Activities calendar

26 July 2017

బీహార్ లో బలబలాలు..

పాట్నా : రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బలబలాలు ఇలా ఉన్నాయి...బీహార్ అసెంబ్లీ మొత్తం స్థానాలు 243. సీఎం పదవి చేపట్టడానికి కనీస మెజార్టీ 122 స్థానాలు. జేడీయూ-71, ఆర్జేడీ- 80, బీజేపీ- 53, కాంగ్రెస్ - 27, ఎల్‌జేపీ- 2,ఇతరులు - 10. 

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న లాలూ..

పాట్నా : రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. నితీష్ కుమార్ రాజీనామా ప్రకటన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

నితీష్ కు బీజేపీ మద్దతు..

పాట్నా : ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నితీష్ కు మద్దతు తెలియచేస్తామని బీజేపీ నేత సుశీల్ మోడీ వెల్లడించారు. కాసేపటి క్రితం సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

 

మమైత్ విచారణకు సిట్ సిద్ధం..

హైదరాబాద్ : టాలీవుడ్ నటి మమైత్ ఖాన్ విచారణకు సిట్ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఆమెను విచారించనున్నారు. బుధవారం ఛార్మీని సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. 

కిర్లంపూడిలో బందోబస్తు..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడను గృహ నిర్భందం చేశారు. కాపుల రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పాదయాత్ర చేయాలని అనుకున్న ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాగైనా పాదయాత్ర చేస్తానని ముద్రగడ పేర్కొన్నారు. 

21:32 - July 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యంపై సిపిఎం ఆందోళనకు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు 6 అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టనున్నట్లు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. రైతుల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, జిఎస్‌టి అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, ప్రయివేటీకరణ, మహిళలకు రిజర్వేషన్లపై ఆందోళన చేపట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో నిర్ణయించిందని ఏచూరి చెప్పారు. 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని, పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఉండేలా చూస్తామని ప్రధాని మోది ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులు తమ పంటలను నేరుగా ప్రభుత్వానికి అమ్మేలా చట్టాన్ని తీసుకురావాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

21:30 - July 26, 2017

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండుతో పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ముద్రగడ సొంతూరు కిర్లంపూడితోపాటు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్రికత్తలు నెలకొన్నాయి. ముద్రగడ పాదయాత్రతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో 24 గంటలపాటు గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే కాపుల రిజర్వేషన్ల కోసం నిరవధిక ఉద్యమానికి పిలుపు ఇచ్చిన తాను ఎప్పుడైనా పాదయాత్ర చేసితీరతాని ముద్రగడ ప్రతిజ్ఞ చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండుతో పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పాదయాత్రకు ముద్రగడ అనుమతి తీసుకోలేదు. పైగా గతేడాది జనవరిలో కాపు రిజర్వేషన్‌ ఉద్యమం హింసాత్మకంగా మారి, భారీ విధ్వంసానికి దారితీసింది. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముద్రగడ కాలు బయటపెడితే కాపులను అదుపుచేయడం కష్టమని భావించిన పోలీసులు కిర్లంపూడిని అన్ని దిశలా దిగ్బంధించేశారు.

కిర్లంపూడి బందీ..
పోలీసు పదఘట్టనల మధ్య కిర్లంపూడి బందీగా చిక్కుకుపోయింది. వీధివీధినా ఖాకీల బూట్ల చప్పుళ్లు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌, చీమచిటుక్కమన్నా ఇట్టే పసిగట్టే నిఘా నేత్రాలు, డ్రోన్‌ కెమెరాలు, బాడీ కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు... ఇలా కిర్లంపూడి గ్రామం యావత్తూ నిఘానీడలోకి వెళ్లిపోయింది. కాపు నేతల అరెస్టులు, నోటీసులు, బైండోవర్‌ కేసులతో కిర్లంపూడి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. గ్రామంలో సీఆర్‌పీసీలో 151 సెక్షన్‌తోపాటు పోలీసు చట్టంలోని సెక్షన్‌ 30, 144 సెక్షన్ల కింది నిషేధాజ్ఞలు విధించారు. వ్యాపారులు షాపులను స్వచ్ఛంధంగా మూసివేశారు. గ్రామంలోకి ఎవరినీ అనుమతించలేదు. గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఎవరికీ పర్మిషన్‌ ఇవ్వలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ముద్రగడను హౌస్‌ అరెస్టు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పీ విశాల్‌ గున్నీ తెలిపారు. మరోవైపు నిర్బంధాలు, అవరోధాలు తన ఉక్కు సంకల్పాన్ని ఆపలేవని, ఎప్పుడైనా పాదయాత్ర చేసిన తీరతాని ప్రతిజ్ఞ చేశారు ముద్రగడ.

పార్టీ నేతల స్పందన..
ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచడంపై వివిధ పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. విపక్షాలు ఈ చర్యను తప్పుపట్టగా, అధికార టీడీపీ సమర్థించుకుంది. ముద్రగడను హౌస్‌ అరెస్టు చేయడం సరికాదని వైసీపీ అధినేత జగన్‌ ట్విట్టర్‌లో ప్రభుత్వంపై మండిపడ్డారు. గృహ నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరితే నిర్బంధిస్తారా ? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. కాపుల రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గు మాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా
మండిపడ్డారు.

గంటా..చిన రాజప్పల స్పందన..
మరోవైపు ముద్రగడ పాదయాత్రపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. కాపుల సంక్షేమం, అభివృద్ధికి గతంలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలను టీడీపీ అమలు చేస్తోందన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ముద్రగడను వైసీపీ అధినేత జగన్‌ రెచ్చగొడుతున్నారని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామాంజనేయులు కూడా ముద్రగడపై మండిపడ్డారు. పాదయాత్రపై పునరాలోచన చేయాలని ప్రభుత్వంలోని కాపు మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లు సూచిస్తున్నా, ముద్రగడ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పడంతో కిర్లంపూడిలో పోలీసు బందోబస్తును కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

21:27 - July 26, 2017

విశాఖపట్టణం : టీడీపీ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. విశాఖలోని ప్రగతి మైదానంలో పేదలకు ఆయన ఇళ్ల క్రమబద్దీకరణ పట్టాలను పంపిణీ చేశారు. ఈమేరకు 21, 230 కుటుంబాలకు క్రమబద్దీకరణ పట్టాలు అందజేశారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టించిందని మండిపడ్డారు. ఆ కేసులన్నిటినీ ఎత్తివేస్తామని పేదలకు ఆయన హామీనిచ్చారు. 

21:25 - July 26, 2017

హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు. ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ రెండో రోజూ ఇదేపనిపై పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. మోదీతో భేటీ అయిన కేసీఆర్‌... అసెంబ్లీ స్థానాల పెంపు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులపై చర్చించారు. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను వరుసగా కలిశారు. మొదటగా ఏన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. కేసీఆర్‌ తనను మర్యాదపూర్వకంగానే కలిశారని.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తనకు మద్దతిస్తోందని వెంకయ్య అన్నారు.

అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈభేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రక్షణ భూముల అంశం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు సహా ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపుపైనా కేసీఆర్‌ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశంతోపాటు రక్షణ భూముల్లో ప్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

జైట్లీతో..
సాయంత్రం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై ఆయనతో చర్చించారు. జీఎస్టీ నుంచి గ్రానైట్‌ రంగాన్ని మినహాయించాలని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన దాదాపు 450 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలని విన్నవించారు. మిషన్‌ భగీరథ, జల వనరులశాఖకు సంబంధించిన ఆర్థిక అంశాలను జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి కేసీఆర్‌ తన ఢిల్లీ టూర్‌లో తెలంగాణలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టారు. 

21:23 - July 26, 2017

హైదరాబాద్ : దాదాపు ఆరు గంటలు...అనేక రకాల అనుమానాలు...సేకరించిన ఆధారాలు..వీటితో నటి ఛార్మీని సిట్ అధికారుల బృందం విచారణ చేసింది...కీలక సమాచారం రాబట్టిన అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఐదు గంటల లోపే ఇంటికి పంపించారు...మరోవైపు డ్రగ్స్ సరఫరాలో కీలకమైన వ్యక్తిగా నెదర్లాండ్ దేశానికి చెందిన యువకుడిని అరెస్టు చేశారు..ఆ డ్రగ్ డీలర్ కాల్‌డేటాలో ఎవరితో సంబంధాలున్నాయో బయటపడనున్నాయి.

నటి ఛార్మీ విచారణ పూర్తి...
అనేక అనుమానాలు..సిట్ బృందం విచారణ సరిగాలేదంటూ హైకోర్టును ఆశ్రయించి డ్రగ్స్ కేసులో విచారణకు రకరకాల నిబంధనలు పెట్టాలంటూ కోరిన సినీ నటి ఛార్మీ ఎట్టకేలకు సిట్ ముందు హాజరయింది... హైకోర్టు ఆదేశానుసారమే ఆమెను విచారించిన సిట్ అధికారులు సాయంత్రం ఐదు గంటల లోపే పంపించారు...అయితే సిట్ కార్యాలయానికి ఉదయం పది గంటలకు వచ్చిన ఛార్మీని సుమారు ఆరుగంటలపాటు మహిళా అధికారుల బృందం విచారణ చేసింది...ఆమెను విచారించేందుకు నలుగురు మహిళా అధికారులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం సిట్‌ సమక్షంలోనే ఛార్మికి పలు రకాల ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు...

కెల్విన్‌ సెల్‌ఫోన్లో ఛార్మీ నంబర్..
చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సీఐలు విజలక్మీ, శ్రీలత, రేణుకలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం విచారించింది...కెల్విన్ మొబైల్ లో ఆమె పేరు చార్మి దాదా పేరుతో ఉండడం, ఇద్దరి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా కన్వర్జేషన్, జ్యోతిలక్ష్మీ ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగడం వంటి అంశాలపై సిట్ మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనా ఆరా తీశారు...మొదట్లో తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ తర్వాత ఛార్మీ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

శాంపిల్స్‌ సేకరించని సిట్...
హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఐదు గంటల లోపు విచారించి వదిలేసిన సిట్ అధికారులు ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేది ఉందని భావిస్తున్నారు..ఈ క్రమంలోనే ఆమెతో మరోసారి అవసరమైతే రావాల్సి ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది...ఇక ఛార్మీ నుంచి ఎలాంటి శాంపిల్స్‌ సేకరించలేదని తెలుస్తుంది...ఇక డ్రగ్స్‌ కేసులో రేపు ముమైత్‌ ఖాన్‌, ఆ మర్నాడు నటుడు రవితేజను సిట్ బృందాలు విచారించనున్నాయి...

మరో కీలకవ్యక్తి అరెస్టు..
అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు మరో కీలక నిందితుడిని అరెస్టు చేశారు.. నెదర్లాండ్స్‌కు చెందిన మైక్‌ కమింగను అదుపులోకి తీసుకుని అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు...33 ఏళ్ల మైక్‌ కమింగ నాలుగు సార్లు భారత్‌కు వచ్చాడని, అతని వద్ద భారతీయ పాస్‌పోర్టు ఉందని, దాని గడువు ముగిసినా ఇంకా భారత్‌లోనే అతను ఉన్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్‌ తెలిపారు.

కమింగ కాల్‌డేటా పరిశీలిస్తున్న సిట్..
డ్రగ్స్ డీలర్‌ మైక్‌ కమింగను కోర్టులో హాజరుపరుస్తున్న అధికారులు అతని సెల్‌ఫోన్‌ డాటాను సేకరించారు..అందులో చాలా వరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు...మల్టీ నేషనల్‌ కంపెనీల ప్రతినిధుల నంబర్లున్నాయి...ఇక వీరికి డ్రగ్స్ సరఫరా చేయడంలో కమింగనే ప్రధాన కీలకమైన వ్యక్తిగా సిట్ అనుమానిస్తుంది...మరోవైపు కమింగకు టాలివుడ్‌లో కూడా పరిచయాలున్నట్లు అనుమానిస్తున్నారు..కాల్‌ డేటా ఆధారంగా మరికొన్ని విషయాలు బయటపడనున్నాయి.

21:20 - July 26, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లా పల్లెర్లలో నరేష్‌ అస్థిపంజరం లభించింది. స్వాతిని కులాంతర వివాహం చేసుకున్న నరేష్‌ను.. అమ్మాయి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చంపి కాల్చి బూడిదను మూసీలో కలిపానంటూ పోలీసులను తప్పుదోవపట్టించాడు. మరోవైపు విచారణలో పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా పల్లెర్లలో కనిపించిన అస్థిపంజరం తమ కుమారుడు అంబోజి నరేష్‌దే అంటున్నారు అతని తల్లిదండ్రులు. అయితే అది నరేష్‌దో ? కాదో? డీఎన్‌ఏ పరీక్షల అనంతరం తెలుస్తుందన్నారు భువనగిరి డీఎస్పీ. పంచనామా చేసి డీఎన్‌ఏ పరీక్షలకు పంపిస్తామని ..పరీక్షల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని ఆయన చెప్పారు. 

21:19 - July 26, 2017

పాట్నా : బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వ్యవహారంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో నితీష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో తాను పనిచేయలేనని... అంతరాత్మ ప్రబోదం ప్రకారం తానీ నిర్ణయానికి వచ్చినట్లు నితీష్‌ తెలిపారు. బీహార్ మహాకూటమి బీటలు వారింది. మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి పదవికి నితీష్‌ రాజీనామా చేశారు. గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠిని కలిసి తన రాజీనామాని అందజేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు మిత్రపక్షాలు ఆర్జేడి, కాంగ్రెస్‌లకు ముందస్తు సమాచారమిచ్చారు.

మీడియాతో నితీష్..
మహాకూటమి ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తనవంతు ప్రయత్నం చేశానని నితీష్‌ తెలిపారు. డిప్యూటి సిఎం తేజస్వీ యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆర్జేడి స్పందించలేదన్నారు. తాను ఎవరినీ రాజీనామా కోరలేదని... తేజస్వీపై వచ్చిన ఆరోపణలపై వివరణ కోరానని నితీష్‌ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించలేనని తెలిపారు. అంతరాత్మ ప్రభోదం ప్రకారం రాజీనామా తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని నితీష్‌కుమార్ చెప్పారు. లాలూతోగానీ, ఆర్జేడీతోగానీ తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుకు తాను మద్దతు ప్రకటిస్తే.. ఆ విషయంలోనూ తనపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో మహాకూటమిని నిలబెట్టేందుకు చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదన్నారు. తన రాజీనామా గురించి లాలూకు, కాంగ్రెస్‌ బిహార్‌ చీఫ్‌ సీపీ జోషీకి ముందే సమాచారమిచ్చానని చెప్పారు. ఓ ఎజెండా లేకుండా విపక్షాలు మనుగడ సాధించలేవని నితీష్‌ అన్నారు.

సంకీర్ణ ప్రభుత్వం..
నితీష్‌కుమార్‌ రాజీనామా నేపథ్యంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. నితీష్‌కు బిజెపి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న నితీష్‌కు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్రమోది ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బీహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్‌ ఫిగర్‌ 122. ఆర్జేడికి 80, జెడియుకు 71, కాంగ్రెస్‌కు 27 స్థానాలుండగా...బిజెపికి 53 స్థానాలు, ఇతరులకు 5 స్థానాలున్నాయి. 

లాలూ ఇంట్లో మీటింగ్..

బీహార్ : లాలూ ప్రసాద్ యాదవ్ నివాసంలో పార్టీ నేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో రబ్రీ దేవీ, తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఆర్జేడీ కీలక నేతలు పాల్గొన్నారు. 

రాజ్యసభకు స్మృతి ఇరానీ..అమిత్ షా పోటీ..

ఢిల్లీ : రాజ్యసభకు స్మృతి ఇరానీ..అమిత్ షాలు పోటీ చేస్తారని బీజేపీ పార్టీ నేత జేపీ నడ్డా మీడియాకు తెలిపారు. కాసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుజరాత్ రాష్ట్రం నుండి అమీత్ షా, స్మృతి ఇరానీలు పోటీ చేస్తారని వెల్లడించారు. 

రాజ్యసభకు అమీత్ షా..?

ఢిల్లీ : బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా రాజ్యసభకు పోటీ చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాసేపటి క్రితం ముగిసిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చించారు. అమీత్ షాను రాజ్యసభకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

నితీష్ రాజీనామాపై కాంగ్రెస్ అసంతృప్తి..?

