Activities calendar

10 July 2017

21:55 - July 10, 2017

ఢిల్లీ : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మీసా భారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలోని మీసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్‌ చేసే ఆలోచనలో ఉంది. రెండు రోజుల క్రితం మనీ లాండరింగ్‌ కేసులో మీసా నివాసంతో పాటు ఫామ్‌హౌస్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. మీసా భర్త శైలేష్‌ను ఈడీ ప్రశ్నించింది. అక్రమ ఆస్తుల కేసులో మీసా, ఆమె భర్త శైలేష్‌ గతనెల ఐటి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారని మీసా ఆమె భర్తపై ఆరోపణలున్నాయి. 

21:54 - July 10, 2017

లాస : టిబెట్‌లో భారీ వ‌ర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద‌ల‌కు ఓ ఐదంతస్థుల భ‌వనం నీళ్లలో కుప్పకూలి పోయింది. అప్పటికే ఆ బిల్డింగ్‌లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. చూస్తుండగా.. బిల్డింగ్‌ కూలిపోయింది. అలాగే ఓ ట్రక్ కూడా నీళ్లలో కొట్టకుపోయింది.

 

21:50 - July 10, 2017

చిలి : పెరూలో అధికవేగంతో వెళ్తున్న డబుల్‌ డెక్కర్‌ టూరిస్ట్‌బస్సు అదుపుతప్పి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించగా.. మరో 25 మంది గాయపడ్డారు. లిమాలోని అధ్యక్షభవనానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నగర అందాలను శాన్‌ క్రిస్టోబల్ కొండపై నుంచి చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. 

21:48 - July 10, 2017

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో విధ్వంసానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులు పన్నిన కుట్రను మన భద్రతా దళాలు భగ్నం చేశాయి. నౌగామ్ సెక్టార్‌లోకి చొరబడ్డ ముష్కరులు పహారా కాస్తున్న మన జవాన్లపై కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకారం మన జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగామ్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

21:47 - July 10, 2017

పాట్నా : ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మీసా భారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఢిల్లీలోని మీసా ఫాంహౌస్‌ను ఈడీ అటాచ్‌ చేసే ఆలోచనలో ఉంది. రెండు రోజుల క్రితం మనీ లాండరింగ్‌ కేసులో మీసా నివాసంతో పాటు ఫామ్‌హౌస్‌లో ఈడీ సోదాలు నిర్వహించింది. మీసా భర్త శైలేష్‌ను ఈడీ ప్రశ్నించింది. అక్రమ ఆస్తుల కేసులో మీసా, ఆమె భర్త శైలేష్‌ గతనెల ఐటి అధికారుల ముందు హాజరైన విషయం తెలిసిందే. అతి తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టారని మీసా ఆమె భర్తపై ఆరోపణలున్నాయి. 

21:46 - July 10, 2017

బీజింగ్ : జర్మనీలో జరిగిన జి-20 సదస్సు సందర్భంగా ప్రధాని మోది, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదని చైనా అధికార ప్రతినిది గెంగ్‌ షువాంగ్‌ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో భాగంగా బ్రిక్స్‌ దేశాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ప్రధాని మోది కలుసుకున్నారు. ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. వీరి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు భారత్‌ కూడా చెప్పలేదు. ఇరు దేశాల నేతలు కరచాలనం చేసిన ఫొటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే గత శుక్రవారం పోస్ట్‌ చేశారు. డోక్‌లామ్‌లో భారత బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని గెంగ్‌ షువాంగ్‌ పేర్కొన్నారు.

21:45 - July 10, 2017

నాగపూర్ : మహారాష్ట్రలోని నాగపూర్‌లో విషాదం నెలకొంది. కలమేశ్వర్‌ ప్రాంతంలోని వీనా డ్యామ్‌కు విహారయాత్రకు వచ్చిన కొంతమంది యువకులు పడవ మునిగి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఏడుగురు గల్లంతయ్యారు. 11మంది యువకులు విహారయాత్ర కోసం ఆదివారం వీనా డ్యామ్‌కు వచ్చారు. సాయంత్రం సమయంలో బోట్‌ రైడింగ్‌ చేస్తుండగా... పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని కాపాడారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు నిర్దారించారు. గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు కూడా గాలింపు చేపట్టాయి. అయితే పడవ ఎలా మునిగిపోయిందో ఇంకా స్పష్టతరాలేదని అధికారులు చెప్తున్నారు. 

21:44 - July 10, 2017

చెన్నై : తమిళనాడు తీరంలోని బంగాళాఖాతంలో మ‌లబార్ నౌకాద‌ళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. భార‌త్‌, జ‌పాన్‌, అమెరికా దేశాల‌కు చెందిన యుద్ధ నౌక‌లు ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. మలబార్-2017 పేరుతో జులై 10 నుంచి 17 వరకు మూడు దేశాల సంయుక్త నౌకా దళ విన్యాసాలు కొనసాగనున్నాయి. మూడు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన సైనిక సంబంధాలే ల‌క్ష్యంగా ఈ విన్యాసాల‌ను ఏర్పాటు చేశారు. భారత్, అమెరికా, జపాన్‌కు చెందిన 16 యుద్ధ నౌకలు, 95 ఎయిర్‌ క్రాఫ్ట్స్‌, రెండు సబ్‌ మెరైన్లు ఇందులో పాల్గోనున్నాయి. భార‌త్‌కు చెందిన జెల్సావా, 45 వేల ట‌న్నుల బ‌రువున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యలు కూడా విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. 1992 నుంచి వరుసగా అమెరికా, భారత్‌లు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో నౌకాదళ విన్యాసాలు జరగడం గమనార్హం.

21:42 - July 10, 2017

కాశ్మీర్ : అనంతనాగ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రికుల పై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు యాత్రికులు మృతి చెందారు, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 

21:42 - July 10, 2017

హైదరాబాద్ : ఇంజినీరింగ్ స్టూడెంట్ గణేశ్ మిస్సింగ్ కేసులో అనుమానాలు తలెత్తుతున్నాయి...మూడు రోజులుగా జాడలేని గణేష్‌ చాటింగ్‌ చేస్తున్నాడు కాని......అసలు ఎక్కడున్నాడు..? ఏ పరిస్థితులో ఉన్నాడు...? ఎవరి చెరలో ఉన్నాడు..? ఏమయింది..? ఇలా ఎన్నో అనుమానాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గణేశ్ ఫేస్‌బుక్ మెసేజ్‌ల ఆధారంగా... లొకేషన్ ట్రేస్‌ చేయాలని రాచకొండ సైబర్ క్రైమ్‌ విభాగాన్ని ఆదేశించారు. అయితే ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేస్తున్న వ్యక్తి గణేశ్ అవునా కాదా అన్నది కూడా అనుమానాలే..దీంతోనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ సాంకేతికంగా సహకారం తీసుకుంటున్నారు...

తల్లిదండ్రుల అనుమానాలు
ఇదిలా ఉంటే ఇంజనీరింగ్ స్టూడెంట్‌ గణేష్‌ మిస్సింగ్‌పై యువకుడి తల్లిదండ్రులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. తమ కొడుకు ఆచూకీ ఏంటని ప్రశ్నిస్తున్నారు...అసలు గణేష్‌ ఏమయ్యాడంటూ వారు సంధిస్తున్న ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు..అదే సమయంలో గణేష్‌ గురించి పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు...యాదాద్రి జిల్లా పులిగళ్ల గ్రామానికి చెందిన 19 ఏళ్ల గణేష్‌, ఘట్‌కేసర్‌ అవుషాపూర్‌లోని వీబీఐటీ యంత్ర కాలేజీలో బీటెక్‌ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు...అదే కాలేజీలో తనతో చదువుతున్న అమ్మాయితో పరిచయం

ఇద్దరూ కలిసి భద్రాచలం
గణేష్‌,అమ్మాయి ఇద్దరూ కలిసి భద్రాచలం వెళ్లారు...తండ్రి అంగమయ్య ఫోన్ చేస్తే భువనగిరిలో ఉన్నానని...వస్తానని చెప్పిన గణేష్‌ ఫోన్ ఆ తర్వాత స్విచ్చాఫ్ అయింది...ఇక మర్నాడు ఉదయం అతనితో వెళ్లిన అమ్మాయి కాలేజీకి రావడం..గణేష్‌ ఆచూకీ లేకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి...అయితే భద్రాచలం వెళ్లినట్లు అమ్మాయి చెబితేనే తెలియడంతో కలవరం మొదలయింది...దీంతో గణేష్‌ కుటుంబీకులు పోలీసులకు అనుమానాలతో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు...

21:40 - July 10, 2017

గుంటూరు : అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అంశాలను విమర్శన ధోరణిలో కాకుండా.. సామరస్యంగా సాధించుకోవాలని ఎంపీలకు సూచించారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించినా..నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యంపై చర్చించాలన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాలని, ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన, రాబోయే నిధులపై సవివరంగా పార్లమెంట్‌లో చర్చించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఈ సమావేశాల్లోనే స్పష్టత రావడానికి కృషి చేయాలని.. రైల్వే మంత్రి సురేష్ ప్రభును మరోసారి కలిసి విజ్ఞప్తి చేయాలని చంద్రబాబు సూచించారు. నియోజక వర్గాల పెంపు అంశంపై గట్టిగా కృషి చేయాలని చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా నియోజక వర్గాల పెంపు ద్వారా రాబోయే ఎన్నికల్లో వచ్చే సానుకూల అంశాలను ఎంపీలు చంద్రబాబుకు వివరించారు. వీటితో పాటు రాష్ట్ర విభజన తర్వాత 9, 10 షెడ్యూల్ ఆస్తులపై చర్చించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రావాల్సిన నిధులు, అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తామన్న 1000 కోట్లు వెంటనే వచ్చేందుకు కృషిచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రాష్ట్రం ఖర్చు చేసిన 3700 కోట్లకు క్లియరెన్స్ రాలేదని... ఈ విషయం పై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటకు సంబంధించిన పనులు వేగవంతం చేసేందుకు ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు.

20:57 - July 10, 2017

మనం శాస్త్రసంకేతిక రంగంలో పరుగులు తీస్తున్నాము..మనం డిజిటల్ అభివృద్ధిలో విమానం కంటే వేగంగా వెళ్తున్నాము..ఇవి ప్రొద్దున్న లేస్తే మనం వినే మాటలే..కానీ ఈ సమాజంలో కూడా మూఢనమ్మకాలను మోస్తున్నాము..మూఢత్వం కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మనం సాధించామని చెబుతున్న అభివృద్ధిని వెక్కిరిస్తున్న మూఢనమ్మకాల పై ఈరోజు వైడ్ యాంగిల్.

కుషాయిగూడలో ఎర్రచందనం చెట్ల నరికివేత

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ ఎన్ఎఫ్ సీలో ఎర్రచందనం చెట్ల నరుకుతుండగా సీఐఎస్ఎఫ్ కమాండోలను చూసి ఎర్రచందనం దొంగలు పారిపోయారు. 

20:21 - July 10, 2017

అమ్మో కోదండరాం సారు ఏమో అనుకున్నంగని.. పెద్ద జంగే తయ్యారు జేస్తున్నడుగదా సిరిసిల్ల దిక్కు.. మొన్నటిదాక సిద్దిపేట్ల హరీష్ రావుకు నీళ్లు దాపిచ్చినంత పనిజేశిండు.. ఇప్పుడు సిరిసిల్ల మీద సమర జెండా లేవట్టిండు.. ఏ ఊర్లె ఆగినా జనమే జనమొచ్చి సమస్యలు జెప్పుకుంటుండే వర్కళ్ల.. జేఏసోళ్లకు ఇంక జర్రంత ఊపొస్తున్నట్టుంది.. జోర్దార్గ జేశిండ్రు అమరుల స్పూర్తి యాత్ర..

