Activities calendar

18 July 2017

21:47 - July 18, 2017

తూర్పు గోదావరి : గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణను ఎత్తేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకోవడం లేదని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు వివర్శించారు. తమకు ఓట్లు  వేయలేదన్న కారణంగానే దళితులపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆరోపించారు. ఈనెలాఖరుకల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ ఎత్తివేసి.. పర్చూరులో దళితుల  భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహాభారత ఉత్సవాలను కలెక్టర్‌ పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈనెల 31న దళితులతో కలిసి చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.. ~

 

21:44 - July 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా 350 నుంచి 400 క్యూసెక్కుల నీటిని హుస్సేన్‌ సాగర్‌ నుంచి దిగువకు వదులుతున్నారు. బేగంపేటలో అత్యధికంగా 47 మిల్లీమీటర్లు , రాజేంద్రనగర్‌లో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
జాగ్రత్తలు..
గ్రేటర్‌ పరిధిలోని చెరువులకు గండ్లుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాలకు యాదాద్రి భువనగిరిజిల్లాలో మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని పోచంపల్లి, బీబీనగర్‌, మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
ఎడతెరిపి లేకుండా..        
రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్‌లోకి వరదప్రవాహం  కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 18.4 టీఎంసీలుగా ఉంది.  జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1813 క్యూసెక్కులు కాగా 392 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.  
నిలిచిన విద్యుత్‌ సరఫరా..
భారీవర్షాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. కొత్తగూడెం ప్రధానరహదారిపై భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో 23వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి 17 అడుగులకు చేరుకోగా.. ఇటు ఖమ్మంజిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీవర్షాలకు ఈదురు గాలులుకూడా తోడవడంతో భారీగా వృక్షాలు విరిడిపడుతున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి  గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. 
విస్తారంగా..
అటు కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, దహేగాం, పెంచికల్‌ పేట మండలాల్లో భారీగా వానలు దంచికొడుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదికి వరదనీరు పోటెత్తుతోంది.  ఆసిఫాబాద్‌ తిర్యాణి, కెరమెరి మండలాల్లోనూ  వానలు జోరుగా కురుస్తున్నాయి.  బంగాళాఖాతంలో వాయుగుండం కారంణంగా మరో 3రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. జోరువానలతో కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో ప్రత్తిపంట వరదనీటిలోకొట్టుకుపోయి నష్టాలపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

21:39 - July 18, 2017

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదభయం వెంటాడుతోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని విశాఖ వాతారణ కేంద్రం తెలిపింది.
48 గంటల్లో..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున  సముద్రం కల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.  
అప్రమత్తం..
వాయుగుండం ప్రభావంతో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగావళి, వంశధార, కళ్యాణి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీనికి తోడు ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదనీరు పోటెత్తుతోంది.  పలు లోతట్టు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి.  బూర్ణ, సంతకవిటి మండలాల్లో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. గొట్టా బ్యారేజ్‌ 22 గేట్లను ఎత్తేసిన అధికారులు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయనగరం, పార్వతీపురం ఆర్డీవో కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికపుడు గమనిస్తున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ తెలిపారు. 
ఇదే అత్యధికం..
అటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. ధవళేశ్వరం ప్రాజెక్టులోకి  భారీగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎగువనున్న కుంట, కోయిదా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 11.10 అడుగుల నీటి మట్టం నమోదయ్యిందని అధికారులు చెప్పారు. 143 గేట్లను ఎత్తి సముద్రంలోకి 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 900, మధ్య డెల్టాకు 1200, పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల వంతున వరద నీటిని విడుదల చేస్తున్నారు. 
నానా ఇబ్బందులు..
విజయవాడలో ఎడతెరిపి లేని వానలకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో డ్రైనేజివ్యవస్థ అస్థవ్యస్థంగా మారడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. గంరెద్దుల దిబ్బ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడతాయేమోననే భయం నెలకొంది. వర్షాలతో ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాల్లో సీపీఎం నేతలు పర్యటించారు.  వాయుగుండం ఈరాత్రికి గోపాల్‌పూర్‌ -పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా  ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో 3రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 

21:34 - July 18, 2017

న్యూ ఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. దళితులపై దాడి అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన మాయావతి అన్నంత పనీ చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతికి పంపారు. విపక్షాల గందరగోళం నడుమ ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్‌లోని ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. 
టైం ఇవ్వకపోతే రాజీనామా..?
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. రాజ్యసభలో ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌పూర్‌లో దళితులపై దాడి అంశాన్ని బిఎస్‌పి అధినేత్రి మాయావతి  లేవనెత్తారు.  షహరాన్‌పూర్‌ దాడికి కేంద్రం పథకం రచించిందని ఆరోపించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఆమె మాట్లాడుతుండగా సభాపతి అడ్డుపడటంతో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. 

గుండారాజ్.. జంగల్ రాజ్..
షహరాన్‌పూర్‌ అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా మాయావతి సభ నుంచి వాకౌట్‌ చేశారు. యూపీలో ఇప్పటికీ గూండారాజ్‌, జంగల్‌రాజ్‌ కొనసాగుతోందని ఆమె ఆరోపించారు. యూపీలో ఓటమితో మాయావతి కోలుకోలేకపోయారని...రాజీనామా చేస్తానని హెచ్చరించడం ద్వారా ఛైర్మన్‌ను అవమానపరచారని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. మాయావతి క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో ఏ సమస్యకైనా చర్చకు అనుమతిస్తామని చెప్పి ఇపుడు అడ్డుకోవడం ఎంతవరకు సబబని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రశ్నించారు.

దళిత, మైనారిటీలపై పెరుగుతున్న దాడులు..
దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రైతులకు మద్దతు ధర కల్పించలేకపోయారని ఏచూరి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. వీటిపై విపక్షాలు చర్చకు పట్టుపట్టడంతో లోక్‌స‌భ‌లోనూ దుమారం రేగింది. దీంతో సభ వాయిదా పడింది.
 

21:29 - July 18, 2017

హైదరబాద్ :  డ్రగ్స్ కేసులో సిట్ బృందం యాక్షన్ ఆరంభం అయింది. కార్పోరేట్ స్కూళ్లలో స్టూడెంట్స్ మత్తుపై కౌన్సిలింగ్ మొదలుపెట్టారు. ఇక కొన్ని గంటల్లో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో టాలివుడ్‌లోని నోటీసులు అందుకున్న నటుల విచారణ మొదలు కానుంది. ఇంతవరకు సమాచార సేకరణతో పక్కాగా నోటీసులు ఇచ్చిన సిట్ యాక్షన్ స్టార్ట్‌ చేసింది.
పూరీతో మొదలు.. 
డ్రగ్స్ కేసులో యాక్షన్ మొదలు కాబోతుంది. మరికొన్ని గంటల్లో నోటీసులు అందుకున్న సినీతారల విచారణ ప్రారంభం కానుంది. సిట్ ముందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రానున్నారు. ఆగస్ట్ 2 వరకు జరిగే ఈ విచారణలో ముమైత్‌ఖాన్‌ మినహా అందరు హాజరవుతారని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సబర్వాల్ తెలిపారు. ముమైత్‌ ఖాన్‌కు ఇంకా విచారణ తేదీ నిర్ణయించలేదన్నారు. ప్రస్తుతం ముమైత్ ఖాన్.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటోంది. దీంతోనే ఆమెకు రిలాక్సేషన్ ఇచ్చిన సిట్ అదికారులు మిగతావారికి ఫిక్స్ చేసిన డేట్స్ ప్రకారం హాజరు కానున్నారని చెబుతున్నారు.
ఆందోళన..
ఇక టాలివుడ్‌లో మరికొంత మంది ఉన్నట్లు వస్తున్న వార్తలను సిట్ అధికారులు సున్నితంగా కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికే కలకలం రేపగా కాస్త గ్యాప్ తీసుకోవాలనే ధోరణిలో కన్పిస్తుంది. దీంతోనే  ఈ వ్యవహారంలో కొత్తగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదని అకున్ సబర్వాల్ చెబుతున్నారు. దీన్ని బట్టి ప్రస్తుతం నోటీసులు జారీ చేసినవారి విచారణ పూర్తయ్యాక రెండో జాబితా ఇచ్చే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఇక నోటీసులు అందుకుని రేపటి నుంచి వరుసగా సిట్‌ ముందు హాజరు కానున్న నటీనటుల్లో ఆందోళన పెరిగింది. సిట్ ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది.. వారికి సమాధానాలు ఎలా చెప్పాలి..? ఎక్కడైనా పొరపాటు జరిగితే జరిగే పరిణామం ఏంటి.?? ఎన్నో సందేహాలతో ఉన్న నటులు వారికి తెలిసిన న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది....
స్టూడెంట్స్‌కు కౌన్సిలింగ్...
మరోవైపు మత్తు మందులకు అలవాటైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఆబ్కారీ శాఖ కార్యాలయంలో 22 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ , డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు, కేసుల నమోదుపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు. విజయ్ కుమార్ , అకున్ సబర్వాల్ లు నేరుగా కౌన్సిలింగ్ ఇచ్చారు...డ్రగ్స్‌ వల్ల పరిణామాలతో పాటు కేసులయితే భవిష్యత్తులో ఎలా ఉంటుందని వారికి వివరించారు. ఇటీవల డ్రగ్స్ వ్యవహారంలో కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తెలియడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.

21:20 - July 18, 2017

అమరావతి : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్టుషాపుల మూసివేతకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అక్రమంగా మద్యం విక్రయిస్తే అవసరమైతే పీడీ యాక్టుకింద కేసులు పెట్టాలని నిర్ణయించారు. అలాగే రోడ్లపై మద్యం తాగితే కేసులు పెట్టాలని నిర్ణయించారు. అక్రమ ఇసుక రవాణాపై కేబినెట్‌లో సుధీర్ఘంగా చర్చించారు. ప్రతి జిల్లాలో నలుగురితో కమిటీ వేయాలని నిర్ణయించారు. ఇందులో కలెక్టర్‌, ఎస్పీతో పాటు మరో ఇద్దరితో కమిటీ వేయాలని తీర్మానించారు. ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేసి కేసులు పెట్టాలని మంత్రివర్గం ఆదేశించింది. ఉద్దానం తరహా కిడ్నీ బాధితులకు నెలకు రూ.2,500 చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీ స్టేట్‌ వాటర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు  కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

48 గంటల్లో అతి భారీ వర్షాలు..

విశాఖ : బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. జాలర్లు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

20:59 - July 18, 2017
20:57 - July 18, 2017
20:55 - July 18, 2017

ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు... చదువు సంధ్యల్లో ముందుంటారు.. కానీ, ఆహ్లాదంగా, ఆనందంగా కనిపించే ఆ కళ్ల వెనుక ఏవో అసంతృప్తులు.. ఆ చిన్న మెదళ్లపై ఏవో వత్తిళ్లు.. అనవసరమైన అనేక ప్రలోభాలు.. ఫలితం అనేక అనూహ్య పరిణామాలు.. మరి ఆ చిట్టిబుర్రలను తొలిచేసేదేమిటి? ఆకర్షించేదేమిటి? పూర్ణిమ ఒక్క అమ్మాయి కాదు.. అలాంటి అనేకమంది పూర్ణిమలు ఇప్పుడు మన సమాజంలో కనిపిస్తున్నారు.. వారి సమస్యలేమిటి? వాటికి కారణాలేమిటి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. 

సోషల్ మీడియా ఓ రేంజ్ లో ఆక్యుపై చేస్తోంది. డ్రాయింగ్ రూమ్ నుంచి, బెడ్ రూమ్ ని చేరుతోంది. మరోపక్క జీవితానికి సరికొత్త లక్ష్యాలు నిర్దేశించే గ్లోబల్ పరిణామాలు జీవితగమనాన్ని అమాంతం మార్చేస్తున్నాయి. ఈ షిఫ్ట్ ను పెద్దలే తట్టుకోలేని  సమయంలో చిన్నారులెలా తట్టుకోగలరు? మరి ఆ ఒత్తిడినుంచి బయటపడేదెలా?  మరిన్ని అంశాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోపై క్లిక్ చేసి నేటి వైడాంగిల్ స్టోరీ చూడండి..

