Activities calendar

25 July 2017

శాంతిభద్రతల విఘాతానికే ముద్రగడ పాదయాత్ర : చినరాజప్ప

అమరావతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికే ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి చినరాజప్ప అన్నారు. జగన్ ఆడుతున్న నాటకంలో పాత్రధారి ముద్రగడ అని చెప్పారు. తన ఉనికి కాపాడుకోవడానికి 3 నెలలకోసారి డ్రామాలు అడుతున్నారని ఎద్దేవా చేశారు. 

21:53 - July 25, 2017

ఢిల్లీ : రైతుల ఆత్మహత్యలపై రాజ్యసభలో  విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సమయంలో రైతుల పెట్టుబడికన్న ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోది హామీ ఏమైందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ నిలదీశారు. మద్దతు ధరపై రమేష్‌ చంద్ర కమిటీ ఇచ్చిన నివేదికపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ తాత్సారం వల్ల 2014-15లో నేషనల్‌ క్రైం బ్యూరో రిపోర్ట్‌ నివేదిక ప్రకారం 42 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సహకార బ్యాంకులను బలోపేతం చేయాలని, రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని యూపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ  రుణమాఫీ చేశారని...మోది ఒక్క యూపీకే ప్రధాని కారని...దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ అమలు చేయాలని ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌ అన్నారు.

 

21:51 - July 25, 2017

ఢిల్లీ : ఏ దేశంతోనైనా యుద్ధమే గనక సంభవిస్తే 10 రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మనవద్ద లేదని కాగ్‌ ఇచ్చిన నివేదికపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. చైనా-పాకిస్తాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మనవద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరిపడా లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు రామ్‌గోపాల్‌ యాదవ్ అన్నారు. దీనిపై రక్షణమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ...ప్రస్తుతం భద్రతా దళాల వద్ద ఆయుధ సామాగ్రికి లోటు లేదని తెలిపారు. కాగ్‌ రిపోర్టు 2013కు సంబంధించిన అంశమని...ప్రస్తుతం ఆయుధాల కొనుగోలు సరళీకృతం చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. మూడేళ్లు మోది ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని కాంగ్రెస్‌ సభ్యులు ఆనంద్‌శర్మ విమర్శించారు.

 

21:48 - July 25, 2017

రంగారెడ్డి : జి‌ల్లాలోని కేశం పేట మండలం...మీనమోనిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది  ఓ అమ్మాయిపై కిరాతకంగా దాడి చేశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో.. శివకుమార్‌ అనే వ్యక్తి .. పొలంలో పని చేసుకుంటున్న సునీతను కత్తితో పొడిచాడు.  తీవ్ర గాయాలైన సునీతను బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సునీత డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా.. గత ఏడాది నుంచి శివకుమార్‌.. సునీతను వేధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు.

 

21:47 - July 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్ కమీషన్ల మినిస్టర్‌గా మారారని కాంగ్రెస్‌ ఎంపీ జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు శాఖ కోసం హిమాంషు మోటార్స్‌ నుంచి కొనుగోలు చేసిన వాహనాల అంశాన్ని జైరామ్‌ ప్రస్తావించారు. ఈ కంపెనీ మంత్రి కేటీఆర్‌దేనని ఆరోపించారు. జైరామ్‌ రమేశ్‌ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే పోలీసు శాఖకు వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. యూపీఏ హయాంలో ఈ ధరలు నిర్ణయించిన కమిటీల్లో జైరామ్‌ రమేశ్‌ కూడా  సభ్యుడుగా ఉన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. 

 

21:45 - July 25, 2017

హైదరాబాద్ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజా ప్రతిఘటన వేదిక సమావేశాలు నాలుగో రోజు కొనసాగాయి. వేదిక ఆధ్వర్యంలో నేడు ప్రజా సర్వీసులు -కార్పొరేట్‌ శక్తులు, బహుళ జాతి సంస్థలు- ఈ కామర్స్, మత్స్య పరిశ్రమ - వాణిజ్యం అనే అంశాలపై ప్యానెల్‌ డిస్కషన్లు జరిగాయి. స్వేచ్ఛా వాణిజ్య  ఒప్పందాల నుంచి భారత్‌  వైదొలగాలని, ఆ ఒప్పంద పత్రాలను పార్లమెంటు  ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

 

21:40 - July 25, 2017

ప్రకాశం : ఈనెల 29న చలో దేవరపల్లి కార్యక్రమానికి సీపీఎం పిలుపు ఇచ్చింది. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితులు భూములను  భూస్వాములు దురాక్రమణ చేశారు. చెట్టు-నీరు కార్యక్రమంలో కింద చెరువులు తవ్వారు. దీంతో దళితులు ఉపాధి కోల్పోయారు. దేవరపల్లి భూఆక్రమణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన సీపీఎం, ప్రజా సంఘాల  నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దురాక్రమణకు గురైన దళితుల భూములను తిరిగి ఇప్పించేందుకు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆధ్వర్యంలో చలో దేవరపల్లి కార్యక్రమానికి  పార్టీ నాయకత్వం పిలుపు ఇచ్చింది. 

 

21:34 - July 25, 2017
21:33 - July 25, 2017
21:31 - July 25, 2017
21:28 - July 25, 2017
21:03 - July 25, 2017

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది.. ఇది సినిమా డైలాగ్ కాదు.. నిజం. ఒకవైపు అసహనం....మరోవైపు హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు. ఇదో కీలక సమయం. ఈ సమయంలో బాధ్యతలు చేపట్టిన కోవింద్ ముందున్న సవాళ్లేంటీ..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:50 - July 25, 2017

కొత్తరాష్ట్రపతి కొలువెక్కిన కోవింద్...పార్లమెంట్ హాలుల పసందైన విందు, హన్మంతరావును అడ్డుకున్న ఖాకీలు... బాబు తీర్చాల్నంట తీస్కున్న బాకీలు, మాతాశిశు మరణాలకు డాక్టర్ల హోమం...గాంధీదావాఖాన్ల గమ్మత్తైన సిబ్బంది, వీవో, ఒప్పో పోన్ల బోర్డులు మీద దాడి..చైనా బడార్ల చూపెట్టుర్రి తమ్మి మీ వాడి, లీడర్లకు ఓట్లు దేవుండ్లకు కోరికలు... కొడుమూరు కాడ బాల భక్తుల కథ,  మన్షిలెక్క శ్వాస దీస్కుంటున్న సమాధి.. మానుకోట జిల్లా కేసముద్రం కాడ గమ్మతి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:44 - July 25, 2017

కాపు రిజర్వేషన్లపై ముద్రగడ సద్మనాభం చేపట్టిన పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాపు జేఏసీ నేత నరహరి శెట్టి నరసింహారావు, సిద్ధార్థ లా కాలేజీ ప్రిన్సిపల్ దివాకర్ రావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ్య పాల్గొని, మాట్లాడారు. ఇది అప్రజాస్వామికం పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు, ధర్నాలు, ఆందోళనలు చేసే హక్కు ప్రజలకు ఉంటుందని తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కాపు రిజర్వేషన్లపై పావులు కదుపుతోన్న ప్రభుత్వం

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పావులు కదుపుతోంది. కాపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మంజునాథ్‌ కమిషన్‌కు లేఖ రాయడంతో పాటు.. కుల ధృవీకరణ పత్రాల జారీకి అనుమతిస్తూ.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుల ధృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని.. తహశీల్దార్లకు కట్టబెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కుల ధృవీకరణతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. 

20:36 - July 25, 2017

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం పావులు కదుపుతోంది. కాపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మంజునాథ్‌ కమిషన్‌కు లేఖ రాయడంతో పాటు.. కుల ధృవీకరణ పత్రాల జారీకి అనుమతిస్తూ.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కుల ధృవీకరణ పత్రాల జారీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది. కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారాన్ని.. తహశీల్దార్లకు కట్టబెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కుల ధృవీకరణతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయనున్నారు. 

 

20:31 - July 25, 2017

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమయ్యారు. పోలీసులు అనుమతి లేకపోయినా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరతానని భీష్మిస్తున్నారు. దీంతో కిర్లంపూడిని పోలీసులు దిగ్బంధించారు. 5వేల మంది పోలీసులతో పాటు ఆర్ ఏఎఫ్ దళాలను అడుగడునా మోహరించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లేందుకు ఆంక్షలు విధించారు. మరోవైపు అనుమతి లేకుండా ఎవరు పాదయాత్ర చేసినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఏపీడీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. 

 

