Activities calendar

25 June 2017

21:58 - June 25, 2017

తెలంగాణ బీజేపీ చీఫ్ డా.లక్ష్మణ్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలను ప్రస్తావించారు. టీసర్కార్ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడాకి ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:48 - June 25, 2017

పశ్చిమగోదావరి : ఉదయం నుంచే ఒకటే ఆందోళన. ఏ క్షణం ఏం జరుగుతోందోనన్న టెన్షన్‌. అన్యాయానికి గురైన దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న వారిపైనే చర్యలు. గరగపర్రు గ్రామంలోకి వెళ్లకుండా భారీగా పోలీసుల మోహరింపు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న దళితులను వెలి వేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసినా చర్యలు శూన్యం. మరోవైపు సమస్యను రాజీ చేసేందుకు అధికారుల యత్నం. ఇవన్నీ ఈరోజు గరగపర్రులో చోటు చేసుకున్న పరిణామాలు. అయితే.. దళితులను వెలి వేసినవారిపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన ఆగదంటున్నారు దళిత, ప్రజాసంఘాల నేతలు. దీంతో గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటులో వివాదం 
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటులో నెలకొన్న వివాదం ఉద్రిక్తంగా మారింది. గరగపర్రులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పర్యటిస్తుందనే నేపథ్యంలో  దళిత, ప్రజాసంఘాలు 'ఛలో గరగపర్రు'కు పిలుపునిచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ పర్యటనను మంగళవారానికి వాయిదా వేసుకుంది. 
గ్రామంలో 144 సెక్షన్‌ 
అయితే దళిత, ప్రజా సంఘాల పిలుపు మేరకు అనేకమంది దళితులు, నేతలు గరగపర్రుకు బయల్దేరారు. అయితే.. గ్రామంలో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు.. గ్రామంలోకి ఎవరినీ అనుమతించలేదు. గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
గ్రామంలోకి అనుమతించకపోవడంపై దళిత నేతలు ఆగ్రహం 
అన్యాయానికి గురైన దళితులను పరామర్శించేందుకు గ్రామంలోకి తమను అనుమతించకపోవడంపై దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గరగపర్రు క్రిస్టియన్‌పేటలో శనివారం రాత్రి బస చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక వాహనంలో హర్షకుమార్‌ను రాజానగరం పీఎస్‌కు తరలించారు. దీనిపై హర్షకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రు నిందితులను అరెస్ట్‌ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. 
కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు 
మరోవైపు దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు పుప్పర గ్రామం వద్ద అడ్డుకున్నారు. దళితులను వెలి వేసిన వారిపై చర్యలు తీసుకోకుండా... భరోసా కల్పించేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమన్నారు కాంగ్రెస్‌ నేతలు. 
దళితులను వెలి వేయడం దుర్మార్గం : చంద్రశేఖర్, విల్సన్  
గరగపర్రులో పర్యటించేందుకు వెళ్తున్న తమను అడ్డుకున్నారన్నారు మాజీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్‌, విల్సన్‌లు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తే దళితులను వెలి వేయడం దుర్మార్గమన్నారు. పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువ అయ్యాయని నేతలు అభిప్రాయపడ్డారు. 
మేరుగు నాగార్జునను అడ్డుకున్న పోలీసులు  
గరగపర్రులో దళితులను పరామర్శించేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ మేరుగు నాగార్జునను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు. దళితులను వెలి వేసినవారిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 
గొల్లకోడేరులో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు 
గరగపర్రు ఘటనకు నిరసనగా గొల్లకోడేరులో ఫోరం ఫర్ ఆర్టీఐ, దళిత సంఘాలు ర్యాలీకి యత్నించాయి. రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో దళిత నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక విగ్రహ ఏర్పాటులో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కలెక్టర్‌... దళితుల పట్ల వివక్ష చూపిన వారిపై చర్యలు తీసుకోకుండా.. రాజీ చేసేందుకు యత్నిస్తున్నారని దళిత నేతలంటున్నారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఓవైపు దళితుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామంటున్న బీజేపీ పాలకులకు.. ఇక్కడ జరుగుతున్న అన్యాయం తెలియదా అని దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించి సమస్యను పరిష్కరించి.. దళితులపై వివక్ష ప్రదర్శించిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

తిరుమలలో మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం మిస్సింగ్

చిత్తూరు : తిరుమలలో మాజీ ఎమ్మెల్యే కుంజా బిక్షం తప్పిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిక్షం కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు ఎమ్మెల్యేగా పని చేశారు. నిన్న సాయంత్రం శ్రీవారి దర్శనం తర్వాత తప్పిపోయారు. మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. 

21:26 - June 25, 2017
21:12 - June 25, 2017
20:59 - June 25, 2017
20:57 - June 25, 2017

విజయవాడ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ రాజకీయ లబ్ధి కోసం దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని కేరళ ఆర్ధిక మంత్రి థామస్ ఐజాక్ అన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన 'మతోన్మాదం.. సవాళ్లు' అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్ధాయి సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో హిందువుల తప్ప మిగిలిన వాళ్లంతా పరాయివాళ్లుగా భావిస్తున్నందునే మైనార్టీ, దళితులపై దాడులకు తెగబడుతున్నారని థామస్ ఐజాక్ అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నామని ఆయన చెప్పారు. 

 

20:53 - June 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల పోరాటం కొనసాగుతూనే ఉంది. అయితే దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ మేరుగు నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలన్నారు. దళితులను వెలి వేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే ముద్దాయిలను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. 

20:47 - June 25, 2017

శ్రీనగర్ : జమ్మూలో రోప్‌వే కూలి ఏడుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. శ్రీనగర్‌లోని గుల్మార్గ్‌లో పెనుగాలికి భారీ వృక్షం కూలీ రోప్‌వే తీగపై కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తులో ఉన్న కార్‌చైర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, టూర్ గైడ్‌తో సహా ఓ కుటుంబం మృతిచెందింది. ఈ ఘటన తరువాత కేబుల్ కార్ల సర్వీసులను వెనువెంటనే నిలిపివేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1998లో ప్రారంభమైన గుల్మార్గ్ కేబుల్ కారు సర్వీసులో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొన్నారు. 

20:40 - June 25, 2017

కాబూల్ : ఆప్ఘనిస్తాన్‌లో భారత్‌ నిర్మించిన సల్మా డ్యామ్‌పై తాలిబాన్లు దాడి చేశారు. ఈ ఘటనలో 10మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది ఐదుగురు తాలిబాన్లను కాల్చిచంపారు. సల్మా డ్యామ్ ముందు ఉన్న చెక్‌పోస్ట్ వద్ద ఈ దాడి జరిగింది.  2014లో ఆప్ఘన్‌తో సంబంధాల బలోపేతంలో భాగంగా... భారత్‌ 1700కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించింది. దీనిద్వారా 75వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

 

20:38 - June 25, 2017

అమెరికా : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రారంభమైంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం.. మోదీ ఉదయం వాషింగ్టన్ చేరుకున్నారు. ఇవాళ అమెరికా కంపెనీల సీఈవోలు, వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాలతోనూ మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. మోదీ రాకను ఆహ్వానిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

హైదరాబాద్ : భారత్, వెస్టీండీస్ ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ 43 ఓవర్లకు కుదించారు. 

20:32 - June 25, 2017

హైదరాబాద్ : అతివేగం మరొకరిని బలి తీసుకుంది. హీరో రవితేజ తమ్ముడు.. సినీ నటుడు భరత్‌... కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద ఆగివున్న లారీని ఢీకొని భరత్‌ మృతి చెందాడు. . జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అతివేగమే భరత్‌ మృతికి కారణమని పోలీసులంటున్నారు. 
రోడ్డు ప్రమాదంలో భరత్‌ మృతి 
సినీ హీరో రవితేజ సోదరుడు, సినీ నటుడు భరత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌ నుంచి  హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా కొత్వాల్‌గూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. భరత్‌ స్కోడా కారు ఢీకొట్టింది.  కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అయితే... అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి పోలీసులు భరత్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్‌ ఆధారంగా భరత్‌ తల్లికి ఫోన్లు చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో చనిపోయింది ఎవరనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతర్వాత ఉదయం భరత్‌ తల్లి పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో.. విషయం నిర్ధారణ అయ్యింది. 
భరత్‌ మృతికి అత్యధిక వేగమే కారణం 
భరత్‌ మృతికి అత్యధిక వేగమే కారణమని పోలీసులంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బెలూన్లు తెరుచుకున్నప్పటికీ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో భరత్‌ మృతి చెందాడు. 
మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు 
ఉస్మానియాలో భరత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు ముగిశాయి. భరత్‌ను చూసేందుకు స్నేహితులు, సినీ నటులు తరలివచ్చారు. అయితే... భరత్‌ మరణవార్త విని శోకసంద్రంలో మునిగివున్న తల్లి, సోదరుడు రవితేజ.. అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో భరత్‌ అంత్యక్రియలను సోదరుడు రఘు నిర్వహించారు. 
మరో నటుడి ప్రాణాలు హరించిన అతివేగం 
మొత్తానికి అత్యధిక వేగం మరో నటుడి ప్రాణాలు హరించివేసింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వేగంగా వాహనాలు నడపడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం, మితిమీరిన వేగంతో అనేకమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. 

 

ముస్లీంలకు సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : నగరంలో నెలవంక కనిపించింది. ముస్లీం సోదరసోదరీమణులు రేపు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లీంలకు ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు

చత్తీస్ ఘడ్ : రాష్ట్రంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 12 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 

 

విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం

విశాఖ : ఏజెన్సీలో ఆంత్రాక్స్ కలకలం రేపింది. అరకులోయ మండలం సిరగరంలో నలుగురు గిరిజనుల ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 

 

 

 

20:04 - June 25, 2017

కడప : ఉచిత ఇసుక విధానం గ్రామాల్లో ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో.. రైతులు ఇతర ప్రాంతాలకు చెందిన ట్రాక్టర్లు, లారీలను అడ్డుకుంటున్నారు. తమ ప్రాంతంలోని ఇసుక తమకే సొంతమంటూ.. పక్క గ్రామాలకు చెందిన వాహనాలను రానివ్వడం లేదు. కొన్నిచోట్ల దాడులకు దిగుతుంటే.. మరికొన్ని చోట్ల దారికి అడ్డంగా గోతులు ఏర్పాటు చేసుకుని నిలిపేస్తున్నారు. ఇదే అదునుగా మరికొంతమంది ఇసుకాసురులు నిబంధనలకు విరుద్ధంగా.. ఇసుకను బెంగళూరు, హైదరాబాద్‌లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
30 ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల గుర్తింపు 
కడప జిల్లాలో ఉచితంగా ఇసుక తవ్వుకొనేందుకు.. అధికారులు అనుమతులు ఇచ్చారు. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి మొత్తం 30 ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను గుర్తించారు. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో.. పెన్నానదిలో ఆరు రీచ్‌లను గుర్తించారు. చాలా చోట్ల అనుమతులు లేకున్నా.. ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. 
ఉచిత ఇసుక వివాదం
ఉచిత ఇసుక వివాదం జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. జమ్మలమడుగులో ఐదు ప్రాంతాల్లో రీచ్‌లకు అనుమతి ఇచ్చారు. మైలవరం మండలంలో, దొమ్మర నంద్యాలలో రీచ్‌ ఉంది. ఇదే మండలానికి చెందిన ఇతర గ్రామస్థులు అక్కడికి వెళ్తే.. భూగర్భ జలాలు అడుగంటుతాయంటూ ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుపడుతున్నారు. ఇది కాకుండా దగ్గర్లో ఉన్న రీచ్‌ పొన్నతోట సమీపంలో ఉంది. ఆ రీచ్‌ నుంచి ఇసుకను తీసుకెళ్లాలంటే ముద్దనూరు రోడ్డులో ఉన్న పెన్నా వంతెన నుంచి వెళ్లాలి. కానీ అక్కడి నుంచి వెళ్లకుండా వంతెన వద్ద రోడ్డుకు అడ్డంగా పెద్ద గొయ్యిని తవ్వారు. అలా ట్రాక్టర్లు అటు వైపు వెళ్లకుండా చేశారు. 

