Activities calendar

28 June 2017

22:09 - June 28, 2017

జార్ఖండ్ : గోసంరక్షణ పేరిట దాడులు ఆగడం లేదు. హర్యానా రైలులో గోమాంసం పేరుతో ఓ యువకుడి హత్య చేసిన ఘటన ఇంకా మరవకముందే బిజెపి పాలిత రాష్ట్రం జార్ఖండ్‌లో మరో ఘటన వెలుగు చూసింది. రాంచీకి 2 వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో గోరక్షకులు ఓ వ్యక్తిని చితకబాదారు. ఉస్మాన్‌ అన్సారి ఇంటి సమీపంలో మృతి చెందిన ఆవు   కనిపించడమే ఇందుకు కారణం. అన్సారీపై దాడి చేయడమే కాకుండా ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో తీవ్రంగా గాయపడ్డ అన్సారిని ధన్‌బాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో ఇద్దరు వ్యక్తులతో పాటు 50 మంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

22:06 - June 28, 2017

ఢిల్లీ : దేశంలో దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని.. వీటిని రాజ్యం ప్రోత్సహిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ శక్తుల దాడులను నిరసిస్తూ జంతర్‌మంతర్‌వద్ద "నాట్‌ ఇన్‌ మై నేమ్‌" పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని రాఘవులు అన్నారు.

22:03 - June 28, 2017

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న‌ష్టాల‌ను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలు అమ్మేయ‌ాలని నిర్ణయించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు క్యాబినెట్ ఓకే చెప్పిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు... ఎయిర్ ఇండియా సంస్థలో చేర‌డం వ‌ల్ల సంస్థ మ‌రింత నాణ్యంగా, వేగంగా ప‌నిచేస్తుంద‌ని కేంద్ర మంత్రి జైట్లీ అభిప్రాయ‌పడ్డారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు సుమారు 50 వేల కోట్ల అప్పులున్నాయి. నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాద‌న‌ల ఆధారంగానే ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. 

 

22:00 - June 28, 2017

విజయవాడ : నీరు చెట్టు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కొల్లగొడుతుందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దళితుల భూములను తొలగించే ప్రయత్నం సిగ్గుచేటన్నారు. చెరువులను తవ్విన చోట భూములను దళితులకే అప్పగించాలన్నారు. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ అన్యాయమన్నారు. 

 

21:56 - June 28, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు కేసులో నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసుల తాత్సారంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 24గంటల్లో నిందితుల అరెస్ట్‌కు జాతీయ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు స్పందించకపోవడంపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆమరణదీక్ష కొనసాగుతుండగా..దళిత సంఘాలు సైతం దీక్షకు సన్నద్ధమవుతున్నాయి. 
పోలీసుల అలసత్వంపై ఆందోళనలు 
పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితుల వెలి కేసులో.. పోలీసుల అలసత్వంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దళితుల పట్ల ప్రభుత్వానికి గాని.. పోలీసులకు గాని చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 24 గంటల్లో అరెస్ట్‌ చేయాలని జాతీయ ఎస్సీకమిషన్‌, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకపోవడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా గరగపర్రులో.. దళిత సంఘాలు ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నాయి.  
హర్షకుమార్‌ దీక్ష
మరోవైపు గరగపర్రు కేసులో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఉదయం నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్‌ దీక్షకు దిగారు. నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తానని హెచ్చరిస్తున్నారు. ఈ కేసులో అన్ని సాక్షాలున్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. దళితులను అణచివేయాలన్నదే ప్రభుత్వ దృక్పంథంగా కన్పిస్తుందన్నారు. దీక్ష కొనసాగిస్తున్న హర్షకుమార్‌కు ప్రభుత్వం తరఫున వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెద్యులు వెల్లడించారు. హర్షకుమార్‌ ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈనెల 30న గరగపర్రులో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. బాధితులను ఆయన పరామర్శించనున్నారు. 

 

21:46 - June 28, 2017

ఢిల్లీ : బీజేపీ, టీఆర్ఎస్ లపై టీకాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. బీజేపీ, టీఆర్ ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అఖిల పక్షానికి రాజ్ నాథ్ సింగ్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

21:40 - June 28, 2017

గరగపర్రులో దళితుల వెలివేత దుర్మార్గమని వక్తలు అన్నారు. గరగపర్రు ఘటనపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ నేత భాగ్యరావు, లాయర్ జయరాజ్ పాల్గొని, మాట్లాడారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:36 - June 28, 2017

జీఎస్టీ అమలుతో వ్యవసాయ సంక్షోభం తలెత్తుతోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ప్రతిభ బయోటెక్ ఎండీ రాజశేఖర్ రెడ్డి, రమణారావు, యుగంధర్ రావు మాట్లాడారు. వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ భారం పడుతుందని తెలిపారు. జీఎస్టీతో నష్టమే కాని లాభం లేదని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:05 - June 28, 2017

విశాఖ : ఏజెన్సీలో ఆంత్రాక్స్ మళ్లీ కోరలు చాస్తోంది. ఇప్పటికే ఐదుగురికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు కేజిహెచ్‌లో చికిత్స పొందుతుండగా.. తాజాగా అరకులోయ మండలం కోడిపుంజువలసలో మరో ఇద్దరికి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. వారిద్దరిని కేజిహెచ్‌కు తరలించిన అధికారులు కోడిపుంజువలసకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపించారు. 

 

21:02 - June 28, 2017

రంగారెడ్డి : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కల్తీ విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ప్రధాన నిందితుడు చిన్నం జానకిరామ్‌ సహా సంఘి మహేందర్‌, శ్రీను, లక్ష్మిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సృష్టి, గోపి కృష్ణ సీడ్స్‌ పేరుతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రైతులను మోసం చేసినట్లు పేర్కొన్నారు. నిందితులపై సెక్షన్‌ 420, ఐపీసీ 13 (1), 18 (1) తో పాటు సీడ్‌ కంట్రోయాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కల్తీ విత్తనాల విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ రేమా రాజేశ్వరి హెచ్చరించారు. 

 

20:59 - June 28, 2017

ఢిల్లీ : మియాపూర్ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరేందుకు అఖిలపక్షం నేతలు ఢిల్లీ వెళ్లారు  కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవాలని ప్రయత్నించారు. ఈరోజు ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో  మండిపడుతున్నారు టీ.లీడర్లు. తమకు కావాలనే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. ఇది టిఆర్‌ఎస్, బిజెపి చీకటి ఒప్పందమంటూ విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగినా బిజెపి నేతలు విస్మరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి  ఎద్దేవా చేశారు. చరిత్రలోనే ఇంతటి స్కామ్‌ జరగలేదన్నారు దిగ్విజయ్ సింగ్. దీనిపై కేంద్రం సిబిఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. 

20:56 - June 28, 2017

మెదక్ : ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎస్సై ఆత్మహత్య కేసులో ఏసీపీ గిరిధర్‌ను ఏ1 గా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. అలాగే ఏసీపీపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి చనిపోయిన తరువాత.. ఏసీపీ ఎస్ ఐ గదిలోకి వెళ్లి కొన్ని కాగితాలను మాయం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తమ్ముడు భాస్కర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీపీ గిరిధర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ1 నిందితుడుగా చేర్చారు. 

20:52 - June 28, 2017

విజయవాడ : బెజవాడలో కార్మికులు కదం తొక్కారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియూసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లెనిన్  సెంటర్ నుంచి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్, అంగన్ వాడీ, ఆశ, మెడికల్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఏ విధంగా జీతాలు పెంచారో అవే జీతాలను ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

 

20:49 - June 28, 2017

చిత్తూరు : జిల్లాలోని నగరిలో ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం టికెట్టు తీసుకుని కొద్ది దూరం బస్సులో ప్రయాణం చేశారు.

 

20:44 - June 28, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల వెలి కేసులో నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసుల తాత్సారం చేస్తున్నారు. 24గంటల్లో అరెస్ట్‌ చేయాలని జాతీయ ఎస్సీకమిషన్‌, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. దీంతో గరగపర్రులో.. దళిత సంఘాలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నాయి.  

 

20:09 - June 28, 2017

హైదరాబాద్ : సీసీ కెమెరాలో ఫుటేజీ లేదు...ఎవిడెన్స్‌ దొరకలేదు..ఆధారాల కోసం ప్రయత్నాలు ఫలించలేదు...కేవలం సమాచారం మాత్రమే... ఇప్పుడు పోలీసుల ముందున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు...ఒకవైపు బ్యూటీషియన్ శిరీష డెత్‌పై ...మరోవైపు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై...ఈ రెండు మరణాలపై అనుమానాలు అనుమానాలుగానే ఉన్నాయి... నిందితుల రెండ్రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని తిరిగి జైలుకు తరలించారు...
ముగిసిన రెండురోజుల కస్టడీ...
బ్యూటీషియన్‌ శిరీష డెత్‌ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌ ల విచారణ కోసం నాంపల్లి కోర్టు ఇచ్చిన రెండు రోజుల గడువు పూర్తికాగానే పోలీసులు తిరిగి కోర్టులో హాజరుపర్చారు...రెండురోజుల పాటు జుడిషియల్ రిమాండ్ విధించి తిరిగి ఈ నెల 30న కోర్టులో వారిని హాజరుపర్చాలని న్యాయస్థానం ఆదేశించింది...దీంతో బంజారాహీల్స్ పోలిసులు నిందితులిద్దరిని చంచల్ గూడా జైలుకు తరలించారు. 
అనేక విషయాల్లో లేని క్లారిటీ...
బ్యూటీషియన్‌ శిరీషది నిజంగా ఆత్మహత్యేనా? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి క్వార్టర్‌లో ఆ రోజు ఏం జరిగింది? తేజస్విని,శిరీష గొడవలను రాజీవ్‌ ఏ కోణంలో ఆలోచించాడు...అందుకు రాజీవ్ ఎలాంటి కుట్ర చేశాడు..దీనికి సహకరించిన శ్రావణ్‌ ఎలా వాడుకున్నాడు...శిరీష బంధువుల ఆరోపణల నేపథ్యంలో రిమాండ్‌లో ఉన్నఇద్దరు నిందితులు రాజీవ్‌, శ్రవణ్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీ లో విచారణ సాగింది. అనేక కొణాల్లో బంజారాహిల్స్‌ పోలిసులు ఇంటారాగేషన్ నిర్వహించారు. బంజారాహీల్స్ పిఎస్ లో నిందితులను వేరువేరుగా, కొన్ని సందర్బాలలో ఇద్దరిని కలిపి రెండు రోజులపాటు ఇంటారాగేషన్ జరిపారు. రెండు రోజుల విచారణ పూర్తి కాగానే నిందితులను అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహింపజేసిన పోలీసులు ఒక్కసారి మాయం కావడంతో కలకలం రేపింది...
అర్ధరాత్రి పోలీసుల హైడ్రామా...
సరిగ్గా అర్ధరాత్రి 12 దాటిన తరువాత పోలిసులు చాకచక్యంగా నిందితులను పోలిస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిందితులకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం నేరుగా నిందితులను బంజారాహీల్స్ రోడ్ నంబర్3 మీదుగా కుకూనూరు పల్లికి తీసుకెళ్లారు...సీన్ మినట్ టూ మినట్ రీకన్స్ట్రక్షన్‌ లో బాగంగా నిందితులను కూకునూరు పల్లిలో అరగంటకు పైగా పలు కోణాల్లో విచారించారు. 
ఆ రోజు ఏం జరిగింది...
ఆ రోజు ఏం జరిగింది... ఎలా వెళ్లారు...? ఎలా వచ్చారు..మధ్యలో ఏం జరిగింది.. శిరీషతో ఆ ఇద్దరూ ఎలా ప్రవర్తించారు.. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు పోలీసులు అర్థరాత్రి దాటాక వారిని ఆ రోజు వారు వెళ్లిన దారిలోనే తీసుకువెళ్లి తీసుకువచ్చారు...ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంత సేపు శిరిష ఉన్న వాహనం ఆగింది, ఏ ప్రాంతాలలో వీరు గొడవకు దిగారు, ఎక్కడెక్కడ శిరిషను కొట్టారు, అలాగే కుకూనూర్ పోలిస్ క్వాటర్స్ లో ఏం జరిగింది, బయటకు వచ్చిన తరువాత ఎక్కడెక్కడ తమ వాహానాన్ని అపారు అన్న అనేక విషయాలను విచారించారు...
ఆధారాల కోసం పోలీసుల గాలింపు..
ఇక రాజీవ్,శ్రావణ్‌,శిరీషలు కుకునూరుపల్లి నుంచి బయల్దేరిన సమయంలో ఎక్కడ ఆగారు..ఆమెతో ఎలా ప్రవర్తించారన్న విషయాలన్ని తెలుసుకున్న పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్‌ కోసం ప్రయత్నం చేశారు...శిరిష బందువులు అరోపించిన విదంగా పోలిసు క్వార్టర్స్ కి మూడు కిలొ మిటర్ల దూరంలో ఉన్న ఫాంహౌజ్ వద్ద శిరిషా వాహనం నిలిచిందా లేదాని నివృత్తి చేసుకున్నారు...
విచారణ తర్వాత కేసుల్లో మార్పులు..
శిరీష డెత్‌ కేసులో ముందుగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 306,109 కేసులు నమోదు చేయగా రెండ్రోజుల పాటు న్యాయస్థానం అనుమతితో పాటు ఆదేశానుసారం న్యాయవాది సమక్షంలో విచారణ చేశారు...అన్ని వివరాలు తెలుసుకున్న పోలీసులు ఈఘటనలో ఉద్దేశ్య పూర్వకంగా శిరిషను అవమానిస్తూ... ఘొరంగా కొట్టినందుకు గాను ఐపిసి 324, 354, రెడ్ విత్ 506 సెక్షన్ల కింద పోలిసులు అదనంగా సెక్షన్లను నమోదు చేశారు. 
తిరిగి కస్టడీ కోరనున్నారా...?
నిందితులిద్దరి నుంచి కీలక సమాచారం తెలుసుకున్న పోలీసులు కన్ ఫెక్షనల్ రిపోర్టుగా రూపొందించారు. ఇక పూర్తి వివరాలతో నిందుతుల హెల్త్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ తో పాటు పరస్పరం నమోదు చేసుకున్న ఫిర్యాదు వివరాలు, ఎవిడెన్స్ రిపోర్టు, రెండు రోజుల పాటు విచారణ జరిపిన కస్టడి రిపోర్ట్, రిమాండ్ రిపోర్టులను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందుంచారు...రెండు రోజుల అనంతరం నిందితులను తిరిగి కస్టడిలోకి తీసుకుంటారా, లేక నిందితుల తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ వేస్తారా అన్నది వేచిచూడాల్సిందే.. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు నిందితులను తిరిగి న్యాయస్థానం ముందు ఉంచడంతో పాటు ఆదేశాలతో జైలుకు తరలించడంతో కేసులో మరిన్ని అనుమానాలు మాత్రం శేషప్రశ్నలుగానే మిగిలిపోయాయి...

