Activities calendar

16 July 2017

పొంగిపొర్లుతున్న నాగావళి..

ఢిల్లీ : ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నది పొంగి పొర్లుతోంది. నాగావళి నది ఉధృతితో ఆంధ్రా-ఒడిశా మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది.

అమర్ నాథ్ యాత్ర విషాదంపై మోడీ దిగ్ర్భాంతి..

ఢిల్లీ : అమర్‌నాథ్‌ యాత్రికుల ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో యాత్రికుల మృతి అత్యంత బాధాకరమని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

21:32 - July 16, 2017

రోజర్ ఫెదరర్ వింబుల్డన్ ఫైనల్‌లో దుమ్ము రేపాడు. సిలిచ్‌పై 6-3, 6-1, 6-4 వరుస సెట్లతో విజయం సాధించి 8వ సారి ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఫెదరర్ ఖాతాలో 19వ గ్రాండ్‌ స్లామ్ చేరింది. అత్యధిక వింబుల్డన్ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా కూడా ఫెదరర్ చరిత్ర సృష్టించాడు.

21:30 - July 16, 2017

జమ్మూ కాశ్మీర్ : అమర్‌నాథ్‌ యాత్రలో మరో విషాదం నెలకొంది. లోయలో బస్సు పడటంతో 16 మంది మృతి చెందారు. గుజరాత్‌ నుంచి జమ్ము వస్తున్న బస్సు రాంబాన్‌ జిల్లాలోని జాతీయరహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో 16 మంది మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. బస్సు అమర్‌నాథ్‌ యాత్రకు వస్తున్నట్లు ఎలాంటి బోర్డు పెట్టుకోలేదు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అమర్‌నాథ్‌ యాత్రికుల ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో యాత్రికుల మృతి అత్యంత బాధాకరమని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

21:28 - July 16, 2017

హైదరాబాద్‌ : లాల్‌ దర్వాజ బోనాలు కన్నులపండుగగా జరిగాయి. బోనాలు సమర్పించడానికి అమ్మవారి ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పలువురు ప్రముఖులు దేవాలయాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి తరలి వచ్చారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాసరావు ప్రభుత్వ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

బోనాలు ముఖ్యమైన పండుగలు..
తెలంగాణలో బోనాలు చాలా ముఖ్యమైన పండుగని... కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.. లాల్‌దర్వాజ అమ్మవారిని కుటుంబసభ్యులతోకలిసి దర్శించుకున్నారు. బోనాల సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత లాల్‌ దర్వాజ మహంకాళి అమ్మవారికి గుడి కట్టిస్తానని చెప్పి మర్చిపోయారని అన్నారు. అనంతరం అంబర్‌పేటలోని మహంకాళీ అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సంప్రదాయమైన పండుగలను కూడా హైజాక్‌ చేస్తున్నారని, ఇది చాలా విచారించ దగ్గ విషయమని వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నేతల సందర్శన..
బోనాల పండుగ తరతరాలుగా నిర్వహిస్తున్న పండుగ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డికె అరుణ అన్నారు. లాల్‌ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్న ఆమె ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గీతా రెడ్డి లాల్‌ దర్వాజ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్యాడ్‌మింటన్‌ స్టార్‌ పివి సింధు లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించారు. ఒలంపిక్స్‌కు ముందు బోనాలు సమర్పించడానికి వచ్చానని, ప్రతీ ఏడాది అమ్మవారి దర్శనం కోసం వస్తానన్నారు. అనంతరం పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయాన్ని సందర్శించారు.

మేడ్చల్ జిల్లా..
మేడ్చల్ జిల్లాలో కూడా బోనాల సందడి నెలకొంది. కాప్రా, కుషాయిగూడ, మీర్‌పేట్‌, హెచ్‌బీ కాలనీల్లో బోనాల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భక్తులు బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. మల్కజ్‌గిరిలో కూడా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నేరేడ్‌మెట్‌, వినాయక్‌ నగర్‌లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో బోనాల పండుగ ఘనంగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆలయ సిబ్బంది.. పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.

21:24 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్, కల్తీలను నియంత్రించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్. వీటిని అరికట్టేవరకు ఎవరూ విశ్రమించవద్దని సూచించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కేసీఆర్ అధికారులకూ- ప్రజా ప్రతినిధులకు పలు బాధ్యతలు అప్పగించారు. గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అందించడానికి చేపట్టాల్సిన చర్యలను సిఎంఓ అధికారులు ఎస్.నర్సింగ్ రావు, శాంతి కుమారికి బాధ్యతలను కేసీఆర్‌ అప్పగించారు. కల్తీలు, డ్రగ్స్ దందాల్లో నేరాల అదుపునకు చట్టాల్లో ఎలాంటి సవరణలు తేవాలనే అంశాన్ని అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి సిఫారసు చేసే బాధ్యతను హైదరాబాద్ సిపి మహేందర్‌ రెడ్డికి అప్పగించారు. వ్యవస్థీకృత నేరాలను అదుపుచేయడానికి ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పే బాధ్యతలను ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌కు ఇచ్చారు.

బాధ్యతలు..
కల్తీ విత్తనాలు , ఆహార కేంద్రాలు తయారు చేసే కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేయడంతో పాటు, ఇతర వ్యూహాల అమలు చేసే బాధ్యతను డిజిపి అనురాగ్ శర్మకు అప్పగించారు. డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు పడే దాకా చర్యలు తీసుకునే బాధ్యతను ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ కు అప్పగించారు. హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో జరుగుతున్న దందాలు, వాటిని ఆదిలోనే అరికట్టాల్సిన వ్యూహాలను రూపొందించే బాధ్యతలను హైదరాబాద్, వరంగల్ ఐజిలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డిలకు అప్పగించారు.

కలెక్టర్ల సహాయం..
హైదరాబాద్ చుట్టు పక్కల విత్తనాలు, ఆహార కల్తీ జరిగే ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ల సహకారంతో తగిన చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ కు అప్పగించారు. అవినీతి అధికారుల చిట్టా తయారు చేసే బాధ్యతను ఎసిబి డిజి పూర్ణచందర్ రావుకు అప్పగించారు. కొత్త పోలీసు కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఎక్సైజ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనులను పర్యవేక్షించే బాధ్యతను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త, ఎండి మల్లారెడ్డిలకు అప్పగించారు సీఎం కేసీఆర్.

పలు సూచనలు..సలహాలు..
డ్రగ్స్, గుడుంబా, గంజాయి తదితర విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నందున ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసే చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు అప్పగించారు. విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంట వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకునే బాధ్యతను వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ కు అప్పగించారు. హైదరాబాద్ లో కావాల్సినంత మంది ఫుడ్ ఇన్స్ పెక్టర్లను నియమించి, ఆహార పదార్ధాల పరీక్షలు వెంటవెంటనే నిర్వహించి, కేసుల్లో సహకరించే బాధ్యతను జిహెచ్ఎంసి కమీషనర్ జనార్దన్ రెడ్డికి అప్పగించారు. దూల్ పేటలో గుడుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యతలను హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ దందాలను అరికట్టే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో అధికారులు అంకితభావంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు.

21:21 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను రెండో రోజు విచారించారు సిట్ అధికారులు. ఇప్పటి వరకు సినీ ప్రముఖుల పేర్లు మాత్రమే వెల్లడించిన కెల్విన్ తాజాగా రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో రాజకీయ నేతల్లో గుబులు మొదలైంది. మరోవైపు డ్రగ్స్ నిందితులు కెల్విన్, ఖుద్దూస్, వహీద్ కస్టడీ ఆదివారంతో ముగిసింది.

పెను సంచలనం..
డ్రగ్స్ కేసు రాష్ట్రంలోనే పెను సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్, ఖుద్దూస్, వహీద్‌ల కస్టడీ ఆదివారంతో ముగిసింది. సిట్ అధికారుల రెండు రోజుల విచారణలో కెల్విన్ మరికొంతమంది పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు సినీ ప్రముఖుల పేర్లు మాత్రమే వినిపించినా తాజా విచారణలో పలువురు రాజకీయ ప్రముఖుల పిల్లల పేర్లను కెల్విన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

19-27 సినీ ప్రముఖుల స్టేట్మెంట్లు..
రెండు రోజుల విచారణలో కెల్విన్‌ను పలు కోణాల్లో ప్రశ్నించారు సిట్ అధికారులు. సినీ ప్రముఖులతో కెల్విన్‌కు అసలు పరిచయం ఎలా జరిగింది? విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై అధికారులు కెల్విన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు స్టేట్మెంట్లను ఈనెల 19 నుంచి 27 వరకూ రికార్డ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.

పలువురికి బాధ్యతలు..
మరోవైపు డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదలొద్దన్నారు. అధికారులకు- నాయకులకు పలు బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్, కల్తీ దందాలు నియంత్రించే వరకు విశ్రమించవద్దని అధికారులను సూచించారు.

21:16 - July 16, 2017

వీహెచ్..వి.హనుమంతరావు..కాంగ్రెస్ లో సీనియర్ నేత. తెలంగాణ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేత. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. నేతలపై ఆయన తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తుంటారు. వీహెచ్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన విషయాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి.

21:09 - July 16, 2017

హైదరాబాద్ : కూకట్ పల్లిలో అదృశ్యమైన విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకి లభ్యమైంది. మహారాష్ట్ర దాదర్ దగ్గర పూర్ణిమ ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఆమె క్షేమంగా ఉండడంతో తల్లిదండ్రులు..పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఓ స్వచ్చంద సంస్థ సంరక్షణలో పూర్ణిమ ఉన్నట్లు తెలుస్తోంది.

7వ తేదీన అదృశ్యం..
కూకట్ పల్లి నిజాంపేటలో పూర్ణిమా సాయి 7వ తేదీన స్కూల్ కని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో పూర్ణిమ కోసం ఆమె బంధువులు, ఫ్రెండ్స్ ను తల్లిదండ్రులు ఆరా తీశారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 14 టీమ్ లు విద్యార్థిని ఆచూకి కనుక్కొనేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన అధికమైంది. ఎక్కడున్నా ఇంటికి రావాలంటూ పోస్టర్లు ముద్రించారు.

సంతోషంగా ఉంది - కుటుంబసభ్యులు..
పూర్ణిమ ఆచూకి కనుక్కొవడానికి సహకరించిన మీడియా..పోలీసులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు పూర్ణిమ తల్లిదండ్రులు పేర్కొన్నారు. టెన్ టివితో వారు మాట్లాడారు. సీఐ బాలకృష్ణ ఫోన్ చేసి..బాలిక దొరికిందని చెప్పడంతో ఆనందం వేసిందని తండ్రి పేర్కొన్నారు. ఓ స్వచ్చంద సంస్థలో ఉన్నట్లు గుర్తించారని..అమ్మాయి సేఫ్ గా ఉందని ఫొటోలో కనిపించిందన్నారు. తాము స్వచ్చంద సంస్థకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు, సోమవారం ఉదయం తాము ఫ్లైట్ లో బయలుదేరుతున్నట్లు పేర్కొన్నారు. సినిమాలో యాక్టింగ్ చేస్తానని చెప్పలేదని..సీరియళ్లు..కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే ఆసక్తి ఎక్కువని పూర్ణిమ తల్లి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:56 - July 16, 2017

తెలుగు..సంస్కృతి..సంప్రదాయాలను మరిచిపోతూ పాశ్చాత్య పోకడలు పోతున్న ఈ తరుణంలో ఎక్కడో అమెరికాలో పుట్టి..పెరిగి తెలుగు సంస్కృతి..సంప్రదాయాలను గౌరవిస్తూ ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం పొందుతూ అమెరికాలో జరిగిన 'పాడుతా తీయగా' సింగింగ్ కాంపిటీషన్ లో సెమీ ఫైనలిస్టుగా నిలిచి తన ప్రతిభను కనబరచడమే కాకుండా భారతదేశానికి సేవ చేయాలనే దృక్పథంతో 'స్వరవేదిక ట్రస్టు'ను ఏర్పాటు చేసి దానికి కో ఫౌండేషన్ గా ఉంటూ దాని ద్వారా వచ్చిన నిధులను పేద విద్యార్థుల కోసం అందిస్తున్నాడు ఈ 15 సంవత్సరాల కుర్రాడు..మాదో దంతోర్తి...పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

పార్లమెంట్ లో ఓటు వేయనున్న అమిత్ షా..

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అస్సాం మాజీ సీఎం గగోయ్ లు పార్లమెంట్ లో ఓటు వేయనున్నారు.

20:22 - July 16, 2017

పూర్ణిమ ఆచూకీ లభ్యం..

హైదరాబాద్ : కూకట్ పల్లిలో అదృశ్యమైన టెన్త్ విద్యార్థిని పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలోని దాదర్ వద్ద పూర్ణిమను సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. స్కూల్ కు బయలుదేరిన పూర్ణిమ జూన్ 7న అదృశమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ స్వచ్చంద సంస్థ సంరక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన..

