Activities calendar

30 June 2017

జీఎస్టీతో దేశంలో సమపాలన సాగుతుంది

ఢిల్లీ : జీఎస్టీతో దేశంలో సమపాలన సాగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఇంది భారతీయుల అందరి విజయమని ఆయన అన్నారు. జీఎస్టీ అమలుకు 11నెలలు 17రోజులు పట్టిందని మోడీ తెలిపారు. జీఎస్టీ వెనుక ఎన్నో ఏళ్ల కళ అని ఆయన పేర్కొన్నారు. 

23:41 - June 30, 2017

ఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానసంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సిపిఎం మండిపడింది. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టవద్దని నీతిఆయోగ్ సూచనలకు కెంద్ర కేబినెట్ ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించింది. 2015-16 ఎయిర్ ఇండియా105కోట్ల ఆపరేటింగ్ లాభాలు గడించగా...2016-17 లో దాదాపు 300 కోట్ల లాభాలను ఆర్జించింది. నష్టాలను సాకుగా చూపి ఎయిర్‌ ఇండియాను ప్రయివేటీకరించడం సరికాదని తప్పు పట్టింది. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోది ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తోందని సిపిఎం పొలిట్‌ బ్యూరో ధ్వజమెత్తింది. ప్రయివేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని... ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని డిమాండ్ చేసింది.

 

 

23:40 - June 30, 2017

ఢిల్లీ : గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన కొద్ది గంటలకే ఝార్ఖండ్‌లో మరో హత్య వెలుగు చూసింది. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లాకు చెందిన అలీముద్దీన్‌ మారుతీవ్యాన్‌లో వెళ్తుండగా బాజర్‌టాండ్‌ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వ్యానులో బీఫ్‌ను తరలిస్తున్నాడన్న అనుమానంతో అలీముద్దీన్‌పై దాడి చేసి కారుకు నిప్పంటించారు.తీవ్రంగా గాయపడ్డ అలీముద్దీన్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు 12 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రామ్‌గఢ్‌లో 144 సెక్షన్‌ విధించారు. కొన్ని చోట్ల కర్ఫ్యూ కొనసాగుతోంది. గతవారం మధుర-ఢిల్లీ లోకల్‌ ట్రైన్‌లో నలుగురు ముస్లిం యువకులపై జరిగిన మూకుమ్మడి దాడిలో 16 ఏళ్ల జునైద్‌ మృతి చెందాడు. హర్యానాలోని బల్లబ్‌గఢ్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన వెనక సంఘ్‌ పరివార్‌ హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి.గోరక్షణ పేరిట జరుగుతున్న దాడుల్ని సహించమన్న ప్రధాని ప్రకటనపై విపక్షాల నేతలు మండిపడ్డాయి. మాటల్లో కాదని చేతల్లో చూపాలని పేర్కొన్నాయి. గోసంరక్షణ పేరుతో జరుగుతున్న దాడుల వెనక బిజెపి మద్దతుందని మండిపడుతున్నాయి.కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌ అధికారం చేపట్టాక గోరక్షణ పేరిట ముస్లింలపై మూకుమ్మడి దాడులు పెరిగిపోయాయి. 2014 మే నుంచి ఇప్పటి వరకు 32 మంది ముస్లింలపై సామూహిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 23 మంది మృతి చెందారు. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడులు ఇంకా ఎక్కువే ఉండొచ్చు...జాతీయ మీడియా దృష్టికి రాలేకపోతున్నాయి. 2014-15లో బీఫ్‌కు సంబంధించి 11 కేసులు నమోదయ్యాయి. 2016లో 16 కేసులు, 2017లో జూన్‌ వరకు 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధిక కేసులు ఉత్తర భారతానికి సంబంధించినవే.

అత్యధికంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే
గోహత్య, ఆవులను తస్కరించడం, బీఫ్‌ తినడం, బీఫ్‌ కలిగి ఉండడం లాంటి కారణాలతో ముస్లింలపై గోరక్షకులు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులు అత్యధికంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే వెలుగు చూస్తున్నాయి. గోరక్షణ పేరుతో జరిగే టెర్రిరిజం 12 రాష్ట్రాలకు పాకింది. ఈ దాడులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బిజెపి కొత్తగా రాష్ట్రంలో అధికారం చేపట్టగానే గోహత్యలకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావడం గమనార్హం.

 

 

23:38 - June 30, 2017

పశ్చిమ గోదావరి : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ శుక్రవారం గరగపర్రు గ్రామంలో పర్యటించారు. దళితుల సామాజిక బహిష్కరణ సంఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దళితేతరులను... దళితులను కూడా కలిసి మాట్లాడారు. జరిగిన ఘటనపై ఇరు వర్గాల వాదనలను విన్నారు. ఈ సందర్భంగా తమను అన్యాయంగా పనుల్లో నుంచి తొలగించారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నేతలతో పాటు.. అధికారులు కూడా తమను పట్టించుకోలేదని వాపోయారు. గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండాలని జగన్‌ గ్రామస్థులకు సూచించారు. జరిగిన దుర్ఘటనను మరిచిపోయి కలిసి జీవించాలన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదని ఆకాంక్షించారు. వివాదాలకు తావు లేకుండా..గ్రామాన్ని.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. గ్రామంలో పార్టీ తరపున ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నానని.. ఆ కమిటీ ఇరుపక్షాలు కలిసి ఉండటానికి కృషి చేస్తుందని తెలియజేశారు. జగన్ పర్యటన సందర్భంగా గ్రామంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు వాగ్వావాదం చోటుచేసుకుంది. 

 

23:37 - June 30, 2017

హైదరాబాద్ : వచ్చే ఖరీఫ్ నాటికి పాలమూరు జిల్లాలో పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆయన ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. దిగువ మానేరు, ఎస్సారెస్పీ కాల్వలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని చెప్పారు. కాల్వలు సిద్ధం చేసి వచ్చే ఖరీఫ్‌కు చివరి ఆయకట్టు వరకు నీరందించాలని వెల్లడించారు. వీటితో పాటు.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డంకులన్నీ తొలగిపోతున్నందున... వాటి పనుల్లో కూడా వేగం పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు.. అధికారులు హాజరయ్యారు.

23:36 - June 30, 2017

 

హైదరాబాద్ : దేశమంతా ఒకే పన్ను విధానం అమలు కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అంతర్‌ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు మూతబడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచే వాణిజ్య పన్నుల శాఖకు చెందిన చెక్‌పోస్టుల్లో కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు వాటిని తొలగించేస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని సాలుర, సలాబత్ పూర్‌లలో అంతర్రాష్ర్ట చెక్ పోస్టులున్నాయి. ఈ మార్గాల్లో వివిధ రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులు, టైల్స్, రాళ్లు లాంటివి రవాణా అవుతుంటాయి. లక్షలాది రూపాయల పన్నులు వసూలయ్యేవి. కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులకు ఈ చెక్‌పోస్టులు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా ఉండేవి. జీరో బిజినెస్‌ చేసే వ్యాపారులు, తమ సరుకును అక్రమంగా తరలిస్తూ.. ఇక్కడి చెక్‌పోస్టు అధికారులకు ముడుపులు చెల్లించేవారన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ బయటపడింది. అందుకే ఈ చెక్‌పోస్ట్‌లలో పనిచేయడానికి అధికారులు సైతం పోటీపడేవారు. జీఎస్టీ అమలుతో నిజామాబాద్‌ జిల్లాలోని సాలూర, సలాబత్‌ చెక్‌పోస్టులతో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని వాణిజ్య పన్నుల చెక్‌పోస్ట్‌లూ మూతబడ్డాయి. వీటిల్లో కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా అందిన ప్రభుత్వ ఆదేశాలతో, అధికారులు చెక్‌పోస్టులు ఎత్తివేసే పనిలో పడ్డారు. ఇకపై పన్నుల ఎగవేత పేరిట, వాహనాలను నిలిపి తనిఖీ చేసే వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు సిబ్బంది ఇకపై ఉండరు. అయితే ఎక్సైజ్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్టు చెక్‌ పోస్ట్‌లు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. ఇప్పటిదాకా అంతర్రాష్ట్ర రహదారుల సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో పనిచేస్తున్న సిబ్బందిని.. సంబంధిత శాఖలకు పంపేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

23:35 - June 30, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కొత్త పన్నుల విధానం..జీఎస్టీపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రజలను దోచుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా తనను కలిసిన వస్త్రవ్యాపారులకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మద్దతు తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని జీఎస్టీతో మరింత కష్టాల్లోకి నెడుతున్నారని టీ-కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. ఏకపన్ను విధానం అని చెబుతున్న పాలకులు ఏకబాదుడు విధానానికి తెరతీశారని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌ ,డీజిల్ తోపాటు మద్యాన్ని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. జీఎస్టీ కాదు.. గ్యాంబ్లింగ్‌ సర్వీస్‌ అంటూ సెటైర్లు విసిరారు.

జీఎస్టీకి వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి
ఇప్పటికైనా మించిపోయింది లేదని, కేసీఆర్‌ ప్రభుత్వం అఖిలపక్షాలతో చర్చించి జీఎస్టీకి వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే అన్ని విపక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు. 

23:34 - June 30, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఒకే పన్ను విధానంపై ... వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు జీఎస్‌టీ విధానంపై మండిపడుతున్నారు. జీఎస్‌టీకి వ్యతిరేకంగా.. వస్త్ర వ్యాపారులు చేపట్టిన బంద్‌ నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దుకాణాలు మూతబడ్డాయి. విజయవాడలో వ్యాపారులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సీపీఎం, జనసేన పార్టీల నేతలు మద్దతు తెలిపారు. జీఎస్‌టీని రద్దు చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పలువురు నాయకులు హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా.
అలాగే ప్రకాశం జిల్లా.. చీరాల పట్టణంలో వస్త్ర వ్యాపారులు రిలే నిరాహారదీక్షను కొనసాగిస్తున్నారు. నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేశారు. అనంతపురం జిల్లాలో వ్యాపారులు షాప్‌లన్నీ మూసివేసి... భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలిలో బైఠాయించి ... జీఎ‌స్‌టీ అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కడపలోనూ వస్త్ర వ్యాపారులు. చెప్పుల షాప్‌ల యజమానులు రోడ్లపైకి వచ్చి జీఎస్టీ అమలును విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. షాపులు బంద్‌ చేసి...ర్యాలీ నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో
జీఎస్‌టీ విధానంపై శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తీరప్రాంతాన్ని కలిగి ఉన్న ఈ జిల్లాలో జీఎస్‌టీ వల్ల మత్స్య పరిశ్రమపై పెనుభారం పడుతుందని... గ్రానైట్‌ పరిశ్రమలపై, జీడిపప్పు వ్యాపారాలు నష్టాల బాట పడతాయని జిల్లావాసులు అంటున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమపై జీఎస్‌టీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రానైట్‌ పరిశ్రమ సంఘాల నాయకులు అంటున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.కాగా విశాఖలో మాత్రం జీఎస్‌టీ కారణంగా పలు షాపులు వినియోగదారులతో కిటకిటలాడాయి. పాతస్టాక్‌ విక్రయించుకునేందుకు దుకాణ యజమానులు భారీ ఆఫర్లు కురిపించడంతో.. వస్తువులు కొనేందుకు ప్రజలు ఎగబడ్డారు.  

23:31 - June 30, 2017

ఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న జిఎస్‌టిపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. జీఎస్టీ వల్ల సాధారణ పౌరులు, చిన్న వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఓ గొప్ప సామర్థ్యం ఉన్న పన్ను సంస్కరణ.. ప్రచారం కోసం ఆదర బాదరగా అమలు చేస్తున్నారని రాహుల్‌ ఎద్దేవాచేశారు. పెద్దనోట్లు రద్దు నిర్ణయం లాగే.. జీఎస్టీ ప్రణాళికలోనూ ఎలాంటి ముందు చూపు లేదని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. 

23:30 - June 30, 2017

ఢిల్లీ : స్వాతంత్రం తర్వాత దేశంలోనే అతిపెద్ద పన్నుల సంస్కరణగా భావిస్తున్న జిఎస్‌టి అమలును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో అర్ధరాత్రి ప్రారంభోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్త కార్పెట్‌, కొత్త సౌండ్‌ సిస్టంతో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలును ముస్తాబు చేశారు.

రాత్రి 11 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ
రాత్రి 11 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాకతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటల ఒక్క నిముషానికి జాతీయ గీతం ఆలపిస్తారు. 11 గంటల 3 నిముషాలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగిస్తారు. జిఎస్‌టి అమలులో భాగంగా రెండు షార్ట్‌ ఫిలింలను ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత 11 గంటల 15 నిముషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రసంగిస్తారు. 11 గంటల 38 నిముషాలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అనంతరం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు పెద్ద గంటను మోగించి జిఎస్‌టి అమలును ప్రకటిస్తారు. అర్ధరాత్రి నుంచే జిఎస్‌టి అమలులోకి వస్తుంది.

దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా 1947, ఆగస్టు 15న అర్ధరాత్రి 'ట్రైస్ట్‌ విత్‌ డెస్టినీ' పేరిట సెంట్రల్‌ హాల్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం ఉండబోతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకం...
కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించబోతున్న జీఎస్‌టి కార్యక్రమానికి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాని మోదీతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్‌, కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, న్యాయకోవిదులు, ఆర్థిక నిపుణులు, బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, పారిశ్రామిక వేత్త రతన్‌టాటా తదితరులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడి, సీపీఐ తదితర పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ వేడుకకు దూరంగా ఉండబోతున్నారు. నితీష్‌ తరపున పార్టీ ప్రతినిధి హాజరవుతారు. జిఎస్‌టిని హడావిడిగా అమలు చేస్తూ చిన్న వ్యాపారులను పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, పార్టీలతో చర్చలు జరిపాకే జిఎస్‌టిపై నిర్ణయం తీసుకున్నామని....ఆవిష్కరణ కార్యక్రమాన్ని బహిష్కరించడం తగదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

 

 

20:16 - June 30, 2017

1990లో పి. వి. నరసింహరావు ఆర్థిక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి నుంచి దేశంలో జీఎస్టీ తీసుకురావాలని ప్రభుత్వాలు భావిస్తున్న అప్పటి నుంచి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు రావడంతో జీఎస్టీ తీసురావడంతో విఫలం చెందాయని, కానీ 2014లో మోజార్టీతో ఎన్డీఏ రావడంతో జీఎస్టీ తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆర్థిక నిపుణుడు దినకర్ అన్నారు. ప్రస్తుతం అయితే ఎటువంటి అభిప్రాయలు రాలేదని డిప్యూటి కమిషనర్ కమర్షియల్ హరిత గారు తెలిపారు. చిన్న బిజినెస్ అయిన కూడా రికార్డ్ లు మెయింటెన్ చేయాలని తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్ సంఘం అధ్యక్షుడు మన్నెం అమరేందర్ అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

20:13 - June 30, 2017

ఢిల్లీ : స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న జిఎస్‌టి జులై 1 నుంచి అమలు కానుంది. జిఎస్‌టితో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కానుంది. ఈ పన్ను సంస్కరణ వల్ల జిడిపి 1.5 నుంచి 2 శాతానికి పెరిగే అవకాశముంది. జిఎస్‌టి అమలు వల్ల సామాన్యులకు కొంత లాభం...కొంత ఖేదం అన్నట్టుగా ఉంది. బియ్యం, గోధుమలు, పప్పలు, కూరగాయలు, పళ్లు, పాలు లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను నుంచి మినహాయించారు. చికెన్‌, ఆయిల్‌, భుజియా, వెన్న తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పెరుగు, పనీర్, చాక్లెట్, ఐస్‌క్రీం, చిప్స్‌, బిస్కట్స్, వెన్న, టీ, కాఫీ, మసాలా పౌడర్, లాంటి వాటి ధరలు 1 నుంచి 5 శాతం వరకు పెరగనున్నాయి.

