Activities calendar

28 July 2017

పట్టుబిగించిన కోహ్లీ సేన..

ఢిల్లీ : గాలె టెస్టులో కొహ్లీ అండ్‌ కో జోరు కొనసాగుతోంది. మూడో రోజు మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. 309 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త తడబడింది.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగిన శిఖర్‌ ధావన్‌, చటేశ్వర్‌ పుజారా విఫలమైనా.... విరాట్‌ కొహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను పోటీలో నిలిపాడు.

శనివారం రవితేజ డ్రైవర్ విచారణ..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం రవితేజను 9గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. శనివారం రవితేజ డ్రైవర్ రాజును విచారించనున్నారు. 

సుప్రీం తీర్పును స్వాగతించిన ఇమ్రాన్ ఖాన్..

పాకిస్తాన్ : ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు. నవాజ్‌ షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారు. ఇది ప్రజా విజయమన్నారు. కోర్టు తీర్పు దేశానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రతియేటా 10 బిలియన్‌ డాలర్ల మనీ లాండరింగ్‌ జరుగుతోందని తెలిపారు. 

21:28 - July 28, 2017

 

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పనామా కేసులో షరీఫ్‌ను కోర్టు దోషిగా ఖరారు చేసింది. ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ పాక్‌ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. పనామా గేట్‌ కుంభకోణం కేసులో పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు అత్యున్నత న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. ప్రధానమంత్రి పదవికి షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. షరీఫ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని కోర్టు సూచించింది.

1990లో..
1990లో షరీఫ్‌ ప్రధానిగా ఉన్నపుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డారని ఆయనపై అభియోగాలు దాఖలయ్యాయి. షరీఫ్‌ పిల్లల పేరిట ఉన్న డొల్ల కంపెనీల ద్వారా నగదును దేశం దాటించినట్లు పనామా పత్రాలు వెల్లడించాయి. కానీ.. ఈ ఆరోపణలను పాక్‌ అధికార పాకిస్తాన్ ముస్లింలీగ్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై విచారణ జరపాలని ప్రతిపక్ష నేత పాకిస్తాన్‌ తెహరిక్‌ ఇన్సాఫ్‌ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ప్రధానికి రాజీనామా..
షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిన జిట్‌ జూలై 10న కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చింది. ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. షరీఫ్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిలు ... తక్షణమే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. కొత్త ప్రధాని ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. పంజాబ్‌ ప్రావిన్స్ సిఎంగా ఉన్న తన సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ను ప్రధాని చేయాలని ఇప్పటికే షరీఫ్‌ రంగం సిద్ధం చేశారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసీఫ్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారు.

ప్రజా విజయమన్న ఇమ్రాన్ ఖాన్..
సుప్రీంకోర్టు తీర్పును పిటిషనర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారు. ఇది ప్రజా విజయమన్నారు. కోర్టు తీర్పు దేశానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రతియేటా 10 బిలియన్‌ డాలర్ల మనీ లాండరింగ్‌ జరుగుతోందని తెలిపారు. నవాజ్‌ షరీఫ్‌ మూడుసార్లు ప్రధానిగా ఎంపికైనా ఐదేళ్ల పదవీకాలాన్ని ఎప్పుడూ పూర్తి చేసుకోలేదు. ఒక‌సారి ప్రెసిడెన్సీ రూల్‌, మ‌రోసారి మిలిట‌రీ కుట్ర.. ఇప్పుడు అవినీతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు.. ఇలా మూడుసార్లూ ష‌రీఫ్ ప‌ద‌వీకాలం ముగియ‌క ముందే దిగిపోయారు.

21:25 - July 28, 2017

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అసెంబ్లీలో ఆర్జేడీ కుటుంబ రాజకీయాలని ఎండగట్టారు. అవినీతికి పాల్పడి అడ్డదారుల్లో సంపద పోగేసుకునేవారికి తాను వత్తాసు పలకనని పరోక్షంగా తేజస్వీయాదవ్‌పై విమర్శలు గుప్పించారు. సిఎం పదవి అంటే అధికారం అనుభవించడం కాదని...ఓ కుటుంబాన్ని నడపడం కాదని....పేద ప్రజలకు సేవ చేయడమేనని నితీష్‌ స్పష్టం చేశారు. మహాకూటమిని గౌరవిస్తూనే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించానని తెలిపారు. అవినీతి, అన్యాయాలను తాము సహించేది లేదని సిఎం తేల్చి చెప్పారు.

21:24 - July 28, 2017

హైదరాబాద్ : మహిళల క్రికెట్‌ కెప్టెన్‌ మిథాలీరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. కోచ్‌ మూర్తికి 25 లక్షల నగదు ప్రోత్సాహాన్ని ఆయన ప్రకటించారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న మిథాలీ... ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా... మిథాలి, కోచ్‌ మూర్తిని కేసీఆర్‌ శాలువాకప్పి సన్మానించారు. ప్రపంచకప్‌లో మిథాలీరాజ్‌ అత్యద్భుతంగా ఆడిందని.. వ్యక్తిగత రికార్డును సాధించడం మరో అద్భుతమని కేసీఆర్‌ ప్రశంసించారు.

21:23 - July 28, 2017

జనగాం : ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించింది టీ మాస్..281 ప్రజా, సామాజిక సంఘాలతో కలిసి టీ మాస్ ఆవిర్భవించింది. జనగాం జిల్లాలోని పూర్ణిమా గార్డెన్‌లో టీ మాస్ ఆవిర్భావ సభ జరిగింది. సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కంచ ఐలయ్య, గద్దర్, విమలక్కలతో పాటు ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నేతలు పాల్గొన్నారు. సభకు ముందు టీ మాస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని చైతన్య పరుస్తూ ఆట పాటలతో అలరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించి.. దోపిడి వ్యవస్థను అరికట్టేందుకే టీ మాస్‌ను ఏర్పాటు చేశామన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. టీ మాస్‌లో అందరూ చేరాలని పిలుపునిచ్చారు.

 

21:22 - July 28, 2017

హైదరాబాద్ : మహానగరంలో మరోసారి కాల్పుల కలకలం రేపింది...బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి తనయుడు విక్రం గౌడ్‌ ఇంట్లో తుపాకీ పేలింది..ఇది హత్యాయత్నమా..? లేక ఆత్మహత్యాయత్నమా..?? ఎన్నో మలుపులు..ఎన్నో అనుమానాలున్న ఈ కేసుపై పోలీసులు శోధిస్తున్నారు..మరోవైపు ఆస్పత్రిలో కోలుకుంటున్న విక్రం కోలుకుంటే వాస్తవాలు బయటపడనున్నాయి. అంతా కలకలం...తెల్లవారుజామున పేలిన తుపాకీ...బుల్లెట్లు దేహంలో దిగడంతో రక్తపు మడుగులో పడి ఉన్న మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రం గౌడ్‌ను కుటుంబీకులు దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు...వైద్యులు పరీక్షలు చేసి వెంటనే చికిత్స మొదలుపెట్టగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు...ఇదిలా ఉంటే విక్రంపై ఎవరు కాల్పులు జరిపారు...ఎందుకు జరిపారు...ఆ ఇంట్లో ఏం జరిగిందనేది అంతా సస్పెన్స్...మిస్టరీగా మారిన ఈ కేసులో విక్రం నోరువిప్పితేనే వాస్తవాలు బయటపడతాయి.

ఎన్నో అనుమానాలపై పోలీసుల దర్యాప్తు..
ఇక విక్రం గౌడ్‌ దేహంలోకి బుల్లెట్లు దిగడం వెనక ఎన్నో అనుమానాలున్నాయి. రాజకీయంగా...సినీ రంగంలో నిర్మాతగా.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిగా ఉన్న విక్రం గౌడ్‌కు లైసెన్స్‌ గన్‌ లేదు... గతంలో కూడా లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న దాఖలాలు లేవు.. అయితే విక్రం గౌడ్‌పై పేలిన ఆ తుపాకీ ఎక్కడిది...అనధికారికంగా తుపాకీ కలిగి ఉన్నాడా..? లేదంటే విక్రం భార్య షిఫాలి చెబుతున్నట్లు బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా..? దీనిపై లోతుగా తెలుసుకునేందుకు పోలీసులు రాత్రి నుంచి తెల్లవారేవరకు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలు సేకరిస్తున్నారు..వీటితో పాటు విక్రంపై బుల్లెట్లు దిగడంతో ఆస్పత్రికి వెళ్లగా పోలీసులు వచ్చేసరికి రక్తం మరకలను తుడిచేశారు..ఇది ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? దీనిపై పోలీసులు వివరాలు సేకరిస్తే పనిమనిషి తుడిచిందని చెబుతున్నా ఎవరైనా చెప్పారాన్నది తేలాల్సి ఉంది.

అప్పుల్లో కూరుకుపోయిన విక్రం..?
ఇదిలా ఉంటే వ్యాపార రంగంలో కూడా ఉన్న విక్రం గౌడ్‌కు అప్పులు పెరిగాయని దీంతోనే చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలుస్తుంది...విక్రం అప్పు తీసుకున్నవారి నుంచి వచ్చిన సమాచారం కూడా ఫోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది..ఒకరికి 20 లక్షలు..మరొకరికి 35 లక్షలు ఇవ్వాలన్నట్లు మెసేజ్‌ల ద్వారా పోలీసులు గుర్తించారు...ఇక అప్పులు పెరగడంతో వ్యాపార నిమిత్తం బంజారాహిల్స్‌లోని ఇల్లు కూడా విక్రయించినట్లు తెలుస్తోంది... అప్పులు పెరగడం వల్లే ఒత్తిడికి గురయి స్వతహాగా అఘాయిత్యానికి పాల్పడ్డాడాన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది..అయితే స్వతహాగా చేసుకున్నా...బయటివారు వచ్చినా ఆ గన్‌ ఎవరిదనేది మాత్రం అనుమానాస్పదమే...

డ్రగ్స్‌తో లింకులున్నాయా...
ఇక విక్రంగౌడ్‌ కాల్పుల అంశంలో మరో మలుపు...సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో విక్రంగౌడ్‌కు ప్రమేయం ఉందాన్న అనుమానాలు కూడా ఉన్నాయి... సినీ రంగంతో ఉండడంతో పాటు నగరంలో ఓ పబ్‌లో వాటాదారుడిగా తెలుస్తోంది.. ఆ పబ్‌లో డ్రగ్స్‌ వాడకం ఉందన్న అనుమానాలున్నాయి..దీంతోనే సిట్ అధికారులు కూడా రకరకాలుగా నోటీసులు అందుకున్నవారిని విచారిస్తున్నారు..ఇక డ్రగ్స్ సప్లయి చేసేవారిని అరెస్టు చేసిన సమయంలో పబ్‌ విషయం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది..దీంతో తనకు నోటీసులు వస్తాయని...తన ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వస్తాయన్న భయం కూడా విక్రంను వెంటాడినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని తప్పించుకోవడంతో పాటు ఫైనాన్సర్ల ఒత్తిడి నుంచి కొంతకాలం బయటపడేందుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడాన్న అనుమానాలున్నాయి.

21:19 - July 28, 2017

హైదరాబాద్ : తొమ్మిదో రోజు...తొమ్మిది గంటలు...ప్రముఖ సినీ నటుడు రవితేజను సిట్ విచారించింది...తమ్ముడు భరత్‌కు డ్రగ్స్ సంబంధాలతో మొదలుకుని కెల్విన్‌తో కాంటాక్ట్స్‌పై పూర్తి వివరాలు ఆరా తీశారు..రకరకాల ప్రశ్నలతో రవితేజను కౌంటర్ చేసిన సిట్ అధికారులకు టాలివుడ్‌లో మత్తుపై సమాచారం దొరికినట్లు తెలుస్తోంది...ఒక్కటి కాదు..రెండు కాదు...గుచ్చి గుచ్చి ప్రశ్నలతో సినీనటుడు రవితేజను సిట్ అధికారులు ముచ్చెమటలు పెట్టించినట్లు తెలుస్తోంది...రవితేజ సోదరుడు...ఈ మధ్యనే ప్రమాదంలో మరణించిన భరత్‌ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే..ఆ సమయంలోనే టాలివుడ్‌లో మత్తు సరఫరాపై ఆధారాలు వచ్చాయి...దీనికి తోడు చిత్రసీమలో మత్తు జాడలు కూడా కన్పించాయి...ఆ తర్వాత కంటిన్యూ అవుతున్న డ్రగ్స్‌పై కొనసాగుతున్న శోధనలో ఎన్నో విషయాలు బయటపడ్డాయి.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన జిషాన్‌ రవితేజ పేరు చెప్పడంతో నోటీసులు అందించారు...తొమ్మిదో రోజున రవితేజను విచారించిన అధికారులు తొమ్మిది గంటలపాటు యక్ష ప్రశ్నలు వేశారు..ఉదయాన్నే పదిన్నరకు నాంపల్లిలోని అబ్కారీ ఆఫీస్‌కు వచ్చిన రవితేజను రాత్రి ఎనిమిది వరకు ప్రశ్నించారు.

కెల్విన్‌ను పరిచయం చేసింది జిషాన్‌...
మీకు డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయా..?. కెల్విన్‌, జీశాన్‌ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్‌తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్‌ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసిన సిట్ బృందం కుటుంబ నేపథ్యం.. వ్యవహారాలు..అన్నదమ్ముల మధ్య సంబంధాలు కూడా తెలుసుకున్నారు..దీంతో రవితేజను కాస్త రిలాక్స్ చేసి ఆ తర్వాత మళ్లీ డ్రగ్స్‌పై సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది...

శనివారం రవితేజ డ్రైవర్ విచారణ..
మ‌రోవైపు ర‌వితేజ‌తో పాటు మ‌రో ఇద్దరు ఫ‌య‌ద్ యూనిస్‌, తౌబీర్ అహ్మద్‌ల‌ను కూడా డ్రగ్స్ కేసులో విచారించినట్లు సిట్ అధికారులు తెలిపారు...వీరిద్దరూ డ్రగ్స్ సరఫరాలో పాత్ర ఉందని తేలినట్లు చెబుతున్నారు...ఇక రవితేజకు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజు ద్వారానే డ్రగ్స్ అందినట్లు సిట్‌ శోధనలో తేలింది..దీంతో రవితేజ డ్రైవర్ రాజును శనివారం విచారించనున్నారు.

21:18 - July 28, 2017

హైదరాబాద్ : తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు పౌరులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. డ్రగ్స్‌ను అంతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే డ్రగ్స్‌ కేసులో లోతైన విచారణ జరుగుతోందని తెలిపారు. పారదర్శకంగా, చిత్తశుద్ధితో డ్రగ్స్‌ విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీని టార్గెట్‌ చేయలేదన్న కేసీఆర్‌... ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామన్నారు.  డ్రగ్స్‌ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్‌ కేసు విచారణ వివరాలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. డ్రగ్స్‌ కేసులో విచారణను పారదర్శకంగా, చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆదేశించారు. నేరస్తులెవరైనా శిక్ష పడేలా చూడాలన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ దందాలు అడుగుపెట్టకుండా ఆదిలోనే అంతం చేయాలని ఆదేశించారు.

మొగ్గలోనే తుంచాలన్న కేసీఆర్..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వాడకం, సరఫరా వ్యాప్తి చెందకుండా మొగ్గలోనే తుంచేసే క్రమంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారి బాగా వ్యాపించిందనే ప్రచారం సరికాదన్నారు. తెలంగాణలో డ్రగ్స్‌ వినియోగం ఎక్కవగా లేదని, అసలు దానికి ప్రవేశమే దొరకకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డ్రగ్స్‌ మూలాలను పట్టుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఇప్పటికే డ్రగ్స్‌కు సంబంధించి కీలక ఆధారాలు, సూత్రధారుల వివరాలు లభించాయన్నారు. గుడుంబా, పేకాట, హుక్కా, కల్తీలు, నకిలీల లాంటి సామాజిక రుగ్మతలను తొలగించే బృహత్తర లక్ష్యంలో భాగంగానే డ్రగ్స్‌ భూతాన్ని కూడా తరిమికొట్టాలని నిర్ణయించామన్నారు. ఇక సినీ రంగాన్ని టార్గెట్ చేశారన్న ఆరోపణలు కేసీఆర్‌ కొట్టేశారు. ప్రభుత్వం నేరస్తులను శిక్షిస్తుందే తప్ప బాధితులను ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. పేకాట క్లబ్బులు, గుడుంబా, హుక్కా సెంటర్లు, గంజాయి సరఫరాపై ప్రభుత్వానికి సమాచారం అందించే వారికి లక్ష రూపాయల బహుమానం ఇవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి..
రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కంకణం కట్టుకున్నామని కేసీఆర్‌ అన్నారు. కల్తీలను అరికట్టే సందర్భంలోనే డ్రగ్స్‌ వాడకానికి సంబంధించిన సమాచారం అందిందన్నారు. దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్న కేసీఆర్‌... పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులకు డ్రగ్స్‌ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. డ్రగ్స్‌ వినియోగించిన వారిని విచారిస్తున్నామని, వారిచ్చిన సమాచారం ఆధారంగా సరఫరా చేసే వారిని, డ్రగ్స్‌ మూలాలను దొరకబడతామన్నారు. డ్రగ్స్‌ తీగను లాగి డొంకను కదిలిస్తామని చెప్పారు. డ్రగ్స్‌ అమ్మేవారు, దందాచేసే వారిని క్షమించబోమన్నారు. డ్రగ్స్‌ నియంత్రణకు పౌరులు స్వచ్చందంగా ముందుకొచ్చి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

శాప్, స్కిల్ డెవలప్ మెంట్ పై బాబు సమీక్ష..

విజయవాడ : శాప్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. ఆగస్టు 15న విశాఖ, కాకినాడ, గుడివాడ, నర్సరావుపేట, నెల్లూరు, అనంతపురంలో స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అమరావతిలను స్పోర్ట్స్ సిటీలుగా తీరిదిద్దాలని సూచించారు. 

మిథాలీకి కోటి నగదు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ను మహిళల క్రికేట్ జట్టు సారథి మిథాలీ రాజ్ కలిశారు. మిథాలీకి రూ. కోటి నగదు, 600 గజాల స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం కేటాయించారు. 

పీజీ డాక్టర్ల కౌన్సెలింగ్..గందరగోళం..

విజయవాడ : పీజీ సర్వీస్ డాక్టర్ల కౌన్సెలింగ్ లో గందరగోళం నెలకొంది. గొల్లపూడిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి ఉదయం 10గంటలకు పీజీ డాక్టర్లు వచ్చారు. సాయంత్రం 6గంటల వరకు అధికారులు అందుబాటులో లేరు. దీనితో పీజీ డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. 

ముగిసిన రవితేజ విచారణ..

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 9గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. 

20:40 - July 28, 2017

నాకు తెల్సిన కాడికి.. వడ్లళ్ల రకాలు సిక్ట్సీ ఫోర్ ఒడ్లు.. పొట్టి మొల్కలు.. హంసలు అండ్ల గూడ దొడ్డంస.. సన్నంస.. బాస్మతులు.. గిట్ల కొన్నిరకాలుంటయ్ గని.? ఈ నడ్మ కేటీఆర్ వడ్లు రావోతున్నయట.. మరి అవ్వి ఎంత దొడ్డుంటయ్.. ఎంత పొడ్గుంటయ్ అనేది.. అవ్వి వండిస్తున్న రైతులనే అడ్గితె తెలుస్తది.. పాండ్రి పాడి పంట కార్యం కాడికి..ఈ ముచ్చట చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:36 - July 28, 2017

ముఖ్యమంత్రి కొడ్కు కేటీఆర్ మేడకు గట్టిగనే సుట్టుకునెతట్టు గొడ్తున్నది.. బీహార్ శాసన సభలో విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. పాపం ఎప్పటికైనా పండుతది అనెతందుకు మళ్లొక ఉదాహరణ దొర్కింది పాకిస్తాన్ ప్రధానమంత్రి రూపంల.. నాకు తెల్సిన కాడికి.. వడ్లళ్ల రకాలు సిక్ట్సీ ఫోర్ ఒడ్లు.. ఈ నడ్మ కేటీఆర్ వడ్లు రావోతున్నయట..తెలంగాణల ఎస్ఐ రాత పరీక్షలు అయ్యి తొమ్మిదినెలలైంది.? ఇప్పటిదాక ఫలితాలు డెలివరీ గాలే..పోరగాళ్లకు ఆటపాటలు నేర్పురా వారీ అంటే.. పోరగాళ్ల జీవితాలతోనే ఆటాడుదామని సూశిండట ఒక సారూ...ఇగ మారెతట్టు లేరు జనం.. చెప్పి చెప్పి చెప్పి నాకే యాష్టొస్తున్నది.. ఎన్ని మాట్ల జెప్తి..? వారెవ్వ..? ఊరూరి దిర్గి బిచ్చమెత్తుకునెటామెను రంగంలకు దించి నాల్గువందల గజాల భూమిని మాయం జేశిండ్రంటే వాళ్లు చిన్నోళ్లేనా..? : నేను మన్షిని గాదు జంతువును అంటున్నడు నందమూరి బాలికాకయ్య..రాందేవ్ బాబా అనంగనే మనకు ఏం యాదికొస్తది..?...గరం..గరం..ముచ్చట్లు వినాలంటే వీడియో క్లిక్ చేయండి..

20:34 - July 28, 2017

ఢిల్లీ : గాలే టెస్ట్‌లో కొహ్లీ అండ్‌ కో జోరు కొనసాగుతోంది. మూడో రోజు ఆల్‌రౌండ్‌ షోతో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ...మ్యాచ్‌పై పట్టు బిగించింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో లంక జట్టును తక్కువపరుగులకే కట్టడి చేసిన భారత్‌...భారీ విజయంపై కన్నేసింది.మూడో రోజే 498 పరుగుల ఆధిక్యంలో నిలిచిన భారత్‌....600 పరుగులకు పైగా లక్ష్యాన్నుంచి లంక జట్టుపై ఒత్తిడి పెంచాలని పట్టుదలతో ఉంది. 154 పరుగులకు 5 వికెట్లతో 3వ రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన లంక జట్టు ...ఓవర్‌ నైట్‌ స్కోర్‌కు మరో 137 పరుగులు మాత్రమే జోడించగలిగింది.జడేజా స్పిన్‌ మ్యాజిక్‌తో లంక లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు కట్టడి చేయడంతో పాటు గాయం కారణంగా గుణరత్నే బ్యాటింగ్‌కు రాకపోవడంతో లంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు మాత్రమే చేసింది.

309 పరుగుల ఆధిక్యం..
309 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త తడబడింది.తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగిన శిఖర్‌ ధావన్‌, చటేశ్వర్‌ పుజారా విఫలమైనా.... విరాట్‌ కొహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. వరుసగా విఫలమవుతోన్న అభినవ్‌ ముకుంద్‌ సైతం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముకుంద్‌ టెస్టుల్లో 2వ హాఫ్‌ సెంచరీ నమోదు చేయగా....విరాట్ 15వ హాఫ్‌ సెంచరీ స్కోర్‌ చేశాడు. ఇద్దరూ కలిసి 3వ వికెట్‌కు 133 పరుగులు జోడించడంతో ... ఆట ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. 
మూడో రోజే 498 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్‌....600 పరుగులకు పైగా లక్ష్యాన్నుంచి లంక జట్టుపై ఒత్తిడి పెంచాలని పట్టుదలతో ఉంది. గాలే టెస్ట్‌లో విరాట్‌ కొహ్లీ అండ్‌ కో విజయం సాధించడం ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

20:32 - July 28, 2017

గుజరాత్‌ : రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా.. ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశారు. వరుసగా రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీ తరఫున గుజరాత్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న అహ్మద్‌ పటేల్‌ను కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల బలం క్షీణిస్తుండటంతో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అహ్మద్‌పటేల్‌ విజయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ నేత శంకర్‌ సింగ్‌ వాఘేలాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. రాజీనామా చేసిన ఓ ఎమ్మెల్యేను అహ్మద్‌పటేల్‌పై బిజెపి పోటీగా నిలబెట్టింది. ప్రస్తుతం 182 మంది సభ్యులున్న గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 52కి తగ్గగా...అహ్మద్‌ పటేల్‌ విజయానికి 48 ఓట్లు అవసరం ఉన్నాయి.

20:30 - July 28, 2017

పాట్నా : ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ విశ్వాస పరీక్ష నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో నితీష్‌కుమార్‌కు అనుకూలంగా 131 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. 108 మంది ఎమ్మెల్యేలు నితీష్‌ను వ్యతిరేకించారు. బిహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సభ్యులున్నారు. ఆర్జేడికి 80, జెడియుకు 71, కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలుండగా...బిజెపికి 53 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా 131 మంది సభ్యుల మద్దతు నితీష్‌కు లభించింది. విశ్వాసపరీక్షకు ముందు నితీష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. నితీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారం కోసం నితీష్‌కుమార్‌ ఓ పథకం ప్రకారం తనని టార్గెట్‌ చేసి కేసులో ఇరికించారని తేజస్వీ యాదవ్‌ నిప్పులు చెరిగారు. దమ్ముంటే తనని బర్తరఫ్‌ చేయాల్సిందని... బిహార్‌ ప్రజలకు నితీష్‌ మోసం చేశారని విమర్శించారు. 

20:26 - July 28, 2017

హైదరాబాద్ : ఐద్వా వ్యవస్ధాపకుల్లో ఒకరైన కెప్టెన్ లక్ష్మీ సెహగల్ వర్థంతి సభ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఆమె చిత్రపటానికి ఐద్వా సీనియర్ నేత మల్లు స్వరాజ్యం, ఐద్వా నేతలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు.. వామపక్ష ఉద్యమాల్లో పాల్గొన్న మహిళా నాయకుల చరిత్ర తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆవిష్కరించారు. అట్టడుగు వర్గాల సమస్యల పరిష్కారానికి సెహగల్ ఎంతో కృషి చేశారని.. ఆమె జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మల్లు స్వరాజ్యం తెలిపారు. 

20:24 - July 28, 2017

నిజామాబాద్ : విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలం డోన్గావ్‌ గ్రామ పరిధిలోని శక్తినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో వాటర్‌మేన్‌ బాబు మృతి చెందాడు. జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాబు మృతితో కోపోద్రిక్తులైన శక్తినగర్‌ వాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో దిగొచ్చిన అధికారులు మృతుడి కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. 

20:22 - July 28, 2017

విజయవాడ : ప్రైవేట్ మొబైల్ ఆపరేటర్లకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ సేవల్ని విస్తరిస్తున్నట్లు ఆ సంస్ధ ప్రిన్సిపల్ మేనేజర్ జాన్ క్రిసోస్థం తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తైనట్లు ఆయన చెప్పారు. మరో మూడు నెలల్లో బీఎస్ఎన్ వినియోగదారులకు 4G సేవలను అందిస్తామని జాన్ క్రిసోస్థం పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

20:21 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ గత కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తోన్న సమస్య. డ్రగ్స్‌ కేసు విచారణలో కలబంద హాట్‌ టాపిక్‌గా మారింది. డ్సగ్స్‌ వాడిన వ్యక్తి శరీరంలో దాని ఆనవాళ్లు లేకుండా చేసే శక్తి కలబందకు ఉందా? దీర్ఘకాలికంగా దురలవాట్లకు బానిసైన వ్యక్తిని బయటకు తీసుకురాగలిగే సత్తా ఉందా అంటే డాక్టర్లు ఉంటుందనే చెబుతున్నారు. అయితే కండీషన్స్‌ అప్లై అని అంటున్నారు. అదెలాగో ఇప్పుడో లుక్కేద్దాం.

ఎక్కువ వినిపిస్తున్న పదం..
డ్రగ్స్‌.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం. స్కూల్‌ పిల్లలు మొదలుకొని.. టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ కేసులో ఉండటం అందరిలో కలవరం సృష్టించింది. డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న సినీ నటులు అలోవేరా డ్రింక్స్ తాగి.. కడుపుని క్లీన్ చేసుకొని విచారణకు హాజరవుతున్నారు. ఇవి స్వయంగా ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు.. ఈయన వ్యాఖ్యల తరువాత అందరి దృష్టి కలబందపైకి మళ్లింది.

ఆయుర్వేద వైద్య నిపుణులు..
కలబంద రసం తీసుకుంటే కడుపులో ఉన్న డ్రగ్స్‌ని.. మూలాల నుంచి తొలగించుకోవచ్చా అనే అనుమానాలు ప్రతీ ఒక్కరిలో కలుగుతున్నాయి. అయితే ఆయుర్వేదంలో కలబందకు ప్రత్యేక స్థానం ఉందని ఆయుర్వేద ప్రముఖ వైద్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల కొంత మేరకు విష పదార్థాలను వెలికి తీసెయొచ్చని చెబుతున్నారు. మానవ శరీరంలో ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఏర్పడే విషతుల్య పదార్థాలను తొలగించడానికి.. కలబంద ఉత్పత్తులు ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలబంద జీవ క్రియలను పునర్నిర్మించడంలో దివ్య ఔషధంగా పని చేస్తుందని చెప్పారు. సాధారణంగా మన శరీరంలోకి ఏ రకమైన ఔషధాలను అధిక మోతాదులో తీసుకున్నా.. అవి విషంగా మారిపోతాయి. శరీర జీవక్రియలను దెబ్బతీస్తాయి. ఇటువంటి సందర్భాల్లో కలబంద ఉత్పత్తులు మంచి గుణాన్నే కనబరుస్తాయనీ ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

పెద్దగా ఉపయోగం ఉండదన్న నిపుణులు..
విశిష్ట గుణాలుండటం వల్లే కలబంద రసాన్ని నేరుగా తాగుతుంటారు. అయితే మాదక ద్రవ్యాల వాడకం విషయంలో దాని ప్రభావం అంత తీవ్రంగా ఉండదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ రోజుకు రెండు రోజులకు మాదక ద్రవ్యాలను వాడితే.. కలబంద వల్ల శరీరం నుంచి విష తుల్యాలు వెలుపలికి వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా మత్తు పదార్థాలను వినియోగిస్తున్న వారిలో.. శరీరం లోతుల్లో దాని మూలాలు దాగి ఉంటాయనీ డాక్టర్‌ చెప్పారు. అలాంటి వారిలో కలబంద ఉత్పత్తుల వినియోగం వల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదని నిపుణులు స్పష్టం చేశారు.  

20:08 - July 28, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. ఉదయం విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 9గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ పట్టుబడడంతో ఈ డొంక కదిలింది. టాలీవుడ్ కు సంబంధం ఉండడంతో పలువురు సెలబ్రెటీలకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు నటీ, నటులను విచారించింది. శుక్రవారం రవితేజను విచారించింది. బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ ను ఇవ్వడానికి రవితేజ నిరాకరించినట్లు తెలుస్తోంది.
రవితేజ కుటుంబ వ్యవహారాలు..సినీ రంగ ప్రవేశం..సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తు మందుల వాడకం ఎప్పటి నుండి ఉంది ? ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా ? తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కెల్విన్..జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి ? వారు ఏ విధంగా పరిచయం అయ్యారు ? దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడుతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:37 - July 28, 2017
19:30 - July 28, 2017

చిత్తూరు : తిరుమలలో కిడ్నాపైన బాలిక నందిని క్షేమ సమాచారం తెలిసింది. గతంలో కూడా కిడ్నాపైన బాలుడిని పోలీసులు క్షేమంగా విడిపించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల క్రితం తిరుపతిలో చిన్నారి నందిని కిడ్నాపైంది. గుర్తు తెలియని మహిళ చిన్నారిని ఎత్తుకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులకు తెలియచేయడంతో కిడ్నాప్ కు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో లభ్యమయ్యాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టారు. వేలూరులో నందిని ఉందని పోలీసులకు సమాచారం అందింది. కానీ అక్కడ లేకపోవడంతో కర్నాటకలో పోలీసులు గాలించారు. ఓ ప్రాంతంలో నందిని క్షేమంగా విడిపించారు. కిడ్నాప్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు అర్బన్ ఎస్పీ మీడియాకు తెలియచేయనున్నారు. 

19:21 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రవితేజ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుండడం విశేషం. 9గంటలకు పైగా విచారణ జరుగుతుండడంతో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. భిన్న కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నట్లు, రవితేజ కుటుంబ వ్యవహారాలు..సినీ రంగ ప్రవేశం..సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తు మందుల వాడకం ఎప్పటి నుండి ఉంది ? ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా ? తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా కెల్విన్..జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి ? వారు ఏ విధంగా పరిచయం అయ్యారు ? దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడుతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది.