20:51 - July 18, 2017

మొత్తం మీద తెల్గు మన్షి వెంకయ్యనాయుడు సారు పువ్వుగుర్తుతోని సోపతి కట్ జేస్కున్నడు.. చిన్నప్పటి సంది కాషాయం అంటె కండ్లకు అద్దుకోని తిర్గిండు.. అసొంటి మన్షి.. ఏక్ దం రాత్రికి రాత్రి జర్గిన ముచ్చటతోని పార్టీకి రాజీనామా జేశి.. ఆశయంతోని రాజీపడుడంటె చిన్నముచ్చటగాదుగదా..? మరి దీని కథ ఏందో సూడుండ్రి..

తెలంగాణ ముఖ్యమంత్రి కొడ్కు.. రామారావు.. కాంగ్రెస్ పార్టీ పెద్దచెయ్యి ఉత్తంకుమార్ రెడ్డి ఇద్దరు ఇయ్యర మయ్యర తిట్టుకుంటున్నరుగదా..? బంగారు తెలంగాణ గావాల్నంటే కాంగ్రెసును బొందవెట్టాలే అని కేటీ రామారావు అంటుంటే.. నువ్వు బచ్చెగానివి నీ అయ్యను మాట్లాడుమను సమాధానం జెప్తమని ఉత్తంరెడ్డి ఉడ్కు మాటలే అంటున్నడు.. జర్ర వాళ్ల పంచాది జూద్దాం..

 తెలంగాణ ఉద్యమం అయ్యెటప్పుడు ఎన్ని లారీలు తల్గవడ్డయ్.. ఎన్ని ఆర్టీసీ బస్సులు ఆత్మహుతి జేస్కున్నయ్.. ఇవ్వన్ని అయితెనేగదా..? శ్రీ కల్వకుంట్ల తారక రామారావుగారు మంత్రి అయ్యింది.. మరి అదే మంత్రి ఇలాకాల.. జనం ఒక ఉశ్కెలారీని తల్గవెట్టిండ్రని.. ఓ పోరగాళ్లను ఎట్ల గొట్టిపిచ్చిండో సూడుండ్రి... ఉశ్కెలారీలు జనాన్ని సంపినా పర్వాలేదుగని.. జనం ఉశ్కెలారీని సంపోద్దనేది వాళ్ల ముచ్చట గావొచ్చు..

 గురు శిష్యుల బంధం అంటె ఎట్లుండాలే.. ఒక తండ్రి బిడ్డెల బంధం కంటె గొప్పగుండాలే.. అంత పవిత్రమైన బంధాన్ని బర్బాత్ జేశిండు ఒక టీచర్ గాడు.. పోరగాళ్లకు సద్వు జెప్పురా అని సర్కారు వాన్ని బడికి తోలిస్తె.. ఆడివోరగాళ్లను లోపటేమేస్కున్నవ్.. అది ఏ రంగులున్నది..? అని బూతుమాటలు మాట్లాడుతున్నరట.. ఇగ ఊకుంటరా..? ఎన్నిరోజులు సూస్తరు చెప్పుండ్రి.. ఈ సంగతులతో పాటు మరిన్ని మల్లన్న ముచ్చట్లు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి.. 

20:39 - July 18, 2017

కడప : మన దేశంలో తల్లి, తండ్రి, గురువును దైవంతో సమానంగా చూస్తాం. ముఖ్యంగా తల్లిదండ్రుల తరువాత ఆ స్థానాన్ని, అంతటి గౌరవాన్ని గురువుకు ఇస్తాము. అంతటి పవిత్రమైన స్థానంలో ఉన్న ఓ గురువు వెర్రి వేషాలు వేశాడు. పసి పిల్లలకు తప్పుడు పాఠాలు చెప్పాడు. కడప జిల్లాలో అసభ్య టీచర్‌ భాగోతంపై 10 టీవీ కథనం. 
బూతులు జొప్పిస్తూ..
ఇదిగో ఈ ప్రబుద్ధుడిని చూడండి. ఇతని పేరు శ్యామ్సన్‌ ముఖర్జీ. చేసే పని పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి.  కడప మెయిన్‌ హైస్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్. శ్యామ్సన్‌, విద్యార్థులకు మంచిని నేర్పాల్సింది పోయి.. తను చెప్పే పాఠాల్లో బూతులను జొప్పిస్తున్నాడు. తెలిసీ తెలియని చిన్న పిల్లలతో కారు కూతలు కూస్తూ.. తన వృత్తికి కళంకాన్ని ఆపాదిస్తున్నాడు. 
హోం వర్క్ కూడా.. 
పాఠశాలలో విద్యార్థినులే కాదు సహ ఉపాధ్యాయినులు కూడా ఈ బూతులరాయుడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆ బూతు మాటలు వినడానికే జుగప్సాకరంగా ఉంటాయి. ఈయన పాఠాలతో పాటు హోమ్‌ వర్క్‌ కూడా బూతులే రాసుకొని రమ్మని చెబుతుంటాడు. అవి ఎలాంటివంటే.. బాధిత విద్యార్థినుల మాటలు వింటే విస్తుపోవాల్సిందే. 
మా కొద్దీ టీచర్...
ఈ సెక్స్‌ టీచర్‌ ఆగడాలను భరించలేని విద్యార్థినులు.. వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదులు తీసుకుంటున్న జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు ముందు గోడు విన్నవించుకున్నారు. ఈ టీచర్‌ తమకొద్దని చిన్నారులు వేడుకుంటున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు వెళ్లి దుర్మార్గపు టీచర్‌పై.. చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైస్కూల్‌ ఎదుట విద్యార్థినులతో కలిసి ధర్నా నిర్వహించారు. 
కుట్ర : శ్యామ్సన్
ఇదిలా ఉంటే శ్యామ్సన్‌ ముఖర్జీ మాత్రం.. తాను చాలా మంచోడినని చెబుతున్నాడు. తాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకున్నానని తనంటే గిట్టని వారు ఎవరో చేస్తున్న కుట్రగా ఆయన చెప్పుకొచ్చాడు. ఏదేమైనా పిల్లలను తప్పుదారి పట్టించాలని చూసిన ఈ టీచన్‌ భాగోతాన్ని.. విద్యార్థినులు ధైర్యంగా వెలుగులోకి తీసుకొచ్చారు. 

20:34 - July 18, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ పై సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టాలని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా తీవ్రమవ్వడంతో చిన్నారుల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు వాటికి బానిసలుగా తయారవుతున్నారని వారు మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్స్ సరఫరాకు రెక్కలొచ్చాయని విచ్చలవిడితనం పెరిగిపోయిందని అందుకు ప్రభుత్వం పూర్తి భాద్యత వహించాల్సిందేనని వక్తలు అభిప్రాయపడ్డారు. మరింత సమాచారానికి వీడియో చూడండి.. 

20:32 - July 18, 2017

 ప్రకాశం :  జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటుకు నిరసనగా మహిళలు కనిగిరి ఎక్సైజ్‌ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. కనిగిరి మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు పాలూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో తాళ్లూరు, గడిపడు, ఎనిమరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరై మద్యం షాపులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ సీఐ వెంకటరావుకు వినతి పత్రం అందించారు. షాపులను తొలగించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.

20:29 - July 18, 2017

హైదరాబాద్ : కేటీఆర్‌ రాజీవ్‌ గాంధీతో పోల్చుకోవడం హాస్యాస్పదమమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. దేశ సమగ్రత కోసం ప్రాణాలిచ్చిన చరిత్ర ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకే చెందుతుందన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచడంలో రాజీవ్‌ గాంధీ ప్రాణాలనే త్యాగం చేశాడని అన్నారు. కేసీఆర్‌ ఫ్యామిలీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుందని జీవన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

20:25 - July 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ఊరట లభించింది. చిన్నారులు మోసే స్కూల్‌ బ్యాగ్‌ల బరువుపై తెలంగాణ సర్కార్‌ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక నుంచి క్లాస్‌కు తగ్గ పుస్తకాలనే తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకూ బ్యాగ్‌ల బరువులపై పరిమితిని విధించింది. 1, 2 తరగతులకు పుస్తకాల బ్యాగ్‌ కిలోన్నర బరువు ఉండాలని నిర్ణయించింది. అలాగే 3 నుంచి 5 తరగతులకు రెండు కిలోల నుంచి 3 కిలోలు.. 6,7 తరగతులకు 4 కిలోలు.. 8, 9 క్లాసులకు నాలుగున్నర కిలోలు.. పదో తరగతి వారు కేవలం 5 కిలోలు బరువు గల బ్యాగ్‌లు ఉండాలని నిర్దేశించింది. ఈ మార్గదర్శకాలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు కానున్నాయి. 

20:23 - July 18, 2017

న్యూ ఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభలో ఉత్తర్‌ప్రదేశ్‌లో దళిత వర్గాలపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని మాయావతి కోరారు. అయితే, డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌.. సమయం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను ఇప్పుడు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చరించి సభ నుంచి వాకౌట్‌ చేశారు. అన్నట్టుగానే మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యస‌భ ఛైర్మన్‌ హ‌మీద్ అన్సారీకి ఆమె త‌న రాజీనామా లేఖ‌ను పంపారు.

17:39 - July 18, 2017

హైదరాబాద్: పదోతరగతి బాలిక పూర్ణిమ సాయి ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? సినిమాలపై మక్కువా..? లేక ఆ బాలిక చెబుతున్నట్లు దేవుడు కలలో కనిపించి ఆమెను ఆదేశించాడా? ముంబైలో ఉన్న చిన్నారి... తల్లిదండ్రులను కలిసేందుకు ఎందుకు ఇష్టపడలేదు. ? ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు.? పూర్ణిమ.. తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటుందా.? లేక జువనైల్‌ హోంలో ఉంచుతారా? ఇదే అంశం '10టివి'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సామాజిక కార్యకర్త దేవి, సైకాలజిస్టు వీరేంద్ర పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

17:36 - July 18, 2017

విజయవాడ : వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన నలుగురు మంత్రులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపులతో మంత్రి పదవులు అనుభవించడం చట్ట విరుద్ధమని... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో నలుగురు మంత్రులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది.

17:34 - July 18, 2017

చిత్తూరు : మదనపల్లెలో గుప్తునిధుల గ్యాంగ్‌ కలకలం సృష్టించింది. పొలంలో వజ్రాలు దొరికాయని.. దుండగులు... వృద్ధ దంపతులను కిడ్నాప్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి... దంపతులను రక్షించారు. ఈ ఘటనలో నిందితులన నుంచి 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగులోని మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

17:33 - July 18, 2017

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రేపటి నుంచి సినీతారల విచారణ ప్రారంభం కానుంది. రేపు సిట్ ముందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రానున్నారు. ఆగస్ట్ 2 వరకు జరిగే ఈ విచారణలో... ముమైత్‌ఖాన్‌ మినహా అందరు హాజరవుతారని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్‌ సబర్వాల్ తెలిపారు. ముమైత్‌ ఖాన్‌కు ఇంకా విచారణ తేదీ నిర్ణయించలేదన్నారు. ప్రస్తుతం ముమైత్ ఖాన్.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటోంది. మరోవైపు ఈ వ్యవహారంలో కొత్తగా ఎవరికి నోటీసులు ఇవ్వలేదని అకున్ సబర్వాల్ తెలిపారు.

17:30 - July 18, 2017

హైదరాబాద్: అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి వస్తోంది. ఆమెకు ఒక బ్యారెక్‌లోని మూడు- నాలుగు సెల్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక సెల్‌ కిచెన్‌గా, రెండో సెల్‌లో దుస్తులు, కొన్ని ప్రత్యేక పరికరాలు ఉంచుకోవడానికి కప్‌బోర్డులు కూడా ఉన్నాయి. ఇక మరో సెల్‌లో విజిటర్స్‌ను కలవడానికి కుర్చీలు, బెంచీలు ఉన్నట్లు సమాచారం. మరోసెల్‌లో శశికళ నిద్రించేవారని తెలుస్తోంది. సెల్స్‌ ఉన్న బ్యారెక్‌లోకి ఎవరినీ పంపించేవారు కాదని సెల్స్‌కు తెర కూడా ఉండేదని దీని వల్ల లోపల ఉన్నవారు ఏమి చేస్తున్నారో బయటికి తెలిసేది కాదని జైలు అధికారుల్లో ఒకరు చెప్పారు. మరోవైపు సమాచారం లీకేజీ చేస్తున్నారనే అనుమానంతో జైలులో ఉన్న దాదాపు 40 మంది ఖైదీలను వేర్వేరు జైళ్లకు పంపిచేశారు. శశికళ రాజభోగాలపై కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప స్వయంగా వివరాలను బయట పెట్టారు. జైలు ఉన్నతాధికారులకు శశికళ భారీగా ముడుపులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. నివేదిక తీసుకున్న ప్రభుత్వ పెద్దలు డీఐజీ రూపపై బదిలీ వేటు వేశారు. మరోవైపు జైల్లో నేరస్థులను సిద్ధరామయ్య ప్రభుత్వం కాపాడుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శశికళ జైలులో స్వేచ్ఛగా తిరుగుతున్న విజువల్స్‌ 10 టీవీకి ఎక్స్‌క్లూజివ్‌గా దొరికాయి.

