Activities calendar

06 July 2017

22:50 - July 6, 2017

గ్యాంగ్ టక్ : పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంపై సిక్కిం సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది. గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కారణంగా 60 వేల కోట్ల ఆదాయం నష్టపోయామని సిక్కిం ఆరోపిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిక్కిం భావిస్తోంది.  గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిక్కిం చెబుతోంది. గత 32 ఏళ్లలో 60 వేల కోట్లు నష్టపోయామని సిక్కిం వాదిస్తోంది. గత రెండు రోజులుగా సిక్కిం రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ విషయంలో తమకు న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సిక్కిం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. చైనా, బెంగాల్ మ‌ధ్య న‌లిగిపోవ‌డానికి ఇష్టం లేక సిక్కిం ప్రజ‌లు త‌మ రాష్ట్రాన్ని ఇండియాలో క‌ల‌ప‌లేద‌ని ముఖ్యమంత్రి చామ్లింగ్ చెప్పారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించిన చామ్లింగ్- ఇది ఎన్నో ఏళ్ల పోరాట‌మంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు ఆయ‌న లేఖ రాశారు.

 

22:48 - July 6, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇందిరాపార్క్ దగ్గర ధర్నాచౌక్‌ను యథాతథంగా పునరుద్ధరించాలని వామపక్షాలు హెచ్చరించాయి. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఈనెల 15న మరోసారి సమావేశాన్ని నిర్వహిస్తామని..అప్పటికీ సర్కారు స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
ధర్నాచౌక్‌ పరిరక్షణకై ఉద్యమం 
ధర్నాచౌక్‌ పరిరక్షణకై ఉద్యమం తీవ్రమవుతోంది. ఈ పోరాటం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కొద్ది నెలలుగా పోరాటం చేస్తున్న పరిరక్షణ కమిటీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ధర్నాచౌక్‌ను ఎత్తివేయోద్దనే విషయాన్ని మరోసారి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు పరిరక్షణ కమిటీ యోచించింది. ఇందులో భాగంగానే..సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కేసీఆర్‌ను కలవాలనుకున్న వామపక్ష నేతలను, ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ సభ్యులను ఎస్వీకే వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, జాన్‌వెస్లీ తదితరులను పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్ట్‌చేసి గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ఎస్వీకే వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 
పోలీసుల అరెస్టుపై తమ్మినేని మండిపాటు 
పోలీసులు అరెస్ట్‌ చేయడంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని..కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. ప్రజా ఉద్యమాలంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. పార్టీ కార్యాయలాల్లోకి పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. 
అరెస్ట్‌ చేయడంపై కోదండరాం ఆగ్రహం 
వామపక్షాల బృందాన్ని అరెస్ట్‌ చేయడంపై జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 15న మేధావులు, కళాకారులు, ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు.  అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే..ఈనెల 22న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు కోదండరామ్‌ తెలిపారు. 
ధర్నాచౌక్‌ను పునరుద్దరించాల్సిందే... 
ధర్నాచౌక్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్దరించాల్సిందే అని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తోంది. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

22:46 - July 6, 2017
22:42 - July 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది.. మంత్రులు కేటీర్ ఈటెల ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటైంది.. ఈ భేటీలో జీఎస్ టీ, రాష్ట్రంలో పరిశ్రమలకు రాయితీలు, వాటిపై పడే ప్రభావంపై చర్చించారు.. వచ్చే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంనాటికి జీఎస్ టీ రాబడులు, వాటి ప్రభావంపై అధ్యయనానికి దేశంలోని అత్యుత్తమ కన్సల్టెన్సీ కంపెనీ సేవలు ఉపయోగించుకోవాలని తీర్మానించారు.. జీఎస్ టీపై వివిధ రాష్ట్రాలు చేపడుతున్న చర్యలు, పరిశ్రమవర్గాల అభిప్రాయాలపై రెండు వారాల్లో నివేదిక ఇస్తామని సీఐఐ ప్రతినిధులు మంత్రులకు తెలిపారు..

 

22:34 - July 6, 2017

స్కూళ్లు పిల్లలంటే చాక్లెట్లు, కేకులు, పీజాలకు అలవాటైతారు... ఇదీ సాధారణం..కానీ స్కూల్ కాంపౌడ్ లోకి డ్రగ్స్ వచ్చి చేరుతున్నాయి. బాల్యాన్ని ఛిదిమేస్తున్నాయి. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. మేలుకోకపోతే కుటుంబాలు చితికి పోవడం ఖాయం. మహానగరం మత్తులో మునిగి డ్రగ్స్ బాధితుల అడ్డాగా పూర్తిస్థాయిలో మారకముందే మేల్కోవడం అవసరం ఉంది. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

22:22 - July 6, 2017

లీడర్ల వాస్తుకు జనం సొమ్ము ఖాళీ... జనానికి వాస్తుకు లేని సీఎంల కథ, రాబోతున్న రోబో పోలీసోళ్లు... రోబో పొలిటీషియన్స్ వొస్తే బెటరేమో, హైదరాబాద్ కీర్తి కిరీటంల డ్రగ్స్ పొగ.. నిజామాబాద్ కు తాకింది ఈ సెగ, తాళిబొట్లు తెంపేసుకున్న ఆడోళ్లు...ఉంటే సచ్చిపోతున్నరంట అని పుకార్లు, తొక్కిచ్చుకుంటే పిల్లలు పుడ్తరంట... ఏనుగుతోటి తొక్కిస్తే... ఒక్కసితం కాదా, పార్లమెంట్ల పలిగిన ఎంపీలు చెంపలు.. వెనిజులా దేశంలో గెదిమికొట్టిన జనం.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.....

 

22:11 - July 6, 2017

రెండు రెళ్ళు ఆరు”టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా టీమ్ సభ్యులు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:06 - July 6, 2017

ఏపీలో మద్యం విక్రయంపై వాడివేడి చర్చ జరిగింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు రామాదేవి, మానసిక వైద్య నిపుణులు, లాయర్ రాణి మోటూరు, టీడీపీ నేత పాల్గొని, మాట్లాడారు. మద్యాన్ని నియంత్రించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:01 - July 6, 2017

హైదరాబాద్ : విచ్చలవిడిగా ఇంటర్నెట్ యూజ్ చేయడం...ఎవరితోనూ కలువకుండా నిత్యం చాటింగ్‌లు చేస్తుండడం... సోషల్‌ మీడియాలో వస్తున్నవాటికి ఆకర్షితులు కావడం..రకరకాలుగా జరుగుతున్న నేరాలపట్ల ఆకర్షితులు కావడం..ఇప్పుడు మైనర్లపై ప్రభావం చూపుతున్నది ఇదే...కన్నవారి పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరుగుతున్న ఎన్నో దారుణాల్లో తాజా ఉదాహరణే జరిగిన ఘటన....
సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు..
ఇంటర్నెట్...ఇప్పుడు అరచేతిలోనే అంతా తెలిసిపోతుంది...చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు...ఇక ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు..ఏదీ తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు...అంతా కూర్చున్నచోటనే తెలుసుకునే వీలుంది..ఇది ఎంతో మంచిదే కాని..ఇప్పుడు అదే ఎన్నో దారుణాలకు కూడా కారణమవుతుంది...ఇప్పటికే ఎన్నో ఘటనలకు కారణం నెట్‌ యూజ్ చేయడమేనని తేలింది... ప్రస్తుతం చిన్నారులు సైతం నెట్‌ యూజ్ చేస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు..అందులో ప్రధానంగా సెక్స్...అక్రమసంబంధాలు...షార్ట్‌ఫిలింల రూపంలో ఉంటున్న ఆసక్తి పెంచుతున్న స్టోరీలు...వాటితోనే ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు....
చెడువైపు దృష్టి పెడుతున్న మైనర్లు..
హైదరాబాద్‌ పాతబస్తీలో జరిగిన ఘోరమైన ఘటన ఓ రకంగా హెచ్చరిస్తుంది...ఇప్పటికే ఎన్నో ఘటనలు కూడా జరిగాయి.. ఇదే పాతబస్తీలో ఓ మైనర్ ఈ మధ్యకాలంలోనే శునకంపై అసహజమైన కోర్కెలు తీర్చుకుంటూ దొరికిపోయాడు...ఇలాంటివెన్నో ..చెప్పలేనివెన్నో వెలుగులోకి రాలేదు..దీనంతటికీ కారణం మైనర్లలో పెరుగుతున్న చెడు స్వభావమే....
కన్నవారి పర్యవేక్షణ లేకపోవడం..
ఇక ఎందరో పిల్లలు చాలావరకు రాత్రిళ్లు సరిగా నిద్రపోకపోవడంతో పాటు తెల్లవార్లూ స్మార్ట్‌ ఫోన్లలో రకరకాల డాక్యుమెంట్లు చూస్తున్నట్లు తేలింది..దీంతో ఆరోగ్యం చెడిపోవడమేగాకుండా వారిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయనడానికి జరిగిన ఘోరమే ఓ ఉదాహరణ...ఏదో ఒక దేశంలో జరిగిన ఘటనపై వారిలో పెరుగుతున్న ఆసక్తితో చెడు ఆలోచనలకు కారణమవుతుంది...ఇలానే నేరాలకు తెగబడుతున్నారన్నది పోలీసు రికార్డులు చెబుతున్న సత్యాలే... ప్రధానంగా చెడు అలవాట్లు...చెడు సావాసాలు చేస్తున్న పిల్లలపట్ల కన్నవారు జాగ్రత్తగా ఉండాలి..వారిపై ఓ కన్నేసి ఉంచాలి..లేదంటే చిన్నారులు నేరాలు చేసేవరకు తెలియదు...దారుణాలకు తెగబడేవరకు అర్థం కాదు...సో...పేరెంట్స్ జాగ్రత్తా...

 

21:57 - July 6, 2017

హైదరాబాద్ : ఆ బాలుడిలో ఇలాంటి దారుణమైన ఆలోచన ఎలా వచ్చింది..? గతంలో కూడా అదే బాలుడు నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది...? ఇదే నిజమైతే చిన్న వయస్సులోనే రాక్షసంగా మారుతున్న మైనర్ల ఆలోచనా విధానం భయంకరంగా ఉంటుంది...
బాలుడిపై అసహజమైన కోర్కెలు
అసహజమైన కోర్కెలు... గతంలో కూడా నేరాలు.. దారుణాలకు పాల్పడ్డట్లు సమాచారం..
లోతుగా శోధిస్తున్న పోలీసులు... పాతబస్తీ బార్కాస్ సమీపంలోని స్కూలు భవనంపై చిన్నారి బాలుడిపై అసహజమైన కోర్కెలతో దారుణానికి తెగబడ్డ 17 ఏళ్ల మైనర్ విషయంలో పోలీసులు చాలా సీరియస్‌గా ఉన్నారు...ఈ మైనర్ గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది...ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురు చిన్నారులపై కూడా ఇలానే అఘాయిత్యానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు...
బాలుడు సైకోగా మారాడా..? 
17 ఏళ్ల బాలుడు సైకోగా మారాడా..? లేక అతనిలో వచ్చిన ఈ దారుణమైన ఆలోచనలతో రాక్షసంగా తయారవుతున్నాడాన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు..పదేళ్లలోపు బాలలను ఎంచుకుని వారికి కావాల్సినవి కొనిస్తాడు.. ఇలా వారితో ఆడుకుంటాడు..ఆ తర్వాత నిర్జనప్రదేశం..లేదంటే ఎవరూ చూడని ప్రాంతానికి తీసుకువెళ్లి అసహజమైన కోర్కెలు తీర్చుకుంటున్నాడు..ఇలా ఇప్పటికే రెండు మూడు ఘటనలకు పాల్పడ్డట్లు తెలుసుకున్న పోలీసులు బాధితులెవరో తెలుసుకునే పనిలో పడ్డారు..అయితే ఆ చిన్నారుల స్టేట్‌ మెంట్ రికార్డ్‌తోనే కేసును బలంగా చేసే ఉద్దేశ్యమని పోలీసులు చెబుతున్నారు...
పోలీసులు షాక్‌ 
17 ఏళ్ల బాలుడు చేస్తున్న ఇలాంటి ఘటన పోలీసులను షాక్‌కు గురిచేసింది..అప్పటివరకు తమ కొడుకు ఏమయ్యాడోనని ఆందోళన చెందిన కన్నవారు కూడా విషయం తెలిసి ఆందోళనకు గురయ్యారు....అదే సమయంలో నేరం చేసిన మైనర్  కన్నవారు కోలుకోలేకపోతున్నారు.

 

21:55 - July 6, 2017
21:53 - July 6, 2017

హైదరాబాద్ : వయస్సు పన్నెండే...కాని ఆలోచనలు మాత్రం క్రూరంగా ఉంటున్నాయి...వయస్సు 16...కాని వారు భయంకరంగా మారుతున్నారు.. ఢిల్లీ నిర్భయ కేసులో ఓ మైనర్‌ ఉండడం అప్పట్లోనే ఎందరో కన్నవారిలో కలవరాన్ని రేపింది...కాని అలాంటి మైనర్లు చాలా మంది ఉన్నారు.. తయారవుతున్నారు...కన్నవారు పర్యవేక్షణ లేకపోతే...పట్టించుకోపోతే...మన ఇంట్లో కూడా ఇలాంటి ఘోరాలు వినాల్సి వస్తుంది..ఇది నిజం..జరుగుతున్న వాస్తవం... సోషల్‌ మీడియా...ఇంటర్నెట్...అసహజ కోర్కెలతో ఉన్న డాక్యుమెంట్లు..ఇలా రకరకాల ప్రభావాలు ఇప్పుడు మైనర్లపై పడుతుంది...దాంతోనే నేరాలకు తెగబడుతున్నారు...దారుణాలకు పాల్పడుతున్నారు...హైదరాబాద్‌లో జరిగిన ఘటన ప్రతీ కన్నవారికి ఓ హెచ్చరికనే...
కన్నవారిలో ఆందోళన
పది రోజులవుతుంది..కొడుకు జాడ లేడు..పదేళ్ల బాలుడు ఏమయ్యాడోనని కన్నవారిలో ఆందోళన పెరుగుతుంది..వారి కలవరంతో పోలీసుల్లో టెన్షన్ పుట్టింది..సీసీ ఫుటేజీలన్నీ వెతికితే ఓ కెమెరాలో కన్పించాడు బాలుడు...అతనితో మరో మైనర్ ఉన్నాడు...ఆ బాలుడిని విచారిస్తే అసలు విషయం చెప్పాడు...తీసుకువెళ్లి అదృశ్యమైన బాలుడిని చూపించాడు..సజీవంగా కాదు..నిర్జీవంగా...ఈ ఘటన ఎవరికీ ఊహకందనిది...పోలీసులను షాక్‌కు గురిచేసింది...
పది రోజుల క్రితం అదృశ్యం..
హైదరాబాద్‌ పాతబస్తీ బార్కాస్‌లో మరో పదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు....మహ్మద్‌ ఖాన్ అనే పదేళ్ల బాలుడు గత నెల 28న మైదానంలో ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పోయి తిరిగిరాలేదు...అతని తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడంలేదంటూ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా  ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు...
ఫుటేజీలో కన్పించిన మరో బాలుడు..
పదేళ్ల బాలుడి మిస్సింగ్‌లో పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా చూస్తే 17 ఏళ్ల బాలుడు తీసుకువెళ్లినట్లు కన్పించింది..వెంటనే అనుమానంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే హత్య చేసినట్లు తేలింది..దీంతో ఖంగుతిన్న పోలీసులు హత్యా స్థలానికి చేరుకున్నారు.
బాలుడిని దారుణంగా హత్య చేసిన మైనర్..
బాలుడిని తన వెంట తీసుకువెళ్లిన 17 ఏళ్ల మైనర్‌ నేరుగా ప్రభుత్వ పాఠశాల భవనంపైన ఏర్పాటు చేసిన నీళ్లట్యాంక్‌ వెనుకకు తీసుకుపోయాడు...ఆ తర్వాత అసహజ లైంగిక దాడి చేసి విషయాన్ని ఎవరికైనా చెబుతాడని భయపడి ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

21:49 - July 6, 2017
21:44 - July 6, 2017

హైదరాబాద్ : సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తన రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ కోసం రజనీ అమెరికా వెళ్లారు. అక్కడ కారులో ప్రయాణిస్తుండగా తొలిసారిగా రజనీ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఫ్యాన్స్‌కి హాయ్‌ చెబుతూ నవ్వుతూ కనిపించారు. వారం రోజుల తర్వాత తలైవా తిరిగి ఇండియాకు రానున్నారు. 