 

19:56 - June 28, 2017

జగిత్యాల : వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు నడుం బిగించింది జగిత్యాల జిల్లాలోని తారకరామనగర్ గ్రామం. వరకట్నం మాకొద్దంటూ గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. వరకట్నం కారణంగా కుటుంబాలు విచ్చిన్నం కావడం.. హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఉద్యమించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయానికి మహిళా సంఘాలు కూడా మద్దతు పలికాయి. అందరూ కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరి వరకట్నం ఇవ్వద్దు..తీసుకోవద్దు అంటూ ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామంలోనే కాకుండా ఊరూరా ఈ నిషేధం అమలయ్యేలా ఉద్యమిస్తామన్నారు గ్రామస్తులు. ఎవరైనా కట్నం తీసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. 

 

19:53 - June 28, 2017

రంగారెడ్డి : జిల్లాలోని మంచాల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నాకు దిగింది. రంగాపూర్‌ గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేలా వ్యవసాయరంగంలో పరిష్కారం జరగాలన్నారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుజరిగేందుకు అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఎగ్గొట్టేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. 

 

ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రకేబినెట్ ఆమోదం

హైదరాబాద్ : ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రకేబినెట్ ఆమోదం తెలిపింది. విధి విధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. హెచ్ ఆర్ ఏ, అలవెన్సులపై ఏడో వేతన సంఘం సిఫారుసులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మెడికల్ అలవెన్స్ రెట్టింపు అయింది. రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచారు. ఈ ఏడాది జులై 1 నుంచి అమలు చేయనున్నారు. ప్రభుత్వంపై రూ.30,748,23 కోట్ల భారం పడనుంది. 

 

19:29 - June 28, 2017

హైదరాబాద్ : జీఎస్టీ ప్రవేశపెడితే ప్రజలకు నష్టమే గాని లాభం లేదని నవభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు కళ్యాణ్‌ కృష్ణ అన్నారు. జీఎస్టీ అమలును తమ పార్టీ పూర్తిగా ఖండిస్తుందన్నారు. జీఎస్టీ అమలు వల్ల నిత్యావసరాలపై అదనపు పన్ను పడుతుందని..దీని వల్ల సామాన్యులపై అధిక భారం పడుతుందన్నారు.  పూర్తి వివరాలు వచ్చేవరకు జీఎస్టీ అమలును నిలిపేయాలని డిమాండ్ చేశారు. 

 

19:27 - June 28, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రి గోదావరి తీరాన బాపూ, రమణల విగ్రహాలను ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తి. రమణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపి మురళీమోహన్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి పాల్గొన్నారు. తెలుగు, సినీ సాహిత్య రంగానికి బాపూ, రమణలు చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. 

 

19:22 - June 28, 2017

ఆదిలాబాద్ : అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు... మార్పు కోరుకుంటున్నారు. ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం మాత్రం అంతర్గత విభేదాలతో... గ్రూపు రాజకీయాలతో పలచబడుతోంది. ఒకరిపై ఒకరు కాలు దువ్వుకుంటూ.. అధికార పక్షానికే అనుకూలంగా పరిస్థితులను మారుస్తున్నారు.   
కాంగ్రెస్‌ గెలుపునకు అవకాశం
అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్‌ నియోజకవర్గ ప్రజలు...మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ... సరైన నాయకుడికి పట్టం కట్టాలని భావిస్తున్నారు. దీంతో భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు సాధ్యమనేంతగా పరిస్థితి మారింది. అయితే టికెట్‌ కోసం పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిని నేనే అని చెప్పుకునేందుకు ఎన్నికల వాతావరణాన్ని ఇప్పుడే సృష్టించుకుంటున్నారు నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు. సొంత పార్టీలోనే ముగ్గురు నాయకులు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు.     
వ్యక్తిగత గుర్తింపు కోసం పాకులాట
ఎవరికి వారే విడివిడిగా సమావేశాలు.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ప్రజల్లో వ్యక్తిగత గుర్తింపును సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, బార్గవ్ దేశ్ పాండే... మూడు వర్గాలుగా చీలిపోయి.. ఎవరికి వారే.. పార్టీ టికెట్‌ మాదేననే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారే  ఇఫ్తార్‌ విందులు.. సేమ్యా కిట్‌ల పంపిణీ కార్యక్రమాలు చేసుకున్నారు.  గండ్రత్ సుజాత సేమ్యా కిట్‌ల పంపిణీకి  సొంత పార్టీలోని తన గ్రూప్ కానివారేవ్వరిని పిలవలేదు.  అలాగే బార్గవ్ దేశ్ పాండే ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు నిర్మల్‌ నుంచి  డీసీసీ అధ్యక్షులు మహేశ్వర్‌రెడ్డి , పార్టీ నాయకులు వచ్చినా స్థానికంగా ఉండే సీనియర్‌ నేత మాజీ మంత్రి సి.రాంచందర్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. అలాగే సి.రాంచందర్ రెడ్డి సైతం వేరుగా  సేమ్యా కిట్‌లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  
రెండు వర్గాలుగా చీలిన జిల్లా కాంగ్రెస్‌
నియోజకవర్గంలోనే కాదు...జిల్లా కాంగ్రెస్‌ కూడా రెండు వర్గాలుగా మారింది. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి వర్గం... మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలుగా చీలిపోయింది. కొంత కాలంగా జిల్లాలో రెండు గ్రూపులు ఎవరికివారు కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించుకోగా.. ఒకరిపైఒకరు రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. గతంలో నిర్మల్ రైతు ధర్నా వేదికగా  కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. 
అంతర్గత కుమ్ములాటలే అనుకూలిస్తాయనే ధీమాలో టీఆర్‌ఎస్‌
కాగా ప్రతిపక్షంలోని అంతర్గత కుమ్ములాటలే తమకు అనుకూలిస్తాయనే ధీమాలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.  గ్రూప్‌ రాజకీయాలు ఇలానే కొనసాగితే.. తమదే గెలుపని లెక్కలు వేసుకుంటున్నారు. 

 

19:18 - June 28, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల వెలి కేసులో  నిందితులను అరెస్ట్‌ చేయడంలో పోలీసుల తాత్సారం చేస్తున్నారు. 24గంటల్లో అరెస్ట్‌ చేయాలని జాతీయ ఎస్సీకమిషన్‌, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలు ఇచ్చినా..పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. దీంతో గరగపర్రులో.. దళిత సంఘాలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నాయి. 

19:14 - June 28, 2017

చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం జంగాలపల్లి వద్ద లారీ, ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఎనిమిది  మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఆటోలో అంతా మహిళలే ఉన్నారు. అందరూ రేణిగుంట కొత్తపాలెంకి చెందినవారే.

 

19:08 - June 28, 2017

చంఢీఘర్ : హరియాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ పత్రికలో వచ్చిన  ప్రకటన వివాదాస్పదంగా మారింది. 'ఘూంఘట్‌' అంటే 'కొంగు' రాష్ట్ర గుర్తింపు...అన్న ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ' కృషి సంవాద్‌ ' అనే పత్రికలో కొంగు వేసుకున్న ఓ మహిళ ఫొటోను ముద్రించారు. అందులో మహిళ ముఖం నిండా ముసుగు వేసుకుని తలపై ఓ తట్టను మోస్తున్నట్లుగా ఉంది. దాని పక్కనే కొంగు వేసుకోవడం.... హర్యానాకు ఓ గుర్తింపు లాంటిదని క్యాప్షన్‌ రాసి పెట్టారు. కవర్‌ పేజీపై ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చిత్రాన్ని ముద్రించారు.  ఈ ప్రకటన గత తరం ఆలోచనలకు ఓ నిదర్శనమని బిజెపిని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. హర్యానాలోని మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని పేర్కొంది. 'బేటి బచావ్‌'... నినాదంతో హోరెత్తించిన బిజెపి...ఇపుడు 'బేటి ఛుపావో'ను తెరపైకి తెచ్చింది. ఈ రెండు ప్రకటనలు కూడా బిజెపి పాలిత రాష్ట్రం హర్యానాలో వెలువడడం గమనార్హం.  

