Activities calendar

21 July 2017

కొనసాగుతోన్న సుబ్బరాజు సిట్‌ విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు సుబ్బరాజు సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల నుంచి సిట్‌ అధికారులు సుబ్బరాజును విచారిస్తున్నారు. ప్రధానంగా కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. 

22:11 - July 21, 2017
22:10 - July 21, 2017
22:09 - July 21, 2017
22:08 - July 21, 2017
22:07 - July 21, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌ ఓటమి చెందినప్పటికీ 50 ఏళ్ల క్రితం రికార్డును తిరగ రాశారు. ఇప్పటివరకు ఓటమి చెందిన అభ్యర్థులకన్నా మీరా కుమార్‌ ఎక్కువ ఓట్లను సాధించారు. మొత్తం 10 లక్షల 90 వేల 3 వందల ఓట్లకు గాను రాష్ట్రపతిగా ఎంపికైన రామ్‌నాథ్‌ కోవింద్‌కు 7 లక్షల 2 వేల 44 ఓట్లు రాగా... విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు 3 లక్షల 67 వేల 314 ఓట్లు వచ్చాయి. 1976 రాష్ట్రపతి ఎన్నికల్లో జాకిర్‌ హుస్సేన్‌ చేతిలో ఓటమి చెందిన మాజీ చీఫ్‌ జస్టిస్‌ కోకా సుబ్బారావుకు 3 లక్షల 63 వేల ఓట్లను సాధించారు. గత 50 ఏళ్లుగా ఓటమి చెందిన అభ్యర్థికి అత్యధికంగా ఓట్లు పోలైన రికార్డును మీరా కుమార్‌ ఇపుడు అధిగమించారు. సుబ్బారావుకు 43 శాతం ఓట్లు రాగా...ఆయనకన్న 10 శాతం తక్కువ 34 శాతం ఓట్లు మీరా కుమార్‌కు వచ్చాయి.

 

22:04 - July 21, 2017

కొహిమా : నాగాలాండ్‌ కొత్త సీఎం జెలియాంగ్‌ బలనిరూపణ పరీక్షలో నెగ్గారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలనిరూపణ కోసం ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 59 మంది ఎమ్మెల్యేలలో 47 మంది జెలియాంగ్‌కు మద్దతుగా ఓటేశారు. వీరిలో 36 మంది ఎన్‌పీఎఫ్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగా, నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్రులు ఉన్నట్లు నాగాలాండ్‌ స్పీకర్‌ ఇమ్తివాపాంగ్‌ వెల్లడించారు. నాగాలాండ్‌లో గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ సీఎం లీజిత్సు జులై 15న బలపరీక్షకు హాజరుకాకపోవడంతో జెలియాంగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆచార్య కోరారు. సిఎంగా ప్రమాణం చేసిన జెలియాంగ్‌ ఇవాళ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు.

 

22:02 - July 21, 2017

ఢిల్లీ : కశ్మీర్‌ అంశంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్‌ చేశారు. మోది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే కశ్మీర్‌ సమస్య జఠిలంగా మారిందని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి మూడో దేశం జోక్యం చేసుకోవాలని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా, తదితరులు చేసిన సూచన సరికాదన్నారు. భారత్‌ అంటే కశ్మీర్‌...కశ్మీర్‌ అంటే భారత్‌...ఇది మన అంతర్గత వ్యవహారమని, ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడానికి ఒప్పుకోమని రాహుల్‌ స్పష్టం చేశారు.   

 

21:59 - July 21, 2017

హైదరాబాద్ : రాష్ర్టంలోని మున్సిపాలిటీలన్నింటినీ.. పరిశుభ్ర పట్టణాలుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కేటీఆర్.  మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.  పారిశుద్ధ్యం, హరిత హారం, ఏల్ ఈడి లైట్ల ఏర్పాటు లాంటి అంశాలపై పలు సూచనలు చేశారు. ఆగష్టు 15 నాటికి రాష్ర్టంలోని అన్ని  మున్సిపాలిటీలను బహిరంగ మలమూత్ర విసర్జణ రహితంగా ప్రకటిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 
స్వచ్ఛమున్సిపాలిటీలే లక్ష్యం...
స్వచ్ఛమున్సిపాలిటీలే లక్ష్యంగా పనిచేస్తున్నమని తెలంగాణ మంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆగష్టు 15నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను పరిశుభ్ర పట్టణాలుగా ప్రకటిస్తామన్నారు.  బహిరంగ మలమూత్ర విసర్జనలేని పట్టణాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్‌ అన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా.. మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై కమిషనర్‌లకు పలు సూచనలు చేశారు. 
అభివృద్ధిపనులకు నిధుల కొరతలేదు 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ల అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరతలేదన్నారు మంత్రి కేటీఆర్‌. అవసరం అయితే ఏల్ అర్ యస్ నిధులు వాడుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లకు సూచించారు. పట్టణాల్లో  ఎట్టిపరిస్ధిల్లో టాయిలెట్ల నిర్మాణం అగవద్దని, యద్దప్రాతిపథికన  ప్రతి మున్సిపాలిటీ ఒడియప్ స్టేటస్ అందుకోవాలన్నారు. మధిర, భైంసా, భువనగిరి , ఇబ్రహీంపట్నం, సత్తుపల్లి, అచ్చంపేట, హుజురాబాద్, తోపాటు  గజ్వేల్, జగిత్యాల్, హుజూర్ నగర్, షాద్‌నగర్, సూర్యపేట, సిద్దిపేట, సిరిసిల్లా, బోడుప్పల్, నర్సంపేట్ మున్సిపాలీలు ఇప్పటికే ఒడియప్ స్టేసస్ పొందాయన్నారు.  
పారిశుధ్యంపై  ప్రత్యేక దృష్టి 
వర్షకాలంలో పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. శిథిల భవానాలు, నాలలపై కబ్జాల తొలగింపు, నాలల పుడికతీత పనులను వేంటనే పూర్తి చేయాలన్నారు. ఆగష్టు  రెండోవారంలో పట్టణాలకు స్వచ్ఛ ఆటోలను అందజేస్తామన్నారు.  వచ్చే దీపావళి నాటికి అన్ని పట్టణాల్లో ఏల్ ఈడీ లైట్ల వెలుగులే ఉంటాయన్నారు. ప్రభుత్వం మున్సిపాలీటీలకు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు మెక్కలు నాటాలని, హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పట్టణాల్లోని డంప్ యార్దుల్లో సాద్యమైనన్ని ఎక్కువ సువాసనాలు వెదజల్లే మెక్కలు నాటాలన్నారు. 

21:56 - July 21, 2017

కడప : జిల్లాలో దారుణం జరిగింది. ప్రొద్దుటూరు గోకుల్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని హైందవను దుండగులు గొంతుకోసి చంపారు. హైందవ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు స్కూటీతో దుండగులు పరారయ్యారు. అయితే... బంగారం కోసమే హత్య చేశారా ? లేక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు. అయితే... ఇటీవలే హైదరాబాద్‌ నుంచి సొంత ఊరు వచ్చిన హైందవ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

21:53 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు సుబ్బరాజు సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఉదయం 10.30 గంటల నుంచి సిట్‌ అధికారులు సుబ్బరాజును విచారిస్తున్నారు. ప్రధానంగా కెల్విన్‌తో గల సంబంధాలపై సిట్‌ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. విచారణలో సుబ్బరాజు... డ్రగ్స్‌ వాడుతున్న మరికొంతమంది నటుల పేర్లు తెలిపినట్లు తెలుస్తోంది. వీరికి రెండు, మూడు రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక డ్రగ్స్‌ పబ్బుల నుంచి సరఫరా అవుతున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. దీంతో రేపు పబ్బులు, బార్ల యజమానులతో ఎక్సైజ్‌శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే... రేపు తరుణ్‌ విచారించనున్నట్లు అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. అదేవిధంగా ఈనెల 27న ముమైత్‌ఖాన్‌ విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:51 - July 21, 2017

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలన్నారు...! లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు...!! ఇదిగో నోటిఫికేషన్‌ అంటూ ఊరించారు...! కానీ ఏదో కారణం చెబుతూ.. ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తూ వస్తున్నారు..!! ఇదీ తెలంగాణ రాష్ట్రంలో సాగుతోన్న ఉద్యోగాల కల్పన తీరు. సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్లు వేయడం.. దాన్ని కోర్టు కొట్టేయడం.. షరామాములుగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో లోపం ఎక్కడుంది? హడావుడిగా నోటిఫికేషన్లు వేయడమే సమస్యకు కారణమా? సిఎం వేగాన్ని సర్వీస్ కమీషన్ అందుకోలేకపోతోందా? లక్ష ఉద్యోగాలు ఉత్తిమాటలేనా? అసలింతకీ సర్వీస్ కమీషన్ పై ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలేంటి?
తెలంగాణా సర్వీస్ కమీషన్ ఏర్పడి మూడేళ్లు  
తెలంగాణా సర్వీస్ కమిషన్ ఏర్పడి మూడేళ్లు గడిచింది. గడచిన మూడేళ్లలో సుమారుగా 31 నోటిఫికేషన్లు విడుదల చేసారు. కాని పూర్తి స్థాయిలో చేపట్టిన నియామకాలు వందల్లో కూడా లేవు.. నోటిఫికేషన్ల వారీగా చూసుకుంటే అందులో కూడా 20కి పైగా ఏదో ఒక స్పెషలైజేషన్ చేసిన అభ్యర్ధులే అర్హులు. అయితే  కేవలం డిగ్రి పూర్తి చేసిన విద్యార్ధులకు మాత్రం గ్రూప్ 2 ఒక్కటే విడుదల అయ్యింది. ప్రస్తుతం అదికూడా చిక్కుల్లో పడిపోయింది. ఈ మధ్య కాలంలో గురుకుల నోటిఫికేషన్ పేరుతో ఎంతో హడావుడి చేసిన టి సర్కార్ అందులో లేనిపోని కొర్రీలు పెట్టి అభ్యర్ధులన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. 
ఇయర్ క్యాలెండర్ అమలు లేదు...
టిఎస్‌పిఎస్‌సి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఇయర్ క్యాలెండర్ అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి దాంట్లో గందరగోళం క్రియేట్ చేసి పరీక్షలపైన నిరాసక్తత పెంచుతున్నారనే ఆరోపణలు మొదలయ్యాయి.  అంతే కాదు పెట్టిన ప్రతీ పరీక్షలో ఏదో చిక్కుముడులతో పెట్టడంతో అభ్యర్ధులు రోజురోజుకి ప్రభుత్వ ఉద్యోగం అంటేనే చాలా రిస్క్‌తో కూడుకున్నదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత లక్ష ఉద్యోగాలు అన్న ప్రభుత్వం మూడేళ్లు ముగిసినా కూడా వేల సంఖ్యల్లో కూడా నియామకాలు చేపట్టకపోవడంతో వ్యతిరేకత కూడా పెరుగుతోంది. 
పరీక్షల ఫలితాలు వెల్లడించని టీఎస్ పీఎస్ సీ 
ఇక పరీక్షలు నిర్వహించిన వాటి ఫలితాలనూ టీఎస్‌పీఎస్‌సీ వెలువరించలేక పోతోంది. ఎస్‌ఐ ఫలితాలు ఇప్పటికీ విడుదల కాకపోవడంతో లక్షలాదిగా అభ్యర్ధులు పడిగాపులు కాస్తున్నారు. గురుకుల పరీక్షల్లోనూ నిత్యం సమస్యలు వస్తూనే ఉన్నాయి. గురుకులాల పరీక్షలపై ఏకంగా ముఖ్యమంత్రే అక్షింతలు వేయడం గమనార్హం. అంతేకాదు ఒక్క పరీక్ష కోసం దాదాపుగా మూడు సార్లు వివాదం అవడం సర్వీస్ కమీషన్ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే ఇప్పుడు తాజాగా గురుకుల్లాల్లోనూ లింగ వివక్ష చూపే జీవో నెంబర్ 1274 ని కోర్టు కొట్టేయడంతో మరోసారి వివాదాలు మొదలయ్యాయి. దీంతో తాము పై కోర్టులో తేల్చుకుంటామంటూ టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను వాయిదా వేసింది. అయితే తదుపరి పరీక్షల తేదీలను మాత్రం ప్రకటించలేదు.  
ఆందోళనలో అభ్యర్థులు 
మరోవైపు జీవో 1274ని కోర్టు కొట్టేసింది కాబట్టి మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళనలో వున్నారు. కమీషన్ ఇప్పటికే డివిజన్ బెంచ్ కి వెళ్లినందున,  అక్కడా చుక్కెదురైతే మళ్లీ పరీక్ష పెట్టాల్సిందేనని కమీషన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఇప్పటికే పిజిటి లో మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. టిజిటి మెయిన్స్ లో మాత్రం రెండు పరీక్షలు అయ్యాయి.. మిగితావి వాయిదా పడ్డాయి. ఈ దశలో, కమీషన్ కేసు గెలిస్తే సమస్య ఉండదు కాని పక్షంలో రీఎగ్జామ్ తప్పదు. ఇది అభ్యర్థులకు ఇబ్బందికరమే. సర్వీస్ కమీషన్ ఏర్పడినప్పటినుంచి నోటిఫికేషన్లు విడుదల అవ్వడం ఏదోక సమస్య తలెత్తడం కోర్టు కి వెళ్లడం అది కోర్టులో నానడం.. పరిపాటిగా మారింది. దీంతో స్వరాష్ట్రంలో ఉద్యోగం సాధించడం సాధ్యమయ్యే పనికాదన్న భావనకు అభ్యర్థులు వచ్చేస్తున్నారు. 
విడుదల కాని గ్రూప్ 1 నోటిఫికేషన్‌  
ఇదిలావుండగా రాష్ట్ర ఏర్పడిన మూడున్నరేళ్లలో ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్‌ ఇప్పటి వరకు విడుదల చేయలేదు. గ్రూప్ 2 విడుదలయినా గాని చిక్కుల్లో వుంది. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, గ్రూప్ 3, గ్రూప్ 4 పంచాయితీ సెక్రటరీ ఇంతవరకు విడుదల చేయలేదు. దీంతో హెవీ కాంపీటీషన్ కొన్నింటిలోనే ఉంటున్నాయి. సర్వీస్ కమీషన్ సరైన క్లారిటీ ఇవ్వక పోవడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని విద్యార్ధి, యువజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రకారం సక్రమంగా పరీక్షలు నిర్వహించి, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

 

21:43 - July 21, 2017

అంతిమంగా కిక్కు కావాలి. డ్రగ్స్ తో వచ్చే కిక్ కొందరికి.. దాన్ని అమ్మితే వచ్చే సొమ్ము ఇచ్చే కిక్ ఇంకొందరికి .. మందు, సిగరెట్ లాంటి మత్తు పదార్ధాలపై పన్నులు వసూలు చేసి, లైసెన్సులు అమ్మే కిక్ ఇంకొకరిది. ఓ వరాల్గా వ్యక్తుల బలహీనత, పాలనా వ్యవస్థల బలహీనత.. రెండూ కనిపిస్తున్నాయి. మరి ఏది ప్రమాదకరం? ఏది మారాలి? ఎంత మారాలి? ఇదే  ఈ రోజు వైడాంగిల్ స్టోరీ.. చట్టప్రకారం మాట్లాడాల్సినవి కొన్ని విచక్షణతో పరిశీలనతో మాట్లాడాల్సినవి మరొకొన్ని. డ్రగ్స్ కు సంబంధించి... అది వాడిన వారికి, అమ్మినవారికి, చట్టం ఏం చెప్తుందో.. దానికి తగినట్టు చర్యలు ఉండాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, ఇలాంటి వ్యక్తుల మత్తు పదార్ధాల బలహీనతలతో పెద్ద ఎత్తున జరుగుతున్న వేల కోట్ల వ్యాపారం సంగతేంటి? మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:38 - July 21, 2017

సిట్టుతోని పోటివడి మీడియా విచారణ...డ్రగ్స్ కేసుల థర్డ్ డిగ్రీ జేస్తున్న టీవీలు, మద్యం లేకపోతే జనానికి పిచ్చిలేస్తది...బుద్దిలేని ముచ్చట జెప్పిన చంద్రబాబు, రాజుకున్న బీబీనగర్ నీమ్సు పంచాది..పాదయాత్రతోటి పదునువెట్టిన కాంగ్రెస్, మంత్రి కొంగుజాపిన ఆశా అక్కలు..ముఖ్యమంత్రి హామీలుఏమైనయని సురుకులు, ఓయూల కండ్లెర్ర జేస్తున్న కాంట్రాక్టు టీచర్లు...ఉద్యోగ భద్రత ఉండాల్న, వద్దా అన్న ప్రశ్నలు, కల్లుదాగిన జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..విదేశాలకు ఎక్స్ పోర్టు చేస్తా అని హామీ... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:09 - July 21, 2017

ఉద్యోగాల కల్పనలో టీసర్కార్ విఫలమైందని వక్తలు విమర్శించారు. టీఎస్ పీఎస్సీ..నోటిఫికేషన్లు... టీసర్కార్ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్, డివైఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు విప్లవ్ కుమార్, హైకోర్టు న్యాయవాది రమేష్, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. కేసీఆర్..ఎన్నికల ముందు  ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:58 - July 21, 2017

లవ్ లీ సినిమాతో సక్సెస్ అందుకున్న జయ.. చాలా రోజుల తరువాత వైశాఖం అనే లవ్ లీ టైటిల్ తో సినిమా తీసి ఆడియన్స్ ముందుకు తీసుక వచ్చారు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్ అందరి దగ్గర నుండి విషెస్ అందుకున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బిఏ రాజు నిర్మించారు.. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.. 
కథ...
కథ విషయానికి వస్తే.. ఒక అపార్ట్ మెంట్ లో ఉంటూ. ఆ అపార్ట్ మెంట్ లో వాళ్ళందరిని ఏడిపిస్తూ ఎంజాయి చేస్తూ ఉంటాడు వేణు అయితే ఒక రోజు భానుమతి అనే అమ్మాయి వేణు లవ్వర్ని అని చెప్పి.. ఆ అపార్ట్ మెంట్ లో మరో ప్లాన్ ను తీసుకుని బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తుంది.. వేణు అందరిని ఆటపట్టించినట్టు ఆ అమ్మయిని కూడా ఆటపంటించడంతో ఆ అమ్మాయి వేణు లవ్వర్ అని అబద్దు చెప్పిన సంగతి తెలుస్తుంది. కాని ఆ అమ్మాయి వేణుని విపరీతంగా ద్వేశిస్తుంది... పైగా వేణు అమ్మను తనతో ఉంచుకుని సకల సేవలు చేస్తుంది...  ఇంతకీ ఆమె ఎవరూ..? వేణు జీవితంలోకి ఎందుకు వచ్చింది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి..
విశ్లేషణ...   
నటీ నటుల విషయానికి వస్తే... లీడ్ యాక్టర్ హరీష్, అవంతికా మిశ్రాల యాక్టింగ్ బాగుంది... హరీష్ కసితో నటిస్తే... అవంతికా బాగా నటిస్తూనే అడ్డు చెప్పకుండా అందాలు ఆరబోసింది..ఇక సాయికుమార్, రమాప్రభ,ఈశ్వరావుల పాత్రలు లిమిటెడ్ గా ఉన్నా.. సినిమాకు మాత్రం ఈ పాత్రలు కీలకంగా ఉంటాయి.. కమెడియన్ పృధ్వీ ఐపిఎల్ పై బెట్టింగ్ కాసే పాత్రలో పర్వాలేదు అనిపించాడు.. 
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. లేడీ డైరక్టర్ అయిన జయ.. ఆర్టినరీ లవ్ స్టోరీకి అపార్ట్ మెంట్ కల్చర్ ని యాడ్ చేసి.. హ్యూమన్ రిలేషన్స్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది... అయితే కథ చాలా చిన్న పాయింట్ కావడంతో , స్క్రీన్ ప్ఏ కూడా అంత ఆసక్తి కరంగా లేకపోవడంతో పర్వాలేదు అనిపించింది... కాని ఆమె అనుకున్న ఎమోషన్స్ ని మాత్రం బాగా డీల్ చేసింది... ఇక కెమెరా మెన్  డీసెంట్ వర్క్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరక్టర్ డిజే వసంత్  పాటలు పర్వాలేదు అనిపించినా.. ఆర్ఆర్ లో మాత్రం లౌండ్ నెస్ తో విసిగించాడు... ఇక ప్రోడక్ష్న్ వ్యాల్యూస్ బాగున్నాయి.. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేసి కంట్రీ చిలకా సాంగ్  లొకేషన్స్ చాలా బాగున్నాయి... ఓవర్ ాల్ గా చూస్తే వైశాఖం పేరులో  పోజిటీవిటీని సినిమాలో పూర్తిగా రిఫ్లెక్ట్ చేయలేకపోయినా.. ఓవర్ ఆల్ గా ఓకే అనిపిస్తుంది.. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి..

ప్లస్ పాయింట్స్
నటీనటులు
పాటలు
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
కామెడీ
క్లైమాక్స్.. 

రేటింగ్..2/5

20:56 - July 21, 2017

సున్నితమైన కథాంశాలతో లైటర్ కామెడీ మూమెంట్స్ తో సూపర్ సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్ముల కొంత కాలంగా సక్సెస్ లేక రేసులో వెనుకపడ్డాడు.. అయితే ప్రస్తుతం, దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ తేజ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫిదా.. మొదటి నుండి మంచి పాజిటీవ్ టాక్ తో ఉంది.. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ....
కథ విషయానికి వస్తే అమెరికాలోఉండే వరుణ్.. అన్నయ్యకు బాన్సువాడలో ఉండే భానుమతి అకక్క నచ్చుతుంది. ఆ పెళ్ళి కోసం అమెరికా నుండి బాన్సువాడ వచ్చిన వరుణ్, స్ట్రెయిట్ ఫార్వాడ్ గా ఉండే బానుమతితొ లవ్ లో పడతాడు బానుమతి కూడా వరుణ్ ని లవ్ చేస్తుంది.. తీరా ఆమె ప్రపోజ్ చేద్దాం అనుకునే సమయంలో కొన్ని అనుకోని సంఘటణలు జరిగి, వరుణ్ వేరే వారిని లవ్ చేస్తున్నారని ఫీల్ అయ్యి అతడిని దూరం పెడుతుంది. భానుమతి వరుణ్ ని ఎవైడ్ చేయడంతో అతను కూడా తన ప్రేమను తనకు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోతాడు.. అలా దూరం అయిపోయిన ఈ జంట ప్రేమ కథ ఏమైంది.. వారి ఇద్దరి మధ్య అపార్ధాలు తొలగిపోయాయా.. చివరికి వారిద్దరూ కలిశారా లేదా.. అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి...
విశ్లేషణ..
నటీ నటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన చలాకీతనంతో నాచురల్ పర్ఫామెన్స్ తో నడిపించేసింది సాయి పల్లవి.. ఎక్కువగా నవ్వించింది...  అకక్కడక్కడ ఏడిపించింది కూడా.. ఆమె వరిజనల్ వాయిస్ వలన క్యారక్టర్ కి బాగా డెప్త్ వచ్చింది.. ఇక వరుణ్ తేజ్ మిగతా సినిమాలతో పోలిస్తే.. చాలా హ్యండ్స్ం గా ఉన్నాడు.. పర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ కూడా బాగా ఇంప్రూ అయ్యింది.. సత్యం రాజేష్ కొన్ని నవ్వులు పంచగా.. మిగతా నటీ నటులు అంతా సహజత్వంతో కూడిన నటనతో అలరించారు..
 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. అనామికా తరువాత బాగా గ్యాప్ ఇచ్చిన శేఖర్ కమ్ములా ఈ సినిమాను ఎంతో ఎఫర్ట్ పెట్టి తీశాడు.. కామెడీలో రోమాన్స్ లో సెంటి మెంట్ లో డోసేజ్ పెంచాడు.. కాని ఎక్కడా తన ఫ్లెవర్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు.. భానుమతీ పాత్రను మలిచిన విధానం అద్భుతంగా ఉంది... ఇక విజయ్ సి కూమార్ సినిమాటో గ్రాఫీ శక్తీ మ్యూజిక్.. సినిమాకు ఎసెట్ గా నిలిచాయి... సినిమాటోగ్రాఫీ సూపర్ అనిపిస్తే.. శక్తీ ఆర్ ఆర్ సినిమా స్థాయిని పెంచింది.. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వాటికి తిరుగులేదు.. ఓవర్ ఆల్ గా ఫిదా సినిమా గురించి చెప్పాలి అనుకుంటే .. ఆహాల్లాదకరమైన కామెడీతో. ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు.. సెకండ్ ఆఫ్ బాలెన్స్ లేకపోవడం వలన కొంచెం లాగ్ అయినట్లు అనిపించింది.. క్లైమాక్స్ రొటీన్ గా ముగించినట్టు అనిపించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్ళు రాబట్టే స్కోప్ ఉంది....
ప్లస్ పాయింట్స్
కథనం
హీరోయిన్ పాత్ర
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
కామెడీ
సంగీతం
సినిమాటోగ్రాఫీ
మైనస్ పాంయింట్స్
కథ
రొటీన్ క్లైమాక్స్
సెకండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు

రేటింగ్ ..2.75/5

20:48 - July 21, 2017

యాద్రాద్రి భువనగిరి : జిల్లాలోని బీబీనగర్‌ మండలంలో ఏర్పాటు చేసిన నిమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్‌ నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్ తో ఆయన మహాపాదయాత్ర చేపట్టారు. బీబీనగర్‌ మండలం రంగాపురం లోని నిమ్స్‌ ఆస్పత్రి నుంచి యాదాద్రి క్షేత్రం వరకు  మహాపాదయాత్ర చేపట్టారు. ఈపాదయాత్రకు భువనగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. అనిల్‌ కుమార్‌రెడ్డితో ఫేస్‌ టూ ఫేస్‌ టెన్ టివి నిర్వహించింది. నిమ్స్‌ ను అభివృద్ధి చేయాలన్నదే తన ప్రధాన డిమాండ్ అని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్రగ్స్ కేసులో మరో సినీ ఫ్యామిలీ

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మరో సినీ ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. 3 లేదా 4 రోజుల్లో నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దశాబ్ధాలుగా టాలీవుడ్ తో ఆ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఆ కుటుంబంలో ఇద్దరికి డ్రగ్స్ తో సంబంధమున్నట్లు సమాచారం. 

19:51 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సుబ్బరాజు సిట్ విచారణ కొనసాగుతోంది. కొన్ని పబ్స్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సిట్ గుర్తించారు. సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని అకున్ సబర్వాల్ తెలిపారు.  కీలక వివరాలు చెప్పారని అకున్ సబర్వాల్ అన్నారు. 16 పబ్ లపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. రేపు పబ్స్, బార్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నట్లు అకున్ సబర్వాల్ తెలిపారు. రేపు తరుణ్ ను విచారిస్తామని చెప్పారు. రేపు ఉదయం 10.30 గంటలకు తరుణ్ ను విచారిస్తామని చెప్పారు. ఈనెల 27న ముమైత్ ఖాన్ ను విచారిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

19:33 - July 21, 2017

గుంటూరు : ఏపీలో బెల్ట్‌షాపుల బెండు తీస్తామని ప్రభుత్వం హూంకరిస్తోంది. ఇన్నాళ్లూ.. వీటిపై మహిళలు ఉద్యమించినా పట్టించుకోని ప్రభుత్వం.. ఉన్నపళంగా బెల్ట్‌షాపులపై ఎందుకు కన్నెర్ర చేస్తోంది..? సీఎం ఆకస్మిక నిర్ణయం వెనుక కారణమేంటి..? రాజకీయ సమీకరణాలే ప్రభుత్వ నిర్ణయానికి కారణమా..? వాచ్‌ దిస్‌ స్టోరీ
బెల్ట్‌ షాపుల తొలగింపు... చర్చనీయాంశం 
ఏపీలో బెల్ట్‌ షాపుల తొలగింపు అంశం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణం దాగుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను తొలగించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజానికి 2014 ఎన్నికలకు ముందే బెల్టు షాపులను తొలగిస్తామని టీడిపి ప్రజలకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టాక మూడేళ్లకు ఇప్పుడు బెల్టు షాపులను రద్దు చేస్తామనడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 
బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని జగన్‌ హామీ
జులై 8,9 తేదీల్లో ఏపీ రాజధాని గుంటూరులో వైసీపి నిర్వహించిన ప్లీనరీ విజయవంతం కావడం, మహిళా లోకానికి వైసీపీ అధినేత వరాల జల్లు కురిపించడం టీడీపిని కుదిపేసినట్లయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైసీపి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి ప్రజలకు ప్రయోజనకరంగా మారుస్తానని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మద్యం దుకాణాల సంఖ్య తగ్గించి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని హామీల వర్షం కురిపించారు. వీటి కారణంగా, మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న భావన కలిగిన చంద్రబాబు.. హడావుడిగా బెల్ట్‌షాపుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 
మద్యం మహమ్మారిని తొలగించాలని మహిళల ఆందోళన
రాష్ట్రంలో... కొన్ని రోజులుగా మద్యం మహమ్మారిని తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంలో వైసీపి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ టిడీపికి చురకలంటించారు. దీంతో, మూడేళ్లపాటు బెల్టు దుకాణాలపై మౌనం వహించిన చంద్రబాబు జులై 18వ తేదీన జరిగిన కేబినేట్‌ సమావేశంలో బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారు. చంద్రబాబు హడావుడి నిర్ణయంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మూడేళ్లుగా నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడే మేల్కోవడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ఈ నిర్ణయమైనా మొక్కుబడిగాకాకుండా, కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు
రాష్ట్రంలో 4వేల 380 మద్యం దుకాణాలు ఉండగా, బెల్టు షాపులు 40వేలకు పైగా ఉన్నాయి. చంద్రబాబు బెల్టు షాపుల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడంతోనే  అధికారులు రంగంలోకి దిగారు. జులై 19న ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదుచేశారు.  మరోవైపు బెల్టు షాపులపైనా దాడులు కొనసాగించాలన్న ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలో 133 బెల్టు షాపులపై కేసు నమోదు చేసి 138 మందిని అరెస్టు చేసింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం సబబే అయినప్పటికీ, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే నడుచుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను కాగితాలకే పరిమితం చేయకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

19:14 - July 21, 2017

పశ్చిమగోదావరి : జిల్లా నర్సాపురంలో సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. మెగా అక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని.. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ ర్యాలీ చేపట్టిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

అమరావతిలో మంత్రి లోకేష్‌ చాంబర్‌ వద్ద మహిళ వింత ప్రవర్తన

గుంటూరు : అమరావతిలోని మంత్రి లోకేష్‌ చాంబర్‌ వద్ద ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. మంత్రిని కలిసేందుకు పిల్లలతో వచ్చినా.. అవకాశమివ్వడం లేదని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తూ.... పిల్లలను చూసైనా కనికరం లేదా.. ఆవేదన వ్యక్తం చేసింది. 

19:05 - July 21, 2017

గుంటూరు : అమరావతిలోని మంత్రి లోకేష్‌ చాంబర్‌ వద్ద ఓ మహిళ వింతగా ప్రవర్తించింది. మంత్రిని కలిసేందుకు పిల్లలతో వచ్చినా.. అవకాశమివ్వడం లేదని మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూనకం వచ్చినట్లు ప్రవర్తిస్తూ.... పిల్లలను చూసైనా కనికరం లేదా.. ఆవేదన వ్యక్తం చేసింది. 

మరికాసేపట్లో బయటకు రానున్న సుబ్బరాజు

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు విచారించారు. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీశారు. అయితే సుబ్బరాజు విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు దాటవేసినట్లు సమాచారం. రేపు తరుణ్‌ను సిట్‌ విచారించనుంది. బార్‌, పబ్‌ ఓనర్లనూ అధికారులు విచారించనున్నారు. మరికాసేపట్లో సుబ్బరాజు బయటకు రానున్నారు. 

18:57 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు విచారించారు. కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీశారు. అయితే సుబ్బరాజు విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు దాటవేసినట్లు సమాచారం. రేపు తరుణ్‌ను సిట్‌ విచారించనుంది. బార్‌, పబ్‌ ఓనర్లనూ అధికారులు విచారించనున్నారు. మరికాసేపట్లో సుబ్బరాజు బయటకు రానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:46 - July 21, 2017

అనంతపురం : జిల్లాలోని పెనుకొండలో రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతులు, కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై భైటాయించి ఆందోళన చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సురెన్స్ అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. 

18:41 - July 21, 2017

గుంటూరు : ఏపీని ఐటీహబ్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఐటీశాఖా మంత్రి నారాలోకేశ్‌ అన్నారు. గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఫైకేర్‌ ఐటీ సంస్థను మంత్రి ప్రారంభించారు.  22 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఐటీపార్క్‌లో ఇప్పటివరకు 220 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 2019లోపు మంగళగిరి ఐటీపార్క్‌లో 10వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌ను ఐటీలో టాప్‌గా నిలిపిన సీఎం చంద్రబాబు ఇపుడు అమరావతిని కూడా ఐటీలో మేటిగా నిలుపుతారని మంత్రిలోకేశ్‌ అన్నారు. 

 

 

18:22 - July 21, 2017

జనగామ : బోనాల పండుగ సందర్భంగా జనగామలో కలెక్టర్‌ శ్రీదేవసేన మొదటి బోనాన్ని ఎత్తుకున్నారు. మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి కలెక్టర్‌ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో తులసి మొక్క నాటారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. 

 

18:19 - July 21, 2017

హైదరాబాద్ : పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా ముగిసింది.. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని... ప్రభుత్వ బడులను మూసివేసే ఆలోచన విరమించుకోవాలని... కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యను అందించాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.. అలాగే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కల్పించాలని... పెండింగ్‌లోఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురియింబర్స్‌మెంట్‌ నిధుల్ని వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.. నారాయణగూడలో ర్యాలీ చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. 

 

18:15 - July 21, 2017

హైదరాబాద్‌ : జువైనల్‌ హోం నుంచి పూర్ణిమసాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. బాలికను తీసుకెళ్లడానికి జువైనల్‌ హోంకు పూర్ణిమ తల్లిదండ్రులు, బంధువులు వచ్చారు. తమ బిడ్డ ఇంటికి వస్తోందని స్వీట్లు పంచి పూర్ణిమ తల్లిదండ్రులు ఆనందం పంచుకున్నారు. మరిన్ని వివారాలను వీడియోలో చూద్దాం...

కూకట్ పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన

హైదరాబాద్: కూకట్ పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఓలా కార్యాలయం ఎదుట క్యాబ్ డ్రైవర్లు బేఠాయించి ఆందోళన చేపట్టారు. డ్రైవర్లను బౌన్సర్లు అడ్డుకోవడంతో నలుగురు డ్రైవర్లకు గాయాలు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

17:15 - July 21, 2017
17:12 - July 21, 2017

మహబూబ్ నగర్ : ప్రాజెక్ట్‌ జలకలతో నిండుకుండలా మారింది. కానీ రైతులకు మాత్రం కడుపు నిండడం లేదు.. జీవనాధారమైన ప్రాజెక్ట్‌ నుంచి ఈ ఏడాది చుక్కనీరు బయటకు రావడం లేదు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆయకట్టు రైతుల పొలాల్లోకి నీరు పారడం లేదు. దీంతో అన్నదాతలంతా లబోదిబోమంటున్నారు.. పాలమూరు కర్షకుల కడగళ్లపై ప్రత్యేక కథనం. 
రైతుల వరప్రదాయిని జూరాల ప్రాజెక్ట్‌ 
ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు జూరాల ప్రాజెక్ట్‌ వరప్రదాయిని. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలుగు  నేలను ముద్దాడుతూ మొదటగా చేరేది ఈ ప్రాజెక్టుకే. కొన్ని వేల రైతు కుటుంబాలు ఈ జలాశయాన్నే నమ్ముకునే సాగు చేస్తున్నాయి. దశాబ్దానికి పైగా ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తొలగిస్తోంది. ఇదంతా గతం. చెంతనే కృష్ణమ్మ పారుతున్నా పంటపొలాలకు నీరందక బీడుభూములుగా మారుతున్నాయి. ప్రభుత్వ పెద్దల స్వార్థం అన్నదాతలను ఆవేదనకు గురిచేస్తోంది. 
నీటిని విడుదల చేయని ప్రభుత్వం
జూరాల ప్రాజెక్ట్‌ కింద కొన్నేళ్లుగా  కుడి, ఎడమ కాల్వల కింద లక్ష ఏడువేల ఎకరాలలో రైతులు సాగుచేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు కళకళలాడాల్సిన సమయంలో.. చుక్క నీరులేక  వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది కుడి ఎడమ కాల్వలకు ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు..దీనికి ప్రధాన కారణం ఇసుక రవాణా కోసం నీటిని నిలుపుదల చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన  రైతులు ఆందోళనబాట పట్టారు. రాస్తారోకోలు చేస్తూ జూరాల డ్యాంపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతన్నలకు బాసటగా విపక్షాలు భాసటగా నిలుస్తున్నాయి. 
పంటలను కాపాడాలి : రైతులు 
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయ కట్టు రైతులు కోరుతున్నారు. ఇసుక రవాణా నిలిపివేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం నాటికి నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తామే గేట్లు ఎత్తివేస్తామని డీకే అరుణ ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఉత్కంఠ రేపుతోంది. 

 

కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సుబ్బరాజు విచారణ కొనసాగుతోంది. విచారణకు సుబ్బరాజు సహకరిస్తున్నారు అని, పలు కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మీడియాకు తెలిపారు.

రైళ్లలో ఆహార పదార్ధాల్లో నాణ్యత ఉండడం లేదు: కాగ్

ఢిల్లీ: రైళ్లలో ఆహార పదార్ధాల్లో నాణ్యత ఉండడం లేదని, రైల్వేలో స్వచ్ఛత, పరిశుభ్రత కనిపించడం లేదు అని కాగ్ పేర్కొంది.డస్ట్ బిన్ లు మచ్చుకైనా లేవని, రైళ్లలో అపరిశుభ్రమైన నీళ్లతో ఆహారం వండుతున్నారని కాగ్ పేర్కొంది.

17:00 - July 21, 2017

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎంబీ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. గతంలోనూ విచారణల పేరుతో.. హడావుడి చేసి నిందితులపై చర్యలు తీసుకోకుండా నీరుగార్చారన్నారు. మరోవైపు నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని... నోటిఫికేషన్లను కోర్టులు కొట్టివేసేలా కుట్ర పన్నుతున్నారని తమ్మినేని ఆరోపించారు. 

 

16:58 - July 21, 2017

హైదరాబాద్‌ : నగరంలో ఏడాది క్రితం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన డాటా వింగ్‌ హార్డ్‌వేర్‌ కంపెనీ మూతపడింది. యాజమాన్యం రాత్రికి రాత్రే కంపెనీని మూసేసి ఉడాయించింది. దీంతో 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ తీరుపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కార్మికశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

16:56 - July 21, 2017

అయ్యే...ఏమయ్యిందో...రేపు ఏం జరుగుతుందో..టెన్షన్ లో పెట్టేశారు..అవసరమా గింత టెన్షన్..చెప్పేస్తే అయిపోతుండే..కదా..అని కొందరు అనుకుంటుంటారు. ఏ రాజకీయాలో..ఏ పార్టీ..ఏ వ్యక్తుల గురించో ఇక్కడ చెప్పడం లేదు. ‘సీరియళ్లు'..అవును సీరియళ్లు నగర ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపెడుతున్నాయి. కుటుంబ సంబంధాలు సన్నగిల్లే పరిస్థితులు నెలకొంటున్నాయి. టైం అయ్యిందంటే చాలు ప్రపంచాన్నే మరిచిపోయి టీవీల ఎదుట వాలిపోతారు. సీరియళ్ల నడుమ కొందరి ఇంట్లో చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి.

యువతితో పదేళ్ల బాలుడు ప్రేమాయణం..
సీరియళ్లు అర్థవంతమైనదిగా ఉండాలి..స్పూర్తి నింపే విధంగా ఉండాలి..చైతన్యపరిచే విధంగా చూడాలి..కానీ తాజాగా ఓ సీరియల్ రచ్చ చేస్తోంది...బాల్య వివాహాలు వద్దు అని చట్టాలు ఘోషిస్తున్నాయి. కానీ ఓ పదేళ్ల కుర్రాడు...అమ్మాయిని ప్రేమించడం..లాంటి కథతో సీరియల్ రూపొందడంపై వివాదాస్పదమౌతోంది. కొత్త రకం కాన్సెప్ట్ తో జనం ముందుకొస్తోంది. పదేళ్ల కుర్రాడు..18 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తాడంట..అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుంటారంట...ఈ సీరియల్ పేరు ‘పియా పెహెరెదార్ కీ’..సుయ్యాష్ రాయ్ దర్శకత్వంలో ఈ సీరియల్ రూపొందుతోంది. దియా అనే యువరాణి, రతన్ సింగ్ అనే యువరాజుతో ప్రేమలో పడుతుంది. ఇక్కడ ఆ యువరాజు వయసు కేవలం పదేళ్లు మాత్రమే కావడం గమనార్హం. సీరియల్ ప్రోమో ఏకంగా అమ్మాయి..బాలుడు పట్టుకోవడం..తదితర దృశ్యాలున్నాయి. వీటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది.


సీరియల్స్ ప్రభావం ఎంతుందో ఇటీవలే పలు చోటు చేసుకున్న ఘటనలు చూస్తే తెలుస్తుంది. సీరియల్స్ చూసి దొంగలుగా మారడం..క్రిమినల్స్ గా మారడం చూస్తూనే ఉంటున్నాం. సీరియల్స్ వచ్చిన పాత్రలను అనుకరిస్తూ పలువురు మృత్యువాత పడిన ఘటనలు కూడా ఉన్నాయి...తాజాగా 'పియా పెహెరెదార్ కీ’ పై ఎలాంటి విమర్శలు చెలరేగుతాయో చూడాలి.

16:55 - July 21, 2017

చిత్తూరు : కాంగ్రెస్‌నాయకులు రాష్ర్ట్రాన్ని దోచుకుతిన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేదవాడికి ఇళ్లు కట్టివాల్సిన కాంగ్రెస్‌పాలకులు 4వేల కోట్లోరూపాయలు మింగేశారని బాబు విమర్శించారు. తమ ప్రభుత్వంలో అవినీతికి తావేలేకుండా కృషి చేస్తున్నామన్నారు. దీనికోసం 11 00 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 11 00 కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేస్తే..అవినీతి పరుగుల భరతం పడతామన్నారు. రాష్ట్రంలో అవినీతిని సహించేది పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు నిశేదించామని.. ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తుంటే వెంటనే ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధిలో నడిపిస్తామని చెప్పారు. 

 

16:51 - July 21, 2017

హైదరాబాద్ : పూర్ణిమసాయి నగరంలోని తన తల్లిదండ్రుల చెంతకు చేరింది. జువైనల్ హోమ్ లో పూర్ణిమసాయికి సీడబ్ల్యుసీ కౌన్సిలింగ్ ఇచ్చారు. హోమ్ నుంచి తన తల్లిదండ్రులతో కలిసి పూర్ణిమసాయి బయల్దేరింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:45 - July 21, 2017

హైదరాబాద్ : ఈ నెల 31న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీకానున్నారు. ఈ నెల 29న రాష్ట్రానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణుల బృందం వస్తోంది. ఈ బృందం ఉద్దానం ప్రాంతంలో పర్యటించించి కిడ్నీ బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనుంది. వీరితో పవన్‌  ఈనెల 30న వైజాగ్‌లో భేటీ కానున్నారు. ఆ తర్వాత 31న విజయవాడకు వచ్చి చంద్రబాబును కలవనున్నారు. ఉద్దానం సమస్య పైనే ప్రధానంగా వీరి మధ్య చర్చ జరగనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:42 - July 21, 2017

ఢిల్లీ : రైళ్లలో అందిస్తున్న ఆహారంపై కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రైళ్లలో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారం మనుషులు తినడానికి పనికిరాదని కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ తన రిపోర్టులో పేర్కొంది. పాడైపోయిన ఆహారం, రీ-సైక్లిడ్‌ ఫుడ్‌, ప్యాక్లెట్లలో ఉంచిన ఆహారం, గుర్తింపు లేని కంపెనీల వాటర్‌ బాటిల్స్‌  ప్రయాణీకులకు రైల్వే అందిస్తోందని కాగ్‌ తెలిపింది. ట్యాప్‌ల నుంచి నీటిని పట్టి అమ్ముతున్నట్లు గుర్తించింది. కాగ్‌, రైల్వే అధికారులు సంయుక్తంగా 74 స్టేషన్లు, 80 రైళ్లలో తనిఖీలు నిర్వహించిన అనంతరం నివేదికను తయారుచేసింది. ఆహారం తయారుచేసే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం లేదని...ఆహార పదార్థాలపై ఈగలు, పురుగులు, దుమ్ము పడుతోందని వెల్లడించింది. ప్రయాణికులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని కాగ్‌ స్పష్టం చేసింది. ఈ రిపోర్టును కాగ్‌ పార్లమెంట్‌లో సమర్పించనుంది.

 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 124 పాయిట్లు లాభపడిన సన్సెక్స్ 32,029 వద్ద ముగిసింది. 42 పాయింట్లు లాభపడి 9,915 వద్ద నిఫ్టీ ముగిసింది.

16:36 - July 21, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని టెక్కలి ఎస్‌ఐ రాజేశ్‌ సాహసంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసలొస్తున్నాయి. బావిలోపడిన ఇద్దరిని అత్యంత సాహసంగా ఎస్‌ఐ బయటకు తీశారు. టెక్కలిలోకి గొల్లవీధికి చెందిన అరుణ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు ఓ యువకుడు బావిలో దూకాడు. బయటకు రాలేక ఇద్దరూ బావిలో ప్రాణాలతో పోరాడారు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేశ్ వెంటనే అక్కడికి చేరుకుని తాళ్ల సహాయంతో బావిలోకి దిగాడు. ముందు బాధితురాలికి తాళ్లు కట్టి పైన ఉన్న పోలీసులను లాగమని చెప్పాడు. ఆమెను పైకి పంపాక యువకుడినీ క్షేమంగా బయటకు పంపాడు. ఇద్దరూ సురక్షితంగా బయటకు వెళ్లాక ఎస్‌ఐ బావి నుంచి బయటకు వచ్చాడు. బావిలో పడిన ఇద్దరినీ రక్షించిన ఎస్‌ఐని స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.

 

16:29 - July 21, 2017

చిత్తూరు : తప్పుచేస్తే శిక్ష అనుభవించకతప్పదని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణా దారులు, బెల్టు షాపు యజమానుల తాటతీస్తామని చెప్పారు. ఎలాంటి రెకమండేషన్ లు పని చేయవని...తప్పుచేస్తే శిక్ష అనుభవించకతప్పుదన్నారు. టీడీపీ నీతివంతమైన పార్టీ అని తెలిపారు. అవతలి పార్టీ అవినీతి కంపుతో కుళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. తాను చేసే ఉద్యమ పవిత్రమైన ఉద్యమమని...ప్రజల కోసం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోకి ఎన్ టిఆర్ సుజల స్రవంతిని తీసుకొస్తామని పేర్కొన్నారు. రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఆధునీకరణ రీతిలో అన్ని ఆఫీసులు నిర్మిస్తామని తెలిపారు. రోడ్డు వెడల్పు చేసి జాతీయ రహదారిగా మార్చుతామని చెప్పారు. స్పోర్ట్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి నదీ జలాలను పట్టిసీమ ద్వారా తీసుకొచ్చామని తెలిపారు. నదులను అనుసంధానం చేశామని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

లాలూ కుటుంబానికి మరో షాక్

పాట్నా: బీహార్ సీఎం లాలూ కుటుంబానికి మరో షాక్ ఎదురయ్యింది. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ పెట్రోల్ బంక్ లైసెన్సును భారత్ పెట్రోలియం రద్దు చేసింది.

బలపరీక్షలో నెగ్గిన నాగాలాండ్ సీఎం

కోహిమా : నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ బల పరీక్షలో నెగ్గారు. 59 మంది ఎమ్మెల్యేలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జెలియాంగ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు, నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డీఏఎన్) చైర్మన్ టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే.

బలపరీక్షలో నెగ్గిన నాగాలాండ్ సీఎం

కోహిమా : నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ బల పరీక్షలో నెగ్గారు. 59 మంది ఎమ్మెల్యేలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జెలియాంగ్‌కు 47 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నాయకుడు, నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమి (డీఏఎన్) చైర్మన్ టీఆర్ జెలియాంగ్ నాగాలాండ్ 19వ ముఖ్యమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం విదితమే.

వనస్థలీపురంలో నకిలీ డాక్టర్ బ్రహ్మయ్య అరెస్ట్

హైదరాబాద్: వనస్థలీపురంలో నకిలీ డాక్టర్ బ్రహ్మయ్య అరెస్టు అయ్యాడు. బ్రహ్మయ్య సిద్ధార్ధ పాలీక్లినిక్ పేరుతో మోసం చేస్తున్నాడు. హాస్పటల్ తో పాటు మెడికల్ షాపును పోలీసులు సీజ్ చేశారు. 

16:08 - July 21, 2017

31న చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

అమరావతి: ఈనెల 31న సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. 29న హార్వర్ట్ విశ్వవిద్యాలయ నిపుణుల బృందం ఉద్దానం ప్రాంతంలో పర్యటించనుంది. ఈ నెల 30న విశాఖలో హార్వర్డ్ యూనివర్శిటీ బృందంతో పవన్ భేటీ కానుంది. 31న విజయవాడ వచ్చి పవన్ చంద్రబాబును కలిసి ఉద్దానం కిడ్నీ బాధితులపై సీఎం తో చర్చించనున్నారు.

జనవరి టు డిసెంబర్ కు మారనున్న ఆర్థిక సంవత్సరం...

ఢిల్లీ: ఆర్థిక సంవత్సరాన్ని జనవరి నుండి డిసెంబర్ కు మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని హోం మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ కు లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు.

15:50 - July 21, 2017

నిజామాబాద్ : స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న దళితులపై దాడులు,  గ్రామ బహిష్కరణ, సంఘ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు భారత రాష్ట్రపతిగా దళిత అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. మరోవైపు దళితులను వెలివేస్తున్నారు. గ్రామ బహిష్కరణలు, వివక్ష కొనసాగుతోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో అమానుషం జరిగింది. దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. తమకు కేటాయించిన భూమిని దళితులు చదును చేసుకుంటుంటే వీడిసీ అడ్డుకున్నారు. భూమి గ్రామానికి చెందిందంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. 150 మంది దళితులను గ్రామం నుంచి వీడీసీ బహిష్కరించారు. కిరాణా సరుకులు ఇవ్వకూడదని, ఆటోలలో ఎక్కించకూడదని వారికి ఎవరూ సాయం చేయకూడదని వీడీసీ ఆదేశించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:49 - July 21, 2017

ఉప్పు..అన్నీ వేసి చూడు..చివర్లో నన్ను వేసి చూడు అని సామెత. వంటకాల్లో ఉప్పు లేకపోతే దాని రుచే వేరేగా ఉంటుంది. అదే సందర్భంలో ఉప్పు ఎక్కువయినా ప్రమాదమే. పరిమితంగా ఉప్పును తీసుకుంటే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది ఉప్పును చాలా ఎక్కువగా ఇష్టపడుతారు. ఉప్పులో ఉండే అయోడిన్ ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. రుచి కోసం ఎక్కువగా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక వయస్సు పెరిగే కొద్ది ఉప్పును తగ్గించడమే మేలు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల సోడియం స్థాయి పెరుగుతుంది. సోడియం స్థాయి పెరగడం వల్ల ఏ చిన్న పని చేసినా అలసిపోవడం..తొందరగా ఆందోళన చెందుతారు. అంతేగాకుండా అధిక రక్తపోటు వస్తుంది. శరీరంలో కాల్షియం స్థాయి కొంచెం తగ్గినా కీళ్ల నొప్పులు, ఎముకలు పొలుసుబారడం, విరిగిపోవడం వంటివి జరుగుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు బలహీన పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

జగిత్యాల : బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి, విద్యుత్ పరికరాలు దగ్ధం అయ్యాయి. భయంతో ఉద్యోగులు పరుగులు తీశారు.

15:38 - July 21, 2017

ఆహారం..నిద్రకు అవినావ సంబంధం ఉంది. 'నిద్ర సుఖమెరుగదు' అన్నారు పెద్దలు. 'అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం' అంటున్నారు ఆధునికులు. ఇక ఉరుకుల పరుగుల ఉద్యోగాలు.. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న వారు ఎంతో మంది. సరైన నిద్ర లేక అవస్థలు పడుతుంటారు. అలాంటి వారు ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే సరిపోతుంది..

అరటిపండ్లు : జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. నిద్రలేమి సమస్యను తీరుస్తాయి. మెగ్నీషియం..పొటాషియం..సూక్ష్మ పోషకాలు త్వరగా నిద్రపట్టేలా చేస్తాయి.
బాదం : మెగ్నీషియం ఇందులో కూడా అధికంగా ఉంటుంది. నిద్రిస్తున్న సమయంలో రక్తంలోని చక్కెరస్థాయిని నియంత్రించడంలో సహయపడుతుంది.
వెచ్చని పాలు : పడుకోవడానికంటే ముందు వెచ్చని పాలు తాగడం బెటర్. ఈ పాలు తాగడం వల్ల నిద్రలోకి జారుకోవడం సులభం.
తేనె : ఇందులో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శ‌రీరంలోని సెర‌టోనిన్‌, మెల‌టోనిన్ స్థాయిల‌ను పెంచుతుంది. శ‌రీరంలో హార్మోన్లు ప్రేరేపిత‌మై అప్పుడు నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది.
చెర్రీ : ఈ పండ్లలో మెల‌టోనిన్ స‌మృద్ధిగా ఉంటుంది. నిద్రించ‌డానికి ముందు కొన్ని చెర్రీ పండ్ల‌ను తిన్నా లేదంటే చెర్రీ జ్యూస్ తాగినా ఫ‌లితం ఉంటుంది.

విమానంలో రెండు కేజీల డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ : ఎయిరిండియా విమానం లో రెండు కేజీల మార్ఫిన్ విశ్రమంపట్టుబడింది. చెన్నై నుంచి ఢిల్లీ వచ్చిన‌ ఫ్లైట్ 440 కేట‌రింగ్ ట్రాలీలో రెండు ప్యాకెట్లు న‌ల్ల టేప్‌తో చుట్టిన‌ట్లు ఓ సూప‌ర్‌వైజ‌ర్ గుర్తించారు. ఈ రెండు ప్యాకెట్ల‌ను కిచెన్ సామ‌గ్రి కింద దాచి ఉంచారు. ఎవ‌రు ఈ ప్యాకెట్లు ఉంచార‌న్న‌దానిపై క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్ విచార‌ణ మొద‌లుపెట్టింది. ఈ మార్ఫిన్ మిశ్ర‌మంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు స‌మాచారం ఇచ్చారు. ఇందులో కొంత మొత్తాన్ని ప‌రీక్ష‌ల కోసం తీసుకున్న ఎన్‌సీబీ.. మిగ‌తా మొత్తాన్ని క‌స్ట‌మ్స్ వేర్‌హౌజ్‌లో ఉంచారు.

మంచిర్యాల జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య..

మంచిర్యాల :మందమర్రి మండలం రామకృష్ణాపురంలో కానిస్టేబుల్ గరిమిళ్ల రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేందర్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేందర్ హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయమే బావిలో దూకి ఆత్మహత్యకు యత్నిస్తే స్థానికులు రక్షించారు. మళ్లీ ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చాడు కానిస్టేబుల్. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

కుప్పంలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు : కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కుప్పంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ ను ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీస్ అధికారులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. 150 పడకల ఏరియా ఆస్పత్రి భవనాన్ని సీఎం ప్రారంభించారు. కుప్పంలో సీడీపీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. సామూహిక శ్రీమంతంలో గర్భిణులను ఆశీర్వదించారు.

తిరుమలలో మొరాయించిన కంప్యూటర్లు

తిరుమల : తిరుమలలో కంప్యూటర్లు మోరాయించాయి. పద్మావతి సన్నిధానం, సీఆర్వో జనరల్ కౌంటర్లలో గదుల కేటాయింపు 2 గంటలుగా స్తంభించాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

తల్లిదండ్రుల చెంతకు పూర్ణిమ సాయి

హైదరాబాద్: జువైనల్ హోమ్ లో పూర్ణిమ సాయికి కౌన్సిలింగ్ ముసింది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లేందుకు పూర్ణిమ అంగీకరించింది. సీడబ్ల్యుసీ బృందం కౌన్సిలింగ్ తో తల్లిదండ్రుల చెంతకు పూర్ణిమ సాయి చేరింది.

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కోవలం నియోజకవర్గ శాసనసభ్యుడు విన్సెంట్‌పై కేసు నమోదైంది. తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

14:54 - July 21, 2017
14:53 - July 21, 2017

చిత్తూరు : జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంకు భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు.

 

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకారా

విశాఖ: గాజువాకలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకారా పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.33 లక్షలు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేశారు.

150 దళిత కుటుంబాల వెలివేత...

నిజామాబాద్: ఆర్మూరు మండలం మంథనిలో గ్రామ అభివృద్ధి కమిటీ మాట వినడం లేదని 150 దళిత కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు.

గచ్చిబౌలి ఓఆర్ ఆర్ వద్ద గంజాయి పట్టివేత

హైదరాబాద్: గచ్చిబౌలి ఓఆర్ ఆర్ వద్ద గంజాయి పట్టుకున్నారు. కారు డిక్కీలో 150 కిలోల గజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.

ఓడినా రికార్డు సృష్టించిన మీరాకుమార్

ఢిల్లీ: యూపీఏ త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేసిన మీరా కుమార్ ఆ ఎన్నిక‌ల్లో ఓడినా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇటీవ‌ల ముగిసిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో మొత్తం 10.69 ల‌క్ష‌ల ఓట్ల‌కు గాను మీరాకుమార్‌కు 3.67 ల‌క్ష‌ల ఓట్లు ప‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్ విక్ట‌రీ కొట్టిన విష‌యం తెలిసిందే. అయితే 50 ఏళ్ల త‌ర్వాత మీరా కుమార్ ఆ రికార్డును బ్రేక్ చేశారు. ఓడినా ఎక్కువ ఓట్లు గెలిచిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మీరా నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో సుబ్బారావుకు 43 శాతం ఓట్లు పోల‌య్యాయి. కానీ ఇప్పుడు మీరా కుమార్‌కు 34 శాతం ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి.

మధ్యప్రదేశ్ లో బోల్తా పడ్డ బస్సు: 15మందికి గాయాలు..

మధ్యప్రదేశ్‌: సిహోర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

14:27 - July 21, 2017

ఓ అమానుషం జరగాలంటే అది ముంబై కావాలి. ఓ దారుణం చోటు చేసుకోవాలంటే అది ఉత్తర్ ప్రదేశ్ కావాల్సిందే. మనుషుల్లా కాకుండా మానవ మృగాల్లా ప్రవర్తించే మనుషులున్నారు. పట్టపగలు దారుణాలకు పాల్పడుతున్నారంటే ఆయా రాష్ట్రాల భద్రతలో డొల్లతనం బయటపడుతున్నాయి. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని 27సార్లు నరికి చంపారు. అమ్మాయి..అబ్బాయి..మాట్లాడుకుంటుంటే కట్టుబాట్ల పేరిట చిత్రం హింసలకు గురి చేశారు. ఈ ఘోరాలు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

విద్యార్థులకు బీఎస్ ఎన్ ఎల్ కొత్తప్లాన్

హైదరాబాద్: విద్యార్థులకు బీఎస్ ఎన్ ఎల్ కొత్తప్లాన్ ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ లో ఎంసెట్, నీట్ విద్యార్థుల కోసం ప్రిపెయిడ్ తో పాటు త్వరలో జీ ని ఉచిత డేటా ప్లాన్ తో బీఎస్ ఎన్ ఎల్ మార్కెట్ లోకి రానుంది. 30 రోజుల్లో 300 ఉచిత ఎస్ఎంఎస్ ల సౌలభ్యం కల్పించింది. ఒక మొబైల్ లేదా ల్యాండ్ లైన్ కు అన్ లిమిటెడ్ ఉచిత కాల్స్, సెకండ్ కు ఒక పైసా ఛార్జీతో అన్ని నెట్ వర్క్లకు వాయిస్ కాల్స్ ఆఫర్ ప్రకటించింది.

పెనుగొండ లో రఘువీరా మహాధర్నా

అనంతపురం: పెనుగొండ ఆర్డీవో ఆఫీసు ముందు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. రైతులకు ఇన్ఫుడ్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నిరసన వ్యక్తం చేశాడు. మహాధర్నాకు రైతులు భారీగా హాజరయ్యారు.

13:51 - July 21, 2017

ధిరవనితగా సంచలనం సృష్టించి లోకమంత చుట్టేస్తూ ఆకాశం గెలుపు సంతకం చేసింది ఓ తెలుగమ్మాయి. అతి చిన్న వయస్సులో అతి పెద్ద బోయింగ్ విమానం నడిపిన మహిళగా సంచలనం సృష్టించింది విజయవాడకు చెందిన దివ్య..ఓ విద్యార్థిని కలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. తన కల నెరవేరిన తరణనా సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు మెదక్ జిల్లాకు చెందిన సంజన అనే అమ్మాయి..గర్భస్తా శిశువులు జికా వైరస్ భారి నుంచి రక్షించేందుకు టేక్సన్ యూనివర్సిటీ చేసిన ప్రయేగాలు మంచి ఫలతాలను ఇస్తున్నాయి..మంగుళూరు మేయర్ కవిత సల్లి డేరింగ్ నిర్ణయం తీసుకోవటంలో ముందుంటారు. సిటీలో అక్రమంగా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై కఠినంగా వ్యవరించాలని అధికారులను ఆదేశించారు...ప్రముఖ అస్సామి నటి, గాయని బిదిసా బెజ్ పార్వ ఆత్మహత్య చేసుకున్నారు...ఉమెన్స్ క్రికెటర్ మిథలి రాజు ఐసీసీ ర్యాకింగ్స్ లో 2వ ర్యాంక్ సాధించారు. ప్రముఖ షెట్లర్ పివి సింధు సినిమాల్లో నటించనుందా అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నటుడు సోను సుద్ నిర్మాణంలో సింధు జీవిత చరిత్రను సినిమా తీయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:29 - July 21, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఎస్పీ గున్నీ పోలీసులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటమని ఎస్పీ తెలిపారు. ఇవాళ్లి నుంచి కిర్లంపూడిలో 144 సెక్షన్ అమలు చేయనున్నామని పేర్కొన్నారు. ర్యాలీలు నిర్వహించేవారికి వినకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి. 

13:18 - July 21, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు పూర్ణిమసాయికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు, విజయదేవి. బాలరాజు బెంచ్ ఆఫ్ బెజిస్ట్రేట్ పద్మావతి నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. బాలల సంరక్షణ కమిటీ నింబోలి అడ్డా జువైనల్ హోమ్ లో ఉన్న పూర్ణిమసాయిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. తల్లిదండ్రులు తన చెల్లిని ఒకలాగ తనను మరొలాగ చూసుకుంటున్నారని ఆమె తెలిపింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:15 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ రెండున్నర గంటలుగా నటుడు సబ్బరాజును విచారిస్తున్నారు. నిన్న సినిమాటోగ్రాఫర్ శ్యాం కె నాయుడిని, మొన్న పూరీ జగన్నాథ్ ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు 3 రోజుల్లో డ్రగ్స్ సంబంధించిన పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులర్యాలి..అరెస్ట్

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ లో భాగంగా నారాయణ గూడ నుంచి విద్యార్థుల ర్యాలీ జరిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

 

13:14 - July 21, 2017

శేఖర్ కమ్ము..వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 'దిల్' రాజు నిర్మాతగా రూపొందిన 'ఫిదా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వరుణ్ తేజ్ సరసన సాయి పల్లవి నటించింది. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకుల మన్ననలు పొందింది.

శేఖర్ కమ్ముల అనగానే మనస్సుకు హత్తుకొనే సినిమాలు తీస్తారని టాక్ ఉంది. వరుణ్ తేజ్ తో సినిమా తీస్తారని టాక్ రావడం ప్రేక్షకుల్లో ఒక ఫీల్ ఏర్పడింది. ప్రేక్షకులు ఊహించినట్లుగానే సినిమా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మాధ్యమాల్లో వెలువడుతున్నాయి.

వరుణ్ తేజ్ అమెరికాలో అన్నతో పాటు ఉండూ మెడిసిన్ చేస్తుంటాడు. పెళ్లిచూపులకని తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రాంతానికి అన్నయ్య వస్తాడు. కానీ అభిప్రాయం తెలపాలని అమెరికా నుండి ఇండియాకు రావాలని వరుణ్ కు తెలియచేస్తాడు. దీనితో వరుణ్ ఆ ప్రాంతానికి వస్తాడు. అక్కడ పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) స్నేహం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అమెరికా వెళ్లిన వరుణ్ తన ప్రేమని భానుమతికి తెలియచేయడం.. అయితే భానుమతి వరుణ్ ప్రేమని తిరస్కరిస్తుందని టాక్. వరుణ్ ప్రేమను భాను ఎందుకు కాదని అంటుంది ? వరుణ్ తన ప్రేమను గెలుచుకుంటాడా ? చివరకు వీళ్లు కలుస్తారా ? అనేది సినిమాలో చూడాలి.

వరుణ్ తేజ నటన ఆకట్టుకుందని..సాయి పల్లవి బాగానే నటించిందని టాక్ వినిపిస్తోంది. మిగిలిన వారు పాత్రల పరిధి మేరకు నటించారని తెలుస్తోంది. డ్యాన్స్ విషయంలో కొంత నిరాశ తప్పదని, పాత్రల పరిచయాలు..కొన్ని సరదా సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

‘ఫిదా' సినిమాపై ఫర్ ఫెక్ట్ రివ్యూ అండ్ రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేసి చూడండి.

13:10 - July 21, 2017

హైదరాబాద్ : రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నలుగుతున్న అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఏపీ ,తెలంగాణల్లో ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టిన కేసీఆర్,చంద్రబాబులు డీలిమిటేషన్‌ కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వీరితో తమకున్న రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మోదీ సైతం డీలిమిటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అటెన్షన్ అయ్యింది. రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కావాలంటే కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. ఇప్పుడు ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహానికి పదును పెడుతోంది కాంగ్రెస్. రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ. విభజన చట్టంలో డీలిమిటేషన్‌ను చేర్చిందే కాంగ్రెస్ కాబట్టి దీన్ని వ్యతిరేకించినా కాంగ్రెస్ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలను తెరపైకి తెస్తోంది. తెలంగాణ‌లో ఖ‌మ్మం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, యూనివ‌ర్సీటిలు,ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలను ఇక ఆంధ్రప్రత్యేశ్ ప్రత్యేక హోదావంటి అంశాలను తక్షణమే అమలు చేయాలనే మెలికతో కేసీఆర్, చంద్రబాబులతో పాటు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్‌, చంద్రబాబులకు విభజన హామీలపై చిత్తశుద్ధి లేదని ప్రజలకు తెలియచెప్పి పొలిటికల్ మైలేజ్‌ పొందాలని ఆశపడుతోంది హస్తం పార్టీ. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 

కుప్పంలో పీఎస్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

చిత్తూరు: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పంలో టౌన్ బ్యాంక్, నూతన పోలీస్ స్టేషన్ ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ సాంబశివరావు పాల్గొన్నారు.

13:09 - July 21, 2017

మంచిర్యాల : ముద్దులొలికే ఈ చిన్నారి పేరు సహర్షిణి. వయసు మూడేళ్లు. మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో నివాసం ఉంటున్న సుగంధ్-మౌనికల కుమార్తె. 40 రోజుల క్రితం వరకు చక్కగా ఆడుకున్న సహర్షిణికి అకస్మాత్తుగా చెవుల నుంచి రక్తం కారడం మొదలైంది. దగ్గర ఉన్న ఆసుపత్రిలో చూపించినా ఫలితం లేకపోవడంతో మంచిర్యాల, కరీంనగర్, వరంగల్‌లోని పెద్దాసుపత్రులలో చూపించారు. అయినా.. చిన్నారి పరిస్థితిలో మార్పు లేదు. అదేపనిగా చెవుల నుంచి రక్తం కారుతుండటంతో సహర్షిణి రక్త హీనతతో బాధపడుతోంది. సహర్షిణి తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెక్కాడితే కానీ డొక్క నిండని కుటుంబం. సహర్షిణికి మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేదు. దాతలు ఎవరైనా సాయమందిస్తే ఆమెకు వైద్యం చేయించుకుంటామని సహర్షిణిని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మనసున్న మహారాజులెవరైనా.. స్పందించి చిన్నారికి సాయమందించాలని సహర్షిణి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వారి ఆశ ఫలించి చిన్నారి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుందాం. 

13:07 - July 21, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు, కలెక్టర్లను నియమించింది. వీరిలో పలువురు కొత్త వారు కాగా, మరికొందరు సీనియర్లు ఉన్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా పరిపాలనలో అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రోటోకాల్‌ వివాదం మొదలుకొని పలు అభివృద్ది , రాజకీయ పరమైన అంశాలు, తదితర సమస్యలు కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెంచుతున్నాయి. అంతే కాక కొన్ని సందర్భాల్లో బహిరంగంగా విమర్శలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.మొన్న జరిగిన హరితహారం కార్యక్రమం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల మధ్య దూరాన్ని పెంచింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రీతిమీనాపై ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అనుచిత ప్రవర్తన అనేక వివాదాలను తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధులు పరస్పరం మండిపడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన కలెక్టర్లు, లీడర్ల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపాయి.

కరీంనగర్‌ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం
కరీంనగర్‌ జిల్లాలో కలెక్టర్‌ సర్పరాజ్‌కి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మధ్య ప్రోటోకాల్ వివాదం, పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌ అలుగు వర్శిణికి, స్థానిక నేతలకు మధ్య సమన్వయ లోపం, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హోలి కేరికి, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు అలాగే జనగాం జిల్లా కలెక్టర్‌ దేవసేనకు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి మధ్య పాలన అంశాలపై దూరం కొనసాగుతోంది. యాదగిరి రెడ్డి స్వయంగా సీ.ఎస్‌.ఎస్‌.పీ. సింగ్‌ను కలిసి కలెక్టర్‌ను మార్చాలని కోరగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కూడా ప్రీతిమీనాను మార్చాలని కోరినట్లు తెలుస్తుంది.నిజామాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణాకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య కూడా పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేదు. అయితే యోగితారాణా అక్కడ పాతుకుపోయారనే చర్చ జరుగుతోంది. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ విభేదాలు ప్రజా సంక్షేమంపై ప్రభావం చూపుతున్నాయి. పలు సందర్భాల్లో ఈ వివాదాలను మంత్రులు మ్యానేజ్‌ చేస్తూ వస్తున్నారు. అధికారుల తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తరచూ వివాదాలు
తరచూ వివాదాలు చోటు చేసుకోవడంతో అభివృద్ధి పనులను సమన్వయంతో చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కలెక్టర్ల తీరుతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇటు కలెక్టర్లు కూడా ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు సిఎస్‌ఎస్‌పి సింగ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు.నిత్యం వివాదాలతో ఆందోళన చెందే కంటే బదిలీ చేయడమే సరైందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ల బదిలీలను చేపట్టి తద్వారా వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

బీటెక్ ఫెయిల్ అయ్యాడని రైలు కింద పడి

వరంగల్ : ఓ బీటెక్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ - కాజీపేట మధ్యలో ఉన్న సంతోషిమాత రైల్వేట్రాక్ వద్ద చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని హర్షవర్ధన్‌రావు(20)గా పోలీసులు గుర్తించారు. విద్యార్థి హర్షవర్ధన్ బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినందుకు హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హర్షవర్ధన్ స్వస్థలం కరీంనగర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామం.

 

13:05 - July 21, 2017

ప్రకాశం : జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో వైసిపి నేతలు పర్యటించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని, నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌ భరత్ దళితుల భూములను సందర్శించారు. తమ భూములు అన్యాయంగా లాక్కున్నారంటూ దళితులు వారికి తమ గోడు చెప్పుకున్నారు. దళితులను ఓదార్చిన వైసిపి నేతలు ధైర్యం చెప్పారు. 

12:57 - July 21, 2017

మనుషులా ? మృగాలా ? దేశంలో దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కో ఘటన వింటుంటే..చూస్తుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు..ఎందుకిలా మారిపోతున్నారు..ఎందుకిలా చేస్తున్నారు..మనిషిని చంపే హక్కు వీరికి ఎవరిచ్చారు ? చట్టాన్ని చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు ?

దేశంలో ఎక్కడో ఒక చోట దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. కక్షలు..కార్పణ్యాలు..క్షణికావేశంలో హత్యలకు తెగబడుతున్నారు. కర్రలు..మారణాయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. ఇటీవల ఈ ఘటనలు పెచ్చరిల్లుతుండడం ఆందోళన కలిగిస్తోంది మనుషులం అని మర్చిపోతున్నారా ? లేక మానవత్వం చచ్చి మృగాలుగా మారిపోతున్నారా ? మూగజీవాలు..మనుషుల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ప్రశ్నని, ప్రశ్నించే తత్వాన్ని నిలువరించడానికి హత్యల్ని ఆయుధం చేసుకున్న కొందరు మూకలు దేశమంతటా ఒక భీతావహ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గొడ్డు మాంసం తింటే ఖబడ్దార్‌ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా హత్యలు చేయడంలో వెనుకాడడం లేదు. ఏది తినాలి ? ఏది తినకూడదు అనే తీర్పు ఎవరిచ్చారు ? తమ మాట కాదని తింటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. గొడ్డు మాంసం తినే కోట్లాదిమంది దళిత, మైనారిటీ వర్గాల వాళ్ళందరినీ చంపేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాలనలో గడచిన రెండునెలల కాలంలో 803 అత్యాచారాలు, 729 హత్యలు జరిగాయని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ఇటీవలే వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. యోగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ రోమియో స్క్వాడ్స్‌ అత్యుత్సాహం పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమాయక యువకులను టార్గెట్ చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. నైతికత పేరిట ఓ అబ్బాయి..అమ్మాయిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాజ్ గంజ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఓ దారుణ ఘటన దిగ్ర్భాంతి కలిగించింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు. ఏకంగా 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

ఇలాంటి ఎన్నో ఘటనలు భారతదేశంలో చోటు చేసుకుంటున్నాయి. గో రక్షక్ పేరిట మారణకాండను సృష్టిస్తున్నారు. గో రక్షక్ పేరిట జరుగుతున్న దాడుల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలస్యంగా స్పందించారు. ఇలాంటి దాడులు సహించమని చెప్పుకొచ్చారు. కానీ దాడులు..హత్యలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. అక్కడి పాలకులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి దాడులు..లౌకికవాదులు..అభ్యుదయ వాదులు..ఖండించాల్సినవసరం ఉంది...

రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాం: లోకేష్

అమరావతి: రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ తెలిపారు. టిడిపి హయాంలో ఐటీ అభివృద్ధి జరిగిందని, 2019లోపు అమరావతిలో 10 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు యువతకు అందిస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో 25 వేల ఉద్యోగాలు ఇచ్చేందకు సిద్ధం అని లోకేష్ పేర్కొన్నారు.

12:30 - July 21, 2017

ముంబై : జియో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ లోకి జియో ఫోను ప్రవేశపెట్టనుంది. జియో ఫోన్ లో ఎన్నా ఫీచర్లు ఉంటాయని తెలిపింది. ఈ ఫోన్ వాయిస్ కమాండ్ ఆప్షన్ తో పనిచేస్తుందని తెలిపారు. ఈ ఆఫర్ జియో కస్టమర్లకు మాత్రమే అని తెలుస్తోంది. నెలకు రూ.153కే అపరిమిత డేటా ఇవ్వనున్నారు. మొదటగా రూ.1500 డిపాజిట్ చేసి ఫోన్ పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. 

12:29 - July 21, 2017

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు పూర్ణిమసాయికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్లు, విజయదేవి. బాలరాజు బెంచ్ ఆఫ్ బెజిస్ట్రేట్ పద్మావతి నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. బాలల సంరక్షణ కమిటీ నింబోలి అడ్డా జువైనల్ హోమ్ లో ఉన్న పూర్ణిమసాయిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:28 - July 21, 2017

పశ్చిమ గోదావరి : గోదావరి వరద ప్రహహం క్రమంగా పెరుగుతోంది. పోలవరం వద్ద గోదావరి స్థాయికి మించి ప్రవహిస్తోంది. అధికారలు పర్యాటక బోట్లను నిలివేశారు. భారీ వర్షాలకు గోదావరి వరద పెరగడంతో పోలవరం పనులు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

భారతీయులందరికీ జియో ఫోన్ ఉచితం: ముఖేష్ అంబానీ

ముంబై: భారతీయులందరికి జియో ఫోన్ ఉచితం అని ముఖేష్ అంబానీ ప్రకటించారు. సెక్యూరిటీ డిపాజిట్ రూ.1500 తో జియో ఫోన్, మూడేళ్ల తర్వాత రూ.1500 కస్టమర్లకు రిఫండ్ ఇవ్వనుంది. ఆగస్ట్ 15 నుంచి మార్కెట్ లోకి కొత్త జియో హ్యాండ్ సెట్ రానుంది.

పూర్ణిమ ను తల్లిదండ్రులకు అప్పగించనున్న సీడబ్ల్యూసీ కమిటి

హైదరాబాద్: నింబోలి అడ్డాలోని జువైనల్ హోమ్ లో పూర్ణిమ సాయికి రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు పూర్ణిమ ఒప్పుకుంది. కాసేపట్లో సీడబ్ల్యూసీ కమిటీ పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పగించనుంది.

కార్పొరేషన్ మేయర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: వివిధ జిల్లాల కార్పొరేషన్ మేయర్లు, అధికారులు, కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కార్పొరేషన్ మేయర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: వివిధ జిల్లాల కార్పొరేషన్ మేయర్లు, అధికారులు, కమిషనర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కేర్ సాప్ట్ వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రి లోకేష్

అమరావతి: మంగళగిరి ఐటీ పార్క్ లో ఫై కేర్ సాప్ట్ వేర్ కంపెనీని మంత్రి లోకేష్ ప్రారంభించారు. 500 మంది ఉద్యోగులతో కార్యకలాపాలను ప్రారంభించింది. మరో 6 నెలల్లో 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 

11:53 - July 21, 2017

నిద్ర..మనిషికి ఎంతో ముఖ్యం..ఆలోచనలు..కష్టాలు మరిచిపోతూ నిద్ర పోతుంటారు. ఆరు గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తుంటారు. నిద్రలేమి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు సూచిస్తుంటారు. ప్రపంచంలో ఏ మనిషి అయినా నిద్ర పోవాల్సిందే. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం నిద్ర పోతే చనిపోతాడంట. ఓ అరుదైన వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తికి సంబంధించిన వార్త సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది...

లియామ్ డెర్బీషైర్ అనే యువకుడు బ్రిటన్ కు చెందిన వాడు. ఇతనికి 'సెంట్రల్ హైపోవెంటిలేషన్' అనే అరుదైన వ్యాధితో బాద పడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్న వారు పొరపాటున నిద్రపోతే ప్రాణం పోతుంది. ఇంత తీవ్రమైన వ్యాధి అతని పుట్టుక నుండే వచ్చిందని తెలుస్తోంది. లియామ్ బతికే ఛాన్స్ లేదని..ఆరు వారాలకు మించి ఉండడని వైద్యులు తేల్చిచెప్పారు. తమ కుమారుడిని బతికించుకోవాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

లియామ్ నిద్రపోతే అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా చూడాలి. నిద్రపోయిన అనంతరం ఎవరి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయనే సంగతి తెలిసిందే. లియామ్ ఊపిరితిత్తులు ఆగిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ ప్రత్యేకమైన బెడ్ రూం ఏర్పాటు చేశారు. లియామ్ నిద్రలోకి జారుకోగానే కృతిమ శ్వాసను అందేలా ఏర్పాటు చేశారు. గుండె ద్వారా ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేశారు.

ఈ పర్యవేక్షణ కోసం ఒకరిని నియమించారు. బెడ్ రూంలో జరిగే అంశాన్ని సమన్వయంతో వారు పరిశీలిస్తునే ఉన్నారు. ఇలా గత పద్దెనిమిదేళ్లుగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎలాంటి సమస్య లేకుండా లియామ్ బతికేస్తూ మృత్యువును ఓడిస్తూనే ఉన్నాడు...

జియో నుంచి కొత్త ఫీచర్ ఫోన్ విడుదల..

హైదరాబాద్: జియో నుంచి కొత్త ఫీచర్ ఫోన్ ను రిలయన్స్ విడుదల చేసింది.వాయిస్ కమాండ్ తో కొత్త జియో ఫోన్ పని చేయనుంది.

ముంబై రిలయన్స్ వార్షిక సర్వసభ సమావేశం

ముంబై : రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...1977లో 3500 మంది ఉద్యోగులు మా సంస్థలో పని చేశారని, ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 2,50,000కు చేరింది అని తెలిపారు. షేర్ హోల్డర్ల సంపద ప్రతి రెండేళ్లలో రెట్టింపవుతుందని పేర్కొన్నారు. 1977లో రూ.వెయ్యి పెట్టుబడి పెట్టిన షేర్ వాల్యు ఇపుడు రూ.16.5 లక్షలు అయ్యిందని ముఖేష్ చెప్పారు. నికర ఆదాయం 3 కోట్ల నుంచి 30వేల కోట్లకు పెరిగిందన్నారు. 40 ఏళ్లలో సంస్థ నికర లాభం 10 వేల రెట్లు పెరిగిందన్నారు. జియోకు 170 రోజుల్లోనే కోటి కస్టమర్లు చేరారన్నారు. 

11:35 - July 21, 2017

విజయవాడ : ఏపీలో అక్రమ నిర్బంధాలకు నిరసనగా విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. ప్రకాశం జిల్లా దేవరపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో దళితులు, ఉద్యమకారుల అక్రమ నిర్బంధంపై నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

11:32 - July 21, 2017

విజయవాడ : నగరవాసులకు దొంగల భయం పట్టుకుంది. ఏ క్షణంలో దొంగతనం జరుగుతుందో అని బెజవాడవాసులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడవాసులు వరుస చోరీలతో బెంబేలెత్తుతున్నారు. ఓ దొంగల ముఠా నగరంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. తాజాగా ఏడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. నామమాత్రంగా పోలీసుల నాకాబందీ చర్యలు. రాత్రి వేళ నిఘాలు లోపించడంతోనే దొంగలు పడుతున్నారని ప్రజలు అంటున్నారు. నగరంలోని చాలా కెమెరాలు పనిచేయడం లేదు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:24 - July 21, 2017

నల్లగొండ : జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు నర్సులు డాక్టర్‌ అవతారమెత్తారు. అర్హత లేకున్నా గర్భిణికి ప్రసవం చేయగా.. ఇద్దరు కవల పిల్లల్లో ఒకరు మృతి చెందారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బకరు చనిపోయారని బంధువులు ఆందోళనకు దిగారు. 

11:22 - July 21, 2017

హైదరాబాద్ : మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు ఉస్మానాబాద్ కు చెందివారు, ఒకరు ముంబైకి చెందిన వారిగా గుర్తించారు. మరొకరు స్థానిక బండ్లగూడకు చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

గుంటూరులో అరుదైన ఆపరేషన్

గుంటూరు: పూర్తిగా తెగిపోయిన అరచేయిని డాక్టర్లు ఆపరేషన్ ద్వారా మళ్లీ అతికించారు. రవి అనే వ్యక్తి చేయి టింబర్ మిషన్‌లో పడింది. దీంతో అరచేయి వరకు పూర్తిగా తెగిపోయింది. అయితే... డాక్టర్ మారుతి ప్రసాద్ బృందం ఆపరేషన్ ద్వారా తెగిపోయిన చేతిని అతికించారు. దాదాపు 10గంటలపాటు ముగ్గురు వైద్యుల బృందం శ్రమించి అరచేయిని అతికించారు.

11:18 - July 21, 2017

 

అరే..నా ఫస్ట్ సాలరీ వచ్చిందిరా..చలో ఎంజాయ్ చేద్దాం ఒకరు..అమ్మా..నా మొదటి జీతం వచ్చింది..ఇదిగో అంటూ మరొకరు..ఫస్ట్ టైం జీతం అందుకున్నా..ఏమి చేయాలి ? అంటూ మరికొందరు...ఇలా చాలా మందిలో విభిన్న ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. మొదటి సాలరీ చేతికందగానే ఆ కిక్కే వేరు.

తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటారు..తమ కొడుకును..కూతురిని ఇంజినీర్..డాక్టర్ ఏదో ఒకటి చేయాలని అనుకుని ఆ తల్లిదండ్రులు తమ బాధ్యతను నెరవేరుస్తుంటారు. అప్పటి వరకు ఆ పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీతో కాలం వెళ్ల దీస్తుంటారు. మరికొందరు చదవుకుంటూనే ఇతర పనులు చేస్తూ డబ్బులు సంపాదించడం ప్రారంభిస్తారు. చదువు అనంతరం ఉద్యోగం కోసం అన్వేషణ.. ఆ అన్వేషణలో విజయం..ఉద్యోగం దక్కించుకున్న వారు కొందరు..చదువుకుంటూనే ఉద్యోగం..చేసే వారు మరికొందరు..ఇలా ఏది చేసినా మొదటి సాలరీ తీసుకున్న ఆనంద క్షణాలు మరిచిపోలేనివి.

ఇక్కడ ఓ విషయం చెప్పాలి. మొదటి సాలరీ తీసుకున్న అనంతరం ఎలాంటి ప్లాన్స్ లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఎన్ని అంకెల జీతం కాదు..ఎలా ఖర్చు చేస్తున్నారన్నదే ముఖ్యమని పలువురు సూచనలు చేస్తుంటారు. భవిష్యత్‌లో ప్రణాళికాబద్ధంగా ఖర్చుచేసి ముందుకుపోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలని నిపుణులు పేర్కొంటుంటారు. చిన్న వయస్సులోనే ఉద్యోగం సంపాదించుకున్న వారు డబ్బులు ఎలా ఖర్చు చేసుకోవాలన్న ఆలోచన కంటే ఆ డబ్బును ఎలా పొదుపు చేసుకోవాలని ఆలోచిస్తే చాలా మంచిది.

డబ్బు ఉంది కదా..మన డబ్బే కదా..ఎవరు అడగరు..అనుకుంటూ వివిధ ఆకర్షణలకు లోనవుతుంటారు. ఇది సహజమే. కానీ దీనివల్ల భవిష్యత్ లో ఎన్నో ఆర్థిక అటుపోట్లు ఎదురవుతుంటాయి. షాపింగులు..పార్టీలు..ఏ విషయాలైనా సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
మొదటి జీతం నుండే డబ్బులను ఎలా పొదుపు దిశగా మళ్లించుకొంటే భవిష్యత్ లో వచ్చే కష్టాలను సలభంగా ఎదుర్కొన వచ్చు. ఇప్పటికే వేతనాలు తీసుకంటున్న వారు కూడా ఇలాగే ఆలోచిస్తే మంచిది....

27 నుండి బీఫార్మసీ కౌన్సెలింగ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్-2017 ఫార్మసీలో సీట్ల భర్తీ కోసం బైపీసీ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఈ నెల 28 నుంచి 30 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఆప్షన్ల మార్పులకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 1న సీట్ల కేటాయింపు చేస్తామని కౌన్సెలింగ్ కన్వీనర్ ఏ వాణిప్రసాద్ తెలిపారు. ఈ కౌన్సెలింగ్ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం

11:08 - July 21, 2017

హైదరాబాద్ : క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్‌ కేసులో మూడో రోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు పూరీజగన్నాథ్‌, శ్యాంకే నాయుడును విచారించిన సిట్‌ అధికారులు ఇవాళ సుబ్బరాజును విచారించనున్నారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపైనే ఆరా తీయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

విజయవాడ లెనిన్ సెంటర్లో సీపీఎం నిరసన కార్యక్రమం

విజయవాడ: రాష్ట్రంలో అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ లెనిన్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రకాశం జిల్లా దేవరపల్లి, ప.గో జిల్లా తుందుర్రులో దళితులు, ప్రజానాయకుల అక్రమ నిర్బంధంపై ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

బీబీ నగర్ నిమ్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలంటూ పాదయాత్ర..

యాదాద్రి: కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోకవర్గ ఇన్ ఛార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. బీబీ నగర్ నిమ్స్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. నిమ్స్ నుంచి యాదాద్రి సన్నిధి వరకు పాదాయత్ర చేపట్టారు. పాదయాత్రను డీసీసీ అధ్యక్షుడు బిక్షమయ్య గౌడ్ ప్రారంభించారు. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కూడా పాల్గొన్నారు.

వరస చోరీలతో బెంబేలు ఎత్తుతున్న బెజవాడ వాసులు

విజయవాడ: వరస చోరీలతో బెజవాడ వాసులు బెంబేలు ఎత్తుతున్నారు. నగరంలో దొంగల ముఠా ప్రవేశించినా పోలీసుల సెక్యూరిటీ లోపించిందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో కెమెరాలు పనిచేయడం లేదు. పోలీసు యంత్రాంగం వీఐపీ బీట్లకే సరిపోతున్నారని, రాత్రివేళ నిఘా లొంపించిందని చెబుతున్నారు. నేడు తాజాగా ఏడు ఇళ్లల్లో చోరీ జరిగాయి.

10:51 - July 21, 2017

ఫొటోలో కనిపిస్తున్న నటిని గుర్తు పట్టారా ? లేదు అంటారా..అయితే చిన్న క్లూస్..ఈమె బుల్లితెరపై నటించింది..అనంతరం తెలుగు చలన చిత్ర సీమకు పరిచయమైంది. అనతికాలంలో బోలెడంత క్రేజ్ తెచ్చుకుంది. తెలుసుకోలేకపోతున్నారా ? ‘చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ గుర్తుంది కదా..అందులో ఎవరు నటించారు ? ‘అవికా గోర్'..అవును..ప్రస్తుతం ఇలా మారిపోయింది..

'చిన్నారి పెళ్లికూతురు'గా 'అవికా గోర్’ మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం టాలీవుడ్ కి 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయం అయింది. తరువాత మాయమై పోయింది. హఠాత్తుగా సినిమాలకు దూరం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గ్లామర్ తరహా పాత్రల్లో నటించాలని ఉత్సాహం చూపినా ఆమె బాడీ సహకరించలేదని పుకార్లు వినిపించాయి.

తాజాగా గుర్తు పట్టని విధంగా 'అవికా గోర్' మారిపోయింది. తనను తాను మార్చేసుకుని మరీ ఫోజులు ఇచ్చి.. వాటిని నెట్ లో పెట్టేసింది. ఈ ఫొటోలు చూసిన వారు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

దేవపల్లిలో వైసీపీ నేతల పర్యటన

ప్రకాశం: పర్చూరు మండలం దేవరపల్లిలో వైసీపీ నేతలు పర్యటిస్తున్నారు. దళిత భూములను ఎంపి వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. మాజీ మంత్రి బాలినేని, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ భరత్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. తమ భూములను అన్యాయంగా లాక్కొంటున్నారని దళితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

10:46 - July 21, 2017

బాలీవుడ్..టాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సినిమాల కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అందులో ప్రధానంగా సెట్ ల కోసం భారీగా డబ్బులు గుమ్మరిస్తుంటారు. కొన్ని సినిమాల దర్శక, నిర్మాతలు సెట్టింగ్ ల కోసం కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడుతుంటాయి. తాజాగా 'సుకుమార్'..’రామ్ చరణ్' తాజా చిత్రానికి సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ..సుకుమార్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్టు రూపొందుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందబోయే సినిమాకు ''రంగస్థలం 1985’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో 'రామ్ చరణ్' వెరైటీ పాత్ర పోషించనున్నారు. ‘చెర్రీ' సరసన 'సమంత' నటిస్తోంది. ఈమె కూడా పల్లెటూరి యువతిగా నటిస్తోంది.

ఇదిలా ఉంటే సినిమా కోసం భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. రూ. 5 కోట్లతో ఖరీదైన సెట్ ను రూపొందిస్తున్నారు. 1980ల నాటి వాతావరణం కనిపించేలా ఓ గ్రామాన్ని ఆర్టిఫిషియల్ గా రూపొందిస్తున్నట్లు, దాదాపు 35 రోజులపాటు ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'చరణ్' మాస్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి నది, కొల్లేరు ప్రాంతంలో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేశారు.

10:22 - July 21, 2017

 

లండన్ : మహిళల వన్డే ప్రపంచ కప్‌ క్రికెట్‌లో భారత్‌ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసి తుది పోరుకు బెర్తు ఖరారు చేసుకుంది. ఈనెల 23న లార్ట్స్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింద

హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మెరుపు ఇన్నింగ్స్‌
మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 115 బంతుల్లో 171 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హర్మన్‌ ప్రీత్‌ కైర్‌ 20 ఫోర్లు, 7 సిక్సర్లుతో చెలరేగిపోయి ఆసీస్‌ భరతం పట్టింది. హర్మన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచింది. అనంతరం తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరులుగు సాధించింది. విలాని 58 బంతుల్లో 13 ఫోర్లు 75 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కష్టాలు రెండో ఓవర్‌ నుంచే మొదలయ్యాయి. మూనీ ని ఒక్క పరుగుకే పాండే అవుట్‌ చేసి ఆ జట్టును దెబ్బ తీసింది. ఆ తర్వాత కెప్టెన్‌ లానింగ్‌ పరుగులేమీ చేయకుండానే జులన్ గోస్వామి బౌలింగ్‌లో ఔటై పెవిలియన్‌ దారి పట్టింది. పద్నాలుగు పరుగులు చేసిన బోల్టన్‌ ను దీప్తి అవుట్‌ చేసింది. అనంతరం విలానీ, పెర్రీ 38పరుగులతో నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో ఆసీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. మన జట్టులో దీప్తి శర్మ మూడు వికెట్లు, జులన్‌ గోస్వామి, శికా పాండే చెరో రెండు వికెట్లు తీసి ఆసిస్‌ను కట్టడి చేశారు.

వరుస వైఫల్యాలు
టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తూ స్మృతి మంధన ఆరు పరుగులతో తొలి ఓవర్లోనే వెనుదిరిగింది. మరో ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ కూడా 14 పరుగులకే పెవిలియన్‌ దారి పట్టింది. అనంతరం కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 61 బంతుల్లో 2 ఫోర్లతో 36 పరుగులు చేసింది. మిథాలీ కూడా క్రీజ్‌లో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించింది. చివరకు బీమ్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో భారత్‌ పరిస్థితి చూస్తే సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆ తర్వాత దీప్తి శర్మ 35 బంతుల్లో 25 పరుగులు చేసింది. దీనిలో ఒక ఫోర్‌ కూడా ఉంది. దీప్తి అండగా నిలవడంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగిపోయింది.గత మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్‌ ఈసారి అసలైన తరుణంలో తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. షుట్‌ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్‌ ఆడిన షాట్‌ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌లో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్‌ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్‌ స్కోరు 35. ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్‌ తరం కాలేదు. గార్డ్‌నర్‌ వేసిన 37వ ఓవర్లో కౌర్‌ పండగ చేసుకుంది. తొలి బంతికి దీప్తి శర్మ సింగిల్‌ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్‌ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్‌ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం.అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ప్రీత్‌ తన చిరస్మరణీయ సెంచరీ క్షణాన్ని మాత్రం ఆస్వాదించలేకపోయింది. నాన్‌స్ట్రైకర్‌ దీప్తి శర్మతో సమన్వయ లోపం ఆమెను తీవ్ర అసహనానికి గురి చేసింది. 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో బీమ్స్‌ బౌలింగ్‌లో కౌర్‌ మిడ్‌ వికెట్‌ దిశగా ఆడింది. వేగంగా సింగిల్‌ పూర్తి చేసుకున్న ఆమె, రెండో పరుగు కోసం ప్రయత్నిం చింది. దానికి దీప్తి సరిగా స్పందించలేదు. చివరకు ప్రమాదం లేకుండా ఆ పరుగు పూర్తయి కౌర్‌ సెంచరీ సాధించింది. అటువైపు దీప్తి కూడా రనౌట్‌ కాకుండా బయటపడింది. కానీ కౌర్‌ మాత్రం తన కోపాన్ని దాచుకోలేక సహచరిణిపై ప్రదర్శించింది. భారత ఇన్నింగ్స్‌ తర్వాత మాట్లాడుతూ... ఆ సమయంలో తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయానని, ఆ తర్వాత దీప్తికి సారీ చెప్పినట్లు కౌర్‌ వెల్లడించింది.

డ్రగ్స్ మలినాలను శుద్ధి చేసుకునే పనిలో సెలబ్రెటీలు..

హైదరాబాద్: డ్రగ్స్ మలినాలను శుద్ధి చేసుకునే పనిలో కొంత మంది సినీ ప్రముఖులు ఉన్నారు. రక్తం, గోర్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తుండడంతో సెలబ్రిటీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. రక్తంలోని మలినాలను తొలిగించుకునేందుకు బిటాక్ట్స్ పరికరాలను సెలబ్రిటీలు ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. రూ.3,4 వేలకే డిటాక్ట్స్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

నల్గొండ: దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నర్సులు డాక్టర్ల అవతారమెత్తారు. గర్భిణీకి నర్సులు ప్రసవం చేయగా ఇద్దరు కవల పిల్లల్లో ఒకరుమృతి చెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం పై బంధువులు ఆందోళన చేపట్టారు.

10:10 - July 21, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం కష్టపడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘పవన్' ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. సినిమాకు సంబంధించిన టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.

సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలనే భావనతో 'పవన్' ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా నిన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. తాజాగా టీం బ‌ల్గేరియా షిఫ్ట్ అయింది. 20 రోజ‌లు పాటు అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న‌ట్టు స‌మాచారం. షూటింగ్ లో పాల్గొనేందుకు 'పవన్' బల్గేరియా వెళ్లారు. పవన్ వెళుతున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పవన్ సరసన కీర్తి సురేష్..అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బల్గేరియాలో వీరిద్దరిపై పాటలు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌ ‘రోబో 2.0’, 'వివేగం' మూవీ టీం కూడా బల్గేరియాలో కొన్ని సన్నివేశాలతో పాటు సాంగ్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'ప‌వ‌న్' సినిమా కూడా అక్క‌డికే బ‌య‌లుదేర‌డం విశేషం. దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

పలువురికి పూరీ డ్రగ్స్ సరఫరా చేసేవాడు: శ్యామ్!

హైదరాబాద్: సినీ పరిశ్రమలో పలువురికి పూరి జగన్నాథ్ సినీ పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసేవాడని సిట్ విచారణలో శ్యామ్ వెల్లడించినట్లు సమాచారం. మత్తు కలిగించే సిగరెట్లు తాడం, నిషాలో మాట్లాడడం సినీ ప్రముఖులకు సాధారణమే అని శ్యామ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.

10:05 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారు రోజుకొక్కరు చొప్పున సిట్ ఆఫీస్ హాజరరౌతున్నారు. డ్రగ్స్ కేసులో మూడో విచారణలో భాగంగా నేడు సుబ్బరాజును విచారించనున్నారు. ఇప్పటికే సుబ్బరాజు సిట్ ఆఫీస్ కు చేరుకున్నారు. సుబ్బరాజు పూరీ జగన్నాథ్ కు అతి సన్నిహితుడుగా పేరుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పోలవరం వద్ద స్థాయికి మించి గోదావరి పరవళ్లు

ప.గో: గోదావరికి వరద ఉధృతి పెరిగింది. పోలవరం వద్ద స్థాయికి మించి వరద ప్రవహిస్తోంది. పర్యాటక బోట్లను అధికారులు నిలిపివేశారు. అంతే కాకుండా పోలవరం పనులు కాఫర్ డ్యామ్, డయాఫ్రాం వాల్ పనులు కూడా నిలిచిపోయాయి.

ప్రారంభమైన కానిస్టేబుళ్ల శిక్షణ

హైదరాబాద్ : కమ్యూనికేషన్ పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాన్ని బేగంపేటలోని మెట్రో బ్యారెక్స్‌లో టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు తొమ్మిది నెలల శిక్షణ ఉంటుందని, మొత్తం 307 మంది అభ్యర్థుల్లో 103 మంది మహిళలు, 204 మంది పురుషులు ఉన్నారని అధికారు లు తెలపారు. అభ్యర్థులందరికీ ల్యాప్‌టాప్లు, కిట్లు అందజేశామన్నారు. అనంతరం క్యాంపస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీసు సీనియర్ అధికారులు మురళీకృషి, జే శ్రీనివాస్‌రావు, మిర్జా రియాజ్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డ గంజాయి..

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 45 కిలోల గంజాయి పట్టుబడింది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరు నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా గుర్తించారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను జీఆర్‌పీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రైల్వే కోర్టులో హాజరుపరిచారు.

09:56 - July 21, 2017

సంగారెడ్డి : జిల్లాలోని జహీరాబాద్‌లోని ప్రాంతీయ ఆసుపత్రిలో శుక్రవారం నుంచి ఐసీయూ సేవలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటి వరకు అత్యవసర సేవల విభాగం లేకపోవడంతో జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రోగులు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఐసీయూ ఏర్పాటుతో అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

09:56 - July 21, 2017

టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకపోయిన హీరోయిన్లు..వీరు..’కాజల్'..’రకూల్ ప్రీత్ సింగ్'...కాజల్ అగ్ర హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతుండగా 'రకూల్ ప్రీత్ సింగ్' కూడా వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ బిజీ బిజీగా మారిపోతోంది. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో ఆడిపాడిన 'రకూల్' పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రంలో కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది.

ఈ ముద్దుగుమ్మలిద్దరూ లండన్ లో కలిశారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘రకూల్ ప్రీత్ సింగ్' ‘అయారీ' సినిమాలో నటిస్తోంది. షూటింగ్ నిమిత్తం 'రకూల్' లండన్ కు చేరుకుంది. అయితే ఈ సమయంలో అక్కడనే ఉన్న 'కాజల్' ను 'రకూల్' కలుసుకున్నారు. విదేశాల్లో ఇలా కలిసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో.. అంటూ 'కాజల్‌'తో దిగిన ఫొటోను 'రకుల్‌' పోస్ట్‌ చేశారు. 'చాలా అద్భుతంగా సమయాన్ని గడిపాం' అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ప్రస్తుతం రకూల్ ప్రీత్ సింగ్ పలు సినిమాల్లో నటిస్తోంది. మురుగదాస్ 'స్పైడర్' లో మహేష్ బాబుకు జతగా 'రకూల్' నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్‌ పూర్తయినట్లు తెలుస్తోంది.

09:55 - July 21, 2017

నాగర్ కర్నూలు : రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల అక్రమ బదిలీల పరంపర కొనసాగుతోంది. బదిలీలకు అవకాశం లేదని గతంలో చెప్పిన ప్రభుత్వం... తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి జడ్ పీహెచ్ఎస్ నుంచి కొంతమంది టీచర్లను ... రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్ జడ్ పీహెచ్ఎస్ కి... వెల్దొండ జడ్ పీహెచ్ఎస్ నుంచి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ జడ్ పీహెచ్ఎస్కి బదిలీ చేస్తూ జీవో విడుదల చేసింది. ఈనెల 18వ తేదీన రంగారెడ్డి డీఈవో పేరుతో బదిలీలు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి.అయితే ఈ బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రెండేళ్ల నుంచి సాధారణ బదిలీల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే... నోటిఫికేషన్ విడుదల చేయని ప్రభుత్వం ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా బదిలీలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇష్టానుసారంగా బదిలీలు చేస్తూ పోతుంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు డబ్బులు దండుకుని అక్రమ బదిలీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అధికార పార్టీలోని కొత్త ఎంఎల్‌సీలు అక్రమ బదిలీలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. టీచర్లను బదిలీ చేయిస్తామంటూ హామీలు ఇచ్చినందున ఎన్నికైన వెంటనే పైరవీలు చేసి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఉత్తర్వులు జారీ చేయిస్తున్నట్టు సమాచారం. 

డ్రగ్స్ వ్యవహారంలో ఓ పత్రిక అధిపతి!

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణలో ఓ పత్రిక అధిపతి పేరును పూరీ జగన్నాథ్, శ్యామ్ లు ప్రస్తావించినట్లు సమాచారం. ఆ పత్రికలఅ ధిపతి తరచూ గోవా వెళ్లేవాడంటూ వెల్లడించారు. పూరీ జగన్నాథ్, శ్యామ్ ఇచ్చిన సమాచారంతో మరిన్ని ఆధారాలను సిట్ అధికారులు సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

భద్రాచలం వద్ద ఉరకలు పెడుతోన్న గోదావరి

భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ఉరకలు పెడుతోంది.ఒక్కరోజే పుణ్యక్షేత్రం భద్రగిరిలో 13 అడుగుల గోదా వరి పెరగడం 36.6 అడుగుల వద్ద గోదావరి నిలకడగా ఉంది.ఇదిలా ఉండగా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి తగ్గలేదు. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. పలు గిరిజన గ్రామాలకు ఏర్పడిన అంతరాయం తొలగలేదు.వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల:తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. కాలినడకన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

09:49 - July 21, 2017

బాలీవుడ్ లో బయోపిక్ ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖుల జీవిత కథల ఆధారంగా పలు సినిమాలు నిర్మితమయ్యాయి. ఈ సినిమాల్లో బాలీవుడ్ పేరొందిన హీరో..హీరోయిన్స్ నటించి అభిమానులను అలరించారు. తాజాగా 'అజయ్ దేవ్ గన్' మరో బయోపిక్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన 'భగత్ సింగ్' లాంటి పాత్రలు చేసి అందర్నీ మెప్పించాడు. మరాఠా వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది.

ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘అజయ్ దేవ్ గన్' హీరోగా నటిస్తున్నారు. సినిమాకు 'తానాజీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో 'అజయ్' యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను అజయ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఆయన తన ప్రజలు..తన నేల..తల్లి..తన రాజు ఛత్రపతి శివాజీ కోసం పోరాడారు. అద్భుతమైన భారత చరిత్రలో కీర్తించని యుద్ధ వీరుడు సుబేదార్ తానాజీ మలుసరే' అని ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమాలో ఎటువంటి యుద్దాలు ఉండబోతున్నాయో తెలిసేలా డిజైన్ చేశారు. మరాఠీ ఆర్మీ డ్రెస్ వేసుకొని కత్తి పట్టి రణరంగంలో తన వీరం చూపిస్తున్న తానాజీ రూపాన్ని చూపించారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

09:48 - July 21, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నారంట. తాజా చిత్రానికి సంబంధించిన స్పెషల్ న్యూస్ ఏదైనా అనౌన్స్ మెంట్..పోస్టర్స్..టీజర్స్ విడుదల చేస్తారా అని అనుకుంటున్నారా ? కాదు..ఓ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ప్రేక్షకులకు..అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నాడని సోషల్ మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

బుల్లితెరపై 'బిగ్ జీ' ఎంటర్ టైన్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరగబోతోంది. ఈ అవార్డు షోలో 'సల్మాన్ ఖాన్' పాల్గొననున్నారు. ఇతర అవార్డు కార్యక్రమాల్లో 'సల్మాన్' పాల్గొని సందడి చేస్తారనే సంగతి తెలిసిందే. డ్యాన్సులు..జోకులతో అందరి చేత నవ్వులు పూయిస్తూ హల్ చల్ చేస్తుంటారు.

బిగ్ జీ కార్యక్రమంలో పాల్గొనే 'సల్మాన్' మూడు కొత్త అవతరాల్లో కనిపించి థ్రిల్ చేయనున్నారని టాక్. తన సినిమాల్లో రొమాంటిక్ పాటలకు డ్యాన్స్..రెండో భాగంలో తన సినిమాల్లోని మంచి జోష్ ఉన్న పాటలకు డ్యాన్స్ చేయనున్నాడంట. ఇక మూడో భాగంలో ఏం చేయబోతున్నాడని సస్పెన్స్ ఉంచారు. అవార్డు కార్యక్రమాల్లోనే అందరికీ 'సల్మాన్' సర్ ఫ్రైజ్ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి అదేంటో తెలుసుకోవాలంటే బుల్లితెరపై ఆగస్టు 13 ప్రసారమయ్యే ఈ కార్యక్రమం చూడాల్సిందే.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'సల్మాన్' సరసన 'కత్రినా కైఫ్' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మొరాకాలో జరుగుతున్న షూటింగ్ లో సల్మాన్ గుర్రపుస్వారీ మెళుకవలు నేర్చుకుంటున్నాడు.

ముత్తూట్ దోపిడీ కేసులో నలుగురు అరెస్ట్

హైదరాబాద్: మైలార్ దేవులపల్లి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ యత్నం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైయిన వారిలో ఇద్దరు ఉస్మానాబాద్ కు చెందిన వారు ఉన్నారు. ముంబైకి చెందిన ఒకరు, బండ్లగూడకు చెందిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

సిట్ ఆఫీసుకు చేరుకున్న సుబ్బరాజు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సినీ నటుడు సుబ్బరాజును సిట్ నేడు విచారించనుంది. సిట్ ఆఫీసుకు సుబ్బరాజు చేరుకున్నాడు.

09:10 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు సిట్ ముందుకు నటుడు సుబ్బరాజు రానున్నాడు. సుబ్బరాజు ఉదయం 10.30 గంటలకు సిట్ ఆఫీస్ చేరుకుంటారు. సిట్ అధికారుల విచారణలో సుబ్బరాజుతో కెల్విన్ సంబంధాలపై ఆరా తీయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

08:15 - July 21, 2017

 

గ్రీస్ : దేశంలో భారీ భూకంపం సంభవించింది. కోస్ ఐలాండ్ లో భూకంప తీవ్రత ప్రభావం ఎక్కువ చూపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదు అయింది. భూకంప ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 100మందికి గాయాలయ్యాయి.

 

08:10 - July 21, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నలుగురు ఇంటర్ విద్యార్థులకు సిట్ కౌన్సిలింగ్ ఇచ్చారు. నలుగురు విద్యార్థుల్లో ఒకరు డాక్టర్ కుమారుడు, మరో ఇద్దరు ఎయిర్ పోర్టు నిర్మాణాలుచేపట్లే సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలుగా తెలుస్తోంది. వారు డార్క్ వెబ్ సైట్ నుంచి ఇంటి అడ్రస్ లకు ఎల్ఎస్ డీ డ్రగ్స్ ఆర్డర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు ఒకే ఇంటర్నేషనల్ కాలేజీ చెందిన విద్యార్థులు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

07:49 - July 21, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లా... దేవరపల్లిలో పర్చూరు మండలంలో జరుగుతున్న దళిత భూ వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దళితుల భూములను లాక్కునేందుకు అధికారులు ప్రయత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న దళితుల భూముల్లో నీరు-చెట్టు పనులు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు వ్యతిరేకంగా సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీని చేపట్టగా..స్థానిక బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. అలాగే గ్రామంలో సుమారు 30 మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించడానికి బయల్దేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వైవీని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దళితుల పట్ల చిన్న చూపు
దీంతో ప్రభుత్వ చర్యలపై సీపీఎం మధు ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరు-చెట్టు పేరుతో దళితుల భూములను లాక్కోవడం దౌర్భగ్యామని.. అన్నారు. టీడీపీ ప్రభుత్వం..ఎన్నికల ముందు హామీలిచ్చి... ఎన్నికల తర్వాత దళితుల పట్ల చిన్న చూపు చూడడం దారుణమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై టీడీపీ ఎమ్మెల్యేలు .. వారి అనుచరగణం కోట్ల రూపాయల సంపాదనకు తెర లేపారని విమర్శించారు. ప్రజలు త్వరలోనే చంద్రబాబునాయుడుకి బుద్ధి చెబుతారని అన్నారు.సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూముల్లో.... రాత్రికి రాత్రే 400 మంది పోలీసులను గ్రామంలోకి దించి..15 ప్రొక్లైనర్‌లతో చెరువు తవ్వడం మొదలుపెట్టారని...ఇదెక్కడి అన్యాయమని గ్రామస్థులు వాపోతున్నారు. దళితులపై అక్రమాలకు పాల్పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చరమ గీతం పాడతామని మధు హెచ్చరించారు. శుక్రవారం అన్ని పార్టీలతో కలిసి ఛలో దేవరాపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

07:48 - July 21, 2017

హైదరాబాద్ : ఎన్నో ప్రశ్నలు..మరెన్నో సందేహాలు...వీటన్నింటిపై సిట్ బృందం కెమెరామెన్ శ్యాంకెనాయుడిని విచారించింది...డ్రగ్స్ కేసులో టాలివుడ్‌లోని 12 మందికి నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెండో రోజు శ్యాంను విచారించారు.. ప్రధానంగా డ్రగ్స్ కింగ్ పిన్ కెల్విన్‌తో ఎలాంటి సంబంధాలు కొనసాగించారన్న దానిపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీశారు...ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దాదాపు ఆరు గంటలపాటు సాగిన విచారణలో శ్యాం పూర్తి సమాచారం అందించినట్లు తెలిసింది...సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు మధ్యలో తడబడ్డా ఆ తర్వాత తేరుకుని తనకు తెలిసిన సమాచారం అందించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే కొన్ని గంటలపాటు రకరకాల ప్రశ్నలతో సిట్ అధికారులు శ్యాంను విచారించగా సూటిగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది..దీంతో అధికారుల విచారణ...అటు అధికారులు శ్యాం చెప్పిన సమాధానాలపై సంతృప్తి చెందారు.ఎక్సైజ్ నోటీసు అందుకున్న శ్యాం ఉదయం తన న్యాయవాది, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు...అధికారులను కలవడంతో అప్పటికే ఏర్పాట్లు చేసి ఉండగా ఉదయం పదిన్నరకు ప్రశ్నించడం మొదలయింది...పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన అధికారులు నాలుగుగంటల సమయంలో శ్యాంను తిరిగి పంపించారు.

డాట్‌నెట్‌వర్క్‌
ఇదిలా ఉండగా డ్రగ్స్‌కు ప్రధానంగా డాట్‌నెట్‌వర్క్‌ నుంచి ఆర్డర్లు బుక్ చేసుకోవడంతో ఆ పార్శిల్స్‌ డీహెచ్‌ఎల్‌, బ్లూ డాట్‌, ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థల నుంచి నగరానికి చేరాయి..దీంతో ఆయా మూడు సంస్థలతో సిట్ అధికారులు సమావేశం నిర్వహించారు.. సంస్థల ప్రతినిధులు చెప్పిన సమాచారాన్ని రికార్డు చేశారు...అయితే ఇందులో ప్రధానంగా ఏయే దేశాల నుంచి కొరియర్లు వచ్చాయి.. ఎవరి పేరు మీద చేరాయి..వాటిని రిసీవ్ చేసుకున్నదెవరు..? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు.ఇక సిట్ నోటీసులు జారీ చేసి రోజుకొకరు చొప్పున విచారిస్తుంది..ఇందులో టాలివుడ్ చెందిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను మొదటి రోజు కాగా..రెండో రోజు కెమెరామెన్ శ్యాంకె నాయుడు విచారణ పూర్తయింది..ఇక మూడో రోజు నటుడు సుబ్బరాజును విచారించనున్నారు...సుబ్బరాజు ఉదయాన్నే సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు...అయితే సుబ్బరాజు డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా..? సరఫరా చేశారా..? డ్రగ్స్ తీసుకున్న..డీలింగ్ చేసినవారితో ఎలాంటి సంబంధాలున్నాయన్నదానిపై ఆరా తీయనున్నారు.. అన్ని రకాల ఆధారాలతో ప్రశ్నలు రెడీ చేసుకున్న సిట్ సుబ్బరాజును రేపు ఉదయం నుంచి విచారించనుంది.

07:45 - July 21, 2017

పశ్చిమగోదావరి : వారు సంఘవిద్రోహులు కాదు.. దేశద్రోహులు అసలేకాదు.. కాలుష్యం వెదజల్లే ఆక్వా పరిశ్రమను వద్దంటున్న తుందుర్రు గ్రామస్థులు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దని వారు వేడుకుంటున్నారు.. పాలకులు వారి విన్నపాలను పెడచెవిన పెట్టారు. వేరే దిక్కు లేక, గ్రామస్థులంతా కలిసికట్టుగా ఆక్వా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. అంతే.. పోలీసులు శివాలత్తిపోయారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ యాజమాన్యపు ఉద్యోగులా అన్నట్లుగా ప్రవర్తించారు. గ్రామాలపైబడి దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. పశ్చిమగోదావరిజిల్లా తుందుర్రులో ప్రభుత్వ దౌర్జన్యకాండ గురువారం నాడూ కొనసాగింది. ఆక్వాఫుడ్‌ పార్క్ వద్దంటున్న గ్రామస్తులపై చంద్రబాబుప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలాది మంది ఖాకీలు తెల్లవారకముందే గ్రామాలపై దాడిచేశారు. ఇళ్లలోని మగవారినందరినీ లారీల్లో తరలించారు. బాధలు చెప్పుకోవాలని ప్రయత్నించిన ఆడవాళ్లను మీడియాసాక్షిగా నోరు నొక్కేశారు. పచ్చని పల్లెలగుండెల్లో విషాన్ని నింపడానికి చంద్రబాబు సర్కార్‌ ఎందుకంత ఉత్సాహం ప్రదర్శిస్తోందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటును మొదటి నుంచి గ్రామస్తులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు.. పర్యావరణ కాలుష్యం, భూగర్భజలాలు కూడా కలుషితం అవడంతోపాటు బంగారుపంటలు పండే భూములు నిస్సారంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా స్థానికుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం..ఆక్వా యాజమాన్యానికి వత్తాసుపలుకుతోంది. ఇప్పటికే 80శాతం పూర్తయిన ఆక్వాపరిశ్రమకు ఇపుడు యంత్రసామాగ్రిని తరలిస్తోంది.

ప్రభుత్వం దౌర్జన్యం
దీనిపై గ్రామస్తులు భగ్గున మండిపడుతున్నారు. తమ అభ్యంతరాలను వినిపించుకోకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా వ్వహరిస్తోందని ఆగ్రహం వ్యతక్తం చేస్తున్నారు. తుందుర్రుతోపాటు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న గ్రామాలను దాదాపు 800 మందిపోలీసులు దిగ్బంధం చేశారు. మిషనరీ తరలించే దారిపొడవునా వందలాది మంది పోలీసులు పహరా కాశారు. గ్రామాల్లో మగవారినందరినీ గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. తమ వాళ్లు ఏమయ్యారో చెప్పాలన్న మహిళలను.. కనీసం మాట్లాడకుండా దౌర్జన్యం ప్రదర్శించారు. గ్రామస్తుల ఆందోళనకు అండగా నిలిచిన సీపీఎం నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు.

లాఠీలతో చితకబాదారు..
తమ జీవితాలను ప్రమాదంలో పడేసే ఆక్వాఫుడ్‌పార్క్‌ను ఎలాగైన అడ్డుకోవాలని నర్సాపురం నుంచి మిషనరీతో వస్తున్న లారీలకు గ్రామస్తులు అడ్డుతగిలారు. పోలీసులు లాఠీలతో చితకబాదుతుంటే.. తట్టుకోలేని ప్రజలు కారప్పొడిచల్లుతూ ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. వంటిపై కిరోసిన్‌పోసుకుని నిరసన తెలిపారు. ప్రాణాలు తీసే ఆక్వాపరిశ్రమ వద్దన్నందుకే చంద్రబాబు సర్కారు పోలీసులతో దాడికి దిగిందని తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దమనకాండను ప్రదర్శించినా ఆక్వాఫుడ్‌ ఫార్క్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు. 

07:42 - July 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలోని విద్యారంగ సమస్యలపై ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్దమవుతున్నాయి. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ... నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. విద్యారంగంలో ఎలాంటి మార్పులు రాలేదని... కేజీ టూ పీజీ పేరుతో ప్రచారం మొదలుపెట్టి ఆ పథకానికి మంగళం పాడారని ఆరోపించాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన సర్కార్‌.. ఆ దిశగా ప్రయత్నించడం లేదన్నాయి. 

07:41 - July 21, 2017

హైదరాబాద్ : నిరసన కార్యక్రమాలతో... హడావిడి చేసే... ఎన్‌ఎస్‌యూఐ ..తన పంథా మార్చుకుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఈ విద్యార్థి సంఘం... విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ...చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యార్థుల్లో మరింత బలపడే దిశగా... ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మధ్య క్యాంపస్‌ యాత్రలు.. హాస్టల్‌ యాత్రలు చేపట్టింది.తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్‌ఎస్‌యూఐ తొలి కార్యక్రమంగా క్యాంపస్‌ యాత్రను చేపట్టింది. అధ్యక్షుడు వెంకట్‌ నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలను సందర్శించారు. అక్కడి వసతులు నుంచి ఫ్యాకల్టీ వరకు...తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మహత్యలపై కూడా అధ్యయనం చేసి రాహుల్‌కు నివేదిక అందించారు. అనంతరం చైతన్య యాత్రల ద్వారా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో వసతులు, సమస్యలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గుర్తించిన విద్యార్థి సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు అందించి... విద్యార్థి గర్జనల పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ప్రభుత్వం చెల్లించకపోవడంపై అన్ని జిల్లాల్లో విద్యార్థి గర్జనలు నిర్వహించారు.ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో సమస్యలపై కూడా ఎన్‌ఎస్‌యూఐ పోరుకు దిగింది. తాండూర్‌ నుంచి షాద్‌ నగర్‌ వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా 19 ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి...అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. ముగింపు రోజున వేలాది మంది విద్యార్థులతో పెద్దఎత్తున సభను నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో...తెలంగాణ సర్కార్‌ విఫలమైందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విమర్శించారు. మొత్తానికి ఎన్‌ఎస్‌యూఐ క్షేత్రస్థాయిలో విద్యార్థుల సమస్యలను గుర్తించి... వాటిపై అధ్యయనానికి, పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తోంది. 

07:39 - July 21, 2017

సిరిసిల్ల : మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ స్థానం పరిధిలోని నేరెళ్లలో దళితులపై దాడి జరిగింది. దాడి చేసింది ఎవరో కాదు.స్వయాన ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కావడం గమనించదగ్గ విషయం. పోలీసుల లాఠీల కాఠిణ్యానికి దళితుల వీపులు చీరుకుపోయాయి. కాళ్లు, చేతులు విరిగాయి. పోలీసులు ఇచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌, థర్డ్‌ డిగ్రీ పద్ధతులకు నిలువెత్తు నిదర్శమనే ఈ రక్తపు మరకలు, గాయాలు. చేయని తప్పుక నేరెళ్ల గ్రామ దళితులు శిక్ష అనుభవిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా చెలగేరిపతోంది. అడ్టూ అదుపూ లేకుండా తిరుగున్న లారీ డ్రైవర్ల నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లో అమయాకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంతూ, పొంతూ లేకుండా పోతున్న లారీ డ్రైవర్ల ఆడగాలను నిరసిస్తూ నేరెళ్ల గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. లారీ ఢీకొని భూమయ్య చనిపోవడంతో ఆగ్రహోదగ్ధులైన నేరెళ్లవాసులు ఐదు లారీలను దహనం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు గ్రామస్తులను విరుచుకుపడ్డారు.

దళితు వీపులపై కరాళ నృత్యం
రెండు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తమనే ఎదరిస్తారా అంటూ ఖాకీల లాఠీలు నేరెళ్ల దళితు వీపులపై కరాళ నృత్యం చేశాయి.ఇందుకు ఈ బాధితులే సాక్ష్యం. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న నేరెళ్ల దళిత బాధితులను పరామర్శించారు. గాయాలను చూసి చలించిపోయారు. ఇది అమానుషమంటూ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ... గాంధీభవన్‌లో అత్యవసరంగా భేటీ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఉద్యమ కార్యచరణ రూపొందించింది. టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు రక్షణలేకుండా పోయిందన్న అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. తద్వారా క్షేత్రస్థాయిలో దళితులను టీఆర్‌ఎస్‌కు దూరం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్లాలని స్కెచ్‌ వేసింది. నేరెళ్ల ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేంగా జరిగే పోరాటంలో భాగంగా ఈనెల 25న రాజన్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు వినితపత్రం అందించాలని నిర్ణయించింది. అలాగే ఈనెల 27న తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేయాలని ప్లాన్‌ చేసింది.

పార్లమెంట్ లో ప్రస్తావిస్తాము
పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా దీనిని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. నేరెళ్ల ఘటనపై ఉద్యమించడంతోపాటు హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్‌ ముందుకు తెచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దళితులపై పోలీసులు చేసిన దాడిని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని డిసైడ్‌ అయింది. నేరెళ్ల ఘటనపై కేటీఆర్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా దళితులకు మరింత దగ్గరకావాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 

07:38 - July 21, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఏ సమస్య తెరపైకి వచ్చినా అధికార టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎప్పుడూ చకోరపక్షిలా ఎదురు చూస్తూనే ఉంటుంది. గతంలో రైతుల ఆత్మహత్యలు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, మిర్చిరైతుల గిట్టుబాటు ధరల సమస్యలపై ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికేలా చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు డ్రగ్స్‌ మాఫియాను అస్త్రంగా చేసుకుని అధికార టీఆర్‌ఎస్‌పై వాగ్బాణాలు సంధిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ల మధ్య డ్రగ్ మాఫియా ఆజ్యం పోస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని గులాబీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మాదకద్రవ్యాల మాఫియాపై అధికార టీఆర్‌ఎస్‌పై మూకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు, అవసరమైనప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతున్నారు.

నకిలీ వెబ్‌సైట్లు
తెలంగాణ పోలీసులు ఐసిస్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించారని రెండు నెలల క్రితం ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్... ఇప్పుడు మరో సారి డ్రగ్స్‌ మాఫియాపై తనదైన శైలిలో స్పందించారు. జంటనగరాల్లో వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా అంశంపై ఇప్పటి వరకు సినీ ప్రముఖులు, విద్యాసంస్థల చుట్టూనే తిరిగింది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ కీలక నేతల సన్నిహితులకు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, దిగ్విజయ్‌సింగ్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ ప్రముఖులను విచారిస్తున్న సిట్‌... మాఫియాతో టీఆర్‌ఎస్‌ నేతల సన్నిహితులకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతుందో... లేదో.. అంటూ ట్విట్టర్‌లో అనుమానాలు వ్యక్తం చేశారు. దిగ్విజయ్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెద్ద మనిషిలా వయసుకు తగిన విధంగా వ్యవహరించాల్సిన దిగ్విజయ్... రాజకీయాల నుంచి గౌరవప్రదంగా వైదొలగాల్సిన సమయం వచ్చిందని ట్వీట్‌ చేసి, కాంగ్రెపై విరుచుకు పడ్డారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు రాజకీయంగా అనుమానాలకు తావిస్తుండటంతో అధికార పార్టీ నేతలను కూడా కొంత అయోమయానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతల మధ్య ట్వీట్స్‌ వార్‌కు కారణమైన డ్రగ్స్ వ్యవహారం కొత్త కిక్ ఇచ్చేలా కనిపిస్తోంది.

07:24 - July 21, 2017

చంద్రబాబు నాయుడు గతం నుంచి గుణపాఠం నెర్చుకున్నట్టు కనపడడంలేదని, గతంలో అంగన్ వడీలను గుర్రలను తొక్కించారని. కరెంట్ సమస్యం పై పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరపడం తెలిసిన విషయమేనని, పర్యవరణం అనగానే దళితుల భూములు గుర్తుస్తున్నాయని నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు రైతుల భూములను లాక్కొలేదని, అమరావతి విషయంలో రైతులు స్వచ్ఛదంగా అప్పగించారని, ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

07:05 - July 21, 2017

రాష్ట్రంలో కౌలు రైతులు 32 లక్షల మంది ఉన్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీకెళ్లడం కోసం ఈ పోరు యాత్ర చేశారు. యాత్ర సందర్భంగా వెళ్లినప్పుడు వారికి చాలా వారకు 2011కౌలు రైతు చట్టం ఉందని ఎవరికి తెలియదని, కొన్ని సందర్భంలో వ్యవసాయ అధికారులు, భూయాజమానులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలేదని, రుణాల కోసం పట్టా పుస్తకం తీసుకురామ్మని చెబుతున్నారని ఏపీ కౌలు రైతు సంఘం అధ్యక్షుడు జమలైయ్య అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss