Activities calendar

23 July 2017

మహిళల వరల్డ్ కప్ ఇంగ్లండ్ కైవసం

ఇంగ్లండ్ : మహిళల వరల్డ్ కప్ ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్.. భారత్ పై గెలుపొందింది. భారత్ పోరాడి ఓడింది. చివర్లో మిథాలీసేన వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 

22:09 - July 23, 2017

సీనియర్ సినీ నటులు చలపతిరావుతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన సినీ కెరీర్ వివరించారు. తన అనుభవాలను తెలిపారు. సినీ పరిశ్రమలో తను పడిన కష్టాలను వివరించారు. డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే.....
'డ్రగ్స్ ఎలా మొలైందో నాకు తెలియదు'. 'మేము కూడా మత్తులోనే ఉంటాం...నటన మత్తులో ఉంటాం'. మత్తు వేషంలో ఉంది. మత్తు పదార్థాలను ప్రభుత్వం నియంత్రించాలి. ఏ లేదు... బి లేదు...అందరూ నటులే. అవకాశాలు రాలేదని సినీ ఇండస్ట్రీ నుంచి పారిపోకూడదు. వేశాలు లేకుండా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. నాడు బస్సు ఎక్కడానికి పది పైసలు కూడా లేకుండేది. అవకాశాలకు నిలబడి పోట్లాడాలి. ఎవరు..ఎవరిని తొక్కలేదు. ఎన్ టిఆర్ లాంటి మనిషి ఇకరాడు. ఎన్ టిఆర్... దేవుడు. ఆయన జీవితం జోలికి వెళ్లొద్దు. బయోపిక్ తీస్తే వివాదాలు అవుతాయి' అని చలపతిరావు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:54 - July 23, 2017
21:53 - July 23, 2017
21:44 - July 23, 2017

డయ్యూ : డయ్యూ నగ్వా బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ పిచ్చి ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. బీచ్‌ వద్ద అలలవైపు నిలబడి కొందరు సెల్ఫీ తీసుకుంటుండగా రాకాసి అల ఒక్కసారిగా నలుగురిని ముంచేసింది. వారిలో ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరు క్షేమంగా బయటపడ్డారు. 

21:39 - July 23, 2017

ఢిల్లీ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మత ఘర్షణలను ప్రోత్సహిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘువులు ఆరోపించారు. దళితులు, మైనార్టీలపై హిందూత్వ శక్తులు, ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులు పెరిగాయన్నారు.  వ్యవసాయాన్ని మోదీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. వ్యవసాయరంగాన్ని కాపాడుకునేందుకు రైతు ఉద్యమాలను ప్రోత్సహిస్తామన్నారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. మైనార్టీలపై దాడులు, వ్యవసాయం, జీఎస్టీ, నిరుద్యోగంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాఘవులు...  దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు.  ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 75 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయన్నారు. ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. 

 

21:24 - July 23, 2017

నిర్మల్‌ : జిల్లాలోని కుబిర్‌ మండలం నిగ్వలో దారుణం జరిగింది. ప్రేమజంట పూజ, గోవింద్‌ను దారుణంగా హత్య చేశారు. పూజ సోదరుడు దిగంబర్‌ వారిని నరికి చంపాడు. అనంతరం మహారాష్ట్ర పోలీసుల ఎదుట దిగంబర్‌తోపాటు మరో యువకుడు లొంగిపోయాడు. మహారాష్ట్ర భోకర్‌ తాలూకా పెర్బానికి చెందిన గోవింద్‌, పూజ కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురి పెద్దలకు చెప్పడంతో వారు పెళ్లికి నిరాకరించారు. పూజకు తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెళ్లి చేశారు. ఇష్టంలేని పెళ్లి చేయడంతో పూజ... తన ప్రియుడు గోవింద్‌తో కలిసి నిగ్వ గ్రామంలో కాపురం పెట్టింది. మరోవైపు పూజ సోదరుడు దిగంబర్‌ తన సోదరి పూజ కనిపంచడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిగ్వ గ్రామంలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ప్రేమజంటను, దిగంబర్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం తిరుగు ప్రయాణంలో దిగంబర్‌.. అతని స్నేహితుడితో కలిసి పూజ, గోవింద్‌ను నరికి చంపాడు. పూజ, గోవింద్‌ది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. 

 

కారు లోయలో పడి ఇద్దరు మృతి

పెద్దపల్లి : బసంతనగర్ మూలమలుపు వద్ద ఓ కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు.

21:09 - July 23, 2017

ప్రకాశం : జిల్లాలో "మీ సేవా కేంద్రాల" కోసం  ఏర్పాటు చేసిన అర్హతా పరీక్షకు అభ్యర్ధులు భారీగా హాజరయ్యారు. ఒంగోలు లోని నాగార్జున విశ్వవిద్యాలయంలో అభ్యర్థులకు పరీక్షను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయితీల నుండి అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను అధికారులు రెండు రోజుల్లో వెల్లడించనున్నారు..

 

21:08 - July 23, 2017

'గౌతమ్ నంద' టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో గోపిచంద్, చిత్ర దర్శకుడు సంపత్ నంది మాట్లాడారు. సినిమా విశేషాలను తెలిపారు. తమ తమ సినీ అనుభవాలను పంచుకున్నారు. ఇంట్రెస్టింగ్ గా ఉంటే నెగేటివ్ షేడ్స్ పాత్రలు కూడా చేస్తానని గోపిచంద్ చెప్పారు. ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. సినిమాకు చెందిన పలు అసక్తకరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

20:55 - July 23, 2017
20:54 - July 23, 2017

ఢిల్లీ : సభలో ఆందోళనలు పార్లమెంట్‌కు నష్టమన్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఆయనకు పార్లమెంటు సెంట్రల్ హాలులో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ ముఖర్జీని ఘనంగా సన్మానించారు. దేశానికి ప్రణబ్‌  అందించిన సేవలను నేతలంతా కొనియాడారు. ప్రస్తుత ఎంపీల సంతకాలు, తన ప్రసంగంతో కూడిన పుస్తకాన్ని ప్రణబ్‌కు  స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అందజేశారు. అందరికీ ప్రణబ్‌ ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ఆమె ప్రశంసించారు. వీడ్కోలు కార్యక్రమం నిర్వహించినందుకు ప్రణబ్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు.

 

తొలి వికెట్ కోల్పోయిన భారత్

ఇంగ్లండ్ : మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. 229 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. అయితే 2వ ఓవర్లలోనే భారత్‌  ఓపెనర్‌ స్మృతి మందాన వికెట్‌ కోల్పోయింది.  అంతకుముందు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 228 పరుగులే చేయగలిగింది. జులన్‌ గోస్వామి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. 

 

భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభం

ఇంగ్లండ్ : మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. 229 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. 

 

20:39 - July 23, 2017

ఇంగ్లండ్ : మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భారత్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. 229 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. గెలుపే లక్ష్యంగా భారత్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. అయితే 2వ ఓవర్లలోనే భారత్‌  ఓపెనర్‌ స్మృతి మందాన వికెట్‌ కోల్పోయింది.  అంతకుముందు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 228 పరుగులే చేయగలిగింది. జులన్‌ గోస్వామి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను దెబ్బతీసింది. 

20:34 - July 23, 2017

కడప : జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జారాయుళ్లు ఆక్రమించేస్తున్నారు.  నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూములను కాజేస్తున్నారు. వాటిని రక్షించాల్సిన రెవెన్యూ అధికారులు కాసుల కక్కుర్తితో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కడప జిల్లా కాశినాయన మండలంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూములపై 10టీవీ ప్రత్యేక కథనం...
కోట్లవిలువైన భూములు కబ్జా
కడప జిల్లాలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి గద్దల్లా వాలిపోతున్నారు. ఖద్దరు చొక్కాలు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేస్తున్నారు.
విలువైన ప్రభుత్వ భూములు
ఇదిగో ఈ భూములు కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలంలోనివి. ఇవన్నీ ప్రభుత్వ భూములు. ఇవి అత్యంత సారవంతమైన భూములు.  వ్యవసాయానికి యోగ్యమైన ప్రభుత్వ భూములు.  అక్కెంగుండ్ల, సావిశెట్టిపల్లి, పగడాలపల్లె రెవెన్యూ పరిధిలో వివిధ సర్వేనంబర్ల కింద మొత్తం 6వేల ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములున్నాయి. ఇందులో కొన్ని డీకేటీ భూములు కూడా ఉన్నాయి. 
ప్రభుత్వ భూములపై కబ్జారాయుళ్ల కన్ను
కాశినాయన మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాల్లో ఉండడంతో వాటిపై భూ బకాసురుల కన్ను పడింది. ఖద్దరు చొక్కాలు, బడా వ్యాపారులు ఆ భూములను కాజేసేందుకు ఏకమయ్యాయి.  ఇందుకు కోసం పక్కాగా ప్లాన్‌ రూపొందించారు.  రెవెన్యూ అధికారులతో పరిచయం పెంచుకున్నారు. వారికి ముడుపుల ఎరవేశారు.  ఇంకేముందీ... తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీంతో ప్రభుత్వ భూములు కాస్తా కబ్జారాయుళ్ల ఆధీనంలోకి వెళ్లాయి.
ప్రభుత్వ డీకేటీ భూమి ఆక్రమణ
అక్కెంగుండ్ల, సావిశెట్టిపల్లి, పగడాలపల్లె రెవెన్యూ పరిధిలోని 130 నుంచి 153 వరకు గల సర్వేనంబర్లలోని భూమి పూర్తిగా ఆక్రమణకు గురైంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి 38,39 సర్వేనంబర్లలోని 400 ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూమిని ఆక్రమించారు. అందులో యథేచ్చగా అరటి సాగు చేస్తున్నారు. దేవుని మాన్యం భూములను కొన్నామని చెప్తున్నారు. దేవుని మాన్యం భూములు ఎవరికీ అమ్మే హక్కు, కొనే హక్కులేదు. మరి రాఘవరెడ్డి ఎలా కొనుగోలు చేశారో ఆ దేవుడికే తెలియాలి.
125 ఎకరాల డీకేటీ భూమి కబ్జా 
కడప నగరంలో డాక్టర్‌ సురేంద్రబాబు తిరుమల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన కాశినాయన మండలంలో 25 ఎకరాల పొలం కొన్నారు. పనిలో పనిగా తన పొలం చుట్టూగా ఉన్న 125 ఎకరాల డీకేటీ భూమిని కబ్జా చేసేశారు. కబ్జా చేసిన భూమిలో దానిమ్మపంటను సాగుచేస్తున్నారు. కేంద్ర మాజీమంత్రి జైపాల్‌రెడ్డి బంధువులుగా చెప్పుకుంటున్న వరంగల్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌రెడ్డి  600 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. కొన్ని ఎకరాల్లో అరటిని సాగుచేస్తున్నారు. 
ఆర్మీ మాజీ ఉద్యోగుల భూమి కబ్జా
కాశినాయన మండలానికే చెందిన బస్వాపురం గ్రామవాసి శ్రీనివాస్‌ యాదవ్‌ దాదాపు 300 ఎకరాలకుపైగా భూమిని కబ్జా చేశారు.  కబ్జా చేసిన భూమిలో చాలా వరకు అరటి సాగు చేస్తున్నారు. శ్రీనివాస్‌ యాదవ్‌ ఆక్రమించిన భూమి ప్రభుత్వ రికార్డుల్లో ఆర్మీ మాజీ ఉద్యోగులకు కేటాయించిన భూమిగా చూపిస్తోంది. కానీ శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు ఈ భూమిని దర్జాగా సాగుచేసుకుంటున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఇలా ఎవరికి సాధ్యమైనంతగా వారు ప్రభుత్వ భూములను యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. ఆ భూముల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఆక్రమణ భూములను ఎస్టేట్‌లుగా మార్చుకుని వారాంతపు విడిది స్పాట్స్‌గా మార్చుతున్నారు. వన్యప్రాణులను వేటాడి చంపుకు తింటున్నా పట్టించుకునేవారు ఉండరు. 
దళితులకు కబ్జా రాయుళ్లు బెదిరింపులు
ఎన్నాళ్లుగానో డీకేటీ భూములను సాగు చేసుకుంటున్న దళితులను కబ్జా రాయుళ్లు బెదిరింపులకు గురిచేస్తున్నారు. అవి తమ భూములని వాటిలో సాగు చేస్తే చంపుతామని బెదిరిస్తున్నట్టు దళితులు వాపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ భూములంటోంటే... తామేమీ కావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ఆ భూములపై ప్రత్యేక విచారణ కమిటీ వేయాలి : ప్రజాసంఘాల నేతలు  
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై ప్రత్యేక విచారణ కమిటీ వేయాలతని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.  కబ్జాకు గురైన వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. భూమిలేని నిరుపేదలకు ఆ భూమిని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

 

20:21 - July 23, 2017

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల పోలీసు స్టేషన్‌లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, క్రైం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

 

20:12 - July 23, 2017

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరళ్ల దళితులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తమను ఎస్పీతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను కాంప్రమైజ్‌ కావాలంటూ వేధిస్తున్నారన్నారు. రాజీపడితే మా పిల్లలను విడిపిస్తామని.. లేకుంటే శవమై తేలుతారని హెచ్చరిస్తున్నారంటూ వాపోయారు. న్యాయం చేయాల్సిన పోలీసులు, అధికారపార్టీ నేతలే తమను బెదిరింపులకు గురిచేస్తుంటే ఎవరితో చెప్పుకోవాలని కన్నీరుమున్నీరయ్యారు.  నేరెళ్ల గ్రామలో ఈనెల 2న ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే నిరుపేద చనిపోయాడు. దీంతో అర్ధరాత్రి దళితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలోనే గుర్తుతెలియని దుండగులు లారీలకు నిప్పించారు. దీంతో పోలీసులు దళితులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. అమాయకులైన యువకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ వారు పోరుబాటపట్టగా వేధింపులు ఎక్కువయ్యాయి. ఎట్టిపరిస్థితిలోనూ రాజీపడే ప్రసక్తేలేదని.. న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముందు భూ బాధితులు ఆందోళన

హైదరాబాద్ : హబ్సీగూడలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంటి ముందు అమ్ముగూడ భూ బాధితులు ఆందోళన చేపట్టారు. 15 ఏళ్లుగా వివాదంలో ఉన్న అమ్ముగూడ భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

 

ప్రేమజంట దారుణ హత్య

నిర్మల్ : కుబీర్ మండలం నిగ్వ సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ప్రేమజంట దారుణ హత్య గావించబడ్డారు. మృతులు పూజ (20), గోవింద్ (25).. మహారాష్ట్ర భోఖర్ తాలూకాలోని తెర్చన్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించార.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు కార్యక్రమం

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, అద్వానీ, సోనియా, మన్మోహన్ సింగ్, దేవేగౌడ, పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. 

 

ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

తూర్పుగోదావరి : కాపునేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు యంత్రాంగం అప్రమత్తం అయ్యారు.

19:18 - July 23, 2017
19:16 - July 23, 2017
19:14 - July 23, 2017

తూ.గో జిల్లాలో పోలీసుల కవాతు

తూర్పుగోదావరి : జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. కాపు నేతల ఇళ్ల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్....

ఇంగ్లండ్ : మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. భారత బౌలర్లు జులన్ గోస్వామి మూడు వికెట్లు తీశారు. పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. 

 

18:48 - July 23, 2017

ఇంగ్లండ్ : మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. భారత బౌలర్లు జులన్ గోస్వామి మూడు వికెట్లు తీశారు. పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీశారు. 

ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ జోరు

ఢిల్లీ : మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ జట్టు జోరు కొనసాగుతోంది. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ కు చుక్కలు చూపిస్తున్నారు. జులన్ గోస్వామి మూడు వికెట్లు తీసి ఇంగ్లీష్ టీమ్ నడ్డి విరించింది. 

18:29 - July 23, 2017

కృష్ణా : బెజవాడలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒకేసారి భారీ దొంగతనాలకు స్కెచ్‌ వేస్తూ.. పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. భద్రత కట్టుదిట్టంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతాల్లో ఘరానా చోరీ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. దొంగలు, పోలీసులను.. ఉరుకులు, పరుగులు పెట్టించడం చర్చనీయాంశంగా మారింది. 
బీభత్సం సృష్టిస్తున్న దొంగలు 
బెజవాడలో చోరులు చొరబడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లల్లోకి చొరబడి.. దొరికిందంతా దోచుకెళ్తున్నారు. అయితే తప్పు చేసినవాళ్లు దొరకకుండా పోరని పోలీసులు చెబుతున్నారు. నిఘా వ్యవస్థకే సవాల్‌గా మారుతూ దోపిడీదారులు, కత్తులు, తుపాకులతో బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో నగర ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. 
నగల తయారీకేంద్రంలో 7 కిలోల బంగారం చోరీ 
మహారాష్ట్ర, బెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ సభ్యులు.. ఏపీ రాజధానిలో ప్రవేశించి నానా హంగామా చేస్తున్నారు. జులై 11న జరిగిన భారీ దొంగతనం గురించి సీఎం స్వయంగా ఆరా తీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బంగారు నగల తయారీ కేంద్రంలో చొరబడిన దొంగలు 7 కిలోల బంగారం దోచుకుపోవడం అందరినీ కలవరపరచింది. ఈ చోరీ జరిగి ఇన్ని రోజులైనా ఆ గ్యాంగ్‌ జాడ తెలియలేదు. ఇదే అదనుగా దుండగులు మరిన్ని చోరీలకు పాల్పడుతున్నారు.  
సీసీ కెమెరాలకు, పోలీసులకు చిక్కని దొంగలు 
తెలంగాణలో ఏదైనా ప్రాంతంలో దొంగతనం జరిగి వ్యక్తులు పట్టుబడితే.. పీడీ యాక్ట్ కింద కఠినంగా వ్యవహరిస్తున్నారు. పీడీ యాక్ట్‌ను ప్రయోగించడం ద్వారా ఏడాది వరకు బెయిల్ కూడా దొరకని పరిస్థితి ఉంది. ఏపీలో ఈ తరహా శిక్షలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని పలువురు భావిస్తున్నారు. బెజవాడలోని రద్దీ ప్రాంతాల్లో దొంగతనం చేసి క్షణాల్లోనే సీసీ కెమెరాలకు, పోలీసులకు కనపించకుండా దొంగలు మాయమైపోతున్నారు. గతంలో అర్ధరాత్రి వేళ బెజవాడ పోలీస్ పహారాలో ఉండేది. ఇప్పుడలా లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. చోరీల విషయంలో సీఎం చంద్రబాబు, డీజీపీ, విజయవాడ సీపీ ఈ కేసు విషయంలో దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా చోరీలకు పాల్పడుతున్న దుండగుల చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు చెబుతున్నారు. 

 

18:20 - July 23, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని పాలకొల్లు ఎమ్ వీఎస్ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల చేత కిచెన్‌ గార్డెన్‌ పనులు చేయిస్తున్నారు. ట్రాక్టర్‌లో వచ్చిన మట్టిని చిన్న పిల్లల చేత మోయిస్తున్నారు. ఇదేమిటని పాఠశాల ప్రాధానోపాధ్యాయున్ని ప్రశ్నించగా కూలీలు లేక అందుబాటులో ఉన్న పిల్లల చేత పనులు చేయిస్తున్నామని చెబుతున్నారు. ఈ విషయంపై  ఎమ్ఈవో రంగరాజు స్పందించి ఈ విషయంపై పరిశీలిస్తామని తెలిపారు.

 

18:15 - July 23, 2017

నిజామాబాద్‌ : జిల్లాలోని ఆర్మూరు మండలం మంథనిలో దళితుల బహిష్కరణ వివాదం సద్దుమణిగింది. టెన్‌ టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు.  ఆర్డీవో, పోలీసులు మంథని గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో  చర్చలు జరిపారు.  వారి మధ్య సయోధ్య కుదిర్చారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు టెన్‌ టీవీకి కృతజ్ఞతలు తెలిపారు. 
10టీవీ కథనాలు...అధికారయంత్రాంగంలో చలనం
నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మంథనిలో దళితుల గ్రామ బహిష్కరణ వివాదంపై ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. దళితుల గ్రామ బహిష్కరణపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. కంప్యూటర్‌ యుగంలోనూ దళితులపై జరుగుతున్న వివక్షను ఎండగట్టింది. గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో దళితులను వెలివేసిన  వైనాన్ని  ప్రశ్నించింది. పెత్తందార్లు అమలు పరుస్తోన్న ఆటవిక న్యాయాన్ని గొంతెత్తి నినదించింది. 
గ్రామాన్ని సందర్శించిన టీ మాస్‌ఫోరం నేతలు
మంథని దళితుల గోడును 10టీవీ బయటి ప్రపంచానికి తెలియజేయడంతో ప్రజాసంఘాల ఐక్యవేదిక టీ మాస్‌ ఫోరం సభ్యులు ఆ గ్రామాన్ని సందర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీమాస్‌ నేతలు రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, జాన్‌వెస్లీ, ఎంబీసీ సంఘం నేత ఆశయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.   దళితులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దళితుల భూములను  పరిశీలించారు. దళితులను వెలివేసిన పెత్తందార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్వరాష్ట్రంలోనూ దళితులపై దాడులు , దౌర్జన్యాలు కొనసాగడం దురదృష్టకరమని తమ్మినేని వీరభద్రం అన్నారు. దళితులను వెలివేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దళితుల భూములను లాక్కొవాలని ప్రయత్నిస్తున్న పెత్తందార్లపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీమాస్‌ నేత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 
గ్రామాన్ని సందర్శించిన ఆర్డీవో, పోలీసు అధికారులు
మంథని దళితులకు జరిగిన అన్యాయంపై టీన్‌టీవీ వరుస కథనాలు ఒకవైపు... టీమాస్‌ నేతల ఆందోళన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఆర్డీవో, డీఎస్పీ, ఏసీపీ, సీఐసహా పలువురు అధికారులు  హుటాహుటినా గ్రామాన్ని సందర్శించారు. దళితులను అడిగి వివరాలు సేకరించారు. వారి ఫిర్యాదు మేరకు  21మందిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు  నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 
ఇరువర్గాల మధ్య కుదిరిన సయోధ్య
 గ్రామంలోని ఇరువర్గాలతో పోలీసులు చర్చలు జరిపారు. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు  ప్రయత్నాలు చేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది. దళితుల సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి దాని పరిష్కారానికి కృషి చేసిన 10టెన్‌ టీవీకి అభినందనలు వెల్లువెత్తాయి. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన టీన్‌టీవీకి దళితులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి టెన్‌ టీవీ చొరవతో దళితుల బహిష్కరణ వివాదం సద్దుమణిగింది. టెన్‌ టీవీ ఎప్పుడూ బడుగుజీవుల గొంతుకే. వారి ప్రతినిధిగా ఎల్లప్పుడూ పనిచేస్తుంది. న్యూస్‌ ఈజ్‌ పీపుల్‌.
 

18:10 - July 23, 2017

ఢిల్లీ : మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ జట్టు జోరు కొనసాగుతోంది. భారత్ బౌలర్లు ఇంగ్లండ్ కు చుక్కలు చూపిస్తున్నారు. జులన్ గోస్వామి మూడు వికెట్లు తీసి ఇంగ్లీష్ టీమ్ నడ్డి విరించింది. 

 

18:00 - July 23, 2017

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం పాలమాకులలోని జెఎన్ ఎన్ యూఆర్ ఎమ్ గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బెంగళూరు...హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి ఆందోళన కారుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జెఎన్ ఎన్ యూఆర్ ఎమ్ గృహాలను మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. 

17:54 - July 23, 2017

ప్రకాశం : ఒంగోలు రిమ్స్‌కు ఎంసిఐ గుర్తింపు లభించకపోవడంపై మెడికోలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రిమ్స్‌ను మూడుసార్లు సందర్శించిన ఎంసిఐ లోపాలను ఎత్తి చూపుతూనే ఉంది. రిమ్స్‌కు మరోసారి ఎంసిఐ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో మెడికోలు ఆందోళన చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:50 - July 23, 2017

హైదరాబాద్ : స్కేట్‌ బోర్డింగ్‌ కింగ్స్‌ రాఫా నిక్స్‌, ఎడ్వర్డ్‌ జెన్నింగ్స్‌, టామ్‌ పెయిన్‌ చైనాలో వరల్డ్‌ రికార్డ్‌ స్టంట్‌తో అదరగొట్టారు. హైవేపై చెంగ్‌డూ నుంచి లాసా వరకూ స్కేటింగ్‌ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత లాసా నగర వీధుల్లో స్ట్రీట్‌ స్కేటింగ్‌ చేసి ఆకట్టుకున్నారు. 

 

17:47 - July 23, 2017

హైదరాబాద్ : స్కై డైవింగ్‌ స్పెషలిస్ట్‌లు కరీబియన్‌ ద్వీపంలో పెద్ద సాహసమే చేశారు. గ్వాడిలౌప్‌ తీరంలో సోల్‌ ఫ్లయర్స్‌ డైవింగ్‌ టీమ్‌ ప్రదర్శించిన స్టంట్ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. ఫెడెరిక్‌ ఫ్యుజెన్‌, విన్సెంట్‌ రెఫెట్‌ సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తులో నుంచి డైవింగ్‌ చేయడం మాత్రమే కాదు...రివర్స్‌లో డైవ్‌ చేసి ఔరా అనిపించారు. ఆ తర్వాత వింగ్‌ సూట్‌ డైవింగ్‌ సైతం చేసి ... డైవింగ్‌లో తమ తర్వాతే ఎవరైనా అని నిరూపించారు. 

 

17:39 - July 23, 2017

హైదరాబాద్ : నగరం అంతా నిద్ర పోయిన తర్వాత.. పబ్‌ల్లో కొత్త ప్రపంచం నిద్రలేస్తుంది. సిటీలోని పబ్‌లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. డ్రగ్స్ కేసులో అధికారుల విచారణలో ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ లాంటి సంపన్న ప్రాంతాల్లోని పబ్స్ అక్రమాలకు అడ్డాగా మారాయని డ్రగ్స్ కేసు మరోసారి రుజువు చేసింది. ఈ జాబితాలో హీరో నవదీప్‌ పబ్‌ మినహాయింపేమీ కాదని అధికారులు తేల్చారు. ఈనేపథ్యంలో సోమవారం సిట్‌ ముందుకు హాజరుకానున్న నవదీప్‌ ఎలాంటి విషయాలు బయటపెడతారన్నది ఉత్కంఠ రేపుతోంది. 
జై సినిమాతో హీరోగా నవదీప్   
జై సినిమాతో నవదీప్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. గౌతమ్‌ ఎస్ ఎస్ సీ, చందమామ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పరజయాలతో సతమతమయ్యాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేశాడు. 
నవదీప్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు 
సినీ నటుడు నవదీప్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అనుమతిలేని బోట్ షికారు నడపడటంతో పాటు..నగర శివార్లలో రేవ్‌ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్.. ఆ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. డ్రగ్  సప్లయర్ కెల్విన్ నుంచి సినీ ఇండస్ట్రీలోని మాదక ద్రవ్యాల వాడకం దారులకు పబ్బుల నుంచే పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు. సినీ ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లలు సైతం  నవదీప్ పబ్ కస్టమర్లని సిట్ అధికారులు వివరాలు సేకరించారు.
16 బార్లలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సిట్‌ గుర్తింపు 
హైదరాబాద్‌లోని 16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. పలు పబ్బుల్లో డ్రగ్స్ తీసుకోవడానికే యూత్, విద్యార్థులు, సినీ ప్రముఖులు రెగ్యులర్‌గా వస్తుంటారని సిట్  అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్ లోనూ డ్రగ్స్ అమ్మకాలు  జరిగినట్టు సిట్ గుర్తించింది. డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ సోమవారం సిట్ అధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు.
నాకు డ్రగ్స్‌ ముఠాతో ఎలాంటి సంబంధం లేదు : నవదీప్‌
ఇప్పటికే సిట్‌ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నటుడు నవదీప్‌.. త‌న‌కు డ్రగ్స్‌ ముఠాతో ఎలాంటి సంబందం లేదంటున్నాడు. కెల్విన్ త‌న పేరు చెప్పడం త‌న‌ను ఆశ్చర్యప‌రిచింద‌ని చెబుతున్నాడు. సిట్ విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయంటున్నాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో పలువురు వాడకం దారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న విషయం వెల్లడయినా వారికి కౌన్సిలింగ్ చేస్తారు. కాని డ్రగ్స్ సప్లయర్, అమ్మకం దారులుగా తేలిన వారికి 5 నుంచి పదేళ్ల వరకు శిక్షలున్నాయి. నవదీప్‌ విషయంలో ఏం జరుగుతుందో సిట్ విచారణ ముగిసిన తర్వాతగాని తెలియదు.

 

17:26 - July 23, 2017

హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును కేంద్రం తప్పుబట్టింది. ప్రాజెక్టు పూర్తికి నిర్దేశించుకున్న గడువు పూర్తి కావస్తున్నా.. పనుల్లో పురోగతి లేకపోవడాన్ని కేంద్రం ఆక్షేపించింది. అంతేకాదు, పోలవరం పనుల్లో లోపాలపైనా కేంద్రం సీరియస్‌ అయింది. ఇప్పటివరకూ జరిగిన జమాఖర్చుల వివరాలు తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 
నత్తనడకన పోలవరం ప్రాజెక్టు పనులు 
ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పనుల తీరుపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డెడ్‌లైన్‌ను అందుకునేలా కార్యాచరణ ఉండడం లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం కాపర్‌ డ్యామ్‌ పనులు కూడా మొదలు పెట్టక పోవడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. పోలవరం పనులపై చీఫ్‌ ఇంజనీర్‌ దృష్టి కేంద్రీకరించాలని కేంద్రం సూచించింది. 
ప్రాజెక్టు పనులపై మండిపడుతోన్న కేంద్రం
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ముందుకొచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తమకే అప్పగించాలని ఒత్తిడి తెచ్చి మరీ.. నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఇది జరిగి పదకొండు నెలలు కావస్తున్నా పనులు ఏమాత్రం ఆశాజనకంగా సాగడం లేదని కేంద్రం మండిపడుతోంది. పదహారు లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు గాను కేవలం ఒక లక్ష పదహారువేల క్యూబిక్‌ మీటర్ల పనులే పూర్తి చేయడాన్ని కేంద్రం ఎత్తిచూపింది. స్పిల్‌ చానల్‌ పనుల్లో ఒక లక్ష డెబ్బై కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పెండింగ్‌లో ఉండటం, అప్రోచ్‌ చానల్ పనుల్లో ఒక లక్ష మూడు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయకపోవడం, ఫైలట్‌ చానల్‌ పనులు సక్రమంగా నిర్వహించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పోలవరానికి నిధులు విడుదలకు కేంద్రానికి లేఖ
పోలవరానికి సంబంధించి నిధులు విడుదల చేయాలని ఏపి ప్రభుత్వం, కేంద్రాన్ని లేఖ ద్వారా కోరింది. అయితే, 2014-15 నుంచి ఇప్పటి వరకూ తాము విడుదల చేసిన 3,364.70 కోట్లకు సంబంధించిన జమాలెక్కలు చూపించాలని కేంద్రం బదులిచ్చింది. బిల్లులు, యూసీలు తక్షణమే సమర్పించాలని ఆదేశించింది. దీనికి గాను జులై 20తేదిని గడువుగా విధించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. నిధుల కోసం కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. హామీ ప్రకారమే పోలవరం పనులను సకాలంలో పూర్తి చేస్తామని నమ్మబలుకుతోంది.  
పోలవరం పూర్తికి ఐదు సంవత్సరాలు : నిపుణులు  
జరుగుతున్న పనులను బట్టి చూస్తే.. పోలవరం పూర్తికి కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుందని సేద్యపునీటి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పనులను వేగవంతం చేసి.. పోలవరం ప్రాజెక్టును సకాలంలో రైతులకు అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను, దీనికోసమే సక్రమంగా ఖర్చు చేసి.. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 

 

17:13 - July 23, 2017

హైదరాబాద్ : ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తామని ప్రచారం చేసిన బల్దియా దాన్ని అమలు చేయడంలో విఫలమైంది. తన వెబ్‌సైట్‌నే సక్రమంగా నిర్వహించుకోలేని స్థితిలో కార్పొరేషన్‌ ఉంది. ఇది గ్రేటర్‌ లో జీహెచ్ ఎంసీ పరిస్థితి.
కార్పొరేషన్‌ పనులన్నీ ఆన్‌లైన్‌లోనే
ఆ కార్పొరేషన్‌ పనులన్నీ ఆన్‌లైన్‌లోనే... పెన్ను లేదు, పేపర్‌ అంత కన్నా అవసరం లేదు. నెట్‌ అందుబాటులో ఉంటే చాలు ఖండాంతరాల్లోంచైనా పనులు చక్కబెట్టొచ్చు. వారాలు పట్టే ఫైల్‌ గంటలో క్లోజ్‌ చేయొచ్చు. ఎలాంటి ఫిర్యాదులైనా ఆన్‌లైన్‌లోనే చక్కబెట్టొచ్చు. చేసిన దరఖాస్తుల స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఇంతెందుకు ఇంటి గడప దాటకుండానే, బల్దియా ఆఫిస్‌కి వెళ్లకుండానే పనులన్నీ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఇది గ్రేటర్‌లో మున్సిపల్‌ కార్పోరేషన్‌ చేసిన ప్రచారం. కాని బల్దియా తన వెబ్‌సైట్‌నే సక్రమంగా నిర్వహించలేకపోతోంది. 
ఆన్‌లైన్‌ విధానాన్ని పక్కన పెట్టిన అధికారులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా గ్రేటర్‌లో ఆన్‌లైన్‌ సేవలను సేవలను అందుబాటులోకి తెచ్చింది జీహెచ్‌ఎంసీ... భవన నిర్మాణ అనుమతులనుంచి పన్నుల చెల్లించే క్యాష్‌లెస్‌ విధానాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుపుతామని అధికారులు ప్రకటించారు.. మొదట్లో హడావిడి చేసిన అధికారులు.. ఆ తర్వాత ఆన్‌లైన్‌ను పక్కనపెట్టేశారు.. బల్దియాలోని ఐటీ విభాగం నిర్లక్ష్యంవల్లే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో లేవన్న విమర్శలున్నాయి.. సర్విస్‌ డెలివరీలోనూ బల్దియా విఫలమైంది. చాలా విభాగాల్లో జోప్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
ఆన్‌లైన్‌ విధానంపై పట్టులేని అధికారులు
ఇక కొన్ని సర్కిళ్లలోఅయితే అధికారులకు అసలు ఆన్‌లైన్‌ సేవల్లో ఎలాంటి పట్టు లేదు. దీంతో కంప్యూటర్‌ ఆపరేటర్లే అన్ని పనులు చేస్తున్నారు.. అంతేకాదు బల్దియా నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌ కూడా అప్‌డేట్‌గా ఉండటంలేదు.. కొత్త డిజైన్లతో వెబ్‌సైట్‌ కనిపించినా హోమ్‌పేజ్‌ మినహా మిగతా అంశాలన్నీ పాతవే దర్శనమిస్తున్నాయి. 
జాబితాలో, సర్కిల్‌ కార్యాలయంలో వేర్వేరుగా చూపిస్తున్న పేర్లు
వెబ్‌సైట్‌లో బల్దియా విభాగాలు, అధికారుల కాంటాక్ట్‌ లిస్ట్‌ ను పరిశీలిస్తే జీహెచ్ ఎంసీ ఐటీ విభాగం ఎంత చురుగ్గా పనిచేస్తుందో అర్థం అవుతుంది. నిత్యం అందుబాటులో ఉండే అధికారులు, వారి కాంటాక్ట్‌ నంబర్లు ప్రజలకు ఎంతో ముఖ్యం. అయితే వీరి పేర్లు డిప్యూటీ కమిషనర్ల జాబితాలో, సర్కిల్‌ కార్యాలయంలో వేర్వేరుగా చూపిస్తున్నారు. అడ్మిన్‌ అదనపు కమిషనర్‌గా పనిచేసిన రామకృష్ణారావు గత నెలలో రిటైర్‌ అయ్యారు. ఆ బాధ్యతలను జె. శంకరయ్యకు అప్పజెప్పారు. వెబ్‌సైట్‌లో ఇంకా రామకృష్ణారావే అడ్మిన్‌గా ఉన్నారు. అలాగే రెవెన్యూ అడ్వర్టైజ్‌ మెంట్‌ విభాగానికి ఇద్దరూ అదనపు కమిషనర్లు ఉన్నాట్లుగా జీహెచ్ ఎంసీ సైట్లో చూపిస్తున్నారు. జీహెచ్ ఎంసీ కార్యదర్శిగా పనిచేసిన నళిని పద్మావతి నెల రోజుల ముందు డిప్యూటి కమిషనర్‌గా అల్వాల్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది... సైట్లో పేరుమాత్రం మారలేదు. 
అప్ డేట్ లో అలసత్వం
ఇక ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కొద్ది వారాల క్రితం ఈ విభాగంలోకి చీఫ్‌ ఇంజనీర్‌ వచ్చారు. అయినా సైట్లో ఇంకా అప్‌డేట్‌ చేయలేదు. ట్రాన్స్ పోర్టు విభాగంలో పనిచేసిన భాషా ఐదు నెలల క్రితం ఆంధ్రకు అలాట్‌ చేయబడ్డారు. కాని ఈ విభాగంలో ఇంకా  ఏఈగా చూపిస్తున్నారు. ఇక నార్త్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌గా నెల రోజుల క్రితం విజయరాజు బాధ్యతలు తీసుకున్నా, ఇంకా బేగంపేట డిప్యూటి కమిషనర్‌గా పరిగణిస్తుంది జీహెచ్ ఎంసీ విభాగం. 
సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోని ఐటి విభాగం  
సమాచార హక్కు చట్టాన్ని కూడా ఐటి విభాగం పట్టించుకోవడంలేదు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లు, అప్పిలేట్‌ అధికారులు మారిపోయినా ఇంకా వారినే ఆర్టీఐ అధికారులుగా చూపిస్తున్నారు. అవినీతికి పాల్పడి సస్పెన్షన్‌లోఉన్న వెస్ట్‌ జోన్‌ అర్బన్‌ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ కిషన్‌ రావునూ వెబ్‌సైట్‌నుంచి తొలగించలేదు. వెబ్‌సైట్‌ పనితీరు ఇలా ఉన్నా.. టెక్నాలజీని వాడుకుంటూ టైం ఆదా చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చెబుతున్నారు. వెబ్‌సైట్‌ నిర్వహణలో లేజీగా వ్యవహరిస్తున్న అధికారులతీరుపై గ్రేటర్‌ వాసులు మండిపడుతున్నారు.. వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంగ్లండ్ 146/4...

ఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో 32.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు, గోస్వామి, గైక్వాడ్ లు చెరో వికెట్ తీశారు.

నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్..

ఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో ఇంగ్లండ్ తలపడుతోంది. బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లడ్ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో ఇతర బ్యాట్స్ మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం 30.3. ఓవర్ లో 3 వికెట్ ల నష్టానికి ఇంగ్లండ్ 138పరుగులు చేసింది.

17:00 - July 23, 2017

హైదరాబాద్ : పచ్చదనం లేకపోతే భావి తరాల మనుగడేకే ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు మంత్రి జోగురామన్న. రేపటి వారసులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్గించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మియాపూర్‌లోని రేగులకుంట చెరువు వద్ద సాహి స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన హరితాహారం కార్యక్రమంలో మంత్రి జోగురామన్న, మేయర్‌ బోంతు రామ్మోహన్‌ పాల్గొన్నారు. చెరువుల అభివృద్ధికి కార్యక్రమాలు చేపడుతున్న స్వచ్చంద సంస్థను వారు అభినందించారు.  

 

16:58 - July 23, 2017

రంగారెడ్డి : జిల్లాలోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ కారం, పచ్చళ్ల  తయారీ కేంద్రంపై బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు, జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. అవినాష్‌ మోదీ అనే వ్యక్తి సన్‌ లైట్‌ పేరుతో కంపెనీ పెట్టి నకిలీ ముడిసరుకుతో తయారు చేసిన పచ్చళ్లు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కంపెనీపై దాడి చేసి 15 లక్షల రూపాయల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. 

 

16:25 - July 23, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజమండ్రి కాస్మో పోలిన్ క్లబ్‌లో బ్యాడ్మింటన్ స్టార్‌ పివి సింధును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ ఆవరణలో సింధు మొక్కలు నాటారు. 

16:21 - July 23, 2017
16:18 - July 23, 2017

ఇంగ్లండ్ 63/3...

ఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు తడబడుతోంది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో ఇంగ్లండ్ తలపడుతోంది. బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లడ్ జట్టు అప్పుడే మూడు వికెట్లు కోల్పోయింది. 16.1 ఓవర్ లో 3 వికెట్ ల నష్టానికి ఇంగ్లండ్ 63పరుగులు చేసింది.

16:11 - July 23, 2017

టమాట..ఇటీవలే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ఏమాత్రం ధర లేని ఈ టమాట ప్రస్తుతం చుక్కలు చూపిస్తోంది. కొనాలంటేనే భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టమాట ఏకంగా కిలో వంద రూపాయల ధరలు పలుకుతుడడం గమనార్హం. గిట్టుబాటు ధర లేకుండా తాము పండించిన పంటలను రైతులు రోడ్డుపై పారేస్తుంటే మార్కెట్ లో మాత్రం ధరలు ఆకాశాన్ని అంటుతుండడం విశేషం.

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కూరగాయల హోల్ సేల్ మార్కెట్ ఉంది. ఇక్కడ టమాటను దొంగతనం చేస్తున్నారే వార్త హల్ చల్ చేస్తోంది. దీనితో టమాటలను రక్షించేందుకు అక్కడి వ్యాపారులు సెక్యూర్టీ గార్డులను నియమించుకోవాల్సి వస్తోందంట. ధర అమాంతంగా పెరగడంతో ఇక్కడ టమాట దొంగతనాలు మొదలయ్యాయి. టమాటాలు చోరీకి గురికాకుండా చూసేందుకు కూరగాయల వ్యాపారులు ప్రత్యేకంగా సెక్యురిటీ గార్డులను కాపాలా పెడుతున్నారు. సాయుధులైన భద్రతా సిబ్బందిని నియమించి టమాటాలు చోరుల బారిన పడకుండా చూసుకుంటున్నారు.

20వ తేదీన ముంబైలోని దాహిసార్ కూరగాయాల మార్కెట్ లో 300 కిలోల టమాటలు చోరీకి గురయ్యాయంట. ప్రస్తుతమున్న ధర ప్రకారం వీటి విలువ అక్షరాల రూ. 70వేలు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి సెప్టెంబర్ వరకు టమాట ధరలు దిగొచ్చే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.

16:09 - July 23, 2017

కృష్ణా : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. విష జ్వరాలతో మరో 200 మంది బాధపడుతున్నారు. బొడ్డపాడులో విషజ్వరాలు ప్రబలుతున్నా.. వైద్యారోగ్యశాఖ స్పందించకపోవడంపై బాధితులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధిని కనిపెట్టలేకపోవడంపై మండిపడుతున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేపీ సారథి, పామర్రు నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్‌కుమార్‌ గ్రామంలో పర్యటించనున్నారు. 

 

నంద్యాలలో తమదే విజయమన్న దేవినేని..

విజయవాడ : నంద్యాల ఉపఎన్నికలో టీడీపీదే విజయమని మంత్రి దేవినేని ఉమా ధీమా జోస్యం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓట్లేస్తారని, ప్రతిపక్షాల తాటాక చప్పుళ్లకు భయపడమని తెలిపారు.

16:02 - July 23, 2017

వనపర్తి : జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో టెట్ పరీక్ష రాస్తూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పట్టుబడ్డారు. పరంధాములును డీఈవో సుశీంధర్‌ రావు పట్టుకున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరంధాములపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రేముద్దుల జెడ్ పీహెచ్ ఎస్ లో ఇంగ్లీష్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న పరందాములు వనపర్తి జిల్లా బాలికల ఉన్నత పాఠశాలలో టెట్‌ పరీక్ష రాస్తూ డీఈవోకు పట్టుబడ్డారు. డీఈవో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని  అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:00 - July 23, 2017

అరే ఏమి సినిమా..మస్తుగుంది..మొన్న విడుదలైన సినిమా చూసిన..తెలుగు ప్రేక్షకులకు ఓ మంచి సినిమా అందించిండు. అంటూ శేఖర్ కమ్ములపై ప్రశంసల జల్లు కురుస్తోంది. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న 'శేఖర్ కమ్ముల' ‘ఫిదా' చిత్రంలో మళ్లీ ముందుకొచ్చాడు. మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన 'వరుణ్ తేజ' ఈసినిమాలో హీరోగా నటించగా 'సాయి పల్లవి' హీరోయిన్ గా నటించింది. 'దిల్' రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది.

వరుణ్ తేజ..సాయి పల్లవి నటనపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్వకుడు శేఖర్ కమ్ముల మంచి సినిమా తీశారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భాష..అందమైన ప్రదేశాలు అద్భుతంగా చూపించారని కితాబిస్తున్నారు. చాలా కాలం ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా హీరో 'వరుణ్ తేజ' కు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీరిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కలెక్షన్లలలో 'ఫిదా' చూపిస్తోంది. పాజిటివ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్లు పెరిగే ఛాన్స్ ఉందటూ టాక్ వినిపిస్తోంది. మల్లీఫ్లెక్స్ ప్రేక్షకులను ఈ సినిమా మంచిగానే అలరిస్తోందంట. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్ కు ఆడియన్ ఫిదా అవుతున్నారు.

 

ఇంగ్లండ్ ఫస్ట్ వికెట్ డౌన్..

ఢిల్లీ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. 11.1 ఓవర్ లో ఒక వికెట్ నష్టానికి ఇంగ్లండ్ 47 పరుగులు చేసింది.

15:54 - July 23, 2017

నిజామాబాద్ : ఆర్మూర్ మండలం మంథనిలో దళితుల బహిష్కరణ వివాదం సద్దుమణిగింది. దళితులు విజయం సాధించారు. దళితులపై బహిష్కరణ ఎత్తివేశారు. 10 టీవీ వరుస కథనాలు, దళితుల న్యాయ పోరాటం ఫలితంగా అధికారులు దిగి వచ్చారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, దళితులతో చర్చలు జరిపారు. దళితులపై బహిష్కరణను ఎత్తివేయించారు. కొద్దిరోజుల క్రితం మంథనిలో 150 దళిత కుటుంబాలను అగ్రకులస్తులు బహిష్కరించారు. దళితుల బహిష్కరణపై 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 10 టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు. రెండు వర్గాలతో ఆర్డీవో, ఏసీపీ సమావేశమయ్యారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిర్చారు. అగ్రకులస్తులు దళితులపై బహిష్కరణ ఎత్తివేశారు. వివాదం ముగియడంతో 10టీవీకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

నకిలీ పచ్చళ్లు..కారం..

మేడ్చల్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో నకిలీ కారం..పచ్చళ్ల తయారీ కేంద్రంపై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నకి ముడి సరుకుతో పచ్చళ్లు తయారు చేస్తున్న 'సన్ లైట్' కంపెనీ యాజమాన్యం వద్ద రూ. 15 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

మోడీపై ఉద్దవ్ మండిపాటు..

ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అచ్చే దిన్ ప్రకటనల్లోనే కనిపిస్తోందని..అధికారాలన్నీ మోడీ దగ్గరే ఉన్నాయన్నారు. మోడీ రాష్ట్రాల స్వతంత్రను హరిస్తున్నారని దుయ్యబట్టారు.

పాక్ పై వెంకయ్య విమర్శలు..

ఢిల్లీ : కార్గిల్ పరాక్రమ పరేడ్ లో ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ దేశంపై పలు విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాక్ 1971యుద్ధంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదులకు సాయం చేసినంత మాత్రానా పాక్ కు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. పాక్ తన ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని మార్చుకుందని, కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని అందులో ఇంచు భూమిని కూడా వదులుకొనే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు.

డ్రగ్స్..ఇక బుల్లితెర వంతు..

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. సీరియల్ నటులకూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు వెల్లడైంది. బుల్లితెర నటులపై సిట్ అధికారులు దృష్టి సారించారు.

నాలుగు అంశాలపై చర్చ - రాఘవులు..

ఢిల్లీ : పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చిస్తున్నట్లు సీపీంఎ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశాలు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. రేపు, ఎల్లుండి కేంద్ర కమిటీ సమావేశాలు జరగనున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

 

15:21 - July 23, 2017

ఇంగ్లండ్ : మహిళల వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ప్రారంభం అయింది. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య  ఫైనల్‌ మ్యాచ్ జరుగుతోంది. లార్డ్స్‌ మైదానంలో మ్యాచ్ ప్రారంభం అయింది. 

 

15:21 - July 23, 2017

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో 'కత్రీనా కైఫ్' ఒకరు. అగ్ర హీరోల సరసన ఆడి..పాడిన ఈ నటి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'జగ్గా జాసూస్' మంచి మార్కులనే కొట్టేసింది. షూటింగ్..ప్రమోషన్ కోసం 'కత్రినా' యమ కష్టపడింది. బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' తో కలిసి 'టైగర్ జిందా హై' సినిమాల్లో నటిస్తోంది. ‘ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం 'కత్రినా' మొరాకోలో జరుగుతోంది. షూటింగ్ లో పాల్గొనేందుకు 'కత్రినా' కూడా మొరాకోకు వెళ్లింది. హాలీడేస్ కు దూరంగా ఉన్న 'కత్రినా' మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. అందమైన ప్రదేశాలను చూస్తూ 'కత్రినా' తెగ సంతోష పడుతుందంట. తాజాగా ఓ సర్ఫింగ్ వీడియో ను సోషల్ మాధ్యమాల్లో 'కత్రినా' విడుదల చేసింది. ఎగిసిపడే అలలపై 'కత్రినా' చేసిన సర్ఫింగ్ అభిమానులను ఆకట్టుకొంటోంది. సర్ఫింగ్ ఎక్స్ పర్ట్ సమక్షంలోనే ఈ రిస్క్ చేసిందట.

15:13 - July 23, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'జూనియర్ ఎన్టీఆర్' పార్టీ స్థాపించాడా ? త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఉంటుందా ? 2019లో ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగనున్నాడా ? ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. గతంలోనే టిడిపి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్త ఓ సినిమాకు సంబంధించింది..

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై లవ కుశ' షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో ఏకంగా 'ఎన్టీఆర్' మూడు పాత్రలను పోషించనున్నాడు. అందులో ఓ పాత్ర విలన్ షేడ్ ఉండడం విశేషం. ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా అలరించింది. మిగతా పాత్రల టీజర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో 'ఎన్టీఆర్' రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడంట. సమ సమాజ్ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్..ఎన్టీఆర్..ఫొటో..సమ సమాజ్ పార్టీ జెండాలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ జెండాలు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే ఉండటంతో కథ ఉత్తరాధికి సంబంధించినదని భావిస్తున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కు రెడీ చేయనున్నారు.

బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్..

ఢిల్లీ : మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

14:35 - July 23, 2017

లండన్ : మహిళల మహాసంగ్రామంలో మిథాలీ అండ్ కో అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌తో ఆఖరాటకు ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. టైటిల్‌ ఫైట్‌కు క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. హీదర్‌ నైట్‌ నాయకత్వంలోని ఇంగ్లీష్‌ టీమ్‌కు....మిథాలీ రాజ్‌ సారధ్యంలోని ఇండియన్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది. వరల్డ్‌ కప్‌ టైటిల్ కోసం ఆతిధ్య ఇంగ్లండ్‌ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సారి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు తొలి సారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది. ఇదే అంశంపై టెన్ టివి చర్చ కార్యక్రమం నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

వ్యాధిని కనిపెట్టలేకపోతున్న డాక్టర్స్..

కృష్ణా : తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో విష జ్వరాలు వ్యాపించాయి. ఇద్దరు మృతి చెందగా 200 మంది మంచాన పడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాధిని వైద్యులు కనిపెట్టలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక పేదలు మంచాన పడుతున్నారు. గ్రామాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేపీ సారథి, పామర్రు నియోజకవర్గ ఇన్ ఛార్జీ అనీల్ కుమార్ లు సందర్శించనున్నారు.

ఉగ్రవాది హతం..

జమ్మూ కాశ్మీర్ : చొరబాటుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. మచిల్ సెక్టార్ లో చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదిని భారత బలగాలు మట్టుబెట్టాయి.

టెట్ పరీక్ష రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు..

వనపర్తి : బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు టెట్ పరీక్ష రాశారు. పరీక్ష రాస్తున్న ఆయన్ను డీఈవో పట్టుకున్నారు.

ఆర్టీసీని కాపాడుకుంటామన్న మంత్రి ఈటెల..

కరీంనగర్ : బస్టాండు ఆధునీకరణ పనులను మంత్రులు ఈటెల, మహేందర్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపులను ప్రారంభించారు. ఆర్టీసీని కార్పొరేట్ మాదిరిగా మార్చేందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని, కొత్త కాంట్రాక్టర్లతో బస్టాండు ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులకు మంత్రి ఈటెల ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడో మునిగే ఆర్టీసీని కార్మికులు త్యాగాలతో బతికించారని, ఆర్టీసీని కాపాడుకుంటామని..పూర్వ వైభవం తెస్తామని తెలిపారు.

టెన్ టివికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు..

నిజామాబాద్ : మంథనిలో దళితుల బహిష్కరణ ఘటనలో అగ్రవర్ణాలు..దళితుల మధ్య ఏసీపీ, ఆర్డీవోలు రాజీ కుదిర్చారు. గ్రామ బహిష్కరణపై నిరంతరంగా కథనాలు ప్రసారం చేసిన టెన్ టివికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

డ్రగ్స్ నియంత్రణపై మంత్రి గంటా సమీక్ష..

విశాఖపట్టణం : డ్రగ్స్ నియంత్రణపై మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో డ్రగ్స్ నివారణపై డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని మంత్రి గంటా సూచించారు. స్కూళ్లలో డ్రగ్స్ నివారణపై ప్రత్యేక టోల్ ఫ్రీ ఏర్పాటు చేయననున్నట్లు తెలిపారు.

13:58 - July 23, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఆయన 'జనసేన' పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేషశ్ రాష్ట్రాల్లో పార్టీ కోసం కార్యకర్తలను నియమిస్తున్నారు. పరీక్షల ద్వారా టాలెంట్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు కూడా.

ఇదిలా ఉంటే ప్రస్తుతం 'పవన్' పలు సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా మారిపోయారు. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' దర్శకత్వంలో 'పవన్' ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఈ సినిమా అనంతరం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా పూర్తి చేయాలని 'పవన్' నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పూర్తిగా రాజకీయంపై దృష్టి పెట్టాలని 'పవన్' ప్లాన్ చేసుకున్నారని వినికిడి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం ఎన్నికల కంటే ముందుగానే చిత్రం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ తో పాటు 'పవన్' కూడా నిర్ణయానికి వచ్చారని టాక్. కేవలం 40 రోజుల కాల్షిట్లు మాత్రమే కేటాయించారని తెలుస్తోంది. అంటే కేవలం 40 రోజుల్లోనే సినిమా పూర్తవుతుందన్నమాట. ఇందులో 'పవన్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

మరి సినిమా 40 రోజుల్లో పూర్తవుతుందా ? ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

13:41 - July 23, 2017

రామ్ గోపాల్ వర్మ అకున్ సబర్వాల్ కన్నా మీడియా పై ఎక్కువగా వాఖ్యలు చేశారు. వారికి వ్యక్తిగతం ఉంటుందని, వివిధ టివి ఛానల్ , వివిధ సైట్లు నటుల గురించి రాయడమనేది తప్పు అని డైరెక్టర్ సునీల్ రెడ్డి అన్నారు. నటుల వ్యక్తగత జీవితం బయపెట్టడం మంచి కాదని ఆయన అన్నారు. వర్మగారి వాదనతో ఏకీభవించడం లేదని, దాన్ని ఖండిస్తున్నానని, ఫెమ్ కోసం వర్మ మీడియాను వినియోగించుకుంటున్నారని, మీడియా ఎప్పుడు ప్రజలను జాగురుకులను చేస్తుందని, డ్రంక్ అండ్ డ్రైవర్, బ్రోతల్, డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి సంబంధం ఎందుకు ఉంటుంది. మా అసోసియేషన్ వారు గౌరవంగా మాట్లాడారని, పిల్లలు కూడా విచారిస్తారా అని వర్మ అనడాన్ని కానీ చట్టం ప్రకారం పిల్లలను విచారించడం హక్కులేదని బాలల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. వర్మ గారికి చెప్పె ముందు చట్టం గురించి మాట్లాడుకోవాలని, ప్రోసిసర్ ప్రకారం మనిషిని పట్టుకుంటారని, డ్రగ్ ఎక్కడ నుంచి వచ్చిందని విచారణ చేయాలని, కేసు బుక్ చేస్తేనే మెజిస్ట్రేట్ కేసు తీసుకుంటారని మాజీ టాస్క్ ఫోర్స్ అధికారి మహబూబ్ అలీ గారు అన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు ఇలానే ఉంటాయని, ఉదయం ఒకరకంగా మందు తాగిన ఒకరంగా ఉంటాయని, క్షమాపణ చెబుతాడని, ఆఫీసర్స్ పై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించాలని మానసిక వైద్య నిపుణులు భరత్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:40 - July 23, 2017

విజయవాడ : రెండేళ్ల తర్వాత రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది ప్రతిపక్ష వైసీపీ. టీడీపీ, జనసేనకు సినీ గ్లామర్‌ భారీగానే ఉంది. ఎటొచ్చి వైసీపీ సినీ గ్లామర్‌ పెద్దగా లేదు. దీంతో రానున్న ఎన్నికల్లో పార్టీకి సినీగ్లామర్‌ అద్దాలని చూస్తోంది. సినీ, రాజకీయ కుటుంబాలతో సంబంధమున్న ఇద్దరు ముఖ్య నటులను ఎన్నికల్లో దింపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పార్టీని విజయతీరాలకు చేర్చేందుకంటూ జగన్‌ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ముగిసేలోపు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని ఆయన భావిస్తున్నారు. వైసీపీ బలంగాలేని కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి నందమూరి, ఘంటమనేని కుటుంబాలకు చెందిన నటులతో పోటీ చేయించాలని స్కెచ్‌ వేశారు.

సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ
ఇందులో భాగంగానే... విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణను పోటీకి దింపాలని జగన్‌ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన ద్వారా కృష్ణ ఎంపీగా పోటీకి దిగేలా ఒప్పించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణ ఎంపీగా పోటీచేస్తే మహేష్‌బాబు వైసీపీ తరపున ప్రచారం చేస్తారని జగన్‌ భావిస్తున్నారు. మహేష్‌ ప్రచారం పార్టీకి కలిసివస్తుందన్న యోచనలో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టి అధికారపగ్గాలు చేపట్టాలని చూస్తున్న జగన్‌... నందమూరి కుటుంబ సభ్యులనూ వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నందమూరి హరికృష్ణ
ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణని వైసీపీలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. హిందూపురం నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకు గుడివాడ ఎమ్మెల్యే నానిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. హరికృష్ణను వైసీపీ తరపున పోటీచేయించి.... ఆయన తరపున జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రచారం చేయాలని స్కెచ్‌ వేస్తున్నట్టు సమాచారం. మరి జగన్‌ ప్రయత్నాలకు వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

 

13:34 - July 23, 2017

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ నాయకులు వర్సెస్‌ అధికారులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌... కలెక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించినప్పటి నుంచి ఈ పరిస్థితి తలెత్తింది. శంకర్‌ నాయక్‌ వ్యవహారంపై కేసీఆర్‌ తీవ్రంగా స్పందించడం, కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పాలని ఆదేశించడంతో గులాబీ నేతలపై ఐఏఎస్‌లు పైచేయి సాధించినట్టయ్యింది. ఇది ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు తమ మాట వినడంలేదన్న భావనలో వారున్నారు.

శంకర్‌నాయక్‌ ఎపిసోడ్‌ తర్వాత
శంకర్‌నాయక్‌ ఎపిసోడ్‌కు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏంపనిచెప్పినా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులు చేసేవారు. తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను నేరుగా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కాని ఇప్పుడా పరిస్థితులు లేకుండా పోయాయని కొంతమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సమస్య గురించి పలుమార్లు కలెక్టర్లకు చెప్పినా పనులు చేయడంలేదంటున్నారు. గట్టిగా వారిని హెచ్చరించాలని ఉన్నా... శంకర్‌నాయక్‌ ఎపిసోడ్‌ కళ్లముందు కదులుతుందంటున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తే అది తిరిగి తమకే రివర్స్‌ అయ్యే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకే కలెక్టర్ల, ఇతర అధికారులను గట్టిగా హెచ్చరించలేక... సైలెంట్‌గా ఉండాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా... వారిని ప్రశ్నించే సాహకం చేయలేకపోతున్నారు. పనుల్లో జాప్యం జరుగుతున్నా సైలెంట్‌ అయిపోతున్నారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. అధికారులు జవాబుదారీతనంగా వ్యవహరించకపోతే ప్రజల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవంటున్నారు. మరి ఈ సమస్యను గులాబీ బాస్‌ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.

 

డ్రగ్స్ కేసలో బుల్లితెర నటులు..?

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీని కలవరపెట్టిన డ్రగ్స్ వ్యవహరం ఇప్పుడు బుల్లితెరను వనికించబోతుంది. జీసన్ అలీ అలియాస్ జాక్ సీరియల్ నటులకూ డ్రగ్స్ సరఫరా చేసనట్లు తెలుస్తోంది. 

13:03 - July 23, 2017

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీని కలవరపెట్టిన డ్రగ్స్ వ్యవహరం ఇప్పుడు బుల్లితెరను వనికించబోతుంది. జీసన్ అలీ అలియాస్ జాక్ సీరియల్ నటులకూ డ్రగ్స్ సరఫరా చేసనట్లు తెలుస్తోంది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారలులు నైజిరియా, ఇతర దేశాల నుంచి జాక్ డ్రగ్స్ సేకరించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

13:01 - July 23, 2017

అతడు ఎప్పుడు ప్రజల గురించే ఆలోచిస్తాడు. ప్రజలను ఆలోచింపచేయడానికి రచనలు చేస్తాడు. అలా ప్రజచైతన్య గేయలు, నాటకలు, రూపకాలు ఎన్నో రాశాడు విశాఖకు చెందిన మౌళలి. ఆయన సమాజంలోని అనేక రూగ్మతలపై వేయ్యికి పైగా పాటలు రాశాడు. మద్యపాన నిషేధం, మహిళ సమస్యలు, ఎయిడ్స్, గిరిజన పోరాటలు ఇలా అనేక అంశాలపై పాటలు రాసి ప్రజలను చైతన్యవంతం చేస్నున్నా ప్రముఖ గేయకవి ఎన్ఐఎన్ మౌళలి జనం పాటలో పరిచయం చేస్తున్నారు. ప్రముఖ గేయ కవి స్ఫూర్తి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:00 - July 23, 2017

సృజకారులరా మీరు ఎటువైపు..ప్రజలవైప ప్రభువవుల వైప అని ప్రశ్నిస్తాడు గోరెటి..సమాజంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కవులు, కలకారలుపై ఉంటుంది. సృజనత్మక రచనలు సమాజంలో కదలికను తీసుకొస్తాయి. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో జరిగే ఉద్యమాలను, ఆ ఉద్యమాసంబంధిత సృజనాత్మక కళారంగలను ఏకం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటివల మహిళ ఉద్యమాల తీరుతెన్నులను పరిశీలిస్తూ సాగిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక చర్చ కార్యక్రమం మఖ్యంశాలతో మీ ముందుకు వచ్చింది అక్షరం. మన దేశంలో మహిళఉద్యమాలు బలంగా నడుస్తూన్న రాష్ట్రలో తెలంగాణ, ఏపీ ముందు వరసలో ఉన్నాయి. ఏ ఉద్యమానికైన గమనం ఏ వైపు సాగుతుందో నిరంతర సమీక్ష చాలా అవసరం. అదే సమయంలో ఒకే గమ్యంతో సాగే వ్యక్తులను కలుపుకుంటూ ముందుకు సాగాల్సి అవసరం చాలా ఉంటుంది. క్షేత్రస్థాయి ఉద్యమాలకు ఆ ఉద్యమానికి సంబంధించిన సంస్కృతిక సమన్వయన్ని సరిచూసుకుంటూ ఉద్యమాలను మరింత బలోపేతం దిశగా సాగటం ముఖ్యం. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

నేడు సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం

ఢిల్లీ : నేడు సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశంలోని పరిస్థితులు, రైతుల, దళితుల సమస్యలపై చర్చింనున్నారు.

12:23 - July 23, 2017

ఢిల్లీ : నేడు సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దేశంలోని పరిస్థితులు, రైతుల, దళితుల సమస్యలపై చర్చింనున్నారు. అలాగే పార్టీ సంస్థాగత అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:09 - July 23, 2017

ఖమ్మం : జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన జాబ్‌ మేళాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధి కల్పిస్తామని వేలాది మందిని పిలిపించి..కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా జాబ్‌ మేళా నిర్వహించడం దారుణమని మండిపడుతున్నారు. జాబ్‌ మేళాలో భోగస్ కంపెనీలు పాల్గొన్నాయని ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:08 - July 23, 2017

స్పోర్ట్స్ : మహిళల క్రికెట్‌ మహా సంగ్రామానికి మిథాలీ సేన సై అంటే సై అంటోంది. మూడు సార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి తొలి సారిగా వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని టీమిండియా తహతహలాడుతోంది.ఓ వైపు ఇంగ్లండ్‌.... మరోవైపు ఇండియా ...క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో ఇరు జట్ల మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఫైట్‌....అసలు సిసలు క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత జట్టుకు...గ్రూప్‌ దశ నుంచి సెమీస్‌ వరకూ పోటీనే లేకుండా పోయింది. 7 రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ 5 విజయాలు సాధించింది. సెమీఫైనల్‌లో పవర్‌ ప్యాకెడ్‌ ఆస్ట్రేలియా జట్టుకు షాకిచ్చి టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించింది. హర్మన్‌ ప్రీత్‌ సెన్సేషనల్‌ సెంచరీతో టీమిండియా ఆస్ట్రేలియాకు షాకిచ్చి పెద్ద సంచలనమే సృష్టించింది. ఇంగ్లండ్‌తో ఫైనల్‌లోనూ అంచనాలకు మించి రాణించాలని మిథాలీ రాజ్‌ అండ్‌ కో...పట్టుదలతో ఉంది. మిథాలీ రాజ్‌,పూనమ్‌ రౌత్‌, స్మృతి మందన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్టమూర్తి, జులన్‌ గోస్వామీ,షికా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వర్‌ గైక్వాడ్‌,పూనమ్‌ యాదవ్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భారత జట్టు అన్ని విభాగాల్లో పవర్‌ఫుల్‌గా ఉంది. మిథాలీ రాజ్‌,పూనమ్‌ రౌత్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్టమూర్తి సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు బ్యాటింగ్‌ విభాగంలో మునుపెన్నడూ లేనంతలా పటిష్టంగా ఉంది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఎలా ఉన్నా....ఫైనల్‌ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించడం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడిఉన్నాయి. తొలి సారిగా టీమిండియా ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మిథాలీ సేన విశ్వవిజేతగా నిలిస్తే...భారత మహిళల క్రికెట్‌లోనే చిరస్థాయిగా నిలుస్తుందనడంలో అనుమానమే లేదు. 

బుల్లితెర నటుల్లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీని కలవరపెట్టిన డ్రగ్స్ వ్యవహరం ఇప్పుడు బుల్లితెరను వనికించబోతుంది. జీసన్ అలీ అలియాస్ జాక్ సీరియల్ నటులకూ డ్రగ్స్ సరఫరా చేసనట్లు తెలుస్తోంది.

11:07 - July 23, 2017

హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీని కలవరపెట్టిన డ్రగ్స్ వ్యవహరం ఇప్పుడు బుల్లితెరను వనికించబోతుంది. జీసన్ అలీ అలియాస్ జాక్ సీరియల్ నటులకూ డ్రగ్స్ సరఫరా చేసనట్లు తెలుస్తోంది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందకు ప్రయత్నం చేస్తున్నారు. అధికారలులు నైజిరియా, ఇతర దేశాల నుంచి జాక్ డ్రగ్స్ సేకరించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

10:07 - July 23, 2017

గుంటూరు : రాకపోకలకు సరైన రోడ్లు లేవు... తాగేందుకు నీళ్లు లేవు.. ఇదీ రాజధాని ప్రాంత గ్రామాల పరిస్థితి.. ఇక్కడి ప్రజలు కనీస అవసరాలు తీరక నానా అవస్థలు పడుతున్నారు. రాజధాని ప్రాంతంగా ప్రకటించి..రెండున్నరేళ్లవుతున్నా... అక్కడ మౌలిక అవసరాలకు కూడా తీరడం లేదు.రాజధాని నిర్మాణం కోసం భూములు తీసుకునే సమయంలో గ్రామాలను పట్టణాలుగా మారుస్తామని, మున్సిపల్ శాఖ , సీఆర్డీఏ కలిసి గ్రామాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించారు. నేలపాడు గ్రామం నుండి ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నామంటూ 2015 జనవరిలో ప్రకటించారు. కాని ఎక్కడ ఆ అభివృద్ధి జాడ కూడా కనబడంలేదు. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో ఎక్కడా సరైన రోడ్లు లేవు. ఉన్న రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. వర్షాకాలంలో రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ... అస్తవ్యస్థంగా ఉంది. మురుగు నీరు మొత్తం ఎక్కడిక్కడ నిలిచిపోతుంది. రహదారులపైకి చేరుతోంది. రాజధానిలోని చాలా గ్రామాల్లో తాగునీరు దొరకని పరస్థితి..ఇప్పటికీ శాఖమూరు, ఐనవోలు, నిడమర్రు, నవలూరు వంటి గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీరు రాక... చెరువులో నీటిని వాడుతున్నారు. ఐనవోలు , శాఖమూరు గ్రామాల ప్రజలు వ్యవసాయ కాలువల ద్వారా వచ్చే కృష్ణానది నీటిని నింపుకుని వాటిని శుద్ధి చేసుకుని తాగేవారు. అయితే వ్యవసాయ పంటల లేకపోవడం ఆ కాలవలను పూడ్చేశారు. దీంతో వర్షపునీటి చెరువుల్లోకి నింపి వాటిని శుద్ధి చేసుకుని తాగుతున్నారు. నీటి సమస్య గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు నీళ్లు ఇవ్వని ప్రభుత్వ పెద్దలు , ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న ప్రవేటు యూనివర్సిటీల కోసం... కార్పొరేట్‌ సంస్థలకు కోసం పైప్‌లైన్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం సర్వస్వం ఇచ్చి... కూడు, గూడు లేకుండా బతుకుతుంటే ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

జాడలేని అభివృద్ధి
ఇక సచివాలయం నిర్మాణం జరిగిన మందడం గ్రామంలో కూడా అభివృద్ధి జాడ కనబడం లేదు. పైగా అక్కడ కొత్త సమస్యలు తలెత్తాయి. హోటళ్లు, షాపుల్లో నుంచి వచ్చే వ్యర్థాలన్నీ డ్రైనేజీలో పడి... నిల్వ ఉంటున్నాయి. ఇక గ్రామంలోని చెత్తను సేకరించి, రైతులచ్చిన పొలాల్లో వేస్తున్నారు. దీంతో పొలాలు కాస్తా డంపింగ్ యార్డుల్లా మారాయి. మరోవైపు గ్రామంలోని చెరువు పూర్తిగా కలుషితం అయిపోతుంది. దీంతో చేపలు చనిపోతున్నాయి.గ్రామాల సమస్యలను స్థానిక పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. 29 గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని గతంలో సీఆర్డీఏ అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ నిధులు జాడే లేదు. ఇప్పటికైనా గ్రామాలలో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 

10:06 - July 23, 2017

గుంటూరు : అమరావతి వచ్చింది... అక్కడ వారంతా దర్జాగా బతుకుతున్నారనే ఊహలు... అక్కడి రైతులు రాజభోగాలను అభవిస్తున్నారనే ప్రచారం...కానీ బయట జరుగుతున్న ప్రచారానికి, రాజధాని గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. అక్కడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి బంగారు భవిష్యత్తు ఉంటుందనుకుంటే... బతుకే ప్రశ్నార్థకమైంది.ఏపీ ప్రభుత్వం .... తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం చేయాలని భావించి రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్ విధానంలో భూమి సేకరించింది. అలా ఇప్పటి వరకు 34వేల ఎకరాల వరకు రైతుల నుంచి తీసుకుంది. రైతులకు ప్రతి ఏడాది కౌలు, తిరిగి ప్లాట్లు కేటాయించింది. అయితే రాజధానిగా ప్రకటించే సయయంలో రైతులతో పాటు వారితో సమానంగా ఉన్న కౌలు రైతులు, రైతు కూలీలకు ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం హామీలు ఇచ్చింది..కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదు.

దారుణంగా రైతుల పరిస్థితి
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో... భూములిచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. చాలా గ్రామాల్లో రైతులు వారికున్న భూమిలో కొంత ప్రభుత్వానికి ఇచ్చి, మరికొంత అమ్ముకుని వారి జీవనం కోసం ఉపయోగించుకుంటున్నారు. దీంతో రెండున్న సంవత్సరాలుగా రైతులు వ్యవసాయ పనులకు దూరమయ్యారు. నిత్యం పొలం పనులతో హడావిడిగా గడిపే రైతన్నలు నేడు గ్రామాల్లో రచ్చ బండలు వద్ద ఖాళీగా కూర్చుంటున్నారు. స్థానికంగా వ్యవసాయ పనులు లేక... రైతు కూలీలు కూడా.. నానా పాట్లు పడుతున్నారు. నెల..నెలా కౌలుతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా స్థానికంగా పని కల్పిస్తామన్న ప్రభుత్వం... ఆ హామీని మరిచింది. కూలీలకు ప్రభుత్వం ఇస్తామన్న 2500 పింఛన్‌ మూడు నెలలకు , ఆరు నెలలకు ఒకసారి అందుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందులు
దీంతో వారంతా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు రాజధాని ప్రాంతంలో జరిగే నిర్మాణాల్లో గాని..వేరే పనులకు కూడా స్థానికులను తీసుకోవడం లేదు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల వారినే తీసుకుంటున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెడతాం.. పనులు కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవడం లేదు. ఇంక చేసేది పొట్ట చేత పట్టుకుని దూర ప్రాంతాల్లోని పనులు వెతుక్కుంటూ వెళ్తున్నారు. రైతులను వ్యవసాయానికి దూరం చేయడంతో... ఆర్థిక ఇబ్బందులతో సతమతమవడమే కాకుండా.. చాలామంది రైతులు చెడు వ్యసనాలకు బానిసలై...సమయాన్ని.. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. 

10:03 - July 23, 2017

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన టీ మాస్‌ బృందానికి కనిపించిన దృశ్యాలివి.. మహిళల ఆవేదన, వారి కన్నీళ్లు అక్కడున్న ప్రతిఒక్కరినీ కదిలించాయి.. బాధితులందరినీ టీ మాస్‌ బృందం ఓదార్చింది.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది. నేరెళ్ల గ్రామంలో ఈ నెల 2న ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే నిరుపేద మృతిచెందాడు.. గడచిన ఆరు నెలల్లో ఇసుక లారీలు నలుగురి ప్రాణాలు తీశాయి.. 46మందిని గాయాలపాలు చేశాయి.. భూమయ్య మృతితో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. అర్ధరాత్రి గ్రామస్తులు రోడ్డుపైకివచ్చారు.. కొందరు దుండగులు లారీలకు నిప్పంటించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేరెళ్ల ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

అమాయకులను తీసుకెళ్లి చితకబాదరు
తంగళ్లపల్లి మండలం నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాల్లో తమ ప్రతాపం చూపారు.. అర్ధరాత్రి మఫ్టీలోవచ్చి నిద్రపోతున్న అమాయకులను కొట్టుకుంటూ తీసుకువెళ్లారు.. కేసులుపెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు.. బాధిత కుటుంబాలను టీ మాస్‌ బృందం పరామర్శించింది.. బృందాన్ని కలిసిన మహిళలు తమ గోడు చెప్పుకొని కన్నీరుమున్నీరయ్యారు.. పోలీసు దెబ్బలనుంచి తమ కుటుంబసభ్యులు కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఆవేదన విన్న టీమాస్‌ బృందం సభ్యులు... వారందరినీ ఓదార్చారు.. పోలీసులు వ్యవహరించిన తీరుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.. దళితులు, అమాయకులను చితకబాదడం ఏరకమైన ప్రజాస్వామ్యం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీమాస్‌ నేత జాన్‌ వెస్లీ.. బాధితుల కుటుంబాలకు పోలీసులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీమాస్‌ ఫోరం భరోసానిచ్చింది. వారందరితరపున న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చింది.

 

10:02 - July 23, 2017

ఖమ్మం : దేశవ్యాప్తంగా క్రికెట్‌ ఫీవర్ కొనసాగుతోంది.. మరికొన్ని గంటల్లో జరగబోయే మహిళా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కోసం క్రికెట్‌ ప్రేమికులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.. మిథాలీసేనకు అభిమానులంతా బెస్ట్‌ ఆఫ్ లక్‌ చెబుతున్నారు.. మ్యాచ్‌ గెలిచి ప్రపంచ విజేతలుగా నిలవాలని కోరుతున్నారు.. మహిళా జట్టు కప్‌తో రావాలంటూ ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జాతీయ పతాకాలతో సందడి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

10:01 - July 23, 2017

హైదరాబాద్ : 21 రోజులు... 50 వేల ఖర్చు.. రాజధానిలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు.. అవును ఎక్సైజ్‌ అధికారులు మూడు వారాల వ్యవధిలో, మారువేషాలతో ... డ్రగ్స్‌ ముఠా తెర వెనుక నిజాలను బయటకు తీశారు. ఆధారాలతో సహా నిందితులను పట్టుకున్నారు. ఒక చిన్న సమాచారంతో... రంగంలోకి దిగిన అధికారులు.. డ్రగ్స్‌ రాకెట్‌ను పట్టుకునేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు కదిలారు. 21 రోజుల ఆపరేషన్‌కు తెరతీశారు. దీంతో స్టాఫ్‌లోని యూత్‌.. కాలేజీ విద్యార్థులు అవతారమెత్తి... నిజాల వేటలో పడ్డారు. ఎక్సైజ్‌ శాఖకు చెందిన యువ సిబ్బందిని కాలేజ్‌ స్టూడెంట్స్‌ అంటూ రంగంలోకి దింపారు. వారు పబ్‌లు.. హుక్కా సెంటర్లు తిరిగారు. బార్లు.. రెస్టారెంట్లకు వెళ్లారు. అచ్చంగా డ్రగ్స్‌ కోరుకునే వారిగానే నమ్మించి.. డ్రగ్స్‌ సప్లయర్స్‌ జాడ తెలుసుకున్నారు... ఈవెంట్‌ మేనేజర్‌తో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. చాకచక్యంగా డ్రగ్స్‌ పెడ్లర్స్‌ ఫోన్‌ నెంబర్లు సేకరించారు. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌లోకి దిగిన బృందం.. తమ పని తాము కానిస్తుంటే.. వారిచ్చిన సమాచారం ఆధారంగా, మరో బృందం చకచకా తమపని కానిచ్చేసింది. యూజీ టీమ్‌ ఇచ్చిన ఫోన్‌ కాల్స్‌ జాబితాను ట్రాక్‌ చేసి... వారి కదలికలపై నిఘా పెట్టింది.

అధికారుల నిఘాతో
అధికారుల నిఘాతో... నిర్దిష్టమైన ఆధారాలతో పాటు నిందితులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో... జూలై రెండో తేదీన దాడులు నిర్వహించి, కెల్విన్‌, మహ్మద్‌ అబ్దుల్ ఖుదూస్‌, మహ్మద్‌ వాహెబ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఏడు వందల ఎల్‌ఎస్‌డీ బాట్లర్స్‌, 35 గ్రాముల మెథం ఫెటమైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అండర్‌కవర్‌ ఆపరేషన్‌కి అధికారులు రూ.50 వేలను ఖర్చు చేశారు. సరిగ్గా 21 రోజుల్లో మొత్తం ముగించారు. డ్రగ్స్‌ వ్యవహారంపై దృష్టి సారించి.. ఇప్పుడు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. 

09:56 - July 23, 2017

కడప : జిల్లాలోని గుడ్ హార్ట్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులను చిత్ర హింసలకు గురిచేస్తూ, భోజనం సరిగా పెట్టడం లేదని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి వృద్ధ ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. వృద్దులు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి జడ్జి శ్రీనివాసులు చలించిపోయారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వృద్ధులను సోమవారం వేరే వృద్ద ఆశ్రమానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. నిర్వాహాకుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో ఒకరిని అరెస్ట్ చేశారు. 

నాగర్ కర్నూలులో రోడ్డు ప్రమాదం

నాగర్ కర్నూలు : జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం సమీపంలో బొలెరో వాహనం డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

కాంట్రాక్ట్ ఉద్యోగాల స్కామ్ లో అరెస్ట్ లు

కృష్ణా : జిల్లాలోని విజయవాడ దుర్గగుడి కాంట్రాక్ట ఉద్యోగాల స్కామ్ లో అరెస్ట్ లు మొదలైయ్యాయి. ఏఈ లక్ష్మణ్, రికార్డ్ అసిస్టెంట్ ప్రసాద్ ను పోలీసుల అరెస్ట్ చేశారు. గత రెండు నెలుగా సాగుతున్న విచారణ తుది దశకు చేరకునట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

09:06 - July 23, 2017

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మరికాసపట్లో టెట్ పరీక్ష జరగబోతోంది. టెట్ కు వన్ మినట్ రూల్ వర్తిస్తుందని నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరిస్తామని, గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 1574 పరీక్ష కేంద్రాల్లో 3,67,912మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పూర్తి వివరాకలు వీడియో చూడండి.

08:20 - July 23, 2017

కృష్ణా : జిల్లాలోని విజయవాడ దుర్గగుడి కాంట్రాక్ట ఉద్యోగాల స్కామ్ లో అరెస్ట్ లు మొదలైయ్యాయి. ఏఈ లక్ష్మణ్, రికార్డ్ అసిస్టెంట్ ప్రసాద్ ను పోలీసుల అరెస్ట్ చేశారు. గత రెండు నెలుగా సాగుతున్న విచారణ తుది దశకు చేరకునట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోమ వీడియో క్లిక్ చేయండి.

07:52 - July 23, 2017

అభివృద్ధిలో భాగంగానే పలు కార్యక్రమాలు ప్రకటిస్తున్నామని, ఉప ఎన్నిల కోసం కదని టీడీపీ ఎమ్మెల్యేల శ్రావణ్ అన్నారు.నంద్యాల ఉప ఎన్నికలు టీడీపీ చాల ప్రతిష్టత్మకంగా తీసుకుందని, ఒకవేళ నంద్యాలలో టీడీపీ ఓడిపోతే పార్టీ భారీ నష్టం వటిల్లిందని, నంద్యాల నియోజవర్గానికి ఇచ్చిన అభివృద్ధి అన్ని నియోజకవర్గాలకు చేయాలని సీపీఎం నేత ఉమామహేశ్వర్ రావు అన్నారు. భూమా నాగిరెడ్డి గారు వైసీపీ గుర్తుతో గెలిచారని, అందుకే మేం పోటీ చేస్తున్నామని, ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలో అభివృద్ధి పేరుతో రూ.700కోట్లు ప్రకటించారని, గత మూడేళ్లుగా ఏం చేశారని వైసీపీ నేత అనిల్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:51 - July 23, 2017

లండన్ : మహిళల మహాసంగ్రామంలో మిథాలీ అండ్ కో అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఆతిధ్య ఇంగ్లండ్‌తో ఆఖరాటకు ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. టైటిల్‌ ఫైట్‌కు క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. హీదర్‌ నైట్‌ నాయకత్వంలోని ఇంగ్లీష్‌ టీమ్‌కు....మిథాలీ రాజ్‌ సారద్యంలోని ఇండియన్‌ టీమ్‌ సవాల్‌ విసురుతోంది. వరల్డ్‌ కప్‌ టైటిల్ కోసం ఆతిధ్య ఇంగ్లండ్‌ జట్టుతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో సారి ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు తొలి సారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలవాలని పట్టుదలతో ఉంది.మూడు సార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ 4వ సారి టైటిల్‌ సాధించాలని తహతహలాడుతోంది.2017 వన్డే వరల్డ్‌కప్‌లో నిలకడగా రాణించి, తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఇండియా, ఇంగ్లండ్‌ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి.గ్రూప్‌ దశలో ఇంగ్లండ్‌ జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. సెమీఫైనల్‌లో సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికా జట్టును ఓడించి ఇంగ్లండ్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.గ్రూప్‌ దశలో మిథాలీ సేన అంచనాలకు మించి రాణించింది. 7 రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ 5 విజయాలు సాధించింది.

హోరాహోరి పోరు
సెమీఫైనల్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధించింది.టీమిండియా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌,పూనమ్‌ రౌత్‌, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, వేదా కృష్టమూర్తి సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. జులన్‌ గోస్వామీ,షికా పాండే, దీప్తి శర్మ, రాజేశ్వర్‌ గైక్వాడ్‌,పూనమ్‌ యాదవ్‌ వంటి బౌలర్లతో భారత బౌలింగ్‌ ఎటాక్‌ సైతం పదునుగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఒంటిచేత్తో భారత జట్టుకు విజయాన్నందించిన స్మృతి మందన...సెమీస్‌లో హరికేన్ ఇన్నింగ్స్‌ ఆడిన హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మరోసారి మెరుపులు మెరిపిస్తే బ్యాటింగ్‌లో భారత్‌కు తిరుగుండదు.మిగతా ప్లేయర్ల ప్రదర్శన ఎలా ఉన్నా....కీలక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రాణించడం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడిఉన్నాయడంలో సందేహమే లేదు.మరోవైపు మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టు మ్యాచ్‌ విన్నర్లతో పవర్‌ఫుల్‌గా ఉంది. హీదర్‌ నైట్‌ ,టామీ బ్యూ మాంట్‌, శారా టేలర్‌, ఫ్రాన్‌ విల్సన్‌ ,లారెన్‌ విన్‌ఫీల్డ్‌ వంటి బ్యాటర్లతో పాటు....జెన్నీ గన్‌, క్యాథరీన్‌ బ్రంట్‌,అన్యా ష్రబ్‌సోల్‌, నటాలీ స్కివర్‌, లారా మార్ష్‌ వంటి బౌలర్లతో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.

రెండో సారి ఫైనల్ కు భారత్
కెప్టెన్‌ హీదర్‌ నైట్‌, శారా టేలర్‌, బ్యూ మాంట్‌ నిలకడగా రాణించడంతో పాటు జెన్నీ గన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగుతుండటంతో ఇంగ్లండ్‌ జట్టుకు సెమీఫైనల్‌ వరకూ పోటీనే లేకుండా పోయింది.ఇప్పటివరకూ జరిగిన 10 వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో 6 సార్లు ఫైనల్‌కు అర్హత సాధించిన ఇంగ్లండ్‌ జట్టు 3 సార్లు విజేతగా నిలిచింది.ఇక ఓవరాల్‌ వన్డే ఫేస్‌ టు ఫేస్‌ రికార్డ్‌లోనూ ఇండియాపై ఇంగ్లండ్‌దే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ భారత్‌తో 61 వన్డేల్లో పోటీ పడిన ఇంగ్లండ్‌ 34 మ్యాచ్‌ల్లో నెగ్గింది. భారత్‌ జట్టు 25 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కానీ ప్రస్తుత వరల్డ్‌ కప్‌ ఆరంభ రౌండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా సునాయాస విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. 2005 వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించి రన్నరప్‌ స్థానంతోనే సరిపెట్టుకున్న భారత్‌...ఈ సారి మాత్రం విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది.సెమీస్‌లో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఓడించి జోరు మీదున్న మిథాలీ సేన ఫైనల్‌లోనూ సంచలనం సృష్టించాలని తహతహలాడుతోంది. కానీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతోన్న ఇంగ్లండ్‌ జట్టును ఓడించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలవడం భారత జట్టుకు పెద్ద సవాలే అనడంలో అనుమానమే లేదు.

 

 

 

07:49 - July 23, 2017

వాషిగ్టన్ డిసి : డొక్లామ్ సరిహద్దు వివాదాన్ని భారత్‌, చైనాలు ప్రత్యక్ష చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది. ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు కృషి చేయాలని పెంటగాన్‌ రక్షణశాఖ ప్రతినిధి గ్యారీ రోస్‌ తెలిపారు. భారత్‌-చైనా వివాదంలో తలదూర్చ కూడదని పెంటగాన్‌ నిర్ణయించింది. ఈ నెలాఖరులో పెడ్చింగ్‌లో జరగనున్న బ్రిక్స్‌ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ సరిహద్దు వివాదంపై చైనాతో చర్చించే అవకాశముంది. గత నెల రోజులుగా సిక్కిం సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత సైన్యం వెనక్కి వెళ్లకపోతే యుద్ధమే పరిష్కారమని చైనా హెచ్చరిస్తోంది. సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని భారత్‌ తేల్చి చెప్పింది. 

07:48 - July 23, 2017

కేరళ : కేరళలో ఓ మహిళను రేప్‌ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సే విన్సెంట్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో విన్సెంట్‌ను పోలీసులు ఐదుగంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విన్సెంట్‌ 51 ఏళ్ల మహిళను వెంటాడి అత్యాచారం చేసి.. ఆత్మహత్యకు పురిగొల్పినట్టు అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు పలువురు సాక్ష్యుల వాంగ్మూలం సేకరించారు. ఇందులో బాధితురాలి భర్త, సోదరుడు, ఇరుగుపొరుగువారితోపాటు బంధువులు ఉన్నారు. కొల్లం సిటీ పోలీసు కమిషనర్‌ అజితా బేగం నేతృత్వంలో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

07:47 - July 23, 2017

వరంగల్ : టాలీవుడ్‌ హీరోయిన్ సమంత వరంగల్‌లో సందడి చేశారు. హన్మకొండ కిషన్‌పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిగ్‌ సి మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించారు. అయితే సమంత వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మొబైల్‌ షాప్‌ ప్రారంభం తర్వాత సమంత అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

 

07:47 - July 23, 2017

హైదరాబాద్ : తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు రంగం సిద్ధమైంది. ఈ పరీక్షకు 3లక్షల 67వేల 912 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి 574 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపరు-1 పరీక్ష జరగనుంది. దీనికి 1లక్షా 11వేల 647 మంది హాజరుకానున్నారు. అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. దీనికి రెండు లక్షల 56వేల265 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఎలక్ర్టానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని,.. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా హాల్‌ లోకి అనుమతించరని అధికారులు తెలిపారు.ఇప్పటికే డిఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టెట్ అనంతరం డిఎస్సీ ఉంటుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. టెట్ ఫలితాలు వెల్లడించిన వెంటనే డిఎస్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

07:46 - July 23, 2017

విజయనగరం :  జిల్లా పార్వతీపురం కాల్పుల కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిపై కాల్పులు జరిపి మర్డర్‌ చేశారు. సుమిత్ర డిపార్ట్‌మెంటల్‌ స్పోర్ట్‌ యజమాని మురళిని దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని ఆగంతకులు మురళిపై కాల్పులు జరిపారు. దీంతో మురళి రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

07:45 - July 23, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించారు.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు చేశారు... కానాల, చింతకుంట, జూలపాడు, పశులపాడు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.... నియోజకవర్గ ప్రజలపై వరాలజల్లు కురిపించారు.. మురుగునీటి శుద్ధికి 90 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.. నంద్యాలలో 13 వేల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.. చామకాలువను సుందరీకరిస్తామని... కుందూ, గాలేరు నగరి, మద్దిలేరును సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.. 50 ఏళ్లు దాటిన బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్‌... 7వ తరగతి ఫెయిలైన వారికి డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తామని హామీలిచ్చారు..

వైసీపీపై విమర్శలు
వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.. నంద్యాల అభివృద్ధి కోసమే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వచ్చారని గుర్తుచేశారు.ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు.నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేసిన సీఎం.. రాయలసీమను రతనాల సీమ చేయడంతోపాటు... నంద్యాల పట్టణం రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.

07:44 - July 23, 2017

హైదరాబాద్ : ఒక్క మెసేజ్‌.. వంద ప్రశ్నలు...సమాధానంగా దిగ్భ్రాంతికర నిజాలు ... "అంకుల్‌, ఇంతకుముందు మీరిచ్చిన డ్రగ్‌ చాలా ఎక్కువ ప్రభావంగా ఉంది. నాకు ఇంకొకటి ఇవ్వరా" ఈ ఒక్క మెసేజ్‌... హైదరాబాద్‌ నగరాన్నే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. డ్రగ్స్‌ రాకెట్‌ పాఠశాల విద్యార్థులను మత్తుప్రపంచపు కూపంలోకి లాగేసిందని తేల్చింది. అసలు ఆ మెసెజ్‌ ఎవరు పంపించారు? ఓ 29 ఏళ్ల కుర్రాడిని అంకుల్‌ అని సంబోధించేది ఎవరు? ఈ దిశగా సాగిన దర్యాప్తే.. హైదరాబాద్‌లోని వివిధ స్కూళ్ల విద్యార్థుల డ్రగ్స్‌ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. అభం శుభం తెలియని స్కూల్‌ పిల్లలు మత్తు మాయజాలంలో ఇరుక్కున్నారనే విషయం అధికారులు గుర్తించారు. వాట్సాప్ మెసేజ్‌లు, మొబైల్‌ ఫోన్‌ కాంటాక్ట్స్‌ ఆధారంగా విచారణ మొదలు పెట్టిన అధికారులు ఆసక్తికరమైన వాస్తవాలు తెలిసాయి. దాదాపు 200 మంది స్కూలు పిల్లలు.. కెల్విన్‌, మహ్మద్‌ అబ్దుల్ ఖుదూస్‌, మహ్మద్‌ వాహెబ్‌ల ద్వారా డ్రగ్స్‌ వాడుతున్నారని తేలింది. 19 కాలేజీలలో.. 26 పాఠశాలల విద్యార్థులు వీరికి కస్టమర్లుగా ఉన్నట్టు తెలిసింది.

పాకెట్ మనీ
పిల్లల బర్త్‌డేలను సెవెన్‌ స్టార్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో జరిపించే ధనిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు.. తమ పిల్లలకు అదే రేంజ్‌లో పాకెట్‌ మనీ ఇస్తున్నారు. దీంతో ఈ తరహా విద్యార్థులు అతి సులభంగా... వేలకు వేలు పోసి డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. అయితే, డబ్బులు లేని వారు డ్రగ్స్‌ కోసం రకరకాల పోకడలకు పోతున్నట్టు విచారణలో వెల్లడైంది. అమ్మాయిలైతే కెల్విన్‌కు అర్ధనగ్న ఫొటోలు పంపి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకుని... దానికి ప్రతిఫలంగా తమకు డ్రగ్స్‌ పంపమని కోరినట్టు విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితుల ద్వారా... చిన్నారులు... డ్రగ్స్‌కి ఎడిక్ట్‌ అయ్యారని గుర్తించిన అధికారులకు...సినీ ప్రముఖులు అదే బాటలో ఉన్నట్టు తెలిసింది. దాని ఆధారంగా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ విచారణ చేపట్టింది. 

07:42 - July 23, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. ఎయిర్‌పోర్టులు, రోడ్డుమార్గాలు.. కొరియర్‌ ద్వారానేకాకుండా... ఇండియన్‌ పోస్టల్‌ సర్వీసుల ద్వారా కూడా డ్రగ్స్‌ హైదరాబాద్‌కు చేరుతున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.. వెంటనే పోస్టల్‌ శాఖను అప్రమత్తం చేస్తూ లేఖ రాశారు.. ఈ లేఖ అందుకున్న పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారులు.. హైదరాబాద్‌లోని 109 పోస్టల్‌ డెలివరీ ఆఫీసులను, సిబ్బందిని అలర్ట్‌ చేశారు.. విదేశాలనుంచి వచ్చే పార్శళ్లను ఓ కంట కనిపెట్టాలని ఆదేశించారు.ముఖ్యంగా నెదర్లాండ్స్, నైజీరియాలాంటి దేశాలనుంచి వస్తున్న ఉత్తరాలు, పార్శిళ్లను గమనించాలని సిబ్బందికి ఆదేశాలు అందాయి.. తరచుగా పార్శిళ్లు అందుకునే వ్యక్తులప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే వెంటనే తెలియజేయాలంటూ సిబ్బందికి అధికారులు సూచించారు.

అంతర్జాతీయ పార్శిల్ పై నిఘా
డ్రగ్స్‌ ఎక్కువగా డార్క్‌ నెట్‌ ద్వారా నగరానికి వస్తున్నాయి.. అయితే భారత్‌కువచ్చే ప్రతి పార్శిల్‌ను కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయాలి..... ఈ సోదాలు అంతంతమాత్రంగా సాగడంతో నగరానికి డ్రగ్స్‌ తరలింపు యధేచ్చగా సాగుతోందన్న విమర్శలున్నాయి.. ఇకనుంచి అలా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు

07:41 - July 23, 2017

 

హైదరాబాద్ :డ్రగ్స్‌ రహిత సమాజం కోసం విద్యార్థులు ఒక్కటయ్యారు. డ్రగ్స్‌ మాఫియాపై దండెత్తారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో వీఎన్‌ఆర్‌ కాలేజీ విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఎన్‌టీయూ నుంచి మలేషియా టౌన్‌షిప్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ నో డ్రగ్స్‌ ర్యాలీలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్నారు. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. 

07:40 - July 23, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ దందాకు పబ్స్‌ వేదికగా మారుతుండడంపై యువజన కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పలు పబ్‌ల ఎదుట ఆందోళనకు దిగింది. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో యువకులు ఆందోళన నిర్వహించారు. డ్రగ్స్‌ సరఫరా నిర్వహిస్తున్న పబ్‌లను మూసివేయాలని డిమాండ్‌ చేశారు.

07:39 - July 23, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో శనివారం హీరో తరుణ్‌ను సిట్‌ అధికారులు విచారించారు. తన తండ్రి చక్రపాణితో కలిసి ఉదయం 10.30 గంటల సమయంలో తరుణ్‌ సిట్‌ కార్యాలయానికి వచ్చారు. ఆ వెంటనే సిట్‌ అధికారులు విచారణ ప్రారంభించారు. తరుణ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. తరుణ్‌ మీరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? డ్రగ్స్‌ డీలర్‌ కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంకా ఆ డ్రగ్స్‌ లింక్స్ కొనసాగిస్తున్నారా? మీరు ఏమైనా పబ్‌లు నిర్వహిస్తున్నారా? పబ్‌లలో డ్రగ్స్‌ అమ్మడం సర్వ సాధారణమేనా? వంటి ప్రశ్నలు సిట్‌ అధికారులు సంధించారు. సినీ పరివారంలో పబ్‌ కల్చర్‌ గురించి హీరో తరుణ్‌ నుంచి సిట్‌ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. 13 గంటలకు పైబడి సిట్‌ అధికారులు తరుణ్‌ను విచారించారు.

ఆ వ్యాపారనికి ఆరేళ్ల క్రిందటే స్వస్తి
గోవా ట్రిప్పులు, డ్రగ్స్‌, డీల్స్‌, బినామీ పబ్‌ల వ్యవహారంపైనా సిట్‌ అధికారులు తరుణ్‌కు ప్రశ్నలు సంధించారు. పబ్‌లలో సినీ నటుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని.. పబ్‌ వేదికగా తెలుగు ఇండస్ట్రీకి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు తరుణ్‌ విచారణ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పబ్‌లలో డీజేలు, ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్‌ రవాణాలో పాత్రధారులుగా ఉంటారని వివరించారు. పలువురు యువనటులు డ్రగ్స్‌ వాడుతున్నట్టు తరుణ్‌ విచారణలో స్పష్టం చేసినట్టు సమాచారం. తరుణ్‌ పబ్‌ నిర్వహించారన్న దానిపైనా సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే గతంలో సొంతంగా పబ్‌ నిర్వహించిన తాను ఆరేళ్ల కిందటే ఆ వ్యాపారానికి స్వస్తి చెప్పానన్నారు. ప్రస్తుతం ఏ పబ్‌లోనూ తాను పార్ట్‌నర్‌గా కొనసాగంలేదన్నారు.

13గంటల పాటు విచారణ
ఉదయం 10.30 మొదలైన తరుణ్‌ విచారణ రాత్రి 11.40 నిమిషాలకు ముగిసింది. విచారణ అనంతరం బయటకు వచ్చిన తరుణ్‌.. సిట్‌ అధికారులకు పూర్తిగా సహకరించానని చెప్పారు. డ్రగ్స్‌ కేసును సిట్‌ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని, డ్రగ్స్‌ను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు తనవంతుగా సిట్‌ విచారణకు సహకరించానని తెలిపారు. విచారణ సమయంలో తరుణ్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తాను ఉపవాసం ఉన్న కారణంగా నీరసించారు. దీంతో అధికారులు ఆయనకు బీపీ చెకప్‌ చేయించింది. అనంతరం తరుణ్‌ రక్తనమూనా, చేతిగోళ్లు, తల వెంట్రుకలను క్లూస్‌ టీమ్‌ సేకరించింది. ఇక సోమవారం నటుడు నవదీప్‌ సిట్‌ విచారణకు హాజరుకానున్నారు.

 

07:07 - July 23, 2017

ప్రస్తుత వ్యవసాయ విధానంలో సేంద్రియ పద్దతి ప్రవేశపెట్టాడంలో వెనపడ్డమని, రైతులు ఎక్కువగా రసాయనా ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడంతో పంట దెబ్బతిట్టుందని దని నివరాణ కోసం ప్రతిభ బయోటెక్ సేంద్రయ విధానాన్ని ప్రవేశపెట్టింది. పంట సంక్షించుకోడం సగం విజయం సాధించినట్టే మిగతా సగం నేలను కాపాడుకోవాలని, సేంద్రియ ఎరువులపై రైతుల్తో అవగాహన పెంచుతున్నామని ప్రతిభ బయోటెక్ సీఈవో రాజశేఖర్ అన్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు రెండో బీజేపీ కార్యవర్గ సమావేశాలు

వరంగల్ : నేడు రెండో రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హాజరుకానున్నారు.

నేడు తెలంగాణ టెట్

హైదరాబాద్ : నేడు తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగనుంది. టెట్ కు 3,67,912 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్ 1 ఉదయం 9.30 నుంచి 12.30వరకు పేపర్ 2 మధ్యాహ్నాం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి.

Don't Miss