18:59 - June 28, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో దారుణం జరిగింది. కొడుకు, కూతురును కన్నతండ్రి కడ తేర్చాడు. దారుణంగా హత్య చేశారు. వర్ని మండలం తగిలేపల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుని తండ్రి గొడ్డలితో నరికి చంపారు. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:58 - June 28, 2017

ఖమ్మం : జైల్లో ఉండే ఖైదీలంటే రాళ్లు కొడతారు. వడ్రంగి పనులు చేస్తారు. మహిళా ఖైదీలైతే అల్లికలు అల్లుతారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ఆవేశంలో తప్పులు చేసి జీవితాలు నాశనమైనవారికి.. జైలు అధికారులు మంచి దారిని చూపిస్తున్నారు. కష్టపడటం.. సత్‌ ప్రవర్తనను నేర్పిస్తూ.. వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. 
సామర్థ్యాన్ని వెలికితీస్తున్న జైలు అధికారులు 
రిమాండ్‌ ఖైదీల నుండి శిక్ష అనుభిస్తున్న ఖైదీల వరకు.. వారిలో దాగి ఉన్న సామర్థ్యాన్ని జైలు అధికారులు వెలికితీస్తున్నారు. ఖైదీలను సరి కొత్తగా తీర్చి దిద్దుతున్నారు. పదేళ్ల క్రితం నుంచి ఖమ్మం జిల్లా కారాగారంలో.. వ్యవసాయ క్షేత్రాలు, చిన్న తరహా పరిశ్రమ ఉత్పత్తుల్లో ఖైదీల భాగస్వామ్యం ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పుడు పెట్రోల్‌ పంపుల్లో బాయ్‌లుగా.. పరిశ్రమల్లో బెంచీలు, మంచాలు, పాఠశాల డెస్కులు తయారు చేయిస్తూ పని మంతులుగా మారుస్తున్నారు. 
క్రమశిక్షణ గల ఖైదీలతో పెట్రోల్‌ బంక్‌ మొదలు
క్రమ శిక్షణ గల ఖైదీలతో ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ భాగస్వామ్యంతో..  పెట్రోల్‌ బంక్‌ను మొదలుపెట్టారు. నాణ్యమైన పెట్రోలు లభించడంతో రోజుకు సుమారు 2 లక్షల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో జైలు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన.. పెట్రోలు బంకుల్లో కరీంనగర్‌ ఎనిమిదవది. ప్రారంభమైన ఆరు నెలల్లో 3 కోట్ల 60 లక్షల రూపాయలు పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు జరిగాయి. జిల్లా కారాగారంలో 2017జనవరి 11న ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 90 లక్షల విలువైన బెంచీలు, బీరువాలు, మంచాలు, పాఠశాలలో ఉపయోగించే డెస్కు ఫర్నీచర్‌ను తయారు చేసి.. జైళ్ల శాఖ ఆదాయాన్ని పెంచారు. 
వ్యక్తిత్వ వికాస తరగతులు
రెండేళ్ల కిందట ప్రారంభించిన ఫినాయిల్‌ తయారీ ద్వారా.. దాదాపు 10 లక్షల ఫినాయిల్‌ ఉత్పత్తిని చేపట్టారు. ఇప్పుడు పెట్రోల్‌ పంపు ఏర్పాటు కావడంతో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. శిక్షను అనుభవిస్తున్న, విడుదలైన ఖైదీల ప్రవర్తనపై సంతృప్తి చెందిన జైలు అధికారులు.. పెట్రోలు బంకులో పనిచేసేందుకు ఎంపిక చేశారు. అందుకోసం శిక్షణ ఇప్పించారు. వినియోగదారులతో క్రమశిక్షణతో మెలిగేందుకు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించారు. సిబ్బంది, అధికారులు తమపై ఉంచిన సమ్మకాన్ని ఖైదీలు వమ్ము చేయలేదు.     
జైలు అధికారుల ప్రయోగాత్మక నిర్ణయాలు 
ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యాక ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు.. జైలు అధికారులు ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనిచేస్తున్న ఖైదీలకు మెరుగైన వేతనాలు ఇస్తున్నారు. జైల్లో భవనాలకు, క్వార్టర్స్‌కు రెండేళ్ల కిందట రంగులు వేయడం, జైలు ముందు, లోపల నూతన నిర్మాణాలు చేపట్టడం ద్వారా 30 నుంచి 35 లక్షలు ఆదా అయ్యాయి. జైలు ప్రాంగణంలో వందల టేకు మొక్కలను నాటి.. దీర్ఘకాల ఆదాయ మార్గాలకు శ్రీకారం చుట్టారు. 
జైళ్లలో ట్రంకు పెట్టెలు, ఫినాయిల్‌, డోర్‌మ్యాట్‌లు ఉత్పత్తి 
జిల్లా కారాగారంలో ఉత్పత్తి అయిన వస్తువులతోపాటు.. వరంగల్‌, హైదరాబాద్‌ జైళ్లలో ఉత్పత్తయిన వస్తువులను తెప్పించి స్టాళ్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. ట్రంకు పెట్టెలు, ఫినాయిల్‌, డోర్‌మ్యాట్‌ల లాంటివి స్టాళ్లలో ఉంటున్నాయి. ఇక్కడి పెట్రోల్‌, డీజిల్ మంచి మైలేజ్‌ ఇస్తోందని వాహనదారులు చెబుతున్నారు. పెట్రోల్‌ పంపులో పనిచేయడంతో రోజుకు 100 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఇక్కడ రకరకాల వాహనదారులను పలకరిస్తూ.. జైల్లో ఉన్నట్లు కాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నట్లు ఖైదీలంటున్నారు. 
ఉపాధి కల్పించేందుకు సంస్కరణలు 
తెలిసీ తెలియక, క్షణికావేశంతో జైలుకు వచ్చిన ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత.. ఎవరిపైనా ఆధారపడకుండా ఉపాధి కల్పించేందుకు సంస్కరణలు చేపడుతున్నారు. సమాజం వారిని చిన్నచూపు చూస్తే కుంగిపోకుండా ధైర్యంగా ఉండేందుకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. బయట పని దొరక్కుండా కారాగారాన్ని ఆశ్రయిస్తే వారి ప్రవర్తన పరిశీలించి ఉపాధి కల్పిస్తున్నారు. జీవిత ఖైదీలకు, కారాగారం నుంచి విడుదలైన రిమాండ్‌ ఖైదీలు తిరిగి నేరాలు చేయకుండా చదువుకుని ఉండి, మార్పు వచ్చిన ఖైదీలకు పెట్రోలు పంపులో పని కల్పిస్తున్నారు.

 

18:56 - June 28, 2017

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీలో ఏపీ ముందుందని ఐటి మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. త్వరలో ఏపీలో ప్రారంభించనున్న 6 ప్రాజెక్టుల శంకుస్థాపనకు రవిశంకర్‌ ప్రసాద్‌ను ఆహ్వానించినట్లు లోకేశ్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో ఏపీకి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని మంత్రి చెప్పినట్లు లోకేశ్ తెలిపారు.

 

18:55 - June 28, 2017

నిజామాబాద్ : శంకుస్థాపన చేశారు.. నిర్మాణ పనులు మాత్రం మరిచారు. ఇదీ పాత నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డిలో  బస్‌ డిపో దుస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సంవత్సరాలు గడిచిపోయింది.. ఇప్పటికీ బస్‌డిపో అన్నది.. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నంగానే మిగిలిపోయింది.
టీడీపీ హయాంలో బస్‌ డిపో నిర్మాణానికి శంకుస్థాపన
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా పద్దెనిమిదేళ్లు..! నిజామాబాద్‌ జిల్లా వాసులు, ఆర్టీసీ డిపో కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. బస్‌డిపో అన్నది.. ప్రతి ఎన్నికల్లోనూ ఓ హామీగానే ఉండిపోతోంది. ఎన్నికల హామీని నమ్మి ఓట్లేసిన ప్రజలను.. ఏపార్టీ నాయకులైనా సరే..  ప్రతిసారీ వంచిస్తూనే ఉన్నారు. 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అప్పటి టీడీపీ పాలకులు, నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గంలో బస్‌ డిపోను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు నాలుగు దశాబ్దాలుగా డిపో కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.. ఈహామీతో మురిసిపోయారు. పైగా, త్వరలోనే కల సాకారం చేస్తామంటూ.. అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బస్‌డిపో నిర్మాణం కోసం శంకుస్థాపన  కూడా చేసేశారు. అంతేనా, ప్రహరీ నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని, ఏడు లక్షల ఇరవై వేల రూపాయల నిధులు కేటాయించారు. ఈ నిధులతో అప్పట్లోనే ప్రహరీ గోడను నిర్మించారు. ఇంకేముందీ.. డిపో వచ్చేసినట్లే అని అంతా భావించారు. కానీ, దాదాపు 18 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ డిపో నిర్మాణం ఆచరణరూపం దాల్చలేదు. 
రాష్ట్ర విభజనతో ఆగిన నిర్మాణ పనులు
ప్రహరీ నిర్మాణం జరిగి 18 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతలోనే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడడం, కేంద్ర పాలకులు, రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే, రాష్ట్ర విభజన జరగిపోయింది. అంతే, నేతలంతా ఎల్లారెడ్డి బస్‌డిపో హామీని మరిచిపోయారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినప్పటికీ డిపో నిర్మాణ పనులు చేపట్టలేదు. పాలకులు ప్రభుత్వాలు మారడంతో డిపో ఏర్పాటును పట్టించుకునే వారు కరువయ్యారు. ఎల్లారెడ్డిలో శంకుస్థాపనకు ముందే కామారెడ్డి, బాన్సువాడ, నారాయణ ఖేడ్‌ లలో బస్‌ డిపోను ఏర్పాటు చేశారు. అయితే పాలకుల నిర్లక్ష్య ధోరణితో ఇక్కడి బస్‌ డిపోను పక్క ప్రాంతాల వారు తరలించుకుపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా డిపో నిర్మాణ పనులు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మినీ బస్‌ డిపోగా చేయాలి : ప్రజలు 
జిల్లాల విభజన తర్వాత కామారెడ్డి జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి మండలంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతం వాణిజ్య కూడలిగా మారింది. రోజూ ప్రయాణికులు, విద్యార్ధులు ఈ ప్రాంతానికి వస్తూ వెళుతుంటారు. ఈ తరుణంలో.. ఎల్లారెడ్డిగూడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు బస్‌ డిపోను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నమైన ఎల్లారెడ్డి బస్‌ డిపోను మినీ బస్‌ డిపోగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

 

18:53 - June 28, 2017

హైదరాబాద్‌ : హైదరాబాద్ హెల్త్‌హబ్‌గా తయారవుతుందని.. మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాల రోగులు సైతం నగరానికి రావడం శుభపరిణామమని మంత్రి హరీష్‌రావు అన్నారు. శేరిలింగంపల్లిలో సిటిజెన్‌ ఆస్పత్రిలో సెంటర్‌ ఫర్‌ డైజెస్ట్‌ డిసార్డర్స్‌ విభాగాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. రాష్ట్రంలో డివైసెస్‌ పార్క్‌ ఏర్పాటుతో వైద్య పరికరాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 

 

18:50 - June 28, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజులు తగ్గించాలని తెలంగాణ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. లేకపోతే  అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించింది. ఫీజులు నియంత్రించాలని కోరుతూ టీపీఏ ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. స్కూల్స్ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం నుంచి స్పదన లేకపోవడాన్ని అసోసియేషన్‌ తప్పుపట్టింది. ఫీజులు మొత్తం ముక్కుపిండి  వసూలు చేసిన తర్వాత సర్కారు నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం వుండదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రైవేటు స్కూల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు. 

 

18:48 - June 28, 2017

హైదరాబాద్ : జీఎస్టీని విధించడం వల్ల చేనేత రంగం కుదేలైపోతుందని ఎమ్మెల్యే డి.కె.అరుణ అన్నారు. ఈ పరిస్థితి నుంచి చేనేత కార్మికులను కాపాడాలంటూ మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఆమె చెప్పారు. చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని అభ్యర్ధించాల్సిందిగా మంత్రిని కోరినట్లు డికె.అరుణ తెలిపారు. మరోవైపు టిఆర్‌ఎస్ రాష్ట్రపతి అభ్యర్ధిగా మీరాకుమార్‌కు కాకుండా బిజెపి అభ్యర్ధికి సపోర్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. 

