Activities calendar

20 July 2017

తుందుర్రులో గ్రామస్తుల ఆందోళన

పశ్చిమగోదావరి : మెగా ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా తుందుర్రులో గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. వారిని పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఎస్ లో మంగతయారు అనే మహిళకు గుండె నొప్పి వచ్చింది. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

 

21:42 - July 20, 2017

చిత్తూరు : జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటించారు. సెప్టెంబర్‌లో కుప్పంకు హంద్రీనీవా జలాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే తన లక్ష్యమన్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపులు లేకుండా చేస్తామని... ఎక్కడైనా బెల్ట్‌షాపులు ఉంటే తాటతీస్తామని సీఎం హెచ్చరించారు. 
ఆర్టీసీ బస్సును ప్రారంభించిన చంద్రబాబు 
చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఓ బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కిన చంద్రబాబు... కండక్టర్‌ వద్ద టికెట్‌ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌ సీటులో కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. బస్సు సర్వీసును ప్రారంభించడమే కాకుండా... తమ రూట్‌లోని బస్సు చంద్రబాబు ఎక్కినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

21:38 - July 20, 2017

ఢిల్లీ : కిడ్నాపర్ల చెరలో ఉన్న డాక్టర్‌ శ్రీకాంత్‌ గౌడ్‌ను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఈనెల 6వ తేదీన శ్రీకాంత్‌ కిడ్నాప్‌నకు గురి కాగా... కాపాడేందుకు పోలీసులు ఎంతో శ్రమించారు. అనేక మార్గాల ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈరోజు నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్‌ చేశారు. తన ప్రాణాలు కాపాడినందుకు ఢిల్లీ పోలీసులకు శ్రీకాంత్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది తనకు పునర్జన్మ లాంటిదన్నాడు. కిడ్నాపర్లు తమ జాడ తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు పడ్డా.... మీరట్‌లోని శతాబ్ధి నగర్‌లో శ్రీకాంత్‌ను బంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు కిడ్నాపర్లను పట్టుకోగలిగారు. ఒకానొక సమయంలో కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో కిడ్నాపర్లకు బుల్లెట్‌ గాయలయ్యాయి. 

 

21:36 - July 20, 2017

ప్రకాశం : దేవరపల్లిలో దళితుల భూములను లాక్కునే ప్రయత్నాన్ని సాగనివ్వమని సీపీఎం నేత మధు అన్నారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గ చర్యలను అడ్డుకుంటామని హెచ్చరించారు.  దేవరపల్లిలో నీరు-చెట్టు పేరుతో..  22 ఎకరాల దళితుల భూములకు స్వాధీనం చేసుకునే ప్రయత్నంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులను.. గ్రామస్థులను అరెస్ట్‌లు చేయడం అన్యాయమని అన్నారు. 
దళిత భూ వివాదం 
ప్రకాశం జిల్లా... దేవరపల్లిలో పర్చూరు మండలంలో జరుగుతున్న దళిత భూ వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దళితుల భూములను లాక్కునేందుకు అధికారులు ప్రయత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న దళితుల భూముల్లో నీరు-చెట్టు పనులు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు వ్యతిరేకంగా సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీని చేపట్టగా..స్థానిక బస్టాండ్‌ సెంటర్‌  సమీపంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. అలాగే గ్రామంలో సుమారు 30 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించడానికి బయల్దేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వైవీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.
ప్రభుత్వ చర్యలపై మధు ఆగ్రహం
దీంతో ప్రభుత్వ చర్యలపై సీపీఎం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు- చెట్టు పేరుతో దళితుల భూములను లాక్కోవడం దౌర్భగ్యామని.. అన్నారు. టీడీపీ ప్రభుత్వం..ఎన్నికల ముందు హామీలిచ్చి... ఎన్నికల తర్వాత దళితుల పట్ల చిన్న చూపు చూడడం దారుణమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై టీడీపీ ఎమ్మెల్యేలు .. వారి అనుచరగణం కోట్ల రూపాయల సంపాదనకు తెర లేపారని విమర్శించారు. ప్రజలు త్వరలోనే చంద్రబాబునాయుడుకి బుద్ధి చెబుతారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చరమ గీతం పాడతాం : మధు 
సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో.... రాత్రికి రాత్రే 400 మంది పోలీసులను గ్రామంలోకి దించి..15 ప్రొక్లైనర్‌లతో చెరువు తవ్వడం  మొదలుపెట్టారని...ఇదెక్కడి అన్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. దళితులపై అక్రమాలకు పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమ గీతం పాడతామని మధు హెచ్చరించారు. శుక్రవారం అన్ని పార్టీలతో కలిసి ఛలో దేవరాపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

 

21:33 - July 20, 2017

హైదరాబాద్ : మొదటి రోజు చాలా హడావుడిగా ఉన్న అబ్కారీ అధికారులు రెండో రోజు కూల్‌గా ప్రశ్నల వర్షం కురిపించారు...కెమెరామెన్ శ్యాం.కె.నాయుడును ఆరుగంటలపాటు విచారించిన అధికారులు డ్రగ్స్ కింగ్‌పిన్ కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీశారు..మరోవైపు డ్రగ్స్ చేరుతున్న మూడు కొరియర్ సంస్థలతో సమావేశమయ్యారు...ఇక మూడో రోజు నటుడు సుబ్బరాజును విచారించేందుకు సిట్ ప్రశ్నలతో సిద్దమయింది..
శ్యాంకెనాయుడి విచారణ
ఎన్నో ప్రశ్నలు..మరెన్నో సందేహాలు...వీటన్నింటిపై సిట్ బృందం కెమెరామెన్ శ్యాంకెనాయుడిని విచారించింది...డ్రగ్స్ కేసులో టాలివుడ్‌లోని 12 మందికి నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండో రోజు శ్యాంను విచారించారు.. ప్రధానంగా డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించారన్న దానిపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీశారు...ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో శ్యాం పూర్తి సమాచారం అందించినట్లు తెలిసింది...సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు మధ్యలో తడబడ్డా ఆ తర్వాత తేరుకుని తనకు తెలిసిన సమాచారం అందించినట్లు తెలుస్తోంది...
రకరకాల ప్రశ్నలతో విచారణ 
ఇదిలా ఉంటే కొన్ని గంటలపాటు రకరకాల ప్రశ్నలతో సిట్ అధికారులు శ్యాంను విచారించగా సూటిగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది..దీంతో అధికారుల విచారణ...అటు అధికారులు శ్యాం చెప్పిన సమాధానాలపై సంతృప్తి చెందారు. ఎక్సైజ్ నోటీసు అందుకున్న శ్యాం ఉదయం తన న్యాయవాది, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు...అధికారులను కలవడంతో అప్పటికే ఏర్పాట్లు చేసి ఉండగా ఉదయం పదిన్నరకు ప్రశ్నించడం మొదలయింది...పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన అధికారులు నాలుగుగంటల సమయంలో శ్యాంను తిరిగి పంపించారు..
మూడు కొరియర్ సంస్థలలో మీటింగ్..
ఇదిలా ఉండగా డ్రగ్స్‌కు ప్రధానంగా డాట్‌నెట్‌వర్క్‌ నుంచి ఆర్డర్లు బుక్ చేసుకోవడంతో ఆ పార్శిల్స్‌ డీహెచ్‌ఎల్‌, బ్లూ డాట్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థల నుంచి నగరానికి చేరాయి..దీంతో ఆయా మూడు సంస్థలతో సిట్ అధికారులు సమావేశం నిర్వహించారు.. సంస్థల ప్రతినిధులు చెప్పిన సమాచారాన్ని రికార్డు చేశారు...అయితే ఇందులో ప్రధానంగా ఏయే దేశాల నుంచి కొరియర్లు వచ్చాయి.. ఎవరి పేరు మీద చేరాయి..వాటిని రిసీవ్ చేసుకున్నదెవరు..? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు...
మూడో రోజు సుబ్బరాజు...
ఇక సిట్ నోటీసులు జారీ చేసి రోజుకొకరు చొప్పున విచారిస్తుంది..ఇందులో టాలివుడ్ చెందిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను మొదటి రోజు కాగా..రెండో రోజు కెమెరామెన్ శ్యాంకె నాయుడు విచారణ పూర్తయింది..ఇక మూడో రోజు నటుడు సుబ్బరాజును విచారించనున్నారు...సుబ్బరాజు ఉదయాన్నే సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు...అయితే సుబ్బరాజు డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా..? సరఫరా చేశారా..? డ్రగ్స్ తీసుకున్న..డీలింగ్ చేసినవారితో ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీయనున్నారు.. అన్ని రకాల ఆధారాలతో ప్రశ్నలు రెడీ చేసుకున్న సిట్ సుబ్బరాజును రేపు ఉదయం నుంచి విచారించనుంది...

 

21:26 - July 20, 2017

పశ్చిమగోదావరి : దమనకాండ.. దౌర్జన్యం..పేరేదయినా.. ప్రభుత్వ నిజస్వరూపం బట్టబయలైంది. పశుబలం ప్రదర్శించిన చంద్రబాబు సర్కారు.. పెద్దోళ్ల కొమ్ముకాసింది. పశ్చిమగోదావరిజిల్లా తుందుర్రులో ప్రజలపై లాఠీ విరిగింది. కనీసం తమ బాధలను కూడా  చెప్పుకోనీకుండా మీడియాసాక్షిగా గ్రామస్తుల నోరు నొక్కేశారు ఖాకీలు. 
గ్రామస్థులపై విచక్షణ రహితంగా లాఠీచార్జ్‌..
వారు సంఘవిద్రోహులు కాదు.. దేశద్రోహులు అసలేకాదు.. కాలుష్యం వెదజల్లే ఆక్వా పరిశ్రమను వద్దంటున్న తుందుర్రు గ్రామస్థులు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దని వారు వేడుకుంటున్నారు.. పాలకులు వారి విన్నపాలను పెడచెవిన పెట్టారు. వేరే దిక్కు లేక, గ్రామస్థులంతా కలిసికట్టుగా ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. అంతే.. పోలీసులు శివాలత్తిపోయారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ యాజమాన్యపు ఉద్యోగులా అన్నట్లుగా ప్రవర్తించారు. గ్రామాలపైబడి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. 
గ్రామస్తులపై పోలీసులను ఉసిగొలిపిన చంద్రబాబు ప్రభుత్వం 
పశ్చిమగోదావరిజిల్లా తుందుర్రులో ప్రభుత్వ దౌర్జన్యకాండ గురువారం నాడూ కొనసాగింది. ఆక్వాఫుడ్‌ పార్క్ వద్దంటున్న గ్రామస్తులపై చంద్రబాబుప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలాది మంది ఖాకీలు తెల్లవారకముందే గ్రామాలపై దాడిచేశారు. ఇళ్లలోని మగవారినందరినీ లారీల్లో తరలించారు. బాధలు చెప్పుకోవాలని ప్రయత్నించిన ఆడవాళ్లను మీడియాసాక్షిగా నోరు నొక్కేశారు. 
ఆక్వాఫుడ్‌ పార్క్‌ ను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు  
పచ్చని పల్లెలగుండెల్లో విషాన్ని నింపడానికి చంద్రబాబు సర్కార్‌ ఎందుకంత ఉత్సాహం ప్రదర్శిస్తోందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటును మొదటి నుంచి గ్రామస్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.. పర్యావరణ కాలుష్యం, భూగర్భజలాలు కూడా కలుషితం అవడంతోపాటు బంగారుపంటలు పండే భూములు నిస్సారంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్థానికుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం..ఆక్వా యాజమాన్యానికి వత్తాసుపలుకుతోంది. ఇప్పటికే 80శాతం పూర్తయిన ఆక్వాపరిశ్రమకు ఇపుడు యంత్రసామాగ్రిని తరలిస్తోంది. దీనిపై గ్రామస్తులు భగ్గున మండిపడుతున్నారు. తమ అభ్యంతరాలను వినిపించుకోకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా వ్వహరిస్తోందని ఆగ్రహం వ్యతక్తం చేస్తున్నారు. తుందుర్రుతోపాటు,  కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 
పోలీసుల పహారా...
ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న గ్రామాలను దాదాపు 800 మందిపోలీసులు దిగ్బంధం చేశారు. మిషనరీ తరలించే దారిపొడవునా వందలాది మంది పోలీసులు పహరా కాశారు. గ్రామాల్లో మగవారినందరినీ గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. తమ వాళ్లు ఏమయ్యారో చెప్పాలన్న మహిళలను.. కనీసం మాట్లాడకుండా దౌర్జన్యం ప్రదర్శించారు. గ్రామస్తుల ఆందోళనకు అండగా నిలిచిన సీపీఎం నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. 
మిషనరీ లారీలకు అడ్డుతగిలిన గ్రామస్తులు  
తమ జీవితాలను ప్రమాదంలో పడేసే ఆక్వాఫుడ్‌పార్క్‌ను ఎలాగైన అడ్డుకోవాలని నర్సాపురం నుంచి మిషనరీతో వస్తున్న లారీలకు గ్రామస్తులు అడ్డుతగిలారు. పోలీసులు లాఠీలతో చితకబాదుతుంటే.. తట్టుకోలేని ప్రజలు కారప్పొడిచల్లుతూ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వంటిపై కిరోసిన్‌పోసుకుని నిరసన తెలిపారు. 
తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన  
ప్రాణాలు తీసే ఆక్వాపరిశ్రమ వద్దన్నందుకే చంద్రబాబు సర్కారు పోలీసులతో దాడికి దిగిందని తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దమనకాండను ప్రదర్శించినా ఆక్వాఫుడ్‌ ఫార్క్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు. 

 

21:15 - July 20, 2017

వ్యవసాయ ప్రధాన దేశం మనది...రైతు కళ్లల్లో ఆనందం నిండినప్పుడే...మన వ్యవస్థకు సుస్థిరత... రైతన్నను వదిలేస్తే దేశానికి భవిష్యత్ శూన్యం...కానీ ఈ నిజాన్ని పట్టని ప్రభుత్వాలు రైతన్నను ఒంటరి చేస్తున్నాయి.. నిర్మాణాత్మక వ్యవసాయ విధానాలు రూపొందించలేని ప్రభుత్వాల వైఫల్యం... కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టే విధానాలే.. దీనికి కారణంగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:01 - July 20, 2017

రాష్ట్రపతి ఓట్లల రామ్ నాథ్ సార్ గెలుపు....వెంకయ్యసారు ఇక మీవంతే దులుపు, తుందుర్రు జనాన్ని కొట్టిచ్చిన చంద్రాలు.. పోలీసోళ్ల మీదికి సల్లిండ్రు జనం కారాలు, గాలికిపోయే కంప నెత్తికిసుట్టుకున్నది... పొన్నం, రసమయి కయ్యం గమ్మత్తున్నది, కరీంనగర్ అలియాస్ లండన్ కాడా పత్తాలాట....బందైందని చెప్పిన వారానికే దొరికిన లీడర్లు, మంచిగున్న ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్.. మరి నీమ్స్ పరిస్థితి ఎన్నడుచూస్తవు సారు..గోవులను చంపేసిన గోసంరక్షకులు.. ఇప్పుడు బాధ్యులెవరో చెప్పాలె మరి... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:49 - July 20, 2017
20:47 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం, దేవరపల్లిలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో స్ధానిక ఎమ్మెల్యే అనుచరులు నీరు చెట్టు కార్యక్రమం చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ ప్రాణాలు పోయినా భూమిని విడిచిపెట్టమని రైతులు తేల్చి చెప్పారు. ఈ భూములే తమకు బతుకుదెరువని ఎమ్మెల్యేకు విన్నవించినా.. తమ గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 
మధు అరెస్ట్‌ 
ప్రకాశం జిల్లా దేవరపల్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న... సీపీఎం ఏపీ కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పర్చూరు బొమ్మల సెంటర్‌లో అటకాయించి... అరెస్ట్ చేశారు. మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వైవీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులోనైనా 'చలో దేవరాపల్లి' కొనసాగుతుందన్నారు మధు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని కొనసాగనీయమని.. అందరూ ఈ దుర్మార్గాన్ని ఖండించాలన్నారు. 

 

20:42 - July 20, 2017

హైద‌రాబాద్ : నేడు విడుద‌లైన కేయూ సెట్ ఇంగ్లీష్ ఎంట్రెన్స్ ఫలితాల్లో క‌రీంన‌గ‌ర్ జిల్లా మెట్‌ప‌ల్లికి చెందిన ప్ర‌వీణ్ ఎంఏ ఇంగ్లీష్ కోచింగ్ సెంట‌ర్ విద్యార్థి సాయి శిల్ప స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ సాధించిన‌ట్టు ఆ సంస్థ నిర్వ‌హ‌కులు పులిమామిడి ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. కాగా ఆమెను స్థానిక ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్‌రావు అభినందించారు. రాష్ట్ర స్థాయిలో సల్మ సుల్తానా మూడో ర్యాంకు,  అనుష ఆరో ర్యాంకు,  దీప 17,  రమ్య 41, పవిత్ర  46 , సతీష్ 75,  మాధురి  192 ర్యాంకులు సాధించిన‌ట్టు పేర్కొన్నారు. ఐదేండ్లుగా రాష్ట్రస్థాయిలో ఎన్నో ర్యాంకులు సాధించి ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రతిష్టాత్మక యూనివ‌ర్శిటీల్లో విద్య‌న‌భ్య‌స్తున్న‌ట్టు తెలిపారు. కాగా ఇటీవ‌ల విడుద‌లైన ఓయూ సెట్ ఫ‌లితాల్లోనూ ఈ సంస్థ విద్యార్థులు రాష్ర్ట స్థాయి ర్యాంకులు సాధించిన విష‌యం తెలిసిందే...

 

20:32 - July 20, 2017

చెట్టు కొమ్మ మీదపడి... ఇద్దరు మృతి

సిరిసిల్ల : అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపుల ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. అయితే... రోడ్డుపై వాహనాలను నిలిపివేయకుండానే చెట్లను తొలగిస్తున్నారు. అయితే... నరికిన చెట్టు కొమ్మ ద్విచక్రవాహనంపై పడింది. ఈ ప్రమాదంలో బైక్‌ వస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతేకాకుండా... రోడ్డుపై వస్తున్న విద్యార్థినులపై కూడా చెట్ల కొమ్మలు పడ్డాయి.

20:17 - July 20, 2017

సిరిసిల్ల : అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపుల ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. అయితే... రోడ్డుపై వాహనాలను నిలిపివేయకుండానే చెట్లను తొలగిస్తున్నారు. అయితే... నరికిన చెట్టు కొమ్మ ద్విచక్రవాహనంపై పడింది. ఈ ప్రమాదంలో బైక్‌ వస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతేకాకుండా... రోడ్డుపై వస్తున్న విద్యార్థినులపై కూడా చెట్ల కొమ్మలు పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులంటున్నారు. 

 

తెలంగాణలో గురుకుల నియామక పరీక్షలు వాయిదా

హైదరాబాద్ : తెలంగాణలో గురుకుల నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు జరగాల్సి ఉన్న గురుకుల పరీక్షలను టీఎస్ పీఎస్సీ వాయిదా వేసింది. జీవో 1274ను హైకోర్టు నిలిపివేయడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. 

ఆక్వాపుడ్ పార్క్ ఆందోళనకారులపై కేసు నమోదు

పశ్చిమగోదావరి : తుందుర్రులో ఆక్వాపుడ్ పార్క్ ను వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. 
353, 307, 143, 144, 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 

20:01 - July 20, 2017
19:58 - July 20, 2017
19:50 - July 20, 2017

కృష్ణా : ఫిదా చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. చిత్రం రేపు విడుదల కాబోతున్న సందర్భంగా డైరక్టర్‌ శేఖర్‌ కమ్ముల, నిర్మాత దిల్‌ రాజు, హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ సాయిపల్లవి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి ప్రీమియర్‌ షో చూసిన వారంతా చిత్రం బాగా ఉందని, వరుణ్‌ తేజ్‌ కెరీర్ లోనే బెస్ట్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుందని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని నటించిన హీరోయిన్‌ సాయిపల్లవి అద్భుతంగా నటించిందని అన్నారు..

 

19:48 - July 20, 2017

బెంగుళూరు : హిందీ భాష‌కు వ్యతిరేకంగా క‌ర్నాట‌క‌లో ఆందోళనలు ఊపందుకున్నాయి.  హిందీ సైన్‌బోర్డ్‌లు అవ‌స‌రం లేదంటూ ఆందోళ‌న‌కారులు గ‌ళ‌మెత్తారు. కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు హిందీలో రాసివున్న పేర్లపై నల్లని రంగు పూశారు. బెంగుళూరులోని మెట్రో రైల్వే స్టేష‌న్ల వ‌ద్ద హిందీ భాషలో రాసి ఉన్న సైన్‌బోర్డుల‌ను తొలిగించారు. హిందీ రాతలపై పోస్టర్లు అతికించారు. జ‌య‌న‌గ‌ర్‌, పీన్యా, దీపాంజ‌లి న‌గ‌ర్‌, మైసూర్ రోడ్డు, య‌శ్వంత‌పూర్ మెట్రో స్టేష‌న్ల‌లో ఉన్న హిందీ భాష బోర్డుల‌ను తొలిగిస్తున్నారు. మెట్రో బోర్డుల‌ను క‌న్నడ‌, హిందీ, ఇంగ్లీష్ బాష‌ల్లో రాశారు. మెట్రో బోర్డుల‌కు మూడు భాష‌ల‌ను ఎందుకు వాడుతున్నార‌ని ఇటీవ‌ల సీఎం సిద్ధిరామ‌య్య మెట్రో కార్పొరేష‌న్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కేఆర్‌వి సమాయత్తమవుతోంది. ఆందోళన నేపథ్యంలో బెంగళూరులో భద్రతను పెంచారు.

 

జగన్‌కు ఎదురుదెబ్బ

హైదరాబాద్ : జగన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్ని ఆస్తుల కేసులను కలిపి ఏకకాలంలో విచారించాలని జగతి పబ్లికేషన్స్ కోరింది. దీంతో హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది. 

 

19:43 - July 20, 2017

హైదరాబాద్ : జగన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్ని ఆస్తుల కేసులను కలిపి ఏకకాలంలో విచారించాలని జగతి పబ్లికేషన్స్ కోరింది. దీంతో హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:40 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని దేవరపల్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న... సీపీఎం ఏపీ కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పర్చూరు బొమ్మల సెంటర్‌లో అటకాయించి... అరెస్ట్ చేశారు. మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వైవీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితులోనైనా 'చలో దేవరాపల్లి' కొనసాగుతుందని మధు అన్నారు. ప్రభుత్వం రౌడీరాజ్యం నడిపిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ దౌర్జన్యాన్ని కొనసాగనీయమని.. అందరూ ఈ దుర్మార్గాన్ని ఖండించాలన్నారు. 

 

19:32 - July 20, 2017

ఢిల్లీ : రామ్‌నాథ్‌ కోవింద్‌ 14 వ రాష్ట్రపతిగా ఈ నెల 25 న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్యసభ సభ్యులుగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, బీహార్‌ గవర్నర్‌గా... సేవలందించారు. దళిత, వెనకబడ్డ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారు. నిరాండంబర జీవితాన్ని గడిపిన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి అవుతానని మాత్రం ఎన్నడూ అనుకోలేదు..
దళిత కుటుంబంలో జననం 
భారతదేశానికి 14 వ రాష్ట్రపతిగా ఎంపికైన 72 ఏళ్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ మారుమూల గ్రామం నుంచి వచ్చినవారే. అక్టోబర్‌ 1, 1945లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని పరాంఖ్‌ గ్రామంలోని దళిత కుటుంబంలో జన్మించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కాన్పూర్‌ యూనివర్సిటీ నుంచి బి.కాం., ఎల్‌ఎల్‌బి పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే మేధావిగా పేరు తెచ్చుకున్న ఆయన  న్యాయవాది వృత్తిని చేపట్టడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించారు. 1971లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఢిల్లీలో కోవింద్‌ పేరు నమోదు చేయించుకున్నారు.
మొరార్జీ దేశాయ్‌ వద్ద ప్రత్యేక అధికారిగా 
1977లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 1977 నుంచి 79 వరకు ఢిల్లీ హైకోర్టులో సెంట్రల్‌ గవర్నమెంట్‌ అడ్వకేట్‌గా పనిచేశారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వకేట్‌ రికార్డ్‌గా పనిచేశారు.  1980 నుంచి 93 వరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో 16 ఏళ్లు పనిచేశారు. 1998 నుంచి 2002 వరకు బిజెపి దళిత మోర్చా అధ్యక్షునిగా పనిచేశఆరు.
1991లో బిజెపిలో చేరిక 
రామ్‌నాథ్‌ కోవింద్‌ 1991లో బిజెపిలో చేరారు. అప్పటి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. బిజెపి దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు 1994లో తొలిసారిగా ఎంపికయ్యారు. 2006 వరకు రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. పార్లమెంట్‌కు చెందిన అనేక కమిటీల్లో ఆయన సభ్యునిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ, హోంశాఖ, సామాజిక న్యాయం, లా అండ్‌ జస్టిస్, తదితర కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. పార్లమెంట్‌ కమిటి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఎంపి కోటాలో తనకు కేటాయించిన నిధులను యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో పాఠశాలల నిర్మాణానికి, అభివృద్ధికి కృషి చేశారు.
అనుకోకుండానే కోవింద్‌ నియామకం 
బిహార్‌ గవర్నర్‌గా రామ్‌నాథ్‌ కోవింద్‌ నియామకం అనుకోకుండానే జరిగింది. ఆయన నియామకాన్ని అధికార జెడియు తీవ్రంగా వ్యతిరేకించింది. రామ్‌నాథ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయి. రాంనాథ్‌కు భార్య సవితా కోవిద్‌,  ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను ప్రజలకు, తన గ్రామ అభివృద్ధికి ఇచ్చేయడం ద్వారా యూపీలో గుర్తింపు పొందారు.

 

19:27 - July 20, 2017

ఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై.. 65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈనెల 17న ఓటింగ్‌ జరగగా.. ఈరోజు ఉదయం నుంచి ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు జరిగింది. 7 లక్షల 2 వేల 44 ఓట్లతో రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపొందినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈనెల 24తో ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. 25వ తేదీన రామ్‌నాథ్‌ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిగా గెలిచిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు ప్రధాని మోదీతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి భ‌వ‌న్‌లో తాను అడుగుపెట్టడం భార‌త ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శమన్నారు భార‌త 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్. ఇది త‌న‌కు చాలా భావోద్వేగాలతో కూడుకున్న క్షణమన్నారు. త‌న విజ‌యాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు కోవింద్ కృత‌జ్ఞతలు తెలిపారు.
కోవింద్‌కు మీరాకుమార్‌ శుభాకాంక్షలు 
రాష్ట్రపతిగా విజయం సాధించిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. పోటీలో తనకు సహకరించిన వారికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

 

19:20 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని దేవరపల్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న... సీపీఎం ఏపీ కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పర్చూరు బొమ్మల సెంటర్‌లో అటకాయించి... అరెస్ట్ చేశారు. మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వైవీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

19:18 - July 20, 2017

పశ్చిమగోదావరి : వందలాది మంది పోలీసుల పహరాలో పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాపరిశ్రమ మిషనరీని తరలించారు. అడ్డుకున్న గ్రామస్తులను చితకబాది.. వందలాది మందిని అరెస్టు చేశారు. మహిళతోసహా గ్రామస్తులందరనీ లారీల్లో గ్రామం నుంచి బలవంతంగా తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వాపరిశ్రమ కోసం మిషనరీ తరలింపు సందర్భంగా ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగింది. వందలాది మంది గ్రామస్థులు, సీపీఎం కార్యకర్తలను అరెస్టు చేశారు.  

 

18:49 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో శ్యామ్‌ కె.నాయుడును సిట్‌ ఆరుగంటల పాటు విచారించింది. కెల్విన్‌తో శ్యామ్‌కు ఉన్న సంబంధాలపై సిట్‌ ఆరా తీసింది. ఫోన్‌ డేటా, వాట్సాప్‌ డేటాలపై సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణకు శ్యామ్‌ సహకరించారని.. మళ్లీ అవసరమైతే పిలుస్తామని సిట్‌ అధికారులు తెలిపారు. శ్యామ్‌తో విచారణలో కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ సప్లై అవుతున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా కొరియర్‌ సంస్థల ప్రతినిధులనూ సైతం అధికారులు విచారించారు. కొరియర్‌ సంస్థలకు రాతపూర్వక ఆదేశాలు జారీ చేశారు. శ్యామ్‌ ఇంటికి ఎన్నిసార్లు కొరియర్‌ వచ్చిందో డీహెచ్ ఎల్, బ్లూ డార్ట్‌, ఫెడెక్స్‌ ప్రతినిధులను ఆరా తీశారు. ఇకపై నిషేధిత నార్కాటిక్స్‌ లాంటివి సరఫరా చేయవద్దని సిట్‌ ఆదేశించింది. ఇక ఈ విచారణ పరంపరలో భాగంగా రేపు నటుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు విచారించనున్నారు. సుబ్బరావు రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. 

 

18:44 - July 20, 2017

చిత్తూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గుడిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు చంద్రబాబు. నాలెడ్జ్‌కు మించింది ఏదీ లేదని... నాలెడ్జ్‌ వల్ల సాధారణ వ్యక్తులు కూడా ఎక్స్‌ట్రార్డినరీ పీపుల్‌గా తయారవుతారన్నారు. 

 

18:43 - July 20, 2017

హైదరాబాద్ : చిత్ర సీమను కుదిపేస్తున్న డ్రగ్స్‌ మాఫియాపై సినీ నిర్మాత అశ్వనీదత్‌ స్పందించారు. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వాళ్లు సినిమా పరిశ్రమ నుండి వెళ్లిపోయినంత మాత్రాన పరిశ్రమకు ఎలాంటి నష్టం లేదన్నారు. డ్రగ్స్‌ ఒక క్రిమినల్‌ చర్యని, ఎంతటివారైనా జైలుకి వెళ్లక తప్పదన్నారు. గతంలో శాంతి భద్రతలను కాపాడిన ఎన్టీఆర్‌, చంద్రబాబుల మాదిరిగానే కేసీఆర్‌ కూడా కాపాడుతున్నారని నిర్మాత కొనియాడారు. 

 

18:40 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ నాయకులకు సంబంధం ఉందన్న దిగ్విజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ  షబ్బీర్‌ అలీ అన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంపై..ప్రభుత్వం.. జ్యుడిషియల్‌ ఎంక్వైరీ వేస్తే... తమ దగ్గర ఉన్న ఆధారాలను చూపిస్తామని చెప్పారు. ఈమేరకు షబ్బీర్ అలీ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

17:41 - July 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. మెగా ఆక్వాఫుడ్‌ పరిశ్రమ వ్యతిరే ఆందోళనకారులను పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేశారు. మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ పోరాట సమితి నాయకులను అరెస్ట్‌ చేశారు. ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. గ్రామాల నుంచి ప్రజలను లారీల్లో తరలిస్తున్నారు. ఆక్వాఫుడ్ పార్క్‌కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్‌ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కంసాల బేతపూడి, జొన్నల గురువు, తుందూరులో గ్రామస్తులు ఆందోళనలకు దిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:33 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో రెండో రోజు సిట్‌ విచారణ ముగిసింది. సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడును ఐదున్నర గంటల పాటు అధికారులు విచారించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో శ్యామ్‌ కె.నాయుడు పాత్ర ఉన్నట్లు సిట్‌ నిర్ధారణకు వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

17:30 - July 20, 2017

కరీంనగర్‌ : జిల్లాలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌.. మానకోండురు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లాలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయాలంటూ మంత్రి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందజేసే క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌కు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను మంత్రికి చూపిస్తుండగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకుని...హామీని నేరవేరుస్తామంటూ  అడ్డుతగలడంతో  పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:26 - July 20, 2017

 ఢిల్లీ : సరిహద్దు ఇంకా నిర్ధారించలేదన్నారు. దీనిపై భారత్‌ ఓ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసిందని...మూడు దేశాలు కలిసి సరిహద్దు నిర్ణయించుకోవాల్సి ఉందని ఆమె తెలిపారు. 2012లో దీనిపై ఒప్పందం కుదిరినా...మధ్య మధ్యలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సుష్మాస్వరాజ్‌ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో భూటాన్‌తో సహా పలుదేశాలు భారత్‌కు అండగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు.

 

17:23 - July 20, 2017

చిత్తూరు : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి ఘన  స్వాగతం పలికారు. సచిన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఆలయానికి చేరుకున్నారు. అయితే ఓ అభిమాని సచిన్‌కు స్వామివారి చిత్రపటం ఇవ్వడానికి ప్రయత్నించగా జేఈవో శ్రీనివాసరాజు అతనిని వారించి అక్కడి నుంచి పంపేశారు. ఇంతలోనే సచిన్ అభిమానిని దగ్గరకు పిలిచి ఫోటోను స్వీకరించారు. 

