Activities calendar

05 July 2017

21:59 - July 5, 2017
21:58 - July 5, 2017

ఢిల్లీ : ఇండియా, ఇజ్రాయిల్‌ల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, స్పేస్‌, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. తృతీయ ప్రపంచ దేశాలకోసం పనిచేయాలని... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. 
ఇజ్రాయిల్ ప్రధానితో మోడీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోది చారిత్రాత్మక ఇజ్రాయిల్‌ పర్యటనలో భాగంగా రెండోరోజు ప్రధాని బెంజమిన్‌ నెతాన్యహూతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏడు కీలక ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇరుదేశాలు  ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వ్యవసాయం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, స్పేస్‌, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్నోవేష‌న్ హ‌బ్‌కు సంబంధించిన అంశాలపై రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త మీడియా ప్రకటన చేశారు. 
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు : ఇజ్రాయిల్ ప్రధాని
ఇజ్రాయ‌ల్‌, భార‌త్ సంబంధాన్ని స్వర్గంలో జ‌రిగిన పెళ్లిగా నెతన్యాహు అభివ‌ర్ణించారు. ఇజ్రాయిల్‌, భారత్‌లు కలిసి కొత్త చరిత్ర సృష్టించబోతున్నాయన్నారు. ఇరుదేశాలు కలిసి మూడో ప్రపంచ దేశాల కోసం కృషి చేయనున్నాయని, ముఖ్యంగా ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం భారత్‌తో కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. ఉగ్రవాదంపై  కలిసి పోరాడేందుకు అంగీకరించినట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని తెలిపారు.
నా పర్యటనతో నూతన అధ్యాయం : మోడీ 
తన పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య నూతన అధ్యాయం మొదలైందని ప్రధానమంత్రి నరేంద్ర మోది అన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలకే తాము పరిమితం కాలేదని... ప్రపంచ అంశాలను కూడా ప్రస్తావించామని మోది తెలిపారు. ఇజ్రాయిల్‌ ప్రజలు పరిశోధన, వాటర్‌ మేనేజ్‌మెంట్‌, వ్యవసాయ రంగంలో చాలా ముందున్నారని ప్రధాని ప్రశంసించారు. భారత్‌లో వీటికే తాను అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మోది పేర్కొన్నారు.
ఇజ్రాయిల్‌ రాష్ట్రపతితో మోది భేటి 
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోది ఇజ్రాయిల్‌ రాష్ట్రపతి రూవెన్‌ రెవ్లిన్‌తో భేటి అయ్యారు. ప్రోటోకాల్‌ను కాదని ఇజ్రాయిల్‌ రాష్ట్రపతి తనకు స్వాగతం పలకడంపై మోది కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా ఫర్‌ ఇజ్రాయిల్‌...ఇజ్రాయిల్‌ ఫర్‌ ఇండియా అంటూ మోది చమత్కరించారు.
మోషెను కలిసిన మోది
ఇజ్రాయిల్‌ పర్యటనలో ఉన్న మోది 26/11 ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో తన పేరేంట్స్‌ను కోల్పోయిన మోషెను కలుసుకున్నారు. తన గ్రాండ్‌ పేరెంట్స్‌తో కలిసి భారత్‌కు రావాలని పదేళ్ల మోషేకు ఆహ్వానించారు. తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో ఉగ్రదాడి జరిగినపుడు మోషే పేరెంట్స్‌ దగ్గర పనిమనిషిగా ఉన్న సాండ్రా సామ్యూల్‌ రెండేళ్ల చిన్నారిని కాపాడి ఇజ్రాయిల్‌లో ఉన్న గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గరకు చేర్చారు.

 

21:51 - July 5, 2017

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నకిరేకల్‌ అడ్డరోడు వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

21:49 - July 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న ఈ నామ్ మార్కెటింగ్‌పై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారని మంత్రి హరీష్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా ఈ నామ్‌ అమలు తీరుతెన్నులపై ఢిల్లీలో రాధామోహన్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హరీష్‌రావు హాజరయ్యారు. తెలంగాణలో 44 మార్కెట్లలో ఈ నామ్‌ అమలులో ఉందని.. మరో 16 మార్కెట్లకు అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 180 మార్కెట్లలో ఈ నామ్‌ విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

 

21:45 - July 5, 2017

హైదరాబాద్ : మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి  కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని రక్షించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మూడో విడత హరితహారం కార్యక్రమంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 
కరీంనగర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం  
మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అధికారులను సీఎం కేసిఆర్ ఆదేశించారు. మూడో విడత హరితహారంపై సమీక్ష నిర్వహించిన ఆయన..ఈ నెల12న కరీంనగర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.  నగరంలో తొలి రోజు 25వేల మొక్కలు..మరుసటి రోజు నుంచి 5 వేల మొక్కలు చొప్పున నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. మొక్కలు నాటే సమయానికి మసీదుల్లో సైరన్ మోగే ఏర్పాటు చేయాలని చెప్పారు. 
ఒక్కో డివిజన్‌కు బ్రిగేడియర్‌గా అధికారి లేదా ప్రజాప్రతినిధి 
కరీంనగర్‌లోని 50 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు ఒక అధికారి లేదా ప్రజాప్రతినిధి బ్రిగేడియర్‌గా వ్యవహరించాలన్నారు. అలాగే విద్యార్ధులతో గ్రీన్ బ్రిగేడ్‌లను తయారు చేయాలని సీఎం సూచించారు. ఉద్యోగులు, మహిళలతో బ్రిగేడ్‌ తయారు చేయాలన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఈ విధానం అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటడం, ట్రీ గార్డు ఏర్పాటు చేయడం..నీళ్ళు పోయడం, అందుకోసం నీటి ట్యాంకర్లు సమకూర్చుకోవడం లాంటి పనులన్నీ చేయాలన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని రక్షించడం కూడా అంతే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

 

21:41 - July 5, 2017
21:24 - July 5, 2017

మద్యం ఏరులైపారితేచాలు... ప్రజలభాగోగుల సంగతి ఎవరికి కావాలి... ఖజానా నిండితేచాలు రోడ్లపై రక్తపు చారికలు కడుతున్నా... కుటుంబాలు కూలిపోతున్నా.. ఎవరికి కావాలి... అందుకే హైవేలు కాస్త పేరు మార్చుకున్నాయి.. డినోటిఫై పేరుతో మద్యం దందాకు ప్రోత్సాహాలు కల్పిస్తోంది ఏపీ సర్కార్. హైవేలపై బార్లు, వైన్ షాపులు ఉండొద్దని.. సుప్రీంకోర్టు చెబితే అసలు హైవేలనే మాటే లేకుండా చేసింది ఏపీ సర్కార్. ప్రజల ఆరోగ్యాలు ఫణంగా పెట్టి... బొక్కాసాలు నింపే ప్రయత్న చేస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ చూద్దాం.. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి. 

20:48 - July 5, 2017

పాయింట్ల పద్ధతిన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్.. హైదరాబాద్ ల మారిన పోలీసోల్ల సెన్స్, పాత బకాయిలు పడావే ఉండంగా..  కొత్త లైన్లు కావాల్న రైతులు..ఇయ్యం, సీతాఫల్ మండిల కారాటే రాజు రౌడీయిజం...కబ్జాపెట్టనీయలేదని కండ్లు పొడగొట్టిండు, తాగినందుకు అరెస్టు జేసిన పోలీసులు.. అమ్మినందుకు తప్పేంలేదంటున్నరు, ఫోన్ దుకుణ పోన్ని కొట్టిన పోలీసోన్ని కొడుకు, వాని బలుపు, మదం, మస్తీ అంతా తీయ్యాలే, హరితహారానికి తయారైతున్న గుండ్రాలు... కరీంనగర్ జిల్లాల కేసీఆర్ టూర్ కు ఇంతజాం...ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:37 - July 5, 2017

బీజింగ్ : చైనాలోని హునాన్‌, గ్వాంగ్షీ ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో సుమారు 50 మంది మృతి చెందారు. మరో 22 మంది గల్లంతయ్యారు. హునాన్‌ ప్రాంతంలో జూన్‌ 22 నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఒక్క ప్రాంతంలోనే ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. భారీ వరదల కారణంగా అధికారులు కోటి మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 38 వేల ఇళ్లు నీట మునిగాయి. వేలాది హెక్టార్ల పంట నష్టం సంభవించింది. డోంగ్‌టింగ్‌ ఝీల్‌ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రాంతాల్లో 15 వేల మంది సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. 

 

20:33 - July 5, 2017

ఢిల్లీ : సిక్కిం సరిహద్దులోని డోంగ్‌లాంగ్‌లో నెలకొన్న పరిస్థితులపై చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చింది.  సిక్కిం సరిహద్దు నుంచి భారత సైనికులు మర్యాదగా వెనక్కి వెళ్లాలని...లేదంటే చైనా సైన్యంతో వెళ్లగొట్టాల్సి వస్తుందని గ్లోబల్ టైమ్స్‌ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత సైన్యం గౌరవప్రదంగా తమ సరిహద్దు ప్రాంతంలోకి వెళ్లిపోవాలి...లేదా తమ భూభాగం నుంచి భారత బలగాలను వెళ్లగొట్టే శక్తి సామర్థ్యాలు చైనా ఆర్మీకి ఉందని పేర్కొంది. డోంగ్‌లాంగ్‌లో భారత సైన్యం వెనక్కి వెళ్లిపోతేనే ఉద్రిక్తలు తగ్గుతాయని...లేదంటే యుద్ధానికి తమ దేశం సిద్ధమేనని గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. జైట్లీ చేసిన వ్యాఖ్యలు నిజమే. 2017 భారత్‌.. 1962 నాటి పరిస్థితులకు పూర్తిగా భిన్నంగా ఉంది.  ఇప్పుడు యుద్ధం జరిగితే 1962 కన్నా భారత్‌ ఘోరంగా నష్టపోతుందని చైనా హెచ్చరించింది.

 

