Activities calendar

03 July 2017

22:22 - July 3, 2017
22:20 - July 3, 2017
22:12 - July 3, 2017

మత్తులో పడుతున్నారు... సరదాగా చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో డ్రగ్స్ బారిన పడుతున్నారు.. విచ్చలవిడిగా డ్రగ్స్ వాడకం...నిత్యం రేవు పార్టీల సందడి.. ఓవరాల్ గా మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న యువత... వెరసీ హైదరాబాద్ నగరం డ్రగ్స్ ముఠాలకు అడ్డాగా మారుతుందా...? డ్రగ్స్ బానిసలకు నిలయమవుతుందా..? ప్రమాదకర డ్రగ్స్ కు బానిసలయ్యేవారు పెరుగుతున్నారా.?? ఇదే అంశంపై వైడ్ యాంగిల్ సోర్టీ చూద్దాం..
పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి..

22:04 - July 3, 2017

పాట్నా : ఐక్యతారాగం ఆలపిస్తున్న కాంగ్రెస్‌ను బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ టార్గెట్‌ చేశారు. ఏ ఎజెండా లేకుండా ప్రతిపక్ష పార్టీల ఐక్యత సాధ్యం కాదని తెలిపారు. కేవలం ఐక్యత గురించి మాట్లాడితే సరిపోదని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌ ముందుగా ఓ ఎజెండా రూపొందించాలని సూచించారు. ఏ ఎజెండా లేకుండా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని చెప్పారు. 2019 ఎన్నికల్లో విపక్షాల తరపున తాను ప్రధాని అభ్యర్థి పోటీలో లేనని నితీష్ స్పష్టం చేశారు.

 

22:02 - July 3, 2017

పాకిస్తాన్ : భారత్‌లో ఉగ్రవాద దాడులు జరిపినట్లు అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ బహిరంగంగా ఒప్పుకున్నారు. పాకిస్థాన్‌లో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో - భారత్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాద దాడులు జరిపిందని తెలిపారు. పాక్‌ కేంద్రంగా భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాపింప చేస్తున్నారనడానికి సలావుద్దీన్‌ ప్రకటనే నిరదర్శనం. కశ్మీర్‌ అంశంపై సానుభూతితో భారత్‌లో తనకు చాలామంది మద్దతుదారులు ఉన్నారని చెప్పుకొచ్చారు. భారత భద్రతా బలగాలే తమ టార్గెట్‌ అని చెప్పారు. తమకు కావాల్సిన ఆయుధాలను అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తామని సలావుద్దీన్‌ పేర్కొన్నారు. సలావుద్దీన్‌ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటారు.

 

21:59 - July 3, 2017

ఢిల్లీ : సిక్కిం సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. డోక్లామ్‌ ప్రాంతం విషయంలో భారత్‌ వెనక్కి తగ్గాలని, చరిత్ర తెలుసుకొని ముందుకు నడవాలంటూ చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ- భారత్‌ 1962 నాటిది మాత్రం కాదని  గట్టి కౌంటర్‌ ఇచ్చారు. దీనికి ప్రతిస్పందనగా చైనా కూడా అదే రీతిలో జవాబిచ్చింది.  ఇపుడున్న చైనా 1962 నాటిది కాదని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ హెచ్చరించారు. 1890లో చైనా-బ్రిటన్‌ల మధ్య కుదిరిన సంధి ప్రకారం సిక్కిం సెక్టార్‌లో సరిహద్దు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.  

 

21:56 - July 3, 2017

హైదరాబాద్ : ఎఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదికన ఓట్లు వేసే విధంగా మాట్లాడారు. ఈ దేశం ప్రధాని మోది, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ అబ్బ సొత్తు కాదంటూ బజారు భాషను ఉపయోగించారు. ఈ దేశంలో మీకెంత హక్కు ఉందో...మాకు అంతే హక్కు ఉందన్నారు. అఖ్లాక్‌, జునైద్‌ హత్యలను ప్రస్తావిస్తూ...దేశంలోని సెక్యులర్లంతా ఎక్కడున్నారని అక్బరుద్దీన్‌ ప్రశ్నించారు. భారత్‌లో ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారని ధ్వజమెత్తారు. తలకు టోపి, గడ్డం పెంచుకుని ముస్లింగా ఉండడమే ఇక్కడ తప్పు అయిపోయిందన్నారు. ముస్లింలంతా ఒక్కటైతే  పార్లమెంట్‌లో 50 సీట్లు గెలవొచ్చని రెచ్చగొట్టే ప్రసంగం చేశారు.

 

21:54 - July 3, 2017

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరు అరుంధతిపాలెంలో మద్యం షాపులపై మహిళలు దాడులు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం షాపుపై దాడి చేసి మద్యం బాటిళ్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

21:51 - July 3, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కార్మికవర్గం సమస్యలపై  సమరశంఖం పూరించింది.   హక్కుల  సాధనకు ఉద్యమబాట పట్టింది. ఏపీ వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోరుతూ  కదం తొక్కింది. కనీస వేతన చట్టాలను అమలుచేయాలంటూ  కలెక్టరేట్లను కార్మికులు ముట్టడించారు. విజయనగరం, కర్నూలు,నెల్లూరు, కృష్ణా కలెక్టరేట్ల ఎదుట   కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్‌ కార్యాలయానికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌లు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయనగరంలో మగ పోలీసులు ఆశా, అంగన్‌వాడీ, మిడ్డేమీల్స్‌ మహిళలపై ప్రతాపం చూపించారు. మహిళలని కూడా చూడకుండా వారిని లాఠీలతో కొట్టడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని కార్మిక నేతలు మండిపడ్డారు. కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తూ వారికి కనీస వేతనం ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దిచెప్తామని హెచ్చరించారు.

 

21:48 - July 3, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. బాలికపై నలుగురు డిగ్రీ విద్యార్థులు అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా ఖమ్మంలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజ్‌ విద్యార్థులని పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:46 - July 3, 2017

హైదరాబాద్ : తెలంగాణలో జీఎస్టీ పై ప్రజలకు అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని అధికారుల్ని సీఎం కేసీఆర్‌  ఆదేశించారు.. జీఎస్టీ అమలు తీరు ఎలా ఉంటుంది? ఎంత మొత్తంలో వ్యాపారం చేస్తే ఎంత పన్ను పడుతుంది? అనే అంశాలపై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శులు.. కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు స్వయంగా వెళ్లి .. అనుమానాలు నివృత్తి చేయాలన్నారు.. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి  ప్రయోజనమే తప్ప నష్టానికి అవకాశంలేదని స్పష్టం చేశారు.. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో జీఎస్టీ అమలు ప్రభావాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు..

 

21:43 - July 3, 2017

గుంటూరు : ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. ఇందులో ప్రధానంగా మద్యం దుకాణాలపై వస్తున్న వ్యతిరేకతపై చర్చించారు. అలాగే.. రాష్ట్రంపై జీఎస్టీ ప్రభావం, ఖరీఫ్‌ సీజన్‌కు సన్నద్ధత, ఎరువులు, విత్తనాల కొరతను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు....తీసుకుంటున్న చర్యలు వంటి 13 అంశాల ఎజెండాతో ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు విధానంపై కీలక చర్చ జరిగింది. ఐటీ రంగానికి మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషించే డీటీపీ ద్వారా 2024 నాటికి రాష్ట్రంలో 50 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.

 

21:40 - July 3, 2017

హైదరాబాద్ కొచ్చిన మీరాకుమార్..గాంధీభవన్ ల కెళ్లి ప్రచారం సురువు, కల్తీలులేని తెలంగాణ కావాలన్న సీఎం... మరి కల్తీ లేని రాజకీయాలొద్దా..సారూ, పిల్లపుట్టకముందుకే కుల్లకుట్టేస్తుండ్రు....తెలంగాణ కాంగ్రెస్ ఇద్దరు రెడ్ల రేసింగ్, మద్యం దుకాన్లు మాకొద్దంటున్న జనం....సెంద్రాలు జర శరం తెచ్చుకుంటే బెటర్, ఆకులోలే రాలుతున్న అడవి బిడ్డలు....అందని వైద్యానికి సర్కారు గొప్పలు, రసమయి మీద జనం రుసరుస...మాకొద్ది ఈ ఎమ్మెల్యే అంటున్నరట...
ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ

గుంటూరు : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మద్యం దుకాణాలపై వస్తున్న వ్యతిరేకతపై కేబినెట్ లో చర్చించారు. డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు విధానంపై కీలక చర్చించారు. ఖరీఫ్ సీజన్ సన్నదత, ఏజెన్సీ విషజ్వరాలపై చర్చ చేపట్టారు. 
 

21:08 - July 3, 2017

ప్రజా సమస్యల పరిష్కారం కోసం టీమాస్ ఫోరం ఉద్యమిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రొ.కంచె ఐలయ్య, కెవిపిఎస్ నేత జాన్ వెస్లీ, గాయని విమలక్క పాల్గొని, మాట్లాడారు. హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:36 - July 3, 2017
20:33 - July 3, 2017

మద్యం పాలసీపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

విశాఖ : మద్యం పాలసీపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు. ఏపీని మధ్యాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని విమర్శించారు. 

19:55 - July 3, 2017
19:52 - July 3, 2017

శ్రీకాకుళం : జిల్లాలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన రైతు రథం పథకం ఆదిలోనే నీరుగారి పోతోంది. టీడీపీ నేతల తీరుతో జిల్లాలోని రైతుల సంబరాలు ఆవిరైపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన పథకాన్ని పసుపు చొక్కా వర్గాలకే అన్నట్లుగా టీడీపీ నేతలు చక్రం తిప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.  
రైతు రథం పంపిణీకి సిద్ధమవుతోన్న ప్రభుత్వం 
శ్రీకాకుళం జిల్లాలో రైతు రథం పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యవసాయ రంగంలో ప్రోత్సాహం నింపేందుకు రెండు ఎకరాలు ఉన్న రైతులకు ట్రాక్టర్లు పంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పథకంలో భాగంగా రైతులకు గరిష్టంగా రెండు లక్షల రూపాయల రాయితీతో పాటు ట్రాక్టర్‌, విడి పనిముట్లు అందించాలన్నదే టీడీపీ లక్ష్యం. దీంట్లో భాగంగా ప్రాథమికంగా జిల్లాలో 380 ట్రాక్టర్లు పంపిణీ చేయాలని అధికారులు అంచనాకు వచ్చారు. 
జిల్లా ఇంచార్జి ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక
నియమ నిబంధనల ప్రకారం జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు దరఖాస్తు చేసుకుంటే..జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో లబ్దిదారులను ఎంపిక చేస్తారు. దీంట్లో భాగంగా జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని 38 మండలాల్లో రైతులకు పథకాన్ని అందజేయాలి. అయితే కుదించిన కేటాయింపుల్లో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గానికి 36 ట్రాక్టర్లు మాత్రమే అందుతాయి. అయినప్పటికీ రైతు రథం పథకానికి దరఖాస్తు చేసినా అవి టీడీపీ నేతల సిఫార్సుల మేరకే లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్న టీడీపీ నేతల మాటలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
రైతులు ఆవేదన 
ఇదే జరిగితే ఘనమైన లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు రథం పథకం నీరు గారిగారిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లను అర్హులైన వారికి కేటాయించాలని శ్రీకాకుళం జిల్లా రైతు ప్రతినిధులు కోరుతున్నారు. భారీ రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్టర్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ.. అద్దెలకు తిప్పుకోవాలన్న దురుద్దేశంతో పలువురు బినామీ పేర్లతో దరఖాస్తు చేస్తున్నారు. 380 ట్రాక్టర్లను ఏడుకోట్ల రూపాయల రాయితీతో అందిస్తున్న రైతు రథం పథకాన్ని అర్హులైన రైతులకు అందజేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

