Activities calendar

04 July 2017

22:13 - July 4, 2017
22:12 - July 4, 2017

ఇజ్రాయిల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది ఇజ్రాయిల్‌ పర్యటనలో భాగంగా టెల్‌ అవీవ్‌ చేరుకున్నారు. బెన్‌ గురియన్‌ విమానశ్రయంలో మోదికి ఎర్ర తివాచీ పరచి ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహు హిందీలో మాట్లాడుతూ మోదిని స్వాగతించారు. భారత్‌ తమకు సహజ మిత్ర దేశమని...ప్రధాని మోది పర్యటన చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలకు ఆకాశమే హద్దన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తాను అమితంగా గౌరవిస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని తెలిపారు. తొలి భారత ప్రధానిగా ఇజ్రాయిల్‌లో పర్యటించడం తాను అదృష్టంగా భావిస్తానని ప్రధాని మోది చెప్పారు.  ఇజ్రాయిల్‌తో బలమైన సంబంధాలు నెలకొల్పడంపైనే తన దృష్టి ఉందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని మోది అన్నారు. భారత్‌ అతి పురాతన సంస్కృతి కలిగిన యువ దేశమని పేర్కొన్నారు.  సైబర్ భద్రత, నవ కల్పనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారంపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. 

 

మద్యం షాపుపై మహిళలు దాడి..పది మంది అరెస్టు

తూర్పుగోదావరి : కరప మండలం వేలంగిలో మద్యం షాపుపై మహిళలు దాడి చేశారు. పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును నిరసిస్తూ స్థానికులు స్టేషన్ ఎదుట భైఠాయించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

తిరుమల : పుల్లుట్ల అటవీప్రాంతంలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించింది. 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారీలో ఉన్నారు. 

21:43 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేదిక ఆవిర్భవించింది.  అణగారిన వర్గాల సరికొత్త గొంతుక దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటమే లక్ష్యంగా రెండు వందలకు పైగా సామాజిక, సాంస్కృతిక, ప్రజాసంఘాలతో కలిసి టీ మాస్‌ ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల గొంతుకగా టీ-మాస్‌ ఫోరం పనిచేస్తుందని నేతలు స్పష్టం చేశారు. సబ్బండ వర్ణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈ ఫోరం ప్రభుత్వంపై ఉద్యమిస్తుందని తెలిపారు.
200పైగా సంఘాలతో టీ మాస్‌ ఫోరం 
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన ఉద్యమ వేదిక పురుడుపోసుకుంది. 200పైగా సంఘాలతో కలిసి టీ మాస్‌ ఫోరం ఘనంగా ఆవిర్భవించింది. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎంఈ గార్డెన్స్‌ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన సంఘాల ప్రతినిధులంతా కలిసి టీ మాస్‌ ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 24 మందితో స్టీరింగ్‌ కమిటీ, 81 మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టీరింగ్‌ కమిటీలో గద్దర్‌, తమ్మినేని, విమలక్క, కంచె ఐలయ్య, అద్దంకి దయాకర్‌, జాన్‌వెస్లీ, బెల్లయ్య నాయక్‌లాంటి ప్రముఖులు ఉన్నారు. 
విధివిధానాలు ప్రకటించిన తమ్మినేని
టీ మాస్‌ ఫోరం ఏర్పాటు సభలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని టీ మాస్‌ ఫోరం విధివిధానాలను ప్రకటించారు. తెలంగాణలో పేదల ఆకలిని, కన్నీటినీ తుడిచేందుకు.. మోగించే డప్పుల నిప్పుల దరువే టీ మాస్‌ అని  ప్రకటించారు. తెలంగాణ ప్రజా గొంతుకగా టీ మాస్‌ పనిచేస్తుందని చెప్పారు. టీ మాస్‌ పేరు వింటేనే ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.  ఇందుకు  మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీ మాస్‌ను పటిష్టం చేయాలని సూచించారు.
సామాజిక శక్తులదే రాజ్యాధికారమని : గద్దర్‌ 
2019ఎన్నికల్లో తెలంగాణలో సామాజిక శక్తులదే రాజ్యాధికారమని ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అన్నారు. అందుకే సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రభుత్వంపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆధునిక దొరలు, మతతత్వ, సామ్రాజ్యవాదులతో నిరంతరం పోరాటం చేయాలన్నారు. 
తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమానికి కేసీఆర్‌ ద్రోహం : విమలక్క
తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమానికి కేసీఆర్‌ ద్రోహం చేశారని  టఫ్‌ నాయకురాలు విమలక్క ఆరోపించారు. రాష్ట్రంలోని ఉద్యమశక్తులను అణిచివేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా....  నేటికీ సంపూర్ణ వలస విముక్తమైన నవ తెలంగాణ ఏర్పడలేదని ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు అన్నారు.
కేసీఆర్‌ ది నియంత పాలన : ప్రొ.కంచె ఐలయ్య
తెలంగాణలో కేసీఆర్‌ నియంత పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలనసాగుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌ గడీల పాలనను కొనసాగిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ దొరతనం , అహంభావం వీడకుంటే ప్రజలకే ఆయనకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. విమలక్క, గద్దర్‌, భూదేవితోపాటు ప్రజానాట్యమండలి కళాకారుల పాటలు ఆలోచింపజేశాయి.

21:36 - July 4, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు దళితులకు న్యాయం చేయాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గరగపర్రు ఘటనలో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. విలువైన దళితుల భూములను టీడీపీ నాయకులు దోచుకున్నారని ... ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలపై చంద్రబాబునాయుడు శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రం మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కంబాల గంగా భవానీ పాల్గొన్నారు. 

 

21:32 - July 4, 2017

చిత్తూరు : తిరుపతిలో హెరిటేజ్‌ పేరుతో ఉన్న వాహనంలో ఎర్రచందనాన్ని తరలిస్తుండగా... టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనం రెండు నంబర్లతో రిజిస్టర్‌ అయినట్టు తెలుస్తోంది. ఒకటి ఏపీకి సంబందించిన రిజిస్ట్రేషన్‌ కాగా, మరొకటి తమిళనాడుదిగా గుర్తించారు. అయితే వాహనం హెరిటేజ్‌ సంస్థదా లేక దుండగులు ఇలా హెరిటేజ్‌ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

21:30 - July 4, 2017

హైదరాబాద్ : జగన్‌ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే తాను వైసీపీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి జగన్‌ సమక్షంలో పార్టీలో చేరుతానన్నారు. తన అనుచరవర్గంతో కలిసి హైదరాబాద్‌లో జగన్‌ను కలిసిన ఆయన... వైసీపీ బలోపేతానికి అందరితో కలిసి తాను కూడా కృషి చేస్తానని చెప్పారు. జగన్‌ నాయకత్వాన్ని సమర్ధించేందుకే పార్టీలోకి వచ్చానని.. తనకు సీటు ఇస్తారనే ఆలోచనతో పార్టీలోకి రాలేదన్నారు. 

 

21:21 - July 4, 2017

రంగారెడ్డి : ముత్తూట్ ఫైనాన్స్ దోపిడి యత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్ లో నిందితులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లతో పోలీసులు పహారా
కాస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ముత్తూట్ ఫైనాన్స్ దోపిడి యత్నం కేసులో ముమ్మర దర్యాప్తు

రంగారెడ్డి : ముత్తూట్ ఫైనాన్స్ దోపిడి యత్నం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హ్యాపీ హోమ్స్ అపార్ట్ మెంట్ లో నిందితులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లతో పోలీసులు పహారా
కాస్తున్నారు. 

21:05 - July 4, 2017

మాటలు తప్ప చేతలు కనిపించన చోట... నిలబెట్టి కడిగేసే తెగువ కావాలి.. హామీలు వమ్మే అయ్యేచోట.. ప్రశ్నల వర్షం కురిపించే గొంతుకవ్వాలి...
ఏలికల నిర్లక్ష్యం... ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తుంటే.. ఏకమైన ప్రజా గొంతుకలు పోరాటమే మార్గంగా.. ముందుకు సాగాలి... ఇదే లక్ష్యాలతో ఇప్పుడు తెలంగాణలో ఒక వేదిక ఆవిర్భవించింది. ప్రజా గొంతుకగా మేము నిలబడతాం... అన్యాయాల నిగ్గుతేలుస్తాం.. ప్రజల పక్షం పోరాటం సాగిస్తామంటున్న ఒక అపురూప దృశ్యం.. కనిపిస్తోంది మనకి.. ఇదే అంశంపై ఈరోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం... పూర్తి వివరాలను వీడియోలో చూడండి. 

 

20:51 - July 4, 2017

ఆంధ్రల అంటుకున్న మద్య నిషేధం..తెలంగాణల గూడా సురువయ్యే ఛాన్స్, క్లారిటీ తప్పిన తెలంగాణ సర్కార్.. జీఎస్ టీ మీద మంత్రి, సీఎం తలోమాట, రుణాలు మాఫీ చేసిన ఘనత మాదే.. బడాయి మాటలే అంటున్న రైతులు, కల్వకుంట్ల ఇంటికి కాటువెడుతున్న జేఏసీ.... సిరిసిల్ల కాడికెళ్లి... కోదండయ్య యాత్ర, ఓయూలో మోగుతున్న నిరుద్యోగ గంట... ఘంటా చక్రపాణి సారూ.. ఇది ఇనాల్నంట, సెల్ ఫోన్లనే చెట్లునాటేస్తున్న అధికారులు... కరీంనగర్ హరితహారంలో అద్భుత ఘట్టం...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

20:28 - July 4, 2017
20:24 - July 4, 2017

డ్రగ్స్ వాడకంపై వక్తలు పలు అభిప్రాయాలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త దేవి, సామాజిక విశ్లేషకులు రవికుమార్, మానసిక వైద్యనిపుణులు జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

20:15 - July 4, 2017

నెల్లూరు : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు పోలీసులే తూట్లు పొడుస్తున్నారని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసు నమోదు నుంచి విచారణలో కూడా పోలీసులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. అలాగే పోలీసులకు, రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులను నీరు గార్చేందుకు యత్నిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కారం శివాజీ హెచ్చరించారు.

 

20:12 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పేదల ఆకలి, కన్నీళ్లు తుడచడానికి ప్రభుత్వంపై డప్పులు వేసే నిప్పుల దరువే టీ మాస్‌ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ ప్రజా గొంతుకగా టీ మాస్‌ పనిచేస్తుందని తెలిపారు.  టీ మాస్‌ పేరు వింటనే ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎంఈ గార్డెన్స్‌లో టీ మాస్‌ ఫోరం ఆవిర్భవించింది. ఈ సందర్భంగా మాట్లాడిన తమ్మినేని.... కేసీఆర్‌ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకోసం టీ మాస్‌ ఫోరం పోరాడుతుందని స్పష్టం చేశారు. టీ మాస్‌ను మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టం చేయాలన్నారు.
సామాజిక శక్తులదే రాజ్యాధికారం : గద్దర్
2019ఎన్నికల్లో తెలంగాణలో సామాజిక శక్తులదే రాజ్యాధికారమని ప్రజాయుద్ధనౌక గద్దర్‌ అన్నారు. అందుకే సామాజిక న్యాయ సాధనే లక్ష్యంగా ప్రభుత్వంపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.  రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతికంగా అందరూ సమానత్వం సాధించడమే సామాజిక న్యాయమని స్పష్టం చేశారు.  ఇందుకోసం ఆధునిక దొరలు, మతతత్వవాదులు, సామ్రాజ్యవాదులతో నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

20:09 - July 4, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో శోధన కొనసాగుతుంది...మరో నలుగురిని అరెస్టు చేసిన సిట్ బృందం వారిని విచారిస్తుంది..దీంతో సరికొత్త విషయాలు బయటపడ్డంతో ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు... అరెస్టయిన నలుగురు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగులు...వీరి ద్వారా ఎవరెవరికి చేరాయి...వారి ఏజెంట్లు ఎవరు..? ఇలాంటి విషయాలతో పాటు సిట్ బృందం మరో ఐదుగురి కోసం వేట మొదలుపెట్టింది.. ఇప్పటికే ఏడుగురు అరెస్టు కాగా... పన్నెండుకు చేరే అవకాశం ఉంది...
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న అరెస్టులు..
డ్రగ్స్...మహానగరంలో మత్తుపై ఏర్పాటయిన సిట్‌ బృందం శోధన మొదలుపెట్టింది..ఇప్పటికే డ్రగ్స్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన అధికారులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు..డ్రగ్స్‌ కేసులో .. ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామంటూ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ప్రకటించారు...దీంతో డ్రగ్స్ కేసులో ఏడుగురి అరెస్టయినట్లు చెప్పారు...
నిందితుల వద్ద డ్రగ్స్..
ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న సిట్ బృందం వారిని విచారణ చేస్తుంది...ఇప్పటికే వారి వద్ద ఉన్న 100 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు...ఆ నలుగురి విచారణలో మరికొన్ని పేర్లు బయటపడ్డంతో వారి కోసం వేట మొదలుపెట్టారు.
ఆ నెట్‌వర్క్‌తోనే సప్లై అవుతున్నట్టు గుర్తింపు...
ప్రధానంగా నగరంలో మత్తు విరివిరిగా సరఫరా అయ్యేందుకు కారణం డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా సాంకేతిక సహకారం తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు...ఆ వెబ్‌సైట్  ఎక్కడిది...ఎలా రన్ చేస్తున్నారు..ఎక్కడెక్కడికి నెట్‌వర్క్‌ విస్తరించి ఉందన్నదానిపై తెలుసుకోనున్నారు. డ్రగ్స్ కేసులో లోతుగా అధ్యయనం చేస్తున్న సిట్‌ బృందం మూలాలు తెలుసుకుని కట్టడి చేసే ప్రయత్నంలో మునిగిపోయారు.

