Activities calendar

19 July 2017

22:03 - July 19, 2017
22:01 - July 19, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై రాజ్యసభ దద్దరిల్లింది. దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. గోరక్షణ పేరిట కొందరు వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. గోరక్షణ సంస్థలను నిషేధించాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మూడోరోజు దేశవ్యాప్తంగా గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రాజ్యసభ దద్దరిల్లింది. సిపిఎం నేత సీతారాం ఏచూరి ఇచ్చిన నోటీసుపై రాజ్యసభలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది.
దళితులపై దాడి ఘటనను ప్రస్తావించిన గులాంనబీ ఆజాద్ 
కాంగ్రెస్‌ సభ్యులు గులాంనబీ ఆజాద్‌ ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లో దళితులపై దాడి ఘటనను ప్రస్తావించారు. ఇప్పటికి కొందరు దళిత యువకులు అడ్రస్‌ లేకుండా పోయారన్నారు. సహరాన్‌పూర్‌లో దాడుల వెనక ఓ ఎంపి హస్తముందని ఆరోపణలు వచ్చాయని... రాష్ట్ర ప్రభుత్వం ఎంపీపై విచారణ జరపకుండా ఎస్‌ఎస్‌పిని బదిలీ చేసి చేతులు దులుపుకుందని ఆజాద్‌ విమర్శించారు. జార్ఖండ్‌లో దళితులు, మైనారిటీలకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం శోచనీయమన్నారు. ఓటు బ్యాంకు కోసం అధికార పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆజాద్‌ ధ్వజమెత్తారు.
ఆ దాడులను అరికట్టడంలో మోది ప్రభుత్వం విఫలం : ఏచూరీ
గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శాంతి భద్రతల అంశమని ప్రధాని మోది చెప్పడాన్ని  సిపిఎం సభ్యులు ఏచూరి తప్పు పట్టారు. గోరక్షక సంస్థలకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండడం వల్లే దాడులు పెరిగాయన్నారు. బీఫ్‌ పేరిట జరుగుతున్న దాడులను అరికట్టడంలో మోది ప్రభుత్వం విఫలమైందని... గోరక్షణ సంస్థలను కేంద్రం నిషేధించాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. జాతిపిత మహాత్మగాంధీ హత్యకు సంబంధించి అప్పటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ సంఘ్‌పరివార్‌ను తప్పు పట్టారన్న విషయాన్ని ఏచూరి కోట్‌ చేశారు. పథకం ప్రకారమే లౌకిక భారత్‌ను హిందు దేశంగా మార్చే కుట్ర జరుగుతోందని ఏచూరి ఆరోపించారు. హిందుత్వ శక్తులు 'భారత్‌ మాతాకీ జై' నినాదాన్ని తెరపైకి తెస్తున్నాయని...'జై హింద్‌'  భగత్‌ సింగ్‌ నినాదం 'ఇన్‌క్విలాబ్‌ జిందాబాద్‌' దేశభక్తి నినాదాలు కావా....అని ప్రశ్నించారు. 
విపక్షాల ఆరోపణలపై ప్రభుత్వ స్పందన
విపక్షాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోరాదని ప్రధాని మోది స్పష్టం చేశారని కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని చెప్పారని నక్వీ గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ప్రతిపక్షాలు మతతత్వాన్ని పులుముతున్నాయని మంత్రి ఎదురుదాడికి దిగారు.
హిందూ దేవతలపై ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ అవమానకర వ్యాఖ్యలు 
గోరక్షణపై చర్చ సందర్భంగా ఎస్పీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ హిందూ దేవతలపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవతలను ఆయన మద్యం బ్రాండ్లతో పోల్చారు. హిందువుల మనోభావాలు కించపరచారని ఆయనపై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్‌ చేసింది. అగర్వాల్‌ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారని, దీన్ని ఇంతటితో వదిలేయాలని కాంగ్రెస్‌ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. 

 

21:53 - July 19, 2017
21:51 - July 19, 2017

గుంటూరు : అమరావతిలో నిర్మాణాల పురోగ‌తిపై సీఎం చంద్రబాబు సీఆర్డీఏ అధికారుల‌తో స‌మీక్షించారు. ప్రభుత్వ భ‌వ‌నాలకు సంబంధించిన మొత్తం ప‌నుల‌ను మొద‌టిద‌శ‌లో,  అంటే 2019 మార్చి క‌ల్లా పూర్తిచేయాల‌ని  అధికారుల‌ను ఆదేశించారు. శాఖ‌మూరులో నిర్మించే అతిపెద్ద పార్కును వ‌చ్చే సంక్రాంతికి ప్రారంభించాల‌ని సీఎం నిర్ణయించారు. 
మొద‌టిద‌శ నిర్మాణాలు పూర్తిచేసేందుకు నిర్ణయం
అమ‌రావ‌తిలో మొద‌టిద‌శ నిర్మాణాలు పూర్తిచేసేందుకు నిర్ణయించారు. రాజ‌ధానిలో స్టార్ హెట‌ళ్లు, మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రులు ఏర్పాటుచేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం  ఆదేశించారు. ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాల డిజైన్లు పూర్తికాగా...స‌చివాల‌యం,రాజ్ భ‌వ‌న్ తో పాటు మిగిలిన అన్ని బిల్డింగ్‌కు వీలైనంత త్వర‌గా డిజైన్లు పూర్తిచేసి ప‌నులు ప్రారంభించాల‌న్నారు. అమ‌రావ‌తిలోని శాఖ‌మూరులో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్కును నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం అయిందని  మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 241 ఎకరాలలో ఉద్యానవనకేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీన్ని నాలుగు జోన్ లుగా విభ‌జించారు.. మొదటి జోన్ 85 ఎకరాల్లో అమ్యూజ్‌మెంట్ పార్క్, రెండోజోన్ 34 ఎకరాలు, మూడవ జోన్ 49 ఎకరాలు, నాలుగో జోన్‌ అంబేద్కర్ పార్క్‌తో కలిపి 73 ఎకరాల చొప్పున ఉంటుందని మంత్రి చెప్పారు. పార్కు కు సంబంధించిన మాస్టర్ ప్లాన్, నైట్ స‌ఫారీ ఏర్పాటుకు ప్రణాళిక‌ల‌పై ఏడీసీ అధికారులు సీఎం చంద్రబాబుకు వివ‌రించారు...ఈ పార్కు సమీపంలోనే గాంధీ విగ్రహం కూడా ఏర్పాటుచేసి గాంధీ మెమోరియ‌ల్ పార్కుగా అభివృద్ది చేయాల‌ని నిర్నయించారు.. వ‌చ్చే సంక్రాంతిక‌ల్లా పార్కు ప‌నులు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయాల‌ని సీఎం నిర్ణయించారు..
హోటళ్లు, విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి
అటు అమ‌రావ‌తి నిర్మాణాలు ప్రారంభం అవుతుండ‌టంతో ప్రముఖ హోట‌ళ్లు, విద్యాసంస్థలు నెల‌కొల్పేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించినట్లు.. మంత్రి నారాయణ తెలిపారు. పాఠ‌శాల విద్య కోసం దేశం మొత్తం అమ‌రావ‌తి వైపు చూసేలా  ప్రముఖ విద్యాసంస్థల‌ను ఆహ్వానించాల‌ని అన్నారు. అవ‌స‌ర‌మైతే భూమిని ఉచితంగా అందించాల‌ని నిర్ణయించారు. ఇప్పటికే అమ‌రావ‌తిలో హోట‌ళ్లు ఏర్పాటుచేయ‌డానికి 16 స్టార్ హెట‌ళ్లు ముందుకొచ్చాయ‌ని...త్వర‌లోనే వాటిపై స్పష్టత వ‌స్తుంద‌ని సీఆర్డీఏ అధికారులు సీఎంకు వివ‌రించారని మంత్రి నారాయణ చెప్పారు. 
2019 మార్చి నాటికి ప్రభుత్వ భవనాలు పూర్తి ..!
ముఖ్యమంత్రి ఆదేశాలతో వ‌చ్చే విజ‌య‌ద‌శ‌మి నుంచి అమరావతిలో నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. 2019 మార్చి నెలాఖ‌రుక‌ల్లా ప్రభుత్వ భ‌వ‌నాల కాంప్లెక్స్  పూర్తికానుంది. ముందుగా ప్రభుత్వ భ‌వ‌నాల నిర్మాణం ప్రారంభ‌మైతే  ప్రయివేట్ సంస్థలు కూడా ముందుకొస్తాయ‌ని ప్రభుత్వం అంచానా వేస్తోంది. 

 

21:47 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ తీసుకున్నారా...లేదా...? ఇప్పుడు టాలివుడ్‌లో షేక్ చేస్తుంది...డ్రగ్స్ తీసుకున్నట్లు...డీలర్లతో లింకులున్నట్లు ఆధారాలు సేకరించిన సిట్ బృందం నటీనటులను విచారణ మొదలుపెట్టింది...అయితే డ్రగ్స్ వారు తీసుకున్నారా లేదాన్నది తేలాలంటే రక్త, మూత్ర పరీక్షలతో సాధ్యమా..? ఆ శాంపిల్స్‌తో మాత్రం వారు మత్తు సేవించారాన్నది తేలడం కష్టమే...లోతుగా శోధించాలంటే మాత్రం శిరోజాలే ప్రధానం...మత్తు తీసుకున్నట్లు తేలాలంటే వెంట్రుకల శాంపిల్స్ మాత్రమే బయటపెట్టగలుగుతుంది..ఆ మత్తు ప్రభావం వెంట్రుకల్లో మూడు నెలల పాటు ఉంటుంది...
వెంట్రుకల ద్వారా టెస్ట్‌లు
మత్తు..డ్రగ్స్...ఇది తీసుకుంటే మత్తు ఎన్ని రోజులు ఉంటుందో చెప్పారు...కాని తెలియని నిజం ఒకటి ఉంది..ఆ మత్తు తీసుకున్నవారు నిజమేనా..కాదాన్నది తేల్చాలంటే రకరకాల టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది...ఇందులో ప్రధానమైంది శిరోజాలే... అవును.. వెంట్రుకల శాంపిల్స్ తీసుకుని నార్కోటిక్‌ నిపుణులు పరీక్షలు జరిపితే మాత్రం బయటపడుతుంది..కాని ఇది కేవలం 90 రోజుల్లోపు జరగాల్సి ఉంటుంది...ఆ తర్వాత డ్రగ్స్ సేవించారా లేదాన్నది తేలడం కష్టమేనంటున్నారు నిపుణులు...
ఒక్కసారి పీల్చితే కొన్ని గంటలు..
మత్తు తీసుకునేవారు మొదటిసారి తీసుకున్నప్పుడు కాస్త కష్టంగా..ఆ తర్వాత మత్తులో తేలుతూ మైమర్చిపోతుంటారు..ఇది కొన్ని గంటలపాటు పనిచేస్తుంది..కాస్త వీక్‌బాడీ ఉంటే మాత్రం రోజుకు పైనే ఉంటుంది...ఆ తర్వాత మత్తు దిగుతుంది..కాని మత్తు ఒక్కసారి తీసుకున్నవారు మళ్లీ మళ్లీ తీసుకోవాలనిపిస్తుంది..అందుకుకారణం మత్తులో ఉన్న మజానే వేరంటుంటారు బానిసలు.. దీంతోనే బానిసలుగామారి రెగ్యూలర్‌గా  మత్తు తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యంలో మార్పు వస్తుంది...ఆ తర్వాత దానికి ఎడిక్ట్‌ కావడంతో రక్తంలో మార్పుతో ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది...
ఒక్కో రకమైన మత్తు ఒక్కోరకంగా...
ఇప్పుడు మత్తు తీసుకున్నారా లేదా..? తీసుకుంటే వారు ఎవరికి సరఫరా చేశారనేదానిపై ఎక్సైజ్ అదికారులు విచారణ మొదలుపెట్టారు..అయితే మత్తు తీసుకున్న విషయం తెలియాలంటే మాత్రం ఒక్కో రకమైన మత్తు ప్రభావం కొంత సమయం ఉంటుంది..దీన్ని బట్టి వారు డ్రగ్స్ తీసుకునే విషయం బయటపడుతుంది..అయితే ఎక్సైజ్ అధికారులు విచారిస్తున్నవారి నుంచి రక్త పరీక్షలు,మూత్ర పరీక్షలు తీసుకుంటే మాత్రం డ్రగ్స్ వాడారా లేదాన్నది తేలడం కష్టమేనంటున్నారు నిపుణులు...
మూడు రోజుల్లోపే రక్త పరీక్షలు 
డ్రగ్స్ తీసుకున్నవారి గుట్టు తెలియాలంటే మూడు రోజుల్లోపే రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది...ఇక మూత్ర పరీక్షల ద్వారా వారం లోపు తెలుసుకోవచ్చు...మామూలు పరీక్షల్లో 24 గంటల వరకే ఉంటుంది...పూర్తి స్థాయిలో లోతుగా పరీక్షలు జరపాలంటే మాత్రం శిరోజాల ద్వారానే బయటపడుతుంది...ఇప్పుడు అధికారులు విచారిస్తున్నవారి గుట్టు తెలుసుకోవాలంటే వెంట్రుకలు కూడా శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తే మాత్రం తప్పక వారి గుట్టురట్టవుతుంది...

 

డ్రగ్స్‌ కేసులో ముగిసిన పూరీ సిట్‌ విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్‌ విచారణ ముగిసింది. 10 గంటలుగా సిట్‌ అధికారులు పూరీని విచారించారు. ముందు కెల్విన్‌ ఎవరో తెలియదంటూ బుకాయించిన పూరీ.. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కెల్విన్‌ ఫొటోను చూపించి నిలదీయడంతో కెల్విన్‌తో సంబంధాలు అంగీకరించారు. ముందు సాధారణ ప్రశ్నలతో ప్రారంభించి తర్వాత సిట్‌ అధికారులు డోస్‌ పెంచారు. కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలు సేకరించారు సిట్‌ అధికారులు. మరోవైపు ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన ఉస్మానియా వైద్య బృందం.. పూరీ బ్లడ్‌ శాంపిల్స్‌ను తీసుకుంది.

21:41 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్‌ విచారణ ముగిసింది. 10 గంటలుగా సిట్‌ అధికారులు పూరీని విచారించారు. ముందు కెల్విన్‌ ఎవరో తెలియదంటూ బుకాయించిన పూరీ.. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కెల్విన్‌ ఫొటోను చూపించి నిలదీయడంతో కెల్విన్‌తో సంబంధాలు అంగీకరించారు. ముందు సాధారణ ప్రశ్నలతో ప్రారంభించి తర్వాత సిట్‌ అధికారులు డోస్‌ పెంచారు. కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలు సేకరించారు సిట్‌ అధికారులు. మరోవైపు ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చిన ఉస్మానియా వైద్య బృందం.. పూరీ బ్లడ్‌ శాంపిల్స్‌ను తీసుకుంది. రేపు సిట్‌ అధికారులు శ్యామ్‌ కే నాయుడును విచారించనున్నారు. 

 

21:37 - July 19, 2017

మద్యం షాపులను ఎత్తివేయాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ మహిళ నాయకురాలు తాటి శంకుతల, ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల భాగ్యలక్ష్మీ, ఐద్వా నాయకురాలు శ్రీదేవి పాల్గొని, మాట్లాడారు. విచ్చిలవిడిగా మద్యం అమ్మకాలను నియంత్రిచాలని తెలిపారు. మద్య నిషేధం కోసం మహిళలు, పురుషులు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీని తప్పుపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:32 - July 19, 2017

చెన్నై : తమిళనాడులో కరువు బారిన పడ్డ రైతులు రుణమాఫీ కోసం అల్లాడుతుంటే...ఎమ్మెల్యేలు మాత్రం బంపర్‌ ఆఫర్‌ కొట్టేశారు. తమిళనాడు ఎమ్మెల్యేల జీతభత్యాలు ఏకంగా వందశాతం పెంచేశారు. ప్రస్తుతం నెలకు 50 వేలు వేతనం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ఇక నుంచి లక్షా ఐదు వేలు డ్రా చేయనున్నారు. ఒక్కసారిగా 50 వేలు పెరిగిందన్నమాట. సాలరీ ఒక్కటే కాదు ఎమ్మెల్యేల పెన్షన్‌ కూడా పెంచేశారు. ప్రస్తుతం 12 వేలు ఉన్న పెన్షన్‌ను 20 వేలకు పెంచేశారు. అసెంబ్లీ నియోజకవర్గం ఫండ్‌ను రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో ప్రకటించారు. ఎంపీల జీతాలు కూడా పెంచాల‌ని ఇవాళ పార్లమెంట్‌లో స‌మాజ్‌వాదీ, కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే. 

 

21:31 - July 19, 2017

ఢిల్లీ : రైతుల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్‌, జెడియు లేవనెత్తాయి. రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి బదులు తూటాలు పేల్చారని మందసౌర్‌ ఘటనని పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. 150 మంది రైతులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం ఎందుకు మౌనం వీడడం లేదని ఆయన ప్రశ్నించారు. దిగుమతి సుంకం అవినీతికి ఆస్కారమిస్తోందని డిగ్గీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జెడియు నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. పప్పు దినుసులు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.  267 నిబంధన కింద రైతుల సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించిందని రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ చెప్పడంతో అక్కడితో ఆ అంశం సద్దుమణిగింది. 

 

21:21 - July 19, 2017
21:12 - July 19, 2017
21:11 - July 19, 2017
21:09 - July 19, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రు బాధితులకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్‌పీ హర్షకుమార్‌ డిమాండ్‌ చేశారు. గరగపర్రులో సాంఘీక బహిష్కరణకు గురైన బాధితులను ఆయన కలిశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25 నుండి దీక్ష చేపడతానని, 26వ తేదీన దళిత సంఘాలు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తాయని హర్షకుమార్‌ హెచ్చరించారు.

 

21:06 - July 19, 2017

హైదరాబాద్ : టీఆర్ ఎస్ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి హత్య... పూర్తిగా వ్యక్తిగత కక్షలతో జరిగిందని వరంగల్‌ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పష్టం చేశారు. కేసు విచారణలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. ప్రధాన నిందితుడు చెప్పిన ప్రకారమే రిపోర్ట్‌లో కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్‌రెడ్డి సహా ఇతర పేర్లు చేర్చామని సుధీర్ బాబు తెలిపారు. 

21:04 - July 19, 2017

ప్రకాశం : కనిగిరి ప్రభుత్వ వసతి గృహాలపై ఎసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌ తన బృందంతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలేజి హాస్టల్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ.. హాస్టల్‌ వార్డెన్‌ వెంకటరెడ్డి అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. అవినీతికి పాల్పడుతున్న వార్డెన్‌పై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

 

21:02 - July 19, 2017

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీపై పోలీసులు దాడిచేశారు. అర్బన్‌ జిల్లా పరిధిలోని రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామంలో ఉన్న ఫ్యాక్టరీని సీజ్‌ చేశారు. ఫ్యాక్టరీని నిర్వహిస్తున్న నిమ్మన నాగేశ్వర్రావుని అరెస్ట్‌ చేసి, 36 లక్షల విలువైన గుట్కా బస్తాలను, మిషనరీని స్వాధీనం చేసుకున్నారు. 

20:56 - July 19, 2017

హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా గత మూడు రోజులుగా రెండు రాష్ట్రాల్లో  భారీవర్షాలు  కురిశాయి.  ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో రేపటి వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ అంటోంది. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఇటు భారీవర్షాలతో హైదరాబాద్‌లో జనం నానా అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో రెండు రోజుల పాటు భయపెట్టిన వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌ ...,పూరీ మధ్య తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీవర్షాలు పడ్డాయి. మరోవైపు ఒడిశా, ఏపీ , తెలంగాణ ప్రాంతంలో  ఉపరితల ఆవర్తనం కొనసాగుతూనే ఉంది. దీంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడున్నాయి. 
ఒడిశాలో ఇంకా భారీ వర్షాలు 
ఒడిశాలో ఇంకా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో నదులకు వరదనీరు పోటెత్తుతోంది. నాగావళి, వంశధార పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ పలుగ్రామాలు జలదిగ్బధంలోనే ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల అధికార యంత్రాంగం సహాయక చర్యలు తీసుకుంటోంది. 
హైదరాబాద్‌ లో తీవ్ర ఇబ్బందులు 
కుండపోత వానతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు చేరింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అడుగడుగునా ట్రాఫిక్‌ జామ్‌లతో వాహనదారులు విసుగెత్తిపోతున్నారు. భారీ వర్షం నేపథ్యంలో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో భాగ్యనగరంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి.  లింగంపల్లి నుంచి గచ్చిబౌలి  మార్గం, మియాపూర్‌ నుంచి కొండాపూర్‌ రూట్‌, జెఎన్ టీయూ నుంచి హైటెక్‌ సిటీకి వేళ్లే మార్గాల్లో రోడ్లు డ్యామేజీ అయ్యాయి. అటు పాతబస్తీ పరిసరప్రాంతాల్లో కూడా  రోడ్లన్నీ పాడయ్యాయి.  మాదన్నపేట, అజింపుర, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌ ఏరియాల్లో  గుంతలు పడిన రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 
చెరువులు జలకళ
భారీ వర్షాలు ముంచెత్తడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రాంతాల్లో పడుతున్న భారీవర్షాలతో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. అటు ఖమ్మం జిల్లా మున్నేరు వాగులో వరద ఉధృతి కొనసాగుతోంది. కష్ణానదిలోకి చేరుతున్న వరద ప్రవాహం  దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజిల్లోకి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టుల్లో  క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం 12అడుగులకు చేరుకుంది.  
ఉధృతంగా  ప్రవహిస్తున్న వాగులు, వంకలు 
అటు భద్రాద్రిజిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్మగూడెం మండలాల్లో.. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తుండటంతో 18 గేట్లు ఎత్తి 65 వేల 200 క్యూసెక్కుల  నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 24 అడుగులకు చేరింది. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉన్నామని అధికారులు అంటున్నారు. ముంపు బాధితుల కోసం తగిన చర్యలు తీసుకున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  వరద ప్రభావం పెరుగుతుండటంతో దిగువన ధవళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ఇంకా వరద వస్తుండటంతో.. ప్రాజెక్టులోని 143 గేట్లను ఎత్తి..90వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. విస్తారంగా వర్షాలు పడుతుండటంతో తెలుగురాష్ట్రాల్లో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కదశలో ఉన్న పంటలకు వర్షాలు ప్రాణం పోశాయయంటున్నారు. మరోవైపు  మధ్యబంగాళఖాతం మీదుగా  ఏపీ, తెలంగాణ వరకు  కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది.  

ఢిల్లీలో గళమెత్తిన రైతు సంఘాలు

ఢిల్లీ : సమస్యలపై రైతు సంఘాలు గళమెత్తాయి. గిట్టుబాటు ధర కల్పించాలంటూ... రుణమాఫీ కోరుతూ... రైతులు.. జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రైతులు పాల్గొన్నారు. 

20:51 - July 19, 2017

హైదరాబాద్‌ : ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. బ్లడ్‌ శాంపిల్స్‌ కిట్‌తో మెడికల్‌ సర్జరన్‌ సిట్‌ కార్యాలయంలోకి వెళ్లారు. పూరీ జగన్నాథ్‌కు రక్త పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పూరీజగన్నాథ్‌ డ్రగ్స్‌ తీసుకున్నారో.. లేదో అధికారులు నిర్ధారించనున్నారు. ముందు కెల్విన్‌ ఎవరో తెలియదంటూ బుకాయించిన పూరీ.. సిట్‌ విచారణలో అడ్డంగా దొరికిపోయారు. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో కెల్విన్‌ ఫొటోను చూపించి పూరీని సిట్‌ అధికారులు నిలదీశారు. ముందు సాధారణ ప్రశ్నలతో ప్రారంభించి తర్వాత డోస్‌ పెంచారు. కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలను సైతం అధికారులు సేకరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:49 - July 19, 2017

ఢిల్లీ : సమస్యలపై రైతు సంఘాలు గళమెత్తాయి. గిట్టుబాటు ధర కల్పించాలంటూ... రుణమాఫీ కోరుతూ... రైతులు.. జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రైతులు పాల్గొన్నారు. రుణమాఫీ చేయాలని చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న తమిళనాడు రైతులు... పుర్రెలతో నిరసన తెలిపారు. ఓవంక రుణమాఫీ కోసం తమిళరైతులు పోరాటం చేస్తుంటే... మరోవంక ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు... జీతభత్యాలు రెట్టింపు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో... ఎమ్మెల్యే నెలసరి వేతనం 50 వేల రూపాయల నుంచి లక్షా 5 వేలకు పెరిగింది.  

 

20:45 - July 19, 2017
20:44 - July 19, 2017
20:43 - July 19, 2017

శ్రీకాకుళం : పొంటపొలాల్లో కలిసి కట్టుగా, విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ తాము పడుతున్న శ్రమను మర్చిపోతారు. వరిపైర్లను లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తారు. పంటలు బాగా పండాలని, తమ యజమానికి లాభాలు చేకూరాలని పాటల ద్వారా వేడుకుంటారు. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలోని వరినాట్లు వేసే రైతుల స్టైల్‌ఆఫ్‌ వర్కింగ్‌.
నాట్లు వేసే సమయంలో పాటలు
శ్రీకాకుళం జిల్లాలో వరినాట్ల సీజన్‌ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. వర్షాలు విరివిగా కురుస్తుండటంతో పదిహేను రోజుల నుండి ఊబలు వేయడం ప్రారంభించారు. వరినాట్లు వేసేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. మహిళలే ఈ పని చేయడానికి ఎక్కువశాతం ఆసక్తి చూపుతారు. నాట్లు వేసే సమయంలో అలసట తెలీకుండా ఉల్లాసంగా పనిచేయడానికి పాటలు పాడటం ఆనవాయితీగా వస్తోంది. 
మత్య్సకారుల కూలీలు అధికం 
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనమిది మండలాలున్నాయి. కవిటి నుండి గార వరకు గల తీర ప్రాంతంలో ఎక్కువ  శాతం కూళీలు మత్య్సకారులె. వీళ్లందరూ పాటలు పాడుతూ, సరదాగా పనిచేయడం వారసత్వంగా వస్తుంది. మహిళలు అందరూ నోటితో ఊళలు వేస్తూ ఒకేసారి లక్ష్మీదేవిని కొలుస్తూ పాటలు పాడుతుంటారు. ఆడుతూ పాడుతూ  పనిచేసే వీళ్ల పనితీరు.. చూసే వారికి చాలా సరదాగా కనిపిస్తుంటుంది. ఖరీఫ్‌, రబీ సీజన్లలో, వరినాట్ల సమయంలో ఈ తరహా స్వరాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఉద్దాన ప్రాంతంలోని పంటపొలాలలో ఈ తరహా సాంప్రదాయం కొనసాగుతోంది. ఉదయం పొలాల్లో అడుగు పెట్టినప్పడినుండి సాయంత్రం పనిలో నిమగ్నమయ్యే కూళీలంతా చెప్పులు వేసుకోకుండానే పొలాల్లో అడుగుపెడతారు. పూజలు, పాటలతో లక్ష్మీదేవిని కొలుస్తూ పనులు చేసుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని కూళీలు చెబుతున్నారు.

 

ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ చైర్మన్ గా జేఆర్ పుష్పరాజ్ ను నియమించారు. కమిషన్ లో చైర్మన్ తోపాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఆహార కమిషన్ సభ్యులుగా నీలయపాలెం విజయకుమార్ (చిత్తూరు), జి.కృష్ణమ్మ (కర్నూలు), డా.స్వర్ణ గీత (ప్రకాశం), ఎల్.వెంకట్రావు (విశాఖ), ఎన్.శ్రీనివాసరావు(తూ.గో), రాష్ట్ర ఆహార కమిషన్ పదవీకాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది. 

ఎమ్మెల్యేలు వేతనం పెంచుకోవడం సిగ్గుచేటు : అయ్యకన్ను

చెన్నై : పంటలకు కనీస మద్దతు ధర పెంచకుండా ఎమ్మెల్యేలు వేతనం పెంచుకోవడం సిగ్గుచేటని తమిళనాడు రైతు పోరాటం నేత అయ్యకన్ను అన్నారు. మద్దతు ధరపై సీఎం పళనిస్వామి ప్రధానితో మాట్లాడాలని కోరారు. దశాబ్ధాలుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగాయన్నారు. పంటలకు మద్దతు ధర మాత్రం పెరగడం లేదని చెప్పారు. రేపటి నుంచి రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

19:59 - July 19, 2017

నిజామాబాద్‌ : జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్నారు. జూలై 6న ఓ బ్యాంకులో.. ఆ తరువాత 8 దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డా.. ఒక్క దొంగా పట్టుపడలేదు. మరోవైపు పోలీసుల వైఫల్యమే అందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
వరుస దొంగతనాలు 
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో దోపిడి దొంగలు చెలరేగిపోతున్నారు. వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ కోఆపరేటివ్ బ్యాంక్‌లో సీసీ కెమెరాలు పగలగొట్టి చోరికి విఫలయత్నం చేశారు. స్ట్రాంగ్ రూం తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. వెళ్లే ముందు అక్కడి బీరువా.. సిస్టమ్స్ పగలగొట్టారు. 
మీ సేవ సెంటర్‌.. వైన్ షాపులు టార్గెట్‌ 
బ్యాంకు దోపిడి విఫలం కావడంతో ప్రధాన రహదారిపై ఉన్న మీ సేవ సెంటర్‌.. వైన్ షాపులను టార్గెట్‌ చేశారు. ఆ రెండు చోట్ల చోరీకి పాల్పడి రెండు లక్షల వరకు ఎత్తుకెళ్లారు. ఇదే మండలంలోని పకిరాబాద్‌లో ఓ మహిళ మెడ నుంచి బంగారపు తాళిబొట్టు దోచుకెళ్లారు . ఇక పొలాల్లో రైతులు వేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్లను సైతం దొంగలు వదిలిపెట్టట్లేదు. ఇలా ఒకదాని తరువాత ఒకటి చోరీలు జరగడంతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. 
పోలీసులపై విమర్శలు 
నిజామాబాద్‌ జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాల్ని పోలీసులు లైట్‌గా తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసు పెడితే చూసి వెళ్లడమే తప్ప.. ఆ తరువాత దానిపై దర్యాప్తు చేపట్టట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

 

19:55 - July 19, 2017

అనంతపురం : ఏపీలో టీచర్ల బదిలీ విషయం ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. రోజుకొక నిర్ణయంతో టీచర్లు సతమతమవుతున్నారు. పాయింట్ల విధానంతో  ప్రతీ రోజూ ఉపాధ్యాయులు టెన్షన్‌ పడుతున్నారు. ఒక్క అనంతపురంలోనే పది వేల మంది టీచర్లు ట్రాన్స్‌ఫర్ల కోసం అప్లై చేసుకొన్నారంటే.. టీచర్లలో ఎంత టెన్షన్‌ ఉందో అర్థమవుతుంది. 
10 వేల మంది దరఖాస్తు 
అనంతపురం జిల్లాలో 10 వేల మందికి పైగా టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎనిమిదేళ్లు, ఐదేళ్లు పూర్తయిన వాళ్లు, ప్రధానోపాధ్యాయులు ఇలా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 8 వేల మంది బదిలీకి అర్హులు కాగా.. మిగిలిన వారిని ఖాళీ అయిన స్థానాల్లో అవకాశముంటే బదిలీ చేస్తారు. ఇలా అందరికీ బదిలీ ఫీవర్‌ పట్టుకొంది. 
ఉపాధ్యాయుల్లో టెన్షన్‌  
ట్రాన్సిషన్‌ పాయింట్లు, మిడ్‌ డే మీల్స్‌ పాయింట్‌లు ఇలా ఒకటేమిటి ఒకదానికొకటి లింక్‌పెట్టి పాయింట్లలో కోతలు పెడుతున్నారు. దీంతో ఏ క్షణం ఎలాంటి నిర్ణయం వినాల్సి వస్తుందోనని ఉపాధ్యాయులు టెన్షన్‌ పడుతున్నారు. మరోవైపు జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం ఎవరికీ అన్యాయం జరగదంటూ హామీలిస్తున్నారు. ఖాళీల లిస్టుతో పాటు, సీనియారిటీ లిస్టు ప్రకటిస్తామని.. ఎవరికైనా అభ్యంతరాలుంటే పరిష్కరించి మళ్లీ లిస్టును ప్రకటించి బదిలీలను పూర్తి చేస్తామని డీఈఓ లక్ష్మీ నారాయణ తెలిపారు. 
పాయింట్ల విధానం వల్ల గందరగోళం 
మరోవైపు టీచర్లు మాత్రం పాఠశాలలో ఉంటూనే తమకు వచ్చిన పాయింట్‌లకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందోనన్న ఆందోళనలో గడుపుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పడమే మరచిపోతున్నారు. ఎలాగూ ట్రాన్స్‌ఫర్‌ కావలసిందే అన్న ఆలోచనలో ఉన్న ఉపాధ్యాయులు.. పిల్లలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పాయింట్ల విధానం వల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటికైనా వాటన్నింటినీ సరి చేసి బదిలీలు చేపట్టి ఉంటే బాగుండేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తానికి ఈ పాయింట్ల అంశం ఉపాధ్యాయులను గందరగోళానికి గురి చేస్తోంది. 

 

19:44 - July 19, 2017

వరంగల్ : అతను శ్రమను నమ్ముకున్న ప్రతిభా వంతుడు.. పేదరికాన్ని జయించిన సరస్వతీ పుత్రుడు. యువత కోసం ఆరాట పడుతున్న తపనపరుడు. అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న విజేత. ప్రొఫెసర్‌ తాళ్లపల్లి వంశీ సాధించిన అరుదైన ఘనతపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. 
సాధారణ కుటుంబంలో పుట్టిన వంశీ  
అతి సామాన్య వ్యక్తిగా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ప్రొఫెసర్ తాళ్లపల్లి వంశీ. సాధారణ కుటుంబంలో పుట్టిన వంశీ పట్టుదల ముందు.. పేదరికం తల వంచింది. విద్యావేత్త అయిన తన తండ్రి తాళ్ల మల్లేశం ప్రోత్సహంతో.. వంశీ ఎంటెక్‌, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. యువతను, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రయోజకులను చేయాలని వంశీ తపన పడుతున్నాడు. 
తాళ్ల పద్మావతి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ 
త్రినగరిగా ప్రసిద్ది చెందిన వరంగల్‌లో.. సోమిడిలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్ కళాశాలలో వంశీ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఇంజినీరింగ్ కళాశాల నడపడంలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నాడు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుకుంటున్న దశలోనే.. వారికి నచ్చిన ప్రొఫెషన్‌లో స్థిరపడాలని వంశీ తపన పడ్డాడు. అందుకే తాళ్ల పద్మావతి సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ను నెలకొల్పాడు. ప్రతీ యేటా విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడానికి వివిధ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాడు. 
20 శాతం మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు 
వంశీ అనియన్ హెల్త్ కేర్ సంస్థతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకొని.. తమ సొంత కాలేజీలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. ప్రతీ ఏడాది 20 శాతం మంది విద్యార్థులకు.. ఉపాధి అవకాశాలను కళాశాలలోనే కల్పిస్తున్నారు. సొంత సాఫ్ట్ వేర్ సంస్థ టీపీ సొల్యూషన్స్‌తో కళాశాల విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్నారు. 
వంశీకి అవకాశం కల్పించిన కేంద్రం 
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో సాంకేతిక విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు నిపుణులతో కూడిన కమిటీని వేసింది. దానిలో భాగంగా ప్రొఫెసర్ తాళ్లపల్లి వంశీ ట్రాక్ రికార్డును పరిశీలించిన భారత ప్రభుత్వం.. దక్షిణ భారత దేశం నుంచి ప్రొఫెసర్ వంశీకి అవకాశం కల్పించింది.
కమిటీలో.. 19 మంది మేధావులు 
అసోషియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నేతృత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కమిటీలో.. 19 మంది  మేధావులు ఉన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ సహస్రబుద్ది కమిటీకి నాయకత్వం వహిస్తారు. జులై 10 నుంచి ఏడు రోజుల పాటు యూకేలో ఈ కమిటీ పర్యటించనుంది. పేరు పొందిన యూనివర్శిటీ ఆఫ్ లండన్, కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బర్నల్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్‌ను మేధావుల కమిటీ సందర్శిస్తోంది. 
పారిశ్రామిక వేత్తలను, విద్యావేత్తలను కలుస్తోన్న కమిటీ 
స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కోసం కమిటీ ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటుంది. యూకేలోని  భారత దౌత్య కార్యాలయ సిబ్బందిని, యూకే దౌత్య కార్యాలయ సిబ్బందిని, అక్కడి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులను, పారిశ్రామిక వేత్తలను, విద్యావేత్తలను కమిటీ కలుస్తోంది. హెచ్ ఆర్డీ మంత్రి, ప్రధాన మంత్రులకు నివేదికను అందజేస్తుంది. కోరిక మాత్రమే ఉంటే సరిపోదు దాన్ని నెరవేర్చుకోవాలనే తపన ఉంటేనే.. ఎవరైనా ఏమైనా సాధిస్తారని వంశీ నిరూపించారు. 

