Activities calendar

24 July 2017

22:19 - July 24, 2017
22:15 - July 24, 2017

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ అధికారిక నివాసానికి అతి సమీపంలోని అర్ఫా కరీమ్‌ టవర్‌ వద్ద జరిగిన పేలుడులో 22 మంది మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, మిలటరీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందస్తున్నారు. సీఎం షాబాజ్‌ షరీఫ్‌ తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉండగా పోలీసులే లక్ష్యంగా  ఈ దాడి జరిగింది. 

 

22:11 - July 24, 2017
22:10 - July 24, 2017

ఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు జైరామ్‌ రమేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వెంకయ్యనాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్‌ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మినహాయింపులు పొందారని ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్‌ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు.

 

21:55 - July 24, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం పూర్తైంది. ఈ సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటు తనకు దేవాలయం వంటిదన్నారు.  ఎప్పటికీ ఈ దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు.  కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అభినందనలు తెలిపారు.  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తాను ఐదేళ్ల క్రితమే ప్రమాణం చేశాననీ, దేశానికి తాను చేసిన దానికంటే తనకు దేశమే ఎక్కువ ఇచ్చిందన్నారు. భారత్‌ అంటే భూభాగం మాత్రమే కాదని, భిన్న జాతులు, భిన్న అభిప్రాయాల కలయిక అని అన్నారు. ప్రభుత్వాలు పేదల ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని సూచించారు. ప్రజలంతా సహనంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. 50 ఏళ్లపాటు రాజ్యాంగమే తనను నడిపించిందని ఈ సందర్భంగా ప్రణబ్‌ గుర్తుచేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు.

 

21:53 - July 24, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సీపీఐ నాయకులు ఆందోళన బాట పట్టారు.  వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడేసే విధానాలను పాలకులు అవలంబిస్తున్నారంటూ.. మండిపడ్డారు. రైతులను, చేనేత కార్మికులను... పేదలను ఆదుకోవాలని.. డిమాండ్‌ చేశారు.  
తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తం 
సీపీఐ పిలుపునిచ్చిన జైల్‌ భరో కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తంగా సాగింది. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ నాయకులు.. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. సిద్ధిపేటలో  కొత్తబస్టాండ్‌  నుంచి సబ్‌ జైల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్ట్‌ చేసి...వన్‌టౌన్‌  స్టేషన్‌కు తరలించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చడం లేదని నారాయణ విమర్శించారు. అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. 
ఖమ్మంలో
జైల్‌ భరో కార్యక్రమంలో భాగంగా... ఖమ్మంలోనూ  సీపీఐ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని .. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కల్తీ విత్తనాలు, మందులతో రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో  
ఏపీలో సీపీఐ నేతలు కదంతొక్కారు. అనంతపురం జిల్లాలో  సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలను, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా  రైతుల సమస్యలను పరిష్కరించకపోగా... వారిపై కాల్పులకు పాల్పడుతున్నారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 
ప్రకాశం జిల్లాలో 
ప్రకాశం జిల్లా..కందుకూరులో ఆర్డీవో ఆఫీస్‌ను ...సీపీఐ నాయకులు ముట్టడించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. రోడ్డు బైఠాయించి  ఆందోళన చేశారు. అలాగే  రాజమండ్రిలోని  సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు ముట్టడించారు. ఆందోళనలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  విశాఖపట్నంలో.. సీతమ్మధారలోని ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగా సీపీఐ నేతలు  ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగురాష్ట్రాల్లో సీపీఐ ఆధ్వర్యంలో మరో మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు సాగనున్నాయి. 

 

సిట్ విచారణకు సహకరించా : నవదీప్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. దాదాపు 11 గంటలపాటు సిట్ అధికారులు నవదీప్ ను విచారించారు. సిట్ విచారణకు సహకరించానని హీరో నవదీప్ తెలిపారు. విచారణ కోసం ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. 

21:44 - July 24, 2017

ఢిల్లీ : రైతు సమస్యలు, దళితులపై దాడులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఉద్యమం చేపట్టేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు రుణ మాఫీ కోసం చట్టం తీసుకురావాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంపై ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఆందోళన వ్యక్తమైంది.
సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు  
సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు , జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే సీపీఎం 22వ జాతీయ మహా సభల తేదీలను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు. 
ప్రజా, రైతు సమస్యలపై చర్చ 
మొదటి రోజు భేటీలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలపై చర్చించారు. దేశంలో ప్రబలుతున్న నిరుద్యోగం, జీఎస్‌టీతో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆధార్‌ సమాచారం లీకు వంటి అంశాలను చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారు. మంగళవారం తెలంగాణ రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఇసుకు దందా, భూకుంభకోణాలు వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. బీజేపీతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహారంపై కూడా చర్చిస్తారు. 
ధర్నా చౌక్‌  ఎత్తివేతను నిరసిస్తూ జంతర్‌ మంతర్‌ దగ్గర ఆందోళన 
హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌  ఎత్తివేయడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 22న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ దగ్గర చేపట్టే ఆందోళన కార్యక్రమానికి సీపీఎం జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
 

21:39 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్‌ జోరు పెంచింది. ఓవైపు కేసుతో సంబంధమున్న వారిని విచారిస్తూనే... ఇంకోవైపు వారిచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్‌ మాఫియా కూపీని లాగుతున్నారు అధికారులు. ఈక్రమంలో డ్రగ్స్‌ వాడుతున్న నలుగురిని సోమవారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి ఉందని.. కేవలం ఓ వర్గాన్నే టార్గెట్‌ చేశారంటూ విపక్షాలు, సినీ రంగం వారు ఆరోపణలు గుప్పించారు. దీనికి ఎక్సైజ్‌ శాఖ దీటుగానే స్పందించింది. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చట్టానికి లోబడే విచారణ జరుగుతోందని.... విచారణలో సేకరించిన పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు.
ముమ్మరంగా సాగుతోన్న సిట్‌ విచారణ
డ్రగ్స్‌ కేసులో విచారణను సిట్‌ ముమ్మరం చేసింది. ఒకవైపు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు వారిచ్చే సమాచారంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే సోమవారం పలువురిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. నటి కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్‌ రాన్‌సన్‌ జోసెఫ్‌ను సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాన్‌సన్‌ చాలా కాలం నుంచి డ్రగ్స్‌ వాడుతున్న పోలీసులు తెలిపారు. అదే విధంగా, హైదరాబాద్‌ శివారు జవహర్‌నగర్‌లో  ఓ డ్రగ్స్‌ ముఠా పోలీసులకు చిక్కింది.  పలువురు నైజీరియన్లతోపాటు విజయవాడకు చెందిన ఓ యువతిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 గ్రాముల కొకైన్‌. 12 గ్రాముల బ్రౌన్‌షుగర్‌తోపాటు ఇతర మత్తుపదార్థాలు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. 
సిట్‌ విచారణపై హైకోర్టును ఆశ్రయించిన ఛార్మి
ఒకవైపు డ్రగ్స్‌ కేసులో సిట్‌ దూకుడుగా ఆధారాలు  సేకరిస్తోంటే... మరోవైపు దాని విచారణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిట్‌ విచారణ తీరు బాగాలేదంటూ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు వచ్చిన వారి నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లు బలవంతంగా సేకరిస్తున్నారంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. రక్త నమూనాలను బలవంతంగా సేకరించడం సరికాదని ఆమె కోర్టుకు విన్నవించారు.  
సిట్‌ దూకుడుపై విమర్శలు  
మరోవైపు, సిట్‌ దూకుడుపై రాజకీయ, సినీ వర్గాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ అధికారులపై ఒత్తిడి ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. అదే విధంగా, సినీ నటులను  టార్గెట్ చేస్తూ సిట్‌ విచారణ జరుపుతోందని.. ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరిస్తే డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తాయని దర్శకుడు ఆర్‌. నారాయణమూర్తి ప్రశ్నించారు. 
ఆరోపణలను తిప్పికొట్టిన చంద్రవదన్‌  
సిట్‌ ఒక వర్గాన్నే టార్గెట్‌ చేసిందన్న ఆరోపణలను ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ తిప్పికొట్టారు. అన్నిరంగాలకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నామన్నారు. విచారణ అంతా చట్టానికి లోబడే సాగుతోందన్నారు. సినీ ప్రముఖులను విచారిస్తున్నట్లుగానే, విద్యార్థులను విచారిస్తారా అన్న డైరెక్టర్‌ రాంగోపాల్‌వర్మ విమర్శలను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ ఖండించారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా వారి పేర్లను వెల్లడించబోమని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసులో ఎవరినీ వదలబోమని చెప్పారు. విచారణ మొత్తాన్ని వీడియోలో  చిత్రీకరిస్తున్నామని, వారి అనుమతితోనే రక్త నమూనాలను సేకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ముమ్మరంగా సిట్‌ దర్యాప్తు  
డ్రగ్స్‌ కేసులో మొత్తానికి సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.  దీంతో డ్రగ్స్‌ మాఫియా గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంకోవైపు, తాజా అరెస్టుల నేపథ్యంలో సరికొత్తగా మరెవరి పేర్లు వెలుగు చూస్తాయోనన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. 

21:36 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ను సిట్‌ విచారిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. నవదీప్‌కు చెందిన బీపీఎమ్ పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. నవదీప్‌ విచారణలో కీలక సమాచారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:17 - July 24, 2017

పైకి స్వదేశీ కబుర్లు చెబుతారు.. కానీ చేతల్లో పక్కా విదేశీ న్యాయం పాటిస్తారు. మనరైతులంటే చులకన.. మన పౌరులంటే చిన్న చూపు.. మన పరిశ్రమలంటే నిర్లక్ష్యం.. మన పాడి అంటే పట్టరానితరం.. వెరసి  ఒప్పందాల ముసుగులో దేశాన్ని నాశనం చేసి... పరాయి దేశాలకు, మల్టీనేషనల్ కంపెనీలకు సంపదనకు, ప్రజల హక్కులను, అంతిమంగా దేశ సార్వభౌమత్వాన్ని ధారాదత్తం చేసే చర్యలకు ప్రభుత్వాలు దిగుతున్నాయా? అవునంటున్నారు. పరిశీలకులు. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం..
దేశాన్ని ముంచే ఒప్పందాలు ఎందుకు? 
అప్పట్లో వచ్చిన డబ్ల్యూటీవోనే అంతులేని నాశనం చేసింది. మరి ఇప్పుడు వస్తున్న ఈ ఆర్ సీఈపీ ఒప్పందాలు ఎవర్ని ముంచటానికి? వద్దు వద్దంటుంటే దేశాన్ని నిలువునా ముంచి, నట్టేట్లో వదిలేసే ఒప్పందాలు ఎందుకు? ఎవర్ని ఉద్ధరించటానికి? ఎవర్ని బాగు చేయటానికి. సామాన్యుడు బతకలేని పరిస్థితికి దిగజార్చే ఈ ఒప్పందాలపై ఇప్పుడు మంటలు రేగుతున్నాయి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

21:09 - July 24, 2017

బహిష్కరణ నడ్మగలిసిన బంధవ్యాలు.. మంథని కథ సుఖాంతం చేసిన టెన్ టివి, కరివెన ముంపు బాధితులకు టోకరా...నౌకర్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్, ఆడోల్లను ఏయ్ ఒసేయ్ అంటున్న ఎమ్మెల్యే...మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైత్యం, సిరిసిల్ల దళితులతోని సర్కారు కాళ్ల బ్యారం...దెబ్బలు కొట్టినంక పుట్టుకొచ్చిన మమకారం, తెలంగాణ రాష్ట్రంల యువ కలెక్టర్లు, ఎస్పీలు...ప్రజలతోని మమేకమైతున్న అధికారులు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

