Activities calendar

07 July 2017

22:06 - July 7, 2017
22:03 - July 7, 2017
22:02 - July 7, 2017
22:01 - July 7, 2017

ఢిల్లీ : సిక్కిం సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరుదేశాల నేతలు ఎదురుపడ్డారు. జర్మనీలోని హంబర్గ్‌లో జి-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోది, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ కలుసుకున్నారు. ఇద్దరు నేతలు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడమే కాకుండా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. జి-20 సదస్సులో భాగంగా బ్రిక్స్‌ దేశాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలో బ్రిక్స్‌ను నిర్వహిస్తున్న తీరును మోది అభినందించారు. చైనాలోని జియోమెన్‌లో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి పూర్తి మద్దతిస్తామన్నారు.  ఉగ్రవాదంపై భారత పోరును జిన్‌పింగ్‌ ప్రశంసించారు. ఆర్థిక సామాజిక రంగాల్లో భారత్‌ అభివృద్ధిని మెచ్చుకున్నారు. అంతకు ముందు జీ సదస్సులో పాల్గొన్న నేతలకు జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మోర్కెల్‌ స్వాగతం పలికారు.

 

21:57 - July 7, 2017

హైదరాబాద్ : అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి..ఇంతకాలం ఎదురుచూస్తున్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు రానేవచ్చింది...బ్యూటీషియన్ మరణం మిస్టరీని చేధించింది...ఆమె ఆత్మహత్యకు కారణం అత్యాచారం కాదని తేలింది...అత్యాచారయత్నమే జరిగిందని...ఆమె దుస్తులపై మరకలు ఆహారపదార్థాలని నివేదిక తేల్చింది...ఇక ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందంటున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులకు శిక్ష పడేవిధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు...
ఆమెపై అత్యాచారం జరగలేదన్న నివేదిక..
ఎన్నో అనుమానాలు..మరెన్నో సందేహాలు..వీటన్నింటికి మించి కొత్త కొత్త మలుపులు..ఎన్నో లింకులు..బ్యూటీషియన్‌ శిరీష డెత్‌ తర్వాత మలుపులు తిరిగిన కేసులో చివరకు ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వచ్చింది...పోలీసుల చేతికి అందడంతో ఈ కేసులో అనుమానాలు తొలగిపోయాయి..ఇంతకాలం బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందని..ఆ తర్వాత ఆమెను చంపేశారన్న అనుమానాలు తీరిపోయాయి...ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని పోలీసులు తేల్చేశారు...శిరీష మృతి కేసుకు సంబంధించి తమకు ఫోరెన్సిక్‌ నివేదిక అందినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు ప్రకటించారు...
ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం..
కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి శిరీషపై అత్యాచారం చేయలేదని.. అత్యాచారయత్నం చేసినట్లు మాత్రమే పోలీసులకు ఆధారాలు దొరికాయి...ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యం జరిగిందన్న అనుమానాలు వచ్చినా రిపోర్టు ప్రకారం తేలిపోయింది..అయితే శిరీష ఆత్మహత్యకు ముందు మద్యం సేవించిందని నివేదికలో తేల్చారు...
సాంకేతిక ఆధారాలతో కేసు ముందుకు..
ఇక బ్యూటీషియన్‌ శిరీష దుస్తులపై ఉన్న మరకలు అత్యాచారానికి సంబంధించినవి కావని.. ఆహార పదార్థాల మరకలని నివేదికలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు...శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు సాంకేతిక పరమైన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని.. వాటిని కోర్టుకు సమర్పిస్తామని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు..

 

21:53 - July 7, 2017

విశాఖ : జిల్లాలోని అనకాపల్లిలో భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయి లారీని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిషాకు టిప్పర్‌ లారీలో తరలిస్తున్న 2629 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిబ్యాగులపై కంకర రాళ్లు వేసి.. టార్పాలిన్‌ కప్పి... రహస్యంగా తరలించేందుకు విఫలయత్నం చేశారు. పక్కా సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా..గంజాయి ముఠా గుట్టు రట్టయింది. పట్టుబడ్డ గంజాయి విలువ 2.62 కోట్లు ఉంటుందని..అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 8 కోట్లు విలువ చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 

21:50 - July 7, 2017

గుంటూరు : ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన కురుక్షేత్రం సభ రణక్షేత్రంగా మారింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు మంగళగిరిలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. గ్రీన్‌ ట్రీ పార్క్ సమీపంలో ఉన్న లారీకి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సుకు నిప్పంటించేందుకు ప్రయత్నించడంతో పరిస్ధితి ఉద్రిక్తం మారింది. మరోవైపు సభ జరిగే నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. యూనివర్శిటీతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లో 144, 30 సెక్షన్లను విధించారు. మరోవైపు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ కదలికలపై పోలీసుల డేగకన్నుతో గాలిస్తున్నారు. మందకృష్ణ మాదిగ ఎక్కడున్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

21:47 - July 7, 2017

నీ స్నేహితులెవరు చెప్పు... నీ వెంటో చెప్తానంటారు. ఇరుగు పొరుగు దేశాలను దూరం చేసుకుని.. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావించే దేశానికి దగ్గరయ్యే ఆరాటం. ఆ అగ్రరాజ్యానికి పావులా మారిన కిరాయి గుండా లాంటి మరో దేశంతో ఇప్పుడు కొత్త స్నేహం. దశాబ్ధాలుగా మన దేశం అనుసరిస్తున్న దౌత్య విధానాలను తుంగలో తొక్కుతున్న ఈ కొత్త స్నేహాలు ఏ లక్ష్యం కోసం...? ఈ అడుగులు ఏ గమ్యం వైపు..? ఇదే ఈరోజు వైడాంగిల్ స్టోరీ..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

21:36 - July 7, 2017

బీహార్ : ఆర్జేడి చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్ కుటుంబానికి మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. తాజాగా లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై సిబిఐ దాడులు నిర్వహించింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో హోటల్‌ టెండర్లలో గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ దాడులను బీజేపీ చేపడుతున్న రాజకీయ కుట్రగా లాలు అభివర్ణించారు. బీజేపీ రాజకీయ కుట్రలకు తాను భయపడేది లేదని ఆయన స్పష్టంచేశారు.
లాలూకు మరో సమస్య 
గడ్డి స్కాంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు మరో సమస్య ఎదురైంది. తాజాగా  రైల్వే టెండర్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో  లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి  తదితరులపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఉదయం ఏడున్నరకే పట్నా, ఢిల్లీ, గురుగావ్‌, రాంచీ, పూరిలోని లాలూ కుటుంబానికి సంబంధించిన 12 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. 
టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలు 
2006సం.లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. పూరీ, రాంచీలోని రైల్వేస్‌లో హోటళ్లు నడుపుకునేందుకుగాను ప్రయివేట్‌ వ్యక్తులకు లాలు అక్రమంగా టెండర్లు కేటాయించినట్లు సిబిఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు గాను సదరు వ్యక్తులు లాలూ కుటుంబానికి రెండెకరాల స్తలాన్ని రాసిచ్చినట్లు సిబిఐ పేర్కొంది. రాంచీలో బిఎన్‌ఆర్‌ హోటల్‌, పట్నాలో చాణక్య హోటల్‌ నిర్వహించుకునేందుకు  లీజు గడువు 30 ఏళ్లు ఉంటే 60 ఏళ్లకి అనుమతించారు. టెండర్లలో ఈ రెండు హోటళ్లు కూడా లాలుకు సన్నిహితుడైన జార్ఖండ్‌ ఎంపి ప్రేమ్‌చంద్ర్‌ గుప్తా దక్కించుకున్నారు. తాను మాత్రం  రైల్వే నిబంధనల ప్రకారమే హోటళ్లు కేటాయించినట్లు లాలు చెబుతున్నారు. లాలు ఇళ్లపై సిబిఐ దాడులు జరపడం చరిత్రలో బ్లాక్‌డేగా నిలిపోనుందని ఆర్జేడి పేర్కొంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఐటి, ఈడీ, సిబిఐలను గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తోందని ఆర్జేడి ప్రతినిధి మనోజ్‌ ఝా ఆరోపించారు. లాలు కుటుంబ సభ్యులపై సిబిఐ దాడుల నేపథ్యంలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. లాలూ వ్యవహారంపై  ఇప్పటికైనా నితీష్‌ మౌనం వీడాలని బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోది అన్నారు.

 

21:31 - July 7, 2017

అకున్ సబర్వాల్ మీద ఆగ్రహం.. పేర్లెందుకు బయిటపెట్టినవన్న కడియం, కురుక్షేత్ర సభ మీద చంద్రాలు పైత్యం... సభకు హాజరై, సక్సెస్ జేసిన పోలీసులు, 
కొడంగల్ ఎమ్మెల్యేగారి భూమి దందా... జస్టు పన్నెండు వందల ఎకరాలేనట, అధికార పార్టీ అనుచరుల వీరంగం.. హైదరాబాదుల పెరిగిన అరాచకాలు, 
చెట్టెక్కికూసున్న తాటి కొండ రాజన్న.. దిగిండా లేదా.. సూతంపాండ్రన్న, ఇంకా ఆగని బడగల గుర్రం పరుగు... బీచుల పొంట మోడీ సారు ఎంజాయ్.. ఈ అంశాపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దా...

