Activities calendar

27 June 2017

21:33 - June 27, 2017

దహేగ్ : భారత ఆర్థికాభివృద్ధిలో నెదర్లాండ్స్‌ సహజ భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌ వెళ్లిన మోది ది హేగ్‌లో ఆ దేశ ప్రధాని మార్క్‌ రూట్‌తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య మూడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. తన పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని మోది ఆకాంక్షించారు. భారత్‌-నెదర్లాండ్స్‌కు ఇది 70వ వార్షికోత్సవమని...ఈ క్రమంలో ద్వైపాక్షిక సంబంధాలపై మరింత దృష్టి సారించి ముందుకెళ్తున్నట్లు మోది చెప్పారు. ప్రపంచంలోనే ఇండియా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్ రుట్టె పేర్కొన్నారు. నెదర్లాండ్స్ మద్దతుతో...మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌లో భారత్‌ సభ్యత్వం సాధించిందని మోది గుర్తు చేశారు. అమెరికా నుంచి నెదర్లాండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదికి ఘనస్వాగతం లభించింది.

21:31 - June 27, 2017

గుంటూరు : పచ్చని గిరి గూడేల్లో విష జ్వరాలు పడగ విప్పాయి. ఇప్పటికే 18 మందిని పొట్టనపెట్టుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా చాపరాయిలో మూడు వారాల్లో 18 మంది, విశాఖ జిల్లాలో జి.మాడుగుల సర్పంచ్‌ మత్స్యరాజు, మరో పదకొండేళ్ల చిన్నారి మేఘనలు కూడా విషజ్వరాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పచ్చని గూడేలు శవాల దిబ్బగా మారుతున్నా ఏ అధికారీ అటువైపు చూసిన పాపాన పోలేదు. ఆదివారం విషయం వెలుగులోకి రావడంతో అధికారులు చాపరాయికి పరుగులు తీశారు. అప్పటి వరకు చాపరాయి మృత్యు ఘోష ఎవరికి వినిపించలేదు. ఆలస్యంగా నిద్రలేచిన ప్రభుత్వ యంత్రాంగం బాధితుల్ని కాకినాడ, రంపచోడవరం, మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రులలో చేర్పించి చేతులు దులుపుకుంది.

పెడర్థాన్ని తీస్తున్నా సర్కార్
పరిస్థితి తీవ్రతను, గిరిజనుల వేదనను అర్థం చేసుకోవాల్సిన సర్కారు పెద్దలు.. ఈ విషాదానికి మరో పెడర్థాన్ని తీస్తున్నారు. అంతుచిక్కని జ్వరాలకు పదుల సంఖ్యలో గిరిపుత్రులు అసువులు బాస్తుంటే.. పాలకులు ఈ రీతిగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. ఏజెన్సీలో ఏటా విష జ్వరాలు ప్రబలి అమాయకపు గిరిజనులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పటికైనా ఏజెన్సీల్లో విస్తరిస్తున్న విష జ్వరాలు.. ఆంత్రాక్స్ లాంటి మహమ్మారుల నివారణకు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. 

21:29 - June 27, 2017

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రి దత్తాత్రేయ... కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కలిశారు. కాళేశ్వరం, నీటిపారుదల, ఇతర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై ఆయనతో చర్చించారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ ప్రాజెక్టులను క్లియర్‌ చేస్తుందని అని దత్తాత్రేయ అన్నారు.

 

21:27 - June 27, 2017

పశ్చిమగోదావరి : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గరగపర్రు దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనలో.. ప్రభుత్వం నుంచి స్వల్ప కదలిక వచ్చింది. ఘటనకు బాధ్యులను చేస్తూ.. పాలకోడేరు తహశీల్దారు రత్నమణితో పాటు, ఎస్‌ఐ రాంబాబును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. గరగపర్రు వివాదంలో, ప్రభుత్వానికి తప్పుడు నివేదిక పంపినందుకు వీరిపై ఈ చర్యను తీసుకుంది. అటు గరగపర్రు పంచాయతీ సర్పంచ్‌ ఉన్నమట్ల ఎలిజబెత్‌పైనా చర్యలు తీసుకుంది. ఆమె చెక్‌పవర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

24 గంటల్లోగా అరెస్టు చేయాలి
మరోవైపు, మంగళవారం, గరగపర్రును సందర్శించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. దళితుల సాంఘిక బహిష్కారానికి కారకులైన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ అధికారులను ఆదేశించారు. దళితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో పూర్వ స్థితి నెలకొనేందుకు ప్రతి 15 రోజులకోసారి గ్రామంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. గరగపర్రు దళితుల వెతల గురించి 10టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ప్రభుత్వంలో కదలికను తెచ్చాయి. సభ్య సమాజం నుంచి దళితులకు రోజురోజుకీ మద్దతు పెరుగుతుండడం.. విపక్ష నాయకులు కూడా గరగపర్రు బాధితులను పరామర్శిస్తుండడం.. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తెచ్చింది. దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్‌తో పాటే, రాష్ట్ర మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌లూ మంగళవారం, గరగపర్రులో పర్యటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని... ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు దళితులకు భరోసా ఇచ్చారు.

10టీవీని అభినందించిన జూపూడి
ఇక గరగపర్రులో పర్యటించిన ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌.. ఘటనను సభ్యసమాజం దృష్టికి తీసుకువచ్చిన 10టీవీని అభినందించారు. ఓ వైపు ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెడుతుంటే... గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం దారుణమన్నారు. వెలి వేసిన దళితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతిపక్షాల పోరాటం
ఇదిలావుంటే... దోషులను శిక్షించాలని కోరుతూ బుధవారం ఉదయం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హర్షకుమార్‌ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. అధికారులంతా టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. ఓవైపు దేశ ప్రథమ పౌరుడిగా దళిత అభ్యర్థిని ఎన్నుకోబోతున్న ఈ సమయంలో కూడా ఇలాంటి కుల దురహంకార, దళిత బహిష్కరణ ఘటనలు వెలుగు చూస్తుండడం దారుణమని దళిత, ప్రజాసంఘాలంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి.

 

20:41 - June 27, 2017

ఇద్దరూ నినాదాలిస్తారు.. తమ తమ దేశాలను గొప్పగా మార్చాలని చెప్తుంటారు..ఒకరు అమెరికా అధ్యక్షుడు.. మరొకరు భారత ప్రధాని..అమెరికా భారత్ తో స్నేహానికి ముందుకు దూకుతోందా? వ్యూహాత్మక భాగస్వామిగా భారత్ ఎందుకు మారింది? దీనికి కారణాలేంటి? ట్రంప్ మోడీ భేటీ ఏం తేల్చింది? ఎన్ని మాటలు చెప్పినా... ఎన్ని ప్రకటనలు చేసినా, ద్వైపాక్షిక సమావేశాల్లో ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం.. ఇప్పుడు ప్రపంచాన్ని గిర్రున చుట్టే ప్రధాని మోడీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి ఆతిధ్యాన్ని స్వీకరించారు. సమావేశాన్ని కూడా పూర్తి చేశారు. మరి ప్రయోజనం అమెరికాకా? భారత్ కా? లేక ఇరుదేశాలకీనా? భారత్ అమెరికాల మధ్య స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయి చెప్పుకోటమే లక్ష్యమా? ఉగ్రవాదం, సాంకేతికత, రక్షణ లాంటి అంశాలు మాత్రమే చర్చించారా? పాకిస్తాన్ కు ఓ వార్నింగ్ ఇవ్వటమే ముఖ్యాంశమా? మరి పాక్ కు అమెరికా అందించే ఆయుధాల మాటేమిటి? అసలు మోడీ, ట్రంప్ ఏం చర్చించారు..? సమావేశం ఏదైనా ప్రయోజనం ఏమిటి అనేది అసలు విషయం.

20:30 - June 27, 2017
20:28 - June 27, 2017
20:14 - June 27, 2017
20:13 - June 27, 2017

చెన్నై : తొమ్మిదేళ్ల విరామం తర్వాత సినీ నటి శ్రియారెడ్డి మళ్లీ తెరపై కనిపించనుంది. వేలుమణి దర్శకత్వంలో అండావై కానోమ్‌ అనే తమిళ సినిమాలో శ్రియా నటించింది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ చెన్నైలోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించినందుకు సంతోషంగా ఉందని శ్రియారెడ్డి అన్నారు. 

20:11 - June 27, 2017

ఢిల్లీ : గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిన లోక్‌సభ్‌ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికను 'దళిత్‌ వర్సెస్‌ దళిత్‌'గా అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇది కుల పోరాటం కాదని భావజాల సంగ్రామమని పేర్కొన్నారు. కుల వ్యవస్థను భూస్థాపితం చేయాలన్నారు. సమ్మిళిత అభివృద్ధి, పత్రికా స్వేచ్ఛ, సామాజిక న్యాయం, పారదర్శకత, అవినీతి అంతం, కులవివక్షను రూపుమాపడమే తమ సిద్ధాంతమని మీరా కుమార్‌ తెలిపారు. ఒకే విధమైన సైద్ధాంతికతతో విపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచాయన్నారు. ఈ అంశాల ఆధారంగానే తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తనపై విశ్వాసం ఉంచి రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపినందుకు 17 రాజకీయ పార్టీలకు మీరా కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు.

20:10 - June 27, 2017

ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలకు జూన్‌ 30 నుంచి ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఆధార్‌ లేదని...సంక్షేమ పథకాల లబ్దిని నిరాకరించొద్దని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆధార్‌ లేకుండా సంక్షేమ పథకాలు పొందేందుకు కేంద్రం జూన్‌ 30 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించింది. దీనిపై తదుపరి విచారణ జూలై 7కు వాయిదా వేసింది.

20:09 - June 27, 2017

కలకత్తా : ప్రత్యేక రాష్ట్రం కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా చేపట్టిన ఆందోళన 13వ రోజుకు చేరింది. జిజెఎం కార్యకర్తలు ట్యూబ్‌లైట్లు పట్టుకుని వినూత్నరీతిలో 13 చోట్ల ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులు తమ వీపుపై ట్యూబ్‌లైట్లను పగలగొట్టి నిరసన తెలిపారు. గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను తగులబెట్టారు. అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని గూర్ఖా జనముక్తి మోర్చా యువ విభాగం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నిన్న GJMకు చెందిన ముగ్గురు సభ్యుల ప్రతినిధి మండలి కోల్‌కతాలో గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి కలిసింది. గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సభ్యత్వం కలిగి ఉన్న 43 మంది సభ్యుల రాజీనామాను గవర్నర్‌కు సమర్పించింది. గూర్ఖాలాండ్‌ పేరిట ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆందోళన ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.

20:08 - June 27, 2017

ఢిల్లీ : గతవారం రైలులో గోమాంసం తీసుకెళ్తున్నారన్న అనుమానంతో కత్తితో దాడిచేసి 16 ఏళ్ల జునైద్‌ను హతమార్చిన ఘటనకు సంబంధించి సిసిటివి ఫుటేజి బయటకు వచ్చింది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒకరి తలకు రక్తంతో ఉన్న పట్టి ఉన్నట్లు గుర్తించారు. గత గురువారం మధుర లోకల్‌ ట్రైన్‌లో ఉన్న జునైద్‌, అతడి సోదరుడు హసీబ్‌, మరో ఇద్దరు కజిన్స్‌ షాకిర్‌, మొహసిన్‌లపై సంఘ్‌ పరివార్‌కు చెందిన సభ్యులు సామూహికంగా కత్తులతో దాడి చేశారు. జునైద్‌ను ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో అసౌతి వద్ద నడుస్తున్న రైలు నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటనకు సంబంధించి అసౌతి సర్పంచ్ మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు యువకుల సిసిటివి ఫుటేజీని పోలీసులకు ఇచ్చారు. మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న యువకులకు జునైద్‌ హత్యతో సంబంధం ఉందా...లేదా...అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జునైద్‌ హత్య కేసులో ఇప్పటివరకు ఒక్కరినే అరెస్ట్‌ చేశారు. తమపై 20 మంది దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై రేపు దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి.