 

 

20:05 - July 4, 2017

విజయవాడ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీలో పర్యటించారు. గన్నవరం ఏయిర్‌పోర్ట్‌లో కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు. అటు నుంచి విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోవింద్‌ పాల్గొన్నారు. అక్కడ టీడీపీ, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుసుకున్నారు. గవర్నర్‌కు రాజీనామా చేసిన తర్వాత తాను ఏ పార్టీలో చేరలేదన్న కోవింద్‌.. దేశ అభివృద్ధికోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేతలకు విజ్ఞప్తి చేశారు. అటు రామ్‌నాథ్‌ కోవింద్‌ను, కేంద్రమంత్రులను చంద్రబాబు సన్మానించారు.

 

19:50 - July 4, 2017

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సీఎం దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కారు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి తాగుబోతు ప్రభుత్వంలా మారిందని మండిపడ్డారు. లిక్కర్‌ సిండికేట్‌ ఓనర్లంతా కలిసి కేబినెట్‌ సమావేశం పెట్టుకున్నట్టుగా ఉందన్న రోజా.. సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు ధిక్కరిస్తున్నారన్నారు. లిక్కర్‌ దుకాణాల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేయడం దారుణమన్న ఆమె... నీరు..మీరు కార్యక్రమంలా బీరు...బారు కార్యక్రమం చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వెనక్కు తీసుకోకపోతే లిక్కర్‌ షాపులను ధ్వంసం చేస్తామని రోజా హెచ్చరించారు. 

 

19:46 - July 4, 2017

హైదరాబాద్ : నట సార్వభౌముడు, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవితం తెరకెక్కనుంది. చలనచిత్ర, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎన్‌టీఆర్.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు... ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. ఎన్‌టీఆర్‌ లైఫ్‌లో చోటుచేసుకున్న అనేక సంఘటనల ఆధారంగా  సినిమా రూపొందించనున్నారు. ఈ బయోపిక్‌లో హీరో బాలకృష్ణ ..ఎన్‌టీఆర్‌ పాత్రను పోషించనుండగా... రామ్‌గోపాల్‌ వర్మ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
రామ్‌గోపాల్‌వర్మ డైరెక్షన్‌లో 
వివాదాస్పద సినిమాలకు కేరాఫ్‌ అడ్రసైన.. డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ.. సినీ ప్రేక్షకులను మరో బయోపిక్‌తో అలరించనున్నారు.  మహానటుడు ఎన్‌టీఆర్‌ జీవితంపై సినిమా తీస్తానని రామ్‌గోపాల్‌ వర్మ ప్రకటించారు. ఆయన జీవితాన్ని తెరకెక్కించడం చాలా గర్వంగా భావిస్తున్నానన్నారు. ఎన్‌టీఆర్‌ శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, ఎవరికీ తెలియని విషయాల వెనుక అసలు వివాదం ఏమిటో.. అవన్నీ అశేష తెలుగు ప్రజానికానికి తన ఎన్‌టీఆర్‌ చిత్రంలో చూపిస్తానన్నారు. ఈ సందర్భంగా ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని.. పొగడరా నీ తండ్రి ఎన్‌టీఆర్‌ని... అని చెబుతున్న రామ్‌గోపాల్‌ వర్మ వాయిస్‌ని విడుదల చేశారు. అలాగే  జై ఎన్‌టీఆర్ అంటూ తానే రాసి పాడిన పాటను కూడా వర్మ రిలీజ్‌ చేశారు. రామారావుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు రామ్‌గోపాల్‌ వర్మ.    
ఎన్‌టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ
ప్రతిష్టాత్మకంగా తీయనున్న ఈ సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ ఎన్‌టీఆర్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. బాలకృష్ణ, రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.   ప్రస్తుతం బాలకృష్ణ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పైసా వసూల్‌ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ఎన్‌టీఆర్‌ బయోపిక్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఎన్‌టీఆర్‌ పదవిని కోల్పోవడం... ఆయన మృతి లాంటి అంశాలను సినిమాలో ప్రస్తావించకూడదని కొందరు.. ఆయన మరణానికి అసలు కారణాలను చూపించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. 

 

19:43 - July 4, 2017

నెల్లూరు : జిల్లాలో పార్టీనాయకులు తీరు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారింది.  ఆత్మకూరు నియోజకవర్గంలో  వర్గపోరు భగ్గుమంటోంది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. టీడీపీ నాయకుల ఘర్షణలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ పావులు కదుపుతోంది. 
ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరుతో రగిలిపోతోంది. కొత్త-పాతనేతల మధ్య ఇప్పటికీ సమన్వయం కుదరకపోవడంతో..  ఎవరికి తోచిన రీతిలో వారు పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు.  
ఆనంపై గుర్రుగా ఉన్న గూటూరు కన్నబాబు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరుజిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన  మాజీ ఆనం రామనారాయణరెడ్డి.. రాష్ట్ర విభజన తర్వాతా మారిన రాజకీయపరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరారు. దాంతో   ఆత్మకూరు  నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆనంను పార్టీ అధిష్టానం నియమించింది. అయితే అప్పటివరకు ఇన్‌చార్జ్‌గా బాధ్యలు నిర్వహించిన గూటూరు కన్నబాబును తప్పించి ఆనం రామనారాయణ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో.. కన్నబాబు అసంతృప్తికి లోనయ్యారు. అప్పటికి పార్టీ అధినాయకత్వం అజమాయిషీతో సర్దుకున్న కన్నబాబు.. తర్వాత ఆనంతో కలిసి సాగకుండా పార్టీలో ఉంటూనే తన దారితనదే అన్నట్టు పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. 
పార్టీ ఇంచార్జ్‌తో సంబంధం లేకుండా పార్టీకార్యక్రమాలు 
కన్నబాబు స్పీడ్‌ ఎంతదాకా పోయిందంటే.. ఆత్మకూరు నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్‌తో అసలు సంబంధమే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. రోగులు, ఇతర బాధితులకు సీఎం సహాయనిధికి సంబంధించిన చెక్కులను ఇంటింటికీ తిరుగుతూ స్వయంగా అందిస్తున్నారు. దాంతోపాటు నియోజకవర్గంలో  రంజాన్‌ ఇఫ్తార్‌విందులు ఇవ్వడం, సొంత ఖర్చులతో పలు గ్రామాల్లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తూ దూకుపోతున్నారు. ఈ పరిణామాలు నియోజకవర్గ ఇంచార్జ్‌ ఆనం రామనారాయణరెడ్డికి ఇరకాటంగా మారాయి.  దీంతో పలు సందర్భాల్లో ఇద్దరు నేతల అనుచరలు ఘర్షణలకు కూడా దిగుతూ టీడీపీ రాజకీయాలను రచ్చకీడుస్తున్నరు. దీంతో పసుపుపార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. 
టీడీపీ వర్గపోరును క్యాష్‌ చేసుకుంటున్న వైసీపీ 
టీడీపీలో రగులు తున్న వర్గపోరును అటు వైసీపీ తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడింది. ఇటీవలే పార్టీ ప్లీనరీ నిర్వహించుకున్న వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. దీంతో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో మళ్లీ  గెలుపు తమదే అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి. ఓవైపు  పార్టీ నేత గూటూరు కన్నబాబు వైఖరి.. వైసీపీనేతల దూకుడు మరోవైపు.. ఈ పరిణామాల్లో పార్టీ  ఇంచార్జ్‌గా ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీకి పట్టును సాధిస్తారా .. అనేదానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 

 

19:41 - July 4, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. సెప్టెంటర్‌ 23 నుండి ప్రారంభమై... అక్టోబర్‌ 1 వరకూ జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా అధికారులతో జేఈఓ సమావేశం అయ్యారు. గత అనుభవాలను గుర్తుంచుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులకు సేఫ్‌ దర్శన్‌ కాన్సెప్ట్‌తో... సులభంగా స్వామివారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భద్రత కోసం.. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేలోపు అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అధికారులు  తెలిపారు.

 

19:38 - July 4, 2017

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలోని కృష్ణాపురంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లపై ఓ తండ్రి కత్తితో దాడి చేశాడు. దీంతో భార్య సులోచన, ఓ కూతురు మృతి చెందింది. మరో కూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

 

19:30 - July 4, 2017

కరీంనగర్‌ : హరితహారంలో ఖైదీలు భాగస్వామ్యం అవుతున్నారు. అయితే వారు మొక్కలు నాటకుండా.. సీడ్‌ బాల్స్‌ను తయారు చేస్తూ తమ వంతుగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కారాగారంలోని ఖైదీలంతా ఇప్పటికే 2 లక్షలకు పైగా విత్తన బంతులను తయారు చేశారు. మొక్కలు నాటే అవకాశం లేని చోట, కొండలు గుట్టల ప్రాంతంలో సీడ్‌ బాల్స్‌ను విసిరి మొక్కలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరీంనగర్‌ జైల్లో విత్తన బంతుల తయారీపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం....

19:24 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలరాశాడని.. రాష్ట్రపతి అభ్యర్థి, దళిత మహిళా నేత మీరా కుమార్‌ ఫోన్‌ చేస్తే కనీసం రెస్పాండ్‌ కాకపోవడం దారుణమని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. కేసీఆర్‌..రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు బిచ్చగాళ్ల తెంగాణాగా మారుస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్‌ సహాయం చేసే వారికి మొండి చేయి ఇచ్చే రకమని విమర్శించారు. 

 

19:21 - July 4, 2017

కర్నూలు : జిల్లాలోని కోడుమూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. 2 రోజులుగా మద్యం షాపులు మూసివుండటం..ఇవాళ షాపులు తెరవడంతో బహిరంగంగా మద్యం సేవించారు. పోలీసులు అడ్డుకోవడంతో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

19:19 - July 4, 2017

హైదరాబాద్ : జీతాలు పెంచాలన్న డిమాండ్‌తో గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి నిరసన తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో.. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇరవై ఐదు వరకు శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో తనిఖీకి వచ్చిన మంత్రి లక్ష్మారెడ్డిని జీతాలు పెంచాలని తాము కోరితే... గాంధీ నుంచి వేరేచోటుకు మార్చాలని మీడియాకు చెప్పడంపై.. ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సెలవుల్లో ఉంటామని ఆరోగ్యశ్రీ ఉద్యోగులు చెబుతున్నారు. 

 

19:02 - July 4, 2017
19:00 - July 4, 2017
18:59 - July 4, 2017
18:58 - July 4, 2017
18:57 - July 4, 2017
18:55 - July 4, 2017
18:53 - July 4, 2017
18:52 - July 4, 2017
18:50 - July 4, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో .. ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ చెప్పారు. వారి వద్ద నుంచి 100 ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. డార్క్‌ వెబ్‌సైట్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై అవుతున్నట్టు గుర్తించామని... ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.  సిట్‌ బృందంతో దర్యాప్తు వేగవంతం చేశామని.. మూలాలు తెలిస్తే డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు రాకుండా కట్టడి చేయవచ్చని అన్నారు. 

18:49 - July 4, 2017

మంచిర్యాల : జిల్లాలోని తాండూరు ఎస్సై రవి శివాలెత్తిపోయాడు. అచలాపూర్‌కు చెందిన విజయ్‌ అనే యువకుడిపై దాష్టీకం ప్రదర్శించాడు. రాత్రి ఠాణాకు పిలిపించి పైశాచికంగా చితకబాదినట్లు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్సై తీరుపై అచలాపూర్‌ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి ఎస్సై రవిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. 

 

18:48 - July 4, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో కాంగ్రెస్‌ నాయకులు పర్యటిస్తున్నారు. అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళిత కుటుంబాలను పరామర్శించారు. గరగపర్రులో దళితులపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌  జాతీయ ఎస్సీసెల్‌ చైర్మన్‌ కొప్పులరాజు డిమాండ్‌ చేశారు. అగ్రకులాలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. గరగపర్రులో దళితులకు న్యాయం చేసేందుకు త్వరలోనే కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. దళితులకు రక్షణ కల్పించాలని, వారిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేయాలని జేడీ శీలం అన్నారు. దళితులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

 

18:46 - July 4, 2017

హైదరాబాద్ : మళ్లీ మత్తు జాడలు టాలివుడ్‌ను కుదిపేస్తున్నాయి..తాజాగా దొరికిన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం ఓ ప్రముఖ నిర్మాత ఉన్నట్లు తేలింది..దీంతో సినీనగర్‌లో మరోసారి కలకలం రేపుతుంది... మరోవైపు శివార్లలోని ఇంజనీరింగ్ కాలేజీలు...ప్రముఖుల పిల్లలు చదువుతున్న కార్పోరేట్ స్కూళ్లలోనూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది..దీంతో అప్రమత్తమయిన అధికారుల బృందం ఆయా సంస్థలకు సమాచారం చేరవేడయంతో పాటు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు...
మళ్లీ టాలివుడ్‌లో ప్రకంపనలు...
డ్రగ్ మాఫియా మూలాలు కదిలిస్తున్న సిట్‌ అధికారులకు మళ్లీ టాలివుడ్‌ లోని పెద్దల పేర్లు బయటకు వస్తున్నట్లు తెలిసింది... సిని పరిశ్రమకు చెందిన పెద్ద నిర్మాత హస్తం ఉన్నట్లు ఇప్పటికే సమాచారం తెలుసుకున్న అధికారులు నిర్మాతకు కూడా ఈ వ్యవహారంతో సంబందం ఉన్నట్లు నిర్దారించుకున్నారు..దీంతోనే అబ్కారీ పోలిసుల ఎదుట హజరుకావాలని నోటిసులు జారి చేసినట్లు తెలుస్తోంది...
చాలా గ్యాప్‌ తర్వాత మరోసారి మూలాలు..
టాలివుడ్...ఇప్పటికే తెలుగు సినీ నగరంలో కూడా మత్తు జాడలు కన్పించాయి... గతంలో ఎందరో అరెస్టులు కూడా జరిగాయి..ఆ రోజుల్లోనే ఎందరో పేర్లు బయటకు వచ్చినా అప్పటికప్పుడు మరుగునపడింది...ఆ తర్వాత మళ్లీ సినీనగర్‌లో మత్తు జాడలు కన్పించలేదు..తాజాగా అబ్కారీ శాఖాధికారులు అరెస్టు చేసిన నిందితుల సమాచారంతో ఓ ప్రముఖ నిర్మాత పేరు వస్తుండడంతో కలకలం రేపుతుంది...చాలా గ్యాప్‌ తర్వాత మత్తు మూలాలు టాలివుడ్‌లో ఉందన్న సమాచారం ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఆసక్తి రేపుతుంది..ఎవరెవరున్నారు...? ఎవరి పేర్లు బయటపడతాయి...? ఆ నిర్మాత ఎవరు..? అతను ఎవరికి సరఫరా చేశారు..? ఇలాంటి ఎన్నో విషయాలపై ఉత్కంఠ రేపుతుండగా సిట్ అధికారులు మాత్రం లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది....
శివార్లలోని కాలేజీలకు మత్తు...
మత్తు సరఫరా శివార్లలోని కాలేజీలకు ఉందనేది బహిరంగ రహస్యం ...రకరకాల మత్తు పదార్థాలు ఇంజనీరింగ్ కాలేజీలకు సప్లై అవుతుందని ఇప్పటికే తేలిపోయింది..మరోవైపు కాలేజీ స్టూడెంట్స్‌లో బానిసలుగా మారినవారినే ఏజెంట్లుగా పెట్టుకున్న డీలర్లు వారితోనే విక్రయాలు జరిపారన్నది బయటపడ్డవే...అయితే తాజాగా విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ శివార్లలోని కాలేజీలు స్కూళ్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది....
నోటీసులు జారీ చేసిన అధికారులు...?
కాలేజీలు..స్కూళ్లలో మత్తు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు ఇప్పటికే ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు..అప్రమత్తంగా ఉండడంతో పాటు సంస్థల్లో యూత్‌కు నష్టం కాకుండా చూసుకోవాలని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది...ఈ డ్రగ్ వ్యవహరంలో ప్రదాన నిందితుడు కెల్విన్ 9ఏళ్ల చిన్నారిని డ్రగ్స్ కు బానిసగా చేసి చిన్నారి ద్వారా మద్యవర్తిత్వాన్ని నడిపినట్లు పోలిసుల విచారణలో వెల్లడైంది. నిందితులు కార్పోరేట్ స్కూల్స్ విద్యార్ధులకు డ్రగ్స్ అలావాటు చేసిన్నట్లు సమచారం...ఈ వివరాలతోనే అప్రమత్తమయిన అధికారులు శోధనలో భాగంగా వాటిపై కూడా దృష్టి పెట్టారు. కాలేజీలు...కార్పోరేట్‌ స్కూళ్లు...ఇవే కాదు..డ్రగ్స్ డీలర్లు అడ్డాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను...ఐటీ స్టూడెంట్స్‌ను కూడా టార్గెట్ చేసుకున్నారు..వీరి వద్ద సంపాదించిన మొత్తంతో పాటు చదువుకునేందుకు ఉండే డబ్బుపై కన్నేశారు..దీంతోనే ఆయా రంగాలపై దృష్టి పెట్టి ఆన్‌లైన్‌ ద్వారా మత్తును విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.
కార్పోరేట్‌ స్టైల్‌కు అలవాటు పడే యువత..
తాజాగా హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు దొరికిన డ్రగ్స్‌ వ్యవహారం చూస్తే కార్పోరేట్ స్టైల్‌లో అలవాటు పడుతున్న యువతను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది...డబ్బు ఎక్కడైతే దొరుకుతుందో..ఎవరైతే నీళ్లలా ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తారో వారిని లక్ష్యం చేసుకుంటున్న డ్రగ్స్ డీలర్లు భారీగా మత్తు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది....సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఐటి స్టూడెంట్స్ కు మత్తును అలవాటు చేస్తూ వారిని అందులో ముంచేస్తున్నారు...
ఒక్కసారి పీల్చితే రోజంతా మత్తు..
మత్తు ఏంటో కూడా తెలియనివారికి రుచి చూపిస్తున్నారు...ఒకటి రెండు సార్లు వాడినవారు అందులో మునిగిపోతున్నారు..ఇలా ఇప్పుడు సాఫ్ట్‌వేర్, ఐటీ రంగంవైపు దృష్టి పెట్టారు డ్రగ్స్ డీలర్లు... విదేశాల నుంచి గుర్తించేందుకు కూడా వీలులేకుండా ఉంటున్న మత్తు పదార్థాలను వారికి విక్రయిస్తూ వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్నారు..ఒక్కసారి వచ్చిన స్టాక్‌ లక్షల్లో ఉంటుందంటే నమ్మశక్యం కాదు....ఇలా మత్తుకు అలవాటు పడుతున్న వారంతా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు...
ఆన్‌లైన్ విక్రయాలతో జోరు...
మొన్నటి వరకు నేరుగా హ్యాంట్ టు హ్యాండ్ విక్రయాలు జరిపిన మాఫియాలు ఇప్పుడు సాధారణ వస్తువుల మాదిరిగా ఆన్‌లైన్ విధానంలో మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు ఆబ్కారీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నగరంలోని బోయిన్‌పల్లిలో 20లక్షల విలువ చేసే 700గ్రాముల ఎల్‌డీఎస్, ఎండీఎంఏ డ్రగ్‌ను ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. దీంతో అసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ఖరీదై డ్రగ్స్ నగరంలో చాలా కాలంగా చలామణి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీని ధర ఒక మిల్లీ గ్రాముకు 3000 వేల నుంచి 4000 వేల వరకు ఉంటుందని సమాచారం. ఈ డ్రగ్‌ను ఒక మిల్లీగ్రాము తీసుకుంటే సుమారు 8 నుంచి 12గంటల వరకు మత్తులో ఉంటారని ఆబ్కారీ ఈడీ అకున్‌సభర్వాల్ తెలిపారు.

18:43 - July 4, 2017

హైదరాబాద్ : గుడ్డి టీ.ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు అన్నారు. టీమాస్ ఫోరం ఆవిర్భావ సభలో పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం కార్మికుల మీద యుద్ధం ప్రకటించిందన్నారు. కార్మికులను ముక్కలు ముక్కులుగా చేస్తున్నారని పేర్కొన్నారు. పోరాటంలో గెలుపు, ఓటములు సహజమన్నారు. దోపిడీకి, అణిచివేతకు టీమాస్ ఫోరం చెక్ పెడుతుందన్నారు. టీమాస్ ఫోరం పటిష్టతకు సీఐటీయూ కృషి చేస్తుందన్నారు. 
టీమాస్ ఫోరంకు తమ సంఘం అండదండలుంటాయని హామీ ఇచ్చారు.  

17:01 - July 4, 2017
16:59 - July 4, 2017

నిజామాబాద్‌ : కొత్త రాష్ట్రం.. కొత్త పాలన.. కొత్తగా పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలిందా? జిల్లా అభివృద్ధికి తోడ్పడే జడ్పీటీసీలు, ఎంపీపీలు తమకు  ప్రాధాన్యం లేదని తెగ బాధ పడుతున్నారా? జిల్లా స్థాయి అధికారులకు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కొరవడిందా? నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల పరిపాలనలో అసలు ఏం జరుగుతోంది? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
ఎక్కువ మెజార్టీతో జడ్‌పి టీఆర్‌ఎస్‌ కైవసం 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో.. అత్యధిక మెజార్టీతో జడ్‌పిని టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. తర్వాత కాంగ్రెస్‌ నుంచి కొంత మంది జడ్‌పీటీసీలు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మండల స్థాయిలో అత్యధికంగా ఎంపిపి స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా.. స్థానిక జడ్‌పిటీసీలు, ఎంపీపీలు, ఎంపిటీసీలు, సర్పంచ్‌ల సహకారం అవసరం ఉంటుంది. కానీ నిజామాబాద్‌ జిల్లాలో అంతా తామే అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. 
రాష్ట్రప్రభుత్వం నుంచి అరకొరగా నిధులు 
కేంద్రప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధుల కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అరకొరగా వస్తున్నాయి. ఎమ్మెల్యేలను, జడ్‌పిటీసీలను, ఎంపీటీసీలను ప్రజలే ఓట్లు వేసి ఎన్నుకున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 36 మండలాల్లో.. జడ్‌పీటీసీలు, ఎంపిపిలకు అధికారం లేకుండా పోయిందని తెగ బాధ పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏం చెబితే అది అధికారులు వింటున్నారని, తమ మాట అధికారులు లెక్క చేయడం లేదని జిల్లా పరిషత్‌ సభ్యులు బహిరంగంగానే అంటున్నారు. జిల్లా స్థాయి, డివిజనల్‌ స్థాయి, మండల స్థాయి అధికారులు ఎవరు వచ్చినా తమకు సమాచారం ఇవ్వడం లేదని పలుసార్లు జడ్‌పి సమావేశంలో ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయిందని.. సదరు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
సంక్షేమ పథకాల చెక్‌లను పంపిణీ చేస్తోన్న ఎమ్మెల్యే 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌లకు వచ్చిన చెక్‌లను.. ఎమ్మెల్యే తన నివాసంలో పంపిణీ చేస్తున్నారని కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి జడ్‌పి, మండల స్థాయి వరకు నిధులు వస్తే ఎమ్మెల్యేలే వాటిని తీసుకోవడంతో.. తమకు గ్రామాల్లో ప్రాధాన్యత తగ్గిందని బాధ పడుతున్నారని సమాచారం. కనీసం ప్రోటోకాల్ కోసం అయినా పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ యోగిత రాణ ఒంటెద్దు పోకడ వల్ల తమకు అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 
జిల్లాకు రాని ఎంపీ కవిత 
జడ్‌పి సమావేశాలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌, మండలి చీఫ్‌ విప్ సుధాకర్‌ రెడ్డి, జహీరాబాద్‌ ఎంపి బీబీ పాటిల్‌లు తరచూ వచ్చినా.. నిజామాబాద్‌ ఎంపీ కవిత రావడం లేదు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధుల విషయంలో పార్లమెంట్‌లో మాట్లాడాలంటే ఎంపీ కవిత రావలసి ఉండగా ఆమె గైర్హాజరవుతున్నారు. 
ప్రజలకు సేవ చేయలేకపోతున్న జడ్ పీటీసీలు, ఎంపీటీసీలు 
జడ్‌పిటీసీలు, ఎంపీటీసీలు గెలిచి మూడేళ్లు పూర్తయ్యింది. కానీ ఇంతవరకు తమకు వచ్చిన నిధులు ఎమ్మెల్యేలు తీసుకోవడంతో ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని అంటున్నారు. గ్రామాల్లో కనీసం బోర్‌ వేయించాలంటే కూడా స్థానిక ఎమ్మెల్యేనే చెప్పే పరిస్థితి దాపురించింది. దీంతో విసిగిపోయిన అధికార, ప్రతిపక్ష జడ్‌పిటిసిలు మూకుమ్మడిగా జడ్‌పి సమావేశాన్ని బహిష్కరించారు. అయితే పార్టీలకు అతీతంగా అందరూ సమావేశమై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రతాపం పార్టీలకు చూపించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

 

16:45 - July 4, 2017

కరీంనగర్ : తెలంగాణలో హరిత హారం మూడవ విడత కార్యక్రమం.. ఈ నెల 12న సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం గ్రీనరీని, 33 శాతానికి పెంచేందుకు ఇప్పటికే రెండు విడతలను పూర్తి చేసి.. మూడో విడత హరిత హారాన్ని ప్రారంభించబోతోంది. 
నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు 
రాష్ట్రంలో పచ్చదనం పెంచే లక్ష్యంతో.. తెలంగాణ సర్కార్‌ హరితహారం కార్యాక్రమాన్ని చేపట్టింది. నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడమే సర్కార్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో పూర్తయిన హరితహారం కార్యక్రమం.. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు మూడవ విడత ప్రారంభం కానుంది. 
కరీంనగర్‌లో ఒకే రోజు లక్ష మొక్కలు 
కరీంనగర్‌లో ఒకే రోజు లక్ష మొక్కలతో సీఎం కేసీఆర్‌ హరితహారం ప్రారంభించనున్నారు. హరితహారం మొదటి ఏడాది 2015-2016 లో 15.86 కోట్ల మొక్కలను నాటారు. 2016-2017లో 31.67 కోట్ల మొక్కలను నాటారు. ఇక మూడవ విడతలో 2017-2018లో 40 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది 2, 925 నర్సరీలలో 40 కోట్ల మొక్కల పెంపకం చేపట్టారు. 
ప్రతీ మొక్కను సంరక్షించాలని సీఎం ఆదేశాలు 
హరితహారం కార్యక్రమం ప్రారంభమైన రెండేళ్లలో.. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు పంచాయతీరాజ్‌ రహదారులకు ఇరు వైపులా నాటిన మొక్కల్లో 91 శాతం మొక్కలు మాత్రమే పెరిగాయి. అలానే ప్రభుత్వానికి చెందిన నిరుపయోగ స్థలాల్లో నాటిన మొక్కల్లో 79 శాతం.. ఖాళీ స్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో 53 శాతం మొక్కలు మాత్రమే బతికినట్లు అంచనాలున్నాయి. మొక్కలను నాటే సమయంలో హడావిడి చేసిన కేసీఆర్‌ సర్కార్‌.. వాటిని సంరక్షించడంలో మాత్రం ఫెయిల్ అయిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. 
అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు 
అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలు, సామాజిక అడవుల కింద 120 కోట్ల మొక్కలను ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాల్లో.. మరో 10 కోట్ల మొక్కలను జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఎ పరిధిలో నాటనున్నారు. మూడవ విడతలో మొక్కలను నాటడమే కాకుండా.. వాటి సంరక్షణ బాధ్యతను తెలుసుకునేందుకు ఒక టీమ్‌ను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. 
గ్రామ పంచాయితీ పరిధిలో 40 వేల మొక్కలు 
సామాజిక అడవుల కింద ప్రతీ ఏడాది 40 కోట్ల మొక్కలను నాటాలని కేసీఆర్‌ సర్కార్‌ ప్రణాళికలు రూపొందించిది. ప్రతీ ఏడాది నియోజకవర్గం పరిధిలో 40 లక్షల మొక్కలు, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటాలని ప్రణాళికను సిద్ధం చేసింది. కనీసం 50 మొక్కలను.. అంతకంటే ఎక్కువ నాటే వ్యక్తులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. 
పంచాయితీలు, వార్డులు, మున్సిపాలిటీలు 
లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయితీలు, వార్డులు, మున్సిపాలిటీలకు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించబోతోంది. హరితహారం ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్‌ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. మొక్కలను సిద్ధం చేస్తూనే జిల్లాల వారీ టార్గెట్ ప్రకారం.. తప్పనిసరిగా మొక్కలు నాటాలని ఆదేశించారు. 

 

16:26 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మరో వారంలో నోటిఫికేషన్ జారీ కానుంది. కౌన్సెలింగ్‌ ప్రకటన విడుదలకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.  నీట్ జాతీయ స్థాయి ఫలితాలు గత నెల 23న విడుదల కాగా, రాష్ట్ర స్థాయి ర్యాంకులను మొన్న  హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటించింది. తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి ప్రభుత్వం హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 
నీట్... 40వేల తెలంగాణ విద్యార్ధులు హాజరు
దేశ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలల్లో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన నీట్ మే 7వ తేదిన నిర్వహించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన నీట్ లో తెలంగాణ నుంచి 40వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. వీరిలో 27వేల మంది విద్యార్ధులు అర్హత సాధించారు.వీరిని స్థానికులుగా పరిగణించి  85శాతం సీట్లు కేటాయిస్తారు. ఏపీ నుంచి దాదాపుగా 30వేల మంది క్వాలిఫై అయ్యారు. వీరిని స్థానికేతరులగా పరిగణించి 15 శాతం సీట్లు కేటాయిస్తారు. గత నెల 23న జాతీయ ర్యాంకులు విడుదల చేశారు. ముందుగా జాతీయ స్థాయిలో మెడికల్‌ సీట్లు భర్తీ చేసిన తర్వాత రాష్ట్రాల్లో సీట్లు భర్తీ చేయాల్సి ఉండటంతో, స్టేట్‌ ర్యాంకుల ప్రకటనకు కొద్ది రోజులు వేచి చూడాల్సి వచ్చింది. 
గతంలో ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా సీట్లు భర్తీ 
సీబీఎస్‌ఈ నిబంధనల మేరకు రాష్ట్రంలో మెడికల్ సీట్ల భర్తీకి షెడ్యూల్  తయారుచేస్తున్నట్టు హెల్త్‌ యూనివర్శిటీ వీసి కరుణాకర్ రెడ్డి తెలిపారు. మరోవైపు ప్రతి యేడాది ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్ల భర్తీ జరిగేది కాబట్టి జేఎన్‌టీయూ ఈ సీట్ల భర్తీ చేపట్టేవారు. కాని ఈసారి పరీక్ష  సీబీఎస్‌ఈ నిర్వహించడంతో భారత వైద్యమండలి నిబంధనల  ప్రకారం మెడికల్ సీట్ల భర్తీకి ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది.  
నీట్‌ ఫలితాల ప్రకటనలో జాప్యంతో కౌన్సెలింగ్‌ ఆలస్యం 
ఎంసీఐ నిబంధనల మేరకు ఆగస్టు 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవ్వాల్సి వుండగా నీట్ ఫలితాల ప్రకటనలో జాప్యం జరగడంతో  రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విద్యార్థులు ఆన్‌లైన్లో  దరఖాస్తులు చేసుకునేందుకు పది రోజులు సమయం ఇస్తారు. కౌన్సెలింగ్‌ పూర్తైన తర్వాత వారం రోజుల్లో విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభిస్తారు. ఆ వెనువెంటనే వెబ్‌ ఆప్షన్ల ఎంపిక మొదలుపెట్టి  మెరిట్ లిస్ట్ విడుదల చేసి సీట్ల కేటాయిస్తారు.  భారత వైద్య మండలని నిబంధనల మేరకు వీలైనంత వరకు  వచ్చే నెల రెండో వారంలోగా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి తరగతులు  ప్రారంభించేందుకు  ప్రారంభించాలని యూనివర్శిటీ చర్యలు చేపట్టింది.  
గతేడాది మెడికల్‌ సీట్లు 3,750
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ సీట్లను పరిశీలిస్తే, గతేడాది మొత్తం 3,750 సీట్లు ఉన్నాయి. కానీ ఈ ఏడాదికి మహావీర్, ఆర్‌వీఎం నాలుగైదు మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 500 సీట్లు తగ్గిపోయాయి. దీంతో మొత్తం ప్రైవేటు, మైనార్టీ, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో  కలిపి 3,250 సీట్లు వున్నాయి. వీటిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 1050 సీట్లు కాగా.. మైనార్టీ మెడికల్ కాలేజీల్లో 400,  ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1800 సీట్లు అందుబాటులో ఉంటాయి.
నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులతోనే భర్తీ 
మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్లో అర్హత సాధించని విద్యార్ధులకు దేశం, రాష్ట్రంలోని ఏ కాలేజీలో కూడా మెడికల్ సీటు లభించే అవకాశం లేదు. గతేడాది వరకు ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్లు భర్తీ చేసేవారు. దీంతో క్వాలిఫై అవ్వని విద్యార్ధులు కోట్లు పెట్టి మెడికల్ సీటు కొనుక్కుని అవకాశం వుండేది. కానీ ఈసారి ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. ఏ సీటైనా తప్పనిసరిగా నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులతోనే భర్తీ చేయాల్సి వుంటుంది. 