హోటల్‌ కెళ్తే జేబుకు చిల్లే
కుటుంబంతో కలిసి సరదాగా హోటల్‌ కెళ్లి భోజనం చేయాలనుకుంటే జేబుకు చిల్లు పడ్డట్టే. ప్రతి యేటా 75 లక్షలు టర్నోవర్‌ చేసే రెస్టారెంట్లపై 5 శాతం జిఎస్‌టి విధించారు. ఏసీ లేని రెస్టారెంట్లలో భోజనం చేస్తే ఇంతకు ముందు 6 శాతం వ్యాట్‌ ఉండేది. ఇపుడది 12 శాతానికి పెరిగింది. ఏసీ హోటళ్లలో 18 శాతం జిఎస్‌టి విధించారు. అందంగా మేకప్‌ వేసుకుని ఫంక్షన్‌ వెళ్లడం కూడా ఇపుడు ఖరీదే...బ్యూటీ పార్లర్లపై కూడా పన్ను పెరగనుంది.టెలిఫోన్‌ బిల్లులపై టాక్స్‌ను 15 శాతం నుంచి 18 శాతం పెంచడం వల్ల బిల్లు మరింత మోగనుంది. స్మార్ట్‌ ఫోన్ల ధరలు మాత్రం తగ్గనున్నాయి.

లగ్జరీ వస్తువులపై పన్ను 15 నుంచి 18 శాతానికి
ఇల్లు, కారు, లగ్జరీ వస్తువులపై పన్ను 15 నుంచి 18 శాతానికి పెంచడం వల్ల కొనేవారిపై భారం పడనుంది. చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇంతకు ముందు వీటిపై 40 శాతం టాక్స్‌ ఉంటే...ఇపుడు 29 శాతం జిఎస్‌టి విధించారు. ఇక లగ్జరీ కార్ల ధరను మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ప్రస్తుతం 43 శాతం పన్ను ఉండగా 46 శాతానికి పెంచారు. అలాగే టూ వీలర్స్‌ ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఇంతకు ముందు వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 30 శాతం పన్ను ఉండగా...ఇపుడు జిఎస్‌టి 28 శాతానికి తగ్గించారు.విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ధరలు కొంచెం తగ్గనున్నాయి. ప్రస్తుతం 5.60 శాతం పన్ను ఉండగా 5 శాతానికి తగ్గనుంది. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర మాత్రం భారీగా పెరగనుంది. 8.40 శాతం టాక్స్‌ నుంచి జిఎస్‌టి 12 శాతానికి పెరగనుంది.

వెయ్యి దాటే కాస్ట్‌లీ డ్రెస్‌లపై 8 నుంచి 12 శాతం
వెయ్యి రూపాయల లోపు దుస్తుల ధరలపై టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. వెయ్యి దాటే కాస్ట్‌లీ డ్రెస్‌లపై 8 నుంచి 12 శాతం జిఎస్‌టి విధించారు.ప్రాపర్టీపై స్టాంపు డ్యూటీ ఎప్పటిలాగే ఉంటుంది. కానీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాపర్టిని కొంటే 12 శాతం జిఎస్‌టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది 6 శాతం ఉండేది.ఆరోగ్యం, విద్య లాంటి సేవలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. మందుల ధరలపై టాక్స్‌ను 14 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. పొగాకు, మద్యం, పెట్రోల్‌లకు టాక్స్‌ నుంచి విముక్తి కల్పించారు. ఆయా రాష్ట్రాలే వీటిపై పన్ను నిర్ణయించనున్నాయి.జులై 1 నుంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు సంబంధించివన్నీ తగ్గనున్నాయి. సినిమా, థియేటర్‌, కేబుల్, డిటిహెచ్‌ సర్వీసులపై 18 శాతం జిఎస్‌టి విధించనున్నారు. ఇపుడు రాష్ట్రాలు విధిస్తున్న పన్ను కంటే ఇది తక్కువ.

బ్యాంకింగ్‌ సేవలు మరింత ప్రియం
బ్యాంకింగ్‌ సేవలు మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ఇప్పటి వరకు 15 శాతం పన్ను ఉండగా...ఇపుడు 18 శాతం జిఎస్‌టి విధించారు. డిడి, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు, ఎండోమెంట్‌ పాలసీ, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరగనున్నాయి. రైలు టికెట్ల ధరలు కొద్దిగా పెరగనున్నాయి. సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఎసీ, ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు కొంచెం పెరుగుతాయి.కన్జూమర్‌ డ్యూరెబుల్‌ వస్తువులపై 26 శాతం టాక్స్‌ ఉండగా..అదనంగా మరో 2 శాతం జిఎస్‌టి పెరగనుంది.

20:07 - June 30, 2017

విశాఖ : జీఎస్టీ వల్ల తమకు నష్టం స్వల్పమే అంటున్నారు విశాఖ బంగారు నగల వ్యాపారులు. గతంలో 2 శాతం ఉండే పన్ను ఇప్పుడు 3 శాతానికి పెరిగిందంటున్నారు. దీంతో స్వర్ణకారులు, వినియోగదారులపై భారం పడుతుందంటున్నారు గోల్డ్ మర్చెంట్స్. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:05 - June 30, 2017

ఢిల్లీ : ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీపై సామాన్యప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు జీఎస్టీపై అవగాహన కల్పించకుండానే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్నుల విధానాన్ని అమల్లోకి తీసుకురావడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:04 - June 30, 2017

విజయవాడ : ఆయుష్‌ ఉద్యోగుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ సందర్భంగా పలువురిని అరెస్టు చేశారు. 15నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో వీరు నిరాహార దీక్షకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పి.హెచ్.సి., సి.హెచ్.సి.లలో పనిచేస్తున్న ఆయుష్‌ సిబ్బంది తమకు జీతాలు చెల్లించడంతోపాటు, ఉద్యోగ సర్వీసును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

20:02 - June 30, 2017

కడప : కడప జిల్లాలో ప్రతిభ శిబిరాలు నిర్వహిస్తోంది జనసేన పార్టీ. వైఎస్ఆర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన యువతీ, యువకులు జిల్లాలో క్రియాశీలకంగా పనిచేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి టిటిడి మాజీ బోర్డు మెంబర్ హరిప్రసాద్, జనసేన పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ హరిప్రసాద్‌లు హాజరయ్యారు. 

18:55 - June 30, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రవేటు ట్రావెల్స్ యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట లభిచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను తిప్పుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది. మూడు వారాల్లోగా అభ్యంతరాలు చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న 900ట్రావేల్స్ బస్సులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

18:52 - June 30, 2017

కరీంనగర్ : రాజకీయ నేతలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అధికారం, దర్జా, దర్ప, గౌరవం, హోదా ఉంటుంది. ఒకసారి రాజకీయల్లోకి వచ్చి, ఏదో ఒక పదవి అనుంభవించిన తర్వాత దీని నుంచి దూరం అవ్వడం కష్టం. ఆ వ్యక్తో, లేక అతని కుటుంబ సభ్యులో రాజకీయాల్లో తరతరాలుగా కొనసాగుతూనే ఉంటారు. కరీంనగర్‌ జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి కొనగుతున్న నేతలంతా వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పక్కకు తప్పుకోవాలని చూస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిక్ష కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ నేతలు ఇదే ఆలోచనలో ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్న యువత కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. కొందరు నేతలు కూడా తమ వారసులకు రాజకీయ పాఠాలు నూరిపోస్తుంటే, మరికొందరు నేర్పిస్తున్నారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు
ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు ఇద్దరు తనయుల్లో ఒకరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యాసాగర్‌రావు పెద్ద కుమారుడు వికాస్‌ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని జిల్లా బీజేపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విద్యాసాగర్‌రావు అనుచరులు ఈ విషయంలో ఒత్తిడి తెస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌ కూడా క్రియాశీల రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోరుట్ల లేదా హైదరాబాద్‌లోని ఏదో ఒక సెగ్మెంట్‌ నుంచి బరిలో దిగొచ్చని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినాయకత్వం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి రాములు, జ్యోతక్కల రెండో కుమారుడు విజయ్‌ ఆజాద్‌ కూడా కోరుట్ల కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

సీనియర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముగ్గురు తనయుల్లో ఇద్దరు రాంచంద్రారెడ్డి, చంద్రకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జీవన్‌రెడ్డి పెద్దకుమారుడు రాంచంద్రారెడ్డి న్యాయవాదిగా పని చేస్తున్నారు. రాంచంద్రారెడ్డి, చంద్రకృష్ణారెడ్డి కాంగ్రెస్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇద్దరిలో ఒకరి వచ్చే ఎన్నికల్లో జగిత్యాల లేదా హైదరాబాద్‌ నుంచి ఎన్నికల బరిలో దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జగిత్యాల నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదురైతే జీవన్‌రెడ్డే పోటీ చేయొచ్చని భావిస్తున్నారు.

సోమారపు సత్యనారాయణ
రామగుండం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కుమారుడు అరుణ్‌ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సోమారపు సంత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకుంటే అరుణ్‌ పోటీ చేసే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి అధికార పార్టీ శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి కుమారుడు, ట్రినిటీ విద్యాసంస్థల అధినేత ప్రశాంత్‌రెడ్డి రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. తనయుడికి కార్పొరేషన్‌ పదవి కోసం తండ్రి పయత్నిస్తున్నారు. ఇది సాధ్యంకాకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించే చాన్స్‌ ఉందని ప్రచారం జరుగుతోంది.

గీట్ల ముకుంద్‌రెడ్డి
పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుంద్‌రెడ్డి కోడలు సవితారెడ్డి రాజకీయాల్లోకి దిగారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన జవ్వాది రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావు గత ఎన్నికల్లో ఓడిపోయారు. మంథని నియోజవర్గం నుంచి చందుపట్ల రామిరెడ్డి కోడలు సునీల్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సీటు ఆశిస్తున్నారు. మంథని ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు బలమైన నేతగా ఎదిగి నియోజకవర్గంపై పట్టు సాధించిన నేపథ్యంలో సునీల్‌ రెడ్డికి ఎంతవరకు అవకాశం ఉంటుందన్నదే అనుమానం. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తనయుడు నితిన్‌ వచ్చే ఎన్నికల్లో హుజారాబాద్‌ నుంచి బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నితిన్‌ కాకపోతే ఈటల సతీమణి జమునారెడ్డి పోటీచేసే అవకాశం ఉంది. ఈటల కరీంనగర్‌ లోక్‌సభ సీటుపై దృష్టి పెట్టారు. కరీంనగర్‌ ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ వరంగల్‌ నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇలాగే మరికొందరు నేతలు కూడా తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు అనుగుణంగా పావులు కదపడంతోపాటు, వ్యూహరచన చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి. 

18:50 - June 30, 2017

హైదరాబాద్ : తెలంగాణాలో అధికారం చేపడదామనుకున్న కాంగ్రెస్‌కు.. ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి దెబ్బతీసింది. ఈ ఓటమితో ఒక్క సారిగా కుంగిపోయిన కాంగ్రెస్‌.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రధాన ప్రతిపక్షంగా అందివచ్చిన ప్రతీ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. సర్కారు వ్యతిరేక పోరాటాలతో క్యాడర్‌లో జోష్‌ తీసుకువచ్చింది. అంతేకాదు సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్‌ సభ పార్టీలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. అయితే హైదరాబాద్‌పై మాత్రం కాంగ్రెస్‌కు టెన్షన్‌ పట్టుకుంది.

రెండే కార్పొరేషన్ స్థానాలు
గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రేస్‌ రెండు కార్పొరేషన్ స్థానాలకు పరిమితం కావడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. టీఆర్‌ఎస్‌ ఆకర్ష్ పాలిటిక్స్‌తో రాజధానిలోని కాంగ్రెస్‌ మాజీ కార్పొరేటర్లు గుంపులుగా గులాబీ గూటికి చేరడంతో పార్టీలో నిస్తేజం ఏర్పడింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు స్పందించక పోవడం పార్టీకి శాపంగా మారింది. అలాగే మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక బల్దియా ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రేటర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్‌ రాజీనామా చేయడం..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం వంటి పరణామాలతో గ్రేటర్‌లో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది.

పీసీసీకి తలనొప్పి
గ్రేటర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇతర పార్టీలు ఆందోళన చేస్తుంటే, కాంగ్రెస్‌ మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో పీసీసీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను సమన్వయం చేయడంలో పీసీసీ విఫలమైందన్న వాదన నేతల్లో వినిపిస్తుంది. క్యాడర్‌లో జోష్‌ ఉన్నా నడిపించే నాయకుడు లేకపోవడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌ కమిటీని ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రేటర్‌పై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు పార్టీలో ఆసక్తి రేపుతోన్న అంశం. 

18:49 - June 30, 2017

కరీంనగర్ : టాటా తనిష్క్ గోల్డ్ స్టోర్స్‌.. తెలంగాణలో తన 9వ శాఖను కరీంనగర్‌లో ప్రారంభించింది. కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించారు. షోరూం ప్రారంబోత్సవం సందర్భంగా కస్టమర్లకు కొన్ని ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు కంపెనీ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్.. ఎన్.వైదీశ్వరన్ తెలిపారు. బంగారం కొనుగోలుపై గోల్డ్‌కాయిన్‌ తో పాటు వజ్రాల నగలపై గరిష్ఠంగా 25 శాతం రాయితీ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్‌ తొలి మూడు రోజులు మాత్రమే ఉంటుందని తనిష్క స్టోర్స్‌ నిర్వహకులు తెలిపారు.

18:47 - June 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చినా ప్రజల బతుకుల్లో ఏమీ మార్పు రాలేదని మేధావుల వేదిక అభిప్రాయపడింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేధావుల వేదిక సమావేశం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. నిరుద్యోగ యువత వలసలు వెళ్తున్నారని పలువురు ప్రొఫెసర్లు అన్నారు. పాలనలో మార్పు రాకుండా అభివృద్ధి సాధ్యపడదన్నారు. ఈ సందర్భంగా టీ మాస్‌ ఫోరమ్‌లో మేధావుల ఫోరమ్‌ భాగస్వామ్యం అవుతుందని ప్రకటించారు.

18:46 - June 30, 2017

హైదరాబాద్ : మహిళలను గౌరవిస్తే దేశాన్ని గౌరవించినట్టే అన్నారు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. హైదరాబాద్‌లో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌, భరోసా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలకు , చిన్నారులకు భద్రత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. హెంశాఖలో అమలుచేస్తున్న 33శాతం రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్‌ చైర్మన్‌ త్రిపురాన వెంకటరత్నం , పోలీస్‌ నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

18:45 - June 30, 2017

సంగారెడ్డి : హాస్టల్ వార్డెన్ వేధిస్తోందంటూ... సంగారెడ్డి జిల్లా ఆందోల్ గిరిజన వసతి గృహంలోని విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. హాస్టల్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. ఘటనపై DCDO మణెమ్మ హాస్టల్‌ వార్డెన్‌ను విచారించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. 

18:43 - June 30, 2017

హైదరాబాద్ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకరరెడ్డి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ డిజి కోటేశ్వరరావు తన కుమార్తె శ్వేతను ఎస్ఐ ప్రభాకరరెడ్డి వేధించాడని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ప్రభాకరరెడ్డి శ్వేతను బెదిరించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడని ఆయన మీడియాకు చెప్పారు. తనతో ఫోన్‌లో కూడా అమర్యాదగా మాట్లాడాడన్నారు. ఎస్ఐ ప్రభాకరరెడ్డి తనతో ప్రవర్తించిన తీరుని ఇప్పటికీ మర్చిపోలేదని శ్వేత గుర్తు చేసుకున్నారు. 

16:58 - June 30, 2017

తూర్పుగోదావరి : కాకినాడ‌లో ఐద్వా కార్యకర్తల ఆందోళ‌న ఉద్రిక్తతకు దారితీసింది. మద్యానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ డీసీ కార్యాల‌యాన్ని మ‌హిళ‌లు ముట్టడించారు. డీసీ ఛాంబ‌ర్ లోకి వెళ్లి బైఠాయించారు. కొత్తగా ఏర్పాటు చేయ‌బోతున్న బార్ల లాట‌రీ ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగంలో దిగి మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:54 - June 30, 2017

హైదరాబాద్ : నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ వల్ల రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులపై మరిన్ని భారాలు పడతాయంటున్నారు ప్రజాసంఘాల నేతలు. జీఎస్టీని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసి క్రాస్‌ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలపై భారాలు మోపి పార్లమెంట్‌లో సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. కేంద్రం విధిస్తున్న పన్నులతో ఇప్పటికే వ్యసాయం, అసంఘటిత కార్మికులు సంక్షోభంలో ఉన్నారన్నారు. జిఎస్టీని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు కొనసాగుతాయిని తేల్చిచెప్పారు.

