Activities calendar

02 July 2017

కుంటాల జలపాతం వద్ద..

ఆదిలాబాద్ : కుంటల జలపాతం వద్ద విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుంటుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నిజామాబాద్ జిల్లా బక్రాన్ పల్లి (మం) అర్గుల్ కుచెందిన అన్సార్, ఫైజాన్ లుగా గుర్తించారు.

నగరంలో డ్రగ్స్..

హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 21 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను కొన్న వారిలో ప్రముఖ సినీ నిర్మాత, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉన్నారని ఎక్జైజ్ పోలీసు అధికారి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. టాప్ స్కూళ్లకు చెందిన విద్యార్థిని..విద్యార్థులున్నారని, 9వ తరగతి విద్యార్థిని కూడా డ్రగ్స్ కొనుగోలు చేసిందన్నారు.

వైద్యుడి కిడ్నాప్ సుఖాంతం..

విజయవాడ : మాచవరంలో వైద్యుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ఐదుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డా.వెంకటేశ్వరరావును కిడ్నాప్ చేసి రూ. 30 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. విద్యాసాగర్, రంజిత్ కుమార్, బెనర్జీ, దిలీప్ కుమార్ తో పాటు మరో మహిళను అరెస్టు చేశారు.

18:46 - July 2, 2017

విశాఖపట్టణం : జిల్లాలో భూస్కాంపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తుకు ఆదేశించినా ప్రతిపక్షాలు శాంతించడం లేదు. దాదాపు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్న జిల్లా అధికారులు..తర్వాత మాట మార్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పైగా బహిరంగ విచారణను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నిస్తున్నాయి. విశాఖలో కబ్జాకు గురైన ప్రాంతాల్లో వైసీపీ, సీపీఎం నిజనిర్ధారణ బృందాలు పర్యటించాయి.. సేవ్‌ విశాఖ పేరుతో వైఎస్సార్‌ సీపీ నగరంలో ఆందోళనకూడా చేపట్టింది.. ఈ నిరసనలతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది.. ఈ స్కాంలో మంత్రులు, ఎమ్మెల్యేల హస్తం ఉందన్న ఆరోపణలు సర్కారును మరింత ఇబ్బందిపెట్టాయి.. వెంటనే ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలపై టీడీపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.

126కి పైగా కేసులు..
అటు భూస్కాంపై ఏర్పాటైన సిట్‌ వేగంగా తని చేసుకుంటూపోతోంది..126కు పైగా కేసులు సిట్‌ దృష్టికిరాగా..జీవోలోని అంశాలపైమాత్రమే తాము విచారణ చేస్తామని స్పష్టం చేసింది.. ట్యాంపరింగ్ అయిన భూములపైనే దర్యాప్తు చెస్తామని తెలిపింది. మిగిలిన భూములపై స్థానిక రెవెన్యూ అధికారులకైనా..పోలీసులకైనా ఫిర్యాదులు చెయ్యాలని సిట్‌ సభ్యులు సూచిస్తున్నారు. సిట్‌ ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి..జిల్లాలో మధురవాడ, కొమ్మాది, అనందరపరం, భీమిలి రూరల్‌, పెందుర్తి పరిధిలోని ముదపాక భూములు, గాజువాక పరిధిలోని తుంగ్లాం భూములు.. నక్కపల్లిలో pcpirకోసం సేకరరించిన భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.. ఈ స్థాయిలో కుంభకోణం జరిగితే కేవలం జిల్లాలో ట్యాంపర్‌ అయిన భూములపైనే దర్యాప్తు చేస్తామని సిట్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని ఫైర్ అవుతున్నాయి.. మధురవాడ, కొమ్మాది ప్రాంతాలకు ఈ సమస్యను పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శిస్తున్నాయి.. ఈ స్కాంలో పలువురు ప్రభుత్వ పెద్దలహస్తం ఉందని.. అందుకే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.
సిట్‌ విచారణపై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.. సిట్‌ దర్యాప్తు తర్వాత పెద్దలు తప్పించుకునే అవకాశం ఉంటుందని చివరికి కిందిస్థాయి అధికారులే బలవుతారని అభిప్రాయపడుతున్నాయి. భూస్కాంపై రోజుకోరకంగా నిరసనలు వ్యక్తంచేస్తున్న వైసీపీ... సేవ్‌ విశాఖ పేరుతో క్యాంపెయిన్‌కు సిద్ధమవుతోంది.. కలిసివచ్చే ప్రతిపార్టీనీ కలుపుకుంటూ ఆందోళనలు ఉధృతం చేస్తామని సర్కారును హెచ్చరిస్తోంది.