 

18:47 - June 28, 2017

హైదరాబాద్ : జోనల్ వ్యవస్థ రద్దు అంశంపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ల భేటీ జరిగింది. భేటీలో టిజీవోలు, టీఎన్జీవో సంఘాలు పాల్గొన్నాయి. జోనల్ వ్యవస్థ రద్దును స్వాగతిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జోనల్ పోస్టుల్లో ఉన్నవారికి ఇబ్బందులు రాకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పది శాతం మాత్రమే ఓపెన్ కోటాలో పెట్టాలని, డ్రాఫ్ట్ రూపొందించిన తరువాత మరోసారి పిలవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఏడేళ్ల స్ధానికత నిబంధనను కూడా ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.

18:45 - June 28, 2017

హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్ట్ చేస్తున్న జై లవకుశ  సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ విషయాన్ని సినిమా యూనిట్ సోషల్ మీడియాలో తెలిపింది. దీనిపై ఎన్టీఆర్ సోదరుడు , చిత్ర నిర్మాత కళ్యాణ్‌ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లీకైన ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దంటూ చిత్ర యూనిట్ అభిమానుల్ని కోరింది. 

 

18:29 - June 28, 2017

సూర్యాపేట : శ్రీరామ్ నగర్ లో పట్టపగలే దారుణం జరిగింది. నడిరోడ్డుపై భార్య సమీరాను భర్త శ్రీనివాస్ గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం శ్రీనివాస్ పారిపోయాడు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

16:05 - June 28, 2017

సామజిక మాధ్యమాలు రోజుకో విధంగా అప్డేట్ అవుతున్నాయి. అందులో ఒక పోస్ట్ చేస్తే నిముషాల్లో వైరల్ అవుతుంటయ్.ప్రధానంగా ఇది సినిమాలకు పాకింది. సినిమా రిలీజ్ అయినా రెండు..మూడు రోజులకే నెట్ లో ప్రత్యక్షం అవుటున్న సంగతి తెల్సిందే. కంటెంట్ బాగా ఉన్న సినిమాలు..కంటెంట్ బాగా లేని సినిమాలు కూడా ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడం దర్శక, నిర్మాతలను నష్టాలపాల్జేస్తోంది. పైరసీని ప్రోత్సహించవద్దని..అరికట్టాలని హీరో, దర్శక, నిర్మాతలు కోరుతూనే ఉంటున్నారు. కానీ తాజాగా ప్రముఖ సినిమాలు ఆన్లైన్ లో దర్శనం కావడం సంచలం కలిగిస్తోంది. డీజే..దువ్వాడ జగన్నాథం..రీలిజ్ కానీ జై లవ కుశ టీజర్ దృశ్యాలు లీక్ కావడం...ట్యూబ్ లైట్ ఫిలిం ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. దీనితో డీజే టీమ్ సీసీ ఎస్ పోలీస్ లను ఆశ్రయించింది. తమ సినిమా పైరసీ అయ్యిందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ పోలీస్ లకు పిర్యాదు చేశారు. వెబ్సైట్ లో సినిమా పైరేటెడ్ కాపీ లు, లింక్స్ దర్శనమిచ్చాయి. ఇంటర్నెట్ లో సినిమాను అప్లోడ్ చేసినా, లింక్స్ షేర్ చేసినా నేరమని..కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు ఏ మాత్రం పని చెయ్యడం లేదని తాజా ఘటన చూపిస్తోంది.

పెనుభూతం...
తెలుగు సినిమా పరిశ్రమకు పైరసీ అనేది పెనుభూతం ల మారిపోయింది. చిన్నా..పెద్ద సినిమాలు..అంటూ ఏ మాత్రం సంబంధం ఉండడం లేదు. సినిమా అనేది ఒక్కరోజులో పూర్తయేది కాదు. నెలలు..సంవస్తరాలు కాస్త పడితే ఒక సినిమా పూర్తవుతుంది. ఇలా రిలీస్ అయినా ఫిలిం కొన్ని నిమిషాల్లో పైరసీ ని చేసేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పైరసీ భూతాని అరికట్టలేక పోతున్నారు. ప్రముఖ హీరోల ఫిలిమ్స్ కూడా ఆన్లైన్ లో ప్రత్యక్షం కావడం ఆ హీరో అభిమానులని కలవర పెడుతోంది. ఈ నేపత్యంలో పైరసీ అరికట్టేందుకు మినిస్టర్ కేటీఆర్ తో సినీ ప్రముఖులు భేటీ అయినా విషయం తెల్సిందే. సినిమాల కోసం 200 వెబ్సైటు లు పనిచేస్తున్నాయని నిర్మాత సురేష్ బాబు పేరొన్నారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని టాక్. ఒకవైపు పరిశ్రమల్లో సరైన హిట్లు లేక సతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన బాహుబలి సినిమా సత్తాని చాటింది. ఒకటి..రెండు..సినిమాలు హిట్స్ ఉన్నా నిర్మాణ వ్యయం భారీగా పెరగడం..రెమ్యూనరేషన్ కూడా అధికం కావడం తో నిర్మాతలు చాల కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ లో ఉండే కొంత మంది పెద్దలు కూడా పైరసీ లో భాగం ఉందని పుకార్లు షికారు చేసాయి కూడా. ఇందులో చిన్న..పెద్ద నటులు తేడా లేదు. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా..రాజమౌళి ఫిలిం బాహుబలి సినిమా కూడా పైరసీ బారిన పడింది. 

టెక్నాలజీ..
ఇంతకూ ముందు కేవలం కొన్ని రూపాల్లో ఉన్న ఈ భూతం కొత్త కొత్త వేషాలతో ముందుకు వెళుతోంది. మొన్నటి వరకు కేవలం వీడియో ఆధారంగా చేసేవాళ్ళు. ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు అందనంత ఎత్తులో ఎదుగుతోంది. స్మార్ట్ ఫోన్..లు అందుబాటులో రావడం క్షణంలో సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తున్నారు. అత్యాధునిక 4k వీడియో రికార్డింగ్ కలిగిన స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్నాయ్. కొన్ని ఫోన్స్ చీకటి లో కూడా స్పష్టంగా తీయగలిగే అల్ట్రా మోడరన్ లైన్స్ వాడి కస్టమర్ తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. 

నివారించలేమా ?
మరి దీనిని నివారించలేమా. ప్రతి ప్రాబ్లెమ్ కు ఒక సొల్యూషన్ ఉంటుంది. సెల్ ఫోన్ లేకుండా సినిమా కు రావద్దని చెప్పలేము. ప్రభుత్వాలు..సినీ రంగం సమన్వయము తో పనిచేయడం..చట్టాలను కఠినంగా అమలు చేస్తే కొంత వరకు సాధ్యమేనని కొంత మంది పేరుకొంటున్నారు. ప్రదానంగ పైరసీ ని ప్రోత్సహించడం వాళ్ళ జరిగే నష్టం..ఇతర విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి సూచనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా అవగానే వస్తే పైరసీని నిర్ములిస్తే సాధ్యమేనని మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పైరసీని అరికట్టాలని సూచిస్తున్నారు. 

లారీ-ఆటో ఢీ: ముగ్గురు మృతి

చిత్తూరు : ఏర్పేడు మండలం జంగాలపల్లి వద్ద లారీ, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. ఎనిమిది మందికి త్రీవ గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆటో లో అంతా మహిళలే ఉన్నారు. బాధితులంతా రేణిగుంట కొత్తపాలెంకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

ఢిల్లీ అసెంబ్లీలో పేపర్ రాకెట్ లొల్లి....

హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీలో గ్యాలరీ నుంచి పేపర్ రాకెట్ కలకలం రేగింది. మంత్రి సత్యేందర్ జైన్ పై పేపర్ రాకెట్ పడింది. పేపర్ రాకెట్ విసిరారని ఇద్దరు వ్యక్తులపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారు.

కొడుకు, కూతుర్ని నరికి, ఉరేసుకున్న తండ్రి

నిజామాబాద్: వర్ని మండం తగిలేపల్లిలో దారుణం జరిగింది. కొడుకు, కూతురిని గొడ్డలితో నరికి చంపి, ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్రంప్ ది వింత ప్రవర్తన అంటూ మహిళా జర్నలిస్టు ట్వీట్

హైదరాబాద్: అగ్రదేశం అధ్యక్షుడు ట్రంప్ ఈ సారి మహిళా జర్నలిస్టు ను టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ట్రంప్ ది వింత ప్రవర్త అంటూ మహిళా జర్నలిస్ట్ ట్వీట్ చేసింది. ఫోన్ ఓ ఓ దేశ ప్రధానితో మాట్లాడుతూ మరో పక్క జర్నలిస్టుతో పరాచకాలేంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

టీఎస్ పీఎస్సీని ముట్టడించిన విద్యార్థులు

హైదరాబాద్: గ్రూప్ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు టీఎస్ పీఎస్సీని ముట్టడించారు.

గంజాయి విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్

హైదరాబాద్: యూసఫ్ గూడలో గంజాయి విక్రయిస్తున్న బీటెక్ విద్యార్థి సాయిమోహిత్ ను అరెస్ట్ చేశారు. అంతే కాకుండా కిలో గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సాయి సీఎంఆర్ కాలేజీ బీటెక్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

జీఎస్టీ ప్రారభోత్సవం.. కాంగ్రెస్ తర్జన భర్జన

ఢిల్లీ : జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేక తర్జభర్జన పడుతోంది.

భార్య గొంతు కోసిన భర్త

సూర్యాపేట : జిల్లా కేంద్రంలో పట్టపగలే దారుణం జరిగింది. శ్రీరాంనగర్ లో నడి రోడ్డు పై భార్య గొంతు కొసిన భర్త పరారయ్యాడు. భార్య సమీరా అక్కడిక్కడే మృతి చెందింది. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటనకు కారణం అని బంధువులు తెలిపారు.

ముంబై పేలుళ్లలో దోషిగా ఉన్న ముస్తఫా దోస్సా మృతి

ముంబై : 1993 ముంబై పేలుళ్లలో దోషి గా ఉన్న ముస్తఫా దోస్సా మృతి చెందాడు. గత రాత్రి అనారోగ్యానికి గురికావడంతో జైలు సిబ్బంది ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేర్పించారు.

జీఎస్టీ చారిత్రక తప్పిదం: మమతా బెనర్జీ

హైదరాబాద్: జీఎస్టీ చారిత్రక తప్పిదం అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాను అని స్పష్టం చేశారు.

రాజ్ నాథ్ ను కలువనున్న టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : సాయంత్రం 4గంటలకు దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రిని టి.కాంగ్రెస్ నేతలు కలువనున్నారు. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని రాజ్ నాథ్ సింగ్ ను వారు కోరనున్నారు.

సీఎస్ తో ఉద్యోగ సంఘాల భేటీ..

హైదరాబాద్ : జోనల్ వ్యవస్థపై ఉద్యోగ సంఘాలు సీఎస్ ను కలిశాయి. జోనల్ వ్యవస్థ రద్దు ప్రతిపాదనకు టీజీవో, టీఎన్జీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి.

'జై లవకుశ' టీజర్ దృశ్యాలు లీక్..

హైదరాబాద్ : 'జై లవకుశ' సినిమా టీజర్ దృశ్యాలు లీక్ అయ్యాయయని సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు సినిమా నిర్మాత కళ్యాణ రావు ఫిర్యాదు చేశారు.

హైకోర్టులో టీ.ఎస్ సర్కార్ కు ఊరట

హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని హైకోర్టు ఆదేశించింది. నిపుణుల కమిటీ అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

13:50 - June 28, 2017

సరోగసి అడ్డం పెట్టుకుని ఇటవలి కాలంలో అక్రమాలకు పాల్పడుతున్నారు... మన దేశంలో సరోగసి ద్వారా 10వేల కోట్ల బిసినెస్ జరుతోంది...అసలు సగరోసి అంటే ఏమిటి....సరోగసికి ఎవరు అర్హులు...దీని చర్చించడానికి అడ్వకేట్ పార్వతి గారి సూచనలు, సలహాలు పూర్తి వీడియో చూడండి.