19:47 - July 3, 2017

విజయనగరం : కురుపాం నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాలను మలేరియా కబళిస్తోంది. ఇప్పటికే  మలేరియాతో నలుగురు చిన్నారులు కన్నుమూశారు. మే, జూన్‌ నెలలో ఒక్క కురుపాం ఆసుపత్రిలో 274 మలేరియా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. అయినా ఏ ఒక్క వైద్యాధికారి ఇక్కడి గ్రామాలవైపు చూడకపోవడం వారి నిర్లక్ష్యధోరణికి అద్దం పడుతోంది. 
గ్రామాల్లో విజృంభిస్తోన్న మలేరియా 
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో లైన నోండృకోన, కుశ గ్రామాల్ని మలేరియా విజృంభిస్తోంది. ఈ గ్రామాల్లో 130 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నెలరోజులుగా ఈ కుటుంబాల్ని విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు విష జ్వరం బారిన పడి కన్నుమూస్తున్నారు . గత నెలలో నోండృకోనకు చెందిన నిమ్మల, ఇలియానా, కిల్లక, స్వర్ణలత అనే చిన్నారులు  మలేరియాతో చనిపోయారు. 
గిరిజనుల ఇబ్బందులు
ఈ ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం కోసం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉంటుంది.  దగ్గర్లో ఏ ఒక్క వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో  గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇక్కడి గ్రామాల్లోని గిరిజనులు  నిరక్షరాస్యులు కావడంతో  పసర మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తరువాత ప్రభుత్వాసుపత్రులకు వెళ్లినా పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు. రెండు నెలలుగా ఇక్కడి గ్రామాల్లో పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఏ ఒక్క వైద్యాధికారి ఈ గ్రామాలవైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. 
మే, జూన్‌లలో 274 మలేరియా కేసులు
మే, జూన్‌నెలల్లో కురుపాం ఆసుపత్రిలో 274 మలేరియా కేసులు నమోదైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. రోజుకు 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారని పేర్కొన్నారు. ఒక్క కురుపాం ఆసుపత్రిలోనే ఇన్ని కేసులు నమోదౌతుంటే ఇక మిగిలిన ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పరిస్థితి మరింత చెయ్యిదాటే ప్రమాదం ఉంది. 

 

19:43 - July 3, 2017

నెల్లూరు : ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. ప్రయాణికులను, జనాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు. ఆరుగురిపై దాడి చేశాడు. చివరికి ఆత్మహత్యకూ ప్రయత్నించాడు. నెల్లూరులోని సోన్‌ హౌజ్‌పేటలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆరుగురిపై కర్రతో దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఒళ్లు కాల్చుకున్నాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. అతికష్టంమీద అతన్ని పట్టుకుని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రోగులపై, వాచ్‌మెన్‌పై దాడి చేసిన సైకో ఆత్మహత్య చేసుకుంటానంటూ చెట్టుపైకి ఎక్కాడు. పోలీసులు, వైద్య సిబ్బంది చెట్టుకింద పరువులు, దుప్పట్లు వేసి అతన్ని కాపాడారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.

 

19:42 - July 3, 2017

విశాఖ : రాష్ర్టంలో ఏజెన్సీవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం రాష్ర్ట సబ్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఏజెన్సీలో 16 మంది గిరిజనులు మృతిచెందినా.. వేలాది మంది విష జ్వరాలు, అంత్రాక్స్ బారినపడుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏజన్సీలోని జీహెచ్ సీ, సీహెచ్ సీలలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

 

19:39 - July 3, 2017

గుంటూరు : సదావర్తి భూములపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వేలంలో వచ్చిన 22 కోట్ల కన్నా అదనంగా 5 కోట్లు చెల్లించి సదావర్తి భూములను తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. రెండు విడతలుగా డబ్బు చెల్లించే వెసులుబాటు కూడా కల్పించింది. కోట్ల విలువ చేసే భూమిని 22 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని హైకోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
సదావర్తి సత్రం భూములపై కీలక తీర్పు 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. సదావర్తి సత్రం భూములపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పిటీషనర్‌ వాదనను సమర్థించింది. చెన్నై సమీపంలోని సదావర్తి సత్రానికి చెందిన సుమారు వెయ్యికోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొంతమంది పెద్దలకు ఏపీ ప్రభుత్వం 22 కోట్లకే విక్రయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదావర్తి భూములను తక్కువ ధరకే ఇతరులకు కట్టబెట్టారని.. తనకిస్తే మరో 5కోట్లు అదనంగా చెల్లిస్తానని న్యాయస్థానానికి వివరించారు.
ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌పై విచారణ 
ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పునిచ్చింది. 22 కోట్ల కంటే ఎక్కువగా మరో 5 కోట్లు చెల్లించి ఆ భూములను దక్కించుకోవాలని ఎమ్మెల్యే ఆర్కేకు తెలిపింది. రెండు వారాల్లో 10 కోట్లు, నాలుగు వారాల్లోపు 17.44 కోట్ల రూపాయలు చెల్లించాలని హైకోర్టు పేర్కొంది. అదనంగా 5 కోట్లు ఎక్కువగా చెల్లించేందుకు సిద్ధమేనని ఎమ్మెల్యే ఆర్కే కోర్టుకు తెలిపారు. మరోవైపు హైకోర్టు తీర్పును ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. తన దగ్గర అంత సొమ్మ లేదని పార్టీ ద్వారా సొమ్ము చెల్లిస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.

19:37 - July 3, 2017

విశాఖ : గడువుతీరిన కార్మిక చట్టాలను సవరించి... కార్మికులకు న్యాయంచేయాలంటూ విశాఖ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆందోళనలు కొనసాగాయి. విశాఖ నగరంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.  సరస్వతి పార్క్‌ నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీలో విచిత్ర వేషాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులపై ఉక్కుపాదం మోపుతోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు మండిపడ్డారు. స్కీమ్‌ పథకాల కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులపట్ల తనతీరు మార్చుకోకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 
విజయవాడలో 
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. విజయవాడ ధర్నా చౌక్‌లో సిఐటియు నేతలు తలపెట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మిక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సిఐటియు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తోంటే పోలీసులు అడ్డుకోవడం తగదని వారించినా పోలీసులు వినిపించుకోలేదు. రోడ్డుపై బైటాయించిన కార్మిక నేతలను, మహిళలను రోడ్డుపై ఈడ్చకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించారు. సిఐటియు రాష్ట్రనాయకులు గఫూర్, బాబూరావుతో పాటు ఇతర కార్మికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహా అందిస్తారు. 
మచిలీపట్నంలో 
కనీస వేతన చట్టాల అమలు, సామాజిక భద్రత కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మికులు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రామిక శంఖారావం పేరుతో కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ, ఆశా, విద్యుత్‌, భవన నిర్మాణ కార్మికులు, చేనేత, ఆటో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  కనీసవేతనం 18వేలు ఇవ్వాలని, గడువు తీరిన జీవోలను వెంటనే సవరించాలంటూ నినాదించారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో కలెక్టర్‌ కార్యాలయంలోనికి కార్మికులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  అనంతరం ఆర్డీవోకూ కార్మిక నాయకులు మెమోరాండం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవో హామీనిచ్చారని కార్మిక నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
నెల్లూరులో 
సమస్యల పరిష్కారం కోరుతూ నెల్లూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. నగరంలో భారీ ర్యాలీగా వెళ్లి... కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కలెక్టర్‌ వచ్చి తమ సమస్యలు వినాలని డిమాండ్‌ చేశారు. ఎంతకీ అధికారుల నుంచి స్పందనలేకపోవడంతో కలెక్టరేట్‌ గేట్లు తోసుకుని లోనికి వెళ్లారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం సీఐటీయూ నేతలు  సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు కనీస వేతనంగా 18వేలు ఇవ్వాలని, అసంఘటితరంగంలో పనిచేస్తోన్న కార్మికులందరికీ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. 

 

19:32 - July 3, 2017

గుంటూరు : తెనాలిలో ఇళ్ల మధ్య బార్‌షాప్‌ పెడుతున్నారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. బార్‌షాప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే శాంతియుతంగా తాము ధర్నా చేస్తున్నా బార్‌ షాప్‌ యాజమాన్యం దౌర్జన్యం చేసిందని మహిళలు ఆరోపించారు. పోలీసులముందే తమపై దాడిచేశారంటూ ఆగ్రహంతో మద్యం సీసాలను పగలగొట్టారు.

 

ఏపీ కేబినెట్‌ భేటీ

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం రెండు గంటలుగా సాగుతోంది. జీఎస్టీ లాభనష్టాలు, నూతన మద్యం పాలసీ, మద్యం వ్యతిరేక ఉద్యమాలతో పాటు.. మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చ జరుగుతోంది. 

18:52 - July 3, 2017

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం రెండు గంటలుగా సాగుతోంది. జీఎస్టీ లాభనష్టాలు, నూతన మద్యం పాలసీ, మద్యం వ్యతిరేక ఉద్యమాలతో పాటు.. మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలపై చర్చ జరుగుతోంది. దీంతో పాటు... ఏజెన్సీ ప్రాంతాల్లో రోగాల నివారణ, గరగపర్రులో దళితుల వెలి వివాదం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:39 - July 3, 2017

హైదరాబాద్ : మహానగరంలో మత్తుపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది...డ్రగ్స్‌ సరఫరాలో బయటపడుతున్న నిజాలు తేల్చేందుకు ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది...మరోవైపు విచారణలో డ్రగ్స్ నిందితులు ముగ్గురు వెల్లడించిన వాస్తవాలు కలకలం రేపుతున్నాయి...
డ్రగ్స్ వ్యవహారంపై సీరియస్...
డ్రగ్స్‌ వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. మహానగరంలో మత్తు జాడలు మళ్లీ కన్పించడంతో ఈ వ్యవహారాన్ని మామూలుగా తీసుకోవద్దని సిట్‌ ఏర్పాటు చేసింది...కలకలం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో వచ్చిన ఎంతో సమాచారం ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తెరలేపింది...దీంట్లో నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు...
డ్రగ్స్‌ కేసులో 11మంది విచారణ...
కాగా డ్రగ్స్‌ కేసుపై సిట్‌ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నారు...నగరంలో డ్రగ్స్‌  మూలాలను ఏరిపారేయాలన్న కృత నిశ్చయంతో ఉంది...డ్రగ్స్‌ పంపిణీదారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వివరాలు సేకరిస్తుంది...
నిందితుల విచారణలో సంచలనాత్మక సమాచారం..
మరోవైపు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా  నిందితుల విచారణలో అనేక సంచలనాత్మక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.. అనేక మంది బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్‌ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉన్నారన్న సమాచారం ఇప్పుడు అధికారులకు నిద్రపట్టనివ్వడం లేదు...దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తూ భాద్యులను కఠినంగా శిక్షించేందుకు రంగం మొదలయింది...
ఆన్‌లైన్‌ ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు..
ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ షాపింగ్...సోషల్‌ మీడియాలో ప్రచారం...ఫోన్ కాల్స్‌తో ఆర్డర్లు తీసుకోవడం...ఇదీ డ్రగ్స్ వ్యవహారంలో బయటపడుతున్న నిజాలు...ఇప్పటికే కొంత సమాచారం సేకరించిన సిట్‌ అధికారులు లోతుగా దర్యాప్తుకు రంగంలోకి దిగారు..
డ్రగ్ మాఫియాపై పూర్తి విచారణ
నగరంలోని బోయిన్‌పల్లి ఘటన ద్వారా వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టిన బృందాలకు సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి...సూర్యాపేట్ జిల్లా సూపరిండెంట్ శ్రీనివాస్ బ్రుందం ఈ డ్రగ్ మాఫియాపై పూర్తి లోతైన విచారణ జరుపుతుంది...డ్రగ్ మాఫియాపై నిఘా పెట్టేందకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అబ్కారి శాఖ. నిందితులు ఆన్‌లైన్ ద్వారా డ్రగ్స్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేసిన తీరును గుర్తించారు...వారి అంతర్జాతీయ వ్యాపారాలపై నిఘా పెట్టారు...
నిందితుల కాల్‌డేటాలో సమాచారం...
మరోవైపు ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను విచారించిన సిట్ బృందానికి వారి కాల్ డేటా ఈమెయిల్స్, ఫేస్ బుక్ అకౌంట్స్, సోషల్ మీడియా వాట్సప్ లాంటి వాటిపై విచారణ జరుపుతున్నారు. అలాగే కాల్ డేటా ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డేటా అధారంగా విచారణ సాగిస్తున్నారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లలోను ప్రత్యేక బ్రుందంతో విచారణ జరుపుతున్నాురు. సిట్‌ బృందానికి దొరికిన కొద్ది సమాచారంతో తీగలాగుతున్నారు..ఇప్పటికే నిందితుల నుంచి వచ్చిన వివరాలతో పాటు.. కాల్‌ డేటా ఆధారంగా ప్రముఖుల పుత్రరత్నాల జాతకాలు బయటపడుతున్నాయి...

