Activities calendar

29 July 2017

21:35 - July 29, 2017

ఢిల్లీ : బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ఆస్తులు బాగా పెరిగాయి. 2012లో ఆయన ఆస్తుల విలువ 1.90 కోట్లు కాగా...ఇపుడది 19 కోట్లకు చేరుకుంది. ఆయన స్థిరాస్తులు 2012లో 6.63 కోట్లుంటే...2017 నాటికి 15.30 కోట్లకు పెరిగింది. వీటిలో పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల విలువ 10.38 కోట్లు ఉన్నట్లు అమిత్‌ షా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ కింద దాఖలు చేసిన అఫిడవిట్‌లో అమిత్‌ షా, స్మృతీ ఇరానీ, బల్వంత్‌ సిన్హా రాజ్‌పుత్ తమ ఆస్తుల వివరాలు తెలిపారు. స్మృతీ ఇరానీ స్థిర చరాస్తులు 2014లో 4.91 కోట్లుంటే 2017 నాటికి 8.88 కోట్లకు చేరింది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బికాం ఫస్టియర్‌ పూర్తి చేశానని చెప్పారు. దీనిపై వివాదం రేగడంతో ఈసారి మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయలేదని తెలిపారు. ఇక కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ తన చరాస్తులు 254 కోట్లుగా, స్థిరాస్తులు 62.56 కోట్లుగా ఉన్నట్టు డిక్లేర్‌ చేశారు.


 

 

21:34 - July 29, 2017

హైదరాబాద్ : గోదావరి, కృష్ణా నదులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి ప్రభుత్వం ఓ లేఖ రాసింది. కొత్త ప్రాజెక్టులు నిర్మించకుండా ఏపీని ఆపాలని లేఖలో కోరింది. ఇరు రాష్ర్టాల మధ్య సమస్యలను కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. సమస్యలపై చర్చకు అత్యున్నత మండలి భేటీ ఏర్పాటు చేయాలని కోరింది. ఏపీలో పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు తరలిస్తున్నారని టీ సర్కార్‌ ఫిర్యాదు చేసింది. పోలవరం, పట్టిసీమ నీటి మేరకు తెలంగాణకు అదనపు నీరు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. డీపీఆర్‌లు ఇవ్వకుండానే ఏపీ కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో స్పష్టం చేసింది. పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఇవ్వలేదని తెలిపింది. 

21:33 - July 29, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో రవితేజ కారు మాజీ డ్రైవర్‌ శ్రీనివాసరావును సిట్‌ విచారించింది. ఉదయం 10 గంటలకు శ్రీనివాసరావు సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. పదిన్నరకు ప్రారంభమైన సిట్‌ విచారణ దాదాపు నాలుగు గంటలపాటు సాగింది. ఈ విచారణలో డ్రగ్స్‌కు సంబంధించి శ్రీనివాసరావు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది.డ్రగ్స్‌ దందాలో కీలక నిందితుడైన జీశాన్‌ నుంచి రవితేజకు, ఆయన సోదరుడు భరత్‌, డ్రైవర్‌ శ్రీనివాసరావుకు డ్రగ్స్‌ అందినట్టు సిట్‌ అనుమానించింది. ఆ కోణంలోనే శ్రీనివాసరావును సిట్‌ విచారించింది. డ్రగ్స్‌ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌, జీశాన్‌తో గల సంబంధాలపై సిట్‌ కూపీలాగింది. కెల్విన్‌తో సంబంధాలు, కెల్విన్‌తో శ్రీనివాసరావు ఫోన్‌ సంభాషణలపై సిట్‌ ప్రశ్నలు సంధించింది. కెల్విన్‌, జీశాన్‌తో రవితేజ ఫోన్‌లో మాట్లాడేవారా? ఆ తర్వాత మీరు వెళ్లి డ్రగ్స్‌ పార్శిల్‌ తీసుకొచ్చేవారా? కెల్విన్‌, జీశాన్‌లను ఎక్కడ కలిసేవారు? వారిచ్చే కవర్‌లో ఏం ఉండేది? షూటింగ్‌ లేని సమయాల్లో రవితేజ ఎక్కడ గడిపేవారు? మీ సెల్‌ఫోన్‌లో కెల్విన్‌ నంబర్‌ ఎందుకుంది? రవితేజతో క్లోజ్‌గా ఉండే సహచర నటులెవరు? వారాంతాల్లో వారంతా ఎక్కడ గడిపేవారు? లాంటి ప్రశ్నలకు సిట్‌ సమాధానం రాబట్టింది. డ్రగ్స్‌ మాఫియాతో సినీ ఇండస్ట్రీలో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న దానిపైనా కూపీ లాగింది.

డ్రగ్స్‌పై కీలక సమాచారం
సిట్‌కు శ్రీనివాసరావు డ్రగ్స్‌పై కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది. అయితే తానెప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని శ్రీనివాసరావు సిట్‌ అధికారులకు చెప్పినట్లు సమాచారం. హీరో రవితేజ డ్రగ్స్‌ తీసుకుంటారని సిట్‌ అధికారులు బలంగా నమ్ముతున్నారు. అతనికి శ్రీనివాసరావు డ్రగ్స్‌ అందచేసేవాడని, కెల్విన్‌ ద్వారానే డ్రగ్స్‌ సరఫరా జరిగేదనిఅనుమానిస్తున్నారు. కెల్విన్‌ కాల్‌ లిస్టులో శ్రీనివాసరావు నంబర్‌ ఉండటమే కాకుండా ఇద్దరి మధ్యా చాలా సంభాషణలు జరిగినట్టు పోలీసులు నిర్దారించుకున్నారు. ఇవే ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. శ్రీనివాసరావు కొద్ది కాలంలోనే మూడు ఇళ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అన్నదానిపైనా సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. రవితేజకు బినామీగా వ్యవహరిస్తున్నారా? లేక డ్రగ్స్‌ తీసుకోవడంతోపాటు ఇతరులకు సరఫరా చేస్తారా అన్న కోణంలోనూ ప్రశ్నలు అడిగారు. దీంతో శ్రీనివాసరావు కొద్దిగా తత్తరపాటుకు గురైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కెల్విన్‌తో పరిచయాలు, సినిమా ఇండస్ట్రీలోడ్రగ్స్‌ సరఫరాపై సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసరావుతో పరిచయాలున్న సినీ వర్గాలు కలవరపడుతున్నాయి.

రేపు తనీష్
ఇక సోమవారం సిట్‌ విచారణకు హీరో తనీష్‌ హాజరుకానున్నారు. మంగళవారం నందును సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు. ఆగస్టు 2వ తేదీతో తొలివిడత విచారణ ముగియనుంది. త్వరలో మరికొందరు సినీ నటులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది.

21:32 - July 29, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల వ్యవహారంలో కొత్త వాదనలు ముందుకు వస్తుండడంతో నిజాలను తేల్చే పనిలో పోలీసులు పడ్డారు. విక్రమ్‌గౌడ్‌ చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి టాస్కఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి వచ్చారు. విక్రమ్‌గౌడ్‌ దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. తనపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే తాను కిందపడిపోయానని, ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాక గట్టిగా అరిచినట్టు చెప్పారు. తన అరుపులు విన్న భార్య షిపాలి కిందకు రావడంతో.. 108కు ఫోన్‌ చేయాలని సూచించానన్నారు. అంబులెన్స్‌ రాకపోవడంతో కారులో ఆస్పత్రికి తన భార్య తీసుకొచ్చిందని, ఆమెకు డ్రైవర్‌, వాచ్‌మెన్‌ సహకరించారని చెప్పారు. తనకు బెదిరింపుకాల్స్‌ వచ్చిన మాట వాస్తవమేనని విక్రమ్‌గౌడ్‌ అంగీకరించారు. నొప్పి ఎక్కువగా ఉండడం వల్లే శుక్రవారం పోలీసులతో మాట్లాడలేకపోయినట్టు స్పష్టం చేశారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు.

ఆధారాలు లభ్యం కాలేదు
మరోవైపు పోలీసు బృందం విక్రమ్‌గౌడ్‌ భార్య షిపాలీని విచారించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె...కాల్పుల ఘటనపై విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు అంతా తెలిపారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేశారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. విక్రమ్‌పై ఎవరు దాడిచేశారో పోలీసులే గుర్తించాలన్నారు. పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని...తమకు న్యాయం జరుగుతుందని షిపాలి చెప్పారు.బయటి నుంచి వేరే వ్యక్తులు వచ్చినట్టు సరైన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు. అతనే కాల్చుకున్నాడా... లేక ఇంట్లో ఏమైనా జరిగిందా అనే దానిపై సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. కాల్పుల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేదన్న నిర్ధారణకు వస్తున్నారు. కాల్పులు జరిపిన తుపాకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

21:31 - July 29, 2017

అనంతపురం : మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌ రెడ్డి వవ్యహారంపై పుట్టపర్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రిపదవిలో ఉన్నపుడు నియోజకవర్గవ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను పెంచిపోషించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిచోట తన సామాజిక వర్గ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ కాంట్రాక్టులు, ఇతర పనులు కట్టబెడుతూ తమకు అన్యాయం చేశారని కొందరు తెలుగు తమ్ముళ్లు అప్పట్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌ అయిన చంద్రబాబు పల్లెరఘునాధ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలించారు. పద్దతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కూడా దక్కదని బాబు హెచ్చరించినట్లు సమాచారం. అయినా పల్లె రఘునాథ్‌రెడ్డి వైఖరిలో మార్పురాలేదని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. పుట్టపర్తి నియోజవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం సైకిల్‌పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.

నిమ్మల కిష్టప్ప రాజకీయం
ఈనే పథ్యంలో పుట్టపర్తిలో పాగావేయడానికి ఛాన్స్‌ దొరికిందన్నట్టు ఎంపీ నిమ్మల కిష్టప్ప తనదైన శైలిలో రాజకీయాన్ని నడిపిస్తున్నారు. తన కుమారుడు శిరీష్‌ను పుట్టపర్తిలో లీడర్‌గా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీఓటర్లపై ఆయన దృష్టిపెట్టారు. అటు పలువురు బీసీ సామాజిక వర్గాల వారు కూడా నిమ్మల కిష్టప్ప ప్రయత్నానికి సహకరిస్తున్నారట. ఇప్పటికే రఘునాథరెడ్డి వ్యతిరేక వర్గీయులను ఒకతాటిమీదకు తేవడంలో ఎంపీ నిమ్మల సక్సెస్‌ అయ్యారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పిసీ గంగన్న తాను ఎంపీ అడుగుజాడల్లో నడుస్తానని బహిరంగంగానే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు శిరీశ్‌ను పుట్టపర్తిఅసెంబ్లీ స్థానంలో పోటీకి దింపుతానని సన్నిహితుల వద్ద నిమ్మల కిష్టప్ప చెబుతున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో అధికారపార్టీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. మాజీమంత్రి పల్లె, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య కోల్డ్‌వార్‌ ఏ పరిణామలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

18:14 - July 29, 2017

వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్‌ నిర్మాణాలు... అనేక గ్రామాల ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్నాయి. పాలకుల అరకొర పరిహారం చెల్లింపులతో.. నిర్వాసితులు ఉపాధికి, వసతికి దూరం అవుతున్నారు. రైతుల ఇళ్లు, భూములు లాక్కుని రోడ్డున పడేలా చేస్తున్నారు. దీంతో వారంతా ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా... వనపర్తి జిల్లా... రేవల్లీ మండలంలో ప్రభుత్వం ఎదుల రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ నిర్మాణం వల్ల బండరాయిపాకుల, కోంకలపల్లి, ఎదుల, తిగలపల్లి, నాగపుర్ గ్రామాల రైతులు ఐదు వేల ఎకరాలకు పైగా భూములను కోల్పోతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ బతుకులు ఏమిటంటూ.. ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టా ఉన్న వారికి 5.5 లక్షలు, అసైన్డ్‌ భూమి ఉన్న వారికి 3.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడానికి సిద్ధమైంది.

అరకొర పరిహారంతో...నిర్వాసితులుగా మారుస్తున్న ప్రభుత్వ చర్యలపై ముంపు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... పూర్తి పరిహారం చెల్లించాలని.. పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే తమకు పరిహారం చెల్లించాలని.. ఆయకట్టు కింద భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ముంపునకు గురవుతున్న రెండు గ్రామాల ప్రజలు పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. మేలు చేస్తాడని ఎన్నుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ.. వాపోతున్నారు. ఆ గ్రామాల ప్రజల పోరాటానికి సీపీఎం కూడా మద్దతుగా నిలిచింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ గ్రామాల్లో పర్యటించి.. నిర్వాసితుల బాధలను తెలుసుకున్నారు. వారికి న్యాయం జరిగే వరకూ సీపీఎం పార్టీ తోడుగా ఉంటుందని తమ్మినేని హామీ ఇచ్చారు.