 

17:16 - July 20, 2017

హైదరాబాద్ : నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌.. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ఈ అంశమే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల‌కు అత్యంత కీల‌కంగా మారింది. త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల‌కు దీన్ని ఆయుధంగా భావిస్తున్న కేసీఆర్, చంద్రబాబులు .. డీలిమిటేష‌న్ పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి ప్రయత్నానికి మోదీ సర్కార్ సానుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్, మోదీలను ఇరుకున  పెట్టేలా కాంగ్రెస్ స్కెచ్‌ వేస్తోంది. విభజన హామీలను తెరపైకి తేవాలని డిసైడ్ అయ్యింది. 
డీలిమిటేషన్‌ కోసం ఢిల్లీలో లాబీయింగ్
రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నలుగుతున్న అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఏపీ ,తెలంగాణల్లో ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టిన కేసీఆర్,చంద్రబాబులు డీలిమిటేషన్‌ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వీరితో తమకున్న రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోదీ సైతం డీలిమిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అటెన్షన్ అయ్యింది. రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావాలంటే కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఇప్పుడు ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది కాంగ్రెస్. 
డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్‌కు నష్టమే
రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ. విభజన చట్టంలో డీలిమిటేషన్‌ను చేర్చిందే కాంగ్రెస్ కాబట్టి దీన్ని వ్యతిరేకించినా కాంగ్రెస్ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలను తెరపైకి తెస్తోంది.  తెలంగాణ‌లో ఖ‌మ్మం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, యూనివ‌ర్సీటిలు,ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలను ఇక ఆంధ్రప్రత్యేశ్ ప్రత్యేక హోదావంటి అంశాలను తక్షణమే అమలు చేయాలనే మెలికతో కేసీఆర్, చంద్రబాబులతో పాటు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్‌, చంద్రబాబులకు విభజన హామీలపై చిత్తశుద్ధి లేదని ప్రజలకు తెలియచెప్పి పొలిటికల్ మైలేజ్‌ పొందాలని ఆశపడుతోంది హస్తం పార్టీ. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 

 

17:12 - July 20, 2017
17:09 - July 20, 2017

అనంతపురం : వరుస కరువులతో అనంత రైతు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. అనంతపురం జిల్లాలో ఒకేసారి వర్షం కురిపించి వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో రైతులు పూర్తిగా సంక్షభంలో కూరుకుపోయారు. రోజురోజుకీ దీనావస్థలో కూరుకుపోతున్న అనంత రైతన్నపై 10టీవీ ప్రత్యేక కథనం. 
అతి తక్కువ వర్షాపాతం 
అనంతపురం జిల్లాలో ఎప్పుడూ అతి తక్కువ వర్షాపాతం నమోదవుతుంది. దీంతో జిల్లాలో వ్యవసాయం దినదినగండంగా మారుతోంది. ఏటా అరకొర వర్షాలతో వేసిన పంటల దిగుబడి చేతికి రాక రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. దీంతో పంటలు సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా లక్షల హెక్టార్ల భూములు బీళ్లుగా మారుతున్నాయి. జిల్లాలో ఎక్కువ శాతం వేరు శనగ పంటపై ఆధారపడే రైతుకు.. ఈ ఏడాది కూడా ఆశాభంగం తప్పలేదు. 
8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు 
అనంతపురం జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. కానీ 47 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు పంట సాగుకు ఇష్టపడుతున్నారు. ఇది అధికారులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఇంకా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని.. పంట సాగుకు అనుకూల వాతావరణం ఉందని వ్యవసాయశాఖాధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన  కంది, రాగి, జొన్న, కొర్ర, పొద్దుతిరుగుడు సాగు చేసినా.. కేవలం 87 వేల హెక్టార్లలో మాత్రమే పండించే అవకాశం ఉంది. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడితే.. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి సాధించవచ్చని.. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెబుతున్నారు. విత్తన కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ముందుకు వస్తే.. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాల సహకరిస్తామంటున్నారు. 
ఇక పంట సాగు కష్టమే : రైతులు
అయితే ప్రతీ యేటా వేరు శనగ సాగు చేస్తూ నష్టాలను చూస్తున్న అనంత రైతు మాత్రం.. ఇక పంట సాగు కష్టమేనంటున్నాడు. 10 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వ్యవసాయ కూలీగా మారాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. గతేడాది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన రెయిన్‌ గన్‌ల ద్వారా అయినా.. వేసిన పంటను కాపాడాలని రైతులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతు కనుమరుగు కాక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: 14వ రాష్ట్రపతి గెలుపొందిన రామ్ నాథ్ కోవింద్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

 

17:05 - July 20, 2017

విశాఖ : జిల్లాలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేస్తున్నారు. తాజాగా 130 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ ధృవపత్రాలు సృష్టించి విక్రయించేశారు కొందరు కబ్జాకోరులు. చివరకు పోలీసులకు చిక్కారు. 
24.05 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
విశాఖలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. విశాఖ వ్యాలీ స్కూల్ వద్ద 24.05 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఓ ముఠా నకిలీ ధృవపత్రాలలు సృష్టించి కోట్ల రూపాయలకు ఆ భూమిని విక్రయించింది. తాజాగా వారి మోసం బయటపడటంతో పోలీసులు కబ్జాకోరుల్ని అరెస్టు చేశారు. అయితే ఈ భూకుంభకోణం వెనుక పెద్ద కథ నడిచినట్లు పోలీసుల విచారణలో తేలింది. 
ప్రభుత్వ భూములపై కన్నేసిన సుధాకరరాజు అండ్ గ్యాంగ్
విశాఖ జిల్లా ఎండాడ, రుషికొండ ప్రాంత పరిసరాల్లో సర్వే నంబర్ 35, 37, 38లలో 26.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఇక్కడ ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై చేకూరి సుధాకరరాజు అండ్ కో కన్ను పడింది. దాన్ని కబ్జా చేయడానికి ఆ గ్యాంగ్ స్కెచ్ వేసింది. ఈ భూముల్ని గతంలో ప్రభుత్వం ఒమ్మి ఇంటిపేరున్న వ్యక్తులకు కేటాయించి.. ఆ తరువాత రద్దు చేసినట్లు తెలుసుకుంది. దీంతో సుధాకరరాజు అండ్ కో భూముల్ని కబ్జా చేయాలంటే ఒమ్మి ఇంటిపేరున్న వ్యక్తులైతే ఇబ్బందులు ఉండవనుకుంది. దీంతో ఒమ్మి దాలినాయుడు అనే పేరుతో ఓ వ్యక్తిని రంగంలోకి దింపింది. 
నకిలీ ధృవ పత్రాలతో ప్రభుత్వ భూమి విక్రయం
వాస్తవానికి ఒమ్మి దాలినాయుడు అనే వ్యక్తి లేనే లేడు. ఆ పేరున్న వ్యక్తిని అధికారులకు చూపించాలి కాబట్టి సుధాకరరాజు తన అనుచరుడు.. హైదరాబాద్‌కు చెందిన బొడ్డి పిచ్చయ్యను రంగంలోకి దించాడు. ఇతను హైదరాబాద్‌లోని ఓ కుక్కర్ల సంస్థలో  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి వీలుగా అతని పేరుతో దొంగ సంతకాలు చేసి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. పట్టాదారు పాసుపుస్తకాలను కూడా సంపాదించడమే కాకుండా ఆ భూముల్ని విక్రయించారు. ఈ భూకబ్జా భాగోతం విశాఖ గ్రామీణ తహసిల్దారుగా ఉన్న సుధాకరనాయుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 2016లో పీఎం.పాలెంలో కేసు నమోదైంది. తరువాత నిందితుడు పరారీ కావడం, దాలినాయుడు పేరుతోనే  పిచ్చయ్య ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవడంతో కేసు మరుగున పడినట్లైంది
పలు కోణాల్లో కేసు విచారణ 
అయితే ఈ కేసును పీఎం పాలెం పోలీసులు పలు కోణాల్లో విచారణ చేశారు. దస్తావేజుల్లో దాలినాయుడిగా చూపిన ఫొటో ఎవరి ఫొటోతోనైనా సరిపోలుతుందేమోనన్న కోణంలో సోషల్ మీడియాలో జల్లెడ పట్టారు. అది బొడ్డి పిచ్చయ్య ఫోటోతో సరిపోయింది. కూపీ లాగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అసలు సూత్రధారి చేకూరి సుధాకరరాజును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 
చేకూరి సుధాకరరాజుపై ఇప్పటికే 13 కేసులు
చేకూరి సుధాకరరాజుపై ఇప్పటికే 13 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు సుధాకరరాజుతోపాటు భూ దందాలో పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో నిందితులపై అధికారులు ఏం చర్యలు చేపడతారో వేచి చూడాలి. 

 

17:00 - July 20, 2017

కామారెడ్డి : జిల్లాలోని కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ప్రైవేటు అంబులెన్సు నిర్వాహకుల హవా నడుస్తోంది. మెరుగైన వైద్యం కోసం రోగులను కామారెడ్డి నుండి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ప్రైవేటు అంబులెన్స్ యజమానులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇదంతా ఆసుపత్రి అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి. ఈ ఆసుపత్రికి మూడు అంబులెన్స్‌లు ఉన్నా.. ఇక్కడ అంతా ప్రైవేటు అంబులెన్స్‌లదే హవా. ఆసుపత్రి సిబ్బంది అండతో రోగుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ ప్రైవేటు అంబులెన్స్ యజమానులు అందినకాడికి దోచుకుంటున్నారు. 
ప్రభుత్వాసుపత్రికి మూడు అంబులెన్స్‌లు
మెదక్, నిజామాబాద్ సిద్దిపేట సిరిసిల్లా జిల్లాలకు చెందిన పలు గ్రామాలు కామారెడ్డికి దగ్గరగా ఉంటాయి. దీంతో ఆయా జిల్లాల ప్రజలు అత్యవసర చికిత్స కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి వస్తుంటారు. ఒకవేళ కేసు సీరియస్ అయితే హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో మూడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అందులో ఒకటి మూలన పడింది. ఇక మిగిలిన వాటికి రెగ్యులర్ ఒకరు.. కాంట్రాక్ట్‌లో ఒకరు డ్రైవర్లు ఉన్నారు. అయితే ఏనాడు ఆ అంబులెన్స్‌లు బయటకు తీసిన దాఖలాలు లేవు. 
ప్రభుత్వాసుపత్రిలో డ్రైవర్ల ఇష్టారాజ్యం
ఇక రెఫరల్ కేసులన్నింటినీ ప్రభుత్వాసుపత్రికి చెందిన అంబులెన్స్‌లోనే తరలించాలని నిబంధనలు ఉన్నా ఇక్కడి అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో డ్రైవర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వాహనాలలో డీజిల్ లేదని.. రిపేర్ ఉందని చెబుతూ ప్రైవేటు అంబులెన్స్‌లలో వెళ్లాలని సూచిస్తున్నారు. కొందరు డీజిల్ పోయడానికి సిద్ధపడితే 2 వేలకు తక్కువ కాకుండా డీజిల్ పోయించుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌లకు కూడా రోగి బంధువులు లేదా సంబంధీకులు డీజిల్ పోయించాల్సిన దుస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇవేమీ మా దృష్టికి రాలేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. 
ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్న నేతలు
ఇక ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే ఉద్యోగుల బంధువులకు సంబంధించిన అంబులెన్స్‌లు నిరంతరం ఆసుపత్రి బయట నిలిచి ఉంటాయి. ఆసుపత్రి నుంచి  హైదారాబాద్‌కు వెళ్లాలంటే 15 వందలు మాత్రమే ఖర్చు అవుతుంది . రోగి అత్యవసర పరిస్థితిని బట్టి వారి నుండి  3 వేల నుండి 4 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ దందా ఏ ఒక్క నేత చెవిన పడలేదు. చిన్న జిల్లాల ద్వారా అభివృద్ధి సాధ్యం అంటూ ఊదరగొడుతున్న నేతలు ఇలా ప్రజల ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోగులను నిలువు దోపిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

రాంనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని..

న్యూఢిల్లీ: భార‌త 14వ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌త్యేక‌మైన ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. 20 ఏళ్ల కింద‌ట రామ్‌నాథ్‌తో క‌లిసి దిగిన ఫొటోను, ఇప్ప‌టి ఫొటోను ఆయ‌న షేర్ చేశారు.

16:53 - July 20, 2017

హైదరాబాద్ : ఆ ప్రాంతంలో వైసీపీని దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తుందా? ప్రతిపక్షానికి పట్టు ఉన్న ప్రాంతంపై ... తన హావా కొనసాగించడానికి ప్రయత్నిస్తోందా? టీడీపీ ప్రయత్నాలు చూస్తుంటే... అవుననే అనిపిస్తోంది. రాయలసీమపై టీడీపీ దృష్టి సారించి...అక్కడ రెడ్డి వర్గాన్ని తమ పార్టీవైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తోంది.
రాయలసీమలో ప్రభవాన్ని పెంచుకునేందుకు టీడీపీ ప్రయత్నం 
వైఎస్సార్‌ కుటుంబానికే పట్టు ఉన్న రాయలసీమలో... టీడీపీ తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బే తగిలింది. రాయలసీమలో అత్యధిక స్థానాలను గెలుచుకున్నా.. కడప, కర్నూల్, చిత్తూరు జిల్లాల్లో మాత్రం వైసీపీకే ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్నికల తర్వాత టీడీపీ తన స్టాటజీ మార్చుకుంది. ఆయా జిల్లాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలను పార్టీవైపు తిప్పుకుంది. అలాగే అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రజలకు దగ్గరయ్యేందుకు .. విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ పరంగా కూడా  రాయలసీమకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.  
సీమపై దృష్టి సారించిన మంత్రి లోకేశ్‌
సీఎం చంద్రబాబునాయుడుతో పాటు మంత్రి లోకేశ్‌ కూడా ఎక్కువ రాయలసీమపైనే దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇటీవలే కడప, కర్నూల్‌, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. త్వరలోనే అనంతపురం జిల్లాలోనూ పర్యటించబోతున్నారు.  పర్యటనలో భాగంగా లోకేశ్‌...పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి వారంలో రెండు లేదా మూడు రోజులు పాటు ఎక్కువగా జిల్లాల్లోనే పర్యటించాలని లోకేశ్‌ భావిస్తున్నట్టు సమాచారం.   
ప్రజలకు దగ్గరయ్యే యోచన
సెప్టెంబర్‌ నుంచి జరిగే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో కూడా ఈ జిల్లా  ప్రజలకు మరింత చేరువయ్యేందుకు  టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఈ సారి జరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ సీమ గడ్డపై సైకిల్‌ పార్టీ... వ్యూహాలు ఫలిస్తాయో  లేదో తెలియాల్సి ఉంది.

 

సీపీఎం నేత మధు అరెస్ట్

ప్రకాశం: దేవరపల్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం ఏపీ కార్యదర్శి పి.మధు ను పోలీసులు అరెస్టు చేశారు. పర్చూరు బొమ్మల సెంటర్ లో పోలీసులు అటకాయించి మధు, మరో నేత వైవీ ని అరెస్టు చేశారు.

16:42 - July 20, 2017

హైదరాబాద్ : మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది.. ఏ రోడ్డన్నది లేదు.. అన్ని రోడ్లదీ అదే పరిస్థితి. వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో సిటీలో వేగం సగానికి పైగా తగ్గింది. కొన్ని రోజుల క్రితం వేసిన రోడ్లు కూడా దెబ్బతినడం బల్దియా పనుల్లో నాణ్యత, డొల్లతనాన్ని బయటపెట్టాయి. చాలా ప్రాంతాల్లోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయనే టాక్‌ గ్రేటర్ హైదరాబాద్‌లో నడుస్తోంది. 
రోడ్లన్నీ గుంతలమయం
వరుసగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్‌ రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కార్పొరేషన్‌ రోడ్లు అని తేడా లేకుండా రోడ్లన్నీ ప్రయాణం చేయడానికి వీలు లేకుండా తయారయ్యాయి. భారీ గోతులు సిటిజన్స్‌కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సాధారణంగా సిటీలో గంటకు 13 కిలోమీటర్ల వేగం ఉంటుంది. అది ప్రస్తుతం సగానికి పడిపోయింది. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్‌ జాం అవుతోంది. ప్రధాన రోడ్లతో పాటు కాలనీ రోడ్లు కూడా గుంతలమయం అయ్యాయి. దీంతో సిటీ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
మెట్రో రైలు వర్క్‌...వాహనదారులకి నరకం 
ఇక సిటీలోని ప్రధాన మార్గాల్లో మెట్రో రైలు వర్క్‌ జరుగుతోంది. ఈ మార్గాల్లో అయితే వాహనదారులకి నరకం కనిపిస్తోంది. వాహనదారులకి సిటీ రోడ్స్‌ ఇబ్బందుల వల్ల పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గోతుల కారణంగా వాహనాలు కూడా ఎక్కువగా రిపేరుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. 
గతేడాది రూ. 320 కోట్లు 
ఇక గతేడాది 320 కోట్లు, ఈ ఏడాది 75 కోట్లతో దాదాపు 1200 కిలో మీటర్ల రోడ్లను జీహెచ్‌ఎంసీ రికార్పెట్‌ చేసింది. అంటే రెండేళ్లలో రోడ్ల రికార్పెటింగ్‌ కోసం 400 కోట్లు ఖర్చు చేసిన జీహెచ్‌ఎంసీ.. ఈ ఏడాది గోతులు పూడ్చడానికి మరో 15 కోట్లు ఖర్చు చేశారు. కొత్తగా రికార్పెట్ చేసిన రోడ్లన్నింటికీ రెండేళ్ల డిఫెక్ట్‌ లయబుల్టీ ఉంటుంది. అంటే ఈ కాలంలో పాడైన రోడ్లను సంబంధిత కాంట్రాక్టర్లు రీస్టోర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ వర్క్‌ను ఇంజనీరింగ్‌ అధికారులు ఆయా కాంట్రాక్టర్లతో పని చేయించాలి. కానీ వర్షాలకు సిటీలో భారీగా గోతులు వచ్చాయంటూ జీహెచ్‌ఎంసీ తమ ఖజానా నుంచి రోడ్ల గోతులు పూడ్చడానికి సిద్ధమైంది. 
రోడ్లన్నింటి నిర్వహణ బల్దియాదే 
గ్రేటర్‌ పరిధిలోని జాతీయ రహదారులు మినహా రోడ్లన్నింటి నిర్వహణ బల్దియా చూస్తుంది. వీటి మెయింటెనెన్స్‌ కోసం యేటా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అయినా రోడ్లు మాత్రం చిన్న వర్షానికే ఛిద్రమవుతున్నాయి. దాంతో గ్రేటర్‌ వాసుల బళ్లు, ఒళ్లు గుళ్ల అవుతున్నాయి. అంతేకాక చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

16:25 - July 20, 2017

ఢిల్లీ : భారత 14 వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. 66.65 శాతం ఓట్లతో ఎన్ డీఏ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ గెలిచారు. కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈనెల 25న రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

టీడీపీ, వైసీపీల మద్ధతుతో ఏకపక్షంగా రాంనాథ్..