విశాఖఫట్టణం : ప్రభుత్వ అతిథి గృహం వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గీతం యూనివర్సిటీలో కంప్యూటర్ మొరాయించడంతో అభ్యర్థులు పరీక్ష రాయలేదు.

ఏపీలో ముగిసిన గ్రూప్ 2 పరీక్ష..

విజయవాడ : ఏపీలో 173 కేందాల్లో గ్రూప్ 2 పరీక్షలు ముగిశాయి. 45,287 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. గీతం యూనివర్సిటీలో సర్వర్ పనిచేయకపోవడంతో 41 మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. నెల రోజుల్లో గ్రూప్ 2 ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

20:03 - July 16, 2017

విశాఖపట్టణం : గ్రూప్‌ టూ కి సంబంధించిన ప్రాథమిక కీని ఈరోజు విడుదల చేస్తామని ..నెలరోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. గీతం యూనివర్సిటీ విద్యార్ధులు నిబంధనలు పాటించలేదన్నారు. గ్రూప్ -2 పరీక్షను పారదర్శకంగా నిర్వహిచండం జరిగిందని, బయో మెట్రిక్ అటెండెన్స్..సీసీ కెమెరాల మధ్య ఈ పరీక్ష జరిగిందన్నారు. నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేయడం జరుగుతుందని, సర్వర్లు మొరాయించడం సహజంగా జరిగేదని..గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని..ఘటన జరిగితే మాత్రం ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సమయం..తక్కువ అయ్యే అవకాశం ఉండదని..ఈ నేపథ్యంలో గీతం వర్సిటీ విద్యార్థులు బయటకు వెళ్లడం జరిగిందన్నారు. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి.

20:00 - July 16, 2017
19:34 - July 16, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌కు టీఎంసీ మినహా అన్ని పార్టీల అగ్ర నేతలు హజరయ్యారు. సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని అఖిలపక్ష నేతలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. మరోవైపు సమావేశాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి.

మహిళా రిజర్వేషన్..
దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ, వ్యాపారంలో పరిస్థితి దిగజారాయని.. వీటిపై పార్లమెంటులో చర్చించాల్సిన అవసరం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఏచూరి అన్నారు.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేనా ?
జీఎస్టీలోని లోపాల్ని సరిచేసి ప్రజల్లో ఉన్న ఆందోళన పోగొట్టే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధంగా చైనా బోర్డర్ టెన్షన్, అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి అంశాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరినట్లు సుజనా చెప్పారు.

ఫిరాయించిన నేతలపై చర్యలేవి - మేకపాటి..
దేశ వ్యాప్తంగా వ్యవసాయదారులు పడుతున్న ఇబ్బందుల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టంలో సవరణలు తేవడంతో పాటు.. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు మేకపాటి తెలిపారు.

జీఎస్టీ గ్రానైట్ పరిశ్రమ
జీఎస్టీ నుంచి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపి జితేందర్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ స్కీం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులకు సంబంధించిన అంశాల్లో జీఎస్టీ మినహాయింపు కోరినట్లు జితేందర్ రెడ్డి చెప్పారు.
సోమవారం రాష్ట్రపతి ఎన్నికతో పాటు.. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి.

19:23 - July 16, 2017

హైదరాబాద్ : సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా కేసీఆర్ దిశా..దశ నిర్ధేశం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మాక్ పోలింగ్ లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ మద్దతు తెలియచేసిన సంగతి తెలిసిందే. ఓటు హక్కు వినియోగించు కొనేందుకు టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. 90 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినిగించుకోనున్నారు. ఉదయం 10గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

19:10 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మూలాలను వెతికి పట్టుకోవడంలో ఎక్సైజ్ పోలీసులు నిమగ్నమయ్యారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అధికారి అకూన్ సబర్వాల్ చేపట్టిన దర్యాప్తులో పలు సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి. టాలీవుడ్..విద్యార్థిని..విద్యార్థులు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్టు బయటపడ్డాయి. సినీ వర్గానికి చెందిన ప్రముఖుల పేర్లు బయటపడడంతో కలకలం రేగింది.

కేసీఆర్ సూచనలు..సలహాలు..
డ్రగ్స్ రాకేట్ కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎక్సైజ్, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు..ఆదేశాలు జారీ చేశారు. డగ్స్..కల్తీ దందాలప ఎవరున్నా చర్యలు తీసుకోవాలని, అధికార ప్రతినిధులున్నా వదిలి పెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్..కల్తీల నిర్మూలనకు తీవ్రంగా శ్రమించాలని, ఎవరనీ వదలద్దని సూచించారు. రాజకీయ నాయకులైనా..చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసులు పెట్టాలని, ఇలాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడేలా చర్యలుండాలన్నారు.

పలువురికి కీలక బాధ్యతలు..
పోలీసు..ఎక్సైజ్ అధికారులకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో నిందితులకు శిక్ష పడేలా చూసే బాధ్యత ఎక్సైజ్ కమిషనర్..ఎక్సైజ్ ఈడీలకు..కల్తీలు..డ్రగ్స్ కేసులో బాధ్యులపై కఠిన చర్యలకు చట్టాల్లో మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసే బాధ్యత హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డికు..కల్తీ విత్తనాలు..కల్తీ ఆహార పదార్థాల స్థావరాలపై దాడుల పర్యవేక్షణ బాధ్యతను డీజీపీకి..అవినీతి అధికారుల చిట్టాను తయారు చేసే బాధ్యతను ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావుకు అప్పగించారు.

రాజకీయ..వ్యాపార వేత్తల కుమారులు..
ఇదిలా ఉంటే సిట్ కస్టడీలో ఉన్న కెల్విన్, మహ్మద్, ఖుద్దూస్, మహ్మద్ వాహిద్ లను రెండో రోజు విచారించారు. సాయంత్రానికి సిట్ కస్టడీ ముగిసింది. విచారణలో కెల్విన్ ముఠా పలు సంచలనాత్మకమైన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతల పుత్రరత్రాల పేర్లు ఉన్నట్లు సమాచారం. బడా వ్యాపారవేత్తల కుమారులు.. కెల్విన్ కస్టమర్లని తెలుస్తోంది.

మరి ఈ డ్రగ్స్ కేసులో రాజకీయ..బడా వ్యాపార వేత్తల కుమారులు ఉంటే వారి పేర్లు బయటపడుతాయా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో వేచి చూడాలి.

అమర్ నాథ్ యాత్ర బస్సు బోల్తా..16 మంది మృతి..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర బస్సు బోల్తా కొట్టడంతో 16 మంది మృతి చెందారని జమ్మూ ఐజీపీ పేర్కొన్నారు. మొత్తం 46 మంది ప్రయాణీకులు బస్సులో ఉన్నారని, రాజస్థాన్..బీహార్ ప్రాంతాలకు చెందిన వారున్నట్లు తెలిపారు.

సహాయక చర్యల్లో సీఆర్పీఎఫ్ - ఒడిశా సీఎం..

ఒడిశా: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా నాగావళి ఉధృతికి రాయగడ్ వద్ద రైలు వంతెన కొట్టుకపోయింది. సీఆర్పీఎఫ్ బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు.

18:33 - July 16, 2017

విశాఖపట్టణం : రాష్ట్రంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళల ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులివ్వడం విశాఖ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్క వీధిలో నివాసాల మధ్య మద్యం విక్రయాలపై ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక మహిళలు నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన తెలిపారు. నివాసాల మధ్యనున్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని, గతంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు విషయం చెప్పడం జరిగిందని మహిళలు..ఐద్వా నేతలు తెలిపారు. మద్యం దుకాణాలు తొలగిస్తామని చెప్పి ఇంతవరకు ఆ పని చేయలేదని, దుకాణ యజమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరి మహిళల ఆందోళనతో మద్యం దుకాణాలను తొలగిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

18:24 - July 16, 2017

కర్నూలు : వైసీపీ ఎంపీ బుట్టా రేణుక పార్టీ మారబోతున్నారా ? వైసీపీని వదిలి సైకిల్ ఎక్కుతారా ? సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎంపీలతో జరిపిన సమావేశానికి బుట్టా రేణుక హాజరు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. కానీ దీనిపై ఆదివారం ఎంపీ బుట్టా రేణుక స్పష్టతనిచ్చారు. వైసీపీని వీడే ఆలోచన లేనే లేదని కుండబద్ధలు కొట్టారు. శనివారం లోటస్‌పాండ్‌లో జరిగిన ఎంపీల సమావేశానికి హాజరు కాలేనని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ముందుగానే తెలిసినట్లు పేర్కొన్నారు. కేవలం అభివృద్ధి పనుల విషయంలోనే మంత్రి నారా లోకేష్‌ను కలవడం జరిగిందని, అంత మాత్రాన పార్టీ మారినట్లేనా అని రేణుక ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరినీ కలవకూడదా ? అనే అనుమానం రేకేత్తిస్తున్నారని పేర్కొన్నారు.

పోలీసు..ఎక్సైజ్ అధికారులకు కీలక బాధ్యతలు..

హైదరాబాద్ : పోలీసు..ఎక్సైజ్ అధికారులకు సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్ కేసులో నిందితులకు శిక్ష పడేలా చూసే బాధ్యత ఎక్సైజ్ కమిషనర్..ఎక్సైజ్ ఈడీలకు..కల్తీలు..డ్రగ్స్ కేసులో బాధ్యులపై కఠిన చర్యలకు చట్టాల్లో మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసే బాధ్యత హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డికు..కల్తీ విత్తనాలు..కల్తీ ఆహార పదార్థాల స్థావరాలపై దాడుల పర్యవేక్షణ బాధ్యతను డీజీపీకి..అవినీతి అధికారుల చిట్టాను తయారు చేసే బాధ్యతను ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావుకు అప్పగించారు.

పేకాట ఆడిన రెవెన్యూ ఉద్యోగులు..

పశ్చిమగోదావరి : ఏలూరులో రెవెన్యూ భవన్ పై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో డిప్యూటి తహశీల్దార్ లామ్, కామవరపు కోట తహశీల్దార్ నర్సింహరాజులు ఉండడం గమనార్హం. మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ఆక్సిడెంట్ లో తండ్రి..కొడుకుల మృతి..

నాగర్ కర్నూలు : కడ్తాల్ లో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో టిప్పర్ - బైక్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రితో సహా ఇద్దరు కొడుకులు మృతి చెందారు. భార్యకు తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. మృతులు వరంగల్ జిల్లా నర్సంపేట వాసులుగా గుర్తించారు.

ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు ?

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో బీజేపీ సోమవారం ప్రకటించనుంది. ఎల్లుండి ఉప రాష్ట్రపతి అభ్యర్థికి నామినేషన్ కు తుది గడువు ఉందనే విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో వెంకయ్య నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.

ఓటు వేయనున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

విజయవాడ : రేపు స్టేట్ గెస్ట్ హౌస్ లో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం జగన్..ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లి ఓటు వేయనున్నారు.

ఏపీ అసెంబ్లీలో పోలింగ్..

విజయవాడ: రేపు అసెంబ్లీలో ఉదయం 10 నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. రేపు ఉదయం 8గంటలకు టిడిపి ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు.

డ్రగ్స్ కేసులో మరికొంతమంది పేర్లు..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మరికొందరి పేర్లను విచారణలో కెల్విన్ బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ నేతల పుత్రరత్రాల పేర్లు ఉన్నట్లు సమాచారం. బడా వ్యాపారవేత్తల కుమారులు.. కెల్విన్ కస్టమర్లని తెలుస్తోంది.

బంజారాహిల్స్ లో పోకిరీలు..

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో పోకిరీలు రెచ్చిపోయారు. ఈనెల 11న రోడ్ నెంబర్ 12లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ యువతి పట్ల పోకిరీలు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎదురుతిరగిన యువతి పై ఆకతాయిలు చేయి చేసుకున్నారు. స్థానికుల రావడంతో పోకిరీలు పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అక్రమార్కులు భయపడాలి - కేసీఆర్..

హైదరాబాద్ : పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసులో దూకుడు పెంచాలని, కల్తీ రక్తం విషయంలో తన మనస్సు చలించిందన్నారు. డ్రగ్స్..కల్తీల నిర్మూలనకు తీవ్రంగా శ్రమించాలని, ఎవరనీ వదలద్దని సూచించారు. రాజకీయ నాయకులైనా..చివరికి కేబినెట్ మంత్రి పాత్ర ఉన్నా కేసులు పెట్టాలని, ఇలాంటి దుర్మార్గాలు తెలంగాణలో చేయలేమని అక్రమార్కులు భయపడేలా చర్యలుండాలన్నారు.

17:32 - July 16, 2017

మహిళలు..అన్ని రంగాల్లో ప్రతిభ..ఆటో డ్రైవర్..క్రీడా రంగం..సినిమా రంగం..పరీక్షల్లో.. అన్ని రంగాల్లో మహిళల ప్రతిభ..కానీ వీరు మాత్రం మహిళా పురోగతికి..సాధికారితకు చిహ్నాలుగా మారిపోయారు..మహిళల పరిస్థితి ఎలా ఉంది ? ప్రస్తుత పరిణామాలు చూస్తే కడుదయనీయంగా ఉందనే విషయం తెలిసిందే. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇతర అన్ని రంగాల్లో మహిళామణులు తీవ్ర వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఇతర బిల్లులను పాస్ చేయించుకొనేందుకు ప్రయత్నాలు చేసే పాలకులు ఈ బిల్లు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?

మమ్మల్ని అధికారంలోకి రానివ్వండి..మా తడాఖా ఏంటో చూపిస్తాం..రైతులు..కార్మికులు..మహిళలు..అందరి సమస్యలు తీర్చేస్తాం..ప్రధానంగా మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి చూపిస్తాం..అంటూ ఎన్నికల కంటే ముందు పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తుంటాయి. తమ సమస్యలు తీరుస్తారని ఆశించిన ప్రజలకు తీరని కలగానే మిగిలిపోతోంది. అందులో ప్రధానమైంది 'మహిళా రిజర్వేషన్ బిల్లు'. ఈ బిల్లు తేవడంలో వామపక్షాల పాత్ర అనిర్వచనీయం. దీనిపై కూడా బీజేపీ ప్రభుత్వం హామీలిచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి. కానీ ఆ హామీ మాత్రం ఎక్కడి గొంగళి అన్న చందంగానే మిగిలిపోయింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..
మళ్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశాల ఎజెండాలో ఈ బిల్లు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర అంశాలతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు సంగతిని ప్రశ్నించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీపీఎం గళమెత్తుతోంది. బిల్లును ఆమోదించాలని..ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ర్యాలీలు..ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉందని..ప్రభుత్వాలు మారుతున్నాయి..కానీ ఈ బిల్లుకు మోక్షం లభించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1996లో ప్రవేశ పెట్టిన బిల్లు అనేక అభ్యంతరాలు..వివాదాలతో ఇన్నాళ్లు కూడా ఆమోదానికి లేకుండా చేశారు. ముఖ్యంగా బీజేపీ, కొన్న ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు అభ్యంతరాలు పెట్టడం దురదృష్టకరమని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు..ఇతర వాటికి లింక్ పెడుతున్నారని వామపక్ష నేతలు పేర్కొంటున్నారు.

2014 ఎన్నికల సమయం..
2014 ఎన్నికల సమయంలో బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది..లోక్ సభలో పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. కానీ ఆమోదించేందుకు మాత్రం మోడీ సర్కార్ అడుగులు వేయడం లేదు. ఎందుకని ? దీనిపై ప్రశ్నిస్తే మాత్రం సరికొత్త భాష్యాలకు తెరతీస్తున్నారు. ఇతర బిల్లుల విషయాల్లో ప్రతిపక్షాలతో చర్చించే పాలకపక్షం ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

వామపక్షాల కీలక పాత్ర..
మహిళా రిజర్వేషన్‌ (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు 2008లో రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. వామపక్షాల మద్దతుతో ఉన్న యుపిఎ-1 ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చినా ఇందులో వామపక్షాల పాత్ర అనిర్వచనీయమని అందరికీ తెలిసిందే. లోక్‌సభలోనూ, రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ముఖ్యోద్దేశం. రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సగభాగంగా ఉన్న మహిళలకు కనీసం 33 శాతం సీట్లను చట్ట సభల్లో కేటాయించగలిగినప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో 'మహిళా రిజర్వేషన్ బిల్లు' తెస్తారా ? లేదా ? అనేది చూడాలి.

పుట్టిన దగ్గర నుండి పోయే వరకూ మహిళ వివక్షకు గురవుతూనే ఉంది.
మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం..దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయగలిగితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెబుతున్న దేశంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది...

17:22 - July 16, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడు కేవీపై ఈ వ్యాఖ్యలు చేశారు. టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. జగన్ తో పాటు కేసీఆర్ తో కేవీపీ అంటకాగుతూ...కాంగ్రెస్ నేతలను ఆయా పార్టీల్లోకి పంపిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనలాటి ఎంతో మంది నేతలను వైఎస్ కు దూరం చేశాడని..తనకు కూడా మంత్రి పదవి రాకుండా కేవీపీ అడ్డుకున్నాడంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా కేవీపీ సూచన మేరకు వైసీలో చేరిన మల్లాది విష్ణు కూడా వైసీపీలో చేరారని వీహెచ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమంలో చూడండి..

17:13 - July 16, 2017

హైదరాబాద్ : నగర బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని సీఎం కేసీఆర్ ఎక్సైజ్, పోలీసు అధికారులకు సూచించారు. డ్రగ్స్ కేసుపై ఆయన అధికారులతో ప్రగతి భవన్ లో సుదీర్ఘంగా చర్చించారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం కొనసాగించింది. ఈసందర్భంగా కేసీఆర్ పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దూకుడు పెంచాలన్న కేసీఆర్..
డ్రగ్స్ కేసు దర్యాప్తులో దూకుడు పెంచాలని..అధికార పార్టీకి చెందిన నాయకులు..ఇతరులు ఎవరైనా ఉంటే తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం, దందా ఎప్పటి నుంచో ఉన్నాయని, దీనిని పూర్తిగా రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని..అక్రమార్కులు భయపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు.
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్ విచారణ జరిగింది. అడ్వకేట్ సమక్షంలో జరిగిన విచారణలో కెల్విన్ సహకరించలేదని తెలుస్తోంది.

సెల్ఫీ తీసుకుంటూ జారిపడి..

విశాఖపట్టణం : కిరండోల్ ప్యాసింజర్ ట్రైన్ లో సెల్ఫీ తీసుకుంటూ యువకుడు జారి పడి మృతి చెందాడు. బోండం - కరకవలస గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

16:51 - July 16, 2017
16:50 - July 16, 2017
16:47 - July 16, 2017

విశాఖపట్టణం : సోషల్ మీడియా నేరాల్లో కొత్త కోణం వెలుగు చూసింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా పరిచయమైన కొంతమందితో స్వలింగ సంపర్కం చేసి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు లాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. నకిలీ ఫేస్ బుక్ ఖాతాల ద్వారా 'గే' గ్రూపుల ద్వారా పరిచయమైన ఐదుగురు యువకులు..నగరానికి చెందిన ఓ యువకుడితో స్వలింగ సంపర్కం చేశారు. ఈ వ్యవహరాన్ని అంతా రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం వారు డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని ఆ వ్యక్తిని బెదిరించారు. రూ. 2లక్షలు ఇచ్చిన ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బ్లాక్ మెయిల్ చేసే ఐదుగురు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

అప్రమత్తండా ఉండాలన్న పోలీస్ కమిషనర్..
ఫేస్ బుక్ లపై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ముక్కాల ఆనంద్ ఉన్నాడని..మరో నలుగురు ఈ కేసులో ఉన్నారని పేర్కొన్నారు. విశాఖ జిల్లా కేంద్రంగా నడుస్తున్న 'గే' గ్రూపులో 2,335 మంది సభ్యులుగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వేధింపులకు గురవుతున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

16:38 - July 16, 2017

కరీంనగర్ : కేంద్రం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన సంస్కరణలు ఎల్ఐసీ రంగంతో పాటు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం పై జీఎస్టీ విధించడం సరికాదన్నారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అండ్ ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులు జిల్లాలో జరిగాయి. ప్రధాన కార్యదర్శి రమేష్ కూడా హాజరయ్యాచరు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు ఐక్యంగా ఉద్యమించాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కార్మిక వర్గ ఐక్యత..అభివృద్ధికి మూలాధారం అనే అంశంపై కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథులుగాఉమ్మడి కరీనంగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఇన్సూరెన్స్ ఉద్యోగస్తులు భారీగా హాజరయ్యారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులపై చర్చించి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రైవేటీ కరణ, ఉద్యోగులపై ప్రభావం...వ్యవసాయ సంక్షోభంపై శిక్షణా తరగతులు కొనసాగాయి.

16:28 - July 16, 2017

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో గత కొన్ని రోజులుగా భూ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నీరు - చెట్టు కార్యక్రమం పేరిట భూములను ఆక్రమస్తున్నారంటూ దళితులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి సంఘీభావంగా..పరామర్శించేందుకు పలు పార్టీల నేతలు దేవరపల్లికి వెళుతున్నారు.

బాలినేని గృహ నిర్భందం..
ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెళుతున్నారని పోలీసులకు సమాచారం అందించింది. దీనితో అర్ధరాత్రి బాలినేని ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. దేవరపల్లికి వెళితే అరెస్టు చేస్తామని పరోక్షంగా పోలీసులు హెచ్చరించారు.

ఖండించిన బాలినేని..
దేవరపల్లిలో హరిజనులకు..గ్రామస్తులకు జరిగిన భూ తగాదా విషయంలో దేవరపల్లికి వెళ్లాలని అనుకోవడం జరిగిందని బాలినేని మీడియాకు తెలిపారు. కానీ తనను నిర్భందించడం అన్యాయమన్నారు. కేవలం తాము పరామర్శించడానికి వెళితే ఇలా చేయడం సబబు కాదని..తప్పకుండా ఆ గ్రామాన్ని తాము సందర్శించడం జరుగుతుందని బాలినేని స్పష్టం చేశారు.

అమరావతిలో మరో భూ దందా..

విజయవాడ : అమరావతిలో అధికార పార్టీ నేతల భూ దందా వెలుగులోకి వచ్చింది. మైనింగ్ క్వారికి అక్రమంగా ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు అనుమతులు పొందారు. అమరావతి (మం) ఎండ్రాయిలో చనిపోయిన మహిళ పేరిట దొంగ పత్రాలు సృష్టించి క్వారీ అనుమతులు పొందారు. ఆధారాలు పరిశీలించకుండానే క్వారీకి మైనింగ్ అధికారులు, అమరావతి తహశీల్దార్ అనుమతులు ఇవ్వడం గమనార్హం. అక్రమ క్వారీపై రేపు కలెక్టర్ ను వైసీపీ నేతలు కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

16:09 - July 16, 2017

విజయనగరం : నాగావళి నది పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నాగావళి ఉధృతం పెరిగిపోయింది. కళ్యాణ్ సింగ్ పూర్ లో నీట మునగగా మరో 30 గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకపోయాయి. నాగావళి ఉధృతితో ఆంధ్రా..ఒడిషా రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొమరాడ మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

విజయనగరం జిల్లాపై..
నాగావళి ఉధృతి విజయనగరం జిల్లాపై ప్రభావం పడింది. పార్వతీపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరాడ (మం) కోనేరు వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. గత నాలుగైదు గంటలుగా ఎక్కడి వాహనాలు నిలిచిపోయాయి. కొమరాడ మండలంలోని పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాలకు వీరిని తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాయగడ జిల్లా కళ్యాణ సింగుపూర్ నీట మునగగా తెరుబలి వద్ద రైల్వే బ్రిడ్జి కొట్టుకపోయింది.

వాహనదారుల ఇక్కట్లు..
జాతీయ రహదారి..ఇతర ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి ఉధృతితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లోతట్టు ప్రాంతాల వాసులు పేర్కొంటున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో తాము వంట వండుకోవడానికి సరుకులు కూడా లేవని, కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని వాహన డ్రైవర్లు..సిబ్బంది పేర్కొంటున్నారు.

టీఆర్ఎల్పీ సమావేశం..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో టీఆర్ఎల్పీ సమావేశం జరిగింది. రేపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మాక్ పోలింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. రేపు తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

నాగావళి ఉధృతం..

విజయనగరం : ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయగడ జిల్లా కళ్యాణ సింగుపూర్ నీట మునగగా తెరుబలి వద్ద రైల్వే బ్రిడ్జి కొట్టుకపోయింది.

మీరా కుమార్ కు మద్దతిస్తున్న పార్టీలు..

ఢిల్లీ : మీరాకుమార్ కు యూపీఏలో పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, కేసీఎం, డీఎంకేలు మద్దతు ప్రకటించాయి. టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్, జేడీఎస్, జేఎంఎం, ఏఐఎంఐఎం, జేకేఎన్సీ సభ్యులు మద్దతు వెల్లడించారు. మొత్తం బలం 4,34,241గా ఉంది.

లాల్ దర్వాజ బోనాల్లో వీహెచ్..

హైదరాబాద్ : లాల్ దర్వాజ గుడి కట్టిస్తానని ఇచ్చిన హామీ సీఎం కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. లాల్ దర్వాజ అమ్మవారిని సందర్శించి ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీని కేసీఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

15:38 - July 16, 2017

హైదరాబాద్ : లాల్ దర్వాజ గుడి పెద్దగా కట్టిస్తానని ఇచ్చిన హామీ సీఎం కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. లాల్ దర్వాజ అమ్మవారిని సందర్శించి ఏర్పాటు చేసిన వేదికపై ఆయన ప్రసంగించారు. మొదటిసారి ఆలయానికి వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీని కేసీఆర్ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇంకా వీహెచ్ ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

15:34 - July 16, 2017

ఢిల్లీ : దేశం మొత్తం మీద వ్యవసాయ దారులు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. యాంటీ డిఫెక్షన్ బిల్లు ఎగతాళిగా మారిందని, 21 శాసనసభ్యులు..ఇద్దరు పార్లమెంట్ సభ్యులు..తెలంగాణ నుండి ఒక ఎంపీ పార్టీలు మారినా ప్రభుత్వం డిస్ క్వాలీఫ్ చేయలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంటనే వారిని డిస్ క్వాలీఫై చేయాలని కోరుతున్నా నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

15:31 - July 16, 2017

ఢిల్లీ : జీఎస్టీ నుండి గ్రానైట్ పరిశ్రమకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం స్కీం, మిషన్ కాకతీయ..మిషన్ భగీరథ పనులకు జీఎస్టీ మినహాయింపు కోరినట్లు తెలిపారు. గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న చిన్న వారిపై జీఎస్టీ ప్రభావం చూపుతుందని, ఈ రంగంపై ఆధార పడుతున్న లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటారని దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయి మూడు సంవత్సరాలైనా హైకోర్టు ఏర్పాటు నిర్ణయం తీసుకోలేదని, దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. దీనికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

15:25 - July 16, 2017

ఢిల్లీ : జీఎస్టీలో ఉన్న లోపాలను సరిచేసి ప్రజల్లో నెలకొన్న ఆందోళన పొగొట్టే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష పార్లమెంట్ సమావేశంలో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జీఎస్టీలో ఇబ్బందులున్నాయనే మాట వాస్తవమేనని..దీనిపై నెలకొన్న సమస్యలు తీర్చాలని కోరడం జరిగిందన్నారు. చైనా బోర్డర్ లో నెలకొన్న సమస్యలు..అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడి బాధాకరమని..వీటిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు సుజనా తెలిపారు.

15:13 - July 16, 2017

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ కేసు ప్రకంపనాలు ఇంకా కొనసాగుతున్నాయి. టాలీవుడ్ ఇండ్రస్టీ..విద్యార్థినీ..విద్యార్థులు డ్రగ్స్ కేసులో ఉన్నారని బయపడడంతో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు ఇందులో ఉన్నారని బయటకు పొక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. కేసు మూలాల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రగతి భవన్ లో సమీక్ష..
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పోలీసు, ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. హోం మంత్రి నాయినీ, డీజీపీ, అకున్ సబర్వాల్, కమిషనర్లు మహేందర్ రెడ్డి, మహేష్ భగవత్, సందీప్ శాండిల్య, జనార్దన్ రెడ్డి, డ్రగ్స్ పై ప్రాథమిక నివేదికను సీఎం కేసీఆర్ కు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకూన్ సబర్వాల్ సమర్పించారు. నివేదికలో పలు అంశాలను ఆ శాఖ పొందుపరించింది. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

స్పష్టమైన ఆదేశాలు..
డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేసీఆర్ అధికారులకు సూచించారు. బ్రాండ్ ఇమేజ్ ఉన్న హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలని, ఈ కేసులో ఎవరు ఉన్నా కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని కోణాల నుండి లోతుగా దర్యాప్తు ప్రారంభించాలని, డ్రగ్స్..కల్తీల నియంత్రణలో మరింత కఠినంగా వ్యవహరించాలని..విచారణలో ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు లొంగవద్దని..ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు గాను అవసరమైతే మరింత పోలీసుల సహాయం తీసుకోవాలని, సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చని..నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సెలవులపై వెళితే కేసుపై ప్రభావం చూపుతుందని..అందుకని సెలవుల విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని అకూన్ సబర్వాల్ కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు సిట్ కస్టడీలో ఉన్న కెల్విన్, మహ్మద్, ఖుద్దూస్, మహ్మద్ వాహిద్ లను రెండో రోజు విచారిస్తున్నారు. సాయంత్రానికి సిట్ కస్టడీ ముగియనుంది.

14:48 - July 16, 2017

అమర్ నాథ్ యాత్రలో మరో విషాదం..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులను తీసుకెళుతున్న బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

14:45 - July 16, 2017

ఢిల్లీ : 7 సార్లు వింబుల్డన్‌ చాంపియన్‌..స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌, 8వ టైటిల్‌పై కన్నేశాడు. మెన్స్‌ ఫెదరర్‌కు సెమీఫైనల్‌లోనూ పోటీనే లేకుండా పోయింది.ఫైనల్‌ బెర్త్‌ కోసం చెక్‌ రిపబ్లిక్‌ సెన్సేషన్‌ థామస్‌ బెర్డిచ్‌తో జరిగిన పోరులో ఫెదరర్‌ వరుస సెట్లలో సునాయాస విజయం సాధించాడు. మోడ్రన్‌ టెన్నిస్‌లో 18 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఫెదరర్‌...19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.

ఫైనల్ లో ఎంటర్..
ఫైనల్‌ బెర్త్‌ కోసం చెక్‌ రిపబ్లిక్‌ సెన్సేషన్‌ థామస్‌ బెర్డిచ్‌తో జరిగిన పోరులోనూ ఫెదరర్‌కు పోటీనే లేకుండా పోయింది.మూడు సెట్లలోనే బెర్డిచ్‌ను ఓడించి...ఫైనల్‌ ఫైట్‌కు అర్హత సాధించాడు. ప్రత్యర్ధి ఫెదరర్‌ కావడంతో బెర్డిచ్‌ తొలి సెట్‌ నుంచే ఎదురుదాడికి దిగాడు.తన ట్రేడ్‌ మార్క్‌ సెర్వ్‌,ఓలీ గేమ్‌తో చెలరేగిన ఫెడ్డీ తొలి రెండు సెట్లను టై బ్రేక్‌లో సొంతంచేసుకుని మ్యాచ్‌పై పట్టు బిగించాడు. మూడో సెట్‌లోనూ ఫెడ్డీ దూకుడు ముందు బెర్డిచ్‌ తేలిపోయాడు. 6-4తో థర్డ్ సెట్‌ నెగ్గిన ఫెదరర్‌..ఫైనల్‌లో ఎంటరయ్యాడు.

11వ సారి అర్హత..
ఫెదరర్‌ వింబుల్డన్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది 11వ సారి కావడం విశేషం.ఇప్పటికే రికార్డ్‌ లెవల్లో 7 సార్లు వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన ఫెడ్డీ...8వ సారి నెగ్గాలని తహతహలాడుతున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనే ప్రతిష్టాత్మకంగా భావించే...వింబుల్డన్‌ టైటిల్‌ను 8వ సార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలని ఫెదరర్‌ పట్టుదలతో ఉన్నాడు.

14:42 - July 16, 2017
14:39 - July 16, 2017

ఢిల్లీ : మన దేశంలో ఇంటర్నల్‌ సెక్యూరిటీ, వ్యాపారంలో పరిస్థితి దిగజారిందని, దాని గురించి పార్లమెంట్‌లో చర్చించాల్సిన అవసరం ఎంతో ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రజల మీద పెరుగుతున్న ఆర్థిక భారంపై చర్చ జరగాల్సి ఉందని ఏచూరి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉమెన్స్‌ రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పట్టించుకోవడం లేదని ఏచూరి అన్నారు. రైతు ఆత్మహత్యలను నివారిస్తామని..కనీస మద్దతు ధర కల్పిస్తామని ఆనాడు హామీనిచ్చారని, ఓ చట్టం ద్వారా దానిని అమలు పరచాలని సూచించారు.

14:36 - July 16, 2017

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామిని అభిషేకించారు. అనంతరం.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా టిటిడి ఈరోజు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం జరిగే పుష్పపల్లకి సేవతో అణివార ఆస్థానం వేడుకలు ముగుస్తాయి..

14:33 - July 16, 2017

ఖమ్మం : బస్టాండ్‌ వద్ద చెప్పుల దుకాణం యజమానిపై దాడి కేసులో పోలీసులు ఇద్దరు ఎస్‌ఐలను అరెస్ట్ చేశారు. రాత్రి షాప్‌లోకి వచ్చిన ఓనర్‌పై దాడికి దిగారు. పిస్టల్‌తో బెదిరిస్తూ.. దాడి చేశారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. షాప్ ఓనర్ జావెద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు ఎస్‌ఐలను అదుపులోకి తీసుకున్నారు. షాప్‌లోకివచ్చిన పోలీసుల్ని ఎవరు అని అడిగినందుకు తమపై దౌర్జన్యం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి వారు ఎలా దాడి చేశాడో..బాధితులు ఏమన్నాడో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:31 - July 16, 2017

హైదరాబాద్ : ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఓ సంచలనం. అవినీతిపరుల గుండెల్లో ఆయన సింహస్వప్నం. డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపిన ధీశాలి. భాగ్యనగరానికి పట్టిన ప్రమాదకర మత్తును వదిలించేందుకు.. శత విధాలుగా ప్రయత్నిస్తున్న విక్రమార్కుడు. ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌పై 10 టీవీ స్పెషల్ ఫోకస్‌. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న పేర్లు రెండే రెండు. ఒకటి డ్రగ్స్‌ మాఫియా, మరొకటి ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్. 2001 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్.. డ్రగ్స్‌ మాఫియాపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. మొన్నటివరకూ లా అండ్‌ ఆర్డర్‌లో డీఐజీగా విధులు నిర్వహించిన ఆయన ఇటీవలే ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

వెలుగులోకి వచ్చిన తారల బాగోతాలు..
బదిలీ అయిన కొద్ది రోజులకే అకున్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న డ్రగ్స్‌ మత్తును వదిలిస్తూ.. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు. అకున్‌ సబర్వాల్ డ్రగ్స్‌ డొంక లాగటంతో విద్యార్థి లోకం, అటు తల్లిదండ్రులు కళ్లు తెరిచేలోపే.. టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. సినిమా పరిశ్రమ ముసుగులో డ్రగ్స్‌కు బానిసలవుతున్న తారల నిజాలు వెలుగులోకి వచ్చాయి.

అకున్‌ ఓ డెంటిస్ట్‌..
సమాజంలో బాధ్యతాయుత ఐపీఎస్‌ ఆఫీసర్‌గా పేరు రావడమనేది సాధారణ విషయం కాదు. ఓ సెన్సేషనల్ క్రైమ్‌ను బయటకు తీసుకొస్తే ప్రశంసల కన్నా.. ఒత్తిళ్లే ఎక్కువగా వస్తాయి. గతంలో చాలా మంది ఆఫీసర్లు డ్రగ్స్‌, కొకైన్‌ లాంటి ప్రమాదకర మత్తు మాఫియా తీగ లాగి వదిలేస్తే.. అకున్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి అకున్‌ సబర్వాల్ ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారనే మంచి పేరుంది. 2001లో సివిల్స్‌కు సెలెక్ట్ అయిన అకున్‌ నిజానికి ఓ డెంటిస్ట్.

పోలీసులు, మావోయిస్టుల మధ్య 28 సార్లు ఎదురుకాల్పులు
మొదట అస్సాం కేడర్‌కు ఎంపికైన అకున్‌ సబర్వాల్.. తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఎన్నో చర్యలు తీసుకున్నారు. తన బ్యాచ్‌మెట్ స్మిత సబర్వాల్‌ను పెళ్లి చేసుకొని.. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు మారారు. అనంతపురంలో మొదట బాధ్యతలు తీసుకొని ఫ్యాక్షనిస్టుల పని పట్టారు. ఆ తరవాత వరంగల్‌ ఓఎస్డీగా పని చేసి నక్సల్స్‌ నిర్మూలనకు కృషి చేశారు. తరవాత విశాఖ జిల్లా ఎస్పీగా పని చేసి.. అక్కడ మావోయిస్టుల నుంచి సవాళ్లను ఎదురుకున్నారు. ఆయన హయాంలో జిల్లాలో 28 సార్లు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అలాగే బలిమెల ఎన్‌కౌంటర్‌లోనూ పోలీసులకు పలు సూచనలు చేస్తూ రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించాడు.

ఎక్సైజ్‌ శాఖను అప్పగించిన సీఎం కేసీఆర్‌
హైదరాబాద్‌ వచ్చిన తరువాత సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా, సౌత్‌జోన్‌ డీసీపీగా పని చేశారు. తెలంగాణలో గుడుంబాను నిర్మూలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అకున్‌ సబర్వాల్‌కు ఎక్సైజ్‌శాఖ అప్పగించారు. తక్కువ సమయంలోనే అకున్‌ తెలంగాణను గుడుంబా రహితంగా మార్చారు. బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజుల్లోనే... నగరంలో వేళ్లూనుకున్న డ్రగ్స్‌ తీగ లాగారు. ఈ దర్యాప్తులోనే... టాలీవుడ్‌ ప్రముఖులు కూడా డ్రగ్స్‌ వాడుతున్నారనే పచ్చి నిజం బయటపడింది. గతంలో డ్రగ్స్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అకున్‌.. నకిలీ మందుల ముఠాలను అరికట్టగలిగారు. ఏదైనా టాస్క్‌ను ఇస్తే దాన్ని పూర్తి చేయడంలో ఐపీఎస్‌ అకున్‌ దిట్ట. 1976లో పాటియాలలో పుట్టిన అకున్ సబర్వాల్.. ఆయన తండ్రి ఆర్మీలో పని చేయడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. అకున్‌ సబర్వాల్‌ భార్య స్మిత సబర్వాల్‌ ప్రస్తుతం సీఎంవోలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కలెక్టర్‌గా ఆమె పని తీరును గమనించిన సీఎం కేసీఆర్‌ తన కార్యాలయంలో నియమించారు. అకున్‌, స్మితా దంపతులకు ఇద్దరు పిల్లలు.

దర్యాప్తు వేగవంతం..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. సినీ పెద్దలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. దీంతో సర్కార్‌ అండ దండలుంటాయని నమ్మిన సినీ పెద్దలు.. ఇక్కడే స్థిరంగా ఉంటామని పలుసార్లు చెప్పారు. గతంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ద్వేషించిన వారంతా ఇప్పుడు స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ తీసుకున్నారని నోటీసులు అందడం సంచలనంగా మారింది. అయితే స్వయంగా సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి మరీ.. డ్రగ్స్‌ భూతాన్ని తరిమికొట్టాలని చెప్పడంతో... అకున్‌ సబర్వాల్ దర్యాప్తును వేగవంతం చేశారు.

పెరుగుతున్న అమర్ నాథ్ యాత్రికుల మృతుల సంఖ్య..

జమ్మూ కాశ్మీర్ : అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 8కి చేరింది. చికిత్స పొందుతూ యాత్రికురాలి మృతి చెందింది.

 

చిన్నారిని పోలీసులకు అప్పగించిన టెన్ టివి ప్రతినిధి..

ప్రకాశం : ముళ్లమూరు (మం) ఉల్లగట్లు శివారులో ఆడుకుంటూ నాలుగు ఏళ్ల చిన్నారి తప్పిపోయింది. ఆ చిన్నారిని పీఎస్ లో టెన్ టివి ప్రతినిధి అప్పగించారు. ముళ్లమూరు ఎస్ఐ టెన్ టివి ప్రతినిధిని అభినందించారు. చిన్నారిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.

కేసీఆర్ చేతిలో డ్రగ్స్ ప్రాథమిక నివేదిక..

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో పోలీసు, ఎక్సైజ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి నాయినీ, డీజీపీ, అకున్ సబర్వాల్, కమిషనర్లు మహేందర్ రెడ్డి, మహేష్ భగవత్, సందీప్ శాండిల్య, జనార్దన్ రెడ్డి, డ్రగ్స్ పై ప్రాథమిక నివేదికను సీఎం కేసీఆర్ కు ఎక్సైజ్ శాఖ సమర్పించింది. నివేదికలో పలు అంశాలను ఆ శాఖ పొందుపరించింది. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నట్లు నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పై కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కేసీఆర్ అధికారులకు సూచించారు.

అఖిలపక్ష సమావేశం..

ఢిల్లీ : పార్లమెంట్ లైబ్రరీ హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి మోడీ, అనంతకుమార్, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ముక్తార్ అబ్బాస్, ఎస్.ఎస్.ఆహ్లువాలియా, గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్ సింథియా, సుజనా చౌదరి, సీఎం రమేష్, తోట నరసింహం, జితేందర్ రెడ్డి, కేకే, మేకపాటి, విజయసాయిరెడ్డి, అనుప్రియా పటేల్, నరేష్ అగర్వాల్, సతీష్ చంద్ర మిశ్రాలు తదితరులు హాజరయ్యారు.

డ్రగ్స్ కేసు..సెకండ్ డే విచారణ..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు రెండో రోజు విచారణ చేస్తున్నారు. సిట్ కస్టడీలో ఉన్న కెల్విన్, మహ్మద్, ఖుద్దూస్, మహ్మద్ వాహిద్ లను రెండో రోజు విచారిస్తున్నారు. సాయంత్రానికి సిట్ కస్టడీ ముగియనుంది.

స్వలింగ సంపర్కులను బ్లాక్ మెయిలింగ్..

విశాఖపట్టణం : స్వలింగ సంపర్కులను బ్లాక్ మెయిల్ చేసే ఐదుగురు యువకులను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఫేస్ బుక్ లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు.

యువతీయువకుల మృతదేహాలు కలకలం

కడప : జిల్లాలోని రాజంపేట మండలం ఉప్పరపల్లెలోని రైల్వేట్రాక్‌పై యువతీ, యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి.. డ్రైవింగ్‌ లైసెన్స్ఆధారంగా చనిపోయిన యువకుడు రాజోలు నాగార్జున రెడ్డిగా గుర్తించారు.. వారిదగ్గరున్న బ్యాగ్‌లో బంగారు తాళిబొట్టు, రెండువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొనిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

డ్రగ్స్ కేసులో కెల్విన్ ను రెండోరోజు విచారిస్తోన్న సిట్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కెల్విన్ ను సిట్ రెండో రోజు విచారిస్తోంది. నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖులకు కెల్విన్ ఎలా పరిచయం..? వాళ్ల ఫోన్ నెంబర్లు కెల్విన్ దగ్గర ఎందుకు ఉన్నాయి...? విదేశాల నుంచి డ్రగ్ సరఫరా చేసే ప్రధాన సూత్రధారి ఎవరు..? ఈ అంశాలపై కెల్విన్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తోన్నారు. కెల్విన్, ఖుద్దూస్, వహాద్ ల కస్టడీ నేటితో ముగియనుంది. 

13:58 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కెల్విన్ ను సిట్ రెండో రోజు విచారిస్తోంది. నోటీసులు జారీ చేసిన సినీ ప్రముఖులకు కెల్విన్ ఎలా పరిచయం..? వాళ్ల ఫోన్ నెంబర్లు కెల్విన్ దగ్గర ఎందుకు ఉన్నాయి...? విదేశాల నుంచి డ్రగ్ సరఫరా చేసే ప్రధాన సూత్రధారి ఎవరు..? ఈ అంశాలపై కెల్విన్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తోన్నారు. కెల్విన్, ఖుద్దూస్, వహాద్ ల కస్టడీ నేటితో ముగియనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:50 - July 16, 2017

డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ ను గడగడలాడిస్తోంది. డ్రగ్స్ కేసును విచారణను సిట్ వేగవంతం వేసింది. ఈనేపథ్యంలో సిట్ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో నవదీప్ కూడా ఉన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న హీరో నవదీప్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:29 - July 16, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలను చైతన్య పరుస్తుంది. దోపిడివర్గాల గుట్టును రట్టు చేస్తుంది. సామాజిక అసమానతలను బయట పెడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలను  ఉద్యమాల బాట పట్టిస్తుంది. అలాంటి రచనలు చేసిన రచయితలు మన మధ్య ఎందరో ఉన్నారు. వారిలో వర్థమానకవి అనంతోజు మోహన్ కృష్ణ. ఆయన పరిచయ కథనతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. కొంత మంది యువకులు ముందు యుగం దూతలు అంటూ మహాకవి శ్రీశ్రీ యువతరాన్ని అభినందించారు. అలాంటి యువకులలో కవులుగా మారినవారెందరో యున్నారు. వారిలో అనంతోజు మోహన కృష్ణ ఒకరు. పాలకుల కళ్లకు పట్టిన పొరలు తొలగనంతవరకు మన చుట్టూ అంతా అంధకారమే అంటూ కవిత్వం రాసిన వర్థమానకవి అనంతోజు మోహన్ కృష్ణ. ఆయన ఇటీవల ఆలోచన చేద్దామా అన్న కవితా సంపుటిని వెలువరించారు. ప్రజలను చైతన్య పరిచే కవిత్వం రాస్తున్న అనంతోజు మోహన్ కృష్ణ పరిచయ కథనం ఈ వారం కొత్త కెరటంలో..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:26 - July 16, 2017

గిదేమి న్యాయం..పేదోడికి ఒక న్యాయం..డబ్బున్నోడికి ఒక న్యాయం..మతానికొక న్యాయం..కులానికి ఒక న్యాయం..మాములు ఆడదానికొక న్యాయం...ప్రశ్నించాల్సిన వారు ఏం చేస్తున్నరు ? అంటూ ఘటనలపై జనాలు ప్రశ్నిస్తున్నరు. మరి వారి ప్రశ్నలకు సమాధానం ఉందా ?

కలెక్టర్ చేయి పట్టుకున్న ఎమ్మెల్యే...
ఇటీవలే రెండు ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో యాదృచ్చికంగా చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనలపై కొన్ని మీడియా..ప్రతికలు విభిన్నంగా స్పందించాయి. మహిళలపై జరుగుతున్న వాటిపై పోరాడాల్సిందే..వారికి న్యాయం జరగాలని నినదించాల్సిందే. అందులో  ఎలాంటి డౌట్ అవసరం లేదు. కానీ ఇక్కడ జరిగింది విభిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన నిర్వాకం అందరికీ తెలిసిందే. మహిళా అధికారి అయిన కలెక్టర్ తో అమర్యాదగా ప్రవర్తించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకేత్తించింది. ఇలాంటి ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించారు కూడా.

గరగపర్రు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా 'గరగపర్రు' సాంఘీక బహిష్కరణ మీద గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. భీమవరంలో ఉద్యమిస్తున్న ఓ యువతిపై మగ ఖాకీ పట్టుకున్న విధానం అత్యంత దారుణం. భీమవరానికి వెళ్లేందుకు ప్రయత్నించిన గరగపర్రు దళితులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాలకు మధ్య దళితులకు తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వీరికి మద్దతుగా తరలివచ్చిన సీపీఎం శ్రేణులను అరెస్టు చేశారు.

విభిన్న స్పందనలు..
ఈ ఘటనలపై కొన్ని పత్రికలు..కొన్ని మీడియా ఛానెల్స్ విభిన్నంగా స్పందించాయి. ఎందుకలా ? మహిళలను మహిళ పోలీసులే అరెస్టు చేయాలి అనే కనీస విషయాన్ని మరిచిపోయారా ? మహిళకు మీరు ఇస్తున్నటు వంటి రక్షణ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు కురిపిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న వాటిని ఎవరైనా ఖండించాల్సిందే కానీ ఏ ఘటనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనే విషయాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. భీమవరంలో మహిళలను మగ పోలీసులు అవమానించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బలహీన వర్గాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా ? ప్రజాస్వామ్యయుతంగా పాలకులు కానీ, మీడియా ప్రవర్తించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో తహశీల్దార్ వనజాక్షి పై ఎమ్మెల్యే చింతమనేని చేసిన దౌర్జన్యం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనంతరం ఈ ఘటనలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

మహిళలపై అరాచకం..అన్యాయం జరిగినా..ఖండించాల్సిందేనని..కానీ కలెక్టర్ కి ఒక న్యాయం..మండల అధికారికి ఒక న్యాయం...సామాన్య మహిళకి ఒక న్యాయమా? ఆలోచించాలంటూ సూచనలు వినిపిస్తున్నాయి.

13:25 - July 16, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలను చైతన్య పరుస్తుంది. దోపిడివర్గాల గుట్టును రట్టు చేస్తుంది. సామాజిక అసమానతలను బయట పెడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలను  ఉద్యమాల బాట పట్టిస్తుంది. అలాంటి రచనలు చేసిన రచయితలు మన మధ్య ఎందరో ఉన్నారు. వారిలో అభ్యుదయ గేయ రచయిత నూనెల శ్రీనివాసరావ్. ఆయనపై కథనంతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. తెలుగు నాట వచన కవిత్వం రాసే కవులతో పాటు గేయరచయితలెందరో ఉన్నారు. కవిత్వం మేధావులను ఆలోచింపజేస్తే.... గేయాలు సామాన్య ప్రజలను చైతన్యవంతం చేస్తాయి. అలాంటి గేయాలు రాసిన విశాఖ జిల్లా రచయిత నూనెల శ్రీనివాసరావు. ఆయన వందకు పైగా గేయాలు రాసారు. శ్రమైక గేయాలు అన్న పాటల పుస్తకం కూడా వెలువరించారు. గేయకవి నూనెల శ్రీనివాస్ రావు జనం పాట మీ కోసం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:19 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్న ఎవరిని వదలవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఆయన ఈ వ్యవహారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌కు డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్‌ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. దర్యాప్తు వివరాలను కేసీఆర్‌కు అకున్‌ సబర్వాల్ వివరించారు. కేసులో పోలీసుల సాయం తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖకు కేసీఆర్ సూచించారు. 

 

13:13 - July 16, 2017

విజయవాడ : ఆకాశాన్నంటిన బియ్యం ధరలు ఆఫర్ల పేరుతో దళారులు.. బియ్యం ధరలను భారీగా పెంచేస్తున్నారు. దళారులు లాభాన్ని గడిస్తోంటే.. మధ్య తరగతి కుటుంబాలు బియ్యం కొనుగోలు చేయాలంటేనే హడలిపోతున్నారు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్లు అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ధరలను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో.. దళారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. 
ఇష్టారీతిగా ధరలు పెంపు
బియ్యం లేకుండా సామాన్యుడికి రోజు గడవదు. పోషకాహారం లేకపోయినా సరే మధ్యతరగతి వాళ్లు.. రెండు పూటలా తినే అన్నాన్నే అమృతంగా భావిస్తారు. కానీ బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యాన్ని కొనడం కాదు.. చూసినా సామాన్యుడి గుండెల్లో గుబులు పుడుతోంది. దళారులు బియ్యం ధరలను ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తున్నారు. 
బీపీటీ బియ్యం క్వింటాలుకు రూ.2, 200  
బహిరంగ మార్కెట్‌లో బీపీటీ బియ్యం క్వింటాలుకు 2 వేల నుంచి 2, 200 వరకు ధర పలుకుతోంది. చిల్లర మార్కెట్‌లో ఇవే సన్న రకాల బియ్యం బీపీటీ, కర్నూలు, మసూరు ధరలు.. కేజీ 50 నుంచి 56 వరకు పలుకుతోంది. మిల్లులో ఒక బస్తా బియ్యం పట్టిస్తే 65 కేజీల బియ్యం వస్తాయి. దీని ప్రకారం కేజీ బియ్యం గరిష్టంగా 34 రూపాయలు పడుతుంది. ఇవే బియ్యం మార్కెట్‌లో 16 నుంచి 22 రూపాయల వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇదంతా దళారుల కనుసన్నల్లోనే నడుస్తోంది. దీనివల్ల బియ్యం ధరలు చుక్కలను తాకుతున్నాయి. 
బియ్యం ధరలను చూసి మంత్రి ప్రత్తిపాటి విస్మయం  
సూపర్‌ మార్కెట్లలో బియ్యం ధరలను చూసి.. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విస్మయం వ్యక్తం చేశారు. ఆఫర్ల పేరుతో ఇష్టారాజ్యంగా అమ్మడం ఏంటని.. ఒకే రకమైన ధరల విధానం అమలు కావాల్సి ఉన్నా.. అలా ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలే అమలు కావాలని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు బియ్యం ధరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. 
గుంటూరు, కృష్ణాజిల్లాలో 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు 
గుంటూరు, కృష్ణాజిల్లాలో దాదాపు 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో ఎక్కువగా సన్నరకాల ధాన్యం సాగు చేస్తున్నారు. అయితే సన్నరకాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని దళారులు అందినకాడికి దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద మాల్స్‌లో బియ్యం వ్యాపారులు.. తూకం పేరుతోనూ మోసం చేస్తున్నారు. 25 కేజీలు ఉండాల్సిన బస్తా 24 కేజీలే ఉంటోంది. క్వింటాలుకు దాదాపు 4 కేజీల బియ్యం తగ్గుతోంది. దీన్ని బట్టి వినియోగదారుడికి 200 నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా బియ్యం ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. దళారుల ఆగడాలు పెరిగిపోకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ప్రతిపక్షాల నేతలు అంటున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దళారీ వ్యవస్థను నియంత్రించాలి. 

 

13:07 - July 16, 2017

నిజామాబాద్‌ : వర్షాకాలం... అయినా వర్షాలు కురవడం లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రైతన్న. తొలకరిలో వర్షాలు పలకరించినా... ఆ తర్వాత జాడే లేకుండా పోయాయి. నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌ కింద రైతాంగం నీళ్లు లేక అల్లాడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. తమ భవిష్యత్‌ ఏంటని ఆందోళన చెందుతున్నారు. 
అడ్రస్‌ లేకుండా పోయిన వర్షాలు
రెండు రోజులు మురిపించిన వర్షాలు.. ఆ తర్వాత అడ్రస్‌ లేకుండా పోయాయి. దీంతో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కింద 2.31 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 
1378.60 అడుగులకు చేరుకున్న నిజాంసాగర్‌.. 
నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా నీటి సామర్ధ్యం 17.8 టీఎంసీలు. అయితే.. ప్రస్తుత నీటిమట్టం 1378.60 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్‌లో కేవలం 1.72 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. గతేడాది వర్షాలు భారీగా కురవడంతో ఈ సమయానికి గేట్లు ఎత్తి నీళ్లు వదిలారు. ఈసారి కూడా వర్షాలు కురుస్తాయని రైతులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అనుకున్న మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశలో మునిగిపోయారు. ఇక ఆయకట్టు కింద ఉన్న బాన్సువాడ, బీర్కూరు మండలాల రైతులు కేవలం నిజాంసాగర్‌ ప్రధాన కాలువపై ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రాజెక్ట్‌ నుండి నీళ్లు విడుదల చేస్తే తప్ప సాగు చేయలేని పరిస్థితి. నారుమళ్లు పోయాలన్నా నీటిని విడుదల చేయాల్సిందే. 
521.25 అడుగులకు చేరుకున్న సింగూరు నీటి మట్టం 
ఇదిలావుంటే... సింగూరు పూర్తిస్థాయి నీటిమట్టం 523.60 అడుగులు కాగా... నీటి నిల్వ సామర్ధ్యం 29.91 టీఎంసీలు. అయితే.. ప్రస్తుతం 521.25 అడుగులకు 19.78 టీఎంసీల నీటి సామర్ధ్యం మాత్రమే ఉంది. ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వలు లేకపోవడంతో నిజాంసాగర్‌కు నీరు విడుదల చేయడం లేదు. కానీ... సింగూరు ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 8.64 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.  సింగూరు నీటి విడుదల కోసం వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రైతులు ఆందోళన బాటపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నేతలు బాన్సువాడ నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని రైతాంగం కోరుతోంది. 

13:01 - July 16, 2017

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. అల్పపీడనంగా మారింది. వచ్చే రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతుందని వాతావరణశాఖ పేర్కోంది. ఈ ప్రభావంతో... రానున్న 24గంటల్లో కోస్తా, తెలంగాణాల్లో అనేకచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరోవైపు.. అల్పపీడనం బలపడి నాలుగు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని, ఈ నెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటుతుందని ఇస్రో పేర్కొంది. వచ్చే 3రోజులు... విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతం, తెలంగాణాలో అతిభారీ వర్షాలు  కురిసే అవకాశముందని తెలిపింది. వాయుగుండంతీరం దాటి బలహీనపడినా ఛత్తీ‌స్‌గఢ్‌, తెలంగాణాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

12:58 - July 16, 2017

కడప : జిల్లాలోని రాజంపేట మండలం ఉప్పరపల్లెలోని రైల్వేట్రాక్‌పై యువతీ, యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి.. డ్రైవింగ్‌ లైసెన్స్ఆధారంగా చనిపోయిన యువకుడు రాజోలు నాగార్జున రెడ్డిగా గుర్తించారు.. వారిదగ్గరున్న బ్యాగ్‌లో బంగారు తాళిబొట్టు, రెండువేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఇద్దరూ ఆత్మహత్య చేసుకొనిఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

 

12:56 - July 16, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసుపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.. ఈ రివ్యూ మీటింగ్‌కు డీజీపీ అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సీపీలు హాజరయ్యారు.. దర్యాప్తు వివరాలను కేసీఆర్‌కు అకున్‌ సబర్వాల్ వివరించారు. పోలీసుల సాయం తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖకు సూచించారు.

డ్రగ్స్‌ కేసుపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసుపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.. ఈ రివ్యూ మీటింగ్‌కు డీజీపీ అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సీపీలు హాజరయ్యారు.. దర్యాప్తు వివరాలను కేసీఆర్‌కు అకున్‌ సబర్వాల్ వివరించారు. పోలీసుల సాయం తీసుకోవాలని ఎక్సైజ్‌ శాఖకు సూచించారు.

 

12:53 - July 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది... లాల్‌దర్వాజతో పాటు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఇవాళ భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు.  నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, కాంగ్రెస్ నేత డీకే అరుణ.. అమ్మవారిని దర్శించుకున్నారు. 
అమ్మవారికి బోనం సమర్పించిన పివి.సింధు   
లాల్‌దర్వాజ అమ్మవారికి బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి. సింధు బోనం సమర్పించారు.. ప్రత్యేక పూజలు చేశారు.. ఒలంపిక్స్‌కుముందు తాను అమ్మవారికి బోనం సమర్పించానని... ఇప్పుడు మళ్లీ వచ్చానని తెలిపారు.. ప్రతి ఏడాది ఇలాగే వస్తానని తెలిపారు.. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో బోనాలు చాలా ముఖ్యమైన పండుగని... కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు.. లాల్‌దర్వాజ అమ్మవారిని కుటుంబసభ్యులతోకలిసి దర్శించుకున్నారు.

 

12:39 - July 16, 2017

పెద్దపల్లి : రాకపోకలకు సరైన దారి లేదు.. తాగడానికి నీరు లేదు... చేపట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. మౌలిక అవసరాలు తీరక ఆ నియోజకవర్గ ప్రజలు అల్లాడుతున్నారు. నమ్మి ఓట్లేసిన నాయకుడు వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటూ... ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టేశాడు.  అవినీతిలో కూరుకుపోయి... నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశాడు. 
పరిష్కారానికి నోచుకోని సమస్యలు
నేతలు మారితే ... అభివృద్ధి జరుగుతుందనుకున్న పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు కాకపోగా...  నియోజవర్గంలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీరందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాలతో పాటు.. పట్టణంలోని రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వీధిలైట్లు లేక రాత్రిపూట ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే  పెద్దపల్లి బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు లేవు. ఎల్లమ్మ గుండమ్మ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణం ముందుకు సాగడం లేదు. దీంతో టీఆర్‌ఎస్‌ బలంతో విజయం సాధించిన... ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని విమర్శిస్తున్నారు. 
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి..ట్రినిటి విద్యా సంస్థల అధినేతగానే నియోజకవర్గానికి సుపరిచితుడు. రాజకీయ అనుభవం లేకున్నా... ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉండడం కారణంగానే ప్రజలు మనోహర్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచారు.  అయితే మనోహర్‌రెడ్డి మాత్రం నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన కాసులపల్లిని తప్ప మిగతా గ్రామాలను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తన అధికార బలంతో తన వ్యాపార సంస్థలను వృద్ధి చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రైతులకు అందించాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లు తన బంధువులకు మంజూరు చేయించుకుంటున్నాడని.. కాసులపల్లిలో రంగనాయకస్వామి ఆలయానికి సంబంధించిన 250 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. భోంపల్లిలో తన కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 
అధికారులపై ఎమ్మెల్యే వేధింపులు?
అలాగే ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధికారులను వేధిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.  తన కనుసన్నల్లో విధులు నిర్వహించకుంటే..ఆయన ఆగ్రహానికి గురికావాలనే ప్రచారం కూడా ఉంది.  గతంలో పెద్దపల్లి ఎస్‌ఐ జగన్మోహన్‌ ఆత్మహత్య ఘటనలో ఎమ్మెల్యే వేధింపులే కారణమంటూ ఎస్‌ఐ బంధువులు ఆరోపించారు. దీంతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చుకున్నారని.. మిషన్‌ కాకతీయ మట్టిని రైతుల పొలాల్లోకి చేరకుండా తన భూముల్లో పోయించుకున్నారనే అపవాదులు ఉన్నాయి. దీంతో స్థానికులు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానని ఎమ్మెల్యే చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మనోహర్‌రెడ్డి నెరవేర్చాలని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

12:36 - July 16, 2017

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణ పండుగలకు మరింత ప్రాచుర్యం లభిస్తోందని... మంత్రి తలసాని అన్నారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.. ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెప్పారు తలసాని..
లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన ఎంపీ కవిత
లాల్‌ దర్వాజ అమ్మవారికి నిజామాబాద్ ఎంపీ కవిత బోనం సమర్పించారు. ఉదయమే బోనం సమర్పించి... అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కవిత తెలిపారు.

 

12:29 - July 16, 2017

విజయవాడ : జీఎస్టీ ప్రభావం పర్యాటక శాఖపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పర్యాటకులు లేక బెజవాడ భవానీ ద్వీపం వెలవెలపోతోంది. టూరిజం శాఖ అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచేయడంతో పర్యాటకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు భవానీ ద్వీపాన్ని సింగపూర్‌లోని సంతోషా తరహాలో అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీలు ఆచరణలో అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
అందని ద్రాక్షలా పర్యాటకం
ఆహ్లాదం కోరుకునే పర్యాటకులకు చక్కని టూరిస్ట్ స్పాట్ విజయవాడలోని భవానీ ద్వీపం. అలాంటి ద్వీపం తిలకించాలనుకునే సామాన్య, మధ్య తరగతి జనులకు అది అందని ద్రాక్షలా మారింది. బోటు షికారుతో కృష్ణవేణి అందాలు తిలకించాలనుకునే వారిని జీఎస్టీ తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. జీఎస్టీ కారణంగా పర్యాటక శాఖ బోటింగ్ చార్జీలను విపరీతంగా పెంచేయడంతో పర్యాటకులు రాక ద్వీపం వెలవెలబోతోంది. 
మధ్యతరగతికి కష్టతరంగా మారిన బోటింగ్ పార్టీలు 
విజయవాడలో ఏపీటీడీసీ నేతృత్వంలో భవానీపురం, దుర్గా, పున్నమి, కృష్ణవేణి మోటెల్‌ల నుంచి బోటింగ్ నిర్వహిస్తున్నారు. బోటింగ్ చేయాలంటే  టిక్కెట్ ధర పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 వసూలు చేసేవారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక 18 శాతం పన్ను విధించడంతో ..ప్రస్తుత బోటింగ్ ధర పెద్దలకు 59, పిల్లలకు 35 రూపాయలకు పెంచారు. అలాగే జెట్ స్కీయింగ్ ప్రస్తుతం 250 రూపాయల నుంచి 295కు పెరిగింది. ఇక స్పీడ్ బోటు చార్జీ 300 నుంచి 354 రూపాయలకు చేరింది. బోధిసిరి డబుల్ డెక్కర్ క్రూయిజ్ ధర గంటకు 4 వేలు ఉండగా, జీఎస్టీ పుణ్యమా ఆ మొత్తం 4వేల 700 రూపాయలకు పెరిగింది. దీంతో మధ్యతరగతి వర్గాలు సరదాగా బోటింగ్ పార్టీలు చేసుకోవాలంటేనే కష్టతరంగా మారింది. 
ధరలపై జీఎస్టీ తీవ్ర ప్రభావం 
ఇక భవానీద్వీపంలో కాటేజీల ధరలపై కూడా జీఎస్టీ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ద్వీపంలో మొత్తం 28 కాటేజీలు ఉన్నాయి. గతంలో 2వేల 400 రూపాయలలోపు అద్దె ఉన్న కాటేజీకి రూ.50 మినహాయింపు ఇచ్చేవారు. ఇక ఈ కాటేజీలలో నాలుగు ట్రీ టాప్ కాటేజీలు ఉన్నాయి. ఇవి కాకుండా బెర్మ పార్క్ లో 18 కాటేజీలు ఉన్నాయి. వీటి అద్దెలు 3వేల 500 రూపాయల పైనే ఉంటుంది. జీఎస్టీ అమలు నుంచి కాటేజీల ధరలు 18శాతం పెరిగిపోయాయి. వెరసి సామాన్య, మధ్య తరగతి వర్గాలకు పర్యాటక రంగం మరింత  ప్రియంగా మారిపోయింది. అప్పట్లో భవానీ ద్వీపాన్ని సింగపూర్‌ సంతోషా తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పర్యాటకులకు కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే అవి ఆచరణలో ఏ మత్రం అమలు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం భవానీ ద్వీపంపై దృష్టి పెట్టి  అభివృద్ధి చేయాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. 

 

12:23 - July 16, 2017
12:22 - July 16, 2017
12:21 - July 16, 2017
12:20 - July 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. లాల్‌దర్వాజతో పాటు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఇవాళ భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు.  నిజామాబాద్ ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
అమ్మవారికి బోనం సమర్పించిన ఎంపీ కవిత
లాల్‌ దర్వాజ అమ్మవారికి నిజామాబాద్ ఎంపీ కవిత బోనం సమర్పించారు. ఉదయమే బోనం సమర్పించి... అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలంటూ అమ్మవారిని కోరుకున్నట్లు కవిత తెలిపారు. 
ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపిన డా. లక్ష్మణ్
తెలంగాణవాసులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌.. ప్రపంచవ్యాప్తంగా బోనాల పండుగకు గుర్తింపుఉందని చెప్పారు.. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని... ప్రజలు సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు..

 

12:12 - July 16, 2017

ప్రకాశం : నీరు చెట్టు పథకంకింద దళితుల భూముల్లో చెరువుల తవ్వకాన్ని నిరసిస్తూ ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఇవాళ సభ నిర్వహణకు తీర్మానించింది. దీంతో పోలీసులు పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని పలువురు వైసీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిపాటి భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని అర్ధరాత్రి నుంచే గృహనిర్భందించారు.

 

12:10 - July 16, 2017
11:57 - July 16, 2017

విశాఖ : రిషికొండ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈతకెళ్లి ఇద్దరు మృతి చెందారు. కరాచీ బేకరిలో పని చేస్తున్న అరుగురు యువకులు రిషికొండ బీచ్ లో ఈతకు వెశ్లారు. వీరిలో నలుగురు బీచ్ లోకి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. మరొకరిని స్థానికులు రక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ముగ్గురు యువకులు క్షేమంగా బయటపడ్డారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం.....

11:41 - July 16, 2017

హైదరాబాద్ : డగ్ర్స్‌ కేసులో రెండో రోజు కెల్విన్‌, కుదుస్‌, వాహిద్‌లను సిట్‌ విచారించనుంది. కెల్విన్‌ ఫోన్‌లోని 2400 కాంటాక్ట్స్‌పై విచారణ జరగనుంది. మరోవైపు తమ పేర్లు బయటికి రాకుండా తారలు సినీపెద్దలను ఆశ్రయిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఇద్దరు ఎస్‌ఐల అరెస్టు

ఖమ్మం : బస్టాండ్‌ వద్ద చెప్పుల దుకాణం యజమానిపై దాడి కేసులో పోలీసులు ఇద్దరు ఎస్‌ఐలను అరెస్ట్ చేశారు. రాత్రి షాప్‌లోకి వచ్చిన ఇద్దరు ఎస్‌ఐలు... ఓనర్‌పై దాడికి దిగారు. పిస్టల్‌తో బెదిరిస్తూ.. దాడి చేశారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. షాప్ ఓనర్ జావెద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఇద్దరు ఎస్‌ఐలు బానోత్ మహేశ్, రాణా ప్రతాప్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

11:32 - July 16, 2017

ఖమ్మం : బస్టాండ్‌ వద్ద చెప్పుల దుకాణం యజమానిపై దాడి కేసులో పోలీసులు ఇద్దరు ఎస్‌ఐలను అరెస్ట్ చేశారు. రాత్రి షాప్‌లోకి వచ్చిన ఇద్దరు ఎస్‌ఐలు... ఓనర్‌పై దాడికి దిగారు. పిస్టల్‌తో బెదిరిస్తూ.. దాడి చేశారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. షాప్ ఓనర్ జావెద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఇద్దరు ఎస్‌ఐలు బానోత్ మహేశ్, రాణా ప్రతాప్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వైభవంగా లాల్ దర్వాజ బోనాలు

  హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబసభ్యులు వెండి బోనం సమర్పించారు. 

10:22 - July 16, 2017
10:12 - July 16, 2017

హైదరాబాద్ : వింబుల్డన్‌ మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 7 సార్లు చాంపియన్‌ స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌...క్రొయేషియన్‌ సెన్సేషన్‌ మిలోస్‌ రోనిచ్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.సెమీస్‌లో రోజర్‌ ఫెదరర్‌,థామస్‌ బెర్డిచ్‌కు షాకివ్వగా...మిలోస్‌ రోనిచ్‌, శామ్‌ క్వెరీని చిత్తు చేశాడు.  ఆల్‌ ఇంగ్లండ్‌ సెంట్రల్ కోర్ట్‌ వేదికగా జరుగనున్న ఫైనల్‌లో గ్రాండ్‌ స్లామ్‌ కింగ్‌..స్విస్‌ ఏస్ రోజర్‌ ఫెదరర్‌ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నాడు. 
వింబుల్డన్‌ ఓపెన్‌ ఆఖరాటకు రంగం సిద్ధం 
గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లోనే ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ ఓపెన్‌ ఆఖరాటకు రంగం సిద్ధమైంది. అంచనాలకు అందని రీతిలో సాగిన మెన్స్‌ సింగిల్స్‌  టైటిల్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఫైనల్‌లో  మెన్స్‌ సింగిల్స్‌ టైటిల్‌కోసం గ్రాండ్‌ స్లామ్‌ కింగ్‌ రోజర్‌ ఫెదరర్‌....క్రొయేషియన్‌ సెన్సేషన్‌ మిలోస్‌ రోనిచ్‌ సై అంటే సై అంటున్నారు. 7 సార్లు వింబుల్డన్‌ చాంపియన్‌ స్విస్‌ ఏస్‌ రోజర్‌ ఫెదరర్‌...8వ సారి టైటిల్ నెగ్గాలని తహతహలాడుతుండగా....తొలి సారిగా ఫైనల్‌కు అర్హత సాధించిన రోనిచ్‌ సంచలనం సృష్టించాలని ప్లాన్‌లో ఉన్నాడు. 
థామస్‌ బెర్డిచ్‌కు రోజర్‌ ఫెదరర్‌ షాక్ 
సెమీస్‌లో అమెరికన్‌ రైజింగ్‌ స్టార్‌ శామ్‌ క్వెరీని మిలోస్‌ రోనిచ్‌ చిత్తు చేయగా....కెనడియన్‌ వండర్‌ థామస్‌ బెర్డిచ్‌కు రోజర్‌ ఫెదరర్‌ షాకిచ్చాడు. మోడ్రన్‌ టెన్నిస్‌లో 18 గ్రాండ్ స్లామ్‌ టైటిల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన ఫెదరర్‌...19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.  ఇప్పటివరకూ అమెరికన్‌ ఓపెన్‌ టైటిల్ మాత్రమే నెగ్గిన మారిన్‌ సిలిచ్‌... వింబుల్డన్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విలూరుతున్నాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ సెంట్రల్ కోర్ట్‌ వేదికగా జరుగనున్న ఫైనల్‌లో గ్రాండ్‌ స్లామ్‌ కింగ్‌..స్విస్‌ ఏస్ రోజర్‌ ఫెదరర్‌ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఫెదరర్‌ ఫామ్‌ చూస్తుంటే....మరో వింబుల్డన్‌ టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. 

రిషికొండ బీచ్ లో విషాదం..

విశాఖ : జిల్లాలోని రిషికొండ బీచ్ లో విషాదం నెలకొంది. ఈతకెళ్లి ఇద్దరు మృతి చెందారు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. 

లాల్ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన ఏంపీ కవిత

హైదరాబాద్ : లాలా దర్వాజ అమ్మవారిని ఎంపీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. బోనాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అందరూ సుఖంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలు లభ్యం

కడప : రాజంపేట మండలం ఉప్పరపల్లి రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఖాజీపేటకు చెందిన నాగార్జునరెడ్డి దంపతులుగా గుర్తించారు. 

09:14 - July 16, 2017

ఢిల్లీ : వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా స్పెయిన్ కు చెందిన ముగురుజ విజేతగా నిలిచింది. ఫైనల్స్‌లో వీనస్ విలియమ్స్‌పై ముగురుజ గెలుపొందింది. వీనస్‌పై 7-5, 6-0 తేడాతో విజయం సాధించింది. ముగురుజకిదే తొలి వింబుల్డన్ టైటిల్. 77 నిముషాల పాటు జరిగిన ఆట తీవ్ర ఉత్కంఠతో సాగింది. మెరుపు వేగంతో ఆడిన ముగురుజ.. ఒక్క సెట్ కూడా ఓడకుండానే... విజయం సాధించి వింబుల్డన్ టైటిల్‌ గెలుచుకున్న రెండో స్పానిష్ మహిళగా ఘనత సాధించింది. 

 

09:12 - July 16, 2017

శ్రీనగర్ : సాధారణంగా  మనం క్రికెట్‌ ఆడాలంటే ఏం చేస్తాం..ఓ బ్యాట్‌, బాల్‌,వికెట్లు తీసుకుని ఆడుతుంటాం. అదే క్రికెట్‌ మ్యాచ్‌ను ఉగ్రవాదులు ఆడితే ఎలాఉంటుంది?  అసలు ఉగ్రవాదులు క్రికెట్‌ ఆడితే మీరెప్పుడైనా చూశారా? మనలా బ్యాట్‌, బాల్‌,వికెట్లు ఏర్పాటు చేసుకొని ఆడతారనుకుంటే పొరబాటే..వారికి అవన్ని అవసరం లేదు. ఏకంగా ఏకే47 రైఫిల్‌ని వికెట్‌గా వాడుకుని క్రికెట్‌ ఆడేస్తారు.  దక్షిణ కశ్మీర్‌లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు వికెట్లకు బదులుగా గన్నులు పెట్టుకుని క్రికెట్‌ ఆడారు. ఏకంగా ఏకే-47 రైఫిల్‌ను వికెట్‌గా పెట్టి క్రికెట్‌ ఆటలో మునిగిపోయారు. ఈ దృశ్యాన్ని వారిలో ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. 

 

09:08 - July 16, 2017

కృష్ణా : జిల్లాలోని పెడన...గుడివాడ రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. పెడన పల్లోటి స్కూల్‌ వద్ద వాకర్స్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో.. ఒకరు మృతి చెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి. గాయలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

09:02 - July 16, 2017

హైదరాబాద్‌ : నగరంలో బోనాల సందడి ఉత్సాహంగా సాగుతోంది. లాల్‌దర్వాజతో పాటు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఇవాళ భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. రాష్ట్రప్రభుత్వం తరపున మంత్రులు పలు ఆలయాల్లో పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. మరోవైపు బోనాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:50 - July 16, 2017

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ నేడు వైసీపీ సభ నిర్వహించనున్నారు. సభ నేపథ్యంలో సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. ఒంగోలులో సీపీఎం నగర కార్యదర్శి కొండారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు ప్రసాద్ ముందస్తు అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:46 - July 16, 2017

రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ సర్కార్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైపీపీ నేత సామినేని ఉదయ భాను, పీసీసీ ప్రధాన కార్యదర్శి మీసాల రాజేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. అమరావతిలో రాజధాని నగరం నిర్మాణంలో అవినీతి జరుగుతుందని ఆరోపించారు. అమరావతి ప్రపంచస్థాయి రాజధాని కాదని..ప్రపంచస్థాయి కుంభకోణం అని ఎద్దేశా చేశారు. ప్రాజెక్టుల విషయంలోనూ కుంభకోణం జరుగుతుందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:34 - July 16, 2017
08:32 - July 16, 2017

ఢిల్లీ : ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌ సెమీస్‌లోకి భారత్‌ ప్రవేశించింది. న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 186 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కివీస్‌ను బెంబేలెత్తించింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సెంచరీతో చెలరేగింది. భారత్‌ 7 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగా... తర్వాత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 79 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

08:29 - July 16, 2017

చెన్నై : నియమాలు, నిబంధనలు.. డోంట్‌ కేర్‌. తాము అనుకుంటే ఏదైనా జరగాల్సిందే. ఇది రాజకీయ నేతల తీరు. ఇది రాజకీయాల్లోనే కాదు... ఎక్కడైనా తమదే పైచేయిగా వ్యవహరిస్తుంటారు. అయితే... భక్తుల మనోభావాలతో కూడుకున్న ఆలయాల్లోనూ ఇలా వ్యవహరించడం ఇప్పుడు వివాదస్పదమవుతోంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నైలోని శ్రీవారి ఆలయంలోకి అఘోరాలను అనుమతించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాట ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. 
భక్తుల మండిపాటు
చెన్నై టీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలోకి అఘోరాలను ఆహ్వానించడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. పాలక మండలి నిర్వాకం వల్ల ఆలయ ప్రతిష్ట మంటగలిసిందని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆలయ కమిటీ సభ్యులైన రవిబాబు, శంకర్‌లు ఉత్తర భారతం నుండి వచ్చిన అఘోరాలను, నాగసాధువులను శ్రీవారి ఆలయానికి ఆహ్వానించి.. స్వామి వారి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం అఘోరాలను ఆలయంలోకి అనుమతించకూడదని పూజరులు.. కమిటీ సభ్యులకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన కమిటీ సభ్యులు అఘోరాలను ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఆ తర్వాత పక్కనే ఉన్న ఆలయ మందిరంలోకి తీసుకెళ్లి సన్మానం చేశారు. 
ఈ వ్యవహారం వివాదాస్పదం
ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడులో వివాదాస్పదమవుతోంది. గత నలబై ఏళ్లుగా ఆలయంలో స్థానిక సలహా మండలి పేరుతో ఓ కమిటీ రాజకీయాలకు అతీతంగా పని చేస్తుండగా.. గత మూడేళ్ల క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీలో... రాజకీయ ప్రమేయం ఎక్కువైందని పలువురు ఆరోపిస్తున్నారు. కమిటీలో పారిశ్రామికవేత్తలకు, టీడీపీ కార్యకర్తలకు చోటు ఇవ్వడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయంటున్నారు. అఘోరాలను ఆలయంలోకి అనుమతించకూడదని పూజారులు చెప్పినా... కమిటీ సభ్యులు వినిపించుకోకుండా... తాము చంద్రబాబు, లోకేశ్‌ సన్నిహితులమని బెదిరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై స్వామివారి భక్తులు ఆగ్రహం చేస్తున్నారు. అయితే... అంతా జరిగిన తర్వాత తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆలయాన్ని శుద్ది చేశారు. 
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : భక్తులు 
అయితే.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. కమిటీలో రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వడం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. తక్షణమే కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తానికి టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా శ్రీవారి ఆలయంలోకి అఘోరాలకు ప్రవేశం కల్పించడం ఇప్పుడు తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. 

 

08:13 - July 16, 2017

సూర్యపేట : బకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ రైతుల భూములు కనిపించినా ఆక్రమించేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో గ్రామ కంఠం భూముల్ని సైతం వదిలిపెట్టలేదు. కొన్నేళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న 117 ఎకరాల భూమిని జువారీ సిమెంట్ యాజమాన్యం కబ్జా చేసింది. అక్కడితో ఆగకుండా సమితి నిధులతో నిర్మించిన రోడ్డును కూడా ఆక్రమించేసారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 
గ్రామకంఠం భూములపై కన్నేసిన జువారీ సిమెంట్స్ యాజమాన్యం
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరులో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జాచేశారు. 850 సర్వే నంబర్‌లో 117 ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఇందులో 30 ఎకరాలు రైతుల ఆధీనంలో ఉంది. ఆ భూమిలో రైతులు కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే పక్కనే ఉన్న జువారి సిమెంట్స్ యాజమాన్యానికి ఈ గ్రామకంఠం భూములపై కన్నుపడింది. ఇంకేం నిదానంగా.. ఆభూములను ఆక్రమించేసుకున్నారు. అక్కడితో ఆగకుండా రేవూరు-దొండపాడును కలుపుతూ సమితి నిధులతో రోడ్డు నిర్మిస్తే  దాన్ని సైతం జువారీ సిమెంట్స్‌ యాజమాన్యం కబ్జా చేసి అక్రమ మైనింగ్‌ చేస్తోంది. 
కబ్జాకు గురైన భూములను పరిశీలించిన భూ నిర్వాసితుల కమిటీ
కబ్జాకు గురైన రైతుల భూములను భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు, గిరిజన సంఘం నాయకుడు రవినాయక్ పరిశీలించారు. తెలంగాణ వస్తే మన నీరు .. మన భూములు అన్న కేసీఆర్ రైతుల భూముల్ని కార్పొరేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే భూ నిర్వాసితుల కమిటీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి రైతుల భూముల్ని వారికి అప్పగించే వరకు తమ పోరాటం ఆపేది లేదని భూ నిర్వాసితుల కమిటీ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

 

08:09 - July 16, 2017

ఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరగనున్న పోలింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునే అంతా సిద్ధం అధికారులు చేశారు.
ఏపీ అసెంబ్లీలో ధికారులు ఏర్పాట్లు  
సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అసెంబ్లీ మొదటి అంతస్తులోని కమిటీ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ పరిశీలించారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా సత్యనారాయణ, అసిస్టెంట్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా బాలకృష్ణమాచార్యులు వ్యవహరించనున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా పంజాబ్‌ నుంచి రన్‌వీర్‌కౌర్‌ వచ్చారు. 
సోమవారం ఉ.30 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభం 
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి ఓటింగ్‌ ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలందరికీ ఉదయం సచివాలయంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. అనంతరం పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి ఓటు హక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగించుకోనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు. రాష్ట్ర అసెంబ్లీలలో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసే అధికారం ఉంది. ఎంపీలు, రాజ్యసభ సభ్యులు తమ ఓటు హక్కును ఢిల్లీలో మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే... నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఏపీ అసెంబ్లీలోనే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాయపాటి వ్యక్తిగత అభ్యర్థన మేరకు ఈ అవకాశం ఇచ్చినట్లు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. 
ఈనెల 19న ఓట్ల లెక్కింపు 
ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లోని శాసనసభ్యులకు ఒక్కోవిధంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఎమ్మెల్యే ఓటుకు 159 పాయింట్లు కేటాయించారు. మొత్తానికి సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఈనెల 19న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

07:51 - July 16, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు పంపించామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. గరగపర్రులో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. గరగర్రులో మంత్రి పర్యటించారు. అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కొందరు కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దని చినరాజప్ప చెప్పారు. ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు. 

 

07:47 - July 16, 2017

మహబూబ్ నగర్ : తాము చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు పాలకులు వివరించే పనిలో పడ్డారు. పాలమూరు జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్‌.. జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అయితే.. కొంతమంది కావాలనే అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... వారికి ప్రజలే బుద్ది చెప్పాలన్నారు. 
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన 
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జడ్పీ గ్రౌండ్‌లో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేయడం వల్లే... వలసలు ఎక్కువగా పెరిగాయన్నారు కేటీఆర్‌. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. త్వరలోనే అభివృద్ధిలో జిల్లా దూసుకుపోతుందన్నారు. అయితే.. ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్లకు మీరే బుద్ది చెప్పాలని ప్రజలకు సూచించారు కేటీఆర్‌. 
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్‌ 
అనంతరం నారాయణపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కేటీఆర్‌ పాల్గొన్నారు. కోయిల్‌సాగర్‌ మండలం రామకొండలో మిషన్‌ భగీరథ పథకంగా భాగంగా 18 కోట్లతో నిర్మించిన ప్లాంట్‌ను, 2.65 లక్షలతో నిర్మించిన గ్రీన్‌బెల్ట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నారాయణపేట పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కాలేజి నిర్మాణానికి పునాది రాయి వేశారు. అలాగే 29 కోట్ల రూపాయలతో రోడ్ల వెడల్పు పనులను ప్రారంభించారు. 
కాసేపు ఆహ్లాదంగా మంత్రి కేటీఆర్‌ 
ఇక పాలమూరు జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్‌ కాసేపు ఆహ్లాదంగా గడిపారు. మయూరి పార్క్‌ను ప్రారంభించిన మంత్రి... సందర్శకులతో మాట్లాడి ప్రభుత్వ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్క్‌లో నూతనంగా ఏర్పాటు చేసి అడ్వెంచర్‌ క్యాంప్‌ను సందర్శించారు. తోటి మంత్రులతో కలిసి సరదాగా రోప్‌వేపై ట్రావెల్‌ చేశారు కేటీఆర్‌. 

 

07:25 - July 16, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. నాన్‌బోర్డర్స్‌ను ఖాళీ చేయించేందుకు  అధికారులు పీజీ హాస్టళ్లకు విద్యుత్‌, మంచినీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ రెసిడెన్సీ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. 

 

07:23 - July 16, 2017

ఖమ్మం : బస్టాండ్‌ కాంప్లెక్స్‌ వద్ద చెప్పుల దుకాణంలో ఇద్దరు ఎస్సైలు హల్‌చల్ చేశారు. మద్యం మత్తులో షాపు యజమానిపై దాడి చేశారు. పబ్లిక్‌గా గన్‌తో బెదిరించి షాపు యజమానిని చితకబాదారు. 

 

వాకర్స్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

కృష్ణా : పెడన పల్లోటి స్కూల్ వద్ద వాకర్స్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 

నేడు లాల్ దర్వాజ బోనాలు

హైదరాబాద్ : నేడు లాల్ దర్వాజ బోనాలు జరుగున్నాయి. బోనం సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సీపీఎం, వైసీపీ నేతల ముందస్తు అరెస్టు

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ నేడు వైసీపీ సభ నిర్వహించనున్నారు. సభ నేపథ్యంలో సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. ఒంగోలులో సీపీఎం నగర కార్యదర్శి కొండారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు ప్రసాద్ ముందస్తు అరెస్టు చేశారు. 

 

సీపీఎం, వైసీపీ నేతల ముందస్తు అరెస్టు

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములు లాక్కోవడాన్ని నిరసిస్తూ నేడు వైసీపీ సభ నిర్వహించనున్నారు. సభ నేపథ్యంలో సీపీఎం, వైసీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. ఒంగోలులో సీపీఎం నగర కార్యదర్శి కొండారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు ప్రసాద్ ముందస్తు అరెస్టు చేశారు. 

 

Don't Miss