18:24 - July 3, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని రుద్రూరు మండలం సులేమాన్‌ పారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ప్రమాదవశాత్తు లారీ కింద పడి చాంద్‌బీ అనే వృద్ధురాలు మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

17:54 - July 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో జరగుతున్న భూ కుంభకోణాలపై విచారణ జరిపి, పంపిణీ చేసిన అసైన్డ్ సీలింగ్‌ భూముల వివరాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బి. వెంకట్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణదారుల నుంచి భూములను స్వాధీనం చేసుకోవాలని.. లేనిపక్షంలో భూపోరాటం చేపట్టి ఆ భూములను పేదలకు పంచుతామన్నారు. ఆగస్టులో భూపోరాటాలు ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే భూదాన భూములు, అసైన్డ్‌ భూములు కబ్జా చేస్తున్నారని వ్యకాస జాతీయ నాయకులు జి. నాగయ్య ఆరోపించారు. 

 

17:50 - July 3, 2017

హైదరాబాద్‌ : నగరంలోని కోఠి ఉమెన్స్ కాలేజ్‌ నినాదాలతో దద్దరిల్లింది... హాస్టల్‌ అడ్మిషన్స్‌ ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజ్ ముందు ఉద్రిక్తత నెలకొంది. కాలేజ్ ప్రారంభమై... 2 వారాలు దాటుతున్నా... ఇంత వరకు హాస్టల్ అడ్మిషన్ ఇవ్వలేదని విద్యార్థినులు వాపోయారు. 

17:47 - July 3, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని... సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్యోగులు, విద్యార్థులతో టీ మాస్‌ ఫోరమ్‌ విధి విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం, సామాజిక న్యాయ సాధనకోసం తెలంగాణలో సామాజిక, ప్రజాసంఘాలన్నీ ఐక్య వేదికగా ఏర్పడుతున్నాయని చెప్పారు. జులై 4న హైదరాబాద్‌ వనస్థలిపురంలో టీ మాస్‌ ఫోరం ఆవిర్భావ సభ జరుగుతుందని ప్రకటించారు. 

 

17:42 - July 3, 2017

నల్లగొండ : జిల్లాలో దొండ రైతులు రోడ్డెక్కారు.. జిల్లా కలెక్టరేట్‌ ముందు దొండకాయల్ని కుప్పలుగా పోసి నిరసన తెలిపారు. దొండకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. శీతల గిడ్డంగి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

17:38 - July 3, 2017

సూర్యపేట : జిల్లాలోని కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ సురేంద్రమోహన్ ఎదుటనే కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కోర్టులో ఉన్న భూ వివాదంలో క్లర్క్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని...వాయిదాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన చెందింది. డబ్బులు లేకపోతే రాత్రికి రూమ్ రా... అన్నాడని బోరున విలపించింది. గతంలో గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:19 - July 3, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ రిమాండ్ రిపోర్టులో నిందితులు ఖుద్దూస్, వాహెద్ లు కీలక విషయాలను వెల్లడించారు. కెవ్విన్ తో రెండేళ్లుగా పరిచయం ఉందని తెలిపారు. నిందితులు ముగ్గురికీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

17:03 - July 3, 2017

మేడ్చల్‌ : డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. మేడ్చల్‌ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టాయి.. వివిధ కాలేజీలనుంచి తరలివచ్చిన విద్యార్థులు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. గతంలో మేడ్చల్‌కు మంజూరైన కళాశాలను సుధీర్‌ రెడ్డి ఘట్‌కేసర్‌ మండలానికి మారుస్తున్నారని ఆరోపించారు.. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండువర్గాల మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించాయి. 

 

17:02 - July 3, 2017

హిమాచల్ ప్రదేశ్ : 2014సం.లో హిమాచల్ ప్రదేశ్‌లో వీఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి విద్యార్థుల మృతిపై అక్కడి హిమాచల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విద్యార్థుల మృతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును హిమాచల్ ప్రదేశ్ సుప్రీంలో సవాలు చేసింది. అయితే జరిగిన ఘటనకు హిమాచల్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ తప్పిదం వల్లనే విద్యార్థులు చనిపోయారని జస్టిస్ ఎన్.వి.రమణతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. హిమాచల్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే దీనికి హిమాచల్ ప్రభుత్వం ఆరు నెలల సమయం కోరగా... మూడు నెలల్లో పరిహారం చెల్లించాల్సిందేనని జస్టిస్ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం..

సూర్యపేట : జిల్లా కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. గ్రీవెన్స్ డేలో కలెక్టర్ సురేందర్ మోహన్ ఎదుటనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గతంలో గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు, వాయిదాల పేరిట ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

గుంటూరు..ప్రకాశంలో భూ ప్రకంపనాలు..

గుంటూరు : జిల్లాలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. వినుకొండ, శావల్యపురం, కారుమంచి, మతుకుమల్లి, కృష్ణాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనాలు వచ్చాయి. మరో వైపు ప్రకాశం జిల్లాలో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. సంతమాలగులూరు, ఏల్చూరు, పరిటాల వారి పాలెంలో భూమి కంపించింది.

'ఒక్కో విద్యార్థికి రూ. 25 లక్షలు ఇవ్వండి'..

ఢిల్లీ : హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ. 25 లక్షల చొప్పున చెల్లించాలని సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు ఆరు నెలల గడువు కావాలని అక్కడి ప్రభుత్వం కోరగా మూడు నెలల్లో పరిహారం చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014లో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల విద్యార్థులు విహార యాత్రకు వెళ్లి బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

16:49 - July 3, 2017

రాజన్నసిరిసిల్ల : సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. లారీ ప్రమాదంలో మృతిచెందిన భూమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అతని బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆదివారం లారీ ప్రమాదంలో భూమయ్య మృతి చెందారు. ఆగ్రహంతో గ్రామస్తులు ఆరు ఇసుక లారీలకు నిప్పు పెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:46 - July 3, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. బయ్యారం ఉక్కు పరిశ్రమ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌ను మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశామని కేటీఆర్ తెలిపారు.. టాస్క్‌ఫోర్స్ నివేదిక అందగానే హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించి ప్లాంట్‌పై నిర్ణయం తీసుకుంటామని బీరేంద్ర సింగ్‌ హామీ ఇచ్చారు..

 

పార్టీ మారుతున్న మల్లాది విష్ణు..

విజయవాడ : కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పార్టీ మారబోతున్నారు. ఆయన కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి చేరబోతున్నారు. వైసీపీ అధ్యక్షులు జగన్ సమక్షంలో మల్లాది వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

16:41 - July 3, 2017

ఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లి మండలం చెర్వుమాదారంలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. ఓ ఆర్డీవోకు చెందిన ఫామ్‌హౌజ్‌లో రెవిన్యూ అధికారుల పేకాట ఆడుతుండగా దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్‌ దాడిలో ఆర్డీవో, ఇద్దరు డిఫ్యూటీ తహశీల్దారులు, ఒక రెవిన్యూ ఇన్స్‌ఫెక్టర్‌ పట్టుబడ్డట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా అధికారులు మేనేజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మహిళలపై మద్యం షాపు యజమాని దాడి..

గుంటూరు : తెనాలి ఐతానగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం షాపు ఏర్పాటును మహిళలు అడ్డుకున్నారు. మద్యం దుకాణ యాజమాన్యానికి పోలీసులు వత్తాసు పలికారు. మద్యం షాపు యజమాని మహిళలపై దాడికి పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

ఉపాధి హామీ పథకంలో చేతివాటం..

ప్రకాశం : ఇంకొల్లు మండలం భీమవరంలో ఉపాధి హామీ పథకంలో అధికారులు చేతివాటం బయటపడింది. రూ. 5లక్షల ఉపాధి హామీ నిధులు గోల్ మాల్ అయ్యాయి. పనులకు రాని 60 మంది కూలీలకు 7 వారాల పాటు హాజరు వేశారు. ఎండీవో కార్యాలయం చెందిన నలుగురు ఉద్యోగుల బంధువులకు జాబ్ కార్డులు జారీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీల ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది.

వెరైటీగా స్పందించిన సీఐ శ్రేష్ట ఠాకూర్..

ఢిల్లీ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వేసిన బదిలీ వేటుపై సీఐ శ్రేష్ట ఠాకూర్ వెరైటీ గా స్పందించారు. తన బదిలీపై ఆసక్తికర పోస్టు చేశారు. తనను నేపాల్ సరిహద్దు ప్రాంతానికి బదిలీ చేశారని, చేసిన మంచి పనికి ఇదో రివార్డు అని పేర్కొన్నారు. అందరూ బహ్రెచ్ కు ఆహ్వానితులేనని, దీపం ఉన్న చోటే వెలుతురు ఉంటుందన్నారు. కొన్ని రోజుల క్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ నేతలకు సీఐ శ్రేష్ట ఠాకూర్ జరిమాన విధించిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ రాకెట్..కీలక విషయాలు

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ రిమాండ్ రిపోర్టులో ఖుద్దూస్, వాహెద్ లు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. కెవ్విన్ తో రెండేళ్లుగా పరిచయం ఉందని నిందితులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిందితులకు ముగ్గురికీ 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

16:03 - July 3, 2017
15:57 - July 3, 2017

నిజామాబాద్ : విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కిన చిరుత... కరెంట్‌ షాక్‌తో స్తంభంపైనే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా మల్లారం అటవీప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది...విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. 

 

15:54 - July 3, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3లో అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేతకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రయత్నించారు. అయితే కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ కూల్చివేతను అడ్డుకుని జీహెచ్ ఎంసీ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. మరోవైపు తన ప్రాపర్టీకి వెళ్లే మార్గంలో కొందరు అడ్డంగా గోడ నిర్మించారని.. వాటిని తొలగించడానికి వచ్చిన సిబ్బందిపై కార్వాన్ ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదని పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:47 - July 3, 2017

విజయనగరం : కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. విజయనగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికులకు కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, భవన నిర్మాణ సంక్షేమ నిధిని మళ్లించవద్దని, 60 ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. 

 

15:45 - July 3, 2017

కృష్ణా : కనీస వేతన చట్టాల అమలు, సామాజిక భద్రత కోరుతూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మికులు చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రామిక శంఖారావం పేరుతో కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అంగన్‌వాడీ, ఆశా, విద్యుత్‌, భవన నిర్మాణ కార్మికులు, చేనేత, ఆటో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.  కనీసవేతనం 18వేలు ఇవ్వాలని, గడువు తీరిన జీవోలను వెంటనే సవరించాలంటూ నినాదించారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో కలెక్టర్‌ కార్యాలయంలోనికి కార్మికులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.  అనంతరం ఆర్డీవోకూ కార్మిక నాయకులు మెమోరాండం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆర్డీవో హామీనిచ్చారని కార్మిక నాయకులు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
 

అమరావతి సచివాలయ ఉద్యోగుల నిరసన...

