Activities calendar

29 June 2017

21:34 - June 29, 2017

ఢిల్లీ : స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న జిఎస్‌టి జులై 1 నుంచి అమలు కానుంది. జిఎస్‌టితో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కానుంది. ఈ పన్ను సంస్కరణ వల్ల జిడిపి 1.5 నుంచి 2 శాతానికి పెరిగే అవకాశముంది.జిఎస్‌టి అమలు వల్ల సామాన్యులకు కొంత లాభం...కొంత ఖేదం అన్నట్టుగా ఉంది. బియ్యం, గోధుమలు, పప్పలు, కూరగాయలు, పళ్లు, పాలు లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను నుంచి మినహాయించారు. చికెన్‌, ఆయిల్‌, భుజియా, వెన్న తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పెరుగు, పనీర్, చాక్లెట్, ఐస్‌క్రీం, చిప్స్‌, బిస్కట్స్, వెన్న, టీ, కాఫీ, మసాలా పౌడర్, లాంటి వాటి ధరలు 1 నుంచి 5 శాతం వరకు పెరగనున్నాయి.

భోజనం చేయాలనుకుంటే జేబుకు చిల్లే...
కుటుంబంతో కలిసి సరదాగా హోటల్‌ కెళ్లి భోజనం చేయాలనుకుంటే జేబుకు చిల్లు పడ్డట్టే. ప్రతి యేటా 75 లక్షలు టర్నోవర్‌ చేసే రెస్టారెంట్లపై 5 శాతం జిఎస్‌టి విధించారు. ఏసీ లేని రెస్టారెంట్లలో భోజనం చేస్తే ఇంతకు ముందు 6 శాతం వ్యాట్‌ ఉండేది. ఇపుడది 12 శాతానికి పెరిగింది. ఏసీ హోటళ్లలో 18 శాతం జిఎస్‌టి విధించారు. అందంగా మేకప్‌ వేసుకుని ఫంక్షన్‌ వెళ్లడం కూడా ఇపుడు ఖరీదే...బ్యూటీ పార్లర్లపై కూడా పన్ను పెరగనుంది.టెలిఫోన్‌ బిల్లులపై టాక్స్‌ను 15 శాతం నుంచి 18 శాతం పెంచడం వల్ల బిల్లు మరింత మోగనుంది. స్మార్ట్‌ ఫోన్ల ధరలు మాత్రం తగ్గనున్నాయి.ఇల్లు, కారు, లగ్జరీ వస్తువులపై పన్ను 15 నుంచి 18 శాతానికి పెంచడం వల్ల కొనేవారిపై భారం పడనుంది. చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి.

చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి...
ఇంతకు ముందు వీటిపై 40 శాతం టాక్స్‌ ఉంటే...ఇపుడు 29 శాతం జిఎస్‌టి విధించారు. ఇక లగ్జరీ కార్ల ధరను మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ప్రస్తుతం 43 శాతం పన్ను ఉండగా 46 శాతానికి పెంచారు. అలాగే టూ వీలర్స్‌ ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఇంతకు ముందు వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 30 శాతం పన్ను ఉండగా...ఇపుడు జిఎస్‌టి 28 శాతానికి తగ్గించారు.విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ధరలు కొంచెం తగ్గనున్నాయి. ప్రస్తుతం 5.60 శాతం పన్ను ఉండగా 5 శాతానికి తగ్గనుంది. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర మాత్రం భారీగా పెరగనుంది. 8.40 శాతం టాక్స్‌ నుంచి జిఎస్‌టి 12 శాతానికి పెరగనుంది.వెయ్యి రూపాయల లోపు దుస్తుల ధరలపై టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. వెయ్యి దాటే కాస్ట్‌లీ డ్రెస్‌లపై 8 నుంచి 12 శాతం జిఎస్‌టి విధించారు.

ప్రాపర్టీపై స్టాంపు డ్యూటీ ఎప్పటిలాగే ఉంటుంది. కానీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాపర్టిని కొంటే 12 శాతం జిఎస్‌టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది 6 శాతం ఉండేది.

ఆరోగ్యం, విద్య సేవలకు పన్ను నుంచి మినహాయింపు
ఆరోగ్యం, విద్య లాంటి సేవలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. మందుల ధరలపై టాక్స్‌ను 14 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. పొగాకు, మద్యం, పెట్రోల్‌లకు టాక్స్‌ నుంచి విముక్తి కల్పించారు. ఆయా రాష్ట్రాలే వీటిపై పన్ను నిర్ణయించనున్నాయి.జులై 1 నుంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు సంబంధించివన్నీ తగ్గనున్నాయి. సినిమా, థియేటర్‌, కేబుల్, డిటిహెచ్‌ సర్వీసులపై 18 శాతం జిఎస్‌టి విధించనున్నారు. ఇపుడు రాష్ట్రాలు విధిస్తున్న పన్ను కంటే ఇది తక్కువ.బ్యాంకింగ్‌ సేవలు మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ఇప్పటి వరకు 15 శాతం పన్ను ఉండగా...ఇపుడు 18 శాతం జిఎస్‌టి విధించారు. డిడి, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు, ఎండోమెంట్‌ పాలసీ, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరగనున్నాయి. రైలు టికెట్ల ధరలు కొద్దిగా పెరగనున్నాయి. సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఎసీ, ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు కొంచెం పెరుగుతాయి.కన్జూమర్‌ డ్యూరెబుల్‌ వస్తువులపై 26 శాతం టాక్స్‌ ఉండగా..అదనంగా మరో 2 శాతం జిఎస్‌టి పెరగనుంది.

 

21:28 - June 29, 2017

ఢిల్లీ : జూన్‌ 30న అర్ధరాత్రి 12 గంటలకు పార్లమెంట్‌ సెంట్రల్ హాలులో జరిగే జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాల్గొనడం లేదని కాంగ్రెస్‌ తెలిపింది. అర్ధరాత్రి కార్యక్రమం జరపడాన్ని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ తప్పు పట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. రాష్టప‌తి ప్రణబ్ హాజ‌రయ్యే ఈ ప్రత్యేక స‌మావేశంలో ప్రధాని మోదీ జీఎస్టీని ప్రారంభించ‌డం ఆయ‌న హోదాను త‌గ్గించ‌డ‌మే అవుతుంద‌ని కాంగ్రెస్ ఇంత‌కుముందు అభిప్రాయ‌ప‌డింది.

 

21:22 - June 29, 2017

గుంటూరు : జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా వనం-మనం పేరుతో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి సిద్దా రాఘవరావు, అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమాన్ని విస్తృత స్ధాయిలో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా కొండవీడు నుంచి ప్రారంభించే ఈ కార్యక్రమం కార్తీకమాసంలో నిర్వహించే వన మహోత్సవం వరకు నిరాటంకంగా కొనసాగనుంది. 

21:21 - June 29, 2017

హైదరాబాద్ : మజ్లిస్‌ పార్టీ నేత అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తీర్పు వెలువడింది. మొత్తం 15 మందికి గాను, న్యాయస్థానం, నలుగురిని దోషులుగా గుర్తించింది. కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌కు కోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై అభియోగాలను కొట్టేసింది.2011 ఏప్రిల్‌ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్‌-బాలాపూర్‌ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్ర గాయాలు కాగా, దాడికి పాల్పడ్డ 25ఏళ్ల ఇబ్రహీం బిన్‌ యూనుస్‌ యాఫై.. గన్‌మెన్‌ కాల్పుల్లో మృతిచెందాడు. అప్పట్లో ఈ కేసులో మొత్తం 15 మందిపై చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తర్వాత ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ పహిల్వాన్‌ సహా... హుస్సేన్‌ బిన్‌ ఒమర్‌, అబ్దుల్లా , అవద్‌ యాఫై, యూనుస్‌ బిన్‌ ఒమర్‌, ఈసా బిన్‌ యూనుస్‌, యహియా బిన్‌ యూనుస్‌, ఫైసల్‌ బిన్‌ అహ్మద్‌ , ఫజల్‌ బిన్‌ అహ్మద్‌ యాఫై , మునావర్‌ ఇక్బాల్‌ తోపాటు మహ్మద్‌ బిన్‌ సాలెహ్‌, హఫీఫ్‌ బిన్‌ యూనుస్‌ , సైఫ్‌ బిన్‌ యాఫై, మహ్మద్‌ అమెరుద్దీన్‌ లను అరెస్ట్‌చేశారు. అనంతరం వీరందరిపై అభియోగపత్రాలు కోర్టులో సమర్పించారు.

ఆరేళ్లపాటు విచారణ
నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో ఆరేళ్లపాటు విచారణ కొనసాగిన ఈ కేసులో నిందితులకు బెయిల్‌ రాకపోవడంతో అప్పటి నుంచి జైలుకే పరిమితం అయ్యారు. మొత్తం 86 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. ఏ2 నిందితుడు హసన్‌, ఏ3 అబ్దుల్లా, ఏ5 వాహిద్‌తోపాటు ఏ 12 నిందితుడు వహ్లాన్‌ లను దోషులుగా నిర్ధారించింది. ఈ న‌లుగురు దోషుల‌కు ప‌దేళ్లపాటు శిక్ష విధించింది. ఇప్పటికే వారు అనుభ‌వించిన ఆరేళ్లను మొత్తం శిక్షనుంచి మినహాయించింది. అయితే ప్రధాన నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

తప్పుదోవ పట్టించే ప్రయత్నం
అయితే ఈ కేసును కొందరు అధికారులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఎంబీటీ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. అప్పట్లో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌, ఏసీపీలు ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అసలు అక్బరుద్దీన్‌పై జరిగింది హత్యాయత్నం కాదని పహిల్వాన్‌కు అక్బర్‌కు ఉన్న వర్గపోరుతోనే ఆ సంఘటన జరిగిందన్నారు. ప్రస్తుతం కోర్టు తీర్పు కూడా తమ వాదనకు అనుకూలంగా ఉందని చెప్పారు.ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉంటోన్న వారిలో 10 మంది.. కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు దోషులకు శిక్షల ఖరారు నేపథ్యంలో పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 

21:14 - June 29, 2017
21:08 - June 29, 2017

ఢిల్లీ : జిఎస్‌టి అమలుకు రంగం సిద్ధమైంది. జూన్‌ 30న అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమలు కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖల్ని మార్చేసే జిఎస్‌టి ప్రారంభోత్సవానికి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్ వేదిక కానుంది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని కాంగ్రెస్‌, తృణమూల్‌ పార్టీలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ఉండగా ప్రధాని ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది.

ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కేంద్రం
జిఎస్‌టి అమలును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కేంద్రం-ఈ చట్టం అమలును అందరికీ గుర్తుండేలా అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదిక కానుంది. జూన్‌ 30న రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 గంటలు కాగానే పెద్ద గంటను మోగించి జిఎస్‌టి అమలును ప్రకటిస్తారు. అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమలులోకి వస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 1947, ఆగస్టు 15న అర్ధరాత్రి 'ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ' పేరిట సెంట్రల్‌ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం ఉండబోతోంది. జిఎస్‌టి అమలుతో దేశ వాణిజ్యంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. జిఎస్‌టి అమలుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయని, జూన్‌ 30 అర్థరాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు. జిఎస్‌టిపై గత ప్రభుత్వాలు కూడా ప్రధాన భూమికను పోషించినట్లు మంత్రి పేర్కొన్నారు.జిఎస్‌టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలు, జీఎస్టీ మండలి సభ్యులు హాజరు కానున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడలకు కూడా కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోది కీలక ప్రసంగం చేయనున్నారు. జిఎస్టీ ప్రచారకర్తగా బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ను ఎంపిక చేసింది. జిఎస్‌టి అమలులో భాగంగా షార్ట్‌ ఫిలిం ప్రదర్శించనున్నారు.జీఎస్టీ అమలులో భాగంగా జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు 17 సార్లు సమావేశమై చట్టానికి తుదిరూపు నిచ్చింది.

21:07 - June 29, 2017

మహబుబూ నగర్ : జిల్లా, నకిలీ విత్తనాల తయారీకి అడ్డాగా మారింది. భూత్పూరు కేంద్రంగా నకిలీ విత్తనాలను.. ఇష్టం వచ్చినట్లు తయారు చేస్తున్నారు. ఇక్కడ కొందరు పోలీసులు.. నకిలీ విత్తన కంపెనీల యాజమాన్యాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఖరీఫ్‌ మొదలైనప్పటి నుంచి భూత్పూరులోని కంపెనీలపై.. పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ నిఘా ఉంచింది. ఈ రెండు శాఖలు కలిసి పలుసార్లు దాడి చేసి.. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. దాడుల్లో భూత్పూరులోని గోపీకృష్ణ సీడ్స్‌ కంపెనీ నుంచి.. 2 వేల 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 1, 050 కిలోల కంది విత్తనాలను సీజ్‌ చేశారు. వీటి విలువ 46 లక్షలు ఉంటుందని ప్రత్యేక నిఘా విభాగం అంచనా వేసింది. ఈ కేసులో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. నకిలీ విత్తనాల కంపెనీలకు సహకరిస్తున్న.. భూత్పూరు సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ అశోక్‌ను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ప్రకటించారు. ప్రతీ ఏడాది భూత్పూరు ప్రధాన అడ్డాగా.. ఈ నకిలీ విత్తనాల దందా కొనసాగుతూనే ఉంది. దీంతో రాష్ట్ర రాజధాని నుంచే ఎస్‌ఓటి పోలీసులు నిఘా ఉంచి ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులు ఈ దందాలకు సహకరించడంపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉమ్మడి పాలమూరు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, బిజినేపల్లి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లో.. నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఈ కంపెనీలు చేస్తున్నాయి. కంపెనీలపై దాడులు జరుగుతున్నా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఎస్‌ఓటి విభాగం రంగంలోకి దిగి నకిలీల ఆట కట్టించేందుకు సిద్ధమైంది. పోలీసుల పాత్రపై కూడా నిఘా ఉంచారు.

 

21:05 - June 29, 2017

గుంటూరు : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు, యూటీఎఫ్ నేతలు వెలగపూడి సచివాలయంలో మంత్రి గంటా శ్రీనివాసరావుని కలిశారు. బదిలీల్లో కొన్ని మార్పులు జరిగినా వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వలేదన్న అంశాన్ని యూటీఎఫ్ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెబ్ కౌన్సెలింగ్ రద్దుతో పాటు ప్రతిభ ఆధారంగా పాయింట్ల తగ్గింపు, కొత్త బదిలీల షెడ్యూల్‌ విడుదల చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారని యూటీఎఫ్ నేతలు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:03 - June 29, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా గరగపర్రులో.. ఎట్టకేలకు అన్యాయానికి చెరపడింది. రెండున్నర నెలలుగా దళితులకు సామూహిక బహిష్కారం విధించి.. వారికి తిండి, ఉపాధి.. ఆఖరికి వైద్యం కూడా అందకుండా వేధించిన అగ్రకుల దురహంకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికీ ఇందుకూరు బలరామకృష్ణంరాజు, ముదునూరు రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లే బాధ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఈ ముగ్గురినీ గురువారం ఉదయం అరెస్టు చేశారు. గరగపర్రు దళితులు, రెండున్నర నెలలుగా అనుభవిస్తున్న వేదనను తీర్చేందుకూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. దళిత కుటుంబాలకు అవసరమైన ఉపాధి, వసతుల కల్పనకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దిశగా చర్యలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటే, గ్రామంలో, దళితుల బహిష్కారం అనంతరం తలెత్తిన శాంతిభద్రతల సమస్యను పరష్కరించేందుకు.. ప్రత్యేకంగా శాంతి కమిటీలను నియమించాలనీ పోలీసు శాఖ నిర్ణయించింది.

మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆమరణ నిరాహార దీక్ష
గరగపర్రులో దళితులకు సామూహిక బహిష్కారం విధించిన అగ్రకుల పెద్దలను అరెస్టు చేయడంతో.. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. దళిత సంఘాల నేతలు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్షను విరమింపజేశారు. భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలతో అగ్రకుల దురహంకారాన్ని ఎదుర్కొంటామని హర్షకుమార్‌ స్పష్టం చేశారు. గరగపర్రు దళితులకు దన్నుగా వివిధ పక్షాల నేతలు గురువారం కూడా ఆ గ్రామంలో పర్యటించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం.. గరగపర్రును సందర్శించింది. సామూహిక బహిష్కారం వల్ల స్థానికులు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దళితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్నీతిని, నిరంకుశ వైఖరిని సీపీఎం నాయకులు ఈ సందర్భంగా తప్పుబట్టారు.