18:38 - July 2, 2017

విశాఖపట్టణం : జిల్లాలో మహిళలు రోడ్డెక్కారు. మద్యం రక్కసిపై సమరశంఖం పూరించారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. భారీ సంఖ్యలో మహిళలు ఆందోళనలు చేపడుతున్నారు. గుడి..బడి తేడా లేకుండా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని మహిళలు పేర్కొంటున్నారు. జ్ఞానాపురంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. స్కూల్ కు..నిత్యావసర వస్తువులు..ఇతరత్రా పనులపై వెళ్లే వారి పట్ల మందుబాబులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలకు పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఈతకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల మృతి..

విశాఖపట్టణం : జిల్లా మాడ్గుల మండలంలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు.. ఎల్‌.కొత్తపల్లి మావూళ్లమ్మ గుడి సమీపంలోని రిజర్వాయర్‌లో విహారయాత్రకోసం వీరు వెళ్లారు..మూడు మృతదేహాలను గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీశారు..

18:33 - July 2, 2017

విశాఖపట్టణం : జిల్లా మాడ్గుల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. ఎల్‌.కొత్తపల్లి మావూళ్లమ్మ గుడి సమీపంలోని రిజర్వాయర్‌లో కొంతమంది విహార యాత్రకోసం వచ్చారు. అనంతరం కొంతమంది ఈత కోసం నీటిలో దిగారు. అందులో ముగ్గురు నీట మునిగి మృతి చెందారు. సమాచారం అందుకున్న గజఈతగాళ్లు వారి మృతదేహాలకు బయటకు తీశారు. ఇద్దరు విశాఖపట్టణానికి చెందిన వారు కాగా మరొకరు పుణెకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం సేవించి ఈత కొట్టారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

18:29 - July 2, 2017

వరంగల్‌ : భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లోభాగంగా ఎనిమిదోరోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.. అమ్మవారు ఉగ్రప్రభ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.. భద్రకాళి దర్శనానికి భక్తులు పోటెత్తారు.. అమ్మవారి నామస్మరణచేస్తూ దర్శనంకోసం ఆలయంలో బారులు తీరారు..

18:27 - July 2, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాదినుంచి మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారు బోనం సమర్పిస్తామని... మంత్రి తలసాని తెలిపారు.. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు.. ఈ బోనాన్ని స్థానిక కార్పొరేటర్‌ అత్తిలి అరుణ, జోగిని శ్యామల సిద్ధం చేశారు.. బోయిగూడలోని అత్తిలి నివాసంనుంచి అమ్మవారికి బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు.. ఈ ఊరేగింపులో శ్యామల డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..

సంపులో పడిన 14 ఏళ్ల బాలుడు..

మేడ్చల్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంపులో పడి 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

 

17:58 - July 2, 2017

విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు విజయవాడకు చేరుకున్నారు. అక్కడ బెజవాడ కనకదుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోనాలు సమర్పించినట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ మహాకాంళి అమ్మవారికి కనకదుర్గమ్మ గుడి తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని యోచిస్తున్నట్లు అక్కడి అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:56 - July 2, 2017
17:54 - July 2, 2017

మొదటి బోనం..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిన మహాంకాళీ ఆలయంలో మొదటి బోనం కార్యక్రమం జరిగింది. అమ్మవారికి అత్తెలి కుటుంబసభ్యులు మొదటి బోనం సమర్పించారు. జోగిని శ్యామలతో బోనం సమర్పించారు.