ముస్లీంలకు సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : నగరంలో నెలవంక కనిపించింది. ముస్లీం సోదరసోదరీమణులు రేపు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ముస్లీంలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 

 

19:49 - June 25, 2017

గుంటూరు : తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఘనవిజయంపై కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తంచేశారు. వారంరోజుల్లోనే వరుసగా రెండో సిరీస్ సాధించడంతో... శ్రీకాంత్ ఇంట్లో పండగ వాతావరణం కనిపించింది. కుటుంబసభ్యులు, బంధువులు స్వీట్లు తినిపించుకొని తమ సంతోషం వ్యక్తం చేశారు. 

19:46 - June 25, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గ్రామంలోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే... దళితులను వెలి వేయడం దారుణమని నేతలంటున్నారు. సమస్యను పరిష్కరించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారంటున్నారు. 

18:35 - June 25, 2017
18:27 - June 25, 2017

హైదరాబాద్ : స్కై డైవింగ్‌, బేస్‌ జంపింగ్‌ స్పెషలిస్ట్‌ మైల్స్‌ డైషర్‌ జోర్డాన్‌లో చరిత్రను తిరగరాశాడు. బేస్‌ జంపింగ్‌ హిస్టరీలోనే మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డ్‌ సృష్టించాడు. ఒక్క రోజులో, 24 గంటల్లోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 సార్లు బేస్‌ జంప్‌ చేసి ఆశ్చర్యపరచాడు. బేస్‌ జంపింగ్‌ ట్రాక్‌ రికార్డ్‌లోనే రికార్డ్‌ లెవల్లో 24 గంటల్లో 63 సార్లు బేస్‌ జంప్‌చేసిన తొలి అథ్లెట్‌గా వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.  

 

18:24 - June 25, 2017

నెల్లూరు : జిల్లాలో ఓ ఎస్‌ఐ తన డిపార్ట్‌మెంట్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అధికారులు, అధికారపార్టీ నేతలకు మామూళ్లు వసూలు చేయలేకపోతున్నానంటూ ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.  కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తావా అంటూ.. ఎస్‌ఐపై విరుచుకుపడుతూ ఎస్పీ చెడామడా తిట్టేసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ఎస్ ఐకి ఎస్పీ విశాల్ గున్నీ వార్నింగ్ 
ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నది నెల్లూరు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ. అది సూళ్లూరుపేట ఎస్‌ఐ జగన్మోహనరావుకి. ఇప్పుడు ఈ విజువల్సే సంచలనం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు జగన్మోహనరావు. ఇటీవల తనతో పోలీస్ అధికారులు, అధికారపార్టీ నేతలు మామూళ్లు వసూలు చేయిస్తున్నారని .. ఆ పని చేయలేకపోతున్ననని కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నెలకి కోటి టార్గెట్ ఇస్తారని.. పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారిని పీడించాలని.. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించి వచ్చే సొమ్మును అందరికీ పంపించాలని.. అయితే ఇలా చేయడం తన వల్ల కావడం లేదంటూ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నట్లు సమాచారం.  
రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం 
ఇక జగన్మోహనరావు ఆవేదన ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. అతనిపై యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ. వెంటనే అతనిని  బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచారు. అక్కడితో ఆగకుండా తన దగ్గరకు రప్పించుకుని డిపార్ట్‌మెంట్‌లో లేకుండా చేస్తాను.. .. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చేశారు. మరోవైపు జిల్లా పోలీసు అధికారులు సైతం జగన్మోహనరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది నిజమేనని.. దీనిపై దర్యాప్తు అనంతరం వివరాలు చెబుతామని అంటున్నారు. 
మాట మార్చిన ఎస్‌ఐ జగన్మోహనరావు 
పోలీస్ బాస్‌ క్లాస్‌లకి భయపడ్డాడో ఏమో ఎస్‌ఐ జగన్మోహనరావు మాట మార్చాడు. తాను అసలు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని.. కిట్టని వారెవరో ఇలాంటి అభియోగాలు మోపుతున్నారని చెబుతున్నాడు. ఇక ఈ స్టోరిపై పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.. ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. 

18:15 - June 25, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని ఏజెన్సీలో 15 మంది గిరిజనులు మృత్యువాత పడటం కలకలం రేపింది. వారంరోజుల వ్యవధిలో వీరంతా చనిపోయినట్టు సమాచారం. జిల్లాలోని వైరామవరం మండలం బొడ్డగండి పంచాయితీ పరిధిలోని చాపరాయిలో ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. వెంటనే ఘటనా స్థలానికి వైద్య సిబ్బందిని పంపారు. గిరిజనుల మృతికి అతిసారా లేకుంటే పుడ్ పాయిజనా అనేది ఇంకా నిర్థారణ కాలేదు. అయితే అధికారులు మాత్రం ఓ వివాహంలో పాల్గొన్న అందరు అనారోగ్యానికి గురైనట్టు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. 

 

18:10 - June 25, 2017

యాదాద్రి భువనగిరి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల కాపురం తరువాత మోజుతీరిన మాయగాడికి కులం గుర్తుకొచ్చింది. నమ్ముకొని వచ్చిన ఇల్లాల్ని నట్టేట ముంచి పలాయనం చిత్తగించాడు. తాను మోసపోయానని తెలుసుకున్న యువతి భర్త కోసం 5ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. 
ప్రేమ వివాహం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెంకు చెందిన ఈమె పేరు జ్యోతి. 2012లో ఈమెకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం జరిపించారు. అయితే జ్యోతి అదే గ్రామానికి చెందిన లింగస్వామి ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దల్ని ఎదిరించలేక ఇంట్లోంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో కాపురం పెట్టిన జ్యోతి, లింగస్వామిలు మూడునెలలు బాగానే ఉన్నారు. ఆ తరువాత లింగస్వామిలో మార్పు వచ్చింది. అకారణంగా కులంపేరుతో ఆమెను ధూషించడం, చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కొద్దిరోజులకు ఆమెను వదిలిపెట్టి తన ఇంటికి వెళ్లిపోయాడు. అత్తింటికి వెళ్లిన జ్యోతికి అగచాట్లే ఎదురయ్యాయి. కులం కానిదానివంటూ అత్తమామలు ఇంట్లోకి రానివ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది జ్యోతి. భర్త కావాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. 
భర్త కోసం పోరాటం
ఐదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసినా న్యాయం జరగకపోవడంతో రెండురోజుల క్రితం అత్తవారింటికి వచ్చింది. ఆమెను తిట్టిపోసిన అత్తమామలు ఇంటికి తాళం పెట్టి ఎటో పోయారు. అయినా సరే అక్కడే బైఠాయించిన జ్యోతి ఆందోళన చేస్తోంది. ఆమె ఆందోళనకు గ్రామస్తులు, ప్రజా సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కేవలం కులం పేరుతో విడిచిపెట్టిన భర్తపై అధికారులు ఏం చర్యలు చేపడతారో.. జ్యోతికి ఏం న్యాయం చేస్తారో వేచి చూడాలి. 

 

18:06 - June 25, 2017

నిజామాబాద్‌ : జిల్లా కేంద్రంలో ధర్మపురి ట్రస్ట్  ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. నిజామాబాద్ నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని రాజ్య సభ సభ్యులు డి.శ్రీనివాస్ ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ నుండి ప్రత్యేక వైద్యులను పిలిపించి ఈ శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు, ఉచితంగా మందులను అందచేస్తున్నామని డీఎస్ తెలిపారు.

18:03 - June 25, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలి వేసిన దళితులను పరామర్శించేందుకు నేతలెవరిని గ్రామంలోకి పోలీసులు అనుమతించడం లేదు. పుప్పర గ్రామంలో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారు. దళితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఈమేరకు కాంగ్రెస్ నేత కొండ్రు మురళి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దళితులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. దళితులను అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు. రెండు నెలల నుంచి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 

17:57 - June 25, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలి వేసిన దళితులను పరామర్శించేందుకు నేతలెవరిని గ్రామంలోకి పోలీసులు అనుమతించడం లేదు. పుప్పర గ్రామంలో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారు. దళితులకు భరోసా ఇచ్చేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఈమేరకు కాంగ్రెస్ నేత శైలజానాథ్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. దళితులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందన్నారు. దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని వాపోయారు. రెండు నెలల నుంచి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులను అణిచివేసే కుట్ర జరుగుతుందన్నారు.

 

17:48 - June 25, 2017

టోక్యో : జపాన్‌ క్యాపిటల్‌ సిటీ టోక్యోలో నిర్వహించిన రెడ్‌బుల్‌ కిక్‌ ఇట్‌ చాలెంజ్‌లో టాప్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌లు అదరగొట్టారు. డేర్‌ డెవిల్‌ ట్రిక్స్‌తో వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేశారు. గాల్లో గిర్రున తిరుగుతూ కళ్లు చెదిరే ఫ్రీ స్టైల్‌ ఫీట్స్‌తో ఔరా అనిపించారు. వ్యక్తిగత విభాగాల్లో మొత్తం మూడు రౌండ్లలో ఈ పోటీలను నిర్వహించారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి మరీ రిస్కీ స్టంట్స్‌ ప్రదర్శిస్తుంటే...ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతయ్యింది. ఈ డేర్‌డెవిల్‌ కాంపిటీషన్‌లో దక్షిణ కొరియాకు చెందిన జాకబ్‌ పింటో ప్రదర్శించిన ఫీట్స్‌....టోటల్‌ కాంపిటీషన్‌కే హైలైట్‌గా నిలిచాయి. మూడు రౌండ్లలో ఎక్కడా తడబడకుండా ..మిగతా పోటీదారులెవరికీ సాధ్యం కానటువంటి స్టంట్స్‌ ప్రదర్శించిన పింటో ....వీక్షకులతో పాటు, న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు.