 

 

టీఎస్ సర్కార్ ఉత్తర్వులను నిలిపివేన కోర్టు...

హైదరాబాద్: ఏపీ ఎన్జీవో భవనాన్ని అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను 8 వారాల పాటు నిలిపి వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

13:44 - June 28, 2017

చిత్తూరు : జిల్లా నిత్య పెళ్లికొడుకు నాగభూషణం ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని మూడవ భార్య ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తన భర్త మరో నాలుగో పెళ్లి చేకుంటున్నాడని ఆరోపణ చేస్తున్నారు. నాగభూషణం మాత్రం తను రెండే పెళ్లిలు చేసుకునట్టు తెలుపుతున్నాడు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

13:38 - June 28, 2017

తూర్పు గోదావరి : తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోటలో ఇద్దరు చిన్నారులు.. అనుమానాస్పద మృతిలో మృతి చెందారు. దీంతో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో.. తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు విజయనగరం జిల్లా పార్వతీపురం వాసులుగా తెలుస్తోంది. ఆడపిల్లలనే కారణంతోనే హత్య చేశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

13:36 - June 28, 2017

హైదరాబాద్ : జీఎస్టీ లో లోపాలు ఉన్నాయని నవభారత్‌ నేషనల్‌ పార్టీ ఆరోపించింది. ఆరు నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాతే జీఎస్టీ అమలు చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. 

13:35 - June 28, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి బలం ఉంది. పటిష్టమైన క్యాడర్‌ ఉన్నా సమర్థవంతమైన లీడర్‌ లేనిలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి... పార్టీ శాసనసభ్యులు, నేతలు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి.నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఆరు చోట్ల వైసీపీ గెలుపొందింది. నెల్లూరు లోక్‌సభ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే ఉంది. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఎంపీ మేకపాటి ఎవరినీ కలుపుకుపోవడంలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పైగా ఎంపీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలిందన్న వాదనలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు మేకపాటిని మార్చకపోతే వైసీపీ పరిస్థితి వేరుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జనంతో మమేకం
నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సూళ్లూరుపేట స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై పోరాడుతూ, నిత్యం జనంతో మమేకమవుతున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిపై కొంత వ్యతిరేకత ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి బరిలో దిగితే మేకపాటి గౌతంరెడ్డి సరితూగరని పార్టీ నేతలే చెబుతున్నారు. ఆత్మకూరుకు కొత్త అభ్యర్థిపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టాలని కొందరు సూచిస్తున్నారు.

బలమైన అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌
ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు వైపీసీ నాయకత్వం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పోటీకి విముఖత చూపితే ఆత్మకూరులో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మేకపాటి గౌతంరెడ్డిని మంచిదంటున్నారు. కోవూరు స్థానంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బలమైన అభ్యర్థి అవుతారని చెబుతున్నారు. కొకపోతే ఆర్థికంగా కొంత బలహీనంగా ఉండటమే సమస్యగా భావిస్తున్నారు. సర్వేపల్లి అసెంబ్లీ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సోమిరెడ్డిపై కాకాని గెలుపొందారు. మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రోజురోజుకు ప్రజలకు చేరువు అవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేస్తే, వైసీపీ అభ్యర్థిత్వాన్ని మార్చలన్న అభిప్రాయం పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ కుమార్‌ టీడీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో నాయకత్వలోపం ఏర్పడింది. గూడూరు స్థానంలో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మురళీధర్‌ వచ్చే ఎన్నికల్లో పోటీకి పరిపోరని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో గత వెంకటగిరిలో ఓడిపోయిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా ఉన్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాయకత్వ, సమన్వయ లోపాలను సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఢోకా ఉండదని విశ్లేషిస్తున్నారు. 

13:33 - June 28, 2017

నల్లగొండ : తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్‌ పని అయిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ధీటుగా ఫలితాలు సాధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సైతం.. ఇవే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యా యి. జెడ్పీ, డీసీసీబీ, మున్సిపాలిటీ చైర్మన్లు మొదలు.. సర్పంచ్‌ల వరకూ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో కాంగ్రెస్‌ ఖాళీ అవుతూ వచ్చింది.

జానారెడ్డి ఉలికిపాటు
పాతికేళ్లకు పైగా అనుచరులుగా పనిచేసి ఎంతో అనుబంధమున్న వాళ్లు కూడా.. అగ్రనేతల్ని వీడివెళ్లారు. దీంతో రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న జానారెడ్డి కూడా ఉలికిపాటుకు గురయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముచ్చెమటలు పట్టాయి. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంట పాతికేళ్లు నడిచిన వాళ్లు కూడా దూరమయ్యారు. దీంతో నియోజకవర్గంలో ఏముందని పర్యటించాలి అని అనుకునేంత చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో.. నేతలు, క్యాడర్ లో మరింత నైరాశ్యం నెలకొంది. ఇక సూర్యాపేట, మునుగోడు, దేవరకొండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. కాంగ్రెస్‌ ఖాళీ అయ్యింది. కాంగ్రెస్‌లో ఎవరున్నారు..? టీపీసీసీ అధ్యక్షులు, ఆయన సతీమణీ, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్ప అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి.. అనేక సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే కామెంట్లు చేసే పరిస్థితికి చేరింది. వాళ్లు కూడా గులాబీ తీర్థం పుచ్చుకు నేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌నుద్దేశించి నియోజకవర్గ ఇన్‌చార్జీలు కూడా వ్యాఖ్యానించారు.

రాజకీయ విజ్ఞులు చెప్పినట్లే
వాస్తవానికి ఆ వాతావరణం చూస్తే టీఆర్‌ఎస్‌ పుంజుకున్నట్టు.. కాంగ్రెస్‌ తుడిచి పెట్టుకు పోయే పరిస్థితి కనిపించింది. ఇదెంతో కాలం నిలవదని.. అధికార దర్పం మార్పులు చేర్పులకు కారణమవుతుందని రాజకీయ విజ్ఞులు చెప్పినట్లే జరిగింది. పదవులు, కాంట్రాక్టులు, రాజకీయ అవకాశాలు వస్తాయనే ఆశతో పార్టీ మారిన వాళ్లందరికీ టీఆర్‌ఎస్‌ నేతలు.. మంత్రి పోకడల వల్ల చేదు అనుభవమే ఎదురైంది. ఎలా పార్టీలోకి వెళ్లారో అలా తిరిగి పోవడమూ అదే స్పీడ్‌గా జరిగిపోతోంది. జానారెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, సీనియర్‌ ప్రజా ప్రతినిధి శంకర్‌నాయక్‌తో పాటు.. పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరారు. జానారెడ్డి వెంట తిరిగే పేరున్న నాయకులే కనిపించని పరిస్థితుల్లో లింగారెడ్డి, శంకర్‌నాయక్‌, ఇతర నాయకుల్ని తిరిగి తన గూటికి తెచ్చుకున్నారు.

దూకుడు పెంచిన ఉత్తమ్, దామోదర్
సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలు ఇటీవలే దూకుడు పెంచారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పర్యటనలు పెంచారు. పోయిన వాళ్లను తిరిగి రాబట్టే ప్రయత్నాల కంటే.. వెంట ఉన్న వాళ్లను బలపర్చేందుకు విస్తృత సమావేశాలు జరిపారు. చిన్న శుభకార్యాలకు కూడా హాజరవుతూ.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వచ్చివెళ్తుండడంతో కేడర్‌లో ఉత్సాహం నింపినట్టు అవుతోంది. మండలాల వారీగా భారీ సభలు ఏర్పాటు చేసి.. పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ల ద్వారా హాడావుడి పెంచారు. ఇక సూర్యాపేటలో ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న దామోదర్‌రెడ్డి.. ఇటీవల తన హడావిడి పెంచారు. కాస్త దూకుడుగా వ్యవహరించడం ద్వారా పార్టీలో ఉన్న నాయకుల్ని ఉత్సాహ పరుస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాల్ చేసి మరీ గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. భువనగిరి నియోజకర్గంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. ఆలేరులో ఎమ్మెల్యే భర్త మహేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, అసంతృప్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ క్యాడర్‌ను కాపాడుకుంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్‌ పుంజుకుంటున్నట్లే కనిపిస్తోంది. 

13:31 - June 28, 2017

విశాఖ : విశాఖ జిల్లాలో వెలుగుచూసిన భూకుంభకోణాలపై సిట్‌ దర్యాప్తు ప్రారంభమైంది. విశాఖ కలెక్టరేట్‌, ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌లలో సిట్‌ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ వీలుంటే అక్కడ ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని విశాఖ పోలీసు కమిషన్‌ యోగానంద్‌ చెప్పారు. 

13:30 - June 28, 2017

తూర్పు గోదావరి : గరగపర్రు వెలి కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా..ఆలస్యం చేస్తోన్న ప్రభుత్వ తీరుకి నిరసనగా మాజీ ఎంపీ హర్షకుమార్ దీక్షకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసేవరకూ దీక్ష విరమించేది లేదని చెప్పారు. రోజులు గడుస్తున్నా అమానుష దారుణానికి పాల్పడిన వారిని కాపాడేలా.. చంద్రబాబు సర్కార్‌ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

13:27 - June 28, 2017

ఢిల్లీ : ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ నామినేషన్‌ వేశారు. పార్లమెంటులో రాష్ట్రపతి ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. మీరాకుమార్‌ వెంట కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే ఎంపీ కనిమొళి తదితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరా కుమార్‌ 2009-14 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. 2004-2009 మధ్య ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ, పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసులో పనిచేసి, 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బీహార్‌లోని ససారం నుంచి ఓడిపోయారు. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. జులై 20 ఓట్లు లెక్కిస్తారు.

 

13:25 - June 28, 2017

ఖమ్మం : ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల దోపిడిపై ప్రజా సంఘాలు, వామపక్షా పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంద్భంగా ఖమ్మంలో జిల్లా విద్యా సదస్సును నిర్వహించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:24 - June 28, 2017

తూర్పు గోదావరి : జీఎస్టీని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర వ్యాపారులు పాటిస్తున్న బంద్‌ రెండో రోజుకు చేరుకుంది. హోల్‌సేల్‌ మార్కెట్ల, వస్త్రదుకాణాలు మూతపడ్డాయి. దీంతో దాదాపు 40 కోట్ల రూపాయాల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:22 - June 28, 2017

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణ మాఫీ ప్రకటనపై రైతుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తున్నాయి. నిజాయితీగా అప్పులు చెల్లించే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమకు జరిగిన అన్యాయాన్ని మాజీ కేంద్ర వ్యవసాయమంత్రి శరద్‌ పవార్‌తో రైతులు మొరపెట్టుకున్నారు. లక్షా 50 వేల వరకూ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిజాయితీగా రుణాలు చెల్లించిన రైతులకు 25 శాతం బోనస్‌ ప్రకటించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము 3 లక్షల వరకు బ్యాంకులకు రుణాలు చెల్లిస్తే...ప్రభుత్వం 25 వేల బోనస్‌ ప్రకటించడంపై మండిపడుతున్నారు. అసలు రుణాలే చెల్లించని రైతులకు లక్షా 50 వేలు మాఫీ చేస్తోందని శరద్‌ పవార్‌కు తెలిపారు. తమ బోనస్‌ను 50 వేల నుంచి లక్షా 50 వేలకు పెంచాలని రైతులు డిమాండ్‌ చేశారు.

 

 

తిరుపతి పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కొడుకు

తిరుపతి :ఓ నిత్య పెళ్లి కొడుకు తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నాడు.తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని నాగభూషణం మూడో భార్య పోలీసులను ఆశ్రయించింది. 4 పెళ్లిళ్లు చేసుకున్నాడని నాగభూషణం భార్య ఆరోపిస్తుండగా నాగభూషణం మాత్రం నేను 3 పెళ్ళిళ్లు చేసుకున్నాని వాదిస్తున్నాడు.