19:36 - July 19, 2017

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతుల గోడు పట్టడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా.. ఇప్పటికీ కౌలు రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా వ్యవసాయ రంగాన్ని నష్టాల్లోకి నెట్టుతుండడంతో.. అప్పులు చేసి కౌలు రైతులు రోడ్డున పడుతున్నారు. 
పట్టణాలకు వలస వెళ్తోన్న పెద్ద రైతులు 
పట్టణీకరణ రోజురోజుకీ పెరుగుతోంది. పిల్లల చదువులు, ఉద్యోగాల పేరుతో గ్రామాల్లోని పెద్ద రైతులు పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో వారి భూములను కౌలుకు తీసుకుని సాగుచేసి.. రాష్ట్ర అభివృద్ధిలో కౌలు రైతులు కీలకంగా మారారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇపుడు వ్యవసాయం కౌలు రైతుల కష్టం మీదే ఆధారపడి ఉందని చెప్పాలి. అలాంటి అన్నదాతలు ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. 
కౌలు రైతుల పరిస్థితి దయనీయం 
నెల్లూరు జిల్లాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్న.. ఈ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారు. లక్షలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. అయితే  వ్యవసాయం రంగం సంక్షోభంలో ఉండడంతో పాటు,  ప్రభుత్వ విధానాల వల్ల ఇపుడు కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవడమే కష్టంగా మారుతోంది. 
వడ్డీలేని రుణం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు 
2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కౌలు రైతులకు ఎన్నో హామీలిచ్చారు. కౌలు రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. గుర్తింపు కార్డులిచ్చి రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారో.. అవన్నీ కౌలురైతులకు కూడా వర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణం, ఇన్ పుట్ సబ్సిడీలు కల్పిస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. జిల్లాలో లక్ష మంది కౌలు రైతులుంటే 30 వేల మందికి ఎలాంటి ఉపయోగంలేని గుర్తింపు కార్డులిచ్చారు. 2011లో ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తీసుకొచ్చినా దాంట్లోని ఏ అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు. 
బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు, మందులు, విత్తనాలు 
కౌలు రైతులకు తలనొప్పిగా ప్రభుత్వ విధానాలు  
మరోవైపు ప్రభుత్వ విధానాలు కూడా కౌలు రైతులకు తలనొప్పిగా మారాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆన్ లైన్ లో ఎరువులు, మందులు, విత్తనాలు అందించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో పట్టాదారు పుస్తకాలను ఆధార్‌కు లింకు చేస్తారు. దాని ఆధారంగా వ్యవసాయాధికారి గుర్తించి పర్మిషన్‌  ఇస్తాడు. దానిని ఆన్ లైన్ ద్వారా అనుమతి తీసుకుని డీలర్ల వద్దకు వెళ్తే.. అపుడు ఎరువులు, మందులు, విత్తనాలు సబ్సిడీకి అందిస్తారు. ఈ ఆన్ లైన్ విధానం వల్ల వ్యవసాయం సాగడం కష్టమని.. ఒక వేళ సబ్సిడీలో దొరక్కపోతే బ్లాక్‌లో కొనుగోలుచేయాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులంటున్నారు. యూరియా సబ్సిడీలో 300 రూపాయలుంటే బ్లాక్‌లో 1500 రూపాయలని, అదే డిఏపి సబ్సిడీలో 1300 ఉంటే బ్లాక్‌లో 3500 లకు లభిస్తుండడంతో బాగా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. 
రైతులకు అందని ఇన్ పుట్ సబ్సిడీ  
అలాగే ఇన్ పుట్ సబ్సిడీ కూడా కౌలు రైతులకు అందడంలేదు. వ్యవసాయం చేయని రైతుకే అందుతోంది. భూమి మీద ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వారికే సబ్సిడీ ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నా అవేమీ నెరవేరడంలేదు. కౌలు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం జాతాలు, బహిరంగ సభలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కౌలు రౌతులు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. 

 

19:18 - July 19, 2017

ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఉస్మానియా వైద్య బృందం

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. బ్లడ్ శాంపిల్స్ కిట్ తో సిట్ కార్యాలయంలోకి మెడికల్ సర్జన్ వెళ్లారు. పూరీ జగన్నాథ్ కు రక్త పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారో..లేదో ధికారులు తేల్చనున్నారు. సిట్ విచారణలో పూరీ జగన్నాథ్ అడ్డంగా దొరికాడు. ముందు కెల్విన్ ఎవరో తెలియదంటూ పూరీ బుకాయించారు. 

19:11 - July 19, 2017

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. బ్లడ్ శాంపిల్స్ కిట్ తో సిట్ కార్యాలయంలోకి మెడికల్ సర్జన్ వెళ్లారు. పూరీ జగన్నాథ్ కు రక్త పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నారో..లేదో ధికారులు తేల్చనున్నారు. సిట్ విచారణలో పూరీ జగన్నాథ్ అడ్డంగా దొరికాడు. ముందు కెల్విన్ ఎవరో తెలియదంటూ పూరీ బుకాయించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:44 - July 19, 2017
18:39 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌  సిట్‌ విచారణ కాసేపట్లో ముగియనుంది. పూరీని మూడు కోణాల్లో సిట్‌ అధికారులు విచారించారు. వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారాలపై ప్రశ్నలు వేశారు. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్‌కి కెల్విన్‌ కూడా వచ్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. కెల్విన్ గురించి స్పష్టంగా ఎలాంటి విషయాలు చెప్పని పూరీ.. ఓ దశలో కెల్విన్ ఎవరో తెలియదన్నట్లు వ్యవహరించారు. కెల్విన్ ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా తనకు పరిచయం అయినట్లు పూరీ తెలిపారు. కెల్విన్‌ ఎల్ఎస్‌డీ సప్లై చేస్తాడని తర్వాత తెలిసిందని.. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వ సాధారణమని పూరీ చెప్పుకొచ్చారు. వీకెండ్స్‌లో సన్నిహితులతో కలిసి పబ్బులకు వెళ్తానన్న పూరీ.. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అమీర్‌పేటలో హోర్డింగ్స్‌ తొలగింపులో ఉద్రిక్తత

హైదరాబాద్ : అమీర్‌పేటలో హోర్డింగ్స్‌ తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలకు గాలి వెలుతురు రాకుండా మొత్తం భవనాన్ని హోర్డింగులతో కప్పేశారని గ్రేటర్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే అధికారుల చర్యలను వ్యాపారులు, సాప్ట్‌వేర్ ఇనిస్టిట్యూట్ల ప్రతినిధులు అడ్డుకున్నారు. హోర్డింగ్స్‌ తొలగిస్తే.. తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ... రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వ్యాపారుల ధర్నాతో అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

18:31 - July 19, 2017

హైదరాబాద్ : అమీర్‌పేటలో హోర్డింగ్స్‌ తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా భవనాలకు గాలి వెలుతురు రాకుండా మొత్తం భవనాన్ని హోర్డింగులతో కప్పేశారని గ్రేటర్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే అధికారుల చర్యలను వ్యాపారులు, సాప్ట్‌వేర్ ఇనిస్టిట్యూట్ల ప్రతినిధులు అడ్డుకున్నారు. హోర్డింగ్స్‌ తొలగిస్తే.. తమ జీవనోపాధి దెబ్బతింటుందంటూ... రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వ్యాపారుల ధర్నాతో అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కాసేపట్లో ముగియనున్న పూరీ సిట్‌ విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌  సిట్‌ విచారణ కాసేపట్లో ముగియనుంది. పూరీని మూడు కోణాల్లో సిట్‌ అధికారులు విచారించారు. వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారాలపై ప్రశ్నలు వేశారు. జ్యోతిలక్ష్మి సినిమా ఆడియో ఫంక్షన్‌కి కెల్విన్‌ కూడా వచ్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. 

18:21 - July 19, 2017
18:20 - July 19, 2017

హైదరాబాద్ : తన కూతురుకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని హీరోయిన్ చార్మి తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ అన్నారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. 13 ఏళ్ల వయసులోనే చార్మి సినీ రంగప్రవేశం చేసిందని తెలిపారు. సినీ రంగంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని పేర్కొన్నారు. తన కూతురు గురించి తనకు బాగా తెలుసు అన్నారు. ట్విట్టర్ లో తన తండ్రికి చార్మీ కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

17:44 - July 19, 2017
17:17 - July 19, 2017

కొహిమా : నాగాలాండ్‌ నూతన ముఖ్యమంత్రిగా జెలియాంగ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ..టీఆర్‌ జెలియాంగ్‌ను గవర్నర్‌ పీబీ ఆచార్య ఆహ్వానించారు. అసెంబ్లీలో బలపరీక్షకు ప్రస్తుత సీఎం లీజిత్సు హాజరుకాకపోవడంతో జెలియాంగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లిజిత్సు గత 5 నెల‌లుగా అధికారంలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గం.ల‌కు రాజ్ భ‌వ‌న్‌లో జెలియాంగ్‌ ప్రమాణ‌ స్వీకారం చేశారు. టీఆర్ జెలియాంగ్‌ను జూలై 22లోగా అసెంబ్లీలో బ‌లాన్ని నిరూపించుకోవాల‌ని గ‌వ‌ర్నర్ ఆదేశించారు. గ‌త ఫిబ్రవ‌రిలో ఆదివాసీల నిర‌స‌న‌ల కార‌ణంగా జెలియాంగ్‌ ముఖ్యమంత్రి ప‌ద‌వి నుంచి వైదొల‌గడంతో లిజిత్సు సిఎం అయ్యారు. మొత్తం 47 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తనకే మద్దతిస్తున్నారని...తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని జెలియాంగ్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. దీంతో అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆచార్య ప్రస్తుత సీఎం లీజిత్సుకు సూచించగా...అసెంబ్లీకి హాజరు కాకుండా డుమ్మా కొట్టారు.

17:15 - July 19, 2017

ఢిల్లీ : రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ... అన్ని రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలు మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ నుంచి ర్యాలీగా ఢిల్లీకి చేరుకున్నారు. మెడలో బంగాళాదుంపలు దండగా మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

17:09 - July 19, 2017
17:05 - July 19, 2017

కృష్ణా : విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్శిటీ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఫాతిమా కాలేజీకి ఎంసీఐ అనుమతి రద్దు చేయడంతో రోడ్డునపడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎంకు, మంత్రి కామినేనిని కలిసినా న్యాయం జరగలేదన్నారు. ఇందులో పెద్దవ్యక్తుల ప్రమేయం ఉందంటున్న విద్యార్థులు.. 50 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. మంత్రి, ముఖ్యమంత్రి- మాట తప్పితే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని విద్యార్థులు అంటున్నారు. లక్షల ఫీజులతో పాటు రెండేళ్ల విద్యా సంవత్సరం కోల్పోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:04 - July 19, 2017

డెంగ్యూ వ్యాధి దోమలతో వస్తుందనే విషయం తెలిసిందే. ఈజిప్టి జాతి దోమ ద్వారా రోగగ్రస్తుల నుండి..ఈ వ్యాధి సోకుతుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు పగటిపూటే కుడుతాయి. దోమ కుట్టిన ఐదు..ఎనిమిది రోజుల తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటాయి. మరి ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..చూద్దాం..

వ్యాధి లక్షణాలు..
నోరు ఎండిపోవడం జరుగుతుంది. దాహం కూడా అధికమౌతుంది.
కండరాలు..కీళ్ల నొప్పులుంటాయి.
వాంతి అవుతున్నట్లు అనిపిస్తుంటుంది.
జ్వరం అధికంగా వస్తుంది.
తలనొప్పి కూడా అధికంగా ఉంటుంది.

ఈ లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మేలు. వ్యాధి ఉందో..లేదో నిర్ధారణ చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. నీరు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటే ఈ రకమైన దోమలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా తొట్టీలు..కుండీలు..ఖాళీ డ్రమ్ములు..బిల్డింగ్ లపై నిలిచిన వాన నీటిలో ఎక్కువగా పెరుగుతుంటాయి.

జాగ్రత్తలు..
డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. నీరు నిల్వకుండా చూసుకోవాలి. ఇళ్ల వెలుపల నీటి నిల్వలను పారేయాలి. నీటి ట్యాంకుకు మూత వేయాలి. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించి, వారంలో ఒక రోజు డ్రైడే విధానాన్ని తప్పక పాటించాలి.

  • దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి కాపాడుకోవాలి.
  • శరీరంలోని అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
  • పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేటట్లు దుస్తులు వేయాలి.
  • పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించాలి.
  • జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
17:02 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను సిట్‌ అధికారులు మళ్లీ విచారిస్తున్నారు. కెల్విన్‌ పాత్రపై పూరీ 40 నిమిషాలు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిట్‌ అధికారులు..పూరీని మూడు కోణాల్లో విచారిస్తున్నారు. వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పూరీని పలు ప్రశ్నలతో సిట్‌ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. తొలుత కెల్విన్‌ ఎవరో తెలియదన్నట్లు వ్యవహరించిన పూరీ.. కెల్విన్ ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా పరిచయమైనట్లు తెలిపారు. కెల్విన్‌ ఎల్ఎస్‌డీ సప్లై చేస్తాడని తర్వాత తెలిసిందని పూరీ చెప్పినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వ సాధారణమన్న పూరీ.. వీకెండ్స్‌లో సన్నిహితులతో కలిసి పబ్బులకు వెళ్తానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తనకు డ్రగ్స్ వాడే అలవాటు లేదని పూరీ చెప్పినట్లు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ నియామకం..

అమరావతి: ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ నియమితులయ్యారు. కమిషన్ లో ఛైర్మన్ తో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఆహార కమిషన్ సభ్యులుగా నీలయపాలెం విజయ్ కుమార్ (చిత్తూరు), జి. కృష్ణమ్మ(కర్నూలు), డాక్టర్ స్వర్ణ గీత(ప్రకాశం), ఎల్. వెంకట్రావ్ ( వివాఖ), ఎన్.శ్రీనివాసరావు (తూ.గో) ఉన్నారు. రాష్ట్ర ఆహార కమిషన్ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఏపీలో ఆహారభద్రత చట్టం, లక్షిత ప్రజా పంపినీ పై ఆహార కమిషన్ దృష్టి సారించనుంది.

16:46 - July 19, 2017
16:44 - July 19, 2017

హైదరాబాద్ : ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎయిర్ లైన్స్ సంస్థల నుంచి ఊరట లభించింది. జేసీపై ఇండిగో ఎయిర్ లైన్స్ నిషేధాన్ని ఎత్తివేసింది. గతంలో విశాఖలో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై జేసీ వీరంగం సృష్టించారు. దీంతో జేసీపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి. ఇప్పుడు తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేశాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఫాతిమా మెడికల్ కాలేజీ పై స్పందించిన మంత్రి కామినేని

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ వద్ద కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.ఆత్మహత్యకు పాల్పడతామంటూ బిల్డింగ్ ఎక్కి ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన మంత్రి కామినేని మాట్లాడుతూ..విద్యార్థులను ఆదుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఫాతిమా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మోసం చేసిందన్నారు. విద్యార్థులు కట్టిన ఫీజులను వెనక్కి ఇప్పిస్తామన్నారు. సుప్రీం కోర్టు కూడా విద్యార్థుల కేసును అనుమతించలేదు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఫాతిమా కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని కామినేని హెచ్చరించారు.

16:37 - July 19, 2017

హైదరాబాద్ : నగరంలో టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి కథ సుఖాంతమైంది. నిన్నటి వరకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లేది లేదన్న పూర్ణిమసాయి మనసు మార్చుకుంది. సైకాలజిస్టులు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో పూర్ణిమలో మార్పు వచ్చింది. అమ్మ, నాన్నతో వెళ్లేందుకు అంగీకరించింది. ఇవాళ హైదరాబాద్‌ నింబోలి అడ్డ జువైనల్‌ హోమ్‌లో.. పూర్ణిమను కుటుంబ సభ్యులు, సైకాలజిస్టులు కలిశారు. వారి కౌన్సిలింగ్ అనంతరం పూర్ణిమ మనసు మార్చుకుంది. మరోసారి సీడబ్ల్యూసీ బృందం కౌన్సిలింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది. సీడబ్ల్యూసీ అధికారిక ఆదేశాలు ఇచ్చిన తర్వాతే.. పూర్ణిమసాయి తల్లిదండ్రుల చెంతకు చేరే అవకాశముంది. 40 రోజుల క్రితం.. సీరియల్స్‌లో ఇంట్రస్ట్‌తో పూర్ణిమసాయి ముంబై వెళ్లిపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:27 - July 19, 2017

అరే మన వేతనాలు పెరిగాయి తెలుసా...అరే ఎంత పెరిగింది..అంటూ లెక్కలు వేసుకుంటున్నారు...జీతాలు పెరగడంతో వాళ్లంతా సంబర పడిపోతున్నారు..ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియచేస్తున్నారు...వేతనాల కోసం వీరంతా పోరాటం చేయలేదు..కనీసం రోడ్డెక్కలేదు..డిమాండ్ చేశారంతే..అలా పెరిగిపోయాయి...ఏదో కార్మికులు..ప్రభుత్వ ఉద్యోగుల విషయం చెప్పడం లేదు. వేతనాలు పెంచుకున్నది తమిళనాడు ప్రజాప్రతినిధులు. కానీ తమకు న్యాయం..పరిహారం చేయాలని ఆందోళన చేస్తున్న రైతన్న దుఖాన్ని..కన్నీళ్ల విషయంలో ఆలోచించకపోవడం బాధాకరం..

తమిళనాడు కరవు...
తమిళనాడు..కరవు విలయతాండవం చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడి రైతులు ఆందోళన చేస్తున్నారు. తమ ఆందోళన కేంద్రం దృష్టిలో పడాలని ఏకంగా దేశ రాజధాని వేదికగా వారు కొన్ని రోజుల తరబడి ఆందోళన చేశారు. వారు చేసిన ఆందోళనలు..నిరసనలు ప్రధాన వార్తల్లోకి ఎక్కాయి. కానీ కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాల చెవికి మాత్రం ఎక్కలేదు. అర్థనగ్న ప్రదర్శనలు..మెడలో పుర్రెలు..మూత్రం తాగుతూ ఇలా తమ నిరసన వ్యక్తం చేశారు. కరువు ఉపశమన ప్యాకేజీ..రుణ మాఫీ..పంట నష్టపరిహారం ఇవ్వాలంటూ జంతర్ మంతర్ వద్ద ఆ రాష్ట్ర రైతులు ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు. ఎంత చేసినా వారిలో మాత్రం కనికరం రాలేదు. న్యాయం చేస్తామని హామీనిస్తున్నారో గాని శాశ్వత పరిష్కారం చూపించలేదు. దక్షిణాది నదుల అనుసంధాన రైతు సంఘాల సమాఖ్య నాయకులు రాష్ట్రంలో కరవు పరిస్థితుల నుండి కాపాడాలంటే రూ.40 వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎంతో మంది మృత్యువాత..
వర్షాభావ పరిస్థితులు...కావేరి జలాలను కర్ణాటక ప్రభుత్వం నిలిపివేయడం వంటి కారణాలతో అన్నదాతలు ఎంతగానో నష్టపోయారు. గత రెండేళ్లుగా అన్నదాతలు నష్టపోయారని వార్తలు వెలువడ్డాయి. అప్పు చేసి పండించుకున్న పంటలు కోత సమయానికి ముందే నీరందక కళ్లెదుటే ఎండి పోవడంతో 200 మందికి పైగా రైతులు గుండె పోటుకు గురై..ఆత్మహత్యలకు పాల్పడ్డారని మీడియాలో కథనాలు వచ్చాయి.

హైకోర్టు తీర్పు..
ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు రైతులకు మద్దతుగా తీర్పునిచ్చింది. సహకార సంఘాల నుంచి కర్షకులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించిన సంగతిత తెలిసిందే. ఐదు ఎకరాల వరకు పంట భూములు కలిగిన రైతుల రుణాలు మాఫీ చేయాలని తీర్పులో పేర్కొంది. హైకోర్టు తీర్పుపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా కేంద్ర ప్రభుత్వం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.

నిధులు ఏ మూలకు చాలుతాయి..
రైతులు చేస్తున్న ఆందోళనలు..వివిధ డిమాండ్స్ తో కేంద్రం స్పందించాల్సి వచ్చింది. రూ.1,712 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందులో 'వార్దా' తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పనులకు రూ.264.11 కోట్లు, జాతీయ తాగునీటి వినియోగ పథకానికి రూ.2.6 కోట్లను కేటాయించనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సహా అన్ని జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి, కరవు నుంచి గట్టెక్కాలంటే రూ.39 వేల కోట్ల మేరకు నిధులు తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధులు ఏ మూలకు చాలుతాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు.

పెరిగిన వేతనాలు..
రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా..రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏకంగా ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం అక్కడి ఎమ్మెల్యేలకు రూ.50 వేల నెల జీతం ఉంది. ఈ వేతనం హైక్ అయ్యింది. ఇక నుండి లక్షా 5వేలు డ్రా చేయనున్నారు. అంటే ఏకంగా రూ. 50 వేలు పెరిగిపోయింది. అంటే వంద శాతం అన్నమాట. అంతేకాదండోయ్...మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పెన్ష‌న్ కూడా పెంచేశారు. ఎమ్మెల్యేల‌ పెన్ష‌న్‌ను రూ.12 వేల నుంచి రూ.20 వేల‌కు పెంచేశారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఫండ్‌ను కూడా రెండు కోట్ల నుంచి 2.6 కోట్ల‌కు పెంచారు. ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్న‌ట్లు ఇవాళ త‌మిళ‌నాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు.

కానీ అన్నం పెట్టే రైతన్న విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని...వేతనాలు పెంచుకున్న ప్రజాప్రతినిధులు రైతన్న విషయంలో ఆలోచించాలని పలువురు కోరుతున్నారు...

ఎన్టీఆర్ హెల్త్ వర్శీటీ వద్ద మెడికల్విద్యార్థులు ఆందోళన

విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ వర్శీటీ వద్ద కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఎంసీఐ అనుమతి రద్దు చేయడంతో ఫాతిమా కాలేజీ విద్యార్థలు రోడ్డున పడ్డారు. రెండేళ్ల విద్యా సంవత్సరం కోల్పోయామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట

హైదరాబాద్: ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. జేసీ పై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నిషేధం ఎత్తివేశాయి. గతంలో విశాఖ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది పై జేసీ వీరంగం తో జేసీ పై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి.

15:57 - July 19, 2017

నిన్నటి నష్టాలను పూడ్చుకున్న స్టాక్ మార్కెట్లు

ముంబై : నిన్నటి నష్టాలను స్టాక్ మార్కెట్లు పూడ్చుకున్నట్లు తెలుస్తోంది. 244 పాయింట్లు లాభపడి 31,955 దగ్గర సెన్సెక్స్ ముగిసిన 72 పాయింట్లు లాభపడి 9,899 దగ్గర నిఫ్టీ ముగిసింది.

జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రైతుల ధర్నా

ఢిల్లీ: ఆలిండియా రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద రెండో రోజు రైతుల ధర్నా కొనసాగుతుంది. 165 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా,యూపీ, తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ చేరారు. వీరు రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న మహారాష్ట్ర రైతుల పిల్లలు కూడా పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని చిన్నారుల సందేశాన్ని కూడా అందించారు. అప్పులు కట్టలేక తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఓ చిన్నారి విలపించింది.

15:37 - July 19, 2017

చిత్తూరు : వారాంతపు రోజుల్లో దివ్యదర్శనం టోకెన్ల రద్దుపై టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. కాలినడక వచ్చే భక్తులకు వారాంతంలోనూ దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. ప్రతి రోజు 20వేల మంది కాలినడక భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. టోకెన్లు పొందిన భక్తులకు రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. వారాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని నడకదారి భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను శుక్ర, శని, ఆదివారాల్లో రద్దు చేస్తూ ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. శుక్ర,శని, వారాల్లో నడకదారి భక్తులను దర్శనానికి అనుమతించలేదు.

భక్తుల వ్యతిరేకత..
దీంతో టీటీడీ తీరుపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తులు మండిపడ్డారు. వారాంతంలోనూ కాలినడక భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీని కోరారు. వారాంతంలో దివ్యదర్శనం టోకెన్ల రద్దును భక్తులు వ్యతిరేకిస్తుండడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. టీటీడీ అధికారులు దీనిపై చర్చించారు. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో వారాంతాల్లో దివ్యదర్శనం టోకెన్లను పునరుద్దరిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఇక నుంచి నడకదారి భక్తులకు ప్రతినిథ్యం 20వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తామన్నారు. టోకెన్‌ పొందిన భక్తులకు రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

టైమ్‌స్లాట్‌ ద్వారా..
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పెరటాశినెలతోపాటు ఇతర రద్దీరోజుల్లో మినహా అన్ని రోజుల్లో కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో 6వేలు కలుపుకుని మొత్తంగా రోజుకు 20వేల టోకెన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులతో కలిపి నిత్యం 40వేల భక్తులకు టైంస్లాట్‌ ద్వారా దర్శనం కల్పిస్తున్నామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం సర్వదర్శనం భక్తులకు కూడా టైమ్‌స్లాట్‌ ద్వారా దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంటి టీటీడీ.

15:34 - July 19, 2017

వరంగల్ : గ్రామంలో ఏ సంఘటన జరిగినా ముందుగా గ్రామ పంచాయితీ గుర్తొస్తుంది. గ్రామ పంచాయితీ అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారు. కానీ అలాంటి గ్రామ పంచాయితీకి ఓ చోట తాళం పడింది. వరంగల్ రూరల్ జిల్లా, వర్ధన్నపేట మండలంలో గ్రామపంచాయితీకి తాళం పడింది. పంచాయితీ భవన నిర్మాణ నిధులు రాలేదని గ్రామ ఉప సర్పంచ్‌ మరియు వార్డు సభ్యులు కలిసి తాళం వేశారు.

2013 లో ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామ పంచాయితీ భవనం మంజూరైందని గ్రామ ఉప సర్పంచ్‌ తెలిపారు. నిధులు సకాలంలో రాకపోవడంతో గ్రామపంచాయితీకి సంబంధించిన పాలక వర్గ సభ్యులంతా కలిసి.. కొంత మొత్తంలో డబ్బులు జమ చేశారు. భవన నిర్మాణాన్ని పూర్తి చేసి నాలుగు ఏళ్లు గడుస్తున్నాయి. తమకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ముట్టలేదని.. అందుకే గ్రామ పంచాయితీకి తాళం వేశామని వార్డు సభ్యులు అంటున్నారు. కేవలం సంబంధిత ఏఈ అధికారి నిర్లక్ష్య వైఖరికి తామంతా బలి కావాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన గ్రామ పంచాయితీ బిల్లును త్వరగా రప్పించాలని కోరుతున్నారు.

బిల్లులు వచ్చేంత వరకూ భవనాన్ని గ్రామ పంచాయితీ కోసం వాడేది లేదని వీళ్లు తేల్చి చెబుతున్నారు.

5గం.లకు అకున్ సబర్వాల్ మీడియా సమావేశం...

హైదరాబాద్ : సాయంత్రం 5 గంటలకు ఆబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్‌సబర్వాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సమావేశంలో డ్రగ్స్ కేసులో విచారణకు సంబంధించిన విషయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ నుంచి నలుగురు సిట్ అధికారుల బృందం డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. సిట్ అధికారి శ్రీనివాస్ రావు నేతృత్వంలో పూరీ జగన్నాథ్ విచారణ కొనసాగుతున్నది.

తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించిన పూర్ణిమ సాయి

హైదరాబాద్: విద్యార్థిని పూర్ణిమ సాయి సస్పెన్స్ వీడింది. తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు పూర్ణిమ అంగీకరించింది. సైకాలజిస్టులు ఇచ్చిన కౌన్సిలింగ్ తో పూర్ణిమ లో మార్పు వచ్చింది. జువైనల్ హోమ్ లోని పూర్ణిమ ను సైకాలజిస్టులు,కుటుంబ సభ్యులు కలిశారు. 

15:12 - July 19, 2017
15:11 - July 19, 2017

హైదరాబాద్ : నగరానికి ఏమైంది. బ్రాండ్ ఇమేజ్ పేరు ఉన్న హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. విద్యార్థులు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు..యువతను టార్గెట్ చేసిన ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఛైన్ సిస్టం మాదిరిగా ఎవరికీ తెలియకుండా డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. కెల్విన్ ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వీరి విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. టాలీవుడ్..స్కూళ్లు..కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఎక్సైజ్ శాఖ అధికారి అకూన్ సబర్వాల్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై బుధవారం సిట్ అధికారులు విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిరోజు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను విచారిస్తుండగా... మరో డ్రగ్స్ ముఠా పోలీసులకు పట్టుబడడం కలకలం రేపింది. కాల్ డేటా ఆధారంగా దాడులు చేస్తుండడంతో ఒక్కో ముఠా బయటపడుతోంది. నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు జరిపిన దాడుల్లో 9 మందిని అరెస్టు అయ్యారు. వీరిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వీరివద్ద 17 డోస్‌ల ఎన్‌ఎస్‌డీ, 300 గ్రాముల కొకైన్‌..ఒక ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ? వీరి వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు ? ఎంతకాలం నుండి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు ? తదితర విషయాలు విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది.

నాకూతురుకు డ్రగ్స్ వాడే అలవాటు లేదు: చార్మీ తండ్రి

ఉప్పల్ : నాకూతురుకు డ్రగ్స్ వాడే అలవాటు లేదు అని చార్మి తండ్రి దీప్ సింగ్ స్పష్టం చేశారు. మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. మీడియా వార్తలతో నా భార్య డిస్టర్బ్ అయ్యిందన్నారు. 13 ఏళ్ల వయసు నుంచి సినీ రంగంలో చార్మీ కష్టపడుతోందని, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే నా కూతురు ఈ స్థాయికి వచ్చేది కాదని చార్మీ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు ఎమ్మెల్యేల జీతాలు రెట్టింపు..

చెన్నై: త‌మిళ‌నాడు ఎమ్మెల్యేలు మాత్రం బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేశారు. ఆ రాష్ట్ర‌ ఎమ్మెల్యేల‌ జీతాల‌ను ఏకంగా నూరు శాతం పెంచేశారు. ప్ర‌స్తుతం రూ.50 వేల నెల జీతం ఉన్న ఎమ్మెల్యేలు ఇక నుంచి ల‌క్షా అయిదు వేలు డ్రా చేయ‌నున్నారు. అంటే నెల జీతం ఏకంగా రూ.50 వేలు ఒక్క‌సారిగా పెరిగిపోయింది. సాల‌రీ హైక్ ఒక్క‌టే కాదు, ఎమ్మెల్యేల పెన్ష‌న్ కూడా పెరిగింది. ఎమ్మెల్యేల‌ పెన్ష‌న్‌ను రూ.12 వేల నుంచి రూ.20 వేల‌కు పెంచేశారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఫండ్‌ను కూడా రెండు కోట్ల నుంచి 2.6 కోట్ల‌కు పెంచారు.

కెల్విన్ పరిచయంపై పూరీ ఏమన్నాడంటే...

హైదరాబాద్: కెల్విన్ ఓ ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా నాకు పరిచయం అని పూర్తి తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వ సాధారణం అని నా సినిమాలో ఎక్కువ పబ్ సీన్స్ ఉంటాయని తెలిపినట్లు సమాచారం. అందుకే ఈవెంట్ ఆర్గనైజర్స్, పబ్ ఓనర్స్ తో నాకు పరిచాయాలు అని చెప్పారు. పబ్బుల్లో ఎక్కువగా డ్రగ్స్ వాడే వారు ప్రతి వీకెండ్ కూడా సన్నిహితులతో పార్టీలు చేస్తా అని సిట్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

17 గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్నాం: మంత్రి సుజయ

అమరావతి: మన్యంలో వ్యాధుల తీవ్రత ఎక్కువ గా ఉన్న 17 గిరిజన ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని మంత్రి సుజయ కృష్ణ రంగారావు తెలిపారు. అక్కడ వైద్య సేవలను అందిస్తున్నామని, తనుల తవ్వకాల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఆరోగ్య రథాలు సేవలందిస్తాయని తెలిపారు. ఈసీజీ, రక్తం, మల పరీక్షలతో పాటు భవిష్యత్ లో క్యాన్సర్ రోగ నిర్ధారణ యంత్రాలను ప్రవేశ పెడతామన్నారు.

14:55 - July 19, 2017

‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలతో హాలీవుడ్ చూపు తెలుగు వైపు వచ్చేలా చేసిన దర్శకుడు 'రాజమౌళి'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రికార్డులు బద్దలు కొట్టాయి. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది. ఈ సినిమా అనంతరం 'రాజమౌళి' నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఏ ప్రాజెక్టు చేస్తున్నారో ? నిర్మాత ఎవరు ? హీరో..హీరోయిన్ ఎవరు ? అనేది తెలియడం లేదు.

తాజాగా 'శ్రీదేవి..’రాజమౌళి'లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 'శివగామి' పాత్ర ఈ ఇద్దరి మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. శివగామి పాత్ర కోసం అందాల తార 'శ్రీదేవి'ని సంప్రదించడం జరిగిందని..కానీ భారీ పారితోషకంతో పాటు హిందీలో కూడా షేర్..అనేక డిమాండ్స్ పెట్టిందని..ఇలాంటి డిమాండ్స్ పెట్టడమే మంచియ్యిందని..ఆ పాత్రలో 'రమ్యకృష్ణ'ను కాకుండా వేరే వారిని ఊహించుకోలేమని 'రాజమౌళి' బహిరంగంగా చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై అందాల తార 'శ్రీదేవి' గుస్సా అయ్యింది. తాను డిమాండ్లు పెట్టలేదని..బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ 'రాజమౌళి'కి 'శ్రీదేవి' చురుకులు అంటించింది. తాను బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని..అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ ఇటీవలే 'రాజమౌళి' అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీదేవి టాప్ హీరోయిన్ తో సయోధ్య ఉండడం మంచిదని..తన సినిమాలు హిందీలో రిలీజ్ చేయాలని భావించి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని టాక్.

ఇదిలా ఉంటే నెక్ట్స్ సినిమాలో శివగామికంటే పవర్ పుల్ పాత్రను 'రాజమౌళి' తీర్చిదిద్దుతున్నారని..ఆ ప్రాతంలో అతిలోక సుందరికి 'శ్రీదేవి'కి ఛాన్స్ ఇస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజమౌళి తదుపరి సినిమాలో 'శ్రీదేవి' నటిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

తాగి వాహనం నడపొద్దు: అల్లు అర్జున్

హైదరాబాద్: రూల్స్ స్ట్రిక్ట్ గా ఉండాలని అనుకోను,సెల్ఫ్ ఛేంజ్ తోనే మార్పు సాధ్యం అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. సత్యసాయి నిగమ్ ట్రాఫిక్ రూల్స్ సదుస్సు జరిగింది.ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... మన సమాజాన్ని మనమే మార్చుకోవాలనితెలిపారు. తాగి వాహనం నడపొద్దని, యువత ట్రాఫిక్ రూల్స్ పాటించి మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.

మళ్లీ మొదలైన పూరీ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ పోలీసులు భోజన విరామం అనంతరం మరళా ప్రారంభించారు.

పూరిని మూడు కోణాల్లో విచారిస్తున్న సిట్!

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ను డ్రగ్స్ కేసులో సిట్ పోలీసులు విచారిస్తున్నారు. మూడు కోణాల్లో విచారణ సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పూరీ వ్యక్తిగత గత జీవితం, సినిమా ఇండస్ట్రీ, డ్రగ్స్ వ్యవహారాలపై సిట్ ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది.