 

20:20 - July 10, 2017

ఇగ రేపు రేపు జనం జేయవల్సిన పని ఏం లేదు.. ఖాళి ఐదేండ్ల కొకపారి మాకు ఓట్లేయుండ్రి.. తిని ఇండ్లళ్ల నిమ్మలంగ నిద్రవోండ్రి.. బువ్వ మేమే వెడ్తం..అమ్మో కోదండరాం సారు ఏమో అనుకున్నంగని.. పెద్ద జంగే తయ్యారు జేస్తున్నడుగదా సిరిసిల్ల దిక్కు..ఈ తెలంగాణ ఆంధ్ర, పోనీ ఈ ప్రపంచంల ఎవ్వడైనా సరే మంత్రగాడు అనెటోడు ఉంటే.. వానికి మంత్రాలొస్తె.. నా మీద ప్రయోగించుండ్రి..జామాబాద్ జిల్లాల గొర్లు జోరుగ వంచుతున్నట్టున్నరుగదా..? అందరికి ముడ్తున్నయా.?? గోర్లు.. ఇగ మరి సర్కారు ఇచ్చిందిగదా..?మీరు బాగ గమనించుండ్రి.. భూముల పంచాదిల ఎప్పుడు పేదోళ్లె ఇర్కుతాఉంటరు.. అంతెందుకు మన తెలంగాణ ఆంధ్ర దీస్కుందాం..తప్పు జేశినోళ్లంత చట్టం ముంగట సమానమే.?.. చట్టం తనపనితాను జేస్కుంటవోతనే ఉంటది..జనంతోని వచ్చిందే ఈ సావు.. ఓట్లు లీడర్లకేస్తరు.. కోరికలు దేవుండ్లను గోరుకుంటరు.. పనులు గాకుంటే దేవున్ని తిడ్తరు.. లీడరు రాంగనే చేతులెత్తి మొక్కుతరు.. ఇంక నయ్యం ముడ్డి గడ్గిచ్చుకోకపొయ్యిండో..? పాడుగాను.. ముఖ్యమంత్రి అనంగనే అదేదో బ్రహ్మదేవుని ఇంట్లకెళ్లి ఊశిపడ్డట్టు ఫీలైతుంటరు కొందమంది..

 

20:19 - July 10, 2017

సినిమా : విమర్శలకు ఆమె నటనే సమాధానం..కెరియర్‌ అయిపోయిందన్న వాళ్ల నోళ్లకు తాళాలు వేసింది ఆమె అభినయం. మామ్‌ సినిమాతో శ్రీదేవి తాను అంత వీజీ నటిని కాదని నిరూపించింది. అందమే కాదు అంతకు మించిన నటనా తన సొంతమని మరోసారి ప్రూవ్‌ చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:18 - July 10, 2017

విశాఖ : టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో అన్ని వర్గాల ప్రజల జేబుకు చిల్లు పడుతోంది. విశాఖలో కిలో టమాటా 70 నుంచి వంద రూపాయలు పలుకుతుంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

20:17 - July 10, 2017

విజయవాడ : టమోట ధరలు కొండెక్కడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. రైతు బజార్లలోనే కిలో టమాట ధర 54 రూపాయలకు చేరుకోవడంతో సామాన్యులు టమాట వైపు చూసే పరిస్థితి కనిపించడంలేదు. ఇక బయటి మార్కెట్లలో అయితే ఏకంగా కిలో 60 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. దీంతో నిన్నా మొన్నటి వరకు రెండు, మూడు కిలోలు కొనుక్కెళ్లే వినియోగదారులు..ఇప్పుడు పెరిగిన ధరలతో పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:16 - July 10, 2017

హైదరాబాద్ : కరీంనగర్ పట్టణంలో ఈనెల 12న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి జోగు రామన్న చెప్పారు. మూడో విడత హరితహారంలో పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తామని ఆయన అన్నారు. ఈసారి హరిత రక్షణ కమిటీలు ఏర్పాటుచేశామని.... ప్రతీ 500 మొక్కలకు ఒక హరిత సైనికుడు ఉంటాడని మంత్రి జోగు రామన్న అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:14 - July 10, 2017

హైదరాబాద్ : అహరితహారంలో భాగంగా జీహెచ్ఎంసీ ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌లో మంత్రి కేటీఆర్‌ మొక్కలు నాటారు. సర్వే ఆఫ్‌ ఇండియా ఆడిటోరియంలో రైతులకు, భూమి కోల్పోయిన వారికి పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు ఒక్క ఎకరానికి వెయ్యి గజాలు చొప్పున రిజిస్ట్రేషన్‌ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మహేంద్రరెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు.

20:13 - July 10, 2017

మహబూబ్ నగర్ : పోలీసు శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తే ఆఫీసర్లు కొట్టేస్తారని.. అందుకే పోలీసు వాహనాలపై స్టేషన్‌ పేర్లతో స్టిక్కర్లు అతికించి పంపించామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో నాయిని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

19:57 - July 10, 2017

జనాల్లోని అవగాహన రాహిత్యం.. అజ్ఞానం.. కరీంనగర్‌ జిల్లాలోని ఐదు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. కూలీ పని చేసుకుని బతికే వారిపై మంత్రగాళ్లంటూ అయినవాళ్లే దాడులు చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హుజూరాబాద్‌ మండలంలోని కందుగులలో కొమురయ్య కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గంగిరెద్దుల కాలనీలో నివాసముంటోన్న ఘంటా కొమురయ్య దంపతులు, ముగ్గురు చిన్నారులను చంపి.. తమ ప్రాణాలు తీసుకున్నారు. ఘంటా కొమురయ్య, కొమురమ్మ దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఎల్లమ్మ, కొమరమ్మ, అంజమ్మ అనే ముగ్గురు కుమార్తెలున్నారు. కొమురయ్య మంత్రాలు, చేతబడులు చేస్తున్నాడనే నెపంతో భార్య పుట్టింటి వారు అతడి కుటుంబాన్ని హుస్నాబాద్‌కు పిలిపించి దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కొమరయ్య దంపతులు ఆదివారం రాత్రి.. పిల్లలకు ఉరి వేసి హతమార్చి, అనంతరం తామూ ప్రాణాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఐదుగురి ఆత్మహత్య...
ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి కారుకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మంత్రాలపై అంధ విశ్వాసాలు దూరమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. సమాజంలో ఇంకా పాతుకుపోయిన మూఢ నమ్మకాలు.. అయిదు నిండు ప్రాణాలను బలిగొన్న ఘటనను.. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా, అంధ విశ్వాసాలను పారదోలేలా ప్రజలను చైతన్య పరచాల్సిన అవసరమూ ఉంది. 

19:33 - July 10, 2017

సూర్యాపేట : జిల్లా మద్దిరాల మండలంలో అంగన్ వాడీ సెంటర్ పై పెచ్చులుడి బాలుడి పై పడ్డాయి. దీంతోమ బాలుడికి తీవ్ర గాయమైంది. దీంతో బాలుడి కాలువిరగడంతో బాలున్ని ఆసుపత్రికి తరలించారు. అంగన్ వాడీ సెంటర్ మోన్ననే నిర్మించింది కావడంతో నిర్మాణంలోమ నాణ్యత లేదని ప్రజలు అంటున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

19:32 - July 10, 2017

ఢిల్లీ : జూలై 6వ తేదీన కిడ్నాప్ గురైన మహబూబు నగర్ కు చెందిన శ్రీకాంత్ గౌడ్ ఆచూకీ పోలీసులు ఇంక కనిపెట్టలేకపోయారు. ఓలా యాజమాన్యం పేరుతో కిడ్నాపర్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. సింగ్ నకిలీ ధృవపత్రాలతో ఓలా డ్రైవర్ గా చేరాడు. కిడ్నాపర్ సింగ్ మరో డ్రైవర్ ఐడీతో ఓలాలో ఉద్యోగం పొందాడు. అతనుమ జూలై 4వ తేదీన ఓలా క్యాబ్ డ్రైవర్ గు అపాయింట్ అయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:31 - July 10, 2017

హైదరాబాద్ : గణేష్ మిస్సింగ్ పై విచారణ కొనసాగుతోంది. విచారన బాధ్యతలు రాచకొండ సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. పోలీసులు ఫేస్ బుక్ మెసేజ్ ల ఆధారంగా ఆరా తీస్తున్నారు. పోలీసులు చాటింగ్ చేస్తున్ వ్యక్తి గణేష్ అవునా కాదా అన్నది తేలలేదంటున్నారు. పోలీసులు గణేష్ గురించి ఇంతవరకు ఎలాంటి అధాకారిక ప్రకటన చేయాలేదు. గణేష్ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయి పేరెంట్స్ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:09 - July 10, 2017

నెల్లూరు : కువైట్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడు నానా కష్టాలు పడుతున్నాడు. 5 రోజుల నుంచి ఆ యువకుడిని తను పనిచేసే యజమాని ఓ రూమ్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. తినడానికి తిండిగానీ.. తాగడానికి మంచినీరు కూడా ఇవ్వడం లేదు. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి 2011లో కువైట్‌కు వెళ్లాడు. అక్కడ రుమితియా అనే షేట్‌ వద్ద కారుడ్రైవర్‌గా చేరాడు. 2016లో అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వచ్చేశాడు. అయితే మళ్లీ రావాలంటూ అక్కడి నుంచి యజమాని ఫోన్‌ చేశాడు. రెండు లక్షల రూపాయలు ఇస్తానని.. దాంతో పాటు జీతం కూడా పెంచుతానని హామీ ఇవ్వడంతో రవి భార్యను..తల్లి, దండ్రులను వదిలి కువైట్‌ వెళ్లాడు. ఇటీవలే రవి భార్య డెలివరీ అయ్యింది. కువైట్‌లో రవి చిత్రహింసలకు గురవుతున్న వార్తలు తెలిసినప్పటి నుంచి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కువైట్‌ నుంచి రవి పంపించిన వాట్సప్‌ వీడియోలను జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు చూపించారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు సైతం విషయం తెలిపారు. ఎలాగైనా కువైట్‌లో నిర్బంధంలో ఉన్న రవిని విడిపించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

19:08 - July 10, 2017
19:07 - July 10, 2017

తూర్పు గోదావరి : జిల్లా కాకినాడలో ఏపీ రైతు సంఘం 21వ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాసభకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాసభలో పాల్గొనేందకు ఏఐకేఎస్‌ నేతలు హన్నన్‌ మొల్ల, విజుకృష్ణన్‌,రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, కేశరావు, పెద్దిరెడ్డిలు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:06 - July 10, 2017

అనంతపురం : ముఖ్యమంత్రి అవుతానని జగన్ పగటి కలలు కంటున్నారని ఏపీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. ఒకవేళ పొరపాటున సీఎం అయినా రాష్ట్రాన్ని అమ్మేస్తారని విమర్శించారు. అనంతపురం జిల్లా పరిగిలో ఇండియన్‌ డిజైన్‌ గార్మెంట్‌ ఫ్యాక్టరీని మంత్రి సునీత ప్రారంభించిన సందర్భంగా.. వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్లీనరీ కేవలం చంద్రబాబు, లోకేష్‌లను తిట్టేందుకు పెట్టుకున్నట్లుందని మండిపడ్డారు. పేద ప్రజల కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న సంక్షేమ పథకాలు జగన్‌కు కనబడటం లేదా అని ప్రశ్నించారు. 

19:03 - July 10, 2017

గుంటూరు : ప్రజల మీద నమ్మకం లేకనే జగన్‌ కన్సల్టెంట్స్‌ను పెట్టుకున్నారని ఏపీ ఆర్థికమంత్రి యనమల విమర్శించారు. అధికారంలోకి రాలేననే భయంతోనే జగన్‌ ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారని.. ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టింది ఎన్టీఆర్‌ అని...ఈ పథకాన్ని విమర్శించే హక్కు జగన్‌కు లేదన్నారు. 

19:00 - July 10, 2017

గుంటూరు : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు. ఉన్నది లేనట్టు రాస్తూ తన లాంటి వాళ్లను రోడ్‌ మీదకి లాగుతున్నారని అన్నారు. మా జీవితాలపై మీరు బతుకుతున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్‌ ఘటనపై వివరణ ఇవ్వమనగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. 

18:58 - July 10, 2017

వరంగల్ : ఇది వరంగల్ ట్రై సిటీలోని కాజీపేట లో వున్న బాలుర పాఠశాల. ఈ పురతన భవనానికి సుమారు 60 యేళ్ల చరిత్ర వుంది. తెలంగాణరాష్ట్ర ఉద్యమ సిద్దాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్ ఈ బడిలో పిల్లలకు పాఠాలు బోధించారు. అంతటి ఘనత కలిగిన ఈ విద్యాసౌధం ఇపుడు వెలవెలబోతోంది. వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ బడిలో ఇప్పుడు కేవాలం 67 మంది విద్యార్థులు మాత్రమే వున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా పట్టుమని పది మంది కూడ ఈ పాఠశాలలో చేరలేదు.ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడింయ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హడావిడి చేస్తున్నా.. తమ పాఠశాలలో మాత్రం తెలుగులోనే బోధన జరగడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల పాఠశాల్లో ఉన్నట్టే తమ బడిపైకూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

బడిబాట కార్యక్రమం
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించడానికి బడిబాట కార్యక్రమం చేపట్టినా అది కొన్ని చోట్ల మాత్రమే సక్సెస్‌ అవుతోందని జిల్లా విద్యాధికారి అంటున్నారు. వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో 25కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు చదువులంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చస్తున్నారు. నాణ్యతలేని చదువులు, అంతకంటే కునారిల్లుతున్న పాఠశాల భవనాలు.. పిల్లల్ని ఎందుకు పంపించాలి ప్రభుత్వ పాఠశాలకు అని తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నారు.  

18:57 - July 10, 2017

హైదరాబాద్ : సరూర్‌నగర్‌లో లేక్‌ పెట్రోలింగ్‌ పోలీసులు..ఓ వ్యక్తిని మృత్యువు నుంచి తప్పించారు. సరూర్‌నగర్‌ చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మునిగిపోతున్న వ్యక్తిని గమనించిన లేక్‌ పెట్రోలింగ్‌ పోలీసులు... అతన్ని కాపాడారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పాటు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. దీంతో లేక్‌ పెట్రోలింగ్ పోలీసులను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు.  

18:55 - July 10, 2017

హైదరాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ టీ టీడీపీ నేతలు చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నకిలీ విత్తనాలను అరికట్టాలని, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలంటూ టీడీపీ నేతలు అగ్రికల్చర్‌ కమిషనర్‌ కార్యాలయానికి ర్యాలీగా వచ్చారు. అనంతరం ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం టీ టీడీపీ నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేసి వాహనాల్లో తరలించారు. రైతు సమస్యలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గాలికొదులుతోందని టీ టీడీపీనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. నకిలీ విత్తన తయారీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

18:54 - July 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టమాట ధరలు మోత మోగిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో టమాట ధరలు సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం నగరంలో కిలో టమాట ధర 80 నుంచి 90 రూపాయలు పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో కిలో వంద రూపాయలు మార్క్ దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాలు వీడియో క్లిక్ చేయండి.

18:53 - July 10, 2017

హైదరాబాద్ :  ఇంజనీరింగ్‌ విద్యార్థి మిస్సింగ్‌ మిస్టరీ కొనసాగుతోంది. వీబీఐటీ కాలేజీలో చదువుతున్న గణేశ్ మూడురోజులక్రితం ఓ అమ్మాయితోకలిసి భద్రాచలం వెళ్లాడు. అక్కడినుంచి అమ్మాయిమాత్రం తిరిగివచ్చింది.. గణేశ్ కనిపించకుండాపోయాడు.. తమ బిడ్డ అదృశ్యమయ్యాడంటూ గణేశ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనను గాళ్ ఫ్రెండ్‌ మోసం చేసిందంటూ గణేశ్ తన స్నేహితులకు వాట్సప్‌ మెసేజ్‌లు పంపించాడు. సెల్‌ఫోన్‌ మెసేజ్‌ల ఆధారంగా గణేష్‌ను ట్రేస్‌ చేస్తున్నారు పోలీసులు.

 

18:52 - July 10, 2017

సినిమా : తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు 'ఏంజెల్‌' సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఫలణి దర్శకత్వం వహించిన ఈ సినిమా... ఈ నెల 21న విడుదల కానుంది. భువన్‌ సాగర్‌ నిర్మించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్‌, నాగ్‌ అన్వేష్‌ ప్రధాన పాత్రలు పోషించగా.. కబీర్‌ సింగ్‌ పత్రినాయకుడిగా కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రదీప్‌రావత్‌, సన, సప్తగిరి, ప్రభాస్‌ శ్రీను నటించారు. ఇది ఓ సోషియో ఫాంటసీ చిత్రమని... ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుందని దర్శక, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

18:51 - July 10, 2017

 

పశ్చిమ గోదావరి : జిల్లా కామవరపుకోటలో మహిళలు కదం తొక్కారు. జనవాసాల మధ్య మద్యం షాపులు తొలగించాలంటూ చెప్పులు, చీపుర్లతో నిరసన తెలిపారు. చెక్‌పోస్ట్‌ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుపై దాడి చేసి మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఫర్నీచర్‌ ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైన్‌షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.

18:50 - July 10, 2017

 

తూర్పు గోదావరి : పట్టిసీమ ముమ్మాటికి ముడుపుల కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. ఈ వ్యవహారంపై టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నాననీ ఉండవల్లి స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వం రూపాయికి వంద రూపాయలు ఖర్చుచేసిందని ఆరోపించారు.

 

18:49 - July 10, 2017

 

కరీంనగర్ : అవమానం భరించలేక కరీంనగర్‌ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఐదుగురి మృతదేహాలను హుజురాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వారి మృతదేహాలను మంత్రి ఈటెల రాజేందర్‌ సందర్శించి.. సంతాపం ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:48 - July 10, 2017

అనంతపురం : జిల్లా... తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు యోగానంద చౌదరి, ఆయన సోదరుడు జలందర్‌చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు మరో 1500 మంది మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ పాలన నచ్చి...వీరంతా పార్టీలో చేరడం ఆనందంగా ఉందని మంత్రి మాణిక్యాల రావు అన్నారు. 

18:47 - July 10, 2017

హైదరాబాద్ : చంద్రబాబు మూడేళ్ల పాలనను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆనాటి వైఎస్‌ పాలన మళ్లీ రావాలనే ఉద్దేశ్యంతోనే నిన్నటి ప్లీనరీలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని వివరించామన్నారు బొత్స. వైసీపీ మేనిఫెస్టోని చూసి టీడీపీ భయపడుతోందని బొత్స ఎద్దేవా చేశారు. 

18:46 - July 10, 2017

విశాఖ : శాఖ నగరంలో ప్రియురాలిని హత్యచేసిన కిరాతకుడు సతీష్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఐద్వా ఆధ్వర్యంలో పాండవీధి నుంచి జిల్లా కోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించి సతీష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏ ఒక్క లాయర్ కూడా ఈ కేసును వాదించకూడదని వారు డిమాండ్ చేశారు. నిర్భయ నిధి నుంచి 20 లక్షల రూపాయల నష్టపరిహారం భవానీ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

లాలూ కుమార్తె మీసాభారతికి ఈడీ సమన్లు

పాట్నా: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసారభారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

లాలూ కుమార్తె మీసాభారతికి ఈడీ సమన్లు

పాట్నా: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసారభారతికి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

అరకు లోయలో యువతికి ఆంత్రాక్స్ లక్షణాలు..

విశాఖ: అరకు లోయ మండలం దొండపాడులో సన్నమ్మ అనే యువతికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ యువతిని విశాఖ జీజీహెచ్ కు తరలించారు.

మద్యం షాపు వద్దంటూ చెప్పులు, చూపుర్లతో నిరసన

ప.గో: కామవరపు కోటలోని చెక్ పోస్టు సెంటర్ దగ్గర ఇళ్ల మధ్య మద్యం షాపు వద్దంటూ మహిళలు చెప్పులు, చీపుర్లతో ఆందోళనకు దిగారు. మద్యం సీసాలు పగులగొట్టి ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు.

బ్యాంకుల్లో మరింత పెరుగుతున్న మొండి బకాయిలు

హైదరాబాద్: బ్యాంకుల్లో మొండి బకాయిలు మరింత పెరుగుతున్నాయి. మార్చి 2018 నాటికి 10.2 శాతం నుంచి 11.2 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ తెలిపింది. 2017 మార్చి నాటికి 9.8 శాతం మొండి బకాయిలు ఉన్నాయని, మొండి బకాయిలు పెరగడం పై ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.

చెన్నైలో ప్రారంభం అయిన నావికా విన్యాసాలు...

చెన్నై : నగరంలో నావికా విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ పాల్గొననున్నాయి. 17వ తేదీ వరకు ఈ నావికా విన్యాసాలు కొనసాగనున్నాయి.

16:26 - July 10, 2017

నెల్లూరు : మరో భారతీయుడి కువైట్ లో నిర్భంధించారు. నెల్లూరు చెందిన ఓ యువకున్ని కువైట్ నిర్భంధించారు. నెల్లూరు జిల్లాకు చెందిన రవి కారుడ్రైవర్ ఉద్యోగానికి కువైట్ కు వెళ్లారు. యజమాని రవిని ఐదు రోజులుగా ఆహారం, నీరు ఇవ్వకుండా స్టోర్ రూమ్ లో బంధించారు. ఎలాగైనా రక్షించాలంటూ కుంటుంబ సభ్యులకు రవి వాట్సప్ వీడియో పంపాడు. కుటుంబ సభ్యులు విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కు తెలిపారు. కుటుంబ సభ్యులు రవిని కాపాడాలంటూ 10టివిని ఆశ్రయించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:10 - July 10, 2017

హైదరాబాద్ : యాదాద్రకి చెందిన గణేష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. పోలీసులు ఫోన్ మెసేజ్ ల ద్వారా గణేష్ ను ట్రేస్ చేస్తున్నారు. గణేష్ గత మూడు రోజుల క్రితం ఓ అమ్మాయితో భద్రచలం వెళ్లాడు. అమ్మయి ఒక్కరే రావడంతో గణేష్ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. గణేష్ ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మరింత సమాచారం వీడియో చూడండి. 

మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో ఇద్దరు సస్పెండ్..

జగిత్యాల : '10టివి' ఎఫ్ క్ట్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ షరత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మృతదేహాన్ని ఎలుకలు తిన్న ఘటనలో ఎంఎన్ వో సుధాకర్ తో పాటు ఏఎన్ ఎం ససెన్షన్ కు గురయ్యారు.

కాకినాడలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

తూ.గో : ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా కాకినాడలో భారీ ర్యాలీ, జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఏఐకేఎస్ నేతలు, హన్సన్ మొల్ల, విజుకృష్ణన్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కేశవరావు, పెద్దిరెడ్డి పాల్గొన్నారు.

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో5వ స్థానానికి భారత్

హైదరాబాద్: ఐసీసీ టీ-20 ర్యాంకింగ్స్ లో భారత్ 5వ స్థానానికి దిగజారింది. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి వెస్టిండీస్, తొలి మూడు స్థానాల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పాకిస్థాన్ లు చేరుకున్నాయి.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 350 పాయింట్లు లాభపడి 31,716 వద్ద సెన్సెక్స్, 105 పాయింట్లు లాభపడి 9,771 వద్ద నిఫ్టీ ముగిసింది.

15:44 - July 10, 2017

కోమరంభీం : కొమరంభీం జిల్లా కౌటాడ మండలం కేజీబీవీలో ఉదయం అల్పాహారంతిన్న 30మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు.. ఇందులో కొందరు విద్యార్థినిల పరిస్థితి విషమంగాఉందని తెలుస్తోంది.. వీరికి సిర్పూర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. గత ఏడాదికూడా ఇక్కడ ఫుడ్‌పాయిజన్‌ అయి విద్యార్థినిలు అనారోగ్యానికి గురయ్యారు. 

15:43 - July 10, 2017

ఢిల్లీ : కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌పై మండిపడ్డారు. పాక్‌ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన కుల్‌ భూషణ్‌ జాదవ్‌ తల్లి అవంతికా జాదవ్‌కు వీసా ఇప్పించాలని స్వయంగా అభ్యర్థించినా సర్తాజ్‌ స్పందించడం లేదని సుష్మా ఆరోపించారు. తన కుమారుడిని కలవాలన్న జాదవ్ తల్లికి పాకిస్తాన్‌ వీసా ఇవ్వకపోవడాన్ని సుష్మా తప్పు పట్టారు. మెడికల్‌ వీసా కోరుకుంటున్న పాకిస్తానీల పట్ల తనకు సానుభూతి ఉందని సుష్మా వరుస ట్వీట్లు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఫైజా తన్వీర్‌ మెడికల్‌ వీసా కోరగా తాను సానుకూలంగా స్పందించిన విషయాన్ని సుష్మా గుర్తు చేశారు. ప్రతి ఏడాది దాదాపు 500 మంది పాకిస్తానీలు వైద్యం కోసం భార‌త్ వ‌స్తున్నారు.

15:42 - July 10, 2017

నోయిడా : గ్రేటర్‌ నోయిడాలో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదం ఒళ్లు గగుర్పొడిచేలా సంభవించింది. అతివేగంగా వెళ్తున్న ఓ వాహనం మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా వెనకాలే వస్తున్న మరో కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వెంటనే కారు అమాంతం గాల్లోకి లేచి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్విఫ్ట్‌ డిజైర్‌ కారు, లాంబోర్గి కారు చేసిన పొరపాటు కారణంగా ఎలాంటి తప్పు లేకపోయినా వెనకాలే వస్తున్న కారు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ప్రమాదానికి కారణమైన స్విఫ్ట్‌ డిజైర్‌ కారు డ్రైవర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లాంబోర్గి కారు డ్రైవర్‌ ఇంకా దొరకలేదు. సిసిటివి కెమెరాలో రికార్డ్‌ అయిన ఈ యాక్సిడెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

 

కువైట్ లో నెల్లూరు జిల్లా యువకుడి కష్టాలు..

నెల్లూరు: కువై ట్ లో నెల్లూరు జిల్లా యువకుడు కష్టాలపాలయ్యాడు. 5 రోజుల నుంచి గదిలో బంధించిన యజమాని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. కువైట్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న రవి కలువాయికి చెందిన రవి అనే యువకుడు '10టివి'కి కువైట్ నుంచి మెసేజ్ పంపాడు. తన కుమారుడిని రక్షించాలని తల్లిదండ్రులు '10టివి'ని ఆశ్రయించారు.

కావలిలో నలుగురు యువకుల అదృశ్యం...

నెల్లూరు: కావలిలో నలుగురు యువకుల అదృశ్యం అయ్యారు. సముద్ర స్నానానికి వెళ్తున్నట్లు వారు స్నేహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

15:16 - July 10, 2017

హైదరాబాద్ : కలకలం సృష్టించిన గణేష్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. గణేష్ అదృశ్య మయ్యాడంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గణేష్ నిన్న తనను మోసం చేసిదంటూ స్నేహితులకు మెసెజ్ లు పంపినట్టు తెలిసింది. గణేష్ ఘట్ కేసర్ వీబీఐటీ లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:15 - July 10, 2017

పాట్నా : బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడి విమర్శించింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పాట్నాలో ఆర్జేడి ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఆర్జేడి నాయకులు మాట్లాడుతూ లాలు కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ రాజీనామా ప్రసక్తే లేదని వారు తెలిపారు. ఆర్జేడి ఎమ్మెల్యేలు తేజస్వీకి పూర్తి మద్దతు ప్రకటించారు.

మీడియాపై ఎంపీ జేసీ అక్కసు

అమరావతి : మీడియా పై ఎంపి జేసీ దివాకర్ రెడ్డి తన అక్కసును వెళ్లగక్కారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారాల కోసం మాలాంటి వారిని నగ్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. మా జీవితాలను అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.

బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది: లాలూ

పాట్నా: బిజెపి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఆయన పాట్నాలో ఆర్జేడీ ఎమ్మెల్యేలతో భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బిజెపి కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. లాలు కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ రాజీనామా చేసే ప్రసక్తేలేదని తెల్చి చెప్పారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : రికార్డు స్థాయి లాభాల్లో స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 400 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

జగన్ పై మంత్రి యనమల ఫైర్

గుంటూరు: వైసీపీ నేత జగన్ పై ఆర్థిక మంత్రి యనమల మండిపడ్డారు. సీఎం అయినట్లు జగన్ కలలు కంటున్నారని, ప్రజలపై నమ్మకం లేకే జగన్ కన్సల్టెంట్ ను పెట్టుకున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో అని జగన్ తెలుసుకోవాలన్నారు. జగన్ పాదయాత్ర కాదు జైలు యాత్రలు చేస్తారని ఎద్దేవా చేశారు.

రైల్వే సర్వేను అడ్డుకున్న చిన్నకోడూరు రైతులు

సిద్ధిపేట : చిన్న కోడూరులో రైల్వే సర్వేను రైతులు అడ్డుకున్నారు. గతంలో చేసిన సర్వే ప్రకారమే రైల్వే లైను కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

14:40 - July 10, 2017

హైదరాబాద్ : మిస్సింగ్ అయిన బీటెక్ విద్యార్థి ఆచూకీ లభ్యమయింది. తమ బంధువులకు మెసెజ్ పంపుతున్నారు. గత మూడు రోజుల క్రితం ఓ అమ్మయితో భద్రచలం వెళ్లిన గణేష్ అమ్మాయి ఒక్కరే తిరిగి రావడంతోమ గణేష్ మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

14:38 - July 10, 2017
14:37 - July 10, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడలో 21 ఏపీ రైతు సంఘమహా సభలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏపీలో పూర్తి స్థాయిలో రుణ మాఫి జరగలేదని, పంట మద్దతు ధర కల్పించడం లేదని, రైతు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని ఆ దిశ చర్యలు తీసుకొవడంలేదరి ఏపీ రైతు సంఘ అధ్యక్షడు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:36 - July 10, 2017

వరంగల్ : జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ను తొలగించాలంటూ గత వారంఓ రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఈ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాన్వకేషన్ నిర్వహించవద్దంటూ ఒకవేళ నిర్వహిస్తే అడ్డుకుంటామని విద్యార్థుఉల హెచ్చరించారు. వీసీ ఛాంబర్ లోకి చోచ్చుకెళ్లి వీసీ ముందు బైఠాయించి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:35 - July 10, 2017

హైదరాబాద్ : ప్రేమ వ్యవహరంలో కిడ్నాప్ లు కలకలం రేపుతున్నాయి. మోన్న మంథిని మధుకర్, నిన్న నరేష్ ఈ రోజు నగరంలో బీటెక్ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. హైదరాబాద్ సమీపంలోని ఘట్ కేసర్ లో వీబీఐటీ కాలేజీలో చుదువుతున్న గణేష్ మూడు రోజుల క్రితం ఓ అమ్మాయితో భద్రాచలం వెళ్లాడు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి భద్రచలం వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే అమ్మాయి తిరిగివచ్చిన గణేష్ మాత్రం రాలేదు. దీంతో గణేష్ ను కిడ్నాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి. అమ్మాయి తండ్రి పై గణేష్ తల్లిందడ్రుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి మాత్రం గణేష్ మిస్సింగ్ పై నోరు విప్పలేదు. మరో వైపు గణేష్ తన స్నేహితులకు అమ్మాయి తనను మోసం చేసిందటూ నిన్న వాట్సప్ మెసేజ్ పంపారు. దీనీ పై పోలీసులు విచారణ ప్రారంభించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

వీబీఐటీ కాలేజీ విద్యార్థి గణేష్ ఆచూకీ లభ్యం

హైదరాబాద్: ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీకి చెందిన విద్యార్థి గణేష్ ఆచూకీ లభ్యం అయ్యింది. తల్లిదండ్రులు మందలిస్తారని ఇంటికి రావడం లేదని బంధువులకు మెసేజ్ లు పంపుతున్నాడు. గత మూడు రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ తో భద్రాచలం వెళ్లారు.

డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధన లక్ష్యం చర్యలు: కడియం

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధన లక్ష్యం చర్యలు తీసుకుంటున్నామన్నారు.

15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో గ్రేన్ డే: కడియం

హైదరాబాద్: 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో గ్రేన్ డే నిర్వహిస్తున్నాట్లు డిప్యూటీ సీఎం కడియం తెలిపారు. ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు హరిత ర్యాలీలు, అనంతరం మొక్కలు నాటడం నిర్వహిస్తామన్నారు. హరితహారం ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని కడిం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ పై వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో చ్చే అవకాశం ఉందని కడిం పేర్కొన్నారు.

మూసీని సబర్మతిలా చేస్తాం: కేటీఆర్

హైదరాబాద్ : మూసీ నదిని సబర్మతి నదిలా చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ. 3 వేల కోట్లతో ఆధునీకరిస్తామని, ఉప్పల్ ఏరియాలో మరో శిల్పారామం ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్, ఉప్పల్ నుండి యాదాద్రికి ఎంఎంటీఎస్, ఎస్ ఆర్ డీపీ ద్వారా ఉప్పల్ లో భారీ ఫ్లైఓవర్ నిర్మిస్తామన్నారు.

మైదకూరు వద్ద 5గురు ఎర్రచందనం స్మగర్ల అరెస్ట్

కడప: మైదుకూరు సమీపంలో ఐదుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుండి 80 ఎర్రచందనం దుంగలు, విదేశీ కరెన్సీ, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీ విద్యార్థి గణేష్ అదృశ్యం...

అమరావతి:ఘట్ కేసర్ వీబీఐటీ కాలేజీకి చెందిన విద్యార్థి గణేష్ అదృశ్యం అయ్యాడు. మూడు రోజుల క్రితం గర్ల్ ఫ్రెండ్ తో భద్రాచలం వెళ్లిన గణేష్ తిరిగి రాలేదు. గర్ట్ ఫ్రెండ్ మాత్రం తిరిగి వచ్చింది. గణేష్ మిస్సింగ్ పై గర్ల్ ఫ్రెండ్ నోరు విప్పడం లేదు. తనను మోసం చేసిందని నిన్న ఫ్రెండ్స్ కు గణేష్ వాట్సప్ మెసేజ్ లు పంపినట్లు సమాచారం. అమ్మాయి కుటుంబ సభ్యులపై గణేష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాకతీయ యూనిర్శిటీలో ఉద్రిక్తత

వరంగల్: కాకతీయ యూనిర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యల పై రిజిస్ట్రార్ తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. రిజిస్ట్రార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఐఐటీ ప్రవేశాలపై స్టే ఎత్తివేత :సుప్రీం

ఢిల్లీ: ఐఐటీ ప్రవేశాలపై సుప్రీం కోర్టు స్టే ఎత్తివేసింది. జేఈఈ 2017 ఆధారంగా ప్రవేశాలు నిర్వహించాలని పేర్కొంది. కౌన్సిలింగ్, ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని హైకోర్టులకు సుప్రీం కోర్టు సూచించింది.

టీమిండియా కోచ్ కోసం ఇంటర్వ్యూలు..

ముంబై: టీమిండియా కొత్త హెడ్ కోచ్ కోసం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ ఇంట‌ర్వ్యూలు మొదలెట్టింది. క‌మిటీ స‌భ్యులైన ల‌క్ష్మ‌ణ్‌, గంగూలీ బీసీసీఐ హెడ్‌క్వార్డ‌ర్స్‌కు చేరుకున్నారు.

13:36 - July 10, 2017

అమరావతి: ఏపీ సచివాలయంలో టీడీపీ సమావేశం కొనసాగుతోంది. విశాఖకు రైల్వే జోన్‌ రానుంది. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి మరింత సాయం అందనుంది. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలను విభజించనున్నారు. నియోజకవర్గాల పెంపు, రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించాల్సిన విధానం, తదితర అంశాలపై చర్చ జరగనుంది. 

13:35 - July 10, 2017

హైదరాబాద్: మూఢ నమ్మకాలు అంటే ఏమిటి? వాటి నిర్మూలనకు ఏం చేయాలి? ఇదే అంశాలపై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, జేవివి నేత డాక్టర్రమాదేవి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

ప్రారంభమైన ట్రేడింగ్..

ముంబై : జాతీయ స్టాక్ ఎక్చ్సేంజీలో సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రేడింగ్ ఆగిపోయింది. కొన్ని గంటల పాటు నిలిచిపోయిన ట్రేడింగ్ కాసేపటి క్రితం పున: ప్రారంభమైంది.

13:33 - July 10, 2017

విజయనగరం: చిన్న పదవి వస్తే చాలు కోట్లు సంపాదిస్తుంటారు రాజకీయ నాయకులు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం అసలే పట్టించుకోరు. ప్రభుత్వ నిధులను అడ్డంగా బొక్కేస్తూ రాజభోగం అనుభవిస్తుంటారు. ఇలాంటి నాయకులున్న ఈ రోజుల్లోనూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నాడు ఓ సర్పంచ్‌. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా నిత్యం కృషి చేస్తున్నాడు. మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి పైసా వివరాలను గ్రామస్తులందరికీ తెలిసే విధంగా లెక్కలతో సహా వివరిస్తున్నాడు. నీతి, నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్న తీరును మీరు చూడాలనుకుంటున్నారా... అయితే లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...

అక్కడ అడుగుపెట్టగానే మనసుకు ఆహ్లాదం ...

అక్కడ అడుగుపెట్టగానే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. పచ్చని చెట్లు.. పరిశుభ్రమైన వాతావరణం అందరినీ ఆకట్టుకుంటుంది. రోడ్లకిరువైపులా ఉన్న మొక్కలు రారమ్మని ఆహ్వానం పలుకుతాయి. ఇది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లి గ్రామం ప్రత్యేకత. ఈ జిల్లాలో 925 పంచాయతీలుంటే... సీపీఎం నేత సర్పంచ్‌గా ఉన్న ఈ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతుంది.

నిధులను సక్రమంగా ఉపయోగించుకుంటున్న గ్రామం...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా ఉపయోగించుకుంటున్న గ్రామం బుడతనాపల్లి. గ్రామంలో అన్ని ప్రాంతాలకు రోడ్లు నిర్మించారు. వాటికి ఇరువైపులా చెట్లను నాటారు. అంతేకాకుండా వాటిని సంరక్షించేందుకు అనేక రకాలు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కాలువల పూడికతీత, రక్షిత మంచినీటి పథకం నిర్వహణ, పంచాయతీ సిబ్బంది వేతనాలు, రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు సంబంధించిన మొత్తం లెక్కలను ప్రజలకు తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సర్పంచ్‌ బుద్దరాజు రాంబాబు..

ఎక్కడాలేని విధంగా ప్రతి ఏడాది పంచాయతీ వార్షికోత్సవాలను

ఇక ఎక్కడాలేని విధంగా ప్రతి ఏడాది పంచాయతీ వార్షికోత్సవాలను కూడా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ ఏడాది నాలుగో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు. ఈ నాలుగేళ్లలో గ్రామం సాధించిన అభివృద్ది... నిధులు, సంక్షేమ ఫలాలకు సంబంధించిన అన్ని వివరాలను ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు.

నీతి నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ది చేస్తున్న రాంబాబు

నీతి నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ది చేస్తున్న రాంబాబును పలువురు ప్రశంసిస్తున్నారు. రాజకీయాలు పక్కనపెట్టి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకున్న గ్రామస్తులకు అభినందనలు తెలిపారు.

వ్యక్తిగతంలో ఎవరికీ ఆపద వచ్చినా

గ్రామాభివృద్ధే కాకుండా వ్యక్తిగతంలో ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందుండే వ్యక్తి సర్పంచ్‌గా ఉండడం గ్రామస్తుల అదృష్టం అని పలువురు కొనియాడుతున్నారు. గతంలో రాజకీయ కక్షతో అర్హులకు పింఛన్లు ఇవ్వకపోతే పోరాడి ఇప్పించిన ఘనత రాంబాబుది అని గుర్తు చేస్తున్నారు. నీతి, నిజాయితీగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న రాంబాబును పలు గ్రామాల సర్పంచులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. తమ గ్రామాలను సైతం బుడతనాపల్లి మాదిరిగా తీర్చిదిద్దేందుకు సిద్దమవుతున్నారు. 

ముగిసిన టిడిపి పార్లమెంటరీ సమావేశం..

విజయవాడ : టిడిపి పార్లమెంటరీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. పార్లమెంటరీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీకి సంబంధించిన వివరాలు కొద్దిసేపట్లో తెలియనున్నాయి.

గంగిరెద్దు ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు..

కరీంనగర్ : హుజురాబాద్ (మం) కందుగులలోని గంగిరెద్దు కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 302, 306 సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

కుటుంబం సూసైడ్ పై ఈటెల సంతాపం..

కరీంనగర్ : హుజురాబాద్ (మం) కందుగులలోని గంగిరెద్దుకాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం పట్ల మంత్రి ఈటెల సంతాపం వ్యక్తం చేశారు. మూఢ నమ్మకాలను ప్రజలు విశ్వసించవద్దని..సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. విద్యాపరంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చర్యలు తీసుకుంటున్నట్లు, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

జిల్లా..మండల సదస్సులు - టీ మాస్ ఫోరం..

హైదరాబాద్ : ఆగస్టు చివరి నాటికి జిల్లా సదస్సులు సెప్టెంబర్ చివరి నాటికి మండల సదస్సులు నిర్వహించి కమిటీలను ఏర్పాటు చేస్తామని టీ మాస్ ఫోరం ప్రకటించింది. టీమాస్ ఫోరం వాయిస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక బృందాలు ఏర్పాటు చేస్తామని, విద్యార్థులు తక్కువగా ఉన్నారని మూసివేసిన ఐదువేల స్కూళ్లను తెరిపించాలని డిమాండ్ చేసింది.

బేగంబజార్ పీఎస్ లో టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : అగ్రికల్చర్ కమిషనరేట్ ఎదుట టి.టిడిపి నేతలు ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న రావుల, అరికెల, అరవింద్ కుమార్ గౌడ్, అమర్ నాథ్ పలువురు నేతలను అరెస్టు చేసి బేగంబజార్ పీఎస్ కు తరలించారు.

12:42 - July 10, 2017

మహారాష్ట్ర: నాగపూర్‌లో విషాదం నెలకొంది. కలమేశ్వర్‌ ప్రాంతంలోని వీనా డ్యామ్‌కు విహారయాత్రకు వచ్చిన కొంతమంది యువకులు పడవ మునిగి గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా ఏడుగురు గల్లంతయ్యారు. 11మంది యువకులు విహారయాత్ర కోసం ఆదివారం వీనా డ్యామ్‌కు వచ్చారు. సాయంత్రం సమయంలో బోట్‌ రైడింగ్‌ చేస్తుండగా... పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ముగ్గురిని కాపాడారు. ఇప్పటి వరకు ఒకరి మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు నిర్దారించారు. గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు కూడా గాలింపు చేపట్టాయి. అయితే పడవ ఎలా మునిగిపోయిందో ఇంకా స్పష్టతరాలేదని అధికారులు చెప్తున్నారు. 

కొనసాగుతున్న టిడిపి పార్లమెంటరీ పార్టీ..

విజయవాడ : టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. రానున్న పార్లమెంటరీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

పాలకమండలి సమావేశం వర్సిటీ వీసీ ఇంట్లో..

కర్నూలు : రాయలసీమ వర్సిటీ వీసీ ఇంటిని విద్యార్థి సంఘం నేతలు ముట్టడించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులను అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. రాయలసీమ వర్సిటీ పాలక మండలి సమావేశాన్ని రహస్యంగా వీసీ తన ఇంట్లో నిర్వహిస్తున్నారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

కడప : మైదుకూరు సమీపంలో ఐదుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. 80 ఎర్రచందనం దుంగలను..విదేశీ కరెన్సీ..రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

 

12:38 - July 10, 2017

చిత్తూరు : రేణిగుంటలో పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది.. అనధికారికంగా కొందరు ప్రయాణికులు సిలిండర్‌ను రైలులో తీసుకువెళ్లారు.. రేణిగుంట స్టేషన్‌ సమీపంలో గ్యాస్‌ లీక్ అయింది.. అదే సమయంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు రైలును ఆపి సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు.. సిలిండర్‌ పేలిఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగిఉండేదని పోలీసులు చెబుతున్నారు. పూరీ నుండి తిరుమలకు వచ్చిన కొంత మంది ప్రయాణీకులు అనధికారికంగా 3 సిలీండర్లను తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒక సిలీండర్లో నుండి గ్యాస్ లీక్ కావడంతో తోటి ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేయగా.. అదే సమయంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు రైలును ఆపి సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చారు.. దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో 6మంది పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పూరీ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్లు..

చిత్తూరు : పూరీ ఎక్స్ ప్రెస్ లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో రైలును రేణిగుంట రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. రైలులో తరలిస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

12:35 - July 10, 2017

అనంతపురం : తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పోకిరీని.. ఓ మహిళ ధైర్యంగా పోలీసులకప్పగించింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పెనుకొండ నుంచి నిత్యం ఆకుకూరలు అమ్మడానికి వస్తోన్న ఓ మహిళతో.. ఆటో డ్రైవర్‌ షేక్షావళి బూతు మాటలు మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సహనం కోల్పోయిన శారద ఆటో దిగగానే ఎదిరించింది. స్థానికులకు విషయం చెప్పింది. అంతలోనే షేక్షావళి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై పోకిరీని పట్టుకోవడంతో.. మహిళ పోకిరీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. 

12:33 - July 10, 2017

కొమరంభీం: కౌటాడ మండలం కేజీబీవీలో మరోసారి ఫుడ్‌ పాయిజన్‌ అయింది.. అల్పాహారంతిన్న 30మంది విద్యార్థినిలు అస్వస్తతకు గురయ్యారు.. ఇందులో కొందరు విద్యార్థినిల పరిస్థితి విషమంగాఉందని తెలుస్తోంది.. వీరికి సిర్పూర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

12:31 - July 10, 2017

రంగారెడ్డి : అబ్దులా పూర్‌ మేట్‌ మండలంలోని రాగన్న గూడలో.. రెవెన్యూ అధికారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌ రూమ్‌ భూమి కబ్జాకు గురవుతోందని.. వీఆర్‌ఓ రాములు, విఆర్‌ఏ నవీన్‌, ఆర్‌ఐ నవిద్‌ ప్రభుత్వ బోర్డ్‌లు పెట్టడానికి వెళ్లారు. దీంతో అక్కడ 10 మంది దుండగులు అధికారులపై రాళ్ల దాడి చేశారు. తుర్క యాంజల్‌ రెవెన్యూ పరిధిలోని 10 ఎకరాల భూమిని.. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లకు కేటాయించింది. అయితే రెండు రోజుల కిందట భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదు వచ్చింది. అధికారులు అక్కడకు వెళ్తే.. రాగన్న గూడ సర్పంచ్ తమ్ముడు ఐలయ్య, మరి కొంత మంది అధికారులపై రాళ్లతో దాడి చేశారు. సెల్‌ఫోన్‌లు, బైక్‌లు లాక్కొని ఇక్కడే ఉంటే చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో అధికారులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ప్రభుత్వ భూమిని కాపాడటానికి వెళ్లిన తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే.. వీఆర్వో, వీఆర్‌ఏ సంఘాల తరపున ఆందోళనలు చేస్తామని అధికారులు తెలిపారు. 

12:28 - July 10, 2017

సూర్యాపేట : మానవత్వం మంట గలిసిపోతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి రుజువైంది. డబ్బు ముందు అన్నదమ్ముల అనుబంధానికి విలువ లేకుండా పోయింది. అన్న మృతదేహం ముందే ఆస్తి కోసం కొట్టుకున్న ఘటన.. సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలంలోని కొత్తగూడెంతండాలో జరిగింది. దహన సంస్కారాలు నిర్వహించాల్సినవాళ్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. రెండు రోజులుగా శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని రక్తం కారేలా కొట్టుకొని.. చివరకు ఆసుపత్రి పాలయ్యారు. బాణోతు వెంకటేశ్వర్లు పెళ్లి చేసుకోలేదు. గతంలో వెంకటేశ్వర్లు ఆలనాపాలనా అతని అన్న కుమారుడు నరసింహ చూసుకునేవాడు. ఆ సమయంలో వెంకటేశ్వర్లు తనకున్న 4 ఎకరాలను.. నరసింహకు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చాడు. ఇప్పుడు ఆ భూమిలో తమకూ వాటా ఇవ్వాలంటూ నరసింహ అతని కుటుంబ సభ్యులతో బాణోజి, హనుమంతరావు ఘర్షణకు దిగారు. లేదంటే అంత్యక్రియలు జరగనిచ్చేది లేదంటూ గొడవకు దిగారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

12:20 - July 10, 2017

వర్షాకాలం వచ్చేసింది. వాటితో పాటు మేము కూడా వస్తున్నాం అంటూ రోగాలు కూడా వచ్చేస్తుంటాయి. చలి..జ్వరం..జలుబు..ఇతరత్రా అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధ పడుతుంటారు. కొంతమంది వర్షంలో తడిస్తే వెంటనే జలుబు సమస్య వెంటాడుతుంటుంది. మలేరియా, టైఫాయిడ్, కలరా ఇలా మరెన్నో సీజనల్ వ్యాధులు వేధిస్తాయి.
మలేరియా : మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ ఏర్పడుతుంది. చలి..జ్వరం..కడుపులో నొప్పి..ఒళ్లు నొప్పులు..అతిగా చమట పట్టడం దీని లక్షణం.
దగ్గు : ఇది అంటు వ్యాధి అని చెప్పుకోవచ్చు. వర్షంలో ఎక్కువ సేపు తడిచినా దగ్గు ఏర్పడుతుంది. గొంతు నొప్పి..కండరాల నొప్పులు..ఆయాసం..ముక్కు కారడం లక్షణాలు.
డయేరియా : కలుషిత ఆహారం..నీటిని తీసుకోవడం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది. ఆయాసం..తిమ్మిరులు..వాంతులు..నీరసం..అలసట ఉండడం దీని లక్షణం.
టైఫాయిడ్ : కలుషిత నీరు..ఆహారం వల్ల వస్తుంది. తలనొప్పి..గొంతు నొప్పి..జ్వరం వీటి లక్షణం.

జాగ్రత్తలు..
పచ్చి కూరగాయలు తినొద్దు...దోమలు లేకుండా జాగ్రత్త పడండి..ఇల్లు..పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడండి...తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి..మరిగించి..చల్లార్చిన నీటిని తాగండి..నిండుగా దుస్తులు ధరించండి..రోగాలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి..

12:11 - July 10, 2017

ఆరోగ్యం బాగుగా ఉండాలంటే అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. అనారోగ్యం రాకుండా పలు జాగ్రత్తలు..వ్యాయామం చేస్తే రోగాలు దరి చేరనీయకుండా ఉంటాయి. భోజనం చేసిన అనంతరం చాలా మంది కూర్చొవడం..పడుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
భోజనం చేసిన తరువాత కొద్ది దూరం నడవడం వల్లో ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం వంద అడుగులు నడిచినట్లయితే ఆనంద జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బయటకెళ్లి నడవలేని వారు ఇంటి ఆవరణలోనైనా నడవొచ్చు. నెమ్మదిగా నడవడం వల్ల గుండె సంబంధించిన వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వారు భోజనం తిన్న తరువాత నడిస్తే చాలా ఉపయోగం. ట్రై చేయండి.

 

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..

కొమరం భీం : కౌటాడా మండలం కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. అల్పాహారం తిన్న 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో సిర్పూర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

త్వరలో న్యూ ఐటీ పాలసీ - లోకేష్..

విజయవాడ : ఆటోనగర్ లో ఏడు ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని, త్వరలో మరో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని లోకేష్ పేర్కొన్నారు. భవిష్యత్ లో పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. 2019 లోపు రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు.

తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా పడింది..

చిత్తూరు : తిరుమల రెండో ఘాట్ రోడ్డు 22వ మలుపు వద్ద కారు బోల్తా పడింది. నలుగురు భక్తులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

నౌగామ్ సెక్టార్ లో మళ్లీ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : నౌగామ్ సెక్టార్ లో మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచాంర. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్వీ జూ పార్కులో జిరాఫీ కన్నుమూత..

చిత్తూరు : తిరుపతి ఎస్ వీ జూ పార్కులో మగ జిరాఫీ మృతి చెందింది. నిబంధనలకు విరుద్ధంగా జిరాఫీని ఐదేళ్లుగా ఒంటరిగా ఉంచారు. ఒంటరితనంతోనే చనిపోయిందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద చర్చకు సిద్ధమన్న ఉండవల్లి..

తూర్పుగోదావరి : పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగమని ఉండవల్లి పేర్కొన్నారు. పట్టిసీమపై బహిరంగ చర్చకు రావాలన్న బుచ్చయ్య చౌదరి సవాల్ కు సిద్ధంగా ఉన్నట్లు, 18న ప్రకాశం బ్యారేజ్ వద్ద చర్చకు వస్తానని ప్రతిసవాల్ విసిరారు. నీటి పారుదల రంగాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారని విమర్శించారు.

11:42 - July 10, 2017

హైదరాబాద్: మహంకాళి ఆలయంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని... పాడిపంటలతో రాష్ట్రం విలసిల్లుతుందని చెప్పారు.. భక్తులకు ఎలాంటి ఆపదా రానివ్వనని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

11:40 - July 10, 2017

హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అయితే కొంతమందికి అసౌకర్యం కలిగిన మాటవాస్తవమేనన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు భక్తులు భారీగా తరలిరావడంతో ఏర్పాట్లలో ఇబ్బందులు కలిగాయన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయకు అసౌకర్యం కలిగినందుకు మన్నించమని కోరారు. వీఐపీలకు కొంత అసౌకర్యం కొంత వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. భవిష్యత్ అలా జరగకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

11:37 - July 10, 2017

కర్నూలు : ఆళ్లగడ్డ ఏడీఈ నాగరాజు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది.. నాగరాజు ఇంటితోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది.. ఏకకాలంలో ఏడుచోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు , డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

11:36 - July 10, 2017

తిరుపతి : ఎస్‌వీ జూపార్క్‌లో జిరాఫీ మృతి చెందింది.. ఒంటరితనంతోనే మగ జిరాఫీ చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.. ఐదేళ్లుగా జూపార్క్‌లో మగ జిరాఫీ ఒంటరిగా ఉంటోంది.. జిరాఫీని ఒంటరిగా ఉంచొద్దంటూ నిబంధనలున్నా అధికారులు పట్టించుకోలేదు.. జిరాఫీకి తోడు సమకూర్చలేకపోయారు.. 

వీఆర్వో, వీఆర్ఏలపై రాళ్ల దాడి..

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ (మం) రాగన్నగూడెంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కబ్జా చేశారు. ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన వీఆర్వో రాములు, వీఆర్ఏ నవీన్, ఆర్ఐ నవీద్ పై కబ్జాదారులు రాళ్లతో దాడి చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు..

అరుణాచల్ ప్రదేశ్ : భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనితో చాలా ప్రాంతాల్లో రోడ్డు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.

11:08 - July 10, 2017

టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ పొందిన హీరోయిన్లలో 'రకూల్ ప్రీత్ సింగ్' ఒకరు. టాలీవుడ్ యంగ్ హీరోల సరసన 'రకూల్' నటించింది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఈ భామ ఇతర భాషల చిత్రాల వైపు దృష్టి సారిస్తోంది. బాలీవుడ్..తమిళ చిత్రాల్లో నటించాలని 'రకూల్' ఉత్సుహకత చూపిస్తున్నట్లు టాక్. ఇప్పటికే తమిళంలో పలు సినిమాల ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 'కార్తీ' హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో 'రకూల్' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో 'ఖాకీ' పేరిట విడుదల కానుంది. సెప్టెంబర్ లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
2014 'అలా మొదలైంది' రీమెక్ చిత్రంలో నటించిన 'రకూల్' తరువాత నటిస్తున్న చిత్రమిదే. అంతేగాకుండా మరికొన్ని తమిళ సినిమాల ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'రకూల్ ప్రీత్ సింగ్' టాలీవుడ్ ప్రిన్స్ నటించిన 'మహేష్ బాబు' 'స్పైడర్' చిత్రంలో నటిస్తోంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు..తమిళ భాషల్లో రూపొందుతోంది. సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తోంది. ఒకే నెలలో 'రకూల్ ప్రీత్ సింగ్' రెండు సినిమాల ద్వారా తమిళ ప్రేక్షకులను అలరించనుంది. మరి ఆ రెండు చిత్రాలు అలరిస్తాయా ? లేదా ? అనేది చూడాలి.

10:58 - July 10, 2017

జూనియర్ ఎన్టీఆర్ కలల ప్రాజెక్టుకు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అడ్డుపడుతున్నాడా ? ఈ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇరువురు హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో 'పవన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రంలో 'ఎన్టీఆర్' నటిస్తున్నాడు. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒకటి విలన్ పాత్ర కావడం విశేషం.
'రాశీఖన్నా', 'నివేదితా థామస్' లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టులోపు షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని దర్శకుడు బాబి పక్కా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అనంతరం నవంబర్ మాసంలో 'త్రివిక్రమ్' దర్వకత్వంలో 'ఎన్టీఆర్' నటించనున్నాడని తెలుస్తోంది. కానీ 'పవన్' తో 'త్రివిక్రమ్' చేస్తున్న సినిమా ఆ లోపు షూటింగ్ కంప్లీట్ అవుతుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దసరా విడుదల చేయాలని అనుకున్నా ఆలస్యం అవుతుండడంతో అక్టోబర్ నెలలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'ఎన్టీఆర్' సినిమాకు 'పవన్' అడ్డు పడుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఎన్టీఆర్..త్రివిక్రమ్ కాంబినేషన్ లో చిత్రం ఉంటుందా ? లేదా ? అనేది చూడాలి.

స్వర్ణలత భవిష్యవాణి..

హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రముఖ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపటి క్రితం రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. భక్తులకు ఎలాంటి ఆపదరానివ్వనని, పాడిపంటలతో రాష్ట్రం విరాజిల్లుతుందని తెలిపింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని తెలిపింది.

ఎమ్మెల్యేలతో లాలూ భేటీ..

పాట్నా : ఎమ్మెల్యేలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. లాలూ కుటుంబసభ్యులపై సీబీఐ దాడుల అనంతరం ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆస్తి కోసం అంత్యక్రియలు జరపనివ్వడం లేదు..

సూర్యాపేట : చింతలపాలెం (మం) కొత్తగూడెం తండాలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఆస్తితగదాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సోదరుడి మృతదేహానికి అంత్యక్రియ చేయలేదు. ఆస్తి పంపకాలు జరిపే వరకు అంత్యక్రియలు జరపమని స్పష్టం చేస్తున్నారు. పెద్దమనుషుల వద్దకు పంచాయతీ చేరింది.

దక్కన్ పార్క్ ప్రారంభం..

హైదరాబాద్ : షేక్ పేట్ లో దక్కన్ పార్క్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ లు ప్రారంభించారు. దక్కన్ పార్కు లో వాకర్స్ కు అనుమతి ఉందని, హైదరాబాద్ ను టూరిస్టు ఫ్లెండ్లీ నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఐటీ కంపెనీలను ప్రారంభించిన లోకేష్..

విజయవాడ : ఆటోనగర్ లో ఏడు ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కంపెనీల ద్వారా 300మందికి ఉద్యోగాలు లభిస్తాయని లోకేష్ పేర్కొన్నారు.

ఆళ్లగడ్డ ఏడీఈ ఇంటిపై ఏసీబీ దాడి..

కర్నూలు : ఆళ్లగడ్డ ఏడీఈ నాగరాజు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. నంద్యాల..ఆళ్లగడ్డ..కర్నూలు..కోవెలకుంట్లలో నాగరాజు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించింది.

09:58 - July 10, 2017

నిజామాబాద్ :వర్ని మండలం సిద్ధాపూర్‌లో విషాదం నెలకొంది. 4వ తరగతి చదువుతున్న శ్రీకాంత్‌ అనే బాలుడు అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన శ్రీకాంత్‌ ఇవాళ పొలం దగ్గర శవమైతేలాడు. మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు పడేసి పోతుండగా స్థానికులు గుర్తించారు. దుండగుల వాహనాన్ని గ్రామస్తులు వెంబడించగా తప్పించుకుని పారిపోయారు. శ్రీకాంత్‌ మృతితో అతని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల కిందట శ్రీకాంత్‌ కనిపించకుండాపోయారు. తల్లిదండ్రులు తెలిసిన చోటల్లా వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తుండగా ఇంతలోనే శవమై కనిపించాడు. బాలుడి మృతితో సిద్ధాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

09:53 - July 10, 2017

విశాఖ : ఉన్మాదం పడగవిప్పింది... ప్రేమించినందుకు కసిగా కాటేసి బదులు తీర్చుకుంది... ఫ్లోన్లో ఎవరితో మాట్లాడావంటూ గొంతును కోసేశాడో శాడిస్టు ప్రేమికుడు. విశాఖవన్‌టౌన్‌లో ఉన్మాదప్రేమికుడి చేతిలో బలయింది ఓ అభాగ్యురాలు.

ప్రేమించానంటూనే రాక్షసుడిగా

ప్రేమించానంటూ చెప్పుకుంటూనే రాక్షసుడిగా మారాడు. నాలుగు సంవత్సరాలుగా ప్రేమను పంచినందుకు కసిగా గొంతుకోశాడు.

పిల్లల ప్రేమకు ఓకే చెప్పిన ఇరు కుటుంబాలు

విశాఖ వన్‌టౌన్‌లోని పండావారివీధిలో భవానీ, సతీష్‌ కుటుంబాలు ఒకే బిల్టింగ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పిల్లల ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారు. పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ప్రేమికుడు సతీష్‌ భవానీపై అనుమానం పెంచుకున్నాడు. తను ఎవరితోనో ఫ్లోన్లో మాట్లాడుతూ తనను నిర్లక్ష్యం చేస్తోందని కసిపెంచుకున్నాడు. భవానితో గొడవపడ్డాడు. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మాట్లాడదాం రమ్మని పిలిచాడు. ముందుగా సిద్దం చేసుకున్న అద్దంపెంకుతో ఒక్కసారిగా ప్రేమికురాలి గొంతుకోసేశాడు. కొద్దిసేపటికే అభాగ్యురాలు చనిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతరు కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

ప్రేమోన్మాదిని చితకబాదిన ఇరుగుపొరుగు వారు

అయితే తనపై దాడిచేస్తున్న సమయంలో భవాని ఒక్కసారిగా కేకలు పెట్టింది. దీంతో అక్కడికి వచ్చిన భవానీ బంధువులు, ఇరుగుపొరుగువారు సతీష్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలపాలైన సతీష్‌ను విశాఖలోని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు . అనుమానంతోనే భవానిపై దాడిచేసి చంపేసినట్టు సతీష్‌ చెబుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రేమించానంటూ తిరిగిన సతీశ్.. తనలోని మృగంగా మారి.. అమాయకురాలని బలితీపుకున్నాడని విశాఖ పండావారి వీధిలో జనం తిట్టిపోస్తున్నారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసును నమోదుచేసి ..దర్యాప్తు చేస్తున్నారు. 

09:50 - July 10, 2017

కామారెడ్డి: పట్టణంలో విత్తనాల వ్యాపారం చేస్తున్న మోహన్‌ ఊర్లో నుంచి ఉడాయించాడు. తీరా కారణాలు వెలికితీస్తే 16 కోట్ల రూపాయల మేర టోకరా వేసినట్లు బయటపడింది. గత నాలుగు రోజుల నుంచి మోహన్‌ పత్తా లేకుండా పోయాడు. మరోవైపు షాపుకు తాళాలు వేసి ఉండడంతో పాటు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.

డైలీ మార్కెట్‌లో నివాసం ఉండే మోహన్‌...