20:06 - June 27, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర వ్యాపారులు ఆందోళన బాట పట్టారు. వస్త్రాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు వస్త్ర దుకాణాల బంద్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా

ఏపీలో
విజయవాడలో వస్త్ర వ్యాపారులు దుకాణాలు మూసివేసి.. నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీఎస్టీ వల్ల 30 నుంచి 40 శాతం పేద ప్రజలపై భారం పడుతుందని... వ్యాపారులు, కార్మికులు రోడ్డున పడతారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గుంటూరు జిల్లా.. మంగళగిరిలో చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీని ఉపసంహించుకోవాలని కోరుతూ... పద్మశాలి బహుత్తమ సేవా సంఘం కల్యాణ మండపం నుంచి ర్యాలీ సాగింది. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా..కనిగిరిలో వస్త్ర వ్యాపారులు క్లాత్ మర్చంట్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నల్లజెండాలతో.. ర్యాలీ నిర్వహించారు. దుకాణాలు మూసివేసి...జీఎస్‌టీకి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేస్తామని వస్త్ర వ్యాపారులు తెలిపారు. అదే విధంగా చీరాల వస్త్ర వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేసి... పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ కూడలి వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నెల్లూరులోను వస్త్ర వ్యాపారుల ఆందోళన కొనసాగింది. స్వచ్ఛందంగా...దుకాణాలను మూసివేసి.. ధర్నా చేశారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న చేనేత ఉత్పత్తులపై పన్ను విధించడం.. దుర్మార్గమంటూ.. వస్త్ర వ్యాపారులు కడప కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. రాజమండ్రిలోనూ వస్త్ర వ్యాపారులు బంద్‌ను చేపట్టారు. రాజమండ్రి హోల్‌సేల్‌, రిటైల్‌ క్లాత్‌ మర్చంట్‌ అససియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. విశాఖలోనూ దుకాణాలను మూసివేసి...వస్త్ర వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జీఎస్టీ వల్ల వచ్చే ఇబ్బందులపై సెమినార్‌ నిర్వహించారు. పన్ను వల్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని.. ప్రజలపై కూడా భారం పడుతుందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రంలోనూ వస్త్ర వ్యాపారులు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం విధించిన పన్నుకు నిరసనగా ఖమ్మంలో అన్ని రకాల వస్త్ర దుకాణాలు మూతబడ్డాయి. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. ఖమ్మం శాసన సభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌ వస్త్ర వ్యాపారుల నిరసనకు మద్దతు ప్రకటించారు. వస్త్రాలపై పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. బంద్‌లో భాగంగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలోనూ వ్యాపారులు తమ దుకాణాలు మూసి వేసి..ఆందోళన చేపట్టారు. జీఎస్‌టీ అమల్లోకి రానున్న జూన్‌ 30వ తేదీ అర్ధరాత్రి వరకూ.. వస్త్ర దుకాణాల బంద్‌ కొనసాగించాలని వ్యాపారులు నిర్ణయించారు. జూన్ 30న ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని వస్త్ర వ్యాపారులంతా తీర్మానించారు. 

20:04 - June 27, 2017

పశ్చిమ గోదావరి : గరగపర్రులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ పర్యటించి.. నిజనిజాలు తెలుసుకున్నారు. సాంఘిక బహిష్కరణపై తప్పుడు సమాచారమిచ్చిన అధికారులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. గరగపర్రులో దళితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సమస్యకు కారణమైన వారిని 24 గంటల్లోగా అరెస్ట్‌ చేయాలని ఆదేశించామని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

19:50 - June 27, 2017

జీఎస్టీ చాలా ఇబ్బంది ఉందని, ఇంతకు ముందు చిన్న సినిమా, పెద్ద సినిమాకు పన్నులు తేడాలు ఉండేవని తెలంగాణ ఫిలం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణా గౌడ్ అన్నారు. కేరళ పన్ను రాయతీలు కల్పిస్తున్నారని, కర్ణాటక లో 9 శాతం ప్రొడ్యుసర్స్ ఇస్తుందని, తమిళనాడు కూడా అలానే ఉంది కానీ తెలుగు రాష్ట్రాల్లో అలా లేదని ప్రొడ్యుసర్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్ అన్నారు. టికెట్ల ధర పెంపు సరైంది కాదని సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామారాజు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

19:09 - June 27, 2017
19:08 - June 27, 2017
19:07 - June 27, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతికగా జరుపుకునే బోనాలు ఉత్సవాల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం

19:06 - June 27, 2017

ఖమ్మం : రిమాండ్‌ ఖైదీల నుండి శిక్ష అనుభిస్తున్న ఖైదీల వరకు.. వారిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని జైలు అధికారులు వెలికితీస్తున్నారు. ఖైదీలను సరి కొత్తగా తీర్చి దిద్దుతున్నారు. పదేళ్ల క్రితం నుంచి ఖమ్మం జిల్లా కారాగారంలో.. వ్యవసాయ క్షేత్రాలు, చిన్న తరహా పరిశ్రమ ఉత్పత్తుల్లో ఖైదీల భాగస్వామ్యం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు పెట్రోల్‌ పంపుల్లో బాయ్‌లుగా.. పరిశ్రమల్లో బెంచీలు, మంచాలు, పాఠశాల డెస్కులు తయారు చేయిస్తూ పని మంతులుగా మారుస్తున్నారు.

ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ భాగస్వామ్యంతో
క్రమ శిక్షణ గల ఖైదీలతో ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ భాగస్వామ్యంతో.. పెట్రోల్‌ బంక్‌ను మొదలుపెట్టారు. నాణ్యమైన పెట్రోలు లభించడంతో రోజుకు సుమారు 2 లక్షల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన.. పెట్రోలు బంకుల్లో కరీంనగర్‌ ఎనిమిదవది. ప్రారంభమైన ఆరు నెలల్లో 3 కోట్ల 60 లక్షల రూపాయలు పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు జరిగాయి. జిల్లా కారాగారంలో 2017జనవరి 11న ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 90 లక్షల విలువైన బెంచీలు, బీరువాలు, మంచాలు, పాఠశాలలో ఉపయోగించే డెస్కు ఫర్నీచర్‌ను తయారు చేసి.. జైళ్ల శాఖ ఆదాయాన్ని పెంచారు.

10 లక్షల ఫినాయిల్‌ ఉత్పత్తి
రెండేళ్ల కిందట ప్రారంభించిన ఫినాయిల్‌ తయారీ ద్వారా.. దాదాపు 10 లక్షల ఫినాయిల్‌ ఉత్పత్తిని చేపట్టారు. ఇప్పుడు పెట్రోల్‌ పంపు ఏర్పాటు కావడంతో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. శిక్షను అనుభవిస్తున్న, విడుదలైన ఖైదీల ప్రవర్తనపై సంతృప్తి చెందిన జైలు అధికారులు.. పెట్రోలు బంకులో పనిచేసేందుకు ఎంపిక చేశారు. అందుకోసం శిక్షణ ఇప్పించారు. వినియోగదారులతో క్రమశిక్షణతో మెలిగేందుకు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించారు. సిబ్బంది, అధికారులు తమపై ఉంచిన సమ్మకాన్ని ఖైదీలు వమ్ము చేయలేదు. ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు.. జైలు అధికారులు ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనిచేస్తున్న ఖైదీలకు మెరుగైన వేతనాలు ఇస్తున్నారు. జైల్లో భవనాలకు, క్వార్టర్స్‌కు రెండేళ్ల కిందట రంగులు వేయడం, జైలు ముందు, లోపల నూతన నిర్మాణాలు చేపట్టడం ద్వారా 30 నుంచి 35 లక్షలు ఆదా అయ్యాయి. జైలు ప్రాంగణంలో వందల టేకు మొక్కలను నాటి.. దీర్ఘకాల ఆదాయ మార్గాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కారాగారంలో ఉత్పత్తి అయిన వస్తువులతోపాటు.. వరంగల్‌, హైదరాబాద్‌ జైళ్లలో ఉత్పత్తయిన వస్తువులను తెప్పించి స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. ట్రంకు పెట్టెలు, ఫినాయిల్‌, డోర్‌మ్యాట్‌ల లాంటివి స్టాళ్లలో ఉంటున్నాయి.

ఉపాధి కల్పించేందుకు సంస్కరణలు
ఇక్కడి పెట్రోల్‌, డీజిల్ మంచి మైలేజ్‌ ఇస్తోందని వాహనదారులు చెబుతున్నారు. పెట్రోల్‌ పంపులో పనిచేయడంతో రోజుకు 100 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఇక్కడ రకరకాల వాహనదారులను పలకరిస్తూ.. జైల్లో ఉన్నట్లు కాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నట్లు ఖైదీలంటున్నారు. తెలిసీ తెలియక, క్షణికావేశంతో జైలుకు వచ్చిన ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత.. ఎవరిపైనా ఆధారపడకుండా ఉపాధి కల్పించేందుకు సంస్కరణలు చేపడుతున్నారు. సమాజం వారిని చిన్నచూపు చూస్తే కుంగిపోకుండా ధైర్యంగా ఉండేందుకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. బయట పని దొరక్కుండా కారాగారాన్ని ఆశ్రయిస్తే వారి ప్రవర్తన పరిశీలించి ఉపాధి కల్పిస్తున్నారు. జీవిత ఖైదీలకు, కారాగారం నుంచి విడుదలైన రిమాండ్‌ ఖైదీలు తిరిగి నేరాలు చేయకుండా చదువుకుని ఉండి, మార్పు వచ్చిన ఖైదీలకు పెట్రోలు పంపులో పని కల్పిస్తున్నారు.

19:04 - June 27, 2017

హైదరాబాద్ : బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. యువతిని వేధిస్తున్నాడంటూ యువకుడు సునీల్‌పై.. ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు. 

19:02 - June 27, 2017

నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర వ్యాపారులు జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం విధించిన పన్నుకు నిరసనగా నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో వ్యాపారులు తమ దుకాణాలు మూసి వేసి..ఆందోళన చేపట్టారు. జీఎస్టీ వల్ల వ్యాపారులపై భారం పడుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

18:59 - June 27, 2017

హైదరాబాద్ : కేంద్రప్రభుత్వ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ను దృష్టిసారించింది. ఇందుకు ఈ సంస్థ ఉజాల కార్యక్రమంలో భాగంగా..మార్కెట్ రేటు కంటే తక్కువ ధరలకు బల్బులను అందించాలని డిసైడ్‌ అయ్యింది. హైదరాబాద్‌లో ఎనర్జీ ఎఫిసెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌-జీహెచ్‌ఎంసీతో కలిసి 9 వాట్స్‌ లైట్‌తో పాటు 20 వాట్స్‌ ట్యూబ్‌ లైట్‌, 50 వాట్స్‌ ఫ్యాన్లను అమ్ముతుంది. 9 వాట్స్‌లైట్‌కు 70 రూపాయలు..20 వాట్స్‌ ట్యూబ్‌ లైట్‌లకు 230 రూపాయలు. 50 వాట్స్‌ ఫైవ్‌ స్టార్‌ ఫ్యాన్‌కు 1150 రూపాయల ధర నిర్ణయించి అమ్ముతున్నారు. ఇంత వరకు భాగానే ఉంది. అయితే వీటిపై ధరను ముద్రించకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రొడక్ట్‌ నంబర్‌ లేదు. ఒక సంస్థ బల్బులు అమ్ముతూ మరో సంస్థకు చెందిన టోల్‌ ఫ్రీ నంబర్‌ను ముద్రించారు. బిల్‌పై ప్రొడక్ట్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ లేదు. అయినా తాము వారంటీ ఇస్తామంటూ ఈఈఎస్‌ఎల్‌ అధికారులు ప్రకటిస్తున్నారు.

సాధారణంగా పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రతీ వస్తువుకు..మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్‌ ఉంటుంది. వస్తువు అమ్మకం నిబంధనల ప్రకారం తయారీ సంస్థ పేరు, తయారీ తేదీ, అడ్రస్‌ తప్పనిసరిగా ధరను ముద్రించాల్సి ఉంటుంది. కానీ EESL అమ్ముతున్న బల్బులపై ఎలాంటి ముద్రణ లేదు. అయితే 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బ్‌ మామూలు ధర 39 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ట్రాన్స్‌పోర్ట్‌ సిఎంసి, బ్యాంక్‌ వడ్డీ, ట్యాక్స్‌లు కలిపితే 70 రూపాయలు అవుతుంది. ఇక ట్యూబ్‌లైట్‌ మామూలు ధర 190 రూపాయలు. ఫ్యాన్‌ 915 రూపాయలకు అమ్ముతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం EESL అధికారులు చెప్పలేకపోతున్నారు. మార్కెట్‌లో ఇంతకన్నా ఎక్కువ ధరలు ఉన్నాయంటున్నారు. అయితే ఇంతకన్నా తక్కువ ధరలపై మాత్రం వారు స్పందించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 50 రూపాయలకే ఎల్‌ఈడీ బల్బ్‌ ఇస్తున్నారు. వినియోగదారుల నుంచి 10 రూపాయలు మాత్రమే తీసుకొని వాటిని బిల్‌లో కలిసి తీసుకునేలా ప్లాన్‌ చేశారు. అయితే ఇక్కడ మాత్రం..ఎనర్జీ సేవింగ్‌ పేరుతో దోపిడీ జరుగుతోందంటూ నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పేరు చెప్పి బిజినెస్‌ చేయడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా దీనిపై జీహెచ్‌ఎంసీ స్పష్టమైన ప్రకటనతో ముందుకు వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. 

18:57 - June 27, 2017

ఢిల్లీ : ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. ఉపాధ్యాయ ఏకీకృత సర్వీసు నిబంధనలకు కేంద్రం అంగీకారం తెలిపినందుకు కడియం కృతజ్ఞతలు తెలిపారు. వెంకయ్యనాయుడు చొరవ వల్లే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమైందన్నారు కడియం. 

18:56 - June 27, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్‌ శిరీష, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతి కేసులను విచారిస్తున్న పోలీసులు నిందితులు రాజీవ్‌, శ్రవణ్‌ వాంగ్మూలం తీసుకున్నారు. ఈ కేసులో శిరీష-తేజస్విని మధ్య గొడవలు కీలకంగా మారడంతో అసలు వీరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాజాగా రాజీవ్‌ ప్రేయసి తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు సేకరించారు.రాజీవ్‌ కోసమే తాను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, రాజీవ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని తేజస్విని తెలిపింది. శిరీష అడ్డుతగలడంతో రాజీవ్‌ వెనకడుగువేశాడని, అందుకే శిరీషకు ఫోన్‌ చేసి గొడవపడ్డానని చెప్పింది. రాజీవ్‌ తనను మోసం చేశాడని, శిరీష మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చింది.

కొనసాగుతున్న విచారణ...
బ్యుటీషియన్‌ శిరీష మిస్టరీ డెత్‌ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో శ్రవణ్‌, రాజీవ్‌లను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న తేజస్విని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆమె వెల్లడించింది. బ్యూటీషియన్‌ శిరీష అడ్డుపడటంతో పలుమార్లు తాము గొడవపడినట్లు.. పోలీసుస్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు తేజస్విని వాంగ్మూలంలో తెలిపింది...ఆమె వల్లే గొడవలు పెరిగాయని..దీంతోనే రాజీవ్‌ కూడా మారిపోయాడని చెప్పింది...రాజీవ్‌ను పెళ్లి చేసుకునే విషయం వారి తల్లిదండ్రులను సంప్రదిస్తే వారు కూడా తిరస్కరించారని తేజస్విని తెలిపింది...ఇదే సమయంలో శిరీష అడ్డుకుంటుండడంతో రాజీవ్ తనకు దూరం కావాలని చూశాడని తెలిపింది. మరోవైపు నిందితులను కస్టడీకి కోర్టు అనుమతించడంతో ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో అనుమానాలను తేల్చుకునేందుకు ఆ కేసు విచారణ చేస్తున్న ప్రత్యేకాధికారి సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న బంజారాహిల్స్ చేరుకున్నారు..నిందితులిద్దరిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.

18:54 - June 27, 2017

నిజామాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా పద్దెనిమిదేళ్లు..! నిజామాబాద్‌ జిల్లా వాసులు, ఆర్టీసీ డిపో కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. బస్‌డిపో అన్నది.. ప్రతి ఎన్నికల్లోనూ ఓ హామీగానే ఉండిపోతోంది. ఎన్నికల హామీని నమ్మి ఓట్లేసిన ప్రజలను.. ఏపార్టీ నాయకులైనా సరే.. ప్రతిసారీ వంచిస్తూనే ఉన్నారు.

1999 లో హామీ
1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అప్పటి టీడీపీ పాలకులు, నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో బస్‌ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు నాలుగు దశాబ్దాలుగా డిపో కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఈహామీతో మురిసిపోయారు. పైగా, త్వరలోనే కల సాకారం చేస్తామంటూ.. అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బస్‌డిపో నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేసేశారు. అంతేనా, ప్రహరీ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని, ఏడు లక్షల ఇరవై వేల రూపాయల నిధులు కేటాయించారు. ఈ నిధులతో అప్పట్లోనే ప్రహరీ గోడను నిర్మించారు. ఇంకేముందీ.. డిపో వచ్చేసినట్లే అని అంతా భావించారు. కానీ, దాదాపు 18 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ డిపో నిర్మాణం ఆచరణరూపం దాల్చలేదు.

18 సంవత్సరాలు గడిచిపోయాయి
ప్రహరీ నిర్మాణం జరిగి 18 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతలోనే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడడం, కేంద్ర పాలకులు, రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే, రాష్ట్ర విభజన జరగిపోయింది. అంతే, నేతలంతా ఎల్లారెడ్డి బస్‌డిపో హామీని మరిచిపోయారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినప్పటికీ డిపో నిర్మాణ పనులు చేపట్టలేదు. పాలకులు ప్రభుత్వాలు మారడంతో డిపో ఏర్పాటును పట్టించుకునే వారు కరువయ్యారు. ఎల్లారెడ్డిలో శంకుస్థాపనకు ముందే కామారెడ్డి, బాన్సువాడ, నారాయణ ఖేడ్‌ లలో బస్‌ డిపోను ఏర్పాటు చేశారు. అయితే పాలకుల నిర్లక్ష్య ధోరణితో ఇక్కడి బస్‌ డిపోను పక్క ప్రాంతాల వారు తరలించుకుపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా డిపో నిర్మాణ పనులు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత కామారెడ్డి జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి మండలంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతం వాణిజ్య కూడలిగా మారింది. రోజూ ప్రయాణికులు, విద్యార్ధులు ఈ ప్రాంతానికి వస్తూ వెళుతుంటారు. ఈ తరుణంలో.. ఎల్లారెడ్డిగూడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు బస్‌ డిపోను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నమైన ఎల్లారెడ్డి బస్‌ డిపోను మినీ బస్‌ డిపోగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

18:16 - June 27, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ తీరుపై టీజేఏసీ చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు కాంట్రాక్ట్‌ల మీద .. భూదందాల మీద చూపుతున్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై చూపించడం లేదని అన్నారు. వారి అక్రమాల కోసం పోలీసు యంత్రాంగాన్ని కూడా వాడుకుంటున్నారని ఆరోపించారు. అందుకు సహకరించని అధికారులపై ఒత్తిడి పెరుగుతోందని.. అందుకు కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్య ఘటన ఓ ఉదాహరణ అని అన్నారు. ప్రభుత్వ పథకాలన్ని పేపర్లకే పరిమితం చేస్తున్నారని.. అర్హులకు సరిగ్గా చేరడం లేదని కోదండరామ్‌ అన్నారు. మొదటి దశ అమరుల స్ఫూర్తి యాత్ర ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. 

18:05 - June 27, 2017
17:31 - June 27, 2017

 

మెడ్చల్ :  నకిలీ విత్తన కంపెనీలపై ఎస్‌వోటీ అధికారులు దాడులు చేశారు. కాలపరిమితి చెల్లిన విత్తనాలను తిరిగి ప్యాకింగ్‌ చేసి సంపద సీడ్స్‌ అమ్మకాలు కొనసాగిస్తోంది. సమాచారం తెలుసుకున్న అధికారులు దాడులు నిర్వహించి... 1500 ప్యాకెట్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 

17:10 - June 27, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌ పర్యటించారు. దళితులను బహిష్కరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. తప్పుడు సమాచారమిచ్చిన ఎమ్మార్వోను సస్పెండ్‌ చేయాలని సూచించామన్నారు. భవిష్యత్‌లో ఎమ్మెల్యే ఓట్లు అడగాలన్నా ఈ గ్రామానికి క్షమాపణ చెప్పాల్సిందే అని జూపూడి అంటున్నారు. మరింత సమాచారనికి వీడియో చూడండి. 

16:53 - June 27, 2017

పశ్చిమగోదావరి : సామాజిక బహిష్కరణకు గురైన ఎస్సీ, ఎస్టీలంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. గ్రామంలో అగ్రవర్ణాలు తమనేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు గ్రామంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కరెం శివాజీ విచారణ జరిపారు. ఈ విచారణకు బహిష్కరించింది, ఎలాంటి మానసిక క్షోభకు గురిచేసిందన్న విషయాలను కమిషన్‌ చైర్మన్ కారెం శివాజీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విచారణకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో పాటు మంత్రులు శామ్యూల్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌, దళిత, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. వీరందరి సమక్షంలోనే ఎస్సీ కమిషన్‌ చైర్మన్ కారెం శివాజీ విచారణ జరిపారు. విచారణ అనంతరం అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాలకోడేరు ఎమ్మార్వో రత్నమణి, ఎస్సై రాంబాబు, వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

16:05 - June 27, 2017

వరంగల్ : బెంగళూరు నుంచి అలహాబాద్ వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లోమ ఆరుగురు యువకులు డ్రగ్స్ తీసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లారు, గమనించిన తోటి ప్రయణికులు, అధికారులు వారిని ఖాజీపేట రైల్వేస్టేషన్ లో దించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. 

రైల్లో డ్రగ్స్ తీసుకొని.. అపస్మారకస్థితిలోకి...!

వరంగల్ : జిల్లా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ఆరుగురు యుకులు డ్రగ్స్ తీసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లారు. గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు తెలపడంతో వారిని ఖాజీపేట రైల్వే స్టేషన్ లో దించారు. అనంతరం వారిని ఎంజీఎం కు తరలించారు.

16:00 - June 27, 2017

విజయనగరం : కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు 67వ జన్మదిన వేడుకలు చర్చకు దారితీశాయి. ఇప్పటి వరకు జరిగిన జన్మదిన వేడుకలకు భిన్నంగా నిర్వహించడం విజయనగరం జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారింది. సహజంగా అశోక్ గజపతిరాజు... బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ ఆయన బంగ్లాలో అతి సాధారణంగా, నిరాడంబరంగా నిర్వహించేవారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి, చెవిటి, మూగ పాఠశాలను సందర్శించేవారు.. ఆ తర్వాత ప్రేమ సమాజంలో వృద్ధులకు పండ్లు, ఫలహారాల పంపిణ, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే, ఈ ఏడాది మాత్రం అశోక్‌ గజపతిరాజు పుట్టిన రోజు వేడుకల్లో హడావిడి కనిపించింది. మునుపెన్నడూ లేనివిధంగా అభిమానులు, కార్యకర్తలు, నాయకుల సందడితో అశోక్ బంగ్లా ప్రాంగణం కిటకిటలాడింది.

జనాల తాకిడి....
జనాల తాకిడికి అశోక్ గజపతిరాజు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వేలాది మంది ప్రజలు, అభిమానులు అశోక్ బంగ్లాకు క్యూ కట్టారు. రెండు రోజుల పాటు జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా మొదటి రోజు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెండో రోజు జెడ్పీ ఛైర్మన్ స్వాతిరాణి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, పుస్తకాలు, స్కూల్ బ్యాగుల పంపిణీ గతానికి భిన్నంగా అశోక్ గజపతిరాజు పుట్టిన రోజు వేడుకలకు వేలాది మంది అభిమానులు తరలిరావడం...జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలే కారణంగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. సుజయ క్రుష్ణ రంగారావు మంత్రి పదవి చేపట్టడం..జిల్లాకు కొత్త కమిటీ ఏర్పాటు కావడంతో సదరు నేతలు రాజుగారిపై ఈ విధంగా తమ అభిమానాన్ని చాటుకున్నారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పదవులు పొందిన నేతలు తమ అభిమానాన్ని తెలిపేందుకు, బల నిరూపణకు రాజు పుట్టిన రోజు వేడుకలను అవకాశంగా మలుచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు జన్మదిన సంబరాలు గతానికి భిన్నంగా నిర్వహించడం విజయనగరం జిల్లాలో రాజకీయ చర్చకు దారితీశాయి. 

15:58 - June 27, 2017

విశాఖ : జిల్లాలోని ఏజెన్సీలో తరచు ఆంత్రాక్స్ సోకుతోందని.. అందుకు గిరిజనుల ఆహారపు అలవాట్లే కారణమన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కేజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆంత్రాక్స్ బాధితుల్ని మంత్రి పరామర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో అన్ని శాఖల సమన్వయంతో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో జ్వరాల బారిన పడి మృతి చెందిన ఘటనపై సైతం అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

15:57 - June 27, 2017

తూర్పుగోదావరి : జిల్లా చాపరాయిలో మలేరియా వల్ల మరణాలు సంభవించలేదన్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్. చనిపోయిన ఆవు అవశేషాలున్న నీటిని తాగడం వల్లే వారు చనిపోయినట్లు స్పష్టం చేశారు. మలేరియాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక కేసు మాత్రమే నమోదైందని మంత్రి చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మంత్రి కామినేని శ్రీనివాస్ రేపు, ఎల్లుండి చింతూరు, రంపచోడవరంలో పర్యటిస్తానని చెప్పారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. 

15:56 - June 27, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు ఘటనలో దోషులను రేపు ఉదయం 9 గంటలలోగా అరెస్ట్‌ చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని మాజీ ఎంపీ హర్షకుమార్‌ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. అధికారులంతా టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారన్నారు హర్షకుమార్‌. 