 

18:13 - July 29, 2017

జగిత్యాల : పిల్లలను.. కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతల్లులే.. గాలికొదిలేశారు. నీడగా ఉండాల్సిన వారే.. నిర్ధాక్షిణ్యంగా..విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారులు మాత్రం.. తల్లులు కోసం బెంగపెట్టుకున్నారు..అమ్మ పలకరింపు కోసం... అల్లాడిపోయారు. ఆరు నెలల తర్వాత కనిపించిన అమ్మ దగ్గరకు వెళ్లాలని ఆ పసివాళ్లు తహతహలాడిపోయారు. ఆ తల్లులు మాత్రం.. కన్నపిల్లల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. సారంగాపూర్‌ మండలం..కొనాపూర్‌ గ్రామంలో ...ఇద్దరు వివాహితులు ... భర్తలను విడిచిపెట్టి... పిల్లలను వదిలిపెట్టి ప్రేమించినవాళ్లతో వెళ్లిపోయారు.. కూలి పనులు కోసం వచ్చిన హరిబాబు, నాయుడు అనే ఇద్దరు అన్నదమ్ములతో... వివాహితులైన ఇద్దరు అక్కచెల్లెలు ప్రేమలో పడ్డారు. 8 నెలల క్రితం వీరి మధ్య పరిచయం ఏర్పడింది... హరిబాబు, నాయుడులతో రోజూ ఇద్దరు అక్క చెల్లెల్లు కూలి పనులకు వెళ్లేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఫిబ్రవరిలో నలుగురు ఊరివిడిచి వెళ్లిపోయారు.

నిరాశే ఎదురైంది
భార్యలు కనిపించకపోవడంతో... భర్తలు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నలుగురు వ్యక్తులు విజయవాడలో ఉన్నట్టు తెలుసుకుని.. వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరు పరిచారు. అయితే వారు ఇష్టపూర్వకంగానే వెళ్లినట్టు ఇద్దరు మహిళలు చెప్పారని ... పోలీసులు తెలియజేశారు. ఆరు నెలలుగా తల్లులు కనిపించక... వారి పిల్లలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మకోసం పరితపించారు. అయితే అమ్మ వస్తుందని కోర్టుకు వెళ్లిన చిన్నారులకు .. నిరాశే ఎదురైంది. కోర్టులో తమ తల్లులు కనబడగానే.. దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా దుఃఖభరితమయ్యారు. కానీ ఆ తల్లులు మాత్రం వారిని పట్టించుకోలేదు.. దీంతో ఆ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

18:08 - July 29, 2017

నిజమాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా గరగపాడులో దళితులను అగ్రకులస్తులు గ్రామ బహిష్కరణ చేసిన ఘటన దారుణమన్నారు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జరిగిన జిల్లా 4వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో ప్రజా, దళిత సంఘాల నేతలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కృష్ణ మండిపడ్డారు. 

18:06 - July 29, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లా నారాయణపురం మండల శివారులోని శ్రీరామ స్పిన్నింగ్‌ మిల్లులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మిల్లులో పనిచేస్తోన్న 50మంది బాలలకు విముక్తి కల్పించారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటోన్న పరిశ్రమ చైర్మన్‌, ఎండీసహా 16మందిపై కేసులు నమోదు చేసినట్టు రాచకొండ పోలీస్‌ అదనపు కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. ఇందులో 12మందిని అరెస్ట్‌ చేశామన్నారు. విముక్తి పొందిన బాలకార్మికుల్లో 36మంది బాలురు, 11మంది బాలికలు ఉన్నారు. వీరందరూ ఒడిషా,చత్తీస్‌గఢ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిని బాలల సంక్షేమ కమిటీకి అప్పగించినట్టు తరుణ్‌జోషి తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. 

18:04 - July 29, 2017

విజయవాడ : బందరు పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సుమారు 5,300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఇక ప్రైవేట్ పట్టా భూముల సమీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం 2,282 ఎకరాల పట్టా భూములకు గాను.. ఇప్పటి వరకు 550 ఎకరాలు మాత్రమే ఇచ్చేందుకు రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్‌కు అంగీకార పత్రాలు ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు, వారి అనుచరుల పేరిట వందలాది ఎకరాల భూములున్నాయని.. వాటిని పోర్టుకు ఇవ్వకుండా రైతుల భూములను మాత్రమే తీసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

33177.78 ఎకరాల భూమి
బందరు నౌకాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 33177.78 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వీటిలో పోర్టు నిర్మాణానికి 5292.75 ఎకరాలు..ఇండస్ట్రియల్ కారిడార్, మెగాటౌన్ షిప్ కు సంబంధించి 27885.03 ఎకరాలు. వీటిలో ప్రైవేట్ భూములతో పాటు అసైన్డ్ భూములు ఉన్నాయి. పట్టా భూములు 14620.11 ఎకరాలు, అసైన్డ్ భూములు 9117.32 ఎకరాలు, ప్రభుత్వ భూములు 9440.35 ఎకరాలు ఉన్నాయి. పోర్టుకు సంబంధించి రైతుల వివరాలు సమగ్రంగా సేకరించి, వీరందరికీ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. 25 నుంచి 30 ఎకరాల భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు 25 ఎకరాల భూమి ఇచ్చినా..1836 రెవెన్యూ చట్టం ప్రకారం మెట్ట భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి రెండున్నర ఎకరాలకు మించి ప్యాకేజీ ఇవ్వకూడదనే నిబంధన ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంపై ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బందర్‌ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ చేపడితే.. పోరాటం తప్పదని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.

17:59 - July 29, 2017

హైదరాబాద్ : హైదరాబాద్‌లో మళ్లీ స్వైన్‌ ఫ్లూ కలకలం మొదలైంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 15 రోజుల్లోనే.. ఇద్దరు గర్భిణులు... స్వైన్‌ ఫ్లూతో మృతి చెందారు. ఆస్పత్రిలో ఆరుగురికి స్వైన్‌ ఫ్లూ నిర్ధారణ అయిందని.. వ్యాధి ముదిరిపోయిన తర్వాత రావడంతో ఇద్దరిని కాపాడలేకపోయామని డిప్యూటీ సూపరింటెండెంట్‌ నర్సింహరావు తెలిపారు. మరో ఇద్దరు వ్యాధి నయమై.. డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. ఇంకో ఇద్దరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బానీ

హైదరాబాద్: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా షాహిద్ అబ్బానీ ని నియమించారు. 45 రోజుల ప్రధానిగా షాహిద్ కొనసాగనున్నారు.

 

17:22 - July 29, 2017

శ్రీలంక : తొలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధిచింది. 304పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ గెలుపొందింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 245పరుగులకే కుప్పకూలింది.

తాండూరు రైల్వేస్టేషన్‌లో 100 కిలోల గంజాయి స్వాధీనం

వికారాబాద్ : తాండూరు రైల్వేస్టేషన్‌లో 100 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న మహిళ సహా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సీఎం నితీష్ కుమార్ కేబినెట్ విస్తరణ

పాట్నా: సీఎం నితీష్ కుమార్ తన కేబినెట్ ను విస్తరించారు. నితీష్ కేబినెట్ లో 27 మంది మంతులకు చోటు దక్కింది. జేడీయూ, బిజెపి తరపున చెరో 13 మంది, ఎల్ జీపీ తరపున ఒకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

17:04 - July 29, 2017

పుదీనా..ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు. రుచికరంగా ఉండడంతో వీటిని ఆయా కూరల్లో వేస్తుంటారు. కానీ ఈ పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. కొన్ని రోగాలకు దీనిని ఉపయోగిస్తే చక్కటి పరిష్కారం లభిస్తుందంట.
నీరంగా ఉన్నట్లు అనిపిస్తే అరకప్పు పుదీనా రసంలో కొద్దిగానిమ్మరసం, రెండు స్పూనుల తేనెల కలుకుని తాగితే నయమవుతుంది. అంతేగాకుండా ఎసిడిటీతో ఇబ్బంది పడే వారు రోజుకో ఒక గ్లాసు పుదీనా రసం తీసుకుంటే మేలు. కడుపునొప్పితో బాధపడేవారు కప్పు డికాషన్ లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించాక తాగితే కడుపునొప్పి బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అరికాళ్ళు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే మంట తగ్గుతుంది. ఈ ముద్దను గాయాల తాలుకూ మచ్చలకు రాస్తే త్వరగా మాయమౌతాయి.  

అట్టహాసంగా నాల్సార్ విశ్వవిద్యాలయ 15వ స్నాతకోత్సవం

హైదరాబాద్ : నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శామీర్‌పేటలో గల యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికిముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, యూనివర్సిటీ చాన్స్‌లర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ తో పాటు లా విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్.. 49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయ శాస్ర్త పట్టాలను అందజేశారు.

 

304 పరుగుల తేడాతో భారత్ విజయం

గాలె : గాలె టెస్టులో టీమిండియా 304 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఈ రోజు ఉదయం ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన టీమిండియా నిన్న‌టి స్కోరుకి మ‌రో 50 ప‌రుగులు జ‌త‌ చేసి 240 ప‌రుగుల‌కి డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక‌కి 550 ప‌రుగుల టార్గెట్ విధించింది. అయితే ఆరంభంలో కాస్త త‌డ‌బ‌డి వికెట్స్ కోల్పోయిన శ్రీలంక త‌ర్వాత పుంజుకుంది. ఓపెన‌ర్ కరుణర‌త్నే (97), డిక్ వెల్లా గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేశారు. ఇక వీరిద్ద‌రు ఔట్ కావ‌డంతో మిగ‌తా బ్యాట్స్ మెన్ లు పెవిలియ‌న్ క్యూ క‌ట్టారు.

16:30 - July 29, 2017

ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమత్రి..మరొకరు ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్..మరి వీరిద్దరూ ఓ విషయంపై భిన్నంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసు ఎంత కలకలం సృష్టిస్తుందో తెలిసిందే. కెల్విన్ ముఠా పట్టుబడడంతో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. టాలీవుడ్ కు సంబంధించని పలువురు సెలబ్రెటీలను సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు పంపారు. సుమారు 20 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటిదాకా 8 మందిని విచారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే స్పందించింది. ఎవరు ఉన్నా వదిలిపెట్టవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి ఉన్నతాధికారులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పాల్గొన్నారు. సినీ పరిశ్రమపై వేధింపులు ఉండవని, డ్రగ్స్ ను తరిమివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు..నేరస్తులను శిక్షిస్తుందే తప్ప..బాధఙతులను ఇబ్బంది పెట్టదని కేసీఆర్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే డ్రగ్స్ అమ్మకం..సరఫరా చేయడం..వ్యాపారం చేయడం నేరమని..కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వాడినా నేరస్తులేనంటూ ఇటీవలే తెలంగాన ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ..అకున్ సబర్వాల్ చెప్పింది నిజమా ? కేసీఆర్ చెప్పింది నిజమా ? అనే చర్చకు తెరలేపినట్లైంది.

సినీ ప్రముఖులను బాధితులగానే చూస్తామని కేసీఆర్ పేర్కొనడంతో కేసు అటకెక్కించే ప్రయత్నాలు జరుగుతాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ తీవ్రత అంతగా లేదని చెప్పడాన్ని పలువురు పేర్కొంటున్నారు. ఈ కేసు కూడా గతంలోగానే నీరుగారిపోతుందనే విమర్శలున్నాయి. 

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని నిప్పులు..

హైదరాబాద్ : ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందని.. వాటిని మానుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. సిరిసిల్ల ఘటనపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయాలకతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కుటుంబ రాజకీయాల గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆధారాలు లేకుండా అడ్డగోలు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలు తక్షణమే కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

వీఆర్ ఏ పై చేయిచేసుకున్న జాయింట్ కలెక్టర్

మహబూబ్ నగర్ : ధర్మాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ ఏ పై జేసీ చేయిచేసుకున్నాడు. భూముల వివరాలు సరిగ్గా చెప్పలేదని వీఆర్ ఏ పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వీఆర్ ఏ పాషాకు మద్దతుగా వీఆర్ ఓలు విధులు బహిష్కరించి, జాయింట్ కలెక్టర్ పై కలెక్టర్ కు వీఆర్ ఏలు ఫిర్యాదు చేశారు.

16:07 - July 29, 2017

కామారెడ్డి : జిల్లాగా మారడంతో ... కామారెడ్డి పట్టణంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఒకప్పుడు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు .. ఉండే గజం భూమి ధర... నేడు పది వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. కామారెడ్డి జిల్లా... నిజామాబాద్ జిల్లాకు... హైదరాబాద్‌కు మధ్యలో ఉండడం... జిల్లాగా మారడంతో పట్టణంలో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని 527 సర్వే నెంబర్‌లో కలెక్టరేట్ నిర్మాణానికి 92 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న భూములకు డిమాండ్ పెరిగింది. ఆ భూముల ధరలు ఐదింతలు నుంచి పదింతలు వరకు పెరిగాయి. అలాగే అడ్లూరు, శాబ్దిపూర్, గర్గుల్‌, రామేశ్వర్పల్లి క్యాసంపల్లి పాతరాజంసేట్ తదితర గ్రామ శివారులో గజం రేటు వందల్లో పలకగా ప్రస్తుతం వేల రూపాయలు పలుకుతున్నాయి.. ఎకరం పొలం కోటి రూపాయల వరకూ పలుకుతోందని సమాచారం.

ముందుగానే కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
దీంతో కలెక్టర్‌ కార్యాలయం కోసం సేకరించిన భూమి... చుట్టు పక్కన గల స్థలాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే కొనుగోలు చేసి ప్లాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఐదు వందల ఎకరాలకు పైగా ప్లాట్లను తయారు చేశారు. మరికొంతమంది వ్యాపారులు కలెక్టరేట్ ప్రతిపాదిత స్థలంలోనే ప్లాట్లు చేసి గజానికి ఐదు వందల నుంచి 8 వందల వరకు విక్రయించారు. మొత్తానికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తోంది. భూముల ధరలు పెరిగిపోవడంతో... ఇల్లు కట్టుకోవాలనే ఆశ.. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీరని కోరికగానే మిగిలిపోతుందని స్థానికులు అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ దందాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.  

16:05 - July 29, 2017

నిజమాబాద్ : జిల్లా పరిషత్‌ రాష్ట్రంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలు కలిపి 36 మంది జడ్పీటీసీలు ఉన్నారు. గతంలో జిల్లా పరిషత్‌ లో పుష్కలంగా నిధులు ఉండటంతో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయ్యింది. జిల్లా పరిషత్‌ నేడు నిధులు లేక వెలవెలబోతోంది. ప్రజాప్రతినిధులు ప్రజలకి హామీలను నెరవేర్చక పోయే సరికి ప్రజాక్షేత్రంలో తలెత్తుకు తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అధికారులు, శాసన సభ్యులు తమను పట్టించుకోవట్లేదంటూ ఆందోళన చెందుతున్నారు.జిల్లా పరిస్థితి గురించి మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ప్రతిపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల నిర్వీర్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాపరిషత్‌ సభ్యులు, మండల పరిషత్‌ సభ్యులు సర్పంచ్‌ లు నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నారని అన్నారు. నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలైన జిల్లా మండల పరిషత్‌ లకు రావాల్సిన నిధులలో కోత విధించాయి. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే "బీఆర్జిఎఫ్‌" నిలిచిపోగా 14 వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కాలేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకి రావల్సిన నిధుల్లో వాట ఇవ్వడం లేదని .. దీని ద్వారా అభివృద్ధి కుంటుపడుతోందని వామపక్షాలు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా జిల్లాకి రావాల్సిన నిధులు రాక మౌళిక వసతులు కుంటుపడ్డాయని సీపీఎం నాయకులు ఆరోపించారు. మొత్తం మీద ప్రభుత్వ నిర్లక్ష్యం.. జిల్లా అభివృద్ధిని కుంటుపరుస్తోందని విపక్షాలు వాపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

16:04 - July 29, 2017

గుంటూరు : కార్పొరేటు స్కూలు ధృవపత్రాలు ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలో సరస్వతి విద్యాలయం పేరుతో స్కూలు నడుస్తోంది. దీన్ని కార్పొరేటు యాజమాన్యం సొంతం చేసుకుంది. సరస్వతి విద్యాలయం పేరుతో అనుమతి ఉన్న ఈ స్కూల్‌ని పబ్లిసిటీ కోసం శ్రీ చైతన్య టెక్నో స్కూలు పేరుతో నడుపుతోంది. దీంతో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థి సంఘం నేతలు ఆందోళనకు దిగారు. చైతన్య టెక్నో స్కూలు పేరుతో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా.. పిల్లలకు ఇచ్చే సర్టిఫికెట్స్‌, బుక్స్‌ శ్రీ చైతన్య పేరుతోనే మెయింటెనెన్స్‌ చేస్తుండగా డిప్యూటి డీఈవో తనిఖీ నిర్వహించారు. స్కూల్‌కి లైసెన్స్‌ లేదని, సర్టిఫికెట్‌ లేదని స్కూలు బస్సు డ్రైవర్స్‌కి హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేవని చెప్పారు. వచ్చిన అధికారిని నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అవమానకరంగా మాట్లాడటంతో అధికారి విస్తుపోయారు.

తల్లిదండ్రులను మోసం చేస్తోన్న యాజమాన్యం
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. మంగళగిరిలో శ్రీ చైతన్య టెక్నో స్కూలుకు గుర్తింపు లేకుండా యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తోంది. ఈ విషయాన్ని విద్యార్థి సంఘం నాయకులు స్కూల్‌ ఎంఈవోకి తెలియజేశారు. ఆయన వచ్చి ఈ స్కూలుకి గుర్తింపు లేదని చెప్పి.. శ్రీ చైతన్య టెక్నో స్కూలు పేరుతో ఉన్న బ్యానర్లను తొలగించారు. ఇక్కడి స్కూల్‌కి ఎలిమెంటరీ నుండి ఐదవ తరగతి వరకు అనుమతి లేదని.. హైస్కూలేనని ఎంఈవో చెప్పారు. స్కూల్‌లో 1000 మంది స్టూడెంట్స్‌ ఉన్నారన్నారు. వీరికి శ్రీ చైతన్య సంస్థవారు వసతులు ఏర్పాటు చేయలేదని.. తరగతి గదులు చాలక బాత్‌రూమ్‌ల ప్రక్కన క్లాసులు నడుపుతున్నారని, పిల్లలు హోంవర్క్‌ చేయకపోతే ఎండలో మోకాళ్లపై నిలబెడుతున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధంగా, అక్రమంగా స్కూలు నడుపుతున్నందుకు వారిపై కేసులు నమోదు చేసి, అనుమతి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యమం ఉధృతం
విద్యార్థులు పరిమితి కంటే ఎక్కువ మంది ఉండటంతో.. వారిని వేరే పాఠశాలకు తరలించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని ఎంఈఓని కోరినట్లు విద్యార్థి సంఘం నేతలు చెప్పారు. నియమాలకు విరుద్ధంగా నడుస్తున్న శ్రీ చైతన్య టెక్నోపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.

16:02 - July 29, 2017

హైదరాబాద్ : చేయడం లేదని మండిపడ్డారు టీ మాస్ కమిటీ సభ్యులు జాన్ వెస్లీ. టీఆర్ఎస్‌ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం ఆగస్టు 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. టీ మాస్ చేపడుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు టీ మాస్ కన్వీనర్ విశ్వేశ్వరరావు. సామాజిక తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌ జరిగిన టీ మాస్ సమావేశంలో జాన్ వెస్లీ, విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. 

16:02 - July 29, 2017

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలిశారు. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు... రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వీరిద్దరి మధ్య ప్రస్తుత రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతల అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. 

16:00 - July 29, 2017

హైదరాబాద్ : తమ ఆస్తులను రక్షించుకోవడంలో జీహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైంది. నగరవ్యాప్తంగా వేలాది ఆస్తులు ఉన్న కార్పొరేషన్‌.. అధికారుల నిర్లక్ష్యంతో కబ్జాదారుల చేతిలో పడింది. ప్రధానంగా మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కమ్యూనిటీ హాళ్లు, పార్క్‌ల్యాండ్స్‌తో పాటు బహిరంగ స్థలాలున్నాయి. వీటి నుండి బల్దియాకు... ఏడాదికి కనీసం రెండు కోట్ల రూపాయలు కూడా రావడం లేదు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో బల్దియాకు ఉన్న ఆస్తులు సైతం చేజారుతున్నాయి.బల్దియాలో... 25 ఏళ్లలోపు లీజుకు ఇచ్చిన ఆస్తులన్నీ ఒకవేయి 3వందల 55 ఉండగా, వీటిలో 751 మార్కెట్‌ స్టాల్స్‌, 599 షాపింగ్‌ మాల్స్‌, 52 షాపింగ్‌ కాంప్లెక్సులు ఉన్నాయి. 26 నుండి 30 ఏళ్ల వరకు లీజుకు ఇచ్చినవి 74 ఆస్తులు ఉండగా... 13 మార్కెట్‌ స్టాల్స్, 52 షాపింగ్ కాంప్లెక్సులు, 9 ఖాళీ స్థలాలు ఉన్నాయి. 31 నుండి 40 ఏళ్ల వరకు లీజులో ఉన్న ఆస్తులు 515 కాగా, 50 ఏళ్ల వరకు లీజులు ఉన్నవి 645 ఆస్తులు ఉన్నాయి.

కోట్లాది రూపాయల ఆర్జిన
ఇక 50 ఏళ్లకు పైగా లీజులో ఉన్నవి 480 ఉన్నాయి. ఇలా మొత్తం 3వేల ఆస్తులు బల్దియాకు ఉన్నాయి. వీటిని లీజుకి పొంది సేవాకార్యక్రమాలు చేసేవారు మినహా మిగతా అందరూ ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కాని వారు బల్దియాకు చెల్లిస్తున్నది నామినల్‌ రేటు మాత్రమే. 1996లో ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ పేరుతో 16,940 గజాల భూమిని లీజుకు తీసుకున్నారు. ఇందులో క్లబ్‌ హౌజ్‌ రెస్టారెంట్‌, మీడియా హాల్‌, ఓపెన్‌ థియేటర్‌, ఫుడ్‌ కోర్టుతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే వీరు బల్దియాకు చెల్లిస్తున్నది మాత్రం ఏడాదికి 5 వేల రూపాయలు మాత్రమే. ఇలా బల్దియా తన ఆదాయాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే తమ ఆస్తులు కరగడానికి కారణం.. చట్టంలోని లోపాలే ప్రధాన కారణమంటున్నాయి బల్దియా వర్గాలు. చట్టాన్ని పక్కన పెట్టి కొందరు అధికారులు తమ ఇష్టానుసారంగా బల్దియా ఆస్తులను లీజు పేరుతో ధారాదత్తం చేశారు. బల్దియాకు చెందిన ఆస్తులన్నీ కేవలం ఒక్క ఏడాదికి మాత్రమే లీజుకు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హక్కు ఉంటుంది.

గరిష్టంగా మూడేళ్లు మాత్రమే
స్టాండింగ్‌ కమిటీ కూడా గరిష్టంగా మూడేళ్లు మాత్రమే లీజుకు అనుమతిస్తూ నిర్ణయం చేయగలుగుతుంది. కాని చాలా ఆస్తుల విషయంలో ఏడాదికి మించి లీజు ఒప్పందం చేసుకుంటున్నారు బల్దియా అధికారులు. వీటిని అలానే పొడిగిస్తూ 25 ఏళ్లకు మించితే ఈ ఆస్తులపై జీహెచ్ఎంసీ కి ఎలాంటి హక్కు లేకుండా పోతుందని బల్దియా ఉన్నతాధికారులు తాజాగా గుర్తించారు. ఈ పరిస్థితిని సవరించుకునే పనిలో పడ్డారు బల్దియా అధికారులు. ఇందుకోసం 1955 మున్సిపల్‌ యాక్ట్‌లో ఉన్న లోపాలను సవరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. అయితే ఇప్పుడు చట్ట సవరణ జరిగి జీహెచ్ఎంసీ ఆస్తులు రక్షించబడుతాయా, లేక ఎప్పటిలాగానే ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయా అనేది తేలాల్సిఉంది. 

ఘనంగా సినారె జయంతి వేడుకలు...

హైదరాబాద్ : రవీంద్రభారతిలో సినారె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ కవిత, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. స్మరనారాయణీయం పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కించారు. ఈ సందర్భంగా ఆచార్య గోపి ప్రసంగిస్తూ... సినారె అదృశ్య రూపంలో మనలోనే ఉన్నట్లు ఉంది. కవులంటే సీఎం కేసీఆర్‌కు మహా అభిమానమన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సి నారాయణరెడ్డి భావ విన్యాసాలు మధురాతి మధురం. సినారె అభ్యుదయ దృక్పథం కలిగిన వ్యక్తి అన్నారు.

మధ్యాహ్న భోజన కార్మికురాలి కూతురి పై టీచర్ అత్యాచారయత్నం

పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట హైస్కూల్ లో మధ్యాహ్న భోజన కార్మికురాలి కూతురి టీచర్ అత్యాచారయత్నం చేశారు. పెద్దగా కేకలు వేయడంతో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పరారయ్యాడు. అనంతరం బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేసింది.

దిగ్విజయ్ కు నాంపల్లి కోర్టు సమన్లు

హైదరాబాద్:కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కు నాంపల్లి క్రిమినల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 10లోగాకోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. యూపీ ఎన్నికల్లో అమిత్ షా, అసదుద్దీన్ లు మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దిగ్విఇజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం నేత అన్వర్ కోర్టుకు వెళ్లాడు.

15:21 - July 29, 2017

హైదరాబాద్ : కాల్పులపై విక్రమ్ గౌడ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. నాపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడని, వెంటనే కేకలు వేయడంతో తన భార్య క్రిందకు వచ్చిందని 108కి ఫోన్ చేయమని ఫిపాలికి తనే చెప్పానని, షిపాలి కారులో అపోలోకు వెళ్లామని విక్రమ్ గౌడ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. 

కాల్పులపై విక్రమ్ గౌడ్ వాంగ్మూలం....

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ వాంగ్మూలాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు రికార్డు చేశారు. వేకువజామున 3.30 గంటల సమయంలో కారులో వచ్చిన వ్యక్తి నా పై కాల్పులు జరిపాడని విక్రమ్ గౌడ్ తెలిపాడు. కేకలు వేయడంతో మేడపై నుంచి నా భార్య షిపాలి వచ్చిందని, అప్పటికే దుండగుడు పారిపోయాడని, రక్తపు మడుగులో పడి ఉన్న నన్ను నా భార్య షిపాలి, డ్రైవర్, వాచ్ మన్ అపోలో ఆస్పత్రికి తరలించారని విక్రమ్ చెప్పాడు.

15:07 - July 29, 2017

'ఎవరిది ప్రజా పాలన..ఎవరిది దుర్మార్గ పాలన..దుర్మార్గం..సన్మార్గం మధ్య పోటీ..మీరా చెప్పేది..అవినీతిలో కూరుకపోయి జైలుకు వచ్చిన వారు నీతులు చెబుతారా..అధికారం నాదా..నీదా' అంటూ నేతలు విమర్శలు..ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సి.. పరిష్కరించాల్సిన నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఏంటీ ? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ..అధికారపక్ష మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సై..సై అంటే సవాళ్లకు దిగుతున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అంది వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా అధిక ఓటు శాతం దక్కించుకున్నామని..ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా వివిధ సభలు..సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయ వేడిని రగిలిస్తోంది. అధికారపక్షమైన టిడిపిని తూర్పారపడుతోంది. ఇటీవలే జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో టిడిపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించింది. దుర్మార్గం..సన్మార్గం మధ్య పోటీ జరుగుతుందని అప్పుడే ఆ పార్టీ ప్రకటించింది.