15:53 - July 2, 2017

బాలీవుడ్ హీరో 'అక్షయ్ కుమార్' సరికొత్త లుక్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రేమ కథలు..యాక్షన్ లాంటి పాత్రలు పోషించిన 'అక్షయ్' తన స్టైల్ కు భిన్నంగా ఓ పాత్రను పోషిస్తున్నాడు. 1948 లండన్ ఒలింపిక్స్ లో భారత్ సాధించిన తొలి స్వర్ణ పతకం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. రీమాకట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను 'అక్షయ్' తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. పాతకాలం మనిషిగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. రితేశ్ సిద్దాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్షయ్ కు జోడిగా బుల్లితెర నటి మౌని రాయ్ నటిస్తోంది. సినిమాకు 'గోల్డ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో కునాల్ క‌పూర్ మ‌రియు అమిత్ స‌ద్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల టీం అంతా లండ‌న్ వెళ్ళారు. అక్క‌డ తొలి షెడ్యూల్ మొద‌లు పెట్టారు. ఆగ‌స్ట్ లో ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

15:35 - July 2, 2017

నిజామాబాద్ : జీఎస్టీ రాకతో.. వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులన్నీ మూతబడిపోనున్నాయి. దేశమంతా ఒకే పన్ను విధానం రావడంతో.. ఇక వాణిజ్య పన్నుల ఎగవేతకు ఆస్కారం లేని కారణంగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టులను ఎత్తేయాలని నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎక్సైజ్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ చెక్‌ పోస్టులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. దేశమంతా ఒకే పన్ను విధానం అమలు కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అంతర్‌ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు మూతబడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచే వాణిజ్య పన్నుల శాఖకు చెందిన చెక్‌పోస్టుల్లో కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు వాటిని తొలగించేస్తున్నారు.

నిజామాబాద్..కామారెడ్డి..
నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని సాలుర, సలాబత్ పూర్‌లలో అంతర్రాష్ర్ట చెక్ పోస్టులున్నాయి. ఈ మార్గాల్లో వివిధ రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులు, టైల్స్, రాళ్లు లాంటివి రవాణా అవుతుంటాయి. లక్షలాది రూపాయల పన్నులు వసూలయ్యేవి. కాస్త చూసీ చూడనట్లు వ్యవహరించే అధికారులకు ఈ చెక్‌పోస్టులు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా ఉండేవి. జీరో బిజినెస్‌ చేసే వ్యాపారులు, తమ సరుకును అక్రమంగా తరలిస్తూ.. ఇక్కడి చెక్‌పోస్టు అధికారులకు ముడుపులు చెల్లించేవారన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం పలుమార్లు ఉన్నతాధికారుల తనిఖీల్లోనూ బయటపడింది. అందుకే ఈ చెక్‌పోస్ట్‌లలో పనిచేయడానికి అధికారులు సైతం పోటీపడేవారు.

సంబంధిత శాఖలకు సిబ్బంది..
జీఎస్టీ అమలుతో నిజామాబాద్‌ జిల్లాలోని సాలూర, సలాబత్‌ చెక్‌పోస్టులతో పాటు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని వాణిజ్య పన్నుల చెక్‌పోస్ట్‌లూ మూతబడ్డాయి. వీటిల్లో కార్యకలాపాలు నిలిపివేయాల్సిందిగా అందిన ప్రభుత్వ ఆదేశాలతో, అధికారులు చెక్‌పోస్టులు ఎత్తివేసే పనిలో పడ్డారు. ఇకపై పన్నుల ఎగవేత పేరిట, వాహనాలను నిలిపి తనిఖీ చేసే వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్టు సిబ్బంది ఇకపై ఉండరు. అయితే ఎక్సైజ్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్టు చెక్‌ పోస్ట్‌లు మాత్రం యథావిధిగా పనిచేస్తాయి. ఇప్పటిదాకా అంతర్రాష్ట్ర రహదారుల సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో పనిచేస్తున్న సిబ్బందిని.. సంబంధిత శాఖలకు పంపేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

15:31 - July 2, 2017

విజయవాడ : ఏపీ శాసనమండలి చైర్మన్ పదవి ముస్లిం మైనార్టీకి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో ముస్లింలకు మొండిచేయి చూపించారని విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిడిపిలో ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసన మండలి చైర్మన్‌ ఎవరన్నది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆ పదవికి ఎమ్మెల్సీ షరీఫ్ పేరు దాదాపుగా ఖరారైనట్లేనని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదన్న విమర్శలున్నాయి. దీంతో ఈ వర్గాన్ని శాంతింపజేసేందుకు.. చక్రపాణిరెడ్డి పదవీకాలం పూర్తికావడం వల్ల ఖాళీ అయిన శాసన మండలి చైర్మన్ పదవిలో షరీఫ్‌ను కూర్చోబెట్టాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం.

ముస్లిం వ్యక్తికి..
శాసనమండలి చైర్మన్‌గా మొదట శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని నియమించాలని చంద్రబాబు భావించారు. శిల్పా మోహన్‌రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకోవడంతో చంద్రబాబు ఆ నిర్ణయం మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నేతలు పైరవీలు చేస్తున్నా కుదరదని చంద్రబాబు స్పష్టం చేశారు. ముస్లింలను కొంత వరకైనా తృప్తి పరచాలన్న ఉద్దేశంతో.. మండలి చైర్మన్‌ పదవిని వారికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి ఎన్నికలు..
ప్రస్తుతం శాసనమండలిలో టీడీపీ తరఫున ముస్లిం వర్గానికి చెందిన ఎమ్మెల్సీగా షరీఫ్‌ ఒక్కరే ఉన్నారు. పార్టీ పుట్టింది మొదలు ఇప్పటివరకూ ఆయన నమ్మకమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే చంద్రబాబు షరీఫ్‌కు మండలి చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఒకటి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారు చేశారు. మరొకరి ఎంపికపై అధినేత చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తమ్మీద గవర్నర్‌ కోటాలో సభలో అడుగుపెట్టే కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..? మండలి కొత్త చైర్మన్‌ ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయ్యేవరకూ వేచి చూడాల్సిందే.

15:28 - July 2, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లవుతున్నా ఉద్యోగుల విభజన వివాదం ఓ కొలిక్కి రాలేదు. ఏపీ స్ధానికత ఉన్న 24 మంది సెక్రటేరియట్‌ సెక్షన్ ఆఫీసర్స్‌ను తీసుకోలేమని తాజాగా ఏపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటుతున్నా ఉద్యోగుల విభజన వివాదం కొనసాగుతూనే ఉంది. ఏపీ స్ధానికత ఉన్న 24 మంది సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణలోనే కొనసాగించాలంటూ తాజాగా ఏపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. ఏపీ తీరుపై తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు మండిపడుతున్నారు.

కమల్ నాథన్ కమిటీ..
ఏపీ స్ధానికత ఉండి, ఏపీకి ఆప్షన్ పెట్టుకున్న 24 మంది ఎస్‌వోలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది కమలనాథన్ కమిటి. ఈ కేటాయింపులు జరిగి 5 నెలలు అవుతోంది. అయితే తాజాగా ఈ 24 మందిని తాము తీసుకునేది లేదని తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెబుతూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇదే జరిగితే తెలంగాణ సెక్రటేరియట్‌లో ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు 24 మంది కూడా తెలంగాణ సెక్రటేరియట్‌కు వస్తే తమ ప్రమోషన్‌లు ఏమి కావాలని ప్రశ్నిస్తున్నారు.. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ స్ధానికత కలిగిన 24 మంది ఉద్యోగులను తీసుకోవద్దని సీఎస్‌ను కలిసి కోరారు. తమ విజ్ఞప్తిని ప్రభుత్వం ఆలకించకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నారు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు. మరి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి.

15:26 - July 2, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన నరసింహారావు, లలిత, శిరీషగా గుర్తించారు. బీహెచ్‌ఇఎల్‌ నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నరసింహారావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఒక కుమార్తె మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో... నరసింహారావు ఇంటి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి.
ప్రస్తుతం మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించారు. తమ వాళ్లు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

15:20 - July 2, 2017

సిద్ధిపేట : సివిల్ తగదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా అక్కడక్కడ పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని మిరుదొడ్డిలో సీఐ చేసిన జులుం బయటకుపొక్కింది. వికలాంగుడిపై ఇష్టమొచ్చినట్లుగా దాడి చేయడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహరెడ్డి..కొమరయ్య వ్యక్తుల మధ్య భూవివాదం చోటు చేసుకుంది. పెద్ద మనుషుల మధ్య సమస్యను పరిష్కరించుకుందామని ఐలయ్య..ఇతరులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం ఇద్దరిపై ఎస్‌ఐ సతీష్‌ దాడి చేశారు. అకారణంగా వారిని చితకబాదారు. వికలాంగుడు అని కూడా చూడకుండా ఐలయ్య అనే వ్యక్తిపైనా అమానుషంగా దాడి చేశారు. ఈ దాడుల దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. నాన బూతులు తిట్టి తనపై తప్పుడు కేసులు బనాయించారని బాధితుడు పేర్కొంటున్నాడు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

15:11 - July 2, 2017

వరంగల్ : ఏంజీఎం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాప బతికి ఉండగానే వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఓ మహిళ ఏంజీఎం ఆసుపత్రిలోని శిశు సంజీవని..ప్రత్యేక నవజాత శిశు చికిత్సా కేంద్రంలో పసికందుకు మూడు రోజుల క్రితం జన్మనిచ్చింది. కానీ పసికందు తక్కువ బరువుతో జన్మించడం వల్ల మృతి చెందిందని వైద్యులు పేర్కొంటూ డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. దీనితో తల్లిదండ్రులు కన్నీరుము

వికలాంగుడిపై పోలీసుల జులుం..

సిద్ధిపేట : మిరుదొడ్డిలో వికలాంగుడిపై పోలీసులు దాడి చేశారు. భూ వివాదంలో స్టేషన్ కు రప్పించిన ఐలయ్య అనే వికలాంగుడిని పోలీసులు కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టారు.

సోమవారం థియేటర్ల బంద్..

చెన్నై: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ను వ్యతిరేకిస్తూ తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లన్నీ సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు దిగుతున్నాయి. 1,100కు పైగా థియేటర్లను నిరవధికంగా మూసివేయనున్నారు.

కొనాయిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్ : మేడ్చల్ మండలం కొనాయిపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

గిరిజనుల ఆరోగ్యంపై శ్రద్ధ - నక్కా ఆనందబాబు..

విశాఖపట్టణం : గిరిజనుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఏజెన్సీలో సమస్య రాగానే…ప్రభుత్వం వెంటనే స్పందించిందని తెలిపారు. ఘటన జరిగిన 10 రోజులకు స్పందించిన జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.

ఎంపీపీ కొడుకు మోసం చేశాడు : యువతి

సూర్యాపేట : జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఓ యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ అక్ష్మి ఇంటి ముందు ఆమె ఆందోళన చేస్తోంది. ఎంపీపీ కొడుకు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. 

10:49 - July 2, 2017

హైదరాబాద్ : అతివేగంగా బైక్స్‌ నడుపుతూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న కుర్రకారుపై పోలీసులు కొరడా జుళిపించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు బైక్‌ రేసింగ్‌లు నిర్వహిస్తున్న పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు.

10:45 - July 2, 2017

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై విపక్షాలు రోజురోజుకు విమర్శల దాడి పెంచుతున్నాయి. కేసీఆర్‌ రాజకీయ చతురతతో మూడేళ్లపాటు ప్రతిపక్షాలను కట్టడి చేయగలిగారు. మియాపూర్‌లో భారీ భూకుంభకోణం వెలుగుచూడడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌లో అవినీతి పెరిగిపోయిందంటూ ఘాటుగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, లెప్ట్‌పార్టీలతోపాటు టీ జేఏసీ, పలు ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. మియాపూర్‌ భూ స్కామ్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ల్యాండ్‌ స్కామ్‌
మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌తో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రతిపక్షాలకు అవకాశం కల్పించింది. సీఐడీకి కేసును అప్పగించినా విపక్షాలు శాంతించలేదు. అసలు దోషులను తప్పించేందుకు కుట్ర జరుగుతోందంటూ మరింతగా ఆరోపణలు చేస్తున్నాయి. అంతేకాదు... మియాపూర్‌ భూ కుంభకోణంపై వాస్తవాలు వెలుగుచూడాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం అది కుదరదంటూ సీఐడీతోనే విచారణ జరిపిస్తోంది. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమబయంలోనూ కుంభకోణాలు జరిగాయని వాటిపై సీబీఐ విచారణ జరుగుతోందన్న వాదనను ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఇదే అంశంపై గులాబీ పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్‌ను సీబీఐ విచారించిందని టీడీపీ ఆరోపిస్తుండగా.... సహారా పీఎఫ్‌ మినహాయింపు కుంభకోణంలో తనకు సంబంధంలేదని కేసీఆర్‌ చెప్పగలరా అంటూ కాంగ్రెస్‌ నేతలు సవాళ్లు విసురుతున్నారు. గులాబీ బాస్‌పైనే ప్రతిపక్షాలు సూటిగా విమర్శలు గుప్పిస్తున్నా టీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. దారినపోయే దానయ్యలు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కేసులు పెడతామని గులాబీబాస్‌
తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతామని గులాబీబాస్‌ పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు విపక్షాలు నేరుగా కేసీఆర్‌పైనే విమర్శలు చేస్తున్నా కేసుల దిశగా అడుగులు వేయకపోవడం చర్చనీయాంశమైంది. అంటే విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనా అన్న సందేహం అందరిలోనూ నెలకొంది.