17:28 - July 18, 2017

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోది రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని ప్రధాని హామి ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించడానికి కేంద్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఏచూరి చెప్పారు. రైతుల సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

17:27 - July 18, 2017

ఢిల్లీ: పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, రైతులకు పెన్షన్‌ విధానం అమలు చేయాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు భారీ ధర్నా చేపట్టారు. అఖిల భారత రైతుపోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా అన్నదాతలు తరలివచ్చారు. రైతుల న్యాయమైన డిమాండ్లకు సీపీఎం, సీపీఐ, జేడీయూ, ఆప్‌ సహా ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలిపాయి.

మాయావతి రాజీనామా

ఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మంగళవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభలో ఆమె ఈ మేరకు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సహారాన్‌పూర్‌లో దళితులపై జరిగిన దాడి గురించి మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మైనారిటీలకు వ్యతిరేకంగా ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాయావతి ఆరోపించారు.

టీఎస్ లో స్కూల్ బ్యాగ్ లోడ్ తగ్గిస్తూ మార్గదర్శకాలు

హైదరాబాద్: స్కూల్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ ఊరట కలిగింది. స్కూల్ బ్యాగ్ లోడ్ తగ్గిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒకటి, రెండు తరగతులకు బ్యాంకు బరువు 1.5 కిలోలు, 3 నుండి 5 తరగతులకు బ్యాగ్ బరువు 2 నుండి 3 కిలోలు, 6,7 తరగతులకు బ్యాగ్ బరువు 4 కిలోలు, 8,9 తరగతులకు బ్యాగ్ బరువు 4.5 కిలోలు, 10వ తరగతికి 5 కిలోలు బ్యాగ్ బరువు వుండాలని తెలిపింది.

జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా

ఢిల్లీ: అఖిల భారత రైతు పోరాట సమితి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. రైతు సమస్యలు పరిష్కరించాని డిమాండ్ చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీతారాం ఏచూరి, శరద్ యాదవ్, మేధాపాట్కర్, ఎండీ సలీం, తపన్ సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ...రేపు పార్లమెంట్ లో రైతు సమస్యలు లేవనెత్తుతామన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చకు రావడం లేదని ఏచూరి ఆరోపించారు.

డీజీపిని కలిసిన టి.కాంగ్రెస్ నేతలు...

హైదరాబాద్: టి. కాంగ్రెస్ నేతలు డీజీపీ కలిశారు. తమ కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. డీజీపిని కలిసిన వారిలోఉత్తమ్, పొన్నాల, భట్టి విక్రమార్క, బలరాం నాయక్ ఉన్నారు.

ఏసీబీ వలకు చిక్కిన వీఆర్ వో

తూర్పుగోదావరి: అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. తొండంగి మండలం ఏవీ నగరం వీఆర్‌వో తమ్మయ్యదొర రూ. 30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. కాకినాడ సెజ్‌ నిర్వాసిత రైతు నుంచి లంచం ఇవ్వాలని వీఆర్‌వో డిమాండ్‌ చేశాడు. వీఆర్వోను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేశారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 360 పాయింట్లు కోల్పోయి 31,715 దగ్గర సెన్సెక్స్, 89 పాయింట్లు కోల్పోయి 9,827 దగ్గర నిఫ్టీ ముగిసింది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా జెడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 381 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.

15:36 - July 18, 2017

విజయనగరం : జిల్లా ఎస్‌.కోటలోని ఉద్రిక్తత నెలకొంది. ధార గంగమ్మ దేవస్థానం స్థలంలో ఆక్రమణలను అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులను అడ్డుకున్న బాధితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:34 - July 18, 2017

హైదరాబాద్ : భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. ఇటు ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

యాదాద్రి భువనగిరిలో..
భారీవర్షాలతో యాదాద్రి భువనగిరిజిల్లాలో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతంలోని పోచంపల్లి, బీబీనగర్‌, మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంగారెడ్డిలో..
రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్‌లోకి వరదప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 18.4 టీఎంసీలుగా ఉంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 18.13క్యూసెక్కులు కాగా... 392 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.

15:32 - July 18, 2017
15:23 - July 18, 2017

రంగారెడ్డి : శంషాబాద్ మండలంలోని దర్మాస్ కుంట వద్ద విషాదం చోటు చేసుకుంది. కుంటలోకి దిగిన ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దర్మాస్ కుంట వద్దకు సూరత్ తో పాటు నలుగురు విద్యార్థులు వెళ్లారు. కుంటలోకి దిగిన సూరత్ గల్లంతయ్యాడు. వెంటనే అతను నీట మునిగిపోయాడు. అక్కడున్న ఇతర విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు. కానీ విషయాన్ని మాత్రం పెద్దలకు చెప్పలేదు. ఇంటికి చేరుకోకపోవడంతో సూరత్ తల్లిదండ్రులు తోటి విద్యార్థులను నిలదీయడంతో విషయం చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కుంటలో గాలింపు చేపట్టారు. మూడు గంటల అనంతరం సూరత్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీనితో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

15:21 - July 18, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను ఆబ్కారీ శాఖ పోలీసులు పట్టుకోవడంతో విస్తుగొలిపే విషయాలు బయటకొచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు..స్కూళ్లు..కాలేజీలకు సంబంధించిన విద్యార్థిని..విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలియడంతో కలకలం రేగింది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విచారణలో వేగవంతం చేయాలని..ఎవరినీ వదలొద్దని సీఎం కేసీఆర్ సూచిండచంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తు ముమ్మరం చేపట్టారు.

విద్యార్థులకు కౌన్సెలింగ్..
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో స్కూళ్లు...కాలేజీలు ఉండడంతో అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎక్సైజ్ అధికారులు విజయ్ కుమార్..అకూన్ సబర్వాల్ పలు చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఎక్సైజ్ అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 22 మంది స్టూడెంట్స్ కు ఎక్సైజ్ ఆఫీసులో నిర్వహిస్తున్న ఈ కౌన్సెలింగ్ రెండు గంటలకు పైగా కొనసాగుతోంది. శాఖ ఉన్నతాధికారులు విజయ్ కుమార్, అకున్ సబర్వాల్ లు స్వయంగా ఈ కౌన్సెలింగ్ చేస్తున్నారు.

'చెరువులు తెగిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం'

హైదరాబాద్: నగర పరిధిలో చెరువులు తెగిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని లేక్స్ సెక్షన్ ఇంజనీర్ శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న 10 చెరువుల వద్ద ఇసుక సంచులను సిద్ధంగా ఉంచామన్నారు. చెరువులకు గండిపడితే వెంటనే మూసివేయడానికి సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు.

15:18 - July 18, 2017

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి మండిప‌డ్డారు. వైసీప్లీ ప్లీనరీలో ప్రకటించిన నవ పథకాలతో సీఎం బాబు నవనాడులు చిట్లిపోయాయంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. హైద‌రాబాద్‌లోని వైసీపీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడిన రోజా.. 2014 జూన్‌లోనే రాష్ట్రంలో బెల్టు షాపులు తొలగిస్తామని చంద్రబాబు సంత‌కం పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నేళ్లయినా బెల్ట్‌ షాపులను అరిక‌ట్టలేకపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబుని ఫాద‌ర్ ఆఫ్ బెల్ట్ షాప్ అని అంతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో మ‌హిళ‌లు పోరాటం చేస్తున్నందుకు ఇప్పుడు నెల‌రోజుల్లో బెల్టు షాపుల‌ను అరిక‌డ‌తామ‌ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్లీనరీతోనే బాబు ప్రభుత్వంలో కదలికలొచ్చాయన్నారు.

జీఎస్టీ అమలు పై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: టీఎస్ లో జీఎస్టీ అమలు పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 15 రోజుల్లో జీఎస్టీ పరిధిలోకి 90శాతం మంది వ్యాట్ ఖాతాదారులు వచ్చారు. టీఎస్ లో 2.16 లక్షల మంది ట్రేడర్లు వ్యాట్ పరిధిలో ఉండరన్నారు. 1.92 లక్షల మంది జీఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

విజయవాడ, మచిలీపట్నంలో కంట్రోల్ రూం లు..

కృష్ణా : భారీ వర్షాలతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. విజయవాడ కంట్రోల్ రూం నెం 0866-2474804, మచిలీపట్నం కంట్రోల్ రూం 08672-2525762 నెంబర్లు కేటాయించారు.

15:12 - July 18, 2017

విజయవాడ : రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకూడదన్నదే విపక్షాల దురుద్దేశమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని.. అయితే ప్రాజెక్టు పూర్తిచేసేందుకు సమయం పడుతుందన్నారు. అందుకే పట్టిసీమ ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలన్నారు. ఇంకా బుచ్చయ్య ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభం

హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యింది. 22 మంది విద్యార్థులకు ఈ రోజు కౌన్సిలింగ్ ఇచ్చారు. షార్ట్ ఫిల్మ్, డ్రగ్స ఎఫెక్స్ట్, కేసుల నమోదు పై అవగాహనకు 2 గంటల పాటు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ ఎక్సైజ్ శాఖ అధికారులు విజయ్ కుమార్, అకున్ సబర్వాల్ పాల్గొన్నారు.

15:08 - July 18, 2017

అనంతపురం : జిల్లాలో ఓ కీచక టీచర్‌ భాగోతం వెలుగులోకి వచ్చింది. హిందూపురం నగరం మోడల్‌ కాలనీలోని.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మల్లికార్జున అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. విద్యార్థినిల పట్ల ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

కేసీఆర్ ది మోసాల కుటుంబం : షబ్భీర్ అలీ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ది మోసాల కుటుంబం అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఇంకా కాంగ్రెస్ పై నిందలు వేయడం అవివేక అని పేర్కొన్నారు. 

15:04 - July 18, 2017

హైదరాబాద్‌ : 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. హుస్సేన్‌ సాగర్‌ నిండు కుండను తలపిస్తోంది. ఇంకా వర్షాలు కురుస్తుండటంతో.. 350 నుంచి 400 క్యూసెక్కుల నీటిని హుస్సేన్‌ సాగర్‌ నుంచి బయటకు వదులుతున్నారు. దీనిపై మరిన్ని మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

14:58 - July 18, 2017

విశాఖపట్టణం : పశ్చిమ బెంగాల్‌, ఒడిశాను ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. బలంగా గాలులు వీచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమగోదావరి, ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక వర్ష పాతం నమోదైంది. కేకే లైన్ వద్ద రైల్వే ట్రాక్ పై వర్షపు నీరు వెళుతుండడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన రాకపోకలు

యాదాద్రి: గట్టుగూడెం వంతెన పై నుండి మూసీ నది ప్రవహిస్తోంది. భువనగిరి-పోచంపల్లి మధ్య నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి.

జీహెచ్ ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్ రూం. నెంబర్ 100 లేదా 21111111

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి నగరం అతలాకుతలమవుతుంది. వానలపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు సమీక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూం. నెంబర్ 100 లేదా 21111111ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. నగర వాసులు తమ కాలనీల్లో వర్షాల వల్ల తలెత్తిన సమస్యలను పై నెంబర్ల ద్వారా జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేవచ్చు. 590 మంది సిబ్బందితో 140 మొబైల్, మినీ మొబైల్ టీమ్స్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒక సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్ ను అందుబాటులో ఉంచింది.

స్లాబ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు: మంత్రి నారాయణ

అమరావతి: సచివాలయంలో వాటర్ లీకేజీ అయిన మంత్రుల చాంబర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్లాబ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని తెలిపారు. లాబీల్లో ఏర్పాటు చేసిన డక్ షీట్ బయటికి రావడం వల్ల అందులోనుంచి వాటర్ లోపలికి వెళ్లిందని తెలిపారు. మనం కట్టుకునే ఇళ్లలో చిన్న చిన్న లోపాలుంటాయని వాటిని భూతద్ధంలో చూడొద్దని విజ్ఞప్తి చేశారు.

