Activities calendar

14 July 2017

21:51 - July 14, 2017

పాట్నా : బిహార్‌లో నితీష్‌-లాలుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో వాటిని చల్లార్చడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌, ఆర్జేడి చీఫ్‌ లాలూతో మాట్లాడారు. కనీసం వచ్చే పార్లమెంట్‌ సమావేశాలవరకైనా కలిసి పనిచేయాలని ఇరువురు నేతలకు సోనియా సూచించినట్లు సమాచారం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆర్జేడీతో అమీతుమీకి నితీశ్ కుమార్ వర్గం సిద్ధమైంది. కేబినెట్లో తానో, తేజస్వి యాదవ్ ఎవరో ఒకరే ఉండాలని ఆయన తాజాగా డిమాండ్ చేశారు. నితీశ్ ప్రకటనతో బీహార్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. లాలూ కుటుంబంపై సిబిఐ దాడుల నేపథ్యంలో ఆర్జేడీ-జేడీయూ మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోంది. ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై అవినీతి కేసు నమోదు కావడంతో ఆయన ప్రభుత్వంలో ఉండాలో లేదో తేల్చుకోవాలని సిఎం నితీష్‌కుమార్‌ 4 రోజుల గడువు ఇచ్చారు. తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం రాజకీయ కుట్రగా తేజస్వీ పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్‌ రాజీనామా చేసే ప్రసక్తే లేదని లాలూ స్పష్టం చేశారు.

21:50 - July 14, 2017

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంముగిసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్ అరుణ్‌జైట్లీ, అజిత్‌ దోవల్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విపక్షాల తరపును సీపీఎం నేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎస్పీ నేత ములాయం, జేడీయూ నేత శరద్ యాదవ్, శరద్‌ పవార్‌, తదితర పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడితో పాటు సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌లో భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని విపక్షాలకు వివరించినట్లు సమాచారం. వచ్చే సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాలతో కేంద్ర ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

21:49 - July 14, 2017

కర్నూలు : కర్నూలు ప్రభుత్వ అతిధి గృహంలో రాయలసీమ ఉద్యమకారులకు.. మంత్రి లోకేశ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. లోకేశ్ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుండగా రాయలసీమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఉద్యమకారులు మంత్రి లోకేశ్‌ను నిలదీశారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు నెలకొల్పడంలో...ఉద్యోగాల నియామకంలో సీమను పట్టించుకోవట్లేదని ఆరోపించారు. లోకేశ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి వారి సమస్యలపై దృష్టి పెడతామని లోకేశ్ హామీ ఇవ్వడంతో ఉద్యమకారులు శాంతించారు. 

21:48 - July 14, 2017

గుంటూరు : అమరావతి..! ఆంధ్రుల ఒకప్పటి అద్భుత రాజధాని..!!అమరావతి..! నేటి నవ్యాంధ్రకూ నవ రాజధాని..!ధాన్యకటకంగా నాడు విరాజిల్లిన బౌద్ధక్షేత్రం..విశ్వవిఖ్యాత నిర్మాణాలకు వర్తమాన సంకల్పం..ఆంధ్రుల తొలి రాజధాని అమరావతిని తలపించేలా.. అలనాటి స్మృతులు చెక్కుచెదరకుండా... నవ్యాంధ్ర రాజధాని నగర నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ తుది ఆకృతిని పూర్తి చేయాలని, సెప్టెంబర్‌ 30న విజయదశమికి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆగస్టు 30 నాటికి ఉన్నత న్యాయస్థానం ఆకృతిని సిద్ధం చేసి... అక్టోబర్‌ 15న నిర్మాణ పనులు మొదలు పెట్టాలనీ ప్రభుత్వం సంకల్పించుకుంది.

కోహినూర్‌ వజ్రా ఆకృతిలో శాసనసభ
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో.. నాటి తరం కోల్పోయిన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి దక్కించుకున్నామన్న భావన ప్రజల్లో కలిగేలా.. శాసనసభ భవన ఆకృతిని తీర్చిదిద్దారు. కోహినూర్‌ వజ్రాన్ని పోలిన ఆకృతిలో శాసనసభ భవన నిర్మాణం... బౌద్ధారామం స్ఫురించేలా బౌద్ధ స్తూపాకృతిలో అత్యున్నత న్యాయస్థాన భవనాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటే సచివాలయ భవనాన్ని 10 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. తొమ్మిది వందల ఎకరాల్లో పరిపాలన నగరం.. 450 ఎకరాల్లో న్యాయ నగరాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వం సంకల్పం. అమరావతి నగరానికి స్వాగత ఆకర్షణగా ఓవైపు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని, మరోవైపు అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక రాజధానిలో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు 50 శాతం పచ్చదనం, నీరు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రాజధానిని ఒకేచోటి నుంచి వీక్షించేలా నగరం మధ్యలో 500 మీటర్ల ఎత్తులో భారీ టవర్‌ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక భవంతులు, నిర్మాణాలు చేపడుతున్నారు.

సెప్టెంబర్‌ 15 నాటికి సిద్ధం
సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ఆకృతి సెప్టెంబర్‌ 15 నాటికి సిద్ధం చేసి, నవంబర్‌ మొదటివారంలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఒకే క్యాంపస్‌గా, 10 అంతస్తుల శాశ్వత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలను నిర్మించనున్నారు. 40 లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలుంటాయి. ఏడాదిన్నరలో శాసనసభ, ఉన్నత న్యాయస్థానం, సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. తెలుగువారి సగర్వ చిహ్నంగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. శాసనసభ, న్యాయస్థానం, సచివాలయం తుది ఆకృతులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలనీ చంద్రబాబు యోచిస్తున్నారు. మరి ప్రభుత్వ సంకల్పం ప్రకారం, వచ్చే రెండేళ్లలో ఈ నిర్మాణాలన్నీ పూర్తవుతాయా..? లేక యథావిధిగా జాప్యం అనివార్యమవుతుందా..? వేచి చూడాలి. 

21:47 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల నోటీలసుల విషయంలో నటులు స్పందించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

21:45 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో తగిలిన డ్రగ్స్‌ తీగను పట్టి లాగితే.. సినిమా పరిశ్రమలో డొంక కదులుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ అందించిన సమాచారం ఆధారంగా.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇప్పటికే డజనుకు పైగా సినీరంగ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యాం కె.నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని, సెక్షన్‌ 67 కింద జారీ చేసిన ఆ నోటీసుల్లో సూచించారు.

50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు నోటీసుల జారీ ప్రక్రియను ఇకపై కూడా కొనసాగించాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ణయించింది. డ్రగ్స్‌ వ్యవహారంలో సుమారు 50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర ఉందని డైరెక్టరేట్‌ అనుమానిస్తోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన వారిని.. సిట్‌ ఆఫీసులోనే విచారిస్తామని.. హీరోయిన్లను మాత్రం వారు కోరిన చోట విచారిస్తామని, డైరెక్టరేట్‌ ప్రకటించింది. అయితే నోటీసులు అందుకున్న వారందరూ డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? లేదా.. వాటి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది. వీటన్నింటిని లోతుగా విచారించేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రగ్స్‌ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పియూష్ అనే సివిల్‌ ఇంజనీర్‌తో పాటు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఎల్‌ఎస్‌డీ కేసులో 11 మందిని, కొకైన్‌ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

కొందరికి అందని నోటీసులు
అయితే టాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారందరికి నోటీసులు అందలేదని సమాచారం. ఇందులో బడా నిర్మాతలు, దర్శకుల కొడుకులను తప్పించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కొంతమందికే నోటీసులిచ్చి ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్‌ మాఫియా గుట్టును బట్టబయలు చేయడంలో ముక్కుసూటిగా వెళుతున్న..ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అనూహ్యంగా సెలవుపై వెళుతుండడం..పలు అనుమానాలకు తావిస్తోంది.

సబర్వాల్ పై ఒత్తిళ్లు
పాఠశాలల్లో డ్రగ్స్‌ విక్రయంపై మొదలైన విచారణ.. సినీ పరిశ్రమ వరకూ సాగింది. ఈ క్రమంలో.. ప్రభుత్వంపై సినీ ప్రముఖులు ఒత్తిడిని పెంచారని, అందుకే, ప్రభుత్వ పెద్ద ఒకరు అకున్‌ సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పది రోజుల సెలవులో వెళుతున్నారని తెలుస్తోంది. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న మేరకే సెలవు మంజూరైందని అకున్‌ చెబుతున్నారు. మొత్తానికి రకరకాల మలుపులతో.. డ్రగ్స్‌ వ్యవహారం.. సినిమా ఫక్కీలో రసవత్తరంగా సాగుతోంది. ఈ డ్రగ్స్‌ సినిమాకు క్లైమాక్స్‌ మరియు ముక్తాయింపు ఎలా ఏంటాయోనని సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

రెండో జాబితా సిద్ధం

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రెండో జాబితా సిద్ధం చేశారు. డ్రగ్స్ కేసులో మరికొన్ని నోటీసులకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. రెండోమ జాబితాలో సినీ ప్రముఖులు పేర్లు ఉండే అవకాశం ఉంది. 

20:34 - July 14, 2017

ఉన్నంత కాలం బాగానే ఉంది.. పొమ్మనేటప్పుడే అడ్డా మీద కూలీలకంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఐటి రంగం భవితేమిటి? మెడపై లే ఆఫ్ కత్తి వేలాడుతుంటే అంతులేని ఒత్తిడితో టెకీలు ఏం కాబోతున్నారు? తెల్లారితో ఉద్యోగం ఉంటుందో లేదో, ఏ నిమిషం హెచ్చార్ నుండి మెయిల్ వస్తుందో అర్ధం కాని అయోమయం ఒక్కసారిగా లక్షలాది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను తీవ్రమైన అభద్రతలో పడేస్తోంది. ఈ పరిస్తితికి కారణం ఎవరు? దీనికి పరిష్కారం ఏమిటి? లేబర్ లాస్ ఉండవు..గొడ్డు చాకిరీ చేయాలి. రాత్రింబవళ్లు కష్టపడాలి.. అవసరమైతే వీకెండ్ కూడా త్యాగం చేయాలి. కంపెనీకి ఆదాయం ఎప్పటికప్పుడు పెంచాలి. కానీ, అలాంటి ఉద్యోగి రేపటి గురించి భయంలో పడితే, ఈఎమ్మైలు ఎలా కట్టాలి, అసలు ఇంకో ఉద్యోగం దొరుకుతుందా అనే ప్రశ్నలో పడితే... అంతకంటే నరకం ఉంటుందా? లాభాలు తగ్గకుండా చూసుకోటానికి కాస్ట్ కంట్రోలింగ్ అంటూ కంపెనీలు ఆడే గేమ్ లో బలవుతున్నారు ఐటి ఉద్యోగులు.. కారణాలేంటి? సాఫ్ట్ వేర్ రంగం ఎందుకు సంక్షోభంలో పడుతోంది? అమెరికాలో ట్రంప్‌ గెలవటమే కారణమా? ఆటోమేషన్‌ పెరగటమా? ఐటీ రంగంలో మాంద్యం మొదలైందా? వీటిలో ఏది నిజం? ఏది కారణం? కోటి కలల యువతను నిరాశకు గురిచేస్తున్న అంశాలేమిటి? అభద్ర జీవితంలోకి కంపెనీలకు ఎందుకు నెడుతున్నాయి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:17 - July 14, 2017

హరక జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సారు పనోడే ఉన్నట్టుండుగదా..? ఏ ఈనతోని ఏమైతది.? పబ్లీకును మోసం జేసుడు.. భూముల పంచాదులళ్ల ఏళ్లు వెట్టుడు జనాన్ని ఆగం జేసుడు అనుకున్నంగని... అబ్బో పనోడే.. ఒక్కలు గాదు ఇద్దరు గాదు.. కాలిని కాలినీ వచ్చి సారు ఇంటి ముంగట గూసున్నదంటే.. తక్వమన్షి ఎట్లైతడు.. తాకట్లోడైతడు గని..మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:14 - July 14, 2017

కర్నూలు : అరె నాయనా ఆ చంద్రబాబు కొడ్కుకు ఎవ్వడన్న జెప్పుండ్రిరా..? పూరాగ రాజకీయం నేర్చుకొని పబ్లీకులకు రమ్మని.. ఆయన ఇజ్జత్ దీస్కున్నది గాక.. ఇప్పుడు తండ్రి ఇజ్జతు.. తండ్రి పార్టీ ఇజ్జతును గూడ పణంగ వెట్టినట్టే గొడ్తున్నది.. మా నాయిన గూడ చెప్తడు గదా అవద్దాలు నేను గూడ అట్లనే జెప్తాని ఒకటి జెప్పిండు.. జనం అప్పట్లెక్క లేరు గదా ఇని సప్పట్లు గొట్టెతందుకు.. ఎంటనే అందుకున్నరు సూడుండ్రి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

20:13 - July 14, 2017

నాకు అప్పుడే అనుమానమొచ్చింది... ఏందిరో ఈ సీన్మ ఇండస్ట్రీవోళ్లు.. ఎవ్వలు వెట్టుమనకముందుకే మీటింగులు వెట్టి డ్రగ్సును కంట్రోలు జెయ్యాలే..అరె నాయనా ఆ చంద్రబాబు కొడ్కుకు ఎవ్వడన్న జెప్పుండ్రిరా..? పూరాగ రాజకీయం నేర్చుకొని పబ్లీకులకు రమ్మని.. ఆయన ఇజ్జత్ దీస్కున్నది గాక..కత్తి వట్టినోడు ఎప్పటికైనా కత్తికే బలైతడు.. దాంట్లె డౌటేం లేదు.. వరంగల్ కార్పొరేటర్ మురళి పరిస్థితి గూడ ఆసొంటిదే... ఆయన ఇర్వై ఐదేండ్ల కింద..నువ్వు భయపెడితే భయపడడానికి నేను ఓటర్ననుకున్నవా బే.. షూటర్నీ.. కాల్చిపడేస్తా నా కొడకా.. ఇది బాలకిష్ణ డైలాగు గదా... అగో సేమ్ డైలాగు ఇశిరిండు.. పాలమూరు జడ్పీ చైర్మన్ భాస్కర్ సారు గూడ.. హరక జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సారు పనోడే ఉన్నట్టుండుగదా..? ఏ ఈనతోని ఏమైతది.? పబ్లీకును మోసం జేసుడు.. బాబా సాహెబ్ అంబేద్కరా..? ఏ స్వర్గంలున్నవోగని.. సూడు తండ్రి.. నువ్వు కింది జాతులు అధికారంలకు రావాలె అని వాళ్లకు రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిపోయినవ్..?అయ్యో ఆత్మహత్యలకు అడ్డా అయిపోయిందిగదా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు.. ఎవ్వలికి కష్టమొచ్చినా ఈడికొస్తున్నరు పుర్గుల మందు తాగుతున్నరు.. వా.. విధి జూడుండ్రి ఒక్కొక్కలి జీవితంతోని ఎట్ల ఆటాడ్తదో.. తల్లి దండ్రులు సచ్చిపోయిండ్రు.. తోడబుట్టిన తమ్ముడు సచ్చిపోయిండు.. పనిగల మేస్త్రి పందిరి వేస్తె కుక్క తోక తగిలి కూలిపొయింది.. అట్లనే ఉన్నది ఈ కథ గూడ..పత్తాలాట క్లబ్బులు బంజేశ్నమని బుజాలు గుద్దుకుంటిరిగదా..? కేసీఆర్ సారూ..? ఇగో మళ్లొక కేంద్రం దొర్కింది..పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:02 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ విషయంలో తనకు ఎలాంటి నోటీసుల రాలేదని నటి ముమైత్ ఖాన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

19:42 - July 14, 2017

హైదరాబాద్ : టెన్ టివిలో సినీఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై నిర్వహించిన చర్చలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ ఫోన్ లైన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పై ఫైర్ అయ్యారు. ఒకరి తప్పు చేస్తే అందరికి అపదించద్దని అన్నారు పూర్తి వివరాలకు కోసం వీడియో క్లిక్ చేయండి.

19:36 - July 14, 2017

ఇదేం మొదటి సారి కాదని, ఈసారి పకడ్బందిగా విచారణ జరుగుతోందని, డ్రగ్స్ మాఫియా వెనుక బడ నాయకులు ఉన్నారని, కానీ అకున్ సబర్వాల్ ను అప్పుడే లీవ్ పై పంపించారని, సినీఇండస్ట్రీ పూర్తిగా మారిపోయిందని, పీఓడబ్ల్యూ నేత సంధ్య అన్నారు. సినీఇండస్ట్రీని పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, ఆధారాలు లేకుండా నోటీసులు ఇవ్వడం బాధకరమని, వ్యవస్థలో దమ్ముఉంటే నిరూపించాలని డైరెక్టర్ రమణ రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఇండస్ట్రీలో నిప్పు పుట్టించడం మంచిదికాదని నటుడు, ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:08 - July 14, 2017

విశాఖ : జిల్లాకేంద్రంలోని గాజువాక పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నారు. స్టేషన్ ల్లో విధులు నిర్వహిస్తున్న వారిపై అవినీతి ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

18:58 - July 14, 2017

తూర్పు గోదావరి : ఏపీలో మద్యంపై మహిళల పోరు కొనసాగుతోంది. తాజాగా కాకినాడలో మహిళలు ఐద్వ ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. ప్రజవాసల్లో మద్యం షాపులపై వారు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:55 - July 14, 2017

గుంటూరు : రాష్ట్రం విడిపోయాక ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి తరలించాకా వారికి అన్ని డిపార్ట్‌మెంట్లలో ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఆర్ధికశాఖలో మాత్రం..దళిత, దళితేతర ఉద్యోగులలో వచ్చిన విభేదాల కారణంగా 9 నెలలుగా ప్రమోషన్లు ఆగిపోయాయి. ప్రమోషన్లలో తమ కోటా 15 శాతం భర్తీ చేయాలని దళిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 2 ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 6 శాతం చొప్పున ఇవ్వాలి. అయితే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన ప్రమోషన్లలో దళిత ఉద్యోగులకు 15శాతం ప్రమోషన్లు ఇచ్చారని వారంతా తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నారని ఓసీ, బీసీ ఉద్యోగులు చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఇచ్చే ప్రమోషన్లలో మళ్లీ రూల్స్‌ అంటూ రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని జూనియర్లు ముందుకు వెళ్తారని ఓసీ, బీసీ ఉద్యోగులు వాదిస్తున్నారు.

ఆర్ధికమంత్రితో చర్చలు
దీంతో విభేదాలు తవ్రతరం కావడంతో అచివాలయంలో ఎవరివారు సమావేశాలు పెట్టుకోవడం, నిరసనలకు దిగడం జరుగుతోంది. ప్రమోషన్లలో రిజర్వేషన్‌ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని దళితేదర ఉద్యోగుల నాయకులు మండిపడుతున్నారు. ప్రమోషన్లలో రిజర్వషన్లు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడితో కూడా చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా సమస్య మొత్తం సచివాలయానికి పాకింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

18:53 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారం కేసులో మరొక నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈవెంట్‌ మేనేజర్‌ పీయూష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో డ్రగ్స్‌ కేసులో అరెస్టుల సంఖ్య 13కు చేరింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:52 - July 14, 2017

గుంటూరు : ఏపీ రాజధాని నగరం నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఓవైపు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణాల డిజైన్లపై కసరత్తు చేస్తూనే..మరోవైపు నిధుల సమకూర్చునేందుకు వ్యూహాలు రచిస్తోంది. సెప్టెంబర్‌ 30 విజయదశమి రోజున అసెంబ్లీ నిర్మాణ పనులు అక్టోబర్‌ 15న హైకోర్టు, అక్టోబర్‌ 30న సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజధాని నగరంలో ప్రభుత్వ భవనాలతో అందమైన పర్యాటక భవనాలు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

18:50 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమే అన్నారు ప్రముఖ హీరో నవదీప్‌. కానీ డ్రగ్స్‌కు తనకు ఎలాంటి సంబంధంలేదని నవదీప్ వివరణ ఇచ్చారు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ ఒక ఈవెంట్‌ మేనేజర్‌తో తనకు పరిచయాలు ఉన్నాయని..దాంతో పోలీసులు తనకు నోటీసులు జారీచేశారన్నారు.హీరో నవదీప్‌ సిట్‌ విచారణకు హాజరై అన్ని విషయాలు వివరిస్తామన్నారు. 

18:42 - July 14, 2017

రీలిజైన సినిమాల రివ్యూలు ఇస్తూ...రేటింగ్ అనలైజ్ చేసే నేడే విడుదల ఇవాళ కూడా ఒక సినిమాతో మీ ముందుకు వచ్చింది. టూడే అవర్ రిసెంట్ రీలిజ్ మూవీ శమంతకమణి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన కామెడి థ్రిల్లర్ శమంతకమణి..ఈ ఇవాళ్టి మన నేడే విడుదుల.

 

18:18 - July 14, 2017

హైదరాబాద్ : నగరంలోని ఎక్సైజ్ కార్యాలయానికి సినీనటుడు నందు వచ్చారు. నందు మీడియాలో వార్తలపై ఎక్సైజ్ అధికారులను వివరాలు అడగడానికి వచ్చానని తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని నందు స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పీయూష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు...

హైదరాబాద్: డ్రగ్స్ కేలో మరో కీలకనిం దితుడు పీయూష్ పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. డ్రగ్స్ కేసులో పీయూష్ మొత్తం13 మందిని పోలీసులుఅ రెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... యాంటి నార్కోటిక్స్ బృందం పీయూష్ కాల్ డేటా ఆధారంగా సిట్ విచారణ చేపట్టింది. ఆన్ లైన్ లో ఎల్ ఎస్ డీ డ్రగన్స్ పీయూష్ ఆర్డర్ చేసుకున్నాడని, ఎల్ ఎస్ డీ డ్రగ్స్ ను తయారు చేసే మిశ్రమాలను ఫార్మా కంపెనీల్లో దొరికే మత్తు పదార్థాలను కలిపి ఎల్ ఎస్ డీ డ్రగ్స్ తయారు చేస్తుండగా పీయూష్ ను పట్టుకున్నారు.

ఎక్సైజ్ కార్యాలయానికి నందు

హైదరాబాద్: మీడియాలో వార్తలపై ఎక్సైజ్ అధికారులను వివరాలు అడిగేందుకు వచ్చానని సినీ నటుడు నందు తెలిపాడు. డ్రగ్స్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు.

రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. భారత విదేశాంగ విధానం పాక్, చైనా సరిహద్దులలో పరిస్థితులపై అఖిలపక్ష నేతలతో సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి ఖర్చే సీతారాం ఏచూరి, ములాయం సింగ్,పాశ్వాన్, సుజనా చౌదరి, తోట నరసింహం, జితేందర్ రెడ్డి, కేకే, మేకపాటి తదితరులు పాల్గొన్నారు.

రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: రాజ్ నాథ్ సింగ్ నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. భారత విదేశాంగ విధానం పాక్, చైనా సరిహద్దులలో పరిస్థితులపై అఖిలపక్ష నేతలతో సుష్మాస్వరాజ్ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి ఖర్చే సీతారాం ఏచూరి, ములాయం సింగ్,పాశ్వాన్, సుజనా చౌదరి, తోట నరసింహం, జితేందర్ రెడ్డి, కేకే, మేకపాటి తదితరులు పాల్గొన్నారు.

17:35 - July 14, 2017
17:34 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినిమా స్టార్స్‌ను మాత్రమే ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదన్నారు నటి జీవిత. సొసైటీలో ఎంతోమంది డ్రగ్స్ కేసులో ఉన్నవారుండగా.. సినిమా వారిని ముందు వరుసలో చూపించడం సరికాదన్నారు జీవిత. సినిమా తారలు ఒక పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని .. తమకందరికి బాధ్యత ఉంటుందని జీవిత చెప్పారు. 

17:33 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ సిద్ధమైంది.. రెండో జాబితాలో అగ్ర కథానాయకులు, దర్శకులు ఉండే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకుచెందినవారెవ్వరూ మీడియాతో మాట్లాడవద్దంటూ ప్రముఖ నిర్మాత సూచించారు.. చర్చలకోసం టీవీ స్టుడియోలకు వెళ్లొదన్నారు.. ఇక సిట్‌ నోటీసులు సినీ ప్రముఖులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, కెమెరా మెన్ శ్యామ్‌ కె నాయుడు, సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు సిట్ నోటీసులు ఇచ్చేందుకు రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తోంది. 

17:20 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ మాఫియా కేసులో పోలీసులు పీయూష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 13కు చేరింది. పీయూష్ గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేశాడు. ఇంజనీర్ ఉండగానే అతను డ్రగ్స్ అలవాటు చేసుకున్నాడు. పీయూష్ జాబ్ కోల్పోపవడంతో వివిధ రకాల పదార్థలతో కొన్ని రసాయనాలు తయారు చేశాడని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

పంజాగుట్ట పీఎస్ లో సీఎం కేసీఆర్ వీహెచ్ ఫిర్యాదు

హైదరాబాద్: పంజాగుట్ట పీఎస్ లో సీఎం కేసీఆర్ వీహెచ్ ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం వద్ద ముగ్గురి ఆత్మహత్యాయత్నం ఘటనలో కేసీఆర్ పై 302 సెక్షన్ కింద కేసు పెట్టాలని వీహెచ్ ఫిర్యాదు చేశారు.

ఆగస్టు 15న యూపీ అసెంబ్లీని పేల్చేస్తా...

లోక్నో : ఆగస్టు 15న స్వాత్రంత్య దినోత్సవం రోజున యూపీ అసెంబ్లీని పేల్చేస్తానంటూ ఓ ఆగంతకుడి నుంచి పోలీసులకు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. ఫోన్‌ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. బెదిరింపు కాల్స్‌కు పాల్పడిన విద్యార్థిని దేవరియా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ విద్యార్థి ఎవరూ.. ఎందుకు ఇలా చేశాడనే విషయాలను మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

16:45 - July 14, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లపై...సీఎం చంద్రబాబుతో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైకోర్టు డిజైన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఇచ్చిన సూచనలపై సీఎంతో చర్చించారు. ఆగస్ట్‌ 15 నాటికి అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణానికి సంబంధించి తుది డిజైన్లు అందించాలని ఫోస్టర్స్‌ బృందానికి సూచించారు. తుది ఆకృతులపై కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతితో పాటు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు జైట్లీ, వెంకయ్యనాయుడుకు ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని తెలిపారు. అమరావతి నిర్మాణాన్ని సింబల్‌ ఆఫ్‌ ఫ్రైడ్‌గా, పోలవరం నిర్మాణాన్ని సింబల్‌ ఆఫ్‌ ప్రొగ్రెస్‌గా చంద్రబాబు అభివర్ణించారు.   

16:44 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కూడా ఫోన్లు రాలేదన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని కెరియర్ బ్యాడ్ అవుతుందని నందు చెప్పారు. ఎవరికి డౌట్ ఉన్నా లైవ్‌లో తను బ్లడ్ టెస్ట్ చేయించుకునేందుకు సైతం సిద్ధమని నందూ స్పష్టం చేశారు. 

16:42 - July 14, 2017

ఫ్రాన్స్ : స్టెప్‌ అప్‌, స్టెప్‌ డౌన్‌, వర్చువల్‌ స్పిన్‌, టోటల్‌ స్పిన్‌ వంటి ఫీట్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.ఈ డేర్ డెవిల్‌ కాంపిటీషన్‌లో అరుదైన ఫీట్స్‌ ప్రదర్శించిన జామీ మతియు టాప్‌ ప్లేస్‌లో నిలిచి టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. యుటో హోరిగేమ్‌, డానీ లియోన్‌ వరుసగా రెండు,మూడు స్థానాలతో సరిపెట్టుకున్నారు.

16:42 - July 14, 2017

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో ఆవరణలో బాంబు కలకలం సృష్టించింది. అత్యంత శక్తివంతమైన PETN పేలుడు పదార్ధాన్ని డాగ్‌ స్క్వా డ్‌ తనిఖీల్లో పోలీసులు బాంబును గుర్తించారు. ప్లాస్టిక్‌ రూపంలో ఉండే ఈ పేలుడు పదార్ధాన్ని మెటల్‌ డిటెక్టర్లు, ఎక్స్‌ రే యంత్రాలు కూడా గుర్తించలేవు. వంద గ్రాముల PETN భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. షాక్‌వేవ్‌, హీట్‌తో ఇది పేలుతుంది. ఈ ఘటన తర్వాత అసెంబ్లీతోపాటు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఆవరణలో పేలుడు పదార్థం లభ్యంకావడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ, దీనిపై NIA దర్యాప్తుకు ఆదేశించినట్టు చెప్పారు.  

16:41 - July 14, 2017

కలకత్తా : పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మళ్లీ హింస చెలరేగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న గూర్ఖాలాండ్‌ కార్యకర్తలు హింసకు పాల్పడ్డారు. గూర్ఖాలాండ్‌ ప్రాదేశిక పరిపాలనా కార్యాలయం భవనానికి నిప్పు పెట్టారు. గాయబరిలో ఉన్న కుర్షియాంగ్‌ రైల్వే స్టేషన్‌ను దహనం చేశారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో డార్జిలింగ్‌తోపాటు కలిపాంగ్‌, సొనాడ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు మళ్లీ సైన్యాన్ని రంగంలోకి దింపారు. మరోవైపు 27 రోజులుగా డార్జిలింగ్‌లో బంద్‌ కొనసాగుతోంది. మెడికల్‌ షాపులు మినహా, మిలిగిన అన్ని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కాలేజీలు, స్కూళ్లు, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. 

16:40 - July 14, 2017

బ్రిటన్ : బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగనామం పెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా భారత్‌కు రావడానికి ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు. లండన్‌లో జరిగిన ఫార్ములావన్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మాల్యాతో ఓ జర్నలిస్ట్‌.. భారత్‌ను మిస్సవుతున్నారా..? అని ప్రశ్నించారు. అక్కడ మిస్సవడానికి నాకేమీ లేదు. నా కుటుంబ సభ్యులంతా ఇంగ్లాండ్‌, అమెరికాల్లోనే ఉన్నారు. భారత్‌లో కుటుంబపరంగా మిస్సవ్వడానికి ఏమీ లేదని మాల్యా చెప్పుకొచ్చారు. తానేమి తప్పు చేయలేదని...తనపై కావాలనే కేసులు పెడుతున్నారని... లండన్‌ కోర్టులో కేసు నడుస్తున్నందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఇక్కడ పక్షపాతం చూపరని... తీర్పుకోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. మాల్యాను భారత్‌కు రప్పించే కేసు విచారణ లండన్‌ కోర్టులో కొనసాగుతోంది. గత ఏడాది లండన్‌కు పారిపోయిన మాల్యా అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

16:38 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ నోటీసులపై ప్రముఖ నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. తాను డ్రగ్స్‌ తీసుకోవడంలేదని..తప్పుకుండా ఈనెల 21న సిట్‌ ముందు హాజరై వివరణ కోరతానన్నారు. 

16:31 - July 14, 2017

పాట్నా : బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్జేడీతో అమీతుమీకి సిద్ధమైయ్యారు. కేబినెట్లో తానో, తేజస్వి యాదవ్ ఎవరో ఒకరే ఉండాలని నితీష్ స్పష్టం చేశారు. నితీష్ ప్రకటనతో బీహర్ లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆర్జేడీ జేడీయూ కలిసే ఉండాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:26 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణ హెడ్ గా ఉన్న అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్లడానికి పెద్దల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ రెండో జాబితా ఉన్న సినీ పెద్దలకు నోటీసులు జారీ చేస్తుదన్న సమాచాంరతో వారు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తునట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

600 గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాంబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడి నుంచి రూ.17,40,000 విలువైన 600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

16:05 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో తాము ఎవరిపేరు బయటపెట్టలేదని ఎక్సైజ్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్.. నోటీసులు ఇచ్చినంతమాత్రాన నిందితులు కాదని స్పష్టం చేశారు.. ఈ కేసులో ఇప్పటివరకూ 13మందిని అరెస్ట్‌ చేశామని ప్రకటించారు.. నోటీసులు అందుకున్నవారు విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..

'ఏపీ పరిపాలన నగరం, హైకోర్టు మాస్టర్ ప్లాన్ ఖరారు'

అమరావతి: 9వందల ఎకరాల్లో నిర్మించే పరిపాలన నగరం, 450 ఎకరాల్లో నిర్మించే న్యాయ నగరాల ఫైనల్ మాస్టర్ ప్లాన్ ను ఏపీ సర్కార్ ఖరారు చేసినట్లు అయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. భుజ స్థూపాకారంలో హైకోర్టు, కోహినూరు వజ్రాకారంలో అసెంబ్లీ డిజైన్లను ఖారారు అయ్యాయిన, రెండు నగరాలకు ఇరువైపులా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 30న అసెంబ్లీ నిర్మాణ పనులు, అక్టోబర్ 15న హైకోర్టు నిర్మాణ పనులు, అక్టోబర్ 30న సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. వాటికి సంబంధించి వివిధ కంపెనీల టెండర్లను డిజైన్లు రాగానే ఖరారు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

16:00 - July 14, 2017

హైదరాబాద్‌ : వనస్థలిపురంలోని ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అందోళనలు రెట్టింపు అయ్యాయి. నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందిచడం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. డెలివరి డేట్‌ వచ్చినా ఆలస్యం చేస్తున్నారని వైద్యులని నిలదీశారు. క్లీనింగ్‌ ఉద్యోగులు లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో గర్భినులు ఆవేదన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి జీతాలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.

15:59 - July 14, 2017

విశాఖ : విశాఖ జిల్లాలో భూభాగోతంపై సిట్‌ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి ప్రాంతంలో 210 ఎకరాల రైతుల భూములను ట్యాంపరింగ్‌ చేశారంటూ జనసేన సేవ సమితి కార్యకర్తలు సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకే వ్యక్తి పేరు మీద 210 ఎకరాల భూమి మార్చారంటే..ఏ స్థాయిలో అధికారుల కుమ్మక్కు జరిగిందో అర్థమవుతుందన్నారు. ఈ వ్యవహారంపై సిట్‌ అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని.. లేనిపక్షంలో సీబీఐ విచారణకు అప్పగించేవరకు పోరాడుతామంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

15:58 - July 14, 2017

విశాఖ : విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు ముమ్మరమైంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు సిట్‌ ముందు హాజరయ్యారు. భూకుంభకోణంపై ఆధారాలను సిట్‌కు అందించారు.. సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకముందని తెలిపారు.. జిల్లాలో తనవద్దకు వచ్చిన ఫిర్యాదులను అన్నింటినీ సిట్‌ ముందుంచానని చెప్పారు. విశాఖ జిల్లాలో భూమలు అన్యాక్రాంతమవుతున్నాయని 2015లోనే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని గుర్తుచేశారు.. భూకుంభకోణాల్లో అన్ని పార్టీల నేతలున్నాయని స్పష్టం చేశారు. భూస్కాంలో హస్తం ఉన్నట్లు తేలితే ఏ పార్టీ వారినైనా విడిచిపెట్టమని అయ్యన్న ప్రకటించారు.. ఈ నెల 19న సిట్‌ను కలిసి మరిన్ని వివరాలు సమర్పిస్తామన్నారు.

15:57 - July 14, 2017

కర్నూలు : కులం, మతం ప్రాంతం అడ్డుపెట్టుకొని చేయొద్దన్నారు.. మంత్రి లోకేశ్‌ నాయుడు.. కర్నూలు జిల్లాలో లోకేశ్ పర్యటిస్తున్నారు.. ప్రభుత్వ అతిథి గృహంలో ప్రజల వినతులు స్వీకరించారు.. అక్కడి సమస్యలపై ఆరాతీశారు.. అయితే రాయలసీమలో పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపించడంలేదంటూ సీమ ఉద్యమకారులు ఆరోపించారు.. సీమపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని లోకేశ్‌ను ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన మంత్రి... సీఎం చంద్రబాబు రాయలసీమకుచెందిన వ్యక్తిఅని.. సీమను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు అహర్నిషలు కృషి చేస్తున్నారని ఉద్యమకారులకు తెలిపారు.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

15:53 - July 14, 2017

వరంగల్ : టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ మురళిని హత్యచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మురళి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎంజీఎం ఆస్పత్రిలో మురళికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

'గరగపర్రు'బాధితులకు నైపుణ్య శిక్షణ:జూపూడి

విజయవాడ: గరగపర్రులో దళితుల బహిష్కరణను'10టివి' వెలుగులోకి తెచ్చాక ప్రభుత్వం వెంటనే స్పందించిందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ తెలిపారు. గరగపర్రు దళితులకు జీవనోపాది కోసం ఎస్పీ కార్పొరేషన్ తరపున కారు డ్రైవింగ్ రుణాలు, నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్య తీసుకుంటున్నామని తెలిపారు.

15:50 - July 14, 2017

వరంగల్ : టీఆర్‌ఎస్‌ నేత, జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి దారుణ హత్యను నిరసిస్తూ.. ఆ పార్టీ వరంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని.. పార్టీ శ్రేణులకు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:49 - July 14, 2017

విజయవాడ : వస్త్రాలపై జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో మరోసారి వస్త్రవ్యాపారులు ఆందోళనకు దిగారు. జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వస్త్రాలపై జీఎస్టీ విధించడం మూలంగా 18శాతం వరకు పన్నుభారం పడుతుందని చెప్పారు. దీంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయి రోడ్డునపడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుననారు. కేంద్రం ఇప్పటికైనా తమ గోడును పట్టించుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:48 - July 14, 2017

హైదరాబాద్ : ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ దురుసు ప్రవర్తనపై సీఎస్ ఎస్పీ సింగ్‌తో ఐఏఎస్ అధికారుల సంఘం భేటీ అయింది.. ఈ వివాదంపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌తోపాటు... సీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ ఘటనపై సీనియర్‌ ఐజీ ఆఫీసర్‌తో విచారణ జరిపించాలని కోరారు.. ఇలాంటి అవమానాలు మళ్లీ జరగకుండా గ్రీవెన్‌ సెల్‌లాంటిది ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

15:46 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్న విషయం తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు భానుచందర్‌. తాను కూడా ఇకప్పుడు డ్రగ్స్‌కు భానిసై జీవితాన్ని నాశనం చేసుకున్నానని..కానీ ఇప్పుడు దాన్ని నుంచి సంపూర్ణంగా బయటపడి ఎంతో ఆనందంగా జీవిస్తున్నానన్నారు. డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోకుండా ప్రతిఒక్కరు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని ఈ సందర్భంగా టాలీవుడ్‌ స్టార్స్‌కు భానుచందర్‌ సలహా ఇచ్చారు. ఇదే అంశంపై మా అధ్యక్షుడు శివాజీరాజా స్పందిస్తూ..నోటీసులు అందని వారి పేర్లను బయటపెట్టవద్దని సూచించారు. నోటీసులు అందన వారికి పోలీసు డిపార్ట్‌మెంటే శిక్షిస్తుందని..మా తరపున కూడా తగిన చర్యలు చేపడతామన్నారు. 

మోదీపై ఫన్నీ ఫోటోలు.. ఎఫ్ఐఆర్ నమోదు..

ముంబై: ప్ర‌ధాని మోదీపై వివాదాస్ప‌ద రీతిలో ఫోటోలు పోస్ట్ చేసిన ఆల్ ఇండియా బాక్‌చోద్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు త‌న్మ‌య్ భ‌ట్‌పై ఇవాళ ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. 

15:36 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అనవసరంగా తనపేరు బయటకులాగారని వాపోయారు. 

'విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణ పనులు'

అమరావతి: సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 కల్లా సవివర ఆకృతులు అందించాలని సీఎం ఆదేశించారు. విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి నిర్మాణాన్ని సింబల్ ఆఫ్ ఫ్రైడ్ పోలవరం నిర్మాణాన్ని సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ గా అభివర్ణించి నార్మన్ ఫోస్టర్స్ అందించే తుది ఆకృతులపై రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ప్రజెంటేషన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.

15:17 - July 14, 2017

టాలీవుడ్..బాలీవుడ్...ఏ వుడ్ లోనైనా సినిమాలు ఘన విజయం సాధించడం..రికార్డులు బద్దలు కొట్టడం..పరాజయం కావడం చూస్తూనే ఉంటాం. ఘన విజయం సాధిస్తే కలెక్షన్ల పంట పడుతుంది. అదే సినిమా పరాజయం పాలైతే మాత్రం నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంటారు. తమకు జరిగిన నష్టాన్ని తీర్చాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు..హీరోలను కోరుతుంటారు. దయ తలిచిన హీరోలు వారిని ఆదుకుంటుంటారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలు డిస్ట్రిబ్యూటర్ల పట్ల దయ చూపారు.

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' వరుస విజయపరంపరలకు 'ట్యూబ్ లైట్' చిత్రం బ్రేకులు వేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద పరాజయం పాలైంది. గత చిత్రాల వలే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. కానీ అనూహ్యంగా బోల్తా కొట్టడంతో వారు నష్టాల పాలయ్యారు. తమను ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్ల కోరికపై 'సల్మాన్' సానుకూలంగా స్పందించాడు. వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని..నిర్మాతగా వ్యవహరించిన 'సల్మాన్' రూ. 55 కోట్లకు వెనక్కి ఇచ్చేశారు. నెక్ట్స్ సినిమా 'టైగర్ జిందా హై' తీసుకున్న పారితోషకాన్ని సగం వెనక్కి ఇచ్చేసి తక్కువ రేటుకు విక్రయించాలని నిర్మాతను 'సల్మాన్' సూచించినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. తన సినిమా రిలీజ్ అయ్ని అనంతరం నష్టపోతే..రిటర్న్ ఇచ్చేస్తానని 'రణబీర్' ముందే పేర్కొంటుండడం గమనార్హం. ‘కత్రినా', ‘రణబీర్' జంటగా 'జగ్గా జాసూస్' చిత్రం రూపొందింది. కానీ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఏడాది పాటు రిలీజ్ కు నోచుకోలేని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి 'రణ్‌బీర్‌' కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ సంచనల ప్రకటన చేశాడు. ‘సినిమా ఫ్లాపయితే ఆ నష్టం భరిస్తాను. ధైర్యంగా నా సినిమాని విడుదల చేయొచ్చు..’ అంటూ ప్రకటించి అందర్నీ 'రణ్‌బీర్‌' ఆశ్చర్యానికి గురి చేశాడు.

మరి వీరి దారిలో ఇతర హీరోలు పయనిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

15:13 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ సిద్ధమైంది.. రెండో జాబితాలో అగ్ర కథానాయకులు, దర్శకులు ఉండే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకుచెందినవారెవ్వరూ మీడియాతో మాట్లాడవద్దంటూ ప్రముఖ నిర్మాత సూచించారు.. చర్చలకోసం టీవీ స్టుడియోలకు వెళ్లొదన్నారు.. ఇక సిట్‌ నోటీసులు సినీ ప్రముఖులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు సిట్ నోటీసులు ఇచ్చేందుకు రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:11 - July 14, 2017

అనంతపురం : జిల్లాలోని గుంలకల్లులో రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో విషాదం నెలకొంది. స్కూల్ గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి రవికుమార్(4)మృతి చెందాడు. ఈ సంఘటనలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. దీంతె ఆమెను గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందినట్ట విద్యార్థిసంఘాలు ఆరోపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

'మా' ద్వారా నోటీసులు: శివాజీరాజా

హైదరాబాద్: 'మా' ద్వారా సినిమా ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందించింది అని నటుడు శివాజీ రాజా తెలిపారు. డ్రగ్స్ కేసులో సంబంధమున్న సినిమా ప్రముఖుల పేర్లను ఉదయం మీడియాకు తెలియజేస్తామని, ఇప్పటి వరకు 8 మందికి నోటీసులు అందాయని పేర్కొన్నారు.

15:02 - July 14, 2017

గ్రాఫిక్స్ అంటే హాలీవుడ్ , బాలీవుడ్ మాత్రమే కాదు..తెలుగు సినిమా చూస్తే గ్రాఫిక్స్ అంటే తెలుస్తుందని బాహ్యా ప్రపంచానికి తెలియచెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు. గ్రాఫిక్స్ తో థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. విమర్శకుల చేత ఔరా అనిపించుకున్న సందర్భాలున్నాయి. టాలీవుడ్ లో కూడా గ్రాఫిక్స్ లతో పలు సినిమాలు నిర్మితమౌతున్న సంగతి తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు'..మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోంది. మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. షూటింగ్ మొదలు పెట్టి ఇప్పటికే సంవత్సరం పూర్తయ్యింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు బయటకు రాలేదు. దీనితో ‘మహేష్’ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అనంతరం చిత్ర పోస్టర్..టీజర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపే ప్రయ త్నం చేశారు. తాజాగా 'స్పైడర్' లో గ్రాఫిక్స్ సన్నివేశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకనే చిత్ర రిలీజ్..ఇతరత్రా విషయాల్లో లేట్ అవుతుందని తెలుస్తోంది.

ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ చూస్తే నిజమే అనిపించక మానదు. ఆరు దేశాల్లో గ్రాఫిక్స్ సంబంధించిన వర్క్ చేస్తున్నట్లు టాక్. రెండు పాటల్లో ఒక పాటను ఇటీవలే పూర్తి చేశారని, ఆగస్టు నెలలో మరో పాట షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 27న 'స్పైడర్' రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరీ 'మహేష్' ‘స్పైడర్' లో గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

14:45 - July 14, 2017

నారా రోహిత్..పేరు చెప్పగానే అతని శరీరం గుర్తుకొస్తుంది. బొద్దుగా ఉండే రూపం ఠక్కున మెదలుతుంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటు ముందుకెళుతున్నాడు. కానీ అతని లుక్ విషయంలో పలు టాక్స్ వినిపించాయి. కానీ తన లుక్ ను మార్చుకోవడానికి నారా రోహిత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అతడు నార్మల్ రూపంలోకి వచ్చాడని సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'శమంతకమణి', ‘కథలో రాజకుమారి' సినిమాల్లో 'నారా రోహిత్' నటించిన సంగతి తెలిసిందే.

కొన్ని నెలల నుండి జిమ్ లో 'నారా రోహిత్' చెమటోడుస్తున్నాడంట. ఏకంగా 21 కిలోలు తగ్గిపోయాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తాను బరువు తగ్గినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 'పవన్ మల్లెల' అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాలో 'రోహిత్' న్యూ లుక్ ఉంటుందని టాలీవుడ్ టాక్. ఇందులో 'రోహిత్' సిక్స్ ప్యాక్ తో కనబడుతాడని మరో టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రోహిత్.

14:39 - July 14, 2017

చిత్తూరు : లక్ష్యంకోసం కష్టపడాలని... మనస్తాపంతో డ్రగ్స్‌కు బానిస కావడం సరికాదని... మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ సూచించారు.. ఫస్ట్‌ క్లాస్‌ ఆర్టిస్టులు ఎప్పుడూ డ్రగ్స్‌వైపు చూడలేదని అభిప్రాయపడ్డారు.. సెకండ్‌, థార్డ్‌ క్లాస్‌ ఆర్టిస్టులు ఇటువైపు వెళుతున్నారని చెప్పారు.. కళాకారులు మామూలువాళ్లకంటే పదిరెట్లు బాధ్యతగా ఉండాలన్నారు.. తిరుమల శ్రీవారిని నటకిరీటి దర్శించుకున్నారు.. ఇవాళ మంత్రి పత్తిపాటి, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ అనిత, మాజీ క్రికెటర్‌ వెంకటేశ్ ప్రసాద్‌ కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు.

14:38 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. ఫిల్మ్‌ చాంబర్స్‌లో మీడియాతో మాట్లాడిన పలువురు నేతలు యువహీరోలు డ్రగ్స్‌ తీసుకోవడం బాధాకరమన్నారు. సిట్‌ విచారణలో పేర్లు బయటకు వచ్చినంత మాత్రానా వారంతా తప్పుచేసినట్టు కాదన్నారు. వారంలోగా అసలు వాస్తవమేంటో తెలుస్తుందన్నారు. అందులో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలితో వారిపై సినీ ఇండస్ట్రీ తరపున చర్యలుంటాయన్నారు. 

తక్షణమే అకున్ సబర్వాల్ సెలవు రద్దు చేయాలి:రేవంత్

హైదరాబాద్: డ్రగ్స్ కేసు నుంచి అకున్ సబర్వాల్ ను ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే తప్పిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహుతలైన వారిని తప్పించడానికే అకున్ సబర్వాల్ ను సెలవులపై పంపిస్తున్నారని, తక్షణమే అకున్ సబర్వాల్ సెలవును వెంటనే రద్దు చేయాలని టిడిపి నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

14:37 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు ఎక్సైజ్‌ శాఖ సిద్ధమైంది.. రెండో జాబితాలో అగ్ర కథానాయకులు, దర్శకులు ఉండే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకుచెందినవారెవ్వరూ మీడియాతో మాట్లాడవద్దంటూ ప్రముఖ నిర్మాత సూచించారు.. చర్చలకోసం టీవీ స్టుడియోలకు వెళ్లొదన్నారు.. ఇక సిట్‌ నోటీసులు సినీ ప్రముఖులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు సిట్ నోటీసులు ఇచ్చేందుకు రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తోంది. 

3500 అశ్లీల వెబ్ సైట్లను బ్లాక్ చేశాం: కేంద్రం

ఢిల్లీ: చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న 3500 అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. గత నెలలో మొత్తం 3500 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేసినట్టు స్పష్టంచేసింది. ఈ వెబ్‌సైట్లకు కళ్లెం వేసేవిధంగా పాఠశాలల్లో జామర్లు ఏర్పాటుచేయాలని సీబీఎస్‌ఈని కోరినట్టు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. 

స్కూలు గేటు విరిగిపడి నర్సరీ విద్యార్థి మృతి

అనంతపురం: పాత గుంతకల్లులో విషాదం నెలకొంది. రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గేటు విరిగి మీద పడడంతో నర్సరీ విద్యార్థి రవి కుమార్ (4) మృతి చెందాడు. ఈ ఘటనలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

14:17 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీ తారల పేర్లు బయటకు రావడంతో ఎక్సైజ్ శాఖలో ముసలం మొదలైంది. ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ పై వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఆయన రేపటి నుంచి 10రోజుల పాటు లీవ్ పై వెళ్లనున్నారు. గతంలోనే లీవ్ కు అప్లై చేసుకునట్ట అకున్ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పదిరోజులు వీవ్ పై వెళ్తునట్టు ఆయన చెప్పారు. నాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని, తనకు ప్రభుత్వ మద్దతు ఉందని అకున్ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:53 - July 14, 2017

మానవి   న్యూస్  మహిళా వార్తల సమాహారం మానవి న్యూస్ కు స్వాగతం... మహిళలకు సంబంధించిన వివిధ రకాల వార్తలతో ఇవాళ్టి మానవి   న్యూస్ మీ ముందుకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:45 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేస్తున్న ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై ఉన్నతస్థాయి ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి 10 రోజుల పాటు సెలవులపై అకున్ సబర్వాల్ వెళ్తున్నారు. మనస్తాపానికి గురై సెలవుపై అకున్ వెళ్తున్నట్లు కనిస్తోంది. కీలక ప్రముఖుడు మందలింపులు కారణమని సమాచారం. అయితే లీవ్ కు సబంధించి గతంలోనే అప్లై చేసుకున్నానని అకున్ చెప్పారు. వ్యక్తిగత కారణాలతో పది రోజులు లీవ్ పై వెళ్తున్నానని పేర్కొన్నారు. తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని అకున్ చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉందని తెలిపారు. మరోవైపు రెండో జాబితాలో అగ్ర కథానాయకులు, దర్శకులు ఉండే అవకాశం ఉంది. డ్రగ్స్ వ్యవహారంలో సినిమా పరిశ్రమకు చెందిన వారెవరూ మీడియాతో మాట్లాడవద్దని ప్రముఖ నిర్మాత సూచించారు. చర్చల కోసం టీవీ స్టూడియోలకు కూడా వెళ్లొద్దని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కాంగ్రెస్ లో బీసీ నేతల భేటీ

హైదరాబాద్: లక్డీకపూల్ లోని అశోక్ హోటల్ లో కాంగ్రెస్ బీసీ నేతలు సమావేశం అయ్యారు. పార్టీలో బీసీల బలోపేతం, బీసీలకు ప్రాధాన్యత కల్పించడంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

బీసీ కులాల తొలగింపు పై సుప్రీంలో విచారణ

ఢిల్లీ: తెలంగాణ సర్కార్ బీసీ జాబితా నుంచి 26 కులాలను తొలగించడంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బాధిత కులాలు సుప్రీం ను ఆశ్రయించాయి. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

13:19 - July 14, 2017

హైదరాబాద్ : పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌ చాలా అనుకూలమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ ఇండస్ట్రీ సెమినార్‌ ఆయన హాజరై, మాట్లాడారు. నగరంలో ఎన్నో రీసర్చ్ ఇనిస్టిట్యూట్‌లు ఉన్నాయని తెలిపారు. వచ్చే మార్చిలో ఇండియన్‌ ఏవియేషన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందని ప్రకటించారు. సెమినార్‌ తర్వాత ఏవియేషన్‌ ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి హాజరయ్యారు. 

డ్రగ్స్ కేసులో ఈవెంట్ మేనేజర్ పీయూష్ అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఈవెంట్ మేనేజర్ పీయూష్ ను సిట్ అధికారులు బంజారాహిల్స్ లో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పీయూష్ వద్ద ఉన్న కాల్ డేటాను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. సినీ పరిశ్రమలో పలువురికి పీయూష్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు సమాచారం.

రేపటి నుండి10రోజులు లీవ్ పెట్టిన అకున్ సబర్వాల్

హైదరాబాద్: అనుకున్నదంతా జరిగింది. డ్రగ్స్ కేసులో మూలాలు కదులుతున్న సమయంలో ఆ కేసు సవాల్ గా తీసుకుని పని చేస్తున్న ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ 10 రోజులు లీవ్ పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... నా పై ఎలాంటి రాజకీయ ఒత్తిడులు లేవని వ్యక్తిగత కారణాలతో పది రోజులు లీవ్ పై వెళ్తునాన్నారు. మరో వైపు సినీ సినీ పరిశ్రమ ఒత్తిళ్లతో సబర్వాల్ ను మందలించడంతో మనస్థాపానికి గురై లీవు పెట్టినట్లు సమాచారం.

12:55 - July 14, 2017
12:51 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ సేవిస్తున్న పలువురు సినీరంగ ప్రముఖులకు నోటీసులు అందజేశామని అకున్‌సబర్వాల్‌ తెలిపారు.  ఈనెల 19 నుంచి నోటీసులు అందిన వారిని విచారిస్తామన్నారు. ఒక్కొక్కరినీ ఒక్కోరోజు వ్యక్తిగతం విచారించనున్నట్టు తెలిపారు. ఎవరు ఏరోజు విచారణకు హాజరుకావాలో నోటీసుల్లో తెలిపామన్నారు. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

వరంగల్ మున్సిపల్ ఆఫీసులో మురళి భౌతికాయం..

వంగల్ : కార్పొరేటర్ మురళి మృత దేహానికి ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టు మార్టం పూర్తయింది. ఎంజీఎం సెంటర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. ప్రజల సందర్శనార్థం మురళీ భౌతిక కాయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఉంచారు.

12:40 - July 14, 2017
12:39 - July 14, 2017

ప్రీతి మీనాకు న్యాయం చేయండి: ఐఏఎస్ అధికారులు..

హైదరాబాద్: ఎస్పీ సింగ్ తో ఐఏఎస్ అధికారుల భేటీ ముగిసింది. మహబూబాబాద్ ఘటన పై ఫిర్యాదు చేశామని, ప్రీతి మీనాకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలపై విచారణకు ఐజీ స్థాయి అధికారితో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సీఎస్ ను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు.

12:38 - July 14, 2017

సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: సీఆర్డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భవనాల డిజైన్ల పై మరోసారి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. అసెంబ్లీ, హైకోర్టు ఇంటీరియర్ డిజైన్లు, మాస్టర్ ప్లాన్, సచివాలయం డిజైన్ల పై చర్చిస్తున్నట్లు సమాచారం.

12:27 - July 14, 2017

నోట్ల రద్దు...తో ఉగ్రవాదం..అవినీతి అంతం అయిపోతుంది...నోట్ల రద్దుతో దొంగ పైసలొస్తాయి..వాళ్లను జైళ్లో వేస్తా..పేదోళ్లకు డబ్బులు ఇప్పిస్తాం..అంటూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత కొన్ని నెలల క్రితం చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టారు..జేజేలు పలికారు..కానీ కాలం గడిచిపోయింది..పేదల ఖాతాల్లో డబ్బులు వచ్చినయా ? పాత నోట్లు ఎన్ని వచ్చినయి ? అవినీతి చేసిన వాళ్లు ఎంతమంది జైళ్లో ఉన్నారు..? ఇలాంటి ప్రశ్నలు సామాన్యుడు..పేదోడు మనస్సుల్లో మెదులుతున్నాయి..

2016 నవంబర్ 8...
నోట్ల రద్దు..రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016నవంబర్ 8వ తేదీన అర్ధరాత్రి కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఎన్నో సమస్యలు ఏర్డడ్డాయి. రద్దు చేసిన ఈ నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని కొన్ని షరతులు విధించింది. మరికొన్ని రోజుల అనంతరం షరతులను సడలించి గడువు పెంచింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఏటీఎంలు..బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. డబ్బులు తీసుకోలేక...డబ్బులు జమ చేయలేక నానా అవస్థలు పడ్డారు. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. పెద్దనోట్ల ఆకస్మిక రద్దుద్వారా అవినీతికి అడ్డుకట్టలు పడతాయని మోడీ చెప్పిన లక్ష్యం వెలవెలబోయిందనడానికి గతంలో ఘటనలే నిదర్శనం. బీజేపీ పార్టీకి చెందిన నేతల వద్ద కొత్త నోట్లు భారీగా పట్టుబడడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

లక్ష్యం నేరవేరిందా ?
కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సమర్థించగా మరికొంతమంది వ్యతిరేకించారు. నోట్ల రద్దు అనంతరం కేంద్రం పేర్కొన్నవి అమలయ్యాయా ? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల దాడులు అలాగే కొనసాగుతున్నాయని పలు ఘటనలు చూస్తే అర్థమౌతుంది. నోట్ల రద్దు వల్ల క్యాష్ లెస్ విధానం పెరుగుతుందని, డిజిటల్ వైపు పరుగులు తీయాలని నేతలు ప్రసంగాల్లో పేర్కొన్నారు. కానీ డిజిటల్ వైపు కొద్దిమంది మాత్రమే చేస్తున్నారని..జీఎస్టీ విధానంతో అది మరింత తగ్గిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు వల్ల జరిగిన పరిణామాల రీత్యా మోడీ నిర్ణయాన్ని మొదట ఆహ్వానించిన వారు సైతం తమ అభిప్రాయాన్ని పరిశీలించుకుంటున్నారు.

పాతనోట్లు లెక్కింపు కొనసాగుతోంది...
తాజాగా ఆర్బీఐ గవర్నర్ పాతనోట్లపై పలు వ్యాఖ్యానాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాతనోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని, వాటిని లెక్కించడం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సెలవులు కూడా తీసుకోకుండా శ్రమిస్తోందని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ వెల్లడించారు. పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట ఆయన హాజరై ఈ విషయాన్ని తెలియచేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో తలెత్తిన పలు సందేహాలను నివృత్తి చేసేందుకు పటేల్‌ రెండోసారి ప్యానెల్‌ ముందు హాజరయ్యారు. పాతనోట్ల లెక్కింపు కొనసాగుతోందని, దాదాపు రూ.17.7లక్షల కోట్ల రద్దు చేసిన నగదుకు గాను ఇప్పటి వరకు రూ.15.4లక్షల కోట్ల నగదును పంపిణీ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నేపాల్‌, సహకార బ్యాంకులు నుంచి రద్దయిన పాత నోట్లు వస్తున్నాయని, తపాలా కార్యాలయాలు, జిల్లా సహకార బ్యాంకులు ఆర్బీఐ కార్యాలయాల్లో ఇంకా పాత నోట్లను జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

మరి జమ అయిన పాతనోట్లు లెక్క ఎప్పటికి తేలేనో...ప్రధాన మంత్రి మోడీ చెప్పినట్లు పేదవాడి ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ అయ్యేనో...

తెలంగాణలో 4రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.

5గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

నెల్లూరు: 5గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిన్న యారలూరు-శ్రీకాళహస్తి మార్గంలో వాహనాల తనిఖీల్లో కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ఛేజ్ చేసి పట్టుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ముగ్గురు నేపాల్, ఒకరు చైనా, ఒకరు చెన్నై కు చెందిన వారు ఎస్పీ రామకృష్ణ తెలిపారు. వారి వద్ద నుం 30 ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

 

త్వరలో సెలవుపై వెళ్లనున్న అకున్‌సబర్వాల్‌ ?

హైద్రాబాద్: డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖుల పేర్ల వెల్లడిపై ఎక్సైజ్‌శాఖలో ముసలం మొదలైంది. ఓ పత్రికలో పేర్లు రావడంపై ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో అకున్‌సబర్వాల్‌ సెలవుపై వెళ్లనున్నారు. టాలీవుడ్‌ ప్రముఖులకు నోటీసుల జారీ నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశముంది. ఓ పత్రికలో పేర్లు రావడం వ్యూహాత్మకమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్...

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం అతణ్ని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. అయితే ఆ కీలక వ్యక్తి ఎవరన్న విషయాన్ని పోలీసులు బయటికి రానివ్వలేదు.

నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు: నందు

హైదరాబాద్: డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వర్ధమాన నటుడు నందు తెలిపారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి నోటీసు అందలేదని పేర్కొన్నాడు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి నేను సిద్ధమని తెలిపాడు.

నాకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదు : నవదీప్

హైదరాబాద్: డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబందం లేదని నటుడు నవదీప్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని, సిట్ విచారణకు సహకరిస్తానని తెలిపాడు. కెల్విన్ ఎవరో నాకు తెలియదని చెప్పాడు.

యూపీ అసెంబ్లీలో బాంబు కలకలం

లక్నో: యూపీ అసెంబ్లీలో బాంబు కలకలం రేగింది. ప్రతిపక్ష నేత కుర్చీ కింద శక్తివంతమైన పెంటా బాంబును దుండుగులు అమర్చారు. డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు బాంబు ను గుర్తించారు. ఈ నెల 12న తనిఖీల్లో బాంబును పోలీసులు గుర్తించారు. దీంతో యూపీ అసెంబ్లీ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. యూపీ సీఎం అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

సిట్ అధికారులను కలిసిన మంత్రి అయ్యన్న పాత్రుడు

విశాఖ: సిట్ అధికారులను ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు కలిశారు. భూ కుంభకోణంపై ఆధారాలను సిట్ అధికారులకు అందించారు. జిల్లాలో నా వద్దకు వచ్చిన ఫిర్యాదులన్నీ సిట్ ముందుంచానన్నారు.18న సిట్ ను కలిసి మరిన్ని వివరాలు సమర్పిస్తానని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ భూములు, రోడ్ల పై రూ. 192 కోట్ల బ్యాంకు రుణాలు పొందారని, జిల్లాలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. భూ కుంభకోణాల్లో అన్ని పార్టీల నేతలు ఉన్నారని, ఆరోపణలు రుజువు అయితే ఏ పార్టీ వారైనా విడిచి పెట్టే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు.

11:39 - July 14, 2017

చిన్న సమస్యే..కానీ పెద్ద ఇబ్బందులు...కండక్టర్లు..ప్రయాణీకుల మధ్య గొడవలు..నిత్యం బస్సుల్లో వాదనలు..మధ్యలోనే బస్సులు ఆపుతున్న డ్రైవర్లు...గమ్యానికి లేటుగా చేరుకుంటున్న ప్రయాణీకులు..

ఓ వ్యక్తి బస్సు ఎక్కాడు..టికెట్ ఇవ్వాలని అడిగి పది రూపాయల నోటిచ్చాడు..ఏడు రూపాయల టికెట్ చించి ఆ వ్యక్తి చేతికిచ్చాడు. మూడు రూపాయల చిల్లరివ్వాలని అడిగాడు..లేదు అని ఆ వ్యక్తి చెప్పాడు..నా దగ్గర లేదని..ఎంత మందికి ఇలా ఇవ్వాలంటూ కండక్టర్ రుసరుసలాడాడు..నేనేం చేయాలని ఆ వ్యక్తి..నా దగ్గర లేవని కండక్టర్..మాట..మాట పెరిగిపోయాయి...ఇలాంటి దృశ్యాలు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తోంది.

చిల్లర ఎక్కడి నుండి తేవాలి ?
ఆర్టీసీ బస్సుల్లో నిత్యం వేలాది మంది ప్రయాణం సాగిస్తుంటారు. బస్సు టికెట్ ఛార్జీలు రూ. 11, రూ. 7, రూ. 13 ఉండడంతో చిల్లర సమస్య ప్రధానంగా కొనసాగుతోంది. రూ. 11 టికెట్ కు 20 నోటిస్తే మిగతా రూ. 9 చిల్లర ఎక్కడి నుండి తేవాలని ప్రయాణీకులతో కండక్టర్లు పేర్కొంటున్నారు. తమ దగ్గర చిల్లర లేదని ప్రయాణీకులు పేర్కొంటుండడంతో సమస్య జఠిలమౌతోంది. ఇలాగా ఇతర ఛార్జీల విషయంలో కూడా జరుగుతోంది. ఆర్టీసీ బస్సు డిపో వారు చిల్లర ఇస్తారని..కావాలనే కండక్టర్లు ఇలా చేస్తున్నారంటూ కొంతమంది ప్రయాణీకులు మండి పడుతున్నారు. బస్సు డిపో వారు కొంతమాత్రమే ఇస్తారని..తాము ప్రయాణీకుడికి ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దనే భావనతో వ్యవహరిస్తామని కండక్టర్లు పేర్కొంటున్నారు.

వాదనలు..ఘర్షణలు..
చిల్లర లేనిదే టికెట్‌ ఇవ్వనని...బస్సు దిగాలని హెచ్చరించడం పరిపాటై అయిపోయ్యింది. తామేం తక్కువ తిన్నట్లు ప్రయాణికులు సైతం ఎదురుదాడికి దిగుతుండడంతో కొన్ని ఘటనలు పీఎస్ వరకు వెళ్లిన సందర్భాలున్నాయి. చిల్లర లేకపోవడం..బస్సు దిగాలని కండక్టర్ అనడం..దిగనని ప్రయాణీకుడు పేర్కొంటుండడంతో డ్రైవర్ బస్సును మధ్యలోనే ఆపేస్తున్నాడు. దీనితో ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అంతేగాకుండా ఇద్దరు..ముగ్గురికి కలిపి కండక్టర్ డబ్బులు ఇస్తున్నాడు. దీనితో ఆ డబ్బులను పంచుకోవడానికి ఆ ముగ్గురు అవస్థలు వర్ణానాతీతంగా ఉంటున్నాయి. డబ్బులను పంచుకోవడానికి దుకాణాల్లో అనవసరమైన వస్తువులు, తినుబండారాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

టికెట్ వెనుక డ్యూ..
ఎందుకు వివాదంలే అనుకుని పలువురు కండక్టర్లు ఎలాగొలా చిల్లర సర్దిస్తున్నారు. మరికొంత మంది కండక్టర్లు టికెట్ వెనుక ఎంత డబ్బులివ్వాలో రాసిస్తున్నారు. గమ్యాన్ని త్వరగా చేరుకోవాలని..ఇతరత్రా కారణాలతో ఆ డబ్బులను ప్రయాణీకుడు మరిచిపోతున్నాడు. ఆ తరువాత గుర్తుకు వచ్చినా ఏం చేసేది లేదని సదురుకుంటున్నారు. కావాలనే కండక్టర్లు ఈ విధంగా చేస్తున్నారని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాయిన్ బాక్స్ లు ఏర్పాటు చేయాలి...
చిల్లర సమస్య ఏర్పడకుండా ఆర్టీసీ బస్టాండులు..వివిధ కూడళ్లలో కాయిన్ బాక్స్ లు ఏర్పాటు చేయాలని ప్రయాణీకులు కోరుతున్నారు. రూ. 10..లేదా రూ. 20 నోటును వేస్తే రూ.2, రూ. 5 కాయిన్స్ వచ్చే విధంగా చూస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా ఉంటుందని సూచనలు వస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా ఇలాంటి కాయిన్స్ బాక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరి ఈ సమస్య ఎన్నడు తీరుతుందో వేచి చూడాలి..

11:39 - July 14, 2017

విశాఖ : జిల్లాలో వెలుగుచూసిన భూ కుంభకోణంపై సిట్‌ దర్యాప్తు ముమ్మరమైంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు నేడు సిట్‌ ముందు హాజరయ్యారు. భూకుంభకోణంపై ఆధారాలను సిట్‌కు అందించారు. సిట్‌ దర్యాప్తుపై తనకు నమ్మకముందని తెలిపారు. జిల్లాలో తనవద్దకు వచ్చిన ఫిర్యాదులను అన్నింటినీ సిట్‌ ముందుంచానని చెప్పారు. విశాఖ జిల్లాలో భూమలు అన్యాక్రాంతమవుతున్నాయని 2014సం.లోనే సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని గుర్తుచేశారు. భూకుంభకోణాల్లో అన్ని పార్టీల నేతలున్నాయని స్పష్టం చేశారు. భూస్కాంలో హస్తంఉన్నట్లు తేలితే ఏఆ పార్టీవారైనా విడిచిపెట్టమని అయ్యన్న ప్రకటించారు. ఈ నెల 19న సిట్‌ను కలిసి మరిన్ని వివరాలు సమర్పిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సీఎస్ ఎస్పీ సింగ్ తో ఐఏఎస్ అధికారులు భేటీ

హైదరాబాద్: సీఎస్ ఎస్పీ సింగ్ తో ఐఏఎస్ అధికారులు భేటీ అయ్యారు. మహబూబాబాద్ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

భారత వైమానిక దళ పారిశ్రామిక సదస్సు ప్రారంభం

హైదరాబాద్ : బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో భారత వైమానిక దళ పారిశ్రామిక సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ సభకు మంత్రి కేటీఆర, డిప్యూటీ సీఎం పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు.

11:28 - July 14, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సిట్ నోటీసులు సినీ ప్రముఖులను హడలెత్తిస్తున్నాయి. సినీ ప్రముఖులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరో వైపు సిట్ నోటీసులు ఇచ్చేందుకు రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:15 - July 14, 2017

ఖమ్మం : చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదతో నిండిపోయాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించలేదు. ఇలాగైతే లాభంలేదనుకున్నారు ఆ కాలనీవాసులు. వినూత్నంగా నిరసన తెలిపి తమ డిమాండ్ వినిపించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లబిలో రోడ్లన్నీ నీటితో నిండిపోయి నడవడానికి ఇబ్బందిగా మారింది. స్థానిక చిన్నారులు రోడ్డుపైనున్న బురదలో నాట్లువేశారు. వినూత్నంగా నిరసన తెలిపి తమ వాయిస్‌ వినిపించారు.

 

11:11 - July 14, 2017

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని నిషేధాలు కలకలం సృష్టిస్తుంటాయి. విద్యార్థులపై డ్రెస్ కోడ్..జీన్స్ వేసుకరావద్దని..ఆడవాళ్లు ముఖానికి బట్టలు కట్టుకోవద్దని..ఇలా ఎన్నో నిషేధాలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ కాలేజ్ లో విద్యార్థినీ, విద్యార్థులు ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ లో చోటు చేసుకుంది. మొరదాబాద్ లో ఉన్న 'మహారాజ హరీష్ చంద్ర పీజీ కాలేజ్' లో ఫోన్ల వాడడంపై నిషేధం విధిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. విద్యార్తినీ, విద్యార్తులు ఫోన్లను వాడుతూ అదే పరధాన్యంలో ఉంటున్నారని..అంతేగాకుండా సోషల్ మాధ్యమాల్లో కూడా పాల్గొంటున్నారని..విద్యార్థులు అదే పనిగా అమ్మాయిలతో మాట్లాడుతున్నారని..అందుకని డిసిప్లిన్ మెంటెన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా చేయాల్సి వచ్చిందని డా.విశేష్ గుప్తా ఇంటర్వ్యూలో పేర్కొన్నారని ఏఎన్ఐ కథనంలో పేర్కొంది. కొత్తగా వచ్చే విద్యార్థినీ, విద్యార్థులు కూడా నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై విద్యార్థినీ, విద్యార్థులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

10:59 - July 14, 2017

దర్శకులు నిర్మాతలవుతారు..నిర్మాతలు దర్శకులవుతారు...హీరోలు..హీరోయిన్లు కూడా దర్శకులు..నిర్మాతలుగా మారుతుండడం చూస్తూనే ఉంటాం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారారు. ఆయన నిర్మాణ సారథ్యంలో 'దర్శకుడు' అనే వెరైటీ ప్రేమ కథను వెండితెరపై చూపించబోతున్నారు. ఈసినిమాలో 'అశోక్', ‘ఈషా' హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జుక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 4వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.

రిలీజ్ కంటే ముందుగా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందులో భాగంగా ఈనెల 15న పాటల విడుదల వేడుక నిర్వహించాలని, ఇందుకు మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్' ముఖ్యఅతిథిగా పిలవాలని చిత్ర బృందం భావించింది. ‘రామ్ చరణ్' స్పెషల్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ‘చెర్రీ' చేతుల మీదుగా పాటలను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే 'రామ్ చరణ్' తాజా చిత్రం 'రంగస్థలం 1985’ షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఈ సినిమాను సుకుమార్ తనదైన స్టైల్ లో తీస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో 'రామ్ చరణ్' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది.

10:33 - July 14, 2017

విశాఖ : జిల్లా గొలిగొండ మండలం చోద్యం జెడ్ పీ హైస్కూల్ లో సీసీ కెమెరాలు కలకలం రేపాయి. గర్ల్స్ టాయిలెట్ దగ్గర దుండగులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను గుర్తించిన విద్యార్థినులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ సిసి కెమెరాల్లో మెమోరీ లేదని. ఎలాంటి వీడియో క్లిప్స్, విజువల్స్ రికార్డు కాలేదని పోలీసులు తెలిపారు. గర్ల్స్ టాయిలెట్స్ పైకప్పు లేకపోవడం గమనార్హం. అయితే బాలికల బాత్ రూమ్ లపై కప్పు లేకపోవడం వల్లే సీసీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు వీలుకల్గిందంటున్నారు. త్వరగా బాత్ రూమ్ లపై కప్పు ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపల్ చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముందు మహిళలు ఆందోళన

హైద‌రాబాద్‌: హబ్సిగూడలోని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటిముందు మహిళలు రెండోరోజూ ఆందోళన చేప‌ట్టారు. గత 15 సంవ‌త్స‌రాలుగా పెండింగ్ లో ఉన్న అమ్ముగూడా భూవివాద సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు, సైనిక్ పురి అమ్ముగూడ వద్ద 15 సంవత్సరాల క్రితం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఇళ్ళు కట్టుకుందామని అనుమతి కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకుంటే.. ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంద‌ని.. అనుమతి ఇవ్వలేమ‌ని అధికారులు చెప్పారు.

10:28 - July 14, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య'..'యుద్ధం శరణం' అంటున్నాడు. కెరియర్ ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్న చైతూ 'ప్రేమమ్'...’రారండోయ్ వేడుక చూద్దాం' విజయవంతం కావడంతో జోష్ లో ఉన్నాడు. తాజా చిత్రం 'యుద్ధం శరణం' సినిమాలో మాస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రతి నాయకుడిగా 'శ్రీకాంత్' నటిస్తుండడం విశేషం. ఆర్. వి. మారి ముత్తు దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ‘నాగ చైతన్య’ కు జోడిగా ‘లావణ్య త్రిపాఠి’ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే చిత్ర టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో 'చైతూ' హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

10:27 - July 14, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' తాజా చిత్రం 'జై లవ కుశ' సినిమాతో బిజీగా ఉన్నాడు. బాబి దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సోదరుడు 'కళ్యాణ్ రామ్' ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఏకంగా మూడు పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఒక పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ‘జై' పాత్రలో 'ఎన్టీఆర్' తనదైన స్టైల్ లో నటించి అభిమానులను అలరించాడు. నత్తితో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' పాత్రలో నటిస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ రికార్డ్స్ బద్ధలు కొడుతూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే చిత్రానికి సంబంధించిన మరో టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈసారి 'లవ' క్యారెక్టర్ ను పరిచయంతో టీజర్ ఉంటుందని తెలుస్తోంది. 'జై' రావణుడు అయితే 'లవ' రాముడిలా ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈనెలాఖరున టీజర్ రిలీజ్ అవుతుందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన భద్రతా బలగాలు..

జమ్మూకశ్మీర్ : బందీపొరా జిల్లాలోని సుంబాల్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అరస్టైన ఉగ్రవాది నుంచి పిస్టోల్, గ్రేనెడ్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దులో ఉగ్రవాదుల చొరబాటుపై ఆర్మీ జవాన్లు ప్రత్యేక నిఘా ఉంచారు.

10:16 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ ను వణుకుపుట్టిస్తోంది. డ్రగ్స్ లిస్టులో సినీ ప్రముఖుల పేర్లను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. హీరోలు తరుణ్, నవదీప్, తనీష్, నందు, రవి తేజ, క్యారెక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, హీరోయిన్స్ హీరోయిన్స్ చార్మీ, ముమైత్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేర్లను వెల్లడించారు. నటులు, నిర్మాతలు నోటీసులు అందుకున్నారు. మరికొంతమంది నటులు, ప్రొడ్యూసర్లు తెరపైకి రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకు సినీ ప్రముఖులు వీరే

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ నోటీసులు అందుకున్న సినీ ప్రముల్లో కొందరు. పూరీ జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, శ్యామ్ కె నాయుడు,తరుణ్, నవదీప్, శ్రీనివాసరావు, తనీష్, నందు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, సుబ్బరాజు వున్నారు. ఇంకా మరి కొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

10:05 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ లో వణుకు పుట్టిస్తోంది. డ్రగ్స్ రాకెట్ లో ఇవాళ మరికొన్ని పేర్లు బటయకు వచ్చే అవకాశం ఉంది. లిస్టులో ప్రముఖ నటులు, ప్రొడ్యూసర్లు ఉన్నట్లు తెలుస్తోంది. తమ పేర్లు బయటకు రాకుండా టాలీవుడ్ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ మరికొంతమందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

మహిళతో సహా ముగ్గురిని హత్య చేసిన మావోలు...

పాట్నా : బీహార్ జాముయ్ జిల్లాలోని బర్హత్ గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో మహిళతో సహా ముగ్గురిని మావోయిస్టులు హత్య చేశారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బర్హత్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిపెట్టారు.

09:56 - July 14, 2017

కలెక్టర్ ప్రీతి మీనా పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత రాజామోహన్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య పాల్గొని, మాట్లాడారు. శంకర్ నాయక్ దురహంకారంతో కలెక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. కలెక్టర్ కే భద్రతా లేకపోతే..సాధారణ మహిళ పరిస్థితి ఏంటని వాపోయారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మద్యం మత్తులో తల్లిదండ్రులను నరికేశాడు..

సూర్యాపేట : అర్వపల్లి మండలం కాసర్లపాడ గ్రామ పరిధిలోని తూర్పుతండాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తల్లిదండ్రులను గొడ్డలితో నరికాడు తనయుడు. తల్లిదండ్రులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీలో 52ఏళ్ల మహిళ దారుణ హత్య..

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళ దారుణ హత్యకు గురైంది. 52 ఏళ్ల మహిళ నిన్న రాత్రి లక్ష్మీ నగర్‌లోని తన నివాసంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ మెడపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లుగా స్పష్టమైన గుర్తులు కనిపించడంతో, పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. క్లూస్ ఆధారంగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 27 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, కాలినడకన భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టనుంది.

09:46 - July 14, 2017

హైదరాబాద్ : ప్రముఖ సింగర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శంకర్‌ మహదేవన్‌ మహిళల కోసం ఓ అద్భుతమైన గీతాన్ని పాడారు. ఉమెన్‌ యాంథెమ్‌ సాంగ్‌ ఆయన కంఠం నుంచి జాలువారింది. ఈ పాటలో శంకర్‌ మహదేవన్‌ మహిళల గొప్పతనాన్ని  ప్రపంచానికి చాటి చెప్పారు.   సుభాష్‌ సంగీతాన్ని అందించగా... రాహుల్‌ సాంగ్‌ను తీర్చిదిద్దారు. 4 నిమిషాల 36 సెకన్ల నిడివికల ఈ సాంగ్‌కు ఆడియెన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడిది యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

 

09:43 - July 14, 2017

హైదరాబాద్ : వర్షాలు లేకపోవడంతో వ్యవసాయం పనులు ముందుకుసాగక అల్లాడుతున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ నెల 16 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని  అంచనావేస్తోంది. ఇది  వాయుగుండంగా మారి  భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు  రాయలసీమలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈ  నాలుగు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. 
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం   
తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవాలు ప్రవేశంచి నెల రోజులు గడచిపోయింది. అయినా భారీ వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం పడకేసింది. పనులు ముందుకుసాగక వరుణుడి కరుణ కోసం రైతులు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నారు. ఈనెల 16న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటనతో  రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 16న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది క్రమేణా వాయుగుండంగా మారే అవకాశం ఉందని  వాతావరణ శాఖ ప్రకటించింది.  ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇస్రో కుడా ఇదే విషయం చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి, ఈ నెల 16 నుంచి 18 వరకు ఒక మోస్తరు వర్షాలు, ఆ తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.  ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. నైరుతీ రుతుపవన కాలంలో ఏర్పడే  ఈ వాయుగుండం వల్ల రుతుపవనాలు బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో పలు చోట్ల ఆరు  నుంచి 11 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదుకావొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈనెల 18న కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లకు పైగా అతి వర్షాలు కురిసే అవకాశం ఉంది.  అదే సమయంలో ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు పడతాయి. అలాగే ఈ నెల  20 నుంచి  22 వరకు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అల్పపీడనం, వాయుగుండం ప్రభావం తెలంగాణ జిల్లాలపై కూడా ఉంటుంది. 
రాయలసీమలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాపై ఈ ప్రభావం కనిపిస్తోంది. పలు  ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షపాతం నమోదైంది.  ఆ జిల్లాల్లో రానున్ననాలుగు రోజులూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. 

 

జెడ్పీ హైస్కూల్ లో బాత్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు..

విశాఖ : గొలిగొండ మండలం చోద్యం జెడ్పీ హైస్కూల్ లో బాత్ రూమ్ వద్ద దుండగులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను గుర్తించిన విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మురళి హత్యకు నిరసనగా వరంగల్ బంద్

వరంగల్: టీఆర్ ఎస్ కార్రొఏటర్ మురళీ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత దివంగత జనార్థన్ కుమారుడు విక్రమ్ అనుచరులు వరుణ్, చిరంజీవి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.మురళీ హత్యకు నిరసనగా వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో బంద్ కొనసాగుతోంది. వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కాసేపట్లో ఎంజీఎంలో మరళీ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించనున్నారు.

09:37 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంకోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్‌ను ఇచ్చేందుకు కేంద్ర రక్షణశాఖ అంగీకరించింది.. ఈ స్థలానికి ప్రతిఫలంగా ఎక్కడ ప్లేస్‌ ఇస్తారో చర్చించేందుకు ఇవాళ ఢిల్లీకి రావాలని రాష్ట్రానికి లేఖ రాసింది.. దీనిపై వెంటనే స్పందించిన సర్కారు ఇవాళ సీఎస్‌, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శిని ఢిల్లికి వెళ్లాలని ఆదేశించింది.. ప్రభుత్వ ఆదేశాలతో వీరు హస్తినకు వెళ్లనున్నారు.. అధికారంలోకి వచ్చినప్పటినుండి సచివాలయానికి వాస్తుదోషం ఉందని.. వేరేచోటికి మార్చాలని కేసీఆర్‌ భావించారు.. సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ అయితే సరిపోతుందని సూచించారు.. ఇక్కడ సెక్రటేరియట్‌ నిర్మాణానికి కేంద్ర రక్షణశాఖ అనుమతి కోరారు.. కేసీఆర్‌ విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.. దీంతో పాటు ఆర్‌ అండ్‌ బీ అధికారులు బోయిన్‌పల్లి స్కైవే నిర్మాణంపై కూడా కేంద్ర రక్షణ శాఖ  కార్యదర్శితో ఢిల్లీలో సమావేశం కానున్నారు.

 

09:33 - July 14, 2017

నల్గొండ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దెబ్బ తాకింది. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో నాణ్యతా లోపం బయటపడింది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గలంలోని కొండ భీమనపల్లి గ్రామ పంచాయితీలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఇళ్ల పనులు పూర్తి కాకుండానే లోపాలు బయటపడుతున్నాయి. మెట్ల స్లాబ్‌ విరిగిపడి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

విరిగిపడిన డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల మెట్ల స్లాబ్‌

నల్గొండ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్ల దెబ్బ తాకింది. నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం, కొండ భీమనపల్లి గ్రామ పంచాయితీలో.. డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదు. ఇళ్ల పనులు పూర్తి కాకుండానే లోపాలు బయటపడుతున్నాయి. మెట్ల స్లాబ్‌ విరిగిపడి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.  

 

జెడ్పీ హైస్కూల్ లో బాత్ రూమ్ వద్ద సీసీ కెమెరాల అమరిక

విశాఖ : గొలిగొండ మండలం చోద్యం జెడ్పీ హైస్కూల్ లో బాత్ రూమ్ వద్ద దుండగులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను గుర్తించిన విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. 

 

రంగనాయకుల ఆలయ ఈవో ఇంటిపై ఏసీబీ దాడి

నెల్లూరు : రంగనాయకుల ఆలయ ఈవో ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నెల్లూరులోని దర్గామిట్టా పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. 

 

09:15 - July 14, 2017

జీఎస్టీ అమలుతో వస్త్ర వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని.. భారం పడుతుందని వస్త్రలత వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహారావు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'జీఎస్టీ నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. విభిన్న వర్గాలు ఇప్పటికీ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. జిఎస్టీ అమలులోకి రావడానికి పూర్వమే మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన వస్త్ర వ్యాపారులు మరోసారి సమ్మెకు దిగుతున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు వస్త్ర దుకాణాలు బంద్ పెట్టేందుకు సమాయత్తమయ్యారు. జీఎస్టీ వల్ల వస్త్ర వ్యాపారం ఏవిధంగా ప్రభావితం అవుతుంది? వస్త్ర వ్యాపారులు ఆందోళనలు ఇంత తీవ్రస్థాయిలో కొనసాగడానికి కారణం ఏమిటి? ప్రభుత్వం నుంచి వస్త్ర వ్యాపారులు ఆశిస్తున్నదేమిటి? అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:09 - July 14, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కులభూషణ్‌ జాదవ్‌ తల్లి జాదవ్‌ అవంతిక జాదవ్‌కు వీసా ఇచ్చే విషయాన్ని పాక్‌ విదేశాంగశాఖ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పాక్‌ మీడియా వెల్లడించింది. గూఢచర్యం కేసులో పాక్‌ ఆర్మీ కోర్టు కులభూషణ్‌ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. కుమారుడి చూసేందుకు తనకు పాక్‌ అనుమతివ్వాలని జాదవ్‌ తల్లి వీసా దరఖాస్తు చేశారు. దీనిపై పాక్‌ స్పందించకపోవడంతో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ పాక్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌కు ఘాటుగా లేఖ రాశారు. సుష్మా జోక్యంతో ఎట్టకేలకు పాకిస్తాన్‌లో కదలిక వచ్చింది. 

 

09:05 - July 14, 2017

చెన్నై : అన్నాడిఎంకె ప్రముఖ నేత శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారు. స్పెషల్‌ కిచెన్...స్పెషల్‌ బెడ్‌...స్వేచ్ఛగా తిరగడానికి అధికారులకు లంచం ఇచ్చి తనకు కావలసిన సకల సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కావు... జైళ్ల డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రూప స్వయంగా ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నారు.
శశికళ రాజభోగాలు 
అక్రమ ఆస్తుల కేసులో జైలుశిక్ష అనభవిస్తున్న అన్నాడిఎంకె చీఫ్‌ శశికళకు బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారంలో వివిఐపి ట్రీట్‌మెంట్‌ లభిస్తోంది. జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారు. చిన్నమ్మ కోసం ప్రత్యేక వంటగది, గదిలో పరుపులు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా జైలు అధికారులు వసతులు కల్పించారు. జైళ్ల డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ రూప మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో ఈ అంశాలను పేర్కొన్నారు. జైలులో శశికళకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసేందుకు గాను ఓ అధికారికి 2 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆమె ఆరోపించారు. 
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు
పరప్పన జైలులో జరుగుతున్న మరికొన్ని విషయాలను కూడా రూప అధికారుల దృష్టికి తెచ్చారు. కొందరు జైలు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. శశికళతో పాటు స్టాంపుల స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్‌ కరీం తెల్గీ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారని నివేదిక వెల్లడించింది.  జైలులో ఖైదీలకు డ్రగ్స్‌ కూడా లభిస్తున్నట్లు రుజువైందని పేర్కొన్నారు. కొందరు ఖైదీలు డాక్టర్లు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా సీనియర్‌ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తన నివేదికపై దర్యాప్తు జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిఐజి రూప డిమాండ్‌ చేశారు.
శ‌శిక‌ళ‌కు ఎలాంటి వీఐపీ సౌక‌ర్యాలు కల్పించలేదన్న డీజీ
ప‌ర‌ప్పన అగ్రహార జైలులో శ‌శిక‌ళ‌కు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నర‌ని డీఐజీ రూపా చేసిన ఆరోప‌ణ‌ల‌పై క‌ర్నాట‌క జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణరావు స్పందించారు. శ‌శిక‌ళ‌కు ఎలాంటి వీఐపీ సౌక‌ర్యాలు క‌ల్పించడం లేదన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకార‌మే శ‌శిక‌ళ‌కు స‌హ‌క‌రిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు ఒకవేళ డిఐజి రూప ఏదైనా గమనిస్తే ఆ విషయంపై తనతో చర్చించవచ్చని, మీడియాతో మాట్లాడడం సరికాదన్నారు.

 

08:57 - July 14, 2017

హైదరాబాద్ : టీ.కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవం కోసం తపిస్తోంది. .. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించుకున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీని పటిష్ఠం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియాను చురుగ్గా వాడుకోవడం ద్వారా గెలుపు బాట పట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్ ఆర్ ఐ సెల్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అమెరికాలో పర్యటిస్తూ ఎన్‌ఆర్‌ఐ కమిటీల నియామకాలు చేపట్టారు. 
ఎన్నారై సెల్‌పైనా స్పెషల్ ఫోకస్
గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీ కాంగ్రెస్ పార్టీ..  మళ్లీ పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ముందు పార్టీ పటిష్ఠతపై దృష్టి పెట్టింది. దీంతోపాటే పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల ఏర్పాటు, వాటి నిర్వహణ అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు పార్టీ నాయకులు. ఇందులో భాగంగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, పార్టీ అనుబంధ సంఘాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్‌, మహిళ, సేవాదల్‌ కమిటీల నియామకాలు పూర్తి చేశారు. దీంతో పాటే, ఈసారి, పార్టీ అనుబంధ ఎన్నారై సెల్‌పైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 
గతంలో మొక్కుబడిగా ఉన్న ఎన్నారై సెల్‌ 
గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నారై  సెల్‌ అంటే మొక్కుబడి కమిటీగానే ఉండేది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభంజనం నేపథ్యంలో.. ప్రపంచం నలుమూలల ఉన్న పార్టీ అభిమానుల సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో.. భట్టివిక్రమార్క.. గడచిన నెలరోజులుగా అమెరికాలో పర్యటించారు. న్యూయార్క్, లాస్ ఏంజిలస్‌, న్యూ జెర్సీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వెగాస్ లతో పాటు 21 రాష్ట్రాలలో క‌మీటీల‌ను ఏర్పాటు చేశారు. ఒక కన్వీనర్‌తో పాటు 10 మంది సభ్యులతో కమిటీలను నియమించారు. 
ఎన్నారై సెల్ కు యాక్షన్ ప్లాన్ ఇచ్చిన విక్రమార్క
ఇక ఎన్నారై  సెల్‌ ఎలాంటి సహకారాలు అందించాలనే దానిపైనా కమిటీలకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు విక్రమార్క. దీనికోసం వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లతో సోషల్ మీడియాను టీపీసీసీకి అనుసంధానం చేస్తూ ఎన్నారై  సేవలను వాడుకోనున్నారు. కొత్త కమిటీల సేవలు పార్టీకి ఏ మేరకు లాభిస్తాయో వేచి చూడాలి. 

08:54 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు తయారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కిరాదని తేల్చి చెప్పింది. తుది నివేదిక సమర్పించడానికి మరో రెండు నెలల గడువు కోరింది. దీంతో ఫీజులు తగ్గుతాయని ఆశపడ్డ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. 
ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు మార్గదర్శకాలు తయారు చేసేలా తెలంగాణ ప్రభుత్వం గత మార్చిలో ఓ కమిటీని నియమించింది. ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ  తుది నివేదికను సమర్పించాల్సి ఉంది. అయితే పలు కారణాలతో కమిటీ ప్రభుత్వాన్ని గడువు కోరుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం మరో రెండు నెలల గడువును పొడిగించింది. 
కొలిక్కి రాని కమిటీ నివేదిక
ఇప్పటికే అనేక సార్లు సమావేశాలు నిర్వహించిన కమిటీ సభ్యులు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అయినా కమిటీ నివేదిక ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ప్రొ.తిరుపతిరావు కమిటీ ఉద్దేశ పూర్వకంగానే నివేదికను ఆలస్యం చేస్తోందని పేరెంట్స్ అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి.  ప్రైవేటు స్కూల్స్ ఒత్తిడి మేరకే కమిటి నివేదిక ఇవ్వడంలేదని విమర్శిస్తున్నాయి.
తల్లిదండ్రుల ఆగ్రహం 
అయితే ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులు పరిశీలించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటే మంచిదని కమిటీ సభ్యులు తేల్చి చెప్పడంతో  విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెకెండ్ టర్మ్ ఫీజు చెల్లించే నాటికైనా ఫీజుల నియంత్రణపై క్లారిటి వచ్చేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

08:50 - July 14, 2017

రంగారెడ్డి : అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తే మరో అవినీతి తిమింగలం దొరికింది...పరిశ్రమల శాఖలో చీఫ్ ఇన్‌స్పెక్టర్‌గా చేస్తున్న వెంకన్నకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఆస్తులున్నాయి....ఏకకాలంలో ఏసీబీ దాడులు చేయగా దాదాపు 15 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది...
అవినీతి సొమ్ముతో ఆస్తులెన్నో...
రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ చీఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకన్న...అధికారిగా ఎన్నో ఆస్తులు జమ చేశాడన్న సమాచారంపై ఏసీబీ కన్నేసింది..వచ్చిన సమాచారంతో వివరాలు ఆరాతీయగా తవ్వినకొద్ది ఆస్తుల చిట్టా బయటపడుతుంది...వెంకన్న ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు...మియాపూర్, మదీనగూడ, కృషి నగర్‌లలోని వెంకన్న ఇళ్లలో.. తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి...ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు.. ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నారు....
పది కోట్లకు పైగా ఆస్తులు వెలుగులోకి..
పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా చీఫ్‌ ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఇల్లు మియాపూర్ లోని కృషినగర్, మాసబ్ ట్యాంక్ లోని పరిశ్రమలశాఖ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు...మియాపూర్ లోని ఆయన నివాసంలో రెండున్నర లక్షల నగదు, భూమిపత్రాలు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఆయన భార్య పేరు మీద‌ పది బ్యాంకు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. మియాపూర్ లోని 5 కోట్ల రూపాయల విలువైన ఇళ్లు వెంకన్న పేరు మీద ఉందని ఏసీబీ గుర్తించింది...
ఏకకాలంలో దాడులకు 12 బృందాలు..
వెంకన్న ఆదాయానికి మించి ఆస్తుల చిట్టాను వెలుగులోకి తెచ్చేందుకు ఏసీబీ అధికారులు  నిజామాబాద్ లోని అతని బందువుల ఇంళ్లపై దాడులు నిర్వహించారు...హైదరాబాద్ డిఎస్పి రవి కుమార్ , నిజామాబద్ డిఎస్పి నరేంద్ర రెడ్డిల సమక్షంలో వెంకన్న మామ ఇంటితో పాటు,అద్దెకు ఉన్న ఇళ్లు..కొత్తగా నిర్మిస్తున్న భవనాలను తనిఖీలు చేశారు.. ఈ దాడులలో 23 ఎకరాల భూమి పత్రాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు స్వాదీనం చేసుకున్నారు...మరోవైపు సూర్యాపేట జిల్లాలోనూ వెంకన్న ఆస్తులు గుర్తించారు..అక్కడ ఉన్న భవనాలతో పాటు...ఆ ఇళ్లలో సోదాలు చేయగా కీలకమైన సమాచారం దొరికింది..వెంకన్న ఆస్తులపై కొనసాగుతున్న దాడుల్లో దాదాపు పదిహేను కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయని అంచనా వేస్తున్నారు...అధికారిక లెక్కల తర్వాత ఆస్తుల విలువను ప్రకటించనున్నారు.

 

 

బి.వెంకట్ తల్లి నాగరత్మమ్మ మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ సంతాపం

ఖమ్మం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ తల్లి నాగరత్మమ్మ మృతికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు కాసాని ఐలయ్య, పొన్నం వెంకటేశ్వర్ రావులు సంతాపం తెలిపారు.   

సీపీఎం నేత బి.వెంకట్ కు మాతృవియోగం

ఖమ్మం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ కు మాతృ వియోగం కలిగింది. జూలూరుపాడు మండలం వినోబానగర్ లో వెంకట్ తల్లి నాగరత్మమ్మ (86) కన్నుమూశారు. మధ్యాహ్నం 12 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. 

08:35 - July 14, 2017

కృష్టా : ఏపీలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. పట్టపగలే రెచ్చిపోతున్నారు. బెజవాడనగరం నడిబొడ్డున భారీ దోపిడీకి పాల్పడ్డం సంచలనంగా మారింది. వరుస చోరీలతో వణికిపోతుంటే.. పోలీసులు మాత్రం దొంగలను వదిలే ప్రసక్తేలేదంటూ పాతడైలాగులే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. 
మారణాయుధాలతో దొంగల హల్‌చల్‌ 
దొంగల భయంతో విజయవాడ జనం వణికిపోతున్నారు. నరగం నడిబొడ్డున ప్రీప్లాన్డ్‌గా దోపిడీలకు పాల్పడుతున్నారు. సాధారణంగా ఏ అర్థరాత్రో అపరాత్రో  తమపని కానిచ్చే చోరులు.. రాత్రి 9గంటలకే  రెచ్చిపోయారు. విజయవాడ నగరం నడిబొడ్డున మారణాయుధాలు చేతపట్టిన దొంగలు స్వైరవిహారం చేశారు.  పోలీసులకు సవాల్ విసిరారు.  
బెజవాడ చోరీలో ఇంటిదొంగల హస్తం..!
జులై 11వ తేదీ రాత్రి 9గంటలకు  బీసెంట్‌రోడ్‌లో జరిగిన దొంగతనంతో బెజవాడ హడలిపోయింది. నగలతయారీ కేంద్రంలో ఏకంగా 2.5కోట్ల రూపాయల విలువైన  7కిలోల బంగారాన్ని దోపిడీ చేయడం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ  భారీ చోరీపై పోలీలు పలు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఈ చోరీలో ఇంటిదొంగల హస్తం కూడా ఉండొచ్చంటున్నారు.  పైగా ఇక్కడ పనిచేసే కార్మికుల్లో చాలా మంది బీహార్‌, బెంగాల్‌ ప్రాంతాలకు చెందినవారు కావడంతో.. ఈపనిచేసింది కచ్చితంగా బీహార్‌ దొంగల గ్యాంగులే అంటున్నారు పోలీసులు. 
రోబరీపై సీఎం చంద్రబాబు ఆరా
మరోవైపు  చోరీ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబుకూడా ఆరాతీశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ డీజీపీ సాంబశివరావు  కేసును  సీరియస్‌గా తీసుకున్నారు.  ఒకేసారి విశాఖపట్నం, కర్నూలు, విజయవాడలో చోరీలు జరగడంపై పోలీసులను అప్రమత్తం చేశారు.  అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్‌కమిషనర్‌ సూచిస్తున్నారు. బంగారం వ్యాపారులు ఆధునిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. 
ఇంటిదొంగలు లేకుండా ఇంత పెద్ద చోరీ ఎలా ..? 
మొత్తానికి ఇంటిదొంగల ప్రమేయం లేకుండా ఇంత పెద్దమొత్తంలో రాబరీ జరగడం అసాధ్యమని నమ్ముతున్న పోలీసులు..
ఆదిశగా విచాఱణ చేపట్టారు. ఇప్పటికే స్పెష్‌టీమ్‌లను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇతరరాష్ట్రాలకు కూడా పోలీస్‌ బృందాలను పంపి దొంగల ఆచూకీ కోసం ప్రత్నిస్తున్నారు. అటు వరుసగా జరుగుతున్న దొంగతనాలతో కంటిమీద కనుకులేకుండా పోయిందని.. నగరంలో నిఘాను మరింత పెంచాలని పోలీసులను కోరుతున్నారు జనం.  

 

08:31 - July 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో  టామ్‌ అండ్‌జెర్రీ గేమ్‌ రంజుగా నడుస్తోంది ..! అధికార్లపై గరం అవుతున్న నేతలు  రోజుకో వివాదం రాజేస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తమను చిన్నపు చూస్తున్నారని గులాబీపార్టీ నేతలు గుస్సా అవుతున్నారు.   అధికారులు వర్సెస్‌ ప్రజాప్రతినిధులు ఉప్పు నిప్పుల పంచాయతీతో రాష్ట్రంలో  పాలన గాడితప్పుతోందనే విమర్శలు వస్తున్నాయి. 
సొంతపార్టీ నేతల నుంచే సీఎం కు చిక్కులు
తెలంగాణా  ముఖ్యమంత్రి కెసిఆర్ కు సొంత పార్టీ నేతల నుంచే కొత్త  చిక్కులు ఎదురౌతున్నాయి.  10జిల్లాలను 31కిపెంచి.. పాలనను పరుగులెత్తిస్తామని సీఎం చెబుతుంటే.. దుందుడుకు వైఖరితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అధికారులతో కయ్యంపెట్టుకుంటున్నారు. తాజాగా  ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అమర్యాదగా ప్రవర్తించారి మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనా ఫైర్‌ అవడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టింది.
ముత్తిరెడ్డి వర్సెస్ కలెక్టర్  దేవసేన 
ఇటీవలే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్  దేవసేనను బహిరంగంగానే నిలదీసినంత పనిచేశారు. తనకు సమాచారం ఇవ్వడం లేదని కలెకర్టపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కరీంనగర్ కలెక్టర్ పై  ఎమ్మెల్యే రసమయి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సదరుఅధికారి ధీటుగా సమాధానం ఇవ్వడం చర్చనీయంశంగా మారింది. అంతకు ముందు టీఆర్‌ఎస్‌ ఎంపీ సుమన్ ప్రోటోకాల్ వివాదంలో కలెక్టర్‌ను టార్గెట్‌చేస్తూ నిప్పులు చెరిగారు. మరోవైపు  మహబూబ్ నగర్  కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌కు  ఎక్కడా పొసగడం లేదు. శ్రీనివాస్‌గౌడ్‌ కలెక్టర్‌ కు వ్యతిరేకంగా ధర్నా కూడా నిర్వహించడం..వివాదాస్పదంగా మారంది. గతంలో మహబూబ్‌నగర్‌లో పనిచేసిన కలెక్టర్ శ్రీదేవికి ప్రజాప్రతినిధులకే బేధాభిప్రాయలు తీవ్రం కావడంతోనే ఆమె బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. 
సీఎం వైఖరిపై గులాబీ నేతల అసంతృప్తి 
ఇంతకీ గులాబీపార్టీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఎందుకు అంతలా మండిపడుతున్నారన్న ప్రశ్నకు.. అధికారులెవరూ వారి మాట వినడం లేదనే సమాధానం వస్తోంది. దీనికి సీఎం కేసీఆర్‌ వైఖరి కూడా కారణం అని అధికారపార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన వ్యవహారాలన్నీ  కేసీఆర్‌తోనే  ప్రత్యక్షంగా మాట్లాడుతూ కలెక్టర్లు  చక్కబెడుతున్నారు. దీంతో పాలనలో తమకు ప్రాధాన్యత లేకుండా పోతోందని ప్రజాప్రతినిధులు గుర్రుగా వున్నారు. అందుకే ముఖ్యమంత్రిపై ఉన్న అసంతృప్తిని ఇలా అధికారులపై చూపిస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ మనోగతాన్ని గుర్తించి.. అధికారుల పెత్తనానికి కళ్లెం వేయాలని .. గులాబీపార్టీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. లేదంటే..పార్టీతోపాటు పాలనకూడా గాడితప్పడం ఖాయం అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

 

06:55 - July 14, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం నంద్యాలకు వరాల జల్లులు కురిపిస్తుంది. ఓ వైపు నామినేటేడ్ పదవులు,.మరోవైప భారీగా నిధులు నంద్యాలకు కేటాయిస్తున్నారు. ఆ శాఖ-ఈ శాఖ అని తేడా లేకుండా అన్ని శాఖలు నంద్యాల మీద ఎక్కడా లేని ప్రేమను చూపిస్తున్నాయి. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం,.ఇప్పుడు ఏకంగా భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం పట్ల అన్ని వర్గాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 
నంద్యాల నియోజక వర్గానికి నిధుల విడుదల 
ఉప ఎన్నిక ఎఫెక్ట్ నంద్యాలపై బాగా పని చేస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా ప్రకటించకముందే,.నియోజకవర్గంపై ప్రభుత్వం నిధులు వరద పారిస్తుంది. పది రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక శాఖ నుండి నంద్యాల నియోజక వర్గానికి నిధులను విడుదల చేస్తునే ఉన్నారు. నంద్యాలకు నిధులు కేటాయించడం ద్వారా రాబోయే ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవాలన్నది ప్రభుత్వం వ్యూహంగా కనబడుతోంది. ఇప్పటికే ఉప ఎన్నికలో గెలవడం కోసం మంత్రులూ, ఎమ్మెల్యేలు నంద్యాలలో పాగా వేయగా, మరోవైపు ప్రభుత్వం నుండి పది రోజులు భారీగా నిధులు విడుదల చేస్తున్నారు. 
భారీ మెజారిటి సాధించాలనే లక్ష్యం 
టీడీపీ ప్రభుత్వానికి నంద్యాల ఉప ఎన్నిక ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. భూమానాగిరెడ్డి మృతి తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలో  గెలుపు సాధించి, నైతికంగా వైసీపీని దెబ్బ కొట్టాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. అందుకే నంద్యాల అసెంబ్లీ ఎన్నికకు ఆరుగురు మంత్రులను ఇంచార్జీలుగా నియమించారు. జిల్లా మంత్రులు కేఈ కృష్ణమూర్తి , అఖిల ప్రియతో పాటు,..కాల్వ శ్రీనివాసులు, డాక్టర్‌ నారాయణ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు బాధ్యత అప్పగించారు. ఇక ప్రభుత్వ పరంగా పది రోజుల నుంచి నంద్యాలకు సంబందించిన పనులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. జూన్ 3న జరిగిన క్యాబినెట్లో 42 లక్షలు విలువతో  హౌసింగ్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాదు మున్సిపల్‌, రోడ్స్ అండ్‌ బిల్డింగ్స్‌ లోకేష్  ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ నుంచి ఒక్క రోజులో 4 జీవోలు విడుదల చేసి వందకోట్లు నంద్యాల చుట్టుప్రక్కల గ్రామాలకు కేటాయించారు. వీటితో పాటు కాపు కార్పొరేషన ద్వారా నంద్యాలలో 3 కోట్ల రూపాయలతో కాపు కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వైద్య ఆరోగ్యశాఖ నుండి నంద్యాల ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి, వైద్య పరికరాల కొనుగోలు కోసం ఐదున్నర కోట్లు విడుదల చేశారు. 
గెలుపుతో వైసీపీని దెబ్బకొట్టాలనే వ్యూహం 
అయితే నంద్యాలకు  కేటాయిస్తున్న నిధులతో నిజంగా అభివృద్ధి జరుగుతుందా అంటే జరగదనే సమాధానం వస్తుంది. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడం కోసం నిధులు కేటాయింపులతో పాటు నామినేటెడ్ పదవులను భారీ ఎత్తున భర్తీ చేశారు. నంద్యాలలో ఉన్న ముస్లింల ఓటు బ్యాంకు కొల్లగొట్టడం కోసం జిల్లాలో మైనారిటీలకు ప్రాధ్యానత్యను పెంచారు. ఇలా అన్ని వైపుల నుండి నంద్యాల నియోజక వర్గానికి నామినేట్ పదవులు, నిధుల కేటాయించి భారీ మెజారిటీతో గెలవాలని చంద్రబాబు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రజల చూపు నంద్యాల ఉప ఎన్నికల పైన ఉండడంతో అధికార పార్టీ ఎక్కడ తగ్గకుండా నిధులు మంజూరు చేస్తుంది. మరి అధికారి పార్టీ ఎత్తుగడలపై ప్రతిపక్షాలు ఏవిధంగా రెస్పాండ్ అవుతాయో చూడాలి. 

 

06:50 - July 14, 2017

వరంగల్ : నగరంలో కలకలం రేగింది...కార్పోరేటర్ అనిశెట్టి మురళి తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు...ఇంట్లోకి నేరుగా వచ్చిన ముగ్గురు వేటకొడవళ్లతో నరికేశారు...చనిపోయాడని నిర్ధారణ కావడంతో నేరుగా వెళ్లి పోలీసు స్టేషన్లో లొంగిపోయారు హంతకులు..
ఇంట్లోనే వేటకొడవళ్లతో నరికిన ప్రత్యర్థులు..
వరంగల్‌ హన్మకొండలోని కుమార్‌పల్లిలోని తన ఇంట్లో ఉన్న కార్పోరేటర్ అనిశెట్టి మురళి హత్యకు గురయ్యాడు... ఇంట్లో వచ్చినవారితో మాట్లాడుతుండగా వచ్చిన ముగ్గురు వేటకొడవళ్లు తీసి దారుణంగా నరికేశారు..రక్తపు మడుగులో కుప్పకూలిన మురళి అక్కడే మృతి చెందాడు..
పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన ముగ్గురు..
కార్పోరేటర్‌గా ఉన్న అనిశెట్టి మురళీ గతంలో జనార్థన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు...ఆ తర్వాత కక్ష పెంచుకున్న జెన్నీ కుమారులు అవకాశం కోసం చూస్తున్నారు...జెన్నీ కుమారుడు విక్రమ్ జాతీయ పార్టీ గుర్తుతో కార్పోరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.. వ్యాపారాలు చేసుకుంటున్న విక్రమ్ అవకాశం దొరగ్గానే మురళిని నట్టింట్లోనే చంపేసి నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయారు...అనిశెట్టి మురళి హత్యతో నగరంలో కలకలం రేపింది...

 

విశాఖ మన్యంలో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా

విశాఖ : మన్యంలో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. పాడేరు ఐటీడీఏ ఆందోళనలో కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. 

 

నేడు విశాఖ అర్బన్, రూరల్ టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం

విశాఖ : నేడు అర్బన్, రూరల్ టీడీపీ కమిటీల ప్రమాణ  స్వీకారం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చిన రాజప్ప పాల్గొననున్నారు. 

 

Don't Miss