విజయవాడ : సచివాలయం థర్డ్ బ్లాక్ అసోసియేషన్ హాల్లో ప్లకార్డులతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖలో పది నెలలుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కార్వాన్ ఎమ్మెల్యే హల్ చల్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేతకు జీహెచ్ఎంసీ సిబ్బంది యత్నించారు. కూల్చివేతను అడ్డుకుని జీహెచ్ఎంసీ సిబ్బందిపైకి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ దౌర్జన్యానికి దిగారు.

15:06 - July 3, 2017

నగర రోడ్లపై ఎక్కడ గుంత కనపడినా అధికారులపై చర్యలు తీసుకుంటాం..వెంటనే చర్యలు తీసుకోవాలని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించినా..అదేశాలు జారీ చేసినా నగరంలోని ప్రధాన రహదారుల్లోని రోడ్లు ఛిద్రం కావడం..ఇంకా గుంతలు అలాగే ఉండడం దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్లపై పలువురు ప్రయాణీస్తూ మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికమౌతోంది. గుంతల్లో నీరు నిలవడంతో ఇది గమనించని వాహనదారులు..పాదచారులు అందులో పడి మృతి చెందుతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు..ఇందుకు ఆధునాతన ఏర్పాట్లు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పలు సందర్భాల్లో పేర్కొంది. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో గుంతలమయమైన రోడ్లు దర్శనమిస్తున్నాయి.
తాజాగా సోమవారం ఓ బాలుడు నగరంలోని హబ్సీగూడ ప్రాంతంలోని గుంతలు పడిన రోడ్డును పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ జాతీయ ఛానెల్ దీనిని గుర్తించి బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. ఇటీవలే ఓ కుటుంబం బైక్ పై ప్రయాణీస్తూ గుంతలో పడిపోయారని..ఇలా వేరే వారికి కాకూడదనే తాను ఇలా చేశానని 12 ఏళ్ల బాలుడు రవితేజ ఆ ఛానెల్ కు తెలిపాడు.
నగరంలోనే కాక ఇతర ప్రాంతాల్లో ఛిద్రమైన రోడ్లు..గుంతలు గుంతలుగా పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని పలువురు కోరుతున్నారు.

15:02 - July 3, 2017
14:59 - July 3, 2017
14:56 - July 3, 2017

తూర్పుగోదావరి : కార్మిక సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు కాకినాడలో ఆ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని.. శ్రామిక శంఖారావం పేరుతో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని...కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఐఎస్ ఐ, పీఫ్ ఇవ్వడం లేదని చెప్పారు. ఉద్యమాలను అణచివేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల పాత్ర పెరిగిపోయిందని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:56 - July 3, 2017

టాలీవుడ్ నటుడు విక్టరీ 'వెంకటేష్' కు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ 'వెంకీ' ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ‘గురు' చిత్రం అనంతరం ఆయన ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదు. వేసవి సెలవుల నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్లినట్లు టాక్ వినిపించింది. అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అనంతరం ఆయన పలు కథలను విన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని 'వెంకటేష్' యోచిస్తున్నట్లు ఎప్పటి నుండో ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' ప్రియురాలు 'లులియా వాంటర్' తో కారులో 'వెంకటేష్' వెళుతున్న ఫొటో హల్ చల్ చేస్తోంది. ‘సల్మాన్ ఖాన్’..’వెంకటేష్’ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఓ పార్టీలో పాల్గొనేందుకు 'వెంకీ' వెళ్లారని తెలుస్తోంది. అందులో భాగంగా సల్మాన్..లులియాలతో 'వెంకటేష్' చర్చలు జరిపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం 'వెంకటేష్' నోరు విప్పలేదని తెలుస్తోంది. మరి 'వెంకటేష్' బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలిసిపోనుంది.

14:49 - July 3, 2017

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి పదవికి అత్యంత సమర్థవంతమైన నాయకురాలు మీరాకుమార్ అని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మీరాకుమార్‌కు ప్రజా ప్రతినిధులంతా మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

 

కాంగ్రెస్ నేత జేబు నుండి రూ. లక్ష చోరీ..

హైదరాబాద్ : యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ నగరానికి చేరుకున్నారు. గాంధీ భవన్ లో ఆమెకు టి.కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో జేబు దొంగ హస్తలాఘవం చేశాడు. ఓ కాంగ్రెస్ నేత జేబు నుండి రూ. లక్ష చోరీ చేశాడు. మీడియా కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

కేసీఆర్ అందుబాటులోకి రాలేదు - మీరా కుమార్..

హైదరాబాద్ : రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు మద్దతినిచ్చిన 17 విపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ వెల్లడించారు. సిద్ధాంతాల కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో నిల్చోవడం జరిగిందని, తప్పక విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని తెలిపారు. మద్దతు కోసం సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు ఫోన్ చేశానని, సీఎం అందుబాటులో రాలేదని, సీఎంఓకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. టీఆర్ఎస్..ఎంఐఎం మద్దతు కోసం లేఖ రాసినట్లు, అధికార పార్టీ ఓట్లు పొందేందుకు తమ వ్యూహాలు తమకున్నాయన్నారు. తాను స్పీకర్ గా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

14:14 - July 3, 2017

చిత్తూరు : మోస్ట వాంటెడ్ స్మగ్లర్ హాజీ నజీర్ ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. హాజీ నజీర్ పై 20 పైగా కేసులున్నాయి. వెయ్యి టన్నుల పైగా ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:11 - July 3, 2017

బాలీవుడ్ నటి ‘కత్రినా కైఫ్’..’మల్లీశ్వరీ’ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తురాలు. బాలీవుడ్ లోని పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాప్ పోజిషన్లలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అమీర్ ఖాన్’ తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’..’ సల్మాన్ ఖాన్’ తో ’టైగర్ జిందా హై' చిత్రాల్లో నటిస్తోంది. ‘జగ్గా జాసూస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా తోటి నటుడు 'రణ్ బీర్ కపూర్'తో అబుదాబీలో జరిగిన సైమా వేడుకల్లో 'కత్రీనా' పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు వేసింది. దక్షిణాదిలో నటించాల్సి వస్తే ఏ హీరోలతో నటిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు 'తెలుగులో ప్రభాస్ తో..తమిళంలో 'విక్రమ్' తో నటిస్తా' అని ఠక్కున చెప్పేసింది. 'బాహుబలి' మూవీ చూశానని..ప్రభాస్ ఎంతో చక్కగా నటించారని కితాబిచ్చింది. 'చియాన్' విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన అద్భుతమైన నటుడని 'కత్రినా కైఫ్' అభిప్రాయపడింది. మరి 'కత్రినా' మాటలు దర్శకుల చెవిలో పడ్డాయో లేదో...

14:06 - July 3, 2017
14:03 - July 3, 2017

అవరోధలను అధికమించి వికలాంగులు సాధిస్తున్న విజయాలు ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలసిన అవసరం ఉంది. తమకున్న లోపాలకు క్రుంగిపోకుండా తమ జీవితాలను విజయగీతికలు తీర్చిదిద్దుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. కాలం చేసిన గాయాలు కొందరివైతే, ప్రమాదవశాత్తు వికలాంగుల వారు కొందరు. ఇలా కారణమెదైనా వైకల్యాం అనుభవిస్తూ విజయపథంలో ప్రయాణించిన వారి విజయాలకు తన రచనల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు పాలపర్తి సంధ్యరాణి.....ఈనాటి మన స్ఫూర్తి మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సదావర్తి భూములపై హైకోర్టు తీర్పు ఇదే..

హైదరాబాద్ : సదావర్తి భూములపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ రేటుకంటే ఎకరానికి రూ. 5 కోట్లు ఎక్కువగా ఇస్తే భూములు కేటాయిస్తానని పిటిషనర్ కు హైకోర్టు తెలిపింది. నాలుగు వారాల్లో డబ్బులు చెల్లించే వారికి భూములు అప్పగించాలని, అదనంగా రూ. 5 కోట్లు చెల్లించేందుకు సిద్ధమని పిటిషనర్ ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు. రెండు వారాల్లోగా రూ. 10 కోట్లు..మిగతా డబ్బు మరో రెండు వారాల్లో చెల్లించాలని ఆర్కేకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సదావర్తి సత్రానికి చెందిన 84 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. రూ.

అబార్షన్ లపై సుప్రీం సంచలన తీర్పు...

ఢిల్లీ : అబార్షన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోల్ కతాకు చెందిన 25 వారాల గర్భిణీకి అబార్షన్ కు సుప్రీం అనుమతినిచ్చింది. ఆరోగ్యకారణాల రీత్యా అబార్షన్ కు అంగీకారం తెలిపింది.

మంగళవారం కృష్ణా జిల్లా నేతలతో బాబు భేటీ..

విజయవాడ : మంగళవారం ఉదయం 9.30గంటలకు కృష్ణా జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు..ఎంపీలు..ఎమ్మెల్సీలు..జిల్లా పార్టీ అధ్యక్షుడితో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

స్మగ్లర్ ఖాజీ నజీర్ అరెస్టు...

చిత్తూరు : మోస్ట్ వాంటెండ్ ఎర్రచందనం స్మగ్లర్ ఖాజీనజీర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నజీర్ పై జిల్లాలో 20కి పైగా కేసులున్నాయి. 1000 టన్నుల ఎర్రచందనం విదేశాలకు నజీర్ తరలించాడని, పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

13:50 - July 3, 2017

బియ్యం పిండి..దీనితో పలు రకాల వంటకాలు..ఇతర వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ బియ్యం పిండితో అందాన్ని కూడా ఇనుమడింప చేసుకోవచ్చనే విషయం తెలుసా ? పిండిని వాడడం వల్ల చర్మానికి చాలా లాభాలు కలుగుతాయి. బియ్యం పిండి..ఓట్ మీట్..పాల పొడిలను తగినంత మోతాదులో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పట్టిస్తే శరీర ఛాయలో మంచి మార్పు వస్తుంది. అంతేగాకుండా శరీరానికి మెరుపు వస్తుంది.
బియ్యం పిండి..శనగ పిండిల తగినంత తీసుకుని ఈ మిశ్రమానికి కొబ్బరి నూనె కలపాలి. దీనిని ఈ మిశ్రమాన్ని స్నానం చేసే ముందు రాసుకొంటే మంచి ఫలితం ఉంటుంది. బాగా పండిన అరటిపండు గుజ్జుకు బియ్యం పిండి కలుపుకోవాలి. దీనికి ఆముదం కూడా చేర్చాలి. ఈ ప్యాక్‌ ను కళ్ళ కింద రాసుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ పోతాయి. బియ్యం పిండికి ఆలో వెరా జెల్..తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాల అనంతరం కడుక్కోవాలి. ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది. బియ్యం పిండి, ఎగ్‌ వైట్‌ , తేనే కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. 

13:47 - July 3, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌తో భేటీ అయ్యారు తెలంగాణ డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించాలని ప్రకాష్ జవదేకర్‌ను కోరినట్లు కడియం శ్రీహరి చెప్పారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుతో పాటు, వరంగల్‌ కేంద్రంగా రీజనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని విద్యా సంస్థల ఏర్పాటుకు తమవంతు సాయం అందిస్తామని ప్రకాష్ జవదేకర్ హామీ ఇచ్చినట్లు కడియం శ్రీహరి చెప్పారు. 