 

17:45 - June 25, 2017

హైదరాబాద్ : రెడ్‌బుల్‌ ఎంటిబి చాలెంజ్‌లో మౌంటెయిన్‌ బైకింగ్‌ స్పెషలిస్ట్‌లు అదరగొట్టారు. క్రాన్‌ఓర్క్స్‌ వేదికగా జరిగిన ఈ డేర్‌డెవిల్‌ కాంపిటీషన్‌ ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. 100 మంది మౌంటెయిన్‌ బైకింగ్‌ స్పెషలిస్ట్‌లు పోటీకి దిగిన ఈ కాంపిటీషన్‌...ఫైనల్‌ రౌండ్‌లో డెడ్లీ ఫీట్స్‌తో అదరగొట్టిన బ్రెట్‌ రీడర్‌...టైటిల్‌ ఎగరేసుకుపోయాడు.  

 

17:08 - June 25, 2017

హైదరాబాద్ : చేతివృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. సమాజానికి సేవ చేస్తున్న నాయి బ్రాహ్మణులు, రజకులకు చేయూత ఇచ్చేందుకు వచ్చే నెలలో అనేక పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. పథకాల రూపకల్పన కోసం సచివాలయంలో రజక, నాయి బ్రాహ్మణ సంఘాల నేతలతో మంత్రులు ఈటల, జోగు రామన్నలు భేటీ అయ్యారు. ఇప్పటికే అనేక కులాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్‌... ఈ రెండు సామాజికవర్గాల కోసం కూడా కొత్త పథకం ప్రవేశపెడతారన్నారు.

 

16:54 - June 25, 2017

హైదరాబాద్ : రైతులను బ్యాంకులు ఇబ్బంది పెట్టవద్దని తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బ్యాంకులలో డబ్బులు లేకపోవడం వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఒకట్రెండు నెలల్లో అన్ని సర్దుకుంటాయని కేంద్రం చెప్పినా.. నగదు కోసం రైతులు బ్యాంకుల ఎదుట క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితిని త్వరగా పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 

 

గుల్మార్గ్ లో ప్రమాదం...ఐదుగురు మృతి

జమ్మూకాశ్మీర్ : గుల్మార్గ్ లో ప్రమాదం జరిగింది. కేబుల్ కార్ రోప్ వేపై చెట్టు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. 

పొందూరు రైల్వేస్టేషన్ వద్ద విషాదం

శ్రీకాకుళం : పొందూరు రైల్వేస్టేషన్ వద్ద విషాదం నెలకొంది. రైలు కింద పడి తల్లీకూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుమార్తె పావని మృతి చెందారు. తల్లి భాగ్యలత పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు సంతకవిటి మండలం గోల్లవలసకు చెందినవారుగా గుర్తించారు. 

16:38 - June 25, 2017

గరగపర్రు ఘటనకు నిరసగా ర్యాలీ

పశ్చిమగోదావరి : గరగపర్రు ఘటనకు నిరసగా గొల్లకోడేరులో ఫోరం ఫర్ ఆర్టీఐ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, దళిత సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. 

దాసరి భవన్ లో మహిళా సంఘాల సమావేశం

విజయవాడ : దాసరి భవన్ లో మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. మద్యంపై పోరుకు మహిళలు నడుం బిగించారు. బెల్టు షాపులు, జనావాసాల మద్య ఉన్న షాపుల ఎదుట జులై 1 నుంచి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. 

16:08 - June 25, 2017

హైదరాబాద్ : బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించే దృశ్యాలు చూస్తున్నప్పుడల్లా అంతులేని బాధ మన గుండెలను మెలిపెడుతోంది. రెండు మూడు నెలలకోసారి ఎక్కడో ఒకచోట ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ధ్యాసే మనకు రావడం లేదు. ఇలా పగబట్టినట్టు, బలికోరుతున్నట్టు బోరుబావులు పసిపిల్లలను పొట్టనబెట్టుకుంటున్నా మనం ఏమీ చేయలేమా? ఈ దుస్థితిని నివారించలేమా? 
బోరు బావులు పూడ్చేయరెందుకు?
బోరుబావిలో బోచోడు వుంటాడని, ఆ వైపు వెళ్లితే తన ప్రాణాన్నే మింగేస్తాడని పాపం చిన్నపిల్లలకు తెలియదు. ఇది తెలిసిన ప్రభుత్వాలు, అధికారులు, పెద్దలు వాటిని మూసివేయించే చర్యలు తీసుకోరు. ఫలితంగా అభంశుభం తెలియని చిన్నారులు వాటిలో పడి చనిపోతున్నారు.
2నెలలకు ఒకరు బలి
ఒకరా ఇద్దరా మన దేశంలో సగటున రెండు నెలలకు ఒకరు చొప్పున బోరుబావులకు బలైపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో  కూడా ఇలాంటి విషాదాలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్లలో నలుగురు చనిపోవడం మరీ విషాదం. 
మూగ వేదన
పిల్లలు బోరుబావుల్లో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రేయింబవళ్లు పడుతున్న శ్రమ చాలా సందర్భాలలో ఫలించడం లేదు. మృత్యుంజయులుగా తిరిగొస్తున్నవారు చాలా కొద్దిమందే. చాలా సంఘటనల్లో  అంతులేని విషాదమే మన గుండెలను పిండేస్తోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెంలోనూ అలాంటి విషాదమే మనల్ని మూగ వేదనలోకి నెడుతోంది. 
పిల్లలు బలైపోతుంటే నిశ్చేష్టులమై చూడాల్సిందేనా? 
ఇలా బోరుబావులకు పిల్లలు బలైపోతుంటే నిశ్చేష్టులమై చూడాల్సిందేనా? ఉపయోగంలో లేని బోరుబావులను పూడ్చివేయాలన్న చిన్న ఆలోచన కూడా ఎందుకు రావడం లేదు? ఇంతమంది పిల్లలు చనిపోతున్నా, గుండెలవిసేలా కన్నవారు ఏడుస్తున్నా, అలాంటి ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదు?
బోరుబావుల కనీస సమాచార సేకరణ కరువు 
మన దేశంలో ఇలా నోళ్లు తెరచి పసికూనలను పొట్టనబెట్టుకుంటున్న బోరుబావులు చాలానే వున్నాయి. ఆధార్ పేరుతో ప్రతి ఒక్కరి డేటాను, సమగ్ర సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తున్న ప్రభుత్వాలు ఇంత ప్రమాదకరమైన బోరుబావుల విషయంలో కనీస సమాచారం సేకరించడం లేదు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్రమాదకర బోరుబావులున్నాయో, వాటి పూడ్చివేతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పేవారు లేరు. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గరా సమాచారం లేదు. ఏ పిల్లాడు ఏ బోరులో పడి చస్తే నాకేంటి అన్న రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడం క్షమించరాని నేరం. 
విచ్చలవిడిగా బోర్లు 
మన దేశంలో అత్యధికశాతం బోరుబావుల మరణాలకు మినరల్ వాటర్ ప్లాంట్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కారణమవుతున్నాయి. నీళ్ల వ్యాపారమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకున్న వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. నీళ్లు పడన్నప్పుడు వాటిని పూడ్చేయడం లేదు.  ప్రమాదాన్ని సూచిస్తూ కనీసం హెచ్చరిక బోర్డులో, ఇనుప కంచెలో వేయడం లేదు.  పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించేవారు సైతం ఇలాంటి నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నారు. కొంతమంది బోర్‌ వెల్‌ యజమానులు వాటి పనితీరు టెస్టు చేసేందుకు తవ్విన బోరులను కూడా పూడ్చడం లేదు. 
ప్రమాదకర బోరుబావులను పూడ్చివేయాలి..
కారణం ఏదైనా, నిర్లక్ష్యం ఎవరిదైనా రెండు నెలలకో పసికూన బోరుబావులకు బలైపోతోంది. బోరుబావి తవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనీ, నీళ్లు పడకపోతే దానిని పూడ్చివేయాలని వాల్టా చట్టం స్పష్టంగా చెబుతోంది.   ఎవరు ఏ అవసరం కోసం బోరుబావి తవ్వినా, అది నిరుపయోగంగా మారినప్పుడు దానిని పూడ్చేయడమన్నది నిర్లక్ష్యం చేయడానికి వీలులేని  బాధ్యత. దీనిని విస్మరించడం వల్లనే ఇన్ని అనర్ధాలు. ఇన్ని మరణాలు. ఇన్ని విషాదాలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ప్రమాదకర బోరుబావులున్నాయో గుర్తించి, వాటి పూడ్చివేతకు చర్యలు తీసుకోవాలి. ఆ పని ఆలస్యమైనా కొద్ది మనం మరికొంతమంది బిడ్డలను బలిపెట్టుకోవాల్సి వస్తుంది. 

 

గరగపర్రు వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. దళితులకు మద్దతుగా ర్యాలీగా తరలివచ్చిన ఆర్టీఐ దళిత సంఘాలు, సమాజవాదీ పార్టీ దళిత నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు దళిత నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. 

15:49 - June 25, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని వైఎస్‌ జగన్‌ ఖరారు చేశారు. పార్టీ నేతలతో విస్తృత చర్చల అనంతరం శిల్పా పేరును జగన్‌ ప్రకటించారు. అయితే.. ఇప్పటికే టీడీపీ భూమా బ్రహ్మానందరెడ్డిని పేరును ప్రకటించింది. ఉప ఎన్నిక ఏకగ్రీవమయ్యేందుకు జగన్‌తో చర్చించాలని టీడీపీ యత్నించింది. కానీ జగన్‌ ఈ రోజు శిల్పా పేరును ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:44 - June 25, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. దళితులకు మద్దతుగా ర్యాలీగా తరలివచ్చిన ఆర్టీఐ దళిత సంఘాలు, సమాజవాదీ పార్టీ దళిత నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు దళిత నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

శైలజానాథ్ ను అడ్డుకున్న పోలీసులు

పశ్చిమగోదావరి : గరగపర్రు గ్రామాన్ని సందర్శించేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత శైలజానాథ్ ను పోలీసులు పిప్పర వద్ద అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

15:29 - June 25, 2017

వరంగల్ : వరకట్న దాహానికి ఓ వివాహిత బలైంది. వరంగల్ జిల్లా హన్మకొండలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా వడ్డెరకొత్తపల్లికి చెందిన యాకయ్య అదే గ్రామానికి చెందిన రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హన్మకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న యాకయ్య..నిత్యం భార్యను వేధించేవాడని బంధువులు చెప్తున్నారు. బంధువులు, భర్త, అత్తామామల వేధింపుల వల్లే రాధిక మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ ఎంజీఎం మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. పెళ్లి అయిన నాటి నుంచి అదనపు కట్నం తీసుకురావాంటూ కుటుంబసభ్యులు వేధించేవారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

15:20 - June 25, 2017

రంగారెడ్డి : 60 గంటల పాటు నిర్విరామంగా చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. బోరుబావిలోంచి చిన్నారి బతికొస్తుందనుకున్న ఆ కన్నతల్లికి కన్నీళ్లే మిగిలాయి. కన్నతల్లి పేగు బంధాన్ని శాశ్వతంగా తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అమ్మా అని నోరారా పిలిచే ఆ చిట్టితల్లి చిట్టిపొట్టి మాటలు ఇప్పుడు వినిపించవు. నవమాసాలు మోసి కనిపెంచిన ఆ కన్నతల్లికి ఇప్పుడు మిగిలింది కడుపుకోతే. 
చిన్నారి మృతి 
చిన్నారి క్షేమంగా బయటపడుతుందన్న ఆశతో 60 గంటలుగా చేసిన శ్రమంతా వృధా అయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందింది. మూడు రోజుల తర్వాత 180 అడుగుల లోతు నుంచి ఎయిర్‌ ఫ్లషింగ్‌ విధానం ద్వారా చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. ఎయిర్‌ ఫ్లషింగ్‌ విధానం ద్వారా తొలుత చిన్నారి డ్రెస్‌ బయటకొచ్చింది. ఆ తర్వాత చిన్నారి శరీర భాగాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. చిట్టితల్లి ఇకలేదన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. తమ పాప ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్న కన్నవారి ఆశలు అడియాసలు కావడంతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రమైంది. 
శాయశక్తులా ప్రయత్నించాం : మంత్రి మహేందర్‌రెడ్డి 
పాపను ప్రాణాలతో తీసుకువచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించామని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తొలుత చిన్నారి 40 అడుగుల లోతులో ఉందని గుర్తించామని..తర్వాత 180 అడుగుల లోతుకు జారిపోయిందని తెలిపారు. సహాయక బృందాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాపను బతికించలేకపోయామన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో జరుగకుండా ఉండాలంటే ప్రజల్లో చైతన్యం రావాలన్నారు జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌. ప్రజలంతా స్వచ్చందంగా ఫేలైన బోరుబావుల్ని మూసివేయాలని ఆయన పిలుపునిచ్చారు.
చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం
చిన్నారి శరీర భాగాలను చెవేళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత సొంతగ్రామం యాలాల్‌ మండలం గోరేపల్లిలో చిన్నారి అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలకు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్‌ సునీతామహేందర్‌రెడ్డి హాజరుకాగా..గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరోవైపు చిన్నారి మృతితో పాప తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 
ఆడుకుంటూ బోరుబావిలో పడిన చిన్నారి 
18 నెలల చిన్నారి మీనా గురువారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే చిన్నారిని బయటికి తీసేందుకు రెండు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన సిబ్బంది శ‌త‌విధాలా ప్రయ‌త్నించినా సత్ఫలితాల్ని ఇవ్వలేదు. 
పొలం యజమాని మల్లారెడ్డిపై కేసు నమోదు 
బోరు పూడ్చకుండా నిర్లక్ష్యంచేసి ప్రమాదానికి కారణమైన పొలం యజమాని మల్లారెడ్డిపై పోలీసులు సెక్షన్‌ 336 కింద కేసు నమోదుచేశారు. వాల్టా చట్టం ప్రకారం ఎవరు బోరు వేయాలనుకున్నా ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని, బోరులో నీళ్లు రాని పక్షంలో వాటిని పూడ్చివేయాల్సిన బాధ్యత యజమానులదేనని అధికారులు తెలిపారు. జిల్లాలో పూడ్చకుండా ప్రమాదకరంగా ఉన్న బోర్లను గుర్తించి వాటిని పూడ్చివేసే బాధ్యత తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
ప్రయత్నాలన్నీ విఫలం 
చిన్నారి మీనాను ప్రాణాలతో రక్షించేందుకు మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో..కన్నతల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదని..ఘటనను ప్రత్యక్షంగా చూసిన జనమంతా వేడుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా మనమందరం ఓ అడుగు ముందుకేసి..నీరులేని బోరుబావులను పూడ్చేలే ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం.  

 

15:04 - June 25, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భరత్‌ మృతికి అతివేగమే కారణమని పోలీసులు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 140 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా భరత్‌ కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతివేగం, మద్యం సేవించడంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
రోడ్డు ప్రమాదంలో భరత్‌ మృతి 
రోడ్డు ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్‌ మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్‌లో ఆగి వున్న లారీని భరత్‌ ప్రయాణిస్తున్న స్కోడా కారు వేగంగా ఢీకొంది. కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ఘటనను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్‌జీఐఏ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భరత్‌ పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
భరత్‌ మృతి పట్ల స్నేహితులు విచారం 
అవుట్‌ రింగ్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో సినీనటుడు భరత్‌ రాజు మృతి పట్ల అతని స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. భరత్‌తో తమకు ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసివేళ్లి, కలిసితినేవారిమని చెబుతున్నారు. 

 

నంద్యాల ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి

కర్నూలు : నంద్యాల ఉపఎన్నిక వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి పేరును వైఎస్ జగన్ ఖరారు చేశారు. 

బాక్సర్ అంకుష్ దాహియాకు స్వర్ణ పతకం

ఉలాన్బాతార్ : భారత బాక్సర్ అంకుష్ దాహియాకు స్వర్ణ పతకం లభించింది. 60 కిలోల విభాగంలో అంకుష్ దాహియా స్వర్ణం పతకం పొందారు. 

 

రంజాన్ కేసీఆర్ శుభాకాంక్షలు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందన్నారు సీఎం. మత సామరస్యానికి, సరస్వత సౌభ్రతృత్వానికి నెలవైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు.

ముంబైలో వర్షాలు..

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. గ‌త రెండు మూడు రోజుల‌ నుంచి ప‌డుతున్న వ‌ర్షాల‌తో ముంబై లోని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌య‌మయ్యాయి.

విచారణ చేయించాలన్న ఐవైఆర్..

హైదరాబాద్ : ప్రకాశం జిల్లా దొనకొండలో ఎటువంటి భూములూ లేవని మాజీ సీఎస్, మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. రాయపాటి చేసిన ఆరోపణలపై నిజానిజాలను విచారణ జరిపించి తేల్చాలని సవాల్ విసిరారు.

రంజాన్ రద్దీ..

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రంజాన్ పండుగ సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో ముస్లిం సోదరులు షాపింగ్ నిర్వహిస్తున్నారు. మార్కెట్ లో విపరీతమైన రద్దీ నెలకొంది.

13:39 - June 25, 2017

పాకిస్తాన్ : భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 123 మంది సజీవదహనం కాగా 70 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బహావల్ పూర్ లో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆదివారం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీనితో భారీగా ఇంధనం రోడ్డుపై లీక్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డుపై ఉన్న ఇంధనాన్ని బకెట్లలో నింపే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా ట్యాంకర్ కు నిప్పంటుకోవడంతో 123 మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఓ వ్యక్తి ఓ వ్యక్తి సిగరేట్ తాగడంతో ఇది చోటు చేసుకుందని తెలుస్తోంది.

13:34 - June 25, 2017

చిత్తూరు : అలనాటి నటి..అందాల తార శ్రీదేవి తిరుపతికి విచ్చేశారు. భర్త బోనీకపూర్ తో విచ్చేసిన ఆమె ఆదివారం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి దంపతులకు దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.

13:28 - June 25, 2017

నిర్మల్ : గిరిజనులు..అడవి నమ్ముకుంటుంటారు..ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల స్థలాలు..ఇళ్లు లేకపోవడంతో వీరంతా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇదే వీరు చేసిన నేరం. హరితహారం పేరిట భూముల నుండి గిరిజనుల తరిమివేశారు. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నా అధికారులు వేధిస్తున్నారంటూ గిరిజనులు పేర్కొంటున్నారు. తాడోపేడో తేల్చుకోవాలని ఏకంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు.


ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..
అడవుల్లో..ఆహ్లాదంగా బతికే గిరిజనులు రోడ్డున పడ్డారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..ఏకంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియచేస్తున్నారు. వీరి నిరసన నేటికి 50 రోజులుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా నిరసన తెలియచేస్తున్నా మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి..కలెక్టర్..ఇతర ఉన్నతాధికారులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. తాము చేసిన నేరం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.

మంత్రి హామీనిచ్చారు..
వీరు చేస్తున్న ఆందోళనను బాహ్య ప్రపంచానికి తెలియచేయడానికి టెన్ టివి నడుం బిగించింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేసింది. మూడు సార్లు గుడిసెలు వేసుకోవడం జరిగిందని, ప్రభుత్వ భూముల్లో వేసుకుంటే సహకరిస్తామని మంత్రి ఇంద్రకిరణ్ చెప్పారని గిరిజనులు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోవడం జరిగిందని, కానీ రెవెన్యూ, ఫారెస్టు, పోలీసుల సహాయంతో తమను తరిమివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళనపై స్పందించాలని, ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా మంత్రి ఇంద్రకిరణ్..కలెక్టర్..మాట్లాడలేదని పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా సంబంధిత మంత్రి..అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది వేచి చూడాలి.

13:19 - June 25, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితజే సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కోత్వాల్ గూడ సమీపంలో అవుటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణీస్తున్న స్కోడా కారు అతివేగంగా ఢీకొంది. దీనితో లారీ కిందకు కారు సగభాగం వెళ్లిపోయింది. భరత్ అక్కడికక్కడనే మృతి చెందాడు. అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్టీఐ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎన్నో ప్రశ్నలు..
కారు నెంబర్ కారణంగా దర్యాప్తు చేయగా సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ అని తేలింది. ఇదిలా ఉంటే భరత్ కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. భరత్ మద్యం సేవించి ఉన్నాడా ? కారులో ఇంకా ఎవరు ఉన్నారు ? ఒకవేళ ఉంటే ప్రమాదం జరిగిన తరువాత వారు ఎక్కడకు వెళ్లారు ? తదితర ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ప్రమాద సమయంలో 150 కి.మీటర్ల వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ఆగి ఉన్న లారీపై కేసు నమోదు చేయడం జరిగిందని, నోవాటెల్ కు వెళ్లినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

వివాదాల్లో కూడా..
సోదరుడు భరత్ పలు సినిమాల్లో నటించాడు. సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన భరత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు. పెదబాబు..ఒక సైన్యం..ఒక్కడే..దోచెయ్ లాంటి పలు సినిమాల్లో నటించాడు. అంతేగాకుండా పలు వివాదాల్లో కూడా భరత్ పేరు వినిపించింది. గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో వీరంగం సృష్టించడంలో కూడా అరెస్టు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసుల విచారణకు హాజరైన భరత్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అనంతరం మీడియాకు క్షమాపణలు చెప్పారు.