16:52 - June 30, 2017

ఢిల్లీ : మరికొన్ని గంటల్లో జీఎస్టీ అమలు కాబోతోంది. జీఎస్టీ అమలు తరువాత పరిణామాలు ఎలా ఉండబోతాయనే అంశంపై ఎకానమిస్టు పుల్లారావు టెన్ టీవీతో మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

16:50 - June 30, 2017

ఢిల్లీ : మరికొన్ని గంటల్లో అమలు కానున్న జీఎస్టీకి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందన్నారు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్. అమలులో సమస్యలు తలెత్తితే వాటని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ బిల్లుతో మొదటి రోజుల్లో కొంత ఇబ్బంది ఉన్నా.. భవిష్యత్ లో మేలు జరుగుతుందన్నారు ఎంపి వినోద్. జీఎస్టీతో పన్ను ఎగవేత దారులకు చెక్‌ పడుతుందన్నారాయన. ఢిల్లీలో ఈవాళ, రేపు జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల, ఎంపీ వినోద్ ఢిల్లీ వెళ్లారు. 

16:49 - June 30, 2017

పశ్చిమ గోదావరి :  జిల్లా గరగపర్రులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ పర్యటన ముగిసింది. గ్రామంలో సామాజిక బహిష్కరణకు గురైన దళితులను జగన్‌ పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా గ్రామంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు వాగ్వావాదం చోటుచేసుకుంది. 

16:47 - June 30, 2017

శ్రీకాకుళం : సిక్కోలు ఆంధ్రా బ్యాంక్ దేశంలోనే ఉత్తమ శిక్షణ సంస్థగా అవార్డును అందుకుంది.. శ్రీకాకుళం ఆంధ్రా బ్యాంక్ అబిర్డ్‌ సంస్థ సీ కేటగిరీ విభాగంలో ఎక్సలెన్సీ అవార్డు దక్కింది.. ఇంతటి ముఖ్యమైన పురస్కారాన్ని అందుకోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. 2002 నవంబర్‌ 27న ఆంధ్రాబ్యాంక్‌ రూరల్‌ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రారంభమైంది.. అప్పటినుంచి నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది.. ప్రతి ఏడాది ఇందులో చేరేవారిసంఖ్య క్రమంగా పెరిగింది.. 2015-16 సంవత్సరంలో 32 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చింది.. ఇందులో ట్రైనింగ్‌ పొందిన 816మంది టైలరింగ్‌, బ్యూటీపార్లర్‌, సెల్‌ఫోన్‌ రిపేర్‌, ట్యాక్సీ డ్రైవింగ్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, డీటీపీ, అగర్‌బత్తులు, సాఫ్ట్‌ టాయ్స్, జుట్‌ వస్తువుల తయారీరంగంలో స్థిరపడ్డారు.. వీరిలో దాదాపు 60శాతంమంది స్వయంఉపాదివైపు అడుగులువేశారు..

ఉచిత శిక్షణ, భోజనం
అనుభవజ్ఞులైనవారితో శిక్షణ, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు నిరుద్యోగులకు వరంగా మారాయి.. కోర్సు పూర్తయ్యాక అర్హులైనవారికి సర్టిఫికేట్లుకూడా ప్రదానం చేస్తున్నారు.. యూనిట్‌ స్థాపించడానికి ముందుకువస్తే బ్యాంకులద్వారా రుణాలుకూడా మంజూరుచేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు శిక్షణ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులునింపుతోంది.. జీవితంలో స్థిరపడే ఇంతమంచి అవకాశం కల్పిస్తున్న ఆంధ్రా బ్యాంక్‌కు యువత కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌ ఒక్క నిరుద్యోగులకేకాదు.. రైతులకూ ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టింది.. పాడి పశువులు, గొర్రెలు, పట్టుపురుగులు, వానపాముల పెంపకం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందిస్తోంది.. బ్యాంక్‌ చేపట్టిన ఈ కార్యక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలవర్షం కురుస్తోంది.

ఆరోగ్య శ్రీ పరిధిలోకి వేరికోస్ వ్యాధి : మంత్రి లక్ష్మా రెడ్డి

హైదరాబాద్: ఆరోగ్య శ్రీ పరిధిలోకి వేరికోస్ వ్యాధి చేర్చుతున్నట్లు మంత్రి లక్ష్మా రెడ్డి ప్రకటించారు. నాగర్ కర్నూల్ లో కావాలనే రాజకీయం చేశారని.. అది చిన్న సమస్య అని మంత్రి పేర్కొన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య తగ్గిందంటే మంచిదేగా అని.. విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సరోగసి చట్టం కేంద్రం నుంచి రావాలన్నారు.

 

జీఎస్టీ అభ్యంతరాలపై కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారు: ఈటెల

ఢిల్లీ: జీఎస్టీ అభ్యంతరాలపై సీఎం కేసీార్ ప్రధానికి లేఖ రాశాని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గ్రానైట్, బీడీ పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలని కోరామని.. కేంద్రం స్పందించడం లేదని తెలిపారు. జీఎస్టీకి ముందు ఆమోదం తెలిపినా ప్రజా సమస్యలను కేంద్రానికి వివరించామన్నారు. అవసరం అయితే వాయిదావేయాలని, అభద్రత మధ్య ప్రారంభించ వద్దని తెలిపామన్నారు. జీఎస్టీ వల్ల భారం పడుతున్న రాష్ట్రాలకు జీఎస్టీ కౌన్సిల్ లో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఈటెల తెలిపారు. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పై రూ.2వేల కోట్ల భారం పడుతుందన్నారు.

 

16:18 - June 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మళ్లీ అమెరికాకు పయనం కానున్నారా ? ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తమిళ రాజకీయాల్లోకి 'రజనీ' ఎంట్రీ ఉంటుందని...అభిమానులతో కూడా 'రజనీ' భేటీ కావడం రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన 'రోబో 2.0'..'కాలా' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. 'కబాలి' చిత్ర సమయంలో 'రజనీ' అమెరికాలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా మళ్లీ 'రజనీ' అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 'కాలా' సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న 'రజనీ' అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిజాలు ఏంటో 'రజనీ' స్వయంగా..లేదా ఆయన కుటుంబసభ్యులు నోరు మెదిపితే కాని తెలియదు.

జీఎస్టీకి టీఆర్ ఎస్ మద్ధతిస్తుంది: ఎంపి వినోద్

ఢిల్లి : జీఎస్టీకి టీఆర్ ఎస్ మద్ధతిస్తుంది అని ఎంపి వినోద్ తెలిపారు. ఆర్థిక మంత్రి, ఈటెల, టీఆర్ ఎస్ ఎంపీలంతా జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరవుతామని స్పష్టం చేశారు. జీఎస్టీ వల్ల భవిష్యత్ లో మేలు జరుగుతుందని వినోద్ తెలిపారు. జీఎస్టీ తో పన్ను ఎగవేత దారులకు చెక్ పడుతుందన్నారు. మిషన్ భగీరధ, కాకతీయ, బీడీ వంటి వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్ మోదీకి లేఖ రాశారని తెలిపారు. భవిష్యత్ లో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

16:01 - June 30, 2017

సినిమా రంగంలో ఉన్న హీరోలు తమ తమ చిత్రాలను రిలీజ్ చేసుకొనే విషయంలో ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇతర హీరోల చిత్రాలు అదే డేట్ లో రిలీజ్ అయితే ఇబ్బందులు తప్పవని భావించి ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు టాక్. మొండి వైఖరితో ముందుకెళ్లకుండా ఒకరితో ఒకరు చర్చించుకుని ముందుకెళుతున్నారు. ఇటీవలే పలు చిత్రాల రిలీజ్ విషయంలో ఒకరినొకరు అర్థం చేసుకుని వారి వారి చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న 'స్పైడర్'..జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రాల రిలీజ్ డేట్ విషయంలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. 'జై లవ కుశ' సినిమా విడుదల సెప్టెంబర్ 21న రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేసినట్లు..కానీ 'స్పైడర్' చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 27వ తేదీన 'స్పైడర్' విడుదల చేయాలని భావించారంట. కానీ 'జై లవ కుశ' చిత్ర యూనిట్ అభ్యర్థన మేరకు 'స్పైడర్' చిత్రాన్ని సెప్టెంబర్ 22 రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాల విడుదల తేదీల్లో స్పష్టత రానుంది.

15:59 - June 30, 2017

మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్'..ప్రముఖ దర్శకుడు 'సుకుమార్' కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రంగస్థలం 1985'. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఆర్ట్ సినిమాల ఉంటుందని..చిత్రం సామాన్య ప్రేక్షకుకుడికి రీచ్ అవుతుందా ? అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఎక్కువ శాతం షూటింగ్ కొనసాగుతోంది. 'రామ్ చరణ్' సరసన 'సమంత' నటిస్తోంది. గుబురు గడ్డంతో లుంగీతో కనిపించే చరణ్ ఒక పేదింటి అబ్బాయి అని ప్రచారం జరుగుతోంది. పల్లెటూరి అమ్మాయిలా ఈ సినిమాలో కనిపిస్తున్న 'సమంత' డబ్బున్న మారాజు కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించబోతోందని టాక్. వీరి మధ్యన జరిగే ప్రేమ...1985 నాటి పరిస్థితుల నేపథ్యంలో కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ మాత్రం సినిమాను చాలా డిఫరెంటింగ్ గా తీస్తున్నారని టాక్. చరణ్ కెరియర్ లో 'రంగస్థలం' ఎలాంటి ఫలితం ఇవ్వనుందో రానున్న రోజుల్లో తెలియనుంది.

15:54 - June 30, 2017

కామారెడ్డి : లక్కీ డ్రాలు, బంపర్ డ్రాలు, బంపర్ ఆఫర్లు అంటూ జనాలకు.. ఈజీగా కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. స్కీంల పేరుతో కోట్ల రూపాయలు కట్టించుకొని మోసం చేస్తోన్న ఘటనలు ఎన్ని వెలుగులోకి వస్తోన్నా.. మళ్లీ జనం దగా పడుతూనే ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో బంపర్‌ డ్రా పేరుతో ఓ ముఠా స్కీం వ్యాపారం నడిపిస్తోంది. స్కీమ్‌కు పర్మిషన్‌ లేకున్నా.. కొందరు పోలీసులు, ప్రజా ప్రతినిధుల అండతో దందాను నడిపిస్తున్నారు.

1250 రూపాయలు కట్టండి..
నెలకు కేవలం 1250 రూపాయలు కట్టండి.. ఆకర్షణీయమైన బహుమతులను పొందండి. లక్ష్మీ గణపతి ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో.. కొందరు వ్యక్తులు ఈ దందాను నడిపిస్తున్నారు. నెలకు 1250 చొప్పున 12 నెలలు కట్టాలి. మొత్తం 3, 300 మంది ఈ స్కీంలో సభ్యులుగా చేరారు. కామారెడ్డి నగర శివారులోని ఫంక్షన్‌ హాలులో ప్రతి నెలా ఈ భాగోతాన్ని నడిపిస్తున్నారు. 41 లక్షల 25 వేలు ప్రతీ నెలా వసూలు చేస్తారు. ఏడాదికి చూస్తే 4 కోట్ల 94 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఇందులో ప్రతీ నెల బంపర్ డ్రా తీస్తారు. 12 నెలలు ప్రతీ నెలా కొన్ని బహుమతుల బంపర్‌ డ్రా ఉంటుంది. ఓ నెల నాలుగు ఎల్‌ఈడీ టీవీలు ఉంటే మరో నెల నాలుగు ఎల్‌ఈడీ టీవీలతో పాటు బైక్‌లు ఉంటాయి. మరో నెల కారు ఉంటుంది. ఇలా 12 నెలలు ఆకర్షణీయమైన బహుమతులంటూ జనాలను మభ్యపెడుతున్నారు. ఈ స్కాం గురించి ఎస్పీకి ఫిర్యాదు చేసినా.. ఎంక్వైరీ కూడా చేయలేదు. ప్రజా ప్రతినిధుల అండ.. పోలీసులు కూడా బంపర్‌ డ్రాలో అభ్యర్థులుగా ఉండటం వల్లే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీం సభ్యులు మినహా ఎవరూ రాకుండా సెక్యూరిటీని నియమిస్తారు. ఈ స్కీంలో ముందు అర చేతిలో వైకుంఠం చూపించి.. వారు సభ్యులుగా చేరాక శరతులు వర్తిస్తాయని చెబుతారు. స్కీంలో బైక్‌ వస్తే.. దానికి అయ్యే భీమా, రోడ్ ట్యాక్స్, ఎంట్రీ ఫీజు ఇలా చట్ట ప్రకారం కట్టాల్సిన డబ్బులు.. డ్రా పొందిన సభ్యుడే కట్టాలి. సభ్యుడు రెండు నెలలు డబ్బులు కట్టకపోతే సభ్యత్వం తీసేస్తారు. అంతకు ముందు కట్టిన డబ్బులు కూడా ఇవ్వరు.

ఎల్‌ఈడీ టీవీలు అమ్మడానికి మాత్రమే
ఈ పథకం కేవలం ఎల్‌ఈడీ టీవీలు అమ్మడానికి మాత్రమే అని పెట్టి.. ఇందులో కార్లు, బైక్‌లు బంపర్‌ డ్రాలో పెడతారు. టీవీలు, బైక్‌లు, కార్లు షోరూం పెట్టి లైసెన్స్‌లు పెట్టి అమ్మాలి. టీవీలు, కార్లు, బైక్‌లు ఇలా ఏదైనా ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించకుండా బంపర్‌ డ్రాలో వెళ్లినవారికి ఇచ్చేస్తున్నారు. ఇది చట్టరీత్యా నేరం.

స్కీం పేరుతో 4 కోట్ల 94 లక్షలు వసూలు
12 నెలల్లో మొత్తం స్కీం పేరుతో 4 కోట్ల 94 లక్షలు వసూలు చేస్తారు. ఏడాదిలో 3, 300 మంది సభ్యుల్లో 2 వేల మంది ఎల్‌ఈడీ టీవీలు పొందుతారు. మిగతా వెయ్యి మంది కట్టే కోటీ 25 లక్షలు స్కీం సభ్యులకు మిగులుతాయి. ఒక్క ఎల్‌ఈడీని 9 వేలకు ఇప్పిస్తున్నారు. మిగతా 6 వేలు స్కీం నడిపిస్తున్న వారి ఖాతాలోకి వెళ్తాయంటే.. ఏ రేంజ్‌లో స్కాం చేస్తున్నారో అర్థమవుతుంది. బ్రాండెడ్‌ ఎల్‌ఈడీ టీవీలు అని చెప్పి చివరకు.. అసంబుల్డ్‌ ఎల్‌ఈడీ టీవీలు అంటగడుతున్నారు. నిర్వహకులు స్కీం ఎత్తేస్తే.. కోట్ల రూపాయలు జనాలకు కుచ్చుటోపీ పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా.. జనం ఈ మాయదారి స్కీంలను నమ్ముతూ మోసపోతూనే ఉన్నారు.  

15:52 - June 30, 2017

విశాఖ : పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులతో సమానంగా కాంట్రాక్టు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో అవుట్‌ సోర్సింగ్ కార్మికులు సిఐటియూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జివిఎంసి వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. జూలైన 3న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్నిజయప్రదం చేయాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికుల పాలిట శాపంగా ఉన్న 279 జీవోను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.

15:50 - June 30, 2017

అనంతపురం : అనంతపురం జిల్లా పుట్లూరు తహశీల్దార్‌ కార్యాలయంముందు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.. సూరేపల్లికిచెందిన రైతు పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు..పాస్‌ పుస్తకాల విషయంలో అధికారులు పట్టించుకోలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తోంది.

15:48 - June 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వంశపాలన నడుస్తోందని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య. రాష్ట్రంలో 92 శాతంగాఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు పాలనలోనూ, అభివృద్ధిలోనూ సముచిత భాగస్వామ్యం కంచె ఐలయ్య లేదంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:46 - June 30, 2017

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌...కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి... మన రాష్ట్రానికి నష్టమయ్యే జీఎస్టీ విధానాన్ని సవరించే విధంగా కృషి చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ వల్ల టెక్స్‌టైల్స్‌, గ్రానైట్‌, బీడీ కార్మిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ... ఈ రంగాలపై పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వెంటనే ఈ రంగాలపై పన్ను టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నట్టు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.    

ఎయిరిండియా ప్రైవేటీకరణ తగదు: సీపీఎం

ఢిల్లీ : ఎయిరిండియా ప్రైవేటీకరణ తగదని సీపీఎం పొలిట్ బ్యూరో  హెచ్చరించింది. 2008 నుంచి నష్టాల్లో వున్న ఎయిరిండియా 2015-16 లో రూ. 105 కోట్ల లాభాన్ని సాధించిందని,ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఎయిరిండియాను ప్రైవేటీకరిస్తున్నారని సీపీఎం ఆరోపించింది.