15:54 - June 27, 2017

పశ్చిమ గోదావరి : గరగపర్రులో దళితుల గ్రామ బహిష్కరణ చేసిన సంఘటనలో ఆ గ్రామంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్, ఎస్పీ కమిషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ బహిరంగ విచారణ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

15:45 - June 27, 2017

వరంగల్ : జిల్లా యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో డ్రగ్స్ కలకలం రేగింది. ఆరుగురు యుకులు డ్రగ్స్ తీసుకొని అపస్మారకస్థితిలోకి వెళ్లారు. గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు తెలపడంతో వారిని ఖాజీపేట రైల్వే స్టేషన్ లో దించారు. అనంతరం వారిని ఎంజీఎం కు తరలించారు. డాక్టర్లు ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. మరో వై రైల్లో ప్రయాణిస్తూన్న కొంత మంది ప్రయాణికులు మాత్రం వారి మత్తు మందు ప్రయోగం చేశారని అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

14:55 - June 27, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు దళితుల బహిష్కరణ విషయాన్ని టెన్ టివి వెలుగులోకి తెవడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. దళితుల బహిష్కరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలకోడేరు ఎమ్మార్వో రత్నమణి, ఎస్సై రాంబాబు, వీఆర్వో లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. గరగపర్రు గ్రామంలో మంత్రులు నక్కా ఆనంద్ బాబు, జవహర్ పర్యటించారు. మరో వైపు దోషులను రేపు ఉదయం 9గంటలలోపు అరెస్ట్ చేయ్యాలని, లేకుంటే నీరహాదీక్షకు దిగుతానని మాజీ ఎంపీ హర్షకుమార్ హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

14:54 - June 27, 2017

హైదరాబాద్ : శిరీష మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజీవ్ ప్రియురాలు తేజస్విని పోలీసులకు తెలిపారు. రాజీవ్ తనను మోసం చేశాడాని తేజస్విని ఆరోపించారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన మాట వాస్తమే అని ఆమె ఒప్పుకున్నారు. తేజస్విని పోలీసులకు ఇచ్చిన వాంగ్ములంలో ఈ విషయాలను పేర్కొంది. మరో వైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు విచారిస్తున్నారు. రేపు వీరిని చంచల్ గూడ్ బైల్ కు తరలిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

14:53 - June 27, 2017

చిత్తూరు : రెండు వారల క్రితం తిరుమలలో కిడ్నాపయిన బాలుడి ఆచూకీ పోలీసులు ఇంత వరకు గుర్తించలేదు. ఈనెల 12తేదీ ఉదయం 5గంటలకు బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తమ బాబు కోసం తల్లిదండ్రులు తిరుమలలోనే పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు తాజాగా ఈ కేసులో పురోగతి సాధించారు. కిడ్నాపర్ సంబంధించి సీసీ ఫుటెజ్ రీలిజ్ చేశారు. పోలీసులు త్వరలో బాలుడితో పాటు నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

14:09 - June 27, 2017

జీఎస్టీ బిల్లు ఏంచెబుతుంది...? వస్త్ర వ్యాపారుల ఆందోళనకు కారణమేంటీ...? కేంద్రం ఇస్తున్న వివరణ ఏంటీ.. రాష్ట్రాలకున్న అభ్యంతరాలేంటీ..? అనేక సందేహాలు కలవరపెడుతున్నాయి. జీఎస్టీ బిల్లుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోనుందా..?  అద్భుతాలు జరుగుతాయా..? ఆర్థికాభివృద్ధి వేగం పుంజకుంటుందా.? లేక సామాన్యుడు కష్టాల్లో పడతాడా...? ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ ఎపిసోడ్. పూర్తి వివరాలను వీడియోలో చూద్దా...

 

14:01 - June 27, 2017

సరోగసి అనే అంశంపై మానవి వేదిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అకురం ప్రతినిధి సుమిత్ర, నర్మద పాల్గొని, మాట్లాడారు. సరోగసి అంటే ఏమిటీ..? అద్దె గర్భం లాంటింది..ఎటువంటి సమయంలో సరోగసికి వెళ్లాలి...? సరోగిసి ఉండే నిబంధనలు ఏమిటీ..? ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటీ...? అంటి అంశాలపై సవివరంగా వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:57 - June 27, 2017
13:54 - June 27, 2017

హైదరాబాద్ : సివిల్స్ మూడో ర్యాంకర్ రోణంకి గోపాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోపాలకృష్ణ తప్పుడు ధృవీకరణపత్రంతో వికలాంగుల కోటాలో ర్యాంక్ సాధించారని లాయర్ మురళీకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. పిల్ పై విచారణ చేపట్టిన కోర్టు గోపాలకృష్ణకు నోటీసులు పంపింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూపీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:42 - June 27, 2017
13:41 - June 27, 2017

బోనాలపై మల్లన్నముచ్చట్లలో స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్, సాయిచంద్ లు పాల్గొన్నారు. బోనాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా పలు బోనాలు పాటలు పాడి అలరించారు. వారితో మల్లన్నముచ్చటించిన అసక్తిర సంభాషణ, గాయకులు పాడిన పాటలను వీడియోలో చూద్దాం...

 

వర్గీకరణకు చొరవ చూపాలని వెంకయ్యను కోరా: కడియం

ఢిల్లీ: తెలంగాణ లో షెడ్యూలు కులాల వర్గీకరణకు చొరవ చూపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరానని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఉత్తరాదా రాష్ట్రాలతో సంబంధం లేకుండా తెలంగాణ వరకు షెడ్యూలు కులాల వర్గీకరణ చేపట్టాలని వెంకయ్యను కోరినట్లు పేర్కొన్నారు.

పెనుమాక భూ సేకరణ సదస్సులో ఉద్రిక్తత

అమరావతి : పెనుమాక భూ సేకరణ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. రైతుల అభ్యంతరాలను అధికారులు మినట్ బుక్ లో రాసుకోలేదు. సదస్సు పెట్టి అభ్యంతరాలు ఎందుకు రాసుకోరని అధికారులపై రైతులు, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండి పడ్డారు. పై అధికారుల సూచనల మేరకే అభ్యంతరాలు తీసుకోలేమని సీఆర్డీఏ అధికారులు తేల్చి చెప్పారు. ఇబ్బందులు వినతిపత్రం రూపంలో ఇవ్వాలని అధికారులు కోరారు. రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలంటూ అధికారులను ఎమ్మెల్యే ఆర్కే అడ్డుకున్నారు. దీంతో అధిరానేలసౌ రైతులు నిరసన వ్యక్తం చేస్తూ కుర్చీలు, టెంట్లు ధ్వంసం చేశారు.

13:21 - June 27, 2017
13:20 - June 27, 2017
13:19 - June 27, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్‌ శిరీష మృతి కేసులో తేజస్విని వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. రాజీవ్‌ కోసమే తాను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, రాజీవ్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నానని తేజస్విని తెలిపింది. శిరీష అడ్డుతగలడంతో రాజీవ్‌ వెనకడుగువేశాడని, అందుకే శిరీషకు ఫోన్‌ చేసి గొడవపడ్డానని చెప్పింది.  రాజీవ్‌ తనను మోసం చేశాడని, శిరీష మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చింది.

 

రాజీవ్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నా: తేజస్విని

హైదరాబాద్‌: బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో శ్రవణ్‌, రాజీవ్‌లను రెండు రోజుల పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న తేజస్విని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆమె వెల్లడించింది. రాజీవ్‌ అంటే తనకు చాలా ఇష్టమని.. అతనిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నానని వాంగ్మూలంలో తేజస్విని పేర్కొంది. కేవలం రాజీవ్ కోసమే తాను బెంగళూరు నుంచి హైదరాబాదుకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నానని చెప్పింది. ఇక్కడకు వచ్చిన తర్వాత శిరీష, రాజీవ్ లు క్లోజ్ గా ఉండటాన్ని గమనించానని తెలిపింది.

13:17 - June 27, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో టీడీపీ అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర.. అక్కడి గ్రామ ప్రజలను కలిశారు. దళితులను వెలివేడయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను వెలివేయడం దారుణమన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ఉంది.. ఆ విగ్రహాన్ని కూడా తీసేస్తారా.. అని ప్రశ్నించారు. అంబేద్కర్...రాజ్యాంగాన్ని దళితుల ఒక్కరికే రాయలేదని.. దేశ ప్రజలందరికీ రాశారని చెప్పారు. అంబేద్కర్ ను దళితులకు పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

వెంకయ్యనాయుడును కలిసిన కడియం శ్రీహరి

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్యను తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి వేణుగోపాలాచారి కలిశారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు కేంద్రం అంగీకారం తెలపడం పట్ల వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

13:09 - June 27, 2017

పశ్చిమగోదావరి : జిల్లా గరగపర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇవాళ  రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ బృందం పర్యటించనుంది. దీంతో గ్రామంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. నిన్ననే గ్రామంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం పర్యటించింది. ఈ  సందర్భంగా దళితులను గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను అరెస్ట్‌ చేయాలని జాతీయ కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే మరోవైపు గరగపర్రులో గ్రామంలో వైసీపీ బృందం బృందం పర్యటిస్తోంది. వైసీపీ బృందంలో ధర్మాన ప్రసాదరావుతో పాటు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, నాని, ఇతరులు ఉన్నారు. 

విశాఖ ఏజెన్సీ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం : కామినేని

అమరావతి: విశాఖ ఏజెన్సీ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏజెన్సీలో సమస్యలు చాలా కాలం నుండి ఉన్నాయని, చాపరాయిలో మలేరియా జ్వరాలతో ఎవరూ మృతి చెందలేదన్నారు. ఆవు అవశేషాలున్న నీటి తాగడం వల్లే వారు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఒక్క మలేరియా కేసు మాత్రత నమోదైందని, లక్ష రూపాయలు జీతం ఇస్తున్నా వైద్యులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లడం లేదని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు.

13:06 - June 27, 2017

తూర్పుగోదావరి : విషజ్వరాలు, అంటువ్యాధులతో తూర్పుగోదావరి జిల్లా మన్యంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పారిశుధ్యలోపం, మంచినీరు, ఆహార కాలుష్యంతో వై. రామవరం మండలం చాపరాయిలో మరణమృదంగం మోగుతోంది. ఒకరు కాదు... ఇద్దరు కాదు.. 16 మంది అమాయక గిరిజనులు మృత్యువాత పడ్డాక ప్రభుత్వం కళ్లు తెరిసింది. అధికారులు, పాలకులు తీరిగ్గా  బాధితులను పరామర్శిస్తూ,  ఓదారుస్తున్నారు.  
చిత్తడి నేలల్లో పందులు స్వైర విహారం 
ఇది తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని చాపరాయి గ్రామం. జనాభా 375 మంది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విసిరేసినట్టుగా ఉన్న 75 ఇళ్లు ఉన్నాయి. ఊళ్లో మచ్చుకు కూడా పారిశుధ్యం కనిపించదు. వర్షం కురిసని చిత్తడి నేలల్లో పందులు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.
చాపరాయికి మంచినీటి వనరులు లేవు 
చాపరాయికి మంచినీటి వనరులు లేవు. ఊళ్లో నుంచి ప్రవహిస్తున్న వాగునీరే దిక్కు. ఈ వాగులో మృతి చెందిన జంతు కళేబరాలు పడినా పట్టించుకునే దిక్కులేదు. వెరసి 16 మంది ప్రాణాల్లో అంతవాయుల్లో కలిసిపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు దయనీయ పరిస్థిత్లో బతుకీడుస్తున్నారు. గ్రామంలో ఏడు వీధులుండగా అన్ని చోట్ల ఏదో ఒక అనారోగ్య సమస్యతో స్థానికులు బాధపడుతున్నారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత 26 మందిని హుటాహుటిన రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు.
చాపరాయిలో అంటు వ్యాధులు
చాపరాయిలో అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలినా తొలిదశలో ఎవరూ గుర్తించలేదు. మరణాలు సంభవించిన తర్వాతే విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో పారిశుధ్యలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంతోనే ఉపద్రవం ముంచుకొచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. చాపరాయిలో మచ్చుకైనా రక్షిత మంచినీరు లేకపోవడంతో కులుషిత నీటికి మన్యంలో గిరిజనులు బలయ్యారని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. 
మరణాలకు పాలకుల రకరకాల కారణాలు
చాపరాయి మరణాలకు పాలకులు రకరకాల కారణాలు చెబుతున్నారు. విషజ్వరాల విషయం తొలిదశలో ప్రభుత్వ దృష్టికి రాకపోవడం, మూఢనమ్మకాలతో గిరిజనులు నాటువైద్యం చేయించుకోవడం, నిరక్షరాస్యత ఇందుకు తోడయ్యాయన్నది ప్రభుత్వ వాదన. నీరు, ఆహార కాలుష్యమే చాపరాయిలో గిరిజనుల మరణానికి కారణమని జిల్లాకు  చెందిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చెబుతున్నారు. గ్రామ ప్రజల ఆహార అలవాట్లు కూడా ప్రమాదకంగా ఉన్నాయని వైద్యలు చెబుతున్నారు. 
అధికారులు తూతూ మంత్రపు చర్యలు
ప్రమాదం కట్టలు తెంచుకుని..పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నా అధికారులు తూతూమంత్ర చర్యలకే పరిమితమవుతున్నారు.మన్యంలో భారీ ప్రాణ నష్టం జరిగిన సందర్భాల్లో హడావుడి చేసే యంత్రాంగం తరువాత అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇళ్ల ముందు కాసింత బ్లీచింగ్‌ చల్లి మమ అనిపించినట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామానికి వెళ్లాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలన్నా దాదాపు 20 కిలోమీటర్ల మేర నడిచి రావాల్సిందే. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ గూడేలకు వచ్చి, హామీల వర్షం కురిపించే నేతలు ఆ తర్వాత కన్నెత్తి చూడకపోవడంతోనే తమకు ఈ దుస్థితి దాపురించింది గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇకనైనా ఈ విషజ్వరాల బారి నుంచి తమకు కాపాడాలని కోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని గిరిజనుల దైన్యంపై పాలకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