డైలీ మార్కెట్‌లో నివాసం ఉండే మోహన్‌... 20 ఏళ్లుగా కామారెడ్డి జిల్లాతో పాటు.. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం, సోయ, పెసర్లు, మినుములు కొనుగోలు చేస్తున్నాడు. ఇతరుల కంటే కొద్దిగా ఎక్కువ ధర ఇస్తానని చెప్పడంతో అందరూ ఈయనకే పంటలు అమ్ముతున్నారు. అయితే.. ఒకేసారి డబ్బులు చెల్లించకుండా విడతలవారీగా చెల్లిస్తానని రైతులను నమ్మించాడు. ఇలా అనేక లక్షల మేర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. మరోవైపు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర వ్యాపారుల వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. రైతులకు పంటలు వేసుకునే సమయానికి డబ్బులు ఇస్తానన్నాడు. గత నాలుగైదు రోజుల నుంచి మోహన్‌ కనిపించకుండాపోవడంతో... రైతులు షాపు వద్దకు వచ్చారు. తాళాలు వేసి ఉండడంతో ఫోన్లు చేశారు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులను అడిగితే తమకు కూడా ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీంతో తామంతా మోసపోయామని బాధితులంటున్నారు.

స్థానికులు కూడా మోహన్‌ వద్ద డబ్బులు

ఇదిలావుంటే మరికొంతమంది స్థానికులు కూడా మోహన్‌ వద్ద డబ్బులు దాచుకున్నారు. తన కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే... ఇప్పుడు ఇలా జరిగిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మోసాలపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు

ఇక మోహన్‌ మోసాలపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు.. ఇతర ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా బాధితులు సిద్దమవుతున్నారు. ఎలాగైనా మోహన్‌ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

09:47 - July 10, 2017

హైదరాబాద్ : పాతబస్తీ బోనాల ఉత్సవాలలో భాగంగా జరిగే.. అమ్మవారి ఘటాల స్థాపన కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా శాలిబండ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన అమ్మవారి ఘటాల ఊరేగింపుకు.. భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులు పట్టారు. పూలతో ఘనంగా స్వాగతం పలికారు. లాలదర్వాజ మోడ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద.. హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారి ఘటాలకు ఘనంగా స్వాగతం పలికారు. పాతబస్తీలోని 19 ప్రధాన దేవాలయాలకు చెందిన ఘటాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో.. అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి డప్పు చప్పుళ్లతో పాతబస్తీ హోరెత్తింది. 

09:44 - July 10, 2017

మధ్యప్రదేశ్ : రైతులు ఎవరైనా ఎద్దుల సాయంతో దుక్కి దున్నుతారు. సొంత ఎద్దులు లేకపోతే అద్దెకు తీసుకుని పొలం చదునుచేస్తారు. కానీ ఆర్థిక స్థోమతలేని ఆ రైతుకు తన ఇద్దరు కూతుళ్లే కాడెద్దులుగా మారారు. 15 ఏళ్ల రాధ, 13 ఏళ్ల కుంతి అరక లాగుతుంటే వీరి తండ్రి సర్దార్‌ బరేలా నాగలి మేడిపట్టి పొలం దున్నారు. మధ్యప్రదేశ్‌లోని సెహోరి జిల్లా బసంత్‌పూర్‌ సంగారి గ్రామంలో ఇది సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సొంత జిల్లా సెహోర్‌ ఇది చోటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈ దృశ్యాలు వైరస్‌గా మారడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు పథకాల్లో ఏదో ఒకటి మంజూరుచేసి, కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇకపై కుమార్తెలతో వ్యవసాయం చేయించొద్దని కోరారు. పేద రైతుగా కుటుంబ పోషణ కష్టం కావడంతో తన కుమార్తెలతో చదువు మాన్నించాలని సర్దార్‌ బరేలా ఆవేదన వ్యక్తం చేశారు. 

09:42 - July 10, 2017

హైదరాబాద్: బ్రిటన్‌లో లింగమార్పిడి చేయించుకున్న 21 ఏళ్ల హేడెన్‌ క్రాస్‌ పండంటి పాపకు జన్మనిచ్చాడు. లింగమార్పిడి చేయించుకున్న తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన మొదటి పురుషుడిగా హేడన్‌ రికార్డు సృష్టించాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్‌ లింగమార్పిడి చేయించుకుని పురుషుడిలా మారాడు. మూడేళ్ల నుంచి ఆమె అతడుగా మారి జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ల చికిత్స చేయించుకున్నాడు. భవిష్యత్‌లో పిల్లలు పుట్టరని, ముందుగానే బిడ్డను కనాలని నిర్ణయించుకున్న హేడెన్‌ వీర్య దానం కోసం ఫేస్‌ బుక్‌లో ప్రకటన ఇచ్చాడు. ఓ దాత ముందుకొచ్చి స్పెర్మ్‌ దానం చేయడంతో హేడెన్‌ గర్భం దాల్చడం అప్పట్లో సంచలనం సృష్టించింది. గత నెల 16న లండన్‌లోని రాయల్‌ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. పాపకు పైగే అని పేరు పెట్టాడు. తండ్రి అయినందుకు హేడన్‌ సంతోష పడుతున్నాడు. 

అదృశ్యమైన బాలుడు మృతి..

నిజామాబాద్ : వర్ని (మం) సిద్ధాపూర్ లో అదృశ్యమైన 9 బాలుడు శ్రీకాంత్ మృతి చెందాడు. వ్యవసాయ పొలం వద్ద శ్రీకాంత్ మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

టిడిపి పార్లమెంటరీ భేటీ..

విజయవాడ : సచివాలయంలోని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ భేటీ జరుగనుంది. ఈనెల 17వ తేదీ నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపిపిలో చర్చ జరుగనుంది. కేంద్రం నుండి రాష్ట్రానికి అందాల్సిన నిధులపై చర్చించనున్నారు.

09:39 - July 10, 2017

అమరావతి: ఏపీ సచివాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఈనెల 17న ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఉభయసభల్లో లేవనెత్తాల్సిన అంశాలను ఖరారు చేస్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక సాయంపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అందాల్సిన నిధులపై ఒత్తిడి తెచ్చే అంశంతోపాటు రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు అంశంపై కూడా చర్చిస్తారు. 

సిక్కిం సరిహద్దులో తొలగని టెన్షన్..

ఢిల్లీ : డోక్లాం ప్రాంతంలో భారీగా భారత బలగాలు మోహరించాయి. భూటాన్ వివాదంలో ఇండియా తలదూర్చిందని చైనా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్ విషయంలో చైనా కూడా తలదూర్చే అవకాశం ఉందని హెచ్చరించింది. భూటాన్ సహాయం కోరినందుకు భారత బలగాలు వచ్చాయని, పాక్ కోరినందుకు చైనా బలగాలు కూడా కాశ్మీర్ కు వస్తాయని కథనాల్లో పేర్కొంది. దౌత్యమార్గంలో సరిహద్దు వివాదాల పరిష్కారమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

కుటుంబం ఆత్మహత్య..

కరీంనగర్ : హుజురాబాద్ (మం) కందుగులలో విషాదం చోటు చేసుకుంది. గంగిరెద్దుకాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో దంపతులు, ముగ్గురు కుమార్తెలున్నారు. మృతులు : కొమురయ్య, కొమురమ్మ, ఎల్లమ్మ (10), కొమురమ్మ (8), అంజయమ్మ (6)

08:38 - July 10, 2017

కరీంనగర్ : చిన్న కారణాలు..ఆర్థిక ఇబ్బందులు..కుటుంబంలో గొడవలు..క్షణికావేశాలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని చిన్న పిల్లలను కూడా చంపేసి వారు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హుజురాబాద్ మండలంలోని కందుగులలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...గంగిరెద్దు కాలనీలో కొమురయ్య, కొమురమ్మ దంపతులు గంగిరెద్దులు ఆడిస్తూ భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నారు వీరికి ఎల్లమ్మ (10), కొమురమ్మ (8), అంజమ్మ (6) కుమార్తెలున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం వీరి విగతజీవులుగా కనిపించడం గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంత్రాలు వస్తాయనే కారణంతో వీరిని గ్రామస్తులు దూరంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొమురమ్మ కొండాపూర్ లో ఉన్న తల్లిగారింటికి వెళ్లినట్లు..అక్కడ కూడా ఆమెను అవమానించారని సమాచారం. దీనితో ఆ బాధను భరించలేక దంపతులు కుమార్తెలకు బలవంతంగా ఉరి వేసి చంపేశారు. అనంతరం వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

08:37 - July 10, 2017

కలైపులి ఎస్.థాను నిర్మాణ సారథ్యంలో ధనుష్ తాజా చిత్రం 'వీఐపీ 2’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘రఘువరన్ బీటెక్' కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో బాలీవుడ్ నటి కాజల్ ప్రతినాయిక పాత్రలో 'వీఐపీ 2’ సినిమా రూపొందింది. చిత్ర విడుదల సందర్భంగా ప్రచార కార్యక్రమాలను చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది.

చెన్నైలో మీడియాతో ధనుష్..కాజల్ మాట్లాడారు. ధనుష్..నటన హైలెట్ గా నిలుస్తుందని దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తెలిపారు. సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని..ప్రతినాయిక బాగుండడంతో నటించడానికి ఒప్పుకోవడం జరిగిందని కాజల్ తెలిపారు. ఈ మూవీతో దక్షిణాది ప్రేక్షకులు కొత్త కాజల్ ను గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. ఈ సినిమాను తెలుగు..తమిళం..హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడం జరుగుతుందని ఎస్.థాను తెలిపారు.

08:31 - July 10, 2017
08:29 - July 10, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించారు. తొలి బోనాన్ని మంత్రి తలసాని సమర్పించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. సోమవారం జరిగే రంగం కార్యక్రమాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో జనాలు తరలివస్తున్నారు. అవివాహిత స్వర్ణలత పచ్చికుండపై ఎక్కి భవిష్యవాణిని వినిపించనున్నారు. ఆమె చెప్పేవి జరుగుతాయని ప్రజల నమ్మకం. మరింత విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

08:25 - July 10, 2017

గుంటూరులో జరిగిన ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్‌ చంద్రబాబు పాలనపై సమరశంఖం పూరించారు. టిడిపి దుష్టపాలన గురించి ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్‌ 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే తొమ్మిది కీలక కార్యక్రమాలను జగన్‌ ప్రకటించారు. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియోలో జరిగిన చర్చా వేదికలో గౌతమ్ రెడ్డి (వైసీపీ), దుర్గాప్రసాద్ (వైసీపీ), బాబురావు (సీపీఎం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

కాకినాడలో ఏపీ రైతు సంఘం మహాసభలు..

తూర్పుగోదావరి : నేటి నుండి మూడు రోజుల పాటు కాకినాడలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2గంటలకు ప్రదర్శన..బహిరంగసభ జరగనుంది. ఏఐకేఎస్ జాతీయ నేత హన్నన్ మొల్ల, మధులు పాల్గొననున్నారు.

06:58 - July 10, 2017

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసేందుకు 110 మున్సిపాల్టీల కార్మికులు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. దీంతో మూడు రోజుల పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు స్తంభించే అవకాశం వుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 279 జీవోపై ఇప్పటికే వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు ఇప్పుడు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మూడు రోజుల్లో తమ డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించకపోతే, నిరవధిక సమ్మెకైనా సిద్ధమంటూ కార్మిక సంఘాల జెఏసి ఇప్పటికే హెచ్చరించింది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉమా మహేశ్వరరావు విశ్లేషించారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

06:56 - July 10, 2017

ఢిల్లీ : విండీస్‌ పర్యటనను భారత్‌ పరాజయంతో ముగించింది. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన... ఏకైక టీ-20లో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా... 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఓపెనర్లు చెలరేగి ఆడారు. లూయిస్‌ మెరుపు వేగంతో సెంచరీ చేశాడు. లూయిస్‌ 62 బంతుల్లో 125 పరుగులు చేయడంతో.. విండీస్‌ భారీ టార్గెట్‌ను ఈజీగా ఛేదించింది. మన బౌలర్లు ఎంత కష్టపడ్డా వికెట్లు పడకపోవడంతో ఏకైక టీ-20లో వెస్టిండీస్‌ గెలిచింది.

 

మంగళవారం నుండి మున్సిపల్ సమ్మె..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేసేందుకు 110 మున్సిపాల్టీల కార్మికులు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.

 

06:55 - July 10, 2017

హైదరాబాద్‌ : నగర పరిసర ప్రాంతాల్లో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి కేఎంఆర్ రియల్టర్స్‌ వల్ల సాకారమవుతుందన్నారు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ సునితా మహేందర్‌రెడ్డి. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో శంషాబాద్‌కు సమీపంలో కేఎంఆర్ రియల్టర్స్‌ సరికొత్త వెంచర్‌ను ప్రారంభించింది. అతి తక్కువ ధరకే... మధ్య తరగతి ప్రజలకు 300, 500 గజాలతో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు కేఎంఆర్ రియల్టర్స్‌ సీఈవో మోహన్‌. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

06:50 - July 10, 2017

విశాఖపట్టణం : జిల్లాలో వరుసగా భూ దందాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో భూ బాగోతాలపై ఇప్పటికే సిట్ విచారణ సాగుతుండగా.. తాజాగా వక్ఫ్‌ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి నియోజవర్గంలో వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములకు రెక్కలు వచ్చాయి. విశాఖజిల్లాలో సరికొత్త భూదందాకు నాయకులు, అధికారులు తెరతీశారు. 210 ఎకరాల వక్ఫ్ భూమిని ఓకే వ్యక్తి పేరుతో మార్చిన అధికారులు సరికొత్త మాయాజాలన్ని ప్రదర్శించారు.