దీనిపై అధికార పక్ష నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఎవరిది దుర్మార్గమైన పాలన..ఎవరిది సన్మార్గ పాలన అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో కేసులు..ఛార్జీషీట్లు నమోదై జైలుకు వెళ్లి వచ్చిన వారు నీతులు చెబుతారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ గురించి మాట్లాడుతారా అంటూ మంత్రులు గళవిప్పుతున్నారు.

అధికారం నీదా ? నాదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది. అధికారం కోసం నేతలు ఇప్పటి నుండే తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ప్రజా సమస్యలపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం కాకుండా ముందు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని వామపక్షాలు సూచిస్తున్నాయి. 

గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం మధ్యాహ్నం కలిశారు. శుక్రవారమే హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు...ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. కాగా... వీరిద్దరి మధ్య పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

14:35 - July 29, 2017

హైదరాబాద్ : ఓయూలో నాన్ బోర్డర్స్ ను ఖాళీ చేయించడానికి అధికారలు పలు చర్యలకు దిగుతున్నారు. ఓయూలో ఉంటున్న నాన్ బోర్డర్స్ వారు ఖాళీ చేయాలని అధికారులు ఇటీవలే హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నాన్ బోర్డర్స్ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు ఖాళీ చేయకపోవడంతో నీళ్లు..కరెంట్ కట్ లాంటి చర్యలకు దిగుతున్నారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం రోడ్డెక్కారు. జులై 15 నుండి అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నా ఇంతవరకు హాస్టల్స్ ఓపెన్ చేయ లేదని, ఉద్యమ సమయంలో ఇబ్బందులు ఎదురు కాలేదని పేర్కొన్నారు. మరి ఈ సమస్య తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:30 - July 29, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా సెలబ్రెటీలను సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ ముఠా పట్టుబడడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా టాలీవుడ్ కు డ్రగ్స్ లింక్ ఉందని సిట్ భావిస్తూ పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, శ్యామ్ కె.నాయుడు, నవదీప్, రవితేజలను విచారించిన సంగతి తెలిసిందే.

శనివారం రవితేజ దగ్గర పనిచేసిన మాజీ డ్రైవర్ శ్రీనివాస రావును సిట్ విచారించింది. ఉదయం నుండి కొనసాగిన ఈ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. విచారణలో డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ను శ్రీనివాస రావు తీసుకొచ్చి రవితేజకు ఇచ్చాడని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలే కాకుండా ఇతర వాటిపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోమవారం తనీష్..మంగళవారం నందులను సిట్ బృందం విచారణ జరుపనుంది. 

మాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం: విక్రమ్ గౌడ్ భార్య షిపాలి

హైదరాబాద్: కాల్పుల ఘటనపై అన్ని విషయాలను పోలీసులకు వివరించామని విక్రమ్ గౌడ్ భార్య షిపాలి మీడియాకు చెప్పారు. నిన్నటి ఘటనపై నా భర్త అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని, ఘటనపై అన్ని వివరాలు పోలీసులే చెబుతారని, మాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం అని షిపాలి మండి పడ్డారు.

ఉద్దానం ప్రాంతానికి హార్వర్ట్ నిపుణుల బృందం

శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతానికి హార్వర్డ్ వర్శిటీ కిడ్నీ వ్యాధుల నిపుణుల బృందం చేరుకుంది. కాసేపట్లో కవిటి మండలం గొరివంకలో ఈ బృందం పరిస్థితిని అంచనా వేయనుంది.

13:54 - July 29, 2017

విశాఖ : ఎండుచేపలకు కష్టం వచ్చింది. ఫిషింగ్‌ హార్బర్‌లో ఎగుమతులు నిలిచిపోయాయి. జీఎస్టీ ఎఫెక్ట్‌తో  ఎండుచేపల ధరలు అమాంత పెరిగాయి. రేటు ఆకాశాన్నంటడంతో  అమ్మాకాల్లేక రోజుగడవని స్థితిలో పడియోరు విశాఖ మత్స్యకారులు. విశాఖ మత్స్యకార్మికుల కష్టాలపై టెన్‌టీవీ ఫోకస్‌..
మత్స్యకారులపై జీఎస్టీ పిడుగు
ఎండుచేపలు అమ్ముకుని జీవించే మత్స్యకారులపై జీఎస్టీ పిడుగుపడింది. ఎండుచేపల అమ్మకాలపై పన్ను వేస్తుండటంతో విశాఖలో వ్యాపారంసాగక మత్స్యకార్మికులు ఉసూరుమంటున్నారు. విశాఖ నగరంనుంచి రోజుకు 30 కోట్లరూపాయల విలువైన చేపలఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. ఇందులో దాదాపు 5 కోట్ల విలువైన ఎండు చేపలు విదేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇక్కడ దాదాపు 500 మత్స్యకార కుంటుంబాలు ఎండుచేపల వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేపలను ఎండబెట్టి వాటిని వివిధ రకాలుగా విడదీసి..ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చెయ్యడం వీరి ప్రధాన వృత్తి. 
బుట్ట ఎండు చేపలు 50 రూపాయలు
ఒక్కో బుట్ట ఎండు చేపలు 50 రూపాయలవరకు పలుకుతాయి. అమ్మాకలు బాగుంటే ఒక్కో సారి బుట్ట ఎండు చేపలకు  100 రూపాయలు కూడా వస్తాయి. వీటికి అదనంగా మరో 50 రూపాయలు పన్నులు ఇతర ఖర్చులు ఉంటాయి. దీంతో అటు వినియోగదారుడికి కూడా ధరలు అందుబాటులో ఉండటంతో ఎండుచేపల వ్యాపారం జోరుగా సాగేది. కాని.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ పన్నుల విధానం ఇపుడు ఎండుచేపల వ్యాపారాన్ని దెబ్బతీసింది. 
200లకు చేరిన ఎండు చేపల ధర 
జీఎస్‌టీ భారంతో బుట్ట ఎండుచేపల ధర ఏకంగా 200లకు చేరుకుంది. దీంతో వినియోగదారుడు ఎండుచేపలు కొనడమే మానేశారు. అమ్మకాలు మందగించడంతో వ్యాపారులు కూడా మత్స్యకారుల నుంచి చేపలు కొనడం తగ్గించేశారు. దీంతో ఏరోజుకారోజు చేపలు అమ్ముకుని ఇల్లుగడుపురే మత్స్యకారుల జీవనం కటకటగా మారింది. జీఎస్టీ వల్ల ఉపయోగాలు ఉంటాయని చెబుతుంటే  తాము సంతోషపడ్డామని..కాని ఇపుడు ఉపాధికి ఎసరోచ్చిందని మత్స్యారులు అవేదన వ్యక్తం చెస్తున్నారు. ఇప్పటికైనా తమ జీవనాధారమైన ఎండుచేపలను జీఎస్టీ పరిధినుంచి మినహాయించాలని మత్స్యకారులు కోరుతున్నారు.  

 

13:49 - July 29, 2017

కరీంనగర్‌ : ఒకప్పడు ఆ ఇద్దరు గురుశిష్యులు...కాని రాజకీయ పరిణామాలు వారిని బద్ధ శత్రువులుగా మార్చేశాయి. మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేకు ఓటర్లు ఝలక్‌ ఇచ్చి శిష్యుడికి పట్టం కట్టడంతో సీన్‌ మారిపోయింది. వీరిలో గురువు మాజీ మంత్రి శ్రీధర్ బాబు అయితే.. శిష్యుడు ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టమధు. మంథని నియోజకవర్గంలో ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికారం కోసం ఆరాటం ఒకరిదైతే..పట్టు నిలుపుకునే ప్రయత్నం మరొకరిది. గురుశిష్యుల కోల్డ్‌వార్‌తో మంథని పాలిటిక్స్‌ కాకపుట్టిస్తున్నాయి. 
టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఆధిపత్యపోరు 
కరీంనగర్‌ జిల్లా మంథనిలో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. అధికార టిఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న మంథని నియోజక వర్గంలో 2014 ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గులాబి జెండా రెపరెపలాడింది. ఓటర్లు పుట్ట మధుకు పట్టం కట్టారు. శ్రీధర్ బాబు మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి హ్యట్రిక్ సాధించారు. పౌర సరఫరాల మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విఫ్‌గా సేవలందించారు. శ్రీధర్‌ బాబు మంత్రిగా ఉన్న సమయంలో ప్రదాన అనుచరుడిగా పుట్ట మధు...అన్ని తానై నియోజక వర్గ పనులు చక్కబెట్టారు. కాంగ్రెస్ వీడిన మధు మొదట టిడిపి, ఆ తర్వాత పీఆర్పీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ కలిసి రాకపోవడంతో కారు పార్టీకి జైకొట్టారు.   శ్రీధర్ బాబుపై ఉన్న వ్యతిరేకత, పుట్ట దంపతులపై ఉన్న సానుభూతి 2014 ఎన్నికలకు వెళ్లిన మధుకు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. ఇప అప్పటి నుంచి ఒకప్పటి గురుశిష్యుల మధ్య ఆదిపత్య పోరాటం కొనసాగుతోంది. 
పార్టీ బలోపేతానికి మధు విస్తృత ప్రయత్నాలు
పుట్ట మధు రాజకీయంగా తన అనుచరులను, పార్టీ క్యాడర్‌ను పెంచుకునే ప్రయత్నం కొనసాగించారు. శ్రీధర్ బాబుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మూడేళ్ల పాటు మౌనం వహిస్తు...క్రీయాశీల రాజకీయాలకు అంటీముట్టన్నట్లుగా ఉన్నారు.  శ్రీధర్ బాబు ఇటీవల తిరిగి మంథనిలో తన కార్యకలాపాలను విస్తృతం చేశారు. అధికార టిఆర్ఎస్ తీరుపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ పూర్వ వైభవం కోసం ముమ్మర ప్రయత్నలు చేస్తున్నారు. గతంలో తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునే దిశగా సాగుతున్నారు. ఎమ్మెల్యే మధును టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఇటివల మధు శ్రీధర్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్‌ అటాక్‌ ఇస్తున్నారు. శ్రీధర్ బాబు అనుచరుడు కాటారం జడ్పిటిసి నారయణ రెడ్డి, మధు మధ్య వాగ్వాదం తీవ్ర దుమారం రేపింది. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలుస్తావో చూస్తమంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. శ్రీధర్ భాబు తెలివిగా మధును ఇరకాటంలో నెట్టడానికి రాజకీయంగా పావులు కదుపుతున్నరని రాజకీయ విశ్లేకులు భావిస్తున్నారు. రాబోయే  ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇద్దరు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గురుశిష్యుల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్‌లో 2019 ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. 

13:46 - July 29, 2017

వనపర్తి : పల్లెలను ముంచొద్దు ... పొట్ట కొట్టొద్దంటూ.. నిర్వాసితులు కోరుతున్నారు.  అభివృద్ధి పేరుతో.. ఇళ్లు, భూములు లాక్కోవడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలో నిర్మిస్తున్న ఎదుల రిజర్వాయర్ నిర్మాణంతో రోడ్డున పడుతున్న నిర్వాసితులు.. .ప్రభుత్వంపై పోరు ప్రారంభించారు. తగిన పరిహారం ఇచ్చేంత వరకూ... కదిలేది లేదంటూ..తేల్చి చెబుతున్నారు.
అరకొర పరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్‌  నిర్మాణాలు... అనేక గ్రామాల ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్నాయి. పాలకుల అరకొర పరిహారం చెల్లింపులతో.. నిర్వాసితులు ఉపాధికి, వసతికి దూరం అవుతున్నారు. రైతుల ఇళ్లు, భూములు లాక్కుని రోడ్డున పడేలా చేస్తున్నారు. దీంతో వారంతా ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. 
ముంపునకు గురవుతున్న రెండు గ్రామాలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా... వనపర్తి జిల్లా... రేవల్లీ మండలంలో ప్రభుత్వం ఎదుల రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ నిర్మాణం వల్ల బండరాయిపాకుల, కోంకలపల్లి,  ఎదుల, తిగలపల్లి, నాగపుర్ గ్రామాల రైతులు ఐదు వేల ఎకరాలకు  పైగా  భూములను కోల్పోతున్నారు.  దీంతో ఆయా గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  తమ బతుకులు ఏమిటంటూ.. ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వం మాత్రం పట్టా ఉన్న వారికి 5.5 లక్షలు, అసైన్డ్‌ భూమి ఉన్న వారికి 3.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడానికి సిద్ధమైంది.
ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం 
అరకొర పరిహారంతో...నిర్వాసితులుగా మారుస్తున్న ప్రభుత్వ చర్యలపై ముంపు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ధర్నాలు, ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... పూర్తి పరిహారం చెల్లించాలని.. పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం  మాత్రమే తమకు పరిహారం చెల్లించాలని.. ఆయకట్టు కింద భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ముంపునకు గురవుతున్న రెండు గ్రామాల ప్రజలు పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేస్తామని తేల్చి చెబుతున్నారు.  మేలు చేస్తాడని ఎన్నుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి  గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ.. వాపోతున్నారు.  
ప్రజల పోరాటానికి సీపీఎం మద్దతు
ఆ గ్రామాల ప్రజల పోరాటానికి సీపీఎం కూడా మద్దతుగా నిలిచింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ గ్రామాల్లో పర్యటించి.. నిర్వాసితుల బాధలను తెలుసుకున్నారు. వారికి న్యాయం జరిగే వరకూ సీపీఎం పార్టీ తోడుగా ఉంటుందని తమ్మినేని హామీ ఇచ్చారు.  