 

13:01 - June 27, 2017

విశాఖ : మన్యాన్ని ఆంత్రాక్స్‌ వైరస్‌ వణికిస్తోంది. ఆంత్రాక్స్‌ బాధితులకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆంత్రాక్స్‌ బాధితులను మంత్రి గంటా శ్రీనివాసరావు పరామర్శించారు. బాధితుల రక్తనమూనాలను మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సెంటర్‌కు వైద్యులు పంపించారు. అయితే బ్లడ్‌ రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. ఆంత్రాక్స్‌ కనిపించిన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 

 

సివిల్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యం పై విచారణ వాయిదా

హైదరాబాద్ : సివిల్ ర్యాంకర్ గోపాలకృష్ణ అంగవైకల్యాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిల్ పై విచారణ జరిగింది. సివిల్స్ 2016 లో మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ అంగవైకల్యం ఉందని తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించాడని కోర్టులో న్యాయవాది మురళీ కృష్ణ పిల్ దాఖలు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం, యూపీపీఎస్సీ, గోపాలకృష్ణకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

12:55 - June 27, 2017
12:54 - June 27, 2017
12:53 - June 27, 2017

సంగారెడ్డి : నారాయణఖేడ్‌ బైపాస్‌రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డీఎం మహేందర్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. పురుగుల మందుతాగి మహేందర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది.  

వీరపట్నం లో దంపతులు హత్య

గుంటూరు : రొంపిచర్ల మండలం వీరపట్నం లో దంపతులు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం అన్నా వదినను తమ్ముడు హత్య చేశాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

గ్యాస్ ఏజెన్సీల్లో మంత్రి ప్రత్తిపాటి ఆకస్మిక తనిఖీలు

విజయవాడ: గ్యాస్ ఏజెన్సీల్లో మంత్రి ప్రత్తిపాటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్యాస్ ఏజెన్సీల్లో అవకతవకలు జరుగుతున్నాయని, రకరకాల పేర్లతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. కంపెనీల నుండి వస్తున్న సిలిండర్ లలో కూడా 200 గ్రాముల గ్యాస్ తక్కువగా ఉందని తెలిపారు. ఏజెన్సీలు, హెచ్ పీ కంపెనీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మాల్స్ లోనూ, సెలక్ట్ ఛానల్ పేరుతో అధిక ధరలకు విక్రయించేందుకు వీల్లేదన్నారు.

12:47 - June 27, 2017

హైదరాబాద్ : బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. యువతిని వేధిస్తున్నాడంటూ యువకుడు సునీల్‌పై.. ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజీవ్, శ్రవణ్ పై రెండో ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్: రాజీవ్, శ్రవణ్ పై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శిరీషను ఉద్దేశపూర్వకంగా కొట్టినందుకు 324,354,100 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.

12:42 - June 27, 2017

అమెరికా : ఉగ్రవాదంపై  పోరు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని... దానిపనై ఉమ్మడిగా  పోరాడి అణచివేస్తామని హెచ్చరించారు. భారత్‌, అమెరికా మధ్య ఆర్ధికమైత్రి కొనసాగుతుందని స్పస్టం చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో భేటీ అయిన మోదీ.... వాణిజ్యం, రక్షణరంగం, ఉగ్రవాదంపై చర్చించారు.
శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం 
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. భాతర కాలమానం ప్రకారం సరిగ్గా మంగళవారం రాత్రి ఒంటిగంట 10 నిమిషాలకు వైట్‌హౌస్‌కు  మోదీ కారులో వచ్చారు.  మోదీ వాహనం దిగగానే ట్రంప్‌ దంపతులు ఆయనతో కరచాలనం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. సుమారు రెండు నిమిషాలపాటు ప్రధాన ద్వారం దగ్గరే క్షేమసమాచారాలను ఒకరినొకరు విచారించుకున్నారు.  ఈ సందర్భంగా మోదీ ఏం చెప్పారో తెలియదుకానీ... అమెరికా అధినేత ట్రంప్‌, మెలనియా దంపతులు హాయిగా గుండెనిండా నవ్వుకున్నారు. ఆ తర్వాత  ట్రంప్‌ దంపతులు, మోదీ ముగ్గురూ కలిసి వైట్‌హౌస్‌లోకి వెళ్లారు.
ట్రంప్‌ - మోదీ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు 
శ్వేతసౌధంలోని కేబినెట్‌ రూమ్‌లో ట్రంప్‌ - మోదీ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి.  వాణిజ్యం, రక్షణరంగంతోపాటు ఉగ్రవాదంపైనా ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఈ చర్చలు ముగియగానే రోజ్‌ గార్డెన్‌లో ట్రంప్‌, మోదీ సంయుక్త ప్రకటన చేశారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన  టెర్రరిజాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.  అంతర్జాతీయ ఉగ్రవాదంపై అమెరికా, భారత్‌ ఉమ్మడిగా పోరాడుతాయన్నారు. ఉమ్మడిగా పోరాడి ఉగ్రవాదాన్ని అణచివేస్తామని హెచ్చరించారు.  భారత్‌ ఆర్ధికపరంగా అభివృద్ధి చెందుతోన్న దేశమని...ఆ దేశంతో ఆర్థికమైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు.  ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వానికి   మద్దతిస్తామని చెప్పారు.
మేము అభివృద్ధి యంత్రాలం... 
అమెరికా అధ్యక్షుడి ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనని మోదీ అన్నారు. శ్వేతసౌధంలో తనకు లభించిన ఆతిథ్యం భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు.  తామిద్దరం అభివృద్ధి యంత్రాలమని.... ప్రజాస్వామ్య విలువలకు  ఇరుదేశాలు కట్టుబడి ఉండాలన్నారు.  ఉగ్రవాదం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్యని... ఉమ్మడిగా టెర్రరిజంపై పోరాడుతామని మోదీ హెచ్చరించారు.  అమెరికాతో భారత్‌ స్నేహబంధం మరింత బలపడుతుందని భావిస్తున్నానన్నారు. ఇరు దేశాధినేతల మధ్య సమావేశం ముగిసిన తర్వాత మోదీకి ట్రంప్‌ ప్రత్యేక విందు ఇచ్చారు.

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణ మహోత్సవం

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మతల్లి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

గోపించ్ అకాడమీలో శ్రీకాంత్ అభినందన సభ

హైదరాబాద్: గచ్చిబౌలి గోపిచంద్ అకాడమీలో అస్ట్రేలియన్ సూపర్ సిరీస్ విజేత శ్రీకాంత్ అభినందన సభ జరిగింది. బ్యాడ్మింటన్ క్రీడాకారులను గోపిచంద్ సన్మానించారు. కిదాంబి శ్రీకాంత్ ను చాముడేశ్వరీనాథ్ అభినందించారు.

'పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ఉంది తీసేయమంటారా'

ప.గో : గంగపర్రులో దళితులతో అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మాట్లాడారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనివ్వకపోవడం క్షమించరాని విషయం అని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు పనులు కూడా చేసుకోనివ్వకుండా బహిష్కరిస్తే అరాచకం పెరుగుతుందన్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ఉంది తీసేయమంటారా అని ప్రశ్నించారు.

11:57 - June 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని ఏజెన్సీలో విషజ్వరాల మరణమృదం మోగుతోంది. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని వై. రామవరం మండలం చాపరాయిలో విషజ్వరాలతో నెల రోజుల వ్యవధిలో 16 మంది మృత్యువాత పడ్డారు. కలుషితనీరు, ఆహారం, పారిశుధ్యలోపం  ఇందుకు కారణమని చెబుతున్నారు. మన్యంలో ప్రాణనష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం హడావుడి చేస్తోంది. అధికారులు, మంత్రులు ఒక్కసారిగా చాపరాయి వైపు పరుగులు తీస్తున్నారు. బాధితులను పరామర్శిస్తూ, ఓదారుస్తున్నారు. రక్షిత మంచినీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే చాపరాయి మరణాలకు కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం విషజ్వరాలతోనే మరణాలు సంభవించాయని చెబుతోంది. 

 

11:53 - June 27, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్‌ శిరీష మృతి కేసు.. రోజుకో మలుపు తిరుగుతోంది.  రెండోరోజు శ్రవణ్‌, రాజీవ్‌ల విచారణ కొనసాగుతోంది. ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి బలవన్మరణంపై శ్రవణ్‌, రాజీవ్‌ను.. పోలీసులు వేరువేరుగా విచారించారు. మరిన్ని వీడియోలో చూద్దాం..

కుకునూరుపల్లి ఎస్ ఐగా సంతోష్ కుమార్

సిద్దిపేట: కుకునూరుపల్లి ఎస్ఐగా జి.సంతోష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్‌కు చెందిన సంతోష్‌ది జగిత్యాల స్వగ్రామం. మెదక్ రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన కుకునూరుపల్లికి వచ్చారు. ఇంతకు ముందు ఆయన జగదేవపూర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. సిద్దిపేట జిల్లాలోని కుకునూర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ సంచనాలకే కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కుకునూర్‌పల్లి ఎస్‌ఐగా పనిచేసిన రామకృష్ణా రెడ్డి అధికారుల ఒత్తిడి కారణంగా రివాల్వర్‌తో కాల్చుకొని మృతి చెందిన విషయం విధితమే.

11:35 - June 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని మన్యం చాపరాయిలో సంభవించిన మరణాలకు నెపాన్ని గిరిజనులపై నెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాలకులు, అధికారుల తప్పిదాన్ని కప్పిపుచ్చుతోంది. గిరిజనుల మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత , అమాయకత్వంలోనే 16 మంది మరణించారని మంత్రి నక్కా ఆనందబాబు చెబుతున్నారు. 

 

11:31 - June 27, 2017

ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సూర్యప్రకాశ్, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి పాల్గొని, మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గిరిజన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:24 - June 27, 2017

జీఎస్టీ అమలుతో వస్త్రవ్యాపారానికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలంగాణ వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు ప్రకాష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'భారతీయ సంప్రదాయ వస్త్ర వ్యాపారానికి గడ్డు రోజులొచ్చాయి. స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా వస్త్రాలపై బిజెపి  ప్రభుత్వం పన్నుపోటు పొడిచింది. వస్త్రాలపై 5శాతం జిఎస్టీ విధించడంతో ఆ భారంపై వినియోగదారులపై పడబోతోంది. ఇంతకు మించి, అసలు భారతదేశంలోని సంప్రదాయ వస్త్ర వ్యాపారమే చిన్నాభిన్నమై, వస్త్ర వ్యాపారులు వీధినపడే ప్రమాదం రాబోతోంది. కేవలం పది పెద్ద కంపెనీలకు మేళ్లు చేసిపెట్టేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం వస్త్రాలపై జిఎస్టీ పన్ను పోటు పొడుస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. వస్త్రాలపై జిఎస్టీని తొలగించాలంటూ భారతదేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు బంద్ పాటిస్తున్నారు'. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గంగపర్రులో వైసీపీ నేతల పర్యటన

ప.గో : గంగపర్రులో వైసీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటిస్తోంది. దళితుల గ్రామ బహిష్కరణపై వివరాలను సేకరిస్తున్నారు. ఈ కమిటీలో ధర్మాన, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, నాగార్జున పాల్గొన్నారు.

నిషేధిత మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న నలుగురి అరెస్ట్...

తూ.గో: రాజమండ్రిలో మంత్తు మందు విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులకు నిషేధిత మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 215 మత్తు ఇంజక్షన్లు, 80 సిరంజిలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ ఏజెన్సీలో విజృంభిస్తోన్న మలేరియా

విశాఖ : విశాఖ ఏజెన్సీలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియాజ్వరంతో సోమవారం ఇద్దరు మృతి చెందారు. మృతులు జీమాడుగుల సర్పంచ్ మంచ రాజు, మేఘన లుగా తెలుస్తోంది. ఏజెన్సీలో ఆంత్రాక్స్ బాధితులను మంత్రి గంటా పరామర్శించారు.

