Activities calendar

12 July 2017

22:03 - July 12, 2017
22:01 - July 12, 2017

తమిళనాడు : ప్రముఖ నటుడు కమల్‌హసన్‌ వివాదంలో చిక్కుకున్నారు. తమిళ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'కి  హోస్ట్‌గా చేయడం మానుకోవాలని కమల్‌కు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ షో పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ హిందు మక్కల్‌ కట్చి సంఘం ఆరోపిస్తోంది. కమల్‌హాసన్‌, షో నిర్వాహకులపై సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమల్‌హాసన్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. దీనిపై కమల్‌హసన్‌ స్పందించారు. నన్న అరెస్ట్‌ చేసినా ఫర్వాలేదని...బిగ్‌బాస్‌ ఓ సామాజిక కార్యక్రమమని... అందుకే దీన్ని చేసేందుకు నేను ఒప్పుకున్నానని తెలిపారు. క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేటప్పుడు చీర్‌లీడర్స్‌పై నిషేధం ఎందుకు విధించరని ప్రశ్నించారు. కమల్‌ ఇటీవల మహాభారతంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ చాందసవాదులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

21:59 - July 12, 2017

బీహార్ : తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, లాలు తనయుడు తేజస్వీ యాదవ్‌ ఎట్టకేలకు స్పందించారు. తనపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడం రాజకీయ కుట్రగా పేర్కొన్న తేజస్వీ... మహాకూటమిని చీల్చేందుకు బిజెపి యత్నిస్తోందని ధ్వజమెత్తారు.  2004లో లాలు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో హోటల్‌ టెండర్లకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో తాను 13- 14 ఏళ్ల వయసులో ఉన్నానని.... మూతి మీద మీసం కూడా రానీ వయసులో అవినీతికి పాల్పడడం సాధ్యమవుతుందా... అని తేజస్వీ ప్రశ్నించారు. ఈ అంశంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

21:57 - July 12, 2017

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైన్యం మరోసారి దుస్సాహసానికి తెగించింది. కుప్వారా జిల్లా కెరన్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ముందస్తు హెచ్చరికలేవీ లేకుండా భారత జవాన్లపై కాల్పులు జరిపింది. మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో భారత జవాన్లే లక్ష్యంగా పాకిస్తాన్‌ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. పాక్‌ కాల్పులకు దీటుగా భారత బలగాలు పాకిస్తాన్‌ ఆర్మీపై ఎదురుదాడికి దిగాయి. ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదులను భారత్ దళాలు మట్టుబెట్టడంతో పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యకు పాల్పడుతోంది. జూన్‌ నెలలో పాక్‌ దాదాపు 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడింది. 

21:55 - July 12, 2017

ఛండీఘర్ : హరియాణాలోని హిస్సార్‌లో బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు. 'భారత్‌ మాతాకి జై' అననందుకు ఓ ముస్లిం మత పెద్ద చెంప ఛెళ్లుమనిపించారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడికి నిరసనగా బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళన మసీదు వద్దకు చేరుకోగా...అప్పుడే మసీదులో నుంచి మతపెద్ద బయటకు వచ్చారు. 'భారత్‌ మాతాకి జై' అనాలని ఆ మత పెద్దను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. అందుకు నిరాకరించడంతో ఓ కార్యకర్త  చెంపదెబ్బ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వందమందిపై కేసు నమోదు చేశారు. ఇంతవరకు ఎవరిని అరెస్ట్‌ చేయలేదు.

21:50 - July 12, 2017

పశ్చిమగోదావరి : ఈ నెల 26నుంచి కాపుల పాదయాత్ర ప్రారంభమవుతుందని... కాపు హక్కుల నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.. ఎన్ని ఆంక్షలు విధించినా పాదయాత్ర ఆపేదిలేదని తేల్చిచెప్పారు.. ఇచ్చిన హామీల్ని నెరవేర్చమంటే కేసులుపెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు.. కేసులనే రిజర్వేషన్లుగా భావించమంటారా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.. చంద్రబాబు తాను పాదయాత్ర సమయంలో ఏ ఫార్మేట్‌ పాటించారో తమకు పంపాలని... అదే బాటలో తాము నడుస్తామని ముద్రగడ తెలిపారు..

 

21:48 - July 12, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ..సీపీఎం చేపట్టిన చలో భీమవరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భీమవరానికి వెళ్లేందుకు ప్రయత్నించిన గరగపర్రు దళితులను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసులకు దళితులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీరికి మద్దతుగా తరలివచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును కూడా అరెస్ట్‌ చేయడంతో దళిత సంఘాలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
చలో భీమవరం.... సీపీఎం పిలుపు 
గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ సీపీఎం బుధవారం చలో భీమవరానికి పిలుపు నిచ్చింది. గరగపర్రులోని దళితుల వెలిని నిరసిస్తూ కేవీపీఎస్‌ ఇతర దళిత సంఘాలు ఛలో భీమవరం పిలుపునివ్వడంతో దళితులు, దళిత సంఘాల నేతలు భీమవరానికి భారీగా చేరుకున్నారు. గరగపర్రు దళితులు చలో భీమవరానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. చలో భీమవరానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పట్టణానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులపై 144 సెక్షన్‌ పెట్టి పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. దీంతో అక్కడికి వస్తున్న వారికి పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో భీమవరం-తాడేపల్లిగూడెం  రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో చలో భీమవరం ఉద్రిక్తంగా మారింది.
మధు, ఇతర నేతలు అరెస్టు 
గరగపర్రు దళితులకు అండగా ఛలో భీమవరం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఇతర సీపీఎం నేతలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాలినడకన వస్తున్న సీపీఎం నేతలను బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు. 
మాకు ఏం న్యాయం చేశారు : దళితులు  
తమను సాంఘిక బహిష్కరణ చేసి రెండు నెలలు అవుతున్నా పోలీసులుగాని, ప్రభుత్వంగాని తమకు ఏం న్యాయం చేశారని గరగపర్రు దళితులు పోలీసులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమను సామాజిక బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాల్సని... లేకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. 

 

21:44 - July 12, 2017

మహబూబాబాద్‌ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్... కలెక్టర్‌ ప్రీతీమీనా పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రవర్తనపై ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగారు. విషయం తెలుకున్న సీఎం నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే నాయక్‌కు ఆదేశాలు జారీ చేశారు.  
ఎమ్మెల్యే తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసిన కలెక్టర్‌
మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రవర్తన వివాదాస్పదమైంది.  హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రీతిమీనా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో హరితహారం కార్యక్రమంలోనే ప్రభుత్వ సిబ్బంది ఆందోళన చేశారు. విషయం తెలిసి.. జిల్లా అంతటా ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లబ్యాడ్జీలతో కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే రేపు ఉద్యోగాలకు హాజరుకాబోమని హెచ్చరించారు. మరోవైపు జరిగిన ఘటనపై కలెక్టర్ ప్రీతిమీనా సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు ఐఏఎస్ ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. 
ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం 
ఘటన వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ .. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. కలెక్టర్‌తో మాట్లాడాల్సిందిగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను ఆదేశించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేతో కలెక్టర్‌కు క్షమాపణ చెప్పించే బాధ్యతనూ వారికే అప్పగించారు. 
కలెక్టర్‌ ప్రీతిమీనాకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
వ్యవహారం తీవ్రతరం కావడం... సాక్షాత్తు ముఖ్యమంత్రే ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. శంకర్‌నాయక్‌ దిగొచ్చారు. కలెక్టర్‌ ప్రీతిమీనాను కలసి క్షమాపణ చెప్పారు. కలెక్టర్‌ తనకు సోదరి లాంటిదని.. ఉద్దేశపూర్వకంగా తానలా ప్రవర్తించలేదన్నారు. ఎమ్మెల్యే క్షమాపణపై.. కలెక్టర్‌ ఏ విధంగానూ స్పందించ లేదని సమాచారం.

 

21:40 - July 12, 2017
21:38 - July 12, 2017
21:36 - July 12, 2017
21:19 - July 12, 2017

కరీంనగర్ పట్నాన్ని లండన్ లెక్కచేస్తా.. అంతకంటే ముందుగాల అడవిలెక్కచేస్తా, పిలిచి తిట్టిపిచ్చుకున్న పిలగాడు లోకేష్.. కడప జిల్లాల మొఖం మీదనే అన్న జనం, గరగపర్రు కాడ మళ్ల రగిలిన ఉద్యమం.. అమ్మాయి నడుముపట్టిన పోలీసోడు, బడి పిల్లలను ధర్నాలకు తీస్కపోతే కేసులు.... మరి సర్కార్ సభకు తీస్కబోతే ఏం చేస్తరు సారు, పాత బంగ్లాకే గులాబీ రంగులు... బోనగిరి కడా కేంద్రీయ బడి కథ, తాటి చెట్టు మీద తనువు చాలించిన గౌడు...నివారణ చర్యకు సర్కారు తియ్యాలే దౌడు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:58 - July 12, 2017
20:57 - July 12, 2017
20:56 - July 12, 2017
20:55 - July 12, 2017
20:53 - July 12, 2017
20:53 - July 12, 2017

డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్స్‌ సప్లై కేసులో ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇందులో ఒకరు నాసా మాజీ సైంటిస్ట్‌ అనీశ్. టాలీవుడ్‌కు డ్రగ్స్‌ సప్లై చేస్తోన్న అనీష్‌ కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అనీశ్‌ సహా మరో వ్యక్తి రితుల్‌ అగర్వాల్‌ను అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. 

20:50 - July 12, 2017

విశాఖపట్నం : కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌లో మద్యం షాపులకు..వ్యతిరేకంగా మహిళల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ షాప్ ముందు ధర్నా చేయడంతో ఆగ్రహించిన వైన్‌ షాపు యజమానులు...  మహిళలపై బ్లేడ్‌తో దాడికి యత్నించారు. తమపై ఎన్ని దాడులు జరిగినా... మద్యం షాపులు తీసేవరకు ఉద్యమం ఆపేది లేదని మహిళలు స్పష్టం చేస్తున్నారు. 

 

20:47 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్స్‌ సప్లై కేసులో ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇందులో ఒకరు నాసా మాజీ సైంటిస్ట్‌ అనీశ్. టాలీవుడ్‌కు డ్రగ్స్‌ సప్లై చేస్తోన్న అనీష్‌ కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. అనీశ్‌ సహా మరో వ్యక్తి రితుల్‌ అగర్వాల్‌ను అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. వీరిద్దరి నుంచి భారీగా ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎండీఎంఏ మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డార్క్‌ వెబ్‌సైట్ ద్వారా వీరిద్దరిని పట్టుకున్నారు. 
విచారణలో వీరిద్దరు మరికొందరి పేర్లు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు డ్రగ్స్‌తో సినీ ఇండస్ట్రీకి సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ విచారణలో ఇండస్ట్రీకి సంబంధించిన 10మందికి నోటీసులు జారీచేశారు. ఆరు రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదం

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదమైంది. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్..కలెక్టర్ ప్రీతిమీనా  పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంలోనే సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ ప్రీతిమీనాపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ ప్రీతిమీనా పట్ల ఆయన ప్రవర్తించిన తీరు సరిగా లేదంటూ తీవ్రస్థాయిలో మందలించారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు.

20:44 - July 12, 2017

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదమైంది. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్..కలెక్టర్ ప్రీతిమీనా  పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంలోనే సిబ్బంది ఆందోళనకు దిగారు. కలెక్టర్‌ ప్రీతిమీనాపై ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమం సందర్భంగా కలెక్టర్‌ ప్రీతిమీనా పట్ల ఆయన ప్రవర్తించిన తీరు సరిగా లేదంటూ తీవ్రస్థాయిలో మందలించారు. కలెక్టర్‌ను వ్యక్తిగతంగా కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. శంకర్‌నాయక్‌ తన ప్రవర్తనను మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌తో మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లను ఆదేశించారు. ప్రభుత్వం, పార్టీ తరఫున కలెక్టర్‌తో మాట్లాడి సముదాయించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే చేత కలెక్టర్‌కు క్షమాపణ చెప్పించే బాధ్యతను కూడా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌, ఎంపీలకు అప్పగించారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి..ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను పిలిపుంచుకొని క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు జరిగిన ఘటనపై తీవ్ర మనస్తాపం చెందిన కలెక్టర్ ప్రీతిమీనా సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పాటే ఐఏఎస్ ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. 

 

20:39 - July 12, 2017
20:37 - July 12, 2017

అనంతపురం : పట్టణంలో 279జివోను రద్దు చేయాలని సిఐటియూ కార్మికులు డిమాండ్‌ చేస్తూ మంత్రుల ఇళ్లను ముట్టడించారు. పోలీసులు ముట్టడిని అడ్డుకొని... సిఐటియూ కార్మికులను అరెస్టు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరంటూ కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. సీజనల్‌ వ్యాధులు విస్తరిస్తున్నా తప్పనిసరి పరిస్తితుల్లో ఆందోళన చేస్తున్నామని కార్మిక నాయకులు తెలిపారు. 

20:36 - July 12, 2017

రాజమండ్రి : వైసీపీ ప్లీనరీలో జగన్‌ చెప్పినవన్నీ అబద్ధాలే అని ఏపీ డిప్యూటీ సీఎం కె.యి. కృష్ణమూర్తి విమర్శించారు. రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గంలోని పలు అభివృద్ది, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. జగన్‌ జైలుకి వెళ్తారో లేక పాదయాత్ర చేస్తారో ఆయనకే స్పష్టత లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు చంద్రబాబునే ముఖ్యమంత్రి చేస్తామని కృష్టమూర్తి అన్నారు.

 

మహిళా కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దురుసు ప్రవర్తన

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదమైంది. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్..కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంలోనే సిబ్బంది ఆందోళనకు దిగారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర మనస్థాపం చెందిన కలెక్టర్ ప్రీతిమీనా..ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్‌కు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. 

 

20:33 - July 12, 2017

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీరు వివాదాస్పదమైంది. హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్..కలెక్టర్ ప్రీతిమీనా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హరితహారం కార్యక్రమంలోనే సిబ్బంది ఆందోళనకు దిగారు. మరోవైపు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర మనస్థాపం చెందిన కలెక్టర్ ప్రీతిమీనా..ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్‌కు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. 

 

విజయవాడ దోపిడి ఘటన...కారు గుర్తింపు

కృష్ణా : విజయవాడ దోపిడి ఘటనలో దుండగులు వినియోగించిన... మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును గుంటూరు శివారులో పోలీసులు గుర్తించారు. స్థానిక ఓబులు నాయుడు పాలెం సమీపంలోని కొండల వద్ద దుండగుల ఆనవాళ్లపై సమాచారం రావడంతో... ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. 

20:28 - July 12, 2017

విజయవాడ : ఏపీలో దోపిడి దొంగలు బరితెగించారు. రెండు ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖల్లో భారీ దోపిడీలకు పాల్పడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన రెండు దొంగతనాలు.. ప్రజలను ఉలికిపడేలా చేశాయి. మహారాష్ట్రకు చెందిన ముఠాలే ఈ దొంగతనాలు చేసి ఉండొచ్చని.. పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. దుండగులు చేతిలో ఆయుధాలు పట్టుకొని వచ్చి.. నిలువు దోపిడీ చేశారు. జరిగిన హఠాత్పరిణామంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బంగారం, డబ్బు దొరికినంతా దోచుకెళ్లడంతో.. దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. 
7 కిలోల నగలను దోచుకెళ్లిన దుండగులు 
విజయవాడలో బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. గవర్నరుపేట, గోపాలరెడ్డి వీధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గోపాలరెడ్డి వీధిలోని ఓ భవనంలో నగలు తయారు చేసే కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇందులో 30 మంది దాకా పని చేస్తుంటారు. వీళ్లంతా బెంగాల్‌కు చెందినవారే. రాత్రి పదిగంటల సమయంలో కార్మికులు నగలు తయారు చేస్తుండగా.. దాదాపు 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో వచ్చి బెదిరించారు. కార్మికులను ఒక చోటకు చేర్చి చేతులు పైకెత్తించి కూర్చోవాలని ఆదేశించారు. అక్కడ ఉన్న 7 కిలోల నగలను బ్యాగులోకి సర్ధి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కార్ఖానా యజమాని సోదరుడు సుభాష్‌ మన్నా, మరో వర్కర్‌ తేరుకొని వారిని వెంబడించారు. ఇది గుర్తించిన ఆగంతకులు కార్ఖానా సమీపంలో నిలిపిన తెల్లకారులో పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అయినా వారు దొరకలేదు. ఈ తతంగాన్ని గమనించిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ బైక్‌పై కారును వెంబడించినా.. ఫలితం లేకుండా పోయింది. 
కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు 
సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో.. ఎనిమిది పోలీసు బృందాలు వాహనాలను తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం పోలీసులు  గాలింపు ముమ్మరం చేశారు.  క్లూస్‌, డాగ్‌  స్క్వాడ్లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు హిందీలో మాట్లాడుతుండటంతో.. వాళ్లు మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో వారిని గుర్తు పట్టేలా లేకపోవడంతో.. గుంటూరు ఖాజా వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దాడి చేసిన వాళ్లంతా 25 నుంచి 30 ఏళ్ల లోపు యువకులేనని కార్ఖానా కార్మికులు చెబుతున్నారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాల తనిఖీలు చేపట్టాయి. 
మొత్తం 8 మంది దుండగులు 
విశాఖ నగరం.. దారపాలెంలోనూ సినీఫక్కీలో చోరీ జరిగింది. సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడి ఇంట్లోకి ముఖానికి ముసుగులు వేసుకున్న దుండగులు ప్రవేశించారు. కత్తులు, తుపాకులు చూపించి ఇంట్లో ఉన్నవారిని బెదిరించి ఉన్నదంతా దోచుకెళ్లారు. 20 తులాల బంగారు వస్తువులు పట్టుకుపోయారు. కాళ్లుపట్టుకున్నా దుండగులు వినిపించుకోలేదని సత్యనారాయణ తెలిపాడు.  బాధితుడి ఫిర్యాదుతో అరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  కారులో ఎనిమిది మంది దుండగులు వచ్చారని.. వారిలో ఇద్దరు ఇంటి బయట ఉండగా.. ఆరుగురు లోపలకు ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ రెండు దొంగతనాలు జనాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. రాష్ట్రంలోకి ప్రవేశించిన దొంగల ముఠాల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  

 

కర్నూలులో జాతీయ పతాకానికి అవమానం

కర్నూలు : జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. జాతీయ పతాకం పసుపు వర్ణంలోకి మారిపోయినా కూడా కర్నూలు జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. నిత్యం ప్రముఖులెందరో తిరిగే చోటే జాతీయ జెండాకు అవమానం జరిగినా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదు. వాస్తవానికి మురికి జెండాను ప్రదర్శించడం జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుంది. 

20:24 - July 12, 2017

కర్నూలు : జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. జాతీయ పతాకం పసుపు వర్ణంలోకి మారిపోయినా కూడా కర్నూలు జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదు. నిత్యం ప్రముఖులెందరో తిరిగే చోటే జాతీయ జెండాకు అవమానం జరిగినా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదు. వాస్తవానికి మురికి జెండాను ప్రదర్శించడం జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుంది. సాంప్రదాయిక నియమం ప్రకారం మురికి జెండాను ప్రదర్శించడం నేరం. పతాకావిష్కరణకు వాడే కర్రలు, వాటికి కట్టే తాడు మాసినా జెండాకు అవమానం జరిగినట్లే. కానీ కర్నూలు కలెక్టరేట్లో మాత్రం మాసిన జెండాను ఇప్పటివరకు తొలగించలేదు. అయితే తక్షణమే జాతీయ పతాకాన్ని మార్చి గౌరవిస్తారా..? లేదంటే స్వాతంత్ర్య దినోత్సవం వరకూ వేచి చూస్తారా అని కర్నూలు పౌరులు ప్రశ్నిస్తున్నారు. 

 

20:22 - July 12, 2017
20:21 - July 12, 2017
20:19 - July 12, 2017
20:18 - July 12, 2017

హైదరాబాద్ : జిఎస్‌టి బలోపేతం అయిన తర్వాత ఆదాయం పెరుగుతుందన్నారు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా కార్యదర్శి సోమేష్ కుమార్‌. జిఎస్‌టిపై నిర్వహించిన అవగాహన సెమినార్‌లో పాల్గొన్న ఆయన... వచ్చే ఆగస్ట్ 28 తరువాత ఫలితాలు అందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు కేంద్రం 10 మంది ఐఎఎస్ అధికారులను రాష్ట్రానికి పంపనుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను జిఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. 

 

20:16 - July 12, 2017

మహబూబ్ నగర్ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది.. పాలమూరు జిల్లాలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల దుస్థితి. ఉమ్మడి పాలమూరు ప్రజలకు నీరందించాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ఆ దిశగా పనులు ముందుకు సాగడం లేదు. త్వరగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి మహబూబ్‌నగర్‌లో వలసలను తగ్గించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నా.. కాంట్రాక్టర్లు చేసే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. 
ఎక్కడి పనులు అక్కడే 
పాల‌మూరు జిల్లాలో వ‌ల‌స‌ల‌కు అడ్డు కట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించారు. త్వరగా పనులు పూర్తి కావాలంటే పర్యవేక్షణ అవసరమని.. సీఎం, మంత్రులకు ఆ బాధ్యతలను అప్పగించారు. మంత్రి హరీశ్‌రావు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి.. 2 కిలోమీటర్ల దూరం కాలువల వెంట తిరిగారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తరవాత ప్రెస్‌ మీట్‌ పెట్టి త్వరలో ప్రాజెక్ట్‌లు పూర్తి కాబోతున్నాయన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ మంత్రులు వెళ్లగానే ఎక్కడి పనులు అక్కడే పడకేస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఒకటి, రెండూ జేసీబీలు.. రెండు, మూడు టిప్పర్లతో మాత్రమే పనులు జరిపిస్తున్నారు . మంత్రులు వస్తున్నారంటే మాత్రం అర డజన్‌కి తగ్గకుండా అన్ని యంత్రాలు స్పాట్‌లో ఉంటున్నాయని పాలమూరు ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వర్షాకాలం రావడంతో సాగు చేసుకునేందుకు కాలువల ద్వారా నీరు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ కాంట్రాక్టర్ల పని తీరు చూస్తే మాత్రం వచ్చే ఏడాది కూడా కలవకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు.. పాలమూరు ఎత్తి పోతల పథకం పనులు పూర్తి అయ్యేలా లేవని వాపోతున్నారు. 
పూర్తికాని ప్రాజెక్టులు 
కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట్‌, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని.. 3.65 లక్షల ఎకరాలకి నీరందించాలనే ఉద్దేశ్యంతో మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకాన్ని సర్కార్‌ ప్రారంభించింది. దీని నిర్మాణ ఖర్చు మొదటగా 2, 990 కోట్లు అనుకోగా.. చివరికి 4500 కోట్లకు పెంచారు. మొదట లిఫ్ట్‌ ద్వారా ఏలూరు రిజర్వాయర్‌ నుంచి 13 వేల ఎకరాలకి, తర్వాత రెండో లిఫ్ట్‌ ద్వారా జొన్నల గడ్డ రిజర్వాయర్ నుంచి 47 వేల ఎకరాలకి, మూడో లిఫ్ట్‌ ద్వారా జొన్నలగడ్డ రిజర్వాయర్‌ ద్వారా 2.80 వేల ఎకరాలకి నీరందించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అవ్వాలంటే 19 రిజర్వాయర్లు పూర్తి చేయాలి. ఇప్పటివరకు ఏ ఒక్క రిజర్వాయర్ పనులు 100 శాతం పూర్తి కాలేదు. మరి 19 రిజర్వాయర్‌కి ఎంత కాలం పడుతుందో మంత్రులే చెప్పాలని ప్రజలు మండిపడుతున్నారు. 
ముందుకు సాగని నెట్టెంపాడు ప్రాజెక్టులు  
ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు ఒకటి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఖరీఫ్‌కి 1.50 లక్షల ఎకరాలకి నీరు అందించాలని ప్లాన్‌ చేశారు. మొదట 43 కోట్ల వ్యయం ఉన్న కాలువ నిర్మాణం కాంట్రాక్టర్‌ కోసం 130 కోట్లకి పెంచారు. అయినా పనులు జరగకపోవడంతో దీన్ని ఒకే కాంట్రాక్టర్‌కి కాంట్రాక్ట్‌ ఇవ్వకుండా, డీ1, డీ2, డీ3, డీ4 భాగాలుగా విభజించి వేరు వేరు కంపెనీలకి పనులని అప్పగించారు. అయినా కాలువ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. 
ప్రాజెక్టుల ప‌నులు జాప్యం
ఈ రెండు ప్రాజెక్టుల ప‌నులే కాదు.. పాల‌మూరు జిల్లాలో చేప‌ట్టిన బీమా, కొయిల్ సాగ‌ర్, పాల‌మూరు ఎత్తిపోతల ప‌థ‌కం ప్రాజెక్టుల ప‌నులు వేగంగా జ‌ర‌డ‌గంలేదు. గ‌త ప్రభుత్వాలు పూర్తి చేసిన పనులే తప్ప కొత్తగా ఈ రెండేళ్లలో 10 శాతం పనులు కూడా జరగలేదని పాలమూరు ప్రజలు అంటున్నారు. మంత్రులు జిల్లా పర్యటనికి వచ్చినప్పుడల్లా అధికారులపై మండిపడటం.. తర్వాత ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి పనులని అడ్డుకుంటున్నారని ఆరోపించడం తప్ప చేసిందేమీ లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

 

20:10 - July 12, 2017

హైదరాబాద్ : ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఓయూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చేస్తున్న ధర్నా 7వ రోజుకు చేరుకుంది. ఓయూ పరిపాలన భవనం ముందు ఉద్యోగులు చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్‌ కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

 

20:08 - July 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు అధిష్టానం అనుమతి కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పాదయాత్ర చేసేందుకు పీసీసీ పదవే అక్కర్లేదని.. ఓ కాంగ్రెస్ కార్యకర్తగా కాలినడక కొనసాగిస్తామన్నారు. యాత్రలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని..తెలంగాణ సాధించుకున్న  ఉద్యేశ్యమేమిటో వివరిస్తామన్నారు. 

20:06 - July 12, 2017

కరీంనగర్‌ : జిల్లాలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తుండగా..ఓ మహిళా నినాదాలు చేస్తూ హల్‌చల్‌ చేసింది. మొక్కలు నాటడమే కాదు..ఆహార భద్రత కింద ఇస్తున్న సన్న బియ్యం ఇవ్వాలని మహిళ నినాదాలు చేసింది. అయితే వెంటనే స్పందించిన మహిళా పోలీసులు అమెను బయటకు తీసుకెళ్లారు. 

20:03 - July 12, 2017

హైదరాబాద్ : హరితహారం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం కేవలం ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్ విమర్శించారు. వాస్తవాన్ని పక్కనపెట్టి అసత్య ప్రచారం చేస్తుందన్నారు. రెండేళ్లలో ఎన్ని మొక్కలు నాటారో, వాటిలో పెరిగిన మొక్కలెన్నో వివరాలు బయటపెట్టాలన్నారు. 

19:55 - July 12, 2017

కరీంనగర్ : హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నేతల ఆర్భాటం తప్ప జరుగుతున్నది మాత్రం శూన్యమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం విమర్శించారు. సీఎం పర్యటన సందర్భంగా కరీంనగర్‌లో అడుగడుగునా పోలీస్‌ నిర్బంధం జరగడం దారుణమన్నారు. సామాన్యులు తిరగలేని పోలీస్‌ నిర్బంధం ఎందుకు విధించాల్సి వచ్చిందో చెప్పాలని పొన్నం ప్రశ్నించారు. 

 

19:51 - July 12, 2017

కరీంనగర్‌ : హరిత తెలంగాణను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్‌లో మూడో విడత హరిత హారాన్ని ప్రారంభించిన కేసీఆర్‌.. రాబోయే రోజుల్లో కరీంనగర్ పట్టణాన్ని లండన్‌ నగరంగా మారుస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిఒక్కరు చెట్లను నాటాలని..వాటిని తమ పిల్లలతో సమానంగా చూసుకుంటూ పెంచాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలో కోటి ఎకరాలకు నీళ్లిస్తామన్నారు. 
మూడో విడత హరితహారానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం 
మూడో విడత హరితహారం కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు వద్ద మహాగని మొక్క నాటిన అనంతరం అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. హరితహారం సందర్భంగా ప్రజానీకానికి ఆకుపచ్చ హరిత వందనాలు తెలిపారు. మూడో విడత హరితహారం సందర్భంగా..సీఎం కేసీఆర్‌ ప్రసంగించిస్తూ హరిత తెలంగాణను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూమిలో తేమశాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం సొంత పనిగా భావించినప్పుడు హరిత తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. 
కరీంనగర్‌ను లండన్‌ నగరంగా మారుస్తా : కేసీఆర్
రాబోయే రోజుల్లో కరీంనగర్‌ను లండన్‌ నగరంగా మారుస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లండన్‌లోని థేమ్ నది ఉన్నట్లే కరీంనగర్‌కు పక్కనే మానేరు నది ఉందంటూ పోల్చారు కేసీఆర్‌. కరీంనగర్ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 25 కోట్లతో కరీంనగర్ కళాభారతిని నిర్మిస్తామన్న సీఎం.. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 523 అవార్డులు ఇస్తామని సీఎం ప్రకటించారు. 
ప్రతిపక్షాల విమర్శలపై కేసీఆర్‌ మండిపాటు 
గొర్రెల పంపిణీపై ప్రతిపక్షాల విమర్శలపై కేసీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ అధికారం కోసం ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి తప్పా..ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని సీఎం నిప్పులు చెరిగారు. ఎస్సార్‌ఎస్పీ ద్వారా వచ్చే ఏడాది నుంచి రెండు పంటలు పండించి కరీంనగర్‌ను దేశానికి ఆదర్శంగా నిలుపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానంతో 30లక్షల ఎకరాలు ఉత్తర తెలంగాణలో సస్యశ్యామలమవుతుందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం అన్నారు. 

 

19:45 - July 12, 2017

విశాఖ : 279 జీవోని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ కార్మికులు కధం తొక్కారు. వందలాది మంది కార్మికులు మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. 279 జీవో వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేస్తు గంటాకు వినతి పత్రం సమర్పించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

19:43 - July 12, 2017
19:40 - July 12, 2017

తిరుపతి : దళితుల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాన్ని ఆత్మగౌరవ పోరాటంగా భావించాలని ప్రకాష్‌ అంబేద్కర్‌ అన్నారు. కులవివక్ష అనేది వివిధ రూపాల్లో మారుతోందన్నారు. తిరుపతిలో దళితుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన ఆయన... మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అభివృద్ధి విధానం కాకుండా.. వినాశకర విధానాన్ని అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. భారతదేశంలో కుల సమస్య తీవ్రంగా ఉందని.. దీనికి వ్యతిరేకంగా తరతరాలుగా సంఘసంస్కర్తలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు.   

19:38 - July 12, 2017

విశాఖ : 279 జీవోని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీవీఎంసీ కార్మికులు కధం తొక్కారు. వందలాది మంది కార్మికులు మంత్రి గంటా ఇంటిని ముట్టడించారు. 279 జీవో వల్ల కలిగే ఇబ్బందులను తెలియజేస్తు గంటాకు వినతి పత్రం సమర్పించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం...

 

19:36 - July 12, 2017

కృష్ణా : విజయవాడ దోపిడి ఘటనలో దుండగులు వినియోగించిన... మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును గుంటూరు శివారులో పోలీసులు గుర్తించారు. స్థానిక ఓబులు నాయుడు పాలెం సమీపంలోని కొండల వద్ద దుండగుల ఆనవాళ్లపై సమాచారం రావడంతో... ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు. 

 

19:11 - July 12, 2017

పశ్చిమగోదావరి : ఛలో భీమవరం పిలుపు మేరకు ... గరగపర్రు చేరుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును, కేవీపీఎస్, వ్యవసాయ, దళిత సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని పోలీసులు బలవంతంగా వ్యాన్‌లలో ఎక్కించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

19:09 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ కేసులో... సిట్ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనీష్, రితుల్ అగర్వాల్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో.. ఎల్ ఎస్ డీ, కొకైన్, ఎండీఎంఏ మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అనీష్ హిమాచల్‌ప్రదేశ్‌లోని డూన్ స్కూల్‌లో చదువుకొని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాలో పనిచేస్తున్నాడు. అక్కడి పౌరసత్వం కూడా ఉంది. మరో నిందితుడు... రితుల్‌ అగర్వాల్‌  హైదరాబాద్ బీబీఏ స్కూల్‌లో చదివాడు. డార్క్‌ వెబ్‌సైట్ ద్వారానే వీరిద్దరు పట్టుబడారు. వీరిద్దరిని విచారించగా... మరికొందరి పేర్లు వెల్లడించినట్లు సమాచారం. వీరిద్దరితో కలుపుకొని ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది అరెస్టు చేశారు. 

18:06 - July 12, 2017

చిత్తూరు : హిందుత్వ అజెండా ముసుగులో బీజేపీ సర్కార్‌ దళితులపై దాడులు చేయిస్తుందని దాదాసాహెబ్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ మండిపడ్డారు. జిల్లాలో కులవివక్షకు వ్యతిరేకంగా దళిత సంఘాలు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. కుల వివక్ష ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని.. దేశమంతా వ్యాపించి ఉన్న సాంఘిక దురాచారమన్నారు. చట్టాల్లో మార్పులు, సవరణలు అవసరం లేదని... ఉన్నవాటిని సమర్థవంతంగా అమలు చేస్తే కులవివక్షను రూపుమాపవచ్చని తెలిపారు. పాలకుల వ్యక్తిత్వాల్లో మార్పు వచ్చినప్పుడే కులవివక్షను నిర్మూలించడం సాధ్యమవుతుందని చెప్పారు. 

 

17:59 - July 12, 2017

జీహెచ్ ఎంసీలో 6 జోన్లు.. స్టాండింగ్ కమిటీ తీర్మానం..

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జీహెచ్ ఎంసీలో 6 జోన్ల ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది.

కడప సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పై ఏసీబీ దాడులు

కడప: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పై ఏసీబీ దాడులు చేసింది. పలు డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

 

17:34 - July 12, 2017
17:33 - July 12, 2017
17:25 - July 12, 2017
17:22 - July 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరు 15వ డివిజన్‌లో.. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేస్తుండటంతో మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం షాపు తాళాలు పగలగొట్టి షాపు ముందు బైటాయించారు. మహిళలు ఆందోళన చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు మహిళలతో చర్చించారు. తమ ఆరోగ్యాలు నాశనమైనా మీరు బాగు పడండి అంటూ మహిళలు మండిపడ్డారు. 

యూనాని వైద్యులు విషయంలో టీఎస్ సర్కార్ కు ఎదురు దెబ్బ

హైదరాబాద్: తొమ్మిది మంది యునాని వైద్యులను ఏపీకి వెళ్లాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. టీఎస్ ప్రభుత్వ జీవో అమలును నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ రికార్డు

హైదరాబాద్: మహిళా క్రికెట్ లో మిథాలీరాజ్ రికార్డు సాధించారు. వన్డేలో 6 వేల పరుగులు పూర్తి చేశారు. 6 వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ మిథాలీరాజ్. ఇంగ్లండ్ బ్యాట్స్ వుమెన్ రికార్డును బ్రేక్ చేసింది. 164 వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసింది.

 

17:11 - July 12, 2017

అనంతపురం : జనావాసాల మధ్య మద్యంషాపులు నిర్వహించడంపై అనంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐద్వా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు.  సీఎం చంద్రబాబు...  తమ పసుపు కుంకుమలు కాపాడాలంటూ నిరసన తెలిపారు.  తాలిబొట్టు, గాజులు, పసుపు కుంకుమలు చేతబట్టుకుని ర్యాలీ నిర్వహించారు. వాటిని సీఎంకు పోస్ట్‌లో పంపుతామన్నారు. పది రోజులుగా ప్రభుత్వానికి తమ ఆవేదన చెప్తున్నా ఇప్పటి నుంచి స్పందనేలేదని ఐద్వా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

17:09 - July 12, 2017

ఢిల్లీ : ఏపీ విభజన చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం నెరవేర్చలేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు...ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చేలా పార్లమెంట్ సమావేశాలలో ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. అలాగే మెగా ఆక్వాఫుడ్‌ వల్ల వచ్చే సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌గాంధీని కోరామని చెప్పారు. 

 

16:22 - July 12, 2017

అనంతపురం : జిల్లాలో రైతన్నకు అంతులేని కష్టం వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలే కాదు ప్రైవేటు రుణాలు దక్కడం లేదు. సేద్యానికి పెట్టుబడి కరువవడంతో భార్య సాయంతో రైతు దుక్కిని దున్నుతున్నారు. విత్తనాలు వేసేందుకూ భార్య కష్టమే ఆదరవుగా మారింది. కొత్త చెరువు గ్రామంలో రైతు శివారెడ్డి దంపతులు దయనీయస్థితిలో ఉన్నారు. పథకాలు రైతుల దరి చేరడం లేదనడానికి ఇది నిదర్శనంగా ఉంది. అనంత జిల్లాలో కరవుకు ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచ్చు. 

 

16:17 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన 10 మందికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ముగ్గురు యువ హీరోలు, నలుగురు డైరెక్టర్లు, ఇద్దరు నిర్మాతలకు నోటీసులు అందజేసింది. 6 రోజుల్లోగా హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది. ఆలోగా హాజరుకానిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:09 - July 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో గరగపర్రు బాధితులకు అండగా చేపట్టిన చలో భీమవరం ఉద్రిక్తంగా మారింది. గరగపర్రు దళితులకు అండగా చలో భీమవరంలో పాల్గొనేందుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, దడాల సుబ్బారావు, బలరాం, మంచన సీతారాం గోపాలన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం నేతలను రోడ్డుపై ఈడ్చుకెళ్లి... బలవంతంగా అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:02 - July 12, 2017
  • పచ్చిమిరపకాయలు పాడుకాకుండా ఉండాలంటే వాటి తొడిమలను తీసేసి ఫ్రిజ్ లో నిల్వ చేసుకొంటే తొందరగా పాడవవు.
  • బియ్యం తెల్లగా రావాలంటే ఉడికే సమయంలో రెండు చుక్కల నిమ్మరసం వస్తే అన్నం తెల్లగా వస్తుంది.
  • క్యాబేజీ కూర చేసే సమయంలో పచ్చివాసన వస్తుంటుంది. ఈ సమస్య తీరాలంటే ఒక బ్రెడ్ ముక్కను వేసి చూడండి.
  • ముక్కు రంధ్రాల నుండి రక్తం కారుతుంటే దానిమ్మ రసాన్ని రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేస్తే మంచి ఫలితం వస్తుంది.
  • గాస్లు నీళ్లలో అందులో కొంచెం ఏలకుల పొడి కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్ర సంబంధ సమస్యలు రావు.
  • నోటీ దుర్వాసనతో బాధ పడే వారు నిద్ర లేవగానే పరిగడుపున ఐదు గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఇలా కొంతకాలం చేస్తే దుర్వాసన తగ్గుముఖం పడుతుంది.
  • పెరుగు పాడుకాకుండా ఉండాలంటే కొబ్బరి ముక్క వేసి చూడండి.
  • పప్పు తొందరగా ఉండాలంటే అందులో కొద్దిగా నూనె..డాల్డా వేయండి.
  • పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.
15:54 - July 12, 2017

హైదరాబాద్ : ఏపీ శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. హైకోర్టు కోసం డిజైన్‌ చేసిన వజ్రాకార భవన ఆకృతిని శాసనసభ కోసం సిద్ధం చేయాలని, శాసనసభ కోసం రెడీ చేసిన బుద్ధ స్థూపం డిజైన్‌ను హైకోర్టుకు మార్చాలని ఫోస్టర్ బృందానికి సూచనలు చేశారు. ఈ మార్పులు చేశాక ఛీఫ్ జస్టిస్‌కు చూపించి తుది ఆకృతులను రెండు రోజుల్లో సిద్ధం చేయాలని కోరారు. ఏపీ కోల్పోయిన కోహినూర్ వజ్రాన్ని శాసనసభ భవనం రూపంలో తిరిగి తెచ్చుకున్నట్లు ప్రజలు భావించాలన్నారు. శాసనసభకు వజ్ర ఆకారాన్ని పోలిన డిజైన్ ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థూపం సంతోషానికి చిహ్నమని, నిజమైన న్యాయం జరిగినప్పుడే సంతోషం కలుగుతుందని అందుకే.. హైకోర్టుకు స్థూపం డిజైన్‌ ఫైనల్ చేసినట్లు ప్రకటించారు.

15:53 - July 12, 2017

కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఈ సమయాల్లో ఏవో మందులు వేసుకుని సరిపుచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడొచ్చు.
పిప్పళ్లు బాగా దంచి చూర్ణం వేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడాలి.
జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
మారేడు ఆకుల రసం రెండు స్పూన్ల తీసుకోవాలి. అందులో నాలుగు మిరియాలు చూర్ణం వేసి కలిపి తాగితే సమస్య తీరుతుంది.
పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దానిని బాగా మరగపెట్టాలి. దీనిని చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం..సాయంత్రం తాగాలి.
ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ పాలను వడగట్టి తాగాలి.
పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.

క్రిమినల్ కేసులకు భయపడం : మహిళలు

విశాఖ: మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలపై క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారని, కేసులకు భయపడేది లేదనిమహిళలు హెచ్చరిస్తున్నారు.

15:43 - July 12, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గొల్లలకోడేరులో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. గ్రామం నుంచి భీమవరం వరకు ర్యాలీగా బయలుదేరిన గరగపర్రు దళితులను, దళిత నాయకులను గొల్లలకోడేరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, దళితులకు మధ్య తోపులాట జరిగింది. కేవీపీఎస్‌ నేత రామకృష్ణతో సహా పలువురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగులు ఆందోళన

హైదరాబాద్: ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ -1 ఫలితాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను నిరుద్యోగులు దహనం చేశారు.

15:13 - July 12, 2017

పోలీసులకు ధీటుగా దొంగల ప్లాన్...సోషల్ మీడియాతో కాప్స్ నేరాల నియంత్రణ..యూ ట్యూబ్ లో చూసి దొంగల తర్ఫీదు..స్నాచర్లను కాప్స్ పట్టుకున్నారు...ఆదిలాబాద్ లో తెలివిమీరుతున్న చోర్స్...

ఆధునిక టెక్నాలజీ..దీనిని ఇప్పుడిప్పుడు వంట పట్టించుకుంటున్న కాప్స్ నేరాలను నియంత్రించేందుకు సఫలీకృతమౌతున్నారు.. అదే సమయంలో నేరగాళ్లు పోలీసుల కంటే ముందున్నారు..ఏకంగా యూ ట్యూబ్ లో నేరాలు ఎలా చేయాలో తెలుసుకుని కొత్త కొత్తగా పుట్టుకొస్తున్నారు.. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు..దొంగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది..రోటీన్ గా స్నాచర్లను పట్టుకున్న పోలీసులు వారు చెప్పిన విషయాలు చూసి ఖంగుతిన్నారు..ఆసక్తికరంగా ఉన్న ఈ విషయాలని మరింత తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి..

 

దోపిడీ దొంగల కోసం గాలిస్తున్న విజయవాడ పోలీసులు

విజయవాడ: గవర్నర్ పేట నగల దుకాణంలో చోరీ కేసులో దుండగులు ఉపయోగించిన మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కారును గుంటూరు నగర శివారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓబులునాయుడుపాలెం సమీపంలోని కొండలల్లో దుండగులు సంచరిస్తున్నారనే సమాచారంతో అటవీ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.

 

డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనీష్, రితుల్ అగర్వాల్ నుంచి పెద్ద మొత్తంలో ఎల్ ఎస్ డీ, కొకైన్, ఎండీఎంఏ అనే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనీష్ అమెరికన్ సిటిజన్ నాసాలో పని చేసిన హైదరాబాద్ కు వచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ లోని డూన్ స్కూల్ లో అనీష్ చదివాడు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 12 మంది ని అరెస్ట్ చేశారు.

ఏపీ శాసనసభ, హైకోర్టు ఆకృతులు ఖరారు

అమరావతి: ఏపీ శాసనసభ, హైకోర్టు ఆకృతులను సీఎం ఖరారు చేశారు. అసెంబ్లీకి వజ్రాకారం, హైకోర్టుకు స్తూపాకార డిజైన్లు ఖరారు చేసింది. నాలుగు ఫోర్లుగా హైకోర్టు నిర్మాణం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో 10మంది సిట్ నోటీసులు

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో 10 మందికి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 6 రోజుల్లోగా సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు యువ హీరోలు, నిర్మాత, ఇద్దరు దర్శకులకు సిట్ నోటీసులు జారీ చేశారు. 6 రోజుల్లోగా హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని సిట్ హెచ్చరించింది.

ఎపి జేసీ హైకోర్టులో పిటిషన్.. విచారణ

హైదరాబాద్: జేసీ దివాకర్ రెడ్డి పిటిషన్ హైకోర్టు విచారణ జరిగింది. విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయాలని రిజిష్ట్రార్ హైకోర్టు ఆదేశించింది. తన ప్రయాణం పై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించడం పై జేసీ పిటిషన్ వేశారు.

 

14:02 - July 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సరసన చేయాలని కొంతమంది హీరోయిన్లు ఆశ పడుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే అవకాశం దక్కుతుంటుంది. ‘పవన్' తో ఒక్క సినిమా చేస్తే చాలు అనే వారు కూడా ఉంటుంటారు. టాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న నటి 'రకూల్ ప్రీత్ సింగ్'...తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో చేసే అవకాశాలు దక్కించుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో', 'అల్లు అర్జున్' తో 'సరైనోడు..’రామ్ చరణ్' తో 'ధృవ'..ప్రస్తుతం 'మహేష్ బాబు'తో 'స్పైడర్' సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తరువాతి చిత్రంలో నటించేందుకు 'రకూల్' ను ఎంపిక చేశారని టాక్. ప్రస్తుతం 'పవన్ కళ్యాణ్'..’త్రివిక్రమ్' కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా అనంతరం కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే మూవీకి 'పవన్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని..ఇందులో 'రకూల్' ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందని తెలుస్తోంది.
తమిళ చిత్రం 'వీరమ్' ని రీమేక్ చేసిన 'పవన్’ 'విజయ్' మూవీని రీమేక్ చేస్తాడని టాలీవుడ్ టాక్. మంచి విజయం సాధించిన 'థేరి' చిత్రాన్ని 'పవన్' తెలుగులోకి తీసుకురానున్నాడని, కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి 'పవన్' సరసన 'రకూల్' నటించనుందా ? లేదా ? అనేది చిత్ర యూనిట్ స్పందిస్తే గాని తెలియరాదు.

13:59 - July 12, 2017

కామారెడ్డి :  పట్టణంలో విత్తనాల వ్యాపారం చేస్తున్న మోహన్‌ ఊర్లో నుంచి ఉడాయించాడు. తీరా కారణాలు వెలికితీస్తే 16 కోట్ల రూపాయల మేర టోకరా వేసినట్లు బయటపడింది. గత నాలుగు రోజుల నుంచి మోహన్‌ పత్తా లేకుండా పోయాడు. మరోవైపు షాపుకు తాళాలు వేసి ఉండడంతో పాటు.. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. డైలీ మార్కెట్‌లో నివాసం ఉండే మోహన్‌... 20 ఏళ్లుగా కామారెడ్డి జిల్లాతో పాటు.. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం, సోయ, పెసర్లు, మినుములు కొనుగోలు చేస్తున్నాడు. ఇతరుల కంటే కొద్దిగా ఎక్కువ ధర ఇస్తానని చెప్పడంతో అందరూ ఈయనకే పంటలు అమ్ముతున్నారు. అయితే.. ఒకేసారి డబ్బులు చెల్లించకుండా విడతలవారీగా చెల్లిస్తానని రైతులను నమ్మించాడు. ఇలా అనేక లక్షల మేర పంటలను రైతుల నుంచి కొనుగోలు చేశాడు. మరోవైపు వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర వ్యాపారుల వద్ద కూడా భారీగా అప్పులు చేశాడు. రైతులకు పంటలు వేసుకునే సమయానికి డబ్బులు ఇస్తానన్నాడు. గత నాలుగైదు రోజుల నుంచి మోహన్‌ కనిపించకుండాపోవడంతో... రైతులు షాపు వద్దకు వచ్చారు. తాళాలు వేసి ఉండడంతో ఫోన్లు చేశారు. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులను అడిగితే తమకు కూడా ఎలాంటి సమాచారం లేదంటున్నారు. దీంతో తామంతా మోసపోయామని బాధితులంటున్నారు.

తన కూతురి పెళ్లి కోసం
ఇదిలావుంటే మరికొంతమంది స్థానికులు కూడా మోహన్‌ వద్ద డబ్బులు దాచుకున్నారు. తన కూతురి పెళ్లి కోసం డబ్బులు దాచుకుంటే... ఇప్పుడు ఇలా జరిగిందని.. ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక మోహన్‌ మోసాలపై బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు.. ఇతర ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా బాధితులు సిద్దమవుతున్నారు. ఎలాగైనా మోహన్‌ను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 

13:57 - July 12, 2017

సూర్యాపేట :  జిల్లా కోదాడలో మైనార్టీ విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఇది. ఇక్కడ అరకొర సౌకర్యాలతో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులకు.. ఈ బిల్డింగ్‌ ఓనర్‌ పెడుతున్న టార్చర్‌ భరించరానిదిగా తరయారైంది. ప్రస్తుతానికి సొంతభవనం లేకపోవడంతో.. కోదాడ పట్టణంలోని ఓ సంక్షేమ హాస్టల్‌ వార్డెన్‌కు చెందిన ఈ బిల్డింగ్‌లో గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అయితే.. బిల్డింగ్‌ ఓనర్‌ లేనిపెత్తనాన్ని నెత్తినవేసుకుని విద్యార్థులను నానా ఇబ్బందులు పెడుతున్నాడు. చివరికి చిన్నారులకు పెడుతున్న భోజనం విషయంలోకూడా కలగజేసుకుంటున్నాడు. తనకు ఏమాత్రం సంబంధం లేని విషంయలో జోక్యం చేసుకుంటూ.. అధికారుల ముందుకూడా తనకు అలవాటై టార్చర్‌ విద్యను ఇలా ప్రదర్శించాడో మీరే చూడండి

ఈసంవత్సరం 200 మంది విద్యార్థులు
ఇంతకీ ఈ బిల్డంగ్‌ ఓనర్ చెప్పేదేమంటే.. సౌకర్యాలు లేకున్నా.. ఇందులోనే పడిఉండాలంటున్నాడు. ఇక్కడ గత ఏడాది 100 మంది విద్యార్థులు జాయన్‌కాగా .. ఈసంవత్సరం 200 మంది వచ్చారు. దీంతో భవనంలో సౌకర్యాల కొరత ఏర్పడింది. 3వందల మంది విద్యార్థులు నాలుగు బాత్‌రూంలతో సరిపెట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకోడానికి రాత్రి ఒంటిగంటనుంచి క్యూలో నిల్చువాల్సి వస్తోందని పిల్లలు వాపోతున్నారు. విద్యార్థులకు అసౌకర్యంగా ఉందని ..అధికారులు గురుకులపాఠశాలను మరొక బిల్డిండ్‌లోకి మార్చాలని నిర్ణయించారు. పాఠశాలభనాన్ని సందర్శించిన మైనార్టీ విజిలెన్స్‌ అధికారులు విద్యార్థులను, సామాన్లను తరలించడానికి ప్రయత్నించారు. ఇదేసయంలో కొంతమంది కూలీలకతో అక్కడికి వచ్చిన బిల్డింగ్‌ యజమాని.. లోపల అధికారులను ఉంచేసి బయటినుంచి తాళం వేసి నానా హంగామా సృష్టించాడు.అయితే .. ఇప్పటిదాకా తన భవనాన్ని వాడుకున్నందకు రావాల్సిన అద్దెబకాయిలు.. ఇతర మెయింటెనెన్స్‌ ఖర్చులు ఇవ్వాలని బిల్డింగ్‌ ఓనర్‌ డిమాండ్‌ చేయడంతో అధికారులు నీళ్లు నములుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గురుకుల పాఠశాలకు సొంతబిల్డింగ్‌ ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు, అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ప్రస్తుత బిల్డింగ్‌ ఓనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

13:55 - July 12, 2017

తూర్పు గోదావరి : ఈ జిల్లా ఏపీలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న జిల్లా. ఇక్కడ పాగా వేస్తేనే సీఎం కుర్చీకి చేరువ‌కాగ‌లుగుతార‌న్నది రాజకీయవర్గాల నిశ్చితాభిప్రాయం. ఇది గత ఎన్నికల్లో కూడా నిరూపితం అయింది. జిల్లాలోని మొత్తం 19స్థానాల్లో టీడీపీ, 13, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించగా.. వైసీపీకి 5 స్థానాలు మాత్రమే దక్కాయి. వారిలో కూడా ఇద్దరు టీడీపీ కండువా కప్పుకున్నారు. 2014 ఎన్నికల అనంతరం ఓటమిపాలయిన ప‌లువురు నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు. రాజ‌మండ్రి సిటీ నుంచి పోటీ చేసిన బొమ్మన రాజ్ కుమార్, మండ‌పేట నుంచి బ‌రిలో దిగిన గిరిజాల వెంక‌ట‌స్వామి నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇటు జిల్లా నుంచి గెలిచిన ఐదుగురిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వ‌రుపుల సుబ్బారావు సైకిల్‌పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లావైసీపీలో స్తబ్దత నెలకొంది. రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి పోటీ చేసిన ఆకుల వీర్రాజు , ముమ్మిడివ‌రం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌యిన గుత్తులసాయి లాంటి నేతలు ప్రస్తుతం అంతక్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు.

పూర్తిస్థాయిలో మార్పులు
తూర్పుగోదావరిజిల్లా పార్టీలో నెలకొన్న సైలెన్స్‌ బ్రేక్‌ చేయడానికి వైసీపీ నాయకత్వం పూర్తిస్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చేసి కొత్తవారికి చాన్స్‌ ఇస్తోంది. కాకినాడ రూరల్‌లో చెల్లుబోయిన వేణుస్థానంలో కన్నబాబుకి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ సిటీ బాధ్యతలను ముత్తాశశిధర్‌కు ఇవ్వగా.. రాజమండ్రి సిటీ ఇంచార్జ్‌గా రౌతు సూర్యప్రకాశ్‌రావు, రాజమండ్రి రూరల్లో కందుల దుర్గేశ్‌ బాధ్యలు చేపట్టారు. వీరితోపాటు ఇటీవలే వైసీపీ గూటికి చేరిన పర్వత ప్రసాద్‌ను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించారు. అటు ముమ్మిడివరం, మండపేటల్లో కూడా కొత్తవారినే ఇంచార్జ్‌లుగా నియమించారు. ఇలా జిల్లాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో కొత్తవారే పార్టీఇంచార్జ్‌లుగా పగ్గాలు చేపట్టారు. ఇక పిఠాపురం, పెద్దాపురం, రామచంద్రాపురం, పి.గన్నవరం లాంటి చోట్ల కూడా నయా లీడర్లకే అవకాశం కల్పించే చాన్స్‌ కనిపిస్తోంది. దీంతో రాబోయే 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి నుంచి మూడొంతులకు పైగా కొత్త నేతలకే అసెంబ్లీ టెక్కెట్లు లభిస్తాయని వైసీపీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న వైసీపీ .. రాబోయే ఎన్నికలకు పక్కాప్లాన్‌తో వెళ్లాలని భావిస్తోంది. దీనికోసం పార్టీలో యువనేతలతోపాటు అనుభజ్ఞులకు పెద్దపీటవేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొత్తరక్తం ఎక్కిస్తున్న వైసీపీ అధినాయకత్వం రాబోయే ఎన్నికల్లో ఏమేరకు సక్సెస్‌ అవుతుందో వేచి చూడాలి. 

'నార్మన్ పోస్టర్' డిజైన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం

అమరావతి: ఏపీ శాశ్వత అసెంబ్లీ భవనాలకు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు ఇచ్చిన డిజైన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అయితే ఇందులో సీఎం చంద్రబాబు స్వల్ప మార్పులను సూచించినట్లు సమాచారం. డిజైన్లతో పాటు ఇంటీరియర్ డిజైన్లనూ సీఎం ఆమోదించారు.

 

13:49 - July 12, 2017

నగరంలో డ్రగ్స్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. మాదకద్రవ్యాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో సరఫరా చేసిన కెల్విన్ ముఠా టాస్క్ ఫోర్స్ ప్రత్యేక టీంకు పట్టుబడడంతో విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. సినీ పరిశ్రమకు చెందిన వారికి..విద్యార్థులకు డ్రగ్స్ పంపిణీ జరిగినట్లు పోలీసులు వెల్లడించడంతో ఈ అంశంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సిట్ ను నియమించింది. ప్రధానంగా సినీ పరిశ్రమకు డ్రగ్స్ లింకులు ఉండడం గతంలో కూడా వచ్చినవే.
దీనిపై ఆలస్యంగా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు బుధవారం స్పందించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..డ్రగ్స్ మాఫియాపై తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉనాన్యని ప్రశంసించారు. సినీ పరిశ్రమలో 15 మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిసిందని, ఈ విషయం ఎవరికీ తెలియదని అనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయంలో పోలీసులు సంయమనం పాటిస్తున్నారని, ఇలాంటి వారికి దూరంగా ఉండాలంటూ వారికి అల్లు అరవింద్ సూచించారు. కళాకారులు ఆదర్శంగా ఉండాలని, అలా కాకుండా సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెచ్చి...సమాజానికి కీడుగా మారితే తీవ్రంగా నష్టపోయేది మీరేనని అల్లు అరవింద్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కానీ ఆ వ్యక్తులు ఎవరనేది ఆయన బయటపెట్టలేదు. డ్రగ్స్ తీసుకుంటున్న ఆ 15 మంది ఎవరనే దానిపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. మరి 15 మంది ఎవరు ?

సీఎం కేసీఆర్ సభలో మహిళ ఆందోళన

కరీంనగర్ : మూడో విడుత హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కేసీఆర్ సభ జరుగతోంది. ఈ సభలో మహిళ రేషన్ కార్డు పై సన్న బియ్యం ఇవ్వాలని నినాదాలు చేసింది.

 

13:45 - July 12, 2017

ఖమ్మం : పద్మశ్రీ, వనజీవి రామయ్యకు ప్రభుత్వం తరపున ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రామయ్యకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్నారు. రామయ్య ఇచ్చిన స్ఫూర్తితోనే ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మూడో విడత హరితహారంలో భాగంగా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ వనజీవి రామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. 

13:44 - July 12, 2017

కరీంనగర్ : ఎమ్మెల్యే రసమయి... ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించే సీఎం బహిరంగ సభ వేదిక దగ్గరకు... వీఐపీ పాస్‌లు లేవని పోలీసులు రసమయి, లక్ష్మణ్‌రావును అనుమతించలేదు. దీంతో రసమయి, లక్ష్మణ్‌రావుకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై రసమయి బాలికిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

13:43 - July 12, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ మాఫియాపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సమరశంఖం పూరించింది. టాలీవుడ్‌లో డ్రగ్స్‌ నియంత్రకు కృషి చేస్తామని సినీ ప్రముఖులు తెలిపారు. ఎవరో కొంతమంది డ్రగ్స్‌ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తోందని చెప్పారు. ఇక నుంచి ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎవరు డ్రగ్స్‌ తీసుకున్నా చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్‌ నియంత్రణపై ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ వినియోగం తగ్గించడానికి అవసరమతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 

13:42 - July 12, 2017

వృద్ధులు..పిల్లలు తమ బాగోగులు చూసుకోవడం లేదని చాలా మంది వృద్ధులు వృద్ధాశ్రమాలను ఆశ్రయిస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని దింగమింగుకొని జీవితాన్ని ఆశ్రమాల్లో కొనసాగిస్తున్నారు. వృద్ధులు నిరాదరణకు గురైన సమయంలో కోర్టును ఆశ్రయించవచ్చా ? వీరికి ఏ విధమైన చట్టాలున్నాయనే దానిపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమం చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ లాయర్ పార్వతి పాల్గొని సూచనలు..సలహాలు ఇచ్చారు. వృద్ధులను ఇంట్లో వారు ఒక వేస్ట్ గా చూస్తున్నారని, వీరితో మనకు ఏం అవసరమని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి వ్యవస్థ క్షీణదశకు చేరుకుందని చెప్పవచ్చని, వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లి అమ్మనాన్నలను మరిచిపోతూ..ఆస్తుల కోసం కూడా పీడిస్తున్నారన్నారు. మనోవేదనకు భరించలేక వృద్ధులు తీవ్ర మనస్థాపానికి గురవుతూ బలవన్మరణాలకు పాల్పడుతుండడమే కాకుండా చంపేస్తున్న ఘటనలు చూస్తున్నామన్నారు. వీరికి తప్పకుండా చట్టాలున్నాయన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

దళిత సంఘాలు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

ప.గో: గంగపర్రు నుంచి భీమవరం వరకు దళిత సంఘాలు ర్యాలీని ప్రారంభించాయి. గొల్లల కోడేరు వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులకు, దళితులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సహా పలువురికి గాయాలయ్యాయి.

మొక్కలను కొడుకును పెంచుకున్నట్లు పెంచాలి: సీఎం కేసీఆర్

కరీంనగర్ : మొక్కలను కొడుకును పెంచుకున్నట్లు పెంచాలని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్ ఎండీ కట్ట దిగువన మహాగని ఔషధ మొక్కను నాటారు. అనంతరం అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో పిల్లల్ని సాకినట్లు మొక్కలను కూడా సాకాలి తెలిపారు. కార్పొరేటర్లు బాధ్యత తీసుకుని ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటేలా చూడాలన్నారు. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించిన విజయమేనన్నారు.

13:29 - July 12, 2017
13:21 - July 12, 2017

బాలీవుడ్ హీరోయిన్ దివ్యా దత్తాకు చేదు అనుభవం ఎదురైంది. చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో స్టేజ్ పైకి 'దివ్యా'ను పిలవకపోవడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై ఏడుస్తూ వెనుతిరిగారు. నావాజుద్దీన్ సిద్దిఖి ప్రధాన పాత్రలో 'బాబూ మోషాయ్ బందూక్ బాజ్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో 'దివ్యా దత్త' కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదల చేశారు. ఇందుకు ఏర్పాటు చేసిన స్టేజ్ పైకి చిత్ర బృందం చేరుకోగా 'దివ్యా దత్త' మాత్రం కిందనే ఉండిపోయింది. స్టేజ్ పైకి ఆమెను పిలవకపోవడంతో కిండనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనితో దివ్య దత్త తీవ్ర ఉద్వేగానికి లోనే కన్నీళ్లు కార్చారు. ఏడుస్తూ ఈవెంట్ నుండి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర బృందం ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.

 

13:15 - July 12, 2017
13:05 - July 12, 2017

నల్లగొండ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఆయన భార్య ఎమ్మెల్యే పద్మావతి... రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ... నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటిస్తూ తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ప్రజలతో మమేకమవుతూ... కలసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ... రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. రెండు పర్యాయాలు కోదాడ ఎమ్మెల్యేగా సేవలందించిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడగానే.. కోదాడలో తన భార్యను రంగంలోకి దించి.. ఆయన హుజూర్ నగర్‌కు షిఫ్ట్ అయ్యారు. తర్వాత ఉత్తమ్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన సతీమణి పద్మావతి... ఉత్తమ్ స్థానంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటనలు సాగిస్తున్నారు. అలాగే పద్మావతి ఉన్నప్పటికీ హుజూర్ నగర్‌తో పాటు కోదాడ నియోజకవర్గం బాధ్యతలను ఉత్తమ్ పరోక్షంగా మోస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు.. కార్యక్రమాలను ఉత్తమ్‌ నిర్ణయిస్తున్నారు. ఉత్తమ్‌ వారానికి ఒకసారైనా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో గర్జన సభతో పాటు.. కార్యకర్తల వ్యక్తిగత వేడుకలకు సమయం కేటాయిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఉత్తమ్ వెంట ఆయన సతీమణి పద్మావతిని కూడా తీసుకెళ్తున్నారు. దీంతో దీని వెనక ఉత్తమ్ వ్యూహం ఏదో ఉందంటూ పలువురు అనుకుంటున్నారు.

నల్గొండ పార్లమెంటు సీటు కన్నేసిప ఉత్తమ్
మొత్తానికి ఇటు హుజూర్‌నగర్‌, అటు కోదాడ నియోజకవర్గాల్లోనూ తమ పట్టును కోల్పోకుండా.. ఉత్తమ్‌ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోది. దీంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన క్యాడర్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నల్గొండ పార్లమెంటు సీటుపై ఉత్తమ్ కన్నేసినట్టు ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడి నుంచి తన సతీమణి పద్మావతిని పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. హిందీలోనూ, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగల ప్రతిభ ఉన్న పద్మావతి ఎంపీ అయితే క్షేత్రస్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ పార్టీతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవచ్చని ఉత్తమ్ ఆలోచనగా తెలుస్తోంది. తద్వారా.. పార్టీ అధిష్ఠానానికి మరింత చేరువ కావచ్చన్న ఎత్తుగడ ఇందులో ఉందని పార్టీలో కొంతమంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వ్యూహాత్మాక ఎత్తుగడలతో ఎన్నికల ముందు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఉత్తమ్ రూటే సెపరేట్. దానికి తోడు ఈసారి ద్విముఖ వ్యూహంతో పావులు కదుపుతున్న ఉత్తమ్‌ను చూసి సొంత నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

13:03 - July 12, 2017

బిజీ బిజీగా మారుతూ..వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటున్న హీరోయిన్ 'కాజల్' చేతికి మరో ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ప్రముఖ సీనియర్ నటుడు 'ధర్మేంధ్ర' తనయుడు 'బాబిడియోల్' సరసన నటించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా బాలీవుడ్ సినిమాల్లో 'కాజల్' నటించిన సంగతి తెలిసిందే. 2016లో బాలీవుడ్ సినిమా 'దో లఫ్జోన్ కి కహాని' లో నటించిన ‘కాజల్’ మరో సినిమా ఒప్పుకోలేదు. 'యామ్లా పాగల్ దీవానా-3' సినిమాను సన్నిడియోల్ సొంత బ్యానర్ లో రూపొందబోతోంది. చిత్రంలో ధర్మేంద్ర..బాబిడియోల్..సన్నిడియోల్ లు నటించనున్నారు. ఈ సినిమాలో బాబి డియోల్ సరసన 'కాజల్' ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

13:03 - July 12, 2017

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణి... విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కేయూ అధికారులు ఈ ఏడాది పరీక్షా ఫలితాలలో విద్యార్థులకు చుక్కలు చూపించారు. విద్యార్థుల ఫలితాలు తప్పులు తడకలుగా విడుదల చేశారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై అధికారులను నిలదీశారు.. ఆందోళనలు చేశారు. గత నెల 12న యూనివర్సిటీ అధికారులు డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే రిజల్ట్ ఇచ్చామని ఆనందపడిపోయారు. కానీ ఫలితాల జాబితాలలో భారీగా తప్పులు దొర్లాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు గైర్హాజరు వేశారు. బాగా రాసిన విద్యార్థులకు ఫెయిల్‌ మార్కులు వేశారు. ఇంకొందరికి ప్రాక్టికల్‌ మార్క్‌లు వేయలేదు. సుమారుగా 300 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినా... గైర్హాజరు అయినట్టు చూపించారు. దీంతో చాలామంది విద్యార్థులు పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకన్న ఓ బీఎస్సీ గణిత విద్యార్థికి 100 మార్కుల పేపర్‌లో 105 మార్కులు వచ్చాయని జాబితాను పంపించారు. ఆశ్చర్యపడ్డ ఆ విద్యార్థి పరీక్షల విభాగానికి వెళ్లి... ఫిర్యాదు చేసింది. వెంటనే అధికారులు జాబితాను వెనక్కి తీసుకుని... అసలు మార్కులను వేసి ఇచ్చారు.

డిగ్రీ ఫలితాలలోనూ ఇవే అవకతవకలు
గతంలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశపరీక్షా ఫలితాల్లోనే కాకుండా.. ఇప్పుడు డిగ్రీ ఫలితాలలోనూ ఇవే అవకతవకలు జరిగాయి. దీంతో విద్యార్థి నాయకులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రీ వాల్యూయేషన్‌పై కూడా అనుమానాలున్నాయని.. అందులో కూడా అవినీతి జరుగుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ఎంఫిల్‌.. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల ఫలితాలలో తప్పులు జరగడం వాస్తవమేనని... సాంకేతిక కారణాల వల్లే ఇది జరిగిందని వీసీ స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకున్నామని...దీనికి బాధ్యులైన అధికారులిద్దరిని సస్పెండ్‌ చేశామని వీసీ చెప్పారు. అలాగే డిగ్రీ ఫలితాలలో దొర్లిన పొరపాట్లకు సంబంధించి.. విచారణ జరుపుతున్నామని చెప్పారు. కాగా వర్సిటీలో ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉండగా...మరో పది రోజుల్లో స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

13:00 - July 12, 2017

కరీంనగర్ : జిల్లాలోని దిగువ మానేరు డ్యాం దగ్గర సీఎం కేసీఆర్‌ మూడో విడత హరిహారాన్ని ప్రారంభించారు.. నగరానికి చేరుకున్న సీఎం.. మొక్కను నాటగా.. మంత్రి ఈటెల మట్టి పోశారు.

12:59 - July 12, 2017

హైదరాబాద్ : ఓయూలో నాన్‌ బోర్డర్స్‌పై చర్యలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మూడు రోజుల్లో ఖాళీ చేయాలని యూనివర్శిటీ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15కల్లా ఖాళీ చేయకపోతే నీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామన్నారు. అప్పటికీ నాన్‌బోర్డర్స్‌ ఖాళీ చేయకపోతే పోలీసులను రంగంలోకి దించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పదిరోజులుగా ఓయూలో మంచినీటి సరఫరా ఆపేశారని విద్యార్థలు ఆరోపిస్తున్నారు.. ఈ నెల 23న టెట్‌, ఆగస్టు 2, 3 తేదీల్లో గురుకుల పరీక్షలున్నాయని.. అప్పటివరకూ హాస్టళ్లలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.. ఆలోపు ఖాళీ చేయిస్తే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

12:57 - July 12, 2017

చిత్తూరు : తిరుమలలో గదుల కేటాయింపు కోసం టీటీడీ.. కొత్తగా టోకెన్‌ పద్ధతిని ప్రారంభించింది. టోకెన్‌ పద్ధతి బాగా లేదని సీఆర్‌ఓ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. పాత పద్ధతి ద్వారానే గదులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

హరితహారం కార్యక్రంలో షబ్బీర్ అలీ, పొంగులేటి

ఢిల్లీ: తెలంగాణ భవన్ హరితహారం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా హరితహారంలో పాలొన్నాలని తెలిపారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో సంరక్షించడం అంతే ముఖ్యం అని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు హరితహారంలో భాగస్వామ్యం కల్పించాలని షబ్బీర్ అలీ, పొంగులేని సూచించారు.

12:56 - July 12, 2017

యాదాద్రి : జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర్లలో విషాదం చోటుచేసుకుంది.. కల్లుతీసేందుకు తాటిచెట్టుఎక్కిన గీత కార్మికుడు చెట్టుపైనే మృతిచెందాడు.. నడుముకు కట్టుకున్న ముస్తాదు ఊడిపోవడంతో కార్మికుడి తల తాటిచెట్టుకు ఢీకొట్టింది.. తీవ్ర గాయాలతో భద్రాద్రి చనిపోయాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:55 - July 12, 2017

హైదరాబాద్ : నగర శివారు జీడిమెట్లలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీదుద్దీన్‌ అనే విద్యార్థి మైనార్టీ గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఫరీదుద్దీన్‌ మృతదేహంపై గాయాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటాడని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు చెప్పకుండానే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుకు చేదు అనుభవం

కరీంనగర్ : ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావుకు చేదు అనుభవం ఎదురయ్యింది. వీఐపీ పాస్ లేదని సీఎం బహిరంగసభ వేదిక దగ్గరకు రసమయి, లక్ష్మణ్ రావును పోలీసులు అనుమతించలేదు. రసమయి, లక్ష్మణ్ రావు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల తీరుపై రసమయి బాలకిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

12:51 - July 12, 2017

ప్రకాశం : జిల్లాలోని ముండ్లమూరు మండలంలోని పెదరావిపాడు గ్రామంలో విషజ్వరాలు ప్రబలాయి. జంపాని వీరమ్మ, పంబా సుశీల జ్వరాలతో మృతి చెందారు. అయితే వారు డెంగ్యూతో చనిపోయారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా రోజుల నుంచి ప్రజలు జ్వరాలతో బాధ పడుతున్నా.. మండల వైద్య సిబ్బంది ఎటువంటి మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయలేదు. మండల అధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

12:47 - July 12, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా భీమవరంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులోని దళితుల వెలిని నిరిసిస్తూ కేవీపీఎస్‌ ఇతర దళిత సంఘాలు ఛలో భీమవరం పిలుపునిచ్చాయి. దీంతో దళితులు, దళిత సంఘాల నేతలు భీమవరానికి భారీగా చేరుకున్నారు. అయితే దళితుల సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. సభకు అనుమతిలేకపోవడంతో ముందస్తు అరెస్ట్‌లకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు సహా పలువురు నేతలు భీమవరానికి చేరుకున్నారు. దీంతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఈనెల 30 ఏపీ సెట్ : ఏయూ

విశాఖ: ఈనెల 30 ఏపీ సెట్ నిర్వహిస్తున్నట్లు ఏయూ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ పరీక్షకు 43,023 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, ఈ పరీక్షకు 15 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి లేదని ఏ యూ అధికారులు తెలిపారు.

12:46 - July 12, 2017

కృష్ణా : విజయవాడలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గోపాలరెడ్డి వీధిలోని ఓ భవనంలో నగలు తయారు చేసే కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇందులో 30మందిదాకా పనిచేస్తుంటారు. రాత్రి పదిగంటల సమయంలో కార్మికులు నగలు తయారు చేస్తుండగా దాదాపు 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో వచ్చి బెదిరించారు. అక్కడి ఏడు కిలోల నగలను దోచుకెళ్లారు. ఈ తతంగాన్ని గమనించిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ బైక్‌పై కారును వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాలను తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:23 - July 12, 2017

తాను అన్నేళ్ల వరకు సీఎంగా ఉంటాను...నన్నేవరూ ఓడించలేరు..అప్పటి వరకు ముఖ్యమంత్రిగా తానే ఉంటాను...చేసి చూపిస్తా...అధికారంలోకి రావడమే లక్ష్యం..సీఎం అయ్యేందుకు సహకరించండి..సీఎం అయిన తరువాత చేసి చూపిస్తా..అంటూ ఒక నేత..తాను అధికారంలో ఉంటే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా..ఓడించే ప్రశ్నే ఉత్పన్నం కాదని..విపక్షాలవి వట్టి మాటలని..అధికారంలో ఉన్న పాలకులు చెబుతున్న మాటలు..మరి ఇవి సాధ్యమయ్యే పనేనా...

అధికారంలో టిడిపి..ప్రతిపక్షంలో వైసీపీ...
ఆంధ్రప్రదేశ్..టిడిపి అధికారంలో కొనసాగుతుండగా వైసీపీ ప్రతిపక్షంలో కూర్చొంది. మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం జరిపేందుకు సిద్ధమౌతోంది. ఇటీవలే నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో జగన్ ఏకంగా సీఎం అవుతానని ప్రకటించారు. 30 ఏళ్లు సీఎంగా ఉండాలని తనకు కోరిక ఉందని బహిరంగంగా ప్రకటించడం విశేషం. తాను అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేపడుతానో కూడా ఎన్నికల హామీలు కూడా ప్రకటించేశారు కూడా. తన నాయకత్వాన్ని ప్రేమించే విధంగా చేస్తానని జగన్ చెప్పుకొస్తున్నారు.

తానే సీఎం అంటున్న బాబు..
ఇక సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2050 వరకు అగ్రస్థానంలో నిలబెడుతానని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అంటే అప్పటి వరకు ఆయన సీఎంగా కొనసాగాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో..తరువాతి ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా విజయం సాధిస్తారన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపించే సమస్య ఉండదని..గతంలో కొన్ని ఇబ్బందికర నిర్ణయాలున్నాయని..అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఉండదని చెప్పుకొస్తున్నారు.

23 ఏళ్ల పాటు పాలించిన జ్యోతి బసు..
30 సంవత్సరాలు అధికారంలో ఉండడం సాధ్యమేనా ? ప్రపంచంలో ఒక ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడం జరిగిందా ? గతంలో జరిగిన పాలనపై ఒకసారి దృష్టిసారిస్తే...సోవియట్ యూనియన్ లో స్టాలిన్ ఏకంగా 30 ఏళ్లు అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇంత సుదీర్ఘ పాలన ఎవరన్నా చేశారా ? అంటే ఠక్కున జ్యోతిబసు పేరు గుర్తుకొస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జ్యోతిబసు ఏకంగా 23 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన సంగతి తెలిసిందే. అత్యధికంగా అన్ని సంవత్సరాలు సీఎంగా కొనసాగిన వ్యక్తి జ్యోతి బసు ఒక్కరే. అంతేగాకుండా ఆ రాష్ట్రంలో 34 ఏళ్ల పాటు సీపీఎం పాలన కొనసాగడం రికార్డు. త్రిపురలో మాణిక్ సర్కార్..ఒడిశాలో నవీన్ పట్నాయక్ లు..కొంతమంది సుదీర్ఘంగా సీఎంలుగా కొనసాగుతున్నారు.

ఎన్నో సమస్యలు..
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆ రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్న సంగతి తెలిసిందే. నూతన రాజధాని ఏర్పాటుకు ఎంతో మంది రైతుల నుండి ప్రభుత్వం భూ సేకరణ జరిపింది. తాతాల్కిక అసెంబ్లీ భవనం ఏర్పాటు చేశారు. 2019 నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం అవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. మరి పూర్తిగా నిర్మాణం కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ? ఇక విభజన కష్టాలు..ఆర్థిక కష్టాలు..లోటు బడ్జెట్..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..ఇతరత్రా సమస్యలు ఇంకా ఉన్నాయి.


కానీ వీరు అధికారంలోకి రావాలంటే ప్రజలు కీలకం. ఓటు అనే ఆయుధంతో వీరు పడుతున్న కలలకు చెక్ పెడుతారా ? లేక ఎలాంటి తీర్పునిస్తారో రానున్న రోజుల్లో తెలుస్తుంది...

ఔషధ మొక్కను నాటిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కరీంనగర్ మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్ ఎండీ కట్ట దిగువన మహాగని ఔషధ మొక్కను నాటారు. అనంతరం అంబేద్కర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

చల్లపల్లి కోమలానగర్ లో ఉద్రిక్తత

కృష్ణా :చల్లపల్లి కోమలానగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నివాసాల మధ్య మద్యం దుకాణం పెట్టొద్దని మద్యం దుకాణం వద్ద ఎక్సైజ్ సీఐ ను మహిళలు చుట్టిముట్టారు. మద్యం యజమానులు, మహిళల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

డ్రగ్స్ తో జీవితాలను నాశనం చేసుకోవద్దు: అల్లు అరవింద్

హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా పై సినీ ప్రముఖులు స్పందించారు. డ్రగ్స్ తో జీవితాలను నాశనం చేసుకోవద్దని అల్లు అరవింద్ సూచించారు. రేవ్ పార్టీల పేరుతో కల్చర్ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

ఓయూలో 10 రోజులుగా మంచినీటి సరఫరా బంద్

హైదరాబాద్: ఓయూలో గత 10 రోజులుగా మంచినీటి సరఫరా ఆపేశారని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 23న టెట్, ఆగస్టు 2,3 న గురుకుల పరీక్షల నేపథ్యంలో అప్పటి వరకు హాస్టళ్లలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ లోపు ఖాళీ చేయిస్తే మరో ఉద్యమం చేపడతామని ఓయూ విద్యార్థులు హెచ్చరించారు.

11:34 - July 12, 2017

విజయవాడ : నగరంలో భారీ దోపిడీ జరిగింది. బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలోకి తుపాకులు, కత్తులతో చొరబడిన ఆగంతకులు సుమారు ఏడు కిలోల నగలు దోచుకెళ్లారు. గవర్నరుపేట గోపాలరెడ్డి వీధిలో రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బెంగాల్‌కు చెందిన శంకర్‌ మన్నా గోపాలరెడ్డి వీధిలోని ఓ భవనంలో నగలు తయారు చేసే కార్ఖానా నిర్వహిస్తున్నాడు. ఇందులో 30మందిదాకా పనిచేస్తుంటారు. రాత్రి పదిగంటల సమయంలో కార్మికులు నగలు తయారు చేస్తుండగా దాదాపు 12 మంది ఆగంతకులు తుపాకులు, కత్తులతో వచ్చి బెదిరించారు. అక్కడి ఏడు కిలోల నగలను దోచుకెళ్లారు. ఈ తతంగాన్ని గమనించిన నైట్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ బైక్‌పై కారును వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఎనిమిది పోలీసు బృందాలు వాహనాలను తనిఖీలు చేపట్టాయి. దుండగుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్లను రంగంలోకి దించి కీలక ఆధారాలు సేకరించారు. మహారాష్ట్రకు చెందిన ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కరీంనగర్ కు చేరుకున్నారు. కాసేపట్లో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

11:33 - July 12, 2017

యాదాద్రి : కాలుష్య కోరల్లో పల్లెలు..కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలునిబంధనలు పాటించని కంపెనీలు నాశనమవుతున్న ఊళ్లు..విషపూరితమవుతున్న భూగర్భ జలాల..బీడువారుతున్న భూములు.. రోగాల బారిన పడుతున్న గ్రామస్థులుయాదాద్రి భువనగిరి జిల్లా.. చౌటుప్పల్ రెవిన్యూ డివిజన్ ప్రాంతంలో పల్లెలన్నీ రసాయన పరిశ్రమల కాలుష్యంలో చిక్కుకున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలు, వాయు కాలుష్యం వల్ల ఊళ్లకు ఊళ్లు నాశనమవుతున్నాయి. దోతిగూడెంలో ఏడు కంపెనీలు ఒకే చోట తిష్టవేయడంతో.. నీరు...గాలి... భూములు విషపూరితంగా మారాయి. దీంతో ఇక్కడ గ్రామాల ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

దాదాపు 75 పరిశ్రమలు
చౌటుప్పల్ , పోచంపల్లితో పాటు చిట్యాల మండలాల పరిధిలో ఫార్మా , బల్క్‌డ్రగ్స్, రసాయన తదితర పరిశ్రమలు పెద్దఎత్తున వెలిశాయి. దాదాపు 75 పరిశ్రమలు పెద్దస్థాయిలో నిర్మాణమయ్యాయి. ఇవన్నీ పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. కంపెనీల్లో కాలుష్యాన్ని నియంత్రించే పరికరాలు ఉండవు. ప్రమాదకర వ్యర్థాలను శుద్ధి చేయకుండా.. డైరెక్టర్‌గా పక్కనున్న పొల్లాలోకి ట్యాంకర్ల ద్వారా తెచ్చి వదిలేస్తున్నారు. కొన్ని కంపెనీలైతే బోర్లను తవ్వి అందులో పారబోస్తున్నారు. ఫలితంగా దోతిగూడెం, అంతమ్మగూడెంలోని బోర్ల నుంచి వచ్చే నీరు పూర్తిగా రంగు మారిపోయి .. రసాయనాల వాసన వస్తున్నాయి. ఆ నీరు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇలా రెండు గ్రామాల్లో వంద బోర్ల వరకు నిరుపయోగంగా మారాయి. ఆ నీళ్లను తాగుతున్న మూగ జీవులు వ్యాధుల బారిన పడి.. చనిపోతున్నాయి. రైతులకు చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయి. పంటలు బీడువారుతున్నాయి.. తోటలు వాడిపోతున్నాయి. దీంతో ఇక్కడ గ్రామాల ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ నీటితో సాగుచేద్దామంటే పంట పూర్తిగా ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లనివ్వడంలేదు..
పంటలు పండక.. రోగాలు తగ్గక ఈ ప్రాంతం నుంచి చాలామంది వలసలు వెళ్లిపోతున్నారు. పెళ్లీడికు వచ్చిన అబ్బాయిలకు.. ఆడపిల్లలను కూడా ఇవ్వడం లేదు. కాలుష్యంపై అధికారులకు.. పాలకులకు అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా ధోతిగూడెంలో హెజెలో యూనిట్‌ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.. దీనిని ఆ ప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధర్నాలు.. ర్యాలీలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం బుధవారం నిర్వహించబోయే ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ నామమాత్రంగా జరపాలని చూస్తోందని.. స్థానికులు అంటున్నారు. ప్రజా ప్రతినిధులు సహకరించడం వల్లే.. పరిశ్రమల యాజమాన్యాల ఆగడాలకు అడ్డు లేకుండా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతంపై దృష్టి సారించాలని.. కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

 

అసెంబ్లీ భవనం డిజైన్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు రూపొందించిన అసెంబ్లీ భవనం డిజైన్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమాక్షకు స్పీకర్ కోడెల, మంత్రులు యనమల, నారాయణ పాల్గొన్నారు

11:19 - July 12, 2017

మొక్కలు..ప్రస్తుత తరానికి..భవిష్యత్ తరానికి నీడను..ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా కాలుష్యాన్ని నివారిస్తుంది..పర్యావరాణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు నాటాలి..స్వచ్ఛమైన గాలి..అందుతుంది..వాతావరణ కాలుష్యం నుండి మనకు మనం కాపాడుకోగలుగుతాం..

మూడో విడత...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం అట్టహాసంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ‘హరితహారం’ పేరిట మూడో విడత మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు పర్యాయాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఇందులో విద్యార్థులు..ప్రభుత్వ ఉద్యోగులు..ఇతరులు స్వచ్చందంగా పాల్గొంటూనే ఉన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు..ట్రీ గార్డ్స్..నర్సరీలో పెంచడానికి అవసరమైన సౌకర్యాల కోసం నిధులు కేటాయిస్తోంది..మూడో విడతలో 40 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన మొక్కలు..ఇతర వాటిని ఏర్పాటు చేసి పంపిణీ చేపడుతోంది. నాలుగు సంవత్సరాల పాటు సాగే కార్యక్రమంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్షంగా నిర్ణయించారు. ఇందుకు ప్రోత్సాహకరంగా అవార్డులను కూడా ప్రకటించింది కూడా.

విమర్శలు..
కోట్లాది మొక్కలు..కోట్ల రూపాయలు..కేటాయించడం..కానీ ఇవన్నీ ఫలితం ఇస్తున్నాయా ? అంటే కొంతమేర మాత్రమే ఫలితం వస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నాటిన మొక్కల్లో ఎన్ని బతికి ఉన్నాయో చెప్పాలని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్ని మొక్కలు నాటామో ముఖ్యం కాదని..ఎన్ని బతికున్నాయో ముఖ్యమని పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చెట్లు నాటడం కార్యక్రమం చేపడుతోంది. చెట్లను నాటడానికి..వాటిని పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిచేయాలని పలువురు సూచిస్తున్నారు.

ప్రణాళిక ముఖ్యం..
ఇందుకు ముఖ్యంగా ప్రణాళిక ముఖ్యమని..అటవీ ప్రాంతంలో పోడు భూముల్లో పండ్లు..ఇతర పంటలు వేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా మొక్కలు నాటే బాధ్యత చూసుకుంటామని ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకరంగా కొంత వేతనం ఇస్తే కొంత నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ భూముల్లో చెట్లు పెంచి..వాటి బాగోగులు చూస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికంగా ఖర్చు పెట్టడం..అట్టహాసంగా ప్రచారం నిర్వహించడం మినహా స్పష్టమైన విధానం..ప్రణాళిక లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.
హరితహారం అనేది మంచి కార్యక్రమమైనా అది నీరుగారిపోకుండా చూడాలని సూచిస్తున్నారు. ఉద్యమంగా చేపడితేనే ప్రతిఫలం దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

11:16 - July 12, 2017

హైదరాబాద్ : ఓయూ క్యాంపస్ లో నాన్ బోర్డర్స్ పై చర్యలకు రంగం సిద్ధమైంది. మూడు రోజుల్లో ఖాళీ చేయాలని యూనివర్శిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15కల్లా ఖాళీ చేయకపోతే నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. అప్పటికీ నాన్ బోర్డర్స్ ఖాళీ చేయకపోతే పోలీసులను రంగంలోకి దించనున్నట్లు అధికారులు తెలిపారు. మరింత సమాచాం కోసం వీడియో క్లిక్ చేయండి.

గంటా ఇంటి దగ్గర మున్సిపల్ కార్మికులు ఆందోళన

విశాఖ: మంత్రి గంటా ఇంటి దగ్గర మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీ.వో నెం 279ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన

హైదరాబాద్: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో సేవలు నిలిచిపోయవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఎస్సీ బాలుర వసతి గృహంలో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావ్

సంగారెడ్డి: ఎస్సీ బాలుర వసతి గృహంలో మూడో విడత హరితహారాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ పాల్గొన్నారు. వసతి గృహ ఆవరణలో హరీష్ రావు మొక్కలు నాటారు.

రంగారెడ్డి జిల్లాలో నవ వధువు ఆత్మహత్య...

రంగారెడ్డి : జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగున్పల్లిలో నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తమామలే ఉరి వేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వధువు ప్రశాంతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసం హత్య చేశారని.. అత్తమామలను కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య...

హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టీఎస్‌ఐఐసీ కాలనీలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఫరీదుద్దీన్‌ అనే విద్యార్థి మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడు. పాఠశాల సిబ్బంది సంఘటనా వివరాలను పోలీసుకుల చెప్పకుండానే మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించడం అనుమానాలకు తావిస్తోంది. మృతదేహంపై గాయాలు ఉండటంతో.. ఉపాధ్యాయులు తీవ్రంగా దండించడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫరీదుద్దీన్‌ గాంధీనగర్‌ పరిధి వెంకట్రామిరెడ్డి నగర్‌కు చెందిన నాజీమొద్దీన్‌, అక్తర్‌ బేగంల ఏకైక సంతానం.

మహిళను అపహరించి సామూహిక అత్యాచారం...

తూ.గో : కాకినాడలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. మహిలను అపహరించి ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

10:28 - July 12, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ మట్లాడుతూ చంద్రబాబు సర్కార్ కాపులను చిన్న చూపు చూస్తోందని అన్నారు. నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో కపులను భ్రమలో పడేస్తున్నారని, రిజర్వేషన్ కావాలని పోరాడితే అక్రమ కేసులు పెడుతున్నారని ముద్రగడ ఆరోపించారు.

కాపులపై ఎందుకు చిన్న చూపు : ముద్రగడ

తూ.గో : కాపులను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాధం ప్రశ్నించారు. ఆయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాపులను భ్రమలో పడేస్తున్నారని విమర్శించారు.

10:23 - July 12, 2017

చిత్తూరు : టీటీడీ తిరుమలలో కొత్తగా ప్రవేశపెట్టిన టోకెన్ ద్వారా గదుల కేటాయింపును భక్తులు వ్యతిరేకిస్తున్నారు. టోకెన్ పద్ధతి బాగా లేదని సీఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. పాత విధానం ద్వారానే గదులు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతితో భక్తులకు క్యూలైన్లో నిలుచునే బాద తప్పుతుంది. భక్తులకు టోకెన్లు ఇచ్చి వారి రూం అలాట్ అయిన తర్వాత వారి ఫోన్ కు రూం వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. కానీ చదువు లేని వారికి, ఫోన్ లేనివారికి నూతన విధానం ఇబ్బందిగా ఉంటుందని భక్తులు అంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

10:22 - July 12, 2017

హైదరాబాద్ : ఇంజనీరింగ్ విద్యార్థి గణేష్ మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. పోలీసులు గణేష్ ను ముసాపేట అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని విచారణ కోసం ఘట్ కేసర్ పీఎస్ తరలించారు. పోలీసులు అదృశ్యం వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు. గణేష్ తల్లిదండ్రులకు భయపడి ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:15 - July 12, 2017

వరుణ్ సందేశ్ సతీమణి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. గత సంవత్సరం ఆగస్టు 19వ తేదీన సినీ నటుడు వరుణ్ సందేశ్..నటి వితిక షెరులకు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కానీ మంగళవారం రాత్రి వితిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు..ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు హల్ చల్ చేశాయి. దీనిపై వితిక ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సోషల్ మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారం అంతా పుకారేనని..తాము సంతోషంగా ఉన్నామని వెల్లడించింది.

నేడు కస్టడీకి డ్రగ్స్ కెల్విన్?!

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ రాకెట్ కేసు మూలాలను రాబట్టేందుకు ప్రధాన నిందితుడు కెల్విన్‌ను కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కోర్టును అభ్యర్థించినట్టు తెలిసింది. వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతించినట్టు సమాచారం. కెల్విన్‌ను బుధవారం కస్టడీకి అప్పగించే అవకాశం ఉన్నది. డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెల్విన్ గతంలో అరెస్టయిన సందర్భంగా వెల్లడించిన వివరాల ఆధారంగా ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

త్రిపురలో భారీ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టివేత..

త్రిపుర: బీఎస్‌ఎఫ్ సిబ్బంది, డ్రగ్ కంట్రోల్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ ఘటన త్రిపుర రాజధాని అగర్తలలో చోటుచేసుకుంది. డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

 

10:09 - July 12, 2017

బాలీవుడ్ సీనియర్ నటుడు 'అనీల్ కపూర్' ముద్దుల కూతురు 'సోనమ్ కపూర్' త్వరలో వివాహం జరగనుందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. న్యూ ఫ్యాషన్ తో కేక పెట్టించే ఈ బ్యూటీ డేరింగ్ అండ్ డాషింగ్ అని బాలీవుడ్ లో టాక్ ఉంది. తన డేటింగ్ విషయంలో ఇటీవలే స్పందించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎన్నో సినిమాల్లో తన నటనతో సోనమ్ ఆకట్టుకొంటోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ అహుజాతో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె టైటిల్ పాత్రలో వచ్చిన 'నీర్జా'కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ అవార్డు ఫంక్షన్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు 'అనీల్ కపూర్'..’ఆనంద్' కూడా రావడం చర్చనీయాంశమైంది. దీనితో ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తిరుమలలో భక్తుల ఆందోళన

తిరుమల : తిరుమలలో గదుల కేటాయింపు కోసం కొత్తగా టోకెన్ పద్ధతిని టిటిడి ప్రారంభించింది. టోకెన్ పద్ధతి బాగాలేదని సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులు ఆందోళనకు దిగారు. పాద పద్ధతి త్వారానే గదులు కేటాయించాలని భక్తులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

ప్రకాశం జిల్లాలో డెంగ్యూతో ఇద్దరు మహిళలు మృతి...

ప్రకాశం: ముండ్లమూరు మండలం పెదరావిపాడులో డెంగ్యూ, విషజ్వరాలు ప్రబలుతున్నాయి. పెదరావిపాడులో డెంగ్యూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు జంపాన వీరమ్మ(50), పంబ సుశీల(30). విషజ్వరాలతో పదరావిపాడు వాసులు డజన్ల కొద్ది మంచం పట్టారు. అయినా వైద్యాధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

వీబీఐటీ విద్యార్థి గణేష్ ఆచూకీ లభ్యం...

హైదరాబాద్: వీబీఐటీ విద్యార్థి గణేష్ మిస్సింగ్ కేసులో ఆందోళనకు తెరపడింది. గణేష్ ను ఈ రోజు ఉదయం మూసాపేట్ లో ఘట్ కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఘట్ కేసర్ పీఎస్ కు తరలించారు. అదృశ్యం వ్యవహారం పై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.

నేటి నుండి తిరుమలలో టోకెన్ల పద్ధతిలో గదుల కేటాయింపు

తిరుమల: తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో తితిదే అధికారులు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ రోజు నుంచి టోకెన్ల పద్ధతిలో భక్తులకు గదులను కేటాయించే ప్రక్రియను చేపట్టనున్నారు. టోకెన్ల మంజూరుకు సీఆర్వో గదుల కేటాయింపు వద్ద 10 కౌంటర్లను ప్రత్యేకించి ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఈ టోకెన్ల మంజూరుకు ఎంబీసీ-34 వద్ద ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఆధార్‌, వేలిముద్ర, మొబైల్‌ నెంబర్‌ ద్వారా ఈ టోకెన్ల నమోదు చేసుకోవచ్చని టీటీడీ స్పష్టంచేసింది.

మంచాల పీఎస్ లో మొక్కలు నాటిన డీజీపీ

రంగారెడ్డి : మంచాల పీఎస్ లో హరిత హారం కార్యక్రమాన్ని డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా పీఎస్ లో డీజీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మొక్కలు నాటారు.

పటాన్ చెరు లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు..

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు టోల్‌గేట్ వద్ద రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 2 ప్రైవేట్ బస్సులు, 2 టిప్పర్లను అధికారులు సీజ్ చేశారు. అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఆగివున్న బస్సును ఢీకొన్న ఇన్నోవా కారు: ఇద్దరి మృథి

మహబూబ్ నగర్ : అడ్డాకుల మండలం గుడిబండ స్టేజీ సమీపంలో ఆగివున్న బస్సును ఇన్నోవా ( ఏపీ 10 బీడీ 1788) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విజయవాడలో భారీ దోపిడీ..

విజయవాడ: నగరంలో మంగళవారం రాత్రి భారీ నగల దోపిడీ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బీసెంట్ రోడ్డులోని నగల తయారీ కేంద్రంలో రాత్రి భారీ దోపిడీ జరిగింది. దొంగలు కత్తులు, తుపాకులతో బెదిరించి 7 కిలోల బంగారు నగలు దోచుకెళ్లారు. 15 మంది దోపిడీ దొంగలు కార్ఖానాలో పనిచేస్తున్న సిబ్బందిని తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపట్టారు. దోపిడీ ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. పోలీస్ స్టేసన్లు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉద్రిక్తత

యాదాద్రి : భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. ఎబోలా, ఫార్మ కంపెనీ ప్రజాభిప్రాయ సేకణ నేపథ్యంలో అఖిలపక్ష నేతలను ముందస్తు అరెస్టు లు చేస్తున్నారు. యువ తెలంగాణ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ విస్తరణను వ్యతిరేకిస్తూ నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

09:42 - July 12, 2017

కర్నూలు : జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో ఓ వ్యక్తి దుండగులు కత్తులతో దాడి చేశారు. బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు రియాజ్ పై దుండగుల దాడి చేశారు. దుండగులు బిర్యానీతోపాటు మటన్ పీసెస్ అదనంగా ఇవ్వాలని బెదిరించడంతో అందుకు రియాజ్ నిరాకరించడంతో అతని పై కత్తులతో దాడి చేశారు. రియాజ్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

09:38 - July 12, 2017

యాదాద్రి : జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. హిటిరో ఫార్మా కంపెనీ పై ప్రజాభిప్రాయ సేకరణ భాగంగా హెటిరో ఫార్మా కంపెనీ వ్యతిరేకిస్తున్న నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. యువ తెలంగాణ అధ్యక్షుడు బాలకృష్ణరెడ్డిని పోలీసులు గృహనిర్భంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో పోలీసులను భారీగా మోహరించారు. అయితే ఇప్పటికే ఆ ఊరులో ఏడు రసాయనాల కంపెనీలు ఉన్నాయి. అక్కడ సర్వే చేసిని అధికారులు అక్కడ ప్రాంతమంతా కాలుష్యానికి గురైందని ఉన్నధికారులకు నివేదిక ఇచ్చన కూడా మళ్లీ కొత్త కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పై గ్రామస్తులు తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

09:37 - July 12, 2017

విశాఖ : జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారపాలెంలోని ఓ టీచర్‌ ఇంట్లో కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ముసుగులు వేసుకుని వచ్చిన వ్యక్తులు మెడపై కత్తులు పెట్టి బెదిరించి.. బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇంట్లో ఆడవారు ఉండడంతో వారు ఏం చేయాలపోయారు. దీని పై పోలీలసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:36 - July 12, 2017

కృష్ణా : విజయవాడలోని గవర్నర్ పేటలో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి 11గంటల సమయంలో దొంగలు బంగారు నగలు తయారీ దుకాణంలోకి ప్రవేశించి యాజమానులను కత్తులు, తుపాకులతో బెదిరించి 7కిలోల నగల దోపిడీ చేశారు. దుకాణంలోని రెండు సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బయట ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు గుంటూరు వైవు వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. దొంగలు ఉపయోగించిన వాహానం మహారష్ట్ర పేరుతో రిజిస్ట్రేషన్ తో ఉంది. దొంగలు మహారాష్ట్ర కు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ విషయం పోలీసులకు తెలిసిందన్న సమాచారంతో దొంగలు వారి వాహానాన్ని వదిలి వెళ్లారు. వారు రైల్లో వెళ్లె అవకాశం ఉండడంతో రైల్వే పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఈ దోపిడీలో మొత్తం 10 మంది పాల్గొనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

09:09 - July 12, 2017

హైరదాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రి హరీష్‌ రావుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పులిచింతల ప్రాజెక్టును టార్గెట్‌గా చేసుకుని హరీష్‌ రావు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీటిని తరలించారని.. ఈ మొత్తం వ్యవహారం నడిపింది ఉత్తమ్‌ కుమారేనని ఆదివారం మంత్రి హరీష్ ఆరోపించారు. హరీష్‌ రావు వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాను టీఆర్‌ఎస్ నేతల్లాగా ఆంధ్రా కాంట్రాక్టర్లకు బానిసను కానని మండిపడ్డారు. ప్రాజెక్టు లేకపోతే .. విద్యుత్ ప్రాజెక్టు ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.టీఆర్‌ఎస్ నేతలకు తన దైన శైలిలో కౌంటర్ ఇవ్వడమే కాదు.. అప్పుడే అసలేం జరిగిందనే విషయం ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గాంధీభవన్ వేదికగా ముంపు బాధితులను మీడియా ముందుకు తీసుకువచ్చి వారితోనే మాట్లాడించారు.చివరిగా పులిచింతలతో కొంత ముంపుకు గురైనా తెలంగాణకు మేలు జరిగిందని చెప్పుకొచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఉత్తమ్ కౌంటర్‌కు మంత్రి షరీష్‌ రావు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.

08:53 - July 12, 2017

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లై. ఈ మూవీ టీజర్‌ మంగళవారం విడుదలైంది. పూర్తి యాక్షన్‌ సన్నివేశాలతో విడుదల చేసిన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ ఎంటరటైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో అర్జున్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో అర్జున్‌ పాత్రపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

08:51 - July 12, 2017

బ్రిటన్ : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ కీలక పోరుకు సిద్ధమైంది. సెమీఫైనల్‌ బెర్తే లక్ష్యంగా... ఇవాళ మిథాలీ సేన బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో వరుసగా ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంకను ఓడించి జోరుమీదున్న భారత్‌కు సౌతాఫ్రికా షాక్‌ ఇచ్చింది. 115 పరుగుల తేడాలో మిథాలీ బృందం ఓటమి చవిచూసింది. ఇక ఆసీస్‌ది కూడా ఇదే పరిస్థితి. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆజట్టు ఆతిథ్య ఇంగ్లాండ్‌ చేతిలో ఓడింది. దీంతో భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య సమరం ఆసక్తిరేపుతోంది. 

08:06 - July 12, 2017

విశాఖ : జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దారపాలెంలోని ఓ టీచర్‌ ఇంట్లో కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ముసుగులు వేసుకుని వచ్చిన వ్యక్తులు మెడపై కత్తులు పెట్టి బెదిరించి.. బంగారు ఆభరణాలు దోచుకున్నారు.

 

నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్

మహిళ ప్రపంచకప్ : నేడు ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది.

07:26 - July 12, 2017

కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎమిటో తెలిసిందని, ప్రజల నుంచి విజ్ఞాప్తులు తీసుకుంటున్నామని సోలిసిటర్ జనరల్ సుప్రీంకు తెలిపారని, ప్రజల అనుగుణంగా సవరణలు చేస్తామని, ఎవరు మాంసం తినకూడదని బీజేపీ అనుకోవడంలేదని, ప్రధాని మోడీ కొందరి హెచ్చరించారని, జంతువుల పేరుతో జరుగుతున్న దాడులను ఖండించారని బీజేపీ నేత ప్రసున్న అన్నారు. దేశంలో జరుగుతున్న బీజేపీ పాలనకు మోట్టికాయలాంటిదని, గోసంరక్షుల పేరిట ఆర్ఎస్ఎస్ వారు మైనార్టీల పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని, గోవులను తరలించే ఇద్దరిని ఉరివేశారని సీపీఎం నేత రఘు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:24 - July 12, 2017

ముంబై : టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎవరనే అంశంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త కోచ్‌గా రవిశాస్త్రిని నియమించినట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా వెల్లడించారు. టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా, రాహుల్‌ ద్రవిడ్‌ను బ్యాటింగ్‌ సలహాదారుడిగా నియమించినట్లు పేర్కొన్నారు. గతంలో టీమ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన రవిశాస్త్రి... కోచ్‌ పదవికి గడువు పెంచిన తర్వాత దరఖాస్తు చేసుకున్నాడు. భారత జట్టు కెప్టెన్‌ కోహ్లీతో పాటు ఆటగాళ్లందరూ రవిశాస్త్రినే కోరుకోవడంతో... గంగూలీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ ఆయనను కోచ్‌గా ప్రకటించింది. అయితే... నిన్న సాయంత్రం రవిశాస్త్రిని హెడ్‌కోచ్‌గా నియమించినట్లు వార్తలు వచ్చినా బీసీసీఐ కొట్టిపారేసింది. కానీ... చివరకు రవిశాస్త్రినే హెడ్‌ కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడం విశేషం.

 

 

07:23 - July 12, 2017

ఈటనగర్ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పాపుంపరే జిల్లా లాప్‌టాప్‌ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండచెరియలు విరిగి పడటంతో గ్రామానికి చెందిన 14 మంది చనిపోయారు. ఈ ఘటనలో గ్రామస్తులు కొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వారు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా పాపుంపరేలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. అందువల్లే కొండ చరియలు విరిగిపడినట్టు అధికారులు తెలిపారు. మరోసారి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో.. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

07:22 - July 12, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో అవకాశం రాని నేతలంతా గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం వారి ఆశలపై నీళ్లుచల్లారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆశించిన వారికి కాకుండా... ఈసారి వేరేవారికి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించనున్నారు. గవర్నర్‌ కోటాలో రెండు ఎమ్మెల్సీలు పదవులున్నాయి. వీటిలో ఒకటి కడప జిల్లా జమ్మలమడుగు ఇన్‌చార్జ్‌ రామసుబ్బారెడ్డికి, మరొకటి కర్నూలు జిల్లా నంద్యాల సీనియర్‌ నేత ఎన్‌.ఎండీ ఫరూఖ్‌కు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే సమయంలోనే రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మధ్యనే చంద్రబాబును కలిసిన రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిస్తున్నట్లు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

శాసనమండలి చైర్మన్‌గా ఫరూఖ్‌
ఇక రెండో ఎమ్మెల్సీ పదవి కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు. ఇందులో ముఖ్యంగా పార్టీ లీగల్‌ సెల్‌కు చెందిన కనకమేడల రవీంద్రబాబు, పరకాల ప్రభాకర్‌, చందు సాంబశివరావు, దాసరి రాజామాస్టార్‌లున్నారు. చంద్రబాబును కలిసి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. అయితే.. రెండు రోజుల క్రితమే నంద్యాల సీనియర్‌ ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ పదవిస్తున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారట. త్వరలో నంద్యాలలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. బలమైన ముస్లిం ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఫరూఖ్‌కు ఈ పదవి కట్టబెడుతున్నట్లు తెలుస్తోంది. ఫరూఖ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. భవిష్యత్‌లో ఆయనను శాసనమండలి చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయి. దీంతో కేబినెట్‌లో మైనారిటీలు లేరనే లోటును ఈ విధంగా భర్తీ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఫరూఖ్‌కు అవకాశం కల్పిస్తే... రాయలసీమలో ఓటు బ్యాంక్‌ ఉన్న ముస్లిం మైనారిటీలను తమ పార్టీ వైపే ఉంచుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా మొత్తానికి గవర్నర్‌ కోటాలోని రెండు ఎమ్మెల్సీ పదవులకు రామసుబ్బారెడ్డి, ఫరూఖ్‌ల పేర్లు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 

07:19 - July 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ హస్తం పార్టీలో రెడ్డి, బీసీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుతోంది. రెడ్డి నాయకుల డామినేషన్‌కు వ్యతిరేకంగా బీసి లీడర్లు వాయిస్‌ పెంచుతున్నారు. సంఖ్యాపరంగా పదవుల్లో తమకు వాటా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2014లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నాల ల‌క్ష్మయ్యకు హైకమాండ్‌ పీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ నిర్ణయమే కాంగ్రెస్ పార్టీకి న‌ష్టం చేసింద‌ని రెడ్డి నేత‌లు దుష్ప్రచారం చేశారని బిసీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆ టైమ్‌లో జానారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించినట్లయితే ఫలితం మరోలా ఉండేదని రెడ్డి నేత‌లు చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది బీసీ నాయ‌క‌త్వాన్ని అస‌మ‌ర్థంగా చిత్రీక‌రించే ప్రయత్నమే అని..భ‌విష్యత్‌లో పార్టీకి న‌ష్టమంటున్నారు.

బీసీ నేత‌ల భవిష్యత్‌ కార్యచరణ
ఇదే సరైన స‌మ‌యంగా భావిస్తున్న బీసీ నేత‌లు..భవిష్యత్‌ కార్యచరణ రూపొందించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ బీసీల‌కు ప్రాధాన్యత కల్పించడం... సొంత పార్టీలో జ‌ర‌గుతున్న అన్యాయంపై స్వరం పెంచుతున్నారు. త‌మ మ‌ధ్య ఉన్న అభిప్రాయ భేదాల‌ను ప‌క్కనబెట్టి పార్టీలోని బీసీ నేత‌లను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వ‌ర‌స‌ సమావేశాలు నిర్వహించిన నేతలు..ఈనెల 14న యాక్షన్‌ ప్లాన్ ప్రకటించనున్నారు. పార్టీలో బీసీ ప్రాధాన్యత పెంచేందుకు ప‌క్కాప్రణాళికతో బీసీ నాయకులు ముందుకెళ్తున్నారు. ఢిల్లీలో బీసీ లీడ‌ర్‌ షిప్‌పై ఉన్న అభిప్రాయాన్ని మార్చడం..సంఖ్యాపరంగా పదవుల్లో వాటా అన్న నినాదాన్ని తీసుకెళ్లడం తదితర అంశాలపై హైక‌మాండ్‌కు రిపోర్టు ఇవ్వాల‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఉత్తమ్‌, జానాల పనితీరుపై ఏకరువు పెట్టాలని భావిస్తున్నారట. పీసీసీచీఫ్‌గా ఉత్తమ్‌, సీఎల్పీ నేత‌గా జానారెడ్డి ఇప్పటివరకు ఏం సాధించార‌ని ప్రశ్నిస్తున్నారట. గ్రేట‌ర్, వ‌రంగ‌ల్, నారాయ‌ణ్ ఖేడ్ ఎన్నికల్లో ఎందుకు ఘోరంగా ఓట‌మి పాల‌య్యారనే అంశాల‌తో రిపోర్టును సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మ‌రి బీసీ లీడర్ల ఎత్తుగడలకు రెడ్డీ నాయకులు ఏ విధంగా కౌంటర్‌ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.

07:18 - July 12, 2017

హైదరాబాద్: పచ్చదనాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం మూడో విడత అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో గులాబి శ్రేణులు ముమ్మరంగా పాల్గొననున్నాయి. పార్టీ పరంగా నేతలంతా ఈ కార్యక్రమంలో తప్పని సరిగా పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతలను ఆదేశించారు. కేసీఆర్‌ కరీంనగర్ జిల్లాలో మొక్క లు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నేత నుంచి గ్రామ స్థాయి నేత వరకు కూడా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు అందాయి. నేతల ఇళ్ల ముందు మొక్కలు నాటి గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నేతలే పర్యవేక్షించాలని... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నేతలు భావించకుండా తమ గ్రామం, మండలాన్ని పచ్చదనంగా మార్చే బాధ్యతగా నేతలు భావించాలని స్పష్టమైన సంకేతాలను సీఎం కార్యాలయం ఇచ్చింది. అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి సభ్యులతో పాటు.. కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ హరితహరం కార్యక్రమంలో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు.

రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు
రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో నేతలను భాగస్వామ్యం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యులను చేస్తున్నారు. ఇక సీఎం ఆదేశాలతో కొన్ని రోజులపాటు నేతలంతా నియోజకవర్గాలకే పరిమితం కానున్నారు. 

07:08 - July 12, 2017

హైదరాబాద్ : భాగ్యనగరంలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని శాఖలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది జీహెచ్‌ఎంసీ. హరితహారం కింద గతేడాది 80 లక్షల మొక్కలు నాటించగా.. ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని టార్గెట్‌గా పెట్టుకుంది బల్దియా. అలాగే గత సంవత్సరం 2.80 లక్షల మొక్కల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించగా... 90 శాతం వరకు మొక్కలను రక్షించగలిగామంటున్నారు అధికారులు. ఇందుకోసం ఒక్కో మొక్కకు 350 రూపాయలు ఖర్చుచేశామంటున్నారు. అలాగే ఈ సారి కూడా మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్నారు.

ప్రజల భాగస్వామ్యం
ఒక మొక్కలు నాటడంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 93 లక్షల మొక్కలను ప్రజలకు అందించాలని నిర్ణయించారు. అయితే ఎవరెవరికి ఏయే మొక్కలు కావాలో వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశారు. బుధవారం ప్రారంభం కానున్న మూడవ విడత హరిత హారాన్ని ముసారంబాగ్‌లో ప్రారంభిస్తారు మేయర్ బొంతు రామ్మోహన్. సిటీలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. 

07:07 - July 12, 2017

 

కరీంనగర్ : జిల్లాలో  సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా. రాజకీయంగా, ఉద్యమపరంగా కేసీఆర్‌ను నిలబెట్టిన జిల్లా కావడంతో ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడినుంచే శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమానికి కరీంనగర్‌ వేదిక అయ్యింది. సీఎం కేసీఆర్‌ ఉదయం 10.45 గంటలకు తిమ్మాపూర్‌కు చేరుకుంటారు. అనంతరం లోయర్‌ మానేరు డ్యామ్‌ తీరాన మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మానేరు తీరాన 11 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడినుంచి భారీ ర్యాలీతో అంబేడ్కర్‌ స్టేడియానికి సభాస్థలికి చేరుకుంటారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి కేసీఆర్‌ చేతులమీదుగా మొక్కల పంపిణీ చేస్తారు.

50 డివిజన్లలో 50 వేల మొక్కలను
కరీంనగర్‌కు ముఖ్యమంత్రి వస్తుండటంతో నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్లన్నీ ఆకర్షణీయంగా మారాయి. అల్గునూర్‌ వంతెనపై పూల కుండీలను ఏర్పాటు చేయడంతో నగరానికి కొత్త కళ వచ్చింది. నగరంలో డివైడర్ల మధ్య పూల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లలో 50 వేల మొక్కలను నర్సరీల నుంచి తెప్పించామని వాటి సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్‌ రవిందర్‌సింగ్‌ సీఎం పర్యటన నేపథ్యంలో 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. లోయర్‌ మానేరు డ్యామ్‌ నుంచి అంబేడ్కర్‌ స్టేడియం వరకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఆమరణ దీక్ష చేస్తానని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరిక
ఇక కేసీఆర్‌ కరీంనగర్‌ పర్యటన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరీంనగర్‌కు ప్రకటించిన మెడికల్‌ కళాశాలను ఆగస్టు 4వ తేదీలోగా మంజూరు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. మొత్తానికి మూడో విడత హరితహారం కార్యక్రమానికి కరీంనగర్‌ వేదిక కావడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

07:05 - July 12, 2017

హైదరాబాద్ : ఎంజీబీఎస్ ఆవరణలోని సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓవర్‌లోడ్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్లకు అంటుకుని మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. 7 గంటలపాటు ఫైర్‌ సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు. 

నేటితో ముగియనున్న ఏపీ రైతుసంఘమహాసభలు

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడలో జరుగుతున్న 21ఏసీ రైతుసంఘమహా సభలు నేటితో ముగియనున్నాయి. నేడు ఏపీ రైతుసంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు.

విజయవాడలో భారీ చోరీ

కృష్ణా : విజయవాడలోని గవర్నర్ పేటలో భారీ చోరీ జరిగింది. దొంగలు బంగారు నగలు తయారీ దుకాణంలో కత్తులు, తుపాకులతోమ బెదిరించి 7కిలోల నగల దోపిడీ చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

06:43 - July 12, 2017

 

అనంతపురం చెప్పడానికి బాగానే ఉందని కానీ ప్రభుత్వం చెప్పెదోకటి చేసేదొకటి అని, అనంతపురం జిల్లాకు కోట్లు ప్రకటించామని రూపాయి కూడా ఇవ్వలేదని, ఇన్ పుట్ సబ్సిడీ, ప్రిమియానికి ముడి పెట్టారు. జిల్లా ఒక్క ఎరాకు కూడా నీరు ఇవ్వలేదని అనంతపురం జిల్లా ప్రతినిధి తెలిపారు. ఈ రోజున ఏ ప్రభుత్వ అయిన మహిళ గురించి మాట్లాడుతున్నారని, గ్రామల్లో మహిళల శ్రమ దోపిడీ జరుగుతుందని, మద్యపాపనం చంద్రబాబు నిషేధిస్తుమని చెప్పారు కానీ భర్తలు కోల్పోయిన ఎందరో ఉన్నారని, కుటుంబ భారమంత మహిళలు మోసే పరిస్థితి వచ్చిందన మహిళ రైతు ప్రతినిధి రూయా అన్నారు. ఇవాళ్టి రోజున రైతులు వ్యవసాయం చేయ్యాలో లేదా అన్న మీమంసంలో ఉన్నారని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పారు కానీ అవి అమలు కావడం లేదని కృష్ణా జిల్లా రైతు ప్రతినిధులు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు తూ.గో మంత్రి శిద్దా పర్యటన

తూర్పుగోదావరి : జిల్లాలోని కాకినాడలో మంత్రి సిద్దా రాఘవరావు పర్యటించనున్నారు. ఆయన అటవీ శాఖ ఉన్నధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

 

వివక్షకు వ్యతిరేకంగా నేడు బహిరంగ సభ

చిత్తూరు : తిరుపతి మహాభారత ఉత్సవాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఉదయం 10గంటలకు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Don't Miss