Activities calendar

17 July 2017

21:32 - July 17, 2017

హైదరాబాద్ : పూర్ణిమ దొరికింది..అంతా ఊపిరి పీల్చుకున్నారు..పుట్టినరోజునే కూతురి సమాచారం తెలుసుకున్న కన్నవారు ఎంతో సంతోషంతో ముంబాయి వెళ్లారు..కాని వారికి నిరాశే మిగిలింది...తిరిగి హైదరాబాద్ బయల్దేరారు...ఇక బాలికను నగరానికి తీసుకువచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు...రేపు ఈ సమయానికి పూర్ణిమ హైదరాబాద్ చేరనుంది. మంబాయిలోని హోంలో ఉన్న హైదరాబాద్‌ అమ్మాయి పూర్ణిమ ఉందని తెలిసి ఎంతో సంతోషంతో వెళ్లిన కన్నతల్లిదండ్రులకు నిరాశే ఎదురయింది...వారితో మాట్లాడేందుకు పూర్ణిమ నిరాకరించడంతో మనస్తాపం చెందారు..ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలిక ససేమిరా అనడంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారని తెలుస్తోంది.

రోడ్డుమార్గంలో తీసుకురానున్న పోలీసులు..
ఇక హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మాయమైన పదో తరగతి బాలిక పూర్ణిమ ముంబాయిలో ఉన్నట్లు తేలడంతో ఊపిరిపీల్చుకున్న పోలీసులు..కన్నవారు ఇక ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు..పూర్ణిమను రోడ్డు మార్గంలో తీసుకువచ్చేందుకు నగరం నుంచి మహిళా కానిస్టేబుల్స్‌ను వాహనంలో తరలించారు...జువైనల్‌ కోర్టు ఆదేశాలతో పూర్ణిమను రేపు ఉదయం ముంబాయి నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు.

15 బృందాలతో దర్యాప్తు..
హైదరాబాద్‌ నిజాంపేటలోని అమృతసాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న నాగరాజు, విజయకుమారిలకు ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కూతురు పూర్ణిమ సాయి ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది...గత నెల 7వ తేదీన స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 15 బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు షిర్డీ, పుణె తదితర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో ఈనెల 13న కిడ్నాప్‌ కేసుగా మార్చారు. పూర్ణిమ సాయి ముంబైలోని దాదర్ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందింది.

దాదర్ లో..
సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పూర్ణిమ ముంబై వెళ్లి దాదర్‌లోని ఓ సినిమా స్టూడియో దగ్గర తిరుగుతుండగా అక్కడి పోలీసులు డొంగరి బాల్ సుధార్ ఆశ్రమంలో చేర్పించినట్లు తెలుస్తోంది. వారికి తాను ఒక అనాథనని.. తనపేరు అనికాశ్రీ అని చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ తుకారంగేట్‌లోని సాయిశ్రీ అనాధాశ్రమం నుంచి వచ్చానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పూర్ణిమ ఫోటోలను దాదర్‌లోని బోయవాడ పోలీసులు ముంబైలోని గోడలకు అంటించారు. ఈ విషయం హైదరాబాద్‌ పోలీసులకు తెలియడంతో పూర్ణిమ ఆచూకీ తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు...

21:29 - July 17, 2017

హైదరాబాద్ : వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, ప్రీతిమీనాలు బయ్యారం అడవుల్లో ప్రయాణించారు. అడవిలో ఉన్న బయ్యారం పెద్ద గుట్ట ఇనుప ఖనిజం టూరిజం ప్రాంతాన్ని చూశారు. ఇద్దరు కలెక్టర్లు.. దాదాపు 12 కిలోమీటర్ల పాటు ఉత్సాహంగా నడుచుకుంటూ.. అడవి అంతా పరిశీలించారు.

21:27 - July 17, 2017

హుస్సేన్ సాగర్ కు వరదనీరు..

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ కు వరదనీరు పెరుగుతోంది. 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 513.10 మీటర్లుగా ఉంది.

టీజేఏసీ స్టీరింగ్ కమిటీ తీర్మానాలు..

హైదరాబాద్ : టీజేఏసీ స్టీరింగ్ కమిటీ పలు తీర్మానాలు చేసింది. గజ్వేల్ లో కోదండరాం అరెస్టును ఖండించడం..కొండపోచమ్మ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూ సేకరణనను తక్షణమే నిలిపివేయాలి..30న గజ్వేల్ లో మూడో దశ అమరవీరుల స్పూర్తియాత్ర..ఆగస్టు 21న ఢిల్లీలో టీజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై సెమినార్ నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు.

రాంగ్ ఓటింగ్ పట్ల బాబు ఆగ్రహం..

విజయవాడ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఓటును తప్పుగా వేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఓటు సరిగా వేయకపోవడం సిగ్గు చేటని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదన్నారు. పనితీరు మెరుగుపరచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని బాబు హెచ్చరించారు.

21:23 - July 17, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది.

అల్పపీడనం..
ఏపీలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. మరో 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణలోనూ పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మరో 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో కోస్తాఆంధ్రతోపాటు రాయలసీమలోనూ భారీవర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల ఉధృతితో గాలులు వీస్తాయని .. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో ఇచ్ఛాపురం, రామచంద్రాపురంలలో 5 సెం.మీ, కొయ్యలగూడెంలో 4 సెం.మీ, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెం.మీల‌ వర్షపాతం నమోదైంది.

నాగావళి..
అటు నాగావళి నది కొద్దిగా శాంతిస్తోంది. క్రమేణ తోటపల్లి జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రాజెక్టులో 103.3 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 12,500 క్యూసెక్కులు ఉండగా..ఔట్‌ఫ్లో 10,000 క్యూసెక్కులగా ఉంది. ఎనిమిది గేట్లలో నాలుగింటిని తెరిచి నీటిని కిందికి వదులుతున్నారు. కూనేరు వద్ద రహదారిపై భారీగా వండ్రుమట్టి పేరుకుపోవడంతో... అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరోవైపు, ఒడిశాలో భారీవర్షాలు కురుస్తుండటంతో దిగువప్రాంతాలకు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికపుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

తెలంగాణలో..
ఇటు తెంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాజధాని హైదరాబాద్‌లో జోరువానలు కురుస్తున్నాయి. . రోడ్లన్నీ జలమయంగా మారడంతో, వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఖమ్మంలో పట్టణంలోనూ కుండపోతగా కురిసిన వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. పల్లపు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. పట్టణ పరిసర ప్రాంతాల్లోనూ జోరువానలతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇదిలావుంటే తీవ్ర అల్పపీడనానికి తోడు బంగాళాఖాతానికి నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. దక్షిణకోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లు కురుస్తాయిన వాతావరణ కేంద్రం తెలిపింది.

21:20 - July 17, 2017

హైదరాబాద్ : డ్రగ్స్...కేసులో సిట్‌ యాక్షన్ షురూ కాబోతుంది..మరికొన్ని గంటల్లో రంగంలోకి దిగనున్న సిట్ బృందం విచారణ ప్రారంభించనుంది.. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సిట్...టాలివుడ్‌లోని వారికి అందించిన నోటీసుల ప్రకారం వారికి తేదీలు నిర్ణయించింది..ఇలా రోజుకు ఒక్కరి చొప్పున నటులు సిట్ ముందు హాజరుకానున్నారు...ఇప్పటివరకు సమాచార సేకరణ..ఆధారాలు సంపాదించిన సిట్...ఇకపై స్టార్ట్‌ ...కెమెరా...యాక్షన్...అంటుంది...మత్తుపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్షన్ స్టార్ట్‌ కాబోతుంది...ఇప్పటివరకు డైరెక్షన్ చేసుకున్న సిట్ బృందం ఇకపై యాక్షన్‌లోకి దిగనుంది...సమాచార సేకరణ..నిజానిజాలు తెలుసుకుని..అన్ని ఆధారాలతో రెడీగా ఉన్న సిట్ అధికారులు ఇక కెమెరా ముందు విచారణ చేయనున్నారు...టాలివుడ్‌లోని కొందరికి ఇప్పటికే నోటీసులు అందించి విచారణకు రావాలని ఆదేశించారు...వారికి సంబంధించిన సమాచారంపై వివరాలు ఆరా తీయనున్నారు.

తారల డేట్స్..
సిట్‌ ముందు పూరీ...సమాచారం ఇచ్చిన జగన్నాథ్... 19న హాజరుకానున్న డైరెక్టర్...20న హీరోయిన్‌ చార్మీ..21న ఐటంసాంగ్‌ ఫేం ముమైత్ ఖాన్..22న నటుడు సుబ్బరాజు..23న కెమెరామెన్‌ శ్యామ్‌కె నాయుడు..24న హీరో రవితేజ..25న ఆర్ట్‌ డైరెక్టర్ చిన్నా..26న నటుడు నవదీప్...28న నటులు నందు,తనిష్...రోజుకొకరు చొప్పున విచారణ...12 మంది విచారించనున్న సిట్..

రోజుకు ఒక్కరు..
రోజుకు ఒక్కరు...వారితో పూర్తి వివరాలు తీసుకోవాలనుకుంటున్న సిట్ ఇప్పటికే ఎవరివారి సమాచారం సేకరించింది...ఇక ప్రతీ రోజూ ఒక్కరి చొప్పున విచారించి నిజాలు వెలుగులోకి తీసుకువస్తుంది..ఆ తర్వాత యాక్షన్ తీసుకునేది లేనిది...అందులో వాస్తవాలు అన్నీ బయటపడనున్నాయి. డ్రగ్స్‌ కింగ్ కెల్విన్‌ కాల్‌డేటా ఆధారంగా ఎక్సైజ్ అధికారులు టాలివుడ్‌లోని నటులు..సహనటుల మత్తు వినియోగాన్ని తెలుసుకున్నారు..వారితో నేరుగా మాట్లాడారా...? ఎవరు సరఫరా చేశారు..ఎక్కడి నుంచి వచ్చాయి..? ఇలాంటి విషయాలన్ని తెలుసుకుని కెల్విన్ చెప్పినదాన్ని క్రాస్ ఎగ్జామ్ చేయనున్నారు..దీంతో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి...

21:17 - July 17, 2017

ఢిల్లీ : గత కొన్ని రోజులుగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడ్డ బిజెపి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య తన పదవులకు రాజీనామా చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీయే అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేస్తారు. ఉపరాష్ట్రపతి పదవి పట్ల వెంకయ్య విముఖత చూపినప్పటికీ బిజెపి పెద్దలు ఆయనను నచ్చజెప్పి ఒప్పించారు.

విశేషాలు..
బిజెపికి చెందిన ప్రముఖ నేతలలో ఒకరైన ముప్పవరపు వెంకయ్య నాయుడు 1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి 1980 వరకు జనతాపార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 1980 నుంచి శాసనసభలో బిజెపి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు.

పార్టీకి సేవలు..
వెంకయ్యనాయుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యున్నత పదవులు అలంకరించారు. 1993లో బిజెపి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. 2014లో మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి కేంద్ర కాబినెట్‌ మంత్రి అయ్యారు. 2002 జూలై 1 నుంచి అక్టోబర్ 5, 2004 వరకు బిజెపి జాతీయ అధ్యక్షపదవిలో వెంకయ్య పార్టీకి సేవలందించారు. మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వెంకయ్యనాయుడు నాలుగుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడింపారు. వెంకయ్యనాయుడుకు భార్య ఉష, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మంగళవారం వెంకయ్య నామినేషన్..

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి అభ్యర్థి పదవికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం 11గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం రాత్రి మంత్రి పదవి..పార్టీ పదవులకు వెంకయ్య రాజీనామా చేయనున్నారు.

21:07 - July 17, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనూ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో వందశాతం పోలింగ్‌ నమోదు కాగా, తెలంగాణలో ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. ఏపీలో.. రాష్ట్రపతి ఎన్నికల వేళా.. పాలక, ప్రతిపక్షాల నేతల మధ్య వాగ్యుద్ధం నడిచింది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులు అందరూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు తొలిఓటు వేయగా, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు రెండో ఓటు వేశారు. వైసీపీ నుంచి వలస వచ్చిన వారు సహా మొత్తం 124 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన 46 మంది, బీజేపీకి చెందిన నలుగురు సభ్యులూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ సభ్యులందరూ ఓటేశాక, వైసీపీ ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం కారణంగా ఓ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో.. 174 మంది ఎమ్మెల్యేలు , పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఏపీ అసెంబ్లీలో ఓటేశారు.

మాటల యుద్ధం..
ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినా.. పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం.. వాతావరణాన్ని వేడెక్కించింది. పాలక, ప్రతిపక్షాలు రెండూ ఎన్డీయే అభ్యర్థికే మద్దతునిచ్చాయి. అయితే.. దీనికి కారణాలపై ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. తెలంగాణాలోనూ.. ఎమ్మెల్యేలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి ఓటేయగా.. బీజేపీ శాసనసభాపక్షం నేత కిషన్‌రెడ్డి చివరగా ఓటేశారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు గాను, 117 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌, మనోహర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా, ఓటేయలేదు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ క్రాస్‌ ఓట్‌ చేసినట్లు ప్రచారం జరిగినా.. ఆయన దాన్ని ఖండించారు. పార్టీ ఆదేశానుసారమే ఓటేశానన్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

బాబుకు మోడీ ఫోన్..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఖరారు చేసినట్లు తెలిపారు. వెంకయ్య నాయుడు విజయానికి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా మోడీ సూచించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కు మోడీ ఫోన్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఖరారు చేసినట్లు తెలిపారు.

20:24 - July 17, 2017

మాటలదేముంది బాస్ ఎన్నైనా చెప్పొచ్చు.. కానీ, వాటిలో నిజం ఎంత? నిజాయితీ ఎంత అనేదే ముఖ్యం. ఓ స్టేట్ మెంట్ ఇచ్చేస్తే అదే పడుంటుంది.. అనుకుంటే ప్రయోజనం ఏముంటుంది.. ఓ పక్క జరగాల్సిందంతా జరుగుతోంది. దేశంలో దళిత బహుజనులు మైనార్టీలపై అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి.. గోరక్షణ పేరుతో పూటకోచోట విరుచుకుపడుతూనే ఉన్నారు.. ఇవన్నీ ఓ పక్కన రక్తపాతాన్ని సృష్టిస్తుంటే మాన్య ప్రధాని మోడీ గారు ఠాఠ్..!! గోరక్షణ పేరుతో దాడులా చెల్లవు.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి అంటున్నారు. మరి వినేవాడుండాలే కానీ.. చెప్పటానికేముంది అంటారా? ఈ అంశంపై ప్రత్యేక కథనం..

ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలి ?
గోరక్షణ పేరుతో జరిగే దాడుల్ని అడ్డుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.. మంచి మాట సెలవిచ్చారు. అమలైతే సంతోషమే. దానికి తగిన పరిస్థితులు ఏర్పడితే బ్రహ్మాండమే. కానీ, ఓపక్క గోవు పవిత్రత ఎంతో, దాని ఉపయోగాలెంతో తేల్చే ప్రయోగాలు చేయండి.. అంటూనే గోరక్షణ పేరుతో దాడులు సహించం అననటంలోనే.. ఎక్కడో తేడా కొడుతోందా? అసలు దేశంలో ఏం జరుగుతోంది? ప్రధాని వ్యాఖ్యలకు, కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకుండా ఎందుకు పోయింది? ఓ పక్క జరగాల్సినవన్నీ జరుగుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంలాంటి దేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి.. వీటన్నిటిని వదిలేసిన ప్రధాని ఇప్పుడీ ప్రకటన చేయటానికి ఎలా అర్ధం చేసుకోవాలి?

భిన్నత్వంలో ఏకత్వం...
భిన్నత్వంలో ఏకత్వం...ఇదీ మనదేశపు ఐడెంటిటీ..మన సమాజ గొప్పతనం.. దానికి మన రాజ్యాంగం అవసరమైన బలాన్నిచ్చింది. కానీ, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఏ కోణంలో అర్ధం చేుకోవాలి ? ఇతర మతాలను, ఈ దేశ మూలవాసులను అణగదొక్కుతున్న పరిస్తితి కనిపిస్తోందా? ఆవు పేరుతో అసహనం రాజ్యమేలుతోంది.. పైగా ఇటీవలే సర్కారు వారు బీఫ్ బ్యాన్ విషయంలో సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నారు. పెంచండి..పాలు పితుక్కోండి.. కానీ, కోసుకు తినటానికి అమ్మకండి.. అన్నతీరులో.. ఓ పక్క ప్రజల ఆహార స్వేచ్ఛ హరిస్తూ, మరోపక్క రైతులపై భారం మోపేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బీఫ్ తినే అవకాశం లేని పరిస్థితి క్రియేట్ చేస్తోంది. అమ్మటానికి పశువులు అందుబాటులో లేకుండా సర్కారు వ్యవహరిస్తోంది. పరోక్షంగా గోరక్షణ దళాలకు మద్దతిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న మాట వాస్తవం.. కులం, మతం ఏ జాతినీ నీతినీ నిర్మించలేవు అని బాబా సాహెబ్ చెప్పిన మాటలు ఎటు పోయాయి? మతం పేరుతో గోవుకు మొక్కి, మనిషిని చంపే జాతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..? ఊహించటానికే భయం కలిగించే అంశం.. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రధాని చేసే మొక్కుబడి ప్రకటనల ప్రయోజనం ఎంత?
పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి...

20:18 - July 17, 2017

రాష్ట్రపతి ఎన్నికలళ్ల ఫూల్లు ఓటింగ్ అయ్యినట్టుంది గదా..? తెల్గురాష్ట్రాలళ్ల మట్టుకు ఎవ్వలు గూడ మిస్ గానట్టుండ్రి.. అరే పాపం.. జేఏసీ చైర్మన్ కోదండరామ్‌ సారును మళ్ల అరెస్టు జేశిండ్రుగదా ఇయ్యాళ.. సర్కారు భూములు కబ్జాలు వెట్టిండ్రని.. అవ్వి తెలంగాణల అయితే.. ఇది కడప జిల్లాల అయ్యినయ్.. తెలంగాణ పోలీసోళ్లు జర్ర మీరు జాగ్రత్తగుండుండ్రి.. మిమ్ములను దొర్కిచ్చుకోని కొడ్తాడట నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సారూ..వారెవ్వ.. హన్మంతన్నకు అమ్మవారు కళల కొచ్చిందట..విజయనగరం దిక్కు పరేషాన్ ఉన్నది పబ్లీకుకు.. తక్వ వర్థలా అవ్వి.. మంత్రగాళ్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి కుచ్చుటోపి వెట్టిండ్రుగదా..?పద్మాసనం ఏస్కోని కూసుంటె పరమాన్నం వడ్డిస్తుండొచ్చునా..? గిసొంటి గరం గరం ముచ్చట్టు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

20:14 - July 17, 2017

తెలంగాణ పోలీసోళ్లు జర్ర మీరు జాగ్రత్తగుండుండ్రి.. మిమ్ములను దొర్కిచ్చుకోని కొడ్తాడట నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సారూ.. ఆయన ప్రభుత్వం రాంగనే మిమ్ములను ఒక్కల్ని గూడ ఇడ్సిపెట్టడట.. ముందే కోమటిరెడ్డి ఎంకట్ రెడ్డి అంటె మాటమీదుండే మన్షి.. ఆయన అన్నడంటే మీ పని ఖతమైతది.. జాగ్రత్తగ ఉండుండ్రి మరి..మరి కోమటిరెడ్డి ఏమన్నడో సూడాలంటే వీడియో సూడుండ్రి..

ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య అర్హుడు - అమిత్ షా..

ఢిల్లీ : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఖరారు చేసినట్లు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కాసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు అర్హుడని, పార్టీ పార్లమెంటరీ సమావేశం ఏకగ్రీవంగా వెంకయ్యను ఎన్నుకుందని తెలిపారు. వాజ్ పాయి హాయాంలో మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం మోడీ హాయాంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. చి

 

ఉప రాష్ట్రపతి వెంకయ్య..జీవిత విశేషాలు..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన మంత్రి మోడీ..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు.

20:04 - July 17, 2017

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీ పడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఎన్డీయే బరిలోకి దింపనుంది. ఈ అంశంపై వీరయ్య (విశ్లేషకులు), కార్తీక రెడ్డి (కాంగ్రెస్), ప్రకాష్ రెడ్డి (బీజేపీ) పాల్గొని విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:03 - July 17, 2017

ఢిల్లీ : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఖరారు చేసినట్లు బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. కాసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు అర్హుడని, పార్టీ పార్లమెంటరీ సమావేశం ఏకగ్రీవంగా వెంకయ్యను ఎన్నుకుందని తెలిపారు. వాజ్ పాయి హాయాంలో మంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం మోడీ హాయాంలో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. చిన్నప్పటి నుండి బీజేపీ పార్టీతో సంబంధం ఉందని, చిన్న కార్యకర్త నుండి ఎదిగి ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారని తెలిపారు. మంగళవారం 11 గంటలకు ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య నాయుడు నామినేషన్ ధాఖలు చేస్తారని వెల్లడించారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఇప్పటికే గోపాల కృష్ణ గాంధీని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి, పార్టీ పదవులకు ఈ రాత్రికి వెంకయ్య నాయుడు రాజీనామా చేయనున్నారు.

  • 1949 జులై 1న నెల్లూరు జిలాల చవటపాలెంలో జన్మించారు.
  • వీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు.
  • ఏయూ నుండి న్యాయపట్టా పొందిన వెంకయ్య కాలేజీల్లో చదువుకొనే రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు.
  • 1972లో జై ఆంధ్రా ఉద్యమంలో పనిచేశారు.
  • 1978లో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
  • ఉదయగిరి నుండి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • వాజ్ పేయి కేబినెట్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.
  • ప్రస్తుతం మోడీ హాయాంలో మంత్రిగా విధులు..
19:50 - July 17, 2017

హైదరాబాద్ : ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఉత్కంఠ వీడింది. బీజేపీలో కీలక నేత, కేంద్ర క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు పేరును ఖరారు చేశారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన మంత్రి మోడీ..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు వెంకయ్యను అభినందించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియమించడంపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య...

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన మంత్రి మోడీ..బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభినందించారు.

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ కాసేపటి క్రితం ముగిసింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకొనేందుకు సమావేశం ఏర్పాటు చేశారు.

19:26 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీ పడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార, ప్రతిపక్షాలు అన్న తేడా లేకుండా ఇరువైపుల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం. జులై 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడనుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీ, అద్వాని, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

32 పోలింగ్ కేంద్రాలు..
రాష్ట్రపతి ఎన్నికల కోసం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు తమ తమ అసెంబ్లీలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓటు వేయాల్సి ఉండగా ఈసీ ముందస్తు అనుమతితో 55 మంది ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేశారు. గుజరాత్‌లో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్లమెంట్‌లో ప్రధాని మోదితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

4896 సభ్యులు..
రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు మొత్తం 4896 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 4,120 మంది శాసనసభ్యులు కాగా...776 మంది పార్లమెంట్‌ సభ్యులున్నారు. మొత్తం ఓట్ల సంఖ్య 10 లక్షల 98 వేల 903 ఓట్లు. నామినేటెడ్‌ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండదు. ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని ఏ పార్టీ కూడా తమ సభ్యులకు విప్‌ జారీ చేయడం కుదరదు. దీంతో పలు రాష్ట్రాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం.

25న ప్రమాణ స్వీకారం..
రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎన్డీయే పక్షాలతో పాటు బిజెడి, టిఆర్‌ఎస్‌, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, ఎఐఎడింకెలో ఓ వర్గం మద్దతు ప్రకటించాయి. మీరా కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడి, ఎస్పీ, బిఎస్పీ వామపక్షాలు తదితర 17 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. మొదటి నుంచి మీరా కుమార్‌కు మద్దతు తెలిపిన ఎన్‌సిపి చివరి క్షణంలో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌వైపు మొగ్గడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం తథ్యమని తెలిసినా...పోటీలో ఉండాలనే ఉద్దేశంతో విపక్షాలు మీరా కుమార్‌ను రంగంలోకి దింపాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌ 63 శాతానికి పైగా ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. జులై 20న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడనుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

19:09 - July 17, 2017

సుప్రీం సూచనను తిరస్కరించిన కేంద్రం..

ఢిల్లీ : పాతనోట్లు డిపాజిట్ చేసేందుకు ప్రజలకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. సుప్రీం సూచనను కేంద్రం తిరస్కరించింది. పాతనోట్ల మార్పిడికి మరో అవకాశం ఇవ్వలేమని, మరో అవకాశం ఇస్తే నోట్ల రద్దు ఉద్ధేశ్యం నెరవేరదని తేల్చిచెప్పింది.

 

మెట్రోపై ఏపీ ప్రభుత్వం వెనక్కి...

విజయవాడ : మెట్రో పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మెట్రో స్థానంలో లైట్ మెట్రో ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గన్నవరం నుండి పండింట్ నెహ్రూ బస్టాండు వరకు..పండింట్ బస్టాండ్ నుండి పెనమలూరు వరకు లైట్ మెట్రో ఏర్పాటు చేయాలని, రద్దీ తక్కువగా ఉండే ప్రాంతంలో మోనో ట్రైన్లు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాసేపట్లో అమిత్ షా ప్రెస్ మీట్..

ఢిల్లీ : సోమవారం రాత్రి 7.30గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు.

 

ఎంపీ జేసీకి చుక్కెదురు..

హైదరాబాద్ : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విమానయాన సంస్థలు తనపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జేసీ దివాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దివాకర్ ట్రావెల్స్ లో ఇలాంటి ఘటనలు జరిగితే అనుమతినిస్తారా అని హైకోర్టు జేసీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాత్కాలికంగానైనా అనుమతించాలని జేసీ తరపు న్యాయవాది కోరారు. విమానయాన సంస్థల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.

సిట్ విచారణకు పూరీ..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో 19వ తేదీన సిట్ విచారణకు టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరు కానున్నారు. ఈ కేసులో పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

18:35 - July 17, 2017

కరీంనగర్ : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధరల స్థిరీకరణ నిధులు అమలు చేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా 24వ తేదీ నుండి 26 తేదీ వరకు జైల్ భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. గో సంక్షరక దళాలు దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురి చేయడం సిగ్గు చేటన్నారు.

18:30 - July 17, 2017
18:26 - July 17, 2017

నెల్లూరు : జెన్ కో కాలుష్యం బారిన పడిన నేలటూరు గ్రామస్తులకు ఆగస్టు 15వ తేదీలోగా పునరావాసం కల్పించాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే జెన్ కో ప్రాజెక్టు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. గతంలో పోర్టు కాలుష్యంపై ఆందోళన చేసిన టిడిపి అదే కాంట్రాక్టు పనులు చేజిక్కించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉన్న సమయంలో టిడిపి నేతలు హడావుడి చేశారని, ఆందోళన చేసిన నేతలు బూడిద కాంట్రాక్టు తీసుకుని చేస్తున్నారని తెలిపారు. వరిగొండకు వెళ్లాలని చెబితే సీపీఎం అంగీకరించదని మధు స్పష్టం చేశారు.

ఇంటికి వచ్చేందుకు పూర్ణిమ నిరాకరణ..

ముంబై : కూకట్ పల్లిలో అదృశ్యమైన పూర్ణిమ సాయి ఆచూకి ముంబైలో లభ్యమైన సంగతి తెలిసిందే. కూతురిని వెంట తీసుకొద్దామని వెళ్లిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రుల వెంట వెళ్లేది లేదని పూర్ణిమ మొండికేస్తోంది.

 

18:10 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నిక తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే రామ్ నాథ్ కోవింద్ ను నియమించిన సంగతి తెలిసిందే. మిత్రపక్షాలు మీరా కుమార్ ను నియమించారు. కాసేపటి క్రితం పోలింగ్ ముగిసింది. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని నియమించనున్నారనే దానిపై చర్చ ప్రారంభమైంది. దీనిపై ప్రతిపక్షాలు ముందుగానే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనువడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని ఎంపికచేశాయి.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై చర్చించడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో 12 మంది సభ్యులు ఓ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడే అని బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ విద్యాసాగర్ రావుతో పాటు ఇతర పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దక్షిణాదికి చెందిన నాయకుడికే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించాలని బీజేపీ యోచిస్తోంది. వెంకయ్య అభ్యర్థిత్వంపై ప్రధాని మోడీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఎన్డీయే పక్షాలతో మంతనాలు కొనసాగుతున్నాయి. కానీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ప్రకటిస్తే రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై బీజేపీ యోచిస్తోంది. ఉప రాష్ట్రపతి అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందనే విషయం తెలిసిందే. కానీ ఇందుకు వెంకయ్య నాయుడు సుముఖంగా లేరని సమాచారం.

విద్యా సాగర్ రావు..వెంకయ్య నాయుడుల్లో ఎవరికి అవకాశం దొరుకుతుంది.. చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వస్తుందా? వేచి చూడాలి.

నాయక్ ముదస్సర్ వీరమరణం..

జమ్మూ కాశ్మీర్ : పూంచ్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ నాయక్ ముదస్సర్ వీరమరణం పొందాడు. దీనితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 37 ఏళ్ల అహ్మద్‌కు ఇద్దరు పిల్లలున్నారు.

వేధించాడని అర గుండు కొట్టించి..

కర్నాటక : విజయపురలో మహిళను వేధించినందుకు ఓ వ్యక్తికి మహిళ కుటుంబసభ్యులు అరగుండు కొట్టించి..మెడలో దండలు వేసి..ఊరేగించారు.

సిక్కోలులో 11 మండలాల అప్రమత్తం..

శ్రీకాకుళం : 11 మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. పాలకొండ డివిజన్ లో బూర్ఖ, రేగడి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఏ నిర్ణయమైనా సమ్మతమే - వెంకయ్య..

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరున ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

17:19 - July 17, 2017

విజయవాడ : రాజకీయాలకు..రాజ్యాంగ పదవులకు ముడి పెట్టవద్దని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు వైసీపీ మద్దతు విషయంపై ఆయన టెన్ టివితో మాట్లాడారు. రాష్ట్రపతి అనేది అత్యుత్తమ పదవి అని, స్పష్టమైన మెజార్టీ కనిపిస్తున్న అంశమన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు మద్దతిచ్చామని గుర్తు చేశారు. అనవసరమైన పోటీ పెట్టి అగౌరవపర్చడం ఎందుకని ఆలోచించడం జరిగిందని, రాష్ట్రపతి అయిన తరువాత గతంలో చేసిన పనులు కోవింద్ చేయరని అనుకుంటున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:16 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా ఓటు వేసేందుకు 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఈనెల 20న ఓట్లను లెక్కించి అదే రోజున ఫలితాన్ని ప్రకటించనున్నారు. 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే తరపున రామ్ నాథ్ కోవింద్, ప్రతిపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు.

ఎంపీలు..ఎమ్మెల్యేల ఓటు..
పార్లమెంట్ లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 721 ఎంపీలు ఓటు వేశారు. వివిధ రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా అసెంబ్లీలో ఓటు వేశారు. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎంత నమోదు అయ్యింది ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. అనారోగ్యం..బయట దేశాల్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఢిల్లీ పార్లమెంట్ కు బ్యాలెట్ బాక్స్ లు చేరుకుంటాయి. ఇదిలా ఉంటే ఓటింగ్ లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి. కోవింద్ కు 60 శాతం ఓటింగ్ నమోదవుతుందని ఎన్డీయే భావిస్తోంది.

అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేశారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

ముద్రగడపై హోంమంత్రి చినరాజప్ప ఫైర్

అమరావతి: కాపు ఉద్యమ నేత ముద్రగడపై హోంమంత్రి చినరాజప్ప మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ ప్రోద్భలంతోనే ముద్రగడ, మందకృష్ణ, హర్షకుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా సమాచారం ఉందని, ప్రత్యేక బృందాలతో డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటామని తెలిపారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుటుంబానికి కోయదొరల బురిడీ

వరంగల్: పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుటుంబానికి కోయదొరలు బురిడీకొట్టించారు. కోయదొరలకు రూ.57 లక్షలు ఇచ్చారు. తీరా చూస్తే మోసపోయామని గమనించిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్ కేసు నమోదుచేసి గోప్యంగా విచారణ చేపట్టారు.

ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొద్ది సేపటి వరకు జరిగింది. 4,120 మంది శాసనసభ్యులు, 776 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరిపి అదేరోజు ఫలితాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సీఎం చంద్రబాబు పై సీఈసీకి వైసీపీ ఫిర్యాదు

ఢిల్లీ: సీఈసీ అచల్ కుమార్ జ్యోతిని వైసీపీ ఎంపిల బృందం కలిసింది. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లను టిడిపి ప్రలోభపెడుతోందని ఈసీకి వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. సవ్వయంగా సీఎం చంద్రబాబే ఓటర్లను బెదిరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపి వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. నంద్యాల ఉపెన్నికను వెంటనే నిర్వహించాలని కోరామన్నారు. ఆగస్టు చివరి కల్లా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చాని వైవీ తెలిపారు.

 

16:42 - July 17, 2017

ఢిల్లీ : టిడిపి గుర్తును రద్దు చేయాలంటూ వైసీపీ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను సోమవారం కలిశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అక్రమాలకు పాల్పడుతోందని..సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు. నంద్యాలలో నలుగురు మంత్రులు క్యాంప్ వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని, టిడిపికి ఓట్లు వేయకుంటే రోడ్లపైఊ ఎలా తిరుగుతారంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. మరి వైసీపీ ఎంపీల ఫిర్యాదుపై టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

16:37 - July 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో 84 కస్తూర్బా విద్యాలయాలకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని విద్యాశాఖ మంత్రి కడియం పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న 397 కేజీబీవీలకు అదనమని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని కేజీబీవీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:32 - July 17, 2017

హైదరాబాద్ : 'రవితేజ నిప్పులాంటి వాడు..నిప్పుతో చెలగాటమాడుతున్నారు..శత్రుత్వం తమకు లేదు..ఎవరో కావాలని చేశారని అనుకోవడం లేదు..తన కష్టం మీద పైకి వచ్చాడు'..అంటూ రవితేజ తల్లి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ కేసు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ నటుడు రవితేజ..ఇతరులు కూడా ఉన్నారనే వార్త సంచలనం అయ్యింది. దీనితో ఆమె తల్లి 'రవితేజ' తల్లి సోమవారం స్పందించారు.

మత్తు ఏంటో తెలియదు..
డ్రగ్స్ వ్యవహారంలో తన కొడుకు పేరు రావడంపై హీరో రవితేజ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజకు మత్తు పదార్థాలు సేవించే అలవాటు లేదని, కష్టపడి ఇంత స్థాయికి ఎదిగిన తన కుమారుడికి ఈ కేసుతో సంబంధం ఉందని అనడం తమకు బాధ కలిగిందన్నారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నందున స్పందించడానికి అందుబాటులో లేడని, పోలీసుల నుండి నోటీసు వచ్చిందన్నారు. 22వ తేదీన విచారణకు రవితేజ హాజరౌతాడని తెలిపారు.

కెల్విన్..ఎవడో తెలియదు..
నిజాయితీ ఎప్పటికైనా బయటపడుతుందని..ఏ టెస్టులకైనా తన కొడుకు రెడీ అని తెలిపారు. ఆరు నెలలకొకసారి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడని, గతంలో భరత్..రవితేజను డ్రగ్స్ కేసులో ఇరిక్కించారని తెలిపారు. భరత్ అలాంటి సర్కిల్ కు అలవాటు పడ్డాడని..మంచితనం కుర్రాడైన భరత్ మద్యానికి అలవాటు పడ్డాడని తెలిపారు. కెల్విన్..గెల్విన్ ఎవడో తెలియదని 'రవితేజ' తల్లి కుండబద్ధలు కొట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

శ్రీకాకుళం జిల్లాకు వరద ముప్పు... అప్రమత్తత

శ్రీకాకుళం: జిల్లాలో 11 మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. పాలకొండ వివిజన్ లో బూర్జ, రేగడి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాలకొండలో ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భూమిని ప్రాంతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. ఒడిశాల్లో భారీగా వర్షాలకు వంశధారకు వరద ఉధృతి పెరిగింది.

16:17 - July 17, 2017

శ్రీకాకుళం : ఒడిశా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో నాగావళికి అకస్మాత్తుగా భారీగా వరద ఉధృతి చేరుకొంటోంది. ఆదివారం నుండి వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్పటికే వరద నీరు జాతీయ రహదారులపైకి చేరడంతో రాకపోకలు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

వంశధార..నాగావళి నదులు..
ఉత్తరాంధ్ర జిల్లాలోని వంశధార..నాగావళి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాకపోకలకు నిలిచిపోయాయి. భారీగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలో తురాయి చెట్టు వీధి, మండలం వీధుల్లోకి వరద నీరు చేరింది. పాలకొండ డివిజన్ లోని బూర్ఖా రేగడి మండలాల్లో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సహాయక చర్యలు..
నదులు ఉగ్రరూపం దాలుస్తుండడంతో అధికారులు పరుగులు పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం మొదలు పెట్టారు. పాలకొండలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. బామిని ప్రాంతంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే హిర మండలం గొట్టా బ్యారేజ్ లో 21 గేట్లను ఎత్తివేశారు. గడిచిన 24గంటలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

లంగర్ హౌస్ లో దగ్ధమైన కారు

హైదరాబాద్: లంగర్ హౌస్ ఓ కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

16:08 - July 17, 2017

చిలకడ దుపం..ఈ దుంపలకు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటిని మొరంగడ్డ, కందగడ్డ, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పిండి పదార్థాలను, చక్కెరలను కలిగి ఉండే ఈ ఆహార పదార్థం రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ ఉండవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చిలగడ దుంపలో శరీరానికి కావల్సిన పోషకపదార్థాలను అందించడంలోనే కాదు, వివిధ రకాలుగా శరీరంలో చేరిన విషపదార్థాలను తొలగించడంలో చిలకడ దుంపలకు ప్రత్యేక స్థానం ఉంది. చిలకడదుంపను తినటానికి ఇష్టపడని వారు ఉండరు అనే చెప్పాలి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. ఇక చిలుగడదుంపలో కార్టినాయిడ్స్‌ మరియు పాలీఫినాల్స్‌ వంటి ఫైటో రసాయనాలు ఉన్నాయి. దుంపలో లభించే పోషక పదార్ధాల వినియోగం దానిని ఉడకపెట్టే విధానంపై ఆధారపడి ఉంటుంది . ఎదిగే పిల్లలకు స్వీట్‌ పొటాటోను ఉడికించి తినిపించడం వల్ల శరీరంలో ఉన్న విషరసాయనాలు సులభంగా బయటకు పంపిస్తుంది. అనేక ఖనిజ లవణాలతో పాటు దుంపలలో పిండి పదార్థాలు(కార్బోహైడ్రేటులు), విటమిన్‌లు(బి,సి,ఇ) ఉన్నాయి.

షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది...

బంగాళాదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలోని షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది

దండిగా విటమిన్ బీ-6

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

అధికంగా పొటాషియం...

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

అధికంగా మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. మ్యాంగనీస్ ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది.

అధికంగా విటమిన్ ఇ

విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది. వయస్సు మీద పడనియ్యకుండా చేసి, ముడతలను అడ్డుకుంటుంది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 54 పాయింట్ల లాభంతో 32.074 వద్ద సెన్సెక్స్, 30 పాయింట్ల లాభంతో 9,015 వద్ద నిఫ్టీ ముగిశాయి.

గొట్టా బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి

శ్రీకాకుళం : హిర మండలం వద్ద గొట్టా బ్యారేజికి వరద ఉధృతి పెరుగుతోంది. గొట్టా బ్యారేజీ 22 గేట్లు ఎత్తి నిటిని వదులుతున్నారు. కొత్తూరు మండలం మదనాపురం వద్ద పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కే ఓటు వేశా: రాజాసింగ్

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్ కు ఓటు వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ఎన్టీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కేఓటు వేసినట్లు స్పష్టం చేశారు. పార్టీలో కొందరు నాపై దుష్పచారం చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

15:37 - July 17, 2017

వనపర్తి : కొత్త ప్రాజెక్టులు రైతులు ఎంత సంతోష పడుతారో..నిర్వాసితులకు కూడా అంతే సంతోషం దక్కాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలోని బీమా ప్రాజెక్టు ఫేజ్ 2 లో భాగంగా ఉన్న కానాయిపల్లి, ఆర్ అండ్ ఆర్ ముంపు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసితులకు ఎకరాకు రూ. 12 లక్షలు పరిహారం చెల్లించాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన కలిపించిన తరువాతే గ్రామాన్ని ఖాళీ చేయించాలని తెలిపారు. వెంటనే ఖాళీ చేయాలని, వేరే ఊరు నిర్మించిన అనంతరం ఖాళీ చేయించాలని పునరావస చట్టం పేర్కొంటోందని గుర్తు చేశారు. ఎక్కడో దూరంగా కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో ఇస్తామంటున్నారని తెలిపారు. గ్రామం గ్రామం ఒక్కటిగా ఉందని..సరియైన నష్ట పరిహారం భూమికి కావాలని..న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తమ్మినేని హెచ్చరించారు.

15:32 - July 17, 2017

కరీంనగర్ : 'కేటీఆర్ ఓ బచ్చా..నీ చరిత్ర ఏంటీ ? నీ బతుకెంత..అమెరికాలో నిన్న..మొన్నటి వరకున్నడు'.. అంటూ టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ విమర్శలకు పదును పెట్టారు. వరంగల్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కాంగ్రెస్ నేతలను ఇరికిస్తున్నారంటూ మండిపడ్డారు. తామే హత్య చేశామంటూ నిందితులు నేరుగా పీఎస్ లోకి వెళ్లి లొంగిపోయారని, కానీ కాంగ్రెస్ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్న నాయకులగా ప్రవర్తిస్తున్నారని..ఏమీ సంబంధం లేని కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయన బచ్చా అంటూ తిట్టిపోశారు. ఇంకా ఉత్తమ్ ఎలాంటి మాటలు మాట్లాడారో వీడియో క్లిక్ చేయండి.

15:27 - July 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పక్షం..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ శత్రువు కాంగ్రెస్ అంటూ మంత్రి కేటీఆర్ మరోసారి ఆ పార్టీపై విరుచకపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని విమర్శలు చేశారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని..ఉద్యమ సమయంలో తెలంగాణ నినాదాన్ని అణిచివేయాలని ప్రయత్నించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకొంటోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

15:23 - July 17, 2017

చెన్నై: ‘బాధితురాలి పేరు దాచకూడదు. కానీ అందుకు చట్టం ఒప్పుకోదు. నాకు బాధితురాలు అన్న పదం వాడటానికి సిగ్గుగా ఉంది హీరోయిన్ గౌతమి అన్నారు. లయాళ నటి అపహరణ కేసులో బాధితురాలి పేరు దాచకూడదని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై గౌతమి స్పందించారు. ఎందుకంటే ఓ అమ్మాయి ఇలాంటి దారుణ ఘటనల్ని ఎదుర్కొని తనకు న్యాయం కావాలని పోరాడుతున్నప్పుడు ఆమె పేరు దాచాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో ఆమె ఓ హీరో. ఇంత జరిగాక కూడా ఆమె సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తన చుట్టూ ఉన్నవారికి ముఖం చూపించాలి. అంతెందుకు తన పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించిన వ్యక్తికి కూడా తన ముఖం చూపించాల్సి వస్తుంది. అందుకు తనకు ఎంతో ధైర్యం కావాలి.’ అని గౌతమి వివరించారు.

15:23 - July 17, 2017
15:21 - July 17, 2017

హైదరాబాద్ : వర్షాలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత అల్పపీడనంగా బలపడుతోంది. దీనితో ఇరు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గత కొన్ని రోజులుగా ఆందోళనగా ఉన్న రైతులు వర్షాలు కురుస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో భారీ వర్షం..
నగరంలో గత రెండు రోజుల నుండి వాతావరణం మేఘావృతమై కనిపిస్తోంది. కానీ సోమవారం వాతావరణ పరిస్థితుల్లో మార్పు కనిపించింది. నగరంలో ఉదయం నుండి వర్షం కురుస్తోంది. సాయంత్రం భారీ వర్షం పడుతుండంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపై భారీ ఎత్తున నీరు చేరుతుండడంతో వాహనదారులు..పాదాచారులు అష్టకష్టాలు పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పత్తి..వరి నాటు వేసుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేస్తున్నారు.
 

15:16 - July 17, 2017

హైదరాబాద్: దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత మరోసారి కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాకు ప్రభుదేవా డైరెక్టర్ గా వ్యహరించనున్నారు. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన దబాంగ్, దబాంగ్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను రాబట్టాయి. ఈ సిరీస్‌లో మూడో భాగం రూపొందనుంది. దబాంగ్-3 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. సల్మాన్‌ఖాన్‌తో ఉన్న అనుబంధం, స్నేహం కారణంగా ఆయనకు ఈ అవకాశం దక్కినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సల్మాన్ సోదరుడు అర్భాజ్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

ఓటేసిన వైసీపీ నేత జగన్

అమరావతి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైఎస్ జగన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే రోజాకు మరోసారి నోటీసులు...

అమరావతి: ఎమ్మెల్యే రోజాకు మరోసారి ప్రివిలేజ్ నోటీసులు అందనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌కు పాల్పడడం సరికాదని, స్పీకర్ కూడా అందుకు సహకరించారని, పదవికి గౌరవం కల్పించే విధంగా స్పీకర్ ప్రవర్తిస్తే బాగుంటుందని, దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని రోజా అన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

కాంగ్రెస్సే మొదటి శత్రువు: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణకు మొదటి కాంగ్రెస్సే శత్రువు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 1969లో ఉద్యమాన్ని అణిచివేసి ద్రోహం చేసింది కాంగ్రెస్సే అని విమర్శించారు. 2001లో వచ్చిన మూడు కొత్త రాష్ట్రాలు ఇప్పటికి అభివృద్ధి సాధించలేదని, తెలంగాణ కొత్త రాష్ట్రం అయినా మూడేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. రాజకీయం కోసం కాంగ్రెస్ తెలంగాణను వాడుకుందని ఘాటు విమర్శలు చేశారు. జయశంకర్ లేని లోటు కనపడుతుందని, కేసీఆర్ ఏ విషయంపై అనుమానాలుఅడిగితే జయశంకర్ చెప్పేవారన్నారు. 1962 నుంచి నీళ్లు, నిధులు నియామాకాల్లో అన్యాయం జరిగిందని, పీవీ, అంజయ్యకు అవమానం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.

14:36 - July 17, 2017

బెంగళూరు : సెంట్రల్‌ జైలులో అన్నాడిఎంకె ప్రముఖ నేత శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని నివేదిక ఇచ్చినందుకు జైళ్ల డిఐజి రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. ఓ అధికారి రెండు కోట్లు లంచం తీసుకుని శశికళకు ప్రత్యేక వంటగది, స్పెషల్‌ బెడ్‌, స్వేచ్ఛగా తిరగడానికి సౌకర్యాలు కల్పించారని రూప ఆరోపించారు. పరప్పన జైలులో జరుగుతున్న అక్రమాలపై ఆమె ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. డిఐజి రూప జైలులో అక్రమాలను బయటపెట్టినందుకు ప్రభుత్వం బదిలీ వేటు వేసిందని విపక్షాలు విమర్శించాయి. సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులను సిద్ధరామయ్య ప్రభుత్వం కాపాడుతోందని జెడిఎస్‌ విమర్శించింది.

14:32 - July 17, 2017

నెల్లూరు : చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దళితులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..నీరు చెట్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందన్నారు. గరకపర్రులో నేటికీ సాంఘిక బహిష్కరణ జరుగుతుండటం దారుణమని మండిపడ్డారు. దళితుల సమస్యలు జూలై 31లోగా పరిష్కరించకపోతే.. 31న చలో విజయవాడకు పిలుపు ఇస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:31 - July 17, 2017

గుంటూరు : ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీలో వైసీపీ నేత జగన్‌ ఎమ్మెల్యేలతో కలిసి రోజా తొలి సారిగా ఓటు వేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పినట్టు గా బీజేపీ బలపరిచిన అభ్యర్ధి రామ్‌నాథ్‌ కోవింద్‌కి ఓటు వేసినట్టు తెలిపారు.. తొలిసారిగా రాష్ట్రపతికి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రితో కలిసి మాక్‌ ఓటింగ్‌లో పాల్గొనడం స్పీకర్‌ పదవికే అవమానకరం అని రోజా అన్నారు.

 

14:30 - July 17, 2017

ఢిల్లీ : టీఆర్‌ఎస్ ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేశామని ఎంపి వినోద్ పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని వినోద్ చెప్పారు. మరోవైపు ఏపీ, తెలంగాణలకు హైకోర్టును కేటాయించాల్సిన అవసరం ఉందని ఈ అంశంపై కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని వినోద్ తెలిపారు. సిద్ధంగా ఉన్న అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు రెండు, మూడు రోజుల్లో పార్లమెంటుకు వస్తుందని భావిస్తున్నట్లు ఎంపి వినోద్ చెప్పారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్...

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సాయంత్రం 5 గంటలకు ఓటు వేయనున్నారు.

 

జైళ్ల శాఖ డీఐజీ రూపపై బదిలీ వేటు

బెంగళూరు: అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడింది. ఆమెను జైళ్లశాఖ నుంచి ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళకు జైల్లో అక్రమంగా సౌకర్యాలు కల్పించినందుకు దాదాపు రూ.2 కోట్ల మేర ముడుపులు అందాయని డీఐజీ రూప డీజీపీకి ఆరు పేజీల లేఖ రాయడం కలకలం రేపింది.

ఓటు హక్కు కోల్పోయిన ఎంపి మంత్రి

భోపాల్: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటు వేసే హ‌క్కును మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా కోల్పోయారు . ఎన్నిక‌ల సంఘం ఆయ‌న ఓటుపై అనర్హ‌త ప్ర‌క‌టించింది. ఇది చాలా అరుదైన కేసు. పెయిడ్ న్యూస్‌పై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి న‌రోత్త‌మ్‌పై ఎన్నిక‌ల సంఘం మూడేళ్ల వేటు వేసింది. 2008 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చేసిన ఖ‌ర్చుపై మంత్రి వాస్త‌వాలు చూప‌ని కార‌ణంగా ఆయ‌న‌పై వేటు వేశారు. త‌న‌కు ఓటు హ‌క్కు క‌ల్పించాల‌ని మంత్రి న‌రోత్త‌మ్ ఢిల్లీ హైకోర్టులో పిటీష‌న్ వేశారు. కానీ కోర్టు ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది.

ఏపీలో ఓట్లన్నీ రామ్ నాథ్ కే: ఎంపి రాయపాటి

అమరావతి: ఏపీలో ఓట్లన్నీ రామ్ నాథ్ కే పడతాయని ఎంపి రాయపాటి అన్నారు. వైసీపీ తన అవసరాల కోసం రామ్ నాథ్ కు మద్దతు ఇచ్చిందని, అయినా జగన్ ను మోదీ కేసుల నుండి కాపాడరని రాయపాటి ఎద్దేవా చేశారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రానికి నిధులు తెచ్చేవారు ఉండరని రాయపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

14:07 - July 17, 2017
14:04 - July 17, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడేళ్ల బాలికతో పాటు ఓ జవాను అమరుడయ్యాడు. మృతి చెందిన జవానును నాయక్‌ ముదస్సర్‌ అహ్మద్‌గా గుర్తించారు. 37 ఏళ్ల అహ్మద్‌కు ఇద్దరు పిల్లలున్నారు. పాక్‌ కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారు. ఉదయం ఏడున్నర ప్రాంతంలో రాజౌరిలోని బంకర్‌పై పాక్‌ బలగాలు మోర్టార్‌ షెల్స్‌తో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. పాక్‌ దాడులకు దీటైన జవాబు చెబుతామని మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం:దామోదర్ రెడ్డి

సూర్యాపేట : టీఆర్ ఎస్ నేలు చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ని మరవద్దు అని దామోదర్ రెడ్డి సూచించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఎవరిని పాతరేస్తారో తెలుస్తుందని, మంత్రి జగదీష్ రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబతారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని రంరెడ్డి జోస్యం చెప్పారు.

14:03 - July 17, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బిజెపి ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. అనంతరం బిజెపి తమ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి భావిస్తోంది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పేర్లు వినిపిస్తున్నాయి. వెంకయ్యనాయుడు పేరును ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ఉన్న వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇదే విషయాన్ని ప్రధాని మోదితో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రధాని మోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షా గతవారం చర్చించారు. వెంకయ్యనాయుడు వైపే అమిత్‌ షా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

14:02 - July 17, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధాని మోదీ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఓటు వేశారు. 

చెట్టును ఢీకొన్న కారు.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

తూ.గో: పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఓ కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి భార్గవ్ మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

మోదీ మదిలో ఎవరి పేరు తలిస్తే వారికి పదవులు:సీపీఐనారాయణ

ఒంగోలు : దేశంలో ఆర్ ఎస్ ఎస్ భావజాలం విస్తృతమవుతోందని సీపీఐ నారాయణ అన్నారు. దేశం మొత్తం కాషీయకరణ చేసేందుకు బిజెపి కంకణం కట్టుకుందని ఆరోపించారు. మోదీ మదిలో ఎవరి పేరు తలిస్తే వారికి పదవులు ఇస్తున్నారని, ఏపీలో మాపియా పాలన నడుస్తోందని నారాయణ విమర్శించారు. రైతులు కష్టాలో ఉంటే చంద్రబాబు అమరావతి జపం చేయడయం దారుణమన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

13:49 - July 17, 2017

పురుషధిక్య భవజాలం మెండుగా ఉన్న మహిళల కేరిర్ నిర్ణయించడంతో వివాహాం కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. వివాహా అనంతరం కూడా ఎంతో మంది మహిళలు తమ కేరిర్ లో అందివచ్చిన అనుగుణంగా మార్చుకుంటారు. అయితే ఈ అంశం కొందరికి సానుకూలంగా ఉంటుంది. మరికొందరు తమకు వచ్చిన అరుదైన అవకాశలు అందుకుని ముందుకు వెళ్తుంటారు. వారిలో ఒకరు ఎంఎస్ ప్లాస్టిక్ ప్రొప్రెటర్ శ్రీవిద్య...మహిళల స్వశక్తితో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాంటివారికి తము ఎంచుకునే రంగల గురించి కుటుంబ నేపథ్యం ఉంటే వారికి మరిన్ని మెరుగైన అవకాశలు అందుబాటులోకి వచ్చినట్టే అలాంటి కుటుంబ నేపథ్యం వచ్చిన శ్రీవిద్య గ్రాడ్యుయెషన్ చేశారు. భర్త అనుభవానికి తన వ్యూహాన్ని జతచేసి పరిశ్రమ స్థాపించారు. శ్రీవిద్య ఈనాటి స్పూర్తి పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

13:25 - July 17, 2017

హైదరాబాద్ : జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మీరాకుమార్ కు ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఓటు వేసే క్రమంలో పోరపాటు చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మీరాకుమార్ కు ఓటేసిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజాసింగ్ లు!

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజాసింగ్ లు మీరాకుమార్ కు ఓటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సీఎంకేసీఆర్ ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

13:18 - July 17, 2017

విశాఖ : జిల్లా కేంద్రంలోని పోర్ట్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బోల్తాపడి 16 మందికి గాయాలయ్యాయి. ఆటోను తప్పించబోయి బస్సు బోల్తా పడినట్టు తెలుస్తోంది. బస్సు నర్సిపట్నం నుంచి విశాఖ వస్తుంది. వర్షం కారణంగా టైర్లు స్కిడ్ అవడంతో బోల్తా పడినట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫీక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

13:17 - July 17, 2017

సిద్దిపేట : జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ లో ప్రొ. కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోదండరామ్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో పర్యటిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కోదండరామ్ అరెస్ట్ వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పూర్తి సమాచారం కోసం వీడయో చూడండి.

 

13:16 - July 17, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని నాగావిళి నది వరదనీరు పోటెత్తుతుంది. సంతకవిటి మండలం రంగరాయపురం, కేఆర్ పురం గ్రామలు జలమయమైయ్యాయి. నది ఉగ్రరూపం ఉండడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ప్రస్తుతం నది ప్రవాహం తగ్గడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు. రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఆర్టీసీ బస్సు బోల్తా:16మందికి గాయాలు

విశాఖ: పోర్ట్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసి బస్సు బోల్తా పడి 16 మందికి గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

డిగ్రీ కాలేజీ లెక్చరర్ల రాత పరీక్ష పై హైకోర్టు స్టే

హైదరాబాద్: డిగ్రీ కాలేజీ లెక్చరర్ల రాత పరీక్ష పై హైకోర్టు స్టే ఇచ్చింది. లెక్చరర్ల పోస్టుల్లో 50 0పోస్టులు మహిళలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అడ్వకేట్ బూర రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 30న జరగనున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్ల రాత పరీక్ష జరగనుంది.

కొనసాగుతున్న అల్పపీడనం...

విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు.అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

12:50 - July 17, 2017

హైదరాబాద్ :  నిజాంపేటలోని అమృతసాయి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న నాగరాజు, విజయకుమారిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె పూర్ణిమ సాయి ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది. గత నెల 7వ తేదీన స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన పూర్ణిమ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 15 బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు షిర్డీ, పుణె తదితర ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో ఈనెల 13న కిడ్నాప్‌ కేసుగా మార్చారు.

మారుపేరుతో ఉంటున్నట్లు
ఈ నేపథ్యంలోని పూర్ణిమ సాయి ముంబైలోని దాదర్ సమీపంలోని ఓ ఆశ్రమంలో మారుపేరుతో ఉంటున్నట్లు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందింది. సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పూర్ణిమ ముంబై వెళ్లి దాదర్‌లోని ఓ సినిమా స్టూడియో దగ్గర తిరుగుతుండగా అక్కడి పోలీసులు డొంగరి బాల్ సుధార్ ఆశ్రమంలో చేర్పించినట్లు తెలుస్తోంది. వారికి తాను ఒక అనాథనని.. తనపేరు అనికాశ్రీ అని చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ తుకారంగేట్‌లోని సాయిశ్రీ అనాధాశ్రమం నుంచి వచ్చానని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పూర్ణిమ ఫోటోలను దాదర్‌లోని బోయవాడ పోలీసులు ముంబైలోని గోడలకు అంటించారు. ఈ విషయం హైదరాబాద్‌ పోలీసులకు తెలియడంతో పూర్ణిమ ఆచూకీ తెలిసింది. మరోవైపు 40 రోజులుగా పూర్ణిమ ఆచూకీ దొరక్క కుమిలిపోతున్న తల్లిదండ్రులు ఆమె ముంబైలో ఉన్నట్లు తెలియడంతో సంతోషంలో మునిగిపోయారు. ఆదివారం పూర్ణిమ పుట్టినరోజు కావడం.. అదే రోజు ఆమె క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

12:49 - July 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ మధుసూదనా చారి ఓటు వేశారు.  

12:48 - July 17, 2017

గుంటూరు : ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తొలి ఓటు వేశారు. ఆ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

12:47 - July 17, 2017

ఢిల్లీ : పార్లమెంట్ వర్షకాల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇటివలే మరణించిన మాజీ సభ్యులకు ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఉభయసభలు తీవ్రంగా ఖండించాయి. అమర్‌నాథ్ యాత్రికుల మృతుల పట్ల సంతాపం ప్రకటించాయి ఉభయసభలు. లోక్‌సభ సభ్యులు వినోద్ ఖన్నా, అనిల్ మాధవ్ దవే సహా పలువురు సభ్యుల మృతిపట్ల ఎంపీలు సంతాపం తెలిపారు. రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సి నారాయణరెడ్డి, దాసరి నారాయణరావు మృతిపట్ల రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

12:45 - July 17, 2017

శ్రీకాకుళం : శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చుతోంది. కొమురాడ వద్ద వరద బాధిత ప్రాంతాల్లో శ్రీకాకుళం కలెక్టర్‌, ఎస్పీ పర్యటించారు. లోతట్టుప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. 2 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలు, 2 ఎస్పీఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జలమయమయ్యే అవకాశం ఉండటంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:20 - July 17, 2017

పశ్చిమగోదావరి : ఏలూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్ రావిపాటి అన్నపూర్ణయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏలూరులో మూడు ప్రాంతాల్లో తణుకు, హైదరాబాద్ లలో రెండు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. రూ.1.50కోట్లు ఆస్తులు, 40 కాసుల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నపూర్ణయ్య బంధువుల ఇళ్లలోనూ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

ఆగస్టు 15న జన్ కో విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటాం:పి.మధు

నెల్లూరు : కృష్ణపట్నం పోర్టుతో ముత్తుకూరు, చిల్లకూరు, తోలపల్లిగూడూరు మంలాల ప్రజలు ఇబ్బంది పడతున్నారని సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. జెన్ కో పవర్ ప్రాజెక్ట్ కాలుష్యంతో నేలటూరు నాశనమవుతోందని, నేలటూరులో కాలుష్య వ్యతిరేక పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాలని మధు డిమాండ్ చేశారు. కాలుష్యం పై కలెక్టర్ తో పాటు మంత్రులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 15న జన్ కో విద్యుత్ ఉత్పత్తిని అడ్డుకుంటామని మధు హెచ్చరించారు.

రామ్ నాథ్ కు ఓటేయమనడానికి నోరెలా వచ్చింది:డీకే అరుణ

హైదరాబాద్: రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వేయాయలని డీకే అరుణను ఉద్దేశించి మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. దీనిపై స్పందించిన అరుణ తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మీరాకుమార్ కు కాకుండా ఎన్టీఏ అభ్యర్థికి ఓటేయాలని అడగటానికి నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.

అన్ని విధాలుగా ఆదుకున్నాకే గ్రామాలను ఖాళీ చేయించాలి:తమ్మినేని

వనపర్తి : ముంపు బాధితలను అన్ని విధాలుగా ఆదుకున్నాకే గ్రామాలను ఖాళీ చేయించాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తమ్మినేని హెచ్చరించారు.

బైలాంపూర్ వద్ద కోదండరామ్ అరెస్ట్

సిద్ధిపేట : కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో ప్రొ.కోదండరామ్ పర్యటిస్తున్నారు. బైలాంపూర్ వద్ద కోదండరామ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

కాల్పులకు తెగబడ్డ పాక్ : బాలిక మృతి

జమ్మూకశ్మీర్ : రాజౌరి, పూంచ్ సెక్టార్ లో పాక్ కాల్పులకు తెగబడింది. ఫూంచ్ సెక్టార్ కాల్పులో ఓ బాలిక మృతి చెందింది. రాజౌరిలో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి.

11:50 - July 17, 2017

హైదరాబాద్: పంచె కట్టుకుని కామెడీ పండించే జబర్థస్ ఫేమ హైపర్ ఆది వివరణ ఇచ్చుకున్నాడు. రహస్యంగా ప్రేమ పెళ్లి చేస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసింది. ఈ అంశం పై స్పందించిన ఆది ‘ఆట కదరా శివ’ అనే సినిమా చేస్తున్నానని, ఆ ఫొటో అందులోని ఓ సన్నివేశానికి సంబంధించినదని చెప్పాడు. షూటింగ్‌లో ఫొటో తీసి ఎవరో కావాలనే సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారని ఆది వివరణ ఇచ్చాడు. తాను నిజంగా పెళ్లి చేసుకోలేదని చెబుతూ.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నానని, మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తాను తప్పకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని ఆది స్పష్టం చేశాడు.

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ఎన్నికల బరిలో రామ్ నాధ్ కోవింద్, మీరాకుమార్ పోటీ పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

11:35 - July 17, 2017

సూర్యాపేట : ఏపీ మంత్రి నారాయణ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా కోదాడ మునగాళ్ల సమీపంలో ప్రమాదం జరిగింది. గన్ మెన్ లు ప్రయాణిస్తున్న కారు నాలుగుపల్టీలు కొట్టి డివైడర్ ను ఢీకొట్టింది. ఇద్దరు గన్ మెన్ లతో పాటు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. మరింత సమాచాంర కోసం వీడియో చూడండి.

మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం

సూర్యాపేట: మంత్రి ఆదినారాయణ రెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. కోదాడ సమీపంలో మంత్రి కాన్వాయ్ లో ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు డన్ మెన్లు, ఓ డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే లోక్ సభ సభ్యులుగా ఫరూక్ అబ్ధుల్లా, కున్హాలి కుట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అనిల్ దవే, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, లోక్ సభ ఎంపి వినోద్ ఖన్నామృతికి ఉభయ సభలు సంతాపం తెలియజేశాయి. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.

11:25 - July 17, 2017

హైదరాబాద్: ‘స్వామిరారా’తో కెరీర్ టర్నింగ్ తీసుకుని ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ లాంటి సినిమాలతో నిఖిల్ 'కార్తికేయ' తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిఖిల్ హీరోగా అనిల్ సుంకర నిర్మించనున్న న్యూ మూవీకి ముగ్గురు డైరెక్టర్లు పనిచేయడం విశేషం. శరణ్ కొప్పిశెట్టి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీకి నిఖిల్ కెరీర్‌కి టర్న్ ఇచ్చిన సుధీర్ వర్మ స్ర్కీన్‌ప్లే అందిస్తుంటే.. ‘కార్తికేయ’తో మరో సక్సెస్ ఇచ్చిన చందూ మొండేటి మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం రీసెంట్ రిలీజ్ ‘కేశవ’ కూడా సాదాసీదా సినిమా అయినప్పటికీ ప్రొడ్యూసర్‌కి ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. దాంతో నిఖిల్‌తో సినిమా తీస్తే లాస్ వచ్చే భయం లేకపోవడంతో అతనితో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు.

11:24 - July 17, 2017

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటు వేశారు. ఇటు తెలంగాణలో సీఎం చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కువినియోగించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అనీల్ దవే, పాల్వాయి, వినోధ్ ఖన్నాకు ఉభయ సభలు సంతాపం

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుండి ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. లోక్ సభ సభ్యులుగా ఫరూక్ అబ్ధుల్లా, కున్హాలి కుట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి అనిల్ దవే, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి, లోక్ సభ ఎంపి వినోద్ ఖన్నామృతికి ఉభయ సభలు సంతాపం తెలియజేశాయి.

11:12 - July 17, 2017

హైదరాబాద్: గజరాజు ఆనందంగా నీటిలోకి వచ్చి... తొండంతో పాటు కాళ్లతో నీటిని కొడుతూ ఈదింది. కొన్ని స్టంట్స్‌ కూడా చేసింది. అమెరికాలోని ఆరిజోనా జూ వారు ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. వాళ్ల జూలో ఉండే సముద్ర అనే ఏనుగు స్విమ్మింగ్‌ చేస్తున్న వీడియో అది. జంతుప్రదర్శనశాలలో ఓ జంతు ప్రేమికుడు వాటర్‌ మెలన్‌ను విసిరేశాడు. వెంటనే ఏనుగు అందుకుని తిన్నది. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే దాదాపు 14 లక్షల 98 వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు.

11:04 - July 17, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

సంయుక్తంగా ఎదుగుదాం అనేది జీఎస్టీకి మరో పేరు: మోదీ

ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలకు అన్ని పార్టీ సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వర్షాల తర్వాత వచ్చే మట్టి సుగంధం లాంటి ఫలితాలిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంయుక్తంగా ఎదుగుదాం అనేది జీఎస్టీకి మరో పేరు అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జీఎస్టీ స్ఫూర్తితో విజయంవంతంగా సాగుతాయని భావిస్తున్నానని తెలిపారు.

10:49 - July 17, 2017

కరీంనగర్ : జిల్లాలోని గంగాధర క్రాస్ రోడ్‌ వద్ద బైక్ ఢీకొట్టిన ఘటనలో ఏడేళ్ల బాలుడు అక్షయ్ స్పాట్‌లోనే చనిపోయాడు. తడగొండ గ్రామానికి చెందిన లత అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గంగాధర మండలం వేదిర గ్రామానికి బయలుదేరింది. బస్ ఎక్కేందుకు ఇద్దరు పిల్లలతో గంగాధర క్రాస్ రోడ్ దాటే క్రమంలో అతి వేగంతో వచ్చిన బులెట్ అక్షయ్‌ని ఢీ కొట్టింది. దాంతో అక్షయ్ 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయాడు. కన్నబిడ్డ కళ్లెదుటే చనిపోవడంతో అక్షయ్ తల్లి కన్నీరు మున్నీరు కావడం అందరిని కలిచివేసింది. 

10:33 - July 17, 2017

విజయనగరం : జిల్లాలో నాగావలి నది శాంతించింది. తోటపల్లి జలాశయానికి వరద ఉద్ధృతి తగ్గింది. ప్రాజెక్టులో నీటిమట్టం 103 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో12,500, ఔట్ ఫ్లో 10,00 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ఎనిమిది గేట్లలో నాలుగు మూసివేశారు. నిన్న ఉద్ధృతంగా ప్రవహించిన నదితో కూనేరు వద్ద రహదారిపై భారీగా వండ్రుమట్టి పేరుకుపోయింది. 

ఏలూరు ఎస్సీ హాస్టల్ వర్డెన్ ఇంటి పై ఏసీబీ సోదాలు..

ప.గో: ఏలూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వర్డెన్ రావిపాటి అన్నపూర్ణయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏలూరులోని మూడు ప్రాంతాలు, తణుకు, హైదరాబాద్, అన్నపూర్ణయ్య బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

10:25 - July 17, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

ఓటు వేసిన సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల

అమరావతి: అసెంబ్లీ కమిటీ హాల్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

10:20 - July 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికలు అసెంబ్లీలో ప్రారంభమైయ్యాయి. మొదటి ఓటుగా సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత స్పీకర్ మధుసుధనచారి, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తొలి ఓటు వేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. సీఎం కేసీఆర్ తొలి ఓటు వేయగా, స్పీకర్ రెండో వేటు, సీఎల్పీ నేత జానా రెడ్డి మూడో ఓటు వేశారు.

చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా ఎంఆర్ భాస్కర్

హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా ఎంఆర్ భాస్కర్ ను జైళ్ల శాఖ నియమించింది. ప్రస్తుతం నిజాబామాబాద్ సూపరింటెండెంట్ గా భాస్కర్ విధులు నిర్వహిస్తున్నారు.

నాగావళికి తగ్గిన వరద ఉధృతి

విజయనగరం : నాగావళికి వరద ఉధృతి తగ్గింది. ఇన్ ప్లో 12,500, ఓట్ ఫ్లో 10వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 103.3 అడుగులుగా ఉంది.

తాలిపేరు ప్రాజెక్టు ఏడు గేట్ల ఎత్తివేత

భద్రాద్రి కొత్తగూడెం: తాలిపేరు ప్రాజెక్టు ఏడు గేట్ల ఎత్తివేశారు. 5500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గుండాల ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. దీంతో మల్లన్న, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

10:07 - July 17, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమైయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు పేపర్ ను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఓటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు గాని, కెమెరాలు గాని తీసుకెళ్లకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

తూ.గో : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 10.1 గోదావరి నీటి మట్టం చేరింది. 34 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. పార్లమెంట్ హౌస్ అసెంబ్లీల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటింగ్ లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పాల్గొననున్నారు.

క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ పార్టీ ఆశలు

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. 15 మంది టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు విపక్షాలు బలపరిచిన అభ్యర్థి మీరాకుమార్ కు ఓటేస్తారని కాంగ్రెప్ విప్ సంపత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అసెంబ్లీకి బయలు దేరిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలపై టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించానున్నారు. ప్రత్యేక బస్సుల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. టీఆర్‌ఎస్‌ తరపున పోలింగ్‌ ఏజెంట్లుగా కొప్పుల ఈశ్వర్‌, గంప గోవర్దన్‌‌ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ నుంచి అసెంబ్లీకి వెళ్లేవరకు సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు, మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది.

09:51 - July 17, 2017

గుంటూరు : రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్ర నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. అటు వైసీపీ గెస్ట్ హౌస్ వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

09:43 - July 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. వారు తెలంగాణ భవన్ నుంచి రెండు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పపడే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:32 - July 17, 2017

హైదరాబాద్ : కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగునున్నాయి. ఈ సందర్భాంలో కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ వారు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ప్రవేశపెట్టడంలో మీరా కుమారి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

09:31 - July 17, 2017

గుంటూరు : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ అవరణలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేల అల్పహారం వింద్ ఇచ్చి అనంతరం నేరుగా పోలింగ్ బూత్ వెళ్లనున్నారు. 

కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నికలు

ఢిల్లీ : దేశ అత్యున్నతపదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు.

అసెంబ్లీ చేరుకుంటున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : కాసపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలు పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో బస్సులో వచ్చే అవకాశం ఉంది.

09:19 - July 17, 2017

హైదరాబాద్ : కాసపట్లో ప్రారంభం కానున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలు పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో బస్సులో వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్

హైదరాబాద్ : తెలంగాణ భవన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ అనంతరం అసెంబ్లీ చేరుకోనున్నారు.

 

 

 

09:07 - July 17, 2017

ఢిల్లీ : దేశ అత్యున్నతపదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు పేపర్ ను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. ఓటు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు గాని, కెమెరాలు గాని తీసుకెళ్లకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:02 - July 17, 2017

గుంటూరు : ఉద్దానం కిడ్నీ సమస్యలపై చర్చించేందుకు ఇవాళ విజయవాడ రావాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందం ఉద్దానం సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించనుంది. ఈ సమావేశంలో పాలుపంచుకోవాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రితో పవన్‌ భేటీ అయితే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై జనసేన తరఫున పరిశీలించిన అంశాలను పవన్‌ వివరించనున్నారు. ఆ ప్రాంతంలో డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు, మందుల పంపిణీ తదితర అంశాలపై నిర్మాణాత్మక సూచనల్ని అందించనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్ ఇవాళ సమావేశానికి హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. 

09:00 - July 17, 2017

ఢిల్లీ : దేశ అత్యున్నతపదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్, విపక్ష అభ్యర్థి మీరా కుమార్‌లు పోటీపడుతున్నారు. పార్లమెంట్‌ హౌస్‌లో ఒక పోలింగ్‌ కేంద్రాన్ని, రాష్ట్ర అసెంబ్లీల్లో ఒక్కో కేంద్రాన్నీ కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలను పర్యవేక్షించడానికి ఎన్నికల సంఘం 33 మంది పరిశీలకులను నియమించింది. పార్లమెంట్‌ హౌస్‌లో ఇద్దరిని, అసెంబ్లీల్లో ఒక్కొక్కరిని నియమించారు. దామాషా ప్రాతినిధ్యం విధానంలో రహస్య బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగుతుంది. అనంతరం వివిధ రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఢిల్లీకి తరలించి ఈ నెల 20న కౌంటింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటు వేస్తారు. తొలి ప్రాధాన్యాన్ని తప్పక ఇవ్వాలి. తొలి ప్రాధాన్యం ఇవ్వని ఓటును గుర్తించరు. లెక్కింపు అనంతరం 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:47 - July 17, 2017

గుంటూరు : ఏపీలోని అమరావతిలో కూడా రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో టీడీపీ, వైసీపీ ఇతర పార్టీల సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:44 - July 17, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోననున్నారు. అసెంబ్లీ సెక్రటరీ సదానంద మాట్లాడుతూ ఎవరు కూడా పెన్నులు తీసుకెళ్లందని, పోలింగ్ బూత్ లోనే పెన్నులు ఇస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

నేడు బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటి కానుంది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

నేడు టీఆర్ఎస్  

నేడే రాష్ట్రపతి ఎన్నికలు

ఢిల్లీ : నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దేశావ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో, దేశ పార్లమెంట్ లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. 

08:33 - July 17, 2017

వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతి ఇవ్వడంమనేది ఆహ్వానించదగ్గ విషయమని, కాని తెలుగు రాష్ట్రాలకు ఆయన లేకుండా ఉంటే ఇబ్బందే అని, ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదా అవసరమని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. ఉపరాష్ట్రపతి పేరుకు వెంకయ్య నాయుడని చేయడమనేది తెలుగు రాష్ట్రలకు గర్వకారణంగా ఉంటుందని, అయితే ఆయన కేంద్రంలో ఉండడం తెలుగు రాష్ట్రలకు ముఖ్యమని, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఫల్యం చెందిందని సామాజిక విశ్లేషకులు భైర దీలిప్ అన్నారు. వెంకయ్య నాయుడు చాలా సీనియర్ నాయుకుడు, తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కు అని, వెంకయ్య కేంద్రంలో ఉండడం తెలుగురాష్ట్రాలకు ఉపయోగం ఏమి లేదని, ఉపరాష్ట్రపతిగా ఉన్నవారు అందరు రాష్ట్రపతి కాలేరని, కానీ వెంకయ్య నాయుడు తనకు ఇష్టం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పారని విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. డ్రగ్స్ కేసుల ఎంతవారు ఉన్న వదలద్దని ముఖ్యమంత్రి చెప్పారని టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు.మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

08:15 - July 17, 2017

ఆర్సీఈపీ ఈ నాలుగు పదాలే ఇప్పుడు భారతదేశ వ్యవసాయ రంగాన్ని, పాడిపరిశ్రమను, మందుల పరిశ్రమను, తయారీ రంగాన్ని కలవరపెడుతున్నాయని, స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో భారతదేశాన్ని పెను సంక్షోభంలోకి ఈడ్చుకెళ్లే ప్రాతిపాదనలను ఆర్సీఈపి సిద్ధం చేస్తోందని, రీజినల్ కంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ లేదా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం పేరుతో 16 దేశాల ప్రతినిధులు చర్చలు జరపబోతున్నారని, ఆర్సీఈపీ ఒప్పందంతో ఔషదలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆర్సీఈపి ప్రతిఘటనా వేదిక కన్వీనర్ , వ్యవసాయ శాస్త్రవేత్త అరిబండి ప్రసాదరావుగారు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:09 - July 17, 2017

హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో నైరుతీ రుతువనాలు చురుగ్గా కదలుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రంలో పడుతున్న వర్షాలు మరింత విస్తృతంకానున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 18,19 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈనెల 20 నాటికి ఒడిశాలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరింత విస్తృతమై ఈనెల 19 వరకు కొనసాగుతాయి.శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 20 సెంమీటర్ల అతి భారీ వర్షాలకు కురిసే చాన్స్‌ ఉంది. వాయుగుండం తీరం దాటినా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయి. గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

ఒడిశాలో భారీ వర్షాలు
మరోవైపు ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి పోటెత్తుతోంది. దీంతో విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని కూనేరు, కొమరాడ, గురుగుబిల్లి మండలాల్లో వరద ముంపులో చిక్కుకున్నాయి. తెరవళి వంతెన కూలిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒడిశాలోని కళ్యాణ్‌సింగ్‌పూర్‌ గ్రామం నీటి మునిగింది.

పోటెత్తిన నాగావళి నది
నాగావళి నది పోటెత్తడంతో విజయనగరం జిల్లాలోని తోటపల్లి జలాశయం పూర్తిగా నిండిపోయింది. రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్మకపాడు నుంచి 12 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తోటపల్లి బ్యారేజ్‌లోని అన్ని గేట్లను పైకిఎత్తి 21,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. వరదముంపు, భారీ వర్షాల సమాచారం కోసం పార్వతీపురం ఐటీడీఏ కార్యాయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. కొమరాడ మండలం ఇందిరానగర్‌కు చెందిన అంకాలపు సీతారాయుడు పుశువులను తోలుకుని వెళ్లి నాగవళి నది మధ్యలో చిక్కుకుపోయాడు. ప్రాణాలు అరచేతపెట్టుకు బిక్కుబిక్కుమంటున్న సీతారాయుడును కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నాగవళి నది పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

08:08 - July 17, 2017

విజయవాడ : జులై 11... రాత్రి 9గంటల సమయం.. బెజవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు సమీపానికి కూతవేటు దూరంలోనే దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. మారణాయుధాలతో ప్రజలను, నగల వ్యాపారులను హడలెత్తించి భారీ మొత్తంలో నగలు దోచుకుపోయారు. అయితే నగర పరిధిలో దోపిడీ దొంగల స్వైర విహారం వెనుక ఉన్న మూలాలు ఛేదించడం ఖాకీలకు సవాల్‌గా మారింది. ఈ భారీ దొంగతనం ఫ్రీ ప్లాన్డ్‌ స్కెచ్చేనని పోలీసులు తెలపడం..నిఘా వ్యవస్తలోని లోపాల్ని బయటపడేలా చేశాయి. సుమారు పది మందికి పైగా దొంగలు ఈ భారీ చోరికి పాల్పడ్డారు. ఈ దొంగతనం చేసేముందు వారు సిసి కెమెరాలకు చిక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చోరీ చేసిన వెంటనే దొంగలు మాస్క్‌ లేకుండానే ఉడాయించిన విజువల్స్ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయినప్పటికీ నిందితుల వివరాలు పూర్తిగా లభ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే సిసి కెమెరాల పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిసి ఫుటేజి కేసుల పరిష్కరం
సుమారు పది నెలల నుండి సిసి ఫుటేజి దృష్యాల ఆధారంగానే బెజవాడ పోలీసులు కేసులను పరిష్కరిస్తున్నారు. కేసుల పురోగతిలో సిసి కెమెరాలు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అలాగే ఎక్కడా సాక్ష్యాలు దొరక్క సవాల్‌గా మారిన కేసులను సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగానే పోలీసులు ఛేదించారు. కాని భారీ దోపిడి జరిగిన రోజు మాత్రం నగర పరిధిలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న సిసి కెమెరాలు పని చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. బంగారం తయారీ కేంద్రంలో ఉన్న 8 సిసి కెమెరాలు కూడా రెండు నెలలుగా పనిచేయడంలేదని పోలీస్‌కమీషనర్‌ తెలిపారు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న సిసి కెమెరాలు ఏమాత్రం పనిచేసినా కేసులో పురోగతి చాలా సులభంగా లభించి ఉండేదని పలువురు చర్చిస్తున్నారు. టెక్నాలజీ పరంగా కేసును పరిష్కరించాలనుకున్న పోలీసులకు నిందుతులు దొరకడం సవాల్‌గా మారింది. నిందితుల కోసం ప్రత్యేక టీంలు రాష్ట్రాల్లో వేట ప్రారంభించాయి. ఇప్పటికే ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. దీంతో డీజీపీ సాంబశివరావు రంగంలోకి దిగారు. త్వరితగతిన కేసును పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ దొంగలను పట్టుకుంటామని విజయవాడ సిపి గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. అయితే ఈ దొంగతనం జరిగిన తీరు చూస్తే ఘటనకు ముందే దొంగలు సిసి కెమెరాలను పసిగట్టారని, అవి పనిచేయడంలేదని తెలుసుకున్నాకే రాబరీకి పాల్పడి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలు
ఇప్పటికే నగరంలో 1303 కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటికితోడు అదనంగా మరో 1200 కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వస్త్ర, బంగారు, షాపింగ్‌ మాల్స్‌, భవన సముదాయాల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరుని నిరంతరం తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.మొత్తానికి బెజవాడలో జరిగిన భారీ దోపిడి పట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానం ఉండే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు తెలిపారు.

08:06 - July 17, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అదృశ్యమైన పదో తరగతి బాలిక పూర్ణిమ సాయి ఆచూకీ లభ్యమైంది. ముంబై దాదర్‌ ప్రాంతంలో పూర్ణిమ సాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 7వ తేదీ నుంచి పూర్ణిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. 40 రోజులుగా పూర్ణిమ ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పూర్ణిమ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు బాలికను గుర్తించారు. సోమవారం సాయంత్రానికి పూర్ణిమను హైదరాబాద్‌ తీసుకురానున్నారు. పూర్ణిమ ఆచూకీ లభించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

08:05 - July 17, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు రాష్ట్రంలోనే పెను సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టై పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు కెల్విన్, ఖుద్దూస్, వహీద్‌ల కస్టడీ ఆదివారంతో ముగిసింది. సిట్ అధికారుల రెండు రోజుల విచారణలో కెల్విన్ మరికొంతమంది పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. ఇప్పటి వరకు సినీ ప్రముఖుల పేర్లు మాత్రమే వినిపించినా తాజా విచారణలో పలువురు రాజకీయ ప్రముఖుల పిల్లల పేర్లను కెల్విన్ వెల్లడించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల విచారణలో కెల్విన్‌ను పలు కోణాల్లో ప్రశ్నించారు సిట్ అధికారులు. సినీ ప్రముఖులతో కెల్విన్‌కు అసలు పరిచయం ఎలా జరిగింది? విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై అధికారులు కెల్విన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు స్టేట్మెంట్లను ఈనెల 19 నుంచి 27 వరకూ రికార్డ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. మరోవైపు డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రగతి భవన్‌లో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్ డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదలొద్దన్నారు. అధికారులకు- నాయకులకు పలు బాధ్యతలు అప్పగించారు. డ్రగ్స్, కల్తీ దందాలు నియంత్రించే వరకు విశ్రమించవద్దని అధికారులను సూచించారు.

 

08:03 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో మెడికల్‌ పరికరాల విడిభాగాల తయారీ కేంద్రం మెడ్‌టెక్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాదే శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మొత్తంగా 270.7 ఎకరాల భూమిని సేకరించింది. 196 ఎకరాల్లో 172 మంది రైతులు ఉన్నట్టు, వారు ఎన్నోఏళ్లుగా ఆ భూముల్లో తోటలు సాగు చేసుకుంటున్నట్టు రెవెన్యూ అధికారులు జాబితా రూపొందించారు. ఎకరానికి వీరికి 12 లక్షల చొప్పున.. మొత్తంగా 23.52 కోట్ల పరిహారం రైతులకు ప్రభుత్వం చెల్లించింది. అయితే 196 ఎకరాల్లో కేవలం ఇద్దరి పేరిట మాత్రమే డీ- పట్టాలు ఉన్నాయి. వాస్తవానికి వారికి మాత్రమే పరిహారం అందాలి. కానీ భూసేకరణ సమయంలో ఆ భూమిని గత కొంతకాలంగా ఆక్రమించుకొని సాగుచేసుకుంటున్న వారికీ పరిహారం అందించాలన్న నిబంధన కూడా ప్రభుత్వం చేర్చింది. దీన్నే అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పరిహారం విషయంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారని మంత్రి అయ్యన్న ఆరోపిస్తున్నారు. మొత్తం 170 మంది పేర్లతో అధికారులు జాబితా సిద్దంచేసినట్టు తెలిపారు. వీరంతా భూమిని సాగు చేస్తున్న దానికి నిదర్శనంగా లేని తోటలను సృష్టించారన్నారు. గ్రామంలో తమకు అనుకూలంగా ఉన్న కొన్ని కుటుంబాలను ఎంపిక చేశారని.. ఒక్కో కుటుంబం నుంచి ఆరుగురు మొదలు 43 మంది సభ్యుల పేర్లను జాబితాలో చేర్చినట్టు వివరించారు. ఈ జాబితాలో స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న వారు కూడా ఉన్నారు. 196 ఎకరాల్లో తోటలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 50 ఎకరాల్లో కూడా తోటలు కనిపించవు. మొత్తంగా 172 మంది లబ్దిదారుల్లో 44 మంది పేర్లు బినామీలవేనని మంత్రి అయ్యన్న ఆరోపించారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే అమ్మి అధికారులు సొమ్ము చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై 2015లోనే రెండుసార్లు లేఖ రాసినా స్పందించలేదని, చెల్లింపులు జరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు కోట్ల ప్రభుత్వ ధనాన్ని బినామీల పేరిట స్వాహా చేశారని.. దీనికి సిట్‌ దృష్టికి తీసుకెళ్లానన్నారు.

పరిహారం పంపిణీ
గ్రామ సభ నిర్వహించిన తర్వాతే అర్హులకు పరిహారం పంపిణీ చేశామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అనర్హులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదన్నారు. పరిహారం విషయంలో కొంతమంది కావాలనే వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. మెడ్‌టెక్‌ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు మంత్రికి వివరించామని... అయినా మరోసారి ఆయనను కలుస్తామన్నారు. పరిహారం చెల్లింపులో అధికారులు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి మెడ్‌టెక్‌ భూముల పరిహారం వ్యవహారం మంత్రి, కలెక్టర్‌ మధ్య వివాదానికి తెరలేపింది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాలి

08:01 - July 17, 2017

విశాఖ : విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్‌ భూ అక్రమాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. గోవింద్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన కుటుంబ సభ్యుల పేరుమీద ఏకంగా 48.55 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఆనందపురం మండలం రామవరంలో సర్వే నంబర్‌ 126, 127, 128,130లో 95.89 ఎకరాల భూమిని కాజేసినట్టు ఎమ్మెల్యే గోవింద్‌పై ఆరోపణలు ఉన్నాయి. గోవింద్‌ అండ్‌ కో ఈ 95.89 ఎకరాలను తమ పేర్లమీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దాదాపు 14 మంది పేరిట రాయించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గోవింద్‌తోపాటు ఆయన బంధువుల పేర్లు కూడా ఉన్నాయి.

సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌
ప్రభుత్వ భూములను కాజేయడానికి పీలా గోవింద్‌ అండ్‌ కో... సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అడంగల్‌ రికార్డును ట్యాంపర్‌ చేసినట్టు సిట్‌ గుర్తించింది. ఆ రికార్డులో కొన్నిచోట్ల రెడ్‌ ఇంక్‌తో దిద్దినట్టు తహసీల్దార్‌ నివేదిక సమర్పించారు. సర్వే నంబర్‌ 130 /2లోని 11.45 ఎకరాలకు అప్పటి కాంగ్రెస్‌ నేత ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ దగ్గర ఎమ్మెల్యే ఎన్‌వోసీ తీసుకున్నారు. ఆ భూమి పక్కనే ఉన్న మరో 48.55 ఎకరాల ప్రభుత్వ భూమినీ వదల్లేదు. వాటిపై కన్నేసి రికార్డులను తారుమారు చేసి దర్జాగా ఆక్రమించుకున్నారు. దశాబ్దాలుగా ఆ భూమిద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు... సర్వేనంబర్‌ 130లో 60 ఎకరాలు ఉండగా సెటిల్‌మెంట్‌ ఫెయిర్‌ అండగల్‌ మార్చేసి అందులో 17 సబ్‌ డివిజన్లు సృష్టించారు. వీటిలో కొన్ని భూములను పీలా కుటుంబీకుల పేరుమీదకు 10(1) అండగల్‌లో నమోదు చేశారు.

పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు
ఆనందపురం భూముల కేసు ఆర్‌డీవో కోర్టుకు విచారణకు రావడంతో ఎమ్మెల్యేగారి అక్రమాల బాగోతం బయటపడింది. పీలా గోవింద సత్యనారాయణ అండ్‌ కో స్వాధీనంలో ఉన్న భూముల్లో 48.55 ఎకరాలు ప్రభుత్వ భూములని తేల్చారు. వాటికి జారీ అయిన పాస్‌ పుస్తకాలను, టైటిల్‌ డీడ్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగిలిన 47.34 ఎకరాల భూమికి సంబంధించి అటు జమీందార్ల కుటుంబంగానీ, ఇటు పాకలపాటి, పీలా కుటుంబంగానీ సరైన రికార్డులు చూపించకపోవడంతో వాటికి సంబంధించిన హక్కులు ఎవ్వరికీ లేకుండా రద్దు చేసింది. ఈ వివాదం కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. తక్షణమే పీలా కుటుంబీకుల స్వాధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని ఆనంతపురం తహసీల్దార్‌ను ఆదేశించారు. తనపై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలపై ఎమ్మెల్యే పీలా గోవింద్ ఎట్టకేలకు స్పందించారు. తనపై కొంతమంది కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సిట్‌ విచారణకైనా తాను సిద్దమేనని చెప్పారు.పీలా గోవింద్‌ అక్రమాల డొంక కదిలించేందుకు సిట్‌ సిద్ధమవుతోంది. మరి సిట్‌ ఏం తేలుస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.

07:59 - July 17, 2017

గుంటూరు : ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. అమరావతిలో సచివాలయం నిర్మించినా, పార్టీల కోసం ప్రత్యేక భవనం లేదు. దీంతో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించాలంటూ ఏదో ఒక ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు తొలగనున్నాయి. టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబును కలవాల్సి వస్తే అమరావతిలోని సచివాలయానికి వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సరైన వసతులు లేవు. పైగా ఇది అమరావతికి 35 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు టీడీపీ ఆఫీసులు పార్టీ కార్యక్రమాలను అనువుగా లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక షెల్టర్...
టీడీపీ కార్యాలయం కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో స్థలం కేటాయించారు. కొత్త ఆఫీసు ఇప్పట్లో సిద్ధమయ్యే అవకాశాలు లేవు. దీంతో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద భారీ షెడ్‌ నిర్మిస్తున్నారు. చంద్రబాబు సందర్శకులను కలుసుకోవడంతోపాటు టీడీపీ సమావేశాలకు వినియోగించుకునేందుకు వీలుగా దీనిని సిద్ధం చేస్తున్నారు. వీలైంత త్వరగా దీనిని పూర్తి చేయాలని తెలుదేశం అధినాయకత్వం నిర్ణయించింది. చంద్రబాబు సచివాలయం నుంచి రాగానే పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నారు. ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌రావుకు షెడ్‌ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.

త్వరలో వైసీపీ కూడా 
మరో వైపు ప్రతిపక్ష వైసీపీ కూడా త్వరలో అమరావతి నుంచి కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. పార్టీ అధినేత జగన్‌ అమరావతి నుంచి రాజకీయ వ్యూహ రచన చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండు నుంచి అమరావతికి మకాం మార్చేందుకు తాడేపల్లిలో నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోబోతోంది. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న టీడీపీ, వైసీపీ అమరావతి కేంద్రంగా రాజకీయాలను వేడెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

07:58 - July 17, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని రంగంలోకి దింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే స్వయంగా వెంకయ్య దగ్గర పెట్టినట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువరించనున్నారు. దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడమే వెంకయ్యవైపు మొగ్గుచూపడానికి కారణమైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఈ పోటీకి అంత సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలలన్నదే తన ధ్యేయమని అమిత్‌షా దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది.

07:57 - July 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు టీఆర్‌ఎస్‌ అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పార్టీ శాసనసభ్యులతో సమావేశం నిర్వహించి ఓటు హక్కు వినియోగించడంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించింది. పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు మొదటి సారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఓటును సక్రమంగా వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. శాసనసభ్యులతో నమూనా పోలింగ్ ను కూడా నిర్వహించింది. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పార్టీ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. అసెంబ్లీలోని ఒకటవ నంబర్‌ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు.

కేసీఆర్‌ ఆగ్రహం.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీకి మంత్రి లక్ష్మారెడ్డి తో పాటు కొంత మంది శాసనసభ్యులు హాజరు కాకపోవడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశానికి గైర్హాజరు కావడంపై అసహనాన్ని వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకుండా డుమ్మా కొట్టడాన్ని తప్పుపట్టారు. నేటి ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అయితే..... TRS పార్టీ శాసనసభ్యులంతా ఒకే సారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తెలంగాణా భవన్ లో ఉదయం 8 గంటలకు సమావేశం కానున్నారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి చేరుకుంటారు.మొత్తం 90 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

07:55 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నిక కోసం దేశవ్యాప్తంగా 32 పోలింగ్‌ ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పార్లమెంటు హౌస్‌లో ఒకటి, అన్ని రాష్ట్రాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్‌ను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ 33 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. పోలింగ్‌ పూర్తైన తర్వాత బ్యాటెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూముల్లో ఉంచి, ఓట్ల లెక్కించేందుకు ఈనెల 20 ఢిల్లీకి తరలిస్తారు. రాష్ట్రపతి ఎన్నికకు ఈసారి ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చారు.

ఓటింగ్ కు ప్రత్యేక పెన్నులు
ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వెంట పెన్నులు తీసుకురావద్దని ఎన్నికల కమిషన్‌ సూచించింది. ఓటు వేసేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన మార్క్‌ను అందిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటింగ్‌ గదిలోకి వచ్చే ముందు వీరి వద్ద ఉన్న పెన్నులు పోలింగ్‌ సిబ్బంది తీసుకుంటారు. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లే ముందు తిరిగి ఇస్తారు. బ్యాలెట్‌ పత్రాలపై గుర్తు పెట్టేందుకు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ సంస్థ తయారు చేసిన ప్రత్యేక పెన్ను ఇస్తారు. మొదటిసారి పోలింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనల పోస్టర్లు అంటించారు. ఎంపీలకు ఆకుపచ్చ రంగులో ఉండే బ్యాలెట్‌ పత్రాలు ఇస్తారు. ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలు అందిస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్‌ అధికారి పని సులభమయ్యే విధంగా వేర్వేరు రంగుల్లో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఎంపీలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

Don't Miss