11:02 - June 27, 2017

హర్యానా : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ముస్లింలు పండగ జరుపుకుంటుంటే... ఢిల్లీ-మధుర లోకల్‌ ట్రైన్‌లో జరిగిన మతపరమైన దాడిని నిరసిస్తూ హర్యానాలో పలుచోట్ల ముస్లింలు పండగను నిషేధించారు. ఖందావలి తదితర గ్రామాల్లో చేతికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మసీదులో ప్రార్థనలు చేయడం ద్వారా నిరసనలు వ్యక్తం చేశారు. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌  స్టేషన్‌ సమీపంలో రంజాన్‌ పండగ షాపింగ్‌ వెళ్లి లోకల్‌ ట్రైన్‌లో తిరిగి వస్తున్న ముస్లిం యువకులపై సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో  15 ఏళ్ల జునైద్‌ మృతి చెందగా...అతని సోదరులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. బీఫ్‌ తింటున్నారన్న కారణంతో దాడి చేసినట్లు అరెస్ట్‌ అయినవారిలో ఒకరు చెప్పారు. 

 

కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్:యనమల

అమరావతి: ఇక నుంచి కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని మంత్రి యనమల రామక‌‌ృష్ణుడు అన్నారు. కేంద్ర బడ్జెట్‌ మాదిరిగానే డిసెంబర్‌ చివరినాటికి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం పోందుతుందని ఆయన అన్నారు. జనవరి1 నుంచి డిసెంబర్‌తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని ఆయన తెలిపారు.

10:59 - June 27, 2017

అమెరికా : ఇస్లాం దేశాల పట్ల వ్యతిరేకత చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రంజాన్‌ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఇచ్చే ఇఫ్తార్‌ విందు సంప్రదాయానికి తెరదించారు. గ‌త రెండు ద‌శాబ్దాల‌లో వైట్‌హౌస్‌ ఇలా చేయ‌డం ఇదే తొలిసారి. 1805లో అప్పటి అధ్యక్షుడు థామ‌స్ జెఫ‌ర్‌స‌న్ రంజాన్‌కు ముందు వైట్‌హౌస్‌లో తొలిసారి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత 1996లో అప్పటి ఫ‌స్ట్ లేడీ హిల్లరీ క్లింట‌న్ ఈ సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. 1999 నుంచి ప్రతి ఏటా వైట్‌హౌస్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి కేవలం ఓ ప్రకటనతో సరిపుచ్చుకుంది. 'అమెరికాతోపాటు ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న ముస్లింలంద‌రూ ఈద్ జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా వాళ్ల విలువ‌ల‌ను గౌర‌వించ‌డానికి అమెరికా క‌ట్టుబ‌డి ఉంద‌ని'...ఓ ప్రకటన వెలువరించింది.

 

10:56 - June 27, 2017

శ్రీనగర్ : రంజాన్‌ పర్వదినం రోజున కూడా జమ్ముకశ్మీర్‌లో అల్లర్లు ఆగలేదు. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌, బారముల్లా జిల్లాల్లో పలు చోట్ల ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అల్లర్లను అదుపుచేసేందుకు పోలీసులుభాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు సిఆర్‌పిఎఫ్ జవాన్లతో సహా పది మంది గాయపడ్డారు. ఈద్‌ ఉల్‌ ఫితర్‌ను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌లో పలుచోట్ల ఆంక్షలు విధించారు. శ్రీనగర్‌లోని ఓ మసీదు వద్ద ఆంక్షలను ధిక్కరించి స్థానిక ముస్లింలు ప్రార్థనల కోసం వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అనంత్‌నాగ్‌ జిల్లాలో సిఆర్‌పిఎఫ్‌ క్యాంపుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

10:53 - June 27, 2017

చెన్నై : గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడు రాజధాని చెన్నై తీవ్ర జల సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. చెన్నై నగరానికి నలువైపులా ఉన్న నాలుగు జలాశయాలు పూందీ, రెడ్‌ హిల్స్‌, చోలవరం, చెమ్బరమ్బక్కమ్‌ ఎండిపోవడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. గత 140 ఏళ్లలో నీటికోసం అత్యంత గడ్డు పరిస్థితిని ప్రస్తుతం చెన్నై ఎదుర్కొంటోంది. చెన్నై నగరానికి రోజుకు 83 కోట్ల లీటర్ల తాగునీరు అవసరం కాగా.. సంక్షోభం కారణంగా కొన్ని రోజులుగా నీటి సరఫరాకు సగానికిపైగా పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో మూడు రోజులకొకసారి మాత్రమే పంపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు అధికారులు రోజుకు 3 వందల వాటర్‌ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

 

10:53 - June 27, 2017

హైదరాబాద్: మెగా హీర రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ నటిస్తోందట. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా అనసూయే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో రంగస్థలం షూటింగ్‌కి వస్తున్న నటీనటులకు స్వాగతం అంటూ రాసింది. దీన్ని బట్టి రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ కూడా నటిస్తోందని అర్ధమవుతోంది.

10:52 - June 27, 2017

ముంబై : కూతురు షీనాబోరా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియాపై మరో కేసు నమోదైంది. ముంబైలోని బైకుల్లా జైలులో తోటి ఖైదీలతో కలిసి విధ్వంసం సృష్టించడమై కాకుండా జైలు అధికారులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇంద్రాణితో పాటు 2 వందల మంది మహిళా ఖైదీలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గుడ్లు దొంగిలించిందన్న కారణంతో మహిళా ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న మంజుల షెట్టేను అధికారులు కొట్టడంతో మృతి చెందింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇంద్రాని ముఖర్జీతో పాటు తోటి ఖైదీలు నిరసనకు దిగారు. పలు వస్తువులను ధ్వంసం చేసి కాగితాలకు నిప్పు పెట్టారు.  అడ్డుకున్న అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు అధికారులను సస్పెండ్‌ చేశారు. తోటి ఖైదీలను ఇంద్రాణి రొచ్చగొట్టారని పోలీసులు ఆరోపించారు.

 

10:47 - June 27, 2017

హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మసీదుల్లో భక్తి, శ్రద్ధలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్తలు..భక్తులకు ఉపదేశాలు ఇచ్చారు. ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 
మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు 
వాడవాడలా రంజాన్‌ పండుగ వైభవంగా జరిగింది. రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే సౌదీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే ఇతర దేశాలలోనూ రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. మన దేశంలో చెన్నైలో రంజాన్‌ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహించారు.
రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తలసాని 
పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లను నిర్వహించారు. హైదరాబాద్‌ నల్లగుట్ట మసీద్‌లో జరిగిన రంజాన్‌ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 
ఎంపీ అసదొద్దీన్‌ ఓవైసీ రంజాన్ శుభాకాంక్షలు 
బహదూర్‌ పురాలోని మీరాలం ఈద్గాలో లక్షల సంఖ్యలోముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అసదొద్దీన్‌ ఓవైసీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 
రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు 
అలాగే సిద్ధిపేట జిల్లాలో రంజాన్‌ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొని.. ముస్లిం ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నిజామాబాద్‌లో జరిగిన ప్రార్థనల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఖమ్మంలోని గొల్లగూడెం దర్గా, స్థానిక రైల్వే స్టేషన్‌ దగ్గరిలోని ఈద్గా వద్ద ముస్లిం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మెదక్‌ పట్టణంలో జరిగిన వేడుకల్లో ఉపసభాపతి పద్మాదేవేందుర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ చందనా దీప్తి పాల్గొని... పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  
గద్వాలలో 
రంజాన్‌ సందర్భంగా...జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోనూ ఈద్గాలలో..వారి పెద్దల సమాదులు దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  స్థానిక శాసన సభ్యురాలు డీకే అరుణ, బీసీ కమిషన్‌ సభ్యులు ఆంజనేయులు గౌడ్‌ తదితరులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఉత్సాహంగా రంజాన్ 
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో...యాదాద్రి భువనగిరి జిల్లాలో.. కామారెడ్డి జిల్లాలలో రంజాన్‌ పండుగ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. 
ఏపీలో 
రంజాన్‌ పర్వదినంతో... ఏపీలో పలు ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లాలో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కర్నూలులో 
కర్నూలులో ఉన్న కొత్త, పాత మసీదుల్లో వేలాదిమంది ముస్లింలు అల్లాను స్మరించుకున్నారు. ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ పాల్గొన్నారు. 
కిక్కిరిసిన మసీదులు, ఈద్గాలు 
ప్రకాశం జిల్లాలో మసీదులు, ఈద్గాలు ముస్లీం సోదరులతో కిక్కిరిసాయి. రంజాన్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌,  ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలోనూ రంజాన్‌ సంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. అల్లా దయతో అందరూ సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. 
రంజాన్‌ వేడుకల్లో అపశ్రుతి 
కాగా భద్రాద్రి కొత్తగూడెంలోని జరిగిన రంజాన్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రార్థనల సమయంలో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రార్థనలు జరిగే ప్రాంతంలో నాయకులు ఉండడంపై పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. 

 

ఆర్టీసీ డిపో మేనేజ్ ఆత్మహత్య...

సంగారెడ్డి: నారాణఖేడ్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ కట్టా మహేందర్‌(48) మంగళవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పట్టణ శివారలోని బైపాస్‌రోడ్డుపై ఆయన మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుల మందుడబ్బా ఉండడంతో పాటు ఆయన నోట్లో నుంచి నురగలు వచ్చాయని స్థానికులు తెలిపారు. నెలరోజుల క్రితమే మహేందర్‌ పదోన్నతిపై నారాయణఖేడ్‌ డిపో మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

10:34 - June 27, 2017

వరంగల్ : ఖరీఫ్‌ సీజన్‌ అదను దాటుతున్నా  రైతులకు పంటరుణాలు మాత్రం అందడంలేదు. విత్తనాలు నాటేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లేదు. రుణాల కోసం కాళ్లరిగేలా తిరిగినా బ్యాంకులు కనికరం చూపడం లేదు.  దీంతో రైతులకు ప్రైవేట్‌ అప్పులే దిక్కవుతున్నాయి.  పుట్టెడు కష్టాలను దిగమింగుకుంటూ సాగుకు సన్నద్దమవుతున్నారు వరంగల్‌ రైతులు. నేలమ్మను నమ్ముకున్న భూమిపుత్రులు పడుతున్న రుణగోసపై 10టీవీ కథనం..
రుణాలు అందక రైతుల ఎదురుచూపులు
తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది.  ఉత్తర తెలంగాణకు కేంద్రమైన వరంగల్‌ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. సాగుకు రైతులు దుక్కులుదున్ని సిద్దంగా ఉన్నారు. కానీ అన్నదాతలకు రుణాలు ఇచ్చేవారు కరువయ్యారు.  అప్పుల కోసం బ్యాంకులచుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండడం లేదు.  రాష్ట్రస్థాయిలో రుణ ప్రణాళిక ఆశలను ప్రభుత్వం కల్పించినా... క్షేత్రస్థాయిలో మాత్రం అమలు జరుగక రైతులకు నిరాశే మిగులుతోంది.  రాష్ట్రస్థాయి డైరెక్షన్‌ లభిస్తేనే జిల్లాలో రుణ ప్రక్రియ మొదలవుతోంది.  ఈ తతంగమంతా పూర్తి కావాలంటే అదనుదాటిపోయే దుస్థితి దాపురించింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను రైతులు విత్తడం ప్రారంభించారు. ఈ సమయంలోనే రైతులకు రుణాలు అవసరం ఉంటాయి. ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు.
రైతులకు దిక్కవుతున్న ప్రైవేట్‌ అప్పులు
ఏటా ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ ఒకటి నుంచే మొదలవుతుంది. ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగుస్తుంది. అన్నదాతలు తీసుకున్న రుణాలను మే చివరి వరకు చెల్లిస్తుంటారు. బ్యాంకులు జూన్‌ మొదటి వారంలో నుంచి కొత్త, పాత రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. వివిధ కారణాలతో ఏటా జూలై నుంచి మొదలుపెట్టి సెప్టెంబర్‌ చివరి వరకు రుణాలు అందిస్తున్నారు. సాగు సమయంలో రుణం అందకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఎకరా భూమిలో విత్తడానికి రూ.8వేల ఖర్చు
ఎకరా భూమిలో విత్తనాలు విత్తడానికి దాదాపు 8వేల వరకు ఖర్చు వస్తుంది. అదే రెండు మూడు ఎకరాలు ఉంటే... 20వేలకుపైగా చేతిలో పెట్టుకుంటేనే విత్తనాలు వేయగలుగుతారు.  ఇంత మొత్తం డబ్బు లేకపోవడంతో రైతులు ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది.  ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో.. అదను దాటిపోతుందని రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే జరుగుతుందని రైతులు వాపోతున్నారు. వడ్డీ వ్యాపారులకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణ ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధం 
2017-18 వార్షిక సంవత్సరానికి రైతులకు ఆర్థిక చేయూతను  ఇచ్చేందుకు ప్రభుత్వం రుణప్రణాళిక ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సబంధించి 5230 కోట్ల రూపాయల రుణాన్ని లక్ష్యంగా నిర్ధేశించారు.  అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
పూర్తిగా అమలు కాని పంట రుణాలు  
ప్రభుత్వం ప్రకటించినట్టుగా పంట రుణాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడంలేదు. రైతులందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడంపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని అందరికీ రుణాలు అందేలా చూడాలని  రైతులు కోరుతున్నారు.

 

10:34 - June 27, 2017

గ్రామీణ యువతిగా వాలుజడ, లంగావోణీతో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా సంప్రదాయబద్దంగా కనిపిస్తోన్న ఈ హోరియన్ ఎవరో చెప్పండి.. ప్రస్తుతం విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న రంగస్థలం చిత్రీకరణతో బిజీగా ఉన్నది ఈ సొగసరి. రామ్‌చరణ్ తో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. సరస్సు ఒడ్డుపై కూర్చొని సూర్యస్తమయాన్ని చూస్తున్న ఫొటోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈమె. గ్రామీణ యువతిగా ఆమె పాత్రను దర్శకుడు సుకుమార్ వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. గోదావరి తీర ప్రాంతాల్లో చిత్రీకరణ సందర్భంగా వారం రోజులుగా సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ మాట్లాడటం కుదరలేదని, మళ్లీ వెనకటి రోజులకు వెళ్లిన అనుభూతి కలిగిందని ట్విట్టర్ ద్వారా పేర్కొంది కూడా.

10:30 - June 27, 2017

వరంగల్ : ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కీలక సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లిన అనుభవం వారిది. అయితే.. రాష్ట్రం సిద్ధించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సరైన రీతిలో స్పందించేందుకు ఒకరిద్దరూ మినహా మరేవరూ ముందుకు రాని పరిస్థితి.. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ టీఆర్‌ఎస్‌ నేతలను వెంటాడుతోంది. 
కామ్‌ గా ఉన్న నేతలు   
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమంది నేతలు తమ వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకున్నారు. దశాబ్ధ కాలం జరిగిన మలి ఉద్యమంలో తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్‌ అయ్యారు. అయితే.. అలాంటి నేతలంతా ఇప్పుడు కామ్‌ కావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 
రాబోయే ఎన్నికలకు కసరత్తు 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో ఇప్పటినుంచే రాబోయే ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ప్రతిపక్షాల విమర్శలకు అధికార పార్టీ సరైన రీతిలో స్పందించడం లేదు. టీఆర్‌ఎస్‌ నేతలంతా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ వారిని వెంటాడుతోంది. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా అగ్రనేతల ఆదేశాలతోనే మాట్లాడుతున్నారు. అదికూడా పార్టీలో ఆదినుంచి క్రియాశీలంగా వ్యవహరించిన నేతలే మీడియా ముందుకు వస్తున్నారు. 
సీఎం కేసీఆర్‌ తీరే కారణమంటున్న నేతలు  
అయితే... దీనికంతటికి సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరే కారణమనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు నేతలకు పెద్దగా బాధ్యతలు ఇవ్వకపోవడంతో పాటు... కీలక పదవుల్లో ఉన్నవారికి పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇవ్వకపోవడమే దీనికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అధికార పార్టీ సమర్దవంతమైన పాలన అందిస్తున్నామని సంబరపడిపోతున్నా.... ప్రతిపక్షాల విమర్శలపై అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే భవిష్యత్‌లో పార్టీకి నష్టం జరిగే అవకాశముందంటున్నారు. 

నీరు - ప్రగతి పురోగతి పై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్

అమరావతి : నీరు - ప్రగతి పురోగతి పై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...ఈ నెలలో ఇప్పటి వరకు 32 శాతం అధిక వర్షపాతం పడిందని, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లన్నీ నీటితో నిండితే మన కష్టాలన్నీ గట్టెక్కినట్లేనని పేర్కొన్నారు. జూన్, జులైలో పడే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి వర్షపు చుక్క భూమిలోకి ఇంకిస్తేకరువు ఉండదన్నారు. ప్రాచీన వారసత్వ సంపదగా చెరువులను కాపాడుకోవాలన్నారు.

వెంకయ్య నాయుడుతో భేటీ కానున్న కడియం

హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఢిల్లీ బయలుదేరారు. మ.12 గంటలకు కేంద్ర మంత్రి వెంకయ్యతో కడియం భేటీ కానున్నారు. టీచర్ల ఉమ్మడి సర్వీసులకు ఆమోద ముద్ర వేయిచండానికి సహకరించిన వెంకయ్యకు కడియం ధన్యవాదాలు తెలపనున్నారు. మ.3.30 గంటలకు ఎస్ సీఈఆర్ టీ సమావేశానికి కడియం హాజరు కానున్నారు.

09:51 - June 27, 2017

హైదరాబాద్ : కూకల్ పల్లి హౌసింగ్ బోర్డులో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు దేవాలయాలలో చోరీ చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి పంచలోహ విగ్రహాలను చోరీ చేశారు. సెవెన్ హిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండి పగలగొట్టి కానుకల సొమ్మును ఎత్తుకెళ్లారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:47 - June 27, 2017

అనంతపురం : జిల్లాలోని సాయినగర్ లో దారుణం జరిగింది. అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడేపుట్టిన శిశువును గుర్తు తెలియన వ్యక్తులు చెత్తకుండీలో వదిలివెళ్లారు. స్థానికులు శిశువును చేరదీసి ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:43 - June 27, 2017

కరీంనగర్ : రోడ్లు వేస్తామంటారు... పరిశ్రమలు తీసుకొస్తామంటారు... అభివృద్ధి చేసేస్తామంటూ హామీలు గుప్పిస్తారు.  రోజులు... నెలలు గడిచినా అవి అమలకు మాత్రం నోచుకోవడం లేదు.  పాలకుల్లో చిత్తశుద్ధి కరువవడంతో.. ప్రజలకు నిరాశ తప్ప మరేం మిగలడం లేదు.
జిల్లాకు దూరమవుతున్న పరిశ్రమలు
అభివృద్ధి మాటేమోగాని... కరీంనగర్‌ జిల్లాకు మంజూరైన పరిశ్రమలు  దూరవుతున్నాయి. అది చేస్తాం... ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తున్న పాలకుల హామీలు మాటలకే పరిమితమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లాగా చెప్పుకునే కరీంనగర్‌ జిల్లాపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని ప్రజలు అంటున్నారు. ఐటీ రంగంలో జిల్లాను అభివృద్ధి చేస్తామని.. అనుమతులు మంజూరు చేస్తే యుద్ధప్రాతిపదికన ఐటీ నిర్మాణాలు చేపడతామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేకపోగా... జిల్లాకు మంజూరైన పరిశ్రమలు సైతం తరలిపోతున్నాయి.   
ఐటీ పార్క్‌ ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్‌  జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని ఏడాదిన్నర కిందట కేటీఆర్‌ హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఐటీ పార్క్‌ నిర్మాణం కోసం పది ఎకరాల  మార్క్‌ఫెడ్‌ స్థలాన్ని కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. 
ఐటీ పార్క్‌కు ఏర్పాటుకు పడని అడుగులు
కేటీఆర్‌ హామీతో ఐటీ పనులు చకాచకా సాగిపోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనుకున్న దానికంటే భిన్నంగా పరిస్థితులు మారాయి.  ఐటీ పార్క్‌ ఏర్పాటుకు ఇంత వరకు అడుగులు పడకపోగా... గతంలో జిల్లాకు మంజూరైన లెదర్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, టెక్స్ టైల్ జోన్‌, హర్టికల్చర్ యూనివర్సిటీలు కూడా మరొక చోటికి తరలిపోతున్నాయి. దీంతో జిల్లా ప్రజలు నిరాశ చెందుతున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై మడిపడుతున్నాయి. 
హైదరాబాద్‌, బెంగళూర్‌ నగరాలకు తరలి వెళ్తున్న ఇంజినీర్లు
జిల్లాలో శాతవాహన యూనివర్సిటీతో పాటు 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉండడంతో ఏటా ఆరు వేల మంది ఇంజనీర్లు పట్టాలు పుచ్చుకుని హైదరాబాద్, బెంగుళూర్‌కు తరలి వెళ్తున్నారు. ఇక్కడ ఐటీ రంగం అభివృద్ధి చెందితే... ఇక్కడే వారందరికీ ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. కానీ మంజూరైన పరిశ్రమలే తరలిపోవడంతో.. అందరూ నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిడాంబి శ్రీకాంత్ కు ఘన స్వాగతం...

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సీరిస్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంధుమిత్రులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... నా పట్టుదల, శ్రమకు లభించిన ఫలితమిదని తెలిపాడు. తన తరువాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ చాపియన్‌షిప్. దాదాపు ఆరు వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టిపెట్టి సిద్ధమవుతానని వెల్లడించాడు.

09:39 - June 27, 2017

ఢిల్లీ : గిరిజనులకు ఆహారం, నీరు, ఆవాసం ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం బాధాకరమని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. ఏజెన్సీలో కలుషిత నీరు తాగి 20 మంది మృత్యువాతపడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు ఉడటం లేదని.. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో గిరిజనులు మృత్యువాత పడుతున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజన మంత్రి లేక పోవడం కూడా గిరిజనుల నిర్లక్ష్యానికి కారణమని కొత్తపల్లి గీత అన్నారు. 

 

'పట్టిసీమను నీటికి కృష్ణా డెల్టా రైతులు స్వాగతం పలుకుతున్నారు'

విజయవాడ: పట్టిసీమను నీటికి కృష్ణా డెల్టా రైతులు స్వాగతం పలుకుతున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాల్లో రైతులను బతికించిందన్నారు. పట్టిసీమ ద్వారా 6018 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరిందన్నారు. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు వస్తే జగన్ ఓర్వలేకపోతున్నారని, కడుపు మంటతో పట్టిసీమపై జగన్ విషం కక్కుతున్నారన్నారు. జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా చేసిన పాపాలు పోవన్నారు.

09:35 - June 27, 2017

హైదరాబాద్ : జూన్‌ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్న ఈ పన్ను వల్ల సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వినోదపు పన్ను 15 శాతం నుంచి 20 శాతం మధ్యలోనే ఉందని తెలిపారు. జీఎస్టీ వల్ల ఈ శాతం 28 శాతానికి పెరుగుతుందని... తద్వారా సినిమా టిక్కెట్ల ధరలు పెరుగుతాయని వివరించారు. వినోదపు పన్ను ద్వారా ఏటా రూ.120 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర, గ్రామ పంచాయితీలకు ఈ ఆదాయం నేరుగా వెళ్లేదని... ఇప్పుడు దీన్ని జీఎస్టీలో చేర్చటం వల్ల ఈ పన్ను మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు... సినిమా టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతాయని చెప్పారు.

వినోదపు పన్నుకు కత్తెర...

ఇప్పటి వరకూ వివిధ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న సినిమాలకు రాష్ట్రాలు వినోదపు పన్నులో రాయితీనిచ్చేవి. కానీ ఈ పన్ను మినహాయింపుల వల్ల నిర్మాత లాభపడతాడు.. కానీ సగటు సామాన్య ప్రేక్షకుడికి మాత్రం సినిమా టిక్కెట్‌ ధర తగ్గదు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలుతో వినోదపు పన్ను మినహాయింపులకు ఎలాంటి ఆస్కారం (వినోదపు పన్ను కేంద్రం పరిధిలోకి వెళుతుంది కాబట్టి...) ఉండదు. ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక సినిమాకు రాయితీ, పన్ను మినహాయింపునివ్వాలంటే... అందుకు సంబంధించిన సొమ్మును తానే భరించాల్సి ఉంటుంది.

సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యాలకు అనుమతిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన సినిమా టికెట్ల ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. టికెట్ ధర గరిష్టంగా రూ. 20, కనిష్టంగా రూ. 10 పెంచేందుకు హోంశాఖ అనుమతిచ్చింది. జీహెచ్‌ఎంసీ, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో సినిమా టికెట్ల ధరలు పెరగనున్నాయి. టికెట్ ధరలోనే థియేటర్ నిర్వహణ వ్యయం, ఆన్‌లైన్ ఛార్జీలు ఉండనున్నాయి. జీఎస్టీ వసూలు కలిపి సినిమా టికెట్‌పై ముద్రించాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు.

నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో

నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో 20 శాతం సీట్లు లోయర్ క్లాస్‌కు ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధి ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర రూ. 120, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 40, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ రూ. 60, లోయర్ క్లాస్ టికెట్ ధరూ. 20, మున్సిపాలిటీల్లోని ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ టికెట్ ధర రూ. 80, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 30, నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ రూ. 60, లోయర్ క్లాస్ ధర రూ. 20, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో బాల్కనీ ధర రూ. 70, లోయర్ క్లాస్ ధర రూ. 20, నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ ధర రూ. 50, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 15గా నిర్ణయించారు.

సినిమాహాల్స్ ఆధునీకరణ కోసం

సినిమాహాల్స్ ఆధునీకరణ కోసం రూ. 2 నుంచి రూ. 7, నాన్ ఏసీ థియేటర్లలో రూ. 2 నుంచి రూ. 5 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌ల్లో గోల్డ్, రాయల్ టికెట్ల ధరలు రూ. 300 మించకూడదని వెల్లడి చేశారు. ఎగ్జిక్యూటివ్ టికెట్ల ధరలు రూ. 200 మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

09:33 - June 27, 2017

పశ్చిమగోదావరి : చంద్రబాబుకి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చావోరేవో పేరుతో జూలై 26నుంచి ఛలో అమరావతి నిరవధిక పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర సాగే గ్రామాల జాబితాను కూడా ముద్రగడ వెళ్లడించారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని..116 గ్రామాలగుండా పాదయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ముద్రగడ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలు, కాపుల మధ్య గొడవ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ముద్రగడ అన్నారు. చంద్రబాబు మాటల వల్లే  కాపులు ఈనాడు ఉద్యమించాల్సి వస్తుందని ముద్రగడ ఆయన మండిపడ్డారు. 

 

09:30 - June 27, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్‌ శిరీష మరణంలో మిస్టరీ ఏంటి..? కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎందుకు కాల్చుకోవాల్సి వచ్చింది... మానసిక వేదనతోనా..? లేక ఘోరానికి పాల్పడ్డారా..? శిరీషను హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుందా..? ఆడియో టేపుల్లో గొడవలకు ఎవరు కారణం...? రెండు మరణాలపై అనుమానాలు తీరనున్నాయా..? నిందితులిద్దరినీ రెండ్రోజులు విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయా..? 
నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు
వాసంచలనం రేపుతున్న బ‌్యుటీషియ‌న్  శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లను బంజారాహిల్స్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం నిందితులిద్దరినీ చంచల్‌గూడ జైలు నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు....
శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య  
ఈ నెల 13న తెల్లవారుజామున ఆర్‌కె స్టూడియోలో శిరీష ఉరితాడుకు వేలాడిన సంగతి తెలిసిందే...మరుసటి రోజే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని క్వార్టర్స్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు...ఈ రెండు మరణాలకు లింకులు బయటపడ్డాయి...దీంతో బ్యూటీషియన్ శిరీష డెత్‌ కేసులో నిందితులుగా ఆర్‌కె స్టూడియో యజమాని రాజీవ్‌తో పాటు వారి మిత్రుడు..ఈ ఘటనలకు సూత్రధారి అయినా శ్రావణ్‌లపై కేసులు నమోదు చేశారు...నిందితులుగా వీరిద్దరిని కోర్టు ఆదేశాలతో రిమాండ్‌ తరలించగా...కేసులో మరింత సమాచారం కోసం వారిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రెండు రోజులకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో  పోలీసు స్టేషన్‌కు తరలించారు...
అసలు ఈ ఘటనలో ఏం జరిగింది...
బ్యూటీషియన్‌ శిరీష కేసులో నిందితులిద్దరినీ పలు అంశాలపై ప్రశ్నించనున్నారు. ఆత్మహత్య తర్వాత శిరీషకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపైనా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. శ్రవణ్, ప్రభాకర్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారమే శిరీషను కుకునూర్ పల్లి పీఎస్ కు పిలిపించారని.... రాజీవ్ తో పన్నాగం పన్ని హత్య చేశారని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  ఈ ఆరోపణల తరుణంలో పోలీసులు పలు కోణాల్లో నిందితులిద్దరినీ ప్రశ్నించే అవకాశం ఉంది.
కుకునూరుపల్లిలో ఏం జరిగింది..
శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌, శ్రవణ్‌లను కస్టడీకి తీసుకున్న పోలీసులు ప్రధానంగా కుకునూర్‌పల్లిలో ఏం జరిగిందన్న అంశంపై ప్రశ్నించనున్నారు...శిరీష, రాజీవ్‌, శ్రవణ్‌, ఎస్సై ప్రభాకర్‌రెడ్డిల విషయంలో ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ పక్కాప్లాన్‌తో చేసినవి కాదని..అనుకోకుండా జరిగినే తప్ప మరోటి కాదంటున్నారు నిందితుల తరుపున న్యాయవాది... ఏదీ ఏమయినా రెండు మరణాల తర్వాత జరిగిన పరిణామాలు..బయటకు వచ్చిన ఆరోపణలు..అనుమానాలను నివృత్తి చేస్తూ కేసులో ఆధారాలతో పాటు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు...

09:26 - June 27, 2017

విజయవాడ : పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణాడెల్టాకు తరలింపు ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా 2500 క్యూసెక్కులు నీటిని తూర్పు డెల్టాకు తరలిస్తున్నారు. ఇందులో రైవస్ కాలువకు 1000 క్యూసెక్కులు, బందరు, ఏలూరు, కేఈ కెనాల్స్‌కు 500 క్యూసెక్కులు చొప్పున నీటిని అందించనున్నారు. నదుల అనుసంధానంతో.. గోదావరి, కృష్ణా డెల్టాలకు జూన్‌లోనే నీళ్లిచ్చామని తెలిపారు.

 

09:23 - June 27, 2017
09:21 - June 27, 2017

పశ్చిమగోదావరి : దళితులపై సాంఘిక బహిష్కారం ఘటనను... జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. సోమవారం ఉదయం.. గరగపర్రులో పర్యటించిన కమిటీ సభ్యులు.. దీనికి బాధ్యులైన నలుగురినీ అరెస్టు చేయాలని జిల్లా రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలను ఆదేశించారు. మరోవైపు గరగపర్రు బాధితులకు దళిత, ప్రజాసంఘాల మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. నిందితులను శిక్షించే వరకు బాధితులకు అండగా ఉంటామని వారు భరోసా ఇస్తున్నారు. 
మూడో రోజూ పోలీసుల దిగ్బంధం 
పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో మూడో రోజు కూడా పోలీసుల దిగ్బంధం కొనసాగుతోంది. సాంఘిక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించేందుకు గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు రహదారులను మూసివేశారు. గ్రామంలో అడుగడుగునా పోలీసులు పహారా కాస్తున్నారు. పోలీసుల అష్టదిగ్బంధం మధ్యలోనే.. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌ సభ్యులు రాములు.. సోమవారం గరగపర్రులో పర్యటించారు. దళితుల బహిష్కారానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. దీనికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని.. రాములు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. 
గరగపర్రులో న్యాయవాదుల బృందం పర్యటన 
కుల బహిష్కరణకు దారితీసిన వివరాలు సేకరించేందుకు న్యాయవాదుల బృందమొకటి కూడా గరగపర్రులో పర్యటించింది. వీరిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులతో వాగ్వాదం అనంతరం గ్రామంలోకి వెళ్లిన న్యాయవాదులు బాధితులను అడిగి వివరాలు సేకరించారు. రెండు నెలల నుంచి దళితులపై వివక్ష కొనసాగుతున్నా... నిన్ననే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతుండడాన్ని లాయర్లు ఆక్షేపించారు. అధికారులు ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే... హైకోర్టులో పిల్‌ దాఖలు చేస్తామని లాయర్లు తెలిపారు.
దళిత, ప్రజాసంఘాలు, సీపీఎం నేతలు రాస్తారోకో 
ఘటన వెలుగుచూసి మూడు రోజులైనా నిందితులపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఖండిస్తూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో దళిత, ప్రజాసంఘాలు, సీపీఎం పార్టీ నేతలు రాస్తారోకో చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కేసును నీరుగార్చాలని చూస్తోందని, దళితులకు ఇంత అన్యాయం జరుగుతున్నా... రాజ్యాంగ పదవుల్లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్‌లు ఎందుకు రాజీనామా చేయడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సమాజం దృష్టికి తీసుకువచ్చిన 10టీవీని పలువురు అభినందిస్తున్నారు. 

 

నెదార్లాండ్ కు ప్రధాని మోదీ

హైదరాబాద్: అమెరికాలో పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీ కొద్దిసేపటి క్రితం నెదర్లాండ్స్ బయలుదేరారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన చివరిగా నెదర్లాండ్స్‌లో పర్యటించనున్నారు.

బాలాపూర్ లో దారుణం

హైదరాబాద్: బాలాపూర్ లో దారుణం జరిగింది. యువతిని వేధిస్తున్నాడంటూ యువకుడు సునీల్ పై దాడి ఐదుగురు వ్యక్తులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీల్ మృతి చెందాడు.

రానున్న 36 గంటల్లో భారీ వర్ష సూచన..

హైదరాబాద్: నైరుతీ రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న 36 గంటల్లో గ్రేటర్‌లోని పలు ప్రాం తాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో 6.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోధన్, రెంజల్, కోటగిరి , వర్ని, రుద్రూర్, నందిపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో అన్ని చోట్ల వాన పడింది. కమ్మర్‌పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నల్లగొండ జిల్లాలోని 20మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా శాలిగౌరారం మండలంలో 31.8మి.మీ. వర్షపాతం నమోదైంది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి వైకుంఠం వెలుపల కి.మీ మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది.

చెత్తకుండలో అప్పుడే పుట్టిన బిడ్డ

అనంతపురం : నగరంలో ని సాయినగరంలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుండీలో వదిలేశారు. ఏడుపులు విన్న స్థానికులు శిశువును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేపీహెచ్ బీలో దొంగల బీభత్సం

హైదరాబాద్: కూకల్ పల్లి హౌసింగ్ బోర్డు లో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు దేవాలయాలలో చోరీ చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి పంచలోగ విగ్రహాలు చోరీ, సెవెన్ హిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండి పగలుకొట్టి హుండీలోని కనుకల సొమ్మును దొంగలు ఎత్తుకెళ్లారు.

రెండో రోజు శ్రవణ్, రాజీవ్ ల విచారణ

హైదరాబాద్: అనేక మలుపులు తిరుగుతున్న బ‌్యుటీషియ‌న్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లను బంజారాహిల్స్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం నిందితులిద్దరినీ చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. రెండో రోజు విచారణ కొనసాగుతోంది.

పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు...

అమరావతి: పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణాడెల్టాకు తరలింపు ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా తూర్పు డెల్టాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా 2500 క్యూసెక్కులు నీటిని తూర్పు డెల్టాకు తరలిస్తున్నారు. ఇందులో రైవస్ కాలువకు 1000 క్యూసెక్కులు, బందరు, ఏలూరు, కేఈ కెనాల్స్‌కు 500 క్యూసెక్కులు చొప్పున నీటిని అందించనున్నారు. నదుల అనుసంధానంతో.. గోదావరి, కృష్ణా డెల్టాలకు జూన్‌లోనే నీళ్లిచ్చామని తెలిపారు.

గంగపర్రు లో కొనసాగుతున్న ఉద్రిక్తత...

.గో : దళితులపై సాంఘిక బహిష్కారం ఘటనను... జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. సోమవారం ఉదయం.. గరగపర్రులో పర్యటించిన కమిటీ సభ్యులు.. దీనికి బాధ్యులైన నలుగురినీ అరెస్టు చేయాలని జిల్లా రెవిన్యూ, పోలీసు యంత్రాంగాలను ఆదేశించారు. మరోవైపు గరగపర్రు బాధితులకు దళిత, ప్రజాసంఘాల మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. నిందితులను శిక్షించే వరకు బాధితులకు అండగా ఉంటామని వారు భరోసా ఇస్తున్నారు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న టీ.కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. 28న యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. 

నేడు పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సమావేశం

మధ్యప్రదేశ్ : భూపాల్ లో నేడు కేంద్రమంత్రి తోమర్ అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ మంత్రుల సమావేశం జరుగనుంది. ఏపీ, తెలంగాణ మంత్రులు నారా లోకేష్, జూపల్లి కృష్ణారావు పాల్గొననున్నారు. 

నేడు ఐటీడీఏ పీవోలతో మంత్రి కామినేని భేటీ

అమరావతి : నేడు ఐటీడీఏ పీవోలతో మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఏజెన్సీలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. 

ఉమ్మడిగా ఉగ్రవాదం పై పోరాడుతాం:ట్రంప్,మోదీ

హైదరాబాద్: ఉగ్రవాదంపై పోరు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, భారత ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రకటించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని... దానిపనై ఉమ్మడిగా పోరాడి అణచివేస్తామని హెచ్చరించారు. భారత్‌, అమెరికా మధ్య ఆర్ధికమైత్రి కొనసాగుతుందని స్పస్టం చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్‌తో భేటీ అయిన మోదీ.... వాణిజ్యం, రక్షణరంగం, ఉగ్రవాదంపై చర్చించారు.

తుర్కపల్లిలో అగ్నిప్రమాదం

మేడ్చల్ : శామీర్ పేట మండలం తుర్కపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. 

Don't Miss