13:45 - July 3, 2017

సంగ్గారెడ్డి : టీఆర్‌ఎస్‌ నేతలపై తనదైన శైలిలో.. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు చేశారు. గత ప్రభుత్వం సిద్ధాపూర్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే.. అధికారంలోకి రాగానే లాక్కున్నారని దుయ్యబట్టారు. లబ్ధిదారులతో కలిసి సదాశివపేట, తహశీల్దారు కార్యాలయం ముట్టడికి జగ్గారెడ్డి ప్రయత్నించారు. దీంతో పోలీసులు జగ్గారెడ్డిని కొండాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పేదలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల మందికి సిద్ధాపూర్‌లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి.. పట్టాలు ఇచ్చామని అన్నారు. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే భూములను లాక్కుందని మండిపడ్డారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. లబ్దిదారులకు పొజిషన్‌ ఇవ్వకపోతే ఈ నెల నాలుగున కలెక్టరేట్‌ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించారు.

 

13:44 - July 3, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ రాకెట్‌ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటుకు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ నిర్ణయించారు. సూర్యాపేట ఎస్పీ శ్రీనివాసరావును సిట్‌ ఇన్‌ఛార్జిగా నియమించే అవకాశం ఉంది. 20 నుండి 25 మంది సిబ్బందితో సిట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక డ్రగ్స్‌ రాకెట్‌లో పట్టుబడ్డ వాహెద్‌, కెల్విన్‌, ఖుద్దూస్‌ను నాంపల్లి కోర్టులో ఎక్సైజ్‌ పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

13:38 - July 3, 2017

వర్షాకాలం..ఎన్నో రోగాలు వస్తుంటాయి..జలుబు..దగ్గు..అనారోగ్యం..లాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. దీనితో వెంటనే వైద్యుడి దగ్గరకు పరుగెతుంటారు. కానీ ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఒక టీ స్పూన్ మిరియాల పొడి..టేబుల్ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి కలుపుకోవాలి. ప్రతిరోజు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రాత్రి నిద్ర పోయే ముందు గ్లాసు మంచినీరు తాగాలి. ఇలా చేయడం వల్ల గుండెపోటు..పలు అనారోగ్య సమస్యలు ఏర్పడవు.
ఎసిడిటి సమస్యతో బాధ పడే వారు వేడి నీళ్లలో ఒక టీ స్పూన్ సోంపును వేసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్ని ఆ నీటిని వడకట్టి అందులో టీ స్పూన్ తేనే కలుపుని ఉదయం..సాయంత్రం..రాత్రి వేళల్లో తీసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి.

13:28 - July 3, 2017

గుంటూరు : సీఐటీయూ నేతలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. శ్రామిక శంఖారావం పేరుతో ధర్నాకు దిగారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని ఆందోళన నిర్వహించారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:27 - July 3, 2017
13:25 - July 3, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతృత్వంలో 17 పార్టీలు కలసి రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేశారు. భావసారూప్యం గల పార్టీలన్నీ ఏకతాటిపై రావడం సంతోషంగా ఉందని అన్నారు. గుజరాత్ సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రచారం ప్రారంభించామని మీరాకుమార్ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

గుంటూరు జిల్లా కలెక్టర్ రేట్ ముట్టడి..

గుంటూరు : జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలో కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

అధికారం మళ్లీ టిడిపిదే - బాబు..

విజయవాడ : తాజా సర్వే ప్రకారం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం తమకే ఉందని టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సరిగ్గా పనిచేయని వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేమని బాబు సంకేతాలు ఇచ్చారు. గుంటూరు జిల్లా నేతల తీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ఏర్పాటు చేస్తే నేతలు హాజరు కావడం లేదని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి అయ్యన్న ఫిర్యాదు చేయడంతో ఇలా ప్రవర్తించడం సరికాదని గుంటూరు జిల్లా నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇంటింటికి టిడిపి...

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 30 వరకు ఇంటింటికి టిడిపి కార్యక్రమం జరుగుతుందని టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతొక్కరికీ తెలియచేయాలని సూచించారు. గత సంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని, ఎట్టి పరిస్థుతుల్లో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలని, నేతలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిని గెలిపించాలని, నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవానికి సంబంధించి అన్ని పార్టీలకు లేఖలు రాయాలని సమావేశంలో నిర్ణయించారు.

నగరంలో మీరా కుమార్..

హైదరాబాద్ : ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన మీరా కుమార్ మీడియాతో మాట్లాడారు. 17 పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేశాయని, భావసౌరుప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం సంతోషంగా ఉందన్నారు.

వరంగల్ లో ఎస్ఎఫ్ఐ నిరసన..

వరంగల్ : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల తీరుపై ఎస్ఎఫ్ఐ నిరసన వ్యక్తం చేసింది. పబ్లిక్ గార్డెన్ నుండి అర్బన్ డీఈవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించింది. డీఈవో ఆఫీసు ముట్టడికి యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

ట్రంప్ 113 రోజులు..74 అసత్యాలు..

అమెరికా : అధ్యక్షుడు ట్రంప్ పై న్యూయార్స్ టైమ్స్ ప్రతిక ఘాటు వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ప్రతి రోజు ఏదో ఒక అసత్యాలు చెబుతున్నారని, 113 రోజుల్లో 74 అసత్యాలు చెప్పారని పేర్కొంది. ట్రంప్ నిజాయితీ పరుడు కాదని 60 శాతం మంది అమెరికన్లు నమ్ముతున్నారని తెలిపారు. ట్రంప్ పై ప్రజలు రిపబ్లికన్ పార్టీ నేతలు నమ్మకాన్ని కోల్పోతున్నారని వెల్లడించింది.

డ్రగ్స్ కేసు..సిట్ ఏర్పాటు..

హైదరాబాద్ : డ్రగ్స్ వ్వవహారంపై సిట్ ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులతో పాటు సిట్ ఏర్పాటు ఉంటుందని, ఇన్ ఛార్జీగా సూర్యాపేట ఎస్పీ శ్రీరామ్ శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. కెల్విన్, వాహిద్, ఖుద్దూస్ ఫోన్లను కాల్ అనాలిసిస్ కు పంపడం జరిగిందని నివేదిక వచ్చిన అనంతరం విచారణ మరింత ముమ్మరం చేస్తామన్నారు.

కోర్టులో డ్రగ్స్ నిందితులు..

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ కేసులో పట్టుబడిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

 

12:53 - July 3, 2017

వ్యాయామం..వయస్సు తేడా అనేది లేకుండా ప్రతొక్కరూ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కళ్ల విషయంలో కొంతమంది అశ్రద్ధ కనబరుస్తుంటారు. ఫలితంగా కంటి సమస్యలు ఏర్పడుతాయి. కళ్ల ఆరోగ్యానికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి సమస్యలుండవు.
కళ్లను గట్టిగా మూసి..తెరవడం వంటివి చేయాలి. ఇలా ఏడు..ఎనిమిది సార్లు చేయాలి.
కళ్లను చేతులతో మూసి ఉంచి నెమ్మదిగా రెప్పలపై మసాజ్ మాదిరిగా చేయాలి.
కనుగుడ్లను ఒకసారి ఒక దిశలో..మరొకసారి మరొక దిశలో కదపాలి. ఇలా కొన్నిపర్యాయాలు చేయాలి. మధ్యమధ్యలో కనురెప్పలను అల్లల్లాడించాలి.
కొద్ది దూరంలో ఉన్న ఒక వస్తువును తదేకంగా చూడడం..అదే సందర్భంలో కొంత దగ్గరగా వస్తువుపైకి దృష్టి మరల్చడం చేయాలి. ఇలా పది సార్లు చేయాలి.
తలను నిటారుగా ఉంచి కంటి చూపును పైకి తిప్పుకుంటూ కుడివైపుకు చూడాలి. అలాగే చూపును కింద నుండి పూర్తిగా ఎడమవైపు నుండి చూడండి.
తలను ఏమాత్రం కదల్చకుండా వీలైనంత పైకి..మళ్లీ వీలైనంత క్రిందకూ చూడాలి. ఇలా చేయడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తీరే అవకాశం ఉంది.

12:37 - July 3, 2017

ఖమ్మం :  జిల్లా మిర్చి మార్కెట్‌ను.. గుర్రాలపాడుకు తరలించాలని వ్యాపారులు నిరంతర బంద్‌కు పిలుపునిచ్చారు. అధికార పార్టీకి చెందిన దిగుమతి శాఖ, మిర్చి శాఖ కొనుగోలుకు ప్రయత్నించారు. దీంతో కొనుగోళ్లను అడ్డుకునేందుకు వచ్చిన సీపీఎం నేతలను, కార్మికులను, మహిళా కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:30 - July 3, 2017

ఆదిలాబాద్ : నిన్న కుంటాల జలపాతంలో గల్లంతైన ఇద్దరు యువకుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఐదుగురు యువకులు ఆదివారం విహారయాత్ర వెళ్లారు. సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఇద్దరు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:29 - July 3, 2017

హైదరాబాద్ : నగరంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ ముఠా గుట్టురట్టు పై విచారణ కోసం ప్రభుత్వం సిట్ వేసింది. సూర్యపేట ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్యర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. 20నుంచి 25 మంది సిబ్బందితో సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డ్రగ్స్ మాఫియా యువతను డ్రగ్స్ బానిసలు చేయడంతో దీన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

12:26 - July 3, 2017

హైదరాబాద్..అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం. ఇక్కడ విద్య..వైద్యం..విజ్ఞానం..ఇతర ఎన్నో రంగాల్లో పేరొందిన నగరంగా గుర్తింపు పొందింది. కానీ ప్రస్తుతం హైదరాబాద్ 'డ్రగ్స్' బాద్ గా మారిపోతుందా ? యువతే టార్గెట్ గా చేస్తూ పలు ముఠాలు హైదరాబాద్ ను కేంద్రంగా మార్చారా ? ఎగుమతులు..దిగుమతులు చేసుకుంటూ చాపకింద నీరులా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో మరోసారి కలకలం రేపుతోంది..

యువతే టార్గెట్...
డ్రగ్స్...యువతను టార్గెట్ చేసేందుకు పలు ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా వివిధ దేశాల వ్యక్తులతో సంబంధాలున్న వారు నగరంలో మకాం వేసి యూత్..విద్యార్థులను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా సంపన్న వర్గాలకు చెందిన పుత్రరత్నాలకు డ్రగ్స్ ఎరగా వేసి మత్తులోకి దించే ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కసారిగా దీనికి అలవాటు పడితే దూరం కావడం అసాధ్యమని తెలిసినా వారు డ్రగ్స్ కు లోనవుతున్నారు. కేవలం మత్తు ఆస్వాదించాలనే తాపత్రయం వారిని చెడుదారి పట్టేలా చేస్తుంది. చదువుకున్న వారు కూడా డ్రగ్స్ కు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఛైన్ సిస్టం..
స్కూళ్లు..కాలేజీలు..యూనివర్సిటీల వద్ద వీరి బిజినెస్ కొనసాగుతూ ఉంటుంది. ఒకరికి గాలం వేయడం..అనంతరం ఇంకొకరు..తరువాత మరొకరు..ఇలా ఛైన్ మాదిరిగా సిస్టమ్ పెరుగుతూ పోతుంటుంది. ముందు సరదాగా మొదలైనా తరువాత అలవాటుగా మారిపోతుంది. ఇంజినీరింగ్ కాలేజీలు, హాస్టళ్లలో డ్రగ్స్ వాడకాలు ఎక్కువగా జరుగుతాయని, ఇందులో అధికారులు..పోలీసుల పర్వవేక్షణ లేకపోవడం ప్రధాన కారణమని విమర్శలున్నాయి. పలు సందర్భాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నా మరలా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

డ్రగ్స్ రాకెట్..కలకలం..
హైదరాబాద్ లో తాజాగా డ్రగ్స్ రాకెట్ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. ఇందులో సిని నిర్మాత..ఉన్నత చదువు చదివిన విద్యార్థులున్నారు. ప్రముఖ పేరొందిన స్కూళ్లలో చదివే విద్యార్థీనిలు కూడా ఉండడం కలకలం రేపుతోంది. 9 ఏళ్ల విద్యార్థిని కూడా డ్రగ్స్ తీసుకొంటుండడం బయటకు రావడం ఏస్థాయిలో ఈ వ్యాపారం జరుగుతుందో ఆలోచించవచ్చు. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు సిట్ స్థాయిలో దర్యాప్తు చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది..
డ్రగ్స్ వాడడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందని..మానసిక వ్యాధులకు గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మత్తుకు బానిసైన వారు డ్రగ్స్ దొరకకపోయేసరికి విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో సైకోగా మారి హింసాత్మక సంఘటలనకు పాల్పడే అవకాశముంది. తనను తాను గాయపరుచుకోవడం, లేదా ఆత్మహత్యలకు పాల్పడతారు. డ్రగ్స్‌ను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే మనిషిపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు నిత్యం మత్తు కావాలని అనిపిస్తుంది.

