Activities calendar

01 July 2017

19:23 - July 1, 2017

విశాఖ : జీఎస్‌టీ అమలుతో విశాఖ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. జీఎస్‌టీ గురించి ఏ మాత్రం అర్థం కావడం లేదని నగరవాసులు అంటున్నారు.. దీని వల్ల లాభమో.. నష్టమో తెలియడం లేదని అంటున్నారు. ఒక వేళ లాభం ఉన్నా.. పేదవారి అవి అందవంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. 

19:22 - July 1, 2017

గుంటూరు : జిల్లా ఓబుళనాయుడుపాలెంలో సీఎం చంద్రబాబు పాల్గొన్న వనం-మనం కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. గాల్లోకి హైడ్రోజన్ బెలూన్లను వదిలే క్రమంలో ఒక్కసారిగా బెలూన్లు పేలడంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్ధులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్ధులను హుటాహుటీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారు విజ్ఞాన్ లారా కాలేజ్‌లో బిటెక్‌ చదువుతున్న భాను, కిరణ్, అజయ్‌లుగా తెలుస్తోంది. 

19:21 - July 1, 2017

గుంటూరు : వనం-మనం కార్యక్రమం మనందరి జీవితాల్లో భాగం కావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవరైతే చెట్లు పెంచుతారో వారంతా తన మిత్రులని వారిని అన్ని విధాల ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా వృక్షమిత్ర అవార్డులో సత్కరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మొక్కలను నాటడంలో ఖమ్మం వాసి వనజీవి రామయ్యని అందర్ని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

19:19 - July 1, 2017

అనంతపురం : జిల్లాలోని బత్తలపల్లిలో రైతులు ధర్నాకు దిగారు. ఇన్ పుట్ సబ్సిడీ బ్యాంక్ తమ ఖాతాల్లో జమ కాకపోవడంపై రైతుల ఆగ్రహంతో రోడ్డేక్కినట్టు తెలుస్తోంది. రైతులు రోడ్డు పై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కల్గుతోంది. చెన్నై హైవేపై 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:52 - July 1, 2017

హైదరాబాద్ : మూడు సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు సీఐటియూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు. సీఐటియూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని.. వారు చేస్తున్న సమ్మెల పట్ల ప్రభుత్వం నిర్భందం విధిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజా, కార్మిక పోరాటాలను బలోపేతం చేయడానికి ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలతో ఏర్పడే ఐక్య వేదిక ద్వారా సీఐటియూ పోరాటాలు చేయబోతున్నట్లు సాయిబాబు తెలిపారు.

17:51 - July 1, 2017

హైదరాబాద్ : రంజాన్‌ ప్రార్థనల సందర్భంగా మత సామరస్యాన్ని కాపాడే విధంగా విధులు నిర్వహించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సీఎల్పీ నేతలు సన్మానించారు. సీఎల్పీ కార్యాలయంలో కానిస్టేబుళ్లను శాలువాతో సత్కరించారు. విధి నిర్వహణలో మత సామరస్యాన్ని కాపాడిన తీరు ఎంతో అభినందనీయమని, కాలపత్తర్‌ పీఎస్‌కు చెందిన కానిస్టేబుళ్లను ఆదర్శంగా తీసుకోవాలని జానారెడ్డి తెలిపారు.

17:49 - July 1, 2017

హైదరాబాద్ : జీఎస్‌టీ అమలుపై హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అభిప్రాయపడ్డారు. జీఎస్టీతో వినియోగదారుడికి, వ్యాపార వర్గాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జీఎస్‌టీ వల్ల కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా చూస్తున్నామని అన్నారు. జీఎస్‌టీ వల్ల పడుతున్న అదనపు పన్నును కంపెనీయే భరిస్తుందన్నారు.

17:48 - July 1, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేసీఆర్‌ తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. జీఎస్టీపై టీఆర్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. జీఎస్టీ వలన తెలంగాణకు 19వేల కోట్ల నష్టం వాటిళ్లుతోందని తెలిసినా... ఈ ఈవెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. సీబీఐ కేసులకు భయపడి కేసీఆర్‌ జీఎస్టీకి మద్దతు ఇచ్చారని పొన్నం ఆరోపించారు.

17:46 - July 1, 2017

వరంగల్ : జీఎస్టీ పన్ను విధానంపై వరంగల్ వ్యాపారుల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. జీఎస్టీ పన్ను విధానం అమలులో క్లారిటీ లేదంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:45 - July 1, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ విశ్వజిత్ ఆకస్మిక తనిఖీలు చేశారు. సెక్యూరిటీని పక్కన బెట్టి... సివిల్‌ డ్రెస్‌లో బైక్‌ చందుర్తి పీఎస్‌ను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఎస్పీ ఇలా బైక్‌పై సివిల్‌ డ్రెస్‌లో రావడంతో.. సిబ్బంది ఆశ్చర్యపోయారు. 

17:44 - July 1, 2017

హైదరాబాద్ : విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయుల పిల్లలు.. తెలుగు రాక నానా ఇబ్బందులు పడుతుంటారు. సెలవుల్లో స్వదేశానికి వస్తే కనీసం అమ్మమ్మ, నానమ్మ, తాతలతో తెలుగులో మాట్లాడలేకపోతుంటారు. అయితే గత కొంత కాలంగా విదేశాల్లో ఉంటున్న.. మన తెలుగు వాళ్లకు కొంత ఉపశమనం లభించిందని తెలుగు యూనివర్శిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అంటున్నారు.

ఎనిమిదేళ్లుగా
ఎనిమిదేళ్లుగా సిలికానాంధ్ర..మనబడి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులకు తెలుగు పాఠాలను భోదించే కార్యాన్ని నిర్వహిస్తోంది. నాలుగేళ్ల పాటు ఉండే ఈ తెలుగు కోర్సులను..అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలే స్వయంగా గుర్తించాయి. యూఎస్‌ వంటి దేశాల్లో తెలుగును కొన్ని రాష్ట్రాల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా తీసుకుంటున్నారు. ప్రవాస భారతీయులు తెలుగు భాష పట్ల ఉన్న ఆసక్తితో..సిలికాన్‌ వ్యాలీలో ఐటీ ఉద్యోగులు తమ పిల్లల్ని తెలుగు క్లాసులకు పంపిస్తున్నారు. పిల్లలు సెలవు రోజుల్లో ఎంతో నిబద్ధతగా తెలుగు భాష కమ్మదనాన్ని రుచి చూస్తున్నారు. పిల్లలు కూడా ఎంతో శ్రద్ధగా పాఠాలు వినడమే కాదు.. అసలు తెలుగు మాట్లాడటమే రాని వాళ్లు కూడా ఈ క్లాసుల వల్ల అచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారు. అంతేకాదు ఇండియాలో ఉన్న అమ్మమ్మ..తాతలతో తెలుగులో మాట్లాడుతున్నారని చాలా మంది తనతో స్వయంగా చెబుతున్నారని తెలుగు యూనివర్శిటీ వీసీ అంటున్నారు.

తెలుగు యూనివర్శిటీ పర్యవేక్షణలో
తెలుగు యూనివర్శిటీ పర్యవేక్షణలో సిలికానాంధ్ర..మనబడి వారు 8 ఏళ్లుగా చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. తెలుగు క్లాసుల గురించి యూనివర్శిటీ దృష్టికి తీసుకురాగానే తాము ఒక కమిటీని ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలను తయారు చేస్తామని అంటున్నారు. నాలుగేళ్లుగా ప్రవేశిక, ప్రహేళిక, ప్రాథమిక అని విభజించి బోధిస్తున్నామని అన్నారు. యూనివర్శిటీ వారే ప్రశ్న పత్రాలను రూపకల్పన చేసి వారి పర్యవేక్షణలోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మూల్యాంకనం కూడా వీరి పర్యవేక్షణలోనే జరుపుతూ సర్టిఫికెట్స్‌, కాన్వగేషన్‌కి వీసీని ఆహ్వానించడం జరుగుతోంది. చివరగా 400 మంది విద్యార్థులకు తాను స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొని..తెలుగు భాష పట్ల వారికున్న శ్రద్ధను చూసి ముగ్ధుడిని అయ్యాయని యూనివర్శిటీ వీసీ అంటున్నారు. యావత్ ప్రపంచంలో తెలుగు భాష పట్ల..ఇష్టం పెంచడం కోసం ప్రయత్నాలు తీవ్రం చేశామని తెలిపారు.

కెనడా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, మలేషియా, ఆస్ట్రేలియా, మారిషస్‌ వంటి దేశాల్లో
కెనడా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, మలేషియా, ఆస్ట్రేలియా, మారిషస్‌ వంటి దేశాల్లో కూడా తెలుగు పాఠాలను నేర్పిస్తున్నామని వీసీ అన్నారు. భాషకు ఎల్లలు లేవని..ఖండాంతరాల్లో మాతృ భాష ప్రసిద్ధిని చాటుతున్నారు. ఎంతో మంది విద్యార్థులకు భాష గొప్పతనాన్ని తెలుసుకునేలా చేస్తూ..తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అయితే త్వరలో మరిన్ని కొత్త కోర్సులతో తెలుగు భాషతో పాటు సంగీతం, నాట్యం, కథక్కలి, పేరిణి వంటి కళారూపాలను కూడా పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. 

17:41 - July 1, 2017

హైదరాబాద్ : భారతీయ స్టేట్ బ్యాంకు 62వ ఆవిర్భావ వేడుకల ఎస్బీఐ జోనల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బ్యాంకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని బ్యాంక్‌ మేనేజర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ రీజనల్‌ మేనేజర్లు శ్రీనివాస్‌ రెడ్డి, శేషుబాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

17:39 - July 1, 2017

కృష్ణా : 12 ఏళ్ల తరువాత జూన్ నెలలో కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన ఇవాళ కృష్ణాజిల్లాలోని పెదపారుపూడిలో వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 5కోట్ల రాష్ట్ర ప్రజలే నా కుటుంబసభ్యులని... వారి ఆనందమే తన ఆనందమన్నారు. వనం-మనం కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా చేపట్టామని... ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

17:38 - July 1, 2017

పశ్చిమగోదావరి :  జిల్లా ..ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఎక్సైజ్‌ శాఖామంత్రి జవహర్‌ చెప్పులు కుట్టారు. మాదిగ వృత్తి గురించి తెలియని నాయకులు మాదిగల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని జవహర్‌ ఈ సందర్భంగా అన్నారు. మాదిగలను మోసం చేసిన తెలంగాణ ప్రభుత్వంపై మంద కృష్ణ ఉద్యమం చేయాలని సూచించారు. అలాగే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన మొక్కలు నాటారు.

17:37 - July 1, 2017

ఖమ్మం : కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ భారంతో తమ దుకాణాలు మూతపడే ప్రమాదం ఉందని, జీఎస్టీతో సంబంధం లేకుండా వస్త్ర దుకాణాలు నిర్వహించేలా వీలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఖమ్మం వ్యాపారులు. తమ జీవితాల్లో మట్టికొట్టే చట్టాన్ని తీసుకొచ్చిందని మండిపడుతున్నారు. జీఎస్టీ భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమానికి సిద్ధమైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:34 - July 1, 2017

విజయనగరం : జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు నిరసన చేపట్టారు. మహిళా సంఘాల అధ్వర్యంలో జిల్లాలో పలుచోట్ల మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సీతానగరం మండలం అంటిపేట వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపుపై మహిళలు దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళలపై మేల్ కానిస్టేబుల్స్ దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. 

16:01 - July 1, 2017

న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్‌ హాస్పిటల్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూయార్క్‌లోని వెయ్యి ప‌డ‌క‌లు ఉన్న బ్రాంక్స్-లెబ‌నాన్‌ హాస్పట‌ల్లో గ‌తంలో డాక్టర్‌గా ప‌నిచేసిన వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓమహిళా డాక్టర్‌ చ‌నిపోగా మ‌రో ఆరుగురు గాయ‌ప‌డ్డారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని సాయుధుడు ప్రాణాలు తీసుకున్నాడు. గాయపడ్డవారిలో ముగ్గురు వైద్యులు ఉన్నట్లు సమాచారం. బిల్డింగ్‌లోని 16వ‌, 17వ అంత‌స్తులో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుపు రంగు మెడిక‌ల్ కోట్ వేసుకుని ఆగంత‌కుడు కాల్పుల‌కు తెగించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

16:00 - July 1, 2017

శ్రీనగర్ :జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతాదళాలు, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. బత్పోరా గ్రామంలోని ఓ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉండడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల నుంచి 17 మందిని ఖాళీ చేయించారు. ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ లీడర్‌ బషీర్‌ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ 44 ఏళ్ల తాహిరా బేగంను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

15:59 - July 1, 2017

గుంటూరు : వైసీపీ జాతీయ ప్లీనరీకి సిద్ధమవుతోంది. ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టింది. ఈనెల 8,9 తేదీల్లో రెండు రోజులపాటు గుంటూరులోని ఎన్టీరంగా యూనివర్సిటీ సమీపంలోని ఓపెన్‌ గ్రౌండ్‌లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. ప్లీనరీ కోసం దాదాపు 12 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ ప్లీనరీ విజయవంతం కోసం మొత్తంగా 18 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్నీ ఏర్పాట్లలో మునిగిపోయాయి. ఇక వైసీపీ ప్లీనరీలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చించే అవకాశముంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు భవిష్యత్‌ కార్యక్రమాలను ప్లీనరీలో రూపొందించనున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫోకస్‌ పెట్టనున్నారు. పార్టీ బలోపేతంపైనా ప్లీనరీలో చర్చించనున్నారు. పలు ప్రజా సమస్యలపై ప్లీనరీ తీర్మానాలను ఆమోదించనుంది. ఈ ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇందుకోసం 8వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 9వ తేదీన నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తారు. అయితే జగనే మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. 

15:57 - July 1, 2017

అహ్మదబాద్ : గుజరాత్ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉదయం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న మ్యూజియంను సందర్శించిన మంత్రి..గాంధీజీ చరఖా వద్ద ఫోటో దిగారు. అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మంత్రి. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ..సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. గాంధీ సాధారణ వ్యక్తి అని పేర్కొన్న మంత్రి..ఆయన గొప్ప జీవితాన్ని గడిపారని అన్నారు.  

15:56 - July 1, 2017

విశాఖ : విశాఖలో చోరీలకు పాల్పడుతున్న సంతోష్‌ కుమార్‌ సాహూను పోలీసులు అరెస్ట్ చేశారు.. పలు దేవాలయాల్లో సాహు దొంగతనాలు చేశాడు.. అతని దగ్గరనుంచి 6లక్షల రూపాయలు, 30 గ్రాముల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. సంతోష్‌ గతంలోకూడా పలు దొంగతనాలు చేశాడని పోలీసులు తెలిపారు.

14:30 - July 1, 2017

శ్రీనగర్ : జమ్మూలో మరోసారి ఉగ్రకలకలం రేగింది. అనంత్ నాగ్ లో భద్రతాదళాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి. 

14:28 - July 1, 2017

పెద్దపల్లి : రక్తసంబంధం మంటగలిసింది. ఆస్తులకోసం, అక్రమా సంబంధం కోసం స్వంత తమ్ముడిని అక్క ఆమె ప్రియుడు హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా చామనపల్లి గ్రామంలో ఏడాది క్రితం రమేష్ మిస్సింగ్ కేసు నమోదు అయింది. ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపాట్టారు. చివరికి అక్క నాగమణి ఆమె ప్రియుడు మల్లేశం పై అనుమానంతో వారిని ప్రశ్నించారు. దీంతో అసలు నిజం బయట పడింది. తన తమ్మున్ని తను, ప్రియుడు మల్లేశం కలిసి చంపి పొలంలో పూడ్చినట్టు ఒప్పుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:29 - July 1, 2017
13:28 - July 1, 2017
13:27 - July 1, 2017

నల్గొండ: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గోడలకు గులాబీ రంగు వేయడంపై మీడియాలో వచ్చిన కథనాలకు డ్యాం అధికారులు స్పందించారు. సాగర్‌ గోడలకు గులాబీ రంగు వేయడంపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన తెలంగాణ అధికారులు..గుట్టు చప్పుడు కాకుండా గులాబీ రంగులను మారుస్తున్నారు. అయితే డ్యాం వద్దకు మీడియాను అధికారులు అనుమతించకుండా రహస్యంగా రంగులను మార్చుతున్నారు.

13:24 - July 1, 2017

తిరుపతి: బాలుడి కిడ్నాప్‌ కేసులో తమిళనాడు పోలీసులు విశేష కృషి చేశారని తిరుపతి ఎస్పీ జయలక్ష్మి అన్నారు. తిరుమలలో అత్యాధునికి సీసీ కెమెరాలు లేకపోవడంవల్లే బాలుడి ఆచూకీని కనుగొనడంలో ఆలస్యం అయిందన్నారు. తిరుమల కొండపై పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఉంటే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం తక్కువ ఉంటాయని తిరుపతి ఎస్పీ జయలక్ష్మి '10టివి'తో తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

13:22 - July 1, 2017

నిజామాబాద్ : మహారాష్ట్రలో బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో శ్రీరాంసాగర్‌కు జలకళ రానుంది.. సుప్రీంకోర్టు ఆదేశాలప్రకారం జులై 1న త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నీటిని విడుదల చేశారు.. ఈ నీరు 77 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీరాం సాగర్‌కు రావాలంటే 12గంటల సమయం పట్టనుంది.. వర్షాకాలం ప్రారంభమయ్యాక జులై 1నుంచి అక్టోబర్‌ 28వరకూ బాబ్లీ గేట్లు ఎత్తి ఉంచాలని... 2014 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.. అక్టోబర్‌ 29నుంచి తర్వాత ఏడాది జూన్‌ 30వరకూ గేట్లను దించుకోవాలని తీర్పు చెప్పింది.. ఈ ప్రక్రియ అంతా త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో జరగాలని సూచించింది.. శ్రీరాంసాగర్‌ నీటిపై ఆధారపడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు 9లక్షల ఎకరాలు పంటలు సాగవుతున్నాయి.. నీటి విడుదలపై ఆయా జిల్లాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

13:20 - July 1, 2017

పెద్దపల్లి: ఏడాది క్రితం ప్రియుడితో కలిసి అక్క.. సొంత తమ్ముడిని హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామంలో.. ఆస్తి తగదాలతో ఓ అక్క దారుణం చేసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు.. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ధర్మారం పోలీసుల విచారణలో.. హత్య చేసినట్టు నిందితుడు మల్లేశం ఒప్పుకున్నాడు. ఎంఆర్‌ఓ సమక్షంలో శవాన్ని వెలికి తీసి పోలీసులు పంచనామా నిర్వహించనున్నారు.

13:18 - July 1, 2017

నల్లగొండ :జిల్లాని నాగార్జున సాగర్‌లో.. జీఎస్టీ ప్రభావంతో అంతరాష్ట్ర చెక్‌ పోస్టును మూసేస్తున్నారు. తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో.. ఆంధ్ర, తెలంగాణ మధ్య సరిహద్దులో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆంధ్ర సరిహద్దులకు వెళ్లే వాహనాలకు కమర్షియల్‌ ట్యాక్స్‌ విధించడం వలన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అయితే ఇవాళ్టితో జీఎస్టీ విధానం రావడంతో.. రాష్ట్ర సరిహద్దులో ఉండే వాణిజ్య పన్నుల చెక్‌ పోస్ట్‌ను ఎత్తేస్తున్నారు. ఇప్పటివరకు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉన్న వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ.. ఇవాళ్టి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లనున్నాయి.

టీఎస్ఐపీఏఆర్ డీలో రెండవ తెలంగాణ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని టీఎస్ఐపీఏఆర్ డీలో రెండవ తెలంగాణ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని, పోచారం, హరీష్ రావు, జూపల్లి హాజరయ్యారు.

టీఎస్ఐపీఏఆర్ డీలో రెండవ తెలంగాణ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్

హైదరాబాద్: రాజేంద్రనగర్ లోని టీఎస్ఐపీఏఆర్ డీలో రెండవ తెలంగాణ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ కౌన్సిల్ సమావేశం అయ్యింది. ఈ కార్యక్రమానికి మంత్రులు నాయిని, పోచారం, హరీష్ రావు, జూపల్లి హాజరయ్యారు.

మంత్రులు కళా, లోకేష్ తో రామసుబ్బారెడ్డి భేటీ

అమరావతి: మంత్రులు కళా వెంకట్రావు, లోకేష్ తో జమ్మలమడుగు నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అంతక ముందు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.

గుట్టుచప్పుడు కాకుండా సాగర్ డ్యాం రంగు మార్పు...

నల్గొండ : సాగర్ ప్రాజెక్టుకు గులాబి రంగు వేయడం పై మీడియా కథనాలకు డ్యాంకు అధికారులు స్పందించారు. గుట్టుచప్పుడు కాకుండా అధికారులు రంగులను మారుస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మీడియాను డ్యాం వద్దకు అనుమతించడం లేదు.

 

పాతబస్తీలో రౌడీషీటర్ల ఇళ్ల పై టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్: పాతబస్తీలో రౌడీషీటర్ల ఇళ్ల పై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

 

పిల్లలు తినే ఫుడ్స్ పై జీఎస్టీ భారం.

హైదరాబాద్: పిల్లలు ఇష్టంగా తినే పదార్థాలపై ఏ మాత్రం ప్రధాని మోదీ ప్రభుత్వానికి కనికరం లేదు. 10 శాతంలోపు పన్ను ఉన్న కార్న్ ఫ్లాక్స్ పై 18 శాతం జీఎస్టీ వడ్డన, 6 శాతం లోపు ఉన్న జామ్ లపై 18 శాతం జీఎస్టీ పన్ను వడ్డించారు. 7 శాతం పన్ను ఉన్న బేబీ ఫుడ్స్ పై 18 శాతం జీఎస్టీ వడ్డించారు. 5శాతం ఉన్న చీజ్, బట్టర్ పై 18 శాతానికి జీఎస్టీని పెంచారు. బిస్కెట్ల పై 12 శాతం ఉన్న పన్నును 18 శాతం జీఎస్టీ వడ్డించారు.

11:45 - July 1, 2017

తిరుపతి: తిరుమలలో ఈనెల 14న కిడ్నాప్‌కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితులు నిన్న తమిళనాడులోని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవడంతో తిరుమల పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిడ్నాప్‌కు గురైన బాలుడితో పాటు కిడ్నాప్‌ చేసిన నిందితులను తిరుపతి పోలీసులు..మీడియా ముందు ప్రవేశపెట్టారు. తమకు పిల్లలు లేకపోవడంతోనే బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తిరుపతి డీఐజీ ప్రభాకర్‌రావు మీడియాకు తెలిపారు. కిడ్నాపర్లు ప్రేమ పెళ్లి చేసుకున్నారని..వారి పెళ్లిని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పిల్లలు ఉన్నట్లుగా డ్రామా ఆడారని డీఐజీ తెలిపారు. బాలుడి ఆచూకీని కనిపెట్టేందుకు మొత్తం 18 పోలీసు బృందాలు చేసిన కృషి చేశారని వారందరికి డీఐజీ ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.

11:42 - July 1, 2017

హైదరాబాద్‌: వ్యవసాయరంగాన్ని జీఎస్టీని మినహాయించాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. జీఎస్టీ రేటు తగ్గించాలని నేతలు డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాప్తంగా సీపీఎం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని అబిడ్స్‌ చౌరస్తాలో.. తెలంగాణ సీపీఎం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, డీజీ నరసింహారావు, శ్రీనివాసుల రెడ్డి, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

11:39 - July 1, 2017

కొత్తగూడెం : జిల్లాలో ఫారెస్ట్‌ అధికారులు దౌర్జన్యానికి దిగారు. బానోత్‌ తండాలో గిరిజనులు సాగుచేసుకొనే పోడు భూముల్లో పత్తి మొక్కలను పీకేస్తున్నారు. దీంతో గిరిజనులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరింత సమాచారం కోసం ఈవీడియోను క్లిక్ చేయండి...

11:37 - July 1, 2017

హైదరాబాద్: ఆదిలాబాద్‌ బై పాస్‌ రోడ్డులో.. చేపల లారీ బోల్తా పడింది. లారీ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే లారీలో ఉన్న చేపలన్నీ రోడ్డుపై కుప్పలు కుప్పలుగా పడి ఎగిరాయి.

కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జీఎస్టీ విధానం ప్రారంభం....

హైదరాబాద్: కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో జీఎస్టీ విధానాన్ని అపోలో ఆస్పత్రుల ఎండీ సీంగీతారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణీ కూడా పాల్గొన్నారు.

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుండి నీటి విడుదల

నిజామాబాద్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 0.16 టీఎంసీల నీరు విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 28 వరకు అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు.

కిడ్నాపైన బాలుడిని తల్లికి అప్పగించిన పోలీసులు

తిరుపతి: జూన్ 14న తిరుమలలో కిడ్నాపైన చిన్నారి కేశవ్ ను డీఐజీ సమక్షంలో తల్లికి అప్పగించారు.

తెలంగాణ లో 21 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు

హైదరాబాద్‌: గిరిజన విద్యార్థుల కోసం కొత్తగా 21 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కాలేజీలను ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న విషయంపై శుక్రవారం సీఎం కేసీఆర్‌.. గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్‌, గిరిజన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

 

అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్ :ఒకరి మృతి

శ్రీన‌గ‌ర్: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య ఫైరింగ్ జ‌రుగుతున్న‌ది. అనంత్‌నాగ్‌లో ఇవాళ ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మైంది. ఎదురుకాల్పులకు ఒక మ‌హిళ బ‌లైంది. ఓ ఇంట్లో దాక్కుకున్న ఉగ్ర‌వాదుల‌ను త‌రిమేందుకు భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పుల‌కు దిగాయి. ఆ స‌మ‌యంలో 44 ఏళ్ల త‌హిరాకు గాయాల‌య్యాయి. అయితే ఆమెను హాస్ప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో ప్రాణాలు విడిచింది. ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో బ్రెంటీ బ‌ట్పోరా ప్రాంతంలో ఆర్మీ భారీ కూంబింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టింది. బ‌షీర్ ల‌ష్క‌రీ అనే ఉగ్ర‌వాది ఆ గ్యాంగ్‌లో ఉన్న‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తమిళనాడులో సినిమా థియేటర్ల సమ్మె

హైదరాబాద్ : సోమవారం నుండి తమిళనాడు రాష్ట్రంలో సినిమా థియేటర్ల యజమానులు సమ్మె చేపట్టనున్నారు. ప్రభుత్వం 30 శాతం మున్సిపల్ ట్యాక్స్ విధించడం పై నిరసన తెలియజేస్తూ ఈ సమ్మె ను చేపట్టనున్నట్లు సమాచారం

 

గుంటూరు జిల్లాలో వనం-మనం కార్యక్రమం: చంద్రబాబు

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని, ఓబులు నాయుడు పాలెంలో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖా మంత్రి సిద్ధా రాఘవరావు.. జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే నర్సరీల నుంచి పెద్ద సంఖ్యలో మొక్కలను.. ఓబులు నాయుడు పాలెంకు తరలించారు. సీఎం పిలుపునివ్వడంతో అటు అధికారులు అన్ని జిల్లాల్లో వనం-మనం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ రోజు కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

09:44 - July 1, 2017

ప్రకాశం : జిల్లాలో సబ్సిడీ విత్తనాలకు అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.. కందుకూరు పోతురాజుమిట్ట దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఈ విత్తనాలను తీసుకువెళుతున్న లారీ కనిపించింది.. లారీలో 10లక్షల రూపాయల విలువైన 12 టన్నుల విత్తనాలు పోలీసులు గుర్తించారు.. ఈ విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు..

 

09:41 - July 1, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ రోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు రూరల్‌ మండల పరిధిలోని, ఓబులు నాయుడు పాలెంలో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖా మంత్రి సిద్ధా రాఘవరావు.. జిల్లా అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పటికే నర్సరీల నుంచి పెద్ద సంఖ్యలో మొక్కలను.. ఓబులు నాయుడు పాలెంకు తరలించారు. సీఎం పిలుపునివ్వడంతో అటు అధికారులు అన్ని జిల్లాల్లో వనం-మనం కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ రోజు కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

09:38 - July 1, 2017

ఢిల్లీ: జీఎస్టీ అమలుతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. జీఎస్టీపై పన్ను ఎగవేతదారులు తప్పా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త సంస్కరణలు ప్రారంభమైనపుడు ఒడిదుడుకులు తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా సామాన్య జనానికి మంచి జరుగుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనేక అంశాలను '10టివి' తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:36 - July 1, 2017

హైదరాబాద్: ఒకే దేశం...ఒకే పన్ను ఉండాలని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి శ్రీకారం చుడితే .. తెలంగాణ ప్రభుత్వం మాత్రం భారీగా ట్యాక్స్‌ని తప్పించుకునే వ్యూహాలకు పదునుపెట్టింది. జిఎస్టీ ప్రభావం పడకుండా ఎక్సైజ్‌ శాఖ ఆర్డర్లు పాస్ చేయించుకుంది. అదీ జీఎస్టీ అమలుకు ముందే ఈ వ్యవహారాన్ని చాకచక్యంగా చక్కబెట్టింది.

జీఎస్టీ బారినుంచి తప్పించుకున్న అబ్కారి శాఖ

తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ నుంచి అక్టోబర్ వరకు అమల్లులో ఉంటుంది. మరో మూడు నెలల్లో కొత్త పాలసీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోపే జిఎస్టీ అమల్లోకి తేవడంతో..3 నెలలకే బార్ లైసెన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో 18 శాతం కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో లిక్కర్ మాత్రం జిఎస్టీ పరిధిలోకి రావడం లేదు. ఫీజు కింద వచ్చే ఆదాయంలో 18 శాతం కేంద్రానికే వెళ్తుంది. ఈ లెక్కన మూడు నెలలకు 36 కోట్లు, వచ్చే ఏడాది నుంచి ఏటా 144 కోట్లు జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీపై మేథోమథనం చేసిన అధికారులు దాని నుంచి బయటపడే మార్గాలను అన్వేషించారు.

మరో 3 నెలల్లో అమల్లోకి కొత్త ఎక్సైజ్‌ పాలసీ

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎక్సైజ్ పాలసీకి చిన్న సవరణలు చేసి కోట్లాది రుపాయాల పన్ను భారం పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకోసం బార్ లైసెన్స్ స్థానంలో బార్ ట్యాక్స్ అని చేర్చారు. అదే విధంగా లిక్కర్ ఫీజు అని ఉన్న చోట లిక్కర్ ట్యాక్స్‌గా మార్చారు. ఇలా రాష్ట్ర ఖజానాకు గండిపడకుండా చాకచాక్యంగా ఆదాయాన్ని కాపాడుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వ విధానానికి స్వయంగా ఓ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఎగవేసే ప్రయత్నం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

09:32 - July 1, 2017

హైదరాబాద్: వెస్టీండీస్‌ తో జరుగుతున్న ఐదు వన్డేల సీరీస్‌ లో... మూడో వన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది..దీంతో భారత్‌ 2-0 ఆధిక్యం దూసుకెళ్లింది..మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణిత 50ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.ఓపెనర్‌ రహానే నాలుగు ఫోర్లు ఒక సిక్సర్‌ సహాయంతో 72 పరుగులు చేశాడు..తరువాత బ్యాటింగ్‌ కి దిగిన ఆతిథ్య వెస్టిండీస్‌ను బౌలర్లు కుల్‌దీప్‌ యాదవ్‌,అశ్విన్‌లు చరో 3వికెట్లు తీసి 38.1 ఓవర్లలో కేవలం 158 పరుగులకే ఆలౌట్‌ చేశారు..దీంతో భారత్‌ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది..78 పరుగులు చేసిన మహేంద్రసింగ్‌ ధోని మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా ఎంపికయ్యాడు..

 

సీఎం చంద్రబాబు ను కలిసిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

అమరావతి: జమ్మలమడుగు నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం చంద్రబాబును ను కలిశాఱు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టడంపై రామసుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు రామసుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారు.

07:09 - July 1, 2017

హైదరాబాద్: భారత ఆర్ధిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్లమెంట్‌ వేదికగా జీఎస్టీ అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ ప్రారంభసూచికంగా పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జేగంటను రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ మోగించారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ షో' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, బిజెపి నేత ఆచారి,కాంగ్రెస్ నేత మల్లురవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:57 - July 1, 2017

నల్లగొండ: మిర్యాలగూడెంలో నెలరోజుల కిందట అదృశ్యమైన స్పప్న అనే బాలిక ఆచూకీ లభించింది. స్వప్నను కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. విజయవాడ సమీపంలో స్వప్నను గుర్తించారు. స్వప్నను కిడ్నాప్‌ చేసిన సుధారాణి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

06:55 - July 1, 2017

ఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్లమెంట్‌ వేదికగా జీఎస్టీ అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ ప్రారంభసూచికంగా పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జేగంటను రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ మోగించారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం

ఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్లమెంట్‌ వేదికగా జీఎస్టీ అర్ధరాత్రి అమల్లోకి వచ్చింది. జీఎస్టీ ప్రారంభసూచికంగా పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జేగంటను రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ మోగించారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది.

06:53 - July 1, 2017

ఢిల్లీ: ఒకేదేశం ఒకే పన్ను నినాదంతో వస్తు సేవల పన్ను పట్టాలెక్కింది. 17ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుడ్‌బై చెప్పేస్తూ గుడ్‌మార్నింగ్‌ అంటూ ఇండియాను పలకరించింది. ఇది పూర్తిగా జీఎస్టీ ఉదయం. పొద్దున లేవగానే మీ చేతిలోకి వచ్చే టూత్‌పేస్ట్‌ నుంచి రాత్రి నిదురపోయే సమయంలో తలకిందకు వచ్చే దిండుదాకా....ప్రతీ వస్తువును పన్ను కోణంలో పనిచయం చేసే నూతనోదయం . 130 కోట్ల మంది దైనందిన జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తూ... కోటికోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థనూ శాసిస్తూ జీఎస్టీ దూసుకొచ్చింది. దేశ చరిత్రలో అత్యంత కీలక సంస్కరణగా నిలిచిపోయే ఈ పన్నును ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సెంట్రల్‌హాల్‌లో జీఎస్టీ స్వాగత కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

దేశ వ్యాప్తంగా ఒకేపన్ను విధానం అమల్లోకి రావడం గొప్ప మార్పునకు నాంది :రాష్ట్రపతి

దేశ వ్యాప్తంగా ఒకేపన్ను విధానం అమల్లోకి రావడం గొప్ప మార్పునకు నాంది అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పన్ను విధానం భారత ప్రజాస్వామ్య పరిపక్వత, వివేచనకు నిదర్శనమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య వ్యవస్థకు కొత్త ఉదాహరణగా నిలిచి ఏకాభిప్రాయంతో జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. పన్ను విధానంలోనే ఇదే కొత్తశకమని అభివర్ణించారు. జీఎస్టీ అమలు ప్రారంభంలో సమస్యలు తప్పవని... వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్‌ సూచించారు.

జీఎస్టీ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రక్రియ: ప్రధానమంత్రి

జీఎస్టీ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రక్రియని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జీఎస్టీ దేశ ఆర్ధిక వ్యవస్థలను ఏకం చేస్తుందని, ఇక నుంచి దేశంలోని మూలమూలనా ఒక వస్తువు ఒకే ధరకు దొరుకుతుందని అన్నారు. చిన్న వ్యాపారులు, సామాన్యులకు ప్రయోజనం చేకూరేలా జీఎస్టీ ఉంటుందన్నారు. జీఎస్టీతో పన్నుల విధానంలో కొత్తశకం ప్రారంభమైందన్నారు. పేదల హితం కోసమే జీఎస్టీ తీసుకువచ్చామని చెప్పారు.

