాధారణ తల్లిగా ఉండాలని భావిస్తున్నారంటూ శ్రీదేవి పై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె తన వ్యాఖ్యల పై యూటర్న్ తీసుకుంది. తన పై వచ్చిన విమర్శల శ్రీదేవి స్పందించారు. జాన్వీ కపూర్ గురించి తను చేసిన వ్యాఖ్యలు వక్రీకరించారని, తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మహిళలకు పెళ్లే జీవిత పరమార్థం చెప్పినట్లు ప్రచారం చేయడం నన్ను బాధిస్తోందని ఆమె తెలిపారు. తన కూతుళ్లు వారి కాళ్ల పై నిలబడితే చూసి ఆనందించాలని ఉందని, ఎందుకంటే మహిళలు వారికంటూ స్వంత గుర్తింపు తెచ్చుకోవడం మంచిదని అన్నారు. మీరు ఎంచుకున్న కెరీర్ లో నిలదొక్కులకోవాలని తన కూతుళ్లుకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లకు తరుచుగా చెబుతుంటానని శ్రీదేవి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు గడిచినా మహిళలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్తే వారికి భద్రత కరువు అయిందని శ్రీదేవి తెలిపారు. 

09:24 - June 24, 2017

రంగారెడ్డి : చిన్నారి మీనా బోరు బావిలో పడి 39 గంటలు గడుస్తున్న బోరు బావి లో చిన్నారి అచూకీ తెలియడం లేదు. పాప నిన్న 40 అడుగుల లోతులో ఉంది, కానీ మోటార్ తీసే ప్రయత్నంలో పాప లోతుకు జారిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతానికి చిన్నారి మీనా బోరు బావిలో 200 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే మంత్రి మహేందర్ రెడ్డి బోరుబావి వద్ద కు చేరకున్నారు. సీసీ కెమెరాల్లో పాప జాడ మాత్రం కనబడడం లేదు. అధికారులకు పాప ను తీసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి అర్ధం కాకుండా ఉంది. మరింత సమాచారనికి వీడియో చూడండి.

 

08:44 - June 24, 2017

సినిమా : రాజకీయాల తర్వాత తిరిగి సినిమాలో వచ్చి ఖైదీ నంబర్ 150తో దుమ్మురేపారు. తెలుగు సినిమా కలెక్షన్లను 100 కోట్ల మార్క్ దాటించడం సాధ్యమే అని చాటారు మెగా స్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆయన 151 చిత్రం మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుడంగా...త్వరలో గ్రాండ్ గా మూవీ లాంఛింగ్ చేసుకునేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సంబంధంచి క్యాస్టింగ్ ను దాదాపు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథనాయకుని పాత్రకు ఇద్దరు భార్యలు ఉంటారని...మరో మహిళతో సన్నిహిత సంబంధాలు ఉంటాయని సమాచారం. ఈ పాత్రల కోసం ముగ్గురు భామలను ఎంచుకున్నారట వారు బాలివుడ్ నటి ఐశ్వర్యా రాయ్...మరో భామ టాలీవుడ్ స్వీటీ అనుష్కతో పాటు దక్షణాదిలో మంచి పేరున్న నయన తార. ఇప్పటికే వీరితో చర్చోపర్చలు జరుగుతున్నట్టు సినీ వర్గాల సమాచారం. మూవీ లాంఛింగ్ టైంలోనే వీరి పేర్లు అనౌన్స్ చేస్తారట. 

08:14 - June 24, 2017

రంగారెడ్డి : చిన్నారి చిట్టి తల్లి మీనా బోరు బావిలో పడి రెండో రోజుకు చేరుకుంది. చిన్నారి మీనా 60 ఫీట్ల నుంచి 200 ఫీట్లకు జారుకున్నట్టు తెలుస్తోంది. చిట్టి తల్లి పై ఆశలు ఆవిరౌతున్నాయి. చివరి ఆశతో సహాయక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు.చిన్నారి మీనా గువారం సాయంత్రం 6.15 గంటలకు బోరుబావిలో పడింది. చిన్నారి సజీవంగా తిరిగి వస్తుందన్న ఆశలు గంట గంటకు అడుగట్టుతున్నాయి. చిన్నారి బోరుబావి నీటిలో మునిగినట్లు అనుమానం వస్తోంది. బోరుబావి 120 అడుగుల లోపులో చిన్నారి జాడ కనిపించడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

ఇంకా బోరుబావిలో చిన్నారి మీనా

రంగారెడ్డి : గురువారం బోరుబావిలో పడ్డ చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. చిన్నారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

సౌదీలో ఉగ్రకుట్ర భగ్నం

సౌదీ : దేశంలోని మక్కా మసీదులో ఉగ్రదాడి కుట్రను అక్కడి పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రమూక నక్కి ఉన్న ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఓ ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. 

07:41 - June 24, 2017

రైతులను ఆదుకోవడానికి బదులు దాన్ని ఫ్యాషన్ అనడడం సబబు కాదని, ప్రముఖ నేత బాధ్యతయుత పదవిలో ఉన్న వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చేయల్సింది కాదని, రుణమాఫీ ఒక్కటి చేస్తే రైతులు బాగుపడతారా అంటే కాదు రుణ మాఫీ కాదు రైతులకు చాలా చేయాల్పి ఉందని, స్వామినాథన్ కమిటీ సూచనలు అమలు చేయడం లేదని, దేశంలో మొట్టమొదటిగా ఎన్టీఆర్ సూచనతో విపి. సింగ్  చేశారని టెన్ టివి న్యూస్ మార్నింగ్ పాల్గొన్న విశ్లేషకులు వినయ్, టిడిపి నేత దినాకర్, బీజేపీ నేత మాధవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:31 - June 24, 2017

ప్రాంతాన్ని బట్టి విత్తనాలను ఎన్నుకోవాలని ఎందుకంటే స్థానిక పరిస్థితులు విత్తనాలు తట్టుకుంటాయా లేదా అనేది ముఖ్యంగా ఆలోచించాలని, విత్తె ముందు భూమిని తదును చేయాలని, పొలంలోని కల్పుమొక్కలను తొలగించేందుకు రసాయనాలను వాడడం కన్నా వంటనూనెలు వాడితే మంచి ఫలితం ఉంటుందని, వచ్చిన పంటలు ఆరోగ్యానికి చాలా మంచిదని సంగారెడ్డి రైతు పొన్ను స్వామి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:30 - June 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లా గరికపర్రు గ్రామంలో దళితుల వెలివేతపై టెన్‌టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో జాతీయ, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌లు సీరియస్‌గా స్పందించాయి. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశాయి. ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఆదేశాలతో జిల్లా అధికారుల్లో ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా సబ్‌కలెక్టర్‌ గరికపర్రు గ్రామాన్ని సందర్శించగా.. ఈనెల 25న విచారణకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు కూడా హాజరుకావాలని ఏపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. అటు కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ కూడా ఆదివారం గరికపర్రును సందర్శించి పరిస్థితిని స్వయంగా తెలుసుకోనున్నారు.

దళిత సంఘాల ఆగ్రహం
గరికపర్రులో దళితుల వెలివేతపై ఏపీ, తెలంగాణల్లో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌, కర్నూలు, కాకినాడ, విశాఖ నుంచి దళిత సంఘాల నేతలు శనివారం గ్రామాన్ని సందర్శించనున్నారు. అటు ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ కూడా ఇవాళ గరికపర్రుకు వస్తున్నారు. రెండు నెలలుగా గ్రామంలో దళితుల వెలివేత కొనసాగుతున్నా.. అధికారం యంత్రాంగం పట్టించుకోకపోవడంపై దళితసంఘాలు మండిపడుతున్నాయి. సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లి.. దళితుల పట్ల కొనసాగుతున్న వివక్షను ప్రపంచానికి చూపిన టెన్‌టీవీని అభినందిస్తున్నారు.

 

07:22 - June 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో మరో కొత్త యూనియన్‌ ఏర్పాయింది. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఇపుడున్న తెలంగాణ మజ్దార్‌ యూనియన్‌ విఫలం అవుతోందని.. కొత్త యూనియన్‌ నాయకులు అంటున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

07:19 - June 24, 2017

హైదరాబాద్ : రుణమాఫీ విషయంలో రైతుల్ని అడ్డంగా పెట్టుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కరీఫ్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేశామని పోచారం అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

07:16 - June 24, 2017

హైదరాబాద్ : రైతు సమస్యలపై చర్చించేందుకు బ్యాంకర్లతో సమావేశమయ్యారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్. పని వేగాన్ని పెంచుతూ రైతులకు రుణాలివ్వాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామన్నారాయన. ప్రభుత్వం నాలుగు శాతం వడ్డీ చెల్లించనందుకే బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్న మాట ఈటెల రాజేందర్‌ అవాస్తవమంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

07:12 - June 24, 2017

హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో రికార్డ్‌కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్‌ను ఉపయోగిస్తున్న సీఎంగా ఉన్న కేసీఆర్‌.. మరోసారి ఆ రికార్డ్‌ను తిరగరాయబోతున్నారు. తాజాగా తన కాన్వాయ్‌లో బెంజ్‌ వాహనాలను చేర్చుకోబోతున్నారు. ఈ శ్రావణమాసం నుంచే సీఎం కాన్వాయ్‌లో కొత్త వాహనాలు చేరనున్నాయి. అనుకున్నది చేస్తున్నారు..ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అందుకనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా.. తాను అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమైనా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సంధిస్తున్న ఆరోపణలకు తన స్టైల్‌లో సమాధానమిస్తున్నారు.