21:03 - July 24, 2017

నిర్మాణ రంగంపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపిందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థికరంగ నిపుణులు పాపారావు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేత జీవీ రెడ్డి, బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. నోట్ల రద్దుతో నిర్మాణ రంగం కదేలయిందన్నారు. కార్మిక రంగాన్ని దెబ్బతీసిందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:58 - July 24, 2017

దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం లాంటి నిర్మాణ రంగం కుదేలైంది... దాదాపు మూడున్నర కోట్ల మంది ఆధారపడ్డ ఈ రంగం నోట్ల రద్దు పుణ్యమా అని తీవ్రంగా ప్రభావితమైంది.. ఈ రంగంలో అత్యల్ప వృద్ధి రేటు నమోదైందని కేంద్రం చెబుతున్న లెక్కలే తాజా ఉదాహరణ.
అసంఘటిత కార్మిక రంగాన్ని దెబ్బ తీసిన నోట్ల రద్దు
దేశంలో మెజార్టీ అసంఘటిత రంగ కార్మికులు ఆధారపడ్డ నిర్మాణ రంగాన్ని నోట్ల రద్దు తీవ్రంగా దెబ్బతీసింది. ఈ రంగపు వార్షిక టర్నోవర్‌ 14 లక్షల కోట్ల రూపాయిలు. అంటే, జాతీయ స్థూల ఆదాయంలో 20 శాతం అన్నమాట. నిర్మాణ రంగమే కాకుండా ఉత్పత్తి రంగం కూడా దేశ వ్యాప్తంగా వ్యతిరేక వృద్ధి రేటును నమోదు చేసింది.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాలు బయటపెట్టింది. ఉత్పత్తి రంగం 7.9 శాతానికి పడిపోతే... నిర్మాణ రంగం అత్యంత దారుణంగా మైనస్ 3.7 శాతానికి పడిపోయింది.. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు తీస్తుందన్న మోడీ సర్కార్ మాటలు డాంబికాలేనని ఈ గణాంకాలు తేల్చేశాయి. 
ఉత్పత్తి రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం 
నోట్ల రద్దు నిర్ణయం ముందు వెనుకలు ఆలోచించకుండా తీసుకున్నదని ఆర్థికవేత్తల్లో కొందరు గగ్గోలు పెట్టినా.. పెడ చెవిన పెట్టిన మోడీ సర్కార్.. ప్రస్తుత ఆర్థికరంగ దుస్థితికి ఏం సమాధానం చెబుతుంది..? దేశవ్యాప్తంగా 2014-15లో 8.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన ఉత్పత్తి రంగం.. 2015-16లో బాగా పుంజుకుని 10.8 వృద్ధిని సాధించింది. 2016-17లో అది కాస్తా 7.9 శాతానికి పడిపోయింది. ఉత్పత్తి రంగంపైనే పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2016-17 మూడో త్రైమాసికంలో అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో 8.2 శాతం వృద్ధి ఉండగా, నాలుగో త్రైమాసికంలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో అది కాస్తా 5.3 శాతానికి పడిపోయింది. దీంతో పాటు నిర్మాణ రంగంలో గమనించదగ్గ వ్యతిరేక వృద్ది రేటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. తాజా గణాంకాలు చూస్తే ఆర్థిక వ్యవస్థ వెన్ను విరుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ముఖ్యంగా నిర్మాణ రంగంపై ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులు ఆధారపడటం.. నోట్ల రద్దు నిర్ణయం, వాళ్ల జీవన పరిస్థితిని ఇకపై మరింతగా దిగజారుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 
 దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న నిర్మాణరంగం
నిర్మాణ రంగంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దేశవ్యాప్తంగా 2014-15లో 4.7 వృద్ధిని సాధించిన నిర్మాణ రంగం.. 2015-16లో 5 శాతానికి పెరిగింది. మోదీ ప్రభుత్వం నిర్మాణ రంగంపై అధిక శ్రద్ధ చూపిస్తున్న నేపథ్యంలో రాబోయే పదేళ్లలో వృద్ధి రేటు 7 నుంచి 8 శాతం మేర ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. రియల్‌ఎస్టేట్‌వ్యాపారం పుంజుకోవడం, రోడ్లు, ప్రాజెక్టులు, స్మార్ట్‌సిటీలు, ఇతర భవన నిర్మా ణ పనులు జోరందుకున్న సమయంలో ఈ అంచనా వేశారు. అయితే, ఈ అంచనాలు అన్నింటిని తలకిందులు చేస్తూ 2016-17లో 1.7 శాతం మాత్రమే వృద్ధి రేటు కనిపించింది. క్వార్టర్ల వారీగా పరిశీలిస్తే నోట్ల రద్దు ఎంత దెబ్బకొట్టిందో స్పష్టంగా కనిపిస్తోంది. 2016-17 మూడో క్వార్టర్లో ఈ రంగం 3.4 శాతం కనిపిస్తే .. నాలుగో క్వార్టర్‌కు  మైనస్ 3.7వృద్ధిరేటుతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రతికూల వృద్ది రేటు కనిపించింది.
నిర్మాణ రంగంలో స్తబ్దత
రియల్ ఎస్టేట్ లో దేశంలో చెప్పుకోదగ్గ గ్రోత్ కనిపించే ముంబై, ఢిల్లీ - నోయిడా, గుర్ గావ్ , పూణే, బెంగళూరు, హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో నోట్ల రద్దు తర్వాత నిర్మాణ రంగంలో స్తబ్దత కనిపిస్తోంది.. దీంతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, ప్రత్యేక నిర్మాణాలు, మౌళిక సదుపాయాల కోసం చేపట్టే నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి.. ఇప్పట్లోనైతే ఈ ప్రతికూల వృద్ది రేటును అధిగమించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థిక విశ్లేషకులంటున్నారు. 

నవదీప్ ను విచారిస్తోన్న సిట్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నవదీప్ ను సిట్ విచారిస్తోంది. ప్రశ్నలతో సిట్ నవదీప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కెల్విన్ తో పరియలం కాకముందు డ్రగ్స్ అలవాటుందా.. కొత్త వాళ్లను డ్రగ్స్ ఊబిలోకి ఎలా లాగుతున్నారు. పబ్బులలో కొత్త వాళ్లకి డ్రగ్స్ ఎలా అలవాటు చేస్తున్నారని వంటి పలు ప్రశ్నలు అడిగారు. 

 

పాస్ పోర్టు నిబంధనలు సరళతరం

హైదరాబాద్ : పాస్ పోర్టు నిబంధనలను సరళతరం చేశారు. పాస్ పోర్టు పొందాలంటే బర్త్ సర్టిఫికేట్ తప్పని సరికాదు. డేటాఫ్ బర్త్ ను ధృవీకరరించే ఇతర పత్రాలతో కూడా పాస్ పోర్టు పొందవచ్చు. 

రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగం

ఢిల్లీ : రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ ముఖర్జీ చివరి ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ కు తనకు దేవాలయంతో సమానమన్నారు. దేశ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. దేశానికి తాను సేవ కంటే..దేశం తనకు ఎక్కువే ఇచ్చిందన్నారు. 

 

డ్రగ్స్ కేసులో మరో నిందితుడికి బెయిల్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు బెన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఖుద్దూస్, వాహిద్ ల బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. 

19:46 - July 24, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులు కదం తొక్కారు. కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు భారీగా హాజరైన విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టల్స్‌ మూసివేత తగదంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

19:44 - July 24, 2017

నెల్లూరు : అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌ను.. నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అప్పటి నుంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో క్రికెట్‌ బెట్టింగ్ బుకీలతో సంబంధాలున్న పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లతో పాటు.. జిల్లాలో ఉన్న 15 మంది ప్రధాన బుకీల వివరాలు కృష్ణసింగ్‌ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా ఎస్పీ రామకృష్ణపై, కృష్ణసింగ్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ మంత్రులు, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. కృష్ణసింగ్‌ వందల కోట్లు క్రికెట్‌ బెట్టింగ్‌లతో పాటు, పేకాట స్థావరాలను నిర్వహిస్తూ తన వ్యాపారాన్ని కర్ణాటక, తమిళనాడుకు విస్తరించాడు. పోలీసు అధికారులు, రాజకీయ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ.. వారికి కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. 

 

19:43 - July 24, 2017

విజయనగరం : కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు రాజకీయ వారసులెవరు? ఆయన స్థాయిని అందుకునే ఆ సంస్థానాధీశులెవరు? రాజుగారి తర్వాత సంస్థానంలో రాజకీయ వారసత్వం కొనసాగుతుందా? కుమారులు లేని పూసపాటి వంశీయుల రాజకీయ చరిత్ర ఏ మలుపు తిరుగనుంది? రాబోయే ఎన్నికలకు తెరపైకి వచ్చే ఆ కొత్త వారసులెవరు? విజయనగరం మహారాజుల రాజకీయ వారసత్వంపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.
రాజకీయాల్లో పూసపాటి వంశీయులకు ప్రత్యేక చరిత్ర
విజయనగరం జిల్లా పాలిటిక్స్‌లో పూసపాటి వంశీయులకు ప్రత్యేక చరిత్ర ఉంది.  రాజవంశీయుల పాలన అంతమైనా... నేటికీ ఈ జిల్లాలో ప్రజలు పూసపాటి కుటుంబీకులను ఆదరిస్తూనే ఉన్నారు. పూసపాటి వంశీయుల్లో చివరి పట్టాభిషిక్తుడైన పివిజి రాజు నుంచి నేటి కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు వరకు రాజకీయ వారసత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా పనిచేస్తున్న అశోక్‌గజపతిరాజు.. పాలిటిక్స్‌లో మచ్చలేని మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  రాజకీయ జీవితంలో అపజయమే అన్నది ఎరుగకుండా అప్రతిహత విజయంతో కొనసాగుతున్నారు. 
అశోక్‌ వారసులు ఎవరన్నదానిపై తీవ్ర చర్చ
రాజకీయ నేతలు తమ వారసులుగా కుమారులను పాలిటిక్స్‌లోకి తీసుకురావడమన్నది ఆనవాయితీగా వస్తోంది. ఎవరో అక్కడక్కడ కొంతమంది తప్ప పాలిటిక్స్‌లో ఉన్నవారంతా ఇది పాటిస్తూనే ఉన్నారు. అయితే అశోక్‌గజపతిరాజుకు కుమారులు లేరు. ఆయన సోదరుడు ఆనందగజపతిరాజుకూ కుమారులు లేరు. దీంతో అశోక్‌గజపతి రాజు రాజకీయ వారసులెవరన్నది చర్చనీయాంశమైంది. ఆయన వారసులుగా ఎవరు పాలిటిక్స్‌లోకి అడుగుపెడతారన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.
అశోక్‌ రాజకీయ వారసురాలిగా అతిథి!
అశోక్‌గజపతి రాజు పెద్ద కుమార్తె అతిథి సామాజిక కార్యక్రమాల్లో ముందున్నారు. ఎన్నికల్లో తండ్రి తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించారు.  అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.  దీంతో అశోక్‌గజపతి రాజు రాజకీయ వారసురాలిగా అతిథి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో పూసపాటి వంశీయుల రాజకీయ వారసురాలు అతిథే అన్న వాదనలకు బలం చేకూరుతోంది.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అతిథి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కోసమే అతిథి.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటుందన్న వాదన వినిపిస్తోంది.  కేంద్రమంత్రి దత్తత తీసుకున్న ద్వారపూడి గ్రామంపై ఆమె దృష్టి సారించి అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంతేకాదు... విజయనగరం నియోజకవర్గ పరిధిలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా ఆమె నేరుగా స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు.  గత నెల 26న తన తండ్రి  బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేసి పార్టీ క్యాడర్‌కు మరింత దగ్గరయ్యారు.  ఈనెల 9న జరిగిన జిల్లా పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.  విజయనగరం నియోజకవర్గంలో తండ్రి ఎక్కడ పర్యటించినా.. అతని వెంట అతిథికూడా వెళ్తుండడం ఆమె రాజకీయాల్లోకి రావడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో మరోసారి లోక్‌సభకు అశోక్‌ పోటీ
2019 ఎన్నికల్లో అశోక్‌ మరోసారి లోక్‌సభకే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అతిథి విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. వాస్తవానికి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలి నుంచి  విజయనగరం సంస్థానాధీశులే పోటీచేస్తూ విజయం సాధిస్తూ వచ్చారు.  అయితే గత ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు లోక్‌సభ స్థానానికి పోటీ చేయడంతో... అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి తొలిసారి ఇతరులకు అవకాశం దక్కింది. అశోక్‌ ఆశీస్సులతో మీసాలగీత విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పూసపాటి వంశీయులే ఈ స్థానాన్ని దక్కించుకునే అవకాశముంది. మొత్తానికి విజయనగరం మహారాజుల రాజకీయ వారసురాలిగా అతిథి రాజకీయ తెరంగేట్రం చేయబోతున్నారన్నమాట. మున్ముందు దీనిపై  మరింత స్పష్టత వచ్చే  అవకాశముంది.

19:37 - July 24, 2017

కృష్ణా : విజయవాడలో ఓ వ్యక్తి పోగొట్టుకున్న 50 లక్షల నగదుతో కూడిన బ్యాగ్‌ను పోలీసులు రెండు గంటల్లోనే కనిపెట్టారు.  ఓ జ్యువెలరీ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్న రామకృష్ణ.... గవర్నర్‌పేటలో 50 లక్షల నగదు కలిగిన బ్యాగ్‌ను పోగొట్టుకున్నాడు. కొద్దిదూరం వెళ్లాక అది గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 2 గంటల్లోనే కేసును ఛేదించారు. రామకృష్ణ పోగొట్టుకున్న బ్యాగు  దారినపోయే ఓ వ్యక్తికి కనిపించింది. దీంతో అతడు  ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బ్యాగ్‌ను తీసుకున్న వ్యక్తిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండు గంటల్లోనే కేసు చేదించిన పోలీసులను సీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. 

 

19:33 - July 24, 2017
19:30 - July 24, 2017
19:26 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు విచారణ చట్ట విరుద్ధంగా జరుగుతోందంటూ వస్తున్న ఆరోపణలు సిట్‌ తోసిపుచ్చింది. ప్రతిదీ చట్ట ప్రకారం, వీడియో చిత్రీకరణ మధ్య విచారణ జరుపుతున్నామని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ఆర్ వీ చంద్రవదన్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ చెప్పారు. విచాణకు హాజరైన ఎవరి నుంచి కూడా బలవంతంగా రక్తం నమూనాలు సేకరించలేదన్నారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు జరుగుతోందన్న వాదన సరికాదన్నారు. డ్రగ్స్‌ కేసులో నిందితులుగా ఉన్న స్కూలు పిల్లల పేర్లు బయటపెట్టబోమని సిట్‌ స్పష్టం చేసింది. ఈకేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టమని చెప్పారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణ కొసాగుతుందన్నారు. ఇంతవరకు 27 మందిని ప్రశ్నించామని చెప్పారు. డ్రగ్స్‌ కేసులో 19 మందిని అరెస్టు చేశామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

19:07 - July 24, 2017

విశాఖ : సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థుల విశాఖ కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సంక్షేమ హాస్టల్స్‌లోని సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని వసతి గృహాలకు చెందిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. హాస్టల్స్‌లో వసతులు కల్పించాలని, మెస్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్ట్‌ చేశారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

19:00 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఒకవైపు సినీ నటులను విచారిస్తూనే .. మరోవైపు వారిచ్చే సమాచారంతో పలువురి కదలికలపై దృష్టిసారించింది. టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మేనేజర్‌ రోనిని సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని ఇంట్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి రోని డ్రగ్స్‌ వాడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోని గతంలో హీరోయిన్స్‌ లావణ్య త్రిపాఠి, రాశీఖన్నాకు కూడా మేనేజర్‌గా పని చేశాడు. 

18:57 - July 24, 2017

హైదరాబాద్‌ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులు, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు కలిసి మృత్యుంజయ హోమం నిర్వహించారు. లేబర్‌ వార్డు ఆవరణలో ఈ హోమాన్ని నిర్వహించారు. నలుగురు వేదపండితులతో నాలుగు గంటలపాటు ఈ హోమం సాగింది. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు ఈ హోమం నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. వైద్యుల  తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణాలు నిలపాల్సిన వైద్యులు హోమాలు చేయడమేంటని రోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే దేవుడిమీద భారంవేసి తమ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు  ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. 

 

18:51 - July 24, 2017

కాబూల్‌ : ఆప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో కారు బాంబు కలకలం రేపింది. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. కారు బాంబు పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. షియా మతస్తుల టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఏడాది ముందు కూడా ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపడం గమనార్హం.

 

18:48 - July 24, 2017

ఢిల్లీ : సంచలనం సృష్టించిన నిఠారి రేప్‌ మర్డర్‌ కేసులో దోషులకు సిబిఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ప్రధాన నిందితులు సురేంద్ర కోలి, మొనిందర్‌ పండేర్‌లకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిఠారి హత్యాకాండకు సంబంధించి గజియాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానం వీరిని ఇంతకు ముందే దోషులుగా ఖరారు చేసింది. 20 ఏళ్ల పింకి సర్కార్‌ కిడ్నాప్‌, రేప్‌, హత్య కేసులో కోలి, పండేర్‌లను కోర్టు దోషులుగా పేర్కొంది. యువతి రేప్‌ మర్డర్‌ కేసులో తగిన ఆధారాలు దొరికాయని కోర్టు తరపు లాయర్ జెపి శర్మ కోర్టుకు తెలిపారు. 2006లో నోయిడాలోని నిఠారిలో పండేర్‌ ఇంట్లో 19 మృత కళేబరాలను అప్పట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోలి, పండేర్‌లపై 16 ఘటనలకు సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

 

18:46 - July 24, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో రచ్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు ప్రాధికార సంస్థ అనుమతిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్టారాజ్యంగా అంచనాలు పెంచిన విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఈ విధంగా చేయడం నిబంధనలు విరుద్ధమని వాదించారు. అంచనాలు పెంచడం చట్ట విరుద్ధమన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. గిరిజనులకు పునరావాసం కల్పించడంలో రాష్ట్రం విఫలమైందని తెలిపారు. పోలవరంపై సభలో జరిగిన చర్చకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్‌కుమార్‌ సమాధానం చెప్పారు. సవరించిన ప్రాజెక్టు అంచనాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అందుతాయన్నారు. అంతిమంగా పోలవరం ప్రాజెక్టు ప్రాధికార సంస్థ నిర్ణయానుసారమే చెల్లింపులు జరుగుతాయని సభ దృష్టికి తెచ్చారు. 

 

18:36 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే విచారిస్తున్నామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఈకేసులో 27 మందిని విచారించామని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి చెందిన 5 మందిని విచారించామని తెలిపారు. 19 మందిని అరెస్టు చేశామని..ఈరోజు జానీ జోసఫ్ ను అరెస్టు చేశామని తెలిపారు. 7 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. స్టాటింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు విచారణ వీడియో రికార్డు అవుతుందన్నారు. విచారణను పూర్తిగా వీడియో రికార్డు చేస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తి అయ్యాక... విచారణ వీడియోలను కోర్టుకు పంపుతామన్నారు. ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. నిన్నటి వరకు ఇద్దరి నుంచి శాంపిల్స్ తీసుకున్నామని..హెయిర్, నెయిల్ శాంపిల్స్ తీసుకున్నామని తెలిపారు. అనుమతి లేకుండా శాంపిల్స్ సేకరించబోమని చెప్పారు. అయితే శాంపిల్స్ ఇచ్చేందుకు సహకరించకపోతే కేసు డైరీలో పేర్కొంటామని...కోర్టుకు తెలుపుతామన్నారు. చార్మి, ముమైత్ ఖాన్ లు ఎక్కడ కోరితే అక్కడ విచారిస్తామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి పేర్లను వెల్లడించబోమని తెలిపారు. ప్రతిరోజు నలుగురితో కూడిన టీమ్ విచారిస్తోందని చెప్పారు. డ్రగ్స్ కొనడం, అమ్మడం, వినియోగించడం, ఇంట్లో ఉండడం కూడా నేరమే అని తెలిపారు. విచారణలో అన్ని నిబంధనలు పాటిస్తున్నామని చెప్పారు. ఒక వర్గాన్నే టార్గెట్ చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఆరోపణలు ఆపకపోతే వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఒకవైపు కేసు విచారణ చేస్తూనే... మరోవైపు డ్రగ్స్ వాడకం, దుష్ఫలితాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. విచారణ వివరాలను తెలపడానికి రాజశేఖర్ రావు, విజయ్ లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. తాను చాలా సేఫ్ గా ఉన్నానని....తనకు ఇద్దరు సమర్ధవంతమైన బాడీ గార్డ్స్ ఉన్నారని తెలిపారు. ఎవరితో భయం లేదని.. ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:03 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో చట్టానికి లోబడి, నిబంధనలకనుగుణంగా విచారణ సాగుతోందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. చట్టానికి లోబడి.. తమకు ఇచ్చిన అధికారాలను బట్టి విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. కోర్టుకు అన్ని వివరాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించే నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు విచారించిన వారు స్వేచ్ఛగా ముందుకు వచ్చారు కాబట్టే వారి నమూనాలను తీసుకున్నామని.. దౌర్జన్యంగా వారి నుంచి నమూనాలను సేకరించలేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసు విచారణలో ఒక సెక్షన్ ను టార్గెట్ చేస్తున్నారనేది వాస్తవం కాదన్నారు. అన్ని రంగాలకు చెందినవారిని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఎక్సైజ్ శాఖపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 27 మందిని ప్రశ్నించామని తెలిపారు. వీరిలో 17 మంది నిందితులు, ఇతరులు 10 మంది ఉన్నారని చెప్పారు. 19 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఆరుగురు ప్రధానంగా ఉన్నారని తెలిపారు. 3 ఎల్ ఎస్ డీ స్వాధీనం చేసుకున్నాట్లు పేర్కొన్నారు. 45 గ్రాముల కొకైన్, 6 గ్రాముల మ్యాజిక్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు పంపాపమని.. వీరిలో ఈరోజు వరకు ఐదుగురిని ప్రశ్నించామని తెలిపారు. సమసర్థవంతమైన అధికారులు విచారిస్తున్నారని.. సీరియస్ గా, పూర్తి నిబద్ధతో విచారణ చేస్తున్నామని తెలిపారు. 

 

ఎక్సైజ్ శాఖకు అన్ని అధికారాలున్నాయి: అకున్ సబర్వాల్

హైదరాబాద్: డ్రగ్స్ కేసు ను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ కు అన్ని అధికారాలు ఉన్నాయని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. విచారణలో అత్యుత్తమ ఇంటర్వూ టెక్నిక్స్ ను పాటిస్తున్నామని, విచారణ అంతా రికార్డు అవుతోందని తెలిపారు. ఆ వీడియోలను కోర్టులో ప్రవేశపెడతామని, ఎన్ డీపీఎస్ యాక్టు ప్రకారం డ్రగ్స్ ఉంచుకోవడం, అమ్మడం, కొనడం, సేవించడం, ఇంతకు ముందు వాడటం, ఇంట్లో ఉంచుకోవడం కూడా నేరమేనని సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో స్కూలు పిల్లల పేర్లు వెల్లడించం అని స్పష్టం చేశారు. చిన్నపిల్లల పేర్లు ప్రకటిస్తే వారి జీవితాలు నాశనం అవుతాయని, హోటళ్ల యజమానులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు.

17:41 - July 24, 2017

హైదరాబాద్ : కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా బీసీ గురుకుల పాఠశాలలు విద్యను అందిస్తున్నాయని మంత్రి జోగు రామన్న అన్నారు. బీసీల్లోని పేదలకు కార్పొరేట్‌ విద్య అందించేందుకే ఈ వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం 119 గురుకుల పాఠశాలు ప్రారంభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ స్కూళ్లకు విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులు కూడా గురుకులాల్లో చేరుతున్నారని తెలిపారు. సంచార జాతులకు బేషరతుగా ఈ పాఠశాల్లో సీటు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 

సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే విచారణ :చంద్రవదన్

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు 27 మందిని ప్రశ్నించామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. కొద్ది సేపటి క్రితం చంద్రవదన్, అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడారు. 27 మందిలో చాలా రంగాల వ్యక్తులున్నారని తెలిపారు.  ఇప్పటి వరకు సినీరంగానికి చెందిన ఐదుగురిని ప్రశ్నించినట్లు తెలిపారు. నోటీసు అందుకున్న వారితోనే విచారణ ముగియదని స్పష్టం చేశారు. సిట్ కు నిబద్ధత లేదనడం సరికాదన్నారు. సిట్ కు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, జీవో కూడా జారీ చేశారన్నారు. డ్రగ్స్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, సిట్ లో అనుభం కలిగిన వారు ఉన్నారని చెప్పారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోని అరెస్ట్

హైదరాబాద్: టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. గంజాయి కేసులో తెలుగు హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ మేనేజ‌ర్ రోనీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రోనీ నివాసం వ‌ద్ద గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. గ‌త కొంత కాలంగా హీరోయిన్ కాజ‌ల్ కు మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు రోని. చాలా కాలం నుంచి రోని డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తెలుసుకున్న అధికారులు అత‌డిపై నిఘా పెట్టారు. రోని ఇదివ‌ర‌కు హీరోయిన్స్ లావ‌ణ్య త్రిపాఠి, రాశి ఖ‌న్నాకు మేనేజ‌ర్ గా ప‌ని చేశాడు. రోని ఇంట్లో గంజాయి దొర‌క‌డంతో వెంట‌నే అత‌డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు అధికారులు

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోని అరెస్ట్

హైదరాబాద్: టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రోజుకో మ‌లుపు తిరుగుతున్న‌ది. గంజాయి కేసులో తెలుగు హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ మేనేజ‌ర్ రోనీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రోనీ నివాసం వ‌ద్ద గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. గ‌త కొంత కాలంగా హీరోయిన్ కాజ‌ల్ కు మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు రోని. చాలా కాలం నుంచి రోని డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తెలుసుకున్న అధికారులు అత‌డిపై నిఘా పెట్టారు. రోని ఇదివ‌ర‌కు హీరోయిన్స్ లావ‌ణ్య త్రిపాఠి, రాశి ఖ‌న్నాకు మేనేజ‌ర్ గా ప‌ని చేశాడు. రోని ఇంట్లో గంజాయి దొర‌క‌డంతో వెంట‌నే అత‌డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు అధికారులు

16:52 - July 24, 2017

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతో డ్రగ్స్‌ విచారణ జరిపించాలని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాయాలన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. డ్రగ్స్‌ వినియోగించిన వారిని విచారించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. డ్రగ్స్ ఉత్పత్తిదారులను, రవాణా చేసేవారిని పట్టుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న పబ్‌లపై ప్రభుత్వం తక్షణమే  చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేకుంటే టీ టీడీపీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. 

 

పోలవరం ప్రాజెక్టు పురోగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పురోగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును వర్చువల్ ఇన్స్ స్సెక్షన్ ద్వారా సీఎం పరిశీలిస్తున్నారు. పోలవరం పనులపై 34వ సారి సీఎం వర్చువల్ ఇన్స్ స్సెక్షన్  చేస్తున్నారు.
విజయవాడ: గవర్నర్ పేట లో రూ.50లక్షల నగదు ఉన్న బ్యాగును ఓ వ్యక్తి పోగొట్టుకున్నాడు.

పోలవరం ప్రాజెక్టు పురోగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పురోగతి పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును వర్చువల్ ఇన్స్ స్సెక్షన్ ద్వారా సీఎం పరిశీలిస్తున్నారు. పోలవరం పనులపై 34వ సారి సీఎం వర్చువల్ ఇన్స్ స్సెక్షన్  చేస్తున్నారు.
విజయవాడ: గవర్నర్ పేట లో రూ.50లక్షల నగదు ఉన్న బ్యాగును ఓ వ్యక్తి పోగొట్టుకున్నాడు.

16:49 - July 24, 2017

హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి స్పందించారు. డ్రగ్స్‌ గురించి సినీ నటులను టార్గెట్ చేస్తూ వివాదం చేయడం సరి కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరిస్తే డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. తెలుగు సినీ రంగానికి చెందిన వారిని దోషులుగా చూపిస్తూ మీడియా, సిట్‌ అధికారులు అతిగా ప్రచారం చేస్తున్నారన్నారు. 1960 నుంచే దేశంలో డ్రగ్స్‌ వాడకం ఉందని..  డ్రగ్స్‌ మూలాలను అణచివేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సిగరెట్, మద్యం ఆరోగ్యానికి హానికరమని చెబుతూనే.. డబ్బుల కోసం ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. ముందు ప్రభుత్వాలు మారితే సమాజంలో మార్పు వస్తుందన్నారు. 

 

కాజీపేట, సికింద్రాబాద్ లమధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

పెద్దపల్లి: చీకురాయి వద్ద 38వ గేటు హోమ్ సిగ్నల్స్ వద్ద గూడ్స్ రైలు ఢీ కొట్టి వెళ్లిపోయింది. సిగ్నల్ విరిగిపోవడంతో 2 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ లమధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సిగ్నల్ వ్యవస్థ ను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.

 

కాజీపేట, సికింద్రాబాద్ లమధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

పెద్దపల్లి: చీకురాయి వద్ద 38వ గేటు హోమ్ సిగ్నల్స్ వద్ద గూడ్స్ రైలు ఢీ కొట్టి వెళ్లిపోయింది. సిగ్నల్ విరిగిపోవడంతో 2 గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ లమధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సిగ్నల్ వ్యవస్థ ను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే సిబ్బంది తెలిపారు.

 

16:05 - July 24, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' కి హీరో 'నితిన్' పెద్ద అభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ..ఆ' చిత్రంతో ఇటీవల భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా 'నితిన్' హీరోగా మరో సినిమా మొదలైంది. ఇప్పటికే 'లై' అనే చిత్రంతో 'నితిన్' బిజీగా ఉన్నాడు. ఎక్కువ భాగం విదేశాల్లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే 'పవన్ కళ్యాణ్' క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్ మూవీస్ బేనర్ పై ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గత ఏడాది నవంబర్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కృష్ణ చైతన్య దర్శకుడు కాగా ఈ సినిమాకు 'త్రివిక్రమ్' స్వయంగా కథను అందిస్తుండడం విశేషం. తన అభిమాని కోసం ఓ సినిమాను నిర్మించడానికి 'పవన్ కళ్యాణ్’, 'త్రివిక్రమ్' లు ముందుకు రావడం విశేషం.

తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైనట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. తొలి ఐదు రోజుల పాటు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. అనంతరం భారీ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఇక నితిన్ పక్కన ఏ హీరోయిన్ నటించనుందో తెలియడం లేదు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

16:01 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ను సిట్‌ విచారిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ గుర్తించింది. నవదీప్‌కు చెందిన బీపీఎమ్ పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. నవదీప్‌ విచారణలో కీలక సమాచారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలు ఫైవ్‌స్టార్‌ హోటళ్ల యజమానులనూ సిట్‌ విచారిస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లోక్ సభ నుండి 6గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్

ఢిల్లీ: లోక్ సభ నుండి 6గురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పోడియంపై వారు కాగితాలు విసిరి వేయడంతో 5రోజుల పాటు వారిని సస్పెండ్ చేశారు.

 

15:57 - July 24, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ భవనంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్‌లపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.

 

లోక్ సభ రేపటికి వాయిదా

ఢిల్లీ: లోక్ సభ రేపటికి వాయిదా పడింది. కాంగ్రెస్ ఎంపీల ఆందోళనలతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

15:54 - July 24, 2017

ఖమ్మం : నగరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆందోళకు దిగింది. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ఖమ్మం కలెక్టరేట్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ తర్వాత కలెక్టరేట్‌ ముట్టడికి సీపీఐ నేతలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ నిరసనలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పువ్వాడ, కూనం సాంబశివరావు, భాగం వేమంతరావు పాల్గొన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

 

15:49 - July 24, 2017

హైదరాబాద్ : స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో దేశంలోకి విదేశీ సరుకులు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని... టీజాక్ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఆర్సీఈపి సమావేశాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం టెన్ టివితో మాట్లాడారు. ఇదే జరిగితే దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఈ ర్యాలీలో కోదండరాంతోపాటు సారంపల్లి మల్లారెడ్డి
అన్నారు. 

 

15:35 - July 24, 2017

హైదరాబాద్ : స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో దేశంలోకి విదేశీ సరుకులు తీసుకువచ్చే కుట్ర జరుగుతోందని... టీజాక్ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఆర్సీఈపి సమావేశాలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం టెన్ టివితో మాట్లాడారు. ఇదే జరిగితే దేశంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతుందని చెప్పారు. ఈ ర్యాలీలో కోదండరాంతోపాటు సారంపల్లి మల్లారెడ్డి
అన్నారు. 

 

కేటీఆర్ ను కేబినెట్ నుండి తప్పించాలి: ఉత్తమ్

హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం అండతోనే సిరిసిల్లలో దళితులపై దాడి జరుగుతోందని టి.పిసీసీ ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ెవరి కోసం పని చేస్తున్నారు. దళితులను పోలీసులు హింసిస్తే కేటీఆర్ స్పందించారా.. ఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, కేటీఆర్ ను కేబినెట్ నుండి తప్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

 

15:08 - July 24, 2017

డ్రగ్స్ కేసులో మరో నిందితుడికి బెయిల్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో నిందితుడికి బెయిల్ మంజూరయింది. బెన్ కు నాంపలి్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఖుద్దూస్, వాహిద్ ల బెయిల్ పిటిషన్ల ను కోర్టు కొట్టి వేసింది.

 

చంద్రవదన్, అకున్ సబర్వాల్ కు కోర్టుకు నోటీసులు జారీ

హైదరాబాద్: ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి హైకోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్‌ కేసులో భాగంగా విచారణలో బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్‌ వేశారు. విచారణ తీరు కూడా సరిగా లేదని చార్మి ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ మేరకు చంద్రవదన్, అకున్ సబర్వాల్‌కు నోటీసులు జారీచేసింది. కాగా చార్మి పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.

 

’పోలవరానికి పూర్తి నిధులు మంజూరు చేస్తాం’

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టకు పూర్తిగా నిధులు మంజూరు చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ తెలిపారు. రాజ్యసభలో ఏపి మంత్రులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పునరావాస ప్యాకేజీని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వందశాతం కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఏ న్యాయస్థానం పోలవరంపై స్టే విధించలేదన్నారు.

 

పోలవరం పై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ : పోలరవం ప్రాజెక్ట్ పై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఎంపీలు కేవీపీ, దిగ్విజయ్, విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు, పునరావాసంపై ఎంపీ లు ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు ఏపికి ఎందుకు అప్పగించారని ఎంపిలు ప్రశ్నించారు. త్వరితగతిన ప్రాజెక్టు పూర్తిచేసేందుకే అప్పగించామని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పూర్తికి నిధులు మంజూరు చేస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ తెలిపారు.

 

సినీ నటులను టార్గెట్ చేయడం సరికాదు:ఆర్.నారాయణ మూర్తి

అమరావతి: డ్రగ్స్ వ్యవహారంపై నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. డ్రగ్స్ కేసులో సినీ నటులను టార్గెట్ చేయడం సరికాదన్నారు. సినీ రంగానికి చెందిన వారిని దోషులుగా చూపిస్తూ మీడియా, సిట్ అధికారులు అతిగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1960 నుంచే దేశంలో డ్రగ్స్ వాడకం ఉందని నారాయణ మూర్తి తెలిపారు. డ్రగ్స్ మూలాలను అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. సిగరెట్, మద్యం ఆరోగ్యానికి హానికరమని చెబుతూనే డబ్బుల కోసం ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వాలు మారితే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. పిల్లలు డ్రగ్స్ కు బానిసవ్వడం దారుణం అన్నారు.

 

13:52 - July 24, 2017

సెయిలింగ్ స్పోర్ట్స్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి..ఈ పోటీలు 17 వ శతాబ్దలో నెదర్లాడ్స్ లో ప్రారంభమైయ్యాయి. నీటి అలలపై తెలియడుడతూ అలలతోమ ఆటలడుకుంటూ బాడీని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగటం సెయిలింగ్ పోటీలో గెలవడం కష్టమైన పని కానీ ఇష్టపడితే ఎది కష్టం కాదు కదా. ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ ఈ పోటీలు నిర్వహించారు. ఈ సారి పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన అనన్య తో ఈ రోజు స్పూర్తి......

 

13:50 - July 24, 2017

నాగర్‌కర్నూల్‌ : జిల్లా కల్వకుర్తిలోని జేపీ నగర్‌, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను, ఎస్టీ ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ బాలిక ఆశ్రమ పాఠశాలను గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ తనిఖీ చేశారు. గురుకులాలలోని తరగతి గదులను, వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు చదువును అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ప్రిన్సిపల్‌, సంబంధిత అధికారులకు సూచించారు. 

13:48 - July 24, 2017

ఆదిలాబాద్ : జ్వరాలు, అతిసార, రక్తహీనత, వ్యాధులతో ఏజెన్సీ తల్లడిల్లుతోంది. నెల రోజుల్లో 8 వేల 300 మంది జ్వరాల బారిన పడడం.. వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది. వర్షాకాలం కావడంతో వ్యాధులకు గిరిజనులు ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:47 - July 24, 2017

అనంతపురం : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు తీర్చాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు.. వేలాదిమంది విద్యార్థులు ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి తరలివచ్చారు.. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో రెండువర్గాలమధ్య తోపులాట జరిగింది.. పోలీసుల లాఠీచార్జ్‌లో విద్యార్థులకు గాయాలయ్యాయి.

13:45 - July 24, 2017

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు.. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ట్వీట్‌ చేశాడు. లోక్‌ష్‌ ట్వీట్‌కు.. కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కలిసి మెలిసి ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడదామని కేటీఆర్‌.. లోకేష్‌కు రీ-ట్వీట్‌ చేశారు. 

సినీ పరిశ్రమలోని పెద్దలకూ చుట్టకుంటున్నడ్రగ్స్ కేసు

హైదరాబాద్: సినీ పరిశ్రమలోని పెద్దలకూ డ్రగ్స్ కేసు చుట్టుకుంటుంది. ప్రముఖుల కుటుంబాలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన అగ్ర నిర్మాత కుమారుడు, యువతో క్రేజ్ ఉన్న హీరో కి డ్రగ్స్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

13:43 - July 24, 2017

కృష్ణ : విజయవాడ సివీఆర్‌ స్కూల్‌లో విద్యా వాణి ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వర్చువల్‌ పద్దతి ద్వారా పాఠాలను సులభంగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును మొదటి విడతలో భాగంగా విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని 14 స్కూళ్లలో ప్రారంభం చేశారు.

13:42 - July 24, 2017

నెల్లూరు : అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌ను.. నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అప్పటి నుంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో క్రికెట్‌ బెట్టింగ్ బుకీలతో సంబంధాలున్న పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లతో పాటు.. జిల్లాలో ఉన్న 15 మంది ప్రధాన బుకీల వివరాలు కృష్ణసింగ్‌ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా ఎస్పీ రామకృష్ణపై, కృష్ణసింగ్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ మంత్రులు, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. కృష్ణసింగ్‌ వందల కోట్లు క్రికెట్‌ బెట్టింగ్‌లతో పాటు, పేకాట స్థావరాలను నిర్వహిస్తూ తన వ్యాపారాన్ని కర్ణాటక, తమిళనాడుకు విస్తరించాడు. పోలీసు అధికారులు, రాజకీయ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ.. వారికి కోట్ల రూపాయలు ముడుపులు ఇస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. 

13:32 - July 24, 2017

హైదరాబాద్ : తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..... డ్రగ్స్ విక్రయాలు, సరఫరాలు, డ్రగ్స్ నిందితులపై చర్చించారు.. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాట్లతోపాటు.. డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమంపైనా చర్చ నడిచింది.. వీటితో శాఖలో తాజా ట్రాన్స్‌ఫర్లు, హరితహారంపైకూడా చర్చించామని అకున్‌ తెలిపారు.

సిమి ఎన్ కౌంటర్ కేసులో సుప్రీం నోటీసులు

ఢిల్లీ : సిమి ఎన్ కౌంటర్ కేసులో సుప్రీం నోటుసులు ఇచ్చింది. కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. సీబీ ఐ విచారణకు ఎందుకు అప్పగించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. గత ఏడాది భోపాల్ ఎన్ కౌంటర్ లో 8 మంది సిమి ఉగ్రవాదులు హతం అయ్యారు. జైలు నుంచి తప్పించుకుని పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేశారు.

13:08 - July 24, 2017

హైదరాబాద్ : సిట్‌ కార్యాలయంలో నవదీప్‌ విచారణ కొనసాగుతోంది. 10.30 గంటల నుంచి సిట్‌ అధికారులు నవదీప్‌ను విచారిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నవదీప్‌ కీలకంగా సిట్‌ భావిస్తోంది. నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. ఎవరెవరు ఈ పబ్‌కు వచ్చేవారు... ఏ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారనే అంశాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:06 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. అర్టికల్ 20, సబ్ సెక్షన్ 3కింద తన హక్కులకు భంగం కలుగుతోందంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్లడ్ శాంపిల్స్, ఇతర టెస్టులు చేయకూడదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. బలవంతంగా శాంపిల్స్ సేకరిస్తున్నారని చార్మి ఆరోపంచారు. అడ్వకేట్ ను ఉవెంటతీసకు వెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. విచారణపై ఎక్సైజ్ శాఖకు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ చార్మి కోరారు. విచారణలో వ్యక్తిగత వివరాలు అడగోద్దని ఆమె అన్నారు. చార్మి ఈ నెల 28 తేదీన విచారణ కోసం సిట్ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

కేటీఆర్ పుట్టిన రోజుశుభాకాంక్షలు తెలిపిన లోకేష్

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని లోకేష్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. 

12:42 - July 24, 2017

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. మూడురోజులపాటు కొనసాగబోయే ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ, త్రిపుర ముఖ్యమంత్రులు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, వివిధ రాష్ట్రాల కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలనుంచి తమ్మినేని వీరభద్రం, పి.మధు, పుణ్యవతి, ఎంఏ గఫూర్‌, వీరయ్య, చెరుపల్లి సీతారాములు పాల్గొంటున్నారు.. ఈ సమావేశాల్లో దేశంలో ప్రస్తుత పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. పూర్తి వివరాలు వీడియో చూడండి.

12:41 - July 24, 2017

హైదరాబాద్ :సిట్‌ కార్యాలయంలో నవదీప్‌ విచారణ కొనసాగుతోంది. 10.30 గంటల నుంచి సిట్‌ అధికారులు నవదీప్‌ను విచారిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌డేటాలో నవదీప్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నవదీప్‌ కీలకంగా సిట్‌ భావిస్తోంది. నవదీప్‌కు చెందిన బీపీఎం పబ్బులో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. డ్రగ్స్‌ ముఠాతో ఫోన్‌కాల్స్‌, ఫొటోలు, వీడియోల సాక్ష్యం ఆధారంగా నవదీప్‌ను సిట్‌ విచారిస్తున్నారు. ఎవరెవరు ఈ పబ్‌కు వచ్చేవారు... ఏ డ్రగ్స్‌ను కొనుగోలు చేశారనే అంశాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఎక్సైజ్ అధికారులతో ముగిసిన అకున్ బర్వాల్, చంద్రవదన్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో ఎక్సైజ్ అధికారులతో అకున్ సబర్వాల్, చంద్రవదన్ సమావేశం ముగిసింది. గుడుంబా పునరావాస కుటుంబాలకు రూ.72 కోట్లు విడదుల చేశారు. ఇప్పటి వరకు 3600 కుటుంబాలకు పునరావాసం కల్పించామన్నారు. హరితహారం, ఎక్సైజ్ శాఖ లో బదిలీలపై చర్చించామన్నారు. డ్రగ్స్ సంబంధిత వ్యవహారాలపై సాయంత్రం ఎక్సైజ్ కార్యాలయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

 

12:35 - July 24, 2017

అనంతపురం : జిల్లా లేపాక్షి మండలం పులమితి బసవనపల్లిలో చిరుత సంచరిస్తుంది. పొలానికి వెళ్లిన వ్యక్తిపై చిరుత దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:26 - July 24, 2017

అనంతపురం : జిల్లాలోఎస్ఎఫ్పై కదం తొక్కింది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలపై ఎస్ఎఫ్ఐ కలక్టరేట్ ముట్టడించింది. పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:25 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నటి చార్మి హైకోర్టును ఆశ్రయించింది. అర్టికల్ 20, సబ్ సెక్షన్ 3కింద తన హక్కులకు భంగం కలుగుతోందంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. బ్లడ్ శాంపిల్స్, ఇతర టెస్టులు చేయకూడదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. బలవంతంగా శాంపిల్స్ సేకరిస్తున్నారని చార్మి ఆరోపంచారు. అడ్వకేట్ ను ఉవెంటతీసకు వెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆమె కోర్టును కోరారు. విచారణపై ఎక్సైజ్ శాఖకు డైరెక్షన్స్ ఇవ్వాలంటూ చార్మి కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదంటూ కోర్టుకెక్కిన ఛార్మి

హైదరాబాద్: సినీ నటి ఛార్మి హైకోర్టును ఆశ్రయించింది. డ్రగ్స్ కేసులో బ్లడ్ శాంపిల్స్ సేకరణ సరికాదని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విచాణ తీరు సరిగా లేదని పిటిషన్ చార్మి పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం చార్మి పిటిషన్ విచారణకు రానుంది. డగ్స్ కేసులో ఈ నెల 26న సిట్ విచారణకు ఛార్మి హాజరు కానుంది.

 

రాజ్యసభలో పోలవరం అంశాన్ని ప్రస్తావించిన కేవీపీ

ఢిల్లీ : పోలవరం అంశాన్ని కేవీపీ ప్రస్థావించారు. 2014-15 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని సవరించాలని అని కేవీపీ ప్రశ్నించారు. మొత్తం ప్రాజెక్టు వ్యవయంలో సాగు, తాగునీరు, విద్యుత్పత్తి, పునరావాసం కోసం అయ్యే వ్యయ అంచనాలు తెలపాలని కేవీపీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం అన్ని విభాగాల పనులు  ఏ దశలో ఉన్నాయి? ఎప్పటి లోగా పోలవరం నిర్మాణ పనులు పూర్తవుతాయి అని కేవీపీ ప్రశి్నంచారు.

 

సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష

అమరావతి: ఏపీ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాలలో వైద్య సదుపాయాలు, 13 జిల్లల్లో వైద్య ఆరోగ్య శాఖ సమస్యలపై చర్చించినట్లు సమాచారం.

 

జిల్లా అధికారులతో చంద్రవదన్, అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : జిల్లా అధికారులతో చంద్రవదన్, అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరిత హారం, గుడుంబా నిర్మూలన, పునరావాసం, జీఈపీఆర్ ఎస్ పై సమీక్ష నిర్వహించారు.

 

విజయవాడలో విద్యా వాణి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: నగరంలో మున్సిపల్ స్కూళ్లలో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి. సీవీఆర్ స్కూల్ నుంచి విద్యా వాణి పథకాని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడలోని 28 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయి.

 

కేకే ను పరామర్శించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: నిమ్స్ లో చికిత్స పొందుతున్న కేకే ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కేకేను మంత్రులు కడియం, అలీ, ఈటెల కూడా పరామర్శించారు.

 

ప్రారంభమైన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ఈ సమావేశాలకు కేరళ, త్రిపుర సీఎంలు, పొలిట్ బ్యూరో సభ్యలు, వివిధ రాష్ట్రాల కేంద్ర కమిటీ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్ర కార్యదర్శలు హాజరయ్యారు.

 

11:31 - July 24, 2017

నెల్లూరు : జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురంలో దారుణం జరిగింది. ఓ తండ్రి కుమారుడి గొంతుకోసి తానూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. తండ్రి మృతి, బాలుడి పరిస్థితి విషయంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

మలయాళ నటుడు దిలీప్ కు మళ్లీ చుక్కెదురు

కేరళ : మలయాళ నటుడు దిలీప్ కు చుక్కెదురు అయ్యింది. బెయిల్ పిటిషన్ హైకోర్టు మళ్లీ తిరస్కరించింది. నటి భావన పై వేధింపుల కేసులో దిలీప్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అయిన విషం తెలిసిందే.

 

11:25 - July 24, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో వేచి చూస్తున్నారు. మురుగదాస్ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమాలో 'మహేష్ బాబు' నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'స్పైడర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్..టీజర్ విషయాల్లో కూడా లేట్ చేసిన సంగతి తెలిసిందే.

నెమ్మదిగా షూటింగ్ చేయడం వల్లే సినిమా విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఎగ్జయింట్ మ ఎంట్ ను చిత్ర బృందం అస్సలు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. జులైలో రావాల్సిన సినిమా ఆగస్టుకు వాయిదా పడడం..మళ్లీ సెప్టెంబర్ చివరి తేదీకి మార్చారని తెలుస్తోంది.

రెండు భాషల్లో విడుదలయ్యే ఈ సినిమా విడుదలపై తేదీపై క్లారిటీ రావడం లేదని టాక్. కానీ సెప్టెంబర్ 27వ తేదీన చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని..ఒక్క పాట కూడా పూర్తయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది.

'రకూల్' హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాలో 'మహేష్' రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. మరి సెప్టెంబర్ నెలలో వస్తాడా ? రాడా ? అనేది వెయిట్ అండ్ సీ..

11:24 - July 24, 2017

వరంగల్ : నగరంలోని మత్తు మాఫియాపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. టన్ టివి కథనాలతో వరంగల్ సీపీ సుధీర్ బాబు స్పందించారు. సీపీ మాఫియా కార్యకలాపాలపై నేరుగా రంగంలోకి దిగారు. డ్రగ్స్ అడ్డాలపై సమగ్ర ప్రణాళిక తో దాడికి సీపీ ముందుకు వెళ్తున్నారు. పోలీసులు అవేర్ నెస్, ఆపరేషన్, యాక్షన్ పద్ధతులను అమలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ ను అప్రమత్తం చేశామని సీపీ తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్ ష్టేషన్ల వద్ద నిఘా పెంచామని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:16 - July 24, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. మరుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. చిత్రం సెట్ పై ఉండగానే 'మహేష్' మరో సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో 'మహేష్' నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు ‘భరత్ అనే నేను’ టైటిల్ ను పెట్టారు.

రాజకీయ ప్రధానంగా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో 'మహేష్ బాబు' ముఖ్యమంత్రి పాత్రలో సందడి చేయనున్నాడని టాక్. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమ నేపథ్యంలో 'మహేష్'..ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ‘శ్రీమంతుడు' తరువాత 'మహేష్' - ‘కొరటాల' కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను 'మహేష్' జన్మదినమైన ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో 'మహేష్' సరసన 'కైరా అడ్వాణీ' హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా 'భరత్ అనే నేను' సినిమాను విడుదల చేయనున్నారు.

11:10 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని విచారణకు హాజరైన నవదీప్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకు చెందిన బీపీఎం పబ్బులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో బీపీఎం పబ్బుకు ఎవరెవరు వచ్చేవారు, ఏ డ్రగ్ ను కొనుగోలు చేశారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. కెల్విన్ తో పాటు నవదీప్ గోవాకు వెళ్లడంపై సిట్ ఆరా తీస్తుంది. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 2 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.

జవహర్ నగర్ లో ఇద్దరు నైజీరియన్లు అరెస్ట్

హైదరాబాద్: జవహర్ నగర్ లో ఇద్దరు నైజీరియన్లను పోలీసు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.2లక్షల నగదు, భారీగా గంజాయి, డ్రగ్స్ర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

11:00 - July 24, 2017

‘భానుమతి..ఒక్కటే పీస్..హైబ్రీడ్ పిల్ల' అనే డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ నటి 'సాయి పల్లవి'..ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు అధికంగా వినిపిస్తోంది. ‘శేఖర్ కమ్ముల' దర్శకత్వంలో 'వరుణ్ తేజ' హీరోగా వచ్చిన 'ఫిదా' చిత్రంలో 'సాయి పల్లవి' హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిజామాబాద్ అమ్మాయిగా నటించింది. తెలుగు రాకపోయినా తెలంగాణ యాసలో మాట్లాడి అదరగొట్టింది. ఒక్క సినిమా ద్వారా స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ మరో ఛాన్స్ కొట్టేసినట్లు టాలీవుడ్ టాక్.

అద్భుత‌మైన అభిన‌యం.. క‌ట్టిప‌డేసే చూపుల‌తో మాయ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ‌ను తమ సినిమాల్లోకి తీసుకోవాలని పలువురు దర్శక..నిర్మాతలు ఆలోచిస్తున్నారంట. అందులో భాగంగా 'శర్వానంద్' హీరోగా రూపొందబోయే సినిమాలో ఆమెను నటింపచేయనున్నారని వార్తలు వస్తున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమాలో 'శర్వానంద్'..'సాయి పల్లవి' కాంబినేషన్ బాగుంటుందని దర్శకుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'శర్వానంద్' హీరోగా 'మహానుభావుడు' చిత్రం రూపొందుతోంది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు టాక్. ఈ సినిమా అనంతరం సుధీర్ వర్మ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

మరి 'శర్వానంద్' సరసన 'సాయి పల్లవి' నటిస్తుందా ? లేదా అనేది చిత్ర బృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

హైదరాబాద్ లో కొనసాగుతున్న డ్రగ్స్ సరఫరా

హైదరాబాద్: సిట్ విచారణ ఎదుకొన్న డ్రగ్స్ దందా కోరులు పూరీ, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్, సిట్ విచారణ ఎదుర్కొంటున నవదీప్ డ్రగ్స్ దందా కోరుల్లో పశ్చాత్తాపం కపడటం లేదు. హైదరాబాద్ లో ఇప్పటికీ డ్రగ్స్ సరఫరా కొనసాగుతోంది. ఏడాది క్రితమే బీపీఎం పబ్ ను నవదీప్ ప్రారంభించాడు. నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ లో డ్రగ్స్ దందా తీవ్ర స్థాయిలో ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. నవదీప్ డ్రగ్స్ దందాపై పక్కా సమాచారం సేకరించి సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

 

కుమారుడి గొంతు కోసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

నెల్లూరు : ముత్తుకూరు మండలం గోపాలపురంలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి గొంతు కోసిన తండ్రి ఆత్మహత్య  చేసుకున్నాడు. బాలుడి పరిస్థితి విషయంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

10:51 - July 24, 2017

బాలీవుడ్ అలనాటి నటుడు 'రిషీ కపూర్' దర్శకుడు అనురాగ్ బసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రణ్ బీర్ కపూర్' హీరోగా నటించిన 'జగ్గా జాసూస్'ను 'అనురాగ్ బసు' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంపై సోషల్ మాధ్యమాల్లో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా విషయంపై 'రిషీ కపూర్' తాజాగా స్పందించారు.

‘అనురాగ్' కు అసలు బాధ్యత లేదని..విడుదలకంటే ఒక్క రోజు ముందు కూడా సినిమాలో పలు మార్పులు చేశారని..ఇలా ఏ దర్శకుడైనా చేస్తాడా అంటూ 'రిషీ కపూర్' మండిపడడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో ప్రముఖ నటుడు 'గోవిందా'తో ఓ సన్నివేశం ఉందని..కానీ ఆ తరువాత ఆ సన్నివేశాన్ని కట్ చేశారని పేర్కొన్నారు. అలాంటప్పుడు అతనిని సినిమాలో తీసుకోవడం ఎందుకని ఘాటుగా ప్రశ్నించారు.

సినిమాను అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేదని..రెండేళ్ల క్రితమే చిత్రం విడుదల కావాల్సి ఉందన్నారు. ఈ సినిమాకు తన అబ్బాయి 'రణ్ వీర్ కపూర్' సిని నిర్మాతగా వ్యవహించాడని..దర్శకుడు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే ఎవరూ అతనితో పనిచేయాలని అనుకోరని స్పష్టం చేశారు.

‘రిషీ కపూర్' చేసిన కామెంట్స్ పై 'అనురాగ్ బసు' ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాక సమీక్ష

భద్రాద్రి: ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాక సమీక్ష నిర్వహించింది. ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై అధికారులతో మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, కలెక్టర్, మలేరియా నిర్మూలన జేడీ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

 

10:31 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల నోటీసులు అందుకున్న నటుడు నవదీప్ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. ఈ రోజు విచారణలో నవదీప్ కు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై విచారించనున్నారు. గతంలో డ్రగ్స్ ముఠాతో మాట్లాడిన ఫోన్ కాల్స్, ఫోటోలు, వీడియోల సాక్ష్యంతో సిట్ నవదీప్ ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

10:30 - July 24, 2017

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. పోలీసులు జవహర్ నగర్ ఓ ఇంట్లో ఇద్దరు నైజీరియన్ల అరెస్ట్ చేశారు. ఇద్దరితో పాటు విజయవాడు చెందిన ఓ అమ్మాయి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరి దగ్గర రూ.2లక్షల నగదు, భారీగా గంజాయి, డ్రగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:19 - July 24, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలోని గరగపర్రులో దళితుల బహిష్కరణ వాస్తమే అని డీఎస్పీ మురళీకృష్ణ తేల్చారు. ఆయన ఏలూరు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. చార్జ్ షీట్ లో ఇందూకురి బలరామకృష్ణరాజు, ముసునూరు రామారాజు, గొట్టిగొప్పల శ్రీనివాస్ లు దళితులను బహిష్కరించినట్లు మురళీకృష్ణ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకోనున్న నవదీప్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నవదీప్ కాసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకోనున్నారు. సిట్ అధికారులు డ్రగ్స్  రాకెట్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టనున్నారు. నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. కెల్విన్, ఈవెంట్ ఆర్గనైజర్ బ్రిన్డన్ బేర్ తో నవదీప్ కి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నట్లు సమాచారం.

 

నీరు-ప్రగతి పురోగతి ప సీఎం టెలీ కాన్ఫరెన్స్

అమరావతి: నీరు-ప్రగతి పురోగతి ప సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ గ్రామాలు దేశానికే ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్, సిమెంట్ రహదారులతో గ్రామాలు స్వయం పోషకం కావాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పంటకుంటలు, చెక్ డ్యాంలతో ప్రతి గ్రామం కళకళలాడాలన్నారు. ప్రతి కుటుంబం నెలకు కనీస రాబడి రూ.10వేలు ఉండాలని, నిధుల సద్వినియోగంతో అనుకున్న ఫలితాలు సాధించాలన్నారు.

10:08 - July 24, 2017

హైదరాబాద్ : కాసేపట్లో సిట్ ఐదవ రోజు సిట్ విచారణ ప్రారంభం కానుంది. 10.30 గంటలకు సిట్ నవదీప్ ను విచారించనుంది. సిట్ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలోర నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్నారు. అధికారులు పక్కాగా ఆధారాల ప్రకారం విచారణ చేయనున్నారు. అటు క్లబ్బులు, పబ్బులు, కొరియర్ సంస్థలపై అధికారులు నిఘా పెడుతున్నారు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

పోలీసుల దిగ్భంధంలో కిర్లంపూడి

తూ.గో: 26న ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో జిల్లాలో టెన్షన్ నెలకొంది. అన్ని మండల కేంద్రాలో్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కిర్లంపూరడి పోలీసుల దిగ్భంధంలో ఉంది. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. అంతే కాకుండా ముద్రగడ ఇంటి వద్ద మీడియా ఆంక్షలు పెట్టింది. కాపు నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాబూల్ లో ఆత్మాహుతి దాడి:22 మంది మరణం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ముష్కరులు కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఘటనను అఫ్గాన్‌ హోంమంత్రిత్వ శాఖ నజీబ్‌ దానిశ్‌ ధ్రువీకరించారు.

 

నేటి నుండి గ్రూప్-1 ఇంటర్య్వులు

హైదరాబాద్ : గ్రూప్1-2011 ఇంటర్వ్యూలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఏయే తేదీల్లో హాజరుకావాలనే వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టారు. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తమ పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్స్ ఆప్షన్లను ఆగస్టు 5వ తేదీలోగా నమోదుచేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

 

ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం పై కాల్పులు

 హైదరాబాద్: జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జోర్డాన్‌కి చెందిన ఇద్దరు పౌరులు మృతిచెందగా ఇజ్రాయెల్‌కి చెందిన ఓవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులు ఇద్దరూ కార్యాలయంలో పనిచేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు జోర్డాన్‌ మీడియా పేర్కొంది.

 

09:21 - July 24, 2017

తూర్పు గోదావరి : ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్ని మండల కేంద్రాల్లో పోలీసులు పికెట్ లు నిర్వహిస్తున్నారు. కిర్లంపూడి పోలీసుల దిగ్భంధనంలోకి వెళ్లింది. ఆధార్ కార్డు చూపిస్తేనే పోలీసులు గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ముద్రగడ ఇంటి వద్ద పోలీసులు వీడియా పై ఆంక్షాలు విధించారు. జిల్లాలోని కాపు నేతల ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

09:12 - July 24, 2017

విజయవాడ : వారం క్రితం బీసెంట్ రోడ్డులో బంగారు నగల తయారీషాపులో కత్తులు, తుపాకీతో బెందిరి 5కిలోల బంగారంతో పరైనా మహారాష్ట్ర దొంగ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రత్యేక బలగాలతో గాలింపు చేపట్టి, 2రోజుల క్రితమే అరెస్ట్ చేసినట్టు సమాచారం. నిందితుల వద్ద నుంచి దోపిడీ చేసిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నింధితులను మధ్యాహ్నం మీడియా ముందు హాజరుపరుచనున్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

09:05 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు హీరో నవదీప్ ను సిట్ విచారించనుంది. అబ్కారీ కార్యలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. సిట్ డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. అయితే సిట్ విచారణలో నవదీప్ నిజాలు చెబుతాడా లేదా అనేది చూడాలి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

08:48 - July 24, 2017

బెంగూళురు : ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ ఉడిపి రామచంద్రరావు ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఏడాదిగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 1932 మార్చిన 10న కర్నాటకలోని ఆడమారులో జన్మించారు. భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. 1984-1994 మధ్య ఇస్రోకు ఆయన చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సతీష్‌ ధావన్ తర్వాత పదేళ్ల పాటు ఇస్రోకు చైర్మన్‌గా వ్యవహరించింది రావు మాత్రమే. పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల రూపకల్పనలో రావు భాగస్వామ్యం ఉంది. రిటైర్డ్ అయిన తరువాత కూడా.. మామ్‌ మిషన్‌ కోసం ఇస్రోతో కలసి ఆయన పనిచేశారు. యూ.ఆర్.రావు అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్‌ అవార్డుతో సంత్కరించింది. అంతకుముందు 1976లో ఆయన పద్మభూషణ్ అందుకున్నారు. వీటితో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం యూ.ఆర్‌. రావు అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లాబోరేటరీ పరిపాలనా విభాగ చైర్మన్‌గానూ, తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకు చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.

08:47 - July 24, 2017

వరంగల్ : మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి మహిళలు ధర్నా చేపట్టారు. మూడురోజుల క్రితం ఖిలా వరంగల్‌కు చెందిన జంపన్న, సుగుణల కుమార్తెపై అదే కాలనీకి చెందిన అరుణ్‌ అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితునిపై చర్యలు తీసుకోకపోవడంతో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితుడు అరుణ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్‌ చేసింది.

08:46 - July 24, 2017

నంద్యాల : వైసీపీ అధినేత జగన్‌పై.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటిస్తున్న చంద్రబాబు... ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి జగన్‌ అడ్డుపడుతున్నారన్నారు. రాజకీయ సంప్రదాయాలు, నైతికతకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యతిస్తుందని.... వైసీపీ సంప్రదాయానికి విలువ ఇవ్వకుండా.. నంద్యాల ఉప ఎన్నికలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలపై పోటీ పెడుతుందని విమర్శించారు. ఇలాంటి పార్టీకి ఉప ఎన్నికలో తగిన బుద్ది చెప్పాలన్నారు ఆయన అన్నారు.

విజయవాడ బంగారం దొంగల అరెస్ట్

విజయవాడ : నగరంలరోని బంగారు నగల తయారీషాపు డోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నింధితులను మధ్యాహ్నం మీడియా ముందు హాజరుపరుచనున్నారు. 

08:38 - July 24, 2017

విజయవాడ : నగరంలరోని బంగారు నగల తయారీషాపు డోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నింధితులను మధ్యాహ్నం మీడియా ముందు హాజరుపరుచనున్నారు. వారం క్రితం బీసెంట్ రోడ్డులో కత్తులు, తుపాకీతో బెందిరి 5కిలోల బంగారంతో మహారాష్ట్ర ముఠా పరారైన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

నేడు నవదీప్ వంతు

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు హీరో నవదీప్ ను సిట్ విచారించనుంది. అబ్కారీ కార్యలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. సిట్ డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది.

08:08 - July 24, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు హీరో నవదీప్ ను సిట్ విచారించనుంది. అబ్కారీ కార్యలయంలో ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. సిట్ డ్రగ్స్ వ్యవహారంలో నవదీప్ కు ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

07:24 - July 24, 2017

శివసేన బీజేపీకి సహజ మిత్రపక్షామని, అన్నిరాష్ట్రాల్లో బీజేపీ ఎదోవిధంగా అధికారం చేజెక్కించుకోవాలని చూస్తుందని, నోట్ల రద్దు తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజరిందని, ఇది దేశాన్ని ఆందోళన కలిగించే విషయామని, కాగ్ నివేదికలో కూడా భారత రక్షణ వ్యవస్థ బాగాలేదని తెలిపిందని, ప్రణబ్ ముఖర్జీ అర్డినెన్స్ పదే పదే చేయడం మంచి కాదని చెప్పడాని ప్రముఖ విశ్లేషకులు ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శివసేన మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉంది, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు విడిగా పోటీ చేసి బీజేపీ మెజార్టీ సీట్లు గెలించిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. రైతులకు రుణా మాఫీ చేశామని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న మాట వాస్తవం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

నేడు డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్న ఏపీ సీఎం

 

విజయవాడ : నగరంలోని మున్సిపాల్ స్కూల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజిటల్ క్లాసులు ప్రారంభించనున్నారు.

నేటి గ్రూప్ 1 అభ్యర్థులకు ఇంటర్వ్యూలు

హైదరాబాద్ : నేటి నుంచి గ్రూప్ 1 అభ్యర్థులకు టీఎస్ పీఎస్పీ ఇంటరర్వ్యూలు నిర్వహించనుంది. పోస్టులకు అప్షన్లు ఇవ్వలంటూ టీఎస్ పీఎస్పీ సూచిందింది.

నేటితో ముగియనున్న రాష్ట్రపతి పదవి కాలం

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం నేటితో ముగియనుంది. రేపు కొత్త రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నేడు తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యం

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా బయల్దేరనుంది. ఉదయం 6.25గంటలకు బదులు ఉదయం 8గంటలకు వెళ్లుతుంది.

07:00 - July 24, 2017

లండన్ : లార్డ్స్‌ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. భారత్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల ఛేదనలో భారత్‌ బ్యాట్స్‌ఉమెన్లు పూనమ్‌రౌత్‌, హర్మన్‌ప్రీత్‌లు హాఫ్‌ సెంచరీలు చేసినా... ఆఖరి ఏడు వికెట్లు 28 పరుగుల తేడాతో కుప్పకూలడంతో భారత్‌ ఓటమి పాలైంది. దీంతో నాలుగోసారి ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. భారత్‌ రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌... నటాలీ సీపర్‌, సారా టేలర్‌ రాణించడంతో 228 పరుగులు చేసింది.

చేతులెత్తిసిన భారత్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ స్మృతి మంధానా ఖాతా తెరవకుండానే వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మరో వికెట్‌ చేజారకుండా ఆడేందుకు ప్రయత్నించారు. కానీ... మిథాలీ అనూహ్యంగా రనౌట్‌ కావడంతో రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత పూనమ్‌ రౌత్‌, హర్మన్‌ప్రీత్‌ల భాగస్వామ్యం మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చివేసింది. మంచి ఊపు మీదున్న కౌర్‌... మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో క్యాచ్‌ అవుట్‌ అయ్యింది. దీంతో మూడో వికెట్‌ భాగస్వామ్యానికి 95 పరుగులు చేశారు. అనంతరం పూనమ్‌ రౌత్‌ ఒంటరిపోరాటం చేసింది. 86 పరుగులతో వీరవిహారం చేసిన ఓపెనర్‌ రౌత్‌ 4వ వికెట్‌గా వెనుదిరిగిన తర్వాత టీమిండియా పేకమేడలా కూలిపోయింది. ఇంగ్లండ్‌ రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్‌ చేయడంతో భారత్‌ ఒత్తిడిలో పడింది. చివరకు 18 బంతుల్లో 14 పరుగుల చేయాల్సి ఉండగా... భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ చేజార్చుకుంది. ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ ష్రబ్‌షోల్‌ ఏకంగా 6 వికెట్లు పగడొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇక భారత్‌ కప్‌ గెలవలేకపోయినా సిరీస్‌ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత మహిళలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ టీమిండియా ప్లేయర్లను అభినందించారు. ప్రపంచకప్‌ వేదికగా తమ సత్తా చాటారని కీర్తించారు. 

06:56 - July 24, 2017

శ్రీకాకుళం : నిత్యం పెరిగిపోతున్న క్రైంరేట్‌తో శాంతిభద్రతల నిర్వహణ పోలీస్‌లకు సవాల్‌గా మారింది. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక కేసుపనిలో హడావిడి పడే పోలీసన్నలకు శ్రీకాకుళం పోలీస్‌పెద్దలు ఉపశమనం కల్పించారు. వీక్లీఆఫ్‌లు ఇస్తూ.. కొత్త పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పెరిగిపోతున్న క్రైంరేట్‌ను తగ్గించడానికి జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ వినూత్న పంథాను అనుసరించారు. పోలీసుల సేవలు ప్రజలకు మరింత చేరువేయ్యేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. దీన్లో భాగంగా విపరీతమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్న జిల్లా పోలీసులకు ఉపశమనం కలిగించే విధంగా వీక్లీ ఆఫ్ లను ఇస్తూ .. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మొదటగా ఆర్మడ్ రిజర్వ్ పోలీసులకు ఈ వారాంతపు సెలవులు వర్తింపజేస్తున్నారు. తరువాత క్రమంగా అన్ని విభాగాల పోలీసులకు ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. ప్రతీ పోలీసు నెలలో నాలుగు రోజులు సెలవులు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని, వారి వ్యక్తిగత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఎస్పి అంటున్నారు.

పని భారాన్ని తగ్గించేవిధంగా
మరోవైపు పోలీసుల పై పని భారాన్ని తగ్గించేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ప్రజలు పోలీసుశాఖతో మమేకమయ్యే నూతన విధానాన్ని ఎస్పి ప్రారంభించారు. ఇటీవల జిల్లాలో పెరిగిపోతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యాప్ లో రిజిస్టర్ చేసుకున్న ప్రజలు.. ఇంటిని వదలి బయట ప్రాంతాలకు వెళ్ళే సమయం లో ఈ యాప్ లో ఆ వివరాలు ఉంచితే కెమెరాలతో వారి ఇళ్లపై నిఘా పెట్టె విధంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి జిల్లా పోలీస్ బాస్ తీసుకున్న నిర్ణయాలు.. అటు జిల్లా పోలీస్ సిబ్బంది లోనూ.. ప్రజలలోనూ ఆనందం నింపుతున్నాయి. ఈ నూతన విధానాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే.. జిల్లాలో క్రైం రేట్ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.  

06:55 - July 24, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని ఇచ్చాపురం సమీపంలో కంటైనర్ బోల్తాపడింది. ప్రమాద ఘటన విని.. అక్కడకు వచ్చిన స్థానికులకు కంటైనర్‌లో గోమాంసం బయటపడింది. గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆగ్రహంతో.. స్థానికులు కంటైనర్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కంటైనర్‌ పాక్షికంగా తగలపడి పోగా.. డ్రైవర్, క్లీనర్‌ పరారయ్యారు. 

06:53 - July 24, 2017

హైదరాబాద్ : ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం-ఆర్సీఈపీ పేరుతో ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేందుకు హైదరాబాద్‌లో జరుగుతున్న సమావేశాలకు వ్యతిరేకంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్లీనరీ నిర్వహించారు. వివిధ సామాజిక సంఘాలు, రైతు సంఘాలతో ఏర్పాటైన నోఆర్సీఈపీ వేదిక ఆధ్వర్యంలో ఈ ప్లీనరీ నిర్వహించారు. భారత్‌ నుంచే కాకుండా ఆసియాలోని వివిధ దేశాల నుండి పలువురు ప్రతినిధులు హాజరై... ఒప్పందాల్లోని ప్రమాదకరమైన అంశాలను వివరించారు. పలు రంగాలపై పడే దుష్ప్రభావాలను వెల్లడించారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశానికి ప్రమాదకరమం
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశానికి ప్రమాదకరమన్నారు అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి. ఈ ఒప్పందం వల్ల బహుళజాతి సంస్థలకు మన మార్కెట్‌లో తలుపులు తెరిచినట్లవుతుందన్నారు. విచ్చలవిడిగా వస్తున్న దిగుమతులతో మన ఉత్పత్తుల ధరలు తగ్గడమే కాకుండా విస్తీర్ణం పడిపోతుందన్నారు. ఈ ఒప్పందం అమలైతే మన దేశంలో రైతాంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఒప్పందాలను అడ్డుకునేందుకు పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరముందన్నారు.

విదేశాలకు మేలు
ఈ ఒప్పందం వల్ల విదేశాలకు మేలు జరుగుతుందన్నారు టీ-జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌. ప్రమాదకర ఒప్పందాలను పార్లమెంట్‌లో చర్చించకుండా... ప్రజలతో చర్చించకుండా మోదీ సర్కార్‌ సంతకాలు చేసేందుకు సిద్దమవుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని పాలకులను ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని... నిరసన తెలిపేందుకు వేదికలు కూడా లేకుండా కుట్రలు చేస్తున్నారు. మొత్తానికి హైటెక్స్‌లో ఆర్సీఈపీ సమావేశాలు జరుగుతుండగా... నగరంలో నో-ఆర్సీఈపీ వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్సీఈపీ కార్యక్రమాలు జరిగే అన్ని రోజుల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతామని వేదిక నిర్వాహకులు స్పష్టం చేశారు. 

06:52 - July 24, 2017

హైదరాబాద్ : జై సినిమాతో నవదీప్ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యాడు. గౌతమ్‌ SSC, చందమామ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా పరజయాలతో సతమతమయ్యాడు. హీరోగా అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలకూ ఓకే చెప్పేశాడు. సినీ నటుడు నవదీప్‌పై ఇప్పటికే పలు ఆరోపణలున్నాయి. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. అనుమతిలేని బోట్ షికారు నడపడటంతో పాటు..నగర శివార్లలో రేవ్‌ పార్టీలు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్.. ఆ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. డ్రగ్ సప్లయర్ కెల్విన్ నుంచి సినీ ఇండస్ట్రీలోని మాదక ద్రవ్యాల వాడకం దారులకు పబ్బుల నుంచే పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు. సినీ ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లలు సైతం నవదీప్ పబ్ కస్టమర్లని సిట్ అధికారులు వివరాలు సేకరించారు.

16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు గుర్తించారు
హైదరాబాద్‌లోని 16 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్టు అధికారులు గుర్తించారు. పలు పబ్బుల్లో డ్రగ్స్ తీసుకోవడానికే యూత్, విద్యార్థులు, సినీ ప్రముఖులు రెగ్యులర్‌గా వస్తుంటారని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, నవదీప్ కు చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ నైన్, వాటర్స్ పబ్, టెన్ డౌనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లిన్ పబ్స్ లోనూ డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్టు సిట్ గుర్తించింది. డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ సోమవారం సిట్ అధికారుల విచారణ ఎదుర్కోనున్నాడు.

నవదీప్ ఏం చెబుతాడో
ఇప్పటికే సిట్‌ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నటుడు నవదీప్‌.. త‌న‌కు డ్రగ్స్‌ ముఠాతో ఎలాంటి సంబందం లేదంటున్నాడు. కెల్విన్ త‌న పేరు చెప్పడం త‌న‌ను ఆశ్చర్యప‌రిచింద‌ని చెబుతున్నాడు. సిట్ విచార‌ణ‌లో అన్ని విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయంటున్నాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నట్లు తెలిపాడు. ఇప్పటికే నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో పలువురు వాడకం దారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న విషయం వెల్లడయినా వారికి కౌన్సిలింగ్ చేస్తారు. కాని డ్రగ్స్ సప్లయర్, అమ్మకం దారులుగా తేలిన వారికి 5 నుంచి పదేళ్ల వరకు శిక్షలున్నాయి. నవదీప్‌ విషయంలో ఏం జరుగుతుందో సిట్ విచారణ ముగిసిన తర్వాతగాని తెలియదు.

06:51 - July 24, 2017

హైదరాబాద్ : పబ్‌లలో తనకు భాగస్వామ్యం ఉందన్న వార్తల్లో నిజం లేదన్నారు హీరో తరుణ్‌. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్‌ చేశారాయన. దుష్ప్రచారాల వల్ల తనకూ, తన కుటుంబ సభ్యులకు చాలా బాధగా ఉందన్నారు. గతంలో కూడా తనపై చాలా రూమర్స్ వచ్చాయని, నిజాలు తెలుసుకోవాలన్నారు. విచారణలో సిట్‌ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని అన్నారు. త్వరలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్నారు తరుణ్‌.

06:50 - July 24, 2017

తెలంగాణ ఉద్యోగనియామకల ఎప్పుడు వివాదస్పదం అవుతున్నాయిని, కేంద్ర యూపీఎస్సీ తీసుకుంటే ఓ క్యాలెండర్ విధానాన్ని బట్టి నియామకలు చేస్తున్నారని రాష్ట్రంలో అలా లేదని రాజకీయం కోసం ఎప్పుడు పడితే అప్పుడు ప్రకటనలు చేయడం, ఓ అభ్యర్థి టీచర్ జాబ్ చేయలంటే 2సంవత్సరాలు చదువాలని, తర్వాత టెన్ రాయాలని, సరైన విధానంలేకుండా టీఎస్ పీఎస్పీ చేస్తుందని అడ్వకేట్ రమేష్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Don't Miss