 

21:17 - July 7, 2017
21:14 - July 7, 2017

డ్రగ్స్ దందాపై చర్చ కార్యక్రమంలో వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై చర్చ కార్యక్రమంలో స్లేట్ స్కూల్ చైర్మన్ అమర్ నాథ్, హెచ్ ఎస్ పీఏ నేత వెంకట్, మానసిక వైద్య నిపుణులు శ్రీనివాస్ రావు, రచయిత వండమూరి వీరేంద్రనాథ్ పాల్గొని, మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:07 - July 7, 2017
21:00 - July 7, 2017
20:58 - July 7, 2017
20:53 - July 7, 2017

న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ నివేద థామస్ నటించిన నిన్నుకోరి సినిమా ఇవాళ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్.. రేటింగ్ ను వీడియాలో చూద్దాం..

ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో శ్రీదేవి నటించిన సినిమా మామ్ మూవీ ఇవాళ విడుదల అయింది. సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులు ఫీలింగ్ ఏమిటీ, రేటింగ్ తదితర విషయాలను వీడియోలో చూద్దాం..

20:49 - July 7, 2017

వైశాఖం మూవీ టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో హరీష్, హీరోయిన్ అవంతిక మాట్లాడారు. సినిమా విశేషాలు తెలిపారు. తమ సినీ అనుభవాలను వివరించారు. వారు ముచ్చటించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. 

20:38 - July 7, 2017
20:35 - July 7, 2017

అనంతపురం : పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ వివాదానికి తెరపడింది. ఈ పదవిలో మూడేళ్లపాటు పీసీ.గంగన్న, రెండేళ్లు బెస్త చలపతి ఉండేలా ముందు ఒప్పందం కుదర్చుకున్నారు. అలాగే మరో నాలుగు పోస్టులకు కూడా ఇదే బాటలో నడిచేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే మూడేళ్లు గడిచినా గంగన్న రాజీనామా చేయలేదు. ఒప్పందం కుదుర్చుకున్న మిగతా పోస్టుల్లో వారూ రాజీనామా చేస్తేనే తాను చేస్తానంటూ షరతు పెట్టారు.. దీంతో ఆగ్రహించిన టీడీపీ అధిష్ఠానం గంగన్నపై ఆరేళ్లపాటు బహిష్కరణవేటు వేసింది. ఈ నిర్ణయంతో షాక్‌తిన్న గంగన్న... తనను ఆదుకోవాలంటూ హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పను ఆశ్రయించాడు. అధిష్ఠానంతో మాట్లాడిన కిష్టప్ప... రాజీనామా చేస్తే సస్పెన్షన్‌పై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. దీంతో గంగన్న తన పదవికి రాజీనామా చేశారు.

 

20:33 - July 7, 2017

హైదరాబాద్ : ఏపీ రాజధానికి భూసేకరణపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భూసేకరణకు సంబంధించిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో విచారణ సాగుతోందని... ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జులై 15న ఉమ్మడి హైకోర్టులో విచారణ ఉందని.. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. పెనుమాక, కురుగల్లు, రాయపూడి, నవులూరు గ్రామాల్లో 2013 భూసేకరణ చట్టం సెక్షన్‌ 10 క్లాజ్‌ 1 ప్రకారం చట్టవిరుద్ధంగా అమరావతికి భూసేకరణ నోటిఫై చేశారంటూ ఆర్ కే పిటిషన్‌ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమకు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆర్ కే తరఫు న్యాయవాది సుధాకర్‌ రెడ్డి తెలిపారు.

 

20:20 - July 7, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో దళితుల పట్ల వివక్షను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఖండించారు. సామాజిక బహిష్కరణను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. గరగపర్రులో మధు పర్యటించారు. ఈ సందర్భంగా మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. కౌలు భూముల్ని సాగుచేసుకునే వారికి ఇవ్వాలన్నారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అప్పటివరకూ పోరాటం కొనసాగుతోందన్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గరగపర్రులో దళితుల సమస్యల్ని ఈ నెల 12లోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే చలో భీమవరం చేపడతామని హెచ్చరించారు.

 

20:13 - July 7, 2017

హైదరాబాద్ : అధికారపార్టీ నేతల అండదండలతోనే సిరిసిల్ల జిల్లాలో ఇసుకదందా సాగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం విమర్శించారు. అధికార పార్టీ నేతలు తమపై విమర్శలు మాని పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. పోలీసు నియామకాల ఫలితాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీడీ, చేనేత కార్మికులకు సంఘీభావంగా రెండో విడత అమరుల స్ఫూర్తి యాత్ర చేపడుతున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాకు వెళ్లే ఈ యాత్రను సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ వద్ద నుంచి ప్రారంభిస్తామన్నారు. సిరిసిల్ల జిల్లాలో మూడు రోజులపాటు స్ఫూర్తియాత్ర  కొనసాగనుందని చెప్పారు. శనివారం నుండి సోమవారం వరకు జిల్లాలో పర్యటన కొనసాగుతుందని చెప్పారు.
 

19:59 - July 7, 2017

సిరిసిల్ల : జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిరిసిల్ల నియోజక వర్గానికి మంజూరైన కార్యక్రమాల అమలులో వెనకబడిన పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయించాలని.. సమయపాలన, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని...  కేటీఆర్‌ సూచించారు. ఆగస్టు 15నాటికి సిరిసిల్లా పట్టణంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్లు... వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. 

19:57 - July 7, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఏకీకృత విధానాన్ని అనుసరించేందుకు కార్యాచరణ రూపొందించాలని పురపాలక శాఖాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్త నిర్వహణ ప్రాజెక్ట్‌లపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. చెత్త నిర్వహణలో ఏకీకృత విధానాన్ని అవలంబించేందుకు అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజ్‌ సహకారంతో మార్గదర్శకాలు రూపొందించాలని కేటీఆర్‌ అన్నారు. అలాగే హైదరాబాద్‌లోని జవహర్‌ నగర్‌ ప్లాంట్‌ వద్ద ఉన్న వ్యర్థాలను గ్రీన్‌ క్యాపింగ్‌ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. ఆరు వేస్ట్‌ టూ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల గురించి తెలుసుకుని... వాటిని పునరుద్ధరించే అవకాశాలను తెలసుకున్నారు. ఈ సమావేశంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, నగర కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

19:56 - July 7, 2017

హైదరాబాద్ : హరితహారం మూడో విడతలో భాగంగా 42 కోట్ల మొక్కలను నాటబోతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 12న కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 12 కోట్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. దీని కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు హరితహారం కింద 17 వందల కోట్లను ఖర్చు చేశామని మంత్రి జూపల్లి చెప్పారు. మూడో విడత హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

19:54 - July 7, 2017

హైదరాబాద్ : నష్టాల ఊబిలో చిక్కుకున్న తెలంగాణ ఆర్టీసీ సమస్యలమధ్యే మనుగడ సాగిస్తోంది. పక్కనే ఉన్న తమిళనాడులోమాత్రం ఆరేళ్లుగా ఒక్క పైసా టికెట్ ధర పెంచకుండానే అక్కడ ఆర్టీసీ ప్రజలకు సేవలందిస్తోంది. అక్కడి ఆర్టీసి పనితీరుపై అధ్యయనం చేసిన తెలంగాణ ఆర్టీసీ ఎస్ డబ్ల్యుఎఫ్ కార్యదర్శి విఎస్ రావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్.. నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వివరాలను ఆయన మాటల్లోనే.. 'తమిళనాడు ప్రభుత్వం ఆర్టీసీని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ప్రతి 500మందికి ఒక బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లోనూ ఆర్టీసీ బస్సుల సేవలు అందిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఆర్‌టీసీ నిత్యం నష్టాల్లో ఉంది. చార్జీలు పెంచినా కష్టాలు తప్పడం లేదు' అని తెలిపారు. 

19:46 - July 7, 2017

నిజామాబాద్ : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన తెలంగాణ యాత్రికులను క్షేమంగా ఇంటికి తీసుకువస్తామని... మంత్రి పోచారం హామీ ఇచ్చారు.. గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలకుచెందిన తొమ్మిదిమంది గాయపడ్డారని తెలిపారు.. వారంతా సేఫ్‌గానే ఉన్నారని స్పష్టం చేశారు.. ఢిల్లీలోని ప్రత్యేక ప్రతినిధి ద్వారా యాత్రికుల సమాచారం తెలుసుకుంటున్నామని పోచారం చెప్పారు.

 

19:44 - July 7, 2017

హైదరాబాద్‌ : నగరంలో డ్రగ్స్ దందాపై డీజీపీ అనురాగ్‌శర్మ సీరియస్ అయ్యారు. కమిషనర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో...మూలాలు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ దందాపై ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోవాలన్నారు. నిఘా కోసం ఇంటెలిజెన్స్ విభాగంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

 

19:42 - July 7, 2017

హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్‌కు బెయిల్ ఇవ్వొద్దని నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యుల అనుమానాలపై విచారణ కొనసాగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 11కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. 

19:39 - July 7, 2017

హైదరాబాద్ : ఎస్ వోటీ పోలీసులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీగాళ్ల అంతుచూస్తున్నారు. హైదరాబాద్‌ ఎల్ బీ నగర్‌ బైరామల్‌గూడ సమీపంలో అక్రమంగా కారంపొడి తయారుచేస్తున్న సాయి గ్రాండెడ్స్, ఆర్ కే ట్రేడర్స్ గోదాములపై దాడులు చేశారు. రూ.63లక్షల విలువైన నకిలీ కారంపొడితోపాటు.. ఒక డీసీఎంను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రజల నివాసాలమధ్య గోదాం ఏర్పాటుచేసిన నిందితులు.. కారంపొడిలో చెక్కపొడి కలుపుతున్నారు. ఈ కల్తీకారాన్ని పలు జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.

 

19:34 - July 7, 2017

గుంటూరు : ఎమ్మార్పీఎస్‌ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభ రణరంగంగా మారింది. కురుక్షేత్ర సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో సభను ఎలాగైనా జరిపి తీరుతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. దీంతో గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీతో పాటు మంగళగిరి పరిసరాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కురుక్షేత్ర సభకు పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు తరలివస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంగళగిరి మండలం చిన్న కాకానిలో జాతీయ రహదారిపైకి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు మెరుపు వేగంతో పెద్ద ఎత్తున దూసుకొచ్చారు. జాతీయ రహదారిపై వస్తున్న వాహనాలను కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో రహదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను ఎక్కడికక్కడ చెదరగొడుతూ అదుపులోకి తీసుకున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

 

19:33 - July 7, 2017

చిత్తూరు : జీఎస్టీ అమలుతో టీటీడీ పై 50కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని... దేవస్థానం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.. బంగారు డాలర్ల విక్రయంపై 3శాతం, వెయ్యి, రెండు వేల ఐదువందల మధ్య అద్దెఉన్న గదులపై 12శాతం, అంతకంటే ఎక్కువ ధరలు ఉన్న గదులకు 15శాతం ట్యాక్స్‌ను భక్తుల నుంచి వసూలు చేస్తామని చెప్పారు.. టీటీడీ కొనుగోలుచేసే నిత్యావసరాలపై ఏటా 32కోట్ల రూపాయల వరకూ జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.. ఈ భారం భక్తులపై పడకుండా... టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయించాలంటూ కేంద్రానికి లేఖ రాశామని సింఘాల్ తెలిపారు.  

 

19:32 - July 7, 2017

అదిలాబాద్‌ : జిల్లా కేంద్రంలోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఇద్దరు లేడీ కిలాడీలు చోరీకి ప్రయత్నించారు.. బురఖాలు ధరించి షాప్‌లోకి వెళ్లిన మహిళలు.. విలువైన ఫేస్‌ క్రిములు, ఫేస్‌ ప్యాక్‌లు, సెంట్‌ బాటిళ్లు, చాక్లెట్లను బురఖాలో వేసుకున్నారు.. వీరితీరును గమనించిన షాప్‌ యజమాని అక్కడి మహిళా ఉద్యోగులతో తనిఖీ చేయించడంతోఅసలు విషయం బయటపడింది.. చోరీ చేసిన వస్తువుల విలువ పదివేల రూపాయలవరకూ ఉంటుందని షాప్‌ యజమాని చెబుతున్నారు..

 

17:03 - July 7, 2017

గుంటూరు : ఆచార్య యూనవర్సిటీ ఎదురుగా ఉన్న మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిన్న కాకాని జాతీయ రహదారిపై ఎమ్ ఆర్ పీఎస్ కార్యకర్తలు మెరుపు ధర్నా చేపట్టారు. పోలీసులు ఊహించనంతగా పెద్ద ఎత్తున ఎమ్ ఆర్ పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చారు. కార్యకర్తలు రోడ్లపై బైటాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు వాహనాలపై రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. గుంటూరు అర్బన్ ఎస్పీని కార్యకర్తలు నెట్టివేశారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. కార్యకర్తలు వేదిక వద్దకు పరుగులు తీస్తున్నారు. ఓ కార్యకర్త స్పృహ కోల్పోయాడు. ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టులు కొనసాగుతున్నాయి. సభకు పోలీసుల అనుమతి నిరాకరించారు. అయితే సభ జరిపి తీరుతామని మందకృష్ణ మాదిగ స్ఫష్టం చేశారు. 
కార్యకర్తలు..
'మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ఓడించేదాక నిద్రపోం. మా సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో చెప్పాలి. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మాదిగలతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తాం' అని హెచ్చరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:50 - July 7, 2017

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో తెలంగాణ మాదిగ జేఏసీ కార్యకర్తలు హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేసిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

 

16:41 - July 7, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ విమానాశ్రయంలో డేటా విండ్ కంపెనీ ముందు సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండా వందమంది సిబ్బందిని తీసివేశారని కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. తామంతా ఉద్యోగంలో జాయిన్‌ అయి సంవత్సరం అవుతున్నా ఇప్పటివరకు ఈఎస్‌ఐ కార్డు ఇవ్వడంలేదని ఉద్యోగులు చెప్తున్నారు. అంతేకాకుండా జీతంలోంచి పీఎఫ్‌ను కట్‌చేస్తున్నా..పీఎఫ్‌ జమకావడంలేదన్నారు ఆరోపించారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే పనిలోకి తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 

 

16:40 - July 7, 2017

గుంటూరు : అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో..ఎలాగైనా సభ జరిపి తీరుతామని మందకృష్ణ మాదిగ సవాల్ చేస్తున్నారు. దీంతో నాగార్జున యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కురుక్షేత్ర సభకు వస్తున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. వరంగల్ నుండి కురుక్షేత్ర మహాసభకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న 40 మంది కార్యకర్తలను మంగళగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరిన్ని వివరానలు వీడియోలో చూద్దాం..

 

16:34 - July 7, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో జరగబోయే బోనాల జాతరలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని.. నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు. నగర కమిషనర్‌ ఈరోజు పాతబస్తీలో కొలువై ఉన్న అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని పనులు పూర్తి చేశామని.. ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. 

16:27 - July 7, 2017

హైదరాబాద్ : పాతబస్తీలో జరగబోయే బోనాల జాతరలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని.. నగర కమిషనర్‌ మహేందర్‌రెడ్డి చెప్పారు. నగర కమిషనర్‌ ఈరోజు పాతబస్తీలో కొలువై ఉన్న అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని పనులు పూర్తి చేశామని.. ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. 

ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మంగళగిరి టోల్ ప్లాజా వద్ద..

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ముందస్తుగా ఎమ్మార్పీఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఎమ్మార్పీఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

16:00 - July 7, 2017

గుంటూరు : వెలగపూడి సచివాలయంలో గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్‌ .. మంత్రి నారా లోకేశ్‌తో భేటి అయ్యారు. రోహన్‌కు... మంత్రి లోకేశ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐటీ రంగంపై ఇరువురు చర్చించారు. ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాల పనితీరు గురించి రోహన్‌ అడిగి తెలుసుకున్నారు. అలాగే సచివాలయ నిర్మాణ వివరాలను లోకేశ్‌... మంత్రి రోహన్‌కు తెలియజేశారు. 

 

15:58 - July 7, 2017

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రాంచరణ్'..సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985’ సినిమా రూపొందుతోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆయన గెటప్ కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘చెర్రీ' సరసన నటిస్తున్న 'సమంత' పల్లెటూరి అమ్మాయిలా కనిపించనున్నట్లు టాక్. ఇదిలా ఉండగా తదుపరి చిత్రంపై 'చెర్రీ' ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘మురుగదాస్' దర్శకత్వంలో చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
‘మణిరత్నం' కాంబినేషన్ లో చిత్రం ఉంటుందని తొలుత ప్రచారం జరిగినా అది వాస్తవం కాదని సోషల్ మాధ్యమాల్లో పుకార్లు లేస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు'తో 'మురుగదాస్' 'స్పైడర్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'చరణ్' తో 'మురుగదాస్' చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అధికారిక వివరాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

15:58 - July 7, 2017

నిజామాబాద్ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల్ని తగ్గించాలంటూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.  

 

15:56 - July 7, 2017

సూర్యాపేట : జిల్లాలోని నల్లచెరువులో రైతులు ఆందోళన బాటపట్టారు. సర్వేనెంబర్‌ 671 భూమిలో రైతుల ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 1975సం.లో 97 ఎకరాల అసైన్డ్‌ భూమిని 45 మంది రైతులకు ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే తాజాగా..అదే స్థలంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణ స్థలంగా పేర్కొంటూ 2రోజుల క్రితం అధికారులు బోర్డులను పాతారు. అయితే రైతులు బోర్డులను తొలగించి వాటిని తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:52 - July 7, 2017

విశాఖ : మద్యం షాపులకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కదం తొక్కుతున్నారు. గుడి, బడి అన్న తేడాలేకుండా ఏర్పాటు చేస్తున్న బార్‌ షాపుల్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో మహిళలు, కార్మికులు, విద్యార్థులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్క్‌ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

15:48 - July 7, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మల్లు రవి హల్‌చల్‌ చేశారు. నిరసన చేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. వారం రోజుల్లో జీవో 14ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌ ముట్టడి చేపడతామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

 

15:44 - July 7, 2017

గుంటూరు : ఏపీ సచివాలయం వద్ద  మద్యం సీసాలు దర్శనమివ్వడం కలకలం రేపింది. సచివాలయంలో 2వ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా...  ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆల్టో కారులో మూడు మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. అయితే వాటిని స్వాధీనం చేసుకోకుండా... వెంటనే  వెనక్కి పంపించేశారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీస్ లు మాత్రం కారు  వివరాలను తీసుకుని విచారణ  చేస్తున్నామని చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

15:42 - July 7, 2017

ఖమ్మం : జిల్లాలోని కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌లో అప్పులబాధతో ఓ రైతు బలవన్మరణం చేసుకున్నాడు. బాసిత్‌నగర్‌ గ్రామానికి చెందిన గుంట వెంకన్న గతేడాది 6 ఎకరాల పొలంలో అధికవడ్డీలకు అప్పుతెచ్చి మిర్చి, పత్తి పంట వేశాడు. చేసిన అప్పులు పెరిగిపోవడం.. పెట్టుబడులకు రుణాలు దొరక్కపోవడంతో తీవ్రమనస్తాపానికి గురైయ్యాడు. తన పొలంలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

617 సర్వే నెంబర్ లో రైతుల ఆందోళన..

సూర్యాపేట : నల్లచెరువు ప్రాంతంలోని 671 సర్వే నెంబర్ భూమిలో రైతులు ఆందోళన చేపట్టారు. 1975లో 617 సర్వే నెంబర్ లో 97 ఎకరాల అసైన్డ్ భూమిని 45 మంది రైతులకు ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంగా పేర్కొంటూ రెండు రోజుల క్రితం అధికారులు బోర్డులు పాతారు. బోర్డులను తొలగించి రైతులు తగులబెట్టారు.

పశువుల మాంసంతో నూనె..

హైదరాబాద్ : పాతబస్తీలోని సంతోష్ నగర్, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు.

నిలిచిపోనున్న ఐఐటీ - జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ..

ఢిల్లీ : ఐఐటీ అడ్మిషన్లు..కౌన్సెలింగ్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రశ్నలకు 18 గ్రేస్ మార్కులను ఐఐటీ కల్పించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టుతో ఐఐటీ - జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోనుంది.

ముమ్మిడివరం పీఎస్ లో ఎమ్మార్పీఎస్ నేతలు..

తూర్పుగోదావరి : ముమ్మిడివరం నుండి చలో అమరావతి కురుక్షేత్ర మహాసభకు వెళుతున్న ఎమ్మార్పీఎస్ నేతలు అరెస్టు చేశారు. నిరసనగా ముమ్మిడివరం పీఎస్ ముట్టడించారు.

 

15:19 - July 7, 2017
15:17 - July 7, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోనాల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు మంత్రులు, కార్పొరేటర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి గుడికి ప్రభుత్వ నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కార్పొరేటర్లకు సూచించారు. రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి గుడికి నిధులను కేటాయిస్తామని తెలిపారు. బోనాల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.

 

శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళన..

రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయంలో డేటా వింగ్ కంపెనీ ఎదుట సిబ్బంది ఆందోళన నిర్వహించారు. సమాచారం ఇవ్వకుండా 100 మంది సిబ్బందిని విధుల నుండి తొలగించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్కే పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీం..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి నిర్మాణానికి చట్టవిరుద్ధంగా భూ సేకరణ చేపట్టారని సుప్రీంలో ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. భూ సేకరణపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్ కు సుప్రీం సూచించింది.

జీ 20 సదస్సు ప్రారంభం..

జర్మనీ : జీ 20 సదస్సు ప్రారంభమైంది. సభ్య దేశాలకు జర్మనీ ఛాన్స్ లర్ స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా, చైనా, జర్మనీ, రష్యా దేశాధ్యక్షులు హాజరయ్యారు.

పొలంలోనే ఉరి వేసుకున్న రైతు..

ఖమ్మం : జిల్లా కామేపల్లి మండలం బాసిత్ నగర్ లో అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతేడాది అధిక వడ్డీలకు అప్పు తెచ్చిన గుంట వెంకన్న మిర్చి పత్తి సాగు చేశాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకన్న తన పొలంలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు..

15:04 - July 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠా అరాచకాలు బయటపడిన నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. డ్రగ్స్ నిర్మూలన చర్యలు చేపట్టింది. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పాపిరెడ్డి అధ్యక్షతన.. ఓయూ, జేఎన్టీయూ వీసీలు, అధికారులతో విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలేజీల చుట్టుప్రక్కల ప్రాంతాల షాపులపై నిఘా ఉంచాలని... త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి డ్రగ్స్‌ నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వాడకం తదనంతర పరిణామాలపై చర్చించారు. 
 

14:56 - July 7, 2017

జయశంకర్‌ : జిల్లాలోని గుడ్‌మార్నింగ్‌ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్ధుల వద్ద నిషేధిత గుట్కాలు లభించడం కలకలం రేపుతోంది. ఓ విద్యార్ధి తోటి విద్యార్ధులకు గుట్కాలు ఇస్తుండగా ప్రిన్సిపాల్ మందలించారు. దాంతో భయపడిన మరో విద్యార్ధి దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతనిని 108లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. 

 

జగన్ న్యాయవాదికి సీబీఐ కోర్టు హెచ్చరిక..!

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో జగన్..విజయసాయిరెడ్డిలు గైర్హాజర్ పై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్లీనరీ సమావేశాలున్నందున జగన్ విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతో కోర్టుకు హాజరు కాకపోవడం సరికాదని..మరోసారి ఇదే పునరావృతమైతే వారెంటు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

14:51 - July 7, 2017

జగిత్యాల : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందగా.. బాలింత పరిస్థితి విషమంగా మారింది. విద్యానగర్‌కు చెందిన షేక్‌ ఇర్ఫానా ప్రసవం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. అయితే గైనకాలజిస్ట్‌ రజిత అందుబాటులో లేకపోగా... నర్స్‌లకు ఫోన్‌లో చెప్పి ఇర్ఫానాకు చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. కాని ఫలితం లేకపోవడంతో ఆస్పత్రికి చేరుకున్న రజిత పెద్ద ఆపరేషన్‌ చేశారు. కానీ పాప చనిపోయింది. ఈ విషయాన్ని బంధువులకు తెలిపి.. ఎవరికీ అనుమానం రాకుండా పసికందు మృతదేహాన్ని పూడ్చి పెట్టమని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ పాప మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని పాప తండ్రి షేక్‌ రహమాన్‌ కోరుతున్నారు. 

 

14:47 - July 7, 2017

హైదరాబాద్ : వైఎస్‌ జగన్‌పై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు విచారణకు హాజరు కాకుండా.. పిటిషన్‌ దాఖలు చేయడంపై ఫైర్‌ అయ్యింది. పార్టీ ప్లీనరీ సమావేశం నేపథ్యంలో.. జగన్‌ కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆయన తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. రాజకీయ కారణాలతో కోర్టు విచారణకు హాజరుకాకపోవడం సరికాదని.. మరోసారి ఇది పునరావృతమైతే వారెంట్‌ జారీ చేయాల్సి వస్తుందని సీబీఐ కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది. 

 

సచివాయంలో మద్యం బాటిళ్లు..

విజయవాడ : ఏపీ అమరావతి సచివాలయంలో మద్యం బాటిళ్లు కలకలం సృష్టించాయి. రెండో గేట్ వద్ద తనిఖీల్లో కారులో మూడు మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. కారు ఎవరిదనే వివరాలు తెలుసుకుంటున్నారు.

14:08 - July 7, 2017

దేశానికి వెన్నెముక రైతు. పిడికెడు మెతుకుల కోసం ఎంతోమంది కష్ట పడుతుంటారు..ఎవరు ఏ పని చేసినా చివరకు కడుపు నింపుకోవడానికే..తినే అన్నం..కూరగాయాలు..పండు..పండించేది రైతు..చెమటోడ్చి..ఎండనక..వాననక..రేయింబవళ్లు..రెక్కలు ముక్కలు చేసుకొనే రైతు శ్రమపైనే ఆధార పడుతున్నాం..సమాజానికి రైతు సేవ ఎంతో గొప్పదని ప్రముఖులు పేర్కొంటుంటారు. కానీ ప్రస్తుతం రైతు ఏ పరిస్థితిలో ఉన్నాడు ? కడుదయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిస్థితులను చూస్తే తెలుస్తుంది. దేశంలో..తెలుగు రాష్ట్రాల్లో ఏక్కడో ఒక చోట తమ సమస్యలు పరిష్కరించాలని..తమ గోడు వినాలని..తమను ఆదుకోవాలంటూ రైతులు రోడ్డెక్కుతున్న సందర్భాలు వింటూనే ఉంటున్నాం..చూస్తూనే ఉంటున్నాం..మరి వీరి సమస్యలు తీరెదెన్నడూ...

నల్గొండ దొండ రైతుల కన్నీళ్లు..
మొన్న మిరప..నిన్న పత్తి..నేడు దొండ..ఇలా సాగు చేస్తున్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు ఏం చేయాలి ? అప్పుసప్పు చేసి..తిని తినక..కాయ కష్టం చేసిన ఆ రైతుకు చివరకు దక్కుతున్నది ఏదీ ? తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ‘దొండ’ సాగు చేసిన రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ‘దొండకాయ’ క్వింటాలుకు రూ. 100 కు పడిపోవడంతో రైతులు బిక్కమొహం వేస్తున్నారు. అంటే కిలో ‘ఒక రూపాయి’ అన్నమాట. ప్రభుత్వ సబ్సిడీ అందక..ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయిన ఆ దొండ రైతుల్లో తీవ్ర ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.

నేలపాలైన దొండకాయలు..
అధికారంలోకి రాకముందు ఒకమాట..అధికారంలోకి వచ్చాక ఒక విధంగా వ్యవహరిస్తున్నారనే రైతులు మండి పడుతున్నారు. తాము పండించిన ఆ దొండ పంటను ఏకంగా రోడ్డుపై పారపోసి తమ బాధను ప్రభుత్వానికి తెలియచేసే ప్రయత్నం చేశారు. తాము కష్టపడి పండించిన పంటను నేలపాలు చేయడానికి ఏ రైతు సాహసం చేయడు. కానీ దొండ రైతులు ఎందుకింత నిరసన చేపడుతున్నారో ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు.

హామీనిచ్చిన సర్కార్..
దొండ రైతుల కష్టాలు..మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. దొండకాయలను అమ్ముకొనేందుకుకు బస్సు సౌకర్యం కల్పిస్తాం..కిలోకు రూ. 8 ఇప్పిస్తామని స్వయంగా మంత్రి హరీష్ రావు హామీనివ్వడంతో తమ కష్టానికి కొంతైనా ప్రతిఫలం దక్కుతుందని ఆశించిన ఆ దొండ రైతుకు నిరాశే మిగిలిందని ఓ పత్రిక కథనాలు ప్రచురించింది. నల్గొండ జిల్లాలలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దొండకాయ బస్తాలను బస్సుల్లో హైదరాబాద్ కు తరలించారు.

మరోసారి మోసపోయిన దొండ రైతు..
నగరంలోని పేరొందిన ఓల్డ్ బోయిన్ పల్లి మార్కెట్ కు దొండ బస్తాలు చేరుకున్నాయి. వ్యాపారులు చెప్పిన రేటు చూసి రైతులు ఖంగుతిన్నారు. 50 కిలోల బస్తా రూ. 50 నుండి రూ. 75 కంటే మించిన ధర ఇవ్వలేమని వ్యాపారులు తేల్చిచెప్పడంతో రైతులు మరోసారి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ప్రభుత్వం చెప్పిన మాట కూడా చెల్లడం లేదని ఆగ్రహానికి గురైన ఆ రైతులు ఆందోళనకు దిగారు. గిదేం దోపిడీ అంటూ ఇక్కడ కూడా 'దొండకాయలను' పారబోసి వెళ్లిపోయారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని దొండ రైతులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఆదుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి..

13:55 - July 7, 2017

ఉపాధి కోసం , ఉద్యోగాల కోసం, చదువుల కోసం ఎక్కడెక్కడ నుంచో ఈ హైదరాబాద్ కు వస్తుంటారు. రేపటి పౌరులుగా మరాల్సిన చిన్నారులు డ్రగ్స్ బానిసలవుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కు బానిసవుతుంది. చిన్నారు డ్రగ్స్ బానిసలు కావడానికి కారణం ఏమిటి..? పిల్లలు చెడిపోవడానికి డబ్బే కారణమని, ధనికుల కుటుంబాల వారు తమ పిల్లలకు 10వేల నుంచి 50 వేల వరకు ఖర్చులు ఇస్తారని, పిల్లలు ఆ డబ్బును ఏం చేస్తారు. క్రమంగా చెడు అవాట్లకు దగ్గరవుతారని సమాజికవేత దేవి అన్నారు. కొంత మంది తల్లిదండ్రులు సంపద కోసం పిల్లలను నిర్లాక్ష్యం చేయడంతో పిల్లలు ఒత్తిడి గురౌతారని ఆమె తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలన పెంచాల్సిన విధానం తెలియాదని, కేవలం డబ్బు సంపదించడం తప్ప పిల్లల కోరికలు గుర్తించలేకపోతున్నారని పిల్లల సైకాలజిస్టు శ్రీనివాస్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఫోన్లో డెలివరీ ఎలా చేయాలో చెప్పిన డాక్టర్..

జగిత్యాల : ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. పురిటినొప్పులతో వచ్చిన నిండు గర్భిణీకి ఫోన్లో చెబుతూ నర్సుతో డాక్టర్ రజిత ఆపరేషన్ చేయించింది. బిడ్డ మృతి చెందగా బాలింతకు తీవ్ర అస్వస్థతకు గురైంది.

13:41 - July 7, 2017

‘నాని'..టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు. వరుసగా విజయవంతమై చిత్రాల్లో నటిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ‘నాని'తో సినిమా తీస్తే మినిమం వసూళ్లు వచ్చి పడుతాయనే ముద్ర పడిపోయింది. దీనితో ఆయనతో సినిమాలు తీయాలని దర్శక..నిర్మాతలు ముందుకొస్తున్నారు. నేచురల్ స్టార్ గా ముద్ర పడిన 'నాని' తాజాగా 'నిన్ను కోరి' తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన 'నిన్నుకోరి’ ప్రేక్షకులను అలరించిందా ?
ఈ సినిమాలో 'నాని' సరసన 'నివేదా థామస్' నటించగా 'ఆది పినిశెట్టి' ప్రత్యేక పాత్ర పోషించాడు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా గురించి భిన్నమైన టాక్ వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నిర్మించారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రేమ కథల్లా కాకుండా ఇది పెళ్లి తరువాత జరుగుతుందని, వివాహ వార్షికోత్సవంతో సినిమా మొదలవుతుందని సమాచారం.
ఎప్పటిలాగానే ఈ సినిమాలో కూడా 'నాని' పాత్రలో ఒదిగిపోయి నటించాడని, నివేదా థామస్..ఆది..లు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారని టాక్. స్ర్కీన్ ప్లే కాస్త స్లోగా సాగిందని పలు సైట్లు రివ్యూల్లో పేర్కొంటున్నాయి. ‘నాని' గత సినిమాల స్థాయిలో అంతగా కామెడీ లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది ? పర్ ఫెక్ట్ రివ్యూ గురించి సాయంత్రం టెన్ టివిలో చూడండి.

13:41 - July 7, 2017

వరంగల్ : ఎంఫిల్, పిహెచ్‌డీ, డిగ్రీ ఫలితాల వెల్లడిలో తప్పులకు పాల్పడ్డ ఇద్దరిని సస్పెండ్ చేశామంటున్నారు కేయూ వీసీ సాయన్న. యూనివర్సిటీ అభివృద్ధి కోసం టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. త్వరలో పీజీ సెట్‌ ఫలితాలు వెల్లడించిన అనంతరం ఎంఫిల్‌, పీహెచ్డీ ఫలితాలు విడుదల చేస్తామని సాయన్న ప్రకటించారు. 

13:39 - July 7, 2017

నల్లగొండ : ఫేస్ బుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడు తనను నగ్నంగా చిత్రీకరించాడంటూ పోలీసులను ఆశ్రయించింది నల్లగొండకు చెందిన ఓ యువతి. పశ్చిమగోదావరి జిల్లా ముక్కామలకు చెందిన అమ్మనరాజు నల్లగొండ జిల్లాకు చెందిన యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల అమ్మనరాజు తనను నగ్నంగా చిత్రీకరించాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు రాజును ఇండియాకు రప్పించి ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

13:38 - July 7, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠా అరాచకాలు బయటపడిన నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం. డ్రగ్స్ నిర్మూలన చర్యలు చేపట్టింది. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పాపిరెడ్డి అధ్యక్షతన.. ఓయూ, జేఎన్టీయూ వీసీలు, అధికారులతో విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాలేజీల చుట్టుప్రక్కల ప్రాంతాల షాపులపై నిఘా ఉంచాలని... త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి డ్రగ్స్‌ నివారణకు పాపిరెడ్డి చర్యలు తీసుకుంటామన్నారు. 

13:37 - July 7, 2017

పశ్చిమ గోదావరి : గరగపర్రు దళితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో ఆయన పర్యటించారు. అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళిత కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీపీఎం పార్టీ బాధితులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి

13:25 - July 7, 2017
13:24 - July 7, 2017

గుంటూరు : అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభ పై ఉత్కంఠ కొనసాగుతోంది. పోలీసులు సభకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎఆర్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సభ జరిపి తీరుతమంటూ మంద కృష్ణ మాదిగ కృత నిర్చయంతో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నరో పోలీసులు ఆరా తీస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. సచివాలయం ముట్టడించే అవకాశం ఉండడంతో అక్కడు కూడా భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు వీడియో క్లిక్ చేయండి.

13:19 - July 7, 2017

టాలీవుడ్ లో వైవిధ్యమైన కథా చిత్రాలు ఎంచుకుంటూ తనలోని నటన ప్రతిభను చూపిస్తున్న నటుడు 'రానా' మరోసారి భిన్నమైన పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. తేజా దర్శకత్వంలో రూపొందిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో 'రానా' తో 'కాజల్' జత కడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై విశేషంగా ప్రేక్షకులను ఆకర్షించిన విషయం తెలిసిందే. రాజకీయ నేప‌థ్యంతో వ‌స్తున్న ఈ సినిమాపై చిత్ర‌ యూనిట్‌ భారీ అంచ‌నాలు పెట్టుకుంది. 'కృష్ణం వందే జగద్గురుమ్' తర్వాత 'రానా' మరోసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓ సాధారణ యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన అంశంతో చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. కేథరిన్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమాలో అశుతోష్ రానా, నవదీప్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ లు నటింంచారు. కన్పించనున్నారు. ఈ సినిమాను ఆగ‌స్టు 11న విడుద‌ల చేయ‌నున్నారు. మరి ‘నేనే రాజు.. నేనే మంత్రి’తో 'రానా' ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

13:19 - July 7, 2017

ఢిల్లీ : కృష్ణా ట్రిబ్యునల్ తదుపరి విచారణ వాయిదా వేసింది. ట్రిబ్యునల్ సెప్టెంబర్ 13,14,15తేదీలకు వాయిదా వేసింది. ఏపీ సూచించిన 11అంశాల్లో ఒకదాన్ని ట్రిబ్యునల్ తీసేసింది. మరో అంశాన్ని పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ సూచించిన 16 అంశాలను పరిశీలించింది. వివిధ అంశాలకు సంబంధించి పత్రాలను ఆగష్టు 16 కల్లా సమర్పించాలని ఏపీ, తెలంగాణకు ట్రిబ్యునల్ ఆదేశించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మాదిగల కురుక్షేత్ర సభపై ఉత్కంఠ..

విజయవాడ : అమరావతిలో మాదిగల కురుక్షేత్ర సభపై ఉత్కంఠ కొనసాగుతోంది. సభకు పోలీసుల అనుమతిని నిరాకరించారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ముందస్తుగా కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సభ జరిపి తీరుతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేస్తున్నారు.

ప్రణబ్ కు 23న వీడ్కోలు..

ఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జులై 23వ తేదీన పార్లమెంట్ ఘనంగా వీడ్కోలు పలుకనుంది. ఉభయసభలు ఆయనకు వీడ్కోలు పలుకనున్నాయి. జులై 24తో రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ మళ్లీ వాయిదా..

ఢిల్లీ : కృష్ణా ట్రిబ్యునల్ తదుపరి విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 13, 14, 15 తేదీలకు వాయిదా వేసింది. ఏపీ సూచించి 11 అంశాల్లో ఒకదానిని ట్రిబ్యునల్ తీసివేయగా పెండింగ్ లో మరో విజ్ఞప్తిని ఉంచింది. వివిధ అంశాలకు సంబంధించి పత్రాలను ఆగస్టు 16 కల్లా సమర్పించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

సౌదీకి వెళ్లి మోసపోయిన హైదరాబాద్ మహిళ..

హైదరాబాద్ : గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు హైదరాబాద్ మహిళ బలైంది. పనికోసం సౌదీకి వెళ్లిన మంజుల మోసపోయింది. తనను నిర్భందించి వేధిస్తున్నారంటూ భర్తకు మంజుల ఫోన్ చేసి తెలిపింది. సౌదీ నుండి తన భార్నఉ రప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని మంజుల భర్త వేడుకుంటున్నాడు.

12:58 - July 7, 2017

ఉత్తరఖండ్ : అమర్‌ నాథ్‌ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. కుల్గాం జిల్లా, క్వాజీగుండ్‌ సమీపంలోని వీసు వద్ద.. ప్రమాదం చోటు చేసుకుంది. 44 మంది యాత్రికులతో జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగగా గుర్తించారు. మరొకరు తెలంగాణలోని కామారెడ్డికి చెందిన వ్యక్తి అని భావిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో బస్సులో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతోనే.. ప్రమాదం జరిగిందని కొందరంటున్నారు. అయితే మరో ప్రయాణికుడు సిలిండర్‌ పేలలేదని.. మరేదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 

ఐటీ అధికారులతో లోకేష్ సమీక్ష..

విజయవాడ : ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ పనితీరు...రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు...మరిన్ని కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రణాళికలపై చర్చ జరిగింది.

గరగపర్రు బాధితులకు సీపీఎం ఆర్థిక సహాయం..

పశ్చిగోదావరి : గరగపర్రులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. బాధితులకు సీపీఎం పార్టీ తరపున రూ. లక్ష ఆర్థిక సాయం, బియ్యాన్ని సీపీఎం నేతలు అందించారు. గరగపర్రు బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని, ఈనెల 12 లోపు కౌలు భూములు తిరిగి ఇవ్వకపోయినా బహిష్కరణ సమస్య పరిష్కారం కాకపోఇనా చలో భీమవరం పిలుపునివ్వడం జరిగిందన్నారు. 13 జిల్లాల నాయకులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

డ్రగ్స్ విచారణకు స్పెషల్ టీం..

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ పై విచారణ ముమ్మరమైంది. డ్రగ్స్ ముఠాకు ఇతర రాష్ట్రాలతో ఉన్న లింక్ లపై విచారణకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ టీంలను ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది.

బోనాలపై మేయర్ సమీక్ష..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో బోనాలపై మేయర్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రులు నాయినీ, తలసాని, డిప్యూటి మేయర్ లు పాల్గొన్నారు.

ప్రేమ పేరిట మరో మోసం..

నల్గొండ : ఫేస్ బుక్ లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట రాజు అనే యువకుడు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వీడికాల్ ద్వారా నగ్నంగా యువకుడు చిత్రీకరించాడు. దుబాయిలో ఓ సంస్థలో సూపర్ వైజర్ గా రాజు పనిచేస్తున్నాడు. యువతి ఫిర్యాదుతో దుబాయి నుండి రాజును రప్పించి ముంబై ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. నిందితుడు ప.గో.జిల్లా ముక్కముల వాసి.

ఆలౌట్ తాగిన విద్యార్థి..

జయశంకర్ భూపాల పల్లి : జిల్లాలోని గుడ్ మార్నింగ్ స్కూల్ లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. గుట్కాలు తీసుకొచ్చాడని ప్రిన్స్ పాల్ మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్థి ఆలౌట్ తాగాడు. పరిస్థితి విషమంచడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

జగన్ కుట్రలు పన్నుతున్నాడు - దేవినేని..

విజయవాడ : ఎంతమంది ప్రశాంత్ కిషోర్ లను పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవలేడని, శాంతిభద్రతలు చెడగొట్టాలని జగన్ కుట్ర పన్నుతున్నారని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. కుట్రలు..కుతంత్రాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 180 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. వివిధ రిజర్వాయర్లలో మరో 190 టీఎంసీల నీరు ఉందని, మరో 750 టీఎంసీల నీరు రావాల్సి ఉందని వెల్లడించారు. రైతులు 30 టీఎంసీల నీటిని బోర్ల ద్వారా వినియోగించుకోవడం జరిగిందని, నాగార్జున సాగర్ డ్యామ్ కి గులాబీ రంగు వేయడం సరికాదన్నారు. డ్యామ్స్ అంటే ఆధునిక దేవాలయాలని రాజకీయ పార్టీలకు సంబంధించివి కావన్నారు.

12:37 - July 7, 2017

హైదరాబాద్ : హెచ్‌సీయూలో తమపై వివక్ష కొనసాగుతుందని దళిత విద్యార్థులంటున్నారు. విభాగాలవారీగా 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తాము ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులంటున్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

12:35 - July 7, 2017

మేడ్చల్ : గల్ఫ్ లోని అరబ్ చేరలో మరో తెలుగు మహిళ చిక్కుకుంది. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం సోనియాగాంధీ నగర్ కు చెందిన మంజుల రెండేళ్ల క్రితం పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లారు. సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత వీసా గడువు తీరిపోయినా స్వస్థలానికి రానివ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. తనను నిర్భంధించారంటూ భర్తకు ఆడియో క్లిప్ ను మంజుల పంపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.తన భార్యలను తీసుకురావాలని భర్త రవి కోరుతున్నారు. 

12:33 - July 7, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్ లు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాలతో డ్రగ్స్ ముఠాకు సంబంధాల పై ఎక్సైజ్ శాఖ ఆరా తీశారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

12:11 - July 7, 2017

గుంటూరు : జిల్లాలోని మంగళిగిరి, తాడేపల్లి మండలల్లో టెన్షన్ టెన్షన్ గా ఉంది. కురుక్షేత్ర సభపై ఉత్కంఠ కొనసాగుతోంది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడ్ ఉద్రిక్తత నెలకొంది. అటు మందకృష్ణ మాదిగ సభ జరిపి తీరుతామాంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మంగళగిరి,తాడేపల్లి మండలాల్లో ఎంఆర్పీఎస్ కార్యర్తల అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

యూనివర్సిటీలో కుల చిచ్చు

కర్నూలు : రాయలసీమ యూనివర్సిటీలో కుల చిచ్చు రగులుతోంది. యూనివర్సిటీలో దళిత, బీసీ అధ్యాపకులపై వివక్ష చూపుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేనివారిని అంతలమెక్కించారని వారు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ఐదుగురు సభ్యులతో కమిటీ నిబంధనలు పాటించకుండా నియమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ మాత్రం కాంట్రాక్టు అధ్యాపకలనే తొలగించాంటున్నారు.

హెచ్ సీయూలో ఆగని వివక్ష

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పై వివక్ష కొనసాగుతునే ఉంది. దళిత రిజర్వేషన్ల అమలుకు అధికారుల కొత్త మెలిక పెట్టారు. విభాగాల వారీగా 7.5 శాతం రిజర్వేషన్ అమలు అధికారుల అడ్డు చెబుతున్నారు. అధికారలు అన్ని విభాగాలకు కలిసి 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అంటున్నారు. దళిత విద్యార్థులు దామాషా పద్దతిలో భారీగా సీట్లు కోల్పోనున్నారు. ఉద్యమాల్లో పాల్గొనబోమని సంతకాలు చేయాల్సిందిగా విద్యార్థుల పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

అత్యాచార యత్నం...రక్షించిన పోలీసులు

హైదరాబాద్ : నడుస్తున్న కారులో మహిళ పై అత్యాచారయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించింది. కారును గూగుల్ మ్యాప్ తో ట్రేస్ చేసి తార్నాక చౌరస్తాలో మహిళను ఓయూ పోలీసులు కాపాడరు. అయితే ఈ యువతికి పెళ్లై భర్త విడాకులు తీసుకుంది. తర్వాత క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటుంది. 

డ్రగ్స్ కేసులో కదిలిన విద్యాశాఖ.....

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహరంలో ఎట్టకేలకు విద్యాశాఖ స్పందించింది. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలన చర్యలు చేపట్టనుంది. నేడు మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఓయూ, జేన్టీయూ వీసీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

శిరీష ఫోరెన్సిక్ నివేదికలో ఏముంది...?

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. శిరీష ఆత్మహత్య తర్వాత కుకునూర్ పల్లి ఎస్సై ఆత్మహత్య తో ఈ కేసు రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే శిరీష తల్లిదండ్రులు శిరీషది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదికలో ఏముందని చర్చనీయంశంగా మారింది. గురువారం రాత్రి పొద్దుపోయక ఈ నివేదిక పోలీసులకు అందింది. 

11:28 - July 7, 2017

కర్నూలు : రాయలసీమ యూనివర్సిటీలో కుల చిచ్చు రగులుతోంది. యూనివర్సిటీలో దళిత, బీసీ అధ్యాపకులపై వివక్ష చూపుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేనివారిని అంతలమెక్కించారని వారు ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ఐదుగురు సభ్యులతో కమిటీ నిబంధనలు పాటించకుండా నియమించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ మాత్రం కాంట్రాక్టు అధ్యాపకలనే తొలగించాంటున్నారు. నియామకాల్లో యూజీసీ నిబంధనలు పాటించినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

11:09 - July 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున డ్రగ్స్ వ్యవహరంలో విద్యార్థుల ఎక్కువ డ్రగ్స్ వాడుతుండడంతో దీని పై విద్యాశాఖ స్పందించి ఓయూ, జేన్టీయూ వీసీల ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:02 - July 7, 2017

వెంటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వెనక్కి తీరిగి చూసుకోలేదు. ఆమె పెద్ద హీరోల సరసన నటిస్తూ కేరిర్ లో పిక్ స్టేజ్ లో ఉన్నారు. నాన్నకు ప్రేమతో..సరైనోడు..ధృవ..రా రండోయ్ వేడుక చూద్దాం.. దసరాకు రానున్న స్పైడర్...ఇలా వరుసగా క్రేజి ప్రాజెక్టులతో అలరిస్తోంది. మధ్యలో విన్నర్ తో కాస్త నిరాశపరిచిన ఆమె జోరు మాత్రం తగ్గలేదు...అందుకే రకుల్ రెమ్యూనేషన్ భారీగా పెంచినట్టు తెలుస్తోంది. అయితే ఏ హీరోయిన్ అయిన బాలీవుడ్ లో మెరవడం ఓ కోరిక ఉంటుంది. రకుల్ అక్కడే కెరీర్ మొదలు పెట్టిన తెలుగు మంచి పేరు స్వంతం చేసుకుంది. కానీ ఆమెకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు ఫీల్మ్ వర్గాల సమాచారం. ఈ సినిమా కోసం తను పెట్టుకున్న పరిమితులను కూడా సడలించుకుందట రకుల్.

ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ రాని ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకు ఓ బికినీ తో పాటు హీరోతో గాఢమైన లిప్ లాక్ కూడా చేసేందుకు ఆమె అంగీకరించిందని కథనాలు వస్తున్నాయి. ప్రాజెక్టు అనౌన్స్ వస్తే తప్ప ఇందులో నిజం ఎంతో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు మూవీ స్పైడర్ తో టాలీవుడ్ లో తనకు స్టార్ స్టేటస్ అభిస్తుందని రకుల్ బోలెడన్ని ఆశలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో....!

10:41 - July 7, 2017

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పై వివక్ష కొనసాగుతునే ఉంది. దళిత రిజర్వేషన్ల అమలుకు అధికారుల కొత్త మెలిక పెట్టారు. విభాగాల వారీగా 7.5 శాతం రిజర్వేషన్ అమలు అధికారుల అడ్డు చెబుతున్నారు. అధికారలు అన్ని విభాగాలకు కలిసి 7.5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అంటున్నారు. దళిత విద్యార్థులు దామాషా పద్దతిలో భారీగా సీట్లు కోల్పోనున్నారు. ఉద్యమాల్లో పాల్గొనబోమని సంతకాలు చేయాల్సిందిగా విద్యార్థుల పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:39 - July 7, 2017

హైదరాబాద్ : నడుస్తున్న కారులో మహిళ పై అత్యాచారయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించింది. కారును గూగుల్ మ్యాప్ తో ట్రేస్ చేసి తార్నాక చౌరస్తాలో మహిళను ఓయూ పోలీసులు కాపాడరు. అయితే ఈ యువతికి పెళ్లై భర్త విడాకులు తీసుకుంది. తర్వాత క్యాబ్ డ్రైవర్ శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉంటుంది. అతనితో హైదరాబాద్ కొన్ని రోజులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అత్యచారం చేసిన వారిలో ప్రియుడు శ్రీకాంత్ ఉన్నాడు. వారు ఘటకేసర్ నుంచి కారులో ప్రయాణం చేస్తున్నప్రుడు వారిద్దరి మధ్య గొడవ జరినట్టు తెలుస్తోంది. వీరిది జనగామ కావడంతో కేసును జనగామకు బదిలీ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:24 - July 7, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. శిరీష ఆత్మహత్య తర్వాత కుకునూర్ పల్లి ఎస్సై ఆత్మహత్య తో ఈ కేసు రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే శిరీష తల్లిదండ్రులు శిరీషది ఆత్మహత్య కాదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదికలో ఏముందని చర్చనీయంశంగా మారింది. గురువారం రాత్రి పొద్దుపోయక ఈ నివేదిక పోలీసులకు అందింది. ఈ నివేదికలో శిరీష పై అత్యాచారం, లైంగిక దాడి జరగలేదని నిర్ధారించారు. శరీరం పై ఉన్న గాయాలు దుస్తుల పై మరకల ఆధారంగా ఉరి వేసుకోవడంతోనే శిరీష మృతి చెందిందని నిర్ధారణకోచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:23 - July 7, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహరంలో ఎట్టకేలకు విద్యాశాఖ స్పందించింది. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలన చర్యలు చేపట్టనుంది. నేడు మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఓయూ, జేన్టీయూ వీసీల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ సరఫరా జరిగినట్లు తేలిన పాఠశాలల గుర్తింపు రద్దుకు విద్యా శాఖ నిర్ణయించింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మైనింగ్ ఏడీ ఇంటిపై ఏసీబీ దాడులు

సూర్యాపేట : జిల్లాలోని మైనింగ్ ఏడీ సుధాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతోన్నాయి. ఏక కాలంలో ఎడు చోట్ల ఏడు టీంలతో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. అధికారలు సుధాకర్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 2కోట్ల విలువైన అక్రమా ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసుధన్ రెడ్డి తెలిపారు. అందులో జనగామలో 37 ఎకరాల తోట, కోదాడలో ఎకంర వాణిజ్య భూమి ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

09:26 - July 7, 2017

సూర్యాపేట : జిల్లాలోని మైనింగ్ ఏడీ సుధాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతోన్నాయి. ఏక కాలంలో ఎడు చోట్ల ఏడు టీంలతో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. అధికారలు సుధాకర్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 2కోట్ల విలువైన అక్రమా ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసుధన్ రెడ్డి తెలిపారు. అందులో జనగామలో 37 ఎకరాల తోట, కోదాడలో ఎకంర వాణిజ్య భూమి ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సూర్యాపేట తో పాటు హైదరాబాద్, వరంగల్, కోదాడలో సోదాలు చేస్తునట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తనిఖీ పూర్తయ్యక వెల్లడిస్తామని మధుసుధన్ రెడ్డి తెలిపారు. మరింత సమాచాంర కోసం వీడియో చూడండి.

 

లాలూ ప్రసాద్ ఇంటిలో సీబీఐ దాడులు

పాట్నా : అర్జేడి అధినేత, బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చెందిన సంస్థల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. 2006 లో ప్రైవేట్ సంస్థకు టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరగాయిన ఆరోపణలపై లాలూతో సహా రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏక కాలంలో 12 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేస్తోన్నారు. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ లోని తనిఖీలు చేస్తున్నారు. 

కిర్లంపూడిలో టెన్షన్...టెన్షన్

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో టెన్షన్... టెన్షన్ వాతవరణం కొనసాగుతోంది. ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలపో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అటు ప్రభుత్వం పాదయాత్ర అనుమతి ఇవ్వలేదు. ముద్రగడ మాత్రం ఎలాగైనా పాదయాత్ర చేస్తానంటున్నారు.

09:10 - July 7, 2017

పాట్నా : అర్జేడి అధినేత, బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చెందిన సంస్థల్లో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. 2006 లో ప్రైవేట్ సంస్థకు టెండర్ల కేటాయింపుల్లో అవకతవకలు జరగాయిన ఆరోపణలపై లాలూతో సహా రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏక కాలంలో 12 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేస్తోన్నారు. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ లోని తనిఖీలు చేస్తున్నారు. వీఎన్ఆర్, సుజాత హోటళ్లు కోసం లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

 

వీసీలతో ఉన్నత విద్యామండలి భేటీ

హైదరాబాద్ : ఓయూ, జేన్టీయూ, కాకతీయ, శాతవాహన వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహించనుంది. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

తిరుమలలో 3 రోజల వరకు దివ్యదర్శనం బంద్

చిత్తూరు : నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్ర, శని,ఆదివారల్లో నడదారి భక్తులకు దివ్యదర్శ టికెట్లు నిలిపివేయనున్నారు. 

08:39 - July 7, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో టెన్షన్... టెన్షన్ వాతవరణం కొనసాగుతోంది. ముద్రగడ పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలపో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అటు ప్రభుత్వం పాదయాత్ర అనుమతి ఇవ్వలేదు. ముద్రగడ మాత్రం ఎలాగైనా పాదయాత్ర చేస్తానంటున్నారు. మద్రగడను కలిసేందుకు కిర్లంపూడికి నేతలు తరలివస్తున్నారు. దీంతో గ్రామంలో పోలీసులను భారీగా మోహరించి, 144 సెక్షన్ విధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

08:38 - July 7, 2017

ఓ ముఖ్యమంత్రిని కలుస్తామంటే అరెస్టు చేయడం దేశ చరిత్రలో అరుదని, ప్రజాస్వామ్య మౌళిక ప్రక్రియ ప్రభుత్వం గౌరవించకపోవడం రాష్ట్రానికి మంచి కాదని, ప్రజల ఆంకాక్షకు పూర్తి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవరిస్తుందని ఇంది పెరుగుతున్న నిరంకుశ పాలనకు నిదర్శనమని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు.ఇది ప్రతిపక్షాల రదంతం చేస్తున్నారని, సీఎం ప్రజా సమస్యల పై కలుస్తామంటే ఒప్పుకుంటారని, ప్రజల సమస్యల పై ప్రభుత్వం అనేక పథకాలు తీసుకోస్తున్నారని టీఆర్ఎస్ నేత రామ్మోహన్ అన్నారు. టీఆర్ఎస్ ది అవసరం కోసం రాజకీయం చేస్తుందని, అనాడు కోదండరాం అళ్లం అయిండు ఇప్పుడు చేదు అయిండని కాంగ్రెస్ నేత కైలాష్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

08:37 - July 7, 2017

25 ఏళ్ల వరకు ఆలోచన విధానం ఉంటుందని. తనను గుర్తించాలని తహతహలడుతారని, అన్ని సాధ్యం కానీ సందర్భంలోడ్రగ్స్ తీసుకుంటున్నారని, నేనే కంట్రోల్ చేసుకోగలను కొంత మంది అలవాటు చేసుకుంటారని, తల్లిదండ్రులు పిల్లలకు మొదటి పుస్తకాలు అని, వారు సంపద కోసం ఇంటిలో ఉండకుండా బయట ఉంటే పిల్లల మధ్య ప్రేమలు తగ్గుతాయని దీంతో వారు డ్రగ్స్ వైపు మారుతాయని, పిల్లలతో తల్లిదండ్రులు కమ్యూనికేట్ అవల్సిన అవరం ఉందని ప్రముఖ సైకాలజిస్టు జవహర్ నెహ్రు అన్నారు. పూర్తి సమాచాం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:35 - July 7, 2017

కడప : కడప జిల్లాలోని జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం ఫ్యాక్షన్‌ రాజకీయాలకు నెలవు. ఈ స్థానం నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల రామసుబ్బారెడ్డి మధ్య కొనసాగుతోన్న ఆదిపత్యపోరు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిమణించింది. మంత్రి ఆదినారాయణరెడి 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ అధినేత జగన్‌తో విభేదించి, టీడీపీలో చేరి, మంత్రి అయ్యారు.. ఆ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన
ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరికను రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తే, చంద్రబాబు నచ్చచెప్పారు. ఇద్దరూ కలిసిమెలిసి సమన్వయంతో పనిచేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఆదినారాయణరెడ్డి ఆదిపత్యం చెలాయించం ప్రారంభించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న రామసుబ్బారెడ్డిని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. ఇది నచ్చని రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుకు ఫిర్యాదు

ఆదినారాయణరెడ్డి వ్యవహార శైలిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా, పరిస్థితిలో మార్పు రాలేదన్న బాధతో ఉన్న రామసుబ్బారెడ్డి.. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు విశాఖపట్నంలోజరిగిన మహానాడుకు దూరంగా ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాశంగా మారింది. ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వలన తన వర్గం నష్టపోతోందని పార్టీ నేతల వద్ద రామసుబ్బారెడ్డి వాపోతున్నారు. తాను బదిలీ చేయించిన జమ్మలమడుగు మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదినారాయణరెడ్డి తిరిగి తీసుకురావడంపై రామసుబ్బారెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించిన తర్వాత వైన్‌ షాపులు లైసెన్స్‌ల కోసం రామసుబ్బారెడ్డి చేసిన ప్రయత్నాలకు ఆదినారాయణరెడ్డి గండికొట్టే విధంగా చేశారు. పైగా మంత్రి తన బంధువులకు మద్యం దుకాణాల లైసెన్స్‌లు ఇప్పించుకోవడంపై రామసుబ్బారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జమ్మలమడుగు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి తన తమ్ముడు గిరిధర్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తే, మంత్రి ఆదినారాయణరెడ్డి దీనికి చెక్‌ పెట్టి, తన కుమారు సుధీర్‌రెడ్డికి ఈ పదవి ఇప్పించుకోవడంతో రామసుబ్బారెడ్డి ఆగ్రహాశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాను ఏది ప్రతిపాదించినా, మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యతిరేకించడంపై రామసుబ్బారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ విషయాలన్నింటినీ పొన్నాల రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆదినారాయణరెడ్డి వ్యవహార శైలితో తన వర్గానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీనిని నివారించేందుకు గవర్నర్‌ కోటాలో తనకు ఎమ్మెల్సీ పదవితోపాటు, ప్రొటోకాల్‌ విషయంలో మంత్రి ఆదినారాయణరెడ్డితో సమానంగా ఉండే విధంగా శాసన మండలి చైర్మన్‌ పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు కార్యాచరణ ఎలా ఉంటుందో చూచిన తర్వాత తన భవిష్యత్‌ రాజకీయ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలన్న యోచనలో రామసుబ్బారెడ్డి ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

 

08:34 - July 7, 2017

కృష్ణా : రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రజల అంచనాలకు అందనిరీతిలో విస్తరిస్తోంది. ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఈ నగరం ఉంది. రాజధానిలో పనుల కోసం వచ్చే వారెవరైనా విజయవాడ కేంద్రంగా బసచేసి, కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉపాధి కోసం వలస వచ్చే వారితో నగరం అంతకంతకు విస్తరిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతోంది. కానీ జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య జటిలంగా మారుతోంది.

మూడు ప్రధాన మార్గల్లోనే 90 శాతం వాహనాలు
విజయవాడలోని మూడు ప్రధాన మార్గల్లోనే 90 శాతం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ-హైదరాబాద్‌, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారులల్లో వాహనాల రద్దీ పెరిగింది. బందరు రోడ్డు ఇరుకుగా మారడంతో ట్రాఫిక్‌ కష్టాలు ఎదురువుతున్నాయి. మరికొన్ని మార్గాలు ఆక్రమణలకు గురవుతోండటంలో ట్రాఫిక్‌తో వాహనచోదకులు, పాదచారులకు చక్కలు కనపడుతున్నాయి. బెజవాడలోకొన్ని ఫ్లై ఓవర్లు నిర్మించారు. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. కీలకమైన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎట్టకేలకు టెండర్లు పూర్తయ్యాయి. పనులు ప్రారంభించినా, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నత్తనడకన సాగుతోంది. దీంతో అమ్మవారి భక్తులతోపాటు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణలంక సబ్‌వే నిర్మాణం కూడా అంతంతమాత్రంగానే తయారైంది.

బెంజ్‌ సర్కిర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఒక్కటే
బెజవాడ ట్రాఫిక్‌ సమస్యకు తరుణోపాయం బెంజ్‌ సర్కిర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఒక్కటే. దీనిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. బెంజ్‌ సర్కిర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు పూర్తి కావాలంటూ మరో ఏడాదిన్నపడుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. బెంజ్‌ సర్కిర్‌ ఫ్లై ఓవర్‌ కోసం ప్రజలు ఆరు దశాబ్దాల నుంచి ఉద్యమిస్తున్నారు. ఇప్పటికి టెండర్లు పూర్తి చేసుకుంది. 220 కోట్ల రూపాయలతో రెండు దశల్లో నిర్మాణం చేపడుతున్నారు. బెజవాడకు బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్‌ అంతా నగరం నుంచే వెళ్లాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో బెంజి సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ను త్వరితగతిన పూర్తిచేసి, ట్రాఫిక్‌ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

07:07 - July 7, 2017

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వైఎస్‌ జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది. ఇండియా సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ చార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు..ఆగస్టు 4న కోర్టుకు హాజరుకావాలని జగన్‌కు ఆదేశాలు జారీచేసింది. జగన్‌తో పాటు ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌, విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ శామ్యూల్స్‌కూ కూడా ఈడీ కోర్టు సమన్లు జారీచేసింది.

 

Don't Miss