15:44 - June 30, 2017

నల్లగొండ : .నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చెందిన పోతురాజు,దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు..అందులో 14 ఏళ్ల బాలిక స్వప్న ఉంది... ఇదే ప్రాంతానికి చెందని సుధారాణి వద్ద మిరపతొడిమెలు తీసే పనిలో చేరింది.. బాలికకు నిత్యం ఈ నెల 1న కూలీ డబ్బులు ఇస్తానంటూ కబురు చేయడంతో వెళ్లిన 14 ఏళ్ల బాలిక స్వప్న ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు..దీంతో కుటుంబీకులు వెళ్లి చూస్తే సుధారాణి కూడా లేదు..వెంటనే అనుమానం వచ్చిన వారు ఎంత వెతికినా జాడలేకపోవడంతో రెండో తేదిన పోలీసులకు ఫిర్యాదు చేశారు...

స్పందించని పోలీసులు
ఇదిలా ఉంటే కూతురు అదృశ్యమైనప్పటి నుంచి నిత్యం పోలీసు స్టేషన్ వెళ్లి సమాచారం తెలుసుకుంటున్న ఆ కుటుంబీకులకు సమాధానం దొరక్కపోవడంతో ఆందోళనకు దిగారు..బాలికను కిడ్నాప్ చేసిన సుధారాణి ఏం చేసింది...చిన్నారిని అమ్మేసిందా..? లేక మరేదైనా చేసిందాన్న అనుమానాలు పెరుగుతున్నాయి..బాలిక కోసం గాలిస్తున్న పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు.. అదే సమయంలో సుధారాణి ఎవరు.?. ఎక్కడి నుంచి వచ్చిందన్న సమాచారం కూడా సేకరించలేకపోయారు పోలీసులు.

15:40 - June 30, 2017

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో జూన్ 1న అదృశ్యమైన స్పప్న (14) టెన్ టీవీ వరుస కథనాలతో జిల్లా ఎస్పీ స్పందించారు. స్వప్న అదృశ్యం పై ఎస్పీ ప్రకాష్ రెడ్డి ఆరా తీశారు. బాలిక కోసం 4 బృందాలు గాలిస్తున్నాయని ఆయన తెలిపారు. 

జీఎస్టికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాపిత ఆందోళనలు: సీపీఎం

హైదరాబాద్: జీఎస్టికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాపిత ఆందోళనలకు సీపీఎం తెలంగాణ పార్టీ పిలుపు ఇచ్చింది. సమాఖ్య రాష్ట్రంలో రాష్ట్రాలకున్న ఆర్థిక అధికారాలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జీఎస్టీకి ముందు మద్ధతు ఇచ్చిన కేసీఆర్ ఇపుడు అభ్యంతరాలు చెబుతున్నారని తమ్మినేని మండిపడ్డారు. కేసీఆర్ అభ్యంతరాలు నిజమైతే అఖిలపక్షంగా ఢిల్లి వెళ్లేందుకు వామపక్షాలు సిద్ధం అని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు మద్ధతిస్తున్నా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

15:22 - June 30, 2017

ఢిల్లీ : ఇవాళ అర్ధరాత్రినుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి రానుంది.. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో అర్ధరాత్రి 12గం.లకు జీఎస్‌టీ ప్రారంభోత్సవం జరగనుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, పలువురు సీఎంలు, నిపుణులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.

15:10 - June 30, 2017

పశ్చిమగోదావరి : గరపర్రులో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన బహిష్కరణకు గురైన వారితో భేటీ అయ్యారు. గ్రామంలో శాంతి నెలకొనేందుకు వైసీపీ తరుపున పూర్తి సహకరిస్తామని ఆయన తెలిపారు. జగన్ దళిత కాలనీలకు వెళ్లే క్రమమంలో దారి మధ్యలోఅగ్రకులాల వారితో మాట్లాడారు అందరు ఒకే ఊరు వాళ్లం అందరం కలిసుద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అనుసంధానం కాని పాన్ కార్డులు చెల్లుతాయి: సీబీడీటీ ఛైర్మన్

హైదరాబాద్ : పాన్ కార్డులతో ఆధార్ అనుసంధానానికి నేడు ఆఖరు తేదీ. అనుసంధానం చేసుకోకపోతే పాను కార్డు రద్దవుతుందన్న ప్రచారంతో ఒక్కసారిగా అనుసంధానానికి కార్డు హోల్డర్లు ప్రయత్నించారు. ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్  సర్వర్ పై భారం పెరిగింది. అనుసంధానం కాని పాన్ కార్డులు రద్దు కావంటూ సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర ప్రకటించారు. మరో నోటిఫికేషన్ వచ్చే వరకు అనుసంధానం కాని పాన్ కార్డులు చెల్లుబాటు అవుతాయని తెలిపారు.

 

14:45 - June 30, 2017
14:41 - June 30, 2017

హైదరాబాద్ : బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్ లకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుల్ని పోలీసులు కోర్టుల హాజరుపరిచారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

14:40 - June 30, 2017

కరీంనగర్: జిల్లా కేంద్రంలో 2012మార్చి 8న రూ.30 పకోడీ కోసం అనిల్ అనే వ్యక్తి గొడవపడి రాజు, నరేశ్, కమల్, కిరణ్ లను హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో అనిల్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది.అనిల్ ఇప్పటికే ఓ హత్య కేసుతో సంబంధం ఉండడంతో అతని పై పీడీ యాక్ట నమోదు చేశారు. అనిల్ దాన్ని హైకోర్టుల సవాల్ చేశారు. దీంతో కోర్టు అతని పిటిషన్ కొట్టివేయడంతో కరీంనగర్ కోర్టు 10 రోజులు విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

14:39 - June 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో గరగపర్రులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. సామాజిక బహిష్కరణకు గురైన దళితులతో జగన్ భేటీ అయ్యారు. గ్రామంలోని పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జగన్ పర్యటన సందర్భంగా గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు. బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దళితుల సామాజిక బహిష్కరించిన అగ్రకులాల తీరు పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులకు న్యాయం చేసేంతవరకు పోరాడుతా అంటూ జగన్ ప్రకటించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

ఆయూష్ ఉద్యోగుల చలో అమరావతి భగ్నం

అమరావతి: 15 నెలల వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయూష్ ఉద్యోగులు చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సమస్యలు పరిష్కరించాలని విజయవాడ ధర్ణా చౌక్ ఆందోళనకు పిలుపునిచ్చారు.గత వారం రోజులుగా ఆయూష్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు. దీంతో వారి మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

 

ఏపీ హౌసింగ్ కార్యాలయం ప్రారంభం...

విజయవాడ: ఏపీ హౌసింగ్ కార్యాలయాన్ని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రారంభించారు. ఇక నుంచి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యకలాపాలన్నీ అమరావతి నుండే  కొనసాగుతాయని నాగుల్ మీరా తెలిపారు. అమరావతిలో రూ.8 కోట్లతో అధునాత భవనాన్ని నిర్మిస్తున్నామని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు విశ్రాంతి తీసుకునే విధంగా నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ కు క్వార్టర్ ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

 

గంగపర్రులో జగన్ పర్యటన

ప.గో: వైసీపీ అధినేత జగన్ గంగపర్రులో పర్యటిస్తున్నారు. మార్గ మధ్యంలో జగన్ వాహనాన్ని ఆపి అగ్రవర్ణాలు మాట్లాడారు. వెలివేతకు గురైన దళిత కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నాడు. దళితుల సామాజిక బహిష్కరణ గురించి స్థానికులను అడిగి తెలుసుకోనున్నారు.

 

చలో ఆగిరిపల్లికి హైకోర్టు అనుమతి

క్రిష్ణా : రేపటి చలో ఆగిరిపల్లకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉభయ రష్ర్టాల నుండి దళితులు భారీగా తరలి రానున్నారు. అంతే కాకుండా అంబేద్కర్ మనువడు రాజారత్న అంబేద్కర్, ప్రజా గాయకుడు గద్ధర్, కత్తి పద్మారావు హారజరు కానున్నారు. మరో వైపు ప్రభుత్వ యంత్రాంగం ఆటంకం కలిగించేందుకు యత్నిస్తోంది. దళితులపై దాడులు, వేధింపులకు నిరసనగా చలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఆగిరిపల్లి దళితులపూ పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని దళిత ఉద్యమ నేత విట్టర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

అనంతపురం : పట్లూరు తహశీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. పాస్ పుస్తకాల విషయంలో అధికారులు పట్టించుకో లేదని మనస్థాపం చెందిన రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. బాధితుడు సూరేపల్లి వాసి అని తెలుస్తోంది.

దోమల నియంత్రణ, నివారణ పై మంత్రి కామినేని సమీక్ష

అమరావతి: దోమల నియంత్రణ, నివారణ పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో వైద్య, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

13:43 - June 30, 2017

మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం...దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా వార్తలను వీడియోలో చూద్దాం....

నలుగురిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు

కరీంనగర్ : నలుగురిని హత్య చేసిన కేసులో కొమ్ము అనిల్ అనే వ్యక్తికి జిల్లా కోర్టు జీవిత ఖైధు విధించింది. 2012 లో రూ. 30 చికెన్ పకోడీ కోసం జరిగిన ఘర్షణలో అనిల్ కత్తితో దాడి చేయడంతో నలుగురు మరణించారు.

13:40 - June 30, 2017

తూర్పుగోదావరి : గరగపర్రులో పీస్‌ కమిటీని ఏర్పాటైంది. కమిటీలో ఆర్డీవో, డీఎస్పీ, దళితుల నుంచి నలుగురు, అగ్రవర్ణాల నుంచి నలుగురు చొప్పున సభ్యులుగా ఉన్నారు. గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా చూడాలని.. పీస్‌ కమిటీ చర్చించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:38 - June 30, 2017

గుంటూరు : విధుల్లో చేరకముందే ఐపీఎస్‌ అభిషేక్‌ మహంతికి బదిలీ అయింది. ఈ వ్యవహారం పోలీసువర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీనివెనక పెద్ద తతంగమే నడిచిందని ప్రచారం జరుగుతోంది.. చిత్తూరు అడ్మిన్‌ ఏఎస్ పీగా ఉన్న అభిషేక్‌ మహంతిని గుంటూరు అర్బన్‌ ఎస్ పీగా బదిలీచేస్తూ ప్రభుత్వం గతవారం ఉత్తర్వులు ఇచ్చింది.. ఈ నెల 30న బాధ్యతలు స్వీకరణకు అభిషేక్‌ సిద్ధమయ్యారు.. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే అభిషేక్‌ వస్తే తమ ఆటలు సాగవని కొందరు పోలీసులు భావించినట్లు తెలుస్తోంది.. ఈ యువ ఐపీఎస్‌ గుంటూరుకు రాకుండా చూడాలంటూ రాజకీయ నేతలకు విజ్ఞప్తులు చేశారు.. ఆయన వస్తే ఇకనుంచి మీరు చెప్పినట్లు చేయడంకుదరదంటూ నేతలకు పోలీసులు చెప్పినట్లు సమాచారం.. దీంతో ఆలోచనలోపడ్డ నేతలు.. గుంటూరుకు అభిషేక్‌ వద్దంటూ సీఎం చంద్రబాబుతోపాటు డీజీపీ దృష్టికి తెచినట్లు సమాచారం.. అందుకే అభిషేక్‌ మహంతిని తిరుపతి అర్బన్‌కు బదిలీ చేశారని తెలుస్తోంది.

13:27 - June 30, 2017
13:20 - June 30, 2017

హైదరాబాద్ : గూడ్స్ సర్వీస్ ట్యాక్స్..సామాన్యుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జీఎస్టీతో చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ పడనుంది. కేంద్రప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను పేరుతో తీసుకొస్తోన్న జీఎస్టీతో.. ఎరువులు, ట్రాక్టర్లపై పన్నులు పెరగనున్నాయి. దీంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడేలా ఉంది. ఇలా పన్ను మోత మోగించడంతో ఇటు వ్యాపారులు.. అటు లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది. 
జీఎస్టీ..సామాన్యులు హడల్ 
జీఎస్టీ ఈ పేరు వింటేనే.. ఇప్పుడు సామాన్యులు హడలిపోతున్నారు. వ్యవసాయం, టెక్స్‌టైల్స్‌, బీడి, హోటల్‌ సర్వీస్‌ రంగాలపై.. జీఎస్టీతో తీవ్ర ప్రభావం పడనుంది. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో.. తీసుకొస్తోన్న జీఎస్టీ వలన పన్నులు పెరుగనున్నాయి. ఎరువులు ట్రాక్టర్లపై పన్నులు పెరగటంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడనుంది. వస్తు ఆధారిత సేవా పన్ను.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
చిరు వ్యాపారులకు రూ. 20 లక్షల వెసులు బాటు 
జీఎస్టీలో చిరు వ్యాపారులకు 20 లక్షల వెసులు బాటు కల్పించారు. కానీ రైతులకు మాత్రం ఆ వెసులు బాటు కల్పించలేదు. వ్యాపారం చేసుకునే వారి టర్నోవర్‌ ఏడాదికి 20 లక్షల లోపు జరిగితే వారు.. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవసరం లేదు. ఒకవేళ 20 లక్షల లోపు అవి బ్రాండెడ్ కంపెనీలవి అయితే తప్పని సరిగా జీఎస్టీలో నమోదు చేసుకోవాలి. 
ఏడాదికి రూ.75 లక్షల వ్యాపారం చేసే వారికి వెసులుబాటు 
ఏడాదికి 75 లక్షల లోపు వ్యాపారం చేసే వారికి వెసులు బాటు ఉంటుంది. వారు చేసే వ్యాపారాన్ని బట్టి ఒకటి, రెండున్నర శాతం పన్ను జీఎస్టీ కింద చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో సొంతంగా తయారు చేసే వస్తువులకు జీఎస్టీ కింద మూడు నెలలకు ఒకసారి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. చిన్న హోటళ్లు, క్యాంటిన్‌ వారు ఆహార పదార్థాలు సరఫరా చేసే క్యాటరింగ్‌ వారు  రెండున్నర శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఇతర వస్తువులు సరఫరా చేసే వారికి కొంతమేరకు జీఎస్టీ కింద చెల్లించాలి. 
జీఎస్టీ కింద పన్ను చెల్లింపు 
ఈ కామర్స్‌ ద్వారా వ్యాపారం చేసేవారు కూడా జీఎస్టీ కింద పన్ను చెల్లించాలి. ఆన్‌లైన్‌ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది వర్తిస్తుంది.  జీఎస్టీ కింద రాష్ట్ర వాణిజ్య శాఖతో పాటు ఇన్‌కమ్‌ట్యాక్స్‌ కస్టమ్స్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ రిజర్వు బ్యాంకు ఉంటాయి. వ్యాపారులు బిల్లు కట్టేది లేనిది ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్‌ జిల్లాల్లో కేంద్రం విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. మూడు రోజులుగా వస్త్ర వ్యాపారులు షాపును మూసేసి.. ఆందోళనలు చేస్తున్నారు.
పెరగనున్న ఎరువుల ధరలు 
ఎరువుల ధరలు కూడా పెరగనున్నాయి. ట్రాక్టర్లపై పన్ను పెరగటం వలన రైతులకు మరింత భారం కానుంది. జీఎస్టీ అమలైతే ట్రాక్టర్లు 1800 హెచ్‌పికి ప్రస్తుతం ఐదు శాతం వ్యాట్ ఉంది. జీఎస్టీ ద్వారా 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయం ఎక్కువగా ట్రాక్టర్లపై నడుస్తోంది. ఒకేసారి ఏడు శాతం పెరిగితే రైతులు ట్రాక్టర్లు కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారనుంది. జీఎస్టీ అమలుతో యూరియా, డీఏపి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరగనున్నాయి. 
బీడీలపై వ్యాట్, సెంట్రల్‌ పన్ను 18.5 శాతం 
అలాగే ప్రస్తుతం బీడీలపై వ్యాట్, సెంట్రల్‌ పన్ను కలిసి.. 18.5 శాతానికి పెరగనుంది. బీడి ఆకుపై 5 శాతం పన్నుల నుంచి 15 శాతానికి పెరగనుంది. ఈ భారం పరిశ్రమపై ప్రభావం చూపనుంది. అయితే గతంలో గుజరాత్‌ సీఎంగా పని చేసిన సమయంలో జీఎస్టీతో చాలా కష్టాలు ఉన్నాయని నరేంద్ర మోడీ అన్నారు. కానీ ప్రధాన మంత్రి కాగానే అన్నీ మర్చిపోయి.. జీఎస్టీ విధించడం న్యాయం కాదని అంటున్నారు. జీఎస్టీతో చాలా మంది వ్యాపారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందని.. కొందరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు. 