13:20 - June 28, 2017

హైదరాబాద్ : జంగుసైరన్‌ మోగుతోంది. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా 200లకు పైగా ప్రజా, సామాజిక సంఘాలు ఐక్యవేదికను ఏర్పాటు చేసుకోనున్నాయి. జూలై 4న హైదరాబాద్‌ వనస్థలిపురంలో ప్రజాసంఘాలు, సామాజిక సంస్థల ఐక్యవేదిక ఆవిర్భావసభ నిర్వహించనున్నారు. దీనికోసం ఈనెల 20నే వేదిక సన్నాహక సమావేశం జరిగింది. టీమాస్‌పేరుతో ఏర్పాటు కానున్న ఐక్యవేదిక, తెలంగాణలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం కృషి చేయనుంది.

కులవివక్షకు వ్యతిరేకంగా పోరు
రాష్ట్రంలో కులవివక్షకు పేదవర్గాలు బలవుతున్నాయని ఐక్యవేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ లపై దురహంకార దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం వేడుక చూస్తోందని నాయకులు మండిపడుతున్నారు. అణగారిన వర్గాల తరపున గళం వినిపించడానికి ఐక్యవేదిక ఏర్పాటు చేశామంటున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా పాలన లేదని .. టీఆర్‌ఎస్‌పార్టీ ఎన్నికల హామీల్లో ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3ఎకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య , కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, లక్ష ఉద్యోగాల భర్తీ లాంటి హామీల్లో ఏ ఒక్కటీ పూర్తికాలేదని టీమాస్‌ వేదిక ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వీటితోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగ సమస్యలపై గళం విప్పుతామంటోంది సామాజిక ఐక్యవేదిక. టీమాస్‌ వేదికలో ప్రజాకవి గద్దర్‌, విమలక్కతోపాటు వివిధ ప్రజాసంఘాలు భాగస్వాములు కానున్నాయి. ఇంతకాలం విడివిడిగా ప్రజాసమస్యల పరిష్కార కోసం పోరాడుతున్న సంఘాలు, సంస్థలు ఇపుడు ఏకత దిశగా చేతులు కలుపుతున్నాయి. వేదిక లక్ష్యాలకు అనుగుణంగా కలిసివచ్చే అందరినీ కలుపుకుని పోరుబాటన సాగాలని టీమాస్‌ ఫోరమ్‌ నిర్ణయించింది. 

అనధికారికంగా ఉన్న బోరుబావులపై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ లో అనధికారికంగా ఉన్న బోరుబావులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది ఆజాద్ హెచ్ ఆర్సీని ఆశ్రయించారు. హెచ్ ఆర్సీ విచారణకు స్వీకరించింది. 2002 వాల్టా చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో ఆజాద్ పేర్కొన్నారు.

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో నారా లోకేష్ భేటీ

ఢిల్లీ : కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ అభివృద్ధి పై చర్చిస్తున్నట్లు సమాచారం.

అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి కమిటీ

విజయవాడ : అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వంతో సమన్వయంతో కోసం కమిటీ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షుడిగా 5గురు సభ్యులతో కమిటీ వేశారు. అభివృద్ధి విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో 6నెలలకోసారి స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది.

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీల అవస్థలు...

నాగర్ కర్నూలు : జిల్లా ప్రభుత్వాస్పత్రిలో గర్భిణీలు అవస్థలు పడుతున్నారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యులు లేకపోవడంతో సిజేరియన్లు ఆగిపోయాయి. చిన్న గైనకాలజిస్టులు లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. దీంతో గర్భిణీల బంధువులు ఆందోళనకు దిగారు.

మంచాల తహశీల్దార్ కార్యాలయం తమ్మినేని ధర్నా

రంగారెడ్డి : మంచాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రంగాపూర్ లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

హౌసింగ్ గ్రాంట్ వెంచర్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్: హౌసింగ్ గ్రాంట్ వెంచర్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి మంత్రులు ఈటెల, మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.

జీఎస్టీతో చిత్ర సీమ పై మరింత ఆర్థిక భారం:సురేష్ బాబు

హైదరాబాద్: మంత్రి తలసానితో నిర్మాత సురేష్ బాబు, సి. కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ సినీ పరిశ్రమ పై జీఎస్టీ ప్రభావంపై చర్చించారు. జీఎస్టీ పై ప్రభుత్వం సరైన నిర్ణయ తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ ప్రభుత్వానికి ఎంటర్ టైన్ మెంట్ పన్ను చెల్లిస్తున్నామని, తాజాగా జీఎస్టీతో చిత్ర సీమ పై మరింత ఆర్థిక భారం పడుతుందని, భవిష్యత్ లో సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని సురేష్ బాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ భవనాల డిజైన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ప్రభుత్వ భవనాల డిజైన్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ సీఆర్డీఏ , ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.

విశాఖ ఏజెన్సీలో విషజ్వరాలపై హెచ్ ఆర్సీ లో ఫిర్యాదు

హైదరాబాద్: విశాఖ ఏజెన్సీలో విషజ్వరాలపై హెచ్ ఆర్సీ కి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఫిర్యాదు చేశారు. వచ్చే నెల 13 లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శికి హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది.

12:10 - June 28, 2017

హైదరాబాద్ : శిరీష ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రాజీవ్, శ్రవణ్ లు పోలీసులు చంచల్ గూడ జైలు కు తరలించారు. నాంపల్లి కోర్టు వీరికి ఈనెల 30 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జడ్జీ వారిని మీ పై తర్డ్ డీగ్రీ ప్రయోగించారా అన్న ప్రశ్నకు వారు లేదని సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

ఇద్దరు చిన్నారుల హత్య కేసులోతల్దిండ్రులు అరెస్టు

తూ.గో :సామర్లకోట లో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో పోలీసులు తల్దిండ్రులను అరెస్టు చేశారు. నిందితులు విజయనగరం జిల్లాల పార్వతీపురం వాసులు.

11:40 - June 28, 2017

రజనీకాంత్..ఎప్ప్పుడు రాజకీయాల్లో వస్తాడు...పార్టీ పెడుతాడా లేక ఏదైనా పార్టీ లో చేరుతాడా  ? ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల మనస్సులో మెదలుతున్నాయి. జయ మరణం తరువాత రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెల్సిందే. ఈ తరుణం లో రజని రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తు రజని అభిమాన సంఘాలతో భేటీలు నిర్వచించారు. వరుసగా జరిగిన ఈ భేటీల అనంతరం కూడా రజని రాజకీయంఫై ఎలాంటి ప్రకటనలు రాలేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో రజని భేటీ అయ్యారని సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'కాలా' షూటింగ్ నిమిత్తం ముంబైలో రజని ఉన్నట్లు తెలుసుతోంది. ఈ నేపథ్యం లో అమితాబ్ తో పాటు మరికొంతమందితో రజని భేటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. 

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ విఫలం:పొన్నం

కరీంనగర్ : డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేసీఆర్ విఫలం అయ్యారని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్న ప్రభాకర్ విమర్శించారు. 2,66,366 ఇళ్లను మంజూరు చేసి 1,708 మాత్ర నిర్మించారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఖర్చు చేసింది. 214 కోట్లు మాత్రమేనని, కేంద్రం ఇచ్చిన రూ.975 కోట్ల నిధులను ఎందుకు ఖర్చు చేయలేనది ప్రశ్నించారు. ఇరిగేషన్ కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందం చేసుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం జరుగుతోందని పొన్నం ఆరోపించారు. కేంద్రం నిధులపై బిజెపి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇందిరమ్మ గృహాల్లో నివసిస్తున్న వారిని పశువులతో పోల్చడం కోర్టుల, ధర్మపురి ఎమ్మెల్యేల అహంకారానికి నిదర్శనమన్నారు.

విశాఖ భూస్కాం పై సిట్ విచారణ ప్రారంభం

విశాఖ భూస్కాం పై సిట్ విచారణ ప్రారంభం అయ్యింది. నేటి నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభం అవుతుందని సీపీ యోగానంద్ పేర్కొన్నారు. గడువులోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. భూ ఆక్రమణలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదు లకోసం కలెక్టరేట్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, వాట్సాప్, ఈ మెయిల్, వెబ్ సైట్ టోల్ ప్రీ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని సీపీ పేర్కొన్నారు. అంతే కాకుండా బాధితులు నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని కూడా పేర్కొన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన మీరా కుమార్

ఢిల్లీ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, 17 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

శ్రీనగర్ లో పోలీసుల అదుపులో ముగ్గురు హురియత్ నేతలు

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ముగ్గురు హురియత్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ముగ్గురు హురియత్ నాయకులను ఢిల్లీలో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. వీరు ఇచ్చిన సమాచారంతోనే వీరిని పట్టున్నట్లు సమాచారం.

11:25 - June 28, 2017
11:19 - June 28, 2017

మహేష్ బాబు ఏడో స్థానంలో నిలిచాడు.  ఏడో స్థానం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? టైమ్స్ మోస్ట్ డిజరబుల్ మెన్ జాబితా లో మహేష్ మళ్ళీ చోటు సంపాదించుకున్నాడు. కానీ గత ఏడాది ఒక సంఖ్య తగ్గించుకొని ఏడో స్థానములో నిలిచాడు. 2016 లో దక్షిణాది నుండి టాప్ టెన్ లో నిలిచిన ఏకైక వ్యక్తి కూడా మహేష్ కావడం విశేషం. తొలిస్థానములో మిస్టర్ ఇండియా 2015 టైటిల్ దక్కించుకున్న రోహిత్ కాంధేవాల్ నిలవగా తరువాతి స్థానాలు కోహ్లీ, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్..ఇతరులు నిలిచారు. ఎనిమిదో స్థానం లో మోడల్ జితేష్ కుమార్, తొమ్మిదో స్థానం లో డాల్జిత్ చోటు సంపాదించారు. ఇక 'బాహబలి' సినిమాతో పేరు సంపాందించుకున్న 'ప్రభాస్', రానా లు కూడా రెండెంకల స్థానం లో నిలిచారు. ప్రభాస్ 22 , రానా 24 స్థానములో నిలిచారు. 

11:07 - June 28, 2017

చిత్తూరు : తిరుమల దేవస్థానంలో వచ్చే నెల7 నుంచి శుక్ర, శని, ఆదివారల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేయనున్నారు. కాలినడక భక్తులకు ఇస్తున్న ఉచిత అడ్డూల విధానం కొనసాగించనున్నారు. నడక దారిన భక్తులు ఎక్కువగా రావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

 

 

ముంబై వరుస పేలుళ్ల కేసు నిందితుడికి అస్వస్థత

హైదరాబాద్ : ముంబై 1993 వరసు పేలుళ్ల కేసు నిందితుడికి అస్వస్థత అయ్యింది. నిందితుడు ముస్తఫా దోస్సాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముస్తఫా గుండె నొప్పి, ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు.,

విశాఖ ఏజెన్సీ లో పూనం మాలకొండయ్య పర్యటన

విశాఖ ఏజెన్సీ: పాడేరులో రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఏజెన్సీలో ప్రబలిన ఆంత్రాక్స్, మలేరియా, డయేరియా తదితర వ్యాధులపై మాలకొండయ్య అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

హర్షకుమార్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం

తూ.గో : మాజీ ఎంపి హర్షకుమార్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం అయ్యింది. దళితుల బహిష్కరణ ఘటనలో గరగపర్రు నిందితులను అరెస్ట్ చేయడం లేదని హర్షకుమార్ ఆమరణ దీక్ష చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసు హర్షకుమార్ ఇంటి వద్ద భారీ మోహరించారు.

వెనిజులా సుప్రీం కోర్టు పై గ్రనేడ్ల దాడి..

హైదరాబాద్: వెనిజులా సుప్రీం కోర్టు భవనంపై మంగళవారం గ్రనేడ్ల దాడి జరిగింది. వెనిజులా పోలీసు శాఖకు చెందిన హెలికాప్టర్‌ సుప్రీంకోర్టు భవనంపై గ్రనేడ్లను విసిరింది. అయితే ఈ ఘటనను ఉగ్రదాడిగా భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో తెలిపారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో మంగళవారం నికోలస్‌ జర్నలిస్ట్‌లతో లైవ్‌లో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని నికోలస్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అయ్యింది. జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఉగ్రదాడులు జరగవచ్చనే సమాచారంతో భద్రతను పటిష్టం చేశారు.

10:24 - June 28, 2017

ఢిల్లీ : విపక్షాల అభ్యర్థి మీరాకుమారి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ పార్టీ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అర్జేడీ అధ్యక్షుడు లలూప్రసాద్ యాదవ్ సహా 17 పార్టీల నేతలు హాజరు కానున్నారు. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నాల్గవ సెట్ నామినేషన్ వేయనున్నారు.

 

ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ

ఢిల్లీ: మూడు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ చేరుకున్నారు. పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్‌లో మోడీ పర్యటించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ స్వాగతం పలికారు.

గిరిజనులకు ఆంత్రాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ

విశాఖ : కేజీహెచ్ లో చికిత్స పొందుతన్న గిరిజనులకు ఆంత్రాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వ్యాధి బారిన పడిన వారిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మాజీ ఎంపి హర్షకుమార్ ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు

తూ.గో : మాజీ ఎంపి హర్షకుమార్ ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హర్ష కుమార్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దళితుల బహిష్కరణ ఘటనలో గరగపర్రు నిందితులను అరెస్ట్ చేయడం లేదని ఆమరణ దీక్షకు హర్షకుమార్ సిద్ధమయ్యారు.

ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన

అమరావతి : ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఏపీ భవన్ లో ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ భేటీఅ య్యారు. ఏపీ ని మొబైల్ హబ్ గా మార్చేందకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చిస్తున్నట్లు సమాచారం. రేణిగుంట ఎలక్ర్టానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తో అదనంగా మరికొన్ని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను ఏపీకి తీసుకురావడం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

10:16 - June 28, 2017

సిద్దిపేట : కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య పై డీజీ గోపికృష్ణ డీజీపీ అనురాగ్ శర్మ కు నివేదికను అందించారు. శిరీష ఆత్మహత్య ఒత్తిడికి గురై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకునట్టు నివేదికలో స్పష్టీకరణ చేశారు. ప్రభాకర్ రెడ్డి పై ఎలాంటి శాఖాపరమైన ఒత్తిళ్లు లేవని, ప్రభాకర్ రెడ్డికి ఒక్క చార్జి మెమో కూడా జారీ చేయలేదని విల్లడించారు. అధికారులు ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్ ల మధ్య జరిగిన కాల్ డేటాను నివేదికలో పొందుపరిచారు. డీసీపీ గిరిధర్ వేధింపులు వాస్తవం కాదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. పూర్తి వివరలకు వీడియో చూడండి.

టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో దారుణం

హైదరాబాద్: టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఇమ్రాన్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ప్లాటినం బ్లేడులతో చాంద్, బషీర్ ఇమ్రాన్ గొంగు కోసి పరారయ్యారు.. ఇమ్రాన్ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందుతలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శ్రీవారి దివ్యదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

తిరుమల: శ్రీవారి దివ్యదర్శనం టోకెన్ల జారీలో మార్పులు జరిగాయి. కాలికడ భక్తుల రద్దీ పెరగడంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలినడక భక్తుల ఉచిత్త లడ్డూలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. జులై 7 నుంచి వారంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాలలో దివ్యదర్శనం టోకెన్లు జారీ నిలిపివేస్తామని జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.

శిరీష ఆత్మహత్యతో ఒత్తిడికి గురై ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య

హైదరాబాద్: కుకునూరుపల్లి ఎస్పై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఘటనపై అదనపు డీజీ గోపీకృష్ణ డీజీపీకి నివేదిక అందించారు. శిరీష ఆత్మహత్యతో ఒత్తిడికి గురై ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి పై ఎలాంటి శాఖాపరమైన ఒత్తిళ్లు లేవని, ఒక్క చారిమెమో కూడా జీ చేయలేదని గోపీకృష్ణ వెల్లడించారు. శిరీష ఆత్మహత్య చేసుఉన్న రోజు ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్ ల మధ్య జరిగిన కాల్ డేటాను నివేదికలో అధికారులు పొందుపరిచారు. డీజీపీ గిరిధర్ వేధింపులు వాస్తవం కాదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చారు.

10:04 - June 28, 2017

హైదరాబాద్ : శిరీష్ ఆత్మహత్య కేసు రాజీవ్, శ్రవణ్ ల పోలీసుల కస్టడీ ముగిసింది. వారిని నాంపల్లి కోర్టు హాజరుపరిచారు. మరి కొన్ని రోజుల పోలీసు కస్టడీకి పోలసులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడిండి. 

నాంపల్లి కోర్టు కు రాజీవ్, శ్రవణ్

హైదరాబాద్: బంజారాహిల్స్ పీఎస్ నుంచి రాజీవ్, శ్రవణ్ లను నాంపల్లి కోర్టుకు తరలించారు. మూడో అదనపు జడ్జి ఎదుట వారిని పోలీసులు ప్రవేశ పెట్టారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. అవసరం అయితే మరోసారి రాజీవ్, శ్రవణ్ ల కస్టడీ కోరుతూ పిటీషన్ వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజీవ్ శ్రవణ్ ల తరపున బెయిల్ పిటీషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ-విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

అమరావతి: ఢిల్లీ-విజయవాడ ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. ఉదయం 6:15 గం.లకు ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం 20 నిమిషాల్లోనే తిరిగి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయింది. విమానంలో పలువురు ఎంపీలు, ప్రముఖులు, అధికారులు ఉన్నట్లు సమాచారం.

09:53 - June 28, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల వ్యవహారం.. మంత్రి కేటీఆర్‌కు, సామాన్యులకు మధ్య ట్విట్టర్‌ వార్‌కు కారణమైంది. మా ఆసుపత్రులన్నీ ఫైవ్‌ స్టార్‌ లెవెల్లో ఉన్నాయన్న కేటీఆర్‌ ట్వీట్‌కు.. నాగర్‌కర్నూల్లో గర్భిణికి వైద్యం అందించలేనందుకా అంటూ సామాన్యుడొకరు రీట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో కాస్త దూకుడుగానే ప్రతిస్పందించారు.

కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల తీరుతెన్నులపై సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో ఆసక్తికరమైన వార్‌ జరిగింది. తమ పాలనలో సర్కారు దవాఖానాలు వెలిగిపోతున్నాయంటూ.. మంత్రి కేటీఆర్‌, కొత్తహంగులు సమకూర్చుకున్న కింగ్‌కోఠి, మలక్‌పేట ఆసుపత్రుల ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి వైద్యరంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్నారని ప్రశంసించారు.

సామాన్యుడి రీ ట్వీట్
మంత్రి కేటీఆర్‌ ఇలా ట్వీట్‌ చేశారో లేదో.. నాగర్‌కర్నూలు జిల్లా దవాఖానాలో గర్భిణులకు వైద్యం అందని వైనం వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు లేరని, మహబూబ్‌నగర్‌కు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీనిపై గర్భిణుల బంధువులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఉదహరిస్తూ.. ఓ నెటిజన్‌ కేసీఆర్‌ ట్వీట్‌కు ప్రతి ట్వీట్‌ చేశారు.

ఎందుకని ద్వేషం కేటీఆర్
దీనికి సంబంధించిన కేటీఆర్‌.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అంత ద్వేషం ఎందుకని ప్రశ్నిస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ల వార్‌ కొనసాగుతున్న తరుణంలోనే, నాగర్‌కర్నూలు జిల్లా వైద్యాధికారి విధులకు హాజరుకాకుండా, తన సొంత ఆస్పత్రిలో, డబ్బులకు వైద్యం చేస్తూ తీరక లేకుండా గడిపేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నల్లమల అటవీ ప్రాంతాలైన అచ్చంపేట ,కొల్లాపూర్‌ పరిసర గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు నాగర్‌కర్నూలు ఆస్పత్రికి వస్తుంటారు. రాజధాని హైదరాబాద్‌లోని ఒకటిరెండు ఆస్పత్రులను చూపిస్తూ మురిసిపోకుండా.. మారుమూల ప్రాంతాల వైద్యశాలలపైనా దృష్టిపెట్టాలని జనం కోరుకుంటున్నారు. 

09:43 - June 28, 2017

మేడ్చల్ : జిల్లాలోని షామీర్ పేట లో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి తో సహా కొడుకు, కూతరు చెరువులో దూకారు. కూతురు మృతదేహం వెలికితీత, తండ్రి, కొడుకు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు హైదరాబాద్ రసూల్ పురా వాసులుగా గుర్తించారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

09:33 - June 28, 2017

ప్రభాస్..ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న నటుడు. ఆయన నటించిన 'బాహుబలి'..’బాహుబలి2’ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది. ఈ సినిమాల కోసం 'ప్రభాస్' సంవత్సరాల తరబడి పనిచేశారు. ఆయన నటనా ప్రతిభకు జాతీస్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన తాజాగా 'సాహో' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు రావడం లేదు కానీ ఇతర విషయాలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో 'ప్రభాస్' ను నటింప చేయాలని పలువురు దర్శక..నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్. తాజాగా తమన్నా..భూమిక..ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'ఖామోషీ' చిత్రంలో 'ప్రభాస్' ను నటింప చేయాలని అనుకున్నట్లు టాక్. ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. బి టౌన్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమా ? కాదా ? అనేది తెలియాల్సి ఉంది.

09:24 - June 28, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ 'అమీర్ ఖాన్' సాహసాలు చేయడంలో ముందుంటాడు. ఆయన నటించే పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడని ఆయన చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. తాజాగా మరొక సాహసం చేశాడు. ఆయన ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘అమీర్' ఇటీవలే నటించిన 'దంగల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాత్రల కోసం సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు..మరో పాత్ర కోసం ఏకంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్పినా 'అమీర్' వినకుండా సాహసం చేసి భళీరా అనిపించాడు. తాజాగా ఆయన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఆయన ఏకంగా ముక్కు..చెవులు కుట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చెవులు కుట్టించుకోవడంతో 'అమీర్' నొప్పి భరించలేకపోయాడని టాక్. మరి ఆయన పాత్ర ఎలా ఉండనుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

09:19 - June 28, 2017

 

గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాల ప్రజలు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తమ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ను మరో చోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్వాఫుడ్‌ పార్క్‌ను నిర్మించవద్దని వేడుకున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ను నిర్మిస్తే తమ ప్రాంత డ్రెయిన్లు కలుషితమవుతాయని... వేలాదిమంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనను తాము అంగీకరించబోమని సీఎంకు తేల్చి చెప్పారు.

ఓపిగ్గా విన్నా చంద్రబాబు
పశ్చిమ గోదావరి ప్రజల కష్టాన్ని చంద్రబాబు ఓపిగ్గా విన్నారు. పూర్తి అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని వారికి నచ్చజెప్పారు. ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమో.. లేక కొందరి ప్రయోజనాల కోసమో ప్రభుత్వం పనిచేయడంలేదన్నారు. ప్రజలకోసమే తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందన్నారు. పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నామనే భావన వస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు రారని..అలాంటి సంకేతాలు ఇవ్వకుండా చూడాలన్నారు. పరిశ్రమలు వద్దంటే నష్టపోయేది రాష్ట్రప్రజలేనని...ఎవరికీ ఇబ్బంది రాకుండా చూస్తామని హామీనిచ్చారు.ప్రజల అభిప్రాయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌పై త్వరలోనే చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. మొత్తానికి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటుపై ప్రజల్లో రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాన్ని అడ్డుకునేందుకు సిద్దమవుతున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. 