కొత్త క్యాంప్‌ కార్యాలయం
ఇప్పటికే భారీగా నిధులు వెచ్చించి కొత్త క్యాంప్‌ కార్యాలయాన్ని నిర్మించుకోవడం.. తన సెంటిమెంట్‌ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవడం అనేక వివాదాలకు తావైంది. అయితే.. తాజాగా కేసీఆర్‌ ఇలాంటి నిర్ణయమే మరొకటి తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన పాత వాహనశ్రేణిని తెలుపురంగుగా మార్చుకున్న కేసీఆర్‌.. ఆ తర్వాత వాటి స్థానంలో ఖరీదైన వాహనాలను చేర్చారు. ఇక ఇప్పుడు మరింత ఖరీదైన వాహనాలను కేసీఆర్‌ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంజ్‌ కంపెనీకి చెందిన 9 వాహనాలు త్వరలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సెంటిమెంట్‌కు ప్రాధాన్యమిచ్చే కేసీఆర్‌.. ఈ శ్రావణమాసం నుంచి కొత్త వాహనాలను వాడుతారని సమాచారం. ఇక ముఖ్యమంత్రితో పాటు.. మంత్రివర్గానికి, ఇటీవలే నియమితులైన కార్పొరేషన్‌ చైర్మన్లకు కూడా కొత్తవాహనాలను సమకూర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. 

07:08 - June 24, 2017

రంగారెడ్డి : గురువారం రాత్రి నుంచి పాపను రక్షించేందుకు  సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. నిర్విరామంగా ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికార యంత్రాంగం ప్రయత్నాలుచేస్తున్నారు. పాపను బయటకు తీసుకువచ్చేందుకు రోబోటిక్‌ యంత్రంతో విశ్వప్రయత్నం. అయితే.. ఆ ప్రయత్నాలేవీ సఫలీకృతం కాలేదు. తొలుత 40 అడుగల లోతులో చిన్నారి ఉన్నట్లు కెమెరాల్లో గుర్తించిన అధికారులు.. రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే... ఆ తర్వాత పాప మరింత లోతుకు జారింది. పాప 75 నుంచి 80 అడుగుల మధ్యన ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు
పాపను రక్షించేందుకు బోరుబావికి సమాంతరంగా జేసీబీలు తవ్వకాలు జరుపుతున్నాయి. అయితే.. నిన్న పలుమార్లు వర్షం కురవడంతో సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా.. అధికారులు శ్రమిస్తూనే ఉన్నారు. పాపను ఎలాగైనా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే... లోపలికి వెళ్లే కొద్దీ భూమి మెత్తగా ఉండడంతో పాప లోపలికి జారుతుందని అధికారులు భావిస్తున్నారు. నిన్న రాత్రి 70 అడుగల లోతుకు కెమెరాలు పంపినా పాప ఆచూకీ కనిపించలేదు. దీంతో టెన్షన్‌ మరింత పెరిగింది. అయితే.. పాప మాత్రం సజీవంగానే ఉందని అధికారులంటున్నారు.

గడిచిన రోజున్నర
పాప బోరుబావిలో పడి ఇప్పటికీ రోజున్నర గడిచిపోవడంతో అందరిలోనూ భయాందోళనలు మొదలయ్యాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ అందరిని వెంటాడుతోంది. మరోవైపు తల్లిదండ్రులు రోదనలు మిన్నంటుతున్నాయి. తన కూతురిని రక్షించాలని ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తోంది. అనేకమంది ఘటనాస్థలానికి వచ్చి తల్లిదండ్రులను ఓదారుస్తున్నారు. పాప క్షేమంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.

కేటీఆర్ ఆరా..
ఇక పాప క్షేమసమాచారం, సహాయకచర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పాప బోరుబావిలో పడినప్పటి నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి సహాయకచర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇక ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే.. ఒక్క శాతం అవకాశం ఉన్నా పాపను రక్షిస్తామంటున్నారు. ఇక పాపను రక్షించేందుకు ఈరోజు మరిన్ని బృందాలు రంగంలోకి దిగనున్నాయి. పాపను రక్షించేందుకు... తవ్వకాలు మరింత వేగంగా కొనసాగించేందుకు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. 

నేడు మహిళ క్రికెట్ వరల్డ్ కప్ ప్రాంభం

ఇంగ్లాండ్ : నేటి నుంచి మహిళ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా పోటీ జరగనుంది.

Don't Miss