 

కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం ప్రత్యేకంగా ఓ జెండాను కలిగి ఉండే అంశాన్ని కర్ణాటక ప్రభుత్వం పరిశీలించేందుకు కమిటీ వేసింది. ప్రత్యేక జెండా సాధ్యాసాధ్యాలను ఆ కమిటి పరిశీలించనుంది. 

మదనపల్లెలో గుప్త నిధుల గ్యాంగ్ కలకలం

చిత్తూరు : మదనపల్లెలో గుప్త నిధుల గ్యాంగ్ కలకలం రేగింది. పొలంలో వజ్రాలు దొరికాయని వృద్ధ దంపతులను దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ గ్యాంగ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.

13:59 - July 18, 2017

ప్రభాస్..’బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుతో పాటు భారీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఈసినిమాలో కండలతో భారీకాయంతో..’ప్రభాస్' నటించాడు. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ తో పాటు లేడీస్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది.
ప్రస్తుతం 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన విశేషాలు మాత్రం బయటకు రావడం లేదు. హీరోయిన్..విలన్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా న్యూ యంగ్ లుక్ లో కనిపిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లుక్ 'సాహో' చిత్రంలోనేదా ? లేక మాములుదేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఫొటోలో 'ప్రభాస్' కిందుకు చూస్తూ ఒకింత సిగ్గు పడుతూ చిరు నవ్వు చిందిస్తూ ఉన్న ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఆరెంజ్‌ కలర్‌ రౌండ్‌నెక్‌ టీ షర్ట్‌ ధరించి.. దానిపై మెడ చుట్టూ చెక్‌ షర్ట్‌ వేసుకొని ఉన్న ఈ ఫొటో ఇప్పటికే అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది.

కేరళలో డెంగ్యూ విజృంభణ

హైదరాబాద్: కేరళలో డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తోంది. 3 వారాల్లో 21 మంది మృతి చెందారు. దీంతో కేరళ సర్కార్ వైద్యసిబ్బంది సెలవులను రద్దు చేసి, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచుతోంది. స్కూల్లు, దేవాలయాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది.

13:48 - July 18, 2017

భారతదేశంలో డయబెటిక్ రోగుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇటివలి కాలంలో చిన్నపెద్ద తేడాలేకుండా అందరికి డయబెటిక్ వస్తుంది. అసలు డయబెటిక్ రావడానికి కారణాలు ఏమిటి..?ఇది వంశపరపర్యంగా వచ్చే అవకాశం ఉందా.?దీన్ని పూర్తిగా నివరించవచ్ఛా..? డయబెటిక్ గురించి మాట్లాడానికి మనతో డయబెటిక్ ఎడ్యుకేటర్ వసుధరాణి, నేచరోపతి వైద్య నిపుణులు సాగర్ ఉన్నారు. ఎక్కువ శాతం డయబెటిక్ ఆహారపు అవాట్ల వల్ల వస్తుందని సాగర్ అన్నారు. డయబెటిక్ వ్యాధి కాదని సుధరాణి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

తాలిపేరు ప్రాజెక్టు కు భారీగా వరద నీరు..

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 15 గేట్లు ఎత్తి.. 51 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విడుదలైన నీరు గోదావరిలోకి వెళ్తుంది. భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది.

 

13:39 - July 18, 2017

కొత్తగూడెం : జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. నగరంలోని లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అటు కొత్తగూడెం ప్రధానరహదారిపై భారీగా వర్షం నీరు చేరడంతో.. వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు చేరడంతో .. 23వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

13:38 - July 18, 2017

తూర్పు గోదావరి : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎగువనున్న కుంట, కోయిదా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో కాటన్‌ బ్యారేజీ నుంచి సముద్రంలోకి.. సుమారు 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు. గతేడాది ఇదే సమయానికి 3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ధవళేశ్వరం వద్ద 10.10 అడుగులు, భద్రాచలం వద్ద 16.50 అడుగుల నీటి మట్టం నమోదయ్యిందని అధికారులు చెప్పారు. ధవళేశ్వరం, మద్దూరు, ర్యాలీ, విజ్ఞేశ్వరం, ఆర్మూర్‌లో 175 గేట్లకు.. 143 గేట్లను ఎత్తేశారు. సముద్రంలోకి 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 900, మధ్య డెల్టాకు 1200, పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల వంతున వరద నీటిని విడుదల చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:37 - July 18, 2017

ఆసిఫాబాద్ : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, దహేగాం, పెంచికల్‌ పేట మండలాల్లో భారీగా వానలు పడుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న పెనుగంగా నదికి వరదనీరు పోటెత్తుతోంది. అటు ఆసిఫాబాద్‌ తిర్యాణి, కెరామెరి మండలాల్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:36 - July 18, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్‌ దాఖలు చేసినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా.. కేంద్రమంత్రిగా...రాష్ట్రంలోను, కేంద్రంలోను, పార్టీలోను పలు కీలక పదవులు నిర్వహించానని ఆయన చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజాసేవలో చురుకైన పాత్ర నిర్వహించిన తాను -ఇకపై కొత్త పాత్ర నిర్వహించబోతున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని... రాజ్యాంగ వ్యవస్థను కాపాడేందుకు శాయశక్తులా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ప్రధాని మోది, బిజెపి చీఫ్ అమిత్‌షా, ఎన్డీయే పక్షాలు...తనకు మద్దతు ప్రకటించిన టిఆర్‌ఎస్‌, వైసిపి, ఎఐఎడిఎంకె పార్టీలకు వెంకయ్యనాయుడు కృతజ్ఞతలు తెలియ జేశారు. 

13:35 - July 18, 2017

ఢిల్లీ : దళితులపై దాడుల అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్‌ చర్చకు నిరాకరించినా..ప్రతిపక్షాలు వెనక్కితగ్గకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 

13:34 - July 18, 2017

ఢిల్లీ : రైతులు, దళితులు, మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో మోదీ సర్కార్ విఫలమైందని సీతారాం ఏచూరి ఆరోపించారు. దేశంలో దళితులపై వివక్ష, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడుల అంశంపై సభలో చర్చకు అనుతించకపోవడం దారుణమని అన్నారు. 

13:33 - July 18, 2017

ఢిల్లీ : విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. దళితులపై దాడుల అంశాన్ని చర్చించాలన్న నినాదాలతో హోరెత్తింది. విపక్షాలకు ప్రధాని ఇచ్చిన వాగ్దానాలను రాజ్యసభలో అమలు చేయడం లేదని గులాంనబీ ఆజాద్‌ ఆరోపించారు. సమస్య ఏదైనా చర్చకు అనుమితిస్తామని చెప్పి..ఇప్పుడు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

13:32 - July 18, 2017

ఢిల్లీ : రాజ్యసభలో దళితులపై దాడుల అంశంపై మాయావతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సహరాన్‌పూర్‌ అల్లర్లను మాయావతి ప్రస్తావించింది. దళితుల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చకు అనుమతించకపోవడంపై నిరసనగా సభనుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపింది. అంతేకాదు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని హెచ్చరించింది. 

13:19 - July 18, 2017

గుంటూరు : అమరావతిలోని ఏపీ సచివాలయంలో వాటర్ మళ్లీ లీకేజీ అయింది. మెదటి అంతస్థు, గ్రౌండ్ ఫ్లోర్ లో కి వర్షపు నీరు చేరుకుంది. జల వనరుల శాఖ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు పని చేస్తున్న హాల్ లోకి వర్షపు నీరు చేరింది. సచివాలయ ఉద్యోగులు వర్షపు నీటిని బకెట్ తో తోడుతున్నారు. మంత్రులు గంటా, దేవినేని చాంబర్ లోకి నీరు చేరాయి. గతంలోనూ ఓ సారి 4వ బ్లాక్ లోకి వర్షపు నీరు చేరింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

13:18 - July 18, 2017

ఉయ్యూరు పీఎస్ కు ఉండల్లి

విజయవాడ : మాజీ ఎంపి ఉండవల్లి అరెస్ట్ అయ్యారు. పట్టిసీమపై ఎమ్మెల్యే గోరంట్లతో బహిరంగ చర్చకు శనీశ్వరాలయం వద్దకు ఉండవల్లి రావడంతో పోలీసులు అరెస్టు చేసి ఉయ్యూరుకు తరలించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉండవల్లిని గోరంట్ల పిలిచారు.అయితే చర్చా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

డిప్యూటీ కమిషనర్లతో ముగిసిన అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: డిప్యూటీ కమిషనర్లతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. డ్రగ్స్ కేసులో రేపటి నుంచి ఆగస్టు 2 వరకు సినీ ప్రముఖులను సిట్ విచారించనుంది.

13:10 - July 18, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ వేశారు. ఈ కార్యాక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరైయ్యారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు...

హైదరాబాద్ : రాష్ర్టంలో కల్తీలు, డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇటీవలే ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులతో కలిసి సీఎం కేసీఆర్.. కల్తీలు, డ్రగ్స్ వ్యవహారంపై సమీక్ష నిర్వహించిన విషయం విదితమే. కల్తీలు, డ్రగ్స్ వ్యవహారంలో ఎంతటి వారున్న సరే వదలొద్దని సీఎం గట్టి ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కల్తీలు, డ్రగ్స్ ను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళనకు సర్వం సిద్ధం చేసింది.26 మంది అసిస్టెంట్ సెక్రటరీలు, 196 మంది సీఐలు బదిలీ అయ్యారు. ఎక్సైజ్ శాఖలో బదిలీలపై మరికాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

13:04 - July 18, 2017

వానాకాలం..శీతాకాలం..వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ కాలంలో అస్తమా వ్యాధిగ్రస్తులకు ఈ కాలం సరిపడదు. అందుచేత ఈ సీజన్లో సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకంటే బెటర్.

  • నూనెలో వేయించిన అహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆకుకూరల్లో బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. బాదం..అల్లం తీసుకోవాలి. అల్లం టీ తాగడం ద్వారా జలుబు..అసిడిటీని దూరం చేసుకోవచ్చు.
  • కారం..చేదు..పులుపు గల ఆహార పదార్థాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి.
  • రోజు వారి డైట్ లో తృణ ధాన్యాలు తీసుకోవాలి. వేరు శనగలు..తేనెను డైట్ లో చేర్చుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కూరగాయల్లో కేరట్, బీట్‌రూట్ వంటివి తీసుకోవచ్చు.
  • విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. టమాట, బంగాళ దుంప వంటి కూరగాయల్లో, కివీలు, నారింజ‌, ద్రాక్ష, ఉసిరి, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి నిమ్మ‌జాతి ఫ‌లాల‌ను ఎక్కువ‌గా తినాలి. వీటిలో విటమిన్ సి ఉంటుంది.
  • పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త తీసుకోవ‌చ్చు.
  • వెల్లుల్లిలో మినరల్స్‌ బాక్టీరియా, ఫంగస్‌ వంటి ఇన్ ఫెక్షన్ ల పై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

నామినేషన్ దాఖలు చేసిన గోపాలకృష్ణ గాంధీ...

ఢిల్లీ : విపక్షాల ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు గాంధీ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 

తెలంగాణ లో విస్తారంగా వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షంపడుతోంది. బేగం పేటలో అత్యధికంగా 47 మి.మీ వర్షపాతం నమోదు కాగా, రాజేంద్ర నగర్ లో 39 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. హైదరాబాద్ లో 16 శాతం వర్షపాతం నమోదు అయ్యింది.

ఒడిశా తీరానికి సమీపంలో వాయుగుండం

హైదరాబాద్ : తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా తీరానికి సమీపంలో గోపాల్ పూర్ కు 120 కి.మీ దూరంలో వాయుగుండం ఏర్పడింది. ఒడిశా తీరంలోని గోపాల్ పూర్ - పూరీ మధ్య ఈ రాత్రికి వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

12:43 - July 18, 2017

ఢిల్లీ : విపక్షాలకు ప్రధాని ఇచ్చిన వాగ్దానాలను రాజ్యసభలో అమలు చేయడం లేదని గులాంనబీ ఆజాద్‌ ఆరోపించారు. సమస్య ఏదైనా చర్చకు అనుమితిస్తామని చెప్పి..ఇప్పుడు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. దళితులపై దాడుల అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. 

12:41 - July 18, 2017

ఢిల్లీ : ఎన్డీఏ ఉపరాష్ర్టపతి అభ్యర్థిగా ఎం. వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు దాఖలు చేశారు. మొదటి సెట్ పై ప్రధాని మోదీ సంతకం చేయగా, రెండో సెట్ పై హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతకం చేశారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ సభ్యులు కూడా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీతో పాటు పలువురు ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. వెంక‌య్యనాయుడు డు ఇవాళ కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. వెంక‌య్య వ‌ద్ద ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ‌ను న‌రేంద్ర తోమ‌ర్‌కు, స‌మాచార‌, ప్రసార శాఖను మ‌రో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి అప్పగించారు. 

నాకు పార్టీ తల్లితో సమానం :వెంకయ్యనాయుడు

ఢిల్లీ : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని గౌరవంగా భావిస్తున్నాని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాని, నా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయా అని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు పార్టీ తల్లితో సమానం అని.. పార్టీకి దూరం అవుతున్నందుకు బాధగా ఉందన్నారు.

12:29 - July 18, 2017

ఏపీ సచివాలయంలో మళ్లీ వాటర్ లీకేజీ

అమరావతి: సచివాలయంలో మళ్లీ వాటర్ లీకేజీ అయ్యింది. మొదటి అంతస్తు, గ్రౌండ్ ఫ్లోర్ లో వర్షపు నీరు చేరింది. జలవనరులు, రెవెన్యూ శాఖ కార్యాలయలంలోకి నీరు చేరింది. దీంతో వర్షపు నీటిని సచివాలయ సిబ్బంది బక్కెట్ తో తోడుతున్నారు. ఇటీవలే 4వ బ్లాక్ లో వాటర్ లీకేజీ అయిన చోట పూర్తిగా మరమ్మతులు చేయకపోవడంతో మరోసారి వాటర్ లీకేజీ అయినట్లు తెలుస్తోంది.

12:09 - July 18, 2017

ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ విపక్షాల ఆందోళన మధ్య మళ్లీ వాయిదా పడింది. స్పీకర్ ఆమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. మరింత సమచారం వీడియో చూడండి.

 

12:05 - July 18, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నిఖిల్' వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. కథల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ‘ఎక్కడకు పోతావు చిన్నవాడా', ‘కేశవ' సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయా సినిమాల్లో 'నిఖిల్' నటనకు మంచి మార్కులే వేశారు. ఇదిలా ఉంటే 'నిఖిల్' ఓ రీమెక్ చిత్రంలో నటిస్తున్నారనే వార్త ప్రచారం జరుగుతోంది. తమిళంలో 'అథర్వ' హీరోగా 'కణిదన్' పేరిట ఓ చిత్రం రూపొందింది. నకిలీ సర్టిఫికేట్ల విషయంపై ఓ యువ జర్నలిస్టు చేసే పోరాటంపై చిత్ర కథ తెరకెక్కింది. మంచి విజయం సాధించిన ఈ సినిమాను రీమెక్ చేయాలని తెలుగు దర్శక..నిర్మాతలు భావించారు. ఈ రీమెక్ హక్కులను ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ముందుగా 'రవితేజ' నటిస్తాడని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు రవితేజ కాకుండా 'నిఖిల్' నటించబోతున్నట్లు టాక్. ఈ టాక్ నిజమైతే యువ జర్నలిస్టుగా 'నిఖిల్' ఎలా నటించనున్నాడో వేచి చూడాలి.

కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

నల్లగొండ: కేతేపల్లి వద్ద మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. మూసీ నది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 629.10 అడుగులకు చేరింది. మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 462 క్యూసెక్కులు ఉంది.

11:58 - July 18, 2017

చిత్తూరు : తిరుపతిలో అలిపిరి తనిఖీ వద్ద అధికారులు.. భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక భక్తుల వాహనాల్లో మద్యం సీసాలు, టెట్రా ప్యాకెట్‌లు, గుట్కాలను.. టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

11:57 - July 18, 2017

శ్రీకాకుళం : ఉత్తరాంధ్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీకాకుళం నగరానికి వరదముప్పు పొంచివుంది. జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రభావిత ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. బూర్ణ, సంతకవిటి మండలాల్లో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. గొట్టా బ్యారేజ్‌ 22 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

11:56 - July 18, 2017

హైదరాబాద్ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. హుస్సేన్‌ సాగర్‌ నిండు కుండలా మారింది. పై ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. హుస్సేన్‌ సాగర్‌లో నీటి శాతం పెరిగింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 1,200 కూసెక్కులు ఉండగా.. 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రాజ్యసభ నుండి మాయావతి, బీఎస్పీ ఎంపీలు వాకౌట్

ఢిల్లీ: దళితులపై దాడుల ఘటనలను మాయావతి ప్రస్తావించింది. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యసభ నుండి మాయావతి, బీఎస్పీ ఎంపీలు వాకౌట్ చేశారు. మాయావతికి మద్దతుగా రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దళిత వ్యతిరేక ప్రభుత్వం అంటూ నినాదాలు చేశాయి. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

వర్షాలతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి...

భద్రాద్రి: ఇల్లందులో 4 రోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. కేవోసీలో 8,963 టన్నులకు గాను, 2,880 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యింది.

11:44 - July 18, 2017

కొత్త కధలను ట్రై చేస్తూ ఆడియన్స్ కి దగ్గరైన మంచు ఫామిలీ హీరో 'మనోజ్'. వెరైటీ స్టోరీ లైన్స్ తో ఆడియన్స్ ని కట్టుకుంటూ కష్టపడుతూ సినిమాలు ఫినిష్ చేసే ఈ హీరో ఇప్పుడు ఒక చరిత్ర సృష్టించిన స్టోరీతో రాబోతున్నాడు. 'మంచు మనోజ్' ప్రీవియస్ మూవీ 'గుంటూరోడు'. 'గుంటూరోడు' సినిమా రిలీజ్ అయింది కానీ ఆశించినంతగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చెయ్యలేదు అని ఫిలిం నగర్ టాక్. ఈ చిత్ర ట్రైలర్ కి, ఆడియోకి యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ సినిమా కి మెగా ఎట్రాక్షన్ ఒకటి ఆడ్ అయింది మెగా స్టార్ చిరు తన వాయిస్ కూడా ఇచ్చాడు. ఎస్ కే సత్య డైరెక్టర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో 'ప్రగ్య జైస్వాల్' హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా యూత్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. 'మంచు మనోజ్' సినిమా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పక్క.
'
మంచు మనోజ్' 'ఒక్కడు మిగిలాడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఎల్.టి.టి ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని పద్మజ ఫిలిమ్స్, న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్ పతాకంపై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎనర్జీ లెవెల్స్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చెయ్యడం లో మంచు మనోజ్ ఎప్పుడు ముందే ఉంటాడు. తమిళనాడు వారికి కనెక్ట్ అయ్యే స్టోరీ ఎల్ టి టి ఈ లైన్ తో వస్తున్న ఈ 'ఒక్కడు మిగిలాడు' సినిమా మీద మంచి ఎక్సపెక్టషన్స్ ఉన్నాయ్

11:40 - July 18, 2017

డైరెక్టర్ తేజ తీసిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన నటి 'కాజల్ అగర్వాల్'. ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ అందరి హీరోలతో ఫిలిమ్స్ చేస్తూ రీసెంట్ గా 'ఖైదీ నెంబర్ 150’ సినిమాలో మెగాస్టార్ తో కూడా స్టెప్ లు వేసింది కాజల్. మెగా స్టార్ 150 అంటే చాల ప్రెస్టీజియస్ అలాంటి మూవీలో 'కాజల్' కనిపించడం ఫాన్స్ కి కూడా మంచి ఫీల్ ఇచ్చింది. ఇప్పుడు తన 50th సినిమాతో రాబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్ లతో కొట్టుకుంటున్న డైరెక్టర్ తేజ. తన ప్రీవియస్ మూవీ 'హోరా హోరి' కూడా ఆశించినంత హిట్ అవ్వలేదు. అందరూ కొత్తవాళ్లతో తీసిన లవ్ అండ్ యాక్షన్ ఫిలిం 'హోరా హోరి' ఆడియన్స్ కి కొత్తదనం ఇవ్వలేకపోయింది. తేజ మార్క్ సినిమాగా నిలిచింది. దాదాపు పది సినిమాలనుండి పోరాడుతున్న తేజ ఇప్పుడు రీసెంట్ గా మల్లి తన ప్రాజెక్ట్ తోరాబోతున్నాడు.

'రానా' తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ మంచి ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రంలో రానా పొలిటీషియన్ గా నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైనట్లు తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 'కాజల్' హీరోయిన్ గా నటిస్తుండగా, కేథరిన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. చిత్ర ఆడియో మరియు విడుదల తేదీకి సంబందించిన విషయాలు త్వరలోనే వెల్లడవుతాయి.

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి...

ఖమ్మం: సత్తుపల్లి జీవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ లో రెండు రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సుమారు 28 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. సత్తుపల్లి మండలం బేటుపల్లి చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. 16 అడుగులకు వరద నీటి మట్టం చేరింది. ఎన్టీఆర్ వరద కాలువ ద్వారా 53 చెరువులకు నీటిని అధికారులు విడుదల చేశారు.

11:32 - July 18, 2017
11:31 - July 18, 2017
11:29 - July 18, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడకు చెందిన మత్స్యకారలు సముద్రంలో గల్లంతయ్యారు. ఆరుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. బాధితులు ఉప్పాడర కొత్తపల్లి మండలం సుబ్బంపేట వాసులుగా ఉన్నారు. మెరైన్ సిబ్బంది మత్స్యకారుల కోసం సముద్రంలో గాలిస్తున్నారు. పూర్తి వివరాలు వీడియో చూడండి.

11:28 - July 18, 2017

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళఖతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారుల అప్రమత్తమైయ్యారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:27 - July 18, 2017

పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకులకు పండగే ..అందులోనూ పండగరోజుల్లో సినిమాలు రిలీజ్ అయితే ఇంకా వేరే చెప్పాలా ..ఈ దసరాకి టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమా లు స్క్రీన్ మీద పోటీ పడబోతున్నాయి. ముగ్గురు పెద్ద హీరోలు ఒకే నెలలో థియేటర్స్ మీద విజృంభిస్తే ...ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ..

మహేష్ బాబు..
శ్రీమంతుడు సూపర్ హిట్ తరువాత చాల గ్యాప్ తీసుకున్నాడు మహేష్ బాబు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌’. సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. 'మ‌హేష్‌'కు జంట‌గా 'ర‌కుల్ ప్రీత్ సింగ్' హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఎస్‌.జె.సూర్య‌, భ‌ర‌త్ విల‌న్స్‌గా న‌టిస్తున్నారు. అల్రెడి విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. మ‌హేష్ కెరీర్‌లో ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతుంది.

జూ.ఎన్టీఆర్..
'జనతా గ్యారేజ్' సినిమా ఎన్ టి ఆర్ ని పర్ఫెక్ట్ ట్రాక్ లో పెట్టి అటు క్లాస్ కి ఇటు మాస్ కి మరింత దగ్గర చేసింది. 'జనతా గ్యారేజ్' సినిమా హిట్ తరువాత మల్లి అదే స్థాయిలో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎన్ టి ఆర్. బాబీ డైరెక్షన్ లో ఎన్ టి ఆర్ డిఫరెంట్ రోల్స్ తో రాబోతున్న సినిమా 'జై లవ కుశ'..ఈ సినిమా సెప్టెంబ‌ర్ 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రంగ సిద్ధం చేస్తున్నారట. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 'జై ల‌వ‌కుశ‌' దసరా కానుకగా థియేటర్స్ ని టచ్ చేయబోతుంది.

బాలకృష్ణ..
'గౌతమి పుత్ర శాతకర్ణి' హిట్ తో ట్రాక్ రికార్డ్స్ ని సేఫ్ జోన్ లో పెట్టుకుంటున్నాడు నందమూరి బాలకృష్ణ. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన శాతకర్ణి సినిమా బాలయ్య బాబు యు ఎస్ మార్కెట్ ని కూడా బాగానే పెంచింది. ఇప్పుడు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా 'పైసా వసూల్' ..ఈ సినిమా పూరి చాల సీరియస్ గా తీస్కొని చేస్తున్నాడట. గత కొంత కాలం గా హిట్స్ లేకుండా ఉన్న పూరి ఈ సినిమా తో గ్యారంటీ హిట్ అని ఫిక్స్ అయ్యాడంట. సెప్టెంబ‌ర్ 29న నంద‌మూరి బాల‌కృష్ణ 'పైసా వ‌సూల్‌' విడుద‌ల‌వుతుంది.

అంటే ఒకే నెలలో మహేష్ బాబు, బాలకృష్ణ, ఎన్ టి ఆర్ మూడు సినిమాలు టాలీవుడ్ లో సందడి చెయ్యబోతున్నాయి అన్నమాట. పోటీ పోటీనే ..సినిమా సినిమానే ..ఆడియన్స్ ఆల్వేజ్ గాడ్ …

11:27 - July 18, 2017

విజయవాడ : పట్టీ సీమ పై బహిరంగ చర్చ ప్రకాశం బ్యారేజీ వద్ద ఉండవల్లిని గోరంట్ల చర్చకు పిలిచారు. ఈ చర్చ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బహిరంగ చర్చకు వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు గోరంట్లను కూడా పోలీసులు వెనక్కు తిప్పి పంపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:25 - July 18, 2017

ఢిల్లీ : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని, కేంద్ర మంత్రులు ఎన్డీఏపక్షనేతల సమక్షంలో వెంకయ్య నాయుడు నామినేషన్ వేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ నేటితో గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 21 చివరి తేదిగా ఉంది. ఆగస్ట్ 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అదే రోజు ఫలితాల వెల్లడిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:22 - July 18, 2017

ఈ ఏడాది ప్రారంభంలో 'బాలకృష్ణ' వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో.. రాణి వశిష్టీ దేవిగా మెప్పించింది 'శ్రియా శరణ్’. టీనేజ్ లోనే ఫిలిం ఎంట్రీ ఇచ్చిన ఈమె వయసు.. ప్రస్తుతం 35 సంవత్సరాలు. దాదాపు 18 ఏళ్లుగా హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇంత సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగడం అనేది చాలా కష్టమైన విషయం. క్రిష్ మలచిన అద్భుత చారిత్రక సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో శ్రియ నటన అందర్నీ ఆకట్టుకుంది. అందాల భామ 'శ్రియ' మరో ఆఫర్ ని అందుకుంది. సందీప్ కిషన్ హీరోగా రీసెంట్ గా 'నరకాసురుడు' ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. తెలుగు-తమిళం రెండు భాషల్లో ఈ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో 'అరవింద్ స్వామి' కీలక పాత్ర పోషిస్తుండగా..ఈ సీనియర్ అందగాడికి జోడీగా నటించేందుకు 'శ్రియా శరణ్' ను ఫైనల్ చేయడం విశేషం. యంగ్ డైరెక్టర్ 'కార్తీక్ నరేన్' ఈ 'నరకాసురుడు' మూవీకి దర్శకత్వం వహించనున్నాడు.

నామినేషన్ వేసిన వెంకయ్య

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అద్వానీ, జోషి, అమిత్ షా, సుష్మాస్వరాజ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

పట్టణాభివృద్ధి శాఖను తోమర్ కు, ప్రసార శాఖ ను స్మృతీ ఇరానీకి అప్పగింత...

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాజీనామా చేశారు. ఆ వెంటనే దాన్ని ఆమోదిస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఇప్పటి వరకూ వెంకయ్య అధీనంలోని పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను మరో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. సమాచార, ప్రసార శాఖల బాధ్యతలను మరో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి అప్పగిస్తున్నట్టు ఈ ప్రకటన వెల్లడించింది. 

ఆటో పై 440 కె.విద్యుత్ వైరు పడి దగ్ధం...

ప్రకాశం: వేటపాలెం మండలం దేశాయిపేటలో ప్రమాదం తప్పింది. 440కె.వీ విద్యుత్ వైరు పడి ఆటో దగ్ఢంఅయ్యింది. స్కూలు పిల్లలను ఎక్కించుకోవడానికి ఆటో వచ్చింది. అయితే ఆటో పిల్లలు ఎక్కక పోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఉప్పల్ లో ఎల్ కేజీ విద్యార్థిని అదృశ్యం...

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్‌ ఠాణా పరిధి చిలుకానగర్‌లో ఎల్‌కేజీ చదువుతున్న ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. తమ బిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తల్లిదండ్రులు ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెంలో భారీ చోరీ

ప్రకాశం: పర్చూరు మండలం కొమ్మినేని వారి పాలెంలో చోరీ జరిగింది. 400 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి అహరరణకు గురయినట్లు సమాచారం. భారీ మొత్తంలో నగదు కూడా ఎత్తుకెళ్నిట్లు అనుమానిస్తున్నారు.

11 గంటలకు వెంకయ్య నామినేషన్

ఢిల్లీ : ఉదయం 11 గంటలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

ఆరుగురు మత్స్యకారుల గల్లంతు...

కాకినాడ : సముద్రంలో మత్స్యకారులు గల్లంతయ్యారు. చేపల వేటకు వెళ్లి ఆరుగురు మత్స్యకారులు తిరిగి రాలేదు. బాధితులు ఉప్పాడ కొత్తపల్లి మండలం సుబ్బంపేట వాసులు అని తెలుస్తోంది. మత్స్యకారుల కోసం సముద్రంలో మైరన్ సిబ్బంది గాలిస్తున్నారు.

10:29 - July 18, 2017

హైదరాబాద్ : నగరంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా.. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెస్క్యూ, స్వీపింగ్ టీం సిబ్బందిని రంగంలోకి దించారు. పూర్తి వివరాలు వీడియో చూడండి.

10:27 - July 18, 2017

హైదరాబాద్ : ఉప్పల్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చిలకానగర్ నలంద స్కూల్ లో ఎల్ కేజీ చదువుతున్న ఆరోహి మీనా నిన్నటి నుంచి కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఎలగైనా పట్టుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:20 - July 18, 2017

హైదరాబాద్ : మరికొన్ని గంటల్లో టాలీవుడ్ డ్రగ్స్ పై విచారణ షురూ చేయనున్నారు. విచారణలో నిజానిజాలు తెలుసుకోనున్నారు. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19న డైరెక్టర్ పూరీ జగన్నాథ్, 20న హీరోయిన్ చార్మీ, 21న ముమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న కెమెరామెన్ శ్యామ్ కెనాయుడు, 24న హీరోమ రవితేజ, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, 26న నవదీప్, 28 న నందు, తనీష్ హాజరైయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానకి ముమైత్ ఖాన్ ఇంక నోటీసులు అందుకోలేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:19 - July 18, 2017

యాదాద్రి : ఆడపిల్ల అయినందుకు అమ్మ కష్టలు పెడుతున్నారా అన్న కవి రాసిన మాటలు గుర్తొస్తున్నాయి ఈ దారుణం చూస్తే ...మొగపిల్లడుపై మోజుతో ఓ నీచుడు గర్భంలో ఆడపిల్ల అని అనుమానించి ఆ తల్లిని సజీవ దహనం చేశాడు. అడ్డు వచ్చిన కూతురుకు సైతం నిప్పంటించాడు దౌర్భగ్యుడు ఈ సంఘటన యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రావి పహడ్ తండాలో జరిగింది. తండాలో సావిత్రి దంపతులకు 7ఏళ్ల క్రితం వివాహాం జరిగింది. వీరికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల సంతనం ఉన్నారు. తన భర్త మగబిడ్డ కోసం మళ్లి గర్భం దాల్చింది. కానీ భర్త మూడోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఆరు నెలల గర్భంతో ఉన్న సావిత్రిని, చిన్న కూతురు శ్రీదేవిని సజీవ దహనం చేసి హత్య చేశాడు. ప్రాణాలతో ఉన్న కూతురు శ్రీదేవి ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:17 - July 18, 2017

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయ్యాయి..తెలుసా...అంటే..అయితే ఏంటీ మనకేం ఏమన్నా ఉపయోగమా ? అని ఠక్కున బదులిస్తుంటారు..ఎందుకంటే పార్లమెంట్ లో ప్రజా సమస్యలు ఏమన్నా చర్చకు వస్తున్నాయా ?..మన సమస్యలు తీరుతున్నాయా ? అనే ప్రశ్న వినిపిస్తుంటుంది.

పార్లమెంట్...దేశం యొక్క అత్యున్నత చట్ట సభ..చట్టాలను రూపొందించే వేదిక ఇది. సమాఖ్య ప్రభుత్వంలో శాసన వ్యవస్థ అంటే పార్లమెంటు (రాజ్యసభ, లోక్ సభ). కార్య నిర్వాహక వ్యవస్థ అంటే రాష్ట్రపతి, ప్రధాని, మంత్రివర్గం చట్టాలను అమలు చేసేవారు. లోక్ సభ, రాజ్యసభలను కలిపి పార్లమెంటుగా వ్యవహరిస్తారు. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయా ? వాటి పరిష్కారానికి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? అంటే ప్చ్..అనే సమాధానం వస్తుంది..

వర్షాకాల సమావేశాలు..
ఈసారి కూడా వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లో ఎన్నో బిల్లులను ముందుకు తీసుకరావాలని కేంద్రం యోచిస్తోంది. ఉభయసభల్లో 18 బిల్లులు రానున్నాయి. అందులో 9 చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. తక్కువ సమయంలో ఇన్ని బిల్లులు తీసుకరావడాన్ని వామపక్షాలు అభ్యంతకరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నో సమస్యలు..
కానీ ప్రస్తుతం దేశంలో ఎన్నో సమస్యలు నెలకొని ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించాలని విపక్షాలు పేరొంటున్నాయి. దళితులపై దాడులు..గో రక్షక్ పేరిట దాడులు పెచ్చరిల్లుతున్న సంగతి తెలిసిందే. రైతుల ఆత్మహత్యలు..గిట్టుబాటు ధర తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు..కార్మికులు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు..చైనా సరిహద్దు..నిత్యావసర ధరలు..జీఎస్టీతో నష్టాలు..ఇతరత్రా సమస్యలు ఎన్నో నెలకొన్నాయి. వీటితో పాటుగా ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని వీటిపై వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నో సమస్యలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

సమస్యలు చర్చించరా ?
కానీ ప్రజా సమస్యలు ప్రతిసారి చర్చకు వస్తాయని అనుకుంటుంటే చర్చకు రాకుండానే పోతున్నాయి. ఈసారి సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిలదీస్తామని ప్రధాన విపక్ష పార్టీలు..సమస్యలపై చర్చిస్తామని అధికార పక్షం పేర్కొంటున్నాయి కానీ సమావేశాలు జరుగుతున్న తీరు అందరికీ తెలిసిందే. ప్రజా సమస్యలు చర్చించరా ? వారి లాభాల కోసం..మనుగడ కోసం నేతలు ప్రయత్నిస్తుంటారా ? అని పేద..సామాన్య..మధ్యతరగతి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

గత సమావేశాలు...
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు..సమావేశాల్లో ఎలాగైనా గట్టెక్కాలని అధికార పక్షం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా గత కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా నడుస్తున్న వ్యవహారమే. గతంలో జరిగిన సమావేశాలు వృధాగా ముగిసిపోయిన సంగతి తెలిసిందే. 16వ లోక్ సభలో మొదటి ఆరు సమావేశాల్లో 200 గంటలు వృథా అయ్యాయి. గత శీతాకాల..బడ్జెట్ సమావేశాల్లో అలాగే జరిగిపోయాయి.

కోట్ల డబ్బులు..
పార్లమెంట్ నిర్వహించడానికి ఎంతో ఖర్చు అవుతున్న సంగతి తెలిసిందే. ఒక్క నిమిషానికి అక్షరాల రూ. 2.50 లక్షలు ఖర్చు అవుతుందని విశ్లేషకుల అంచనా. అంటే ఒక గంటకు కోటిన్నర అన్నమాట. ఒక గంట సమయం వృథా అయ్యిందంటే కోటిన్నర నీళ్లపాలే. అంటే ఈ లెక్కన ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు రూ. 300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. పార్లమెంట్ సభ్యులు జీతభత్యాలు..ఇతరత్రా వేరే ఖర్చు. ఇదంతా

ఏది ఏమైనా ప్రజా సమస్యలపై చర్చించి..వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వాయుగుండంగా మారుతున్న తీవ్ర అల్పపీడనం

విశాఖ: తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాని తెలిపింది. తీరం వెంటన గంటలకు 50 నుంచి 55 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్య కారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

వరదల వల్ల పలు రైళ్లు రద్దు..మరికొన్ని దారిమళ్లింపు...

ఒడిశా: సంబల్‌పూర్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుదల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. సింగాపూర్-తెరువలి మార్గంలో వరద ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ఉంది. నాందేడ్-సంబల్‌పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్, ఈ నెల 20న తిరుపతి-బిలాస్‌పూర్, రాయగడ- జునాగఢ్ రోడ్ -రాయగడ మధ్య రైళ్ల సేవలు రద్దు చేశారు. తిరుపతి-బిలాస్‌పూర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు. అలప్పుజా-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ విజయనగరం మీదుగా మళ్లించారు.

శ్రీకాకుళం జిల్లాలో నీట ముగిన పంటలు...

శ్రీకాకుళం: బూర్గు మండలం కొల్లివలస - నారాయణ పురం మధ్య రాకపోకలు బందయ్యాయి. వందలాది ఎకరాల పంట నీటమునిగింది. హిర మండలం గొట్టా బ్యారేజీ నుంచి 36 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మధ్యాహ్నాన్నానికి నాగావళి, వంశధార నదులకు వరద ఉధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ ధనుంజయ్ రెడ్డి తెలిపారు.

గర్భంతో ఉన్న భార్యను సజీవ దహనం చేసిన భర్త

యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణం జరిగింది. 3వ కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో గర్భంతో ఉన్న భార్య, బిడ్డను భర్త సజీవదహనం చేశాడు. బీబీ నగర్ మండలం రావిపహాడ్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు భార్య సావిత్రి, కుమార్తె శ్రీదేవి గా గుర్తించారు.

హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. నగరంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

విశాఖ లో దారుణం...

విశాఖ: ఓ అపార్ట్ మెంట్ లో కుటుంబం పై హత్యాయత్నం జరిగింది. విక్రమ్ అనే వ్యక్తి కుటుంబంపై కత్తులతో ఆరుగురు దుండగులు దాడి చేశారు. విక్రమ్, భార్య, డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి: క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. 16.8 అడుగులకు నీటి మట్టం చేరింది. తాలిపేరు ప్రాజెక్ట్ 6 గేట్లను ఎత్తి4,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

పట్టిసీమమపై బహిరంగ చర్చకు ఉండవల్లికి గోరంట్ల సవాల్

విజయవాడ: పట్టిసీమమపై ఉండవల్లితో బహిరంగ చర్చకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. చర్చా కార్యక్రమానికి పోలీసుల అనుమతి కోరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు.

09:42 - July 18, 2017

యాదాద్రి : ఆడపిల్ల అయినందుకు అమ్మ కష్టలు పెడుతున్నారా అన్న కవి రాసిన మాటలు గుర్తొస్తున్నాయి ఈ దారుణం చూస్తే ...మొగపిల్లడుపై మోజుతో ఓ నీచుడు గర్భంలో ఆడపిల్ల అని అనుమానించి ఆ తల్లిని సజీవ దహనం చేశాడు. అడ్డు వచ్చిన కూతురుకు సైతం నిప్పంటించాడు దౌర్భగ్యుడు ఈ సంఘటన యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం రావి పహడ్ తండాలో జరిగింది. తండాలో సావిత్రి దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లల సంతనం ఉన్నారు. తన భర్త మగబిడ్డ కోసం మళ్లి గర్భం దాల్చింది. కానీ భర్త మూడోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో సావిత్రిని సజీవ దహనం చేసి హత్య చేశాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:35 - July 18, 2017

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? మంత్రాలకు మంత్రి పదవులు వస్తాయా ? సమాజంలో మంత్ర..తంత్రాలకు విలువనిచ్చే వారు ఎంతో మంది ఉన్నారు. అందులో చదువుకున్న వారు..ప్రజాప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. వరంగల్ రూరల్ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాగే వార్తల్లోకి ఎక్కారు. నాన్నకు మంత్రి పదవి రావాలని ఆయన కుమార్తె కోయదొరలతో పూజలు చేయించారని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి..
వరంగల్ జిల్లా రూరల్ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుటుంబం క్షుద్రపూజలు చేయించారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టిడిపి నుండి ఆయన టీఆర్ఎస్ లోకి జంపైన సంగతి తెలిసిందే. ధర్మారెడ్డికి మానస అనే కుమార్తె ఉంది. ప్రత్యేక పూజలు చేయిస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని..ధర్మారెడ్డికి మంత్రి పదవి వస్తుందని కోయదొరలుగా చెబుతున్న వ్యక్తులు మానసను నమ్మించారంట.

రూ. 57 లక్షల వసూలు..పూజల పేరిట వాళ్లు హడావుడి చేశారు. పూజల ఖర్చు..ఇతరత్రా ఖర్చుల కోసం కోయదొరలని చెబుతున్న వ్యక్తులు డబ్బులు లాగడం మొదలు పెట్టారు. ఇలా మొత్తం రూ. 57లక్షలు వసూలు చేశారు. కొన్ని రోజుల అనంతరం ఆ వ్యక్తులు మాయమయ్యారు. చివరకు మోస పోయామని గ్రహించారు. దీనితో ఎమ్మెల్యే ధర్మారెడ్డి కుటుంబసభ్యులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఆరోగ్యం కోసమంటున్న ధర్మారెడ్డి..!
ధర్మారెడ్డి మాత్రం దీనిని ఖండిస్తున్నట్లు తెలుస్తోంది. తన కుమార్తె మానస ఆరోగ్యం కోసమే పూజలు చేయించిందని, మంత్రి పదవి కోసం కాదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. సామాన్యులు ఇలాంటి మాయలో పడ్డారంటే ఏమో అనుకోవచ్చు..కానీ ఎమ్మెల్యేనే ఈ మాయలో పడి లక్షల్లో మోసపోవడాన్ని ఏమనాలి?

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మానవులు గ్రహాలు చుట్టి వస్తున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండడం బాధాకరం. జనాల మానసిక బలహీనతలను అడ్డు పెట్టుకుని దోచేసే ముఠాలపట్ల అప్రమత్తంగా ఉండాలి.

09:20 - July 18, 2017

హైదరాబాద్ : నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరపులేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బేగంపేటలో అత్యధికంగా 47 మీ.మీ, రాజేంద్రనగర్ లో 39మీ.మీ వర్షాపాతం నమోదైయింది. నగరంలో సగటు వర్షపాతం కంటే 16 అధికంగా నమోదైయింది. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు రావడంతో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:09 - July 18, 2017

శ్రీకాకుళం : పశ్చిమధ్య బంగాళఖతంలో ఏర్పాడిన అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ అధికారలు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారలు హెచరికలు జారీ చేశారు. మరో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షలకు వంశధార, నాగావళి ఉగ్రరూపంగా ప్రవాహిస్తున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తు నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీకాకుళం నగరానికి వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. నీటీ ముప్పుతో కేఆర్ పుపరం, రంగరాయపూరం గ్రామలు పూర్తి జలదిగ్భంధంలో ఉన్నాయి. వరి నారు మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు చేరుకున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:50 - July 18, 2017

విజయవాడ : ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ సర్కార్‌... ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యానికి పూనుకుంటోందని ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు వెంకటేష్‌ ఆత్రేయ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్లక్ష్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగం - ప్రాధాన్యత - సవాళ్లు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో చిన్నాచితక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం ఆయన ప్రజాశక్తి సంచికను ఆవిష్కరించారు.

 

08:22 - July 18, 2017

హైదరాబాద్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరపులేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బేగంపేటలో అత్యధికంగా 47 మీ.మీ, రాజేంద్రనగర్ లో 39మీ.మీ వర్షాపాతం నమోదైయింది. నగరంలో సగటు వర్షపాతం కంటే 16 అధికంగా నమోదైయింది. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు రావడంతో వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:18 - July 18, 2017

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళఖతంలో ఏర్పాడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. 48గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర భారీ వర్షలు కురిస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 50 కి.మీ నుంచి 55కి,మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. అటు శ్రీకాకుళంలో భారీ వర్షాలతో వరద ముప్పు ఉండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికాలు జారీ చేశారు. వంశధార, నాగావళి ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో నగరంలో భారీ వర్షం నమోద అయింది. అత్యధికంగా బేగంపేటలో 47 మీమీ, రాజేంద్రనగర్ లో 39 మీమీ వర్షపాతం నమోదైయింది. పలు లోతట్టు ప్రాంతాలు జలామయం.

వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖ : బంగాళఖతంలో ఏర్పాడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఉత్తరాంధ్రకు అతి భారీ వర్ష సూచన ఉందని, గంటకు 55కి.వీ వేగంతో గాలులు వీస్తాయని వాతవారణ అధికారులు తెలిపారు.

07:26 - July 18, 2017

తెలుగు వారు ఉన్నతంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటామని, తెలుగు ఉన్నద పదవిలో ఉన్నప్పుడు తెలుగు వారికి న్యాయం జరుగుతుందా.. విభజన సమయంలో ఏపీ తెలంగాణకు న్యాయం చేయలేకపోయాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఉన్న చోట రాజకీయాలకు అతీతంగా పనిచేయాని, ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చే వారు రాజ్యంగ పదవిలో రావడం వల్ల ఏం జరుగుతుందో తెలుసునని, దేశంలో మైనార్టీలో దాడులు జరుగతోందని సీపీఎం నేత బాబురాబు అన్నారు. ఆర్ఎస్ఎస్ మూలలు ఉన్నవారు కాకపోతే నక్సలైట్లు, యాకుబ్ మెమెన్ ఉరి తీయోద్దు అన్నా వారిని రాష్ట్రపతి చేయాలా అని, భారతదేశం తల్లి గా బ్రతికేవాళ్లమని, అక్కడ స్వీచ్ వేసి ఇక్కడా లైటు వేయడం, ఉత్తర ప్రదేశ్ లో ముస్లిం మంత్రగా ఉన్నారని, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. వెంకయ్యనాయుడు తెలుగురాష్ట్రాలకు తనవంతు సహాయం చేశారని టీడీపీ నేత రాములు అన్నారు.మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:25 - July 18, 2017

గుంటూరు : సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ జీవధార పోలవరం సహా పలు ప్రాజెక్టుపై చర్చించారు. పలు ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడక నడుస్తుండటం పట్ల చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న చిన్న పనులను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షిస్తున్నా కాంట్రాక్టు ఏజెన్సీల్లో కదలిక లేకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సంస్థలను ఇక ఉపక్షించకుండా శాశ్వతంగా బ్లాక్‌ లిస్టులో పెట్టి, ఏ ప్రభుత్వ శాఖల పనులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతోపాటు, కాంట్రాక్టు సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులన్నింటికీ ప్రారంభోత్సవ తేదీలు ఖరారు చేశామని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. నిద్రపోతారో లేదో తనకు అనవసరమని చంద్రబాబు తేల్చి చెప్పారు. తమాషా కోసం వారం వారం సమీక్షలు నిర్వహించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో పురోగతి లేకపోతే సహించేది లేదని హెచ్చరించారు.

చంద్రబాబు ఆవేదన
సాగునీటి ప్రాజెక్టుల పరిహారం చెల్లింపు, పనరావాసం కల్పించడంలో ఎదురువుతున్న ఇబ్బందులపై చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పరిహారం చెల్లిస్తున్నా కొందరు కోర్టులకు వెళ్లడంతో సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసులు వేసేవారు అభివృద్ధి గురించి బాధ్యతాయుతంగా ఆలోచించాలని కోరారు. వంశధార నిర్వాసితులకు ఈ వారంలోగా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయాన్ని అందరూ గమనించాలని చంద్రబాబు కోరారు. ప్రాజెక్టులతో కలిగే ప్రయోజనాలపై నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

07:22 - July 18, 2017

హైదరాబాద్ : ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టును సమర్థంగా వాడుకునే అంశంపై కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఎస్సారెస్పీ కాలువలన్నింటినీ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను కోరారు. వచ్చే ఏడాది నుంచి వందకు వందశాతం ఆయకట్టుకు నీరందించాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా 16 లక్షల ఎకరాలకు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు.. మొత్తంగా 40 లక్షల ఎకరాలకు గోదావరి నదీ జలాలను అందించాలని సూచించారు. గోదావరినదిలో తెలంగాణకు ఉన్న వాటా ప్రకారం నీరు వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్నదని, నిధుల కొరతలేదని.. ఈ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించకపోతే పాపం చేసినట్లేనని సీఎం వ్యాఖ్యానించారు. ఎస్సారెస్పీ నుంచి నడిగూడెం వరకు 346 కిలోమీటర్ల మేరనున్న కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, ఇందుకు ఎన్ని నిధులైనా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్సారెస్పీ కిందనున్న చెరువులను రిజర్వాయర్లుగా మార్చే అవకాశాలను పరిశీలించి , అంచనాలను 10 రోజుల్లో తయారు చేయాలని సీఎం ఆదేశించారు. 45 రోజుల్లో టెండర్లు పిలిచి, ఈ అక్టోబర్‌లో పనులు ప్రారంభించాలని సూచించారు. మొత్తంగా రైతులకు రెండు పంటలకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఏడాది జూన్‌ నాటికి
వచ్చే ఏడాది జూన్‌ నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని తోడడం ప్రారంభమవుతుందని... అక్కడి నుంచి మిన్‌మానేరు, ఎల్‌ఎండీలకు నీరు చేరుతుందన్నారు. అక్కడి నుంచి పాత కరీంనగర్‌, వరంగల్‌ , నల్లగొండ జిల్లాలకు నీరందిస్తామన్నారు. వెంటనే కాల్వల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. వచ్చే ఎండాకాలం పూర్తయ్యేనాటికి కాల్వల పనులు పూర్తికావాలని టార్గెట్‌ పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని కేసీఆర్‌ అన్నారు. ప్రతీ జిల్లాలో మంత్రులు తమ పరిధిలోని పనులు వేగంగా జరిగేటట్లు చూడాలని, సమీక్షలతోనే సరిపెట్టకుండా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని పరిష్కరించాలన్నారు. తమ ప్రాంత రైతులకు సాగునీరు అందించడాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యతగా భావించాలన్నారు. సమీక్షలో పాల్గొన్న కడియం, ఎర్రబెల్లి దయాకర్‌రావు , రెడ్యానాయక్‌ తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన రిజర్వాయర్ల నిర్మాణాలపై కేసీఆర్‌కు వినతిపత్రాలు అందజేశారు. 

07:20 - July 18, 2017

హైదరాబాద్ : పేట్‌ బషీరాబాద్‌లో దారుణం జరిగింది. దత్తాత్రేయ నగర్‌లో ఓ యువతిపై యాసిడ్‌ దాడి జరిగింది. ఫారీదా అనే యువతి రాత్రి ఒంటరిగా వస్తుండగా.. ప్రదీప్‌ అనే యువకుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి పారిపోయాడు. స్థానికులు ఫారీదాను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫారీదా పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ప్రేమను అంగీకరించకపోవడంతో ఫారీదాపై యాసిడ్‌ దాడి జరిగినట్టు తెలుస్తోంది.

07:18 - July 18, 2017

గుంటూరు : ఏపీలో అప్పుడే చిన్నగా ఎన్నికల హీట్‌ మొదలవుతోంది. ప్రతిపక్ష నేత జగన్‌... వైసీపీ ప్లీనరీలో ఎన్నికల హామీలను అప్పుడే ప్రకటించేశారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను కూడా రంగంలోకి దించేశారు. అంతేకాదు.. జగన్‌ పాదయాత్రకూ సిద్ధమవుతున్నారు. ప్రతిపక్ష స్పీడ్‌ను అధికార టీడీపీ కూడా ఎన్నికల రేస్‌లో ముందుండడానికి వ్యూహాలు రచిస్తోంది. పల్లెపల్లెకు టీడీపీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. మరి 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తామంటోన్న పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన కూడా రేస్‌లో ఉంది. జనసేన ఏం చేస్తుందన్నదానిపై అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష వైసీపీ దృష్టిసారించాయి.

పోటీ చేస్తుందని పవన్‌ ప్రకటన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. అందులో భాగంగానే జనసైనికులను ఎంపిక చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు జనసేనపై దృష్టి సారించాయి. జనసేన పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందన్న చర్చ సాగుతోంది. అయితే జనసేన అధికారంలోకి రాకపోయినా 2019 ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావితం చేస్తుందని ప్రశాంత్‌ కిశోర్‌ జగన్‌కు చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు పాలనపై పోరాటం, ప్రజామద్దతును జనసేన కూడగడితే .. వైసీపీకి కలిసొచ్చి అధికారం చేపడుతుందని ప్రశాంత్‌ కిశోర్‌ స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. దీంతో జనసేన పార్టీ ఎప్పుడు కార్యక్రమాలను విస్తృతం చేస్తుందా అని వైసీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. పవన్‌ను తమవైపు తిప్పుకుంటే తిరుగే ఉండదని.. అందుకు తగ్గ ప్రయత్నాలు చేసేపనిలో వైసీపీ నేతలు పడ్డారు. అయితే జగన్‌తో పవన్‌ కలుస్తారా అన్నది ఇక్కడ ఆసక్తి కలిగిస్తోంది.

పవన్ జగన్ కలుస్తారా..
2014 ఎన్నికల్లో పవన్‌... జగన్‌ అవినీతిని ప్రశ్నించారు. మరి ఇప్పుడు జగన్‌తో ఆయన దగ్గరవుతారా అన్న చర్చ సాగుతోంది. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరన్నది నానుడీ. ఎప్పుడు ఏది ఏమైనా జరగొచ్చు. మరి దీని ప్రకారం చూస్తే జగన్‌ - పవన్‌ కలిసే అవకాశాలూ కూడా లేకపోలేదని వైసీపీ నేతలంటున్నారు.పవన్‌ ఆలోచనలు, జనసేన సిద్ధాంతాలు చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ జగన్‌కు మద్దతివ్వరని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్‌కు పవన్‌ మద్దతు ఇస్తారని ఎవరూ ఊహించరని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీకే మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పవన్‌ను ఉద్దానం సమస్యలపై చర్చకు ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరు కేవలం ఉద్దానం సమస్యలకే పరిమితం అవుతారా... పాలిటిక్స్‌ వ్యవహారాలు సైతం చర్చిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు జనసేనాని మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మరి ఈ రెండు పార్టీలలో పవన్‌ దేనివైపు మొగ్గుచూపుతారు? లేక ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తారా? మరేదైనా పార్టీలో జట్టు కడతారా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది.

07:06 - July 18, 2017

గుంటూరు : రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసిన తర్వాత టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఓటింగ్‌ జరిగిన తీరును సమీక్షించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుగా ఓటేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. కదరి బాబూరావు, జితేందర్‌గౌడ్‌ తప్పుగా ఓటేసిన విషయాన్ని కొందరు శాసనభ్యులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. వీరిద్దరూ బ్యాలెట్‌ పేపర్‌పై పేర్లు రాసినట్టు చంద్రబాబుకు చెప్పారు. శానసభ్యులుగా ఉంటూ ఓటేయడం చేతకాకపోతవడం సిగ్గు పడాల్సిన విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలుగా సరిగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం ప్రజల్లోకి తప్పుడు సంతేకాలు వెళతాయని కోపతాలు వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేలపై చర్యలు
తప్పుగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. పోలింగ్‌కు ముందు నమూనా ఓటింగ్‌ నిర్వహించినా తప్పుచేయడం క్షమార్హం కాదని ఆగ్రహించారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించినా ఇద్దరు తప్పు చేయడం నిర్లక్ష్యం కిందకు వస్తుందని మండిపడ్డారు. మరో వైపు మాక్‌ పోలింగే తమ కొంప ముంచిదని తప్పుగా ఓటేసిన ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, జితేందర్‌గౌడ్‌ తమ సహచరులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును కూడా చంద్రబాబు సమీక్షించారు. కొందరు శాసనసభ్యులు ప్రజలకు దూరంగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వబోనని హెచ్చరించారు. ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేల తీరు మారడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సయమం కూడా లేదని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లికపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరికి వారుగా పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు అందుబాటులో ఉండకపోతే
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోతే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు వివరాలు తన వద్ద ఉన్నాయని బాబు తమ శాసనసభ్యులు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి చేపట్టే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలని చందబాబు ఆదేశించారు. మరోవైపు రాష్ట్రంలో మహోద్ధృతంగా సాగుతున్న మద్యం వ్యతిరేక ఉద్యమంపై కూడా టీడీఎల్‌పీ సమావేశంలో చంద్రబాబు సమీక్షించారు. జనావాసాల మధ్య కాకుండా ఊరి చివర మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం దుకాణాలను అనుబంధంగా బెల్టు షాపులు పెరుగుతున్నాయని వీటి రెండు రోజుల్లో తొలగించాలని కోరారు. లేకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దేవుని పేరుమీద వైన్‌ షాపులు పెట్టేవారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలని టీడీఎల్‌పీలో నిర్ణయించారు. ఇసుక అక్రమ రవాణాపై కూడా తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంతో చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు తక్కువ రేటుకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో లోపాలు ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సామాన్యులకు పూర్తి స్థాయిలో ఇసుక తక్కువ రేటుకు అందడంలేదని గుర్తించిన చంద్రబాబు... రవాణ చార్జీలు తగ్గేలు చర్యలు తీసుకోవాలిన ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణ జరగకుండా శాసనసభ్యలు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. 

07:04 - July 18, 2017

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఎంపిక పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ సహా వివిధ పార్టీల ఎంపీలు వెంకయ్యను కలిసి అభినందనలు తెలిజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా అర్హుడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హోదాలో మూడేళ్లుగా ఏపీకి అన్ని విధాల సహకరించిన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం పట్ల టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడు అన్ని విధాల యోగ్యుడని బీజేపీ నేతలు అభినందించారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడును ఎంపిక చేయడం పట్ల టీఆర్‌ఎస్‌ హర్షం వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం వెంకయ్యనాయుడు నామినేషన్‌ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గోనున్నారు. 

07:02 - July 18, 2017

ఢిల్లీ : గత కొన్నిరోజులుగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన పడ్డ బిజెపి ఎట్టకేలకు ఉత్కంఠకు తెరదించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే మిత్రపక్షాలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిజెపి అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడంతో వెంకయ్య తన పదవులకు రాజీనామా చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్డీయే అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేస్తారు.ఉపరాష్ట్రపతి పదవి పట్ల వెంకయ్య విముఖత చూపినప్పటికీ బిజెపి పెద్దలు ఆయనను నచ్చజెప్పి ఒప్పించారు.బిజెపికి చెందిన ప్రముఖ నేతలలో ఒకరైన ముప్పవరపు వెంకయ్య నాయుడు 1949, జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో జన్మించారు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

విద్యార్థి నాయకుడిగా
1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే వెంకయ్యనాయుడు రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి 1980 వరకు జనతాపార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 1980 నుంచి శాసనసభలో బిజెపి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగారు.వెంకయ్యనాయుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యున్నత పదవులు అలంకరించారు. 1993లో బిజెపి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1998లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేశారు. 2014లో మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి కేంద్ర కాబినెట్‌ మంత్రి అయ్యారు.

బిజెపి జాతీయ అధ్యక్షపదవిలో
2002 జూలై 1 నుంచి అక్టోబర్ 5, 2004 వరకు బిజెపి జాతీయ అధ్యక్షపదవిలో వెంకయ్య పార్టీకి సేవలందించారు. మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వెంకయ్యనాయుడు నాలుగుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడింపారు. వెంకయ్యనాయుడుకు భార్య ఉష, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

06:39 - July 18, 2017

తెలంగాణ వచ్చి మూడు సంవత్సరాలు అయినప్పటికి నిజాం కాలం నాటి సంస్కరణలు ఉన్నాయిని, తెలంగాణలో 15లక్షల మంది కల్లుగీత కార్మికులు ఉన్నారని, అనాటి తెలంగాణ ఉద్యమంలో గౌడ సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారని, కల్లుగీత కార్మికులపై దాడులకు పాల్పడుతున్నారని, లక్షల మంది ఆధారపడ్డ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తాడి చెట్టు నుంచి పడితే 12గంటల అయిన మృతదేహన్ని తీయాలేకపోతున్నారని తెలంగాణ బీసీ సెల్ నాయకుడు శేఖర్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. నేడు ఉదయం 10గంటలకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరగనుంది. అనంతరం మధ్యాహ్నాం 3గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు.

 

Don't Miss