20:10 - July 5, 2017
20:09 - July 5, 2017

హైదరాబాద్ : స్కెచ్ పక్కాగా ఉంటుంది....ఏ మాత్రం తేడా ఉండదు..అంతా కలిసి వెళ్తారు..కలిసి దోచేస్తారు..తేడా వచ్చినా..దోచేసినా... ప్లాన్ ప్రకారమే మాయమైపోతారు..కాని ఈ మధ్యలోనే అసలు కథ ఉంటుంది...అందరూ కలిసి ఘటనా స్థలం నుంచి పారిపోయినా వారు వెళ్లిన వాహనం మాత్రం ఎక్కడో ఒక చోట వదిలేస్తారు..దీని చుట్టే పోలీసులు తిరిగి..శోధించే సమయంలోనే ముఠా మాయమైపోతుంది.. ఇదీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై పంజా విసురుతున్న ముఠాల వ్యూహం...దీని ప్రకారంగానే పోలీసులు వారి స్కెచ్‌లో చిక్కారన్నది పచ్చినిజం...
గుజరాత్‌ నుంచి వచ్చిన ముఠా...
దేశవ్యాప్తంగా ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై పంజా విసురుతున్న కరడుగట్టిన ముఠాల్లోని కొందరే తాజాగా నగర శివార్లలో కూడా ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు...దోపిడీకి వచ్చిన తీరు..వేసిన స్కెచ్...ఆ తర్వాత మాయం కావడానికి వేసిన ప్లాన్..ఇవన్నీ గతంలో దోపిడీలు చేసిన ముఠాల తరహాలోనే ఉండడంతో పోలీసులు కూడా అదే అనుమానిస్తున్నారు...అయితే ముఠా మాట్లాడిన తీరు.. వారి బాషను బట్టి నార్త్‌ ఇండియన్స్‌గా గుర్తించారు..ఇక నిందితులు ఉపయోగించిన వాహనం నంబర్ కూడా మార్చారు.. ప్రస్తుతం ఉన్న నంబర్‌ చూస్తే వాహనం హైదరాబాద్ లోని మహ్మద్ అనే వ్యక్తికి చెందిన కారు నెంబరుగా తేలింది. కానీ నిందితులు బినామీ నెంబర్ ను టవేరా వాహనానికి ఉపయోగించి గత నెల రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. టవేరా వాహనం చాసిస్ నెంబర్ ప్రకారం గుజరాత్ వాహనంగా తేల‌డంతో వారంతా గుజరాతీయులే అయి ఉంటార‌ని పోలీసులు నిర్ధర‌ణ‌కు వ‌చ్చారు...
పోలీసుల ప్రయత్నం విఫలం ...
మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. దోపిడీ కోసం నిందితులు ఉపయోగించిన వాహనాన్ని ఉప్పర్ పల్లిలోని హ్యాపీహోమ్ అపార్ట్ మెంట్ లో గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని తెల్లవార్లూ సోదాలు చేసినా చివరకు ఎలాంటి క్లూ దొరకలేదు...అనుమానితులుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది...నిందితుల వద్ద తుపాకులు ఉండడంతో ముందుగానే పోలీసులు సుశిక్షితులైన ఆక్టోపస్ దళాలు హ్యాపీహోమ్స్ కు రప్పించి చేసిన సోదాలు ఫలించలేదు...
విచారణ కొనసాగిస్తున్న పోలీసులు..
హ్యాపీహోమ్స్ లో 9 బ్లాకుల్లో సుమారు 700 ప్లాట్ లు ఉన్నాయి. వీటిలో 3వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఈ హ్యాపీ హోమ్ అపార్ట్ మెంట్లోని ఫ్లాట్లలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు...దుండగులు నేరుగా అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపి ఉంచి పారిపోయారంటే... ఈ ప్రాంతంపై వీరికి అవగాహన ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హ్యాపీ హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. దుండగులు ఉపయోగించిన వాహనం కూడా గుజరాత్ దే కావడంతో పాటు ఇక్కడే వదిలిపెట్టడంతో వారికి సంబందించినవారో..లేక వారికి కొంతకాలంగా షెల్టర్ ఇచ్చినవారో ఉండొచ్చని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు...
పోలీసుల కాన్‌సన్‌ట్రేషన్ డైవర్ట్ 
ఇప్పటివరకు అమాయకుల దృష్టి మరల్చి దోచుకునే గ్యాంగ్‌లను చూశాం...కాని ముత్తూట్‌ ఫైనాన్స్‌పై పంజా విసిరేందుకు ప్లాన్ చేసుకున్న ముఠా పోలీసుల కాన్‌సన్‌ట్రేషన్ డైవర్ట్ చేయడంలో సక్సెస్‌ అయిందనే చెప్పాలి...వారు వచ్చిన వాహనం సీసీ ఫుటేజీలో దొరుకుతుందని ముందే గమనించిన ముఠా వారు తప్పించుకునేందుకు టవేరాను వదిలేసి వెళ్లిపోయారు...నాడు రాంచంద్రపురంలో దోపిడీ చేసిన ముఠా బ్లాక్‌ స్కార్పియో వదిలి పారిపోయినట్లే...నేడు టవేరాను వదిలేసి మాయమైంది ముఠా...
ముఠా వేసిన స్కెచ్‌లో పడ్డ పోలీసులు 
ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ దోపిడీకి పక్కా ప్లాన్ వేయడంలో సఫలమైన గ్యాంగ్...దోచుకోవడంలో విఫలమయింది..అయితే దోచుకున్నా...దోచుకోపోయినా...తప్పించుకునేందుకు కూడా ముందే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ముఠా మాత్రం సక్సెస్‌ఫుల్‌గా మాయమైంది... అందులో ప్రధానంగా పోలీసుల దృష్టి మరల్చడంలో సఫలమైన ముఠా పక్కాగా పారిపోయింది..ఇందులో ముఠా వేసిన స్కెచ్‌లో పడ్డ పోలీసులు ఇప్పుడు నేరగాళ్ల కోసం ఎన్నో రకాల ప్రయాస పడుతున్నారన్నది వాస్తవం....
పక్కా ప్లాన్‌తోనే పారిపోతారు..
ఇదీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై పంజా విసురుతున్న ముఠాల ప్లాన్... నార్త్‌ ఇండియన్స్‌గా అనుమానిస్తున్నవారంతా ఎక్కడో ప్లాన్ చేస్తారు..ఆ తర్వాత అనుకున్నట్లుగానే నగరానికి చేరతారు..ఇక శివార్లలోని ఓ సంస్థను టార్గెట్ చేసుకుని వారి కార్యకలాపాలపై దృష్టి పెడతారు...ఇలా ఆ సంస్థలో భారీగా బంగారం దొరుకుతుందని ఆలోచనవస్తే చాలు దానిపై రెక్కీ నిర్వహిస్తారు...ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో మారణాయుధాలు..తుపాకులతో రంగంలోకి దిగుతారు..ఇలా దోపిడీ చేసినా..చేయకున్నా ముందుగా అనుకున్నట్లుగానే మాయమైపోవడంలో కూడా పర్‌ఫెక్ట్‌ ప్లాన్ ఉంటుందని తేలింది...
నాడు స్కార్పియో...నేడు టవేరా...
దేశవ్యాప్తంగా పలు చోట్ల ముత్తూట్‌ ఫైనాన్స్‌ల్లో దోపిడీలు చేసిన అనుభవం కలిగిన ముఠాలే నేడు కూడా పంజా విసిరిందని ఘటన తీరు చూస్తే చెప్పకనే చెబుతుంది..నార్త్‌ ఇండియన్స్‌గా అనుమానిస్తున్నవారే పక్కా ప్లాన్‌ వేసి దోపిడీకి ప్రయత్నించారు..ఇక పోలీసులకు దొరక్కుండా విజయవంతంగా తప్పించుకోవడం వారి వ్యూహంలో భాగమే...గతేడాది డిసెంబరు 28న ఉదయన్నే రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ చేసిన గ్యాంగ్‌ నలుపురంగు స్కార్పియోలో పారిపోయారు...భారీ ఎత్తున బంగారం దోచుకున్న గ్యాంగ్‌ కొడంగల్‌ మీదుగా 113 కిలోమీటర్ల దూరం దాటి కర్ణాటకలోని హోళికట్టకు మధ్యాహ్నం కల్లా చేరుకున్నారు...ఆ తర్వాత పోలీసులు వారి వాహనాన్ని గుర్తిస్తారని బ్లాక్‌ స్కార్పియోను అక్కడే వదిలేసి వేర్వేరుగా బంగారంతో అంతా పారిపోయిన సంగతి తెలిసిందే...సేమ్‌ టూ సేమ్‌ ఇక్కడ కూడా అదే జరిగింది..టవేరా వాహనంలో వచ్చినవారంతా మాయమై పోలీసుల దృష్టి మరల్చి వారిని ఓ ప్రాంతానికే పరిమితం చేస్తూ వాహనం వదిలేసి మాయమైపోయారు..
టవేరాలో అనేకసార్లు రెక్కీ...
మైలార్‌దేవులపల్లిలోని రోడ్డుపక్కనే ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌పై పంజా విసిరేందుకు ప్రయత్నించిన ముఠా టవేరా వాహనంలో సంచరించింది...వాహనం నంబర్‌ ప్లేటు కూడా మార్చేసింది..దీంతో పోలీసుల దృష్టి మరల్చడంతో పాటు వాహనం హ్యాపీ హోం అపార్ట్‌మెంట్ ప్రాంతంలో వదలడంతో ఇక అక్కడికే పరిమితమయ్యారు పోలీసులు..ఆ సమయంలోనే ముఠా సభ్యులంతా వేర్వేరుగా పలు ప్రాంతాల నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది..
దొరికిన ఒక్క సీసీ ఫుటేజీ
ఇప్పుడు పోలీసులకు దొరికింది ఒక్కటే సీసీ ఫుటేజీ....అందులోని ఆధారాలు..వారి ఫోటోలు...వీటిని పట్టుకుని పోలీసులు తీగలాగాలి...రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు అనుమానిస్తున్న ముఠా కోసం పోలీసులు పొరుగు రాష్ట్రాల్లోని పోలీసులకు ఆయా ఫోటోలు చేరవేయాలి...అప్పుడుగాని సమాచారం అందుకుంటే ఇందులో నేరగాళ్లను పట్టుకునే వీలుంది....ఏదీ ఏమైనా ముత్తూట్‌ లో దోపిడీకి యత్నించిన ముఠా వ్యూహంలో పోలీసులు పడిపోవడం వైఫల్యం చెందినట్లే...

 

19:54 - July 5, 2017

ప్రకాశం : ఒంగోలులో హీరోయిన్‌ కేథరిన్‌ సందడి చేసింది. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓ మొబైల్ షాపును కేథరిన్‌ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఒంగోలులో ఇలాంటి ప్రారంభోత్సవానికి పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కేథరిన్‌ అన్నారు. ఈ సందర్భంగా కేథరిన్‌ను చూడడానికి వేలాదిమంది ఎగబడ్డారు.

 

19:53 - July 5, 2017

చిత్తూరు : జయదేవ్‌ చిత్ర హీరో గంటా రవితేజ తిరుపతిలో సందడి చేశారు. బుధవారం నగరానికి వచ్చిన ఆయన జయదేవ్‌ సినిమాను ప్రదర్శిస్తున్న కృష్ణతేజ థియేటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు అక్కడ ఘన స్వాగతం పలికారు. హీరోపై పూల వర్షం కురిపించారు. తన మొదటి చిత్రం ఇంత విజయం సాధించడం మరచిపోలేని అనుభూతి అని గంటా రవితేజ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కనుమలూరి సతీష్, హరీష్, బడి సుధా యాదవ్, సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

19:50 - July 5, 2017

విజయనగరం : హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని సినీ నటి కల్యాణి ఆవేదన వ్యక్తం  చేశారు.  విజయనగరం... గాంధీపార్క్‌లోని ధ్వంసమైన ఆదిభట్ల విగ్రహాన్ని ఆమె సందర్శించారు. ఆదిభట్ల నారాయణదాసు గొప్ప వ్యక్తని.. ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేస్తే  మేధావులు... ప్రజలు ఏమి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. విగ్రహ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కల్యాణి అన్నారు.

19:44 - July 5, 2017

నిజామాబాద్ : జిల్లాలో డ్రగ్స్ స్మగ్లర్లు హల్ చల్ చేశారు. జోరుగా డ్రగ్స్ చాకెట్ల విక్రయం జరుగుతోంది. దుబ్బాక కాలనీలో డ్రగ్స్ చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ స్మగ్లర్లు హల్ చల్

నిజామాబాద్ : జిల్లాలో డ్రగ్స్ స్మగ్లర్లు హల్ చల్ చేశారు. జోరుగా డ్రగ్స్ చాకెట్ల విక్రయం జరుగుతోంది. దుబ్బాక కాలనీలో డ్రగ్స్ చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

 

19:39 - July 5, 2017
19:32 - July 5, 2017

ప్రకాశం : జిల్లాలోని చీమకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లోడుతో వస్తోన్న టిప్పర్ ... కారుని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం గర్భిణి బానూరి రమాదేవి, ఆమె బంధువులు వెలిగండ్ల మండలం నాగులవరం నుంచి కారులో బయలుదేరారు. అయితే చీమకుర్తి వద్ద ఓ టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బలంగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో  రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. నారాయణమ్మ, శాయమ్మ పరిస్థితి విషమంగా ఉంది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

19:25 - July 5, 2017

హైదరాబాద్ : జీఎస్‌టీపై ఎలాంటి అనుమానాలు లేవని .. జీఎస్‌టీపై దశాబ్దాకాలానికి పైగా చర్చలు జరిగాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జీఎస్‌టీకి అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. 18 సార్లు జీఎస్‌టీకు సంబధించిన సమావేశాలు జరిగాయని.. దానిపై అధ్యాయనం జరిగిందని పేర్కొన్నారు. 164 దేశాల్లో జీఎస్‌టీ అమల్లో ఉందన్నారు. జీఎస్‌టీ వల్ల మొదట ఇబ్బందులున్నా.. రెవెన్యూ పెరుగుతుందని చెప్పారు. 

