Activities calendar

30 July 2017

21:43 - July 30, 2017

స్పెయిన్ : స్పెయిన్‌లోని బార్సిలోనాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యునైటెడ్‌ స్పెయిన్‌ ఫెస్టివల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరి ముగిసిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి, వేదిక మొత్తం వ్యాపించాయి. దీంతో సంగీతోవ్సవానికి వచ్చిన వారు భయంతో ఆహాకారాలు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 22 వేల మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

21:42 - July 30, 2017

ఢిల్లీ : వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడారు. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో తనతో పాటు కేంద్రమంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైనికులు, అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.. బాధిత ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నిత్యవసర సరుకులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. అసోం, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్ లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని మోదీ పేర్కొన్నారు. 

21:41 - July 30, 2017

హైదరాబాద్ : సంచలనం రేపిన విక్రమ్ గౌడ్‌పై కాల్పుల ఘటన ఇంకా మిస్టరీ వీడటం లేదు. కాల్పులు ఎవరు జరిపారనే దానిపై టాస్క్‌ఫోర్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులు కూపీ లాగుతున్నారు. కాల్పుల ఘటన తర్వాత విక్రమ్ గౌడ్‌తో పాటు ఆయన భార్య షిపాలి నుంచి వాంగ్మూలాలు సేకరించారు. అయితే ఇద్దరు ఒకే కథనాన్ని చెబుతుండటంపై పోలీసులకు పలు అనుమానాలు కలుగుతున్నాయి. విక్రమ్ గౌడ్‌ కేసును ఛేదించేందుకు 10 పోలీస్‌ బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. విక్రమ్ గౌడ్‌కి పలురకాల వ్యాపారాలు ఉన్నాయి...తనకు అప్పులున్నాయన్న విషయాన్ని విక్రమ్‌ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. వడ్డీ వ్యాపారుల నుంచి తప్పించుకోవడానికే విక్రమ్‌ ఈ డ్రామా ప్లే చేశాడా? లేకవ్యాపారంలో విభేదాలే ఈ దాడికి కారణమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

రెండుసార్లు వాంగ్మూలం
అపోలో ఆస్పత్రికి వచ్చిన పోలీసులకు విక్రమ్‌ గౌడ్‌ రెండుసార్లు వాంగ్మూలం ఇచ్చారు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి హెల్మెట్‌ పెట్టుకుని వచ్చి, కాల్పులు జరిపి పారిపోయారని చెప్పారు. ఈ వివరాలతో సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. తెల్లవారు జామున గేటు ఎందుకు తెరిచారని పోలీసులు ప్రశ్నించగా.. దర్గాలో అన్నదాన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో గేటు తెరిచినట్లు విక్రమ్‌ దంపతులు పోలీసులకు సమాధానమిచ్చారు. మరోవైపు ఘటనా సమయంలో బయటి వ్యక్తులు ఎవరూ విక్రమ్‌ గౌడ్ ఇంట్లోకి రాలేదని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్‌ రోడ్‌ నెంబర్‌ 86లోని విక్రంగౌడ్‌ నివాసంలో సీఐడీ, బంజారాహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సోదాలు ముగిశాయి. విక్రమ్‌ ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తేల్చారు. విక్రమ్‌ గౌడ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లిన వాహనాన్ని త‌నిఖీ చేసిన పోలీసులు... కాల్పుల‌కు ఉపయోగించిన తుపాకీ ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నారు. అయితే విక్రమ్ దంపతులు ఒకే విధంగా ఇచ్చిన వాంగ్మూలాల తీరుకు.. పోలీసులు చేస్తున్న విచారణలో వెలుగుచూసిన విషయాలకు ఎలాంటి పొంతన లేదని సమాచారం. దీంతో అసలు నిజాలను రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు. 

21:29 - July 30, 2017
21:25 - July 30, 2017

చిత్తూరు : జిల్లా తిరుపతిలోని శెట్టిపల్లిలో బాణాసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:00 - July 30, 2017
20:59 - July 30, 2017

జర్మనీ : కాన్‌స్టాంజ్‌ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టారు. అప్పటికే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే ఇది తీవ్రవాద ఘటన కాదని పోలీసులు తెలిపారు.

20:58 - July 30, 2017

అహ్మదబాద్ : భారీవర్షాలతో గుజరాత్, రాజస్థాన్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువవడంతో.. రంగంలోకి దిగిన సైన్యం సహాయక చర్యలు వేగవంతం చేసింది. రాజస్థాన్‌లోని జాలూరులో వరదనీటిలో చిక్కుకున్న 87 మందిని సైన్యం కాపాడింది. అయితే పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో... సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరో 3 రోజుల వరకు వరద తీవ్రత ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని.. వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద ప్రాంతాల్లో... వ్యాధులు ప్రబలే ప్రమాదం ర్పడటంతో...అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

 

20:57 - July 30, 2017

ఢిల్లీ : రష్యా నుంచి మరో 48 ఎంఐ-17 హెలికాఫ్టర్ల కొనుగోలుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన డీల్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని రష్యా అధికారులు తెలిపారు. సైనికుల రవాణా, సెర్చ్ ఆపరేషన్ల కోసం ఈ హెలికాఫ్టర్లను వినియోగించాలని ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ భావిస్తోంది. భారత్‌ వద్ద ఇప్పటికే ఎంఐ-8, ఎంఐ-17 మోడల్‌కుే చెందిన 300లకు పైగా హెలికాప్టర్లు ఉన్నాయి. వీటికితోడు మరో 48... ఎంఐ-17 మోడల్‌ చాపర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

20:56 - July 30, 2017

హైదరాబాద్ : మహిళలు అన్ని రంగాల్లో రానించాలనేది ప్రధాని మోది ఆశయమన్నారు బండారు దత్తాత్రేయ. బేగంపేటలో జరిగిన మహిళా సాధికారత సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన మహిళలు సాధించిన విజయాల గురించి రాసిన వుమెన్‌ గ్లోరి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అందుకోసమే బేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

20:55 - July 30, 2017

సిరిసిల్ల : జిల్లా నేరేళ్ల ఘటనపై రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే ప్రజా సంఘాలతో పాటు దళితులు, ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యమకార్యచరణ ప్రకటించుకొని 3రోజుల క్రితం ఛలో సిరిసిల్ల అంటూ సభను ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు భారీ స్థాయిలో యత్నించడంతో సభ ఏర్పాట్లు జరగలేదు. కనీసం స్టేజ్‌ కూడా వేయనీయకుండా నిర్భందం కొనసాగించి... పోలీసులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సోమవారం సభ నిర్వహించి తీరుతామని భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది.

అండగా కమ్యునిస్టు పార్టీలు
ఎలాగైనా సభను విజయవంతం చేసేందుకు దళిత నేత అయిన మీరా కుమారిని సిరిసిల్లకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే నేరేళ్ల బాధితులకు ఇటు, కమ్యునిస్టు పార్టీలు అండగా నిలిచాయి. ప్రజాసంఘాలు, దళిత సంఘాలు కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించాయి. ఎప్పటికప్పుడు పోలీసులు వీరిని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నా రోజురోజుకీ పరిస్థితి మరింత సీరియస్‌గా మారుతోంది. బీజెపీ లాంటి జాతీయ స్థాయి పార్టీ నాయకులపై కూడా పోలీసులు కేసులకు వెనకాడటంలేదు. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఈ విషయంలో పట్టు విడవడంలేదు. దీంతో సోమవారం సభ ఎలా నిర్వహిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ కూడా ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే మాజీ స్పీకర్‌ మీరాకుమారిని సిరిసిల్ల సభకు ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలకు కూడా పోలీసులు అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారు. సభకు అనుమతి లేదంటూ ప్రకటనలు జారీ చేశారు. కావాలనే సభకు అడ్డుపడుతున్నారని భావించిన కాంగ్రెస్‌ ఎలాగైనా సభ నిర్వహిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్‌ సిద్ధం చేసుకుంది.

హైకోర్టును ఆశ్రయించింది
సభ నిర్వహణకు కాంగ్రెస్‌, జిల్లా స్థాయిలో చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా అది తిరస్కరించబడింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్‌ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు మాత్రం బహిరంగ సభల వల్ల సిరిసిల్లలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెబుతున్నారు. అందుకోసం 48 గంటల ముందు నుండి సిరిసిల్లలో బహిరంగ సభలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తూ... సెక్షన్‌ 30 కింద జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్‌ నిర్వహించబోయే బహిరంగ సభకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సభకు అనుమతివ్వాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గం కావడంతో బాధితులకు అండగా నిలిచి ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టాలన్నది ప్రతిపక్షాల వ్యూహం. మొత్తానికి నువ్వా నేనా అన్న స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో సోమవారం... కాంగ్రెస్‌ నిర్వహంచబోయే సభతో సిరిసిల్ల హాట్‌హాట్‌గా మారింది.

20:54 - July 30, 2017

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో కాపు జేఏసీ ఆద్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు తెలియజేశారు. కాపుల ఆకలి కేకలు చంద్రబాబుకి తెలియాలంటూ ముద్రగడ సూచించారు. కాపు నేతలు కంచాలతో చప్పుడు చేస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో ముద్రగడతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కాపు జేఏసీ నాయకులు మహిళలు పాల్గోన్నారు. 

20:52 - July 30, 2017

విశాఖ : ఉద్దానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యుల బృందంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో సమావేశ అయ్యారు. శనివారం ఉద్దానంలో పర్యటించి అధ్యయనం చేసిన వివరాలను హార్వర్డ్స్ వైద్యులు పవన్‌కు వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలన్నారు పవన్. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత పాలకులు ఈ సమస్యను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం అయినా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే ప్రతిపక్ష వైసీపీ మద్దతు కూడా కోరతానన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు తనతో కలిసి వచ్చినా ఆహ్వానిస్తానని పవన్‌ పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీవ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే తన ప్రయత్నం ఫలించినట్లని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల కోసమే గానీ.. రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. మానవత్వం మంటగలుస్తున్నా పోరాడేవారు లేకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారం కావాలన్నదే తన అభిమతమని, మనిషి మేధస్సు ఉద్దానం సమస్యను పరిష్కరించగలదని పవన్ అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు.

