Activities calendar

09 July 2017

21:44 - July 9, 2017

హంబర్గ్ : జర్మనీలోని హాంబర్గ్‌లో రెండు రోజులు పాటు జరిగిన జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ముగిసింది. సుస్థిర అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి, సరళీకృత వాణిజ్య విధానాలు, అంకుర సంస్థలకు ఆర్థిక సాయం, కార్మిక సంస్కరణలపై ప్రధానంగా చర్చించారు. ఈ సదస్సులో హాంబర్గ్‌ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. మన దేశంలో అమలవుతున్న సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోదీ జీ-20 దేశాల దృష్టికి తీసుకెళ్లారు. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు విదేశీ సహాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మన ప్రధాని ప్రస్తావించారు. సరళీకృత వాణిజ్య విధానాల అమల్లో 130వ ర్యాంకులో ఉన్న భారత్‌ను 50వ స్థానానికి తీసుకొచ్చే విధంగా సంస్కరణలు అమలు చేస్తున్నట్టు జీ-20 దేశాధినేతల దృష్టికి తెచ్చారు. 

21:43 - July 9, 2017

పాట్నా : అర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు చేయడంపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ మౌనంగా ఉండటంపై ఇద్దరి మధ్య సత్సంబంధాలు మరింత బెడిసినట్లు కనిపిస్తున్నాయి. లాలూపై కుట్రపూరితంగానే దాడులు జరిగాయని తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఆరోపించాయి. లాలూకి తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ప్రతినిధులు ఫోన్లు చేసి చెప్పారు. కానీ నితీశ్‌ మాత్రం ఈ దాడులపై ఇంత వరకు స్పందించలేదు. కనీసం ఆయన పార్టీకి చెందిన ఏ ఒక్క నేత కూడా లాలూని కలవకపోవడం చర్చనీయాంశమైంది. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు ఇచ్చినప్పటి నుంచి జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 

21:42 - July 9, 2017

అరుణాచల్ ప్రదేశ్ : చైనా ఎన్ని బెదిరింపుల‌కు దిగుతున్నా ఇండియా మాత్రం డోక్‌లామ్ ప్రాంతంలో వెన‌క్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. స‌మ‌స్య మొద‌లై మూడు వారాల‌వుతున్నా... పరిష్కారం కనిపించకపోవడంతో.. ఇండియన్ ఆర్మీ అక్కడే టెంట్లు వేసుకొని తిష్ట వేసింది. చైనా అక్కడరోడ్డు నిర్మాణాన్ని ఆపేవ‌ర‌కు వెన‌క్కి వెళ్లే ప్రసక్తే లేద‌ని దీని ద్వారా ప‌రోక్షంగా భార‌త బ‌ల‌గాలు సందేశం పంపించాయి. అయితే దౌత్యం మార్గాల ద్వారానే ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని ఆర్మీ భావిస్తోంది. గ‌తంలో ఏర్పడ్డ స‌రిహ‌ద్దు స‌మ‌స్యల‌కు ఇలాగే ప‌రిష్కారం ల‌భించింద‌ని సీనియర్ అధికారి తెలిపారు. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 2012లో ఇండియా-చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

21:40 - July 9, 2017

శ్రీనగర్ : నియంత్రణ రేఖ వెంబడి భారత్‌ పౌరులను లక్ష్యంగా పాక్‌ రేంజర్లు జరుపుతున్న కాల్పులపై మన సైన్యం ధీటుగా స్పందించింది. జమ్ము-కశ్మీర్‌ పూంచ్‌ సెక్టార్‌లో పాకిస్థాన్‌ సైనికుల బంకర్‌ను సైన్యం ధ్వంసం చేసింది. ఇందుకోసం భారత్‌ ఆర్మీ భారీ ఫిరంగులను ఉపయోగించింది. నిన్న పాక్ సైన్యం... జరుపుతున్న కాల్పుల్లోభారత సరిహద్దుల్లో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటనపైనే భారత్ దీటుగా స్పందించింది.

21:39 - July 9, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నీరు - చెట్టు పథకం పేరుతో దళితుల భూములను లాక్కోవడానికి అధికారులు యత్నించడం వివాదాస్పదమైంది. తమ భూములు ఇవ్వబోమంటూ దళితులు కొన్నాళ్లుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. దళితుల ఆందోళనకు సీపీఎం, కేవీపీఎస్‌తోపాటు పలు దళిత సంఘాలు మద్దతు ప్రకటించాయి. దళితులపట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ చల్లో పర్చూరుకు పిలుపునిచ్చాయి. దీంతో దళితులు, దళిత సంఘాల నేతలు భారీగా తరలివచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎంనేత వై. వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారిని బలవంతంగా అరెస్ట్‌ చేసి ఎద్దులపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏపీలో చంద్రబాబు పోలీసు రాజ్యం నడుపుతున్నారని మధు మండిపడ్డారు. దళితుల భూములను కాజేసి బడా సంస్థలకు అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

21:38 - July 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్న కరెంటు, నీటి కష్టాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ వచ్చినా కాంగ్రెస్ నేతల్లో బానిస మనస్తత్వం పోలేదని విమర్శించారు. పులిచింతలపై ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సమైక్యవాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సందర్భంలో పులిచింతల వద్దని చెప్పినా వినని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 14 వేల ఎకరాల్ని ముంచి పులిచింతలను ఆంధ్రకు బహుమతిగా ఇచ్చారంటూ హరీష్‌ రావు మండిపడ్డారు.

21:37 - July 9, 2017

హైదరాబాద్ : భక్తులతో సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. మహంకాళి అమ్మవారిని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా దర్శించుకున్నారు. భక్తులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమ్మవారు ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ కవితతో పాటు సీఎం కేసీఆర్ సతీమణి శోభ కూడా అమ్మవారికి మొక్కు సమర్పించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామని కవిత చెప్పారు.మహంకాళి అమ్మవారిని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కే కేశవరావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయినీ నర్సిహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతురామ్మోహన్, స్టార్ షట్లర్ పీవీ సింధు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు

2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
మరోవైపు బోనాల పండుగకు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాల్లో 130 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా షీటీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృంటాస్క్‌ఫోర్స్ బృందాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 

21:36 - July 9, 2017

గుంటూరు : గుంటూరులో రెండు రోజులు పాటు జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. జగన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను ఎన్నుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్‌ కృతజ్ఞతలు చెప్పారు. రెండో రోజు ప్లీనరీలో జగన్‌ తల్లి, వైపీసీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం జగన్‌ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నయవంచన పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఆరు నెలలపాటు కొనసాగే పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. మధ్యలో తిరుమల శ్రీవారిని సందర్శించుకోవాలని జగన్‌ నిర్ణయించారు.

జగన్‌ ప్రజలకు తొమ్మిది హామీలు
వైసీపీ ప్లీనరీలో జగన్‌ ప్రజలకు తొమ్మిది హామీలు ఇచ్చారు. పాదయాత్రలో ప్రజా సమస్యలతో పాటు, వీటినీ జనం దృష్టికి తీసుకెళ్తారు. జగన్‌ ఇచ్చిన హామీల్లో మద్యపాన నిషేధం కీలకమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని ప్రకటించారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడంతో పాటు బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. మద్యం మానుకునే వారికి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కోటీశ్వరులకు మాత్రమే మద్యం అందుబాటులో ఉండేలా ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తారు. మద్య నిషేధాన్ని ఉల్లంఘించేవారికి కఠిన శిక్షలు విధించేలా కొత్త చట్టం తీసుకొస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం కొన్ని కీలక హామీలిచ్చారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల కోసం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని జగన్‌ ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నాలుగు విడతలుగా 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఏటా మేలో 12,500 రూపాయలు నగదు రూపంలో రైతుల చేతికి అందించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. దీని వలన 66 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని జగన్‌ ప్రకటించారు.

డ్వాక్రా మహిళలకు నాలుగు దశల్లో 15 వేలు
డ్వాక్రా మహిళలకు నాలుగు దశల్లో 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు, వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జగన్‌ హామీ ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇస్తున్న సామాజిక పెన్షన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచుతామని ప్రకటించారు. అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదవే విద్యార్థులకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి వృత్తి విద్యాకోర్సులు చదవే విద్యార్థులకు పూర్తిగా ఫీజులు రీఇంబర్స్‌మెంట్‌ చేయడంతో పాటు, హాస్టల్‌ ఖర్చులకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీని పటిష్టపరచడంతో పాటు ఈ కార్యక్రమం కింది ఆపరేషన్లు చేయించుకున్న కుటుంబ పెద్దలు విశ్రాంతి తీసుకునే సమయంలో కుటుంబ ఖర్చులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీవ్యాధి బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికపై పూర్తిచేసి, సాగునీరు అందిస్తామన్న ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. మోసపు పునాదులపై చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించిన జగన్‌, బాబు దోపిడీని చట్టం ముందు నిలబెడతామని ప్లీనరీలో చెప్పారు. మొత్తం మీద రెండు రోజుల పాటు జరిగిన ప్లీనరీ వైసీపీ నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సహం నింపింది. 

20:00 - July 9, 2017

జమైకా : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఎదురులేని కరీబియన్‌ టీమ్‌, తిరుగులేని టీమిండియా....అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి.ఓ వైపు రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ వెస్టిండీస్‌... మరోవైపు తొలి టీ20 చాంపియన్‌ ఇండియా...ఇరు జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది.5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న టీమిండియా....వెస్టిండీస్‌తో సింగిల్‌ టీ20 మ్యాచ్‌కు సై అంటోంది.విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 4 స్థానంలో ఉండగా.... కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌ జట్టు 5వ స్థానంలో ఉంది.

అందరూ మ్యాచ్‌ విన్నర్లే
విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్‌, అజింక్య రహానే, దినేష్‌ కార్తీక్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ,ఉమేష్‌ యాదవ్‌, వంటి పేసర్లతో పాటు రవీందర్‌ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ,కుల్దీప్‌ యాదవ్‌ వంటి మ్యాజిక్‌ స్పిన్నర్లతో ఎప్పటిలానే పవర్‌ఫుల్‌గా ఉంది. బౌలింగ్‌లో ఎలా ఉన్నా...భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగ్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.టాప్‌ ఆర్డర్‌లో ధావన్‌, విరాట్ కొహ్లీ,మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌, ధోనీ..లోయర్ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య అదరగొడితే భారత జట్టుకు తిరుగుండదు.

అత్యంత ప్రమాదకరమైన జట్టు
మరోవైపు కార్లోస్ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌ జట్టు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టు అనడంలో అనుమానమే లేదు. వన్డే జట్టులో లేని క్రిస్‌ గేల్‌, కీరన్‌ పోలార్డ్‌, మార్లన్ శామ్యూల్స్‌, సునీల్‌ నరైన్‌,శామ్యూల్‌ బద్రీ వంటి మ్యాచ్‌ విన్నర్లు ...టీ 20 జట్టులో ఉన్నారు. భారత్‌తో పోల్చుకుంటే అన్ని విభాగాల్లోనూ వెస్టిండీస్‌ జట్టు ధీటుగా ఉంది. క్రిస్‌ గేల్‌, కీరన్‌ పోలార్డ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, మార్లన్‌ శామ్యూల్స్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు కలిగిన కరీబియన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ..ఎంతటి విధ్వంసం సృష్టించగలదో అందరికీ తెలిసిందే. ఇక స్పిన్‌ మెజీషియన్స్‌ సునీల్‌ నరైన్‌,శామ్యూల్‌ బద్రీలతో బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది.

ఇండియాపై వెస్టిండీస్‌దే పైచేయి
ఇక ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ ఇండియాపై వెస్టిండీస్‌దే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 7 టీ 20 మ్యాచ్‌ల్లో పోటీపడగా....4మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ జట్టు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్‌ నెగ్గింది. 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌పై...సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌ సంచలన విజయం సాధించడం...భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని ఓ పీడకల.టీ20 వరల్డ్‌ కప్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.జమైకాలోని సబీనా పార్క్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సింగిల్‌ టీ20 ఫైట్‌లో వెస్టిండీస్‌ జట్టు హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుండా అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

19:57 - July 9, 2017

 

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సద్గురు సాయిబాబా ఆలయాలు తెల్లవారుజామునుంచే భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో..ఇరు రాష్ట్రాల్లోని సాయిబాబా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీప కాంతులతో సాయి ఆలయం దేదీప్యమానంగా వెలుగులీనుతోంది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు ఎల్‌బీనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునుంచే సాయిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో జనం రద్దీతో క్యూలైన్లు కిక్కిరిసిపోతున్నాయి. కుషాయిగూడ సాయిబాబా దేవాలయంలో గురుపౌర్ణమి వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో సాయిని దర్శించుకుంటున్నారు. యాదగిరిగుట్ట సద్గురు శ్రీ షిర్డీ సాయినాథుని ఆలయంలో గురుపూర్ణిమ సంబరాలు వైభవంగావోపేతంగా సాగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురుపౌర్ణిమ సందర్భంగా సాయి విగ్రహాన్ని సర్వాంగసుందరంగా ఆలంకరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 1500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

అటు ఏపీలోను గురుపౌర్ణమి
అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. దేశ, విదేశీ భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కేంద్రఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌, ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం మూడోరోడ్డులోని సాయిబాబా ఆలయంలో మంత్రి పరిటాల సునీత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సాయిని కోరుకున్నట్లు తెలిపారు. అటు తాడిపత్రిలోని సాయి ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. ఉదయం కాగడా హారతితో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. 

19:54 - July 9, 2017

విజయనగరం : ఉపరాష్ట్రపతిగా తన పేరు పరిశీలనలో ఉందనేది ఊహాగానమేనని కేంద్రమంత్రి అశోక గజపతిరాజు అన్నారు.. విజయనగరం పట్టణంలోని గాంధీ పార్క్‌లోని దుండగులు ధ్వంసం చేసిన ఆదిభట్ల నారాయణదాసు విగ్రహాన్ని మంత్రి పరిశీలించారు.. నగరంలో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని..పెద్దలను గౌరవించడం మన బాధ్యత అన్నారు..తన పూర్వీకులకు చెందిన విగ్రహాన్ని దుండగులు తీసివేసినప్పుడు అప్పటి ప్రభుత్వం కనీసం స్పందించలేదన్నారు..విశాఖ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను నడిపే అవకాశం ఉందని చెప్పారు..జేసి దివాకర్‌ రెడ్డి ఘటనకు సంబందించిన వివరాలను ఆయననే అడగడం మంచిదని అశోక గజపతిరాజు అన్నారు.

19:52 - July 9, 2017

వరంగల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందన్నారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని గుడేప్పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూంల శంఖుస్థాపన కార్యక్రమములో పరకాల ఎమ్మెల్యేల చల్లా ధర్మారెడ్డి, మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు 40 వేలకోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గుడేప్పాడు గ్రామానికి 94 డబుల్ బెడ్‌రూం పనులకు 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కడియం తెలిపారు.  

19:51 - July 9, 2017

కరీంనగర్ : మూడో దశ హరితహారాన్ని ఈనెల 12న కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఅర్ టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. హరితహారంలో సీఎం మొక్కలు నాటే లోయర్ మానేర్ డ్యాం తీరాన్ని, అక్కడ జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ స్డేడియంలో జరిగే బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోజు రోజుకు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించాలంటే చెట్లు పెంచాలని మంత్రి ఈటెల కోరారు. ప్రతి ఒక్కరూ హరిత హారంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు.

19:50 - July 9, 2017

గుంటూరు : వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు టీడీపీ నేతలు. మూడేళ్ల పాలనలో సిఎం చంద్రబాబు 3 లక్షల 75వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్షనేత జగన్ నిరూపిస్తే ఏపి కేబినేట్ మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి సవాల్ చేశారు. వైసిపి ప్లీనరీలో అభివృద్ధిని అడ్డుకునే విధ్వంసకర తీర్మానాలు చేశారంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.

19:49 - July 9, 2017

హైదరాబాద్ : భక్తులతో సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి భక్తులు తరలివస్తున్నా ఆలయం వద్ద సందడి తగ్గలేదు. రాత్రి కూడా భక్తులు బోనాలు సమర్పించేందుకు.. అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమ్మవారికి పలువురు వీపీఐలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని, ఎంపీ కవిత, షట్లర్ పీవీ సింధు, సీపీ మహేందర్‌ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:48 - July 9, 2017

గుంటూరు : అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా 30 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాలన్న ఆకాంక్షను వైసీపీ అధినేత జగన్‌ వ్యక్తం చేశారు. వైఎస్‌ తరహాలోనే తన పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలన్నారు. గుంటూరు జరుగుతున్న ప్లీనరలో పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత జగన్‌ ప్రసంగించారు. 

బీహర్ లో పిడుగు పడి 12 మంది మృతి

పాట్నా : బీహర్ లో పిడుగు పడి 12 మంది మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించింది. 

18:36 - July 9, 2017
18:33 - July 9, 2017
18:31 - July 9, 2017
18:25 - July 9, 2017

ఢిల్లీ : గత మూడు రోజుల క్రితం కిడ్నాపైన డాక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌.. ఢిల్లీలో ఉన్న మెట్రో ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం శ్రీకాంత్‌గౌడ్‌ను ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్ చేశాడు. అయితే డాక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్‌ ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ప్రీత్ విహార్ పీఎస్‌ ఏసీపీ రాహుల్‌ తెలిపారు. ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, యూపి పరిసర ప్రాంతాలలో పోలీసు బృందాలు విస్త్రతంగా గాలిస్తున్నాయి. ఎలాంటి చిన్న క్లూ దొరికినా నిందితుడిని పట్టుకుంటామని ఏసీపీ రాహుల్ అన్నారు. మరోవైపు శ్రీకాంత్‌గౌడ్ కిడ్నాప్‌ అయి మూడు రోజులైనా ఆచూకీ దొరక్కపోవడతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వివాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్టుల భర్తీ

విశాఖ : విశాఖ స్టీల్ ప్లాంట్ లో పోస్టుల భర్తీ ప్రక్రియ వివాదంలో చిక్కుకుంది. ప్లాంట్ యాజమాన్యం సకాలంలో పరీక్ష పేపరు రాలేదని ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ పరీక్షను నిలిపివేసింది.

 

18:17 - July 9, 2017

హైదరాబాద్ : భక్తులతో సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్న సమయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... అమ్మవారికి బోనం సమర్పించారు. అంతకు ముందు హోంమంత్రి నాయిని, షట్లర్ పీవీ సింధు, సీపీ మహేందర్‌ రెడ్డి, ఖైతరాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్‌ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:09 - July 9, 2017

గుంటూరు : వైసీపి అధికారంలోకి వస్తే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ భరోసా పథకం కింది ఈ మొత్తాన్ని నాలుగేళ్లలో ప్రతి ఏటా మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని ప్లీనరీలో చెప్పారు. 

ఇంక తెలియని డాక్టర్ శ్రీకాంత్ గౌడ్ ఆచూకి

ఢిల్లీ : గత మూడు రోజుల క్రితం కిడ్నాపైన డాక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్‌ ఆచూకీ ఇంకా లభించలేదు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌.. ఢిల్లీలో ఉన్న మెట్రో ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం శ్రీకాంత్‌గౌడ్‌ను ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్ చేశాడు. అయితే డాక్టర్‌ శ్రీకాంత్‌గౌడ్‌ ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ప్రీత్ విహార్ పీఎస్‌ ఏసీపీ రాహుల్‌ తెలిపారు.

17:51 - July 9, 2017

హైదరాబాద్ : మధ్యాహ్న సమయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత... అమ్మవారికి బోనం సమర్పించారు. అంతకు ముందు హోంమంత్రి నాయిని, షట్లర్ పీవీ సింధు, సీపీ మహేందర్‌ రెడ్డి, ఖైతరాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.

17:48 - July 9, 2017

హైదరాబాద్ : కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్‌ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 

17:47 - July 9, 2017

హైదరాబాద్ : భక్తులతో సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:42 - July 9, 2017

గుంటూరు : అక్టోబర్‌ 27నుంచి పాదయాత్ర చేస్తానని ప్రతిపక్ష వైఎస్‌ జగన్ ప్రకటించారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. అక్టోబర్ 27 నుంచి దాదాపు 6నెలలపాటు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి పాదయాత్రను మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు చేపడుతానని జగన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:41 - July 9, 2017

గుంటూరు : జిల్లాలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో వైసీపీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యపాన నిషేదం విధిస్తామని తెలిపారు. మద్యం దుకాణాలను దశలవారీగా తగ్గిస్తామని, మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా పెంచుతామని తెలిపారు. అలాగే మద్యాన్ని మాన్పించేందుకు రీహాబిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. అధికారంలోకి వస్తే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని వైసీపీ అధినేత జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ భరోసా పథకం కింది ఈ మొత్తాన్ని నాలుగేళ్లలో ప్రతి ఏటా మే నెలలో 12,500 రూపాయలు ఇస్తామని ప్లీనరీలో చెప్పారు. 

17:40 - July 9, 2017

గుంటూరు : వైసీపీలో అప్పుడే ఎన్నికల వాతవరణం నెలకొంది. రెండు రోజులుగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీలు ప్రకటించారు. ఆయన 9 హామీలను ప్లీనరీ వేదికగా వెల్లడించారు. రైతులకు కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకోవడం కోసం అమ్మ ఒడి పథకం, కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ పథకం, డ్వాక్రా పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాల పథకం, పొదుపు సంఘాలకు ఆసరా పథకం తీసుకొస్తామని జగన్ ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం టిడిపి పావులు..

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ పావులు కదుపుతోంది. ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నౌమాన్ నియామకం జరిగింది. దీంతో పాటు.. రేపు సీఎంను కలవాలని... పార్టీ సీనియర్ నేత ఫరూఖ్‌ను ఫోన్ వచ్చింది. ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా కౌన్సిల్ ఛైర్మన్ పదవి కూడా ఫరూఖ్‌కే కల్పించే అవకాశం ఉన్నట్లు పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికారంలోకి వచ్చిన వెంటనే 9 కార్యక్రమాలు: జగన్

  • 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం...
  • ప్రతి ఏటా రూ.12,500 ఒకేసారి మే నెలలో ఇస్తామని ప్రకటన
  • వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద డబ్బు చెల్లిస్తాం: జగన్
  • పొదుపు సంఘాలకు ఆసరా పథకం తీసుకొస్తాం: జగన్
  • డ్వాక్రా, పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్ ఆసరా పథకం తీసుకొస్తాం...
  • డ్వాక్రా, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం: జగన్
  • కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్: జగన్
17:32 - July 9, 2017

కర్నూలు : జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో గెలుపు కోసం టీడీడీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నౌమన్ నియామించారు. అటు మరో ముస్లిం పార్టీ సీనియర్ నేత ఫరూఖ్ రేపు సీఎంను కలవమని ఫోన్ వచ్చింది. ఫరుఖ్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించడానికి సీఎం చంద్రబాబు సుముఖంగా ఉన్న తెలుస్తోంది. ఎమ్మెల్సీతో పాటు మండలి చైర్మన్ పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు పార్టీలో ఊహాగానాలు వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

మద్యంపై జగన్ సంచలన ప్రకటన..

గుంటూరు : మద్యంపై వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ సంచలన ప్రకటన చేశారు. మద్యంపై ఒకే సారి నిషేధం కంటే మూడు దఫాలుగా నిషేధం విధిస్తామని ప్రకటించారు. మద్యాన్ని కొనుక్కోవాలంటే షాక్ ఇచ్చే విధంగా ధరలు పెంచుతామని, కోటీశ్వర్లుఉ కొనుక్కొనే విధంగా ఫైవ్ స్టార్ హోటళ్లో విక్రయించే విధంగా చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

పాదయాత్ర చేస్తానన్న జగన్..

గుంటూరు : వైసీపీ ప్లీనరీ ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్ మాట్లాడారు. అక్టోబర్ 27వ తేదీ నుండి పాదయాత్ర చేపడుతానని, దాదాపు ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు. ఇడుపుల పాయ నుండి యాత్ర ప్రారంభించి తిరుమలకు వెళుతానని..ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తానన్నారు.

16:37 - July 9, 2017
16:36 - July 9, 2017

కరీనా కపూర్..బాలీవుడ్ లో రొమాంటిక్..కామెడీ..డ్రామాల వరకు ఎన్నో రకాల సినిమాల్లో నటించింది. తనదైన గ్లామర్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి మళ్లీ రీ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నటుడు సైఫ్ ఆలీఖాన్ ను వివాహం చేసుకున్న అనంతరం ఈ మధ్యే ఓ బిడ్డకు 'కరీనా' తల్లయ్యింది. అనంతరం బిడ్డతో ఎంజాయ్ చేస్తున్న పలు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కాలంలో 'కరీనా’ బాగా లావుగా మారిందని ప్రచారం జరిగింది. కానీ ఇటీవలే ఓ ఈవెంట్ లో ‘కరీనా’ పాల్గొంది. తిరిగి తన పూర్వపు రూపాన్ని సంతరించుకుని షాక్ ఇచ్చింది. తక్కువ సమయంలో ఇంత స్లిమ్‌గా ఎలా మారిందని చర్చించుకున్నారంట. గ్లామర్ లుక్‌లో ఆకట్టుకున్న 'కరీనా' రీ ఎంట్రీకి రెడీ అవుతోందని పుకార్లు షికారు చేస్తున్నాయి. హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయా ? ఎలాంటి పాత్రలు వస్తాయి ? వేచి చూడాలి.

16:36 - July 9, 2017

గుంటూరు :  జిల్లాలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ లో జగన్ రాబోయే తమ పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 9 పథకాలు ప్రారంభిస్తామని జగన్ తెలిపారు. ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరీకి రూ.50వేలు ఇస్తామని, ప్రతి ఏటా మే నెలలో రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఈ డబ్బు చెల్లిస్తామని అన్నారు. ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలో రైతు ఇష్టమని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇస్తామని, రూ.3వేల కోట్లతో రైతు స్థీరికరణ నిధి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి రైతుకు గిట్టు బాటు ధర హామీ ఇస్తామని జగన్ ప్రకటించారు. రూ.2వేల కోట్లతో కెలామెటీ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పల్లవాడు బడికి వెళ్లి చదువుకోవడానికి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ.500, 5వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు నెలకు రూ.750, ఇంటర్ కు నెలకు రూ.1000 ఇస్తామని జగన్ ప్రకటించారు. మహిళ సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి.

 

16:15 - July 9, 2017

వరుస చిత్రాలతో బిజీ బిజీగా మారిపోతున్న 'కాజల్' కు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. స్టార్ హీరోల పక్కన మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ ప్రేక్షకులను 'కాజల్' అలరిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' సరసన 'ఖైదీ నెంబర్ 150’లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న ఈ భామ 'నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది 2’ సినిమాలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో సైతం పొల్గొందని టాక్. పాత్ర నచ్చడంతోనే నటించేందుకు 'కాజల్' ఒప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరత్ కపూర్ సరసన 'కాజల్' నటించందా ? లేక 'నాగార్జున' సరసన నటించిందా అనేది చూడాలి. 'రానా' సరసన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'కాజల్' నటిస్తోంది.

జగన్ ఎన్నికల హామీలు..

గుంటూరు : ప్లీనరీ ముగింపు రోజున వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ ప్రసంగిస్తున్నారు. ఆయన ప్రసంగంలో ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాలు..ప్రవేశ పెట్టి పేదలను ఆదుకుంటామన్నారు. వృద్ధాప్య ఫించన్లను రూ. 1000 నుండి రూ. 2000 లకు పెంచుతామని, 'అమ్మ ఒడి' అనే పథకం తీసుకొస్తామని, 1 నుండి 5 తరగతి చదివే వారికి ఒక్కో పిల్లవాడికి రూ. 500 చొప్పున ఇద్దరికి రూ. 1000 తల్లులకు అందిస్తామన్నారు. అలాగే 5 నుండి 10 వ తరగతి చదువుతున్న వారికి ఒక్కో విద్యార్థికి రూ. 750 చొప్పున ఇద్దరు విద్యార్థులకు రూ. 1500 అందిస్తామన్నారు.

16:01 - July 9, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి) చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరుపుకొంటోంది. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో 'నితిన్' వైవిధ్యమైన పాత్ర పోషించినట్లు టాక్. వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకరలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.
‘నితిన్' కు విలన్ గా యాక్షన్ కింగ్ 'అర్జున్' కనిపించనుండడం..చిత్ర పోస్టర్ లో 'అర్జున్' లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేశాయి. హీరోకు...విలన్ కు మధ్య ఏం ఉంది ? అతనే తెలిపే పోస్టర్ ను జులై 10న రిలీజ్ చేయనున్నారు. అలాగే జులై 11వ తేదీన చిత్ర టీజర్ ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ‘నితిన్' సరసన మేఘా ఆకాష్‌ హీరోయిన్ గా నటించింది. 'అ..ఆ మూవీతో హిట్ కొట్టిన 'నితిన్'... ‘లై’ మూవీతో హిట్ ట్రాక్‌ను కొనసాగిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

15:52 - July 9, 2017

టాలీవుడ్ లో ప్రముఖ హీరోల సరసన నటించి..మెప్పించిన నటీమణుల్లో 'రమ్యకృష్ణ' ఒకరు. ప్రస్తుతం యంగ్ హీరోల చిత్రాల్లో అమ్మ..ఇతర కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తోంది. ఇటీవలే రెబల్ స్టార్ 'ప్రభాస్' నటించిన 'బాహుబలి'..’బాహుబలి 2’ సినిమాలో 'శివగామి' పాత్రలో టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా 'రమ్యకృష్ణ' మారారు. తదనంతరం పలు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా మరోసారి ఆసక్తికరమైన పాత్రలో 'రమ్య' నటించనున్నారు.
'నారా రోహిత్’, 'రెజినా' జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'రమ్యకృష్ణ' రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనుంది. ‘బాహుబలి' సినిమాలో 'శివగామి' పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాలోకూడా 'రమ్యకృష్ణ' పాత్ర అంతే కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. మరి ఆ పాత్ర ఏమిటీ ? ఎలా ఉండబోతోంది ? అనేది తెలుసుకోవాలంటే చిత్ర రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

15:34 - July 9, 2017

టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తున్న 'సమంత' ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెడుతోంది. తమిళ సినీ రంగంలో పలు చిత్రాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో 'వేలైక్కారన్' చిత్రంలో 'సమంత' నటిస్తోంది. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శుక్రవారం నుండి 'సమంత' షూటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు ఘన స్వాగతం పలికింది. హీరోగా నటిస్తున్న 'శివకార్తియన్'..’సమంత'లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 14 ఏఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'సిమ్రాన్'..’నెపోలిన్' ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

15:20 - July 9, 2017

గుంటూరు : మరో సారి వైసీపీ అధ్యక్షునిగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగన్ తనను ఎన్నుకున్నందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు పాలన పై ఇక్కడ నుంచి సమర శంఖం పూరిస్తున్నామని స్పష్టం చేశారు. మూడు సంవత్సరాలుగా తము చేసిన పోరాటలను ఆయన గుర్తు చేశారు. నిన్ని నాన్న గారి 68వ జయంతి జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో స్వర్ణయుగం వచ్చిందని, ఆయన ఉంటే రాష్ట్రం వీడిపోయేది కాదని జగన్ అన్నారు. ఈ ప్లీనరీతో చంద్రబాబు గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. 1995లో అధికారం తీసుకునేటప్పుడు స్వంత మామగారిని వెన్నుపోటు పొడిచి పదవి తీసుకున్నారని, అదే ప్రజల ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి ప్రజల అశీర్వదిస్తే పదవి చేపట్టాడని జగన్ తెలిపారు. కూతురు ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఐదు కోట్ల మందికి వెన్నుపొటు పొడుస్తాడని జగన్ ఆరోపించారు.

నా ఫోటో కూడా అందరి ఇళ్లలో 
నాన్న గారి లాగా మఖ్యమంత్రి 30 ఏళ్లు చేసి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోవాలని, అందరి ఇళ్లలో నాన్న ఫోటో ఎలా ఉంటుందో తన ఫోటలో కూడా ఉండాలని జగన్ ఆశభావం వ్యక్తం చేశారు. సినిమాలో మూడోంతు విలన్ దే పై చేయి కానీ సినిమాలో అంతిమంగా హీరోదే విజయమని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతి తప్ప మరొటి కనబడుట లేదని, దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఎవరిన కదిపిన తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఆశ వర్కర్ల తొలగింపు అన్యాయమని తెలిసిన వారిని తొలగించారని ఆయన అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

చంద్రబాబు గుండెల్లో రైళ్లు - జగన్..

గుంటూరు : జిల్లాలో రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్లీనరీలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ ప్రసంగించారు. ఇక్కడి నుండి సమరశంఖం పూర్తిస్తున్నట్లు, ఈ ప్లీనరీని చూసి సీఎం చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ప్లీనరీలో 20 అంశాలపై చర్చలు జరిగాయని, భవిష్యత్ మనదేనని వైసీపీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నారు.

 

మరోసారి వైసీపీ అధ్యక్షుడిగా..

గుంటూరు : మరోసారి వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికయ్యారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ప్లీనరీ చివరి రోజున జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఉమ్మారెడ్డి ప్రకటించారు.

బైక్ పై మంత్రి హరీష్ రావు..

మెదక్ : తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ సిద్దిపేటలో అభివృద్ధి పనులను పరిశీలించారు. మెదక్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ రోడ్లకు ఇరువైపులా నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ పనుల పురోగతిని బైక్‌పై వెళ్లి తెలుసుకున్నారు.

బాబును విమర్శించడానికే ప్లీనరీ - సోమిరెడ్డి..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించడానికి వైసీపీ ప్లీనరీ పెట్టుకుందని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్లీనరీ పార్టీ సంప్రదాయానికి భిన్నంగా ఉందని, జగన్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, మూడేళ్లలో రూ. 3.75లక్షల కోట్ల అవినీతి జరిగిందనడం..దోపిడి జరిగిందనడం ఆరోపిస్తున్నారని తెలిపారు.

ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు పెండెంగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా జె.ఆర్.పుష్పరాజ్, ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా అంబికా కృష్ణ, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా జలీల్‌ ఖాన్; ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నౌమాన్, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నరసింహయాదవ్, లిడ్ క్యాప్ చైర్మన్‌గా ఎరిక్షన్ బాబు, మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకాశ్ నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బాబు ప్రభుత్వంపై విజయమ్మ విమర్శలు..

గుంటూరు : చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతంపాడే సమయం ఆసన్నమైందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా... ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడేవారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు.

వైసీపీ ప్లీనరీలో ప్రశాంత్ కిషోర్..

గుంటూరు : వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీప్లీ ప్లీనరీకి హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలకు కిషోర్ ను పార్టీ అధ్యక్షుడు జగన్ పరిచయం చేశారు.

14:59 - July 9, 2017

పెద్దపల్లి : జిల్లా ముత్తారం మండలం పారుపెల్లి పంచాయతీ పరిధిలోని క్షాత్రాదిపల్లి, టేకుమట్ల మండలం పరిధిలోని గట్టంపల్లి గ్రామాల మధ్య భూవివాదం తలెత్తింది. రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. 400 ఎకరాల భూములను గట్టంపల్లికి చెందిన కొందరు ఆక్రమించారంటూ క్షాత్రాదిపల్లి గ్రామస్తులు ఆందోళనకుదిగారు. దీనికి ప్రతిగా గట్టంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే పుట్ట మధు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. 

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న తమ్మినేని..

హైదరాబాద్ : రైతులకు గిట్టుబావటు ధర కల్పించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. దళారుల మోసాలను అరికట్టాలని, ఉత్పత్తులకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి..ఉద్యానవన పంటల విషంయలో కార్యాచరణ రూపొందించి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

14:58 - July 9, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు పెండెంగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా జె.ఆర్.పుష్పరాజ్, ఏపీ టీవీ, సినిమా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా అంబికా కృష్ణ, వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా జలీల్‌ ఖాన్; ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నౌమాన్, కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నరసింహయాదవ్, లిడ్ క్యాప్ చైర్మన్‌గా ఎరిక్షన్ బాబు, మాంసం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రకాశ్ నాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

14:56 - July 9, 2017

గుంటూరు : చంద్రబాబు ప్రభుత్వానికి చరమగీతంపాడే సమయం ఆసన్నమైందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరించారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా... ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడేవారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. రాజన్న కలలుగున్న సువర్ణయుగం కోసం అందరూ అహర్నిశలు శ్రమించాలన్నారు. చంద్రబాబు ఆచరణసాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. మూడేళ్లలో ఆయన ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో రాష్ట్రప్రజలు జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ఆమె ప్రసంగించారు.

భూ వివాదం..ఘర్షణ..

పెద్దపల్లి : జిల్లా ముత్తారం (మం) క్షాత్రాదిపల్లి భూపాలపల్లి జిల్లా గట్టంపల్లి మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. తమ 400 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ క్షాత్రాదిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రెండు గ్రామస్తులతో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు.

14:16 - July 9, 2017

గుంటూరు : వైసీపీ ప్లీనరీ వద్ద ఎమ్ ఆర్ పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎస్సీ వర్గీకరణపై జగన్‌ వైఖరి తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. ప్లీనరీ వద్దకు వెళ్లేందుకు నవ్యాంధ్ర ఎమ్ ఆర్ పీఎస్ కార్యకర్తల ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు.

 

14:13 - July 9, 2017
14:09 - July 9, 2017
14:05 - July 9, 2017
14:04 - July 9, 2017
14:03 - July 9, 2017
14:00 - July 9, 2017

హైదరాబాద్‌ : చాంద్రాయణగుట్టలో పోలీసులు ఈ తెల్లవారుజామున కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.. జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి ఆధ్వర్యంలో 350 మంది పోలీసులుతో ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు... తనీఖీల్లో 8మంది రౌడీషీటర్లను  27మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.. అక్రమంగా  అల్లం  తయారుచేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.. అదేవిధంగా 27 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు, 5 ఆటోలు, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

 

13:59 - July 9, 2017

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలంలోని పలు కాలనీల్లో  పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు.. రూరల్‌ ఏసీపీ తిరుపతి  ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు...తనీఖీల్లో సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు , 2 ఆటోలతోపాటు కల్తీ అల్లం ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీన పరుచుకున్నారు.. సమాజంలో  ఏలాంటి అసాంఘిక  కార్యకలాపాలు జరక్కుండా పోలీసులు ప్రజలు అప్రమత్తమయ్యేందుకే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని ఏసీపీ తిరుపతి అన్నారు.
 

13:55 - July 9, 2017

జగిత్యాల : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మార్చురీలో మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి.. అర్షద్‌ పాషా అనే యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు... జగిత్యాల ఆస్పత్రికి తరలించేవరకే అతను చనిపోయాడు.. మార్చురీలో డెడ్‌బాడీని భద్రపరిచారు.. ఈ మృతదేహాన్ని ఎలుకలు తిన్నాయంటూ అతని బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు..

 

13:47 - July 9, 2017

పెద్దపల్లి : జిల్లాలోని ముత్తారం మండలం పారుపెల్లి పంచాయతీ పరిధిలోని క్షాత్రాదిపల్లి, టేకుమట్ల మండలం పరిధిలోని గట్టంపల్లి గ్రామాల మధ్య భూవివాదం తలెత్తింది.  రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి.  400 ఎకరాల భూములను గట్టంపల్లికి చెందిన కొందరు  ఆక్రమించారంటూ  క్షాత్రాదిపల్లి గ్రామస్తులు ఆందోళనకుదిగారు. దీనికి ప్రతిగా గట్టంపల్లి  గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు  ఇరు గ్రామాల ప్రజలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే పుట్ట మధు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. 

 

13:47 - July 9, 2017

క్షణికావేశం..జీవితాన్ని చిదిమేస్తుంది..కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించాలి..ఆత్మవిశ్వాసం గెలుపుకు బాట వేస్తుంది..ఆత్మహత్య ఏ సమ్యకు పరిష్కారం కాదు..

సమస్యలు..ఆర్థిక ఇబ్బందులు..ఇతరత్రా కారణాలతో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు..బలి తీస్తున్నారు..జీవితంలో కష్టాలకు..సమస్యలకు ఎదురీతకుండా 'చావు' ఒక్కటే పరిష్కారమనుకుంటున్నారు. కష్టాలు వచ్చాయని..తమకు నష్టాన్ని కలుగ చేశారని..బాధతో..కక్షలతో జీవితాన్ని మధ్యలో తుంచేసుకుంటున్నారు..తుంచుతున్నారు..ఎందుకిలా జరుగుతోంది ? పుట్టుక..మరణం..పుట్టిన ప్రతి వాడు గిట్టక మానడు..అనేది అందరికీ తెలిసిందే. మానవ జీవితం ఒక అద్భుతమని..ఈ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలి.

ఆత్మహత్యలు అధికం..
ప్రస్తుతం మారుతున్న సమాజంలో మరణాల సంఖ్య అధికమౌతున్నాయి. కక్షలు..కార్పణ్యాలు..ఆర్థిక ఇబ్బందులు..కష్టాలు రావడంతో చావు ఏకైక మార్గమమని అనుకుంటున్నారు. ఎదురుదెబ్బలకు తట్టుకుని ధైర్యంగా నిలబడకుండా బలవన్మరణాలకు పాల్పడడం ఎంతవరకు కరెక్టు. జీవితంలో కష్టాలు వచ్చాయని..వాటిని భరించలేమని ఆందోళన చెందుతూ జీవితాన్ని అంతం చేసుకోవడం మూర్ఖత్వం అనగా ఇంకేమనాలి.

బలహీనత..
చేసే పనుల్లో నిజాయితీ ఉండేలా తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇతర వ్యక్తులతో చక్కటి సత్సంబంధాలు ఉండేలా చూడాలి. చావు సంగతి సరే..నీపై ఆధారపడిన వారికి ఏం సమాధానం చెబుతారు ? నిరాశ, నిస్పృహలు లోనైటప్పుడు మనస్సులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పరిభ్రమిస్తాయి. ఆ క్షణంలో బలహీనపడ్డామంటే మాత్రం అంతే సంగతులు. ప్రతి సమస్యకు చావులోనే సమాధానం వెతుక్కుంటారా ? ఆలోచన వచ్చిందే తడవుగా అఘాయిత్యానికి పాల్పడకుండా తమకు తాము ఓ గడువు విధించాలని మానసిక విశ్లేషకులు సూచిస్తుంటారు.

భయాన్ని వీడాలి..
భయం..మరింత భయాన్ని కలుగచేస్తుంది..ఓ చిన్న భయం బతుకంతా వ్యాపింపచేస్తుంది. భయం సకల సమస్యలకు మూలంగా తయారవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే భయం నీడలాంటిదని చెప్పవచ్చు. అది నీడలా వెంటాడుతుంది. ధైర్యంగా పోరాడటం..భయాన్ని పారదోలే విధంగా మాసకింగా ధృడంగా తయారు కావాలి. చిన్న సమస్యకూ చావు ఒక్కటే పరిష్కారం అనేది దాని నుండి బయటపడాలి. తీవ్ర నిరాశ నిస్ర్పహలో ఉన్న వారితో సాంత్వన చేకూర్చేలా మాట్లాడాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు..కౌన్సెలింగ్‌ చేయాలి లేదా మానసిక వైద్య నిపుణుడు వద్దకు తీసుకువెళ్లడం చేస్తే పరిస్థితిలో నుండి మార్పు వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో మానసిక నిపుణులను ఏర్పాటు చేసి సమస్యలను గుర్తించి వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా ఆత్మహత్యలను నివారించే ప్రయత్నం చేయవచ్చు.

13:42 - July 9, 2017

ప్రముఖ నవలారచయిత ప్రభాకర్ జైని రాసిన సినీవాలీ నవల ఆవిష్కరణ సభ ఇటీవల రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణా ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో  ఆధ్యాత్మిక గురువు శ్రీరాంసార్ సినీ వాలీ నవలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నవ్యవీక్లీ ఎడిటర్ జగన్నాథశర్మ, ఎ.పి.బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోషియేషన్  అధ్యక్షులు టి.రాజేందర్, బిక్కి కృష్ణ, అసుర, కత్తిమహేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సత్కరించారు. ఇటీవల మహబూబాబాద్ లో కవయిత్రి కీర్తనారెడ్డి రాసిన జీవనవీణ కవితా సంపుటిని ప్రముఖ కవి, ప్రజాగాయుడు గోరటి వెంకన్న ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్ శర్మ, జాయింట్ కలెక్టర్  దామోదర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఉమా మురళీనాయక్, ఆకెళ్లరాఘవేంద్ర తదితరులుపాల్గొన్నారు. 

13:41 - July 9, 2017

తెలంగాణాలో ఎందరో గేయరచయితలున్నారు. అద్భుతమైన పాటలు రాస్తున్నారు. ప్రజలను తమ పాటలతో ఉత్తేజపరుస్తున్నారు. ఉద్యమాల బాట పట్టిస్తున్నారు. అలాంటి వారిలో కరీంనగర్ కు చెందిన కన్నం లక్ష్మీనారాయణ ఒకరు. ఆయన ఓ పక్క సింగరేణి బొగ్గుగనిలో కార్మికునిగా పనిచేస్తూ మరో పక్క గేయరచయితగా పాటలు రాస్తూ వచ్చారు. ప్రముఖ గేయరచయిత కన్నం లక్ష్మినారాయణ జనం పాట మీ కోసం..పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:39 - July 9, 2017

తెలుగు కథా శిఖరం నేలకొరిగింది.. తెలుగు కథా మాంత్రికుడు నిష్క్రమించాడు.. సంక్లిష్ట సందర్భంలో ఉన్న సమాజంలోని సంఘర్షణను ఒడిసిపట్టి తెలుగు పాఠకుల ముందు నిబద్ధతగా నిలబడిన ఓ నిలువెత్తు కథలాంటి మనిషి అదృశ్యమయ్యాడు.. ప్రముఖ కథారచయిత, నవలాకారుడు డా.వి.చంద్రశేఖరరావు కన్నుమూతతో తెలుగు సాహితీ ప్రపంచం విషాదంలో మునిగింది. ఆ మహాకథన శిల్పికి నివాళులర్పిస్తూ..ఈ వారం అక్షరం మీ ముందుకొచ్చింది. 
సంచలనం సృష్టించిన రచయిత డా.వి.చంద్రశేఖరరావు 
తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో సంచలనం సృష్టించిన గొప్ప రచయిత డా.వి.చంద్రశేఖరరావు శనివారం కన్నుమూసారు. ఆకుపచ్చని దేశం, నల్లమిరియం చెట్టు, ఐదుహంసలు,లాంటి నవలలు, జీవని, లెనిన్ ప్లేస్, మాయాలాంతరు, ద్రోహవృక్షం లాంటి కథాసంకలనాలు వెలువరించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు వర్తమాన జీవితం నుంచి వస్తువును తీసుకుని, తన రక్తంలో ముంచి అద్భుతమైన సృజన సాగించిన... మన కాలం మహాకథారచయిత వి. చంద్రశేఖర్రావు. 

13:29 - July 9, 2017

సిద్దిపేట : తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ సిద్దిపేటలో అభివృద్ధి పనులను పరిశీలించారు.  మెదక్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ రోడ్లకు ఇరువైపులా నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌  పనుల పురోగతిని  బైక్‌పై  వెళ్లి తెలుసుకున్నారు.  నాణ్యతాలోపంతో  వర్షాలకు  దెబ్బతిన్న  ఫుట్‌పాత్‌ను పరిశీలించారు. నిర్దేశిత సమయంలో ఫుట్‌పాత్‌పనులు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.  నాణ్యతాప్రమాణాలు పాటించకుంటే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   ఆ తర్వాత రోడ్లపై నాటిన చెట్లను పరిశీలించారు.  అక్కడి నుంచి నేరుగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఏసీ అంబులెన్స్‌ను ప్రారంభించారు. 

 

13:22 - July 9, 2017

విశాఖ : జిల్లా నాతవరం మండలం నాయుడుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఏలేరు కాలువ గట్టుపై సైకిల్‌ తొక్కుతూ ఇద్దరు పిల్లలు కాలువలో పడ్డారు. నీళ్లలో మునిగి తరుణ్‌ రమేష్‌, సతీష్‌ మృతి చెందారు.

 

మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు..

జగిత్యాల : ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి. మార్చురీలో జరిగిన ఈ ఘటనపై మృతుడి బంధువులు ఆందోళన చేపడుతున్నారు.

13:13 - July 9, 2017
13:12 - July 9, 2017

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కేఈ..

కర్నూలు : ప్రభుత్వాసుపత్రిని డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి అకస్మికంగా తనిఖీలు చేశారు. శనివారం రాత్రి యూరాలజీ వార్డులో షార్ట్ సర్క్యూట్ కు గురైన ప్రాంతాన్ని కేఈ పరిశీలించారు.

13:11 - July 9, 2017
13:10 - July 9, 2017

వైసీపీ ప్లీనరీ సెకండ్ డే..

విజయవాడ : వైసీపీ ప్లీనరీ రెండో రోజు కొనసాగుతోంది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మీ, షర్మిలలు హాజరయ్యారు. ప్లీనరీలో తెలంగాణ వైసీపీ నేతలు ప్రవేశ పెట్టారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీ శ్రేణులపై దాడులపై పార్థసారధి తీర్మానం ప్రవేశ పెట్టారు.

13:08 - July 9, 2017

కడప : దువ్వూరు మండలం చింతకుంట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి సిమెంట్‌ మిల్లర్‌ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా... మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 

దేవరపల్లిలో 144 సెక్షన్..

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లిలో 144 సెక్షన్ ను అమలు చేశారు. దళితు భూముల వివాదం నేపథ్యంలో పోలీసులు మోహరించారు. భూములు పరిశీలించేందుకు వెళుతున్న సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు

దేవరపల్లిలో దళితుల గృహ నిర్భందం..

ప్రకాశం : దేవరపల్లిలో దళితులను గృహ నిర్భందం చేశారు. చర్చీకు వెళ్లనీవ్వకుండా నిర్భందించడంపై మహిళలు ఆందోళనకు సిద్ధమౌతున్నారు.

13:02 - July 9, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దళితుల భూముల వివాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దళితులను పరామర్శించడానికి వెళ్లిన ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావుసహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సీపీఎం నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా సీపీఎం నేతలను అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు పోలీసు రాజ్యం నడుపుతున్నారని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దేవరపల్లిలో 144 సెక్షన్‌ విధించారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 

 

12:27 - July 9, 2017

దళారీ..ఏ వ్యాపారంలోనైనా సులువుగా చొచ్చుకపోయే వాడు దళారీ..ఈ దళారీ వ్యవస్థతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు..కష్టాలు పడుతున్నారు..ఆయా వ్యాపారం..రంగాల్లో దళారీ వ్యవస్థ లేకుండా చేస్తాం..అందరికీ లాభమయ్యే విధంగా చూస్తామంటున్న పాలకుల మాటలు వట్టిమూటలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రైతుల పరిస్థితి..ధరల చూస్తుంటే ఇది నిజమనిపించకమానదు..

చెమటోడ్చి పండిస్తున్న రైతు..
రైతు..కాయకష్టం..రాత్రింబవళ్లు..తినీతినకుండా చెమటోడ్చి పంటలు పండిస్తుంటాడు. వడ్డీలకు..అప్పులు తెచ్చి..ఆస్తులు..బంగారాన్ని కుదువపెట్టి పంటలు పండిస్తుంటాడు. తమ పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆ రైతు ఆశ పడుతుంటాడు. కానీ ఆశలు అడియాసలవుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతుండడంతో రైతు నేల చూపులు చూస్తున్నాడు.

గిట్టుబాటు ధరేది..?
రైతు పండించిన పంటకు వ్యాపారులు సరైన ధర చెల్లించి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నా స్పందించిన దాఖలు తక్కువ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుడికి..రైతు మధ్య విగాధం ఏర్పడుతోంది. వివిధ పంటలు పండించిన రైతన్నలకు ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మిర్చి..పత్తి..దొండ రైతులు ఆందోళనలు..నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మద్దతు ధర తప్పనిసరిగా అందేలా ప్రభుత్వం చూడాల్సి ఉన్నా ఆ దిశగా సరియైన చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేసి వినియోగదారులకు అందిస్తామని చెబుతున్న మాటలు నెరవేరడం లేదు.

రైతు..వినియోగదారుడు..
రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు...కానీ మార్కెట్ లో మాత్రం కూరగాయలు ధరలు కొండెక్కుతున్నాయి. దళారీ వ్యవస్థ ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రైతుల వద్ద మాములు ధరకు కొనుగోలు చేసి మార్కెట్ లో మాత్రం వినియోగదారుడికి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇటీవలే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. నేరుగా అమ్మే ధరకు..చిల్లర మార్కెట్ ధరకు వందశాతం తేడా ఉంటోందని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. దొండకాయ..వంకాయ..టమాట..ఇతర కూరగాయాల ధరలు అమాంతం పైకి ఎగబాకాయి. గతంలో టమాట కిలో పది రూపాయలు పలికితే నేడు రూ. 80-100 ధర పలుకుతోంది. కానీ కూరగాయాలు పండించిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో తాము పండించిన పంటలను రోడ్డుపై పారబోస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించడం కూడా ధరల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు.

మరి రైతుకు లాభం..వినియోగదారుడి కష్టాలు ఎన్నడు తీరుతాయో....

12:21 - July 9, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను, 2500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారిని టీఆర్ఎస్ ఎంపీ కేకే దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. మహంకాళి బోనాల ఉత్సవానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషన్‌ రెడ్డి హాజరయ్యారు..  ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు..
గట్టి భద్రత
మహంకాళి బోనాల పండుగకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.. షీ టీమ్స్‌కూడా ఈ విధుల్లో భాగస్వామ్యం అయ్యాయి.

 

12:19 - July 9, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు విక్రయం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ భరించలేక ఓ తల్లి శిశువును విక్రయించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన ఓ మహిళ ఆస్పత్రిలో స్వీపర్ గా పని చేస్తున్న జ్యోతి ప్రోద్బలంతో 5 వేల రూపాయలకు ఆడ శిశువును కొత్తగూడెంకు చెందిన పిల్లలు లేని మహిళలకు విక్రయించారు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డు విషయాన్ని అవుట్ పోస్టింగ్ పోలీసులకు తెలిపారు. వ్యవహారం బయటికి పొక్కడంతో శిశువును మహిళ తిరిగి తల్లికి అప్పగించింది. 'మొదట కాన్పులో ఆడపిల్ల పుట్టింది..ఇప్పుడు కూడా ఆడ పిల్ల పుట్టింది.. కుటుంబ పోషణ భరించలేక శిశువును విక్రయానికి ఒప్పుకున్నట్లు' తల్లి తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

బోల్తా కొట్టిన సిమెంట్ మిల్లర్ లారీ..

కడప : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దువ్వూరు మండలం చింతకుంట వద్ద సిమెంట్ మిల్లర్ లారీ బోల్తా కొట్టడంతో మహిళ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.

సర్కారీ ఆసుపత్రిలో శిశు విక్రయం..

ఖమ్మం : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం రేపింది. కొత్తగూడెంకు చెందిన ఓ మహిళకు ఆడశిశువును రూ. 5వేలకు విక్రయించింది. వ్యవహారం బయటకు పొక్కడంతో ఆ మహిళ శిశువును తిరిగి ఇచ్చేసింది.

11:01 - July 9, 2017

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి 'రాధిక కుమార స్వామి' రీ ఎంట్రీ ఇస్తున్నారు. పెళ్లయిన కుమారస్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో కుమారస్వామి నిర్మాతగా..డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన సమంయలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తరువాత వీరు వివాహం చేసుకున్నారు. ‘రాధిక' గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. రవిచంద్రన్ స్వతహాగా రాసిన కథను వెండితెరకు ఎక్కించేందుకు రాధిక కుమార స్వామి ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలను రాధిక నిర్వర్తించనున్నారు. ఈశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు రవిచంద్రన్ వెల్లడించాడు.

కాల్వలో పడిన చిన్నారులు..

విశాఖపట్టణం : నాతవరం మండలం నాయుడుపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఏలేరు కాల్వలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు తరుణ్ రమేష్, సతీష్ లుగా గుర్తించారు.

10:51 - July 9, 2017

'ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు’..అన్నాడో సినీ కవి. అవును మరి.. ఇప్పుడిలాగే ఉంది మార్కెట్ పరిస్థితి. సంచుల్లో డబ్బు, జేబుల్లో వంట సామాగ్రి తెచ్చుకునే దుస్థితి నేడు ...దాపురిస్తోంది. ఏం తినాలి ? ఎలా బతకాలి ? ఎలా ఉండాలి ? ఈ ప్రశ్నలు సామాన్యుడు..మధ్యతరగతి వర్గాల ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు.

చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్న ప్రజలకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక కిరాయి ఇళ్లలో నివాసం ఉంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. భోజనం తినడానికి కూడా భయపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువులు..మాంసాహారం..ఇలా ప్రతొక్క వస్తువు ధర పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది...

సెంచరీ కొట్టిన టమాట...
గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరల పైకి ఎగబాకుతున్నాయి. గత నెలల క్రితం రూ. 10 కిలోగా ఉన్న టమాట నేడు రూ. 100 దాటుతుండడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. టమాటానే కాకుండా ఇతర కూరగాయలు కూడా కిలోకు రూ. 30 నుండి రూ. 50 ధరలు పలుకుతున్నాయి. దీనితో కిలో కొనాలనకున్న వారు పావుకిలోతో సరిపుచ్చుకుంటున్నారు. ముగ్గురు..నలుగురు..ఆరుగురు..ఉన్న ఇంట్లో ఎలా సరిపెట్టాలా అని గృహిణీలు మదనపడుతున్నారు.

మాంసాహారం..
ధరలు పెరుగుతుండడంతో ఒక పూట పచ్చడి..ఏదైనా చారుతో సరిపెట్టుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి. మరుసటి రోజు ఏదైనా ఒక కూరగాయి..కొద్దిగా పప్పుతో కానిచ్చేస్తున్నారు. ఇక పేదవాడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పచ్చడి మెతుకులతోనే రోజు గడిపేస్తున్నారు. ఆదివారం..సెలవు రోజుల్లో మాంసాహారం తిందామని అనుకున్న వారి జేబులు గుల్లవుతున్నాయి. మటన్ కేజీ గతంలో రూ. 420 ఉంటే ప్రస్తుతం రూ. 460 ధర పలుకుతోంది. చికెన్ కూడా ఇదే దారి. స్కిన్ లెస్ చికెన్ గతంలో రూ. 200 ఉంటే ప్రస్తుతం రూ. 240గా ఉంది. కనీసం గుడ్డైనా తిందామని అనుకుంటే వాటి ధరలు కూడా అలాగే ఉన్నాయి.

వ్యాపారుల పరిస్థితి..
ధరలు పెరుగుతుండడంతో కూరగాయాలు కొనే వారి సంఖ్య తగ్గుతుండడంతో వ్యాపారుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. ధరలు పెరగడంతో కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదని, వచ్చినా తక్కువ కొంటుండడంతో నష్టాలను చవి చూడాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. వడ్డీలకు తెచ్చిన వ్యాపారుల పరిస్థితి చెప్పనవసరం లేదు.

రైతుల ఆందోళనలు..
తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదంటూ తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నల్గొండ జిల్లాలో దొండ రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కిలో దొండకాయ రూ. 1 పలకడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా రోడ్లపైనే దొండకాయలను పారపోసి తమ బాధను ప్రభుత్వానికి తెలియచేశారు.
పెరిగిన ధరల నుండి ఆదుకోవాలని ప్రజలు..తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు పాలకులను కోరుతున్నారు....

10:51 - July 9, 2017
10:49 - July 9, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను, 2500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మహంకాళి జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారని... మంత్రి తలసాని అన్నారు.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు.. విజయవాడ, ఢిల్లీలోనూ బోనాల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. 

 

10:38 - July 9, 2017
10:33 - July 9, 2017

అనంతపురం : జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి..ఉదయం నుంచి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి..తాడిపత్రిలోని సాయిబాబా దేవాలయంలో ఉదయం కాగడ హారతితో పూజలు ప్రారంభమయ్యాయి...బాబాను దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు..

 

10:31 - July 9, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను, 2500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మహంకాళి జాతరకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటున్నారని... మంత్రి తలసాని అన్నారు.. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు.. విజయవాడ, ఢిల్లీలోనూ బోనాల పండుగ నిర్వహిస్తున్నామని చెప్పారు. 

 

10:29 - July 9, 2017

ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కుమార్తెలలో ఒకరైన 'శృతి హాసన్' చలన చిత్ర రంగంలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకెళుతోంది. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఇదిలా ఉంటే 'బిగ్ బాస్' ద్వారా బుల్లితెరపై 'కమల్ హాసన్' కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మీడియా 'శృతి'ని పలు ప్రశ్నలు వేసింది. 'బిగ్ బాస్'గా 'కమల్' బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తారనే నమ్మకం ఉందని, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుందని పేర్కొంది.
బుల్లితెరపై కనిపిస్తారనే ప్రశ్నకు 'బుల్లితెరపై మెరుస్తానని..’బిగ్ బాస్' లాంటి షో ద్వారా వస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాను' అని తెలిపింది. వెండితెర కంటే 'బుల్లితెర' విస్తృతమైందని, సినిమా స్థాయిలోనే టీవీ రంగం కూడా ఎదిగిందన్నారు. బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్' ప్రస్తుతం తమిళ భాషలో టెలికాస్ట్ అవుతోంది. ఇందులో 'కమల్' నటించారు. ఈ షో అతి త్వరలోనే తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకొనేందుకు ముందుకొస్తోంది. ఈ షోతో 'ఎన్టీఆర్' బుల్లితెరపై మెరవనున్నారు.

30 మంది జాలర్లను నిర్భందించారు...

నెల్లూరు : కావలి రూరల్ (మం) చ ఇన మండెమ్మపురం వద్ద సుమద్రతీరంలో అక్రమంగా 30 మంది జాలర్లు వచ్చారు. తమిళనాడు, నిజాంపట్నంకు చెందిన ఈ జాలర్లను..ఐదు బోట్లను స్థానిక మత్స్యకారులు నిర్భందించారు.

'వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదు'..

విశాఖపట్టణం : ఏజెన్సీలో మంత్రి కామినేని పర్యటించారు. వ్యాధి తీవ్రతను కామినేని పరిశీలించారు. ఏజెన్సీలో గిరిజనులు వైద్యం కోసం రూ. వేల కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం దక్కడం లేదని, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ పర్టన చేస్తున్నట్లు, త్వరలో రాష్ట్రంలోని ఏడు ఏజెన్సీలలో పర్యటిస్తానన్నారు. చాపరాయి ఘటన దురదృష్టకరమన్నారు.

కరెంటు షాక్ తో రైతు మృతి..

మహబూబాబాద్ : బయ్యారం (మం) కాచనపల్లిలో విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందాడు. పొలం చుట్టూ ఉన్న కంచెపై విద్యుత్ తీగ పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

8 మంది రౌడీషీటర్లు..25 మంది అనుమానితులు..

హైదరాబాద్ : పహాడీ షరీఫ్ పీఎస్ దగ్గర పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఓ డీసీపీ, ఐదుగురు ఏసీపీలు, నలుగురు అడిషనల్ ఏసీపీలు, 15 మంది సీఐలు, 250 మంది కానిస్టేబుళ్లు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 మంది రౌడీషీటర్లు, 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 5 ఆటోలు, 27 బైక్ లు, 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

 

09:48 - July 9, 2017

ప్లీనరీ సమావేశాలు, పభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని వక్తలు అన్నారు. కానీ వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారని.. అది సబబు కాదని హితవు పలికారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, టీడీపీ నేత పట్టాభిరామ్, వైసీపీ నాయకురాలు పద్మజ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:37 - July 9, 2017

మహబూబాబాద్‌ : జిల్లాలోని నెల్లికుదురు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. ఉదయం కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్ధినులకు పురుగులతో కూడిన అన్నం వడ్డించడంతో వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వారిని మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరైన భోజన ప్రమాణాలు పాటించకపోవడంతోనే తరచూ తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్ధినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యార్ధులకు నాణ్యమైన  భోజనం అందించాలని కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:27 - July 9, 2017

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భంగపాటు కలిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు జేసీ యత్నించారు. ట్రూజెట్ విమానంలో ప్రయాణించేందుకు టిక్కెట్ కోసం జేసీ ప్రయత్నం చేశారు. ట్రూజెట్ ఎయిర్ లైన్స్ అధికారులు జేసీకి టికెట్ నిరాకరించారు. దీంతో దివాకర్ రెడ్డి వెనుతిరిగి వెళ్లిపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

గొర్రెల కొనుగోలులో గోల్ మాల్

పెద్దపల్లి : జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకం ఎన్ సీడీఎస్ పక్కదారి పట్టింది. గొర్రెల కొనుగోలులో గోల్ మాల్ జరిగింది. పాతలబ్ధిదారులకే గొర్రెలను పంపిణీ చేసినట్లు చూపి సిబ్సిడీని మాయం చేశారు. రూ.3 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఏసీబీకి లేఖ రాశారు.  

జేసీ దివాకర్ రెడ్డికి విమానం టిక్కెట్ నిరాకరణ

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి భంగపాటు కలిగింది. ట్రూజెట్ విమానంలో టిక్కెట్ కోసం జేసీ ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు జేసీ యత్నించారు. కానీ అధికారులు  ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో అక్కడి నుంచి జేసీ వెనుదిరిగారు.  

08:28 - July 9, 2017
08:26 - July 9, 2017
08:24 - July 9, 2017

ఢిల్లీ : ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా,వెస్టిండీస్‌ జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ వెస్టిండీస్‌....మాజీ చాంపియన్‌ భారత్‌తో సింగిల్‌ టీ20 మ్యాచ్‌కు సై అంటే  సై అంటోంది.కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని కరీబియన్‌ టీమ్‌కు విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు సవాల్‌ విసురుతోంది. టీమిండియాపై ట్వంటీ ట్వంటీల్లో ఎదురులేని కరీబియన్‌ టీమ్‌ హిస్టరీ రిపీట్‌ చేయాలని తహతహలాడుతుండగా...విరాట్‌ ఆర్మీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 
అసలు సిసలు సమరం
ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో ఎదురులేని కరీబియన్‌ టీమ్‌, తిరుగులేని టీమిండియా....అసలు సిసలు సమరానికి సన్నద్ధమయ్యాయి. ఓ వైపు రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌ వెస్టిండీస్‌... మరోవైపు  తొలి టీ20 చాంపియన్‌ ఇండియా...ఇరు జట్ల మధ్య ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నెగ్గి జోరు మీదున్న టీమిండియా....వెస్టిండీస్‌తో సింగిల్‌ టీ20 మ్యాచ్‌కు సై అంటోంది.
టీ20 ర్యాంకింగ్స్‌లో 4 స్థానంలో భారత్
విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో 4 స్థానంలో ఉండగా.... కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌ జట్టు 5వ స్థానంలో ఉంది. విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టులో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్‌, అజింక్య రహానే, దినేష్‌ కార్తీక్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీ, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ,ఉమేష్‌ యాదవ్‌, వంటి పేసర్లతో పాటు రవీందర్‌ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ,కుల్దీప్‌ యాదవ్‌ వంటి మ్యాజిక్‌ స్పిన్నర్లతో ఎప్పటిలానే పవర్‌ఫుల్‌గా ఉంది. 
భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగ్‌ 
బౌలింగ్‌లో ఎలా ఉన్నా...భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగ్‌ మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు.టాప్‌ ఆర్డర్‌లో ధావన్‌, విరాట్ కొహ్లీ,మిడిలార్డర్‌లో యువరాజ్‌ సింగ్‌,  ధోనీ..లోయర్ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య అదరగొడితే భారత జట్టుకు తిరుగుండదు.  
వెస్టిండీస్‌ అత్యంత ప్రమాదకరమైన జట్టు 
మరోవైపు కార్లోస్ బ్రాత్‌వైట్‌ సారధ్యంలోని వెస్టిండీస్‌ జట్టు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన జట్టు అనడంలో అనుమానమే లేదు. వన్డే జట్టులో లేని  క్రిస్‌ గేల్‌, కీరన్‌ పోలార్డ్‌, మార్లన్ శామ్యూల్స్‌, సునీల్‌ నరైన్‌,శామ్యూల్‌ బద్రీ వంటి మ్యాచ్‌ విన్నర్లు ...టీ 20 జట్టులో ఉన్నారు. భారత్‌తో పోల్చుకుంటే  అన్ని విభాగాల్లోనూ వెస్టిండీస్‌ జట్టు ధీటుగా ఉంది. క్రిస్‌ గేల్‌, కీరన్‌ పోలార్డ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, మార్లన్‌ శామ్యూల్స్‌ వంటి హార్డ్‌ హిట్టర్లు కలిగిన కరీబియన్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ..ఎంతటి విధ్వంసం సృష్టించగలదో అందరికీ తెలిసిందే. ఇక స్పిన్‌ మెజీషియన్స్‌  సునీల్‌ నరైన్‌,శామ్యూల్‌ బద్రీలతో బౌలింగ్‌ ఎటాక్‌ పదునుగా ఉంది. 
ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లో వెస్టిండీస్‌ పై చేయి 
ఇక  ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ ఇండియాపై వెస్టిండీస్‌దే పై చేయిగా ఉంది.ఇప్పటివరకూ ఇరు జట్లు 7 టీ 20 మ్యాచ్‌ల్లో పోటీపడగా....4మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ జట్టు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్‌ నెగ్గింది. 
2016...సెమీఫైనల్‌.. వెస్టిండీస్‌ విజయం 
2016 టీ20 వరల్డ్‌ కప్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌పై...సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌ సంచలన విజయం సాధించడం...భారత క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని ఓ పీడకల.టీ20 వరల్డ్‌ కప్‌ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది. జమైకాలోని సబీనా పార్క్‌ స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సింగిల్‌ టీ20 ఫైట్‌లో వెస్టిండీస్‌ జట్టు హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఈ మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుండా అని క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

బోనాల జాతరకు గట్టి భద్రత ఏర్పాటు : మంత్రి తలసాని

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం అయ్యాయి. బోనాల జాతర సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయవాడ, ఢిల్లీలో కూడా బోనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు

మహారాష్ట్ర : షిర్డీలో ఘనంగా గురుపౌర్ణమి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. సాయి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే సాయి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. 