 

19:22 - July 5, 2017

విశాఖ : జిల్లాలో ఇటీవల కాలంలో పరిశ్రమల కోసం విస్తృతంగా భూసేకరణ చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అధికారులు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. లేని తోటలను ఉన్నట్టుగా లెక్కలు చూపించి, రికార్డులు సృష్టించి బినామీలకు కోట్ల రూపాయల పరిహారం చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలో అధికారులు కూడా తమ వాటా తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడ్‌ టెక్‌ పరిశ్రమకు సేకరించిన భూమికి చెల్లించిన పరిహారంలో జరిగిన అవకతవకలపై 10 టీవీ  ప్రత్యేక కథనం...
మెడ్‌ టెక్‌ పార్కుకు గతేడాదిలో శంకుస్థాపన 
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ భూమిని కేటాయించింది. మెడ్‌ టెక్‌ పార్కుకు గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపన జరిగింది. 
మెడ్‌ టెక్‌కు 270.7 ఎకరాల భూమి కేటాయింపు
మెడ్‌ టెక్‌ వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు  భారీగా భూమి కేటాయించారు. మొత్తం 270.7 ఎకరాలు ఈ సంస్థకు ఇచ్చారు. 471, 472, 475 నుంచి 477, 480/2, 481/1 సర్వే నంబర్లలో ఉన్న భూములు కేటాయించారు.  దీనిలో ఎక్కువ భాగం ప్రభుత్వానికి చెందినదే.  కొంత మేరకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ భూములు ఉన్నాయి. ప్రైవేటు భూములు తక్కువ. అయితే మొత్తం భూమిలో 196 ఎకరాలను 172 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్టు అధికారులు నివేదికలు రూపొందించారు. మిగిలిన 75 ఎకారాల్లో ఎటువంటి సాగులేదని తేల్చారు. ఎకరానికి 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయల  వంతున మొత్తం 23.52 కోట్ల పరిహారం చెల్లించారు. అధికారులు సృష్టించిన 172 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే పట్టాలు ఉన్నాయి. మిగిలిన అందరూ బినామీలే. ఈ పరిహారం చెల్లింపు వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
పరిహారం కాజేసిన అధికారులు : ప్రజా సంఘాలు  
రెవెన్యూ అధికారులు నకిలీ రైతులను సృష్టించి తమకు తెలిసినవారి పేర్లను భూములు కోల్పోతున్న రైతుల జాబితాలో చేర్చి పరిహారం కాజేశారని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. మెడ్‌ టెక్‌ భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం నిజమైన రైతులకే పరిహారం చెల్లించామని చెబుతున్నారు. మెడ్‌ టెక్‌ భూముల పరిహారం చెల్లింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తామంటున్నారు. మెడ్‌ టెక్‌కు కేటాయించిన భూములకు పరిహారం చెల్లింపులో వెలుగుచూసిన అకతవకల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

 

19:15 - July 5, 2017

నెల్లూరు : జిల్లాలో మహిళలు మద్యం దుకాణంపై విరుచుకుపడ్డారు. శెట్టిగుంట రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపుని మహిళలు ధ్వంసం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో షాపు గోడలను, బోర్డును నేలకూల్చారు. ఈ షాపు సమీపంలో ప్రభుత్వ పాఠశాల, ఆలయం కూడా ఉండడంతో నిబంధనలకు విరుద్ధంగా షాపుని ఏర్పాటు చేయడం సరైంది కాదని మహిళలు మండిపడ్డారు. 

 

19:13 - July 5, 2017

గుంటూరు : ఏపీ సచివాలయంలో ఓ ప్రహారీ గోడ కూల్చివేత హాట్‌ టాపిక్‌గా మారింది. సీఎం కాన్వాయ్‌ రాక కోసమే ఈ మార్పులంటూ అధికారులు చెబుతున్నా... అసలు కారణం మాత్రం వాస్తు దోషాలని ప్రచారం జరుగుతోంది. వాస్తు సవరణలకోసం ఐదో గేటు నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
సెక్రటేరియట్‌లో మరోసారి మరమ్మత్తులు 
అమరావతిలోని సెక్రటేరియట్‌లో మరోసారి మరమ్మత్తులు చేపట్టారు.. సీఎం చంద్రబాబు సచివాలయానికివచ్చే మార్గంలో నాలుగోబ్లాక్‌ పక్కనున్న ప్రహారీ గోడను పడగొట్టారు.. అక్కడ మరో కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు.. ఇప్పటికే సచివాలయానికి నాలుగు గేట్లున్నాయి.. ఇప్పుడు నిర్మిస్తున్నది ఐదో గేటు.. 
ఏపీ సెక్రటేరియట్‌కు నాలుగు గేట్లు
సెక్రటేరియట్‌కు నాలుగు గేట్లున్నా ప్రస్తుతానికి రెండుమాత్రమే వాడుతున్నారు.. సీఎం కాన్వాయ్‌కోసం మొదటి గేటు... మంత్రులు, అధికారులు, సాధారణ ప్రజలకోసం రెండో గేటు ఉపయోగిస్తున్నారు. అయితే 15రోజులక్రితం నుంచి సీఎం కాన్వాయ్‌ ఒకటోగేటు నుంచి కాకుండా రెండో గేటునుంచి వస్తోంది. వాస్తు కారణంగానే కాన్వాయ్‌ రూట్‌ మార్చారంటూ వార్తలొచ్చాయి. అయినా వాస్తు దోషాలు తగ్గలేదంటూ ఐదో గేట్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.. 
సీఎం కాన్వాయ్‌ కోసం ప్రత్యేకంగా రోడ్డు 
మరోవైపు సచివాలయం నిర్మాణ సమయంలో సీఎం కాన్వాయ్‌కోసం ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేయాలని భావించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంనుంచి కరకట్టమీదుగా రాజధాని శంకుస్థాపన ప్రాంతంనుంచి సచివాలయానికి వెళ్లేలా రోడ్డు ప్లాన్‌ శారు. కొద్దిరోజులుగా ఈ రహదారి పనులు కొనసాగుతూనేఉన్నాయి.. ఈ రోడ్డునుంచి వెళ్లేందుకు వీలుగా గేటు నిర్మిస్తున్నారంటూ కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు.. 
గేట్లు మార్చడంపై విమర్శలు 
గేటు నిర్మాణంపై అధికారులు వేరే సమాధానం చెబుతున్నా అసలు కారణం వాస్తు దోషమేనంటూ ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు మూఢ నమ్మకాలు ఎక్కువని.. అందుకే రెండు గేట్లు ఇప్పటికే మార్చేశారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి సీఎం కాన్వాయ్‌కోసం ఇన్నిసార్లు గేట్లు మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 

19:08 - July 5, 2017

అనంతపురం : రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని.... ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాను పాదయాత్ర చేసేసమయంలోనే రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. అనంతపురంలో రెయిన్‌ గన్లు ఇచ్చి పంటల్ని కాపాడామని తెలిపారు.. ప్రపంచం మొత్తం అనంతపురంలో పండే పండ్లు, కూరగాయలు తినేరోజు వస్తుందని చెప్పారు.. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. పేదవారిని ఆదుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు.
మానవత్వాన్ని చాటుకున్న సీఎం చంద్రబాబు  
అనంతపురం పర్యటనలో సీఎం చంద్రబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి భార్య పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తవించారు. ఆ కుటుంబంలో బతికివున్న రామసుబ్బారెడ్డి కూతురు లక్ష్మీ ప్రసన్నకు 20 లక్షలు డిపాజిట్‌ చేస్తామని ప్రకటించారు. అప్పుల్లో ఉన్న 14 ఎకరాల భూమిని సెటిల్‌ చేస్తామని హామీ ఇచ్చారు. యువతికి ఉద్యోగంతో పాటు భవిష్యత్‌ను తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 
నేను చనిపోదామని అనుకున్నా : లక్ష్మీ ప్రసన్న 
కుటుంబ సభ్యులు మృతిచెందగానే తాను కూడా చనిపోదామనుకున్నానని తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి కూతురు లక్ష్మీప్రసన్న అన్నారు. సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు, బంధువులు ఇచ్చిన భరోసాతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిపారు. తన తల్లి చివరి కోరికను నెరవేరుస్తానని చెప్పారు. ఐఏఎమ్ లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదవడమే తన లక్ష్యమన్నారు. 

 

ఏపీలో జాతీయ రైల్వే భద్రతా అకాడమీ

గుంటూరు : దేశంలోనే తొలిసారి ఏపీలో జాతీయ రైల్వే భద్రతా అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ దగ్గర 33 ఎకరాల్లో రైల్వే భద్రత అకాడమీ నిర్మించబోతున్నారు. ఆర్పీఎఫ్ కు కమాండో శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు రైల్వే శాఖ చేయనుంది.

 

పాతబస్తీలో చైనా మహిళ బ్యాగు చోరీ

హైదరాబాద్ : పాతబస్తీలో చైనా మహిళ బ్యాగును చోరీ చేశారు. చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ సందర్శనకు మహిళ వచ్చింది. బ్యాగులో పాస్ పోర్టు, ఐడీ కార్డు, ఫారిన్ కరెన్సీ ఉన్నట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. 

 

తెలంగాణలో రేపు అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ ఫలితాలు

హైదరాబాద్ : తెలంగాణలో రేపు అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. 

18:48 - July 5, 2017
18:46 - July 5, 2017

ఖమ్మం : చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యవర్గం ఆరోపిస్తోంది. స్పెషల్‌ బ్యాలెట్‌ పద్ధతి ద్వారా వారిని తొలగించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు 70 ఏళ్ల చరిత్రలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష, కార్యదర్శులను బయటికి పంపిన ఘటన లేదని మండిపడుతున్నారు. 

18:44 - July 5, 2017

హైదరాబాద్ : ఓ వైపు మొక్కలు నాటండంటూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హరిత హారం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏళ్లనాటి వృక్షాలను నరికివేస్తుండటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 
అసెంబ్లీ సాక్షిగా ఏళ్లనాటి వృక్షాలు తొలగింపు 
ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం... మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ఏళ్లనాటి వృక్షాలను తొలగిస్తున్న దృశ్యం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. మొక్కలు నాటుదామంటూ ఓవైపు ప్రభుత్వం ఊదరగొడుతుంటే.. అందుకు విరుద్ధంగా అసెంబ్లీలో మొక్కలు నరికివేస్తుండటం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. రాష్ట్రంలో అడవుల్ని నరికి వేస్తుండటంతో జంతువులన్నీ ఊర్లలోకి వస్తున్నాయన్న సీఎం.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంకేముంది .. స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో మంత్రులు, అధికారులు హరితహారం జపం చేస్తూ ఊరు, వాడా మొక్కలు నాటుతున్నారు. ఈ కార్యక్రమం పేరుతో ప్రభుత్వం వందలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. 
నరికివేత ఎందుకు..?
ఇంతలా ప్రభుత్వం హరితహారానికి ప్రాధాన్యత ఇస్తుంటే.. అసెంబ్లీలో మాత్రం వృక్షాలను నరికివేస్తున్నారు. అందుకు కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఉన్న క్యాంటీన్ బోర్డు కనిపించట్లేదని ఇంత పెద్ద చెట్టుని అడ్డగోలుగా నరికేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా వృక్షాలను నరుకుతుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారనేది అందరి మదిలోని ప్రశ్న. ఇదే కొనసాగితే జంతువులు  ఊర్లోకి రావడం కాదు.. అసెంబ్లీలోకే వస్తాయంటూ జనం సెటైర్లు వేస్తున్నారు. దీనిపై అధికారులు ఏం సమాధానం చెప్తారో.. ఏమో?

 

18:38 - July 5, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మూడో దఫా హరితహారం కార్యక్రమానికి రంగం సిద్ధం చేసింది. ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో ఈసారి గుట్టలు.. కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా విత్తన బంతుల తయారీకి శ్రీకారం చుట్టారు కరీంనగర్ జిల్లా జైళ్ల శాఖ అధికారులు. అక్కడి ఖైదీలు వేతనాలు తీసుకోకుండా విత్తన బంతులు తయారు చేస్తూ హరితహారంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంతకీ విత్తన బంతులు అంటే ఏంటి? వాచ్‌ ది స్పెషల్ స్టోరి. 
ఈనెల 12న మూడో దశ హరితహారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రెండు విడతలు పూర్తి చేసుకుంది. ఈనెల 12న మొదలుకానున్న మూడో దశ ప్రారంభం కానుంది. అందుకోసం కరీంనగర్‌లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి హరితహారంలో గుట్టలు, కొండ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో సైతం మొక్కలు నాటాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం విత్తన బంతులు తయారు చేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కారాగారంలోని ఖైదీలతో విత్తన బంతులను తయారు చేయిస్తున్నారు. 
హరిత హారంలో ఖైదీలు భాగస్వాములు 
ఈసారి హరిత హారంలో ఖైదీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. వేతనాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విత్తన బంతులు తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఖైదీలతో మూడు లక్షలకు పైగా విత్తన బంతులు తయారు చేయించిన అధికారులు అవసరమైతే మరిన్ని తయారు చేయిస్తామని చెబుతున్నారు. 
విత్తన బంతులు తయారీ ఎలా...?
ఇంతకీ ఈ విత్తన బంతులు అంటే ఏమిటి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఇది ఒక పురాతనమైన పద్ధతి. ప్రస్తుతం అదే పద్ధతిని అనుసరించి వీటిని తయారు చేయిస్తున్నారు. 200 లీటర్ల నీరు నింపిన డ్రమ్ములో 20 లీటర్ల గోమూత్రం, కిలో బెల్లం, కిలో శెనగపిండి, కిలో పుట్టమట్టిని వేసి 45రోజుల పాటు పులియబెడతారు. ఆ తరువాత జీవామృతం తయారౌతుంది. రాళ్లు లేని ఎర్రమట్టిలో జీవామృతం, బయో ఎరువులు కలిపి ముద్దగా చేసి వాటిని బంతులుగా చుడతారు. ఆ బంతుల మధ్యలో విత్తనాలు పెట్టి వాటిని ఎండబెడతారు. ఇలా తయారైన వాటినే సీడ్ బాల్స్.. అని విత్తన బంతులు అని అంటారు. వారం పాటు ఎండలో ఉంచిన విత్తన బంతులను వర్షాకాలంలో అడవులు, గుట్టల ప్రాంతాల్లో విడిచిపెడతారు. వర్షానికి విత్తనబంతుల్లోని విత్తనాలు మొలకెత్తుతాయి. నర్సరీలలో మొక్కలను పెంచడం ద్వారా అధిక మొత్తంలో ఖర్చు అవుతుండగా ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం తయారు చేసిన విత్తన బంతులు మంచి ఫలితాలను ఇస్తే రాబోయే రోజుల్లో మరిన్ని తయారు చేయించాలని అధికారులు భావిస్తున్నారు. విత్తన బంతుల తయారీలో విదేశీ మొక్కలకు బదులు స్ధానికంగా మొలకెత్తే రావి, మర్రి, వెదురు, కానుగ, ఉసిరి మొక్కల విత్తనాలను మాత్రమే ఉంచుతున్నారు. 