సినీ రంగం టార్గెట్ కాదు..
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్ర‌గ్స్ కేసుపై శనివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. పోలీసు, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డ్ర‌గ్స్ కేసు విచార‌ణ‌ను పార‌ద‌ర్శ‌కంగా, చిత్త‌శుద్ధితో నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ వాడ‌కం, స‌ర‌ఫ‌రా వ్యాప్తి చెంద‌కుండా మొగ్గ‌లోనే తుంచేయాలని సూచించారు. తెలంగాణ లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి కి ప్ర‌వేశం లేకుండా చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, డ్రగ్స్ ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో తెలంగాణ లేదన్నారు. డ్రగ్స్ మూలాలను పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నామని, సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు అన్నారు. కీలక ఆధారాలు..సూత్రధారుల వివరాలు లభించాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

శనివారం రవితేజ డ్రైవర్ విచారణ..

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజ విచారణ ఇంకా కొనసాగుతోంది. గత 9గంటలకు పైగా విచారణ జరుగుతోంది. రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్ లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ ను విచారిస్తామని సిట్ పేర్కొంది. 

తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదన్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ దొరకకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, డ్రగ్స్ ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో తెలంగాణ లేదన్నారు. డ్రగ్స్ మూలాలను పట్టుకొనే ప్రయత్నంలో ఉన్నామని, సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నామనడం తప్పు అన్నారు. కీలక ఆధారాలు..సూత్రధారుల వివరాలు లభించాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

19:02 - July 28, 2017

చాలా కాలంగా ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ హీరో లో ఒకరు గోపిచంద్. తన స్టైల్, బాడీలాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకొని ఓ చిత్రంతో ముందుకొచ్చాడు. ఆ సినమానే 'గౌతమ్ నంద'. మాస్ హీరోయిజాన్ని సూపర్బ్ గా ఎలివేట్ చేసే సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించిందా..? సంపత్ కమర్షియల్ డైరెక్టర్ గా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడా...?..హిట్ కోసం తపిస్తున్న గోపిచంద్ ఆశ నెరవేరిందా ? అనేది తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:46 - July 28, 2017
18:43 - July 28, 2017
18:42 - July 28, 2017

కర్నూలు : ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, చేపట్టిన లాంగ్‌ మార్చ్‌ కర్నూలు జిల్లా పత్తికొండలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర పత్తికొండ చేరుకుంది. కన్నయ్య కుమార్‌ ప్రసంగం తర్వాత సివిల్‌ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుల్‌... కన్నయ్యను ప్రశ్నించేందుకు ప్రయత్నించడంతో సభలో గందగరగోళం నెలకొని, ఉద్రిక్తతలకు దారితీసింది. కన్నయ్యను ప్రశ్నించేందుకు యత్నించిన వ్యక్తిని లాంగ్‌ మార్చ్‌ సభలో పాల్గొన్న కార్యకర్తలు దాడి చేయడంతో, పోలీసులు ఆ వ్యక్తిని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కన్నయ్య ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. 

18:41 - July 28, 2017

తూర్పుగోదావరి : నడవలేక నాటకాలు ఆడుతున్నారన్న విమర్శలపై.. ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 2 తర్వాత పాదయాత్ర చేపడతానన్నారు. పాదయాత్రకు అనుమతిస్తే నడుస్తానో లేదో తెలుస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ చంద్రబాబు బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు 2019లో ముగింపు తప్పదని జోస్యం చెప్పారు. 

18:39 - July 28, 2017

విజయవాడ : బందరు రోడ్డులో వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్థసారథి భూమి పూజ చేశారు. పార్థసారధికి చెందిన స్థలంలో ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. 30 సెంట్ల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ ఛాంబర్, సమావేశ గది, మీడియా రూమ్, తో పాటు పార్టీ కార్యకలాపాలకు వేరుగా ఒక గది నిర్మిస్తున్నారు. 

18:37 - July 28, 2017

గుంటూరు : మంగళగిరి ఐటీ పార్క్‌ను ఐటీహబ్‌గా తీర్చిదిద్ది మరో సైబరాబాద్‌ నిర్మిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో మెరుగైన ఫలితాలు సాధించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని ఐటీ సంస్థలు రావడానికి పైడేటా సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. త్వరలోనే క్లౌడ్‌పాలసీని తీసుకురానున్నట్టు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. అమరావతిలో మరో ఐటీ సంస్థ కొలువుదీరింది. మంగళగిరి ఆటోనగర్‌లోని ఐటీపార్క్‌లో 600 కోట్లతో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పై డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 300 మందికి ప్రత్యక్షంగా, మరో 2వేల మందికిపైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఎంవోయూలు..
ఈ సందర్భంగా పై డేటా సెంటర్‌తో 10ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు చంద్రబాబు సమక్షంలో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. పై డేటా సెంటర్‌ అమరావతికి మరో హైటెక్‌ సిటీగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీలో పెట్టుబడులకు అన్ని అవకాశాలు ఉన్నాయని... ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. టెక్నాలజీని వినియోగించడంలో తానెప్పుడూ ముందుంటానని, సాంకేతికత కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.

సంతోషంగా ఉందన్న లోకేష్..
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతిలో డేటా సెంటర్‌ రావడం సంతోషంగా ఉందని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. మంగళగిరిని ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. త్వరలోనే క్లౌడ్‌హబ్‌ పాలసీని తీసుకురాబోతున్నామని, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన చేపడతామన్నారు. మంగళగిరి ఐటీ పార్క్‌లో రానున్న రెండేళ్లలో 20వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు.

5వేల ర్యాకులు..
క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డాటా అనలిటిక్స్‌కు సంబంధించి పలు ప్రత్యేకతలు ఈ డేటా కేంద్రం సర్వర్లు అందిస్తాయి. దక్షిణాదిలో ఈ తరహా డేటా కేంద్రాల్లో అమరావతిలో ఏర్పాటు చేసిందే మొదటిది. డేటా సెంటర్లలో ఇది నాలుగో శ్రేణికి చెందినది. పై డేటా కేంద్రంలో డేటా నిక్షిప్తం చేయడానికి మొత్తం 5వేల ర్యాక్‌లను సిద్ధం చేశారు. అందులో వెయ్యింటిని ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. మిగిలినవి ప్రైవేటు సంస్థల సేవలకు ఉపయోగించనున్నారు. 

18:33 - July 28, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్‌పై కాల్పుల వ్యవహారంలో ఇప్పటి వరకూ పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. విక్రమ్ గౌడ్ తనను తాను కాల్చుకున్నాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. విక్రమ్ గౌడ్ సెల్‌ఫోన్‌లో 35 వాట్సప్ మెసేజ్‌లను గుర్తించిన పోలీసులు..
ఆయనకు పెద్దమొత్తంలో అప్పులు ఉన్నట్లు అంచనా వేశారు. డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావని విక్రమ్‌ ఫోన్‌కు మెసేజ్‌లు రావడాన్ని గుర్తించారు. మాదాపూర్ పబ్‌ నిర్వహణ బాధ్యత మొత్తం విక్రమ్‌దే కావడంతో డ్రగ్స్‌కేసులో ఏమైనా సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసు విచారణ వివరాలను విక్రమ్‌ తన ఫోన్‌లో భద్రపరుచుకోవడం అనుమానాలకు తావిస్తోంది. క్లూస్ టీమ్‌ల దర్యాప్తు తర్వాత.. విక్రమ్ గౌడ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

18:25 - July 28, 2017

మహబూబ్ నగర్ : విద్యార్థులకు చదువు చెప్పాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది చెడు పనులు చేస్తుండగా మరికొంతమంది ఉపాధ్యాయులు ఏకంగా క్లాస్ రూంలో నిద్రపోతున్నారు. నిద్రపోతున్న ఉపాధ్యాయుడి చేతులో సస్పెండ్ లెటర్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మిడ్జిల్ జెడ్ పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో నిద్రపోతుండగా ఫొటో తీసి డీఈవోకు వాట్సప్ లో విద్యార్థులు పంపారు. ఆ ఉపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు. విధి నిర్వాహణలో ఉన్న ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో నిద్రపోతున్నారనే సమాచారంతో గతంలో అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భాలున్నాయి. 

18:21 - July 28, 2017

హైదరాబాద్ : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్ డ్రగ్ కేసుపై జరుగుతున్న విచారణపై ఆరా తీశారు. ఎక్సైజ్ పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న విచారణకు సంబంధించిన నివేదికను ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఓ నివేదికన అందచేసినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ పలు సూచనలు..
13 ఐటీ హబ్ కంపెనీలకు చెందిన పలువురు ఉద్యోగులు డ్రగ్స్ కు అలవాటు పడినట్లు తెలుస్తోంది. అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తోంది ? ఎవరు సరఫరా చేస్తున్నారనే దానిపై కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. విచారణలో ఎవరికీ భయపడాల్సినవసరం లేదని, ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యేక బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలని, కావాల్సిన ప్రణాళిక రూపొందించుకోవాలని..సిబ్బందిని నియమించుకోవాలని ఈ సమావేశంలో కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు సినిమా రంగానికి చెందిన వారినే టార్గెట్ చేశారన్న విమర్శలపై సిట్ పలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన వారిని శనివారం నుండి విచారించనున్నట్లు సమాచారం. 

18:17 - July 28, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజను సిట్ అధికారులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం 10 నుండి విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలు..ఇతరత్రా వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. రాత్రి 10 నుండి 11గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
విచారణలో రవితేజ వెల్లడించిన సమాచారం..కీలకమైన వ్యక్తుల విషయంలో క్రాస్ స్కెచ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ శ్రీనివాసరావుతో రవితేజ డ్రగ్స్ తెప్పించుకున్నట్లు, ఇతరులకు ఈ డ్రగ్స్ ఇచ్చారా అనే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పొడ్యూసర్ల పేర్లు..రాజకీయ నేతల కుమారుల పేర్లు తెరపైకి వస్తాయని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

లింక్ లున్న నేతలు..పోలీసులను వదలం - నారాయణ..

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ లో ఎవరెవరికి సంబంధాలున్నాయో ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాంపై సీఎం సీరియస్ గా ఉన్నారని, బెట్టింగ్ తో లింకులున్న నేతలను..పోలీసులను వదిలే ప్రసక్తే లేదన్నారు. 

నిద్రపోతున్న ఉపాధ్యాయుడు సస్పెండ్..

మహబూబ్ నగర్ : మిడ్జిల్ జెడ్ పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో నిద్రపోతుండగా ఫొటో తీసి డీఈవోకు వాట్సప్ లో విద్యార్థులు పంపారు. ఆ ఉపాధ్యాయుడిని డీఈవో సస్పెండ్ చేశారు.

 

డ్రగ్ కేసుపై సీఎం కేసీఆర్ చర్చ...

హైదరాబాద్ : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. డ్రగ్ కేసుపై చర్చ జరుగుతోంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. 

 

18:01 - July 28, 2017
17:59 - July 28, 2017
17:58 - July 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యార్థినిలు అరుదైన ఘనత సాధించారు. నిత్యం మంచుతో నిండి ప్రమాదకరంగా భావించే రష్యాలోని ఎలబ్రస్ పర్వతాన్ని శ్రీవిద్య, పూర్ణలు అధిరోహించారు. తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన ఐదుగురితో కూడిన బృందం ఎల్రబస్ పర్వతారోహణకు బయలుదేరింది. వీరిలో తెలంగాణకు చెందిన శ్రీవిద్య, పూర్ణలున్నారు. వీరు అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. పర్వతంపై సీఎం కేసీఆర్, రాజముద్ర చిత్రపటాలను ఎగురవేశారు. పర్వతాన్ని అధిరోహించిన అనంతరం అప్పటి వరకు పడిన కష్టాన్ని మరిచిపోయామని శ్రీవిద్య పేర్కొన్నారు. 

17:54 - July 28, 2017

హైదరాబాద్ : బైక్ లపై వచ్చి ఛైన్ స్నాచింగ్ లు చూశాం..తాజాగా ముగ్గురు వ్యక్తులు ఛైన్ స్నాచింగ్ కు పాల్పడి కారులో పారిపోతుండగా ఓ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్ లో చోటు చేసుకుంది. బోడుప్పల్ అంబేద్కర్ నగర్ లో ఛైన్ స్నాచింగ్ కు పాల్పడి కారులో పారిపోతున్నారు. ఓ కానిస్టేబుల్ చూసి వారిని వెంబడించాడు. చివరకు నాచారం చౌరస్తాలో వీరిని అడ్డుకున్నాడు. వారి వద్ద కారును..ఛైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకొనేందుకు శ్రమించిన కానిస్టేబుల్ ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. 

17:21 - July 28, 2017

హైదరాబాద్ : సినీ నటుడు రవితేజపై వస్తున్న ఆరోపణలపై ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిట్ కార్యాలయంలో ఆయన్ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 10గంటల నుండి ప్రారంభమైన విచారణ ఆరు గంటలకు పైగా కొనసాగుతోంది. పలు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారని తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషించిన కెల్విన్..జీషన్ ఆలీ లనుండి రాబట్టిన సమాచారం ఆధారంగా సినీ పరిశ్రమలో 12మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, శ్యామ్ కె.నాయుడు, ఛార్మీ, ముమైత్ ఖాన్ లను ఇప్పటికే సిట్ విచారించింది. రవితేజ శుక్రవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగతం నుండి ప్రారంభమైన విచారణ సినీ రంగ ప్రవేశం..అతడి సోదరుడు భరత్ డ్రగ్స్ వినియోగం..లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. జీషన్..కెల్విన్ లతో పరిచయం..సినీ పరిశ్రమల్లోని వ్యక్తుల డ్రగ్స్ వినియోగంపై ఆరా తీసినట్లు సమాచారం. విచారణకు హాజరు కాకముందే రవితేజ ఓ న్యాయవాదిని సంప్రదింపులు జరిపినట్లు ఆయన సూచనలు..సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

రవితేజ ఫ్యాన్స్ హర్ట్..
సినీ నటుడు రవితేజపై వస్తున్న ఆరోపణలు..విమర్శలపై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సిట్ కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల అభిమానులు తరలివచ్చారు. ఈసందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

సదావర్తి భూముల కేసులో నగదు జమ చేసిన ఎమ్మెల్యే

అమరావతి: సదావర్తి భూముల కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నగదు జమ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ వద్ద రూ.27 కోట్ల 44 లక్షల 15 వేలు ఎమ్మెల్యే ఆర్కే జమ చేశారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా నగదును జమ చేశారు.

దయనీయ స్థితిలో రైతులు : తమ్మినేని

వరంగల్: దోపిడీ, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా టీమాస్ ఫోరం పోరాడుతుందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో దయనీయ స్థితిలో రైతులు ఉన్నారని, ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, 2 పడకల ఇళ్లు కట్టించినట్లు ఎక్కడా కనిపించలేదని తమ్మినేని ఆరోపించారు. గ్రామీణ పేదల ఆర్థిక స్థితిగతుల పై టీ మాస్ ఫోరం పోరాటం చేస్తుందన్నారు. 93 శాతం ఉన్న సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నారు.

16:51 - July 28, 2017

విజయవాడ : ప్రతిపక్ష నేత జగన్‌ అభివృద్ధి నిరోధకుడుగా మారారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టపాలన సాగిస్తున్నారని జనగ్‌ విమర్శించడాన్ని దేవినేని తప్పుపట్టారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎక్కడా మంచి మాట మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులను వైసీపీ నేతలు 671 సార్లు తిట్టారని, నాలుగు సార్లు ప్రకాశం బ్యారేజీ నుండి జగన్ వెళ్లాడని...బ్యారేజీలో గోదావరి నీళ్లు కనిపించలేదా అని ప్రశ్నించారు. 

16:48 - July 28, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ భూములు కాపాడాలంటూ సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి మహేంద్రా హిల్స్‌కు చేరుకుని జెండాలు పాతి నిరసన తెలిపారు. జాగీరు స్థలాలన్నీ ప్రభుత్వానివే అన్న కేసీఆర్ .. మహేంద్రా హిల్స్‌లోని 90 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్. లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి ప్రజలతో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. 

