Activities calendar

27 July 2017

21:30 - July 27, 2017

ఢిల్లీ : మహిళా క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా క్రికెటర్స్‌ను బిసిసిఐ ఢిల్లీలో ఘనంగా సన్మానించింది. భారీ నజరానాలు అందించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, బీసీసీఐ ప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివేక్ హాజరయ్యారు. మహిళా క్రికెట్‌కు తెలుగమ్మాయి కెప్టెన్ కావడం గర్వకారణంగా ఉందన్నారు వివేక్. హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే మిథాలీ రాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు వివేక్ తెలిపారు. 

21:29 - July 27, 2017

గాలే టెస్ట్‌లో టీమిండియాకు పోటీనే లేకుండా పోయింది. రెండో రోజు సైతం భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ , రెండో రోజు బౌలర్లు రాణించడంతో భారత జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. ధావన్‌ ధనా ధన్‌ ఇన్నింగ్స్‌, పుజారా ట్రేడ్‌ మార్క్ సెంచరీతో పాటు ....యంగ్‌ గన్‌ హార్దిక్‌ పాండ్య అరంగేట్రం టెస్ట్‌లోనే ఆకట్టుకుకోవడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసి శ్రీలంక జట్టుకు సవాల్‌ విసిరింది. లంక బౌలర్లలో నువాన్‌ ప్రదీప్‌ ఒక్కడే 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక జట్టు ఆరంభం నుంచే తడబడింది. కరుణ రత్నే, గుణతిలక విఫలమైనా....ఉపుల్‌ తరంగ హాఫ్‌ సెంచరీతో లంకను ఆదుకున్నాడు. తరంగ రనౌటవ్వండంతో పాటు మెండిస్‌ పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో...లంక జట్టు 125 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. ఏంజెలో మాథ్యూస్‌ హాఫ్‌ సెంచరీతో లంక జట్టును మరోసారి ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే లంక జట్టు బ్యాట్స్‌మెన్‌ తేలిపోవడంతో....భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగించింది. మూడో రోజు భారత స్పిన్నర్లు సైతం చెలరేగితే లంక జట్టుకు కష్టాలు తప్పవు.

21:28 - July 27, 2017

మహారాష్ట్ర : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు కష్టాలు తీరేలా కనిపించడం లేదు. వీఐపీ స్టేట‌స్ వ‌ల్లే సంజ‌య్‌ద‌త్‌ను ముందుగానే జైలు నుంచి విడుద‌ల చేసిన‌ట్లు భావిస్తే.. అత‌న్ని తిరిగి జైలుకు పంపొచ్చని మ‌హారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు స్పష్టంచేసింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో జైలుకు వెళ్లిన సంజయ్‌దత్‌- సత్‌ప్రవర్తన కారణంగా 8 నెలల ముందే విడుదలయ్యారు. ద‌త్ ప్రవ‌ర్తన బాగున్నట్లు అధికారులు ఎలా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు? అత‌ను శిక్షా కాలంలో స‌గం పెరోల్‌పై బ‌య‌టే ఉన్నపుడు అత‌ని ప్రవ‌ర్తన‌ను ఎలా అంచ‌నా వేశారని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం- సంజయ్‌ విడుదలపై నిబంధనలు అతిక్రమిస్తే మళ్లీ అతనికి జైలుకు పంపడంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలిపింది. 1993 బాంబు పేలుళ్ల సంద‌ర్భంగా సంజ‌య్‌ద‌త్ అక్రమంగా ఆయుధాలు క‌లిగి ఉన్నాడ‌న్న కేసులో సుప్రీంకోర్టు అత‌నికి ఐదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. సంజయ్‌ను 8 నెలలు ముందుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త ప్రదీప్‌ భాలేకర్ ముంబై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

21:27 - July 27, 2017

పాట్నా : దాణా స్కాం, బినామీ ఆస్తుల కేసులు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి తాజాగా ఈడీ షాకిచ్చింది. లాలూ, ఆయన కుటుంబసభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. లాలు రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు రైల్వే హోటల్స్‌ కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. సీఎంగా నితీశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే లాలూపై ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం.

1100 కాల్ సెంటర్ సర్వే వివరాలు...

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. 1100 కాల్ సెంటర్ సర్వే వివరాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పెన్షన్ లపై 97 శాతం సంతృప్తి, 3 శాతం అసంతృప్తి..ఉపాధి పనులపై 77 శాతం సంతృప్తి, 23 శాతం అసంతృప్తి..చంద్రన్న బీమాపై 92 శాతం సంతృప్తి, 8 శాతం అసంతృప్తి..నంద్యాల రోడ్లలపై 98 శాతం సంతృప్తి, 2 శాతం అసంతృప్తి..మద్యం అమ్మకాలపై 92 శాతం నియంత్రించాలని..8 వద్దని...బెల్లుషాపుల మూసివేత నిర్ణయంపై 98 శాతం సంతృప్తి, 2 శాతం అసంతృప్తి..విశాఖ భూకబ్జాలపై సిట్ దర్యాప్తు సరైందేనని 74 శాతం సరైందేనని.. 6 శాతం కాదని..తెలియదని 16 శాతం అభిప్రాయాలు తెలిపినట్లు వెల్లడించారు. 

ముద్రగడ కొన్ని నెలలు ఆగలేరా - నారాయణ..

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పినా ముద్రగడ పాదయాత్ర చేస్తానంటున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ కాపుల గురించి మాట్లాడలేదన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్టు వచ్చే వరకు ఉండాల్సిందేనని, ఇన్నాళ్లు ఉన్నారు..కొన్ని నెలలు ఆగలేరా అని ప్రశ్నించారు. 

21:24 - July 27, 2017

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రిగా బిజెపి నేత సుశీల్‌ మోది ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్‌ మహాకూటమి నుంచి వైదొలగడంపై ఆర్జేడి, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. నితీష్‌ పచ్చి అవకాశవాదని అధికారం కోసం నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తాయి. నితీష్‌ బిజెపితో జతకట్టడంతో జెడియులో లుకలుకలు మొదలయ్యాయి. రాజ్‌భ‌వ‌న్‌లో జరిగిన కార్యక్రమలో గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి నితీష్‌ చేత ప్రమాణ‌స్వీకారం చేయించారు. నితీష్‌ సిఎంగా ప్రమాణం చేయడం ఇది ఆరోసారి.

ఉపముఖ్యమంత్రిగా బిజెపి నేత..
ఉపముఖ్యమంత్రిగా బిజెపి నేత సుశీల్‌ మోది ప్రమాణ‌స్వీకారం చేశారు. బిహార్‌ అభివృద్ధి కోసమే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు నితీష్‌ చెప్పారు. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు వివరంగా చెబుతానని తెలిపారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌పై ఆర్జేడీ చీఫ్‌ లాలుప్రసాద్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నితీష్‌ పచ్చి అవకాశవాదని, అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. బిజెపితో నితీష్‌ చేతులు కలపడం పట్ల బిహార్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌ ప్రజలు బిజెపిని ఖాళీ చేతులతో పంపారని ... వెనకబడిన తరగతులు, మైనారీటీలు, పేదలు మహాకూటమికి మద్దతిచ్చారని గుర్తు చేశారు. నితీష్‌ బిజెపితో కుమ్మక్కై తేజస్వీ యాదవ్‌పై సిబిఐ కేసు నమోదు చేయించారని ఆరోపించారు.

రాహుల్ నిప్పులు..
నితీష్ కుమార్ మోసం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కనీసం తమతో చర్చించకుండా బీజేపీతో చేతులు కలపడం దారుణమన్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మూడు నాలుగు నెలల నుంచి నితీష్ స్కెచ్ వేశారని రాహుల్ వెల్లడించారు. అధికారం కోసం నితీష్ ఏమైనా చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలు తీర్పు ఇస్తే...స్వార్థం కోసం నితీష్‌ బిజెపితో చేతులు కలిపారని విమర్శించారు.

పలువురు మండిపాటు..
నితీష్‌కుమార్‌ బిజెపితో జతకట్టడంపై జెడియులో సొంత పార్టీల నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నితీష్‌ నిర్ణయంపై సీనియర్‌ నేతలు శరద్‌ యాదవ్‌, అలీ అన్వార్‌ మండిపడుతున్నారు. నితీష్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శరద్‌ యాదవ్‌ హాజరు కాలేదు. మరోవైపు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో తాజా పరిణామాలపై శరద్‌యాదవ్‌ మంతనాలు జరిపారు. జెడియు నేతలతో శరద్‌యాదవ్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. బిజెపితో నితీష్‌ చేతులు కలపడాన్ని కేరళ జెడియు నేత వీరేంద్రకుమార్‌ వ్యతిరేకించారు. రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. జులై 28న నితీశ్‌కుమార్‌ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. 

21:19 - July 27, 2017

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధాన్ని వచ్చే నెల 2 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం విధించిన 24 గంటల గృహ నిర్బంధం ముగియడంతో గురువారం ఉదయం పాదయాత్ర ప్రారంభించేందుకు ముద్రగడ ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే గృహ నిర్బంధాన్ని ఆగస్టు 2 వరకు పొడిగిస్తూ జిల్లా కలెక్టర్‌ కార్తీయ మిశ్రా ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని పోలీసులు ముద్రగడ దృష్టికి తీసుకెళ్లి, వెనక్కి పంపారు. మరోవైపు కాపులకు రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తేలేదని ముద్రగడ తేల్చి చెప్పారు.

ఆగస్టు 2వరకు పొడిగింపు..
కాపు నేత ముద్రగడ పద్మనాభం గృహనిర్బంధాన్ని ప్రభుత్వం ఆగస్టు 2వరకు పొడిగించింది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో బుధవారం పాదయాత్రకు సిద్ధమైన ముద్రగడను ప్రభుత్వం తొలుత 24 గంటలపాటు గృహ నిర్బంధంలో ఉంచింది. గురువారం ఉదయంతో గడువు పూర్తవడంతో గృహనిర్బంధాన్ని వచ్చే నెల 2 వరకు పొడిగించింది. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తీయ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. తాజా ఉత్తర్వులు అందకపోవడంతో, ముద్రగడ నిర్బంధం ముగిందన్న భావనతో పాదయాత్రకు బయలుదేరారు. ఆవెంటనే పోలీసులు ఆయన్ను నిలువరించారు. దీంతో ముద్రగడ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారం రోజుల పాటు గృహ నిర్భందం..
పాదయాత్ర చేస్తే హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ముదగ్రడను మరో వారంపాటు గృహ నిర్బంధంలోనే ఉంచుతున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ప్రకటించారు. గృహ నిర్బంధం పొడిగింపుపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. నిర్బంధం ఎప్పుడు ముగిస్తే అప్పుడే పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమ జాతిని మభ్యపెడుతున్నారని ముద్రగడ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపుపై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

చెక్ పోస్టుల కొనసాగింపు..
ముద్రగడ గృహ నిర్బంధాన్ని వచ్చే నెల 2 వరకు పొడిగించడాన్నివ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులు నిరసన వ్యక్తం చేశారు. పశ్చిమగోదారి జిల్లా పాలకొల్లులో మెడకు ఉరితాళ్లు, చేతులకు బేడీలు వేసుకుని కాపులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మరోవైపు ముద్రగడ గృహ నిర్బంధం పొడిగింపును ప్రభుత్వం సమర్థించుకుంది. ముద్రగడ ఉద్యమం వెనుక వైసీపీ అధినేత జగన్‌ హస్తం ఉందని హోం మంత్రి చినరాజప్ప ఆరోపించారు. ముద్రగడ గృహ నిర్బంధాన్ని పొడిగించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను కొనసాగించాలని పోలీసులు నిర్ణయించారు. 

21:16 - July 27, 2017

విజయవాడ : 2019 అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు దుష్ట పాలన, వైసీపీ సన్మార్గానికి మధ్య పోటీ అని పార్టీ అధినేత జగన్‌ ప్రకటించారు. వచ్చే నెల 23న జరిగే నంద్యాల ఉప ఎన్నికతోనే చంద్రబాబు పాలన చరమగీతానికి నాంది, ప్రస్తావన ప్రారంభమవుతుందన్నారు. నంద్యాల బై ఎలక్షన్‌తోపాటు వచ్చే ఎన్నికల్లో టిడిపికి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. విజయవాడకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీPలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ నిప్పులు చెరిగారు. విజయవాడకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో తీర్థం పచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి విష్ణును... జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. విష్ణుతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు.

మల్లాది విష్ణు..
మల్లాది విష్ణు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు. వీజీటీఎం... వుడా చైర్మన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్‌ మరణం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్‌లేదని గ్రహించిన మల్లాది, అనుచరుతో సంప్రదించి ఇటీవల ఆ పార్టీకి రాజీనామాచేసి, ఇప్పుడు వైసీపీలో చేరారు. విష్ణు వైసీపీలోకి రావడంతో విజయవాడలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్‌ చేశారు. నంద్యాల ఉప ఎన్నికతోపాటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కవన్నారు. అధికారం కోసం చంద్రబాబు మాదిరిగా ప్రజలను మోసగించే తత్వం తనకులేదన్న వాదాన్ని జగన్‌ వినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు ఈనెల 8,9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైసీపీ పీన్లరీలో జగన్‌ ప్రకటించిన నవరత్నకార్యక్రమాలను వల్లెవేశారు. 

సంజయ్ విడుదలపై మహారాష్ట్ర సర్కార్ వివరణ..

మహారాష్ట్ర : సంజయ్ దత్ ముందస్తు విడుదలపై ముంబై హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం వివరణనిచ్చింది. ముందుస్తు విడుదలలలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే సంజయ్ దత్ ను తిరిగి జైలుకు పంపడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం పేర్కొంది. 

నితీష్ పై రాహుల్ గరం గరం..

ఢిల్లీ : నితీష్ కుమార్ పై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. కొందరు అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతారని, దేశ రాజకీయాల్లో ఉన్న సమస్య ఇదేనని తెలిపారు. నితీష్ కుట్ర నాకు ముందే తెలుసన్నారు. బీజేపీతో చేతులు కలిపి నితీష్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

అభివృద్దిని అడ్డుకున్న శిల్పా మోహన్ రెడ్డి - అఖిల ప్రియ..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి అఖిల ప్రియ ఓ సభలో మాట్లాడారు. నంద్యాల అభివృద్ధి కోసం భూమా నాగిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని, భూమాను శిల్పా మోహన్ రెడ్డి అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శించారు. ఫ్యాక్షనిజంపై శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెలిపారు..

యూత్ పాలసీపై బాబు సమీక్ష..

విజయవాడ : యూత్ పాలసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఏ వయస్సు నుండి నిరుద్యోగ భృతి కల్పించాలన్న అంశంపై..ఏపీలో ఉపాధి..ఉద్యోగం లేని..యువత సమాచారం కోసం సేకరించాలని ఆదేశించారు. యువత సమాచారం సేకరించి విధి విధానాలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎంప్లాయిమెంట్ ఎక్సైంజ్ లు సాధికారిక సర్వే, సిల్క్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, వివిధ యూనివర్సిటీల్లో సమాచారం సేకరించి అనుసంధించాలని సూచించారు. 