 

తమ పిల్లలు ఎక్కడకు వెళుతున్నారు ? ఏమి చేస్తున్నారు ? ఎలా వ్యవహరిస్తున్నారు ? ఇతరత్రా విషయాలను తల్లిదండ్రులు క్షుణ్ణంగా గమనించాలని సూచిస్తున్నారు.

కుంతాల జలపాతంలో ఒకరి మృతదేహం లభ్యం..

ఆదిలాబాద్ : కుంతల జలపాతంలో గల్లంతైన వారి మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి మృతదేహం కోసం గాలింపులు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బక్రాన్ పల్లి (మం) అర్గుల్ కు చెందిన అన్సార్, ఫైజాన్ లుగా గుర్తించారు.

డ్రగ్స్ కలకలం..సిట్ ఏర్పాటు ?

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ సరఫరా కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందులో ఓ సిని నిర్మాత..కళాశాల విద్యార్థులు..స్కూల్ విద్యార్థులున్నట్లు తేలడం కలకలం రేపుతోంది. దీనితో ఈ రాకెట్ గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు కానున్నట్లు, ఇందులో 20-25 సిబ్బందితో సిట్ ఉండనున్నట్లు సమాచారం.

12:02 - July 3, 2017

కన్నవారి పర్యవేక్షణ లేకపోవడంతో పాటు చెడు స్నేహాలు..సినిమాల ప్రభావం...పిల్లలు చెడిపోవడానికి..చెడు దారుల్లో నడవడానికి కారణమౌతున్నాయి..లైంగిక దాడులు..రకరకాల నేరాలు జరుగుతున్న కేసులు పరిశీలిస్తే మైనర్లలోని నేర స్వభావం బయటపడుతోంది. ఇది తెలిసిన కన్న వారిలో ఆందోళన మొదలవుతోంది. పిల్లలు సక్రమమైన దారిలో వెళుతున్నారా ? లేదా ? తెలుసుకోవాలన్న అవసరం వచ్చింది. అజాగ్రత్త పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోలేక పోతున్న ఎందరో కన్న వారు తప్పు జరిగాక అవమానంతో తలదించుకుంటున్నారు. ఓ కన్నతల్లి కడుపుకోతకు మరో కన్నతల్లి మొహం చూపించుకోలేక కనిపించకుండా పోవడాన్ని కారణం మైనర్లే...తన కంటి పాప ఎక్కడుంది ? ఆచూకి కోసం ఆ తల్లి ప్రయత్నించింది. కానీ ఎవరూ చూడలేదనే సమాధానం వచ్చింది. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలిసింది. చిన్నారి కోసం గాలించారు. కానీ కనిపించలేదు. మూడేళ్ల వయస్సు కూడా లేని ఆ చిన్నారి ఎక్కడికి వెళ్లింది ? కానీ ఆ చిన్నారిని చంపింది ఎవరో తెలుసా ? ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక్ చేయండి...

11:37 - July 3, 2017

విజయవాడ : దీర్ఘకాలంగా ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నారు. కార్మికులకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని, భవన నిర్మాణ సంక్షేమ నిధిని మళ్లించవద్దని, 60 ఏళ్లు దాటిన కార్మికులకు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:35 - July 3, 2017

సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపలి మండలం నేరెళ్లలో ఇసుక లారీ ఢీకొనడంతో భూమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. భూమయ్య కుటుంబానికి న్యాయం చేయాలిన గ్రామస్తుల ఆందోళన చేస్తున్నారు. రోడ్డు పై ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పరిస్థితి ఉద్రక్తతంగా మారింది. భూమయ్యకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

హిమాచల్ ప్రదేశ్ సీఎంకు ఎదురు దెబ్బ..

ఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ సీఎంకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సీఎం వీరభద్రసింగ్ పై మనీలాండరింగ్ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఆస్తులు సీజ్ చేసే అధికారం ఈడీకి ఉందని హైకోర్టు పేర్కొంది.

11:23 - July 3, 2017

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు కలకలం రేపుతోంది. యువతను, విద్యార్థులు టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా తన కార్యకలపాలు జరుపుతోంది. ఇంటర్ నెట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుపుతున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని డ్రగ్స్ బానిస చేయడంతో ఆ విద్యార్థిని ఫేస్ బుక్ పొస్టు చేయడంతో అలర్ట అయిన పోలీసుల డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం వాయిదా...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. సమావేశానికి కేవలం పది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కోరం లేని కారణంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి మేయర్ వెల్లడించారు. కార్పొరేటర్లు..ఎమ్మెల్యేల మధ్య పేచీ తేలకపోవడంతో ఏరియా కమిటీ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది.

11:21 - July 3, 2017

ప్రభాస్...‘బాహుబలి'..’బాహుబలి-2’..చిత్రాల ద్వారా ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరొందిన నటుడు. ప్రస్తుతం ఇతడి కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో నటింప చేయాలని పలువురు దర్శకులు ప్రయత్నాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్..ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరొందిన 'ప్రభుదేవా' దర్శకత్వంలో 'ప్రభాస్' నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'ప్రభుదేవా' దర్శకత్వంలో పలు చిత్రాలను వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుదేవా, తమన్నా జంటగా నటిస్తున్న 'ఖామోషి' చిత్రంలో 'ప్రభాస్‌' అతిథి పాత్రలో చేస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై 'ప్రభుదేవా' మీడియాతో మాట్లాడారు..కేవలం బిజినెస్‌ కోసం తామిద్దరం కలిసి సినిమా చేయడంలో అర్థం లేదని, ‘ప్రభాస్‌'తో సినిమా తీయాలనుందని స్పష్టం చేశారు. 'సాహో' సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా అయ్యాక ఏ విషయం అనేది ప్రకటిస్తామన్నారు.

11:17 - July 3, 2017

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుపై దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కు అలవాటుపడ్డ సినీనిర్మాతకు ఎక్సైజ్ అధికారులు నోటిసులు జారీ చేశారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని నిర్మాతకు ఆదేశించారు. నిందితులు అబ్దుల్ వాహిద్, కెల్విన్, ఖుద్దూన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో మత్తుకు బానిసలైన విద్యార్థులపై పోలీసులు విచారణకు రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్ ను హైటెక్ పద్దతిలో సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ అమెరికాలోని చికాగో నుంచి హైదరాబాద్ కు కోరియర్ ద్వారా వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

డ్రగ్స్ రాకెట్..సంచలన విషయాలు..

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టుపై దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ కు అలవాటు పడిన సినీ నిర్మాతకు ఎక్సైజ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. డ్రగ్స్ సరఫరా దారులు అబ్దుల్ వాహెద్, కెల్విన్, ఖుద్దూస్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కు బానిసలైన విద్యార్థులపై విచారణకు రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్ రాకెట్ లో కెల్విన్ డ్రగ్ బాధితుడే అని అతని తండ్రి బెర్నాడ్ పేర్కొంటున్నారు.

నేరేళ్లలో ఉద్రిక్తత..

రాజన్న సిరిసిల్ల : తంగెళ్ల (మం) నేరెళ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇసుక లారీని ఢీకొని భూమయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. భూమయ్య కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇసుక లారీలను రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి..అంబేద్కర్ చౌరస్తాలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి - రఘువీరా...

తూర్పుగోదావరి : తూర్పు ఎజెన్సీలో పీసీసీ చీఫ్ రఘువీరా పర్యటించారు. ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, వ్యాధులతో 17 మంది మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

రామేశ్వరంలో కుటుంబం సూసైడ్..

నెల్లూరు : రామేశ్వరంలో ఓ హోటల్ లో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ బకాయిలు చెల్లించాలని బుకీల బెదిరింపులతో భార్య..కుమారుడితో ప్రణవ్ ఆత్మహత్య చేసుకున్నారు.

11:02 - July 3, 2017

చెన్నై : రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్నును తొలంగించాలని డిమాండ్‌ చేస్తూ తమిళ చిత్రసీమ సంఘాలు థియేటర్ల బంద్‌ కు పిలుపునిచ్చాయి. దీంతో తమిళనాడులోని 1050 థియేటర్లు మూత పడనున్నాయి. జీఎస్టీ నుండి తమిళ చిత్ర సీమకు మినహాయింపు ఇవ్వాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేవరకు థియేటర్లు మూతపడతాయని థియేటర్ల యాజమాన్య సంఘం అధ్యక్షులు తెలిపారు.

11:00 - July 3, 2017

నిజామాబాద్ : కుంటాల జలపాతంలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి గల్లంతయ్యారు. నిజామాబాద్‌ జిల్లా, అర్గుల్‌ గ్రామానికి చెందిన అన్సర్‌, ఫాజిల్‌తో పాటు ఆర్మూర్‌కు చెందిన ముగ్గురు యువకులు కలిసి విహార యాత్రకు వెళ్లారు. అయితే.. వీరిలో అన్సర్‌, ఫాజిల్‌లు నీటిలో మునిగి గల్లంతయ్యారు. దీంతో అర్గుల్‌లోని మృతుల ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.

10:51 - July 3, 2017

పార్టీ ఫిరాయింపులు తప్పు కాదని..కానీ పార్టీ ఫిరాయించేటప్పుడు ముందున్న పార్టీ పదవికి రాజీనామా చేసి ఇష్టమొచ్చిన పార్టీలో పోవాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో టిడిపి పరిస్థితి..ఇతరత్రా విషయాలపై టెన్ టివి ఆయనతో చర్చించింది. ఈసందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. చర్చలో పార్టీ ఫిరాయింపుల అంశం ఆయన మాట్లాడారు. సిద్ధాంతపరమైన పార్టీల వ్యక్తులను కొనుగోలు చేసే పరిస్థితి తెలంగాణలో రావడం బాధాకరమన్నారు. ఈ విషయంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ తప్పించుకుంటున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన వారే ప్రోత్సాహిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కూడా అదే పని చేసిందన్నారు. ఒక పార్టీ ద్వారా నెగ్గి ఈ పదవిని తీసుకుని ఇతర పార్టీలోకి వెళ్లడాన్ని తాను వ్యతిరేకిస్తానని..దీనిపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంకా రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలపై మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి..

పుల్వామాలో మళ్లీ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు..ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి.

ఖమ్మం మార్కెట్ తరలింపు వివాదం...

ఖమ్మం : మార్కెట్ తరలింపుపై వివాదం కొనసాగుతోంది. మిర్చి మార్కెట్ ను గుర్రాలపాడుకు తరలించాలనే నిర్ణయంపై వ్యాపారులు రెండుగా చీలిపోయారు. మార్కెట్ బంద్ కు ఓవర్గం పిలుపునివ్వగా కొనుగోళ్లకు అధికార పార్టీకి చెందిన వ్యాపారులు ముందుకొచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

రూ. 20 లక్షల నకిలీ గుట్కా..

హైదరాబాద్ : నకిలీ గుట్కా తయారీ ముఠాను పోలీసుటు గుట్టు రట్టు చేశారు. కాటేదాన్ లో నకిలీ గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి జరిపి రూ. 20 లక్షలకు పైగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

గార్లదిన్నె మండలంలో కారు బోల్తా..