16:46 - July 28, 2017

సిరిసిల్ల : అధికారుల ఆదేశాలను దిక్కరిస్తూ గ్రామం మీదుగా వెళ్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. సిరిసిల్లా జిల్లా తాడూరు గ్రామం బైపాస్‌ రోడ్డు గుండా వెళ్లాల్సిన ఇసుక లారీలు గ్రామం మధ్య నుండి ప్రయాణిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు వాటిని అడ్డుకున్నారు. ఇసుక లారీల వే బిల్లులను పరిశీలించిన గ్రామస్తులు అవి వేరే తేదీలతో ఉండడంతో అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని లారీలను వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

విక్రమ్ గౌడ్ నివాసంలో ముగిసిన క్లూటీం తనిఖీలు..

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ నివాసంలో క్లూస్ టీం తనిఖీలు ముగిశాయి.

16:42 - July 28, 2017

వరంగల్ : సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా టీ మాస్ ఫోరమ్ పనిచేస్తుందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. టీ మాస్ ఫోరమ్ ఆధ్వర్యంలో జనగాంలో నిర్వహించిన ర్యాలీలో గద్దర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ తో టెన్ టివి ముచ్చటించింది. తెలంగాణలో ప్రజలందరికీ న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణ సాధించి తీరతామని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదన్నారు. ప్రజల శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదని, మాస్ అంటే ప్రజలు పేర్కొన్నారు. నిశబ్దం బ్రేక్ అవుతుందని..ప్రజా సంఘాలు నిప్పులా ఏకమౌతాయన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని లక్షలాది మంది ప్రజలు ఏకమౌతున్నారని పేర్కొన్నారు. 

16:37 - July 28, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్‌పై కాల్పుల కేసులో మిస్టరీ వీడుతోంది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వస్తుందన్న భయంలో విక్రమ్‌గౌడ్‌ కాల్చుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విక్రమ్‌గౌడ్‌ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. డబ్బులు చెల్లించాలంటూ వాట్సాప్‌లో బెదిరింపులు వస్తున్నట్లుగా సమాచారం. వాట్సాప్‌ మెసేజ్‌లో రూ.20 లక్షలు,. మరో మెసేజ్‌లో 35 లక్షలు చెల్లించాలని విక్రమ్‌పై ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. తండ్రి ఇచ్చిన ఇంటిని సైతం విక్రమ్‌గౌడ్‌ అమ్మేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో విక్రమ్‌కు వాటా ఉంది. పబ్ పేరు బయటకు వస్తుందనే భయంలో విక్రమ్ గౌడ్ కాల్చుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు ప్రారంభం నుంచి వస్తున్న కథనాలను తన ఫోన్‌లో విక్రమ్‌గౌడ్‌ సేవ్ చేసుకున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:36 - July 28, 2017

చిత్తూరు : టిటిడికి కొత్త పాలక మండలి ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గత పాలక మండలి గడువు ముగిసి మూడు నెలలు కావస్తున్నా... ఇప్పటి వరకు కొత్త పాలక మండలి ఊసే లేదు. పలువురి సీనియర్ టిడిపి నేతలు టిటిడి ఛైర్మెన్ పోస్ట్ పై ఆశలు పెట్టుకుని ఉన్నా... సిఎం చంద్రబాబు నాయుడు ఎవరి పట్ల మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక సంస్థ టిటిడీ. ఒకవైపు నిత్యం కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తూనే... మరో వైపు శ్రీవారి దర్శనానికి వచ్చే యావత్ భక్త కోటికి మెరుగైన సేవలు కల్పించడం టిటిడి బాధ్యత. ఇలాంటి అత్యున్నతమైన టిటిడీలో మూడునెలలుగా పాలక మండలి లేదు. ప్రస్తుత చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాలక మండలి గడువు ఈఏడాది ఏప్రిల్ 27తో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలి ఏర్పాటు కాలేదు. దీంతో టీటీడీలో అధికారులదే పెత్తనంగా మారింది.

పలువురి పేర్లు..
నిజానికి టిటిడి ఛైర్మెన్ పోస్ట్ కోసం గతంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. ఎంపిలు రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్ తదితరులు గట్టిగానే ప్రయత్నించారు. అయితే ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి టిటిడి ఛైర్మెన్ పోస్ట్ ఇవ్వడం కుదరదని సిఎం తెగేసి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. అటు తర్వాత హరికృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ పేరు వినిపించింది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లుగా తేలిపోయాయి. తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పేరు ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. చాలా కాలంగా పార్టీకి చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా మస్తాన్ రావును ఈ పదవి వరించనున్నట్లు పార్టీ వర్గాల్లోనూ టాక్ వినిపిస్తోంది.

విపరీతమైన పోటీ..
మరోవైపు టీటీడీపాలకమండలిలో స్థానంకోసం అధికారపార్టీ నాయకల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఎలాగైనా పాలకమండలిలో చోటు సంపాదించడానికి పలువురు నేతలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. అటు మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పైస్థాయిలో సిఫారస్‌లు చేస్తున్నట్టు సమాచారం. పాలకమండలిలో కనీసం తమకు నాలుగు పోస్టులు కావాలని వారు కోరుతున్నట్లు సమాచారం.ఇప్పటికే బిజెపి నుంచి ఓ లిస్ట్ సిఎం కు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టిటిడికి కొత్త పాలక మండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.

స్పెసిఫైడ్ అథార్టీ..
సాధారణంగా పాలక మండలి నియామకం ఆలస్యమైనప్పుడు ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టంలోని సెక్షన్ 137, 163 ప్రకారం రెవిన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఛైర్మెన్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ మేరకు ఓ జీవోను కూడా విడుదల చేస్తారు. అయితే అటు పాలక మండలిని ఏర్పాటు చేయక, ఇటు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేయకుండా ఈసారి ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. మూడు నెలల క్రితం ఇవోగా బాధ్యతలు స్పీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. టిటిడికి పాలక మండలి లేక మూడు నెలలు గడిచిపోయిన నేపథ్యంలో ఇక వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి సిఎంపై ఉంది. ఈ నేపథ్యంలో పాలక మండలిలో సభ్యత్వం కోసం పెద్ద సంఖ్యలో టిడిపి- బీజేపీ నేతలు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు కుస్తీ పడుతున్నారు. 

16:33 - July 28, 2017

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి... ప్రభుత్వాన్ని స్థాపించాలి.. ఇదే లక్ష్యంతో పార్టీలో అనేక మార్పులు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్‌.. రాష్ట్రంలో కీలకప్రాంతమైన విజయవాడలో కొత్త నిర్ణయాలు అమలుచేయబోతున్నారు.. నేతల బాధ్యతలనుకూడా మారుస్తున్నారు.. జగన్‌ ప్లానేంటి? ఏం చేయబోతున్నారు? స్పెషల్ స్టోరీ.. ఏపీ రాజధానిప్రాంతంలో పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత జగన్‌ ప్రత్యేక దృష్టిపెట్టారు.. 2014 ఎన్నికల్లో సరైన అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదని అందుకే ఓడిపోయామని జగన్‌ భావిస్తున్నారు..... ఈసారి ఆ తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మూడు నియోజకవర్గాలు..
గత ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలోని మూడు నియోజకవర్గాలకుగాను కేవలం ఒక స్థానంలో వైసీపీ విజయం సాధించింది.. ఆ ఒక్క ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ టీడీపీలోకి వెళ్లిపోయారు.. అప్పటినుంచి నగరంలో వైసీపీకి ప్రజాప్రతినిధులులేరు.. మూడు నియోజకవర్గాలకు ఇంచార్జులు పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పార్టీలోకి చేర్చుకున్న జగన్‌.. పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.. గతంలో పీఆర్‌పీనుంచి పోటీచేసిన వెల్లంపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ముస్లింలు ఎక్కువగాఉన్న ఈ నియోజకవర్గంసీటును వెల్లంపల్లికే ఇస్తారా? లేక మైనారిటీ వర్గాలకు కేటాయిస్తారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు..

సెంట్రల్ నియోజకవర్గం..
ఇక కీలకస్థానమైన సెంట్రల్‌ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా వంగవీటి రాధ ఉన్నారు.. గురువారం మల్లాది విష్ణు వైసీపీలో చేరారు.. గతంలో ఇదే స్థానంనుంచి మల్లాది ఎమ్మెల్యేగా విజయబావుటా ఎగురవేశారు.. వంగవీటి రంగాకి ప్రధాన అనుచరుడిగాఉన్న విష్ణు.. ఎక్కువగా సెంట్రల్‌నుంచే ప్రాతినిధ్యం వహించారు.. ఆ తర్వాత వైఎస్‌కు సన్నిహితంగాఉంటూ హుడా చైర్మన్‌పదవిలో కొనసాగారు.. నియోజకవర్గంపై మంచి పట్టున్న విష్ణుకు విజయవాడ పార్టీ నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని జగన్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.. గతంలో నగర అధ్యక్షుడిగా వంగవీటి రాధా ఉండేవారు. ఈమధ్యే ఆ బాధ్యతల్ని వెల్లంపల్లికి అప్పగించారు.. ఇప్పుడు మల్లాదిని నగర అధ్యక్షుడిగా నియమిస్తారని వార్తలొస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం సెంట్రల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గాఉన్న రాధ జనసేనలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది.. ఇదే జరిగితే విష్ణును సెంట్రల్‌నుంచి బరిలోకి దించాలన్న ప్లాన్‌లో జగన్‌ ఉన్నారు.. రాధమాత్రం పార్టీమారే ప్రసక్తేలేదని స్పష్టం చేస్తున్నారు..

తూర్పు నియోజకవర్గం..
ఇక తూర్పు నియోజకవర్గంలో వైసీపీకి అంతగా పట్టులేదు.. గత ఎన్నికల్లో వంగవీటి రాధ ఈ నియోజకవర్గంనుంచి పోటీచేసి ఓడిపోయారు.. ఎన్నికలతర్వాత రాధను జగన్‌ సెంట్రల్‌కు మార్చారు.. తూర్పుకు బొప్పన భవ కుమార్‌ను నియమించారు.. తూర్పులోకూడా నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో జగన్‌ ఉన్నారు.. మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి పార్టీలోకి చేర్చుకుంటారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.. రవి గతంలో పీఆర్‌పీనుంచి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. రవిని వైసీపీలోకి రప్పించేందుకు జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. కీలక ప్రాంతమైన రాజధానిలో లీడర్ల బాధ్యతలు మారుస్తూ పార్టీని పటిష్టంచేసేందుకు జగన్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలో తేలనుంది.

డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న రవితేజ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఇవాళ సిట్ విచారణకు హాజరైన రవితేజ విచారణ కొనసాగుతోంది. కెల్విన్, జీషన్ వెల్లడించిన వివరాల ఆధారంగా రవితేజను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ సోదరుడు భరత్ డ్రగ్స్ సంబంధాలపై సిట్ ఆరా తీయగా భరత్ వ్యవహారం పై తననేమీ అడగొద్దని చెప్పుకొచ్చాడట. అన్ని విషయాలు భరత్ కి తెలుసు. అందుకే తాను భరత్ కి దూరంగా ఉంటున్నానని రవితేజ అన్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్తో సినిమాలు చేస్తున్న సమయాల్లో డ్రగ్స్ వ్యవహారం మీ దృష్టికి వచ్చిందా అని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

పత్తికొండ ఏఐఎస్ ఎఫ్ లాంగ్ మార్చ్ లో ఉద్రిక్తత

కర్నూలు: పత్తికొండ ఏఐఎస్ ఎఫ్ లాంగ్ మార్చ్ లో ఉద్రిక్తత నెలకొంది. కన్హయ్య ప్రసంగాన్ని ఓ యువకుడు అడ్డుకున్నాడు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.

16:16 - July 28, 2017
16:10 - July 28, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటనలో మిస్టరీ వీడుతోంది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వస్తుందన్న భయంలో విక్రమ్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆయన నివాసంలో కాల్పుల ఘటన కలకలం రేగింది. విక్రమ్ గౌడ్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాల్పులు జరిపింది ఎవరు అనేది తెలియరావడం లేదు. విక్రమ్ గౌడ్ తనకు తానే కాల్పులు జరుపుకున్నాడా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. పబ్బులో డ్రగ్స్ అమ్ముతున్నారని..సేవిస్తున్నారంటూ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేస్తూ సీజ్ చేస్తున్నారు. విక్రమ్ గౌడ్ కు కూడా మాదాపూర్ లో ఓ పబ్బులో వాటా ఉందని..ఈ పబ్బు అప్పులో కూరుకపోయిందని తెలుస్తోంది. తండ్రి ఇచ్చిన ఇంటిని సైతం అమ్మేశాడు. డబ్బులు చెల్లించాలంటూ బెదిరింపులు వస్తున్నట్లు, ఒక మెసేజ్ లో రూ. 20 లక్షలు..మరొక మెసేజ్ లో రూ. 35 లక్షలు చెల్లించాలని వత్తిడి వచ్చిందని తెలుస్తోంది. ఈ భయంతోనే విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. 

16:04 - July 28, 2017

వరంగల్ : టీమాస్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం స్పష్టం చేశారు. టీమాస్ ఏర్పాటైన అనంతరం జనగామలో అతిపెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. 31 జిల్లాలో కమిటీలు..మండలాల్లో కమిటీలు ఏర్పడుతాయన్నారు. జనగామకు వచ్చిన సందర్భంగా తమ్మినేనితో టెన్ టివి ముచ్చటించింది. సామాజిక కోసం అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. టీ మాస్ చేసే కార్యక్రమాలు ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేదికపై కలిసి పనిచేస్తామని, కలసి కట్టుగా పోరాటం చేయాలని భావించడం జరిగిందన్నారు. అట్టడుగు కులాల ప్రజలు ఆర్థికంగా..సామాజికంగా..రాజకీయంగా సామాజిక న్యాయం జరగాలంటే కలిసికట్టుగా పనిచేయాలన్నారు. బీసీ కులాలు..ఎంబీసీ..గొర్రెలు..మేకలు...చేపల పెంపకం తదితర పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని..ఈ పథకాలు సక్రమంగా జరగడం లేదని..కానీ సర్కార్ పై వత్తిడి మాత్రం వస్తుందని తమ్మినేని తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. 73 పాయింట్లు నష్టపోయి 32,310 వద్ద సెన్సెక్స్ ముగియగా, 6 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,014 వద్ద ముగిసింది.

15:45 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సినిమా ఇండ్రస్ట్రీని టార్గెట్ చేశామన్న ఆరోపణలో ఎంత మాత్రం నిజం లేదని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. సినిమా వాళ్లపై ప్రభుత్వానికి పక్షపాత ధోరణి లేదని, సినీ రంగాన్నే టార్గెట్ చేస్తారనడం సరికాదన్నారు. త్వరలోనే సినిమా రంగానికి చెందిన వారితో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, సినిమ రంగానికి సంబంధించిన వారికి డ్రగ్స్ కేసులో సబంధాలు ఉండడం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ కేసులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

'ప్రైవేటు మొబైల్ నెట్ వర్క్ లకు ధీటుగా బీఎస్ ఎన్ ఎల్'

విజయవాడ: ప్రైవేటు మొబైల్ నెట్ వర్క్ లకు ధీటుగా బీఎస్ ఎన్ ఎల్ ను విస్తరిస్తున్నామని, ఏపీలో రూ.212 కోట్లతో సెల్ వన్ సేవలవిస్తరణ జరుగుతోందని బీఎస్ ఎన్ ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జాన్ క్రిసోస్తం తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా బీఎస్ ఎన్ ఎల్ కు నష్టం ఉండదన్నారు. సెల్ వన్ ద్వారా మరో 3 నెలల్లో 4జి సేవలు నెట్ వర్క్ స్పీడ్ పెంచడానికి 1,153 కొత్త టవర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

15:40 - July 28, 2017

విజయవాడ : రెండు రోజుల పాటు అమెరికా హ్వార్డర్ యూనివర్సిటీ బృందం ఏపీలో పర్యటించనుంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఎలా వస్తోంది..దశాబ్దాలుగా ఉన్న ఈ వ్యాధిని ఎలా అరికట్టాలి..ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన రోగులకు ఎలాంటి సహాయం అందించాలి..ఎలాంటి అవగాహన కల్పించాలనే దానిపై యూనివర్సిటీ బృందం అధ్యయనం చేయనుంది. ఈ నేపథ్యంలో శనివారం జిల్లాలోని 13 మండలాల్లో వైద్యులు బృందం పర్యటించనుంది.

సమస్యను తీసుకెళ్లిన పవన్..
శ్రీకాకుళం జిల్లాలోని కిడ్నీ బాధితుల సమస్యను హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా వెళ్లి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించిన పవన్ అక్కడి మేధావులకు తెలియచేశారు. అంతేగాకుండా మెడికల్‌ స్కూల్‌ వైద్యులతో మాట్లాడారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కోవాలని సూచించారు.

రెండు రోజుల పాటు పర్యటన..
స్కూల్‌ రీజినల్‌ విభాగం ముఖ్య వైద్యుడు జోసెఫ్‌ బెన్వంత్రీ నేతృత్వంలో ఒక బృందం ఈనెల 29న జోసెఫ్‌ బృందం ఉద్దానంలో పర్యటిస్తుంది. అనంతరం 30వ తేదీన విశాఖపట్నంలో హార్వర్డ్‌ వైద్యులతో పవన్‌ సమావేశం కానున్నారు. పవన్‌, వైద్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. 

విక్రమ్ కాల్పుల ఘటనలో కొత్త మలుపు

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటన మిస్టరీ వీడుతోంది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వస్తుందన్న భయంతో విక్రమ్ కు డబ్బులు చెల్లించాలంటూ వాట్సప్ లో విక్రమ్ కు బెదిరింపులు వచ్చాయి. ఒక మెసేజ్ లో రూ.20లక్షలు, మరో మెసేజ్ లో రూ.35 లక్షలు చెల్లించాలని విక్రమ్ పై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. తండ్రి ఇచ్చిన ఇంటిని సైతం విక్రమ్ అమ్మేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్ లోని ఓ పబ్ లో విక్రమ్ గౌడ్ కు వాటా ఉంది. ఈ పబ్ నష్టాల్లో ఉండడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

రేపు ఏపీకి హార్వర్డ్ యూనివర్శిటీ బృందం

అమరావతి: రేపు ఏపీలో హార్వర్డ్ యూనివర్శిటీ బృందం పర్యటించనుంది. జనసేన అధినేత పవన్ ఆహ్వానం మేరకు ఏపీకి హార్వార్డ్ బృందం రానుంది. 3 రోజుల పాటు రాష్ట్రలో హార్వార్డ్ బృందం పర్యటించనుంది. రేపు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో కిడ్నీ రోగులతో హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యులు ముఖాముఖి నిర్వహించనున్నారు. 30న వైజాగ్ లో సదస్సులో హార్వార్డ్ బృందం పాల్గొననుంది. అదే రోజు సాయంత్రం వారితో పవన్ భేటీ అయి ఉద్దానం కిడ్నీ రోగుల సమస్యలపై చర్చ, 31న విజయవాడలో సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన సీఎంతో పవన్ కల్యాన్, హార్వర్డ్ బృందం చర్చించనుంది.

15:28 - July 28, 2017

హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వాన్ పిక్ వ్యవహారంపై ఈడీ మరోసారి ఝులక్ ఇచ్చింది. వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డకు చెందిన రూ. 148.89 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌కు భూకేటాయింపులపై సిబిఐ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మ్యాట్రిక్స్ ఎన్ పోర్టు ఏర్పాటై అనంతరం వాన్ పిక్ ప్రాజెక్టు కోసం రస్ ఆల్ ఖైమాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. చివరగా వాన్ పిక్ మ్యాట్రిక్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇందులో సీబీఐ చేసిన విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కారణంగానే ఈ ప్రాజెక్టు త్వరితగతిన మ్యాట్రిక్స్ చేతికి వెళ్లిందనేది ఆరోపణలున్నాయి.

అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి మధ్య వాడరేవు, నిజాంపట్నం పోర్టుల అభివృద్ధిపై మార్చి 11, 2008న ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ రెండు నౌకాశ్రయాలను కలుపుతూ వాన్ పిక్ పేరిట పారిశ్రామిక కారిడార్ తెరమీదకు వచ్చింది. ఒక్కో పోర్టు ప్రాంతంలో 2వేల ఎకరాల చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కారిడార్ నిర్మాణానికి 28 వేల ఎకరాలను ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఫిబ్రవరి 2009 నాటికి దీనిని సవరిస్తూ 18 వేల ఎకరాలను వాన్ పిక్ కు అప్పగించాలంటూ గుంటూరు, ప్రకాశం కలెక్టర్లను ఆదేశించింది. ఇక్కడా నిబంధనలకు విరుద్ధంగానే భూకేటాయింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. అభివృద్ధి అంతగా జరగకపోవడంతో ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. 

15:20 - July 28, 2017

హైదరాబాద్ : మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ సినీ నటుడు రవితేజను ఎక్జైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10గంటల నుండి విచారణ ప్రారంభమైంది. పలు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషించిన కెల్విన్..జీషన్ ఆలీ లనుండి రాబట్టిన సమాచారం ఆధారంగా సినీ పరిశ్రమలో 12మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, శ్యామ్ కె.నాయుడు, ఛార్మీ, ముమైత్ ఖాన్ లను ఇప్పటికే సిట్ విచారించింది. రవితేజ శుక్రవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. వ్యక్తిగతం నుండి ప్రారంభమైన విచారణ సినీ రంగ ప్రవేశం..అతడి సోదరుడు భరత్ డ్రగ్స్ వినియోగం..లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. జీషన్..కెల్విన్ లతో పరిచయం..సినీ పరిశ్రమల్లోని వ్యక్తుల డ్రగ్స్ వినియోగంపై ఆరా తీసినట్లు సమాచారం. విచారణకు హాజరు కాకముందే రవితేజ ఓ న్యాయవాదిని సంప్రదింపులు జరిపినట్లు ఆయన సూచనలు..సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

గుజరాత్ లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

హైదరాబాద్: గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా పరంపర కొనసాగుతుంది. తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.

సినిమా ఇండస్ట్రీ పై పక్షపాత ధోరణి లేదు: మంత్ర తలసాని

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీ పై పక్షపాత ధోరణి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన '10టివి'తో మాట్లాడుతూ... ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవని, డ్రగ్స్ కేసులో సినీ రంగాన్నే టార్గెట్ చేశారనడం సరికాదన్నారు. సినిమా రంగానికి సంబంధించిన వారికి డ్రగ్స్ కేసులో సంబంధాలుండటం దురదృష్టకరని, త్వరలో సినీ రంగ ప్రముఖులతో సమావేశమై డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

లంచ్ తరువాత ప్రారంభమైన సిట్ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో లంచ్ బ్రేక్ తరువాత సిట్ విచారణ ప్రారంభమైంది. 5 గంటలుగా హీరో రవి తేజను సిట్ విచారిస్తోంది.

 

ఏం జరిగిందో మాకు తెలియదు: విక్రమ్ గౌడ్ అత్తమామలు

హైదరాబాద్: కాల్పుల ఘటన పై విక్రమ్ అత్తమామలు స్పందించారు. ఏం జరిగిందో మాకు తెలియదు అని తెలిపారు. విక్రమ్ గౌడ్ దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, 8 నెలలుగా జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. ఇద్దరు మనువళ్లను మా ఇంటికి తీసుకెళ్తున్నామన్నారు.

14:48 - July 28, 2017

వెండితెర‌పై రికార్డుల మ్రోత మోగించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా బిగ్ బాస్ షోతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. 12 మంది సెల‌బ్రిటీలు, 70 రోజులు, 60 కెమెరాల మ‌ధ్య ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ షోకి టీ ఆర్పీ రేటింగ్ 16.18 గా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, గ‌తంలో ఏ రియాలిటీ షో కి కూడా ఇంత రేటింగ్ రాలేద‌ని అంటున్నారు. తాజాగా కింగ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ని ప్ర‌శంసించారు. 'తొలి వారంలో సాధించిన ఘ‌న‌త‌కి అభినంద‌న‌లు. నీ ఎనర్జీ నాకు ఎంత‌గానో నచ్చుతుంద‌ని' ట్వీట్ చేశాడు నాగ్. దీనికి వెంట‌నే రియాక్ట్ అయిన ఎన్టీఆర్ కింగ్ నాగ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. బుల్లితెర‌పై మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మా లాంటి వారికి ఓ మార్గం చూపారని రిప్లై ఇచ్చాడు జూనియ‌ర్.

14:36 - July 28, 2017
14:34 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. 9వ రోజున సినీ నటుడు రవితేజను సిట్ అధికారులు విచారణ చేపట్టారు. కెల్విన్ ముఠాను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పట్టుకోవడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన పలువురు నటీ, నటులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నోటీసులు అందుకున్న నటులు సిట్ విచారణకు హాజరౌతున్నారు. శుక్రవారం ఉదయం రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకముందే ఓ న్యాయవాదితో రవితేజ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఉదయం నుండి విచారణ..
ఉదయం నుండి విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో రవితేజపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమచారం. కెల్విన్ తో సంబంధాలు..డ్రగ్స్ డీలర్ బిషాన్ తో పరిచయం ఎలా ఏర్పడింది ? ఆరేళ్లుగా జిషాన్ తో స్నేహం కొనసాగిస్తున్నారా ? డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? జాక్ ఎప్పుడు పరిచయం అయ్యారు ? ఫోన్ లో అతని నెంబర్ ఎందుకుంది. శ్రీనివాస్ రావు ఎవరు ? అతనితో పరిచయం ? వాట్సాప్ లో సంభాషణలు...తదితర వివరాలపై సిట్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ జరుపుతున్న విచారణలో రవితేజ సహకరిస్తున్నాడా ? ఎవరి పేర్లయినా వెల్లడిస్తున్నారా ? అనేది తెలియరావడం లేదు. ఇదిలా ఉంటే రవితేజ సిట్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

14:33 - July 28, 2017

పాట్నా : బీహార్ లో రాజకీయ పరిణామాలు హై డ్రామాను తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి బుధవారం రాజీనామా చేసిన నితీశ్ కుమార్ 24గంటలకు గడువకముందే గురువారం తిరిగి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇదిలా ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ శుక్రవారం అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. కానీ బలపరీక్ష జరుగుతున్న తీరును టీవీల్లో టెలికాస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా తీర్పుకు ఇది పూర్తిగా వ్యతిరేకమని విపక్షాలు మండిపడుతున్నాయి. నితీశ్ కు అనుకూలంగా 131 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 108 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కనీస మెజార్టీ 122 ఉండాలి.
బీజేపీతో చేతులు కలుపుతూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. నితీశ్ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆర్జేడీ నేతలు అసెంబ్లీలో ఆందోళన చేపట్టారు. ఎప్పటి నుండో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నితీశ్ అనుకున్నారని, అందుకు తనను పావులా వాడుకున్నారని ఆర్జేడీ అధినేత లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.

పాక్ తాత్కలిక ప్రధానిగా ఖ్వాజా ఆసిఫ్!

హైదరాబాద్: పాక్ సుప్రీం తీర్పుతో పాక్ ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ రాజీనామా చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

మిడ్ మానేరు ఆర్ అండ్ ఆర్ కింద రూ.45 కోట్లు మంజూరు

హైదరాబాద్: మిడ్ మానేరు ఆర్ అండ్ ఆర్ కింద రూ.45 కోట్లు మంజూరు అయ్యాయి. ఇళ్లు ఖాళీ చేసిన వారికి రూ. 2లక్షలు తక్షణమే అందించాలని హరీష్ రావు ఆదేశించారు.

14:06 - July 28, 2017
14:05 - July 28, 2017
14:04 - July 28, 2017

రూ.148.89 కోట్ల నిమ్మగడ్డ ఆస్తులు అటాచ్

హైదరాబాద్: జగన్ అక్రమాస్థుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన రూ.148.89 కోట్ల విలువైన భూమిని ఈడీ అచాట్ చేసింది.

14:01 - July 28, 2017

గుంటూరు : మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'పై' డేటా సెంటర్‌ను ప్రారంభించారు. 600 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ డేటా సెంటర్‌ ప్రారంభానికి వివిధ దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 1300 మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది. సాంకేతికతను ఉపయోగించుకోవడంతో రాష్ట్రం ముందు ఉందన్నారు. 

13:59 - July 28, 2017

విజయనగరం : కుక్కపిల్లకోసం కొట్టుకొని ఏడుగురు గాయాలపాలయ్యారు.. విజయనగరం జిల్లా బలీజిపేట మండలం వంతారంలో కొందరు వ్యక్తులు రెండుగా విడిపోయి కుక్కపిల్లకోసం ఘర్షణ పడ్డారు.. ఈ గొడవలో ఏడుగురికి గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

13:56 - July 28, 2017

కరీంనగర్‌ : విద్యారంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. కరీంనగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లను వెంటనే విడుదల చేసి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని.. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో.. విద్యార్థులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ గేట్లు వేయడంతో కొంత మంది విద్యార్థులు.. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గేట్‌ ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. మహిళా పోలీసులు విద్యార్థినిలపై చేయి చేసుకోవడంతో ఆందోళన కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. గేట్ ఎక్కుతున్న సమయంలో కిందకు లాగడంతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు తిరుపతి తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. ఆందోళన చేస్తున్న చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 

 

13:54 - July 28, 2017

తూర్పుగోదావరి : 'నడవలేక నాటకాలు ఆడుతున్నారన్న' విమర్శలపై.. ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 2 తర్వాత పాదయాత్ర చేపడతానన్నారు. పాదయాత్రకు అనుమతిస్తే నడుస్తానో లేదో తెలుస్తుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ చంద్రబాబు బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు 2019లో ముగింపు తప్పదని జోస్యం చెప్పారు. 

 

13:52 - July 28, 2017

ఇస్లామాబాద్ : పాక్‌ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పనామా కేసులో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై అనర్హత వేటువేసింది. పనామా కేసులో షరీఫ్‌ను దోషిగా తేల్చింది. క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పనామా కుంభకోణంలో షరీఫ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హిమాంషు మోటార్స్ కేటీఆర్ దే : షబ్బీర్ అలీ

హైదరాబాద్: హిమాంషు మోటార్స్ కేటీఆర్ దే అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో హిమాంషులో రూ. 30 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందే హిమాంషు మోటర్స్ నుంచి వైదొలిగినట్లు కేటీఆర్ చెప్పడం అబద్ధమని అలీ చెప్పారు. ఈ రోజుకీ హిమాంషు లో కేటీఆర్ డైరెక్టర్ ఉన్నారని, 300 ఇన్నోవాల కొనుగోళ్లలో ఎంత కమీషన్ తీసుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ తో పాటు ఎన్ని ట్రస్టులకు రాయితీలు ఇచ్చారో వెల్లడించాలని, ఈ అంశం జైరాం రమేష్ చెప్పింది అబ్ధమా అని ప్రశ్నాంచారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వం పై రేవంత్ ఫైర్

హైదరాబాద్: టీఆర్ ఎస్ ప్రభుత్వం పై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిఫైర్ అయ్యారు. కేసీఆర్ మనవడు చదివే స్కూల్ లోనే డ్రగ్స్ అమ్ముతున్నారని, రాష్ట్రంలో నిఘా వ్యవస్థకు ఏమైందని ప్రశ్నించారు.

 

13:39 - July 28, 2017

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ విశ్వాస పరీక్ష నెగ్గారు. అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో నితీష్‌కుమార్‌కు అనుకూలంగా 131 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. 108 మంది ఎమ్మెల్యేలు నితీష్‌ను వ్యతిరేకించారు.  బిహార్‌ అసెంబ్లీలో మొత్తం 243 సభ్యులున్నారు. ఆర్జేడికి 80, జెడియుకు 71, కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలుండగా...బిజెపికి 53 మంది ఎమ్మెల్యేలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా 131 మంది సభ్యుల మద్దతు నితీష్‌కు లభించింది. విశ్వాసపరీక్షకు ముందు నితీష్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. నితీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో  గందరగోళ పరిస్థితి నెలకొంది. 

13:36 - July 28, 2017

విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్ : మాజీ మంత్రి కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పులు కేసులో దర్యాప్తు ముమ్మరం అయ్యింది. విక్రమ్ నివాసంలో 7.39 ఎంఎం లేటెస్ట్ వెపన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఓ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫింగర్ ప్రింట్స్ ను కూడా పరిశీలిస్తున్నారు. పనిమనిషి, వాచ్ మెన్ ను కూడా విచారిస్తున్నారు. అంతే కాకుండా విక్రమ్ కారులో ఉన్న ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు వారం రోజుల ముందు సంచరించిన అనుమానితులు, వచ్చిపోయే వారని పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ కలెక్టరేట్ ను ముట్టడించిన ఎస్ ఎఫ్ఐ

కరీంనగర్ : విద్యా సంస్థల్లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ను ఎస్ ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. కార్యాలంలోకి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి.

13:33 - July 28, 2017
13:31 - July 28, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిగిన సంఘటనాస్థలాన్ని హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. విక్రమ్‌గౌడ్‌ ఒంటిపై రెండు బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు. 

 

రాష్ట్రంలో మరిన్ని సంస్థలు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు

గుంటూరు : మంగళగిరిలో 'పై డేటా సెంటర్' ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరిన్ని సంస్థలు రాబోతున్నాయి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని కంపెనీల్లో ఎక్కడ చూసినా మనవాళ్లేనని, ప్రపంచంలో వేగంగా సాంకేతికత విస్తరించిందని చంద్రబాబు తెలిపారు. సాంకేతిక వినియోగంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

బలపరీక్షలో సీఎం నితీష్ కుమార్ గెలుపు

బీహార్ : బలనిరూపణలో సీఎం నితీష్ కుమార్ నెగ్గారు. సీఎం నితీష్ కు మ్దాతుగా 131 మంది ఎమ్మెల్యేలు నిలవగా, విపక్షానికి 108 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.

13:13 - July 28, 2017

హైదరాబాద్ : హీరో రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రవితేజకు మద్దతుగా నినాదాలు చేశారు. తమ హీరోకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వారు గట్టిగా చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

ఆగివున్న లారీనీ ఢీ కొట్టిన కారు..

మంచిర్యాల: మంచిర్యాల పట్టణం బైపాస్ రోడ్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ భవన్ ముందు ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు నేరుగా వెళ్లి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నవీన్, సందీప్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు సీసీసీ నాగార్జున కాలనీకి చెందినవారని తెలుస్తోంది.

శ్రీలంక 291 ర‌న్స్‌కు ఆలౌట్

గాలె: తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 291 ర‌న్స్‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్‌కు మొద‌టి ఇన్నింగ్స్‌లో 309 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. 154 ప‌రుగుల‌కు 5 వికెట్లతో ఇవాళ మూడవ రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక మ‌రో 137 ర‌న్స్ జోడించి మ‌రో అయిదు వికెట్ల‌ను కోల్పోయింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా మూడు, ష‌మీ రెండు వికెట్లు తీసుకున్నారు.

 

13:00 - July 28, 2017

హైదరాబాద్ : హీరో రవి తేజ సిట్ ముందుకు హాజరయ్యారు. సిట్‌  కార్యాలయంలో హీరో రవితేజ విచారణ కొనసాగుతోంది. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. రవితేజకు కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరాపై పూర్తివివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. కెల్విన్‌ ఫోన్‌లో రవితేజ ఫోన్‌ నెంబర్లు?, డ్రగ్స్‌ డీలర్‌ జిషాన్‌తో రవితేజకు సంబంధాలు?, రవితేజకు కెల్విన్‌ను పరిచయం చేసిన జిషాన్?, ఆరేళ్లుగా జిషాన్‌తో రవితేజ స్నేహం? వంటి అంశాలపై విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రవితేజ ఓ న్యాయవాదినికూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే రోడ్డుప్రమాదంలో మరణించిన భరత్‌కూ డ్రగ్స్‌ ముఠాతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వాడకంతోపాటు సరఫరా చేస్తున్నారంటూ గతంలో భరత్‌ ను అరెస్ట్ చేసిని సంగతి తెలిసిందే. 

 

ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ అనర్హుడని పాక్ సుప్రీం తీర్పు

హైదరాబాద్: ఫనామా కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై అనర్హత వేటు పడింది. ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ అనర్హుడని పాక్ సుప్రీం తీర్పు ఇచ్చింది. నావాజ్ పై క్రిమినల్ కేసు నమోదు చేశాయలని ఆదేశించింది.

విక్రమ్ గౌడ్ నివాసంలో 7.36 ఎంఎం లేటెస్ట్ వెపన్ స్వాధీనం...

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ నివాసంలో 7.36 ఎంఎం లేటెస్ట్ వెపన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఒక బులెట్ లభిచిందని, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.

గుజరాత్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు

హైదరాబాద్: గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

జగన్ కనుసన్నల్లో ముద్రగడ : మంత్రి నారాయణ

నెల్లూరు : కాపుల కోసం టిడిపి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని మంత్రి నారాయణ అన్నారు. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఉద్దేశ్యపూర్వకంగానే ముద్రగడ పాదయాత్రలు, ఆందోళనలు చేపట్టారని మండిపడ్డారు. జగన్ కనుసన్నల్లో ముద్రగడ నడుస్తున్నారని నారాయణ ఆరోపించారు. గతంలో మాదిరిగా విధ్వంసం జరగకుండా ముద్రగడను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు.

'కాపు రిజర్వేషన్ల పై త్వరగా నిర్ణయం తీసుకోండి'

తూ.గో : కాపు రిజర్వేషన్ల పై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే పార్టీని వీడతామని కొత్త పేట టీడిపి నేత తలాది రామకృష్ణ హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందుతుంటే జాప్యం చేయడం తగదన్నారు.

12:36 - July 28, 2017

హైదరాబాద్ : కష్టాల సమయంలో అండగా ఉన్నారు... ఉద్యమంలో అగ్రభాగాన నిలిచారు... భారీ మెజార్టీని అందించి...విజేతగా నిలిపారు... ఇప్పుడు వారే కన్నెర్ర చేశారు.. ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్దియా కార్మిక నేతల  వేదనలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ. 
పోరాటానికి సన్నద్ధులవుతున్న కార్మికులు
కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి బాసటగా  నిలిచిన బల్దియా ఉద్యోగులు... నేడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. బల్దియా ట్రేడ్‌ యూనియన్‌ ..అధికార పార్టీకి దూరమవుతున్న ఛాయలు కనబడుతున్నాయి. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. తమ డిమాండ్‌ల సాధనకు పోరాట బాట పట్టనున్నాయి. 
ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌కు బాసటగా బల్దియా ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర సమితికి ఏ మాత్రం మద్దతు లేని సమయంలో మేమున్నామంటూ... బల్దియా ఉద్యోగులు బాసటగా నిలిచారు. అప్పుడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ కూడా బల్దియా ఉద్యోగుల వెతలపై చాలా స్పష్టంగా స్పందించారు. బల్దియా కార్మికులకు హామీల వర్షం కురిపించారు. బల్దియా కార్మికుల కోసం ఆస్పత్రి నిర్మిస్తామని.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఎన్‌ఎమ్‌ఆర్‌గా పరిగణించి  రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జీహెచ్‌ఎంసీ కార్మికునికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు.
హామీల సంగతి ఎత్తని ప్రభుత్వం
అయితే రాష్ట్రం వచ్చి మూడేళ్లు దాటింది. ఉద్యమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, నాటి హామీల అమలు గురించి కేసీఆర్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌ ఉద్యోగుల పోరాటం తర్వాత జీహెచ్‌ఎంసీ కార్మికులకు వేతనాలు పెంచింది తప్ప  ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల రెగ్యులరైజేషన్‌ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్న హామీ మాటలకే పరిమితమైందని  టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆరోపిస్తోంది. ఇంతకాలం ప్రభుత్వం తమ సమస్యలను  తీర్చుతుందని ఆశించామని.. అయినా తమను పాలకులు పట్టించుకోవడం లేదని యూనియన్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియా కార్మికులకు కనీసం హెల్త్‌ కార్డ్‌ కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. తమ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
నిరాశే ఎదురైంది : యూనియన్‌ నేతలు 
రాష్ట్రం సిద్ధిస్తే.. బతుకులు బాగుపడతాయని ఆశించిన బల్దియా కార్మికులకు నిరాశే ఎదురైందని యూనియన్‌ నేతలు వాపోతున్నారు. నమ్ముకున్న వారే నట్టేట ముంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణకు సమాయత్తమవుతన్నారు. 

 

'కమ్యూనిస్టులు ఎక్కడ ఆటంకం కలిగించారో నిరూపిస్తారా లోకేష్'

విజయవాడ: నగరాభివృద్ధికి కమ్యూనిస్టులు ఆటంకమని మంత్రి నారా లోకేష్ అనడం అవివేకం అని సీపీఎం నేతలు సీహెచ్ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ అన్నారు. టిడిపి నేతలు రాసిచ్చిన ప్రసంగాలను చదవడం మానుకోవాలని, టిడిపి ప్రభుత్వ హాయంలో విజయవాడ నగరాభివృధ్ధి ఏ మేరకు జరిగిందో బహిరంగ చర్చలకు తాము సిద్ధమని, విజయవాడ నగరం - కమ్యూనిస్టుల చరిత్రను అధ్యయనం చేసి మాట్లాడాలని వారు హెచ్చరించారు. కమ్యూనిస్టులు ఎక్కడ ఆటంకం కలిగించారో నిరూపిస్తారా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో జరిగే విధ్వంసాలను కమ్యూనిస్టులు ఎపుడూ అడ్గుకుంటారని వారు తెలిపారు.

12:32 - July 28, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ స్పీడ్‌ పెంచారు. పార్టీలో సర్వేలు.. ఇంటర్వూలు.. రివ్యూలు... అంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, పార్టీ మఖ్యనేతలతో రాష్ట్ర్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. 
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దూకుడు పెంచారు. ఇప్పటికే నియోజకర్గాల పరిస్తితిపై ఓ సర్వే నిర్వహించడమే కాకుండా రెండు సార్లు ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ  ఇంచార్జులకు ఇంటర్వూలు నిర్వహించారు. అంతేకాకుండా వారికున్న బలాబలాలపై ఓ అంచనాకు వచ్చారు. దీనిపై త్వరలోనే అధినేత జగన్‌కు ఓ నివేదిక కూడా ఇవ్వనున్నారు. అయితే ఇప్పటివరకూ ఎమ్మెల్యేలు, ఇంచార్జులు, పార్టీ నేతలతో  విడివిడిగా సమావేశాలు నిర్వహించిన ఆయన..అందరితో కలిసి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దీనికోసం ఈనెల 31న ముహూర్తం నిర్ణయించారు. ఈ సమావేశంలో జగన్‌తో పాటు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకర్గ ఇంచార్జులు, నేతలు హాజరుకానున్నారు...
సర్వేలు, ఇంటర్వూలు, రివ్యూలతో బిజీ బిజీ
ప్రశాంత్ కిషోర్ తొలిసారి నిర్వహిస్తున్నఈ మీటింగ్‌లో పలు కీలకమైన అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లీనరిలో జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్లాలన్న అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. దీంతో పాటు ఇటీవల నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే, ఎమ్మెల్యేలు, ఇంచార్జుల పనితీరుపై ప్రధానంగా చర్చ జరగనుంది. పనితీరు సరిగాలేని వారు తమను తీర్చిదిద్దుకునేందుకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు..
ఎమ్మెల్యేలు, ఇంచార్జుల పనితీరుపై ప్రధానంగా చర్చ!
పలువురు సిట్టింగ్‌ ఎమ్మెలకు టికెట్లు రావని.. నియోజకర్గాల మార్పు తథ్యమని వస్తున్న పుకార్లపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. మొత్తంగా ప్రశాంత్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. 

 

12:22 - July 28, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ పై జరిగిన కాల్పుల ఘటన వాస్తవాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు. తనకు వస్తున్న బెదిరింపులపై విక్రమ్‌గౌడ్‌ తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. పూజకు వెళ్లే సమయంలో ఈ కాల్పులు జరిపినట్లు విక్రమ్‌గౌడ్‌ భార్య తెలిపారని.. ఆ కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

12:21 - July 28, 2017

విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న దగ్గుపాటి రానా ముందుకెళ్తున్నాడు. రానా బాబాయ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా తీసేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో నిర్మాత సురేశ్ బాబు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెంకటేశ్ ఇమేజ్ కూడా తోడైతే బాగుంటుందని భావించిన ఆయన, ఆ ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడని అంటున్నారు. . ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిందని అంటున్నారు గానీ .. డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

12:17 - July 28, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో తొమ్మిదో సిట్ రోజు విచారణ కొనసాగుతోంది. హీరో రవితేజ సిట్ ముందు హాజరయ్యారు. రవితేజను సిట్ అధికారులు విచారిస్తున్నారు. రవితేజకు కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. రవితేజకు కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరాపై పూర్తివివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. కెల్విన్‌ ఫోన్‌లో రవితేజ ఫోన్‌ నెంబర్లు?, డ్రగ్స్‌ డీలర్‌ జిషాన్‌తో రవితేజకు సంబంధాలు?, రవితేజకు కెల్విన్‌ను పరిచయం చేసిన జిషాన్?, ఆరేళ్లుగా జిషాన్‌తో రవితేజ స్నేహం?, రోడ్డుప్రమాదంలో మరణించిన భరత్‌కూ డ్రగ్స్‌ ముఠాతో లింక్, డ్రగ్స్‌ వాడకంతోపాటు సరఫరా చేస్తున్నారంటూ గతంలో భరత్‌ అరెస్ట్ ను చేసిన విషయం విధితమే. మరోవైపు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రవితేజ ఓ న్యాయవాదిని కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. 

విక్రమ్ పై రెండు రౌండ్ల కాల్పులు..

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేశ్‌కుమార్ గౌడ్ తనయుడు విక్రంగౌడ్ రెండు రౌండ్లు కాల్పులు జరిగాని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. అపోలో చికిత్స పొందుతున్న విక్రమ్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో వివరాలు వెల్లడించారు. విక్రమ్‌గౌడ్‌పై రెండు రౌండ్ల కాల్పులు జరిగాయి. విక్రమ్‌గౌడ్ ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. కేసు దర్యాప్తు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశాం. కేసు విచారణ వేగవంతం చేశాం. కాల్పుల ఘటనపై విక్రమ్‌గౌడ్ సాయంత్రం చెబుతానన్నారు. విక్రమ్‌గౌడ్ ఆలయానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దంతో పై అంతస్తు నుంచి విక్రమ్ భార్య కిందకు వచ్చింది.

12:01 - July 28, 2017

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం పైసా వసూల్. శ్రేయ, ముస్కాన్, కైరాదత్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రోజు పైసా వసూల్ స్టంపర్ అంటూ చిన్న టీజర్ విడుదల చేశారు. ఇందులో బాలయ్య డైలాగ్స్, పూరీ టెకింగ్, అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పక్కా యాక్షన్ మూవీ అని డైలాగ్స్ తో చెప్పకనే చెప్పారు. కొత్తరకం స్టైల్ తో మొదలైన ఈ ప్రమోషన్ సినిమా రిలీజ్ వరకు ఇంకా ఏఏ రూట్లో వెళుతుందో అని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుండగా ఒక పాత్రలో టాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో మాఫియా డాన్ గా కనిపించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బేనర్ పై రూపొందుతున్న పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అలీ, పృథ్వీ, విక్రమ్జిత్ సహా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు

 

11:44 - July 28, 2017
11:41 - July 28, 2017

కెరియర్ మొదలు పెట్టిన దగ్గర వంద సినిమాలు పూర్తి చేసుకుని.. వరుస విజయాలతో ఆయన తన దూకుడు చూపిస్తూనే వచ్చారు. తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్న బాలకృష్ణ, ఆ మధ్య 'నర్తనశాల' రీమేక్ తో నిర్మాతగా మారాలని చూశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘పైసా వసూల్‌’ సినిమా చేస్తున్న బాలయ్య.. 102వ సినిమాను తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌తో చేయనున్నారు. కాగా, బాలయ్య గురించి తాజాగా ఓ గ్యాసిప్‌ పుట్టుకొచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్న బాలయ్య త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నారన్నదే ఆ గ్యాసిప్‌. తెలుగులో ప్రస్తుతం చాలా మంది స్టార్‌ హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అయితే బాలయ్య మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ సినిమా నిర్మాణం జోలికి వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం తనకు బాగా సన్నిహితుడైన మరో నిర్మాతతో కలిసి బాలయ్య సినిమాలు నిర్మించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్యానర్‌లో తొలి సినిమా మోక్షజ్ఞదే ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

రాజ్యసభకు అమిత్ షా నామినేషన్ దాఖలు.

గాంధీనగర్‌ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా శుక్రవారం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అమిత్‌షా గుజరాత్‌ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు.

 

చంద్రబాబు పాలనకు 2019 లో ముగింపు :ముద్రగడ

తూ.గో : నడవలేక నాటకాలు అడుతున్నారన్న విమర్శలపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 2 తర్వాత పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతిస్తే నడుస్తానో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ చంద్రబాబు బురద జల్లుతున్నారని, చంద్రబాబు పాలనకు 2019 లో ముగింపు తప్పదు అని ముద్రగడ హెచ్చరించారు.

విక్రమ్ గౌడ్ పరామర్శించిన షబ్బీర్ అలీ...

హైదరాబాద్: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రహ గౌడ్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, విక్రమ్ మాట్లాడితే అన్ని విషయాలు బయటికొస్తాయన్నారు. విక్రమ్ కు 2 నెలలుగా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

పాట్నా హైకోర్టులో ఆర్జేడీ పిటిషన్

బీహార్ : బీహార్ రాజకీయ సంక్షోభం పై పాట్నా హైకోర్టులో ఆర్జేడీ పిటిషన్ వేసింది. మరో వైపు బీహార్ అసెంబ్లీ కొనసాగుతుంది. ఈ అసెంబ్లీలో సీఎం నితీష్ బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు.

 

కొనసాగుతున్న రవి తేజ సిట్ విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారలో రవితేజను సిట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. దీంతో సిట్ కార్యాలయం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

బీహార్ అసెంబ్లీ ఎదుట ఆర్జేడీ నిరసన

పాట్నా: కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కుమార్ బలపరీక్ష ను ఎదుర్కోనున్నారు. అసెంబ్లీకి సీఎం నితీష్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆర్జేడీ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యింది. కోర్టు ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ బయట పెద్ద ఆర్జేడీ ఆందోళన చేస్తోంది.

10:56 - July 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విక్రమ్‌గౌడ్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకెళ్లాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో రెండుబులెట్లు ఆయనకు తాకినట్టు తెలుస్తోంది. ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చేతిలో, కడుపులోకి బులెట్లు దూసుకెళ్లినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్‌గౌడ్‌ పరిస్థితి నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని.. వెస్ట్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాల్పుల సమయంలో విక్రమ్‌ గౌడ్‌, ఆయన భార్యమాత్రమే ఇంట్లో ఉన్నారని చెప్పారు. విక్రమ్‌గౌడ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయని స్పష్టం చేశారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విక్రమ్ గౌడ్ పై దుండగులు కాల్పులు జరిపారా..? లేదా కుటుంబ, ఆర్థిక కారణాల రీత్య తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విక్రమ్ గౌడ్ ను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. కాల్పుల కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైంది. నిఫ్టీ 10వేల మార్క్‌ దిగువకు పడిపోగా.. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 150 పాయింట్లు కోల్పోయి 32,233 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 9,984 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

కాల్పుల ఘటనలో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో సంఘటనా స్థలాన్ని సీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు.

క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏపీ కీలక అడుగు

అమరావతి: క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏపీ కీలక అడుగు వేసింది. దేశంలో మొదటిసారిగా ఏపీలో 'ఫై' డేటా సెంటర్ మంగళగిరిలోని ఐటీ పార్క్ లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రూ.600 కోట్లతో 'పై' డేటా సెంటర్ ను ఏర్పాటు చేశారు. దక్షిణాదిలోనే మొదటి 'పై' డేటా సెంటర్ కావడం విశేషం. ప్రత్యక్షంగా 300 మందికి పరోక్షంగా 2 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో సీఎం నితీష్ కు బలపరీక్ష

పాట్నా: రాజీనామా చేసిన నాలుగు గంటల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరి కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు.

10:45 - July 28, 2017

హైదరాబాద్ : సినీహీరో రవితేజ సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజను సిట్ అధికారులు విచారించనున్నారు. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. రవితేజకు కెల్విన్‌తో సంబంధాలు, కెల్విన్‌ ఫోన్‌లో రవితేజ ఫోన్‌ నెంబర్లు? డ్రగ్స్‌ డీలర్‌ జిషాన్‌తో రవితేజకు సంబంధాలు? రవితేజకు కెల్విన్‌ను పరిచయం చేసిన జిషాన్? ఆరేళ్లుగా జిషాన్‌తో రవితేజ స్నేహం?, డ్రగ్స్‌ సరఫరాపై పూర్తివివరాలు రాబట్టాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నలుకూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రవితేజ ఓ న్యాయవాదిని కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. రోడ్డుప్రమాదంలో మరణించిన భరత్‌కూ డ్రగ్స్‌ ముఠాతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వాడకంతోపాటు సరఫరా చేస్తున్నారంటూ గతంలో భరత్‌ అరెస్ట్ ను చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

ఆత్మహత్యాయత్నంగా భావిస్తున్న పోలీసులు..!

హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కాల్పులు జరిగాయి. విక్రమ్ గౌడ్ పై రెండు రౌండ్ల కాల్పులు జరగడంతో కుడిభుజం, వెన్నుపూసలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్లు వైద్యులు తెలిపారు. విక్రమ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఫిలింనగర్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జూబ్లిహిల్స్ లోని విక్రమ్ నివాసం తెల్లవారుజామున 3.30 నిమిషాల ప్రాంతంలో కాల్పులు జరిగాయని, కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి రివాల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నంగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

10:35 - July 28, 2017

సినిమా అంతా స్లో మోషన్‌... గొర్రెలు నెమ్మదిగా తిరుగుతూ.... గడ్డితింటూ... కూర్చుంటూ... పడుకుంటూ ఉంటాయి.... ఇదే బాబా ల్యాండ్‌ మూవీ... అత్యంత డల్‌ మూవీ అయిన ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలకాబోతోంది.. నిద్రలేమికి తమ మూవీ మందు అని.. నిద్రమాత్ర కంటే పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందని చిత్ర నిర్మాతలు బాబా ల్యాండ్‌ను ప్రచారం చేసుకుంటున్నారు.. బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో తీసిన ఈ మూవీని చిత్రీకరించారు... ఒత్తిడి తగ్గించడానికి, బుర్రలను ప్రశాంతపరచడానికి.. ఆ గొర్రెలను అలా చూస్తూ ఉండండి అని చిత్ర నిర్మాత పీటర్‌ ఫ్రీడ్‌మన్‌ ప్రేక్షకులను కోరుతున్నారు.. 8 గంటలపాటు మంచి నిద్ర కోరుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌ అని అన్నారు.... మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా తీయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. మొదటి భాగంతో పోలిస్తే.. మరింత డల్‌గా రెండో ఎపిసోడ్‌ తీస్తారట.. నిడివికూడా 24 గంటలు ఉండే అవకాశం ఉందట..

 

10:33 - July 28, 2017

తూర్పుగోదావరి : జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతూనేఉంది.. ఇవాళ కోనసీమ బంద్‌కు కాపు జేఏసీ పిలుపునిచ్చింది.. అటు కిర్లంపూడిసహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీస్‌ పహారా కొనసాగుతోంది.. ముద్రగడ హౌస్‌ అరెస్ట్‌పై కాపు నేతలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

పార్టీని నా తల్లిలా భావిస్తా: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: వెంకయ్యనాయుడుకు ఆత్మీయ అభియనందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీని నా తల్లిలా భావిస్తానని పేర్కొన్నారు. పదవులు నేను ఎప్పుడూ కోరలేదు .. అవే వచ్చాయని స్పష్టం చేశారు.

10:31 - July 28, 2017

హైదరాబాద్ : సిట్‌ముందుకు సినీహీరో రవితేజ హాజరుకానున్నారు. ఉదయం పదిన్నరగంటలకు సిట్‌ కార్యాలయానికి రానున్నారు. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. రవితేజకు కెల్విన్‌తో సంబంధాలు, కెల్విన్‌ ఫోన్‌లో రవితేజ ఫోన్‌ నెంబర్లు? డ్రగ్స్‌ డీలర్‌ జిషాన్‌తో రవితేజకు సంబంధాలు? రవితేజకు కెల్విన్‌ను పరిచయం చేసిన జిషాన్? ఆరేళ్లుగా జిషాన్‌తో రవితేజ స్నేహం?, డ్రగ్స్‌ సరఫరాపై పూర్తివివరాలు రాబట్టాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నలుకూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రవితేజ ఓ న్యాయవాదిని కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. అయితే రవిజేత ఎలాంటి వివరాలు వెల్లడిస్తారని ఆసక్తి నెలకొంది. మరోవైపు రోడ్డుప్రమాదంలో మరణించిన భరత్‌కూ డ్రగ్స్‌ ముఠాతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వాడకంతోపాటు సరఫరా చేస్తున్నారంటూ గతంలో భరత్‌ అరెస్ట్ ను చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

విజయవాడలో ఆపరేషన్ ముస్కాన్...

విజయవాడ: అనాథలు, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన చిన్నారులకు ఆశ్రయం కల్పించడమే లక్ష్యంగా విజయవాడ పోలీసులు ఆపరేషన్‌ ముస్కాన్‌ చేపట్టారు. నగర పోలీసు కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా విడిపోయిన పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వాణిజ్య సదుపాయాలు, రహదారులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు జరిగిన తనిఖీల్లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్‌పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు చిన్నారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు కంపార్టమెంట్స్ అన్నీ నిండినవి. భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. నడకమార్గం ద్వారా వచ్చిన భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.

10:23 - July 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విక్రమ్‌గౌడ్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకెళ్లాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో రెండుబులెట్లు ఆయనకు తాకినట్టు తెలుస్తోంది. ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చేతిలో, కడుపులోకి బులెట్లు దూసుకెళ్లినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్‌గౌడ్‌ పరిస్థితి నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని.. వెస్ట్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాల్పుల సమయంలో విక్రమ్‌ గౌడ్‌, ఆయన భార్యమాత్రమే ఇంట్లో ఉన్నారని చెప్పారు. విక్రమ్‌గౌడ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయని స్పష్టం చేశారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విక్రమ్ గౌడ్ పై దుండగులు కాల్పులు జరిపారా..? లేదా కుటుంబ, ఆర్థిక కారణాల రీత్య తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:42 - July 28, 2017

ఖమ్మం : జులై 28 2007.. ప్రజాస్వామ్యం గొంతు నులిమిన దుర్దినం.. నెత్తిమీద నీడకోసం  జాగా అడగడమే పాపం అన్నట్టు.. నాటి పాలకులు రెచ్చిపోయారు. ఖాకీమూకలను ఉసిగొల్పారు. ఏడుగురు బడుగుజీవులను పొట్టన పెట్టుకున్నారు.  ముదిగొండకాల్పుల విషాదానికి నేటికి పదేళ్లు. ముదిగొండ అమరవీరుల ప్రాణత్యాగాన్ని ప్రజలు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం దమనకాండ..
భుక్తికోసం, నెత్తిమీద నీడకోసం 2007లో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా పేదప్రజలు ఉద్యమించిన కాలం అది. 9 కమ్యూనిస్టుపార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో.. అప్పటి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయింది. బడుగుజీవులకు కాసింత సాగుభూమి, ఇంటిస్థలం ఇవ్వడానికి ఇష్టపడక.. జూలై28న కసిగా తుపాకులు పేల్చి ఏడుగురిని బలితీసుకుంది. ఖమ్మంపట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదిగొండలో సీపీఎంపార్టీ ఆధ్వర్యంలో పేదప్రజలు నిరసనకు దిగారు. కోదాడ-ఖమ్మం రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా విరుచుకుపడిన ఖాకీలు.. ఏకపక్షంగా తుపాకులతో కాల్పులకు దిగారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా, కనీసం రబ్బర్‌బుల్లెట్లుకూడా వాడలేదు. పేదప్రజలను చంపాలన్న ఉద్దేశంతోనే కాల్పులు జరిపారు. ఆనాటి దుర్ఘటనలో యనగందుల వీరన్న, కత్తుల పెదలక్ష్మి, ఉసికల గోపయ్య, బంకా గోపయ్య, పసుపులేటి కుటుంబారావు, జంగం బాలస్వామి, చిట్టూరి బాబురావులు నేలకొరిగారు. 
ఎస్పీ రమేశ్‌కుమార్‌ నేతృత్వంలోనే మారణహోమం
అంతకు ముందు 6 నెలల క్రితం జనవరి 29న భద్రాచలంలో జరిగిన  పోలీసు కాల్పులకు నాయకత్వం వహించిన జిల్లా అదనపు ఎస్పీ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోనే .. ముదిగొండలోకూడా  నెత్తురు యాగం చేశారు.  పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో తరలివచ్చిన రమేశ్‌కుమార్‌ ను రాస్తారోకో విరమించడానికి మరి కొంత సమయం కావాలని నాయకులు అభ్యర్ధించినా పట్టించుకోలేదు. అప్పటికి రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్‌ స్థంభించలేదు. కాని.. నెత్తుటి  రుచిమరిగిన ఖాకీల తుపాకి గుళ్లు అమాయకులపైకి  దూసుకొచ్చాయి. వచ్చీరావడంతోనే లాఠీలతో ప్రజలను చితకబాదిన పోలీసులు.. ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.. ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి టియర్‌గ్యాస్‌కూడా ప్రయోగించలేదు.  కనీసం ముందుగా గాల్లోకి కాల్పులు జరపలేదు. అలాంటివేం చేయకుండా..   నేరుగా ప్రజలపై తుపాకులు గురిపెట్టి కాల్చేశారు. 
కాల్పుల ఘటనపై పాండురంగారావు కమిషన్‌ 
నాటి కాల్పులపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ జరిగింది. దీనిపై మొసలికన్నీరుకార్చిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం.. జస్టిస్ పాండురంగారావు కమిషన్ ను నియమించి చేతులు దులుపుకుంది. పాండురంగారావు కమిషన్‌ తూతూమంత్రంగా విచారణచేపట్టి అంతా పాలకుల అభిమతం ప్రకారమే  నివేదికను ఇచ్చిందని అప్పట్లోనే ప్రసారసాధనాలు కోడైకూశాయి.  
రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు పేదప్రజలపై కత్తిగట్టింది..? 
ఇంతకీ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు పేదప్రజలపై కత్తిగట్టింది..? అంటే.. అప్పట్లో వామపక్షాలు ప్రభుత్వ ప్రజావత్యిరేక విధానాలను అడుగడుగునా ఎండగట్టాయి. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల వెనుక అవినీతి, ప్రాంతీయపక్షపాతాన్ని ఎత్తిచూపాయి. అందుకే అప్పటి వైఎస్‌ఆర్‌ సర్కార్.. ప్రజాసంఘాలు, వామపక్షాలపై కన్నెర్ర చేసింది. ముఖ్యంగా పోలవరం,  పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్‌ మార్పుల వెనుక పాలకుల కుట్రకోణాన్ని కమ్యూనిస్టుపార్టీలు నిగ్గదీశాయి. ఈనేపథ్యంలోనే భూమి, ఇళ్లస్థలాల కోసం ఉద్యమిస్తున్న పేదప్రజలపై పోలీసులను ఉసిగిల్పిందని రాజకీయపార్టీలు విమర్శించాయి.  
కోనేరు రంగారావు కమిషన్‌ సిఫార్సుల అమలుకు డిమాండ్‌ 
రాష్ట్రలో భూపంపిణీ, గిరిజనులు, దళితుల భూమి హక్కులపై కోనేరు రంగారావు కమిషన్ చేసిన సిఫార్సులను అమలు  జరపాలని అప్పట్లో ప్రజాసంఘాలు, వామపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేశాయి.  ఇదే అంశంపై అర్హులైన పేదలందరికి భూమి, ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2007 సంవత్సరంలో పెద్ద ఎత్తున బడుగుజీవులు ఉద్యమించారు. అదే ఏడాది  జూలై , ఆగస్టు మాసాలలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.  195 ప్రజా సంఘాలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దీనికి నాయకత్వం వహించాయి.  
టీఆర్‌ఎస్‌ పాలనలోనూ పేదలకు అన్యాయం 
ఉద్యమపార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్‌ పాలనలోకూడా దళితులకు, పేదవర్గాలకు అన్యాయమే జరగుతోంది. ఆంధ్రా పాలకులు తెలంగాణకు అన్యాయం చేశారని.. తాము న్యాయం చేస్తున్నామని చెబుతున్న గులాబీపార్టీ నేతలు.. దళితులకు 3ఎకరాల భూమి పథకాన్ని అటకెక్కించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అంటూ ఉత్తుత్తి ఊరింపులే తప్పించి.. పేదవాడికి సొంతిఇల్లు దక్కుతుందన్న భరోసా లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా పాలకులు మాత్రమే మారారు..పాలన మాత్రం అన్నీ ఆదిపత్యవర్గాల చేతుల్లోనే ఉండిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముదిగొండ అమరవీరుల ప్రాణత్యాగాన్ని వృధాకానీమంటూ.. వామపక్షాలు, ప్రజాసంఘాలు పేదప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తామని తేల్చిచెబుతున్నాయి.  

 

సిట్ కార్యాలాయానికి చేరుకున్న రవితేజ

హైదరాబాద్ : సినీ హీరో రవితేజ సిట్ కార్యాలాయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు ఆయన్ను విచారించనున్నారు. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. 

09:23 - July 28, 2017

హైదరాబాద్ : కాసేపట్లో సిట్‌ముందుకు సినీహీరో రవితేజ హాజరుకానున్నారు. ఉదయం పదిన్నరగంటలకు సిట్‌ కార్యాలయానికి రానున్నారు. సిట్‌ నోటీసులు పంపిన ఈ 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్‌, రవితేజ కీలకమని అధికారులు భావిస్తున్నారు. రవితేజకు కెల్విన్‌తో సంబంధాలు, కెల్విన్‌ ఫోన్‌లో రవితేజ ఫోన్‌ నెంబర్లు? డ్రగ్స్‌ డీలర్‌ జిషాన్‌తో రవితేజకు సంబంధాలు? రవితేజకు కెల్విన్‌ను పరిచయం చేసిన జిషాన్? ఆరేళ్లుగా జిషాన్‌తో రవితేజ స్నేహం?, డ్రగ్స్‌ సరఫరాపై పూర్తివివరాలు రాబట్టాలని అధికారులు చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నలుకూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రవితేజ ఓ న్యాయవాదిని కూడా సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. రోడ్డుప్రమాదంలో మరణించిన భరత్‌కూ డ్రగ్స్‌ ముఠాతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ వాడకంతోపాటు సరఫరా చేస్తున్నారంటూ గతంలో భరత్‌ అరెస్ట్ ను చేసిన విషయం తెలిసిందే. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:18 - July 28, 2017

హైదరాబాద్ : చిన్న చిన్న పాత్రల నుంచి మాస్ మహారాజు స్థాయికి ఎదిగాడు. ఆ హీరో సినిమాలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువే. కామేడితో కడుపుబ్బనవ్విస్తాడు. ఫంచ్ డైలాగులతో కేక పుట్టిస్తాడు. స్టెప్పులతో అదరగొడతాడు. అతడే రవితేజ..కామెడి, సెంటిమెంట్, యాక్షన్ ఇలా క్యారెక్టర్ ఏదైనా..ఆ పాత్రలో ఒదిగిపోతాడు. టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ మాస్ మహారాజుపై డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరుకాబోతున్నాడు.   
తూ.గో జిల్లాలో రవితేజ జననం 
మాస్ మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రవితేజ అసలు పేరు భూపతి రాజు రవిశంకర్‌ రాజు. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించాడు. రవితేజ నాన్న భూపతిరాజు రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్ కావడంతో.. అతని చిన్నతనమంతా నార్త్‌ ఇండియాలోనే గడిచింది. అది కూడా ఒక్కచోట కాకుండా జైపూర్, ఢిల్లీ, ముంబై, భోపాల్ వంటి చోట్ల స్కూలింగ్ పూర్తి చేశారు.  కాలేజీ వయసు వచ్చేసరికి విజయవాడలో సెటిల్ కావడంతో ఎందరో సినీ ప్రముఖులు చదివిన సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి చెన్నై ట్రైన్ ఎక్కేశాడు. 
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫిల్మ్‌ కెరీర్ ప్రారంభం
ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ఫిల్మ్‌ కెరీర్ స్టార్ట్ చేశాడు. సిరీయల్స్ దగ్గర నుంచి అనేక టాలీవుడ్, బాలీవుడ్ సిన్మాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఆ సమయంలోనే దర్శకులను రిక్వెస్ట్ చేసి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా రవితేజ మొదటి సంపాదన 500 రూపాయలు. అలా ప్రస్తానం మొదలు పెట్టిన రవితేజ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌గా ఎదిగాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తున్న సమయంలో డైరెక్టర్లు వైవీఎస్ చౌదరి, గుణశేఖర్‌తో రూమ్‌మెట్‌గా ఉండేవాడు. 
1990లో కర్తవ్యం సినిమాతో తెరగేట్రం
1990లోనే కర్తవ్యం సిన్మాలో చిన్న పాత్ర చేసి వెండితెరపై మెరిసిన రవితేజ..చాలాకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గానే ఉండిపోవాల్సి వచ్చింది. కృష్ణవంశీని కలిశాక రవితేజ దశదిశా మారిపోయింది. నిన్నెపెళ్లాడుతా సిన్మాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు..మాములు పాత్ర పోషించి నటనలో కృష్ణవంశీని మెప్పించాడు. దీంతో కృష్ణవంశీ డైరెక్ట్‌ చేసిన సింధూరం సిన్మాలో అవకాశం దక్కింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు రావడంతో రవితేజకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన నీ కోసం సిన్మా హిట్ అవ్వడమే కాకుండా నంది అవార్డు లభించింది. ఇట్లు శ్రావణిసుబ్రమణ్యంతో మొదలైన ప్రయాణం..ఇడియట్ మూవీతో సెన్సేషన్ సృష్టించింది. ఆ తరువాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో, అమ్మ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, డాన్ సీను, కిక్, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ శీను చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. 

 

09:11 - July 28, 2017

హైదరాబాద్‌ : నగరంలో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విక్రమ్‌గౌడ్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకెళ్లాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాల్పుల్లో రెండు బులెట్లు ఆయన కు తాకినట్టు తెలుస్తోంది. ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చేతిలో, కడుపులోకి బులెట్లు దూసుకెళ్లినట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్‌గౌడ్‌ పరిస్థితి నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. మరోవైపు కాల్పుల ఘటనపై విచారణ జరుగుతోందని.. వెస్ట్ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.. కాల్పుల సమయంలో విక్రమ్‌ గౌడ్‌, ఆయన భార్యమాత్రమే ఇంట్లో ఉన్నారని చెప్పారు.. విక్రమ్‌గౌడ్‌కు ఆర్థిక ఇబ్బందులున్నాయని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:56 - July 28, 2017

హైదరాబాద్ : నగరంలో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విక్రమ్‌గౌడ్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకెళ్లాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు కాల్పులకు పాల్పడ్డారు. జూబ్లిహిల్స్ లోని విక్రమ్ నివాసంలో దుండగులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. విక్రడ్ గౌడ్ కుడి భజం, వెన్నుపూసలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో విక్రమ్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఫిలింనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో విక్రమ్ చికిత్స పొందుతున్నారు. 

నేడు రవితేజ సిట్ విచారణ

హైదరాబాద్ : నేడు హీరో రవితేజ సిట్ ముందుకు రానున్నారు. డ్రగ్స్ కేసులో రవితేజన్ సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న ముమైత్ ఖాన్ ను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.

08:37 - July 28, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా  కలిశారు.  రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్‌కు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏకు మద్దతు తెలిపినందుకు సీఎం కేసీఆర్‌కు రామ్‌నాథ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.  సీఎం వెంట టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్‌రెడ్డి ఉన్నారు. 

 

08:35 - July 28, 2017

హైదరాబాద్ : అధికారపార్టీపై విపక్షాలు స్వరం పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంపై ఏ ఆరోపణలు వచ్చినా..యువనేత కేటీఆర్‌నే టార్గెట్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కుంభకోణాల్లో కేటీఆర్‌ సన్నిహితులకు సంబంధాలున్నాయన్న విమర్శలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కీలక నేత కావడంతో...ప్రతిపక్ష పార్టీలు మరింత ఉత్సాహంగా గులాబినేతపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మాటల దాడి 
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మాటలదాడి పెంచుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా తూర్పారబడుతున్నాయి. ప్రధానంగా కేటీఆర్‌ టార్గెట్‌గా విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో కలకలం రేపుతున్న స్కాంలతో కేటీఆర్‌కు లింకులున్నాయని ఆరోపిస్తూ ఇరుకునపెడుతున్నాయి. 
ఎంసెట్ స్కాంలో కేటీఆర్‌ బంధువు పాత్ర ఉందని ఆరోపణ
రాష్ట్ర ఆవిర్భావం తర్వత  వెలుగు చూసిన వివాదాస్పద అంశాల్లో కెటిఆర్‌ అత్యంత సన్నిహితులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలను విపక్ష పార్టీలు తెరపైకి తెస్తున్నాయి. ఎంసెట్ కుంభకోణంలో కేటీఆర్‌ సమీపబంధువే ప్రధానకారణమన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. ఇక పోలీస్‌ వాహనాల కొనుగోళ్లల్లోనూ ఐటీ మంత్రి పాత్ర ఉందని జాతీయ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇటీవల వెలుగుచూసిన మియాపూర్ భూ కుంభకోణంలో మంత్రి కేటీఆర్ సన్నిహితులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. రాష్ట్రంలో సంచలనంగా మారిన డ్రగ్స్ వ్యవహారంలోనూ విపక్షాలు కేటీఆర్‌ను టార్గెట్ చేశాయి. మంత్రి సన్నిహితుల పబ్బులకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు సంధించాయి. 
నోరు మెదపని అధికార పార్టీ పెద్దలు  
మరోవైపు కేటీఆర్‌కు పలు స్కాముల్లో సంబంధాలున్నాయని ప్రతిపక్షాలు ముప్పేటా దాడి చేస్తున్నా.. అధికార పార్టీ పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు. తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి కెటిఆరే స్వయంగా సమాధానాలు చెప్పుకోవాల్సి పరిస్థితి ఎదురవుతోంది. 

 

రోడ్డు ప్రమాదంలో టీఆర్ ఎస్ నేత సతీష్ రెడ్డి మృతి

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ ఎస్ నేత దుబ్బాక సతీష్ రెడ్డి మృతి చెందారు. ఆగివున్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. 

 

06:52 - July 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక రాజకీయ పార్టీల్లో కాక పుట్టిస్తోంది. తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అధికార, ప్రతిపక్షాల్లో మరింత హీటు పెరిగింది. పాలక, ప్రతిపక్షాలు రెండూ గెలుపు కోసం ఇప్పటి నుంచే సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే,  ఈ ఉప ఎన్నికల్లో జనసేన దారెటు అన్న సందేహం సామాన్యుడిని సైతం వేధిస్తోంది. పవన్ కళ్యాణ్‌ టీడీపీకి మద్దతు ఇస్తారా? లేక ఎన్నికలకే దూరంగా ఉంటారా? అసలు పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? వాచ్ దిస్‌ స్టోరి. 
ఉప ఎన్నికకు షెడ్యూలు 
నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూలు వెలువడింది. బాగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, వైసీపీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. షెడ్యూలు కన్నా ముందే ప్రచారాన్నీ మొదలు పెట్టేశారు. నంద్యాల రాజకీయ వాతావారణం రోహిణికార్తె ఎండల్లా మండిపోతోంది. ఈ దశలో.. అందరి దృష్టీ పవన్‌ కల్యాణ్‌పై కేంద్రీకృతమైంది. ఈ ఎన్నికల్లో పవన్‌ దారెటు..? ఈ ప్రశ్న స్థానిక ఓటర్లను, రాజకీయ పక్షాలనూ వేధిస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతు
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి జనసేనాని పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు ప్రభుత్వంతో విభేదిస్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతానని దాదాపుగా ప్రకటించేశారు. తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని కూడా తేల్చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. ఈ ఎన్నికల్లో.. పవన్ కళ్యాణ్ గతంలో లాగా టీడీపీకి మద్దతు ఇస్తారా? లేక వ్యతిరేకంగా పనిచేస్తారా..? కాదూ స్తబ్దుగా ఉండిపోతారా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 
టీడీపీ, వైసీపీకి సవాల్‌గా నంద్యాల ఉప ఎన్నిక
నంద్యాల నియోజకవర్గంలో కాపు, బలిజ ఓట్లు దాదాపు 30 వేల వరకూ ఉన్నాయి. వీటిని పొందేందుకు పవన్‌ మద్దతు సమీకరించాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించిన సంప్రదింపుల వ్యవహారాన్నీ పార్టీ అగ్రనేతలు మొదలు పెట్టారు. ఈనెల 31న సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉద్దానం కిడ్నీ సమస్యపైనే చర్చిస్తారని పైకి చెబుతున్నా.. నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్‌ మద్దతు కూడగట్టడమే చంద్రబాబు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. 
పవన్ ఎవరికి మద్దతిస్తారో...?
భూమా నాగిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆయన పవన్‌తో కలిసి పనిచేశారు. ఆరకంగా, భూమా కుటుంబంతో పవన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ నంద్యాలలో మరోసారి తమకే మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే గతంలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని తప్పు పట్టిన పవన్ కళ్యాణ్ ఫిరాయింపులకు పాల్పడ్డ భూమా కుటుంబానికి మద్దతు ఇస్తారో లేదో అనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి, పవన్ స్టాండ్ ఏంటనేది సస్పెన్స్‌గానే ఉన్నా.. చంద్రబాబుతో భేటీ తరువాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

06:47 - July 28, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల కావడంతో నంద్యాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బైపోల్‌ను సెమీ ఫైనల్‌గా భావించి సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌ సైతం తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 
బరిలో భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పా మోహన్‌ రెడ్డి 
నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ప్రచారంలో స్పీడ్‌ పెంచాయి. టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు. ఇప్పటికే ఇరుపార్టీల అభ్యర్థులు నంద్యాల నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. కొన్ని రోజులుగా పోటా పోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సిఎం చంద్రబాబు రెండుసార్లు, మంత్రి నారా లోకేష్ ఒకసారి నంద్యాల పర్యటనకు వచ్చి టీడీపీ లీడర్లకు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. మరోవైపు క్యాంపు రాజకీయాలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జోరందుకున్నాయి.
1952లో నంద్యాల నియోజకవర్గం ఆవిర్భావం
నంద్యాల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగాయి. రాష్టపతి, ప్రధానిని చేసిన ఘన చరిత్ర నంద్యాల సొంతం. 2014 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి..టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత మంత్రి కావాలన్న ఆశతో భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడం...ఆ కల నెరవేరకుండానే గుండె పోటుతో హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నికలు అని వార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో టిడిపి టికెట్ తనకే ఇవ్వాలని ఆ పార్టీ ఇంచార్జీ శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. అయితే రాజకీయ సాంప్రదాయ ప్రకారం మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే అవకాశం ఇవ్వడం సమంజసం అని సిఎం చంద్రబాబు భావించడంతో.. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నంద్యాలలో మకాం 
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నంద్యాలలో మకాం వేశారు. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్, ఆర్పీఎస్ పార్టీలు రేసు గుర్రాలను బరిలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలతో నంద్యాల పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. మరి నంద్యాలలో ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాలి. 

 

06:38 - July 28, 2017

హైదరాబాద్ : నగరంలో కాల్పుల కలకలం రేగింది. మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో విక్రమ్‌గౌడ్‌ శరీరంలోకి రెండు బులెట్లు దూసుకెళ్లాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు కాల్పులకు పాల్పడ్డారు. జూబ్లిహిల్స్ లోని విక్రమ్ నివాసంలో దుండగులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. విక్రడ్ గౌడ్ కుడి భజం, వెన్నుపూసలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో విక్రమ్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఫిలింనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో విక్రమ్ చికిత్స పొందుతున్నారు. 

హైదరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై దుండగులు కాల్పులు జరిపారు.  విక్రడ్ గౌడ్ కుడి భజం, వెన్నుపూసలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో విక్రమ్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఫిలింనగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జూబ్లిహిల్స్ లోని విక్రమ్ నివాసంలో దుండగులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజాము 3.30 గంటలకు కాల్పులు జరిపారు. 

 

Don't Miss