20:36 - July 27, 2017

అఖండ భారతం..మాదే ప్రజల తీర్పు ఎలా ఉన్నా మాకున్న ఎత్తుగడలు మాకున్నాయి..బీహార్ రాష్ట్ర రాజకీయాల మార్పుతో నరేంద్ర మోడీ పంపిన సందేశమిది..మరి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి...బీహార్ సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామాచేశారు..మళ్లీ కొద్దిగంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు...24గంటల వ్యవధి లేకుండా జరిగిన పరిణామిలివి...నాటకీయంగా జరిగిన ఈ పరిణామాలకు కారణాలేంటీ ?..కారకులెవరు ? జరిగింది ఏంటీ ? ఈ అంశంపై ప్రత్యేక కథనం..పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

20:27 - July 27, 2017

ముగ్గురు పిల్లల తల్లికి తొల్చూరు కాన్పామె పుర్టినొప్పులు ఎట్లవడాల్నో నేర్పిందట..? అగో అట్లనే ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కొడ్కు ముచ్చట గూడ.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని చెప్పుదీస్కోని కొట్టాల్నంట.. ఆడోళ్లకు పిల్పునిస్తున్నడు తెల్గుదేశం పార్టీ రేవంతం సారూ..? అన్ని జిల్లాల పోలీసోళ్లు ఏమోగని.? సిరిసిల్ల పోలీసోళ్లకే ఆ వారసత్వం వచ్చినట్టనిపిస్తున్నది.. ఔర్ ఏక్ దక్కా తెలంగాణ పక్కా లెక్క.. ఇదొక్కసారి తన్లాడి సూద్దాం.. వస్తె వస్తది పించిని లేకపోతె లేదని తెలంగాణ సచివాలయంకాడికొచ్చిండ్రు ముసలోళ్లు..తెలుగు భాషా పండితుడు.. స్వచ్చమైన స్వర శౌరీ.. శ్రీ కుందూరు జానారెడ్డి సారు మాట్లాడితె ఎట్లుంటది తెల్గు..? తెలంగాణ రాష్ట్రంలున్న జైళ్లను కిరాయికిస్తరట బైటిరాష్ట్రాలోళ్లకు..మిషన్ భగీరథ నీళ్లు పైపులళ్ల కెళ్లి పరవళ్లు తొక్కుకుంట ఉర్కొస్తున్నయ్.. రూపాయికే నల్ల కనెక్షన్ అందుకోండ్రి అద్భుతమైన ఆఫర్..ఆడిమన్షిని అత్యాచారం జెయ్యవోయిండని తెలిస్తెనే పోలీసోళ్లు రంగంలకు దిగి అరెస్టు జేయాలే.. కని..ఎల్లమ్మ ఎంకులాడి పెడ్తె మైసమ్మ మాయం జేశినట్టు.. వారెవ్వ..? గిసోంటి ముచ్చట్లు సూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:19 - July 27, 2017

తెలుగు భాషా పండితుడు.. స్వచ్చమైన స్వర శౌరీ.. శ్రీ కుందూరు జానారెడ్డి సారు మాట్లాడితె ఎట్లుంటది తెల్గు..? ఆణిముత్యాల లెక్క జాలువారుతయ్ పదాలు.. మరి ఆసారు బొమ్మగట్టి ఆయన ఎట్ల మాట్లాడుతడో ఆమాటలను అక్షరీకరిస్తె ఎట్లుంటదో..? యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టోళ్లు అచ్చేశి మరీ సూపెట్టిండ్రు ..వీడియోలో సూడుండ్రి..

పార్టీ నేతలతో లాలూ సమావేశం..

పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లాలూ కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. 

20:00 - July 27, 2017

ఏపీ రాజధాని అమరావతిలో ప్రాంతంలో ఆరంభం నుండి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన పలు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఇటీవలే కోర్టు పలు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:45 - July 27, 2017

విజయవాడ : కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ...నిరసనలు వెల్లువెత్తాయి. వేతన సవరణను నిరాకరిస్తున్న ప్రభుత్వంపై... బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు... ఆందోళనకు దిగారు. ఆర్థిక భారాన్ని మోసే సామర్థ్యం లేదనే నెపంతో వారిని వేతన సవరణ పరిధిలోంచి తీసివేయడంపై నిరసనగా ఒక్క రోజు సమ్మె చేపట్టారు. హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు...ఈ సమ్మెలో భాగమయ్యారు. తమకు మూడో వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు.

విజయవాడ, విశాఖలో..
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా విజయవాడలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వీరి సమ్మెకు బీఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ సంఘాలు, సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. టెలికాం రంగాన్ని ప్రైవేటీకరణ చేపట్టడం దుర్మార్గమైన చర్యని వారు అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులుకు వేతన, పెన్షన్‌ సవరణ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే జిల్లాలోని చల్లపల్లిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని.. ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. వేతన సవరణను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... విశాఖలోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఆందోళన చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగమయ్యారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని... దానికి ఉద్యోగులను బాధ్యులు చేయడం ఎంతవరకూ సమంజసమని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని... తమ డిమాండ్లను ఆమోదించాలని ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

19:41 - July 27, 2017

ప్రకాశం : గరగపర్రు దళితుల సమస్యను పరిష్కరించినట్లే.. ప్రకాశం జిల్లా దేవరపల్లిని సమస్యపై దృష్టి సారించమని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో దేవరపల్లికి ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందం వెళ్తున్నట్లు ప్రభాకరరావు స్పష్టం చేశారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటోన్న దళిత భూములను చెరువుల కోసం తీసుకోవడాన్ని పరిశీలిస్తామని జూపూడి తెలిపారు. 

19:40 - July 27, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా నేరెళ్ల దళితుల్ని కాంగ్రెస్ ఎంపి వి.హనుమంతరావు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి.. ఎస్పీని సస్పెండ్ చేయాలేని డిమాండ్ చేశారు. ఈనెల 31న సిరిసిల్ల బాధితులకు న్యాయం చేయాలంటూ చేపట్టే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని వీహెచ్ సూచించారు. 

19:38 - July 27, 2017

సిద్దిపేట : పట్టణంలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. కోమటి చెరువును సందర్శించి..చెరువుపై రోప్‌వే ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా మున్సిపల్‌, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కోమటి చెరువుపై ఉన్న పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలో గల మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో 4 పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేశామని.. త్వరలోనే 30 కోట్లతో ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. 

19:37 - July 27, 2017

విజయవాడ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి విష్ణును... జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. విష్ణుతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. విష్ణు వైసీపీలోకి రావడంతో విజయవాడలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో రాష్ట్రంలో మళ్లీ రాజన్న పాలన వస్తుందని జగన్‌ చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో.. అధికారపక్షానికి డిపాజిట్ కూడా రావన్నారు. 

19:35 - July 27, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు విచారణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గబోమని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. పక్కా ఆధారాలతోనే సిట్‌ విచారణ జరుగుతోందన్నారు. సినీ వర్గాన్ని టార్గెట్‌ చేశారన్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. విచారణ అధికారులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి... వారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచుతామన్నారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్‌ నియంత్రణ సాధ్యమన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి...

19:33 - July 27, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ డెన్‌ గోవా,బ్యాంకాక్...ఈ ప్రాంతాలనే ఐటంసాంగ్‌ ఫేం ముమైత్ ఖాన్‌ ఇష్టపడతారు..ఆ ప్రాంతాలకే ఎక్కువగా వెళ్తుంటారు.. ఇదే సమయంలో ముమైత్‌కు కెల్విన్‌తో సంబంధాలున్నట్లు ఆధారాలు దొరికాయి...మరి ..ముమైత్‌కు ..డ్రగ్స్‌ మాఫియాకు సంబంధాలేంటి..? ఇదే విషయాన్ని క్లారిటీ తెచ్చుకుంది సిట్... అధికారుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ముమైత్‌ఖాన్ నుంచి చాలా మత్తు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది...మరికొన్ని గంటల్లో కీలకంగా భావిస్తున్న నటుడు రవితేజను విచారించేందుకు అన్ని ఆధారాలతో సిద్దమయింది సిట్...

ముంబైలో నివాసం..
ముమైత్‌ఖాన్...చాలా కాలం క్రితమే హైదరాబాద్‌ వదిలి ముంబాయి వెళ్లిపోయింది...ఆ తర్వాత ఆమె టాలివుడ్‌లో నటిగా ఎదిగినా వస్తూ వెళ్తుండేది...కాని...టాలివుడ్‌లో డ్రగ్స్‌కు...ఐటంసాంగ్ ఫేం ముమైత్ తరుచూ గోవా,బ్యాంకాక్‌లకు వెళ్లడం వెనక ఆంతర్యమేంటనేది అంతుచిక్కడం లేదు...ఇప్పుడా సమాచారం డ్రగ్స్ కేసులో విచారిస్తున్న సిట్‌కు దొరికింది...డ్రగ్స్‌ డెన్‌గా పేరొందిన గోవా, బ్యాంకాక్‌లకు తరుచూ వెళ్లొచ్చే ముమైత్‌ఖాన్‌ను ఈ విషయంలోనే సిట్ అధికారులు గుచ్చి గుచ్చి అడిగినట్లు తెలుస్తోంది.. ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి డ్రగ్స్ డీలర్లతో ఆమెకు సంబంధాలున్నాయా..? లేకపోతే డ్రగ్స్‌కు ఎడిక్టయి వెళ్తుంటారాన్నది సిట్‌ తెలుసుకుంది....ప్రధానంగా టాలివుడ్‌కు మత్తు సరఫరా చేస్తున్న కెల్విన్‌తో పరిచయం ఎలా ఏర్పడింది...డగ్ర్స్‌ ఎవరెవరికి సరఫరా చేస్తాడన్న విషయాలపై సిట్ ఆరా తీసింది...

ఐదు గంటల లోపే విచారణ..
ఇక సినీనటి ముమైత్‌ఖాన్ ఉదయం అబ్కారీ ఆఫీస్ చేరుకోగా నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల లోపే ఆమెను విచారించి వదిలేశారు...విచారణలో ప్రధానంగా కెల్విన్‌తో సంబంధాలపైనే ప్రశ్నలు వేశారు..కెల్విన్‌తో తరుచూ కాంటాక్ట్‌లో ఉండడం.. వాట్సాప్‌లో చాటింగ్‌లు చేయడం లాంటి విషయాలపై ఆరా తీసిన సిట్ అధికారులు ముమైత్‌ నుంచి టాలివుడ్‌లో డ్రగ్స్ సంబంధాలపై కీలక సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది...ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ వెంట షో ప్రతినిధులు కూడా చేరుకున్నారు...వారంతా కలిసి ఉదయాన్నే సిట్ కార్యాలయానికి రాగా అధికారులు ఆమెను విచారించారు...

రవితేజ విచారణ శుక్రవారం..
ఇక కొన్ని గంటల్లోనే రవితేజ విచారణ ఆరంభం కానుంది... సినీనటుడు రవితేజ నంబర్లు కెల్విన్‌ ఫోన్‌లో ఉండడంతో పాటు ఇంతకు ముందే అరెస్టయిన డ్రగ్స్ డీలర్ జిషాన్‌తో సంబంధాలున్నట్లు తేలింది..దీంతో పాటు జిషాన్‌ను విచారించినప్పుడు రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం ఉంది..దీంతో పాటు రవితేజ సోదరుడు , ఈ మధ్యనే ప్రమాదంలో మరణించిన భరత్‌కు డ్రగ్స్‌తో నేరుగా సంబంధాలున్నాయి...డ్రగ్స్ తీసుకోవడమేగాకుండా..సరఫరా చేస్తున్నాడని భరత్‌ గతంలోనే అరెస్టు కావడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది...దాంతోనే టాలివుడ్‌లో డ్రగ్స్‌ సంబంధాలు బయటపడ్డాయి...వీటన్నింటి ఆధారాలతో పాటు విచారణకు సిట్‌ సిద్దమయింది.

దుర్మార్గానికి..సన్మార్గానికి పోరాటం - జగన్..

విజయవాడ : మల్లాది విష్ణు వైసీపీలో చేరడమంటే సొంత ఇంటికి వచ్చినట్టేనని, రాష్ట్రంలో దుర్మార్గానికి, సన్మార్గానికి మధ్య పోరాటం జరుగుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. అధికారం కోసం చంద్రబాబులా అడ్డదారులు తొక్కమని, చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నంద్యాలలో ఓటుకు రూ. 5వేలు ఇస్తే తప్ప టిడిపి గెలువలేదని చంద్రబాబుకు అర్థమైనట్లుందని తెలిపారు. 

కాంగ్రెస్ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా..

గుజరాత్ : రాష్ట్రంలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. బల్వంత్ సింగ్, తేజశ్రీ పటేల్, పీఎల్ పటేల్ లు రాజీనామా చేశారు. 

అభివృద్ధి చేసే శక్తి జగన్ కే ఉంది - మల్లాది విష్ణు..

హైదరాబాద్ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి జగన్ కు ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కాసేపటి క్రితం ఆయన వైసీపీలో చేరారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, విజయవాడలో టిడిపి అరాచకాలు ఇక సాగనివ్వమన్నారు. 

బాబును కలిసిన రామకృష్ణ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలిశారు. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏజెన్సీలో విష జ్వర మరణాలను నిర్మూలించాలని కోరినట్లు పేర్కొన్నారు. మూడు నెలలైనా గరగపర్రు దళితులకు న్యాయం జరగలేదని స్పందించాలని, విజయవాడ అభివృద్ధిని కమ్యూనిస్టులు అడ్డుకుంటున్నారని లోకేష్ అనడం సరికాదని తెలిపినట్లు పేర్కొన్నారు. విజయవాడ అభివృద్ధికి పాటు పడింది కమ్యూనిస్టులేనని, గరగపర్రు, చాపరాయిని సందర్శించాలని కోరినట్లు తెలిపారు. 

కేరళ జేడీయూ తీవ్ర ఆగ్రహం..

ఢిల్లీ : బీజేపీతో నితీష్ పొత్తుపై కేరళ జేడీయూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఫాసిస్టు విధానాన్ని వ్యతిరేకించిన నితీష్ ఇప్పుడు ఫాసిస్టులతో చేతులు కలిపారని, రాజ్యసభ పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని కేరళ జేడీయూ చీఫ్ రవీంద్ర కుమార్ వెల్లడించారు. నితీష్ నిర్ణయంతో కొంతమంది బీహార్ జేడీయూ ఎమ్మెల్యేలూ ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్ర కౌన్సిల్ లో చర్చించి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప.బెంగాల్ ప్రతిపాదనకు కేంద్ర కమిటీ నో..

ఢిల్లీ : సీతారాం ఏచూరిని మరోసారి రాజ్యసభకు ఎన్నుకోవాలన్న ప.బెంగాల్ రాష్ట్ర కమిటీ ప్రతిపాదనపై పొలిట్ బ్యూరో చర్చించిందని సీపీఎం కేంద్ర కమిటీ వెల్లడించింది. ఈ ప్రతిపాదనకు పొలిట్ బ్యూరో అంగీకరించలేదని, ప.బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ కు33 మంది ఎమ్మెల్యేలున్నారని తెలిపారు. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం ఇష్టం లేక ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపింది. సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వారిని చట్ట సభలకు ఎన్నుకోవడం లేదని, సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యే నాటికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని తెలిపింది.

చైనాపై వచ్చే వారమే అణుదాడి - ఆడం స్కాట్..

ఢిల్లీ : ట్రంప్ అనుమతినిస్తే చైనాపై వచ్చే వారమే అణుదాడి చేస్తామని అమెరికా - పసిఫిక్ రేంజ్ కమాండర్ ఆడం స్కాట్ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా జాతీయ యూనవర్సిటీలో జరిగిన సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. 

18:23 - July 27, 2017

కర్నూలు : ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకం నిర్మాణలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును అటకెక్కించిందని, సీఎం చంద్రబాబు నాయుడు విజన్ వల్లే పట్టిసీమ జలాలు పంటల్ని కాపాడుతున్నాయన్నారు. 

18:18 - July 27, 2017

విజయవాడ : కాపులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని..కాపులందరూ ఆలోచించాలని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రపై ఆయన మీడియాతో మాట్లాడారు. కులానికి న్యాయం చేయాలని చాలా మంది చెప్పే వారున్నారని, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ఒక్కరు తప్ప అందరూ చెప్పారే కానీ ముందుకు వెళ్లలేదన్నారు. టిడిపి పార్టీ పుట్టినప్పటి నుండి కాపులకు బాబు న్యాయం చేశారని, చట్టం తన పని తాను చేసుకోపోతుందన్నారు. పాదయాత్ర చేయాలని అనుకుంటే పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. బాబు కూడా గతంలో పాదయాత్రకు అనుమతిని తీసుకుని వెళ్లారని గుర్తు చేశారు. కేవలం రాజకీయం చేయాలనే ఉద్ధేశ్యంతో ముద్రగడ ఇలా చేస్తున్నారని, కొంతమంది భుజాల మీద వేసుకుని..ఆ నాయకుడికి ఉపయోగ పడే విధంగా చేస్తున్నారని పరోక్షంగా జగన్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కొన్ని మాసాలతో పూర్తవుతుందని అనుకుంటున్న నేపథ్యంలో ఇలా చేయడం సబబు కాదన్నారు. 

18:09 - July 27, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు విచారణ ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ రోజు నటి మమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. మహిళా అధికారులు విచారించారు. ఆరున్నర గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణలో సిట్ అధికారులు కీలక సమచారం రాబట్టినట్లు సమాచారం. ప్రశ్నలతో ముమైత్ ను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు, ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో ఈ రోజు ముమైత్ ఖాన్ తో పాటు సాద్ మజీద్, ముబీన్ లనూ విచారించినట్లు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ముమైత్ ను విచారించిన బృందంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్, సీఐలు రేణుక, విజయలక్ష్మి, ఎస్సై శ్రావణి ఉన్నారు. రేపు రవితేజను విచారించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

వైసీపీలో చేరిన మల్లాది విష్ణు..

విజయవాడ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మల్లాది విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాసేపటి క్రితం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 

విజయవాడకు జగన్..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. జగన్ సమక్షంలో విజయవాడ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరనున్నారు. 

శ్రీలంక 154/5..

ఢిల్లీ : గాలె టెస్టు లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత బౌలింగ్ లో షమి 2, ఉమేష్, అశ్విన్ లకు చెరో వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 600 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. 

17:43 - July 27, 2017
17:42 - July 27, 2017

నెల్లూరు : జిల్లాలోని సంగం నుండి తమిళనాడుకు బయలుదేరిన యాత్రికుల బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. బస్సులో 45 మంది ఉన్నారు. పుదుచ్చేరి వద్ద జరిగిన ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షతగాత్రులను వారి వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులోని ఓ దర్గాను దర్శించుకొనేందుకు వీరంతా వెళుతున్నట్లు తెలుస్తోంది.

 

17:38 - July 27, 2017

యాదాద్రి భువనగిరి : జిల్లాలో అంబోజు నరేష్ పరువు హత్యకేసులో పోలీసులు సమగ్ర విచారణ జరపడం లేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. భువనగిరి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీపీఐ కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. నరేశ్ కేసును సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. హంతకుల వెనుక ఉన్న రాజకీయ నేతలు ఎవరో పోలీసులు బహిర్గతం చేయాలని ప్రజా సంఘాల నేతలు కోరారు. 

17:36 - July 27, 2017

గుంటూరు : కార్మికుల ఉద్యమాలు..ఆందోళనలు ఫలించాయి..రెండేళ్ల క్రితం మూతబడిన గుంటూరు భజరంగ్ జూట్ మిల్లు ఆగస్టు 16న పున: ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వం..యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో మిల్లు తెరిచేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీనితో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.

టెన్ టివి చొరవ అభినందనీయం..
ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నేతలు టెన్ టివితో మాట్లాడారు. జులై 4, 2015న జూట్ మిల్లు యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందని గుర్తు చేశారు. 80 ఏళ్ల చరిత్ర..2500 కార్మికులున్న మిల్లు అని తెలిపారు. కానీ మిల్లును మూసివేయడంతో తెరిపించాలనే ఉద్ధేశ్యంతో జూట్ పరిరక్షణ సంఘం పేరిట ఓ సంఘం ఏర్పాటు చేసి ఆందోళనలు..నిరసనలు వ్యక్తం చేసింది. మంత్రులు..సీఎం..యాజమాన్యంతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. ఈ ఉద్యమాల్లో టెన్ టివి కథనాలు ప్రసారం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లు తెరుస్తామని చెప్పారని..ఇది పాక్షిక విజయమన్నారు. ఆగస్టు 16వ తేదీన మిల్లు తెరుచుకోవాలని..కార్మికులకు ఉపాధి కలిగినప్పుడే శాశ్వత పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో టెన్ టివి జరిపిన కృషి అభినందనీయమని భవిష్యత్ లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాక్షించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:30 - July 27, 2017

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ తేల్చిచెప్పారు. పాదయాత్రకు అనుమతినివ్వకుండా పోలీసులు ఆయన్ను గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్భందించినా..అవరోధాలు కలిగించినా రిజర్వేషన్ల సాధన విషయంలో కాపు జాతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఈ విషయంలో సీఎం కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ చిత్తశుద్ధితో వ్యవహించారని పోరాటంలో వెనుకడుగు వేసేది లేదన్నారు. ఎవరితో తమకు బేదాభిప్రాయం లేదని, బాబుకు మతిమరుపు వచ్చిందని చాలా మంది చెబుతున్నారని అది గుర్తు చేయడం కోసమే తాము పాదయాత్ర చేయాలని అనుకున్నట్లు తెలిపారు. జీవోలో ఉన్న మూడు అంశాలపై నివేదిక కావాలని మంజునాథ కమిషన్ ను అడుగుతున్నారని, గతంలో చెత్త జీవో అన్నారని..రెండు నాలుకలున్నాయా అంటూ ముద్రగడ మండిపడ్డారు. 

చార్మి ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు: అకున్ సబర్వాల్

హైదరాబాద్: కానిస్టేబుల్ పై ఆరోపణల్లో వాస్తవం లేదని, చార్మి ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ కేసులో ఈ రోజు ముమైత్ ఖాన్ తో పాటు సాద్ మజీద్, ముబీన్ లనూ విచారించినట్లు తెలిపారు. ముమైత్ ను విచారించిన బృందంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్, సీఐలు రేణుక, విజయలక్ష్మి, ఎస్సై శ్రావణి ఉన్నారు. రేపు రవి తేజను విచారించనున్నట్లు తెలిపారు.

 

17:14 - July 27, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. సిట్ మహిళా అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఆరు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఆమె..ఇతరులతో కారులో వెళ్లిపోయింది. వెళ్లిన సమయంలో ముమైత్ మీడియాతో మాట్లాడలేదు.

గురువారం విచారణకు హాజరైన ముమైత్..
డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ ముఠా విచారణలో సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు టాలీవుడ్ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరవుతున్నారు. గురువారం ఉదయం 10గంటలకు నటి ముమైత్ ఖాన్ హాజరయ్యారు. ఆమెతో పాటు బిగ్ బాస్ షో ప్రతినిధులు కూడా ఉండడం గమనార్హం. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

ప్రశ్నలు ఇవేనా ?
తెలుగు సినిమా పరిశ్రమకు రాకముందు ఏం చేసే వారు ?
తరుణ్..నవదీప్ లకు చెందిన పబ్బులకు ఎన్నిసార్లు వెళ్లారు ?
హైదరాబాద్ ను విడిచి ముంబైకు ఎందుకు వెళ్లారు ?
ఖాళీ సమయాల్లో వారంతాల్లో ఎక్కడ గడిపేవారు ?
నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్ లో ఏం తీసుకొనే వారు ?
ముంబై నుండి హైదరాబాద్ కు కేవలం షూటింగ్ లకు వచ్చేవారా ?
ఏఏ సందర్భాల్లో స్టే చేశారు ?
ఎక్కువ ఐటమ్ సాంగ్స్ లో నటించే మీరు..చిత్ర యూనిట్ తో కలిసి విదేశాలకు ఎందుకు వెళ్లే వారు ?
పబ్ లకు వెళ్లే అలవాటు ఉందా ?
పోకిరీ సినిమాతోనే పూరీకి మీరు క్లోజ్ అయ్యారా ?
డ్రగ్స్ అమ్మకాలు జరిపారా ? తీసుకున్నారా ?
పూరి..ఛార్మీతో పరిచయం ఎప్పటి నుండి ఉంది ?
కెల్విన్ తో ఎలా పరిచయం ?
సినిమా ఫంక్షన్స్ లో కెల్విన్ ను కలిశారా ?
తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
ఆరు గంటల విచారణ ముగిసిన అనంతరం ముమైత్ కారులో వెళ్లిపోయింది. కొద్దిసేపటి అనంతరం సిట్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. శుక్రవారం నటుడు రవితేజ విచారణకు హాజరౌతారని పేర్కొంది. 

ఇసుక మాఫియాలో సీఎం బంధువు: ఉత్తమ్

వరంగల్ : ఇసుక మాఫియాలో సీఎం బంధువు ఉన్నాడని టి.ఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే దళితులను పోలీసులు చిత్రహింసలు పెట్టారని మండిపడ్డారు. సిరిసిల్ల ఘటనపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 31వ చలో సిరిసిల్ల కార్యక్రమంలో మీరాకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. దళితులపై దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. హత్య కేసులో డీసీసీ అధ్యక్షుడిని కావాలనే ఇరికించారని, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా బాకీ తీర్చుకుంటాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

16:59 - July 27, 2017

విజయవాడ : ఏపీ రాజధానిలో వేలాది ఎకరాల్లోని అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. భూముల కోసం కేంద్రానికి నివేదికలు పంపుతున్నా.. వాటిలో లోపాలున్నాయని, సవరించి పంపాలని కేంద్రం ఝలక్‌ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం నివేదికలు తయారు చేయడంలో మల్లగుల్లాలు పడుతోంది. ఏపీ సీఆర్డీఏ క్రీడా పరిధిలోని అటవీ భూములను చేజిక్కించుకునేందుకు.. ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే ప్రాజెక్ట్‌లతో పాటు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. మొదట 26 అటవీ బ్లాకుల్లోని 12, 376 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయాలని ప్రతిపాదించింది. తాజాగా 25 బ్లాకుల్లో 12,444 హెక్టార్లలో భూమిని డీ నోటిఫై చేయాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

12,444 హెక్టార్ల అటవీ భూమి..
రాజధాని మౌలిక సదుపాయాల కోసం 12,444 హెక్టార్ల అటవీ భూమిని డీనోటిఫై చేయించి కేంద్రం నుంచి తీసుకోవాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందించింది. అయితే దీనిపై డీపీఆర్‌ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. అటవీ భూముల్లో ఏఏ పథకాలు అమలు చేస్తారు. ఎంతమేరకు భూములను సద్వినియోగం చేసుకుంటారనేది తెలపాలని సూచించింది. అలాగే అక్కడి పరిస్థితులు, పర్యావరణ, జీవవైవిద్య స్థితిగతుల వంటివి కూడా తెలపాలని పేర్కొంది. ప్రభుత్వం కేంద్రానికి పంపే నివేదికల్లో స్పష్టత లేదని.. ముఖ్యంగా డీపీఆర్ లేకుండా ఏ సంస్థలైనా ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయమై భగ్గమంటున్నాయి.

నివేదికలు..
ప్రభుత్వం ప్రతిపాదించిన అటవీ భూమిలో ఆయుర్వేద పరిశోధన కేంద్రానికి గుడిమెట్ల బ్లాకులోని 196.37 హెక్టార్లు, కొత్తూరులో సమగ్ర ఆరోగ్య కేంద్రం 194. 76 హెక్టార్లు, వెంకటాయపాలెం బ్లాక్‌లో 1835.32 హెక్టార్లలో సాయుధ బలగాల శిక్షణ కేంద్రం.. ఏర్పాటు చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆ బ్లాక్‌లోనే ఏరో స్పేస్ అండ్ గ్రీన్‌ మొబిలిటీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం 792.83, ఇంటిగ్రేటెడ్ కట్ ఫ్లవర్‌ అండ్ స్పైస్ పార్క్ కోసం 218.89, కల్చరల్ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 1437.52, సమగ్ర మౌలిక వసతులకు 266.28 హెక్టార్లు అవసరమని నివేదికలో పొందుపరచినట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలతో మళ్లీ నివేదిక తయారు చేయాలా వద్దా అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. చంద్రగూడెంలో ఐటీ, అనుబంధ పరిశ్రమల కోసం 295.83, దాసులపాలెంలో 546.42, ఇంటర్నేషనల్ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌కు మెట్లపల్లిలో 128.7, చేనేత, హస్తకళల గ్రామం జంగాల పల్లిలో 209.92, ఉన్నత విద్యా కేంద్రానికి టి. గన్నవరంలో 641.5, జియో మెడికల్ బయో టెక్నాలజీ పరిశోధనలకు తోలుకోడులో 264.36 హెక్టార్లు కావాలని కూడా కేంద్రానికి ప్రభుత్వం వివరించింది. 

16:57 - July 27, 2017

అనంతపురం : హీరోయిన్‌ తమన్నా సందడి చేసింది. నగరంలో ఏర్పాటు చేసిన మలబార్‌ గోల్డ్‌ 170వ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. అనంతపురం రావడం ఎంతో సంతోషంగా ఉందని తమన్న ఈ సందర్భంగా అన్నారు. తన కెరీర్‌లో బాహుబలి గుర్తుండిపోయే సినిమా అని అభిమానులు నిరాశపడకుండా మంచి చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. కాగా తమన్నాను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. 

లాలూ పై మనీలాండరింగ్ కేసు : ఈడీ

పాట్నా: దాణా కుంభకోణం, బినామీ ఆస్తుల కేసులు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ఆయన కుటుంబసభ్యులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు గురువారం మనీలాండరింగ్‌ కేసు నమోదు చేశారు. యూపీఏ హయాంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా లాలూప్రసాద్‌ ఉన్నపుడు రైల్వే హోటల్స్‌ కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొని ఆరోసారి సీఎంగా నితీశ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే లాలూపై ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం.

16:53 - July 27, 2017

విజయవాడ : ఏపీలో మత్స్య పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయి. ఏటా ఆక్వా సాగు పెరగుతుండటంతో ఈ పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్నాయి. వివిధ వర్గాల వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాలు, రుణాలను మంజూరు చేస్తున్నారు. వార్షిక బడ్జెట్‌ను కూడా భారీగా విడుదల చేస్తుండటంతో ఆక్వా రంగం మరింత ముందుకెళ్లనుంది. ఆక్వా రంగానికి బాసటగా నిలిచేందుకు మత్స్యశాఖ కృష్ణాజిల్లాలో సంచార ప్రయోగశాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. సేద్యం తర్వాత జిల్లాలో ప్రధాన ఆదాయ వనరుగా మత్స్య పరిశ్రమ ఉంది. రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా మత్స్య ఎగుమతుల్లో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ రంగం మత్స్యకారులకే కాకుండా రైతులకూ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం జిల్లాకు నిధులను భారీగా పెంచడంతో మత్స్య పరిశ్రమ నిలదొక్కుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం "నీల్‌ క్రాంతి" పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది.

నీల్ క్రాంతి..
మరోవైపు ఆదాయపరంగా మత్స్యపరిశ్రమలో తొలిస్థానంలో ఉన్న కృష్ణా జిల్లాలో నీల్‌ క్రాంతి పథకంతో మరింత పురోగమించనుంది. జిల్లాలో 111కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. 3వేల హెక్టార్లలో కృష్ణా బ్యారేజ్‌ జలాశయం, 228 మధ్యతరహా చెరువులు, 44.88 చదరపు కిలోమీటర్ల మేర కొల్లేరు సరస్సు, 2660 కిలోమీటర్ల మేర నదులు, కాలువలు, 2,825 పంచాయితీ చెరువులు ఉన్నాయి. జిల్లాలో మత్స్య పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన అవనిగడ్డ డివిజన్‌లో సంచార ప్రయోగశాల ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా 6,500 ఎకరాలకుపైగా ఉన్న చెరువుల్లో సాగు చేసుకుంటున్న రైతులకు లబ్ధి జరగనుంది. గతేడాది అవనిగడ్డ డివిజన్‌ నుంచి 56,621 మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి కాగా, ఈ ఏడాది 72 వేల టన్నుల ఎగుమతే లక్ష్యంగా మత్స్యశాఖ పనిచేస్తోంది. గతంలో మత్స్యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని, రాయితీ ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

సంచార ప్రయోగ శాల..
మరోవైపు ఆక్వా రైతు ఎకరాకి నీటి పరీక్షల కోసమే రెండువేలు, మట్టి పరీక్షలకోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. దీన్ని నివారించేందుకు.. సంచార ప్రయోగశాలతో నీటికి సంబంధించిన పీహెచ్‌, సెల్‌నిటీ, నైట్రేట్‌, అమ్మోనియా ఆల్కినిటీ, తోపాటు రొయ్య పెరుగుదలకు అతి ముఖ్యమైన డయాటమ్స్‌ పరీక్షలను నామమాత్రపు ఖర్చులతో నిర్వహించనుంది. మత్స్యశాఖ ఏడీ పర్యవేక్షణ, ఎఫ్‌.డి.వో ల నేతృత్వంలో ఎంపీఎఫ్‌ఈఏల ద్వారా సాంకేతిక నిపుణులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మత్స్యశాఖ ఇప్పటికీ రూ.14.2 లక్షల మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం తర్వాత మత్స్యరంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత నిస్తున్నాయి. రానున్న కాలంలో మత్స్యపరిశ్రమలో మరింత మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని ఆశిద్దాం.

16:49 - July 27, 2017

కరీంనగర్ : విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వక్రమార్క మార్గం పడుతున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తీసుకొస్తున్నారు. కరీంనగర్‌ కిసాన్‌నగర్‌లోని శ్రీసాయి స్కూల్‌లో మూడో తరగతి విద్యార్థినిపట్ల పీఈటీ అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పీఈటీకి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. గతంలోనూ పీఈటీపై ఇలాంటి ఆరోపణలే ఉన్నట్టు తెలుస్తోంది. అయినా అతడిని స్కూల్‌ యాజమాన్యం కొనసాగిస్తుండడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

16:46 - July 27, 2017

హైదరాబాద్ : లాలూను దెబ్బతీయడానికే నితీశ్ రాజీనామా చేసి.. బీజేపీతో ప్రభుత్వ ఏర్పాటు చేశారని మండిపడ్డారు ఎంపీ వి.హనుమంతరావు. లాలూ కుటుంబంపై అదే పనిగా సీబీఐ దాడులు చేయిస్తున్న ఎన్డీయే ప్రభుత్వం బిజెపి మంత్రుల అవినీతిపై విచారణ జరపదని విమర్శించారు. మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో సెక్యులర్ పార్టీలు ఏకమయ్యే రోజు వస్తుందని వీహెచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

16:45 - July 27, 2017

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధాన్ని వచ్చే నెల 2 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాపులు మండిపడున్నారు. దీనిని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మెడకు ఉరితాళ్లు, చేతులుకు సంకెళ్లు వేసుకుని గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రెండు వర్గాలకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.

అమలాపురంలో...
ముద్రగడ విషయంలో ప్రభుత్వ తీరు నిరసిస్తూ... తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కాపులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిర్వహించిన ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ఉద్యమ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్రగడకు సంఘీభావంగా ఉద్యమిస్తున్న కాపు మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని నేతలు తప్పుపట్టారు. కాపు మహిళలపై మరోసారి దౌర్జన్యం చేస్తే సహించబోమని హెచ్చరించారు. నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించిన కాపులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

16:35 - July 27, 2017

హైదరాబాద్ : నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలోని వాగ్ధేవినగర్ లో రద్దయిన నోట్లు బయటపడడం కలకలం రేగింది. పాతనోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈ నోట్లు ఉన్న వారు బ్యాంకుల్లో జమ చేయాలని..పలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోట్లు కలిగి ఉంటే నేరమని కూడా ప్రకటించింది.
ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లోని నేరేడ్ మెట్ లోని వాగ్ధేవినగర్ లో చెత్తకుండిని శుభ్రం చేస్తున్న పారిశుద్య కార్మికుడికి రద్దయిన నోట్లు దర్శనమిచ్చాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అందులో రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నోట్ల విలువ రూ. 16లక్షల విలువ ఉందని తెలుస్తోంది. 

రేపు హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు

అమరావతి: సీఎ చంద్రబాబు నాయుడు రేపు హైదరాబాద్ కు రానున్నారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్ లోనే సీఎం చంద్రబాబు మకాం వేయనున్నారు.

16:34 - July 27, 2017

కర్నూలు : జిల్లాలో బళ్లారి ప్రధాన రహదారిపై కోడెమూరు గ్రామస్తులు బైఠాయించారు. కోడెమూరు కు తాగునీటి కోసం మహిళలు.. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తుంగభద్ర దిగువ కాల్వ ద్వారా హింద్రీకి విడుదల చేసిన నీటిని నిలిపివేయడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు వదిలేంత వరకు ఆందోళన విరమించమని మహిళలు తేల్చిచెప్పారు. దీనితో నాలుగు గంటల పాటు ట్రాఫిక్ పూర్తి స్తంభించింది.
పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెళ్లగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులకు..మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఇరిగేషన్ అధికారులతో చర్చ జరిపారు. నీరు వదులతామని అధికారులు చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. 

జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాన్ లేఖ

హైదరాబాద్: జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాన్ లేఖ రాశారు. జనసేన ప్రతినిధులమంటూ కొందరు ప్రచారం చేసుకుంటున్నారని, కృష్ణా జిల్లాలో జనసేన ప్రతనిధి పేరుతో వినాళాలే అడుగుతున్నట్లు తెలిసిందని, మీడియా చర్చల్లో పాల్గొనేందుకు ఎవరినీ నియమించలేదన్నారు. చర్చల్లో అలాంటి వ్యక్తులు చెప్పే వ్యాఖ్యలతో జనసేనకు సంబంధం లేదనియఅర్హతలు ఉన్నవారినే ప్రతినిధులుగా నియమిస్తామని స్పష్టం చేశారు.

నిరుద్యోగ యువతకు భృతి పై సీఎం సమీక్ష

అమరావతి: మంత్రులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ యువతకు భృతి కల్పించే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగ భృతి విధివిధానాల రూపకల్పనపై మృతులు, అధికారులతో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు.. ఆనందంగా ఉంది: పీవీ సింధు

అమరావతి : సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు తీసుకోవడం ఆనందంగా ఉందని పీవీ సింధు అన్నారు. ముందుగా బ్యాడ్మింటన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ఏపీ సర్కార్ క్రీడలను బాగా ప్రోత్సహిస్తుందని పివి సింధు పేర్కొన్నారు.

మెట్ పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఉద్రిక్తత

జగిత్యాల: మెట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతలకు నిరసన గా బాధితులు ఒంటి పై కిరోసిన్ పోసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.

నంద్యాల అభివృద్ధి కోసం భూమా అహర్నిశలు కృషి : మంత్రి అఖిల ప్రియ

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక దేవనగర్ లో మంత్రి భూమా అఖిల ప్రియ సభ నిర్వహించారు. నంద్యాల అభివృద్ధి కోసం భూమా నాగిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. భూమాను శిల్పా మోహన్ రెడ్డి అడుగడుగునా అడ్డుకున్నారని, ఫ్యాక్షనిజంపై శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు.

సంజయ్ విడుదలపై బాంబే కోర్టు ప్రభుత్వం వివరణ

హైదరాబాద్: సంజయ్ దత్ ముందస్తు విడుదలపై బాంబే హైకోర్టు కు మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముందస్తు విడుదలలో నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే సంజయ్ దత్ ను తిరిగి జైలుకు పంపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

16:17 - July 27, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. గత ఆరు గంటలుగా విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె సిట్ ఎదుట హాజరయ్యారు. టాలీవుడ్ కు..డ్రగ్స్ లింక్..ఇతర అంశాలపై సుదీర్ఘంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను మహిళా అధికారులే విచారిస్తున్నారు.
'తెలుగు సినిమీ పరిశ్రమకు రాకముందు ఏం చేసే వారు ? తరుణ్..నవదీప్ లకు చెందిన పబ్బులకు ఎన్నిసార్లు వెళ్లారు ? హైదరాబాద్ ను విడిచి ముంబైకు ఎందుకు వెళ్లారు ? ఖాళీ సమయాల్లో వారంతాల్లో ఎక్కడ గడిపేవారు ? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివల్ లో ఏం తీసుకొనే వారు ? ముంబై నుండి హైదరాబాద్ కు కేవలం షూటింగ్ లకు వచ్చేవారా ? ఏఏ సందర్భాల్లో స్టే చేశారు ? ఎక్కువ ఐటమ్ సాంగ్స్ లో నటించే మీరు..చిత్ర యూనిట్ తో కలిసి విదేశాలకు ఎందుకు వెళ్లే వారు ? పబ్ లకు వెళ్లే అలవాటు ఉందా ? పోకిరీ సినిమాతోనే పూరీకి మీరు క్లోజ్ అయ్యారా ? డ్రగ్స్ అమ్మకాలు జరిపారా ? తీసుకున్నారా ? పూరి..ఛార్మీతో పరిచయం ఎప్పటి నుండి ఉంది ? కెల్విన్ తో ఎలా పరిచయం ? సినిమా ఫంక్షన్స్ లో కెల్విన్ ను కలిశారా' ? తదితర ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
కాసేపట్లో విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

మెట్ పల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.. ఉద్రిక్తత

జగిత్యాల: మెట్ పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కూల్చివేతలకు నిరసన గా బాధితులు ఒంటి పై కిరోసిన్ పోసుకునేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.

కొనసాగుతున్న సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ తో సిట్ విచారణ కొనసాగుతోంది. ముమైత్ డ్రగ్స్ వినియోగం పై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కెల్విన్ తో సంబంధాల పై సిట్ ఆరాతీస్తోంది. పూరి, చార్మితో పరిచయంపై ప్రశ్నలు, పబ్ లు, పార్టీలతో పాటు వీకెండ్ లో ఎక్కడ గడుపుతారు, తరుణ్, నవదీప్ పబ్బులకు ఎన్నిసార్లు వెళ్లారని సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. డ్రగ్స్ మాఫియాతో సినీ పరశ్రిమకు లింకులపై సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు నియామకం...

అమరావతి: పీవీ సింధూ డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఎల్ ఏ ప్రధాన కర్యాదర్ఇశ రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 30 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.

చెత్తకుండీలో రూ. 16లక్షల పాత నోట్లు లభ్యం

హైదరాబాద్: నేరేడ్ మెట్ వాజ్ పేయి నగర్ లోని చెత్తకుండీలో రూ. 16లక్షల పాత నోట్లు లభ్యం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రపతిని కలిసిన ఆర్మీ చీఫ్...

న్యూఢిల్లీ: నూత‌న రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇవాళ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ క‌లుసుకున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఈ భేటీ జ‌రిగింది. రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 25వ తేదీన రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్మీ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ ఆయ‌న్ను క‌లుసుకునేందుకు వ‌చ్చారు.

15:43 - July 27, 2017

విజయనగరం : నిన్న, మొన్నటి వరకు ఆ తహశీల్దార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌.. కార్యాలయంలో ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఏళ్లు గడిచినా... కాళ్లు అరిగేలా తిరిగినా ఆ పని ముందుకు కదలదు. కానీ వాటన్నింటికి అడ్డుకట్ట వేశాడు ఓ అధికారి. చేతివాటానికి అలవాటు సిబ్బందిని దారిలోకి తీసుకొచ్చాడు. మునుపెన్నడూ లేనివిధంగా ఆ కార్యాలయంలో మార్పు రావడంతో తహశీల్దారుకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది రెవెన్యూ శాఖ. లంచం ఇవ్వనిదే ఆ శాఖలో ఏ పనీ జరగదన్న ఆరోపణలు, విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. విద్యార్థుల సర్టిఫికెట్ల నుంచి పట్టాదారు పాసు పుస్తకాల వరకు లంచం ఇవ్వనిదే.. ఏ పనీ జరగదనే అపవాదును మూట గట్టుకుంది రెవెన్యూ శాఖ. కానీ విజయనగరంలో జిల్లాలోని జామి తహశీల్దార్‌ కార్యాలయాన్ని ఇందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పని చేస్తోన్న తహశీల్దార్‌ ఆనందరావు నిజాయితీగా పని చేస్తూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ మధ్యే బదిలీపై ఇక్కడకు వచ్చిన ఆనందరావు కొన్ని రోజుల్లోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా లంచం అనే పదం ఈ కార్యాలయంలో వినిపించకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు.

రెవెన్యూ సదస్సులు..
విశాఖకు చెందిన ఓ వ్యక్తి జామి మండలంలోని భీమసింగి వద్ద కొంత భూమిని కొన్నాడు. వాటి పాసు పుస్తకాల కోసం మూడేళ్ల క్రితం తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పని జరగాలంటే లంచం ఇవ్వాలని సిబ్బంది మొండికేసి కూర్చున్నారు. బదిలీపై వచ్చిన తహశీల్దార్‌ ఆనందరావు .. రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించగా, ఈ విషయం బయటపడింది. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్‌ చేసి మరుసటి రోజు భీమసింగిలో జరిగే రెవెన్యూ సదస్సుకు వచ్చి పాసు పుస్తకాలు తీసుకోవాల్సిందిగా కోరారు. స్వయంగా తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ రావడంతో ఆశ్చర్యానికి గురైన ఆ వ్యక్తి మరుసటి రోజు రెవెన్యూ సదస్సు వద్దకు వెళ్లాడు. 

పెండింగ్ ఫైళ్లు క్లియర్..
జామి కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఆనందరావు కొన్ని రోజుల్లోనే పెండింగ్‌ ఫైళ్లన్నింటినీ క్లియర్‌ చేసేశారు. అలాగే సిబ్బంది కూడా లంచం తీసుకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో సిబ్బంది కూడా లంచం గురించి ఆలోచించడం మానేశారు. అంతేకాకుండా వారానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని.. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో మండల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తహశీల్దార్‌ ఆనందరావు చెప్పారు. 

15:38 - July 27, 2017

విజయవాడ : ఇంటర్వ్యూ అంటే.. ఇంతకాలం కాలేజీల్లో సీట్లకు, సంస్థల్లో ఉద్యోగాలకు మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. రాజకీయాల్లోనూ ఇంటర్వ్యూల హవా నడుస్తోంది. అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా దూసుకు వెళుతున్న పార్టీలు.. మంచి నేతలను ఎంచుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. ఏపీలో కొనసాగుతోన్న పార్టీల ఇంటర్వ్యూల ట్రెండ్‌పై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. ఒకప్పుడు ఇంటర్వ్యూలు విద్యార్థులకు, ఉద్యోగులకు టెన్షన్‌గా ఉండేవి. వీటికోసమే పెద్ద ఎత్తునే కసరత్తులు చేసేవారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. రాజకీయ నాయకులూ ఇంటర్వ్యూల టెన్షన్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. ఎలా ప్రిపేర్‌ అవ్వలా అని మదనపడి పోతున్నారు.

జనసేన..
పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన పార్టీ కార్యకర్తల స్థాయి నుంచే ఇంటర్వ్యూలు ప్రారంభించేసింది. టెస్ట్‌ పెట్టి పాస్‌ అయిన వారికి, ఇంటర్వ్యూలు నిర్వహించి, పార్టీలో చేర్చుకుంటున్నారు పవర్‌స్టార్‌. ఈ ట్రెండ్‌ మొదట్లో కాస్తంత విచిత్రమనిపించింది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కూడా ఇదే ట్రెండ్‌లో సాగుతోంది. పార్టీని ఎలాగైనా పవర్‌లోకి తీసుకురావాలన్న తపనతో.. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలనే నమ్ముకున్న వైసీపీ అధినేత జగన్‌.. వ్యూహకర్త సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రశాంత్‌కిశోర్‌ బృందం నేరుగా ఎమ్మెల్యేలనూ ఇంటర్వ్యూలు చేసి పారేస్తోంది.

పని తీరుపై సర్వే..
నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్ల పనితీరుపై సర్వే నిర్వహించిన కిశోర్‌, నేరుగా నియోజక వర్గాల్లో పర్యటించి అభ్యర్థుల పనితీరు, గెలుపు, ఓటములపై వారినే ఆరా తీస్తున్నారు. గతంలో వీరి పనితీరు, ప్రజా సమస్యలపై స్పందిస్తున్న విధానం వంటి వాటిపై ఐఐటి ఖరగ్‌పూర్‌ విద్యార్థులతో, ఎమ్మెల్యేలను ఇంటర్వూ చేయిస్తున్నారు. తాజాగా ప్రశాంత్‌ కిశోరే రంగంలోకి దిగి ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు.

రంగంలోకి ప్రశాంత్ కిశోర్..
ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే 10 నుండి 15 మంది ఎమ్మెల్యేలతో ఆయా నియోజకవర్గాలకు వెళ్లి సమావేశం అయ్యారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే బలాలు, బలహీనతలు అనే అంశాలపై కిషోర్‌ వారితో భేటీ అయినట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ భేటీలతో ఎమ్మెల్యేలు కంగారు పడుతున్నారు. ఈ భేటి కేవలం సాదాసీదాగా కాకుండా ఓ ఇంటర్వూ మాదిరిగా ఉందని అంటున్నారు. ఈ భేటిలో చర్చించిన అంశాలు, ఎమ్మెల్యేల సమాధానాలు చాలా కీలకం కానున్నాయి. ఈ ఇంటర్వూల ఆధారంగానే, వారికి తదుపరి ఎన్నికల్లో టికెట్‌ లభించేదీ లేనిదీ తేలిపోతుంది. అందుకే, ఎమ్మెల్యేలకు ప్రశాంత్‌కిశోర్‌ బృందం ఇంటర్వ్యూలంటే బెంబేలెత్తిపోతున్నారు. మరి ప్రశాంత్‌ కిశోర్‌ ఇంటర్వ్యూలు, ఆయన సలహాలు జగన్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.  

15:32 - July 27, 2017

విశాఖపట్నం : గోపాలపట్నంలో రెండు రోజుల క్రితం నమోదైన కిడ్నాప్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. అపహరణకు గురైన మణికంఠే.. కేసులో ఏ1 ముద్దాయిగా మారాడు. డబ్బుల కోసం స్నేహితులతో కలసి మణికంఠే కిడ్నాప్‌ డ్రామా ప్లే చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు.. నిందితుని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి.. మణికంఠను కిడ్నాప్‌ చేశామని 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో.. వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మణికంఠ నాటకాన్ని ఛేదించారు. ఈ కేసులో పోలీసులు వెంకటేష్‌, అరుణ్‌తేజ, మణికుమార్‌, మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. వ్యసనాలకు బానిసై...తల్లిదండ్రుల నుంచే డబ్బులు గుంజడానికి మణికంఠ ఈ నాటకం ఆడినట్టు పోలీసులు తెలిపారు.

15:30 - July 27, 2017

కడప : బాలలను పనిలో పెట్టుకోవడం నేరమని తెలిసినా పలువురు వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకుని వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్నారు. పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఈ ఉదంతం వెలుగు చూస్తోంది.
వివిధ షాపుల్లో పనిచేస్తున్న 71 మంది బాల కార్మికులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు. పోలీసులు, కార్మిక శాఖ అధికారులు షాపులపై దాడులు నిర్వహించి, వీటిలో పని చేస్తున్న బాల కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. హోటళ్లు, మెకానిక్‌ షెడ్లు, కిరాణ దుకాణాల్లో పని చేస్తున్న బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరిని బాలల సంరక్షణాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు బాలల కేంద్రానికి చేరుకున్నారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మళ్లీ పనిలో పెట్టమన్న షరతులో అప్పగించనున్నారు. బాలలను పనిలో చెట్టుకున్న సంస్థలపై కేసులు నమోదు చేశారు. 

15:29 - July 27, 2017

అనంతపురం : ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్లాస్టిక్ బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల... అనారోగ్యానికి గురవుతున్నామని... ఇందుకు కారణమైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ.. ఆందోళనకు దిగారు.
వేలకు వేలు ఫీజులు కడుతున్నా భోజనం సరిగ్గా పెట్టడం లేదని పేర్కొన్నారు. డీఎస్పీ మల్లిఖార్జున్ అక్కడకు చేరుకుని ప్రిన్స్ పాల్..విద్యార్థులతో మాట్లాడుతున్నారు.

15:18 - July 27, 2017

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో మద్యం దుకాణాలపై మహిళల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవాసాల మధ్యలో ఉన్న మద్యం దుకాణాలు తొలగించాలని, తమకు ఇబ్బందిగా ఉన్న బెల్టు షాపులను తొలగించాల్సిందేనంటూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా నంది కొట్కూరు అల్లూరు రోడ్డులో మధుర వైన్స్ పై మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలు పగులగొట్టారు. మద్యం షాపును ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. జనవాసాలు మధ్యలో మద్యం దుకాణం ఉండడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. రాత్రి సమయాల్లో మందబాబులు రెచ్చిపోతున్నారని, దీనితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు పేర్కొంటున్నారు. సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. ఇళ్లలోకి వచ్చి నీళ్లు అడుగుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. 

15:11 - July 27, 2017

డిప్యూటీ డీఈఓ పట్ల శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తన

అమరావతి: మంగళగిరిలో ప్రైవేటు స్కూళ్లలో డిప్యూటీ డీఈవో లక్ష్మీనారాయణ తనిఖీలు చేపట్టారు. శ్రీచైతన్య స్కూల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్, సరిపడా బోధనా సిబ్బంది కూడా లేకపోవడం పై శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ను డిప్యూటీ డీఈవో నిలదీశారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండంటూ డిప్యూటీ డీఈఓ పట్ల శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్ దురుసుగా ప్రవర్తించారు.

గ్రూప్ -2 ఉద్యోగ బాధ్యతలను స్వీకరించనున్న పి.వి. సింధు

అమరావతి: ఏపీ సచివాలయానికి పీవీ సింధు చేరుకుంది. కాసేపట్లో సీఎం చంద్రబాబు సమక్షంలో గ్రూప్ -2 ఉద్యోగ బాధ్యతలు ను సింధు స్వీకరించనుంది.

14:50 - July 27, 2017

అనంతపురం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల ఆందోళన

అనంతపురం : ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యంతో చేసిన అన్నం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

14:32 - July 27, 2017

హైదరాబాద్ : సినీ నటి ముమైత్ ఖాన్ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో ఆమెకు ఎక్జైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు ముఖ్యులు సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కెల్విన్ ముఠా పట్టుబడడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

బిగ్ బాస్ షో ప్రతినిధులు..
విచారణలో భాగంగా నటి మమైత్ ఖాన్ సిట్ కార్యాలయానికి ఉదయం వచ్చారు. ఆమె వెంట నలుగురు బిగ్‌బాస్‌ షో ప్రతినిధులుకూడా వచ్చారు. ముమైత్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షో ప్రతినిధులతో ఒప్పందం కుదర్చుకున్న సంగతి తెలిసిందే. 70రోజులపాటు ఈ షోలో పాల్గొనేలా అగ్రిమెంట్‌ రాసుకున్నారు. ఈ సమయంలో ఏం జరిగినా షో ప్రతినిధులదే బాధ్యత ఉంటుంది. ఈ షో రూల్‌ ప్రకారం ఇందులో పాల్గొనేవారు ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం ముమైత్‌కు ఫోన్‌ ఇవ్వకుండా షో ప్రతినిధులే ముమైత్ తరపున మాట్లాడారు.

లంచ్ బ్రేక్..
విచారణ జరిగి ఐదు గంటలు దాటింది. ఇంగ్లీష్..హిందీలో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ వర్గానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు..ఐటీ రంగానికి చెందిన కొన్ని ప్రశ్నలు..ఈవెంట్స్ ఇతరత్రా అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కెల్విన్ తో ఎలాంటి సంబంధాలున్నాయో దానిపై సిట్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. లంచ్ లో సిట్ అధికారులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకోవడానికి ముమైత్ నిరాకరించినట్లు సమాచారం. బిగ్ బాస్ షో ప్రతినిధులు తీసుకొచ్చిన జ్యూస్..పండ్లలను మాత్రమే ముమైత్ తీసుకున్నట్లు సమాచారం. 

బీజాపూర్ లో లొంగిపోయిన లొంగిపోయిన మావోలు

ఛత్తీస్ గఢ్: బీజాపూర్ లో ఎస్పీ, కలెక్టర్ ఎదుట మహిళతో పాటు ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురిపై రూ.3లక్షల రివార్డు ఉంది. వీరి వద్ద నుండి డిటోనేటర్లు, వైర్లు, మందుగుండు సామాగ్రి ని స్వాధీనం చేసుకున్నారు.

14:18 - July 27, 2017

కర్నూలు : నంద్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. భూమా నాగిరెడ్డి హాఠాన్మరణం అనంతరం ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. గురువారం ఈసీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. జులై 29న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఆగస్టు 5వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుందని పేర్కొంది. ఆగస్టు 23 పోలింగ్..ఆగస్టు 28 న కౌంటింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. 2014 ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలుపొందిన భూమా నాగిరెడ్డి, ఆ తర్వాత జగన్‌తో విభేదించి, టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికలో గెలుపు కోసం ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు..
నంద్యాల ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వ్యూహ..ప్రతివ్యూహాలు రచిస్తూ బిజీ బిజీగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికల కంటే ముందుగా వస్తున్న నంద్యాల ఉప ఎన్నికను సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. దీనితో ఎలాగైనా ఎన్నికలో గెలవాలని ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ప్రచారం కూడా నిర్వహించాయి. అధికార పక్షంపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికపై వైసీపీ అధినేత జగన్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ సీటును దక్కించుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.

టిడిపి..వైసిపి అభ్యర్థులు..
మంత్రి భూమా అఖిలప్రియ కూడా ఈ స్థానం నుంచి టీడీపీ తరుపున పోటీ చేస్తున్న తన సోదరుడు బ్రహ్మనందరెడ్డిని గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. టిడిపి టికెట్ వస్తుందని ఆశించి భంగపడిన శిల్పా మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ టికెట్ కన్ఫాం అయిపోయిన తరువాతే వైసీపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ముఖ్యనేతలంతా నంద్యాలలోనే తిష్టవేసి ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల పూర్తయ్యే వరకు వైసీపీ వ్యవహారాలు చూసే బాధ్యతలను తన సోదరి షర్మిళకు అప్పగించాలని జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం.
ఉప ఎన్నిక బరిలో నిలవాలని కాంగ్రెస్, రాయలసీమ పరిరక్షణ సమితి నిర్ణయించుకున్నాయి. ఎవరు అభ్యర్థిని నియమించాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలున్నాయి. 

భారత్ తొలి ఇన్నింగ్స్ 600 ఆలౌట్

గాలె: శ‌్రీలంక‌తో జ‌రుగుతున్న‌ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు రెండో సెష‌న్‌లో 600 ప‌రుగులు చేసి ఆలౌటైంది. చివ‌ర్లో తొలి టెస్ట్ ఆడుతున్న హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 50), బౌల‌ర్ ష‌మి (30) చెల‌రేగి ఆడ‌టంతో విరాట్ సేన భారీ స్కోరు చేసింది. లంచ్ త‌ర్వాత పాండ్యా, ష‌మిలు లంక బౌల‌ర్ల‌పై మ‌రింత విరుచుకుప‌డ్డారు. ఓవ‌ర్‌కు ఆరుకుపైగా ప‌రుగులు సాధిస్తూ టీ20ని త‌ల‌పించారు. ఇద్ద‌రూ సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. చెరో మూడు సిక్స‌ర్లు బాదారు. లంక బౌల‌ర్ల‌లో నువాన్ ప్ర‌దీప్ 6, కుమార 3 వికెట్లు తీసుకున్నారు. ధావ‌న్ (190), పుజారా (153) సెంచ‌రీలు చేయ‌గా..

మణికంఠ కిడ్నాప్ కేసులో కీలక మలుపు...

విశాఖ: గోపాలపట్నంలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన యువకుడు మణికంఠ కేసులో కీలక మలుపు తిరిగింది. కేసులో మణికంఠ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం స్నేహితులతో కలిసి మణికంఠ నాటకమాడాడు. తన తల్తిదండ్రులను రూ.15 లక్షలు కావాలని డిమాండ్ చేయాలని మణికంఠ స్నేహితులకు చెప్పాడు. ఈ కేసులో మణికంఠ సహా నలుగురు అరెస్టు అయ్యారు.

ముమైత్ సిట్ విచారణకు లంచ్ బ్రేక్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ముమైత్ సిట్ విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేసిన లంచ్ ను ముమైత్ ఖాన్ నిరాకరించింది. సిట్ అనుమతి తీసుకుని బిగ్ బాష్ షో సిబ్బంది సహాయంతో పండ్లు, జ్యూస్ ను తెప్పించుకుంది.

13:53 - July 27, 2017
13:50 - July 27, 2017

తూగో : ముద్రగడ గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ.. కిర్లంపూడిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబునాయుడు హామీ ఇవ్వడం వల్లే ముద్రగడ ఉద్యమం చేస్తున్నాడన్నారు. హామీ నిలబెట్టుకుంటే ముద్రగడ ఉద్యమాన్ని ఆపేస్తాడని ఆయన అనుచరులంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం....

13:47 - July 27, 2017
13:44 - July 27, 2017

హైదరాబాద్ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కేటీఆర్ ల అక్రమాలపై లోతైన విచారణ జరగాలని.... సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పదవుల్లోఉన్నవాళ్లు ప్రైవేటు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండటానికి వీల్లేదని.. కేటీఆర్‌ ఈ నిబంధనను ఉల్లంఘించారని ఆరోపించారు.. హిమాన్షు కంపెనీలో తమకు 3లక్షల షేర్లున్నట్లు 2014 ఎన్నికలకుముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేటీఆర్‌ పేర్కొన్నారని తెలిపారు.. మంత్రి అయ్యాకకూడా కంపెనీ డైరెక్టర్‌గా యాన్యువల్‌ రిటన్స్‌ దాఖలు చేశారని చెప్పారు.. చట్టాన్ని కాపాడాల్సిన మంత్రి ఇలా చట్టవిరుద్దమైన పనులు చేయడం సరికాదని సూచించారు.. కేటీఆర్‌కు మంత్రి పదవిలో కొనసాగే అర్హతలేదన్న తమ్మినేని... వెంకయ్య కూతురు కంపెనీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.. 

 

13:41 - July 27, 2017

హైదరాబాద్ : సిట్‌ విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌తో నలుగురు బిగ్‌బాస్‌ షో ప్రతినిధులుకూడా వచ్చారు. ముమైత్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షో ప్రతినిధులతో ఒప్పందం కుదర్చుకుంది. 70రోజులపాటు ఈ షోలో పాల్గొనేలా అగ్రిమెంట్‌ రాసుకున్నారు.. ఈ సమయంలో ఏం జరిగినా షో ప్రతినిధులదే బాధ్యత ఉంటుంది.. ఈ షో రూల్‌ ప్రకారం ఇందులో పాల్గొనేవారు ఫోన్‌కు దూరంగా ఉండాలి.. ఈ నిబంధనప్రకారం ముమైత్‌కు ఫోన్‌ ఇవ్వకుండా షో ప్రతినిధులే ముమైత్ తరపున మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని జగన్ పన్నాగం:చినరాజప్ప

అమరావతి: రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని జగన్ పన్నాగం పన్నారని హోంమంత్రి చినరాజప్ప విమర్శించారు. యువతను రెచ్చగొట్టి వారిపై కేసులు మోపే ప్రయత్నం చేస్తున్నారని, కాపులపై ఇంత ప్రేమ చూపుతున్న జగన్ వైసీపీ ప్లీనరీలో కాపుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని తెలిపారు. కాపు రిజర్వేషన్లు టిడిపితోనే సాధ్యం అని చినరాజప్ప స్పష్టం చేశారు.

ఆగస్టు 23న నంద్యాల పోలింగ్

అమరావతి: నంద్యాల బైపోల్ షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 29న నోటిఫికేషన్, ఆగస్టు 5న నామినేషన్ కు గడువు, ఆగస్టు 23న పోలింగ్, 28న కౌటింగ్ జరపనున్నట్లు తెలిపింది.

'యుద్ధ ప్రాతిపదికన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు'

కర్నూలు : పగిడ్యాల మండలం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామన్నారు. ఆగస్టు చివరికల్లా పనులు పూర్తి చేసి కేసీ కెనాల్ కు 4 పంపులు ద్వారా నీరు లిప్ట్ చేస్తామని తెలిపారు.

13:28 - July 27, 2017

హైదరాబాద్ : తీహార్, బీహార్, యూపీ, పంజాబ్...ఆయా రాష్ట్రాల్లో ఖైదీల సంఖ్య పెరిగిపోయి జైళ్లు సరిపోవడం లేదు...వరండాలో కూడా కూర్చునే పరిస్థితి లేక నానా అవస్థలు పడుతున్నారు..సో...ఆ రాష్ట్రాలు కొత్తగా జైళ్లు నిర్మించాలన్నా...వసతులు కల్పించాలన్నా నిధులు వెచ్చించాల్సిందే..దీన్ని అవకాశంగా తీసుకుని నార్వే దేశం తరహాలో తెలంగాణా జైళ్లను పొరుగు రాష్ట్రాల ఖైదీల కోసం అద్దెకు ఇవ్వబోతున్నారు...
అద్దెకు ఇచ్చే విషయంపై జైళ్ల శాఖ కసరత్తు..
విన్నది నిజమే...చూడబోయేది నిజమే...తెలంగాణాలోని జైళ్లు అద్దెకు ఇచ్చే ప్రతిపాదన వచ్చింది...మరో ఏడాది తర్వాత జైలు శాఖ ఈ ప్రపోజల్‌ను ప్రభుత్వానికి పంపనుంది...అయితే అద్దెకు ఇచ్చేది ప్రయివేటు వ్యక్తులకు మాత్రం కాదు...పొరుగు రాష్ట్రాల్లోని ఖైదీల కోసం...పొరుగు రాష్ట్రాల్లోని జైళ్లు కిక్కిరిసిపోయి ఖైదీలకు కనీస సౌకర్యాలు కాదు కదా..ఉండేందుకు కూడా స్థలం లేక నానా అవస్థలు పడుతున్నారు..దీంతో ఈ ప్రతిపాదనను తెలంగాణా జైళ్ల శాఖ వెలుగులోకి తీసుకువచ్చింది...తెలంగాణాలోని జైళ్లలో ఖాళీలు ఏర్పడుతున్నందున వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని జైళ్ల శాఖ యోచిస్తుంది...
నార్వే దేశంలో ఈ తరహా జైళ్లు..
నార్వే దేశంలో ఇప్పటికే జైళ్లను అద్దెకు ఇస్తున్నారు...నార్వేలో నేరాలు తగ్గుముఖం పట్టడంతో జైళ్లను ఖాళీగా ఉంచడమెందుకని ఆ దేశం జైలు అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడంతో ఓకే చేశారు..పొరుగున ఉన్న చిన్న చిన్న దేశాల్లో జైళ్లు కొరత ఉండడంతో పాటు నేరగాళ్ల సంఖ్య పెరగడంతో నార్వే ఈ ప్రతిపాదనలు చేసింది..దీంతో చిన్న దేశాలకు చెందిన నేరగాళ్లను నార్వే జైళ్లలోకి పంపడం ద్వారా ఆదాయం పెంచుకుంది....
నార్వే తరహాలోనే తెలంగాణాలో కూడా..
నార్వే దేశంలో జైళ్లు అద్దెకు ఇస్తున్న విషయాన్ని గమనించిన జైలు అధికారులు దానిపై వివరాలు తెలుసుకున్నారు..తెలంగాణా జైళ్ల శాఖ డైరెక్టర్‌ ఆఫ్ జనరల్ వీ.కె సింగ్ దీనిపై శోధించి చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు..దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలయింది...జైళ్లలో ఉన్న ఖైదీల ఖాళీలను భర్తీ చేసుకుంటూనే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తున్నారు...
ఒక్కో ఖైదీకి పది వేలు అద్దె...
తెలంగాణాలోని జైళ్లలో దాదాపు 8 వేల మంది ఖైదీలను పెట్టుకునే అవకాశంతో పాటు సౌకర్యాలున్నాయి..అయితే ఇందులో చూస్తే ప్రతీ ఏడాది ఆరువేలు..ఓ ఏడాది ఐదువేలకు పైగా..మరో ఏడాది పెరగడం..తగ్గడం జరుగుతుంది..దీంతో అధికారులు ఖచ్చితంగా ఎంతమంది ఉంటున్నారు..ఎంతవరకు పెరుగుతుంది..? ఇలాంటి వాటిపై వివరాలు సేకరిస్తున్నారు...ఇలా చేయడం ద్వారా మరో ఏడాది చూస్తే ఐదు వేలకు చేరినట్లయితే ఇక అద్దెకు ఇచ్చేందుకు ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. ఇప్పటివరకు జైళ్లలో చేస్తున్న పరివర్తన్, ఉపాధి అవకాశాలు..పెట్రోల్ బంక్‌లు.. వివిధ రకాల చేతి వృత్తి పనుల ద్వారా పరివర్తన వస్తుందని...ఖైదీల్లో మార్పు తీసుకువస్తూ నేరాలు తగ్గేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు జైలు అధికారులు..ఈ విధంగా జైళ్లలో ఖైదీల రద్దీ తగ్గితే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై అన్వేషిస్తున్నట్లు చెబుతున్నారు.

 

13:13 - July 27, 2017

ఉదయం లేవగానే ఏం చేస్తాం..ముఖం కడుక్కొని టీ..కాఫీ..గ్రీన్ టీ..పాలు తాగేస్తుంటారు. కానీ ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటుంటారు. గొరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరంస కలుపుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిమ్మలో ఆల్కలైన్ లక్షణాలు కలిగి ఉండి శరీరంలోని టాక్సిన్స్ ను నిర్మూలిస్తాయి. వేడి నిమ్మరసం ఖాళీ కడుపున త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమైన న్యూట్రిషన్లు..ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. మసాలా..జంక్ ఫుడ్ తీసుకుంటే ఉదయం నిమ్మరం తాగడం వల్ల కడుపు ఉబ్బడం..అలజడి..అల్సర్లు లాంటివి రాకుండా నిమ్మరసం ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషదం లాంటిది. పొద్దున్నే ఒక గ్లాస్‌ నిమ్మరసం తాగడం వలన కడుపు ఖాళీ అయి ప్రశాంతతను అందిస్తుంది. ట్రై చేసి చూడండి..

నితీష్ కుమార్ రాజకీయ డ్రామా అడారు : సురవరం

హైదరాబాద్: రైతాంగ సమస్యలపై మూడు రోజులు పోరాటాలు చేపట్టామని, రైతాంగ సమస్యలపై ఇపుడు జరిగిన పోరాటం ఆరంభం మాత్రమేనని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విస్తృత పోరాటాలు జరిపేందుకు సమాయాత్తమవుతాం అని ఏ రాష్ట్రాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయారో అక్కడ కరువు మండలాలను గుర్తించాలని సురవరం డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్ల నిధులతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయాలని, బీహార్ లో నితీష్ కుమార్ రాజకీయ డ్రామా అడారు అని తెలిపారు. ఎన్డీఏతో కలిసి మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సురవరం స్పష్టం చేశారు.

13:02 - July 27, 2017

హైదరాబాద్ : సిట్‌ విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌తో నలుగురు బిగ్‌బాస్‌ షో ప్రతినిధులు కూడా వచ్చారు. ముమైత్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షో ప్రతినిధులతో ఒప్పందం కుదర్చుకుంది. 70రోజులపాటు ఈ షోలో పాల్గొనేలా అగ్రిమెంట్‌ రాసుకున్నారు. ఈ సమయంలో ఏం జరిగినా షో ప్రతినిధులదే బాధ్యత ఉంటుంది. ఈ షో రూల్‌ ప్రకారం ఇందులో పాల్గొనేవారు ఫోన్‌కు దూరంగా ఉండాలి. ఈ నిబంధన ప్రకారం ముమైత్‌కు ఫోన్‌ ఇవ్వకుండా షో ప్రతినిధులే ముమైత్ తరపున మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:52 - July 27, 2017

టాలీవుడ్..హాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే చిత్రానికి సంబంధించిన విశేషాలు అభిమానులకు తెలియచేసేందుకు చిత్ర బృందం వినూత్న పంథాను ఎంచుకుంటుంది. అందులో భాగమే టీజర్..ట్రైలర్..మోషన్ పిక్చర్స్. తమ చిత్రాలను ఒక్కో విధంగా విడుదల చేస్తూ చిత్రాలపై అంచనాలను మరింత పెంచుతుంటారు. ఇందులో ప్రముఖ హీరోల చిత్రాల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయా సినిమాల పోస్టర్స్, టీజర్స్..ట్రైలర్స్ చూస్తూ అభిమానులు సంతోష పడుతుంటారు. ఆడియో వేడుకలు లేకుండా ఏకంగా యూ ట్యూబ్ లో సాంగ్స్ విడుదల చేయడం ప్రారంభించారు. ఇలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేసింది మెగా ఫ్యామిలీ. అనంతరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పేరిట ఓ వేడుకను నిర్వహిస్తున్నారు.

తాజాగా కొత్త ట్రెండ్ ముందుకొచ్చింది. దర్శకడు పూరి జగన్నాథ్ మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో 'బాలకృష్ణ' హీరోగా 'పైసా వసూల్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి 'స్టంపర్' ను విడుదల చేస్తున్నట్లు పూరీ వెల్లడించారు. టీజర్ క బాప్..గా ఉంటుందని వెల్లడించడం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈనెల 28న ఈ చిత్రం 'స్టంపర్‌'ను విడుదల చేస్తున్నారు. ఇది టీజర్‌, ట్రైలర్‌కు భిన్నంగా ఉంటుందని చిత్రబృందం చెబుతుంది. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయని, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్‌లో ఉంటాయని పూరి పేర్కొంటున్నారు. 

ఆరోపణల పై కేటీఆర్, వెంకయ్య సమాధానం చెప్పాలి: తమ్మినేని

హైదరాబాద్: కేటీఆర్, వెంకయ్యనాయుడు తమ పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని సీపీఎం నేత తమ్మినేని డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారిపై న్యాయ విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని, హిమాన్షు మోటర్స్లో 60శాతం షేర్లు ఉన్నట్లు 2014 ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ పేర్కొన్నారని, ఇపుడు షేర్లు లేవని ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మంత్రిగా కొనసాగే అర్హత కేటీఆర్ కు లేదని తమ్మినేని పేర్కొన్నారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక దందాలు, అక్రమాలు, కుంభకోణాలు వెలుగోకి వస్తున్నాయని, నేరేళ్ల ఘటనకు బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

12:41 - July 27, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' కొత్త సినిమా విడుదల కాక చాలా రోజులైంది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మురుగదాస్ కాంబినేషన్ లో 'మహేష్' చేస్తున్న 'స్పైడర్' గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకొంటోంది. ఎప్పటి నుండో చిత్రీకరణ జరుపుకుంటున్నా ఇప్పటికీ పూర్తి కాకపోతుండడం పట్ల అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఫస్ట్ లుక్ విషయంలో కూడా అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు కనుగొన్న చిత్ర యూనిట్ మోషన్ పిక్చర్ మాత్రం విడుదల చేసింది. అనంతరం కొద్ది రోజుల అనంతరం టీజర్ ను విడుదల చేశారు. అందులో మహేష్ డైలాగ్స్ లేకపోవడం..హీరోయిన్స్ లేకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారంట. దీనితో మరో టీజర్ ను విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారని టాక్.

ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. చివరి సాంగ్ ను చిత్రీకరించాల్సి ఉందని, ఈ సాంగ్ షూటింగ్ యూరప్ లో నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్కడకు వెళ్లుతున్నట్టు బుధవారం చిత్రబృందం వెల్లడించింది. ఈ సాంగ్ అనంతరం మిగతా వర్క్స్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరలో సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఈ సినిమాలో ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడిగా చేస్తున్నాడు. హరీష్‌ జయరాజ్‌ బాణీలు సమకూరుస్తున్నాడు. ఎన్‌.వి. ప్రసాద్‌ నిర్మాత.

12:36 - July 27, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య' తాజా చిత్రం 'యుద్ధం శరణం' షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేసుకొంటోంది. 'రారండోయ్ వేడుక చూద్దాం' అంటూ హిట్ కొట్టడంతో చైతూ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో 'నాగ చైతన్య' సరసన 'లావణ్య త్రిపాఠి' హీరోయిన్ గా నటిస్తోంది.

ఇందులో విలన్ గా 'శ్రీకాంత్' నటిస్తుండడం విశేషం. ఈ మూవీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లో 14వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 31న టీజర్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇతర సినిమాల కంటే టీజర్లు భిన్నంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. 'మీ అందరికీ టీజర్ చూపించటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అంటూ 'నాగ చైతన్య' ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తీకేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

12:34 - July 27, 2017

తూర్పుగోదావరి : కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభంను మళ్లీ గృహనిర్బంధం చేయడంతో కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని నిరసిస్తూ ముద్రగడ అనుచరులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

మాజీ సీఎం ధరమ్ సింగ్ కన్నుమూత...

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌ సింగ్‌ గురువారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధరమ్‌ సింగ్‌ 2006-07 వరకూ కర్ణాటక సీఎంగా పని చేశారు. మరోవైపు ధరమ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

12:27 - July 27, 2017

మహబూబ్ నగర్ : ప్రాజెక్టులు నిర్వాసితుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. హామీలను నెరవేర్చని... పాలకులపై వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గ్రామాలు ఖాళీ చేయించడానికి వస్తే... ఊరుకునేది లేదని .. హెచ్చరిస్తున్నారు. బలవంతంగా గ్రామాల నుంచి తరలించాలని చూస్తే.. తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తారని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.       
టీ.ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న నిర్వాసితులు
తెలంగాణ ప్రభుత్వ తీరుపై.. నిర్వాసితులు మండిపడుతున్నారు. పోరాటం చేసైనా... తమ భూములు..ఇళ్లను కాపాడుకునేందుకు.. సిద్ధమవుతున్నారు. అధికారులకు... పాలకులకు తగిన బుద్ధి చెప్పేందుకు .. సన్నద్ధులవుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న  ప్రాజెక్ట్‌ల వల్ల చాలా గ్రామాల ప్రజలు వసతిని.. ఉపాధిని కోల్పోయి...రోడ్డున పడుతున్నారు. పరిహారం చెల్లిస్తామనే పాలకుల హామీలు కోసం ... ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. దీంతో వారంతా.. ఆందోళన బాట పడుతున్నారు. 
దుఃఖాన్ని మిగిలిస్తున్న పాలమూరు..రంగారెడ్డి ప్రాజెక్ట్‌
ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ మూడు గ్రామాల ప్రజలకు  దుఃఖాన్ని మిగిలిస్తోంది. 35 వేల 250 కోట్లతో పాల‌మూరు ఎత్తిపోత‌ల పథకాన్ని డిజైన్‌ చేశారు.  అయితే పథకంలో భాగంగా చేపడుతున్న కరివెన ప్రాజెక్ట్‌ వల్ల మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భ‌ట్టుప‌ల్లి గ్రామానికి చెందిన మూడు తండాలు మునిగిపోతున్నాయి. వీరందరికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి ముంపునకు గురయ్యే వారితో సంతకాలు చేయించుకున్నారు. అధికారుల మాటలు నమ్మిన ప్రజలు... తమ భూములను ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి అప్పగించారు. 
రూ.3 లక్షలు చెల్లించి భూములు తీసుకున్న అధికారులు
ఎకరానికి కేవలం మూడు లక్షల చొప్పున పరిహారం చెల్లించి.. అధికారులు భూములు తీసేసుకున్నారు. ఆ తంతు ముగిసాక 2015 జూన్‌ 11న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.  అలాగే ఈ పథకంలో భాగంగా చేపట్టిన... మ‌హ‌బూబ్ న‌గ‌ర్  జిల్లా భూత్పూరు మండ‌లంలో కరివెన ప్రాజెక్ట్‌ను కూడా అదే రోజు కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కరివెన ప్రాజెక్ట్‌ వల్ల ముంపునకు గురవుతున్న మూడు గ్రామాల ప్రజలకు కేసీఆర్‌  ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని హామీలు గుప్పించారు.   
రెండేళ్లు అవుతున్న అందని సహాయం
సీఎం హామీలు విన్న ముంపు గ్రామాల ప్రజలు... ప్రాజెక్ట్‌ రావడం తమ అదృష్టమని భావించారు. అయితే ప్రాజెక్ట్‌ను ప్రారంభించి... రెండు సంవత్సరాలు పూర్తైనా.. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహాయం అందలేదు.. తమ భూముల్లో ప్రాజెక్ట్‌ సంబంధించిన పనులు పూర్తి కావస్తున్నాయి. కానీ కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.  దీంతో కరివెన ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  పాలకుల తీరుపై మండిపడుతున్నారు.  
మా గతేంటన్ను నిర్వాసితులు 
కష్టం చేసుకుని బతికేవాళ్లం... ఇప్పుడు మా గతేంటని ప్రశ్నిస్తున్నారు.. కన్నతల్లి లాంటి ఊరుని, అన్నం పెట్టె భూములని ప్రభుత్వానికి ఇస్తే త‌మ నొట్లో మ‌ట్టి కొట్టింద‌ని ఆక్షేపిస్తున్నారు. తమకు అండగా ఉంటానని హామీనిచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోవడంతో వ్యవసాయం చేసుకోలేక..ఉద్యోగాలు రాక, ఉపాధీ దొరక్క నానా పాట్లు పడుతున్నామని బాధపడుతున్నారు.  
గ్రామం ఖాళీ చేసేది లేదన్న ప్రజలు
ఇప్పుడు తమ గ్రామం ఖాళీ చేసేది లేదని.. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారులు ఊళ్లోకి అడుగుపెడితే ఊరుకునేది లేదని.. ముంపు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.  వారి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలవనున్నాయి.. ఇప్పటికే ఆ గ్రామాల్లో పర్యటించిన విపక్ష నేతలు.. అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. ఉద్యమానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు. 

 

ఆంక్షలు ఉల్లంగించి నిరసనలకు దిగితే కఠిన చర్యలు: ఎస్పీ గున్ని

తూ.గో: ఆందోళనకారులపై గృహ నిర్భంధం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆంక్షలు ఉల్లంగించి నిరసనలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడటం కోసం 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్: చొరబాటుకు యత్నించిన ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమర్చారు. గురేజ్ సెక్టార్ లో చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమర్చాయి.

నల్గొండ జిల్లా కోర్టు కలకలం

నల్గొండ : జిల్లా కోర్టులో కలకలం రేగింది. బిల్డింగ్ ఎక్కి ఓ మహిళ ఆందోళన చేపట్టింది. భూ వివాదంలో బెంచ్ క్లర్క్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మహిళ లక్ష్మి ఆరోపించింది. మహిళతో మాట్లాడిన జడ్జి ఆమె వాంగ్మూలాన్ని సేకరించారు. అనంతరం బెంచ్ క్లర్క్ గోవర్థన్ ను జడ్జి తప్పించారు. బెదిరించిన అడ్వకేట్, ఇతర వ్యక్తులపై క్రిమినల్ కేసుకు ఆదేశించడంతో మహిళ ఆందోళన విరమించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ వాయిదా..

ఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని ప్రాజెక్టు నిర్వాసితుడు హయత్ ఉద్దీన్ పిటిషన్ దాఖలు చేశాడు. పనులు నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటషనర్ కోరాడు. 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 16కి వాయిదా వేసింది.

ముద్రగడకు మద్దతుగా మహిళలు రాస్తారోకో

తూ.గో : కిర్లంపూడి, రాజుపాలెంలో ముద్రగడకు మద్దతుగా మహిళలు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న మహిళలను ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. ప్రభుత్వ తీరుపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

12:12 - July 27, 2017

నల్లగొండ : జిల్లా కోర్టు దగ్గర లక్ష్మి అనే మహిళ హంగామా సృష్టించింది. సూర్యాపేటకు చెందిన లక్ష్మి కోర్టు దగ్గరున్న ఓ భవనంపైకి ఎక్కింది. అక్కడి నుంచి దూకుతానంటూ బెదిరించింది. ఓ కేసు విషయంలో న్యాయం జరగడం లేదని ఆరోపించింది. గతంలో సూర్యాపేట కలెక్టరేట్‌ దగ్గర కూడా లక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది.

 

బీహార్ అభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు...

పాట్నా : బీహార్ అభివృద్ధి కోసమే బీజేపీతో చేతులు కలిపినట్లు ఆ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర సీఎంగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడారు. బీహార్ అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

12:09 - July 27, 2017

హైదరాబాద్: సిగరెట్‌, ఆల్కహాల్‌లాగానే డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే తప్పేంటి అని సోషల్‌ మీడియా ద్వారా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం గురించి డ్రగ్స్‌పై ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని వర్మ తప్పుపట్టారు.‘కేవలం ఆదాయం కోసమే సిగరెట్‌, ఆల్కహాల్‌లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం డ్రగ్స్‌ను మాత్రం చట్టవిరుద్ధంగా ఎందుకు చూస్తోంది. డ్రగ్స్‌ను కూడా చట్టబద్ధం చేస్తే ఎక్సైజ్‌ శాఖ ద్వారా ప్రభుత్తానికి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా! నిజానికి ఆల్కహాల్‌ను సప్లై చేస్తూ ప్రజలను తాగుబోతులుగా మార్చి వారి ఆరోగ్యాలను చెడగొడుతోంది ఎక్సైజ్‌ శాఖే. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆల్కహాల్‌ను అనుమతించడం మోసం కాదా అని వర్మ ప్రశ్నించారు.

12:09 - July 27, 2017

విజయనగరం : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌. కోట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ సెంటర్‌ వద్ద టిఫిన్‌ దుకాణంలోకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కార్‌ డ్రైవ్‌ చేయడం వల్లనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కార్‌లో మద్యం బాటిల్లు, బిర్యానీ ప్యాకెట్‌లు ఉన్నాయి. నిందితులను నెల్లిమర్ల విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గుర్తించారు. 

 

12:06 - July 27, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి అనుమతిలేకుండా నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. సాయినగర్‌ హౌసింగ్‌ బోర్డు స్థలంలో కొందరు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ గుడిసెలను ఖాళీ చేయించిన అధికారులు నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తుమధ్య ఈ కార్యక్రమం పూర్తిచేస్తున్నారు.

12:00 - July 27, 2017

సంగారెడ్డి : జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ గంగాధర్‌ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని గంగాధర్‌ రెడ్డి ఇళ్లలో రైడ్స్‌ నిర్వహించారు. గంగాధర్‌ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అభివృద్ధి కాకపోవడానికి కమ్యూనిస్టులే కారణం: లోకేష్

అమరావతి:అభివృద్ధి కాకపోవడానికి కమ్యూనిస్టు పార్టీలే కారణమని మంత్రి నారా లోకేష్ సెలవిచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో కమ్యూనిస్టు పార్టీ లు ముందుంటాయని, అభివృధ్ధి జరగలేదని మళ్లీ వారే గొడవ చేస్తారని లోకేశం అంటున్నారు. అభివృద్ధి అంటే ఏమిటో ఆ లోకేశమే వివరిస్తే బాగుండని పలువు అబిప్రాయపడుతున్నారు.

సిట్ కార్యాలయానికి బిగ్ బాస్ షో ప్రతినిధులు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. ముమైత్ ఖాన్ తో పాటు సిట్ కార్యాలయానికి నలుగురు బిగ్ బాష్ షో ప్రతినిధులు వచ్చారు. బిగ్ బాస్ షో లో 70 రోజుల అగ్రిమెంట్ లో భాగంగా ముమైత్ కాన్ కదలికలను వారు పరిశీలిస్తున్నారు. ముమైత్ ఖాన్ సిట్ విచారణ పూర్తయ్యే వరకు సిట్ కార్యాలయంలోనే బిగ్ బాస్ ప్రతినిధులు వుండనున్నారు.

11:56 - July 27, 2017

హైదరాబాద్ : సిట్‌ కార్యాలయంలో సినీనటి ముమైత్‌ ఖాన్‌ను అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మైసమ్మను నలుగురు మహిళా అధికారులు  విచారించనున్నారు. డ్రగ్స్‌ సరఫరాపై సిట్‌ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. కెల్విన్‌తో సంబంధాలపైకూడా కూపీ లాగుతున్నారు. బిగ్‌ బాస్‌ నిర్వాహకుల అనుమతితో ముమైత్ ఖాన్‌ విచారణకు హాజరయ్యారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లోయలో పడ్డ యాత్రికుల బస్సు : 25 మందికి గాయాలు.,..

పుదుచ్చేరి : పుదుచ్చేరి సమీపంలోని నాగూర్ నాగపట్నం వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రికుల బస్సు లోయలో పడిపోయింది.ఈ ఘటనలో 25 మంది యాత్రికులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది యాత్రికులు ఉన్నారు. బాధితులంతా నెల్లూరు జిల్లా సంగం మండలం తలుపూరుకు చెందినవారు.

పట్టిసీమ, ఒట్టిసీమ అన్న జగన్ క్షమాపణ చెప్పాలి: మంత్రి దేవినేని

కర్నూలు : పట్టిసీమ, ఒట్టిసీమ అన్న జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు 20 టీఎంసీల గోదావరి జలాలను, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు ఇచ్చామన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు వేగంగా జరుగుతున్నాయని, హంద్రీనీవా కాలువ వెడల్పు వల్ల మాల్యాల నుంచి 6 నుంచి 12 పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.

నితీష్ బీహార్ ప్రజలను మోసం చేశారు: రాహుల్ గాంధీ..

న్యూఢిల్లీ : సీఎం నితీష్ కుమార్ బీహార్ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కనీసం తమతో చర్చించకుండా బీజేపీతో చేతులు కలపడం దారుణమన్నారు. తమను కలిసినప్పుడు కూడా ఈ విషయాలు చర్చించలేదన్నారు. నితీష్ నమ్మక ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మూడు నాలుగు నెలల నుంచి నితీష్ ప్లాన్ చేస్తున్నారని రాహుల్ వెల్లడించారు.

కాపుల రిజర్వేషన్ల అంశం ఓ పద్ధతి ప్రకాం చేస్తున్నాం: మంత్రి లోకేష్

విజయవాడ: రాష్ట్రం లోటు బడ్జెట్ వున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి మూడేళ్లలోనే చేశామన్నారు. బిజయవాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతామని, ఇళ్ల పట్టాల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. కాపుల రిజర్వేషన్ల అంశం ఓ పద్ధతి ప్రకాం చేస్తున్నామని, ప్రతిపక్షాలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నాయని మండి పడ్డారు.

11:31 - July 27, 2017

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా నితీష్ అరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటి సీఎంగా సుశీల్ మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తివారి... నితీష్ కుమార్, సుశీల్ మోడీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. 

 

11:27 - July 27, 2017

బీహార్ సీఎం రాజీనామా చేయడం... 24 గంటలు గడవక ముందే మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు అన్న సామెత బీహార్ రాజకీయాలకు సరిపోతోంది. నిన్నమొన్నటివరకు ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకున్న జేడీయూ-ఆర్జేడీలు పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయాయి. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ తమ శత్రుకూటమి రాజ్యమేలుతున్న బీహార్ లో భాజపాను అధికార పార్టీకి మిత్ర పక్షంగా మోడీ మార్చుకున్నారు.

మచ్చలేని సీఎం గా..

బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సుదీర్ఘకాలం కొనసాగిన సమయంలో కానీ ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఆయనపై రాలేదు. రాజకీయ విరోధులు సైతం ఈ అంశంలో వేలెత్తిచూపే ధైర్యం చేయలేనంతటి నిజాయితీ ఆయన సొంతం. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలను మార్చే స్వభావం ఉన్నా నీతి, నిజాయితీలలో మాత్రం చెక్కుచెదరని వ్యక్తిత్వం ఆయనది. తాజాగా మహా కూటమిలో ప్రధాన భాగస్వామిపై వచ్చిన అవినీతి మరకల విషయంలో రాజీపడలేక తన పదవిని సైతం వదులుకోవడానికి సిద్ధమయ్యారు.

లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వి పై ఉన్న అవినీతి ఆరోపణలు, వాటిమీద సాగుతున్న విచారణ కలగలిసి... ఇప్పుడు భాజపాకు పంట పండుతోంది. ఇంకా మూడేళ్లకు పైగా ఉన్న ప్రభుత్వం కాలంలో.. ఏనాటికి పరిణామాలు ఎలా మారబోతున్నాయో చూడాల్సిందే..

బీహార్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రాజీనామ..

బీహార్‌ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే రాజీనామా చేశానని జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్జేడీ మేజర్‌ భాగస్వామిగా ఉన్న మహాకూటమిలో పనిచేయలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలపై తేజస్వి యాదవ్‌ రాజీనామాను తాను కోరలేదని, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని మాత్రమే తాను యాదవులను(లాలూ, తేజస్వి) కోరినట్టు చెప్పారు. అందుకు కూడా వారు ఒప్పుకోకపోవడంతో గత్యంతరం లేక రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. సరిగ్గా ఈ సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భాజపా రంగ ప్రవేశం చేసింది. నితీశ్ పార్టీకి భాజపా మద్దతు ఇస్తేచాలు.. అక్కడ ప్రభుత్వం నిలబడే పరిస్థితి ఉంది. కమలనాధులు.. రంగంలోకి దిగి, బయటినుంచి మద్దతు ఇస్తూ నితీశ్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామం బహుశా లాలూ ప్రసాద్ కు, అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మింగుడు పడేది కాకపోవచ్చు.

సంక్షోభానికి బిజెపినే కారణామా?

గత ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాని నేపథ్యంలో జేడీయూ- ఆర్జేడీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత సంక్షోభానికి బీజేపీనే కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీతో జోడీ కట్టి నితీష్ ఈ దఫా కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా, 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 80, జేడీయూకి 71, బీజేపీకి 53 స్థానాలున్నాయి. మరోవైపు బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీకి కాదని జేడీయూ అవకాశం ఎలా ఇస్తారని ఆర్డీజే నేతలు అర్ధరాత్రి గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఏది ఏమైనా బీహార్ రాజకీయాలు అనూహ్య మలుపులు ఏ దారి పట్టనున్నాయో వేచి చూడాల్సిందే... మరో వైపు బిజెపి మద్దతుతో ఆరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

కలాం సందేశ వాహిని యాత్రను ప్రారంభించిన మోదీ..

చెన్నై : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2వ వర్ధంతి వేడుకలు తమిళనాడు రామేశ్వరంలోని పెయి కరుంబులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పెయి కరుంబులో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలాం విగ్రహాం వద్ద మోదీ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్మించిన కలాం స్మృతి కేంద్రాన్ని ప్రారంభించారు. కలాం సందేశ వాహిని యాత్రను మోదీ ప్రారంభించారు. కలాం స్మృతి కేంద్రాన్ని డీఆర్‌డీవో ఏర్పాటు చేశారు.

11:07 - July 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు బయల్దేరారు. కానీ ఇంటి గేటు వద్దే పోలీసులు ముద్రగడను అడ్డుకున్నారు. పోలీసులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. ముద్రగడ గృహ నిర్బంధాన్ని పోలీసులు పొడిగించారు. ఆగస్టు 2 వరకు ముద్రగడ గృహ నిర్బంధంలోనే ఉంటారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 151 కింద ఎస్పీ విశాల్‌ గున్నీ నోటీసులు అందించారు. అనుమతి లేని పాదయాత్రను జరగనివ్వమని విశాల్‌ గున్ని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 180 పాయింట్ల లాభంతో 32,572 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 10,085 పాయింట్లను దాటింది. దేశీయ, విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడంతో స్టాక్‌మార్కెట్లు వూపందుకున్నాయి.

నేడు తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలు..

హైదరాబాద్: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలను గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విడుదల చేయనున్నారు. బీఈడీలో ప్రవేశాలకు ఈ నెల 16న నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు 59 వేల మంది రాశారు. ఈ నెల 28న ఫలితాలు విడుదల చేస్తామని గతంలో ప్రకటించినా ఒక రోజు ముందుగానే వెల్లడిస్తున్నారు.

10:43 - July 27, 2017
10:23 - July 27, 2017

హైదరాబాద్ : నటి ముమైత్‌ ఖాన్‌ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో ముమైత్‌ ఖాన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. నలుగురు మహిళా అధికారులు ప్రశించనున్నారు. డగ్స్‌ సరఫరాపై సిట్‌ ఆఫీసర్లు ఆరా తీయనున్నారు. పార్టీ కల్చర్‌పై వివరాలు రాబట్టే అవకాశం ఉంది. బిగ్‌ బాస్‌ నిర్వాహకుల అనుమతితో ముమైత్ ఖాన్‌ విచారణకు హాజరయ్యారు. నిన్న అధికారులు హీరోయిన్‌ ఛార్మిని విచారించారు. సినీ ప్రముఖుల్లో ఒకరి తరువాత ఒకరి విచారణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు

సంగారెడ్డి: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గంగాధర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, కూకట్ పల్లిలో గంగాధర్ రెడ్డి సోదరులు ఇళ్లలో, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

నేడు తమిళనాడుకు ప్రధాని మోదీ

చెన్నై: నేడు తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రామేశ్వరంలో కలాం స్మారక మండపంను ప్రధాని ప్రారంభించనున్నారు. కలాం రెండో వర్ధంతి సందర్భంగా రూ.15 కోట్లతో స్మారక మండపం ఏర్పాటు చేశారు. రామేశ్వరంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. కలాం సందేశ్ వాహిని బస్సును ప్రధాని ప్రారంభిస్తారు. ఆయోద్య నుంచి రామేశ్వరం మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. అనంతరం రామేశ్వరంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.

సిట్ విచారణకు హాజరైన ముమైత్ ఖాన్

హైద‌రాబాద్: డ్ర‌గ్స్ కేసులో సిట్ విచార‌ణ‌కు ముమైత్‌ఖాన్‌ హాజ‌రైంది . నాంప‌ల్లిలోని ఆబ్కారీ ఆఫీసుకు ఆమె వ‌చ్చారు.

బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం

పాట్నా: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గరవ్నర్ త్రిపాఠి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గత రాత్రి రాజీనామా చేసిన నితీష్ ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని, బిజెపి తో దోస్తీ కట్టారు.

పాదయాత్రకు బయల్దేరిన ముద్రగడ

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రకు బయల్దేరారు. జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం  గృహ నిర్భందంలోనే ఉన్నారు. ముద్రగడ పాదయాత్రకు బయలుదేరతారన్న వార్తలతో పోలీసులు మరింత అలర్ట్‌గా ఉన్నారు.. ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు.. మొత్తం 95 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 

09:52 - July 27, 2017

తూర్పుగోదావరి : ముద్రగడ పాదయాత్రకు బయల్దేరారు. జిల్లాలోని కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం  గృహ నిర్భందంలోనే ఉన్నారు. ముద్రగడ పాదయాత్రకు బయలుదేరతారన్న వార్తలతో పోలీసులు మరింత అలర్ట్‌గా ఉన్నారు.. ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు.. మొత్తం 95 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 

వచ్చే నెల 2 వరకు ముద్రగడ గృహనిర్బంధం

తూర్పుగోదావరి : వచ్చే నెల 2 వరకు కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఆర్ పీఎస్ సెక్షన్ 151 కింద ముద్రగడకు ఎస్పీ విశాల్ గున్నీ నోటీసులు అందించారు. 

09:36 - July 27, 2017

ప్రకాశం : జిల్లాలోని అద్దంకిలో మళ్లీ గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య వివాదం రగులుకుంది. గొట్టిపాటి వర్గీయుల అనుమతిలేకుండా రాత్రి కరణం గ్రూప్‌ శిలాఫలకాలు ఏర్పాటుచేశారు. దీనిపై కరణం వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదుతో పాత శిలాఫలకాలు తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశించారు. కమిషనర్‌ ఆదేశాలతో గొట్టిపాటి ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని సిబ్బంది తొలగించారు. పోలీసులు గొట్టిపాటి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడకుండా అద్దంకిలో 144సెక్షన్‌ అమలు చేస్తున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:27 - July 27, 2017

హైదరాబాద్ : నేడు సిట్‌ ముందుకు ముమైత్‌ ఖాన్‌ రానున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో ముమైత్‌ ఖాన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. డగ్స్‌ సరఫరాపై సిట్‌ ఆఫీసర్లు ఆరా తీయనున్నారు. నిన్న అధికారులు హీరోయిన్‌ ఛార్మిని విచారించారు. సినీ ప్రముఖుల్లో ఒకరి తరువాత ఒకరి విచారణ కొనసాగుతోంది. బిగ్‌ బాస్‌ నిర్వహకుల అనుమతితో ముమైత్ ఖాన్‌ విచారణకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:51 - July 27, 2017

ఢిల్లీ : టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గాలే టెస్ట్‌లో మరో అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. ధావన్‌తో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం జోడించిన పుజారా...టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. ట్రేడ్‌ మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా173 బంతుల్లో సెంచరీ మార్క్‌ దాటాడు. సెంచరీ పూర్తయ్యాక కూడా పుజారా క్రీజ్‌లో పాతుకుపోయాడు. టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయికి పుజారా మరింత చేరువయ్యాడు. 

 

08:47 - July 27, 2017

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టల బస్తీలో.. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఇందులో 2 వందల మంది పోలీసులు పాల్గొన్నారు. హితోపియ దేశానికి చెందిన ఇద్దరిని పాస్‌పోర్ట్‌ టైమ్‌ అయిపోవడంతో.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కాటన్ల కాఫీ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

 

08:44 - July 27, 2017

హైదరాబాద్ : ఇవాళ సిట్‌ ముందుకు ముమైత్‌ ఖాన్‌ రానున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో ముమైత్‌ ఖాన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. డగ్స్‌ సరఫరాపై సిట్‌ ఆఫీసర్లు ఆరా తీయనున్నారు. నిన్న అధికారులు హీరోయిన్‌ ఛార్మిని విచారించారు. సినీ ప్రముఖుల్లో ఒకరి తరువాత ఒకరి విచారణ కొనసాగుతోంది. బిగ్‌ బాస్‌ నిర్వహకుల అనుమతితో ముమైత్ ఖాన్‌ విచారణకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:41 - July 27, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో తనిఖీలు ఇంకా కొనసాగుతూనేఉన్నాయి.. గృహ నిర్భందంలోనే ఉన్న ముద్రగడ... కాసేపట్లో పాదయాత్ర చేసేందుకు  సిద్ధమవుతున్నారు. ఉదయం 9 గంటలకు ముద్రగడ పాదయాత్ర ప్రారంభించే అవకాశముంది.. ముద్రగడ పాదయాత్ర చేస్తే అడ్డుకునేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ముద్రగడ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల్ని మోహరించారు. 95 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 

 

08:12 - July 27, 2017

బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. నష్టాల్లో వున్న ప్రభుత్వరంగ సంస్థల్లో వేతన సవరణ చేయొద్దంటూ థర్డ్ పిఆర్సీ చేసిన సిఫార్సుల పై బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 2017 జనవరి 1 నుంచి వేతన సవరణ చేయాలంటూ ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.  ఇంతకీ బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు కారణం ఏమిటి? ఈ నష్టాలకు బాధ్యులెవరు? బిఎస్‌ఎన్‌ఎల్‌ విషయంలో ప్రభుత్వ విధానాలు ఎలా వున్నాయి?'. ఈ అంశాలపై మరిన్నివివరాలను వీడియోలో చూద్దాం...

 

మళ్లీ గొట్టిపాటి..కరణం వర్గాల మధ్య పోరు

ప్రకాశం : అద్దంకిలో మళ్లీ గొట్టిపాటి..కరణం వర్గాల మధ్య పోరు జరిగింది. గొట్టిపాటి వర్గీయులు అనుమతి లేకుండా శిలాఫలాలు ఏర్పాటు చేయడంపై కరణం బలరాం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కు కరణం వర్గీయులు ఫిర్యాదు చేశారు. 

 

రెండోరోజు పాదయాత్రకు ముద్రగడ సన్నాహాలు

తూ.గో : రెండో రోజు పాదయాత్రకు ముద్రగడ సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకుంటామని పోలీసులు చెప్పారు. నేడు పలుచోట్ల ఆందోళనలకు కాపు ఉద్యమ నేతలు యత్నించారు. భారీగా పోలీసులు మోహరించారు. కిర్లంపూడిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 

07:36 - July 27, 2017

పాట్నా : బీహార్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఎన్ డీఏ శాసనసభపక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం జేడీయూకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఉదయం 10 గంటలకు జేడీయూ, బేజీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 132 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు ఇరు పార్టీలు గవర్నర్ కు వెల్లడించాయి. నితీష్ కుమార్ సీఎంగా మళ్లీ ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా సుషీల్ మోడీ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని గవర్నర్ ను తేజస్వి యాదవ్ కోరారు. మెజార్టీ నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హత్య కేసులున్న నితీష్.. సీఎంగా ప్రమాణం ఎలా చేస్తారని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. జేడీయూ ఎమ్మెల్యేను నితీష్ నివాసంలో బంధించారని ఆరోపించారు. జేడీయూ, బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ఆర్జేడీ నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీయూకు బీజేపీ మద్దతు ఇచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

శరవేగంగా మారుతున్న బీహార్‌ రాజకీయ పరిణామాలు

పాట్నా : బీహార్‌ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఎన్డీఏ శాసనసభ పక్షనేతగా నితీష్‌ ఎన్నికయ్యారు.  ప్రభుత్వ ఏర్పాటు కోసం జేడీయూకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఉదయం 10 గంటలకు జేడీయూ,బీజేపీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. 132 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు గవర్నర్‌కు ఇరుపార్టీలు వెల్లడించాయి. ప్రమాణ స్వీకారాన్ని ఆపాలని.. మెజార్టీ నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలని గవర్నర్‌ను తేజస్వి యాదవ్‌ కోరారు.  

 

07:31 - July 27, 2017

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే కేంద్ర నిర్ణయం వల్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు ఉపాధ్యాయ,బాలల హక్కుల సంఘాలు, విద్యార్ధిసంఘాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగా తప్పుపడుతోంది. అయితే రాష్ట్రంలో అమలుచేసేందుకు ప్రభుత్వం నిరాకరించినప్పటికీ కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అన్ని సంఘాలు తమకు డిటెన్షన్ విధానం వద్దంటూ పోరుబాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. 
డిటెన్షన్‌ విధానంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నిరసన 
పాఠశాల విద్యలో డిటెన్షన్‌ విధానం పున: ప్రవేశపెట్టానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యలో 5, 8 తరగతుల్లో డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గ్రామీణ మండలాల్లో బాలికల డ్రాపవుట్స్‌ పెరుగుతోందని, ఈ పరిస్థితుల్లో డిటెన్షన్‌ విధానం వల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్న గ్యారంటీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. డిటెన్షన్‌ విధానంతో అక్షరాస్యతా శాతం గణనీయంగా పడిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేంద్ర నిర్ణయాన్ని ఖండించిన సంఘాలు
ఎస్‌ఎఫ్ఐ, టిపిఏ, బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం డిటెన్షన్‌ విధానం అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. డిటెన్షన్‌ విధానంపై అందరూ కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి చీఫ్‌ విప్ పాతూరి సుధాకర్ రెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలు అన్నారు. డిటెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్ధులకు తీరని అన్యాయం జరుగుతుందని సంఘాల నేతలు మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు.  
డిటెన్షన్ తో బాల కార్మికులు పెరిగే ప్రమాదం 
నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని సౌకర్యాలను పెంచాల్సింది పోయి డిటెన్షన్ విధానాన్ని అమలు చేసినట్లయితే బాల కార్మికులు పెరిగే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిటెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాలు, బాలల హక్కుల సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

 

07:23 - July 27, 2017

హైదరాబాద్ : ముమైత్‌ఖాన్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్‌ చేసింది. ఆమె వేసిన స్టెప్పులు కుర్రకారు మదిని దోచాయి. ఒక్క టాలీవుడ్‌ ఎంటీ బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ ముమైత్‌ ఓ ఊపు ఊపింది. ఐటమ్‌ సాంగ్స్‌తో పాటు నటిగా చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మ్యూజిక్‌ అల్బమ్స్‌లోనూ అదరగొట్టింది. డ్రగ్స్‌ కేసులో ఇవాళ సిట్‌ ముందుకు ముమైత్‌ హాజరుకానుంది.     
ఐటమ్‌ సాంగ్స్‌తో అదరగొట్టిన ముమైత్
ముమైత్‌ఖాన్. ఈ పేరు వింటే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ యావత్ భారతదేశ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ గ్లామరస్ డాన్సర్. కొన్ని చిత్రాల్లో నాయికగా కూడా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ సుమారు 80 చిత్రాలకు పైగా ఐటమ్‌సాంగ్స్ చేశారు. అడిక్షన్‌ పేరుతో అల్బమ్‌ కూడా తీశారు. 
1985 సం.లో జననం 
1985 సెప్టెంబర్‌ 1న ముంబైలో ముమైత్‌ ఖాన్‌ జన్మించింది. ఈమెకు నలుగురు సిస్టర్స్‌ ఉన్నారు. మొదట్లో నెలకు 1500 జీతంతో ఓ చిన్న డ్యాన్స్‌ ట్రూప్‌లో ముమైత్‌ పనిచేసింది. హిందీలో వచ్చిన మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌తో ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో వరుస సిన్మాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది.  ఇక పోకిరీ మూవీలో ముమైత్‌ ఐటమ్‌ సాంగ్‌ అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఈ సాంగ్‌ ఆమెకు వరుస ఆఫర్లు తెచ్చిపెట్టింది. ఐటెమ్‌ సాంగ్‌లు చేయడంతో పాటు కొన్ని సినిమాల్లో నటించింది. మైసమ్మ ఐపీఎస్‌ మంచి విజయం సాధించింది. తనకంటూ స్టార్‌ స్టేటస్‌ను క్రియేట్ చేసింది. ఛత్రపతి, ఆపరేషన్‌ దుర్యోదన, సామాన్యుడు, ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలు ముమైత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే కొత్తగా టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్ల రాకతో ముమైత్‌ ఖాన్‌ క్రేజ్‌ తగ్గుతూ వచ్చింది.  2013లో ఝలక్‌ దిక్‌లాజా 6, ఈ ఏడాది సూపర్‌ 2 టీవీ ప్రోగ్రామ్స్‌లో తళుక్కుమంది. తాజాగా తెలుగులో బిగ్‌బాస్‌ షో పాల్గొంటుంది. 
ఇవాళ సిట్‌ విచారణకు ముమైత్ హాజరు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా సినీ తార ముమైత్ ఖాన్ ఇవాళ సిట్‌ విచారణకు హాజరుకానున్నారు. బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఒకరోజు పర్మిషన్తో ఆమె సిట్‌ విచారణలో పాల్గొంటుంది. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగానికి సబంధించి లోతుగా సాగుతున్న సిట్‌ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్‌కు సంబంధించి ముమైత్‌ ఎలాంటి విషయాలు వెల్లడిస్తుందని సస్పెన్స్‌గా మారింది. 

 

నేడు ముమైత్ ఖాన్ ను విచారించనున్న సిట్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు ముమైత్ ఖాన్ ను సిట్ విచారించనున్నారు. పలు అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. నిన్న చార్మీని సిట్ విచారించింది.  

నేడు బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్ : నేడు దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వేతన సవరణ కోసం బీఎస్ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. 

Don't Miss