రేపు జగన్ పర్యటన
అటు కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా గురువారం గరగపర్రులో పర్యటించారు. గ్రామంలోని దళితుల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. మరోవైపు, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా శుక్రవారం గరగపర్రులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంలో భత్రను మరింత కట్టుదిట్టం చేశారు. గరగపర్రు పరిసర గ్రామాల్లో కూడా పోలీసు భద్రతను పెంచారు. గరగపర్రు ఘటనను వెలుగులోకి తెచ్చి, దళితులకు న్యాయం జరిగేలా సామాజిక బాధ్యతతను సమర్థండగా నిర్వర్తించిన 10టీవీకి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

20:33 - June 29, 2017

 

ఓ యువకుడు రైళ్లో వెళ్తున్నాడు.. సీటు దగ్గర గొడవొచ్చింది.  సాధారణంగా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇక్కడ హత్య జరిగింది. కారణం తెలుసా.. బీఫ్ తింటాడని.. గొడ్డు మాంసం తింటాడని చంపేశారు. ఎందుకీ ఉన్మాదం.. ఎందుకీ అరాచకం..ఏ మత విలువలు ఈ హింసను ప్రోత్సహిస్తున్నాయి. గోవుని కాపాడి మనిషిని చంపి ఏం సాధిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశంలో కాస్త ఆలోచన ఉన్నవారైనా నాట్ ఇన్ మై నేమ్ అంటున్నారు. ఎవర్ని చంపుతారో.. ఎవరిపై దాడులకు దిగుతారో.. కానీ, దానికి నా సపోర్ట్ లేదు.. నేను హిందువును కావచ్చు.. బట్ … నాట్ ఇన్ మై నేమ్.. అంటూ దేశమంతా ఒక్కటై నినదిస్తోంది. నిజమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోంది. అసహనం.. పక్కవాడి మతాన్ని భరించలేనంత అసహనం..పక్కవాడి తిండిని ఒప్పుకోలేనంత అసహనం..

పక్కవాడి నమ్మకాల్ని చూస్తూ ఊరుకోలేనంత అసహనం..  మనం అనుకున్నదే కరెక్ట్.. మన విలువలే నిజం.. మన అలవాట్లే సరైనవి. ఈ భావజాలాన్ని ఏమంటారు? ఇది దేశాన్ని ఏ తీరాలకు తీసుకెళుతుంది.. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

20:02 - June 29, 2017
19:45 - June 29, 2017

హైదరాబాద్ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోది స్పందించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలను సహించేది లేదని హెచ్చరించారు. మహాత్మాగాంధీ పుట్టిన ఈ గడ్డపై హింసకు తావు లేదన్నారు. ప్రజలను చంపే హక్కు ఎవరికీ లేదని, హింస సమస్యకు పరిష్కారం కాదని మోది స్పష్టం చేశారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న మోది సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆశ్రమం ఆవరణలో మొక్కను నాటారు. చరఖా తిప్పి నూలు వడికారు. బాపూజీ స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతకే ప్రాధాన్యతనిచ్చేవారని మోది గుర్తు చేశారు. గాంధీ ఆదర్శంగానే స్వచ్ఛభారత్‌ను చేపట్టామన్నారు.

19:44 - June 29, 2017

కృష్ణా : రెండు వేలు ఇవ్వండి...చిప్స్ కొనండి...అయినా చిల్లర ఇస్తారు ...ఎలాగో చూడండి...లెక్కిస్తే 100 తక్కువ... షాపు వాడి చేతికి ఇస్తే లెక్కించి వందతో తిరిగి..దీంతో లెక్క సరిపోయిందా...ఓ సారి లెక్కపెట్టండి...ఐదొందలు తక్కువయ్యాయి కదా...మళ్లీ ఇవ్వండి...లెక్కపెట్టండి..ఐదొందలు కళ్ల ముందే తక్కువ కదా..జస్ట్‌ ఆ లెక్కలోనే వంద తక్కువ వచ్చింది..ఎంచితే తెలిసింది..తిరిగి షాపు వాడికి ఇస్తే వంద కలిపి ఇచ్చేస్తాడు... కళ్ల ముందే లెక్కపెట్టాడు కదాని వెళ్లిపోయారా... అయితే లెక్కపెట్టి చూడండి... ఐదొందలు తక్కువగా ఉంటాయి...చూశారుగా...కళ్ల ముందే ఎలా చివర్లో లెక్కపెట్టేవి...ఐదొందలు పడేసేవి...రౌండప్ చేయాలి....ఇదీ అసలు కథ... కళ్ల ముందే జరిగిపోతుంది...కాని లెక్కలో మాత్రం తేడా వస్తుంది...కాదు...ఆ లెక్కల్లోనే నొక్కేస్తారు.. పడేస్తారు...తిరిగి చూసుకుంటే ఐదొందలు తక్కువ....

19:39 - June 29, 2017

మహబూబబాద్ : జిల్లాలోని దంతాలపల్లిలో గొడ్డలి యాకయ్య అనే వ్యక్తిని దారుణంగా కాల్చి చంపారు. యాకయ్య అరాచకాలకు పాల్పడుతున్నందుకే ఆ శిక్ష విధించామని మావోయిస్టుల పేరుతో లేఖ ఆయన జేబులో ఉంది. ఆ లేఖ మావోయిస్టు పార్టీ సూర్యాపేట కమిటీ పేరుతో ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాకయ్య మృతదేహనికి వైద్యులు పొస్టుమార్టం పూర్తి చేశారు. యాకయ్య శరీరంలో వైద్యులు బుల్లెట్ ను గుర్తించారు. ఈ హత్య పాత కక్షాల నేపథ్యంలో జరిగిందని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

19:38 - June 29, 2017

హైదరాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి ల్లో వెలుగు చూసిన నకిలీ విత్తనాల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ స్పందించింది. అక్రమాలకు ఊతమిచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది మరో ఇద్దరు అధికారులకు మెమోలు జారీ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

19:37 - June 29, 2017

విజయవాడ : పోలవరం ప్రాజెక్ట్‌పై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ మెయిన్‌ డ్యామ్ కాకుండా కాపర్ డ్యామ్‌తో సరిపెడతారంటూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. పోలవరంపై బురద జల్లేందుకే ఉండవల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. ఏ పార్టీలోనూ లేనూ అంటూనే కాంగ్రెస్‌ పార్టీ వేదికపై జగన్‌ డైరెక్షన్‌లో ఉండవల్లి వ్యాఖ్యలు చేస్తున్నాడని మంత్రి దేవినేని ఆరోపించారు.

19:36 - June 29, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు టిడిపి ఎంపీలు నిమ్మల కిష్టప్ప, తోట నరసింహం, కాకినాడ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. జీఎస్టీలో వ్యవసాయ అనుబంధ వస్తువులకు, ఎండుచేపల వ్యాపారులకు మినహాయింపు ఇవ్వాలని అరుణ్‌ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. అరుణ్‌జైట్లీ వారి సూచనలను పరిశీలిస్తామని చెప్పినట్లు టిడిపి ఎంపీలు తెలిపారు. 

19:35 - June 29, 2017

పశ్చిమ గోదావరి : ఓవైపు దళితుణ్ని రాష్ట్రపతినిగా ఎన్నుకోడానికి వివిధ రాజకీయపార్టీలు కసరత్తు చేస్తుంటే.. దళితులు వెలివేతకు గురవడంపై దళిత సోషణ్‌ ముక్తీమంచ్‌ జాతీయ కన్వీనర్ వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రుగ్రామంలో పర్యటించిన ఆయన బాధితులతో మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:33 - June 29, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా గరగపర్రులో.. ఎట్టకేలకు అన్యాయానికి చెరపడింది. రెండున్నర నెలలుగా దళితులకు సామూహిక బహిష్కారం విధించి.. వారికి తిండి, ఉపాధి.. ఆఖరికి వైద్యం కూడా అందకుండా వేధించిన అగ్రకుల దురహంకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారానికీ ఇందుకూరు బలరామకృష్ణంరాజు, ముదునూరు రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లే బాధ్యులుగా గుర్తించిన పోలీసులు.. ఈ ముగ్గురినీ గురువారం ఉదయం అరెస్టు చేశారు. అలాగే గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని..శాంతి కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ రవికృష్ణ చెప్పారు. 

19:32 - June 29, 2017
18:48 - June 29, 2017

హైదరాబాద్ : రోడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు ప్రతీ ఆర్గనైజేషన్‌ ముందుకు రావాలని హైదరాబాద్‌ నగర సీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్కూల్‌ యాజమాన్యాలు చొరవ తీసుకొని విద్యార్థులకు రోడ్డు దాటే విధానం నేర్పాలని సీపీ సూచించారు. మొబైల్స్ వలనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, పాఠశాల యాజమాన్యాలు, సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్ పాటించాలని డీఈవో రమేష్‌ అన్నారు. 

18:47 - June 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సీపీఎం చేపట్టిన పాదయాత్ర ప్రజలను కదిలించి..వారిలో ఉద్యమ స్ఫూర్తి నింపిందని ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా జూలై 4న ప్రజా, సామాజిక సంఘాల ఐక్య వేదిక ఏర్పడుతోందని చెప్పారు. బడుగులకు రాజ్యాధికార రావడం ద్వారానే సామాజిక న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఐక్య వేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ప్రొ ప్రభంజన్ యాదవ్ అన్నారు. మరింద సమచారం కోసం వీడియో చూడండి. 

18:44 - June 29, 2017

కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందులో ఫెర్టిలైజర్‌ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌కి వచ్చాయనే సమాచారంతో అన్ని షాపుల్లో సోదాలు చేశారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని, నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. 

18:43 - June 29, 2017

విజయవాడ : హాస్య నటుడు పృథ్విరాజ్‌... తన భార్య శ్రీలక్ష్మికి రూ.8 లక్షల మనోవర్తి ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది. పృథ్విరాజ్‌ తనని పట్టించుకోవడం లేదని ఆయన భార్య 2017 జనవరిలో విజయవాడ ఫ్యామిలీ కోర్ట్‌ను ఆశ్రయించింది. రూ.10 లక్షల మనోవర్తి కావాలంటూ ఆమె కోరింది. ఈ నేపథ్యంలో పృథ్విరాజ్‌కు కోర్టు సమాన్లు జారీ చేసినా.. స్పందించకపోవడంతో..భార్య శ్రీలక్ష్మికి రూ.8 లక్షల మనోవర్తి ఇవ్వాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.

17:35 - June 29, 2017

సిద్దిపేట : టెట్‌ పరీక్షలకు డిగ్రీలో 50 శాతం మార్కుల అర్హత విధించడం వల్ల చాలా మంది విద్యార్ధులు నష్టపోతారన్నారు జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్. గతంలో ఉన్న 40 శాతం అర్హతనే కొనసాగిస్తూ మిగిలిన విద్యార్ధులకు టెట్‌లో అవకాశం కల్పించాలని ఆయన కోరారు. గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల నియామకాల్లో కొంత వెసులుబాటు కల్పించాలని ప్రొ.కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రం రంగాధం పల్లి చౌరస్తాలో కోదండరామ్ మాట్లాడారు. 

17:12 - June 29, 2017

ఖమ్మం : జిల్లాలోని ముదిగొండ మండలం పెద్దమండవలో దారుణం జరిగింది. అగ్రకులాలు దళిత మహిళ అంత్యక్రియలను అడ్డుకున్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ పొలాల నుంచి వెళ్లొద్దని అగ్రకులాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికకు వెళ్లకుండా అగ్రకులస్తులు అడ్డుకోవడంతో దళితులలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత వివరాలకు వీడియో చూడండి. 

జులై1న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలి: చంద్రబాబు

అమరావతి: అటవీ, పర్యావరణ శాఖ వైల్డ్ లైఫ్ బోర్డు పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహాయజ్ఞంలా వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొన్నారు. జులై1న రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సూచించారు. జులై1 గుంటూరు జిల్లా కొండవీడులో వనం- మనం కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. 2029 నాటికి అటవీ విస్తీర్ణాన్ని 50 శాతనికి పెంచడమే లక్ష్యం అని తెలిపారు. హరితాంధ్రకు అవసరమైన నిధులపై అధికారులు దృష్టి పెట్టి నేరుగా నిధులను వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు.

16:38 - June 29, 2017

విజయవాడ : నూతన ఎక్సైజ్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మద్య వ్యతిరేక పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్‌లో మహిళలు సామూహిక నిరాహార దీక్షలు చేపట

16:37 - June 29, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయం సాధనకు 200 వందల సంఘాలతో టీ మాస్‌ ఫోరమ్‌ పేరుతో ఐక్య వేదిక ఏర్పడుతుందని ప్రజా గాయకుడు గద్దర్‌ చెప్పారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని... పాలకులు మారారు తప్ప పాలన మారలేదని... గద్దర్‌ అన్నారు. వస్తే పవన్‌ను కలుపుకుని ఐక్య వేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటున్న ప్రజా గాయకుడు గద్దర్‌ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

16:36 - June 29, 2017

గుజరాత్ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోది స్పందించారు. గోరక్షణ పేరిట జరుగుతున్న హత్యలను సహించేది లేదని హెచ్చరించారు. మహాత్మాగాంధీ పుట్టిన ఈ గడ్డపై హింసకు తావు లేదన్నారు. ప్రజలను చంపే హక్కు ఎవరికీ లేదని, హింస సమస్యకు పరిష్కారం కాదని మోది స్పష్టం చేశారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న మోది సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆశ్రమం ఆవరణలో మొక్కను నాటారు. చరఖా తిప్పి నూలు వడికారు. బాపూజీ స్వాతంత్ర్యం కన్నా స్వచ్ఛతకే ప్రాధాన్యతనిచ్చేవారని మోది గుర్తు చేశారు. గాంధీ ఆదర్శంగానే స్వచ్ఛభారత్‌ను చేపట్టామన్నారు.

16:34 - June 29, 2017

హైదరాబాద్ : జులై నుంచి అమలవుతున్న జీఎస్టీపై ఆందోళన పడొద్దని.. తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ సూచించారు.జీఎస్టీపై ప్రజల్లో ఎటువంటి భయాందోళనలు సృష్టించవద్దంటూ ట్రేడర్లను ఆయన కోరారు. వస్తువుల మీద ధరలు పెంచే ప్రయత్నం చేయోద్దంటూ విజ్ఞప్తి చేసారు. జిఎస్టీ అమలుపై ప్రజలు, ట్రేడర్లలో ఎటువంటి అనుమానాలు ఉన్నా జిల్లా, రాష్ట్ర కేంద్రాల్లో సంప్రదించి అపోహలు నివృత్తి చేసుకోవాలని ఈటెల తెలిపారు. 

16:32 - June 29, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో టైంస్కేల్‌ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. 30ఏళ్లుగా పనిచేస్తున్నా.. తమకు పీఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యాలు కూడా కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 14న ఆర్ట్స్‌ కాలేజీ మహాధర్నా చేపడుతున్నట్టు వారు తెలిపారు. టైంస్కేల్‌ ఉద్యోగులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. టైంస్కేల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తమ్మినేనిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

ఏపీ లో ఉపాధ్యాయుల బదిలీ సందిగ్ధతకు తెర

అమరావతి: ఉపాధ్యాయుల బదిలీ సందిగ్ధతకు తెర పడింది. మంత్రి గంటాతో ఉపాధ్యాయుల చర్చలు సఫలం అయ్యాయి. సాయంత్రంలోగా సవరణలతో కూడిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. వెబ్ కౌన్సిలింగ్ రద్దు, ఆన్ లైన్ ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితా, ప్రతిభ పాయింట్లు 30 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ఎయిరిండియా వాటల కొనుగోలుకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఆసక్తి

ఢిల్లీ: ఎయిరిండియాలో వాటాలను కొనుగోలు చేసేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ ఆసక్తిగా ఉంది. ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఎయిరిండియాలో వాటాలు అమ్మేకేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు ఎయిర్ ఇండియా కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆసక్తి చూపుతున్న టాటా గ్రూప్. దాదాపు 10 ఏళ్లుగా ఎయిరిండియా నష్టాల్లో పయనిస్తోంది.

16:25 - June 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు కుల బహిష్కరణలో నిందితులను అరెస్ట్ చేయాలని దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్ష కుమార్ నిందితులను అరెస్ట చేయడంతో దీక్ష విరమించారు. దళితుల పట్ల విక్షపై భవిష్యత్లులో పోరాడతామని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

16:22 - June 29, 2017

అనంతపురం : అనంతపురంలో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. యజమానులకే తెలియకుండా కోట్లాదిరూపాయల భూములను మాఫియా మింగేస్తోంది. భూ దొంగలకు రెవెన్యూ అధికారులు, పోలీస్‌లు కూడా తోడవడంతో అనంతపురంలో కోట్ల రూపాయల భూములకు రెక్కలొస్తున్నాయి.

సివిల్‌ పంచాయతీలకు అడ్డాగా పోలీస్‌ స్టేషన్‌
అనంత జిల్లాలో ఏ పోలీస్‌ స్టేషన్‌ చూసినా సివిల్‌ పంచాయతీలకు అడ్డాలుగా మారిపోయాయనే ఆరోపణలొస్తున్నాయి. చివరికి ఏస్పీ, డీజీపీ కార్యాలయాలకు అతి సమీపంలో ఉన్న భూములను కూడా కాజేసేందుకు ప్లాన్స్‌ వేస్తున్నారు. ఏకంగా ఓ పోలీసు అధికారి కార్యాలయమే భూ దొంగలకు అడ్డాగా మారిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం..ఈ విమర్శలకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. పోలీసులు డ్యూటీని వదిలేసి రెవెన్యూ ఉద్యోగం చేస్తున్నారన్న జేసీ వ్యాఖ్యలు జిల్లాలో భూ దందా విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తోందని అంటున్నారు.

సీఐ బంధువుల భూబగోతం

ఇదిగో కలెటక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూమి కేంద్రంగా ఇపుడు వివాదం మొదలైంది. ఈ భూమి తమదేనని అనంతపురం సీఐ బంధువులు కొందరు అమ్మకానికి పెట్టారు. అయితే .. కొనుగోలు దారులు భూమికి సంబంధించిన లింక్‌ డాక్యుమెంట్లు అడగడంతో అసలు విషయం బయటపడింది. లింక్‌ డాక్యుమెంట్లు లేకుండానే భూమి రిజిస్టర్‌ అయి ఉండటంతో.. విషయం భూమి అసలు యజమానులకు చేరింది. దీంతో అసలు తాము ఎపుడూ భూమిని అమ్మలేదని 60ఏళ్ల క్రితమే ఈ భూమిని తాము అసైండ్‌ల్యాండ్‌గా ప్రభుత్వం నుంచి పొందామని విషయాన్ని వారు బయటపెట్టారు. దీంతో తమ బంధువుల తరపున అనంపురం పోలీస్‌ సీఐ రంగంలోకి దిగి భూ యజమానులకు బెదిరింపులు మొదలు పెట్టారు. అంతటితోనే ఆగకుండా పోలీసు తెలివితేటలు ప్రదర్శించి, భూమిని సొంతం చేసుకునేందుకు ఎత్తులు వేశారు. 57 ఏళ్ల క్రితమే ఈ ల్యాండ్‌ తమ పేరుతో రిజిస్టర్‌ అయిందని ..భూమిని అమ్ముకోడానికి అనుమతి ఇవ్వాలని సీఐ బంధువులు ఆర్డీవో దగ్గర పంచాయతీ పెట్టారు. దీనిపై విచారణ చేసిన ఆర్డీవోకు కళ్లుతిరిగినంత పనయింది. ఈ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ అస్తవ్యస్థ వివరాలతో ఉన్నాయి. దీంతో ఇది వివాదాస్పద భూమి అంటూ క్రయ-విక్రయాలు జరపొద్దంటూ .. సమస్యను కోర్టులో పరిష్కరించుకోవాలని తేల్చిచెప్పారు.

పోలీసు అధికారి లోకల్‌ పంచాయతీ
విషయం కోర్టుకు వెళితే అసలుకే మోసం వస్తుందనుకున్న సదరు పోలీసు అధికారి లోకల్‌ పంచాయతీకి తెరతీశారు. కొందరు అధికారపార్టీ నేతలు, స్థానికంగా పలుకుబడి కలిగిన ఓ రియల్‌ వ్యాపారిని రంగంలోకి దించాడు. భూమి అసలు యజమానులను పిలిపించి తలాఇంత అంటూ పంకాలు చేయడానికి ప్రయత్నించారు. అయితే భూమి అసలు యజమానులు దీనికి ఒప్పుకోలేదు. వివాదం మరింత ముదరడంతో విషయం కాస్తా పోలీసుబాసు ఎస్పీ దృష్టికి చేరింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన ఎస్పీ రాజశేఖర్‌బాబు సదరు రియల్‌ఎస్టేట్‌ వ్యారితోపాటు సీఐ బంధువులను కూడా తీవ్రంగా మందలించారు. అనంతపురం ఆర్డీవో నుంచి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెప్పించుకుని పరిశీలించారు. వివాదంలో తలదూర్చిన సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారుల హెచ్చరిక
పోలీసు ఉన్నతాధికారుల హెచ్చరికలతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినా.. అసలు లింకు డాక్యుమెంట్లు లేకుండా భూమి రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందన్నది తేలాల్సిన అవసరం ఉంది. లంచాలకు కక్కుర్తిపడిన కొందరు రెవెన్యూ అధికారులు, రిస్ట్రేషన్‌ అధికారులే ఇలా ఇష్టారీతిగా భూ దందాలకు సపోర్టు చేస్తున్నారనే అరోపణలొస్తున్నాయి. రెవిన్యూ అధికారులు సమస్య సృష్టించడం.. పరిష్కారం పేరుతో పోలీసులు పంచాయతీలు నిర్వహించి, పేదలు, రైతుల ఆస్తులను దోచుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాలకు అడ్డుకట్ట

ముంబై: స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. స్వల్పంగా సెన్సెక్స్, నిప్టీ పెరిగాయి. 23 పాయింట్లు పెరిగి 30,857 దగ్గర సెన్సెక్స్, 13 పాయింట్లు పెరిగి 9,504 దగ్గర నిఫ్టీ ముగిసింది.

సీఎస్ ను కలవనున్న తెలంగాణ జేఏసీ నేతలు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. జనల్ వ్యవస్థ రద్దు, ఉద్యోగుల విభజన ఇతర అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వారం రోజుల్లో రాష్ట్రానికి రప్పించకపోతే ఉద్యమించాలని జేఏసీ నిర్ణయించిట్లు తెలుస్తోంది. కాసేపట్లో సచివాలయంలో సీఎస్ ఎస్పీ సింగ్ ను కలవనున్నారు.

16:04 - June 29, 2017

అనంతపురం : జిల్లాలోని నారాయణ కాలేజీ సిబ్బంది దైర్జన్యానికి దిగారు. మందుతాగి ప్రిన్సిపాల్ శిఖామణి, వార్డెన్ భవానీ విద్యార్థులను చితకబాదరు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి పంపుతామని యాజమాన్యం బెదిరింపులు దిగడంతో విద్యార్థులు బయటకు తెలపలేదు. తల్లిదండ్రులు విషయం తెలుసుకొని కాలేజీ రావడంతో ప్రిన్సిపాల్, వార్డెన్ పరిపోయారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:00 - June 29, 2017

వానాకాలం వచ్చేసింది. వానాకాలంతో పాటు అంటురోగాలు కూడా వచ్చేస్తుంటాయి. వైరల్ ఫీవర్..ఎలర్జీలు ఈ కాలంలోనే అధికంగా వస్తుంటాయి. మరి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈకాలంలో కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగడం మేలు. అల్లం..లెమన్..హెర్బల్ టీలను తాగడం మంచిది. ఆకుకూరలు..ఎలాంటి కూరగాయాలైనా శుభ్రంగా కడుక్కొని వాడడం బాగుంటుంది. ఉప్పు నీళ్లతో కూరగాయాలను కడగడం శ్రేయస్కరం. పండ్లు, జ్యూసులు తాగేటప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం. ఉడికించిన కూరగాయాలు..తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. త్వరగా జీర్ణమయ్యే సూపులు..ఇతరత్రా ఆహార పదార్థాలను భుజించాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమలు, ఈగల నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేపాకు, కర్పూరం, లవంగాలను ఇంటి మూలల్లో ఉంచడం వల్ల ఈ సమస్య నుండి దూరం కావచ్చు. అనారోగ్యాలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆయన సూచనలు..జాగ్రత్తలు పాటించాలి.  

15:59 - June 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాలు నీటి రాక కోసం నిరీక్షిస్తూనే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 13 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. ఆల్మట్టితో సహా అన్ని జలాశయాలు ఖాళీగానే ఉన్నాయి. గోదావరి జలాశయాల్లోకి కూడా ప్రవాహం తక్కువగానే ఉంది.. దిగువన ధవళేశ్వరం వద్ద ఇప్పటివరకు సుమారు 25 టీఎంసీల నీరు వచ్చింది. కృష్ణా బేసిన్‌లో సీజన్‌ ప్రారంభంలో వచ్చే నీటిని.. కర్ణాటక, ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లో నిల్వ చేస్తోంది. ఈ రెండూ నిండిన తరువాతే జులై చివరన లేదా ఆగస్టులో కానీ శ్రీశైలంలోకి ప్రవాహం ఉండటం లేదు. గతేడాది కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్ట్‌లకు.. నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ ఏడాది మెరుగ్గా ఉంటుందని అంచనా వేసినా.. ఇప్పటివరకు కనీస ప్రవాహం కూడా రాలేదు. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల జూరాలలోకి 5.25 టీఎంసీల నీరు చేరింది. సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా నీటి లభ్యత ఉన్న ప్రాజెక్ట్‌ ఇదే. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి 1.31 టీఎంసీల నీరు వచ్చి చేరింది.

రెండు రాష్ట్రాల్లో 12.5 టీఎంసీలు
గోదావరికి రెండు రాష్ట్రాల్లోని జలాశయాల్లో కలిసి.. సుమారు 12.5 టీఎంసీల నీరు వచ్చింది. తెలంగాణలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కొంత మెరుగ్గా ఉన్నా మిగిలిన జలాశయాల్లోకి నామమాత్రంగానే నీరు చేరింది. ధవళేశ్వరం నుంచి 20 టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు ఇవ్వడంతో పాటు.. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు కొంత నీటిని విడుదల చేశారు. నాలుగున్నర టీఎంసీలు సముద్రంలో కలిసిపోయింది.

నాగార్జున సాగర్‌, శ్రీరాం సాగర్‌
నాగార్జున సాగర్‌లో జులై నెలాఖరు వరకు 502 అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌.. కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరారు. శ్రీశైలంలోకి 775 అడుగులకు మించి వచ్చే నీటిలో ఒకటిన్నర టీఎంసీలు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు, సాగర్‌లో నీటిమట్టం నిర్వహించేందుకు విడుదల చేయాలని బోర్డుకు లేఖ రాశారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయియిని శ్రీరాం సాగర్‌ జలాశయంలో.. గతేడాది ఇదే సమయానికి 4.636 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం 9.224 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జులై 1 నుంచి అక్టోబర్‌ 28 వరకు మహారాష్ట్రలోని.. బాబ్లీ జలాశయం 14 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ సారి బాబ్లీలో నీటి పరిమాణం బాగానే ఉంది. నాలుగు రోజులుగా బాబ్లీ ఎగువ భాగంలో వర్షాలు కురుస్తుండటంతో.. నీరు వచ్చి చేరుతోంది. ఏమైనా ఇప్పటివరకూ కురిసిన వర్షాలకు జలాశయాల్లోకి పెద్దగా నీరు రాకపోవడం.. కాస్త ఆందోళన కలిగిస్తోంది. 

15:58 - June 29, 2017

కాకరకాయ..కూరగాయాల్లో ఒక రకం. దీనితో వంటలతో పాటు అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేగాకుండా మంచి ఔషధం కూడా పనిచేస్తుంది. కరివేపాకును పొడి చేసుకోవాలి..అలాగే కాకరకాయను పేస్ట్‌గా చేసుకుని ఈ రెండూ మిశ్రమాలను కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే దురద తగ్గిపోతుంది. కాకరకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలను నివారిస్తుంది. కాకరకాయను మెత్తగా పేస్టు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టుకు జాజికాయ పొడి..ఒక స్పూన్ పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పోతాయి. అంతేగాకుండా ప్రకాశవంతమైన చర్మం వస్తుంది. 

15:42 - June 29, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని మేధావుల వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు అన్నారు. ఉద్యోగాల కల్పన, డబుల్‌ బెడ్‌రూమ్‌, మూడు ఎకరాలు భూమి వంటి హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు. అందుకే 200 సంఘాలు ఒక వేదికగా ఏర్పడి మేమంతో మాకంత వాటా అనే నినాదంతో పోరాటం చేస్తామన్నారు. జూలై 4న టీ మాస్‌ ఫోరమ్‌లో మేధావుల వేదిక భాగస్వామ్యం అవుతుందని ప్రొ విశ్వేశ్వరరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి. 

ఆర్టీసీ ఆస్పత్రికి ఎంపీ నిధుల : కేశినేనినాని

అమరావతి: విజయవాడలో నిర్మించనున్న ఆర్టీసీ ఆస్పత్రికి ఎంపీ నిధుల నుంచి కేశినేని నాదిరూ. 30 లక్షలు కేటాయించారు. కొంత మంది అధికారుల తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, దేశంలో స్లీపర్ బస్సులు తిప్పేందుకు ఏ ప్రైవేటు ట్రావెల్స్ కూ అనుమతి లేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో తిరిగే బస్సులతో ఏపీ ఆర్టీసీకి తీవ్ర నష్టం వచ్చిందన్నారు.

15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి:చంద్రబాబు

విజయవాడ: రాష్ట్రంలో 38 పట్టణాల్లో నిర్మించే 1.20 లక్షల ఇళ్లను సత్వరం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 15 రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, వచ్చే నెల 2వ వారంలో పక్కా గృహాల నిర్మాణం ప్రారంభించాలని పేర్కొన్నారు. సంక్రాంతి నాటికి 20 శాతం నిర్మాణాలు పూర్తి కావాలని, స్థలం లభ్యంకాని చోట గృహాల నిర్మాణాలను జీ ప్లస్ 5, జీప్లస్ 7 మోడల్ లో నిర్మించాలన్నారు. ప్రతి బుధవారం గృహ నిర్మాణ పురోగతి పై సమీక్ష చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీలో ఉపాధి హామీ పనుల కూలీ ధర పెంపు

అమరావతి: ఏపీలో ఉపాధి హామీ పనుల కూలీ ధరను రూ.194 నుంచి 197 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గుణపానికి రూ. 10 నుంచి రూ.15కి, తట్టలకు రూ. 3 నుంచి రూ.5కు పెంచారు.

15:15 - June 29, 2017

హైదరాబాద్ : 2011 ఏప్రిల్ 30న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై దాడి కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. కోర్టు నలుగురిని దోషులను నిర్ధారించింది. దోషులకు కోర్టు రూ.10వేల జరిమానాతో పాటు 10 ఏళ్లు జైలు విధిచింది. వీడియోలోమ కనిపించిన నలుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. శిక్ష పడ్డవారిలో సలీంబిన్, అబ్దుల్లాయాపై, అవద్ యాపై, అసన్ బిన్ యాలు ఉన్నారు. ప్రధాన నిందితుడు పహిల్వాన్ సహా పదిమందిపై కోర్టు కేసు కొట్టివేసింది. మరింత వివరాలకు వీడియో చూడండి. 

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

హైదరాబాద్: మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి అరుదౌన గౌరవం దక్కింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటర్ గా కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పేరు నమోదు అయ్యింది. చివరి ఓటర్ గా మల్లాది కృష్ణారావు పేరు నమోదు అయ్యింది. అక్షర క్రమంలో ఓటర్ల జాబితా నూ సీఈసీ రూపొందించింది.

15:08 - June 29, 2017

’దిల్‘ రాజు నిర్మాతగా మారి మంచి సక్సెలను అందుకుంటున్నాడు. టాలీవుడ్ లోని ప్రముఖుల చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన నిర్మాణంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘డీజే..దువ్వాడ జగన్నాథమ్’ కాసులు కురిపిస్తోంది. దీనితో ‘దిల్’ రాజు ఫుల్ హ్యపీగా ఉన్నాడంట. అయితే ఇదిలా ఉంటే ‘పవన్ కళ్యాణ్’ తో ‘దిల్’ రాజు ఓ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. పవన్ కూడా కథ సిద్ధం చేసుకోవాలని చెప్పాడని టాక్.

2019 ఎన్నికలు..
2019 ఎన్నికల్లో పవన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ రంగంతో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో...సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రాల్లో నటించనున్నాడు. ఎన్ని సినిమాలు ఒప్పుకున్నా 2018 సంవత్సరంలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ‘దిల్’ రాజు నిర్మాణంలో ‘పవన్’ చిత్రం ఉంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

ఏపీలో 3 కొత్త రైలు మార్గాలు..

అమరావతి : ఏపీలో వివిధ మార్గాల నుంచి అమరావతికి చేరుకునేలా 3 కొత్త రైలు మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. రూ. 2800 కోట్లతో 108 కి.మీ పొడవైన రైలు మార్గాల కు తుది సర్వే కోసం రైల్వే బోర్డు టెండర్లను పిలిచింది. విజయవాడ – కాజీపేట మార్గంలో ఖమ్మం, ఎర్రుపాలెం నుంచి వచ్చే లైన్ లో కృష్ణా నది పై 2.7 కి.మీ పొడవైన వంతెన నిర్మాణ జరగనుంది.

14:54 - June 29, 2017

 

నాగర్ కర్నూలు : నల్లమల అడవి రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే నల్లమల్ల అడవి తెలంగాణకే వన్నెతెచ్చింది. రకరకాల పక్షులు, జంతువులు... ఉల్లాసపర్చే జలపాతాలు. ఆహ్లాదపరిచే పచ్చనిచెట్లు. అంతేనా... ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఎన్నో పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ కలగలిసిందే నల్లమల అటవీ ప్రాంతం. ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే 123 చెంచుపెంటలు ఉండటం మరో విశేషం.

అంతరించిపోతున్న చెంచు జాతి..
ప్రస్తుత సమాజంలో చెంచు జాతి క్రమంగా అంతరించిపోతోంది. మరికొన్ని సంవత్సరాలైతే చెంచుజాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారనుంది. ఇది గమనించే 2009లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మన్ననూర్‌లో చెంచుల జీవన విధానాలను తెలుపుతూ ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. చెంచులు ఎలా జీవిస్తారు? వారి జీవన పరిస్థితులు ఏమిటి? జంతువులతో ప్రమాదం ఏర్పడితే చెంచులు ఎలా ప్రాణాలు రక్షించుకుంటారు? తేనెపట్టు తీయడంతోపాటు మరెన్నో విషయాలు కళ్లకుకట్టేలా ఈ మ్యూజియంలో విగ్రహాలను ఏర్పాటు చేశారు.

పాలకుల అలసత్వం...
అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం... చెంచు మ్యూజియం పట్ల శాపంగా మారింది. నాడు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఈ మ్యూజియం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. మ్యూజియంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. అయినా వాటిని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. మ్యూజియం నిరాదరణకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టే ప్రభుత్వానికి చెంచులపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్ధమవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... చెంచు మ్యూజియానికి పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

14:51 - June 29, 2017

తూర్పు గోదావరి : పాలకుల అలసత్వం కారణంగా ఏపీ టూరిజం మందగిస్తోంది. చారిత్రక ప్రదేశాలను... తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడం లేదు. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న హేవలాక్‌ వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటూ.. పాలకులు హామీలు గుప్పించారు. దాని అమలకు మాత్రం అడుగులు పడలేదు.

ఓ చారిత్రక కట్టడం.
ఏపీలో ఉన్న హేవలాక్‌ వంతెన ఓ చారిత్రక కట్టడం. గోదావరి నదిపై తొలి రైలు వంతెన. ఈ వంతెనకు వందేళ్ల చరిత్ర ఉంది. హేవలాక్‌ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అనంతర కాలంలో పర్యాటక మంత్రి హోదాలో చిరంజీవి వంతెనను పరిశీలించారు కూడా. అలాగే హేవలాక్‌ వంతెన ఆధారంగా పర్యాటకాభివృద్ధి చేస్తామంటూ ... పుష్కరాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. గోదావరి లంకల్లో పర్యాటకుల కోసం హోటల్‌ కూడా కడతామని చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగా హేవలాక్‌ వంతెనపై రోప్‌ వే నిర్మించి లంకల్లోకి వెళ్లడానికి ఏర్పాటు చేస్తామన్నారు. పాద యాత్రికులకు కూడా అనుగుణంగా వంతెనపై ఏర్పాట్లు చేస్తామన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిపాదనలు
కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రతిపాదనలు కానీ.. చంద్రబాబు ప్రకటనలు కానీ నేటి వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో స్థానికులు పాలకుల చర్యలపై విస్తుపోతున్నారు. ముఖ్యంగా గోదావరిని ఆనుకుని ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలను వినియోగించుకోలేకపోవడంతో పలువురు పెదవి విరుస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం గోదావరి టూరిజంపై...ప్రధానంగా హేవలాక్‌ వంతెనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

14:49 - June 29, 2017

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్‌తాగి ఆస్పత్రి పాలయ్యారు. యాసిడ్‌తాగి గాయాలపాలైన విద్యార్థులు సాగర్‌, మణి లను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. విద్యార్థులు చదువుతున్న స్కూల్‌లోనే వారి నాన్నమ్మ ఆయాగా పనిచేస్తోంది.

14:47 - June 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు సామాజిక బహిష్కరణ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని ఎస్పీ రవికృష్ణ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువైందని ఇందుకూరు బలరామకృష్ణంరాజు, ముదునూరు రామరాజు, కొప్పుల శ్రీనివాస్‌లను ముద్దాయిలుగా గుర్తించామని ఎస్పీ చెప్పారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని..శాంతి కమిటీలు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే బాధితులకు సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రవికృష్ణ తెలపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

14:45 - June 29, 2017

పుదీనా..వంటల్లోనే కాకుండా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. చైనా దేశంలో అందానికి పుదీనను ఔషధంగా ఉపయోగిస్తారు. చిన్న చిన్న సమస్యలకు ఒక ఔషధంగా ఎలా వాడుకోవచ్చో చూడండి...
కడుపునొప్పి ఉన్న వారు కప్పు డికాషన్ లో గుప్పెడు పుదీనా ఆకులు వేయాలి. బాగా మరిగించాక...తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. 
ఎసిడిటితో ఇబ్బంది పడే వారు రోజూ ఒక గ్లాసు పుదీనా రసం తీసుకోవాలి. సత్వర ఫలితం కనబడుతుంది. 
అరికాళ్లు..చేతులు మంటగా అనిపిసే్త పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే మంట తగ్గుతుంది. నీరసంగా ఉన్నపుడు అరకప్పు పుదీనాకు నిమ్మరసం, రెండు స్పూనుల తేనే కలిపి తీసుకుంటే మంచిఫలితం ఉంటుంది. 

 

14:32 - June 29, 2017

ప్రశ్నిస్తే దాడులేనా ? అసహనం పేరిట దాడులు చేస్తారా ? బీఫ్ తింటే చంపుతారా ? ఏమి తినాలో మీరే చెబుతారా ? మతం..కులం పేరిట ఎంతకాలం ఈ దాడులు ? దళితులు మనుషులు కారా ? స్వతంత్ర భారతంలో ఎంతకాలం కులవివక్ష..అంటరానితనం..వివిధ రూపాల్లో నేటికీ కొనసాగుతోంది..


దేశంలో మతోన్మాద దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట దాడులకు తెగబడుతూ మారణహోమాన్ని స్రుష్టిస్తున్నారు. కులం..మతం..పేరిట జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. బీఫ్ తిన్నాడని..ఆవులను తరలిస్తున్నారని..ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. మరో పక్క దళితులను ఇంకా అంటరానివారీగానే చూస్తున్నారు. దళితులు..మైనార్టీలను ఊచకోతకు తెగబడుతున్నారు. ఇలా ఎంతకాలం...? మతం పేరిట మారణహోమాలు చేస్తారా ? అసహనం పేరిట దాడులు చేస్తారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

జునైద్ బాలుడి హత్య..నిరసనలు..
‘నాట్ మై నేమ్’ పేరిట దేశ వాపితంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. దళితులు..మైనార్టీలు..ఊచకోతలు కొయ్యోద్దు అంటూ గళమెత్తారు. దేశంలో ప్రధాన నగరాల్లో జరిగిన ప్రదర్శనల్లో ప్రజా సంఘాలు..మేధావులు..ఇతరులు పాల్గొని దాడులను తీవ్రంగా ఖండించారు. దీనికంతటికీ కారణం ఢిల్లీలోని ఈ శివారులో ఇటీవలే జునైద్ అనే బాలుడిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మానవతా వాదులందరూ ఖండించారు. ఈద్ సందర్భంగా షాపింగ్ కో్సం జునైద్ ఢిల్లీ వెళ్లి తిరిగి హర్యానాలోని సొంత గ్రామానికి వస్తున్నాడు. బ్యాగులో బీఫ్ తీసుకొస్తున్నాడనే కారణంతో దుండగులు రైలులో జునైద్ ను కొట్టారు. అనంతరం రైలులో నుండి తోసేయగా జునైద్ చనిపోయాడు. ఒక్కసారిగా ఈ ఘటనపై నిరసన పెల్లుబికింది. 

‘నాట్ ఇన్ మై నేమ్’ పేరిట ప్రచారం..
సోషల్ మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అయిపోయింది. ‘నాట్ ఇన్ మై నేమ్’ పేరిట ఫేస్ బుక్ లో విపరీతంగా ప్రచారం జరిగిపోయింది. సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ‘నాట్ ఇన్ మై నేమ్’ అనే పేరుతో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. ఆనాటి ’నిర్భయ’ ఘటన మాదిరే ప్రచారం జరగడంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం దేశంలోని ప్రధాన నగరాలు..ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు..ర్యాలీలు జరిగాయి.  లండన్, టొరంటో, బోస్టన్, కరాచీ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయని దివాన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రదర్శనలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పాల్గొన్నారు.

బీఫ్ తింటే చంపుతారా ? 
మైనార్టీలు..దళితులు..ముస్లింలపై దాడులు పెరిగిపోతున్నాయని, హింస అనేది చాలా పెరిగిపోయిందని మేధావులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం స్పందించకపోవడం..కఠిన చర్యలు తీసుకోవడం లేదని తీవ్రంగా ఖండించారు. బీఫ్ తింటే చంపుతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల దాడులు మరీ ఎక్కువగా జరుగుతున్నాయని ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అని రాఘవులు అన్నారు. జునైద్‌పై దాడి ఘటనలో ఢిల్లీకి చెందిన ప్రభుత్వోద్యోగి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఘటనను హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తీవ్రంగా ఖండించారు.

 

నారాయణ కాలేజీ ప్రిన్సిపల్, వార్డెన్ దౌర్జన్యం...

అనంతపురం: నారాయణ కాలేజీ లో ప్రిన్సిపాల్, వార్డెన్ దౌర్జన్యానికి దిగారు. అకారణంగా విద్యార్థులను ప్రిన్సిపాల్, వార్డెన్ చితకబాదారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తల్లిదండ్రులకు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరించారు. ప్రిన్సిపాల్ శిఖామని, వార్డెన్ భవానీ పరారీలో ఉన్నారు.

ఎట్టకేలకు గోవధ పై మౌనం వీడిన ప్రధాని

గుజరాత్: ఎట్టకేలకు గోవధ పై ప్రధాని మౌనం వీడారు. భారత్ అహింసాయుత దేశం.. హింసకు తావులేదు అని మోదీ పేర్కొన్నారు. గోరక్ష పేరుతో దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు. దాడులు మహాత్మ గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధం అని, మహాత్ముడి కలల సాధనకు అందరం కలిసి పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

14:19 - June 29, 2017
14:18 - June 29, 2017

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో చిన్న తరహా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడనుంది. అందులో భాగంగానే బీడీ పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం పడుతుంది. చాలా మంది మహిళలు బీడీ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. వారి జీవనోపాధికి నష్టం వాటిల్లనుంది. ఇదే అంశంపై ఇవాళ్లి మావని ఫోకస్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

14:13 - June 29, 2017

హైదరాబాద్ : సామాజిక తెలంగాణ సాధనకు పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ పోస్టర్ ను విడుదల చేశారు. జులై 4న ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంఘాలు ఐక్య వేదికగా ఏర్పడ్డాయన్నారు. 

14:06 - June 29, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో ఉద్రిక్తపరిస్థితులు లేకుండా చేస్తామని జిల్లా ఎస్పీ రవికృష్ణ చెప్పారు. గరగపర్రు ఘటనపై మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రామంలో సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నారు. బాధితులను ఆదుకుంటామని చెప్పారు. దళితులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులు విషయాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పారు. కేసును రిజిస్టర్ చేసి.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో శాంతి కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పికెట్స్ ఏర్పాటు చేసి ఘర్షణలు లేకుండా చేస్తామని చెప్పారు. 

 

జీఎస్టీ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ డుమ్మా

ఢిల్లీ: జీఎస్టీ ప్రారంభోత్సవానికి వెళ్లాలా, వద్దా అని తర్జన భర్జన పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది.

 

ముదిగొండ మండలం పెద్దమండవలో దారుణం

ఖమ్మం: ముదిగొండ మండలం పెద్దమండవలో దారుణం జరిగింది. దళిత మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా అగ్రకులస్తులు అడ్డుకున్నారు. తమ పొలాల నుంచి వెళ్లొద్దంటూ అగ్రకులస్తులు అడ్డుకున్నారు.

13:53 - June 29, 2017

ఢిల్లీ : ప్రదాని నరేంద్ర మోదీ ప్రారంభించిన  స్వచ్ఛభారత్‌ ఉద్యమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ తూట్లు పొడిచారు. రాధామోహన్‌ సింగ్‌ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. భద్రతా సిబ్బంది రక్షణలోనే  మంత్రి ఈ చర్యకు పాల్పడ్డారు.  మంత్రులే  ఈ విధంగా చేస్తుంటే సామాన్యుల మాటేమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. సభ్య సమాజానికి అసభ్య సందేశం ఇచ్చిన కేంద్ర మంత్రి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

13:51 - June 29, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వామపక్షాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. సీపీఎం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ దగ్గర జరిగినఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వామపక్షాలు, దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు  పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

13:49 - June 29, 2017

హైదరాబాద్ : దేశంలో జీఎస్టీ అమలు వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడదని... వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.. చిన్న వ్యాపారులకు ఎటువంటి నష్టం జరగదని చెప్పారు.. ఆదాయాన్నిబట్టే టాక్స్‌లుంటాయని తెలిపారు.. జూన్‌ 1నుంచి అమలులోకి రాబోతున్న జీఎస్టీ పై సోమేశ్‌ కుమార్‌తో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. కుమార్‌గ్రానైట్‌లాంటి పరిశ్రమలపై భారం వద్దని కేంద్రాన్ని కోరామని తెలిపారు. జీఎస్‌టీతో లాభాలు త్వరలో తెలుస్తాయన్నారు. అవసరాన్నిబట్టి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పారు.

 

మంచినీరు అనుకుని యాసిడ్ తాగిన విద్యార్థులు...

యాదాద్రి భువనగిరి: మోత్కూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగారు. విద్యార్థులు సాగర్, మణి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే స్కూల్లో విద్యార్థుల నానమ్మ ఆయాగా పని చేస్తోంది.

13:45 - June 29, 2017

హైదరాబాద్ : నాంపల్లి జీఎస్ టీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వస్త్రవ్యాపారులు ఆందోళన కొనసాగిస్తున్నారు.. వస్త్రాలపై జీఎస్ టీ తగ్గించాలంటూ మూడురోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

గరగపర్రులో ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశాం: ఎస్పీ రవిప్రకాశ్

ప.గో : గరగపర్రులో దళితులను గ్రామ బహిష్కరణ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు. ఇందుకూరి బలరామకృష్ణరాజు, ముదునూరి రామరాజు, కొప్పుల శ్రీనును అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24 నుంచి ఎస్సీ, ఎస్టీ సెల్, డీఎస్పీ చేసిన దర్యాప్తులో దళితుల బహిష్కరణ జరిగిందని రుజువైనట్లు పేర్కొన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలతో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపుతామన్నారు. బహిష్కరణకు గురైన వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పీస్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.

13:38 - June 29, 2017

హైదరాబాద్ : అక్బరుద్దీన్‌ కేసులో నాంపల్లి కోర్టు తుదితీర్పు వెలువరించింది.. ఈ కేసులో నలుగురిని దోషులుగా నిర్ధారించింది.. కీలక నిందితుడు పహిల్వాన్‌సహా పదిమందిపై కేసును కొట్టివేసింది.. 86మంది సాక్షుల్లో 61మందిని విచారించిన కోర్టు... 154 సాక్ష్యాధారాలు, 82 మెటీరియల్స్‌ను పరిశీలించింది.. 2011 ఏప్రిల్‌లో 30న బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:17 - June 29, 2017

విశాఖ : జిల్లాలోని మన్యంలో రోజు రోజుకి విషజ్వరాలు, అంటువ్యాధులు ఉధ్దృతి పెరుగుతున్నా,  ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. మలేరియా, డయేరియా, ఆంత్రాక్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో అమాయక గిరిజనుల ప్రాణాల్లో గాల్లో కలుస్తున్నా... అంత ప్రమాదం ఏమీ లేదని వింత వాదన వినిపిస్తోంది. వ్యాధులు నియంత్రణలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పడం విమర్శలకు తావిస్తోంది.
మన్యంలో అంటువ్యాధులు, విషజ్వరాలు
విశాఖ మన్యంలో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలాయి. ప్రాణాంతక ఆంత్రాక్స్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయినా ప్రభుత్వం ఈ సమస్యలను చిన్నది చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. మన్యంలో ఉన్నదంతా అమాయక గిరిజనులే. ఏదీ అడగలేరు. అధికారులు, వైద్యులు చెప్పినట్టు చేయడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మన్యంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది కొరత ఉంది. మందులు అందుబాటులో లేవు. పారా సిట్మాల్‌ టాబ్లెట్లే సర్వరోగ నివారిణిగా రోగులకు అందిస్తున్నారు. అత్యవసర  పరిస్థితుల్లో రోగులను పట్టణప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలిద్దామన్నా అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. డోలీలో కట్టుకుని తరలించాల్సిన దుస్థితి నెలకొంది. 
ఆంత్రాక్స్‌ కు మందులు అందుబాటులో లేవు..
ప్రాణాంతక ఆంత్రాక్స్‌ ప్రబలినా మందులు అందుబాటులో లేవు. వీటిని విదేశాల నుంచి తెప్పించాల్సి ఉందని చెబుతున్నారు. ఆంత్రాక్స్‌ అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నది అధికారుల వాదన. వ్యాధి నిర్ధాణరకు అవసరమైన ప్రయోగశాలు కూడా అందుబాటులో లేవు. రక్తపు నమూనాలు సేకరించి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ నుంచి వచ్చిన నివేదిక వచ్చిన తర్వాత మన్యం గిరిజనులకు సోకింది ఆంత్రాక్సా ? కాదా ? అన్నది తేలుతుంది. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో ప్రబలిన విషజ్వరాలు, అంటువ్యాధులు, ప్రాణాంతక ఆంత్రాక్స్‌ను దృష్టిలో పెట్టుకుని హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే అలాంటి పరిస్థితిలేదని ప్రభుత్వం సమాధానం ఇస్తోంది. విశాఖ మన్యంలో దయనీయ పరిస్థితులు ఉన్నా.. విమర్శల నుంచి తప్పించుకునేందుకే  విషజ్వరాలను ప్రభుత్వం తక్కువచేసి చూపిస్తోందని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. 
 

13:01 - June 29, 2017

మూడేళ్లుగా మూడుముళ్ల కోసం పోరాటం...మహిళా పోలీసులకు మొర పెట్టుకున్నా..కనిపించిన వారి కాళ్లా వేళ్లా పడ్డా..ఎప్పటికప్పుడు దాట వేస్తున్న కాప్స్..కట్టుకున్నవాడితో కాపురం చేయలేక..కులం అడ్డుగోడలు కట్టి గడపలోకి రానీయక..హైదరాబాద్ లో మరో అబల పోరాటం..

మూడు ముళ్ల బంధం నిలుపుకొనేందుకు ఓ మహిళ మూడేళ్లుగా పోరాటం చేస్తోంది. ప్రేమ ముసుగులో వాంఛ తీర్చుకుని ఓ బిడ్డకు తల్లిని చేసిన వాడు గుట్టుగా కాపురం చేశాడు. అత్తరాంటిలో అడుగు పెట్టేదెప్పుడు ? అని ఆమె నిలదీస్తే కులం తక్కువ అని అంటున్నాడు. కాపురం చేయడానికి కులం అడ్డు రాలేదా ? అంటూ చంటి బిడ్డతో అభాగ్యురాలు పోరాటం చేస్తోంది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

 

12:55 - June 29, 2017

ప.గో : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో పర్యటిస్తున్నారు. సాంఘిక బహిష్కరణకు గురరైన దళితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:53 - June 29, 2017

ఓ వివాహితను వేధించాడు..లోబర్చుకొనేందుకు ప్రయత్నించాడు. నెట్ లో ఫొటోలు పెడుతానంటూ బెదిరించాడు. ఆమె భరించలేక ఫిర్యాదు చేస్తే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంతకీ అతను ఎవరో తెలుసా ? ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్...కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ తుంగ రమేష్ ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా రూ. 20వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:52 - June 29, 2017

శ్రీకాకుళం : అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా.. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. ఎప్పటిలానే ఆ నేత హవా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే.. అవినీతి నేత బండారాన్ని బయటపెడతామాని చెప్పిన టీడీపీ అధినాయకుడు.. ఇప్పుడు సైలెంట్‌ అయ్యారు. తమపార్టీకి పవర్‌ వచ్చినందున ఇక ఆయన అవినీతి సామ్రాజ్యానికి బీటలు తప్పవనుకున్న అధికారపార్టీ కార్యకర్తలకు అడియాశలే మిగిలాయి. పవర్‌లో ఉన్నా..లేకున్నా.. విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రాభవం తగ్గని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పాలిటిక్స్‌పై టెన్‌టీవీ ఫోకస్‌.. 
బొత్సపై ఆరోపణలు 
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై వచ్చినన్ని ఆరోపణలు మరే నేతపై వచ్చిఉండవేమో.. వోక్స్‌వ్యాగన్‌ కార్ల కుంభకోణం దగ్గర నుంచి ఇసుక మాఫియా, లిక్కర్‌ సిండికేట్‌ లాంటి సవాలక్ష అంశాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ప్రాభవం ఏమాత్రం తగ్గలేదు. తాము అధికారంలోకి వస్తే..బొత్స అవినీతి బండారాన్ని బయటపెడతామని అప్పట్లో గగ్గోలు పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అధికారం చేపట్టాక  సైలెంట్‌ అవడంపై  టీడీపీ క్యాడర్‌ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
బొత్సపై ఆరోపణలు ఎందుకు రుజువుచేయలేదు..? 
బొత్స సత్తిబాబుది ప్రతిపక్షాలు ఎపుడూ మింగుడుపడని నైజమే అంటున్నారు అయన అనుచరవర్గం. కాంగ్రెస్‌ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సత్తిబాబు దాటికి సాక్షాత్తూ చంద్రబాబే పలు సందర్భాల్లో  నిరసనకుదిగడం.. అప్పట్లో టీడీపీ క్యాడర్‌కు బాగా తెలుసు. మరి అపట్లో అంతలా ఊగిపోయిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా బొత్సపై తాము చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి ఎందుకు ప్రయత్నించడంలేదు..?  దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని బొత్స సత్తిబాబు చేస్తున్న సవాల్ ను టీడీపీ ప్రభుత్వం ఎందుకు స్వీకరించలేకపోతోంది..? 
చంద్రబాబు బొత్స అవినీతి లెక్కలు తీస్తారనుకున్న టీడీపీ క్యాడర్‌ 
బొత్సపై ఆరోపణలకే పరిమితం అయిన టీడీపీ 
2014లో ఎన్నికల్లో టిడిపి అధికారం చేజిక్కించుకోవడంతో ఇక సత్తిబాబుకు సంబంధించిన అవినీతి లెక్కలు బయటకు తీయడం ఖాయమని ప్రత్యర్థులు భావించారు. ప్రధానంగా విజయనగరం జిల్లాలో ఈ చర్చ ఎక్కువగా జరిగింది. జిల్లా కేంద్రసహకార బ్యాంకు కుంభకోణంలో బొత్స పాత్ర ..  లిక్కర్ సిండికేట్‌లో లెక్కలు తేల్చేస్తారని  ఎదురు చూశారు. వీటితోపాటు విజయనగరం  సమీపంలోని గాజులరేగ గ్రామం వద్ద ప్రభుత్వ చెరువును కబ్జా చేసి.. ఓ కళాశాలను నిర్మించారని ఆరోపించిన చంద్రబాబు అప్పట్లో ఆ ప్రాంతాన్ని  స్వయంగా పరిశీలించారుకూడా. చివరికి ఈ చెరువు విషయంలోకూడా ఏలాంటి అవినీతిని బాబు సర్కార్‌ నిరూపించలేకపోయిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతోపాటు  అవుట్ సోర్సింగ్ పోస్టులు, బదిలీలు, మాంగనీసు, ఇసుక మైనింగ్, ఇందిరమ్మఇళ్ల నిర్మాణంలో బొత్స అవినీతి, అక్రమాలకు అడ్డేలేకుండా పోయిందని  విమర్శలు గుప్పించిన టీడీపీ ..అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా  అవే విమర్శలతో కాలంగడిపేస్తున్నారే తప్ప ..   ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయిందిని విజయనగరంజిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. సత్తిబాబుపై ఆరోపణలను నిగ్గుతేల్చడం మాట అటుంచి, బొత్స , ఆయన అనుచర వర్గం టీడీపీపై ఎదురు దాడికి దిగడం అధికారపార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. 
టీడీపీ క్యాడర్‌ అసంతృప్తి  
చివరికి  తమపై వస్తున్న అవినీతి ఆరోపణలను కూడా టీడీపీ నేతలు గట్టిగా కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నారని పసుపుపార్టీ క్యాడర్‌ ఆవేదన చెందుతున్నారు.  వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణారంగారావుల రియాక్షన్‌ చప్పగా ఉందని జిల్లా టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇదిలావుంటే ..  అధికారంలో లేకపోయినా.. బొత్స , ఆయన అనుచరవర్గం దర్జాగా ప్రభుత్వ పెద్దలతో తమ పనులు చేయించుకోవడంపై  స్థానిక టీడీపీ క్యాడర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతలా  ఆరోపణలు చేసిన టీడీపీ అధినేత ఇపుడు సైలెంట్‌ అవడంలో  మతలబు ఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికైనా బొత్స సవాల్ కు తగురీతిలో సమాధానం చెప్పి భవిష్యత్ ఎన్నికలలో ఆయన స్పీడ్ కు అడ్డువేయాలని, లేకుంటే జిల్లాలో  సత్తిబాబు మార్క్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని టిడిపి కార్యకర్తలు  చెప్పుకుంటున్నారు. 

 

అక్బరుద్దీ పై దాడి కేసులో నలుగురికి శిక్ష

హైదరాబాద్: మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను నాంపల్లి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ పహిల్వాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన న్యాయస్థానం... హసన్‌(ఏ2), అబ్దుల్లా(ఏ3), వాహిద్‌(ఏ5), వహ్లాన్‌(ఏ12)లను దోషులుగా నిర్ధారించింది. వీరికి రేపు శిక్షలు ఖరారు చేయనుంది. ఈ కేసులో మొత్తం 14 మందిపై కేసు నమోదు కాగా.. మహ్మద్‌ పహిల్వాన్‌ సహా 10 మంది నిర్దోషులుగా బయటపడ్డారు.

12:46 - June 29, 2017

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురంలో ట్రాఫిక్‌జాం స్థానికులకు చుక్కలు చూపించింది.. రేల్వే గేటు దగ్గర భారీ వాహనం ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.. కురుపాంనుంచి విశాఖ వెళుతున్న తర్స్‌ వాహనం సెక్యూరిటీ గేటును తాకి నిలిచిపోయింది.. వాహనంపై ఎక్కువ ఎత్తులో మిషనరీలు ఉండటంతో అక్కడే ఇరుక్కుపోయింది.... రెండుగంటలపాటు శ్రమించిన సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు..  

 

12:43 - June 29, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 5న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికకు వచ్చే నెల 4న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. జులై 18 వరకు నామిషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు జులై 21 వరకు గడువు ఉంది. ఆగస్టు 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10వ తేదీలో ముగుస్తుంది. 

 

12:42 - June 29, 2017

విశాఖ : ఓ ప్రైవేటు బస్సులో మంటలు స్థానికులు టెన్షన్ పెట్టాయి.. విశాఖలోని చైతన్య కాలేజీ సమీపంలో బస్సుకు మంటలు అంటుకున్నాయి.. మంటల్నిచూసిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు.. అప్పటికే బస్సు సగానికిపైగా కాలిపోయింది.. 

 

వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి ఈటల భేటీ

హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జీఎస్టీ అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం.

12:24 - June 29, 2017

కొన్నాళ్లుగా కనిపించని భర్త కోసం వెతుకుతున్న ఆమెకు విషయం తెలిసిందే. నేరుగా భర్త వద్దకు వెళ్లకుండా పీఎస్ లోకి వెళ్లింది. పోలీసులు అతడిని కాస్తా పట్టుకుని వస్తే అసలు కథ బయటపడింది. అతను ఎవరో కాదు. నిత్య పెళ్లికొడుకు. నాలుగో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న మూడో భార్య ఫిర్యాదుతో గుట్టురట్టయ్యింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

 

కాసేపట్లో అక్బరుద్దీన్ పై దాడి కేసులో తీర్పు

హైదరాబాద్: కాసేపట్లో అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.

12:15 - June 29, 2017

నాన్న.. అమ్మ ప్రాణం పోసి జీవమిస్తుంది..ఆప్రాణానికి.. ఓ రూపు ఇచ్చి.. వ్యక్తిగా తీర్చిదిద్దేది ‘నాన్న’.. ప్రతి విజయంలో వెనుక ఉంటూ.. ఏం కష్టం చవ్చినా నేనున్నానంటూ..ఆసరా ఇచ్చే శక్తి ‘నాన్న’. కానీ ఈ నాన్నలకు ఏమవుతుంది ? ఒక్క నిమిషంలో ఏమీ ఆలోచించకుండా తమ కన్నవారినే బలి తీసుకుంటున్నారు. ఎందుకిలా ? 


హైదరాబాద్..నిజామాబాద్ జిల్లాలో రెండు ఘోర దుర్ఘటనలు జరిగాయి. నాన్నలే కాల యముళ్లయ్యారు. మొత్తంగా నాలుగు పసిప్రాణాలు..అకారణంగా గాల్లో కలిసిపోయాయి. చేయని తప్పులకు బలి పీఠమెక్కారు. ఆడుకుంటున్న చిన్నారులను పిలవడంతో ‘నాన్న’ అరుచుకుంటూ వచ్చారు. కానీ ఆ నాన్న కాలయముడు అవుతాడు. ఇది తెలుసుకోలేని పసివాళ్లు..అతని ఒడిలో అలా వాలిపోయారు..ఆ దుర్మార్గుడు రోకలిబండతో మోది ఆ చిన్నారులను చంపేశాడు. ఆ తరువాత తాను ఉరివేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో  జరిగిన ఘోరానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

12:14 - June 29, 2017
12:09 - June 29, 2017

విజయవాడ : ఏపీలో ఆరాచకత్వం రాజ్యమేలుతుందని సీఐటీయూ రాష్ట్ర నేత గఫూర్ విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని.. విజయవాడ, లెనిన్‌ సెంటర్‌లో శ్రామికులు శంఖారావం పూరించారు. ఈ కార్యక్రమంలో గఫూర్‌ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రం ధరలు మండిపోతున్నాయని తెలిపారు. కనీస వేతనం చట్టం అమలు చేయడం లేదన్నారు. సుప్రీంకోర్టుకు తీర్పు ప్రకారం సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని...కానీ ఇవ్వడం లేదన్నారు. ఇది ప్రపంచం బ్యాంకు కల్చర్ అని..ఏపీ కల్చర్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
స్వరూపరాణి.. 
సీఎం చంద్రబాబు కార్పొరేట్, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అక్వాఫుడ్ పార్కును తరలించాలని ప్రజలు కోరుతున్నా....తరలించడం లేదని చెప్పారు. బాబు.. ఉపాధిని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ...