హైదరాబాద్: ఏపీలో టీడీపీ, వైసీపీలు బిజెపికే మద్దతు ఇవ్వడంతో ఏకపక్షంగా రాంనాథ్ కోవింద్ కు ఓట్లు దక్కించుకున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఒక్క సీటూ లేకపోవడంతో మీరాకుమార్ కు సున్నా ఓట్లు వచ్చాయి.

14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు పూర్తి మెజార్టీ లభించింది. భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నిలవునున్నారు. 65.65 శాతం ఓట్లతో యూపీఏ అభ్యర్థి మీరా కుమారి పై గెలుపోందారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. అందరికంటే ముందుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాంనాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

 

16:13 - July 20, 2017

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ ఈఎస్ఐ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ కార్మికురాలు అనురాధ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి అకారణంగా తీసేశారన్న మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడింది. అనురాధకు హౌస్‌ కీపింగ్‌ కార్మికులు మద్దతు తెలిపి.. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. అయితే.. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి... కార్మికులను చెదరగొట్టారు. పలువురు కార్మికులను అరెస్ట్‌ చేశారు. 

 

16:11 - July 20, 2017

వంట గది..మహిళలు ఎక్కువ సమయం ఇక్కడనే కేటాయిస్తుంటారు. ఉదయం..మధ్యాహ్నం..రాత్రి సమయాల్లో ఇంటి వారికి కావాల్సిన వంటకాలు మహిళలు చేస్తుంటారు. వంట చేసే సమయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు. వంట గది శుభ్రంగా ఉంచుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. వంటగది..వంటల్లో నెలకొనే సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు...

 • వంటగదిలో బొద్దింకలు..చీమలు ఎక్కువగా తిరుగుతూ ఇబ్బందులు పెడుతుంటాయి. బిర్యానీ ఆకును పొడి చేసి బొద్దింకలు తిరిగే చోట చల్లి చూడండి.
 • ఒక దోసకాయను ముక్కలుగా తిరిగి చీమలు తిరిగే చోట పెట్టి చూడండి.
 • వంట చేసే సమయాల్లో చేతులు మరకలవుతుంటాయి. మరకలు కాకుండా ఉండాలంటే ఆలుగడ్డ ముక్కలతో రుద్దాలి.
 • చెక్కతో చేసిన వంట సామాగ్రీ వాసన వస్తుంటాయి. ఇలా రాకుండా ఉండాలంటే వెనిగర్ కలిపిన నీటిలో వాటిని ఉంచాలి.
 • చపాతిలు మృదువుగా రావాలంటే పిండి కలిపే సమయంలో ఉడికిన బంగాళ దుంప కలపండి.
 • చపాతి పిండిలో పాలు లేదా గోరువెచ్చని నీళ్లు కలిపి ఓ అరగంట..గంట పాటు నాననబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
 • కూరల్లో మసాలా ఎక్కువైతే రెండు లేదా మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
 • పచ్చి బటానీలు రంగు మారకుండా ఉండాలంటే వాటిని ఉడికించే సమయంలో చిటికెడు పంచదార వేయాలి.
 • కూరలో ఉప్పు ఎక్కువయిందనుకోండి అందులో కొద్దిగా బియ్యం పిండి కలపాలి.
 • దోశల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండి కలిపి వేసుకుంటే దోశలు రుచిగా వస్తాయి.
 • రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
 • పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే శుభ్రపడుతుంది.
 • పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి.
16:10 - July 20, 2017

శ్రీకాకుళం : జిల్లాలో సముద్రుడు ఉగ్ర రూపం దాల్చాడు. అల్పపీడన ప్రభావం తగ్గినప్పటికీ.. తీరంలో అలజడి మాత్రం కొనసాగుతోంది. జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో అలలు పైకి ఎగసిపడుతున్నాయి. ఈ కారణంగా సముద్రంలోకి లంగరు వేసిన మరబోట్లు కొట్టుకుపోయాయి. సుమారు 80 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలాగే  రణస్థలం, ఎచ్చెర్ల, బారువా ప్రాంతాలలోని తీరాల వద్ద సముద్రం కోతకు గురైంది.

16:08 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలంలో విపక్షాల నిరసన ఉద్రిక్తతంగా మారింది. ఆందోళనలో పాల్గొన్న నాయకులను..  స్థానికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేవరపల్లి వివాదాస్పద దళితుల భూముల్లో... నీరు ప్రగతి పనులను ప్రారంభించడంపై  విపక్ష నేతలు ...సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. అయితే పోలీసులు ర్యాలీని అడ్డుకుని .. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌  సమీపంలో వారిని అరెస్ట్‌ చేశారు. దీంతో పలువురు మహిళా నేతలు అక్కడే బైఠాయించారు. అలాగే  గ్రామంలో నీరు ప్రగతి పనులను అడ్డుకునే ప్రయత్నం చేసిన దళితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్రగ్స్ కేసులో 2వ రోజు ముగిసిన సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసు లో రెండో రోజు విచారణ ముగిసింది. ఈ విచారణ శ్యాం కే నాయుడు ను సిట్ అధికారులు విచారించారు.

 

15:57 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కె.నాయుడు విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి కొనసాగుతున్న విచారణకు మధ్యలో లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. అనంతరం మొదలైన విచారణలో ఎక్సైజ్‌శాఖ అధికారులు శ్యామ్‌ కె.నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే శ్యామ్‌ కె.నాయుడికి కొరియర్‌లో డ్రగ్స్‌ సరఫరా అయినట్లు అధికారులు గుర్తించారు. తొలుత వ్యక్తిగత అంశాలపై ప్రశ్నలు అడిగిన అధికారులు.. అనంతరం కెల్విన్‌తో గల సంబంధాలు.. డ్రగ్స్‌ వినియోగం తదితర అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలావుంటే రెండు మూడు రోజుల తర్వాత టాలీవుడ్‌లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లను రెండో జాబితాలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. 

 

15:56 - July 20, 2017
 • ‘సైనస్'.. తలనొప్పి విపరీతంగా ఉండడం..కళ్ల దగ్గర దురదగా ఉండడం..ముక్కు ఇరువైపులా ముట్టుకొంటే నొప్పిగా ఉండడం..దీని లక్షణాలు. కళ్ల దగ్గర..ముక్కు పక్క భాగంలోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. వాతావరణం మారినప్పుడల్లా సైనస్ అధికమౌతుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం..శీతాకలంలో తీవ్రత హెచ్చుగా ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా కారణంగా ఈ సైనస్‌లు ఉబ్బడంతో ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే కొంత సమస్యకు చెక్ పడనుంది.
 • నీళ్లను కాచి వడబోసి తీసుకుంటే ఎంతో బెటర్. ముక్కు చుట్టుపక్కలి భాగాల్లో ఇన్ ఫెక్షన్ చేరే అవకాశం ఉండదు.
 • సైనస్‌తో బాధపడేవారు పొగాకు ఉత్పత్తులకి ఎంత దూరంగా వుంటే అంత మంచిది.
 • మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
 • టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
 • ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.
 • 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.
 • 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.
 • ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం, చెవిలో దూదిపెట్టుకోవడం, ఆవిరిపట్టడం చేయడం వల్ల సైనసైటిస్‌ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.
15:53 - July 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని తుందుర్రులో ఉద్రిక్తత నెలకొంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ వ్యతిరేక ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్‌ చేశారు. హఠాత్తుగా గ్రామంలోకి ప్రవేశించిన పోలీసులు ఇళ్లలోకి దూరి.. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. పోలీసుల దౌర్జన్యంపై దుంతుర్రు ప్రజలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్రగ్స్ కేసులో టీఆర్ ఎస్ నేతలకుసంబంధాలు:షబ్బీర్ అలీ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో టీఆర్ ఎస్ నేతలకుసంబంధాలు ఉన్నాయని '10టివి' తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు. ఆధారాలుంటనే దిగ్విజయ్ మాట్లాడతారు అని చెప్పారు. సిట్ తో డ్రగ్స్ కేసును నీరుగార్చేందుకు యత్నాలు చేస్తున్నారని, కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నేతల సంబంధాలపై మా వద్ద ఆధారాలున్నాయని, దిగ్విజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.

15:16 - July 20, 2017

పంజాబీ బ్యూటీ 'రకూల్ ప్రీత్ సింగ్' జోరు కొనసాగుతోంది. గత ఎడాది వరుస విజయాలతో జోరు చూపించిన ఈ బ్యూటీ 2017లో వరుస ఆఫర్లు దక్కించుకొంటోంది. ప్రస్తుతం ఈ పొడుగు సుందరికి పోటీ ఇచ్చే హీరోయిన్స్ కూడా లేరని చెప్పాలి. గత ఎడాది 'ఎన్టీఆర్' తో నటించిన 'నాన్నకు ప్రేమతో’, 'బన్నీ'తో నటించిన 'సరైనోడు’, 'రామ్ చరణ్' కి జోడిగా చేసిన 'ధృవ' బిగ్ సక్సెస్ లు గా నిలిచాయి. ఇలా హ్యట్రిక్ సక్సెస్ లతో ఈ పంజాబీ బ్యూటీ ఒక్కసారిగా తారపథంలోకి దూసుకుపోయింది.

రకుల్ జోరు మాములుగా లేదు .. ఆమె సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస్తోన్న రకుల్, తమిళంలోను ఆ స్థాయి దూకుడు చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'రకూల్' ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళంలో 'విజయ్' సరసన కూడా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘మురుగదాస్’ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా 'రకూల్' ని తీసుకోవాలని మురుగదాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 'మురుగదాస్' దర్శకత్వంలో 'రకుల్'.. 'స్పైడర్' చేస్తున్న సంగతి తెలిసిందే.

అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారి కిడ్నాప్

ప్రకాశం:టీసీపల్లి మండలం పెద ఈర్లపాడులో అంగన్ వాడీ స్కూల్లో కుమారి(5) అనే చిన్నారి కిడ్నాప్ అయ్యింది. బైక్ పై వచ్చిన దుండగులు చిన్నారిని ఎత్తుకుపోయారు. చిన్నారి తల్లిదండ్రులకు కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు .. ఆందోళన

యాదాద్రి భువనగిరి: నారాయణపురం మండలం జనగామ జెడ్పీ హైస్కూల్లో పురుగులు, రాళ్లు మధ్యాహ్న భోజనం వడ్డించారు.దీంతో విద్యార్థు లు ఆ అన్నాన్ని బహిష్కరించి ధర్నాచేపట్టారు.

14:58 - July 20, 2017
14:56 - July 20, 2017

సౌదీ : విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ప్రవీణ అనే మహిళ సౌదీలో చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఆమెను ఇంటి యజమానులు హౌస్ అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు గత రాత్రి భర్త అశోక్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ప్రవీణ భర్త అశోక్ విశాఖ పోలీసుల్ని ఆశ్రయించాడు. ప్రవీణ ఏడాదిగా సౌదీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం ఏర్పాటకు ఉత్తర్వులు జారీ

అమరావతి: శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం ఏర్పాటకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5 కోట్లతో కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది.

14:54 - July 20, 2017

'ధనుష్' కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం 'వేలలై యిల్ల పట్టధారి'. ఈ సినిమాకు సీక్వెల్ గా 'వీఐపీ 2’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మాతగా సౌందర్య రజనీకాంత్‌ రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు టాక్. 'ధనుష్‌' పుట్టినరోజు అంటే జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించగా ఇందులో మార్పు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ధనుష్ నటించిన చివరి చిత్రం 'తొడరి' బాక్సాపీస్ వద్ద పరాజయం మూటగట్టుకుంది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ హీరో ప్రయత్నిస్తున్నాడు. ‘వీఐపీ 2’ ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగినట్లుగానే కథ..కథనాలతో భారీగా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అందులో 'ధనుష్' నటన..డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ప్రోస్టు ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న 'వీఐపీ 2’లో 'అమలాపాల్' హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి 'కాజల్' ముఖ్యపాత్ర పోషించారు. దాదాపు 20 ఏళ్ల తరువాత తమిళ సినిమాలో 'కాజల్' నటిస్తుండడం పట్ల ధనుష్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల తేదీల్లో మార్పు చేసినట్లు సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ‘ధనుష్' అభిమానుల ఓపిక..సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియచేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ప్రకటించారు.

సనత్ నగర్ ఈఎస్ఐలో కాంట్రాక్టు కార్మికురాలు ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్: సనత్ నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కాంట్రాక్టు కార్మికురాలు అనురాధ ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి అకారణంగా తీసేశారని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కార్మికురాలికి మద్దతు గా ఎస్ఐ ఆస్పత్రి ఎదుట కాంట్రాక్టు హౌస్ కీపింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్మికులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిళా కార్మికులతో పాటు సిఐటియు నేత ఈశ్వర్ రావును పోలీసులు అరెస్టు చేశారు.

 

14:53 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో స్ధానిక ఎమ్మెల్యే అనుచరులు నీరు..చెట్టు కార్యక్రమం చేపట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ భూములను చెరువుగా మార్చవద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రాణాలు పోయిన భూములు వదలమని తేల్చిచెబుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 21 మంది దళితులను అరెస్టు చేశారు. మరోవైపు మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఘటనాస్థలిలో మీడియాకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

డ్రగ్స్ వాడకం క్రిమినల్ చర్య : నిర్మాత అశ్వనీ దత్

నెల్లూరు : డ్రగ్స్ వాడకం క్రిమినల్ చర్య అని నిర్మాత అశ్వనీ దత్ అన్నారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధమున్న వ్యక్తులు జైలుకు వెళ్లక తప్పదని దత్ హెచ్చరించారు. తెలంగాణ లో శాంతిభద్రతలను సీఎం కేసీఆర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని దత్ పేర్కొన్నారు.

14:48 - July 20, 2017

పశ్చిమగోదావరి  : జిల్లాలోని తుందుర్రులో పోలీసులు భారీగా మోహరించారు. అత్యుత్సాహం ప్రదర్శంచారు. దౌర్జన్యానికి పాల్పడ్డారు. మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ పోరాట సమితి నాయకులను అరెస్ట్‌ చేశారు. ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు మిషనరీని తరలించడానికే ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థుల ఆందోళనలు మిన్నంటాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జ్‌ చేశారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

 

14:41 - July 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం అక్రమ బదిలీలకు అడ్డాగా మారుతోంది. పాలక నేతలు, ప్రజాప్రతినిధులు.. కాసులకు కక్కుర్తి పడి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వమే విధించుకున్న బదిలీల నిషేధాన్ని, సచివాలయం సాక్షిగా.. పాలకపక్షం నేతలు ఉల్లంఘించేశారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉపాధ్యాయులకు అక్రమంగా బదిలీలు చేయించారు. అంతర్‌జిల్లా బదిలీల పేరుతో అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం సాక్షిగా సాగుతోన్న అక్రమ బదిలీలపై తీవ్ర అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజా బదిలీలను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్  చేస్తున్నాయి. లేకపోతే అక్రమ బదిలీలపై పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

14:36 - July 20, 2017

ఢిల్లీ : మాయావతి రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ ఆమోదించారు. రాజ్యసభలో దళితుల అంశంపై మాట్లాడనివ్వకపోవడంపై మాయావతి అలక వహించారు. సభలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాయ... మంగళవారం రాజీనామా లేఖను సమర్పించారు. ఇవాళ రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ఆమోదించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

పోలీసుల దమనకాండను ఖండించిన సీపీఎం

విజయవాడ: తుందుర్రు, దేవరపల్లిలో పోలీసుల దమనకాండను సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఖండించారు. నేడు, రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బాధిత ప్రజలకు మద్దతుగా నిలిచిన సీపీఎం నేతలను, కార్యకర్తలను అరెస్టు చేయడం అమానుషం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఏపీ, అసోం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి రౌండ్ లో ఎన్డీఏ అభ్యర్థి రామ్ నాథ్ ముందజలో ఉన్నారు. రామ్ నాథ్ కు 60,683 ఓట్లు రాగా మీరాకుమార్ కు 22,941 ఓట్లు వచ్చాయి.

14:12 - July 20, 2017

హాలో..ట్రాఫిక్ లో చిక్కుకున్నా..వచ్చే వరకు లేట్ అవుద్ది..అరే ట్రాఫిక్ జాం అయిపోయింది రా బాబు..వస్తున్నా..అంటూ ప్రతి రోజు ఎంతో మంది ఫోన్ లలో ఫ్యామిలీకి..మిత్రులకు తెలియచేస్తుంటారు. కానీ ఈ సమస్య తీరదా ? తీర్చే వారు ఎవరు లేరా ? ఈ ట్రాఫిక్ సమస్య తీరని సమస్యా ? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. స్కైవేలు..ఆకాశ మార్గాలు ఇంకా రాలేదా ? దీనికి బదులేదీ ?