 

21:42 - July 6, 2017

ఢిల్లీ : జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోది, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరగాల్సిన భేటిని చైనా రద్దు చేసింది. సిక్కిం సరిహద్దులో ఏర్పడ్డ వివాదం కారణంగా ప్రస్తుత వాతావరణం ద్వైపాక్షిక చర్చలకు అనుకూలంగా లేదని చైనా విదేశాంగా శాఖ అధికారులు పేర్కొన్నారు. జులై 7 నుంచి జర్మనీలోని హంబర్గ్‌లో జి-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదితో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతున్నారు. సిక్కిం సరిహద్దు డోకలమ్‌ ప్రాంతంలో ఇరుదేశాల సైనికులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డోకలమ్‌ ప్రాంతం నుంచి భారత బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే. 1890లో కుదిరిన‌ సినో, బ్రిట‌న్ ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘిస్తోంద‌ని ఆరోపించిన చైనా... రెండు దేశాల మ‌ధ్య కుదిరిన పంచ‌శీల ఒప్పందాన్ని గౌర‌వించాల‌ని సూచించింది.

 

21:41 - July 6, 2017
21:40 - July 6, 2017

ఢిల్లీ : పరిహారం చెల్లించడం ద్వారా రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం లభించదని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. రైతులపై రుణ భారం తగ్గించేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో తీసుకురావాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వ్యతిరేకం కాదని... ప్రభుత్వ పథకాల అమలుపై శ్రద్ధ వహించాలని పేర్కొంది. ప్రభుత్వం పనితీరు బాగానే ఉన్నప్పటికీ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయమని కోర్టు స్పష్టం చేసింది. రైతుల ఆత్మహత్యల చాలా తీవ్రమైన అంశమని...రాత్రికి రాత్రే దీన్ని పరిష్కరించడం సాధ్యం కాదని తెలిపింది. పథకాలు అమలు చేయడానికి కేంద్రానికి కోర్టు 6 నెలల సమయమిచ్చింది. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై రైతులకు అవగాహన కలిగిస్తున్నట్లు కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ కోర్టుకు తెలియజేశారు.

 

21:36 - July 6, 2017

హైదరాబాద్ : ప్రజా సమస్యలను పరిష్కరించడం పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు వామపక్షాల నేతలు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తివేయడంపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పలేదన్నారు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడా వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే ఈనెల 15న ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం మరోసారి ధర్నాచౌక్‌ పరిరక్షణ సదస్సును నిర్వహిస్తామన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరామ్‌. అలాగే ఈనెల 22న ఢిల్లీలో జంతర్‌మందర్‌ దగ్గర ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. 

 

21:34 - July 6, 2017

హైదరాబాద్ : విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ సరఫరాపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు.  స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు తేలితే గుర్తింపు రద్దు చేస్తామని.. యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటామని ప్రకటించారు. విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కడియం సూచించారు. 

 

21:31 - July 6, 2017

హైదరాబాద్ : ఆర్ధిక శాఖ అధికారులు డబ్బు ఇవ్వడమే కాదని... ఆ నగదు పక్కదోవ పట్టకుండా చూసుకోవాలన్నారు. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌... ఖర్చు పెట్టారో... లేదో చూడాల్సిన బాధ్యత అధికారులదే అని స్పష్టం చేశారు.. కొన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలొచ్చాయని... వాటిపై సమగ్ర నివేదిక అందించాలని అధికారుల్ని ఆదేశించారు.. హైదరాబాద్‌ ఎమ్ సీఆర్ హెచ్ ఆర్ డీలో ఆర్థిక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

 

21:26 - July 6, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది జలాల పంపకాలపై ట్రిబ్యునల్‌లో మొదటి రోజు వాదనలు ముగిశాయి. రేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మరోసారి వాదనలు వినిపించనున్నాయి. ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులను నాలుగు రాష్ట్రాలకు పరిమితం చేయాలన్న ఏపీ, తెలంగాణ అభ్యర్థనను ట్రిబ్యునల్‌ మరోసారి తిరస్కరించింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఏయే ప్రాజెక్టులకు ఎంత నీటిని కేటాయించాలో ట్రిబ్యునలే నిర్ణయించాలని తెలంగాణ సూచించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో తెలిపిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. విభజన చట్టంలోని సెక్షన్‌ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారిగా నిర్ధిష్ట కేటాయింపుల అర్థం ఏమిటో విచారించడానికి ట్రిబ్యునల్‌ అంగీకరించింది.   

 

21:25 - July 6, 2017

హైదరాబాద్ : భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. సాయంత్రం నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట, అమీర్‌పేట్, పంజాగుట్ట, మలక్‌పేట, కోఠి, నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌, బాగ్‌లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. 

 

21:23 - July 6, 2017

హైదరాబాద్ : జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ టీజర్‌ విడుదలైంది. బాబీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ జై, ల‌వ‌, కుశ.. అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించ‌నున్నట్టు సమాచారం. సెప్టెంబ‌ర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం విడుదలైన టీజర్‌ జై అనే పాత్రకి సంబంధించినది. మ‌రికొద్ది రోజుల్లో మ‌రో రెండు పాత్రల‌కి సంబంధించిన టీజర్‌లని కూడా రిలీజ్ చేయ‌నున్నట్టు సమాచారం. జై లవకుశ సినిమాలో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్, సీకె ముర‌ళీధ‌ర‌న్, బాలీవుడ్ యాక్టర్ రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

 

21:19 - July 6, 2017

ప్రకాశం : మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అరెస్టుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో హైడ్రామా నడిచింది. ఎమ్మెల్యే అరెస్టుపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ ముందు హడావుడి చేశారు. అంతలోనే బెయిల్‌ రావడంతో ఆర్ కే బయటకురావడంతో కార్యకర్తలు శాంతించారు. పెనుమాక భూసేకరణ సదస్సులో అధికారులతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. ప్రజాభిప్రాయ సేకరణలో మినిట్స్ రాయాలంటూ నిలదీసినందుకు ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. సీఎం చంద్రబాబు ఒత్తిడివల్లే అధికారులు తనపై కేసు పెట్టారని ఆర్ కే ఆరోపించారు.. 

 

21:15 - July 6, 2017

పశ్చిమగోదావరి : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సభలు, పాదయాత్రలకు అనుమతులు ఇవ్వలేమన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర సభకు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోలేదన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న హోమంత్రి చినరాజప్పతో టెన్ ఫేస్‌ టూ ఫేస్ నిర్వహించింది. జగనే మందకృష్ణ, ముద్రగడను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

 

21:10 - July 6, 2017

హైదరాబాద్ : మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని, మద్యం విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ అన్నారు. ఆల్కాహాల్  తక్కువగా ఉన్న తాటి, ఈత కల్లును ప్రోత్సహించి, మద్య ప్రభావాన్ని తగ్గించాలనే భావనతో బీర్‌ను హెల్త్ డ్రింక్ అనే మాటను వాడానని చెప్పారు. సుప్రీం నిబంధనలకు లోబడే రాష్ట్ర రహదారులను డీ నోటిఫై చేశామని చెప్పారు. జవహర్‌తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి మద్యం తాగకపోవడమే మంచిదన్నారు. 

 

20:59 - July 6, 2017

కర్నూలు : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా తయారైంది కర్నూలు జిల్లా కోడుమూరు వాసుల పరిస్థితి. చుట్టూ నీటివనరులు ఉన్నా గ్రామానికి మాత్రం మూడు నెలలుగా నీరు అందడం లేదు. ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా నీటి ఎద్దడి తప్పడంలేదని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 
ప్రజలు తీవ్ర ఇబ్బందులు 
కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొంది. గాజుల దిన్నె, సుంకేశుల జలాశయాల నుండి నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన నంద్యాల పథకం కూడా పని చేయకపోవడంతో నీరు లేక ప్రజలు ఆందోళన బాట పట్టారు.  
నంద్యాల నీటి పథకం 
నంద్యాల నీటి పథకం కింద కోడుమూరుతో పాటు 16 గ్రామాలున్నాయి. గాజుల దిన్నె జలాశయం నుండి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న కర్నూలుకు, డోన్‌కు నీటి సరఫరా జరుగుతుంది. అయితే 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడమూరుకు మాత్రం నీరు అందడం లేదు. ఓ వైపు దాహం దాహం అంటూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
3 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా
30వేల జనాభా ఉన్న కోడమూరులో కేవలం 3 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.  గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించక పోవడంతో ప్రజలు ఖాళీ బిందలతో పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడించారు. కర్నూల్- బళ్లారి ప్రధాన రహదారి పై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగడంతో మహిళలు వాగ్వాదానికి దిగారు. గాజుల దిన్నె జలాశయం నుండి నీరు వదిలి కోడమూరు గ్రామస్తుల దాహార్తిని తీర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.  

20:38 - July 6, 2017

ఢిల్లీ : ఓ యువతిని పట్టపగలే కత్తితో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన వెలుగు చూసింది. ఢిల్లీ షహదరాలోని మన్‌సరోవర్‌ పార్క్‌ ప్రాంతంలో ఉంటున్న 21 ఏళ్ల యువతి ఎయిర్‌ హోస్టేస్‌ చదువుతోంది. బుధవారం సాయంత్రం అసైన్‌ మెంట్‌ పూర్తి చేసుకుని ఇంటి నుంచి బయటకు బయలుదేరింది. 2 వందల అడుగులు దూరం వెళ్లేసరికి ఇంటి పక్కనే ఉండే ఆదిల్‌ కలిశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అంతే...కత్తితో ఆ యువతిపై ఆదిల్‌ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబందించిన విజువల్స్‌ సిసిటివీ కెమెరాకు చిక్కాయి. తమ కూతురును ఆదిల్‌ ఎందుకు చంపాడో తెలియదని పేరెంట్స్‌ చెబుతున్నారు. ఆదిల్‌కు నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. 

 

20:35 - July 6, 2017

నిజామాబాద్ : శిథిలావస్తకు చేరిన బస్టాండ్‌ను కూల్చి వేశారు. తాత్కాలికంగా బస్టాండ్‌ ఏర్పాట్లు చేశారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితిని కొనసాగిస్తున్నారు. వర్షాకాలం కావడం, చిరుజల్లులకే బస్టాండ్‌లో మురికి నీరు ప్రవహించడంతో.. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదీ నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ పరిస్థితి. 
ప్రారంభం కాని భవన నిర్మాణ పనులు
తెలంగాణ జిల్లాలోనే నిజామాబాద్‌ బస్టాండ్‌ పేరుగాంచింది. నిత్యం వేలాది మంది ఇక్కడి బస్సులలో ప్రయాణిస్తుంటారు. అలాంటి బస్టాండ్‌ రెండు నెలలుగా కష్టకాలంలో ఉంది. నాల్గు సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం శిథిలావస్తకు చేరుకోవడంతో పాత బస్టాండ్‌ను కూల్చివేశారు. ఇది జరిగి రెండు నెలలు కావస్తున్నా కొత్త భవనాన్ని మాత్రం అధికారులు నిర్మించడంలేదు. తాత్కాలికంగా రేకులతో కట్టిన షెడ్‌ను ఏర్పాటుచేశారు. దాదాపు 60 వేల నుండి లక్ష మంది ప్రయాణికులకు నీడనిచ్చే బస్టాండ్‌ నిర్మాణంపై జాప్యం జరుగుతోంది. 
వసతుల పేరుతో కోట్లు వసూలు 
పాత నిజామాబాద్‌ జిల్లాలో కామారెడ్డి, నిజామాబాద్‌ కలిపి మొత్తం ఆరు డిపోలు ఉన్నాయి. రోజుకి 75 లక్షల ఆదాయం సెస్‌ రూపంలో రోజూ 70వేల ఆదాయం వస్తుంది. మూడు సంవత్సరాలలో 7వందల 56 కోట్ల ఆదాయం వస్తుంటుంది. ఇంత ఆదాయం వస్తున్నా రోడ్డు రవాణా సంస్థ ప్రైవేటు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోంది. బస్టాండు ఆవరణలో పరిశుభ్రత, ప్రయాణికులకు వసతుల కల్పన పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తోన్న ఆర్టీసీ సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే గత మూడు సంత్సరాలుగా నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో 7 వందల56 కోట్లు వసూలు చేస్తున్నా ప్రయాణికులకు మాత్రం న్యాయం చేయట్లేదు. 
బస్సులకు ఇబ్బందులు 
బస్టాండ్‌ లోనికి వచ్చే దారిలో గుంతలు ఉండటంతో రాను పోను బస్సులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో మురికి నీరు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమల బాధతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేసినా అది కేవలం పై కప్పు నీడకే పరిమితమైంది. ఫ్లాట్‌ ఫారాలు ఉంటే ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలుస్తుంది. కాని ప్రస్తుతం అక్కడ పరిస్థితి భిన్నంగా మారింది. 
పనులు త్వరగా పూర్తి చేయాలి : ప్రయాణికులు 
నిత్యం వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వందలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే ఈ బస్టాండ్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఉన్నతాధికారులు, నాయకులు స్పందించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ను కూల్చివేసి దాదాపు రెండు నెలలు కావస్తుంది. కొత్త భవన నిర్మాణానికి ఇంకా టెండర్లు కూడా పిలువలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.  

20:29 - July 6, 2017
20:28 - July 6, 2017

హైదరాబాద్ : సోనియాగాంధీపై వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్‌ తీవ్రంగా ఖండించారు. భూమన వ్యాఖ్యలను జగన్‌ ఖండించి.. సోనియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. జగన్‌పై సీబీఐ ఎంక్వయిరీ వేయాల్సిన అవసరం సోనియాగాంధీకి ఏమి అవసరమని వీహెచ్‌ ప్రశ్నించారు. 

 

20:25 - July 6, 2017

గుంటూరు : జనావాసాల మధ్య లిక్కర్‌ షాపులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆందోళనలు మిన్నంటాయి. తుళ్లూరు సినిమా హాల్‌ కూడలిలో మద్యం షాపు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వెంటనే మద్యం షాపును వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 

 

20:22 - July 6, 2017

అనంతపురం : ఏపీలో మద్యం షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీలోని మద్యం దుకాణంపై మహిళల దాడి చేశారు. మద్యం సీసాలు, ఫర్నీచర్‌ పగులగొట్టారు. నివాస ప్రాంతాల మధ్య నుంచి మద్యం షాపులను తొలగించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. అనంతరం మహిళలంతా ఆర్డీవో కార్యాలయం చేరుకుని అక్కడ ధర్నా నిర్వహించారు.

 

20:17 - July 6, 2017

లక్నో : ఓ వైపు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసంపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగానే...మరోవైపు రామ మందిర నిర్మాణం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. తాజాగా రామాలయ నిర్మాణం కోసం మూడు ట్రక్కుల రాళ్లు అక్కడికి చేరుకున్నాయి. రామ జన్మభూమి న్యాస్‌ ప్రాంతంలో ఈ రాళ్లను దించారు. 2 వేల క్యూబిక్‌ ఫీట్లు ఉండే ఈ రాళ్లను రాజస్థాన్‌లోని భరత్‌ పూర్‌కు చెందిన ఓ సంస్థ పంపిందని విహెచ్‌పి పేర్కొంది. ఈ రాళ్లను తెచ్చేందుకు గత ఎస్పీ ప్రభుత్వం అనుమతించలేదు. యూపీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రామమందిర నిర్మాణం పనులు మళ్లీ పుంజుకోవడం గమనార్హం.

20:10 - July 6, 2017

కోల్ కతా : పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా బాదురియాలో జరిగిన మత ఘర్షణల్లో గాయపడ్డ ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం  ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టుతో చెలరేగిన మత ఘర్షణలతో బాదురియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.  అల్లరిమూకలు బాంబులు విసరడం, వాహనాలను తగలబెట్టడం ద్వారా విధ్వంసానికి పాల్పడుతున్నాయి. బుధవారం నాటి హింసలో ఆరుగురు గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నాలుగు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అల్లర్ల కారణంగా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 144 సెక్షన్‌ విధించారు. హింసాత్మక ఘటనలపై నివేదిక పంపాలని కేంద్ర హోంశాఖ మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై తృణమూల్‌- బిజెపిలు పరస్పర ఆరోపణలకు దిగాయి.  

 

20:02 - July 6, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఓ ఆర్మీ జవాను అదృశ్యమయ్యాడు. పుల్వామా ఆర్మీ క్యాంప్‌కు చెందిన జవాను జహుర్‌ ఠాకూర్‌ ఏకే-47 తుపాకీతో సహా అదృశ్యం కావడం ఆర్మీ వర్గాల్లో కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థలతో పాలుపంచుకునేందుకే అతడు ఆర్మీ క్యాంప్‌ నుంచి తప్పించుకుని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జహూర్‌ బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని సమాచారం. ఒకవేళ జహూర్‌ ఉగ్రవాద సంస్థలో చేరితే చాలా ప్రమాదమేనని...ఆర్మీకి చెందిన రహస్యాలు ఉగ్రవాదులకు చేరవేస్తాడన్న భయాందోళన వ్యక్తమవుతోంది. గతనెల కానిస్టేబుల్‌ సయీద్‌ నావీద్‌ ముస్తాక్‌ నాలుగు రైఫిళ్లతో పారిపోయి ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు.

 

19:59 - July 6, 2017

రాజస్థాన్ : భార‌త వైమానిక ద‌ళానికి చెందిన మిగ్‌-23 శిక్షణ విమానం రాజ‌స్థాన్‌లో కుప్పకూలింది. జోద్‌పూర్‌లోని బాలేస‌ర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే శిధిలాల నుంచి భారీగా మంట‌లు వ్యాపించాయి. నేల‌కూలిన‌ మిగ్-23 విమానం పూర్తిగా ధ్వంస‌మైంది. ఈ ప్రమాదం నుంచి  పైల‌ట్లు ఇద్దరూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.  సాంకేతిక లోపం త‌లెత్తడం వ‌ల్ల మిగ్‌-23 ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మంగళవారంనాడు ఎయిర్‌ ఫోర్స్‌ ఛాపర్ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
  

19:56 - July 6, 2017

ప్రకాశం : తొలి ఏకాదశి రోజున నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే తిరునాళ్లు అంబరాన్ని అంటుతాయి. ప్రకాశం జిల్లాలో కృష్ణానది పక్కన శ్రీశైలం ఉత్తర భాగంలో వెలిసిన పాలంకస్వామికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. 
తిరునాళ్లు 
ఆషాడ మాసం తొలి ఏకాదశి రోజున ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో తిరునాళ్లు జరుగుతాయి. కృష్ణా నది పక్కన శ్రీశైలానికి ఉత్తర భాగంలో పాలంక వీరభద్రస్వామి ఆలయం వెలిసింది. ఇక్కడ కొండపై నుంచి జారే నీళ్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ కొండను చుక్కల పర్వతంగా పిలుస్తారు. కొండ నుంచి జాలువారే నీటిచుక్కలను పట్టుకుంటే సంతానభాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇందుకోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. 
భక్తుల రద్దీ 
భక్తుల విశ్వాసంతో ఈ ఆలయానికి ప్రతి ఏడాది భక్తుల రద్దీ పెరుగుతోంది. దీనికి తోడు ఆలయం నల్లమల అటవీ అందాల మధ్య.. కృష్ణా  తీరం వెంట ఉండటంతో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ది చెందింది. ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా వేలాది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయం అటవీ ప్రాంతంలో ఉండటంతో కాలినడకన వచ్చే వారిలో ఎక్కువ మంది రెండు రోజుల ముందుగానే నల్లమలకు చేరుకుంటారు. ఈ క్షేత్రంలో రాత్రి బస చేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తిరునాళ్ల సందర్భంగా బోడ, నలగాటి వంశస్తులు అన్నదానం చేయడం ఆనవాయితిగా వస్తోంది. పాలంక క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

 

19:47 - July 6, 2017

హైదరాబాద్ : నీరు-మట్టి పథకంతో చంద్రబాబు సర్కార్‌ సాధించాలనుకున్న ప్రగతి నీరు గారిపోతోంది. చెరువులు తవ్వి గ్రామాలకు నీటి కొరత తీరుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానం మట్టి గొట్టుకుపోతోంది. నీరు మట్టి పేరుతో చేస్తోన్న మట్టి వ్యాపారం.. తెలుగు తమ్ముళ్లకు కనక వర్షం కురిపిస్తోంది. చెరువుల తవ్వకం పేరుతో గ్రామాల్లో దళితుల భూములపై.. పసుపు దండు విరుచుకుపడుతోంది. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపైనే కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత వాడలు దండాలు పెడుతోన్నా.. అధికార పార్టీ దందా హుందాగా సాగిపోతోన్న వైనంపై 10 టీవీ ప్రత్యేక కథనం. 
నీటి కోసం గ్రామాలు కటకట 
ఉన్న చెరువుల్లో నీరు లేదు. దీంతో గ్రామాలు నీటి కోసం కటకటలాడుతున్నాయి. అయితే కొత్త చెరువులు తవ్వి దాహం తీరుస్తామని ఏపీ సర్కార్‌ దొడ్డి దారి పథకాలకు రూపకల్పన చేసింది. ఆ పథకం పేరే నీరు మట్టి. మట్టితో నవ్యాంధ్రలో ప్రగతికి మెట్లు కట్టిస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. కానీ ఈ విషయంలో తెలుగు తమ్ముళ్లు పండగ చేసుకుంటున్నారు. 
చెరువుల పేరుతో దందా 
చంద్రబాబు వాగ్దానాల అండతో.. గ్రామాల్లో చెరువుల పేరుతో జరుగుతోన్న దందా మామూలుగా లేదు. భూమిలో నీటి నిల్వలు పెరిగేలా చేసి.. చెరువుల పూడిక తీసి ఆ మట్టిని మళ్లీ పొలాల్లో వేయాలన్నది పథకం లక్ష్యం. కానీ సర్కార్‌ అండతో తెలుగు తమ్ముళ్లు మట్టిని.. తమ పొట్ట నింపుకోవడానికి కొట్టుకుపోతున్నారు. ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి హద్దూ అదుపూ లేకుండా కొనసాగుతోంది. ఇక్కడ చెరువుల త్వవకం పేరుతో తెలుగు తమ్ముళ్లు దళితుల భూముల్ని టార్గెట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోన్న పర్చూరు మండలంలోని దేవర పల్లి దళితుల భూముల అంశం నీరు మట్టి పరిధిలోనిదే. ఆరు దశాబ్దాలుగా దళితుల ఆధీనంలోని భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, వాటిని నీరు-మీరు పేరిట లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 
దందా మొదలు పెట్టిన పసుపు దళాలు 
ఇక్కడ ఆరు దశాబ్దాలుగా దళితులు సాగు చేసుకుంటోన్న భూమిని.. నీరు మట్టి కోసం లాగేసుకునేందుకు పసుపు దళాలు దందా మొదలెట్టాయి. సాగు భూమిని వదిలేసి వెళ్లిపోవాలని దళితులకు హెచ్చరికలందాయి. రెండేళ్లుగా దేవరపల్లి భూముల్లోకి దళితులను వెళ్లనివ్వకుండా తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక వారంతా సీపీఎం పార్టీని ఆశ్రయించారు. దళితుల సమస్యను పరిష్కరించేందుకు సీపీఎం శ్రేణులు దేవరపల్లి దళితుల భూమిని సందర్శించే ప్రయత్నం చేశాయి. అయితే భూమి దగ్గరకు వస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని.. స్థానిక అధికార నేతల ప్రాబల్యంతో సీపీఎం నాయకులను అడ్డుకున్నారు. దేవరపల్లికి వెళ్లే హక్కు లేదని ప్రజా స్వామ్యానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు. 
ఆగని కమ్యూనిస్టుల పోరాటం 
తపోలీసులు వందలాది మందిని మోహరించి ఆంధ్రప్రదేశ్‌ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుతో పాటు.. జిల్లా నాయకత్వాన్ని బందీలుగా తీసుకెళ్లారు. అయితే దేవరపల్లి భూముల వ్యవహారంలో కమ్యూనిస్టుల పోరాటం ఆగలేదు. మరోసారి దేవరపల్లిలో బాధిత దళిత రైతులతో సీపీఎం పార్టీ సమావేశం ఏర్పాటు చేసింది. నిషేధిత భూమిగా ప్రభుత్వం దళితుల సాగు పొలాల్లో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించింది. కమ్యూనిస్టులు ప్రారంభించిన దేవరపల్లి దళిత భూముల ఉద్యమంలో అఖిల పక్షాలు భాగస్వాములుగా చేరాయి. దళిత రైతులు, గ్రామస్థులు, వివిధ సంఘాలు ఏకమయ్యాయి. పోలీసులతో పాటు, రెవెన్యూ అధికారులను కూడా నిలదీశాయి. 
దళితుల భూములు మాయం 
జిల్లాలోని నియోజకవర్గాల్లో నీరు మట్టి కోసం దళితుల భూములు మాయమైపోతున్నాయి. ఎక్కడా పథకం లక్ష్యాలు అమలు జరగలేదు. ఒక పర్చూరు నియోజకవర్గంలోనే రెండొందలకు పైగా చెరువులు తవ్వి, మట్టి అమ్ముకున్నట్టు లెక్కలు తేల్చాయి. తద్వారా 25 కోట్ల రూపాయల మట్టి సొమ్ము స్థానిక ఎమ్మెల్యే జేబులోకి వెళ్లినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

 

19:42 - July 6, 2017
17:38 - July 6, 2017
17:35 - July 6, 2017
17:35 - July 6, 2017

హైదరాబాద్ : విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సూచించారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వార్తలు బాధాకరమని వెల్లడించారు. సర్వ శిక్షా అభియాన్ లో అన్ని జిల్లాల డీఈవోలతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కు బానిసైన వారిని గోప్యంగా విచారించాలని, డ్రగ్స్ బాధితులను బయటకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరి తప్పు వల్ల విద్యా సంస్థలపై వార్తలు రాయడం తగదని, దీనితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ వ్యవహారాన్ని విద్యాశాఖ సీరియస్ గా తీసుకోవాలని, డ్రగ్ మాఫియా స్కూల్ ఆవరణలోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే గుర్తింపు రద్దు చేస్తామని, స్కూల్ యాజమాన్యం..తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టాలన్నారు.

17:29 - July 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. కెల్విన్ ముఠాను పట్టుకున్న అనంతరం విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ రాకెట్ లో సినిమా పరిశ్రమలకు చెందిన వారు..కాలేజీలు...స్కూళ్లకు చెందిన విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడం సంచలనం కలిగిస్తోంది. దీనిపై ప్రభుత్వం సిట్ నియమించింది. పోలీసులు దర్పాప్తు ముమ్మరం చేపట్టారు. అందులో భాగంగా గురువారం ఏఎస్ రావ్ నగర్ లో అల్వాల్ కు చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద 62 ఎల్ఎల్ డీ డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను కాసేపట్లో మీడియాకు తెలియచేయనున్నారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై తెలియరావడం లేదు.

17:23 - July 6, 2017

హైదరాబాద్ : వడ్డీ వ్యాపారుల వేధింపులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. నగరంలోని సరూర్ నగర్ లో వడ్డీ వ్యాపారులు ఓ వ్యక్తిపై దాడి చేయడం..దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. వడ్డీ వ్యాపారులైన జంగారెడ్డి..దేవేందర్ రెడ్డిలు సోదరులు. వీరివద్ద జయశంకర్ అనే వ్యక్తి రూ. 2లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిమధ్య ఆర్థిక లావాదేవీలపై కోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం జయశంకర్ పై వడ్డీ వ్యాపారులు జయశంకర్ పై దాడి చేశారు. ఇష్టమొచ్చినట్లు పిడిగుద్దులు కొట్టారు. అక్కడనే ఉన్న ఓ మహిళ ఆపేందుకు ప్రయత్నించారు. రెండు లక్షల అప్పుకు మూడు లక్షలు చెల్లించినా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. దాడి జరిగిన విషయాన్ని జయశంకర్ సరూర్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం బాధితుడు రాచకొండ పీఎస్ కార్యాలయానికి వెళుతున్నట్లు తెలుస్తోంది.
దాడికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో చూడండి...

16:37 - July 6, 2017

హైదరాబాద్ : మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు చేస్తున్న ఆందోళనపై సీఎం చంద్రబాబునాయుడు కదిలారు. మహిళల నిరసనలపై సీఎం దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌, అధికారులతో చంద్రబాబునాయుడు సమీక్ష జరుపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:29 - July 6, 2017

నిజామాబాద్ : దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి.. అంతలోనే ఆవిరవుతున్నాయి. ఫలితంగా జూన్ నెలలో సగటు వర్సపాతం కంటే నాలుగు సెంటి మీటర్ల లోటు ఏర్పడింది.  ఈ సీజన్లో ఇప్పటి వరకు అడపాదడపా జల్లులు మినహ  భారీ వర్షాలు కరువయ్యాయి. నిజామాబాద్‌జిల్లాలో పలు జలాశయాలు నీరులేక వెలవెలబోతున్నాయి.  ఈనెలలో కూడా ఇదే పరిస్తితి కొనసాగితే   కరువు తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ముఖం చాటేసిన వర్షాలు 
వానలు మొఖం చాటేయడంతో నిజామాబాద్‌జిల్లా రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు సాధారణంకంటే తక్కువ వర్షపాతం కురవడంతో తొమ్మిది మండలాల్లో ఖరీఫ్‌ సాగు అనుమానంగా మారింది. 15 రోజులుగా నల్లటి మేఘాలు  కమ్మకుంటున్నా చినుకులు నేల రాలడంలేదు.  వచ్చినట్లే వచ్చిన కారు మబ్బులు దొబుచులాడి వెళ్లిపోతున్నాయి.
దుక్కుల దాహాన్ని కూడా తీర్చని జల్లులు 
జూన్ నుంచి జూలై ఒకటి తేది వరకు జిల్లా వ్యాప్తంగా 20 సెంటిమీటర్ల వర్షం కురువాల్సి ఉండగా.. 16 సెంటి మీటర్ల  మాత్రమే నమోదయింది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి చుక్కనీరుకూడా రావడంలేదు. అటు ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా దాదాపు  4లక్షల 89వేల ఎకరాల్లో పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసారు.  గత నెల రోజులుగా కురిసిన వర్సాలు ఎండిన దుక్కుల  దాహన్ని కూడా తీర్చ లేకపోయాయని నిజామాబాద్‌ జిల్లా రైతులు అంటున్నారు. 
9 మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం
నిజామాబాద్‌ జిల్లాలో  మొత్తం 27 మండలాలు ఉండగా ..ఇప్పటికే తొమ్మిది మండలాలు లోటు జాబితాలో చేరాయి. బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల ,మోర్తాడ్, కమ్మర్ పల్లి ,ఆర్మూరు మండలాలతోపాటు  నందిపేట్, సిరికొండ, మండలాల్లో కూడా అరకొరగానే వర్షపాతం నమోదవుతోంది.  ఇక ఇందల్వాయి, నిజామాబాద్  నార్త్, నిజామాబాద్ సౌత్ ,నిజామాబాద్ రూరల్ , మోపాల్ ,దర్పల్లి , బీంగల్ మండలాతోపాటు   వర్ని, ఎడపల్లి, రుద్రూరు, వేల్పూరుతో కలిపి మొత్తం 13 మండలాల్లో సాధారణంకంటే తక్కువగా  వర్షాలు కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం శ్రీరాసాగర్‌లో 10.50 టీఎంసీలు నీరుఉన్నా.. అది తాగునీటికే సరిపోతాయంటున్నారు అధికారులు.. కనీసం 30 టీఎంసీల వరకు డాంలోకి నీరు చేరితేనే ఖరీఫ్‌లో రైతులకు నీరవ్వడానికి అవకాశం ఉందంటున్నారు. 
రైతుల దిగాలు
జూన్‌నెల మొదట్లో ఒకటి రెండు రోజులు మురిపించిన వానలతో చాలా ప్రాంతాలలొ విత్తనాలు వేయటం కూడా పూర్తయింది. ప్రస్తుతం సోయా పత్తి మొక్కజొన్న పసుపు కంది తదితర పంటలు మొలకెత్తే దశలొ ఉన్నాయి.  అయితే వర్షాల జాడ లేకపొవటంతో రైతులు దిగాలుపడుతున్నారు. మబ్బులు కమ్ముతున్న ఆకాశంవైపు ఆశగా చూస్తున్నారు. 

16:10 - July 6, 2017

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర విడుదల చేసే నిధులు మరికొంత ఆలస్యం కానున్నాయి.. కేంద్ర ఆర్థిక శాఖకు పోలవరం ప్రాజెక్టు ఖర్చు దస్త్రం చేరింది.. 3వేల 791కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం వివరాలు పంపింది.. ఈ దస్త్రాన్ని కేంద్ర జలవనరుల శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది.. మరోవైపు పోలవరం పనులు మరో ఏడాది కొనసాగించుకునేందుకు కేంద్ర అటవీశాఖ అనుమతులు మంజూరు చేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మంద్ సార్ లో రైతుల భారీ నిరసన ప్రదర్శన..

మధ్యప్రదేశ్ : రాజస్థాన్..హర్యానా..ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు మంద్ సార్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసన ర్యాలీలో మేధా పాట్కర్ తదితరులు పాల్గొన్నారు.

16:00 - July 6, 2017
15:51 - July 6, 2017

హైదరాబాద్ : ధర్నా చౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో.. కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పోలీసులు కేసీఆర్‌ను కలవకుండా అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, ప్రసాదరావు, జాన్ వెస్లీ, శ్రీరాం నాయక్‌ లను అరెస్ట్‌ చేసి, గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ్మినేని టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చే అలవాటు లేదన్నారు. సీఎం ఉన్నా లేకపోయినా.. సీఎం ఆఫీస్ లో మెమోరండం ఇచ్చివద్దామనుకున్నామని తెలిపారు. మెమోరండం తీసుకోవడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజా ఉద్యమాలు అంటే సీఎం భయపడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని తెలిపారు. ధర్నా చౌక్ ను పునరుద్ధరణ చేయలేదన్నారు. మెమోరండం ఇవ్వడానికి సిద్ధమైన తమను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సీఎం ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
ప్రొ.విశ్వేశ్వరరావు...
భారత రాజ్యాంగం ప్రకారం.. సీఎం పబ్లిక్ సర్వెంట్ అని అన్నారు. ఎక్కడా ఇలాంటి సీఎం లేడన్నారు. సీఎంను కలుస్తామని ప్రెస్ రిలీజ్ కూడా చేశామని చెప్పారు. అపాయింట్ మెంట్ ఇవ్వాలని సీఎంకు ఫోన్ చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఇలాంటి సీఎం లేడన్నారు. సీఎం చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

జేఎన్టీయూ..ఓయూ వీసీలతో సమావేశం..

హైదరాబాద్ : రేపు జేఎన్టీయూ, ఓయూ వీసీలతో ఉన్నత విద్యా మండలి సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ వార్తలపై చర్చ జరిగింది.

ప్రజా ఉద్యమాలంటే కేసీఆర్ కు భయం - తమ్మినేని..

హైదరాబాద్ : ప్రజా సమస్యలను సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలంటే కేసీఆర్ భయమని, ఉద్యమాలను..సమ్మెలను అణిచివేస్తున్నారని తెలిపారు. కనీసం వినతిపత్రం కూడా ఇవ్వకుండా అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలతో చర్చించి ధర్నా చౌక్ ను కొనసాగించాలని లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.

15:43 - July 6, 2017

వేసవికాలం వెళ్లిపోయింది..వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షకాలంలోనే అత్యధికంగా అనారోగ్యాలు వ్యాపిస్తుంటాయి. అనారోగ్యం బారిన పడగానే వైద్యుల దగ్గరకు పరిగెడుతుంటుంటారు. అంతేగాకుండా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో పలు ఇబ్బందులు పడుతుంటారు. వర్షంలో దుస్తులు తడవడం..షూలు తడిసిపోవడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కొన్ని సమస్యల నుండి దూరమయ్యే అవకాశం ఉంది.
యువతులకు ఈ కాలంలో దుప్పట్టాలు అంతగా సూట్ కావు. షార్ట్ కుర్తీలు..లెగ్గిన్స్..చుడిదార్ వేసుకుంటే బెటర్.
దుస్తులు తడిసినా త్వరగా ఆరిపోవాలంటే చిఫాన్..సిల్క్..ఫ్రాబిక్ కాటన్ దుస్తులు ధరిస్తే బాగుంటుంది.
వర్షాకాలంలో తడవగానే కొంత డల్ గా..నీరసంగా కనిపిస్తుంటారు. అందుకని డార్క్ కలర్ లో ఉండే లెగ్గిన్స్..చుడీదార్స్ వేసుకొని చూడండి.
జీన్స్, లాంగ్ స్కర్ట్స్, అధిక మెటీరియల్‌తో కుట్టిన డ్రెస్స్‌లు ఈ కాలంలో ఇబ్బందిగా ఉంటాయి.
పసుపు, ఆరెంజ్, బ్లూ మిక్స్ చేసిన రంగులు, ఎరుపు, పింక్, దుస్తులను ధరించి తేడా ఏంటో చూడండి.
వర్షాకాలంలో బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రెయిన్ కోట్ జాకెట్స్..గొడుగులు..జెల్లీ షూ వంటివి చక్కగా ఉపయోగపడుతాయి.

15:23 - July 6, 2017

గుంటూరు : వేదికగా జాతీయ స్ధాయి ప్లీనరీ సమావేశాలకు సిద్ధం అవుతోంది వైసిపి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో ఈనెల 8,9 తేదీల్లో జరగనున్న ప్లీనరీ సమావేశాలకు ఏపీ, తెలంగాణ నుంచి 30 వేలమంది 
నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. వైసిపి అధినేత జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్లీనరీని విజయవంతం చేయడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీ, తెలంగాణకు సంబంధించి 18 తీర్మానాలతో ఈ సమావేశాలు జరగనున్నాయి. 
చివరి దశకు చేరుకున్న ఏర్పాట్లు
ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరులో జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 12 ఎకరాల స్థలంలో ప్లీనరీకి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్లీనరీకి ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 30 వేల మంది నేతలు, కార్యకర్తలు వస్తారని అంచనా పార్టీ అధిష్టానం వేస్తోంది. 
నాలుగు కేటగిరీల్లో పాస్‌లు
వైసిపి ప్లీనరీకి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ సంస్థల ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. అయితే వచ్చే అతిధులకు నాలుగు కేటగిరీల్లో పాస్‌లు ఇవ్వనున్నారు. వివిఐపి, విఐపి, స్పెషల్, డెలిగేషన్ పాస్‌లుగా విభజించారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్లీనరీని విజయవంతం చేయడం కోసం మొత్తం 18 కమిటీలను ఏర్పాటు చేశారు. భోజన కమిటీ, తీర్మానాల కమిటీ, సభ నిర్వహణ కమిటీ, వేదిక కమిటీ, పార్టీ అధ్యక్ష ఎన్నిక కమిటీ ఇలా ఏర్పడిన కమిటీలు ఆయా పనుల్లో నిమగ్నమయ్యాయి. ఇక ప్లీనరీలో కీలకమైన 18 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాల్లో 16 ఏపికి, రెండు తెలంగాణకు రెండు సంబంధించినవి ఉంటాయని సమాచారం. 
పార్టీ బలోపేతంపై చర్చ
ఇక ప్లీనరీలో ప్రధాన ఎజెండాగా పార్టీ బలోపేతంపై చర్చ జరగనుంది. వైసీపీ ప్లీనరీలో ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగట్టనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాల విషయంలో భవిష్యత్ కార్యాచరణను ప్లీనరీలో ప్రకటించనున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే దానిపై చర్చ జరగనుంది. ఇక 9వ తేదీన వైసిపి కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఎన్నిక ప్రక్రియ లాంఛనం కావడంతో వైఎస్.జగన్ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. 

 

15:14 - July 6, 2017

ఆషాడ మాసం వచ్చేసింది..ఈ మాసం వచ్చిదంటే చాలు ఆడవారి అరచేతుల్లో 'గోరింటాకు' మెరిసిపోతూ ఉంటుంది. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారనే సంగతి తెలిసిందే. పండుగలు..శుభకార్యాల్లో మహిళలు తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీష్మంలో శరీరం బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు. అంతేగాకుండా నిత్యం పనుల్లో ఉండే ఆడవారి చేతులు..పాదాలు పగులుతుంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకు 'గోరింటాకు' చక్కటి పరిష్కారం.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
గోరింటాకు ఆకులను నీళ్లు పోసి బాగా నూరి అందులో నిమ్మరసం కలుపుకోవాలి. చేతులు..కాళ్లు..పాదాల వరకు రుద్దితే మంటలు తగ్గుతాయి.
గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది.
గోరింటాకుని రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో పెట్టుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
మార్కెట్‌లో దొరికే కోక్, పౌడర్లకంటే గోరింటాకు చెట్టు నుంచే ఆకులు తెంపుకొని పెట్టుకునేందుకు ప్రయత్నించండి.

15:04 - July 6, 2017

తమ పాత్రల కోసం నటీ నటులు ఎంతో కష్ట పడుతుండడం చూస్తూనే ఉంటాం. ఆయా పాత్రల్లో జీవించడం కోసం తమ శరీరాకృతిని కూడా మార్చుకొనేందుకు కూడా వెనుకాడరు. అందులో హీరోలు ముందుంటారు. తామేమీ తీసిపోలేదంటూ హీరోయిన్లు కూడా అందుకనుగుణంగా రిస్క్ లు తీసుకుంటున్నారు. కానీ ఏకంగా ఓ హీరోయిన్ ఓ పాత్ర కోసం గుండు కొట్టించుకొంటోందనే వార్త హల్ చల్ చేస్తోంది.
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘పూర్ణ’ హీరోయిన్ గా నటిస్తోంది. కొంబన్, మారుదు లాంటి చిత్రాలు రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో 'కోడీవీరన్' సినిమా రూపొందుతోంది. శశికుమార్ నటిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ‘పూర్ణ’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 'పూర్ణ' పాత్రే కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకోసం 'పూర్ణ' తన జుట్టును త్యాగం చేసి.. గుండు కొట్టించుకుంది. పాత్ర డిమాండ్‌ని బట్టి గుండు చేయించుకున్నట్టు 'పూర్ణ' వెల్లడించింది. మరి ఆమె సాహసం ఏ మాత్రం ఫలిస్తుందో వేచి చూడాలి.

మద్యం ఆందోళనలపై బాబు నజర్..

విజయవాడ : మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళలు చేస్తున్న ఆందోళనపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్, అధికారులతో బాబు సమీక్ష నిర్వహించారు.

రైతులకు పాదాభివందనం - హరీష్..

హైదరాబాద్ : భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఏడాదికి మూడు లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమని, పాలమూరు ప్రాజెక్టుని పది రోజులకు ఒకసారి పరిశీలిస్తామన్నారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులపై మాటలే పారించాయని, తమ ప్రభుత్వం కాలువల్లో నీరు పారిస్తోందన్నారు. ప్రాజెక్టుల పనులను ఆపాలని కేసులు వేశారని, ఈ ఏడాది కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చి తీరుతామన్నారు. ఒక్క కల్వకుర్తి ప్రాజెక్టు కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

14:52 - July 6, 2017

నల్లగొండ : జిల్లాలోని ఆత్మకూరులో అమల అనే యువతి ఆమరణ దీక్షకు దిగింది. ఎంపీపీ లక్ష్మి కుమారుడు సతీష్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని అమల ఆరోపిస్తోంది. కులాలు వేరు కావడంతో తమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని అమల చెబుతోంది. ఈనెల 2న ఆందోళన చేపట్టిన అమలకు న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చారు. అయితే పోలీసులు తనను మోసం చేశారంటూ అమల ఆమరణ దీక్ష చేస్తోంది. అమల చేపట్టిన దీక్షకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. 

 

డ్రగ్స్ వార్తలు బాధాకరం - కడియం..

హైదరాబాద్ : విద్యాసంస్థల్లో డ్రగ్స్ వార్తలు బాధాకరమని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో విచారణ సంస్థలు..మీడియా సంయమనం పాటించాలన్నారు. డ్రగ్స్ కు బానిసైన వారిని గోప్యంగా విచారించాలని, డ్రగ్స్ బాధితులను బయటకు తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరి తప్పు వల్ల విద్యా సంస్థలపై వార్తలు రాయడం తగదని, దీనితో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ వ్యవహారాన్ని విద్యాశాఖ సీరియస్ గా తీసుకోవాలని, డ్రగ్ మాఫియా స్కూల్ ఆవరణలోకి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

14:49 - July 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్‌  విశ్వేశ్వరరావు, ప్రసాదరావు, జాన్ వెస్లీలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. శ్రీరాం నాయక్‌ను అరెస్ట్‌ చేసి, గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో.. కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పోలీసులు కేసీఆర్‌ను కలవకుండా అడ్డుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:44 - July 6, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ సస్పెన్షన్ కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. కేసు హైకోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని రోజాకు కోర్టు సూచించింది. రోజా క్షమాపణ పత్రాన్ని స్పీకర్‌కు పంపించామని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే తమకు     ఎటువంటి క్షమాపణ పత్రం అందలేదని అసెంబ్లీ తరపు న్యాయవాది చెప్పారు. దీంతో కోర్టులోనే ప్రభుత్వ న్యాయవాదికి క్షమాపణ పత్రాన్ని అందజేశారు. క్షమాపణ పత్రాన్ని సంబంధిత శాఖలకు పంపించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. గతంలో అసెంబ్లీలో అభ్యంతరకరంగా ప్రవర్తించారని, అనుచిత వ్యాఖ్యలతో సభ గౌరవాన్ని కించపరిచారని రోజాపై ఏపీ అసెంబ్లీ సస్పెన్షన్ వేటు వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:26 - July 6, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'త్రివిక్రమ్ శ్రీనివాస్' ల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. నిరాశపరిచిన ‘కాటమరాయుడు' అనంతరం 'పవన్' చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. చిత్రంలో 'పవన్' ఇంజినీర్ గా నటించబోతున్నాడని టాక్. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకన్నట్లు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్‌ను బల్గేరియాలో జరపనున్నారు.
ఈ షూటింగ్ కోసం యూనిట్ బల్గేరియా వెళ్లనుంది. ఇటీవలే 'ఖైదీ నెం 150’ సినిమాలోని పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. ఇక సినిమాలో పలు విశేషాలు కూడా చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. ‘వెంకటేష్' కీలక పాత్ర పోషించనున్నారి..’పవన్' ఓ పాట కూడా పాడుతారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్..అనూ ఇమ్మాన్యూల్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారట.

అమలకు మహిళా సంఘాల సంఘీభావం..

నల్గొండ : ఆత్మకూరులో ఎంపీపీ లక్ష్మీ బ్రహ్మం గౌడ్ ఇంటి ముందు మహిళా సంఘాలతో అమల ఆందోళన చేపట్టింది. ఈనెల 2వ తేదీన నిరసన చేపట్టిన అమలకు న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు. ఎంపీపీ లక్ష్మీ బ్రహ్మంగౌడ్ కుమారుడు సతీష్ ప్రేమ మోసం చేశాడంటూ, కులాలు వేరు కావడంతో వివాహానికి ఒప్పుకోడం లేదని అమల నిరసన చేపట్టింది.

చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం..

కరీంనగర్ : చిగురుమామిడిలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం జరిపాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.

తమ్మినేని అరెస్టు..

హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొ.ప్రసాదరావు, జాన్ వెస్లీ, శ్రీరాం నాయక్ లను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. ధర్నా చౌక్ పరిరక్షణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం కేసీఆర్ ను కలిసి వినతపత్రం ఇవ్వాలని నిర్ణయించడంతో ఈ అరెస్టులు జరిగాయి.

కత్తితో దాడి..ఆ పై..

యాదాద్రి : తుర్కపల్లి (మం) గంధమల్లలో గుర్రాల మహేష్ వ్యక్తి కత్తితో వీరంగం చేశాడు. పలువురిపై దాడికి యత్నించాడు. అనంతరం కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

14:04 - July 6, 2017

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్'..ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం' దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందనేది అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం కూడా జరిగింది. కానీ దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రాంచరణ్ తేజ..సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగస్థలం 1985’ సినిమా రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో 'చెర్రీ' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. భిన్పమైన కథాంశంగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా అనంతరం మణిరత్నంతో 'రాంచరణ్' సినిమా ఉంటుందని టాక్ వినిపించింది. సినిమా గురించి 'చరణ్' తో 'మణిరత్నం' కూడా చర్చలు జరిపారని ప్రచారం జరిగింది.
కానీ ప్రస్తుతం చిత్రం చేసేందుకు 'రామ్ చరణ్' ఉత్సాహం చూపడం లేదని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రయోగాలు చేయడం కాకుండా కమర్షియల్ సినిమాలు చేయడం బెటర్ అని ఫిక్స్ అయ్యాడని టాక్. మరి వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

13:51 - July 6, 2017

పుట్టుకతోనే ఎవరు నేరస్థులుగా పుట్టారు...పరిస్థితులు వారిని నేరుస్థులుగా మారుస్తాయి..పలు నేరాలకు సంబంధించిన వార్తలు మనం వింటున్నాం, చదువుతున్నాం..విధిలేని పరిస్థితుల్లో నేరస్థులుగా మారిన వారు ఎందరో ఉన్నారు..మరి కొందరు నేరప్రవృత్తి అలవాటుపడి జైలు శిక్షను అనుభవించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలు శిక్ష అనుభవించిన వారు విడుదలై బాహ్య ప్రపంచలోకి వస్తే సమాజం వారిని ఏ మాత్రం గౌరవించదు కాదు కాదా అవమానిస్తుంది.
దీంతో వారు సమాజం నుంచి అనేక అవమానాలు, చీత్కారాలు అనుభవిస్తుంటారు..జైలు శిక్ష అనంతరం మంచిగా బ్రతకాలని అనుకున్నవారు ఆశలు అంత తేలిగ్గా నెరవేరవు...ఈ నేపథ్యంలో వారు సమాజం పట్ల కోపంతో, ఉక్రోషంతో విధిలేక మళ్లీ నేరస్థులుగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయం పై ఆలోచించిన జైళ్ల శాఖ విడుదలైన ఖైదీల కోసం పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగానే చంచల్ గూడ శిక్ష అనుభవించి విడుదలైన మహిళ ఖైదీల కోసం ఓ పెట్రోల్ బంక్ ఏర్పరిచి వారికి ఉపాధి కల్పించారు....
దీని గురించి పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

13:45 - July 6, 2017

తాగండి..తాగి ఊగండి..అంటోంది ప్రభుత్వం..అధిక ఆదాయం వస్తుందని గ్రహించిన పాలకులు మద్య విక్రయానికి విచ్చలవిడిగా అనుమతులిచ్చేస్తున్నారు. నిబంధనలను తుంగలలో తొక్కుతూ మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. తాగి..కుటుంబాలు రోడ్డున పడుతున్నా...చచ్చిపోతున్నా..చంపుతున్నా పాలకులు మాత్రం కనికరించడం లేదు. దీనితో మరో ఏపీ రాష్ట్రంలో మద్యం సమరం లేచింది. మహిళా లోకం గర్జిస్తోంది. చేయి చేయి కలుపుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న మద్యానికి ఎంతో మంది బలవుతున్నారు..బలి కాబడుతున్నారు. శారీరక శ్రమ మరిచిపోదామని తాగిన వారు శాశ్వత నిద్రలోకి జారిపోతున్నారు. మరి ఈ సామాన్యులను చంపేస్తున్న పాపం ఎవరిది ? తాగి బలవుతున్న వారిదా ? వీరిచే తాగిస్తున్న పాలకులదా ? ఎన్నో కుటుంబాల్లో తాగుడు చిచ్చు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ తాగుడు బారిన పడొద్దు అంటూ భార్యలు మొత్తుకుంటున్నా భర్తలు పెడ చెవిన పెడుతున్నారు. సంపాదించిన డబ్బు తాగుడుకు ఖర్చు పెడుతుండడంతో తిండి తిప్పలకు ఆగమౌతున్న వారు ఎంతో మంది ఉన్నారు. తాగుబోతుల వల్లే ప్రభుత్వం పచ్చగా ఉంటోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమలాంటి పేదోల పొట్ట కొట్టి సంపాదిచేది ఒక సంపాదేనా ? అంటూ ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. మండలానికి ఓ దుకాణం..షాపింగ్ మాల్స్ లో మందు..ఎక్కడ పడితే అక్కడ మందు దుకాణాలు నెలకొల్పుతూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి తమ ఖజనా నింపుకొనేందుకు ఆరాటపడుతున్నాయి.

అఘాయిత్యాలు..నేరాలు..
అసలే రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. రోజు కూలీ చేస్తే తప్ప పూట గడవని దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద దిక్కును కోల్పోయి దినదినగండంగా బతుకుతున్నారు. తాగుడుకు బానిసైన భర్తలు భార్యల పట్ల వివక్షత కోల్పోతున్నారు. మహిళలపై హింస...నేరాలు అధికమౌతున్నాయి. యువత కూడా మద్యం సేవిస్తుండడం..పలు ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం తెలిసిందే. మద్యం సేవిస్తూ క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కూడా. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా..తాళిబొట్లు తెగుతున్నా పాలకులు..అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. గుడి..బడి అనేది తేడా లేదు..ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు వెలిసిపోతున్నాయి. మందు తాగిన తరువాత మత్తులో మహిళలు..యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం..అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేస్తున్నారు. దీనితో మహిళలు ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే భయపడుతున్నారు.

33 శాతం ఆదాయం..
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో 33 శాతం మద్యం షాపుల ద్వారానే వస్తుందని ఐద్వా పేర్కొంటోంది. ఇంకా మద్యం షాపులను పెంచి ఆదాయం పెంచుకోవాలని చూడటం దారుణమనని, గతంలో ఎన్‌టిఆర్‌ హయాంలో మద్య నిషేధం విధించినా పూర్తిగా అమలు కాలేదన్నారు. చంద్రబాబు వచ్చి దాన్ని ఎత్తివేశారని చెప్పారు. భర్త సంపాదనంతా మద్యానికే ఖర్చు చేయడంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు.

ఉధృతమౌతున్న ఉద్యమం..
ఏపీలో జరుగుతున్న మద్యం మహమ్మారీపై మహిళలు సమర శంఖం పూరించారు. మద్యం..బెల్టు షాపులను తొలగించాలని నినదిస్తున్నారు. రోడ్డుపై ఎక్కి మద్యానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యంపై యుద్ధం మొదలు కావడంతో పాలకుల్లో వణుకు మొదలైందనే చెప్పాలి. జనవాసాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరవవద్దని..మహిళలపై చర్చించాలని..మద్యం దుకాణాలకు ఉన్న దేవుడి పేర్లను తొలగించాలని ఇటీవలే మంత్రివర్గంలో చర్చించింది. మద్యంపై వెంటనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని..లేనిపక్షంలో తాము ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు.

13:39 - July 6, 2017

కర్నూలు : జిల్లాలోని కొడుమూరులో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. అధికారులు స్పందించకపోవడంతో ఖాళీ బిందెలతో పంచాయితీ కార్యాలయాన్ని ముట్టడించారు. తరువాత కర్నూలు-బళ్లారి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మహిళలలు నీరు అందించలేని ఎమ్మెల్యే ప్రభుత్వం నశించాలని.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నీరు వదిలే వరకు కదిలేది లేదని భీష్మించి కూర్చోవటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గాజుల దిన్నె జలాశయం నుంచి నీరు వదిలి తమ దాహార్తిని తీర్చాలని మహిళలు డిమాండ్‌ చేశారు.

 

13:38 - July 6, 2017

రంగారెడ్డి :తెలంగాణ సర్కార్ విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఈరోజు అన్ని జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా డీఈవో కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేసి రాంగోపాల్ పేట పీఎస్‌కు తరలించారు. జీవో 99 రద్దుతో పాటు, విద్యాహక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రైవేటు స్కూళ్ల ఆగడాలను అరికట్టాలని టీఎన్ఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

13:36 - July 6, 2017

హైదరాబాద్ : పాతబస్తీ బార్కాస్‌లో 11 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని ఇంటి సమీపంలోనే ఉండే మరో బాలుడు ప్రభుత్వ పాఠశాల భవనంపైకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి ఆ తర్వాత ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశాడు. మహ్మద్‌ ఖాన్ అనే 11 ఏళ్ల బాలుడు గత నెల 28న మైదానంలో ఆడుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి పోయి తిరిగిరాలేదు. బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడంలేదంటూ చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితంగా కనిపించిన 17సంవత్సరాల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య సంఘటన వెలుగు చూసింది. బాలుడిని నిందితుడు ప్రభుత్వ పాఠశాల భవనంపైన ఏర్పాటు చేసిన నీళ్లట్యాంక్‌ వెనుకకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడ‌ని.. విష‌యం ఎవరికైనా చెబుతాడనే ఉద్దేశ్యంతో ఇనుపరాడ్‌తో తలపై కొట్టి చంపేశాడని డీసీపీ చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. 

13:15 - July 6, 2017

హైదరాబాద్ : నగరంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో నిజలు ఒక్కటి బయట పడుతున్నాయి. తాజాగా ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు అబ్దులు, దీలిప్ ఇందులో దీలిప్ కు సినీ ప్రముఖులతో సంబంధం ఉందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే డ్రగ్స్ ను 1000 మంది వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. నిందితులు డార్క్ వెబ్ సైట్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరిపినట్టు తెలిసింది. విద్యార్థులకు ఎదైనా సమాచాం తెలిస్తే తమకు తెలపండి అని పోలీసులు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగింపు..

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు పనులు మరో సంవత్సరం పాటు కొనసాగించుకొనేందుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతినిచ్చింది. 2018 జులై వరకు పనుల కొనసాగింపుకు కేంద్రం అనుమతినిచ్చింది.

రోజా క్షమాపణపత్రం..

ఢిల్లీ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. క్షమాపణపత్రాన్ని స్పీకర్ కు పంపించడం జరిగిందని సుప్రీంకోర్టుకు రోజా తరపు న్యాయవాది వెల్లడించారు. కానీ క్షమాపణపత్రం అందలేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టులోనే ఏపీ ప్రభుత్వ న్యాయవాదికి రోజా క్షమాపణ పత్రాన్ని జస్టిస్ అమితవరాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అందింపచేసింది. ఈ క్షమాపణపత్రాన్ని అన్ని శాఖలకు పంపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీం సూచించింది. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని రోజా తరపు న్యాయవాదికి సూచించింది.

టీచర్ల కొరత ఉండకూడదన్న కడియం...

హైదరాబాద్: సర్వ శిక్షా అభియాన్ లో అన్ని జిల్లాల డీఈవోలతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణ, విద్యాశాఖ బలోపేతంపై చర్చ జరుగుతోంది. స్కూళ్లలో మౌలిక వసతుల కోసం నిధులు విడుదల చేయడం జరిగిందని, ఏ ఒక్క పాఠశాలలో కూడా టీచర్ల కొరత ఉండకూడదని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండకూడదన్నారు.

కృష్ణ జింకల కేసు విచారణ వాయిదా..

రాజస్థాన్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు విచారణ జోధ్ పూర్ కోర్టులో జరిగింది. తదుపరి విచారణ 22కి వాయిదా వేసింది.

సభలకు అనుమతి లేదన్న గుంటూరు రేంజ్ డీఐజీ..

గుంటూరు : రేపటి మాదిగల కురుక్షేత్ర సభకు అనుమతి లేదని, మాలల సభకూ అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నందున సభలు..సమావేశాలకు అనుమతినివ్వడం జరగదని తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ భద్రత..పరిస్థితి..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో భద్రత పరిస్థితి..భద్రత గురించి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ కు హోం శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్, హోం శాఖ కార్యదర్శి వివరణ ఇచ్చారు.

12:54 - July 6, 2017

పాత్రలకోసం నటులు ఎంతో సాహసం చేస్తుంటారు. బాలీవుడ్ లో ఎక్కువగా ఈ ధోరణి కనబడుతూ ఉంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా కోసం ఎలా కష్టపడ్డాడో తెలిసిందే. తాజాగా 'రాజ్ కుమార్ రావ్' కూడా ఈ జాబితాలో చేరాడు. క్షీణించడం..సిక్స్ ప్యాక్ ల తయారు కావడం..మరలా లావుగా తయారయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చేసింది ఇతను అరకొర సినిమాలే అయినా తన నటనతో జాతీయ అవార్డు సైతం కైవసం చేసుకున్నాడు. ఆయన నటించిన సినిమా 'ట్రాఫ్ట్' చిత్రం ప్రముఖమైంది.
ఈ సినిమా కోసం సన్నగా క్షీణించిపోయినట్లు కనిపించాలని దర్శకుడు రాజ్ కుమార్ చెప్పడంతో ఆ విధంగానే తయారయ్యాడు. మూడు వారాల పాటు బయటకు రాకుండా కేవలం క్యారెట్లు తింటూ ఉండిపోయాడు. ఇలా క్షీణించిపోయినట్లు కనిపించిన 'రాజ్ కుమార్ రావ్' ‘బెహన్ హోగీ తేరీ' సినిమా కోసం ఏకంగా సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. మళ్లీ స్వాతంత్ర సమరయోధుడు సుభాస్ చంద్రబోస్ జీవిత ఆధారంగా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ కోసం లావు అయ్యాడు. ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘నాకు ఒకరి పాత్రలో ఒదిగిపోవడం కంటే మించిన ఆనందం మరొకటి ఉండదు’ అని ట్వీట్‌ చేశాడు.

12:43 - July 6, 2017

విశాఖ :  ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్ గంగాభవానీ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని తన నివాసంలో గంగాభవానీ ఆత్మహత్యకు పాల్పడింది. గంగాభవానీకి మూడు నెలల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది. అయితే గంగాభవానీ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

12:39 - July 6, 2017
12:35 - July 6, 2017

సినిమా : నేచరల్ స్టార్ నాని నటించిన చిత్రం నిన్ను కోరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నానితో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్...

12:16 - July 6, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో దీపక్, అబ్దులు ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

12:15 - July 6, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో 11ఏళ్ల బాలుడి దారుణ హత్య జరిగింది. బాలుని పై 16 ఏళ్ల మరో బాలుడి లైంగిక దాడి చేసి విషయం బయటకు చేప్పేస్తాడని బాలుడి తలను గోడకేసి బాది హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహం కనపడకుండా వాటర్ ట్యాంక్ పక్కన దాచాడు. కుళ్లిపోయిన పరిస్థితలో ఉన్న బాలుడి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడిని గుర్తించారు. గత వారం నుంచి బాలుడు కనపడక ఆందోళనతో తల్లిదండ్రులు నిన్ననే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొడుకు చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:07 - July 6, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తాజా చిత్రం 'సాహో' లో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు ? అనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. దీనిపై పలువురి హీరోయిన్ల పేర్లు ఎన్నో వినిపించాయి. ‘బాహుబలి'..’బాహుబలి-2’.. సినిమాల అనంతరం 'ప్రభాస్' సుజిత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
చివరకు 'అనుష్క'ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేశ్‌ బాలా ట్వీట్ చేయడం గమనార్హం. కానీ చిత్ర బృందం మాత్రం ఎలాంటి కన్ఫామ్ చేయలేదు. గతంలో ప్రభాస్..అనుష్కలు నటించిన పలు సినిమాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ బాగుంటుందని అభిమానులు సైతం అనుకుంటుంటారు. గతంలో వీరి కాంబినేషన్‌లో 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' సినిమాలు వచ్చాయి. మరి అనుష్క నటించనుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

11:56 - July 6, 2017

అసిస్టెంట్ మేనేజర్ ఘరానా మోసం..అమాయకులను చేసి ఫోర్జరీ..

నోట్ల రద్దుతో బ్యాంకుల్లో జమ అయిన డబ్బుపై కన్నేశాడో అసిస్టెంట్ మేనేజర్..ఆ అకౌంట్లకు చెందిన అమాయక కస్టమర్లను ఎంచుకుని వారి సంతకాలను ఫోర్జరీ చేసి కొత్ నోట్లు స్టాకు ఉన్నప్పుడల్లా వారి ఖాతాల్లో నుండి డబ్బు తీసుకున్నాడు. తీరా ఖాతాదారులు బ్యాంకుకు వెళితే డబ్బులు లేవని తెలిసింది. చివరకు ఆ మోసగాడు నిర్వాకం బయటపడింది. మొత్తం రూ. 16 లక్షల రూపాయలను కేటుగాడు నొక్కేశాడు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లి.లో ఈ ఘరానా మోసం బయటపడింది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

11:50 - July 6, 2017

ట్రిపుల్ మర్డర్ నిందితుడి ఆత్మహత్య..భార్యబిడ్డలను చంపి ఆ తరువాత తాను..పెద్ద కూతురుకి ఫోన్ చేసి చెప్పిన హంతకుడు..తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.

ముగ్గురు కూతుళ్లున్నా..ఆ తండ్రి అనుమానపు పిశాచి. భార్య..భర్తల మధ్య గొడవలు..ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. దుర్మార్గుడైన ఆ భర్త..భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లను అతి దారుణంగా చంపేశాడు. ఆ తరువాత ఈ హంతకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు పెద్ద కూతురు ప్రసన్న ఒంటరిది అయిపోయింది. ఈ విషాద ఘటన అనంతపురంలోని తాడిపత్రిలో చోటు చేసుకుంది. ఒంటరి అయిపోయిన ప్రసన్ననను ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి లక్ష్మీ ప్రసన్నను పరామర్శించారు. ప్రసన్నను ఆదుకుంటామని నన్నపనేని హామీనిచ్చారు.
పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

డ్రగ్స్ కేసు..పెరుగుతున్న అరెస్టులు..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు దీపక్..అబ్దుల్ లను ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరుకుంది.

11:32 - July 6, 2017

హైదరాబాద్ : నగరంలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో దీపక్, అబ్దుల్ అనే మరో ఇద్దరిని ఎక్పైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇప్పటికి ఈ కేసులో నిందితుల సంఖ్య 10కి పెరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:31 - July 6, 2017

విశాఖ : జిల్లా మర్రిపాలెం ఉడా లేవుట్ లో పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరర్ పనిచేస్తున్న గంగాభవానీ అనుమానాస్సద స్థితిలో మృతి చెందింది. భవానీకి గత ఏప్రిల్ లో చెందిన గణేష్ పెళ్లి జరిగింది. భవానీది కాకినాడ కగా, గణేష్ ది తిరుపతి చెందిన వారు. భవానీ మృతి పై పుట్టింటి వారు పలు అనుమానాలు వ్యక్త చేస్తున్నారు. పోలీసులు ఆత్మహత్య పై విచారణ చేస్తున్నారు.

11:28 - July 6, 2017

వినాయకుడు పాలు తాగుతున్నాడంట..విగ్రహం నుండి రక్తం కారుతోందంట...చెట్టు నుండి నీళ్లు కారుతున్నాయంట...ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చాయి..ఈ పుకార్లు నిజం కాదని తెలిసినా అమాయక జనం చూడటానికి ఎగపడుతుంటారు. ఈ విషయాన్ని ఒకరి ద్వారా మరొకరు..ఇలా క్షణాల్లో దావానంలా వ్యాపింప చేస్తుంది.
తాజాగా కర్ణాటకలో మరో వదంతి వైరల్ లా వ్యాపించింది. భార్యలు మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్తలు చనిపోతారా ? మంగళసూత్రాల్లో పగడం ఉంటే రాత్రిళ్లు నిద్ర పట్టదా ? అంటూ పుకార్లు షికారు చేశాయి. ‘తాళిబొట్లలో పగడం ఉంటే మొగుడికి కష్టం' అంటూ వచ్చిన మెసెజ్ క్షణాల్లో పాకిపోయింది. వాట్సప్ లో ఈ ప్రచారం జరిగింది. బళ్లారి, దావనగిరి, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ వింత ప్రచారం వ్యాపించింది. ఈ ప్రచారం అందుకున్న వారు తమ సమీప బంధువులకు తెలియచేశారు. తాళిబొట్లలో పగడం ఉంటే మొగుడికి కష్టాలు వస్తాయంటా అంటూ వదంతులు వ్యాపించాయి.
ఎవరు ప్రచారం చేశారో తెలియదు కానీ..ఈ పుకారు గాలి కంటే వేగంగా వ్యాపించింది. ఈ వదంతులను నమ్మిన వారు తమ తాళిబొట్లలోని పగడాలను పగులగొట్టుకున్నారు. ఇవన్నీ పుకార్లే అని చాలా మంది చెబుతున్నా కొంతమంది మహిళలు మాత్రం నమ్మడం లేదు. కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ..ఆంధ్ర జిల్లాలకు కూడా ఈ వదంతులు పాకాయి.

11:19 - July 6, 2017

మృతదేహంతో కాలినడక...అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు..డబ్బులు లేక మృతదేహంతో కిలోమీటర్ల మేర నడక..ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదని ఈ ఘటన చూస్తే అర్థమౌతోంది.
డబ్బులు లేక మృతదేహాన్ని మోసుకుంటూ ఏకంగా 5కి.మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని గంజాంలో చోటు చేసుకోవడం గమనార్హం. సోరిస్ బిలి గ్రామానికి చెందిన భానుమతి నాయక్ (70) అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కానీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. కానీ 108 వాహనం లభించలేదు. ప్రైవేటు వాహనంలో తరలిద్దామన్నా వారిలో అంత డబ్బులు లేకపోయాయి. చివరకు మృతదేహాన్ని ఓ దుప్పటిలో పడుకొబెట్టి..కర్రెల సహాయంతో మోసుకుంటూ 5 కి.మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. వారు మోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఒడిశాలోనే కలహండి జిల్లాలో ధనమజ్జి అనే వ్యక్తి భార్య మృతదేహాన్ని పది కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

11:18 - July 6, 2017

హైదరాబాద్ : ముత్తూట్ దొంగల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. మొన్న రాజేంద్రనగర్ లోని హ్యాపీ అపార్ట మెటలో 500 మంది పోలీసులతో సెర్చ్ చేసిన ఫలితం లేకపోవడంతో తాజాగా పోలీసులు 20 బృందాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. అధికారులు దొంగల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్ లకు పంపి అప్రమత్తం చేశారు. దొంగలు వాడిన కారు గుజరాత్ చెందిన పురోహిత్ పేరు మీదగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు వీడియో చూడండి.

11:17 - July 6, 2017

హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణరావు పై బయోపిక్ వెండి తెరపై తీసుకురాబోతున్నట్టు దాసరి శిష్యుడు, మాజీ ఫిలిం ఫెడరషన్ అధ్యక్షడు ఓ కల్యాణ్ ప్రకటించారు. కల్యాన్ గారు దాసరి శిష్యుల్లో ప్రముఖ దర్శకుడిగా ఉన్నారు. తమ గురువుకు ఇదే తన నిజమైన నివాళి అని ఆయన అన్నారు. తన గురువుగారి జీవితంలోని ఎత్తుపల్లాలన్నీ చూపిస్తానని కల్యాణ్ తెలిపారు. దాసిరి జీవితకథ ఆధారంగా చిత్రాన్ని మూడు నెలల్లో ప్రాంభిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం హీరోకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు కల్యాణ్ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

గరగపర్రులో మళ్లీ కాప్స్ సెర్చ్..

పశ్చిమగోదావరి : గరగపర్రులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దళితుల బహిష్కరణపై పోరాట జేఏసీ ఏర్పాటుకు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. బయటి వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

డీఈవోలతో కడియం భేటీ..

హైదరాబాద్: సర్వ శిక్షా అభియాన్ లో అన్ని జిల్లాల డీఈవోలతో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణ, విద్యాశాఖ బలోపేతంపై చర్చ జరుగుతోంది.

బాలుడిపై అత్యాచారం చేసి చంపేశారు..

హైదరాబాద్ : చాంద్రాయణగుట్ట పీఎస్ లో దారుణం చోటు చేసుకుంది. 11ఏళ్ల బాలుడు మహ్మద్ ఖాన్ ను అత్యాచారం చేసిన వ్యక్తులు హతమార్చారు. గత నెల 28న మిస్సింగ్ కేసుగా నమోదైంది. బాలుడు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

పార్టీ ముఖ్యనేతలతో బాబు భేటీ..

విజయవాడ : పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పెండింగ్ నామినేటెడ్ పోస్టుల భర్తీ, శిక్షణా తరగతుల నిర్వాహణ, ఇంటింటికి టిడిపి కార్యాచరణపై చర్చ జరిగింది.

 

ఎస్ బీఐ అసిస్టెంట్ మేనేజర్ సూసైడ్..

విశాఖపట్టణం : మర్రిపాలెం ఉడా లే అవుట్ లో ఎస్ బీఐ అసిస్టెంట్ మేనేజర్ గంగా భవాని ఆత్మహత్యకు పాల్పడింది. మూడు నెలల క్రితం పవన్ కుమార్ తో గంగా భవాని వివాహం జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మద్యం తాగి సముద్రంలోకి దుంకిన దంపతులు..

విశాఖపట్టణం : ఆర్కే బీచ్ వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మద్యం తాగిన దంపతులు సముద్రంలోకి దూకారు. భర్త నారాయణ రావు మృతి చెందగా భార్యను స్థానికులు కాపాడారు. బాధితులు మర్రిపాలెం వాసులుగా గుర్తించారు.

ఎంపీ రేణుకకు మాతృవియోగం..

హైదరాబాద్ : ఎంపీ రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. బుధవారం అనారోగ్యంతో వసుంధర దేవి (85) కన్నుమూశారు. ఉదయం 11గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. వసుంధర దేవి మృతి పట్ల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు సంతాపం తెలిపారు.

10:29 - July 6, 2017

హైదరాబాద్ : ముత్తూట్ దొంగల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. మొన్న రాజేంద్రనగర్ లోని హ్యాపీ అపార్ట మెటలో 500 మంది పోలీసులతో సెర్చ్ చేసిన ఫలితం లేకపోవడంతో తాజాగా పోలీసులు 20 బృందాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. అధికారులు దొంగల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్ లకు పంపి అప్రమత్తం చేశారు. దొంగలు వాడిన కారు గుజరాత్ చెందిన పురోహిత్ పేరు మీదగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారు గుజరాత్ చెందిన వారిగా పోలీసులు అంచన వేస్తున్నారు. అయితే దొంగలో చేతిలో ఆయుధాలు ఉండడంతో పోలీసులు జాగ్రత్తగా గాలింపు చర్యలు చేపుడుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

10:28 - July 6, 2017

వినోదపు పన్ను పై కూడా పన్ను వేస్తారా ? అంటూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన థియేటర్ల యజమానులు కేంద్రంపై కన్నెర చేశారు. ఇటీవలే కేంద్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లో రూ. 100 కన్నా తక్కువ ఉన్న టికెట్ ధరలపై 18 శాతం, రూ. 100 కన్నా ఎక్కువ ఉన్న టికెట్ ధరలపై 28 శాతం పన్నును జీఎస్టీ నిర్ధారించిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి అక్కడి థియేటర్లు మూత పడ్డాయి.

పలు సినిమాల పరాజయం..
కోలీవుడ్...ప్రముఖ హీరోల భారీ సినిమాలు..చిన్న హీరోల చిన్న సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది కోలీవుడ్ కు కలిసి రాలేదని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పలు సినిమాలు బాక్సాపీస్ వద్ద బోల్తా పడడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగానే వస్తు సేవల పన్ను అమల్లోకి రావడంతో సినిమా కష్టాలు మరింత పెరిగాయి. పన్నును తగ్గించాలంటూ థియేటర్ల యజమానులు గళమెత్తాయి. రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు కొనసాగించాఇ. వెయ్యికి పైగా థియేటర్లు మూసి ఉండడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం కోలీవుడ్ పరిశ్రమకు కోలుకొని దెబ్బ తగులుతుందని సినీ పండితుల అంచనా. ఈ వారంలో నాలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకోవడానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ పై పలువురు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. పన్నును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ లో సర్కార్ ను కోరారు. ఈ ట్వీట్ కు మరో నటుడు కమల్ హాసన్ స్వాగతించారు.

సమ్మె ముగుస్తుందా ?
గురువారానికి సమ్మె ముగుస్తుందని భావిస్తున్నట్లు అక్కడి థియేటర్ల యజమానుల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. ప్రభుత్వం ఎదుట తాము రెండు ప్రధాన డిమాండ్లను పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. టికెట్ల ధరలు పెంచడం..స్థానిక పన్నును తగ్గించాలని కోరడం జరుగుతోందన్నారు. పదేళ్ల నుండి సరైన విధంగా టికెట్ల ధరలు పెంచలేదని, అందులో భాగంగానే ధరలు పెంచాలని కోరుతున్నట్లు తెలిపారు. మరి ఈ సమ్మెకు తెరపడుతుందా ? లేదా ? అనేది కొద్ది గంటల్లో తెలియనుంది.

కలకలం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ నియంత్రణపై నేడు డిప్యూటి సీఎండోవోలు సమావేశం కానున్నారు. స్కూల్స్ , కాలేజీ విద్యార్థులను డ్రగ్స్ ముఠాలు టార్గెట్ చేశాయి. వెయ్యి మంది వరకు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు కొనుగొన్నారు.

10:12 - July 6, 2017

హైదరాబాద్ : నగరంలో గత మూడు రోజుల క్రితం బయటపడ్డ డ్రగ్స్ కేసు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. తాజాగా నిజామాబాద్ లో చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయించడంతో తెలంగాణలో డ్రగ్స్ మాఫియా ఏ విధంగా విస్తరించిదో అర్థం అవుతోంది. డ్రగ్స్ కేవలం విద్యార్థులు ధ్యేయంగా అమ్మకాలు జరుపుతుండడంతో దేశ భివిష్యత్తు అంధకారంలో వెళ్లె అవకాశం ఉంది. దీంతో స్పందించిన విద్యాశాఖ డ్రగ్స్ నియంత్రణ పై నేడు డిప్యూటీ సీఎండీవోలు సమావేశం కానున్నారు. అంతేకాకుండా 31 జిల్లాల డీఈవోలతో సమావేశం నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

ముత్తూట్..దొంగలు ఎక్కడ..

హైదరాబాద్ : ముత్తూట్ దొంగల కోసం గాలింపు కొనసాగుతోంది. దొంగల కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 20 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయంతో గాలింపును ముమ్మరం చేశాయి. దొంగల ఫొటోలను అన్ని పీఎస్ లకు పంపి అధికారులను అప్రమత్తం చేశారు. దొంగల ముఠా వాడిన కారు గుజరాత్ కు చెందిన పురోహిత్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు.

దాసరి బయోపిక్..

హైదరాబాద్ : దాసరి నారాయణ రావు జీవితం ఆధారంగా త్వరలో సినిమా తీయనున్నామని నటుడు ఓ. కళ్యాణ్ వెల్లడించారు. తన గురువుకు తానిస్తున్న నిజమైన నివాళి ఈ సినిమానేనని, దాసరి జీవితంలోని ఎత్తుపల్లాలు అన్ని సినిమాల్లో చూపిస్తామన్నారు.

అమరావతి డిజైన్లను అందించనున్న నార్మన్ పోస్టర్..

విజయవాడ : రాజధానిలో నిర్మించనున్న పరిపాలన నగరానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ఈనెల 12న ప్రభుత్వానికి అందచేయనున్నారు. అసెంబ్లీ, సచివాలయంతో పాటు హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లపై ముఖ్యమంత్రికి ప్రతినిధులు వివరించనున్నారు. 1365 ఎకరాల్లో పరిపాలన, న్యాయ నగరాలకు సంబంధించిన డిజైన్లను అందించనున్నారు.

తండ్రిని చంపేసిన కొడుకు..

నిజామాబాద్ : వర్ని (మం) జుకోరా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని కత్తితో కొడుకు నరికి చంపాడు.

అధికారులు పేకాటాడారు..వేటు పడింది..

ఖమ్మం : పేకాటుడుతూ పట్టుబడిన రెవెన్యూ అధికారులపై వేటు పడింది. ఖమ్మం రూరల్, సత్తుపల్లి డిప్టూయి తహశీల్దార్లు, కొణిజర్ల ఆర్ఐ, సాంఘీక సంక్షేమ శాఖ జూ.అసిస్టెంట్ లను కలెక్టర్ లోకేష్ కుమార్ సస్పెండ్ చేశారు.

09:42 - July 6, 2017

హైదరాబాద్ : ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ దోపిడీకి పక్కా ప్లాన్ వేయడంలో సఫలమైన గ్యాంగ్...దోచుకోవడంలో విఫలమయింది..అయితే దోచుకున్నా...దోచుకోపోయినా...తప్పించుకునేందుకు కూడా ముందే వేసుకున్న ప్లాన్‌ ప్రకారం ముఠా మాత్రం సక్సెస్‌ఫుల్‌గా మాయమైంది... అందులో ప్రధానంగా పోలీసుల దృష్టి మరల్చడంలో సఫలమైన ముఠా పక్కాగా పారిపోయింది..ఇందులో ముఠా వేసిన స్కెచ్‌లో పడ్డ పోలీసులు ఇప్పుడు నేరగాళ్ల కోసం ఎన్నో రకాల ప్రయాస పడుతున్నారన్నది వాస్తవం.ఇదీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై పంజా విసురుతున్న ముఠాల ప్లాన్... నార్త్‌ ఇండియన్స్‌గా అనుమానిస్తున్నవారంతా ఎక్కడో ప్లాన్ చేస్తారు..ఆ తర్వాత అనుకున్నట్లుగానే నగరానికి చేరతారు..ఇక శివార్లలోని ఓ సంస్థను టార్గెట్ చేసుకుని వారి కార్యకలాపాలపై దృష్టి పెడతారు...ఇలా ఆ సంస్థలో భారీగా బంగారం దొరుకుతుందని ఆలోచనవస్తే చాలు దానిపై రెక్కీ నిర్వహిస్తారు...ఆ తర్వాత పక్కా ప్లాన్‌తో మారణాయుధాలు..తుపాకులతో రంగంలోకి దిగుతారు..ఇలా దోపిడీ చేసినా..చేయకున్నా ముందుగా అనుకున్నట్లుగానే మాయమైపోవడంలో కూడా పర్‌ఫెక్ట్‌ ప్లాన్ చేశారు.

దేశవ్యాప్తంగా పలు చోట్ల ముత్తూట్‌ ఫైనాన్స్‌ల్లో దోపిడీలు
దేశవ్యాప్తంగా పలు చోట్ల ముత్తూట్‌ ఫైనాన్స్‌ల్లో దోపిడీలు చేసిన అనుభవం కలిగిన ముఠాలే నేడు కూడా పంజా విసిరిందని ఘటన తీరు చూస్తే చెప్పకనే చెబుతుంది..నార్త్‌ ఇండియన్స్‌గా అనుమానిస్తున్నవారే పక్కా ప్లాన్‌ వేసి దోపిడీకి ప్రయత్నించారు..ఇక పోలీసులకు దొరక్కుండా విజయవంతంగా తప్పించుకోవడం వారి వ్యూహంలో భాగమే...గతేడాది డిసెంబరు 28న ఉదయన్నే రామచంద్రాపురం బీరంగూడ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దోపిడీ చేసిన గ్యాంగ్‌ నలుపురంగు స్కార్పియోలో పారిపోయారు...భారీ ఎత్తున బంగారం దోచుకున్న గ్యాంగ్‌ కొడంగల్‌ మీదుగా 113 కిలోమీటర్ల దూరం దాటి కర్ణాటకలోని హోళికట్టకు మధ్యాహ్నం కల్లా చేరుకున్నారు...ఆ తర్వాత పోలీసులు వారి వాహనాన్ని గుర్తిస్తారని బ్లాక్‌ స్కార్పియోను అక్కడే వదిలేసి వేర్వేరుగా బంగారంతో అంతా పారిపోయిన సంగతి తెలిసిందే...సేమ్‌ టూ సేమ్‌ ఇక్కడ కూడా అదే జరిగింది..టవేరా వాహనంలో వచ్చినవారంతా మాయమై పోలీసుల దృష్టి మరల్చి వారిని ఓ ప్రాంతానికే పరిమితం చేస్తూ వాహనం వదిలేసి మాయమైపోయారు...

రోడ్డుపక్కనే ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌...
మైలార్‌దేవులపల్లిలోని రోడ్డుపక్కనే ఉన్న ముత్తూట్‌ ఫైనాన్స్‌పై పంజా విసిరేందుకు ప్రయత్నించిన ముఠా టవేరా వాహనంలో సంచరించింది...వాహనం నంబర్‌ ప్లేటు కూడా మార్చేసింది..దీంతో పోలీసుల దృష్టి మరల్చడంతో పాటు వాహనం హ్యాపీ హోం అపార్ట్‌మెంట్ ప్రాంతంలో వదలడంతో ఇక అక్కడికే పరిమితమయ్యారు పోలీసులు..ఆ సమయంలోనే ముఠా సభ్యులంతా వేర్వేరుగా పలు ప్రాంతాల నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులకు దొరికింది ఒక్కటే సీసీ ఫుటేజీ....అందులోని ఆధారాలు..వారి ఫోటోలు...వీటిని పట్టుకుని పోలీసులు తీగలాగాలి...రాష్ట్ర సరిహద్దులు దాటినట్లు అనుమానిస్తున్న ముఠా కోసం పోలీసులు పొరుగు రాష్ట్రాల్లోని పోలీసులకు ఆయా ఫోటోలు చేరవేయాలి...అప్పుడుగాని సమాచారం అందుకుంటే ఇందులో నేరగాళ్లను పట్టుకునే వీలుంది....ఏదీ ఏమైనా ముత్తూట్‌ లో దోపిడీకి యత్నించిన ముఠా వ్యూహంలో పోలీసులు పడిపోవడం వైఫల్యం చెందినట్లే.

09:40 - July 6, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ముత్తూట్‌ ఫైనాన్స్‌లపై పంజా విసురుతున్న కరడుగట్టిన ముఠాల్లోని కొందరే తాజాగా నగర శివార్లలో కూడా ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు...దోపిడీకి వచ్చిన తీరు..వేసిన స్కెచ్...ఆ తర్వాత మాయం కావడానికి వేసిన ప్లాన్..ఇవన్నీ గతంలో దోపిడీలు చేసిన ముఠాల తరహాలోనే ఉండడంతో పోలీసులు కూడా అదే అనుమానిస్తున్నారు...అయితే ముఠా మాట్లాడిన తీరు.. వారి బాషను బట్టి నార్త్‌ ఇండియన్స్‌గా గుర్తించారు..ఇక నిందితులు ఉపయోగించిన వాహనం నంబర్ కూడా మార్చారు.. ప్రస్తుతం ఉన్న నంబర్‌ చూస్తే వాహనం హైదరాబాద్ లోని మహ్మద్ అనే వ్యక్తికి చెందిన కారు నెంబరుగా తేలింది. కానీ నిందితులు బినామీ నెంబర్ ను టవేరా వాహనానికి ఉపయోగించి గత నెల రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. టవేరా వాహనం చాసిస్ నెంబర్ ప్రకారం గుజరాత్ వాహనంగా తేల‌డంతో వారంతా గుజరాతీయులే అయి ఉంటార‌ని పోలీసులు నిర్ధర‌ణ‌కు వ‌చ్చారు.

400 మంది పోలీసులు ఫలితం శూన్యం
మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో దుండగులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. దోపిడీ కోసం నిందితులు ఉపయోగించిన వాహనాన్ని ఉప్పర్ పల్లిలోని హ్యాపీహోమ్ అపార్ట్ మెంట్ లో గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని తెల్లవార్లూ సోదాలు చేసినా చివరకు ఎలాంటి క్లూ దొరకలేదు...అనుమానితులుగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది...నిందితుల వద్ద తుపాకులు ఉండడంతో ముందుగానే పోలీసులు సుశిక్షితులైన ఆక్టోపస్ దళాలు హ్యాపీహోమ్స్ కు రప్పించి చేసిన సోదాలు

వారికి కొంతకాలంగా షెల్టర్..!
హ్యాపీహోమ్స్ లో 9 బ్లాకుల్లో సుమారు 700 ప్లాట్ లు ఉన్నాయి. వీటిలో 3వేల మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఈ హ్యాపీ హోమ్ అపార్ట్ మెంట్లోని ఫ్లాట్లలో ఉత్తరాది రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు...దుండగులు నేరుగా అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపి ఉంచి పారిపోయారంటే... ఈ ప్రాంతంపై వీరికి అవగాహన ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత చాలా మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హ్యాపీ హోమ్స్ లో నివాసం ఉంటున్నారు. దుండగులు ఉపయోగించిన వాహనం కూడా గుజరాత్ దే కావడంతో పాటు ఇక్కడే వదిలిపెట్టడంతో వారికి సంబందించినవారో..లేక వారికి కొంతకాలంగా షెల్టర్ ఇచ్చినవారో ఉండొచ్చని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

08:22 - July 6, 2017

నిజామాబాద్ : జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామంలో దరుణం జరిగింది. మద్యం సేవించి తల్లిని వేధిస్తున్నాడని తనయుడు దత్తు తండ్రి కిష్టయ్య గొంతు కోసి చంపాడు. దత్తు గతంలో పద్ధతి మార్చుకోమంటూ తండ్రి కిష్టయ్యని పలుమార్లు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆయన తండ్రి పద్దతి మార్చుకోపోవడం రాత్రి తాగోచ్చి తల్లిని కొట్టడంతో దత్తు కత్తి గొంతు కోసి చంపినట్టు తెలుస్తోంది. అనంతరం దత్తు వర్ని పోలీసుల స్టేషన్ లొంగిపోయాడు. కిష్టయ్య ముప్పై ఎళ్ల క్రింద పెళ్లి చేసుకుని జాకోరాకు ఇళ్లరికం వచ్చాడు. అనంతరం అతను తాగుడుకు బానిస కావడంతో అతని భార్య వేరె ఇంట్లో అద్దెకు ఉంటుంది. అయన కిష్టయ్య తాగి వచ్చ గొడవ చేసేవాడని చుట్టుప్రక్కల వారు తెలిపారు.

 

 

 

07:56 - July 6, 2017

డ్రగ్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మహామ్మరి, అమెరికా లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉండేది, తలిదండ్రులు పిల్లల పై పర్యవేక్షణ కోరవడిందని, దీనిలో పోలీసుల హస్తం ఉందని, డ్రగ్స్ విషయం ఏప్పుడు బయటపడ్డ సినిమా వాళ్లు, డబ్బున్న వాళ్లు పేర్లు బయటకు రావడం లేదని ఎస్ఎఫ్ఐ నేత నాగేశ్వర్ రావు అన్నారు. బడా వ్యక్తులు తెర చాటు ఉండి నడిపించే వ్యవహరమని, ఇదీ ఎయిడ్స్, క్యాన్సర్ కన్న ప్రమాదకారమైని, డ్రగ్స్ వెనక బడా వ్యక్తులు ఉన్నారని, నైజిరియన్లు ఇండియాకు ఎలా వస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి మానవత రాయ్ అన్నారు. ఈ సమస్య భవి భారత పిల్లల పై ప్రభావం చూపుతోందని, ధనవంతుల పిల్లలను టార్గెట్ చేసుకని వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీని పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతినిధి సమ్మరావు అంటారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

07:44 - July 6, 2017

30 వేల మంది ఒక బార్ షాపు ఏర్పాటు తో విజయవాడలో 85 షాపులకు అనుమతి ఇచ్చారని. సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా జనవాసల్లో మద్యం షాపులు ఉండకూడదని, టీడీపీ హామీల్లో బెల్ట్ షాపులు నిషేధిస్తామని చెప్పిన చంద్రబాబు హామీ మరిచారని, గత నెల 29మ సామూహిక దీక్ష చేసామని ఏపీ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:43 - July 6, 2017

హైదరాబాద్ : లష్కర్ బోనాలుగా ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే ఆదివారం, సోమవారాల్లో జరిగే బోనాల ఉత్సవాలను తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరాలతోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆదివారం జరిగే జాతర, సోమవారం నిర్వహించే రంగం ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసేందుకు పలు శాఖల అధికారులు సన్వయంతో పనిచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, దేవాదాయ, పోలీసు, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్‌ అండ్‌ బీ తదితర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలు అమర్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రానుండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు. నార్త్‌జోన్ డిసిపి సుమతి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వీఐపీలు, సామాన్య భక్తులకు మూడు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈసారి ఆలయం చుట్టూ కొత్త బండలు వేసి ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దారు. దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంత విద్యుత్‌ సరఫరాలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం జాతర పూర్తైతే, సోమవారం ఉదయం స్వర్ణలత రంగంలో భవిష్యవాణి వినిస్తారు. ఆ తరువాత పోతరాజుల విన్యాసాలు, తొట్టెలు, పలారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. లష్కర్‌ బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు.

 

07:40 - July 6, 2017

మహబూబు నగర్ : తొలకరి జల్లులు రైతును మురిపించాయి. కాని బ్యాంకులు ఉసూరుమనిపిస్తున్నాయి. ఖరీఫ్‌ పంటకు కావలసిన రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ఖరీఫ్‌ పంటను వేసుకునేందుకు అప్పు పుట్టక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, రైతులకు రుణాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. 2017- 2018 ఏడాది పంట రుణాలను ఇప్పటివరకూ అమలు చేయలేదు. పాలమూరు జిల్లాలో బ్యాంకులు దాదాపు 6 వేల 981 కోట్ల రుణాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా ఇప్పడివరకూ సగం లక్ష్యం కూడా చేరుకోలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నగదు నిల్వలు భారీగా పడిపోయాయి. చాలా బ్యాంకుల్లో నో క్యాష్‌ బోర్డులు పెడుతున్నారు. రైతు రుణాలను తప్పని సరిగా చెల్లించాల్సి వస్తే సగం డబ్బులు చెల్లించి మిగితాది సేవింగ్‌ అకౌంట్‌లో జమ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

చేతులెత్తేసినమ బ్యాంకులు
బ్యాంకులు చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడే దండుకోవాలని చూసే వడ్డీ వ్యాపారులు రైతులకు అప్పు ఇవ్వడానికి షరతులు పెడుతున్నారు. ఐదు రూపాయల వడ్డీ వసూలు చేయడమే కాదు..మరో షరతును పెడుతున్నారు. పంట పొలాల పట్టా బుక్కులను తాకట్టు పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక తమకున్న ఏకైక ఆధారాన్ని తాకట్టు పెడుతున్నారు మహబూబ్‌ నగర్‌ రైతన్నలు.ఒక పక్క బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడం, మరో పక్క వడ్డీ వ్యాపారుల దోపిడీ తో రైతులు ఆందోళన చెందుతున్నారు. బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఇదే గనక కొనసాగితే రాష్ట్రంలో రైతులకు కరువు ఏర్పడుతుంది.ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతుల సమస్యలపై దృష్టి పెట్టి, ఇచ్చిన హామీలని నెరవేర్చాలని రైతులు కోరుతున్నారు. 

07:39 - July 6, 2017

వరంగల్ : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిల్లో ధైర్యాన్ని నింపుతూ... ప్రతిభను వెలికితీసే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సుమారు వెయ్యి మంది బాలికలకు వాయిస్ ఫర్ గర్ల్స్ ఆర్గనైజేషన్‌ మెంబర్స్‌ యాక్టివిటీ బేస్డ్‌గా ట్రైనింగ్‌ ఇస్తున్నారు. అనాథలు, చెల్లాచెదురైన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు క్రిటికల్‌ నాలెడ్జ్‌ను పెంచేందుకు ఇంటర్‌ పర్సనల్ స్కిల్స్‌పై ప్రత్యేక యాక్టివిటీని చేయిస్తున్నారు. ఏడాదిలో మూడు దశలలో ఈ ట్రైనింగ్ సాగుతోంది. పరిచయ్, దిశ, సఖి అనే పేర్లతో ఈ ట్రైనింగ్‌ 30 రోజుల పాటు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్‌ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో కూడా నిర్వహిస్తున్నారు. బాలికలకు... అనేక విషయాల్లో అవగాహన కల్పిస్తున్నామని... శరీరంలో వచ్చే మార్పులు గురించి కూడా వివరిస్తున్నామని టీం సభ్యులు చెబుతున్నారు. లైఫ్ స్కిల్స్ కాన్ఫిడెన్స్‌, నేగోసియోషన్, అడ్వాకేసి అంశాలను బాలికలకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నామని చెప్పారు.

చదువుల్లో మంచి ఫలితాలు
రెగ్యులర్‌గా చెప్పే చదువులను యాక్టివిటీ రూపంలో చెబితే పిల్లల చదువుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని కస్తూర్బా హాస్టల్స్‌ ఇన్‌చార్జ్‌ అంటున్నారు. వాయిస్ ఫర్ గర్ల్స్ ఇస్తున్న ట్రైనింగ్‌తో తమ హాస్టల్లోని పిల్లలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారని చెబుతున్నారు.అలాగే ఈ క్లాసులు తమకు జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయని బాలికలు అంటున్నారు.వాయిస్ ఫర్‌ గర్ల్స్‌ ట్రైనింగ్‌తో బాలికలకు చాలా విషయాలు తెలుస్తాయని కలెక్టర్‌ అమ్రపాలి అన్నారు. మిగతా ప్రభుత్వ స్కూల్స్‌, హాస్టల్స్‌లో ఇలాంటి విజ్ఞానాన్ని అందించేందుకు ఎన్జీవోల కోసం చూస్తున్నామంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు.. అన్ని పాఠశాలల్లోనూ అమలు చేస్తే.. మహిళా శక్తి సర్వసత్తాహకంగా రూపొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  

07:37 - July 6, 2017

గుంటూరు : అమరావతిలోని సెక్రటేరియట్‌లో మరోసారి మరమ్మత్తులు చేపట్టారు.. సీఎం చంద్రబాబు సచివాలయానికివచ్చే మార్గంలో నాలుగోబ్లాక్‌ పక్కనున్న ప్రహారీ గోడను పడగొట్టారు.. అక్కడ మరో కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు.. ఇప్పటికే సచివాలయానికి నాలుగు గేట్లున్నాయి.. ఇప్పుడు నిర్మిస్తున్నది ఐదో గేటు.. సెక్రటేరియట్‌కు నాలుగు గేట్లున్నా ప్రస్తుతానికి రెండుమాత్రమే వాడుతున్నారు.. సీఎం కాన్వాయ్‌కోసం మొదటి గేటు... మంత్రులు, అధికారులు, సాధారణ ప్రజలకోసం రెండో గేటు ఉపయోగిస్తున్నారు. అయితే 15రోజులక్రితం నుంచి సీఎం కాన్వాయ్‌ ఒకటోగేటు నుంచి కాకుండా రెండో గేటునుంచి వస్తోంది. వాస్తు కారణంగానే కాన్వాయ్‌ రూట్‌ మార్చారంటూ వార్తలొచ్చాయి. అయినా వాస్తు దోషాలు తగ్గలేదంటూ ఐదో గేట్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది..

వాస్తు దోషమేనంటూ ప్రచారం
మరోవైపు సచివాలయం నిర్మాణ సమయంలో సీఎం కాన్వాయ్‌కోసం ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేయాలని భావించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంనుంచి కరకట్టమీదుగా రాజధాని శంకుస్థాపన ప్రాంతంనుంచి సచివాలయానికి వెళ్లేలా రోడ్డు ప్లాన్‌ శారు. కొద్దిరోజులుగా ఈ రహదారి పనులు కొనసాగుతూనేఉన్నాయి.. ఈ రోడ్డునుంచి వెళ్లేందుకు వీలుగా గేటు నిర్మిస్తున్నారంటూ కొందరు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గేటు నిర్మాణంపై అధికారులు వేరే సమాధానం చెబుతున్నా అసలు కారణం వాస్తు దోషమేనంటూ ప్రచారం జరుగుతోంది.. చంద్రబాబుకు మూఢ నమ్మకాలు ఎక్కువని.. అందుకే రెండు గేట్లు ఇప్పటికే మార్చేశారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి సీఎం కాన్వాయ్‌కోసం ఇన్నిసార్లు గేట్లు మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

07:35 - July 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కోల్డ్‌వార్‌ సాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఐక్యంగా కదులుతున్నా... వారి మధ్య మాత్రం ఐక్యత కొరవడిందన్నది పార్టీ వర్గాల కథనం. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి ...సీఎల్పీ నేత జానారెడ్డికి అస్సలు పొసగడం లేదంటున్నారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సీటుకు జానారెడ్డి ఎసరు పెట్టారని, పీసీసీ పీఠంపై కన్నేసిన జానా తనదైన స్టైల్లో పావులు కదుపుతున్నారని పార్టీలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఢిల్లీ వెళ్లిన జానారెడ్డి...
ఇటీవల ఓ ముఖ్యనేతతో కలిసి ఢిల్లీ వెళ్లిన జానారెడ్డి తన మనసులోని మాటను హై కమాండ్‌ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. పార్టీలో అందరినీ ఏకం చేయడంలోనూ... కేసీఆర్ సర్కార్‌పై సమరం చేయడంలోనూ ఉత్తమ్‌ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని జానా వర్గం అధిష్ఠానానికి తెలియజేసినట్టు సమాచారం. పీసీసీ పగ్గాలు తనకు అప్పగిస్తే పార్టీని విజయతీరాల వైపు తీసుకెళ్తానని... దానికి కావాల్సిన అంగబలాన్ని.. అర్థబలాన్ని తానే సమకూర్చుకుంటానని జానా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అభద్రతాభావం ఉత్తమ్‌
జానారెడ్డి వ్యూహాలతో.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభద్రతాభావంలో కూరుకు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జానా కదలికలపై అలర్టైన ఉత్తమ్‌ పదవిని కాపాడుకునే పనిలో పడ్డారు. సంగారెడ్డి సభలో... పార్టీ నాయకులందరిని కలుపుకుని.. జనంలోకి వెళ్లండంటూ ఉత్తమ్‌కుమార్‌కు... రాహుల్‌గాంధీ పిలుపునిచ్చినా... ఆదిశగా రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేయడం లేదన్నది స్పష్టం. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్‌ పదవిపై కన్నేసిన జానా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జానా ఫీవర్‌ను కలిగిస్తున్నాడని హస్తం శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి, ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా.. పీసీసీ మార్పు విషయంలో ఢిల్లీ పెద్దల మనస్సులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు పార్టీ సీనియర్లు. 

07:34 - July 6, 2017

గుంటూరు : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి దూరంగా ఉన్న వైసీపీ ఇప్పుడు చేరువు అయ్యింది. ప్రతిపక్ష నేత జగన్‌ రెండు నెలల క్రితం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించిన తర్వాత రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైసీపీ అధినేత జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భైటీ అయిన తర్వాత ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ అండదండలు, మన్ననలు పెద్దగా పొందని వైసీపీ రాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీయే సర్కారుకు చేరువయ్యేలా చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కావడంతో ..... కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ అంటీ ముట్టనట్టాగా వ్యవహరించింది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పక్షాలకు వైసీపీ దూరంగా, ఉంటూ రాజకీయ ఎత్తుగడలను అమలు చేసింది.

రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైసీపీ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైసీపీ మద్దతు తెలిపింది. ఇది ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కేంద్రానికి దగ్గరయ్యేలా చేసింది. ఈనెల 4న తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కోవింద్‌ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో గంటసేపు సమావేశమయ్యారు. మర్యాద పూర్వకంగానే ఈ భేటీ జరిగినా.....ఈ పరిణామాలు కచ్చితంగా భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయంతో వైసీపీ నేతలు ఉన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ప్రకటించి, కేంద్రానికి చేరువ అవ్వడం ద్వారా పార్టీ అధినేత జగన్‌ ఎదుర్కొంటున్న పలు వివాదాలు, చిక్కుల ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం గా తమ పార్టీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కూడా కలిసి వస్తోందన్న అంచనాతో పార్టీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నా.... ఎన్డీయే ప్రభుత్వంలో చేరేందుకు తమకు కూడా మార్గం సుగమం అయ్యిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

 

07:32 - July 6, 2017

గుంటూరు : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తైంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అయినా ఇంకా నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయకపోవడంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. అసంతృప్తితో రగలిపోతున్నారు. దీనిని గ్రహించిన చంద్రబాబు, భవిష్యత్‌లో ఇది పార్టీకి నష్టం చేస్తుందన్న ఉద్దేశంతో నియమిత పదవుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు.

టీటీడీ పాలక మండలి
టీటీడీ పాలక మండలి పదవీకాలం పూర్తై రెండు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు దీనిపై నిర్ణయం తీసుకోలేదు. తాజా మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్‌గా పని చేసే అవకాశం కల్పించాలని విన్నవించారు. అయితే ప్రజా ప్రతినిధులెవరికీ టీడీపీ చైర్మన్‌ పదవి కట్టబెట్టే ఉద్దేశంలేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరూ ఈ పోస్టు కోసం ప్రయత్నించడంలేదు. బోర్డులో సభ్యత్వం కోసం కొందరు యత్నిస్తున్నారు. టీటీడీ చైర్మన్‌ రేసులో చాలా మంది ఉన్నారు. కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుతోపాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో బీద మస్తాన్‌రావుకే ఎక్కువ అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఆర్టీసీ చైర్మన్‌ పదవి
ఆర్టీసీ చైర్మన్‌ పదవిని కూడా భర్తీ చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేఆర్‌ పుష్పరాజ్‌, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌లలో ఒకరికి ఈ పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల పదవుల కోసం కూడా చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలతోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పోస్టుల భర్తీపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పొన్నాల రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో ఈయన ఎమ్మెల్సీ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలతోపాటు దేవాలయ కమిటీల నియమకాలను చేపట్టడం ద్వారా చాలా మందికి పదవులు కట్టబెట్టొచ్చని బాబు భావిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీతో పాటు, రెండు రాష్ట్రాల టీడీపీ కమిటీలను కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై తర్వలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. 

తండ్రి చంపిన తనయుడు

నిజామాబాద్ : జిల్లా వర్ని మండలం జాకోర గ్రామంలో విషాదం నెలకొంది. మద్యం సేవించి తల్లని వేధిస్తున్నాడని కొడుకు తండ్రిని కత్తి తో నరికి చంపాడు.

Don't Miss