Activities calendar

22 July 2017

సోమవారం నవదీప్ ను ప్రశ్నిస్తాం : అకున్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సోమవారం ఉదయం 10.30 గంటలకు నవదీప్ ను ప్రశ్నిస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. పబ్ లు, బార్ల యజమానులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎఫ్ క్లబ్ లైసెన్సు రద్దు చేసినట్లు తెలిపారు. 

 

22:05 - July 22, 2017

ఇది ఎందరో జీవితాల వ్యధ.. ఎందరో కన్నీళ్ల కథ. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మానవ అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. అదే సమయంలో గడపదాటితే చాలు.. పంజా విసిరేందుకు ఎదురుచూస్తున్న కళ్లు ఎన్నో ఉన్నాయి. మానవ మృగాల బారిన పడ్డ ఎందరో ఆడపడచుల జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి. వారి ప్రమేయం లేకుండా జరుగుతున్న మృగాళ్ల పంజా ఎందరినో నాలుగు గోడల మధ్య బంధీని చేస్తోంది. చీకట్లో మగ్గేలా చేస్తోంది. ఇలాంటి అమాయకురాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. సరికొత్త జీవిత ప్రయాణానికి మార్గం చూపాల్సి పాలకులను ప్రశ్నించే కన్నీటి వ్యధలెన్నో ఉన్నాయి. ఇంకెంతకాలం..ఈ ఆవేదన..ఇదీ కథకాదు...ఏ రియల్ స్టోరీ.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:46 - July 22, 2017

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల వీరంగాన్ని టీ మాస్‌ ఫోరం తీవ్రంగా ఖండించింది.. దళితుల్ని చితకబాది అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టింది.. బాధితులకు అండగా నిలిచిన బృందం సభ్యులు... బాధితుల తరపున న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.. 
పోలీసుల థర్డ్ డిగ్రీతో నరకయాతన 
ఎవరిని కదిపినా కన్నీళ్లే..పోలీసుల చిత్రహింసలు అనుభవించిన వారి రోదనలే..పోలీసుల థర్డ్ డిగ్రీతో నరకయాతన అనుభవించిన దళితులు..రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన టీ మాస్‌ బృందానికి కనిపించిన దృశ్యాలివి.. మహిళల ఆవేదన, వారి కన్నీళ్లు అక్కడున్న ప్రతిఒక్కరినీ కదిలించాయి.. బాధితులందరినీ టీ మాస్‌ బృందం ఓదార్చింది.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది.. 
లారీ ఢీకొని భూమయ్య మృతి 
నేరెళ్ల గ్రామంలో ఈ నెల 2న ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే నిరుపేద మృతిచెందాడు.. గడచిన ఆరు నెలల్లో ఇసుక లారీలు నలుగురి ప్రాణాలు తీశాయి.. 46మందిని గాయాలపాలు చేశాయి.. భూమయ్య మృతితో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. అర్ధరాత్రి గ్రామస్తులు రోడ్డుపైకివచ్చారు.. కొందరు దుండగులు లారీలకు నిప్పంటించారు.. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
గ్రామాల్లో పోలీసుల ప్రతాపం 
నేరెళ్ల ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల్లో తమ ప్రతాపం చూపారు.. అర్ధరాత్రి మఫ్టీలోవచ్చి నిద్రపోతున్న అమాయకులను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు.. కేసులుపెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.. 
బాధిత కుటుంబాలను పరామర్శించిన టీ మాస్‌ బృందం  
బాధిత కుటుంబాలను టీ మాస్‌ బృందం పరామర్శించింది.. బృందాన్ని కలిసిన మహిళలు తమ గోడు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు.. పోలీసు దెబ్బలనుంచి తమ కుటుంబసభ్యులు కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదన విన్న టీమాస్‌ బృందం సభ్యులు... వారందరినీ ఓదార్చారు.. పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, అమాయకులను చితకబాదడం ఏరకమైన ప్రజాస్వామ్యం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీమాస్‌ నేత జాన్‌ వెస్లీ.. బాధితుల కుటుంబాలకు పోలీసులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీమాస్‌ ఫోరం భరోసానిచ్చింది. వారందరితరపున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చింది.

 

21:38 - July 22, 2017
21:37 - July 22, 2017

హైదరాబాద్‌ : నగరంలో మద్యంమత్తులో యువకుడు రెచ్చిపోయాడు. మరో యువకుడిపై యాసిడ్‌ దాడి చేశాడు. హైదరాబాద్‌ చత్రినాక పీఎస్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. ఉప్పగూడ అరుంధతి కాలనీలో మద్యం సేవించిన ఇద్దరు యువకులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.. తాగిన మత్తులో అనిల్‌పై నర్సింగ్‌ అనే యువకుడు యాసిడ్‌ పోశాడు.. ఈ దాడిలో గాయపడ్డ అనిల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.. సీసీ ఫుటేజ్‌ద్వారా నిందితుడి గుర్తించిన పోలీసులు... నర్సింగ్‌ను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:34 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణను తప్పుపడుతూ రాంగోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ వివాదాస్పదమయ్యింది. అకున్‌ సబర్వాల్‌ను.. మీడియా బాహుబలి తరహాలో పొగిడేస్తుందని అక్కసు వెల్లగక్కాడు. అకున్‌ సబర్వాల్‌తో రాజమౌళి.. బాహుబలి-3 తీస్తాడేమోనని చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్‌శాఖ తీవ్రంగా స్పందించింది. తమకు సినీ ఇండస్ట్రీపై ఎలాంటి కోపం లేదని... డ్రగ్స్‌ను నివారించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే... వర్మపై ఎక్సైజ్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఆత్మస్థైరాన్ని దెబ్బతీసున్న వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
డ్రగ్స్ విచారణ తీరుపై వర్మ ఆరోపణలు 
డ్రగ్స్‌ కేసు వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేస్తుండగా... తాజాగా రాంగోపాల్‌వర్మ ట్వీట్లు మరింత వివాదాస్పదమవుతున్నాయి. అకున్‌ సబర్వాల్‌, ఎక్సైజ్‌ అధికారుల విచారణ తీరుపై సోషల్‌ మీడియాలో వర్మ ఆరోపణలు చేశాడు. పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజులను విచారించినట్లు డ్రగ్స్‌ తీసుకున్న పిల్లలను కూడా విచారిస్తారా ? అని ఎక్సైజ్‌ అధికారులను ప్రశ్నించాడు. ఎక్సైజ్‌శాఖ సినీ పరిశ్రమను టీజర్‌, ట్రైలర్‌లా వాడుకుని ఉనికి చాటుకుంటుందన్నారు. మీడియాలో వస్తున్న కథనాలకు అకున్‌ సబర్వాల్‌ ఎందుకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం లేదని ప్రశ్నించారు. సబర్వాల్ మౌనంతో ఇండస్ట్రీలో కొందరి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్నారు. అకున్‌ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి స్థాయిలో చూపిస్తుందన్నారు. అకున్‌ సబర్వాల్‌తో రాజమౌళి బాహుబలి-3 తీస్తాడేమోనని చమత్కరించాడు. అయితే.. ఈ ట్వీట్‌పై మీడియాలో దుమారం చెలరేగగా... గంట తర్వాత వర్మ మరో కామెంట్‌ను పోస్ట్‌ చేశాడు. అకున్‌ సమగ్రతను ఎవరూ తప్పుపట్టడం లేదని వ్యాఖ్యానించాడు. అయితే... సరైన రుజువులు లేకుండా... వారి ప్రతిష్టను దిగజార్చేలా మీడియాకు లీక్స్‌ ఇస్తున్నారన్నారు వర్మ. 
విచారణను నీరుగార్చే ప్రయత్నం చేయవద్దు : చంద్రవదన్ 
ఇక వర్మ కామెంట్స్‌పై ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ స్పందించారు. విచారణను నీరుగార్చే ప్రయత్నం చేయవద్దన్నారు. కొంతమంది ట్వీట్లు చేస్తూ విచారణాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్నారు. కేసు విచారణ పూర్తయ్యేవరకు అందరూ సంయమనం పాటించాలన్నారు. 
వర్మ కామెంట్స్‌పై రిటైర్డ్‌ ఉద్యోగులు మండిపాటు 
ఇదిలావుంటే... వర్మ కామెంట్స్‌పై ఎక్సైజ్‌శాఖ రిటైర్డ్‌ ఉద్యోగులు మండిపడ్డారు. విచారణాధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కామెంట్‌ చేసిన వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వర్మపై చర్యలు తీసుకునే వరకు తాము పోరాడుతామన్నారు. 
డ్రగ్స్‌ పాపం కాంగ్రెస్‌దే : నాయిని
ఇక డ్రగ్స్‌ పాపం కాంగ్రెస్‌దే అన్నారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. సమాచారం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్‌... పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారన్నారు. టీఆర్‌ఎస్‌కు నేతలకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే... డ్రగ్స్‌తో ఎవరికీ లింక్‌లు ఉన్నా చర్యలు తప్పవన్నారు నాయిని. మొత్తానికి వర్మ కామెంట్స్‌ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే.. వర్మపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేస్తుండడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

 

21:29 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రతి నెల తరుణ్‌ గోవాకు వెళ్లడం లాంటి సమాచారం సేకరించిన సిట్‌ అధికారులు... వాటిపై విచారించారు. ఇక తరుణ్‌కు డ్రగ్స్‌ అలవాటు ఉందా ? లేదా ? అని తెలుసుకునేందుకు క్లూస్‌ టీమ్‌ను పిలిపించి ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకున్నారు. నాలుగు రోజుల విచారణలో తొలిసారి క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. ఇక ఉస్మానియా వైద్యులు బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించారు. సోమవారం నవదీప్‌ను విచారించనున్నట్లు సిట్‌ అధికారులు తెలిపారు. చార్మి కూడా విచారణకు సిట్‌ కార్యాలయానికి వస్తున్నట్లు తెలిపారు. ఇక ఈరోజు పబ్బులు, బార్ల యజమానులతో సమావేశమైన ఎక్సైజ్‌ అధికారులు... 14 బార్లు, పబ్బులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎఫ్ క్లబ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సోమవారం నవదీప్‌ను విచారించనున్నట్లు సిట్‌ తెలిపింది. అదేవిధంగా చార్మి కూడా విచారణకు రానున్నట్లు సిట్‌ కార్యాలయానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈరోజు డ్రగ్స్‌ సప్లయి చేస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మహ్మద్‌ ఉస్మాన్‌, ఆర్నావ్‌ మండల్‌ల నుంచి 20 గ్రాముల ఎండిఎంఏను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇబ్బందుల్లో హీరో తరుణ్‌..?
డ్రగ్స్‌ కేసులో సినీ హీరో తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. తరుణ్‌ ఇబ్బందుల్లో కూరుకున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి క్లూస్‌ టీమ్‌ చేరుకుంది. తరుణ్‌ నుంచి క్లూస్‌ టీమ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోనుంది. డ్రగ్స్‌ కేసు విచారణలో తొలిసారి క్లూస్‌టీమ్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చింది. గోవాలో డ్రగ్స్‌కు సంబంధించిన పలు వివరాలను సిట్‌ సేకరించింది. వాటి గురించి తరుణ్‌ను సిట్‌ విచారిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:03 - July 22, 2017

డ్రగ్స్ సినిమాల నటిస్తున్న తెలుగు నటులు..ఆఖిరికి అకున్ సారే విలన్ గ తేల్తడేమో..? సర్కారు మీద నిరుద్యోగి అక్షర యుద్ధం..ఫేస్ బుక్ ల చక్కర్లుగొడుతున్న ముచ్చట, గవర్నమెంటు జాబులు అమ్మబడును..విశాఖపట్నంల నిరుద్యోగులకు టోకరా, బాయిలకు దుంకిన టెక్కలి ఎస్ ఐ... సిక్కోలు జిల్లాల రియల్ హీరో రాజేశ్, ఆర్మూర్ మండలంల దళితుల ఘోస..మంథనికాడ ఊర్ల నుంచి ఎలేసిండ్రంట నొస, ఏటీఎంలో పైకం పెట్టి తాళం మరిసిండ్రు.. కస్టమర్ కబురుతోటి కదిలిన బ్యాంకొళ్లు...ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:41 - July 22, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన డ్రగ్స్‌ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.. డ్రగ్స్ సరఫరాకు..  కొరియర్లేకాదు.. పోస్టల్‌ సర్వీస్‌ను కూడా వాడుకుంటున్నట్లు సిట్‌ విచారణలో తేలింది.. ఎక్సైజ్‌ లేఖతో అప్రమత్తమైన పోస్టల్‌ శాఖ.. హైదరాబాద్‌లోని 109 పోస్టల్‌ డెలివరీ ఆఫీసుల్ని అలర్ట్‌ చేసింది. 
పోస్టల్‌ సర్వీస్‌ ద్వారా డ్రగ్స్‌ పార్శిళ్లు
డ్రగ్స్‌ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. ఎయిర్‌పోర్టులు, రోడ్డుమార్గాలు.. కొరియర్‌ ద్వారానేకాకుండా... ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసుల ద్వారా కూడా డ్రగ్స్‌ హైదరాబాద్‌కు చేరుతున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.. వెంటనే పోస్టల్‌ శాఖను అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు.. ఈ లేఖ అందుకున్న పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారులు.. హైదరాబాద్‌లోని 109 పోస్టల్‌ డెలివరీ ఆఫీసులను, సిబ్బందిని అలర్ట్‌ చేశారు.. విదేశాలనుంచి వచ్చే పార్శళ్లను ఓ కంట కనిపెట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా నెదర్లాండ్స్, నైజీరియాలాంటి దేశాలనుంచి వస్తున్న ఉత్తరాలు, పార్శిళ్లను గమనించాలని సిబ్బందికి ఆదేశాలు అందాయి.. తరచుగా పార్శిళ్లు అందుకునే వ్యక్తులప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే వెంటనే తెలియజేయాలంటూ సిబ్బందికి అధికారులు సూచించారు..
డార్క్‌ నెట్‌ ద్వారా నగరానికి డ్రగ్స్‌  
డ్రగ్స్‌ ఎక్కువగా డార్క్‌ నెట్‌ ద్వారా నగరానికి వస్తున్నాయి.. అయితే భారత్‌కువచ్చే ప్రతి పార్శిల్‌ను కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయాలి..... ఈ సోదాలు అంతంతమాత్రంగా సాగడంతో నగరానికి డ్రగ్స్‌ తరలింపు యధేచ్చగా సాగుతోందన్న విమర్శలున్నాయి.. ఇకనుంచి అలా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్‌ రాకెట్‌ కలకలం నేపథ్యంలో అధికారులు తనిఖీలను కూడా మరింత పెంచాల్సిన అవసరముంది..  

 

20:30 - July 22, 2017

హైదరాబాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి తరుణ్‌ను అనేక అంశాలపై విచారిస్తున్నారు. ఇప్పటికే గోవా నుంచి తరుణ్‌కు సంబంధించిన సిట్‌ అధికారులు... వాటిపై విచారిస్తున్నారు. విచారణకు తరుణ్‌ సహకరిస్తున్నారని సిట్‌ అధికారులు తెలిపారు. ఇక సోమవారం నవదీప్‌ను విచారిస్తామన్నారు. అలాగే 26న చార్మి సిట్‌ కార్యాలయానికి విచారణకు రానున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇక ఈరోజు బార్‌, పబ్‌ ఓనర్లను విచారించిన ఎక్సైజ్‌ అధికారులు.... ఎఫ్‌ క్లబ్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. అదేవిధంగా... 14 బార్లు, పబ్బులకు సీరియస్‌ వార్నింగ్‌లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 
ఇబ్బందుల్లో తరుణ్‌  
డ్రగ్స్‌ కేసులో సినీ హీరో తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. తరుణ్‌ ఇబ్బందుల్లో కూరుకున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి క్లూస్‌ టీమ్‌ చేరుకుంది. తరుణ్‌ నుంచి క్లూస్‌ టీమ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోనుంది. డ్రగ్స్‌ కేసు విచారణలో తొలిసారి క్లూస్‌టీమ్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చింది. గోవాలో డ్రగ్స్‌కు సంబంధించిన పలు వివరాలను సిట్‌ సేకరించింది. వాటి గురించి తరుణ్‌ను సిట్‌ విచారిస్తోంది. 

20:21 - July 22, 2017

టెంపర్ సింగర్ ఉమానేహాతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన కెరీర్ ను వివరించారు. తన అనుభవాలను పంచుకున్నారు. పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని విషయాలను ఆమె మాటల్లోనే...'చిన్నప్పటి నుంచి సింగింగ్ చేస్తున్నా. స్కూల్, కాలేజీలో పాడాను. పాటలు వినడం వల్లే సింగింగ్ పై ఆసక్తి కలిగింది. ఐడియా సూపర్ సింగర్ కార్యక్రమంలో పాల్గొన్నాను. సినిమా ఇండస్త్రీలో మొదట పాట పాడాను. నా ఇష్టం సినిమాలో పాట పాడాను. లక్, హార్డ్ వర్క్ చేయాలి. అన్ని జానర్స్ పాటలు ఇష్టం. టెంపర్, జ్యోతిలక్ష్మీ సినిమాలోని పాటలు పాడి వినిపించారు. లైఫ్ లో ఫస్ట్ టైమ్ యూఎస్ వెళ్లాను. ఎన్ టిఆర్, కాజల్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్, ఆర్ జీవీ మంచి కాప్లిమెంట్ ఇచ్చారు. 'అదిరేటి డ్రస్సు మే వేస్తే' పాట పాడినందుకు బెస్టు మార్కులు వచ్చాయి. ఇటీవల బాబు బంగారంలో పాట పాడాను'. అని వివరించారు. పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. వాటిని వీడియోలో చూద్దాం...

తరుణ్ కు ఫస్ట్ షో మొదలుపెట్టిన సిట్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో తరుణ్ కు సిట్ అధికారులు ఫస్ట్ షో మొదలు పెట్టారు. ఉదయం 10.30 నుంచి విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం భోజనం చేయనంటూ తరుణ్ మారాం చేశారు. ఆపిల్ తోనే సరిపుచ్చుకున్నారు. తాను తెలిసి డ్రగ్స్ తీసుకోలేదని తెలవకుండా వేసుకున్నానేమోనని అతి తెలివి సమధానాలు చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ ఎలా అలవాటు అయింది.. పబ్బుల్లో డ్రగ్స్ లావాదేవీలు ఎలా జరుగుతాయంటూ...తరుణ్ ను సిట్ అధికారులు ఆరా తీశారు. 

గంజాయి తరలిస్తున్న కార్లు పట్టివేత

రంగారెడ్డి : నార్సింగి పీఎస్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై గంజాయి తరలిస్తున్న కార్లను పట్టుకున్నారు. రూ.40 లక్షల విలువైన గంజాయి స్వాధీనం, 2 కార్లను సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

19:25 - July 22, 2017

ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో డీజీపీకి నివేదిక

కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో డీజీపీకి... అదనపు డీజీ గోపికృష్ణ నివేదిక సమర్పించారు. బ్యూటిషియన్‌ శిరీష ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ హరీందర్‌కు ఫోన్‌ చేశాడు. ఉదయం 11 గంటలకు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో 27 మందిని విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

19:22 - July 22, 2017

కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో డీజీపీకి... అదనపు డీజీ గోపికృష్ణ నివేదిక సమర్పించారు. బ్యూటిషియన్‌ శిరీష ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునే ముందు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ హరీందర్‌కు ఫోన్‌ చేశాడు. ఉదయం 11 గంటలకు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో 27 మందిని విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభాకర్‌రెడ్డిని ఏసీపీ గిరిధర్‌ వేధించిన మాట వాస్తవమేనని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:19 - July 22, 2017

విజయవాడ : రాష్ట్రపతి ఎన్నికల్లో టిడిపి, వైసీపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డాయని.. ఎపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై విజయవాడలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థికి ప్రతిపక్షం ఓటు వేయడం ప్రజలను మోసం చేసినట్టే అని, రైతు సమస్యలపై ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రఘువీరా అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడుతున్నట్లు ఆయన తెలిపారు.

 

19:16 - July 22, 2017

విశాఖ : రాజకీయ ప్రయోజనాలకోసం ముద్రగడ కాపుల ప్రయోజనాల్ని ఫణంగా పెడుతున్నారని... టీడీపీ విశాఖ ప్రజాప్రతినిధులు విమర్శించారు.. కాపులగురించి ప్లీనరీలో ఒక్కమాట చెప్పని జగన్‌ను ముద్రగడ కలవడానికి కారణమేంటో చెప్పాలని ప్రశ్నించారు.. దశాబ్దాలకాలంనుంచి కాపు రిజర్వేషన్‌ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదని అన్నారు... కాపులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబునే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారో కాపు సోదరులు గుర్తించాలని... పంచకర్ల రమేశ్‌ బాబు, ఎంపీ అవంతీ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.. 

 

19:13 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి తరుణ్‌ను అనేక అంశాలపై విచారిస్తున్నారు. ఇప్పటికే గోవా నుంచి తరుణ్‌కు సంబంధించిన సిట్‌ అధికారులు... వాటిపై విచారిస్తున్నారు. విచారణకు తరుణ్‌ సహకరిస్తున్నారని సిట్‌ అధికారులు తెలిపారు. ఇక సోమవారం నవదీప్‌ను విచారిస్తామన్నారు. అలాగే 26న చార్మి సిట్‌ కార్యాలయానికి విచారణకు రానున్నట్లు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ఇక ఈరోజు బార్‌, పబ్‌ ఓనర్లను విచారించిన ఎక్సైజ్‌ అధికారులు.... ఎఫ్‌ క్లబ్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. అదేవిధంగా... 14 బార్లు, పబ్బులకు సీరియస్‌ వార్నింగ్‌లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో మరో ఇద్దరని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జీషన్‌ అలీ, లోహ విలయంను అధికారులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

19:03 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం నవదీప్ ను విచారించనున్నారు. ఎఫ్ క్లబ్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. 14 బార్లు, పబ్బులకు వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు విచారణకు బార్, పబ్ యజమానులు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

18:57 - July 22, 2017

హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ సరికొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌, నాంపల్లిలోని బీఎస్ ఎన్ ఎల్ ఆఫీసులో తెలంగాణ సీజీఎమ్ అనంతరామ్‌ బీఎస్ ఎన్ ఎల్ ఫీచర్స్‌ను వెల్లడించారు. ఈ మేరకు ఆఫీసులో కొత్త సిక్సర్‌ ప్లాన్‌, సేలియెంట్‌ ఫీచర్స్, డేటా ఎస్ టీవో 444, పోస్ట్‌ పెయిడ్‌ తరిఫ్‌ ప్లాన్‌లను ఆవిష్కరించారు. 

 

18:52 - July 22, 2017

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది మంది గ్రామస్థులపై పోలీస్ అధికారులు థర్డ్ డిగ్రి ప్రయోగించి... వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని టీ మాస్ బృందం తీవ్రంగా ఖండించింది. నేరెళ్ల, జిల్లెల, రామచంద్ర పురంలో గల బాధిత   కుటుంబాలను బృంద సభ్యులు పరామర్శించారు. ఘటనపై న్యాయ పోరాటం చేస్తామంటూ బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ పోలీసులు ఇంత రాక్షసంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్లీ పోలీసులు సామాన్యులకు కాదని...కాంట్రాక్టు, రాజకీయ నాయకులకు, బడా బాబులకు ఫ్రెండ్లీ పోలీసులు అని విమర్శించారు. రాష్ట్రంలో నియంతృత్వంగా, రాక్షసత్వంగా ప్రవర్తిసున్నారని మండిపడ్డారు.
బాధిత కుటుంబసభ్యులు
ఏడ్చినా వదిలిపెట్టలేదంట. ఐదు రోజుల వరకు మావారిని మాకు చూపించలేదు. రోకలి బండలు ఎక్కించుకుంటా కొట్టారంట. కాళ్లతోటి పల్లెం తన్నిండ్రంట. ఏడ్చినా వదలిపెట్టలేదంట. మత్తు సూదీలు అయిపోయాక..మత్తు గోలీలు వేసి కొట్టారంట. మా వారిపై దెబ్బలను చూస్తే బతకాలనిపిస్తలేదు.. చావలనిపిస్తుంది. అయితే మావారిని కొట్టిన సంగతి ఇంటి దగ్గర చెబితే.. మీ భార్యలపై వ్యభిచారం కేసులు పెడతామని బెదిరించారంట. భార్య పిల్లల శవాలు కనిపిస్తాయని బెదిరించారంట. ఏదైనా కేసులో ఇరికిస్తాం.. ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారంట.  
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

18:35 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ హీరో తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. తరుణ్‌ ఇబ్బందుల్లో కూరుకున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌శాఖ కార్యాలయానికి క్లూస్‌ టీమ్‌ చేరుకుంది. తరుణ్‌ నుంచి క్లూస్‌ టీమ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకోనుంది. డ్రగ్స్‌ కేసు విచారణలో తొలిసారి క్లూస్‌టీమ్‌ ఎక్సైజ్‌ కార్యాలయానికి వచ్చింది. గోవాలో డ్రగ్స్‌కు సంబంధించిన పలు వివరాలను సిట్‌ సేకరించింది. తమ వద్దనున్న ఆధారాలను సిట్‌ సరిపోల్చుకోనుంది. వాటి గురించి తరుణ్‌ను సిట్‌ విచారిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:12 - July 22, 2017

వైశాఖం మూవీ టీమ్ తో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్  నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో హరీష్, హీరోయిన్ అవంతిక, కమెడియన్ పృథ్వీ, సంగీత దర్శకులు డీజే వసంత్ లు మాట్లాడారు. సినిమాకు సంబంధించిన వివరాలను తెలిపారు. తమ సినీ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:51 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నాలుగో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. సినీ నటుడు తరుణ్ విచారణ కొనసాగుతోంది. క్లూస్ టీం ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుంది. క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

ఎఫ్ -క్లబ్ లైసెన్సు రద్దు చేశాం: అకున్ సబర్వాల్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సోమవారం నవదీప్ ప్రశ్నిస్తామని ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. పబ్ లు, బార్ల యజమానులతో సమావేశం నిర్వహించాం అని ఎఫ్ -క్లల్బ్ లైసెన్సు రద్దు చేశామని, 16 పబ్ లకు నోటీసులు జారీ చేశామని సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ కిలిగి ఉన్న మహ్మద్ ఉస్మాన్, అర్ణవ్ మందల్ ను అరెస్టు చేశామని, గతంలో అరెస్టు అయిన జిషన్ అలీ, విలియమ్స్ లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని సబర్వాల్ స్పష్టం చేశారు. సిట్ కార్యాలయంలో విచారణకు వస్తానని చార్మి చెప్పినట్లు తెలిపారు.

హుకుం జారీ చేయడం గ్రామాభివృద్ధి కమిటీలకు చెల్లదు: తమ్మినేని

నిజామాబాద్: ఆర్మూర్ మండలం మంథనిలో సామాజిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను తమ్మినేని వీరభద్రం, ప్రజాసంఘాల నేతలు పరామర్శించారు. ఇటీవల మంథనిలో 150 దళిత కుటుంబాల బహిష్కరణ, గ్రామాలలో సాంఘిక బహిష్కరణలు, జరిమానాలు, హుకుం జారీ చేయడం గ్రామాభివృద్ధి కమిటీలకు చెల్లదని స్పష్టం చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో పెత్తందారులు, గ్రామాభివృద్ధి కమిటీలు, దళితులను అణిచివేస్తున్నారని మహాజన పాదయాత్ర సందర్భంగా సీఎంకు లేఖ రాశమని, దళితులను సాంఘిక బహిష్కరణ చేస్తుంటే అంబేద్కర్ ను పొగిడే నేతలు, అధికారులు ఏం చేస్తున్నారని తమ్మినేని ప్రశ్నించారు.

17:32 - July 22, 2017

మహారాష్ట్ర : ముంబైలో ఓ మహిళను కొబ్బరిచెట్టు రూపంలో మృత్యువు వెంటాడింది. దూరదర్శన్‌ మాజీ యాంకర్‌ 58 ఏళ్ల కంచన్‌ నాథ్‌ ఎప్పటిలాగే మార్నింగ్‌ కు వాక్‌ వెళ్లారు. ఇంటి సమీపంలో నడుస్తుండగా కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా ఆమె మీద విరుచుకు పడడంతో కుప్పకూలారు. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కంచన్‌ ఇవాళ ఉదయం కన్ను మూశారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివీలో రికార్డ్‌ అయ్యాయి. ఈ విషాదానికి ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ బాధ్యత వహించాలని బాధిత కుటుంబం డిమాండ్‌ చేసింది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టును బిఎంసి కొట్టివేయకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు.

పాతపాటే పాడారుకేసీర్ : భూ నిర్వాసితులు..

సిద్ధిపేట : మల్లన్న సాగర్ నిర్వాసితులతో సీఎం చర్చలు విఫలం అయ్యాయి. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో రైతులతో కేసీఆర్ చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ పాత పాటే పాడారు అని భూ నిర్వాసితులు విమర్శించారు. 2014 భూ సేకరణ చట్టం ప్రకారమే న్యాయంచేయాలని కోరామని, మా న్యాయమైన పోరాటం ఆగదని భూనిర్వాసితులు ఖరాఖండిగా స్పష్టం చేశారు.

 

17:19 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో రాంగోపాల్‌ వర్మ చేసిన కామెంట్స్‌పై వివాదం ముదురుతోంది. వర్మ కామెంట్లపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం మండిపడుతోంది. ఎక్సైజ్‌శాఖను కించపరిచే విధంగా వర్మ చేసిన కామెంట్లపై ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వర్మ కామెంట్లు విచారణాధికారిని బెదిరించే విధంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఇక రాంగోపాల్‌వర్మపై అబిడ్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసే యోచనలో రిటైర్డ్‌ ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

తరుణ్ వేలిముద్రల సేకరణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటుడు తరుణ్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా తరుణ్ వేలి ముద్రలను క్లూస్ టీం సేకరించింది. త‌రుణ్ ర‌క్త న‌మూనా, చేతి గోళ్లు, వెంట్రుక‌ల‌ను సేక‌రించినట్లు సమాచారం.

చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత...

చిత్తూరు : జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దళితుల సమస్యలను పరిష్కరించాలని భారీ ధర్నా జరుగుతోంది. కలెక్టర్ బయలకు రావాలంటూ కార్యాలయం బయట ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై 3. కి.మీ మేర ట్రాఫిక్ నిలిచి పోయింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు రాఘవులు, శ్రీనివాసరావు, కృష్ణయ్య పాల్గొన్నారు.

17:09 - July 22, 2017

కర్నూలు : జిల్లా రైతాంగం చరిత్రను మారుస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమను  రతనాల సీమగా మారుస్తానని అన్నారు. నంద్యాలలో సారవంతమైన భూములున్నాయని.. అన్నారు. నంద్యాలను ..విశాఖలా సుందరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ ప్రాంతంలో మెగా సీడ్‌ పార్క్‌లో భాగంగా ... మంచి విత్తనాల ఉత్పత్తి కంపెనీలను ఇక్కడకు తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు.

 

17:04 - July 22, 2017

హైదరాబాద్‌ : నగరం డ్రగ్స్‌ చలామణికి అడ్డాగా మారిందా ? ధనిక ప్రాంతాలు డ్రగ్స్‌ విక్రయం, వినియోగానికి ప్రధాన కేంద్రాలుగా మారాయా ? వెస్ట్‌ జోన్‌ పరిధిలోని పబ్స్‌పై పోలీసుల పర్యవేక్షణ ఎలా ఉంది ? పబ్స్‌, హుక్కా సెంటర్లపై పోలీసుల నిఘాపై వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. పబ్స్‌, హుక్కా సెంటర్లపై నిఘా ఉందని వెస్ట్‌జోన్‌ అన్నారు. నైజీరియన్లు, డ్రగ్‌ విక్రయించేవారిని అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పారు. అనేకమందిపై పీడీ యాక్టులు నమోదు చేశామని తెలిపారు. పబ్‌లలో కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కల్చర్‌ డెవలప్‌ అయ్యిందన్నారు. దేశంలో డ్రగ్‌ కల్చర్‌ తక్కువ ఉన్న ప్రాంతం హైదరాబాద్‌ అని పేర్కొన్నారు. డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

16:59 - July 22, 2017

మంచిర్యాల : జిల్లాలోని చెన్నూరు మండలం వెంకటాంపేటలో విషాదం చోటు చేసుకుంది. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన మూడేళ్ల బాలుడు శ్రీరామ్‌.... సమీపంలో జేసీబీ తీసిన నీటిగుంటలో పడి మృతి చెందాడు. చిన్నారి మృతి చెందడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్వాక్రా, మహిళా సంఘాలతో చంద్రబాబు ముఖాముఖీ..

కర్నూలు : నంద్యాల ఎస్ ఆర్ బీసీ కాలనీలో డ్వాక్రా, మహిళా సంఘాలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి జరగుతోంది. సభాస్థలి వద్ద ఎస్ ఆర్ బీసీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఇల్లను కూల్చివేసిన స్థలాల్లో తిరిగి ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉదయ్ పూర్ వద్ద బస్సు బోల్తా: 9మంది మృతి..

రాజ‌స్థాన్: ఉద‌య్ పూర్ స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. బ‌ద్రీనాథ్ యాత్రికుల‌తో వెళ్తున్న ఓ ప్రైవేట్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది మ‌ర‌ణించగా.. 22 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌య్ పూర్ కు 10 కిలోమీట‌ర్ల దూరంలోని నెహ్లా వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎదురుగా వ‌స్తున్న బండిని త‌ప్పించ‌బోయి బ‌స్సు బోల్తా ప‌డిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది గుజ‌రాత్ వాసుల‌ని స‌మాచారం.

బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలతో సీపీఎం, కేవీపీఎస్

నిజామాబాద్: ఆర్మూర్ మండలం మంథనిలో బహిష్కరణకు గురైన 150 దళిత కుటుంబాలను సీపీఎం, కేవీపీఎస్, దళిత సంఘాల నేతలు పరామర్శించారు. అనంతరం వారితో భేటీ అయి వివరాలను సేకరిస్తున్నారు.

తరుణ్ వేలిముద్రలను స్వీకరించనున్న క్లూస్ టీం..!

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటుడు తరుణ్ ను సిట్ విచారణ కొనసాగుతోంది. గోవాలో ఎంజాయ్ చేసిన ఫోటోలను తరుణ్ ను సిట్ విచారిస్తున్నట్లు సమాచారం. అనూహ్యంగా క్లూస్ టీం ను పిలిపించి తరుణ్ వేలిముద్రలను స్వీకరించనున్నట్లు సమాచారం.

16:32 - July 22, 2017

ఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌కు కొత్త అధికారులను కేటాయించారు. రాష్ట్రపతి సెక్రటరీగా పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ సంజయ్‌ కొఠారిని నియమించారు. రాష్ట్రపతి భవన్‌ జాయింట్‌ సెక్రటరీగా ఢిల్లీ స్టేట్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భరత్‌లాల్‌... రాష్ట్రపతికి మీడియా కార్యదర్శిగా సీనియర్‌ జర్నలిస్టు అశోక్‌ మాలిక్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. కోవింద్‌ జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

రామాయంపేటలో దారుణ హత్య..

మెద‌క్: రామాయంపేట్ లో ఓ వ్య‌క్తిని దారుణంగా హత్య చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మ‌స్తాన్ వ‌లీ (50) ఈ దారుణ హ‌త్య కు గుర‌య్యాడు. మండ‌ల కార్యాల‌యం ఆవ‌ర‌ణ‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు వ‌లీని బండ‌రాయి తో మోదీ హ‌త్య చేశారు.

16:30 - July 22, 2017

కేరళ : ప్రముఖ మలయాళీ రచయిత కేపీ రమనున్నికి బెదిరింపు లేఖ వచ్చింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టేలా రచనలు చేస్తున్నారని గుర్తుతెలియని వ్యక్తులు ఆరోపించారు. ఆరు నెలల్లోగా ఇస్లాం మతంలోకి మారాలని.. లేదంటే కుడి చేయి, ఎడమ కాలు నరికేస్తామని లేఖలో ఆయనను హెచ్చరించారు. మలప్పురం జిల్లాలోని మంజేరీ నుంచి ఈ లేఖను పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు ఈ పనిచేశారో తనకు తెలియడం లేదని.. తనకు ఎవరితో శత్రుత్వం లేదని రమనున్ని చెబుతున్నారు. ఆరు రోజుల క్రితమే రమనున్నికి ఈ లేఖ రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఆజ్ఞ పాటించకుంటే గతంలో ప్రొఫెసర్‌ జోసఫ్‌ లాగే మీకు శిక్షను అమలు చేస్తామని హెచ్చరించారు. 2010లో ప్రశ్నాపత్రంలో మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు రాశారంటూ..  ఓ ముస్లిం సంస్థకు చెందిన వ్యక్తులు ప్రొఫెసర్‌ జోసెఫ్‌ కుడిచేయిని నరికారు. రమనున్ని మంచి వక్త, కథలు రాస్తుంటారు.

మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నజరానా...

ముంబై: భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. మిథాలీ రాజ్ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. హోస్ట్ ఇంగ్లండ్ టీమ్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది. అయితే ఫైన‌ల్లో ప్ర‌వేశించిన మ‌హిళా క్రికెట‌ర్ల‌పై బీసీసీఐ ప్ర‌త్యేక న‌గ‌దు పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడిన ప్ర‌తి ప్లేయ‌ర్‌కు రూ.50 ల‌క్ష‌ల క్యాష్ రివార్డును ఇవ్వ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని ఇవాళ క్రికెట్ కంట్రోల్ బోర్డు తెలిపింది. టీమిండియాతో వెళ్లిన‌ స‌పోర్ట్ స్టాఫ్‌కు కూడా ఒక్కొక్క‌రికి రూ.25 ల‌క్ష‌ల న‌గ‌దు ఇవ్వ‌నున్నారు.

తరుణ్ గోవా లో ఎంజాయ్ చేసిన ఫోటోలు చూపి విచారిస్తున్న సిట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటుడు తరుణ్ ను సిట్ విచారణ కొనసాగుతోంది. గోవాలో ఎంజాయ్ చేసిన ఫోటోలను తరుణ్ ను సిట్ విచారిస్తున్నట్లు సమాచారం.

16:22 - July 22, 2017

ముంబై : బాలీవుడ్‌ దిగ్గజాలు షారుఖ్‌ ఖాన్‌, అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామిలీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. విదేశాలకు పంపిన డబ్బులకు సంబంధించి వీరిని ఈడీ ప్రశ్నించనుంది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ కుటుంబ సభ్యులంతా గత 13 ఏళ్లలో విదేశాలకు పంపిన డబ్బుల వివరాలు తెలియజేయాలని ఈడీ కోరింది. అలాగే అజయ్‌ దేవగణ్‌ కూడా విదేశాలకు పంపిన డబ్బు వివరాలు తెలియజేయాలని ఈడీ సూచించింది. అమితాబ్‌ బచ్చన్‌, జయాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌, అజయ్‌ దేవగణ్‌లకు గత నెల ఫెమా చట్టం ఉల్లంఘన కింద ఈడీ నోటీసులు జారీ చేసింది. 2004లో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద విదేశీ బిజినెస్‌ ట్రిప్‌ల లావాదేవీలకు సంబంధించి అమితాబ్‌ ఫ్యామిలీకి నోటీసు ఇచ్చారు. షారుఖ్‌ ఖాన్‌ ఐపిఎల్‌ పార్ట్‌నర్‌ జుహీచావ్లా భర్త జయ మెహతాలకు చెందిన మారిషస్‌లోని ఓ కంపెనీకి సంబంధించి ఈడీ నోటీసు పంపింది. 

 

వికారాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్

వికారాబాద్: జిల్లాలో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిగరెట్లలో గంజాయి పెట్టి విక్రయిస్తు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

16:18 - July 22, 2017

విశాఖ : తాడిచెట్లపాలెంలో మద్యం షాపుల్ని తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. మద్యం దుకాణంముందు వంటావార్పు చేపట్టారు. వెంటనే అక్కడినుంచి దుకాణం తీసివేయాలని డిమాండ్ చేశాయి. మహిళల నిరసనకు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే విన్సెంట్ అరెస్ట్

హైదరాబాద్ : కేరళ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విన్సెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. విన్సెంట్ పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది.

వర్మ వ్యాఖ్యలను ఖండించిన ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ వర్మ చేసిన కామెంట్ల పై ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖండించింది. దర్యాప్తు చేస్తున్న అధికారులను కించపరచడం సరికాదన్నారు. రాంగోపాల్ వర్మ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

16:14 - July 22, 2017

ప్రకాశం : జిల్లాలోని కనిగిరి మండలం పునుగోడులో మద్యం షాప్‌పై మహిళలు కదంతొక్కారు. తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దంటూ రెండురోజులుగా వనితలు ఆందోళన చేస్తున్నారు. అయినా ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో షాప్‌పై దాడి చేశారు. మద్యం సీసాల్ని ధ్వంసం చేశారు. తమ భర్తలు, కొడుకులు రోజూ మద్యంతాగి తమను చిత్ర హింసలు పెడుతున్నారని ఆరోపించారు. 750మంది జనాభాఉన్న తమ గ్రామంలో 6 బెల్టు షాపులు ఎందుకని అధికారుల్ని ప్రశ్నించారు.

ఎస్పీ ఆఫీసులో దళితులను నిర్భంధాన్ని ఖండించిన తమ్మినేని

సిరిసిల్ల : జిల్లా ఎస్పీ ఆఫీసులో దళితులను నిర్భంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటనను సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, ప్రజా సంఘాల నేతలు ఖండించారు.

16:11 - July 22, 2017

హైదరాబాద్ : అబ్కారీ భవన్‌లో పబ్‌ నిర్వహకుల సమావేశం ముగిసింది. పబ్‌ నిర్వహకులను అధికారులు ఘాటుగా హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పబ్‌లో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా డ్రగ్స్‌ సరఫరా చేస్తే వారి పైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే లైసెన్స్‌ రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న పబ్బుల నిర్వాహకులతో పాటు.. పలు పబ్బుల నిర్వాహకులను సిట్ అధికారులు విచారించారు. అయితే తమకు ఎటువంటి నోటీసులు రాలేదని..కొన్ని సూచనలు చేసేందుకు అధికారులు తమను సమావేశానికి పిలిచారని ఓ పబ్ నిర్వాహకుడు చెప్పాడు. పబ్బులలో డ్రగ్స్ తీసుకున్నా.. లేక అమ్మినట్లు తెలిసినా  లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని సిట్ అధికారులు హెచ్చారించారని తెలిపాడు.

 

వరంగల్ లో బిగ్ సీ షోరూమ్ ను ప్రారంభించిన సమంత

వ‌రంగ‌ల్: మొబైల్ షోరూమ్ బిగ్సీ ని ఇవాళ వ‌రంగ‌ల్ లో హీరోయిన్ సమంత ప్రారంభించింది స‌మంత‌. ఇక‌.. త‌మ అభిమాన న‌టిని చూడ‌టానికి జ‌నాలు షోరూం వ‌ద్ద భారీ సంఖ్య‌లో గుమికూడారు. పోలీసులు షో రూమ్ ప్రాంతంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

అంగన్ వాడీ కేంద్రంలో బాలుడు నీటి గుంటలో పడి మృతి

మంచిర్యాల: చెన్నూరు మండలం వెంకటాంపేటలో విషాదం నెలకొంది. అంగన్ వాడీ కేంద్రానికి వచ్చిన మూడేళ్ల బాలుడు నీటిగుంటలో పడి మృతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

రాగన్నగూడ భూ వివాదంలో ఉద్రిక్తత

రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలం రాగన్నగూడ వో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దళితులు సాగుచేసుకుంటున్న 18 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అడ్డుకునేందుకు భారీగా దళిత రైతులు వెళ్లారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రోద్భలంతోనే తాము సాగు చేస్తున్న భూములను ధ్వంసం చేస్తున్నారంటూ దళితులు ఆందోళనకు దిగారు. భూ నిర్వాసిత కమిటీ రాష్ట్ర కన్వీనర్ బి.వెంకట్, సీపీఎం జిల్లా కార్యదర్శి భూపాల్ తో సహా 150 మంది ని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని యాచారం, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, హయత్ నగర్, వనస్థలీపురం పీఎస్ లకు తరలించారు.

16:04 - July 22, 2017

చిత్తూరు : దళితుల పట్ల వివక్షను నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో సీపీఎం సమరశంఖం పూరించింది. కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం కార్యకర్తలు, దళితులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మోదీ, చంద్రబాబు సూపర్ పవర్ అంటూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ధర్నాలో దళితులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో భారీగా ట్రాఫిక్‌ అయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఉన్నత విద్యామండలి ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా

హైదరాబాద్: ఉన్నత విద్యామండలి ఎదుట కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 22 రోజులుగా ఓయూలో కాంట్రాక్ట్ లెక్చర్లు ధర్నా చేపట్టారు. నేడు వీసీల సమావేశం ఉండడంతో ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

15:58 - July 22, 2017

చిత్తూరు : జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పలమనేరు మండలం కాలువపల్లిలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ అనే రైతు మృతి చెందాడు. ఏనుగుల దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:47 - July 22, 2017
15:46 - July 22, 2017

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో నీటి కోసం మహిళలు ఆందోళనకు దిగారు. నెల రోజుల నుండి నీళ్లు రావడం లేదంటూ..  హిందూపురం చిన్న మార్కెట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలకు నచ్చజెప్పి పంపించారు. బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా తమకు నీటి కష్టాలు తీర్చడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను తీర్చకపోతే మున్సిపల్‌ ఆఫీసును ముట్టడిస్తామని మహిళలు హెచ్చరించారు.

15:45 - July 22, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 26న ముద్రగడ పాదయాద్ర ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ బందోబస్తు చేపట్టారు. జిల్లాలోని కాపు జేఏసీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్రగ్స్ మాఫియాలో ఎవరినీ వదలం : నాయిని

ఖమ్మం : డ్రగ్స్ మాఫియాలో ఎవరినీ వదలమని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తెలిపారు. దిగ్విజయ్ కు మతి భ్రమించిందని చెప్పారు. టీఆర్ ఎస్ వారసులు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ హయాం నుంచి డ్రగ్ మాఫియా ఉందన్నారు. 

 

చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

చిత్తూరు : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దళితుల సమస్యలను పరిష్కరించాలని భారీ ధర్నా చేపట్టారు. కలెక్టర్ బయటకు రావాలంటూ కార్యాలయం బయట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ట్రాఫిక్ జామ్ అయింది.. జాతీయ రహదారిపై 3 కిమీ. వాహనాలు మేర నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బివి.రాఘవులు, శ్రీనివాస్ రావు, కృష్ణయ్య పాల్గొన్నారు. 

15:21 - July 22, 2017

నిజామాబాద్ : జిల్లాలోని ఆర్మూరు మండలం మంతెనలో భూమి విషయంలో మాట వినలేదని వందమంది దళితుల్ని గ్రామ అభివృద్ధి సభ్యుల కమిటీ బహిష్కరించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగట్లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

15:15 - July 22, 2017

హైదరాబాద్ : సిట్ కార్యాలయంలో నటుడు తరుణ్‌ విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం తరుణ్‌పై  ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కెల్విన్‌తో తరుణ్‌కు గల సంబంధాలు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తనకు పబ్‌ ఉందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు తరుణ్. ఏడేళ్ల క్రితం ఓ పబ్‌లో భాగస్వామ్యం మాత్రమే ఉండేదని చెప్పారు. ఇప్పుడు పార్టనర్ షిప్ కూడా లేదని స్పష్టం చేశారు. బయటకు వచ్చాక అన్ని వివరాలు చెబుతానని .. తన నిజాయితీని నిరూపించుకుంటానని తరుణ్ తెలిపారు. 

 

ఘనంగా దాసరథి జయంతి వేడుకలు...

హైద‌రాబాద్: "నా తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ" అని స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించి తెలంగాణ స‌మాజంలో జాగృతి ర‌గిలించిన మ‌హ‌నీయుడు, అగ్నిధార పేరుతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఉద్య‌మ చైత‌న్యం క‌లిగించిన క‌వి దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య 93 వ జ‌యంతి వేడుక‌లు భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో ర‌వీంద్ర‌భార‌తిలో ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి, మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్, ఉప‌ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ, ప‌ర్యాట‌క మంత్రి చందూలాల్ పాల్గొన్నారు.

డ్రగ్స్ మాఫియాలో ఎవరినీ వదలం: నాయిని

ఖమ్మం: డ్రగ్స్ మాఫియాలో ఎవరినీ వదలం అని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. దిగ్విజయ్ సింగ్ మంతి భ్రమించి మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ కేసులో టిఆర్ ఎస్ నేతల వారసులు ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు. కల్తీల పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హాయం నుంచి డ్రగ్ మాఫియా ఉందని నాయిని తెలిపారు.

బాలికల వసతి గృహంలో బాలికలను కరిచిన ఎలుకలు

ఖమ్మం: దనవాయిగూడెం బాలికల వసతి గృహంలో 10 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో కేసీఆర్ చర్చలు

సిద్ధిపేట: ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో మల్లన్న సాగర్ భూ నిర్వాసితులతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు.

పంట పొలాలపై ఏనుగులు దాడి:ఒకరి మృతి

చిత్తూరు: పలమనేరు రూరల్ మండలం కాలువపల్లిలో పంట పొలాలపై ఏనుగులు దాడి చేసింది. ఏనుగుల దాడిలో చిన్నబ్బ అనే రైతు మృతి చెందాడు.

రామ్ నాథ్ ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్

హైదరాబాద్: రాష్ట్రపతిగా ఎన్నికల్లో గెలిచిన రామ్ నాథ్ కోవింద్ 25న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. 24న సీఎం కేసీఆర్ ఢిల్లీ పయనం అయి 27 వరకు బస చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

14:03 - July 22, 2017

పోలీసులు, జవాన్ల మధ్య ఘర్షణ

శ్రీనగర్‌: సరిహద్దుల్లో కలిసి పనిచేయాల్సిన పోలీసులు, జవాన్లే ఘర్షణకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

13:58 - July 22, 2017

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వేళ్లూనికొని ఉన్న కుల వ్యవస్థపై గత కొంత కాలంగా.. దళిత సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. చంద్రబాబు వ్యవహారం చూస్తే పేదలు, దళితులంటే లెక్కలేనట్టుగా ప్రవర్తిస్తున్నట్టనిపిస్తోందని రాఘవులు అన్నారు. కుల వివక్ష నిర్మూలనకు ముఖ్యమంత్రి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. కుల వ్యవస్థను నిర్మూలించడం దేశంలో ఉన్న పాలక వర్గానికి కూడా ఇష్టం లేదని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవి రాఘవులు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:47 - July 22, 2017

హైదరాబాద్ : అకున్ సబర్వాల్ కు మానవత్వం లేదా అన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో విమర్శించారు. మీడియాకు ఊహాగానాలు అందకుండా చూడాల్సిన బాధ్యత అకున్ కు లేదా అని ఆయన ప్రశ్నించారు. ఏ ఆధారాలు లేకుంగా సినిమా వాళ్లను ఎలా అనుమానిస్తారని వర్మ ట్విట్ చేశాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:46 - July 22, 2017

ఫేస్ బుక్ లో అకున్ సబర్వాలపై వర్మ విమర్శలు

హైదరాబాద్: ఫేస్ బుక్ లో డ్రగ్స్ కేసులో అకున్ సబర్వాలఫై డైరెక్టర్ వర్మ విమర్శలు గుప్పించారు. అకున్ సబర్వాల్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని, మీడియాలో వస్తున్న కథనాలకు ఫుల్ స్టాఫ్ పెట్టడం లేదన్నారు. సబర్వాల్ మౌనంతో సినీ ఇండస్ట్రీలో కొందరి ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. సబర్వాల్ చిత్త శుద్ధిపై ఎలాంటి అనుమానం లేదన్నారు. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ధీటుగానే బదులిచ్చింది.

వ్యవసాయానికి ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇచ్చాం: చంద్రబాబు

కర్నూలు : ఎన్నికల కోసం అభివృద్ధి పనులు చేయటం లేదని సీఎం చద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనేదే లక్ష్యం అన్నారు. వ్యవసాయంలో ఎప్పుడూ లేని ప్రాధాన్యత ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నదుల అనుసంధానం చేశామన్నారు.

13:40 - July 22, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో మందడం గ్రమానికి చెందిన రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆపకుండా డ్రైవర్‌ 10 కిలోమీటర్లు వెళ్లాడు. లారీని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకొని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ 3 కిలోమీటర్లు నిలిచిపోయింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:33 - July 22, 2017

హైదరాబాద్ : అబ్కారీ భవన్ లో పబ్ నిర్వహకులు సమావేశం ముగిసింది. అధికారులు పబ్ నిర్వహకులను ఘాటుగా హెచ్చరించారు. నిబంధనలను ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పబ్ లో ఎవరరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని పబ్ యాజమానులకు అధికారలు ఆదేశించారు. ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే వారి పైనా కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే లైసెన్స్ రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:14 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో పబ్స్‌పై గురి పెట్టింది ఎక్సైజ్ శాఖ. కాసేపట్లో పబ్స్ యజమానులతో సిట్ అధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి 17 పబ్‌ల యజమానులు హాజరవుతున్నారు. డౌన్ టౌన్ స్ట్రీట్, వాటర్స్, లిక్విడ్, బీర్స్, డూప్లిన్, బాటిల్స్ అండ్ చిమ్నీస్, డాక్ 40, జీరో టు 40, హార్ట్ కప్ పబ్‌లకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఈరోజు జరగనున్న సమావేశంలో డ్రగ్స్‌ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను పబ్ యజమానులతో విచారించనున్నారు సిట్ అధికారులు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో కుల వివక్ష : రాఘవులు

చిత్తూరు : దళితుల సమస్యల పరిష్కారానికై దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం నేత రాఘవులు ముఖ్య నేతగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తిరుమల శ్రీవారి ఆలయంలో కుల వివక్ష కొనసాగుతోందని, టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవో, డిప్యూటీ ఈవో పోస్టుల్లో దళితులను ఎందుకు నియమించడం లేదని రాఘవులు ప్రశ్నించారు. జిల్లాలో దళితుల పట్ల వివక్ష కొనసాగుతున్నా దళిత ప్రజా ప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. నారాయణ స్వామి లాంటి దళిత వైసీపీ ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రాఘవులు విమర్శించారు.

వర్మ వ్యాఖ్యలను ఖండించిన బాలల హక్కుల సంఘం...

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విద్యార్థులను సిట్ అధికారులు ప్రశ్నిస్తారా అంటూ అసందర్భ ప్రేలాపనలు చేసిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలను బాలల హక్కుల సంఘం నేతలు ఖండించారు. డ్రగ్స్ వ్యవహారంలో విద్యార్థులు బాధితులే.. సినీ పరిశ్రమలోలా నిందితులు కారు అని బాలల హక్కుల సంఘం స్పష్టం చేసింది.

13:08 - July 22, 2017

హైదరాబాద్ : సిట్ కార్యాలయంలో నటుడు తరుణ్‌ విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం తరుణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కెల్విన్‌తో తరుణ్‌కు గల సంబంధాలు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తనకు పబ్‌ ఉందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు తరుణ్. ఏడేళ్ల క్రితం ఓ పబ్‌లో భాగస్వామ్యం మాత్రమే ఉండేదని చెప్పారు. ఇప్పుడు పార్టనర్ షిప్ కూడా లేదని స్పష్టం చేశారు. బయటకు వచ్చాక అన్ని వివరాలు చెబుతానని .. తన నిజాయితీని నిరూపించుకుంటానని తరుణ్ తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

నంద్యాలలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు : నంద్యాలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాన చేశారు. రహదారులు, భవనాల అతిథి గృహ నిర్మాణానికి మార్కెట్ యార్డులో రూ.120 కోట్లతో నిర్మించనున్న గోదాం, రైతుబజార్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎన్ పీజీ మైదానంలో ప్రభుత్వ పథకాల స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు.

12:58 - July 22, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం... దేశ ప్రయోజనాలను దెబ్బతీసే.. నిర్ణయాలను తీసుకోబోతుంది. ప్రజల జీవితాలను పణంగా పెట్టి... స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పేరుతో ..కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ వేయనుంది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు.. కేంద్రంపై ... మండిపడుతున్నాయి. ఎలాగైనా ఈ ఒప్పంద సమావేశాలను అడ్డుకునేందుకు కార్యాచరణకు దిగుతున్నాయి. రీజనల్‌ కంప్రెహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ అనే ఆర్థిక ఒప్పందానికి కేంద్రం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల మధ్య ఈ ఆర్థిక ఒప్పందం జరగబోతుంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో పాటు...మన దేశం కూడా ఈ ఆర్థిక ఒప్పందాలపై సంతకాలు చేయబోతుంది. ప్రభుత్వ ప్రతినిధులతో ...జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానుంది. జూలై 17నుంచి 28వరకు ఈ సమావేశాలు జరుగుబోతున్నాయి.ఆర్ సీ ఈపీ ఒప్పందంతో... సామాన్యుల జీవితాలు మరింత దిగజారే ప్రమాదముందటూ వివిధ దేశాలకు చెందిన ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.

ఉద్యమానికి సిద్ధమవుతున్న ప్రజసంఘాలు
ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశాలను అడ్డుకోబోతున్నారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా... అనేక ప్రజా, రైతు, కార్మిక సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తొలుత ఈనెల 23న ప్రజా సదస్సు నిర్వహిస్తున్నారు. 24న నిరసన కార్యక్రమాలు, 25, 26 తేదీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్ సీ ఈపీ ఒప్పందంతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని.. ప్రజాప్రతిఘటన వేదిక ...నేతలు అంటున్నారు. రైతులకు...పంటలు, పాల ఉత్పత్తులకు లభించే ధరలు తీవ్రంగా పడిపోతాయని... విత్తనాలపై పేటెంట్ హక్కులు కాస్త కార్పొరేట్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయని .. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అతి తక్కువ ధరల్లో లభించే జనరిక్ మందుల ఉనికినే నాశనం చేసేందుకు ఈ ఆర్ సీ ఈపీ రాబోతోందని వారు అంటున్నారు. క్యాన్సర్‌, ఎయిడ్స్‌ మందుల ధరలపై తీవ్ర ప్రభావం పడబోతోందని చెబుతున్నారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మనదేశంలో జరిగే ఒప్పందాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని... ఈ ఉద్యమంలో అందరూ భాగం కావాలని వేదిక సభ్యులు కోరుతున్నారు. 

గురుకుల విద్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం: మంత్రి నక్కా

శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 150 గురుకుల వసతి గృహాలకు మంచాలు, పరురుపులు సప్లై చేస్తున్నామని, కార్పొరేట్ విద్యకు ధీటుగా గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచుతామని నక్కా తెలిపారు.

దళితులను చికతబాదడం ఏరకమైన ప్రజాస్వామ్యం:తమ్మినేని

సిరిసిల్ల : దళితులను చికతబాదడం ఏరకమైన ప్రజాస్వామ్యం అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ఆర్మూర్ మండలం మంథనిలో దళితుల గ్రామ బహిష్కరణ కు గురైన వారిని తమ్మినేని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువులు నిర్వహిస్తున్న ఇసుక క్వారీలకు అడ్డురాకుండా 8 మంది గ్రామస్తులపై కేసులు పెట్టారని తమ్మినేని విమర్శించారు.

 

12:35 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణ పై రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో పిల్లలను కూడా విచారిస్తారా అని సెటైర్లు వేశారు. అకున్ సబర్వాల్ తో రాజమౌళి బాహుబలి 3 తీయోచ్చని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసిందని వర్మ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:34 - July 22, 2017

చిత్తూరు : మూడు సంత్సరాల క్రితం బెల్ట్ షాపులను మూసివేస్తానని చెప్పి ఇప్పుడు కొత్త మళ్లి పాత పాట పాడుతున్నారని, దళితుల భూములు లాక్కుంటూ చెరువులు ఏర్పాటు చేస్తున్నారని, ఇదేనా దళితుల పట్ల ప్రభుత్వం ప్రేమ అని సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు బీవి రాఘవులు అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం దళితుల నేరమా అని ఆయన ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

విశాఖ భూస్కామ్ లపై బిజెపి ఎమ్మెల్యే సిట్ కు ఫిర్యాదు

విశాఖ: భూస్కామ్ లపై సిట్ కు బిజెపి నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిర్యాదు చేశాడు. ఐదు ప్రాంతాల్లో జరిగిన భూస్కామ్ లపై ఆధారాలతో సహా సిట్ కు విష్ణుకుమార్ రాజు నివేదిక సమర్పించారు.

డ్రగ్స్ వ్యవహారం పై రాంగోపాల్ వర్మ ప్రేలాపనలు

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం పై సోషల్ మీడియాతో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రేలాపనలు చేశారు. సినిమావాళ్లను విచారించినట్లు స్కూలు పిల్లలను విచారిస్తారా అంటూ వెకిలి ప్రశ్నలు సంధించారు. అకున్ సబర్వాల్ ను పెట్టి రాజమౌళి బాహుబలి-3 తీసార్తారేమోనంటూ అసంబద్ధ వెటకారాలు చేశాడు. సినిమా వాళ్ల పేర్లు చెప్పడం వల్లే ఎక్సైజ్ శాఖకు పేరొస్తుందంటూ అసహనపు వ్యాఖ్యలు చేశాడు.

12:23 - July 22, 2017

చిత్తూరు : కుల వ్యవస్థను నాశనం చేస్తేనే ఆధునికంగా ముందుకు పోతామన్నారు సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు బీవీ రాఘవులు. అతి భయంకరమైన కులవ్యవస్థను పెట్టుకుని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సూపర్ పవర్ కావాలని కలలు కంటున్నారంటూ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో దళితులు ఎదుర్కుంటున్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని రాఘవులు హెచ్చరించారు. నేడు చిత్తూరు కలెక్టరేట్ వద్ద దళితులు చేపడుతున్న మహాధర్నాలో రాఘవులు పాల్గొంటున్నారు. 

12:22 - July 22, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామం ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న వ్యక్తిని టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో మందడం గ్రమానికి చెందిన రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆపకుండా డ్రైవర్‌ 10 కిలోమీటర్లు వెళ్లాడు. లారీని వెంబడించి డ్రైవర్‌ను పట్టుకొని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ 3 కిలోమీటర్లు నిలిచిపోయింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేశ్ అందిస్తారు. 

డ్రగ్స్ కేసు విచారణను నీరుగార్చొద్దు: చంద్రవదన్

హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణను నీరుగార్చొద్దని సిట్ అధికారి చంద్రవదన్ విజ్ఞప్తి చేశారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాన్ని వక్రీకరించడం సరికాదని సిట్ అధికారి చంద్రవదన్,అకున్ సబర్వాల్ తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ సీరియస్ గా పని చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని హాస్యాస్పదం చేస్తున్నారని ఇది మంచి కాదని హెచ్చరించారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఏ రంగంపైనా ద్వేషం లేదని చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ గతంలో చాలా విషయాల పై విచారణ చేశామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్నామని తెలిపారు.

12:21 - July 22, 2017

హైదరాబాద్ : సిట్ కార్యాలయంలో నటుడు తరుణ్‌ విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం తరుణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కెల్విన్‌తో తరుణ్‌కు గల సంబంధాలు, డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు తరుణ్‌ను ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:19 - July 22, 2017

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాన్ని వక్రీకరించడం సరికాదని సిట్ అధికారి చంద్రవదన్,అకున్ సబర్వాల్ తెలిపారు. ఆయన సిట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ సీరియస్ గా పని చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని హాస్యాస్పదం చేస్తున్నారని ఇది మంచి కాదని హెచ్చరించారు. సినీ రంగం వారు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిదన్నారు. నోటీసులు అందుకున్న వారంతా సహకరిస్తున్నారని తెలిపారు. పిల్లలపై ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నామని, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు ఏ రంగంపైనా ద్వేషం లేదని చెప్పారు. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ గతంలో చాలా విషయాల పై విచారణ చేశామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే డ్రగ్స్ కేసును లోతుగా విచారిస్తున్నామని తెలిపారు. సాఫీగా జరుగుతున్న దర్యాప్తును పక్కదోవ పట్టించడం తగదని, ఈ కేసు విచారణను నీరుగార్చొద్దని విజ్ఞప్తి చేశారు. అతి జాగ్రత్తగా, చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. విచారణ నైతిక స్థితిని దెబ్బతీయడం సరికాదని, నిష్పక్షపాతంగా విచారణ చేపడుతున్నామన్నారు. అధికారుల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

దళితుల గ్రామ బహిష్కరణ పై సీపీఎం ఆందోళన

నిజామాబాద్ : ఆర్మూర్ మండలం మంథనిలో దళితుల గ్రామ బహిష్కరణ పై సీపీఎం ఆందోళన చేపట్టింది. దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాంఘీక బహిష్కరణ చేసిన 21 మంది పై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఏసీసీ శివకుమార్ తెలిపారు.

మల్లన్న సాగర్ ముంపు వాసులకు సీఎం ఆహ్వానం

సిద్ధిపేట: మల్లన్న సాగర్ ముంపు వాసులకు సీఎం కేసీఆర్ నుండి ఆహ్వానం వచ్చింది. జగదేవ్ పూర్ ఫాం హౌస్ లో ముంపు వాసులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

చెరువులు, కుంట‌ల్లో కాలుష్య నియంత్ర‌ణ పై మంత్రి కేటీఆర్ సమీక్ష...

హైద‌రాబాద్: న‌గ‌రంలోని చెరువులు, కుంట‌ల్లో కాలుష్య నియంత్ర‌ణ పై ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, టీఎస్ఐఐసీ అధికారుల‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ర‌సాయ‌నాల‌ను అక్ర‌మంగా చెరువుల్లో త‌ర‌లించే ప‌రిశ్ర‌మ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. బ‌యోమెడిక‌ల్, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ స‌రిగా జ‌రిగేలా చూడాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

కొనసాగుతున్న తరుణ్ సిట్ విచారణ...

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు త‌రుణ్ ను విచారిస్తున్నారు. గత మూడు రోజులుగా పలువురు సెలబ్రిటీలను విచారిస్తున్న సిట్ ఈ రోజు తరుణ్ నుండి కీలక విషయాలు సేక‌రిస్తున్న‌ది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు,సుబ్బరాజులను తమ స్టైల్ లో విచారించి సిట్ ముఖ్య విషయాలు రాబట్టింది.

నంద్యాలలో బైరెడ్డి అరెస్ట్

కర్నూలు: నంద్యాల రోడ్డు విస్తరణ లో బాధితులకు న్యాయం చేయాలని సీఎం సభ వద్ద బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిరసనకు దిగాడు. అప్రమత్తమైన పోలీసులు బైరెడ్డిని అరెస్టు చేశారు.

నేరెళ్లలో తమ్మిని, టీమాస్ బృందం పర్యటన

సిరిసిల్ల: తంగెళ్ల మండలం నేరెళ్లలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీమాస్ బృందం పర్యటిస్తోంది. ఇసుక లారీ ఢీకొని మృతి చెందిన భూమయ్య కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించనున్నారు. పోలీసులు చితకబాదిన కుటుంబాల నుంచి కూడా వివరాలు సేకరించనున్నారు.

11:36 - July 22, 2017

హైదరాబాద్ : కేపీహెచ్ బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ కారులో యువకుడు ఆత్మహత్య కలకలం సృష్టించింది. దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు అవినాష్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా అవినాష్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకుని గ్యాస్ లీక్‌ చేసుకుని కారులో అవినాష్‌ ఆత్మహ్యతకు పాల్పడ్డాడు. ప్రేమలో విఫలం కావడంతో అవినాష్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌ని బట్టి తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:29 - July 22, 2017

హైదరాబాద్: రాజుగారి గది-2 అక్టోబర్ 12 న విడుదలకు సిద్ధమవుతోందని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయని యూనిట్ తెలిపింది. హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా లో మొట్టమొదటి సారిగా నాగార్జున తన కెరీర్ లోనే వెరైటీ రోల్ పోషిస్తున్నాడు. సమంత ఘోస్ట్ (ఆత్మ) గా నటిస్తుండడం విశేషం. సీరత్ కపూర్ హీరోయిన్. రాజుగారి గది ఫస్ట్ పార్ట్ సీక్వెల్ గా తీసిన ఈ చిత్రంలో రావు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన తారాగణం.

అవినీతి ప్రక్షాళనతో పాటు కులవివక్ష ప్రక్షాళన చేపట్టాలి: రాఘవులు

చిత్తూరు: సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కులవివక్ష తీవ్రంగా ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. అవినీతి ప్రక్షాళనతో పాటు కులవివక్ష ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితుల సమస్యల పై గ్రామస్థాయి ఉద్యమం చేపడతామని, సెప్టెంబర్ లో హంద్రీనీవా పూర్తి చేసాతమని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. మూడేళ్లుగా ఈ మాట వింటూనే ఉన్నామని, రాయలసీమ సమ సీఎం కార్యాచరణ ప్రకటించకుంటే మహా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గరగపర్రు ఘటన ప్రభుత్వానికి సిగ్టు చేటు అని, పర్చూరులో దళితుల భూముల ఆక్రమణ దుర్మార్గం అన్నారు.

26న ఛార్మి.. 27న ముమైత్ ఖాన్..

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మిని ఈ నెల 26 న విచారించనున్నారు. అటు-బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ విచారణ పై సస్పెన్స్ వీడింది. ఈ నెల 27 న ఆమెను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ షో నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న సిట్ అధికారులు ఆ రోజున తమ ఎదుట హాజరుకావాలని ఆమెను ఆదేశించారు. బిగ్ బాస్ రియాల్టీ షో లో ముమైత్ ఓ సెలబ్రిటీగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

నాకు పబ్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు: తరుణ్

హైదరాబాద్: నాకు పబ్ ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు తరుణ్ తెలిపారు. డ్రగ్స్ కేసులో నాలుగో రోజు సిట్ విచారణను ఎదుర్కొనేందుకు సిట్ కార్యాలయానికి తరుణ్ వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏడేళ్ల క్రితం పబ్ లో పార్ట్ నర్ గా ఉండేవాడినని, పబ్ లో పార్ట్ నర్ షిప్ వదులుకుని ఆరేళ్లవుతోందని తరుణ్ పేర్కొన్నాడు. విచారణ తరువాత మీడియాకు అన్ని విషయాలు వివరిస్తానని, నానిజాయితీని సిట్ ముందు నిరూపించుకుంటా అని తరుణ్ తెలిపారు.

ఏపీ సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

అమరావతి: సచివాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని రోడ్డుపక్కన నిల్చున్న రమేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటన జరిగిన తర్వాత ఆపకుండా 10కి.మీ డ్రైవర్ వెళ్లాడు. లారీని వెంబడించి గ్రామస్థులు పట్టుకున్నారు. మృతదేహంతో గ్రామస్థులు రోడ్డు పై ఆందోళనకు దిగారు.

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు..

సంగారెడ్డి: ఇస్నాపూర్ లో విషాదం నెలకొంది. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చేపట్టారు.

నేడు నంద్యాలలో సీఎం చంద్రబాబు పర్యటన

కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ నంద్యాల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. సుమారు ఏడున్నర గంటలపాటు నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారు. ఉదయం 10.30కు నంద్యాల డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభించి సాయంత్రం 6గంటలకు ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు.

10:15 - July 22, 2017

కల్తీ దందాలపై పోలీసులు కొరడా

వరంగల్ : కల్తీ దందాలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లాలో మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో కల్తీనూనె తయారు చేస్తున్న పరిశ్రమపై పొలీసులు దాడులు చేపట్టారు. పరిశ్రమలో భారీ మొత్తంలో ఉన్న కల్తీ ఆయిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్వాహకులను విచారిస్తున్నారు.

10:10 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ నాలుగో రోజు విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న తరుణ్ సిట్ కార్యాలయానికి చేరకున్నారు. సిట్ అధికారులు తరుణ్ ని విచారిస్తున్నారు. కెల్విన్ తో తరుణ్ కున్న పరియంపై అధికారులు ఆరా తీయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ రాజీనామా..

వాషింగ్ట‌న్: వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ సీన్ స్పైస‌ర్ రాజీనామా చేశారు. అమెరికా దేశాధ్య‌క్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల స్పైస‌ర్ రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ వ్యాపార‌వేత్త ఆంథోనీ స్కారాముకిని క‌మ్యూనికేష‌న్స్ డైర‌క్ట‌ర్‌గా నియ‌మించ‌డంతో స్సైస‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే క‌మ్యూనికేష‌న్స్ డైర‌క్ట‌ర్ ఆంధోనీకి రిపోర్ట్ చేయాల‌ని ట్రంప్ కోర‌డంతో స్పైస‌ర్ నిరాక‌రించారు. స్పైస‌ర్‌కు డిప్యూటీగా చేసిన సారా శాండ‌ర్స్ ఇప్పుడు ప్రెస్ సెక్ర‌ట‌రీగా చేయ‌నున్నారు. ట్రంప్ నిర్ణ‌యాల వ‌ల్ల వైట్‌హౌజ్‌లో వ్య‌వ‌స్థాగ‌త లోపం ఏర్ప‌డింది.

కారేపల్లిలో రెండు ఆలయాల్లో చోరీ...

ఖమ్మం: జిల్లాలోని కారేపల్లిలో ఉన్న రెండు ఆలయాల్లో దొంగతనం జరిగింది. వెంకటేశ్వరస్వామి, పెద్దమ్మతల్లి ఆలయాల్లో దుండగులు చోరికి పాల్పడ్డారు. దేవతామూర్తుల ఆభరణాలు, హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

కాశిబుగ్గలో ప్రేమ జంట ఆత్మహత్య

శ్రీకాకుళం : పలాస, కాశిబుగ్గలో ప్రేమ జంట ఆత్మహత్య కు పాల్పడింది. మృతులు ఒడిశా వాసులుగా గుర్తించారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్శిటీ లో వారు చదువుతున్నట్లు తెలుస్తోంది. మృతుల పేర్లు రామచంద్ర, సుఖాంతిగా గుర్తించారు.

తెరపై హీరోలు.. తెర వెనుక నీచపు పనులు

హైదరాబాద్: తెరపై హీరోలు.. తెర వెనుక నీచపు పనులు చేస్తున్నారు. సినీ ప్రముఖుల పబ్ లు డ్రగ్స్ సరఫరా కేంద్రాలుగా మారాయి. సిట్ విచారణతో పాపాలపుట్ట పగులుతోంది. హైదరాబాద్ గుండెలపై డ్రగ్స్ కుంపటి బద్మాష్ లు పేల్చారు. స్కూల్ పిల్లల జీవితాలతో దుర్మార్గులు చెలగాటం ఆడుతున్నారు.

అకున్ సబర్వాల్ కు బెదిరింపు కాల్స్

హైదరాబాద్: అకున్ సబర్వాల్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. 10 రోజుల నుంచి అకున్ ను డ్రగ్స్ మాఫియా బెదరిస్తోంది. మీ కుటుంబం, పిల్లలు తెలుసంటూ, మీ పిల్లలు ఎక్కడ చదువుతారో, ఎలా వెళతారో తెలుసునని అకున్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఇంటర్నేషనల్స్ కాల్స్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. ఇంటర్నెట్ ప్రోటో కాల్ ద్వారా బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు నిఘావిభాగం గుర్తించి, ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.

హైదరాబాద్ లో డ్రగ్స్ కు అడ్డాలుగా మారిన పబ్స్

హైదరాబాద్: నగరంలో పబ్స్ డ్రగ్స్ కు అడ్డాలుగా మారిపోయాయి. పబ్స్ నుంచే డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు సిట్ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 17 పబ్బులకు సిట్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న పబ్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హాట్ కాఫీ, ఎయిర్ పబ్, కిస్మత్, బాటల్స్ అండ్ చిమ్మీస్, ప్లేబాయ్, డక్ 40, జీరో టూ 40 ఉన్నాయి.

నేడు తరుణ్ ను విచారించనున్న సిట్

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఈ రోజు నటుడు తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. జులై 19న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణతో ప్రారంభమైన ఈ కేసు వచ్చే నెల 2 వరకు నోటీసులు జారీ చేసిన అందరిని విచారించనున్నారు. నిన్న విచారణ అధికారులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ హైదరాబాద్ నగరంలోని పబ్‌లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నారు.

09:36 - July 22, 2017
09:30 - July 22, 2017

హైదరాబాద్ : ఇవాల్టి నుంచి ఈ నెల 27 వరకు నిట్ కౌన్సిలింగ్ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో ఐదు పరిశీలన సెంటర్లు ఏర్పాటు చేశారు. నాన్ లోకల్స్ కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, హైదరాబాద్ లో మూడు సెంటర్లు జేఎన్టీయూ, ఏవీ కాలేజ్, ఓయూ, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో 1,71000 మంది విద్యార్థులు రిజిస్ట్రేషేన్ చేయించుకున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

09:20 - July 22, 2017

హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులోమ నాలుగవ రోజు విచారణ జరగనుంది. నేడు సిట్ ముందుకు ప్రముఖ నటుడు తరుణ్ హాజరుకానున్నారు. సిట్ అధికారులు కెల్విన్ తోమ తరుణ్ ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. ఇప్పటికే తరుణ్ తన ఇంటి నుంచి సిట్ ఆఫీస్ కు బయల్దేరారు. తరుణ్ వెంట అతని తండ్రి చక్రపాణి కూడా సిట్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:18 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుంది. ఎక్సైజ్ డైరెక్టర్ ఆకున్ సబర్వాల్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వారు ఫోన్ లో వెంటనే విచారణ ను నిలిపేయాలని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయిని వారు హెచ్చరించారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తెలుసంటూ బెదిరింపు పాల్పడుతుండడంతో దీన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూండండి.

09:18 - July 22, 2017

హైదరాబాద్ : నగరంలోని కూకట్ పల్లి లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థాని మలేషియా టౌన్ షిప్ లోఇద్దరు యువతులు గంజాయి సేవిస్తున్నారు. వీరిలో ఒకరు ముంబైకి చెందిన అమ్మాయి సాప్ట్ వేర్ ఇంజనీర్, మరొకరు కరీంనగర్ చెందిన ఫ్యాషన్ డీజైనర్ ఉన్నారు. వారి వద్ద నుంచి 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదే టౌన్ షిప్ లో మరో ముగ్గురు యువకులు కూడా పట్టుబడ్డారు. మలేషియా టౌన్ షిప్ లోని 17 వ బ్లాకులో ఘటన జరిగింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

09:17 - July 22, 2017

హైదరాబాద్ : మరికొద్ది సేపట్లో సిట్ కార్యాలయంలో డ్రగ్స్ కేసులోమ నాలుగవ రోజు విచారణ జరగనుంది. నేడు సిట్ ముందుకు ప్రముఖ నటుడు తరుణ్ హాజరుకానున్నారు. సిట్ అధికారులు కెల్విన్ తోమ తరుణ్ ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:16 - July 22, 2017

విచారణ లోతుగా జరుగుతోంది అది మంచిదే కానీ అది కోర్టుకు ఎంతవరకు పోతుందని, అందరి దృష్టి దీనిపై ఉండడంతో వేరే విషయాలు చర్చకు రావడం లేదని, నిజామాబాద్ లో దళితులు బహిష్కరణ, సిరిసిల్ల జిల్లాలో ఇసుక మఫియాను అడ్డుకున్న వారిపై పోలీసులు థర్డ్ డీగ్రితో చితకబాదరని ప్రముఖ విశ్లేషకులు వినయ్ కుమార్ అన్నారు. ఆంధ్రల విషసంస్కృతితో ఇలా జరుగుతోందని, సినిమాలో అసభ్యకర దృశ్యాల కోసం డ్రగ్స్ వాడుతున్నారని, పాల్వంచ అనే ఏరియాలో పూరీ భార్య డ్రగ్స్ వాడారని, పూరీకి తనకున్న పరిచయాలతో దాన్ని క్లోజ్ చేశారని టీఆర్ఎస్ నేత రాజమోహన్ అన్నారు. మరింత వివరాల కోసం వీడియో చూడండి.

09:15 - July 22, 2017

వ్యవసాయం జీవన ఉపాధీ కోసం చేసుకుంటున్నారు. కానీ రైతులకు మద్దతు ధర అవసరమని, పాడి పరిశ్రమ కూడా మంచి లాభసాటిగా ఉంటుందని, అంతర్ కృషి చేయావల్సిన అవసరం ఉందని, కఠిన కరువు వచ్చిందని, రసాయనా ఎరువులకంటే సేంద్రయ ఎరువులు వాడాలని రైతు సింగడి రామస్వామి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:08 - July 22, 2017

గుంటూరు : న్యాయం చేయాలంటూ రోడ్డెక్కినవారిపై సర్కారు ఉక్కుపాదం మోపుతూనే ఉంది.. అక్కడా ఇక్కడా అన్న తేడాలేదు.. నిరసన స్వరం వినిపిస్తే చాలు.. వెంటనే అణచివేసేందుకు ప్రభుత్వం భారీసంఖ్యలో పోలీసులను రంగంలోకి దించుతోంది.. ముఖ్యంగా దళితులపై నిర్బంధ దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ప్రకాశం జిల్లా దేవరపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు, గరగపర్రు ప్రాంతాల్లోని ఘటనలే దీనికి నిదర్శనం. ఈ ప్రాంతాల్లో హక్కుల కోసం గళమెత్తిన దళితులు, ప్రజలు, ప్రజానాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు.ఎన్నికలకుముందు పెద్దకొడుకుగా ఉంటూ జనాలకు అండగా నిలబడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.. అధికారంలోకివచ్చాక ఆ హామీ నిలబెట్టుకోవాల్సిందిపోయి.

ప్రజల ఆవేదన
మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తున్నారన్నది ప్రజల ఆవేదన. తుందుర్రులో ఆక్వా ఫుడ్ పార్క్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారిపై పోలీసుల తీరును ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు.. మహిళల్ని మగ పోలీసులతో ఈడ్చుకెళ్లడాన్ని వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అటు దేవరపల్లి భూముల వివాదంలోనూ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.. దేవరపల్లిలోని 22 ఎకరాల భూమిని దాదాపు 72 ఏళ్ళక్రితంనుంచి దళితులు సాగు చేసుకుంటున్నారు.. ఎన్నికల్లో ఓటు వేయలేదంటూ వివిధ కారణాలతో వారందరినీ అరెస్ట్ చేశారు.. ఇలా ప్రతీ చోటా భూముల కోసం పోరాడుతున్న రైతుల్ని జైళ్లలో పెడుతున్నారు.. ఇక గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణపై నిరసన తెలిపినందుకూ అరెస్టులు చేశారు.. సమస్యలకు పరిష్కారం చూపాల్సిందిపోయి అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

సీపీఎం ధర్నా
మరోవైపు తుందుర్రు, దేవరపల్లిలో పోలీసుల దమనకాండను నిరసిస్తూ కర్నూలులో సీపీఎం ధర్నా చేపట్టింది.. కలెక్టరేట్‌ దగ్గర పోలీసులతీరుకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు.విశాఖలోనూ సీపీఎం నేతలు కదంతొక్కారు.. జీబీఎంసీ విగ్రహంముందు నిరసన చేపట్టారు.. ప్రజల న్యాయమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కారు ఎన్ని వ్యూహాలు పన్నినా.. ఎంతమందిని అరెస్ట్ చేసినా తమ పోరాటం ఆగదని ఉద్యమకారులు స్పష్టం చేశారు.. సమస్యల్ని పరిష్కరించేంతవరకూ శాంతించేదిలేదని తేల్చిచెబుతున్నారు.

09:05 - July 22, 2017

వరంగల్ : జిల్లాలో పెద్దమొత్తంలో కల్తీనూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. నగరపరిధిలోని ఇండస్ట్రిరియల్‌ ఏరియాలో కల్తీ నూనే పరిశ్రమలపై పోలీసులు దాడులు చేశారు.. పరిశ్రమల నుంచి కల్తీనూనె ప్యాకెట్లు, డబ్బాలను పట్టుకున్నారు.. కల్తీ నూనె స్థావరాలను వరంగల్ నగర సీపీ సుధీర్‌బాబు పరిశీలించారు.

09:04 - July 22, 2017

నిజామాబాద్ : రోజులు మారుతున్నా... పాలకులు మారినా దళితుల జీవితాల్లో వెలుగులు నిండడం లేదు. దళితుల కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా వారు మరింత అణచివేతకు గురవుతున్నారు. అగ్రవర్ణాల వేధింపులు వారిపై నిత్యకృత్యమయ్యాయి. ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ దళితుల బతుకులు మారలేదు. వారిపై దాడులు, వేధింపులు మరింతగా పెరుగుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని మంథనిలో 100 దళిత కుటుంబాలు గ్రామ బహిష్కరణకు గురయ్యాయి.

పెత్తందార్ల కన్ను
మంథనిలో దాదాపు 4000 జనాభా ఉంటుంది. ఇందులో మాల, మాదిగ కుటుంబాలు 100 వరకు ఉంటాయి. పెత్తందార్లకు సేవలు చేసినందుకుగాను 20 ఏళ్ల కిందట దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి తన 24 ఎకరాలను దళితులకు కానుకగా ఇచ్చారు. అప్పటి నుంచి దళితులు ఆ భూముల్లో పశువులను మేపుకునేవారు. కొంత భూమిని సాగుకూడా చేసుకుంటున్నారు. ఇటీవలికాలంలో దళితుల భూములకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. దీంతో దళితుల భూములపై ఆ గ్రామానికి చెందిన పెత్తందార్ల కన్నుపడింది. ఎలాగైనా వారి భూములను కాజేయాలని కుట్రపన్నారు. భూములను తమకు ఇవ్వాలంటూ పెత్తందార్లు దళితులను బెదిరింపులకు గురిచేశారు. అయితే దళితులు మాత్రం తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన అగ్రవర్ణాలు వీడీసీ ముసుగును తెరపైకి తీసుకొచ్చారు. గ్రామాభివృద్ధి కమిటీపై పెత్తనం చెలాయిస్తున్న ఆ పెత్తందార్లు దళితులను గ్రామం నుంచి వెలివేశారు.

కలెక్టర్ కు ఫిర్యాదు
అగ్రవర్ణాలు వెలివేయడంతో దళిత కుటుంబాలు ఒంటరయ్యాయి. దళితులకు చెందిన ఆటోల్లో గ్రామస్తులు ప్రయాణించడం లేదు. దళితుల వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు రాకుండా అడ్డుకున్నారు. పాలకేంద్రాల్లో దళితులకు పాలు పోయడం లేదు. అంతేకాదు... దళితులకు కిరాణా దుకాణంలో సరుకులు ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. తమతో ఎవరూ మాట్లాడటం లేదని.. తమకు ఎలాంటి సాయం చేయకుండా నిరాకరిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు జరుగుతున్న అన్యాయంపై దళితులంతా సంఘటితం అయ్యారు. న్యాయం కోసం ఆర్మూర్‌ పోలీసులను ఆశ్రయించారు. సీఐకి తమ సమస్యను విన్నవించారు. అంతేకాదు.. ఏసీసీ శివకుమార్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు తమ గోడు వినిపించారు. న్యాయం చేయాలని అర్థించారు. తమను వెలివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి అధికారులు దళితుల గోడుపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

09:02 - July 22, 2017

కర్నూలు : టీడీపీ నేతలంతా నంద్యాల ఉప ఎన్నికపైనే దృష్టి కేంద్రీకరించారు. అధికార కార్యక్రమాల పేరుతో మంత్రులంతా ఇక్కడే తిష్టవేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి నంద్యాలలో ఒకసారి పర్యటించి, ఓటర్లను ఆకర్షించేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ మరోసారి టూర్‌ చేయనున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనులు ఏ విధంగా జరుగుతున్నది స్వయంగా పరిశీలిస్తారు. అధికారులు, ప్రజాప్రతినిధులో సమీక్ష నిర్వహిస్తారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశిస్తారు. నంద్యాల టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశా, నిర్దేశం చేస్తారు.

మరికొన్ని వరాలు
ఇంకా ఎన్నికల షెడ్యూలు వెలవడలేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు నంద్యాలకు మరికొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల తేదీ ప్రకటన వచ్చిన నాటినుంచే కోడ్‌ అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తే కొత్త హామీలు ఇవ్వకూడదు. దీంతో ముందుగానే సీఎం చంద్రబాబు సహా ఆయా శాఖ మంత్రి నంద్యాలకు వరాల వర్షాలు కురిపిస్తున్నారు. అభివృద్ధి పథకాలకు నిధులను వరదలా ప్రవహింప చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ కూడా నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ తరుపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిస్తోంది. పార్టీ ముఖ్యనేతలంతా నంద్యాలలోనే తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల పూర్తయ్యే వరకు వైసీపీ వ్యవహారాలు చూసే బాధ్యతలను తన సోదరి షర్మిళకు అప్పగించాలని జగన్‌ నిర్ణయించారు. త్వరలోనే షర్మిళ నంద్యాల వచ్చి మకాంవేసే అవకాశం ఉంది. ఉప ఎన్నిక షెడ్యూలు వెలవడక ముందే నంద్యాలలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రచారం మరింత ప్రచారం ఊపందుకుని రాజకీయం ఇంకా వేడెక్కే అవకాశం ఉంది.

 

09:01 - July 22, 2017

విజయవాడ : ఏపీలో డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ ప్రవేశాలు ప్రహసనంగా మారాయి. డీఎడ్‌ కోర్సుల ప్రవేశాల్లో జాప్యం జరుగుతోంది. ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ, ఇతరత్రా ప్రయోజనాల కోసమే ఈ జాప్యం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీఈఈ సెట్‌లో సాధించాల్సిన కటాఫ్‌ మార్కులను తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. ఉపాధ్యాయ విద్యలో ప్రమాణాలను రెట్టింపు చేసేందుకు డీఈఈసెట్‌లో నిర్ణీత అర్హత మార్కులు సాధించిన వారికి డీఎడ్‌లో సీట్లు కేటాయించేలా ప్రభుత్వం గతంలో జీవో నంబర్‌ 30ని తీసుకొచ్చింది. ఈ మేరకు సెట్‌లో ఓసీలు 50శాతం, బీసీలు 45శాతం, ఎస్సీ,ఎస్టీలు 40శాతం మార్కులు సాధించాలని నిబంధన విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు ఎక్కువగా ఉండడంత, అర్హులైన అభ్యర్థుల సంఖ్య తగ్గడంతో ప్రైవేట్‌ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కటాప్‌ మార్కులు తగ్గించాలని ప్రతిఏటా ప్రైవేట్‌ డీఎడ్‌ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. దీంతో గతేడాది ప్రతి కేటగిరీలో ఐదేసి మార్కుల చొప్పున కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం తగ్గించింది. ప్రభుత్వ , ప్రవేట్‌ డీఎడ్‌ కాలేజీల్లో కలిపి మొత్తంగా 66,750 సీట్లున్నాయి. అయితే ఈ ఏడాది 72వేల మంది దరఖాస్తు చేసేకోగా... వీరిలో 53వేల మందే ఎంట్రన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యారు. వీరందరికీ ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం భావించినా... ఇంకా 13వేలకు పైగా సీట్లు మిగులుతాయి.

ప్రభుత్వం పై ఒత్తిడి
దీంతో ప్రైవేట్‌ కాలేజీలు కటాఫ్‌ మార్కులు తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా ఇంతవరకు ఫలితాలను విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.వాస్తవానికి జీవో నంబర్‌ 30 ప్రకారం మార్చిలోనే డీఈఈసెట్‌ ప్రక్రియ ప్రారంభించాలని ఉంది. మే మొదటి వారంలో పరీక్ష నిర్వహించి... అదే నెలలో మూడోవారంలో ఫలితాలు వెల్లడించాలని పేర్కొన్నారు. జూన్‌ ఫస్ట్‌వీక్‌లో కౌన్సెలింగ్‌ ప్రారంభించి... ఆగస్టు నాటికి తరగతులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. దీన్ని కూడా మార్పు చేస్తూ జూన్‌ రెండో వారంలోనే డీఎడ్‌ తరగతులు ప్రారంభించాలని సవరణ జీవో 22ను విడుదల చేసింది ప్రభుత్వం. జూలై మాసం చివరికి వచ్చినా ఇంతవరకు ఫలితాలు కూడా విడుదల చేయలేదు. ఫలితంగా డీఎడ్‌ ప్రవేశాలు జాప్యం అవుతుండడంతో ఈ కోర్సులో చేరాలని ఎదురు చూస్తున్న వేలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

09:00 - July 22, 2017

విశాఖ : జిల్లాలో వెలుగులోకి వచ్చిన భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. అందిన ఫిర్యాదులను విశ్లేషించిన సిట్‌.. ఇప్పుడు విచారణను షురూ చేసింది. కుంభకోణంతో సంబంధం ఉందని తేలిన వారిపై కేసులు పెట్టడం ప్రారంభించింది. సిట్‌కు చాలా ఫిర్యాదులు అందాయి. గతనెల 28న ప్రత్యేక దర్యాప్తు బృందం పని ప్రారంభించింది. ఈనెల 15 వరకు ప్రజలు, ప్రజాసంఘాలు, బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుంది. రాజకీయాల పార్టీల నేతల నుంచి ఈనెల 20 వరకు కంప్లెంటులు స్వీకరించింది. వామపక్షాలతోపాటు లోక్‌సత్తా, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తన వద్ద ఉన్న ఆధారాలను అందించారు. మొత్తం 2296 ఫిర్యాదులు అందాయి. వీటిలో భూమి రికార్డుల తారుమారుపై 246, భూ ఆక్రమణలనకు సంబంధించి 398 ఫిర్యాదులు ఉన్నాయి. ఇతరితర భూసమస్యలకు సంబంధించి 1652 ఫిర్యాదులు సిట్‌కు అందాయి. వీటన్నింటికీ సంబంధించి విచారణ ప్రారంభించారు. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని ప్రత్యేక ద్యాప్తు బృందం భూ రికార్డుల తారుమారు వ్యవహారాలను క్షణ్ణంగా పరిశీలించింది. అక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమికంగా తేలిన 59 మందిపై పీఎం పాలెం, అరిలోవ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేసింది. ఇక అరెస్టులే మిగిలాయి.

బడా బాబులపై సిట్‌ ప్రత్యేక దృష్టి
2002 నుంచి 2017 వరకు విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని 11 మండలాల పరిధిలో భూ బదలాయింపులపై జారీ చేసిన 69 ఎన్‌వోసీలను సిట్‌ క్షణ్ణంగా పరిశీలించింది. మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితుల పేరుతో నిరభ్యంతర ధ్రువపత్రాలు ఇచ్చారు. కొందరు రాజకీయ నేతల అండంతో ఈ భూములను ఆక్రమించుకున్న బడా బాబులపై సిట్‌ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ వ్యవహారం వెనుక ఉన్న రెవెన్యూ సిబ్బంది పాత్రను నిగ్గు తేల్చే పనిలో పడింది. భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో విశాఖ రూరల్‌లో తహశీల్దార్‌గా పనిచేసి రామారావును సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఆనందపురం మండలం వేములవలసలో ప్రభుత్వ భూములను తమవిగాచూపి మెడ్‌ టెక్‌ కంపెనీ బ్యాంకుల నుంచి 190 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ వ్యవహారంలో జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువులపై ఆరోపణలు వచ్చాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు మెడ్‌ టెక్‌ భూములపైనే సిట్‌కు ఆధారాలు అందించారు.

ప్రతిపక్షాల ఫిర్యాదు
వైసీపీ నేతలు కూడా తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇచ్చారు. సీపీఎం, సీపీఐ నేతలు అనందపురం, ముదపాక, భీమిలి మండలాల్లో భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. విశాఖ భూకుంభకోణం వ్యవహారంపై తేనెతుట్టె కదిపిన బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాత్రం సిట్‌కు దూరంగా ఉంటున్నారు. విశాఖ భూకుంభకోణంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు, గ్రామీణ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యేపై ఆరోపణలు వస్తున్నాయి. తనపై వస్తున్న ఆరోపణల గురించి వివరణ ఇచ్చేందుకు మంత్రి గంటా ఇంతవరకు సిట్‌ ముందుకు రాలేదు. భూకుంభకోణంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన సిట్‌... రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజానిజాలను నిగ్గుతేల్చి, నిందితులను పట్టుకుంటుందో ? లేక తూతూమంత్రంగా విచారణను ముగిస్తుందో చూడాలి. 

08:58 - July 22, 2017

నాగర్ కర్నూలు : నాగం జనార్దన్‌రెడ్డి... తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి ఏపీలో టీడీపీ తరుపున ఐదుసార్లు మంత్రిగా పని చేసిన నేత. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో సొంతపార్టీ పైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేత. ఆ తర్వాత నాగర్‌కర్నూలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఇండిపెండెండ్‌గా నెగ్గి, తెలంగాణ వాణి వినించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీజేపీలో చేరిన నాగం, ఇప్పుడు కమలదళంలో ఎలా ఉన్నారు. ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారా ? ఈ విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నాగం బీజేపీలో సంతోషంగా ఏమీ లేరు. అపార రాజకీయ అనుభవం, సమస్యలపై చివరి వరకు పోరాడే తత్వం కల్గివున్న నాగం సేవలను కలమనాథులు పూర్తిగా వాడుకోలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు నాగంను ఎందుకు ఉపయోగించుకోలేక పోతున్నారన్నఅంశంపై కమలనాథులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

కావాలనే పక్కన పెడుతోంది
బీజీపీ నాయకత్వం కావాలనే నాగంను పక్కన పెట్టినట్టు చెప్పుకొంటున్నారు. తెలంగాణలో బలమైన సామాజికి వర్గానికి చెందిన నాగం జనార్దన్‌రెడ్డికి మంచి పేరు, ప్రతిష్టలు ఉన్నాయి. కాస్త అవకాశం వస్తే దూసుకుపోయే తత్వం కల్గివున్న నాగం పట్ల బీజేపీ నాయకత్వ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని కమలనాథులే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అని పోరాడేందుకు నాగం సిద్ధంగా ఉన్నా... బీజేపీ నాయకత్వం ఏమాత్రం సహకరించడంలేదన్న వాదనలు ఉన్నాయి. తెలంగాణ జలహారం, మిషన్‌ కాకతీయ, నాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి వంటి అంశాల్లో అవినీతి గురించిన నాగం మాట్లాడుతుంటే.... బీజేపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురయ్యారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యక్తిగతంగానే హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని నాగం సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. చాలా విషయాల్లో నాగంను నైతికంగా దెబ్బతీసే విధంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తుండటంతోబాధపడుతున్నారు. కొందరు బీజేపీ నేతలు తాను పార్టీ మారుతున్నట్టు దుష్ప్రచారం చేస్తుండటంపై నాగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బీజేపీలో నాగం ప్రయాణం అసంతృప్తితోనే సాగుతోంది. ఇదే కొనసాగితే తెలంగాణ కమలనాథులతో తాడో పేడో తేల్చుకునేందుకు కూడా నాగం సిద్ధంగా ఉన్నారని ఈయన సన్నిహితులు చెబుతున్నారు. తన దారి తాను చూసుకునేందుకు భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. 

08:57 - July 22, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంలో మూడోరోజు సిట్‌ అధికారులు సినీ నటుడు సుబ్బరాజును విచారించారు. ఉదయం 10.30కు ప్రారంభమైన విచారణ రాత్రి 11.15కు జరిగింది. సుబ్బరాజుపై సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ డ్రగ్స్‌ వినియోగం దగ్గరి నుంచి కెల్విన్‌తో పరిచయం వరకు ఏదీ వదలలేదు. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందా? పూరీ జగన్నాథ్‌తో సన్నిహితంగా ఉంటారా? పూరీ ఎప్పుడైనా డ్రగ్స్‌ తీసుకోవడం చూశారా?ముమైత్‌ఖాన్‌, చార్మితో కలిసి పబ్‌ల్లో డ్రగ్స్‌ తీసుకున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు. పూరీతో కలిసి తరచూ బ్యాంకాక్‌ వెళ్లడంపై అధికారులు సుబ్బరాజును ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందో చెప్పాలన్నారు. బ్యాంకాక్‌ వెళ్లినప్పుడు ఏ ఫోన్‌ నంబర్లు వాడారని ప్రశ్నించారు. అక్కడ పూరీ విదేశీ ఫోన్‌ నంబర్లు వాడినట్టు తెలుసా అని సిట్‌ అధికారులు ఆరా తీశారు. కెల్విన్‌ తెలుసా? అతడితో ఎలా పరిచయమైంది? సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందో చెప్పాలన్నారు. అయితే సిట్‌ ప్రశ్నలకు సుబ్బరాజు మొదట తనకేమీ తెలియదంటూ సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. తాను డ్రగ్స్‌ తీసుకోలేదని చెప్పినట్టు సమాచారం. సిట్‌ అధికారులకు సమాధానం చెప్పకుండా వారిని ముప్పుతిప్పలు పెట్టినట్టు తెలుస్తోంది.

రూట్ మార్చిన సిట్
మధ్యాహ్నం తర్వాత సిట్‌ అధికారులు సుబ్బరాజును ప్రశ్నించే తీరును మార్చారు. పలు ఆధారాలు చూపుతూ గట్టిగా ప్రశ్నించారు. దీంతో సుబ్బరాజు డ్రగ్స్‌ వ్యవహారంపై కొంత సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగుస్తుందని అందరూ భావించారు. సుబ్బరాజు సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో మరికొంతసేపు విచారణ కొనసాగించాలని అకున్‌ సబర్వాల్‌ నిర్ణయించారు. నేరుగా తనే రంగంలోకి దిగి ప్రశ్నలు సంధించారు. దీంతో సుబ్బరాజు కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. తరచూ డ్రగ్స్‌ తీసుకునే కొందరిపేర్లు వెల్లడించినట్టు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా ఉన్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్‌ తీసుకుంటారని బయటపెట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకుల కలిపి మరో 13 మంది కూడా డ్రగ్స్‌ విపరీతంగా వినియోగిస్తారని సుబ్బరాజు కీలక సమాచారం వెల్లడించినట్టు తెలుస్తోంది. దీంతో వారికీ సిట్‌ నోటీసులు పంపనుంది. డ్రగ్‌ దందాకు వేదికగా మారిన జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని పలు పబ్బుల పేర్లను కూడా బయటపెట్టినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. పబ్బుల ద్వారానే డ్రగ్స్‌ దందా విస్తరిస్తోందని గుర్తించిన సిట్‌... పబ్బుల నిర్వాహకులను విచారించాలని నిర్ణయించింది. 16 పబ్బులను సిట్‌ నోటీసులు జారీ చేసింది. నేడు 16 పబ్బులతోపాటు ఇతర పబ్బుల నిర్వాహకులతో సమావేశంకానున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు.

అస్వస్థతకు గురైన సుబ్బరాజు
కేసు విచారణలో నటుడు సుబ్బరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సిట్‌ అధికారులు విచారిస్తున్న సమయంలో ఆయనకు బీపీ డౌన్‌ అయ్యింది. దీంతో వెంటనే వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన సుబ్బరాజు... సిట్‌ అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరించానని తెలిపారు. విద్యార్థులు, యువకులు డ్రగ్స్‌కు అలవాటు పడటం బాధాకరమని... డ్రగ్స్‌ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరగాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలన జరగాలని తాను కోరుకుంటున్నానన్నారు. సిట్‌ మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు.విచారణ సందర్భంగా సుబ్బరాజు బ్లడ్‌శాంపిల్స్‌ను సిట్‌ అధికారులు సేకరించారు. ఉస్మానియా వైద్యబృందం ఆధ్వర్యంలో రక్తశాంపిల్స్‌తోపాటు గోర్లు, వెంట్రుకలను పరీక్ష నిమిత్తం తీసుకున్నారు. సిట్‌ దర్యాప్తులో భాగంగా ఇవాళ హీరో తరుణ్‌ విచారణకు హాజరుకానున్నారు. 

Don't Miss