13:38 - July 29, 2017

సంగారెడ్డి : భవిష్యత్‌లో సోలార్‌కు మంచి రోజులు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో సోలార్‌ ప్రీమియర్‌ మాడ్యుల్‌ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. రూ.100 కోట్ల పెట్టుబడితో రూపొందించిన ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు మరెన్నో ఏర్పాటు చేసి... యువత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. 

 

13:37 - July 29, 2017

ప్రకాశం : జిల్లాలోని దేవరాపల్లి బాధితులను సీపీఎం పొలిట్‌ బ్యూరో  సభ్యుడు రాఘవులు పరామర్శించారు. సీపీఎం, కేవీపీఎస్‌ దళిత సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివాదాస్పద భూముల్లో తవ్విన చెరువులను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

13:33 - July 29, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే విక్రమ్‌గౌడ్‌, ఆయన భార్య శిల్పాను పోలీసులు వేర్వేరుగా విచారించారు. ఇప్పటికే ముఖేష్‌గౌడ్‌ ఇంటి నుంచి వెపన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.... బుల్లెట్‌, గన్‌పౌడర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. విక్రమ్ గౌడ్ నాటకం ఆడుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో విక్రమ్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మరోవైపు ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్ ల మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మరోసారి విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు విచారించనున్నారు. 

 

13:24 - July 29, 2017

హైదరాబాద్ : సినీనటుడు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరావు సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. కెల్విన్‌తో నేరుగా సంబంధాలున్న శ్రీనివాసరావు... రవితేజ కోసమే డ్రగ్స్‌ తెచ్చేవారా? లేక ఇతర నటులకూ డ్రగ్స్‌ అందించేవారా? అన్న అంశంపై కూపీ లాగనున్నారు. కీలక సమాచారం కోసం సిట్‌ ప్రయత్నిస్తున్నారు. నిన్న రవితేజను సిట్‌ విచారించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

బీహార్ కేబినెట్ లో బిజెపి 16, జేడియూ 19 మందికి చోటు

పాట్నా: సాయంత్రం 5గంటలకు బీహార్ సీఎం తన కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో 35 మందికి చోటు కల్పించనున్నారు. జేడీయూ19, బిజెపి నుండి 16 మందికి కేబినెట్ చోటు కల్పించానున్నారు.

13:01 - July 29, 2017

నల్గొండ : ప్రభుత్వ పాఠశాలను కాపాడాల్సినవారే బడి ఆస్తిని కాజేశారు.. శిధిలావస్థకు చేరిందంటూ స్కూల్‌లోని కలపపై కన్నేశారు.. పక్లా ప్లాన్‌వేసి ప్రాపర్టీని పక్కదారి పట్టించారు.. ఆ స్కూల్‌ ఎక్కడుంది? ఎవరి అండతో ఇదంతా జరిగింది? 10 టీవీ ప్రత్యేక కథనం.. 
ఎనభై ఏళ్లక్రితం ఏర్పాటైన పాఠశాల 
నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో ఎనభై ఏళ్లక్రితం ఏర్పాటైన పాఠశాల ఇది.. ఈ స్కూల్‌లో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పింది.. ఎప్పుడు చిన్నారుల రాకపోకలతో సందడిగాఉండే ఈ స్కూల్‌లోని కొన్ని గదులు శిధిలావస్థకు చేరాయి.. ఇవి కూలిపోతే చాలాప్రమాదమంటూ హెడ్‌మాస్టర్‌ సర్పంచ్‌ దృష్టికితెచ్చాడు.. ఇదే అదనుగా భావించిన సర్పంచ్‌ అల్లుడు... ఈ గదుల్లోని కలపను కాజేసేందుకు ప్లాన్‌ వేశాడు.. భవనాలను కూల్చివేయాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాయించాడు.. ఈ లెటర్‌పై స్పందించిన అధికారులు... కూల్చివేతకు నిధులు లేవని... గ్రామపంచాయితీగానీ... స్వచ్ఛందసంస్థల సాయంగానీ తీసుకోవాలని సూచించారు..
గదుల కూల్చివేత
అధికారునుంచి లేఖ అందాక అసలు కథ ప్రారంభమైంది.. సర్పంచ్‌ అనారోగ్యానికి గురికావడంతో అతని అల్లుడు రంగంలోకి దిగాడు.. గదుల కూల్చివేతకు 75వేల రూపాయల గ్రామపంచాయితీ నిధులు కేటాయించేలా  చేశాడు.. ఆ డబ్బుతో ఆరు తరగతి గదుల్ని నాలుగు నెలలకింద కూల్చివేయించారు.. అందులోఉన్న వందలకొద్దీ నల్లమద్ది దూలాలు, వాసాలు, చెక్కల్ని అమ్మేందుకు సిద్ధమయ్యాడు..  ట్రాక్టర్లకొద్దీ నాపరాళ్లు, పునాది రాయిని అమ్మేశాడు.. ఈ సామగ్రి విలువ 8లక్షలకుపైగా ఉండటంతో విషయం బయటకువచ్చింది.. గ్రామ ఎంపీటీసీ మేకల పార్వతమ్మ దీనిపై కలెక్టర్‌కు లేఖ రాశారు.. వెంటనే కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.. దీంతో భయపడ్డ సర్పంచ్‌ అల్లుడు అమ్మగా మిగిలిన వస్తువుల్ని రాత్రిరాత్రే స్కూలులో పెట్టించాడు.. అయితే తీసుకువెళ్లిన వస్తువులతోపోలిస్తే వచ్చింది అంతంతమాత్రమేనని గ్రామస్తులు అంటున్నారు..
స్కూల్‌ సామాను అమ్మకంలో హెచ్‌ఎం హస్తం
ఈ అక్రమం వెనక హెచ్‌ఎం హస్తంకూడా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.. ప్రధానోపాధ్యాయుడికి తెలియకుండా ఓ ప్రైవేట్ వ్యక్తి స్కూల్‌ కలప ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు.. పాఠశాల కలప అమ్మకంపై సమగ్ర విచారణ జరిపించి... బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

 

ఆర్జేడీ నేత దారుణ హత్య

పాట్నా: బిహార్‌లో ఆర్జేడీ నేత శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన నేత మిన్హజ్‌ఖాన్‌ తన ఇంట్లో నిద్రపోతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. షేక్‌పుర గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆయన శరీరంలోకి ఐదు బుల్లెట్లు దిగినట్టు పోలీసులు తెలిపారు.

13:00 - July 29, 2017

లైంగిక వేధింపులు..ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య. ఇందులో పలువురు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఆయా సందర్భాల్లో సెలబ్రెటీలు పేర్కొన్నారు కూడా. తాజాగా ఈ జాబితాలో 'అక్షయ్ కుమార్' కూడా చేరాడు. ఆయనకు లైంగిక వేధింపులు ఏమిటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఇది చదవండి..
ఇటీవలే ముంబైలో మానవ అక్రమ రవాణా అంశంపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు 'అక్షయ్ కుమార్' కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'అక్షయ్' మాట్లాడారు. తన చిన్నతనం నాడు జరిగిన ఓ ఘటనను ప్రస్తావించారు. 'నా చిన్నప్పుడు మేముంటున్న అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ లో వెళుతున్నా. అక్కడే ఉన్న లిఫ్ట్ బాయ్‌ ఎక్కడపడితే అక్కడ నన్ను తాకాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. దాంతో వాళ్లు అతన్ని హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత కూడా అతను ఇలాంటి కేసులోనే చిక్కుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు'. అని తెలిపారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని..పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే పెద్దవారికి చెప్పాలని సూచించారు. 

శ్రీవారి సన్నిధిలో మంత్రి తుమ్మల

తిరుప‌తి: తిరుమల శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులను ఆయ‌న పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి ఆయ‌న‌కు దర్శనం చేయించారు. దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ‌ ప్రసాదాలు అందించారు అర్చకులు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తుమ్మల. తన మనవడి పుట్టెంటుక‌లు తీయడానికి తిరుమల వచ్చానని, ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు పోవాలని ఆ దేవదేవున్ని ప్రార్దించానని ఆయన పేర్కొన్నారు.

యోగి వేమన వర్శిటీ పరిధిలో భూ కబ్జా పై గంటా ఆరా...

హైదరాబాద్: యోగి వేమన వర్శిటీ పరిధిలో భూ కబ్జా ఆరోపణలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. యూనివర్శిటీ వీసీతో గంటా మాట్లాడారు. ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు యత్నించారని వివరణ ఇచ్చారు. యూనివర్శిటీ భూమి కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూ కబ్జా ఆరోపణలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

12:54 - July 29, 2017

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు దగ్గర బ్లాస్టింగ్‌ ప్లాంట్‌ అధికారులను టెన్షన్‌ పెట్టింది.. అడుగువరకూ ప్లాంట్‌ భూమిలో కుంగిపోయింది.. మూడువేల టన్నులవరకూ బరువు పెరగడంవల్లే కుంగిపోయిందని తెలుస్తోంది.. ఈ సమాచారాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.. దీంతో సోమవారం అత్యవసరంగా పోలవరంలో పర్యటించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు..

 

విశాఖలో హార్వర్డ్ వర్శిటీ వైద్య బృందం పర్యటన

విశాఖ: హార్వార్డ్ వర్శిటీ వైద్య బృందం పర్యటిస్తోంది. డాక్టర్ జోసఫ్ భన్వేంత్రే నేతృత్వంలో వైద్య బృందం పర్యటిస్తోంది. విశాఖ ఏఎంసీలో మూత్రపిండ సంబంధిత డాక్టర్లతో భేటీ అయ్యారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల నియంత్రణం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

కిలో రూ. 40 లకు టమాటలు

హైదరాబాద్: నగరంలో టమాట ధరలు భారీగా తగ్గాయి. కిలో రూ.90 నుండి రూ.40కి టమాట ధరలు దిగివచ్చాయి. రాబోయే వారం పది రోజుల్లో ధరలు మరింత దిగివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

12:34 - July 29, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో ఆయన భార్య శిల్పారెడ్డి వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు అపోలో ఆస్పత్రిలో విచారించారు. ఈ కేసులో పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. ప్రధానంగా.... విక్రమ్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌కు చెందిన లైసెన్స్‌డ్‌ వెపన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రాజీనామా

కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ పదవికి తన్నీరు నాగేశ్వర్ రావు రాజీనామా చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రకటించారు. వ్కఇ్తగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

మరోసారి విక్రమ్, షిపాలిన విచారించనున్న పోలీసులు

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. సెక్షన్లు తారుమారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ షిపాలిని మరోసారి పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన గన్ స్వాధీనానికి రెండు టాస్క్ ఫోర్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. లైసెన్స్ లేని గన్ ఉన్నందుకు విక్రమ్ పై, తప్పుడు సమాచారం ఇంచినందుకు షిపాలిపై కేసు నమోదు చేసే అకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకే కాల్పుల డ్రామా ఆడినట్లు ప్రాథమిక విచారణ లో తేలినట్లు సమాచారం.

12:21 - July 29, 2017

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్న న్యూ మూవీ షూటింగ్ బిజీ బిజీగా కొనసాగుతోంది. సెన్సెషనల్ డైరెక్టర్ 'సుకుమార్' దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చెర్రీ సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో రూపొందుతున్న సినిమాకు 'రంగస్థలం 1985' అనే టైటిల్ ను ఖరారు చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొనసాగిన షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రత్యేక సెట్టింగ్ లో షూటింగ్ జరుపుకొంటోంది.

ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మూగవాడిగా..చెవిటి వాడిగా 'రామ్ చరణ్' పాత్ర ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. 'రామ్ చరణ్' రెండు పాత్రలను పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. తండ్రి..కొడుకు క్యారెక్టర్స్ పాత్రల్లో నటిస్తున్నాడంట.

తండ్రి పాత్ర పల్లెటూరులో పుట్టి పెరిగిన పాత్ర అని..కొడుకు పల్లెటూరి నుండి పట్నం వచ్చే క్యారెక్టర్ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. రెండు యాంగిల్స్ లను సుకుమార్ చాలా డిఫ‌రెంట్ గా డీల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఏది నిజమో..అబద్దమో అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే. 

'పోలవరం'లో కుంగిన బ్లాస్టింగ్ ప్లాంట్

అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద అడుగుమేర బ్లాస్టింగ్ ప్లాంట్ కుంగిపోయింది. దీనిని పరిశీలించేందుకు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరానికి అత్యవసర టూర్ చేపట్టనున్నారు. బరువు పెరగడం వల్లే కుంగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

12:13 - July 29, 2017

సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన 'సుకుమార్' నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తనలో ఉన్న నిర్మాణ ప్రతిభను 'దర్శకుడు' సినిమా ద్వారా చూపించబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. బిఎస్సిఎస్సి విజయ్ కుమార్, థామస్ రెడ్డి, రవిచంద్ర సత్తిలు సినిమాను నిర్మిస్తుండగా దర్శకుడిగా హరిప్రసాద్ జక్కా వ్యవహరిస్తున్నారు. అశోక్, ఈషా హీరో, హీరోయిన్లుగా నటించారు.

సినిమా ప్రచార కార్యక్రమాలను సుకుమార్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలతో ఈ ప్రచారం నిర్వహస్తున్నారు. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా 'దర్శకుడు' ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. బంజారా హిల్స్ లోని తాజ్ ద‌క్క‌న్ లో ఈ వేడుక‌లు సాయంత్రం 6.30 కి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్ట్ లో విడుద‌ల కానుంది. 

లంచ్ సమానికి లంక 2 వికెట్ల‌కు 85 ప‌రుగులు

గాలె: ఇండియాతో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో ఓట‌మి నుంచి త‌ప్పించుకోవ‌డానికి శ్రీలంక పోరాడుతున్న‌ది. 550 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హోస్ట్ టీమ్‌.. ఒక ద‌శ‌లో 29 ప‌రుగులకే 2 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డినా.. క‌రుణ‌ర‌త్నె, మెండిస్ ఆదుకున్నారు. దీంతో నాలుగో రోజు లంచ్ స‌మ‌యానికి లంక 2 వికెట్ల‌కు 85 ప‌రుగులు చేసింది. క‌రుణ‌రత్నె 44, మెండిస్ 24 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మి, ఉమేష్ యాద‌వ్ చెరొక వికెట్ తీసుకున్నారు. స్పిన్న‌ర్లు జ‌డేజా, అశ్విన్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్ర‌భావం చూప‌లేక‌పోయారు.

ఏఐఎస్ ఎఫ్, ఏఐవైఎఫ్ సభలో కన్హయ్య

కడప: విద్య, వైద్యం, ఉపాధి కోసం ఏఐఎస్ ఎఫ్, ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ నిర్వహించి కళాక్షేత్రంలో సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షులు కన్హయ్య హాజరయ్యారు.

12:06 - July 29, 2017

బాలీవుడ్ హీరో 'సంజయ్ దత్' జైలు నుండి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ నటుడు ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా నటిస్తున్నాడు. డైరెక్టర్ ఓమంగ్ కుమార్ దర్వకత్వం వహిస్తున్న సినిమాలో 'సంజయ్ దత్' హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'భూమి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తండ్రి..కూతురు నేపథ్యంలో చిత్ర కథ సాగుతుందని టాక్ వినిపిస్తోంది.
సంజయ్ దత్ కూతురిగా ఆదితి రావు హైదరి నటిస్తోంది. సందీప్ సింగ్, భూషణ్ కుమార్ లు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లుక్ ను విడుదల చేసింది. ఈ ఫొటో లో సంజయ్ దత్ రఫ్ గా కనిపిస్తున్నాడు. సెప్టెంబర్ 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

దేవరపల్లిలో రాఘవులు..

ప్రకాశం : పర్చూరు (మం) దేవరపల్లిలోని దళితుల భూములను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు పరామర్శించారు. దేవరపల్లిలో వివాదాస్పద భూముల్లో తవ్విన చెరువులను పూడ్చే కార్యక్రమానిన్ రాఘవులు చేపట్టారు. 

రూపా గంగూలీ ఇంటికి సీఐడీ టీం.

కోల్ కతా : బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఇంటికి సీఐడీ బృందం చేరుకుంది. పిల్లల అక్రమ రవాణా కేసులో గంగూలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఐడీ ఆమెను విచారించనుంది. 

కొనసాగుతున్న శ్రీనివాస్ రావు విచారణ..

హైద‌రాబాద్: డ్ర‌గ్స్ కేసులో భాగంగా ప‌దో రోజు సిట్ విచార‌ణ‌కు ర‌వితేజ మాజీ కారు డ్రైవ‌ర్ శ్రీనివాస‌రావు హాజ‌ర‌య్యాడు. సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. 

బీజేపీలో ఇద్దరు ఎమ్మెల్సీలు..

ఢిల్లీ : ఇద్దరు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వీరు బీజేపీలో చేరనున్నారు. లక్నో లో పర్యటించనున్న బీజేపీ అమిత్ షా ఆధ్వర్యంలో వారు పార్టీ కండువా కప్పుకోనున్నారు. 

11:43 - July 29, 2017

అనంతపురం : వేరుశనగ పంటకు రక్షక తడులందించి పంటను కాపాడే ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. వర్షాలు లేక, బోరుబావులు ఎండిపోతున్న పరిస్థితుల్లో....ప్రభుత్వం, రక్షక తడులకు ఏ విధంగా నీరు అందిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి.

పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రెయిన్‌ గన్లను

వేరుశనగ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రెయిన్‌ గన్లను ఏర్పాటు చేసి రక్షక తడులందించే ప్రక్రియ చేపట్టింది. వర్షాభావ పరిస్ధితుల్లో రైతులు ఇరవై వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంటను సాగు చేశారు. ప్రస్తుతం నీరు లేక పంట ఎండిపోతున్న దశలో వుంది. ఈ క్రమంలో రక్షకతడుందించి పంటను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. హెచ్‌ఎల్సీ నుండి వచ్చే నీటిని వాడుకొని పంటకు నీరందించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పక్కన ఉన్న పొలం నుండి నీటిని వాడుకొని పంటలకు రక్షకతడులందించే ప్రక్రియను మంత్రి దేవినేని ఉమా చేపట్టారు.

ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, వామపక్ష నేతల అసహనం...

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు, వామపక్షనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట ఎండిపోతున్న దశలో వుందని, రక్షక తడుల వల్ల పంట బతికేది కూడా కష్టమంటున్నారు రైతులు. హెచ్‌ఎల్సీ నీటిని త్రాగునీటికి కాకుండా, రక్షక తడులకు కేటాయించడం సరైన పద్దతి కాదని మండిపడుతున్నారు. రెయిన్‌ గన్ల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, ఈ ప్రయోగాల వల్ల అధికార పార్టీ నేతలకు తప్పితే రైతులకు లాభం లేదని వామపక్షాలు అంటున్నాయి.

హంద్రినీవా ద్వారా నీరు అందించి పంట పొలాలకు నీరందించాలని వాపపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇంకా రద్దయిన నోట్లు దొరుకుతున్నయి..

అనంతపురం : నోట్ల మార్పిడది ముఠా గుట్టు రట్టయ్యింది. టూ టైన్ పరిధిలో 11 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

11:39 - July 29, 2017

అమరావతి: ఏపీ రాజధానిలోని రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. సచివాలయానికి వెళ్లేదారుల్లో ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సచివాలయంతో పాటు అసెంబ్లీ లాంటి కీలక పాలనా కేంద్రాలను నిర్మించిన ప్రభుత్వం, వాటికి అనువైన రహదారులను నిర్మించకపోవడంతో వాహనదారుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇరుకు రోడ్లపై ప్రమాదాలు జరిగి... చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పాలకులు

అమరావతిలోని రహదారుల విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం వంద అడుగులు, 120 అడుగులు రోడ్లూ అంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, ప్రస్తుత అవసరాల కోసం రోడ్ల నిర్మాణాలు మాత్రం చేయలేకపోతున్నారు. వందల ఏళ్ల కాలం నుంచి రాజధాని గ్రామాల మధ్య నుంచే వెళ్లే రహదారినే , సచివాయానికి వెళ్లే ప్రధాన రహదారిగా ఇప్పటికీ వాడుతున్నారు. దీంతో ట్రాఫిక్ భారీగా పెరుగుతోంది.

గ్రామాల సమీపంలో ఏపీ సచివాలయం

ఏపీ సచివాలయాన్ని మందడం, మల్కాపురం, వెలగపూడి గ్రామాల సమీపంలో ఉన్న భూముల్లో నిర్మించారు. ప్రకాశం బ్యారేజ్‌, ఉండవల్లి కరకట్ట, వెంకటపాలెం గ్రామాల నుంచి మందడం మీదుగా సచివాలయానికి రహదారి ఉంది. వీటితో పాటు ఉండవల్లి సెంటర్ నుంచి పెనమాక, కృష్ణాయపాలెం, మందడం వరకు మరో రూట్ ఉంది. అయితే ఈ రెండు రహదారులు మందడం గ్రామానికి రెండు కిలోమీటర్ల ముందు ఒకటిగా కలిసిపోతాయి. దీంతో ఇక్కడ వాహనాలు ఎటు నుంచి వస్తాయో.. ఎటు పోతాయో తెలియని పరిస్థితి చోటుచేసుకుంది.

ఊహించని స్థాయిలో ట్రాఫిక్‌ రద్దీ

రాజధానిగా ప్రకటించడం.. సచివాలయం కూడా ఇక్కడకు రావడంతో ఈ ప్రాంతంలో ఊహించని స్థాయిలో ట్రాఫిక్‌ పెరిగిపోయింది. అయితే పెరిగిన ట్రాఫిక్ కు అనుగుణంగా ఈ ప్రాంతంలో రహదారులు ఏర్పాటు చేయకపోవడం తీవ్ర సమస్యగా మారింది. గతంలో ఉన్న రహదారులను స్వల్పంగా విస్తరించి ఉపయోగిస్తుండడంతో, రోజూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.

మందడం రహదారి మీదుగానే సరుకుల రవాణా

ఇక ప్రభుత్వ ఉద్యోగులు వాహనాలతో పాటు రాజధాని ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనికి కావాల్సిన సరుకులు తీసుకెళ్లడానికి కూడా ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం గ్రామ రహదారినే ఉపయోగిస్తున్నారు. దీంతో గ్రావెల్, ఇసుక, ఇనుము వంటి వస్తువులు తరలించడానికి వాడే టిప్పర్లు, ట్రాక్టర్లు ఈ రహదారి నుంచే వెళ్తున్నాయి. అలాగే విట్‌, ఎస్,ఆర్,ఎమ్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీల నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా ఇవే రహదారులు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల రద్దీతో జరిగిన ప్రమాదాలతో గత ఆరు నెలల్లో నలుగురు మృతి చెందారు.

ప్రమాదాల నేపథ్యంలో... గ్రామస్థులు ఆందోళన....

ప్రమాదాల నేపథ్యంలో... గ్రామస్థులు ఆందోళన చేయడంతో... టిప్పర్లను, లారీలు, ట్రాక్టర్లను అసెంబ్లీ కోసం వేసిన రహదారి మీదుగా పంపిస్తున్నారు. అయితే ఆ వాహనాలు సచివాలయం మీదుగా వచ్చి మందడం, మల్కాపురం జంక్షన్ మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో మల్కాపురం జంక్షన్ అతి ప్రమాదకరంగా మారింది. విజయవాడ, గుంటూరు,మంగళగిరి ఇలా అన్ని ప్రాంతాల నుండే వచ్చే వాహనాలు మల్కాపురంలో జంక్షన్ రావాల్సి ఉండడంతో, అక్కడ తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రాజధానంటూ గొప్పగా చెప్పుకునే నేతలు ఇప్పటికైనా రహదారులు సమస్యలపై స్పందిస్తాయో లేదో చూడాలి.

విశాఖకు చేరుకున్న హార్వర్డ్ వర్సిటీ వైద్య బృందం.

విశాఖపట్టణం : హార్వర్డ్ వర్సిటీ వైద్యుల బృందం విశాఖకు చేరుకుంది. డా.జోసఫ్ భన్వేంత్రే నేతృత్వంలో వైద్య బృందం పర్యటిస్తోంది. ఏఎంసీలో మూత్ర పిండ సంబంధిత వైద్యులతో భేటీ జరుపుతోంది. ఉద్దాన్నం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల పరిష్కారానికై చర్చ జరగనుంది. 

11:37 - July 29, 2017

అమరావతి: అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన వ్యవహారాలపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు ఇక నుండి పార్టీని తిరిగి అధికారం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని ఇప్పటినుండే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీనికోసం సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుండి అక్టోబర్‌ 30 వరకు "ఇంటింటికి తెలుగు దేశం "కార్యక్రమాన్ని రూపొందించారు. రెండు నెలల పాటు ప్రతి నేత ఇంటింటికి వెళ్లి టీడీపీ మూడేళ్ల ప్రభుత్వ హయంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతే వరకు ప్రజలకు చేరుతున్నాయి అనేది తెలుసుకోడానికి కార్యక్రమాలను సిద్ధం చేశారు.

సంక్షేమ పథకాలపై ప్రజల నుండి అభిప్రాయ సేకరణ

ప్రజల నుండి ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోటు పాట్లు ఏమయినా ఉంటే తెలుసుకుని సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని బాబు భావిస్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి ఖచ్చితంగా పాల్గొనేలా చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని నాయకులకు చంద్రబాబు సూచిస్తున్నారు..

ప్రతి జిల్లాలో బహిరంగ సభల ఏర్పాటు

ఇక ఓ వైపు ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం అనంతరం ప్రతి జిల్లాలో బహిరంగ సభలను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నారు. ప్రతి రెండు నెలలకు ఓ జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహించి క్యాడర్‌లో ఉత్తేజం నింపేలా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా అక్టోబర్‌లోనే కార్యక్రమాలను చేసి అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంట్‌ కూడా బాబు మనసుతో ఉంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల్లో గెలువాలని భావిస్తున్నారు. దీని కోసం ఓ ప్రత్యేక టీంను కూడా సిద్ధం చేస్తున్నారు.

జగన్‌ కూడా అక్టోబర్‌లోనే పాదయాత్ర

మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌ కూడా అక్టోబర్‌లోనే పాదయాత్ర చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకోనుంది. అధికార టీడీపీ కూడా ప్రజల్లోకి వెళ్తుండటంతో... ఏ పార్టీకి ప్రజల నుండి ఎంత మైలేజ్‌ వస్తుందనేది 2019లోనే తెలుస్తుంది.

శరద్ యాదవ్ తమకే మద్దతు - లాలూ..

పాట్నా : శరద్ యాదవ్ తమకే మద్దతిస్తున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. బీజేపీతో నితీశ్ పొత్తు పెట్టుకోవడంపై శరద్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 

11:35 - July 29, 2017

హైదరాబాద్: అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆరోపణలపై గులాబి నేతలు ఘూటుగానే స్పందిస్తున్నారు. మంత్రి కెటిఆర్‌ లక్ష్యంగా కుంభకోణాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లింకులున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల దాడి అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో వివాదాస్పంగా మారుతున్న వ్యవహారాల్లో కేసీఆర్‌ తనయుడికి ఆయన సన్నిహితులకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.

కెటిఆర్ టార్గెట్‌గానే విమర్శలు...

మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌ నుంచి తాజాగా డ్రగ్స్ వ్యవహారం వరకు కెటిఆర్ టార్గెట్‌గానే విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీస్‌ వాహనాల కొనుగోళ్లు, ప్రాజెక్టుల రీడిజైన్లలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పెదవి విరుస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ నేతలు సైతం ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడుతున్నారు. జైరామ్ రమేష్‌, దిగ్విజయ్‌ సింగ్‌ రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని మండిపడుతున్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల ఆరోపణలను నిన్న మొన్నటి వరకు లైట్‌ తీసుకున్న అధికార పార్టీ నేతలు కౌంటర్‌ అటాక్‌ ఇస్తున్నారు. ఇసుక రీచుల నిర్వహణతో మూడేళ్లలో ప్రభుత్వానికి వెయ్యికోట్ల ఆదాయం సమకూరిందని..పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం పది శాతం కూడా ఇన్‌కమ్‌ రాకపోవడానికి కారణమేమిటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్‌పై అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.

చలో సిరిసిల్ల నిర్వహించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శ

చలో సిరిసిల్ల నిర్వహించే హక్కు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదని..దళితులకు ముందు క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని మండిపడుతున్నారు.

ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టే విషయంలో అధికార పార్టీ నేతలు దూకుడు పెంచుతున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలంటున్నారు.

11:31 - July 29, 2017

హైదరాబాద్: విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే విక్రమ్‌గౌడ్‌, ఆయన భార్య శిల్పాను పోలీసులు వేర్వేరుగా విచారించారు. ఇప్పటికే ముఖేష్‌గౌడ్‌ ఇంటి నుంచి వెపన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.... బుల్లెట్‌, గన్‌పౌడర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కాసేపట్లో మరోసారి విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు విచారించనున్నారు.

11:27 - July 29, 2017

టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ పేరొందిన నటుడు 'మోహన్ బాబు'. ఆయన డైలాగ్స్ డెలివరీకి అభిమానులు ఫిదా అయిపోతుంటారు. హీరోగా నటించి చాలా కాలమే అయ్యింది. పలువురు హీరోలుగా నటించిన చిత్రాల్లో ఆయన కీలకమైన పాత్రలు మాత్రం వేశారు. ఆయన తనయులు మంచు విష్ణు..మంచు మనోజ్ లు హీరోలుగా రాణిస్తున్నారు.

తాజాగా ఆయన హీరోగా రాబోతున్నారు. అలా కొంత గ్యాప్ తరువాత కథానాయకుడిగా మళ్లీ రంగంలోకి దిగారు. 'పెళ్లైన కొత్తలో' ఫేమ్ మదన్ దర్శకత్వంలో 'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్' పతాకంపై మోహన్ బాబు నిర్మించనున్న నూతన చిత్రం శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మనవరాళ్లు అరియానా - వివియానా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
ఈ సినిమాకు 'గాయత్రి' అనే టైటిల్ ఖరారు చేశారు. మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ కెమెరా స్విచ్చాన్ చేయగా తొలి సన్నివేశానికి మదన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

దేవరపల్లి బాధితులను పరామర్శించిన రాఘవులు

ప్రకాశం : పర్చూరు మండలం దేవరపల్లి బాధితులను, దళితుల భూములను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు సందర్శించారు.

సోలిస్ కేర్ కంటి ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో సోలిస్ కేర్ కంటి ఆస్పత్రిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంబీసీ ఛైర్మన్ శ్రీనివాస్ దైవజ్జశర్మ పాల్గొన్నారు.

 

 

ఉపరాష్ట్రపదవి వస్తుందని ఊహించలేదు: వెంకయ్యనాయుడు..

విజయవాడ: జీవితంలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యం అని వెంకయ్యనాయుడు అన్నాడు. అమరావతిలో వెంకయ్యకు ఆత్మీసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తనకు ఉపరాష్ట్రపతి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. తాను ఓ రైతు కుటుంబంలో పుట్టానని, చిన్నపుడే అనేక రకాలుగా ఇబ్బంది పడ్డానన్నారు. నా కుటుంబంలో ఎవరూ గాంధీలు, నెహ్రూలు లేరని, దేశం ముందకెళ్లాలంటే సరైనా నాయకత్వం కావాలన్నారు. 2019లో మోదీ ప్రధాని కావాలనేది నా కోరిక అని స్పష్టం చేశారు.

10:32 - July 29, 2017

హైదరాబాద్: హరితహారం కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు.. నగరంలోని గన్‌ పార్క్‌ నుంచి పెద్దపల్లి జిల్లా వరకు తిరుపతి అనే యువకుడు పరుగు ప్రారంభించాడు. ఇవాళ ఉదయం ప్రభుత్వ సలహాదారు వివేక్‌, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు గన్‌పార్క్‌ వద్ద జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. హరితహారంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి రన్‌ చేయడం అభినందనీయమని వివేక్‌ అన్నారు. తిరుపతి తలపెట్టిన రన్‌ చాలా ప్రత్యేకమైనదని ఎమ్మెల్యే పుట్ట మధు కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంథనిలో హరితహారం జోరుగా సాగుతున్నదన్నారు. ప్రతీ ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. రెండు రోజుల్లో మంథని చేరుకుంటానని.. రోజుకు 120 కిలోమీటర్లు పరిగెత్తడమే తన లక్ష్యమని రన్నర్ తిరుపతి చెప్పాడు.

10:31 - July 29, 2017

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట వద్ద వున్న నిమ్స్‌ ఆసుపత్రి బిల్డింగ్‌ పైకి ఎక్కిన రోగి చనిపోతానని బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిమ్స్ ఆసుప‌త్రి పాత భ‌వ‌నం పైకి ఎక్కి చ‌నిపోతాన‌ని ఓ రోగి ఆసుప‌త్రి వైద్యుల‌ను బెదిరించాడు. త‌న‌కు స‌రైన వైద్యాన్ని అందించ‌లేదుని ప్ర‌దీప్ ఆరోపించాడు. ప్ర‌దీప్ ను కిందికి దించేందుకు పోలీసులు విశ్వ ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు అమెరికాలో వైద్యం అందించాల‌ని ప్ర‌దీప్ డిమాండ్ చేశాడు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:29 - July 29, 2017

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ ఓ గర్భిణీ ప్రాణాలుతీసింది.. ఈ జబ్బుతో బాధపడుతున్న ఏడునెలల గర్భిణీ ఆస్పత్రిలో చికిత్సకోసం చేరింది.. వరంగల్‌ జిల్లాకుచెందిన ఆమెకు... మూడురోజులుగా డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నారు.. వ్యాధి ముదిరిపోవడంతో ఇవాళ ఆమె మృతిచెందింది.

శ్రీలంక టార్గెట్ 550

గాలె: శ‌్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో ఆతిథ్య జ‌ట్టుకు 550 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల‌కు 240 ప‌రుగుల ద‌గ్గ‌ర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 309 ప‌రుగుల ఆధిక్యం క‌లుపుకొని ఇండియా ఓవ‌రాల్ లీడ్ 449 ర‌న్స్‌కు చేరింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్ కోహ్లి సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో అత‌నికిది 17వ సెంచ‌రీ. మొద‌టి నుంచీ దూకుడుగా ఆడిన విరాట్‌.. కేవ‌లం 133 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు.

పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరుల మృతి

ప్రకాశం: టంగుటూరు మండలం నిడమానూరులో విషాదం నెలకొంది. పొలాల్లో పిడుగుపడి ముగ్గురు గొర్రెరల కాపరులు మృతి చెందారు. మృతులు పొదిలి, పామూరు, సంతనూతలపాడు వాసులుగా గుర్తించారు.

విక్రమ్ గౌడ్, శిల్పా రెడ్డిని విచారించిన వెస్ట్ జోన్ డీసీపీ

హైదరాబాద్: అపోలో ఆస్పత్రిలో విక్రమ్ గౌడ్, ఆయన భార్య శిల్పా రెడ్డిని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు విచారించారు. క్లూస్ టీం ఆధారంగా కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. విక్రమ్ ఆత్మహత్యాత్నం చేసుకున్నట్లు పోలీసులకు లభించిన ఆధారాల ద్వారా నిర్ధానకు వచ్చినట్లు సమాచారం. ముఖేష్ గౌడ్ లైసెన్స్ వెపన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

కర్నూలు: నారాయణ కాలేజీ భవనంపై దూకి విద్యార్థి ఆత్మహత్యాత్నం చేశారు. అప్రమత్తమైన యాజమాన్యం ఆసుపత్రికి తరలిచి చికిత్స అందిస్తున్నారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

నిమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కి బెదిరిస్తున్న రోగి

హైదరాబాద్: నిమ్స్ బిల్డింగ్ పైకి రోగి ఎక్కి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసి యూఎస్ పంపించాలని డిమాండ్ చేస్తున్నాడు.

సిట్ కార్యాలానికి చేరుకున్న శ్రీనివాసరావు

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న హీరో రవి తేజ డ్రైవర్ శ్రీనివాసరావు సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు.

అమరావతి లో వెంక్యకు ఆత్మీ అభినందన సభ

అమరావతి: వెంకయ్యనాయుడకు ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఈ సమావేశానికి కామినేని, మాణిక్యాలరావు, ప్రతిపాటి, కంభం పాటి హరిబాబు, కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుప‌తి: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతున్న‌ది. శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం కోసం 26 కంపార్ట్ మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నానికి దాదాపు 10 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. కాలిన‌డ‌క మార్గం ద్వారా వ‌చ్చే భ‌క్తుల్లో అలిపిరి నుంచి వ‌చ్చే 14,000 మంది, శ్రీవారి మెట్టు నుంచి వ‌చ్చే 6000 మంది భ‌క్తుల‌కు మాత్ర‌మే దివ్య‌ద‌ర్శ‌నం చేసుకొనే అవ‌కాశం ఉంది.

09:17 - July 29, 2017

ప్రకాశం : జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెలకాపరులు మృతి చెందారు. టంగుటూరు మండలం నిడమానూరులోని పొలాల్లో వినుకొండ, అంద్దంకి, పామూరు గ్రామాలకు చెందిన ముగ్గురు గొర్రెలకాపరులు టెంట్లు వేసుకుని రాత్రి నిద్రిస్తున్నారు. వారిపై పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లిన నిడమానూరు గ్రామస్తులు గమనించి....మృతుల బంధువులకు సమాచారం ఇచ్చారు. మరన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

08:35 - July 29, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో పదో రోజు సిట్ విచారణ కొనసాగనుంది. డ్రగ్స్ వ్యవహారంలో నేడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును సిట్ విచారించనుంది. కెల్విన్ తో శ్రీనివాసరావు నేరుగా సంబంధాలున్నాయి. కేవలం రవితేజకు మాత్రమే డ్రగ్స్ తెచ్చేవారా ? ఇతర సినిమా వాళ్లకు తెచ్చేవారా ? అన్న కోణంలో విచారణ 
చేయనున్నారు. నిన్న రవితేజను సిట్ అధికారులు విచారించారు.

 

08:27 - July 29, 2017

డ్రగ్స్ కేసును కనుమరుగు చేయడమే టీ.ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రభుత్వం అసలు విషయాలను దాచి పెడుతోందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు నవతెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రరావు, టీఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ పాల్గొని, మాట్లాడారు. అకున్ సబర్వాల్ కు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదన్నారు. డ్రగ్స్ కేసులో సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కాదు...తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో పబ్చుల సంస్కృతి పెరిగిందని తెలిపారు. డ్రగ్స్ కేసులో సమగ్ర విచారణ జరగాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు నల్సార్ న్యాయ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం

హైదరాబాద్ : నేడు నల్సార్ న్యాయ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం కార్యక్రమం జరుగనుంది. సీఎం కేసీఆర్ స్నాతకోపన్యాసం చేయనున్నారు.

నేడు తెలుగు టైటాన్స్, పాట్నా పైరేట్స్.. ఢీ

హైదరాబాద్ : ప్రొకబడ్డీలో నేడు తెలుగు టైటాన్స్...పాట్నా పైరేట్స్ ఢీకొననున్నాయి. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. 

07:57 - July 29, 2017

రంగారెడ్డి : జిల్లాలోని నందిగామ మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన దళితులు రస్తారోకో నిర్వహించారు.  మామిడిపల్లి, మొదళ్లగూడలోని తమ భూములను పాలమూరు జిల్లా జెడ్పీ వైస్‌చైర్మన్‌ నవీన్‌రెడ్డి ఆక్రమించారంటూ ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై  బైఠాయించి నిరసన తెలిపారు. తమ భూములను కాజేసిన నవీన్‌రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

 

07:54 - July 29, 2017

జనగామ : ప్రజా సమస్యలు పరిష్కరించి.. దోపిడీ వ్యవస్థను అరికట్టేందుకే టీ మాస్‌ను ఏర్పాటు చేశామని వామపక్షనేతలు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సామాజిక తెలంగాణ సాధనే తమ లక్ష్యమన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని టీమాస్‌ నేతలు స్పష్టం చేశారు. 
జనగామలో ఆవిర్భావ సభ 
ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించింది టీ మాస్. 281 ప్రజా, సామాజిక సంఘాలతో కలిసి ఏర్పడ్డ.. టీ మాస్ జనగామలో ఆవిర్భావ సభను నిర్వహించింది. పూర్ణిమా గార్డెన్ జరిగిన ఈ కార్యక్రమానికి  సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం,  ప్రొ. కంచె ఐలయ్య, గద్దర్, విమలక్కలతో పాటు ప్రజా సంఘాలు, సామాజిక సంఘాల నేతలు హాజరయ్యారు.
సామాజిక వర్గాలకు రాజ్యధికారం రావాలి : తమ్మినేని  
దోపిడికి, పెత్తందారి వ్యవస్థపై పోరాడేందుకే టీ మాస్‌ ఆవిర్భవించిందని సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 93 శాతం వున్న సామాజిక వర్గాలకు రాజ్యధికారం రావాలని ఆకాంక్షించారు. టీమాస్ ను అభివృద్ధి చేసేందుకు గ్రామ, మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు తమ్మినేని వీరభద్రం. టీ మాస్‌లో అందరూ చేరాలని తమ్మినేని పిలుపునిచ్చారు.
హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు: కంచెఐలయ్య 
తెలంగాణ ఏర్పడక ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రొ.కంచె ఐలయ్య విమర్శించారు.  ఎన్నికల ముందు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. 
దుష్ట శక్తులను బయటకు పంపించాలి : విమలక్క 
తెలంగాణ కోసం మలిదశ ఉద్యమం చేసింది ప్రజల కోసమని.. ఇప్పుడు తెలంగాణలో ఉన్న దుష్ట శక్తులను బయటకు పంపించాలన్నారు విమలక్క. టీ మాస్‌ను పటిష్టం చేయడం కోసం అందరూ ఏకం కావాలన్నారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక దందాలో పోలీసులు సామాన్యులను ఇబ్బంది పెడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమలక్క విమర్శించారు.
బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు : టీమాస్ 
తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని టీ మాస్ నేతలు అన్నారు. సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. సభకు ముందు టీ మాస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల్ని చైతన్య పరుస్తూ ఆట పాటలతో అలరించారు. 

 

పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెలకాపరులు మృతి

ప్రకాశం : టంగుటూరు మండలం నిడమానూరులో విషాదం నెలకొంది. పొలాల్లో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మృతి చెందారు. 

నేడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును విచారించనున్న సిట్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. పలు విషయాలపై ప్రశ్నించనున్నారు. 

 

07:35 - July 29, 2017

అనంతపురం : జిల్లాలో అధికాపార్టీ రాజకీయం రంజుగా సాగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆదిపత్య రాజకీయాలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య అంతర్గతంగా పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో పట్టునిలుపుకునేందుకు  ఇరువర్గాలు పొలిటికల్‌ గేమ్‌ను రక్తికట్టిస్తున్నాయి. 
పల్లె రఘునాధ్‌రెడ్డి వర్సెస్ నిమ్మల కిష్టప్ప 
ఆట ఆగిందా సీటు గోవిందా..అనే సినిమాపాటే గుర్తుకు వస్తుంది..పుట్టపర్తిలో తాజా రాజకీయాలను చూస్తే. మాజీ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి..హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య ఆదిపత్య రాజకీయాలు జోరందుకున్నాయి. మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌ రెడ్డి వవ్యహారంపై పుట్టపర్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  మంత్రిపదవిలో ఉన్నపుడు నియోజకవర్గవ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను పెంచిపోషించారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిచోట తన సామాజిక వర్గ నాయకులకే ప్రాధాన్యత ఇస్తూ కాంట్రాక్టులు, ఇతర పనులు కట్టబెడుతూ తమకు అన్యాయం చేశారని కొందరు తెలుగు తమ్ముళ్లు అప్పట్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్‌ అయిన చంద్రబాబు పల్లెరఘునాధ్‌రెడ్డిని మంత్రిపదవి నుంచి తొలించారు. పద్దతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కూడా దక్కదని బాబు హెచ్చరించినట్లు సమాచారం. అయినా  పల్లె రఘునాథ్‌రెడ్డి వైఖరిలో మార్పురాలేదని టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. పుట్టపర్తి నియోజవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం సైకిల్‌పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. 
శిరీష్‌ను లీడర్‌గా నిలబెట్టేందుకు కసరత్తు
ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో పాగావేయడానికి ఛాన్స్‌ దొరికిందన్నట్టు ఎంపీ నిమ్మల కిష్టప్ప తనదైన శైలిలో రాజకీయాన్ని నడిపిస్తున్నారు. తన కుమారుడు శిరీష్‌ను పుట్టపర్తిలో లీడర్‌గా నిలబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ ఓటర్లపై ఆయన దృష్టిపెట్టారు. అటు పలువురు బీసీ సామాజిక వర్గాల వారు కూడా నిమ్మల కిష్టప్ప ప్రయత్నానికి సహకరిస్తున్నారట. ఇప్పటికే రఘునాథరెడ్డి వ్యతిరేక వర్గీయులను ఒకతాటిమీదకు తేవడంలో ఎంపీ నిమ్మల సక్సెస్‌ అయ్యారని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.  ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన పిసీ గంగన్న తాను ఎంపీ అడుగుజాడల్లో నడుస్తానని బహిరంగంగానే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు శిరీశ్‌ను పుట్టపర్తి అసెంబ్లీ స్థానంలో పోటీకి దింపుతానని సన్నిహితుల వద్ద నిమ్మల కిష్టప్ప చెబుతున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో అధికారపార్టీ రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. మాజీమంత్రి పల్లె, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప మధ్య కోల్డ్‌వార్‌ ఏ పరిణామలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 

 

07:29 - July 29, 2017

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం కొనసాగుతోంది. వచ్చే నెల 2 వరకు హౌస్‌ అరెస్టులోనే ఉండనున్నారు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి గృహ నిర్బంధాన్ని పొడిగించాలా ? వద్దా ? అన్న అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు  హౌస్‌ అరెస్టు ఎప్పుడు ముగిస్తే అప్పుడు పాదయాత్ర చేసితీరతానని ముద్రగడ భీష్మించారు. 
నిర్బంధం పూర్తైన వెంటనే పాదయాత్ర : ముద్రగడ 
కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో పాదయాత్ర చేపట్టిన ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం విధించిన గృహ నిర్బంధం కొనసాగుతోంది. హౌస్‌ అరెస్టు గడువు పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని ముద్రగడ నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులంతా అనారోగ్యంపాలైనా ఆస్పత్రికి వెళ్లబోమని ప్రకటించారు. నిర్బంధం పూర్తైన వెంటనే కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేసితీరతానని మరోసారి స్పష్టం చేశారు. రిజర్వేషన్లలో కాపు జాతికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. 
2019 ఎన్నికల్లో టీడీపీ పాలనకు చరమగీతం 
చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నెరవేరిస్తే ఉద్యమం ఇంతవరకు వచ్చేదికాదన్నవాదాన్ని ముద్రగడ వినిపిస్తున్నారు. కాపుల రిజర్వేషన్ల సమస్యకు ప్రభుత్వం ముగింపు పలకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీ పాలనకు చరమగీతం కాయమని ముద్రగడ హెచ్చరించారు. 
ముద్రగడను హౌస్‌ అరెస్టు చేయలేదు : పోలీసులు 
ముద్రగడ గృహ నిర్బంధం విషయంలో పోలీసుల వాదన మరోలా ఉంది. ముద్రగడను హౌస్‌ అరెస్టు చేయలేదని చెబుతున్నారు. వ్యక్తిగత పనులపై ఎక్కడికైనా వెళ్లిరావొచ్చంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ ప్రకటనపై ముద్రగడ మండిపడ్డారు. హౌస్‌ అరెస్టు చేయకపోతే  తన ఇంటిచుట్టూ ఇంతమంది పోలీసులు ఎందుకని ప్రశ్నించారు. 
మరికొందరు కాపు నేతల గృహ నిర్బంధం 
ముద్రగడతోపాటు మరికొందరు కాపు నేతల గృహ నిర్బంధం కూడా కొనసాగుతోంది. వైసీపీకి చెందిన కాపు నేత వీరభద్రం మూడు రోజుల నుంచి  హౌస్‌ అరెస్టులోనే ఉన్నారు. మరోవైపు ముద్రగడ గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాపులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

07:22 - July 29, 2017

కృష్ణా : ఏపీలో మళ్లీ భూసేకరణ చిచ్చు రగులుతోంది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న బాబు సర్కార్‌..అదే వ్యూహాన్ని బందర్‌ పోర్టు నిర్మాణానికి అమలు చేయాలని భావిస్తోంది. చాపకింద నీరులా భూసేకరణ ప్రకియను వేగవంతం చేస్తోంది. మరోవైపు ఎట్టిపరిస్థితుల్లోనూ బందర్‌ పోర్టుకు భూములిచ్చే ప్రసక్తే లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. 
భూసేకరణ ప్రక్రియ వేగవంతం 
బందరు పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. సుమారు 5,300 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 3,014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే పూర్తి చేశారు. ఇక ప్రైవేట్ పట్టా భూముల సమీకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మొత్తం 2,282 ఎకరాల పట్టా భూములకు గాను.. ఇప్పటి వరకు 550 ఎకరాలు మాత్రమే ఇచ్చేందుకు రైతులు మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్‌కు అంగీకార పత్రాలు ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేతలు, వారి అనుచరుల పేరిట వందలాది ఎకరాల భూములున్నాయని.. వాటిని పోర్టుకు ఇవ్వకుండా రైతుల భూములను మాత్రమే తీసుకోవాలనే ప్రయత్నాలు మానుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
బందరు పోర్టు అభివృద్ధికి 33,177.78 ఎకరాలు 
బందరు నౌకాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 33177.78 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. వీటిలో పోర్టు నిర్మాణానికి 5292.75 ఎకరాలు..ఇండస్ట్రియల్ కారిడార్, మెగాటౌన్ షిప్ కు సంబంధించి 27885.03 ఎకరాలు. వీటిలో ప్రైవేట్ భూములతో పాటు అసైన్డ్ భూములు ఉన్నాయి. పట్టా భూములు 14620.11 ఎకరాలు, అసైన్డ్ భూములు 9117.32 ఎకరాలు, ప్రభుత్వ భూములు 9440.35 ఎకరాలు ఉన్నాయి. పోర్టుకు సంబంధించి రైతుల వివరాలు సమగ్రంగా సేకరించి, వీరందరికీ ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షనేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. 
రైతులు ఆందోళన
ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. 25 నుంచి 30 ఎకరాల భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఒక కుటుంబంలోని సభ్యులు 25 ఎకరాల భూమి ఇచ్చినా..1836 రెవెన్యూ చట్టం ప్రకారం మెట్ట భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి రెండున్నర ఎకరాలకు మించి ప్యాకేజీ ఇవ్వకూడదనే నిబంధన ఉందని రెవెన్యూ అధికారులు చెప్పడంపై ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బందర్‌ పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ చేపడితే.. పోరాటం తప్పదని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు. 

07:12 - July 29, 2017

శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికా హార్వర్డ్‌ యూనివర్శిటీ వైద్యుల బృందం రానుంది.  జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిలుపు మేరకు డాక్టర్లు రానున్నారు. ఇవాళ శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతంలో పవన్‌ పర్యటించనున్నారు. కిడ్నీ రోగులతో పవన్‌కళ్యాణ్‌ ముఖాముఖిలో పాల్గొంటారు. కిడ్నీ సమస్య ప్రభావిత గ్రామాల్లో వైద్యులు పర్యటిస్తారు. ఈ నెల 30న వైజాగ్ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉద్దానం సమస్యపై.. పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటు చేయనున్న సమావేశానికి డాక్టర్ల బృందం రానుంది. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో  పవన్‌ కళ్యాణ్‌ చర్చిస్తారు. 

 

07:05 - July 29, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమను భూతద్దంలో చూపిస్తున్నారంటూ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వాడకం అన్ని రంగాల్లో ఉందన్నారు. సినీ ప్రముఖలు ఈ కేసులో చిక్కుకోవడంతో ఎక్కువ ప్రచారం జరుగుతోందని చెప్పారు. సినీ నటుల ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నంకావడం, పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో యువత ఒంటరితో డగ్స్‌కు బానిసలవుతున్నారని విశ్వనాథ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

నేడు కిడ్నీ రోగులతో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల ముఖాముఖి

శ్రీకాకుళం : జిల్లాలోని కవిటి మండలం బొరివంకలో నేడు కిడ్నీ రోగులతో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు ముఖాముఖి నిర్వహించనున్నారు. 

Don't Miss