 

18:37 - July 5, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లు ముగింపు దశకు చేరాయి. మహంకాళి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం, గుడికి వచ్చే దారులు విద్యుత్‌దీపాలతో కాంతులినుతున్నాయి. ఆలయ కమిటి, ఎండోన్మెంట్ అధికారుల పర్యవేక్షణలో పనులన్ని పూర్తి కావచ్చాయి. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం పరిశీలించనున్నారు. ఆదివారం జరగబోయే మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ అన్నపూర్ణతో టెన్ టివి    ముఖాముఖి నిర్వహించింది. వివరాలను ఆమె మాటల్లోనే... 'బోనం ఎత్తుకొచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్‌ ఉంటుంది. బంధువులు సాధారణ క్యూలైన్లలో రావాలి. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు' అని తెలిపారు. 

 

18:36 - July 5, 2017

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుతో ప్రజ్వరిల్లిన మత ఘర్షణల కారణంగా అక్కడ  భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను కాపాడేందుకు 4 వందల మంది బిఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రభుత్వం మోహరించింది. ఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్ని అగౌరవ పరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుతో రెండు రోజుల క్రితం మత ఘర్షణలు చెలరేగాయి. ఫేస్‌బుక్‌ పోస్టు చేసిన 17 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోల్‌కతాకు 70 కి.మీ. దూరంలో బదూరియాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు క్రమంగా 24 పరగణాల జిల్లా అంతటికి పాకిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠీ తనను బెదిరించారని పశ్చిమ బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని గవర్నర్‌ ఖండించారు. మత ఘర్షణలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మమత సర్కార్‌ను ఆదేశించింది.

 

18:35 - July 5, 2017

మహారాష్ట్ర : నడుస్తున్న బస్సులో ఓ మహిళను బలవంతంగా ముద్దుపెట్టుకున్న స్థానిక బీజేపీ నేతను గడ్చిరోలి పోలీసులు అరెస్టు చేశారు. లగ్జరీ బస్సులో అతను మహిళకు బలవంతంగా ముద్దు పెడుతున్న దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో అనైతిక చర్యకు పాల్పడిన స్థానిక బీజేపీ నేత రవీంద్ర బవన్‌థాడేను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్‌ నుంచి గడ్చిరోలి వస్తున్న బస్సులో రవీంద్ర మహిళను ముద్దు పెట్టుకోవడమే కాకుండా ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు రేప్‌ కేసు పెట్టింది. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని రవీంద్ర తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 

18:32 - July 5, 2017

ఇజ్రాయిల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది ఇజ్రాయిల్‌ రాష్ట్రపతి రూవెన్‌ రెవ్లిన్‌తో భేటి అయ్యారు. ప్రోటోకాల్‌ను కాదని ఇజ్రాయిల్‌ రాష్ట్రపతి తనకు స్వాగతం పలకడంపై మోది కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం 125 కోట్ల మంది భారతీయులకు చెందుతుందని చెప్పారు. రెండు దేశాల మొదటి ఆంగ్ల అక్షరం ఐ తోనే ప్రారంభమవుతుందని ఇండియా ఫర్‌ ఇజ్రాయిల్‌...ఇజ్రాయిల్‌ ఫర్‌ ఇండియా అంటూ మోది చమత్కరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢ పడుతున్నాయని తెలిపారు. ప్రధాని మోది ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నేతన్యాహుతో భేటి కానున్నారు. రక్షణ, భద్రత, వాటర్‌ తదితర అంశాలపై చర్చలు జరపనున్నారు.

 

18:31 - July 5, 2017

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ముమ్మాటికి ధోషి అని... జైల్లో ఊసలు లెక్కబెడతారని వైసీపీ నేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తనకు బ్లాక్ మనీ, వైట్ మనీకి తేడా తెలుసని.... జయంతికి, వర్థంతికి తేడా ఎంటో నారా లోకేష్ తెలుసుకోవాలని హితవుపలికారు. 'ధైర్య ఉంటే నా ఆస్తులు, నీ ఆస్తులపై సీబీఐ విచారణ చేయండి' అని సవాల్ విసిరారు. న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:29 - July 5, 2017

అవును ఈ క్రికేటర్ ఎవరు ? టీమిండియా సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్ మెన్. ఓపెనర్ గా అదరగొట్టే బ్యాట్స్ మెన్...శతక్కొట్టే ఈ బ్యాట్స్ మెన్స్ ఎవరో కాదు..’శిఖర్ ధావన్'. అవును అతనే అలా అయిపోయాడేంటీ ? అని ఏమాత్రం నోరెళ్లబెట్టకండి. సోషల్ మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను అభిమానులకు తెలియచేస్తుంటాడు. అంతేగాక సహచర ఆటగాళ్లతో టూర్లు..తదితర విషయాలు కూడా పంచుకుంటుంటాడు. తాజాగా ధావన్ ఓ ఫొటోను ఇన్ స్ట్రాగామ్ లో పోస్టు చేశాడు. గుర్తు పట్టడానికి వీల్లేకుండా మార్పులు చేశాడు. కూర్చొని నిద్రపోతున్న తన ఫొటోకి 'ధావన్' మార్పులు చేశాడు. త‌న ముఖం పెద్ద‌గా అయిపోయిన‌ట్లు కార్టూన్ పాత్ర‌లా చేసేశాడు. 'గుడ్ నైట్ ఇప్పుడు ఇక్కడ రాత్రి సమయం..హాయిగా నిద్రపోండి' అంటూ పోస్టు చేశారు.శుభ‌రాత్రి. ఐదు వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం కోహ్లీ సారథ్యంలతోని భారత జట్టు విండీస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

17:08 - July 5, 2017

హైదరాబాద్ : ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరోగ్య శ్రీ ఉద్యోగుల వినూత్న నిరసన చేపట్టారు. ఆస్పత్రికి కారులో వచ్చే ప్రొఫెసర్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు... ఆస్పత్రి సూరింటెండెంట్‌ కారును శుభ్రం చేసి తమ  నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగులు బిక్షాటన చేశారు. సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ కుమార్‌ వెయ్యి రూపాయలు ఇచ్చారు. కాగా ఉద్యోగులు విధులకు బహిష్కరించడంతో ఆస్పత్రిలో జరుగాల్సిన 25 శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. 

 

 

17:02 - July 5, 2017

విశాఖ : తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన బిటెక్ విద్యార్ధిని విజయలక్ష్మి. తాను ఉన్నత చదువులు చదువుకోవాలని ఆశిస్తే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తామని బెదిరిస్తున్నారంటూ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇదే విషయంలో పోలీసులు రాజీ చేసి విజయలక్ష్మిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లినా తల్లిదండ్రుల వేధింపులు ఎక్కువయ్యాయని తనపై చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ విజయలక్ష్మి గోపాలపట్నం పోలీసుల్ని ఆశ్రయించింది. 

 

16:47 - July 5, 2017

హైదరాబాద్ : ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడికి యత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి అన్నారు. వారికోసం ఇప్పటికే 20 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం ఆరుగురు దొంగతనానికి యత్నించినట్లు భావిస్తున్నామని ఆయన చెప్పారు. దుండగుల వద్ద రెండు పిస్టల్స్‌తో పాటు, మారణాయుధాలున్నాయని గంగారెడ్డి తెలిపారు. ఎక్కువ బంగారం దోచుకుందామనే ఆశతో ముత్తూట్ ఫైనాన్స్‌ను దొంగలు టార్గెట్ చేసి ఉంటారని ఏసీపీ గంగారెడ్డి అన్నారు. 

 

ఎన్టీఆర్ బయో పిక్ గురించి మామయ్య చూసుకుంటున్నారు: లోకేష్

అమరావతి: ఎన్టీఆర్ బయో పిక్ గురించి మామయ్య బాలయ్య చూసుకుంటున్నారని, మామయ్య ఉండగా సినిమాకు ఎలాంటి ఢోకా లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సదావర్తి భూములపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని లోకేష్ అన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా రూ. 5 కోట్లు అదనంగా డబ్బులను వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కట్టాలని, బినామీలతో కట్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని లోకేష్ హెచ్చరించారు.

 

16:44 - July 5, 2017

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కేసులో ఇవాళ మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈనెల 14న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రభుత్వం తరఫున 80 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అవగాహన వీడియోలు తయారు చేస్తామని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా టోల్‌ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.  

 

16:40 - July 5, 2017

అనంతపురం : రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని.... ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.. తాను పాదయాత్ర చేసేసమయంలోనే రుణమాఫీ నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు.. అనంతపురంలో రెయిన్‌ గన్లు ఇచ్చి పంటల్ని కాపాడామని తెలిపారు.. ప్రపంచంమొత్తం అనంతపురంలో పండే పండ్లు, కూరగాయలు తినేరోజు వస్తుందని చెప్పారు.. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. పేదవారిని ఆదుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు..

 

బిజెపి, శివసేన కార్పొరేటర్ల మధ్య ముష్టి యుద్ధం

హైదరాబాద్: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. బిజెపి, శివసేన కార్పొరేటర్ల మధ్య ముష్టి యుద్ధం నెలకొంది. శివసేన కార్పొరేటర్ పై బిజెపి కార్పొరేటర్ దాడి చేశాడు.

జీఎస్టీలో ఎలాంటి గందరగోళం లేదు:యనమల

అమరావతి: జీఎస్టీలో ఎలాంటి గందరగోళం లేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల అన్నారు. జీఎస్టీ పై క్షుణ్ణంగా అధ్యయనం జరిగిందన్నారు. ఇబ్బందులను జీఎస్టీ కౌన్సిల్ ప్రతి నెలా పరిశీలిస్తందని తెలిపారు. వ్యాపారులకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా జీఎస్టీని అమల్లోకి తెచ్చామని యనల పేర్కొన్నారు. గనులు, వస్త్ర, సినీ పరిశ్రమల డిమాండ్ల పై చర్చిస్తామన్నారు. జీఎస్టీ పరిధిలో లేని బొగ్గు, పెట్రోలియం, లిక్కర్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

 

16:33 - July 5, 2017

అనంతపురం : పేదవారిని ఆదుకోవడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ టీఆర్ కు అత్యంతమైన ఇష్టమైన జిల్లా అనంతపురం అని తెలిపారు. పాదయాత్ర చేసేటప్పుడు రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకున్నానని...రైతు రుణమాఫీ చేయాలని ఆనాడే నిర్ణయించామని చెప్పారు. పట్టిసీమపై చాలా విమర్శలు చేశారు..అన్నింటిని తిప్పికొట్టామని తెలిపారు. పట్టిసీమ పూర్తిచేయకపోతే రాయలసీమకు నీళ్లు వచ్చేనా..? ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా... ఆగేది లేదన్నారు. తనకు ఏ కోరికలు లేవు..పేదవారిని ఆదుకోవడమే తన లక్ష్యమన్నారు. పెట్టుబడి రాయితీ కింద జిల్లాకు రూ.1032 కోట్లు ఇచ్చామని తెలిపారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. 

 

విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూస్తా: కేయూ వీసీ

వరంగల్: విద్యార్ధులకు అన్యాయం జరగకుండా చూస్తామని కాకతీయ యూనివర్సిటీ వీసీ సాయన్న తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు ఉద్యోగుల అవగాహన లోపంతో డిగ్రీ, పీహెచ్‌డీ ఫలితాల్లో తప్పు జరిగిందన్నారు. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్నాతకోత్సవం తర్వాత అడ్మిషన్ల ప్రక్రియను పారదర్శకంగా చేపడతామన్నారు.

 

13 జిల్లాల ఏసీబీ అధికారులతో డీజీ భేటీ

విజయవాడ: అవినీతి నిరోదక శాఖకు చెందిన 13 జిల్లాల అధికారులతో ఆశాఖ డైరెక్టర్ జనరల్(డీజీ) బుధవారం విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జిల్లాల వారీగా అవినీతి అధికారుల జాబితాను ఆయన తెప్పించుకుని పరిశీలించారు. అలాగే అవినీతి ఉద్యోగులను ఏరేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏసీబీ గురించి ప్రజల్లో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

ఖమ్మం వర్తక సంఘం కార్యాలయంలో ఉద్రిక్తత

ఖమ్మం : వర్తక సంఘం కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేయాలని దిగుమతి శాఖ సభ్యులు ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నారు. ప్రజా బ్యాలెట్ బాక్సులు రోడ్డు పై పడేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు.

 

టీఎన్జీవో ఉద్యోగుల భేటీ

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో ఉద్యోగులు సమావేశం అయ్యారు. తెలంగాణ లో ఉన్న ఏపీ ఉద్యోగులను ఏపీ కి పంపాలని, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను రప్పించే విషయంలో బేధాభిప్రాయాలు వచ్చి సమావేశంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

 

16:05 - July 5, 2017

గుంటూరు : ఏపీ రాజధాని ప్రాంతంలో రహదారులపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది.. రాజధాని నిర్మాణంకంటే ముందుగానే రోడ్లను పూర్తిచేసి... పెట్టుబడుల్ని ఆకర్షించాలని భావిస్తోంది.. అన్ని గ్రామాలు కలిపేవిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో 7 ఆర్టీరియల్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇజ్రాయెల్ లో కొనసాగుతున్న మోదీ పర్యటన

హైదరాబాద్: ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని రూవెన్ రివి్లన్ తో మోదీ సమావేశం కానున్నారు. ఇజ్రాయేల్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని  ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

16:00 - July 5, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య' వివాహం త్వరలో 'సమంత' తో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. 'నాగార్జున' తనయుడు 'అఖిల్' కాబోయే వదిన 'సమంత'తో కరీంనగర్ లో సందడి చేశాడు. మెయిన్ సెంటర్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను బుధవారం వీరు ప్రారంభించారు. వీరు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. సౌతిండియా షాపింగ్ మాల్ ప్రచారకర్తలుగా 'అఖిల్'..'సమంత'లున్న విషయం తెలిసిందే.

వరంగల్ కేయూలో ఉద్రిక్తత

వరంగల్ : కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ముట్టబించారు. డిగ్రీ, పీహెచ్ డీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆందోళన చేపట్టారు. అంతే కాకుండా వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

15:58 - July 5, 2017

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తన సోదరుడిని కడసారి ఆ స్థితిలో చూలేకే.. అంత్యక్రియలకు హాజరుకాలేదని సినీ హీరో రవితేజ అన్నారు. భరత్‌ మరణం గురించి తెలిసిన వెంటనే తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన చెందారన్నారు. భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాలేదంటూ సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు తమను బాధించాయన్నారు. అవిరాసే ముందు ఒకసారి తమను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. భరత్‌ అంత్యక్రియలను జూనియర్‌ ఆర్టిస్ట్‌తో జరిపించామన్న కథనాలు అసత్యమని.... తన చిన్నాన్నతో అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు.  భరత్‌ చనిపోయిన తర్వాతి రోజునే తాను షూటింగ్‌కు వెళ్లానని తెలిపారు. ఇక షూటింగ్‌లో నవ్వుతూ సెల్ఫీలు దిగారన్న కథనాలను ఆయన తప్పుపట్టారు. 

 

డ్రగ్స్ వ్యవహారంలో మరొకరి అరెస్ట్ :సబర్వాల్

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో మరొకరిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసినట్లు అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ పరిణామాలపై అవగాన వీడియోలు తయారు చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశామని, 26 పాఠశాలలకు నోటీసులు ఇచ్చినట్లు సబర్వాల్ తెలిపారు. 14వ తేదీ మ.2.30 గంటలకు ప్రభుత్వం తరుపున 80 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

 

15:55 - July 5, 2017

రంగారెడ్డి : జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు ఓ యువకుడు బలైపోయాడు. యువకుడు సెల్ఫీ సూసైడ్‌ చేసుకున్నాడు. శంకర్‌పల్లి మండలం మహరాజ్‌పేటలో నరేష్‌ అనే యువకుడు వ్యవసాయ కుటుంబానికి చెందిన వాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులపాలు అయ్యాడు. రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెందాడు. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీశాడు. తనలా ఎవరూ బెట్టింగ్‌లకు పాల్పొడద్దని నరేష్‌ పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బెట్టింగ్ లతో నష్టం.. యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి : శంకర్ పల్లి మండలం మహరాజ్ పేటలో నరేష్ అనే యువకుడు ాత్మహత్యకు పాల్పడ్డాడు. బెట్టింగ్ లకు పాల్పడి అపుల పాలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తనలా ఎవరూ బెట్టింగ్ లకు పాల్పడి నష్టపోవద్దని ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో నరేష్ తెలిపాడు.

 

అమరావతి సచివాలయంలో వాస్తు దోషాలు.. నివారణ చర్యలు?

అమరావతి: సచివాలయంలో వాస్తు దోషాలు వున్నాయని వాటి సవరణల కోసం కొత్తగా మరో గేటు ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ప్రహరీ గోడను పగలగొట్టి సీఎం కాన్వాయ్ కోసం కొత్త గేటు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీఎం కాన్వాయ్ కోసం బ్లాక్ ల వెనుక దారిని అత్యవసర రహదారిగా అధికారులు మార్చారు.

 

15:43 - July 5, 2017

టాలీవుడ్ లో పలు చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా ? ఎప్పుడు చూద్దామా ? తాము అభిమానించే నటుడు అందులో ఎలా ఉన్నాడోనని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. కానీ పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం సినిమా రిలీజ్ కంటే ముందుగానే టీజర్..పోస్టర్స్ పై ఉత్కంఠ పెరిగిపోయింది. అందుకనుగుణంగా ఆయా చిత్రాల దర్శకులు..హీరోలు ఉత్కంఠను కలుగ చేసే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. తాజాగా జూ.ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాణంలో బాబి దర్శకత్వంలో నిర్మితమౌతున్న ఈ సినిమాలో 'జూ.ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలు పోషిస్తుండడంపై అభిమానుల్లో ఉత్కంఠను కలుగ చేస్తోంది.
ఆయన సరసన 'రాశీఖన్నా'..’నివేదా థామస్' లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇటీవలే సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అనంతరం కొద్ది రోజుల అనంతరం చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. 'జై లవ కుశ'కు సంబంధించి మూడు టీజర్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 'ఇటీవల మీరు 'జై'ను చూశారు. జులై 6 సాయంత్రం 5.22 గంటలకు 'జై' టీజర్ చూసేందుకు సిద్ధం కండి' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 5 గంటల 22 నిమిషాలకి రిలీజ్ చేయనున్న టీజర్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి టీజర్ అభిమానులను సంతృప్తి పరుస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

15:23 - July 5, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' షూటింగ్ సైలెంట్ గా కొనసాగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో 'నితిన్' వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ‘లై' అనే మాటకు 'లవ్..ఇంటలిజెన్స్..ఎనిమీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ‘నితిన్' సరసన 'మేఘా ఆకాష్' నూతన అమ్మాయి పరిచయం కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ గా పేరొందిన 'అర్జున్' కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకి సంబంధించిన ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బాత్ టబ్ లో 'అర్జున్' సేద దీరుతున్నట్లుగా ఉంది. అయితే పోస్టర్లో 'అర్జున్' మెడ భాగంలో ఉన్న టాటూ ఆకటుట్టకొంటోంది. 'అర్జున్' ఫస్టులుక్ ను గురువారం రిలీజ్ చేస్తారని సమాచారం.

మీడియా ఎదుట రవితేజ..

హైదరాబాద్ : తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై సినీ నటుడు రవితేజ మీడియాకు వివరణ ఇచ్చారు. భరత్ విషయంలో సోషల్ మీడియాది అనవసర రాద్ధాంతమని వెల్లడించారు.

ఫలితాల్లో పారదర్శకత - కేయూ వీసీ..

వరంగల్ : ఎంఫిల్, పీహెచ్ డీ ఫలితాలలో పారదర్శకత పాటిస్తామని కేయూ వీసీ సాయన్న వెల్లడించారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని, అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేయూలో ఉద్రిక్తత..

వరంగల్ : కేయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను విద్యార్థులు ముట్టడించారు. డిగ్రీ, పీహెచ్ డీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆందోళన నిర్వహించారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వీసీ ఛాంబర్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.

డ్రగ్స్ కేసులో మరొకరు అరెస్టు..

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో ఈ రోజు మరొకరిని అరెస్టు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు మొత్తం 8మందిని అరెస్టు చేయడం జరిగిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఈ కేసు విషయంలో అవగాహన వీడియోలు తయారు చేస్తామని, 26 పాఠశాలలకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. 14న మధ్యాహ్నం 2.30గంటలకు ప్రభుత్వం తరపున 80 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

బెట్టింగ్ లకు పాల్పడవద్దు అంటూ..

రంగారెడ్డి : శంకర్ పల్లి (మం) మహారాజ్ పేటలో నరేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగులకు పాల్పడుతూ అప్పులపాలు కావడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనలా ఎవరూ బెట్టింగ్ లకు పాల్పడి నష్టపోవద్దనీ ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో నరేష్ వెల్లడించాడు.

14:55 - July 5, 2017

ఖమ్మం : వైరాలోని డిసిసిబి బ్యాంకులో రైతుల ఖాతాల్లో రూ.16 లక్షల రూపాయలు మాయమవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన సీఈవో అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. మరోవైపు రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శివసేన కార్పొరేటర్ పై బీజేపీ కార్పొరేటర్ దాడి..

ముంబై : మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, శివసేన కార్పొరేటర్ల మధ్య ముష్టి యుద్ధం చోటు చేసుకుంది. శివసేన కార్పొరేటర్ పై బీజేపీ కార్పొరేటర్ దాడికి పాల్పడ్డారు. థాకరే..థాకరే అంటూ నినాదాలు చేయడంతో ఘర్షణ తలెత్తింది.

టి.సచివాలయంలో టీఎన్జీవో ఉద్యోగుల సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులను ఏపీకి పంపాలని, ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించకపోవడంపై బేదాభిప్రాయాలు నెలకొన్నాయి. సమావేశంలో ఉద్యోగులు పరస్పర విమర్శలు చేసుకున్నారు.

14:51 - July 5, 2017
14:51 - July 5, 2017

హైదరాబాద్‌ : నగరంలో డ్రగ్స్ రాకెట్ కేసులో విచారణను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ మరింత వేగవంతం చేసింది. డ్రగ్స్‌ కేసులో మరొకరిని అరెస్ట్‌ చేశామని ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. డ్రగ్స్‌ సరఫరా సమాచారం ఉంటే తమకు తెలియజేసేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసినట్లు అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. మరో విదేశీయుడిని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక విదేశీయుడితో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరెస్టైన ఏడుగురిని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసు విషయంలో విద్యార్ధుల ప్రమేయంపై ఇప్పటికే పలు కాలేజీలు, పాఠశాలలకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో సినీ నిర్మాతల పేర్లు మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచడం గమనార్హం. డ్రగ్స్‌ కేసులో మరొకరిని అరెస్ట్‌ చేశామని ఎక్సైజ్‌ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌సబర్వాల్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. డ్రగ్స్‌ సరఫరా సమాచారం ఉంటే తమకు తెలియజేసేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసినట్లు అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. మరో విదేశీయుడిని అరెస్ట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

13:46 - July 5, 2017

మహిళలకు సంబంధించిన ఎన్నో చట్టాలున్నాయి. పురుషులకన్నా మహిళలకు ఎందుకు ఎక్కువ చట్టాలున్నాయి ? ఈ అంశంపై టెన్ టివి మానవి ‘మై రైట్’ కార్యక్రమంలో ప్రత్యేక చర్చ చేపట్టింది. చట్టాలు ప్రత్యేకంగా వారికి..వీరికి ఉద్ధేశించినవి లేవని లాయర్ పార్వతి పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే..అని అందరికీ తెలుసని, మహిళలకు సంబంధించిన చట్టాలు రావడానికి చరిత్ర ఉందన్నారు. మహిళలంటే వివక్ష అనేది ఉందని, గతంలో అనేక సాంఘీక దురాచారాలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. సాంఘీక దురాచారాల నుండి మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్ధేశ్యంతో చట్టాలు ఏర్పడడం జరిగిందన్నారు. ఇతర అంశాలు...కాలర్స్ అడిగిన పలు న్యాయ సందేహాలకు లాయర్ పార్వతి ఇచ్చిన సూచనలు..సలహాల కోసం వీడియో క్లిక్ చేయండి.

13:43 - July 5, 2017

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ల బంద్ కొనసాగుతోంది. థియేటర్లపై జీఎస్టీ విధించడం పట్ల అక్కడి చిత్ర పరిశ్రమ ఒప్పుకోవడం లేదు. జీఎస్టీ నుండి తమిళనాడు చిత్ర పరిశ్రమను మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. థియేటర్ల బంద్ వల్ల రోజుకు రూ. 20 కోట్లు నష్టం వస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బంద్ నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బంద్ కు తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు తెలియచేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశారు.
సినిమా థియేటర్లో రూ. 100 కన్నా తక్కువ ఉన్న టికెట్ ధరలపై 18 శాతం, రూ. 100 కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలపై 28 శాతం పన్నును జీఎస్టీ నిర్ధారించిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి ఇది అమలు అవుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని దాదాపు 1,100 థియేటర్లను సోమవారం (జులై 3) నుంచి మూసివేశారు.

కరీంనగర్ లో సమంత, అక్కినేని అఖిల్ సంద‌డి

కరీంనగర్‌ : నగరంలో సినీన‌టులు స‌మంత‌, అక్కినేని అఖిల్ సంద‌డి చేశారు. నిన్న స‌మంత, అఖిల్ ‘క‌రీంన‌గ‌ర్‌లో క‌లుద్దాం’ అంటూ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు వారిద్ద‌రూ ఆ జిల్లాలోని ఉస్మాన్‌పుర‌లో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ విష‌యాన్ని అఖిల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. త‌న వ‌దిన‌తో క‌లిసి ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన‌డం ప‌ట్ల గ‌ర్వంగా ఉంద‌ని తెలిపాడు. అఖిల్ ట్వీట్ కు స్పందించిన సమంత.. ‘అఖిల్ నా రాక్ స్టార్’ అంటూ కామెంట్ చేసింది. స‌మంత‌, అఖిల్‌ల‌ను చూడ‌డానికి పెద్ద ఎత్తున అభిమానులు వ‌చ్చారు

13:39 - July 5, 2017

తూర్పుగోదావరి : ఏపీలో మద్యం దుకాణాలపై మహిళలు సమరం లేవనెత్తారు. జనవాసాల్లో ఉన్న మద్యం దుకాణాలపై ఆయా జిల్లాల్లో మహిళలు ధర్నాలు..నిరసనలు లేవనెత్తుతున్నారు. రాజమండ్రిలోని ఓ ప్రాంతంలో జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడం పట్ల మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణం వల్ల మందుబాబులు తాగుతూ వీరంగం సృష్టిస్తున్నారని, దీనివల్ల తాము నిత్యం నరకం అనుభవిస్తున్నామన్నారు. ఇళ్లు ముందు తిరుగుతూ నానా బీభత్సం సృష్టిస్తున్నారని, పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మద్యం షాపులు తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

 అమరావతి: సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈభేటీలో యుటిలైజేషన్, ఫెర్రో ేలో వైన్స్ పై చర్చిస్తున్నట్లు సమాచారం.  ఈ భేటీకి పలువురు నేతలు హాజరయ్యారు.

 

13:37 - July 5, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ ముఠాలు లక్ష్యం చేసుకున్న కాలేజీ కుర్రాళ్లలో సగానికి పైగా పల్లెల నుంచి వచ్చినవారేనని తెలుస్తోంది... పల్లెల నుంచి పట్నానికి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్‌ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు..వీరంతా కన్నవారు పంపిస్తున్న ఖర్చులతో మత్తు తీసుకుని దానికి బానిసలవుతున్నారు...కట్టడి లేక..కన్నవారి పర్యవేక్షణ లేకపోవడంతో వారిని టార్గెట్‌ చేసిన ముఠాలు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాయి...మహానగరంలోని నాలుగువైపులా ఉన్న ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీల్లోని బీటెక్‌ స్టూడెంట్స్‌ డ్రగ్స్‌ బానిసలుగా తేలింది....దీంతోనే ఎన్‌ఫోర్స్‌మెంట్,సిట్ అధికారులు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంత మంది విద్యార్థులకు మత్తు సరఫరా అవుతుందనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు..ఇప్పటికే అధికారుల శోదనలో తెలంగాణాలోని రెండు జిల్లాలకు చెందిన విద్యార్థుల విషయం తెలిసి వారిని మందలించినట్లు తెలుస్తోంది.

సంపన్నుల పిల్లలను టార్గెట్
ప్రధానంగా స్కూళ్లలో చదువుతున్న సంపన్నుల పిల్లలను టార్గెట్ చేసుకున్న మత్తు ముఠాలు వారిని ఈ వయస్సు నుంచే మత్తులో ముంచేస్తున్నాయి...రుచి చూపిస్తున్న ముఠాలు వారిని బానిసలుగా మార్చేస్తున్నాయి...ఎల్‌ఎస్‌డీ మత్తు మందును పేపర్ ముక్కతో సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి..సంపన్నుల పిల్లలు చదువుతున్న స్కూళ్లలోనే ఈ తరహా డ్రగ్స్‌ పేపర్లు విక్రయిస్తున్నట్లు తేలింది..ఇప్పటికే దాదాపు వెయ్యి మంది పిల్లలకు మత్తు రుచి చూపించారు దుర్మార్గులు.అసలు ఈ డ్రగ్స్ ప్రభావం ఎంత...ఎలా సరఫరా చేస్తున్నారో చూడండి..లైసర్గిక్‌ యాసిడ్‌ డైఎథిలమైడ్‌గా ఎల్‌ఎస్‌డీని పిలుస్తారు...ఈ డ్రగ్స్‌ టాబ్లెట్లు లేదంటే ద్రవం రూపంలో దొరుకుతుంది..లేదంటే తయారు చేస్తారు...ఇక ప్రధానంగా దీన్ని పేపర్‌ ముక్కకు అంటించి ఒక్కో డోస్‌గా విక్రయిస్తారు...ఇలా దీని ధర మూడు వేలు ఉంటుంది.. ఇది స్కూలు ప్రాంతాల్లోని చిన్న చిన్న షాపుల్లో విక్రయించేలా డ్రగ్స్ ఏజెంట్లను పెట్టుకున్నారు...ఈ పేపర్ ముక్కను కాసేపు నోట్లో పెట్టుకుని చప్పరిస్తే చాలు...ఆ తర్వాత కనీసం 12 గంటల పాటు మత్తు ప్రభావముంటుంది. మిథిలీన్‌ డైఆక్సీ మెథాంపెటమైన్‌...ఈ డ్రగ్‌ ఒక్కో గ్రాము 4 వేలకు పైనే ఉంటుంది...నోటిలో నాలుక పైన పెట్టుకుని చప్పరించే ఈ మత్తు మందు అరగంట తర్వాత దాని ప్రభావం చూపుతుంది...ఇలా ఒక్కసారి మత్తులోకి వెళ్లాక దాదాపు ఆరు గంటలపాటు ఉంటుంది.

సరోగసిపై కమిటీ ఏర్పాటు చేసిన టీ.ఎస్ సర్కార్

హైదరాబాద్: సరోగసి పై తెలంగాణ సర్కర్ రిటైర్డ్ జడ్జి గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా 8 మంది అధికారులు, డాక్టర్లు వున్నారు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని సర్కార్ ఆదేశించింది.

13:35 - July 5, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవుల పల్లి ముత్తూట్ దోపిడి కేసులో పోలీసులు వేట కొనసాగుతోంది. దుండగులను పట్టుకోవడానికి ఏకంగా 20 బృందాలు రంగంలోకి దిగాయని రాజేంద్రగర్ ఏసీపీ గంగారెడ్డి పేర్కొన్నారు. ఈ కేసును ఒక ఛాలెంజింగ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు. దోపిడీకి యత్నంలో ఆరుగురు పాల్గొన్నట్లు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ సేకరించడం జరుగుతోందని వెల్లడించారు.

మైలార్ దేవుల పల్లి...
మైలార్ దేవుల పల్లిలో ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడికి యత్నం చేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ ను బెదిరించారు. కొంత ధైర్యం చేసిన లతీఫ్ అక్కడనే ఉన్న అలారాన్ని నొక్కాడు. అలారం పెద్ద శబ్ధం చేయడంతో దొంగలు కాలికి పని చెప్పారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం..ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.

ఆక్టోపస్ బలగాలు..
ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో దోపిడికి యత్నించి విఫలమైన దుండగులు హోమ్స్ అపార్ట్ మెంట్ లో దాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీ స్థాయిలో ఆ ప్రాంతంలో మోహరించడం స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. అక్టోపస్, గ్రేహౌండ్స్ పోలీసులు అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టారు. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లతో పోలీసులు పహారా కాయడం విశేషం.

గుజరాత్ వాహనం..
ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడికి యత్నించిన దుండగులు గుజారాత్ రాష్ట్రానికి చెందిన వాహనాన్ని వాడినట్లు, దానికి తప్పుడు నెంబర్ తగిలించి వాడారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించినట్లు, మూడు రోజుల్లో సంగారెడ్డి..ముత్తంగి తదితర ప్రాంతాల్లో వాహనం సంచరించినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించినట్లు తెలుస్తోంది. వాహనం పార్కింగ్ చేసిన అనంతరం ముత్తూట్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బందితో మాట్లాడుతూ బంగారు ఆభరణాలు దొంగిలించాలని దండుగులు ప్లాన్ చేసినట్లు..అందుకు మారణాయుధాలను సైతం తీసుకెళ్లారు. ముంబై, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పాత నేరస్తులు అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు పట్టుబడితే కానీ కేసుకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.

13:30 - July 5, 2017

విశాఖ : జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 500 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు ఉండరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైన్‌ షాపుల వైన్‌ షాపుల యజమానలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వీరికి ఊరట లభించింది. అయితే జాతీయ రహదారులు వెంబటి ఉన్న బార్లు, వైన్‌ షాపులను జనావాసాల్లోకి తరలిస్తున్నారు. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారి మద్య వ్యతిరేక ఉద్యమానికి దారితీస్తోంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్‌ విధానంలో కొత్త మద్యం దుకాణాలకు అనమతి ఇవ్వడంతో ఎక్కపడితే అక్కడే వెలస్తున్నాయి. విశాఖ జిల్లాలో 124 బార్లు, 401 వైన్‌ షాపులు ఉన్నాయి. మద్యం దుకాణాలకు అనుంబంధంగా సిటింగ్‌ రూములు, బెల్టు షాపులు ఉన్నాయి.

ఎక్కడైనా వైన్‌ షాపు
కొత్త మద్యం విధానంలో భాగంగా గ్రేటర్‌ విశాఖ పరిధిలోని అనకాపల్లి నుంచి ఆనందపురం జంక్షన్‌ వరకు ఎక్కడైనా వైన్‌ షాపు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జాతీయ రహదారి వెంబడి ఉన్న వైన్‌ షాపులను ఎక్సైజ్‌, పోలీసు శాఖ అధికారులు అనుమతితో జనావాసాల్లోకి తరలిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా మహిళలు పోరాడుతున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నారు. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న ఉద్యమం ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులకు తలనొప్పిగా మారింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను జనావాసాల్లోకి తరలించుకునేందుకు వీలు కల్పించిన ప్రభుత్వ విధానాన్ని విశాఖ బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకుమార్‌ రాజు తప్పుపడుతున్నారు. గుడి, బడికి వంద మీటర్ల పరిధిలో వైన్‌ షాపులు, బార్లు ఉండరాదన్న నిబంధన ఉంది. అయితే ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలు, దేవాదాయ శాఖలో నమోదైన దేవాలయాలకు మాత్రమే వర్తిస్తుంది. చాలా గుళ్లు, బడులకు గుర్తింపు లేదు. దీంతో చట్టంలోని ఈ లొలుగును ఆధారంగా చేసుకుని జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్‌ షాపులను జనావాసాల్లోకి తరలిస్తున్నారు. జనావాసాల మధ్యకు మద్యం దుకాణాల తరలించడం నిలిపివేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మహిళా సంఘాలు హెచరిస్తున్నాయి. 

ఏపిలో దక్షిణాది రాష్ట్రాల విపత్తుల నిర్వహణ కేంద్రం

అమరావతి: ఏపిలో దక్షిణాది రాష్ట్రాల విపత్తుల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్రంలోని కొండపావులూరు దగ్గర పది ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణం జరపనున్నారు. అలాగే.. తీరప్రాంతంలో విపత్తుల నిర్వహణపై కోర్సులు కూడా నిర్వహించనున్నారు.

 

చైనా చర్యలపై కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది: వెంకయ్యనాయుడు

అమరావతి: చైనా దుందుడుకుని కేంద్రం ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, తగిన సమయంలో సరైన చర్యలు చేపడతామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఏపీలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ పనులు జరగాలంటే...పన్నులు కట్టాల్సిందేనని అన్నారు. పన్నుల విధానాన్ని సరళీకృతం చేయడానికే ప్రధాని మోదీ జీఎస్టీని తీసుకొచ్చారని అన్నారు. కొందరు అనవసరమైన అనుమానాలను రేకిత్తిస్తున్నారని, జీఎస్టీ అమలులోకి తేవడానికి 17 ఏళ్లు పట్టిందని వెంకయ్య తెలిపారు. సమస్యలు సర్దుకోవడానికి కొంత సమయం పడుతుందని, రూ.20 లక్షలలోపు టర్నోవర్ ఉండే చిన్నవ్యాపారులకు పన్ను ఉండదని అన్నారు.

13:24 - July 5, 2017

చెన్నై : జీఎస్టీ నుంచి సినిమా థియేటర్లను మినహాయించాలని కోరుతూ తమిళనాడులో నిర్వహిస్తున్న సినిమా ధియేటర్ల బంద్ కొనసాగుతోంది. థియేటర్ల బంద్ తో ప్రతిరోజు రూ.20 కోట్ల నష్టం వస్తుందని యాజమానుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:23 - July 5, 2017

హైదరాబాద్ : నగరంలోని డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా ఓ విదేయున్ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా నిర్మాతల పేర్లు వినబుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు నిర్మాతలను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. డాట్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ కొనగోళ్లు జరుగతునట్టు పోలీసులు గుర్తించారు. విద్యార్థులే ప్రధానంగా డ్రగ్స్ వాడుతునట్టు తెలుస్తోంది. దీనిపై కొన్ని కార్పొరేట్ కాలేజీలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

టీఎస్ సచివాలయంలో భారీగా పోలీసుల మోహరింపు...

హైదరాబాద్ : సెక్రటేరియేట్ లో ఏపీ,గాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ జరిగింది. అప్రమత్తమైన  పోలీసులు భారీగా మోహరించారు. ఏపీ నుంచి వచ్చిన 24 మంది విభాగ అధికారులను విధుల్లోకి తీసుకునే విషయమై ఇరు వర్గాల మధ్యా మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఏపీ నుంచి వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవద్దంటూ తెలంగాణ ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. వారికి ప్రతిగా ఏపీ ఉద్యోగులు సైతం నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి వెళ్లిపోయిన వారిలో పలువురు తమ ఆప్షన్ అవకాశాన్ని వినియోగించుకుని తిరిగి హైదరాబాద్ రావాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

13:20 - July 5, 2017

హైదరాబాద్ : ముత్తూట్ దోపిడీ కేసులో పోలీసుల వేట కొనసాగుతోంది. నిన్న రాత్రంతా రాజేంద్రనగర్ హ్యాపీ హోమ్స్ లో ఆక్టోపస్ 5 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టోల్ ప్లాజా, హోటల్ లోని సీసీ టీవీ ఫుటేజిలో టవేరా వాహనం విజువల్స్ నమోదైయ్యాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:19 - July 5, 2017

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు సినీ నిర్మాతలున్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లను మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు. డ్రగ్స్ విషయంలో ఇంటర్నేషనల్ కాలేజీ..పలు స్కూళ్లకు పోలీసులు నోటీసులు అందించారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సిట్ నియామకం..
డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం..పోలీసులు సిట్ ను నియమించింది. అనంతరం కేసు దర్యాప్తులో ఎక్సైజ్ శాఖ వేగవంతం చేపట్టింది. అందులో కెల్విన్ ను అదుపులోకి తీసుకున్న అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూత్..కాలేజీ విద్యార్థులను వీరు టార్గెట్ చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 మంది ముఠా ఉన్నట్లు తెలుస్తోంది.

రహస్యంగా విచారణ..
తాజాగా ఒక విదేశీయుడితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ అనంతరం మరో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కుందన్ సింగ్ రాజస్థాన్ చెందిన వ్యక్తి కాగా మిగతా ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. వీరందరినీ రహస్యంగా పోలీసులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ కేసులో విద్యార్థుల ప్రమేయంపై పలు స్కూళ్లు..కాలేజీ, యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

సినీ నిర్మాతలు ఎవరు ?
డ్రగ్స్ కేసులో సినీ నిర్మాతలున్నట్లు స్యయంగా పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ ఆ నిర్మాతలు ఎవరన్న దానిపై క్లారిటీ రావడం లేదు. గతంలో డ్రగ్స్ కేసులు పట్టుబడిన సందర్భంలో చలన చిత్ర సీమకు సంబంధం ఉంటుండడంతో కలకలం రేపుతోంది. ఇప్పుడు కూడా డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ నిర్మాతలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుండడం..వారి పేర్లను పోలీసులు బయటకు చెప్పకపోతుండడంతో ఉత్కంఠ రేపుతోంది. ఎవరనేది చెబితే పలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని అందుకనే చెప్పడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసు విషయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు, ఎవరైనా డ్రగ్స్ కు సంబంధించిన విషయాలు తెలిస్తే తెలియచేయాలని సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొంటున్నారు.

13:19 - July 5, 2017

హైదరాబాద్ : నగరంలోని డ్రగ్స్ మాఫియలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు ఈ కేసులోని నిర్మాతల పేర్లు గోప్యంగా ఉంచుతున్నారు. ఒక విదేశియుడుతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలీసులు అరెస్టైన ఏడుగురిని రహస్యంగా విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో విద్యార్థుల ప్రమేయంపై పలు స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు పంపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:17 - July 5, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని మిర్చి మార్కెట్ తరలింపుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తరలింపుకు వ్యతిరేకంగా చాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

13:16 - July 5, 2017

నల్లగొండ : జిల్లాలోని అనుముల మండలం పేరూరు చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెరువు ఎండిపోయిందని చేపలు పట్టడానికి గ్రామస్తులు భారీగా చెరువు వద్దకు చేరుకున్నారు. చెరువును కాంట్రాక్టర్ చెందిన వ్యక్తులు గ్రామస్థులను అడ్డుకున్నారు. అగ్రహం చెందిన గ్రామస్తులు కాంట్రాక్టర్ మనుషులను రాళ్లతో కొట్టారు. గ్రామస్తులకు చెందిన రెండు బైక్ లకు కాంట్రాక్టర్ మనుషులు నిప్పు పెట్టారు. పోలీసులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

అనంతపురం: కనగానల్లి మండలం ముక్తాపురంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముక్తాపురంలో ఎన్టీఆర్ మోడల్ కాలనీని సీఎం ప్రారంభించారు.

13:14 - July 5, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలో మిర్చి మార్కెట్ తరలింపును నిరసిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో త్రీటౌన్ బంద్ కు పిలునిచ్చారు. బంద్ కు సీపీఎం, త్రీటౌన్ పరిరక్షణ కమిటీ మద్దతు తెలుపుతోంది. పలువురు సీపీఎం నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:12 - July 5, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లోని హ్యాపీ హోమ్స్‌లో ఆక్టోపస్‌ బలగాలు చేపట్టిన సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసింది. మైలార్‌దేవ్‌పల్లి ముత్తూట్‌ ఫైనాన్స్‌ దోపిడీ ముఠాను పట్టుకునేందుకు ఐదు గంటలకు పైగా సాగిన ఈ ఆపరేషన్‌లో దుండగులు పట్టబడలేదు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిని పోలీసులు ధృవీకరించలేదు. రాత్రంతా పోలీసుల సెర్చింగ్‌ ఆపరేషన్‌తో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ ప్రజలను వెంటాడింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అంగన్ వాడీ కేంద్రాల్లో సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: అంగన్ వాడీ కేంద్రాల్లో సౌకర్యాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సౌకర్యాల మెరుగు కోసం వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఉయ్యాల వారి పల్లి అంగన్ వాడీ కేంద్రంలో నీటి తొట్టెలో పడి చిన్నారి మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. అంగన్ వాడీ కార్యకర్తలు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.

ముత్తూట్ దోపిడీ దొంగలను పట్టుకుంటాం: ఏసీపీ గంగారెడ్డి

సంగారెడ్డి : ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు దోపిడీ ముఠా వాడిన టవేరా వాహనం చిత్రాలను జూన్ 1,18,23, జూలై 3,4 తేదీల్లో ముత్తంగి టోల్ ప్లాజా స్వీట్ హార్ట్ దగ్గర రాకపోకలను పోలీసులు గుర్తించారు. హోటల్ దగ్గర ఆగి టీ, స్నాక్స్ తీసుకొని మైలార్ దేవరపల్లి వెళ్లినట్లు సమాచారం. ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి యత్నించిన దొంగల కోసం 20 గ్రూపులు గాలిస్తున్నాయని ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. దుండగలను త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనలో 6గురు దొంగతనానికి ప్రయత్నించారని తెలిపారు.సీసీ టీవి ఆధారంగా క్లూస్ సేకరించాం అని చెప్పారు.

12:58 - July 5, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' హీరోగా నటించిన 'జుడ్వా' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 1997లో విడుదలైన ఈ సినిమా సీక్వెల్ రూపొందబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో 'సల్మాన్' కాకుండా 'వరుణ్ ధావన్' ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ‘తాప్సీ’..’జాక్వెలిన్ ఫెర్నాండెజ్’ కథానాయికలుగా నటిస్తున్నారు. కానీ 'సల్మాన్' కూడా నటిస్తున్నాడన్న విషయం చిత్ర యూనిట్ రహస్యంగా దాచి పెట్టింది. ఆ రహస్యం బయటకు పొక్కింది. ‘సల్మాన్ ఖాన్' వంటి స్టార్ తో కలిసి నటించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించుకోలేదని నటి 'తాప్సీ' పేర్కొంది. తానే కాకుండా చిత్ర నటీ నటులు 'సల్మాన్'తో స్క్రీన్ షేర్ చేసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నారని, త్వరలో ఆయన కాంబినేషన్ లో షూటింగ్ ఉంటుందని..ఇందుకు అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు 'తాప్సీ' వెల్లడించింది.

టాలీవుడ్ వదిలిన 'తాప్సీ' బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకొంటోంది. వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే.

12:57 - July 5, 2017

కళ్యాణ్ రామ్ నటుడిగా..నిర్మాతగా బిజీగా కొనసాగుతున్నారు. ఆయన నిర్మాణంలో 'జూ.ఎన్టీఆర్' హీరోగా 'జై లవ కుశ' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో 'ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే షూటింగ్ లో 'కాజల్' కూడా పాల్గొంది. 'కళ్యాణ్ రామ్' జన్మదినం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ లో 'కళ్యాణ్' స్టయిలిస్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు 'కళ్యాణ్ రామ్' ట్వీట్ చేశారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని బ్లూ ప్రింట్ ఎంటర్ టైన్ మెంట్స్ పీపుల్స్ మీడిఆ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తమిళనాడు సీఎం పళని స్వామి కి చుక్కెదురు

ఢిల్లీ : తమిళనాడు సీఎం పళని స్వామి కి చుక్కెదురు అయ్యింది. విశ్వాస పరీక్ష ను సుప్రీం కోర్టు పరిశీలిస్తామంది.

పలు కారేట్ సూ్కళ్లకు అకున్ సబరా్వల్ లేఖ

హైదరాబాద్: పలు కారేట్ సూ్కళ్లకు అకున్ సబరా్వల్ లేఖ రాశారు. 8.9వ తరగతి విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారు.విద్యార్థుల ై టీచర్లు, యాజమాన్యం మానిటరింగ్ ఉండాలి. విద్యార్థుల దగ్గర వున్న క్యాష్ కార్డులను పరిశీలించాలని ఆ లేఖ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు

రాజన్న సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

 

సిరిసిల్ల : జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాన చేయనున్నారు.

నేడు అనంతలో చంద్రబాబు పర్యటన

అనంతపురం : నేడు అనంతపురంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుగు పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

08:22 - July 5, 2017

అనంతపురం : జిల్లా తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామసుబ్బారెడ్డి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ఆయన మృతి చెందాడు. తాడిపత్రిలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక పురుగుల మందు తాగి పడిపోవడంతో గుర్తించిన స్థానికులు ఆసుపత్రి కి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

భార్య, పిల్లలు హత్య చేసిన భర్త మృతి

అనంతపురం : జిల్లా తాడిపత్రిలో రామసుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రామసుబ్బారెడ్డి పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పురుగుల మందు తాగారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ఆయన మృతి చెందాడు. తాడిపత్రిలోని టీటీడీ కల్యాణ మండపం వెనుక పురుగుల మందు తాగి పడిపోవడంతో గుర్తించిన స్థానికులు ఆసుపత్రి కి తరలించారు.

08:14 - July 5, 2017

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 93 శాతం ఉన్నారని, కానీ వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడంలేదని, మతోన్మద పార్టీ బీజేపీతో టీఆర్ఎస్ దగ్గరవ్వలని చూస్తుందాని, ప్రజల సమస్యలు తీర్చాడం, ఎవరికి అన్యాయం జరిగిన పోరాటం కోసం టీ మాస్ ఫోరం ఏర్పాడిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకట్ అన్నారు. టీ మాస్ ఫోరం రాజకీయ పార్టీ కాదని ఆయన తెలిపారు. అవసరమైతే కాంగ్రెస్ కూడా టీ మాస్ ఫోరంలో చేరే ఆవకాశం ఉందని కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రశ్నించడం కోసం ఏర్పాడి న టీ మాస్ ఫోరం స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:01 - July 5, 2017

చిత్తూరు జిల్లాలో దాదాపు 47 మండలాల్లో 108 మహాభారత ఉత్సవాలు జరుగతాయిని, ఇది తమిళనాడు కల్చర్ అని 10 నుంచి 18 రోజులు జరుగుతాయని, అగ్రకుస్తుల వీధుల్లోకి మాత్రమే విగ్రహలు వెళ్తాయని, మహాభారత ఉత్సవాల్లో దళితులకు ఆవకాశం ఇవ్వడంలేదని మహాభారత పోరాట సమితి అధ్యక్షులు సుబ్రమణ్యం తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:00 - July 5, 2017

విశాఖ : విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ భూమిని కేటాయించింది. మెడ్‌ టెక్‌ పార్కుకు గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపన జరిగింది. మెడ్‌ టెక్‌ వైద్య పరికరాల తయారీ పరిశ్రమకు భారీగా భూమి కేటాయించారు. మొత్తం 270.7 ఎకరాలు ఈ సంస్థకు ఇచ్చారు. 471, 472, 475 నుంచి 477, 480/2, 481/1 సర్వే నంబర్లలో ఉన్న భూములు కేటాయించారు. దీనిలో ఎక్కువ భాగం ప్రభుత్వానికి చెందినదే. కొంత మేరకు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ భూములు ఉన్నాయి. ప్రైవేటు భూములు తక్కువ. అయితే మొత్తం భూమిలో 196 ఎకరాలను 172 మంది రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్టు అధికారులు నివేదికలు రూపొందించారు. మిగిలిన 75 ఎకారాల్లో ఎటువంటి సాగులేదని తేల్చారు. ఎకరానికి 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయల వంతున మొత్తం 23.52 కోట్ల పరిహారం చెల్లించారు. అధికారులు సృష్టించిన 172 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే పట్టాలు ఉన్నాయి. మిగిలిన అందరూ బినామీలే. ఈ పరిహారం చెల్లింపు వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నకిలీ రైతులను సృష్టించి
రెవెన్యూ అధికారులు నకిలీ రైతులను సృష్టించి తమకు తెలిసినవారి పేర్లను భూములు కోల్పోతున్న రైతుల జాబితాలో చేర్చి పరిహారం కాజేశారని ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు.మెడ్‌ టెక్‌ భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం నిజమైన రైతులకే పరిహారం చెల్లించామని చెబుతున్నారు. మెడ్‌ టెక్‌ భూముల పరిహారం చెల్లింపుపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ జరిపించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇస్తామంటున్నారు. మెడ్‌ టెక్‌కు కేటాయించిన భూములకు పరిహారం చెల్లింపులో వెలుగుచూసిన అకతవకల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

07:58 - July 5, 2017

గుంటూరు : ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మందు బాబుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను మార్చుకోవాల్సిన పని లేకుండా, రహదారుల పేర్లు మార్చాలని నిర్ణయించింది. దాని కోసం రాష్ట్ర రహదారులను డీ నోటిఫై చేయనుంది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఒరిస్సా లాంటి దాదాపు 8 రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో మొత్తం 4380 మద్యం దుకాణాలు, 831 బార్‌ షాపులు ఉన్నాయి. ఈ ఏడాది జులై ఒకటి నుండి నూతన మద్యం,బార్‌ పాలసీనీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సుమారు రెండు వేల షాపులకు, ఐదు ఏళ్ల వరకు లైసెన్స్‌ ను పొడగించింది. నూతన బార్‌ పాలసీలో కొత్తగా 76 బార్‌ షాపులకు అనుమతి ఇచ్చారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులను ఏర్పాటు చేయాలనే నిబంధనలను ఏపీ సర్కార్‌ అమలులోకి తెచ్చింది.

మహిళలా సంఘాలు ఆందోళనలు
ఓ వైపు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళలా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీనిపై స్పందించని ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటుకు డీ నోటిఫై విదానంతో ముందుకెళ్తుంది. క్యాబినేట్‌ సమావేశంలో కూడా ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రహదారులను వెంటనే ఢీ నోటిఫై చేయాలని స్వయంగా చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు. మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. గత మూడు రోజులుగా మద్యం దుకాణాలు మూసివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఊహించని స్థాయిలో పడిపోయాయి. దీంతో ఆదాయాన్ని కోల్పోతామనే భయంతో, రహదారుల పేర్లు మార్చి ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల ఆందోళనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహించడమేమిటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

మహిళలను కించ పరిచే విధంగా
అయితే మహిళలను కించ పరిచే విధంగా వ్యవహరించబోమని ఎక్సైజ్‌ శాఖ వారు ప్రకటిస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారు. మహిళల ఉద్యమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం పట్ల మహిళా సంఘాలు మరింత ఆందోళనలు చేసే అవకాశం ఉంది. కేవలం ఆదాయం కోసం రహదారుల పేర్లు మార్చడం ఏమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

07:56 - July 5, 2017

హైదరాబాద్ : సబ్బండ కళల సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లలో చేర్చితే .. ఆయన చరిత్ర కనుమరుగు కాకుండా ఉంటుందని సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ అన్నారు. దొడ్డి కొమురయ్య కష్టాలకు భయపడకుండా.. లక్ష్యం కోసం ముందుకు సాగారని ఆయన అన్నారు. 

07:55 - July 5, 2017

అనంతపురం :ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నవరం విమానశ్రయం నుంచి ఈ ఉదయం తొమ్మిదిన్న గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరే సీఎం.. 10 గంటల 10 నిమిషాలను పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు.ముక్తాపురంలో బలహీనవర్గాల కోసం నిర్మించిన ఎన్టీఆర్‌ కాలనీని చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. సకల వసతులతో నిర్మించిన ఎన్టీఆర్‌ కాలనీలోని ఇళ్లను పరిశీలిస్తారు. గ్రామంలో పచ్చదనం-పరిశుభ్రం పాటించేందుకు మొక్కులు నాటతారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై గ్రామస్థులతో చర్చిస్తారు. ఆ తర్వాత పర్వతదేవరపల్లిలో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. జిలాల్లో చేపట్టిన అభివృద్ధి పథకాల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరాపై ఆరా తీస్తారు. ఈ విషయంలో సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిస్తారు.పంటకుంటుల తవ్వకం, నీరు-చెట్టు వంటి పథకాల అమలుపై అధికారులతో చర్చిస్తారు. పర్వతదేవరపల్లి సభా వేదిక వద్దే వివిధ పథకాల కింది లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేసి, ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత పర్వతదేవరపల్లి నుంచి ముక్తాపురం హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి వస్తారు. పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుని, అమరావతి వెళ్తారు. 

07:54 - July 5, 2017

హైదరాబాద్ : 450 ప్లాట్ల ఉన్న హ్యాపీ అపార్టు మెంట్ల లో ఒక్క సీసీ కెమెరా లేదంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ భద్రత ఎలా ఉందో. ఆపరేషన్‌ అనంతరం రాజేంద్రనగర్‌లోని హ్యపీహోమ్స్‌ దగ్గర పరిస్థితిని వీడియోలో చూద్దాం.

07:53 - July 5, 2017

హైదరాబాద్ : రాజేంద్ర నగర్‌లో టెన్షన్‌ వాతావరణానికి తెరపడింది.మైలార్‌దేవ్‌పల్లిలోని ముతూట్ ఫైనాన్స్‌లో దోపిడీకి యత్నించిన దొంగలను పట్టుకునేందుకు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు కొనసాగిన ఆక్టోపస్‌ కమెండోల ఆపరేషన్‌లో నిందితులెవరూ పట్టుబడకుండానే ముగిసింది.

9బ్లాకుల్లో 450 ఫ్లాట్లు, 800 గదులు
రాజేంద్రనగర్‌లోని హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్లో మొత్తం 9బ్లాకుల్లో 450 ఫ్లాట్లు, 800 గదులను అణువణువూ సోదా చేశారు. ఐజీ కొత్తకోట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు, దాదాపు 40 మంది వరకు ఆక్టోపస్‌ కమాండోలు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషేన్‌లోకి దిగిన ఆక్టోపస్‌ బలగాలు.. దుండగుల దగ్గర మారాణాయుధాలు ఉండొచ్చన్న అనుమానంతో ఆచీతూచీ సోదాలు నిర్వహించింది. మొత్తం 450 ఫ్లాట్లలో ప్రతిగదినీ క్షుణ్నంగా పరిశీలించారు. ప్రతి ఇంట్లో వ్యక్తులు, వారి వివరాలను పరిశీలించారు. హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ ముందు ఆపిన టవేరా వాహనాన్ని కూడా బాంబ్‌స్క్వాడ్‌ క్షుణ్నంగా పరిశీలించింది. వాహనానికి లాక్‌ వేసి ఉండటంతో అద్దాలు పగులగొట్టిన తనిఖీ బృందాలు .. కారులోనుంచి వేట కొడవలి, బ్లేడులు, నకిలీ నంబర్‌ పేట్లు, బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడిన టవేరా వాహనం గుజరాత్‌కు చెందినదిగా గుర్తించారు.

వెనుదిరిగిన ఆక్టోపస్‌ కమెండోలూ
అయితే .. సెర్చ్‌ ఆపరేషన్‌లో అనుమానితులు ఎవరూ కనిపించలేదని పోలీసులు చెబుతుంటే.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ముగియడంతో హ్యాపీహోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టిన పోలీసులు బలగాలతో సహా.. ఆక్టోపస్‌ కమెండోలూ వెనుదిరిగి వెల్లారు. 

ముగిసిన పోలీసుల సెర్చ్ ఆపరేషన్

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని హ్యాపీహోమ్స్ అపార్ట్ మెంట్స్ లో ఆక్టోపస్ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 వరకు ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు, ఆక్టోపస్ బృందాలు 450 ప్లాట్లలొ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఐజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.

07:38 - July 5, 2017

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని హ్యాపీహోమ్స్ అపార్ట్ మెంట్స్ లో ఆక్టోపస్ సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 వరకు ఆపరేషన్ కొనసాగుతోంది. పోలీసులు, ఆక్టోపస్ బృందాలు 450 ప్లాట్లలొ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఐజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. మెదక్ జిల్లా మైలార్ దేవర పల్లి లో ముత్తుట్ ఫైనన్స్ లో దోపిడీ ఉపయోగించిన టవేరా వాహనాన్ని పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనం గుజరాత్ కు చెందినదిగా గుర్తించారు. టవేరా వాహనం నుంచి బ్లేడ్లు, వేటకొడవలి, ఫేక్ నంబర్ ప్లేట్ స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss