Activities calendar

13 July 2017

21:33 - July 13, 2017

విజయనగరం : ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో మరణమృదంగం మోగుతున్నా...సీఎం చంద్రబాబు మన్యం ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై విజయనగరం కలెక్టరేట్‌ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం చేపట్టి మూడేళ్లైనా సీఎం ఏ ఒక్క హామిని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు.

21:32 - July 13, 2017

విశాఖ : తూర్పు ఏజెన్సీలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి స్థితిగతులపై వైద్యుల్ని ఆరా తీశారు. రోగులకు అందుతున్న వైద్య సేవల్ని నిశితంగా పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

21:31 - July 13, 2017

నల్లగొండ : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డిలు కలిసి పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. ముగ్గురు మంత్రులు ఒకేసారి అభివృద్ది పనుల శంఖుస్థాపనలలో పాల్గొనడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. పోటాపోటీగా బైక్‌ ర్యాలీలు నిర్వహించడంతో మిర్యాలగూడ పట్టణం కోలాహలంగా మారింది. 

21:30 - July 13, 2017

విజయనగరం : విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వైఫై సేవలను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు.. మారుతున్న కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ముఖ్యమన్నారు. విజయనగరం రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు ఏర్పాటు చేయడంపై కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ ప్రభుకు అభినందనలు తెలిపారు. 

21:30 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారుల బృందాలు ఇప్పుడు సినీ పరిశ్రమపై దృష్టి పెట్టాయి...ఇప్పటివరకు స్కూళ్లు..కాలేజీలతో పాటు ఐటీ కారిడార్‌లలో మత్తు వినియోగంపై వివరాలు ఆరా తీసిన సిట్ బృందానికి టాలివుడ్‌లో లింకులు దొరికాయి...డ్రగ్స్ కింగ్‌పిన్‌ కెల్విన్‌ కాల్‌డేటా పరిశీలిస్తున్న అధికారులకు చిత్రసీమలోని ప్రముఖుల ఫోన్ నంబర్లు దొరికాయి..పదే పదే నంబర్లతో కాంటాక్ట్‌లో ఉండడం చూస్తుంటే వారంతా డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగాయి..దీంతో వారందరికీ నోటీసులు జారీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులు హాజరు కావాలంటూ హుకూం జారీ చేస్తున్నారు...ఇప్పటికే పది మందికి నోటీసులు అందించిన ఈ లిస్టులో తాజాగా మరో ఐదుగురు చేరారు...ఇంకా కొంత మంది ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు టాలివుడ్‌ను కుదిపేస్తుంది...ఇక ఇప్పటికే పదిహేను మందికి నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ నెల 17 నుంచి 27 వరకు ఎక్సైజ్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు...ఎవరైనా హాజరుకాని పక్షంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో వారిపై చర్యలు తీసుకోవాలని రంగం సిద్దం చేసినట్లు తెలుస్తుంది...ఇప్పటికే నోటీసులు అందుకున్న సినీ స్టార్లలో గుబులు రేపుతుండగా సిట్ బృందం వద్ద ఉన్న లిస్టులో మత్తు వినియోగించినవారి జాబితా ఉన్నట్లు సమాచారం..దీంతో వారిలో కూడా ఆందోళన మొదలయినట్లు తెలుస్తోంది...డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల కాల్‌డేటా ఆధారంగా డ్రగ్స్ వాడకం దార్ల గుర్తించిన ఎక్సైజ్ శాఖ వారికి దశలవారిగా నోటీసులు అందిస్తుంది...అందులో భాగంగానే సినీ పరిశ్రమలోని ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు...ఇక హాజరయ్యేవారి నుంచి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకోనున్నారు...మత్తు వినియోగించారా...?ఇప్పటివరకు నిందితుల కాల్‌డేటా ఆధారంగా మత్తు వినియోగించినవారి వివరాలు సేకరించిన ఎక్సైజ్ వారిని విచారిస్తే వాస్తవాలు బయటకు రానున్నాయని భావిస్తున్నారు..వారంతా మత్తు మాత్రమే వినియోగిస్తున్నారా..? లేక వారిలో కొందరు మత్తును సరఫరా చేస్తున్నారాన్న విషయాలు వెలుగులోకి రానున్నాయి.

21:28 - July 13, 2017

వరంగల్ : హన్మకొండలోని కుమార్‌పల్లిలోని తన ఇంట్లో ఉన్న కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురయ్యాడు... ఇంట్లో వచ్చినవారితో మాట్లాడుతుండగా వచ్చిన ముగ్గురు వేటకొడవళ్లు తీసి దారుణంగా నరికేశారు..రక్తపు మడుగులో కుప్పకూలిన మురళి అక్కడే మృతి చెందాడు..కార్పోరేటర్‌గా ఉన్న అనిశెట్టి మురళీ గతంలో జనార్థన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు...ఆ తర్వాత కక్ష పెంచుకున్న జెన్నీ కుమారులు అవకాశం కోసం చూస్తున్నారు...జెన్నీ కుమారుడు విక్రమ్ జాతీయ పార్టీ గుర్తుతో కార్పోరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.. వ్యాపారాలు చేసుకుంటున్న విక్రమ్ అవకాశం దొరగ్గానే మురళిని నట్టింట్లోనే చంపేసి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయారు.

21:03 - July 13, 2017
20:20 - July 13, 2017

 

ఎక్కడ నెగ్గాలో గాదు.. ఎక్కడ తగ్గాల్నో తెల్సినోడు లీడర్ అంటరు సూడు.. అగో ఈ పదానికి పర్ఫెక్టుగ సరిపోతడు మన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సారూ..?ఎక్కడ నెగ్గాలో గాదు.. ఎక్కడ తగ్గాల్నో తెల్సినోడు లీడర్ అంటరు సూడు.. అగో ఈ పదానికి పర్ఫెక్టుగ సరిపోతడు మన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సారూ..?ఒక ఆడివిల్ల మీద యాసిడ్ వోశినోళ్లను అప్పట్ల వరంగల్ కాడ ఎన్ కౌంటర్ జేశిండ్రు.. మరి అదే పిల్లమీద గాకుంట ఏకంగ పల్లెమీదనే విషం జల్లితె వాళ్లను ఎన్ కౌంటర్ జేయాల్నా..? గోర్ల కథ ఉత్తదే ఉన్నట్టుందిగదా..? వాళ్లపైకం బెట్టి వాళ్లకు గొనిచ్చుడు దప్ప.. సర్కారు ఒర్గవెడ్తున్నది ఏం లేదని ఫీలైతున్నరు కొంతమంది గొల్లకుర్మోళ్లు..అరే నాయనా.. తెలంగాణ రాష్ట్రంల ప్యాకాట బందు వెట్టిన సంగతి..? తమిళంల, కన్నడల, ఒడియాల గూడ ప్రచారం జేయుండ్రొసు.. వాళ్లకు మన భాష అర్థంగాక.. మనతానికొచ్చి పత్తాలాటలాడుతున్నరు..హురక మహాత్మగాంధీ తాత గూడ టీఆర్ఎస్ పార్టీల జేరిండా..? అగో ఎప్పుడు జేరిండు ఏం కథ..? మిర్యాల గూడ పట్నంల పబ్లీకంత ఇదే ఆలోచన జేస్తున్నరట.. గాంధీతాత కారెప్పుడెక్కిండు..? అసలు తెలంగాణ రాష్ట్రమొచ్చినం ఓపెన్ కాస్టింగులే ఉండయ్.. అన్ని భూగర్భ బావులే అన్నరు టీఆర్ఎస్ పార్టోళ్లు.. ఏ మేమెప్పుడు అన్నం అంటె.. 2014 ఎన్నికల మేనిఫెస్టో బుక్కున్నదిగదా.? తల్లి కాన్పంటె ఇట్లుండాలే.. ఒక్కటే కాన్పుల ఇద్దరు గాదు ముగ్గురు గాదు.. ఏకంగ నల్గురు పిల్లలు వుట్టిండ్రు.. ఏడనో బైటిదేశంగాదు.. మన ఖమ్మం జిల్లాలనే ఇయ్యాళ పొద్దుగాళ్ల తొమ్మిదిన్నరకు డెలివరీ... పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:19 - July 13, 2017

తీగలాగితే డొంకంతా కదులుతోంది. పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజీలతో మొదలై విషయం టాలీవుడ్ ని చేరింది. నటులు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు చాలామంది ఈ రాకెట్ భాగమయ్యారని తెలుస్తోంది. వాళ్లెవరో సామాన్యులు సైతం ఊహించగలిగేలా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ దర్యాప్తు గతంలోలా చడీ చప్పుడు కాకుండా ఆగుతుందా .. లేక మత్తులో మునుగుతున్న మహానగరాన్ని నిద్రలేపే దిశగా సాగుతుందా? ఇదే ఇప్పుడు ప్రశ్న..ఇండస్ట్రీలో వాళ్లంతా ప్రముఖులే.. తెరపై ఇరగదీసే వారు కొందరైతే... తెరవెనుక చక్రంతిప్పేవారు ఇంకొందరు.. కానీ, అందరూ కలిసి మత్తులో మునిగిపోతున్నారు. ప్రమాదకర డ్రగ్స్ కు బానిసలుగా మారిపోతున్నారు. నగరంలో బద్దలైన డ్రగ్ రాకెట్ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. పేర్లు అధికారికంగా బయటకు రానప్పటికీ...ఈ చిట్టాలో ఎవరున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:53 - July 13, 2017

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ మాఫియా కేసు కుదిపేస్తోంది.. పలువురు సినీ ప్రముఖులను సిట్‌ నోటీసులు వణికిస్తున్నాయి.. నోటీసులు అందుకునేవారిసంఖ్య 20కి చేరే అవకాశం కనిపిస్తోంది.. డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలకుకూడా సిట్‌ నోటీసులు పంపింది.. నోటీసులు అందుకున్నవారిలో ఓ టాప్‌ డైరెక్టర్‌, టాప్‌ హీరో, టాప్‌ కెమెరామెన్‌ తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది.. ఐటం సాంగ్స్‌తో వెండితెరను ఊపేసిన ఓ నటి... వర్ధమాన గాయకురాలి భర్త.... బాలనటుడిగా మొదలై వర్దమాన నటుడిగా ఎదిగిన హీరో.... డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తున్న ఓ హీరోయిన్‌... సినిమా ఫంక్షన్‌లలో హీరోలను ఆకాశానికి ఎత్తే నిర్మాత.... సినిమాల్లో బ్రేక్‌ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడుఉన్నట్లు సమాచారం.. డ్రగ్స్ తీసుకునేవారంతా గచ్చిబౌలిలోని ఓ పబ్‌ అడ్డాగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు పలువురికి నోటీసులు పంపిన సిట్‌.... వీరంతా ఈ నెల 19నుంచి 27తేదీల్లో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు రావాలని ఆదేశించింది.. లేకపోతే చర్యలు తప్పవని అకున్‌ సబర్వాల్ హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:48 - July 13, 2017

విజయవాడ : రేపుటి నుంచి మూడు రోజుల పాటు వస్త్రవ్యాపారులు సమ్మె చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

19:43 - July 13, 2017

మహబూబబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కలెక్టర్ ప్రీతిమీనా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. శంకర్ నాయక్ పై 353,354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:42 - July 13, 2017
19:36 - July 13, 2017

విశాఖ : జిల్లాలోని మధురవడ కొమ్మాదిలో విషాదం జరిగింది. వీఎంకే అపార్ట మెంట్ మూడో అంతస్తు నుంచి రెండేళ్ల బాలుడు కిందపడ్డాడు. తీవ్రగాయాలతో బాలుడు తనూజ్ మృతి చెందాడు. బాలుడి మరణంతో శోకసముద్రంలో తల్లిదండ్రులు మునిగిపోయారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:35 - July 13, 2017

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగాతరలిస్తున్న బంగారన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రితీ మిక్సి జార్ మోటారలో బంగారిన్ని పెట్టి కిలోన్నర బంగారం తరలిస్తూ ఓ మహిళ పట్టుబడింది. ఆ మహిళ అబిదాబి నుంచి వస్తునట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:26 - July 13, 2017

కృష్ణా : జిల్లా పెనమలూరు మండలం సనత్‌ నగర్‌లో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది.. పటమట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతున్న సౌమ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. బాలిక మృతికి ఆకతాయిల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. సౌమ్య తండ్రి ఎలక్ట్రీషియన్‌గా... తల్లి భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్నారు.. ఇద్దరూ పనికివెళ్లిన సమయంలో సౌమ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

19:24 - July 13, 2017

కర్నూలు : పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ఫార్ములాను ఫాలో అవుతుంది ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంతో చేజార్చుకున్న నంద్యాల స్థానాన్ని ఉప ఎన్నిక ద్వారా దక్కించుకోవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రచారం కూడా మొదలు పెట్టింది. పార్టీకి చెందిన కీలక నేతలంతా నంద్యాలలో మకాం వేయనున్నట్టు తెలుస్తోంది. వారంతా ప్రచారంలో పాల్గొననున్నారు. అధినేత జగన్‌తో సహా అవసరమైతే షర్మిల, విజయమ్మ కూడా నంద్యాలలో ప్రచారం చేస్తారని సమాచారం. వైసీపీ అధిష్టానం నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఎలాగైనా నంద్యాల స్థానాన్ని సాధించుకునేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా జగన్‌... ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సలహాలు... సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆధ్వర్యంలో సర్వే కూడా చేయించారు. ఆ సర్వే ఫలితాలు పార్టీకి అనుకూలంగా వచ్చినట్టు పార్టీలో ప్రచారం కూడా సాగుతోంది.

మరోవైపు టీడీపీ
మరోవైపు ప్రభుత్వం కూడా నంద్యాల ఎన్నికలను టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో మెజార్టీగా ఉన్న ముస్లీం ఓటర్లను ఆకర్షించేందుకు మాజీ మంత్రి ఫరీఖ్‌కు ఎమ్మెల్సీ, మండలి చైర్మన్‌ పదవిని ప్రకటించింది. బలిజలకు కమ్యూనిటీ హాల్‌ను నిర్మించినున్నట్టు వెల్లడించింది. నంద్యాల స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార పార్టీకి చెందిన అభ్యర్థితో పాటు.. మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ప్రచారం చేస్తున్నారు.వైసీపీ మాత్రం భూమా నాగిరెడ్డి వైసీపీ గుర్తుతో గెలిచి అధికార పార్టీలో చేరడంతో.. ఆ స్థానం మాదే అనే దీమాలో ఉన్నట్టు తెలుస్తోంది.  

19:23 - July 13, 2017

కర్నూలు : కర్నూలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరుణ యాగం నిర్వహిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. నగరంలోని రాంబొట్ల దేవాలయంలో మూడు రోజుల పాటు ఈ యాగం జరుగుతుందన్నారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్‌ తమ రాష్ట్రానికి బియ్యం కావాలని కోరారని చెప్పారు. 20న కేరళ బృందం విజయవాడకు రానున్నారని వీరితో మంత్రులు ఏ విధంగా సరఫరా చేయాలనే విషయంపై చర్చిస్తామన్నారు. 

19:22 - July 13, 2017

పశ్చిమ గోదావరి : బహిరంగ సభలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాలంటే పోలీస్ శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి పొందాలని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో క్షేత్ర స్థాయి పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. హింసాత్మక చర్యలు జరుగుతాయని భావించినప్పుడే సభలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం జరగదని.. ఒక వేళ అనుమతి ఇవ్వకుంటే... దానిని కచ్చితంగా పాటించాలని డీజీపీ అన్నారు. శాంతి భద్రతలకు అందరూ సహకరించాలని డీజీపీ కోరారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. 

19:17 - July 13, 2017

వరంగల్ : జిల్లాలోని హన్మకొండ కుమార్ పల్లి బుద్ధభవన్ వద్ద దారుణం జరిగింది. టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి దారుణ హత్య జరిగింది. మురళి హత్య అతను హత్యకు గురైయ్యాడు. ముగ్గురు దుండగులు మురళిని కత్తులతో నరికి చంపారు. దుండగులు మురళి తల, మొండం వేరు చేశారు. దుండుగులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

19:16 - July 13, 2017

విజయనగరం : జిల్లా డెంకాడ మండలం జొన్నాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ అంబులెన్స్ ను లెండి ఇంజనీరింగ్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:15 - July 13, 2017

హైదరాబాద్ : సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. వీరు నల్లగొండకు చెందినవారిగా తెలుస్తోంది. వారిలో నాగరాజు, కూతురు నవ్య, మేనల్లుడు శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:42 - July 13, 2017

అనంతపురం : అనంతపురం జిల్లాలో మహిళా ప్రజా ప్రతినిధులపై చిన్నచూపు చూస్తున్నారు. స్థానిక సంస్థల మహిళౄ ప్రతినిధులకు అడుగడుగునా అవమానం జరుగుతుండడంతో డి.హీరేహాళ్ జెడ్పీటీసీ పద్మావతి అధికారుల తీరును బహిర్గతం చేశారు. అభివృద్ధి పనుల్లో పద్మావతికి మొండిచేయి చూపడంతో ఆమె ఆత్మగౌరవం నిలుపని పదవి ఎందుకంటూ నిర్వేదం వ్యక్తం చేస్తూ జెడ్పీ సమావేశంలో మంత్రి సునీతకు రాజీనామా సమర్పించింది. పద్మావతిని మంత్రి సునీత సముదాయించారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో పద్మావతి రాజీనామా వెనక్కు తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:41 - July 13, 2017

విజయనగరం : జిల్లా డెంకాడ మండలం జొన్నాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ అంబులెన్స్ ను లెండి ఇంజనీరింగ్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ఉన్న ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:49 - July 13, 2017

నిజామాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేతలలో నామినేటెడ్ పదవుల కోసం పొటీ మొదలైంది. నిజామాబాద్‌ జిల్లాలో పదవులు రెండే ఉన్నాయి. ఇప్పటివరకు పదవుల కోసం ఎదురు చూసిన వారు రిజర్వేషన్లు, ఇతర సమస్యలతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏమో గానీ.. జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవి వచ్చినా సరిపోతుందని వారు భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం రెండే నామినేటెడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి గ్రంధాలయ చైర్మన్‌ పదవి కాగా.. రెండవది కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్ పదవి. ఇప్పటివరకు మార్కెట్‌ కమిటీల్లో.. రాష్ట్ర స్థాయిలో పదవులు ఆశించిన వారికి దాదాపు భర్తీ కావటంతో మిగిలినవారికి నిరాశ మొదలైంది.

సామాజిక వర్గాలకు
పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నేతలతో పాటు కొత్తగా వచ్చిన నేతల వరకు.. నామినేటెడ్ పదవులకు పోటీ పడ్డారు. సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, సామాజిక వర్గాలకు అనుగుణంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించారు. రిజర్వేషన్ల ప్రకారం మార్కెట్‌ పదవులకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించారు. ఇంకా సీనియర్‌ నేతలు మిగిలి ఉన్నారు. వారిలో ఇద్దరు సీనియర్‌ నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంధాలయం చైర్మన్‌ను ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఈ సారి ఈ నామినేటెడ్ పదవిని సీనియర్ నేతలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ చైర్మన్ పదవికి 55 వేల గౌరవ వేతనంతో పాటు.. వాహన అలవెన్స్‌ కింద నెలకు 25 వేలు ఇవ్వనుండటంతో.. ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇంకా రెండేళ్లే ప్రభుత్వ కాలం ఉండటంతో త్వరగా భర్తీ చేయాలని కోరుతున్నారు.

నేతల్లో ఉత్కంఠ
ఈ గ్రంధాలయ సంస్థకు చైర్మన్‌తో పాటు.. కొంత మంది సభ్యులను కూడా నియమించనున్నారు. దీంతో పాటు నూడా పాలక వర్గాన్ని నియమించనున్నారు. ఈ నూడాకు చైర్మన్‌తో పాటు పది మంది పాలక వర్గం సభ్యులను నామినేట్‌ చేస్తారు. కొత్తగా ఏర్పడుతున్నందున ఈ చైర్మన్‌ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. నూడా చైర్మన్‌ పరిధిలో పలు గ్రామాలు వస్తుండటంతో అధికార పార్టీ నేతలలో ఆశలు పెరిగాయి. ప్రొటోకాల్‌తో పాటు ఇతర అలవెన్స్‌లు ఉండటంతో ఇది వచ్చినా చాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే కొన్ని రోజులలో ఈ రెండు చైర్మన్‌ పదవులకు ఎవరిని నియమిస్తారో తెలుస్తుందని అధికార పార్టీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. 

17:47 - July 13, 2017

ఖమ్మం : ఖమ్మంలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు చిన్నారులకు జన్మనిచ్చిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన సమీనాకు జోయ ఆసుపత్రిలో మొదటి కాన్పులో నలుగురు సంతానం జన్మించారు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు కాగా ఒకరు అమ్మాయి. చిన్నారులు బరువు తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సన్‌ రైజ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 

17:46 - July 13, 2017

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో నగదు కొరత తీర్చాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నగదు కొరతతో వర్షాలు పడుతున్నా రైతులు పంటసాగు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆర్‌బీఐ నుంచి 2 వేల కోట్లు రాష్ట్రానికి వస్తున్నట్లు అధికారులు చెప్పారని.. వచ్చే వారంలో మరో 2 వేల కోట్లు విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. 

17:44 - July 13, 2017

హైదరాబాద్ : ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో ఉన్నారు...ఎక్సైజ్ అధికారుల తాజా లిస్టులో మరికొందరు స్టార్లు..డైరెక్టర్లు ఉన్నారు.. టాప్‌ హీరోతో పాటు టాప్ డైరెక్టర్ కూడా ఉండడంతో లిస్టులో ఇంకా ప్రముఖులెందరున్నారన్న ఆందోళన మొదలయింది. నోటీసుల లిస్టులోని వీరంతా మత్తుకు బానిసలయ్యారా...లేక ఇప్పుడిప్పుడే డ్రగ్స్ వాడకం మొదలుపెట్టారాన్నది తేలాల్సి ఉంది..ఒకప్పుడు ఐటం సాంగ్స్‌తో వెండితెరపై అదరగొట్టి సినీ అభిమానుల ఆదరణ పొందిన నటి కూడా డ్రగ్స్‌కు బానిసయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సినీ ఫంక్షన్లు జరిగాయంటే ..ఆయన మైకు పడితే చాలు...ఆ రోజు కొందరు హీరోలు ప్రశంసల జల్లుల్లో తడిసి ముద్దకావాల్సిందే..ఆయన పెద్ద నిర్మాత కూడా...అతని మాటలకు మైమర్చిపోయే సినీ హీరోలెందరో ఉన్నారు..ఇప్పుడా నిర్మాత మత్తులో తూగుతున్నాడని ఎక్సైజ్‌ లిస్టులో తేలింది.ఇక టాప్‌ లెవల్లో ఉన్న ముగ్గురు హీరోయిన్లు కూడా మత్తు తీసుకుంటున్నారన్న సమాచారం కలకలం రేపుతుంది...ఇందులో ఓ నటి డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూస్తుంటుందని తెలుస్తోంది.

17:42 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ అధికారుల బృందాలు ఇప్పుడు సినీ పరిశ్రమపై దృష్టి పెట్టాయి...ఇప్పటివరకు స్కూళ్లు..కాలేజీలతో పాటు ఐటీ కారిడార్‌లలో మత్తు వినియోగంపై వివరాలు ఆరా తీసిన సిట్ బృందానికి టాలివుడ్‌లో లింకులు దొరికాయి...డ్రగ్స్ కింగ్‌పిన్‌ కెల్విన్‌ కాల్‌డేటా పరిశీలిస్తున్న అధికారులకు చిత్రసీమలోని ప్రముఖుల ఫోన్ నంబర్లు దొరికాయి..పదే పదే నంబర్లతో కాంటాక్ట్‌లో ఉండడం చూస్తుంటే వారంతా డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగాయి..దీంతో వారందరికీ నోటీసులు జారీ చేస్తున్న ఎక్సైజ్ అధికారులు హాజరు కావాలంటూ హుకూం జారీ చేస్తున్నారు...ఇప్పటికే పది మందికి నోటీసులు అందించిన ఈ లిస్టులో తాజాగా మరో ఐదుగురు చేరారు...ఇంకా కొంత మంది ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు టాలివుడ్‌ను కుదిపేస్తుంది.

పదిహేను మందికి నోటీసులు
ఇక ఇప్పటికే పదిహేను మందికి నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ నెల 17 నుంచి 27 వరకు ఎక్సైజ్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు...ఎవరైనా హాజరుకాని పక్షంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో వారిపై చర్యలు తీసుకోవాలని రంగం సిద్దం చేసినట్లు తెలుస్తుంది...ఇప్పటికే నోటీసులు అందుకున్న సినీ స్టార్లలో గుబులు రేపుతుండగా సిట్ బృందం వద్ద ఉన్న లిస్టులో మత్తు వినియోగించినవారి జాబితా ఉన్నట్లు సమాచారం..దీంతో వారిలో కూడా ఆందోళన మొదలయినట్లు తెలుస్తోంది...డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల కాల్‌డేటా ఆధారంగా డ్రగ్స్ వాడకం దార్ల గుర్తించిన ఎక్సైజ్ శాఖ వారికి దశలవారిగా నోటీసులు అందిస్తుంది...అందులో భాగంగానే సినీ పరిశ్రమలోని ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు...ఇక హాజరయ్యేవారి నుంచి వివరాలు సేకరించి నిర్ణయం తీసుకోనున్నారు...

కాల్‌డేటా ఆధారంగా
ఇప్పటివరకు నిందితుల కాల్‌డేటా ఆధారంగా మత్తు వినియోగించినవారి వివరాలు సేకరించిన ఎక్సైజ్ వారిని విచారిస్తే వాస్తవాలు బయటకు రానున్నాయని భావిస్తున్నారు..వారంతా మత్తు మాత్రమే వినియోగిస్తున్నారా..? లేక వారిలో కొందరు మత్తును సరఫరా చేస్తున్నారాన్న విషయాలు వెలుగులోకి రానున్నాయి.

17:05 - July 13, 2017

పెద్ద పెద్ద సినిమాలే అనుకున్న డేట్స్ లో రిలీజ్ అవ్వట్లేదు ..కొన్ని చిన్న సినిమాలకి అసలు థియేటర్స్ ఏ దొరకట్లేదు ..బ్యాక్ సపోర్ట్ ఉండి పేరున్న ప్రొడక్షన్ లో వచ్చిన రెండు సినిమాలు రిలీజ్ డేట్ లో తికమక పడ్డాయి ..ఈ రెండు సినిమాల్లో ఒకే హీరో ఉండటం విశేషం.

హిట్ అండ్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో 'నారా రోహిత్’. సొసైటీ కి యూజ్ అయ్యే కథతో 'ప్రతినిధి' సినిమాలో నటించి వైవిధ్యాన్ని చూపించాడు. తాను ఎన్నుకున్న కధల్లో బలం ఉందా లేదా అనేది మాత్రమే చూసే హీరో నారారోహిత్ ..అందుకే ఇంత తక్కువ టైం లో అన్ని సినిమాలు చేయగలిగాడు ..ప్రజా సమష్యలను ఎదుర్కొంటు ప్రశ్నించే ఒక కామన్ మాన్ రోల్ లో నటించి ప్రతినిధి సినిమా తో మెప్పించాడు రోహిత్ .

'సోలో'లాంటి లవ్ స్టోరీ లో నటించి తాను అన్ని రకాల పాత్రలను చెయ్యగలను అని ప్రూవ్ చేసాడు 'నారా రోహిత్'. లవ్ స్టోరీ లో సెంటిమెంట్ స్టోరీ ని మిక్స్ చేసి తీసిన 'సోలో' సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది. రీసెంట్ గా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నారా రోహిత్ కొత్త సినిమాలు రెండు ఒకే రోజు విడుదల చేయబోతున్నట్లు వేర్వేరుగా ప్రకటనలు వచ్చాయి.

నాగశౌర్య కాంబినేషన్లో రోహిత్ నటించిన ‘కథలో రాజకుమారి’తో పాటు.. ఇంకో ముగ్గురు హీరోలతో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’ని కూడా జూన్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ తేదీకి వీటిలో ఏదీ విడుదల కావట్లేదు. ‘కథలో రాజకుమారి’ 30న పక్కా అనుకుని ‘శమంతకమణి’ని జులై 14కు వాయిదా వేయగా.. ఇప్పుడు ‘కథలో రాజకుమారి’ రిలీజ్ డేట్ కూడా మారిపోయింది. 30వ తేదీకి ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేయలేకపోవడంతో జులైకి వాయిదా వేశారు.‘శమంతకమణి’ జులై 14కు ఫిక్స్ కావడంతో దానికి ముందు.. తర్వాతి వారాల్లో ‘కథలో రాజకుమారి’ని విడుదల చేయట్లేదు. జులై చివరి వారంలో ఈ చిత్రం విడుదలవుతుందట.

16:59 - July 13, 2017

క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశి తన సినిమాల్లో స్పీడ్ తగ్గించాడు. ఇంతకు ముందులా కాకుండా సినిమాల విషయంలో చాల జాగర్త పడుతూ కేర్ఫుల్ గా అడుగులు వేస్తున్నాడు ఈ సీనియర్ డైరెక్టర్. రీసెంట్ గా తన రాబోయే సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ..
మెగా ఫామిలీ తో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో చాల భాగం 'మురారి' సినిమా తో కనెక్ట్ అయి ఉంది టాక్ వచ్చినా 'చరణ్' ఇమేజ్ తో ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. కృష్ణ వంశి ఫామిలీ సబ్జక్ట్స్ ని బాగా డీల్ చేస్తాడు అని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ లాంటి సీనియర్ నటులను పెట్టి 'రామ్ చరణ్' డిఫరెంట్ లుక్ తో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా కృష్ణ వంశీకి శాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అనే చెప్పాలి.
మల్టీస్టారర్ కాన్సెప్ట్ తో కృష్ణ వంశి డైరెక్షన్ లో వస్తున్న సినిమా 'నక్షత్రం'. షూటింగ్ గతేడాది పూర్తి చేసుకున్నప్పటికీ ఈ ఏడాది ఆరంభంలో రావాల్సిన 'నక్షత్రం' ఎందుకనో డిలే అవుతూ వస్తుంది. మేలో పక్కా రిలీజ్ అవుతుందని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఆ ఊసే లేదు. ట్రైలర్ రిలీజ్ తో పాటు ఆడియో కూడా రిలీజ్ చేసి మరో స్టెప్ ముందుకు వేసాడు చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ. ట్రైలర్ కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.

16:57 - July 13, 2017

ఎంతో కస్టపడి డైరెక్టర్ గా మరి మాస్ పల్స్ పట్టుకున్నాడు డైరెక్టర్ 'హరీష్ శంకర్’. బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆడియన్స్ కి ఎం కావాలో అది తన సినిమాల్లో ప్రెసెంట్ చేసిన ఈ డైరెక్టర్ ఈ మధ్య తరుచు సహనం కోల్పోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది. 'డీజే- దువ్వాడ జగన్నాథం' విషయంలో హరీష్ శంకర్ ప్రతీ విషయానికి ఊగిపోతూనే ఉన్నాడు. ఈ సినిమాలోని 'అస్మైక యోగ.. తస్మైక భోగ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసినపుడు విమర్శలు వస్తే.. తాను ఓ బ్రాహ్మణుడినే అంటూ బోలెడంత ఆక్రోశంతో హరీష్ శంకర్ సమాధానం ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
బన్నీ కెరీర్ లో ఇప్పటివరకూ వినిపించని మాట ఫేక్ కలెక్షన్స్. ఆ మచ్చ కూడా ఈ ఆవేశం కారణంగానే అల్లు అర్జున్ కు అంటుకుంది అంటున్నారు అతని జెన్యూన్ అభిమానులు. ఇప్పటికీ చెప్పను బ్రదర్ కామెంట్ కారణంగా ఇబ్బంది పడుతున్న బన్నీకి.. హరీశ్ వాటం మరో తలనొప్పిగా తయారవుతోందని టాక్. ఏది ఏమైనా శంకర్ కొంచెం కంట్రోల్ గా ఉంటే మరిన్ని మంచి సినిమాలు వస్తాయని విశ్లేషకుల అభిప్రాయం.

16:51 - July 13, 2017

యాక్షన్ మాస్ పల్స్ తెల్సిన డైరెక్టర్స్ టాలీవుడ్ లో తక్కువే అని చెప్పాలి .మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తేనే టికెట్స్ కట్ ఔతాయి ఫిలిం మేకర్స్ సేఫ్ జోన్ లో ఉంటారు. మాస్ సినిమా లతో హిట్ కొట్టే డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమా తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 'సరైనోడు' సినిమాలో 'అల్లు అర్జున్' లుక్ ని కొత్తగా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను. మాస్ పల్స్ బాగా పట్టుకున్న ఈ డైరెక్టర్ కి ఆడియన్స్ కి ఎలాంటి యాక్షన్ ఎలెమెంట్స్ ఇవ్వాలో తెలుసు. మ్యూజిక్, డాన్స్, హీరోయిన్ గ్లామర్ ఇలా తనకు తెలిసిన అన్ని రకాల అట్ట్రాక్టీవ్ ఎలెమెంట్స్ పెట్టి తీసిన సినిమాలు హిట్ టాక్ తో ఆడియన్స్ ని రీచ్ అయ్యాయి. 'సరైనోడు' సినిమా ఒక రకంగా ఇటు మాస్ ని అటు క్లాస్ ని టచ్ చేసింది.
'అల్లుడు శీను' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో 'బెల్లంకొండ శ్రీనివాస్'తో ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను తన కొత్త సినిమా ''జయ జానకి నాయక'' రెడీ చేస్తున్నాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్.. ప్రగ్యా జైస్వాల్.. క్యాథరీన్ త్రెసా ఇలా గ్లామర్ ని ఫుల్ గా లోడ్ చేసి తీసుకురాబోతున్నాడు బోయపాటి. దర్శకుడు బోయపాటి ఈ సినిమా 'సరైనోడు' సినిమాను తీశాక తీస్తున్నాడు కాబట్టి..'సరైనోడు ఇన్ఫ్లుయెన్స్' ఇంకా కనిపిస్తుంది అనే టాక్ ఉంది. ప్రస్తుతానికి పెద్దగా ఆసక్తి రేపలేకపోయినా ఈ ''జయ జానకి నాయక'' మరి ట్రైలర్ తో ఏమన్నా సత్తా చాటుతుందేమో చూడాలి.

16:47 - July 13, 2017

హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తాం..పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తాం..కరీంనగర్ ను లండన్ చేస్తాం...

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మాటల్లో దిట్ట...జనాలను ఆకర్షించడం..వారిచే కేరింతలు ఎలా కొట్టించాలో ఆయనకు తెలుసు..అరచేతిలోనే స్వర్గం చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే గతంలో..ఇటీవల జరుగుతున్న పలు సభలో ఆయన పలికే మాటలు..వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతుంది. తాజాగా కరీంనగర్ ను లండన్ లా మారుస్తానని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో మళ్లీ చర్చ ప్రారంభమైంది.

హైదరాబాద్ న్యూయార్క్..పాతబస్తీ ఇస్తాంబుల్..
తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని...ఎన్నో ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను కూడా న్యూ యార్క్ సిటీలా తయారు చేస్తామని..రోడ్లపై గుంతలు లేకుండా..ట్రాఫిక్ సిగ్నల్ లేని సిటీగా..స్కై బ్రిడ్జిలు ఇలా..ఎన్నో హామీలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అభివృద్ధి వెనుకబడిపోయిందని, ఇప్పటికీ ఎన్నో లక్షల మంది మురికివాడల్లో మగ్గుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరిగిందని ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికే రూ.20 వేల కోట్ల ఖర్చవుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాస చెప్పింది. మంత్రి కేటీఆర్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వంద రోజుల ప్లాన్ కూడా చేశారు.

మూడేళ్లు..పరిస్థితిలో మార్పు వచ్చిందా ?
మూడేళ్లు గడిచిపోయాయి..అయినా పరిస్థితిలో మార్పు వచ్చిందా ? ఏమి రాలేదు. ఇప్పటికీ గుంతలు తేలిన రోడ్లు..ఒక వర్షం పడితే సముద్ర తలపించే రోడ్లు..నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఇంకా అలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కొన్ని సంవత్సరాలే అయ్యిందని..సమస్యలు ఒక్కసారి తీరవని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. పాతబస్తీ ఇస్తాంబుల్ నగరంగా మారుస్తామని నేతలు ఎన్నో హామీలు గుప్పించారు. కానీ నేటికి పాతబస్తీలో ఎన్ని సమస్యలున్నాయో తెలిసిందే. పేదలకు డబుల్ బడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్న పాలకులు శంకుస్థాపనలకు పరిమితమవుతున్నారు.

కరీంనగర్ లండన్ సిటీ..
కరీంనగర్ ను లండన్ సిటీలా మారుస్తానని సీఎం కేసీఆర్ మరో హామీలు గుప్పించారు. హెలీకాప్టర్ లో కరీంనగర్ ప్రాంతం మీదనుంచి వెళుతుంటే ఒక పెద్ద అడవిలా కనపడాలని హరిత హారం కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఇదివరకు కరీంనగర్ కి వచ్చినప్పుడు కూడా ఇలాంటి హామీనిచ్చిన సంగతిని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడి రహదారులు అన్నీ అద్దాలు లాగా మెరిసేలా చేస్తా..లండన్ స్టైల్ లో రోడ్లు వేస్తా అని పేర్కొన్నారు. లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందని కూడా తెలిపారు. కానీ లండన్ నగరాన్ని తలపించేలా ప్రణాళికలు..ఆచరణ సాధ్యమయ్యే హామీలివ్వాలని పలువురు సూచిస్తున్నారు.
అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు.. కానీ దానికంటూ స్పష్టమైన విధానం..ప్రణాళిక ఉంటేనే సాధ్యమౌతుందని విశ్లేషకుల మాట.

16:42 - July 13, 2017

ఢిల్లీ : ఇకపై గంగానదిలో చెత్త వేస్తే 50 వేలు జరిమానా చెల్లించాల్సిందే... గంగానది ప్రక్షాళన అంశానికి సంబంధించి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. హరిద్వార్-ఉన్నావ్‌కు మధ్య విస్తరించిన 100 మీటర్ల పరిధిలోని భూభాగాన్ని 'నో-డెవలప్‌మెంట్ జోన్'గా ప్రకటించింది. గంగా నది అంచు నుంచి 5 వందల మీటర్ల పరిధిలో ఎలాంటి చెత్తను డంప్‌ చేయడానికి వీలు లేదని ఎన్‌జిటి స్పష్టం చేసింది. తోలు పరిశ్రమలను గంగానదికి దూరంగా తరలించాలని.... నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 50 వేలు జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. గంగానది ప్రక్షాళనకు కేంద్రం, యూపీ చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రీన్‌ ట్రిబ్యునల్... సుమారు 7 వేల కోట్లు ఖర్చు చేసిన ఫలితం శూన్యమని పేర్కొంది. ధార్మిక కార్యకలాపాలకు దిశా నిర్దేశం చేయాలని యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలకు సూచించింది.

16:40 - July 13, 2017

నాగపూర్ : గోసంరక్షణ పేరిట జరుగుతున్న హత్యలపై ప్రధాని మోది హెచ్చరించినప్పటికీ దాడులు ఆగడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని బీఫ్‌ పేరిట దారుణం చోటుచేసుకుంది. భార్‌సింగి గ్రామంలో బీఫ్‌ తీసుకెళుతున్నాడన్న నెపంతో 40 ఏళ్ల వ్యక్తిపై గోరక్షకులు మూకుమ్మడి దాడి చేశారు. కటోల్‌కు చెందిన సలీం ఇస్మాయిల్‌ షేక్‌ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. వాహనంలో మాంసం ఎక్కడికి తీసుకెళుతున్నావని బెదిరించారు. తాను తీసుకెళుతున్న మాంసం బీఫ్‌ కాదని ఇస్మాయిల్‌ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆవును చంపారన్న అనుమానంతో విచక్షణారహితంగా అతనిపై దాడి చేసి కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. 

16:39 - July 13, 2017

నల్లగొండ : జిల్లా మిర్యాలగూడకు చెందిన వాస్తు నిపుణులు మామిడి సత్యనారాయణ తన పేరున వచ్చిన తెల్లరేషన్‌ కార్డును తిరస్కరించి ఔనత్యాన్ని చాటుకున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌కు హైదరాబాద్‌లో కార్డును అందజేశారు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదని..పేదవాడినని అంగీకరించడం తప్పు అని సత్యనారాయణ అన్నారు. ఆర్థిక స్తోమత ఉండి పేదవారు తినే బియ్యం కొరకు ఆశపడటం తప్పు అని భావించి వైట్‌ రేషన్‌ కార్డును వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. 

16:38 - July 13, 2017

హైదరాబాద్ : లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను మాజీ మంత్రి మర్రిశశిధర్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా సుప్రీం కోర్టు అనుమతి తీసుకోవాలన్న విషయం కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. గన్‌పార్క్‌లో ఉన్న అమరవీరుల స్తూపం చరిత్రను రూపుమాపేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

16:37 - July 13, 2017

మహబూబు నగర్ : ఢిల్లీలో కిడ్నాపైన గద్వాల్‌కు చెందిన శ్రీకాంత్‌ గౌడ్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. శ్రీకాంత్‌ ఆచూకీ తెలుసుకునే విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కిడ్నాప్‌నకు గురై వారం రోజులు గడిచినా కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్‌గౌడ్‌కు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు.

'రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాం'

హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాం అని డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తామన్నారు. అన్ని జిల్లాల్లో సీపీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో కమాండెంట్ కంట్రోల్ ఏర్పాటు చేస్తామన్నారు. భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత భద్రత కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ల పని తీరును మెరుగు పరుస్తామని పేర్కొన్నారు.

16:36 - July 13, 2017

అనంతపురం : జిల్లాలో పాత నోట్లు మార్పిడి చేస్తున్న కానిస్టేబుల్‌ సహా 8 మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కోటి రూపాయల పాతనోట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:24 - July 13, 2017

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ మాఫియా కేసు కుదిపేస్తోంది.. పలువురు సినీ ప్రముఖులను సిట్‌ నోటీసులు వణికిస్తున్నాయి.. నోటీసులు అందుకునేవారిసంఖ్య 20కి చేరే అవకాశం కనిపిస్తోంది.. డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలకుకూడా సిట్‌ నోటీసులు పంపింది.. నోటీసులు అందుకున్నవారిలో ఓ టాప్‌ డైరెక్టర్‌, టాప్‌ హీరో, టాప్‌ కెమెరామెన్‌ తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది.. ఐటం సాంగ్స్‌తో వెండితెరను ఊపేసిన ఓ నటి... వర్ధమాన గాయకురాలి భర్త.... బాలనటుడిగా మొదలై వర్దమాన నటుడిగా ఎదిగిన హీరో.... డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తున్న ఓ హీరోయిన్‌... సినిమా ఫంక్షన్‌లలో హీరోలను ఆకాశానికి ఎత్తే నిర్మాత.... సినిమాల్లో బ్రేక్‌ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడుఉన్నట్లు సమాచారం.. డ్రగ్స్ తీసుకునేవారంతా గచ్చిబౌలిలోని ఓ పబ్‌ అడ్డాగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు పలువురికి నోటీసులు పంపిన సిట్‌.... వీరంతా ఈ నెల 19నుంచి 27తేదీల్లో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు రావాలని ఆదేశించింది.. లేకపోతే చర్యలు తప్పవని అకున్‌ సబర్వాల్ హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు

ముంబై: స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా సెన్సెక్స్ 32 వేల మార్క్ ను దాటింది. 232పాయింట్ల లాభంతో 32,037 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 76 పాయింట్ల లాభంతో 9892 వద్ద నిప్టీ ముగిసింది.

కాకినాడ జేఎన్ టీయూలో ర్యాగింగ్ కలకలం

తూ.గో: కాకినాడ జేఎన్ టీయూలో ర్యాగింగ్ కలకలం రేగింది. మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విద్యార్థి ఫిర్యాదుతో ర్యాగింగ్ కు పాల్పడిన వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు పై ఏసీబీ దాడి

విజయవాడ: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. రూ.50వేలు లంచం తీసుకుంటూ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వై. శివశంకర్ రావు ఏసీబీకి పట్టుబడ్డారు.

15:54 - July 13, 2017

హైదరాబాద్ ను న్యూయార్క్ చేస్తాం..పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తాం..కరీంనగర్ ను లండన్ చేస్తాం...తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..మాటల్లో దిట్ట...జనాలను ఆకర్షించడం..వారిచే కేరింతలు ఎలా కొట్టించాలో ఆయనకు తెలుసు..అరచేతిలోనే స్వర్గం చూపించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే గతంలో..ఇటీవల జరుగుతున్న పలు సభలో ఆయన పలికే మాటలు..వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతుంది. తాజాగా కరీంనగర్ ను లండన్ లా మారుస్తానని సీఎం కేసీఆర్ పేర్కొనడంతో మళ్లీ చర్చ ప్రారంభమైంది.

హైదరాబాద్ న్యూయార్క్..పాతబస్తీ ఇస్తాంబుల్..
తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని...ఎన్నో ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ను కూడా న్యూ యార్క్ సిటీలా తయారు చేస్తామని..రోడ్లపై గుంతలు లేకుండా..ట్రాఫిక్ సిగ్నల్ లేని సిటీగా..స్కై బ్రిడ్జిలు ఇలా..ఎన్నో హామీలు గుప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అభివృద్ధి వెనుకబడిపోయిందని, ఇప్పటికీ ఎన్నో లక్షల మంది మురికివాడల్లో మగ్గుతున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరిగిందని ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికే రూ.20 వేల కోట్ల ఖర్చవుతుందని ఎన్నికల ప్రణాళికలో తెరాస చెప్పింది. మంత్రి కేటీఆర్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వంద రోజుల ప్లాన్ కూడా చేశారు.

మూడేళ్లు..పరిస్థితిలో మార్పు వచ్చిందా ?
మూడేళ్లు గడిచిపోయాయి..అయినా పరిస్థితిలో మార్పు వచ్చిందా ? ఏమి రాలేదు. ఇప్పటికీ గుంతలు తేలిన రోడ్లు..ఒక వర్షం పడితే సముద్ర తలపించే రోడ్లు..నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఇంకా అలానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కొన్ని సంవత్సరాలే అయ్యిందని..సమస్యలు ఒక్కసారి తీరవని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. పాతబస్తీ ఇస్తాంబుల్ నగరంగా మారుస్తామని నేతలు ఎన్నో హామీలు గుప్పించారు. కానీ నేటికి పాతబస్తీలో ఎన్ని సమస్యలున్నాయో తెలిసిందే. పేదలకు డబుల్ బడ్ రూం ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్న పాలకులు శంకుస్థాపనలకు పరిమితమవుతున్నారు.

కరీంనగర్ లండన్ సిటీ..
కరీంనగర్ ను లండన్ సిటీలా మారుస్తానని సీఎం కేసీఆర్ మరో హామీలు గుప్పించారు. హెలీకాప్టర్ లో కరీంనగర్ ప్రాంతం మీదనుంచి వెళుతుంటే ఒక పెద్ద అడవిలా కనపడాలని హరిత హారం కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ఇదివరకు కరీంనగర్ కి వచ్చినప్పుడు కూడా ఇలాంటి హామీనిచ్చిన సంగతిని జనాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడి రహదారులు అన్నీ అద్దాలు లాగా మెరిసేలా చేస్తా..లండన్ స్టైల్ లో రోడ్లు వేస్తా అని పేర్కొన్నారు. లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందని కూడా తెలిపారు. కానీ లండన్ నగరాన్ని తలపించేలా ప్రణాళికలు..ఆచరణ సాధ్యమయ్యే హామీలివ్వాలని పలువురు సూచిస్తున్నారు.

అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు.. కానీ దానికంటూ స్పష్టమైన విధానం..ప్రణాళిక ఉంటేనే సాధ్యమౌతుందని విశ్లేషకుల మాట.

పాత నోట్ల మార్పి చేస్తున్న కానిస్టేబుల్ అరెస్ట్...

అనంతపురం: పాత నోట్ల మార్పిడి చేస్తున్న కానిస్టేబుల్ సహా 8 మంది అరెస్టు అయ్యారు. వీరి వద్ద నుండి కోటి రూపాయల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

15:42 - July 13, 2017

వనపర్తి : వందల గ్రామాల ప్రజలకు సాలగు, తాగునీరు అందించాలంటే.. వారు త్యాగం చేయక తప్పలేదు. వారి త్యాగాలకు మంచి ఫలితమిస్తాం.. పునరావాసం కల్పిస్తామంటూ నేతలు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. కానాయపల్లి శంకరసముద్రం రిజర్వాయర్ నిండుతుండటంతో.. ముంపునకు గురవుతున్న ప్రజలకు పునరావాసం ఏర్పాటు కాకపోవడంతో నరకం చూస్తున్నారు. రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నందుకు సంతోషించాలా? దాని వల్ల ఊరిని ఖాళీ చేయాలని బాధ పడాలో తెలియని పరిస్థితి వీళ్లది. వనపర్తి జిల్లా, కొత్తకోట మండలంలోని కానాయపల్లి శంకర సముద్రం రిజర్వాయర్‌ ద్వారా.. పెద్ద మందడి, అడ్డాకుల మండలాలకు సాగు నీరు అందనుంది. 19 ప్యాకేజీ కాలువల ద్వారా సాగు నీరు అందించాలని 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. నలభై కిలోమీటర్ల మేరా 12 గ్రామాలను అనుసరించి కాలువలు తవ్వారు.

34 వేల ఎకరాలకు సాగునీరు
ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే 34 వేల ఎకరాలకు.. సాగునీరు అందేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకు 22 కోట్లను కేటాయించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయాక.. ప్రాజెక్ట్‌ పనులు సరిగా సాగలేదు. తరవాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఇలా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించింది. ఈ శంకర సముద్రం పనులను పరిశీలించడానికి రాష్ట్రమంత్రి హరీశ్‌రావు స్వయంగా వచ్చి.. గ్రామస్థులతో మాట్లాడారు. వీరికి రావలసిన నష్ట పరిహారం త్వరలో అందజేస్తామని ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. ఇందుకు గ్రామస్థులు సుముఖంగా ఉన్నా కానీ పరిహారం ఇప్పటికీ పూర్తిగా అందక అయోమయంలో ఉన్నారు. ఈ గ్రామం శివారులో రైతులకు సంబంధించిన 2 వేల ఎకరాలకు పైగా ముంపుకు గురి కావడంతో.. దీనికి ప్రభుత్వం ఎకరాకు 90 వేల చొప్పున నష్ట పరిహారం అందించింది. ఈ విషయంలో తమకు ప్రభుత్వం తక్కువ నష్ట పరిహారం అందించిందని రైతులు కోర్టును ఆశ్రయించారు. రిజర్వాయర్‌ నిర్మాణ పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు నత్త నడకన సాగుతున్నాయి. పెద్దమందడి, అడ్డాకుల మండలాలకు చెందిన గ్రామాల రైతులకు సాగు నీరు అందించాలంటే కానాయపల్లి గ్రామంలో 1000 ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు నిర్మాణ పనులు సజావుగా కొనసాగాలన్నా 300 ఇళ్లను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఖాళీ చేసిన ప్రాంతంలో బండింగ్‌ అడ్డుకట్ట నిర్మిస్తేనే నీరు పారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామ పునరావాసానికి సుమారు 40 కోట్లు పరిహారం అందించాల్సి ఉండగా.. ఇంకా కొంతమందికి నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆవేదనకు గురవుతున్నా గ్రామస్థులు
ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తే నివసించడానికి.. ప్రభుత్వం చూపిన భూమి నివాస యోగ్యంగా లేదు. ముఖ్యంగా తాగేందుకు మంచినీరు, విద్యుత్‌ సౌకర్యం లేదని అక్కడికెళ్లి ఎలా బతకాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతానికి 300 ఇళ్లను మాత్రమే పునరావాసానికి పంపే ప్రయత్నం చేస్తుండటంతో మిగతా ఇళ్ల గురించి పట్టించుకోరేమోనని గ్రామస్థులు ఆవేదనకు గురవుతున్నారు. అన్ని ఇళ్లకు ఒకేసారి పునరావాసం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన 23ఎకరాల భూమిని.. మంత్రి హరీష్ రావు సమక్షంలో ఒప్పించి గ్రామానికి కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గ్రామస్థులకు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే 23 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్‌లను తొలగించి వేరే చోటకు మార్చడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్లాట్‌ల పక్కనే ఉన్న ప్రైవేట్‌ వ్యక్తుల ఫ్లాట్‌ల రాళ్లను ధ్వంసం చేశారు.ఇప్పటికైనా పునరావాస విషయంలో తమకు అన్యాయం చేయకుండా.. గతంలో మంత్రి చెప్పినట్టు 23 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్‌లను తమకు కేటాయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

15:41 - July 13, 2017

విశాఖ : మున్సిపల్‌ కార్మికులు విజయం సాధించారు...ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.కార్మికులు నష్టం కలిగించే జీవో 279ను రద్దు చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో కార్మికులు విజయోత్సవ సభ నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:40 - July 13, 2017

హైదరాబాద్ : విపక్షాలను సీఎం కేసీఆర్‌ గొర్రెలతో పోల్చడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ పథకాలలోని తప్పులు ఎత్తిచూపడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. తాము గొర్రెలమైనా..కేసీఆర్‌లా తోడెళ్లమైతే కాదని జీవన్‌రెడ్డి విమర్శించారు. గొర్రెల పంపిణి కూడా దళితులకు మూడెకరాల పథకంలా మారకూడదన్నదే తమ తాపత్రయమన్నారు. 

15:33 - July 13, 2017

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ మాఫియా కేసు కుదిపేస్తోంది.. పలువురు సినీ ప్రముఖులను సిట్‌ నోటీసులు వణికిస్తున్నాయి.. నోటీసులు అందుకునేవారిసంఖ్య 20కి చేరే అవకాశం కనిపిస్తోంది.. డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలకుకూడా సిట్‌ నోటీసులు పంపింది.. నోటీసులు అందుకున్నవారిలో ఓ టాప్‌ డైరెక్టర్‌, టాప్‌ హీరో, టాప్‌ కెమెరామెన్‌ తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది.. ఐటం సాంగ్స్‌తో వెండితెరను ఊపేసిన ఓ నటి... వర్ధమాన గాయకురాలి భర్త.... బాలనటుడిగా మొదలై వర్దమాన నటుడిగా ఎదిగిన హీరో.... డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తున్న ఓ హీరోయిన్‌... సినిమా ఫంక్షన్‌లలో హీరోలను ఆకాశానికి ఎత్తే నిర్మాత.... సినిమాల్లో బ్రేక్‌ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడుఉన్నట్లు సమాచారం.. డ్రగ్స్ తీసుకునేవారంతా గచ్చిబౌలిలోని ఓ పబ్‌ అడ్డాగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు పలువురికి నోటీసులు పంపిన సిట్‌.... వీరంతా ఈ నెల 19నుంచి 27తేదీల్లో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు రావాలని ఆదేశించింది.. లేకపోతే చర్యలు తప్పవని అకున్‌ సబర్వాల్ హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

'తల్లి, పిల్ల కాంగ్రెస్ మధ్య రాజీకి ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ'

అమరావతి: వైసీపీ 9 హామీలపై చర్చ అనవసరం అని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. రైతులకు రూ.50వేలు మేమూ చెల్లించామని, రూ. 12500 చొప్పున 4 ఏళ్లు ఇస్తే రైతుకేం లాభం అని ప్రశ్నించారు. అమ్మఒడి హామీని 2014లోనే ప్రజలు తిరస్కరించారని, తల్లి, పిల్ల కాంగ్రెస్ మధ్య రాజీకి ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీ అని, ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకుని కాంగ్రెస్ భూస్థాపితం అయిందని ఎద్దేవా చేశారు. ఇపుడు వైసీపీ కూడా భూస్థాపితం అవుతుందని యనమల జోశ్యం చెప్పారు.

శాంతి భద్రతలపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రలో శాంతి భద్రతలపై డీజీపీ అనురాగ్ శర్మ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఐజీలు, డీఐజీలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ సర్పంచ్ ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు షాక్

కరీంనగర్ : మానకొండూరు మండలం ముంజపల్లి సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ బలపరిచిన అభ్యర్థిపై 22 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రవీంద్రా చారి గెలుపొందారు.

వీరేనా టాలీవుడ్ డ్రగ్ వీరులు...!?

హైదరాబాద్: టాలీవుడ్ ను డ్రగ్స దందా కుదిపేస్తుంది. నేడు తాజాగా ముగ్గురు హీరోయిన్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. బాలనటుడిగా కెరీర్ ను ప్రారంభించి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి, ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని యువ నటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్లు సమాచారం.

15:03 - July 13, 2017

బర్రెకు సున్నం ఏస్తే ఎద్దవుతుందా ?బొడ్డు ఊసని పోరని అడిగితే కాదని చెబుతడు. మరి పాత బంగ్లాకు కొత్త సున్నం కొట్టి ఇప్పుడే కట్టిచ్చిన్నట్లు..అది మేమే కట్టిచ్చినట్లు..కలరింగ్ ఇస్తే జనాలు గుర్తుపట్టరా...బోనిగిరి కాడ..పాత బంగ్లా కాలేజీకి గులాబీ రంగు వేసి ఓ నాటకం షురూ చేసిండ్రు..మరి పూర్తి వివరాలకు వీడియో సూసుండ్రి...

పట్టణాల్లో పక్కా ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పట్టణాల్లో పక్కా ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని నగరాలు, పట్టణాల్లో ఎన్టీఆర్ నగర్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. సంపన్నుల ఇళ్లకు ధీటుగా పేదల ఇళ్లను నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా కావాలని, ఇళ్ల నిర్మాణ పురోగతిపై ప్రతి నెలా తనిఖీ చేస్తానని చంద్రబాబు తెలిపారు.

14:56 - July 13, 2017

కూలి ఇచ్చి వీపు పగులగొట్టిచ్చుకున్నట్లు ఇదే కావచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ పని కూడా గట్లనే ఉన్నది. కడప జిల్లాలోని రాజంపేటలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పని చేసుకుని రాక..సమస్యలు ఉంటే చెప్పుండ్రి..చెప్పుండ్రి..నేను వినతానికే వచ్చినా..అంటే జనాలు ఏం చేసిన్రో వీడియోలో చూడండి...

సర్పంచ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు...

నల్గొండ: తిప్పర్తి మండలం రాజాపేట సర్పంచ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతకింది పద్మ 140 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

14:44 - July 13, 2017

కలెక్టర్...ఎమ్మెల్యే...కలెక్టర్ కావాలంటే ఎంతో కష్టపడి చదివితేనే సాధ్యమౌతుంది..చదువు..బుద్ధిబలం ఎంతో కావాల్సి ఉంటుంది...ఎమ్మెల్యే..కనీస విద్యార్హత ఉన్నా సరిపోతుంది..కానీ వీరిద్దరూ ప్రజావ్యవస్థకు మూల స్తంభాలాంటి వారని చెప్పవచ్చు. తెలంగాణలో 31 జిల్లాలు ఏర్పడ్డాక 26 మంది యువ ఐఏఎస్‌లే కలెక్టర్లుగా కొనసాగుతున్నారు.

మహబూబాబాద్..
కలెక్టర్లపై ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదమౌతోంది. అంతే గాకుండా జరుగుతున్న తీరుపట్ల ఐఏఎస్ లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ లో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు దారి తీసింది. మహబూబాద్ లో జరిగిన హరిత హారం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రీతిమీనాలు హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే కలెక్టర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. పార్టీకి..ప్రభుత్వానికి తీరని మచ్చ తెచ్చిపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఐఏఎస్ లు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు సమాచారం. కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణలు చెప్పారు. కానీ కలెక్టర్లు, ఎమ్మెల్యేల మధ్య వివాదాల చర్చకు తెర లేపింది.

కరీంనగర్ లో..ఎమ్మెల్యే రసమయి..
గతంలో కూడా కలెక్టర్ల పట్ల పలువురు ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరు వివాదాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇటీవలే కరీంనగర్ జిల్లాలో డిజి ధన్ మేళా కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎంపీ ఫొటో లేదంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..కలెక్టర్ సర్ఫరాజ్ తో వాగ్వాదానికి దిగారు. ఆయన వాదనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి మైండ్ యువర్ టంగ్ అనే స్థాయికి వెళ్లిపోయింది.

జనగాం కలెక్టర్..
అంతేగాకుండా జనగాం కలెక్టర్ దేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల మధ్య ప్రొటోకాల్ చిచ్చు రేపింది. జిల్లాలో నిర్వహించిన సీడ్ బాల్స్ కార్యక్రమంపై తనకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కలెక్టర్ దేవసేనను నిలదీశారు. కలెక్టర్ ను గదమాయించిన తీరు వివాదాస్పదమైంది. ఇదంతా భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సమక్షంలో జరగడం గమనార్హం.

ఈ మూడు ఘటనలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండడం గమనార్హం.
కలెక్టర్లు తమ తమ ఆలోచనలతో తమదైన ముద్ర వేస్తూ ముందుకెళుతున్నారు. కానీ కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలున్నాయి. కలెక్టర్ల పట్ల ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరు మానుకోవాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి ఈ ఘటనతో పుల్ స్టాప్ పడుతుందా ? లేదా అనేది చూడాలి.

14:38 - July 13, 2017
14:37 - July 13, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలులో నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు వద్దంటూ మహిళల ఆందోళనలు కొనసాగుతూనేఉన్నాయి.. ప్రకాశం లో కూడా మహిళలు రోడ్డెక్కారు.. మందుబాబుల ఆగడాలతో ఇళ్లలో ఉండలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:36 - July 13, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకన్న ఇంటిపై.. ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. మియాపూర్, మదీనగూడ, కృషి నగర్‌లలోని వెంకన్న ఇళ్లలో.. తెల్లవారుజాము నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు.. ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సూర్యపేట, నిజామాబాద్, మాసబ్‌ ట్యాంక్‌లోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు 2 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. తనిఖీలు పూర్తయ్యేవరకు మరిన్ని ఆస్తులు బయటపడనున్నాయని ఏసీబీ డీఎస్పీ సిద్ధికి తెలిపారు.

14:35 - July 13, 2017

హైదరాబాద్ : మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని తెలంగాణ టీడీపీ డిమాండ్‌ చేసింది. ఎమ్మెల్యేని అరెస్టు చేసి జైలుకు పంపకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించింది. శంకర్‌నాయక్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

14:34 - July 13, 2017

హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్‌ మాఫియా కేసు కుదిపేస్తోంది.. పలువురు సినీ ప్రముఖులను సిట్‌ నోటీసులు వణికిస్తున్నాయి.. నోటీసులు అందుకునేవారిసంఖ్య 20కి చేరే అవకాశం కనిపిస్తోంది.. డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు హీరోలకుకూడా సిట్‌ నోటీసులు పంపింది.. నోటీసులు అందుకున్నవారిలో ఓ టాప్‌ డైరెక్టర్‌, టాప్‌ హీరో, టాప్‌ కెమెరామెన్‌ తమ్ముడు ఉన్నట్లు తెలుస్తోంది.. ఐటం సాంగ్స్‌తో వెండితెరను ఊపేసిన ఓ నటి... వర్ధమాన గాయకురాలి భర్త.... బాలనటుడిగా మొదలై వర్దమాన నటుడిగా ఎదిగిన హీరో.... డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తున్న ఓ హీరోయిన్‌... సినిమా ఫంక్షన్‌లలో హీరోలను ఆకాశానికి ఎత్తే నిర్మాత.... సినిమాల్లో బ్రేక్‌ లేక సెకండ్ హీరోగా స్థిరపడ్డ నటుడుఉన్నట్లు సమాచారం.. డ్రగ్స్ తీసుకునేవారంతా గచ్చిబౌలిలోని ఓ పబ్‌ అడ్డాగా ఉన్నట్లు తెలుస్తోంది.. మరోవైపు పలువురికి నోటీసులు పంపిన సిట్‌.... వీరంతా ఈ నెల 19నుంచి 27తేదీల్లో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌కు రావాలని ఆదేశించింది.. లేకపోతే చర్యలు తప్పవని అకున్‌ సబర్వాల్ హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఉత్తమ్ కప్టెన్ కాదు.. అబద్దాల కోరు: కర్నె

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కెప్టెన్ కాదని.. ఉత్త అబద్ధాలకోరు అని టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. పులిచింత హైడల్ ప్రాజెక్టు పై ఉత్తమ్ ఆరోపణలు అవాస్తవం అన్నారు. కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కు రైతులను తీసుకొచ్చి పులిచింతలపై అసత్యాలు చెప్పించారు కర్నె ఆరోపించారు.

బ్లేడుతో చేయి కోసుకుని యువతి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: మైలార్ దేవ్ పల్లి పరిధిలోని మధుబన్ కాలనీలో బ్లేడుతో చేయి కోసుకుని యువతి దీక్ష ఆత్మహత్యాయత్నం చేసింది. బ్రోకర్ కేసులో అరెస్టు చేయడంపై దీక్ష మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.

మాజీ ఎమ్మెల్యే రంగస్వామి కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

చిత్తూరు: శాంతిపురంలో టీడీపీ సీనియర్‌ నేత, కుప్పం మాజీ ఎమ్మెల్యే రంగస్వామి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రంగస్వామి సమాధి వద్ద చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత రంగస్వామి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

13:48 - July 13, 2017

చెన్నై : అక్రమ ఆస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకె నేత శశికళ జైలులో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డిఐజి రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. జైళ్లశాఖలోని ఓ సీనియర్‌ అధికారి శశికళ నుంచి 2 కోట్ల నగదు తీసుకుని జైలులో వివిఐపి ట్రీట్‌మెంట్‌ కల్పించారని లేఖలో డిఐజి ఆరోపించారు. ప్రత్యేక వంటగది, గదిలో పరుపు, స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు కల్పించారని కర్ణాటక పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌ కుమార్‌ దత్తకు ఫిర్యాదు చేశారు. శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని డిజిపి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన

సంగారెడ్డి : విద్యుత్ హైటెన్షన్ లైన్లు వేసిన తమ భూములకు పరిహారం చెల్లించాలని పురుగుల మందు, ఉరితాళ్లతో సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ముందు రైతులు ఆందోళన చేపట్టారు.

 

13:46 - July 13, 2017
13:44 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నిందితులు అనీశ్, రితు అగర్వాల్‌నుంచి మరింత పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో పలువురికి ఇప్పటికే నోటీసులుఇచ్చిన పోలీసులు.. డ్రగ్స్‌తో సంబంధంఉన్న మరికొంతమంది సమాచారం సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:40 - July 13, 2017

హైదరాబాద్ : మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా.. క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు మిథాలీ ఓ సంచలనంగా మారిపోయింది. అలాగే సీఎం కేసీఆర్‌ అభినందనలను కూడా అందుకుంది. హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌.. మరో కొత్త రికార్డును నెలకొల్పింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధికంగా 6 వేల పరుగులు సాధించిన మొదటి క్రీడాకారిణిగా.. మిథాలీ పేరు సంపాదించింది. 
మిథాలీ రాజ్‌ కు కేసీఆర్ అభినందనలు
క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అభినందించారు. ఈ మేరకు ఆమెకు అభినందన సందేశం పంపారు. భారత జట్టు సారధిగా, వ్యక్తిగతంగా మిథాలీ రాజ్‌ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌ ఉమెన్‌గా మిథాలీరాజ్‌, అత్యధిక వికెట్‌లు తీసిన బౌలర్‌గా జులన్‌ గోస్వామి.. ఇద్దరూ భారతీయులే కావడం గర్వంగా ఉందని సీఎం అన్నారు. గతంలో టెస్ట్ క్రికెట్‌లో విజయం.. సాధించి గవాస్కర్‌-కపిల్ దేవ్‌ కూడా ఇలా ఒకేసారి అగ్రగాములుగా నిలిచిన సంఘటనను ఈ ఇద్దరు అమ్మాయిలు పునరావృతం చేశారని సీఎం చెప్పారు. ఉమెన్ వరల్డ్‌ కప్‌లో మిథాలీ రాజ్‌ నాయకత్వంలో భారత జట్టు ఘన విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ లాంటి క్రీడల్లో హైదరాబాద్‌ అమ్మాయిలు దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ టైటిళ్లు గెలవడం, రికార్డులు నెలకొల్పడం ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకమని సీఎం అభిప్రాయపడ్డారు. 

 

గంగానది ఒడ్డున చెత్తవేస్తే రూ.50వేలు ఫైన్

ఢిల్లీ: గంగానది ఒడ్డున 100 మీటర్ల వరకు నో డెవలప్ మెంట్ జోన్ గా ఎన్జీటీ ప్రకటించింది. గంగానది ఒడ్డున 500 మీటర్ల వరకు చెత్త వేయరాదని, చెత్తవేసేవారిపై రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

13:22 - July 13, 2017

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు 19వ తేదీ నుండి నుంచి 27వతేదీ లోపు విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

13:18 - July 13, 2017
13:16 - July 13, 2017

వరంగల్ : కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు పరిపాటిగా మారాయి. నెల్లికుదురు కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటన మరువకుముందే మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుది. జిల్లాలోని తొర్రూరు కస్తూర్బా స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమ్తితం వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. ఈనెల 9న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. ఉదయం కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఏపీ సచివాలయంలో సీఆర్డీఏ అధికారుల భేటీ

అమరావతి: సచివాలయంలో సీఆర్డీఏ అధికారులు సమావేశం అయ్యారు. సీఆర్ డీఏ పరిధిలో రవాణా, ట్రాఫిక్ అధ్యయనం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

13:05 - July 13, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రు దళితులపై విధించిన సాంఘిక బహిష్కరణను తొలగించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. లేకపోతే  అన్ని పార్టీలను కలుపుకుని ఈనెల 28న చలో గరగపర్రు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. గరగపర్రు దళిత బాధితుల కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

 

హైకోర్టులో గ్రూప్ -2 అభ్యర్థులు మరో పిటిషన్

హైదరాబాద్: హైకోర్టులో గ్రూప్ -2 అభ్యర్థులు మరో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని పిటిషన్ కోరారు. గ్రూప్ -2 పరీక్షలో అనేక అక్రమాలు జరిగాయని పిటిషనర్ పేర్కొన్నారు. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది.

12:52 - July 13, 2017

హైదరాబాద్ : మెహిదీపట్నం బోజగుట్ట బస్తీ వాసులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సీపీఎం పాదయాత్ర నిర్వహించింది. బస్తీలోని ఇళ్లను కూలగొట్టి డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తప్పుపట్టింది.  మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

12:48 - July 13, 2017
12:46 - July 13, 2017

కరీంనగర్‌ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భరత్‌నగర్ సిద్ధార్థ పాఠశాలలో ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడి.. విద్యార్థి శ్రీకర్‌ రెడ్డి మృతి చెందాడు. విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి.. ప్రమాదవశాత్తు మరణించాడా లేదా ఆత్మహత్యకు చేసుకున్నాడా అని అనుమానిస్తున్నారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శశికళపై సంచలన ఆరోపణలు...

బెంగళూరు: శశికళపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. పరప్పణం జైలులో శశికళకు విఐపీ సేవలు అందిస్తున్నారని, సిబ్బంది ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారని ఉన్నతాధికారులకు జైళ్ల శాఖ డీఐజీ రూప నివేదిక ఇచ్చింది. శశికళ రూ. 2 కోట్లు లంచం ఇచ్చారని కూడా ఆ నివేదికలో ఫిర్యాదు పేర్కొంది.

12:40 - July 13, 2017

ఖమ్మం : కాలేజీ సిబ్బంది నిర్వాకానికి విద్యార్థి బలి అయ్యాడు. కాలేజీ సిబ్బంది సర్టిఫికెట్లు ఇవ్వలేదని విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మంలోని గోపాలపురంలో ఎస్‌ఆర్‌ అండ్‌ బీజేఎన్‌ఆర్‌ కాలేజీలో మాగంటి లక్ష్మణ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. పీజీ ఎంట్రాన్స్ రాశాడు. కౌన్సిలింగ్ ఉన్నందున సర్టిఫికెట్ల కోసం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజేఎన్‌ఆర్‌ కాలేజీకి వెళ్లాడు. కాలేజీ సిబ్బంది లక్ష్మణ్ ను పలుమార్లు తప్పించుకున్నారు. చివరికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇసుక అక్రమ రవాణా...ఎస్సై సస్పెన్షన్

నిజామాబాద్: జిల్లాలోని రెంజల్ ఎస్సై రవికుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇసుక అక్రమ రవాణ దందాలతో ఎస్సైకి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు. స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం వెలువరించారు.

వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

సికింద్రాబాద్: అంతర్ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 50 తులాల బంగారం, పలు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేసి నిందితులను వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు.

15న ఎస్ ఆర్ ఎం వర్శిటీ ప్రారంభం.

విజయవాడ: 15న ఎస్ ఆర్ ఎం యూనివర్శిటీ ప్రారంభం కానున్నట్లు ఆ సంస్థ నేతలు తెలిపారు. ఈ ఏడాది 4 ఇంజనీరింగ్ కోర్సులతో వర్శిటీ ప్రారంభిస్తామని రెండేళ్లలో ఎస్ ఆర్ ఎం ఆసుపత్రి వైద్య విద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఐదు నెలల రికార్డు సమయంలో యూనివర్శిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ఎస్ ఆర్ ఎం కోసం 200 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టిడిపి నేతల భేటీ

హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీ.టిడిపి సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి రేవంత్ రెడ్డి, రావుల, అరికెల, వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

12:11 - July 13, 2017

ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) వేడుకలకు సర్వం సిద్ధమౌతోంది. జులై 14, 15వ తేదీల్లో మెట్ లైఫ్ స్టేడియంలో జరిగే జరిగే వేడుకను అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. న్యూయార్క్ లో 18వ ఎడిషన్ కు సంబంధించిన ప్రోగ్రాం జరగనుంది. ఈ షోకు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ షోని హోస్ట్ చేయ‌నున్నాడు. ఆయ‌న‌కి జ‌త‌గా 'సైఫ్ ఆలీఖాన్' కూడా సంద‌డి చేయ‌నున్నాడు. గ్లామర్..వినోదంతో ఐఫా వేడుక జరుగుతుందని తెలుస్తోంది.
వరుణ్ ధావన్ తొలిసారి ఐఫాలో డెబ్ల్యూ ఫెర్మామెన్స్ ఇవ్వనున్నాడు. వేడుక‌లో బాలీవుడ్ స్టార్స్ స‌ల్మాన్ ఖాన్, అలియా భ‌ట్, క‌త్రినా కైఫ్ , షాహిద్ క‌పూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌రియు కృతి స‌న‌న్, త‌దిత‌రులు లైఫ్ ఫెర్మామెన్స్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ సెల‌బ్రిటీలు గ్రూపులుగా ఐఫాకు చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ సెలబ్రెటీలు చేరుకున్నట్లు తెలుస్తోంది. మిగతా సెలబ్రెటీలు గురువారం పయనం కానున్నారు.
ఐఫా కార్య‌క్ర‌మం పూర్తైన త‌ర్వాతి రోజు అంటే జూలై 16న క్లోజింగ్ పార్టీని నిర్వహించనున్నట్లు, ఇందులో బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ పార్టీకి విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ జంట‌గా హాజ‌ర‌వుతార‌ని టాక్.

కానాల - మింతల వరకు రోడ్డుకు శంకుస్థాపన చేసినమంత్రి లోకేష్

కర్నూలు : నంద్యాల రైతు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. కానాల - మింతల వరకు రోడ్డును ప్రారంభించారు.

బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన

భద్రాద్రి: బూర్గంపహాడ్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు, విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. అయినా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు విధులకు హాజరుకాలేదు. అధికారులు ఆలస్యంగా రావడంపై గ్రామస్తులు నిరసనకు దిగారు.

12:04 - July 13, 2017

'అనిల్ కపూర్’.. బాలీవుడ్ లో స్టార్ నటుడు. ఆయన వారసులుగా వచ్చిన 'సొనమ్ కపూర్' ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. 'అనిల్ కపూర్' కొడుకు 'మిర్జియా' అనే సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. తాజాగా మరో చిత్రంలో నటించబోతున్నాడు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ ‘అభినవ్ బింద్రా’ జీవితాన్ని వెండి తెరపైకి ఎక్కించేందుకు దర్శకుడు కన్ననన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నటీ నటుల ఎంపిక చేపట్టారు. 'రిషీ కపూర్‌’, 'రణబీర్‌ కపూర్‌'లు పాత్రలు చేస్తారని ప్రచారం జరిగింది. తర్వాత 'వరుణ్‌ ధావన్‌' అభినవవ్ బింద్రాగా చేస్తారని టాక్ వినిపించింది. చివరకు అనిల్‌ కపూర్..హర్షవర్ధన్‌ కపూర్ లను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని 'అనిల్‌ కపూర్‌' బుధవారం వెల్లడించాడు. అభినవ్‌ బింద్రా తండ్రిగా అబిత్‌ బింద్రా పాత్రలో 'అనీల్' కనిపించబోతున్నాడు. 'హర్షవర్థన్‌' అభినవ్‌ బింద్రాగా చేస్తున్నాడు. త్వరలోనే ఈచిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.

12:00 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. నిందితులు అనీశ్, రితు అగర్వాల్‌నుంచి మరింత పోలీసులు మరింత సమాచారం రాబడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో పలువురికి ఇప్పటికే నోటీసులుఇచ్చిన పోలీసులు.. డ్రగ్స్‌తో సంబంధమున్న మరికొంతమంది సమాచారం సేకరిస్తున్నారు.

 

11:58 - July 13, 2017

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురం సహారా ఎస్టేట్స్ దగ్గర యువకుడి హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు బాధితునిపై దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన యువకుడిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బాధితుడు చనిపోయాడు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:55 - July 13, 2017

కృష్ణా : విజయవాడలో విషాదం నెలకొంది. ఆకతాయి వేధింపులకు ఓ బాలిక బలైంది. పోకిరి వేధింపులను తట్టుకోలేక బాలిక తనువు చాలించింది. మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పెనమలూరు మండలం సనత్‌ నగర్‌లో దంపతులు గోవిందరాజు, పార్వతి, కూతురు సౌమ్య నివాసం ఉంటున్నారు. తండ్రి గోవిందరాజు ఎక్ట్రిషియన్ గా, తల్లి పార్వతి ...భవననిర్మాణ కూలీగా పని చేస్తున్నారు. కర్రి సౌమ్య.. విజయవాడ పటమట ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే నాలుగురోజుల నుంచి స్కూల్‌కువెళ్లే సమయంలో నాని అనే వ్యక్తి సౌమ్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులను ఎవరికీ చెప్పుకోలేక.. లోలోపల తీవ్రంగా బాధపడింది. ఆకతాయి వేధింపులకు తీవ్ర మనస్తాపం చెందిన బాలిక... తల్లిదండ్రులు పనికి వెళ్లాక... ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. బాలిక మృతికి ఆకతాయిల వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:54 - July 13, 2017

ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతున్న తరుణంలో చిత్ర హీరోలు..హీరోయిన్లు తమ తదుపరి చిత్ర కథ..దర్శకులపై దృష్టి సారిస్తుంటారు. షూటింగ్ దశలోనే ఉండగానే మరో సినిమాకు సైన్ లు చేసేస్తుంటారు. టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' కూడా అదే చేశాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'లై' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ 'అర్జున్' విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌ టైగర్‌' చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ నిర్మాణంలో రూపొందబోయే సినిమాకు ‘నితిన్’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. భారీ బడ్జెట్ తో సినిమా రూపొందనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

11:45 - July 13, 2017

మహబూబాబాద్ : కలెక్టర్‌ ప్రీతిమీనాపట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. తన సొంత వాహనంలో శంకర్ నాయక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు. ప్రాథమిక విచారణ తర్వాత బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకు 353 సెక్షన్, ఒక మహిళ పట్ల నేరపూరితమైన ఆలోచనతో దాడి చేసినందుకు 354 సెక్షన్‌ల కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.. 
ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు...
మహబూబాబాద్‌లో బుధవారం హరితహారం కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రీతి మీనాతో అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. హరితహారంలో మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనాలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో నేతలు, అధికారులు మొక్కలు నాటారు. అక్కడినుంచి వేదిక మీదకు వెళ్లే సమయంలో శంకర్‌ నాయక్‌.... కలెక్టర్‌ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన కలెక్టర్‌ మీనా.. తన చేయితో తాకాల్సిన అవసరం ఏముందంటూ ఆగ్రహించారు. ఈ అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల సంఘంకూడా సీరియస్‌గా స్పందించింది.
మహబూబాబాద్‌లో ఉద్రిక్తత
మహబూబాబాద్‌లో హైటెన్షన్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. శంకర్‌నాయక్‌ను ఏ క్షణాన్నైనా అరెస్ట్‌ చేస అవకాశాలున్నాయి. మరో వైపు మహబూబాబాద్‌ పీఎస్‌లో శంకర్‌నాయక్‌ పోలీసులతో మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే క్షమాపణతో శాంతించని కలెక్టర్‌ ప్రీతిమీనా
శంకర్‌నాయక్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై  353, 354 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.
మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదైంది.

 

 

పాల్వాయి కుంబసభ్యులను పరామర్శించిన ఎంపీలు

హైదరాబాద్: పాల్వాయి కుటుంబ సభ్యులను 11 మంది ఎంపీలు బృందం పరామర్శించింది. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఆనందరావు అల్సు, కమిటీ సభ్యులు పాల్వాయి కుటుంబానికి సానుభూమతి తెలిపారు.

ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదు: చినరాజప్ప

తూ.గో : ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని, ఇక పై ఇవ్వం అని డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పష్టం చేశారు. యువ ఎవరూ ముద్రగడ పాదయాత్రకు వెళ్లొద్దని, ప్లీనరీలో జగన్ ప్రవేశ పెట్టిన 9 పథకాలు ఖజానాను దోచుకోవడానికే అని చినరాజప్ప ఆరోపించారు.

సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం: గోపాలపురంలో డిగ్రీ విద్యార్థి లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సిబ్బంది సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లక్ష్మణ్ డిగ్రీ పూర్తి చేశాడు.

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది: పి. మధు

విజయవాడ: అక్రమ నిర్బంధానికి పాల్పడటం సిగ్గు చేటని.. రాష్ట్రంలో దిళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... గరగపర్రు వ్యవహారంలో సీఎం జోక్యం చేసుకుని సామాజిక బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని పార్టీలతో 28న చలో గరగపర్రు చేపడతామని హెచ్చరించారు. గరగపర్రు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మధు తెలిపారు. ప.గో జిల్లాలో 144 సెక్షన్, దళితులపై కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా మద్ధతిస్తాం అని మధు స్పష్టం చేశారు.

11:22 - July 13, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' బుగ్గలను నలిపేస్తున్నాడా ? ఏ హీరోయిన్ అంటూ దంద్వార్థాలు వెతుక్కొక్కండి. ఎందుకంటే ఆయన బుగ్గులు నలిపేసింది చిత్ర యూనిట్ లో ఉన్న ఓ వ్యక్తివి..అవును...చిత్ర షూటింగ్ సమయంలో హీరోలు..హీరోయిన్లు సరదాగా ఉంటుంటారు. ఖాళీ సమయాల్లో జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తుంటారు. అలాంటి వారిలో 'మహేష్' కూడా ఒకరు. షూటింగ్ లోని వత్తిడిని తగ్గించేందుకు 'మహేష్' సరదాగా గడుపుతాడని టాక్ ఉంది. తాజాగా ఆయన మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రూపొందుతోంది. చాలా కాలంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో మరొక టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సినిమా సెట్ లో జరిగిన ఓ సరదా సన్నివేశాన్ని దర్శకుడు సామాజిక మాధ్యమంలో విడుదల చేశారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ బుగ్గలను పట్టుకుని నలుపుతున్న వీడియో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. 'ఫన్నీయెస్ట్ మూమెంట్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆన్ స్పైడర్ సెట్’ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'మహేష్' కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇందులో ఓ సాంగ్ చిత్రానికే హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉందంట. సెప్టెంబర్ 27న స్పైడర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదంపై జిల్లా ఎస్పీ ప్రెస్ నోట్

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదంపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. 353,354,509 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తు అధికారిగా తొర్రూరు డీఎస్పీ రాజారత్నం ను నియమించారు. కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించిన ఘనటలో దర్యాప్తు బృందం వివరాలు, వీడియో క్లిప్పింగ్ లు సేకరిస్తోన్నట్లు తెలిపారు.

11:15 - July 13, 2017

రంగారెడ్డి : జిల్లాలో ఇన్స్‌పెక్టర్‌ వెంకన్న ఇంటిపై.. ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో మియాపూర్, మదీనగూడ, కృషి నగర్‌లలోని వెంకన్న ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట, నిజామాబాద్, మాసబ్‌ ట్యాంక్‌లోని బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ సిద్దిఖి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.2 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:00 - July 13, 2017

విజయవాడ : రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. భీమవరంలో జరిగిన దమనకాండను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. దళితులు సాగుచేసుకుంటున్న కౌలు భూములను పెత్తందారులు గుంచుకున్నారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో 'నీరు చెట్టు' పేరుతో 32 గ్రామాలను చెరువుల కింద మార్చారని చెప్పారు. వామపక్షాలు, ప్రజాతంత్ర వాదులు... ఇవాళ, రేపు రౌండు టేబుల్ సమావేశాలు, సదస్సులు నిర్వహించాలన్నారు. 

10:59 - July 13, 2017

తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందా ? పెరుగుతున్న ధరలు..ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం..కొన్ని అమలైనా అందులో జరుగుతున్న అవినీతి..ఆక్రమాలు..ఇలా రైతు..సామాన్యుడు..మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి పెళ్లుబిక్కుతోందా ?

మూడేళ్లు..
నీళ్లు..నిధులు..నియామకాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది..అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. ఎన్నో హామీలతో టీఆర్ఎస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. బంగారు తెలంగాణ కోసం తాను కృషి చేయడం జరుగుతుందని..అందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి భిన్నమైన పరిస్థితులున్నట్లు పలు ఘటనలు చూస్తే అర్థమౌతోంది. రైతులు..కార్మికులు..ఏదో ఒక సమస్యపై ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఆందోళనలు..నిరసనలు కొనసాగుతుండడం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేక రైతు..పెరుగుతున్న ధరలపై సామాన్యుడు బక్కచిక్కి పోతున్నాడు. సమస్యలను పరిష్కరిస్తామంటున్నారే కానీ శాశ్వత పరిష్కారం చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అసంతృప్తికి కారణం ?
సమాజంలోని అసంతృప్తికి కారణం ఏమిటి ? సగటు మనిషి జీవితం సాఫీగా సాగకుండా ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నాడు. చాలీ చాలని జీతాలు..పెరుగుతున్న ధరలతో సామాన్యుడి జీవితం అల్లకల్లోలంగా మారిపోతోంది. విద్య..నీళ్లు..ఆహారం..ఆరోగ్యం..ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో సవ్యంగా సాగకపోయేసరికి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. ప్రజల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని విశ్లేషకుల అభిప్రాయం. పేదవాడు కోసమంటూ అమలు చేస్తున్న పథకాలు..సంక్షేమ కార్యక్రమాలు అతడి జీవితాన్ని పెద్దగా మార్చలేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైతుల పరిస్థితి మరింత దిగజారుతోంది. చెమటోడ్చి..రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలోకి జారిపోతున్నాడు. బ్యాంకుల రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నాడు. ఇక ఉద్యోగ కల్పనలోనూ తెలంగాణ ప్రభుత్వం అంతగా ఆశించిన పనులు చేయలేదని నిరుద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రస్తుత సమస్యలపై చర్యలేవీ ?
ఎన్ని సమస్యలున్నా పాలకులు...అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయా ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ప్రజా ప్రతినిధుల మీద మునుపటి నమ్మకాలు సన్నగిల్లాయనేపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే పలు చోటు చేసుకున్న ఘటనలు చూస్తే అర్థమౌతుంది.
ప్రజల అసంతృప్తి పరిధి దాటితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలిసిందే.

వనస్థలీపురం వద్ద యుకుడి పై దాడి.. చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని సహారా ఎస్టేట్ వద్ద యువకుడి పై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

 

 

10:51 - July 13, 2017

శ్రీనగర్ : కాశ్మీర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పలు ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరించారు. లష్కరే తోయిబా అబూ ఇస్మాయిల్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయంపై చర్చించేందుకు ఇవాళ పోలీసులు మరోసారి సమావేశం కానున్నారు. కుల్గమ్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్లద్వారా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:48 - July 13, 2017

మహబూబాబాద్‌ : జిల్లా కేంద్రంలో హైటెన్షన్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. శంకర్‌నాయక్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఎమ్మెల్యే క్షమాపణతో శాంతించని కలెక్టర్‌ ప్రీతిమీనా శంకర్‌నాయక్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై 353, 354 సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదైంది. హరితహారం కార్యక్రమంలో నిన్న జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల మహబూబాబాద్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

గోపాల పురం ఏసీపీ పై వేటు

హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ఆలయానికి వచ్చిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వాహనాన్ని అడ్డుకున్న గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుపై వేటు పడింది. ఆయన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 

పీఎస్ లో లొంగిపోయిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్: ఎమ్మెల్యే శంకర్ నాయక్ లొంగిపోయాడు. కలెక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో పీఎస్ లో శంకర్ నాయక్ లొంగిపోయాడు. వెంటనే స్టేషన్ బెయిల్ పై శంకర్ విడుదలయ్యారు.

కరీంనగర్ సిద్ధార్థ పాఠశాలలో విషాదం

కరీంనగర్ : భగత్ నగర్ సిద్ధార్థ పాఠశాలలో ప్రమాదవశాత్తు భవనం పై నుండి పడి శ్రీకర్ రెడ్డి అనే విద్యార్థి మృతి చెందాడు.

10:34 - July 13, 2017

చెన్నై : బిగ్‌బాస్‌ రియాల్టీషో పై వస్తున్న విమర్శలపై బిగ్‌బాస్‌ హోస్ట్‌  కమల్‌హాసన్‌ స్పందించారు. తమిళం తెలియని వారికి బిగ్‌బాస్‌ ద్వారా తమిళ్‌ నేర్పటం తప్పు కాదని అన్నారు. బిగ్‌బాస్‌ వల్ల తమిళ సంస్కృతికి భంగం వాటిల్లడం లేదని ఎవరి మనోభావాలను కించపరచడం లేదని అన్నారు. అరెస్టులపై వస్తున్న విమర్శలపై స్పందించారు. చట్టంపై పూర్తి నమ్మకం ఉందని.. సమస్యలు వస్తే కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కమల్‌ చెప్పారు.

 

10:25 - July 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌  రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటి అడ్వకేట్‌ జనరల్‌గా రామకృష్ణారెడ్డి పని చేశారు. 2014 జూన్‌ 21న రామకృష్ణారెడ్డి అడ్వకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. మూడేళ్లపాటు పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజనపై దాఖలైన పలు కేసుల్లో హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రామకృష్ణారెడ్డి స్థానంలో సీరియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డిని అడ్వకేట్‌ జనరల్‌గా నియమించే అవకాశం ఉందని న్యాయశాఖ వర్గాల్లో వినిపిస్తోంది. 

 

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకు మంత్రి పోచారం శంకుస్థాపన

కామారెడ్డి: బంజపల్లిలో నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణ పనులకు మంత్రి పోచారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జెడ్పీ ఛైర్మన్ ధఫేదార్ రాణా పాల్గొన్నారు.

ఖమ్మం లో వామపక్ష, టిడిపి నేతల అరెస్ట్

ఖమ్మం: రఘునాథపాలెం, పందిళ్లపల్లిలో ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలు, టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు.

10:11 - July 13, 2017

అధికార పక్షం..విపక్షం..పాలనలో ఈ రెండూ ఉంటాయి. మంచి జరిగితే మంచి అని..ఆ మంచి పనుల్లో చెడు ఉంటే ఇదిగో ఇది చెడు అని విపక్షాలు చూపుతుంటాయి. చెడు జరిగితే సరిదిద్దుకుంటామని అధికార పక్షం చెప్పడం..కాదు మంచే జరిగింది..ఇలా అని చెప్పడం అధికార పక్షం చేసే పని. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలపై సర్కార్ ఎలా వ్యవహరిస్తుంది ? విపక్షాలు చేస్తున్న ఆరోపణలు..విమర్శలపై అధికార పక్షం ఎదురు దాడికి దిగుతోంది.

హరితహారం కార్యక్రమంలో...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో విడత హరిత హారం కార్యక్రమంలో పాల్గొని విపక్షాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. గొర్రెల పంపిణీ పథకంలో విపక్షాలు చేసిన విమర్శలపై సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో విపక్షాలు లేకుండా చేయాలని అధికారపక్షం ప్రయత్నిస్తోందని..అందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నం చేయడం వంటివి చేస్తున్నాయని విపక్షాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బహిరంగంగానే విమర్శలు వినిపించాయి. ముసలి గొర్రెలు ఇస్తున్నారంటూ సోషల్ మాధ్యమాల్లో వచ్చిన వార్తలై వైరల్ అయ్యాయి. గొర్రెల పంపిణీ కోసం ఇంకా సర్వేలతోనే ప్రభుత్వం జాప్యం చేస్తోందని, 80లక్షల గొర్రెలు ఎక్కడ ఉన్నాయని సీపీఎం ప్రశ్నించింది. కానీ ప్రశ్నించినా..విమర్శించినా ప్రభుత్వం తట్టుకోవడం లేదని..విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఇతర నేతలతో ప్రతివిమర్శలు చేయిస్తోందని విపక్ష నేతలు పేర్కొంటున్నారు.

విమర్శలకు సమాధానం ఏదీ ?
రాష్ట్రంలో అభివృద్ధి కావాలని ప్రతొక్కరూ కొరుకొనేదే. కానీ ఆ అభివృద్ది మాటున జరుగుతున్న మోసాలు..అక్రమాలు..అవినీతిపై విపక్షాలు ప్రశ్నిస్తాయి. కానీ ప్రశ్నిస్తున్నాయని..విమర్శలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగడం కరెక్టు కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిషన్ కాకతీయ..మిషన్ భగీరథ..భూముల సేకరణ..ధర్నా చౌక్..పోడు భూములు..తదితర విషయాలపై విపక్షాలు గళమెత్తాయి. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాయి. కానీ వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి స్వయంగా గులాబీ బాస్..లేదా ఇతర నేతలతో విపక్ష పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలు..అవినీతి..ఇతర అంశాలపై బహిరంగంగా చర్చకు సిద్ధమని పోరాటంలో ముందు వరుసలో ఉండే సీపీఎం సవాల్ కూడా విసిరిన సంగతి తెలిసిందే. సవాల్ ను ప్రభుత్వం..గులాబీ నేతలు స్వీకరించలేదనేది తెలిసిందే.
ప్రజల్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోందని..అందుకే గులాబీ పార్టీలో కలవరం మొదలైందని..కానీ ఇవేమీ లేనట్టు...విపక్షాలను టార్గెట్ చేస్తూ కలరింగ్ ఇస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి...

10:09 - July 13, 2017

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి మొదలైపోయినట్టేనా ? ఇంకా సమయం ఉన్నా విపక్షాలు అధికారంలోకి రావడానికి అప్పుడే వ్యూహాలు రచిస్తున్నాయా ? అధికార పార్టీలను మట్టిలో కలిపేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయా ? పార్టీ అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ముందస్తుగా వెళుతున్నారంటే పార్టీలు భయపడుతున్నాయా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఏమాత్రం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికల మాటలు మాట్లాడేస్తున్నారు.

2019లో ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్..తెలంగాణ రాష్ట్రాల్లో 2019 ఎన్నికలు జరుగున్నాయి. కానీ ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలు అప్పుడే ఎన్నికలకు సిద్ధమౌతున్నాయి. ప్రధానంగా ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ముందే హామీలు గుప్పించడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఎన్నికల్లో అధికార పార్టీకి వైసీపీకి ఓట్ల తేడా 1.8 శాతం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ భారీగానే ఓట్లు సంపాదించడం..ఈసారి ఎన్నికల్లో ముందే కృషి చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తమదే అధికారం అంటున్న టిడిపి..
కానీ అధికారంలో ఉన్న టిడిపి మాత్రం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా చెబుతోంది. 2050 వరకు ఏపీని అగ్రస్థానంలో నిలబెడుతామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. వైసీపీ ప్లీనరీ అనంతరం టిడిపి కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటింటికి టిడిపి పేరిట నేతలు జనాల్లోకి వెళ్లాలని అధినాయకుడు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ మరోసారి అధికారం తమదేనని ఖాయమంటోంది. ప్రధాన పార్టీలు టిడిపి..కాంగ్రెస్ లు అప్పుడే వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో బహిరంగసభ ఏర్పాటుతో ఎన్నికల సమరానికి ముందే శంఖం పూరించింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతున్నాయి. టి.టిడిపి కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆయా సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రధాన సమస్యలపై ప్రధాన పార్టీ కాంగ్రెస్ పలు హామీలు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అప్పుడే ప్రకటించడం గమనార్హం.

ప్రజా సమస్యల మాటేమిటి ?
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ ప్రజా సమస్యలపై చర్చించడం లేదనే విమర్శలున్నాయి. ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల మాటలు..మాట్లాడడం..అప్పుడప్పుడు ప్రజా సమస్యలు లేవనెత్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ముందు నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. పోరాట పంథాను కొనసాగిస్తున్నాయి. ప్రజాసమస్యలపై ఎక్కడికక్కడ ఆందోళనలు..నిరసనలు కొనసాగిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. రైతులు..అంగన్ వాడీలు..కాంట్రాక్టు కార్మికులు..టీచర్లు..ప్రతి రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై వామపక్ష నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యమని..ప్రజా సమస్యలు వారికి పట్టవని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కానీ అంతిమంగా ప్రజలే నిర్ణేతలు..అధికారంలోకి రావాలని కలలు కంటున్న నేతల ఆశలు నెరవేరుతాయా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తేలుతుంది..అప్పటి వరకు ఇలాంటి మాటలు వింటూ ఉండాల్సిందే...

మరోసారి వాయిదా పడ్డ అనంత నాగ్ ఉప ఎన్నిక

జమ్మూకశ్మీర్ : రెండోసారి అనంత నాగ్ ఉప ఎన్నిక రద్దయ్యింది. శాంతిభద్రతల కారణంగా అనంతనాగ్ ఉప ఎన్నికను రద్దు చేసినట్లు ఈసీ తెలిపింది. ఎన్నిక నిర్వహణకు అనుకూల పరిస్థితి లేదని, ఈ నెల 25న జరగాల్సిన ఉప ఎన్నిక రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

10:01 - July 13, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' మంచి మార్కులే కొట్టేసింది. ఈ సినిమా అనంతరం నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. కొత్త తరహా కథాకథనాలతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలోని తన గెటప్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మాతగా, బన్సీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈసినిమాకు 'నా పేరు సూర్య’..నా ఇల్లు ఇండియా టైటిల్ ను ఖరారు చేశారు. ‘బన్నీ' సరసన అనూ ఇమ్మాన్యుయల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రతి సినిమాలో ఏదో ఒక స్టైల్ ఉండాలని 'బన్నీ' తహతహలాడుతుంటాడు. స్టైల్..డ్యాన్స్..ఫైట్స్..హీరోయిన్స్..విలన్ ఇలా ప్రతొక్క విషయంలో తనదైన ఫార్ములా ఉండాలని యోచిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ గా దివంగత దర్శకుడు 'దాసరి నారాయణరావు' తనయుడు 'దాసరి అరుణ్' విలన్ గా నటించనున్నారని సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘సరైనోడు' చిత్రంలో విలన్ గా 'ఆది' నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ వార్త నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.

సౌదీలో అగ్ని ప్రమాదం...11మంది విదేశీ కూలీలు మృతి

హైదరాబాద్: సౌదీ అరేబియా నజ్రాత్ ప్రాంతంలోని ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారతీయులతో సహా 11 మంది విదేశీ కూలీలు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భారత్, బంగ్లాదేశ్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. ఇంట్లోని పాతబడిన ఏసీలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది.

09:49 - July 13, 2017

శ్రీనగర్ : కాశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు సంచరించస్తున్నారన్న సమచారంతో కాశ్మీర్ లో అదనపు బలగాలు మోహరించారు. లష్కరే తోయిబా అబూ ఇస్మాయిల్ ను పట్టుకునేందుకు వేట మొదలు పెట్టారు. ఈ విషయంపై చర్చించేందుకు ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు మరోసారి సమావేశం కానున్నారు. కుల్గమ్ అటవీప్రాంతంలో ఉగ్రవాదలు దాగున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రోన్ల ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ రైడ్

హైదరాబాద్: పరిశ్రమలశాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేటలో సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంకన్న రంగారెడ్డి- 1, రంగారెడ్డి-2, పటాన్‌చెరులకు పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని అధికారలు వివరించారు. వెంటనే ఆయనను అదుపులోకి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

వివాఖ పరవాడ ఫార్మసిటీలో ప్రమాదం..

విశాఖ: పరవాడ ఫార్మాసిటిలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ వాల్ ఓపెన్ కావడంతో మంటలు చెలరేగి 5గురు కార్మికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

09:41 - July 13, 2017

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం సద్దుమణగలేదు. ఎమ్మెల్యే క్షమాపణతో కలెక్టర్ శాంతి ప్రీతి మీనా శాంతించలేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలపై సీఎం కేసీఆర్ కు వివరించాలని కలెక్టర్ మీనా భావిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ నాయక్ పై పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ మీనా ఫిర్యాదు చేశారు. శంకర్ నాయక్ పై 353, 354 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదు అయిది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళ ఉధృతం

ఖమ్మం: మిర్చి రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. మిర్చి రైతులకు మద్దతుగా నేడు ఖమ్మం నగర దిగ్బంధానికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. నగర దిగ్భంధన కార్యక్రమంలో వామపక్షాలతో పాటు టిడిపి కూడా పాల్గొననుంది.

సద్దుమణగని ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం సద్దుమణగలేదు. ఎమ్మెల్యే క్షమాపణతో కలెక్టర్ శాంతి మీనా శాంతించలేదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగడాలపై సీఎంకు వివరించాలని కలెక్టర్ భావిస్తున్నారు. శంకర్ నాయక్ పై పోలీస్ స్టేషన్ లో కలెక్టర్ మీనా ఫిర్యాదు చేశారు. శంకర్ నాయక్ పై 353, 354 సెక్షన్ కింద కేసు నమోదు అయింది. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై కేసు నమోదు అయిది.
 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. 

ఓఆర్ ఆర్ పై నడిస్తే జైలుకే...!

హైదరాబాద్: ఓఆర్‌ఆర్‌పై ఎవరైనా నడిస్తే ఇక ఇబ్బందులు తప్పవు. ఈ రహదారిపై ప్రమాదకరమైన స్థాయిలో నడుచుకుంటూ వెళ్లే వారిపై సైబరాబాద్ పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఔటర్‌పై నడచుకుంటూ వెళ్లడం డేంజర్ అని చెప్పినా, అవగాహన కల్పించినా పాదచారులు వినడం లేదు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ.. రహదారిపైకి వచ్చి వారి ప్రాణాన్ని పనంగా పెట్టడంతో పాటు వాహనదారుల ప్రాణాలను కూడా గాల్లో కలుపుతుండడం పోలీసులు తీవ్రమైన చర్యగా పరిగణిస్తున్నారు.

నేడు మాజీ రాష్ట్రపతి కలాం మ్యూజియం ప్రారంభం

తిరువనంతపురం : మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియంను తిరువనంతపురంలో ఈ రోజు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. డాక్టర్ కలాం స్మృతి ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ స్పేస్ మ్యూజియం పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి వసతులు గల మ్యూజియం దక్షిణ భారతంలో తెరువడం ఇదే మొదటిసారి. మాజీ రాష్ట్రపతి కలాం వ్యక్తిగత స్మృతులకు నిలయమైన ఈ మ్యూజియంలో చాలా అరుదైన ఫొటోగ్రాఫ్‌లు, రాకెట్లు, ఉప గ్రహాల నమూనాలు తదితరాలు ఉన్నాయి.

డార్జిలింగ్ లో కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాద్ : డార్జిలింగ్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళనలు చేపట్టారు. పర్యాటక కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పంటించారు. 

 

యాదాద్రి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

యాదాద్రి: జిల్లాలోని దండుమల్కాపురంలోని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి కళాశాల వసతిగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నాంపల్లి మండలం దేవత్‌పల్లికి చెందిన బాతుల నరేశ్(18)గా గుర్తించారు. కళాశాల నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

సౌదీ అరేబియాలో అగ్నిప్రమాదం...11 మంది విదేశీ కూలీలు మృతి

సౌదీ అరేబియా : నజ్రాన్ ప్రాంతంలోని ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది విదేశీ కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇంట్లో పాతబడిన ఏసీలో షార్ట్ సర్క్యూట్ తో మంటుల చెలరేగాయి. మృతుల్లో భారత్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉన్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. 

 

గ్యాంగ్ స్టర్ అనందపాల్ సింగ్ ఎన్ కౌంటర్ పై ఆందోళన

రాజస్థాన్ : గ్యాంగ్ స్టర్ అనందపాల్ సింగ్ ఎన్ కౌంటర్ పై నగౌర్ జిల్లా సాన్వాడలో ఓ వర్గం ఆందోళన చేపట్టింది. పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఘర్షణలో పౌరుడు మృతి చెందాడు. 21 మంది పోలీసులకు గాయాలయ్యాయి. గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. 

 

08:50 - July 13, 2017

హైదరాబాద్ :  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసు ప్రవర్తనపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా ఐఏఎస్ అధికారుల సంఘం శాంతించలేదు. ఇవాళ సాయంత్రం ఐఏఎస్ అధికారుల సంఘం సభ్యులు సమావేశం కానున్నారు. శంకర్ నాయక్ తీరుపై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణ చెప్పినా శాంతించని ఐఏఎస్ అధికారులు

హైదరాబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసు ప్రవర్తనపై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినా ఐఏఎస్ అధికారుల సంఘం శాంతించలేదు. ఇవాళ సాయంత్రం ఐఏఎస్ అధికారుల సంఘం సభ్యులు సమావేశం కానున్నారు. శంకర్ నాయక్ తీరుపై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం కేసీఆర్ తో సమావేశం నిర్వహించనున్నారు. 

 

08:33 - July 13, 2017

విజయవాడ : బంగారం దోపిడీ కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ముఠా దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారించారు. 10 మంది సభ్యులు గల ముఠా దోపిడీలో పాల్గొన్నట్లు నిర్ధారణ చేశారు. 28 గంటలపాటు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. దోపిడీ అనంతరం గుంటూరు జిల్లా నుంచి ముఠా పరారైందని తెలిపారు. ప్రత్యేక బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ పోలీసు కమిషనర్ తో దోపిడీ వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:28 - July 13, 2017

కలెక్టర్ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత కాసం సత్యనారాయణ, సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని, మాట్లాడారు. శంకర్ నాయక్ ను పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేను ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:18 - July 13, 2017

టీఎస్ పీఎస్సీ ఆందోళనకర ఎగ్జామ్స్ నిర్వహిస్తుందని డీఎస్సీ అభ్యర్థుల సంఘం నేతలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థుల సంఘం నేతలు మధుసుధన్, శ్రీలత, రాజు రాంనాయక్ పాల్గొని, మాట్లాడారు. పలు రకాల ఎగ్జామ్స్ లను  వెంట వెంటనే నిర్వహించడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్ పీఎస్సీ నియమనిబంధనలు లేవని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

07:59 - July 13, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో పార్టీ కమిటీల నియామకానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే విద్యార్థి సంఘం కమిటీని నియమంచిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌.. త్వరలో  మిగత కమిటీల నియామకాలను పూర్తిచేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.
పార్టీపదవుల భర్తీకి గులాబీబాస్‌ శ్రీకారం
పార్టీ పదవుల బర్తీకి గులాబీబాస్‌ శ్రీకారం చుట్టారు.  అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మూడేళ్లకు  పదవుల భర్తీ జరగుతుండటంతో టీఆర్‌ఎస్‌ నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పార్టీ నియామవళిలో మార్పులకు ప్లీనరీ  ఆమోదం తెలపడంతో కొత్త నిబంధనల ప్రకారం పార్టీ పదవులను  కేసీఆర్‌ భర్తీ చేస్తున్నారు. గతంలో గ్రామ  స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలతో పాటు  పార్టీ పోలిట్ బ్యూరోలు క్రియా శీలకంగా వ్యవహరించేవి. అయితే సవరించిన నిబంధనల ప్రకారం గ్రామ, మండలస్థాయిలకు అంతగా ప్రాధ్యాన్యత ఉండదంటున్నారు. జిల్లాస్థాయిలో భర్తీకానున్న పదవులకు మాత్రం అన్నిబాధ్యతలు అప్పగిస్తారని  సమాచారం.  
పార్టీ పదవులపై గులాబీ నేతల ఆశలు 
అటు నేతలు కూడా  పార్టీ పదవులపై భారీగా ఆశలు పెంచుకున్నారు. నామినేటెడ్ పదవులు దక్కని వారు  పార్టీ పదవులు  దక్కుతాయన్న ధీమాతో ఉన్నారు. మూడేళ్లుగా ఎప్పటికపుడు వాయిదా పడుతున్న పార్టీపదవులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు మొదలు పెట్టడంతో గులాబీనేతల్లో హడావిడి మొదలయింది. పెద్దల దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారు.  ఇప్పటికే  జిల్లా స్థాయిలో మొత్తం 31జిల్లాల్లో  పార్టీవిద్యార్థి విభాగం నేతల నియామకాలను కేసీఆర్‌  పూర్తిచేశారు. 
నియోజకవర్గంలో ఎమ్మెల్యేకే అన్ని బాధ్యతలు 
అయితే నియోజకవర్గాల్లో మాత్రం  పార్టీ సమన్వయ కమిటీ పేరుతో స్థానిక శాసనసభ్యుడికే అధికారాలు కట్టబెట్టేలా గులాబీఅధినేత నిర్ణయించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల సమన్వయ కమిటీల్లో  ఎంపీటీసీలు, జడ్పీటీసిలు, ఎంపీలతోపాటు ఆయా  నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికీ  స్థానం  దక్కనుంది. అటు జిల్లా స్థాయిలో సమన్వయ కర్తలుగా ఇద్దరినే పార్టీ నియమించనున్నటు సమాచారం.  రాష్ట్ర కమిటీతో పాటు పోలిట్ బ్యూరో పదవులకు నేతలను ఎంపిక చేయాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోపు పార్టీ కమిటీలకు తుదిరూపు వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు.

 

07:52 - July 13, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో నాన్‌బోర్డర్స్ ఏరివేతకు రంగం సిద్ధం చేసింది టి సర్కార్. వర్శిటీలో తిష్టవేసిన  వేలాదిమంది నాన్‌బోర్డర్లుకు మూటాముల్లె సర్దుకోవాలని హుకుం జారీచేశారు ఓయూఅధికారులు.  ఇప్పటికే కొన్ని హాస్టల్స్ లో మంచినీటి సరఫరా ఆపేసారు. దీంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే కొనసాగితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటూ విద్యార్ధులు హెచ్చరిస్తున్నారు. 
ఖాళీ చేయిండానికి అధికారులు కసరత్తు 
ఉస్మానియా యూనివర్శిటీలో నాన్‌బోర్డర్ల ఏరివేతకు బెల్‌ మోగించింది తెలంగాణా ప్రభుత్వం. చదువులు పూర్తయినా హాస్టల్స్ ను వదలని వారిని మూడురోజుల్లోగా ఖాళీ చేయిండానికి ఓయూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలు హాస్టల్స్‌కు నీటిసరఫరా నిలిపివేసిన అధికారులు..విద్యుత్‌ ను కూడా కట్‌చేస్తామంటున్నారు. 
అధికారులపై నాన్‌బోర్డర్స్‌ మండిపాటు 
ఓయూ అధికారుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఓవైపు పోటీపరీక్షలు ముంచుకొస్తుండగా.. ఇలా అర్ధాంతరంగా ఖాళీచేయలనడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 23న టెట్ ఎగ్జామ్, వచ్చేనెల 2, 3 తేదిల్లో గురుకులాల పరీక్షలున్న నేపథ్యంలో విద్యార్ధులంతా ఎగ్జామ్స్‌  ప్రిపరేషన్ లో నిమగ్నమయివున్నారు. ఈ  సమయంలో వర్శిటీ అనాలోచిత నిర్ణయం తీసుకుందంటూ విద్యార్ధులు మండిపడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం పూర్తవకుండానే తమను హాస్టల్స్ ఖాళీ చేయించడం ఎంతవరకు సమంజసమంటూన్నారు. 
లక్ష ఉద్యోగాలపై నోరువిప్పకుండా సర్కార్‌ బ్లాక్‌మెయిల్‌ ..! 
ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీఇచ్చిన లక్షఉద్యోగాలపై ప్రశ్నిస్తున్నందునే తమపై ఇలా కక్షగట్టారని విద్యార్థులు వాపోతున్నారు. అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తయినా అరకొర నోటిఫికేషన్లతో కాలయాపన చేస్తున్నారని స్టూడెంట్స్‌ మండిపడుతున్నారు. లక్ష ఉద్యోగాలపై ఎక్కడ  ఉద్యామాలు లేవనెత్తుతారో అని.... విద్యార్ధుల నోరు మూయించేందుకు నాన్‌బోర్డర్లను ఖాళీ చేయించడం అనే బ్లాక్ మెయిలింగ్ కి దిగజారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే  బోర్డర్స్ కి సరైన సౌకర్యాలు కల్పించడంతోపాటు.. త్వరలో వర్సిటీలో జాతీయ సైన్స్‌కాంగ్రెస్‌ జరగనున్న నేపథ్యంలో హాస్టల్‌ గదులను రిపేర్‌ చేయించాలని నిర్ణయించినట్టు ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి చెబుతున్నారు. అందుకే నాన్‌బోర్డర్లను వెంటనే ఖాళీ చేయిచాలని యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయించిదని రిజిస్ట్రార్‌ అంటున్నారు.    
పోటీపరీక్షలున్నాయి..మధ్యలో ఇబ్బంది పెట్టొద్దు
మరోవైపు తమ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని నాన్‌బోర్డర్స్‌ కోరుతున్నారు. ఇప్పటికే పోటీపరీక్షల ప్రిపరేషన్‌లో మునిగిఉన్నందున మధ్యలో ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నారు.  పోటీపరీక్షలు ముగిసిన వెంటనే తామే వెళ్లిపోతామని చెబుతున్నారు. బలవంతంగా ఉన్నఫళంగా రోడ్డుమీదకు నెట్టాలని చూస్తే.. పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. అటు అధికారులు హుకుం.. ఇటు విద్యార్థుల ఆగ్రహం.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

 

07:45 - July 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో డొంక కదులుతోంది... ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరో ఇద్దరిని చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. అయితే.. అరెస్టైనవారిలో నాసా సైంటిస్ట్‌ ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మరోవైపు డ్రగ్స్‌తో సంబంధాలున్న టాలీవుడ్‌ ప్రముఖులకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. 
డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టుల పర్వం 
భాగ్యనగరాన్ని గడగడలాడిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 12కు చేరింది. అరెస్టైన వారిలో నాసాకు చెందిన శాస్త్రవేత్త అనీష్‌, పారిశ్రామికవేత్త కుమారుడు రితుల్‌ అగర్వాల్‌లు ఉన్నారు. వీరి వద్ద నుంచి 20 యూనిట్ల ఎల్‌ఎస్‌డి డ్రగ్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. 
ఎక్సైజ్‌ అధికారులు విచారణ 
డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టైన వారిని విచారిస్తుంటే డ్రగ్స్‌ మాఫియా సామ్రాజ్య డొంక కదులుతోంది. నగరంలోని అనేకమందికి డ్రగ్స్‌తో సంబంధాలున్నట్లు బయటపడుతోంది. నిందితుల కాల్‌డేటా ఆధారంగా ఎక్సైజ్‌ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. డ్రగ్స్‌కు ఎవరెవరు అడిక్ట్‌ అయ్యారు.... ఎక్కడి నుంచి వస్తుంది... ఎలా సరఫరా చేస్తారనే తదితర అంశాలు కూడా విచారణలో బయటపడుతున్నాయి. పట్టుబడ్డ నిందితుల మొబైల్‌ డేటా ఆధారంగా 1,275 మంది ప్రముఖులకు డ్రగ్స్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడ్డాయి. 
డ్రగ్స్‌తో సినీ ప్రముఖులకు సంబంధాలు
డ్రగ్స్‌తో టాలీవుడ్‌కు చెందిన నిర్మాతలు, నటులకు సంబంధాలున్నాయనే వార్తలు మొదటినుంచి వినినిస్తున్నాయి. అయితే.. తాజాగా అది కన్‌ఫామ్‌ కావడంతో వారిని విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 10 మందికి నోటీసులు ఇచ్చారు. వీరిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్‌ మాస్టర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరు రోజుల్లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ రంగానికి చెందినవారికి సంబంధాలున్నాయని తేలడంతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సీరియస్‌ అయ్యింది. కొంతమంది డ్రగ్స్‌ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని పలువురంటున్నారు. ఇకనుంచి ఇండస్ట్రీలో డ్రగ్స్‌ తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినీ పరిశ్రమ తరపున ప్రచార కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. ఇక డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్‌ వాడకం వల్ల వచ్చే అనర్ధాలను వివరిస్తున్నారు. 
చుక్కల డ్రాప్స్‌ రూపంలో డ్రగ్స్ లభ్యం 
ఇక అధికారులు ఇప్పటివరకు పట్టుకున్న ఎల్‌ఎస్‌డి, ఎండీఎంఏ, గంజాయి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుంది. ఎల్‌ఎస్‌డి అనే డ్రగ్‌ మిల్లీ యూనిట్‌ పేపర్‌ రూపంలో చుక్కల డ్రాప్స్‌ రూపంలో లభ్యమవుతుందని విచారణలో నిందితులు వెల్లడించారు. ఈ చుక్కల మందు వేసుకున్న వారు 12 నుంచి 14 గంటల వరకు గాల్లో తేలిపోతారు. ఎవరేమీ చెప్పినా పట్టించుకోలేరు. ఇక ఎల్‌ఎస్‌డి, ఎండిఎంఏ  డ్రగ్‌కు గంజాయి కలిపితే అధిక మొత్తంలో మత్తు ఆవహిస్తుందని తాజా దర్యాప్తులో బయటపడింది. అయితే... ఈ వ్యవహారంలో ఇంకెన్ని పెద్ద తలకాయలు ఉన్నాయోనన్న సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. 

బంగారం దోపిడీ కేసులో దర్యాప్తు వేగవంతం

విజయవాడ : బంగారం దోపిడీ కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన ముఠా దోపిడీకి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. 10 మంది సభ్యులు గల ముఠా దోపిడీలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయింది. 28 గంటలపాటు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. దోపిడీ అంనతరం గుంటూరు జిల్లా నుంచి ముఠా పరారైంది. ప్రత్యేక బలగాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ పోలీసు కమిషనర్ తో దోపిడీ వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 

 

అండర్ గ్రౌండ్ టెన్నెల్ ప్యాకేజీలో యువకుడి మృతి

పెద్దపల్లి : ధర్మారం మండలం సాయంపేటలో ప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ టెన్నెల్ ప్యాకేజీ నం3లో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల్ అనే యువకుడు మృతి చెందాడు. మృతదేహంతో బంధువులు అందోళన చేపట్టారు. 

వింబుల్డన్ టోర్నీలో నేడు మహిళల సెమీస్ మ్యాచ్ లు

హైదరాబాద్ : వింబుల్డన్ టోర్నీలో భాగంగా నేడు మహిళల సెమీస్ మ్యాచ్ లు జరగనున్నాయి. ముగురుజాతో వర్సెస్ రిబిరికోవా మ్యాచ్ జరుగనుంది. వీనస్ విలియమ్స్ తో కొంటా తలపడనుంది.
 

07:20 - July 13, 2017

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. అసెంబ్లీకి వజ్రాకారం, హైకోర్టుకు బౌద్ధ స్తూపాకార డిజైన్లను ఖరారు చేసింది. గతంలో అసెంబ్లీ కోసం సిద్ధం చేసిన డిజైన్ రూపంలో హైకోర్టు నిర్మాణం చేయాలని చంద్రబాబు సూచించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్‌ జస్టిస్‌కు చూపించాక తుది ఆకృతులను రెండు రోజుల్లో సిద్ధం చేయాలన్నారు. 
అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు కీలక మార్పులు సూచించిన సీఎం
ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లో కీలక మార్పులను సీఎం చంద్రబాబు సూచించారు. హైకోర్టు కోసం సిద్ధం చేసిన డైమండ్‌ ఆకృతిని అసెంబ్లీ కోసం...అలాగే శాసనసభ భవనానికి సిద్ధం చేసిన బుద్ధ స్తూపం ఆకృతిని హైకోర్టు కోసం మార్చాలని ఫోస్టర్‌ బృందానికి ప్రతిపాదించారు. మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్‌ జస్టిస్‌కు చూపించాక తుది ఆకృతులను రెండు రోజుల్లో సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఏపీ కోల్పోయిన కోహినూర్‌ వజ్రాన్ని శాసనసభ భవనం రూపంలో తిరిగి తెచ్చుకున్నామనే భావన ప్రజల్లో వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 
నాలుగు అంత‌స్తుల్లో హైకోర్టు నిర్మాణం
హైకోర్టు నాలుగు అంతస్థులుగా నిర్మించనున్నారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిజిస్ట్రార్లు, ఇతర పరిపాలన వ్యవహారాల గదులు, మొదటి అంతస్తులో లైబ్రరీ, మీటింగ్ హాలు కోసం ఏర్పాట్లు ఉంటాయి. ఇక రెండో అంతస్తులో 16 కోర్టులు, ఆయా కోర్టు జడ్జీలు ఛాంబర్‌లు ఉండేలా ప్రణాళిక తయారు చేశారు. మూడో అంత‌స్తులో 20 కోర్టులు, నాలుగో ఫ్లోర్‌లో చీఫ్ జ‌స్టిస్ కోర్టు,చాంబర్లు,జ‌డ్జిల సమావేశ మందిరాలు ఉండేలా డిజైన్ చేసారు.
కోహినూర్ వజ్రం ఆకృతిలో అసెంబ్లీ భవనం 
కోహినూర్ వజ్రం ఆకృతిలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. మొత్తం 6 అంత‌స్తుల్లో శాసనసభ నిర్మాణం ఉంటుంది...గ్రౌండ్ ఫ్లోర్‌లో అసెంబ్లీ,మండ‌లి,కామ‌న్ యుటిలిటీ హాల్.. మ‌ధ్యలో పబ్లిక్ స్పేస్ ఉంటుంది...మొద‌టి,రెండో అంత‌స్తులో స్పీక‌ర్,మండ‌లి ఛైర్మన్‌, సీఎం,ప్రతిపక్షనేత‌,మంత్రుల చాంబ‌ర్లు ఉండేలా ప్రణాళిక తయారు చేశారు. మూడో ఫ్లోర్‌లో లైబ్రరీ,మీటింగ్ హాళ్లు...నాలుగు,ఐదు,ఆరో అంతస్థుల్లో ప‌రిపాల‌నా వ్యవహారాలకు సంబంధించిన చాంబ‌ర్లు ఉంటాయి.
సెప్టెంబ‌ర్ 15 నాటికి ఇంటీరియ‌ర్, తుది డిజైన్లు సిద్ధం 
శుక్రవారం మ‌రోసారి నార్మన్‌ ఫోస్టర్స్‌ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు స‌మావేశం కానున్నారు. అదే రోజు మాస్టర్‌ ప్లాన్‌పై మ‌రోసారి స‌మీక్షించనున్నారు. అటు స‌చివాల‌యం డిజైన్లపైనా గురువారం జీఏడీ అధికారుల‌తో ఫోస్టర్స్ ప్రతినిధులు భేటీ కానున్నారు. సెప్టెంబ‌ర్ 15 నాటికి ఇంటీరియ‌ర్ స‌హా తుది డిజైన్లు సిద్దం కానున్నాయని.. ఆ వెంట‌నే నిర్మాణాలు ప్రారంభించాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు.

 

07:16 - July 13, 2017

హైదరాబాద్ : ప‌ర్యావ‌ర‌ణం అంటారు.. ప‌చ్చని మొక్కలు నాటాలంటారు.  ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాలంటూ  ప్రజ‌ల‌కు  నీతులు చెబుతుంటారు.  తాము మాత్రం అచ‌రించ‌రు.   పర్యావరణానికి చేటుతెస్తున్నా.. ఫ్లెక్సీలు, బ్యానర్లపై అధికారపార్టీ నేతలకు మోజు తగ్గడంలేదు. హైద‌రాబాద్‌లో జరుగుతున్న హరితహారంలో నేతల హడావిడిపై  టెన్‌టీవీ ఫోకస్‌ ..        ఫ్లెక్సీలు .. ఫోటోలు.. ఫోజులు..
ఫ్లెక్సీలు .. ఫోటోలు.. ఫోజులు.. ప్రచార ఆర్భాటంగా హరితహారం..సీఎం వద్దన్నా భారీ ఎత్తున్న ఫ్లెక్సీల ఏర్పాటు ..రోడ్లన్నీ బ్యానర్లతో నింపేస్తున్న లీడర్లు ..టార్గెట్లతో అధికారులకు సంకటంగా  హరితహారం.. హరిత హారంలో చిన్నారుల విలాపం.. నేతలు వచ్చే వరకు ఎండలో మాడిపోతున్న చిన్నారులు.. 
హీరోలను తలపిస్తున్న అధికార పార్టీ నేతలు 
అధికారపార్టీ నేతలు తెరపై హీరోలను తలపిస్తున్నారు.. ఆ మాటకొస్తే వారికంటే ఎక్కువగానే కెమెరాలముందు హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో రాష్ట్ర నేతల నుంచి గల్లీలీడర్ల వరకు ఫోటోలకు ఫోజులివ్వడానికి తెగ పోటీపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.  జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన హరితహారం కార్యక్రమం నాయకుల ప్రచార ఆర్భాటంగా మారిపోయింది. పెద్దల మెప్పు కోసం గల్లిలీడర్లు, కార్పొరేటర్లు తెగ ఆరాటపడుతున్నారు. నిలువెత్తు కటౌట్లు,  బ్యానర్లతో రోడ్లన్నీ నింపేస్తున్నారు. 
ఫోటోలతో కొలువుదీరిన బ్యానర్లు
ఇదిగో ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతురామ్మోహన్‌ ఫోటోలతో కొలువుదీరిన ఈ బ్యానర్లను ఏర్పాటు చేసింది చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి. ఓవైపు  బ్యానర్లు కడితే  కేసులు కూడా పెట్టాలని సీఎంతోపాటు  మంత్రులు చెబుతుంటే.. కిందిస్థాయి నాయకులు మాత్రం.. ఇలా బ్యానర్లు కట్టేసి.. ప్రజల కార్యక్రమాన్ని కాస్తా.. అధికారపార్టీ నేతల హడావిడిగా మార్చేశారు. మీడియా కెమెరాలు చూడగానే.. మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్న ఈకార్పొరేటర్‌ .. పర్యావరణానికి చేటుతెస్తున్న ఫ్లెక్లీలు, బ్యానర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వందమీటర్ల పరిధిలో 25 ఫ్లెక్సీలు కట్టేశారు. దీనిపై మీడియా ప్రశ్నించడంతో.. కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డిపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ సీరియస్‌అయ్యారు.  దీంతో బల్దియాసిబ్బంది అప్పటికపుడే బ్యానర్లన్నీ తొలిగించారు. 
ప్రజల భాగస్వామ్యం ప్రశ్నార్థకం
ఇక ఇంత హడావిడిగా సాగుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎంత అనే ప్రశ్నకు .. సమాధానం ప్రశ్నార్థంగా మారింది. కార్యక్రమం అంతా అధికారపార్టీ నేతలు. అధికారుల హడావిడే కనిపిస్తోంది. మొక్కలు నాటేందుకు  టార్గెట్లు పెడుతుండటంతో అధికారులకు సంకటంగా మారింది. దీంతో కార్యక్రమానికి జనాన్ని తీకసుకువచ్చేందుకు తంటాలు పడుతున్నారు. వీరికి బకరాలుగా స్కూల్‌ పిల్లలు మాత్రం దొరుకుతున్నారు. నాయకులు ఎంచక్కగా ఇస్త్రీకొట్టిన తెల్లచొక్కాలు వేసుకుని  తీరిగ్గా కార్యక్రమానికి వచ్చేవరకు .. ఈ చిన్నారులను గంటలకొద్దీ ఎండలో మాడ్చేస్తున్నారు. చైతన్యపురిలో జరిగిన కార్యక్రమంలో   మేయర్‌బొంతురామ్మోహన్‌  వచ్చేవరకు రెండుగంటల పాటు ఈపసివాళ్లను ఎండలో నిలబెట్టారు.  ఆతర్వాత మేయర్‌ వచ్చారు.. షరామామూలుగానే  మొక్కలు నాటడం.. పోటోలకు ఫోజులివ్వడానికి లీడర్లు పోటీపడ్డం.. అంతా.. హడావిడే.. ప్రచారమే అంటున్నారు హైదరాబాద్‌ పబ్లిక్‌. ఓవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ పట్టణాలను పచ్చదనంతో నింపేసి.. లండన్‌నగరాన్ని తలదన్నేలా చేస్తామంటుంటే.. ఇటు అధికారపార్టీ నాయకులు మాత్రం.. ఫోటోలకు ఫోజులివ్వడానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

07:06 - July 13, 2017

మహబూబాబాద్ : కావాలని చేశాడో... పొరపాటు జరిగిందో తెలియదు కానీ... కలెక్టర్‌తో ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. విషయం సీఎం కేసీఆర్‌ తెలవడంతో.. వివాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేను ఆదేశించారు. తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే.. కలెక్టర్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కలెక్టర్‌ ప్రీతిమీనా, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మధ్య ఏర్పడిన వివాదం సీఎం కేసీఆర్‌ జోక్యంతో సద్దుమణిగింది. భేషరతుగా కలెక్టర్‌కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. 
శంకర్‌నాయక్‌ ప్రవర్తించిన తీరు వివాదాస్పదం 
మహబూబాబాద్‌ మండలంలో మూడో విడత హరితహారం కార్యక్రమంలో శంకర్‌నాయక్‌ ప్రవర్తించిన తీరు వివాదస్పదమైంది. మొక్కలు నాటే కార్యక్రమంలో శంకర్‌నాయక్‌ తాకడంతో ప్రీతిమీనా మనస్తాపానికి గురయ్యారు. వెంటనే జేసీ, ఎస్పీ, ఆర్డీవోలతో భేటీ అయిన ఆమె.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఉద్యోగులతో తెలియడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించిన ఉద్యోగులు.. శంకర్‌నాయక్‌ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారాన్ని సీఎస్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. 
శంకర్ నాయక్ పై కేసీఆర్ ఆగ్రహం 
ఇక ఈ వ్యవహారం కేసీఆర్‌కు తెలియడంతో..  ఆయన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ప్రవర్తన సరిగాలేదని.. తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానని శంకర్‌నాయక్‌ను  హెచ్చరించారు. జరిగిన ఘటనపై బాధను, ఆవేదనను వ్యక్తం చేసిన కేసీఆర్‌.. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని, ఎంపీ సీతారాం నాయక్‌కు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. 
కలెక్టర్‌ కు క్షమాపణ చెప్పిన శంకర్ నాయక్  
సీఎం సూచనలతో రంగంలోకి దిగిన మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలు శంకర్‌నాయక్‌ను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి ప్రీతిమీనాకు క్షమాపణ చెప్పించారు. కలెక్టర్‌ తనకు సోదరిలాంటిదని, పొరపాటు జరిగితే క్షమించాలని కోరారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడంతో ఉద్యోగులంతా ఆందోళనలు విరమించాలని ఉన్నతాధికారులు కోరారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకోవడంతో.. ఎమ్మెల్యే, కలెక్టర్‌ మధ్య ఏర్పడిన వివాదం సద్దుమణిగింది. 

 

07:02 - July 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొక్కలు నాటి.. హరితహారం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశారు. 40 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. 
పండగలా హరితహారం కార్యక్రమం  
రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం పండగలా జరుగుతోంది. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌.. కూకట్‌పల్లిలోని  పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. బాగ్‌ అంబర్‌పేట్‌లోని అడ్వాన్స్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ మొక్కలు నాటి... రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.
మొక్కలు నాటిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌    
అలాగే ముసారాం బాగ్‌ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌  మొక్కలు నాటారు.  గ్రేటర్‌ పరిధిలోని ఈస్ట్‌, సౌత్‌ జోన్‌ ప్రాంతాలలో నిర్వహించిన హరితహారం కార్యక్రమాలలోనూ ఆయన పాల్గొన్నారు. లాలాపేటలోని జయశంకర్‌ స్టేడియంలో మంత్రి పద్మారావు మొక్కలు నాటి.. విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.  
మొక్కలు నాటిన మంత్రులు  
కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హరీష్‌రావు మొక్కలు నాటారు. జిల్లాలో కోటి 57 లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ 20 చొప్పున మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అలాటే ఖమ్మం జిల్లా.. రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలో  జరిగిన హరితహారంలో మంత్రి లక్ష్మారెడ్డి, కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ పాల్గొని మొక్కలు నాటారు.   
మొక్కలు నాటిన అనురాగ్‌ శర్మ  
రంగారెడ్డి జిల్లా మంచాల పీఎస్‌లో డీజీపీ అనురాగ్‌ శర్మ మొక్కలు నాటారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబాబాద్‌ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని గిరిజన శాఖ టూరిజం శాఖ మంత్రి అజ్మీర్‌ చందూల్‌ ప్రారంభించారు. ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మొక్కలు నాటారు. 
అచ్చంపేటలో భారీ ర్యాలీ 
హరితహారంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వరీ కాలనీలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మొక్కలు నాటారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ అవగాహన ర్యాలీ నిర్వహించి.. స్థానిక పంచాయతీ రాజ్‌ కార్యాలయ ఆవరణలో 400 మొక్కలు నాటారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌ మండలం.. అనజీపురంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ మొక్కలు నాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అటవీ శాఖ ఆధ్వర్యంలో హరితహారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. నిర్మల్‌ జిల్లా భైంసా డివిజన్‌లోనూ పెద్దఎత్తున హరితహార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విట్టల్‌రెడ్డి.. పలు గ్రామాలలో మొక్కలు నాటారు. కడెం మండల కేంద్రంలోని హైస్కూల్లో ఖాణాపూర్‌ ఎమ్మెల్యే రేఖనాయక్‌ మొక్కలు నాటారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా .. ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదేలు.. మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హరితహారం కార్యక్రమం 
ఢిల్లీ తెలంగాణ భవన్‌లోనూ హరితహార కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌ శర్మ, తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేతు షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి  భాగమయ్యారు. 

 

నేడు ఏపీలో టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు

హైదరాబాద్ : ఏపీలో నేడు పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాస్ విడుదల చేయనున్నారు. 

నేడు కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

కర్నూలు : నేడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. నంద్యాల, పాణ్యం, ఓర్వకల్లు, మండలాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొననున్నారు. 
 

నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల భేటీ

అమరావతి : నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. అధికారుల చాంబర్లు, కార్యాలయాల ఏర్పాటుపై చర్చించనున్నారు. 

నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల భేటీ

అమరావతి : నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. అధికారుల చాంబర్లు, కార్యాలయాల ఏర్పాటుపై చర్చించనున్నారు. 

 

నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల భేటీ

అమరావతి : నేడు జేఏడీ అధికారులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల సమావేశం జరుగనుంది. అధికారుల చాంబర్లు, కార్యాలయాల ఏర్పాటుపై చర్చించనున్నారు. 

 

Don't Miss