07:48 - July 9, 2017

హైదరాబాద్ : డిలిమిటేష‌న్ ప్రక్రియ‌లో మ‌రో ముందుడుగు ప‌డిందా..? విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి వీలుగా కేంద్ర న్యాయ‌శాఖ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందా ? సీట్ల పెంపుపై హోంశాఖ‌కు న్యాయ‌శాఖ చేసిన సూచ‌న‌లేంటి. నియోజ‌క‌వ‌ర్గాల‌పెంపు ప్రక్రియ ఎలా సాగ‌బోతుది ? రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న  డీలిమిటేష‌న్‌పై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ. 
కొలిక్కి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు 
తెలుగు రాష్ట్రాలు ఎప్పటినుండో ఎదురుచూస్తొన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశం ఓ కొలిక్కి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. అటు ఏపీలోనూ,.ఇటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ స్ధానాల పెంపున‌కు కీల‌క అడుగుప‌డినట్లు తెలుస్తొంది. విభ‌జ‌న‌ చ‌ట్టంలొ పేర్కొన్న విధంగా సీట్లు పెంచాల్సిందేనంటూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చేసిన ప్రయత్నాలు ఫ‌లించినట్లు స‌మాచారం. అసెంబ్లీ సీట్ల పెంపున‌కు విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం సీట్లు పెంచుకోవడానికి కేంద్ర న్యాయ‌శాఖ ఆమోదం తెలిపిన‌ట్లు స‌మాచారం.ఇందుకు అస‌ర‌మైన రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా వూపినట్లు తెలిసింది. అసెంబ్లీ సీట్ల పెంపునకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 170 సెక్షన్‌ 3 కి చిన్న సవరణ చేస్తే సరిపోతుందని న్యాయశాఖ అభిప్రాయపడింది. ఆ ఆర్టికల్ కింద పొందుపరిచిన నిబంధనలు ఏపీ, తెలంగాణలకు వర్తించవని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ చేస్తే  సీట్ల పెంపున‌కు న్యాయ‌ప‌రంగా ఏ ఆటంకం ఉండ‌ద‌నీ కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.
సీట్ల పెంపు బాధ్యత కేంద్ర హోంశాఖదే 
అయితే సీట్ల పెంపు త‌దుప‌రి కార్యాచ‌ర‌న బాధ్యత కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌పై పడింది. రాజ్యాంగ సవరణకు మళ్లీ యాబైశాతం రాష్ట్రాలు ఆమోదం తెలపడం అనివార్యమా కాదా చూడాలి. ఈ సవరణవల్ల ఇతరత్రా ప్రభావాలేమైనా ఉంటాయా వంటి అంశాల‌పై కేంద్ర హోంశాఖ తదుపరి అభిప్రాయాలు తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాత కేబినెట్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత దీన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకుని పార్లమెంటుకు బిల్లు రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తొంది. ఈ మొత్తం ప్రక్రియ వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే పూర్తి కావాలని ఇటు టిడిపి, అటు టీఆర్‌ఎస్‌ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. దీంతో అంతే వేగంగా కేంద్ర ప్రభుత్వం చ‌ర్యలు తీసుకొనుంది.
ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న స్థానాలు 
ప్రస్తుతం..ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలుండ‌గా డిలిమిటేష‌న్ ఫ‌లితంగా మ‌రో 50 స్థానాలు పెరిగి మొత్తం 225 స్థానాల‌కు చేరుకోనున్నాయి. అంటే ఏపీలో ప్రతి జిల్లాకు 3 లేదా 4 నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగే అవ‌కాశ‌లున్నాయి. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం ఉన్న 119 స్ధానాలు 153కు చేరుకోనున్నాయి. దీంతో ఇప్పటికే  ఏపీ, తెలంగాణలో ప్రతిప‌క్షాల నుండి అధికార పార్టీల‌ల్లోకి భారీగా చేరికలు జరిగాయి. ఏపీలో వైసిపి నుండి 21 ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఫ‌లితంగా టిడిపిలో అప్పటి వ‌ర‌కు ఇన్‌చార్జ్‌లుగా కొన‌సాగుతున్న నేత‌లకు డిలిమిటేష‌న్‌లో సీట్ల స‌ర్దుబాటు చేస్తామ‌నీ చంద్రబాబు హ‌మీ ఇచ్చారు. కానీ కేంద్రం నుండి ఎటువంటి సంకేతాలు లేక‌పోవ‌డంతో నేత‌లు కొంత టెన్షన్‌ ప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే త‌మ ప‌రిస్దితి ఏంటని ఆందోళ‌న చెందారు. అయితే తాజాగా సీట్లు పెంపుద‌ల‌లో కేంద్రం ముందడుగు వేయడంతో  నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణలొనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. 
నేతల్లో సంతోషం 
మొత్తంమీద అసాధ్యం అనుకున్న నియెజ‌క‌వ‌ర్గాల పెంపు ప్రక్రియ ముందుకు సాగుతుండ‌టంతో ఏపీ, తెలంగాణలోని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి డిలిమిటేష‌న్ బిల్లును స‌భ ముందుకు తెచ్చి చ‌ట్టం చేసేందుకు బీజేపీ స‌ర్కార్ రెడి అవుతోంది.

నెల్లికుదురులో కస్తూర్బా బాలిక గురుకులు పాఠశాలలో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ : నెల్లికుదురులో కస్తూర్బా బాలిక గురుకులు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 
 

07:36 - July 9, 2017

విశాఖ : నంధ్యాల ఉప ఎన్నికలో భూమా బ్రహ్మయ్య రెడ్డి 30వేల మెజారిటీతో గెలుస్తారని మంత్రి భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంభంలో విభేదాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. గతంలో చనిపోయిన వారి విషయంలో ఎన్నికలకు పోకుండా ఏకగ్రీవం చేసిన వైసీపీ ఇప్పుడు భూమా నాగిరెడ్డి విషయంలో ఎందుకు పోటీ పెడుతుందో అర్ధం కావడం లేదన్నారు. 

07:31 - July 9, 2017

విశాఖ : నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. గాజువాక రాజీవ్‌నగర్‌లో భార్య, అత్తపై గణేష్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా..అత్త పరిస్థితి విషమంగా ఉంది. పరారీలో ఉన్న గణేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

 

07:28 - July 9, 2017

విశాఖ : ఉన్మాదం పడగవిప్పింది... ప్రేమించినందుకు కసిగా కాటేసి బదులు తీర్చుకుంది... ఫ్లోన్లో ఎవరితో మాట్లాడావంటూ గొంతును కోసేశాడో శాడిస్టు ప్రేమికుడు. విశాఖవన్‌టౌన్‌లో ఉన్మాదప్రేమికుడి చేతిలో బలయింది ఓ అభాగ్యురాలు. ప్రేమించానంటూ చెప్పుకుంటూనే రాక్షసుడిగా మారాడు. నాలుగు సంవత్సరాలుగా ప్రేమను పంచినందుకు కసిగా గొంతుకోశాడు. 
ప్రేమికురాలి గొంతు కోసేశాడు 
విశాఖ వన్‌టౌన్‌లోని పండావారి వీధిలో భవానీ, సతీష్‌ కుటుంబాలు ఒకే బిల్టింగ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పిల్లల ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ప్రేమికుడు సతీష్‌ భవానీపై అనుమానం పెంచుకున్నాడు. తను ఎవరితోనో ఫ్లోన్లో మాట్లాడుతూ తనను నిర్లక్ష్యం చేస్తోందని కసిపెంచుకున్నాడు. భవానితో గొడవపడ్డాడు. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాట్లాడదాం రమ్మని పిలిచాడు. ముందుగా సిద్దం చేసుకున్న అద్దంపెంకుతో ఒక్కసారిగా ప్రేమికురాలి గొంతుకోసేశాడు. కొద్దిసేపటికే అభాగ్యురాలు చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతరు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. 
ప్రేమోన్మాదిని చితకబాదిన ఇరుగుపొరుగు వారు 
అయితే తనపై దాడిచేస్తున్న సమయంలో భవాని ఒక్కసారిగా కేకలు పెట్టింది.  దీంతో అక్కడికి వచ్చిన భవానీ బంధువులు, ఇరుగుపొరుగువారు సతీష్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన సతీష్‌ను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనుమానంతోనే భవానిపై దాడిచేసి చంపేసినట్టు సతీష్‌ చెబుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమించానంటూ తిరిగిన సతీశ్.. తనలోని మృగంగా మారి.. అమాయకురాలని బలితీపుకున్నాడని విశాఖ పండావారి వీధిలో జనం తిట్టిపోస్తున్నారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసును నమోదుచేసి ..దర్యాప్తు చేస్తున్నారు. 

 

07:18 - July 9, 2017

గుంటూరు : వైసీపీ ప్లీనరీలో ఎమ్మెల్యే రోజా సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. పదునైన విమర్శలు, ఉత్సాహపరిచే ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మధ్యమధ్యలో సామెతలు వల్లిస్తూ... ప్రభుత్వాన్ని విమర్శిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపారు. రోజా.. ఏపీ పాలిటిక్స్‌లో ఓ ఫైర్‌ బ్రాండ్‌. పేరుకు తగ్గట్టుగానే వైసీపీ ప్లీనరీలో ఆమె తనదైనశైలిలో ప్రసంగించారు. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు.
రోజా పేరు చదవగానే ఒక్కసారిగా కార్యకర్తల కేకలు 
చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ అనే తీర్మానాన్ని ఆమె వైసీపీ ప్లీనరీలో ప్రవేశపెట్టారు. రోజా పేరు చదవగానే ప్లీనరీలో సభలో ఒక్కసారిగా కార్యకర్తల కేకలు మిన్నంటాయి. రోజా సభావేదికపైకి వస్తూనే జై వైఎస్సార్‌, జై జగన్‌ అని నినాదాలు చేస్తూ అందరినీ అలర్ట్‌ చేశారు. 
జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన రోజా 
ప్లీనరీ చూస్తోంటే 2 ఏళ్ల తర్వాత జరుగబోయే జగన్‌ ప్రమాణ స్వీకారం గుర్తొస్తుందంటూ అందరిలో ఉత్సాహం నింపారు. జగన్‌ను అసెంబ్లీ టైగర్‌, ఆంధ్రా ఫ్యూచర్‌ అంటూ ప్రశంసలతో ముంచెత్తడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. అంతేకాదు.. కష్టకాలంలో రాష్ట్రంలోని ప్రజానికానికి జగన్‌ అండగా ఉన్నారని... ఇక నుంచి జగన్‌కు మనంతా అండగా ఉందామా అంటూ ప్రతినిధులను ప్రశ్నించి ఆలోచింపజేశారు.
చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు 
ఇక చంద్రబాబు ప్రభుత్వంపై తనదైన శైలిలో రోజా విమర్శలు గుర్పించారు. సామెతలు వల్లిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వానికి వాటిని అన్వయింపచేస్తూ ఆమె ప్రసంగం కొనసాగించారు.  మహిళల సమస్యలు వివరిస్తూనే... ఏపీలో దుర్యోధన, దుశ్శాసన దుర్మార్గపు పాలన సాగుతుందని.. ధ్వజమెత్తారు.
మద్యం పాలసీపైనా పదునైన విమర్శలు
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపైనా రోజా పదునైన విమర్శలు చేశారు. గ్రామగ్రామాన మంచినీరు లేకున్నా మద్యాన్ని చంద్రబాబు పారిస్తున్నారని విమర్శించారు. చీఫ్‌ మినిస్టర్‌ ఛీప్‌ లిక్కర్‌కు ప్రమోటర్‌గా మారారని, బార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని రోజా చేసిన కామెంట్లకు క్యాడర్‌ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక బాహుబలి సినిమాను సైతం ప్రభుత్వంపై విమర్శలకు మలుచుకున్నారు రోజా. భల్లాల దేవుడిలాంటి చంద్రబాబును మహేంద్ర బాహుబలిలాంటి జగన్‌ ఓడిస్తారని.. 2019లో పట్టాభిషిక్తుడవ్వడం ఖాయమంటూ అందరిలో ఉత్సాహం నింపారు. ఇక చివరిలో జగన్‌ను సీఎం చేయడానికి మేమంతా సిద్ధం. మీరంతా సిద్ధమేనా అంటూ ప్రతినిధులను ప్రశ్నించారు. దీనికి వారి నుంచి సిద్ధమంటూ సమాధానం రావడంతో సభలో కరతాళ ధ్వనులు మార్మోగాయి.

 

 

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి : మంత్రి తలసాని

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

07:04 - July 9, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రెండు గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో భద్రత కోసం 130 సీసీ కెమేరాలను, 2500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

 

తిరుమలలో కొనసాగుతోన్న భక్తులు రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతోంది. 49 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 91, 826 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 

 

 

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలిబోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. 

 

Don't Miss