ఢిల్లీ : బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

20:39 - July 26, 2017

వట్టి సిట్టింగులేనా ? తేల్చేదుందా ? ప్రస్తుతం డ్రగ్ కేసులో ఎక్జైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సాగిస్తున్న విచారణపై ప్రశ్నలు అనేకం వస్తున్నాయి. గతంలోనే అనేక కేసుల్లో జరిగిన సిట్ విచారణ ఫలితాల వల్ల కలుగుతున్న అనుమానాలు. మరి ఈ కేసు కూడా ప్రచారానికి ఉపయోగపడి పత్తా లేకుండా పోతుందా ? నిజాలు నిగ్గు తేల్చి దోషులను పట్టిస్తుందా ? ఈ అంశంపై ప్రత్యేక కథనం..పూర్తి విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి...

రాష్ట్రపతి పాలన కోరుకోవడం లేదు - లాలూ..

పాట్నా : మహా కూటమి నుండి తాము బయటకు రాలేదని లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. బీహార్ లో రాష్ట్రపతి పాలన కోరుకోవడం లేదని, ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ కలిసి కొత్త నేతను ఎన్నుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కొడుకును చూసి నితీష్ భయపడ్డారని, అవినీతి కంటే హత్యలు చేయడం మహానేరమని లాలూ వ్యాఖ్యానించడం గమనార్హం. నితీష్ పై హైకోర్టులో మర్డర్ కేసు నడుస్తోందని..హత్య కేసులో బయటపడనని నితీష్ కు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ..సంఘ్ పరివార్ తో నితీష్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. నితీష్ రాజీనామా వెంటనే మోడీ ట్వీటే దీనికి నిదర్శనమన్నారు. 

20:33 - July 26, 2017

పాట్నా : బీహార్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ? ఎన్నికలకే నితీష్ మొగ్గు చూపుతారా ? నితీష్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా ? లాలూ - నితీష్ స్నేహహస్తం బెడిసికొట్టిందా ? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మహాకూటమి విచ్చినమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంతేగాకుండా నితీష్ - లాలూ స్నేహహస్తం కథ కంచికే అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

లాలూ..నితీష్ మద్య విబేధాలు..
గత కొన్ని రోజులుగా నితీష్ - లాలూ మధ్య విబేధాలు పొడచూపాయి. లాలూ కుమారుడు డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ పై పలు అవినీతి ఆరోపణలు వస్తుండడంపై సీఎం నితీష్ స్పందించారు. తేజస్వీ యాదవ్ రాజీనామా చేయాలని నితీష్ కోరినట్లు..కుమారుడి రాజీనామాకు లాలూ నో చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రం నితీష్ రాజీనామా చేసి గవర్నర్ కు సమర్పించారు.

మీడియాతో నితీష్..
సంకీర్ణ ధర్మాన్ని పాటించేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించానని, సంకీర్ణ భాగస్వామ్యంలోని కాంగ్రెస్ తో కూడా చర్చలు జరిపామని రాజీనామా చేసిన అనంతరం నితీష్ పేర్కొన్నారు. కొన్ని సంఘటనల కారణంగా తాను పని చేసే వాతావరణం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నడపడం కష్టంగా ఉందన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసం పని చేశానని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నించానని చెప్పారు. బీహార్ ప్రయోజనాల కోసమే తన పదవికి రాజీనామా చేశానని చెప్పారు. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తన నిజాయతీని నిరూపించుకోవాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని తేజస్విని అడిగానని..రాజీనామా చేయ్యాలని చెప్పలేదన్నారు.

స్వాగతించిన మోడీ...
నితీష్ రాజీనామా చేసిన కొద్దినిమిషాల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. నితీష్ ను ఆయన అభినందించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు అభినందనలు తెలియచేస్తున్నట్లు ట్వీట్ లో మోడీ పేర్కొన్నారు. దీనితో నితీష్ కు బీజేపీ స్నేహహస్తం అందిస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి.

బీజేపీ పార్లమెంటరీ భేటీ..
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. బీహార్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించారు. మధ్యంతర ఎన్నికలు కోరుకోవడం లేదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. జేడీయూకు మద్దతివ్వాలా ? వద్దా ? ఇతర అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

నితీష్ నిర్ణయాలకు లాలూ వ్యతిరేకత..
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను లాలూ వ్యతిరేకిస్తున్నారు. తన కొడుకును చూసి నితీష్ భయపడ్డారని, అవినీతి కంటే హత్యలు చేయడం మహానేరమని లాలూ వ్యాఖ్యానించడం గమనార్హం. నితీష్ పై హైకోర్టులో మర్డర్ కేసు నడుస్తోందని..హత్య కేసులో బయటపడనని నితీష్ కు తెలుసని పేర్కొన్నారు. బీజేపీ..సంఘ్ పరివార్ తో నితీష్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. నితీష్ రాజీనామా వెంటనే మోడీ ట్వీటే దీనికి నిదర్శనమన్నారు. 

20:19 - July 26, 2017

యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన నరేష్, స్వాతి కేసులో మరో దిగ్ర్భాంతి కలిగించే విషయం వెలుగు చూసింది. నరేష్ అస్థిపంజరం వెలుగు చూడడం కలకలం రేపుతోంది. నరేష్ ను హత్య చేసి కాల్చి చంపిన అనంతరం బూడిదను మూసీ నదిలోకి వేసినట్లుగా చెప్పిన స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అబద్దాలేనని తెలుస్తోంది. స్వాతి - నరేష్ ప్రేమ..పెళ్లి..విషాదంగా ముగిసిన సంగతి తెలిసిందే. దీనిపై టెన్ టివి వరుసగా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా అస్థిపంజరం లభ్యం కావడంపై నిజ నిజాలు తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:58 - July 26, 2017

అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే దర్శకుడు ఎవరంటే 'శేఖర్ కమ్ముల' అని చెప్పవచ్చు. ఆయన తీసిన హ్యాపీడేస్ ఎలాంటి విజయం సృష్టించిందో తెలిసిందే. కొంతకాలంగా హిట్ లేని ఈయనకు 'ఫిదా' సినిమా ఘన విజయం తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 'వరుణ్ తేజ', 'సాయి పల్లవి' లు జంటగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో నిరాదరణకు గురైన తెలంగాణ యాస, భాషను తెలుగు వారందరూ ఇష్టపడేంతగా చిత్రీకరించిన శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెన్ టివి ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:56 - July 26, 2017

శేఖర్ కమ్ముల..అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే దర్శకుడు. తాజాగా ఆయన 'ఫిదా' సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. 'వరుణ్ తేజ', 'సాయి పల్లవి' లు జంటగా నటించారు. ఈ సందర్భంగా టెన్ టివి ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. బాన్సువాడ..ప్రాంతానికి 'ఫిదా' అయిపోయానని పేర్కొన్నారు. చాలా భాగం అక్కడే షూటింగ్ జరిగిందని..అక్కడి కుటుంబాలు..వారు ఉన్న విధానం మరిచిపోలేనన్నారు. నిజామాబాద్ జిల్లాలోని చుట్టుపక్కల ప్రదేశాలను అందంగా తెరకెక్కించాలని చేశానన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కేకేను పరామర్శించిన లక్ష్మారెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న కేకేను ఆయన పరామర్శించారు. 

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని..ఆగస్టు 15 నుండి 31 వరకు దేశ వ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు 2018 ఏప్రిల్ లో హైదరాబాద్ లో నిర్వహించాలని..ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కమిటీ డిమాండ్ చేసింది. 

నితీష్ కు మోడీ అభినందనలు..

ఢిల్లీ : బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

షాతో టచ్ లో ఉన్న బీహార్ బీజేపీ అధ్యక్షుడు..

పాట్నా : పార్టీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోడీ టచ్ లో ఉన్నారు.

కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

ఢిల్లీ : బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపట్లో జరగబోతోంది. బీహార్ వ్యవహారాలపై బీజేపీ దృష్టి సారిస్తోంది. నితీష్ కు మద్దతుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

నితీష్ వ్యూహాలు..ఉత్కంఠ..

ఢిల్లీ : బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా ? మధ్యంతర ఎన్నికలకు వెళుతారా ? అనేది తెలియరావడం లేదు. నితీష్ వ్యూహాలు ఏమయి ఉంటాయనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. 

19:24 - July 26, 2017
19:18 - July 26, 2017
19:14 - July 26, 2017

పాట్నా : బీహార్ రాష్ట్రంలో రాజకీయం ముదిరిపోయింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆ నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా చేయాలని అనలేదన్న నితీష్..
గవర్నర్ కు రాజీనామా లేఖ ఇవ్వడం జరిగిందని, మహా కూటమి ధర్మాన్ని పాటించేందుకు శాయశక్తులా కృషి చేయడం జరిగిందని రాజీనామా చేసిన అనంతరం నితీష్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం పనిచేసే స్థితిలో లేదని, లాలూతో ఇక కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. తేజస్వీ తన నిజాయితీని నిరూపించుకోవాలని, తేజస్వీ నుండి వివరణ మాత్రమే కోరడం జరిగిందన్నారు. రాజీనామా చేయాలని కోరలేదని తేల్చిచెప్పారు.

తేజస్వీపై పలు ఆరోపణలు..
కొంతకాలంగా లాలూ - నితీష్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాలూ కుమారుడు డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్..నితీష్ మధ్య విబేధాలు పొడచూపాయి. తేజస్వీ యాదవ్ పై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనితో ఆయన రాజీనామా చేయాలని సీఎం నితీష్ కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని లాలూ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చివరకు బీజేపీ రంగంలోకి దిగి నితీష్ కు మద్దతు తెలియచేసినట్లు సమాచారం. దీనితో ఆయన రాజీనామకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
243 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆర్జేడీకి 80 మంది ఎమ్మెల్యేలు..జేడీయూకు 71 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గతంలో ఇరు పార్టీలు కలిసి ప్రభుత్వం స్థాపిస్తాయని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ఏ ప్రభుత్వం వస్తుందో వేచి చూడాలి. 

నగరంలో సీపీఎం 22వ జాతీయ మహాసభలు..

హైదరాబాద్ : నగరంలో సీపీఎం 22వ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. 2018 ఏప్రిల్ లో ఈ సభలు జరుగనున్నాయి. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత మహాసభలను విశాఖలో నిర్వహించిన సంగతి తెలిసిందే. 

నితీష్ రాజీనామా..

బీహార్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామాను గవర్నర్ కు సమర్పించారు. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారు. కొంతకాలంగా లాలూ - నితీష్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజీనామా చేయాలని నితీశ్ డిమాండ్ చేస్తుండగా లాలూ మాత్రం వ్యతిరేకించారు. 

18:46 - July 26, 2017

హైదరాబాద్ : ఇటీవలే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన స్వాతి తండ్రి శ్రీనివాస్ 'దృశ్యం' సినిమా చూపిస్తున్నాడా ? దృశ్యం సినిమాలో తన కూతురును కాపాడుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. కానీ శ్రీనివాస్ ఫక్తు అదే తరహాలో ప్రవర్తిస్తున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్వాతి నరేష్ ప్రేమ..పెళ్లి విషాదంతమైన సంగతి తెలిసిందే. నరేష్ ను హత్య చేసి తగులబెట్టి బూడిదను మూసీలో పారబోసినట్లు శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే.

పల్లెర్లలో..
తాజాగా నరేష్ దిగా భావిస్తున్న అస్థిపంజరం బయటపడడం కలకలం రేపుతోంది. పల్లెర్లలో ఇది బయటపడింది. నరేష్ ఇంటి నుండి వెళ్లిన సమయంలో వేసుకున్న డ్రెస్ ఆధారంగా అస్థిపంజరం ఖచ్చితంగా నరేష్ దని కుటుంబసభ్యులు, అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనితో శ్రీనివాస్ చెప్పినవన్నీ అబద్దాలేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఘటనా ప్రదేశానికి పోలీసులు, ఎమ్మార్వో, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రేమ..పెళ్లి విషాదాంతం..
నరేష్ - స్వాతిలు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి భరించలేకపోయాడు. కొన్ని మాటలు చెప్పి స్వాతిని వెనక్కి పిలిపించుకన్నాడు. కానీ నరేష్ మాత్రం కనిపించలేదు. దీనితో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణనను పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఈ నేపత్యంలో స్వాతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. దీనిపై టెన్ టివి వరుస కథనాలు ప్రసారం చేసింది.

టెన్ టివి కథనాలకు స్పందన..
పోలీసుల తీరుతో విసుగు చెందిన నరేష్‌ తల్లిదండ్రులు న్యాయం కోసం... సీపీఎం, ప్రజాసంఘాలతో పాటు 10టీవీని ఆశ్రయించారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కేసు డీజీపీ వరకు వెళ్లింది. హైకోర్టు అక్షింతల అనంతరం కేసును ఎల్బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వర్లుకు అప్పజెప్పడంతో కేసు ముందుకు కదిలింది. అయితే అప్పటికే పోలీసుల నిర్లక్ష్యం.. వేగంగా స్పందించకపోవడం వల్ల స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆత్మకూరు ఎస్సై శివనాగ ప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అలాగే.. భువనగిరి ఏసీపీ, డీసీపీతో పాటు.. చౌటుప్పల్‌ ఏసీపీ, రామన్నపేట, భువనగిరి సీఐలకు మెమోలు జారీ చేశారు.

పలు ఆధారాలు..
స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు మేజర్లు అయిన నరేష్‌-స్వాతిలు ముంబైలో పోలీసుల అనుమతితో వివాహం చేసుకున్నప్పటికీ.. ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ శివనాగప్రసాద్‌ వారిద్దరిని తిరిగి స్వగ్రామం వచ్చేటట్టు చేసిన రాయభారం ఇప్పటికే ఆధారాలతో సహా బయటపడింది. వారిద్దరూ వచ్చిన తర్వాత రామన్నపేట సీఐ శ్రీనివాస్‌ సమక్షంలో పంచాయతీ నిర్వహించి ప్రేమజంటను బలవంతంగా విడదీసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. 

18:35 - July 26, 2017

విజయవాడ : ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో నిరసనలు వెల్లువెత్తాయి. సమాచారం తెలిసిన వెంటనే కాపులు ఎక్కడికక్కడ రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారులను పలు చోట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. కాపు రిజర్వేషన్ల కోసం పాదయాత్ర తలపెట్టిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు అడ్డుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. దీన్ని నిరసిస్తూ.. ఏపీ ఆందోళనలతో హోరెత్తింది. ధర్నాలు, ర్తాస్తారోకోలతో దద్దరిల్లింది. కాపులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో కాపులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లా పీ గన్నవరం మండలం బోడిపాటివారిపాలెంలో నిరసన తెలిపిన మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పురుష పోలీసులు మహిళల చేయిపట్టుకుని లాగడం వివాదాస్పదమై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల దౌర్జన్యంతో కొందరు మహిళలు గాయపడ్డారు.

మహిళల పట్ల దురుసు..
విజయవాడలోనూ కాపు మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన వివాదాస్పదమైంది. ముద్రగడకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేపట్టిన కాపులను పోలీసులు అరెస్టు చేశారు. కొందిరిపై బైండోవర్‌ కేసులు పెట్టారు. ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. పోలీసుల ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా బైక్‌లపై కిర్లంపూడి వెళ్లేందుకు బయల్దేరిన యువకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని వెనక్కి తిప్పి పంపారు. కాపు ఐక్య ఉద్యమ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిని వ్యతిరేకిస్తూ కాపు నేతలు తమ ఇళ్ల వద్దే నిరసన వ్యక్తం చేశారు. ముద్రగడ గృహ నిర్బంధాన్ని నిరసిస్తూ పశ్చమగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపులు ఆందోళన చేశారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

అమరావతి..
ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతిని పోలీసులు దిగ్బంధించారు. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేతలు సచివాలయాన్ని ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో ముందస్తుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అమరావతి వ్యాప్తంగా పోలీసు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

18:32 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటి ఛార్మి సిట్‌ విచారణ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సుమారు ఆరున్నర గంట‌ల‌పాటు సిట్‌ అధికారుల విచారణ సాగింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సాయంత్రం 5గంటల లోపే విచారణను ముగించారు. ఆమెను విచారించేందుకు నలుగురు మహిళా అధికారులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక బృందం సిట్‌ సమక్షంలోనే ఛార్మిని విచారించింది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనా ప్రధానంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. కెల్విన్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లు, వాట్సాప్‌లో సందేశాల ఆధారంగా ఆమెను విచారించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఛార్మికి అధికారులు స్పష్టంచేసినట్టు సమాచారం. ఛార్మి నుంచి ఎలాంటి శాంపిల్స్‌ సేకరించలేదు. విచారణ ముగిసిన అనంతరం ఛార్మి నవ్వుతూ బయటకు వచ్చారు. తొలుత ఆమె కుటుంబ నేపథ్యం, సినీరంగ ప్రవేశం తదితర అంశాలను ప్రస్తావిస్తూ క్రమంగా మాదకద్రవ్యాల అంశంపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన పూరీ జగన్నాథ్‌, సుబ్బరాజు, శ్యాం కె. నాయుడు, తరుణ్‌, చిన్నా, నవదీప్‌లను విచారించిన సిట్‌ అధికారులు వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నావళిని రూపొందించి ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో రేపు ముమైత్‌ ఖాన్‌, ఎల్లుండి రవితేజలను సిట్‌ అధికారులు విచారించనున్నారు.

స్వాతి తండ్రి చెప్పినవన్నీ అబద్దాలే..

హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లా పల్లెర్లలో నరేష్ అస్థిపంజరం లభ్యమైంది. నరేష్ ను చంపి తగులబెట్టి బూడిదను మూసీలో వేసినట్లు గతంలో పోలీసుల విచారణలో శ్రీనివాస్ వెల్లడించాడు. తాజాగా నరేష్ అస్థిపంజరం లభ్యం కావడంతో స్వాతి తండ్రి శ్రీనివాస్ చెప్పిన మాటలన్నీ అబద్దాలేనని తేలిపోయింది. కేసు విచారణలో జాప్యంపై పోలీసులను ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. 

18:22 - July 26, 2017

హైదరాబాద్ : కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిపై సీఐడీ కర్నూలు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ట్రంక్‌పెట్టెలో చార్జిషీట్‌ పత్రాలను సీఐడీ పోలీసులు కోర్టుకు సమర్పించారు. కేశవరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి వాటిని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారు. చట్టప్రకారం కేశవరెడ్డి ఆస్తులను వేలంవేసి బాధితులకు చెల్లించనున్నట్టు సీఐడీ తెలిపింది. 

18:20 - July 26, 2017

కర్నూలు : అప్పుల బాధతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతోంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడంలేదని సీపీఐ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌ మండిపడ్డారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్‌ ముందు సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. పుర్రెలతో నిరసన తెలిపారు. కరువు, రుణభారంతోపాటు పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. 

18:19 - July 26, 2017

విశాఖపట్టణం : పేదలకు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నామని..ఇవన్నీ మామూలే అని మరిచిపోతారా ? అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జిల్లాలో రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫించన్..రాగానే అయిపోయింది..అనుకుంటారు..రేషన్ కరెక్టు వస్తుంది కదా అనుకుంటుంటారు. చనిపోయితే రూ. 5 లక్షలు ఇస్తున్నా..ఏముందు మాములే కదా అనుకుంటుంటారని..కరెంటు ఆడబిడ్డలు టివి చూడాలంటే..నీళ్లు పట్టుకోవాలంటే..ఎండకాలంలో కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డారని..అదే మూడు సంవత్సరాలుగా కరెంటు కొరత ఉందో చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అన్ని ఇచ్చిన తరువాత మరిచిపోతారా ? అని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్లు త్వరలో వస్తున్నాయని, తొందరలోనే నిరుద్యోగ భృతి తీసుకొస్తామన్నారు. 

మీడియాతో అకున్ సబర్వాల్..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఛార్మీని ప్రశ్నించిన వారిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్, సీఐలు రేణుక, విజయలక్ష్మీ, ఎస్ఐ శ్రావణిలున్నారని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు. బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు ఛార్మీ నిరాకరించినట్లు, ఆమెతో పాటు సచిన్ ధావన్, సాజుద్దిన్ అలియాస్ సల్మాన్ లను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. గురువారం మమైత్ ఖాన్ ను విచారిస్తామన్నారు. 

మీడియాతో అకున్ సబర్వాల్..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఛార్మీని ప్రశ్నించిన వారిలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్, సీఐలు రేణుక, విజయలక్ష్మీ, ఎస్ఐ శ్రావణిలున్నారని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ తెలిపారు. బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్లు ఇచ్చేందుకు ఛార్మీ నిరాకరించినట్లు, ఆమెతో పాటు సచిన్ ధావన్, సాజుద్దిన్ అలియాస్ సల్మాన్ లను కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. గురువారం మమైత్ ఖాన్ ను విచారిస్తామన్నారు. 

ఆరు అంశాలపై మోడీతో కేసీఆర్ చర్చ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఆరు అంశాలపై ఆయన చర్చించారు. బైసన్ పోలో గ్రౌండ్స్..రక్షణ పనుల్లో పై వంతెన నిర్మాణానికి అనుమతులివ్వాలని కేసీఆర్ కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై మరోసారి చర్చిస్తామని మోడీ చెప్పారని, నియోజకవర్గాల పెంపు విషయం తమకు ప్రాధాన్యం కాదని, ఈ విషయాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. 

గురువారం మమైత్ విచారణ..

హైదరాబాద్ : సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు బుధవారం విచారణ చేయనున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించిన సంగతి తెలిసిందే. బుధవారం నటి ఛార్మీని విచారించారు. 

17:36 - July 26, 2017

నల్లగొండ : జిల్లా యాద్గార్‌పల్లి పల్లి సమీపంలో వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సందర్శించారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు జూలకంటి. బ్రిడ్జి స్లాబ్ కృంగి ఎగుడు దిగుడుగా ఉందన్నారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్రిడ్జి నిర్మాణం పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన నడుస్తున్నాయని.. ఇప్పటికైనా అధికారులు చొరవతో నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. 

17:35 - July 26, 2017

హైదరాబాద్ : కష్టాల సమయంలో అండగా ఉన్నారు... ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు... భారీ మెజార్టీని అందించి...విజేతగా నిలిపారు... ఇప్పుడు వారే కన్నెర్ర చేశారు.. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా కార్మిక నేతల వేదనలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బాసటగా నిలిచిన బల్దియా ఉద్యోగులు... నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. బల్దియా ట్రేడ్‌ యూనియన్‌ అధికార పార్టీకి దూరమవుతున్న ఛాయలు కనబడుతున్నాయి. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్‌ల సాధనకు పోరాట బాట పట్టనున్నాయి.

బల్దియా కార్మికులకు ఇళ్ల నిర్మాణం..
తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ మాత్రం మద్దతు లేని సమయంలో మేమున్నామంటూ... బల్దియా ఉద్యోగులు బాసటగా నిలిచారు. అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ కూడా బల్దియా ఉద్యోగుల వెతలపై చాలా స్పష్టంగా స్పందించారు. బల్దియా కార్మికులకు హామీల వర్షం కురిపించారు. బల్దియా కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తామని.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎన్‌ఎమ్‌ఆర్‌గా పరిగణించి రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జీహెచ్‌ఎంసీ కార్మికునికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.

కార్మికుల రెగ్యులరైజేషన్‌పై చర్యలు నిల్‌..
అయితే రాష్ట్రం వచ్చి మూడేళ్లు దాటింది. ఉద్యమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, నాటి హామీల అమలు గురించి కేసీఆర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ ఉద్యోగుల పోరాటం తర్వాత జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచింది తప్ప ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ మాటలకే పరిమితమైందని టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆరోపిస్తోంది. ఇంతకాలం ప్రభుత్వం తమ సమస్యలను తీర్చుతుందని ఆశించామని.. అయినా తమను పాలకులు పట్టించుకోవడం లేదని యూనియన్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా కార్మికులకు కనీసం హెల్త్‌ కార్డ్‌ కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. తమ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
రాష్ట్రం సిద్ధిస్తే.. బతుకులు బాగుపడతాయని ఆశించిన బల్దియా కార్మికులకు నిరాశే ఎదురైందని యూనియన్‌ నేతలు వాపోతున్నారు. నమ్ముకున్న వారే నట్టేట ముంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణకు సమాయత్తమవుతన్నారు. 

17:33 - July 26, 2017

హైదరాబాద్ : పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త చరిత్రకు తెర లేపిందని మంత్రి కేటీఆర్ వెల్లడదించారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. నగరంలో నిర్మిస్తున్న 840 డబుల్ బెడ్ రూం ఇళ్లకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అప్పటి ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఆడపిల్లలకు పెద్ద పీట వేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. 

17:31 - July 26, 2017

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు. జీఎస్టీ నుంచి గ్రానైట్‌ రంగాన్ని సడలించాలని అరుణ్‌జైట్లీని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 450 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలన్నారు. మిషన్‌ భగీరథ, జల వనరులశాఖు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను అరుణ్‌జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్‌ మీటింలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని అరుణ్‌జైట్లీ హామీనిచ్చారు.

'డ్రగ్స్ వాడుతున్న ఐటీ కంపెనీల లిస్టును సిట్ మాకు అందించింది'

హైదరాబాద్: కొన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు సమాచారం ఉందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. డ్రగ్స్ వాడుతున్న ఐటీ కంపెనీల లిస్టును సిట్ మాకు అందజేసిందని, ఆ ఐటీ కంపెనీలతో మాట్లాడుతున్నామని, కొందరితో తానే స్వయంగా మాట్లాడతానని, ఐటీ కంపెనీలు ఖచ్చితంగా నియమాలు పాటించాలని జయేష్ రంజన్ స్పష్టం చేశారు.

వేడెక్కుతున్న బీహార్ రాజకీయం

పాట్నా: బీహార్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ ఇంట్లో జేడీయూ ఎమ్మెల్యే కీలక సమావేశం నిర్వహించారు. తేజస్వీ యాదవ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఉదయమే లాలూ ప్రసాద్ యాదవ్ తేల్చి చెప్పారు. అయితే తేజస్విని తొలగించేందుకు నితీష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సీఎఎస్ తో చంద్రవదన్, అకున్ సబర్వాల్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ తో ఎక్సైజ్ అధికారులు చంద్రవదన్, అకున్ సబర్వాల్ భేటీ అయ్యారు. డ్రగ్స్ కేసు పురోగతి పై సీఎస్ వివరించుతున్నట్లు సమాచారం.

17:20 - July 26, 2017

ఢిల్లీ : సీఎం కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా తనను కలిసినట్లు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో వెంకయ్యనాయుడుతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తమకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని.. కేసీఆర్ తాను కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుతం తాను పొలిటికల్ విషయాలకు దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 

ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు మోదీని ఆహ్వానించా:కేసీఆర్

ఢిల్లీ : ప్రధాని మోదీ తో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఆరు అంశాలపై మోదీతో చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్స్ అప్పగింత, రక్షణ భూముల్లో పై వంతెన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ముస్లిం రిజర్వేషన్స్ మరోసారి చర్చిస్తామని మోదీ చెప్పారని, ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు మోదీని ఆహ్వానించా అని కేసీఆర్ చెప్పారు.

నేషనల్ ఫెర్టిలైజర్స్ లో అమ్మకానికి 15 శాతం

హైదరాబాద్ : నేషనల్ ఫెర్టిలైజర్స్ లో 15 శాతం వాటాను అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వాటా 89.71 శాతం ఉంది. 15 శాతం వాటా అమ్మడంతో 74శాతానికి ప్రభుత్వ వాటా పడిపోయింది.

17:16 - July 26, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన చిత్రాల్లో ఏదో ఒక స్టైల్ ను పరిచయం చేస్తుంటాడు. సినిమా..సినిమాకు వైవిధ్యంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. పాత్ర పాత్రకూ గెటప్ మారుస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకుంటున్న నటుడు 'బన్నీ'. ఇటీవలే ఆయన నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో నటించాడు. ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన పాత్ర కోసం బన్నీ కొన్ని రోజుల పాటు బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నాడని టాక్.

ఈ చిత్ర సక్సెస్ అనంతరం మరో చిత్రం కోసం 'బన్నీ' ఇప్పటి నుండే వర్కవుట్ చేస్తున్నాడంట. వక్కంతం వంశీ దర్శకత్వంలో ' నా పేరు సూర్య'..నా ఇల్లు ఇండియా పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం తగ్గట్టు తన శరీరాన్ని మార్చుకోవడానికి..ఆహార్యం మార్పు కోసం శిక్షణ తీసుకోవాలని అనుకున్నాడంట. అందుకోసం అమెరికాకు బన్నీ వెళ్లనున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

అనురాగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పాలి: విపక్షాల పట్టు

ఢిల్లీ: పార్లమెంట్ లో మొన్న కాంగ్రెస్ ఎంపీలు పేపర్ లు విసిరేసిన దృశ్యాలను అనురాగ్ ఠాకూర్ వీడియో దీశారు. ఈ అంశంపై అనురాగ్ ఠాకూర్ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. క్షమాపణ చెప్పాలంటూ అనురాగ్ ఠాకూర్ కు స్పీకర్ ఆదేశించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయకూడదని స్పీకర్ సూచించారు.

 

కేటీఆర్ తన స్థాయి మరిచి ఉత్తమ్ పై విమర్శలు :దాసోజు శ్రవణ్

హైదరాబాద్: సిలిసిల్ల పోలీసులు ప్రభుత్వానికి తాబేదార్లుగా మారారని, చిన్నదొర కేటీఆర్ తన స్థాయి మరిచి ఉత్తమ్ పై విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఇసుక పేరుతో కాంగ్రెస్ వ్యాపారం చేయలేదని, టీఆర్ ఎస్సే ఇసుక మాషియాకు సహకరిస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఇసుక మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు చారాణ, కేసీఆర్, కేటీఆర్ బొక్కసానికి బారాణ వెళుతోందని శ్రవణ్ విమర్శించారు.

17:13 - July 26, 2017

కాంగ్రెస్ పై చెత్త వాడుగును కేటీఆర్ మానుకోవాలి: దయాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ పై చెత్త వాడుగును కేటీఆర్ మానుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దాయాకర్ హెచ్చరించారు. ఎస్పీ విశ్వజిత్ టీఆర్ ఎస్ తొత్తుగా మారారాని, దళితులపై జరుగుతున్న దాడులపై ట్విట్టర్ లో కేటీఆర్ ఎందుకు స్పందిచరని ప్రశ్నించారు. కేటీఆర్ స్నేహితులు డ్రగ్స్ కేసులో ఉన్నారని, స్నేహితులను రక్షించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

17:02 - July 26, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగంపై రాజ్యసభలో దుమారం రేగింది. కోవింద్‌ జాతిపిత మహాత్మాగాంధీతో సమానంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయను పోల్చడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలను అవమానమించిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా ప్రశ్నిస్తారని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఆనంద్‌శర్మ వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ను కోరారు. టీవీలో కనిపించడానికే కాంగ్రెస్‌ నేతలు రాద్దాంతం చేస్తున్నారని జైట్లీ మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కలిగే సమాజ నిర్మాణం కోసం గాంధీ, దీన్‌దయాల్‌ కన్న కలలను సాకారం చేయాలని రాష్ట్రపతి అన్నారు.

17:00 - July 26, 2017

ఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో అదృశ్యమైన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ లోక్‌సభకు తెలిపారు. అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. నేను చెప్పేది అబద్ధమయితే అదృశ్యమైన 39 మంది భారతీయుల కుటుంబాలను కలవండి, వాళ్లే చెబుతారని పేర్కొన్నారు. ఇరాక్‌ కూడా వారంతా చనిపోయినట్లు నిర్ధారించలేదని మంత్రి తెలిపారు. అదృశ్యమైన భారతీయుల కోసం ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నం చేస్తోందని సుష్మా చెప్పారు. ఎలాంటి సమాచారం లేకుండా మృతులుగా ప్రకటించడం పాపం కిందకు వస్తుందన్నారు. భారత్‌కు చెందిన 39 మంది కార్మికులను ఐసిస్‌ ఉగ్రవాదులు 2014లో బందీలుగా చేసుకున్నారు.  

16:56 - July 26, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి ఛార్మీ విచారణ ముగిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల లోపే సిట్ విచారణ ముగించడం గమనార్హం. డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు సంబంధం ఉందని పేర్కొంటూ ఎక్జైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పలువురు నటీ, నటులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలువురు నటులను ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేశారు. ఆరున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.

బుధవారం ఉదయం..
బుధవారం ఉదయం నటి ఛార్మీని మహిళా అధికారులు విచారించారు. విచారణలో పలు అంశాలను ఛార్మీ వెల్లడించినట్లు తెలుస్తోంది. కెల్విన్ తో ఉన్న సంబంధాలు..ఇతరత్రా విషయాలను సిట్ ఆరా తీసినట్లు సమాచారం. వాట్సప్ లో కెల్విన్ తో ఛార్మీ సంభాషణలు జరిపినట్లు సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని సిట్ ఆమె ఎదుట ప్రస్తావించారని తెలుస్తోంది. ఛార్మీ విదేశీ పర్యటన..సినిమాల్లో జరిగే పార్టీల విషయాలపై ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం.

విచారణ జరుగుతుండగానే..
ఛార్మీ విచారణ జరుగుతుండగానే ఓ వ్యక్తికి ముసుగేసి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాసేపటి అనంతరం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ మీడియా సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలియచేశారు. నెదర్లాండ్స్ కు చెందిన మైక్ కమింగను అరెస్టు చేయడం జరిగిందని, సినీ ప్రముఖలతో సంబంధాలున్నట్లు తెలియచేశారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు.
ఇక ఛార్మీ విచారణ ముగిసిందా ? రేపు కూడా విచారిస్తారా ? ఛార్మీ విచారణకు సహకరించిందా అనేది తెలియాల్సి ఉంది. 

ముగిసిన చార్మి సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మి సిట్ విచారణ ముగిసింది. విచారణ ఆరున్నర గంటల పాటు జరిగింది. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, సినీ ప్రములపై లింకు వంటి అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విచారణ లో నలుగురు మహిళా అధికారులు పాల్గొన్నారు.

16:28 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్టు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నటి ఛార్మీ విచారణ కొనసాగుతుండగానే ఈ అరెస్టు జరగడం విశేషం. బుధవారం ఉదయం ఛార్మీని నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. విచారణలో పలు కీలక సమాచారాన్ని ఛార్మీ తెలియచేసిందని తెలుస్తోంది. లంచ్ బ్రేక్ అనంతరం ఛార్మీ విచారణ కొనసాగింది. విచారణ కొనసాగుతుండగానే ఓ వ్యక్తికి ముసుగు వేసి కార్యాలయానికి తీసుకొచ్చారు.

ఫారెనర్..అరెస్టు..
అతను ఎవరనేది తెలియరాలేదు. కాసేపటి అనంతరం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో మైక్ కమింగ్ అనే విదేశీయుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు డ్రగ్ తీసుకొచ్చాడని పేర్కొన్నారు. నాలుగో సారి ఇండియాకు వచ్చాడని, అతనికి జూన్ 2018 వరకు వీసా వ్యాలెడిటీ ఉందన్నారు. డ్రగ్స్ కేసులో ఇన్వేస్టిగేషన్ బాగానే జరుగుతోందన్నారు. అరెస్టు చేసిన వ్యక్తి నెదర్లాండ్స్ కు చెందిన వ్యక్తి అని, ఇతనికి సినీ ప్రముఖులతో సంబంధాలున్నట్లు సమాచారం. 

16:22 - July 26, 2017

డ్రగ్స్ కేసులో నెదర్లాండ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తి నెదర్లాండ్ కు చెందిన మైక్ కమింగను. మైక్ ను కోర్టు ప్రొడ్యూస్ చేశారు. అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిట్ అధికారు అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. కమింగకు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని, విచారణ చేపడుతున్నామని.. మరిన్ని వివరాలు సేకరిస్తామని స్పష్టం చేశారు.

16:18 - July 26, 2017

విజయవాడ : కాపు ఉద్యమ నేత ముద్రగడపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ముద్రగడ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నేడు నిర్వహించతలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడను గృహ నిర్భందం చేశారు. దీనితో పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ విషయంపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయ్య స్పందించారు. కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు లేదని ఆరోపించారు. కిర్లంపూడిలో రుణమేలా ఏర్పాటు చేస్తామని, కాపుల నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామన్నారు. ముద్రగడ చేసిన జిమ్మిక్కులు మానుకోవాలని, ఆయన కళ్లు తెరిపిస్తానని తెలిపారు. జగన్ తో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడని, నదుల అనుసంధానం చేసి సీఎం చంద్రబాబు నాయుడు అపర భగీరథుడయ్యాడని తెలిపారు. రైతులు..కార్మికులు..ఇతర వర్గాల వారికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. 

16:15 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ దూకుడు పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తికి సినీ పరిశ్రమకు సంబంధాలున్నయని తెలుస్తోంది. ఓ సినీ ప్రముఖుడికి మేనేజర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇంకా నటి ఛార్మీ విచారణ మాత్రం కొనసాగుతోంది.

సెలబ్రెటీల విచారణ..
డ్రగ్స్ కేసులో కెల్విన్ ముఠాను అరెస్టు చేసిన అనంతరం సిట్ టాలీవుడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీ, నటులకు నోటీసులు జారీ చేసి వారిని విచారిస్తున్నారు. వారి నుండి కీలక వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నారు. విచారణకు వచ్చిన వారి నుండి బ్లడ్ శాంపిల్, గోర్లు, వెంట్రుకలు తీసుకున్నారు. నటుడు నవదీప్ మాత్రం ఈ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు.

బుధవారం ఛార్మీ..మరొకరు అరెస్టు..
బుధవారం ఉదయం నటి ఛార్మీ సిట్ ఎదుట హాజరైంది. ఉదయం 10 గంటల నుండి విచారణ జరుగుతోంది. విచారణ సమయంలో కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో ఉమ్మడి హైకోర్టు పలు సూచనలు..సలహాలు చేసింది. నలుగురు మహిళా అధికారులు ఆమెను విచారిస్తున్నారు. విచారణలో కీలక సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ఛార్మీ విచారణ కొనసాగుతుండగానే ఓ వ్యాన్ లో ఓ వ్యక్తికి ముసుగు వేసి పోలీసులు తీసుకరావడం గమనార్హం. నేరుగా కార్యాలయానికి తీసుకెళ్లారు. అతను ఎవరనేది తెలియరాలేదు. ఛార్మీ ఇచ్చిన కీలక సమచారం మేరకు ఆయనను తీసుకొచ్చారా ? లేదా ? అనుమానాలు కలుగుతున్నాయి. 

 

కేజ్రీవాల్ నాకు అబద్ధం చెప్పారు: రాంజెఠ్మలానీ

ఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నాకు అబద్ధం చెప్పారని బిజెపి నేత, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ ఆరోపించారు. ఇకపై ఆయన తరపున వాదించనని జెఠ్మలానీ స్పష్టం చేశారు.

సయోధ్య దిశగా పళని,పన్నీరు వర్గాలు...

ఢిల్లీ: అన్నాడీఎంకే లో వైరి వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఢిల్లీలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు మకాం వేసి ప్రధాని మోదీతో పాటు జేపీ నడ్డా, జ్లైట్లీ, రాజ్ నాథ్ లతో విడివిడిగా సమావేశం అవుతున్నారు.

భార్య, బిడ్డను సజీవదహనం చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్

యాదాద్రి భువనగిరి: బీబీనగర్ మండలం రాయపాడులో గర్భవతి అయిన భార్యతో పాటు కూతురిని సజీవదహనం చేసిన కేసులో నిందితుడు శంకర్ అరెస్టు అయ్యాడు.లింగనిర్ధారణ చేసి నిందితుడికి సహకరించిన స్వప్న ఆసుపత్రి వైద్యుడు రాంరెడ్డి కూడా అరెస్టు అయ్యాడు. మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందని ఈనెల 18న భార్య, కూతురిని శంకర్ సజీవదహనం చేశాడు.

సచివాలయం ఎదుట స్వాతంత్ర్య సమరయోధుల నిరసన

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ఎదుట పలువురు స్వాతంత్ర్య సమరయోధులు నిరసన తెలిపారు. పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నిసనలో వరంగల్, మహబూబాబాద్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్నారు.

15:40 - July 26, 2017

హైదరాబాద్ : 'ఇది పెద్దోళ్ల ప్రభుత్వమా ? పేదల ప్రభుత్వమా' ? అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జియాగూడలో డబుల్ బెడ్ రూం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. డిప్యూటి సీఎం, మంత్రి కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు..సంక్షేమ కార్యక్రమాలు ఏకరువు పెట్టారు.

సంక్షేమ కార్యక్రమాలు..
పెన్షన్ లతో ఒక భరోసా..ఆసరా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. రేషన్ బియ్యం విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కుటుంబానికి సరిపడా బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మీ అనే పథకం..షాదీ ముబారక్ పేరిట పేదలను ఆదుకుంటున్నామని, గర్భిణీల కూడా కేసీఆర్ కిట్ పేరిట ఆరు నెలల మాసాల పాటు రూ. 12 వేలు నేరుగా ఆమె అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుందని, బిడ్డ జన్మించిన అనంతరం కిట్ లో 13 రకాల వస్తువులు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి మూడేళ్లే అయ్యిందని..ఇంకా సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. తొలిసారి 10వేల మార్క్ పైన నిఫ్టీ ముగియగా, 56 పాయింట్ల వద్ద 10,020 వద్ద నిఫ్టీ లాభపడింది. 151 పాయింట్లు లాభపడి 32,362 వద్ద సెన్సెక్స్ ముగిసింది.

15:37 - July 26, 2017

తూర్పుగోదావరి : ప్రశ్నించిన వారిని..అన్యాయం అంటూ ఎదిరించిన వారిని..ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ..ఆందోళన చేస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వ ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. పోలీసుల సహాయంతో ఆందోళనలకు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. అందులో భాగంగా ఆందోళన చేస్తున్న మహిళలపై మగ పోలీసులు తమ ప్రతాపాన్ని చూపెడుతున్నారు. ఇటీవలే పలు ఘటనలే ఇందుకు నిదర్శనం..

ముద్రగడ పాదయాత్రకు నో..
తాజాగా కాపుల విషయంలో ముద్రగడ పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఏపీ సర్కార్ పాదయాత్రకు అనుమతినివ్వకుండా ముద్రగడను గృహ నిర్భందం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కాపు నేతలు..కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. దీనితో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. పి.గన్నవరం మండలంలో కూడా కాపులు ఆందోళనలు..నిరసనలు చేపట్టారు.

పి.గన్నవరం మండలం..
ముద్రగడ పాదయాత్రకు సంఘీభావంగా పలువురు పాదయాత్రకు తరలివెళుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీలో మహిళలు కూడా ఉన్నారు. కానీ మహిళలని చూడకుండా మగ ఖాకీలు అడ్డుకున్నారు. దీనిపై కాపు మహిళలలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లాక్కొంటూ వ్యాన్ లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. వ్యాన్ ఎక్కేందుకు మహిళలు నిరాకరించారు. మగ పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని పలువురు ఖండించారు.

ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తూర్పు..పశ్చిమగోదావరిలో పోలీసులు భారీగా మోహరించారు. బుధవారం ఉదయం నుండి అరెస్టులు..నిర్భంద పర్వాలు కొనసాగుతున్నాయి. 

మరొకరిని అరెస్టు చేసిన సిట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన నటి చార్మి ఇచ్చిన సమాచారంతోనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

నోట్ల రద్దు పై నిర్ణయం తీసుకునేది కేంద్రం కాదు: ఆర్బీఐ

ఢిల్లీ: 2వేల నోటు రద్దు ఆలోచన కేంద్రానికి ఉందా? ఎంపి ప్రశ్నకు అరుణ్ జైట్లీ సమాధానం ఇవ్వలేదు. రూ.2వేల నోట్ల ముద్రణను ఇప్పటికే నిలిపివేశామని, నోట్ల రద్దు పై నిర్ణయం తీసుకునేది కేంద్రం కాదని ఆర్బీఐ పేర్కొంది. రూ.వెయ్యి నాణెం తీసుకొస్తారనే ప్రశ్న నిజమేనా? అని కాంగ్రెస్ ఎంపి ఆజాద్ ప్రశ్నించారు. రూ.2వేల నోట్ల ను రద్దు ప్రచారం ప్రభుత్వం వివరణ ఇవ్వాలని జేడీయూ ఎంపి శరద్ యాద్ డిమాండ్ చేశారు. ఎవరెన్ని ప్రశ్నలు వేసిన అరుణ్ జైట్లీ మాత్రం నోరు మెదపలేదు.

15:27 - July 26, 2017

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సిట్ ఎదుట విచారణకు హాజరై సినీ సెలబ్రిటీలందరూ డ్రస్ కోడ్ పాటించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదటి రోజు పూరి జగన్నాథ్. ఆతర్వాత సుబ్బరాజు, మొన్న తరుణ్, నిన్న నవదీప్ వీళ్లంతా వైట్ షర్ట్‌లతోనే విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ విచారణను ఎదుర్కొంటున్న వారంతా డ్రెస్ కోడ్ వాడుతున్నారా..? లేక డ్రగ్స్ కోడ్ వాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలైన అనుమానం. వాస్తవానికి వైట్ షర్ట్ అంటే శాంతికి చిహ్నం. అదే బ్లాక్ షర్ట్‌లు వేసుకుంటే... నిరసన తెలిపినట్లు అర్థం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే... తమపై వచ్చిన ఆరో్పణలపై... నటులంతా నిరసన వ్యక్తం చేయాలి. అంటే నల్ల చొక్కాలు దరించి విచారణకు హాజరుకావాలి. తాజాగా నవదీప్ కూడా వైట్ షర్ట్ వేసుకుని విచారణకు రావడంతో.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే గుసగుసలు మొదలయ్యాయి.

ఒక్క శ్యాంకే నాయుడు తప్ప...

ఇప్పటి వరకూ విచారణకు హాజరైన ఐదుగురు సినీ ప్రముఖుల్లో ఒక్క శ్యాంకే నాయుడు మాత్రమే వైట్ షర్ట్ ధరించలేదు. అయితే ఆయన ఒక్కడినే అతి తక్కువ సేపు విచారించిన వదిలేశారు. వైట్ షర్ట్‌లు ధరించి విచారణకు హాజరైన మిగిలినవారంతా... సుమారు 12 గంటల నుంచి 13 గంటలు వరకూ సిట్ విచారణ ఎదుర్కొన్నారు. వీరి వద్దనుంచే శాంపిల్స్ సైతం సేకరించారు. అంటే ఈ డ్రగ్స్ కోడ్ లోనే శ్యాంకే నాయుడు లేరా... లేక డ్రగ్స్ కేసుతోనే శ్యాంకే నాయుడుకి సంబంధం లేదా..? డ్రగ్స్ విచారణకు... డ్రెస్ కోడ్‌గా వైట్ షర్ట్‌లతో హాజరుకావడం... యాదృచ్చికంగానే జరిగిందా..? కావాలే జరుగుతుందా..? ఇప్పుడు ఇదే అంశం తేలాల్సి ఉంది. ఏది ఏమైనా... డ్రగ్స్ విచారణకు నటులంతా ఒక డ్రెస్ కోడ్‌లో రావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం.

15:09 - July 26, 2017

గాంధీతో దీన్ ద‌యాళ్ పోల్చడం ఆక్షేపణీయం: కాంగ్రెస్

ఢిల్లీ: నూత‌న రాష్ట్ర‌ప‌తిగా రామ్‌నాథ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్ర‌సంగంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆయ‌న త‌న ప్ర‌సంగంలో మొద‌టి ప్ర‌ధాని నెహ్రూ గురించి మాట్లాడ‌లేద‌ని ఆరోపించింది. రామ్‌నాథ్ ప్ర‌సంగాన్ని త‌ప్పుప‌డుతూ ఎంపీ ఆనంద్ శ‌ర్మ రాజ్య‌స‌భ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జాతి నిర్మాత మ‌హాత్మాగాంధీతో బీజేపీ నేత దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌ను పోల్చ‌డం ఆక్షేప‌ణీయంగా ఉంద‌న్నారు.

15:07 - July 26, 2017

హైదరాబాద్ : ఫెక్సీలు ఏర్పాటు చేయవద్దని ప్రభుత్వం..స్వయంగా మంత్రి కేటీఆర్ చెబుతున్నా పలువురు నేతలు..కార్యకర్తలు పట్టించుకోవడం లేదు. ఆయా ప్రారంభోత్సవాలు..ఇతరత్రా కార్యక్రమాల్లో నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలే పలు వివాదాలకు కారణమౌతున్నాయి. తమ ఫొటోలు లేవని ఇతర నేతలు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా జియాగూడలో ఇలాంటి వివాదం చెలరేగింది.

డబుల్ బెడ్ రూం..
జియాగూడలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి సంకల్పించింది. అందులో భాగంగా బుధవారం 800 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శంకుస్థాపన ఏర్పాట్లు చేసింది. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి కేటీఆర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ ఆ ఫ్లెక్సీలో స్థానిక కార్వాన్ ఎమ్మెల్యే ఫొటో, ఎంపీలు వేయకుండా ఇతరుల ఫొటోలు వేయడంపై ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంత ఆందోళన చెలరేగింది. చివరకు ఆ ఫ్లెక్సీని తొలిగించడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ప్రొటోకాల్ పాటించడం లేదని పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. 

14:55 - July 26, 2017

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో సంచలనం రేపిన వ్యాపం ప్రధాన సూత్రధారి ప్రవీణ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేగుతోంది. ఆయన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. వ్యాపమ్ పేరిట జరిగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్ కోసం జరిగే పరీక్షల్లో భారీ ఎత్తున స్కాం జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపమ్ స్కాంతో సీనియర్ అధికారులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంకు సంబంధించి 40 మందిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ స్కాం శివరాజ్ సింగ్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఇప్పటికే దీనిపై నియమితులైన సిట్ దర్యాప్తు చేస్తోంది. 

సిట్ విచారణకు లంచ్ బ్రేక్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందకుని సిట్ విచారణకు హాజరైన చార్మికి లంచ్ బ్రేక్ ఇచ్చారు. సిట్ అధికారులు ఏర్పాటు చేసిన భోజనాన్ని చార్మి తింటున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలో ప్రొటోకాల్ వివాదం

హైదరాబాద్: కార్వాన్ నియోజకవర్గం జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపనలో ప్రొటోకాల్ వివాదం రేగింది. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం అలీ, మంత్రి కేటీఆర్ పోటో పెట్టి స్థానిక ఎమ్మెల్యే, ఎంపి ఫోటో పెట్టలేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు వేదికపై ఉన్న ఫ్లెక్సీని తొలగించారు.

14:50 - July 26, 2017

ముంబై : ఓ ప్రాంతంలో నాలుగు అంతస్తులు భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య  17కి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. శివసేన నేత సునీల్ కితాబ్ కు చెందిన నర్సింగ్ హోం ను పునరుద్ధరిస్తున్న సమయంలో భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. నిర్లక్ష్యం చేశారన్న దానిపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 28 మందిని రెస్క్యూటీం సురక్షితంగా కాపాడింది. ఇటీవలే జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున సునీల్ సతీమణి పోటీ చేశార. ప్రమాద సమాచారం తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. 

సినిమా వాళ్ల జీవితాలు అద్దాల మేడలాంటిది: రోజా

హైదరాబాద్: డ్రగ్స్ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. సినిమా వాళ్ల జీవితాలు అద్దాల మేడలాంటివని అన్నారు. తప్పు చేయకలేదని రుజువైతే జరిగిన నష్టాన్ని సిట్ పూడ్చలేదని తెలిపారు. ఇప్పటికైనా సిట్ ఇలాంటి పబ్లిసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాలని రోజా విజ్ఞప్తి చేశారు.

రేపు దేశవ్యాప్తగా బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్: రేపు దేశవ్యాప్తంగా బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మెను చేపట్టారు. వేతన సవరణ కోసం బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.

14:43 - July 26, 2017

ఖమ్మం : తండ్రి చికాకు పెడుతున్నాడని..జనాలను..ఇతరులను తండ్రి తిడుతున్నాడని ఇంటి వారు బాధ పడుతుండే వారని స్థానికులు పేర్కొన్నారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ఆరుగురు కుటుంబసభ్యులు అనుమానస్పదంగా మృతి చెందడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. తండ్రి వేధింపులు తాళ లేక ఆత్మహత్య చేసుకున్నారా ? ఇతరత్రా కారణాలున్నాయా అనేది తెలియడం లేదని వారు టెన్ టివికి తెలిపారు.

తండ్రి వేధింపులా ? 
సలీం అనే వ్యక్తి ఐదుగురు కుటుంబసభ్యుల మృతదేహాలు పాలేరు జలాశయంలో కనిపించాయి. ఈ మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో ఆరు ప్రాణాలు బలి కావడం కలకలం రేగింది. వ్యసనాలకు బానిసైన తండ్రి వేధింపులకు గురి చేస్తుండడంతో సలీం కుటుంబసభ్యులను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడా ? అనేది తెలియరావడం లేదు. అభం..శుభం తెలియని చిన్నారులను కూడా బలి తీసుకోవడం బాధాకరం.
ఇంటి పెద్దగా ఉన్న సలీం అధైర్య పడాల్సిన బలమైన కారణం ఉంటుందని బంధువులు పేర్కొంటున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:39 - July 26, 2017

తూర్పుగోదావరి : 'ఆస్తులు అడుగుతున్నామా ? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నాం..అది నేరమా ? పాదయాత్ర చేసేందుకు ఎందుకు అనుమతినివ్వడం లేదు' అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ ప్రశ్నించారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం చలో అమరావతి పేరిట ముద్రగడ పాదయాత్ర చేయాలని తలిచిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు ఏపీ సర్కార్ అనుమతిని నిరాకరించింది.

భారీ బందోబస్తు..
కిర్లంపూడిలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముద్రగడ ఇంటి నుండి బయటకు రాగానే పోలీసులు అడ్డుకుని గృహ నిర్భందం చేశారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తాము ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తామని కాపు నేతలు పేర్కొనగా పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు.

ఆందోళనలు..
ముద్రగడను గృహ నిర్భందం చేశారని విషయం తెలుసుకున్న కాపు నేతలు..ఇతరులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు కొనసాగించారు. పలు జిల్లాల్లో కాపు నేతలు ధర్నాలు..నిరసనలకు దిగుతున్నారు. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేశారు. తుని..అమలాపురం..కిర్లంపూడి తదితర ప్రాంతాల్లో ఆందోళకారులు రోడ్డెక్కుతున్నారు. ముద్రగడకు మద్దతుగా దళితులు తీవ్రస్థాయిలో నిరసనలు తెలియచేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించిన వీరిని పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు.

కొనసాగుతున్న ఆంక్షలు..
కానీ జిల్లాలో మాత్రం పూర్తిస్తాయిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిరసనలు..ఆందోలనలకు పాల్పడవద్దని..ఆంక్షలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి రోజు పాదయాత్ర చేసేందుకు సన్నాహాలు చేస్తానని..ఎప్పుడు అనుమతినిస్తే ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర చేస్తానని ముద్రగడ తేల్చిచెబుతున్నారు. 

14:33 - July 26, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి 'ఛార్మీ' విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఉదయం 10.30గంటలకు కార్యాలయానికి 'ఛార్మీ' వచ్చారు. ఛార్మీ విచారణకు సంబంధించిన సిట్ కు హైకోర్టు సూచనలు..ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠాను పట్టుకున్న అనంతరం పలు సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. టాలీవుడ్..పలువురు విద్యార్థిని..విద్యార్థులు డ్రగ్స్ సేవించినట్లు తేలింది. దీనితో టాలీవుడ్ కు చెందిన పలువురు నటీ, నటులకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు జారీ చేసింది.

భోజనానికి నో అన్న ఛార్మీ ? 
ఇప్పటికే పూరి జగన్నాథ్, తరుణ్, సుబ్బరాజు, నవదీప్, శ్యామ్ కె.నాయుడు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. బుధవారం నటి ఛార్మీ సిట్ అధికారుల విచారణకు హాజరైంది. నలుగురు మహిళా అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఉదయం నుండి విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు. సిట్ అధికారులు ఇచ్చిన భోజనాన్ని తిరస్కరించిన ఛార్మీ తాను తెచ్చుకున్న లంచ్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

పలు అంశాలపై విచారణ..
ఇక విచారణలో ఛార్మీని పలు అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కెల్విన్ తో ఉన్న సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో కెల్విన్ తో దిగిన సెల్ఫీ ఫొటోల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ సేవించారా ? తదితర వివరాలను అడుగుతున్నట్లు సమాచారం. రెండో జాబితాలో ఉన్న పలువురి పేర్లను ఛార్మీ నిర్ధారించినట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం 'ఛార్మీ' మీడియా ఎదుట మాట్లాడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:21 - July 26, 2017

విజయవాడ : 'ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం చెప్పండి.. ముద్రగడను ఎందుకు అరెస్టు చేశారు ? కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు నినదిస్తున్నారు కదా ? ప్రశ్నించినందుకు అరెస్టులు హౌస్ అరెస్టులు..బైండోవర్ చేయడం ఏంటీ' ? అని వైసీపీ అధినేత జగన్ ఏపీ సర్కార్ ను ప్రశ్నించారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ మరోసారి ఉద్యమించిన సంగతి తెలిసిందే. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఆయన పాదయాత్ర నిర్వహించతలపెట్టారు. కానీ ఏపీ సర్కార్ పాదయాత్రకు అనుమతి లేదు. పాదయాత్ర నిర్వహించ తలపెట్టిన ఆయనను గృహ నిర్భందం చేశారు.
దీనిపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. 2014 ఎన్నికల్లో కాపుల విషయంలో పలు హామీలు గుప్పించారని గుర్తు చేశారు. కాపులకు ఇచ్చిన హామీని..మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని అనే కదా వారు నిలదీస్తున్నదని ట్వీట్ చేశారు. ఇలా ప్రశ్నిస్తున్నందుకు అరెస్టులు..హౌస్ అరెస్టులు..బైండోవర్లు చేయడం ఏంటీ..వేల మంది పోలీసుల్ని మోహరించడం ఏంటీ ? అని ట్వీట్ లో సూటిగా ప్రశ్నించారు.
చివరగా 'తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారూ' అంటూ జగన్ పేర్కొన్నారు.  జగన్ చేసిన ట్విట్టర్ పోస్టుపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ముద్రగడను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు: జగన్

హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారని వైసీపీ నేత జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు.కాపులకు ఇచ్చిన హామీని మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలనే కదా వారు మిమ్మల్ని నిలదీస్తోందని, ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్లు, బైండోవర్ కేసులు పెట్టడమేంటని జగన్ నిలదీశారు.

13:56 - July 26, 2017

వివాహేతర సంబంధం.. రెండో వివాహం..అనే అంశాలపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

వెంకయ్యనాయుడుతో ముగిసిన కేసీఆర్ భేటీ

ఢిల్లీ : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వెంకయ్యకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగానే వెంకయ్యను సీఎం కలిసినట్లు సమాచారం.

13:50 - July 26, 2017

పశ్చిమగోదావరి : పోలీసులు ఎన్నిరకాలుగా వేధించినా నిరసనలు ఆపేదిలేదని కాపు నేతలు స్పష్టం చేశారు.. ముద్రగడ హౌస్‌ అరెస్ట్‌కు నిరసనగా ఏలూరులో ఆందోళనకు దిగారు. పోలీసుల బెదిరింపులు దారుణంగా ఉన్నాయన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముద్రగడను ఎన్నిరోజులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తారో చూస్తామన్నారు. ఆ తర్వాతే పాదయాత్ర పూర్తిచేస్తామని చెప్పారు. కాపులను బీసీలో చేర్చి చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:46 - July 26, 2017

గుంటూరు : ముద్రగడ వెనుక వైసీపీ హస్తం ఉందని హోం మంత్రి చినరాజప్ప ఆరోపించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ముద్రగడ వ్యవహరిస్తున్నారన్నారు. ఈమేరకు ముద్రగడ టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని... తుని ఘటనను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. 

 

13:42 - July 26, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించారు. ముద్రగడ ఇంటిని డోన్‌ కెమెర్లాతో పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాపు నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో కాపునేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

 

అంగన్ టీచర్లకు ఆంగ్ల మాద్యమంలో శిక్షణ :ఏపీ సీఎం

అమరావతి: అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ స్కూళ్ల నిర్వహణ పై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడేళ్ల వయస్సు ఉన్న చిన్నారులు నర్సరీ, నాలుగేళ్ల వయస్సు గలవారు ఎల్ కేజీ, ఐదేళ్ల వయస్సు గలవారు యూకేజీ చదివేందుకు, ప్రీ ప్రైమరీ సెంటర్ లలో అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాద్యమంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. రైమ్స్ నేర్పడంలో పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ నియమించే సలహాదారులతో శిక్షణ ఇస్తామన్నారు.

13:35 - July 26, 2017

టీ - శాట్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : టీ - శాట్ నెట్‌వర్క్‌ను మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీ శాట్ నెట్‌వర్క్‌తో పాటు లోగో, స్టేషన్ ఐడీనీ మంత్రులు ఆవిష్కరించారు. టీ శాట్ థీమ్ సాంగ్‌ను అంబేద్కర్ వర్సిటీ వీసీ సీతారామరావు, విద్య చానల్ లోగోను లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన టీవీ సీఈవో శైలేష్ రెడ్డి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మీసేవ కమిషనర్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

13:33 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి సిట్ విచారణ కొసాగుతోంది. డ్రగ్సు కేసులో చార్మి కీలక సమచారం అందించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లు చెప్పినట్లు సమాచారం. కెల్విన్ తో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణకు చార్మి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. సిట్ అధికారులు మొదటగా చార్మి వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్త్రీ జీవితంపై అడిగినట్లు తెలుస్తోంది. అయితే చార్మి హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో రెండో జాబితాను తయారు చేయనున్నారు. తదుపరి జాబితాను అతి కీలంగా వాడే అవకాశముంది. రెండో జాబితాలోని నోటీసులు జారీ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకే విచారించనున్నారు. నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. వీరిలో ఎక్సైజ్‌ సూపరిండెంట్, ముగ్గురు సీఐలు చార్మిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చార్మి విషయంలో కానిస్టేబుల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తనపై ఎక్సైజ్ కానిస్టేబుల్ చేయి వేశాడంటూ సిట్ అధికారులకు ఆర్మి ఫిర్యాదు చేసిశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డ్రగ్స్ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు : తలసాని

హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలంపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పట్టించుకోనందునే రాష్ట్రంలో డ్రగ్స్ విస్తరించిందన్నారు. డ్రగ్స్ వ్యవహారాన్ని మొత్తం సినీ పరిశ్రమకు ఆపాదించడం సరికాదన్నారు. సిట్ వద్ద ఉన్న సమాచారంతో కొందరిని మాత్రమే విచారిస్తున్నారని తెలిపారు. సిట్ విచారణలో వెల్లడైన వాస్తవాల ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. సిట్ విచారణ పూర్తయ్యాక సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం అవుతామని ప్రకటించారు.

13:13 - July 26, 2017

నల్లగొండ : జిల్లాలోని చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఐఎఫ్‌సీఐ గోదాం వద్ద జాతీయ రహదారిపై బోలెరో వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. 

 

ఎక్సైజ్ కానిస్టేబుల్ పై చార్మి ఫిర్యాదు..

హైదరాబాద్: చార్మి విషయంలో కానిస్టేబుల్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. తన పై ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చేయి వేశాడంటూ సిట్ అధికారులకు చార్మి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

13:10 - July 26, 2017

విజయవాడ : కాపుల నేత ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం దారుణమని వైసీపీ నేత రోజా అన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని...లేకపోతే అలా చేయలేమని చెప్పాలని పేర్కొన్నారు. ఇలా పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూడటం సరికాదని రోజా మండిపడ్డారు. ముద్రగడ పాదయాత్రకు అవకాశం ఇవ్వాలన్నారు. 

 

13:08 - July 26, 2017

మనం తినే కూరగాయాల్లో మునగ కాయది ఎంతో ప్రత్యేకమైన స్థానం. నిజానికి మునగ కాయ కంటే మునగ ఆకులోనే ఎక్కువ పోషకాలుంటాయి. అయితే ఒక్క ఆషాడం లోనే కాదు, ఏడాది పొడవునా లేత మునగాకు వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం. మునగాకులో ఎ,సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మునగాకుల్లో విటమిన్లు, అమినో యాసిడ్స్‌, మినరల్స్‌ సమృద్ధిగా ఉన్నాయి. పాల నుంచి లభించే క్యాల్షియంకు 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లకు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కన్నా 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. రోజుకి ఏడు గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్‌ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందు న్యాచురల్‌ మెడిసిన్‌ మునగాకు. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. మునగాకులలో అమినో ఆమ్లాలు ఉండడంవల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మునగాకు రసం రక్తహీనతను నివారిస్తుంది. మునగాకుల రసాన్ని పాలల్లో కలసి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి.

13:04 - July 26, 2017

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్ర నేపథ్యంలో కోనసీమలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపు నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. రావులపాలెంలో కాపు నేతలను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:02 - July 26, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తున్నారని చెప్పారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడానికి కారణముందన్నారు. గత హిస్టరీని దృష్టిలో పెట్టుకొనే  ముద్రగడ పద్మనాభం పాద్యాత్రకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. 

 

12:57 - July 26, 2017

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించారు. ముద్రగడ ఇంటిని డోన్‌ కెమెర్లాతో పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాపు నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో కాపునేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:45 - July 26, 2017
12:44 - July 26, 2017

విశాఖ : ఆంద్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు.. కొద్దిరోజులక్రితం అచ్యుత అనే విద్యార్థిని యూనివర్శిటీ అధికారులు సీటు కేటాయించారు.. ఆమె పదిరోజులపాటు తరగతులు హాజరయ్యారు సీటు లేదంటూ అడ్మిషన్‌ రద్దు చేశారు.. దీంతో అచ్యుత యూనివర్శిటీముందు నిరసన చేపట్టింది.. ఆమెకు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:42 - July 26, 2017

ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో ఆరుగురి అనుమానాస్పద మృతికేసులో కొత్తకోణం బయటకువచ్చింది. తండ్రి వేధింపులు తాళలేక సలీం అనే వ్యక్తి... తన కుటుంబసభ్యులందరినీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. వారందరినీ పాలేరు జలాశయంలో పడేసి తానూ ఆత్మహత్యకు ప్రయత్నించారని తేల్చారు. స్థానికులు ఆరు మృతదేహాలను వెలికితీశారు. 

 

అవకాశాలు వచ్చినా పార్టీ మారలేదు: ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

అమరావతి: అవకాశాలు వచ్చినా పార్టీ మారలేదని..ఎన్నడూ పదవులు ఆశించలేదని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన రామసుబ్బారెడ్డి అన్నారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ... ఇబ్బందికరపరిస్థితులు వచ్చినా టీడీపీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

12:37 - July 26, 2017
12:36 - July 26, 2017

శ్రీకాకుళం : జనసేనాని మరోసారి శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించబోతున్నారు.. ఈ నెల 30న హార్వార్డ్‌నుంచి వచ్చిన డాక్టర్లతో కలిసి ఉద్దానం వెళ్లనున్నారు.. డాక్టర్లతో కలిసి అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:33 - July 26, 2017

గుంటూరు : ముద్రగడ పాదయాత్ర పిలుపుతో అమరావతిలో హైఅలర్ట్‌ ప్రకటించారు.. ఏపీ రాజధాని పరిసరప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు..  సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.. బందోబస్తు విధుల్లో 750మంది పోలీసులున్నారు.. గుర్తింపు కార్డులుఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:26 - July 26, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముద్రగడ పద్మనాభంను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నా హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించారు. ముద్రగడ ఇంటిని డోన్‌ కెమెర్లాతో పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి పై ఛార్జిషీటు

కర్నూలు: విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి పై కోర్టులో ఛార్జిషీటు దాఖలు అయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేసిన కేసులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది.

ముద్రగడ 24 గంటలు హౌస్ అరెస్ట్ : ఎస్పీ విశాల్

తూ.గో: ముద్రగడ పద్మనాభాన్ని 24 గంటలు హౌస్ అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. సీఆర్పీసీ 151 కింద ఆయన్ను హౌస్ అరెస్టు చేశామన్నారు. బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదన్నారు. 144 సెక్షన్ కారణంగా ముద్రగడ ఇంట్లోకి మీడియాను అనుమతించలేదని, జిల్లాలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. అలాగే అనుమానమున్న వారిని హౌస్ అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

12:15 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి సిట్ విచారణ కొసాగుతోంది. చార్మి కీలక సమచారం అందించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖుల పేర్లు చెప్పినట్లు సమాచారం. కెల్విన్ తో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణకు చార్మి సహకరిస్తున్నట్లు కనిపిస్తోంది. సిట్ అధికారులు మొదటగా చార్మి వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్త్రీ జీవితంపై అడిగినట్లు తెలుస్తోంది. అయితే చార్మి హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరోవైపు ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసులో రెండో జాబితాను తయారు చేయనున్నారు. తదుపరి జాబితాను అతి కీలంగా వాడే అవకాశముంది. రెండో జాబితాలోని నోటీసులు జారీ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకే విచారించనున్నారు. నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. వీరిలో ఎక్సైజ్‌ సూపరిండెంట్, ముగ్గురు సీఐలు చార్మిని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

నన్ను అంతర్జాతీయ తీవ్రవాదిలా చూస్తున్నారు: ముద్రగడ

తూ.గో : నన్ను అంతర్జాతీయ తీవ్రవాదిలా చూస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ విమర్శించారు. పోలీసులతో పాలన సాగిస్తామంటే బ్రిటీష్ వారితోనే కాలేదు, ఎన్ని రోజులు అడ్డుకున్నా ఈ యాత్ర ఆగదు అని ముద్రగడ హెచ్చరించారు. ప్రతి రోజు పాదయాత్ర ప్రారంభించేందుకు ప్రయత్తిస్తానని తెలిపారు. ఎన్నికల్లో హామీలు అమలు చేయమంటున్నాం తప్ప చంద్రబాబు ఆస్తిలో వాటా అడగడం లేదని చెప్పారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ ప్రకంపనలు

నల్గొండ :నాగార్జున సాగర్ నియోజకవర్గంలో భూ ప్రకంపనలు వచ్చాయి. పెద్తగూడ, గుర్రంపోడు, హాలియా మండలాల్లో సెకను పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

12:03 - July 26, 2017

ఖమ్మం : రియల్టర్ల వేధింపులు ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. రియల్టర్ల వేధింపులు తట్టుకోలేక ఒకే కటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. పాలేరు జలాశయంలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరుగురు మృతదేహాలను వెలికితీశారు. పెంటా సాహెబ్ ధైర్యవంతుడు ఏ సమస్య వచ్చినా... నిలకడగా పరిష్కరించుకోగలిగే సమర్థుడు. ఆయన వివాదాల్లో లేడు. అయితే ఈ మధ్య కాలంలో వారి సోదరుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేశారు. 
సుమారు 2కోట్ల పదిలక్షల రూపాయల విలువ గల భూమిని కొనుగోలు చేశారు. జాతీయ రహదారి దగ్గర భూమి ఉంది. ఖమ్మం జాతీయ రహదారి కావడంతో ఈ మధ్య కాలంలో భూసేకరణ కొనసాగుతోంది. నాలుగు రోడ్డు నిర్మాణం చేసేందుకు భూసేకరణ చేయడం చేశారు. భూమికి విపరీతమైన ధర రావడంతో ఆ భూమిని అమ్మాలని కొంతమంది రియల్టర్లు ఆయనపై గత పది రోజులుగా వేధింపులు, ఒత్తిడి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్న కొంతమంది గత కొంతకాలంగా పెంటా సాహెబ్ ను వేధింపులకు గురి చేస్తున్నారు. కుటుంబంలో విబేధాలు, కొడుకు, కోడలి మధ్య కూడా విబేధాలు సృష్టించడంతో వారి మధ్య గొడవ జరుగుతుంది. ఈనేపథ్యంలో వారు మనస్తాసానికి గురై ఎవరైనా భానామతి చేసి ఉంటారని భావించి పాలేరు చెరువు కాల్వకు వద్ద ఉన్న గుడి దగ్గరకు పూజలు చేసేందుకు లాలూ ఆటోలో వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వారితోపాటు అభంశుభం తెలియన చిన్నారులను కూడా చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

భవనం కూలిన ఘటనలో శివసేన నేత అరెస్ట్

ముంబై: ముంబై శివారు ప్రాంతంలో మంగ‌ళ‌వారం బిల్డింగ్ కూలిన ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి సంఖ్య 17కు చేరుకున్న‌ది. ఈ ప్ర‌మాదానికి సంబంధించి శివ‌సేన కార్య‌క‌ర్త‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఘ‌ట్‌కోప‌ర్ ప్రాంతంలో నాలుగు అంత‌స్తుల భ‌వ‌నం కూలడం వ‌ల్ల అనేక మంది గాయ‌ప‌డ్డారు. 28 మందిని ర‌క్షించారు.

నంద్యాల ఉప ఎన్నికలో మైనార్టీలు టిడిపికే: ఎమ్మెల్సీ ఫరూక్

అమరావతి: ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కు ఫరూక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ నంద్యా ఉప ఎన్నికను గెలిపించి చంద్రబాబుకు బహుమానంగా ఇస్తామన్నారు. మైనార్టీలు ఎపుడూ టీడిపితోనే ఉన్నారని, నంద్యాల ఉప ఎన్నికలో మైనార్టీలు టిడిపికే ఓటు వేస్తారని జోశ్యం చెప్పారు. శిల్పా వర్గం చేస్తున్న పనులు నంద్యాలలో అందరికి తెలుసునని చెప్పారు.

రైల్వే కోర్టుకు హాజరైన టీఎస్ మంత్రులు

హైదరాబాద్: 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు కు తెలంగాణ మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు హాజరయ్యారు. తదుపరి విచారణ ఆగస్టు 21కి వాయిదా పడింది.

దిల్ సుఖ్ నగర్ ఆర్ ఎస్ బద్రర్స్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ ఆర్ ఎస్ బద్రర్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కోనసీమలో ఇలాంటి పరిస్థితులకు ముద్రగడే కారణం: చినరాజప్ప

అమరావతి: కోనసీమలో ఇలాంటి పరిస్థితులు రావడానికి ముద్రగడే కారణం అని హో మంత్రి చినరాజప్ప అన్నారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని పోలీసు బలగాలను మోహరించామని తెలిపారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, కాపులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని, భవిష్యత్ లో అనుమతి తీసుకుంటే మంజూరు చేస్తామన్నారు. జగన్ కూడా పాదయాత్ర చేయాలంటే అనుమతి తీసుకోవాలని సూచించారు.

కొనసాగుతున్న సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నటి చార్మిని నలుగురు మహిళా అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది.

ఎమ్మెల్సీగాలు రామసుబ్బారెడ్డి, ఫరూక్ ప్రమాణం

అమరావతి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రామసుబ్బారెడ్డి, ఫరూక్ లు ప్రమాణం చేశారు. వీరి చేత మండలి డిప్యూటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

హామీలు నెరవేర్చని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి గంటా

విశాఖ : కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. కాపు జాతి ముద్రగడ సొత్తు కాదని,పాదాయాత్రల పేరుతో విధ్వంసం సృష్టిస్తామంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని గంటా హెచ్చరించారు. పాదయాత్ర విరమించుకుంటే బాగుంటుందని, కాపు కార్పొరేషన్ తో లబ్ధి పొందిన వారి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.

30న ఉద్దానంలో పవన్ పర్యటన

శ్రీకాకుళం  : ఉద్దానంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ పర్యటించనున్నారు. హార్వార్డ్ నుంచి వచ్చిన డాక్టర్ల బృందంతో కలిసి ఉద్దానంలో పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోరీ...

ఖమ్మం : మధిర మండలం మడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. బుధవారం ఉదయం టీచర్లు పాఠశాల తెరిచి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. తక్షణమే పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. రూ. 2 లక్షల విలువ చేసే కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లను అపహరించినట్లు ఉపాధ్యాయులు, పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మం జిల్లా జీళ్ల చెర్వు విషాదంలో మరో కోణం

ఖమ్మం: జీళ్ల చెర్వు విషాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులను చంపి సలీం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే సలీం ఈ దారుణానికి పాల్పడ్డారు అని సీపీ ఇక్బాల్ తెలిపారు.

తిరుమలలో 'గౌతమ్ నంద' చిత్ర యూనిట్

తిరుమల ; ‘గౌతమ్ నంద’ చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో గోపీచంద్ , నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ తోపాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ డ్రగ్స్ ముద్ర నుంచి త్వరలోనే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నాడు. గౌతమ్ నంద మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని కోరుకున్నట్లు గోపీ చంద్ తెలిపారు.

11:15 - July 26, 2017

గుంటూరు : కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ చేపట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేకపోవడంతో.. పోలీసులు గుంటూరు జిల్లాలో హైఎలర్ట్‌ ప్రకటించారు. దీంతో పలువురు కాపు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:13 - July 26, 2017

రకుల్ రిక్షా తొక్కడం ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా హీరోయిన్లు ఏం చేసినా అది న్యూస్ హెడ్ లైన్ గా మారిపోతోంది. ప్రస్తుతం తమిళ సినిమా ధీరన్ అధికరం ఒండ్రు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో రకుల్ రిక్షా తొక్కే సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ కోసం కార్తీ హీరోగా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం పుదుచ్చేరిలో జరుగుతోంది.

11:10 - July 26, 2017

తూర్పుగోదావరి : పాదయాత్రకు బయలుదేరిన కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభంను అతని ఇంటి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల తీరుపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాదయాత్రకు అనుమతిలేదని ముద్రగడకు పోలీసుల వివరణ ఇచ్చారు. ఆ తర్వాత అనుచరులతోసహా ముద్రగడ అక్కడినుంచి వెనక్కివెళ్లిపోయారు. మరోవైపు ముద్రగడ ఇంటిచుట్టూ పోలీసులు బలగాల పహారా కొనసాగుతోంది. ముద్రగడ అభిమానుల్ని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:08 - July 26, 2017

హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'పైసా వసూల్' ఫస్ట్ లుక్స్ ను కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. చిత్రం 'స్టంపర్' ఈ నెల 28న ఉదయం 10.22కు విడుదల చేస్తామని చెబుతూ 'స్టంపర్ కా బాప్', 'టీజర్ కా బేటా' అంటూ 24 సెకన్ల నిడివి వున్న ఫోటోలతో కూడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇందులో బాలయ్య గడ్డంతో స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తుండటం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ముద్రగడ గృహనిర్భంధంపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు

తూ.గో: ముద్రగడ హౌస్ అరెస్ట్ పై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. రాజమండ్రిలో నిరసన తెలుపుతున్న 20 కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురంలో చేతులకు తాళ్లు కట్టుకుని కాపు నేతలు నిరసన తెలిపుతున్నారు. మామిడికుదరు మండలం మగటపల్లిలో టిడిపి జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఇంటిని కాపు నేతలు ముట్టడించి ముద్రగడ పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

చార్మి, కెల్విన్ మధ్య వెయ్యికి పైగా వాట్సప్ కన్వర్జేషన్స్

హైదరాబాద్: కెల్విన్ ముంబైల్ చార్మి దాదా పేరుతో నెంబర్ వుంది. కెల్విన్ తో క్లోజ్ గా ఉండడం సిట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిలక్ష్మి సినిమా ఫంక్షన్ లో కెల్విన్ తో చార్మి సెల్ఫీలు దిగింది. చార్మి, కెల్విన్ మధ్య వెయ్యికి పైగా వాట్సప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి.

10:39 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఏడో రోజు సిట్ విచారణ కొనసాగనుంది. సినీ నటి చార్మి సిట్‌ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఆమెను విచారించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకే విచారణ కొనసాగనుంది. ఈరోజు విచారణ ముగియకపోతే రేపుకూడా విచారించే అవకాశముంది. చార్మిని నలుగురు మహిళా అధికారులు విచారించనున్నారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్, ముగ్గురు సీఐలు చార్మిని ప్రశ్నించనున్నారు. సిట్ కార్యాలయం దగ్గర భద్రతను పెంచారు. మొదటగా చార్మి వ్యక్తిగత జీవితం, విద్యాభ్యాసం, సినీ రంగం వంటి అంశాలపై అడగనున్నారు. తదనంతరం చార్మికి కెల్విన్, ప్రముఖులతో సంబంధాలపై సిట్ విచారించనుంది. కెల్విన్ తో చార్మి వాట్సప్ సంభాషణ, చార్మి డ్రగ్స్ వాడారా..? కొనుగులు చేసిందా..? అనే కోణంలో కీలక విషయాలు రాబట్టనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య

ముంబై: భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది. నిన్న ఘాట్ కోవర్ లో నాలుగు అంతస్థుల భవనం కూలిన విషయం తెలిసిందే..

ఇన్నోవా.. బొలెరో ఢీ: దగ్ధమైన ఇన్నోవా

యాదాద్రి భువనగిరి : హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవా వాహనం పూర్తి కాలిపోయింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది. ఈ ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జరిగింది.

ఏపీ సచివాలయానికి భద్రత పెంపు...

అమరావతి: ముద్రగడ పాదయ్రాత పిలుపుతో భదత్ర పెంచారు. సచివాలయానికి వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీఎం ఇంటి వైపు వెళ్లే కరకట్ట రహదారిలో వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.

రెండు వాహనాలు ఢీ: ఆరుగురి మృతి

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మయూర్ విహార్‌కు సమీపంలోని జాతీయ రహదారి 24పై రెండు వాహనాలు ఢీకొన్నాయి. అతివేగంతో రావడంతో ఓ కారు బోల్తా కొట్టింది. టిప్పర్ పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం 21 కంపార్టమెంట్స్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. కాలినడకన తిరుమలకి చేరుకున్న భక్తులలను ఉదయం 8 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు.

గృహ నిర్భంధంలో ముద్రగడ

తూ.గో: కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గృహనిర్భంధం లో వున్నారు. నేటి నుంచి తలపెట్టిన ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు పోలీసుల అనుమతి లేదు. అయినా పాదయాత్ర చేపట్టి తీరుతా అని హెచ్చరించడం అప్రమత్తమైన పోలీసులు ముద్రగడను గృహనిర్భందంలో వుంచారు. అంతే కాకుండా కిర్లంపూడిలో పోలీసుల బలగాలు మోహరించాయి.

సిట్ కార్యాలయానికి చేరుకున్న నటి చార్మి

హైదరాబాద్ : సినీ నటి చార్మి సిట్‌ చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఆమెను విచారించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకే విచారించనున్నారు. విచారణ విధుల్లో నలుగురు మహిళా అధికారులు ఉండబోతున్నారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్, ముగ్గురు సీఐలు చార్మిని ప్రశ్నించనున్నారు. 

 

09:29 - July 26, 2017

తూర్పుగోదావరి : ముద్రగడ 'చలో అమరావతి' నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులంటుండగా...ఎలాగైనా పాదయాత్ర చేస్తామని ముద్రగడ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలో 144 సెక్షన్‌ విధించారు. జిల్లావ్యాప్తంగా 95 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:27 - July 26, 2017

కాపుల విషయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాభిరామ్, వైసీపీ నేత సీతారామస్వామి, కాపు సంఘం నాయకులు కటారి అప్పారావు పాల్గొని, మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:10 - July 26, 2017
09:08 - July 26, 2017

తూర్పుగోదావరి : ముద్రగడ 'చలో అమరావతి' నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముద్రగడ పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులంటుండగా...ఎలాగైనా పాదయాత్ర చేస్తామని ముద్రగడ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలో 144 సెక్షన్‌ విధించారు. జిల్లావ్యాప్తంగా 95 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు. 

09:03 - July 26, 2017

హైదరాబాద్ : సినీ నటి చార్మి ఇవాళ సిట్‌ముందుకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఆమెను విచారించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో చార్మిని ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకే విచారించనున్నారు. విచారణ విధుల్లో నలుగురు మహిళా అధికారులు ఉండబోతున్నారు. ఎక్సైజ్‌ సూపరిండెంట్, ముగ్గురు సీఐలు చార్మిని ప్రశ్నించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఫ్యామిలీ ఆత్మహత్య

ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. పాలేరు జలాశయంలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

08:59 - July 26, 2017

ఖమ్మం : జిల్లాలోని కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో విషాదం చోటు చేసుకుంది. పాలేరు జలాశయంలోకి దూకి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:55 - July 26, 2017

ఆర్సీఈపితో ప్రజలకు నష్టమని మెడికల్ సేల్స్ అండ్  రిప్రజెంటేటివ్స్  యూనియన్ నాయకులు ముకుల్ కులకర్ణి అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపజథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వ్యవసాయం, విత్తనరంగం, పాడి పరిశ్రమతో పాటు అత్యవసర ప్రాణరక్షక మందుల ధరల మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ధరలు పెరుగుతాయని అన్నారు. హైదరాబాద్ లో మొన్న ప్రారంభమైన 16 ఆసియా దేశాల ఆర్సీఈపి సమావేశాలపై తీవ్రత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం నుంచి మన దేశం తప్పుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వ్యవసాయం, విత్తనరంగం, పాడి పరిశ్రమతో పాటు అత్యవసర ప్రాణరక్షక మందుల ధరల మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అతి తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేస్తున్న మన దేశానికి ఆర్సీఈపి ప్రతిపాదనలు పెను శాపంగా మారబోతున్నాయి. ఆర్సీఈపి ఒప్పందాలు అమలులోకి వస్తే మన ఫార్మా రంగానికి ఎదురయ్యే ఇబ్బందులేమిటి? మందుల ధరల మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది? ఆర్సీఈపి బారి నుంచి మన ఫార్మా రంగాన్ని, ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?.. వంటి అంశాపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:49 - July 26, 2017

రంగారెడ్డి : ప్రేమోన్మాదం మళ్లీ బుసకొట్టింది...మరో అమాయకురాలిపై పంజా విసిరింది...పొలంలో పనిచేసుకుంటున్న అమ్మాయిపై కత్తి దూశాడు దుర్మార్గుడు...ప్రేమించడం లేదని వెంటపడుతూ వేటాడాడు..ఇప్పుడామ్మాయి చావుబతుకుల్లో ఉంది...
ఎన్నో ఘోరాలు 
'ఎవడి సరదాల కోసమో మేం పుట్టామా... ఆడాళ్లు ఉన్నది ఎంటర్‌టైన్ మెంట్ చేసేందుకా.. మేం ఎందుకు బలి కావాలి...సేఫ్టీ ఎక్కడుంది మాకు..పల్లెల్లో ..పట్నాల్లో ఇలా జరిగితే నిందించేది అమ్మాయిలనే'..ఇప్పుడు చెప్పండి...ఈ అమ్మాయి ప్రశ్నలకు సమాధానం...ఇప్పుడు చెప్పండి...జరుగుతున్న ఘోరాలకు సమాధానం....ఎన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి...కాని మృగాళ్లు మాత్రం ఆగడం లేదు..పంజా విసురుతూనే ఉన్నాడు...ఒకడు కామంతో..మరొకడు ప్రేమైకంలో... అమాయకురాళ్లను బలి చేస్తున్నారు...
పొలంలో పనిచేస్తుండగా పంజా..
రంగారెడ్డి జి‌ల్లా...కేశం పేట మండలం...మీనమోనిపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది...ప్రేమోన్మాది  ఓ అమ్మాయిపై కిరాతకంగా దాడి చేశాడు...తనను ప్రేమించడం లేదనే కోపంతో...శివకుమార్‌ అనే యువకుడు.. పొలంలో పని చేసుకుంటున్న సునీతను కత్తితో పొడిచాడు....తీవ్ర గాయాలైన సునీతను బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు సునీత డిగ్రీ మూడో సంవత్సరం చదువుతుండగా.. గత ఏడాది నుంచి శివకుమార్‌..సునీతను వేధిస్తున్నాడని బంధువులు చెబుతున్నారు. జరిగిన ఘోరంతో పల్లె వణికింది..విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నారు... ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య సునీత కొట్టుమిట్టాడుతుంది.

 

08:44 - July 26, 2017

చిత్తూరు : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కిడ్నాపర్లు సంచరిస్తూనే ఉన్నారు..పసిపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలతో కలకలం రేపుతుంది..మొన్నటికి మొన్న ఓ చిన్నారిని తల్లి ఒడిలోంచి ఎత్తుకెళ్లగా గాలించి చివరకు సాధించారు..ఆ తల్లి ఒడికి చిన్నారిని చేర్చారు...మళ్లీ మరో లేడీ కిలాడీ ఏడేళ్ల పాపను అపహరించింది...ఆ చిన్నారిని ఏం చేసింది..??
మళ్లీ కిడ్నాప్‌ కలకలం 
తిరుమలలో మళ్లీ కిడ్నాప్‌ కలకలం చెలరేగింది...శ్రీకాళహస్తికి చెందిన కుటుంబం తిరుమలలో దర్శనానికి వచ్చారు..వారి ఇద్దరు చిన్నారులతో వచ్చిన దంపతులకు ఏడేళ్ల చిన్నారి నందిని కన్పించలేదు..వెంటనే చుట్టూ వెతికిన ఆ కుటుంబానికి కూతురు కన్పించక పోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సీసీ ఫుటేజీ పరిశీలిస్తే అందులో చిన్నారి కన్పించింది..ఇంతే కాకుండా అక్కడే నిలబడి ఉన్న ఓ కిలాడీ లేడి ఆ చిన్నారిని అపహరించినట్లు తేలింది...
పోలీసులు దర్యాప్తు ముమ్మరం   
ఇక సీసీ ఫుటేజీ ద్వారా దొరికిన ఆధారంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు...తిరుమలతో పాటు తిరుపతి, చిత్తూరు పోలీసులకు సమాచారం అందించారు...
చిన్నారిని ఎత్తుకెళ్లిన కిలాడీ ఏం చేసింది..? 
చిన్నారిని ఎత్తుకెళ్లిన కిలాడీ ఏం చేసింది..? ఆ చిన్నారిని అమ్మేసేందుకు అపహరించిందా... లేక మరేదైనా మాఫియాకు అప్పగిస్తుందా..? ఎన్నో అనుమానాలతో పోలీసులు అప్రమత్తమయి తిరుమల దాటకుండా  కట్టడి చేసి జల్లెడపడుతున్నారు.

 

08:39 - July 26, 2017
08:37 - July 26, 2017

రాజన్నసిరిసిల్ల : వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ వద్దు... 9 గంటల కరెంటే ముద్దు అంటున్నారు  అక్కడి గ్రామ రైతులు... అంతటా .. కరెంటో రామచంద్రో అంటూ  అరుస్తుంటే... ఆ  రైతులు మాత్రం ... 24 గంటల కరెంట్‌ వద్దు అని వేడుకుంటున్నారు. దీనికోసం తీర్మానం కూడా చేశారు. 
9 గంటల విద్యుత్‌ అందించాలని తీర్మానం  
ఎక్కడైనా.. రైతులు 24 గంటల విద్యుత్ కావాలని డిమాండ్‌ చేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంట్లలో పరిస్థితి దీనికి భిన్నం. తమకు పగటపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని  కోరుతూ తీర్మానించారు. ఆ తీర్మాన ప్రతులను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రభుత్వానికి  అందించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.  
భూగర్భ జలాలపైన ఆధారపడి వ్యవసాయం 
గ్రామానికి ఎటువంటి నీటి వనరులు లేకపోవడం వల్ల... భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చే‌స్తున్నారు ఇక్కడి రైతులు. అయితే 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడంతో నీటిని ఇష్టానుసారం వాడుతున్నారని.. దాంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కారణంగా తొమ్మిది గంటల కరెంట్ తమకు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. 
చిన్న కుంటల్లో నీరు ఉండేలా కృషి అవసరం
తొమ్మిది గంటల కరెంట్‌తో పాటు... పరిసర ప్రాంతాల్లోని చిన్న చిన్న కుంటల్లో నీరు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. గ్రామానికి ఓ పక్కన లోతువాగులో చెక్‌ డ్యాంలు, ఊరి పైభాగాన ఉన్న మైసమ్మ చెరువుకు మరమ్మతులు  చేయాలని కోరుతున్నారు. అలాగే ఎర్రకుంట వి‌స్తీర్ణాన్ని పెంచి అందులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.  ఊరికి సమీపంలో ఉన్న పెద్ద బోరుగుట్ట మెట్టు గుట్టల మధ్యన చెక్‌ డ్యాంను నిర్మిస్తే గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నారు. భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుని... ఆ తర్వాత.. 24 గంటలు కరెంట్‌ ఇస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. 

 

కాసేపట్లో సిట్ ముందుకు నటి చార్మి

హైదరాబాద్ : కాసేపట్లో సినీ నటి చార్మిని సిట్ ముందుకు రానుంది. డ్రగ్స్ కేసులో కాసేపట్లో సినీ నటి చార్మిని సిట్ అధికారులు విచారించనున్నారు. చార్మి విచారణ విధుల్లో నలుగురు మహిళా అధికారులు ఉన్నారు. చార్మిని ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముగ్గురు సీఐలు ప్రశ్నించనున్నారు. 

నేడు కేంద్రమంత్రి నడ్డాను కలవనున్న టీడీపీ నేతలు

ఢిల్లీ : నేడు కేంద్రమంత్రి నడ్డాను టీడీపీ నేతలు కలవనున్నారు. న్యాయం చేయాలని నేతులు కోరనున్నారు. 

08:22 - July 26, 2017

హైదరాబాద్ : బల్దియాలో సిబ్బంది చేతివాటం శృతిమించిందా..? పన్నుల వసూళ్లుతో జేబులు నింపుకుంటున్నారా..?  కిందిస్థాయి సిబ్బంది నిర్వాకంతో ఏటా వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయా..?  ఇపుడు దీనిపైనే దృష్టిపెట్టింది జీహెచ్‌ఎంసీ .. ఆస్తాపన్ను రాబడిని మరింత పెంచుకునేందుకు స్పెషల్ ప్లాన్స్‌ను అమల్లోకి తెస్తోంది. కేత్రస్థాయి సిబ్బంది నిర్వాకంతో ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతున్నామని జీహెచ్‌ఎంసీ  అధికారులు అంటున్నారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఆస్తుల నమోదు డేటా వివరాలు సరిచూసిన బల్దియా అధికారులకు కళ్లుతిరిగినంత పనవుతోంది. 
రిజిస్ట్రేషన్‌శాఖతో జీహెచ్‌ఎంసీ సమన్వయం
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 14లక్షల 38వేల 835 మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు.  దీనికి తోడు ప్రతిఏడాది గ్రేటర్‌సిటీ పరిధిలో వేలసంఖ్యలో కొత్తనిర్మాణాలు జరుగుతున్నాయి.  ఇలా కొత్తగా వస్తున్న ప్రతిఆస్తి సొంతదారులు జీహెచ్‌ఎంసీకి ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది. కాని కొత్తగా వస్తున్న ఆస్తుల్లో చాలావరకు పన్నులు పరిధిలోకి రావడంలేదని బల్దియా అధికారులు గుర్తించారు. దీనికి విరుగుడుగా  రిజిస్ట్రేషన్‌ శాఖతో జీహెచ్‌ఎంసీ  ఆస్తిపన్ను వివరాలను సమన్వయం చేసింది.  దీంతో  తమ ఆదాయానికి భారీగా గండిపడుతున్న విషయం తెలిసి అధికారులు నోరెళ్లబెడుతున్నారు.  2015 నుంచి  గ్రేటర్‌పరిధిలో  రిజిస్ట్రేషన్‌ అయిన ఆస్తులను తమ ట్యాక్స్‌ పరిధిలోని ఆస్తులకు సరిచూసిన బల్దియాకు అసలు విషయం బోధపడింది.  గడిచిన రెండేళ్లలో  రిజిస్ట్రేషన్‌ అయిన ఆస్తుల్లో  కేవలం 57శాతం మాత్రమే  బల్దియా ఆస్తిపన్ను పరిధిలోకి వచ్చాయి. 
ఏటా జీహెచ్‌ఎంసీకి రూ.200కోట్ల నష్టం..! 
రిజిస్టేషన్‌ శాఖలో 2015 నాటికి 3లక్షల 43వేల ఆస్తులు నమోదు కాగా... వీటిలో 72వేల ఆస్తులు కేవలం ఖాళీభూములే.  వాస్తవానికి రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆస్తుల యజమానులు సకాలంలో జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించేందుకు పీటీఐఎన్‌ నంబర్‌ పొందాలి. కాని క్షేత్రస్థాయిలో బిల్‌కలెక్టర్లు ఇతర సిబ్బంది నిర్లక్ష్యం  కారణంగా చాలా ఆస్తులు పన్ను పరిధిలోకి రావడంలేదు. దీంతో 43శాతం మంది పన్నుపరిధిలోకి రాకుండా పోవడంతో బల్దియా ఖజానాకు 200కోట్ల రూపాయల వరకు నష్టం వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 
ఏటా రూ.1750కోట్ల ఆస్తిపన్ను డిమాండ్‌ 
నిజానికి  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏటా 1750కోట్ల రూపాయల ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంటోంది. కాని వసూలయ్యేది మాత్రం కేంవలం 11వందలకోట్లు మాత్రమే. దానికి కూఆ పలు విధాల ఆఫర్లు పెట్టిన జీహెచ్ఎంసీ నానా తంటాలు పడుతోంది. అయినా వందలకోట్ల రూపాయల పన్నులు పెండింగ్‌లో  ఉంటంతో సర్కిళ్లవారీగా ప్రతినెల టార్గెట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. ట్యాక్స్‌ వసూళ్లను పెంచుకునేందుకు సునామీసర్వే.. ఆస్తుల పున:మదింపు లాంటి చర్యలు చేపట్టారు. చివరికి ఖాళీ భూములకు కూడా  ట్యాక్స్‌లు వసూలు చేయడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధం అయింది.  దీన్లో భాగంగా రిజిస్ట్రేషన్‌ శాఖతో సమన్వయం కారంణంగా వెల్లడైనా 72వేల ఆస్తులపై 0.5శాతం ట్యాక్స్‌  విధించడద్వారా దాదాపు 60 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చేని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికవరకు ట్యాక్స్‌ పరిధిలోకి రాని 43శాతం ఆస్తుల యజమానుల నుంచి సుమారు 150కోట్ల వరకు పన్నులు వసూలు చేయొచ్చని బల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 
ఖజానాకు ఖన్నం వేస్తున్న వారిపై కఠినచర్యలు
ఖజానాకు ఖన్నం వేస్తున్న వారిపై కఠినచర్యలకు  జీహెచ్‌ఎంసీ  సిద్ధం అవుతోంది. పన్నుపరిధిలోకి రాకుండా ఉన్న ఆస్తులపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ చేయాలని జోనల్‌కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది  ఆస్తిపన్నుల వసూళ్లలో అలసత్వం, చేతివాటం ప్రదర్శిస్తున్న ఉద్యోగులపై ఫోకస్‌ పెట్టాలని బల్దియా డిసైడ్‌ అయింది. 

50 కేజీల గంజాయి స్వాధీనం

అనంతపురం : కొత్తచెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 50 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 

కరీంనగర్ కమిషరేట్ పరిధిలో పోలీసులు నాకాబంది

కరీంనగర్ : కమిషరేట్ పరిధిలో పోలీసులు నాకాబంది నిర్వహిస్తున్నారు. గీతాభవన్ చౌరస్తాలో తనిఖీల్లో సీపీ కమల్ హాసన్ రెడ్డి పాల్గొన్నారు. 

06:37 - July 26, 2017

హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ నేతలు అవాకూలు చవాకూలు పేలుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గోరంత దాన్ని కొండంతలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా వ్యవహారం అంతా ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. కొన్ని రోజులుగా ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే యత్నం చేశారు. అదే సమయంలో తప్పులను ఎత్తిచూపుతున్న మీడియా ప్రతినిధులపైనా కస్సుబుస్సుమన్నారు. ఆధారాలుంటే చూపాలని ఎదురుప్రశ్నిస్తున్నారు. 
మంత్రి కెటిఆర్ వ్యవహారం వివాదాస్పదం
ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయ వారుసుడిగా పొలిటికల్‌ స్క్రీన్‌పైకి వచ్చిన మంత్రి కెటిఆర్ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. కొన్ని రోజులుగా సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎదురవుతున్న సమస్యలపై స్పందించని కెటిఆర్..కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై మాత్రం విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పార్టీలపై పెదవి విరుస్తున్నారు. జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను బాధ్యతా రహిత్యమైనవని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తప్పులను ఎత్తిచూపుతున్న మీడియా ప్రతినిధులపైనా చిందులు తొక్కుతున్నారు.  
మీడియా ప్రశ్నలకు మంత్రి అసహనం వ్యక్తం 
సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో ఇసుక మాఫియాకు పోలీసులు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై దుమారం రేగడంతో మంత్రికి సొంత నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. నేరేళ్ల ఘటనను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మరోవైపు ఇసుక రీచులను ప్రభుత్వమే నిర్వహిస్తోందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అయితే బాధితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించారని మీడియా ప్రశ్నించడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.  ఆధారాలుంటే  చూపించాలని ఎదురు ప్రశ్నించారు. సిరిసిల్ల ఘటనలో గాయపడిన బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా మంత్రికి కనపడటం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆధారాలు మీడియా చూపితే తప్ప తెలిసేలా లేవా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. 

06:33 - July 26, 2017

హైదరాబాద్ : వానాకాలం పంటల మార్కెటింగ్‌పై ఇప్పటినుంచే దృష్టి పెట్టాలని రాష్ట్ర నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈసారి వానకాలం భారీ దిగుబడులు వస్తాయనే అంచనా ఉన్నందున తగు విధంగా మార్కెటింగ్ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పత్తిసాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నదన్న మంత్రి, దానికి అనుగుణంగా మార్కెటింగ్ సదుపాయాల కల్పనపై ప్రత్యేకదృష్టి పెట్టాలన్నారు. అలాగే మిర్చి పంట చేతికి వచ్చేనాటికి కోల్డ్ స్టోరేజీలను సిద్ధంచేయాలని చెప్పారు.  
మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ సమీక్ష 
హైదరాబాద్‌లోని బిఆర్ కె భవన్‌లో మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ నామ్,గోడౌన్ల నిర్మాణం, రైతు బజార్‌లు,కోల్డ్ స్టోరేజీలు, మన కూరగాయలు పథకం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రాల దిగుమతులపై అధ్యయనం చేయాలని.. ధరల హెచ్చుతగ్గులపై నిరంతర సమీక్ష అవసరమన్నారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ గోడౌన్ల వసతి సౌకర్యాలు మరింతగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మూడేళ్లుగా 18.55 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 355 గోడౌన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 300 గోడౌన్ల నిర్మాణం పూర్తయ్యిందని.. మిగతా గోడౌన్ల పనులు ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. మరో 34 గోడౌన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరారు. 'మనకూరగాయలు'పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నదున ఈ పథకంపై ప్రతినెలా సమీక్షించాలని అధికారులకు సూచించారు.  
అధికారులకు మంత్రి హరీశ్‌ దిశా నిర్దేశం 
రాష్ట్రంలో పెరుగుతున్న పత్తి సాగు నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మంత్రి హరీశ్‌ దిశా నిర్దేశం చేశారు. ఈ సారి పత్తి దిగుబడి పెరిగే అంచనాలు ఉన్నదున వాటి కొనుగోలుకు సంబంధించి మార్కెటింగ్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. ఆగస్ట్‌ 15 లోగా పత్తి క్రయ విక్రయాలపై ప్రణాలిక రూపొందించుకోవాలని ఆదేశించారు. e-ఎన్ ఏఎమ్ కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో 44 వ్యవసాయ మార్కెట్లలో ఈనామ్‌ విజయవంతంగా అమలవుతోందని.. మరో 16 మార్కెట్లలో ఈనామ్ అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు.  
'తకపట్టి' ఇవ్వడం, చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తూకం కూడా ఈ-నామ్ అనుసంధానంతో జరపాలని కోరారు. 
హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసాలకు రైతు బజార్లు 
హుస్నాబాద్, ఆసిఫాబాద్, భైంసా పట్టణాల్లో కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు  చేయాలని ఈ సమావేశంలో మంత్రి నిర్ణయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇదివరకు మంజూరు చేసిన బత్తాయి, నిమ్మ, దొండకాయల మార్కెట్ లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాబోయే మిర్చి సీజన్ కల్లా మార్కెట్ యార్డులలో కోల్డ్ స్టోరేజ్ ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మార్కెటింగ్ అధికారులు సృజనాత్మక విధానాలు ప్రవేశ పెట్టె దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. 

 

06:30 - July 26, 2017

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ల సాధనే లక్ష్యంగా ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ముద్రగడ పద్మనాభం సిద్ధమయ్యారు. పోలీసుల అనుమతి లేకున్నా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేసి తీరతానని భీష్మిస్తున్నారు. యాత్రను నిలువరించేందుకు పోలీసులు ఇప్పటికే కిర్లంపూడిని దిగ్బంధించారు. ఆర్ ఎఎఫ్ దళాలు కూడా అడుగడునా మోహరించాయి. మరోవైపు అనుమతి లేకుండా ఎవరు పాదయాత్ర చేసినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని ఏపీ డీజీపీ సాంబశివరావు హెచ్చరించారు. 
పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు 
కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, అవరోధాలు కల్పించినా పాదయాత్ర ప్రారంభించి తీరతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. నిర్బంధాలు, దిగ్బంధాలు తన పాదయాత్రను ఆపలేవంటున్నారు. కాపు జాతికి న్యాయం కోసం చంద్రబాబు ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ తన సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడి నుంచి ఏపీ రాజధాని అమరావతి వరకు పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమయ్యారు. 
భారీగా పోలీసు, ఆర్ ఏఎప్ దళాలు మోహరింపు 
ముద్రగడ ప్రతిజ్ఞ నేపథ్యంలో కిర్లంపూడిలో భారీగా పోలీసు, ఆర్ ఏఎప్ దళాలు మోహరించాయి. అనుమతిలేని పాదయాత్రలో ఎవరు పాల్గొన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముద్రగడ సొంతూరు కిర్లంపూడికి  వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎవరినీ అటువైపు వెళ్లనివ్వడంలేదు. ఈ ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించారు. ముద్రగడ పాదయాత్రకు బయలుదేరిన వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. 
వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్న కాపు నేతలు 
ముద్రగడ పాదయాత్ర విషయంలో కాపు నేతలు వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్నారు. ముద్రగడను అరెస్టు చేస్తే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కాపులు అన్ని గ్రామాలు, పట్టణాల  నుంచి బృందాలు, బృందాలుగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఈ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అమరావతి పరిసర ప్రాంత గ్రామాల నుంచి కాపు యువకులు  వెలగపూడి సచివాలయానికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని  సమాచారం అందుకున్న పోలీసులు... కిర్లంపూడి తరహాలోనే అమరావతిలో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 
ముద్రగడ పాదయాత్రపై ఏపీ ప్రభుత్వం మండిపాటు
మరోవైపు ముద్రగడ పాదయాత్రపై ఏపీ ప్రభుత్వం మండిపడింది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదిక సాధ్యమైంత త్వరగా తెప్పిస్తామని ప్రకటించింది. ఈలోగా ముద్రగడ కాపులను రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించింది. గతేడాది జనవరిలో కాపు ఉద్యమం హింసాత్మకంగా మారి, భారీ విధ్వంసం, ఆస్తి నష్టానికి దారితీసిన నేపథ్యంలో ఈసారి పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

06:24 - July 26, 2017

హైదరాబాద్ : టాలివుడ్‌లో ఎవరెవరికి డ్రగ్స్ అలవాటు ఉంది...ఉంటే వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు...కెల్విన్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి.. దర్శకుడు పూరీ విషయంలో సమాచారం...ఇలాంటవన్నీ ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ అధికారులు ఆర్ట్‌డైరెక్టర్‌ చిన్నాను నాలుగు గంటల్లోనే వదిలేశారు...చార్మీ వేసిన సిట్‌పై రిట్‌కు హైకోర్టు తీర్పు వెల్లడించింది...
నాలుగు గంటల్లోనే చిన్నా విచారణ పూర్తి...
టాలివుడ్‌లో కలకలం రేపుతున్న నటుల విచారణలో ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను సిట్ ప్రశ్నించింది...కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే విచారించినా ప్రశ్నల వర్షం కురిపించింది..అంతా టాలివుడ్‌లో డ్రగ్స్‌ లింకులపైనే ప్రశ్నించినట్లు తెలుస్తుంది...కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి...ఎప్పటినుంచి డ్రగ్స్‌ వాడుతున్నారు... సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. ఇలాంటి విషయాలను తెలుసుకున్న సిట్‌ చిన్నా విచారణను పూర్తి చేసింది...అయితే సిట్‌కు కావాల్సిన సమాచారం దొరకడంతో ఇక చిన్నా వద్ద ఎలాంటి గుట్టు లేదని త్వరగానే వదిలేసినట్లు తెలుస్తోంది...
బలవంతంగా నమూనాలు సేకరించొద్దు...
నటి చార్మీ పిటిషన్‌పై సిట్‌కు మార్గదర్శకాలు..
మాదక ద్రవ్యాల కేసులో సినీ నటి ఛార్మి వేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పింది... సిట్‌ విచారణలో తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలన్న ఛార్మి విజ్ఞప్తిని కోర్టు కొట్టేసింది...బలవంతంగా ఆమె రక్త నమూనాలను సేకరించరాదని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఛార్మిని విచారించాలని ఆదేశించింది. ఒకవేళ విచారణ పూర్తికాకపోతే మరో రోజు విచారణకు పిలవాలని సూచించింది. విచారణ బృందంలో మహిళను నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది...సిట్ విచార‌ణ‌లో తన కుటుంబీకులు ఎవరూ అందుబాటులో లేనందున తన న్యాయ‌వాదిని అనుమ‌తించాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాక‌రించింది...ఇదిలా ఉంటే సిట్‌ పంపిన నోటీసు అందుకున్న నటి చార్మీ బుధవారం ఉదయం విచారణకు హాజరుకావాల్సి ఉంది...

 

06:20 - July 26, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు విచారణ కోసం.. డోప్‌ టెస్టింగ్‌ మిషన్‌ను వినియోగించాలని ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ నిర్ణయించింది. అథ్లెట్స్‌ రక్త నమూనాలు పరీక్షించినట్లే.. డ్రగ్స్‌ కేసులో పాత్ర ఉన్న ప్రముఖుల నమూనాలూ సేకరించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు, నటి చార్మిని కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే, విచారించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 
అథ్లెటిక్‌ డోప్‌ టెస్టింగ్‌ మిషన్‌ను తెప్పించాలని నిర్ణయం
డ్రగ్స్‌ కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణాధికారులు రకరకాలుగా ప్రశ్నిస్తూ.. సినీ ప్రముఖుల నుంచి తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. వారు మాదకద్రవ్యాలు స్వీకరించినట్లుగా నిరూపించేందుకు, రక్తనమూనాలు, వెంట్రుకలు, గోర్లను సేకరించారు. నవదీప్‌ తప్ప దాదాపు అందరూ ఈ విషయంలో అధికారులకు సహకరించారు. అయితే, విచారణకు హజరవుతున్న వారు అలోవెరా లాంటి వాటి నుంచి తీసిన ద్రవాన్ని తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీని ప్రభావం రక్తనమూనాలపైనా పడొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, విచారణకు హాజరవుతున్న వారు, అధికారులకు పలువురు పెద్ద హీరోలు, నిర్మాతలు కూడా డ్రగ్స్‌ వాడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. పైగా వీటన్నింటి నేపథ్యంలో, కేసు మరింత జటిలమవుతోందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారులు.. మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, అథ్లెటిక్‌ డోప్‌ టెస్టింగ్‌ మిషన్‌ను ఢిల్లీ నుంచి తెప్పించాలని భావిస్తున్నారు. 
నేడు చార్మిని విచారించనున్న సిట్ అధికారులు
మరోవైపు, నటి చార్మిని బుధవారం ఉదయం సిట్‌ అధికారులు విచారించనున్నారు. సిట్‌పై రిట్‌ వేసిన చార్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అనుమతి లేకుండా ఆమె బ్లడ్‌ శాంపుల్స్‌ తీసుకోవద్దని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారణ జరపాలని సిట్‌ అధికారులను ఆదేశించింది.  విచారణ సమయంలో మహిళా ఆఫీసర్లు కూడా ఉండేలా చూడాలని హైకోర్టు ఆదేశించింది.  
చార్మి హైకోర్టును ఆశ్రయించడంపై స్పందించిన ఎక్సైజ్ శాఖ
చార్మి హైకోర్టును ఆశ్రయించడంపై ఎక్సైజ్‌శాఖ కూడా స్పందించింది. చార్మి అనవసరంగా హైకోర్టుకు వెళ్లిందని శాఖ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. చార్మి నుంచి వివరాలు తెలుసుకునేందుకు పిలుస్తున్నామే తప్ప.. ఆమెను తామెక్కడా నిందితురాలిగా తెలుపలేదన్నారు. కోర్టుకు వెళ్లడం ద్వారా చార్మి, తానే నిందితురాలని పరోక్షంగా ఒప్పుకున్నట్టుగా ఉందని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు. 

Don't Miss