అహ్మదాబాద్: మూడు దేశాల ప‌ర్య‌ట‌న ను ముగించుకొని వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ ఇప్పుడు సొంత రాష్ట్రం గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న అహ్మ‌దాబాద్, రాజ్ కోట్, మొడ‌స్సా, గాంధీన‌గ‌ర్ లో జ‌రిగే కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన‌నున్నారు. ఇవాళ ఉద‌యం అహ్మ‌దాబాద్ కు చేరుకున్న మోదీ అహ్మ‌దాబాద్ లోని స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మంలో జ‌రిగే శ‌తాబ్ది ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఆశ్ర‌మంలో శ్రీమ‌ద్ రాజ్ చంద్ర‌జి 150 వ జ‌యంతి ఉత్స‌వాల్లోనూ ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఇవాళ సాయంత్రం రాజ్ కోట్ కు వెళ్ల‌నున్నారు మోదీ.

కల్తీ విత్తనాలను అరికట్టేందుకు విత్తనచట్టం తేవాలి: దత్తాత్రేయ

ఢిల్లీ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు విత్తన చట్టాన్ని తీసుకురావాలని దత్తాత్రేయ కోరారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి వచ్చే సంవత్సరం చట్టం తీసుకువచ్చేలా చూస్తామని దత్తాత్రేయ పేర్కొన్నారు. సీడ్ సర్టిఫికేషన్ చేసిన కంపెనీలే విత్తనాల అమ్మేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలన్నారు.

పోలవరం పై ఉండవల్లి వ్యాఖ్యలు అవాస్తవం: మంత్రి దేవినేని

విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ డ్యామ్ కాకుండా కాపర్ డ్యామ్ తో సరిపెడతామని ఉండవల్లి వ్యాఖ్యలు అవాస్తవం అని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. పోలవరం పై బురదజల్లేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉండవల్లి ఏ పార్టీలో లేనంటూనే కాంగ్రెస్ పార్టీ వేదికపై జగన్ డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలంతా కలిసి పోలవరం ప్రాజెక్టు పై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్ష

హైదరాబాద్: సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ ఎస్పీ సింగ్ సమీక్ష నిర్వహించారు.

11:56 - June 29, 2017

హైదరాబాద్ : రైల్‌ రోకో కేసులో సికింద్రాబాద్‌ రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని, కేటీఆర్‌, పద్మారావు హాజరయ్యారు. రైల్‌రోకో కేసులో విచారణ కోసం మంత్రులు కోర్టుకు వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో కేసు నమోదైంది. రైలును అడ్డుకున్నారంటూ అధికారులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:51 - June 29, 2017

విజయవాడ : కార్మికుల సమస్యలను పరిష్కరించాలని.. విజయవాడ, లెనిన్‌ సెంటర్‌లో శ్రామికులు శంఖారావం పూరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నేత గఫూర్‌ పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:49 - June 29, 2017

హైదరాబాద్ : జీఎస్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వస్త్రవ్యాపారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలంటూ మూడురోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వస్త్రాలపై జీఎస్‌టీ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:46 - June 29, 2017

హైదరాబాద్ : బ్యుటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతిపై ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. శిరీషపై అత్యాచారం జరగలేదంటూ ఫోరెన్సిక్ వైద్యులు స్పష్టం చేశారు. శిరీష దుస్తులపై మరకలు అత్యాచారానికి సంబంధించినవి కావని నివేదికలో తెలిపారు. ఈ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందజేశారు. పూర్తిస్థాయి నివేదిక త్వరలో ఇస్తామని ఫోరెన్సిక్‌ వైద్యులు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీలు

హైదరాబాద్: ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆకస్మిక తనిఖీ చేశారు.

లెనిన్ సెంటర్ లో గళమెత్తిన కార్మికులు..

విజయవాడ : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు గళమెత్తారు. లెనిన్ సెంటర్ లో శ్రామికులు శంఖారావం నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో సీఐటీయూ నేత గఫూర్ పాల్గొన్నారు. 

11:14 - June 29, 2017

ఏదైనా సంస్థ నష్టాల్లో ఉంటే ఏం చేస్తారు ? అది ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉంటే ? ఏముంది నష్టాల బారి నుండి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటే బెటర్ అని అనుకుంటాం. కదా...కానీ ప్రస్తుతం ఉన్న పాలకులు అలా చేయడం లేదు. ఏకంగా ఆ సంస్థలను అమ్ముకోవచ్చు అని చెబుతోంది. ఎయిర్ ఇండియా విషయంలో ఇలాగే జరుగుతోంది. నష్టాల నెపంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘ఎయిర్ ఇండియా’ అమ్మకానికి ఏకంగా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని కేంద్రం యోచిస్తోందని..ఇలా చేయడం సబబు కాదని కమ్యూనిస్టులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. 

 

1932లో టాటా ఎయిర్‌లైన్స్‌..
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవాలని కేంద్రం యోచిస్తోందనే విమర్శలున్నాయి. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా విషయంలో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకైక విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’. 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను టాటా సన్స్ దీనిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దిగ్గజ పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా తొలి ఫ్లైట్‌లో కరాచి -ముంబయి మధ్య ప్రయాణించారు. అనంతరం 1946లో టాటా ఎయిర్ లైన్స్ ప్రభుత్వ కంపెనీగా మారిపోయింది. తరువాత దీనిని ‘ఎయిర్ ఇండియా’ అని నామకరణం చేశారు. విమాన సర్వీసులు రాకముందు విమానయాన రంగంలో దీనిదే గుత్తాధిపత్యంగా ఉండేది.  దేశీయ సర్వీసులలో దానికి 14.6 శాతం, అంతర్జాతీయ సర్వీసులలో 17 శాతం మార్కెట్ షేర్ ఉండేది. భారతీయ విమాన సంస్థలలో పెద్దన్నగా ఉన్న ఎయిర్ ఇండియా 2007 నుండి నష్టాల బాటలో పయనించడం మొదలు పెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలపై గత పాలకులు..ప్రస్తుత పాలకులు సరియైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే పలు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల బాటలో పయనిస్తున్నాయనే విమర్శలున్నాయి. 2012లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూ.30,231 కోట్ల నిధులకు గాను ఎయిర్ ఇండియాకు రూ.23,993 కోట్లు సాయం అందింది. 


నీతి ఆయోగ్ సూచనలు..
కానీ రుణాలు పెరిగిపోతుండడం..సంస్థ నష్టాల బాటలో ఉండడంతో దీనిని వదిలించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటీకరించాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. దేశీయ మార్కెట్‌లో ఎయిరిండియా మార్కెట్ షేర్ పదేళ్లలో 35 శాతం నుంచి 14శాతానికి పడిపోయింది. సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో మరో రూ. 30,000 కోట్లను ఖర్చు చేసే కంటే ఈ సొమ్మును ఇతర రంగాల్లోకి మళ్లిస్తే బెటరని ఉచిత సలహా ఇచ్చిందని తెలుస్తోంది. సంస్థెకున్న విలువైన స్థిరాస్తులన్నింటినీ వేరు చేయాలని..మరో కంపెనీలకు బదలాయించాలని నీతి ఆయోగ్ సూచిస్తోంది. నీతి ఆయోగ్ చేసిన సూచనలను దేశ పౌర విమానయాన పరిశీలించింది. కానీ ఇండియన్ ఎయిర్ లైన్ విలీనం కారణంగా ఎయిరిండియా ఈ దుస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు సుమారు 50 వేల కోట్ల అప్పులున్నాయి. 

కేంద్ర కేబినెట్ నిర్ణయం..
ఎయిర్ ఇండియా వాటా విక్రయానికి స్థానిక..దేశీయ విమానయాన సంస్థలు బిడ్ వేస్తే బాగుగా ఉంటుందని నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ దిశగా ఎయిర్ ఇండియా వాటా విక్రయ ప్రణాళికలను రూపొందించాలని పౌర విమానయాన శాఖ అధికారులకు సూచనలు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు... ఎయిర్ ఇండియా సంస్థలో చేర‌డం వ‌ల్ల సంస్థ మ‌రింత నాణ్యంగా, వేగంగా ప‌ని చేస్తుంద‌ని పేర్కొడనడం గమనార్హం. మరి దీనిపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు ఎలా స్పందిస్తారు ? వివిధ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్...

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జులై 18..నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ జులై 21..గా నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీన ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలను విడుదల చేయనున్నారు. 

ఇంకా వస్త్రదుకాణాలకు తాళాలు..

హైదరాబాద్ : వస్త్రదుకాణాలు ఇంకా తెరుచుకోలేదు. జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా దుకాణాలు బంద్ పాటిస్తూ నిరసన తెలియచేస్తున్నారు. సికింద్రాబాద్ లో వ్యాపారులు ప్రదర్శన నిర్వహించారు. 

రైల్వే కోర్టుకు మంత్రులు...

సికింద్రాబాద్ : రైల్వే కోర్టుకు మంత్రులు నాయినీ, కేటీఆర్, పద్మారావులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలీ రైల్వేస్టేషన్ లో రైలు రోకో నిర్వహించడంతో వీరిపై కేసు నమోదైంది. 

శిరీష..ప్రాథమిక నివేదిక రెడీ..

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష చనిపోయిన కేసులో బంజారాహిల్స్ పోలీసులకు ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టు అందింది. శిరీష దుస్తులు, శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఆత్యాచారం జరగలేదని రిపోర్టులో వెల్లడించినట్లు తెలుస్తోంది. 

 

10:43 - June 29, 2017

నెల్లూరు : జిల్లాలోని గూడూరు ఏరియా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ గదిలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్ని చూసిన రోగులు, వారి బంధువులు భయంతో బయటికి పరుగులు తీశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:41 - June 29, 2017

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో 14 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపింది.. ఈనెల 1 నుంచి బాలిక కనిపించకుండాపోయింది. కూలీ డబ్బులు ఇస్తానంటూ సుధారాణి అనే మహిళ బాలికను తీసుకెళ్లిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.. తమ కూతురు ఆచూకీ తెలియడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో  ప్రజాసంఘాలను ఆశ్రయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:38 - June 29, 2017

చైనా : తన కూతురి కోసం ఆ తండ్రి.. తపించిపోతున్నాడు. ఏం చేసినా తన కూతురు బతకదని తెలిసీ ఎవరూ చేయని పని చేశాడు. పాప కోసం ఓ సమాధిని తవ్వాడు. ప్రతి రోజూ ఆమెను ఆ సమాధి వద్దకు తీసుకెళ్లి కాసేపు ఆడిస్తున్నాడు. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. జాంగ్‌ జిన్‌ లీ అనే రెండేళ్ల బాలిక రెండు నెలల వయస్సు నుంచి రక్త సంబంధ వ్యాధితో బాధ పడుతోంది. 10 లక్షలు ఖర్చు చేసి ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇప్పించారు. కానీ అవేమీ పాపను కాపాడలేకపోయాయి. తన కూతురుకు తలసీమియా వ్యాధి సోకిందని.. ఇప్పటివరకూ తమకు తెలిసిన వాళ్లందరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి రక్త మార్పిడి చేయిస్తున్నామని లియోంగ్ తెలిపాడు. పాప బతికేది ఇంకా కొన్ని రోజులేనని తేల్చేశారు. లియోంగ్‌ భార్య ప్రస్తుతం గర్భవతి.. ఆమె కూడా తన కూతురు కోసం తవ్విన గుంత ముందు కూర్చొని ఆమెతో ఆటలాడుతూ ఉంటుంది. ఆమె చనిపోవడాని కంటే ముందే.. సమాధిలో పడుకోబెట్టి ఆడుకుంటున్నామని లియోంగ్‌ తెలిపాడు. కనీసం ఇక్కడైనా తన బుజ్జితల్లి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాడు. 

 

10:35 - June 29, 2017

హైదరాబాద్ : ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు.   
చివరి దశకు ఇంజనీరింగ్‌ అడ్మిషన్ల ప్రక్రియ
ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో... 313 కాలేజీల్లో 68 వేల 810మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. విద్యార్థులకు  కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేసిన తర్వాతే సీట్ కన్‌ఫాం అవుతుంది. కాబట్టి అలాట్‌మెంట్స్ అయిపోయిన వెంటనే 5వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు
ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన చాలామంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు రాలేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి కూడా తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా కలిపి మొత్తంగా 91 వేల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా కన్వీనర్‌ కోటాలో 62 వేల మంది విద్యార్థులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దాదాపుగా విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు స్థాయిలో సీట్లున్నాయి. 
ఇతర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి 
అయితే ఈ ఏడాది చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరేకంటే ఇతర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 204 ఇంజనీరింగ్‌ కళాశాలలుండగా వీటిలో 50 మాత్రమే కొంచెం నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.  మిగతా కాలేజీలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో చేరితే  ..నాణ్యమైన విద్యను అందించి... ప్లేస్‌మెంట్స్‌ కల్పించే కాలేజీల్లోనే చేరాలని విద్యార్థులు భావిస్తున్నారు.  దీంతో  టాప్‌ కాలేజీల్లో సీటు రాని వారు... వేరే కోర్సుల్లో చేరేందుకు అన్వేషణ మొదలుపెట్టారు. అంతేకాదు డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తూ.గో.లో విష జ్వరాలు..

తూర్పుగోదావరి : ఏజెన్సీలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. అరకొర వైద్య సేవలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. 

 

10:32 - June 29, 2017

హైదరాబాద్ : ఫోరెన్సిక్‌ నివేదికనే కీలకం...ఇప్పటివరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా వివరాలు సేకరించగలిగారు..వాంగ్మూలాలు రికార్డ్ చేయగలిగారు..కాని బ్యూటీషియన్ శిరీష,ఎస్సై ప్రభాకర్‌రెడ్డి డెత్‌ కేసుల్లో కీలకం ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు...ఆ నివేదిక వస్తే రెండు మరణాలపై పూర్తి క్లారిటీతో పాటు మలుపులకు తెరపడుతుందో..లేక మరో ట్విస్ట్‌ ఉంటుందో చూడాలి...
శిరీషపై అత్యాచారమా..? ప్రయత్నమా..?
బ్యూటీషియన్ శిరీషపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారం చేశాడా..? లేక ప్రయత్నం మాత్రమేనా..? లేక ఆ ముగ్గురు కలిసి ఏదైనా చేశారా..? ఇవన్నీ తేలాలంటే ప్రధానంగా మారిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు కీలకమైంది...ఇప్పటికే ఆ రిపోర్టు ఎప్పుడొస్తుందాని ఎదురుచూస్తున్న పోలీసులు...యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉత్కంఠగా మారింది...అసలు ఈ కేసులో ఏం జరిగిందన్నది ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండగా...కీలకమైన రిపోర్టు ఆధారంగానే అన్నీ తేలిపోనున్నాయి.... శిరీషను హత్య చేశారంటూ ఆమె కుటుంబీకుల అనుమానాలు కూడా నివృత్తి కానున్నాయి...ఇప్పటి వరకు పోలీసులు నిందితులను పలుమార్లు విచారించడంతో పాటు వివరాలు సేకరించినా ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు...ఇప్పుడు ఆ రిపోర్టు వస్తేనే అసలు విషయాలు బయటపడతాయి....
ఎస్సై ప్రభాకర్ రెడ్డి బలవన్మరణం... ముగిసిన ప్రాథమిక విచారణ 
కూకునూరు పల్లిలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి బలవన్మరణంపై ప్రాథమిక విచారణ ముగిసింది. ప్రభాకర్ రెడ్డి చేతి వేల్లు, ఎస్సై పాదాల ముద్రలు, పిస్టల్ పై ఉన్న డస్ట్ కెమికల్ డస్ట్ ఎవిడెన్స్ తో పాటు అనేక కీలక అధారాలను పోలిసులు సేకరించారు. కాల్చుకున్న అనంతరం కుర్చీపై ఏ విదంగా ఒరిగిపోయారు . పరిసర ప్రాంతాల అదారాలు సేకరించారు. పిస్టల్ పై ప్రబాకర్ రెడ్డి వేలిముద్రలు సీన్ అఫ్ అఫెన్స్ ను తగిన ఎవిడెన్స్ ను పోలిసులు సేకరించారు.
మరిన్ని వివరాల కోసం నిందితుల విచారణ..
రెండు రోజుల కస్టడిలో కుకునూరు ఘటనపై ప్రత్యేక విచారణాధికారి, సంగారెడ్డి డిఎస్పీ తిరుపతన్న, కుకునూరు పిఎస్ సిఐ నరేందర్ నేత్రుత్వంలోని దర్యాప్తు అధికారుల బ్రుందం హైదరాబాద్ తరలివచ్చారు. నేరుగా బంజారాహీల్స్ పిఎస్ లో నిందితులను విచారణ జరిపారు. ఈ విషయంలో శ్రావణ్ రాజీవ్ లను వేరువేరుగా అనేక సార్లు ఇద్దరిని కలిపి విచారించినట్లు తెలుస్తోంది. వీరి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. శ్రావన్ ఏవిదంగా ప్రభాకర్ రెడ్డిని అప్రొచ్ అయ్యారు. బంజారాహీల్స్ రోడ్ నంబరు3లోని కాఫీ పబ్ లో గంట సేపు ఏం చర్చించుకున్నారు. క్వార్టర్ లో అసలు సీన్ ఏం జరిగింది. ఎలా జరిగిందన్న అనేక ప్రశ్నలను అన్నికోణాల్లో ప్రశ్నించారు. ఎస్సై ప్రభాకర్ తో భయపెట్టి శిరిషాను దూరం చేసుకొవాలని ముందుగానే నిర్ణయించుకున్నారా లేక ప్రభాకర్ రెడ్డి ఎ విధంగా శిరిషాను లోబర్చుకొవాలని బావిస్తాడు అన్న కొణాల్లోను విచారణ సాగింది. సాంకేతిక అదారాలు, ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక కస్టడి రిపోర్టును అదారంగా చేసుకుని 90 రోజుల్లో నాంపల్లి కోర్టులో బంజారాహీల్స్ పోలిసులు ఛార్జీషీటు దాఖలు చేయనున్నారు. ఈ కేసు ఎన్నిమలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.

 

జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2121 క్యూసెక్కులు..

జోగులాంబ : జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2121 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 317.45 మీ.. పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీ.గా ఉంది. 

 

మిర్యాలగూడలో బాలిక మిస్సింగ్..

నల్గొండ : మిర్యాలగూడలో 14 ఏళ్ల బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈనెల 1వ తేదీ నుండి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.  కూలి డబ్బులు ఇస్తానని సుధారాణి అనే మహిళ తీసుకెళ్లిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

10:27 - June 29, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగిన 3ఏళ్లు పూర్తైనా .. ఉద్యోగుల పంపిణీలో వివాదాలుకొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ స్థానికత కలిగిన 24 మంది ఆఫీసర్లను తీసుకోడానికి ఏపీ ప్రభుత్వం విముఖత చూపింది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. 
నేటికీ పూర్తికాని ఉద్యోగుల విభజన
రాష్ట్ర విభజనానంతరం ఉద్యోగుల విభజన కూడా జరిగింది. ఉద్యోగుల పంపకాల కోసం కేంద్ర ప్రభుత్వం కమల్‌నాథన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫారసులను చేసింది. దాని ప్రకారం ఉద్యోగులను 58:42 రేషియాలో రెండు రాష్ట్రాలకు కేంద్రం  పంచింది. కాని సెక్రటేరియట్‌ ఉద్యోగుల విభజనపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది.
తెరపైకి సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల  వివాదం
కమల్‌నాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు ఏపీ స్థానికత కలిగిన 24మంది సెక్రటేరియట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ ఏపీకి ఆప్షన్‌ పెట్టుకున్నారు. దీంతో వారిని కమల్‌నాథన్‌ కమిటీ ఏపీకి కేటాయించింది. ఈ కేటాయింపులు చేసి కూడా 5 నెలలు గడిచింది. దీంతో 24మంది సెక్షన్‌ ఆఫీసర్లు విధులు నిర్వహించేందుకని ఆశగా ఏపీకి వెళ్లారు. అయితే అక్కడ వారికి ఊహించని షాక్‌ తగిలింది.  24మంది  అధికారులను తీసుకునేది లేదని ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఓ లేఖను కూడా రాసింది.
ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
తెలంగాణ సెక్రటేరియట్‌లో మొత్తం 244 మంది  ఎస్‌వోలు ఉన్నారు. అయితే వీరిలో ఇప్పటికే ఏపీకి చెందిన 84మంది ఎస్‌వోలు, 16మంది ఏఎస్‌వోలు పనిచేస్తున్నారు.  మళ్లీ ఈ 24 మంది కూడా  చేరితే వారి సంఖ్య మరింత పెరగనుంది.  ఏపీ సర్కారు తీరుపై  తెలంగాణ సెక్షన్‌ ఆఫీసర్లు మండిపడుతున్నారు.  మొత్తం ఏపీకి చెందిన వారే ఎస్‌వోలుగా పనిచేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ స్థానికత కలిగిన 24 మంది ఎస్‌వోలను తీసుకోవద్దని సీఎస్‌ను కోరారు.
తమకు న్యాయం జరుగడం లేదన్న ఉద్యోగ సంఘం నేతలు 
తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని .. స్వరాష్ట్రంలోనూ తమకు న్యాయం జరుగడం లేదని ఉద్యోగ సంఘం నేతలు అంటున్నారు. కమల్‌నాథన్‌ కమిటీ ఏపీకి కేటాయించిన తర్వాత ఏపీ ప్రభుత్వం అభ్యంతరం పెట్టడం ఏంటని వారు ప్రశ్నింస్తున్నారు. మొత్తానికి విభజన జరిగిన మూడేళ్లైనా ఇంత వరకు ఉద్యోగుల విభజన వివాదం నడుస్తూనే ఉంది.  ఏపీ సర్కార్‌ వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడూరులో ఫైర్ ఆక్సిడెంట్..

నెల్లూరు : గూడూరు ఏరియా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగుతుండడంతో రోగులు..వారి బంధువులు..ఆసుపత్రి సిబ్బంది బయటకు పరుగులు తీశారు. 

 

10:17 - June 29, 2017

ఢిల్లీ : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ భారత్‌ వెస్టిండీస్‌తో తలపడబోతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించిన ఉత్సాహంతో ఉన్న మిథాలీ సేన... వెస్టిండీస్‌తో పోరుకు సై అంటోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత క్రికెటర్లు నిలకడగా రాణిస్తున్నారు. ఓపెనర్లు స్మృతి మంధన, పూనమ్‌ రౌత్‌లతో పాటు టాపార్డర్‌లో మిథాలీరాజ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో గెలుపుపై టీం మరింత ధీమాగా ఉంది. మధ్యాహ్నం 3గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

 

10:14 - June 29, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ లేడీ పోలీస్‌ విధినిర్వహణలో డేరింగ్ డెసిషన్‌ తీసుకుంది.. నేతలు, కార్యకర్తలు చుట్టుముట్టినా ఏమాత్రం భయపడకుండా వారికి ధైర్యంగా సమాధానమిచ్చింది.. బులంద్‌షహర్‌ అనే ప్రాంతంలో..  పోలీస్‌ సర్కిల్‌ ఆఫీసర్‌గా శ్రేష్ఠా ఠాకూర్‌ పని చేస్తోంది. విధి నిర్వహణలో ఆమె చూపించిన ధైర్యం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మోటారు బైక్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తిని.. శ్రేష్ఠాకుమార్‌ లైసెన్స్‌ అడిగింది. అందుకతను తాను అధికార పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తనని చెప్పాడు. అయినా ఆమె చలాన్‌ ఇచ్చి 2 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పింది.. అతను అధికార పార్టీ వ్యక్తిననే గర్వాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. శ్రేష్ఠా, ఆమెతో పాటు ఉన్న కానిస్టేబుల్‌పై అరిచాడు. అతను మాటలు ఆపకముందే అరెస్ట్‌ చేసి వూచలు లెక్కపెట్టించింది శ్రేష్ఠ... న్యాయస్థానంలో హాజరుపరిచింది. అక్కడా ఆమెపై నోరెత్తడంతో.. మరో కొత్త సెక్షన్‌ వేసి జైల్లో పెట్టింది. 
తడబడకుండా విధులు నిర్వర్తించిన శ్రేష్ఠాఠాకూర్‌  
శ్రేష్ఠాఠాకూర్‌ ఏ మాత్రం తడబడకుండా తన విధులను నిర్వర్తించింది.. జరిగిన విషయం తెలిసి చుట్టుపక్కల అధికార పార్టీ దండు మొత్తం.. ఆమె స్టేషన్‌ ముందు ధర్నా చేసింది. ఓ పాతిక మంది ఆమె చుట్టూ ముట్టారు. ఆమె ఏ మాత్రం భయపడకుండా హుందాగా.. అంతమందికి సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. మేం రాత్రి ఇంట్లో పిల్లల్ని వదిలి ఉద్యోగానికొచ్చేది ఆటలాడటానికి కాదంటూ సమాధానమిచ్చింది. సరైన పత్రాలు లేకుండా స్కూటర్‌ నడిపేవాళ్లపై చర్యలు తీసుకోవడం తమ విధిలో భాగమని చెప్పింది. ముఖ్యమంత్రి నుంచి లేఖ తీసుకురండని.. అప్పుడు పని చేయడం మానేస్తానని సూటిగా చెప్పింది. అధికార పార్టీ నేతలని ఇలాంటి చేష్టలకి దిగితే ప్రజలు గూండాలంటారని హెచ్చరించింది. మరి శ్రేష్ఠా ధైర్యానికి ఎవరైనా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే కదా!

 

10:08 - June 29, 2017

నాని..టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకపోతున్న యంగ్ హీరో. మినమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన నటుడు. విభిన్నమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ ఇతర హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ’నిన్నుకోరి’, ‘ఎమ్‌సీఏ’ సినిమాలతో ‘నాని’ బిజీగా ఉన్నాడు.  ఇదిలా ఉంటే మరోసారి ఆయన ద్విపాత్రభినయం చేయనున్నాడంట. గతంలో ’జెండాపై కపిరాజు’ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెంటిల్ మెన్’ సినిమాలో కూడా రెండు పాత్రలను పోషించాడు. ముచ్చటగా మూడోసారి రిస్క్ కు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ’నానీ’ అంగీకరించాడు. ఈ సినిమాలోనే మరోసారి రెండు పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యాడట. రెండు సినిమాలు పూర్తయిన అనంతరం ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. రెండు పాత్రల విషయం నిజమైతే ‘నాని’ రిస్క్ వర్కవుట్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

 

10:06 - June 29, 2017

ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు..పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపీచంద్..జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. బాలీవుడ్ లో ఇటీవల పలువురు ప్రముఖుల జీవితాల ఆధారంగా బయోపిక్ లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత విక్రమ్ మల్హోత్ర ‘గోపిచంద్’ జీవిత చరిత్రను తెరపైకి ఎక్కిస్తున్నారు. తెలుగు..హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.  'నాపై సినిమా రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. విక్రమ్‌ తీయబోయే చిత్రంతో బాడ్మింటన్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి తచెందుతుందని ఆశిస్తున్నా' అని గోపీచంద్‌ పేర్కొన్నారు. గోపిచంద్ శిక్షణలో పీవీ సింధు పలు విజయాలు సాధించింది. ఇటీవలే ఒలింపిక్ రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. ఈమెపై కూడా ఓ బయోపిక్ రాబోతుందన్న విషయం తెలిసిందే. 
గోపిచంద్ కు జాతీయ స్థాయిలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమాను రూపొందించాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు ’గోపిచంద్’ పాత్ర..నటి రేవతి ‘గోపిచంద్’ తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.  'పుల్లెల గోపీచంద్ బ్యాట్మింటన్' అకాడమీ నిర్వహణ బాధ్యతలను సుబ్బరావమ్మ ప్రత్యేకంగా చూసుకుంటున్నారు. ఈ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత మేరకు రేవతిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. 

 

10:05 - June 29, 2017

నిరోష..ఒకప్పటి గ్లామర్ పాత్రలతో కుర్రకారు మతులను పొగొట్టిన నటి. ఘర్షణ..సింధూరపువ్వు..వంటి అనువాద చిత్రాలు..చిరంజీవితో స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్..నారీ నారీ నడుమమురారీ...వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె రాధిక చెల్లెలు. నటుడు రాంకీని వివాహం చేసుకున్న అనంతరం ‘ఒక ఊరీలో’ అనే చిత్రంలో నటించిన ఈమె మళ్లీ నటించలేదు. తాజాగా ఈమె రీ ఎంట్రీ ఇస్తోంది. సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న ‘నువ్వు తోపురా’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలుకరించనుంది. హరనాథ్ బాబు దర్శకత్వంలో డి.శ్రీకాంత్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నిరోష పాత్ర తమ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. 

 

10:04 - June 29, 2017

సోహా ఆలీఖాన్...ఏం చేసింది ? ఏందుకంత నెటిజన్లు మండి పడుతున్నారు ? ఓ ముస్లిం అయి ఉండి ఇలా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటి ‘సోహాఆలీఖాన్’...షర్మిలా ఠాగూర్ కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఈమె పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కునాల్ ఖేముతో ప్రేమాయణం చేసి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రంజాన్ పండుగ సందర్భంగా ఆమె ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. గులాబీ రంగు చీర కట్టుకుని..తలలో పూలు..బొట్టు..పెట్టుకుని..భర్త కునాల్ ఖేముతో కలిసి దిగిన ఫొటో పోస్టు చేశారు. అయితే ఆమె చీర కట్టడంపై నెటిజన్లు మండిపడ్డారు. కొందరు మాత్రం ఆమె చీరకట్టును ప్రశంసించారు. ముస్లిం అయి ఇలా చేస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ముస్లిం కాదు..అని ఎద్దేవా చేశారు. ఏది నచ్చితే ఆ దుస్తులు ధరిస్తారంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. 

 

09:48 - June 29, 2017

హైదరాబాద్‌ : బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. భద్రాచలంకు చెందిన జగన్నాథరావు కుటుంబం మౌలాలిలోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు బాలానగర్‌ చౌరస్తాకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు ఎదురుగా ఉన్న మరో ప్రైవేటు బస్సు కిందకు దూసుకుపోయింది. రెండు బస్సుల మధ్య చిక్కుకుని కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తనున్న జగన్నాథరావు, రమాదేవి, రమ, శ్రీనివాసరావు, రమేశ్‌ గాయపడ్డారు. క్షతగాత్రులను అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

09:47 - June 29, 2017

హైదరాబాద్ : ఈ సీజన్‌లో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో పత్తి రైతులతో అవగాహన సదస్సులు నిర్వహించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. పత్తి విత్తనాలు గుజరాత్‌కు ఎగుమతి కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పత్తి విత్తనాలతో నూనె తీసే మిల్లులకు ప్రరిశ్రమ హోదా కల్పించి, ప్రోత్సహించాలని సూచించారు. పత్తి ఎగుమతిదారులకు ఇస్తున్న ప్రోత్సహకాలను మూడు నుంచి ఐదు శాతానికి పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని హరీశ్‌రావు నిర్ణయించారు. 

 

09:43 - June 29, 2017

ఢిల్లీ : ఇస్రో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.. భారత్‌కు చెందిన జీశాట్‌-17 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.. ఫ్రెంచి గయానాలోని కౌర్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఏరియన్‌-5 రాకెట్‌ దీనిని అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. సమాచార రంగంలో నెలకొన్న ట్రాన్స్‌ఫాండర్ల కొరతను అధిగమించేందుకు ఈ ప్రయోగం ఉపకరిస్తుంది. ఈ ఉపగ్రహం బరువు 3,425 కిలోలు. దీనిలో మొత్తం 24 సీ ట్రాన్స్‌ఫాండర్లు, 2 లోయర్‌ సీ బాండ్‌, 12 అప్పర్‌ సీ బాండ్‌, 2సీఎక్స్‌, 2ఎస్‌ఎక్స్‌ ట్రాన్స్‌ఫాండర్లు ఉన్నాయి. సుమారు 15ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలు అందించనుంది.

 

09:37 - June 29, 2017

హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. 2011 ఏప్రిల్ 30న బార్కస్ లో అక్బరుద్దీన్ పై దాడి జరిగింది. పహిల్వాన్ వర్గం దాడి చేసినట్లు అక్బరుద్దీన్ కోర్టుకు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు

హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. 2011 ఏప్రిల్ 30న బార్కస్ లో అక్బరుద్దీన్ పై దాడి జరిగింది. పహిల్వాన్ వర్గం దాడి చేసినట్లు అక్బరుద్దీన్ కోర్టుకు తెలిపారు. 

భారత పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో భారత పోస్టులపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. 

09:22 - June 29, 2017

గరగపర్రు దళితులు వెలివేత అంశంపై వాడీ వేడి చర్చ జరిగింది. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత కర్నాటి విద్యాసాగర్ రావు, కేవీపీఎస్ నేత కొత్తపల్లి సుబ్రమణ్యం పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

09:18 - June 29, 2017

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆంత్రాక్స్, డయేరియా వంటి విష జ్వరాలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య వేదిక నాయకులు కామేశ్వరరావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'వానాకాలం పలకరించిందో లేదో అప్పుడే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు మంచానపడుతున్నారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులుతో జనం అవస్థపడుతున్నారు. దీనికితోడు విశాఖ కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నవారికి ఆంథ్రాక్స్ సోకినట్టు తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. మరోవైపు తూర్పోగోదావరి ఏజెన్సీలో జ్వరాల బారినపడి 16మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీలో వ్యాధులు విజృంభించడానికి కారణం ఏమిటి? వర్షాకాలం సీజన్ ఆరంభంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాల్సిన చర్యలేమిటి? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? వంటి ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:13 - June 29, 2017

ఢిల్లీ : జూన్‌ 30 అర్ధరాత్రి పార్లమెంట్‌లో కేంద్రం అట్టహాసంగా నిర్వహించనున్న జిఎస్‌టి కార్యక్రమానికి టిఎంసి హాజరు కాదని పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో కాంగ్రెస్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిఎస్‌టిని ప్రధాన మంత్రి నరేంద్రమోది ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా జిఎస్‌టి ప్రారంభించాలని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. రాష్ట్రపతిని ఆహ్వానించినపుడు ప్రధాని ఎలా లాంచ్‌ చేస్తారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా అన్నారు. జిఎస్‌టిపై ఎన్నో అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో హడావిడిగా ప్రారంభిచాల్సిన అవసరం ఏముందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

09:06 - June 29, 2017

హైదరాబాద్ : ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనుంది. ఓటర్ల నమోదు కోసం జీపీఆర్‌ఎస్‌ను వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ట్యాబ్‌ల ద్వారా అర్హులను మాత్రమే ఓటర్లుగా నమోదు చేయాలని సంకల్పించింది.
పక్కాగా ఓటర్‌ లిస్ట్‌
కొత్త పద్ధతిలో ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్‌... ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ప్రతి ఐదేళ్లకోసారి తయారు చేసే ఓటర్ల జాబితాను ఈసారి పక్కాగా తయారు చేయాలని అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటరు జాబితాలో డూప్లికేషన్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూలై 1 నుంచి  చేపట్టే ఓటరు నమోదు కార్యక్రమానికి జీపీఆర్‌ఎస్‌ వినియోగించనున్నారు.    
పాత పద్ధతికి స్వస్తి
గతంలో అధికారులు కాలనీలోనో, బస్తీలోనో ఒక చోట కూర్చొని ఓటర్ల జాబితాను తయారు చేసేవారు. దీంతో కొందరు తమ ఇష్టం వచ్చినట్టుగా నమోదు చేసేవారు. ఇక ఈ పద్ధతికి స్వస్తి పలకనున్నారు అధికారులు. ఈ మేరకు హైదరాబాద్‌ నగరంలో  టాబ్‌లతో ఓటర్ల నమోదును చేయనున్నారు. సిటీలో 3 వేల 8 వందల 79 మంది బూత్‌ లెవల్‌ అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి జాబితాలో కొత్తవి నమోదు చేయనున్నారు. జీపీఆర్‌ఎస్‌ను అనుసంధానం చేయడంతో ఒక పోలింగ్‌ కేంద్రం పరిధిలో పనిచేసే బీఎల్వో అదే ప్రాంతంలోని ఓటర్లను మాత్రమే నమోదు చేయగలడు. శాటిలైట్‌ మ్యాపింగ్‌ చేసిన ప్రాంతం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఎన్రోల్‌  చేయలేరు. దీంతో జాబితాలో డూప్లికేషన్స్‌ జరిగే అవకాశం ఉండదని, ఒకే పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఉన్న వారందరి ఓటర్లు ఒకే జాబితాలో ఉంటారని అధికారులు చెబుతున్నారు. నూతన పద్ధతిలో ఓటర్ల నమోదుకు హైదరాబాద్‌ ఎన్నికల అధికారి జనార్దన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.

08:53 - June 29, 2017

ప్రకాశం : జిల్లాలో దారుణం జరిగింది. మానవవత్వం మంటగలిసింది. నవ మాసాలు మోసి, కనిపెంచిన కన్నతల్లిని హతమార్చాడు ఓ ప్రభుద్ధుడు. మార్కాపురంలో ఆస్తి తగాదాలతో కొడుకు తల్లిని హత్య చేశాడు. మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. స్థానికులు సమచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

తల్లిని కడతేర్చిన తనయుడు

ప్రకాశం : జిల్లాలో దారుణం జరిగింది. మార్కాపురంలో ఆస్తి తగాదాలతో తనయుడు తల్లిని హతమార్చాడు. మృతదేహంపై కోరోసిన్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు.

నేడు పవిత్రి సంగమం వద్ద సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

విజయవాడ : నేడు పవిత్రి సంగమం వద్ద సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

రుణమాఫీ సమస్యలపై డయల్ యువర్ సీఈవో

అమరావతి : ఏపీలో రుణమాఫీ సమస్యలపై డయల్ యువర్ సీఈవో నిర్వహించనున్నారు. రుణమాఫీ సమస్యలపై ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు డయల్ యువర్ సీఈవో కార్యక్రమం జరుగనుంది. రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్స్... 08676...252858.

 

జోనల్ వ్యవస్థ రద్దుపై నేడు ఉద్యోగసంఘాలతో సీఎస్ భేటీ

హైదరాబాద్ : జోనల్ వ్యవస్థ రద్దుపై నేడు ఉద్యోగ సంఘాలతో మరోసారి సీఎస్ సమావేశం కానున్నారు. 

 

08:41 - June 29, 2017

హైదరాబాద్ : పాడుపడిన బోరుబావులపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేయని బోరుబావులు వివరాలను సేకరించడానికి ఇవాళ్టి నుంచి సర్వే నిర్వహించనున్నారు.  పనిచేయని బోర్లను మూసివేయకుంటే యజమానిపై 50వేల వరకు జరిమానా విధిస్తామని పంచాయతీరాజ్‌శాఖామంత్రి జూపల్లి కృష్టారావు స్పష్టంచేశారు. ఇక నుంచి కొత్తగా బోర్లు వేసుకోవాలంటే.. గ్రామస్థాయిలో వీఆర్వో, విలేజ్‌సెక్రెటరీల ముందస్తు అనుమతి తప్పని సరిచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 
టీ.ప్రభుత్వంలో కదలిక 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడెంలో చిన్నారి బోరుబావిలో పడి చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అనుమతిలేకుండా విచ్చల విడిగా బోర్లు వేయడం, పనిచేయని వాటిని పూడ్చకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, భూగర్భ జలశాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.  పనిచేయని బోర్‌వెల్స్‌ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై  అధికారులతో చర్చించారు.  రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 350 రిగ్స్‌కు మాత్రమే భూగర్భ జలశాఖ అనుమతులు ఉన్నట్టు అధికారులు జూపల్లి దృష్టికి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్లువేసే రిగ్స్‌ ఓనర్లతోపాటు... భూ యజమానులపట్ల ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని  సమావేశంలో నిర్ణయించారు.   ఇకనుంచి బోర్లు వేయడానికి 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలన్నారు.  అనుమతి లేకుండా బోర్లు వేస్తే రిగ్‌ యజమానులకు లక్ష వరకు ఫైన్‌ విధించాలని ఆదేశించారు.  అనుమతులు లేని రిగ్స్‌ను సీజ్‌ చేయడంతోపాటు.. జరిమానా విధించాలని నిర్ణయించారు.  
పనిచేయని బోర్‌వెల్‌ గుంతలను పూడ్చివేయాలని ఆదేశాలు
పనిచేయని బోర్‌వెల్‌ గుంతలను జూన్‌ 10లోపు పూడ్చివేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెడిపోయిన, పనిచేయని బోర్లను పూడ్చివేసే బాధ్యతను పూర్తిగా భూ యజమానులే తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.  పనిచేయని బోరుబావులను పూడ్చకపోతే 50వేల రూపాయల వరకు జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. 
నేటి నుంచే గ్రామలవారీగా సర్వే
పనిచేయని బోరుబావులపై చర్యలు తీసుకునే బాధ్యతను క్షేత్రస్థాయిలో వీఆర్వీ, గ్రామ కార్యదర్శి, సర్పంచ్‌లకు అప్పగించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. చెడిపోయిన, పనిచేయని బోర్‌వెల్స్‌కు సంబంధించి గురువారం నుంచే గ్రామలవారీగా సర్వే చేయాలని అధికారులన ఆదేశించారు. సర్వే సందర్భంగా ఎక్కడికక్కడ భూ యజమానులతో బోర్‌వెల్‌ గుంతలను పూడ్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

08:40 - June 29, 2017

సూర్యపేట : పట్టపగలు నడుస్తూ వెళ్తున్న ఆమెను వెనక నుంచి వచ్చిన దుండగులు వెంటాడారు...కత్తితో గొంతు కోశారు...కేకలేస్తూ కుప్పకూలిన ఆ యువతి అక్కడే చనిపోయింది..క్షణాల్లో ఆ దుండగులు మాయమయ్యారు...సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఘటనకు కారణం ఎవరో తెలుసా..? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
నడిరోడ్డుపై పట్టపగలు హత్య..
ఇది సూర్యాపేట జిల్లా కేంద్రం...సూర్యానగర్ ప్రాంతంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఓ యువతిని వెంటాడిన యువకులు కత్తితో గొంతు కోసి దారుణంగా చంపారు..క్షణాల్లో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలి పడిపోయింది..అక్కడే ఉండి చూస్తున్నవారంతా ఖంగుతిని తేరుకునేలోపే వారంతా వెళ్లిపోయారు....
ఘటన జరిగిన తీరు...                  
జరిగిన ఘటన తెలిసిన పోలీసులు స్పాట్‌కు చేరుకునేసరికి వివరాలు తెలిసిపోయాయి...హత్యకు గురయిన ఆమె 30 ఏళ్ల సబీనా బేగం...గతంలో పెళ్లయి విడాకులు తీసుకున్న సబీనాకు అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న ధరావత్‌ శ్రీనుతో గడిచిన ఎనిమిది నెలల క్రితమే పెళ్లయింది...వీరిద్దరు చక్కగా కాపురం చేసుకుంటారనుకున్న కుటుంబీకులకు కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది.. నిత్యం ఏదో రకంగా వేధిస్తూ శ్రీను భార్యను హింసించేవాడు...ఈ విషయంపై పిటిషన్ ఇవ్వాలని కుటుంబీకులు చెప్పిన నేపథ్యంలో బేగం భర్తపై ఫిర్యాదు కోసం వెళ్లింది...ఇది తెలిసిన శ్రీను మరో ఇద్దరితో కలిసి వచ్చి కత్తితో గొంతు కోసి చంపేశాడు... పట్టపగలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చంపేశాడని స్థానికులు అంటున్నారు. కలహాల కాపురంలో మరో అమ్మాయి బలయింది...ఉన్మాదిగా మారిన భర్త ఆమెను చంపి తాను కిరాతకుడయ్యాడు..

 

08:35 - June 29, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలకు ఉత్సాహంతో సిద్ధమవుతున్న వైసీపీ కాంగ్రెస్ ఫివర్ పట్టుకుంది. ఉప ఎన్నిక ఏకగ్రీవం కాదని తేలిపోవడంతో   అన్ని రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగేందుకు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా  ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో  ప్రతిపక్ష పార్టీకి కొత్త చిక్కులు  తెచ్చేలా కనిపిస్తోంది.
వైసీపీకి కాంగ్రెస్‌ తలనొప్పి
నంద్యాల ఉప ఎన్నికను ధీమాగా ఎదుర్కొవాలనుకున్న వైసీపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అధికార టీడీపీకి  షాక్ ఇవ్వాలనుకున్న వైసీపీ అధినేత జగన్‌కు  కాంగ్రెస్‌ రూపంలో మొదటి ఎదురు దెబ్బ తగలనుందనే చర్చలు జరుగుతున్నాయి.  నంద్యల ఉప ఎన్నిక టీడీపీ కాంగ్రెస్‌ మధ్యే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ తానూ ఉన్నానంటూ నంద్యాల బైఎలక్షన్‌ను హీటెక్కిస్తోంది. 
మరోసారి గెలుపుకు వైసీపీ కసరత్తు 
ఉప ఎన్నికకు ఇంకా నోటిఫికేషన్ వెలువడకపోయినా.....అన్ని రాజకీయాలు నంద్యాల కేంద్రంగా రాజకీయ పావులు కదుపుతున్నాయి. తమ పార్టీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీ లోకి చేరడంతో  ఇక్కడ పట్టునిలుపుకునేందు మరోసారి అవకాశం రావడంతో వైసీపీ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిని  రంగంలోకి దింపుతోంది. 
నంద్యాలలో త్రిముఖపోటీ.. వైసీపీకి ఇబ్బంది
కాంగ్రెస్‌ పార్టీకూడా బరిలో ఉంటానని ప్రకటించడంతో నంద్యాలలో త్రిముఖపోటీ ఏర్పడనుంది. ఈపరిస్థితి  వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌పార్టీ ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ బలాన్ని బేరీజు వేసుకోడానికి ప్రయత్నిస్తోంది. అయితే .. కాంగ్రెస్‌పార్టీ బరిలో ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తమకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంతదని వైసీపీలో అంతర్మథనం మొదలైంది. 
 

08:33 - June 29, 2017

గుంటూరు : భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్‌ డోనమిక్ అస్క్విక్‌ బృందం వెలగపూడిలోని సచివాలయాన్ని సందర్శించింది. స్పీకర్ కోడెలతో పాటు కౌన్సిల్ వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం వారికి స్వాగతం పలికారు. అసెంబ్లీ లోపలి నిర్మాణాలను స్వయంగా స్పీకర్ కోడెల వారికి వివరించారు. అసెంబ్లీ నిర్మాణం అద్భుతంగా ఉందని బ్రిటిష్ కమిషనర్ కితాబిచ్చారు.  అనంతరం బ్రిటిష్ కమిషనర్‌ను స్పీకర్, అసెంబ్లీ సిబ్బంది సత్కరించారు. 

07:53 - June 29, 2017

తూర్పుగోదావరి : టెన్‌టీవీ కథనాలతో ఏపీ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో విషజ్వరాల తీవ్రతపై చర్యలను ప్రారంభించింది. మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్వయంగా ఏజెన్సీలో పర్యటించారు. గిరజనులకు అందుతున్న వైద్యసౌకర్యాలను సమీక్షించారు. కాకినాడ , రంపచోడవరం, మారేడుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి బాధితులకు అందిస్తున్న వైద్య సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.   
18 మంది గిరిజనుల మృతి  
తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో విషజ్వరాలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తూర్పుమన్యంలోని  ఒక్క చాపరాయిలోనే దాదాపు 18 మంది గిరిజనులు చనిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది.  గిరిజన గూడేలు శవాల దిబ్బగా మారుతున్న తీరును 10టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. మన్యం ప్రజల ప్రాణాలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కథనాలు ప్రసారం చేసింది. 
చాపరాయి గ్రామాన్ని సందర్శించిన మంత్రి కామినేని  
10టీవీ కథనాలతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ చాపరాయి గ్రామాన్ని సందర్శించారు. విషజ్వరాలతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు.  విషజ్వరాలకు కారణాలు, గ్రామంలోని పరిశుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉందని... ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పరిస్థితి మెరుగుపడిందన్నారు.  త్వరలోనే ఏజెన్సీ ప్రాంతంలో 144 మోటరు బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. 
కాకినాడలో ఆస్పత్రిని సందర్శించిన మంత్రి కామినేని  
రంపచోడవరం, మారేడుమిల్లి  ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు కాకినాడలో ఆస్పత్రిని కూడా మంత్రి కామినేని శ్రీనివాస్‌  సందర్శించారు. తూర్పుమన్యంలో విషజ్వరాల బారిన పడిన వారికి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బాధితులంతా మలేరియా, పౌష్టికాహారలోపంతో అనారోగ్యం బారిన పడినట్టు గుర్తించిన వైద్యులు... ఆ దిశగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికైనా మన్యంలో విషజ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో  చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. 

నేడు సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

సిద్ధిపేట : నేడు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

 

Don't Miss