14:39 - July 19, 2017

అనంతపురం : సీజనల్‌ వ్యాధులు వస్తాయని తెలిసినా అధికారులు స్పందించలేదు. అనంతపురంలో ఇప్పడివరకూ వందకు పైగా బాధితులు విషజ్వరాల భారిన పడ్డారు. ఇంత జరుగుతున్నా వైద్యశాఖాధికారులు మాత్రం అక్కడక్కడ తప్పితే ఎక్కడా విషజ్వరాలు లేవంటూ తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విష జ్వరాలు వస్తాయని తెలిసినా, ఏ ఒక్క శాఖాధికారుల్లో చలనం లేదు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో వందల సంఖ్యలో విష జ్వరాల కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని గుంతకల్‌, హిందూపురం, కదరి ప్రాంతాల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్క అనంతపురం ఆస్పత్రిలోని ఫీవర్‌ వార్డులోనే వందమందికి పైగా బాధితులున్నారంటే ఇక జిల్లా వ్యాప్తంగా బాధితులు ఏ సంఖ్యలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

పారిశుధ్యసిబ్బంది, వైద్యాధికారి నియామకం
అనంతపురం వైద్యులు మాత్రం కేవలం వైరల్‌ జ్వరాల కేసులే నమోదయ్యాయని విషజ్వరాలు లేవని చెబుతున్నారు. కేవలం కంటి తుడుపు చర్యలు చేపడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాయదుర్గంలో ముగ్గురికి ఎలీసా పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. దీంతో మంత్రి కాలువ శ్రీనివాసులు యుద్ధ ప్రాతిపదికన అనంతపురంలో పారిశుధ్య సిబ్బందిని నియమించి పరిశుభ్రత పనులు మొదలుపెట్టించారు. డివిజన్‌ స్థాయి వైద్యాధికారిని పెట్టించి జ్వరపీడితులకు చికిత్సలు అందించారు. నగరపాలక అధికారులపై కలెక్టర్‌ వీరపాండ్యన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పట్టణంలో డ్రైడే పాటిస్తూ, చెత్తను తొలగించాలని అధికారులకు, ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలతోనైనా అధికారులు స్పందించకపోతే విషజ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

14:36 - July 19, 2017

హైదరాబాద్‌ : నగరంలో రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి.. ప్రధాన రహదారులు గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. మియాపూర్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లే మార్గంలో వేల మంది ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తారు. రెండు రోజుల పాటు నగరంలో కురిసిన వర్షంతో రోడ్లు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే మార్గం, మియాపూర్‌ నుంచి కొండాపూర్‌ వెళ్లే మార్గం, జేఎన్టీయూ నుంచి హైటెక్‌ సిటీకి వేళ్లే మార్గాల్లో రోడ్లు గుంతలు పడటంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది.

గుట్కా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

తూ.గో: రాజానగరం మండలం శ్రీకృష్ణ పట్నంలో గుట్కా తయారీ కేంద్రం పై పోలీసులు దాడి చేసి 23 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 30 లక్షల వలువై గుట్కా, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో గర్భిణీ మృతి

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ తో గర్భిణీ మృతి చెందింది. మృతురాలు కుమురంభీం జిల్లా వాసి అని తెలుస్తోంది. గాంధీ స్వైన్ ఫ్లూ మరో మహిళ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

14:34 - July 19, 2017

ఢిల్లీ : రైతుల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్‌, జెడియు లేవనెత్తాయి. రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి బదులు తూటాలు పేల్చారని మందసౌర్‌ ఘటనని పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. 150 మంది రైతులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం ఎందుకు మౌనం వీడడం లేదని ఆయన ప్రశ్నించారు. దిగుమతి సుంకం అవినీతికి ఆస్కారమిస్తోందని డిగ్గీ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జెడియు నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. పప్పు దినుసులు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 267 నిబంధన కింద రైతుల సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించిందని రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ చెప్పడంతో అక్కడితో ఆ అంశం సద్దుమణిగింది.

 

నాగాలాండ్ సీఎంగా టీఆర్ జెలియాంగ్

హైదరాబాద్ : నాగాలాండ్ సీఎంగా టీఆర్ జెలియాంగ్ ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నాగాలాండ్ సీఎంగా టీఆర్ జెలియాంగ్

హైదరాబాద్ : నాగాలాండ్ సీఎంగా టీఆర్ జెలియాంగ్ ఎన్నికయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా జెలియాంగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్: మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. 300 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. గోవా, నైజీరియన్ కు చెందిన నలుగురు, 5గురు హైదరాబాదీయులను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది.

14:21 - July 19, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 'ఆబ్కారీ' శాఖ మెట్లు ఎక్కారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. విచారణకు రావాలని ఎక్జైజ్ శాఖ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉదయం 10గంటలకు నాంపల్లి ఆబ్కారీ శాఖ కమిషనర్ కార్యాలయానికి 'పూరీ' వచ్చారు. ఆయనతో పాటు కుమారుడు ఆకాశ్..సోదరుడు సాయిరామ్ లు కూడా వచ్చారు.

కెల్విన్ ముఠా..
గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రగ్స్ పంపిణీ చేస్తున్న కెల్విన్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణలో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. టాలీవుడ్..స్కూళ్లు..కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఎక్సైజ్ శాఖ అధికారి అకూన్ సబర్వాల్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ మొదలు పెట్టారు. ప్రభుత్వం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.

ప్రశ్నలు..సమాధానాలు..
టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన విచారణకు బుధవారం వచ్చారు. అకూన్ సబర్వాల్ పర్యవేక్షణలో నలుగురు అధికారుల బృందం ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ తో ఏర్పడిన సంబంధాలు..డ్రగ్స్ అలవాటు..మద్యం తాగే అలవాటు..జీవన శైలికి సంబంధించిన పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
ఓ ఈవెంట్ మేనేజర్ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని పూరీ అధికారులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏ మాత్రం తడబడకుండా సూటిగా, స్పష్టంగా పూరీ సమాధానాలు చెబుతున్నట్లు..కెల్విన్ కు తనకు రెగ్యులర్ గా ఎలాంటి సంభాషణలు జరగలేదని చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు 'పూరీ' పక్కా ప్లానింగ్ తో వచ్చారని తెలుస్తోంది. విచారణపై అధికారులు స్పందించడం లేదు. 12 మందిని విచారించిన అనంతరం పూర్తి వివరాలను ఎక్సైజ్ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.

రాజధాని నిర్మాణ పురోగతిపై బాబు సమీక్ష..

విజయవాడ : రాజధాని నిర్మాణ పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖమూరు పార్క్ ప్రత్యేక ఆకర్షణపై ఏడీపీ ప్రజెంటేషన్ ఇచ్చింది. నైట్ సఫారీ కోసం జురాంగ్ పార్క్ తరహాలో ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. ప్రజారవాణా కోసం డెడికేటెడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

రాజధాని నిర్మాణ పురోగతిపై బాబు సమీక్ష..

విజయవాడ : రాజధాని నిర్మాణ పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖమూరు పార్క్ ప్రత్యేక ఆకర్షణపై ఏడీపీ ప్రజెంటేషన్ ఇచ్చింది. నైట్ సఫారీ కోసం జురాంగ్ పార్క్ తరహాలో ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. ప్రజారవాణా కోసం డెడికేటెడ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

13:45 - July 19, 2017

ఏపీ తాత్కాలిక సచివాలయం...తక్కువ వ్యవధిలోనే సచివాలయం కట్టేశాం..అత్యాధునిక హంగులు పొందుపరిచాం...తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక్కడకు వచ్చేయండి..మన గడ్డపై నుండే పాలన చేద్దాం..అని పాలకులు ఎన్నో మాటలు చెప్పారు. ఇందుకు ప్రజాధనాన్ని ఉపయోగించారు. కానీ ఏమైంది ?

రాజధాని అమరావతి శాశ్వత నిర్మాణాలు పూర్తయ్యేవరకు రాష్ట్ర ప్రజలకు పరిపాలనపరమైన సేవలందేందుకు నెలవుగా మారనున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గతేడాది ఫిబ్రవరి 12న రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. వెలగపూడి ప్రాంతంలో నిర్మితమయిన ఈ సచివాలయం ఆరు నెలల్లో పూర్తి చేశారు. కానీ ఆ సచివాలయం తరచూ వార్తల్లో ఎక్కుతోంది. కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైన ఈ సచివాలయ నిర్మాణ నాణ్యత విషయాల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీళ్లు..
ఇటీవలే కురుస్తున్న వర్షాలకు సచివాలయంలోని ప్రముఖుల ఛాంబర్ లోకి నీళ్లు రావడం వివాదాస్పదమౌతోంది. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీళ్లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయి వేగంతో నిర్మించిన భవనం..అలా కారడంపై విమర్శల వాన కురిసింది. దీనిపై స్వయంగా స్పీకర్ కోడెల రంగంలోకి దిగారు. ఏదో పైపు కట్ అయ్యి నీళ్లు లోపలికి రావడం జరిగిందని..ఇందులో కుట్ర ఉందని ప్రభుత్వ పెద్దలు వాదించారు. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ లోకి నీళ్లు ప్రవేశించాయి కనుక..దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పీకర్ కోడెల ప్రకటించారు. అప్పట్లో మొదలైన విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియదు.

తాజాగా మంత్రుల ఛాంబర్ లోకి..
తాజాగా వర్షానికి మంత్రుల ఛాంబర్ లోనే నీళ్లు లీక్ అయ్యాయి. మంత్రులు దేవినేని, గంటా ఛాంబర్ లోకి నీళ్లు చేరడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నాలుగో బ్లాక్ లోని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చాంబర్లలో ఏకంగా సీలింగ్ కింద పడిపోయింది. దీంతో వర్షం నీరు ప్రవేశించింది. ఇక జలవనరుల శాఖ ఆఫీసుల్లో కూడా వర్షపు నీరు చేరింది. ఇక్కడ కూడా పీలింగ్ రూఫ్ ప్లేట్లు ఊడిపోయాయి. వర్షపు నీరును సిబ్బందిచే ఎత్తిపోయించారు. దీనికి సంబంధించిన వీడియోలు..ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

బూతద్దంలో చూడొద్దంట...
సచివాలయ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, భవనంపై ఉన్న డక్‌షీట్‌ బయటకు రావడం వల్లే వర్షపునీరు లోపలికి వచ్చిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సచివాలయంలో వర్షపు నీరు చేరడంతో ఆయన ఛాంబర్లను పరిశీలించారు. ఆ షీట్‌ను వెంటనే తొలగించాలని నిర్మాణ సంస్థలను ఆదేశించామన్నారు. నిర్మాణంలో చిన్న చిన్న సమస్యలుంటాయని, వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని అభిప్రాయపడ్డారు.

తాత్కాలిక సచివాలయమే అయినా దానికి వ్యయం చేసిన ప్రజాధనం రూ. కోట్లు.
తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోని డొల్లతనం ప్రస్తుత భారీ వర్షాలతో మరోసారి బయటపడినట్లైంది.
మరోసారి నీళ్లు లీక్ అయ్యాయంటే ఎవరి కుట్ర ఉందో ?

13:37 - July 19, 2017

దంపతుల మధ్య వివాదాలకు పిల్లలు బలౌతున్నారు. భార్య, భర్తలు విడిపోతే పిల్లలు ఎవరికి దక్కుతారు.? వారికి బాద్యత ఎవరికి..?అనే విషయలపై చర్చించడానికి ప్రముఖ అడ్వకేట్ పార్వతి గారు ఈనాటి మానవి మై రైట్ వచ్చారు. పిల్లలకు ప్రాథమిక గార్డియన్ గా నాన్న ఉంటారని పార్వతి తెలపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.   

13:29 - July 19, 2017

ఖమ్మం : భారీ వర్షాలతో భద్రాచలం గోదావరి జలకళను సంతరించుకుంది. గోదావరి నీటిమట్టం 24 అడుగులకు చేరింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్మగూడెం మండలాల్లో.. పలు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చిచేరింది. దీంతో ఆ ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లు ఎత్తివేసి 65 వేల రెండు వందల క్యూసెక్కుల వరద నీటిని.. గోదావరిలోకి విడుదల చేశారు. గోదావరి వరదలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంపు బాధితుల కోసం తగిన చర్యలు తీసుకున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 

13:28 - July 19, 2017

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. పూరీకి పశ్చిమదిశలో 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది...దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వేళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు తెలంగాణలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 

13:26 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణ కోసం డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను బలవంతంగా ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకురావడాన్ని ఓ న్యాయవాది తప్పు పట్టారు. తనకు సంబంధం లేదన్న వ్యక్తిని ఇంటి వద్దనే విచారించి వివరాలను కోర్టుకు సమర్పించాలని న్యాయవాది అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వ్యక్తులను హైలైట్ చేయడం వల్ల ప్రజల్లో సినిమా వాళ్లంటే దురభిప్రాయం ఏర్పడిందని న్యాయవాది అన్నారు. విచారణ తరువాత తప్పుంటే అరెస్టు చేయడం సరైన పని అన్నారు. ఈ విషయంలో తాను హెచ్ఆర్సీలో కేసు వేస్తున్నట్లు న్యాయవాది తెలిపారు. 

అమీర్ పేటలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : అమీర్‌పేటలో సాఫ్ట్‌వేర్ సంస్థలతో పాటు ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. భవనాలు, రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సంస్థల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. పోలీసులు భారీగా మోహరించారు.

 

 

13:26 - July 19, 2017

హైదరాబాద్ : పూర్ణిమసాయి ప్రశాంతంగా ఉన్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. పూర్ణిమపై ఎలాంటి నేరారోపణలు లేనందునా.. జువైనల్‌ కోర్టుకు తరలించాల్సిన అవసరం లేదన్నారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ బాలికకు కౌన్సెలింగ్‌ ఇస్తుందని.. కమిటీ ఆదేశాలతో ముందుకెళ్తామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

హైదరాబాద్ ను కాంగ్రెస్ నిరుద్యోగ హబ్ మార్చింది: కర్నె

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ నిరుద్యోగ హబ్ మార్చేందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. గత మూడేళ్లలో 45 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరో 25 వేల ఉద్యోగాల భార్తీ ప్రక్రియ వివిధ దశలో చేపడతామన్నారు. ఇంటికో ఉద్యోగమని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని,లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని స్పష్టం చేశారు. కేటీఆర్ బచ్చా కాదు.. చిచ్చరపిడుగు అని తెలిపారు. రాహుల్ రాజకీయాల్లోకి వచ్చినపుడే కేటీఆర్ వచ్చారని, కేటీఆర్ ది ఉద్యమ వారసత్వమని, రాహుల్ ది కుటుంబ వారసత్వం అని ఎద్దేవా చేశారు. గాపాలకృష్ణ గాంధీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్ గాంధీని అవమానించిందని ఆరోపించారు.

పూరికి భోజన విరామం

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ను డ్రగ్స్ కేసులో సిట్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణకు విరామం ఇచ్చారు. కెల్విన్ పాత్రపై 40 నిమిషాలు పూరి వివరణ ఇచ్చినట్లు సమాచారం. భోజన విరామం తర్వాత మళ్లీ విచారణ చేపట్టనున్నారు.

 

13:16 - July 19, 2017

యంగ్ హీరోలు..ప్రముఖ హీరోలు నటించిన పలు సినిమాల హక్కుల కోసం పలు ఛానెల్స్ పోటీ పడుతుంటాయనే సంగతి తెలిసిందే. చిత్ర టీజర్..పోస్టర్స్ తో సినిమా అంచనాలు అమాంతం పెంచేస్తుంటాయి. చిత్ర హక్కులను సొంతం చేసుకుంటే లాభాల బాట పండుతుందని ఆయా ఛానెళ్లు భావిస్తుంటాయి. కొన్ని సినిమాలు అంచనాల ఆధారంగా విడుదలకు ముందే శాటిలైట్‌ హక్కులు అమ్ముడుపోతుంటాయి. ఇందుకు టీవీ ఛానెళ్ల మధ్య విపరీత పోటీ నెలకొంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' సినిమా హక్కుల కోసం పోటీ నెలకొందంట.

వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న 'నితిన్' ‘లై' చిత్రంలో మరోసారి భిన్నంగా కనిపించేందుకు సిద్ధమయ్యాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో 'నితిన్' సరసన 'మేఘా' హీరోయిన్ గా నటిస్తోంది. ఎక్కువ శాతం విదేశాల్లో జరుపుకుంటున్న ఈ సినిమా పోస్టర్స్..టీజర్ విడుదలై సినిమా అంచనాలు పెంచేసింది. ‘నితిన్' కు విలన్ గా యాక్షన్ కింగ్ 'అర్జున్' నటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ఈ సినిమా పట్ల పాజిటివ్ టాక్ వస్తుండడంతో చిత్ర హక్కులు భారీ ధర పలుకుతున్నాయంట. ప్రముఖ ఛానెల్ ఒకటి భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్ టాక్. మరొక ఛానెల్ కూడా ముందుకొచ్చి అత్యధిక ధర ఇచ్చేందుకు సిద్ధమయ్యాంట. ఇందులో జీ..జెమినీ ఛానెల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది.

గిరిజన సంక్షేమ పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు..

గుంటూరు : ఏటీ అగ్రహారం గిరిజన సంక్షేమ పాఠశాలలో మంత్రి నక్కా ఆనందబాబు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యశాఖపై మంత్రి లక్ష్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: వైద్యశాఖలో అమలవుతున్న వివిధ పథకాలపై మంత్రి లక్ష్మారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

13:12 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు పూరీ జగన్నాథ్ ను గత 3గంటలుగా విచారిస్తున్నారు. సిట్ అధికారులు పూరీకి కెల్విన్ ఉన్నసంబంధాలపై ఆరా తీశారు. కెల్విన్ పూరీ వాట్సాప్ సందేశాలపై కూడా విచారించినట్లు తెలుస్తోంది. విచారణను కెమెరాలతో విచారిస్తున్నారు. పూరీని సిట్ బృందం సైకాలజిస్ట్ సమక్షంలో విచారిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:07 - July 19, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' 151వ సినిమా ఎప్పుడు మొదలు కానుంది ? ఆ చిత్రంలో హీరోయిన్..విలన్..ఎవరు ? తదితర ప్రశ్నలపై సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్ర టైటిల్ ను మారుస్తున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.

దశాబ్దకాలంగా వెండి తెరకు దూరంగా ఉన్న 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు పక్కన కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్నే నమోదు చేసింది. దీనితో తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం ఉంటుందని..ఇందులో 'చిరు' పవర్ ఫుల్ పాత్ర పోషించనున్నారని టాక్. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ‘మహావీర' టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. 'బాహుబలి' స్ఫూర్తితో భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించాలని దర్శకుడు పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘చిరంజీవి' కూడా ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు..పలువురు సూచనలు..సలహాలు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా మొదలయితే ఇలాంటి వార్తలకు చెక్ పడదు.

13:02 - July 19, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడలో డ్రగ్స్ గంజాయి, ప్రమాదకరమైన మెడికల్ డ్రగ్స్ అమ్ముతున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచిపోలీసులు 25కిలోల గంజాయి, టాట్లెట్ లు, ఇంజక్షన్లు, కఫ్ పిరప్ లు రూ.2లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు మెడికల్ షాపులు డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు. పోలీసులు మెడికల్ షాపుల యజమానులను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు రౌడీషీటర్ బెజవాడ రవి, పెమ్మాడ శివప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

ఫార్మా పరిశ్రమల అభివృద్ధి పై మంత్రి పితాని సమావేశం..