09:18 - June 28, 2017

విశాఖ : జిల్లాలో నర్సీపట్నం శివారులో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.20 ఉంటుందని అధికారులు అంచన వేశారు. పోలీసులు లారీలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు ఉత్తర్ ప్రదేశ్ చెందిన వారిగాగుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

09:00 - June 28, 2017

'శనగపప్పు'కు అరుదైన గౌరవం దక్కడం ఏంటీ ? అని నోరెళ్ల పెడుతున్నారా ? కానీ ఇది రియల్.. 'శనగపప్పు'కి అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ప్రతిష్టాత్మకంగా 'ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ'లో చోటు దక్కించుకుంది. ఆరోగ్యరీత్యా శనగపప్పులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇది మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. ప్రతి వంటకాల్లో పోపులో వాడడం..దీనితో ఇతర వంటకాలు పప్పు..వగైరా చేసుకుంటూ ఉంటాం..అయితే ఇంగ్లీషును మరింత విస్తృత పరిచేందుకు ప్రజల నోళ్లలో నానుతున్న ప్రాముఖ్యత సంపాదించిన పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేరుస్తూ ఉంటుంది. ఇందుకు తాజా పరిణామాలు..జీవనశైలి...విద్యారంగం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. త్రైమాసిక నవీకరణలో భాగంగా ఆక్స్ ఫర్డ్ 600కు పైగా కొత్త పదాలను సేకరించింది. అందులో శనగపప్పు (చనా దాల్) కూడా చేర్చింది. దీనితో పాటు టెన్నిస్ సంబంధమైన 'ఫోర్స్ డ్ ఎర్రర్' ఆరు గేముల స్కోరును తెలిపే 'బేగల్' ను కూడా చేర్చింది.

08:47 - June 28, 2017

సినిమా : ఓ స్టార్ హీరోయిన్ మొబైల్ లేకుండా వారం రోజుల పాటు గడిపారు. ఆ హీరోయిన్ షూటింగ్ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో ఫోన్ లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఎవరంటే ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం 1985 షూటింగ్ లో ఉన్న హీరోయిన్ సమంత సినిమా షూటింగ్ కోసం రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగింది. కనీస వసతులు కూడా లేని ఈ ప్రాంతంలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో సమంత ఎలాంటి కంప్లెంట్ చేయకుండా షూటింగ్ చేశారు.

షూటింగ్ లొకేషన్ లో సమంత స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా షూటింగ్ కు సంబంధించి సమంత చేసిన ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. '' వారం పాటు ఫోన్ లేకుండా..అంత ఇబ్బందిగా లేదు..నేను మరోసారి కూడా ఇలా ఉండగలను..!'' అంటూ ట్వీట్ చేసింది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలన్ని అక్టోబర్ లోపు పూర్తి చేసి నాగచైత్యనతో పెళ్లికి రెడీ అవుతోంది. 

08:45 - June 28, 2017

హైదరాబాద్ : నిజాంపేట లో నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేశారు. హాస్టల్ గేట్ తాళం వేసి రెండు మూడు అంతస్తుల్లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. పోలీసులను లోపలికి రానివ్వకుండా 50 మంది విద్యార్థులు మెయిన్ గేట్ తాళం వేసి నిలుచున్నారు. ఔటింగ్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలస్తోంది. దీని కాలేజీ యాజమాన్యం ఎటుంటి ఫిర్యాదు రాలేదు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:44 - June 28, 2017

 

హైదరాబాద్ : రాజీవ్, శ్రవణ్ ల రెండు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. నేటి ఉదయం 10గంటలకు రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు చంచల్ గూడ్ జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం సీన్ రీకనస్ట్రక్షన్ పేరుతో రాజీవ్,
శ్రవణ్ లను పోలీసులు కుకునూరుపల్లికి తీసుకెళ్లారు. అక్కడ వారిని అరగంట పాటు విచారించారు అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లకుండా హైదరాబాద్ తిరిగి వచ్చారు. రాత్రి పొద్దుపోయేవరకు పోలీసుల వారిని విచారించారు. అర్థరాత్రి ఉస్మానియాలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

08:31 - June 28, 2017

వస్త్రపరిశ్రమ పై జీఎస్టీ పన్ను వేయడం మంచిది కాదని, కాని అవసరాల అయిన వస్త్రం పై పన్ను వేయడం దారుణమని, దీంతో నేతన్నల ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉందని, జీఎస్టీలో ఆరు కేటగిరిలో ఉన్నాయి. జీరో శాతం, 5శాతం, 10 శాతం, 18శాతం, 28 శాతం ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. జీఎస్టీతో వస్త్రపరిశ్రమ పై పన్ను ఇబ్బందిగా ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు అన్నారు. జీఎస్టీ సామ్యానుడి కోసం తీసుకున్న నిర్ణయమని బీజేపీ నేత రాకేష్ రెడ్డి అన్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయలు తీసుకొని జీఎస్టీ తీసుకొచ్చారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:28 - June 28, 2017

ది హేగ్ : రెండు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి నెదర్లాండ్‌ దేశానికి వెళ్లారు. ఆమ్‌స్టర్‌డ్యాంలో ఆ దేశ ప్రధాని మార్క్‌రుట్టెతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలపై చర్చించుకున్నారు. ఆ తర్వాత సామాజిక భద్రత, వాటర్‌ కోపరేషన్‌, సంస్కృతి సహకారం వంటి అంశాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వాతావరణంలో మార్పు అంశంలో గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఇరువురు స్పష్టం చేశారు. పునర్వినియోగ శక్తులను అభివృద్ధి చేసుకునేందుకు పరస్పర సహకారం చేసుకుంటామన్నారు. మిసైల్‌ టెక్నాలజీకి కంట్రోల్‌ రెజిమ్‌లో సభ్యత్వం కోరిన భారత్‌కు మద్దతిచ్చినందుకు నెదర్లాండ్‌ ప్రధానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు.దేశ ఆర్థికాభివృద్ధిలో నెదర్లాండ్‌ తమకు సహజమైన భాగస్వామి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇప్పటికే చేసుకున్న ఒప్పందాల ప్రకారం వ్యాపారాన్ని ఇరు దేశాల మధ్య మరింత వేగంగా పరుగెత్తిస్తామని చెప్పారు. నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ... ఆ దేశ రాజదంపతులను కలుసుకున్నారు. ఐకెనోర్ట్స్‌లోని రాజనివాసంలో రాణి మాక్సిమా, రాజు విల్లెం అలెగ్జాండర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత నెదర్‌ల్యాండ్స్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. తన ప్రసంగంతో ప్రవాస భారతీయుల్లో ఉత్సాహం నింపారు.

08:20 - June 28, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలనపై తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తొలి విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రపై సమీక్ష నిర్వహించిన టీజాక్‌..మెదక్ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెబుతోంది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని ప్రభుత్వం చేస్తున్న ఆర్భాట ప్రకటనలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతనలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మెదక్ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా..స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారని వెల్లడించింది.

చిత్త శుద్దితో వ్యవహరించడం లేదు
రైతు సమస్యలపై ప్రభుత్వం చిత్త శుద్దితో వ్యవహరించడం లేదని, రుణమాఫీ పూర్తి అయినా..రైతులకు రుణాలు ఎందుకు అందడం లేదని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ప్రశ్నిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో...భూగర్భంలో పగుళ్లు ఉన్నాయని వాదిస్తోంది. ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే భవిష్యత్తులో భారీగా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై నిపుణులతో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని డిమాండ్ చేసింది.

అవినీతి పెరిగి పోయింది
ఇక రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెరిగి పోయిందని టీజాక్‌ ఆరోపిస్తోంది. నేతలు భూ అక్రమణాలు, ఇసుక దందాలు, కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రజా సమస్యలపై స్పందించడం లేదంటుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించింది. రాష్ట్రంలో పాలన మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామని టీజాక్ ప్రకటించింది.

07:58 - June 28, 2017

గుంటూరు : ఏపీ రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతుల నుంచి భూసేకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..రైతుల అభ్యంతరాలు తెలుసుకునేందుకు సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పెనుమాక రైతులతో సీఆర్‌డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. రైతుల అభ్యంతరాలను సీఆర్‌డీఏ అధికారులు నమోదు చేయకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి,స్థానిక రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆగ్రహించిన రైతులు టెంట్లు పడేసి.. కుర్చీలు విసిరేశారు. రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ఆర్‌కే, పెనమాక రైతులు అధికారులను అడ్డగించారు. దీంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది.

పోలీస్‌ స్టేషన్‌లో కేసులు
ఎమ్మెల్యే ఆర్కేతో పాటు రైతులపై తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి తన అనుచరులతో అడ్డుకున్నారంటూ పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్‌ రాధాకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యేపై 341, 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.పెనుమాక రైతులకు 3 నెలల క్రితమే సీఆర్డీఏ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే ఒకసారి సదస్సు నిర్వహించిన అధికారులు.. మంగళవారం మరోసారి అభ్యంతరాలపై సదస్సు ఏర్పాటు చేసారు. అయితే రైతుల అభ్యంతరాలను అధికారులు మినిట్‌ బుక్‌లో రాసుకోకపోవడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పై అధికారుల సూచనల మేరకే.. అభ్యంతరాలను తీసుకోలేమని అధికారులు చెప్పారు. ఏదయినా ఉంటే వినతిపత్రం రూపంలో ఇవ్వాలని అధికారులు చెప్పడంతో రైతులు భగ్గుమన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఆర్కేతో పాటు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై వైసీపీ నేతలు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

06:59 - June 28, 2017

జీఎస్టీ పన్ను తో బీడీ పరిశ్రమ మరింత దిగజారిపొతుందని, ఇప్పటికే బీడీ పరిశ్రమ సంక్షోభంలో ఉందని, బీడీ పరిశ్రమ పై ప్రత్యేక్షంగా, పరోక్షంగా 3 కోట్ల మంది ఆధారపడ్డరని, తెలంగాణలో బీడి పరిశ్రమ 1901లో మొదలైందని, తెలంగాణలో బీడీ పరిశ్రమతో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలంగాణ బీడి కార్మిక యూనియన్ నాయకులు సిద్ది రాములు గారు తెలిపారు. యూపీఎ ప్రభుత్వం బీడీ కట్టల పై పుర్రె గుర్తు తీసుకోస్తే పోరాటం చేసి దాన్ని తొలగించేల చేశామని వారుత అన్నారు. ఇప్పడు బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమను నిర్విర్యం చేయాడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

నేడు జమ్మూకాశ్మీర్ లో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పర్యటన

జమ్మూకాశ్మీర్ : నేడు కాశ్మీర్ లోర ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. 

నేడు మీరాకుమారి రాష్ట్రపతి అభ్యర్తిగా నామినేషన్

ఢిల్లీ : నేడు ఉదయం 11గంటలకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమారి నామినేషన్ వేయ్యానున్నారు. 

తూర్పు గోదావరి లో మంత్రి కామినేని పర్యటన

తూర్పు గోదావరి : నేడు జిల్లాలోని చింతూరు, రంపచోడవరంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు పర్యటించనున్నారు.

స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు సన్మాన కార్యక్రమం

విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 

చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం

గుంటూరు : నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడితో టీ టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జిల్లాల కార్యవర్గం తుదిరూపంపై చర్చించనున్నారు. 

నెదర్లాండ్ లో ప్రధాని మోడీ పర్యటన

దహేగ్ : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. పాస్ పోర్టు రంగు మారింత మాత్రన మన రక్తం రంగు మారదని అన్నారు.

నిజాంపేట ఓ కళాశాల విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: నిజాంపేట లోని ఓ ప్రైవేట్ కశాశాల విద్యార్థులు హాస్టల్ గేట్ కు తాళాలు వేసి 3ఫ్లోర్లలోని ఫర్నిచర్, లైట్లను ధ్వంసం చేశారు. హాస్టల్ స్టాఫ్ ను రూంలో బంధంచారు.

Don't Miss