 

16:12 - July 4, 2017

విజయవాడ : టీడీపీలో ప్రక్షాళన మొదలైందా...  గ్రూపు రాజకీయలతో  మంటపుట్టిస్తున్న నేతలకు చంద్రబాబు చెక్‌ పెట్టనున్నారా.. ముఖ్యంగా పార్టీలో కిలకమైన ప్రోగ్రామింగ్‌ కమిటీలో కూడా మార్పులు చేయనున్నారా.. అంటే టీడీపీ టాప్‌ నాయకులు అవుననే అంటున్నారు. 
టీడీపీలో పెరిగిన అసంతృప్తులు 
క్రమశిక్షణకు   మారుగా చెప్పుకునే టీడీపీలో  ఇటీవల  అసంతృప్తులు బయటపడుతున్నాయి. పార్టీ గీత దాటి, నాయకులు రోడ్డెక్కుతున్న విషయం ఓ వైపు..   కేసుల్లో చిక్కుకుంటున్న నేతలు మరోవైపు .. ఈ పరిణామాలు పార్టీకి చేటు తెస్తున్నాయని భావిస్తున్న అధినేత చంద్రబాబు పార్టీ ప్రక్షాళనకు 
సిద్ధమైనట్టు తెలుస్తోంది. 
ప్రోగ్రామింగ్‌ కమిటీ ప్రక్షాళనకు బాబు రెడీ ..!
పార్టీలో అతి కీలకమైన ప్రోగ్రామింగ్ కమిటితోపాటు పార్టీ  జిల్లా ఇంచార్జ్ లుగా ఉన్న జ‌న‌ర‌ల్ సెక్రట‌రీల ప‌నితీరుపై బాబుఅంత   అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రోగ్రామింగ్‌ కమిటీలో నుంచి  ఒక‌రిద్దరిని త‌ప్పించాల‌ని అది నేత భావిస్తున్నట్లు స‌మాచారం. అటు ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న పార్టీ అనుబంద విభాగాల్లో నియామకాలు కూడా చేపట్టడానికి చంద్రబాబు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. పార్టీ కమిటీల్లో ఈసారి అందరూ కొత్తవారికే ఛాన్స్‌ ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
పార్టీలో గాడి తప్పిన క్రమశిక్షణ 
పార్టీలో దారితప్పుతున్న క్రమశిక్షణను  గాడిలో పెట్టేందుకు అధినేత చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్దమైనట్టు టీడీపీ నేతలు అంటున్నారు. అయితే పాతవారిని మార్చి కొత్తవారిని తీసుకు రావడం తప్ప.. పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై బాబు దృష్టిపెట్టడం లేదని టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 

 

16:04 - July 4, 2017

కృష్ణా : విజయవాడలోని బుడమేరు వంతెన వద్ద.. అల్లూరి సీతరామరాజు 120వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం నివాళులర్పించారు. బ్రిటీష్‌ వాళ్లని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. ఆయన కేవలం 27 ఏళ్లు మాత్రమే బతికారని.. కానీ జనాల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. 

 

15:59 - July 4, 2017

సంగారెడ్డి : కలెక్టరేట్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సదాశివపేట మండలం సిద్దాపూర్‌లో 5 వేల 500 మంది నిరుపేదలకు కాంగ్రెస్‌ హయాంలో కేటాయించిన ఇళ్ల స్థలాలను చూపించాలని కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

15:52 - July 4, 2017

హైదరాబాద్ : ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సీఎం కేసీఆర్‌ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఎన్నో ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎంతో ప్రాధాన్యతిస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక తనకు మద్దతిచ్చిన టీఆర్‌ఎస్‌కు రామ్‌నాథ్‌ కోవింద్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

 

కేయూ డిగ్రీ రీవాల్యుయేషన్ లో విడ్డూరం

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ రీవాల్యుయేషన్ లో విడ్డూరం చోటుచేసుకుంది. రీవాల్యుయేషన్ లో 100కు 105 మార్కులు వేశారు. 

14:11 - July 4, 2017
14:09 - July 4, 2017
14:07 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రజా, సామాజిక ఉద్యమాల్లో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. టీ మాస్ ఫోరం ఆవిర్భావ సదస్సు జరిగింది. ఈ సదస్సులో 200 కుల సంఘాలకు పైగా పాల్గొన్నాయి. ఈ సదస్సులో పాల్గొన్న విమలక్క పలు సూచనలు చేశారు. కొన్ని అంశాలను దృష్టికి తీసుకొస్తానని..కుల వ్యవస్థ రద్దుతో సామాజిక న్యాయం దక్కుతుందని చాలా మందికి అభిప్రాయం ఉందని తెలిపారు. తెలంగాణ సకల జనుల పోరాటం..కమిటీ ఉంటే బాగుంటుందని తన అభిప్రాయమన్నారు. అభ్యుదయ వాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు తమకు శోషిత జనసేనగా సంఘటిత పడుతూ..ఊరురా..వాడాలా శాఖలుగా ఏర్పడి రోజు వారి తర్ఫీదులిచ్చి ప్రజలకు అండగా ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:59 - July 4, 2017

హైదరాబాద్ : సమాజంలో పెనుమార్పులకు దారి తీస్తుందని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌ స్పష్టం చేశారు. వనస్థలిపురంలో టీ మాస్ ఆవిర్భావ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. టీ మాస్ కు తమ పూర్తి మద్దతు తెలియచేస్తున్నట్లు, సామాజిక విప్లవానికి నాంది పలుకబోతున్నట్లు తెలిపారు. ఆలోచనల్లో మార్పు రావాలని..సామాజిక విప్లవానికి..సామాజిక సమానత్వానికి టీ మాస్ నాయకత్వం వహించాలని..ఇందులో ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

13:49 - July 4, 2017

హైదరాబాద్ : సామాజిక న్యాయమే లక్ష్యమని, సామాజిక న్యాయం కోసమే టీ మాస్ ఏర్పడిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. వనస్థలిపురంలో టీమాస్ ఫోరం ఆవిర్భావ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల్లో..మండలాల్లో టీ.మాస్ ఏర్పడాలని..టీ మాస్ అంటే ఒంటెల్ పోసే విధంగా ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం..కన్నీళ్లు వస్తే అక్కడ టీ.మాస్ ఉండే విధంగా రూపకల్పన జరుగుతుందన్నారు. తాము పెద్దన్న పాత్ర పోషించాలనే తపన తమలో ఏమాత్రం లేదని, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కాకుండా పలు ప్రజా సంఘాల నేతగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఆయన మాటల్లోనే..

అందుకే పాదయాత్ర..
'టీ-మాస్ ఏర్పాటు వెనుక అనేక మంది పెద్దల కృషి ఉంది. 'మహాజన పాదయాత్ర' తెలంగాణ రాష్ట్రంలో 4వేల కిలో మీటర్లు..1500 గ్రామాల్లో తిరిగింది. ఇది సీపీఎం ఆధ్వర్యంలో జరిగింది. కానీ సీపీఎం విధానాలు తెలియచేయడానికి..పార్టీలో చేరిపించడానికి జరగలేదు. రాష్ట్రంలో మూడు సంవత్సరాల పాలన సందర్భంగా ప్రజల ఆశలు..ఆకాంక్షలు నెరవేరడం లేకపోవడంతో పాదయాత్ర జరిగింది. సామాజిక న్యాయం కోసం చర్చించడం..ప్రశ్నించడం..స్పందిస్తున్నారు. మిషన్ భగీరథ..ఐపాస్..విశ్వనగరం..విదేశీ పెట్టుబడులు అంటూ మొదట మాట్లాడే కేసీఆర్..మహాజన పాదయాత్ర అనంతరం గొర్రెలు..చేపలు పంపిణీ అంటూ మాట్లాడుతున్నారు.

సామాజిక న్యాయం కీలకం..
తెలంగాణ అభివృద్ధి అంటే సామాజిక న్యాయం కీలకంగా ఉంటుంది. ఒక పదవి ఇస్తే సామాజిక న్యాయం జరగదన్నారు. సమానత్వం..సాధించడం..ఒక కులం..తక్కువ..ఎక్కువ అనేది కాకుండా అన్నీ కులాలు సమానం. ఆర్థిక అసమానతలు ఉండడటానికి వీలు లేదు. రాజకీయంగా కొద్ది కులాలు మాత్రం పెత్తనం చేస్తున్నాయి. రాష్ట్రంలో సమస్త కులాలకు ప్రాతినిధ్యం వచ్చే విధంగా..అన్నీ కులాలు అర్హత సాధించే విధంగా కృషి చేయాలి. సాంస్కృతికంగా కూడా సమానత్వం సాధించాలి. గొర్రెల పథకంలో మొసలి గొర్రెలు ఇచ్చి ఇదే గొప్ప అని చెబుతున్నారు. కేసీఆర్ కు..పెట్టుబడి వర్గాలకు..వ్యతిరేకంగా పేదోడి తరపున ఒక సామాజిక ఐక్య వేదిక రాజకీయం వస్తుంది. ఇంకా ఈ చర్చ కొనసాగుతోంది. మోడీ..కేసీఆర్ దెబ్బలతో ప్రజలు అతలాకుతలమౌతున్నారు. అప్పటి వరకు నిరీక్షించకుండా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేసి సమస్యలపై పోట్లాడుదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఉమ్మడి నిర్ణయాలు..
ఉమ్మడిగా అందరూ అంగీకరించే మాటలు..నిర్ణయాలు ఈ ఫోరంలో ఉంటాయి...
1) దేశ వ్యాపితంగా దళితులు..పేదలపై మతోన్మాద ధోరణులు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీనిపై పోరాటం చేయాలి.
2) ఆర్థిక విధానాలు : ప్రభుత్వ ఆస్తులు..వనరులు కార్పొరేటర్లకు చౌకగా కట్టబెడుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య తీవ్రమౌతోంది. అంగన్ వాడీ..కార్మికులు..అనేక రంగాలు చేసిన పోరాటాలను అణిచివేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి.
3) సామాజిక న్యాయం : కుల వివక్షకు..కుల నిర్మూలన..కుల వ్వవస్థ..సబ్ ప్లాన్..తదితర అంశాలపై పోరాటం.
4) తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం వాగ్ధానాలు..వాటి అమలు తీరు..పోరాటం చేయాలని నిర్ణయం.
దీనిపై కుల సంఘాలు అభ్యంతరాలు..అభిప్రాయాలు తెలియచేయవచ్చు. స్టీరింగ్ కమిటీ పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’ అని తమ్మినేని పేర్కొన్నారు.
బతుకులు మారే బొమ్మలుగా చూడాలన్నదే సంఘం కర్తవ్యమని...ప్రజార్భాటంగా సంఘం ఏర్పడలేదని..విడివిడిగా పోరాటాలు చేస్తే శక్తి సరిపోదని..అందుకే కలిసి రావాలి అని తమ్మినేని పిలుపునిచ్చారు.
ఇంకా తమ్మినేని ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

కోవింద్ తో కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎన్నో పోరాటాల మధ్య సాధించుకోవడం జరిగిందన్నారు. విద్యుత్ లోపాలు అధిగమించి సర్ ప్లస్ లో రాష్ట్రం నిలిచిందని, తక్కువ సమయంలో దేశంలో అగ్రగామిగా నిలవడంలో కృషి చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలు..బడుగు..బలహీన వర్గాల సంక్షేమ కోసం పలు పథకాలను తీసుకరావడం జరిగిందని చెప్పుకొచ్చారు. పేదలకు అందించేందుకు డబుల్ బెడ్ రూం నివాసాలను కట్టించి అందివ్వడం జరుగుతోందన్నారు.