ఎంపీపీ కొడుకు మోసం చేశాడు : యువతి

సూర్యాపేట : జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఓ యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ అక్ష్మి ఇంటి ముందు ఆమె ఆందోళన చేస్తోంది. ఎంపీపీ కొడుకు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఎంపీపీ కొడుకు సతీష్ తను ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట మారుస్తున్నాడని యువతి అంటుంది. యువతికి మహిళ సంఘాలు మద్దతు తెలిపాయి.

10:28 - July 2, 2017

సూర్యాపేట : జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఓ యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ అక్ష్మి ఇంటి ముందు ఆమె ఆందోళన చేస్తోంది. ఎంపీపీ కొడుకు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఎంపీపీ కొడుకు సతీష్ తను ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట మారుస్తున్నాడని యువతి అంటుంది. యువతికి మహిళ సంఘాలు మద్దతు తెలిపాయి. ధర్నా చేస్తున్న యువతి వద్దకు వచ్చిన సీఐ ఆమె కౌన్సిలింగ్ ఇచ్చ న్యాయం చేస్తానని చెప్పడంతోమ యువతి ఆందోళన విరమించింది. ఎంపీపీ లక్ష్మిని ఆమె భర్తను పోలీసులు స్టేషన్ తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:08 - July 2, 2017
09:40 - July 2, 2017
09:21 - July 2, 2017

హైదరాబాద్ : జీవన్‌దాన్, యశోద హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో మెగా అవయవ దానం డ్రైవ్ శనివారం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో నాగార్జున ఈ డ్రైవ్‌లో పాల్గొన్న వారందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్‌, ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సీపీ మహేందర్‌ రెడ్డి, జీవన్‌దాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి కూడా హాజరయ్యారు.

ప్రాణం నిలబెట్టడం
అవయవాలు దానం చేసేవాళ్లు.. దేవునితో సమానమని కళాతపస్వి దర్శకుడు కె. విశ్వనాథ్‌ అన్నారు. అవయవాలు దానం చేసి మరొకరి ప్రాణం నిలబెట్టడం చాలా గొప్ప విషయమని.. ప్రతి ఒక్కరూ అవయవాలు దానం చేయాలని విశ్వనాథ్‌ అన్నారు. తాను తన కుటుంబం ఇరవై ఏళ్ల క్రితమే తమ అవయవాలను దానం చేసేందుకు సిద్ధమయ్యామని.. అవయవ దానం కన్నా గొప్పదానం ఇంకెక్కడా వుండదని ప్రముఖ హీరో నాగార్జున అన్నారు. అవయవదానం చేసిన వారిని సూపర్‌ హీరోస్‌గా అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ కింద అవయవ దానం ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నామని.. రాష్ట్రంలో జీవన్‌దాన్ బ్రహ్మండంగా పనిచేస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. జీవన్‌దాన్ వంటి ప్రభుత్వ సంస్థ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అవయవదానం చేసిన దాతల కుటుంబ సభ్యులు వారి అనుభవాలను పంచుకున్నారు. వారిని యశోద ఆస్పత్రి వర్గాలు సన్మానించారు.

 

09:19 - July 2, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై హస్తంపార్టీ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రభుత్వ విధానాలపై పోరాడుతూనే... మరోవైపు విపక్షాలతో కలిసి నడిపిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేలా టీ కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది.

టీ కాంగ్రెస్‌ అస్త్రంగా
దేశంలో రాష్ట్రపతి ఎన్నిక పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ దాని మిత్రపక్షాల తరపున రామ్‌నాథ్‌ కోవింద్‌ బరిలో నిలవగా... కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు మీరాకుమార్‌ను పోటీలో నిలిపాయి. ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికను టీ కాంగ్రెస్‌ అస్త్రంగా మార్చుకుంటోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌ కీలక పాత్రే పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ కృషేనని పలుమార్లు కేసీఆర్‌ బహిరంగంగానే చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికకు టీ కాంగ్రెస్‌ దీన్నే అస్త్రంగా మలచుకునేపనిలో పడింది. తెలంగాణకు సహకరించిన మీరాకుమార్‌ను ఎందుకు ఓడించాలనుకుంటున్నారో కేసీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని టీ కాంగ్రెస్‌ నేతలు నిలదీస్తున్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు టీఆర్‌ఎస్‌ సపోర్ట్‌ చేయడాన్ని మత తత్వశక్తులకు మద్దతు పలకడమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆత్మప్రబోధానుసారంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేయాలని టీ కాంగ్రెస్‌ నేతలు సూచించారు. సీబీఐ కేసులకు భయపడే కేసీఆర్‌ మోదీకి మద్దతు పలికారని టీ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది.

ఎంఐఎం దోస్తీకి చెక్‌పెట్టేందుకు
రాష్ట్రపతి ఎన్నికలకు తెలంగాణ సెంటిమెంట్‌ను జోడించిన టీ కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌ ఎంఐఎం దోస్తీకి చెక్‌పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గతంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పనిచేయడం, బీజేపీలో ఆయన ఫుల్‌టైమర్‌గా పనియడాన్ని కాంగ్రెస్‌ రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. నిత్యం బీజేపీని మత తత్వపార్టీ అని విమర్శించే ఎంఐఎం.. రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఓటు వేయవద్దని టీ కాంగ్రెస్‌ కోరుతోంది. మీరాకుమార్‌కే సపోర్ట్‌ చేయాలని సూచిస్తోంది. అసదుద్దీన్‌ ఓవైసీతో మాజీ ఎంపీ వీహెచ్‌ మంతనాలు కూడా చేస్తున్నట్టు సమాచారం. ఎంఐఎం కూడా మీరా కుమార్‌కు మద్దతు ఇవ్వడంపై సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మీరాకుమార్‌కు ఓవైసీ మద్దతు
మీరాకుమార్‌కు ఓవైసీ మద్దతు తెలిపితే... ఇన్నాళ్లూ ఒక్కటిగా సాగిన ఎంఐఎం - గులాబీ బంధానికి బ్రేకులు వేసినట్టే అవుతుంది. మీరాకుమార్‌ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వస్తే.. ఓవైసీ కలిసే చాన్సులేకపోలేదు. ఇదే జరిగితే భవిష్యత్‌లో కొత్త రాజకీయ సమీకరణలకు పురుడు పోయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

09:16 - July 2, 2017

ఢిల్లీ : దేశ ఆర్థికవ్యవస్థలో జీఎస్టీ ఒక నవశకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీఎస్‌టీ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన పథాన్ని నిర్దేశించిందని తెలిపారు. సమాజంలో ఆర్థికపరమైన జబ్బులను నయం చేసే బాధ్యత ఛార్టెడ్‌ అకౌంటెంట్లపైనే ఉందన్నారు. ఢిల్లీలో ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నిలబెట్టే మూలస్తంభాలు ఛార్టెడ్‌ అకౌంటెంట్లు అంటూ ప్రశంసించిన మోదీ.. తప్పులను సరిదిద్ది ఆర్థిక వ్యవస్థను సరైన దిశగా నడిపించాలని కోరారు.

09:14 - July 2, 2017

హైదరాబాద్ : రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్‌ చర్చించారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, అదేవిధంగా వ్యవసాయ రంగానికి నిధులు కూడా భారీగా పెంచాలని కేసీఆర్‌ నిర్ణయించారు. 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,500 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతీ క్లస్టర్‌లో రైతులు ఎప్పటికప్పుడు సమావేశంకావడానికి వీలుగా రైతు నివేదికలు నిర్మించనున్నట్టు తెలిపారు. సంఘటిత శక్తిలో ఉన్న బలమేంటో రైతులకు వివరించి, వారిని సంఘటితం చేసేందుకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పంటకు గిట్టుబాట ధర వచ్చే విషయంలో రైతులకు , వ్యాపారులకు మధ్య మండల రైతు సమాఖ్య అనుసంధాన కర్తగా ఉంటుందన్నారు. గిట్టుబాటు ధర రాకపోతే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్ర రైతు సంఘం కొనుగోలు చేస్తుందని తెలిపారు.

శిక్షణ కార్యక్రమాలు
వ్యవసాయంలో ఉత్పాదకత పెంచేందుకు అనుసరించాల్సిన ఆధునిక , శాస్త్రీయ పద్దతులపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. వ్యవసాయరంగాన్ని మరింతగా విస్తరించాల్సి ఉందని... ఇందుకోసం వ్యవసాయశాఖను పునర్వ్యవస్థీకరించాలన్నారు. ఇందుకు అవసరమైతే విశ్రాంత వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సేవలు కూడా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. గ్రామాల్లో భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు, కల్తీ నివారణకు ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయం, సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకుంటున్నామన్నారు. రైతులకు భవిష్యత్‌లో 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. 17వేల కోట్ల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశామని చెప్పారు. 

09:13 - July 2, 2017

కృష్ణా : దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ దళిత జేఏసీ ఆగిరిపల్లిలో బహిరంగసభ ఏర్పాటు చేసింది. అయితే ఈ సభకు ప్రభుత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో దళిత సంఘాలు సభను జరిపి తీరాలని నిర్ణయించారు. సభావేదికను ఏర్పాటు చేశాయి. సభకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. సభను జరుపవద్దని హెచ్చరించారు. శాంతియుతంగా సభను నిర్వహించుకుంటామంటే అనుమతి ఎందుకు ఇవ్వరంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్తకంగానే సభకు అనుమతి నికారించిందని దళిత నేతలు ఆరోపించారు.

అంబేద్కర్‌ మునిమనువడు రాజారత్నం
మరోవైపు దళిత జేఏసీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొనేందుకు అంబేద్కర్‌ మునిమనువడు రాజారత్నం అంబేద్కర్‌ వచ్చారు. పోలీసులు అతడిని చుట్టుముట్టారు. దీంతో దళిత సంఘాల నేతలకు , పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. బలవంతంగా రాజారత్నం అంబేద్కర్‌తోపాటు పలువురు దళిత నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు తరలించారు. చంద్రబాబు ప్రభుత్వంపై రాజారత్నం అంబేద్కర్‌ తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుతంగా సభకు హాజరయ్యేందుకు వెళ్తోంటే అరెస్ట్‌ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులనూ ప్రభుత్వం లెక్కచేయడం లేదని విమర్శించారు. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.

నేతల అరెస్ట్‌
నేతల అరెస్ట్‌పై దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పీఎస్‌ ఎదుట బైఠాయించారు. భారీగాతరలివచ్చిన దళితులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తమ నాయకులను విడుల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

 

08:42 - July 2, 2017

జీఎస్టీతో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు తొలగించడంతో ట్రాన్స్ పోర్టు ఖర్చు తగ్గుతుందని, ఆటో మోబైల్స్ పై పన్ను పెరగడం జరిగిందని, డీజిల్ కూడా జీఎస్టీలోకి తీసుకురావాలని, ఏపీ లారీ ఓనర్స్ సంఘం కార్యదర్శి వై వీ ఈశ్వర్ రావు అన్నారు. నిజానికి చాలా వస్తువుల ధరలు తగ్గలని, జీఎస్టీ అందరికి పూర్తిగా తెలుసుకోవడానికి ఆరు నెలల సమయం పడుతోందని,ఆర్థిక నిపుణులు శేషద్రి తెలిపారు. జీఎస్టీ ప్రకటించిన తర్వాత వస్త్ర వ్యాపారుల బతులేక బడి పంతులు అన్నట్టు బతులేక వస్త్రవ్యాపారం చేస్తునట్టు ఉందని ఏపీ టెక్స్ టైల్స్ శ్రీనివాస్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:41 - July 2, 2017

ప్రస్తుత వ్యవసాయ విధానంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అవలంభించడంలో వెనక పడ్డారు. ప్రతిభ బయోటెక్ స్థాపించిన నుంచి ఇది గమనించామని, జీవన ఎరువుల ఉపయోగించటం వల్ల ఉపయోగం, జీవ ఎరువులు ఎలా వాడాలి, భూమి గుణం కూడా తెలుసుకోవాలని మట్టిమనిషిలో పాల్గొన్న ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖరు అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss