Activities calendar

08 July 2017

21:47 - July 8, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. గుల్పురా ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో భార్యాభర్తలు మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. పాకిస్తాన్‌ సైన్యం ఉదయం 6 గంటల సమయంలో ఆటోమెటిక్‌ ఆయుధాలతో కాల్పులు జరిపింది. దీనికి దీటుగా భారతీయ భద్రతాదళాలు ఎదురుదాడికి దిగాయి. మరోవైపు బాందిపురాలో జిల్లాలో ఈ తెల్లవారుజామున మూడున్నర ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. హాజిన్‌ ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడుల తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.

21:46 - July 8, 2017

శ్రీనగర్ : హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని తొలి వర్థంతి సందర్భంగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మళ్లీ అల్లర్లు చోటుచేసుకున్నాయి. బుర్హాన్‌ వాని హోంటౌన్‌ త్రాల్‌లో భద్రతాదళాలు, ఆందోళన కారులకు మధ్య ఘర్షణ జరిగింది. బుర్హాన్‌ వానికి నివాళులర్పించేందుకు ఆందోళనకారులు త్రాల్‌లో ర్యాలీ నిర్వహించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వేలాది ద్విచక్రవాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించగా...ఆందోళనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారని బుర్హాన్‌ వాని తండ్రి ముజఫర్‌ అహ్మద్‌ చెప్పారు. తన కొడుకు నివాళి అర్పించేందుకు కూడా వెళ్లలేక పోయానని పేర్కొన్నారు. కశ్మీర్‌లో శాంతిని కాపాడాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. బుర్హన్‌ వాని ప్రథమ వర్థంతి నేపథ్యంలో కశ్మీర్‌ లోయలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. త్రాల్‌లో కర్ఫ్యూ విధించారు. గత ఏడాది జులై 8న అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుర్హాన్‌ వాని హతమయ్యాడు.

21:45 - July 8, 2017

ఢిల్లీ : గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను ఆపాలని ప్రధాని మోది చేసిన విజ్ఞప్తిని బేఖాతరు చేస్తున్నారు. ఔటర్ ఢిల్లీలోని బాబా హరిదాస్‌నగర్‌లో గేదెలను కబేళాకు తరలిస్తున్నారన్న అనుమానంతో దాడి జరిగింది. ఆరుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి రెండు వాహనాల్లో గేదెలను ఘాజిపూర్‌కు తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. గేదెలను తరలిస్తున్న ఆరుగురిపై దాడి చేయడమే కాకుండా వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని తులా రామ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. గాయపడ్డవారిలో అలీజాన్‌ పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారని పోలీసులు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

21:44 - July 8, 2017

కలకత్తా : డార్జిలింగ్‌, బసిర్‌హత్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించడం లేదని ఆరోపించారు. అశాంతి, హింసాత్మక ఘటనల వెనక బిజెపి హస్తం ఉందని దుయ్యబట్టారు. బసిర్‌హత్‌ మత ఘర్షణలపై ముఖ్యమంత్రి న్యాయ విచారణకు ఆదేశించారు. అల్లర్లకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత ఘర్షణలు వ్యాపించడానికి కారణమైన టీవీ చానళ్లపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సిఎం తెలిపారు. కేంద్రాన్ని వ్యతిరేకించే పార్టీలను బిజెపి టార్గెట్‌ చేస్తోందని పేర్కొన్నారు. మరోవైపు మత ఘర్షణలు చోటు చేసుకున్న బసిర్‌హత్‌ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన బిజెపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 

21:43 - July 8, 2017

కలకత్తా : డార్జిలింగ్‌లో తాజాగా గూర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ మద్దతుదారుడు తాషి భూటియాను కాల్చి చంపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతడి తలకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. నిన్న రాత్రి అనారోగ్యంతో ఉన్న తన సోదరుడికి మందులు తీసుకురావడానికి వెళ్లినపుడు భద్రతాదళాలు కాల్చి చంపినట్లు GNLF అధికార ప్రతినిధి నీరజ్‌ జింబా తెలిపారు. తాషి భూటియాను పోలీసులు చంపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పశ్చిమ బెంగాల్‌ టూరిజం మంత్రి గౌతం దేబ్‌ తెలిపారు. ఈ ఘటనపై కోపోద్రిక్తులైన GNLF కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులు భాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. గూర్ఖాలాండ్‌ పేరిట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా గత నెల జూన్‌ 8 నుంచి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. డార్జిలింగ్‌లో వరుస బంద్‌ల కారణంగా తిండి దొరక్క పోవడంతో ప్రజలు షాపులను లూటీ చేస్తున్నారు.

కేంద్ర రాష్ట్రానికి సహకరించడంలేదు : మమతా బేనర్జీ

21:41 - July 8, 2017

పాట్నా : అక్రమ ఆస్తులకు సంబంధించి లాలూ కుటుంబంపై సిబిఐ, ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న లాలు కుటుంబసభ్యుల ఇళ్లపై సిబిఐ దాడులు జరిపి 24 గంటలు గడవక ముందే.. తాజాగా లాలు కుమార్తె ఎంపి మీసా భారతి ఫామ్‌హౌస్‌, ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. సుమారు 3 ఎకరాల్లో ఉన్న సైనిక్‌ ఫామ్‌ హౌస్‌ విలువ 50 కోట్లుగా ఉంది. అక్రమ ఆస్తుల కేసులో మీసా, ఆమె భర్త శైలేష్‌ గతనెల ఐటి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్‌ కేసులో మీసా భర్త శైలైష్‌ను ఈడీ ప్రశ్నించింది.

21:41 - July 8, 2017

హబంర్గ్ : జి-20 సదస్సులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోది బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో సమావేశమయ్యారు. బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు సహకరించాలని బ్రిటన్‌ ప్రధానికి మోది విజ్ఞప్తి చేశారు. గురువారం లండన్‌ కోర్టులో మాల్యా కేసు విచారణ సందర్భంగా భారత్‌లో జైళ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నాయని ఆయన న్యాయవాది పేర్కొనడం గమనార్హం. రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యాను భారత్‌కు అప్పగించే కేసులో తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. విజయ్‌ మాల్యా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు చెల్లించకుండా గత ఏడాది లండన్‌ పారిపోయిన విషయం తెలిసిందే.

21:39 - July 8, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మహ్మద్‌ జిషన్‌ అలీఖాన్‌, బెర్నాండ్‌ విల్సన్‌ నోవా ఫ్రాంక్‌ను అరెస్ట్‌ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముఠాలోని మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల నుంచి 12 గ్రాముల కొకైన్‌, నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ అమ్ముతున్నారని ఎక్సైజ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు వచ్చిందని.. దాని ఆధారంగానే దాడులు చేసినట్లు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అజయ్‌రావు తెలిపారు. 

21:38 - July 8, 2017

 

హైదరాబాద్ : మియాపూర్‌ భూ అక్రమ రిజిస్ట్రేషన్‌లపై గోల్డ్‌ స్టోన్ ప్రసాద్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బాధితులకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మియాపూర్ పోలీసులను కలిసిన ఆయన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవాలని కోరారు. భూములకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

21:36 - July 8, 2017

గుంటూరు : అమరావతి వేదికగా వైసీపీ మూడవ ప్లీనరీ సమావేశాలు మొదటిరోజు ఉత్సాహంగా సాగాయి. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్లీనరీ సమావేశాలు ప్రారంభసూచికంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత వేదిక వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధ్యక్షోపన్యాసం చేసిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎప్పుడు అంతమొందుతుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం పట్టని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.ప్లీనరీ మధ్యాహ్నం సెషన్‌లో చంద్రబాబు అవినీతిపై "ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌" అనే పుస్తకాన్ని జగన్‌ ఆవిష్కరించారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో 3లక్షల 75వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు పుస్తకంలో పొందుపర్చామన్నారు. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని జగన్‌ ఆరోపించారు. విశాఖ భూముల్లో మరో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మూడు నెలల్లోగా అనర్హులుగా ప్రకటించేలా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేలా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు సంవత్సరాల సమయం చాలా కీలకమని.. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్‌కు ప్రజలు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గ
రాష్ట్రంలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని విమర్శించారు. బడులు మూసి బారులు తెరవడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని రోజా ధ్వజమెత్తారు. అంతకుముందు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. మొదటి రోజు ప్లీనరీ సమావేశంలో మొత్తంగా 6 తీర్మానాలను ఆమోదించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికకూ ప్లీనరీ ఆమోదం తెలిపింది.

20:29 - July 8, 2017
20:19 - July 8, 2017
20:12 - July 8, 2017
20:05 - July 8, 2017
20:03 - July 8, 2017
20:02 - July 8, 2017
20:02 - July 8, 2017

ఒంగోలులో విషాదం

ప్రకాశం : జిల్లాలోని ఒంగోలులో విషాదం జరిగింది. ఓ ప్రేమ జంట నాగచక్రి, సుప్రియ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో నాగచక్రి మృతదేహం లభ్యమయింది. సుప్రియ కోసం గాలింపు చేస్తున్నారు. వీరు ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. 

19:13 - July 8, 2017
19:09 - July 8, 2017

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ దేవి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. కూరగాయల అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనార్ధం భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేల టన్నుల కూరగాయలను భక్తులు, అమ్మవారికి కానుకగా ఇచ్చారు. అయితే నిన్నటి కూరగాయలను అలాగే ఉంచడంతో.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో.. అధికారుల తీరుపై మండిపడ్డారు.

 

19:08 - July 8, 2017

విశాఖ : జిల్లాలో సింహాచల దేవస్ధానం గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త.. కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలిపావంచ వద్ద జెండా ఊపి యాత్రను అశోక్ గజపతిరాజు. సింహాచలం వద్ద బయలుదేరి కైలాసధార, సీతమ్మధార, మాధవధార మీదుగా సింహాచలం చేరుకోనున్నార భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

19:07 - July 8, 2017

పశ్చిమ గోదావరి :  పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఐదో వార్షికోత్సవాన్ని రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రాయ్‌ అవార్డ్‌ గ్రహీత కర్రి రామారెడ్డిని, రాష్ట్రపతి అవార్డ్‌ గ్రహీత విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రీని సన్మానించారు. ఐదేళ్లలోనే అందరి మన్ననలు అందుకోవడం ఆనందంగా ఉందని ట్రస్ట్‌ చైర్మన్‌ పంతం కొండలరావు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. 

19:05 - July 8, 2017

అనంతపురం : అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పరిటాల సునీత తనిఖీ చేపట్టారు. చంటిబిడ్డలతో ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్న బాలింతలకు అవసరమైన మౌళిక సదుపాయాలు వెంటనే కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

19:02 - July 8, 2017

గుంటూరు : 2019లో వైసీపీ అధికారంలోకి వస్తే జీవితాంతం ఏపీకి జగనే ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలెవరూ సంతోషంగా లేరన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్లీనరీలో మాట్లాడిన ఆయన... చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

18:55 - July 8, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల జాతీయ కన్వెన్షన్‌ను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని హేమలత విమర్శించారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకునేందుకు ఉద్యోగినులు సిద్ధంగా ఉన్నారన్నారు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ అధ్యక్షుడు సంపత్‌రావు. ఉద్యోగినులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

 

18:54 - July 8, 2017

హైదరాబాద్ : మెదక్‌ జిల్లా అల్లాదుర్గం గ్రామానికి చెందిన విఠల్‌ స్వామి తన పదిహేనవ ఏట నుండే మోసాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనుంజయ అనే వ్యక్తి దగ్గర 2001 సంవత్సరంలో శిష్యునిగా చేరాడు. ప్రజలను మోసం చేసే తంత్ర విద్యలన్నీ నేర్చుకున్నాడు. తనకు పోటీ అవుతున్నాడని విద్య నేర్పిన గురువునే హత్య చేసి 2005వ సంవత్సరంలో జైలు పాలయ్యాడు. జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత మకాం మార్చి తనతో పాటు ముగ్గిరుని కలుపుకొని మళ్లీ తన వృత్తిని కొనసాగించాడు. ప్రణాళికలు వేస్తూ ఈ ముగ్గురు కలిసి.. అమాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి విఠల్‌కు మహిమలున్నాయని నమ్మించేవారు. ఇంట్లో వారికి తెలియకుండా తాయత్తులు దాచేవారు. తర్వాతి రోజు మళ్లీ ఆ ఇంటికి వెళ్లి తాయత్తులు భగవంతుడు మీకోసమే పంపాడని నమ్మబలికేవారు. అది నమ్మిన అమాయకులు విఠల్‌ అడిగిన మేరకు 5వేల నుండి లక్ష రూపాయల వరకూ అప్పజెప్పేవారు. ఇదే కాకుండా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసేవారు.శ్మశాన వాటిక వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విఠల్‌తో పాటు మరో ముగ్గురిని గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్‌లో విచారించగా నిందితులు తమ భాగోతాలను బయటపెట్టారు. వీరి దగ్గర నుండి 16 లక్షల81 వేల నగదు, విఠల్‌ పేరు మీద ఉన్న బ్యాంక్ పాస్‌ బుక్‌, ఆరు సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విఠల్‌ పైన చీటింగ్‌ కేసులు, హత్యకేసులు, నకిలీ కరెన్సీ తయారీ ప్రయత్నం కేసులు అనేకం ఉన్నాయని డీసీపీ సుమతి తెలిపారు. డబ్బు, బంగారం ఆకాశం నుండి ఉడిపడవని, ప్రజలను ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సుమతి కోరారు.

18:51 - July 8, 2017

హైదరాబాద్ : కులాంతర వివాహాలు చేసుకుంటున్న దంపతులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారిపై అనేక దాడులు జరుగుతున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే కుల అహంకార దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

విశాఖలో ప్రేమోన్మాదం

విశాఖ : జిల్లా కేంద్రంలోని పూర్ణా మార్కెట్ పండా కాలనీలో దారుణం జరిగింది. ప్రియుడు సతీష్ ప్రియురాలి గొంతు కోసి, డంబెల్ తో కొట్టి హత్య చేశాడు. అనంతరం ప్రియుడు సతీష్ ఆత్మహత్యయత్నం చేశాడు. అతన్ని కేజీహెచ్ కు తరలించారు. సతీష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వీరిద్దరు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.

18:30 - July 8, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలోని పూర్ణా మార్కెట్ పండా కాలనీలో దారుణం జరిగింది. ప్రియుడు సతీష్ ప్రియురాలి గొంతు కోసి, డంబెల్ తో కొట్టి హత్య చేశాడు. అనంతరం ప్రియుడు సతీష్ ఆత్మహత్యయత్నం చేశాడు. అతన్ని కేజీహెచ్ కు తరలించారు. సతీష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. వీరిద్దరు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు ఇరువురి కుటుంబాల వారు కూడా ఒప్పుకున్నారు. ప్రియురాలిపై అనుమానంతోనే హత్య చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పెద్దపల్లి జిల్లాలో విషాదం

పెద్దపల్లి : జిల్లాలోని సబ్బితం గ్రామంలో విషాదం జరిగింది. కొడుకు మరణాన్ని తట్టులేక తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రి, కొడుకు ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

బంజారాహిల్స్ లో దారుణం

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. రోడ్డు నెం.7లో నడిరోడ్డు పై ఓ రౌడీ షీటర్ ను మరో రౌడీ షీటర్ హత్య చేశాడు. కత్తులతో నరికి చంపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి రౌడీ షీటర్ల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. నిందితుడు పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్టు తెలుస్తోంది.

17:25 - July 8, 2017
17:21 - July 8, 2017
17:10 - July 8, 2017

విశాఖ : విశాఖపట్నంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో అధికారులు కొత్త సంప్రదాయానికి తెర తీశారు. లైసెన్స్‌ లేకుండా పట్టుబడిన వాహన చోదకులకు భీమిలి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జ్‌ మురళీ మోహన్‌రావు... రవాణా శాఖతో మాట్లాడి లైసెన్స్‌లు ఇప్పించారు. యువకుల భవిష్యత్తు నాశనం కాకూడదనే ఉద్దేశంతో వారికి లైసెన్స్‌లు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు అధికారులు యువకులకు లైసెన్స్‌లు అందజేశారు.

17:09 - July 8, 2017

వరంగల్ : ఓరుగల్లు అనగానే ఘనమైన చరిత్ర కళ్లకు కడుతుంది. కాకతి రాజుల పురాతన వైభవం, కళలు, కళారూపాలు ఇలా ఎన్నో మన జ్ఞాపకాల్లో మెదలుతాయి. మరోవైపు కేంద్రప్రభుత్వంతో హెరిటేజ్‌ సిటీ, స్మార్ట్‌ సిటీగా ప్రశంసలు పొందుతూ.. అంతర్జాతీయ చిత్ర పటంలో ప్రత్యేకతను పొందుపరుచుకుంటోంది. ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశంలో.. చీకటి వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి.. డ్రగ్స్‌ దందాను విస్తరిస్తోంది. మత్తులో ముంచెత్తే నిషేధిత ఔషధాలను పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని.. ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా యువతకు అమ్మేస్తున్నారు. కొందరు అక్రమార్కులు గంజాయిని వ్యాపార వస్తువుగా మార్చుకుని.. యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారు.

సిగరెట్ ధర 200 నుంచి 500
నగరంలో పాన్‌ షాపులు, హోటళ్లు, బేకరీల్లో గంజాయి సిగరెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వీటికి అలవాటు పడిన యువత తప్పు దారిలో వెళ్లి జీవితాలను నాశనం చేసుకుంటోంది. రోజురోజుకీ నగరం గంజాయి డెన్‌గా మారుతున్నా.. పోలీసులు ముడుపుల మత్తులో జోగుతున్నారు. ఇక్కడ వీళ్లు పీల్చేస్తోన్న సిగరెట్ ధర 200 నుంచి 500 రూపాయలు. ఇది అలాంటి ఇలాంటి సిగరెట్ కాదు. మనిషిని నిలువునా మత్తులో ముంచే గంజాయి సిగరెట్‌. నగరంలో కొంత కాలంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. గంజాయి నింపిన సిగరెట్లు అందరికీ అంత తేలికగా దొరకవు. గంజాయి అమ్మే వాళ్లకు నిర్దిష్టమైన కోడ్‌ చూపితేనే సిగరెట్లు దొరుకుతాయి. చూశారా.. దగ్గరికెళ్లి ఇలా తెల్ల కర్చీఫ్‌ చూపిస్తేనే గంజాయ్‌ సిగరెట్లు, గంజాయి ప్యాకెట్లు క్షణాల్లో ముందుంటాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను వీరు టార్గెట్‌ చేస్తున్నారు. గంజాయ్‌తో పాటు చెర్రాస్‌ అనే మత్తు మందును సిగరెట్‌లో నింపి అమ్మకాలు జరుపుతున్నారు.

మత్తులో విద్యార్థులు..
గంజాయి, చెర్రాస్‌ దొరకని విద్యార్థులు, యువత... మత్తులో జోగేందుకు ఇతర మార్గాలనూ వెతుక్కుంటున్నారు. ఇలాంటివారు, దగ్గు నయమయ్యేందుకు వాడే కోరెక్స్‌ సిరప్‌, ఫోరెక్స్‌లపై ఆధారపడుతున్నారు. వరంగల్‌ నగరంలో ఎక్కడ అడిగినా కోరెక్స్‌ సిరప్‌ దొరకడం లేదంటే.. దీనికున్న డిమాండ్‌ అర్థమవుతోంది. కోరెక్స్‌కు బానిసలైన యువత మెడికల్‌ షాపుల వద్ద వెంపర్లాడుతున్నారు. ఇక కిక్‌ కోసం.. యువత వైటెనర్‌నూ వదలడం లేదు. 5 మిల్లీలీటర్ల వైటెనర్‌ తాగితే ఒక ఫుల్ బాటిల్ తాగిన కిక్‌ ఎక్కుతుందంటూ.. దీన్ని ఈ మత్తు డేంజర్‌ అని తెలిసినా చదువుకున్నవాళ్లు వీటిని వదులుకోవడం లేదు. ఈ మత్తు మైకంతో ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు లేకపోలేదు. ఎక్కువ మోతాదులో తాగితే మత్తు మాట అటుంచి మెదడు మటాష్‌ అవుతుందన్నది నిపుణుల హెచ్చరిక.

 

17:05 - July 8, 2017

వరంగల్ : అక్కడ మత్తే ప్రపంచం. ఇంతకాలం సామాన్యులకు తెలియని చీకటి ప్రపంచం. అందమైన ప్రపంచాన్ని ఆస్వాదించలేని స్థితికి విద్యార్థులను లాగేస్తోన్న కూపం. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన ఓరుగల్లు విద్యార్థులు.. మాదకద్రవ్యాల కోసం వెర్రెత్తిపోతున్నారు. భవితని బంగారుమయంగా తీర్చి దిద్దుకోవాల్సిన వయస్సులో.. మత్తు మైకంలో మునిగి తేలుతున్నారు. తల్లిదండ్రుల కష్టం పట్టించుకోకుండా.. యువత మత్తు వైపు ఆకర్షితమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత.. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్. చారిత్రకంగా, సాంస్కృతికంగా ఓరుగల్లుకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నాటి సాయుధ పోరు నుంచి నేటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లో ఇక్కడి విద్యార్థులు ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. కానీ నేడదే నగర యువత పెడ ధోరణులకు కేరాఫ్‌గా మారుతోంది. సామాజిక ఉద్యమాలకు ఉడుకు నెత్తురునందించిన నగరంలో.. మరిగే నెత్తురు మత్తుకు చిత్తవుతోంది. ప్రగతి శీల ఉద్యమాలకు, విప్లవ పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటి పోరుగల్లు.. డ్రగ్స్‌ డెన్‌గా మారి చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.మాదకద్రవ్యాల మాఫియా వలకు చిక్కి.. ఇప్పటి యువత.. పూర్తిగా నిస్తేజమై పోతోంది. ఓరుగల్లులో గంజాయితో నింపిన సిగరెట్లు నడిబజారులో బహిరంగంగానే దొరుకుతున్నాయి. దీంతో.. యువత చాటుగా వెళ్లి తమకు కావలసిన మత్తును కొనుక్కుంటోంది. 

17:03 - July 8, 2017

నల్లగొండ : జిల్లా నకిరేకల్‌ మండలంలోని చందంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వైపు వస్తున్న మారుతీ కారు డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి ఓ పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారులో 10 బస్తాల నిషేధిత గుట్కా పాకెట్లు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

17:02 - July 8, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి పాదాల మార్గంలో మహీంద్రా వ్యాను అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. బ్రేకులు ఫెయిల్‌ అయ్యి అదుపు తప్పిన వ్యాను ఓ సుమోను ఢీకొట్టి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కర్నాటకకు చెందిన 14 మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే తిరుమల అశ్వినీ ఆసుపత్రికి తరలించి చికత్స చేస్తున్నారు.

17:01 - July 8, 2017

హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 68వ జయంతిని ఇందిరాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షులు, ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌ భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయని.. ఆయన వల్ల ప్రతి ఒక్కరూ లబ్దిపొందారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ.. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

16:59 - July 8, 2017

గుంటూరు : పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించాలని వైసీపీ ఎంపీ మేకపాటి రామోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారేవారిపై మూడు నెలల్లోనే అనర్హతవేటు వేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వాలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో గెలవడం కోసం అనేక హామీలు ఇస్తున్నారని.. అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఎన్నికల హామీలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ఓ విధానం తీసుకురావాలన్నారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మేకపాటి పార్టీ ఫిరాయింపుల తీర్మానంపై మాట్లాడారు.

16:35 - July 8, 2017

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. రోడ్డు నెం.7లో నడిరోడ్డు పై ఓ రౌడీ షీటర్ ను మరో రౌడీ షీటర్ హత్య చేశాడు. కత్తులతో నరికి చంపినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి రౌడీ షీటర్ల మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. నిందితుడు పోలీసు స్టేషన్ లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. కానీ అధికారలు ఎటువంటి ప్రకట చేయలేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

16:01 - July 8, 2017

కొత్తగూడెం : జిల్లా ఆళ్లపల్లి మండలంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాన్ని సాకుగా చూపుతూ.. మాఫియా యథేచ్ఛగా ఇసుకను తరలించేస్తోంది. వాస్తవానికి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కోసం వాగులో నుండి ఇసుకను తోడి కూలీలతో ఒక చోట డంప్‌ చేయాలి.. అలా చేసినందుకు ప్రభుత్వం 500/- రూపాయలు ఇస్తుంది. అయితే, అక్రమార్కులు, ఈ డంపింగ్‌ నిబంధనను కాలరాస్తూ.. నేరుగా ట్రాక్టర్లలోకే లోడ్‌ చేస్తున్నారు. ఇలా తరలించే ప్రతి ట్రిప్పు ట్రాక్టర్‌కు, ప్రభుత్వానికి డీడీ రూపంలో వెయ్యి రూపాయలు చెల్లించాలి.. కాని డి.డి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, పంచాయితీ సెక్రటరీలు ముడుపులు తీసుకుని ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

పట్టించుకోని అధికారులు
ఆళ్లపల్లి మండలం అనంతోగు ఇసుక ర్యాంపులోని ఇసుక జిల్లా నిర్మించే డబుల్ బెడ్‌ రూం ఇళ్లకే వాడాలి. కానీ అక్రమార్కులు.. ఇక్కడి ఇసుకను ట్రాక్టర్లు, లారీలతో పక్క జిల్లాలకూ తరలిస్తున్నారు. రోజుకు కొన్ని వేల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు...నిబంధనల ప్రకారం ఇసుక లోడును ట్రాక్టర్‌ బాడీ లెవెల్‌ వరకే నింపాలి. కానీ, అక్రమార్కులు హైలెవెల్‌ వరకూ ఇసుకను నింపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులంతా ఇసుక మాఫియా కనుసన్నల్లోనే నడుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు .ఇసుక మాఫియా ఆగడాలను ప్రశ్నించే వారిని చంపేస్తామని బెదిరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఇసుక తరలించడం ద్వార ఆళ్లపల్లి లో భూగర్భ జలమట్టాలు మూడు అడుగుల మేర పడిపోయాయి. ఆనంతోగు ఇసుక ర్యాంపుని రద్దు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

16:00 - July 8, 2017

నిజామాబాద్ :జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ పాలక వర్గం కోసం సాగిన దోబూచులాటకు తెర పడింది. ఇన్నాళ్లూ ఇద్దరు శాసన సభ్యులు చైర్మన్‌ పదవి తమ వాళ్లకే కావాలంటూ.. భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెర పడింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన మూడున్నరేళ్ల తరువాత.. పాలక వర్గం ఏర్పాటైంది. తెలంగాణలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మార్కెట్ కమిటీకి.. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాలక వర్గం కోసం సాగిన దోబుచులాటకు తెర పడింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు దాటినా.. ఇక్కడ పాలక వర్గాన్ని నియమించలేదు. స్వయానా ముఖ్యమంత్రి కూతురు ఎంపీ కవిత నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

రోజూ కోట్ల రూపాయల వ్యాపారాలు
రోజూ కోట్ల రూపాయల వ్యాపారాలు.. ఈ మార్కెట్‌ యార్డులో కొనసాగుతాయి. గతంలో ఈనాం అమలు చేయటంలో ప్రధాన మంత్రి చేతుల మీదగా కలెక్టర్‌ యోగితా రానా.. మార్కెట్ కార్యదర్శి అవార్డును అందుకున్నారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ మార్కెట్‌ చైర్మన్‌ పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. తమ అనుచరులకే కావాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్‌.. అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ చివరకు రూరల్‌ ఎమ్మెల్యే తన పంతాన్ని నెగ్గించుకున్నాడు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలక వర్గం ఎట్టకేలకు ఖరారయ్యింది. సుమారు మూడేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ కమిటీ పాలక వర్గాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిచ్‌పల్లి మండలానికి చెందిన దినేశ్‌ గతంలో.. జడ్పీటీసీగా పని చేశారు. ఆయన సతీమణి కులాచారి దివ్యను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవిపేట మండలం, అనంతగిరికి చెందిన గాందారి చంద్రశేఖర్‌ రెడ్డిని వైస్‌ చైర్మన్‌గా వీరితో పాటు.. 12 మంది సభ్యులను నామినేట్ చేశారు. నూతన పాలక వర్గ సభ్యులు.. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీ కవిత ఓకే చెప్పడంతో నియామకం ఖరారయ్యింది.

బీసీ మహిళకు మార్కెట్ కమిటీ చైర్మెన్
మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవిని.. ప్రభుత్వం బీసీ మహిళకు కేటాయించింది. మార్కెట్ కమిటీకి గత పాలక వర్గం 2014 మే 31 న రాజీనామా చేసింది. అప్పటి నుంచి మార్కెట్ యార్డుకు పాలక వర్గంలేదు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించిన ప్రభుత్వం.. వాటి సమయం కూడా ముగియడంతో మరో ఏడాది గడువును పొడిగించింది. కానీ నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని మాత్రం నియమించలేదు.ఈ మార్కెట్‌ ప్రతీ ఏడాది అన్ని పంటలు కలిపి.. దాదాపుగా 850 కోట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. మార్కెట్ కమిటీ పరిధిలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన మండలాలు ఉన్నాయి. పాలక వర్గం నియమించాలంటే నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ సయోద్య కుదరాలి. ఏ ఒక్కరు వ్యతిరేకించినా పాలక వర్గం నియామకం ఆగిపోయినట్లే. మూడేళ్ల నుంచి ఈ కమిటీకి పాలక వర్గం నియమించకపోవడానికి కూడా సయోధ్య కుదరకపోవటమే కారణమని తెలుస్తోంది. అయితే ఎంపీ కవిత ప్రత్యేక దృష్టి సారించి ప్యానెల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో మూడేళ్ల నిరీక్షణకు తెర పడింది.

15:58 - July 8, 2017

గుంటూరు : ఎమ్మార్పీఎస్ ఆందోళన ఘటనలో ఎంతమంది ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు ఏపీ డీజీపి నండూరి సాంబశివరావు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఎమ్మార్పీఎస్ కురుక్షేత్ర సభ విధ్వంస ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు డిజిపి సాంబశివరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభ నిర్వహణకు అనుమతి లేకపోయినా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చేసిన ఆందోళనపై చంద్రబాబు సీరియస్ అయినట్లు డిజిపి చెప్పారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేశామని ..శాంతి భద్రతల విషయంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని డిజిపి సాంబశివరావు అన్నారు. 

15:56 - July 8, 2017

జగిత్యాల : జిల్లాలోని బిర్పూర్‌ మండలంలో రోళ్లవాగు రిజర్వాయర్‌ నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత శంకుస్థాపన చేశారు. నర్సింహుళ్లపల్లె సమీపంలో 62 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపీ బాల్కసుమన్‌, విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం హరిశ్‌రావు, కవిత ధర్మపురిలో జరిగే బహిరంగ సభకు బయలుదేరారు.

 

15:55 - July 8, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు మూడేళ్ల పాలనలో 2లక్షల 75వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో మరో లక్ష రూపాయల అవినీతి జరిగిందని మండిపడ్డారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు అవినీతిపై ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. చంద్రబాబు అవినీతిని ప్రతి ఒక్కరికి వివరించాలని ఆయన వైసీసీ కార్యకర్తలకు సూచించారు. 

15:53 - July 8, 2017

నిజామాబాద్ : రుణ మాఫీపై ఇందూరు రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్‌లో పైర్లు సాగు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక అన్నదాతలు అల్లాడుతున్నారు. పాత అప్పులు తీరకపోవడంతో కొత్త రుణాలు ఇవ్వాడానికి బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీంతో పుస్తెలు తాకట్టుపెట్టి వడ్డీ వ్యాపారుల నుంచి అధిక మిత్తీకి లోన్లు తీసుకుంటున్నారు.నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయమే ప్రధానం. జిల్లాలో 2,93,947 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో 255 బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఖరీఫ్‌లో 1560.82 కోట్ల రూపాయలు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఇంతవరకు ఇచ్చింది కేవలం 172.65 కోట్ల రూపాయలే. నిర్ణీత లక్ష్యంలో ఇది కేవలం 11 శాతం మాత్రమే. ఇరవైఆరు బ్యాంకు శాఖలు ఇంత రైతులకు రుణాలు ఇవ్వడమే ప్రారంభించలేదు.

జిల్లాలో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు
జిల్లాలో 4.89 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. కానీ అప్పు దొరక్క అల్లాడుతున్న అన్నదాతలు ఇప్పటి వరకు కేవలం 1.33 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీని ఏకకాలంలో చెల్లించకుండా, విడతలవారీగా విడుదల చేస్తున్నారు. దీంతో సర్కారు విడుదల చేసిన రుణమాఫీ సొమ్మును బ్యాంకులు వడ్డీలకే సర్దుబాటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వ వైఖరిని, బ్యాంకుల తీరుపై అన్నదాతలు ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. రుణమాఫీ సొమ్మును ఒక్కసారిగా చెల్లించకుండా విడుతలవారీగా విడుదల చేస్తుండటంతో తమకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు కొత్తగా రుణాలు ఇవ్వకపోవడంతో విత్తనాలు, ఎరువులు, పరుగు మందులు కొనుక్కొనేందుకు కూడా డబ్బులు లేక అన్నతాదాలు అల్లాడుతున్నారు.

మిగిలేది రెక్కల కష్టమే...
రైతులకు రెవెన్యూ శాఖ లైటిల్‌ డీడ్‌ , పాసు పుస్తకం ఇస్తున్నాయి. ఇంతకు ముందు టైటిల్‌ డీడ్‌లను బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు. చేసిన అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు టైటిల్‌ డీడ్‌లను ఇంకా తిరిగి ఇవ్వలేదు. దీంతో తమ వద్ద ఉన్న పాసు పుస్తకాలను వడ్డీ వ్యాపారుల వద్ద తాకట్టుపెట్టి అధిక మిత్తీకి రుణాలు తీసుకుని పైర్లు సాగు చేస్తున్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత తమకే విక్రయించే విధంగా కొందరు వడ్డీ వ్యాపారులు అన్నదాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన రుణానికి వచ్చిన పంటతో సర్దుబాటు చేసుకుంటే రైతులు మిగిలేది రెక్కల కష్టమే తప్ప, పండించిన పంటకు ఫలితం ఉండదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి, అందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. 

15:52 - July 8, 2017

హైదరాబాద్ : కలకలం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో పోలీసులు..ఎక్సైజ్ అధికారులు శోధిస్తున్నారు..తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ మాఫియా విస్తరించిందన్న సమాచారంతో ఆయా నగరాలపై దృష్టి పెట్టారు...ఇక ప్రధానంగా మాఫియా లింకులు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు..గోవా, రాజస్థాన్, యూపీ ప్రాంతాల్లో దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే బృందాలను పంపించారు..ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించిన పోలీసులు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో అక్కడ దాడులు చేయనున్నారుమహానగరం కేంద్రంగా చేసుకుని డ్రగ్స్‌ను కాలేజీలు...స్కూళ్లకు మత్తు సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై దృష్టి పెట్టారని తేలింది...నగరాల్లోని కాలేజీలు..స్కూళ్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఐటీ కారిడార్‌, ఉద్యోగులను మత్తులో ముంచాలని ప్లాన్ చేశారని తెలుసుకున్నారు...తెలంగాణాలోని వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ,విజయవాడ, వైజాగ్,తిరుపతి ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది...దీంతో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు సంబంధించిన లింకులు..కాల్‌డేటా ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.

15:51 - July 8, 2017

గుంటూరు : వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రజలకోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని... YCP అధినేత జగన్‌ గుర్తుచేసుకున్నారు.. ప్రతి పేదవాడికి అండగా నిలిచారని చెప్పారు.. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్లీనరీలో చర్చ జరుగుతుందని చెప్పారు.. సీఎం బాబు పాలన ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని జగన్‌ చెప్పుకొచ్చారు.

శ్రీకాంత్ గౌడ్ కోసం గాలింపు ముమ్మరం

ఢిల్లీ : దేశ రాజధానిలో కిడ్నాప్ గురైన శ్రీకాంత్ గౌడ్ కోసం పోలీసులు బృందాలుగు ఏర్పాడి గాలింపు ముమ్మరం చేశారు. శ్రీకాంత్ ఢిల్లీలోని మెట్రో ఆసుపత్రిలో డాక్టర్ గా చేస్తున్నారు. 

తిరుమలలో రోడ్డు ప్రమాదం

చిత్తూరు : తిరుమల శ్రీవారి పాదాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా వ్యాన్ సుమో ను ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న 10 మందికి గాయలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక వాసులుగా అధికారులు గుర్తించారు

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి : జిల్లా ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీ హిందు ఇంజనీరింగ్ కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు విషయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు మందలించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. 

పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

కొత్తగూడెం : జిల్లా టేకుపల్లి మండలం కోయగూడెంలో విషాదం జరిగింది. ఓ తల్లి ఇద్దరి పల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. భర్త తనను రోజు వేధిస్తుండడంతో పాటు మరో మహిళతో అక్రమా సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన ఆ తల్లి తన పిల్లలు గౌతమి 2సంవత్సరాలు, భరత్ 10నెలలు ఉరి వేసి వారు చనిపోయిన తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది.

15:13 - July 8, 2017

కొత్తగూడెం : జిల్లా టేకుపల్లి మండలం కోయగూడెంలో విషాదం జరిగింది. ఓ తల్లి ఇద్దరి పల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. భర్త తనను రోజు వేధిస్తుండడంతో పాటు మరో మహిళతో అక్రమా సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన ఆ తల్లి తన పిల్లలు గౌతమి 2సంవత్సరాలు, భరత్ 10నెలలు ఉరి వేసి వారు చనిపోయిన తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. తను ఒక్కదాన్నే చనిపోతే పిల్లలు అనాథలు అవుతారే భయంతో వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె భర్త పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:36 - July 8, 2017
14:34 - July 8, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి పాదాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా వ్యాన్ సుమో ను ఢీకొట్టి అనంతరం లోయలోకి దూసుకెళ్లింది. వ్యాన్ లో ప్రయాణిస్తున్న 10 మందికి గాయలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక వాసులుగా అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:24 - July 8, 2017

రంగారెడ్డి : జిల్లా ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీ హిందు ఇంజనీరింగ్ కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు విషయంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు మందలించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి బీటెక్ సెంకడ్ ఇయర్ చదువుతున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

13:58 - July 8, 2017

కథలు వినడం, కాల్షీట్లు ఇవ్వడం..  షూటింగ్ లు.. అవి బోర్ కొడితే రిలాక్స్ కోసం ఫారిన్ టూర్లు... ఎప్పుడూ ఇదే లైఫ్ బోర్ అనిపించిందో ఏమో మన టాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు కొత్త గా ఆలోచిస్తున్నారు... టైమ్ పాస్ కోసం కొత్త కొత్త రూట్లు వెతుకుతున్నారు..... అందులో కూడా ఇన్ కమ్ చూసుకుంటున్నారు.... బిజినెస్ లు చేస్తూ ఇంకా బిజీబిజీ అయిపోతున్నారు. మన టాలీవుడ్ స్టార్లు చేస్తున్న స్టార్ బిజినెస్ ల పై స్పెషల్ స్టోరీ మీ కోసం... 
బిజినెస్ పై దృష్టి
ఇది వరకు యాక్టర్లు సినిమాలు మాత్రమే చేసుకుని బ్రతికేవారు.. జనరేషన్ మారుతున్నాకొద్ది.. టెక్నాలజీ పెరుగుతూవచ్చింది... తరువాత సినిమాలతో సమానంగా యాడ్స్ చేయడం మొదలు పెట్టారు... ఇప్పుడు జనరేషన్ యాక్టర్స్  ఇంకా అడ్వన్స్ అయ్యారు... యాడ్స్ చేయడంతో పాటు మనం కూడా ఏదో ఒక బిజినెస్ ను ఎందుకు రన్ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు... ఆచరణలో పెడుతున్నారు...
పెట్టుబడుల వైపు సంపాదన
నిజం చెప్పుకోవాలంటే సినిమానే ఓ పెద్ద బిజినెస్... అది అందరికి తెలుసు. పెట్టుబడి, రాబడి, లాభాలు, నష్టాలు వీటిపైనా సినిమా ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి నిర్మాతల జీవితం తలకిందులవుతుంది. ఇవన్నీ చాలా దగ్గరగా గమనిస్తారు యాక్టర్స్ అందుకే వారికి బిజినెస్ ట్రిక్స్ బాగా వంటబడుతున్నాయి... స్టార్లుగా చేతినిండా సంపాదిస్తున్న వాళ్ళు వారి సంపాదనను పెట్టుబడుల వైపు మళ్ళిస్తున్నారు. 
వ్యాపారం, సినిమాల్లో దూసుకుపోతున్న నటులు
ఒకప్పటి నటీనటులు తమ సంపాదనను ఎక్కువగా దాచుకోవడానికే ఇంట్రస్ట్ చూపించేవారు.. లేదంటే ఏ రియలెస్టేట్ లాంటి రంగాల్లోనో ఇన్వెస్ట్ చేసేవారు. అంతే కాని సొంత బిజినెస్ లో  పెట్టిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. బిజినెస్ లో పెడితే నష్టాలు వస్తాయేమో అన్న భయం ఉండేది వాళ్ళకు.. అందుకే శోభన్ బాబు లాంటి నటులు రియల్ ఎస్టేట్ లాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టారు... సినిమాల్లోకి రాకముందు నుంచి వ్యాపారాలు చేస్తున్న నటులు మాత్రం తమ అనుభవంతో అటు వ్యాపారంలోను ఇటు సినిమాల పరంగా దూసుకుపోతున్నారు...
యంగ్ స్టార్స్ లో బిజినెస్ మైండ్   
టాలీవుడ్ యంగ్ స్టార్స్ చాలా వరకు బిజినెస్ మైండ్ తోనే ఉన్నారు..  సినిమాల నుండి వస్తున్న  రెమ్యూనరేషన్ తో యూత్ ఫుల్ గా బిజినెస్ లు చేస్తున్నారు..లాస్ లేని వ్యాపారాలు వెతుక్కుని మరీ ఇవ్వెస్ట్ చేస్తున్నారు.. హోటళ్ళ దగ్గర నుండి బోటిక్ ల వరకు అన్నింటిని మెంటేన్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు... 
బిజినెస్ లతో రామ్ చరణ్ బిజీ 
బిజినెస్ చేస్తున్న యంగ్ స్టర్స్ లో ముందు వరుసలో ఉన్నాడు మన టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్... అపోలో చైర్మన్ గా ఉన్న ఉపాసనను పెళ్ళిచేసుకున్నాడు చరణ్.. అంతే కాదు విమానయాన సంస్థలో పెట్టుబడులు పెట్టి అందులో అందులో షేర్ తీసుకున్నాడు... దానితో పాటు హైదరాబాద్ లో ఓ పోలో టీమ్ ను కొన్నాడు. ఇలా రకరకా బిజినెస్ లతో బిజీగా ఉంటున్నాడు మగథీరుడు.. అటు సినిమాలను ఇటు వ్యాపారాన్ని రెండీంటిని మెంటేన్ చేస్తుంన్నాడు...  
బిజినెస్ వైపు ఆలోచిస్తున్న బన్నీ
మెగాఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో బన్నీ. రాంచరణ్ కంటే కూడా ఎక్కువ స్టార్డమ్ ఉన్న హీరో బన్ని.  ఇప్పుడు ఈ అల్లూవారి బుల్లోడు కూడా బిజినెస్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు హోటల్ బిజినెస్ లోకి దిగి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడంట కూడా... మూవీస్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే బన్ని బిజినెస్ లో కూడా అదే హుషార్ తో దూసుకుపోతున్నాడు.
సినిమాలపై అల్లూ శిరీష్ కంప్లీట్ దృష్టి 
మూడు సినిమాల నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అల్లూ శిరీష్.. శిరీష్ కూడా కొంత కాలం క్రితం వరకు ఓ ఫిల్మ్ మ్యాగజైన్ రన్ చేసేవాడు... ఇప్పుడు సినిమాల మీద కంప్లీట్ గా దృష్టి పెడుతున్నాడు.. అన్న స్టార్ డమ్ కు దగ్గరగా పోలేకపోయినా.. కొంచెంలో కొంచెం హీరో అనిపించుకోవడానికి ఆరాటపడుతున్నాడు. హోటళ్ళు, బోటిక్ లు, ఇవే కాదు కన్సల్టెంన్సీలు ఇలా రకరకాల బిజినెన్ ఆలోచనలతో మన టాలీవుడ్ యంగ్ స్టార్స్ ఉరుకులు పెడుతున్నారు. కొంత మంది మేము ఈ బిజినెస్ చేస్తున్నాము అని చెప్పుకుంటుంటే, మరికోంత మంది స్టార్లు మాత్రం ఈ విషయాలు  చెప్పుకోవడానికి ఇష్టపడటంలేదు. సైలెంట్ గా వారి వ్యాపార సాంమ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు.
వ్యాపార ప్రపంచంలో పుట్టిన రానా  
దగ్గుబాటి రానా.... బాహుబలీతో ఎక్కడ లేని క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్.. టాలీవుడ్ టాలెస్ట్ స్టార్... రానా పుట్టడమే వ్యాపార ప్రపంచంలో పుట్టాడు.. దగ్గుబాటి రామానాయుడు మనవడిగా వ్యాపారాలను వంటబట్టించుకుంటున్నాడు. రామానాయుడు మొదటి నుండి రైస్ మిల్లుల వ్యాపారంలో ఉన్నాడు.. ఆ తరువాత సినిమా ప్రొడ్యూసర్ గా, స్టూడియో ఓనర్ గా... డిస్టిబ్యూటర్ గా, సినిమా హాళ్ళు నిర్మించి రకరకాల బిజినెస్ లను నడిపించాడు రామానాయుడు... 
తాత బాటలో రానా..
ఇప్పుడు తాత బాటలో నడవడానికి రెఢీ అయ్యాడు దగ్గుబాటి రానా. తన సొంతంగా ఓ కన్సల్టెన్నీ కంపెనీ స్టాట్ చేశాడు. తన తండ్రి తాతలను  బీట్ చేయాలనుకుంటున్నాడో ఏమో ఈ కన్సల్టెన్సీ ద్వార నటీనటుల వివరాలు పొందుపరిచి తన ద్వారా అవకాశాలు కల్పించనున్నాడు..   ఈ బిజినెస్ బాగుందనుకున్నారో ఏమో.. జగపతిబాబు.. పూరీ జగన్నాధ్ లు కూడా ఇటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నారు..... 
కాఫీ షాపుల్ని నడిపిస్తున్న శార్వానంద్ 
శర్వానంద్ క్లాసిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.... ఈ మద్యే శతమానంభవతీ అనిపించుకున్న శర్వా..కొన్ని కాఫీ షాపుల్ని నడిపిస్తున్నాడంట... అంతే కాదు ఈ జనరేషన్స్ కి రోల్ మోడల్ లాంటి వాడు నాగార్జునా ఆయన బిజినెస్ మైండ్ తో చాలా వ్యాపారాలు నడిపిస్తున్నాడు. కల్యాణ్ జ్యూవలరీస్ లాంటి కార్పోరేట్ వ్యాపారాలలో నాగ్ కి పాట్నర్ షిప్ కూడా ఉందని వినికిడి. వీటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్. మూవీ ప్రొడక్షన్స్, కన్వెన్షన్ సెంటర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అక్కినేని ఫ్యామిలీకి..
బిజినెస్ పై హీరోయిన్స్... 
ఈ బిజినెస్ ఆలోచనలు  ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా వస్తాయి కదా.. హీరోయిన్లు కూడా హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వారి ఆలోచనలకు పదును పెడుతున్నారు.. సినిమాల మీద బాగా సంపాదిస్తుండటం, వాటికి తోడు షాపింగ్ మాల్స్ ఒపెనింగ్స్, యాడ్స్ నుండి వచ్చిన డబ్బులను వ్యాపారాల వైపుకు మళ్ళిస్తున్నారు....   
వెడ్డింగ్ ప్లానర్ గా తాప్పి
మగవారికంటే మేమేమి తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు హీరోయిన్స్... వారివారి ఇంట్రస్ట్ ను బట్టి పలు వ్యాపారాలలో తమ సత్తా చాటుతున్నారు.. మొన్నటి వరకు హీరోయిన గా కుర్రాళ్ళను ఉరకలు పెట్టించిని తాప్సి ప్రస్తుతం నటిస్తూనే... వెడ్డింగ్ ప్లానర్ గా ఉంది. వెడ్డింగ్ ప్లానింగ్ కి సంబంధించిన ఓ కంపెనీ నడిపిస్తూ చేతినిండా సంపాదిస్తుంది.... 
నిషా అగర్వాల్
సోలో లాంటి క్లాసిక్ మూవీస్ తో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నా హీరోయిన్ నిషా అగర్వాల్... స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలిగా కాకుండా తనకంటు ఓ గుర్తింపు తెచ్చుకుంది.  అక్కకంటే ముందే పెళ్ళిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్త ప్రోత్సాహంతో జ్యూవల్లరీ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. అంతే కాదు కాజల్ కు కూడా పాట్నర్ షిప్ ఇచ్చి అక్కను కూడా తన వ్యాపారంలో పాట్నర్ ని చేసుకుంది... 
తమన్నా..
సరిగ్గా ఇలాంటి బిజినెస్ లోనే అడుగు పెట్టింది తమన్నా..  హ్యాపీ డేస్ తో కుర్రాళ్ళ మనసులు కదిపేసిన ఈ బొమ్మ... బాహుబలీ లాంటి పెద్ద ప్రొజక్ట్ లో హీరోయిన్ గా మెరిపించింది ఇప్పుడు స్టార్ హీరోయిన్.. పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన చేస్తూ..  భారీ రెమ్యూనరేషన్స్ తో చేతినిండా సంపాదిస్తుంది. దానితో పాటు ఆన్ లైన్ జ్యూవల్లరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది.. ఆన్ లైన్ ద్వారా నగలు అమ్ముతూ.. పెద్దగా పెట్టుబడి లేకుండానే ఆన్ లైన్ వ్యాపారం చేస్తుంది మిల్కీ. సినిమాలతో పాటు బిజినెస్ కూడా ఓ కళే... సినిమా రంగంలో రాణించిన వాళ్ళం బిజినెస్ లో రాణించలేమా అన్నా ధీమాతో సోంత బిజినెస్ ల వైపు  ఉరుకులు పెడుతున్నారు యంగ్ స్టార్స్. ఉన్న డబ్బులను వేస్ట్ చేయకుండా.. ఎక్కువ రిస్క్ లేని వ్యాపారాలను టైమ్ పాస్ కోసం స్టార్ట్ చేస్తున్నారు సినీ తారలు.... 
రకుల్ ప్రీత్ సింగ్.... 
వచ్చిన తక్కువ కాలంలోనే హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్.... వెంకటాద్రీ ఎక్స్ ప్రెస్ సినిమాతో అందరి మనసులు దోచుకున్నా ఈ గుమ్మ స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. రారండోయ్ వేడుకలకు అంటూ సందడి చేయబోతుంది. రకుల్ ఇప్పుడు బిజినెస్ వైపు కు మళ్ళింది. ఫిట్ నెస్ పై కాస్త ఎక్కువగా దృష్టిపెట్టే రకుల్.. ఇప్పుడు హైదరాబాద్ లో ఓ ఫిట్ నెస్ హబ్  ను స్టార్ట్ చేసిందిట... అంతే కాదు అందులో ఇంటర్ నేషన్ స్టాండెడ్స్ ఉండే విధంగా జిమ్ ను రూపోందించిందట.. 
వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన మోహన్ బాబు.. 
సినిమా ఇండస్ట్రీలోని పెద్ద ఫ్యామిలీస్ లో మంచు వారి ఫ్యామిలీ కూడా ఒకటి.. ఇండస్ట్రీలోకి ఎన్నో కష్టాలుపడి ఇంత ఎత్తుకు ఎదిగాడు మోహన్ బాబు..  ఆయన సినిమాల నుండి వ్యాపారాల వరకు కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు... నిర్మాతగా, సినిమా హాళ్ల ఓనర్ గా మాత్రమే కాకుండా విద్యా సంస్థలు స్ధాపించి...  సంపాదనతో పాటు పేద విద్యార్ధులకు తక్కువ ఖర్చుతో మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు మంచు మోహన్ బాబు.... 
తండ్రి బాటలో నడుస్తున్న మంచు లక్ష్మీ
ఇప్పుడు తండ్రి బాటలోనడుస్తుంది మంచు లక్ష్మీ. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా యాక్ట్రస్ గా, ఉన్న లక్ష్మీ ఇప్పుడు హోటర్ రంగంలోకి దిగారు..  ఓ రెస్టారెంట్ కు సంబంధించిన ఫ్రాంచేజీలో పాట్నర్ అయ్యారంట లక్ష్మీ... సినిమాలో నటిస్తూనే రిస్క్ లేని బిజినెస్ ప్లాన్ చేసుకుంది మంచు లక్ష్మీ ప్రసన్నా... బిజిసెస్ ప్లానింగ్ లో తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవాలని ఆరాటపడుతుంది లక్ష్మి. దాంతో పాటు ఓ రాజకీయ పార్టీ నుండి పోటీ చేసి రాజకీయలను కూడా టచ్ చేయాలి అని ఆలోచనలో ఉందట మంచు వారి ఆడపడుచు.
విజిటింగ్ పాట్నర్స్ గా..
మన తారలు సినిమాల్లో నటిస్తూ... తమ వ్యాపారాలపై ఇంట్లో వాళ్ళకు ఇంచార్జింగ్ ఇస్తున్నారు.. వీళ్ళు మాత్రం విజిటింగ్ పాట్నర్స్ గా ఉంటున్నారు. ఫలానా హీరోకో హీరోయిన్ కో సంబంధించిన రెస్టారెంట్ అనగానే కామన్ పీపుల్స్ కి ఇంట్రస్ట్ పెరుగుతుంది. తమ హీరోకి ఇస్టమైన ఫుడ్ దొరుకుతుంది కదా అన్న కోరికతో... ఫేవరెట్ స్టార్ కి ఇస్టమైన మెను ఉంటుంది అన్న ఆశతో  రెస్టారెంట్లకు క్యూ.. కడుతున్నారు... అందుకే చాలా మంది రెస్టారెంట్ ఓనర్స్ మీరు పెట్టుబడి పెట్టవద్దు పాట్నర్ గా ఉండండి చాలు అంటూ.. మూవీ స్టార్స్ ను బ్రతిమలాడుకుంటున్నారు... 

 

ఢిల్లీలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

ఢిల్లీ : హస్తినలో ఎంబిబిఎస్‌ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌.. ఢిల్లీలోని మెట్రో హాస్పిటల్‌లో ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. అయితే శ్రీకాంత్‌ గౌడ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. 

13:39 - July 8, 2017
13:37 - July 8, 2017

ఢిల్లీ : హస్తినలో ఎంబిబిఎస్‌ విద్యార్థిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌.. ఢిల్లీలోని మెట్రో హాస్పిటల్‌లో ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. అయితే శ్రీకాంత్‌ గౌడ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి.. కోట్లలో డిమాండ్‌ చేస్తున్నాడని శ్రీకాంత్ బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ బంధువులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. శ్రీకాంత్ గౌడ్‌ తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధ పడుతుండటంతో.. విషయాన్ని వారికి తెలియనివ్వలేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:33 - July 8, 2017

గుంటూరు : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు దుర్మార్గపు పాలన కొసాగిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఆ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతటి దుర్మార్గపు పాలన ఎప్పుడు చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. 3 సం.ల కాలంలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన నేత వైఎస్ ఆర్ అని తెలిపారు. వైఎస్ ఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రతి పేదవాడికి అండగా నిలిచారని గుర్తు చేశారు. దశ, దిశా నిర్దేశించుకునేందుకు ప్లీనరీ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ప్లీనరీలో 20 తీర్మానాలు చేయబోతున్నామని...వాటిపై చర్చ జరుగుతుందన్నారు. అందరం కలిసికట్టుగా తీర్మానాలపై ఆమోదం తెలుపుతామని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ప్లీనరీకి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:13 - July 8, 2017

హైదరాబాద్ : మహానగరంలో డ్రగ్స్...నిజామాబాద్‌తో మత్తు చాక్లెట్లు...ఈ రెండు చోట్ల తేలింది ఒక్కటే ..స్కూలు పిల్లలను లక్ష్యం చేసుకుని మత్తు విక్రయిస్తున్నారని...ఇక జిల్లాల్లో రకరకాలుగా దందాలు చేసేవారున్నారు..దానికి స్కూలు పిల్లలే విక్రేతలు కావడం ఘోరం...నిషేదిత గుట్కా, గంజాయి ఇప్పుడు జిల్లాల్లోని పలు కాలేజీలు..స్కూళ్లలో దొరుకుతుంది..
స్టూడెంట్స్‌ టార్గెట్‌గా దందా...
డ్రగ్స్...ఇది ఏ రూపంలో ఉన్నా టార్గెట్‌ మాత్రం చిన్నారులే... స్కూలు పిల్లలకు రకరకాల మత్తును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న గ్యాంగ్స్‌ మహానగరంలోనే కాదు...తెలంగాణాలోని ఎన్నో జిల్లాల్లో కూడా విస్తరించారు..ఎక్కడికక్కడ మత్తు విక్రయిస్తూ సంపాదిస్తున్నవారు పసివాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు...
జగిత్యాలలో గంజాయి విక్రయాలు..
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భారీ ఎత్తున గంజాయి లభ్యమైంది. ఓ యువకుడి నుంచి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్ధులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు విచారిస్తున్నారు....రాయికల్ మండలంలోని ఇద్దరు యువకులు స్కూటీలో గంజాయి పెట్టుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు...యువకులు విక్రయించే గంజాయిని టెన్త్‌, ఇంటర్ స్టూడెంట్స్‌ సిగరెట్లలో పెట్టుకుని తాగుతున్నట్లు తేలింది..దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు..
ప్రయివేటు స్కూళ్లో నిషేదిత గుట్కాలు..
జయశంకర్‌ జిల్లాలోని గుడ్‌మార్నింగ్‌ ప్రైవేటు స్కూల్‌లో విద్యార్ధుల వద్ద నిషేధిత గుట్కాలు లభించడం కలకలం రేపుతోంది. ఓ విద్యార్ధి తోటి విద్యార్ధులకు గుట్కాలు ఇస్తుండగా ప్రిన్సిపాల్ మందలించారు. దాంతో భయపడిన ఓ విద్యార్ధి దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతనిని 108లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
స్కూలు ఆవరణలోకి మత్తు పదార్థాలు...
స్కూలు ఆవరణలోకి మత్తు పదార్థాలు...నిషేదిత గుట్కాలు వస్తున్నాయంటే జిల్లాల్లో ఏ స్థాయిలో డ్రగ్స్‌ వ్యాపారం విస్తరించే పనిలో ఉందో తెలుస్తోంది...ఇప్పటికైనా కన్నవారితో పాటు స్కూలు యాజమాన్యాలు వెంటనే చర్యలు తీసుకోపోతే ప్రమాదాలే జరుగుతాయి.

 

అనంతపురంలో దారుణం

అనంతపురం : నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. అనంతపురంలోని శ్రీనగర్‌ కాలనీలో గంగాధర్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి మూడు రోజులుగా చితకబాదుతున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ఒక సెల్ దొరకడంతో విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అడ్రస్‌తో సహా పోస్ట్‌ చేయడంతో మీడియా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

13:06 - July 8, 2017

అనంతపురం : నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. అనంతపురంలోని శ్రీనగర్‌ కాలనీలో గంగాధర్‌ అనే వ్యక్తిని కిడ్నాప్‌ చేసి మూడు రోజులుగా చితకబాదుతున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ఒక సెల్ దొరకడంతో విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అడ్రస్‌తో సహా పోస్ట్‌ చేయడంతో మీడియా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో కిడ్నాపర్లు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని హాస్పిటల్‌కు తరలించారు. కారు తీసుకొని డబ్బు చెల్లించలేదని సంవత్సరం నుంచి తిప్పుతుండటంతో గంగాధర్‌ని బంధించామని కాంట్రాక్టర్‌ రఘురాం చౌదరి చెప్పాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:02 - July 8, 2017

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పాపులరైన బిగ్‌బాస్‌ షోతో జూనియర్‌ ఎన్టీఆర్‌ బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఈ నెల 16న బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. మొదటి 70 రోజులు మొత్తం 12మంది సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయనున్నారు. ఈ షో టీజర్‌ను యంగ్‌ టైగర్‌ విడుదల చేశాడు. బిగ్‌ బాస్‌ షో తనకొక ఛాలెంజ్‌ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగువాళ్లకు తగినట్లుగా బిగ్‌ బాస్‌ షో ఉంటుందని... యంగ్‌ టైగర్‌ చెప్పాడు. ఈ షోలో ఎవరు పాల్గొనబోతున్నారో తనకు తెలియదని ఎన్‌టీఆర్‌ స్పష్టం చేశాడు. 

12:47 - July 8, 2017
12:42 - July 8, 2017

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు అయింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ లో ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందతులను సాయంత్రం మీడియా ముందు హాజరు పర్చనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:39 - July 8, 2017
12:38 - July 8, 2017
12:27 - July 8, 2017

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దర్శకుల ఎదురుచూపులు ఇప్పట్లో తీరేలా లేవు. హిట్ ప్లాప్ లతో సంభందం లేకుండా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న మహేష్.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లకు కూడా మోస్ట్ వాంటెడ్ హీరో. అందుకే బడా బడా దర్శకులు కూడా మహేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ను లైన్ లో పెట్టిన మహేష్ తాజాగా మరో దర్శకుడి మీద దృష్టి పెట్టాడు. క్లాస్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ ఇప్పుడు మాస్ ఆడియరన్స్ కు చేరువయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
కమర్షియల్ డైరెక్టర్ మీద దృష్టి 
ప్రస్తుతం మురుగదాస్, కొరటాల శివలతో సినిమా చేస్తున్న మహేష్, మరిన్ని సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే బోయపాటి శ్రీను దర్వకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే బోయపాటి ని కథ రెడీ చేయమన్నాడన్న ప్రచారం జరుగుతోంది.
బోయపాటి సినిమా చేసేందుకు మహేష్ ఎదురుచూపులు
బాలకృష్ణ, అల్లు అర్జున్ లతో ఇండస్ట్రీ హిట్స్ అందించిన బోయపాటికి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవటంలో మంచి పట్టు ఉంది. అందుకే బోయపాటి సినిమా చేసేందుకు మహేష్ ఎదురుచూస్తున్నాడట. అయితే ఇప్పటికే మహేష్ చేతిలో మూడు సినిమాలు ఉండటంతో బోయపాటి సినిమా లైన్ లోకి రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.
సూపర్ స్టార్ తో హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న పూరి జగన్నాథ్
ఇప్పటికే మహేష్ హీరోగా రెండు బిగ్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ తో హ్యట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. పోకిరి సినిమాతో మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన పూరి తరువాత బిజినెస్ మేన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఇటీవల మహేష్ తో హ్యట్రిక్ సినిమా చేస్తానంటూ స్వయంగా ప్రకటించిన పూరి మహేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. సూపర్ స్టార్ మార్కెట్ స్టామినాను ఓ రేంజ్ కు చేర్చిన సినిమా పోకిరి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ నిలిచి మహేష్ సూపర్ స్టార్ గా మార్చింది. అందుకే మరోసారి పూరితో కలిసి పనిచేశాడు మహేష్ బాబు. బిజినెస్ మేన్ సినిమాతో రిపీట్ అయిన పూరి, మహేష్ ల కాంబినేషన్ మరోసారి మేజిక్ చేసింది. ఈ సినిమాతో మరోసారి మహేష్ రేంజ్ ఏంటో ప్రూవ్ అయ్యింది.
మహేష్ తో హ్యట్రిక్ సినిమా కోసం త్రివిక్రమ్ యత్నం   
మహేష్ తో రెండు ఇంట్రస్టింగ్ సినిమాలు చేసిన మరో దర్శకుడు త్రివిక్రమ్. మహేష్ బాబు కు సూపర్ స్టార్ ఇమేజ్ అందించిన అతడు సినిమాను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్, తరువాత ఖలేజా సినిమాతో ప్రిన్స్ లోని కామెడీ యాంగిల్ ను కూడా ఆడియన్స్ కు పరిచయం చేశాడు. అయితే అప్పటి నుంచి మహేష్ తో హ్యట్రిక్ సినిమా కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్ మహేష్  అప్రూవల్  కోసం ఎదురుచూస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా అతడు. నటుడిగా మహేష్ కు ఎన్నో అవార్డులు సాధించిన పెట్టిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఇప్పటికీ బుల్లి తెర మీద రికార్డ్ టీఆర్పీలు సాధిస్తున్న అతడు మహేష్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. అతడు ఇచ్చిన జోష్ తో మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాడు సూపర్ స్టార్. ఖలేజ సినిమాతో తనలోని నటన్ని సరికొత్త గా ఆవిష్కరించాడు. అప్పటి వరకు లవర్ బాయ్, యాక్షన్ హీరో ఇమేజ్ లు ఉన్న మహేష్ ఖలేజాతో కామెడీ ట్రై చేసి మెప్పించాడు. వెండితెర మీద ఆకట్టుకోలేకపోయిన ఖలేజ బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి మహేష్ తో మూడో సినిమా కోసం త్రివిక్రమ్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సూపర్ స్టార్ రెడీ అంటే మరో సినిమా చేసేందుకు రెడీ అని చాలా సార్లు చెప్పాడు. స్టార్ డైరెక్టర్లు కూడా మహేష్ బాబు తో సినిమా చేసేందుకు ఉవ్విల్లూరుతుంటారు. ముఖ్యంగా తమ టేకింగ్ కు మహేష్ లాంటి టాప్ హీరో ఇమేజ్ తోడైతే సినిమా రేంజ్ మారుతుందని నమ్ముతారు. అందుకే మహేష్ తో సినిమా చేసేందుకు టాప్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.
రాజమౌళితో మహేష్ సినిమా డౌటే...?
డేట్స్ ఉండి కూడా సూపర్ స్టార్ తో సినిమా పట్టాలెక్కించలేకపోతున్న దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం బాహుబలితో బిజీగా ఉన్న రాజమౌళి చాలా కాలం క్రితమే మహేష్ తో సినిమా చేయడానికి ఒప్పదం కుదుర్చుకున్నాడు. అయితే అప్పట్లో కథ సెట్ అవ్వకపోవటం, తరువాత రాజమౌళి బాహుబలితో బిజీ కావటంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయ్యింది. బాహుబలితో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రజెంట్ రాజమౌళి కాలీగానే ఉన్నా.. మహేష్ మాత్రం ఇప్పట్లో కాలీ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. అంటే సమీప భవిష్యత్తు రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్ తెర మీదకు వచ్చే ఛాన్స్ కనిపించటం లేదు. కానీ రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ పర్ఫెక్ట్ కథలో రెడీ అంటే మహేష్ మిగతా ప్రాజెక్ట్ లు పక్కకు పెట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు.
మహేష్ తో సినిమా చేయడానికి వినాయక్ ఆసక్తి
ఇక మహేష్ తో సినిమా చేయడానికి ఉవ్విల్లూరుతున్న మరో స్టార్ డైరెక్టర్ వినాయక్. మహేష్ ఒప్పుకుంటే వంద కోట్ల బడ్జెట్ తో భారీ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించిన వినాయక్, అందుకు తగ్గ కథా కథనాలను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే మహేష్ మాత్రం వినాయక్ తో  సినిమాపై ఇంత వరకు స్పందించలేదు. ఇటీవల ఖైదీ నంబర్ 150లో వంద కోట్లు వసూళ్లు సాధించిన వినాయక్, ప్రస్తుతం యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా పనుల్లో  బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్లే కాదు కొత్త దర్శకులు కూడా డేట్స్ కోసం సూపర్ స్టార్ వెంట పడుతున్నారు. కొంత మంది ఇప్పటికే మహేష్ ను సినిమా కోసం ఒప్పించగా మరికొంత మంది ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.. ఈ లిస్ట్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్స్, క్రియేటివ్ ఫార్మాట్ లో సినిమాలో సినిమాలు తీసే టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు.
మహేష్ తో సినిమా కోసం క్రిష్ ఎదురుచూపులు 
తన ప్రతి సినిమాను ఓ పొయట్రీలా తెరకెక్కించే క్రిష్ చాలా కాలంగా మహేష్ తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. ఆగడు సినిమా కన్న ముందే మహేష్ క్రిష్ ల కాంభినేషన్ లో సినిమా తెరకెక్కాల్సి ఉన్న కథ ఫైనల్ కాకపోవటంతో వాయిదా పడింది. ప్రస్తుతం కంచె సినిమా చేస్తున్న క్రిష్, మహేష్ ను మెప్పించే కథ కోసం కుస్తీ పడుతున్నాడు.
విక్రమ్ కుమార్ కె తో మహేష్  సినిమా
ఇలా చాలా మంది దర్శకులు క్యూ లో ఉంటే ఓ సక్సెస్ ఫుల్ దర్శకుడికి పిలిచి మరి అవకాశం ఇస్తున్నాడు సూపర్ స్టార్. మనం సినిమాతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన విక్రమ్ కుమార్ కె తో మహేష్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట.  సూర్యతో 24 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చేసిన విక్రమ్, ప్రస్తుతం అక్కినేని అఖిల్ రెండో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.  ఆ తరువాత మరోసారి మహేష్ ను మెప్పించే పని మొదలు పెడతాడేమో చూడాలి.
మహేష్ ను సినిమాకు ఒప్పించిన వంశీ పైడిపల్లి  
చాలా కాలంగా మహేష్ డేట్స్ కోసం ఎదురుచూసిన యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫైనల్ గా సూపర్ స్టార్ ను సినిమాకు ఒప్పించాడు. మహేష్ 25 వ సినిమాను వంశీ పైడి పల్లి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈసినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
మహేష్ డేట్స్ కోసం తమిళ దర్శకులు వెయిటింగ్   
తమిళ దర్శకుల కూడా మహేష్ డేట్స్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. మాస్ మసాలా సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న లింగు స్వామి మహేష్ బాబు తో సినిమా చేయాలనుందని చాలా కాలం కిందటే ప్రకటించాడు. గతంలో మహేష్ కు కథ కూడా చెప్పాడన్నా ప్రచారం జరిగినా తరువాత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం విశాల్, అల్లు అర్జున్ ల సినిమాలతో బిజీగా ఉన్న లింగుసామి మరోసారి మహేస్ కోసం ప్రయత్నాలు ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు.

 

లాలూ ప్రసాద్ కూతురు ఫామ్ హౌస్ లో ఈడీ సోదాలు

ఢిల్లీ : లాలూ ప్రసాద్ కూతురు మీసా భారతి ఫామ్ హౌస్ లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలోని మీసాభారతికి చెందిన మూడు ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. 

పాక్ సైన్యం కాల్పుల్లో దంపతులు మృతి

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ కాల్పులకు తెగపడింది. పాక్ సైన్యం కాల్పుల్లో దంపతులు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. 

అద్దంకిలో టెన్షన్ వాతారణం

ప్రకాశం : అద్దంకిలో టెన్షన్ వాతారణం నెలకొంది. నేడు సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు ఆహ్వానం ఉంది. కరణం వర్గీయులు మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేతలు ససేమిరా అంటున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. 

11:52 - July 8, 2017

పాక్ సైన్యం కాల్పుల్లో దంపతులు మృతి

జమ్మూకాశ్మీర్ : పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ కాల్పులకు తెగపడింది. పాక్ సైన్యం కాల్పుల్లో దంపతులు మృతి చెందారు. ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. 

అద్దంకిలో టెన్షన్ వాతారణం

ప్రకాశం : అద్దంకిలో టెన్షన్ వాతారణం నెలకొంది. నేడు సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు ఆహ్వానం ఉంది. కరణం వర్గీయులు మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు ఇరువర్గాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేతలు ససేమిరా అంటున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. 

 

నేడు రోళ్లవాగు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

జగిత్యాల : నేడు జిల్లాలో ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావులు రోళ్లవాగు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

 

10:47 - July 8, 2017

హైదరాబాద్ : బిగ్ బాస్ టీజర్ విడుదల అయింది. ఈనెల 16న బిగ్ బాస్ రియాల్టీ షో జరుగనుంది. ఈనెల 16న మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. షోపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. జూ.ఎన్ టీఆర్ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. మరిన్ని వివరాలను వీడియో చూద్దాం...

10:40 - July 8, 2017

హైదరాబాద్ : అసలు సమస్యలువదిలేసి... అనవసర విషయాలపై సర్కారు ఎక్కువ దృష్టిపెడుతోందని.. టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ విమర్శించారు.. తమపై నిఘాతోనే అధికారులకు సమయం సరిపోతోందని అన్నారు.. అందువల్లే భూస్కాంలు, డ్రగ్స్‌ దందాలు బయటకొస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రెండోవిడత స్ఫూర్తియాత్ర చేపట్టిన కోదండరాంతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్ నిర్వహించింది. ఆ వివరాలను ఆయన మాటల్లోనే... 'తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అపాయింట్‌మెంట్‌ అడిగితే అరెస్టులు చేస్తున్నారు. ఉపాధి లేక నిరుద్యోగుల అవస్థలుయ పడుతున్నారు. ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలి. అన్ని పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. అర్హులకు పూర్తి స్థాయిలో అందని సంక్షేమ ఫలాలు అందలేదన్నారు. ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన సర్కారుకు లేదు. అనవసర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. మాపై నిఘాతోనే అధికారులకు సరిపోతోంది. అని అన్నారు. 

 

10:33 - July 8, 2017
10:26 - July 8, 2017

అనంతపురం : జిల్లాలోని కొత్తచెరువు మండలం ఆమిదాలకుంటలో ఓ రైతు సెల్‌ టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు.  తన పొలానికి పట్టదారు పాస్‌బుక్‌ ఇవ్వకుండా అధికారులు ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటున్నారని, తనకు ఇప్పుడే పాస్‌ బుక్‌ ఇప్పించాలని రైతు తన రెండేళ్ల కుమారుడుతో సహా సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతును పిల్లాడితో సహా సురక్షితంగా కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. 

 

10:17 - July 8, 2017
10:15 - July 8, 2017


కడప : నేటి నుంచి గుంటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఉ.10.30 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ వైఎస్సార్‌ జయంతి కావడంతో ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి వద్ద జగన్‌తో పాటు.. కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పతాకావిష్కరణ, వైఎస్‌ విగ్రహానికి నివాళులతో ప్లీనరీ ప్రారంభం కానుంది. అనంతరం జగన్‌ ప్రసంగిస్తారు. 

10:10 - July 8, 2017

వరంగల్ : ఓరుగల్లు డ్రగ్స్‌ మాఫియా విష కౌగిలిలో చిక్కుకుపోతోంది. కోడ్‌ భాషతో మాదక ద్రవ్యాల మాఫియా.. యువతకు వల విసురుతోంది. గంజాయి కోసం వరంగల్ యువత వెర్రెత్తిపోతోంది. 10 టీవీ ఆపరేషన్‌లో నిప్పులాంటి నిజాలెన్నో బయటపడ్డాయి. గంజాయి సిగరెట్లను బహిరంగంగానే అమ్ముతున్నారు. నెమ్మదిగా ప్రాణాన్ని హరించే డ్రగ్సే సర్వం అన్నట్టుగా యువత ప్రవర్తిస్తోంది. వరంగల్‌లో ఈ చీకటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్కువగా ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులనే టార్గెట్ చేస్తున్నారు. మత్తు కోసం దగ్గు తగ్గడానికి ఉపయోగించే డ్రగ్‌కి.. ఇక్కడ యువకులు బానిసలుగా మారారు. మహారాష్ట్ర వ్యాపారులు పెద్ద ఎత్తున వరంగల్ నగరంలోకి గంజాయిని దిగుమతి చేస్తున్నారు. గంజాయి వ్యాపారులు విద్యా సంస్థలనే అడ్డాగా మార్చుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అమరుల స్ఫూర్తియాత్ర ప్రారంభం

హైదరాబాద్ : జేఏసీ రెండో విడత అమరుల స్ఫూర్తియాత్ర ప్రారంభం అయింది. సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ వద్ద యాత్రను ప్రొ.కోదండరాం ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుపాటు స్ఫూర్తియాత్ర కొనసాగనుంది. 

09:35 - July 8, 2017

హైదరాబాద్ : జేఏసీ రెండో విడత అమరుల స్ఫూర్తియాత్ర ప్రారంభం అయింది. సికింద్రాబాద్ క్లాక్‌ టవర్ వద్ద యాత్రను ప్రొ.కోదండరాం ప్రారంభించారు. నేటి నుంచి మూడు రోజుపాటు స్ఫూర్తియాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర సిరిసిల్ల జిల్లాలో మూడు రోజులపాటు కొనసాగనుందని కోదండారం చెప్పారు. శనివారం నుండి సోమవారం వరకు జిల్లాలో పర్యటన కొనసాగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:28 - July 8, 2017
09:27 - July 8, 2017
09:25 - July 8, 2017

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని వక్తలు పేర్కొన్నారు. మాదిగల కురుక్షేత్ర సభపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వినయ్ కుమార్, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి,  టీడీపీ నేత వర్లరామయ్య పాల్గొని, మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ ఉద్దేశ్యంతో ఎస్సీ వర్గీకరణ జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:40 - July 8, 2017
08:38 - July 8, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్‌ పార్కుపై ఏపీ ప్రభుత్వ వైఖరి స్పష్టమైంది.  నిర్బంధంగా అయినా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆందోళనలను అణగదొక్కి, ఉద్యమకారులను అరెస్టు చేసైనా ఫుడ్‌ పార్కు నిర్మాణానికి  రాజమార్గాన్ని సుగమం చేయాలన్నది  ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిగా కనిపిస్తోంది. 
నేతలపై చంద్రబాబు ఆగ్రహం 
తుందుర్రు గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టుపై  వెనక్కి తగ్గేది లేదని తెల్చి చెప్పింది. గత నెల 27న ఆక్వాఫుడ్‌ పార్కు బాధితులు అమరావతిలో చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అప్పట్లో కొద్దిగా ఆక్వాఫుడ్‌ పార్కుతో ఎదురయ్యే సమస్యలు గురించి ప్రజలు ఏకరవుపెట్టినప్పుడు కొద్దిగా సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఇప్పుడు ఆక్వా ఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం పెను వివాదంగా మారే అకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ రెచ్చగొడితే ఆందోళన చేస్తారా ... అంటూ ప్రశ్నించిన సీఎం తుందుర్రు మెగా ఆక్వాఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పోరాట సమితి నేతలను చంద్రబాబునాయుడు సచివాలయానికి పిలించుకున్నారు. నాలుగైదు గంటలు వేచివుండే విధంగా చేసి, సహనాన్ని పరీక్షించారు. అయినా ఆక్వా ఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట సమితి ఓపికతో నిరీక్షించారు. తీరా లోపలికి వెళ్లిన తర్వాత నేతలపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఒక రాజకీయ పార్టీ రెచ్చగొడితే ఆందోళన చేస్తారా .. అంటూ కోపతాపాలు ప్రదర్శించినట్టు పోరాట సమితి  నేతలు చెబుతున్నారు.  
ఫుడ్‌పార్కు యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న చంద్రబాబు 
ఆక్వా ఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా కాదని పోరాట సమితి నేతలు చెబుతున్న విషయాలను చంద్రబాబు చెవికి ఎక్కిచుకోలేదు. కాలుష్యం గురించి ప్రస్తావిస్తే కోపతాపాలు వ్యక్తం చేయడం చంద్రబాబుకు తగునా... అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీని వేరే ప్రాంతానికి తరలించాలని కోరితే.. ఎందుకు తరలించాలంటూ ఆగ్రహంతో ఊగిపోవడం ముఖ్యమంత్రి తగదంటున్నారు. భావితరాల భవిష్యత్‌, తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్‌ పార్కుకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన గురించి చంద్రబాబునాయుడు ఆలోచించకపోవడాన్ని పోరాట సమితి నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను పట్టించుకోకుండా  ఫుడ్‌ పార్కు యాజమాన్యానికి  కొమ్ముకాసే విధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్‌ చేస్తూ, చంద్రబాబునాయుడు  తమ పోరాటానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టైనా ఆక్వా ఫుడ్‌ ప్రాజెక్టును  అడ్డుకుంటామని  గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్కు వ్యతిరేక పోరాట సమితి నేతలు చెబుతున్నారు. 
చంద్రబాబు మొండి వైఖరి తప్పుపడుతున్న సీపీఎం 
గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు విషయంలో చంద్రబాబు మొండి వైఖరి సీపీఎం నేతలు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొమ్ము కాసే విధంగా ఉందని విమర్శిస్తున్నారు. మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణం విషయంలో ప్రభుత్వ వైఖరి తేటతెల్లం కావడంతో, దీనికి వ్యతిరేంగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పోరాట సమితి నేతలు  వ్యూహ  రచన చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

08:31 - July 8, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో రిజర్వేషన్‌ల అమలు కోసం ... పోరాటం చేపట్టారు. విద్యార్థి హక్కులను కాలరాసేందుకు చర్యలు తీసుకుంటున్న యూనివర్సిటీ తీరుపై మండిపడుతున్నారు. విద్యార్థులను ... ఉద్యమాల నుంచి దూరం చేసే నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో హెచ్ సీయూ విద్యార్థులు
విద్యార్థి ఉద్యమాలతో .... నిత్యం వార్తల్లో ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. పీహెచ్‌డీ ఎంట్రన్స్ రాసిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ  విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో రిజర్వేషన్‌లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మూడు రోజులుగా  ధర్నా చేస్తున్నారు. అనేక విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని విద్యార్థులు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు  అమలు చేయకుండా దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్‌లను ఆమోదించకపోతే.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 
విద్యార్థులను ఉద్యమాలకు దూరం చేసే నిబంధనలు
విద్యార్థులను ఉద్యమాలకు దూరం చేసే నిబంధనలను విధించడంపై స్టూడెంట్స్‌ మండిపడుతున్నారు. రోహిత్ వేముల మరణం తర్వాత అధికారులు... యూనివర్సిటీలో విద్యార్థులను అణచివేసే పనిలో పడ్డారని  విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ , సైన్స్‌ల్లో చదివే విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వర్సిటీలో కొత్తగా  చేరాలనుకునే విద్యార్థులతో.... విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనమని, ఏ విద్యార్థి సంఘంలో భాగస్వామ్యం అవ్వమంటూ అండర్‌టేకింగ్‌  పత్రాలు రాయించుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న ఈ అన్యాయంపై.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

08:27 - July 8, 2017

విశాఖ : మద్యానికి వ్యతిరేకంగా మహిళాలోకం కదిలింది. గుడి,బడి తేడాలేకుండా ఎక్కడబడితే అక్కడ వెలుస్తున్న మద్యం షాపులపై యుద్ధం ప్రకటించారు. మద్యం మహమ్మారి మా ఏరియాలో వద్దంటూ వైన్‌షాపులపై దాడులకు దిగుతున్నారు. అడ్డుకుంటే తాటతీస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. విశాఖజిల్లాలో కొనసాగుతున్న మహిళల నిరసనపై టెన్‌టీవీ స్టోరీ.. 
మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళనలు 
విశాఖ జిల్లాలో మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. కాలనీల్లో, జనావాసాల మధ్య  మందు షాపులపై తొలగించాల్సిందేనని.. తేల్చి చెబుతున్నారు. వామపక్షాలు, ప్రజాసంఘాల  ఆధ్వర్యంలో కదిలిన నారీలోకం మద్యంపై సమరభేరి మోగిస్తోంది. విశాఖజిల్లాలోని పాడేరు, చింతపల్లి, లాంటి ఏజెన్సీ ప్రాంతాలతోపాటు అనాకాపల్లి, గాజువాక, పరవాడల్లో మద్యం షాపులపై దాడులు కొనసాగిస్తున్నారు. ఇటు విశాఖ నగరంలోని జ్ఞానపురం, మాధవధార, కళింగనగర్‌,  మాల్కాపురం, బుక్కావీధితోపాటు జైల్‌రోడ్‌, కైలాసపురం, ఎండాడ, ఓల్డ్‌సిటీ ఏరియాల్లో  సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. 
మహిళలపై గూండాలను ఉసిగొల్పుతున్న వైన్‌షాపు యజమానులు 
మద్యానికి వ్యతిరేకంగా కదులుతున్న మహిళలపై  వైన్‌షాపుల యజమానులు గూండాలను ఉసిగొల్పుతున్నారు.  విశాఖ నగర పరిధిలోని  వేపగుంట నాయుడు తోటలో వైన్‌షాపును ఎత్తివేయాలని కోరిని మహిళలు, ప్రజాసంఘాల కార్యకర్తలపై మద్యంషాపు దాడికి దిగడంతో .. ఆందోళన కారులు షాపునేమ్‌బోర్డును ధ్వంసం చేసి నిరసన తెలిపారు. జనావాసాలు, గుడి, బడి సమీపంలో మందు షాపులు ఉండరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైన్‌షాపునకు , బార్‌కు తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడే మద్యం సేవిస్తూ.. తాగుబోతులు న్యూసెన్స్‌ చేస్తున్నారని విద్యార్థులు కూడా వాపోతున్నారు.
రెచ్చిపోతున్న వైన్‌షాపు ఓనర్లు   
విశాఖ జిల్లాల్లో మొత్తం 124 బార్లు, 401 వైన్‌షాపులు ఉన్నాయి. వీటికి అనుబంధంగా వేల సంఖ్యలో బెల్టు షాపులు కూడా ఉన్నాయి. అయితే జూలై1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎక్సైజ్‌ పాలసీ నిబంధనలను అనుసరించి  జవీఎంసీ పరిధిలో ఎక్కడైనా మద్యం షాపు ఓపన్‌ చేసుకునే వీలను కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో వైన్‌షాపు ఓనర్లు మరింతగా రెచ్చిపోతున్నారు.  స్కూళ్లు, దేవాలయాలకు 100 మీటర్ల లోపు  మద్యం దుకాణాలు తెరవరాదన్న నిబంధనలేవీ పట్టించుకోవడంలేదు.  రెడెన్షియల్‌ ప్రాంతాల్లో మద్యంషాపులు ఎందుకు నిర్వహిస్తున్నారని అడిగిన వారిపై కేసులు పెడుతూ భయపెడుతున్నారు. మమ్మల్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలులేదంటూ.. పోలీస్‌ ప్రొటెక్షన్‌ ఏర్పాటు చేసుకుని మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడ్డం మానుకోవాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసు రక్షణలో మద్యం అమ్మకాలు సాగిస్తున్న సర్కార్‌కు తగిన సమయంలో బుద్ధి చెబుతామని మహిళలు హెచ్చరిస్తున్నారు. 