 

12:40 - July 4, 2017
12:35 - July 4, 2017

చిత్తూరు : తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈమె మృతిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన యవ్వన ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ ఉంటూ ఇంటర్ విద్యనభ్యసిస్తోంది. కానీ ఈమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రుయా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌కు మంత్రి గంటా ఆదేశించారు. కుటుంబ కలహాలతో యవ్వన ఆత్మహత్య చేసుకుందని వెలువడుతున్న వార్తలను ఆమె కుటుంబసభ్యులు ఖండిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

12:30 - July 4, 2017

రంగారెడ్డి : దొంగలు మళ్లీ ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీని టార్గెట్ చేశారు. మరోసారి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మైలార్ దేవులపల్లిలో ఉన్న మత్తూట్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. కత్తులు..తుపాకులతో అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ ను బెదిరించారు. కొంత ధైర్యం చేసిన లతీఫ్ అక్కడనే ఉన్న అలారాన్ని నొక్కాడు. అలారం పెద్ద శబ్ధం చేయడంతో దొంగలు కాలికి పని చెప్పారు. దొంగలు ప్రవేశించడం..పరారు కావడం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం తెలసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12:23 - July 4, 2017
12:20 - July 4, 2017

ఢిల్లీ : మీ దగ్గర రూ. 500, రూ. 1000 ఉన్నాయా ? ఇంకా ఎక్కడుంటాయి ? అని కొందరు అంటారు. కొంతమంది వద్ద మాత్రం ఇంకా రద్దయిన నగదు ఉన్నా బయటకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రద్దయిన నోట్లు కలిగి ఉంటే శిక్షింపబడుతారని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. పెద్ద నోట్లు రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. పెద్ద నోట్లు జమ చేయలేక..తమ ఖాతాలో ఉన్న డబ్బు తీసుకోలేక ఇలా చాలా కారణాలతో చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. రద్దయిన నోట్లు ఇంకా కలిగి ఉన్న వారికి సుప్రీం పెద్ద ఊరట కలుగ చేసింది.

నవంబర్ 8 అర్ధరాత్రి..
రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న అర్ధరాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం పాత నోట్లు ఉన్న వారు 2016 డిసెంబర్ 30వ తేదీ లోపున జమ చేయాలని కేంద్రం పేర్కొంది. అనంతరం పలు చర్యలు కూడా ప్రకటించింది. పాత నోట్లు ఉన్న వారికి జైలు శిక్ష కూడా విధిస్తామని కూడా హెచ్చరించింది. కానీ కేంద్రం ఇచ్చిన గడువులోపు పాతనోట్లను రద్దు జమ చేయలేకపోయారు. జమ చేయకపోవడానికి గల కారణాలు అప్పటి లోపు వారు తెలియచేయడంలో విఫలమయ్యారు. దీనితో దేశంలోని చాలా మంది వద్ద పాత నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సుప్రీంలో ప్రజాప్రయోజనం..
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపై ప్రజాప్రయోజనం దాఖలైంది. దీనిపై మంగళవారం సుప్రీం విచారణ చేపట్టింది. రద్దైన పెద్దనోట్లు జమ చేయని వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారా ? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పాతనోట్లు కలిగిన వారు జమ చేసుకోవాలని, రెండు వారాల పాటు డిపాజిట్ చేసుకోవాలని ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. కానీ నిబంధనల ప్రకారం ఎందుకు జమ చేయలేకపోయారో తెలియచేయాలని సుప్రీం సూచించింది. పూర్తి వివరాలు అఫిడవిట్ లో అందిస్తామని కేంద్రం తెలిపడంతో తదుపరి విచారణ 18కి వాయిదా వేసింది.

రాజాసింగ్ గైర్హాజర్ పై వెంకయ్య ఆగ్రహం..

హైదరాబాద్ : రాంనాథ్ కోవింద్ భేటీకి రాజా సింగ్ గైర్హాజర్ పై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్..కిషన్ రెడ్డిలకు వెంకయ్య క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ కు సమాచారం ఇచ్చారా ? లేదా ?..పార్టీలో ఏం జరుగుతుందని వెంకయ్య ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో రైతు ఆత్మహత్య..

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం శివరాజ్ చౌహాన్ స్వగ్రామంలోనే రైతు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది.

 

ముత్తూట్ ఫైనాన్స్ లో మళ్లీ చోరీ చేయబోయారు..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి యత్నం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ ను తుపాకీతో బెదిరించారు. కానీ లతీఫ్ అలారం నొక్కడంతో దొంగలు పరారయ్యారు.

11:57 - July 4, 2017

'అర్జున్ కపూర్'..’పరిణీతి చోప్రా'..వీరిద్దరూ కలిసి నటించి చాలా రోజులైంది. ఐదేళ్ల క్రితం 'ఇష్క్ జాదే'తో సినీ కెరీర్ ను వీరు ఆరంభించారు. వీరిద్దరూ మళ్లీ జతకట్టబోతున్నారు. యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించే చిత్రంలో వీరు నటించనున్నారు. ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్' టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకాభిప్రాయంతో వ్యవహరించని అబ్బాయి..అమ్మాయి మధ్య జరిగే కథ అని..అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంఘటనల సమాహారం అని చిత్ర సంస్థ పేర్కొంది. కానీ వీరిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోవడమే వైవిధ్యమని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కపూర్, పరిణితీ చోప్రాలు స్పందించారు. తాను మళ్లీ సొంతింటికి వచ్చినట్లుగా ఉందని అర్జున్ కపూర్ వెల్లడించగా దిబాకర్ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని పరిణీతి వెల్లడించారు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

11:51 - July 4, 2017

ఎప్పుడూ వివాదాల్లో నిలచే 'రాం గోపాల్ వర్మ' ‘ఎన్టీఆర్' జీవిత కథను తెరకెక్కించనున్నారా ? ఆయన దర్శకత్వంలో సినిమా రూపొందనుందా ? ప్రస్తుతం ఈ అంశంపై టాలీవుడ్ లో చర్చ జరగుతోంది. తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమా తీస్తానని ఆయన తనయుడు 'బాలకృష్ణ' ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్' పాత్ర మాత్రం తానే సులువుగా చేయగలనని కూడా పేర్కొన్నారు. కానీ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియరాలేదు. తాజాగా ఈ బయోపిక్ కు 'వర్మ' అయితే పూర్తి న్యాయం చేస్తారని భావించిన బాలయ్య ఆయనతో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరుగుతోంది. 'వర్మ' కూడా గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశారట. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక 'బాలకృష్ణ' 'పూరీ జగన్నాథ్' దర్శకత్వంలో రూపొందుతోన్న 'పైసా వసూల్‌' చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎన్టీఆర్' బయోపిక్ కు సంబంధించిన విషయాలు త్వరలో తెలియనున్నాయి.

11:43 - July 4, 2017

గుంటూరు : బజరంగ్ జూట్ మిల్లు మూతపడి రెండేళ్లు అయ్యింది. కానీ పరిశ్రమను తెరిపిస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేకపోయింది. రెండేళ్లుగా పరిశ్రమను తెరిపించాలని కార్మికులు..నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ పాలకుల చెవికి మాత్రం ఎక్కడం లేదు. గత కొన్ని రోజులుగా కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిశ్రమ మూతపడి రెండేళ్లయినా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల కార్మికులు మళ్లీ పోరాట బాట పట్టారు. పరిశ్రమ ఎదుట రిలే నిరహార దీక్షకు పూనుకున్నారు. కార్మికులకు మద్దతుగా నేతలు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణ్ రావు టెన్ టివితో మాట్లాడారు. లాకౌట్ ప్రకటించి రెండేళ్లు అయ్యిందని, ప్రభుత్వం అనేక హామీలిచ్చిందని..స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు హామీనిచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ హామీలు ఇంతవరకు నెరవేరలేదని, పెట్టుబడులు తెస్తామని బాబు పేర్కొంటున్నారని కానీ మూతబడిన పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ చేశారు. మిల్లును నమ్ముకుని ఎంతో మంది పనిచేస్తున్నారని, మిల్లు మూతపడడంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారని మరొక నేత తెలిపారు. కార్మికులు లేదని ఒకసారి..నష్టాల్లో ఉందని మరొకసారి చెబుతున్నారని, ఈ విషయంలో తాము ప్రభుత్వానికి వాస్తవ విషయాలు తెలియచేయడం జరిగిందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:19 - July 4, 2017
11:10 - July 4, 2017

హైదరాబాద్ : ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ హైదరాబాద్ కు చేరుకున్నారు. చేరుకోవడంతోనే ఆయన షెడ్యూల్ బిజీ బిజీగా ప్రారంభమైంది. రామ్ నాథ్ కు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్..కిషన్..ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కోవింద్ పార్క్ హయత్ కు చేరుకున్నారు. అక్కడ హరితప్లాజా వద్ద బీజేపీ, టీడీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ జరిపారు. భేటీ ముగిసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో టెన్ టివి ముచ్చటించింది. మర్యాదపూర్వకంగా కోవింద్ అందర్నీ కలవడం జరిగిందని, బీజేపీ, టీడీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారని తెలిపారు. అనంతరం వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేలతో కోవింద్ భేటీ అవుతారని తెలిపారు. దళిత మేధావి..రాజ్యాంగ కోవిదుడు..అనేక సేవలందించారని కొనియాడారు. పోటీ సరళి ఎలా ఉంటుందో తెలియచేయడం జరిగిందన్నారు. వామపక్షాల వత్తిడి మేరకు మీరా కుమార్ ను కాంగ్రెస్ బరిలోకి దింపిందని, కానీ ఎన్డీయే అభ్యర్థికి పలువురు మద్దతు తెలియచేస్తున్నారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:03 - July 4, 2017

హిందూ ప్రజల బంధువు శ్రీ నందమూరి బాలి కాకయ్యది ఒక వీడియో బయటకొచ్చిందుల్లో. కాకయ్యకు ఎంత బలుపు ఉంటది..ఎంత మస్తీ ఉంటది..ఆయన ఏషాలు ఎట్లుంటయి..అన్ని వేరియేషన్ లో ఒక్కటే వీడియోలో చూపెట్టిండు. ఏ పుణ్యాత్ముడు తీసిండో ఆ వీడియో గాని మొత్తం మీద 'మల్లన్న ముచ్చట్లు' దాక చేరింది. ఇక్కడ దాక వస్తే మీ దాక వచ్చినట్లే గదా..మరి బాలయ్య ఏమి చేసిండో..తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

బీజేపీ ప్రతినిధులతో కోవింద్ భేటీ..

హైదరాబాద్ : హరితప్లాజాలో బీజేపీ ప్రతినిధులతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్ లు హాజరయ్యారు.

గాంధీలో నిలిచిన ఆరోగ్య శ్రీ..ఓపీ సేవలు..

సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య శ్రీ, ఓపీ సేవలు నిలిచిపోయాయి. మూకుమ్మడిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సెలవులు పెట్టారు. పెంచిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

10:54 - July 4, 2017

నాగర్ కర్నూలు : తెల్కపల్లి (మం) అనంతసాగర్ వద్ద ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహేష్., పరమేష్, నరేష్ లు హైదరాబాద్ లోని అగ్రికల్చర్ విశ్వ విద్యాలయంలో కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు మంగళవారం బయలుదేరారు. బైక్ పార్కు చేసి బస్సులో వెళ్లడానికి ముగ్గురు రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో శ్రీశైలం నుండి మహారాష్ట్రకు వెళుతున్న తుఫాన్ వాహనం వీరిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడనే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

10:14 - July 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిర్భవిస్తోంది. తెలంగాణ ప్రజా, సామాజిక ఉద్యమాల్లో కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. నేడు టీ మాస్ ఫోరం ఆవిర్భావ సదస్సు జరగనుంది. ఉదయం 10గంటలకు వనస్థలిపురం ఎంఈ గార్డెన్స్ ఇందుకు వేదిక కానుంది. 200లకు పైగా సంఘాలు టీ-మాస్ ఫోరం సదస్సులో పాల్గొననున్నాయి. వివిధ ప్రజా సంఘాలు..సంస్థలు ఒకే వేదిక మీదకు వస్తుండడం విశేషం. ఈ సదస్సులో తమ్మినేని, గద్దర్, విమలక్క, చంద్రకుమార్, కంచె ఐలయ్య, పీఎల్ విశ్వేశ్వరరావు, పలువురు ప్రొఫెసర్లు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. తెలగాణ ప్రజల ఆకాంక్షలు..సామాజిక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకై టీ మాస్ ఫోరం ఆవిర్భావించిందని నేతలు పేర్కొన్నారు.

10:09 - July 4, 2017

హైదరాబాద్ : ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నగరానికి చేరుకొన్నారు. ఉదయం 9.30గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకొన్న కోవంద్ కు టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జలవిహార్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కోవింద్ హాజరు కానున్నారు. ప్రస్తుతం కోవింద్ హరిత హోటల్ కు చేరుకున్నారు. అక్కడ బీజేపీ, టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. తనకు ఓటు వేయాలని అభ్యర్థించనున్నారు. మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలతో తెలియడంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

గరగపర్రులో కొప్పుల రాజు పర్యటన..

పశ్చిమగోదావరి : గరగపర్రులో కాంగ్రెస్ ఆలిండియా ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఏపీసీసీ చీఫ్ రఘువీరా, జేడీ శీలం, పనబాక లక్ష్మీ, కనుమూరి బాపిరాజు, శైలజానాథ్ తదితరులున్నారు.

09:40 - July 4, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో కాంగ్రెస్ ఆలిండియా ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని దళితులను సాంఘీకంగా బహిష్కరించిన విషయాన్ని టెన్ టివి ప్రపంచానికి తెలియచేసిన సంగతి తెలిసిందే. దీనిపై దళిత సంఘాలు..నేతలు దీనిని ఖండించారు. తారాస్థాయిలో ఉద్యమం తెరలేచింది. ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతల గరగపర్రుకు వెళ్లి బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించి విషయాలు తెలుసుకుంటున్నారు. మంగళవారం కొప్పుల రాజు..ఏపీసీసీ చీఫ్ రఘువీరా, జేడీ శీలం, పనబాక లక్ష్మీ, కనుమూరి బాపిరాజు, శైలజానాథ్ తదితరులు పర్యటించారు. దళితుల వెలిపై గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి గ్రాంట్స్ కూడా రావడం లేదని, వీరిని అసలు పట్టించుకోవడం లేదని కొప్పుల రాజు విమర్శించారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన పలువురు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరగనుంది.

09:34 - July 4, 2017

చిత్తూరు : హెరిటేజ్ వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు..ఏంటీ హెరిటేజ్ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన సంస్థ కదా..అందులో ఎలా సరఫరా చేస్తారు ? అనేగా మీ అనుమానం. కానీ హెరిటేజ్ పాలకు చెందిన వ్యాన్ లో ఎర్రచందనం దుంగలు సరఫరాకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెక్ పెట్టారు. కానీ హెరిటేజ్ సంస్థకు చెందని వ్యాన్ నేనా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

శేషాచలం అటవీ ప్రాంతంలో...
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు ఎన్ని అడ్డుకట్టలు వేస్తున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వడం లాంటి పలు ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. సత్యనారాయణపురం బీడీ కాలనీ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 50 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. దీనితో స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రతిగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. వెంటనే అక్కడి నుండి స్మగ్లర్లు పరారయ్యారు. 71 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కానీ హెరిటేజ్ పాల వ్యాన్ లో వీటిని తరలిస్తుండడం విశేషం. పరారైన స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. 20 రోజుల్లో 140 మందికి పైగా కెల్విన్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. వాట్సప్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేసి విద్యార్థుల ద్వారా కెల్విన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్ కాల్ లిస్టు ఆధారంగా మరికొంత మంది వీఐపీలను ఎన్ ఫోర్స్ మెంట్ గుర్తించారు. నగరంలోని 4 ఇంటర్నేషనల్ స్కూళ్లు, 8 ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిర్మాతలను ఎన్ ఫోర్స్ మెంట్ విచారించింది. మరికొంత మంది సినీ ప్రముఖులను, వీఐపీలను ఎన్ ఫోర్స్ మెంట్ విచారించనుంది.

కాసేపట్లో టీ మాస్ ఫోరం సదస్సు..

హైదరాబాద్ : తెలంగాణ ప్రజా, సామాజిక ఉద్యమాల్లో మరో కొత్త మలుపు చోటు చేసుకోబోతోంది. నేడు టీ మాస్ ఫోరం ఆవిర్భావ సదస్సు జరగనుంది. ఉదయం 10గంటలకు వనస్థలిపురం ఎంఈ గార్డెన్స్ లో సదస్సు జరగనుంది. 200లకు పైగా సంఘాలతో జరిగే టీ-మాస్ ఫోరం సదస్సులో గద్దర్..విమలక్క..జస్టిస్ చంద్రకుమార్..కంచె ఐలయ్య..పీఎల్ విశ్వేశ్వరరావు..పలువురు ప్రోఫెసర్లు పాల్గొననున్నారు.

అనంత సాగర్ వద్ద రోడ్డు ప్రమాదం..

నాగర్ కర్నూలు : తెల్కపల్లి (మం) అనంతసాగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్లూసర్ - బైక్ ఢీ కొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ కోసం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

రాళ్లు రువ్విన స్మగ్లర్లు..

తిరుపతి : సత్యనారాయణపురం బీడీ కాలనీ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 50 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తారసపడ్డారు. దీనితో స్మగ్లర్లు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రతిగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. స్మగ్లర్లు పరారయ్యారు. 71 ఎర్రచందనం దుంగలు..ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

కొనసాగుతున్న ఉగ్రవాదుల ఏరివేత..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి.

09:25 - July 4, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. నిర్మాత దగ్గరి నుండి ఇంటర్నేషనల్ విద్యార్థుల కాల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో నిర్మాతలు..విద్యార్థులున్నట్లు గుర్తించారు. 9వ తరగతి విద్యార్థిని ఛాటింగ్ చేసిన విధానం చూసిన పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో ఇద్దరు నిర్మాతల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ కేసులో ఉన్న వారి పేర్లను వెల్లడించడానికి ఎక్సైజ్ అధికారులు నిరాకరిస్తున్నారు.
20 రోజుల్లో 140 మందికి పైగా కెల్విన్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. వాట్సప్ గ్రూప్ ద్వారా ఏర్పాటు చేసి విద్యార్థుల ద్వారా కెల్విన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్ కాల్ లిస్టు ఆధారంగా మరికొంత మంది వీఐపీలను ఎన్ ఫోర్స్ మెంట్ గుర్తించారు. నగరంలోని 4 ఇంటర్నేషనల్ స్కూళ్లు, 8 ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిర్మాతలను ఎన్ ఫోర్స్ మెంట్ విచారించింది. మరికొంత మంది సినీ ప్రముఖులను, వీఐపీలను ఎన్ ఫోర్స్ మెంట్ విచారించనుంది. డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎంఎన్ సీఈ కంపెనీ ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం.

08:23 - July 4, 2017

రాష్ట్రపతి అభ్యర్థులు మీరా కుమార్..రాంనాథ్ కోవింద్ లు నగరంలో పర్యటించనున్నారు. సోమవారం మీరా కుమార్ నగరానికి రాగా..మంగళవారం కోవింద్ నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో వారు మద్దతు కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించడం జరిగిందని, కానీ ఆయన స్పందించలేదని మీరా కుమార్ పేర్కొన్నారు. మరోవైపు నగరంలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నాగేందర్ గౌడ్ (టీఆర్ఎస్), దిలీప్ బైరా (సామాజిక విశ్లేషకులు), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

08:19 - July 4, 2017

అనంతపురం : జిల్లాలో ఘోరం జరిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన గృహిణి..కూతుళ్లు ఇద్దరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఘటన జరిగిన అనంతరం భర్త పరారీలో ఉండడంతో అతనిపైనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి భార్య సులోచన, ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, ప్రసన్నలతో తాడిపత్రిలోని కృష్ణాపురంలోని మూడో రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఇటీవలే ఇక్కడకు రావడంతో వీరి గురించి స్థానికులకు పూర్తి సమాచారం లేదు. మంగళవారం ఇంటికి వచ్చిన పని మనిషి సులోచన..ప్రత్యూష..ప్రసన్నలు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించింది. వెంటనే ఈ విషయాన్ని స్థానికులకు..పోలీసులకు సమాచారం అందించింది. భర్త రామసుబ్బారెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

08:13 - July 4, 2017

కోవింద్ కు స్వాగతం పలుకనున్న కేసీఆర్..

హైదరాబాద్ : నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నగరానికి రానున్నారు. ఉదయం 9.30గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న కోవంద్ కు సీఎం కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జలవిహార్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కోవింద్ హాజరు కానున్నారు.

7న చలో విజయవాడ...

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న దాదాపు 26వేల మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు. వేతనాలు పెంపుదల కోసం గత మూడుళ్లుగా పోరాడుతున్న ఈ ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.

06:51 - July 4, 2017

ఆంధ్రప్రదేశ్ లో సర్వ శిక్షా అభియాన్ లో కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన పనిచేస్తున్న దాదాపు 26వేల మంది ఉద్యోగులు పోరుబాట పట్టారు. వేతనాలు పెంపుదల కోసం గత మూడుళ్లుగా పోరాడుతున్న ఈ ఉద్యోగులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ అంశంపై జనపథంలో సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బాలకాశి విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

అల్లూరి సీతారామరాజు జయంతి...

హైదరాబాద్ : భారత స్వాతంత్రయ ఉద్యమంలో బ్రిటీషు పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఈ మన్యం వీరుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న విశాఖ జిల్లాలో జన్మించారు.

06:46 - July 4, 2017

హైదరాబాద్ : భారత స్వాతంత్రయ ఉద్యమంలో బ్రిటీషు పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఈ మన్యం వీరుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమన్ని ఢీకొట్టిన విప్లవ వీరుడు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా 10 టీవీ ప్రత్యేక కథనం. అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న విశాఖ జిల్లాలో జన్మించారు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. స్థిరాదాయం లేక, పేదరికం వలన రాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. స్థిరంగా ఒకచోట ఉండలేక వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. పినతండ్రి రామకృష్ణంరాజు ఆర్థికంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. తండ్రి పాలనలేమి రాజు చదువుపై కూడా ప్రభావం చూపింది. ఆ కాలంలో ఆ కుటుంబ జీవన ప్రయాణం అలా సాగింది.

గిరిజనుల జీవన విధానాన్ని..
సీతారామరాజు 1909లో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరంతోపాటు, రామచంద్రాపురం, కాకినాడలో విద్యాభ్యాసం చేశారు. మిషన్ హైస్కూలులో చదివే రోజుల్లో కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవాడు. చదువు మందగించి, ఆ సంవత్సరం పరీక్ష తప్పాడు. ఆతర్వాత నర్సాపురం దగ్గరి చించినాడ గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది. ఆ కాలంలోనే చుట్టుపక్కలగల కొండలు, అడవులలో తిరుగుతూ, గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు సీతారామరాజు. ధారకొండ, కృష్ణదేవు పేట మొదలైన ప్రాంతాలు సమయంలో చూశారు.

దోపిడీలు..అన్యాయాలు..
ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమదోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించే వారిపై బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు పాల్పడేవారు. రక్షిత అటవీప్రాంతం పేరుతో పోడు కొరకు చెట్లను కొట్టడాన్ని నిషేధించింది బ్రిటీషు ప్రభుత్వం. దీంతో గిరిజనులకు జీవనాధారం లేకుండా చేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణలో కూడా అడ్డంకులు సృష్టించింది.ప్రభుత్వం నిర్మిస్తున్న రోడ్ల కాంట్రాక్టర్ల వద్ద గిరిజనులు రోజు కూలీలుగా చెయ్యవలసి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రభుత్వాధికారులకు లంచాలు తినిపించి, ఆ కూలీ కూడా సరిగా ఇచ్చేవారు కాదు. వీటన్నింటికీ వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి అల్లూరి సీతారామరాజు పోరాడారు.

1922..
1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. ఆ తర్వాత మన్యంలోని చింతపల్లి, రంపచోడవరం, కృష్ణదేవిపేట, రావొమ్మంగి, అడ్డగీతల, నర్సీపట్నం, అన్నవరం వంటి పలు ప్రాంతాల్లో విప్లవోద్యమాలు కొనసాగించారు. చివరకు 1924 మే 7న బ్రిటీషు సేనలకు అల్లూరి సీతారామరాజు పట్టుబడటంతో కాల్చి చంపారు. మే 8న అలూరి మృతదేహం ఫోటోలను బ్రిటీషు పాలకులు విడుదల చేశారు. దేశమాత స్వేచ్ఛ కోసం అసువులుబాసిన అగ్గి పిడుగు అల్లూరి అమరజీవి. సీతారామరాజు జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

06:42 - July 4, 2017

హైదరాబాద్ : దొరతనాన్ని, రాజరికాన్ని ఎదిరించి.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఓ అమరత్వం తిరగబడే పిడికిలైంది. ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఆ విప్లవానికి ఓ మనిషి చేసిన త్యాగం ప్రశ్నించే గొంతుకైంది. భూమి కోసం భుక్తి కోసం ..పేద ప్రజల విముక్తి కోసం ఓ సామాన్యుడు సమరం సాగించాడు. అతను మరెవరో కాదు రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట తొలివీరుడు దొడ్డి కొమరయ్య 71వ వర్థంతి. తెలంగాణ చరిత్రలో తొలి విప్లవ వీరుడు.. నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు.. దొరల పాలనకు అంతం పలికిన తెలంగాణ సమర యోధుడు దొడ్డి కొమరయ్య. ఆయన 71వ వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకం నివాళి అర్పిస్తోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం..దొరతనాన్ని.. రాజరికాన్ని మట్టుబెపెట్టిన ఆయన... ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఆ విప్లవానికి నాయకుడైయ్యాడు.

1940వ దశకం..
అది 1940వ దశకం...గడీలను కేంద్రంగా చేసుకుని తెలంగాణ పల్లెల్లో దొరల దురాగతాలు కొనసాగుతున్న రోజులవి. వెట్టిచాకిరి చేయని వారిని నిర్బంధించి పైశాచికంగా దాడులు చేయడమే కాదు.. క్రూరంగా హతమార్చారు. మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని రాక్షస రాజ్యం పల్లెల్లో రాజ్యమేల్లింది. భూస్వాములు చేసిన ఆగడాలకు నిజాం ప్రభువు మద్దతు ఉండటంతో.. వారి దురాగతాలకు అంతే లేకుండా పోయింది. ఇదే సమయంలో తెలంగాణలో సంఘం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 'భూమి కోసం... భుక్తి కోసం... వెట్టి చాకిరీ విముక్తి కోసం' అనే నినాదంతో కదం తొక్కింది. ఊరురా సంఘాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తున్న సంఘం కార్యక్రమాల పట్ల దొరల గుండెల్లో గుబులు మొదలైంది. సంఘం కార్యకర్తలను కిరాతకంగా హింసించారు. అక్రమ కేసులు బనాయించారు. అయినా నెరవకుండా కార్యకర్తలు తిరగబడటంతో.. ప్రజల్లో నమ్మకం పెరిగి సంఘం పట్ల ఆకర్షితులు కావడంతో దొరలు హడలెత్తిపోయారు.

స్వగ్రామం వరంగల్..
దొడ్డి కొమరయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామం. నిజాం పాలనలో కడివెండి నల్లగొండ జిల్లాలో ఉంది. భూస్వాముల క్రూరత్వంలో వెట్టిచాకిరీలో నలిగింది. ఈ ఒక్క ఊరే కాదు సంస్థానంలోని ప్రతీ పల్లెలోనూ నిర్బంధమే. పండే పంట మీద హక్కు లేదు..పీల్చే గాలి మీద హక్కు లేదు..పటేల్, పట్వారీ దొరల రాజ్యంలో ఇలాంటి దారుణాలు చూసి గుండెలు మండిన దొడ్డి కొమరయ్య రజాకార్లకు వ్యతిరేకంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి పోరాడారు.

కడుపులో తూటాలు..
విసునూర్ దొర రాపాక రాంచంద్రారెడ్డి కర్కోటకుడు..40 వేల ఎకరాలకు ఆసామి. నిజాం జాగీర్దార్లో ప్రముఖుడిగా పేరుగాంచాడు. కడవెండి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని విసునూరు దేశముఖ్ తల్లి జానకమ్మ దొరసాని 12 గ్రామాల్లో వ్యవసాయం చేయించేది. 1946 జూలై 4న సంఘం ఆధ్వర్యంలో వెట్టి చాకిరి, పంటదోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపు మొదలైంది. దొరసాని పథకం ప్రకారం.. కిరాయి మూకలు గడీలో మాటువేశాయి. గడీని ర్యాలీ సమీపించగానే ఒక్కసారిగా బర్మార్లతో దాడికి తెగబడ్డారు. ఊరేగింపు ముందు వరుసలో నడుస్తున్న దొడ్డి కొమరయ్య కడుపులో తూటా దిగడంతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య సహా పలువులు గాయపడ్డారు.

కొమరయ్య అమరత్వంతో ఉద్యమం...
కొమరయ్య అమరత్వంతో ఉద్యమం... సాయుధ సమరంగా మారింది. పటేల్, పట్వారీ, భూస్వామ్య వ్యవస్థను కూల్చే మహా విప్లవం అయింది. బాంచన్ దొర కాల్మొక్త అన్న మనుషులతోనే గొడ్డలి పట్టిచ్చి భూస్వామ్య పునాదులను కదిలించింది. కొమరయ్య స్పూర్తితో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిందిన ఒక్కో రక్తపు బొట్టు దోపిడీ లేని స్వేచ్చా సమాజాన్ని భావితరాలకు అందించింది. నిరంకుశత్వ పాలనపై నడుంబిగించి.. వీరపోరాటం చేసిన కొమరయ్య భవిష్యత్ తరాలకు మార్గదర్శి. తెలంగాణ వీరుడు కొమరయ్య నిజంగా అమరుడు. జోహార్ కొమరయ్య.

దొడ్డి కొమరయ్య 71వ వర్థంతి..

హైదరాబాద్ : భూమి కోసం భుక్తి కోసం ..పేద ప్రజల విముక్తి కోసం ఓ సామాన్యుడు సమరం సాగించాడు. అతను మరెవరో కాదు రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట తొలివీరుడు దొడ్డి కొమరయ్య 71వ వర్థంతి.

06:37 - July 4, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కార్మికవర్గం హక్కుల సాధనకు సమరశంఖం పూరించింది. సమస్యల పరిష్కారం కోరుతూ కోరుతూ కదం తొక్కింది. కనీస వేతన చట్టాలను అమలుచేయాలంటూ పలుచోట్ల కలెక్టరేట్లను కార్మికులు ముట్టడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని కార్మిక నేతలు ధ్వజమెత్తారు. కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దిచెప్తామని హెచ్చరించారు.

ఏకమైన కార్మిక వర్గం..
సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికవర్గం ఏకమైంది. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. విజయవాడలో కార్మికులు నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా బయలుదేరిన కార్మికులు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన నాయకులను, మహిళలను రోడ్డుపై ఈడ్చుకుంటూ వ్యాన్‌లో ఎక్కించారు. సీఐటీయూ నాయకులు గఫూర్‌, బాబూరావుతోపాటు ఇతర కార్మికులను అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మచిలీపట్నంలోనూ సీఐటీయూ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.

గఫూర్ ఆగ్రహం..
హక్కుల కోసం ఉద్యమిస్తే ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గఫూర్‌ మండిపడ్డారు. కార్మిక చట్టాలను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సొమ్మును బడాబాబులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. గడువుతీరిన కార్మిక చట్టాలను సవరించని మూలంగా 50 లక్షల మంది కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబు ప్రభుత్వానికి వారే బుద్దిచెప్తారని బాబూరావు హెచ్చరించారు.

పోలీసుల అత్యుత్సాహం..
శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరిన సీఐటీయూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. జిల్లా కేంద్రంలో సీఐటీయూ నాయకులను అరెస్ట్‌ చేసి.. వారిని గృహనిర్బంధం చేశారు. విజయనగరంలో కార్మికుల కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కలెక్టర్‌ కార్యాలయం దగ్గర కార్మికుల మహాధర్నా చేపట్టగా పోలీసులు వారిపై జులుం ప్రదర్శించారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. మహిళలపై మగపోలీసులే ప్రతాపం చూపారు. లాఠీలతో గొడ్డునుబాదినట్టు బాదారు. దీంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. కనీసవేతన చట్టాలను అమలు చేయాలంటూ విశాఖ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. సమాన పనికి సమాన వేతన ఇవ్వాలంటూ విశాఖ నగరంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్మికులు విచిత్ర వేషాలతో ఆకట్టుకున్నారు. అనంతరం జీవీఎంసీ దగ్గర నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. కార్మికులపట్ల ప్రభుత్వ తీరుమారకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

భారీ ర్యాలీలు..
సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరులో కార్మికులు కదం తొక్కారు. కనీసవేతనం 18వేలు ఇవ్వాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. కాకినాడలోనూ హక్కుల సాధన కోసం కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రామిక శంఖారావం పేరుతో కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫలాంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. నెల్లూరులో కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలను పరిష్కరించాలంటూ కార్మికులు కలెక్టరేట్‌ గేట్లు తోసుకుని లోనికి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్మిక నేతలు జేసీకి వినతిపత్రం అందజేశారు. గుంటూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలు..పరిష్కరించాలి..
కార్మికులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల చట్టాలను కాలరాస్తున్నారంటూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కడపలోనూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో హక్కుల కోసం ఉద్యమించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్మికుల ధర్నాకు వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మద్దతు తెలిపారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని కార్మిక నేతలు మండిపడ్డారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల కలెక్టరేట్‌ దగ్గరా సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహాధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు. కనీసవేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

06:30 - July 4, 2017

విజయవాడ : జాతీయ,రాష్ట్ర రహదారులకు ఇరువైపు 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రోడ్లుగా డీనోటిఫై చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడనున్నాయి. అటు అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన 43 కోట్ల రూపాయలను ఈ రెండు సంస్థల బాధితుల్లో పేదలు, మధ్యతరగతి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా మద్యంపై విధానం, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు పంపిణీ చేయడంపై చర్చించారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపుల 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేబినెట్‌లో ఈ అంశంపై ప్రధానంగా చర్చించారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఎక్సైజ్‌ ఆదాయం పడిపోయి, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన కేబినెట్‌ సమావేశంలో వ్యక్తమైంది.

మహిళలతో చర్చించేందుకు...
జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని మహిళలు చేస్తున్న ఆందోళన కూడా మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో మహిళల మనోభావాలను గౌరవించాలని నిర్ణయించారు. మహిళలు వద్దన్న చోట్ల దుకాణాలుకు అనుమతి ఇవ్వరాదని ప్రతిపాదించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మద్యం దుకాణాలను దేవుళ్ల పేర్లు పెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

43 కోట్ల పంపిణీ..
అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలం వ్యవహారంపై కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ రెండు సంస్థల ఆస్తుల విక్రయం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన 43 కోట్లను బాధితులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సీఆర్‌డీఏ పరిధిలో లేఅవుట్ల ఏర్పాటు విధానాన్ని పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాకి ఐటీ కంపెనీలను ఎక్కువగా ఆకర్షించేందుకు వీలుగా డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పాలసీ 2017-2020కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

నేడు టీ- మాస్ ఫోరం సదస్సు..

హైదరాబాద్ : నేడు టీ- మాస్ ఫోరం ఆవిర్భావ సదస్సు జరగనుంది. ఉదయం 10గంటలకు వనస్థలిపురం ఎంఈ గార్డెన్స్ లో సదస్సు జరగనుంది. 200లకు పైగా సంఘాలతో జరిగే టీ-మాస్ ఫోరం సదస్సులో గద్దర్..విమలక్క..జస్టిస్ చంద్రకుమార్..కంచె ఐలయ్య..పీఎల్ విశ్వేశ్వరరావు..పలువురు ప్రోఫెసర్లు పాల్గొననున్నారు.

నగరానికి కోవింద్..

హైదరాబాద్ : నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నగరానికి రానున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జలవిహార్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి కోవింద్ హాజరు కానున్నారు.

ఇంటర్ విద్యార్థిని సూసైడ్..

చిత్తూరు : ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని యవ్వన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. యవ్వన స్వస్థలం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం.

నేడు కృష్ణా జిల్లా నేతలతో బాబు భేటీ..

విజయవాడ : నేడు ఉదయం 9.30గంటలకు కృష్ణా జిల్లా టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుడిలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.

Don't Miss