210 ఎకరాల వక్ఫ్ భూములు..
అనకాపల్లీ నియోజకవర్గం కశికోట మండలంలో 210 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. దాదాపు 200 మంది రైతులు దశాబ్దాలుగా ఇక్కడే ఇళ్లు కట్టుకుని ఈభూములను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న రైతులలో అత్యధికులు 2014లో వచ్చిన హుద్ హుద్ తుఫానులో నష్టపరిహారం పొందినవారే. అటు ఏలేరు కాలువ కింద నష్టపోయిన రైతులకు కూడా 40:60 నిష్పత్తిలో ఇక్కడే ల్యాండ్స్‌ ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఇటీవల కరీముల్లా అనే వ్యక్తి ఈ భూములు తనవే అంటూ కోర్టుకు ఎక్కారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ భూములు ఎవ్వరి వద్ద ఉన్నాయో విచారణ చెపట్టాలని ఆర్డీవోను అదేశించింది. దీంతో సమస్య మొదలయింది.

పెద్దల హస్తం..
అయితే వక్ఫ్‌ భూములపై కోర్టుకు వెళ్లడం వెనుక కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎకరం దాదాపు కోటిరూపాయలు పలుకుతున్న ఈ భూములపై రాజకీయ పెద్దల కళ్లు పడ్డాయి. వీటిని కాజేయడానికి స్కెచ్‌ వేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో చకచకా పావులు కదిపారు. దీనికి రెవెన్యూ అధికారుల సహకారం తోడయింది. 1993జూన్‌లో ప్రభుత్వం వీటిని ఇనాం భూములుగా ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకుని షేక్‌కరీముల్లా రెహ్మాన్‌ పేరుతో మొత్తం 210 ఎకరాలను ఆన్‌లైన్‌లో మార్పు చేశారు. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

న్యాయం చేస్తామంటున్నారు..
రైతుల తిరుగుబాటుతో అధికారుల్లో హైరానా మొదలయింది. ఎటువంటి విచారణ లేకుండా భూములను ఒకే వ్యక్తి పేరుతో బదిలీ చేయడంపై ఇప్పటికే రైతులు సిట్ కు కూడా ఫిర్యాదు చెశారు. దీంతో రైతులకు న్యాయం చేస్తామని సెలవిస్తున్నారు రెవెన్యూ అధికారులు. రోజుకో భూ బాగోతం బయటపడుతుండటంతో విశాఖ జిల్లా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర కార్యాచరణ రూపొందించుకుని వేల కోట్ల రూపాయల భూదందాలకు బ్రేకులు వేయాలని కోరుతున్నారు.

06:46 - July 10, 2017

కరీంనగర్ : అధికారుల అసమర్థత రెండు గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. దళితులకు భూపంపిణీ అంటూ గత ప్రభుత్వాలు చేసిన హడావిడి..ఇపుడు వివాదంగా మారింది. పేద వర్గాల వారికి భూములు పంచిన అధికారులు ఆ భూములకు సరిహద్దులు మాత్రం నిర్ణయించలేదు. ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల ప్రజలు పరస్పరం తలపడే పరిస్థితి వచ్చింది. దళితులకు భూపంపిణీ ప్రహసనమే అనేది మరోసారి రుజువయింది. రెండున్నర దశాబ్దాల కిందట దళితులకు కేటాయించిన భూములకు సరిహద్దులు నిర్ణయించకపోవడంతో.. భూమికోసం దళితులు పోరుబాట పట్టాల్సి వచ్చింది.

1991లో..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని క్షాత్రాదిపల్లిలో ఉన్న ఈ భూములను 1991లో కొందరు దళితులకు కేటాయించారు. సర్వేనంబర్‌ 181లోని 400 ఎకరాలను ఐదు విడతలుగా పంపిణీ చేశారు. కాని ఇంతవరకు భూమికి సరిహద్దులు నిర్ణయించకపోవడంతో.. భూపాలపల్లి జిల్లా వెంకట్రావ్‌పల్లి పరిధిలోని గట్టంపల్లికి చెందిన కొందరు రైతులు ఈ భూములపై పేచీపెట్టారు. మరి కొందరు మరో అడుగు ముందుకేసి.. ఈ భూములపై పట్టా పుస్తకాలను కూడా సృష్టించుకున్నారు. దీంతో తమ భూములు తమకు ఇప్పించాలని క్షాత్రాదిపల్లికి చెందిన దళితులు ముత్తారం తహశీల్దార్‌ ఆఫీసుముందు నిరాహార దీక్షకు దిగారు. ఈ నిరసనల సందర్భంలో ఓ దళితుడు కిరోసిన్‌పోసుకుని ఆత్మహత్యకు కూడా యత్నించారు.

ఘర్షణలు..
దాంతో కదిలిన పెద్దపల్లిజిల్లా యంత్రాంగం దళితుల భూములపై తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి పూనుకున్నారు. మంథని ఎమ్మెల్యే పుట్టమధు , రెవెన్యూ అధికారులు వివాదాస్పద భూములకు సరిహద్దులు నిర్ణయించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంలో రెండు గ్రామాల ప్రజల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు గ్రామల ప్రజలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం వల్లే రెండు గ్రామాల మధ్య వివాదం తలెత్తిందని బాధితులు అంటున్నారు.

పరిష్కరిస్తారా ?
ఇరు గ్రామాల రైతులు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే పుట్టామధు సర్థిచెప్పారు. గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే దళితులకు ఈ భూములపై హక్కులు లభించలేదని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించి తమకు కేటాయించిన భూములకు సరిహద్దు నిర్ణయించి వివాదాన్ని పరిష్కరించాలని దళితులు కోరుతున్నారు.

06:41 - July 10, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరు గారుతోంది. నత్తనడకన సాగుతున్న పనులతో వేల కోట్ల రూపాయ ప్రజాధనం మట్టిపాలవుతోంది. నిజామాబాద్‌ జిల్లాలో చేట్టిన మిషన్‌ భగీరథ పనులపై టెన్‌టీవీ ఫోకస్‌..ప్రజల దాహార్తిని తీర్చడానికంటూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్‌భగీరథ పథకం కాంట్రాక్టర్ల జేబులు మాత్రమే నింపుతోందనే విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్‌ నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్న పాలకుల హామీలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితులు కనిపించడంలేదు.

బాల్కొండ..
మిషన్‌భగీరథ పథకంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం జలాల్‌పూర్లో ఇంటెక్‌వెల్ నిర్మిస్తున్నారు. శ్రీరాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ఆధారంగా దీని నిర్మాణం చేపట్టారు. 2016 అక్టోబర్‌నాటికే ఇంటెక్‌వెల్ పనులు పూర్తిచేస్తామని మిషన్‌భగీరథ వైస్‌చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి అప్పట్లోనే చెప్పారు. అయితే ఆయన చెప్పిన గడువు ముగిసిపోయినా ఇప్పటికీ 80శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ప్రతిఇంటికి మంచినీటి సరఫరా అనేది ఎండమావే అంటున్నారు జిల్లా ప్రజలు.

కాంట్రాక్టర్ల జేబులు..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం 718 గ్రామ పంచాయితీలతోపాటు 1645 అనుబంధగ్రామాలకు కూడా ఇక్కడ నుంచే మంచినీరు సరఫరా చేయాలని ఉద్దేశించారు. భవిష్యత్తులో పెరగబోయే జనభా అసరాలకు అనుగుణంగా అంటే 2033నాటికి రోజుకు 120 ఎంఎల్‌డీలు, అదే 2048 నాటికి 162 ఎంఎల్‌డీల తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇలా 30 సంవత్సరాల తాగునీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఇంటెక్‌వెల్‌ను నిర్మిస్తున్నారు. 2015 జనవరిలో పనులు ప్రారంభం అయినా.. ఇప్పటికీ 80శాతం కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం వరదమట్టానికి సమాంతరంగా మాత్రమే ఇంటెక్‌వెల్ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఫుట్‌బ్రిడ్జిపై సేఫ్టీవాల్‌ , తర్వాత మోటార్లు బిగించాల్సి ఉంది.దాంతోపాటు వెల్‌చుట్టూ మట్టిపనులు కూడా పూర్తిచేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పనులను ఉద్దేశపూర్వకంగానే నత్తనడకన సాగిస్తున్నారని.. దీంతో భగీరథ పథకం కాస్తా కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రక్రియగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

ఓట్లు దండుకోవడానికే..
వచ్చే వేసవి నాటికి కూడా పనులు పూర్తిఅయ్యే అవకాశం కనిపించడం లేదని నిజమాబాద్‌ జిల్లా ప్రజలు అంటున్నారు. 2019 ఎన్నికల వరకు పనులు చేస్తున్నట్టే ప్రజలను భ్రమల్లో పెట్టి.. మరోసారి ఓట్లను దండుకోడానికే అధికారపార్టీ సిద్ధం అవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథపనులపై నజర్‌ పెట్టాల్సిన అవసరం ఉంది. వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మట్టిపాలుకాకుండా చూడాలని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

06:37 - July 10, 2017

పెద్దపల్లి : వేల రూపాయల వేతనం తీసుకుంటున్నా ఆ అధికారులు సంతృప్తి చెందలేదు. ప్రత్యేక ప్రోత్సహకాలు అందుతున్నా సంతోషపడలేదు. ఒకేసారి కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు పథకం రచించారు. అనుకున్నదే తడవుగా తమ వ్యూహాన్ని అమలు చేశారు. ప్లాన్‌ వర్కౌట్‌ అయినా...వారి అక్రమాలు మాత్రం దాగలేదు. అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణకు ఓ జిల్లా కలెక్టరే డిమాండ్‌ చేయడం సంచలనంగా మారింది. పెద్దపల్లి జిల్లాలో కేంద్ర పథకం ఎన్ సీడీఎస్ నిధులు పక్కదారిపట్టాయి. గొర్రెల కొనుగోలులో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. పాత లబ్దిదారుల గొర్రెలను కొత్తగా పంపిణీ చేసినట్లు చూపి నిధులు కొల్లగొట్టారు. సుమారు 3 కోట్ల సబ్సిడీని కాజేశారు.

20 శాతం సబ్సిడీ..
ఎన్సీడీఎస్ స్కీమ్‌ ద్వారా గొర్రెలను కొనుగోలు చేసి 20 శాతం సబ్సిడీతో లబ్దిదారులకు పంపిణీ చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనుగొలు చేసి లబ్దిదారులకు అందజేస్తారు. ఎన్సీడీఎస్ ద్వారా వచ్చే సబ్సిడీని కొట్టేసేందుకు పెద్దపల్లి జిల్లా అధికారులు పక్కా ప్లాన్‌ చేశారు. 2016లో పెద్దపల్లి జిల్లాకు 320 యూనిట్లు మంజురు కాగా...70 యూనిట్లు మాత్రమే ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో లబ్దిదారులకు పంపిణీ చేసిన గొర్రెలను...కొత్తగా కొనుగోలు చేసినట్లు చూపి సబ్సిడిని మాయం చేశారు. ఈ వ్యవహారం బయటికిపొక్కడంతో వరుస మీడియా కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి...అధికారుల అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఏసీబీ అధికారులకు లేఖ రాశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నివేదిక ఇవ్వాలని కోరారు. 2016లో స్థానికంగా గొర్రెలను కొనుగోలు చేస్తామని కొందరు తనను సంప్రదించారని..అయితే వారి అభ్యర్థనను తిరస్కరించానని కలెక్టర్‌ చెబుతున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఈ అక్రమాలు వెలుగుచూశాయంటున్నారు. ఎన్సీడీఎస్ పథకంలో వెలుగుచూసిన అక్రమాలపై ఏకంగా కలెక్టర్ ఏసీబీ విచారణ కోరడం పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపుతోంది.

గడిసింగాపూర్ లో ఆక్సిడెంట్..

వికారాబాద్ : బోమ్రాన్ పేట (మం) గడిసింగాపూర్ లో లారీ - తుఫాన్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

టీమిండియా కొత్త కోచ్ కు ఇంటర్వ్యూలు..

ఢిల్లీ : నేడు టీమిండియా కొత్త కోచ్ కు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, రాజ్ పుత్ లు రేసులో ఉన్నారు.

రాష్ట్రాల సీఎస్ లతో మోడీ భేటీ..

ఢిల్లీ : నేడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. రాష్ట్రాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరగనుంది.

Don't Miss