ప్రధాన కూడళ్లు..
నగరంలో సాయంత్రం దాటితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అవుతోంది. కిలోమీటర్ల కొలది వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకొనే వారి బాధ వర్ణనీతీతంగా ఉంటోంది. ఇక పాదాచారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని నగర ప్రజలు మండి పడుతున్నారు. ప్రధాన మార్గాలైన నిమ్స్..సరోజినీ దేవి, రాజ్ భవన్, యశోద ఆసుపత్రి, ఆబిడ్స్, నాంపల్లి, ట్యాంక్ బండ్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మారేడ్ పల్లి, తిరుమలగిరి, బంజారాహిల్స్, బేగంపేట, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రధాన కూడళ్లలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.

తిరుమలగిరిలో చిక్కులు..
తిరుమలగిరిలో సాయంత్రం ట్రాఫిక్ నిత్యం జాం కావడం కామన్ అయిపోయింది. సికింద్రాబాద్ వైపుకు వెళ్లే మార్గం..అల్వాల్ కు వెళ్లే మార్గాల్లో వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. ఒక్కోసారి హనుమాన్ టెంపుల్ వరకు వాహనాలు నిలుస్తుండడం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో అంబులెన్స్ చిక్కుకొంటే అంతే సంగతులు. రోడ్డు చిన్నదిగా ఉండడం..వాహనాల సంఖ్య పెరిగిపోవడం ట్రాఫిక్ కు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ట్రాఫిక్ లో చిక్కుకోవడం వల్ల సమయం చాలా వృధా అయిపోతోందని పలువురు పేర్కొంటున్నారు.

హామీలు ఎక్కడపాయే..
ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతామని పాలకులు ప్రకటించి అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తుంటారు. అందులో భాగంగా స్కై వేలు..ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా చేస్తామని ప్రస్తుతం ఉన్న పాలకులు హామీలు గుప్పించారు. ఆకాశ మార్గం..స్కైవేలు నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం నుంచి తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు 40 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. ఇక్కడ పెద్దఎత్తున వాణిజ్య సముదాలు వెలిశాయి. వ్యాపారులు, కస్టమర్లతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అదేవిధంగా అనిల్ ట్రేడ్ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలే కాకుండా మహారాష్ట్రకు సైతం రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడడంతో సమస్య పరిష్కారానికి 'ఆకాశమార్గం' నిర్మిస్తామని చెప్పింది.

ఎస్‌ఆర్‌డీపీ..
ఎస్‌ఆర్‌డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) ప్రాజెక్టులో భాగంగా ఓఆర్‌ఆర్-తూముకుంట- ఆల్వాల్-తిరుమలగిరి-జేబీఎస్(19కి.మీ.లు) ఒక ప్యాకేజీ కాగా నిర్ణయించారు. ప్రధాన కూడళ్లలో పాదచారుల కోసం ప్రత్యేకంగా సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇలా తొలి విడతగా 25 చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. పాదాచారులు ఎక్క‌డైనా స‌రే రోడ్డు దాటాలంటే ఆ కూడ‌లిలో ఉన్న రెడ్ సిగ్న‌ల్స్‌ను ఆన్ చేయడంతో వాహ‌నాలు నిలిచిపోయే విధంగా సిగ్నలింగ్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పనులు మొదలవుతున్నాయని అధికార యంత్రాంగం పేర్కొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
ఇవి ఎక్కడ ఏర్పాటు చేశారో వారికే తెలియాలి.

షాట్ పుట్ క్రీడాకారిణి జాతీయ అథ్లెటిక్ నుండి సస్పెండ్

ఢిల్లీ: షాట్ పుట్ క్రీడాకారిణి మన్ ప్రీత్ కౌర్ ను జాతీయ అథ్లెటిక్ సమాఖ్య సస్పెండ్ చేసింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిర్వహించిన డోప్ టెస్్టలో మన్ ప్రీత్ విఫలమైంది.

తుందుర్రుకు చేరుకున్న ఆక్వాఫుడ్ పార్క్ మిషన్లు

ప.గో: తుందుర్రు మెగా ఆక్వాఫుడ్ పార్క్ కు మిషన్ చేరుకుంది. ఆరు వాహనాల్లో ఈ మిషనరీ చేరుకుంది. కంసాల బేతపూడిలో మిషనరీని అడ్డుకునేందుకు సీపీఎం నేతలు, గ్రామస్థులు యత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులపై గ్రామస్థులు తిరగబడి కిరోసిన్, కారం చల్లారు.

13:44 - July 20, 2017

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేట పంచాయితీ పరిధిలో వందేళ్ల క్రితం పిఠాపురం మహారాజు జంతు హింస నివారణ సంస్థకు స్థలం దానం చేశారు. ఇప్పుడది నానాటికీ చిక్కుతూ వస్తోంది. ఈ సంఘంలో పశువుల కెపాసిటీకి 250 పశువులకు మించకూడదు. కాని చుట్టుపక్కల ఎక్కడ అక్రమ రవాణా జరిగినా ఈ సంఘానికే తరలిస్తారు. ఆ లెక్కల ప్రకారం చూస్తే సంఘంలో పశువుల సంఖ్య వేలల్లో ఉండాలి. కాని ఇక్కడున్నది కేవలం 450 పశువులు. నలభై ఐదు రోజుల్లోనే వందకు పైగా గోవులు చనిపోయాయి. రెండు రోజుల వ్యవధిలో 25 కు పైగా ఆవులు చనిపోయాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతర్గతంగా వ్యాపారం
అంతేకాదు అంతర్గతంగా ఇక్కడ వ్యాపారం జరుగుతోంది. ఇక్కడ బ్రతికున్న గోవులను కబేళాలకు తరలిస్తారన్న అరోపణలు కూడా ఈ సంఘం మీద ఉన్నాయి. సంఘంలోని కొంతమంది సభ్యులు ఈ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గోపూజ మహాద్భాగ్యంగా భావించి దాతలు వారు తోచిన సహాయ సహకారాలు గోశాలకు అందిస్తుంటారు. కాని సంఘం సభ్యులు మాత్రం మాకు నిధులు లేక సక్రమంగా నిర్వహించలేకపోతున్నామని చెబుతున్నారు. అంతేకాక అక్రమ ఆవులను సంఘంలోకి పంపించడం తమకు శిరోభారంగా మారిందంటున్నారు. ఈ సంఘనికి చైర్మన్‌గా ఉన్న జిల్లా కలెక్టర్‌ దీని నిర్వహణ బాధ్యతను స్వయంగా పర్యవేక్షించాలని స్థానికులు చెబుతున్నారు.ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి రావడంతో అధికారులు సంఘానికి చేరుకొని గోశాలను పరిశీలించారు. వెంటనే చర్యలు చేపడుతామని అధికారులు చెబుతున్నారు.గోశాలను పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా... అవి ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాలి.

మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాలి: పొన్నం

కరీంనగర్ : మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి లక్ష్మారెడ్డిని మాజీ ఎంపి పొన్న ప్రభాకర్ కోరారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పొన్నం హెచ్చరించారు.

13:37 - July 20, 2017

సంస్కృతి, సంప్రదాయల పేరుతో సమాజంలో మహిళలను అణగదోక్కే పరిస్థితి ఎన్నో శతాబ్దలుగా నిరంతరయంగా కొనసాగుతోంది. ఈ స్థితి నుంచి ఆడపిల్లలను బయటకు తీసుకొచ్చి స్వశక్తితో ఎదిగేందుకు కావాలసిన పరిస్థితులను కల్పిస్తుంది కస్తూర్భగాంధీ స్మారక కేంద్రం ఈనాటి ఫోకస్ లో మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

అధికారులు రోడ్డు మరమ్మతు పనుల్లో పాల్గొనాలి:కేటీఆర్

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ ఎంసీలోని ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు మరమ్మతు పనుల్లో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వచ్చే మూడ నెలలు అధికారులంతా ఎక్కువ సమయం మరమ్మతుల కోసం సమయం కేటాయించాలని, నూతనంగా నిర్మించే ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణాల్లో బీటీ రోడ్లకు బదులు పూర్తిగా సిమెంటు రోడ్లు వేయాలని ఆదేశించారు.

13:30 - July 20, 2017

కృష్ణా : జిల్లాలో చల్లపల్లిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్ లో ఉరి వేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీనివాసరావు సీఎం బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకునట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:29 - July 20, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీల ఓట్ల లెక్కింపు ముగిసింది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నాలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:24 - July 20, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీల ఓట్ల లెక్కింపు ముగిసింది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నాలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డ్రగ్స్ కేసులో సిట్ కొనసాగుతున్న సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. శ్యామ్ కు కొరియర్ లో డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. శ్యామ్ కె నాయుడు, కొరియర్ కంపెనీల ప్రతినిధులను విడివిడిగా సిట్ అధికారులు విచారిస్తున్నారు.

13:18 - July 20, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' తండ్రి పాత్రలో..డ్యాన్సర్ గా 'జాక్వెలిన్ ఫెర్నాండెంజ్ 'లు ఓ చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో 2014లో 'కిక్' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 'సల్మాన్..’జాక్వెలిన్' జంటగా మరో చిత్రం రూపొందుతోంది. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం మొరాకోలో కొనసాగుతోంది. ఈ సినిమాకు 'గో డ్యాడీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో 'సల్మాన్' వెల్లడించాడు. ‘గో డ్యాడీ' సినిమాలో తాను 9ఏళ్ల పాపకు తండ్రిగా నటిస్తున్నట్లు, ఇందులో తన భార్య చనిపోతుందని తెలిపారు. కూతురు చెప్పిందల్లా చేస్తుంటానని. అందులో భాగంగా డ్యాన్స్ చేయాలని కోరుతుందన్నారు. ఓ డ్యాన్స్ పోటీలో పాల్గొనడానికి పేరు కూడా ఇవ్వడంతో తాను జాక్వెలిన్స్ వద్ద డ్యాన్స్ నేర్చుకోంటానని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని రకాల సినిమాల్లో నటించానని..డ్యాన్స్ నేపథ్యంలో ఓ సినిమా చేయాలనే ఆశ ఈ చిత్రంతో నెరవేరుతుందన్నారు.

ప్రస్తుతం ఆలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టైగర్ జిందా హై' చిత్రంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.

తుందురులో ఉద్రిక్తత

ప.గో: తుందుర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్ల పై గుర్తుతెలియని వ్యక్తులు టైర్లు వేసి నిప్పంటించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామస్తులను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. కాసేపట్లో మెకా ఆక్వాఫుడ్ పార్క మిషనరీ తుందుర్రు చేరుకోనుంది.

అత్యవసర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం

హైదరాబాద్: గాంధీభవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం ప్రారంభం అయ్యింది. భట్టి విక్రమార్క అధ్యక్షతన అత్యవసర సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, సంతప్ కుమార్, గీతారెడ్డి, సర్వే సత్యనారాయణ హాజరయ్యారు.

13:07 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ అధికారలు శ్యాం. కె నాయుడు పై గత మూడు గంటలపైగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సిట్ అధికారులు శ్యాం. కె నాయుడు, కొరియర్ కంపెనీల ప్రతినిధులను విడివిడిగా విచారిస్తున్నారు. అధికారులు శ్యాం.కె నాయుడుకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:06 - July 20, 2017

బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నటీమణుల్లో 'కంగనా రనౌత్' ఒకరు. పలు వివాదాస్పద అంశాల్లో చిక్కుకొనే ఈమె చేసే వ్యాఖ్యలన్నీ కుండబద్ధలు కొట్టే విధంగా ఉంటాయి. తాజాగా ఈమె పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. తాజా సినిమా 'మణికర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' షూటింగ్ లో పాల్గొంటున్న 'కంగానా' గాయపడింది. దీనితో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స పొందుతోంది.

'గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విజయంతో మంచి ఊపు మీదున్న దర్శకుడు 'క్రిష్' తన తరువాతి సినిమాను బాలీవుడ్ నటి 'కంగనా రనౌత్' ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ పేరిట 'క్రిష్' తన కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడు. బాలీవుడ్‌లో నిర్మాణమౌతున్న ఈ సినిమాకు 'బాహుబలి' కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి గాథ ఆధారంగా రూపొందుతోంది. కంగనా ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో నటిస్తోంది.

షూటింగ్ లో భాగంగా కత్తి యుద్ధాలు చేయాల్సి ఉంది. కత్తియుద్ధం సీన్ లో డూప్ ను వాడటానికి 'కంగనా' ఒప్పుకోలేదంట. నిహార్..కంగనా ల మధ్య కత్తిపోరు కొనసాగుతోంది. ‘నిహార్' కత్తి ఒక్కసారిగా ముందుకు రావడంతో కంగన కనుబొమ్మల మధ్య తెగిపోయింది. ఒక్కసారిగా షూటింగ్ లో కలకలం రేగింది. తీవ్రగాయమై రక్తస్రావమవుతున్న 'కంగనా'ను అపోలో ఆసుపత్రికి తరలించారు. నుదుటిపై 15 కుట్లు పడ్డాయి. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఇది చాలా తీవ్రమైన కత్తిగాటు అని, దాదాపు ఆమె ఎముక వరకు తెగిందని వైద్యులు పేర్కొన్నారని చిత్రయూనిట్ పేర్కొన్నదని తెలుస్తోంది.

అందరి సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టాలి: నట్టికుమార్

హైదరాబాద్: డ్రగ్స్ తో సంబంధాలున్న సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టాలని నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు. కొందరి పేర్లు బయటపెట్టి, కొందరి పేర్లు బయట పెట్టక పోవడంతో ప్రజల్లో అనుమానాలున్నాయని నట్టి కుమార్ ఆరోపించారు.

సౌదీలో గాజువాకకు చెందిన మహిళ గృహనిర్భందం

విశాఖ : సౌదీలో గాజువాకకు చెందిన మహిళ గృహనిర్భందానికి గురయ్యింది. పని కోసం గత సంవత్సరం సౌదీకి ప్రవీణ అనే మహిళ వెళ్లింది. అయితే గదిలో నిర్భందించి కొడుతున్నారని తన భర్తకు వాట్పప్ మెసేజ్ పెట్టింది. దీంతో ప్రవీణ భర్త అశోక్ విశాఖ నగర పోలీసులను ఆశ్రయించాడు.

భారత డిప్యూటీ హై కమిషనర్ కు పాక్ సమన్లు జారీ

ఢిల్లీ: భారత డిప్యూటీ హై కమిషనర్ కు పాక్ సమన్లు జారీ చేసింది. రెండు రోజుల్లో రెండోసారి పాక్ సమన్లు జారీ చేసింది.

 

12:42 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ అధికారులు శ్యాం. కె నాయుడు, కొరియర్ కంపెనీల ప్రతినిధులను విడివిడిగా విచారిస్తున్నారు. అధికారులు శ్యాం.కె నాయుడుకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:40 - July 20, 2017

డ్రగ్స్ తీసుకున్నారని తెలియాలంటే బ్లడ్ టెస్ట్ లేదా యూనిరిన్ టెస్ట్ ద్వారా తెలుస్తాయి. డ్రగ్ తీసుకున్న రెండు మూడు రోజుల్లో యూరిన్ టెస్ట్ ద్వారా తెలుకొవచ్చని, బ్లడ్ టెస్ట్ అయితే వాడిన డ్రగ్ ను బట్టి ఉంటుందని, ఐదు ఆరు రోజుల తర్వాత తెలుస్తోందని, రెండు మూడు నెలల తర్వాత బ్లెడ్ టెస్ట్ చేస్తే డ్రగ్ ఫైండ్ కాదని మానసిక వైద్యనిపుణులు భరత్ రెడ్డి అన్నారు. నగరంలోని చాలా స్కూల్ లో పిల్లలు డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిసిందని మానసిక వైద్య నిపుణులు వెంకటరమణ అన్నారు. డ్రగ్ సరఫరా చేసేవారికి శిక్ష పడుతోందని, వాడవారికి శిక్ష పడే ఛాన్స్ లేదని న్యాయ నిపుణురాలు పీడీ వినిలా అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తాగుబోతు తెలంగాణాగా మారింది: వీహెచ్

హైదరాబాద్: తెలంగాణ లో డ్రగ్ దందా బయటి ప్రపంచానికి తెలియడానికే దిగ్విజయ్ ట్వీట్ చేశారని, బంగారు తెలంగాణ కాదు.. డ్రగ్స్ తెలంగాణ అయ్యేట్టుందని, ఇప్పటికే తాగుబోతు తెలంగాణాగా మారిందని వీహెచ్ ఆరోపించారు. దిగ్విజయ్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను తిట్టడం కేటీఆర్ కు అలవాటైందని మండిపడ్డారు. స్టేట్ మెంట్స్ తగ్గించి సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టాలని కేటీఆర్ కు హితవులు పలికారు. డ్రగ్స్ దందా రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

12:12 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ ఆఫీస్ లో శ్యాం. కె నాయుడు విచారణ కొనసాగుతోంది. కెల్విన్ మొబైల్ లో నాయుడు నంబర్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. సిట్ అధికారులు నాయుడుకు కెల్విన్ ఉన్న సంబంధాలపై ఆరు తీయనున్నారు. ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల మొబైళ్లలో శ్యామ్ నంబర్ ఉన్నట్టు తెలుస్తోంది. నాయుడు పూరీ జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడు. కెల్విన్ పూరీ తర్వాత ఎక్కువగా నాయుడే డ్రగ్స్ తీసుకునట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:09 - July 20, 2017

మా సమస్యను పరిష్కరిస్తారా ? లేదా ? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా ? ఏం తినాలో మీరే నిర్ణయిస్తారా ? కులం..మతం అని రెచ్చగొడుతారా ? పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తారా ? లేదా ? రుణమాఫీ చేస్తారా ? లేదా ? కనీస వేతనాలు అమలు చేయరా ? ఇది ప్రజాస్వామ్య దేశమేనా ? అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన వారు ఆందోళనలు..నిరసనలకు దిగుతున్నారు. పాలకుల విధానాలను ప్రశ్నిస్తూ ఎండగడుతున్నారు. దేశంలో ఒకనొక మార్పు వస్తోందా ? ఎన్నడూ గట్టిగా మాట్లాడని వర్గాలు సైతం నిరసనకు దిగుతుండడం గమనార్హం. తమకు జరుగుతున్న అన్యాయాలు..మోసాలపై మహిళలు కన్నెర్ర చేస్తున్నారు..

దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న రైతు గురించి పాలకులు పట్టించుకోవడం మానేశాయి. వ్యవసాయానికి దూరంగా రైతును నెట్టేసే పరిస్థితులు సృష్టిస్తున్నారు. దీనితో ఆ రైతు కన్నెర్ర చేస్తున్నాడు. ప్రధాన రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కుతూ తమ గళం వినిపిస్తున్నారు. అట్టుపోట్లు తట్టుకుని పంటలు పండించినా ఆ రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ లో దళారుల మోసానికి రైతు బలైపోతున్నాడు. రుణభారం భరించలేక..అప్పులు తీర్చలేక..ఆ రైతన్న కూలికి దిగడమో..లేక వలస వెళ్లిపోవడమో జరుగుతున్నాయి. తరతరాలుగా ఇదే తంతు నడుస్తున్నా శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు.

ఆందోళనలు..నిరసనల్లో వ్యాపార వర్గాలు కూడా చేరడం గమనార్హం. ఏనాడు ప్రశ్నించని ఈ వర్గం కూడా పాలకులపై నిరసన తెలియచేస్తున్నాయి. జీఎస్టీ వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు..ఆందోళనలు జరుగుతున్నాయి. గుజరాత్ రాజధాని అహమ్మదాబాద్‌లో వ్యాపారులు కూడా రోడ్డెక్కి తమ నిరసన తెలియచేశారు. జీఎస్టీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని వ్యాపారులు పేర్కొంటున్నారు. కానీ వీరి ఆందోళనలు పాలకులు చెవికి మాత్రం ఏ మాత్రం ఎక్కడం లేదు. వస్తు సేవల పన్ను నుంచి వస్ర్తాలకు మినహాయింపు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. జీఎస్టీ అమలుపై వ్యాపార వర్గాలే కాదు...గ్రానైట్..ఇతర వ్యాపారుల కూడా తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సమస్యలను పరిష్కరిస్తారా ? లేదా అంటూ వివిధ వర్గాలు గళమెత్తుతున్నాయి. దీనితో పాలకులు ఆయా సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. మద్యం మహమ్మారిపై మహిళలు చేసిన ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం దిగివచ్చింది. భూ సేకరణ..రైతులు..దళితులు..వివక్షపై ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు..కార్మికులు..ఇతరులు ఆందోళన బాట పడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు..నిరసనలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు..నిరసనలతో పాలకుల కనువిప్పు కలుగుతుందా ? రానున్న రోజుల్లో పాలకులకు గడ్డుకాలమే అంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు..

సద్సులు పెట్టొద్దు: పెనుమాక రైతులు

అమరావతి: పెనుమాకలో భూసేకరణ సదస్సును రైతులు బహిష్కరించారు. సదస్సుకు హాజరైతే తమపై కేసులు పెడుతున్నారని భయపడి రైతులు రావడం లేదని సమాచారం. రాజధాని కోసం మా భూములు ఇవ్వం అని రైతులు స్పష్టం చేశారు. సదస్సులు పెట్టొద్దని అధికారులకు రైతులు తెలిపారు.

 

 

12:03 - July 20, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నాలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

జూరాల ప్రాజెక్టు పై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు పై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. త్వరతగతిన జూరాల నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆల్మట్టి, నారాయణపూర్ వరద ఉధృతిని పరిశీలించి వీలైనంత త్వరగా నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్తాయిలో పంటల పరిస్థితితులను పరిశీలించాలని సూచించారు. గద్వాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఫోన్ లో మాట్లాడి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దేవరపల్లిలో ఉద్రిక్తత

ప్రకాశం: పూర్చురు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో నీరు - చెట్టు కింద చెరువు త్వకం చేపట్టిన ఎమ్మెల్యే సాంబశివరావు అనుచరులు తమ భూముల్లో పనులు చేపట్టడం పై దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 మంది దళిత మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. దేవరపల్లి చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. గ్రామంలోకి రాపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 

బాలీవుడ్ నటి కంగనారనౌత్ తలకి తీవ్రగాయం

హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనారనౌత్ తలకి తీవ్ర గాయం అయ్యింది. మణి కర్ణిక క్వీన్ ఆఫ్ ఝానీ సినిమా షూటింగ్ లో కత్తిసాము చేస్తుండగా తలకు గాయం అయ్యింది.

11:49 - July 20, 2017

చిత్తూరు : తూడ ప్లానింగ్ అధికారి కృష్ణా ఇంటిపై ఏసీబీ అధికారలు దాడులు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో కృష్ణా రెడ్డి కి చెందిన ఇళ్లలో, బంధువుల, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో భారీగా అక్రమాస్తుల గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

త్వరలో ఆర్గానిక్ కూరగాయలు: మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: రైతు సంక్షేమం, వినియోగదారుల శ్రేయస్సు కోసం 100 మన కూరగాయలు ఔట్‌లెట్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ పార్కులో మన కూరగాయలు రిటైల్ ఔట్‌లెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. త్వరలో ఆర్గానిక్ కూరగాయలు కూడా అందిస్తామని వెల్లడించారు. ఇలాంటి కేంద్రాల వల్ల మార్కెట్‌లో ధరల స్థిరీకరణ వస్తుంది. లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు నాణ్యమైన తాజా కురగాయలను సరఫరా చేస్తున్నామని చెప్పారు. దళారీ వ్యవస్థను రూపుమాపి, ప్రజలు, రైతులకు మేలు చేయాలన్న లక్ష్యంతో మన కూరగాయల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

11:45 - July 20, 2017

బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా...గ్లామర్ పాత్రలే కాదు..శక్తివంతమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకాభిమానుల మన్ననలు పొందడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ‘అకీరా', 'ఫోర్స్ 2’, ‘నూర్' చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం 'సోనాక్షి' ‘ఇత్తేఫాక్'..’సర్కస్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే 'హసినా : ది క్వీన్ ఆఫ్ ముంబాయి' చిత్రంలో ముందుగా సోనాక్షి నటింప చేయాలని అనుకున్నామని చిత్ర దర్శకుడు అపూర్వ లిఖియా పేర్కొన్నారు.

హసినా పాత్ర కోసం తాము సోనాక్షిని సంప్రదించడం జరిగిందని, అందుకోసం షూటింగ్ ను సైతం కొన్ని రోజులు ఆపివేయడం జరిగిందన్నారు. కానీ ఆ టైమ్ లో 'సోనాక్షి'..’ఫోర్స్ 2’ సినిమాలో బిజీగా ఉందని, ఆ సమయంలోనే 'జాన్ అబ్రహం' కూడా గాయాలపాలయ్యాడన్నారు. ఈ తరుణంలో 'శ్రద్దా దాస్' ను తీసుకోవాలని అనుకున్నట్లు...కానీ ఈమె సెకండ్ ఆఫ్షన్ గానే ఉందన్నారు.

చివరకు 'సోనాక్షి' డేట్స్ సెట్ కావడంతో అనివార్య పరిస్థితుల్లో 'శ్రద్ధాదాస్'ను ఫైనల్ చేయడం జరిగిందన్నారు. ఇందులో 'శ్రద్ధా' అద్భుతంగా నటించిందని, ట్రైలర్ చూస్తే అర్థమౌతుందన్నారు. మరి శ్రద్ధా దాస్ ఎలాం నటించిందో సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

11:44 - July 20, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' 'జై లవ కుశ' చిత్రంతో బిజీగా మారిపోయారు. బాబీ దర్శకత్వంలో సోదరుడు 'నందమూరి కళ్యాణ్ రామ్' నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషిస్తుండడం గమనార్హం. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ఫొటోలు..టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. టీజర్ లో 'ఎన్టీఆర్' పలికిన డైలాగ్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఒక్క టీజర్ తోనే చిత్ర అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మూడు పాత్రలకు సంబంధించిన టీజర్స్ విడుదల చేస్తారని తెలుస్తోంది. అందులో ఒక టీజర్ విడుదల కాగా మరొక టీజర్ ఈనెలాఖరులోగా విడుదల చేస్తారని టాక్. రాఖీఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణెలో జరుపుకొంటోంది. ఈ విషయాన్ని స్యయంగా 'ఎన్టీఆర్' ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. నైపుణ్యం కలిగిన బృందంతో పూణెలో శరవేగంగా షూటింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్ లో తీసిన ఒక ఫొటోను 'ఎన్టీఆర్' పోస్టు చేశారు. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.

11:43 - July 20, 2017

క్లాస్ ఆఫ్ 2017 కమిటీ ఎన్నికల్లో పాల్గొనాలంటూ బాలీవుడ్ నటి 'ప్రియాంక చోప్రా' కు ఆహ్వానం అందింది. అకాడమీ కమిటీలో సభ్యురాలవడం చాలా గర్వంగా ఉందని..తన కెరీర్ లో ఇదొక ఎచీవ్ మెంట్ అంటూ 'దీపికా పదుకొనే' పేర్కోంటోంది. 2017 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల ప్రకటన కమిటీ ఎంపిక కోసం వివిధ దేశౄల నుండది ప్రముఖ తారాలకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆహ్వానాలు పంపుతోంది. ప్రియాంక చోప్రా..దీపికా పదుకొనే..అమితాబ్ బచ్చన్..ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్ లు ఇప్పటికే ఆహ్వానాలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రాతో పాటు దీపికా పదుకొనేలకు ఆహ్వానాలు అందాయి. క్లాస్ ఆఫ్ 2017 కమిటీ ఎన్నికల్లో పాల్గొనే సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆహ్వానం అందడం పట్ల 'దీపికా' సంతోషం వ్యక్తం చేసింది. కమిటీకి ఎంపిక చేయడం పట్ల వారికి ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేసింది.

11:39 - July 20, 2017

ప్లీజ్..మమ్మీ..డాడీ..బ్యాగ్ బరువు మేయలేను..అంత బరువు మోస్తుంటే నా భుజం నొస్తోంది..అనే మాటలు ప్రతి ఇంట్లో వినిపిస్తుంటాయి. ఎందుకంటే పిల్లలు జానెడు..బ్యాగ్ ఏమో మూరెడు..చదువు చిన్నది..మోత ఏమో పెద్దది..అనే చందంగా ఉంది. బ్యాగుల బరువు తగ్గించాలనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కేరళ సర్కార్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుని విద్యార్థులకు ఉపశమనం కలిగించింది.

చదివేది ఎల్ కేజీ..కానీ బ్యాగు బరువు చూస్తే ఆరేడు కిలోల పైన ఉంటుంది. అంటే విద్యార్థులు సామర్థ్యానికి మించిన బరువులు మోస్తున్నారన్నమాట. హోం వర్క్..డ్రాయింగ్..అది..గిది అని బండెండు పుస్తకాలను మోయిస్తున్నారు. ఇలా బరువైన బ్యాగులు మోయడం వల్ల పలువురు విద్యార్థులు అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా పుస్తకాల్ని మోపిస్తూ విద్యార్థుల్ని గూనొళ్లని చేస్తున్నాయి.

స్కూల్ బ్యాగుల విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని తల్లిదండ్రులు ఎన్నోమార్లు విజ్ఞప్తులు చేశాయి. కానీ ఏ ఒక్కరూ కనికరించిన పాపన పోలేదు. స్కూల్ బ్యాగ్ ల బరువు తగ్గించాలని డిమాండ్స్ వినిపిస్తున్నా స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వీపున మోయలేని భారాన్ని మోస్తున్న విద్యార్థులు వారి కళ్లకు కనబడడం లేదు. తాజాగా విద్యార్థుల స్కూల్‌ బ్యాగుల బరువు తగ్గించేందుకు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలను నిర్దేశించింది.
కానీ ఎన్ని స్కూళ్లు వీటిని పక్కాగా అమలు చేస్తాయి ? చేస్తున్నాయి ? అనే దానిపై డౌట్స్ నెలకొన్నాయి.
యాజమాన్యాలు కళ్లు తెరుస్తాయా..? విద్యార్థుల భుజాలపై భారాన్ని తగ్గిస్తాయా..? చూడాలి.

లోయలో పడ్డ బస్సు:20మంది మృతి

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాన్‌ నుంచి కిన్నౌర్‌కి వెళుతున్న బస్సు రాంపూర్‌ వద్దకు రాగానే అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా దుర్మరణం చెందినట్లుసమాచారం. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకునిమృతదేహాలను వెలికి తీస్తున్నారు. 

చల్లపల్లిలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కృష్ణా: చల్లపల్లిలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ క్వార్టర్స్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

11:35 - July 20, 2017

పశ్చిమగోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులను ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణ ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాలల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

దిగ్విజయ్ వయసుకు తగ్గట్టుగా నడుచుకో: కేటీఆర్

హైదరాబాద్: దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ స్పందించారు. దిగ్విజయ్ పూర్తిగా విచక్షణ కోల్పోయరన్నారు. గౌరవంగా రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమైందని, దిగ్విజయ్ వయసుకు తగ్గట్టుగా నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషం అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

11:33 - July 20, 2017

ప్రకాశం : 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువులు తవ్వడం మంచిది కాదని ఏపీ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. ఆ భూముల్ని దలితులకు వదిలి వేయ్యాలని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

11:32 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లి ఉద్రిక్తత నెలకొంది. దళితులు సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో ఎమ్మెల్యేల అనుచరులు నీరుచెట్టు పనులు చేపట్టారు. దళితులు ఎమ్మెల్యే సాంబశివరావు అనుచరుల తీరును ఖండించారు. వారు నీరు చెట్టు పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులకు దళిత మహిళల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఐదుగురు మహిళలు సహా 21 మంది దళితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:31 - July 20, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కౌటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నాలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

లుథియానాలో భారీగా హెరాయిన్ పట్టివేత...

పంజాబ్: లుథియానాలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. నిందితుల నుంచి 5 కిలోల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో పట్టుబడిన ఇద్దరు నైజిరియన్ డ్రగ్స్ ముఠా ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

11:30 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ ఆఫీస్ లో శ్యాం. కె నాయుడు విచారణ కొనసాగుతోంది. కెల్విన్ మొబైల్ లో నాయుడు నంబర్ ఉన్నట్లు సిట్ గుర్తించింది. సిట్ అధికారులు నాయుడుకు కెల్విన్ ఉన్న సంబంధాలపై ఆరు తీయనున్నారు. ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల మొబైళ్లలో శ్యామ్ నంబర్ ఉన్నట్టు తెలుస్తోంది. నాయుడు పూరీ జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

శ్రీవారి సేవలో సచిన్ టెండూల్కర్

తిరుమల: ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో భార్య అంజలితో కలిసి స‌చిన్ టెండూల్క‌ర్‌ స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శ‌నం బాగా జ‌రిగింద‌ని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. ఆయనతోపాటు చాముండేశ్వరినాద్, నిమ్నగడ్డ ప్రసాద్‌లు దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయరంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్దప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

11:29 - July 20, 2017

హైదరాబాద్ : కేటీఆర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారల బాధ్యులు డిగ్గీరాజా మధ్య డ్రగ్ వార్ ట్విట్టర్ ఆయుధంగా సాగుతోంది. డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల వారసుల హస్తం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. వారందరినీ విచారిస్తారో లేక రక్షిస్తారో అంటూ ట్వీట్ చేశారు. దిగ్విజయ్ ట్వీట్లపై కేటీఆర్ కౌంటర్ ట్వీట్ చేశారు. దిగ్విజయ్ కు రిటైరయ్యే సమయంల వచ్చేసిందని, వయసుకు తగ్గ పనినే చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు ప్రారంభం...

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల సమయానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. నాలుగు టేబుళ్లపై మొత్తం ఎనిమిది రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ చేపడుతున్నారు. తొలుత పార్లమెంట్‌ భవన బ్యాలెట్‌ పెట్టెను, తర్వాత ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాల బ్యాలెట్‌ పెట్టెలను తెరిచి లెక్కిస్తామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనూప్‌ మిశ్రా చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.