 

మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత: మంత్రి నాయిని

హైదరాబాద్: మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత అని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచాల నివారణకు కఠిన చర్యలు చేపట్టాం అని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల పట్ల వేధింపుల నివారణకు హెడ్ క్వార్టర్స్ లలో భరోసా సెంటర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజల సహకారంతో క్రైం రేటు తగ్గిస్తామన్నారు. పోలీసు శాఖ లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అందుబాటులోకి తెచ్చాం అన్నారు.

13:04 - June 30, 2017
13:03 - June 30, 2017

చిత్తూరు : తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం అయింది. తమిళనాడులోని నమక్కల్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులు లొంగిపోయారు. ఈనెల 14న బాలుడిని కిడ్నాప్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా... 

 

12:56 - June 30, 2017

నల్గొండ : నాగార్జునసాగర్‌ బ్రిడ్జ్‌ ఆధునీకరణ పనులు ఏపీ, తెలంగాణ మధ్య వివాదానికి దారితీసింది. గోడలకు గులాబీరంగు వేయడంపై ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇరురాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుపై ఒక రాష్ట్ర అధికారపార్టీ రంగు ఎలా వేస్తారంటూ తెలంగాణ అధికారులతో వాగ్వావాదానికి దిగారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశం మేరకే గోడలకు గులాబీ రంగు వేశామని తెలంగాణ అధికారులు తెలిపారు. 

 

12:51 - June 30, 2017

నమ్మకం అనేది మనిషి ఏర్పరచుకున్నది..వ్యక్తిగతంగా నమ్మకాలపై ఎవరి అభిప్రాయాలు వారివి ఉంటాయి. కానీ ఇందులో 'మూఢనమ్మకం' కూడా ఒకటి. శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఈ నమ్మకాల చాటున ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది తెలిసిందే. తాజాగా ఓ చర్చీలో మేరీమాత విగ్రహం నుండి రక్తం కారుతోందని ప్రచారం జరిగింది. దీనితో చాలా మంది ఈ ఘటనపై ఆసక్తి కనబరిచారు. ఈ విగ్రహాన్ని చూడటానికి చాలా మంది అక్కడకు తరలివెళ్లారు కూడా.
కానీ ప్రాణం లేని విగ్రహం నుండి రక్తం ఎలా వస్తుంది ? అని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మూఢనమ్మకాలు..ఇతరత్రా వాటిపై ప్రజలను చైతన్యపరచడంలో ముందుండే 'జనవిజ్ఞాన వేదిక' దీనిపై స్పందించింది. రక్తం అనేది ఉత్తుత్తిదే అని జేవీవీ ప్రతినిధి రమేష్ తేల్చిచెప్పారు. ఓ ఛానెల్ తో ఆయన మాట్లాడారు. విగ్రహం అనేది మనుషులు తయారు చేసిందని, భౌతికమైన మెటీరియల్ తో తయారు చేయబడిందన్నారు. ఎక్కడి నుండో రక్తం కారడం అసాధ్యమని, రక్తం కారాలంటే రక్త ప్రసరణ జరగాల్సి ఉంటుందని తెలిపారు. హృదయం..గుండె..తదితర అవయవాలు ఉండాల్సి ఉంటుందని, కానీ తయారు చేసిన విగ్రహంలో రక్త ప్రసరణ లేదని..శరీరంలో నుండి రక్తం బయటకు వస్తే గడ్డ కడుతుందన్నారు. లేబరేటీకి తీసుకెళ్లి ఏ గ్రూపు తేల్చాలని ఆయన సవాల్ విసురుతున్నారు. ఇప్పటికైనా మూఢనమ్మకాలు విడనీడాలని పలువురు సూచిస్తున్నారు.

గంగపర్రులో పీస్ కమిటీ ఏర్పాటు

ప.గో : గంగపర్రులో శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా పీస్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఆర్ఢీవో, డీఎస్పీ, నలుగురు దళితులు, అగ్రవర్ణాలకు చెందిన నలుగురు ఉన్నారు. ఈ కమిటీ గంగపర్రులో శాంతిభద్రతల ఏర్పాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించనుంది.

గాంధీ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీలు

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి వద్ద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

 

12:46 - June 30, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధ్యక్షులు ఎవరు ? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నికైనా రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించే విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోంది ? ప్రస్తుతం ఉన్న అధ్యక్షులే కొనసాగుతారా ? మార్పులు చేర్పులు ఉంటాయా ? టీడీపీ లో ఈ విషయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 
టీడీపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి
తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి. విశాఖలో జరిగిన మహానాడులో చంద్రబాబును టీడీపీ జాతీయ  అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ కమిటీ ఏర్పాటు, రాష్ట్ర అధ్యక్షుల నియామకం విషయంలో సర్వాధికారాలు చంద్రబాబుకు అప్పగిస్తూ మహానాడులో తీర్మానం చేశారు. మహానాడు ముగిసి నెల రోజులు పూర్తైనా ఇంతవరకు కమిటీల ఏర్పాటుపై  చంద్రబాబునాయుడు దృష్టి పెట్టకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 
కొత్తవారికి అవకాశం ఇస్తారా?
మహానాడు ముగిసిన కొద్ది రోజుల్లోనే పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడం చంద్రబాబుకు అలవాటు. కానీ ఈసారి ఇంతవరకు ప్రకటించకపోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కళావెంక్రటావు, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడుగా ఎల్‌ రమణ కొనసాగుతున్నారు. మళ్లీ వీరినే నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా? అన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత కమిటీల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 
మళ్లీ కళావెంకట్రావుకే చాన్స్‌ ?
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. నేతల మధ్య విభేదాలను చక్కబెట్టి, సమన్వయం కుదర్చడంలో నేర్పరని చంద్రబాబు భావిస్తున్నారు. మళ్లీ ఈయన్నే కొసాగించే అవకాశం ఉందని  టీడీపీలో ప్రచారం జరుగుతోంది. కళావెంకట్రావును అటు బీసీల కోటాతో పాటు ఇటు కాపుల ఖాతాలో చూపించొచ్చన్న ఉద్దేశంతో పార్టీ అధినేత ఉన్నారు. అయితే కళ్లా వెంకట్రావు మంత్రిగా ఉన్నారు.   ఒకవ్యక్తికి ఒకే పదవి అన్న విషయంలో చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని కొందరు నేతలు చెబుతున్నారు.  టీటీడీ చైర్మన్‌ పదవి కోసం ప్రయత్నించిన గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి లోక్‌సభ సభ్యుడు మురళీమోహన్‌కు చంద్రబాబు ఇదే విషయం స్పష్టం చేశారు. అలాంటప్పుడు టీడీపీ అధ్యక్షుడి విషయంలో ఈ నియమం వర్తించదా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 
కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్న రేవంత్‌రెడ్డి 
తెలంగాణ టీడీపీ విషయానికి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎల్‌ రమణ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. వివాదరహితుడుగా ఉన్న రమణపై పార్టీ అధినేత చంద్రబాబుకు సదభిప్రాయమే ఉంది. అయితే రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించే విషయంలో చొరవ చూపలేకపోతున్నారన్న అపవాదు ఎదుర్కొంటున్నారు. అన్ని విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న రేవంత్‌రెడ్డికి మళ్లీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కట్టుబెడితే సమతుల్యం పాటించినట్టు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే విషయంలో రేవంత్‌రెడ్డి సఫలీకృతులయ్యారని పార్టీలో పేరుంది. కొంతమంది సీనియర్లకు రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోయినా, ఇలాంటి వారిని రమణ బ్యాలెన్స్‌ చేస్తున్నారు. దీంతో ఈ జోడీనే తిరిగి కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎలా స్పందిస్తారన్నది ఆకస్తిగా మారింది. అండమాన్‌ నికోబార్‌ దీవుల టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న మాణిక్యరావు యాదవ్‌ను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ విషయాల్లో మరో వారం లేదా పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు రంగనాయకుల మండపంలో మంత్రికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

 

తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యం

తిరుమల :ఈ నెల 14వ తేదీన తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యం అయ్యింది తమిళనాడులోని నమక్కల్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

12:33 - June 30, 2017

సిద్ధిపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ఢీకొని ఆర్ ఎంపీ డాక్టర్ సిద్ధి రాముడు మృతి చెందారు. రాముడి భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. రాముడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

12:30 - June 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు గ్రామం పోలీసులు దిగ్బంధంలో ఉంది. మరికాసేపట్లో వైసీపీ అధినేత జగన్ గ్రామంలో పర్యటించనున్నారు. సామాజిక బహిష్కరణకు గురైన గ్రామ ప్రజలను ఆయన కలవనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో బయటివ్యక్తులను పోలీసులు అడ్డుకుంటున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో గరగపర్రులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:25 - June 30, 2017

హైదరాబాద్ : ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు తగ్గించాలని భారత్ విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) ఆందోళన బాట పట్టింది. ఈమేరకు ఆ సంఘం కార్యకర్తలు తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:22 - June 30, 2017

మళ్లీ స్నాచర్లు తెగబడుతున్నారు..మొన్న ఉప్పల్..నేడు వనస్థలీపురం..నేడు నాగోల్..ఎల్ బీనగర్..మహానగరంలో గొలుసు దొంగల పంజా..

గతేడాది ఛైన్ స్నాచర్లపై పోలీసులు తుపాకి కూడా ఎక్కుపెట్టారు..కాల్పులు కూడా జరిపారు. దీనితో గొలుసు దొంగల జాడ కనిపించలేదు. ఆ తరువాత స్పెషల్ టీం ఏర్పాటు చేసినా స్నాచర్ల కదలికలు లేకపోవడంతో స్తబ్దుగా మారిపోయింది. ఇదే మంచి అవకాశం అనుకున్న గొలుసు దొంగలు చెలరేగుతున్నారు. ఇప్పటికే ఉప్పల్..వనస్థలీపురంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని పంజా విసురుతున్నారు. ఎల్ బినగర్, నాగోల్ లోని రెండు ప్రాంతాల్లో ఛైన్ స్నాచింగ్ లు జరిగాయి. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి సమాచారం..వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

టీఎస్ బీపీఈడీసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ బీపీఈడీ ఫలితాలు విడుదలయా్యయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. రాళ్ల నవత (వనపర్తి) బీపీ ఈడీ తొలి ర్యాంకు సాధించింది. బీపీఈడీ రెండో ర్యాంకు అశ్విని(వరంగల్), బీపీీడీ మూడో ర్యాంకు శ్రీను (చర్ల, భద్రాద్రి, కొత్తగూడెం) సాధించినట్లు పేర్కొన్నారు.

 

12:12 - June 30, 2017

నగరానికి తరలివస్తున్న డ్రగ్స్...యూత్..స్టూడెంట్స్ టార్గెట్...సంపన్నపుత్రరత్నాలకు గాలం..మత్తులో ముంచేసి ఆర్జన...యువకుల జీవితాలతో చెలగాటం..

మహానగరంలో డ్రగ్స్...మళ్లీ కలకలం రేపుతోంది..ఇప్పటికే ఎన్నో ముఠాలను కాప్స్ పట్టుకున్నా..కొత్తగా మరికొంత మంది పుట్టుకొస్తున్నారు..నగరంలోని యూత్ తో పాటు కాలేజీ స్టూడెంట్స్ కు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తేలింది..మత్తు..ఇది తెలియని వారికి తెలిసేలా చేస్తున్నారు..మత్తులో ముంచేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ పై ఎంత దాడులు చేస్తున్నా..మళ్లీ మళ్లీ దొరుకుతూనే ఉన్నాయి..గోవాలో దొరికే డ్రగ్స్..నగరంలో దొరుకుతుండడం కలకలం రేపుతోంది..చిక్కడపల్లిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:56 - June 30, 2017

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగుల జీవితం. ఈ సమయంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఉత్సాహం చూపరు. ఏకంగా మధ్యాహ్న భోజనానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇలా చేయడం వల్ల పలు సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో జీవక్రియ దెబ్బతింటుందని..అనేక రకాల సమస్యలు కోరి తెచ్చుకొనే వారవుతారని పేర్కొంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ వారు ఓ పరిశోధన చేశారు. బ్రేక్ ఫాస్ట్ ను పట్టంచుకోని వారు టైప్ 2 డయాబెటీస్ కు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ తినని వారిలో హై పర్ టెన్షన్ ఉంటుందని..ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతాయని పేర్కొంటున్నారు. బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల బరువు పెరుగుతామని అనుకొని అపోహలు పడుతుంటారని, బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొటితే మాత్రం ఖచ్చితంగా బరువు పెరుగుతారని పరిశోధకులు సూచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యానికి ఉపయోగపడే వాటిని తీసుకుంటే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.

మణిపూర్ లో బాంబు పేలుడు.. జవాన్ మరణం

మణిపూర్: ఉఖ్రుల్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అసోం రైఫిల్‌కు చెందిన జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడుకు సంబంధించి ఏ తీవ్రవాద సంస్థ తాము బాధ్యులమని ప్రకటించలేదు. 

 

టీ.ఎస్ సచివాలయం వద్ధ ఎస్.ఎఫ్.ఐ ఆందోళన

హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల్లో చర్యలు చేపట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ ఎఫ్ ఐ) సచివాలయ ముట్టడికి యత్నించింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్ధ్యార్థుల మధ్య తోపులాట జరిగింది.

 

11:47 - June 30, 2017

చిత్తూరు : తిరుపతిలో ఎస్ పీల బదిలీలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతి ఎస్‌పీగా బాధ్యతలు తీసుకున్న 48గంటల్లోనే విజయరావును గుంటూరుకు బదిలీ చేశారు. అలాగే టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా రవికృష్ణ నియామకంపై విమర్శలొస్తున్నాయి. సమర్ధుడైన అధికారిని ప్రాధాన్యతలేని పోస్టులోకి బదిలీచేశారని ఐపీఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెండేళ్లుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఐపీఎస్ అధికారులెవ్వరూ ఈ పోస్టులో చేరేందుకు ఉత్సాహం చూపలేదు. అలాంటి పోస్టులో రవికృష్ణకు పోస్టింగ్‌ ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. విజయరావు బదిలీ కోరారంటూ ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ భరోసా జాతీయ సదస్సు

హైదరాబాద్: ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ భరోసా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. మహిళలు, చిన్నారులపై వేధింపులపై తీసుకోవాల్సిన చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హోంమంత్రి నాయిని, డీజీపీ అనురాగ్ శర్మ, షీ టీమ్స్ కమిషనర్  స్వాతి లక్రా, మంత్రి మహేందర్ రెడ్డి, మహిళా కమిషన్ ఛైర్మన్ త్రిపురాణ వెంకటరత్నం, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నేతలు పాల్గొన్నారు.

 

తిరుపతిలో ఎస్పీల బదిలీల పై వివాదం

తిరుపతి : ఎస్పీల బదిలీల పై వివాదం చెలరేగింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న 48 గంటల్లోనే విజయరావును గుంటూరుకు అధికారులు బదిలీ చేశారు. విజయరావే బదిలీ కోరాడంటూ మరో వైపుప్రచారం సాగుతోంది. సమర్థుడైన ైపీెస్ అధికారి రవికుష్ణను టీటీడీ సీవీెస్ వోగా నియమించడంపై కలకలం రేగింది. అతి తక్కువ ప్రాధాన్యం ున్న పీవీెస్ వో పోస్టుకు రవి కుష్ణను నియమించడంపై ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న సీవీఎస్ వో పోస్టును తీసుకోవడానికి ఐపీఎస్ లు ముందుకు రావడం లేదు.

తెలంగాణ, ఏపీ మధ్య మరో వివాదం

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రాసుకుంది.నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగు వేయడం పై ేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే గులాబీ రంగు వేశామని తెలంగాణ అధికారులు తెలిపారు.

11:10 - June 30, 2017

తమ చిత్రాలను వినూత్నంగా ప్రచారం చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తుంటారు. అందులో భాగంగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుంటారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో..హీరోయిన్లు..చిత్ర యూనిట్ పాల్గొంటూ ఉంటుంది. కానీ ఇండియాలో కాకుండా హాలీవుడ్ లో ప్రచారం నిర్వహించిన ఘనత దర్శకుడు 'శంకర్' కు దక్కుతుంది. రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో 'రోబో 2.0' నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే. ఇది 'రోబో' కు సీక్వెల్. ఈ చిత్రంలో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నాడు. పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచారం ప్రారంభమైంది.
హాలీవుడ్ లోని లేక్ పార్కులో '2.0' చిత్రాలను ముద్రించిన 100 అడుగుల హాట్ బెలూన్ ను ఆవిష్కరించారు. ఇలాంటి బెలూన్లు ప్రపంచంలోని పలు దేశాల్లో ఎగురవేయాలని 'శంకర్' భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రూ. 400 కోట్లతో తెరకెక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రచారానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు...చిత్ర ఆడియో దుబాయిలో కనీవినీఎరుగని రీతిలో నిర్వహించాలని చిత్ర యూనిట్ యోచిస్తోందని తెలుస్తోంది. మరి 'శంకర్' దర్శకత్వం..రజనీ..అక్షయ్..మిగతా నటీ నటుల ప్రతిభపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పునివ్వనున్నారో చూడాలి.

వైఫల్యాలను దిద్దుకోకపోతే కఠినచర్యలు :సీఎం చంద్రబాబు

అమరావతి: రేపటి నుండి నవంబర్ మొదటి వారం వరకు ’జనం-మనం’ కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. జులై లో వన మహోత్సవంతో ప్రారంభించి నవంబర్ లో వన భోజనాలతో ముగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ పట్టణాభివుద్ధి శాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. వైఫల్యాలను దిద్దుకోకపోతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

10:57 - June 30, 2017

2014..అధికారంలోకి వచ్చిన బీజేపీ..భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం..అప్పటి నుండి నేటీ వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ? కులం..మతం పేరిట దాడులు పెరిగిపోతున్నాయనడానికి జరుగుతున్న ఘటనలే తార్కాణం. ప్రధానంగా 'గోవు' దాడులు అధికమౌతున్నాయి. కేంద్రం కూడా ఒక అడుగుముందుకేసి పశువధ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. నరేంద్ర మోడీ హాయాంలో గోరక్షకుల పేరిట హత్యలు..అరాచకాలపై 'ఇండియాస్పెండ్ పోర్టల్' నమ్మలేని నిజాలను వెల్లడించింది. 2010 నుండి జాతీయ ఆన్ లైన్ మీడియాలో వెలుగు చూసిన ఉదంతాల ఆధారంగా ఇండియా స్పెండ్ ఈ నివేదికను తయారు చేసింది.

61 హత్యలు..
గోవులను కాపాడే పేరిట హత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.  మూడేండ్లలో 61 హత్యలు జరిగినట్లు పేర్కొంది. మరణించిన వారిలో 86 శాతం ముస్లింలే కావడం గమనార్హం అని తెలిపింది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి దాడులు అధికమయ్యాయని, తొలి ఆరు నెలల్లోనే గోవు పేరిట 20 ఘటనలు చోటు చేసుకొన్నాయని స్పష్టం చేసింది. 2016తో పోలిస్తే 75 శాతం అధికమని తెలిపింది. ఎక్కువ శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగడం గమనార్హం. దాడులు..హత్యల్లో ఉత్తర్ ప్రదేశ్ 10, హర్యానా 9తొలి వరుసలా నిలుచున్నాయి. కర్నాటకలో 6 కేసులు చోటు చేసుకోగా మిగిలిన తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో 13 ఘటనలు జరిగాయి.

మోడీ స్పందించారు..హత్యలు ఆగలేదు..
గోరక్షక్ పేరిట జరుగుతున్నా ప్రధాన మంత్రి స్పందించకపోవడం పట్ల పలు విమర్శలు చెలరేగాయి. చాలా రోజులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు వ్యాఖ్యానాలు చేశారు. గో భక్తి పేరిట జరుగుతున్న దాడులపై స్పందించారు. ఇలా స్పందించారో లేదో..మరొక హత్య జరగడం తీవ్ర సంచలనం సృష్టించింది. జార్ఖండ్ లోని గిరిదహ్ జిల్లాలోని బిరియబాద్ గ్రామానికి చెందిన డెయిరీ ఓనర్ అలీలముద్దీన్ అలియాస్ అస్గర్ అన్సారీని దుండగులు దారుణంగా హత్య చేశారు. మాంసం వ్యాపారం చేసే అన్సారీని పథకం ప్రకారం హత్య చేశారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దాడి సమయంలో అన్సారీ బీఫ్ తీసుకెళుతున్నాడా ? లేదా ? అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

తినే ఆహారంపై ఆంక్షలా ?
ఇక మరొక విషయానికి వస్తే దాడుల ఘటనలు సగానికి పైగా వదంతులు..తప్పుడు సమాచారం పేరిట జరిగాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పశువధపై నియంత్రణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ అనంతరం ఈ తరహా దాడులు అధికం కావడం ఆందోళన వ్యక్తమౌతోంది. గోవులను తరలిస్తున్నారని..బీఫ్ తిన్నారని ఏకంగా దాడులు చేస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఎవరికి ఇష్టమైనది వారు తినకూడదా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తినే ఆహారంపై ఆంక్షలు విధించడం ఏంటీ ? మాంసాహారాల్లో అన్నింటికన్నా చౌకగా లభించేది ఎద్దు మాంసమేనని పలువురు పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా గోరక్షక్ పేరిట జరుగుతున్న దాడులపై పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

కలెక్టర్లతో మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: గొర్రెల, మేకల పంపిణీ పై జిల్లాల కలెక్టర్లతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

10:51 - June 30, 2017

జోగులాంబ గద్వాల : జిల్లాలోని టీఆర్ ఎస్ లో గ్రూపు రాజకీయాలు భగ్గుమంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కలిసిమెలిసి ఉన్న నేతలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఠాలు కడుతున్నారు. నేతల విభేదాలతో పార్టీ పరువు, ప్రతిష్ఠలు మంటకలుస్తున్నాయి.  పార్టీ ప్రయోజనాల కంటే  వ్యక్తిగత స్వార్థమే పరమావధిగా పెట్టుకుని పని చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో మారుతున్న టీఆర్ ఎస్ రాజకీయ సమీకరణలపై 10 టీవీ ప్రత్యేక కథనం... 
అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం 
జోగులాంబ గద్వాల జిల్లాలో కొంతకాలంగా నివురుకప్పిన నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్‌ వర్గ రాజకీయాలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. నేతల అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం కావడంతో అధికార పార్టీ పరువు వీధినపడుతోంది. ముగ్గురు నేతలు ఆరు గ్రూపులు అన్న చందంగా గద్వాల జిల్లా టీఆర్‌ఎస్‌ పరిస్థితి తయారైంది. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి ముఠాలు కట్టి రెండు గ్రూపులుగా వ్యవహరిస్తున్నారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి, అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో గద్వాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి డీకే అరుణపై పోటీచేసి ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన పాలమూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బలంలేకపోయినా పీఠం అధికార పార్టీ వశమయ్యే విధంగా చక్రంతిప్పి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర నుంచి అందరి దృష్టి ఆకర్షించారు. పలుకుబడితో తన అనుచరుడైన చంద్రశేఖర్‌రెడ్డి భార్యకు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి ఇప్పించుకుని బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపడంతో రెండువర్గాలుగా వ్యవహరిస్తున్నారు. 
కృష్ణమోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ముఠాల పంచాయితీ 
కృష్ణమోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి ముఠాల పంచాయితీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లింది. ఇద్దరూ కలిసిమెలిసి పనిచేసే విధంగా సయోధ్య కుదిర్చినా.. అది కొద్ది కాలానికే పరిమితమైంది. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గద్వాల జిల్లా  సంబురాలను కృష్ణమోహన్‌రెడ్డి వర్గం వ్యతరేకిస్తే, చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు సమర్ధించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఆధిపత్యపోరుగా భాగంగా మొదట బలమైన వర్గంతో కృష్ణమోహన్‌రెడ్డి పెత్తనం చెలాయించినా  ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.  తొలుత కృష్ణమోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్న జెడ్పీ చైర్మన్‌ భాస్కర్‌ ఇప్పుడు చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపులో చేరిపోయారు.అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, వడ్డేపల్లి శ్రీనివాసులు, ఆంజనేయులు గౌడ్‌ వంటి నేతలు కూడా చంద్రశేఖర్‌రెడ్డి పంచన చేరడంతో కృష్ణమోహన్‌రెడ్డి హవా తగ్గింది. ఏ కార్యక్రమం జరిగినా చంద్రశేఖర్‌డ్డి అనుచరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు జిల్లాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 
అందరూ చంద్రశేఖర్‌రెడ్డికి అనుకూలం 
జెడ్పీ కార్యాలయంలో పనులు చూసేందుకు కృష్ణమోహన్‌రెడ్డి నియమించిన ఇద్దరు వ్యక్తులు జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు, సర్పంచ్‌లతో దరుసుగా ప్రవర్తించడంతో అందరూ కూడా చంద్రశేఖర్‌రెడ్డికి అనుకూలంగా మారారు. దీంతో కృష్ణమోహన్‌రెడ్డి ప్రభ మసకబారింది. టీఆర్ఎస్‌ అధినాయకత్వం జోక్యం చేసుకుని కృష్ణమోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చితే మినహా గద్వాల జిల్లాలో టీఆర్‌ఎస్‌ పరిస్థితులు చక్కబడే అవకాశాలులేవని భావిస్తున్నారు.

 

10:46 - June 30, 2017

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టారు. ప్రగతి భవన్‌ ముట్టడికి ప్రయత్నించిన రేషన్‌ డీలర్లను అర్థరాత్రి ముందస్తు అరెస్ట్‌లు చేయడంతో రేషన్ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రగతి ముట్టడికి యత్నించిన 35 మంది రేషన్ డీలర్లను పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు. అయితే సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడుతుంటే అరెస్ట్‌ ఎలా చేస్తారంటూ రేషన్ డీలర్లు మండిపడుతున్నారు. తమకిచ్చే కమీషన్‌ను పెంచాలని దాంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.  

సీఎం కేసీఆర్ ఇంటి ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన.. అరెస్ట్

పంజాగుట్ట: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేషన్‌ డీలర్లు సోమాజిగూడ గ్రీన్‌ల్యాండ్స్‌లోని తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారుల ఒత్తిళ్లతో తెలంగాణలో రేషన్‌ డీలర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నిరసన తెలుపుతున్న 8మందిని పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ల నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు రేషన్‌డీలర్లు సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపేందుకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

 

10:44 - June 30, 2017

పశ్చిమ గోదావరి : గరగపర్రులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గరగపర్రులో ఇవాళ వైఎస్‌ జగన్ పర్యటించనున్నారు. సామాజిక బహిష్కరణకు గురైన ఎస్సీ, ఎస్టీ గ్రామస్తులందరితో వైఎస్‌ జగన్‌ భేటీకానున్నారు. రెండు నెలలుగా బహిష్కరణకు గురైన గ్రామస్తుల సాదకబాదకాలను వారినడికి గెలుసుకోనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. 

 

10:43 - June 30, 2017

అనంతపురం : మిక్సీలో బంగారం బిస్కట్లు తరలిస్తున్న ముగ్గురిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మోటార్‌ ప్లేస్‌లో 17వందల 50 గ్రాముల బంగారం బిస్కట్లు వారు అమర్చారు. సౌది అరేబియా నుంచి ఈ బంగారాన్ని రాష్ట్రానికి తీసుకువచ్చారు. కడప జిల్లా పొద్దుటూరుకు ఈ బంగారం బిస్కెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

10:38 - June 30, 2017

హైదరాబాద్ : రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ ఇండియా....వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ విజయం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.కీలక సమరానికి విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టుకు జాసన్‌ హోల్డర్‌ సారధ్యంలోని వెస్టండీస్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది. మూడో వన్డేలో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌పై పట్టుబిగించాలని విరాట్‌ ఆర్మీ పట్టుదలతో ఉంది. వన్డేల్లో తిరుగులేని టీమిండియా....వెస్టిండీస్‌తో జరగుతున్న  వన్డే సిరీస్‌పై కన్నేసింది. 5 వన్డేల సిరీస్‌లోని కీలక మూడో వన్డేలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 2వ స్థానంలో ఉండగా.... జాసన్‌ హోల్డర్‌ సారధ్యంలోని వెస్టండీస్‌ టీమ్‌ 9వ స్థానంలో కొనసాగుతోంది.
వన్డే ఫేటుఫేస్...వెస్టిండీస్‌దే పై చేయి..
కానీ వన్డేల్లో ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం ఇండియాపై వెస్టిండీస్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 118 వన్డేల్లో పోటీపడగా....60 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ జట్టు విజయం సాధించింది. 54 వన్డేల్లో భారత్‌ నెగ్గింది. ప్రస్తుత సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా...రెండో వన్డేలో భారత జట్టు సునాయాస విజయం సాధించింది. రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో వన్డేలో నెగ్గి సిరీస్‌పై పట్టు బిగించాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్‌, అజింక్య రహానే,విరాట్‌ కొహ్లీ  సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు...బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండటంతో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. మరోవైపు జాసన్‌ హోల్డర్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు.అంతర్జాతీయ అనుభవం లేని వెస్టిండీస్‌ జట్టు భారత జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. ఆంటీగ్వాలోని వివియన్‌ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరుగనున్న మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. మూడో వన్డేలో వెస్టిండీస్‌ కంటే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న బారత జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనండంలో సందేహమే లేదు. 

 

దోమలపై దండయాత్ర కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టాలి: చంద్రబాబు

అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సమాచార లోపం వల్లే చాపరాయి వంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రజల అమాయకత్వం, సకాలంలో ప్రభుత్వ సేవలు అందుబాటులో లేక 16 మంది మరణానికి కారణం అయ్యిందన్నారు. ఇటువంటిఘటనలు మరళా జరగరాదని చంద్రబాబు ఆదేశించారు. తాగేపీటి విపియోగం, పారిశద్ధ్యం, ఆహార అలవాట్లలో ఏజెన్సీ ప్రాంత ప్రజలను చైతన్య పరచాలన్నారు. రేపటి నుండి దోమలపై దండయాత్ర కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

10:32 - June 30, 2017

బ్రదర్..జీఎస్టీ వచ్చేస్తోంది...తెలుసా...ధరలు పెరుగుతాయంట..అరే కాదు..ధరలు తగ్గుతున్నాయి..ఏమో ఏ ధరలు తగ్గుతాయో..పెరుగుతాయో అసలు తెలియడం లేదు..అసలు జీఎస్టీ అంటే ఏమిటీ ? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఫలానా వస్తువుల ధరలు పెరుగుతాయంట..ఫలానా వస్తువుల ధరలు తగ్గుతాయంట..అంటూ నలుగురు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. ఎన్నో సమస్యలున్నా దేశంలో ఒక్కసారిగా అందరి దృష్టి జీఎస్టీపై పడేలా చేసింది.

ఒకే దేశం ఒకే పన్ను...
'ఒకే దేశం..ఒకే పన్ను' అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'జీఎస్టీ' తో నగర వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరికి లాభం..ఎవరికి నష్టం అంటూ వచ్చే వార్తలపై నగర వాసులు కన్నేసి ఉంచుతున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. జీఎస్టీ వల్ల మేలు జరుగుతుందని కేంద్రం పేర్కొంటోంది. కానీ ఈ జీఎస్టీ రావడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి..జీవనం ఎలా ఉంటుందోనని సామాన్యుడు..మధ్యతరగతి వాసులు తెగ ఉత్కంఠకు లోనవుతున్నారు.

జులై 1వ తేదీ..
జులై 1వ తేదీ నుండి అమల్లోకి రాబోతోంది. అందులో భాగంగా జూన్ 30వ తేదీ రాత్రి ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం అయి దీనికి ఆమోదం తెలుపనుంది. జీఎస్టీకి సంబంధించిన దానిపై ద్రం ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసింది. సమావేశాల్లో పాల్గొన్న ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తమ వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 5వ తేదీన లోక్ సభ ఆమోదించగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశ పరిచి జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించేసింది. జీఎస్టీని ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచిపోయింది.

ఆందోళనలు..నిరసనలు..
జీఎస్టీని సమావేశాలు పూర్తయిన అనంతరం ఏయే వస్తువులపై ఎంత పన్ను ఉంటుందనే దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసరికి వివిధ వ్యాపారవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. వెంటనే వారు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పలు వ్యాపార వర్గాల వారు నిరసనలకు దిగుతున్నారు. ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న తమను జీఎస్టీ కారణంగా మరింత నష్టాల్లోకి నెట్టవేస్తున్నారంటూ ఆయా వర్గాలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. ప్రధానంగా దేశానికి వెన్నెముకగా పేరొందిన రైతుపై తీవ్ర ప్రభావం చూపబడనుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. చిన్న..సన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితులు దాపురిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం..
జీఎస్టీని తీసుకరావడంలో కేంద్రం తనదైన వ్యూహాలు రచించింది. ఇందులో రాష్ట్రాలకు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వలేదని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులోని సెక్షన్ 12 (9) ప్రకారం జీఎస్టీ కౌన్సిల్ లో ఏ నిర్ణయమైనా జరగాలంటే కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే వారిలో నాలుగింట మూడు వంతుల అంటే 75 శాతం ఆమోదించాల్సి ఉంటుంది. కౌన్సిల్ లోని 29 రాష్ట్రాల ప్రతినిధుల ఓట్ల విలువ మూడింట రెండు వంతులు అంటే 66.6 శాతం. కేంద్ర ప్రభుత్వం తరపున ఇద్దరు మంత్రుల ఓట్ల విలువ మూడింట ఒక వంతు అంటే 33.3 శాతం. ఏదైనా ప్రతిపాదన నెగ్గాలంటే 75 శాతం ఓట్లు కావాలని నిర్ధేశించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాట మీద నిలబడినా కూడా వాటి ఓట్ల విలువ శాతం 75 శాతం రాదని..వాటి మాట ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగ్గదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రాల మాటలకు కేంద్రం విలువ ఇవ్వదని..కేంద్రమే అన్ని అధికారాలనూ తన గుప్పిట్లో పెట్టుకోగలుగుతుందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో జీఎస్టీ ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

10:31 - June 30, 2017

గుజరాత్ : దేశంలో గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోది స్పందించారు. గోరక్షణ పేరుతో దాడులు చేసి మనుషులను కొట్టి చంపడం ఆమోదయోగ్యం కాదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని, హింస... సమస్యకు పరిష్కారం కాదని మోది స్పష్టం చేశారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న మోది సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. చరఖా తిప్పి నూలు వడికారు. మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక గురువు 'శ్రీమద్‌ రామచంద్ర' స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు.

10:29 - June 30, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' ఏ సినిమాలైనా వందల కోట్ల క్లబ్ లోకి సునాసయంగా వెళ్లిపోతున్నాయి. విభిన్న పాత్రల్లో నటించే ఈ నటుడు తాజాగా 'ట్యూబ్ లైట్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన ఛరిష్మాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇటీవ‌లి కాలంలో 'భజరంగీ బాయిజాన్', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'సుల్తాన్' సినిమాలు అవలీలగా వంద కోట్ల క్లబ్ లోకి చేరాయి. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ట్యూబ్ లైట్' చిత్రంలో 'సల్మాన్' వైవిధ్యమైన పాత్ర పోషించాడు. చైనా ఇండియా వార్ నేపథ్యంలో సినిమా రూపొందింది. రిలీజ్ అయిన అనంతరం చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. కానీ వీకెండ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టినట్లు టాక్. తాజాగా సినిమా క్రిటిక్ తరణ్‌ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ఈ మూవీ కలెక్షన్ వివరాలు ప్రకటించారు. ఓపెనింగ్ వీక్ లో రూ. 64.77 కోట్లు..సోమవారం రూ. 19.09 కోట్లు, మంగళవారం రూ. 12 కోట్లు సాధించిందని వెల్లడించాడు. డే 1 శుక్రవారం రూ. 21.15 కోట్లు..డే 2 శనివారం రూ. 21.17 కోట్లు..డే 3 ఆదివారం రూ. 22.45 కోట్లు..డే 4 సోమవారం రూ. 19.09 కోట్లు..డే 5 మంగళవారం రూ. 12 కోట్లు..డే 6 బుధవారం రూ. 11కోట్లు.. మొత్తానికి రూ. 106.86 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది.

10:28 - June 30, 2017

హైదరాబాద్ : బల్దియాలో ప్రక్షాళన కొనసాగుతోంది. ఇటీవలే డిప్యూటీ కమిషనర్లపై బదిలీ వేటు వేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌..తాజాగా టౌన్‌ప్లానింగ్‌పై నజర్‌ పెట్టారు. సిటీలో ఇష్టానుసారంగా వెలుస్తున్న భవనాలు, అపార్టుమెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల విషయంలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో చైన్‌మెన్‌ నుంచి సిటీ ప్లానర్ల వరకు స్థానచలనం చేయాలని బల్దియా బాస్‌ నిర్ణయించారు. 
సమూల ప్రక్షాళనకు సిద్ధమైన కమిషనర్ 
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సమూల ప్రక్షాళనకు నడుం బిగించారు. అధికారుల అవినీతి బూజు దులిపేందుకు సిద్ధమయ్యారు. ఫైల్‌ కదలాలంటే చేయి తడపాలన్న పద్ధతికి స్వస్తి పలకాలని నిశ్చయించారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా నగరంలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిత్యం జీహెచ్‌ఎంసీకి అందుతున్న ఫిర్యాదుల్లో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికే చెందిన సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు టౌన్‌ప్లానింగ్‌లో అవినీతిపై సాక్షాత్‌ సీఎం పలుమార్లు ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థమవుతుంది. ఇటీవల ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులే ఎక్కుగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బందిపై వేటు వేసేందుకు బల్దియా కమిషనర్‌ రెడీ అయ్యారు. 
ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీకి కసరత్తు 
టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులే అవినీతికి ప్రధానకారణమని భావిస్తున్నారు. దీంతో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లపై బదిలీ వేటు వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 2014 నుంచి మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఏసీపీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అవసరమైతే వారిని మాతృసంస్థకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 
పూర్థిస్థాయిలో బదిలీ 
ఇక టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చాలా మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సర్వేయర్లు, ఆపరేటర్లు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే అధికంగా ఉన్నారు. పలు సర్కిళ్లలో వీరి ద్వారానే అక్రమాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. వీరిని కూడా పూర్థిస్థాయిలో బదిలీ చేయాలని బల్దియా కమిషనర్‌ నిర్ణయించారు. ఆపరేటర్లను ఇప్పుడు పనిచేస్తున్న సర్కిళ్లకు కాకుండా ఇతర సర్కిళ్లకు మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తిస్థాయిలో టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా అవినీతి ఆరోపణలకు తావు లేకుండా చూడాలని బల్దియా బాస్‌ ఫిక్సయ్యారు.  

 

10:28 - June 30, 2017

టాలీవుడ్ నటుడు 'అజయ్' విలన్ గా చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు. 'లక్ష్మీ కళ్యాణం'లో విలన్ గా మెప్పించిన ఈ నటుడు 'విక్రమార్కుడు' సినిమా అనంతరం అందరి దృష్టిని ఆకర్షించాడు. పలు సినిమాల్లో విలన్ గా...తమ్ముడిగా నటించిన ఈ నటుడు పలు పాత్రల్లో నటించాడు. తెలుగు..తమిళ..కన్నడ భాషల్లో 'అజయ్' నటించాడు. తాజాగా ఆయన సతీమణి వార్తల్లోకెక్కారు. ఆయన భార్య 'శ్వేత రావూరి' 'హాట్‌ మోంద్‌' నిర్వహించిన 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని 'అజయ్‌' తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలియచేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. చివరి రౌండ్‌కు ఎంపిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఆమె ఫేస్‌బుక్‌ పేజీని షేర్‌ చేస్తూ.. దయచేసి లైక్‌ చేసి, తనను ఆశీర్వదించాలని కోరారు. తన భర్త సపోర్ట్ ఈ విజయంలో మరవలేనిది అని శ్వేత తెగ పొగిడేస్తోంది.
అజయ్..శ్వేతల వివాహం 2006లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో తెలుగు మోడల్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ 'శిల్పా రెడ్డి' కూడా మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే. 'శ్వేత' కూడా విజయం సాధిస్తుందని అనుకుంటున్నారు...ఆల్ ది..బెస్ట్..

10:26 - June 30, 2017

'బాహుబలి-2'..రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తెలుగు చలన చిత్ర సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుంది. తక్కువ రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. రిలీజ్ కాకముందే రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రం మరో రికార్డు సొంతం చేసుకుంది. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' హిందీ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ మొత్తం 7 కోట్ల మంది చూశారు. దీంతో భారత్‌లో 7 కోట్ల వ్యూస్‌ దాటిన తొలి ట్రైలర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. చైనాలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకుని యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసింది. రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది. రూ. 2000 కోట్ల క్లబ్ లో కూడా చేరుతుందని సినిమా విశ్లేషకుల అభిప్రాయం.

10:25 - June 30, 2017

ఆస్కార్ అవార్డు..అత్యంత ప్రతిష్టాత్మకంగా అవార్డును భావిస్తుంటారు. తమకు ఎప్పటికైనా ఈ అవార్డు వస్తుందని..రావాలని నటీనటులు అనుకుంటుంటారు. అందులో భాగంగా ఆయా చిత్రాల్లో ఒదిగిపోయి నటిస్తుంటారు. ఈ పురస్కారానికి అందుకోవడానికి ప్రపంచదేశాలు పోటీ పడుతుంటాయి. కానీ ఎంపిక మాట తరువాత..నామినేట్ కావడమే అసలు విషయం. నామినేటెడ్ కావడానికి తీవ్రమైన పోటీ ఉంటుంది. కమిటీ సభ్యులు ఆయా సినిమాలను చూసి పరిశీలించి..ఎంపిక చేస్తుంటారు. గత ఏడాది ఆస్కార్‌ పురస్కారాల ఎంపికకు 683 మందితో ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈసారి ఈ సంఖ్యను పెంచారు. ప్యానెల్ లో బాలీవుడ్ స్టార్స్ కు చోటు దక్కింది. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఐశ్వర్య రాయ్, అమీర్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే ఉన్నారు. వీరిని ఆస్కార్‌ ప్యానెల్‌గా ఎంపిక చేసినట్టు ఆహ్వానాలు అందాయి. అత్యధికంగా 774 మందితో ఈ ప్యానల్‌ ఉండబోతుంది.

గరగపర్రులో ఉద్రిక్తత

ప.గో:  వైసీపీ నేత జగన్ నేడు గరగపర్రులో పర్యటించనున్నారు.  గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సామాజిక బహిష్కరణకు గురైన గ్రామస్థులతో జగన్ భేటీ కానున్నారు.

 

10:22 - June 30, 2017

హైదరాబాద్ : ఆరేళ్లపాటు జైలుశిక్షతో తమ కుటుంబాలు ఎంతో ఇబ్బందిపడ్డాయని... అక్బరుద్దీన్‌పై దాడికేసులో నిర్దోషిగా విడుదలైన పహిల్వాన్‌ చెప్పారు.. దేవుడు ఉన్నాడని... 2019వరకు తమ సత్తాఏంటో చూపిస్తామని తెలిపారు.... అక్బరుద్దీన్‌పై దాడి కేసులో పదిమందిని నాంపల్లి కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది... కోర్టు తీర్పు తర్వాత పహిల్వాన్‌తోపాటు మరో ఐదుగురు చర్లపల్లి జైలునుంచి విడుదలయ్యారు.. 

 

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్లాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. 140 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 40 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

 

ప్రజల ఆస్తుల జోలికి వస్తే కఠిన చర్యలు : ప్రభాకర్ చౌదరి

అనంతపురం : రుద్రం పేట పంచాయతీలో ఓ వ్యక్తి స్థలాన్ని మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు కబ్జా చేశాడు. ెమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చొరవతో తిరిగి స్థలాన్ని దక్కిచ్చుకున్నాడు. అనంతపురంలో ఏ పార్టీ వారు కబ్జా చేసినా ఊరుకోమన్నారు. ప్రజల ఆస్తుల జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు.

 

10:16 - June 30, 2017

మెగాస్టార్ చిరంజీవి దశాబ్దకాలం పాటు వెండి తెరకు దూరంగా ఉండి..'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆయన తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాపై సోషల్ మాధ్యమాల్లో వార్తలు తెగ వచ్చేస్తున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు..ఇందులో 'చిరంజీవి' పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే చిరంజీవి 151సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లనున్నట్లు 'రాంచరణ్' ఇటీవలే పేర్కొన్నారు. పలు భాషల్లో నిర్మాణం చేయాలని..అందుకని ఆయా భాషల్లో పేరొందిన నటులను ఈ సినిమాలో నటింపచేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'చిరంజీవి' పక్కన నటించే హీరోయిన్ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నట్లు టాక్. ఐశ్వర్యరాయ్..సోనాక్షి సిన్హా..కాజల్..ఇలా ప్రముఖ నటీమణుల పేర్లు వినిపించాయి. తాజాగా 'అనుష్క' పేరు తెరపైకి వచ్చింది. అయితే చిత్ర బృందం ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు కాబట్టి..'చిరు' సినిమాలో నటించేందుకు 'అనుష్క' గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరికొన్ని రోజులు ఆగితే ఈ చిత్రంపై పూర్తి సమాచారం రానుంది. అప్పటి వరకు వేయిట్ అండ్ సీ..

 

10:13 - June 30, 2017

ఐపీఎల్ లో స్పాటింగ్ ఫిక్స్ లకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 'శ్రీశాంత్' క్రికెట్ కు దూరమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈయన ఫాస్ట్ బౌలింగ్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. క్రికెట్ వదిలేసిన ఆయన వెండితెరపైకి అడుగులు వేశాడు. త్వరలోనే 'టీమ్ 5' ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. జకారియా నిర్మాణంలో సురేష్ గోవింద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తెలుగు..తమిళ..మలయాళ భాషల్లో రూపొందిన చిత్రం జులై 14న విడుదల కానుంది. ఇదో బైక్ రేసర్ కథ అని, రేసింగ్ ఒక్కటే కాకుండా అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని నిర్మాత పేర్కొన్నారు. కథ, కథనం మీద నమ్మకంతో... ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో శ్రీశాంత్ ఒప్పుకున్నారు అని తెలిపారు. బైక్ రేస‌ర్స్ అయిన ఐదుగురు స్నేహితుల జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నానే కథతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలిపారు. నిక్కీ గుల్రానీ, పెరల్ మానే కథానాయికలుగా నటించారు. మకరంద్ దేశ్ పాండే ఓ కీలక పాత్రను పోషించారు. మరి 'శ్రీశాంత్' ఎలా అలరిస్తాడో చూడాలి.

కానిస్టేబుల్ ను ఢీ కొట్టిన బైక్ రేసరు్ల...

హైదరాబాద్:  బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. 10 బైకులను సీజ్‌ చేశారు. గాయాలపాలైన కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. అరస్టైన రేసర్ల ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. దీంతో వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు. రేసర్లు అంతా రాజేంద్రనగర్‌, వట్టేపల్లి, హసన్‌ నగర్‌, సులేమాన్‌ నగర్‌లకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు.

 

పేకాటారాయుళ్ల అరెస్ట్

వరంగల్ అర్బన్ : జిల్లాలోని మమునూర్ పరిదిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. ఓ పాఠశాల వేనకాల 11 మంది వ్యక్తులు పేకాట అడుతుండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ 20.600, 10 సెల్ పోన్లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడ్డవారిలో ఇద్దరు పోలీసులు సైతం ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సాంబయ్య పట్టుబడ్డవారిలో ఉన్నారు.

 

పశుమాంసాన్ని తీసుకు వెళుతున్నాడని కొట్టి చంపేశారు..

.హైదరాబాద్: గో సంరక్షణ పేరిట హత్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిస్తుండగా, పశుమాంసాన్ని తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, జార్ఖండ్ లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. రామ్ గఢ్ జిల్లా బజ్రాతాండ్ గ్రామంలో ఓ డెయిరీ యజమానిగా పనిచేస్తున్న అలీముద్దీన్ అనే వ్యక్తి ఇంటి ముందు ఆవు ఎముకలు కనిపించగా, అతను తన మారుతీ వ్యాన్ లో వెళుతున్నవేళ, దాదాపు 1000 మంది అతన్ని అటకాయించారు. ఆపై దారుణంగా కొట్టి చంపేయడమే కాకుండా, అతని ఇంటికి నిప్పు పెట్టారు.

రైల్వేశాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఘరానా మోసం

హైదరాబాద్‌: రైల్వేశాఖలోని కాల్‌సెంటర్లలో ఉద్యోగాలిప్పిస్తానంటూ బిహార్‌కు చెందిన ఘరానా మోసగాడు అమిత్‌ సింగ్‌ వందల సంఖ్యలో ఉద్యోగార్థులను మోసం చేశాడు. రూ.40 వేల జీతం ఇస్తానంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడంతో పాటు నియామకపు పత్రాలనూ పంపాడు. కాల్‌సెంటర్‌లో విధులు నిర్వహించేందుకు వీలుగా దుస్తులు, ధరావతు కోసం రూ.30వేలు తన ఖాతాలో వేయాలంటూ సూచించాడు. అతడిమాటలు నమ్మిన నిరుద్యోగులు నగదు బదిలీ చేయగానే ఫోన్‌ ఆపేశాడు. ముగ్గురు బాధితులు గురువారం సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్ధీ

తిరుపతి: భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులతో వైకుంఠంలోని 18 కంపార్ట్‌మెంట్లలో నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం, కాలినడకన భక్తులకు 8 గంటల సమయం పడుతోంది,జూన్ 7 నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను శుక్ర, శని, ఆదివారాల్లో నిలిపివేయనున్నారు. ఉచిత లడ్డూలు మాత్రం ఇస్తారు.

 

09:44 - June 30, 2017

కరీంనగర్ : జిల్లాలోని అంబేద్కర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 250 మంది పోలీసులతో తనిఖీలు చేశారు. నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు, నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ కేంద్రాలను గుర్తించారు. ఓ ఇంట్లో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ గుర్తించారు. పెద్ద సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపుల్లో గుట్కా అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 7 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. 

అగిన అమర్ నాథ్ యాత్ర

హైదరాబాద్: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. జమ్ముకశ్మీర్ లోని ఉధమ్ పూర్, బాల్టల్ లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాత్రకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాల్టల్ నుంచి అమర్ నాథ్ వరకు దారి మొత్తం బురదతో నిండిపోయింది. దీంతో, అమర్ నాథ్ కు వెళుతున్న భక్తులను ఉధమ్ పూర్, బాల్టల్ ల వద్ద ఆపేస్తున్నారు. ఇదే సమయంలో ఉధమ్ పూర్ లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో, జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసి వేశారు. ఈ నేపథ్యంలో, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

 

అంబేద్కర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్

కరీంనగర్ : జిల్లాలోని అంబేద్కర్ నగర్ లో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. పలు వాహనాలు, సిలిండర్ ను స్వాధీనం చేసుకున్నారు. 

తుందుర్రులో టెన్షన్

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాపార్కుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీకి యంత్రాలను తరలిస్తున్న లారీలను ప్రజలు అడ్డుకున్నారు. 

08:44 - June 30, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వాపార్కుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీకి యంత్రాలను తరలిస్తున్న లారీలను ప్రజలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు.  పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఫ్యాక్టరీకి వచ్చే యంత్రాలను ఆక్వా పార్కుకు యంంత్రాలు తరలిస్తున్న లారీలను పోలీసులు వెనక్కి పంపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:39 - June 30, 2017

జీఎస్టీ అమలుతో సాధారణ ప్రజలపై భారం పడుతుందని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, కాంగ్రెస్ నేత రజనీస్, బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. బడా పెట్టుబడిదారులు, పెద్ద వ్యాపారులకు లాభం చేకూరుతుందని చెప్పారు. జీఎస్టీతో ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదం వచ్చిందన్నారు. కేంద్రం చేతిలోకి అధికారాలన్ని వెళ్తాయని.. ఫెడరల్ వ్యవస్థ భంగం వాటిల్లుతుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జమ్మూ...శ్రీనగర్ హైవేపై విరిగిపడిన కొండచరియలు

జమ్మూకాశ్మీర్ : జమ్మూ...శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారి మూసివేశారు. రాకపోకలు స్తంభించాయి. అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. 

బాల్ కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు

జమ్మూ : మరోసారి కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు పొడిచింది. బాల్ కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. 

నేటి అర్ధరాత్రి జీఎస్టీ ప్రారంభోత్సవం కార్యక్రమం

ఢిల్లీ : ఈ అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్టీ ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్ హాజరుకానున్నారు. జీఎస్టీ ప్రారంభోత్సవానికి వామపక్షాలు, కాంగ్రెస్, ఆర్జేడీ దూరంగా ఉంటున్నాయి.

 

08:35 - June 30, 2017

జీఎస్టీతో ప్రజలుకు నష్టం కల్గుతుందని పాపులర్ షూస్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ అన్నారు. చెప్పుల పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ప్రవేశపెడుతున్న జిఎస్టీ అన్ని సెక్షన్ లలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఎవరి ఉపాధికి, ఎవరి వ్యాపారానికి ఎలాంటి ముప్పు వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విభిన్న వర్గాలు సమ్మెలు చేస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు బంద్ పాటిస్తుండగా, ఇవాళ చెప్పుల వ్యాపారులు బంద్ కు పిలుపునిచ్చారు. 500 రూపాయలకు మించిన ఖరీదున్న చెప్పులపై 18శాతం జిఎస్టీ విధించడంతో చెప్పుల పరిశ్రమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే విదేశీ బ్రాండ్ ల నుంచి, పెద్ద కంపెనీల నుంచి  తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు జిఎస్టీ చుక్కలు చూపిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిఎస్టీ చెప్పుల పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? భారతీయ చెప్పుల పరిశ్రమ ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లేమిటి? భారతీయ చెప్పుల పరిశ్రమను సురక్షితంగా కాపాడుకోవాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సహకాలు అందించాలి?' మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

08:33 - June 30, 2017

హైదరాబాద్ : వర్షాకాలం ముగిసేవరకు హైదరాబాద్‌ రహదారులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మంత్రి కేటీఆర్‌...అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు, ఇతర విభాగాల అధికారులు రోడ్ల నిర్మాణ పనులు.. మరమ్మతులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు. 
రహదారుల నిర్వహణపై శ్రద్ధ చూపాలి : మంత్రి కేటీఆర్ 
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో... రహదారుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ సమీక్షా నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ... ఇంజనీరింగ్‌ అధికారులు హాజరయ్యారు. వర్షాకాలం ముగిసే వరకు రహదారుల నిర్వహణపై శ్రద్ధ చూపాలని  రహదారులు ధ్వంసం కాకుండా చూసుకోవాలని అధికారులకు కేటీఆర్‌ సూచించారు. అలాగే రోడ్ల మరమ్మతులకు అవసరమైన యంత్రాలను, సామాగ్రిని వెంటనే కొనుగోలు చేయాలన్నారు.
రోడ్ల నిర్వహణ బాధ్యత ఇంజినీర్లకు అప్పగించాలి : కేటీఆర్‌
నగరంలో రోడ్లను... గ్రిడ్ల వారిగా విభజించి వాటి బాధ్యతను ఒక్కో ఇంజినీర్‌కు అప్పగించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆయా గ్రిడ్ల పర్యవేక్షణ, నిర్వహణకు ఆ అధికారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఆ రోడ్లపై కనీసం రోజుకు మూడు, నాలుగు గంటలపాటు  పర్యటించాలన్నారు. అదేవిధంగా రోడ్ల నిర్వహణ కోసం ఓ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ... అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ సిబ్బందికి వర్క్‌షాప్‌ నిర్వహించాలని చెప్పారు.  ఈ సందర్భంగా స్పెషల్‌ పర్పస్‌ వేకిల్‌ ద్వారా మొదటి దశలో నగరంలోని 300 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి కోసం పరిపాలన పరమైన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మున్సిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ను ఆదేశించారు. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎల్‌ఈడీ లైట్ల బిగింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. 

 

08:24 - June 30, 2017

చిత్తూరు : తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ విషయంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయాలని నిర్ణయించింది.  జులై 7 నుంచి ఈ కొత్త విధానాన్ని ఆచరణలో పెట్టనున్నారు. వారాంతంలో దివ్యదర్శనం క్యూలైను మార్గంలో సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నారు. దివ్యదర్శనం టోకెన్లు వారంతంలో రద్దు చేయడానికి కారణం ఉచిత లడ్డూలపై పడుతున్న ఆర్ధిక భారమా? లేక భక్తులను సంతృప్తి పరచలేకపోవడమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం రద్దు 
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. లెక్కకు మించి భక్తులు ఈ మార్గాల్లో వస్తున్నందున దాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. సాధారణంగా తిరుమలేశుడిని దర్శించుకునే భక్తులకు 10 నుంచి 18 గంటల సమయం పట్టే వేళ, దివ్యదర్శనంలో మాత్రం 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే దర్శనం ముగించుకుని బయటకు వస్తారు. దీంతో దివ్యదర్శనానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండగా, అలిపిరి, శ్రీవారి నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ముఖ్యంగా వారాంతాల్లో నడిచి వచ్చే వారి సంఖ్య 35 వేల వరకూ ఉంటుండటంతో 'దివ్యదర్శనం' టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ నిర్ణయించింది. అయితే తొలి దశలో శుక్ర, శని, ఆది వారాల్లో మాత్రమే టోకెన్ల జారీని నిలుపుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని, నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలిపారు. వారాంతాల్లో దివ్యదర్శనం టోకెన్ల రద్దు చేయాలన్న టీటీడీ నిర్ణయంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. 
2008లో దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం
వాస్తవానికి కాలినడకన తిరుమలకు వస్తామని మొక్కుతీర్చుకునే భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టిటిడి 2008లో దివ్యదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించింది. అప్పటి టిటిడి అధ్యక్షులుగా ఉన్న కనుమూరి బాపిరాజు కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ పథకాన్ని ప్రారంభించారు. ఉచితంగా ఒకటి, రాయితీపై 10 రూపాయల చొప్పున 2 లడ్డూలు, 50 చెల్లిస్తే మరో 2 అదనపు లడ్డూలు ఇలా మొత్తంగా 5 లడ్డూలు ఇచ్చారు. టీటీడీపై శ్రీవారి ఉచిత లడ్డూల భారం ఏటా సుమారు 150 కోట్ల నుంచి 180 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ గణాంకాలు చెబుతున్నాయి. ఆలయంలోని పోటులో రోజూ 3 నుండి మూడున్నర లక్షల లడ్డూలు మాత్రమే తయారు చేసే అవకాశం ఉంది. ఒక రోజు 50 వేల మంది భక్తులు కాలినడకన వస్తే ఒక్కొక్కరికి 5 చొప్పున 2.5 లక్షల లడ్డూలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇక సర్వదర్శనం, 300 టికెట్ల దర్శనం, ఆర్జిత సేవల భక్తులకు లడ్డూల సరఫరాలో టీటీడీ తీవ్ర ఇబ్బంది పడుతోంది. అందువల్లే క్రమంగా కాలిబాట భక్తుల దర్శనానికి మంగళం పలికేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం.

 

07:52 - June 30, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సామాజిక న్యాయం సాధించేందుకు ఓ ఐక్యవేదిక పురుడుపోసుకుంది. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన జరగడం లేదంటున్న ప్రజాసంఘాలు.. సమస్యలపై పోరుకు సిద్ధమయ్యాయి. జులై 4న ఏర్పడే ఐక్యవేదిక ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 
జూలై 4న ఆవిర్భావ సభ 
బంగారు తెలంగాణ సాధన కోసం రెండు వందలకుపైగా ప్రజా సంఘాలతో ఒక ఐక్యవేదిక ఏర్పడుతుంది.  తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో జూలై 4న ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐక్యవేదిక ఆవిర్భావ సభ పోస్టర్‌ను ప్రజాసంఘాల నాయకులు విడుదల చేశారు. 
బంగారు తెలంగాణ రావాలంటే పోరాటం తప్పదు : తమ్మినేని  
తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకు బాగుపడుతుందనుకున్న ప్రజల ఆశలన్నీ...అడియాశలయ్యాయని...బంగారు తెలంగాణ రావాలంటే మళ్లీ పోరాటం తప్పదని... సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. దీనికోసం ప్రజా సంఘాలన్నీ ఐక్యమవుతున్నాయని...జులై 4న జరిగే ఐక్యవేదిక సభ చరిత్రాత్మకమవుతుందని ఆయన అన్నారు. సామాజిక న్యాయ సాధనలో ఐక్య వేదిక ఆవిర్భావ సభ మహత్తర పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : గద్దర్ 
విడివిడిగా పోరాటం చేస్తున్న సంఘాలు, సంస్థలు ఐక్యవేదిక ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రజా గాయకుడు గద్దర్‌ అన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా తెలంగాణాలో పాలన సాగడం లేదని... రాష్ట్రానికి పాలకులు మాత్రమే మారారని.. పాలన తీరు మారలేదని ఆయన అన్నారు. 
బడుగులకు రాజ్యాధికారం రావడమే సామాజిక న్యాయం : ప్రొ.ప్రభంజన్  
బడుగులకు రాజ్యాధికారం రావడమే సామాజిక న్యాయమని ప్రొఫెసర్‌ ప్రభంజన్‌ యాదవ్‌ అన్నారు. బంగారు తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విడివిడిగా కాకుండా ఉమ్మడిగా ప్రజా సంఘాలు పోరాడితే దాని ప్రభావం విస్తారంగా ఉంటుందని.. అందుకే ఐక్యవేదిక ఏర్పడిందని అన్నారు. కాగా వచ్చే నెల 4వ తేదీన వనస్థలిపురంలోని ఎంఈ గార్డెన్స్‌లో టీ మాస్‌ ఫోరమ్‌ పేరుతో ఐక్యవేదిక ఆవిర్భావ సభ ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 

 

07:32 - June 30, 2017

పశ్చిమగోదావరి : వారి ఆవేదనను అర్థం చేసుకోలేదు. కన్నీళ్లను తుడిచి భరోసా ఇవ్వలేదు. కొండంత ఆశతో బాధితులు చేసిన చివరి ప్రయత్నంపై నీళ్లు చల్లారు. మాకొద్దీ అక్వాఫుడ్‌ పార్క్‌ అని నెత్తినోరు మొత్తుకున్నా చంద్రబాబు సర్కార్‌ వినిపించుకోలేదు. ఆక్వాఫుడ్ పార్క్‌ మినషరీ తరలింపు యత్నాలను తుందుర్రు, కంసాల బేతపూడి స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మళ్లీ అక్వాఫుడ్‌ పార్క్‌ చిచ్చు
పశ్చిమగోదావరి జిల్లాలో అక్వాఫుడ్‌ పార్క్‌ చిచ్చు మళ్లీ అగ్గిరాజేస్తోంది. కొన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ అలజడి రేపుతోంది. ఓవైపు అక్వాఫుడ్‌ పార్క్‌ వ్యతిరేక పోరాటం ఎగసిపడుతోంది. మరోవైపు ప్రభుత్వం అక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు మొండిగా ముందుకెళ్తోంది. వెరసి ప్రశాంత గ్రామాల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లతో మార్మోగుతోంది.
తుందుర్రులో ఉద్రిక్తత
మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ మినషరీ తరలింపు యత్నాలు తుందుర్రులో ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ చర్యకు నిరసనగా.. తుందుర్రు, కంసాల బేతపూడి స్థానికులు ఆందోళనకు దిగారు. రాత్రి సమయంలో మినషరీని గుట్టుగా తరలిస్తున్న లారీలను గ్రామస్తులంతా కలిసి అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నిరసన తెలుపుతున్న మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆక్వాఫుడ్ పార్క్‌కు మిషనరీ తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న జొన్నలగరువు గ్రామస్తులు తుందుర్రు చేరుకుని పోలీసుల తీరును ఖండించారు.
ఉద్యమం మరింత ఉద్ధృతం
మెగా అక్వాఫుడ్‌ పార్క్ ఏర్పాటు చేయొద్దని బాధితులు సీఎం చంద్రబాబుతో మొరపెట్టుకున్న 3 రోజులకే మిషనరీ తరలించేందుకు యత్నించడం కలకలం రేపుతోంది. మరోవైపు అవసరమైతే ప్రాణాలైనా వదిలేస్తాం.. కానీ మిషనరీని మాత్రం గ్రామాల్లోకి రానివ్వమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు.

 

నేడు హాయ్ ల్యాండ్ లో అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు

విజయవాడ : నేడు హాయ్ ల్యాండ్ లో అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశ, విదేశాల హుద్రోగ నిపుణులు హాజరుకానున్నారు. 

 

Don't Miss