అనంతపురం : గార్లదిన్నె మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీశైలం నుండి అనంతపురానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పుణెలో ఘోర ఆక్సిడెంట్..

మహారాష్ట్ర : పుణె సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ను వ్యాన్ ఢీకొనడంతో ఏడుగరు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

10:27 - July 3, 2017

హైదరాబాద్ : కాసేపట్లో జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఏరియా కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు. కౌన్సిల్ ప్రతి ఐదు వేల జనాభాకు ఒకరు చొప్పున 1400 మందిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ గతేడాదిలోనే పూర్తి కావాల్సి ఉంది కానీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మధ్య సమన్వయ లోపం వల్ల వాయిదా పడింది. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

పంజాగుట్టలో కోటి విలువైన ఆభరణాలు చోరీ..

హైదరాబాద్ : పంజాగుట్ట ఆనంద్ నగర్ కాలనీలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో రూ. కోటి విలువైన బంగారం..డైమండ్స్ లను అపహరించారు. ఇంట్లో పనిచేసే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు ఆరు బృందాలు ఏర్పాటు చేశారు.

10:21 - July 3, 2017

ఖమ్మం : జిల్లా మార్కెట్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. మార్కెట్ ను గుర్రాలపాడుకు తరలించాలని వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. అధికార పార్టీకి చెందిన వ్యాపారులతో కొనుగోళ్ల చేపట్టాలని అధికారుల ఒత్తిడి తీసుకోస్తున్నారు. దీంతో మార్కెట్లో పోలీసులను భారీగా మోహరించారు. ముందస్తుగా పలువురు సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ కార్మికుల ఎవరు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి.ఎమ్మెల్యే మాత్రం మార్కెట్ రఘునాథ పల్లి తరలించాలని భావిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

10:20 - July 3, 2017

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ' జై లవ కుశ' సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుండడంతో చిత్రంపై ఉత్కంఠ పెరుగుతోంది. సినిమాలో 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషించనున్నట్లు టాక్. సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను ఇటీవలే చిత్ర యూనిట్ విడుదల చేసింది. కానీ లుక్ లో మాత్రం 'ఎన్టీఆర్' ఒకరు మాత్రం ఉండడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. తాజాగా చిత్ర యూనిట్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ‘జై లవ కుశ' మూడు పాత్ర టీజర్లు విడివిడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల మీరు 'జై'ను చూశారు. జులై 6 సాయంత్రం 5.22 గంటలకు 'జై' టీజర్ చూసేందుకు సిద్ధం కండి' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కీలక ప్రకటన చూసిన అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. సాధారణంగా సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ను మాత్రమే విడుదల చేస్తుండడం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ ఆర్ట్స్ మూడు టీజర్లను విడుదల చేస్తుండడం క్యూరియాసిటీని మరింత పెంచేసింది. రాశీఖన్నా..నివేతా థామస్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుల్లితెర హిందీ నటుడు 'రోనిత్ రాయ్' విలన్ గా నటిస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకాంపై 'జూ.ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

10:19 - July 3, 2017

జగపతి బాబు..స్టైలిష్ విలన్ గా అభిమానులు ఆకట్టుకుంటున్నాడు. ప్రముఖ హీరోల చిత్రాల్లో 'జగపతి' స్టైలిష్ విలన్ గా కనిపించిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రధాన పాత్రలో కూడా ఆకట్టుకొంటున్నాడు. హీరోగా..విలన్ గా నటిస్తున్న 'జగపతి' మళ్లీ హీరోగా ముందుకొస్తున్నాడు. వాసు పరిమి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఆయన నటిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు 'పటేల్ సార్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ‘జగపతిబాబు' యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని, షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని నిర్మాత సాయి కొర్రపాటి పేర్కొన్నారు. జులై లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

10:19 - July 3, 2017

నందమూరి కళ్యాణ్ రామ్ నటుడుగా..నిర్మాతగా ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 'ఎన్టీఆర్' హీరోగా 'జై లవ కుశ' అనే చిత్రాన్ని 'కళ్యాణ్' నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే చిత్రంలో 'కళ్యాణ్ నటిస్తున్నాడు. సరికొత్త లుక్ లో కనిపించనున్న 'కళ్యాణ్' సరసన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. టీంతో 'కాజల్ అగర్వాల్' జత కలిసింది. ఈ సందర్భంగా 'కాజల్' ఫొటోస్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది. ఈ ఏడాది చివరిలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి 'కళ్యాణ్' ఎంఎల్ఏ' గా ఎలా అలరించనున్నాడో చూడాలి.

10:15 - July 3, 2017
10:12 - July 3, 2017

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరుతోంది. తెల్లవారు ఝామునుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు బమ్నూ ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. మరో ఇద్దరు ఇంట్లో దాగి ఉన్నారు. ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాది కిఫాయిత్ గా భద్రతా బలగాలు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:26 - July 3, 2017

గుంటూరు : కాసేపట్లో ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ సమావేశం జరగనుంది. ఈ భేటీలో టీడీపీ జాతీయ కార్యవర్గం గురించి, ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి చర్చ జరగనుంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షడిగా ఉన్న కళావెట్రావు ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి, నంద్యాల ఉప ఎన్నిక గురించి చర్చించనున్నట్లు సమాచారం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

09:11 - July 3, 2017

ఖమ్మం : జిల్లా మార్కెట్లో ఉద్రిక్తత చేటు చేసుకుంది. మార్కెట్ ను గుర్రాలపాడుకు తరలించాలని వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. అధికార పార్టీకి చెందిన వ్యాపారులతో కొనుగోళ్ల చేపట్టాలని అధికారుల ఒత్తిడి తీసుకోస్తున్నారు. దీంతో మార్కెట్లో పోలీసులను భారీగా మోహరించారు. ముందస్తుగా పలువురు సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

09:03 - July 3, 2017

అమెరికా : లోయలో మినీ బస్సు పడి తెలంగాణ యువకుడు మృతి చెందాడు. మృతుడు భువనగిరికి చెందిన పోత్నక్ ప్రదీప్‌గా గుర్తించారు. 28వ పుట్టిన రోజు జరుపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడాదిన్నర క్రితమే ప్రదీప్‌ వివాహం చేసుకున్నాడు. భార్య కార్తీక సహా మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ప్రదీప్‌ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. 

08:58 - July 3, 2017

హైదరాబాద్ : నగరంలోని పంజాగుట్ట ఆనంద్ నగర్ లో భారీ దొంగతనం జరిగింది. వ్యాపారి ఆనంద్ గుప్త ఇంటిలో కోటి విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ అయినట్టు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నసుమారు కోటి రూపాయాలు విలువ చేసే జీతెందర్ గుప్త పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. దొంగలను పట్టుకునేందుకు ఆరు టీమ్ లు ఏర్పాటు చేశారు. పని మనిషి చోరీ చేసిందని ఆనంద్ గుప్త అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీంలో సేకరించిన ఆధారాలను బట్టి చోరీ పాల్పడింది పురుషునిగా గుర్తించారు. పోలీసులు కాలనీలోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

కారు బోల్తా ఐదుగురి మృతి

అనంతపురం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలకేంద్రంలో రాత్రి ర2 గంటల సమయంలో బోలెరో వాహనం బోల్తాపడి 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి తమిళనాడులోని తిరుచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు.

08:42 - July 3, 2017

అనంతపురం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలకేంద్రంలో రాత్రి ర2 గంటల సమయంలో బోలెరో వాహనం బోల్తాపడి 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి తమిళనాడులోని తిరుచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి ఇంటిలో విషాదం నెలకొంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు 120 స్పీడ్ లో ఉండడంతో బెలూన్లు ఒపెన్ చేసిన ఏం చేయాలేకపోయారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:40 - July 3, 2017

నోట్ల రద్దు తరహలోనే జీఎస్టీ వల్ల ఎటువంటి ఉపయోగం సామ్యాడికి లేదని, జీఎస్టీ రాష్ట్రల ఆదాయన్ని లాగేసుకోవడం కోసం అని, కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణళికా లేదని, జీఎస్టీ కేవలం బడా బాబులకు మాత్రమే అని ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. 160దేశాల్లో సింగపూర్ 8, చైన్నా 17 మన దేశంలో 28 శాతమని, కేంద్రం ప్రజలకు మంచి చేయలనుకుంటే పెట్రోలియం జీఎస్టీ ఎందుకు తీసుకురాలేదని, నోట్ల రద్దు కసరత్తు లేకుండా ఎలా చేశారో, ఇప్పుడు జీఎస్టీ కూడా అలా ఉందని, ప్రస్తుతం వ్యవసాయం సంక్షోభంలో ఉండగా జీఎస్టీతో రైతులు సమస్యలు ఎదురౌతాయని ఏపీ పీపీసీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. జీఎస్టీ ఆహ్వానించ దగ్గా విషయమని ఏపీ పీపీసీ అధికార ప్రతినిధి అన్నారు. 

08:38 - July 3, 2017

రజకులు వృత్తి చేసుకోవడానికి దోబీలు కూడా లేవని, బడ్జెట్ లో కోట్లాది రూపాయాలు ప్రకటిస్తున్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. రజకులకు రాజకీయంగా, సామాజికంగా వెనుకపడ్డారని, రజకులను ఎస్సీ లో చేర్చాలని, 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ కేటగిలో ఉన్నారని ఏపీ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి అంజి బాబు అన్నారు. ఈ రోజు రజక వృత్తి ఈ సమాజాన్ని రక్షించారు. సబ్బులు లేకుండానే బట్టలు శుభ్రం చేశారని, గతంలో రజక సమస్యలను రాజశేఖరెడ్డి గారి దృష్టి తీసుకెళ్లామని తెంలంగాణ రజక సంఘం అధ్యక్షుడు నాగరాజు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

08:36 - July 3, 2017

తూర్పు గోదావరి : జిల్లాలో మన్యం విలవిల్లాడుతోంది. విషజ్వరాలతో గిరిజనలు వణికిపోతున్నారు. ఏజెన్సీలోని చాపరాయి గ్రామంలోనే ఇప్పటికే 16 మంది మృతిచెందగా.. జాల్లావ్యాప్తంగా మరో 5గురు విషజ్వరాలకు బలయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న అరకొర వైద్యసహాయం.. రోగాలను తగ్గించడంలేదని గిరిజనలు ఆవేదన చెందుతున్నారు. అసలు వైద్యాధికారులే తమ గూడేలవైపు రావడంలేదంటున్నారు. అపుడపుడు ఏఎన్‌ఎంలు వచ్చి మందుగోలీలు ఇచ్చి సరిపెడుతున్నారని చెబుతున్నారు.

సీజనల్‌ రోగాలతో......
సీజనల్‌ రోగాలతో ఏజెన్సీలో గిరిజనలు పిట్టల్లా రాలిపోతున్నా.. చలించని ప్రభుత్వంపై గిరిజనలు మండిపడుతున్నారు. విషజర్వాలతో వరుసుగా జనం చనిపోతుంటే.. జిల్లా కలెక్టర్‌ స్పందన భిన్నంగా ఉంది. చనిపోయిన ఆవును కాల్వలో పడేయడంతో .. ఆనీరు తాగినవారు రోగాలభారినపడి చనిపోయారని అంటున్నారు. కలెక్టర్‌ స్పందనపై గిరిజనలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆవును పడవేసింది ఒక గ్రామంలో అయితే మొత్తం ఏజెన్సీలో చావులకు అంటగడుతున్నారని విమర్శిస్తున్నారు. వైద్యసదుపాయాలు ఏర్పాటు చేయడం చేతగాని అధికారులు విషజ్వరాలపై కుంటిసాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పికైనా ప్రభుత్వం ఏజెన్సీలో ప్రభలుతున్న విషజ్వరాలపై దృష్టిపెట్టి.. గిరిజనుల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడో జిల్లా కేంద్రాల్లోనే కాకుండా.. ప్రతి గ్రామంలో హెల్త్‌క్యాంపులు పెట్టి.. సకాలంలో వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు.  

08:35 - July 3, 2017

వరంగల్ : మనిషి ప్రాణాలతో ఉందీ లేనిదీ.. మామూలు జనంకంటే.. మెడలో స్టెతస్‌స్కోపు వేసుకున్న వైద్యులు కచ్చితంగా చెప్పగలరు. కాని.. వరంగల్‌ డాక్టర్లు మాత్రం.. బతికుండగానే చనిపోయినట్టు తేల్చిపారేస్తున్నారు. కాజీపేటకు చెందిన స్వప్న 3 రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. చిన్నారి తక్కువ బరువతో పుట్టడంతో తల్లిండ్రులు పాపను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పసిగందు బతికుండగానే చనిపోయినట్టు చెప్పేశారు. అంతేకాదు.. డెత్‌ సర్టిఫికేట్‌కూడా ఇచ్చేశారు. దీంతో తల్లిదండ్రులు పాపను శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తించి మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

పాప బతికుండగానే చనిపోయినట్టు
పాప బతికుండగానే చనిపోయినట్టు ఎలా చెబుతురాని పాప తల్లిదండ్రులు, బంధులు నిలదీస్తే డాక్టర్లు నీళ్లు నములుతున్నారు. మేం పరీక్షించినపుడు చిన్నారి చనిపోయినట్టే అనిపించిందని చెబుతున్నారు. పైగా ఎందుకు గొడవ చేస్తున్నారని బాధితులపైనే ఎదురుదాడికి దిగారు. దీంతో చిన్నారి బంధులు మీడియా సాక్షిగా డాక్టర్ల తీరును నిలదీశారు. పాపను మరోసారి పరీక్షించిన వైద్యులు ఆమె బతికే ఉన్నట్టు నిర్ధారించుకుని.. మళ్లీ చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం బేబీని ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. మొత్తానికి పాప చనిపోయినట్టు సర్టిఫికేట్‌ ఇచ్చి వైద్యులు నిర్లక్ష్యంపై వరంగల్‌ జనం మండిపడుతున్నారు. 

08:33 - July 3, 2017

హైదరాబాద్ : టీమాస్‌ ఫోరం.. గణగారిన వర్గాల గొంతుకులను ఏకం చేస్తున్న వేదిక. జూలై 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఆరంభ సభతో అణగారిన వర్గాలు ప్రభల శక్తిగా ముందుకు వస్తున్నాయి. పాలకులు, రాజకీయపార్టీలు ఇక సామాజిక న్యాయంపై మాటతప్పడానికి వీలులేని విధంగా ఒత్తిడి తీసుకొస్తామంటున్నారు ఫోరం నాయకులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదిపత్య భావజాలం మరింత పెరిగిందిని టీమాస్‌ ఫోరం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే తెలంగాణలో సామాజిక న్యాయం సాధన కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసేన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందంటున్నారు. అదే స్ఫూర్తిగా ..దాదాపు 200 సంఘాలతో ఏర్పడిన టీమాస్‌ఫోరం సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తుందని తేల్చి చెబుతున్నారు.

అణగారిన వర్గాలకు రాజ్యాధికారం
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కోసమే ప్రజాసంఘాలు, సామాజిక సంఘాల ఐక్యవేదిక ఆవిర్భవించిందని వేదిక నాయకులు అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత , తెలంగాణతోపాటు ఏపీలోనూ పాలకులే మారారు కాని పాలసీలు మారలేదని.. దోపిడి రూపం మాత్రమే మారిందంటున్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో దోపిడీ పెరిగిపోయిందని సామాజిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎన్నడూ లేనంత స్థాయిలో తెలంగాణలో భూ కుంభకోణం చోటు చేసుకోవడం పాలకవర్గాల దోపిడీకి పరాకాష్ట అని విమర్శిస్తున్నారు. దోపిడీపై ప్రజల్లో ఉధృతంగా ప్రచారం చేస్తామంటున్నారు.

తెలంగాణ పాలకులు మోదీ సర్కార్‌కు వత్తాసు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాటఎత్తితే తాము మైనార్టీలకు అనుకూలం అంటూ తెగ లెక్చర్లిస్తోందని.. ఆచరణలో మాత్రం మైనార్టీలకు పూర్తి విరుద్ధ నిర్ణయాలు తీసుకుంటోందని ఫోరం నాయకులు మండిపడుతున్నారు. పశుమాంసం, పశువిక్రయాలకు వ్యతిరేకం కేంద్రం తెచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం చేస్తే.. తెలంగాణ పాలకులు మాత్రం మోదీ సర్కార్‌కు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. జూలై నాలుగున జరగనున్న ప్రారంభ సభతో సామాజిక సంఘాల న్యాయపోరాటం మొదలవుతుందంటున్నారు. తెలంగాణసాయుధపోరాటంలో తొలి అమరుడు దొడ్డికొమరయ్య వర్దంతి సందర్భంగా సామాజిక శక్తులు శంఖారావం పూరిస్తున్నాయని ఫోరం నాయకులు అంటున్నారు. 

08:31 - July 3, 2017

ఖమ్మం:  గులాబీ పార్టీలో ఆధిపత్యపోరు తారస్థాయి చేరింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ మధ్య ఆధిపత్య పోరుకొనసాగుతోంది. ఖమ్మంలో పట్టుకోసం ఇద్దరు నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గతనెల 15న పలు అభివృద్ధికార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేటీఆర్‌ ఖమ్మం వచ్చారు. కేటీఆర్‌ టూర్‌లోనే ఇద్దరి మధ్యనున్న ఆధిపత్య పోరు బయటపడింది.

తగ్గిన తుమ్మల ప్రాధాన్యం
గట్టయ్యసెంటర్‌లో డీసీసీబీ కార్యాలయం ప్రారంభోత్సవంలో తుమ్మలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతేకాదు.... రోప్‌పార్టీ స్పెషల్‌ పోలీసులు తుమ్మలను తోసివేశారు. నూతన బస్టాండ్‌ భవన శంకుస్థాపన కార్యక్రమంలోనూ తనను పోలీసులు తోసివేశారని తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. త్రీటౌన్‌ ప్రాంతంలోని బోస్‌ బొమ్మ సెంటర్‌లో సుభాష్‌చంద్రబోస్‌ కాంస్యవిగ్రహావిష్కరణలోనూ తుమ్మలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో... ఎస్కార్టు సహాయం కూడా తీసుకోకుండానే తుమ్మల వెనుదిరిగారు. ఇలా ఖమ్మం నగర పర్యటనలో తుమ్మలను అడుగడుగునా అవమానాలకు గురిచేసే ప్రయత్నం పువ్వాడ అజయ్‌ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశం జిల్లా పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. నలుగురు కలిసిచోటల్లా దీనిపైనే చర్చించుకున్నారు. ఖమ్మంలో గతనెల 15న ఐటీహబ్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా ఫలకంలో తుమ్మల పేరును విశిష్ట అతిథులుగా చిన్న అక్షరాలతో వేయించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ధంసలాపురం రైల్వేగేటు దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అక్కడ జరిగిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరారావు పువ్వాడ అజయ్‌ను సభ పూర్తయ్యే వరకు నిలబెట్టారు. పువ్వాడ కూర్చున్న కుర్చీని కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌కు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పువ్వాడ తన కుర్చీని కలెక్టర్‌కు ఇచ్చి సభ ముగిసేవరకు నిలబడేఉన్నారు. కేటీఆర్‌ సమక్షంలోనే నేతల మధ్య ఆధిపత్యపోరు బహిర్గతమైంది.

కేటీఆర్‌ సర్దుబాటు...
జిల్లా అభివృద్ధి విషయంలో తుమ్మలకు ప్రత్యేకమైన ముద్ర ఉంది. అది నేటికీ కొనసాగుతుండడంతో.. దాన్ని చెరిపేసే ప్రయత్నాలంలో భాగంగా... ఖమ్మం నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తప్ప మంత్రికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని కేటీఆర్‌ కార్పొరేటర్లు, అధికారులకు గతంలోనే స్పష్టం చేశారు. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌లో తుమ్మల తల దూర్చడానికి వీలులేదని కేటీఆర్‌ సర్దుబాటు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరోవైపు అజయ్‌ కూడా ఖమ్మంలో పట్టుపెంచుకుంటున్నారు. కార్పొరేషన్‌తోపాటు జిల్లా అధికారులు, పోలీసు వ్యవస్థలో పట్టుసాధించారు. గులాబీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఆదేశాలు పాటించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి నేతల మధ్య ఆధిపత్యపోరు దేనికి దారితీస్తుందోనని క్యాడర్‌ ఆందోళన చెందుతోంది.  

08:26 - July 3, 2017

గుంటూరు : ఇవాళ జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశం అజెండా సిద్ధమైంది. రాజధాని అమరావతిలో మౌలికసదుపాయాల కల్పనకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవాడంతోపాటు వివిధ అంశాలపై కేబినెట్‌లో చర్చిస్తారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పినకు ప్రపంచ బ్యాంకు నుంచి రూ.3,300 కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే లోను మంజూరయ్యే దశలో కొందరు రైతుల లేఖలు రాయడంపై వివాదాస్పదంగా మారింది. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో ఈఅంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్లలోపు మద్యం దుకాణాలు, బార్లు ఉండరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కూడా కేబినెట్‌లో చర్చించే చాన్స్‌ ఉంది. రాష్ట్ర రహదారులను డీ నోటిఫై చేసి, వీటి పేర్లు మార్చే అంశం పరిశీలనకు రావొచ్చు. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి మన్యంలో ప్రబలిన విషజ్వరాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుత గోదావరి, కృష్ణా డెల్టాలకు సాగునీరు విడుదల చేసిన నేపధ్యంలో ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులు, విత్తనాల సరఫరా, మూడో విడత రుణమాఫీపై చర్చించే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో వెలుగు చూసిన భూకుంభకోణాలపై సిట్‌ దర్యాప్తు పురోగతి వంటి అంశాలు కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందిని భావిస్తున్నారు.

రాష్ట్రం కోల్పోయే ఆదాయంపై మంత్రివర్గం సమీక్షి
జీఎస్‌టీ అమలుతో రాష్ట్రం కోల్పోయే ఆదాయంపై మంత్రివర్గం సమీక్షిస్తుంది. జీఎస్‌టీని వ్యతిరేకిస్తూ వివిధ వ్యాపార వర్గాలు చేస్తన్న ఆందోళనపై కూడా చర్చించే అవకాశం ఉంది. పశ్చిమగోదారి జిల్లా తుందుర్రు ఆక్వాఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన తీవ్రతమైన తరుణంలో ఈ విషయంలో ఏంచేయాలన్న అంశం చర్చకు రావొచ్చు. కేబినెట్‌ భేటీకి ముందు జరిగే టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పార్టీ జాతీయ కమిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల కమిటీలతోపాటు అనుబంధ విభాగాల ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న కిమిడి కళావెంకట్రావు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు ఈయన స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించొచ్చని వినిపిస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కాపు సామాజిక వర్గానికి చెందని జ్యోతుల నెహ్రూకు ఏపీ టీడీపీ పగ్గాలు అప్పగించే అంశం పరిశీలనకు రావొచ్చు. దేవినేని అవినాష్‌కు తెలుగుయువత అధ్యక్ష బాధ్యతలు అప్పగించే చాన్స్‌ ఉందని భావిస్తున్నారు. టీడీపీ సమన్వయ కమిటీలో ఏనిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

08:05 - July 3, 2017

అనంతపురం : అనంతపురంజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గార్లదిన్నె మండలకేంద్రంలో రాత్రి ర2 గంటల సమయంలో కారు బోల్తాపడి 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి తమిళనాడులోని తిరుచ్చికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి ఇంటిలో విషాదం నెలకొంది.

 

Don't Miss