Activities calendar

11 July 2017

21:43 - July 11, 2017

ముంబై : భారత క్రికెట్ కోచ్‌ ఎంపికలో డ్రామా కొనసాగుతోంది.రవిశాస్త్రి టీమిండియా కోచ్‌గా నియమితుడయ్యాడని ఖరారైనట్లుగా వినిపించినా .... బీసిసిఐ సెక్రటరీ అమితాబ్‌ చౌదరి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌ను ఇంకా నిర్ణయించలేదని...సచిన్‌ టెండుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో కూడిన అడ్వైజరీ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నాక, బీసిసిఐ అధికారికంగా ప్రకటిస్తుందని అన్నారు. 

21:41 - July 11, 2017

ఢిల్లీ : పశువులను వధ కోసం అమ్మకుండా, కొనకుండా నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పశువధ నిషేధంపై కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో కేంద్రం పశువుల అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంపై పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు మే 30న నిషేధం అమలుపై స్టే విధించింది. తాజాగా మద్రాసు హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. 

21:40 - July 11, 2017

ఢిల్లీ : ఆగస్టు 5న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో 18 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరును కాంగ్రెస్‌ ప్రతిపాదించగా మిగతా పార్టీలు అంగీకరించాయి. సమావేశం అనంతరం సోనియాగాంధీ గోపాలకృష్ణ గాంధీకి ఫోను చేసి తెలిపారు. అన్ని పార్టీలు ఒప్పుకుంటే పోటీకీ తాను సిద్ధమేనని గాంధీ చెప్పారు. అనంతరం గాంధీ నామినేషన్‌ పత్రాలపై విపక్షాల పార్టీ నేతలు సంతకాలు చేశారు.ప్రతిపక్షాల సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా... ఎస్పీ, బిఎస్పీలతో పాటు జెడియు కూడా హాజరైంది. రాజ్యాంగ విలువల్ని కాపాడే వ్యక్తిగా గోపాలకృష్ణ గాంధీ సరైనవాడని గుర్తించే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశామని ఏచూరి చెప్పారు.

మహాత్మాగాంధీ మనవడు
ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థిగా ఎంపికైన గోపాలకృష్ణ గాంధీ ఏప్రిల్‌ 22, 1945లో మహాత్మాగాంధీ కుమారుడు దేవదాస్‌ గాంధీ...ఫ్రీడం ఫైటర్‌ సి.రాజగోపాలచారి కుమార్తె లక్ష్మిలకు జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో ఆయన మాస్టర్‌ డిగ్రీ పొందారు. 1968 నుంచి 1992 వరకు ఐఏఎస్‌ అధికారిగా తమిళనాడులో వివిధ శాఖల్లో పనిచేశారు. 1985-87లో ఉప రాష్ట్రపతి కార్యదర్శిగా, 1987 నుంచి 1992 వరకు రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేశారు. గోపాలకృష్ణ గాంధీ సివిల్ సర్వీసుల నుంచి 1992లో స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంక, తదితర దేశాల్లో భారత రాయబారిగా సేవలందించారు. 2004- 2009 మధ్య ఆయన పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేశారు. గోపాలకృష్ణ గాంధీకి భార్య తారా గాంధీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

21:38 - July 11, 2017

నెల్లూరు : 10టీవీ చొరవతో కువైట్‌లో నిర్బంధంలో ఉన్న రవికి విముక్తి లభించింది. కువైట్‌ అరబ్‌ సేఠ్‌ల నిర్బంధంలో నెల్లూరు యువకుడు రవి చిక్కుకున్నాడన్న వార్తను టెన్‌ టీవీ ప్రసారం చేసింది. దీనికి స్పందించిన ఏపీఎన్‌ఆర్‌టీ అసోసియేషన్‌ సభ్యులు రవిని విడిపించి భారత ఎంబసీకి తీసుకువెళ్లారు. రవి 20 రోజుల్లో భారత్‌ చేరుకుంటారని ఏపీఎన్‌ఆర్‌టీ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. 

21:36 - July 11, 2017

హైదరాబాద్ : ట్యాంక్‌బండ్‌ సమీపంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు జాప్యంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది గడిచినా.. పనుల్లో వేగం పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్‌ 6న జరిగే అంబేద్కర్‌ వర్దంతి నాటికి పనులు పూర్తిచేయాలని కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీలో అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరునాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేసే సంస్థను ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు.  

21:35 - July 11, 2017

హైరదాబాద్ : ప్రాజెక్టులతో తెలంగాణను ముంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనంటూ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. పులిచింతలపై టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు బానిసలుగా మారిన టీఆర్‌ఎస్ నేతలు... కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముంపు బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి... పులి చింతలతో కొంత ముంపుకు గురైనా.. తెలంగాణకు మేలు జరిగిందని వారితోనే చెప్పించారు. 

21:28 - July 11, 2017

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూడో విడత హరిత హారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్‌ జిల్లా వేదికగా మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో పెద్దఎత్తున సభను నిర్వహించనున్నారు. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. తొలిరోజే ఇక్కడ 25 వేల మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో జరిగిన లోపాలను పునారవృతం కాకుండా ...ఈసారి హరితహారం విజయవంతంగా నిర్వహించేందుకు పాలకులు, అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ విడత మొత్తం 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం నర్సరీలలో 42 కోట్ల మొక్కలను సిద్ధం చేశారు. అలాగే నాటిన మొక్కల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హరిత దళాలను.. హరిత సైనికులను ఏర్పాటు చేశారు. హరితహారంపై ప్రజల్లో కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ప్రతి మొక్కకు 15 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నామన్నారు. అలాగే ఈ హరితహారలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. పెద్ద సంఖ్యలోమొక్కలు నాటే వారికి అవార్డులు.. నగదు బహుమతులు ప్రకటించనుంది.

21:27 - July 11, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో సోమవారం రాత్రి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో బస్సు డ్రైవర్‌ సలీం సమయస్ఫూర్తిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నా సలీం లెక్కచేయకుండా... అత్యంత సాహసోపేతంగా బస్సును కిలోమీటర్‌ దూరం వరకు తీసుకెళ్లాడంతో మృతుల సంఖ్య చాలావరకు తగ్గిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. సలీమ్‌ ఏడుగురు ప్రాణాలను కాపాడలేకపోవచ్చు. కానీ.. 50 మందిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని గుజరాత్‌కు చెందిన సలీం బంధువు జావేద్‌ చెప్పారు. ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా... మరో 12 మంది గాయపడిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం వైఫల్యం..
అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించినప్పటికీ భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించాయి. ప్రధాని మోది ఇందుకు బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, భద్రతాలోపం ఏవిధంగా జరిగిందో విచారణ జరపాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు.

రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్షా
అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ సమాజంలోని ప్రతి వర్గం అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఖండించిందన్నారు. పవిత్ర అమర్‌నాథ్‌ యాత్రలో జరిగిన ఉగ్రదాడి ముస్లింలకు, కశ్మీరీలకు మచ్చ తెచ్చిందని జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు.అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ దాడికి సూత్రధారి పాక్‌ ఉగ్రవాది ఇస్మాయిల్‌ ఫొటోను జమ్ము-కశ్మీర్‌ పోలీసులు విడుదల చేశారు.అనంతనాగ్‌ దాడి తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగింది. 3,289 మంది యాత్రికులు భగవతి నగర్‌ యాత్రీ నివాస్‌ నుంచి అమర్‌నాథ్‌కు బయలుదేరారు. మొత్తం 185 వాహానాల్లో వీరిని

 

20:44 - July 11, 2017

అర్జుడి విగ్రహాని నెత్తిమీద పెట్టుకొని ఎంతో సంతోషంగా మోసుకొస్తారు..ఎంతో ఉత్సహాంతో తము మోసుకొచ్చిన కళ్ల మీద తమ కళ్లేదుటే పసుపు నీళ్లు చల్లుతుంటే వారి హృదయం అవమానా భారంతో ముగులుతుంటుంది. అందరిలాగే తము అగ్నిగుండంలో పరుగెత్తాలని ముచ్చటపడతారు. కానీ అక్కడ కనకన మండే అంక్షాల కోలిమి వారి కాళ్లకు బంధనాలు వెస్తోంది. బకసూరిడికి ఆహరం తీసుకెళ్లే ఘట్టంలో తాము బండి కట్టి బీముని తరుపున నడవలని ఆరాటపడుతుంటారు. కానీ అక్కడ పెత్తందార్లు కొరడా పట్టుకుని నిలబడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహా భారత ఉత్సవాలలో ఎన్నొనో అవమానాలు, వేధనలు, బాధలు వాటన్నిటిని దిగమింగుతునే తమ కళను ప్రదర్శిస్తున్నారు దళితులు...ఏవరా దళితులు..? ఏమీటా భారతం..? ఎందుకీ అవమానాలు..? 

20:16 - July 11, 2017

అబ్బా ఈ రెవెన్యూ శాఖోళ్లు ఉన్నతాన ఉండరమ్మా.? సర్కారు భూమి కబ్జావెడ్తున్నరంటే పెడ్తరు మరి..? వాళ్ల రాజ్యం నడుస్తున్నప్పుడు అన్ని వెడ్తరు.. ఓ ఇగ మన సర్కారు కొండంత రాగం దీశి ఏదో పాటవాడినట్టు.. గురుకులాలు.. కస్తూర్బాలు.. వచ్చే పాయే.. అగజూడుండ్రి.. నేను జెప్పలేదా..? నాయిని నర్సన్న బోనాల పండుగ ఏర్పాట్లళ్ల మున్గినప్పుడు.. ఏడ గింత తక్లీవు గానియ్యడు.. అవుసరమైతె ఆయననే రంగంలకు దిగుతడని..? ప్రైవేటు బడికి పిల్లలను తోలుతున్న పబ్లీకు ఇగో మీరు బాగ జూడాలే ఈ ముచ్చట.. ఇయ్యాళ రేపు ఊర్లె వార్డు నెంబర్ కొడ్కును గూడ.. సర్కారు బడికి వంపితే నామూషి అని.. అప్పు సప్పు జేశి ప్రైవేటు బడికి వంపుతున్న కాలం ఇది.. ఇసొంటి యాళ్లకు.. ఒక జిల్లా కలెక్టరు తన బిడ్డెను సర్కారు బడికి తోలిచ్చిండంటే..సచ్చినోని ఆస్తి పంచాదుంటే..? సావు కార్యం జేశినంక మెల్లెగ దినాల నాడో.. ఆ మర్నాడో ఎల్లవెట్టుకుంటరా..? లేకపోతె పీన్గె ఆకిట్లుండంగనే కొట్టుకుంటరా..?ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటె మూతి మీసాలు గాలినట్టు.. మన తెలంగాణ మన ప్రభుత్వమని ఓట్లేశి గెలిపిచ్చుకుంటే మా నోట్లె మన్నువొశిండ్రు అంటున్నరు యాదగిరి గుట్టకాడ ఆటోలు నడ్పె అన్నదమ్ములు..హైద్రావాద్ల బిర్యానీ ఎంత ఫేమసో ఒక్కొక్క ఏరియాల ఒక్కొక్క జాగ అంతే ఫేమస్ ఈ పట్నంల.. ట్యాంకు బండున్నది.. బుద్దుని బొమ్మ.. పక్కకు విగ్రహాలు.. పోట్వలు దిగే స్పాట్.. చార్మినార్, గోల్కొండలు టూరిస్టు స్పాట్లు..కుక్కకాటుకు చెప్పుదెబ్బాని రాశిండ్రు గని.. మన్షి కాటుకు ఏందెబ్బ అనేది ఏ కవిగూడ రాశిపెట్టకపాయే చెప్పుకుందామంటే.. కావట్టి కుక్కలే కంటిన్యూ జేద్దాం మన్షికి గూడ...పూర్తి వివరాలకు వీడియో చూడండి.

వెంకయ్యతో సుజనా..గంటా..కేశినేని భేటీ..

ఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడితో కేంద్ర మంత్రి సుజనా..మంత్రి గంటా..ఎంపీ కేశినేని నానిలు భేటీ అయ్యారు. ఏపీలో గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. విశ్వ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్ర మానవవనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ తో చర్చిస్తానని హామీనిచ్చారు. యూనివర్సిటీ ఏర్పాటు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం భూమి విషయంలో ఇంకా ముందుకు రాలేదన్నారు. ఏపీ గిరిజన, సెంట్రల్ యూనివర్సిటీల అంశాన్ని విడిగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రానికి తెలిపినట్లు పేర్కొన్నారు. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని విభజన చట్టంలో ఉందన్నారు.

19:31 - July 11, 2017

మూఢ నమ్మకాలు.. మృత్యుపాశాలై తరుముతున్నాయి. అంధ విశ్వాసాలతో జీవితాలు సమాధులవుతున్నాయి. దేవుడనో.. దెయ్యమనో.. చేజేతులారా ఊపిరి తీసుకుంటున్నారు. మంత్రగాళ్లనే వేధింపులు భరించలేక ఒక చోట... ప్రభువు పిలుస్తున్నాడంటూ ఇంకోచోట... ప్రాణాలు తీసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ప్రొ.బీఎన్ రెడ్డి (జనవిజ్ఞాన వేదిక), జవహార్ లాల్ నెహ్రూ (సైకాలజిస్టు), రమేష్ (జనవిజ్ఞాన వేదిక), బాబు జోగినేని (ప్రముఖ శాస్త్రవేత్త) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి..

19:16 - July 11, 2017

మూఢ నమ్మకాలు.. మృత్యుపాశాలై తరుముతున్నాయి. అంధ విశ్వాసాలతో జీవితాలు సమాధులవుతున్నాయి. దేవుడనో.. దెయ్యమనో.. చేజేతులారా ఊపిరి తీసుకుంటున్నారు. మంత్రగాళ్లనే వేధింపులు భరించలేక ఒక చోట... ప్రభువు పిలుస్తున్నాడంటూ ఇంకోచోట... ప్రాణాలు తీసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. అంధవిశ్వాసాలకు అంతమెప్పుడు..? జనంలో నవచేతనం విరిసేదెన్నడు..?

అజ్ఞానం .. అవగాహన రాహిత్యం.. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఒక్కరోజే ఎనిమిది నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మూఢ విశ్వాసాలతో... అర్ధాంతరంగా.. తనువు చాలించి.. ఈ ఎనిమిది మందీ, అయినవాళ్లకు విషాదం మిగిల్చారు. కరీంనగర్‌ జిల్లాలో.. మంత్రగాళ్లనే వేధింపులు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే... తూర్పుగోదావరి జిల్లాలో.. దేవుడు పిలుస్తున్నాడంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరి వేసుకున్నారు. హుజూరాబాద్‌ మండలంలోని కందుగులలో కూలీ పని చేసుకుని బతికే కొమురయ్య కుటుంబంపై.. క్షుద్రపూజలు చేస్తున్నారంటూ అయినవాళ్లే దాడులు చేశారు. చేతబడులు చేస్తున్నారంటూ అత్తింటి వారే వేధించారు. ఈ అవమానాలను తట్టుకోలేక కొమ్మురయ్య దంపతులు తమ చిన్నారులు ఎల్లమ్మ, కొమరమ్మ, అంజమ్మలను ఉరి వేసి వారు ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వానిదే గురుతర బాధ్యత..
అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా.. కరప నీలయ్య తోటలో అక్క చెల్లెళ్లు... చెల్లెలి కుమార్తె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. సత్యవేణి, సత్తి ధనలక్ష్మి, సత్తి వైష్ణవి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదివారం ధనలక్ష్మి కుమారుడు రఘువీర్‌ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో సువార్త కూటమి పెట్టుకుని .. హాయిగా గడిపిన వీరు సోమవారం ఇంటికి దుష్టశక్తులు ఆవహించాయని.. ప్రభువు పరలోకానికి పిలుస్తున్నాండంటూ గదిలోకి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే నిజామాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఓ బాలుడిని గుప్త నిధులు కోసమే హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోదసీలో వందలకొద్దీ ఉపగ్రహాలను ఒకేసారి అమర్చే శాస్త్ర సాంకేతికత పరిఢవిల్లుతోన్న ప్రస్తుత తరుణంలోనూ ఇలాంటి అంధ విశ్వాసాలు సమాజంలో ఉనికిని చాటుకుంటుండడం బాధాకరం. ఇలాంటి మూఢనమ్మకాలు సమసిపోయేలా.. ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గురుతరమైన బాధ్యత, సామాజిక సంఘాలతో పాటు.. ప్రభుత్వం మీదనే అధికంగా ఉంది.

కరీంనగర్ లో మూడో విడత హరితహారం..

కరీంనగర్ : మూడో విడత హరితహారం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిన తరువాత వేలాది మంది కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్టేడియానికి వస్తారని, బహిరంగసభలో కేసీఆర్ మొక్కలను పంపిణీ చేస్తారన్నారు. ఎల్ఎండీ కట్టవెంబడి 11 కి.మీటర్ల మేర పూలవనం నాటుతున్నట్లు, అదే స్పూర్తితో నగరంలో లక్ష మొక్కలు నాటుతామన్నారు. మిగతా జిల్లాల కంటే కరీంనగర్ జిల్లాకు సీఎం ఎక్కువ నిధులు మంజూరు చేశారని తెలిపారు.

కోచ్ ఎంపికపై బీసీసీఐ విరుద్ధ ప్రకటన..

ఢిల్లీ : టీమిండియా కోచ్ ఎంపికపై బీసీసీఐ విరుద్ధ ప్రకటన చేసింది. కోచ్ ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ప్రకటించింది. కోచ్ గా రవిశాస్త్రి నియామకాన్ని బీసీసీఐ ధృవీకరించింది.

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం - కేఈ..

తూర్పుగోదావరి : రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరయ్యారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, రెవెన్యూ శాఖలో పలు మార్పులు తీసుకొస్తామన్నారు.

18:41 - July 11, 2017

తూర్పు గోదావరి : దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ప్రముఖ పరిశోధకుడు, జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్. దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. ఏపీ రైతు సంఘం 21వ రాష్ట్ర మహాసభల సందర్భంగా వ్యవసాయ సంక్షోభం అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నీటి సౌకర్యం, రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, విత్తనాలు వంటి అనేక అంశాలపై పార్లమెంటులో రైతులతో చర్చించాలని పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. 

ఎస్వీ జూ పార్కులో మరో ఘటన..

తిరుపతి : ఎస్వీ జూ పార్కులో వృద్ధ సింహం మృతి చెందింది. వయస్సు మీద పడిపోయిందని జూ అధికారులు పేర్కొంటున్నారు. ఎస్వీ జూ పార్కులో నిన్న జిరాఫీ మృతి చెందిన విషయం తెలిసిందే.

18:40 - July 11, 2017

గుంటూరు : జిల్లా పొన్నూరులో ఓ యువతి తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. స్థానికంగా బట్టల వ్యాపారం నిర్వహించే తరంగిపూడి హరిహరప్రసాద్‌ గుండెపోటుతో చనిపోయాడు. అతనికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో చిన్నకూతురు అలేఖ్య తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. అలేఖ్య రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. 

18:38 - July 11, 2017

నెల్లూరు : 10టీవీ చొరవతో కువైట్‌లో నిర్బంధంలో ఉన్న రవికి విముక్తి లభించింది. కువైట్‌ అరబ్‌ సేఠ్‌ల నిర్బంధంలో నెల్లూరు యువకుడు రవి చిక్కుకున్నాడన్న వార్తను టెన్‌ టీవీ ప్రసారం చేసింది. దీనికి స్పందించిన ఏపీఎన్‌ఆర్‌టీ అసోసియేషన్‌ సభ్యులు రవిని విడిపించి భారత ఎంబసీకి తీసుకువెళ్లారు. రవి 20 రోజుల్లో భారత్‌ చేరుకుంటారని ఏపీఎన్‌ఆర్‌టీ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు.టెన్ టివి ఎఫెక్ట్

 

లక్ష్మీ ప్రసన్నకు తహశీల్దార్ ఉద్యోగం..

విజయవాడ : సీఎం చంద్రబాబును లక్ష్మీ ప్రసన్న అనే యువతి కలిసింది. ఇటీవల అనంతపురంలో తండ్రి ఘాతుకానికి కుటుంబాన్ని కోల్పోయి లక్ష్మీ ప్రసన్న ఒంటరైన సంగతి తెలిసిందే. ప్రసన్నకు తహశీల్దార్ ఉద్యోగం ఇస్తానని బాబు హామీనిచ్చారు.ఇప్పటికే రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన బాబు ఆరు నెలలకొకసారి కలవాలని సూచించారు.

18:37 - July 11, 2017

ఢిల్లీ : అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడిని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ తీవ్రంగా ఖండించారు. యాత్రికులకు కేంద్రం పటిష్ట భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నిఘా వర్గాలు ముందుగా హెచ్చరించినా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఈ దాడి జరిగిందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ సరైన అభ్యర్థి అన్నారు. పశువధ నిషేధంపై సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడాన్ని ఏచూరి స్వాగతించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

18:36 - July 11, 2017

కరీంనగర్ : జిల్లా వేదికగా మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని రేపు సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ శర వేగంగా సాగుతున్నాయి. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే సభ కోసం ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియో చూడండి.

18:32 - July 11, 2017

హైదరాబాద్ :  బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతిప్పి ఢివైడర్ ను ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంతో రోడ్డు నెంబర్ 3లో భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కారు ప్రయాణిస్తున్న వారు ముక్తఫా ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. వీరు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కాలేజీకి వెళ్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. 

మట్టి మాఫియాపై పీడీ యాక్ట్ - తహశీల్దార్..

కృష్ణా : మైలవరం వెల్వడం మోదుగుల చెరువు కుంభకోణంపై తహశీల్దార్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మట్టి మాఫియాపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు, తవ్విన మట్టి రికవరీ జరిగే వరకు ఊరుకోమని తహశీల్దార్ హెచ్చరించారు.ఇటుక బట్టీలలో డంప్ సైతం వదలమని తెలిపారు.

అక్రమ గ్యాస్ ఏజెన్సీలపై దాడులు..

హైదరాబాద్ : నగరంలోని అక్రమ గ్యాస్ ఏజెన్సీలపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వనస్థలిపురంలో 114 సిలిండర్లు..2 బొలెరో వాహనాలను సీజ్ చేశారు. ఆదినారాయణమూర్తి అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.

కువైట్ రవికి విముక్తి..

హైదరాబాద్ : టెన్ టివి చొరవతో నెల్లూరు జిల్లా వాసి రవికి విముక్తి లభించింది. కువైట్ లో రవి క్షేమంగా ఉన్నారు. ఎంబీసీ అధికారులతో ఏపీఎన్ఆర్ సీ సభ్యులు సురేష్ నాయుడు, రాజశేఖర్, వైసీపీ నాయకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. మరో ఐదు రోజుల్లో రవి క్షేమంగా ఇండియా చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

18:22 - July 11, 2017

హైదరాబాద్ : నగర శివారు ఎల్బీనగర్ లో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు 600కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని స్మగ్లర్లు షోలాపూర్ నుంచి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.2కోట్ల పైనే ఉంటుందని అంచన వేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

రూ. 15 కోట్లతో హరితమిత్ర అవార్డులు - సీఎస్..

హైదరాబాద్ : హరితహారం కార్యక్రమంపై సీఎస్ ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుండి మూడో విడత హరితహారం కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రమంతా గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు కావాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మూడు రోజుల్లో అన్ని ప్రాంతాల్లో గ్రీన్ బ్రిగేడ్లు ఏర్పాటు కావాలని సీఎస్ సూచించారు. పర్యావరణం హితం కోసం ఫ్రెండ్స్ అనే హరితహారం గ్రూపులు ఏర్పాటు చేస్తామని, అన్ని వర్గాలను, ప్రాంతాలను కవర్ చేస్తూ ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాల్లో డివిజన్, కాలనీ, కమ్యూనిటీలు సమూహాలుగా పచ్చదనం కోసం పాటు పడేలా చూడాలన్నారు. హరిత తెలంగాణ కోసం కృషి చేసే వారిని ప్రోత్సాహించాలని, రూ.

ఎల్బీనగర్ లో గంజాయి స్వాధీనం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షోలాపూర్ నుండి తీసుకొచ్చిన ఈ గంజాయి మార్కెట్ విలువ రూ. 2 కోట్ల పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

17:52 - July 11, 2017

తూర్పు గోదావరి : జిల్లా ముక్తేశ్వరంలో ప్రోటోకాల్‌ వివాదం కలకలం రేపింది. వైవీఎస్ బీఆర్ఎం కాలేజీ వ్యవస్థాపకులు జస్టిస్‌ బి.ఏ.ఎస్‌ స్వామి 75వ జయంతి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మండలి ఇన్ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అయితే వేదికపైకి ఆహ్వానించే సమయంలో ప్రోటోకాల్‌ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోతుండగా.. మండలి ఇన్ఛార్జ్‌ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం కలగజేసుకున్నారు. కాలేజీ నిర్వాహకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత ఆయనే ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పి సభావేదిక వద్దకు తీసుకొచ్చారు. 

17:51 - July 11, 2017

నిజామాబాద్ : సీఎం కేసీఆర్‌ విద్యార్థుల, నిరుద్యోగ సమస్యలను విస్మరించారని... కాంగ్రెస్‌ నాయకుడు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ కాకుండా... బంగారు కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాడని విమర్శించారు. తాండూర్‌లో చత్రవాస్‌ అధికార్‌ పాదయాత్ర పేరుతో ఎన్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో చేపట్టిన 110 కిలోమీటర్ల పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 2019లో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాగానే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

17:50 - July 11, 2017

ఖమ్మం : జీఎస్టీ అమలును వ్యతిరేకిస్తూ ఖమ్మంలో గ్రానైట్ యాజమానులు ఆందోళన చేపట్టారు. జీఎస్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టొద్దని గ్రానైట్ యజమానులు కోరుతున్నారు.

 

జిల్లాకో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు:కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, జువైనల్ జస్టిస్ బోర్డులు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

17:32 - July 11, 2017

ఇంటికో ఉద్యోగం..ఉద్యోగం రాలేదా..అయితే నెలకు రెండు వేల నిరుద్యోగ భృతి..బాబుకు ఓటేస్తే జాబు..ఇలా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చేశారు..కానీ నిరుద్యోగ సమస్య తీరిందా ? ప్రతి ఇంటికో ఉద్యోగం వచ్చిందా ? ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి వచ్చిందా ? కానీ పాలకులు మాత్రం 2019 వరకు లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని మరోసారి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యే పనేనా ?

 

రాష్ట్ర విభజన...
టిడిపి...భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు గుప్పించింది. ఎన్నికల మేనిఫెస్టోలో అనేక వాగ్ధానాలు చేసింది. రాజధాని నిర్మాణం..తాత్కాలిక సచివాలయ నిర్మాణం..రైతులకు ప్లాట్లు..భూములు..అంటూ నెట్టుకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు..నదుల అనుసంధానం..పనులు చేపడుతున్నామని..అందరికీ న్యాయం చేస్తామని హామీలు గుప్పించింది. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే ఆందోళనలపై ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటోందని విపక్ష నేతలు పేర్కొంటున్నారు.

అధికారంలోకి వచ్చాక..మూడేళ్లు..
టిడిపి..అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. తమ సమస్యలు పరిష్కరించాలని..వాగ్దానాలు ఏమయ్యాయని ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రైతులు సమస్యలు..నిరుద్యోగ...వేతనాలు..కాంట్రాక్టు కార్మికులు..ఔట్ సోర్సింగ్ కార్మికులు..ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారు రోడ్డెక్కారు. ప్రభుత్వం విధానాలపై మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల జాబులు వస్తాయని విపక్షాలు చెబుతున్న మాటలను ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిరుద్యోగ సమస్య తీరి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంటోంది. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా నిరుద్యోగ సమస్య తీరలేదని..నోటిఫికేషన్ లు ఎప్పుడు విడుదల చేస్తారా ? అని నిరుద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

లోకేష్ హామీలు..
ఇటీవలే మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న నారా లోకేష్ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రాబోతున్నాయని, ఉద్యోగాలను సృష్టిస్తామని పేర్కొంటున్నారు. ఇటీవలే ఓ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా నారా లోకేష్ పలు వ్యాఖ్యానాలు చేశారు. 30 కంపెనీలు తెచ్చి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, రెండు నెలల్లో మరో 10-15 వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని...2019 కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుకొచ్చారు. 30 కంపెనీలలో 3వేల ఉద్యోగాలు అంటే ఒక్కో కంపెనీలో 100 మందికి ఉద్యోగం దొరికిందన్నమాట. 2019 నాటికి లక్ష ఉద్యోగాలు రావాలంటే ఏపీకి ఎన్ని పరిశ్రమలు రావాలి ?
లక్ష ఉద్యోగాలు సృష్టించడం అప్పటి వరకు సాధ్యమేనా ? అని నిరుద్యోగుల మనస్సుల్లో మెదులుతోంది. ఇప్పటికే ఎన్నికల వేడీ మొదలైందని..ఇది కూడా ఎన్నికల హామీలాగానే మిగులుపోతుందా ? అని ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో పాలకులు చెబుతున్న మాటలు అక్షరసత్యమేనా ? అనేది తేలనుంది....

17:28 - July 11, 2017

నెల్లూరు : కువైట్ అరబ్ సేఠ్ ల నిర్భంధంలో ఉన్న నెల్లూరు యువకుడు రవి భారత్ ఎంబసీకి చేరుకున్నారు. టెన్ టివి వరుస కథనాలతో స్పందించిన ఏపీఎన్ఆర్ టీ అసోసియేషన్ ప్రతినిధులు సహాయంతో రవి ఎంబసీ చేరుకునట్టు ఫోన్ ద్వారా తెలిపాడు. రవిని 20 రోజుల్లో భారత్ పంపిస్తామని ఏపీఎన్ ఆర్ఆర్ టీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

బస్సును ఢీ కొట్టిన కారు: ముగ్గురి మృతి

రంగారెడ్డి : మహేశ్వరం మండలం మొహబత్ నగర్ గేటు దగ్గర బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఏడీఈ నాగరాజు ఇళ్లపై కొనసాగుతున్న ఏసీబీ దాడులు

కర్నూలు : ఏడీఈ నాగరాజు ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఏడీఈ నాగరాజు బావమరిది బ్యాంకు ఖాతా నుంచి 365 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాక ఆళ్లగడ్డ ఆంధ్రా బ్యాంకులో 5 లాకర్స్ ఉన్నట్లు గుర్తించి.. రెండు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిచి 116 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

జడ్జి ఎదుట బ్లేడుతో కోసున్న అజీమ్

రంగారెడ్డి : రాజేంద్రనగర్ 8వ మెట్రో పాలిటన్ కోర్టులో జడ్జి ఎదుట బ్లేడుతో గాయపర్చుకున్న అజీమ్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. దొంగతనం కేసులో అజీమ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

 

3వ విడత హరిహారంపై టీఎస్ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: మూడో విడత హరితహారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో టీఎస్ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరిత హారంలో ప్రజల భాగస్వామ్యం, గ్రీన్ బ్రిగేడియర్ల ఏర్పాటు పై చర్చించారు. రేపటి నుండి మూడో విడత హరితహారం మొదలు కానుంది.

17:20 - July 11, 2017

రంగారెడ్డి : జిల్లా మహేశ్వరం మండలం మొహబాత్ నగర్ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మారుతీ కారు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ఎంజీబీఎస్ నుంచి ఆకుల మైలారం వెళ్తుతోంది. మారుతీ కారు కందుకూరు నుంచి హైదరాబాద్ కు వస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:18 - July 11, 2017

ముంబై : భారత్ క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రిని నియామించారు. సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ ఆడ్వజరీ కమిటీ రవిశాస్త్రిని ప్రకటించారు. రవి శాస్త్రి 2019 వన్డే కప్ వరకు భారత్ జట్టుకు కోచ్ గా కొనసాగుతారు. కోచ్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న క్రమంలో రవిశాస్త్రికి ఇంతకుముందు టీం ఇండియా డైరెక్టర్ పని చేసిన అనుభవం ఉండడంతో పాటు కోహ్లీ సపోర్ట్ ఉండడంతో ఆడ్వజరీ కమిటీ శాస్త్రికే ఓటు వేసినట్టు తెలిసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

భారత్ క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రి నియామకం

ముంబై : భారత క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రి ని నియమించారు. 2019 వరల్డ్ కప్ వరకు కోచ్ గా కొనసాగనున్నారు. అనిల్ కుంబ్లే స్థానంలో కోచ్ గా రవిశాస్త్రిని బిసిసిఐ నియమించింది.

 

16:41 - July 11, 2017

హైదరాబాద్ : జీఎస్టీ ప్రభావం సందేహాలపై ఎల్ఐసీ హైదరాబాద్‌ బ్రాంచ్‌1 ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్‌ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీఏ నీలేష్‌ విత్లాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జీఎస్టీతో లాభాలు ఉన్నట్లే సమస్యలు కూడా ఉన్నాయని...ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్నారు నీలేష్‌. జీఎస్టీ అమలుతో పాలసీలు తీసుకునేవారు ఆందోళనలో ఉన్నారని ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలని సీనియర్‌ ఏజెంట్‌ రాజేష్‌ మెహ్రా అన్నారు.  

16:39 - July 11, 2017

విశాఖ : ఏజన్సీ ప్రాంతంలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య వేదిక నేత డాక్టర్‌ గేయానంద్‌ డిమాండ్‌ చేశారు. విశాఖ ఏజెన్సీ జ్వరాల విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్తితి భిన్నంగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్‌ కాలేజీతో పాటుగా ఇన్ఫెక్షన్‌ డిసీజ్‌ రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేస్తే ఇక్కడి వ్యాధులపై పరిశోధన జరిగే అవకాశం ఉందన్నారు. 

ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ ఎన్నికలు:ఏచూరి

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ ఎన్నికలు అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. లౌకిక ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర సిద్ధాంతాలను కాపాడే వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండాలని పేర్కొన్నారు. గోపాలకృష్ణ ఓ గవర్నర్, ఐఏఎస్, విద్యావేత్త, సామాజికవేత్త అని, గోపాలకృష్ణ ను గాంధీ మనవడిగా దేశం గుర్తిస్తుందని ఏచూరి తెలిపారు.

 

16:38 - July 11, 2017

విశాఖ : జిల్లా వ్యాప్తంగా జరిగిన అన్ని భూభాగోతాలపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం. భీమిలి నియోజకవర్గంలో అన్యాక్రాంతమైన భూముల వివరాలను సీపీఎం నేతలు సిట్‌కు అందించారు. రెండు రోజుల్లో ఏజెన్సీలో అన్యాక్రాంతమైన భూముల వివరాలను కూడా సిట్‌కు అందిస్తామన్నారాయన. భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ..సిబిఐ విచారణ జరపాలని కోరారు లోకనాధం. 

16:37 - July 11, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు అయ్యింది. మహబూబు నగర్ కి చెందిన తమ్మప్ప అనే 60యేళ్ల వృద్ధుడికి హెచ్1ఎన్1 పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సీజన్ ప్రారంభమయ్యాక ఇది రెండో కేసుగా గాంధీ హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ శ్రవణ్‌ చెప్పారు. గతేడాది జనవరి నుంచి మొత్తం 162 కేసులు నమోదు కాగా.. అందులో 29 మంది చనిపోయారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల స్వైన్‌ ఫ్లూ ప్రమాదం పొంచి ఉందంటున్నారు వైద్యులు. 

16:35 - July 11, 2017

కడప : రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ కడప జిల్లాలో పర్యటించారు. కడప కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్ర విభజన సమయంలో 16 వేల కోట్ల లోటు బడ్డెట్‌ ఉన్నా ఆలోటు ఏర్పడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 2019లోగా అన్ని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేయిస్తామన్నారు. కాంగ్రెస్‌ పదేళ్లలో చేయని అభివృద్ధిని మూడేళ్లలో చేసి చూపించామని లోకేష్‌ అన్నారు.

 

16:27 - July 11, 2017

నెల్లూరు : కువైట్ దేశంలో నిర్భందంలో ఉన్న నెల్లూరు చెందిన వ్యక్తి రవి పై టెన్ టివి వరుస కథనాలతో కువైట్ ఉన్న భారతీయులు స్పందించారు. ఏపీఎన్ఆర్ టీ అసోసియేషన్ ప్రతినిధులు రవిని భారత ఎంబసీకి తీసుకెళ్లారు. రవి 20 రోజల్లో భారత్ చేరుకుంటారని ఏపీఎన్ఆర్ టీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

16:25 - July 11, 2017

చలన చిత్ర రంగ పరిశ్రమకు చెందిన ప్రముఖుల హీరోల సినిమాలు అప్పుడప్పుడూ బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతుంటాయి. దీనితో డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతుంటారు. దీనితో కొంతమంది హీరోలు..నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటూ మంచి మనస్సు చాటుకుంటారు. గతంలో పలు ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' తన చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 'సల్మాన్ ఖాన్' నటించిన 'ట్యూబ్ లైట్' రంజాన్ పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యింది.
గత చిత్రాల్లో లాగానే ఈ సినిమా కూడా ఘన విజయం సాధించి లాభాలు తెచ్చి పెడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆశించారు. కానీ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో 'సల్మాన్' తీవ్ర నిరాశలో మునిగిపోయారని తెలుస్తోంది. ఆయనకు ఎలాంటి నష్టం లేకున్నా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని టాక్. త‌మ‌కు న‌ష్ట‌ పరిహారం కావాలని డిస్ట్రిబ్యూటర్లు 'స‌ల్మాన్‌' తో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. దీనికి 'స‌ల్మాన్' అంగీక‌రించిన‌ట్లు తాజాగా ట్రేడ్ అన‌లిస్ట్ 'కోమ‌ల్ నాతా' వెల్ల‌డించారు. 'స‌ల్మాన్' పెద్ద మ‌న‌సు చాటుకున్నాడ‌ని, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు వ‌చ్చిన న‌ష్టాల‌ను తీర్చ‌డానికి ముందుకొచ్చాడ‌ని 'కోమ‌ల్' ట్వీట్ చేశాడు.

విశాఖ ఏజెన్సీలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ గేయానంద్

విశాఖ : ఏజెన్సీ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. కాలేఈతో పాటు, ఇన్ఫెక్షన్ డిసీజ్ సెంటర్ ఏర్పాటు చేయాలని,ఇన్సిస్టిట్యూట్స్ ఏర్పాటు తో వ్యాధులపై పరిశోధన జరిగే అవకాశం ఉందన్నారు.

ఉగ్రదాడిని ఖండించిన సీతారాం ఏచూరి

ఢిల్లీ: అనంత నాగ్ లో అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండిచారు. ఉగ్రదాడులు జరగకుండా చూడాలని గతంలో కేంద్రానికి సూచించామని ఏచూరి పేర్కొన్నారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఏచూరి సూచించారు. అమర్ నాథ్ యాత్రికులకు కేంద్రం సరైన భద్రత కల్పించాలని, ఇంటెలిజెన్స్ హెచ్చరించినా దాడులు జరగటంపై విచారణ చేపట్టాలని ఏచూరి డిమాండ్ చేశారు.

16:11 - July 11, 2017

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు ? విలన్ ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే వీటిపై తెగ గాసిప్స్ వచ్చేస్తున్నాయి. దాదాపు దశబ్దకాలం పాటు సినిమాకు దూరంగా ఉన్న 'చిరంజీవి' 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151వ సినిమాపై దృష్టి నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో 'చిరంజీవి' పవర్ పుల్ పాత్రలో నటించనున్నారని టాక్. కొణిదెల ప్రొడక్షన్ పై 'రామ్ చరణ్' చిత్రాన్ని నిర్మించనున్నారు. 'చిరు' 151వ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు రామ్ చరణ్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 'చిరంజీవి' సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ నటింప చేయాలని తొలుత అనుకున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ ల పేర్లు వినిపించాయి. టాలీవుడ్ లో అనుష్క..కాజల్..ఇతర హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా 'నయనతార' ఎంపిక చేసినట్లు తాజాగా వినిపిస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

16:10 - July 11, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతిప్పి ఢివైడర్ ను ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంతో రోడ్డు నెంబర్ 3లో భారీగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కారు ప్రయాణిస్తున్న వారు ముక్తఫా ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. వీరు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కాలేజీకి వెళ్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:01 - July 11, 2017

విజయనగరం : విజయనగరం జిల్లా టీడీపీకి కంచుకోట. పార్టీ వ్యతిరేక పవనాలు వీచిన సందర్భాల్లో కూడా తెలుగుదేశం ఎక్కువ సీట్లు గెలుచుకున్న జిల్లా. బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీలో ఇప్పుడు నయా జోష్‌ కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన మహంతి చిన్నంనాయుడు కొత్త కమిటీని నియమించుకున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా అధ్యక్షుడితోపాటు, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేసి, కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాక మంత్రి అశోక్‌ గజపతిరాజు సతీసమేతంగా హాజరై, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విభేదాలను పక్కనపెట్టి మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ శత్రచర్ల విజయరామరాజు వంటి దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత మహంతి చిన్నంనాయుడుకే దక్కింది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారు.

తూర్పుకాపు సామాజిక వర్గం
జిల్లాలో అత్యధికంగా ఉన్న తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన మహంతి చిన్నంనాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న తూర్పుకాపుల డిమాండ్‌ నెరవేరకపోవడంతో, జిల్లా పార్టీ అధ్యక్షుణ్ని ఈ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేశారు. వచ్చే ఎన్నికల్లో చరిత్ర సృష్టించేందుకు నేతలందరూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లా టీడీపీలో కనిపిస్తోన్న కొత్త ఉత్సాహం ఎన్నికల వరకు కొనసాగుతుందో లేదో చూడాల్సి ఉందని భావిస్తున్నారు. 

15:55 - July 11, 2017

నెల్లూరు : నన్ను బతికించండి ప్లీజ్‌ అంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్న ఇతని పేరు రవి. నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన ఇతను 2011లో కువైట్‌కు వెళ్లాడు. అక్కడ రుమితియా అనే సేఠ్ వద్ద కారుడ్రైవర్‌గా చేరాడు. 2016లో అక్కడి నుంచి తిరిగి భారత్‌కు వచ్చేశాడు. ఇక ఇక్కడే సెటిల్‌ అవుదామనుకున్నాడు. గౌరీతో పెళ్లి జరిగింది. ఆనందంగా ఉంటున్న తరుణంలో మళ్లీ కువైట్‌కు రావాలంటూ అక్కడి నుంచి యజమాని ఫోన్‌ చేశాడు. రెండు లక్షల రూపాయలు ఇస్తానని.. దాంతో పాటు జీతం కూడా పెంచుతానని హామీ ఇచ్చాడు. అప్పులు తీరాలంటే కువైట్‌ వెళ్లడమే శరణ్యమనుకున్న రవి.. భార్యను, తల్లి, దండ్రులను వదిలి కువైట్‌ వెళ్లాడు. రెండోసారి కువైట్‌ వెళ్లినప్పటి నుంచి రవికి చిత్రహింసలు తప్పడం లేదు. కారు పాడవడానికి రవే కారణమంటూ సేఠ్ చితకబాదాడు. పోలీసులతో కొట్టించారు. అంతేకాకుండా వీసా, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్, సెల్‌ఫోన్‌ లాగేసుకున్నారు. ఆరు రోజులుగా ఆహారం, నీరు ఇవ్వకుండా గదిలో బంధించారు. అయితే రవి వద్ద ఉన్న సీక్రెట్‌ ఫోన్‌తో తన దీనావస్థను చిత్రీకరించి నెల్లూరులోని తన బంధువులకు పంపించాడు.

డెలివరీ అయిన రవి భార్య గౌరి..
ఇటీవలే డెలివరీ అయిన రవి భార్య గౌరి.. కువైట్‌లో తన భర్త పడుతున్న బాధలను చూసి కన్నీరు మున్నీరవుతోంది. వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటున్న కొడుకు దేశంకాని దేశంలో చిక్కుకుపోయాడని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. రవిని ఎలాగైనా విడిపించాలని జిల్లా ఎస్పీని, కలెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. రవి పంపిన వాట్సప్‌ వీడియోలను చూపించారు. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు సైతం మెయిల్‌లో విషయం తెలిపారు. మీడియాను ఆశ్రయించి తమ గోడు చెప్పుకున్నారు. అరబ్బు షేక్‌ల నిర్బంధంలో ఎంతోమంది భారతీయులు చిత్రహింసలకు గురవుతున్నారని రవి ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగ కష్టపడుతున్నవారికి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యంచేసుకుని రవికి విముక్తి కల్పించాలని టెన్‌టీవీ కోరుకుంటోంది. 

15:44 - July 11, 2017

విశాఖ : జీవో నంబర్ 279 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటియూ ఆధ్వర్యంలో మద్దెలపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించమంటున్నారు కార్మికులు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

15:42 - July 11, 2017

చిత్తూరు : చంద్రబాబు సర్కార్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ జగన్ ప్రకటించిన 9 హామీలు అమలుకావని మంత్రులు, ఎమ్మెల్యేలు అనడం ఆశ్చరంగా ఉందన్నారు. ఈ విషయంలో బహిరంగచర్చకు తామూ సిద్ధమని సవాల్ విసిరారు. ఐదేళ్లలో 10 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉంటుందని..ఆ బడ్జెట్‌తో హామీలన్నీ నెరవేర్చడం సాధ్యమే అన్నారు. చంద్రబాబు రేపు రాజీనామా చేస్తే హామీలు ఎలా అమలు చేయాలో జగన్‌ చేసి చూపిస్తారన్నారు.

 

15:41 - July 11, 2017

చిత్తూరు : రుమలలో టీటీడీకి చెందిన కాటేజీ నంబర్ 154లో చోరీ జరిగింది. కృష్ణాజిల్లా భక్తులకు సంబంధించిన ఆరు సెల్‌ ఫోన్లు, ఓ కెమెరాను దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం సాయంత్రం గదికి తాళం వేసుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి వచ్చేసరికి చోరి జరిగినట్లు భక్తులు చెబుతున్నారు. బాధితులు తిరుమల క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు.

15:40 - July 11, 2017

పాదయాత్ర...అధికారంలోకి రావడానికి పాదయాత్రలు ఒక్కటే పరిష్కారమా ? తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు అనుకోండి. తాజాగా ఏపీలో పాదయాత్రలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే తాను పాదయాత్ర చేపడుతున్నట్లు వైసీపీ అధ్యక్షుడు 'జగన్' సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో అక్టోబర్ 27వ తేదీ నుండి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఒక్కసారిగా పాదయాత్రలపై సోషల్ మీడియాలో తెగ కథనాలు వెలువడుతున్నాయి. జగన్ పాదయాత్రకు అడ్డంకులు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

2004...నుండి..
2004 ఎన్నికలంటే ముందు 'ప్రజాప్రస్థానం' పేరిట దివంత రాజశేఖరరెడ్డి సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. 2009లో వైఎస్ మృతి అనంతరం తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్రమంతటా కలియతిరిగి అధికారం చేజిక్కించుకున్నారు. వైఎస్ మృతి అనంతరం ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నుండి బయటకొచ్చిన జగన్ 'వైఎస్సార్ సీపీ' పేరిట పార్టీని ఏర్పాటు చేశారు.

షర్మిల పాదయాత్ర..
ఈ నేపథ్యంలో 'జగన్' జైలు పాలు కావడంతో ఆయన సోదరి షర్మిల రంగ ప్రవేశం చేశారు. 'మరో ప్రజా ప్రస్థానం' పేరిట జనాల్లోకి వెళ్లారు. తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు 'జగన్' ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఆయన ఎన్నికల హామీలను గుప్పించారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని..ఇందుకు తగిన విధంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అందులో భాగంగా తాను పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు.

అడ్డంకులు ?
కానీ జగన్ పాదయాత్రకు అడ్డంకులున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే పలు పాదయాత్రలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదనేది తెలిసిందే. అనుమతి లేనిదే పాదయాత్ర చేయవద్దని ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప..కాపు ఉద్యమ నేత ముద్రగడకు తెలియచేసిన సంగతి తెలిసందే. పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జగన్ కు ప్రభుత్వం సూచనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాదయాత్రకు జగన్ ప్రభుత్వ అనుమతి కోరుతారా ? ఇందుకు ప్రభుత్వం సమ్మతిస్తుందా ? అనేది తెలియరావడం లేదు.

కోర్టులు..
ఇక రెండోది..కోర్టు కేసులు..అక్రమాస్తుల కేసులో జగన్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా తరచూ కోర్టుకు కూడా హాజరు కావాల్సి వస్తోంది. కొన్ని సమయాల్లో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపులు పొందుతున్నారు. ఇటీవలే ప్లీనరీ సందర్భంగా జగన్..విజయసాయిరెడ్డిలు హాజరు కాకపోవడాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు హాజరయ్యే అంశాన్ని ఎలా మేనేజ్ చేస్తారు ? కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు ఎలా తీసుకొస్తారు ? అన్న ప్రశ్న తలెత్తుతున్నాయి.
రానున్న రోజుల్లో జగన్ పాదయాత్రలపై క్లారిటీ రానుంది.

జగిత్యాల పీఎస్ ఎదుట రైతుల ఆందోళన

జగిత్యాల: పోలీస్ స్టేషన్ ఎదుట 200ల మంది రైతులు ధర్నా చేపట్టారు. బ్యాంకులు తమ పంట డబ్బులను సమయానికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతుల ధర్నాతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

15:33 - July 11, 2017

నెల్లూరు : కువైట్ లో నిర్భంధంలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన రవి విషయాన్ని టెన్ టివిలో ప్రసారం చేసిన వరుస కథనాలకు జిల్లాలోని నాయకులు స్పందించారు. కువైట్ లో ఉన్న ఫ్రెడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ రవితో మాట్లాడారు. రవిని ఇండియాకు తీసుకొస్తామని ఆయన తెలపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:22 - July 11, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతిప్పి ఢివైడర్ ను ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కడప కలెక్టరేట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

కడ: కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.

బంజారాహిల్స్ లో డివైడర్ ను ఢీకొన్న కారు:ఒకరి మృతి

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం 3 జంక్షన్ దగ్గర ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు డివైడర్ ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణీస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

14:48 - July 11, 2017

టాలీవుడ్ లో విలన్ లు హీరోలవుతున్నారు..హీరోలు విలన్ లు అవుతున్నారు. ఇటీవలీ కాలంలో విలన్ ను స్టైలిష్ గా చూపిస్తూ..కొత్తదనం క్రియేట్ చేస్తున్నారు. స్టైలిష్ విలన్ గా 'జగపతి బాబు' పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. దీనితో కొంతమంది విలన్ గా నటించేందుకు ముందుకొస్తున్నారు. పోలీసు పాత్రలకు న్యాయం చేసే నటుల్లో 'రాజశేఖర్' ఒకరు. ఆయన తొలుత విలన్ పాత్రలు పోషించి..హీరో అయిన సంగతి తెలిసందే. ఆయన హీరోగా నటించిన పలు చిత్రాలు డిజాస్టర్ అవుతుండడంతో విలన్ పాత్రలపై వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హీరోగా భారీ బడ్జెట్ తో 'గరుడ వేగ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను 'రాజశేఖర్' వెల్లడించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
'రామ్ చరణ్' నటించిన 'ధృవ' సినిమాలో విలన్ గా తానే నటించాల్సి ఉందని..కానీ 'అరవింద్ స్వామి'తో నటింప చేశారని పేర్కొన్నారని కథనాల సారాంశం. తాజాగా 'బాలకృష్ణ'..102వ సినిమాలో కూడా విలన్ గా నటించాలని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు..కానీ ఆ విలన్ పాత్ర రోటీన్ గా ఉండడంతో తాను ఒప్పుకోలేదని ఇంటర్వ్యూలో వెల్లడించినట్లు తెలుస్తోంది. మంచి కథ..విలన్ పాత్ర వస్తే నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని 'రాజశేఖర్' పేర్కొన్నట్లు టాక్. మరి ఆయన విలన్ గా చూపించడానికి ఏ దర్శకులు ప్రయత్నిస్తారో వేచి చూడాలి.