విజయనగరం: నగరంలో ఫార్మా పరిశ్రమల అభివృద్ధి పై రెండు రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పితాని పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు నాణ్యత మెరుగుపరుచుకోవాలని, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉంటే భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా ఉంటాయని పితాని స్పష్టం చేశారు. సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో విశాఖ, తిరుపతిలో 500 పడకల కార్మిక ఆసుత్రులు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు పై మంత్రి హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పై మంత్రి హరీష్ రావు సమీక్ష చేపట్టారు. అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పూర్ణిమ మైనర్ కాబట్టి సేఫ్టీకి ప్రాముఖ్యత : ఏసీపీ

హైదరాబాద్: పూర్ణిమ మైనర్ కాబట్టి సేఫ్టీకి ప్రాముఖ్యత ఇస్తున్నామని కూకట్ పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు. జువైనల్ హోలో పూర్ణిమ సాయిని మాదాపూర్ డీసీపీ విశ్వ ప్రసాద్, కూకట్ పల్లి ఏసీపీ భుజంగరావు కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... పూర్ణిమ సాయి తీసుకునే తుది నిర్ణయాన్ని ప్రభుత్వ బాలికల పరిశీలకుల బృందం అమలు పరుస్తుందన్నారు. ఈ కేసులో ఎలాంటి నేరకోణం లేదన్నారు. పూర్ణిమ సాయి పై టీవీ, సీరియల్స్ ప్రభావం లేదని, పూర్ణిమ సాయి మానసిక పరిస్థితి బాగానే ఉందన్నారు. జువైనల్ హోంలో పూర్ణిమ సాయిని కలిశామని మాదాపూర్ డీసీపీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

వ్యక్తిగత కక్షలతోనే మురళి హత్య: సీపీ

వరంగల్: వ్యక్తిగత కక్షలతోనే కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య జరిగింది అని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయలదేని చెప్పారు. ప్రధాన నిందితుడు ఇచ్చిన సమాచారంతో రిమాండ్ రిపోర్ట్ లో నాయిని రాజేందర్ రెడ్డి పేరు చేర్చాం అని పేర్కొన్నారు. నేరం చేసినట్లు ఆధారాలు దొరికితే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. విచారణ పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. ఈ కేసులో మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.

కోల్ కతా రైల్వేస్టేషన్ లో ప్రమాదం

హైదరాబాద్: కోల్ కతా రైల్వే స్టేషన్ లో ప్రమాదం సంభవించింది. ప్లాట్ ఫాం గోడను లోకల్ ట్రైన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. 

12:05 - July 19, 2017

హైదరాబాద్ : సిట్ అధికారులు పూరీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విచారణ అధికారులు గంట నుంచి పూరీని విచారిస్తున్నారు. విచారణ గదిలో పూరితో పాటు నలుగు ఉన్నారు. ఎక్పైజ్ కార్యాలయంలో పూరీని సిట్ ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడు ఉన్నాడు. డాక్టర్ పూరీ సమాధానాలు ఇచ్చే తీరును గమనించనున్నారు. అకున్ సబర్వాల్, ఎక్పైజ్ కమిషనర్ చంద్రవదన్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమామాచారం కోసం వీడియో చూడండి.

 

ట్రాఫిక్ పై అవగాహన సదస్సు కు రాజమౌళి, అల్లుఅర్జున్

హైదరాబాద్: సత్యసాయి నగమంలో ట్రాఫిక్ పై అవగాహన సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి, హీరో అల్లు అర్జున్ హాజరయ్యారు.

12:01 - July 19, 2017

అంతర్జాతీయ వేదికలపై పలు పతకాలు సాధించిన దివ్యాంగురాలు..2013 థాయ్ లాండ్ పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్ లో రెండు పతకాలు..అదే ఏడాది నేషనల్ ఉమెన్ ఎక్స్ లెన్స్ అవార్డు..ఆమెనే 'సువర్ణా రాజ్'..ఈ పారా అథ్లెట్ కు మరోసారి అవమానం ఎదురైంది. భద్రతలో భాగంగా 'చక్రాల కుర్చీ'కి స్కానింగ్ చేసే సమయం లేదని ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె ప్రయాణానికి అనుమతి నిరాకించారనే వార్త సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిని విమానాశ్రయ అధికారులు ఖండిస్తున్నారు. చివరకు ఆమె మరో విమానంలో వెళ్లాల్సి వచ్చింది. గతంలో కూడా 'సువర్ణ'కు ట్రైన్ లో ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. నాగ్‌పూర్‌-నిజాముద్దీన్‌ గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆమెకు అప్పర్‌ బెర్త్‌ను కేటాయించారు. తనకు లోయర్‌ బెర్త్‌ ఇవ్వాలని టీటీఈని, ఇతర ప్రయాణికులను కోరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె రైలులో కింద పడుకోవాల్సి వచ్చింది.

ఇండిగో విమానం..
‘సువర్ణా రాజ్' ఇండిగో విమానంలో ఉదయ్ పూర్ కు వెళ్లేందుకు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చారు. మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకున్నారు. విమానం 1.25గంటలకు బయలుదేరాల్సి ఉంది. కానీ ఆమె చక్రాల కుర్చీని స్కాన్ చేసే సమయం లేదని సిబ్బంది పేర్కొన్నారు. కానీ ఉదయ్ పూర్ కు వెళ్లాల్సి ఉందని..అక్కడ ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని 'సువర్ణా రాజ్' పేర్కొన్నారు. ఇదంతా గడుస్తుండగానే ఆ విమానం కాస్త వెళ్లిపోయింది. ఈ ఘటనపై సువర్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఎప్పుడూ ఇలాంటి ఘటనలను ఎదుర్కొనలేదని..తన దేశంలోనే ఇలాంటి అవమనాలు ఎదురవుతున్నాయని వాపోయింది.

అధికారి స్పందన..
ఈ ఘటనపై ఇండిగో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అజయ్ జాస్రా స్పందించారు. 'పారా అథ్లెట్‌ సువర్ణ తాను ఎక్కాల్సిన విమానాన్ని మిస్‌ అయ్యారు. ఆమె విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. ఆమె పారా అథ్లెట్‌ కావడంతో ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఆమెను మరో విమానంలో పంపించాం. దీనికి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మాతో కలిసి సెల్ఫీ కూడా దిగారు' అని జాస్రా వివరించారు.

భద్రాచలం వద్ద పెరుగుతోన్న గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల సమయానికి 23.8 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సాయంత్రానికి 30 అడుగుల వరకు గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

 

కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు...

జమ్మూకశ్మీర్ : మరోసారి పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఫూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. 36 గంటల్లో ఆరుసార్లు కాల్పులకు పాకిస్తాన్ పాల్పడుతోంది. దీనికి ధీటుగా భారత సైన్యం బదులిస్తోంది.

11:56 - July 19, 2017

హైదరాబాద్ : పూర్ణిమసాయికి జువనైల్ హోంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ అనంతరం అమ్మాయిని జువైనల్ కోర్టలో హాజరుపరుస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తెగిన కరెంట్ లైన్... నిలిచిన ప్యాసింజర్ రైలు

గుంటూరు: దుగ్గిరాల వద్ద బిట్రగుంట ప్యాసింజర్ రైలు తెనాలి- వడ్లమూడి మధ్య రైల్వే కరెంట్ లైన్ తెగిపడటంతో ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేశారు.

 

11:45 - July 19, 2017

బాలీవుడ్ నటి 'రణబీర్ కపూర్' నటించిన తాజా చిత్రం 'జగ్గా జాసూస్' మంచి మార్కులే కొట్టేసింది. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు 'రణబీర్ కపూర్' నిర్మాతగా వ్యవహరించారు. ‘కత్రీనా కైఫ్' హీరోయిన్ నటించిన సినిమా రెండు రోజుల్లోనే మొత్తం రూ. 20.10 కోట్లు రాబట్టిందని విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించిన 'బిదిశా బెజ్ బారువా' అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. ఈమె మరణం వెనుక భర్త నితీశ్ హస్తం ఉందని భావించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురుగ్రామ్ లోని ధనవంతులు నివసించే శుశాంత్ లోక్ ప్రాంతంలోని బిదిశ నివాసం ఉంటోంది. స్టేజ్ షోలు..టీవీ సీరియల్స్ నటించింది. కానీ సోమవారం సాయత్రం బదిశ ఫ్యానుకు ఉరి వేసుకుని కనిపించింది. ఆమె మరణం వెనుక నితీశ్ కుట్ర ఉందని బిదిశ తండ్రి సహారన్ ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో న‌టి బిదిషాకు గొడ‌వ‌లు అయిన‌ట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్‌, ఫేస్‌బుక్‌, సోష‌ల్ సైట్ల ద్వారా ఆమెతో చాట్ చేసిన సందేశాల‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

పూర్ణిమను విచారించేదుకు వచ్చిన డీసీపీ, ఏసీపీ

హైదరాబాద్: విద్యార్థిని పూర్ణిమ సాయిని విచారించేందుకుజువైనల్ హోంకు మాదాపూర్ డీసీపీ, కూకట్ పల్లి ఏసీపీ వచ్చారు.

 

11:31 - July 19, 2017

'సీమాంధ్ర పాలకుల వివక్ష వల్ల హైదరాబాద్‌ నగరం 'ఊపర్ షేర్వానీ, అందర్‌ పరేషనీ' అయ్యింది..చిన్న వర్షం వస్తే నడుముల్లోతు నీళ్లా..కార్లు పడవలవుతయి..’ అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి మూడేళ్లు దాటిపోతోంది. పరిస్థితిలో మార్పు వచ్చిందా ? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే మంగళవారం రోజు కురిసిన వర్షంతో తేటతెల్లమయ్యింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు చెరువులను తలపించాయి...వాహనాలు నీట మునిగాయి..డ్రెయినేజీలు, నాలాలు పొంగి ప్రవహించాయి...నడుముల్లోతు నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్..
నగరంలో చెరువులయిన రోడ్లు..బురదమయమైన గల్లీలు..పొంగిపొర్లిన నాలాలు..డ్రైనేజీలు..లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన మురుగునీరు..నీట మునిగిన సెల్లార్లు..పూర్తిస్థాయికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం..ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం. వాహనదారులు..పాదాచారుల నరకయాతన..ఇది నగరంలో ఒక్క రోజు వర్షం పడితే పరిస్థితి..అదే విపత్తు వస్తే ఎలా ? ప్రస్తుతం నగరంలో చర్చించుకుంటున్నారు. హైదరాబాద్...మహానగరాల్లో ఒకటి. బ్రాండ్ ఇమేజ్ ఉన్న నగరం. అలాంటి నగరంలో ఒక్క రోజు వర్షం పడితే చిగురుటాకులా వణికిపోయింది. నగరంలో రాత్రి 10.30గంటల వరకు సగటున 4.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా.

విపత్తు వస్తే ఎలా ?
అదే విపత్తు వస్తే సమర్థవంతమైన వ్యవస్థ ఇక్కడుందా ? గత అనుభవాల నుండి ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు. గత పాలకుల పుణ్యమా అని ఇలాంటి పరిస్థితి నెలకొందని అధికారంలో ఉన్న వారు పేర్కొంటున్నారు. పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఇంకా ఉందని..సమస్య నుండి బయపడాలంటే కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. కానీ అందుకనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరదనీరు సాఫీగా వెళ్లేందుకు తగిన ప్రణాళిక లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గత ఏడాది కూడా ఇలాంటే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఎలాంటి మార్పు రాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ దుస్థితికి పాలకులు..అధికార యంత్రాంగ నిర్లక్ష్యం..అక్రమార్కుల ఆగడాలే అని ప్రజలు పేర్కొంటున్నారు.

కిర్లోస్కర్ నివేదిక...
ఇక్కడ కిర్లోస్కర్ నివేదిక అంశం గుర్తుకు వస్తుంది. 2000 ఆగస్టులో కురిసిన వర్షాలకు నగరం జలమయమైన సంగతి తెలిసిందే. నీరు వెళ్లకపోవడం..వరదనీటి కాలువలో పేరుక పోయిన భవన నిర్మాణాలు..నాలాలు..చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని అధికారులు గుర్తించారు. మరి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలంటూ 'కిర్లోస్కర్ కన్సల్టెంట్' కు అప్పగించారు. పూర్తిగా అధ్యయనం చేసిన ఈ కన్సల్టెంట్ 2003లో నివేదిక సమర్పించారు. వరదనీరు సాఫీగా వెళ్లాలంటే నాలాలు అభివృద్ధి చేయాలని, ఇందుకు రూ. 264 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనికి భూ సేకరణ..పునరావాసాలకు అదనపు నిధులు అవసరమౌతాయని పేర్కొంది. ప్రస్తుత పరిణామాలకు మరింత ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా.
ఇప్పటికైనా పాలకులు..అధికారులు మేల్కొంటారా ? చూడాలి.

సిరిసిల్లకు బయలుదేరిన టి.కాంగ్రెస్ నేత

హైదరాబాద్: సిరిసిల్లకు టీ.కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. సిరిసిల్లలో పోలీసుల థర్డ్ డిగ్రీ బాధితతను పరామర్శించేందుకు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కేఎల్ ఆర్, వినయ్ బయలుదేరారు.

11:22 - July 19, 2017

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో నోటీసులందుకోని విచారణకు హాజరైయ్యారు. ఎక్పైజ్ కార్యాలయంలో పూరీని సిట్ ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. విచారణ గదిలో పూరీతో పాటు నలుగురు ఉన్నారు. విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడు ఉన్నాడు. డాక్టర్ పూరీ సమాధానాలు ఇచ్చే తీరును గమనించనున్నారు. అకున్ సబర్వాల్, ఎక్పైజ్ కమిషనర్ చంద్రవదన్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమామాచారం కోసం వీడియో చూడండి.

రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు నాయిని, పద్మారావు

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు. మౌలాలిలో రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. 

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ...

ఖమ్మం : కారేపల్లి మండలంలోని ఇల్లందు - ఖమ్మం ప్రధాన రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. గిద్దెవారిగూడెం స్టేజీ వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం, ఇల్లందు ఆస్పత్రులకు తరలించారు. పికెట్ డిపో బస్సు హైదరాబాద్ నుంచి ఇల్లందు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

11:09 - July 19, 2017

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో నోటీసులందుకోని విచారణకు హాజరైయ్యారు. ఎక్పైజ్ కార్యాలయంలో పూరీని సిట్ ఇన్ ఛార్జ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. విచారణ గదిలో పూరీతో పాటు నలుగురు ఉన్నారు. విచారణ గదిలో ఓ మానసిక వైద్యుడు ఉన్నాడు. డాక్టర్ పూరీ సమాధానాలు ఇచ్చే తీరును గమనించనున్నారు. అకున్ సబర్వాల్, ఎక్పైజ్ కమిషనర్ చంద్రవదన్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమామాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విజయ్ మాల్యాపై విచారణను ఈడీ ముమ్మరం

హైదరాబాద్ : విజయ్ మాల్యాపై విచారణను ఈడీ ముమ్మరం చేసింది. 6 దేశాల నుంచి విజయ్ మాల్యా వివరాలను ఈడీ సేకరించనుంది.

కాకినాడలో గంజాయి కలకలం...

తూ.గో: కాకినాడలో గంజాయి కలకలం రేగింది. గంజాయి అమ్ముతున్న 8 మంది ని అరెస్టు చేసి 25 కిలోల గంజాయిని, మత్తు పదార్థాలు, రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో డ్రగ్స్ విక్రయం పై ఎస్పీ విశాల్ గున్నీ కఠిన చర్యలు చేపట్టారు.

పూరీని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు...

హైదరాబాద్: సిట్ ఎదుట విచారణకు పూరీ జగన్నాథ్ హాజరయ్యారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పూరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సిట్ ఇన్ ఛార్జి శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. విచారణ గదిలో పూరీతో పాటు నలుగురు విచారణలో సిట్ ఇనెస్పక్టర్లు, కెల్విన్ ను అరెస్టు చేసిన అధికారి, పూరీ సమాధానాలు ఇచ్చే తీరును మానసిన వైద్యుడు గమనించనున్నాడు.

10:37 - July 19, 2017

హైదరాబాద్ : 45 రోజుల కిందట కూకట్‌పల్లిలో అదృశ్యం అయిన పూర్ణిమ సాయి ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరింది. పోలీసులు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పూర్ణిమను కాచిగూడలోని ప్రభుత్వ బాలికల వసతి గృహానికి తరలించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా, జువైనల్ కోర్టులో పోలీసులు హాజరు పర్చనున్నారు. కేసు విచారణ అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పూర్ణిమ రాకతో.. ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. 

10:36 - July 19, 2017

హైదరాబాద్ : సిట్‌ విచారణకు హాజరయ్యేందుకు పూరీ జగన్నాథ్‌ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. పూరీ వెంట తమ్ముడు సాయిరాం, కుమారుడు ఆకాష్‌ ఉన్నారు. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పూరీని సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. రోజుకొకరి చొప్పున 12 మంది సినీ ప్రముఖులను విచారించనున్నారు. ఆగస్ట్‌ 2 వరకు ఈ విచారణ కొనసాగనుంది. మరోవైపు ఎక్సైజ్‌ ఆఫీస్‌కు సినీ ప్రముఖులు వస్తుండటంతో అభిమానుల తాకిడి పెరిగింది.

 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభంఅ య్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి 31,800పైకి చేరగా.. నిఫ్టీ కూడా 9,850 పాయింట్లను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 128 పాయింట్ల లాభంతో 31,839 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లతో 9,865 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

 

గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం...

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 2017-18లో అనుమతించిన గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభించే 22 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 15 మహిళా డిగ్రీ కళాశాలలు, 7 పురుషుల డిగ్రీ కళాశాలలను గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొత్తం కళాశాలల్లో 7,040 మంది విద్యార్థులకు ప్రవేశించేందుకు అవకాశం ఉండగా.. అందులో 4,800 మంది మహిళలు, 2,240 మంది పురుషులకు ఆయా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్నారు. గిరిజన డిగ్రీ గురుకుల కళాశాలలల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశానికి www.

10:27 - July 19, 2017

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం నటిస్తున్న 101వ సినిమా 'పైసా వసూల్'. సెన్సెషనల్ డైరెక్టర్ గా పేరొందిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో 'బాలయ్య' వెరైటీ గెటప్ లో కనిపించనున్నారని టాక్. 'శ్రియా శ‌ర‌న్' మరోసారి 'బాలయ్య'తో జత కడుతోంది. ‘ముస్కిన్', ‘ఛార్మి' లు కూడా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. పోస్టర్లలో బాలయ్య లుక్ కు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరోవైపు డబ్బింగ్ పనులు చేపడుతున్నారు. ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ మొదలు పెట్టింది. ఆఖరి షెడ్యూల్ ఈనెల 28వ తేదీన ముగియనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 28వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్స్ చేసుకొంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో మార్పులు..చేర్పులు చేసుకోవచ్చని టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో బాలయ్య ఓ సాంగ్ కూడా పాడిన సంగతి తెలిసిందే.

గతంలో ఎన్నడూ చూడని 'బాలయ్య'ను 'పైసా వసూల్' చిత్రంలో చూస్తారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్, ఆడియో ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంటోంది.

10:23 - July 19, 2017

మీ పిల్లాడు ఏం చేస్తున్నాడు సార్..అంటే..ఇంటర్ మీడియట్..బీటెక్..ఏదో ఒకటి చెబుతారు కదా..కానీ మీ పిల్లాడు సెల్ ఫోన్ లో ఏం చేస్తున్నాడు ? ఎవరితో ఛాటింగ్ చేస్తున్నాడు ? స్కూల్..కాలేజీకని చెప్పి ఎక్కడకు వెళుతున్నాడు ? చూస్తున్నారా ? అంటే సమాధానం కొంతమందిలో రాదు. మీ పిల్లలు..స్కూల్ కు..కాలేజీలకు వెళుతున్నారా ? అయితే ఓ వారిపట్ల ఓ కంట కనిపెట్టండి. వారు ఏం చేస్తున్నారు ?..ఎక్కడకు వెళుతున్నారు ? తదితర విషయాలపై దృష్టి సారించండి.

పిల్లలపై దృష్టి ఎక్కడ ?
తమ పిల్లలను డాక్టర్..ఇంజినీర్..సాఫ్ట్ వేర్..చేయాలని ప్రతొక్క తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకని కష్టపడి పని చేస్తూ పైస..పైస కూడబెట్టుకుంటుంటారు. వారు ఏది అడిగితే అది ఇప్పిస్తూ వారి మనస్సును నొప్పియ్యకుండా జాగ్రత్త పడుతుంటారు. తమ దోస్త్ ఖరీదైన సెల్ ఫోన్ తీసుకున్నాడని...బైక్ కొన్నాడని..తమకు ఇప్పియ్యాలని అడగడం ఆలస్యం..వెంటనే లోన్లు..అప్పులు చేసి ఆయా సౌకర్యాలు కల్పిస్తుంటారు. ప్రతి నెలా పాకెట్ మనీ అంటూ డబ్బులు కూడా ఇస్తుంటారు. ఖరీదైన ఫోన్లు..బైక్ లు..పాకెట్ మనీ ఇవ్వడం తప్పు కాదు. కానీ వాటితో పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేసే పనితో..చదువుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటుటో ఉందంటే అది 'అంతర్జాలం'. పిల్లలు ఏం చేస్తున్నారు ? వాళ్ల స్నేహాలు ఎలాంటివి ? అనే ఆలోచించే తీరిక తల్లిదండ్రులకు ఉండడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిణామాలు అలా చేయిస్తున్నాయి. అందరూ కష్టపడితే గాని కుటుంబం సక్రమంగా నడవని పరిస్థితి నెలకొంది. కానీ ఇలా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే అర్థమౌతుంది.

ఫోన్లు..అశ్లీలత..
సమాజంలో విశృంఖలంగా పెరిగిపోయిన అశ్లీలత..చదువుతో సంబంధం లేని ఫోన్లు..వాటిలో ఇంటర్ నెట్ వినియోగంపై తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పిల్లల జీవితాలు నాశనం అవుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. పిల్లల నడవడికపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో తల్లిదండ్రులు కనీస సమయాన్ని కూడా వెచ్చించడం లేదని సర్వేలు స్పష్టం చేస్తున్నారు. దీనితో తమకు ఎదురైన అనుభవాలను ఇంట్లో పిల్లలు స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి.

స్కూళ్లు..కాలేజీలు..
కొంతమంది ఉపాధ్యాయులకు పాఠశాలల మీద మమకారం..విద్యార్థుల మీద ప్రేమాభిమానాలు.. వృత్తి పై అంకిత భావం..సామాజిక బాధ్యత గతంలో ఉండేవి. అయితే ప్రస్తుతం విద్య విపరీత లాభాలను ఆర్జించే వ్యాపారమయింది. గతంలో ఉన్న అనుబంధాలు ప్రస్తుతం లేవని పలువురు పేర్కొంటుంటారు. అంతేగాకుండా స్కూళ్లు..కాలేజీల్లో టీచర్లు కేవలం పాఠాలకు మాత్రమే పరిమితమౌతున్నారు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తున్నారు..వారి నడవడిక ఎలా ఉందనే దానిపై టీచర్లు దృష్టి కేంద్రీకరించడం లేదు. కేవలం మార్కులు బాగా రావాలని..బాగా చదవాలంటూ కొంతమంది టీచర్లు చెబుతూ వారిపై మరింత వత్తిడి తెస్తున్నారు. విద్యార్థులకు ప్రేమ..స్నేహ స్వభావాలను...సుగుణాలను పంచాలి. పిల్లలు వారిని దగ్గరకు చేర్చాలి. బోధన అంటే కేవలం పాఠాలు చెప్పడం కాదు. పిల్లలను అర్థం చేసుకొని వారితో కలిసి జీవించడం. పాఠశాలను, జీవితాన్ని విద్యార్థుల దృష్టితో చూడాలని పలువురు పేర్కొంటున్నారు.

పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి..
నైతిక విలువల గురించి పిల్లలకు శిక్షణ ఇప్పించాలి. ఏదో మంచి..ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్‌ఫోన్‌లు సాధ్యమైనంతవరకు ఇవ్వకూడదు. టీవీలు,  సినిమాలు చూసిన తర్వాత పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలని నిపుణులు తెలియచేస్తున్నారు.

పాత నోట్లు మార్పిడికి యత్నిస్తున్న ముఠా అరెస్ట్

విజ‌య‌వాడ: ర‌ద్దు అయిన పెద్ద నోట్ల‌ను మార్పిడి చేస్తున్న ముఠాను విజ‌య‌వాడ పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఏడు మందిని అరెస్టు చేశారు. సుమారు కోటి రూపాయ‌లు విలువైన పాత నోట్ల‌ను మార్పిడి చేసేందుకు ఆ ముఠా ప్ర‌య‌త్నించింది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు చాక‌చ‌క్యంగా ఆ గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

నేటి నుండి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఎంసెట్ -2017 తుది విడుత కౌన్సెలింగ్ బుధవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. 23,640 సీట్లు అందుబాటులో ఉన్నాయని కౌన్సెలింగ్ కన్వీనర్ ఏ వాణీ ప్రసాద్ తెలిపారు. బీ ఫార్మసీ కాలేజీలలో 2,964 సీట్లు, ఫార్మాడీలో 471 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసుకు డైరెక్టర్ పూరీ

హైదరాబాద్: ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసుకు డైరెక్టర్ పూరీ జగన్నథ్ చేరుకున్నాడు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. పూరీ వెంట అతని కుమారుడు ఆకాష్, తమ్ముడు వెంకట్ సాయి కూడా ఉన్నారు.

భార్యను చంపిన భర్త

సిద్ధిపేట: అక్కన్న పేట మండలం మల్చేర్యు తండాలో దారుణం జరిగింది. పెళ్లైయిన 5 నెలలకే భార్యను భర్త మతమార్చాడు. హత్య చేసిన అనంతరం పీఎస్ లో భర్త లొంగిపోయాడు.

10:05 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న పూరీ జగన్నాథ్ విచారణ కోసం ఎక్సైజ్ ఆఫీస్ కు చేరుకున్నారు. పూరీతో అతని కొడుకు ఆకాశ్, తమ్ముడు సాయిరాంశంకర్, లాయర్ వచ్చారు. పూరీ విచారణలో ఎటువంటి నిజాలు బయటపడతాయో చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తండ్రిని కత్తితో నరికి చంపిన కుమారుడు

కృష్ణా: పెనమలూరు మండలం వణుకూరులో దారుణం జరిగింది. తండ్రిని కుమారుడు కత్తితో నరికి చంపేశాడు. పొలం పనుల విషయంలో ఇరువురి మధ్య తగాదాలు పొడచూపాయి. దీంతో నరికి చంపి గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేసేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తాలిపేరు ప్రాజెక్టు కు పెరిగిన వరద ఉధృతి

భద్రాద్రి కొత్తగూడెం: తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. 18 గేట్లు ఎత్తి 65,200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల : తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ షురూ

హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం రేపిన మాదకద్రవ్యాల కేసులో నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖలను విచారించే ప్రక్రియ బుధవారం ఉదయం మొదలైంది. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ విచారణ నిర్వహించేందుకు ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారుల బృందం(సిట్) సర్వం సిద్ధంచేసింది. విచారణకు ఎప్పుడు రావాలో ఇప్పటికే నోటీసులలో పేర్కొన్న సిట్.. మొదటిగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నించనుంది. పూరీ జగన్నాథ్ తన ఇంటి నుంచి ఉదయం 9.30 గంటలకు ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

09:42 - July 19, 2017

కరీంనగర్ : నగర శివారులోని పుష్పాంజలి రిసార్ట్స్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 32 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల 90 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు కమాన్‌ పూర్ ఎంపిపి ఉన్నట్లు సమాచారం. అరెస్టైన 32 మందిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని రూరల్ ఏసిపి తిరుపతి చెప్పారు. 

09:38 - July 19, 2017

గుంటూరు : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో... అతిభారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున సముద్రం కల్లోలంగా ఉంటుందని .. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. వాయుగుండం ప్రభావంతో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాగావళి, వంశధార, కళ్యాణి నదులు ఉగ్రరూపం దాల్చాయి. దీనికి తోడు... ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులకు వరదనీరు పోటెత్తుతోంది. పలు లోతట్టు గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. బూర్ణ, సంతకవిటి మండలాల్లో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. గొట్టా బ్యారేజ్‌ 22 గేట్లను ఎత్తేసిన అధికారులు నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విజయనగరం, పార్వతీపురం ఆర్డీవో కార్యాలయాల్లో టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికపుడు గమనిస్తున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్‌ అటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. ధవళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎగువనున్న కుంట, కోయిదా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని ఇరిగేషన్‌ అధికారులు అంటున్నారు.

ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం
ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 11.10 అడుగుల నీటి మట్టం నమోదయ్యిందని అధికారులు చెప్పారు. 143 గేట్లను ఎత్తి సముద్రంలోకి 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టాకు 900, మధ్య డెల్టాకు 1200, పశ్చిమ డెల్టాకు 2 వేల క్యూసెక్కుల వంతున వరద నీటిని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఎడతెరిపి లేని వానలకు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో డ్రైనేజివ్యవస్థ అస్థవ్యస్థంగా మారడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. గంరెద్దుల దిబ్బ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడతాయేమోననే భయం నెలకొంది. వర్షాలతో ఇబ్బందులు తలెత్తిన ప్రాంతాల్లో సీపీఎం నేతలు పర్యటించారు. వాయుగుండం ఈరాత్రికి గోపాల్‌పూర్‌ -పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో 3రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 

09:36 - July 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పాటు దేశంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సనీ తారల విచారణకు సిట్ సిద్ధమైంది. నోటీసులు అందుకున్నవారు రోజుకొక్కరు చొప్పున విచారణకు హాజరు కానున్నారు. సిట్ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపారు. కెల్విన్ కాల్ లిస్ట లో పూరీ ఫోన్ నంబర్ ఉండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కెల్విన్ తో పూరీ చాటింగ్ చేసినట్టు, కెల్విన్ తో పూరీ బ్యాంక్ లావాదేవీలు నటిపినట్టు తెలుస్తోంది. పూరీ విచారణ కోసం సిట్ వంద ప్రశ్నలు రెడీ చేసింది. పూరీ విచారణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐదో అంతస్తులో విచారణ చేయనున్నారు. అధికారులు వీడియో మొత్తన్ని వీడియో రికార్డు చేయనున్నారు. సిట్ విచారణ కోసం పూరీ తన ఇంటి నుంచి బయల్దేరారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:32 - July 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు ఊరట లభించింది. విద్యార్థులు మోసే పుస్తకాల బ్యాగ్‌ల బరువుపై ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇక నుంచి క్లాసుకు తగ్గ బరువులను మాత్రమే మోయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఒకటి, రెండు తరగతులకు బ్యాగ్ బరువు కిలోన్నర ఉండాలని, 3 నుంచి 5 తరగతులకు రెండు కిలోల నుంచి మూడు కిలోల బరువు ఉండాలని నిర్ణయించింది. అలాగే 6, 7 తరగతులు విద్యార్థులు నాలుగు కిలోలు, 8, 9 క్లాసుల వారు నాలుగున్నర కిలోలు, పదో తరగతి విద్యార్థులు ఐదు కిలోల బరువు గల బ్యాగ్‌లు మాత్రమే ఉండాలని సూచించింది. స్కూల్‌ బ్యాగుల బరువుతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్‌ సిలబస్‌ పుస్తకాలతో పాటు.. డ్రాయింగ్‌, క్రాఫ్ట్, ఆర్ట్‌, జీకే, కంప్యూటర్‌, అసైన్‌మెంట్‌, డైరీ, రిజిస్టర్‌ వంటి పుస్తకాలను విద్యార్థులు మోయాల్సి వస్తోంది. ఒక్కో సబ్జెక్ట్‌కు 2 నుంచి 3 చొప్పున నోట్‌ బుక్స్‌తో విద్యార్థులపై మోయలేని భారం పడుతుంది. ఈ బరువులతో చిన్నారులు ప్రైవేట్‌ స్కూల్లో మూడు, నాలుగు అంతస్థులుపై ఉన్న తరగతి గదులకు వెళ్లాల్సిన పరిస్థితి. యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే.. బ్యాగ్ బరువు మూడున్నర కిలోలకు పైనే ఉంటుందని విద్యాశాఖ అంచనా.

కోర్టును ఆశ్రయించిన ప్రజా సంఘాలు
విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ప్రజా సంఘాలు గతంలో కోర్టును కూడా ఆశ్రయించాయి. దీంతో యూపీఏ హయాంలో ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. బ్యాగ్‌ల బరువులపై అధ్యయనం చేసిన యశ్‌పాల్ కమిటీ పిల్లల బరువులో పదిశాతం మాత్రమే బ్యాగ్‌ల బరువు ఉండాలని సూచిస్తూ.. నివేదికను అందించింది. కానీ ఏ ప్రభుత్వమూ యశ్‌పాల్‌ కమిటీ సిఫార్స్‌లను అమలు చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ... మొట్టమొదటగా తెలంగాణ ప్రభుత్వం స్కూల్‌ బ్యాగ్‌ల మోతపై సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్కూల్‌ బ్యాగ్‌లపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు కానున్నాయి. ఈ మేరకు విద్యార్థుల పుస్తకాలు... బరువుకు మించినవి ఉంటే స్కూల్లోనే పెట్టే విధంగా స్కూల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

09:22 - July 19, 2017

హైదరాబాద్ : 45 రోజుల కిందట కూకట్‌పల్లిలో అదృశ్యం అయిన పూర్ణిమ ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరింది. పోలీసులు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాచిగూడలోని తెలంగాణ పర్యవేక్షణ గృహానికి తరలించారు. జువనైల్ కోర్టు విచారణ అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

09:04 - July 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పాటు దేశంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ తారల విచారణకు సిట్ సిద్ధమైంది. నోటీసులు అందుకున్నవారు రోజుకొక్కరు చొప్పున విచారణకు హాజరు కానున్నారు. సిట్ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపారు. నేడు సిట్ ముందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రానున్నారు. కెల్విన్ కాల్ లిస్ట్లో పూరీ ఫోన్ నంబర్ ఉండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కెల్విన్ తో పూరీ చాటింగ్ చేసినట్టు, కెల్విన్ తో పూరీ బ్యాంక్ లావాదేవీలు నటిపినట్టు తెలుస్తోంది. పూరీ విచారణ కోసం సిట్ వంద ప్రశ్నలు రెడీ చేసింది. పూరీ విచారణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐదో అంతస్తులో విచారణ చేయనున్నారు. అధికారులు వీడియో మొత్తన్ని వీడియో రికార్డు చేయనున్నారు. పూరీతో పాటు అతని లాయర్ తో వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:19 - July 19, 2017

హైదరాబాద్ : 45 రోజుల కిందట కూకట్‌పల్లిలో అదృశ్యం అయిన పూర్ణిమ ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరింది. పోలీసులు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాచిగూడలోని తెలంగాణ పర్యవేక్షణ గృహానికి తరలించారు. జూనైలు కోర్టు విచారణ అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:15 - July 19, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పాటు దేశంలో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో సినీ తారల విచారణకు సిట్ సిద్ధమైంది. నోటీసులు అందుకున్నవారు రోజుకొక్కరు చొప్పున విచారణకు హాజరు కానున్నారు. సిట్ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపారు. నేడు సిట్ ముందుకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రానున్నారు. కెల్విన్ కాల్ లిస్ట్లో పూరీ ఫోన్ నంబర్ ఉండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు కెల్విన్ తో పూరీ చాటింగ్ చేసినట్టు, కెల్విన్ తో పూరీ బ్యాంక్ లావాదేవీలు నటిపినట్టు తెలుస్తోంది. పూరీ విచారణ కోసం సిట్ వంద ప్రశ్నలు రెడీ చేసింది. పూరీ విచారణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఐదో అంతస్తులో విచారణ చేయనున్నారు. అధికారులు వీడియో మొత్తన్ని వీడియో రికార్డు చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

హైదరాబాద్ కు పూర్ణిమసాయి

హైదరాబాద్ : 45 రోజుల కిందట కూకట్‌పల్లిలో అదృశ్యం అయిన పూర్ణిమ ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరింది. పోలీసులు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాచిగూడలోని తెలంగాణ పర్యవేక్షణ గృహానికి తరలించారు. కేసు విచారణ అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు

07:48 - July 19, 2017

ముఖ్యమంత్రి మొదట చేసిన సంతకం బెల్ట్ షాపు రద్దు కానీ ఎప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు కొత్తగా బెల్ట్ షాపు మూసివేత మాట్లాడుతున్నారని, రాష్ట్రం స్వర్ణంధ్రప్రదేశ్ కాదని మద్యంధ్రప్రదేశ్ అని, ఇంతకాలం ప్రభుత్వం ఎం పని చేసిందని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. గత ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సాహించిందని, ఇప్పుడు బెల్ట్ షాపులు నడుపుతున్నవారికి జైలు శిక్ష వేస్తామని టీడీపీ నేత రామకృష్ణ అన్నారు. బెల్ట్ షాపులు రద్దుతో పాటు మొబైల్ లో మద్యం విక్రయాలు, చాలా మంది మహిళలు తమ ప్రాంతంలో బెల్ట్ షాపులో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నారని ఐద్వా నాయకురాలు రమాదేవి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:45 - July 19, 2017

హైదరాబాద్ : జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌సాగర్‌ నిండుకుండను తలపిస్తోంది. ముందు జాగ్రత్తగా 350 నుంచి 400 క్యూసెక్కుల నీటిని హుస్సేన్‌ సాగర్‌ నుంచి దిగువకు వదులుతున్నారు. బేగంపేటలో అత్యధికంగా 47 మిల్లీమీటర్లు , రాజేంద్రనగర్‌లో 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్‌ పరిధిలోని చెరువులకు గండ్లుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు.హైదరాబాద్‌లో కురుస్తున్న భారీవర్షాలకు.. యాదాద్రి భువనగిరిజిల్లాలో మూసీనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలోని పోచంపల్లి, బీబీనగర్‌, మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎడతెరిపి లేకుండా వర్షం
రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్‌లోకి వరదప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ప్రస్తుత నీటిమట్టం 18.4 టీఎంసీలుగా ఉంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 1813 క్యూసెక్కులు కాగా... 392 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. భారీవర్షాలతో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుగ్రామాలకు రాకపోకలు స్థంభించాయి. కొత్తగూడెం ప్రధానరహదారిపై భారీగా వర్షం నీరు చేరడంతో.. వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో 23వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి 17 అడుగులకు చేరుకోగా.. ఇటు ఖమ్మంజిల్లాలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీవర్షాలకు ఈదురు గాలులుకూడా తోడవడంతో భారీగా వృక్షాలు విరిడిపడుతున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

పలు జిల్లాలో వర్షాలు
అటు కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌, దహేగాం, పెంచికల్‌ పేట మండలాల్లో భారీగా వానలు దంచికొడుతున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న పెన్‌గంగా నదికి వరదనీరు పోటెత్తుతోంది. ఆసిఫాబాద్‌ తిర్యాణి, కెరమెరి మండలాల్లోనూ బంగాళాఖాతంలో వాయుగుండం కారంణంగా మరో 3రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. జోరువానలతో కుంటలు, చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పలు జిల్లాల్లో ప్రత్తిపంట వరదనీటిలోకొట్టుకుపోయి నష్టాలపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

07:43 - July 19, 2017

చిత్తూరు : దివ్యదర్శనం టోకెన్ల రద్దుపై తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కి తగ్గింది. భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. వారాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని నడకదారి భక్తులకు ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను శుక్ర, శని, ఆదివారాల్లో రద్దు చేస్తూ ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. శుక్ర,శని , వారాల్లో నడకదారి భక్తులను దర్శనానికి అనుమతించలేదు. దీంతో టీటీడీ తీరుపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తులు మండిపడ్డారు. వారాంతంలోనూ కాలినడక భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీని కోరారు. వారాంతంలో దివ్యదర్శనం టోకెన్ల రద్దును భక్తులు వ్యతిరేకిస్తుండడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. టీటీడీ అధికారులు దీనిపై చర్చించారు. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో వారాంతాల్లో దివ్యదర్శనం టోకెన్లను పునరుద్దరిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. ఇక నుంచి నడకదారి భక్తులకు ప్రతినిథ్యం 20వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తామన్నారు. టోకెన్‌ పొందిన భక్తులకు రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

అన్ని రోజుల్లో కాలినడక భక్తులకు టోకెన్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పెరటాశినెలతోపాటు ఇతర రద్దీరోజుల్లో మినహా అన్ని రోజుల్లో కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేస్తామన్నారు. అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టుమార్గంలో 6వేలు కలుపుకుని మొత్తంగా రోజుకు 20వేల టోకెన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులతో కలిపి నిత్యం 40వేల భక్తులకు టైంస్లాట్‌ ద్వారా దర్శనం కల్పిస్తున్నామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం సర్వదర్శనం భక్తులకు కూడా టైమ్‌స్లాట్‌ ద్వారా దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంటి టీటీడీ. 

07:42 - July 19, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ వినియోగం కేసులో సిట్‌ విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ డీలర్స్‌ కాల్ లిస్ట్ లో వున్న వారిని ఇప్పటి కే విచారణ పిలిచింది. వారికి నోటీసులు కూడా అందించింది. నేటి నుంచి ఆగస్టు 2వరకు సినీ ప్రముఖులను విచారించేందుకు సిట్‌ సిద్ధమైంది. మొత్తంగా 12 మందిని సిట్‌ విచారించబోతోంది. వీరి నుంచి డ్రగ్స్‌కు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. సిట్‌ నుంచి 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు అందాయి. ఇందులో డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఇవాళ సిట్‌ముందు విచారణకు హాజరవుతున్నారు. ఈ ఉదయం పదిన్నరకు సిట్‌ అధికారుల ముందు విచారణకు వస్తున్నారు. సాయంత్రం వరకు పూరీ జగన్నాథ్‌ను సిట్‌ అధికారులు విచారించనున్నారు. అయితే సిట్‌ పూరీనే అందరికంటే ముందు విచారించాలని ఎందుకు భావించింది? పూరీ జగన్నాథ్‌ నుంచి సిట్‌ అసలు ఏ సమాచారం రాబట్టాలని చూస్తోంది?

అందరికంటే ముందు పూరీ జగన్నాథ్‌
డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను అందరికంటే ముందు విచారించాలని సిట్‌ భావించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌ కాల్‌లిస్ట్‌లో పూరీ జగన్నాథ్‌ మొబైల్‌ నంబర్‌ ఎక్కువసార్లు ఉంది. అటు కెల్విన్‌ ఇచ్చిన వాంగ్మూలంలోనూ పూరీ పేరునే ప్రముఖంగా ప్రస్తావించాడు. తాను పెద్దమొత్తంలో పూరీకి డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నాడు. పూరీతో తాను వాట్సప్‌లో చాట్‌ చేసిన డాటాను అధికారులకు చూపాడు. కోడ్‌ భాషలో పూరీ పలుమార్లు కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు... డ్రగ్స్‌ను పుచ్చుకున్నందుకు పూరీ జగన్నాథ్‌ నేరుగా కెల్విన్‌ బ్యాంకులో నగదు పలుమార్లు డిపాజిట్‌ చేసిన లావాదేవీలు కూడా అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో సిట్‌కు ఫస్ట్‌ టార్గెట్‌ పూరీ అయ్యాడు. పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నిస్తే కీలక సమాచారం తెలుస్తుందని భావించిన సిట్‌.. ఆయననే మొదట హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

పెద్ద మొత్తంలో డ్రగ్స్‌
ప్రతి వీకెండ్‌లోనూ పూరీజగన్నాథ్‌ పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను తెప్పించుకున్నట్టు అధికారుల దగ్గర పూర్తి సమాచారం ఉంది. ప్రతి వీకెండ్‌లో ఫామ్‌హౌజ్‌తోపాటు పబ్‌ల్లోకి పూరీ గ్యాంగ్‌ వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి. పూరీ గ్యాంగ్‌ ఎక్కడికి వెళ్లినా కెల్విన్‌ పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు సమాచారం. దీంతో పూరీ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్‌ అధికారులు యోచిస్తున్నారు. ఇందు కోసం దాదాపు వంద ప్రశ్నలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.వందప్రశ్నలు, వంద రకాలను అధికారులు పూరీకి సంధించనున్నారు. మూడు దఫాలుగా సిట్‌ విచారణ జరుపబోతోంది. మూడు కోణాల్లోనూ విచారణ చేస్తారు. పూరీకి డగ్స్‌ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? పూరీ ఇంతకీ ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌, గంజాయిల్లో దేన్ని తీసుకుంటారు? ఏయే సందర్భాల్లో డ్రగ్స్‌ తీసుకుంటారు? అసలు పూరీ జగన్నాథ్‌కు కెల్విన్‌తో ఎలా పరిచయం ఏర్పడింది? పూరీ ఒక్కరే డ్రగ్స్‌ తీసుకుంటారా? బృందంతో కలిసి తీసుకుంటారా? తాను డ్రగ్స్‌ తీసుకోవడం వరకే పరిమితం అయ్యారా? లేక ఇతరులకూ డ్రగ్స్‌ను అలవాటు చేశారా? షూటింగ్‌ టైమ్‌లోనూ డ్రగ్స్‌ తీసుకుంటారా? నెలకు సరిపడ డ్రగ్స్‌ను ఒకేసారి తెప్పింకుంటారా? లేక అవసరమైనప్పుడు మాత్రమే తెప్పించుకుంటారా? డ్రగ్స్‌ తెప్పించుకోవడానికి పూరీ వాడిన కోడ్‌ భాష ఏంటి? తదితర ప్రశ్నలకు సిట్‌ సమాధానం రాబట్టనుంది. మరోవైపు నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ సిట్‌ ముందు విచారణకు హాజరై... తమ వాదనను వినిపించాలని అధికారులు తేల్చి చెప్పారు. డ్రగ్స్‌ కేసులో ఉన్న పత్రి ఒక్కరినీ విచారిస్తామని.. ఎ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నారు.మొత్తానికి డ్రగ్స్‌ మాఫియా వ్యవహారంలో మొదటి రోజు విచారణకు అంతా సిద్ధమైంది. మరి పూరీ జగన్నాథ్‌ ఏం చెప్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

07:40 - July 19, 2017

కర్నూలు : భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం భర్తీకి తర్వలో ఉప ఎన్నికల నగారా మోగనుంది. దీంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికపై వైసీపీ అధినేత జగన్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ సీటును దక్కించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాపయంలో మార్పు వస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఇదే సెమీ ఫైనల్‌ అన్న ఉద్దేశంతో శిల్పా మోహన్‌రెడ్డిని బరిలో దింపారు. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందు నుంచే ప్రచారం హోరెత్తిస్తున్నారు. నంద్యాల గెలుపు వచ్చే ఎన్నికల్లో విజయసోపానానికి నాంది పలుకుతుందన్నఉద్దేశంతో అధికార టీడీపీతో వైసీపీ హోరాహోరీ తలపడుతోంది. 2014 ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలుపొందిన భూమా నాగిరెడ్డి, ఆ తర్వాత జగన్‌తో విభేదించి, టీడీపీల చేరారు. నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను గెలుచుకోవడం ద్వారా, టీడీపీకి ఝలక్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో వైసీపీ ఉంది.

నంద్యాల అభివృద్ధికి నిధుల ప్రవాహం
అధికార టీడీపీ ప్రభుత్వం నంద్యాల అభివృద్ధికి నిధులు వరదలా ప్రవహింపచేస్తోంది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఈ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న తన సోదరుడు బ్రహ్మనందరెడ్డిని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తు వేసినా ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థిని చిత్తు చేయాలన్న వ్యూహంతో వైసీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. కీలక నేతలందరూ నియోజకవర్గంలోనే ఉండేలా జగన్‌ ప్లాన్‌ చేస్తున్నారు. గుంటూరు ప్లీనరీలో పార్టీ ప్రకటించిన తొమ్మిది హామీలను నంద్యాల ప్రజలల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని వైసీపీకి అనుకూలంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా నంద్యాలలో గెలుపుకు బాట వేయాలని భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుతలైన తర్వాత నంద్యాలలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశలు ఉన్నాయి. 

07:38 - July 19, 2017

హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన శాశ్వత చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకొనేందుకు కొన్నికార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయం విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేస్తారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి అందిచాలని నిర్ణయించిన నేపథ్యంలో... గ్రామాల వారీగా రైతు సంఘాలను ఏర్పాటు చేస్తారు. భూ రికార్డుల సక్రమ నిర్వహణను చర్యలు చేపడతారు. ఈ రెండు కార్యక్రమాలపై అవగాహన కోసం తర్వలో హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

సమైక్య రాష్ట్రంలో జరిగిన వివక్ష
సమైక్య రాష్ట్రంలో జరిగిన వివక్ష, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు చితికిపోయిన విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమం రైతు సమస్యల పునాదిగా నిర్మితమైందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంణాలో రైతు అభ్యున్నతే ముఖ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోటి ఎకరాలు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న కర్షకులను దళారుల దోపిడీ, మార్కెట్‌ మాయాజాలం నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన రైతు సంఘాల ఏర్పాటును వెంటనే ప్రారంభించాలని కేఆర్‌ ఆదేశించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే పంటలు పండించే విధంగా క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చర్యలతో ఐదేళ్లలో రైతుల బతుకులు బాగుపడతాయన్న ఆశాభాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతుల ఇళ్ల ముందు నిలబడి అప్పులు ఇచ్చే పరిస్థితి రావాలన్నది కేసీఆర్‌ ఆకాంక్ష. ఇది తప్పక నెరవేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.  

07:36 - July 19, 2017

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం బెల్టు షాపుల తొలగింపు, ఇసుక అక్రమ రవాణ నియంత్రణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ మంచినీటి సరఫరా సంస్థ ఏర్పాటు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గం భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం బెల్టు షాపుల తొలగింపు, ఇసుక అక్రమ రవాణ నియంత్రణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏపీ మంచినీటి సరఫరా సంస్థ ఏర్పాటు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఏపీ కొత్త ఎక్సైజ్‌ విధానంలో భాగంగా జనావాసాల మధ్య ఏర్పాటవుతున్న మద్యం దుకాణాలపై మహిళలు సమరభేరి మోగించారు. నిత్యం ధర్నాలు, ప్రదర్శనలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మహిళలు గళం విప్పుతున్నారు. జనావాసాల మధ్య, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం షాపులు వెలుస్తుండటంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఈ అంశాలపై చర్చించిన మంత్రివర్గం... బెల్టు షాపుల తొలగింపుకు నిర్ణయం తీసుకుంది.

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై కూడా మంత్రివర్గంలో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారిని ఆదుకునేందుకు పేదలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కిడ్నీ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సంయుక్త పరిశోధనా కేంద్ర ఏర్పాటు చేస్తారు. ఇందుకయ్యే సగం ఖర్చు దాదాపు ఐదు కోట్ల రూపాయలను రాష్ట్రం భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఐసీఎంఆర్‌ వ్యయం చేస్తుంది. ఉద్దానం ప్రాంతంలో ఏడు నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ నెల్లో మూడు, సెప్టెంబర్‌ ఆఖరు నాటికి మిగిలినవి అందుబాటులోకి తెస్తారు. కిడ్నీ బాధితులను ఆదుకునే లక్ష్యంతో కేబినెట్‌ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇసుక అక్రమ రవాణపై
ఇసుక అక్రమ రవాణపై కూడా మంత్రివర్గంలో సుదీర్ఘం చర్చించారు. దీని నివారణకు ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, గనులు శాఖ అధికారితోపాటు మరొకరిని చేర్చి నలుగురితో కమిటీల ఏర్పాటు చేస్తారు. ఇసుక అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారందర్నీ ఆరెస్టు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణ చార్జీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. కిలోమీటరకు ఒకే చార్జీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు.మరోవైపు కాపు రిజర్వేన్‌ ఉద్యమం రగులుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న జస్టిస్‌ మంజునాథ కమిషన్‌పై కూడా కేబినెట్‌లో చర్చించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్‌ను మంత్రివర్గం కోరింది. కులాలు, ప్రాంతాల పేరుతో ఎవరైనా రెచ్చగొడితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించిన ఫైలు కూడా మంత్రివర్గం పరిశీలనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై తుది నిర్ణయం తీసుకున్నాక గవర్నర్‌ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, మరొకటి కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నాల రామసుబ్బారెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు, వ్యసాయంపై కూడా మంత్రివర్గంలో సమీక్షించారు. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణంపై కూడా చర్చించారు. 

07:35 - July 19, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్స్ మహమ్మారిపై యుద్ధానికి ప్రజాసంఘాలు సైరన్ మోగించాయి. విద్యాసంస్థల్లో డ్రగ్స్ సరఫరా తీవ్రమయినప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల భయాందోళను గురవుతున్నారు. ఈ నేపధ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డ్రగ్స్ విక్రయాలు.. సమాజంపై ప్రభావం.. ప్రభుత్వ వైఖరి అనే అంశంపై పలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లో చదివే విద్యార్థుల్లో డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. పిల్లలకు లక్షల్లో పాకెట్‌మనీ ఇవ్వడం వల్ల డ్రగ్స్‌కి బానిసలు అవుతున్నారని, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలని వారు తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలి..
తల్లిదండ్రులు, పిల్లల పట్ల అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఇలాంటి వాటికి బానిసలవుతున్నారని ప్రముఖ విద్యావేత్త విమర్శించారు. డ్రగ్స్‌ విషయంలో అసలు చర్చ మానేసి సెలబ్రెటీ లిస్టును బయటపెట్టి విషయాన్నంతా పక్కదారి పట్టించే పనిలో పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో డ్రగ్స్ ప్రభావం తీవ్రతరం అవుతున్నా... ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారించదగ్గ విషయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సరఫరాని రూపుమాపకపోతే మరింత విచ్చలవిడితనం పెరిగిపోతుందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యాసంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవ్వాల్సి వస్తుందని ప్రజాసంఘం సభ్యులు హెచ్చరించారు. 

07:33 - July 19, 2017

హైదరాబాద్ : 45 రోజుల కిందట కూకట్‌పల్లిలో అదృశ్యం అయిన పూర్ణిమ ఎట్టకేలకు హైదరాబాద్‌కు చేరింది. పోలీసులు ఆమెను ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాచిగూడలోని తెలంగాణ పర్యవేక్షణ గృహానికి తరలించారు. కేసు విచారణ అనంతరం పూర్ణిమను ఆమె తల్లిదండ్రులకు అప్పగించనున్నారు

నేడు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన

సిరిసిల్ల : నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. గంభీరావు పేట లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంస్థాపన చేయనున్నారు.

06:40 - July 19, 2017

విద్యాసంవత్సరం ప్రారంభించిన తర్వాత విద్యారంగ సమస్యలు పరిష్కారిస్తామని, ఫీజుల నియంత్రణకు చట్టల తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని మరిచిపోయిందని, ప్రైవేట్ విద్యాసంస్థలు లక్షల ఫీజులు వసూల్ చేశారని, 4వేల ప్రభుత్వ పాఠశాల మూసివేతకు ప్రయత్నిస్తున్నారని, డిగ్రీలో పెరిగిని ఫీజులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ తో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎల్లుండి రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపునిచ్చామని తెలంగాణ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి తెలిపారు.

నేటి నుంచి సినీ తారల విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేటి నుంచి సినీతారలను సిట్ విచారించనుంది. నేడు సిట్ ముందుకు దర్శకుడు పూరీజగన్నాథ్ హాజరు కానున్నారు. నేటి నుంచి 27తేదీ వరకు నోటీసులందుకున్న వారు విచారణకు హాజరు కానున్నారు.

Don't Miss