13:06 - June 25, 2017

విశాఖపట్టణం : సీపీఐ నేత నారాయణ గాయాలయ్యాయి. ఆక్రమణ చేసిన ఓ గోడను కూల్చివేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే విశాఖలో భూ స్కాం ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలు జరిగిన కొమ్మాది..మధురవాడలో సీపీఐ నేత నారాయణ పర్యటించారు. కొమ్మాది వద్ద ఆక్రమణదారులు కట్టిన గోడను నారాయణ కాలితో కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అకస్మాత్తుగా సిమెంట్ దిమ్మె ఆయన కాలిపై పడిపోయింది. వెంటనే అక్కడనే ఉన్న ఇతర నేతలు ఆయన్ను బయటకు తీశారు. కాలికి గాయం కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సీపీఐ నేత నారాయణ గోడను కూల్చివేస్తుండగా..

విశాఖపట్టణం : భూ ఆక్రమణలు జరిగిన కొమ్మాది..మధురవాడలో సీపీఐ నేత నారాయణ పర్యటించారు. కొమ్మాది వద్ద ఆక్రమణదారులు కట్టిన గోడను కూల్చివేస్తుండగా నారాయణకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12:58 - June 25, 2017
12:57 - June 25, 2017

హైదరాబాద్ : మళ్లీ ఐవైఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవలే సామాజిక మాధ్యమాలల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన ఐవైఆర్ ను ఎస్సీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుండి ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ఐవైఆర్ వివరణనిస్తూ పలు ఆరోపణలు..విమర్శలు..ప్రశ్నలు సంధించారు. దీనిపై టిడిపి నేతలు పలు ఆరోపణలు గుప్పించారు. ఆదివారం ఉదయం మీడియా సమావేశంలో ఐవైఆర్ మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని..ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడుని ఆయన కోరారు. అడిగే వాడు లేకపోవడం వల్ల ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటు వంటి ప్రధాన వాగ్ధానం నెరవేరడం లేదని అనుకుంటుంటాం అని తెలిపారు.

12:49 - June 25, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రుకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు..గ్రామస్తులా కాదా ? ఇతరులా ? అని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై దళిత సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గరగపర్రులో దళితులను కుల బహిష్కరణ చేసిన ఘటనను 10టీవీ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా దళిత సంఘాలు భారీ ఆందోళనలు చేపట్టాయి. చలో గరగపర్రు కార్యక్రమం చేపట్టింది. పోలీసులు రంగంలో దిగి 144 సెక్షన్..తదితర ఆంక్షలు విధించింది. గ్రామంలోకి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటున్నారు.

ఘటన జరిగి రెండు నెలలు..
మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల వెంకట్ రావు, ఢిల్లీ జేఎన్ యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలి చిట్టిబాబు, ఇతర దళిత నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. ఘటన జరిగి రెండు నెలల అవుతున్నా కలెక్టర్...ఎస్పీ..పోలీసు యంత్రాంగం..ఇతర అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాధిత దళితులకు సంఘీభావం తెలపడానికి వచ్చే తెలుపుతున్న నాయకుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సబబు కాదన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడికి..ఎంపీ..ఎమ్మెల్యేలకు గట్టి బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రపతి దళితుడికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు ఈ విషయంపై ఎలాంటి సమాధానం చెబుతారని ఢిల్లీ జేఎన్ యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలి చిట్టిబాబు పేర్కొన్నారు. ఇక్కడ దళిత పేదలు ఆకలితో అలమిటిస్తున్నారని, ఏం తప్పు చేశారని 144 సెక్షన్ విధించారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం ఊపందుకుందని, ఢిల్లీ నుండి దళిత నాయకులంతా గరగపర్రుకు వస్తున్నారని తెలిపారు. దోషులను శిక్షించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

గరగపర్రుకు నాయకులు వస్తున్నారు - కాలి చిట్టిబాబు..

ఢిల్లీ : జాతీయ స్థాయిలో ఈ ఉద్యమం ఊపందుకుందని, ఢిల్లీ నుండి దళిత నాయకులంతా గరగపర్రుకు వస్తున్నారని ఢిల్లీ జేఎన్ యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలి చిట్టిబాబు పేర్కొన్నారు. దోషులను శిక్షించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

12:15 - June 25, 2017
12:13 - June 25, 2017

ఢిల్లీ : మొన్న సింగపూర్‌, నిన్న ఇండోనేషియా, నేడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌..తెలుగు తేజం తీన్ మార్ మోగించాడు. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. ఫైనల్ లో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ పై శ్రీకాంత్ గెలుపొందాడు. 22-20, 21-16 తేడాతో విజయం సాధించాడు. ఈ విజయంతో కెరీర్ లో మూడో సూపర్ సిరీస్ సాధించినట్లైంది. ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ లో నెగ్గడం ద్వారా టాప్ టెన్ లో ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పదకొండో ర్యాంకులో ఉన్న మరింత పైకి ఎగబాకుతాడని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రపంచ నెం.4 షి యూకీ (చైనా)పై అలవోక విజయం అందుకున్న కిదాంబి శ్రీకాంత్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. సింగపూర్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్‌.. ఇండోనేషియాలో విజేతగా అవతరించాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత కిదాంబి శ్రీకాంత్..

ఢిల్లీ : ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా కిదాంబి శ్రీకాంత్ నిలిచాడు. ఫైనల్ లో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ పై శ్రీకాంత్ గెలుపొందాడు. 22-20, 21-16 తేడాతో విజయం సాధించాడు. కెరీర్ లో మూడో సూపర్ సిరీస్ సాధించినట్లైంది.

రంజాన్ శుభాకాంక్షలు - మోడీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. సంతోషం ఎంత పంచుకుంటే అంత ఆనందంగా ఉంటారని, స్వచ్చతా కార్యక్రమం అతి పెద్ద ఉద్యమంగా మారిందన్నారు. విజయనగరం జిల్లాలో అతి పెద్ద మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారన్నారు. మార్చి 10 నుండి 14 వరకు 100గంటల్లో 10వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. ప్రజలు..స్థానిక నేతలు కలిసి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారన్నారు.

11:55 - June 25, 2017

కిటికీలోంచి బయటికి చూస్తున్న నాకు..ప్రశాంతంగా యోగ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తుందా చెట్టు... అంటూ అద్భుత భావుకతతో కవిత్వం చెబుతున్న వర్థమాన కవయిత్రి మెర్సీ మార్గరెట్. ఆమె రాసిన మాటల మడుగు కవితా సంకలనానికి 2017కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆధునిక వచన కవిత్వం నాడిని పట్టుకొని, కొత్త డిక్షన్ తో, తనదైన అభివ్యక్తితో మెర్సీ కవిత్వం రాస్తున్నారు. కేంద్రసాహిత్య అకాడమీ యువపురస్కారం సాధించిన మెర్సీ మార్గరెట్ కవిత్వంపై ఓ సమీక్షణం..మీకోసం...చూడండి..

11:53 - June 25, 2017

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రజలను ఆలోచింపజేస్తుంది. ఉద్యమాలకు ఊపందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులు మన మధ్య ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నవలాకారులు, కవి, విమర్శకులు శ్రీరామకవచం సాగర్ ఒకరు. రాత్రి గుండెల మీద కుంపట్లో... పుస్తకాలు రొట్టెలుగా తెగ కాల్చుకున్నాను... ఉదయం దాకా వాక్యాలు తింటూనే ఉన్నాయి.. అంటూ ఒక మెరుపులాంటి కొత్త భావాలతో కవిత్వం చెప్పిన ప్రయోగవాదకవి శ్రీరామ కవచం సాగర్. గత అయిదు దశాబ్దాలుగా సాహిత్యసేద్యం చేస్తున్న సాగర్ అద్భుతమైన నవలలు, కథలు, కవితలు రాశారు. దహనం, మూలుగు లాంటి నవలలు కొలిమి నవలలతో పాటు పలు కవితా సంకలనాలు ఆయన కలం నుండి జాలువారాయి. తెలుగు సాహిత్యంలో ముక్కాణీలు అన్న కొత్త కవితా ప్రక్రియను ప్రవేశపెట్టిన ప్రయోగ శీలి ఆయన. ప్రచార పటాటోపాలకు దూరంగా ఉంటూ సాహితీ కృషి చేస్తున్న ప్రముఖ కవి, రచయిత, నవలాశిల్పి, సాగర్ శ్రీరామకవచం గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

11:51 - June 25, 2017

హైదరాబాద్ : సకాలానికి వచ్చిన వానలు ఆశలు నింపితే.. బ్యాంకుల తీరు అన్నదాతలకు మింగుడుపడటం లేదు. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రుణప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉండగా.. తొలకరి ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా లెక్కలతో కుస్తీపడుతున్నాయి బ్యాంకులు. ప్రభుత్వం రుణమాఫీ అంటూ తెగ హడావిడి చేసినా .. తమకేం ఒరిగిందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. కోటి ఆశలతో ఖరీఫ్‌ సాగు చేపట్టిన రైతు పెట్టుబడి కోసం దిక్కులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు కూలీ డబ్బుల కోసం రైతుకు ధనం అవసరం. సీజన్ ప్రారంభానికి ముందే తయారు కావాల్సిన ఖరీఫ్ ప్రణాళిక నేటికీ తయారు కాలేదు. తొలకరికి ముందే మేనెలలోనే రుణ ప్రణాళిక ప్రకటించాల్సిన బ్యాంకులు.. సీజన్‌ ప్రారంభమైన నెలరోజలకు సమావేశం అయ్యాయి.

39 వేల కోట్ల రూపాయలు..
ఈ ఖరీఫ్‌లో 39 వేల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు అందించాలని బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ నిర్ణయం ఆదేశంగా మారి, క్షేత్ర స్థాయికి వేళ్లేందుకు కనీసం 20 రోజులు పడుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు. అప్పుడైనా రుణం అందుతుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రైతులకు అమలు చేస్తున్న రుణమాఫీ ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రుణమాఫీ ప్రహసనంగా మారింది. గత సంవత్సరం 87 శాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్నామని బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కానీ వాస్తవం మరో రకంగా ఉంది. వేల కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్మును పాతఅప్పులు, వాటివడ్డీలకే జమవేసుకున్న బ్యాంకులు ..పుస్తకాల్లో మాత్రం కొత్తరుణాలు ఇచ్చినట్టు రాసిపెట్టుకున్నాయి. దీనిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సహకార బ్యాంకులకు ప్రభుత్వం సపోర్ట్‌చేస్తే.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలు అందుతాయంటున్నారు.

రైతుకు నగదు అందుతుందా ?
మరో వైపు ముమ్మాటికి ఇది రైతు రాజ్యం.. రుణమాఫీయే దీనికి సాక్ష్యం అంటూ ప్రకటనలిస్తోంది కేసిఆర్ సర్కార్. రైతు రాజ్యంలో రైతన్నలకు చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందంటున్నారు అన్నదాతలు. రుణమాఫీ విడతల వారీగా జరగటంతో కొత్త రుణం ఇవ్వకుండా బ్యాంకులు ఇచ్చినట్టు నమోదు చేసుకుంటుండంతో పంటలకు పెట్టుబడి కోసం కర్షకులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మూడు రూపాయల నుండి ఐదు రూపాయల వరకు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ సేద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన రుణ ప్రణాళిక ఆచరణలోకి రావడానికి మరో నెల రోజులు పడుతుంది. అప్పుడు క్షేత్ర స్థాయిలో బ్యాంకులు కనికరించినా రైతుకు నగదు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతుంది.

మంత్రుల అసహనం..
బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బ్యాంకర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకులకు సామాజిక సృహ ఉండాలన్నారు. పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే రైతులకు సరైన ప్రయోజనం కలగలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత చేకూరింది. రుణ మాఫీపై వడ్డీ వేయడంతో రైతులకు భారంగా మారింది అనే విమర్శలు వినిపిస్తున్న సందర్భంలో మంత్రుల వ్యాఖ్యలు బ్యాంకుల తీరుకు అద్దం పట్టాయి. రుణమాఫీతో సంబంధం లేకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. అధిక వడ్డీలతో అన్నదాతల నడ్డి విరుస్తున్న ప్రయివేటు వడ్డీ వ్యాపారుల బారి నుండి కాపాడి సకాలంలో పంట రుణాలిస్తే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. ఈ సారైనా రుణాల్ని అందించే విషయంలో బుక్ అడ్జెస్ట్ మెంట్ లు జరగకుండా రుణం అందించాలని రైతులు కోరుతున్నారు.

11:48 - June 25, 2017

నల్గొండ : కులాంతర వివాహం చేసుకుని భర్త, అత్తమామల చేతిలో వేధింపులకు గురైన దళిత యువతి జ్యోతి న్యాయం కోసం పోరాడుతోంది. భర్త ఇంటి వద్ద నిరసన దీక్ష చేపట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలి నాతాళ్లగూడెంకు చెందిన జ్యోతి 2012లో లింగస్వామి గౌడ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు సవ్యంగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కవయ్యాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ జ్యోతి... ఐదేళ్లుగా పోలీసులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి భర్త ఇంటి వద్దే నిరసన దీక్షకు దిగింది.

11:33 - June 25, 2017

హైదరాబాద్ : అధికారం చేపట్టిన ఉద్యమపార్టీలో అంతర్గత యుద్ధం మొదలైందా..? ముఖ్యమంత్రి కుటుంబ పెత్తనంపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా..? పార్టీలో బలహీనవర్గాలు, దళిత నేతల మాటకు విలువ దక్కడంలేదా..? బీసీల బలంవల్లే తనకు మంత్రిపదవి దక్కిందన్న మంత్రి ఈటల వ్యాఖ్యలు దేనికి సంకేతం..? అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది..? తెలంగాణా ఉద్యమం మొదలైన నాటి నుంచి గులాబి జెండా మోసిన నేత ఈటల రాజేందర్‌. అధికారం చేపట్టిన తర్వాత కూడా అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్‌ కు నమ్మినబంటుగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల్లో కొత్త చర్చకు తెరతీస్తున్నాయి.

సౌమ్యుడు..
పార్టీలోనూ, ప్రభుత్వలోనూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న మంత్రి ఈటల రాజేందర్‌ పేలుస్తున్న మాటల తూటాలు సొంతపార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో బలమైన నేతగా ఎదిగి పార్టీ విధానాలను, ఉద్యమ సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేత.. ఒక్కసారిగా ప్రభుత్వంపై అసంతృప్తిని బయటపెట్టుకుంటున్న తీరుపై పార్టీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశాల్లో ..అభివృద్ధి అంతా ఆ నాలుగు నియోజకవర్గాలకే పరిమితం అవుతోందని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో మిగతా నియోజకవర్గాలపై వివక్ష కొనసాగుతోందని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించడం పార్టీలో కలకలమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన కుటుంబసభ్యుల నియోజకవర్గాల్లో మాత్రమే నిధుల ప్రవాహం కొనసాగుతోందన్న అసంతృప్తిని మంత్రి ఈటల తన మాటల్లో చెప్పకనే చెప్పేశారు.

లోగుట్టు ముచ్చట్లు..
తాజాగా నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలోనూ మంత్రిఈటల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనకు ఆర్ధిక మంత్రి పదవి ఎందుకు దక్కిందో అడగకుండానే చెప్పుకొచ్చారు మంత్రి ఈటల. బలహీన వర్గాల్లో తనకున్న మద్దతు వల్లనే మంత్రి పదవి చేట్టగలిగానని.. వ్యాఖ్యానించారు. తనకు బీసీవర్గాల్లో బలముందన్న సంకేతాలను ముఖ్యమంత్రికి ఇవ్వాలనే మంత్రి ఈటల ఇలా చెప్పుకుంటున్నారా.. రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. మంత్రి ఈటల మాటల్లో పెరిగిన కరుకుదనంపై గులాబీపార్టీలో లోగుట్టుముచ్చట్లు జోరందుకున్నాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం ఖర్చుపెడుతున్న నిధులు సీఎం కుటుంబం చుట్టే తిరుగుతున్నాయన్న అసంతృప్తి మిగతా పార్టీనేతల్లో ఉన్నా.. నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. తాజాగా మంత్రి ఈటల మాటల్లో పెరిగిన వాడిని వారూ లోగుట్టుగా స్వాగతిస్తున్నారు. మంత్రి ఈటల ధైర్యంగా మాట్లాడుతున్నారని సంబంరంగా చెప్పుకుంటున్నారు. ఇంతకీ మంత్రి ఈటల మాటల తూటాల వెనుక అసలు కథ ఏంటనే ప్రశ్నకు .. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైఖరే అని గులాబీపార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా మంత్రి ఈటలతో సీఎం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వనంతగా పరిస్థితి వచ్చిందని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇది ఎంతదాకా పోతుందోనని మరికొందరు నేతలు కలవర పడుతున్నారు.

మీనా అంత్యక్రియలు పూర్తి..

రంగారెడ్డి : వికారాబాద్ జిల్లాలోని యాలాల (మం) గోరేపల్లిలో చిన్నారి మీనా అంత్యక్రియలు ముగిశాయి. బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా శరీర భాగాలు బయటకొచ్చడంతో ఆమె మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

11:14 - June 25, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొత్వాలగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. భరత్ ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో భరత్ అక్కడికక్కడనే మృతి చెందాడు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గచ్చిబౌలికి వెళుతున్న భరత్..
శంషాబాద్ నుండి గచ్చిబౌలికి భరత్ శనివారం రాత్రి వెళుతున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలు నిలపకూడదనే నిబంధన ఉన్నా ఓ లారీ పార్కింగ్ చేసి ఉండడడం..భరత్ కారు దానిని ఢీకొనడం జరిగిపోయాయి. తొలుత పోలీసులు ఇతర వ్యక్తిగా భావించారు. పోలీసుల దర్యాప్తులో భరత్ తల్లి రాజ్యలక్ష్మి పేరిట రిజిష్టర్ అయ్యి ఉంది. దర్యాప్తులో రవితేజ సోదరుడని తేలింది. సమాచారం తెలుసుకున్న రవితేజ కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలివస్తున్నారు.

సినిమాలు..వివాదాలు..
సోదరుడు భరత్ పలు సినిమాల్లో నటించాడు. సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన భరత్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడు. పెదబాబు..ఒక సైన్యం..ఒక్కడే..దోచెయ్ లాంటి పలు సినిమాల్లో నటించాడు. అంతేగాకుండా పలు వివాదాల్లో కూడా భరత్ పేరు వినిపించింది. గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో వీరంగం సృష్టించడంలో కూడా అరెస్టు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసుల విచారణకు హాజరైన భరత్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించారు. అనంతరం మీడియాకు క్షమాపణలు చెప్పారు.

పాక్ లో 123 మంది సజీవదహనం..

పాకిస్తాన్ : బహావల్ పూర్ లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుండి లీకవుతున్న ఆయిల్ ను డబ్బాల్లో పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ట్యాంకర్ కు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీనితో 123 మంది దుర్మరణం చెందగా 40మందికి పైగా గాయాలయ్యాయి.

పాక్ లో 123 మంది సజీవదహనం..

పాకిస్తాన్ : బహావల్ పూర్ లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుండి లీకవుతున్న ఆయిల్ ను డబ్బాల్లో పట్టుకొనేందుకు స్థానికులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ట్యాంకర్ కు నిప్పంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీనితో 123 మంది దుర్మరణం చెందగా 40మందికి పైగా గాయాలయ్యాయి.

రవితేజ సోదరుడు భరత్ మృతి..

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శంషాబాద్ (మం) కొత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ కారు ఢీకొంది. దీనితో భరత్ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

10:34 - June 25, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. క్రిస్టియన్ పేట గరగపర్రు గ్రామంలో దళితులపై అగ్రవర్ణాలు విధించిన కులబహిష్కరణను టెన్ టివి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దళితులపై జరిగిన వివక్షపై సంఘాలు గళమెత్తాయి. తాజాగా పోలీసులు గ్రామాన్ని స్వాధీనంలోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలోకి గ్రామస్తులు కాకుండా ఇతరులను అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఘటనకు కారణమైన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. మరోవైపు దళితుల బహిష్కరణపై విచారణ మంగళవారానికి వాయిదా వేశారు.

10:14 - June 25, 2017

రంగారెడ్డి : చిట్టి తల్లి మీనా ఇక సెలవంటోంది..గురువారం సాయంత్రం బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా ఆదివారం ఉదయం కన్నుమూసింది. 400 ఫీట్ల లోతులో పడిపోయిన మీనా శరీర అవయవభాగాలు బయటకు రావడంతో ఆమె కన్నుమూసిందని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించడంతో విషాదం నెలకొంది. 60గంటలుగా కొనసాగిన రెస్క్యూ విషాదంగా ముగియడంతో మీనా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుళ్లిపోయిన శరీర అవయవభాగాలు ఓ పెట్టేలో భద్రపరిచి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మీనా అవయవభాగాలను తల్లిదండ్రులకు అప్పగించారు. విషాద వదనాలతో తల్లిదండ్రులు వికారాబాద్ జిల్లాలోని యాలాల (మం) గోరేపల్లికి తీసుకెళ్లారు. ప్రభుత్వం తరపున అంత్యక్రియలు జరుగనున్నాయి. రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ణ సునీతా మహేందర్ రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. చిట్టి తల్లి అంత్యక్రియలకు మంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మీనా కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

మీనా పోస్టుమార్టం పూర్తి..

రంగారెడ్డి : చిన్నారి మీనా శరీర భాగాలకు చేవెళ్ల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యింది. చిన్నారి శరీర భాగాలను తల్లిదండ్రులకు వైద్యులు అప్పగించారు. శరీర భాగాలను తల్లిదండ్రులు యాలాల (మం) గోరేపల్లికి తీసుకెళుతున్నారు.

