Activities calendar

15 July 2017

22:06 - July 15, 2017

దగపడ్డ ఓ చెల్లి వనుకుతుంది...ప్రతి రోజు మారుతున్న డేట్ ను చూసుకొని బయపడింది...రోజలు గడుస్తున్నాయి..కానీ తనకు దారిలేదు..వారాలు దొర్లిపోతున్నాయి..కానీ తనకు తప్పించుకునే మార్గం లేదు. నెలలు గడుస్తున్నాయి విధి అడుకుంటుంది..చావు దగ్గరై చూసింది.. మరణం దగ్గర నుంచి చూసింది. ఆమె 90 రోజులు నరకం అనుభవించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

21:55 - July 15, 2017

చెన్నై : తమిళనాడులో బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. బిగ్‌బాస్‌ షోను వెంటనే నిలిపివేయాలంటూ శివసేన, హిందూమున్నని, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కమల్‌హాసన్‌ కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. 

21:54 - July 15, 2017

పాటియాలా : పంజాబ్‌లోని పాటియాలాలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందనే నెపంతో ఓ కుటుంబం అమానుషానికి పాల్పడింది. సమీప బంధువు, మరో వ్యక్తి ఓ మహిళపై హాకీ స్టిక్స్‌తో విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళపై దాడి చేస్తుంటే.. అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మీనా కశ్యప్‌, దల్జీత్‌ సింగ్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయన దగ్గర్నుంచి అత్తింటివారు మీనాను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు మితిమీరడంతో మీనా, దల్జీత్‌ వేరు కాపురముంటున్నారు. ఈ మధ్యే మీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంతే దీన్ని సాకుగా చేసుకున్న ఆ కుటుంబం మరింత రెచ్చిపోయింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తూ దల్జీత్‌ సోదరుడు, అతని స్నేహితుడు ఆమెను హాకీ స్టిక్‌లతో అతి దారుణంగా కొట్టారు. ఆ మహిళ కొట్టవద్దని ఏడుస్తున్నా.. వదిలిపెట్టలేదు. సోషల్‌​ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కావడంతో.. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

21:53 - July 15, 2017

విజయవాడ : భవానీపురం చర్చి సెంటర్‌లోని స్వాతి వైన్స్ దుకాణంపై ఐద్వా మహిళలు దాడి చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మహిళలు మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల అరెస్టును నిరసిస్తూ భవానీపురం పోలీస్ స్టేషన్ వద్ద ఐద్వా మహిళలు ఆందోళనకు దిగారు. 

21:52 - July 15, 2017

మహబూబునగర్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సాహసం చేశారు. రోప్‌వేపై ఒక పక్కనుంచి మరో పక్కకు ప్రయాణించి అందరినీ ఆకట్టుకున్నారు. మంత్రితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అడ్వంచర్స్‌ చేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వంచర్‌ పార్క్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రులు- నేతలు ఈ సాహసం చేశారు. 

21:51 - July 15, 2017

మహబూబునగర్ : జిల్లా కేంద్రంలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో పాలమూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దంటూ కేటీఆర్ చెప్పారు. 

21:50 - July 15, 2017

హైదరాబాద్ : పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. ఉభయ సభల్లో హైలెట్‌ చేయాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్... పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని వైసీపీ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి.. పోలవరం లాంటి అంశాలను కేంద్రపరిధి లోకి తేవాలని.. చర్చించనున్నారు. అలాగే జీఎస్‌టీ నుంచి టెక్స్‌టైల్స్‌ను మినహాయించాలనే డిమాండ్‌ను కూడా ఉభయ సభల్లో ఉంచబోతున్నారు. అలాగే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్‌పై అన్ని పార్టీల మద్దతు కోరాలని నిర్ణయించారు. అదేవిధంగా ప్రభుత్వపరంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరనున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా.. తెలుగుదేశం పార్టీకి మాత్రం నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియే ప్రాధాన్యంగా ఉందని వైసీపీ నాయకులు ఆరోపించారు. నియోజక వర్గాల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెమ్మని సొంత పార్టీ ఎంపీలకు సూచించడం... ప్రజా సమస్యలపై ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు.

కాగా శుక్రవారం మంత్రి లోకేశ్‌ను కలిసిన బుట్టా రేణుక ఈ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చానీయాంశంగా మారింది.  

21:49 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ మాఫియా కేసులో సిట్ తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు కీలక నిందితుడైన కెల్విన్‌తో పాటు ఏ-2 అబ్దుల్‌ కుదుస్‌, ఏ-3 అబ్దుల్ వాహెబ్‌లను కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 3 నుంచి చర్లపల్లి జైల్లో ఉంటున్న ఈ ముగ్గురిని అబ్కారీ శాఖ కార్యాలయానికి తరలించారు. కెల్విన్‌ కాల్‌లిస్ట్‌, వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా విచారణ జరిగింది. విచారణలో కెల్విన్, ఖుద్దుస్‌, వాహెబ్‌లు సిట్‌ అధికారులకు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. డ్రగ్స్‌ మాఫియా డాన్‌ కెల్విన్‌కు సినీ పరిశ్రమతో నాలుగేళ్లుగా సంబంధాలున్నట్లు విచారణలో తేలింది. ఎల్ఎస్ డీ డ్రగ్స్ కోసం తనను సినీ ప్రముఖులు సంప్రదించారని..తన కస్టమర్లలో కొంతమంది టాప్ హీరోలు కూడా ఉన్నట్లు తెలిసింది. కెల్విన్ కాల్‌డేటాలో 2వేలకు పైగా ఫోన్ నంబర్లు ఉన్నాయి. మరో నిందితుడు నిఖిల్‌శెట్టి కాల్‌డేటాలో దాదాపు 1500 పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈవెంట్ మేనేజర్స్‌తో కలిసి డ్రగ్స్ సరఫరా చేసినట్లు కెల్విన్ విచారణలో వెల్లడించాడు. జర్మనీ, నెదర్లాండ్స్‌ నుంచి డ్రగ్స్ తెప్పించి టాలీవుడ్ స్టార్స్‌కు సరఫరా చేసినట్లు సిట్‌ బృందానికి చెప్పినట్టు తెలుస్తోంది.

రెండో జాబితా సిద్ధం
సిట్‌ విచారణలో కెల్విన్‌ వెల్లడించిన సమాచారం ఆధారంగా రెండో జాబితాను సిట్‌ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలో సినీ పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇద్దరు బడా నిర్మాతల పుత్ర రత్నాలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా యువతను ఉర్రూతలూగించిన మరో సంగీత దర్శకుడు, ఆయన సోదరుడికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో సక్సెస్‌ సాధించి..సినీ నేపథ్యం ఉన్న ఓ అగ్రహీరోకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉదయం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ముగ్గురు నిందితులను విచారించిన సిట్ సభ్యులు...ఆ తర్వాత కెల్విన్‌ను బాలానగర్‌ ఎక్సైజ్ పీఎస్‌కు, మిగిలిన ఇద్దరిని చార్మినార్ ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించారు.

కెల్విన్‌ అమాయకుడని
అయితే డ్రగ్స్ రాకెట్ కేసులో ప్రధాన సూత్రధారి, పోలీసులు అరెస్టు చేసిన తన కొడుకు కెల్విన్‌ అమాయకుడని అతడి తండ్రి జవహర్‌ అన్నారు. కెల్విన్‌ డ్రగ్స్‌కు బానిసైన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో అతడికి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిందితులు బయటకు వస్తారన్నారు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదిపేస్తున్న తరుణంలో..సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు యువ హీరోలు, నటులు దీనిపై స్పందించగా..తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. ఏ విషయంపైనా, ఎవరి గురించీ తాను ఏ ప్రకటనా చేయలేదని..పైసావసూల్ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా గడుపుతున్నానంటూ పూరీ జగన్నాథ్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కాగా, ఎక్సైజ్ సిట్ నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖుల్లో పూరీ జగన్నాథ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

సెలవులను రద్దు చేసుకున్న సబర్వాల్
రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో శనివారం మరో కీలక పరిణామం జరిగింది. డ్రగ్స్‌ వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌..ఉన్నట్టుండి తన సెలవులను రద్దు చేసుకున్నారు. 10 రోజుల సెలవుపై వెళ్తున్నట్లు శుక్రవారం ప్రకటించడంతో..పలు అనుమానాలు తలెత్తాయి. అయితే డ్రగ్స్‌ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున..దర్యాప్తు పూర్తయ్యేంతవరకు తన సెలవులను రద్దు చేసుకుంటున్నట్టు అకున్ సబర్వాల్‌ ప్రకటించారు. అకున్ సబర్వాల్‌ సెలవులపై స్పందించిన సీఎం కేసీఆర్‌..డ్రగ్స్‌ కేసు కీలక దశలో ఉన్నందున..లీవ్ పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని..సెలవులను వెంటనే రద్దు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్వ్‌ అయిన ఎవరినీ వదలొద్దని..ఈ దందాలో ఉన్న అందరి పేర్లును బయట పెట్టాలని అకున్‌ సబర్వాల్‌కి ఆదేశాలు జారీచేశారు. డ్రగ్స్ కేసులో ఎవరినీ కాపాడే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని అకున్‌ సబర్వాల్‌కి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అకున్‌ సబర్వాల్‌..నార్కొటిక్‌ చీఫ్‌తో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ సిట్‌ అధికారుల ముందు వెల్లడించిన సమాచారంతో రెండో జాబితా రెడీ అవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

21:09 - July 15, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రక్తత నెలకొంది. అధికారులు నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయిస్తున్నారు. హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు వీసీ రెసిడెన్సీ ముందు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:34 - July 15, 2017

లంచంతీసుకుంటూ పట్టుబడ్డ ఫుడ్ అనలిస్ట్

హైదరాబాద్ : నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో ఫుడ్ అనలిస్ట్ రవీందర్ రూ.1.25లక్షల తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. కల్తీ బిర్యానీ ఘటనలో రిపోర్టు తారుమారుకు లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.

 

ఓయూలో పీజీ హాస్టళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత

హైదరాబాద్ : ఓయూ పీజీ హాస్టళ్లకు అధికారులు విద్యుత్ సరఫరా నిలివేశారు. కరెంటు నిలిచిపోవడంతో విద్యార్థులు వీసీ రెసిడెన్సీ ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు.  

20:14 - July 15, 2017

పార్టీలు వెట్టినోళ్లు ఎవ్వలు ఎన్నికలళ్ల పోటీ జేస్తందుకు వీలు లేదని అంటే.. కాంగ్రెసోళ్లు పార్టీ వెడ్తుండెనా..? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ వెడ్తుండేనా..మన సంగారెడ్డి కలెక్టర్ సారుకట.. మెడల టీఆర్ఎస్ పార్టీ కండువ ఏస్తే సరిగ్గ సరిపోతదంటున్నడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు..మన తెలంగాణ పోలీసోళ్లకు కొత్త ఇన్నోవా కార్లు ఇచ్చెగదా..? దాని ఎన్క బాధుకు జీపీఆర్ఎస్ సిష్టం అది ఇది లొట్టపీసు అని ముచ్చట్లు జెప్పిండ్రు ఆ సిస్టం ఎటువొయ్యిందో ఏమైందోగని..మన్సులకు పుట్టిన రోజులు జేయంగ జూశ్నం.. కుక్కలకు నక్కలకు.. పిల్లులకు జేయంగ జూశ్నంగని.. చెట్లకు గూడ పుట్టిన రోజు జేశ్నోళ్లను జూశ్నమా..? ఆ లోటు భర్తీ జేశిండ్రు ఒకతాన.. డబుల్ బెడ్రూం ఇండ్లకు దర్కాస్తు జేస్కున్న ప్రజలారా..? మీరు ఎంటనే ఒక గట్టి ఎల్లైసీ పాలసీ గూడ జేపిచ్చుకోండ్రి ఇంటిల్లిపాదికి.. పుసుక్కున ఏమన్న తేడా వచ్చినా.. తల్లి మంచిగ మోపైండ్రొసు.. నిన్ననేగాదూ.. మనం జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ బాగోతం గూరించి చెప్పుకున్నది.. ఇగో ఇంకో రెడ్డిగారు దొర్కిండు..మొన్న మహబూబాబాద్ కలెక్టర్ మేడానికి చెయ్యిదల్గినందుకే ఎమ్మెల్యే శంకర్ నాయకును ముక్కునాలకు రాపిచ్చి మూడు చెర్వుల నీళ్లు దాపిచ్చిండ్రు ఈ సర్కారోళ్లు..అటు ఆంధ్రల గూడ చంద్రబాబు బాగనే వాడుతున్నట్టుండుగదా..? పోలీసోళ్లను.. ఆయనకు వ్యతిరేకంగ ఎవ్వలు మాట్లాడినా పోలీసోళ్లను వంపుడు అరెస్టులు జేసుడు సేమ్ తెలంగాణల జేస్తున్నట్టే జేస్తున్నడు..వీఎన్ఆర్145 ఈ పేరుతోని ఉండే మిర్పకాయ ఇత్తునాలు కొనకుండ్రే రైతన్నలు.. అద్భతమైన దిగుబడి.. ఇంట్ల సిరుల పంట అని చెప్తె వరంగల్ దిక్కు రైతులు ఏశిండ్రట.. ఏశిన శేను ఏశినట్టే ఉన్నది.. 

19:52 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. కెల్విన్, ఖుద్దూష్‌‌, వహాబ్‌ను కస్టడీలో విచారించిన సిట్... విచారణలో పలువురు మరికొందరు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించారు. కెల్విన్ కస్టమర్లలో కొంతమంది టాప్ హీరోలు ఉన్నట్టు సమాచారం. కెల్విన్ కాల్‌డేటాలో 2వేలకు పైగా ఫోన్ నంబర్లు ఉన్నాయి. నిఖిల్‌శెట్టి కాల్‌డేటాలో దాదాపు 1500 పేర్లు ఉన్నాయి. ఈవెంట్ మేనేజర్స్‌తో కలిసి కెల్విన్... డ్రగ్స్ సరఫరా చేశాడు. వీటిని జర్మనీ, నెదర్లాండ్స్‌ నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు తెలిపింది. మరోవైపు విచారణ ఆధారంగా ఎక్సైజ్ శాఖ మరో జాబితా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్‌ను తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇద్దరు నిర్మాతల..పుత్ర రత్నాలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. యువతను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కూడా జాబితాలో ఉన్నట్టు సమాచారం.వ్యాపార రంగంలో సక్సెస్‌ సాధించిన..సినీ నేపథ్యం ఉన్న ఓ అగ్రహీరోకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

19:31 - July 15, 2017
19:28 - July 15, 2017

వ్యక్తిగతంగా చేసిన తప్పుకు సినీఇండస్ట్రీని బలిచేయడం తప్పని, చిన్నపిల్లకు సైతం డ్రగ్స్ సరఫరా చేయడమనేది మంచిది కాదని, చేసిన వారు ఎంత పెద్దవాళ్లైన వదిలేది లేదని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షడు ప్రతాని రామకృష్ణ అన్నారు. బంగారపు ఇటుకలతో ఏవీఎం, సురేష్ ప్రొడక్షన్ నిర్మించారని, గొప్ప గొప్ప నటులు ఉన్న తెలుగు సినీరంగం మారిందని నటి కవిత అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:12 - July 15, 2017
19:10 - July 15, 2017

విశాఖ : విశాఖజిల్లా, పాయకరావుపేట నియోజకవర్గ భౌగోళిక, రాజకీయ స్వరూపం భిన్నంగా ఉంటుంది. తాండవ, వరాహ నదులు ఒకవైపు.. జిల్లాలో పూర్తిగా తీరప్రాంతం ఉన్న ఏకైక నియోజక వర్గం పాయకరావు పేట. ఈ నియోజకవర్గం అంతా పంచాయితీరాజ్ వ్యవస్థ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానం ఇది ఒక్కటే. మొత్తం ఓటర్లు 2,08,144 మంది. ఇక్కడ బీసీల ఓట్లే డిసైడింగ్ ఫ్యాక్టర్. గొల్ల బాబూరావు ఇక్కడ రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో వంగలపూడి అనిత గెలుపుతో మళ్ళీ పాయకరావుపేటలో పసుపు జెండా రెపరెపలు మొదలయ్యాయి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని గొల్ల బాబూరావు మండిపడ్డారు.

హామీలు అత్యంత కీలకమైనవి..
నియోజకవర్గం మౌలిక సమస్యలతో సతమతమవుతోంది. గత ఎన్నికల్లో ఇప్పటి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన విద్య, వైద్య, ఉపాధి, తాగునీటి హామీలు అత్యంత కీలకమైనవి. అయితే వీటిలో ఏ సమస్యా తీరలేదు. ముఖ్యంగా నియోజక వర్గంలో డిగ్రీ కళాశాల లేదు. దీంతో అమ్మాయిలు ఎక్కువ శాతం స్కూల్ ఎడ్యుకేషన్‌కే పరిమితమవుతున్నారు. మూడేళ్ళ పాలనలో ఎమ్మెల్యే అనిత నీటి ప్రాజెక్ట్‌ను శంఖుస్థాపన వరకూ తీసుకు రాగలిగారు. సుమారు 90 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తానంటున్నారు. ఇక ఫిషర్ మెన్ గ్రామాల్లో ప్రతీ ఇంటికి పైప్ లైన్ వేశారు. కానీ గ్రావెటీతో పనిచేయాల్సి రావడంతో ఎక్కువ శాతం నీరు అందడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రతీ ఇంటికీ నీటి సరఫరా
ఎమ్మెల్యే మాత్రం ప్రతీ ఇంటికీ నీటి సరఫరా చేసి.. మళ్ళీ ఎన్నికలకు వెళ్తానంటున్నారు. ఈ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ కీలకమైన డిమాండ్‌గా ఉంది. ఇప్పటికీ ఆర్‌ అండ్‌ బీ పరిధిలోనే వున్న ఈ రహదారిని.. వుడాకు అప్పగించి 6కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాన నీటి వనరైన వరాహనది సీజనల్‌గా వరదలు వస్తుంటాయి. ఏజెన్సీలో భారీ వర్షాలు కురిస్తే నది ఉప్పొంగుతుంది. ఈ నదికి భారీ వరదలు వస్తే ఎస్. రాయవరం మండలంలోని.. సుమారు 16 గ్రామాలకు ముంపు ఏర్పడుతుంది. ఇక్కడ ఏటి గట్లను ఆధునీకరించాలని రైతులు, ప్రజలు అడుగుతున్నారు. కానీ, ఎమ్మెల్యే ఇప్పటి వరకూ వీటిపై దృష్టి సారించలేదు. ఇక ఇక్కడ ఉన్న రెండు ఫార్మా కంపెనీలు ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. హెటిరో డ్రగ్స్, డక్కన్ ఫైన్ కెమికల్స్ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారన్న ఆందోళన.. స్థానిక యువతలో ఉంది. ఏటికొప్పాక, తాండవ రెండు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. సహకార రంగంలో పనిచేస్తున్న చక్కెర కర్మాగారాల్లో.. అధిక ఉత్పత్తి సాధిస్తున్న వాటిగా గుర్తింపు ఉంది. ఏటికొప్పాక షుగర్స్ ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ.. మూత పడటానికి సిద్ధంగా ఉంది. కానీ తాము ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చామని.. పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత చెబుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇక, నాబార్డ్ నిధుల కింద తుఫాన్ షెల్టర్లు కడుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ కూడా ఈ కోవకే చెందుతుంది. వీటినే ఎమ్మెల్యే తన ఖాతాలో వేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి మాట పక్కన పెడితే గ్రూపిజం పెరిగిందని తెలుగు తమ్ముళ్ల ఇంటర్నల్‌ మాట. పైగా గ్రూపు రాజకీయాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారన్న అపవాదు అనితపై బలంగా ఉంది. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో వైసీపీ పుంజుకుంటోంది. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రస్తుతం.. వైసీపీ నుంచి పాయకరావు పేట సమన్వయ కర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మారిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని వైసీపీ జోస్యం చెబుతోంది. 

19:08 - July 15, 2017

విజయవాడ : బియ్యం లేకుండా సామాన్యుడికి రోజు గడవదు. పోషకాహారం లేకపోయినా సరే మధ్యతరగతి వాళ్లు.. రెండు పూటలా తినే అన్నాన్నే అమృతంగా భావిస్తారు. కానీ బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యాన్ని కొనడం కాదు.. చూసినా సామాన్యుడి గుండెల్లో గుబులు పుడుతోంది. దళారులు బియ్యం ధరలను ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బీపీటీ బియ్యం క్వింటాలుకు 2 వేల నుంచి 2, 200 వరకు ధర పలుకుతోంది. చిల్లర మార్కెట్‌లో ఇవే సన్న రకాల బియ్యం బీపీటీ, కర్నూలు, మసూరు ధరలు.. కేజీ 50 నుంచి 56 వరకు పలుకుతోంది. మిల్లులో ఒక బస్తా బియ్యం పట్టిస్తే 65 కేజీల బియ్యం వస్తాయి. దీని ప్రకారం కేజీ బియ్యం గరిష్టంగా 34 రూపాయలు పడుతుంది. ఇవే బియ్యం మార్కెట్‌లో 16 నుంచి 22 రూపాయల వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇదంతా దళారుల కనుసన్నల్లోనే నడుస్తోంది. దీనివల్ల బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి.

ప్రత్తిపాటి పుల్లారావు విస్మయం
సూపర్‌ మార్కెట్లలో బియ్యం ధరలను చూసి.. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విస్మయం వ్యక్తం చేశారు. ఆఫర్ల పేరుతో ఇష్టారాజ్యంగా అమ్మడం ఏంటని.. ఒకే రకమైన ధరల విధానం అమలు కావాల్సి ఉన్నా.. అలా ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలే అమలు కావాలని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు బియ్యం ధరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. గుంటూరు, కృష్ణాజిల్లాలో దాదాపు 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో ఎక్కువగా సన్నరకాల ధాన్యం సాగు చేస్తున్నారు. అయితే సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద మాల్స్‌లో బియ్యం వ్యాపారులు.. తూకం పేరుతోనూ మోసం చేస్తున్నారు. 25 కేజీలు ఉండాల్సిన బస్తా 24 కేజీలే ఉంటోంది. క్వింటాలుకు దాదాపు 4 కేజీల బియ్యం తగ్గుతోంది. దీన్ని బట్టి వినియోగదారుడికి 200 నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా బియ్యం ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. దళారుల ఆగడాలు పెరిగిపోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రతిపక్షాల నేతలు అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దళారీ వ్యవస్థను నియంత్రించాలి. 

19:06 - July 15, 2017

పశ్చిమగోదావరి : జిల్లా లింగపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. చింతలపూడి నుండి ఏలూరు వస్తున్న వస్తుండగా..ఎస్సై ప్రయాణిస్తున్న కారు..ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎస్సై కారులోనే అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఎస్సై భార్య, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

19:05 - July 15, 2017

నెల్లూరు : మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో సీపీఎమ్‌ పార్టీ నాయకులు, మహిళలు ఆందోళన చేశారు. కలెక్టరేట్‌ వద్దకు ర్యాలి నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ హామీ ఇచ్చిన విదంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని మహిళలు కోరారు. ఈ నెల 17న జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

19:04 - July 15, 2017

విజయవాడ : మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ధర్నాలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, ఐద్వా ఏపీ కార్యదర్శి రమాదేవితో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నాటకాలాడుతోందన్నారు సీహెచ్.బాబురావు. మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ చట్టం అమలు చేయకపోతే తగిన బుద్ధి చెబుతామన్నారు రమాదేవి. 

19:00 - July 15, 2017

హైదరాబాద్ :  లోటస్‌పాండ్‌లో జగన్‌ అధ్యక్షతన.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌లో అనుసరించే వ్యూహంపై జగన్‌ దిశా నిర్దేశం చేశారు. విభజన హమీలు, ఫిరాయింపు నేతల అంశాలను సభలో ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినా.. పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని.. కేంద్ర ప్రభుత్వమే పనులు చేపట్టాలని వైసీపీ కోరనుంది. దీంతో పాటు ప్రభుత్వ పరంగానే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

18:59 - July 15, 2017

గుంటూరు : ఏపీ రాజధాని.. అమరావతిలో స్థాపించిన తొలి ప్రైవేట్‌ విద్యాసంస్థ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీని సీఎం చంద్రబాబునాయుడు.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యూనివర్సిటీని సందర్శించి... కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ నాంది
అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా మార్చడానికి ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ నాంది పలకబోతుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కొంతమంది అడుగడుగునా అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే విజయదశమి నాడు పరిపాలన నగరానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.రాజధాని నగరంలో తొలి వర్సిటీ ఎస్‌ఆర్‌ఎం ఏర్పాటు కావడం సంతోషకరంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అలాగే ఏపీకి... కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మోదీ- చంద్రబాబు జోడీ ఏపీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఆగస్ట్‌ నుంచి క్లాస్‌లు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది 300 మంది విద్యార్థులతో ప్రారంభమవుతున్న ఈ యూనివర్సిటీలో 70 శాతం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు, 30 శాతం మిగతా రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. 

18:56 - July 15, 2017

నల్లగొండ : పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లా పీఏపల్లి మండల కేంద్రంలో దొండ రైతులు ధర్నా నిర్వహించారు. దొండ రైతులు సెక్రటేరియట్‌ను ముట్టడిస్తారన్న అనుమానంతో శుక్రవారం రాత్రి పోలీసులు కొందరు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. తమకు అలాంటి ఉద్దేశ్యమే లేకపోయినా పోలీసులు అత్యుత్సాహంతో రైతుల్ని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించడంతోపాటు.. రైతులను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

18:55 - July 15, 2017

సూర్యాపేట : జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామకంఠం భూమిని జువారీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో కొన్ని సంవత్సరాలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ప్రక్కనే ఉన్న జువారి సిమెంట్స్‌ యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకుంది. ఈ విషయంపై భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, గిరిజన సంఘం నాయకుడు రవినాయక్‌ పరిశీలించారు. 850 సర్వే నెంబర్‌లోని 117 ఎకరాల గ్రామ కంఠం భూమిలో 30 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. అయితే భూమిపై కన్నేసిన జువారీ సిమెంట్స్‌ యాజమాన్యం భూమితో పాటు.. రేవూరు- దొండపాడును కలుపుతూ వేసిన రోడ్డును సైతం ఆక్రమించుకుంది. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 16 సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతుల భూములను కబ్జా చేస్తున్నాయని భూ నిర్వాసితుల కన్వీనర్‌ వెంకట్‌ ఆరోపించారు. 

18:32 - July 15, 2017
18:22 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్ ను బాలానగర్ ఎక్సైజ్ పీఎస్ తరలించారు. అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం ఉంది. డ్రగ్స్ కేసులో కెల్విన్, అబ్దుల్ ఖుద్దూష్, అబ్దుల్ మహాబ్ తొలిరోజు విచారణ ముగిసింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:03 - July 15, 2017

హైదరాబాద్ : 47 సంవత్సరాలుగా కస్టమర్ల విశేషాభిమానం కలిగిన అనుటెక్స్ షాపింగ్‌మాల్‌ ఇప్పుడు కొత్తపేటలో నూతన శాఖను ప్రారంభించింది. సినీ నటి పూజా హెగ్డే హాజరై ఈ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. డీజే ఫేమ్‌ పూజా హెగ్డేను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్‌బీ నగర్‌ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా కొత్తపేటలో నాల్గవ శాఖను ప్రాంరంభించడం చాలా ఆనందంగా ఉందని పూజా హెగ్డే అన్నారు.

18:00 - July 15, 2017

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం కార్యక్రమం హైదరాబాద్‌ నగరంలో జోరుగా సాగుతోంది. గ్రీన్‌ డే కార్యక్రమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్‌ కాప్రా సర్కిళ్లో స్కూల్‌ విద్యార్థులు.. నగర పౌరులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చదనంతో హైదరాబాద్‌కు పూర్వవైభవం తేవడమే లక్ష్యమని.. మేయర్‌ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ ఏడాది గ్రేటర్‌ హైదరాబాద్‌లో కోటి మొక్కలు నాటడమే ధ్యేయమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:00 - July 15, 2017

మహబూబునగర్ : ప్రతి విద్యార్థికి ఇంటర్‌ దశే కీలకం. విద్యార్థుల ఆశలు, ఆశయాలు ఇంటర్‌ విద్యపైనే ఆధారపడి ఉంటాయి. ఇంటర్‌లో కనబర్చిన ప్రతిభపైనే వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు కూడా మంచి జూనియర్‌ కాలేజీలో తమ పిల్లలను చేర్పిస్తుంటారు. అయితే పాలమూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం విద్యార్ధులపాలిట శాపంగా మారింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తంగా 47 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. అయితే వీటిలో ఈ ఏడాది 21 కాలేజీలకు మాత్రమే అధికారులు అనుమతులు ఇచ్చారు. మిగిలిన కళాశాలలకు అనుమతులు రాలేదు. అయినా ధనార్జనే లక్ష్యంగా అనుమతిలేని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలను విద్యార్ధులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో కాలేజీ 200 నుంచి 400 మందికి కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. చైతన్య, ప్రతిభ, ఆదర్శ, రాఘవేంద్ర, సాధన తదితర కళాశాలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్ధులను చేర్చుకుంటూ వారి భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి.

చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
ప్రతి సంవత్సరం అధికారులు అనుమతులు ఉన్న కళాశాలల జాబితాను ప్రకటించాల్సి ఉంది. అనుమతిలేని కాలేజీల లిస్ట్‌ను కూడా వెల్లడించాలి. కానీ అధికారులకు ఇదేమీ పట్టదు. దీంతో విద్యార్ధులు నష్టపోతున్నారు. ఏ కళాశాలకు అనుమతి ఉందో వారికి తెలియడం లేదు. అన్ని కాలేజీలు తమకు అనుమతి ఉందంటూనే విద్యార్థులను, తల్లిదండ్రులను నమ్మించి చేర్చుకుంటున్నాయి. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇంటర్‌బోర్డు నుంచి హాల్‌టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి ఫలించకపోవడంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తోంది. లాగిన్‌ ఐడీ లేని కాలేజీలు విద్యార్ధులను చేర్చుకుంటున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు 21 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. మిగతా వాటికి లాగిన్‌ ఐడీ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. లాగిన్‌ ఐడీ లేని కాలేజీల్లో విద్యార్ధులు చేరవద్దని సూచిస్తున్నారు. అనుమతి లేని కళాశాలలు విద్యార్ధులను చేర్చుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ధన దాహంతో ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్ధులను చేర్చుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోకుంటే విద్యార్ధుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంకానుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుమతి ఉన్న కళాశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తే... వారి భవిష్యత్‌కు బంగారుబాటలు వేసినవారవుతారు.

17:58 - July 15, 2017

హైదరాబాద్ : మహిళల భద్రత కోసం షీటీమ్స్ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని హైదరాబాద్‌ అడిషనల్‌ సిపి స్వాతి లక్రా అన్నారు. మాదాపూర్‌లో ఐటి రంగంలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ల పాత్ర అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జరుగుతున్న మార్పులపై పలు ఐటి కంపెనీకి చెందిన ప్రాజెక్ట్‌ మేనేజర్‌లు పాల్గొని వారి అనుభవాలను పంచుకున్నారు. 

17:57 - July 15, 2017

హైదరాబాద్ : ధర్నాచౌక్‌ పరిరక్షణకై వచ్చేనెల 22న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటి. ధర్నాచౌక్‌ పరిరక్షణ కోసం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాయలంలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు మేధావులు.. ధర్నాచౌక్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆగస్టు 22న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపడతామని సదస్సులో పాల్గొన్న జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ప్రజలు ఆశించిన దానికి విరుద్దంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన నడుస్తుందని..నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సీపీఐ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వామపక్ష నేతలతో పాటు , ప్రొఫెసర్‌ కోదండరాం, వరవరరావు, ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు, మేధావులు పాల్గొన్నారు.

 

17:55 - July 15, 2017

హైదరాబాద్ : పేదలకు సొంతింటి నిర్మాణం ఎప్పుడూ కలగానే మిగిలిపోతోంది. హైదరాబాద్‌లో అయితే సొంతింటి కలలు కల్లలే అవుతున్నాయి. భాగ్యనగరంలో సొంతిళ్లు నిర్మించుకోవడమంటే భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు పైసాపైసా కూడబెట్టుకుని ఇంటి స్థలాలు కొనుక్కుంటున్నారు. దీన్నే అదనుగా భావిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వారిని నిలువునా ముంచుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే ఈ తరహా మోసాలకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. రియల్‌ వ్యాపారులు ప్రజలను నిలువునా ముంచితే న్యాయం కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారు. మోసగాళ్ల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే భక్షకుడిగా మారారు.

10కోట్ల రూపాయలు వసూలు...
ప్రజల నుంచి దాదాపు 10కోట్ల రూపాయలు వసూలు చేసి దశాబ్దన్నర కాలంగా వారిని తనచుట్టూ తిప్పుకుంటున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మల్కాజ్‌గిరి ప్రాంతంలోని అమ్ముగూడలో ఏకశిలానగర్‌ పేరుతో ఓ వెంచర్‌ వేశారు. దాన్ని 125 ప్లాట్లుగా విభజించారు. అప్పటి హుడా అనుమతి ఉన్నట్టు పత్రాలు చూపించి ప్లాట్లను విక్రయించారు. దాదాపు 90 మంది పేద, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఆ స్థలాలను కొనుగోలు చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ఆశగా వెళ్లారు. కాప్రా మున్సిపాలిటీల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు వెళ్లగా అధికారులు షాక్‌ ఇచ్చారు. ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందని... అందులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఊహించని పరిణామంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి. కొంతమంది అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.

ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళన
ఆందోళన చెందిన బాధితులు విషయం తేల్చుకునేందుకు నేరుగా ముత్తిరెడ్డి దగ్గరికే వెళ్లారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని తమకెందుకు విక్రయించారంటూ నిలదీశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. వివాదం కొన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందని వారికి సర్దిచెప్పి పంపించారు. అప్పటి నుంచి బాధితులు ముత్తిరెడ్డి చూట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో శుక్రవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితులను పిలిపించుకుని చర్చలు జరిపారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినట్టు బాధితులు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. హబ్సిగూడలోని ఓయూ స్థలంలో ముత్తిరెడ్డి ఓ హోటల్‌ నిర్మించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఓయూ విద్యార్ధులు పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. జనగామ నియోజకవర్గంలోనూ పలుచోట్ల భూములు ఆక్రమించారంటూ ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలు మరవక ముందే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తమను మోసం చేసారంటూ హైదరాబాద్‌ బాధితులు ఆందోళన చేపట్టారు. అయితే ఎమ్మెల్యే మాత్రం తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్తున్నారు. బాధితులను రియల్టర్‌ అమరేంద్రరెడ్డి మోసం చేశారని తెలిపారు.తమ వారయినా తప్పుచేస్తే వదిలేది లేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు ప్రకటించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మరి దీనిపై ముఖ్యమంత్రి ఏ చర్యలు తీసుకుంటారు, బాధితులకు న్యాయం చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

17:54 - July 15, 2017

ప్రకాశం : జిల్లా ఒంగోలు మండలం పెల్లూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. మడనూరుకు చెందిన వీరంతా కూలీపనికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

17:52 - July 15, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నియంత పాలన కొనసాగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలు ఇంటికి వెళ్తే కలవరని.. ధర్నా చౌక్‌లు తీసేస్తారని ఆరోపించారు. అటు ఏపీలో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 26 న చేపట్టనున్న పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి అవాంతరాలు కలిగించినా టీడీపీ పతనం తప్పదని వీహెచ్ అన్నారు.

ఏసీబీ వలలో తూనికలు, కొలతల శాఖ ఇన్ స్పెక్టర్

కర్నూలు: రూ.30వేలు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా తూనికలు కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ స్వామి ఏసీబికి చిక్కాడు.

'విద్యార్థుల డ్రగ్స్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే సినీ పరిశ్రమను టార్గెట్'

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడ్ని నటుడు, నిర్మాత అశోక్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలోకి ఇతర ప్రాంతాల వారు రావడం వల్లే డ్రగ్స్ వాడకం మొదలైందని ఆరోపించారు. ఒకరిద్దరి కారణంగా మొత్తం ఇండస్ట్రీని తప్పుపట్టడం సరికాదన్నారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, శ్యామ్ కె.నాయుడు కు మందు కూడా అలవాటు లేదని, నయీంతో సంబంధాలు ఉన్నాయని నా పై దృష్పచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారనే దాన్ని డైవర్ట్ చేయడానికే సినీ పరిశ్రమను టార్గెట్ చేశారని విమర్శించారు.

విశాఖ భూ ఆక్రమణలపై సిట్ పరిధి పెంపు..

విశాఖ : భూ ఆక్రమణలపై సిట్ పరిధి పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా భూ ఆక్రమణలకు గురైన వాటిపైనే సిట్ దర్యాప్తు చేపట్టింది. తాజా ఉత్తర్వుర్వుల ప్రకారం ప్రభుత్వం ప్రైవేటు భూములు వెజ్ ల్యాండ్, రెవెన్యూ రికార్డుల తారుమారు అయ్యాయి. మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూముల ఆక్రమణపై దర్యాప్తు చేయాలని సిట్ ను ఆదేశించింది.

డ్రగ్స్ దందా పై తెలంగాణ సర్కార్ సీరియస్

హైదరాబాద్: డ్రగ్స్ దందా పై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. గ్రడ్స్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎవరినీ వదలొద్దని అకున్ సబర్వాల్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు 8గంటలకు అకున్ సబర్వాలకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి సెలవులను రద్దు చేసుకోవాలని సబర్వాల్ కు సీఎం సూచించారు. ఇపుడు సెలవులపై వెళ్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న సీఎం సూచనతో సెబర్వాల్ సెలవులను వాయిదా వేసుకున్నారు. డ్రగ్స్ దందాలో ఉన్న పేర్లన్నీ బయటపెట్టాలని సీఎం సూచించారు. ఎవరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

'మహిళల అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి'

హైదరాబాద్: మహిళల అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. ఇప్పటి వరకు 150 మంది మహిళలకు విముక్తి కల్పించామన్నారు. రాచకొండ పరిధిలో 40 వ్యభిచార గృహాలను సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టామని, గంజాయి రవాణా పై 25 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం మెడలు వంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది: భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో అన్ని బ్యాంకుల వద్ద ఆందోళనలు చేస్తున్న పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు.రైతులకు సంకెళ్లు వేసిన ఘటనలో బాధ్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వం మెడలు వంచేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ ఆశయాలకు అనుగుణంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదన్నారు. నీటి కేటాయింపులు లేకుండా భక్త రామదాసు చేపట్టారని మండిపడ్డారు. ఆయకట్టుకు నీరు అందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడాతమని హెచ్చరించారు.

రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై ఆరోపణలు:అనకాపల్లి ఎమ్మెల్యే

విశాఖ: ప్రభుత్వ భూములను కబ్జా చేశానని వస్తున్న వార్తలు నిరాధారం అని అనకాపల్లి ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన నడుస్తోంది: వీహెచ్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నియంతృత్వ పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎంపి విహెచ్ విమర్శించారు. సామాన్యులు సీఎం ను కలిసేందుకు ప్రగతి భవన్ వెళ్లి నిరాశతో ఆత్మహత్యలకు ప్పాలతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నియంతృత్వ పోకడ గవర్నర్ కు పట్టడం లేదన్నారు. ముద్రగడ పాదయాత్రకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం నియంతృత్వాని సూచిస్తోందని వాపోయారు. జగన్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన చంద్రబాబు ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనమతివ్వరని ప్రశ్నించారు.

రామగుండం టీఆర్ ఎస్ లో విభేదాలు

పెద్దపల్లి: రామగుండం టీఆర్ ఎస్ లో విభేదాలు బట్టబయలు అయ్యాయి. రామగుండం నియోజకవర్గంలో మేయర్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన కమిటీలు చెల్లవని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలిపారు. నాకు తెలియకుండా కమిటీలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు.రామగుండం కార్పొరేషన్ లో అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అని సోమరపు స్పష్టం చేశారు.

16:17 - July 15, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రి మున్సిపాల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. మేయర్ జ్వరాల తీవ్రతపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడంలేదంటూ కమిషనర్ పై టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ ఆదివారం నుంచి రూల్స్ ప్రకారం నడుచుకుంద్దామని తెలిపారు. టీడీపీ సభ్యులు వైసీపీ సభ్యులతో వాగ్వావాదానికి దిగారు. దీంతో మేయర్ వైసీపీ సభ్యులను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. వైసీపీ సభ్యులు పోడియం వద్దే బైఠాయించి నినాదాలు చేశారు. మార్షల్ సహాయంతో వారిని బయటకు పంపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

16:15 - July 15, 2017

మహబూబునగర్ : మంత్రి కేటీఆర్ మహబూబునగర్ పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల నిషేధం పాటించాలని ఆయన కోరారు. ఇద్దరు టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు దృష్ట్యా ఫ్లెక్సీలన్నిటినీ తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు. దీంతో మున్సిపాల్ అధికారులు వెంటనే ఫ్లెక్సీలు తొలగించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సింగరేణి సంస్థకు 'కాస్ట్ ఎక్స్‌లెన్స్ 2016' అవార్డు

హైదరాబాద్ : సింగరేణి సంస్థకు కాస్ట్ ఎక్స్‌లెన్స్ 2016 అవార్డు వరించింది. ఆర్థిక వ్యవహారాల్లో సింగరేణి చూపిన సమర్థతకు ఈ అవార్డు లభించింది. వరుసగా రెండోసారి సింగరేణికి అవార్డు దక్కడం గర్వకారణంగా ఉందని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, కేంద్రప్రభుత్వానికి శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు.

ఢిల్లీలో నలుగురు పారిశుద్ధ్య కార్మికుల మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గిటోర్ని ప్రాంతంలో డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డ్రైనేజీలోనే నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

15:51 - July 15, 2017

కడప : జిల్లా బద్వేలు పట్టణం సిద్దివాటం రోడ్డు పక్కన మద్యం షాపులు ఏర్పాటు చేయడంపై మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. స్కూళ్లు, హాస్టల్‌లకు దగ్గరలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం వల్ల తాము, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న మహిళలు... మద్యం షాపు యజమానులతో వాదనకు దిగారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే మద్యం షాపులకు అనుమతి ఇచ్చామని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయాలని, తాము ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు.

15:49 - July 15, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా లింగపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. చింతలపూడి నుండి ఏలూరు వస్తున్న వస్తుండగా..ఎస్సై ప్రయాణిస్తున్న కారు..ఒక్కసారిగా చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎస్సై కారులోనే అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఎస్సై భార్య, కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

15:48 - July 15, 2017

హైదరాబాద్ : ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలని.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.. రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లును లోక్‌సభలోనూ ఆమోదం పొందేలా చూడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు.. హైదరాబాద్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.. ఈ కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు.

15:47 - July 15, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కొంతమంది అడుగడుగునా అడ్డుతగులుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో రైతులను రెచ్చగొడుతున్నారని పరోక్షంగా ప్రతిపక్షనేల జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చేత కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధిని అడ్డుకోలేరని చంద్రబాబు తేల్చి చెప్పారు. అమరావతిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రారంభవోత్సవంలో పాల్గొన్న ఆయన... రాజధాని నగరాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు..... ఏపీకి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. మోదీ- చంద్రబాబు జోడీ ఏపీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులిచ్చి కేంద్రం ఆదుకుంటోందని చెప్పారు. దేశ చరిత్రలో రాజధాని రైతులపేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయన్నారు. రాజధాని నగరంలో తొలి వర్సిటీ ఎస్‌ఆర్‌ఎం ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. 

15:42 - July 15, 2017

పెద్దపల్లి : రామగుండం టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రామగుండం కార్పొరేషన్ లో వేసిన పార్టీ కమిటీలను రద్దు చేశారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. ఎమ్మెల్యే కార్పొరేషన్ లో అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండని తెలిపారు. కార్పొరేటర్లకు పార్టీకి నష్టం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పాయకరావు పేట మండలం పి.లక్ష్మిపురంలో విషాదం

విశాఖ: పాయకరావు పేట మండలం పి.లక్ష్మిపురంలో విషాదం నెలకొంది. విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరు భవన నిర్మాణ కార్మికుల మృతి చెందారు.

 

హిమాయత్ నగర్ కూడలి వద్ద డీసీఎం బీభత్సం

హైదరాబాద్: హిమాయత్ నగర్ కూడలి వద్ద డీసీఎం బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ చెక్ పోస్టు ను వేగంగా వచ్చి డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

శంకర్ నాయక్ పై కేసీఆర్ కు తగ్గని ఆగ్రహం

హైదరాబాద్: ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం తగ్గలేదు. మహబూబాబాద్ ఘటనపై ఘటనపై కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లినా ఎంట్రీకి అవకాశం లేదు. సచివాలయం చుట్టూ తిరుగుతున్నా శంకర్ నాయక్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విధిలేని పరిస్థితిలో మంత్రి కడియంను కలిసి వరంగల్ దారి పట్టారు.

15:08 - July 15, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియాలో పోలీసులు మరొవ్యక్తి అరెస్ట్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్యం 14కు చేరింది. ఆ వ్యక్తిని ఏజీ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు అతన్ని ఏజీ కాలనీ నుంచి ఎక్సైజ్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:52 - July 15, 2017
14:36 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న కెల్విన్ ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుంది. కెల్విన్ ను చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అబ్దుల్ ఖుద్ధూష్, అబ్దులు వహాబ్ ను కస్టడీకి తీసుకుంది. మరో వైపు డ్రగ్స్ కేసులో రెండో విడత జాబితా విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో గతంలో పట్టుబడ్డ ఓ ప్రముఖ వ్యక్తి పేరు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓ ప్రముఖ నిర్మాత, నటులపేర్లు బయటకువచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:35 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ నోటీసుల పై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. తను ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ప్రస్తుతం తను పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:34 - July 15, 2017

వరంగల్ : టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి హత్యకేసు కొత్తమలుపు తిరిగింది. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేయడంతో మురళి హత్యకేసులోమ కాంగ్రెస్ నేతలకు సంబంధం ఉన్నాయని తెలుస్తోంది...?. కాంగ్రెస్ నేతలు కేసులో ఏ4, ఏ5,ఏ6 నిందుతులుగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో రాజేందర్ రెడ్డి, పోతుల శ్రీమాన్, కానుగంటి శేఖర్ పేర్లు సమాచారం ఉంది. మరిన్ని వివరాలకు కోసం వీడియో చూడండి.

రోడ్డు ప్రమాదంలో ఎస్సై సైదా నాయక్ మృతి

ప.గో: లింగంపాలెం వద్ద కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ మృతి చెందాడు. చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

నాకు ఎలాంటి నోటీసులు అందలేదు: పూరీ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి నోటీసులు అందలేదని దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తను ఎవరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ప్రస్తుతం పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాని పూరీ తెలిపారు.

13:55 - July 15, 2017

డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ పోలీసు అధికారి రెడ్డన్న, మాచవరం పాల్గొని, మాట్లాడారు. కేసు సంబంధించిన మూలాల్లోకి వెళ్లాలని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

మురళి హత్య కేసులో కాంగ్రెస్ నేతలు...

వరంగల్ : టీఆర్ ఎస్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో ఏ4, ఏ5 నిందితులుగా కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో రాజేందర్ రెడ్డి, పోతుల శ్రీమాన్, కానుగంటి శేఖర్ పేర్లు ఉన్నాయి.

కెల్విన్ అమాయకుడు: కెల్విన్ తండ్రి

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాని ముద్దాయి అని కెల్విన్ తండ్రి జవహర్ అన్నారు. కెల్విన్ డ్రగ్స్ కు బానిసైన విషయం వాస్తవమేనని, ఈ వ్యవహారంలో కెల్విన్ కి డ్రగ్స్ సరఫరా చేసిన వారిని పట్టుకుంటే అసలు నిందితులు బయటికొస్తారని జవహర్ తెలిపారు.

13:47 - July 15, 2017

హైదరాబాద్ : హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటడం అభినందనీయమని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం సోమాజీగూడ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి మొక్కలు నాటారు. మూడో విడత హరితహారంలో భాగంగా 230కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని ఉపముఖ్యమంత్రి అన్నారు. అటవీ ప్రాంతం, నాన్‌ ఫారెస్ట్‌, గ్రేటర్‌లో మొక్కలు నాటుతామని కడియం తెలిపారు. 

 

రాజనాథ్ సింగ్ తో సీఎం మహబూబా భేటీ

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జమ్మూకశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ భేటీ అయ్యారు. కశ్మర్ లో శాంతి భద్రతలపై చర్చించినట్లు సమాచారం.

13:42 - July 15, 2017

మహబూబ్ నగర్ : పేదవాళ్ల కన్నీళ్లు తుడవడం ... వాళ్ల ముఖాల్లో చిరునవ్వు చూడడమే లక్ష్యంగా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  తెలంగాణలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు.

13:29 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను చర్లపల్లి జైలు నుంచి సిట్‌ అధికారులు తమ కస్టడీలోకి తీకున్నారు. రెండ్రోజుల పాటు విచారించనున్నారు. మరో వైపు అబ్దుల్‌ ఖుద్దూష్‌, అబ్దుల్‌ వహాబ్‌ను ఎక్సైజ్‌ శాఖ కస్టడీలోకి తీసుకుంది. డ్రగ్స్‌ కేసులో మరికొంతమంది టాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయటకురానున్నాయి.. రెండో విడత పేర్ల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు.... ఈ లిస్టులో పలువురు ప్రముఖుల పేర్లున్నట్లు తెలుస్తోంది.. గతంలో పట్టుబడ్డ ఓ ప్రముఖ వ్యక్తిపేరు మళ్లీ తెరపైకి  రానుందని సమాచారం... అలాగే ఓ ప్రముఖ నిర్మాత, నటులపేర్లుకూడా ఈ లిస్టులో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పోలీసు కస్టడీకి అబ్దుల్ ఖుద్దూష్, అబ్ధుల్ వహాబ్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అబ్దుల్ ఖుద్దూష్, అబ్ధుల్ వహాబ్ ను ఎక్సైజ్ శాఖ 24 గంటల పాటు కస్టడీకి తీసుకుంది.

'మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి'

హైదరాబాద్: ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని, లోక్ సభలోనూ ఆమోదం పొందాలని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

13:22 - July 15, 2017

బుట్టా రేణుక లోకేష్ ను కలిస్తే తప్పేంటి: ఎంపి మేకపాటి

హైదరాబాద్: నియోజకవర్గాల పెంపెనకు రాజ్యాంగ సవరణ అవసరం అని వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రోజు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం విజయసాయి మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనలు ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్ ముందుకు రాలేదని, చంద్రబాబు కు నియోజకవర్గాల పెంపు ప్రధాన సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. విభజన జరిగిన రాష్ట్రాల్లో ఎక్కడా అసెంబ్లీ స్థానాలు పెరగలేదన్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని మరో ఎంపి మేకపాడటి డిమాండ్ చేశారు. బుట్టా రేణుక లోకేష్ ను కలిస్తే తప్పేంటని, ఆమె మా పార్టీలోనే ఉంటారని తెలిపారు.

13:21 - July 15, 2017

'ధర్నా చౌక్' భారీ ఉద్యమం చేపడతాం: చాడ

హైదరాబాద్: ముఖ్దూం భవన్ లో పౌరహక్కులు - నిర్బంధం పై సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ, ప్రొ.కోదండరాం, వరవరరావు, వీరయ్య, అమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య మక్కులు కాలరాస్తున్నాయన్నారు. ప్రజాస్వామికవాదులను అణగదొక్కుతూ కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ధర్నా చౌక్ విషయంలో ఎన్నిక అడ్డంకులు వచ్చినా భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కలిసొచ్చే పార్టీలతో ఐద్య ఉద్యమానికి పిలుపునిస్తామన్నారు.

13:11 - July 15, 2017
13:08 - July 15, 2017

మంచిర్యాల : జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి మృతి చెందారు. జైపూర్ లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో రాకేష్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. రెండో అంతస్తులో ఉంటున్నాడు. కిటికీకి ఆనుకొని అతని బెడ్ ఉంది. కిటికీకి గ్రిల్స్ లేవు. తెల్లవారుజామున.. భవనం కిటికీలో నుంచి కిందికి జారపడి మృతి చెందారు. కిటికీకి గ్రిల్స్ లేకపోవడంతో రాకేష్ జారిపడి చనిపోయారు. విద్యార్థి మృతి పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. సరైన రక్షణ లేకపోవడం వల్లే మృతి చెందాడని అంటున్నారు. కుమారుడి మరణానికి కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ప్రపంచంలో 5 గొప్ప నగరాల్లో అమరావతిని ఒకటిగా చేస్తాం:చంద్రబాబు

గుంటూరు : అమరావతికి పూర్వ వైభవం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఎస్ ఎంఆర్ యూనిర్శిని వెంకయ్యతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రపంచంలో 5 గొప్ప నగరాల్లో అమరావతిని ఒకటిగా చేస్తానన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించారని, ప్రపంచంలో నూతన కోర్సులు ఎస్ ఆర్ ఎం వర్శిటీకి రావాలని ఆకాంక్షించారు. నాలెడ్జ్ హబ్ కింద తయారు కావడానికి ఎస్ ఆర్ ఎం తొలిమెట్టు అని పేర్కొన్నారు. కొందరు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదు.. నంబర్ వన్ గా నిలుస్తాం అని చంద్రబాబు చెప్పారు.

13:00 - July 15, 2017
12:59 - July 15, 2017

గుంటూరు : ఏపీ అభివృద్ధికి ఎల్లప్పుడు అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నీరుకొండలో ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీని సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అభినందనలు తెలిపారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు రాజధానిని అన్ని హంగులతో నిర్మిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, మోడీ జోడీ రాష్టాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. పేదరికం పోవాలని. అందరు కలిసిమెలిసి జీవించాలని కాక్షించారు. అర్ధిక అసమానతలు తొలగిపోవాలన్నారు.  

12:51 - July 15, 2017

గుప్పెడు పల్లీలతో పిడికెడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వేరు శనగలు లేదా పల్లీలు రోజూ ఓ గుప్పెడు తింటే చాలు అందమైన ఆరోగ్యం మీ సొంత అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పల్లీలు తింటే ఫ్యాట్ చేరుతుందని, అలర్జీని చాలా మంది వీటిని తినకుండా ఉంటారు. పల్లీలను పరిమితంగా తింటే ఎలాంటి హానీ ఉండదు. ఇంకా మెరుగైనా ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఒక కేజీలో వుండే మాంసకృత్తులో ఉండే పల్లీల్లోనూ లభిస్తాయి. బెల్లం, మేకపాలతో కలిపి వేరు శనగలను తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పల్లీల్లో మోనోశాచురేటెడ్‌, పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ప్రత్యేకంగా ఉండే ఒలైక్‌ యాసిడ్‌ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి గుండెకు మేలు చేస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్ల నివరాణలోనూ...

కొన్నిరకాల క్యాన్సర్ల నివారణలోనూ పల్లీలు కీలకంగా పనిచేస్తాయి. వీటిల్లో బీటా సిటోస్టెరాల్‌ అని ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కారకాలను నివారిస్తుంది. ఓ అధ్యయనంలో.. వారంలో రెండుసార్లు పల్లీలు తినేవారిలో.. క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం 27 నుంచి 58 శాతం వరకూ తగ్గుతుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గర్భిణీలకు మేలు...

గర్భిణులకు పల్లీలు చేసే మేలు అంతాఇంతా కాదు. వీటిల్లో ఫోలేట్‌ కూడా ఉంటుంది. గర్భధారణకు ముందూ తరవాత ఈ ఫోలిక్‌ యాసిడ్‌ అందడం వల్ల..పుట్టబోయే పాపాయిల్లో నాడీ సంబంధ సమస్యలు చాలామటుకూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు తీసుకోవడం వల్ల పాపాయిలు పుట్టాక కూడా అలర్జీలూ, ఉబ్బసం వచ్చే ఆస్కారం చాలామటుకు తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.

పిల్లల ఎదుగుదలలో...

పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తులు చాలా అవసరం అవుతాయి. అవి పల్లీల నుంచి సమృద్ధిగా అందుతాయి. వాటిని తరచూ పెట్టడం వల్ల వాళ్ల మెదడు పనితీరు చురుగ్గా మారడమే కాదు.. ఎదుగుదలా బాగుంటుంది.

బరువును అదుపులో ఉంచడంలోనూ...

బరువును అదుపులో ఉంచడంలోనూ ఇవి కీలకంగానే పనిచేస్తాయట. పీచూ, కొవ్వూ, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పల్లీలు కాసిని తిన్నా.. పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. అలా ఆకలి తగ్గి.. శరీరానికి అవసరమైన శక్తి అంది.. బరువు తగ్గొచ్చు.

12:43 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రెండో విడత జాబితా విడుదలకు రంగం సిద్ధం అయింది. రెండో లిస్టులో సంచలన పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం. గతంలో పట్టుబడ్డ ఓ ప్రముఖ వ్యక్తి పేరు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఓ ప్రముఖ నిర్మాత, నటుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉండే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు ప్రముఖ నిర్మాతల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంది. రెండో జాబితా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:33 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా లీవు రద్దు చేసుకున్నారు. అకున్ సబర్వాల్ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించింది. డ్రగ్స్ కేసులో మరికొందరు టాలీవుడ్ ప్రముఖలు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంతమందికి ఎక్సైజ్ శాఖ నోటీసులిచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

రాజధాని రైతులకు అండగా ఉంటాం: వెంకయ్యనాయుడు

అమరావతి: ఏపీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ ఆర్ ఎం యూనివర్శిని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉంటామన్నారు. అమరావతి రైతుల పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కొనియాడారు.

రెండో జాబితాలో సంచలన పేర్లు..!

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రెండో విడత పేర్ల జాబితా విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సంచలన పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో పట్టుబడ్డ ఓ ప్రముఖ వ్యక్తి పేరు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశ ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఓ ప్రముఖ నిర్మాత నటుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

11:53 - July 15, 2017

హైదరాబాద్: వర్ధమాన నటుడు వరుణ్‌తేజ్ కథానాయకుడిగా సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న చిత్రం ఫిదా. ఈ చిత్రానికి శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ మా సంస్థలో వస్తున్న మరో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫిదా. ఓ అమెరికా అబ్బాయికి తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే అందమైన ప్రేమకథా చిత్రమిది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు. సాయిచంద్, శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్, హర్షవర్థన్ తదితరులు నటిస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆందోళన

హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆందోళన చేపట్టింది. డ్రగ్స్ కేసులో ఉన్న నిందితులందరి పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

11:40 - July 15, 2017

పోలీసు కష్టడీకి కెల్విన్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు కెల్విన్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ శుక్రవారం సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ కోర్టు మాత్రం రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 3 నుంచి జైలులో ఉంటున్న కెల్విన్‌ను ఈ ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి నిందితున్ని మళ్లీ రిమాండ్‌కు తరలించనున్నారు.

నార్కోటిక్‌ అధికారులతో అకున్ భేటీ..

హైదరాబాద్:ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సబర్వాల్‌ నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులతో శనివారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా డ్రగ్స్‌ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే విదేశాల నుంచి డ్రగ్స్‌ సరఫరా కాకుండా ఎయిర్‌పోర్టుల్లో నిఘాను పటిష్టం చేయాలని అకున్ సబర్వాల్ సూచించారు. అంతగాకుండా కొరియర్‌ సంస్థలపైనా నిఘా పెంచాలని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులకు ఆయన సూచించారు.

11:35 - July 15, 2017

హైదరాబాద్ : ఇవాళ జరగనున్న వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం  ఉత్కంఠ  రేపుతోంది. 17వ తేదీ నుంచి మొదలయ్యే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిన వైసీపీ .. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తుందా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. 
వైసీపీ వైఖరిపై ఉత్కంఠ   
ఎపీలో ప్రధాన ప్రతిపక్షం వైసిపి వైఖరిపై ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఆ పార్టీ స్టాండ్‌ ఎంటనేది చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది ప్రతిపక్ష వైసీపీ. హోదా  కోసం ప్రజా ఉద్యమాలను కూడా నిర్వహించేందుకు  పావులు కదిపింది.  జనసేన అధినేత పవన్‌ దూకుడుతో జగన్‌ మరో అడుగు ముందుకేసి ప్రత్యేకహోదా కోసం  అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు కూడా చేస్తారని గతంలోనే ప్రకటించారు. హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైసిపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే  విభజన చట్టంలోని హామీలు ఇంకా అమలు కావడం లేదని జగన్‌ విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
మోదీతో భేటీ తర్వాత జగన్‌ మెత్తబడ్డారా..?
అయితే.... వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధాని మోదీని కలిసిన అనంతరం కేంద్రంపై మెతక వైఖరితో వ్యవహరించడం చర్చనీయంశంగా మారింది. దీనికి తోడు  రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. దీంతో ఇటు ఏపీలో టీడీపీకి బద్ధశత్రువుగా ఉంటూనే అటు కేంద్రంలో బీజేపీతో మితృత్వం నెరపడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఏస్టాండ్‌ తీసుకోనుంది. ఇంతకాలం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెడుతుందా.. అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

 

11:34 - July 15, 2017

ఓ కామెడీ యూట్యూబ్ ఛాన‌ల్‌కి దర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుపై తాప్సీ చేసిన కామెంట్ల‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట్లో త‌న‌ మాట‌ల‌ను స‌మ‌ర్థించుకున్న తాప్సీ, నిన్న రాత్రి సోష‌ల్‌మీడియాలో వీడియో పోస్ట్ చేసి రాఘ‌వేంద్ర‌రావును క్ష‌మించ‌మ‌ని అడిగింది. `ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మాట‌లు మ‌న‌స్ఫూర్తిగా చెప్పిన‌వి కావు.. వాటిని అర్థం చేసుకోలేక త‌ప్పుదోవ ప‌ట్టించారు. ఏదేమైనా క్షమించ‌మ‌ని అడుగుతున్నాను` అని ఆమె పోస్ట్ చేశారు. నాపై నేను జోకులు వేసుకుంటున్నా అనుకున్నాగానీ, అవి ఇంత గొడ‌వ‌కు దారితీస్తాయ‌నుకోలేదు. రాఘ‌వేంద్ర‌రావుగారు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఆయ‌న గురించి నేను త‌ప్పుగా ఎలా మాట్లాడ‌తాను అన్నారు.

11:27 - July 15, 2017

హైదరాబాద్ : అకున్ సబర్వాల్ సెలవులు రద్దు చేసుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు వాయిదా వేసుకున్నట్లు అకున్ తెలిపారు. అకున్ సబర్వాల్ వినతిని ప్రభుత్వం అంగీకరించింది. నేటి నుంచి పది రోజుల సెలవులపై వెళ్తున్నట్లు నిన్న  అకున్ సబర్వాల్ ప్రకటించారు. దీంతో ఉన్నతస్థాయిలో అకున్ పై ఒత్తిళ్ల కారణంగానే ఆయన సెలవులపై వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. డ్రగ్స్ కేసు కీలక దశలో ఉన్నక్రమంలో అకున్ సెలవులపై వెళ్తాననడంపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఈరోజు ఉన్నట్టుండి సెలవులను రద్దు చేసుకుంటున్నట్లు అకున్ ప్రకటించారు. ఈనేపథ్యంలో డ్రగ్స్ రాకెట్ లో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది సినీరంగ ప్రముఖులకు నోటీసులు అందాయి. ఇవాళ మరికొంతమందికి ఈ కేసులో నోటీసులు జారీ చేయనున్నారు. అయితే రెండో జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అన్న ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కొడుకులు ఉన్నట్లు వార్తలు గుప్పుమంటుతున్నాయి. పేర్లు బయటికి రాకుండా ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

నాగోల్ లో గంజాయి సేవిస్తున్న విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్: నాగోల్‌లో గంజాయి సేవిస్తూ 8మంది విద్యార్థులను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.. వీరంతా ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థులని తెలిపారు. నాగోల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పలువురు గంజాయి సేవిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేపట్టారు. ఓ గదిలో విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికారు.

11:22 - July 15, 2017

హైదరాబాద్: నటుడు రామ్‌చరణ్‌ వీరాభిమాని బుడతడు పరశురామ్‌ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. చూడటానికి చిన్నోడే..కాని నోరు తెరిస్తే సినిమాల్లోని పెద్దపెద్ద డైలాగులను కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు. డ్యాన్స్‌ను సైతం అదరగొట్టేస్తాడు. హావభావాలు పలికించటంలోను దిట్ట. ఆ బుడతడికి రామ్‌చరణ్‌ అంటే వీరాభిమానం, ఆయన డైలాగులను అదరగొట్టగల దిట్ట ఈ బుడ్డొడు. ఇది తెలిసి రామ్‌చరణ్‌ 15 మార్చి 2015న తన ఇంటికి బుడతన్ని పిలిపించుకుని అభినందించారు. అంతేకాకుండా అయిజకు చెందిన పరుశురాముడును అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేలా చెర్రీ ఏర్పాట్లు చేయించాడు. కూలీ డబ్బులతో జీవనం సాగించే కుటుంబ సభ్యులు చిన్నారికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించలేకపోవటంతో బుధవారం కన్నుమూశాడు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్: జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం అయ్యింది. పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపట్టివేత...

సూర్యాపేట: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు శివారు బోరింగ్‌తండా వద్ద చోటుచేసుకుంది. సుమారు 400 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం లారీని స్టేషన్‌కు తరలించారు.

11:06 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను... 2 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. కెల్విన్‌ను చర్లపల్లి జైలు నుంచి.. సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇదిలావుంటే రెండో జాబితాలో సినీ ప్రముఖులు పేర్లు  ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ పేర్లు బయటికి రాకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ మరికొంతమంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:05 - July 15, 2017

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు నూతన చిత్రంలో 'బాహుబలి' సినిమా ద్వారా ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిందన అనుష్క ఐటం సాంగ్ చేయనున్నట్లు చిత్రసీమలో గుసగుస లు వినిపిస్తున్నాయి. ఈమె ప్రస్తుతం 'భాగమతి' సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. గతంలో 'స్టాలిన్' సినిమాలో చిరుతో ఓ స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క తాజాగా మహేష్ కొత్తచిత్రం 'భరత్ అనేనేను' సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో స్టెప్పులేయనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. ఇంతకుముందే 'జనతాగ్యారేజ్' సినిమాలో కాజల్ తో ఐటెం సాంగ్ చేయించి సక్సెస్ అయిన కొరటాల..ఇప్పుడు తన తాజా చిత్రంలో మహేష్ తో అనుష్క ను ఓ స్పెషల్ సాంగ్ లో మెరిపించడానికి సిద్ధమయ్యాడని తెలిసింది.దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మంగళగిరిలలో ఎస్ ఆర్ ఎం యూనివర్శిటీ ప్రారంభం

గుంటూరు : మంగళగిరిలలో ఎస్ ఆర్ ఎం యూనివర్శిటీ ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

10:47 - July 15, 2017

హైదరాబాద్: టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. ఇప్పటికి బయటకు వచ్చింది కొంత మంది పేర్లే... మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ అధికారుల వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మొబైల్ ఫోన్ బుక్, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ సంభాషణలు...డ్రగ్స్ విక్రయదారులు దర్యాప్తులో వెల్లడించిన విషయాలు... వీటితో డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలున్నాయనే విషయాన్ని వెల్లడించాయి. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తులో వాట్సాప్ మెసేజ్ లు కీలక సాక్ష్యంగా మారటం సంచలనం రేపింది. డ్రగ్ ముఠా సభ్యులతో తాము జరిపిన వాట్సాప్ సంభాషణలే తమ కొంప ముంచాయని ఎక్సైజ్ శాఖాధికారుల నుంచి నోటీసులు అందుకున్న వారంటున్నారు. డ్రగ్ బాగోతంలో 12 మంది టాలీవుడ్ నటీనటులతో పాటు వారి డ్రైవర్లు, పీఏలు, వారి సన్నిహితుల పాత్ర ఉందని తేలింది. ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వ్యక్తులే కాకుండా కెల్విన్ కాల్ లిస్ట్‌లో మరో 23మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ 23మంది ఇంతకీ ఎవరన్న విషయం మాత్రం చెప్పలేదు.

10:41 - July 15, 2017

చెన్నై : తమిళనాడులో బిగ్‌బాస్‌ షోకు వ్యతిరేకంగా ఆందోళనలు  తీవ్రతరం అవుతున్నాయి.  బిగ్‌బాస్‌ షోను వెంటనే నిలిపివేయాలంటూ శివసేన, హిందూమున్నని, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కమల్‌హాసన్‌ కార్యాలయ ముట్టడికి యత్నించారు.  దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.  బిగ్‌బాస్‌ కార్యక్రమాన్ని నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. 

 

10:34 - July 15, 2017

ఢిల్లీ : మహిళల ప్రపంచకప్‌ లో మిథాలీ సేన కీలక సమరానికి సిద్ధమైంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఇదే చివరి లీగ్‌ మ్యాచ్‌ కావడంతో రెండుజట్లు హోరాహోరీగా తలపడే అవకాశంఉంది.. ఓవరాల్‌గా భారత్ 8పాయింట్లతో ఉండగా కివీస్‌ 7 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నెట్‌ రన్‌ రేట్‌తో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. వరుస మ్యాచ్‌లలో గెలుపుతో ఊపుమీదున్న భారత్‌... 
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. కివీస్‌తో గెలిచి సెమీస్‌ చేరాలని పట్టుదలగా ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే భారత్‌ సెమీస్‌ చేరే అవకాశముంది.

2 రోజుల పోలీసుల కస్టడీకి కెల్విన్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను 2 రోజుల పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. చర్లపల్లి జైలు నుంచి కెల్విన్ ను సిట్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు.

10:30 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నోటీసులు అందుకున్నవారిని ఈ నెల 19నుంచి 27వరకూ విచారించనుంది. కేసు కీలక దర్యాప్తులో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలావుంటే కొంతమంది సినీ నటులు తమకు నోటీసులు అందలేదని అంటున్నారు. మరికొంతమంది సినీ నటులు తమకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు. డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. 

రాజ్ భవన్ లో హరితహారం

హైదరాబాద్: మూడో విడుత హరితహారంలో భాగంగా నేడు రాజ్‌భవన్‌లోలోని మోడల్ స్కూల్‌లో మొక్కలు నాటనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మొక్కలను నాటుతారు. గ్రీన్‌డే సందర్భంగా అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు పాలమాకుల మోడల్ స్కూల్‌లో జరుగనున్న హరితహారంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పొల్గొననున్నారు.

తెలంగాణ లో చురుగ్గా రుతుపవానాలు..

హైదరాబాద్: తెలంగాణలో శనివారం అక్కడక్కడా భారీవర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాదిరి వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు వివరించారు. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెంలో 9 సెంటీమీటర్లు, అశ్వారావుపేట, నర్మెట్టల్లో 6, టేకులపల్లి, ములకలపల్లి, బూర్గంపాడు, పాల్వంచల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం...

జమ్మూకశ్మీర్ : త్రాల్ సమీపంలోని సతోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సతోరా ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. హతమైన ఉగ్రవాదులను లష్కరే తోయిబాకు చెందిన వారిగా బలగాలు భావిస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా ఎస్సీ గురుకుల పాఠశాలలో విషాదం...

మంచిర్యాల: నిద్రిస్తున్న ఓ విద్యార్థి పైఅంతస్తు నుంచి పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పాయిద రాకేష్ నిద్రిస్తున్న సమయంలో పై అంతస్తు నుంచి పడి మృతిచెందాడు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

09:52 - July 15, 2017

గుంటూరు : అమరావతిలో సీపీఎం నేతల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం నేతలు, కార్యకర్తల్ని ముందే అరెస్ట్ చేస్తున్నారు.. పార్టీ రాజధాని ప్రాంత కార్యదర్శి రవిని మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను సీపీఎం నేత బాబురావు ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

గుంటూరు : అమరావతిలో సీపీఎం నేతల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ప్రారంభానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.. ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం నేతలు, కార్యకర్తల్ని ముందే అరెస్ట్ చేస్తున్నారు.. పార్టీ రాజధాని ప్రాంత కార్యదర్శి రవిని మంగళగిరి పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను సీపీఎం నేత బాబురావు ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 

09:41 - July 15, 2017

హైదరాబాద్ : జర్నలిజంలో అవాంఛనీయ ధోరణు పెరిగిపోతున్నాయని సీనియర్‌ జర్నలిస్టు విజయసింహా అన్నారు. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీలో జరిగిన  'మీడియా న్యూస్‌రూం భవిష్యత్‌' అనే అంశంపై ఆయన మాట్లాడారు.  క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలపై పరిశోధన చేసే రిపోర్టర్లు కరువయ్యారని అన్నారు. కేవలం సంచలనాలు, బ్రేకింగ్స్‌ కే ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఈపరిస్థితి మారాలన్నారు.  గత 35ఏళ్లలో దేశంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిదన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు కాని.. ఇంట్లో కూర్చొని నెట్‌నుంచి ఇన్ఫర్మేషన్‌ తీకుంటే అది జర్నలిజం కాదన్నారు. ఈ పరిస్థితి మారాలన్నారు. న్యూస్‌రూం అంటే.. టెక్నాలజీతోపాటు.. పరిశోధన కూడా అవసరమని విజయసింహా అన్నారు.

 

నల్లగొండ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం

నల్లగొండ : పీఏ పల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయాన్ని ముట్టడిస్తారనే అనుమానంతో పలువురు దొండ రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రాత్రంతా పీఎస్ లోనే నిర్బంధించారు. తాము ఎలాంటి కార్యక్రమాన్ని తలపెట్టలేదని రైతులు చెప్పారు. 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లోని త్రాల్ లో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, లష్కరే తోయిబా ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతదళాలు ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చారు. 

 

ఏపీలో నేడు, రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు

అమరావతి : ఏపీలో నేడు, రేపు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఏపీతో పాటు హైదరాబాద్ లోమ 171 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

డ్రగ్స్ కేసులో నేడు పలువురికి నోటీసులు

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 27 వరకూ నోటీసులు అందుకున్నవారిని అధికారులు విచారించనున్నారు. 19 నుంచి రోజుకు ఒకరిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. 

 

08:23 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈనెల 19 నుంచి 27 వరకూ నోటీసులు అందుకున్నవారిని అధికారులు విచారించనున్నారు. 19 నుంచి రోజుకు ఒకరిని విచారించాలని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

08:14 - July 15, 2017

డ్రగ్స్ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని వక్తలు అన్నారు. డ్రగ్స్ రాకెట్ అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రజినేష్ గౌడ్, ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్, టీఆర్ ఎస్ నేత నాగేందర్ గౌడ్ పాల్గొని, మాట్లాడారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:59 - July 15, 2017
07:57 - July 15, 2017

ఢిల్లీ : ఓ వైపు చైనా కవ్వింపు చర్యలు.. మరోవైపు కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడులు. ఇవీ... గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు. ఇలాంటి సమయంలో దేశ భద్రత దృష్ట్యా ప్రతిపక్షాలతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలన్నింటిని వివరించింది. భారత్‌ తీసుకుంటున్న చర్యలు... ఏం చేయాలనే అంశాలపై ప్రతిపక్ష నేతలు సలహాలు స్వీకరించింది. 
విపక్ష నేతలతో సమావేశం 
సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్‌లో భారత్, చైనా మధ్య తలెత్తిన ప్రతిష్ఠంభన, కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో విపక్ష నేతలతో శుక్రవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌, జేడీయూ నేత శరద్‌ యాదవ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 
డొక్లాం సరిహద్దు విషయంలో ఉద్రిక్తత 
గత మూడు వారాలుగా పొరుగు దేశం చైనాతో సరిహద్దు వివాదంపై పెరుగుతున్న ఉద్రిక్తతలు, కశ్మీర్‌లో వరుస హింసాత్మక అల్లర్లు, భూటాన్‌తో మైత్రి వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. డొక్లాం సరిహద్దు విషయంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కేంద్రమంత్రులు వివరించారు. పొరుగు దేశాలతో సమస్యలను పరిష్కరించుకునేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు తెలిపారు. సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నింటిని ప్రభుత్వం అఖిలపక్ష నేతలకు వివరించింది. ఈ సందర్భంగా పార్టీల నేతలు స్పందిస్తూ.. యుద్ధం పరిష్కారం కాదని ప్రభుత్వానికి సూచించారు. యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిని మునుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. అన్ని అంశాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. 
సమావేశంపై కాంగ్రెస్ సంతృప్తి 
మూడేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, భారత్, చైనా మధ్య తలెత్తిన ప్రతిష్ఠంభనపై విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామమేనని కాంగ్రెస్ సంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాము మూడేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నామని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, సరిహద్దుల పరిరక్షణకు కేంద్రం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందన్నారు. దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొనే అన్ని నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని వైసీపీ, టీడీపీ నేతలు చెప్పారు. అయితే... వచ్చే సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... విపక్షాలు ఈ అంశాలు లేవనెత్తే అవకాశాలు ఉన్నందున కేంద్రం సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అంశాలపై వివరణనిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

07:42 - July 15, 2017

హైదరాబాద్ : కలెక్టర్ ప్రీతి మీనా పట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ అనుచితంగా ప్రవర్తించిన కేసులో కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కేసు గురించి సీఎస్ ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అక్రమాలు చేసే వాళ్లను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 

 

07:31 - July 15, 2017

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేట్‌ విద్యా సంస్థ ప్రారంభం కాబోతుంది. ఈ ఘట్టం అమరావతి చరిత్రలో ప్రత్యేకతను సంతరించుకోనుంది. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జరగనుంది. 
ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ ప్రారంభం
అమరావతిలో స్థాపించిన...  తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీని సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కలసి ప్రారంభించనున్నారు.  శనివారం  ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి  అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా యూనివర్సిటీలో ఆగస్ట్‌ నుంచే క్లాస్‌లు మొదలు పెట్టనున్నారు. 
బోధన కోసం విదేశీ అధ్యాపకులు
తొలుత 300 మంది విద్యార్థులతో ప్రారంభం కానున్న ఈ యూనివర్సిటీలో 70 శాతం ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు,  30 శాతం మిగతా  రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, లిబరల్  ఆర్ట్స్‌, హ్యూమనిటీస్, మెడిసిన్, లా కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.  పాఠ్యాంశాలను బోధించేందుకు అమెరికా, రష్యా, స్పెయిన్, జపాన్‌, ఫ్రాన్స్‌ దేశాల నుంచి అధ్యాపకులను  తీసుకువస్తున్నారు.
ప్రైవేట్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ 
అమరావతిని నాలెడ్జ్‌ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ఏపీ  ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన  ఎస్.ఆర్.ఎమ్, విట్‌ యూనివర్సిటీలకు  స్థలాలు కేటాయించింది. మంగళగిరి మండలం   నీరుకొండ, కురగల్లు గ్రామాల మధ్య   ఎస్.అర్.ఎమ్. యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోంది. ఈ విద్యాసంస్థ కోసం ప్రభుత్వం మొత్తం 200 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుతం 12 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. కాగా వచ్చే ఐదేళ్లలో పది వేల మంది విద్యార్థులను చేర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 

07:27 - July 15, 2017

హైదరాబాద్ : జనంలోకి వచ్చేందుకు జనసేనాని సిద్ధమవుతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ ప్రజా బాట పట్టనున్నాడు. ఇకపై ప్రజల్లోనే ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాడు. రథయాత్రతో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేందుకు రెడి అవుతున్నాడు. 
రూట్‌ మార్చుకున్న పవన్‌?
ప్రజా సమస్యలపై అప్పుడప్పుడు స్పందించే పవన్‌... తన రూట్‌ మార్చుకున్నట్టు తెలుస్తోంది.  యాత్రల సంప్రదాయాన్ని పవన్‌ కూడా అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. గతంలోనే రాష్ట్రమంతా యాత్ర చేపడతానని ప్రకటించిన పవన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
రథయాత్ర చేపట్టాలని యోచిస్తున్న పవన్‌
పవన్‌ రాష్ట్రమంతా తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న సినిమా పూర్తైయ్యాక... ప్రజల్లోకి వచ్చేందుకు పవన్‌ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. తొలుత .. పాదయాత్ర చేయాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల రీత్యా రథయాత్రకు ఫిక్స్‌ అయినట్టు సమాచారం. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుని కొన్ని రోజుల పాటు ఈ రథయాత్ర కొనసాగనుంది. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్‌ 2న ఈ రథయాత్ర ప్రారంభం కానున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ రథయాత్రలో ప్రత్యేక హోదాపైనా... స్థానిక సమస్యలపైనా పవన్‌ ప్రస్తావించనున్నారు. మొత్తానికి జగన్‌ పాదయాత్రకు సిద్ధమైతే..  పవన్‌ రథయాత్ర చేపట్టనున్నాడు.. ఈ యాత్రలకు.. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 

 

07:20 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ రాకెట్‌ టాలీవుడ్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కొంతమంది టాలీవుడ్‌ స్టార్స్‌ నోటీసులపై స్పందించారు. డ్రగ్స్‌తో తమకేం సంబంధంలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే కొందరి వల్లే సినీ పరిశ్రమపై చెడ్డపేరు వస్తుందని టాలీవుడ్ పెద్దలు చెప్తున్నారు. 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్స్‌కు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీచేయడంతో  సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి రేగింది.
నాకు నోటీసులు అందాయి : సుబ్బరాజు
ఈ నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు.
నాకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవం : నందు 
డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. 
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు : హీరో తనీష్‌ 
డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 
డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు సంబంధం లేదు : ముమైత్ ఖాన్  
నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు.  
వారికి ఎలాంటి సాయం ఉండదు : శివాజీరాజా 
డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. వాళ్లకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో..అసోసియేషన్ అంతే శిక్ష వేస్తుందన్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్‌ డ్రగ్స్‌ మత్తులో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ డ్రగ్స్‌ మత్తులో మరెంతమంది టాలీవుడ్ స్టార్స్‌ చిత్తవుతారో చూడాలి. 

06:57 - July 15, 2017

చెన్నై : తమిళనాడులోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ డీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

 

నేడు ముఖ్దూం భవన్ లో సదస్సు

హైదరాబాద్ : నేడు ముఖ్దూం భవన్ లో సదస్సు జరుగనుది. చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పౌరహక్కులు...నిర్బంధం అంశంపై మేధావులతో సదస్సు నిర్వహించనున్నారు. 

 

నేటి నుంచి 10 రోజుల లీవ్ పై వెళ్తున్న అకున్ సబర్వాల్

హైదరాబాద్ : అకున్ సబర్వాల్ నేటి నుంచి 10 రోజులు లీవ్ పై వెళ్తున్నారు. అకున్ సబర్వాల్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసిన విషయం విధితమే. 

కార్పొరేటర్ మురళీ హత్యకు నిరసనగా నేడు వరంగల్ బంద్

వరంగల్ : కార్పొరేటర్ మురళీ హత్యకు నిరసనగా నేడు వరంగల్ బంద్ కు పిలుపునిచ్చారు. మొన్న మురళీ హత్యకు గురయ్యారు. 

 

నేడు గవర్నర్ ను కలవనున్న టీ.కాంగ్ నేతలు

హైదరాబాద్ : నేడు టీ.కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఈ సమావేశంలో రైతు సమస్యలను నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

 

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

హైదరాబాద్ : నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

మహిళల ప్రపంచ కప్...నేడు కీలక మ్యాచ్

హైదరాబాద్ : మహిళల ప్రపంచ కప్ లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరుగనుంది. భారత్..న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. న్యూజిలాండ్ గెలిస్తేనే భారత్ జట్టుకు సెమీస్ బెర్త్ ఖాయం కానుంది. 

 

Don't Miss