సమస్యల పట్ల మానవత్వంతో
తాను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యులు అన్నారు. బాధితుల శాంపిల్స్‌ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలని, బయో మార్కర్స్‌తో వ్యాధి తీవ్రతను గుర్తించి...సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ జోసెఫ్‌ సూచించారు. ఉద్దానంతో పాటు శ్రీలంక, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా కిడ్నీ వ్యాధి ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యాధి మూలాలు అంతుబట్టడం లేదని డాక్టర్‌ రవిరాజు పేర్కొన్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరో డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుతో భేటీ
ఉద్దానం సమస్యపై ఎప్పటికప్పుడు డేటా సేకరించి ప్రపంచ పరిశోధకుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని, ప్రపచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ఉద్దానంలో అయితే సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఉద్దానంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యుల బృందం చేపట్టిన అధ్యయన వివరాలను సీఎంకు సమర్పించనున్నారు. 

19:14 - July 30, 2017

చిత్తూరు : శ్రీవారి దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. వెంకటేషుని దర్శనానికి ఎన్ని కష్టాలనైనా లెక్కచేయరు. అందుకే తిరుమలకు భక్తులు నిత్యం వేలల్లో తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని పులకించిపోతారు.తిరుమలకు వచ్చే భక్తులను వారిని అంతే క్షేమంగా పంపించే బాధ్యత టీటీడీది. అందుకే భక్తుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. వారికి మరింతగా భద్రతను పెంచేందుకు సిద్ధమైంది. భక్తుల భద్రత కోసం టీటీడీ ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయినా భక్తుల భద్రత సమస్యను అధిగమించలేకపోయింది. దీనిపై తీవ్రంగా చర్చించిన అధికారులు... తీవ్రవాదులతో పాటు.. నేర చరిత్ర ఉన్నవారెవరినైనా కొండపైకి అనుమతించకూడదని నిర్ణయించారు. వారిని అలిపిరి దగ్గరే నిలువరించాలని భావిస్తున్నారు.

అత్యాధునిక టెక్నాలజీ
నేర చరితులు, తీవ్రవాదులకు అలిపిరి దగ్గరే చెక్‌ పెట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని టీటీడీ తీసుకొస్తోంది. ఇందుకోసం ఫేస్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయనుంది. గతంలో నేరాలకు పాల్పడిన వారి ముఖాన్ని కంప్యూటర్‌లో పొందుపరుస్తారు. దానికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి కెమెరాలతో అనుసంధానిస్తారు. అప్పటికే కంప్యూటర్‌లో నిక్షిప్తమై ఉన్న ఫొటోల్లోని వ్యక్తులెవరైనా ఆ కెమెరా ముందుగా వెళ్తుంటే వెంటనే వారిని పసిగడుతుంది. వెంటనే అలర్ట్‌ మేజేస్‌లు పంపిస్తుంది. దీంతో ఆ కెమెరాలను ఆపరేట్‌ చేసేవారు... ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తారు. వారు అప్రమత్తమై ఆయా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటారు. ఇలా పాతనేరస్తులు కొండపైకి చేరకుండా ఈ నిఘా కెమెరాలు వారికి చెక్‌ పెడతాయి. ఇందుకోసం ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

24 కెమెరాలు
అలిపిరి చెక్‌ పాయింట్‌, అలిపిరి కాలినడక, శ్రీవారి మెట్టు మార్గాల దగ్గర ఈ రికగ్నైజ్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మూడు చోట్ల మొత్తం 24 కెమెరాలు విజిలెన్స్‌ అధికారులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫేస్‌ రికగ్నైజేషన్‌ కెమెరా వ్యవస్థతో పాటు ఆటోమేటిక్‌ వెహికల్‌ ఐడెంటీపై సిస్టమ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజిలెన్స్‌ భావిస్తోంది. దీని ద్వారా అతివేగం, నిబంధనల అతిక్రమణకు పాల్పడిన వాహనాలను కొండపైకి వెళ్లకుండా నియంత్రిస్తారు. అంతేకాదు... కమాండెంట్‌ కంట్రోల్‌ వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఇక నుంచి ఏడుకొండలపై కాలు పెట్టేవారు... నిఘా కెమెరాల్లో రికార్డ్ కాక తప్పదు.

-

19:12 - July 30, 2017

అనంతపురం : వేరుశనగ పంటలను కాపాడేందుకు ప్రభుత్వం రెయిన్‌ గన్లను ఏర్పాటు చేసి రక్షక తడులందించే ప్రక్రియ చేపట్టింది. వర్షాభావ పరిస్ధితుల్లో రైతులు ఇరవై వేల హెక్టార్లలో మాత్రమే వేరుశనగ పంటను సాగు చేశారు. ప్రస్తుతం నీరు లేక పంట ఎండిపోతున్న దశలో వుంది. ఈ క్రమంలో రక్షకతడుందించి పంటను కాపాడాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. హెచ్‌ఎల్సీ నుండి వచ్చే నీటిని వాడుకొని పంటకు నీరందించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పక్కన ఉన్న పొలం నుండి నీటిని వాడుకొని పంటలకు రక్షకతడులందించే ప్రక్రియను మంత్రి దేవినేని ఉమా చేపట్టారు.అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రైతులు, వామపక్షనేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట ఎండిపోతున్న దశలో వుందని, రక్షక తడుల వల్ల పంట బతికేది కూడా కష్టమంటున్నారు రైతులు. హెచ్‌ఎల్సీ నీటిని త్రాగునీటికి కాకుండా, రక్షక తడులకు కేటాయించడం సరైన పద్దతి కాదని మండిపడుతున్నారు. రెయిన్‌ గన్ల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, ఈ ప్రయోగాల వల్ల అధికార పార్టీ నేతలకు తప్పితే రైతులకు లాభం లేదని వామపక్షాలు అంటున్నాయి.హంద్రినీవా ద్వారా నీరు అందించి పంట పొలాలకు నీరందించాలని వాపపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

19:12 - July 30, 2017

విజయనగరం : విజయనగరం జిల్లా కురుపాం నియోజక వర్గం పరిధిలో ఉన్న గుమ్మడి చెక్‌డ్యాం ఆ ప్రాంత రైతులకు ప్రధాన సాగునీటి వనరు. ఈ చెక్‌ డ్యాం కింద కురుపాం, కొమరాడ, జియ్యమ్మ వలస మండలాల పరిధిలో సుమారు పదివేల ఎకరాల భూమి సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే ప్రతి ఏడాది గుమ్మడిగెడ్డ కాలువల్లో పూడిక తీత పనులు జరుగుతుండేవి. ఇరిగేషన్‌ శాఖ, సాగునీటి సంఘాలు విడుదల చేసే నిధులతో పూడికను తీసి, రైతులకు నీరందించే ప్రక్రియ ఆనవాయితీగా వస్తోంది. కాని ఈ ఏడాది ఆగస్టు వస్తున్నా ఇప్పటి వరకు కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టలేదు. ఓ వైపు నారుమళ్లు వేసి దమ్ములకు సిద్ధమవుతున్న రైతులు నీరు లేక అవస్థలు పడుతున్నారు. గుమ్మడిగడ్డి ద్వారా ఈ ఏడాది సాగునీరు రాకపోవడంతో ఇప్పటికే వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. కాలువలో పేరుకున్న పూడికను తీయించాలని పలుమార్లు కురుఫాం ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ అధికారులను అడిగినా ఫలితం లేదంటున్నారు రైతులు. కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించక పోవడంతో రైతులే చందాలు వేసుకొని పనులు చేపట్టారు. తలో కొంత మొత్తాన్ని వేసుకొని జేసిబితో పనులు ప్రారంభించారు.

పట్టించుకోని అధికారులు
పూడిక తీత పనులు చేపట్టాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు... రైతులు చేస్తున్న పనిని అడ్డుకోవడానికి వచ్చారు. వెంటనే పనులు ఆపేయాలని సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆదేశాలిచ్చాడు. దీంతో అధికారుల తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మిడిగెడ్డ కాలువ పూడిక తీత పనులకు సంబంధించి గతంలో జరిగిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. నిధులు విడుదల కాకపోవడంతో చేసేదేమిలేక అధికారులు మొహం చాటేస్తున్నారు. రైతులే స్వయంగా పూడికతీత పనులు చేపడితే ఇక నిధులు విడుదల కావని భావించిన అధికారులు.. పనులు జరక్కుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.అటు నారుమళ్లు ఎండిపోతున్నాయి. ఇటుచూస్తే కాలువల్లో పూడిక తీయడం లేదు. దీంతో ఈ ఏడాది పంటలు పండేది ఎలా అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఖరీఫ్ సీజన్ కి సిద్ధమైన రైతులకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ,ప్రజాప్రతినిధులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

19:10 - July 30, 2017

కడప : చీటీల పేరుతో కోటి రూపాయలకు మోసం చేసిన వ్యక్తి పరారైన ఘటన కడప జిల్లాలో జరిగింది. బద్వేల్‌ పట్టణంలో రామయ్య అనే వ్యక్తి ఇరుగుపొరుగున ఉండే వారితో కొన్ని సంవత్సరాలుగా చిట్టీలు నడుపుతున్నాడు. ఇటీవల చిట్టీలను వేసిన వారికి డబ్బును సరిగా ఇవ్వకపోవడంతో... వారంతా నిలదీశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఇంటికి తాళం పెట్టి, ఫోన్‌ స్విచ్చ్‌ ఆప్‌ చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

19:09 - July 30, 2017

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం 83-84 వ స్నాతకోత్సవ వేడుకులను ఏయూలో ఘనంగా నిర్వహించారు. తొలి సూపర్‌ కంప్యూటర్‌కు రూపకర్తగా నిలిచిన... ఆచార్య విజయ్‌ పి బట్కర్‌కు డాక్టర్‌ ఆఫ్ సైన్స్‌ గౌరవ డాక్టరేట్‌ బిరుదును వీసీ ఆచార్య నాగేశ్వరరావు ప్రదానం చేశారు... ఉత్తమ థీసస్‌ అవార్డుల విభాగంలో 16 పరిశోధన పతకాలు, 11పరిశోధన బహుమతులు, 856 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు , 50 మందికి ఎంఫిల్‌ డిగ్రీలను ప్రదానం చేశారు. ఉత్తమ పరిశోధనలకు సంబందించి నలుగురు ఆచార్యులకు ఆచార్య నాగేశ్వరరావు చేతుల మీదుగా పతకాలు అందించారు. ప్రతి ఒక్కరు ప్రయోగాత్మక పరిశోదనలతో దేశానికి పేరు తీసుకురావాలని డాక్టరేట్‌ బిరుదు అందుకున్న బట్కర్‌ అన్నారు.