09:31 - June 25, 2017

హైదరాబాద్ : ఆషాడం మాసం వచ్చేసింది.. తొలి ఆదివారం కూడా రావడంతో గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి ఆదివారం ఉదయం భక్తులు తొలి బోనాన్ని సమర్పించుకుంటున్నారు. తొలుత లంగర్ హౌస్ నుండి ఘటాల ఊరేగింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే గోల్కొండ ప్రాంగణంలో డప్పు చప్పుళ్లు..శివసత్తుల పూనకాలు..పోతురాజుల విన్యాసాలతో పండుగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

09:24 - June 25, 2017

రాజమండ్రి : మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దళితలకు అండగా..బాసటగా ఉంటే అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రులో కుల బహిష్కరణపై 10టీవీ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గరగపర్రులోని ఓ చర్చీలో బస చేసిన హర్షకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ టెన్ టివితో మాట్లాడారు. గ్రామం నుండి రాజమండ్రికి తీసుకొచ్చారని తెలిపారు. గ్రామస్తులతో పాటు తాను పడుకోవడం జరిగిందని, మాట్లాడాలంటూ బలవంతంగా తీసుకొచ్చారని పేర్కొన్నారు. దోషులను శిక్షించేంత వరకు గ్రామంలోనే ఉంటానని..అండగా ఉంటానని చెప్పడం వల్ల ఇలా చేశారని తెలిపారు. అత్యంత పాశవికంగా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. 50 రోజుల ముందు కంప్లైట్ ఇస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేయడం జరిగిందని, న్యాయం చేయాలంటూ బాసటగా ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేయడం సబబు కాదన్నారు. వెంటనే ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్టు చేయకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయో రేపటి నుండి చూస్తారని హర్షకుమార్ హెచ్చరించారు.

09:12 - June 25, 2017

రంగారెడ్డి : బోరుబావులపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో పడిపోయిన మీనా మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. సంఘటన జరిగినప్పటి నుండి ఆదివారం ఉదయం వరకు కలెక్టర్ స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టెన్ టివితో కలెక్టర్ రఘునందన్ రావు మాట్లాడారు. తవ్వకాలు..నిర్వాహణపై నిబంధనలు రూపొందిస్తామని, భవిష్యత్ లో బోరుబావుల కారణంగా చిన్నారులు బలికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఘటన జరిగిన అనంతరం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపై ఓ నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. సమన్వయ లోపం ఉందని బయటి వారు అనుకోవచ్చని, కానీ ఉన్న సమాచారం..అవసరాన్ని బట్టి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

09:01 - June 25, 2017
08:42 - June 25, 2017

రంగారెడ్డి : ఆడుతూ..పాడుతూ తిరగాల్సిన చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కారు డోర్ లాక్ కావడంతో ఆ చిన్నారి ఊపిరి ఆగిపోయింది. ఈ విషాద ఘటన నార్సింగిలో చోటు చేసుకుంది. గండిపేట మండలం పీరంచెరువు గ్రామానికి చెందిన అమీన్ పంచాయతీ వార్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి సజాత్ హుస్సేన్ రెండేళ్ల కుమారుడున్నాడు. సజాత్..మరో చిన్నారి ఆడుకుంటూ కారులోపలకు వెళ్లారు. అనంతరం చిన్నారి వెళ్లిపోగా సజాత్ మాత్రం కారులోనే ఉండిపోయాడు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో సజాత్ కు ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. కుమారుడి జాడ కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు కారులో ఉన్నాడని ఆలస్యంగా గుర్తించారు. కారు అద్దాలను పగులగొట్టి సజాత్ ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడని చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై బాలల హక్కుల సంఘం స్పందించింది. చిన్నారులు ఆడుకొనే సమయం..ఇతరత్రా సమయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.

08:26 - June 25, 2017

తూర్పుగోదావరి : గరగపర్రులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గరగపర్రులో కుల బహిష్కరణపై 10టీవీ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా దళిత సంఘాలు భారీ ఆందోళనలు చేపట్టాయి. తాజాగా మాజీ ఎంపీ హర్షకుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేగింది. గరగపర్రు క్రిస్టియన్ పేటలో హర్షకుమార్ శనివారం రాత్రి బస చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు చర్చీ వద్దకు చేరుకున్నారు. ముందుగా విద్యుత్ ను తీసివేసి తెల్లవారుజామున 3.30గంటల సమయంలో హర్షకుమార్ ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఉన్న దళిత నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్షకుమార్ ను రాజానగరం పీఎస్ కు తరలించారు. దళిత నాయకుల దగ్గరున్న సెల్ ఫోన్ లు తీసుకుని ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అరెస్టుపై హర్షకుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అరెస్టు వారెంట్ ఇవ్వకుండా నిద్రపోతున్న తనను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం పాశవికంగా వ్యవహరిస్తోందని, గరగపర్రు నిందితులను అరెస్టు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్ధేశ్యంతో తాము అరెస్టులు చేయడం జరుగుతోందని పోలీసులు పేర్కొంటున్నట్లు సమాచారం. దళితుల ఆందోళనలకు తోడుగా అగ్రవర్ణాలు కూడా ధర్నాలు..ఆందోళనలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే టెన్ టివి కథనాలకు స్పందించిన జాతీయ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌..దళితుల బహిష్కరణపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌, ఎస్పీలకు ఎస్సీ, ఎస్టీ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు గరగపర్రులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆదివారం విచారణ జరుపనున్నారు. ఈ విచారణకు జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌, ఎస్పీ హాజరుకానున్నారు.

07:44 - June 25, 2017

రంగారెడ్డి : తెరిచి ఉంచి ఉన్న బోరు బావులను మూసేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా మృతి చెందింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. బోరు బావిలో పడిపోయిన చిన్నారి మీనాను క్షేమంగా తీయడానికి తాము శతవిధాలన ప్రయత్నించామన్నారు. కింద నుండి ఫ్రషర్ పెట్టి బయటకు తీసేందుకు ప్రయత్నించినట్లు, ఆరేడు గంటల వరకు బాడీలో మూవ్ మెంట్ లేకపోవడంతో మోటార్ సహాయంతో బయటకు తీసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రోబోటిక్ యంత్రం..తాడు సహాయంతో ప్రయత్నాలు చేసినట్లు, 40 ఫీట్ల వరకు తవ్వినట్లు తరువాత హైడ్రాలిక్ ఫ్రషర్ సహాయంతో పెద్ద బండరాయిని తవ్వడంతో ఆ వైబ్రేషన్ కారణంగా బాడీ కిందకు వెళ్లిపోయిందన్నారు. 90 ఫీట్లు..215 ఫీట్లు..ఇలా 330 ఫీట్ల వరకు వివిధ యంత్రాలు పంపామన్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడి చివరి ప్రయత్నంలో భాగంగా బాడీని బయటకు తీసుకొచ్చామన్నారు. బోరు బావి యజమానిపై కేసు నమోదు చేసినట్లు, ప్రతి గ్రామంలో తన బోరు బావి కాకుండా ఇతర బోర్లు తెరిచి ఉండకూడదని ప్రతొక్కరూ భావించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటుందని..అలా కాకుండా ప్రతొక్కరి మనస్సులో నుండి రావాలని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తెరిచి ఉంచిన బోరు బావులను మూసివేయాలని సూచించారు.

07:33 - June 25, 2017

రంగారెడ్డి : చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో మీనా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయిందని మంత్రి ప్రకటించారు. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం తాను, ఎంపీ, కలెక్టర్, ఉన్నతాధికారులు ఇక్కడకు చేరుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సహాయక చర్యలు కొనసాగాయన్నారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీయాలని అనుకోవడం జరిగిందని, మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు. 180 ఫీట్ల వరకు కెమెరాలను పంపించినట్లు, కానీ ఆ ఫలితం నెరవేరలేదన్నారు. 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫ్లషింగ్ సహాయంతో తీయాలని ప్రయత్నించగా మీనా డ్రస్..శరీర భాగాలు బయటకు రావడం జరిగిందన్నారు. ఇలా జరగడం బాధాకరమని, చిన్నారి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామన్నారు.

07:18 - June 25, 2017
07:16 - June 25, 2017

క్షణక్షణం ఉత్కంఠ..చిన్నారి మీనా క్షేమంగా బయటకు రావాలి..అంటూ ప్రతొక్కరిలో ఆశ...మీనా..నేను అమ్మను..నేను వస్తున్నా..అంటూ ఆ తల్లి ఆవేదనతో చెబుతున్న మాటలు..బోరు బావి చుట్టూ తవ్వకాలు..ఆత్యాధునిక కెమెరాలతో పరిశీలన..కానీ ఇవన్నీ ఏవీ నెరవేరలేదు..ఆ చిన్నారి మీనా అనంతలోకాలకు వెళ్లిపోయింది..60గంటలుగా కొనసాగిన రెస్క్యూ చివరికి విషాదంతో ముగిసింది.
 

60గంటలు..
రంగారెడ్డి : చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం చిన్నారి మీనా బోరు బావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారి మృతి చెందిందని మంత్రి మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రకటించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యాయరు. 60గంటలుగా కొనసాగిన రెస్క్యూ విఫలైమంది. దీనితో ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఫ్లష్ ఔట్ పద్ధతితో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం వారి స్వగ్రామానికి తరలిస్తామని అధికారులు వెల్లడించారు.

ఆదుకుంటాం - మహేందర్ రెడ్డి..
చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. మీనా కుటుంబాన్ని ఆదుకుంటామని, 420 ఫీట్ల వరకు చిన్నారి వెళ్లినట్లు గుర్తించినట్లు తెలిపారు. కుళ్లిపోయిన స్థితిలో చిన్నారి శరీర భాగాలు బయటకొచ్చాయని, చిన్నారి రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నించినట్లు తెలిపారు. 40-50 ఫీట్ల మధ్య మోటార్ తీసినప్పుడు మోటార్ తో పాటు పాప వస్తుందని అనుకున్నట్లు కానీ అలా జరగలేదన్నారు.

గరగపర్రులో కారెం శివాజీ విచారణ..

పశ్చిమగోదావరి : గరగపర్రులో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆదివారం విచారణ జరుపనున్నారు. ఈ విచారణకు జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌, ఎస్పీ హాజరుకానున్నారు.
 

చిన్నారి మీనా తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు..

రంగారెడ్డి : చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో బోరు బావిలో పడిపోయిన చిన్నారి మీనా కన్నుమూసింది. దీనితో మీనా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పాప అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బోరు బావులపై స్పెషల్ డ్రైవ్ - మహేందర్ రెడ్డి..

రంగారెడ్డి : బోరు బావులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటించారు. చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని, కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.

చిన్నారి మృతి చెందడం బాధాకరం -మహేందర్ రెడ్డి..

హైదరాబాద్ : చిన్నారి మీనా మృతి చెందడం బాధాకరమని మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో చిన్నారి మీనా పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు.

06:38 - June 25, 2017

ఢిల్లీ : క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో మిథాలీ సేన అదిరే ఆరంభం చేసింది. ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ ఉమెన్లు రెచ్చిపోవడంతో వన్డేలో రెండో అత్యుత్తమ స్కోర్‌ను భారత్‌ నమోదు చేసింది. బ్యాట్స్‌ ఉమెన్లు, బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌పై భారత్‌ సునాయాసంగా గెలుపు సాధించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మెగా టోర్నీలో మిథాలీరాజ్‌ సేన అద్భుత విజయంతో ఆరంభించింది. సమిష్టి ప్రదర్శనతో పటిష్ట ఇంగ్లాండ్‌ను 35 పరుగులతో తేడాతో ఓడించింది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్..
వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌... 3 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వరల్డ్‌కప్‌లో భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోర్‌ కాగా... ఇంగ్లాండ్‌పై ఇదే అత్యుత్తమ స్కోర్‌. ఇక ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌లు చెలరేగి ఆడటంతో భారత్‌ భారీ స్కోర్‌ చేయగలిగింది. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో ముగ్గురు భారత్‌ బ్యాట్‌ ఉమెన్లు అర్ధశతకాలు చేశారు. మంధన 72 బంతుల్లో 90 పరుగులు, పూనమ్‌ 134 బంతుల్లో 86, మిథాలీ 73 బంతుల్లో 71 పరుగులు చేశారు. మొత్తానికి ఇంగ్లాండ్‌ ముందు భారత్‌ 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

35 పరుగుల తేడాతో విజయం..
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ ఉమెన్‌ విల్సన్‌ 81 పరుగులతో రాణించింది. ఇంగ్లాండ్‌ గెలుపు కోసం పయనిస్తున్న సమయంలో రనౌట్లు శాపమయ్యాయి. నలుగురు బ్యాట్స్‌ ఉమెన్లు రనౌట్‌ కావడంతో.. ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌ 47.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో భారత్‌ ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తానికి భారత్‌ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించారు. 90 పరుగులు చేసిన స్మృతి నందన ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఇక ఈనెల 29న వెస్టిండీస్‌తో మిథాలీ సేన తలపడనుంది.

06:35 - June 25, 2017

హైదరాబాద్ : గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధమైంది. డప్పు దరువులు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల జానపద నృత్యాలతో బోనాలు హోరెత్తనున్నాయి. తొలి బోనం అందుకునేందుకు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం వైభవంగా ముస్తాబవుతోంది. ప్రతిష్ఠాత్మకంగా జరిపే బోనాల వేడుకలకు తెలంగాణ సర్కార్ పదికోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. గోల్కొండలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే వేడుక .. ఆషాఢమాస బోనాల జాతర. కాకతీయులకాలంలో మొదలై.. కుతుబ్‌షాహీల పాలనలో ప్రసిద్ధి చెందిన బోనాల జాతరకు ఘన చరిత్ర ఉంది. బండరాళ్ల మధ్య స్వయంభువుగా వెలిసిన జగదాంబిక అమ్మవారికి ఏటా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో తొలి బోనం గోల్కొండ ఉత్సవాలతో మొదలై.. తిరిగి ఇక్కడే ఉత్సవాలు ముగుస్తాయి. జూలై 9న మహంకాళి జాతర లష్కర్ బోనాలు జరుగుతాయి. ఆ తరువాత జూలై 16న లాల్‌ దర్వాజ పాతబస్తీ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు.

అనంతచారి ఇంట్లో ఘనంగా పూజలు..
బోనాలను అధికారికంగా నిర్వహించిన ఘనత కుతుబ్‌షాహీలదే. వీరి అనంతరం పాలన సాగించిన అసఫ్‌జాహీలు సైతం ఆషాఢ బోనాలను అధికారికంగా కొనసాగించారు. ఇక కుతుబ్‌షాహీల కాలం నుంచి స్థానిక ముస్లింలు బోనాల ఏర్పాట్లు, నిర్వహణలో హిందువులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక టిఆర్‌ఎస్ సర్కార్ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్‌ను మంజూరు చేసింది. గోల్కొండ బోనాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల్లో భాగంగా ముందుగా అమ్మవారి విగ్రహాలకు ప్రధాన అర్చకులు అనంతచారి ఇంట్లో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత జగదాంబిక అమ్మవారి ఆలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. తొట్టెల ఊరేగింపు, అమ్మవారి రథం ఊరేగింపు, పోతరాజుల నత్యాలతో లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి బోనాల జాతర ఊరేగింపు వెళ్తుంది. లంగర్ హౌజ్ చౌరస్తా వద్ద తెలంగాణా రాష్ట్ర మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. గోల్కొండ కోటలో ఎదురుకోళ్లు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించనున్నారు.

అధికారుల చర్యలు..
దిగంబర్ పంత్‌ ప్రాంతం నుంచి బయలు దేరే ఉత్సవ విగ్రహాలకు చోటా బజార్‌లో సాక పోసే కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ కోటలో ఎలాంటి తోపులాట జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా చోటేబజార్, బడే బజార్ మీదుగా పోతరాజుల నృత్యాలు, తీన్ మార్ దరువులు, డీజే స్టెప్పులతో ఊరేగింపు అంబరాన్నంటనుంది. బోనాల పండుగ సందర్భంగా దేవాదాయశాఖ, ఉత్సవ కమిటి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోటలో ప్రతి ఆదివారం, గురువారం బోనాల సమర్పణ సందర్భంగా ప్రత్యేక భద్రతతో పాటు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఎమర్జెన్సీ వైద్యసేవలు, ప్రత్యేక షెడ్లులాంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కోటలోపల ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ తో పాటు ప్రత్యేక వెలుగులు జిమ్మే డిజిటల్ మేకింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ సారి సాంస్కతిక శాఖ అధ్వర్యంలో తెలంగాణ జానపద నృత్యాలు, ఒగ్గుడోలు, దుస్సాట, పల్లెల వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాబృందాలతో ప్రదర్శనలు జరగనున్నాయి.

బోరు బావిలో పడిన చిన్నారి ఇక లేదు..

రంగారెడ్డి : బోరు బావిలో పడిపోయిన చిన్నారి మీనా మృతి చెందింది. పాపను రక్షించేందుకు అధికారులు 60 గంటల పాటు శ్రమించారు.

06:28 - June 25, 2017

రంగారెడ్డి : జిల్లాలోని చేవెళ్ల మండలం చన్ వెళ్లి గ్రామంలో గురువారం బోరు బావిలో పడిపోయిన చిన్నారిని బయటకు తీసేందుకు అధికారులు చివరి ప్రయత్నం చేస్తున్నారు. కేఎల్‌ఆర్‌ బోర్‌వెల్స్‌ ఆధ్వర్యంలో రెస్క్యూఆపరేషన్‌ జరుగుతోంది. ఎయిర్‌ లిఫ్టింగ్‌ టెక్నాలజీతో పాపను బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్‌ ప్రయత్నిస్తోంది. అయితే... పాప 70 నుంచి 100 అడుగుల లోతుకు జారుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు ఉపయోగించినా.. పాప ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఇదిలావుంటే బోరుబావికి సమాంతరంగా 40 అడుగుల మేర జేసీబీలు తవ్వకాలు జరిపాయి. కాసేపట్లో పాపను బయటకు తీస్తామని అధికారులంటున్నారు.

గురువారం సాయంత్రం..
గురువారం సాయంత్రం బోరుబావిలో పడ్డ మీనాను రక్షించేందుకు 60 గంటలుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారిని వెలికి తీసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తూనే ఉంది. అయితే.. గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు అడుగంటుతున్నాయి. చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన పెరుగుతోంది. బోరుబావిలో పడినప్పుడు 40 అడుగుల లోతులో చిక్కుకున్న చిన్నారి.. మోటార్‌ బయటకు తీయడంతో మరింత లోతుకు జారిపోయింది. శనివారం రంగంలో దిగిన ఓఎన్జీసీ బృందాలు.. 70 అడుగుల లోతుకు కెమెరాలు పంపించినా పాప జాడ దొరకలేదు. మరొక టీమ్‌ వాటర్‌ ప్రూఫ్‌ మ్యాట్రిక్స్‌ కెమెరాలను 210 అడుగుల మేర వదిలినా.. బోరుబావిలో నీరుండటంతో కెమెరాలో దృశ్యాలు సరిగ్గా కనిపించలేదు. ఆ తర్వాత ముంబై నుంచి తెప్పించిన ప్రత్యేక కెమెరాతో బోరుబావిలో పరిశీలించారు. 360 డిగ్రీల యాంగిల్‌లోనూ పాప కనిపించకపోవడంతో సర్వత్రా ఆందోళన మొదలైంది.

మోటార్ తీయడంతోనే...
అయితే... మోటార్‌ తీసే సమయంలో పాప మట్టిలో కూరుకుపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పాప 40 అడుగుల లోపే ఉంటుందనుకుంటున్నారు. ఎలాగైనా పాపను బయటకు తీయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. బోరు బావులలో ఎంతో అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సలహాలు, సూచనలతో చివరి ప్రయత్నం చేస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో బోరుబావి వేయాలనుకున్నారు. కానీ.. ఎయిర్‌ ప్రెషర్‌తో బోరుబావిలో ఉన్న చిన్నారిని బయటకు తీసుకువస్తామంటున్నారు. అయితే.. గతంలో బోరుబావికి కేసింగ్‌ లేకపోవడంతో... 60 అడుగుల వరకు కేసింగ్‌ వేశారు. ఇదిలావుంటే... పాప బతికి ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌ ప్రెషర్‌ టెక్నాలజీతో బోరుబావిలోని మట్టి, నీళ్లు బయటకు తీస్తామని... దీంతో పాప ఎక్కడ ఉందో తెలుస్తుందంటున్నారు.

కొనసాగుతున్న తవ్వకాలు..
మరోవైపు బోరుబావికి సమాంతరంగా జేసీబీలతో తవ్వకాలు జరుగుతున్నాయి. మంత్రి మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు కలెక్టర్‌ జిల్లా యంత్రాంగమంతా ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇదిలావుంటే.. పాప కోసం తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఏది ఏమైనా కాసేపట్లో బోరుబావిలో నుంచి పాపను బయటకు తీసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియా నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుండి 747 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నేడు ఏపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష జరుగనుంది.

హైదరాబాద్ : నేడు ఏపీపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష జరుగనుంది. ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగనుంది.

 

టి.కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేద ముస్లీంలకు దుస్తుల పంపిణీ..

హైదరాబాద్ : రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లీంలకు దుస్తులు, గిఫ్ట్ లను పీసీసీ చీఫ్ ఉత్తమ్ పంపిణీ చేయనున్నారు.

Don't Miss