 

08:23 - July 8, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ మూలాలతో పాటు లింకులను తెలుసుకునేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది..గోవా, రాజస్థాన్,యూపీలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బృందాలు వేట మొదలుపెట్టాయి..దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లోనే డ్రగ్స్‌ సరఫరా చేయాలని కుట్ర చేసిన కెల్విన్‌ ప్లాన్ భగ్నం చేసే ప్రయత్నం మొదలయింది...
నగరాలపై దృష్టి 
కలకలం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో పోలీసులు..ఎక్సైజ్ అధికారులు శోధిస్తున్నారు..తెలుగు రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ మాఫియా విస్తరించిందన్న సమాచారంతో ఆయా నగరాలపై దృష్టి పెట్టారు...ఇక ప్రధానంగా మాఫియా లింకులు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు..గోవా, రాజస్థాన్, యూపీ ప్రాంతాల్లో దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే బృందాలను పంపించారు..ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి సమాచారాన్ని సేకరించిన పోలీసులు ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో అక్కడ దాడులు చేయనున్నారు....
కెల్విన్‌ కుట్రలపై ఆరా...
మహానగరం కేంద్రంగా చేసుకుని డ్రగ్స్‌ను కాలేజీలు...స్కూళ్లకు మత్తు సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై దృష్టి పెట్టారని తేలింది...నగరాల్లోని కాలేజీలు..స్కూళ్లతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఐటీ కారిడార్‌, ఉద్యోగులను మత్తులో ముంచాలని ప్లాన్ చేశారని తెలుసుకున్నారు...తెలంగాణాలోని వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ,విజయవాడ, వైజాగ్,తిరుపతి ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రధాన నిందితుడు కెల్విన్‌కు సంబంధించిన లింకులు..కాల్‌డేటా ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.

 

నేడు వైసీపీ ప్లీనరీ

గుంటూరు : ఇవాళ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలకు వైసీపీ సిద్ధమైంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలుగు రాష్ట్రాల నుండి 20 వేలే మందికి పైగా హాజరవుతారన్న అంచనాతో.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టారు.. పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు.. 18 అంశాలపై తీర్మానాలను ఈ ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నారు. 

08:13 - July 8, 2017

గుంటూరు : జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశాలకు వైసీపీ సిద్ధమైంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. తెలుగు రాష్ట్రాల నుండి 20 వేలే మందికి పైగా హాజరవుతారన్న అంచనాతో.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టారు.. పార్టీ అధ్యక్ష ఎన్నికతో పాటు.. 18 అంశాలపై తీర్మానాలను ఈ ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నారు. పార్టీ బలోపేతంతోపాటు... ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలన్న ప్రధాన ఎజెండాలతో రెండు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. 
ప్లీనరీకి 20 వేల మంది ప్రతినిధులు హాజరు
వైసీపీకి కొత్త కళ వచ్చింది.. శని, ఆదివారాల్లో పార్టీ ప్లీనరీతో నేతలు, కార్యకర్తల్లో హడావుడి కనిపిస్తోంది. గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీ కోసం దాదాపు 12 ఎకరాల స్థలంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఈ కార్యక్రమానికి దాదాపు 20 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ప్లీనరీలో పాల్గోబోతున్నారు. వీరికోసం నాలుగు కేటగిరీల్లో పాస్‌లు ఇచ్చారు... వీవీఐపీ, వీఐపీ, స్పెషల్, డెలిగేషన్ పాసులుగా విభజించి పాస్‌లు జారీ చేశారు.. పాస్‌లను బట్టి గ్యాలరీల్లో సీట్లు కేటాయించనున్నారు.. 
నిపుణులతో వేదిక అలంకరణ
ఇక భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ప్లీనరీకి అదే స్థాయిలో ప్రధాన వేదిక సిద్ధం చేశారు. వేదిక అలంకరణ కోసం కోయంబత్తూరు నుంచి నిపుణులను రప్పించారు. వేదికకు ఎడమ వైపున పార్టీ అధినేత జగన్‌కు ప్రత్యేక గది రెడీ చేశారు. కుడివైపున 60 మంది ప్రతినిధులు సమావేశం అయ్యేలా హాలుని తయారుచేశారు. ప్రధాన వేదికపై 60 అడుగుల భారీ ఎల్.ఇ.డి తెర... ప్లీనరీ ప్రాంగణంలో మరో నాలుగు పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులు కూర్చునేందుకు 500 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ప్రాంగణం నిర్మించారు. దీనికి అనుగుణంగా డైనింగ్ హాలు సిద్ధం చేశారు.. వర్షం వచ్చినా ఎలాంటి సమస్యా రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వైసీపీ ప్లీనరీకి తెలంగాణ నుంచి కూడా నేతలు హాజరు కానున్నారు. రెండు రాష్ట్రాలనుంచి వచ్చేవారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పాస్‌లను బట్టి పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ రెడీగా ఉంచారు..    
కీలకమైన 18 తీర్మానాలు
రెండురోజుల ప్లీనరీలో కీలకమైన 18 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు... రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై తయారుచేసిన ఈ తీర్మానాల్లో 16 ఏపికి చెందినవి కాగా... రెండు తెలంగాణవి ఉన్నాయి. ప్లీనరీలో చర్చించబోయే అంశాలను కూడా ముందే ప్లాన్‌ చేసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చించాలని భావిస్తున్నారు. సర్కారు తప్పులను ఎత్తిచూపడంతో పాటు.. 
ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ భవిష్యత్‌ కార్యక్రమాలను ప్లీనరీలో ప్రకటిస్తారు. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా మినీ ప్లీనరీల్లో చేసిన తీర్మానాలు, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నారు.
పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చ
వైసీపీ ప్లీనరీలో ప్రధాన ఎజెండాగా ఉన్న పార్టీ బలోపేతంపైనా చర్చిస్తారు.. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ఎలాంటి వ్యూహాంతో ముందుకు వెళ్లాలి అనే అంశంపైనా చర్చ జరగనుంది.. వీటితోపాటు.. క్షేత్ర స్థాయిలో మండల, గ్రామ, బూత్ లెవల్‌లో కమిటీలు వేయనున్నారు.. ఆ తర్వాత పార్టీ మెంబర్‌షిప్‌ కార్యక్రమం పైనా ప్రకటన చేసే అవకాశం ఉంది... ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇందుకోసం మొదటి రోజు నోటిఫికేషన్‌ విడుదల చేసి... రెండో రోజు ఎన్నిక పక్రియ నిర్వహించనున్నారు. ప్లీనరీకి ముందు పార్టీ అధినేత జగన్‌ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించనున్నారు.. శనివారం వైఎస్‌ఆర్‌ జయంతి కావడంతో ఆయన సమాధి దగ్గర నివాళులు అర్పించి నేరుగా ప్లీనరీకి రానున్నారు.

 

08:12 - July 8, 2017

గుంటూరు : జిల్లాలో ఎమ్మార్పీఎస్‌ కురుక్షేత్ర సభ రణరంగంగా మారింది. పోలీసులు అనుమంతిచకపోవడంతో.. కార్యకర్తలు వ్యూహాత్మకంగా నాగార్జునా వర్సిటీలోని సభా ప్రాంగణానికి చేరుకోడానికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న కార్యకర్తలను  పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు  పలువురుని అరెస్టు చేశారు. ఆందోళనలు శృతిమించకుండా కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలకు తోపులాట 
ఎస్సీల వర్గీకరణ చేయాలని డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గుంటూరులో తలపెట్టిన కురుక్షేత్రం సభ రణరంగంగా మారింది. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు  చేసిన సభా ప్రాంగణం దగ్గర పోలీసులతో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఈ  సందర్భంగా పలువురు కార్యకర్తలు గాపడ్డంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పలకరించడానికి వెళ్లిన మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్టు చేశారు. 
టెన్షన్‌ వాతావరణం 
అంతకు ముందు మంగళగిరిలోని నాగార్జున యూనివర్శిటీలో కురుక్షేత్ర సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. కురుక్షేత్రం మహాసభకు కార్యకర్తలు రాకుండా పోలీసులు గురువారం రాత్రి నుంచే ఎక్కడిక్కడ వారిని అడ్డుకున్నారు. సభకు వెళ్లే దారుల్లో పలు చోట్లు పోలీస్‌ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌లు చేశారు. నందిగామ, పిడుగురాళ్ల, గూడవల్లి, మాచర్ల ప్రాంతాల్లో పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
144 సెక్షన్‌ అమలు 
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు అర్బన్‌ జిల్లా వరకు పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేశారు. మంగళగిరికి వచ్చిన వారిని వచ్చేనట్టే.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల అరెస్ట్‌లకు, నిర్బంధాలకు భయపడేది లేదని..ఎట్టి పరిస్థితుల్లోను కురుక్షేత్ర మహాసభ జరిపితీరాలని  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. 
వ్యూహాత్మకంగా వ్యవహరించిన కార్యకర్తలు 
పోలీసుల నిర్బంధంతో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చినకాకానిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాల్లో దాక్కుని  ఒక్కసారిగా టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. దీంతో టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులను చేధించుకొని కొంతమంది ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఏఎన్‌యూ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఒక ఎమ్మార్పీఎస్‌ కార్యకర్త స్రృహకోల్పోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
ఆర్టీసీ బస్సు, పోలీస్‌ వ్యాన్లను తగులబెట్టిన కార్యకర్తలు  
అడ్డుకుంటున్న పోలీసులను తప్పించుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రీన్‌ ట్రీ పార్క్‌ సమీపంలోకి చేరుకున్న కార్యకర్తలు అక్కడ పోలీస్‌ వ్యాన్లను తగులబెట్టారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సును కూడా తగులబెట్టేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. 
మందకృష్ణ మాదిగ అరెస్టు 
ఇదిలావుంటే.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్టు చేయడంతో.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏంజరుగుతుందో.. కార్యకర్తలో ఏ రూపంలో నిరసనలకు దిగుతారో అనె టెన్షన్‌ నెలకొంది. మరోవైపు పోలీసులు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. 

 

06:46 - July 8, 2017

ప్రకాశం : దర్గాకు వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కావలికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కారులో హైదరాబాద్ లోని దర్గాకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద ఇన్నోవా కారు ఆగివున్న లారీని అతివేగంతో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కారు డ్రైవర్ తోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మరో మగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నుజ్జునుజ్జు అయింది. మృత దేహాలు కారులో చిక్కుకున్నాయి. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి గమనించకుండా ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేడు విజయవాడకు నిర్మలాసీతారామన్

హైదరాబాద్ : కేంద్రమంత్రి నిర్మాలాసీతారామన్ నేడు విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు మురళి ఫార్చ్యూన్ హోటల్ లో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో జీఎస్ టీ సదస్సులో ఆమె పాల్గొననున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ప్రకాశం : గుడ్లూరు మండలం మోచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులు కావలి వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి కావాలి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

 

Don't Miss