19:08 - July 30, 2017

గుంటూరు :  పట్టాపురంలోని నార్త్‌ క్లబ్‌పై అర్బన్‌ ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.. ఈ సోదాల్లో పేకాట ఆడుతున్న 38మందిని అరెస్ట్ చేశారు.. వీరిదగ్గరనుంచి మూడు లక్షల యాభైరెండువేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు.. చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

19:05 - July 30, 2017

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణ పోలీసులు. మానవ అక్రమ రవాణా వ్యతిరేఖ దినం సందర్భంగా పంజగుట్ట సెస్‌లో తెలంగాణా సి.ఐ.డి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా పెరుగుతున్న దందా అని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు పోలీస్‌ అకాడమీలో అధికారులకు ట్రైనింగ్‌ ఇస్తున్నామని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. రాచకొండ పరిధిలో 40 వ్యభిచార గృహాలను సీజ్‌ చేసి 71 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించామన్నారు. 

17:33 - July 30, 2017
17:32 - July 30, 2017
16:59 - July 30, 2017

 హైదరాబాద్ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేరెళ్ల ఘటనపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల దౌర్జన్యాన్ని సదస్సు తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసి 8 మంది యువకులపై పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమితో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణితో వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని.. ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వనరుల దోపిడీ జరగడం దారుణమని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. రాష్ట్ర వనరులు ప్రైవేట్ పరం చేయడం..వనరులు దోచుకోవడాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. 

16:56 - July 30, 2017

హైదరాబాద్ : దేశంలో డ్రగ్స్‌ భూతాన్ని తరిమి కొట్టాలన్నారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు. ఇవాళ హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద కళామందిర్‌ ఫౌండేషన్‌, మా ఆధ్వర్యంలో జరిగిన యాంటీ డ్రగ్స్‌ క్యాంపెయిన్‌లో ఆయన పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు అన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తోందని, సినిమా వాళ్లే కారణం అన్న ప్రచారం సరికాదన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ అకున్ సబర్వాల్‌, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

16:55 - July 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ కమ్యూనికేషన్స్‌ ఎస్సై ఫలితాలను వెనక్కితీసుకోవడంపై డి.జి.పి అనురాగ్‌ శర్మ స్పందించారు. కంప్యూటర్‌లో జరిగిన తప్పిదాల వల్లే ఫలితాలను వెనక్కి తీసుకున్నామని అన్నారు. ఫలితాలకు ఇంగ్లీష్‌ వెయిటేజీ తప్పనిసరి అన్న డీజీపీ.. గ్రామీణ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని ఈ విషయంలో... న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే ఎస్సై ఫలితాలను వెల్లడించి, పారదర్శకంగా నియామకాలను చేపడతామన్నారు.

16:54 - July 30, 2017

గుజరాత్ : సముద్ర తీరంలో భారీ ఎత్తున హెరాయిన్ పట్టుకున్నారు. ఇరాన్ నుంచి వస్తున్న ఓ నౌకను వెంబడించిన కోస్ట్‌గార్డ్, కస్టమ్స్ అధికారులు... అందులో 1500 కేజీల హెరాయిన్ ను... డ్రగ్ మాఫియా తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 3,500 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడడం ఇదే తొలిసారి.

16:53 - July 30, 2017

వరంగల్ : మలేరియా... ఈ పేరు చెబితేనే ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా విషజ్వరాలతో మచంపట్టిన వారే కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మలేరియా బాధితులంతా వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. దీంతో ఈ పెద్దాస్పత్రికి రోజు రోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా జర్వంతో బాధపడుతున్న 7,251 మందికి రక్త పరీక్షలు చేశారు. వీరిలో 158 మందికి మలేరియా సోకినట్టు తేలింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం, నెక్కొండ మండలాలతోపాటు వరంగల్‌ నగరంలో ఎక్కువ కేసులను గుర్తించారు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన కుమారుడికి వైద్యం అందించే విషయంలో ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవంపై ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లి పడిన బాధ వర్ణనాతీతం
పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న బిడ్డకు వైద్యం చేయించే విషయంలో ఈ తల్లి పడిన బాధ వర్ణనాతీతం.మలేరియానే కాదు... భయంకరమైన సెలిబ్రల్‌ మలేరియా కేసులను కూడా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గుర్తించారు. మెదడుకు సోకిన మలేరియా చికిత్సకు కూడా లొంగదు. ఇలాంటి కేసుల్లో మరణమే శరణం అవుతోంది. ప్రాణాంతక మలేరియాకు ఇంతవరకు 8 మంది బలయ్యారని ఎంజీఎం ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. సంగెం మండలం వెంటాపూర్‌కు చెందిన 55 ఏళ్ల రఘుపతి, పెద్దపల్లి జిల్లా రామన్నగూడెంకు చెందిన ఆరేళ్ల బాలిక లక్ష్మి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దండిపెల్లికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు బంగారి రాజయ్య మలేరియా మహమ్మారి బారినపడి మృతిచెందారు. అలాగే ఆదిలాబాద్‌ జిల్లా వాసి 55 ఏళ్ల బొందుబాయి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం చెన్నరావుపేటకు చెందిన 30 ఏళ్ల యువకుడు శంకర్‌, 60 ఏళ్ల ముత్తమ్మ, 12 సంవత్సరాల తార, చెన్నారావుపేటకు చెందిన ఏడేళ్ల నందు కూడా మలేరియాతో మృతిచెందారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృత్యువాతపడ్డవారిలో 13 ఏళ్లలోపు వారు ముగ్గురు ఉండటం ఆందోళనకరపరిణామం. ఇవి కేవలం అధికార గణాంకాలే. అనధికార లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే టుంటుందని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రికార్డులకు ఎక్కని మలేరియా మరణాలు చాలానే ఉంటాయంటున్నారు.

13 మందికి డెంగీ
మలేరియానే కాదు.. భయంకరమైన డెంగీ కూడా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రబలింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 199 మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే, 13 మందికి డెంగీ సోకినట్టు గుర్తించారు. ఈనెలలో 76 మందికి రక్తపరీక్ష చేస్తే ముగ్గురికి డెంగీ లక్షణాలు బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. విష్వజరాలతో బాధపడుతూ ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సేవలు అందక వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చినా ఆరోగ్యం అంతమెరుగ్గాలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలేరియా, డెంగీ వంటి ప్రాణాంత విషజ్వరాల ప్రభావం గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణకు ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, వ్యాధి నిరారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్నికోరుతున్నారు. డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బందిని అందుబాటు ఉంచితే అంటువ్యాధులను కొంతవరకైనా నివారించడంతోపాటు, మరణాలను తగ్గించవచ్చని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈదిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

16:52 - July 30, 2017

వికారాబాద్ : జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠాని పట్టుకున్నారు తాండూర్‌ రైల్వే పోలీసులు. తాండూర్‌ రైల్వే స్టేషన్‌లో ట్రైన్‌లో తరలిస్తున్న 4లక్షల విలువగల 110 కిలోల గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు.. నిఘా ఉంచిన పోలీసులు.. వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను వికారాబాద్ రైల్వే పీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు.

16:51 - July 30, 2017

విశాఖ : ఉద్దానం కిడ్నీ సమస్యలపై జనసేన ఆధ్వర్యంలో అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యులతో పవన్‌ కల్యాణ్‌ భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన పవన్‌... ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కరానికి తొలి అడుగు పడిందన్నారు. ఉద్దానం సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని.. గత పాలకులు ఈ సమస్యను పట్టించుకోలేదన్నారు పవన్‌. ఉద్దానం సమస్యపై ప్రజలతో కలిసి పోరాడుతానని.. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కోరుతానన్నారు. ఎంత పెద్ద ప్రయాణమైన చిన్న అడుగుతోనే మొదలవుతుందని.. ప్రజలకు సాయం చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు జనసేనాని. మానవత్వం మంట కలుస్తున్నా పోరాడేవారు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా నేను తాను ఇదే చేసేవాడినని.. సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు.

శంషాబాద్ ఎయిపోర్ట్ లో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిపోర్ట్ నోవాటెల్ హోటల్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ఆల్టో కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొంది. ఈ సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులతో పాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి. 

16:05 - July 30, 2017

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిపోర్ట్ నోవాటెల్ హోటల్ వద్ద కారు ప్రమాదం జరిగింది. ఆల్టో కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొంది. ఈ సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులతో పాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి. వారు ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

మంచు విష్ణుకు గాయాలు

మలేషియా : సినీనటుడు మంచు విష్ణు సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.. మలేషియాలో విష్ణు నటిస్తున్న ఆచారి అమెరికా యాత్ర మూవీ షూటింగ్‌ జరుగుతోంది.. బైక్‌ రేస్‌ సీన్‌ షూట్‌ చేస్తుండగా విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి.. అతన్ని మలేషియాలోని పుత్రజయ ఆస్పత్రికి తరలించారు.

15:07 - July 30, 2017

హైదరాబాద్ : జంటనగరాల్లో రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా రోడ్లు, జంక్షన్లు లేకపోవడంతో కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో 221 జంక్షన్లు ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్ అయ్యే జంక్షన్లు 111 ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించినా... విస్తరణ చేపట్టలేదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జంక్షన్లను విస్తరించాలని మున్సిపల్‌ పరిపాలనా శాఖ జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఇందుకు 42 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కానీ నిధుల కొరతతో సతమతమవుతున్న జీహెచ్‌ఎంసీ జంక్షన్ల విస్తరణను ప్రణాళికను పక్కన పెట్టింది.

111 జంక్షన్లలో....
ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే 111 జంక్షన్లలో 42 మేజర్, 69 మైనర్‌ జంక్షన్లు ఉన్నాయి. మైనర్‌ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తే ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలిదశలో స్థలాల సేకరణ అవసరంలేని యాభై జంక్షన్లను విస్తరించాలని ప్రతిపాదించారు. జీహెచ్‌ఎంసీ నార్త్‌ జోన్‌ పరిధిలోని ప్యారడైజ్‌, ప్యాట్నీ, రాధిక, బాలానగర్‌, పనామా జంక్షన్లకు వెడల్పు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో జంక్షన్‌ విస్తరణకు 25 నుంచి 50 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. గతేడాదే వీటిని అభివృద్ధి చేయాల్సి వున్నా... నిధుల కొరతతో ఇంతవరకు చేపట్టలేదు. ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు మోక్షం లభించే అవకాశం ఉంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే శ్రీనగర్‌ కాలనీ, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌ జంక్షన్ల వెడల్పుకు చర్యలు మున్సిపల్‌ పరిపాలనా శాఖ జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. అయితే నిధుల కొరతతో సతమతమవుతున్న గ్రేటర్‌ నగరపాలక సంస్థ జంక్షన్ల విస్తరణ కార్యక్రమాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

 

15:06 - July 30, 2017

పెద్దపల్లి : ఒకరు ఎస్‌ అంటే మరొకరు నో అంటారు.. ఒకరు ముందుకు నడుద్దామంటే.. మరొకరు ఇప్పుడు కాదంటారు.. ఇద్దరు నేతల పూర్తి వ్యతిరేక నిర్ణయాలతో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు చుక్కలు కనిపిస్తున్నాయి.. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ లక్ష్మినారాయణ మధ్య వార్‌ పార్టీ పరువును బజారున పడేస్తోంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో సోమారపు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో... లక్ష్మినారాయణ టిడిపిలో కీలకపాత్ర పోషిస్తూ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి దూరంగా ఉన్నారు.. తమతో కలిసిరావాలంటూ ఉద్యమకారులు వీరిపై చాలాసార్లు ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు.. ఉద్యమంలో పాల్గొనకపోయినా... అదృష్టం ఈ ఇద్దరు నేతల తలరాతల్ని మార్చేసింది.. ఆర్టీసి చైర్మన్‌ పదవి సత్యనారాయణను వరించగా.. రామగుండం నగర పాలక సంస్థకు మేయర్‌గా లక్ష్మినారాయణ ఎన్నికయ్యారు.

స్వతంత్ర అభ్యర్థి లక్ష్మినారాయణను మేయర్
గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది.. ఒక్క స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది.. గ్రామస్థాయి నుంచి నగర పాలక సంస్థలవరకూ పలు స్థానాల్లో గులాబీ పార్టీవిజయ ఢంకా మోగించింది.. ఒక్క రామగుండం కార్పొరేషన్‌లోమాత్రం చుక్కెదురైంది... 50 డివిజన్లలో మెజారిటీ స్థానాలను స్వతంత్ర అభ్యర్ధులు గెలుచుకున్నారు.. దీంతో మేయర్‌ స్థానం దక్కించుకోవాలంటే స్వతంత్ర కార్పొరేటర్ల మద్దతు తప్పనిసరైంది.... కార్పొరేషన్‌లోపాగావేసేందుకు ముందునుంచి పావులు కదిపిన టీఆర్‌ఎస్‌... ఇండిపెండెంట్ అభ్యర్థులతో చర్చలు జరిపింది.. స్వతంత్ర అభ్యర్థి లక్ష్మినారాయణను మేయర్ చేస్తామని ఆఫర్‌ ఇచ్చింది.. లక్ష్మినారాయణ సానుకూలంగా స్పందించడంతో మేయర్ స్థానం టిఆర్ఎస్ ఖాతాలో చేరింది. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ అనుభవం... ఎంపి సుమన్ సహకారంతో ఇదంతా సాధ్యమైంది.. వీరి వ్యూహాలతో మేయర్‌ అయిన లక్ష్మినారాయణ ఇప్పుడు ఎమ్మెల్యేకే చుక్కలు చూపిస్తున్నారు.

కమిటీల రద్దు
ప్రతి పనిలోనూ ఎమ్మెల్యేకు అడ్డుతగులుతున్న మేయర్‌.... నియోజకవర్గంలోపట్టుకోసం మరింత ప్రయత్నిస్తున్నారు.. పార్టీని బలోపేతంచేసేందుకు గతంలోవేసిన కమిటీలను సోమారపు రద్దు చేశారు.. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మేయర్‌ పావులు కదిపారు.. రద్దు చేసిన కమిటి సభ్యులకే తిరిగి పదవులు ఇస్తున్నట్లు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బాలరాజుతో ప్రకటన చేయించారు... మేయర్‌తీరుతో ఖంగుతిన్న ఎమ్మెల్యే.... గీత దాటి ప్రవహరిస్తే వేటు తప్పదంటూ హెచ్చరించారు.. మేయర్‌మాత్రం కమిటీల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టారు.నియోజకవర్గంలో మేయర్‌ దూకుడువెనక సూత్రదారులు వేరే ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.. మేయర్ లక్ష్మినారాయణకు ఎంపీ బాల్క సుమన్ వర్గం మనిషిగా ముద్రపడిపోయింది.. సోమారపు సత్యనారాయణకు మాజీ ఎంపీ వివేక్ సన్నిహితుడిగా పేరుంది.. నియోజక వర్గంలో తనకంటూ ఓ క్యాడర్ తయారు చేసుకునే పనిలో సుమన్‌ ఉన్నారు.. కలిసివస్తున్న నేతలను తన వర్గంలో చేర్చుకుంటూ... వారికి కావాల్సిన పనులు చేస్తూముందుకుసాగుతున్నారు.. అటు వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపిగా పోటీ చేయాలని వివేక్‌ ఆరాటపడుతున్నారు.. ఈ ఇద్దరు నేతల పాలిటిక్స్‌తో పార్టీ పరిస్థితి స్టీరింగ్ లేని కారులా మారింది.

భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వ్యవహారంకూడా ఇద్దరు నేతలమధ్య చిచ్చుపెట్టింది.. సోమారపు సిఫారసు చేసిన రమేశ్‌కుకాకుండా మేయర్‌, ఎంపీ మద్దతుఇచ్చిన క్రిష్ణకు సిఐ పోస్ట్ ఇవ్వడం వివాదాన్ని మరింత పెంచింది.. రామగుండం టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఈటెల.. ఇద్దరితో చాలాసార్లు చర్చలు జరిపారు.. అయినా ఫలితంరాకపోవడంతో ఈటెలకూడా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు.. ఈ వార్‌ ఇలాగే కొనసాగితే పార్టీకి భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.. ఇందులో వెంటనే జోక్యంచేసుకొని ఇద్దరిమధ్యా రాజీకుదర్చాలని పార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు.

15:02 - July 30, 2017

ఢిల్లీ : ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు సాధన సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పునర్విజన చట్టంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని సమితి నాయకులు కోరారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. 

15:01 - July 30, 2017

మలేషియా : సినీనటుడు మంచు విష్ణు సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.. మలేషియాలో విష్ణు నటిస్తున్న ఆచారి అమెరికా యాత్ర మూవీ షూటింగ్‌ జరుగుతోంది.. బైక్‌ రేస్‌ సీన్‌ షూట్‌ చేస్తుండగా విష్ణుకు తీవ్ర గాయాలయ్యాయి.. అతన్ని మలేషియాలోని పుత్రజయ ఆస్పత్రికి తరలించారు.

14:59 - July 30, 2017

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు చేదుఅనుభవం ఎదురైంది.. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు హస్తం నేతలు ప్రగతి భవన్‌కు వెళ్లారు.. వీరిని సీఎం సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.. నేతలకు లోపలికివెళ్లేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు.. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఉద్దండాపూర్‌ రైతుల సమస్యలపై తాము సీఎంకుగానీ... సీఎంవో అధికారులకుగానీ రిప్రజెంటేషన్‌ ఇచ్చాకే ఇక్కడినుంచి కదులుతామని డీకే అరుణ, మల్లు రవి స్పష్టం చేశారు.. దీంతో అధికారులు ఇద్దరు నేతల్ని లోపలకు పంపారు.. లోపల అధికారులకు రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

14:49 - July 30, 2017

 ఓ హీరోయిన్ రెండు రోజుల కాల్ షిట్స్ రెమ్యూనేషన్ అక్షరాల రూ.5కోట్లు..ఎంటీ అశ్చర్యపోయారా...అవును ఇది నిజం..ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌ అంటే అది నయనతారనే. ఒక్క చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసే స్థాయికి ఎదిగిన నటి ఈ కేరళా బ్యూటీ. అయ్యా(చిత్రం) అంటూ కోలీవుడ్‌కు దిగుమతి అయిన నయనతార ( అసలు పేరు డయానా) తన సినీ పయనంలో పలు ఎత్తుపల్లాలను చూసి ఈ స్థాయికి చేరుకుంది. నటిగా 13 వసంతాలను పూర్తి చేసుకున్న నయనతార నిజజీవితంలోనూ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని, ఎదురొడ్డి నిలిచింది. ఇటీవల నయనతార నటించిన చిత్రం డోర విడుదలై నిరాశపరచింది.అయినా ఈ క్రేజీ హీరోయిన్‌ మార్కెట్‌ ఏ మాత్రం సడలలేదు. ఇప్పటికీ దక్షిణాది నిర్మాతలు ఈమె కాల్‌షీట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారనడం అతిశయోక్తి కాదేమో.

కాగా నయనతార టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా, ఇటీవల వరకూ ఆ పాపులారిటీని ఇతరత్రా వాడుకోలేదు. చాలా మంది కథానాయికలు తమ ఇమేజ్‌ను వాణిజ్య ప్రకటనలకు వాడుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు.ఈ మధ్యనే నయనతార కూడా వాణిజ్య ప్రకటనలో నటించడం ప్రారంభించారు. ఇటీవల ఒక డీటీహెచ్‌ వాణిజ్య ప్రకటనలో నటించారు. అయితే అందుకు ఈ భామ పుచ్చుకున్న మొత్తం రూ.5 కోట్లట.అందుకు కేటాయించింది మాత్రం కేవలం రెండురోజుల కాల్‌షీట్సేనట. ఈ సమాచారం విన్న స్టార్‌ హీరోలే అవాక్కు అవుతున్నారని కోలీవుడ్‌ వర్గాల టాక్‌. మరి నయనతారా..మజాకా.

 

14:05 - July 30, 2017

హైదరాబాద్ : నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజా చిత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్ టీఆర్, హరికృష్ణ, క్రిష్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డితోపాటు.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాలతర్వాత తొలి షాట్‌కు ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి '180' చిత్ర దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న 'జై లవకుశ' చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

యాదాద్రిలో ఆటో డ్రైవర్ల ధర్నా

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కొండపైకి వెళ్లే మార్గంలో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. గుట్టపైకి ఆర్టీసీ, మినీ బస్సులను అనుమతించవద్దని డిమాండ్ చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 

13:57 - July 30, 2017

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కొండపైకి వెళ్లే మార్గంలో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. గుట్టపైకి ఆర్టీసీ, మినీ బస్సులను అనుమతించవద్దని డిమాండ్ చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విక్రమ్‌గౌడ్‌ది ఆత్మహత్యాయత్నం : పోలీసులు

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌ది ఆత్మహత్యాయత్నంగా పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్‌ శరీరంలోని బుల్లెట్‌, గన్‌ కాల్చిన విధానంపై దృష్టిపెట్టిన పోలీసులు.... గన్‌ పేల్చిన వ్యక్తిపై ఉండే అవశేషాలు అతని వద్దే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. విక్రమ్‌ వెన్నుపూసలో బుల్లెట్‌ అలాగే ఉంది.. ఈ బుల్లెట్‌ తొలగిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చిస్తున్నారు. 

13:42 - July 30, 2017
13:41 - July 30, 2017

ఢిల్లీ : వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మన్ కీ బాత్ లో మోదీ మాట్లాడారు. వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో తనతో పాటు కేంద్రమంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైనికులు, అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.. బాధిత ప్రజలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నిత్యవసర సరుకులను అందజేస్తున్నట్లు వెల్లడించారు.  అసోం, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్ లో వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని మోదీ పేర్కొన్నారు. 

 

13:36 - July 30, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌ది ఆత్మహత్యాయత్నంగా పోలీసులు భావిస్తున్నారు. విక్రమ్‌ శరీరంలోని బుల్లెట్‌, గన్‌ కాల్చిన విధానంపై దృష్టిపెట్టిన పోలీసులు.... గన్‌ పేల్చిన వ్యక్తిపై ఉండే అవశేషాలు అతని వద్దే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. విక్రమ్‌ వెన్నుపూసలో బుల్లెట్‌ అలాగే ఉంది.. ఈ బుల్లెట్‌ తొలగిస్తే వచ్చే ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యులతో వైద్యులు చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:31 - July 30, 2017

మంచిర్యాల : జిల్లాలోని కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. పెద్దనపల్లిలో కొడుకుపై దాడిచేసిన తండ్రి బండరాయితోమోది హత్య చేశాడు. మార్త గట్టయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకొడుకైన ప్రశాంత్ అల్లరిచిల్లరిగా తిరిగేవాడు. తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో తండ్రీకొడుకులు ఘర్షణపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోయిన గట్టయ్య అక్కడేఉన్న బండరాయితో కొడుకునుకొట్టాడు. తీవ్ర గాయాలుకావడంతో కొడుకు అక్కడే మృతి చెందాడు.

 

13:12 - July 30, 2017

నాగర్‌కర్నూలు : జిల్లాలోని కల్వకుర్తి సబ్‌స్టేషన్‌లో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని... సీఎంకు జీవితాంతం రుణపడిఉంటామని తెలిపారు. 20వేలమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కేసీఆర్‌ వెలుగులు నింపారని హర్షం వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్‌పై నిన్న కేసీఆర్‌ సంతకం చేశారు.

 

13:10 - July 30, 2017

విశాఖ : కేంద్రప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు ఏవీ అమలు కావడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ హామీలు నెరవేర్చకుండా వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయితే ఈ నింద జీవితకాలం ఉండిపోతుందని అభిప్రాయపడ్డారు. ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. దళితుల సమస్యలపై రేపు విజయవాడలో పదివామపక్ష పార్టీలతో సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. పవన్‌ వచ్చాకే ఉద్దానం సమస్యపై స్పందన వచ్చిందన్నారు.

13:05 - July 30, 2017

విశాఖ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖ చేరుకున్నారు. కాసేపట్లో పోతనమల్లయ్యపాలెంలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో వైద్యులు, హార్వర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో భేటీకానున్నారు.. ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై చర్చించనున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై హార్వర్డ్‌ బృందం ఇచ్చే సూచనలను ఆయనకు వివరించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

13:02 - July 30, 2017

గుంటూరు : పట్టాపురంలోని నార్త్‌ క్లబ్‌పై అర్బన్‌ ఎస్ పీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పేకాట ఆడుతున్న 38మందిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి మూడు లక్షల యాభైరెండువేల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

12:56 - July 30, 2017

పూరి జగన్నాధ్ తన పైసా వసూల్ సినిమా ట్రైలర్ ని వదిలాడు. అదే పూరి మార్కు సినిమా, పూరి మార్కు డైలాగ్స్ తో బాలకృష్ణ స్టైల్ కొత్తగా అనిపించింది కనిపించింది. బాలయ్య బాబు మూవీ అంటే ఆల్రెడీ ఎక్సపెక్టషన్స్ తో ఉంటుంది అదే ఎక్సపెక్టషన్స్ అందుకున్నాడు పూరి... ఆ వివరాలను చూద్దాం...
బాలయ్య మార్కెట్ పెంచిన గౌతమి పుత్ర శాతకర్ణి 
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య మార్కెట్ ని పెంచింది. ఆల్రెడీ తన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ గట్టిగ పెట్టి బిజినెస్ చేసుకునే టాలెంట్ ఉన్న నటుడు బాలయ్య .క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్నాడు అంటేనే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని అందరూ ఫీల్ అయ్యారు ..శాతకర్ణి హిట్ తో అటు బాలయ్య ఫాన్స్ లో ఇటు ఆడియన్స్ లో బాలయ్య మీద పాజిటివ్ హోప్ వచ్చింది .హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా లు చేసే బాలయ్య  డెడికేషన్ ఉన్న నటుడు అని నేమ్ తెచ్చుకున్నాడు.
ఆడియన్స్ ని రీచ్ అయిన ట్రైలర్ 
పూరి డైరెక్షన్ లో తయారవుతున్న బాలయ్య సినిమా పైసవసుల్. ఇద్దరు యువ సూపర్‌స్టార్ల చిత్రాలతో ఢీకొంటోన్న బాలకృష్ణ చిత్రం 'పైసా వసూల్‌' ఫాన్స్‌కి ఇజ్జత్‌ కా సవాల్‌గా మారింది. అద్దిరిపోయే డైలాగ్స్ తో వచ్చిన ఈ పైసవసుల్ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని రీచ్ అయింది. ఈ డైలాగులు కూడా అభిమానుల్ని అలరించేవే. ఈ స్టంపర్ చూస్తే కథేంటన్నది అర్థం కావడం లేదు కానీ.. ఇది పక్కా యాక్షన్ మూవీ అన్నది మాత్రం తెలుస్తోంది. రిచ్ ఫారిన్ లొకేషన్లలో.. భారీగానే సినిమాను తెరకెక్కించినట్లున్నారు. మొత్తానికి ‘పైసా వసూల్’లో బాలయ్యను పూరి తనదైన స్టయిల్లో ప్రెజెంట్ చేసేలా కనిపిస్తున్నాడు ఈ స్టంపర్ చూస్తుంటే.

 

12:18 - July 30, 2017

ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయొద్దని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గపూర్, వైసీపీ నేత భవకుమార్, టీడీపీ నాయకురాలు అనురాధ పాల్గొని, మాట్లాడారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:07 - July 30, 2017

ఢిల్లీ : ఇండియా అంటే ఇందిరాగాంధీనే అంటూ జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోది గొప్పవారని పొగుడుతూనే.. ఇందిరాగాంధీపై ప్రశంసలు కురిపించారు. కొంతమందికి ఇది ఇష్టం లేకపోవచ్చు కానీ...నాకు మాత్రం ఇందిర అంటే భారతదేశం...నేను మళ్లీ అలాంటి భారత్‌ను చూడాలని అనుకుంటున్నానని తెలిపారు. కశ్మీర్‌ బాధను, కష్టాన్ని, ఏడ్పును తనదిగా భావించే భారత్‌ను మళ్లీ చూడాలని ఉందని మెహబూబా పేర్కొన్నారు. కశ్మీర్‌ అంటే మినీ భారత్‌ అని...ఇక్కడ అన్ని మతాల, ప్రాంతాల ప్రజలు ఉన్నారని భావోద్వేగంతో చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను వెనక్కి తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఫ్తి హెచ్చరించారు.

 

11:57 - July 30, 2017

ఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన ప‌రువు నష్టం కేసులో కేజ్రీవాల్‌కు న్యాయ‌వాదిగా ఉన్న రాంజెఠ్మలాని ఇపుడు రివర్స్‌ అయ్యారు. జైట్లీ బూతులు తిట్టాల్సిందిగా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ చెప్పారని జెఠ్మలాని ఆరోపించారు. ఈ విషయంలో రాంజెఠ్మలాని తాజాగా కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఇదే అంశంలో జులై 20 న కేజ్రీవాల్‌కు ఉత్తరం రాశారు. మే 17న కోర్టు విచార‌ణ‌లో భాగంగా జెఠ్మలానీ త‌న‌పై అభ్యంత‌ర వ్యాఖ్య చేయ‌డాన్ని అరుణ్ జైట్లీ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దీనిపై 10 కోట్లకు కేజ్రీవాల్‌పై మ‌రో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేయడంతో జెఠ్మలానిని తొలగించారు. త‌మ ఇద్దరి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ల్లో కేజ్రీవాల్ మ‌రింత అభ్యంత‌ర‌క‌ర భాష వాడిన‌ట్లు కూడా జెఠ్మలానీ వెల్లడించారు. దీంతో కేజ్రీవాల్‌ మ‌రింత చిక్కుల్లో ప‌డ్డారు.

 

11:54 - July 30, 2017

గుజరాత్ : బిజెపి చీఫ్‌ అమిత్‌ షా ఆస్తులు బాగా పెరిగాయి. 2012లో ఆయన ఆస్తుల విలువ 1.90 కోట్లు కాగా...ఇపుడది 19 కోట్లకు చేరుకుంది. ఆయన స్థిరాస్తులు 2012లో 6.63 కోట్లుంటే...2017 నాటికి 15.30 కోట్లకు పెరిగింది. వీటిలో పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల విలువ 10.38 కోట్లు ఉన్నట్లు అమిత్‌ షా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌ కింద దాఖలు చేసిన అఫిడవిట్‌లో అమిత్‌ షా, స్మృతీ ఇరానీ, బల్వంత్‌ సిన్హా రాజ్‌పుత్ తమ ఆస్తుల వివరాలు తెలిపారు. స్మృతీ ఇరానీ స్థిర చరాస్తులు 2014లో 4.91 కోట్లుంటే 2017 నాటికి 8.88 కోట్లకు చేరింది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బికాం ఫస్టియర్‌ పూర్తి చేశానని చెప్పారు. దీనిపై వివాదం రేగడంతో ఈసారి మూడేళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయలేదని తెలిపారు. ఇక కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన బల్వంత్‌సిన్హా రాజ్‌పుత్ తన చరాస్తులు 254 కోట్లుగా, స్థిరాస్తులు 62.56 కోట్లుగా ఉన్నట్టు డిక్లేర్‌ చేశారు. 

 

11:52 - July 30, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీలో ఇద్దరు ఎమ్మెల్సీల రాజీనామాలపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. బిజెపి బిహార్‌ తర్వాత యూపీలో రాజకీయ అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లాలనుకుంటే వారు వెళ్లొచ్చని...వారిని ఎవరూ ఆపలేరన్నారు.  ఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు యశ్వంత్‌ సిన్హా, బుక్కల్‌ నవాబ్‌ ఎస్పీకి రాజానామా చేశారు. బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు.

11:49 - July 30, 2017
11:48 - July 30, 2017

యాదాద్రి : జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎం.టీ. రేపాక, ఉప్పాలపాడ్‌ గ్రామాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి.. రెండు గ్రామాల్లో తిరుగుతూ దాదాపు పదిమందిపై దాడి చేశాయి.. ఇందులో నలుగురు చిన్నారులున్నారు.. వీరిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.. అక్కడ వ్యాక్సిన్‌ అందుబాటులోలేక భువనగిరికి తరలించారు. 

11:46 - July 30, 2017

కృష్ణా : ఈ నెల 31న విజయవాడలో సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం కలవనుంది. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నారు. కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఇవాళ విశాఖ మెడికల్ సింపోజియంకు పవన్‌ వెళ్లనున్నారు. అక్కడ హార్వర్డ్‌ బృందాన్ని పవన్‌ కలవనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:42 - July 30, 2017

వరంగల్ : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదని టీఆర్ ఎస్ ఎంపీ సీతారాం నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ఉత్తరాదిలో వనజ్‌ గిరిజన జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించిన కేంద్రం... మేడారంను విస్మరించడం సరికాదన్నారు. గిరిజన జాతరంటే నెల రోజుల పాటు ఈ ప్రాంత ప్రజల కడుపునిండే విధంగా ఉండాలన్నారు. మేడారం జాతరను  జాతీయ పండుగగా గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తెలంగాణ ఎంపీలందరితో కలిసి కేంద్ర మంత్రిని కలుస్తామని చెప్పారు. వనదేవతలను గద్దెపైకి తీసుకొచ్చినప్పుడు ప్రత్యేక గుర్తింపు అవసరమన్నారు. మేడారం జాతరలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక జానపద శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 

కర్నూలు జిల్లాలో వ్యక్తి హత్య కలకలం

కర్నూలు : శివారులో తాండ్రపాడు దగ్గర వ్యక్తి హత్య కలకలం సృష్టించింది. రాజు అనే వ్యక్తిని తలపై బండరాయితో మోది దుండగులు చంపేశారు.. ఆర్థిక గొడవలు, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

11:29 - July 30, 2017

కర్నూలు : శివారులో తాండ్రపాడు దగ్గర వ్యక్తి హత్య కలకలం సృష్టించింది. రాజు అనే వ్యక్తిని తలపై బండరాయితో మోది దుండగులు చంపేశారు.. ఆర్థిక గొడవలు, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ పరిశీలించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్

విశాఖ : జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. విశాఖ మెడికల్ సింపోజియంకు పవన్‌ వెళ్లనున్నారు. అక్కడ హార్వర్డ్‌ బృందాన్ని పవన్‌ కలవనున్నారు. 

నేడు హార్వర్డ్‌ బృందాన్ని కలవనున్న పవన్‌

కృష్ణా : ఈ నెల 31న విజయవాడలో సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం కలవనుంది. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నారు. కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఇవాళ విశాఖ మెడికల్ సింపోజియంకు పవన్‌ వెళ్లనున్నారు. అక్కడ హార్వర్డ్‌ బృందాన్ని పవన్‌ కలవనున్నారు. 

11:21 - July 30, 2017

కృష్ణా : ఈ నెల 31న విజయవాడలో సీఎం చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యుల బృందం కలవనుంది. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నారు. కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఇవాళ విశాఖ మెడికల్ సింపోజియంకు పవన్‌ వెళ్లనున్నారు. అక్కడ హార్వర్డ్‌ బృందాన్ని పవన్‌ కలవనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

11:16 - July 30, 2017

చిత్తూరు : తిరుమల షాపింగ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో కలకలం రేగింది. ఏడాది వయసున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పోలీసులు బాలుడి తల్లిదండ్రులకోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం

మంచిర్యాల : జిల్లాలోని కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. స్టేషన్‌ పెద్దపల్లిలో తండ్రిని కొడుకు హత్య చేశాడు. తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

11:11 - July 30, 2017

మంచిర్యాల : జిల్లాలోని కాశీపేట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. స్టేషన్‌ పెద్దపల్లిలో తండ్రిని కొడుకు హత్య చేశాడు. తండ్రిపై బండరాయితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ తండ్రి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమి స్థానికులు చెబుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:06 - July 30, 2017

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడలో ఆకతాయి వీరంగం సృష్టించాడు.. అర్ధరాత్రి హాస్టల్‌లోకి ప్రవేశించిన దుండగుడు... మద్యంమత్తులో విద్యార్థులపై దాడి చేశాడు.. విద్యార్థులు కేకలువేయడంతో దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు.

 

11:03 - July 30, 2017

హైదరాబాద్ : యాంటీ డ్రగ్స్‌ వాక్‌తో హైదరాబాద్ సందడిగా మారింది.. కేబీఆర్ పార్క్‌ దగ్గర ఈ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.. ఈ వాక్‌లో ఏపీ మంత్రి కామినేని, ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు..డ్రగ్స్‌కు బానిస కావొద్దని ప్రజలకు సూచించారు..

 

11:01 - July 30, 2017

పశ్చిమ గోదావరి : జిల్లాలోని నిడదవోలుమండలం తాళ్లపాలెంలో రోడ్డుప్రమాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఏపీ 16 ఈఎఫ్ 0209 నెంబర్ గల కారు అదుపుతప్పి.. చెట్టును ఢీకొట్టి ఏలూరు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. విజయవాడ నుంచి నర్సీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

10:57 - July 30, 2017

ఢిల్లీ : తొలి టెస్టులో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో సమిష్టిగా రాణించి.. ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. 304 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరొక రోజు మిగిలి ఉండగానే గాలే టెస్ట్‌లో విజయం సాధించి 3 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
గాలే టెస్టులో భారత్‌ ఘనవిజయం 
గాలే టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. అన్ని విభాగాల్లో రాణించిన కోహ్లీసేన 304 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 240 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసి 550 పరుగుల విజయ లక్ష్యాన్ని లంకకు నిర్దేశించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 76.5 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు మిగిలుండగానే భారత్‌ విక్టరీ సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 190, పుజారా 153 పరుగులతో విరుచుకుపడగా.. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బ్యాట్‌మెన్ల విజృంభనతో భారత్‌ భారీస్కోర్‌ సాధించింది. బ్యాట్‌మెన్స్‌ శ్రమను వృథా కానివ్వకుండా బౌలర్లు సైతం తమవంతు పాత్ర పోషించి లంకను తక్కువ స్కోరుకే కుప్ప కూల్చి విజయాన్ని అందించారు. 
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో తరంగ, మాథ్యూస్‌, పెరార అర్థసెంచరీలతో రాణించడంతో.. 291 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కరుణరత్నే ఒంటరిపోరు చేశాడు. అతనికి ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు రాలేదు. 97 పరుగులు చేసిన కరుణరత్నేను అశ్విన్‌ పెవీలియన్‌కు పంపగా.. డిక్‌వెల్లా 67పరుగులు మినహా ఇతర ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు. దీంతో లంక 245 పరుగులకే ఆలౌట్‌అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, జడేజా చెరో మూడు వికెట్లు, షమి, ఉమేష్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీసి లంకను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కథం తొక్కిన శిఖర్‌ధావన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. మొత్తంగా మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగ‌స్ట్ 3న కొలంబోలో జ‌ర‌గనుంది.

 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : పుల్వమా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతదళాలు హతమార్చారు. 

 

10:44 - July 30, 2017

హైదరాబాద్ : పార్టీ  కమిటీల నియామకానికి శ్రీకారం చుడుతోంది టీఆర్‌ఎస్‌పార్టీ. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన మూడేళ్ల  తర్వాత పార్టీ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తును ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. 
పార్టీపదవుల భర్తీకి కేసీఆర్ ఓకే..!
అధికారపార్టీ నేతలను ఎప్పటి నుంచో ఊరిస్తున్న పార్టీ పదవులు  భర్తీకి గులాబీబాస్‌ శ్రీకారం చుడుతున్నారన్న సమాచరంతో  ఆశావహుల్లో హడావిడి మొదలైంది. పదవీయోగం కోసం అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే  ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 
3ఏళ్లుగా పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టని కేసీఆర్‌
అధికారంలోకి వచ్చి  మూడేళ్లయినా..ఇంతవరకు పార్టీ నిర్మాణంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి సారించలేదు. మొదటి రెండేళ్లు నేతల వలసలను ప్రోత్సహించి ప్రతిపక్షాలను ఉక్కిబిక్కిరి చేసిన గులాబి దళపతి తాజాగా పార్టీ 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలకు మరో రెండేళ్లవరకు సమయం ఉన్నా ఇప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు గులాబీపార్టీ నేతలు అంటున్నారు.   
పార్టీ నియమావళిలో మార్పులకు ప్లీనరీలో నిర్ణయం
పార్టీలో సంస్థాగతంగా మార్పులను చేపట్టాలని..దీనికోసం నియమావళిలో సవరణలకు ఇటీవల నిర్వహించిన పార్టీప్లీనరీలో నిర్ణయం తీసుకున్నారు. దీన్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎమ్మెల్యేలకు పూర్తిస్వేచ్ఛ ఇవ్వడానికి పార్టీ అధినేత ఓకే చెప్పిన తెలుస్తోంది. దీనికోసం అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.  మండలస్థాయి నాయకులు, జడ్పీటీసిలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు సహా ఆయా ఎమ్మెల్యే, ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. అటు జిల్లా స్థాయిలో సమన్వయకర్తులుగా ఇద్దరికి బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు 31 జిల్లాలకు  జిల్లా కోఆర్డినేటర్లను  పార్టీ అధినేత నియమించనున్నారు. ఇక రాష్ట్ర కమిటీ విషయానికి వస్తే.. 42 లేదా 51 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు కానుంది. పోలిట్ బ్యూరో మాత్రం గతంలో మాదిరిగా కాకుండా అతి తక్కువ సంఖ్యలో  సభ్యులతోనే నియమించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు గులాబీపార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రితో కలుపుకుని ఆరుగురికి మాత్రమే పోలిట్ బ్యూరోలో అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
పార్టీకమిటీల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం..!
పార్టీ  కమిటీల పూర్తి స్థాయి నియామకం అనంతరం   ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ అధినేత నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఎప్పటి కప్పుడు స్పందిస్తూ ప్రభుత్వ  ప్రాధాన్యతలను వివరించేందుకు పార్టీ నేతలను  ముఖ్యమంత్రి సిద్ధం చేయనున్నట్లు సమాచారం.  
నియోజకవర్గాల పునర్విభజనకు మూసుకున్న దారలు 
ఇదిలావుంటే నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో .. పార్టీపదవులతోనే నేతల ఆకాంక్షలు నెరవేర్చాలని గులాబీపార్టీ అధినేత భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఏర్పాటవుతున్న పార్టీకమిటీల్లో స్థానంకోసం నేతల ఎవరి ప్రత్నాలు వారు మొదలు పెట్టారు. దీంతో గులాబీపార్టీలో కొత్త  హడావిడి మొదలైంది. 

 

10:39 - July 30, 2017

హైదరాబాద్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఇప్పటినుంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి ప్రత్యేక సర్వేలు చేయిస్తున్నారు. వాటి లోటుపాట్లు సరిచేసుకోడానికి ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌లను సిద్ధంచేసుకున్నారు. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేసుకున్నారు. 
సర్వేల ద్వారా పథకాలపై తీరుపై చంద్రబాబు ఆరా
తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు ప్లాన్‌ ని సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. పథకాలతో ప్రజలు ఎంతమంది సంతృప్తి చెందుతున్నారో ఎంతమంది అసంతృప్తి చెందుతున్నారో సర్వేల ద్వారా తెలుసుకోడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 103 పథకాలపై కాల్‌ సెంటర్‌ ద్వారా సర్వే చేయించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. సర్వేలో పెన్షన్లపై 97శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని 3శాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తేలింది. ఉపాధి హామీ పనులపై 77శాతం ప్రజలు సంతృప్తి చెందగా 23శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మద్యం అమ్మకాలను నియంత్రించాలని 92శాతం మంది కొరుకోగా వద్దని 8శాతం మంది కోరారు. బెల్ట్‌ షాపులను మూసివేయాలన్న నిర్ణయాన్ని 98శాతం స్వాగతించారు. చేయించిన సర్వేల వివరాలను పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రులకు అందజేశారు.
ప్రతివారం 5పథకాల తీరుపై మంత్రులతో సమీక్ష
ప్రతి వారం ఐదు పథకాల అమలు తీరుపై మంత్రల బృందం సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఈసారి చేయించే సర్వే నాటికి... సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తి మరింతగా పెరగాలని మంత్రులకు సూచించారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించి వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని నేతలకు సూచించారు. జన్మభూమి కమిటీలపై అసంతృప్తి ఉన్నందున ఆ కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఓట్ల రూపంలో సంతృప్తి ప్రతిబింబించాలని అన్నారు. ప్రతి ప్రజాప్రతినిధుల పనితీరుపై సర్వేలు జరుగుతున్నాయన్నారు. కొందరు పనితీరు మార్చుకోవాలని తీరు మార్చుకోకపోతే కష్టం అని తేల్చిచెప్పారు. చంద్రబాబు చేయిస్తున్న వరుస సర్వేలతో అటు అధికారుల్లోనూ.. ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ టెన్షన్‌ మొదలైంది. 

 

10:32 - July 30, 2017

ఖమ్మం : రైతురాజ్యంగా చెప్పుకునే మన దేశంలో అన్నదాతలకు అడుగడుగునా భంగపాటు తప్పడం లేదు. విత్తనాల నుంచి  ఎరువులు, క్రిమి సంహారక మందుల వరకు నకిలీలే రాజ్యమేలుతున్నాయి. చివరికి రైతు రుణాలు కూడా నకిలీగా మారిపోయాయి. అదేంటి... రైతు రుణాలు నకిలీ కావడమేంటనే అనుమానం కలుగుతోందా. అవును. లేని రైతులను సృష్టించి వారి పేరుతో వ్యవసాయ రుణాలు కాజేస్తున్నారు కొందరు అక్రమార్కులు. 
బ్యాంకుల మోసం 
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్యాంకు మోసాలకు అడ్డాగా మారింది. ఇక్కడి బ్యాంకులు రైతులను మోసగించడం నిత్యకృత్యంగా మారింది.  గతంలో ఐడీబీఐ బ్యాంక్‌లో ముద్రా రుణాల కుంభకోణం బయటపడింది. ఇప్పుడు  ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకులో మరో అవినీతి వెలుగు చూసింది. రైతు రుణాల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి రుణాలు కాజేశారు అక్రమార్కులు. 
బ్యాంకు అధికారులతో  పరిచయం పెంచుకున్న ముఠా
అధికారుల సంతకాలు ఫోర్జరీ
సత్తపల్లిలో ఓ ముఠా బ్యాంకు అధికారులతో పరిచయం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోంది. నకిలీ రైతుల పేరుతో ఈ ముఠా పాస్‌పుస్తకాలు తయారు చేస్తుంది.  టైటిల్‌ డీడ్‌లో ఉండాల్సిన సంతకాలను సులువుగా ఫోర్జరీ చేస్తారు. నో డ్యూస్‌ సర్టిఫికెట్లనూ తయారు చేస్తారు. అంతేనా... స్టాంప్‌లనూ సృష్టిస్తారు. ఇలా ఒకటేమిటి పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌ నుంచి తహసీల్దార్‌ సంతకాల వరకు అన్నీ పక్కాగా తయారు చేస్తారు.  ఆ తర్వాత బ్యాంక్‌ అధికారులను కలిసి వాటిని చూపిస్తారు. ఇంకేముంది రుణం మంజూరవుతుంది.  ఆ రుణంలో ఒకరికొకరు వాటాలు పంచుకుంటారు. ఇదీ ఇప్పుడు సత్తుపల్లిలోని ఐఓబీ  బ్యాంక్‌లో జరుగుతున్న అవినీతి. 
రుణాల మంజూరీలో అక్రమాలు
సత్తుపల్లికి చెందిన గాదె సత్యనారాయణ సత్తుపల్లి రెవెన్యూ పరిధిలో  26వ ఖాతా నంబర్‌లో 7.3ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ ఖాతా నంబర్‌పై స్థానిక డీసీసీబీ బ్యాంక్‌లో లక్ష రూపాయల రుణం మార్చి నెలలో రెన్యువల్‌ అయ్యింది.  ఇదే ఖాతా నంబర్‌పై ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లో సయ్యద్‌ రజియా పేరుతోనూ 94వేల వ్యవసాయ రుణం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో అవాక్కైన అతడు.. పోలీసులను ఆశ్రయించడంతో రుణాల మంజూరీ అక్రమాల డొంక కదిలింది.
లోతుగా దర్యాప్తుచేస్తున్న అధికారులు
నకిలీ రైతుల పేర్లతో  రుణాలు కాజేసిన వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు చేస్తున్న తనిఖీల్లో వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు  బయటపడ్డాయి. దొంగ డాక్యుమెంట్లు దొరికాయి.  ఏజెంట్లు, బ్యాంకు సిబ్బంది కలిసి రుణాలు కాజేసినట్టు తెలుస్తోంది. రైతు రుణాల పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు 
సత్తుపల్లిలో నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలతో రుణాలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒక్క బ్యాంకులోనే వందల సంఖ్యలో నకిలీ పాస్‌పుస్తకాలు దొరికితే... మిగిలిన బ్యాంకుల్లో ఇంకెన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి మండలాల్లోని అన్ని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశముంది.

10:26 - July 30, 2017

ఢిల్లీ : గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత సంఘం నాయకులు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం ప్రారంభించారు. జాతీయస్థాయి నేతలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 400 కుటుంబాలను వెలివేయడం బాధాకరమన్నారు సీపీఎం నేత శ్రీనివాసరావు. ఇదే విషయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అపాయింట్‌మెంట్‌ కోరామని దళిత సంఘం నేతలు అన్నారు. 

 

10:22 - July 30, 2017

తూర్పుగోదావరి : గరగపర్రు దళితులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈనెల 3వ తేదీలోగా పరిహారం చెక్కులు అందించాలని మాజీ ఎంపి హర్షకుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో 4వ తేదీ నుంచి మరోసారి ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన  ప్రకటించారు. రాజమండ్రిలో గరగపర్రు బాధితులతో సమావేశమైన హర్షకుమార్ వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. 

ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే దానికి బానిసలుగా తయారవుతాం : వెంకయ్యనాయుడు

హైదరాబాద్ : ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే దానికి బానిసలుగా తయారవుతామని వెంకయ్యనాయుడు అన్నారు. పొగ, మద్యంతాగడం కన్నా డ్రగ్స్ వాడకం ప్రమాదకరమని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకంతో శరీరం నిర్వీర్యమవుతుందని తెలిపారు. 

09:48 - July 30, 2017

విశాఖ : హెచ్‌పీసీఎల్‌పై పిడుగుపాటుతో విశాఖనగరం ఉలిక్కిపడింది. క్రూడ్‌ఆయ్‌ట్యాంకుపై పిడుగు పడ్డంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.  అధికారులు, ఫైర్‌సిబ్బంది తక్షణ స్పందించడంతో  భారీగా ఆస్తినష్టం లేకుండా నివారించగలిగారు. ప్రస్తుతం ఆస్తనష్టం ఎంతమేరకు ఉందో అధికారులు అంచనా వేస్తున్నారు. 
హెచ్‌పీసీఎల్ పై పడిన పిడుగు 
వివాఖలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో పడిగుపాటుతో మంటలు చెలరేడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. భారీగా క్రూడాయిల్ నిల్వ ఉన్న జీరో 1-డీ ట్యాంకుపై పిడుగుపడింది. దీంతో ఆయిల్‌కు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన హెచ్‌పీసీఎల్‌ అధికారులు మంటలు ఇరత మిషనరీకి విస్తరించకుండా చర్యలు చేపట్టారు. రిఫైనరీ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను పూర్తిగా ఆపేశారు. అటు సమాచారం తెలుసుకున్న  అగ్నిమాపక సిబ్బంది  తక్షణం స్పందించారు. హుటాహుటిన  ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తంగా వ్యవహరించి  ఆస్తినష్టం భారీగా లేకుండా నివారించామని అధికారులు అంటున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేసిన అధికారులు ఆస్తినష్టం ఏమేరకు ఉందో అంచానా వేస్తున్నారు. 

09:44 - July 30, 2017

శ్రీకాకుళం : ఉద్దానం బాధలు మరోసారి వెలుగలోకి వచ్చాయి. హార్వార్డ్‌ వైద్యబృందం ఉద్దానంలో పర్యటిస్తోంది. కిడ్నీ రోగుల బాధలను  వైద్య నిపుణులు అడిగి తెలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌చొరవతో మరోసారి తమ బాధలు ప్రపంచం దృష్టికి వెళ్లుతున్నాయని ఉద్దానం జనం అంటున్నారు.  
ఉద్దానంలో హర్వార్డ్‌ వైద్యబృందం పర్యటన 
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో హార్వర్డ్‌ వైద్య బృందం పర్యటించింది. బోరివంకలో పర్యటించి కిడ్నీ వ్యాధిగ్రస్తులు, బాధిత కుటుంబాలతో మాట్లాడింది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు, వైద్య నివేదికలను పరిశీలించారు.
ఉద్దానం పరిస్థితులను వివరించిన డాక్టర్‌ వై. కృష్ణమూర్తి
కిడ్నీవ్యాధి బాధితులను పలకరించిన హార్వార్డ్‌ వైద్యబృందం వ్యాధి తీవ్రతకు గల కారణాలను స్థానిక వైద్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైద్య ప్రముఖులు డాక్టర్‌ వై. కృష్ణమూర్తి ఆ ప్రాంత పరిస్థితులను, బాధితులకు అందుతున్న వైద్యసేవల తీరును వారికి వివరించారు. ప్రభుత్వ పరంగా వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. 
చావుకోసం ఎదురు చూస్తున్నాం : బాధితులు  
ఉద్దానం ప్రాంతాన్ని రెండు దశాబ్దాలుగా మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ సంగతి తెలిసినప్పటికీ పాలకుల్లో ఏ మాత్రం చలనం రాలేదు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చొరవతో  ఉద్దానం కిడ్నీవ్యాధుల ఉదంతం ఇపుడు ప్రపంచం దృష్టికి వచ్చినట్టైంది. హర్వార్డ్‌ డాక్టర్లతో మాట్లాడిని బాధితులు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని.. సొంతఖర్చులతో ప్రాణాలు నిలుపుకుంటున్నామని చెప్పారు. ఆస్తులు అమ్ముకుని ఏళ్లకేళ్లు చికిత్స పొందుతున్నా రోగం నయంకాక.. వైద్యం మానుకోని చావు కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పర్యటన తర్వాత ప్రభుత్వంలో కొద్దిగా కదలిక వచ్చినా అది అదరకొర చర్యలతోనే సరిపెట్టారని కిడ్నీబాధితులు వాపోయారు. ఎక్కడో పాలకొండలో, టెక్కలిలో డయాలసిస్ కేంద్రాలు పెట్టి.. అసలు సమస్య ఎక్కువగా ఉన్న  ఉద్దానాన్ని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 
అమలు కాని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హామీ 
భావితరాలకు వ్యాధి సోకకుండా  చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు.  కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా వాటి అమలు జాడే లేకుండా పోయింది.   ప్రస్తుతం  హర్వార్డ్‌ నుంచి వచ్చిన వైద్యుల బృందం ఉద్దానం ప్రాంతంలోనే ఎందుకు ఎక్కువగా వ్యాధి ప్రబలుతుందో అద్యయనం చేస్తోంది.  కిడ్నీ వ్యాధికి కారణాలు, నివారణ, చికిత్సలపై ఏపీ ప్రభుత్వంతోకూడా హార్వార్డ్‌ వైద్యులు చర్చించనున్నారు.

 

09:40 - July 30, 2017

తిరుమల : నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోగా....ఉద్యోగులను రోడ్డున పడేసే విధంగా.. నిబంధనలు పెడుతున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. టీడీపీ నాయకుల వేధింపులు... చంద్రబాబునాయుడు కక్ష సాధింపు చర్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారన్నారు. హామీలను అమలు చేయని చంద్రబాబునాయుడుకు సీఎంగా కొనసాగే అర్హత ఉందా అని రోజా ప్రశ్నించారు. 

 

09:37 - July 30, 2017

కాకినాడ : 50 ఏళ్లు దాటితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగంలోంచి తీసేస్తారంటూ వచ్చిన వార్తలపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం ముందుందని.. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి జర్నలిజం విలువల్ని దిగజార్చుకోవద్దని యనమల సూచించారు. ప్రతిపక్షం కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 

 

ఏఎస్ ఐ ప్రసాద్ గుండెపోటుతో మృతి

కరీంనగర్ : రాంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఏఎస్ ఐ ప్రసాద్ అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఎస్ ఐ పదోన్నతి కోసం శిక్షణకు వచ్చారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. 

 

08:52 - July 30, 2017

హైదరాబాద్ : భవిష్యత్తులో సోలార్‌కు మంచిరోజులున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే రెండేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఐదువేల మెగావాట్లకు తెలంగాణ రాష్ట్రం చేరుకుంటుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా రెండు లక్షల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో... ప్రీమియర్‌ సోలార్‌ మాడ్యుల్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. 
ప్రీమియర్ సోలార్ మాడ్యుల్‌ ప్రారంభం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో ప్రీమియర్ సోలార్ మాడ్యుల్‌ను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.  100 కోట్ల పెట్టుబడితో రూపొందించిన ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశారు. సోలార్‌తో నడిచే ఈ-రిక్షా, ఈ-బైక్, ఈ సైకిల్‌ను మంత్రులు ప్రారంభించారు. 
సౌర శక్తితో ఎన్నో అద్భుతాలు : కేటీఆర్   
సౌర శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే సోలార్‌ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని 200 మెగావాట్ల యూనిట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్‌లు మరెన్నో ఏర్పాటు చేసి... స్థానికులకు వంద శాతం ఉద్యోగాలు  కల్పించాలని ఆయన కోరారు. త్వరలోనే సంగారెడ్డిలో ఎల్‌ఈడీ బల్బుల తయారీ పరిశ్రమ వస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభిస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అధికారులు పాల్గొన్నారు. 

 

08:48 - July 30, 2017

హైదరాబాద్ : ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్‌ అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేలా ఆదేశించాలని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈమేరకు తెలంగాణ నిటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషీ కేంద్ర జలసంఘంగానికి లేఖరాశారు. 
అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపించండి 
ఆంధ్రప్రదశ్‌ ప్రభుత్వం అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న కొత్తప్రాజెక్టులను ఆపాలని తెలంగాణసర్కార్‌ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లేఖరాశారు. 
తుమ్మిళ్ల, భక్తరామదాసు ప్రాజెక్టులు కొత్తవి కాదని లేఖ 
ప్రాజెక్టునిర్మాణంపై పూర్తిస్తాయిలో వివరాలు వెల్లడించకుండానే డీపీఆర్‌లు  ఏపీ కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు.    పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ప్రాజెక్టులకు ఎటువంటి డీపీఆర్‌లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. అయితే తాము చేపట్టిన తుమ్మిళ్ల, భక్తరామదాసు ప్రాజెక్టులు కొత్తవి కావని టీసర్కార్‌ లేఖలో  పేర్కొంది. 
పరిష్కారానికి అత్యున్నత మండలి ఏర్పాటు చేయండి
ఇరు రాష్ర్టాల మధ్య సమస్యలను కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. సమస్యలపై చర్చకు అత్యున్నత మండలి భేటీ ఏర్పాటు చేయాలని కోరింది.  పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు తరలిస్తున్నారని.. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా తరలిస్తున్న నీటికి సమానస్థాయిలో తెలంగాణకు అదనపు నీరు ఇవ్వాలని  టీసర్కార్‌ కోరింది. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదుపై ఏపీ సర్కార్‌ ఎలా స్పందిస్తుందన్నది ఇపడువ ఉత్కంఠగా మారింది.  దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.  

 

'మా' ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ వాక్

హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ వద్ద 'మా' ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ వాక్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, అకున్ సబర్వాల్, చంద్రవదన్, సినీ ప్రముఖులు రాజశేఖర్, జీవిత, శివాజీ రాజా హాజరయ్యారు. 

తిరుమలలో బాలున్ని వదలివెళ్లిన వ్యక్తులు

చిత్తూరు : తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో ఏడాది బాలున్ని గుర్తుతెలియన వ్యక్తులు వదిలి వెళ్లారు. టూటౌన్ పోలీసుల సంరక్షణలో బాలుడు ఉన్నాడు. 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప.గో : నిడదవోలు మండలం తాళ్లపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ 16ఈఎఫ్ 0209 నెంబర్ గల కారు చెట్టును ఢీకొని ఏలూరు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయవాడ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. 

నేడు ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై సదస్సు

విశాఖ : ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై నేడు కన్వెన్షన్ హాల్ లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 

Don't Miss