జీఎస్టీతో దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ : జైట్లీ...

జీఎస్టీతో దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభవుతోందని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. జీఎస్టీ కల సాకారానికి రాష్ట్రాలు, అధికారులు ఎంతగానో శ్రమించారని తెలిపారు. దేశం సాధించిన గొప్ప విజయంగా జీఎస్టీని ఆయన అభివర్ణించారు.

సర్వాంగ సుందరంగా పార్లమెంట్‌

జీఎస్టీ ప్రారంభ వేడుకను పురస్కరించుకుని పార్లమెంట్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సెంట్రల్‌హాల్‌ పూల అలంకరణతో శోభాయమానంగా కనిపించింది. మరోవైపు జీఎస్టీ అమల్లోకి రావడంతో పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చుతూ, మిఠాయిలు తినిపించుకున్నారు.

పట్టాలెక్కిన వస్తుసేవల పన్ను

ఢిల్లీ: ఒకే దేశం. ఒకే పన్ను. అదే వస్తుసేవల పన్ను. 17ఏళ్లనాటి ఆలోచన ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. వస్తుసేవల పన్ను వ్యవస్థను కేంద్రం అర్థరాత్రి అట్టహాసంగా అమల్లోకి తీసుకొచ్చింది. చారిత్రాత్మక పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో రాజకీయ నేతలు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోదీ జేగంట మోగించి జీఎస్టీని ఆవిష్కరించారు. 130 లక్షల కోట్ల రూపాయల దేశ ఆర్థిక వ్యవస్థను.. విప్లవాత్మక పన్ను సంస్కరణల యుగంలోకి ముందడుగేయించారు.

06:49 - July 1, 2017

ఢిల్లీ: స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న జిఎస్‌టి జులై 1 నుంచి అమలు కానుంది. జిఎస్‌టితో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కానుంది. ఈ పన్ను సంస్కరణ వల్ల జిడిపి 1.5 నుంచి 2 శాతానికి పెరిగే అవకాశముంది.

సామాన్యులకు కొంత లాభం...కొంత ఖేదం

జిఎస్‌టి అమలు వల్ల సామాన్యులకు కొంత లాభం...కొంత ఖేదం అన్నట్టుగా ఉంది. బియ్యం, గోధుమలు, పప్పలు, కూరగాయలు, పళ్లు, పాలు లాంటి నిత్యావసర వస్తువులపై పన్ను నుంచి మినహాయించారు. చికెన్‌, ఆయిల్‌, భుజియా, వెన్న తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పెరుగు, పనీర్, చాక్లెట్, ఐస్‌క్రీం, చిప్స్‌, బిస్కట్స్, వెన్న, టీ, కాఫీ, మసాలా పౌడర్, లాంటి వాటి ధరలు 1 నుంచి 5 శాతం వరకు పెరగనున్నాయి.

హోటల్‌ కెళ్లి భోజనం చేయాలనుకుంటే జేబుకు చిల్లు

కుటుంబంతో కలిసి సరదాగా హోటల్‌ కెళ్లి భోజనం చేయాలనుకుంటే జేబుకు చిల్లు పడ్డట్టే. ప్రతి యేటా 75 లక్షలు టర్నోవర్‌ చేసే రెస్టారెంట్లపై 5 శాతం జిఎస్‌టి విధించారు. ఏసీ లేని రెస్టారెంట్లలో భోజనం చేస్తే ఇంతకు ముందు 6 శాతం వ్యాట్‌ ఉండేది. ఇపుడది 12 శాతానికి పెరిగింది. ఏసీ హోటళ్లలో 18 శాతం జిఎస్‌టి విధించారు. అందంగా మేకప్‌ వేసుకుని ఫంక్షన్‌ వెళ్లడం కూడా ఇపుడు ఖరీదే...బ్యూటీ పార్లర్లపై కూడా పన్ను పెరగనుంది.

టెలిఫోన్‌ బిల్లులపై టాక్స్‌ను 15 శాతం నుంచి 18 శాతం

టెలిఫోన్‌ బిల్లులపై టాక్స్‌ను 15 శాతం నుంచి 18 శాతం పెంచడం వల్ల బిల్లు మరింత మోగనుంది. స్మార్ట్‌ ఫోన్ల ధరలు మాత్రం తగ్గనున్నాయి.

లగ్జరీ వస్తువులపై పన్ను 15 నుంచి 18 శాతానికి పెంచడం

ఇల్లు, కారు, లగ్జరీ వస్తువులపై పన్ను 15 నుంచి 18 శాతానికి పెంచడం వల్ల కొనేవారిపై భారం పడనుంది. చిన్న కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇంతకు ముందు వీటిపై 40 శాతం టాక్స్‌ ఉంటే...ఇపుడు 29 శాతం జిఎస్‌టి విధించారు. ఇక లగ్జరీ కార్ల ధరను మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ప్రస్తుతం 43 శాతం పన్ను ఉండగా 46 శాతానికి పెంచారు. అలాగే టూ వీలర్స్‌ ధరలు తగ్గనున్నాయి. వీటిపై ఇంతకు ముందు వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ రూపంలో 30 శాతం పన్ను ఉండగా...ఇపుడు జిఎస్‌టి 28 శాతానికి తగ్గించారు.

విమానాల్లో ఎకానమీ క్లాస్‌ ధరలు కొంచెం తగ్గనున్నాయి. ప్రస్తుతం 5.60 శాతం పన్ను ఉండగా 5 శాతానికి తగ్గనుంది. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ధర మాత్రం భారీగా పెరగనుంది. 8.40 శాతం టాక్స్‌ నుంచి జిఎస్‌టి 12 శాతానికి పెరగనుంది.

 

వెయ్యి రూపాయల లోపు దుస్తుల ధరలపై టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. వెయ్యి దాటే కాస్ట్‌లీ డ్రెస్‌లపై 8 నుంచి 12 శాతం జిఎస్‌టి విధించారు.

ప్రాపర్టీపై స్టాంపు డ్యూటీ ఎప్పటిలాగే ఉంటుంది. కానీ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాపర్టిని కొంటే 12 శాతం జిఎస్‌టి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది 6 శాతం ఉండేది.

ఆరోగ్యం, విద్య లాంటి సేవలకు పన్ను నుంచి మినహాయింపునిచ్చారు. మందుల ధరలపై టాక్స్‌ను 14 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. పొగాకు, మద్యం, పెట్రోల్‌లకు టాక్స్‌ నుంచి విముక్తి కల్పించారు. ఆయా రాష్ట్రాలే వీటిపై పన్ను నిర్ణయించనున్నాయి.

జులై 1 నుంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌కు సంబంధించివన్నీ తగ్గనున్నాయి. సినిమా, థియేటర్‌, కేబుల్, డిటిహెచ్‌ సర్వీసులపై 18 శాతం జిఎస్‌టి విధించనున్నారు. ఇపుడు రాష్ట్రాలు విధిస్తున్న పన్ను కంటే ఇది తక్కువ.

బ్యాంకింగ్‌ సేవలు మరింత ప్రియం కానున్నాయి. వీటిపై ఇప్పటి వరకు 15 శాతం పన్ను ఉండగా...ఇపుడు 18 శాతం జిఎస్‌టి విధించారు. డిడి, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సేవలు, ఎండోమెంట్‌ పాలసీ, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరగనున్నాయి. రైలు టికెట్ల ధరలు కొద్దిగా పెరగనున్నాయి. సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఎసీ, ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ధరలు కొంచెం పెరుగుతాయి. కన్జూమర్‌ డ్యూరెబుల్‌ వస్తువులపై 26 శాతం టాక్స్‌ ఉండగా..అదనంగా మరో 2 శాతం జిఎస్‌టి పెరగనుంది.

కొనసాగుతున్న వస్త్ర వ్యాపారుల బంద్‌

హైదరాబాద్: గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ అమలు నిర్ణయంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. జీఎస్టీతో మరింత సంక్షోభంలో పడిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల ఆందోళనలకు పలు రాజకీయపార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి.

06:39 - July 1, 2017

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌...కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి... మన రాష్ట్రానికి నష్టమయ్యే జీఎస్టీ విధానాన్ని సవరించే విధంగా కృషి చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ వల్ల టెక్స్‌టైల్స్‌, గ్రానైట్‌, బీడీ కార్మిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ... ఈ రంగాలపై పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వెంటనే ఈ రంగాలపై పన్ను టారిఫ్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతున్నట్టు తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

06:37 - July 1, 2017

పాలమూరు ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయాలన్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు. వచ్చే ఖరీఫ్‌కు 10 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని పేర్కొన్నారు. దిగువ మానేరు, ఎస్సారెస్పీ కాల్వలు పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని చెప్పారు. కాల్వలు సిద్ధం చేసి వచ్చే ఖరీఫ్‌కు చివరి ఆయకట్టు వరకు నీరందించాలని వెల్లడించారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల సహా ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖకు బడ్జెట్ నిధులు సహా ఇతర సంస్థల నుంచి ఆర్థిక సహకారం అందనున్నట్లు తెలిపారు.

06:32 - July 1, 2017

హైదరాబాద్: నీటి పారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. భేటీలో నీటిపారుదలశాఖలో పదవీ విరమణలు, పదోన్నతులు, నియామకాలపై సీఎం అధికారులతో చర్చించారు. పాలమూరులో వచ్చే ఖరీఫ్ నాటికి పది లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్తర తెలంగాణలోని లోయర్ మానేరు, ఎస్పెర్పెస్పి కాలువలను సిద్ధం చేయాలన్నారు.

బడ్జెట్ నిధులతో పాటు ఆర్థిక సంస్థల సహకారం ఉంటుందని వెల్లడి

కాళేశ్వరం, పాలమూరు సహా ఇతర కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నందున...వాటి పనుల్లో వేగం పెంచాలని సిఎం స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖకు బడ్జెట్ నిధులే కాకుండా, ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా ఆర్థిక సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక కరీంనగర్ ఎల్.ఎం.డి. దిగువన ఉన్న ఎస్.ఆర్.ఎస్.పి. కాలువలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని, వచ్చే ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు నీరందించే విధంగా సిద్దం చేయాలని సిఎం ఆదేశించారు.

ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరుకు జలకళ

ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు తదితర రిజర్వాయర్లలో 140 టిఎంసిల నీరు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వీటి ద్వారా పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రెండు పంటలు పండించాలన్నారు. ఒక్క పాత వరంగల్ జిల్లాలోనే ఎస్.ఆర్.ఎస్.పి. ద్వారా పది లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు ఇవ్వాలని చెప్పారు. అయితే ఈ పనులన్ని కేవలం అధికారులకు అప్పగించి చేతులు దులుపుకోవడం సరికాదని...ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని పనులను పర్యవేక్షించాలన్నారు ముఖ్యమంత్రి. నీటిపారుల శాఖ అధికారులతో ఎప్పటికప్పడు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

ఈఎన్‌సీ మురళీధర్ పదవీకాలం మరో రెండేళ్లు పొడిగింపు

మొత్తానికి రైతులకు సాగునీరు అందించడం, వ్యవసాయాన్ని బతికించడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్ పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం సంతకం చేశారు.

మూతపడ్డ అంతర్‌ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు

హైదరాబాద్: జీఎస్టీ రాకతో.. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులన్నీ మూతబడిపోనున్నాయి. దేశమంతా ఒకే పన్ను విధానం రావడంతో.. ఇక వాణిజ్య పన్నుల ఎగవేతకు ఆస్కారం లేని కారణంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులను ఎత్తేయాలని నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎక్సైజ్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ చెక్‌ పోస్టులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి.

స్వప్న ఆచూకీ లభ్యం...

నల్గొండ: మిర్యాలగూడ నెల రోజుల క్రితం అదృశ్యమైన స్వప్న (14) ను పోలీసులు కనుగొన్నారు. విజయవాడ వద్ద స్వప్న తో పాటు కిడ్నాప్ చేసిన సుధారణి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...

నల్గొండ : నార్కెట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. అంతే కాకుండా బస్సులోని పలువురి ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

 

00:14 - July 1, 2017

Don't Miss