20:27 - July 25, 2017
20:19 - July 25, 2017

ఆదిలాబాద్ : అవి గిరిజన పల్లెలు. పచ్చని చేలు.. జల జల జారే జలపాతాలు.. అందమైన అడవి.. స్వచ్ఛమైన సంస్కృతికి నిలువెత్తు రూపాలు. వాళ్లకు మోసపోవడం తప్ప, మోసం చేయడం అంటే ఏంటో తెలీదు. వ్యవసాయం, అడవి తల్లే జీవనాధారంగా తరతరాల సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం ఓపెన్‌ కాస్ట్‌ పేరుతో.. గిరి పుత్రుల జీవితాలలో అలజడిని, అశాంతిని రాజేస్తున్నాయి. దీనిపై 10టీవీ ప్రత్యేక కథనం. 
ఓపెన్‌ కాస్ట్‌తో కనిపించకుండాపోనున్న సోనాపూర్ 
సోనాపూర్‌.. ఈ గిరిజన పల్లె మరి కొన్నేళ్లలో మనకు కనపించకుండా పోనుంది. గిరిజనులు చెట్టుకొకరు, పుట్టకొకరు చీలిపోయే దీన పరిస్థితి దాపరించబోతోంది. బెల్లంపల్లి ఓపెన్‌ కాస్ట్‌తో ఇక్కడి గిరిజన సంప్రదాయం కనుమరుగు కానుంది. గిరిజనుల రక్షణ కోసం, వారి బతుకులను, సంస్కృతిని కాపాడేందుకు ఎన్నో షెడ్యూళ్లు, చట్టాలు, క్లాజులు, జీవోలు ఉన్నా.. సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వాలు, పార్టీలకు ఇవేమీ కనిపించడం లేదు.  
బలవంతంగా భూ సేకరణ 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, ప్రస్తుత ఆసిఫాబాద్‌ జిల్లాలోని సోనాపూర్‌లో.. ఓపెన్ కాస్ట్‌ పేరుతో మైనింగ్ చేస్తున్నారు. గిరిజనులు రక్షణ కోసం రాజ్యాంగంలో 5, 6 షెడ్యూళ్లు, 1/70 చట్టం, 2013 భూ సేకరణ చట్టం, 34 జీవో, 2005 అటవీ హక్కుల చట్టం, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌ వంటివి ఉన్నా వీటన్నింటినీ కాదని బలవంతపు భూ సేకరణ ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం గిరిజనులను పోలీసులు, నిర్భందాలు, అబద్దపు ప్రచారాలతో భయపెట్టాలని చూస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం గిరిజన గ్రామాల్లో ఏ ప్రాజెక్ట్‌ అయినా ఏర్పాటు చేయాలంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేయించి గిరిజనులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలి. 
గిరిజన సంస్కృతిని నాశనం చేస్తున్నారు 
ఆదిలాబాద్ జిల్లా, బొగ్గు ఖనిజాలకు పుట్టినిల్లు. భూ గర్భంలోని బొగ్గును వెలికి తీయడానికి ఓపెన్‌ కాస్ట్‌లే పరిష్కారం కాదు. గతంలోనూ మనుషులను ఉపయోగించి అండర్‌ గ్రౌండ్‌ సిస్టం ద్వారా బొగ్గును వెలికి తీశారు. ఇదే అసలు మొదటి పద్ధతి. బొగ్గును తీసిన బావులే భూగర్భగనుల వలన ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. గ్రామాలను ఖాళీ చేయించడం, అడవులను, వ్యవసాయాన్ని నాశనం చేయడం, గిరిజన సంస్కృతిని నాశనం చేయడం, పర్యావరణం వంటి సమస్యలు లేకుండానే బొగ్గును వెలికి తీయవచ్చు. 
సీఎంపై మండిపడుతున్న గిరిజన సంఘాలు 
ప్రజలకు నష్టం జరిగేలా యాజమాన్యం పాలకుల వ్యవహార శైలి ఉంది. యంత్రాలు ఉపయోగించి, బహుళ జాతి సంస్థల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఓపెన్‌ కాస్ట్‌ను  ఉపయోగించుకున్నాయి. తెలంగాణ పోరాట సమయంలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌ వద్దని, గిరిజన బతుకులు నాశనమవుతున్నాయని, భూ సేకరణ కూడా చట్ట విరుద్ధంగా జరుగుతోందని చెప్పారు. తెలంగాణ వచ్చి అధికారం వచ్చాక రూట్‌ మార్చారు. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా కేసీఆర్‌ పాలన ఉందని, గిరిజన వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

 

20:14 - July 25, 2017

హైదరాబాద్ : పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 300 క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ క్యాంటీన్లను ప్రారంభించనుంది. 
ఐదు రూపాయలకే భోజన సదుపాయం
పేదవాడికి తక్కువ ధరకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఐదు రూపాయలకే ఆహారాన్ని అందించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం తమిళనాడులో అమలవుతోన్న అమ్మ క్యాంటీన్లను మంత్రులు పరిశీలించారు. అదే తరహాలో గత ఏడాది రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో క్యాంటీన్‌ను ప్రారంబించారు. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో తుళ్లూరు సచివాలయం ప్రాంతంలోనూ రెండు క్యాంటీన్లను ప్రారంభించారు. 
పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటి వరకూ  పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు జోరందుకున్నాయి. దీంతో క్యాంటీన్ల ఏర్పాటు విషయమై  ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో మంత్రులతో చర్చించారు. మంత్రులు, ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. మొదటి విడతగా 200 క్యాంటీన్ల ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మొత్తం 14 నగర పాలక సంస్థలు, రెండు జిల్లా కేంద్రాలు, ఒక పురపాలక పట్టణంలో అక్టోబర్‌ రెండున ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. 
క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలాలను పరిశీలిస్తున్న అధికారులు
రాజధాని పరిధిలోని మంగళగిరి, విజయవాడ, నంద్యాల పట్టణంలో ఈ నెల 26న అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతంలో స్థలాలను పరిశీలించి అక్కడ కూడా సాధ్యమైనంత త్వరగా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
అన్న క్యాంటీన్‌ ఫౌండేషన్‌ ఏర్పాటుకు సీఎం ఆదేశం
అన్న క్యాంటీన్‌ ఫౌండేషన్‌ పేరుతో ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమల నిత్యాన్నదానం తరహాలో దాతల నుండి విరాళాలు సేకరించి అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు భోజనం పెట్టాలని నిర్ణయించారు. పౌరసరఫరాలు, పురపాలక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇస్కాన్‌, అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్న క్యాంటీన్లను నిర్వహించాలని సీఎం సూచించారు. దీనికోసం పురపాలక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 
ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ పద్దతిలో క్యాంటీన్ల ఏర్పాటు 
ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతిలో ఆకర్శణీయంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. పూర్తి శుభ్రమైన వాతావరణంలో క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి క్యాంటీన్‌లో నాణ్యత గల ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో దీనికోసం సెంట్రలైజ్‌ కిచెన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్యాంటీన్ల నిర్వహణలో భాగస్వామ్యం తీసుకుంటున్న అక్షయపాత్ర సంస్థలకు ఆరు జిల్లాలు, ఇస్కాన్‌కు రెండు జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్యాంటీన్ల ఏర్పాటు నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వ కార్యదర్శులు రాజశేఖర్‌, కరికాల వలవన్‌, పురపాలక శాఖ డైరెక్టర్‌ కన్న బాబులతో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 
ఒక్కో క్యాంటీన్లో 350 మంది భోజనం చేసేలా వీలు
అన్న క్యాంటీన్‌లో భోజనం మెనూను కూడా దాదాపుగా ఖరారు చేశారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, సాంబార్‌, చట్నీ, అలాగే మధ్యాహ్న భోజనంలో అన్నం, కూర, చట్ని, సాంబార్‌, మజ్జిగ అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 350 మంది భోజనం చేసేలా వీలుంటుంది. యాభై వేల జనాభా ఉన్న ప్రాంతానికి రెండు క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో రెండు వందల కోట్లు ఈ క్యాంటీన్ల నిర్వహణకు కేటాయించారు. ప్రి ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణాలకు యాభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అన్న క్యాంటీన్‌ నిర్వహణ ద్వారా ఒక్కో వ్యక్తికి సంవత్సారానికి పదహారువేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ నెల ఇరవై ఆరున మూడు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుండగా, వాటిలో ఒకటి నంద్యాలలో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలకు అనేక వరాలు కురిపిస్తున్న చంద్రబాబు, తాజాగా అన్న క్యాంటీన్‌ పథకాన్నీ ఈ నియోజకవర్గానికి విస్తరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

20:07 - July 25, 2017

విశాఖ : మన్యంలో విషజ్వరాల బారినపడి అల్లాడుతున్న గిరిజనులను ఆదుకునేందుకు సీపీఎం ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సపొందుతూ అన్నంలేక  అల్లాడుతున్న రోగుల ఆకలి తీర్చేందుకు విరాళాలు సేకరిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియాలో చూద్దాం..

 

20:00 - July 25, 2017

హైదరాబాద్ : హైకోర్టులో చార్మి వేసిన పిటిషన్‌లో మూడు అంశాలలో మాత్రమే హైకోర్టులో ఊరట లభించిందని చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్దన్‌ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో మాట్లాడారు. డ్రగ్స్‌ కేసులో చార్మి కేవలం విట్‌నెస్‌గానే హజరవుతుందని చెప్పారు. చార్మికి అనుకూలంగా ఉండే ప్రదేశంలోనే విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. విచారణ సమయంలో అడ్వకేట్‌కు అనుమతి లభించలేదన్నారు. 

 

19:52 - July 25, 2017

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనైతికంగా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వీ హనుమంతరావు ఆరోపించారు. రాజమండ్రి వెళ్తున్న తనను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకుని విజయవాడ తరలించి, ఇక్కడ నుంచి హైదరాబాద్‌ పంపే ఏర్పాట్లు చేయడాన్ని వీహెచ్‌ తప్పుపట్టారు. విజయవాడ నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తే హోటల్‌ భవనం పై నుంచి కిందకు దూకుతానని హెచ్చరించారు. 

 

19:46 - July 25, 2017

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎంపీడీవో

మహబూబాబాద్ : రూ.25 వేలు లంచం తీసుకుంటూ నర్సింహులపేట ఎంపీడీవో ఉపేందర్ ఏసీబీకి పట్టుబట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియమాకం కోసం లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. 

 

టీ.విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఢిల్లీ : తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో ఎంపీలు, జీహెచ్ ఈఎల్ చైర్మన్ అతుల్ సోక్తి పాల్గొన్నారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని తెలిపారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహెచ్ ఈఎల్ వేగం పెంచాలన్నారు.

 

19:29 - July 25, 2017

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమయ్యారు. పోలీసుల అనుమతి లేకపోయినా పాదయాత్రకు బయల్దేరతానని చెబుతున్నారు. తన సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు 116 గ్రామాల ద్వారా పాదయాత్రకు ముద్రగడ ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో కిర్లంపూడిని పోలీసులు దిగ్బంధించారు. కిర్లంపూడిలో ఆర్‌ఏఎఫ్‌ దళాలు, పోలీసు బలగాలు మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

19:21 - July 25, 2017

వరంగల్ : విద్యా బోధన మెరుగుపరచాలని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని వైస్‌ చాన్సలర్‌ సాయన్న చెబుతున్నారు. విద్యార్థులకు బోధనతోపాటు సామాజిక కార్యక్రమాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నామంటున్న సాయన్నతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. వివరాలను ఆయన మాటల్లోనే...
'కాకతీయ యూనివర్సిటీలో బోధన పటిష్టం చేస్తున్నాం. విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం. విద్యార్థులకు సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నైపుణ్య శిక్షణతోపాటు  పోటీ పరీక్షలకు కోచింగ్‌ ఇస్తున్నాం. త్వరలో పీహెచ్‌డీ ఫలితాలు ప్రకటిస్తాం' అని సాయన్న తెలిపారు. 

19:12 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో చార్మి హైకోర్టుకు అనవసరంగా వెళ్లిందని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో వారు స్పందించారు. చార్మి నుంచి వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే ఎక్సైజ్‌ కార్యాలయానికి పిలిచామని తెలిపారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లి.. పరోక్షంగా చార్మి నిందితురాలని తానే ఒప్పుకున్నట్టుగా ఉందన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే వారిని నిందితులు అనడం లేదని స్పష్టం చేశారు. విచారణ మొత్తం రికార్డు అవుతుందని చెప్పారు. విచారణకు వచ్చే వారు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని వెల్లడించారు. విచారణలో కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయని.. పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారని తెలిపారు. ఆధారాలు లేకుండా అందరికీ నోటీసులు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. నార్కోటిక్‌తో పాటు ఢిల్లీ నుంచి అథ్లెటిక్ డోప్ టెస్టింగ్ మిషన్ తెచ్చి పరీక్ష చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నామన్న వారు.. ఇంటెలిజెన్స్ కూడా డ్రగ్స్‌పై పూర్తి నిఘా పెట్టిందన్నారు. సినిమా రంగం రెండు వర్గాలుగా విడిపోయిందని చంద్రవదన్‌, అకున్‌ సభర్వాల్‌ చెప్పారు. 

 

18:46 - July 25, 2017

సిరిసిల్ల : ఓ ఆటో డ్రైవర్‌పై పోలీసు ప్రతాపం చూపించాడు. తప్పు చేశానని ఒప్పుకున్నా  డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. పోలీసు దాష్టీకానికి డ్రైవర్ ఆసుపత్రి పాలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన ఆటో డ్రైవర్ సవరన్‌ రుద్రంగి మండలంలో ప్రయాణికులతో ఆటోలో బయలుదేరాడు. తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన ఎస్ఐ రమేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో సవరన్ తాగినట్లు తేలింది. నిజమేనని ఒప్పుకున్న సవరన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి.. ఆటో అక్కడే వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆటోలోని ప్రయాణికులు ఎస్‌ఐని వచ్చి బ్రతిమాలారు.  దాంతో ఒక్కసారిగా ఫైర్ అయిన ఎస్‌ఐ రమేష్ ప్రయాణికులతో బ్రతిమాలిస్తావా?  అంటూ సవరన్‌పైచేయి చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన సవరన్‌కు మెడపై వాపు రావడంతో సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. ఎక్స్‌ రే తీసిన డాక్టర్లు మెడ ఎముక విరిగినట్లు చెప్పారు. పనిచేస్తే కానీ పూట గడవని సవరన్ కుటుంబం అతనికి చికిత్స చేయించే స్థితిలో లేమని ఆవేదన చెందుతోంది. ఈ పరిస్థితికి కారణమైన ఎస్‌ఐపై చర్యలు చేపట్టాలని సవరన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

 

18:43 - July 25, 2017

హైదరాబాద్ : చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లిందని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. కోర్టులో ఆమెకు పెద్దగా ఏమీ ఊరట ఇవ్వలేదని    చెప్పింది. ఆమెను తాము నిందితురాలు అనలేదని పేర్కొంది. జస్ట్  డీటెయిల్స్ కోసం పిలిచాము.. నిందితురాలు అని ఇన్‌ డైరెక్టుగా ఒప్పుకున్నట్లు ఉంది అని అన్నారు. విచారణకు వచ్చే వాళ్లు అలోవెర డ్రింక్స్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని తెలిపింది. సిటీలో రోజుకు 4 కిలోల గంజాయి దొరుకుతుందన్నారు. డ్రగ్స్ కేసులో ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్‌ తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. విచారణ అంతా వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. విచారణలో కొత్త కొత్త పేర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. పెద్దపెద్ద హీరోలు, నిర్మాతల కుమారుల పేర్లు చెబుతున్నారు.. వారికి ఆధారాలు లేకుండా నోటీసులు ఇవ్వలేమని చెప్పింది. ఢిల్లీ నుంచి అథ్లెటిక్‌ డోప్‌టెస్ట్‌ మిషన్లు తెచ్చి విచారించాలని నిర్ణయించామని తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:45 - July 25, 2017
17:44 - July 25, 2017

ఉపాధి హామీ పథకం అధికారులతో లోకేష్ సమీక్ష

అమరావతి: ఉపాధి హామీ పథకం అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ వేతనదారుల సమస్యలపై చర్చించారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం వల్ల సమస్యలు తలెత్తాయని, సమస్యలను అధిగమించేందు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్లు తెలిపారు.

17:42 - July 25, 2017

విజయవాడ : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రకు అనుమతిలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. గతంలో కులసంబంధమైన ఆందోళనల్లో ఆస్తి నష్టం జరిగిన విషయాన్ని గుర్తు పెట్టుకుని అనుమతి ఇవ్వలేదన్నారు. ముంద్రగడ కూడా పాదయాత్రకు అనుమతి కోరలేదని చెప్పారు. కాపు, దళిత యువత ఆందోళనలకు దూరంగా ఉండాలని సూచించారు. 

కిర్లంపూడిలో భద్రత కట్టుదిట్టం

తూ.గో: కిర్లంపూడిలో భద్రత కట్టుదిట్టం చేశారు. రేపు ముద్రగడ పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగి కిర్లంపూడిలో అన్ని వీధుల్లోనూ కవాతు నిర్వహించాయి.

17:40 - July 25, 2017

హైదరాబాద్ : అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ జెఎన్ టియూవిద్యార్ధులు ఆందోళన చేపట్టారు. జెఎన్ టియూ మెయిన్ గేటు వద్ద ధర్నా నిర్వహించారు.. ఇతర రాష్ట్రాలలో జెఎన్ టియూ అమలు చేస్తున్న విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల రద్దు వల్ల 15 వేల మంది విద్యార్ధులు నష్టపోతారని.. వెంటనే పరీక్షలు నిర్వహించాలని కోరారు.  లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని విద్యార్ధులు హెచ్చరించారు. 

 

17:36 - July 25, 2017

చిత్తూరు : జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దళిత సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న చిత్తూరు  కలెక్టరేట్‌ ముందు సీపీఎం నేతలు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. బివి రాఘవులు మరో 42 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై సెక్షన్ 143, 341 కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యపై వామపక్ష, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:30 - July 25, 2017

ఢిల్లీ : పశ్చిమగోదావరి జిల్లా గరగర్రులో జరిగిన దళితుల సాంఘిక బహిష్కరణను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. దళితలను సాంఘికంగా బహిష్కరించడం తప్పు అని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. 

17:28 - July 25, 2017

బాలీవుడ్ లో బయో పిక్ లో జోరు కొనసాగుతోంది. ప్రముఖుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మితమవుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. ప్రముఖంగా క్రీడాకారుల బయోపిక్ లకు ఇటీవల మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో పలువురు దర్శక..నిర్మాతలు క్రీడాకారుల జీవిత చరిత్రను వెండితెరకు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగా షార్ట్ ఫుట్ విభాగంలో పారాలింపిక్స్ లో పతకం సాధించి తొలి భారతీయ మహిళా 'దీపా మాలిక్'. ఈమె జీవితం ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితం కానుంది. నటుడు ఫర్హాన్ అక్తర్..రితేష్ సిద్వానీలు సినిమాను నిర్మించనున్నారు. ఇందుకు రితేష్..రంగంలోకి దిగి స్వయంగా 'దీపా'తో చర్చించారంట.

ఈ విషయాలను రితేష్ వెల్లడించారు.
ఆమెతో మాట్లాడిన సందర్భంలో పలు విషయాలు వెల్లడించారని, ఆమె సాధించిన పతకాన్ని తన చేతిలో పెట్టడంతో తనకు తెలియని స్పందన కలిగిందన్నారు. చక్రాల కుర్చీలో తన ముందు కూర్చొని ఉంటే అసలు ఆమె దివ్యాంగురాలన్న భావనే కలుగలేదని, అంతటి ధైర్యవంతురాలైన దీపా జీవితాన్ని వెండితెర ద్వారా ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించుకున్నట్లు రితేష్ వెల్లడించారు.

17:23 - July 25, 2017

మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి వెండితెరకు పరిచయమై బిజీ బిజీగా మారిపోతున్నారు. అందులో మెగా స్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' ఒకరు. ఇప్పటికే యువతో ఎంతో క్రేజ్ తెచ్చుకుని తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న నటుల్లో 'పవన్ కళ్యాణ్' ఒకరు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

సుకుమార్ దర్వకత్వంలో 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉండనుందంట. ఈ సినిమాలో 'రామ్ చరణ్' వైవిధ్యమైన పాత్రను పోషించనున్నారని..పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇందులో 'చెర్రీ' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా భారీ సెట్టింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ నవంబర్ బరిలో నిలిచిన 'పవన్'..’త్రివిక్రమ్' సినిమా సంక్రాంతికి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ‘పవన్ కళ్యాణ్' సైతం వేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇతర సినిమాలకు సైతం సైన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్..పవన్ యోచిస్తున్నట్లు టాక్.

మరి సంక్రాంతి బరిలో 'రామ్ చరణ్' నిలుస్తారా ? బాబాయ్ 'పవన్ కళ్యాణ్' సినిమాతో ముందే రిలీజ్ చేయాలని 'చెర్రీ' నిర్ణయిస్తారా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.

17:22 - July 25, 2017

టాలీవుడ్ నటి 'కాజల్' ఇతర భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలువురు అగ్రహీరోలు..యంగ్ హీరోలతో నటించిన ఈ అమ్ముడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అటు మహిళా ప్రధానమైన చిత్రాలు..కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఈ అమ్ముడు సీక్వెల్ గా తెరకెక్కే సినిమాల్లో కూడా నటిస్తోందని తెలుస్తోంది.

రెండేండ్ల క్రితం 'మారి' చిత్రం విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'ధనుష్' హీరోగా నటించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'మారి 2’ని నిర్మించాలని 'ధనుష్' ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కూడా 'కాజల్' ను తీసుకోవాలని 'ధనుష్' యోచిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో నటించేందుకు 'కాజల్' కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, ఇందుకు రెండు కోట్ల పారితోషకం కావాలని డిమాండ్ చేసిందని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పారితోషకం ఇచ్చేందుకు 'ధనుష్' అంగీకరించాడని తెలుస్తోంది. కాజల్ ప్రస్తుతం తమిళంలో 'వివేగం', ‘మెర్పల్', తెలుగులో 'నేనే రాజు నేనే మంత్రి', ‘ఎమ్మెల్యే' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కబోయే హర్రర్ సినిమాకు సైతం 'కాజల్' గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.

17:21 - July 25, 2017

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది అంటారు.. అదే స్థాయిలో మూఢ నమ్మకాలు పెరిగిపోతున్నాయి. సమాజానికి శాస్త్రీయ అవగాహన కల్పించాల్సిన విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలను పాటిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు మృత్యుంజయ హోమం జరపడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. మాత..శిశు మరణాలు తక్కువ కావాలని ఈ హోమాలు జరిపించడం పట్ల పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి మానవి 'వేదిక' కార్యక్రమంలో ప్రత్యేక చర్చ చేపట్టింది. రమేష్ (జనవిజ్ఞాన వేదిక), ఇందిర (టి. కాంగ్రెస్ ప్రతినిధి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

17:20 - July 25, 2017

ఖమ్మం : 'మెనూ ప్రకారం పెట్టడం లేదు..నిన్న దోసకాయ కూర పెట్టారు..అదీ బాగాలేదు..స్టాక్ ఉన్న అటుకులు పెట్టారు..తిన్న తరువాత వాంతులు..విరేచనాలతో బాధ పడ్డాం'..అని గురుకుల విద్యార్థులు పేర్కొంటున్నారు. గురుకులాలను ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. జ్యోతిరావు పూలే బాలికల గురుకుల హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కొంత కలకలం చోటు చేసుకుంది. 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురి కాగా ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల యాజమాన్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రహస్యంగా వీరికి వైద్యం చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న మీడియా విద్యార్థినిలతో ముచ్చటించింది. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, తగిన సౌకర్యాలు కూడా లేవని విద్యార్థినిలు పేర్కొన్నారు.

కనీన మెనూ పాటించడం లేదు - ఎస్ఎఫ్ఐ..

గురుకులాల ద్వారా కేజీ టు పీజీ విద్య అందిస్తామని ప్రభుత్వం చెబుతోందని, కనీస మెనూ కూడా పాటించడం లేదని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం పేర్కొంది. పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు.
బీసీ గర్ల్స్ హాస్టల్ లో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని వైద్యులు తెలిపారు.

17:19 - July 25, 2017

అనంతపురం : ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురంలో నకిలీ నోట్ల ముఠా పట్టుబడింది. ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుండి రూ. 27.37 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిందూపురంలో ఓ గ్రామ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేశారు. నోట్లు తయారు చేసే ప్రింటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు.

17:18 - July 25, 2017

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, ఆతర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌తో భేటీ అయ్యారు. పోలరవం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులపై చర్చించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాసంస్థలకు నిధుల మంజూరు అంశంపై చర్చించారు. అలాగే సెంట్రల్‌ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయాలను ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

17:18 - July 25, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి ఛార్మీ వేసిన పిటిషన్ పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ ఛార్మీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం దీనిపై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.

సిట్ విచారణ సరిగ్గా జరగలేదని, బ్లడ్ శాంపిల్స్ బలవంతంంగా సేకరిస్తున్నారని ఛార్మీ పిటిషన్ లో పేర్కొన్నారు. రక్త నమూనాలను బలవంతంగా సేకరించడం సరికాదని ఆమె కోర్టుకు విన్నవించారు. ఛార్మీకి ఇంకా పెళ్లి కాలేదని, సిట్ విచారణ న్యాయబద్ధంగా జరగాలని ఛార్మీ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై సిట్ తరపు న్యాయవాది వాదించారు. తాము ఛార్మీని అతిథిగానే భావిస్తున్నామని, ఆమె ఇంట్లో కూడా తాము విచారణ చేయడానికి సిద్ధమని తెలిపారు. బలవంతంగా రక్త నమూనాలు..గోర్లు, వెంట్రుకలు తీసుకోవడం లేదని, స్వచ్చందంగా ముందుకొస్తేనే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిన్నటి విచారణలో నటుడు నవదీప్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారని, తప్పు చేయకపోతే భయం ఎందుని పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

17:16 - July 25, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న 'డ్రగ్స్' కేసుపై మళ్లీ దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' మరో పోస్టు చేశారు. ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పై ఇటీవలే 'వర్మ' వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫేస్ బుక్ లో మరో పోస్టు పెట్టారు. హైదరాబాద్ లో జరుగుతున్న తీరుపై దేశ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, పంజాబ్ కన్నా హైదరాబాద్ ఇంత బ్యాడా అంటూ ముంబై వాసులు తనతో అంటున్నారని పోస్టులో పేర్కొన్నారు. కొంతమందిని టార్గెట్ చేసి విచారణ జరపడం వల్ల తెలంగాణ ప్రతిష్ట మసకబారుతోందని, సిట్ ను సెట్ చేయాలని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిష్ట మసకబారకుండా చూడాల్సిన బాధ్యత చంద్రవదన్, అకున్ సబర్వాల్ పై ఉందన్నారు.

17:15 - July 25, 2017

ఢిల్లీ : స్పూర్తి గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నానని నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ లో అడుగు పెట్టిన సమయంలో గత అనుభవాలు గుర్తుకొచ్చాయన్నారు. తాను చిన్న గ్రామంలో..మట్టి ఇంట్లో జన్మించడం జరిగిందన్నారు.

వేలాది మంది పోరాట యోధుల ఫలితంతో స్వాతంత్ర్యం వచ్చిందని, 21వ శతాబ్దపు భారతదేశం నాలుగో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. ఈ దేశ మట్టి, నీరు, సంస్కృతి, శ్రమజీవనంపై గౌరవం ఉందన్నారు. సమానత్వం..ఆర్థిక స్వాతంత్ర్యం లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాల ద్వారానే జాతి నిర్మాణం సాధ్యం కాదని, సైనికులు..పోలీసులు..రైతులు..శాస్త్రవేత్తలు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. స్టార్టప్ ఏర్పాటు చేసిన ఉద్యోగాలు ఇస్తున్న యువత కూడా జాతి నిర్మాతేనని..ఇంటి పనులు, ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లల్ని ఆదర్శ పౌరులుగా తయారు చేస్తున్న మహిళలు కూడా జాతి నిర్మాతలేనన్నారు.

భిన్న సంస్కృతులు, భాషలున్నా మనమంతా భారతీయులమని,  125 కోట్ల మంది భారతీయుల ఆశలు..ఆంక్షాలు నెరవేరుస్తానని తెలిపారు. ఇప్పటి వరకు పని చేసిన రాష్ట్రపతుల బాటలోనే తాను కూడా నడుస్తానన్నారు. ఆర్థిక నాయకత్వం, నైతిక ఆదర్శం ఇవ్వగలిగే దేశంగా భారత్ ఎదగాలని, భారత్ ను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు..నైతిక విలువలు పెంపొందించాల్సి ఉందన్నారు. తనపై ఉంచిన విశ్వాసం వమ్ము చేయనని తెలిపారు. ఆయన పూర్తి ప్రసంగం పాఠం వినాలంటే వీడియో క్లిక్ చేయండి..

17:13 - July 25, 2017

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కాసేపటి క్రితం పార్లమెంట్ సెంట్రల్ హౌస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే పక్ష రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్, విపక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ పోటీ పడిన సంగతి తెలిసిందే.

17:12 - July 25, 2017

రంగారెడ్డి : మొక్కలు నాటడమే కాదు.. నాటిన మొక్కను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. ఆ సాకుతో పేదల భూములను లాక్కుంటారని వస్తున్న వార్తలను కేటీఆర్ కొట్టి పారేశారు. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని స్పష్టం చేశారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చైనా సరే 99 శాతం ఉద్యోగాలు స్థానికులే ఇచ్చేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ముచ్చర్లలో అంతర్జాతీయ ఫార్మా సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 

17:11 - July 25, 2017

నిర్మల్ : జిల్లాలోని మామడ మండలం పానకల్ గ్రామంలో 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సదర్మట్ బ్యారేజీ రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 516 కోట్ల బడ్జెట్ కేటాయించింది. కానీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు మాత్రం నష్ట పరిహారం చెల్లించడం లేదు. తమ సమస్యలపై మంత్రి ఇంద్రకిరణ్ స్పందించకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

17:10 - July 25, 2017

వేముల వాడ : మిష్ ఏషియా, తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ వేములవాడకు వచ్చారు. మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి ఆమె కోడెమొక్కులను చెల్లించుకున్నారు. రాజన్న ఇంటి ఇలవెల్పు అని, ఆలయానికి రూ. 400 కోట్ల బడ్జెట్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చెయ్యడం గర్వించదగిన విషయమన్నారు. డ్రగ్స్ కేసుపై కూడా ఆమె స్పందించారు. ఈ కేసులో ఎంత మంది ఉన్నారో..ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తుందన్నారు. సినీ ఇండ్రస్ట్రీ కాకుండా బయట వారు కూడా డ్రగ్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమయ్యేసరికి ఎక్కువ ప్రచారం జరిగిందని రష్మీ ఠాకూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

17:08 - July 25, 2017

విశాఖపట్టణం : మధురవాడ నారాయణ ఐఐటీ కాలేజీలో ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు..హాస్టల్ సిబ్బంది మధ్య గొడవ పడ్డారు. విద్యార్థులు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు హాస్టల్ సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

17:07 - July 25, 2017

తూర్పుగోదావరి : కాపు ఉద్యమం మళ్లీ తారాస్థాయికి చేరుకుంది. కాపు రిజర్వేషన్ పై తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యమ నేత ముద్రగడ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26వ తేదీ నుండి చలో అమరావతి పేరిట పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేయడం..పాదయాత్ర నిర్వహిస్తామని ముద్రగడ చెప్పడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ముందస్తుగానే పోలీసులు జిల్లాలో భారీగా మోహరించారు. సుమారు ఆరు వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో వేయి మంది పోలీసులు మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడికి వెళ్లే అన్ని దారుల్లో తనిఖీలు..సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రామానికి ఎందుకు వస్తున్నారు ? ఏ పని మీద వస్తున్నారు ? అనేదానిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. బయటి వ్యక్తులు..అనుమానాస్పద వ్యక్తులను మాత్రం లోనికి అనుమతినివ్వడం లేదు.
పాయాత్రకు అనుమతి లేదని..పాదయాత్రలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

17:05 - July 25, 2017

కరీంనగర్ : దారుణం..ఘోరం..సభ్య సమాజం తలదించుకొనే ఘటన..ఓ మహిళను వివస్త్ర చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేకేత్తిస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..తమకు న్యాయం చేయాలని బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటకు వెలుగు చూసింది.
ఎస్ఐ స్పందన..
ఈ ఘటనపై వీణవంక ఎస్ఐ దామోదర్ రెడ్డి టెన్ టివితో మాట్లాడారు. మూడో తేదీన సాయంత్రం ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని..వెంటనే దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిందని, 8వ తేదీ నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందన్నారు.

పోలీసులు సహకరించడం లేదన్న బాధితులు..

తమకు న్యాయం చేయాలని కోరుతుంటే పోలీసులు స్పందించడం లేదని బాధితురాలు..కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. నిందితులకు సహకరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వీణమంక మండలం ఎస్ఐ పట్టించుకోవడం లేదని, రెండు..మూడు రోజులు పీఎస్ చుట్టూ తిరిగామని బాధితురాలు టెన్ టివికి తన ఆవేదన తెలియచేసింది. పోలీసులు తమకు సహకరించడం లేదని బాధితులు పేర్కొంటుండగా తాము చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు.
దృశ్యాలు చిత్రీకరించిన భర్త..

వీణవంక (మం) బ్రాహ్మణ పల్లిలో తమ్ముడి భార్యను ఓ బావ వివస్త్ర చేశాడు. అంతేగాక అత్యాచార యత్నం చేయబోయి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘోరాతి ఘోరమైన ఘటనకు వ్యక్తి భార్య..తల్లిదండ్రులు..సోదరి సహకరించారు. ఈ ఘటనపై బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించారు. సెప్టెంబర్ 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది. భర్త శ్రీనివాస్ రెడ్డి ఈ దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు.

17:04 - July 25, 2017

హైదరాబాద్ : సినీ నటి ఛార్మీ కోర్టు మెట్లు ఎక్కింది. డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఛార్మీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ముఠా పట్టుబడిన అనంతరం సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసి వారిన విచారిస్తున్నారు. ఈ సమయంలో నటి ఛార్మికి..మమైతఖాన్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటీసులపై ఛార్మీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పేరిట వ్యక్తిగత వివరాలు అడగవద్దని..విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్ లో అభ్యర్థించింది. మహిళా అధికారులు మాత్రమే విచారించాలని, బలవంతంగా రక్త నమూనాలు..గోళ్లు..వెంట్రుకలు తన అనుమతి లేకుండా తీసుకోవద్దని..సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు పట్టించుకోవడం లేదని..తనకు దురలావాట్లు లేవని..బలవంతంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు గుప్పించింది. ఆయా అంశాలపై ఎక్సైజ్ శాఖకు పలు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది.

మరి హై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

17:02 - July 25, 2017

కరీంనగర్ : సభ్య సమాజం తలదించుకొనే ఓ ఘటన కరీంనగర్ జిల్లాలో వీణవంక (మం) బ్రాహ్మణ పల్లిలో చోటు చేసుకుంది. తమ్ముడి భార్యను ఓ బావ ఏకంగా వివస్త్ర చేశాడు. అంతేగాక అత్యాచార యత్నం చేయబోయి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘోరాతి ఘోరమైన ఘటనకు వ్యక్తి భార్య..తల్లిదండ్రులు..సోదరి సహకరించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై బాధితురాలు హెచ్చార్సీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంపై బాధితురాలు టెన్ టివితో మాట్లాడి తనకు జరిగిన ఘోరాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేసే చెప్పింది.

2న ఘటన..

ఈనెల 2వ తేదీన ఈ ఘటన జరిగింది. పొలంలో పనిచేస్తుండగా మా అత్త..మా బావ..మా యారాలు..మా మామ..లు దాడి చేశారు. బావ మళ్లీ మీద పడి ఒంటిపై దుస్తులు ఊడపీకాడు. అత్యాచారయత్నానికి పాల్పడడమే కాకుండా తన గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. పెళ్లి అయినప్పటి నుండి తనను వేధిస్తున్నారు. తన భర్త ఏమీ అనకుండా చిన్న చిన్న వాటికి వేధించే వారు. సమస్యలు తీరుతాయని భావించాం. ఆధారాలు లేకపోవడం వల్ల తాము ఎవరికీ చెప్పలేదు. గతంలో పోలీసులకు..పెద్ద మనుషులకు చెప్పిని పట్టించుకోలేదు. దీనితో తమకు సపోర్టు ఇవ్వలేదు. ఎస్ఐ..పెద్ద మనుషులు తమ వైపుకు మాట్లాడలేదు. తనకు పాప..బాబు ఉన్నారు. ఘటన జరిగే సమయంలో తన తల్లి కూడా అక్కడనే ఉందని..వారిని కూడా చితకబాదారు. తనపై నిందలు వేస్తున్నారు. మూడో తేదీన పిటిషన్ ఇవ్వడం జరిగింది. వీణమంక మండలం ఎస్ఐ పట్టించుకోవడం లేదు. రెండు..మూడు రోజులు పీఎస్ చుట్టూ తిరిగినం’. అని బాధితురాలు వాపోయింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీగా వున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం తదితర అంశాలపై ఆయా కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర రెవెన్యూ లోటు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరినట్టు సమాచారం.

16:58 - July 25, 2017

హైదరాబాద్ : చార్మి పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అనుమతి లేకుండా బ్లడ్‌ శాంపుల్స్‌ తీసుకోవద్దని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలని ఆదేశించింది. వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే చార్మీ విచారణ జరపాలిని తెలిపింది. సుప్రీంకోర్టు గైడ్‌లెన్స్‌ ఆధారంగా సిట్ విచారణ జరపాలని..సిట్ విచారణ సమయంలో మహిళా ఆఫీసర్లు కూడా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 

 

16:56 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. నాలుగు గంటల పాటు చిన్నాను విచారించిన సిట్ అధికారులు.. పూరీ జగన్నాథ్‌తో చిన్నాకు ఉన్న సంబంధాలతో పాటు పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

16:54 - July 25, 2017

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్ కోవింద్‌ చేత ప్రమాణం చేయించారు.  రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా కోవింద్‌ గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రపతిని ప్రణబ్‌ ముఖర్జీ తన ఆసనంలో కూర్చోబెట్టారు. కోవింద్‌ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ , ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విదేశీ దౌత్యాధికారులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా తొలిసారి ప్రసంగం చేశారు. 125 కోట్ల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటానని కోవింద్‌ తెలిపారు.

 

16:52 - July 25, 2017
16:50 - July 25, 2017

ఏపీ బీసీ కమిషన్ కు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి లేఖ

అమరావతి: ఏపీ బీసీ కమిషన్ కు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి లేఖ రాశారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలను వెనుకబడిన తరగతుల్లో చేర్చే అంశంపై నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని ప్రభుత్వం కోరింది. మంత్రివర్గ తీర్మానాన్ని కమిషన్ కు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది.

16:48 - July 25, 2017

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రకు సమయం సమీపిస్తున్న కొద్దీ తూర్పుగోదావరి జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి లేదని చెబుతుండగా... ఎట్టి పరిస్థితులోనైనా పాదయాత్ర కొనసాగిస్తామంటున్నారు ముద్రగడ. ఈ నేపథ్యంలో కోనసీమ మొత్తం పోలీసులు భారీగా మోహరించారు. ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లేందుకు ఆంక్షలు విధించారు.  దీంతో జిల్లావ్యాప్తంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 

 

16:43 - July 25, 2017

గుంటూరు : జిల్లాలోని యడ్లపాడులో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో బావిలోకి దూకి.. తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బావి నుంచి మృతదేహాలను వెలికితీశారు. 

హరిత హారంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి: టీఎస్ సీఎం ఓఎస్ డీ

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల ప్రాంగణాల్లో హరిత హారం చేపట్టాలని ఆయా సంస్థలకు తెలంగాణ సీఎం ఓఎస్ డీ ప్రియాంక వర్గీస్ లేఖ రాశారు. ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కోసం హరిత హారంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, వివిధ రకాల మొక్కలను ప్రభుత్వ సంస్థలు ఉచితంగా అందిస్తున్నాయని వర్గీస్ తెలిపారు.

16:39 - July 25, 2017

యాదాద్రి భువనగిరి : తమ పొలాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరులో విద్యుత్‌ సిబ్బందిని రైతులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గతంలో మాదిరిగానే విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. విషయం తెలుసుకుని ఉన్నతాధికారులు రైతులతో మాట్లాడారు. దీంతో శాంతించిన రైతులు విద్యుత్‌ సిబ్బందిని వదిలిపెట్టారు. 

16:35 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై సినీ హీరోయిన్‌ చార్మి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాసేపట్లో తీర్పు వెలువడనుంది. బ్లడ్‌ శాంపిల్స్‌ బలవంతంగా తీసుకోవడంపై చార్మి అభ్యంతరం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

16:32 - July 25, 2017

హైదరాబాద్ : మేనేజర్‌ రోనీ అరెస్ట్‌పై హీరోయిన్‌ కాజల్‌ ట్విట్టర్‌లో స్పందించింది. రోనీ చర్యను సమర్ధించలేనని కాజల్‌ తెలిపింది. రోనీ అరెస్ట్‌ తనను షాక్‌కు గురి చేసిందన్నారు. రోనీతో ప్రొఫెషనల్‌ రిలేషన్‌షిప్‌ అని... వ్యక్తిగత అలవాట్లతో సంబంధం లేదన్నారు. ఇకపై తన వ్యవహారాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని కాజల్‌ తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

'సిట్ విచారణకు అలోవెరా డ్రింక్స్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారు`

హైదరాబాద్: సినిమా రంగం రెండు వర్గాలుగా విడిపోయిందని అకున్ సబర్వాల్ అన్నారు. విచారణకు వచ్చే వాళ్లు అలోవెరా డ్రింక్స్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని తెలిపారు. సిట్ విచారణ లో కొత్త కొత్త పేర్లు చెబుతున్నారని సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణకు హాజరయ్యే వాళ్లను నిందితులు అన లేదని, విచారణంతా వీడియో రికార్డు చేస్తున్నామని తెలిపారు. నిరాధారంగా ఎవరికీ నోటీసులు ఇవ్వలేం అని తెలిపారు.

సిట్ విచారణ లో కొత్త కొత్త పేర్లు

హైదరాబాద్ : సిట్ విచారణ లో కొత్త కొత్త పేర్లు బయటపడుతున్నట్లు సమాచారం. తెరమీదకు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు వస్తున్నట్లు తెలుస్తోంది.

చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లింది: అకున్ సబర్వాల్

హైదరాబాద్: చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లిందని ఎక్సైజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ కోర్టులో చార్మికి పెద్దగా ఊరట దొరకలేదన్నారు. చార్మిని మేము నిందితురాలు అనలేదని, కోర్టుకు వెళ్లడం వల్ల నిందితురాలు అని చార్మి పరోక్షంగా ఒప్పుకున్నట్లయ్యిందని చెప్పారు.

రాజ్ నాథ్ తో కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని హోంమంత్రిని సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.

కూకట్ పల్లి జేఎన్ టీయూ ఎదుట విద్యార్థులు ధర్నా

హైదరాబాద్ : కూకట్ పల్లి జేఎన్ టీయూ ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని వారు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భారీగా జేఎన్ టీయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

జైరాం రమేష్ ఆరోపణలు అవాస్తవం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: జైరాం రమేష్ ఆరోపణలు అవాస్తవం అని మంత్రి కేటీఆర్ అన్నారు. జైరాం రమేష్ ఎపుడైనా ప్రజల ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు. పోలీసు శాఖ వాహనాలపై జైరాం రమేష్ ఆరోపణలు చేశారని, కేంద్ర సంస్థ డీజీఎస్ ఎన్ డీ రేటు ప్రకారమే నేరుగా కంపెనీ లనుంచి కొనుగోలు చేశామని తెలిపారు. ఉనికి ఉండదేమోనని విపక్షాలు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలన్నింటిని ముందుగానే సీఎం పరిష్కరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ లూట్.. జూట్.. స్కూట్ విధానాన్ని పాటిస్తోందని, ఒత్తమ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

ప్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు కొత్త రికార్డు క్రియేట్ చేసి ప్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే 10వేల మార్కును నిఫ్టీ టచ్ చేసింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో సూచీ పడిపోయింది. 11 పాయింట్ల నష్టపోయి 32,235 వద్ద సెన్సెక్స్, 2 పాయింట్లు నష్టపోయి 9,965 వద్ద నిఫ్టీ ముగిసింది.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ సీఎం

మధ్యప్రదేశ్ : బిజెపి ఎగ్జిక్యూటివ్ సమావేశంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన బిల్లుల నెలకు మించి ఆలస్యం చేస్తే ఆయా జిల్లా కలెక్టర్లను తలకిందులుగా వేలాడదీస్తా అని చెప్పారు.

సీపీఎం రాఘవులు సహా 42 మంది అక్రమ కేసులు

చిత్తూరు: పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దళితుల సమస్యలపై సీపీఎం నేత రాఘవులు సహా 42 మంది పై అక్రమ కేసులు బనాయించారు. 143.341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 22న కలెక్టరేట్ దగ్గర సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. పోలీసుల తీరుపై దళిత, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

తిరుమలలో లడ్డూ దళారీల అరెస్ట్...

తిరుమల: తిరుమలలో లడ్డూ దళారీలను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అరెస్టు చేశారు. భక్తులకు లడ్డూలను అధిక ధరలకు విక్రయిస్తున్న 12 మందిని పట్టుకున్నారు. తిరుమలలో పేస్‌ డిటెక‌్షన్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, మూడంచెల భద్రతను కట్టుదిట్టం చేస్తామని చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ రవికృష్ణ తెలిపారు. కాగా, లడ్డూ దళారీలను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

రోని అరెస్ట్..షాక్ కు గురిచేసింది: కాజల్

హైదరాబాద్: రోనీ గురించి తెలిసి షాకయ్యా అని నటి కాజల్ అగర్వాల్ పేర్కొంది. డ్రగ్స్‌ కేసులో తన మేనేజర్‌ అరెస్టుపై ప్రముఖ హీరోయిన కాజల్‌ అగర్వాల్‌ స్పందించారు. రాన్‌సన్‌ జోసెఫ్‌ (రోనీ) చర్యను తాను సమర్థించబోనన్నారు. రోనీ వ్యక్తిగత జీవితం, అలవాట్లతో తనకెలాంటి సంబంధంలేదని ఆమె స్పష్టంచేశారు. రోనీ తన వృత్తిపరమైన వ్యవహారాలకే పరిమితమన్నారు. కాజల్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న పుట్టకర్‌ రాన్‌సన్‌ జోసెఫ్‌ను సిట్‌ అధికారులు నిన్న మణికొండలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు.

ముగిసిన ఆర్డ్ డైరెక్టర్ చిన్నా విచారణ

హైదరాబాద్: డ్ర‌గ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా విచార‌ణ ముగిసింది. దాదాపు 4 గంట‌ల‌పాటు సిట్ అధికారులు చిన్నాని విచారించినట్టు తెలుస్తుంది. ప‌లు కోణాల‌లో సిట్ అధికారులు చిన్నాని విచారించిన‌ట్టు స‌మాచారం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు విచారించిన వారి క‌న్నా చిన్నా విచార‌ణనే అధికారులు చాలా త్వరగా ముగించారు.

చార్మి పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు..

హైదరాబాద్: డ్ర‌గ్స్ కేసులో సినీ నటి చార్మి హైకోర్టు ఆదేశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. సిట్ విచార‌ణ‌లో ఛార్మి తో పాటు న్యాయ‌వాదిని అనుమ‌తించేందుకు నిరాక‌రించింది. బ‌ల‌వంతంగా ఛార్మి ర‌క్త న‌మూనాలు సేక‌రించ‌రాదు అని హైకోర్టు ఆదేశించింది. చార్మిని ఉద‌యం 10 నుండి సాయంత్రం 5 వ‌ర‌కు విచారించాలి, ఒక వేళ విచార‌ణ పూర్తికాక‌పోతే మ‌రోసారి పిలిపించ‌వ‌చ్చు అని హైకోర్టు తెలిపింది. విచార‌ణ బృందంలో మ‌హిళ‌ను కూడా నియ‌మించాలి అని హైకోర్టు పేర్కొంది.

09:35 - July 25, 2017

గుంటూరు : కుటుంబ కలహాలు..ఇతరత్రా కారణాలతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా అభం..శుభం తెలియని చిన్నారులను సైతం తమతో తీసుకెళుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. తాజాగా యడ్లపాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.

ఎస్సీ కాలనీలో భూ లక్ష్మీ తన పిల్లలు రాము..అఖిలతో నివాసం ఉంటోంది. భూ లక్ష్మీ..భర్తల మధ్య తరచూ వివాదాలు కొనసాగుతుండేవని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజాము సమయంలో పిల్లలు రాము..అఖిలలను వెంటబెట్టుకున్న భూ లక్ష్మీ ఎగువబావిలోకి దూకింది. ఈ విషయాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో వారి మృతదేహాలను బయటకు తీశారు. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబకలహాలే ఆత్మహత్యలకు కారణమని తెలుస్తోంది. విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

యడ్లపాడులో విషాదం..

గుంటూరు : యడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి భూ లక్ష్మీ..పిల్లలు రాము..అఖిలలు మృతి చెందిన వారిలో ఉన్నారు. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మృతదేహాలను వెలికి తీశారు.

09:32 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసును చేధించేందుకు సిట్ శాయశక్తులా పనిచేస్తోంది. వివిధ రంగాకు చెందిన వారిని వరుసగా విచారణలు చేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ పట్టుబడడంతో సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. అతని విచారణలో టాలీవుడ్ సెలబ్రెటీలు..కాలేజీ..స్కూళ్లు విద్యార్థులున్నట్లు తెలియడంతో కలకలం రేగింది. దీనితో ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖ హీరోలు..హీరోయిన్స్ కు నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయా హీరోలు విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను రాబట్టేందుకు వారిని విచారించారు. పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్ లను ఇప్పటి వరకు విచారించారు.

ఆర్ట్ డైరెక్టర్ చిన్నా..
మంగళవారం ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10.30గంటలకు విచారణ జరగనుంది. గంటల పాటు జరిగే ఈ విచారణలో సిట్ పలు ప్రశ్నలు సంధించనుంది. కెల్విన్ తో సంబంధాలు..డ్రగ్స్ తదితర విషయాలపై చిన్నా ఎలాంటి సమాధానం చెప్పానున్నారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే సినీ నటి ఛార్మీ విచారణకు ముందే హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. బలవంతంగా తన నుండి రక్తనమూనాలు తీసుకోకూడదంటూ సిట్ ను ఆదేశించాలని ఛార్మీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమా పరిశ్రమలో ఓ వర్గం తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని..కావాలని కుట్రపూరితంగా డ్రగ్స్ కేసు బనాయించారని పేర్కొంది. సిట్ కు చట్టబద్ధత లేదని..కేసులు నిలబడవన్న వాదనలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఖండించారు. డ్రగ్స్ కేసులో 7 కేసులు నమోదు చేసి 27 మందిని ప్రశ్నించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మంగళవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

కోక్రాఝుర్ లో ఎన్ కౌంటర్..

అసోం : కోక్రాఝుర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, ఆర్మీ జాయింట్ జరిపిన ఆపరేషన్ లో ఉగ్రవాది హతమయ్యాడు. ఏకే 47, గ్రైనేడ్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

రూ. 60 లక్షల గంజాయి..

విశాఖపట్టణం : నర్సీపట్నం శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ. 60 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాలేజీలో ఘర్షణ..

విశాఖపట్టణం : మధురవాడ నారాయణ కాలేజీలో ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు..హాస్టల్ సిబ్బంది మధ్య ఈ ఘర్షణ తలెత్తింది. ఇద్దరు హాస్టల్ సిబ్బందికి గాయాలయ్యాయి.

09:28 - July 25, 2017

తూర్పుగోదావరి : కాపు సెగ మళ్లీ లేచింది. కాపుల రిజర్వేషన్ అంశంపై పోరాటం చేస్తున్న ముద్రగడ మరోసారి ఉద్యమం చేపట్టబోతున్నారు. చలో అమరావతి పేరిట పాదయాత్ర చేయాలని ముద్రగడ సంకల్పించిన సంగతి తెలిసిందే. కానీ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. ఎన్ని అడ్డంకులు కలిగించినా పాదయాత్ర మాత్రం జరుపుతామని ముద్రగడ, కాపు ఉద్యమ నేతలు స్పష్టం చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం చలో అమరావతి జరిపి తీరుతామని ముద్రగడ పద్మనాభం తేల్చి చెబుతుండగా.. పాదయాత్రకు అనుమతి లేదని.. హోం మంత్రి, డీజీపీ పదేపదే చెబుతున్నారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 6వేల మంది పోలీసులు మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గండేపల్లి, పెద్దాపురం మండలాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

కిర్లంపూడిలో..
ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఏకంగా వెయ్యిమంది పోలీసులు పహరా కాస్తున్నారు. అడుగుడుగునా సీసీకెమెరాలతో నిఘాపెట్టారు. అంతేగాకుండా డ్రోన్ల సహయంతో భద్రతను పర్యవేక్షిస్తుండడంతో గమనార్హం. గ్రామంలోకి వచ్చే టూవీలర్స్‌సహా అన్నీ వాహనాలను ఆపి తినఖీలు నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ముద్రగడను ఎవరెవరు కలుస్తున్నారు అనే దానిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చివరికి కిర్లంపూడిలో మీడియాపైకూడా అనధికారికంగా ఆంక్షలు పెట్టేశారు.

09:23 - July 25, 2017

చిత్తూరు : కిడ్నాప్ వార్తలతో తిరుమల వార్తల్లోకి ఎక్కుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తూ శ్రీవారి దర్శనం కోసం వివిధ దేశాల వారు ఇక్కడకు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తిరుమలకు కుటుంబసమేతంగా వెళుతుంటారు. కానీ ప్రస్తుతం కిడ్నాప్ ఘటనలతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.
మొన్నటి మొన్న ఓ బాలుడి కిడ్నాప్ ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన దంపతులు ఏడేళ్ల చిన్నారి నందినితో శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. అనంతరం చిన్నారి నందిని కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఈ విషయాన్ని తెలియచేశారు. మీడియాకు ఈ విషయాన్ని ఆలస్యంగా తెలియచేశారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ కిడ్నాపర్ గా భావిస్తున్నారు. బాలికను ఆ మహిళే ఎత్తుకెళ్లిందని భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తిరుమలలో జరుగుతున్న వరుస కిడ్నాప్ లు మరోసారి జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుమలలో బాలిక కిడ్నాప్..

చిత్తూరు : తిరుమలలో మరో కిడ్నాప్ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన దంపతుల ఏడేళ్ల కుమార్తె నందిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఓ మహిళ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తూ.గోలో మస్తు బందోబస్తు..

తూర్పుగోదావరి : జిల్లాలో భారీగా పోలీసులు మోహరించారు. సుమారు 5వేల మందితో బందోబస్తు జరుగుతోంది. బుధవారం ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో భద్రతను పోలీసులు మరింత పెంచారు.

కారులో పరారైన ఉగ్రవాదులు..

జమ్మూ కాశ్మీర్ : బందిపొరలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులు - భద్రదళాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం కారులో ఉగ్రవాదులు పరారయ్యారు.

08:07 - July 25, 2017

ప్రశాంతంగా ఉండే కోనసీమ గంభీరంగా మారిపోయింది. వేలాది మంది పోలీసుల పహారాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాపు ఉద్యమనేత ముద్రగడ చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కోనసీమ పోలీస్‌ పహరాలోకి వెళ్లిపోయింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో లక్ష్మీ పార్వతి (వైసీపీ), దినకరన్ (టిడిపి), అద్దెపల్లి శ్రీధర్ (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీజేపీ..టీడీపీ..వైసీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసుకున్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

08:07 - July 25, 2017

భారతదేశ వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకు మరో ప్రమాద హెచ్చరిక వినిపిస్తోంది. నిన్ననే హైదరాబాద్ లో ఆర్సీఈపి సమావేశాలు మొదలయ్యాయి. ప్రాంతీయ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలకు కోసం జరుగుతున్న ఈ చర్చల్లో 16 ఆసియా దేశాలు పాల్గొంటున్నాయి. ఆర్సీఈపి ప్రతిపాదనలేమిటి? మన దేశం ప్రతిపాదిస్తున్న అంశాలేమిటి? ఇవేవీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం వెల్లడించడం లేదు. అంతా రహస్యంగా వుంచుతున్నారు. కనీసం పార్లమెంట్ కు కూడా ఈ చర్చల వివరాలు చెప్పడం లేదు. మొత్తానికి డబ్ల్యుటివో కంటే అత్యంత ప్రమాదకరమైన అంశాలపైనే ఆర్సీఈపి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్సీఈపి ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే మన దేశంలోని అన్నదాతలను మరిన్ని కష్టాలు చుట్టుముట్టడం ఖాయమంటున్నారు. పాడి పరిశ్రమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారబోతోంది. మందుల ధరలకూ రెక్కలొస్తాయి. అందుకే ఆర్సీఈపిని వ్యతిరేకిస్తూ ఉద్యమాల మొదలయ్యాయి. ఆర్సీఈపి ప్రతిఘటనా వేదిక కో కన్వీనర్ విస్సా కిరణ్ కుమార్ గారు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

08:06 - July 25, 2017

ఢిల్లీ : రాబోయే సంవత్సరం నుంచి వైద్య విద్యకు దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష..ఒకే ప్రశ్నాపత్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌పై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాంతీయ భాషల్లో రూపొందించిన ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటం..ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వడం వివాదాస్పదమైంది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా ఆలస్యంగా విడుదలయ్యాయి.

రాజ్యసభలో..
భద్రతా కారణాలతోనే ఈ ఏడాది ప్రాంతీయ భాషల ప్రశ్నాపత్రాలు..వేర్వేరు సెట్లుగా రూపొందించామంటున్నారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్. వచ్చే సంవత్సరం ప్రశ్నాపత్రం మొత్తం ఆంగ్లంలో రూపొందించి..మిగిలిన భాషల్లోకి తర్జుమా చేయిస్తామంటున్నారు. మరోవైపు నీట్‌తో తమ హక్కులకు, స్థానిక రిజర్వేషన్లకు భంగం వాటిల్లుతుందని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. విడిగా సెట్‌లు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరుతున్నాయి. నీట్‌ నుంచి తమ రాష్ట్రాలను మినహాయించాలని ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్‌ సమావేశాల్లో ఇదే అంశాన్ని డీఎంకే సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందో.. లేక తోసిపుచ్చుతుందో చూడాలి.

08:05 - July 25, 2017

హైదరాబాద్ : మరో సర్వేకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో అస్తవ్యస్థంగా ఉన్న భూముల లెక్కలను సరిచేయడానికి త్వరలో సమగ్ర భూ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగష్టు 15 తర్వాత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో భూముల వివరాలపై సమగ్రసర్వేకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భూమి ఎంత ఉంది.ఎవరి పేరుపై...రికార్డ్ లు ఏమి చెప్తున్నాయి. అనే విషయాల పై సర్వే చేయనున్నరూ...దేశంలో మరే రాష్ట్రంలో కూడా జరగని విధంగా భూమి రికార్డులన్నీ సక్రమంగా నిర్వహించే స్పెషల్ డ్రైవ్ ప్రారంభించబోతుంది ప్రభుత్వం.

భూ వివాదాలు..
ప్రస్తుతం రెవెన్యూ శాఖ వద్ద, వ్యవసాయాధికారుల వద్ద భూమి రికార్డులున్నాయి. కొన్ని భూములు విషయంలో వివాదాలున్నాయి. వివాదాలను పరిష్కరించడంతో పాటు, ఏ భూమి ఎవరిది అనే విషయంలో ఈ స్పెషల్ డ్రైవ్ లో స్పష్టత ఇస్తారు. తెలంగాణలోని వ్యవసాయ భూముల రికార్డులన్నీ సరిచేస్తారు. ప్రతీ ఇంచు భూమిపై ఖచ్చితమైన వివరాలు తేల్చనున్నారు. ఇక తెలంగాణలో భూమి వివాదాలే ఉండని పరిస్థితి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి నిజాం కాలంలో తప్ప..తర్వాత మరెప్పుడూ భూ రికార్డుల విషయంలో ఇంత పెద్ద సర్వే జరగలేదని .. అధికారులు అంటున్నారు.

నిరుద్యోగుల ఎంపిక..
సమగ్ర భూ సర్వే కోసం 15వేల మంది నిరుద్యోగ యువకులను ఎంపిక చేయనున్నారు.. వీరికి నెలకు 20 వెల జీతం ఇవ్వబోతున్నారు. భూమి వివరాలను ప్రొఫార్మాలో ఎలా నమోదు చేయాలన్న దానిపై వీళ్లకు ముందస్తుగా శిక్షణ ఇస్తారు. ఎవరైనా తప్పుడు వివరాలు నమోదు చేయకుండా సర్వే చేసే వారి నుంచి ముందుగానే అఫిడవిట్‌కూడా రాయించుకుంటామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హరితహారం కార్యక్రమం ఆగష్టు 15వరకు జరగనున్నందున ఆతర్వాతే ల్యాండ్‌ సర్వే చేపడతామని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఈలోపు సర్వే నిర్వహణ , అభ్యర్థులకు ట్రైనింగ్ ఏ విషయాలపై ఇవ్వాలి.. ఎన్ని రోజుల్లో సర్వే పూర్తి చేయాలి..? వివరాల నమోదుకు ప్రఫార్మా ఎలా ఉండాలి.. ? అనే అంశాలపై కసరత్తు పూర్తిచేస్తామంటున్నారు.

కంప్యూటర్లలో నిక్షిప్తం..
సర్వే నిర్వహించే సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం లేదా ఆ ఊళ్లో మెయిన్ సెంటర్లలో భూముల విరాలు ఉంచుతారు. వివాదాలు, పొరపాట్లు ఉన్న భూముల విషయంలో క్షేత్రస్థాయిలో గ్రామ రైతు సంఘాల సమక్షంలో సమగ్రంగా, సంపూర్ణంగా విచారణ జరిపి వాస్తవాల ఆధారంగా ఏ భూమి ఏ రైతుదో తేల్చేస్తామంటున్నారు. సర్వే పూర్తిఅయిన తర్వాత కొత్తగా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ రైతుకు, పాస్ పుస్తకానికి యూనిక్ కోడ్ ఇస్తారు. ఆ వివరాలన్నీ కంప్యూటర్ లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు భూమి కొన్నా, అమ్మినా, పేరు మార్పిడీ జరిగినా, వారసులకు దక్కినా.. ఆ వివరాలన్నీ వెంటనే అన్ని కంప్యూటర్లలో, రికార్డుల్లో నమోదయ్యే విధంగా యంత్రాంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. సర్వే తర్వాత భూముల వివరాల ఆధారంగా ఇంతకు ముందే ప్రకటించిన ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడి పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణియించింది. అయితే వందల ఏళ్లుగా అస్తవ్యస్థంగా తయారైన భూముల వివరాలను తేల్చడం అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలు చోట్ల భూములు బినామీల వ్యవహారంలో ఉండటంతో సమగ్ర సర్వే ఎంతవరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

08:03 - July 25, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో... విద్యార్థులు కదం తొక్కారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటు చేసుకుంది. అలాగే కడపలోని కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకుని.. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గుంటూరు జిల్లాలోనూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి... ఖాళీ ప్లేట్లతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జిల్లా పరిషత్‌ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. అనంతపురంలో విద్యార్థులు తమ సమస్యలు తీర్చాలంటూ కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు.. ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన విద్యార్థులను .. పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.. పోలీసుల లాఠీచార్జ్‌ నిర్వహించడంతో.. విద్యార్థులకు గాయాలయ్యాయి.

పలువురు అరెస్టు..
రాజమండ్రిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో... ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్‌లపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. కాకినాడలోని కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు మహాధర్నా చేశారు. సంక్షేమ హాస్టల్స్‌ మూసివేత తగదంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా.. ఏలూరు కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు.

ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్న విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. తొలుత జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా.. పోలీసులు..విద్యార్థులను అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే విజయనగరంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి.. వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మూసివేసిన వసతి గృహాలను తెరిపించాలని.. మెస్‌ చార్జ్‌లు పెంచాలని.. లేదంటే... ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.

07:19 - July 25, 2017

విజయవాడ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిపారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. స్పిల్‌ వే చానల్‌పై నిర్మించ తలపెట్టిన కేబుల్‌ వంతెన డిజైన్లను వచ్చే నెల మొదటివారం నాటికి పూర్తి చేయాలని పోలవరం నిర్మాణ పురోగతిపై నిర్వహించిన సమీక్షలో సూచించారు.

రెండు రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పూర్తి..
పోలవరం ప్రాజెక్టులో వివిధ పనుల పురోగతిని అధికారులు చంద్రబాబుకు వివరించారు. రెండు రేడియల్‌ ఫ్యాబ్రికేషన్‌ గేట్లు పూర్తైన అంశాన్ని ప్రస్తావించారు. డయాఫ్రం వాల్‌ నిర్మాణం పనులు 15.8 మీటర్ల ఎత్తున పూర్తి చేసినట్టు సీఎం దృష్టికి తెచ్చారు. స్పిల్‌వేతోపాటు అప్రోచ్‌ చానల్‌, లెఫ్ట్‌ ఫ్లాంక్‌, పైలెట్‌ చానల్‌ పనుల పురోగతిని తెలుసుకున్న చంద్రబాబు, పనులు వేగాన్ని పెంచాలని ఆదేశించారు. స్పిల్‌వే చానల్‌పై నిర్మించతలపెట్టిన వంతెన డిజైన్లను ఆగస్టు మొదటివారానికి ఇటలీ నిపుణులకు ముఖ్యమంత్రి సూచించారు.

ముచ్చుమర్రి ఎత్తిపోతలకు ఆగస్టు 1 నుంచి నీరు..
తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతలతోపాటు, కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి లిఫ్టు ఇరిగేషన్‌ స్కీముకు నీటి విడుదల అంశాపై చంద్రబాబు సమీక్షించారు. వచ్చే నెల 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభ తేదీని ఖరారు చేసిన విషయాన్ని సీఎం అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే పంపులు అందుబాటులోలేవని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా, బీహెచ్‌ఈఎల్‌ చైర్మన్‌తో మాట్లాడి వచ్చే నెల మొదటివారానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆగస్టు 1 నుంచి నీరు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ప్రాజెస్టులు, పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించాని అధికారులకు సూచించారు.

అనంతపురం జిల్లాలోని 18 మండలాల్లో కరవు..
మరోవైపు అనంతపురం జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై కూడా చంద్రబాబు సమీక్షించారు. జిల్లాలోని 18 మండలాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లతో సన్నద్ధం కావాలని ఆదేశించారు. రెయిన్‌ గన్లు, మొబైల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను విస్తృతం చేయాలని సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాయలసీమలో మరో రెండు, మూడు వారాలు పొడివాతావరణం నెలకొనే అవకాశం ఇస్రో నివేదించిన నేపథ్యంలో కరవు నివారణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

07:15 - July 25, 2017

తూర్పుగోదావరి : ప్రశాంతంగా ఉండే కోనసీమ గంభీరంగా మారిపోయింది. వేలాది మంది పోలీసుల పహారాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాపు ఉద్యమనేత ముద్రగడ చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కోనసీమ పోలీస్‌ పహరాలోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను కోనసీమకు రప్పించారు. ప్రత్యేకంగా 130 ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలు కోనసీమలో తిష్టవేశాయి.

పాదయాత్రకు అనుమతి లేదన్న ప్రభుత్వం..
బుధవారం చలో అమరావతి జరిపితీరతామని ముద్రగడ పద్మనాభం తేల్చి చెబుతుండగా.. పాదయాత్రకు అనుమతి లేదని.. హోం మంత్రి, డీజీపీ పదేపదే చెబుతున్నారు. ఈనేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 6వేల మంది పోలీసులు మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గండేపల్లి, పెద్దాపురం మండలాల్లో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఏకంగా వెయ్యిమంది పోలీసులు పహరా కాస్తున్నారు. అడుగుడుగునా సీసీకెమెరాలతో నిఘాపెట్టారు. గ్రామంలోకి వచ్చే టూవీలర్స్‌సహా అన్నీ వాహనాలను ఆపి తినఖీలు నిర్వహిస్తున్నారు. కొత్త వ్యక్తులు గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ముద్రగడను ఎవరెవరు కలుస్తున్నారు అనే దానిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చివరికి కిర్లంపూడిలో మీడియాపైకూడా అనధికారికంగా ఆంక్షలు పెట్టేశారు.

బుద్ధి చెప్పాలన్న వీహెచ్..
కాపులను మోసం చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎంపీ వి.హనమంతరావు అన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన 'చలో అమరావతి' పాదయాత్ర సంఘీబావ సభకు వీహెచ్‌ హాజరయ్యారు. ముద్రగడ పాదయాత్ర ను అడ్డుకోడానికి ప్రభుత్వం నిర్బంధకాండను అమలు చేస్తోందని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తుంటే.. కాపు ఉద్యమ నేతలు మాత్రం పాదయాత్ర జరిపితీరతాం అంటున్నారు. దీంతో కోనసీమలో ఎపుడు ఏం జరుగుతుందోఅనే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.

07:11 - July 25, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌తో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని తేల్చిచెప్పారు సినీ హీరో నవదీప్‌. సినీ పరిశ్రమలో చాలామందికి డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు. నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ కీలక సమాచారాన్ని రాబట్టింది. కెల్విన్‌తోనూ తనకు ఎలాంటి లింకులు లేవని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను సిట్‌ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 గంటల సమయంలో సిట్‌ కార్యాలయానికి వచ్చిన నవదీప్‌పై అధికారులు వరుస ప్రశ్నలు సంధించారు. ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపైనే ఆరా తీశారు. ఒకే ప్రశ్నను పలు కోణాల్లో సంధించి తికమకపెట్టారు. 11 గంటలకు పైబడి సిట్‌ అధికారులు నవదీప్‌ను విచారించి కీలక సమాచారం రాబట్టారు.

సినీ పరిశ్రమలో డ్రగ్స్ సరఫరా..
డ్రగ్స్‌తో తనకు ప్రత్యక్ష సంబంధం లేదన్న నవదీప్‌..మీడియేటర్ల ద్వారా సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ సరఫరా అవుతుందని చెప్పారు. టాలీవుడ్‌లో పలువురికి డ్రగ్స్‌తో ప్రమేయం ఉన్న విషయాన్ని వెల్లడించారు. అయితే కెల్విన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని..అతని అరెస్ట్‌కు వారం ముందు అతనితో ఈవేంట్‌ చేయించినట్లు తెలిపారు. ఈవెంట్‌కు సంబంధించి కెల్విన్‌తో అనేకసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్‌కు వివరించారు. సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులతో కెల్విన్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపెట్టారు. ముఖ్యంగా డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారు మారుపేర్లతో చలామణి అవుతుంటారని చెప్పుకొచ్చారు. ఇక విచారణలో భాగంగా టింకు అనే యువకుడి పాత్రను కూడా నవదీప్‌ సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. భోజన విరామం తర్వాత నవదీప్‌ను వెంట వెంటనే ప్రశ్నలు సంధిస్తూ కావాల్సిన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. నవదీప్‌ విచారణలో కీలకమైన సమాచారాన్ని సిట్‌ అధికారులు రాబట్టడంతో ఇంకా కొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సమాచారం ఇచ్చానన్న నవదీప్..
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్‌.. డ్రగ్స్‌కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని సిట్‌ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. ఈవెంట్‌ మేనేజర్ల గురించి వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. తనపై విచారణ అధికారులు ఎలాంటి ఒత్తిడి చేయలేదన్నారు. అవసరమేతే మళ్లీ కాల్‌చేస్తామని అధికారులు చెప్పారన్నారు. సిట్‌ విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవుతానని చెప్పారు. సిట్‌ విచారణలో భాగంగా నవదీప్‌..రక్తనమూనాలు, చేతిగోళ్లు, తల వెంట్రుకలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఉస్మానియా వైద్యులు శాంపిల్స్‌ తీసుకోకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. మంగళవారం ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను సిట్‌ అధికారులు విచారించనున్నారు.

బీజేపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఉదయం 9.30గంటలకు జరిగే ఈ సమావేశంలో పార్టీ అగ్ర నేతలు పాల్గొననున్నారు.

ఢిల్లీకి వెళ్లనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు హస్తినకు పయనం కానున్నారు. భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు పాల్గొననున్నారుర.

11గంటల పాటు నవదీప్ విచారణ..

హైదరాబాద్ : సినీ నటుడు నవదీప్ విచారణ సోమవారం రాత్రి ముగిసింది. సుమారు 11గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. సిట్ విచారణకు తాను సహకరించడం జరిగిందని, విచారణ కోసం ఎప్పుడూ పిలిచినా వస్తానని సిట్ కు తెలియచేసినట్లు తెలిపారు.

 

ఛార్మీ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : నేడు హైకోర్టులో సినీ నటి ఛార్మీ వేసిన పిటిషన్ విచారణకు రానుంది. డ్రగ్స్ కేసులో ఆమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తన హక్కులకు భంగం కలుగుతుందని..ఇతరత్రా కారణాలు చూపుతూ నటి ఛార్మీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సిట్ ఎదుట హాజరు కానున్న ఆర్డ్ డైరెక్టర్..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈయన్ని సిట్ అధికారులు విచారించనున్నారు.

కొనసాగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై నేటి సమావేశంలో చర్చ జరగనుంది.

నేడు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : నేడు భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.15కి ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాన మంత్రి మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు పాల్గొననున్నారు.

Don't Miss