11:27 - July 20, 2017

హైదరాబాద్ : 14వ రాష్ట్రపతి ఎవరో మరికొద్ది గంటల్లో తెలనుంది. నేడే రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయంల 11గంటలకు పార్లమెంట్ లో ఓట్ల కౌటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు ఫలితాలు బయటకు తెలుపుతారు. మొత్తం నలుగు టేబుళ్లలో 8 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా పార్లమెంట్ బ్యాలెట్ బాక్స్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. అనంతరం రాష్ట్రాల బ్యాలెట్ బాక్సు ఓట్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెక్కిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 771ఎంపీలు, 4109ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:25 - July 20, 2017

కాకరకాయ జాతికి చెందినదే ఆకాకరకాయ. దీనిని అడవి కాకరకాయ, లేదా బోడ కాకరకాలు అంటారు. కాకరకాయల మాదిరిగా పొడుగ్గా కాకుండా రౌండ్ గా ఉండి..చిన్న చిన్న బొడిపలుంటాయి. అయితే దీని ఖరీదు కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇవి సెప్టెబంర్ మాసంలో ఎక్కువగా దొరకుతాయి. ఈ సీజన్ లో మాత్రం కేజీ 80 రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది.

ఆ కాకరకాయను ఆహారంలో తీసుకోవం వలన మధుమేహం , గుండె జబ్బులతో పాటు అధిక బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అని చెబుతుంటారు.

ఆకాకరకాయలో చాలా తక్కువ సంఖ్యలో కేలరీస్ ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఇది శరీరంలో ఏర్పడ్డ వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.

మధుమేహంతో బాధపడేవారి పాలిట ఆకాకరకాయ గొప్పవరం. ఎందుకంటే ఇది రక్తంలోని చక్కెరస్థాయిలను తగ్గించే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తరచుగా దీనిని ఆహారంలో తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.

దీనిలో ఉండే యాంటీ కేన్సర్ గుణాలు శరీరంలోని కేన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నివారిస్తాయి. శరీరంలో ఏర్పడ్డ కణితులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. శరీరంలోని ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యానిస్తాయి. ఇందులో ఉంటే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

ఇందులో ఉండే పొలేట్ అనే పోషకాలు శరీరంలో కొత్త కణాల వృద్ధికి మరియు గర్బస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పతుంది. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలు ఆకాకరకా ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉండే ఫూటో న్యూట్రియంట్లు కాలేయం, కండడరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచింది. ఆకాకరకాయ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

10:36 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారల బాద్యులు డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యంలు చేశారు. ఆయన డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ నేతల వారసుల హస్తం ఉందన్నారు. విచారణ ఎలా జరుగుతుందో చూడాలని డిగ్గీ కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తారా అంటూ ట్విట్టర్ ద్వారా పొస్టు చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:24 - July 20, 2017

ప్రజా స్వామ్యమా ? ధన స్వామ్యమా ?
మాకు జీతాలు పెంచాలి...ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు...వెంటనే పెంచేయాలి..ఏమంటారు ? చాలా కష్టపడుతున్నాం..అర్థం చేసుకోండి.. మేమేం అడుక్కోవడం లేదు..అందరూ జీతాలు పెంచాలని అడుగుతున్నప్పుడు మేము కూడా అడుగుతాం..ఇదంతా...ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధుల డిమాండ్....జీతాల పెంపును మాత్రం వామపక్ష ప్రజాప్రతినిధులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు..

 

జీతాలు పెంచాలన్న ఎంపీ...
పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంచాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ చేసిన డిమాండ్ తో ప్రజాప్రతినిధుల జీతాలపై చర్చ ప్రారంభమైంది. వారికేం తక్కువ...అన్ని సౌకర్యాలుండగా ఇంకా జీతాలు పెంచడం ఎందుకు ? అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉండగానే కరవు కోరల్లో చిక్కుకున్న తమిళనాడులో ప్రజాప్రతినిధుల జీతాలు పెంపుపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు జీవితాలే సమస్యగా మారితే మీకు జీతాలు సమస్యగా మారాయా ? అంటూ కామన్ మెన్ గుస్సా చేస్తున్నాడు. ఇది ఓటు స్వామ్యమా ? లేక నోటు స్వామ్యమా ? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రజా సమస్యలు పట్టవు..
అయ్యా..బాబు..మాకు ఓటు వేయండి..మీ సమస్యలు పరిష్కరిస్తాం...అని చెప్పిన ప్రజాప్రతినిధుల్లో కొంతమంది ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదు. ఓటు వేసిన అనంతరం ప్రజలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎంతో మంది. ఓటు వేశాక మమ్మల్ని పట్టించుకోని మీకు ఇంతింత జీతాలు అవసరమా అని జనాలు కడిగిపారేస్తున్నారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారిలో కొంతమంది తమ ఆస్తులను కూడబెట్టుకోవడంలో ముందుంటారన్న విమర్శలున్నాయి. వారు..వారి బంధువులు..మిత్రుల్లో భారీ మార్పులు చూస్తుంటాం. కానీ సదరు నాయకులను ఎన్నుకున్న ప్రజానీకంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు.

రోడ్డెక్కుతున్న రైతులు..కార్మికులు..
ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందిరికీ తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వివిధ రంగాలకు చెందిన వారు రోడ్డెక్కుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని..రుణమాఫీ చేయాలని..నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. ప్రకృతి ప్రకోపంతో రైతన్న వెన్ను విరిగిపోతుంటే ప్రభుత్వం గానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ.. మీనమేషాలు లెక్కించారే గానీ... వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కార్మికులు..ఉద్యోగులు..ఇలా ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్న వారు తమ జీతాల సమస్యలపై ఎన్నో సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నారు. వివిధ వర్గాలకు జీతాలు పెంచినా అవి ఇవ్వడంలో మాత్రం పాలకులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇతరులపై విమర్శలు చేసుకునే ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాల పెంపు విషయంలో మాత్రంలో ఏకమవుతారు.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి..కొంతమంది ప్రజాప్రతినిధులు జీతం తీసుకోకుండా పాలన చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీతం వద్దని చెప్పారు. కానీ రాజ్యాంగ బద్ధంగా తప్పనిసరిగా జీతం తీసుకోవాలి కాబట్టి కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నారు. ప్రస్తుత త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ జీతం తీసుకుంటారు. కానీ ఆ జీతాన్ని పేదల కోసం ఖర్చు చేస్తారు. రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్న ఆయనకు సొంత ఇల్లు..వాహనం లేదు.

తుడా ప్లానింగ్ అధికారి కృష్టారెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి

చిత్తూరు: తుడా ప్లానింగ్ అధికారి కృష్ణారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో కృష్ణారెడ్డికి చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. కృష్ణారెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. 

10:06 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. కెల్విన్ మొబైల్ లో శ్యాం. కె నాయుడు నంబర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిట్ అధికారులు నాయుడుకు కెల్విన్ ఉన్న సంబంధాలపై ఆరు తీయనున్నారు. ముగ్గురు ఈవెంట్ ఆర్గనైజర్ల మొబైళ్లలో శ్యామ్ నంబర్ ఉన్నట్టు తెలుస్తోంది. నాయుడు పూరీ జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దర్శించుకున్న గవర్నర్ దంపతులు

జగిత్యాల : ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు..

న్యూఢిల్లీ: ఈనెల 16న పోలింగ్ జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల నేడు లెక్కింపు జరగనుంది. పార్లమెంటులో ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపు కోసం లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయం విస్తృత ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ర్టాల నుంచి బ్యాలెట్ బాక్సులను గట్టి బందోబస్తు నడుమ ఢిల్లీకి తరలించారు. రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ తరఫున మీరాకుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 25న ముగియనుంది. అదే రోజున నూతన రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 17 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను ఉ: 8 గంటల తరువాత స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు.

తుందుర్రులో పోలీసులు భారీగా మోహరింపు

ప.గో: తుందుర్రులో పోలీసులు భారీగా మోహరించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీని తీసుకురావడానికి పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులు ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్

వరంగల్ : ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డిని పూజల పేరుతో మోసం చేసిన మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. కరిమాబాద్ కు చెందిన నర్శింహరాజు, లక్ష్మణరాజు లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 57 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

సిట్ ఆఫీసుకు బయలు దేరిని చోటా కె నాయుడు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నేడు శ్యామ్ కే నాయుడును సిట్ అధికారులు విచారించనున్నారు. సిట్ ఎదుట హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు కాసేపట్లో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసుకు చేరుకోనున్నారు.

డివైడర్ ను ఢీ కొట్టిన కారు : ఇద్దరి మృతి

హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని చైతన్యపురి వద్ద డివైడర్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.

09:34 - July 20, 2017

హైదరాబాద్ : నగరంలోని సరూర్ నగర్ లో కారు మెట్రో పిల్లరును ఢీకొట్టింది. స్నేహితుడి బర్త్ పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న యువకులు మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి పిల్లర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరు వనస్థలిపురం నుంచి దిల్ సుఖ్ నగర్ వస్తుండగా ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:23 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు నిన్నంత పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించారు. ఇవాళ కెమెరామెన్ శ్యాం.కె నాయుడుని అధికారులు విచారించనున్నారు. నాయుడు ఉదయం 10.30గంటలకు సిట్ ముందుకు రానున్నారు. సిట్ అధికారులు కెల్విన్ తో సంబంధాలపై ఆరా తీయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:13 - July 20, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా తుందుర్రులో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులను ఆక్వాఫుడ్ పార్క్ పోరాట సమితి నాయకులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఆరేటి వాసు, సత్యవతి, సత్యనారాయణ ఉన్నారు. ఆక్వాఫుడ్ పార్క్ కు మిషనరీ తరలించేందుకే అరెస్ట్ చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంసాలల బేతపూడి, జొన్నల గురువు, తుందుర్రులో గ్రామస్థులు ఆందోళనలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:05 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లి ఉద్రిక్తత నెలకొంది. దళితులు సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో ఎమ్మెల్యేల అనుచరులు నీరుచెట్టు పనులు చేపట్టారు. దళితులు ఎమ్మెల్యే సాంబశివరావు అనుచరుల తీరును ఖండించారు. వారు నీరు చెట్టు పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులకు దళిత మహిళల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఐదుగురు మహిళలు సహా 21 మంది దళితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:28 - July 20, 2017

వరంగల్ : జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీ గాంధీనగర్ లో దుండగులను ఓ బాలుడిని నరికి చంపారు. దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఆటోలో వదిలి వెళ్లారు. హత్యకు గురైన బాలుడిని వినయ్ కుమార్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 3వ తరగతి చదువుతున్న వినయ్ కుమార్ ను అత్యంత పశవికంగా నరికి చంపడం వరంగల్ లో సంచలనం సృష్టిస్తుంది. వినయ్ స్థానికంగా తాపి పని చేసుకుంటున్న ఓ మేస్త్రి కొడుకు స్కూల్ కు వెళ్లి రాకపోవడంతో నిన్న రాంత్రంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారికి అంతలోనే చేదువార్తు తెలియడంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

08:11 - July 20, 2017

ప్రకాశం : జిల్లాలోని పర్చూరు మండలం దేవరపల్లి ఉద్రిక్తత నెలకొంది. దళితులు సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో ఎమ్మెల్యేల అనుచరులు నీరుచెట్టు పనులు చేపట్టారు. దళితులు ఎమ్మెల్యే సాంబశివరావు అనుచరుల తీరును ఖండించారు. వారు నీరు చెట్టు పనులు అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. పోలీసులకు దళిత మహిళల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఐదుగురు మహిళలు సహా 21 మంది దళితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన స్థలానికి వెళ్లకుండా పోలీసులు మీడియాపై ఆంక్షలు విధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

07:57 - July 20, 2017

ఢిల్లీ : తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌ ఈనెల 6న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అతడిని కిడ్నాప్‌ చేశాడు. అతడిని వదిలిపెట్టాలంటే 5కోట్ల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌ పెట్టాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. శ్రీకాంత్‌గౌడ్‌ కిడ్నాప్‌ కావడంతో ఓలా క్యాబ్‌ యాజమాన్యం 7న ప్రీత్‌విహార్‌ ప్రాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే కిడ్నాపర్‌ వారికి చిక్కకుండా చుక్కలు చూపించాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. బుధవారం శ్రీకాంత్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్నట్టు గుర్తించారు.

ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు
కిడ్నాపర్లు తలదాచుకున్న ప్రదేశాన్ని గుర్తించి వారిని పట్టుకునేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న కిడ్నాపర్స్‌ హరిద్వార్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కిడ్నాపర్లపై కాల్పులు జరిపారు. ఓ కిడ్నాపర్‌కు గాయాలైనట్టు తెలుస్తోంది. శ్రీకాంత్‌ను మాత్రం సురక్షితంగా కాపాడారు.శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు సురక్షితంగా కాపాడారని తెలియడంతో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మోహినిమల్ల వీధిలోని ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఢిల్లీ పోలీసులు తమ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడించారని తెలిపారు. ఇక స్థానిక ఎమ్మెల్యే డీకె అరుణ శ్రీకాంత్‌ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులతో ఆనందాన్ని పంచుకున్నారు.మొత్తానికి శ్రీకాంత్‌గౌడ్‌ సురక్షితంగా కిడ్నాపర్ల చెరనుంచి బయటపడడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తమ కుమారుడిని సురక్షితంగా కాపాడిన ఢిల్లీ పోలీసులకు శ్రీకాంత్‌ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

07:55 - July 20, 2017

విశాఖ : విషజ్వరాలతో విశాఖ మన్యంలో ఇంకా మరణమృదంగం మోగుతూనే ఉంది. నెలన్నర రోజులు నుంచి విషజ్వరాలు, ఆంత్రాక్స్‌ వంటి ప్రాణాంతక వ్యాధులతో అమాయక గిరిజనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా... ప్రభుత్వం పట్టించుకోలేదు. జీ మాడుగుల సర్పంచ్‌ మత్స్యరాజుతో సహా ఇంతవరకు 50 మంది మృత్యువాత పడ్డారు. అయినా ప్రభుత్వంలో స్పందన లేదు. ఏజెన్సీలలోని ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందటంలేదు. మందులు అందుబాటులో లేవు. డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతంత మాత్రమే. దీంతో మన్యం గిరిజనులు ధీనస్థితిపై స్పందించిన సీపీఎం నేతృత్వంలోని 11 ప్రజాసంఘాలు నేటి నుంచి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి. విశాఖ మన్యలోని 11 మండలాల్లో ఇవాళ్టి నుంచి ఈ నెల 31 వరకు 34 వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. వైద్య శిబిరాల ఏర్పాటుకు సీపీఎం చొరవ తీసుకుంది. తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది. అనుభవజ్ఞులైన డాక్టర్లు గిరిజనులుకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వనున్నారు. 

07:54 - July 20, 2017

సిరిసిల్ల : రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్‌ మాఫియా ముఠాలు చెలరేగిపోతున్నాయని, వీటి వెనుక ప్రభుత్వ హస్తం ఉందని TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నవారిని లారీలతో అడ్డంగా తొక్కిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులుకు కూడా మాఫియాకు వంతపాడుతూ ఫిర్యాదుదారులను చింత్రహింసకు గురి చేయడాన్ని తప్పుపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుకు అక్రమణ రవాణను అడ్డుకున్న ఎమిమిది మందిని పోలీసులు చితకబాదడంతో గాయపడి, ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను కాంగ్రెస్‌ నేతలతో కలిసి మల్లు భట్టివిక్రమార్క పరామర్శించారు. ఇసుక లారీలు ఢీకొని 42 మంది చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడంపై మండిపడ్డారు.

 

07:53 - July 20, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేబట్టింది. 63 మంది శాసనసభ్యులతో అధికారం చేజిక్కించుకుంది. ఉప ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. అంతేకాదు.... ఇతర పార్టీల శాసనసభ్యులను కారెక్కించుకుని ఎమ్మెల్యేల సంఖ్యను భారీగా పెంచుకుంది. అధికారపార్టీ గూటిలో ప్రస్తుతం 90మంది శాసనభ్యులు ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు.టీఆర్‌ఎస్‌ పాలనపై సర్వేలు అన్నీ ప్రభుత్వానికే అనుకూలంగా వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు ప్రాతినిథ్యంలేని ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకునేందుకు గులాబీ బాస్‌ స్కెచ్‌ వేస్తున్నారు. విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రాతినిథ్యంలేని నియోజకవర్గాల్లో బలమైన నేతలను వెతికేపనిలో పడ్డారు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయడంపైనా దృష్టిసారించారు.

పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా
తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా గులాబీ బాస్‌ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా తమ బలాలు, బలహీనతలపై ఫోకస్‌ పెట్టారు. బలహీతనలను అధిగమించేందుకు ఏం చేయాలన్నదానిపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. నేతల మధ్యనున్న విభేదాలు తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నేతలందరినీ కలుపుకొనిపోయే వారినే ఇంచార్జీలగా నియమించాలని కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారు. అలాంటి వారికోసం అన్వేషణ ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గ ఇంచార్జీలను నియమించే అవకాశముంది. తద్వారా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే ప్రజాదరణ కలిగిన నేతలను నియోజకవర్గ ఇంచార్జీలుగా నియమించే పనిలో పడ్డారు. 