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు:రోజా

తిరుపతి: సీఎం చంద్రబాబు, మంత్రులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు పాలనా అనుభవం దోచుకోవడానికే పనికొచ్చిందని, మద్యం షాపులతో ఆడవాళ్ల తాళిబొట్టును చంద్రబాబు తెంపుతున్నాడని ఆరోపించారు. మంత్రులకు ఆడవాళ్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ హామీలపై మంత్రుల సవాల్ ను స్వీకరిస్తామని, చంద్రబాబు ను రాజీనామా చేసిన జగన్ ను సీఎం చేయమనం అని, హామీలను ఎలా నెరవేర్చుతామో చేసి చూపుతామని రోజా చెప్పారు.

14:40 - July 11, 2017

కాశ్మీర్ : సరిహద్దులో ఉగ్రవాదం.. భారత్‌కు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంది. ముఖ్యంగా అమాయక అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా.. ఉగ్ర ముష్కరులు దాడులకు తెగబడుగున్నారు. ఫలితంగా ఎంతోమంది అమాయక ప్రజలు బలవుతున్నారు. భారతదేశంలోని ప్రధాన నగరాలతోపాటు ఆధ్యాత్మిక యాత్రలనూ ఉగ్రవాదుల టార్గెట్‌ చేసుకున్నారు. తాజాగా అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి చేసి ఏడుగురిని హతమార్చారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడి మొదటిదేం కాదు. ఇంతకుముందు కూడా ఉగ్రవాదులు అనేకసార్లు అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడులకు పాల్పడ్డారు. 1993లో మొదటిసారి ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రికులను టార్గెట్‌ చేశారు. యాత్రికుల బృందంపై బాంబులతో దాడికి తెలగబడ్డారు. అప్పటి దాడిలో ముగ్గురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఆతర్వాత 1994లోనూ మరోసారి అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరు చనిపోయారు. 1995లోనూ ఉగ్రవాదులు దాడి చేసినా.. యాత్రికులు త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. 2000 సంవత్సరం ఆగస్టు 1న పహల్గావ్‌ దగ్గర అమర్‌నాథ్‌ యాత్రికులపై కశ్మీర్‌ వేర్పాటు వాదులు కాల్పులు జరిపారు. ఇందులో 30 మంది చనిపోయారు. 2001లోనూ అమర్‌నాథ్‌ యాత్రికులపై కాశ్మీరీమిలిటెంట్లు రెండు బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ బాంబు దాడుల్లో 10మంది యాత్రికులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు. 2002లో యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు ఘటనల్లో 12మంది మృతి చెందారు. ఇక 2003లో మరోసారి ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 8మంది యాత్రికులు చనిపోయారు. మంచులో కూరుకుని మరో బ్రిగేడియర్‌ మృతి చెందారు. ఇలా పలుమార్లు అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదులు, కశ్మీరీ వేర్పాటువాదులు దాడులు చేసి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు.

 

14:34 - July 11, 2017
14:33 - July 11, 2017

ఢిల్లీ : ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 17 ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే చర్చకు వచ్చింది. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌గా పనిచేశారు. ఐఏఎస్‌ అధికారిగా గోపాలకృష్ణ గాంధీ పదవీ విరమణ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 5న జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్‌ జరగనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాలుష్య రహిత ఆటోలను ప్రారంభిచిన సీఎం చంద్రబాబు

అమరావతి: విజయవాడ మున్సిల్ కార్పొరేషన్ లోచెత్త సేకరణకు కాలుష్య రహిత ఆటోలను, స్టార్ట్ ఆటోలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు ప్రయోగాత్మకంగా 10 ఆటోలను అందుబాటులోకి తెచ్చారు

14:03 - July 11, 2017

కేంద్రప్రభుత్వంతో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రజలపై భారం పడుతుందని వక్తలు అన్నారు. జీఎస్టీ... మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే అంశంపై మావని వేదిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అరుణజ్యోతిక్, ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకురాలు అరుణజ్యోతి, గృహిణి రేఖ, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని జాహ్నవి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:54 - July 11, 2017
13:53 - July 11, 2017
13:51 - July 11, 2017

సిద్ధిపేట : జిల్లాలోని బస్వాపూర్‌ గ్రామపంచాయితీ పరిధిలోని కనిలభాయ్‌ తండాలో.. ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి. వేటగాళ్లు వన్య ప్రాణుల కోసం అమర్చిన వలలో ఒక ఎలుగు బంటి చిక్కుకోగా.. మరో ఎలుగు బంటి దాడికి యత్నించింది. దీంతో వేటగాళ్లు వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు.  ఎలుగు బంటి చిక్కుకున్న ప్రాంతానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మరో ఎలుగు బంటి కూడా అదే ప్రాంతంలో సంచరిస్తుండటంతో పోలీసులకు, అటవీశాఖ అధికారులకు.. గ్రామస్థులు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు వలలో చిక్కుకున్న ఎలుగు బంటిని బంధించారు. మెదక్‌ రెస్క్యూ సిబ్బంది వల విసిరి పట్టుకొని బోనులో బంధించారు. ఎలుగుబంటి కాలికి గాయమవ్వడంతో చికిత్స చేసేందుకు అటవీ శాఖ అధికారులు.. వైద్యులకు సమాచారం అందించారు. మరో ఎలుగుబంటి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. దీంతో గ్రామస్థులు పొలాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. 

 

13:48 - July 11, 2017

హైదరాబాద్ : వీఎస్‌టీ చౌరస్తాలో రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం చేశారు. ట్రాఫిక్‌ సమస్యలకు కారణమవుతున్న గోడలను తొలగించి రోడ్డు వైడనింగ్ చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.  వీఎస్‌టీ చౌరస్తాలో బాగ్‌లింగంపల్లి వెళ్లేదారిలో బస్సు టర్నింగ్‌ చేసుకోవాలంటే నానా యాతన పడుతున్నారని అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. లేనిపక్షంలో తాము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 


 

13:44 - July 11, 2017

హైదరాబాద్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదించాలని సీపీఎం తెలంగాణ కమిటీ  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఈ ప్రదర్శనల్లో పాల్గొనాలని  పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. 

13:44 - July 11, 2017
13:37 - July 11, 2017

ఢిల్లీ : ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా 17 ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోపాలకృష్ణ గాంధీ పేరు మాత్రమే చర్చకు వచ్చింది. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌గా పనిచేశారు. ఐఏఎస్‌ అధికారిగా గోపాలకృష్ణ గాంధీ పదవీ విరమణ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 5న జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్‌ జరగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:16 - July 11, 2017
13:15 - July 11, 2017
13:12 - July 11, 2017

జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్‌ మండలంలోని చర్లపల్లి గ్రామంలో.. దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని, ప్రియురాలి బంధువులు చంపిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. గత ఆరేళ్లుగా సుధాకర్‌, సుమ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సుమ బంధువులు సుధాకర్‌ను పిలిచి ప్రేమ విషయం గురించి మాట్లాడుతుండగా.. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో సుమ బంధువులు సుధాకర్‌పై గొడ్డలితో దాడి చేశారు. సుధాకర్‌కు బలమైన గాయాలవ్వడంతో.. ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా..

 

13:09 - July 11, 2017

నిర్మల్ : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా  పచ్చని పంట పొలాల నుంచి 15 మీటర్ల లోతున కాల్వ తవ్వుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరించకుండా,  పరిహారం చెల్లించకుండా భూములు లాక్కోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

13:07 - July 11, 2017

విశాఖ : స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే.. పదే పదే పరీక్షలను రద్దు చేయాల్సిన దుస్థితి వచ్చిందని స్టీల్‌ యూనియన్ నేతలు, అభ్యర్థులు మండిపడుతున్నారు. పదే పదే ఉద్యోగ పరీక్షలను రద్దు చెయ్యడాన్ని నిరసిస్తూ.. అభ్యర్థులు స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగారు. పరీక్షలు నిర్వహిస్తున్న ఎబీసీ కన్సల్టెన్సీ పై చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థులు, కార్మిక సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:04 - July 11, 2017

కృష్ణా : జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌లో దారుణం జరిగింది. తాగిన మైకంలో ఇద్దరు వ్యక్తులు పరస్పర దాడి చేసుకున్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే  మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హనుమాన్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో బీహార్‌కు చెందిన పది కుటుంబాలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. విభేదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు దాడులు చేసుకోవడంతో ఈ దారుణం జరిగింది. నూజివీడు రోడ్డులోని వంతెనపై మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హనుమాన్‌ జంక్షన్‌ దాడుల ఘటనతో దీనికి లింకు ఉందా .. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:00 - July 11, 2017

నెల్లూరు : జిల్లాలోని ఆత్మకూరులో న్యాయం కోసం వృద్ధ దంపతుల పోరాటానికి దిగారు. కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకొని.. తమ కుమారులు వారిని ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో న్యాయం చేయాలంటూ వృద్ధ దంపతులు మౌనదీక్ష చేపట్టారు. 

 

12:57 - July 11, 2017

కృష్ణా : విజయవాడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పేగుతెంచుకు పుట్టినవారే వారిని భారంగా భావించారు. మలివయసులో అండగా ఉండాల్సిన వారే ఆదరించలేదు. తోడుగా ఉంటారనుకున్న వారు దగ్గరికి రానివ్వలేదు. బతుకుభారమై అష్టకష్టాలు పడుతున్నా అండగా నిల్వలేదు. దీంతో విజయవాడలోని కృష్ణలంకలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.  కోదండరామాలయం వీధికి చెందిన బచ్చు సత్యనారాయణ, కనకదుర్గ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు.  సత్యనారాయణ ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. వృద్ధాప్యం మీదపడడంతో పనిమానేశాడు. అయితే మలిసంధ్యలో అండగా నిలుస్తారన్న కుమారులు పట్టించుకోలేదు. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా అండగా నిలువలేదు. దీంతో ఆ వృద్ధదంపతులు ఆవేదనకు గురయ్యారు. మనస్తాపంతో కుంగిపోయారు. పేగుతెంచుకు పుట్టిన వారికి భారంగా మారామని భావించారు. మనస్తాపంతో ఈ ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కృష్ణలంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

12:54 - July 11, 2017

హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల్లో  పది కోట్ల రూపాయలు చెల్లించేందుకు పిటిషనర్‌, గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. సొమ్మును ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:51 - July 11, 2017

ఢిల్లీ : అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి వెనుక  లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ దాడికి సూత్రధారి పాక్‌ ఉగ్రవాది ఇస్మాయిల్‌ అని జమ్ము-కశ్మీర్‌ పోలీసులు ప్రకటించారు. అనంతనాగ్‌ దాడి తర్వాత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు  3,289 మంది యాత్రికులు భగవతి నగర్‌ యాత్రీ నివాస్‌ నుంచి అమర్‌నాథ్‌ బయలుదేరారు. మొత్తం 185 వాహానాల్లో వీరిని తీసుకెళ్తున్నారు. అనంతనాగ్‌లో అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడి నిరసిస్తూ  విపక్షాల పిలుపు మేరకు జమ్ము-కశ్మీర్‌లో రెండు రోజుల బంద్‌ జరుగుతోంది.  విద్యాసంస్థలను మూసివేశారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఈ దాడిపై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, రా, ఐబీ చీఫ్‌లతోపాటు సైనిక, పారామిలటరీ బలగాల ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో భద్రతపై జమ్ము-కశ్మర్‌ గవర్నర్‌ వోహ్రా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతనాగ్‌ దాడిలో  మృతులకు రాష్ట్ర గవర్నర్‌ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబూ ముఫ్తీ నివాళులర్పించారు. సీఎం ముఫ్తీ అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి, శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర బృందం అనంతనాగ్‌లో పర్యటించనుంది. 

 

రాజ్ నాథ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ...

ఢిల్లీ: కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై రాజ్ నాథ్ కు గవర్నర్ వివరించినట్లు సమాచారం.

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ!?

ఢిల్లీ: సోనియాగాంధీ అధ్యక్షన విపక్షాల భేటీ కొనసాగుతోంది. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని ఎన్నుకున్నట్లు సమాచారం. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది :తమ్మినేని

హైదరాబాద్: వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని తెలంగాణ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేవారు. అంతే కాకుండా మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

వర్షాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం చేయాలి: తమ్మినేని

హైదరాబాద్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ చట్టం చేయాలని 15న ధర్నాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పై కేసీఆర్, చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

కాసేపట్లో జమ్మూకశ్మీర్ కేబినెట్ అత్యవసర భేటీ

హైదరాబాద్: ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జమ్మూకశ్మీర్ కేబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది.

'ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే రప్పించాలి'

హైదరాబాద్: సచివాలయం ఎదుట నాల్గో తరగతి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణకు రప్పించాలని డిమాండ్ చేశారు. అప్పమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

కువైట్ లో నెల్లూరు యువకుడు రవి నిర్భంధంపై ఎంపి స్పందన

నెల్లూరు: కువైట్ లో నెల్లూరు యువకుడు రవి నిర్బంధంపై '10టివి' కథనానికి ఎంపి వరప్రసాద్ రావు, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్థన్ స్పందించారు. రవి నిర్భంధం పై ప్రధాని, విదేశాంగ మంత్రిత్వ శాఖకు '10టివి'లో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్ పంపించారు. కువైట్ లో రవి నిర్బంధం పై ప్రధాని మోదీతో మాట్లాడుతానని, కువైట్ లో ఇబ్బందులు పడుతున్న వారిని భారత్ కు తీసుకురావడం పై పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానని ఎంపి తెలిపారు.

సోనియా అధ్యక్షతన విపక్షాల సమావేశం...

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియగాంధీ అధ్యక్షతన 18 విపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక పై చర్చిస్తున్నట్లు సమాచారం.

11:59 - July 11, 2017

హైదరాబాద్ : వీబీఐటీ విద్యార్థి గణేష్ మిస్సింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గణేష్ ఫేస్ బుక్ లొకేషన్ ను గుర్తించే పనిలో రాచకొండ పోలీసులు ఉన్నారు. గణేష్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే మీడియాలో కథనాలు వస్తున్నా.. గణేష్ స్పందించకపోవడం, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:58 - July 11, 2017

సన్నని చినుకులు పడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరంలో తినేందుకు ఎంతో రుచిక‌రంగా ఉండే మొక్క‌జొన్న అంటే దాదాపుగా అంద‌రికీ ఇష్ట‌మే. ఉడ‌క‌బెట్టినా, నిప్పుల‌పై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న రుచే వేరబ్బా.. ఈ సీజ‌న్‌లో మొక్క‌జొన్న ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే మొక్కజొన్న‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలో తెలుసుకుందా..

 

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్‌ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

మొక్క‌జొన్న‌లో విట‌మిన్ సి, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్తంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. దీనివ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.

కీళ‌నొప్పులతో బాధ ప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బీటా కెరోటిన్‌, విట‌మిన్- ఎ లు ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది. దృష్టి సంబంధ స‌మస్య‌లు తొల‌గిపోతాయి. పీచు, కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌వ‌చ్చు. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్క‌జొన్న‌ల్లో అధికంగానే ఉంటుంది.

ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది.

మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులూ స్టెరాల్స్‌ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.

మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. చూశారుగా... మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో... అయితే తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్‌ సిరప్‌ను ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్‌ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త!

 

11:41 - July 11, 2017

హైదరాబాద్ : టీ.ప్రభుత్వం రేపటి నుంచి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జీహెచ్ ఎంసీ అడిషనల్ కమిషనర్ రవిప్రసాద్ టెన్ టివితో మాట్లాడారు. ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హరితహారం కార్యక్రమంలో ఈసారి నగరవాసులను అత్యధికంగా భాగస్వామ్యులను చేయాలని భావిస్తున్నామని చెప్పారు. గతేడాది హరితహారం కార్యక్రమంలో 517 ప్రాంతాల్లో 2లక్ష 10 వేల మొక్కలు నాటామని తెలిపారు. 95 శాతం మొక్కలు పెరిగాయని చెప్పారు. గతంలో నాటిన మొక్కలను రీ విజిట్ చేస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

సదావర్తి భూముల పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: సదావర్తి భూముల పై హైకోర్టులో విచారణ జరిగింది.రెండు వారాల్లో రూ.10కోట్లు కట్టేందుకు పిటిషనర్ ఆళ్ల రామకృష్ణ రెండు వారాల్లో రూ.10కోట్లు కట్టేందుకు అంగీకరించారు. ఏపీ ఎండోన్మెంట్ కమిషనర్ కు చెల్లించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.

హరిత హారం కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు...

హైదరాబాద్: హరితహారం కార్యక్రమానికి విసృత ఏర్పాట్లు చేశారు. కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా జీహెచ్ ఎంసీ ఏర్పాట్లు చేసింది. గత ఏడాది నాటిన మొక్కల పరిస్థిని అధికారులు పరిశీలించారు.

11:20 - July 11, 2017

జై లవకుశలో 'జై' పాత్రను గతంలో ఎన్టీఆర్ కు పూరిజగన్నాథ్ చెప్పిన ఓ సినిమా కథ నుంచి కాపీ కొట్టారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 2 రోజులుగా టాలీవుడ్ లో ఈ వార్త దుమారం రేపింది. దీనిపై అటు ఎన్టీఆర్, ఇటు పూరిజగన్నాథ్ ఎవరూ ఓపెన్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ మేటర్ పై ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ చర్చించుకొని రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది.

యంగ్‌టైగర్‌ ఎన్టీయార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలవకుశ’. డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. అయితే తాను గతంలో చెప్పిన ఐడియాను ఎన్టీయార్‌ ఈ సినిమాలో ఉపయోగించుకున్నారని దర్శకుడు పూరీ ఆరోపించినట్టు ఓ ఆంగ్ల పత్రికలో ఓ కథనం రావడం సంచలనమైంది.

ఇది పెద్ద వివాదంగా మారే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్టీయార్‌, పూరీ జగన్నాథ్‌ రాజీ పడినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరూ ఈ విషయమై చర్చించుకుని రాజీ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు మరోసారి డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తానని పూరీకి ఎన్టీయార్‌ మాటిచ్చాడని.. దీంతో పూరీ కూడా సైలెంట్‌ అయినట్టు తెలుస్తోంది. ఇకపై ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడనని ఎన్టీయార్‌కు పూరీ హామీ ఇచ్చినట్లు గా తెలుస్తోంది.

11:07 - July 11, 2017
11:06 - July 11, 2017

ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ముంబైలోని అల్టామౌంట్‌ రోడ్డులోవున్న అంటీలియాలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో 27 అంతస్తుల ఈ ఇంట్లో తొమ్మిదో అంతస్తు నుంచి మంటలు ప్రారంభమై.. సమీపంలోని 4జీ సెల్‌ టవర్‌కు వ్యాపించినట్లు తెలిపారు. 6 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయన్నారు. ఆస్తి నష్టం భారీగానే వుంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఈ భవనాన్ని ఏడేళ్ల కిందట ముఖేష్ అంబానీ నిర్మించిన విషయం తెలిసిందే.

పిఠాపురం ఎస్సీ హాస్టల్ లో ఏసీబీ తనిఖీలు...

తూ.గో: పిఠాపురం ఎస్సీ హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

10:55 - July 11, 2017

తమిళనాడు : అమెరికా, జపాన్‌ లతో కలిసి భారత నావికాదళం విన్యాసాలకు సిద్ధమయ్యింది. ఈ నెల 14 నుండి 17 వరకు చెన్నై సముద్ర తీర ప్రాంతంలో మల్‌బార్‌ 2017 పేరుతో నౌకా విన్యాసాలు జరుగనున్నాయి.  ఇప్పటికే చెన్నై తీరానికి జపాన్‌, అమెరికా దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకలు చేరుకున్నాయి. వీటికి  భారతీయ నావికాదళం సాధరంగా ఆహ్వానం పలికింది. ఈ పరేడ్‌లో మూడు దేశాల నావికాదళ కమాండర్స్‌తో పాటు 900 మంది సైన్యం పాల్గొంటోంది. సరిహద్దు రక్షణ చొరబాట్లు, అంతర్జాతీయ భద్రతపై సవాళ్లను అధిగమించేందుకు ఈ శిక్షణా విన్యాసాలు ఉపయోగపడనున్నాయి.

10:53 - July 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా హరితహారం కార్యక్రమానికి జీహెచ్ ఎంసీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. పెట్టిన ప్రతీ మొక్కను కాపాడటానికి ప్రయత్నిస్తామని చెప్పారు. అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంచామని తెలిపారు. మొక్కల వివరాలను వెబ్ సైట్ ఉంచామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

రైల్వే కోడూరుకు మంత్రి నారా లోకేష్

కడప: ఏపీ మంత్రి నారా లోకేష్ రైల్వే కోడూరుకు చేరుకున్నారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ సరిగా జరగలేదని ఉప్పర్ పల్లిలో లోకేష్ ఎదుట మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

గణేష్ మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: వీబీఐటీ విద్యార్థి గణేష్ మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. రాచకొండ పోలీసులు గణేష్ ఫేస్ బుక్ లొకేషన్ గుర్తించే పనిలో పడ్డారు. గణేష్ హైదరాబాద్ లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం.

10:47 - July 11, 2017

సాహో సినిమా నుండి జేజమ్మ ఔట్ అనే టాక్ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా లో హీరోగా ప్రభాస్ నటిస్తున్నాడు. బాహుబలి2 తర్వాత.. తన జోరు కొనసాగించేందుకు సాహోతో తప్పనిసరిగా.. నేషనల్ వైడ్ గా మంచి సక్సెస్ సాధించాల్సి ఉంది. అందుకే ఈ సినిమా మేకర్స్ అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టెయినర్ కావడంతో.. హీరోయిన్ బబ్లీగా ఉంటే చూసేందుకు ఎబ్బెట్టుగా ఉంటుందని మేకర్స్ భావన. పలు చిత్రాల్లో ప్రభాస్ సరసన నటించి మెప్పించిన అనుష్క కొంత బరువు తగ్గాలని సాహో దర్శక, నిర్మాతలు సూచించారట. అనుకున్న బరువు కంటే ఇంకా 8 కిలోల వరకూ ఎక్కువగానే ఉందట అనుష్క. దీంతో మరో హీరోయిన్ ను వెతుక్కునేందుకు సాహో మేకర్స్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

10:36 - July 11, 2017

ఢిల్లీ : అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము, కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య అమర్‌నాథ్‌కు యాత్రికులు బయలుదేరారు. అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జమ్మూలో ఇంటర్‌నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. కశ్మీర్ లో పరిస్థితిపై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చిస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు జమ్మూలో రెండు రోజుల బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో రెండు రోజులపాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:30 - July 11, 2017

హైదరాబాద్: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ తన తండ్రి అని సంచలన ప్రకటన చేసింది ప్రియాసింగ్‌పాల్. విడుదలకు రెడీ అయిన బాలీవుడ్ ఫిల్మ్ ‘ఇందూ సర్కార్‌’లో తన తండ్రి చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపిస్తూ 48 ఏళ్ల ప్రియాసింగ్‌ మీడియా ముందుకొచ్చారు.సినిమాలో 30 శాతం నిజాలుంటే, 70 శాతం అబద్ధాలున్నాయని ఆమె అన్నారు. ఈ విషయమై మూవీ డైరెక్టర్‌ మధు బండార్కర్ కి లీగల్‌ నోటీసులు సైతం పంపానని తెలిపారు. అయితే భరత్ షా నిర్మాతగా వ్యవహరించారు. అంతేగాక, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహాలానీ ఈ చిత్ర విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

1968లో పుట్టానని, తనను చిన్నప్పుడే షీలా‌సింగ్- బల్వంద్‌ పాల్‌ దంపతులు దత్తత తీసుకున్నారని, పెళ్లికాక ముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని ఈ విషయాన్ని తన పెంపుడు తల్లిదండ్రులు చెప్పినట్టు వివరించారు. తాను పేరు కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం లేదని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకేనని ప్రియాసింగ్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సోదరి విమలా గుజ్రాల్ ద్వారా తనకు తాను ‘సంజయ్ గాంధీ రక్తం పంచుకుపుట్టిన కూతురు'ననే విషయం తెలిసినట్లు తెలిపారు. ఈ విషయాల పై గాంధీ కుటుంబం ఇప్పటి వరకు స్పందించలేదు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. సంజయ్- మేనకాల కుమారుడు వరుణ్ గాంధీ యూపీ నుండి లోక్ సభ్యులుగా ఉన్నారు.

హోంమంత్రి రాజ్ నాథ్ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ మీటింగ్

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ మీటింగ్ జరుగుతోంది. అమర్ నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్ల పై చర్చిస్తున్నట్లు సమాచారం. దాడి ఘటన వివరాలను కశ్మీర్ ఐజీ వివరించినట్లు సమాచారం.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ ఆల్ టైం హైక్ చేరి 31,802 పాయింట్లు చేరగా, సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభలో కొనసాగుతున్నాయి.

'యాత్రికులపై దాడి ఘటనలో లష్కరే తోయిబా హస్తం'

హైదరాబాద్: అమర్ నాథ్ యాత్రికులపై దాడి ఘటన వివరాలను కశ్మీర్ ఐజీ వివరించారు. యాత్రికులపై దాడి ఘటనలో లష్కరే తోయిబా హస్తం ఉందని, పాక్ ఉగ్రవాది ఇస్మాయిల్ దాడికి కుట్ర పన్నినట్లు వెల్లడించారు.

10:09 - July 11, 2017

హైదరాబాద్: దేశంలోకి వచ్చే విదేశీ విరాళాలపై కేంద్రం నిఘా పెట్టింది. అందులో భాగంగా వివిధ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆప్, తదితరల పార్టీలను కేంద్రం కోరింది. విడివిడిగా ఆయా పార్టీలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు, వ్యాపార సంస్థల సహా ఎవరెవరు విరాళాలు ఇచ్చారో ఆ వివరాలు తమకు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా దాదాపు ఆరువేల స్వచ్ఛందసంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది హోంశాఖ. స్వచ్ఛంద సంస్థలు.. విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం- ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదు చేయించుకోవాలి. దీనికి సంబంధించి ప్రతి ఏడాది రిటర్న్స్ సమర్పించాలి. 2010-11 మొదలు 2014–15 మధ్య 18,523 స్వచ్ఛంద సంస్థలు రిటర్న్స్ దాఖలు చేయలేదు. ఆయా సంస్థలకు జూలై 8న షోకాజ్‌ నోటీసులిస్తూ వివరణ ఇవ్వాలంటూ జూలై 23 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 5,922 ఎన్జీవోలకు నోటీసులు ఇచ్చింది. ఇలా నోటీసులు అందుకున్న సంస్థల్లో తెలుగు రాష్ర్టాలకు చెందినవి కూడా వున్నాయి.

09:50 - July 11, 2017

తిరువనంతపురం: మలయాళం సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపిన నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో మరో ప్రముఖ నటుడు దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన్ను కొద్ది రోజుల క్రితం ఇంటారాగేట్ చేశారు. చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో ఆయన్ను ఎట్టకేలకూ అరెస్ట్ చేశారు. షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న భావనను కిడ్నాప్ చేసేందుకు ఆమె దగ్గర గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు స్థానిక రౌడీషీటర్ ఒకరు యత్నించారు. ఆమె కారులోనే ఎక్కి లైంగికంగా వేధించి ఫొటోలు, వీడియోలు తీశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు దిలీప్ భార్య, నటి కావ్య కార్యాలయంలో కూడా ఇటీవలే తనిఖీలు చేశారు. చివరకు ఈ కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను అరెస్ట్ చేశారు.

09:49 - July 11, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో జరుగుతున్న అఖిల భారత్‌ కిసాన్‌ మహాసభలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ జరుగుతున్న ప్రతినిధుల సభలో రైతుల సమస్యలపై చర్చ జరుగనుంది. జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ పాల్గోనున్నారు. ఈమేరకు ఆ సంఘం నేత జమలయ్య టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 'ప్రధానంగా గిట్టుబాట ధర, పంట రుణాలు, దేవాలయ భూములు, రుణమాఫీ వంటి పలు అంశాలపై చర్చిస్తాం. చెరుకు, పాడి రైతు సమస్యలపై చర్చించన్నారు. పూర్తి రుణమాఫీ చేయాలి. రైతులను ఆదుకోవాలి. బలవంతంగా భూములు సేకరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి' విమర్శించాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:43 - July 11, 2017

హైదరాబాద్ : హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. పోతురాజులతో కలిసి చిందేశారు. సికింద్రాబాద్ ఆదయ్య నగర్‌ నుంచి మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.. ఫలహార బండి ఏర్పాటు చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఫలహార బండి కార్యక్రమంలో మంత్రులు నాయిని, మహేందర్‌ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యేక పూజకు హాజరయ్యారు. ప్రత్యేక లైటింగ్‌తో పాటు విభిన్న రూపాల దేవతా ప్రతిమలు ఆకర్షణగా నిలిచాయి. ఉదయం వరకు ఫలహార బండి ఊరేగింపు కొనసాగింది. మంత్రి తలసానితో పాటు ఆయన కుమారుడు సాయి వెంట ఉండి.. బండి వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

 

హుక్కా సెంటర్ పై దాడి.. ఇద్దరి అరెస్ట్...

హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సెంటర్లు నిర్వహించడమే కాకుండా మైనర్లతో హుక్కా సేవింపచేస్తున్న కేంద్రంపై పంజాగుట్ట పోలీసులు దాడిచేశారు. నిర్వాహకులను అరెస్ట్‌ చేయడంతో పాటు, పట్టుబడ్డ ముగ్గురు మైనర్లకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనుమా నంరాకుండా బయటనుంచి తాళంవేసి సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు ఆదివారం రాత్రి దాడిచేసి, 10 అరేబియన్‌, 13 ఇండియన్‌ పాట్స్‌తో పాటు, 11 రకాల హుక్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు అందులో పనిచేసే నితిన్‌ను అరెస్ట్‌ చేశారు.

09:35 - July 11, 2017

శ్రీనగర్ : అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము, కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య అమర్‌నాథ్‌కు యాత్రికులు బయలుదేరారు. అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జమ్మూలో ఇంటర్‌నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు జమ్మూలో రెండు రోజుల బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో రెండు రోజులపాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:50 - July 11, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి మూడో విడత హరితహారం కార్యక్రమం చేపట్టనుంది. ఈనేపథ్యంలో బల్దియా హరితహారం కార్యక్రమానికి సిద్ధమౌతోంది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ మేయర్ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. నగరంలో కోటి మొక్కలు నాటడమే లక్ష్యమని చెప్పారు. స్వచ్ఛమైన వాతావరణం ఉండాలంటే గ్రీనరీ పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వంతో చేయిచేయి కలపాలని కోరారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

 

08:41 - July 11, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చైనా రాయబారి లూ ఝూవోహుయ్‌ని కలిసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ధృవీకరించింది. ఈ సమావేశానికి అంతగా ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు  చైనా, భూటాన్‌ రాయబారులను కలిశారని కాంగ్రెస్‌ తెలిపింది. ఈ విషయాన్ని మొదట ట్వీట్‌ చేసిన చైనా ఎంబసీ ఆ తర్వాత డిలీట్‌ చేసింది. రాహుల్‌ చైనా రాయబారితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరిపినట్లు చైనా రాయబార వెబ్‌సైట్‌లో పెట్టి తొలగించారు. మొదట్లో రాహుల్‌ ఎవరిని కలవలేదని.... ఫేక్‌ న్యూస్‌ అంటూ కొట్టి పారేసిన కాంగ్రెస్‌- ఆ తర్వాత ధృవీకరించింది. అత్యంత ప్రాధాన్యత గల అంశాలను తెలుసుకోవడంలో తప్పేమి లేదంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇందులో భాగంగానే చైనా, భూటాన్‌ల రాయబారులు, మాజీ భద్రతా సలహాదారులను కలిసినట్లు రాహుల్‌ పేర్కొన్నారు. ఓవైపు సరిహద్దు వివాదం నెలకొంటే ముగ్గురు కేంద్రమంత్రులు చైనాలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. 

 

ఉగ్రదాడికి నిరసనగా జమ్మూలో బంద్

శ్రీనగర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా జమ్మూలో బంద్ కు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. 

08:38 - July 11, 2017

శ్రీనగర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. జమ్మూ నుంచి పటిష్ట భద్రత నడుమ యాత్ర బృందాలు అమర్ నాథ్ బయల్దేరాయి. విపక్షాలు రెండు రోజులపాటు జమ్మూ బంద్ కు పిలుపునిచ్చాయి. జమ్మూలో రెండు రోజులపాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. యాత్రికులపై ఉగ్రదాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. జమ్మూలో ఇంటర్ నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

జమ్మూలో రాజకీయ పార్టీలు బంద్ కు పిలుపు

జమ్మూకాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి నిరసనగా జమ్మూలో రాజకీయ పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి.

 

నేడు, రేపు కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

కడప : నేడు, రేపు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

 

08:04 - July 11, 2017

వైసీపీ ప్లీనరీ సమావేశంపై వాడీవేడీ చర్చ జరిగింది. వైసీపీ మ్యానిఫెస్టోలో కొత్తధనం లేదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేత తులసీరెడ్డి, వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత దినకర్ పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబు పరిపాలనపై చర్చించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

07:57 - July 11, 2017

ఓల్డ్ డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఓల్డ్ డిఎస్సీ సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు కె. శ్రీనివాస్, శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. 'ఇది 1998 నుంచి పరిష్కారం కాని సమస్య. 1998, 2002, 2008, 2012  ఈ నాలుగు డిఎస్సీలలోనూ కొంతమంది మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. తాము ప్రతిపక్షంలో వున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇవాళ్టి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేస్తామంటూ హామీలిచ్చినవారే కావడం విశేషం. నిజానికి వీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కొంత సానుకూల దృక్పథంతోనే వ్యవహరించారు. మానవీయ కోణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలో అన్యాయం జరిగినవారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఏం జరిగిందో... ఏ అతీత శక్తులు అడ్డుపడుతున్నాయోకానీ, ఫైళ్లు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఓల్డ్ డిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై వారు మాట్లాడారు. మరిన్ని విరాలను వీడియోలో చూద్దాం...

 

07:49 - July 11, 2017

తూర్పుగోదావరి : అప్పటిదాకా సంతోషంగా గడిపారు. కుమారుడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారు. ఇంట్లో దైవ ప్రార్థనలు నిర్వహించారు. ఇంతలోనే ఏమైందో తెలియదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు తనువు చాలించారు. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. అయితే.. మూఢ నమ్మకాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కొందరంటుంటే.. ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు. 
కరపలో విషాదం 
తూర్పుగోదావరి జిల్లా కరపలో ఓ ఇంట విషాదం చోటు చేసుకుంది. నీలమ్మ తోటలో ఒకే కుటుంబానికి చెందిన సత్తి ధనలక్ష్మి, ఆమె కుమార్తె వైష్ణవి దేవి, ధనలక్ష్మి అక్క సత్యవేణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కరపలో నివాసం ఉంటున్న సత్తి శ్రీనివాస్‌ కాకినాడ పోర్ట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. అతను డ్యూటీకి వెళ్లిన తర్వాత ఆయన భార్య ధనలక్ష్మి, కూతురు వైష్ణవిదేవి, వదిన సత్యవేణి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే.. అంతకుముందే ధనలక్ష్మి కుమారుడు రఘువీర పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా ఇంట్లో దైవ ప్రార్థనలు కూడా నిర్వహించారు. అనంతరం బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే సరికి తలుపు వేసి ఉంది. ఎంతకు తీయకపోవడంతో.. వెనక వైపు నుంచి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లాడు. లోపలికి వెళ్లేసరికి ముగ్గురు మహిళలు ఉరేసుకుని కనిపించారు. 
పోలీసులు వివరాల సేకరణ 
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఒకేసారి ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకోవడం వెనక గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని పోలీసులంటున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడడంతో కరపలో విషాదం నెలకొంది. అయితే.. భక్తి మైకంలో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఇతర కారణాలు ఉన్నాయా ? విచారించి వెంటనే బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

 

07:40 - July 11, 2017

హైదరాబాద్ : జీఎస్టీ చేనేత నడ్డివిరుస్తోంది. ఆకలిచావులకు చేరువలో ఉన్న నేతన్నలకు గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ గుదిబండగా మారుతోంది. చేనేత వస్త్రాలకు ఉపయోగపడే ముడిసరుకుపై పన్నువిధించడంతో  నేతవృత్తి ప్రమాదంలో పడింది.  కడపజిల్లాల్లో చేనేత అవస్థలపై టెన్‌టీవీ ఫోకస్‌.. 
చిలపనూలుపై 5శాతం జీఎస్టీ
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టే ఉంది కేంద్రంలోని పాలకుల తీరు. చేనేతకు పన్ను మినహాయింపు అంటూనే దానికి ఉపయోగపడే ముడిసరుకుపై గట్టిగానే వడ్డించింది కేంద్రం. చేనేతకు ఉపయోగించే చిలపనూలుపై  పన్నుల భారంతో నేతన్నలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 5శాతం పన్ను విధించడంతో ఉత్పత్తి ఖర్చు భారీగా పెరుగుతోందని నేతన్నలు వాపోతున్నారు. 
చేనేత వృత్తిపై ఆధారపడి 36వేల మంది జీవనం  
కడప జిల్లాల్లో చేనేత వృత్తిపై ఆధారపడి 36వేల మంది బతుకుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని  మోరగడి, దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరంతోపాటు దత్తాపురం ప్రాంతాల్లో వేలాది మంది నేతవృత్తితోనే జీవనం సాగిస్తున్నారు. చిలపనూలుపై పన్నుమినహాయింపు ఇవ్వకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే  ధరలు ఎక్కువగా ఉన్నాయన్నా కారణంతో చేనేతల వస్త్రాలను కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదు.  ఇపుడు జీఎస్టీ వడ్డింపులతో  అంతతమాంత్రంగా ఉన్న డిమాండ్‌ ఇపుడు మరింతగా దిగజారే పరిస్థితులు ఉన్నాయంటున్నారు నేతకార్మికులు. 
దొడ్డిదారిన పన్నులు విధింపు 
ఓవైపు చేనేతలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న పాలకులు ఇలా దొడ్డిదారిన పన్నులు విధిస్తూ.. చేనేత రంగాన్ని మరింత కుంగదీస్తున్నారు. ఇప్పటికైనా చేనేత రంగం బతికిబట్టకట్టాలంటే చిలపనూలుపై విధించిన పన్నును మినహాయించాలని చేనేతవృత్తిదారులు కోరుతున్నారు.

07:34 - July 11, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో కర్షకులు కదం తొక్కారు. పాలకుల రైతువ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రైతుల ఆత్మహత్యలు మరింతగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌శక్తుల  కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. కాకినాడలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌రైతు సంఘం 21వ మహాసభలపై టెన్‌టీవీ ఫోకస్‌ .. 
కాకినాడ ఎరుపెక్కింది
కాకినాడ ఎరుపెక్కింది. అరుణపతాకాలు చేతబట్టిన రైతన్నలు .. కేంద్ర రాష్ట్ర రైతువ్యతిరేక విధానలపై  కదంతొక్కారు. మోదీప్రభుత్వ విధానాలతో దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆల్‌ఇండియాకిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి హసన్‌ముల్లా ఆందోళన వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల ఎన్‌డీఏ పాలనలో దేశవ్యాప్తంగా 35వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హసన్‌ముల్లా ఆవేదన వ్యక్తం చేశారు.  సకాలంలో బ్యాంకుల నుంచి రుణాలు, పంటలకు గిట్టుబాటుధరలు  దక్కడం లేదన్నారు. అధికారంలోకి వస్తే స్వామినాధన్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చేస్తామని చెప్పిన మోదీ మాట తప్పారని హసన్‌ముల్లా విమర్శించారు. 
కదంతొక్కిన అన్నదాతలు 
అంతకు ముందు మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ పట్టణంలో కర్షకులు మహా ప్రదర్శన నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆటపాటలు , నృత్యాలతో ఆకట్టుకున్నారు.  కాకినాడ సెజ్, దివీస్ పరిశ్రమ ప్రభావిత గ్రామాలు, అక్రమ ఆక్వా చెరువుల‌తో న‌ష్టపోతున్న అన్నదాత‌లు ఈ ప్రద‌ర్శన‌లో పాల్గొన్నారు. 21వ రాష్ట్ర మహాసభల సందర్భంగా 21 అరుణపతాకాలు చేతబట్టి ముందుకు నడిచారు. 
కాకినాడ సెజ్‌ భూములు తిరిగి ఇచ్చేవరకు పోరాటం
కాకినాడ సెజ్‌భూములు తిరిగి ఇచ్చేంతవరకు రైతుల పోరాటం కొనసాగుతుందని ఏపీ రైతుసంఘం నేతలు స్పష్టం చేశారు. సెజ్‌పేరుతో లాక్కున్న 10వేల ఎకరాలు తిరిగి దక్కించుకోడానికి  రైతులు చేస్తున్న పోరాటానికి  ఆల్‌ఇండియా కిసాన్‌సభ అండగా ఉంటుందన్నారు.  దివిస్‌ ప్రరిశ్రమకు వ్యతిరేకంగా చూపించిన తెగువనే  భవిష్యత్‌ పోరాటల్లో  చూపించాలని  అన్నదాతలకు పిలుపునిచ్చారు .  
కరువుపై సమీక్షలతో చంద్రబాబు కాలయాపన
రాష్ట్రం కరువుకోరల్లో చిక్కుకుంటే.. సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షలంటూ కాలయాపన చేస్తున్నారని ఏపీ రైతుసంఘం నేతలు విమర్శించారు. పదే పదే పోలవరం జపం చేస్తున్న ముఖ్యంత్రికి రాష్ట్రంలో వెనుబడిన ప్రాంతా బాధలు కనిపించడంలేదా అని  ప్రశ్నించారు. బ‌డులు మూసేసి, బార్లు తెరుస్తున్నారని ఎద్దేవాచేశారు. రాయ‌ల‌సీమ‌, ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద చంద్రబాబుకు చిన్నచూపు ఎందుకని నిలదీశారు.  అన్నింటికీ ఆధార్ అంటున్న ప్రభుత్వం ఇసుక మాఫియాలో ఆధార్ కండీష‌న్ పెట్టగ‌ల‌దా అని ప్రశ్నించారు.  మరోవైపు రాష్ట్రంలో పోలీసులు తీరుపై రైతుసంఘం నేతలు మండిపడ్డారు. సమస్యలు తీర్చాలని అన్నదాతలు అడుగుతుంటే.. పోలీసులు బలగాలను ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి సభలు పెట్టుకోడానికి కూడా  రైతులు ఉద్యమించాల్సి వస్తోందన్నారు. 
జాతీయస్థాయిలో ఉద్యమానికి ఏఐకెఎస్‌ కార్యాచరణ
ప్రజావ్యతిరేక, రైతువ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని  ఆల్‌ఇండియా కిసాన్‌సభ నేతలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. 

07:27 - July 11, 2017

హైదరాబాద్ : నగరంలో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. కోటి మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఉద్యమంలా సాగే ఈ కార్యక్రమంలో గ్రేటర్‌వాసులందరిని భాగస్వాములను చేసేందుకు కసరత్తు చేస్తోంది. భాగ్యనగరంలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని శాఖలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది జీహెచ్‌ఎంసీ. 
ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని టార్గెట్‌ 
గతేడాది 80 లక్షల మొక్కలు నాటించగా.. ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని టార్గెట్‌గా పెట్టుకుంది బల్దియా. అలాగే గత సంవత్సరం 2.80 లక్షల మొక్కల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించగా... 90 శాతం వరకు మొక్కలను రక్షించగలిగామంటున్నారు అధికారులు. ఇందుకోసం ఒక్కో మొక్కకు 350 రూపాయలు ఖర్చుచేశామంటున్నారు. అలాగే ఈ సారి కూడా మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్నారు.
ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నం 
ఒక మొక్కలు నాటడంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 93 లక్షల మొక్కలను ప్రజలకు అందించాలని నిర్ణయించారు. అయితే ఎవరెవరికి ఏయే మొక్కలు కావాలో వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 40 రకాల మొక్కలు అందుబాటులో ఉంచామని... పూర్తి వివరాలు ఆన్‌లైన్‌ ఉంచామంటున్నారు. ఈ బుధవారం నగరంలో 150కి పైగా ప్రాంతాల్లో మొక్కల పంపిణీ ఉంటుందంటున్నారు మేయర్‌ బొంతు రామ్మోహన్‌. మొత్తానికి హరితహారం కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో నగర పౌరులను కూడా భాగస్వాములను చేస్తోంది. 

 

07:21 - July 11, 2017

హైదరాబాద్ : మిషన్‌కాకతీయ పనుల్లో నాణ్యతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు మంత్రి హరీశ్‌రావు. ఇప్పటిదాకా జరిగిన పనులపై క్వాలిటీ కంట్రోల్‌ విభాగం దృష్టిపెట్టాలన్నారు. మరోవైపు మిషన్‌కాకతీయ మూడోదశ పనుల నేపథ్యంలో అధికారులతో హరీశ్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు.  
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న మిషన్‌కాకతీయ పనులపై మత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. రెండోదశపనులపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 2వదశలో నిధులు మంజూరై ఇప్పటికీ పనులు చేపట్టని కాంట్రాక్ట్‌లన్నీ రద్దుచేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి సూచించారు. 
3వ దశపనులకు మండలకేంద్రాల్లోనే ఇంజనీర్లు 
మిషన్ కాకతీయ మూడో దశ పనుల నేపథ్యంలో కింది స్థాయి ఇంజనీరింగ్ సిబ్బంది ఆయా మండల కేంద్రాల్లోనే ఉండాలని మంత్రి ఆదేశించారు.  భారీ వర్షాలు కురిసినప్పుడు తలెత్తే పరిస్తితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో చెరువుల పరిస్థితి ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి రాష్ట్ర స్థాయి లో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మైనర్ ఇరిగేషన్ సి. ఇ లను మంత్రి ఆదేశించారు. 
ఫాస్ట్‌ట్రాక్‌ లో సీతారామ ప్రాజెక్ట్‌ పనులు 
సీతారామ ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ట్రాక్ ప్రాతిపదికన పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెంజిల్లా కలెక్టర్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అటు భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది పూర్తి ఆయకట్టుకు నీరందించాలన్నారు. ఖరీఫ్ పంటకు నీరిచ్చేందుకు ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్, ఏఎమ్మార్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిధిలో నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో  రైతుఅవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.  నిజాంసాగర్ కింద గత ఏడాది సాగునీటి నిర్వహణ సమర్థంగా జరిగిందని..అదే స్ఫూర్తిని సింగూరు, ఘన్‌పూర్ ప్రాజెక్టుల విషయంలోనూ  చూపాలన్నారు. శ్రీరాంసాగర్‌ వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టుల్లో పెండింగులో ఉన్న భూసేకరణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున  నీటిలభ్యతను అనుసరించి ఖరీఫ్‌ ఇరిగేషన్‌కు యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని మంత్రి హరిశ్‌రావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

 

07:15 - July 11, 2017

హైదరాబాద్ : ఏపీలో జగన్‌ పార్ట్‌టైమ్‌ రాజకీయ నాయకుడిని సీఎం సీటు కోసం కలలు కంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీపై ఉన్న కోరికతోనే దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామంటున్నారని విమర్శలు గుప్పించారు. రైతులు, మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. రోడ్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై జగన్‌ లేదా ఆయన పార్టీ నేతలు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

 

07:10 - July 11, 2017

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అమర్‌నాథ్‌ యాత్రికులే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా.. 12 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. దాడితో జమ్మూ శ్రీనగర్‌లో భద్రత పెంచారు. మరోవైపు ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీస్తున్నారు. హోంమంత్రి ఇతర ఉన్నతాధికారులతో వివరాలు తెలుసుకున్న ప్రధాని... మరిన్ని బలగాలను సంఘటనాస్థలానికి పంపించాలని ఆదేశించారు. 
అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం 
అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. అమర్‌నాథ్‌ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్‌ బటింగు ప్రాంతంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ముష్కరులు బహిరంగంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 12 మందికిపైగా యాత్రికులు గాయపడ్డారు. పోలీసు బృందం భద్రతతో వెళ్తున్న బస్సుపైనే కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందికి సైతం గాయాలైనట్టు సమాచారం. దీంతో ఉధంపూర్‌లోని జమ్మూ కశ్మీర్‌ రహదారి వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. తమను టార్గెట్‌ చేస్తూ ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ దాడిలో మృతిచెందిన ఏడుగురు యాత్రికులను గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక సీఆర్పీఎఫ్‌ క్యాంపుకు తరలించారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ అధికారుల పర్యవేక్షణలో చికిత్సఅందిస్తున్నారు. 
వారంలో ఇది మూడోసారి. 
ఉగ్రవాదులు ఇలా దాడి చేయడం ఈ వారంలో ఇది మూడోసారి. ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని పది రోజుల క్రితమే కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. యాత్రికులు, పోలీసులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించింది. ఆ సమాచారం మేరకు అన్ని రకాల చర్యలు తీరుకున్న తర్వాతే యాత్రికులను పూర్తిస్థాయిలో అనుమతిస్తున్నారు. అయితే... బస్సు డ్రైవర్‌ భద్రతాదళాల సూచనలను పాటించకుండా ముందుకు వెళ్లడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భద్రతా అధికారులంటున్నారు. 
అనంతనాగ్‌ పరిసర ప్రాంతంతో ఉద్రిక్తత 
ఈ ఉగ్రదాడితో అనంతనాగ్‌ పరిసర ప్రాంతంతో ఉద్రిక్తత నెలకొంది. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిని మూసివేశారు. పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌, మొబైల్‌ సిగ్నల్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఇక ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కేంద్ర భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌తో పరిస్థితిపై నిరంతరం సమీక్ష జరుపుతున్నారు. ఇంకా భద్రతా బలగాలను అవకాశం ఉన్న మేరకు అనంతనాగ్‌ ప్రాంతానికి తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. యాత్రికులు ఆందోళనకు గురికాకుండా సురక్షిత ప్రాంతాలకు వారిని చేర్చాలని హోంమంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

 

నేడు శ్రీవారి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

హైదరాబాద్ : నేడు శ్రీవారి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అష్ఠదళ పాదపద్మారాధన సేవను రద్దు చేశారు.  

నేడు రెండోరోజు ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

తూర్పుగోదావరి : నేడు రెండో రోజు ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. ఈ మహాసభల్లో ప్రత్యేక జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ పాల్గొన్నారు. 

 

అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్ర దాడి

జమ్మూకాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. యాత్రికులు వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. అమర్ నాథ్ యాత్రికులే లక్ష్యంగా 3 చోట్ల దాడులు చేశారు.

 

అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్ర దాడి

జమ్మూకాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. యాత్రికులు వెళ్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. అమర్ నాథ్ యాత్రికులే లక్ష్యంగా 3 చోట్ల దాడులు చేశారు.

 

Don't Miss