07:52 - July 20, 2017

విజయవాడ : జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌... ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నారు. జనసేనానిని దగ్గరకు తీసుకునేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రయత్నిస్తున్నా.... ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలకు కొద్దిగా దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా బరిలో దిగే ఆలోచనలో ఉన్న జనసేన పార్టీ... ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చి, ఎన్డీయే తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఈ రెండు పార్టీలతో విభేదించారు. కొన్ని అంశాల్లో ముఖ్యంగా అమరావతికి భూసమీకరణపై చంద్రబాబు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినా... మరికొన్ని విషయాల్లో సమర్ధించారు. ఏపీ ప్రభుత్వం కూడా పవన్‌ లేవనెత్తిన కొన్ని విషయాలపై సానుకూలంగా స్పందించింది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యే ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు సీను మారింది. ఇదే అంశంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించినా... పవన్‌ కల్యాణ్‌ వెళ్లకపోడం చర్చనీయాంశంగా మారింది.

చంద్రబాబుతో భేటీకి దూరంగా జనసేనాని
చంద్రబాబుతో భేటీకి జనసేనాని దూరంగా ఉండటానికి రాజకీయ కారణాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని పవన్‌ భావిస్తున్నారు. జనసేన నెగ్గినా, ఓడినా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరతానని కొన్నిసార్లు బహిరంగంగా ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌... ఈ దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో టీడీపీ మద్దతు ఇచ్చని జనసేనాని ఇప్పుడు.. ఈ పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతు ఇచ్చి విమర్శల పాలైన పవన్‌.. ఈసారి మళ్లీ చేరువైతే ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న భావనతో ఉన్నారు. ఇందుకే చంద్రబాబుతో భేటీకి దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ అనుకూల ముద్రను తొలగించుకునేందుకు పవన్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని జనసేనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సమీప భవిష్యత్‌లోనే పవన్‌ తన రాజకీయ ప్రణాళికలను ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

07:47 - July 20, 2017

హైదాబాద్ : మహానగరంలో మరో డ్రగ్స్‌ ముఠా దొరికింది...ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే ఓ ముఠాను గుర్తించి లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో మరో ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరకడం కలకలం రేపుతుంది...ఇద్దరు నైజీరియన్లు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.... నిందితుల నుంచి 300 గ్రాముల కొకైన్‌, 42 గ్రాముల ఎండీఎంఏ, 27 ఎల్‌ఎస్‌డీ యూనిట్లు, కారు, ఎయిర్‌గన్‌లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు పట్టుబడిన వారిలో దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టోఫర్‌ అనే విద్యార్థి వీసాపై వచ్చి గోవాలో ఉంటున్నాడు...నిందితులు గోవా కేంద్రంగా ఆన్‌లైన్‌ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని తేలింది...అయితే ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేసిన కెల్విన్‌ ముఠాతో సంబంధాలున్నాయాన్నదానిపై విచారిస్తే ఎలాంటి లింకులు లేవని తేలింది...

డార్క్‌నెట్‌లోనే కొనుగోళు
పోలీసులు పట్టుకున్న ఈ ముఠాలో మల్లికార్జున్‌ అనే వ్యక్తి బీటెక్‌ చేసి ప్రైవేటు ఎంప్లాయిగా పనిచేశాడు. డార్క్‌నెట్‌ నుంచి మూడుసార్లు జర్మనీ నుంచి కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ తెప్పించినట్టు పోలీసుల విచారణలో తేలింది...మహేందర్‌ అనే మరో వ్యక్తి కూడా డార్క్‌నెట్‌లోనే చూసి డ్రగ్స్‌ను కొనుగోలుచేసి సప్లై చేశాడన్నారు. వీరందరిపైనా పీడీ చట్టం ప్రయోగించే ప్రతిపాదనను పెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.

07:45 - July 20, 2017

హైదరాబాద్ : సిట్ అడిగిన ప్రశ్నలకు పూరీ సమాధానం చెప్పారు. తనకు డ్రగ్స్ అలవాటే లేదన్నారు. ఓ ఈవెంట్ సందర్భంగా పబ్‌లో కెల్విన్‌ను కలిశానని ఒప్పుకున్నారు. తనకు కెల్విన్‌కు మధ్య రోజువారీగా ఎలాంటి సంభాషణలు జరగడంలేదని సమాధానం చెప్పారు. సిట్ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు తడబాటు లేకుండా పూరీ సమాధానం చెప్పారని వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పూరీ పక్కా ప్రణాళికతో విచారణకు హాజరయ్యారని అర్థమవుతోంది. అందుకే ప్రతి ప్రశ్నకూ ఆచితూచి సమాధానం చెప్పారని ప్రచారం జరుగుతోంది. సిట్ అధికారులు పూరీని అడిగిన కొన్ని ప్నశ్నలు ఈ విధంగా ఉన్నాయి.

1. డ్రగ్స్ ఎన్నిరోజులుగా వాడుతున్నారు?

2. ఎవరి ద్వారా కెల్విన్ పరిచయం అయ్యారు ?

3. కొకైన్ వాడుతున్నది నిజమా? కాదా?

4. రోజుకు ఎంత మోతాదులో డ్రగ్స్ తీసుకుంటారు?

5. డ్రగ్స్ కోసం నెలవారీగా ఎంత ఖర్చు చేసేవారు?

6. కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ సరఫరా చేసిందెవరు?

7. నైజీరియన్ జిఫాన్‌తో ఉన్న లింకేంటి?

8. మీ ద్వారా డ్రగ్స్ ఎవరెవరికి వెళుతున్నాయి?

9. మీరు డ్రగ్స్‌ను అమ్ముతున్నారా?

10. ఫ్రెండ్లీగా పంచుతున్నారా?

11.ఐటమ్‌ గాళ్‌ ముమైత్, హిరీయిన్‌ ఛార్మి, సుబ్బరాజులకు మీ నుంచే డ్రగ్స్ వెళ్తున్న మాట నిజమా? కాదా?

12. మీ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు?

13. రవితేజ, భరత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్టు ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏంటి?

14. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్‌కు కెల్విన్‌ను ఎందుకు పిలిచారు ?

15. కెల్విన్‌తో ఏ సంబంధం లేకపోతే జ్యోతిలక్ష్మి నిసిమా ఫంక్షన్‌కు అతను ఎందుకు వచ్చారు ?

16.కెల్విన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకోతే మీ బ్యాంకు ఖాతా నుంచి కెల్విన్‌ ఖాతాలోకి డబ్బులు ఎలా బదిలీ అయ్యాయి ?

17.కెల్విన్‌కు డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ?

18.మీ సినిమా ఫంక్షన్‌ పార్టీలకు కెల్విన్‌ డ్రగ్స్‌ సరఫరా చేసేవాడా ?

ఇలాంటి మరికొన్ని ప్రశ్నలు సిట్‌ అధికారులు పూరీ జగన్నాథ్‌ను అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రశ్నలకు పూరీ చెప్పిన జవాబులతో సిట్‌ అధికారులు ప్రత్యేక నివేదిక తయారు చేస్తున్నారు. పూరీతో పాటు విచారణకు వచ్చిన వారిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లోపలికి అనుమతించలేదు.  

07:44 - July 20, 2017

హైదరాబాద్ : కెల్విన్‌ గ్యాంగ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ పునరుద్ఘాటించారు. సిట్‌ విచారణలోనూ అదే చెప్పానని స్పష్టం చేశారు. సిట్‌ విచారణ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లిన పూరీ ట్విట్టర్‌ వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సిట్‌ అధికారులు వేసిన ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్పానన్నారు. సిట్‌ ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానన్నారు. తానెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు. తనకు తప్పు చేసే అలవాటు లేదని... అలాంటి పనులను తానెప్పుడూ ప్రోత్సహించబోనని చెప్పారు. వాస్తవాలు ఏంటో సిట్‌ విచారణలో తేలుతాయని.... తనపై సోషల్‌ మీడియాలో అవాస్తవ కథనాలు ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జీవితాలు నాశనమైపోతాయన్నారు.

07:43 - July 20, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో బుధవారం సిట్‌ విచారణకు హాజరైన ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ను అధికారులు రోజంతా విచారించారు. ఇచ్చిన సమయంకంటే ముందే పూరీ తన తనయుడు ఆకాశ్‌ , సోదరుడు సాయిరాంశంకర్‌తో విచారణకు వచ్చారు. ఎక్సైజ్‌ కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించారు. ఉదయం 10.15 నుంచి రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు విచారించారు. ఆ తర్వాత 9.30కు స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకుని విడిచి పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సంబంధాలు, జీశాన్‌తో లింకు, హీరోయిన్‌ చార్మి, హీరోలు రవితేజతోపాటు పలువురు నటీనటులకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు వచ్చి ఆరోపణలపై విచారించినట్టు తెలుస్తోంది.కెల్విన్‌ డ్రగ్స్‌ సరఫరా చేశారా అని అధికారులు ప్రశ్నించగా .. అతడు ఈవెంట్‌ మేనేజర్‌గానే తనకు తెలుసని.. పబ్‌లలో షూటింగ్‌ల కోసం సంప్రదించి ఉంటానని సమాధానం ఇచ్చారు. తాను కేవలం కుటుంబ సభ్యులు, సినిమా వాళ్లతోనే ఫోన్‌ ద్వారా మాట్లాడుతానని, మిగతా కాల్స్‌ అన్ని తమ మేనేజర్లు చూసుకుంటారని చెప్పారు. తొలుత 2 గంటలపాటు సిట్‌ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ వచ్చిన పూరీని.. టీ బ్రేక్‌ తర్వాత మరోసారి విచారించింది. మొత్తంగా పూరీపై అధికారులు 45 ప్రశ్నల వరకు సంధించాచరు. మొదట కెల్విన్‌తో పరిచయం లేదని చెప్పిన పూరీ.. టీబ్రేక్‌ తర్వాత సిట్‌ అధికారులు అతడితో ఉన్న ఫోటోలను చూపించడంతో కాస్త తడబడ్డారు. కెల్విన్‌, పూరీ, చార్మి కలిసి దిగిన సెల్ఫీ పోటోలు అధికారులు చూపించారు.

ఈవెంట్‌ మేనేజర్‌గానే
దీంతో కెల్విన్‌ తనకు పరిచయం ఉందని, అయితే అది కేవలం ఈవెంట్‌ మేనేజర్‌గా మాత్రమే తెలుసని, అంతకుమించి డ్రగ్స్‌ వ్యవహారంలో ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. కెల్విన్‌తో పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్‌ తీసుకున్నట్టా? నాతో కలిసి ఉన్నవారు, పరిచయం ఉన్నవారు చేసే పనులకు నేను బాధ్యుడను అవుతానా? అంటూ అధికారులను డిఫెన్స్‌లోకి నెట్టారు పూరీ.వాట్సాప్‌లో ఇద్దరి మధ్య జరిగిన కోడ్‌ భాషపైనా, కెల్విన్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్‌ చేయడంపైనా అధికారులు పూరీని పదేపదే ప్రశ్నించారు. జ్యోతిలక్ష్మి సినిమాకు ఈవెంట్ చేయడంతో అతని ఖాతాలో మేనేజర్లు డబ్బులు వేసి ఉంటారని పూరీ చెప్పారు. మధ్యాహ్నం తర్వాత పూరీని శీలం శ్రీనివాస్‌, అంజిరెడ్డి బృందం విచారించాయి. ఉదయం పూరీ చెప్పిన అంశాలపై ఆధారాలు చూపిస్తూ తిరిగి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఒకే అంశంపై పదేపదే ప్రశ్నలు సంధించడంతో పూరీ ఒకే దాన్ని ఎన్నిరకాలుగా అడిగినా తన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసినట్టు సమాచారం.

అరగంటకోసారి...
ఉదయం నుంచి ప్రతి అరగంటకోసారి విచారణ తీరును అకున్‌సబర్వాల్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ పర్యవేక్షించారు. ఇక సాయంత్రం విచారణ ముగుస్తుందని భావించిన అకున్‌సబర్వాల్‌ నేరుగా తనే రంగంలోకి దిగారు. సిట్‌ అడిగిన 45 ప్రశ్నలకు పూరీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సాయంత్రం 5 గంటల తర్వాత అకున్‌సబర్వాలే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సాయంత్రం ఆరుగంటలు దాటినా విచారణ కొనసాగుతుండడంతో పూరీ భార్య, మేనమామ , బంధువులు ఎక్సైజ్‌ ఆఫీసుకు చేరుకున్నారు. మళ్లీ విచారణ ప్రారంభించడంతో కుటుంబీకులు, అభిమానుల్లో అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళన కనిపించింది. దీనికి బలం చేకూర్చేలా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు రావడం, ఆ వెంటనే ఉస్మానియా ఆస్పత్రి జనరల్‌ సర్జన్‌ రావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. పూర్తిని అరెస్ట్‌ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. అయితే తాము ఇప్పుడు అరెస్ట్‌ చేయడంలేదని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అవసరమైతే 3వ తేదీ తర్వాత పూరీ జగన్నాథ్‌ను మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.

నేడు శ్యాం.కెనాయుడు
పూరీ జగన్నాథ్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో దర్యాప్తు అధికారులు ఆయన రక్త నమూనాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను పిలిపించారు. విచారణ పూర్తైన తర్వాత పూరీ జగన్నాథ్‌ నేరుగా తన ఇంటికి వెళ్లారు. ఇక ఇవాళ సిట్‌ విచారణకు శ్యాం కె.నాయుడు హాజరవుతున్నారు. వాస్తవానికి హీరోయిన్‌ ఛార్మి కావాల్సి ఉంది. మరో తేదీన విచారణకు హాజరవుతానని ఛార్మి విజ్ఞప్తి చేయడంతో శ్యాం కె.నాయుడిని పిలిచారు. మరోవైపు విచారణకు హజరుకావాల్సిందిగా కొరియర్‌ సంస్థలైన బ్లూడార్ట్‌, డీహెచ్‌ఎల్‌, ఫెడెక్స్‌ కంపెనీలకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. 

07:28 - July 20, 2017

బీజేపీ అధికారంలోకి రాకముందు వారు స్వామినాథన్ కమిటీ సిఫరాసుల అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ సుప్రీం కోర్టు ఇచ్చిన అఫిడబిట్ లో స్వామినాథన్ సిఫరాసులు అముల చేయలేమని కేంద్రం తెలిపిందని, వరికి కేంద్రం ప్రకటించిన ధర రూ.1550 కానీ వరి పండించాడానిక ఖర్చు రూ.2000అవుతున్నాయని రైతు సంఘనేత సాగర్ అన్నారు.రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, పాస్ బుక్ లు డీడ్ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వలని అర్డినెన్స్ తీసుకొచ్చామని, మార్కెట్లో కొనుగోళుకు ఈ నామ్ తీసుకొచ్చామని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై చర్చిడానిక కేంద్రానికి సమయం లేదని, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకం సరిగా అమలు కావడం లేదని కాంగ్రెస్ నేత రామచంద్ర రెడ్డి అన్నారు. డ్రగ్స్ కేసు మొత్తం ఇండస్ట్రీకి అంటకట్టందని, ఎవరు తప్పు చేసిన తప్పే అని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. డ్రగ్స్ కేసులోమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో ఉందని ఎర్రోల్ల శ్రీనివిస్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:26 - July 20, 2017

తెలంగాణ రాష్ట్రంలో సెక్యూరిటీ చేసేవారు 4లక్షల మంది ఉన్నారు. అందులో 2లక్షల మంది మాత్రమే లేబర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. సెక్యురిటీ చేసేవారికి యూనిఫామ్ ఇతర ఖర్చులు వారి జీతాల్లో కట్ చేస్తున్నారని, అంతేకాకుండా ములుగే నక్క మీద తాటికాయ పడ్డట్టు సెక్యూరిటీ గార్డ్స్ ను జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చారని సీఐటీయూ నేత వెంకటేశం అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

బాలుడిని నరికి చంపిన దుండగులు

వరంగల్ : జిల్లా కేంద్రంలోని లేబర్ కాలనీ గాంధీనగర్ లో దారుణం జరిగింది. గుర్తితెలియని దుండగులు బాలుడిని నిరికి చంపారు. వారు మృతదేహన్ని గోనె సంచిలో పెట్లి వదిలివెళ్లారు.

 

నేడు భారత్ సేమీఫైనల్ మ్యాచ్

లండన్ : మహిళ ప్రపంచకప్ లో భాగంగా నేడు భారత్ సేమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. మ్యచ్ మధ్యాహ్నాం 3గంటలకు ప్రారంభమౌతుంది.

చంద్రబాబు చిత్తూరు పర్యటన

గుంటూరు : నేడు, రేపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

కర్నూలు జిల్లాలో కామినేని పర్యటన

కర్నూలు : జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పర్యటించనున్నారు. ఆయన ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించనున్నారు. 

ఆయిల్ ఫామ్ సమస్యలపై భేటీ

హైదరాబాద్ : ఆయిల్ ఫామ్ సమస్యలపై నేడు కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి తుమ్మల పాల్గొననున్నారు.

కరీంనగర్ జిల్లా మంత్రుల పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. వారు కరీంనగర్ లో మాతా శిశు పథకం, కమలాపూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. 

కరీంనగర్ జిల్లా మంత్రుల పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. వారు కరీంనగర్ లో మాతా శిశు పథకం, కమలాపూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. 

కరీంనగర్ జిల్లా మంత్రుల పర్యటన

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి పర్యటించనున్నారు. వారు కరీంనగర్ లో మాతా శిశు పథకం, కమలాపూర్ లో ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. 

Don't Miss