Activities calendar

31 July 2017

21:50 - July 31, 2017

ఢిల్లీ : రాజ్యసభకు ఎంపికైతే అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలను బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా కొట్టిపారేశారు. బిజెపి అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ పనితీరుతో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. యూపీ పర్యటనలో ఉన్న అమిత్‌షా -2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మోది ప్రభుత్వం సుపరిపాలన, అభివృద్ధి కారణంగా 13 రాష్ట్రాల్లో బిజెపి అధికారం చేపట్టిందని అమిత్‌షా అన్నారు.

21:49 - July 31, 2017

పాట్నా : మహాకూటమితో తెగతెంపులు చేసుకున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ....ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని ఓడించే దమ్ము, ధైర్యం ఇప్పట్లో ఎవరికీ లేదని అన్నారు. మహాకూటమిని కొనసాగించడానికి ఎంతో ఓర్పు వహించానని...తేజస్వీ యాదవ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆర్జేడి మౌనం వహించడంతో బిజెపితో జతకట్టాల్సి వచ్చిందని నితీష్‌ చెప్పారు. తమ పార్టీ నేతలు లాలుపై విమర్శలు చేయలేదని...లాలు కూడా తనతో ఎప్పుడూ మాట్లాడలేదని నితీష్‌ తెలిపారు.

21:48 - July 31, 2017

ఢిల్లీ : గతవారం చైనా సైనికులు ఉత్తరాఖండ్‌ సరిహద్దులో చొరబడ్డట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు ధృవీకరించాయి. చమోలి జిల్లా బారాహోతిలో సుమారు రెండు గంటల పాటు చైనా దళాలు సంచరించినట్లు పేర్కొన్నారు. జులై 25 ఉదయం 9 గంటల ప్రాంతంలో చైనా దళాలు 8 వందల మీటర్ల ఎత్తులో ఉన్న భారత భూభాగంలోకి కిలోమీటర్‌ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సరిహద్దులో ఐటిబిపి సైనికులు వారిని ప్రతిఘటించి వెనక్కి పంపించాయి. బారాహోతి సరిహద్దులో భారత్‌-చైనాల మధ్య ఎలాంటి వివాదం లేదు. చైనా కవ్వింపు చర్యలను సహించేది లేదని భారత్‌ స్పష్టం చేసింది. సిక్కిం సరిహద్దులో డోక్లాం వివాదంపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

21:47 - July 31, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసులో వీడని చిక్కుముడి...మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ కాల్పుల ఘటనపై రోజుకో మలుపుతిరుగుతుంది..కొత్త కొత్త విషయాలు బయటకు వస్తుండడంతో ఈ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి...అనేక అనుమానాలు..అనేక సందేహాలు...వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఆంద్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి విక్రమ్‌గౌడ్‌కు ఐదుసార్లు ఫోన్లు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు...ఘటన జరిగిన శుక్రవారం రాత్రి సమయంలో ఫోన్లు చేసిందెవరు..? నార్త్ జోన్, ఈస్ట్ జోన్ రెండు టాస్క్ ఫోర్స్ పోలిసుల బ్రుందాలు రెండు రోజులుగా అనంతపురం జిల్లాపై ఫోకస్ పెట్టారు...అయితే ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది...

కాల్ డేటా ఆధారంగా
అనంతలో అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ప్రధాన వ్యక్తిగా అనుమానిస్తూ కాల్‌డేటా ఆధారంగా ప్రయత్నిస్తే స్విచ్చాఫ్ ఉంది..దీంతో ట్రేస్ చేయడం కష్టంగా మారింది...ఘటనకు ముందు జూబ్లీహీల్స్ రోడ్ నంబర్ 86లో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అప్రాంతంలో అనుమానితంగా సంచరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలిసులు గుర్తించారు. వారి ద్విచక్ర వాహనం నంబరు ప్లేట్ క్లారిటి లేకపోవడంతో సిసి ఫుటేజ్ ను నగర కమీషనరు కార్యాలయానికి తరలించారు. సిపి కార్యాలయంలోని వీడియో అనాలసిస్ ఎన్ హ్యస్ మెంట్ విభాగం అదికారులు ద్విచక్రవాహనం యొక్క నంబరు ప్లేట్ సదరు యజమాని ఎవరా అన్న కొణంలోను దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఈఘటనకు సంబందించి ఇంట్లో లబించిన అదారాలు పరిశీలిస్తే పోలిసులకు అనుమానం అంతా విక్రంగౌడ్ పైనే ఉన్నట్లు తెలుస్తోంది...ఫైనాన్షియర్లను, కుటుంబ సభ్యులకు ఝలక్ ఇవ్వాలన్న కోణంలో కాల్పుల నాటకం ఆడారన్న అనుమానాలు పోలీసులకు బలపడుతున్నాయి...తనను తానే కాల్చుకుని ఆ రివాల్వర్‌ను తానే ఏర్పాటు చేసిన వ్యక్తులతో పంపించాడా...? అన్న అనుమానాలు లేకపోలేదు.ఘటన జరిగిన ఇంట్లో సైంటిఫిక్‌ బ్రుందాలతో రెండు సార్లు ఆనవాళ్ల కోసం ప్రయత్నించారు...కాని ఎలాంటి క్లూ దొరకలేదు... ఎఫ్ ఎస్‌ ఎల్ క్లూస్ టింలు ఇచ్చిన నివేదిక సైతం విక్రం గౌడ్ చుట్టే తిరుగుతోంది.

కావాలనే కాల్పుల నాటకం
దీంతో కావాలనే కాల్పుల నాటకం అడిఉంటారన్న అనుమానం పోలిసులు వ్యక్తం చేస్తున్నారు.దర్గాలో అన్నదానం ఉందని చెప్పినట్లు భార్య షిఫాలి చెప్పిన విషయంపై పోలీసులు ఆరా తీస్తే సమీప దర్గాలో ఈ విషయంపై ఎవరూ కలువలేదని తెలుసుకున్నారు...దీనికి తోడు ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటే ఆ రోజు ఆస్పత్రికి ఐదో వ్యక్తి వెళ్లాడు..అతను ఎవరు..? అతనే ఆ తుపాకీ మాయం చేశాడా..? ఇలా అన్ని అనుమానాలపై పోలీసులు దర్యాప్తును వేగం చేశారు.

21:46 - July 31, 2017

గుంటూరు : శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్య దశాబ్దాలుగా ఉందని.. ఈ అంశాన్ని మీడియా వెలుగులోకి తెస్తే.. తన బాధ్యతగా అక్కడ పర్యటించి బాధితుల ఆవేదనను ప్రపంచానికి తెలియజెప్పానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం పవన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్దానం అంశాన్ని రాజకీయం చేసి లబ్ది పొందాలనుకుంటే అది దిగజారుడుతనమే అవుతుందని పవన్‌ అన్నారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చి సెంటర్‌ ఏర్పాటు చేయాలని... అలాగే అనాథలవుతున్న చిన్నారుల్ని ప్రభుత్వం దత్తత తీసుకుంటే బాగుంటుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఉద్దానం బాధితులకు కొంత వరకు ఉపశమనం కలిగించారని... అయితే ఉద్దానం సమస్య మూలాలను తొలగించాల్సిన అవసరం ఉందని పవన్‌ అన్నారు. అక్టోబర్‌ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పూర్తిస్థాయిలో ప్రజా సమస్యలపైనా పోరాటం చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ నిర్మాణానికి సంబంధించి సదస్సులు తెలంగాణలో పూర్తయ్యాయన్న పవన్‌... ఏపీలో రెండు మూడు జిల్లాల్లో ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. అక్టోబర్‌ నుంచి అధికశాతం ప్రజా సమస్యలపైనే పనిచేస్తానన్నారు.

ప్రజలను విడదీసే రాజకీయాలంటే
గరగపర్రు దళితుల సమస్యపై తాను ఇప్పటివరకు మాట్లాడలేదన్న పవన్‌... ప్రజలను విడదీసే రాజకీయాలంటే తనకు భయమన్నారు. గరగపర్రు చాలా సున్నితమైన అంశమని.. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం వల్లే అక్కడ సమస్య జఠిలమయ్యిందన్నారు. అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్‌ వంటి మహానీయుల్ని ఒక కులానికి, మతానికి , వర్గానికి పరిమితం చేయడం దురదృష్టకరమన్నారు. కాకినాడ గోదావరి ఆక్వా పార్కు నిర్మాణంలో యాజ‌మాన్యం నిబంధనల్ని పాటిస్తుందో లేదో చూడాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారు కాలుష్య నిబంధనల్ని పాటిస్తున్నారో లేదో.. ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ప్రజలకు హాని కల్గిస్తుందంటే దాన్ని విరమించుకొనేలా, ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేయాలని పవన్‌ అన్నారు.కాపు రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైనదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు చేయకూడదన్న ఆయన.. శాంతియుతంగా చేస్తే ముద్రగడ పాదయాత్రకు అనుమతివ్వాలన్నారు.

పాదయాత్ర చేస్తేనే రాజకీయ నాయకుడా
పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు అనుకోవడం సరికాదన్నారు పవన్‌. తాను కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని.. అయితే తనను అభిమానించే వారు సహకరిస్తే పాదయాత్ర చేస్తానన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న పవన్‌.. ఒకటి రెండు రోజుల్లో పార్టీ తరఫున ప్రకటన చేస్తామన్నారు. ఎవ‌రి బ‌లాలు వారికి ఉంటాయని.. జ‌న‌సేన బ‌లం ఎంతో ప్రజ‌ల్లోకి వెళ్తే తెలుస్తుందన్నారు. టీడీపీ, బీజేపీతో రహస్య స్నేహం గానీ, రహస్య ఎజెండా గానీ ఏమీ లేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గతంలో టీడీపీ, బీజేపీతో స్నేహం చేశానన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పార్టీలకు ఎదురెల్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

21:43 - July 31, 2017

గుంటూరు : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజల కిడ్నీ వ్యాధుల సమస్యకు పరిష్కారం అన్వేషించేందుకు ప్రభుత్వం అడుగు వేసింది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చొరవ, ఒత్తిడి ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. హార్వర్డ్‌ ప్రొఫెసర్లు, వైద్యుల బృందంతో కలిసి.. పవన్‌ కల్యాణ్‌ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఉద్దానం ప్రాంత ప్రజల సమస్యలపై వారు చర్చించారు. ఉద్దానం ప్రజల కిడ్నీసమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పవన్ కల్యాణ్‌ చంద్రబాబును కోరారు. సమస్య కారణంగా అనాథలు అవుతున్న చిన్నారులను దత్తత తీసుకోవాలని సూచించారు. ఉద్దానం పరిసర ప్రాంతాల్లో వైద్యపరమైన కోర్సులు పూర్తి చేసిన 9 వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు కిడ్నీ సమస్య పరిష్కారంలో వారిని భాగస్వాములు చేయాలని పవన్ చంద్రబాబును కోరారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్
జీవన్ దాన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్ అంగీకారం తెలిపారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కనుగొనే దిశగా రూ.15 కోట్ల నిధులతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు హామీ ఇచ్చారు. ఈ పరిశోధనలో, భారతీయ వైద్య పరిశోధన మండలి కూడా భాగస్వామ్యం వహిస్తుందని చంద్రబాబు చెప్పారు. పరిశోధనకు అయ్యే ఖర్చులో ICMR 50 శాతం భరించేందుకు ముందుకు వచ్చిందని.. ఏడాదికి రూ.5 కోట్లు వంతున మూడేళ్లలో రూ.15 కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వపరంగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య హార్వర్డ్‌ వైద్య బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రియల్ 15 నాటికి ఈ వైద్య బృందాల ద్వారా లక్షా ఒక్క వెయ్యీ ఐదు వందల తొంభైముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పూనం మాలకొండయ్య వివరించారు. సమావేశానికి ముందు పవన్, చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పవన్‌తో పాటు హార్వర్డ్ బృందానికి సీఎం చంద్రబాబు విందు ఇచ్చారు.

 

20:42 - July 31, 2017
20:31 - July 31, 2017

ప్రకృతి సహకారం లేదు.. సరే..ప్రభుత్వం ఏం చేస్తోంది..?ఈ దేశ పౌరులుగా కనీస రక్షణలను పొందాల్సిన పౌరులను గాలికొదిలేసిన ఏలికలు దశాబ్దాలుగా సాధించిందేమిటి? ఇన్ని వేల మంది చనిపోతే చీమకుట్టినట్టుగా కూడా అనిపించని సర్కారీ పెద్దలకు మెలకువ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని మరణాలు రావాలి? ఇంకెన్ని గ్రామాలు నాశనం కావాలి? ఉద్ధానం ప్రశ్నిస్తోంది..! సమాధానం కోసం డిమాండ్ చేస్తోంది..!! ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది? జనాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నారు? కారణాలు ఎందుకు తెలియటం లేదు?ప్రకృతి క్రూరంగా చూస్తోంది. సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. వెరసి ఉద్ధానం ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. రోగాల బారిన ప్రజలతో, వేలాది మరణాలతో స్మశాన దృశ్యం కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా? ప్రభుత్వాలు పట్టించుకోవా? ఏళ్లు గడుస్తున్నాయి.. కానీ, సమస్యలో మార్పు లేదు.. మూడు దశాబ్దాలుగా ముప్పుతిప్పలు పెడుతోంది.. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో గ్రామాలు.. వేలాది జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు..వరుసగా సిఎంలు మారుతున్నారు .. కానీ, వాళ్ళిచ్చిన హామీ నెరవేరడం లేదు.. ఇక్కడి ప్రజల తలరాత మారటం లేదు. ఎన్నికలొస్తాయి.. హామీలు కుమ్మరిస్తారు..మీటింగుల్లో చెమటోడుస్తారు.. వరాల జల్లులు కురిపిస్తారు..అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తారు.. గట్టిగా అడిగితే నాలుగు మాటలు చెప్పి కాలం గడిపేస్తారు.. ఇంతకుమించి ఉద్ధానానికి ఒరిగిందేమిటి...మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

20:29 - July 31, 2017

ప్రతిపక్షాలకు ప్రభుత్వం చుక్కలు జూపెడ్తున్నది గదా..? సిరిసిల్ల నేరళ్ల పంచాదిల కాంగ్రెసోళ్లకు.. ఇటు అమరవీరుల స్పూర్తి యాత్రల జేఏసోళ్లకు రాజ్యాధికారం ఉంటే ఎట్లుంటదో ఆ రుచి జూపెడ్తున్నది.. అయినా ప్రభుత్వం గిచ్చుడు ఎక్వనేఉన్నది గావట్టి అటో మెటిగ్గ ప్రభుత్వానికి రావాల్సిన నష్టం వస్తనే ఉన్నట్టు అనిపిస్తున్నది..

కూలిచ్చి ఈపు వలగొట్టిచ్చుకునుడంటే ఇదే గావొచ్చు.. మన తెలంగాణ మంత్రి జూపల్లి కిష్ణయ్య ఏం జేశిండో తెల్సా..? కల్వకుర్తి కాడున్న వైఆర్ఎం కాలేజీలకు వొయ్యిండు.. పొయ్యినోడు శాతనైనయ్ నాల్గు ముచ్చట్లు జెప్పి అవుతల వడక..? విద్యార్థులు మమ్ములను ప్రశ్నించొచ్చు.. మీకు హక్కులున్నయ్ అవ్వి ఇవ్వని చెప్పిండు.. ఇగ ఎన్నొద్దుల సందో కడ్పుల దాస్కున్న కశినంత గక్కిండ్రు.. పోరలు జూపల్లి మొఖం చిన్నవొయ్యింది..

కాపుల ప్రత్యేక రిజర్వేషన్ లడాయిలకు బుడ్డపోరగాళ్లు గూడ దిగిండ్రుగదా..? బడి గుడి ఏది ఇడ్సిపెడ్తలేరు.. ఏడ అవకాశం ఉంటే ఆడనే నినాదాలు జేస్తున్నరు నిరసనలు జెప్తున్నరు.. ఆంధ్రరాష్ట్రంల ఒకతాన.. బుడ్డ బుడ్డ పోరగాళ్లు.. వాళ్లకు నిండ ఏడెన్మిదేండ్లు గూడ లేనట్టున్నయ్ ఆ పిల్లలు కాపు రిజర్వేషన్ ఉద్యమం ఎట్ల జేస్తున్నరో సూడుండ్రి..

తెలంగాణ ప్రజల ఆశాదీపం.. నిర్లక్ష్యాన్ని సహించని సింహబలుడు.. భారతదేశంలనే ఆదర్శవంతమైన హోమంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి సారు తిరుపతికి వొయ్యినట్టుండుగదా..? నడక దారిల వొయ్యిండో.. లేకపోతె మీదికి కార్ల వొయ్యిండో.. నడ్కంటే ఏడైతది నర్సన్నతోని.. మొకాళ్లు సమ్మెకు దిగి చాలా రోజుతైంది గావట్టి కార్లనే

వోవొచ్చు.. మరి కొండమీద ఏం జేస్తున్నడో జర్ర వాండ్రి అర్సుకొద్దాం..

ఉస్మానియి యూనివర్సిటీల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సుర్వైంది.. అగో తెలంగాణ రాష్ట్రం వచ్చే అయిపాయే.. ఎవ్వలి పావుశేరు వాళ్లు వండుకోని తినవట్టిరి.. మళ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఏందనుకుంటున్నరా..? అయ్యో నిన్న ఎన్సీసీ గేటుకాడికెళ్లి.. ఆర్ట్స్ కాలేజీ దాక పెద్ద ర్యాలే దీశిండ్రు.. రాష్ట్రం సాధించి తీర్తమంటున్నరు.. మరి ఇదెక్కడి రాష్ట్రం ఏం కథ అనేది సూపెడ్త పాండ్రి..

నిజంగ తెలంగాణ పోరగాళ్లు తాగే నీళ్లళ్లనే ఉండెతట్టుంది పౌరుషం.. రోశం అంత.. అరే గింత గింత పోరగాళ్లు గూడ.. ధైర్యంగ ప్రశ్నించుడు సుర్వు జేశిండ్రు.. ఎద్గ తెలంగాణ ఉద్యమంల పోరాటం కండ్లార జూశినోళ్లైతె.. ఇగ వాళ్ల మాటలకు సమాధానం జెప్పుడు ఎవ్వలితరం గాదు.. మా ఊరికి బస్సు సక్కగొస్తలేదు.. వచ్చినా బస్సు సరిపోతలేదని బడిపోరగాళ్లు జూడుండ్రి..

ఈ గుడ్డెల్గులు సల్లగుండ.. అడ్వి అధికారుల మీద పగవట్టినయా ఏంది..? వీళ్లకు చేతినిండ పనిలేదు.. మేము బావులళ్ల దుంకుతం.. రక్షించుమంటం అని సూస్తున్నట్టున్నయ్.. మళ్లొక గుడ్డేల్గు బాయిల దుంకింది.. బచావో బచావో అంటున్నది లోపటికెళ్లి.. దాని అయ్య సుట్టాలెవ్వలన్న ఉన్నరా మీదికి గుంజెతందుకు.. భళే తమాష జేస్తున్నవ్ వా..

వారెవ్వ ఏన్గులు గూడ మన్సులను జూశి నేర్చుకుంటున్నట్టున్నయ్ గదా..? ఎట్ల బత్కాలే ఈ భూమ్మీద.. ఆహారం దొర్కనప్పుడు ఏం జెయ్యాలే అని.. మనం అప్పుడప్పుడు సూస్తుంటంగదా..? వాహనాన్ని ఆపి దోచుకున్న దొంగలు.. అని.. అగో అట్లనే ఒక లారీని ఆపి.. ఏన్గుగూడ ఏం జేశిందో మీరే సూడుండ్రి.. అమ్మో.. దొంగ ఏన్గు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంల న్యాయం నాల్గు పాదల మీద నడుస్తున్నది.. అన్యాయం పీకె విస్కేశ్నం.. అని పొంకనాలు గొడ్తున్న పువ్వుగుర్తు పరందామయ్యలు జూడవల్సిన ముచ్చట ఇది.. కమలం కామెర్లొచ్చినోనికి లోకమంత కమలం రంగే గనిపిచ్చినట్టు.. వీళ్లకు గూడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్లగనిపిస్తున్నదో ఏమో... సూడుండ్రి అవినీతి ఎంత గొప్పగ తులతూగుతున్నదో.. అక్కడ పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

 

 

 

20:17 - July 31, 2017

కడప :  జిల్లా సుండపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ కడప డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. దస్తావేజు లేఖరులు, మధ్యవర్తుల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారన్న పక్కా సమాచారంతో ఈ దాడులను చేపట్టారు. దాడుల్లో పలు దస్తావేజులను, 65వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిష్ట్రార్‌ ఎస్‌.ఎం.బాషాతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులను విచారించారు. 

20:16 - July 31, 2017

కర్నూలు : మద్యం షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కల్లూరు సెంటర్‌లో ఉన్న రెండు వైన్ షాపులపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, మహిళలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైన్ షాపులు తొలగించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వైన్ షాపులు తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. 

20:14 - July 31, 2017

సిరిసిల్ల : నేరెళ్ల గ్రామంలో బాధితుల కుటుంబాలను మీరాకుమార్‌ పరామర్శించారు. మహిళలకు జరిగిన అవమానం తనను తీవ్రంగా బాధిస్తోందని మీరాకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మేమంతా మీకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించేవరకు పోరాడుతామన్నారు. ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన మీరాకుమార్‌ కంటతడిపెట్టారు.

20:11 - July 31, 2017

సిరిసిల్ల : ఛలో సిరిసిల్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ బహిరంగసభ నిర్వహణపై సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రంలో రెండ్రోజుల క్రితమే పోలీస్‌ 30 యాక్ట్‌ అమలు చేశారు. నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ నేతలు సిరిసిల్లలో సభ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు హైకోర్టును ఆశ్రయించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను పోలీసులు దిగ్బంధించారు. పలువురు నేతల్ని ముందస్తు అరెస్టులు చేశారు. హైకోర్టు అనుమతి కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులకు నిరాశే ఎదురైంది. విచారణకు తగిన సమయంలేదని.. కాంగ్రెస్‌ అడ్వకేట్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌తో పాటు కరీంనగర్‌ జైల్‌లో ఉన్న బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్‌ మీకు అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.

బలహీన వర్గాల కోసం తెలంగాణ
ఆ తర్వాత ఇందిరాగార్డెన్‌లో మీరాకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో దళితులు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్. తాను కలలుగన్న తెలంగాణ ఇది కాదన్నారు. దళితులపై పోలీసులు దాడులకు పాల్పడటం మరింత బాధాకరమన్నారు. దళితులకు మద్దతుగా సభను నిర్వహించాలనుకుంటే జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇలాంటి తెలంగాణను చూడ్డానికి వస్తానని అనుకోలేదని అన్నారు. బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్రాల మంత్రులు ఒక్కరూ రాకపోవడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెయ్యాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలన్న మీరాకుమార్‌.. పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని చెప్పారు.

కేటీఆర్ రాజీనామా చేయాలి
ఆ తర్వాత నేరెళ్ల గ్రామంలో బాధితుల కుటుంబాలను మీరాకుమార్‌ పరామర్శించారు. బాధితులకు జరిగిన అన్యాయం విని కన్నీళ్ల పర్యంతమయ్యారు. రాష్ట్రంలో ఒక్క దళితుడికి అన్యాయం జరిగినా సహించేది లేదని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం బంధువులు ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఆర్థిక సహాయం అందజేశారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

20:08 - July 31, 2017

హైదరాబాద్ : అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఏపీలోని మరో రెండు జిల్లాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయాల్సి ఉందన్న పవన్‌.. తెలంగాణలో పార్టీ కమిటీలను పూర్తి చేశామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

19:41 - July 31, 2017
18:13 - July 31, 2017

ఢిల్లీ : దేశంలో ముస్లింలు, దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ 100 మంది మాజీ సైనికులు ప్రధానమంత్రి నరేంద్రమోదికి లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న దాడులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న భయందోళన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మీడియాను భయపెట్టడం, యూనివర్సిటీ విద్యార్థులు, మేధావి వర్గాలపై జరుగుతున్న దాడులు, వారిని జాతి వ్యతిరేకులుగా పేర్కొనడాన్ని మాజీ సైనికులు తప్పుపట్టారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. మోదికి రాసిన లేఖపై 114 మంది మాజీ సైనికులు సంతకం చేశారు.

18:12 - July 31, 2017

ఢిల్లీ : గోరక్షణ పేరిట జరుగుతున్న హింసాత్మక దాడులపై లోక్‌సభలో వాడి వేడి చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే సభకు వివరించారు. కొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మైనారిటీలు, దళితులపై మూకుమ్మడి దాడులకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన బీఫ్‌ పేరిట జరిగిన ఘటనలకు ఎవరు బాధ్యులని కేంద్రాన్ని నిలదీశారు. ఈ దాడులపై చర్యలేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గోరక్షణ దాడులను సహించేది లేదని ప్రధాని ప్రకటించిన రోజే దాడి జరగడం గమనార్హమని ఖర్గే అన్నారు. వీటన్నింటికి ప్రధానమంత్రి నరేంద్రమోది సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. కేరళలో ఓ కార్యకర్త హత్య జరిగితే గవర్నర్‌, హోంమంత్రి జోక్యం చేసుకున్నారని...గోరక్షణ దాడులపై ఎందుకు మాట్లాడరని కేంద్రాన్ని దుయ్యబట్టారు. జుడీషియల్‌ విచారణ జరుగుతున్న కేసులను సభలో ఎలా ప్రస్తావిస్తారని ఖర్గే మాట్లాడుతుండగా బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

18:11 - July 31, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాదుల వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు కీలక ఆధారాలు లభించాయి. హురియత్‌ నేత సయ్యద్‌ అలీ షా గిలానీ విడుదల చేసిన అల్లర్లకు సంబంధించిన ఓ కాలెండర్‌ను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. కశ్మీర్‌లో ఏ యే రోజు ఎక్కడ అల్లర్లు జరపాలన్న వివరాలు అందులో ఉన్నాయి. గతేడాది జూలై8న హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత జరగాల్సిన అల్లర్లపై అందులో వివరంగా ఉంది. హురియత్ నేతలు నిర్దేశించిన ఈ కార్యాచరణకు అనుగుణంగానే భద్రతా బలగాలపై అల్లరిమూకలు రాళ్లదాడులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. కశ్మీర్‌ లోయలో అశాంతి, అల్లర్లకు వేర్పాటు వాదులు ఎలా ఆజ్యం పోస్తున్నారన్నది ఈ కాలెండర్‌తో స్పష్టమైంది. హురియత్‌ నేతలకు పాకిస్తాన్‌ ఏజెన్సీల నుంచి ఫండ్‌ వస్తున్న విషయం ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగు చూసింది.

 

18:09 - July 31, 2017

చిత్తూరు : తిరుమల షెడ్డులో వదిలి వెళ్లిన బాలుడి కేసు సుఖాంతం అయ్యింది. మీడియా లో వచ్చిన వరుస కథనాలతో బాలుడి అమ్మమ్మ గుర్తించి తిరుమల పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాలుడి వివరాలను పోలీసులకు సమర్పించింది. బాలుడిని అప్పగించాలని కోరింది. చిన్నారి తల్లి మరణించడంతో అ బాలుడి బాగోగులను అమ్మమ్మే చూసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆమె ఇబ్బంది పడుతుండటంతో బాలుడి నానమ్మ వద్ద వదిలి వెళ్లింది. బాలుడికి ఫిట్స్‌ రావడంతో ఏలాగైనా బాలుడిని వదిలించుకోవాలని తిరుమలలో వదిలేసింది. బాలుడిని వదిలి వెళ్లిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

18:08 - July 31, 2017

తూర్పు గోదావరి : ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కాపు యువత వినూత్న రీతిలో ఆందోళన చేపట్టింది. కాపు ఉద్యమ నేత కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో యువకులు ముఖానికి ముసుగులు ధరించి నిరనన తెలిపారు. రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాల్సిందిగా వేడుకుంటుంటే ప్రభుత్వం తమ ఉద్యమం అణచివేయాలని చూస్తోందని కల్వకొలను తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 

18:07 - July 31, 2017

గుంటూరు : చంద్రబాబుతో జరిపిన చర్చల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి కామినేని శ్రీనివాస్‌అన్నారు. ఉద్దానంలో కిడ్నీబాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వనానికి సహకరిస్తానని పవన్‌ చెప్పారన్నారు. ప్రభుత్వం అందించే జీవన్‌దాన్‌ కార్యక్రమానికి బ్రాండ్‌అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్‌ అంగీకరించారని మంత్రి కామినేని అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:06 - July 31, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతలు.. ఎస్సీలు, బీసీలు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఎస్సీలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని... కానీ వారి 125 ఏళ్ల చరిత్రలో వారికి చేసిందేమి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో.. ఈ మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు చేసిన మేలుపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. 

18:05 - July 31, 2017

హైదరాబాద్ : టాలివుడ్‌ను వెంటాడుతున్న డ్రగ్స్ కేసులో 11 రోజు వర్ధమాన హీరో తనీష్‌ను సిట్ అధికారులు విచారించారు..దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన విచారణలో ప్రధానంగా నాలుగు ప్రశ్నలపైనే గురిపెట్టారు...నటులు తరుణ్,నవదీప్‌లతో ఎలా ఉంటారు.. వారితో ఏ పబ్బుల్లో కలుసుకుంటారు...అక్కడ పార్టీలు ఎలా జరుగుతాయి...డ్రగ్స్‌ సరఫరాలో ఉన్న కెల్విన్,జిషాన్‌లతో పరిచయం ఉందా... ఉంటే ఎప్పుడు ఏర్పడింది..వారి నుంచి డ్రగ్స్ తీసుకున్నారా... వేరొకరికి సరఫరా చేశారా... ఇలా ప్రశ్నల వర్షం కురిపించిన సిట్ అధికారులు నాలుగు గంటల్లోనే కావాల్సిన సమాచారం తెలుసుకుని తనీష్‌ను పంపించారు. ప్రధాన నిందితుడైన కెల్విన్‌ కాల్‌ డేటాలో తనీష్‌ నంబర్ ఉండడంతో పాటు పలుసార్లు ఇద్దరి మధ్య సంబాషణ జరిగినట్లు అధికారులు గుర్తించారు..కెల్విన్‌తో మాట్లాడిన తర్వాత అదే రోజులో కొద్ది సమయంలో తరుణ్, నవదీప్‌లతో తనీష్‌ మాట్లాడినట్లు తేలింది..దీంతో వీరి మధ్య లింకులు తెలుసుకునేందుకు సిట్ అధికారులు తనీష్‌కు కూడా నోటీసులు జారీ చేయగా ఉదయాన్నే నాంపల్లిలోని అబ్కారీ ఆఫీస్‌కు చేరుకున్నారు..ఉదయం పదిన్నరకు మొదలయిన విచారణ మధ్యాహ్నం రెండు గంటల లోపే ముగిసింది...ఇదిలా ఉండగా సిట్ నోటీసు అందుకున్న టాలివుడ్‌లోని మరో హీరో నందు మంగళవారం విచారణకు హాజరు కానున్నారు.సిట్ విచారణలో హీరో తనీష్‌ అధికారుల ముందు తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది...డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు రావడం మనస్తాపం చెందానని..తన కుటుంబీకులు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తనీష్ సిట్‌ ముందు చెప్పినట్లు తెలుస్తోంది...డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు తన వంతు సాయం చేస్తానని...కలిసికట్టుగా దీనిపై పోరాటం చేద్దామంటున్నారు తనీష్

18:01 - July 31, 2017

విజయవాడ : ఉద్దానం సమస్య రాజకీయ విమర్శల వల్ల పరిష్కారం కాదన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఉద్దానం సమస్యను మానవీయ కోణంలో చూడాలన్నారు. మీడియావల్లే ఉద్దానం సమస్య తనదాకా వచ్చిందన్న పవన్‌.. సమస్య పరిష్కారానికి తనవంతు బాధ్యతగా పనిచేస్తాన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కొంత వరకు ఉపశమనం కలిగించారని... అయితే ఉద్దానం సమస్య మూలాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ నుండి ప్రజాల్లోనే ఉంటా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటా. ప్రజల సమస్యలు తెలుసుకుంటా..చేనేత కార్మికులను జీఎస్టీ నుండి తగ్గించాలని సీఎం తో చెప్పా.. కేంద్రంతో మాట్లాడమని చెప్పా అనిగరగపర్రు అంశం చాలా సున్నితమైంది. లోకల్ అడ్మినిస్ట్రేటివ్ విఫలం.. ఆదిలోనే పరిష్కరించకపోవడం వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టిందని పవన్ అన్నారు.అల్లూరి, అంబెడ్కర్ లాంటి వాళ్ళు మహనీయులు వాళ్ళని ఒక కులానికి వర్గానికి ముడిపెట్టడం సరికాదు ఆయన అభిప్రాయపడ్డారు.అంబెడ్కర్ సిద్దాంతాలని అర్ధం చేసుకుంటే అందరికి మహనీయుడు అవుతాడని,అల్లూరి సీతారామ రాజు గిరిజినులతో కలిసి బ్రతికిన వ్యక్తి.. క్షత్రియ కులంకే ముడిపెట్టడం సరికాదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలు జనసేన చెయ్యదు..అందరిని కలిపే రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు.గోదావరి ఆక్వా పార్క్ నిబంధనలు పాటిస్తే ప్రజల నుండి వ్యతిరేకత రాదని, ప్రభుత్వం చిత్త శుద్దిగా వ్యవహరించాలని, పోలీసులతో సమస్య పరిష్కరం అవ్వదని పవన్ అన్నారు. నేను కాపు కులానికి చెందినవాన్ని.. సినిమాల్లో ఉన్నప్పుడు కులలపై అవసరం ఉండదు.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అన్నీనిటీపై స్పందించాలని, కాపుల రేసేర్వేషన్ డిమాండ్ చాలా దశాబ్దాల నుండి ఉందని ఆయన తెలిపారు. బీసీ లకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ అంశం పరిష్కరించాలని ఆయన కోరారు. నాకు పాదయాత్ర చెయ్యాలని ఉంది.. కానీ నా కార్ ని కూడా యువత ముందుకు వెళ్ళనివ్వడం లేదు.. అందుకే ఆలోచిస్తున్నా.. లేదంటే పాదయత్రకి ఎప్పుడు సిద్ధమే అని పవన్ ప్రకటించారు.

17:59 - July 31, 2017

పాట్నా : బిహార్‌ రాజకీయ పరిణామాలపై జేడీయూ సీనియ‌ర్ నేత శ‌ర‌ద్ యాద‌వ్ ఎట్టకేల‌కు మౌనం వీడారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకోవాలన్న నితీష్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. బిహార్‌లో ప్రస్తుతం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు దురదృష్టకరమైనవని తెలిపారు. మహాకూటమి విచ్ఛిన్నం కావడం బాధకరమని శరద్‌ యాదవ్‌ చెప్పారు. నితీష్‌ మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బిజెపితో పొత్తు పెట్టుకోవడం ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమన్నారు.

17:58 - July 31, 2017

పాట్నా : బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తును తెగదెంపులు చేసుకున్నప్పటికీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ వైఖరి మార్చుకోవడం లేదని జేడీయూ స్పష్టం చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే తాము ఓటు వేస్తామని పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాకూటమితో నితీష్‌ తెగతెంపులు చేసుకుని బీజేపీతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహాకూటమి విచ్ఛిన్నానికి ముందు గోపాలకృష్ణ గాంధీకి ఓటువేయాలన్న జెడియు నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత కెసి త్యాగి చెప్పారు. ఇదే విషయాన్ని తాము బిజెపికి కూడా చెప్పామని తెలిపారు.

శిల్పా చక్రవపాణి రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించా: శిల్పా మోహన్ రెడ్డి

కర్నూలు : నా సోదరుడు శిల్పా చక్రవపాణి రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించా అని శిల్పా మోహన్ రెడ్డి '10టివి' తో చెప్పారు. వైసీపీలో చేరే విషయం పై శిల్పా చక్రపాణి రెడ్డి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. నా సోదరుడు నా వెంటే ఉంటే నంద్యాలలో వైసీపీ విజయానికి దోహదపడుతుందని తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్ పై నుండి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం..

చిత్తూరు : కలెక్టర్ కార్యాలయంపై నుంచి దూకి ఉమా మహేశ్వర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడి కి రెండు కాళ్లు విరిగాయి. అప్రమత్తమైన అధికారులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేషన్ కార్డు కోసం వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ నిర్మాణంలో లోపాలు లేవు: సీఐడీ

అమరావతి: అసెంబ్లీలో వైఎస్ జగన్ చాంబర్లో నీరు అంశంపై సీఐడీ ప్రాథమిక రిపోర్టును స్పీకర్ అందజేసింది. అసెంబ్లీ నిర్మాణంలో లోపాలు లేవని తెలిపింది. గ్రౌండ్ ఫ్లోర్ ఏసీ కమ్యూనికేసణ్ కేబుల్ కట్ అవడం వల్లే వర్షపు నీరు చేరిందని ప్రాథమికంగా సీఐడీ నిర్ధారించింది. పైపు ఎలా కట్ అయిందనే దానిపై ప్రాథమిక రిపోర్టును స్పీకర్ కు సీఐడీ అందజేసింది.

అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయి: పవన్

విజయవాడ: అక్టోబర్ తర్వాతే నా బలమెంతో చెప్పగలనని పవన్ తెలిపారు. ఇపుడు రెండు సినిమాలే ఒప్పుకున్నానని, టైం మిగిలితేనే సినిమాల్లో నటిస్తానన్నారు. అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని, దొరికితే దొంగలు లేకపోతే దొరలుగా రాజకీయ పార్టీలు తయారయ్యాయన్నారు. నేను అనౌన్స చేసేవరకు పార్టీ చందాలు ఎవరూ వసూలు చేయవద్దు , ఎవరూ ఇవ్వవద్దని సూచించారు. నంద్యాల ఉప ఎన్నికపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని తెలిపారు.

17:10 - July 31, 2017
17:09 - July 31, 2017
17:08 - July 31, 2017

సామాజిక బహిష్కరణ తప్పు, అన్యాయం: పవన్

విజయవాడ: గరగపర్రు లో సామాజిక బహిష్కరణ అన్యాయం అని జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్నారు. గరగపర్రు దళితుల బహిష్కరణ పై ఇప్పటి దాకా మాట్లాడలేదని తెలిపారు. గరగపర్రు సమస్యపై స్థానిక అధికారులు విఫలమయ్యారు. ప్రతి కులంలోనూ గొప్ప వ్యక్తులు, దిగజారి మాట్లాడేవారు ఉంటారన్నారు. సమాజాన్ని విడదీసే నాయకులు కాకుండా కలిసి కట్టుగా ఉంచే నాయకులు కావాలన్నారు.

పాదయాత్రలకు సిద్ధంగా ఉన్నా : పవన్

విజయవాడ: పాదయాత్రలకు సిద్ధంగా ఉన్నాని పవన్ కల్యాన్ ప్రకటించారు. అభిమానులు, కార్యకర్తలు సహకరిస్తే పాదయ్రాత చేస్తానన్నారు. నా పాదయాత్రలకు మిగతా వారి పాదయాత్రలకు చాలా తేడా ఉంటుందన్నారు. నేను ఎక్కడికి వెళ్లినా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు.

కాపు రిజర్వేషన్ల డిమాండ్ దశాబ్ధాల కాలంగా ఉంది: పవన్

విజయవాడ: కాపు రిజర్వేషన్ల డిమాండ్ దశాబ్ధాల కాలంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాన్ అన్నారు. కాపు రిజర్వేషన్ల పై టిడిపి మేనిఫెస్టోలో పెట్టినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. కాపు రిజర్వేషన్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో నిబంధనలు అతిక్రమించరాదు: పవన్

విజయవాడ : ఆక్వాఫుడ్ పార్క్ విషయంలో నిబంధనలు అతిక్రమించకుండా ప్రభుత్వం చూడాలని పవన్ సూచించారు.

అమిత్ షా వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కల్యాన్

విజయవాడ: గాంధీజీ తెలివైన వైశ్యుడంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పు పట్టారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. సమస్యను సమస్యగా చూడాలని సూచించారు.

అల్లూరి సీతారామరాజును ఒకే కులానికి పరిమితం చేయడం బాధాకరం: పవన్

విజయవాడ: అల్లూరి సీతారామరాజును ఒకే కులానికి పరిమితం చేయడం బాధాకరం అని పవన్ కల్యాన్ అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... అల్లూరి గిరిజనులతో కలిపి పని చేశారని, సమాజాన్ని విడదీసి నాయకులు కాకుండా కలిసి కట్టుగా ఉంటే నాయకులు కావాలన్నారు.

'గరగపర్రు' అంశం చాలా సున్నితమైంది : పవన్ కల్యాన్

విజయవాడ: గరగపర్రు దళితుల బహిష్కరణ పై ఇప్పటి వరకు మాట్లాడలేదని... అది చాలా సున్నితమైన సమస్య అని జనసేన అధినేత తెలిపారు. గరగపర్రు సమస్యలపై స్థానిక అధికారులు విఫలమయ్యారని తెలిపారు. గాంధీజీ తెలివైన వైశ్యుడంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పవన్ తప్పు పట్టారు.

16:36 - July 31, 2017

విజయవాడ : ఉద్దానం కిడ్నీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానని, ఉద్దానం సమస్యంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్దానం సమస్యను రాజకీయం చేయడం మంచిది కాదని, మనుషుల్ని విడదీసే రాజకీయం కాదు కలిపే రాజకీయం కావాలని పవన్ ఆకాక్షించారు. అల్లూరి సీతామరాజును అంబేద్కర్ ను కొన్ని కులాలకు పరిమితం చేయడం బాధకరమని ఆయన అన్నారు. జీఎస్టీపై కూడ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. సెప్టెంబర్ లో తను క్రియశీలక రాజకీయాల్లోకి వస్తున్నానని పవన్ ప్రకటించారు. కాపుల రిజర్వేషన్ల సమస్యపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా: పవన్

విజయవాడ : అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్య పై హార్వర్డ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఉద్దానం నం సమస్యను రాజకీయం చేయడం తగదన్నారు. ఉద్దానంలో ఇప్పటికే కొంత రీసెర్చ్ జరిగిందన్నారు. సీఎం చొరవతో బాధితులకు కొంత ఉపశమనం కలిగిందన్నారు. 50 శాతం దెబ్బతినే వరకూ కిడ్నీ సమస్య తెలిదయన్నారు. మానవతా కోణంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. చేనేత పై జీఎస్టీ గురించి కూడా మాట్లాడాను. గంగపర్రు సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

16:22 - July 31, 2017

గత్యంతరం లేకనే ఎన్డీఏలో చేరా: నితీష్ కుమార్

పాట్నా: అవినీతిపై ఎలాంటి రాజీ లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. గత్యంతరం లేకనే ఎన్డీఏలో చేరానని తెలిపారు.

ఫ్లిప్ కార్డ్ తో విలీనం కుదరదని తేల్చిన స్నాప్ డీల్

హైదరాబాద్: ఫ్లిప్ కార్డ్ తో విలీనం కుదరదని స్నాప్ డీల్ తేల్చేసింది. ఫ్లిప్ కార్డ్ తో విలీన చర్చలు నిలిపివేసినట్లు స్నాప్ డీల్ ప్రకటిచింది. స్నాప్ డీల్ ను కొనుగోలు చేసేందుకు 950 మిలియన్ డాలర్ల ఆఫర్ ను ఫ్లిప్ కార్డ్ ఇచ్చింది. ఫ్లిప్ కార్డ్ తో చర్చలు జరుగుతుండగానే స్నాప్ డీల్ వ్యూహం మార్చింది.

సుండుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

కడప: సుండుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. డాక్యుమెంట్ రైటర్ల వద్ద అదనంగా ఉన్న రూ.85వేలను స్వాధీనం చేసుకున్నారు.

15:59 - July 31, 2017

తూర్పుగోదావరి : కాకినాడ స్మార్ట్‌ సిటీ అని ప్రకటించగానే చాలా మంది ఆశలకు రెక్కలొచ్చాయి. కానీ మూడేళ్లు గడిచినా మురికివాడల వాసులకు కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఈ లోగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద భారీగా ఇళ్లు కేటాయించారు. తలదాచుకోవడానికి సొంతగూడు వస్తుందని భావించారు. కాకినాడలో రెండేళ్ల క్రితమే చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణంలో.. ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి కేంద్రప్రభుత్వ పథకంలో భాగంగా నగరానికి 4 వేలకు పైగా ఇళ్లు కేటాయించడంతో.. మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ భూములు మాత్రం కేటాయించడం లేదు. 47 ఎకరాల కార్పొరేషన్‌ స్థలంలో ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ భూములన్నీ కాకినాడ పోర్ట్‌ పరిధిలో కంపెనీల ఆక్రమణలో ఉన్నాయి. వాటికి మోక్షం కల్పించకుండానే ఇళ్ల లబ్దిదారులంటూ ప్రజల నుంచి 25 వేల చొప్పున డీడీలు సేకరిస్తున్నారు. గతంలో సేకరించిన డీడీలు కూడా ఇలాగే ఎటూ కాకుండా హౌసింగ్‌ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు తాజాగా ఎంపిక చేసిన లబ్దిదారుల విషయంలో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ జాబితా బహిరంగంగా వెల్లడించడం లేదు. అంటే స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

15:58 - July 31, 2017

యాదాద్రి : యాదాద్రి జిల్లాలో రాజకీయమంతా మాజీ రియల్‌ వ్యాపారుల చుట్టే తిరుగుతోంది. భువనగిరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిందా అనే అనుమానం కలిగేలా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ అధికార పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పైళ్ల రాజేశేఖర్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కుంభం అనిల్ కుమార్‌ రెడ్డి, యువ తెలంగాణ పేరుతో స్వతంత్ర్యంగా గుర్తింపు తెచ్చుకున్న జిట్టా బాలకృష్ణారెడ్డి.. అందరూ వ్యాపారాల నుంచి రాజకీయాల వైపు వచ్చినవారే. పైళ్ల రాజశేఖర్‌ రెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువై.. టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించినా.. అలాగే కొనసాగకుండా యువ తెలంగాణ పేరుతో స్వతంత్ర్యంగా ముందుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో గెలుపు తీరాన్ని చేరుకోలేకపోయారు.

 మాటల యుద్ధం
భువనగిరి నియోజకవర్గంపై కన్నేసిన మరో నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నాడు. ఇటీవల బీబీనగర్‌ నిమ్స్‌ పూర్తవడం కోసం చేసిన దీక్ష, పాదయాత్ర అనిల్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ముందస్తు వ్యూహం లేకపోవడంతో ప్రచారంలో కాస్త వెనకవడ్డారనే అభిప్రాయం ఉంది.జిట్టా బాలకృష్ణారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్‌ రెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం హాట్‌ హాట్‌గా సాగుతోంది. సొంత నిధులతో పనులు చేశానని ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని.. జిట్టా బాలకృష్ణారెడ్డి ఆరోపించడంతో గొడవ మొదలైంది. ఏదేమైనా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనంతగా భువనగిరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. స్థానిక ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. భువనగిరి నియోజకవర్గంలో ఆర్థికాంశం చుట్టే భవిష్యత్‌ రాజకీయం నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

15:56 - July 31, 2017

కామారెడ్డి : సింగూర్‌ జలాలను నిజాంసాగర్‌ లోకి వదలాలంటూ కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ రాస్తారోకో, ధర్నా చేపట్టారు. నస్రుల్లాబాద్‌ మండలం బోమ్మన్‌దేవ్‌ పల్లి చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగూరు జలాన్ని నిజాం సాగర్‌లోకి వదలి... రైతుల పంటలు ఎండి పోకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. రైతుల పంటలు ఎండిపోతుంటే వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌ కి తరలించారు.

15:55 - July 31, 2017

విశాఖ : మస్యలు పరిష్కరించాలని విశాఖలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గంటా ఇంటిలోకి చోచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. 

15:54 - July 31, 2017

తూర్పు గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో వేలంక, భోగాపురం గ్రామాలకు చెందిన కాపుకులస్తులు ఆకలికేకలు పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముద్రగడ ఇంటి వద్దకు ర్యాలీగా చేరుకుని కంచాలు, గరిటెల చప్పుళ్లతో ఆందోళన చేశారు. ప్రభుత్వం ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడంపై కాపు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అటు పశ్చిమ గోదావరిలోను కాపు ఉద్యమ నేత ముద్రగడ గృహనిర్బంధాన్ని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కాపు కులస్తులు ఆందోళన చేపట్టారు. గాంధీ బొమ్మల సెంటర్‌లో కంచాలు, గరిటెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. 205 పాయింట్ల లాభంతో 32,514 వద్ద సెన్సెక్స్, 205 పాయింట్ల లాభంతో 32, 514 వద్ద సెన్సెక్స్ ముగిసింది.

15:51 - July 31, 2017

విశాఖ : ఉత్తరాంధ్ర కార్మికులకు అందుబాటులో ఉండేలా 500 పడకల ఈఎస్ఐ అసుపత్రిని ఏర్పాటు చేయాలని సీఐటీయు ఆందోళనకు దిగింది. విశాఖలోని ఈపీఎఫ్‌ ఆఫీసు ముందు జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ పాల్గొన్నారు. కార్మికుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును మెడికల్‌ కాలేజీలు కట్టడానికి ఉపయోగిస్తున్న ప్రభుత్వం... వారి సంక్షేమాన్ని మరిచిందని గఫూర్‌ విమర్శించారు. కార్మికుల అవసరాలను గుర్తించి వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

15:50 - July 31, 2017

సిరిసిల్ల : నేరెళ్ల బాధితులతో మీరాకుమార్ మిలాఖత్ అయ్యారు. తాను కలలుగన్న తెలంగాణ ఇది కాదని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. నేరెళ్ల ఘటన సమాజం సిగ్గుపడేలా ఉందని ఆమె మండిపడ్డారు. నేరెళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై అత్యాచారాలు, దాడులు తెలంగాణలో జరుగుతాయని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. తనను జైలుకు పంపించడంపై మీరాకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చిస్తానన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలపై హార్వర్డ్ బృందం సంతృప్తి: మంత్రి కామినేని

అమరావతి: ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై పవన్ కల్యాన్ కు ప్రజెంటేషన్ ఇచ్చామని మంత్రి కామినేని శ్రీనివాస్ '10టివి'కి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలపై హార్వర్డ్ బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు.

 

ఉద్దానం కిడ్నీ సమస్యను సవాల్ గా తీసుకున్నాం:చంద్రబాబు

అమరావతి: ఉద్దానం కిడ్నీ సమస్యను సవాల్ గా తీసుకున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రూ.15 కోట్లతో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, శ్రీకాకుళం కిడ్నీ వ్యాధుల పరిశోధనా సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ వైద్య పరిశోధనా మండలి ఈ పరిశోధన కేంద్రాన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలిపారు. ఎన్ని అవసరమైతే అన్ని ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.

15:34 - July 31, 2017

కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఆగస్టు 3న నంద్యాలలో జగన్ పర్యటిన సందర్భంగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారుంటూ ప్రచారం సాగుతోంది. చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరికపై అధికారికంగా ప్రకటించలేదు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ఉద్దానం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా: పవన్

అమరావతి: ఉద్దానం సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించారు. సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్దానం సమస్యల వల్ల అనాథలవుతున్న చిన్నారులను దత్తత తీసుకోవడానికి సీఎం చొరవ తీసుకోవాలని పవన్ సూచించారు. పవన్ విజ్ఞప్తి పై సానుకూలంగా చంద్రబాబు స్పందించినట్లు తెలిపారు. ఉద్దానంలో అనాథ చిన్నారుల బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

15:24 - July 31, 2017

వైసీపీలోకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి?

కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 3న నంద్యాలలో వైసీపీ నేత జగన్ పర్యటించనున్న నేపథ్యంలో జగన్ సమోంలో వైసీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలో చేరికపై చక్రపాణి రెడ్డి అధికారికంగా ప్రకటించలేదు.

15:11 - July 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న తనీష్ విచారణ కు హాజరైయ్యారు. కాసేటికి క్రితమే తనీష్ విచారణ ముగిసింది. విచాణ అనంతరం తనీష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియా జాగ్రత్తగా వ్యవరించాలని, తమకు కుటుంబాలు ఉంటాయని దీని వల్ల కుటుంబాలు అందోళనకు గురి అవుతారని తెలిపారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానాని, డ్రగ్స్ వల్ల జీవితాలు నశనం అవుతాయని తనీష్ తెలిపారు. మరోవైపు కేసు విచాణర వేగం మందగించిందాని తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

15:06 - July 31, 2017

గుంటూరు : ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం పవన్, హార్వర్డ్ బృందానికి బాబు విందు ఇచ్చారు. విందు అనంతరం చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతకు ముందు జనసేనాని హార్వర్డ్ ప్రొఫెసర్లు, వైద్యులతో కలిసి చంద్రబాబుతో సమావేశమైయ్యారు. పవన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తున్నారు. హార్వర్డ్ వైద్యులు కిడ్నీ సమస్యలకు పరిష్కారాలను వివరిస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యపూ చొరవతీసుకున్నందుకు పవన్ కు చంద్రబాబు పవన్ కల్యాణ్ ను అభినందించారు. వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్పించే అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని, 30ఏళ్లుగా కిడ్నీ సమస్యలు ఉద్దానం ప్రజల్ని పీడిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. వ్యాధికి సరైన కారణాలను ఇప్పటివరకు కనుగొనలేకపోయారని, హార్వర్డ్ వైద్యపరిశోధక బృందంఇచ్చే విలువూన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు...

హైదరాబాద్: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును సర్కార్ పొడిగించింది. కొత్త తేదీని ఇంకా ఐటీ శాఖ ప్రకటించలేదు. నేటితో ఐటీ రిటర్న్స్ గుడువు ముగిసింది. అయితే గత మూడు రోజులుగా వెబ్ సైట్ పని చేయకపోవడం గడువును పొడిగించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ లో ఇలాంటి దారుణాలు ఊహించలేదు: మీరాకుమార్

సిరిసిల్ల :తెలంగాణ లో ఇలాంటి దారుణాలు ఊహించలేదని లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల ఘటనలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జైలులో బాధితుల ఒంటి పై గాయాలు చూస్తే మనసు కలిచివేసిందన్నారు. తెలంగాణ లో మైనార్టీలు, దళితులపై దాడులకు నేరెళ్ల ఘటనే నిదర్శనం అని మీరాకుమార్ అన్నారు. సిరిసిల్ల నుండి మీరాకుమార్ తిరుగు ప్రయాణం అయ్యారు.

పోలీసులపై బాంబు దాడి చేసిన మావోయిస్టులు ..

ఛత్తీస్ గఢ్ : మావోయిస్టుల వాతరోత్సవాల నేపథ్యంలో బీజాపూర్ జిల్లా నండ్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులను పోలీసులు చుట్టుముట్టారు. పోలీసులపై మావోయిస్టులు బాంబు దాడికి పాల్పడ్డారు.

14:45 - July 31, 2017

498ఏపై సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక విచారణ లేకుండా కేసుపెట్టి అరెస్టులు చేయకుడాదని కోర్టు తెలిపింది. 498ఏ చట్టంపై మానవిలో చర్చలో అడ్వకెట్ పార్వతి, సామాజికవేత దేవి, ఏఐపీఎస్ఓ జాతీయ నాయురాలు రేఖ ముక్తాలు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

ఉస్మానియా ఆసుపత్రిలోని రోగులను గాంధీకి తరలింపు...

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలోని రోగులను గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

14:38 - July 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న తనీష్ విచారణ కు హాజరైయ్యారు. కాసేటికి క్రితమే తనీష్ విచారణ ముగిసింది. విచాణ అనంతరం తనీష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియా జాగ్రత్తగా వ్యవరించాలని, తమకు కుటుంబాలు ఉంటాయని దీని వల్ల కుటుంబాలు అందోళనకు గురౌతారని ఆయన తెలిపారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

14:34 - July 31, 2017

ఢిల్లీ : మహిళలపై జరిగే దాడులు, హింసను అరికట్టేందుకు ఉద్దేశించిన 498-A పటిష్టపరచాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు వద్ద ధర్నా జరిగింది. 498-A సెక్షన్‌ను బలహీన పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరిసిస్తూ జరిగిన ఈ కార్యక్రమంలో 16 మహిళా సంఘాలు పాల్గొన్నాయి. ఈ సెక్షన్‌ కింది పురుషులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న వాదాన్ని మహిళా సంఘాల నేతలు తోసిపుచ్చారు. ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న 498- A మహిళలకు రక్షణ కల్పిస్తోందని ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావ్లే చెబుతున్నారు. 

14:33 - July 31, 2017

తూర్పు గోదావరి : ఏలూరులోని..నర్సాపురం టౌన్‌.. 28వ వార్డులో.. మద్యం షాపును పెట్టకూడదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. 70 కుటుంబాలు నివసిస్తున్న చోట మద్యం షాపు ఎలా పెడతారని ప్రశ్నించారు. దీనిపై తగు చర్యలు తీసుకుని... ఇళ్ల మధ్యలో మద్యం షాపు పెట్టకుండా... అధికారులను ఆదేశించాలని వారు కోరారు.

14:32 - July 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీ ర్యాలీ చేపట్టింది... లిబర్టీ దగ్గర అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసిన రేవంత్‌ రెడ్డి పాదయాత్రగా ముందుకు సాగారు.. వీరిని ట్యాంక్‌బండ్‌ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.. రేవంత్‌ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీనగర్‌ పీఎస్‌కు తరలించారు.. ముందు ఆబ్కారీ భవన్‌వరకూ ఈ ర్యాలీ కొనసాగించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.. మధ్యలో పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

14:31 - July 31, 2017

సిరిసిల్ల : జిల్లా నేరెళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నవారిని మాజీ లోక్‌సభ స్పీకర్‌ పరామర్శించారు.. కరీంనగర్‌ జైలుకువెళ్లి వారిని కలుసుకున్నారు.. ఇసుక మాఫియా, పోలీసుల దౌర్జన్యంపై బాధితులు తమ ఆవేదనను మీరాకుమార్‌ బృందంతో పంచుకున్నారు.. అన్యాయంగా తమను జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.. బాధితులను ఓదార్చిన మీరాకుమార్‌.. వారికి న్యాయం జరిగేవరకూ పోరాడతామని హామీ ఇచ్చారు.

'సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం వ్యాధికి కారణం'

అమరావతి: ఉద్దానం ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ వివరించారు. నీటిలో సిలికా, స్ట్రోటియం, గ్యాలియం శాతం ఎక్కువ ఉండడం, సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం వ్యాధికి కారణం తెలుస్తోంది. అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడ నీరు తీసుకోకపోవడంతో డీ హైడ్రేషన్ కు గురికావడం, పెయిన్ కిల్లర్స్ మందులను అధికారంగా వాడటం వల్లే కిడ్నీ వ్యాధి ప్రభావం కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొన్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసిన శిల్పా మోహన్ రెడ్డి

కర్నూలు: నంద్యాల రాజకీయాలు వేడెక్కాయి. శిల్పా చక్రపాణిరెడ్డిని శిల్పా మోహన్ రెడ్డి కలిశారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా శిల్పా మోహన్ రెడ్డి కోరారు. టిడిపి ఎమ్మెల్సీగా ఉన్న శిల్పాచక్రపాణి రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు చక్రపాణి రెడ్డి దూరంగా ఉంటున్నారు.

14:18 - July 31, 2017

గుంటూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. జనసేనాని హార్వర్డ్ ప్రొఫెసర్లు, వైద్యులతో కలిసి చంద్రబాబుతో సమావేశమైయ్యారు. పవన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తున్నారు. హార్వర్డ్ వైద్యులు కిడ్నీ సమస్యలకు పరిష్కారాలను వివరిస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యపూ చొరవతీసుకున్నందుకు పవన్ కు చంద్రబాబు పవన్ కల్యాణ్ ను అభినందించారు. వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్పించే అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని, 30ఏళ్లుగా కిడ్నీ సమస్యలు ఉద్దానం ప్రజల్ని పీడిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. వ్యాధికి సరైన కారణాలను ఇప్పటివరకు కనుగొనలేకపోయారని, హార్వర్డ్ వైద్యపరిశోధక బృందంఇచ్చే విలువూన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వైసీపీ శ్రేణులతో ప్రశాంత్ కిశోర్ భేటీ...

హైదరాబాద్: వైసీపీ శ్రేణులతో జగన్, పార్టీ వ్యూహకర్తలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల ఇంఛార్జుల పనితీరు వారికి ప్రజల్లో ఉన్న ఆదరణపై నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలను ప్రశాంత్ కిశోర్ ఫలితాలను వెల్లడించారు. వైసీపీ బలోపతం చేయడంపై ఇంఛార్జులకు ప్రశాంత్ వివరించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ నేతలు ఎస్సీ, బీసీల గురించి మాట్లాడటమా: తలసాని

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు ఎస్సీ, బీసీల గురించి మాట్లాడం దెయ్యాలు వేదాలు చెప్పినట్లు ఉందని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. ఎస్సీ, బీసీల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలన, టిఆర్ ఎస్ మూడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. సిరిసిల్లలో కాంగ్రెస్ సభను ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారని పేర్కొన్నారు.

తిరుమలలో బాలుడిని వదిలి వెళ్లిన ఘటనలో పురోగతి

తిరుమల : నిన్న బాలుడిని వదిలి వెళ్లిన ఘటనలో పురోగతి సాధించారు. తల్లి చనిపోవడంతో బాలుడిని తిరుమలలో వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా కథనాలు చూసి బాలుడి బంధువులు తిరుమలకుబయలు దేరినట్లు సమాచారం. బాలుడు తమిళనాడులోని తిరపుత్తూర్ వాసి అని తెలుస్తోంది.

13:48 - July 31, 2017
13:46 - July 31, 2017

విజయవాడ : దళితులపై జరుగుతున్న దాడులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని వామపక్షాలు విమర్శించాయి. ఈ దాడులు, కుల వివక్షను నిరసిస్తూ విజయవాడలోని ఎంబీ భవన్‌లో జరిగిన సదస్సుకు సీపీఎం, సీపీఐ సహా పది వామపక్షాల నేతలు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు, ప్రకాశం జిల్లా దేవరపల్లి, చిత్తూరు జిల్లా మహాభారతంలో దళితులపై జరిగిన దాడులను వామపక్ష నేతలు ఖండించారు. దాడులు ఆపకపోతే  ప్రజలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలను కలుపుకుని  ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. 
 

13:41 - July 31, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులు.. సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్‌ వైద్యుల ప్రతినిధి బృందం 3 డిమాండ్‌లను తీసుకొచ్చారు. ఎప్టీఎఫ్‌ ఫోర్స్ బలగాల ఏర్పాటు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలన్నారు. డిమాండ్‌లను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని చెప్పారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకుంటే సమ్మె కొనసాగుతుందన్నారు. 

 

ఉద్దానంలో మూడు ప్రత్యేక డయాలసిస్ సెంటర్లు

అమరావతి: కిడ్నీ వ్యాధి చికిత్స నిమిత్తం ఉద్దానంలో మూడు ప్రత్యేక డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో అన్ని కమ్యూనిటీ పీహెచ్ సీల్లో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకం చేపడతామని తెలిపింది.

13:39 - July 31, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల బహిరంగసభపై కాంగ్రెస్‌ వెనక్కితగ్గింది. సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయంలేదని.. కాంగ్రెస్‌ అడ్వకేట్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలపై మీరాకుమార్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతల టూర్‌లో స్వల్ప మార్పులుఉండే అవకాశం కనిపిస్తోంది. డీకే.అరుణతోపాటు పలువురు నేతలు కరీంనగర్ జైలులో బాధితులను పరామర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

13:34 - July 31, 2017

కడప : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్న దేశంలో దళితులుపై దాడులు, వివక్ష, గ్రామ బహిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. దళితులు అడుగడుగునా వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. అగ్రవర్ణాల కులదురహంకారం రోజురోజుకు పెచ్చుమీరుతుంది. దళితులను అసలు మనుషులుగా చూడడం లేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  యాక్టు ఉన్నా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. ఏపీలో గరగపర్రు ఘటన, తెలంగాణలోని నేరెళ్ల ఘటనలు మరువకముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. దళితులపై అగ్రవర్ణాలు కులవివక్షకు పాల్పడ్డారు. జిల్లాలోని కాశినాయన మండలం రెడ్డికొట్టాలలో దళితులపై అగ్రవర్ణాల కులవివక్ష బయటపడింది. తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లొద్దంటూ దళిత విద్యార్థులను అగ్రవర్ణాలవాళ్లు అడ్డుకున్నారు. ఇళ్ల ఎదుట రోడ్డుకు అడ్డంగా ముళ్లకంపలు, రాళ్లు పెట్టారు. స్కూళ్లలో కూడా దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారు.  దళిత, అగ్రవర్ణాల విద్యార్థులకు వేర్వేరుగా మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:26 - July 31, 2017

దుంపలు..ఈ దుంపల్లో చిలగడ దుంపలు ఒకటి. ఉడకబెట్టి..నిప్పులపై కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆహారంగానే కాకుండా దీనిని చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఫైబర్, విటమిన్లు ఎ,సి,డి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌లు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు విష పదార్థాలను తొలగిస్తుంది. కెరొటినాయిడ్లు, బీటా కెరొటిన్లు, విటమిన్‌ ఎ అధికంగా లభిస్తాయి. ప్రతి రోజూ కూరలు, పులుసు, సలాడ్లు.. ఇలా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకోవడం ఉత్తమం. చిలగడ దుంపల్లో విటమిన్‌ బి6 సమృద్ధిగా లభిస్తుంది. హృద్రోగాలనూ దూరంగా ఉంచుతుంది. దుంపల్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.

13:25 - July 31, 2017

గంజి..అంటే ఏంటీ ? అని కాలం పిల్లల్లో కొందరు అంటుంటారు. దీనిని రైస్ వాటర్ అని కూడా అంటారు. అన్నం ఉడికిన తర్వాత వంపేసే నీటిని అన్నం గంజి అంటారు. ఇది ఎంతో మందికి ఆకలి తీర్చే ఆహారం. పల్లెటూర్లలో ఇప్పటికీ చాలామంది రైస్ వాటర్ తో కడుపు నింపుకుంటూ ఉంటారు. ఈ నీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి.
వాటర్ లాస్ ని తగ్గిస్తుంది. ఫైబర్ ఉండడం వల్ల గంజి మలబద్ధకంపైన కూడా పనిచేస్తుంది. మొటిమలను గంజి దూరం చేస్తుంది. వేసవికాలంలో ఇది అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఒక గ్లాజు గంజి తాగితే.. డీహైడ్రేషన్ దూరం అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ మెండుగా ఉంటాయి. రెగ్యులర్ గా ఒక గ్లాసు అన్నం గంజి తీసుకుంటే.. అల్జీమర్స్ నివారించవచ్చు. గంజి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ముఖానికి పట్టించడం వల్ల మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పడుతాయి. బ్లాక్ హైడ్స్ పై ప్రభావం చూపుతుంది. గంజి పట్టడం వలన చర్మ తాజాగా ఉంటుంది. 

నేరేళ్ల బాధితులను పరామర్శించిన మీరాకుమార్

కరీంనగర్ : జైల్లో 8 మంది నేరెళ్ల బాధితులను మీరా కుమార్ పరామార్శించారు. మీరా కుమార్ తో పాటు ఉత్తమ్, షబ్సీర్ అలీ, సంపత్, జానారెడ్డి, గీతా రెడ్డి తదితరల కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

13:24 - July 31, 2017

గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి. 

పవన్ కల్యాన్ అభినందించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న పవన్ కల్యాన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమస్య 30 ఏళ్లుగా ఉద్దానంను పీడిస్తోందని చంద్రబాబు అన్నారు. వ్యాయధికి సరైన కారణాలు ఇంత వరకూ కనుగొనలేకపోయారని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని, వ్యాధిగ్రడస్థులకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకున్నామన్నారు. పవన్ కల్యాన్ ఈ అంశంపై చొర తీసుకోవడం ముదావాహం అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మలకొండయ్య ప్రెజెంటేషన్ ఇచ్చారు.

12:56 - July 31, 2017

ఢిల్లీ : గోరక్షణ పేరుతో దాడులపై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ గోవులను చంపుతున్నారంటూ అమాయకులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు

హైదరాబాద్: తమపై రోగి బంధువుల దాడిని నిరసిస్తూ అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు సమ్మె చేస్తున్నారు. దీని పై ఉస్మానియా సూపరింటెండెంట్ తో జూడాల చర్చలు విఫలం అయ్యాయి. జూడాల సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించారు. సూపరింటెండెంట్ సమస్యల పరిష్కారానికి మూడు రోజుల సమయం కోరారు. దానికి అంగీకరించని జూడాలు వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు.

12:47 - July 31, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులు.. సూపరింటెండెంట్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూనియర్‌ వైద్యుల ప్రతినిధి బృందం 3 డిమాండ్‌లను తీసుకొచ్చారు. ఎప్టీఎఫ్‌ ఫోర్స్ బలగాల ఏర్పాటు.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కోరారు. డిమాండ్‌లను పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని చెప్పారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకుంటే సమ్మె కొనసాగుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:44 - July 31, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ పై కాల్పుల ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈకేసులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు అనంతపురం జిల్లాతో లింక్‌ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్‌ ఫోన్‌కు అనంతపురం జిల్లా నుంచి మూడు ఫోన్ కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం జిల్లాకు పంపారు. మరోవైపు కాల్పులు జరిగిన రోజు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా విక్రమ్‌ ఇంటి ముందు సంచరించినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. కాల్పులకు ఉపయోగించిన గన్‌ను బైక్‌పై వచ్చిన వ్యక్తులు తీసుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బైక్‌ ఏపీకి చెందినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గేట్‌ వేయొద్దని విక్రమ్‌గౌడ్‌ వాచ్‌మెన్‌కు చెప్పినట్లు పోలీసుల వాంగ్మూలంలో వెల్లడి అయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీష్ సమీక్ష...

హైదరాబాద్ : నగరంలోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి హరీష్‌రావు సమావేశమయ్యారు. సమావేశానికి ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, చైనా, అమెరికా, బ్రెజిల్, జర్మనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమయ్యే పంపులు, మోటార్ల విషయంపై చర్చించారు.

12:35 - July 31, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో నిర్వహించే సభపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయం లేదని కాంగ్రెస్ అడ్వకేట్ పిటిషన్ ఉపసంహరింకున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో మీరాకుమార్ సమావేశం అయ్యారు. నేతల టూర్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో కరీంనగర్ జైలులో బాధితులను కాంగ్రెస్ నేతలు పరామర్శించనున్నారు. అనంతరం బాధిత గ్రామాల్లో నేతలు పర్యటించనున్నారు. నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ నేడు చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగసభకు సిద్ధమైంది. అయితే సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయం లేదని కాంగ్రెస్ అడ్వకేట్ పిటిషన్ ఉపసంహరింకున్న నేపథ్యంలో సిరిసిల్లలో తలపెట్టిన సభపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

దళితులపై అగ్రవర్ణాల కుల వివక్ష

కడప: కాశినాయన మండలం రెడ్డి కొట్టాలలో దళితులపై అగ్రవర్ణాల కుల వివక్షకు తెగబడ్డారు. తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లొద్దంటూ దళిత విద్యార్థులను అగ్రవర్ణాలు అడ్డుకున్నారు. ఇళ్ల ఎదుట రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు, రాళ్లను అగ్రవర్ణాలు పెట్టారు. స్కూల్లో దళిత, అగ్రవర్ణాల విద్యార్థులకు వేర్వేరుగా మధ్యాహ్న భోజనం నిర్వాహకులు పెడుతున్నారు.

సీఎం చంద్రబాబు తో కొనసాగతున్న పవన్ భేటీ

అమరావతి: సీఎం చంద్రబాబుతో పవన్, హార్వర్డ్ వైద్యుల భేటీ కొనసాగుతోంది. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యల పై వీరి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో పురోగతి

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో పురోగతి కనిపిస్తోంది. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసోం, రాజస్థాన్ వరదలు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని

హైదరాబాద్: అసోం, రాజస్థాన్ వరదల్లో చనిపోయన వారికి కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను మోదీ ప్రకటించారు.

సిరిసిల్లలో కాంగ్రెస్ సభ పై పిటిషన్ విత్ డ్రా

హైదరాబాద్: సిరిసిల్లలో కాంగ్రెస్ సభ నిర్వహణ పై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కాంగ్రెస్ లాయరు ఉపసంహరించుకున్నారు. విచారణకు సమయం లేకపోవడంతో పిటిషనర్ విత్ డ్రా చేసుకున్నారు.

12:13 - July 31, 2017

గుంటూరు : అమరావతిలో సీఎం చంద్రబాబుతో జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హార్వర్డ్ ప్రొఫెసర్లు, వైద్యులతో కలిసి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ భాదితులపై సమస్యలపై చర్చిస్తున్నారు. కిడ్నీ బాధితుల సమస్యలు, వాటి పరిష్కారంపై చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఎనిమిది మంది హార్వర్డ్ వైద్యుల బృందం, మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:10 - July 31, 2017

బేకింగ్ సోడాను కేవలం వంటల్లో మాత్రమే ఉపయోగిస్తారా ? ఇతర వాటికి కూడా బేకింగ సోడాను ఉపయోగించవచ్చు. బేకింగ్‌ సోడా వల్ల అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయి.

శరీరం దుర్వాసన వస్తుంటే చెమట పట్టే ప్రదేశాల్లో కొద్దిగా బేకింగ్ సోడాను చల్లిం చూడండి. కడుపులో మంట..ఇబ్బందిగా ఉన్న సమయంలో కప్పు నీళ్లలో పావు చెంచా బేకింగ్ సోడా వేసుకుని తాగాలి. ఇలా ప్రతిసారి మాత్రం చేయవద్దు. వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కన..జిడ్డుగా ఉంటే బేకింగ్ సోడాను పేస్లు మాదిరిగా చేసి ఆయా ప్రాంతాల్లో రాయాలి. ముందు తడబట్టతో తుడిచిన అనంతరం పొడిబట్టతో తుడిస్తే శుభ్రమవుతుంది. కొంచెం వేడినీళ్ళలో చెంచా బేకింగ్‌ సోడా వేసి దానిలో మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్‌లు వేసి, కొంచెంసేపు తర్వాత మంచి నీళ్ళతో కడిగితే మురికి పోతుంది.

పాట్నా కోర్టులో సీఎం నితీష్ కు ఊరట

బీహార్ : పాట్నా హైకోర్టులో సీఎం నితీష్ కు ఊరట లభించింది. ఆర్జేడీ దాఖలు చేసిన పిటిషన్ పాట్నా హైకోర్టు కొట్టివేసింది.

ఆందోళనలో పన్ను చెల్లింపుదారులు...

విజయవాడ: ఐటీ రిటర్న్స్ కు నేటితో గడువు ముగియనుంది. 3 రోజులుగా ఆదాయపు పన్ను శాఖ వెస్ సైట్ మొరాయిస్తోంది. సాంకేతిక లోపంతో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు నలిచిపోయింది. ఈ- ఫైలింగ్ ఆడిటర్లు, పన్ను చెల్లింపు దారుల అవస్థలు పడుతున్నారు. పన్నుల చెల్లింపుదారల ఆందోళన చెందుతున్నారు.

జూడాలతో సూపరింటెండెంట్ చర్చలు విఫలం

హైదరాబాద్: ఉస్మానియా ఆస్పతి జూనియర్ డాక్టర్లతో సూపరింటెండెంట్ చర్చలు విఫలం అయ్యాయి. దీంతో జూడాల నిరసన కొనుగుతోంది.

జైల్లో ఉన్న నేరెళ్ల బాధితులను పరామర్శించనున్న మీరాకుమార్

కరీంనగర్ : కాంగ్రెస్ సీనియన్ నేతలతో మీరాకుమార్ భేటీ అయ్యారు. కాసేపట్లో కరీంనగర్ జైల్లో నేరెళ్ల బాధితులను మీరాకుమార్ పరామర్శించనున్నారు.

11:32 - July 31, 2017

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. హార్వర్డ్‌ ప్రొఫెసర్లు, వైద్యులతోకలిసి సీఎంను కలవబోతున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలు, వాటి పరిష్కారంపై చంద్రబాబుతో చర్చిస్తారు. అంతకముందు గన్నవరం వచ్చిన పవన్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి అమరావతికి గబ్బర్‌సింగ్ బయలుదేరారు. జనసేనాని రాక సమాచారంతో విజయవాడ సందడిగా మారింది. జనసేన కార్యకర్తలతో నిండిపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:32 - July 31, 2017

జాబు రావాలంటే బాబు రావాలి...వచ్చారు..మని జాబులు వచ్చాయా ? జాబు రాకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం..అన్నారు..వచ్చిందా ? భృతి ఏమైంది అంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు..భృతి మాట అటుంచితే జాబులు ఏమయ్యాయి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

'జాబు రావాలంటే బాబు రావాలంటూ' అధికారంలోకి రాకముందు టిడిపి పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఐదు వాగ్ధానాలను నిలబెట్టుకుంటున్నట్లు సంతకాలు కూడా చేశారు. అందులో ఒకటి 'నిరుద్యోగ భృతి'. నిరుద్యోగ భృతి కల్పిస్తారని లక్షలాది మంది నిరుద్యోగులు నమ్మారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పీఠమెక్కి మూడున్నరేళ్లు అవుతున్నా జాబు రాలేదు కాదు కదా..ఉన్న ఉద్యోగాలే ఊడి వేలాది మంది వీధిన పడుతున్నారు. మళ్లీ నిరుద్యోగ భృతి కల్పిస్తామంటూ పాలకులు మరోసారి హామీలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మళ్లీ మాటల జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

నెలకు రెండు వేల రూపాయలు..
ఎన్నికల ప్రచారం సందర్భంగా నిరుద్యోగులందరికీ ఒక్కొక్కరికి నెలకు రెండు వేల‌ రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని అప్పటి ప్రచారంలో ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అంటూ హడావుడి చేసిన చంద్రబాబు సర్కారు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తుందని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతిని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి అందచేస్తామని మరోసారి హామీలు గుప్పిస్తున్నారు. కేవలం ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి హామీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి.

కండీషన్ అప్లై..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం తొమ్మిది లక్షల మంది మాత్రమే నిరుద్యోగులున్నారని ఏపీ సర్కార్ ప్రకటించడం పట్ల నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. 18 నురచి 35 సంవత్సరాల వయసు లోపు వారికే కావడం గమనార్హం. ఏదో భృతి ఇచ్చామని చెప్పుకోవడానికి..నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని కొద్దిగా తగ్గించుకొనేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహానికి తెరలేపుతోందని తెలుస్తోంది. ఇంటర్మీడియేట్‌ కన్నా తక్కువ చదివిన వారికి నెలకు రూ.900, గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.1500, పోస్టు గ్రాడ్యుయేషన్‌ తదితర విద్యాభ్యాసం చేసిన వారికి నెలకు రూ.3వేల చొప్పున భృతిగా చెల్లించాలని ఏపీ సర్కార్ యోచిస్తుందనో టాక్. ఇదొక్కటే కాకుండా ఇంకా మరికొన్ని కండీషన్స్ పెడుతోందని తెలుస్తోంది. ప్రతి ఏటా డిఎస్సీ విడుదల చేస్తామన్న పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషన్‌నే కొనసాగించారే కానీ ఈ మూడేళ్లలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ మూడేళ్లు దాటిపోతోంది..నిరుద్యోగ భృతి ఇస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఏపీ సచివాలయానికి పవన్ కల్యాన్

అమరావతి: ఏపీ సచివాలయానికి పవన్ కల్యాన్, హార్వర్డ్ వైద్యులు చేరుకున్నారు. ఈ పాటికే సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుతో పవన్ కల్యాన్, హార్వర్డ్ వైద్యులు భేటీ అయి ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి చర్చించనున్నట్లు సమాచారం.

సూపరింటెండ్ తో సమావేశమైన జూడాలు

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్ తో జూడాలు సమావేశం అయ్యారు. తమ పై దాడులు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జూడాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం...

11:20 - July 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో హీరో తనీష్ సిట్ విచారణ కొనసాగుతోంది. తనీష్‌ ను సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం అయింది. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరాపై తనీష్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. పబ్ కల్చర్ పై వివరాలు, డ్రగ్స్ వ్యవహారంలో కీలక అంశాలను రాబట్టనున్నారు. కాల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా తనీష్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. రేపు నందును సిట్ విచారించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

వెలగపూడికి ర్యాలీగా బయలుదేరిన పవన్ కల్యాన్

విజయవాడ: వెలగపూడికి ర్యాలీగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బయలుదేరారు. అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా రావడంతో ప్రకాశం బ్యారేజీ సీతమ్మవారి పాదాల వద్ద ర్యాలీని ఆపే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కరకట్టపై ఎక్కువ వాహనాలు రావడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

రేపు అస్సాంలో పర్యటించనున్న మోదీ

హైదరాబాద్: రేపు (ఆగస్ట్ 1)న అసోంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన వరద నష్టాన్ని.. అందుకు గల కారణాలను అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అసోం అతలాకుతలమయ్యింది. వరదల కారణంగా 76 మంది మృతి చెందగా.. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. సుమారు రెండు వేల 939 కోట్ల మేర నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

11:12 - July 31, 2017
11:06 - July 31, 2017

సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఆన్ లైన్ లో చిత్రం ప్రత్యక్షమవుతుండడం చూస్తుంటాం. చిన్న..పెద్ద చిత్రాలనే తేడా లేకుండా చిత్రాలు లీక్ అవుతుండడం ఆయా చిత్ర దర్శక..నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే పలు సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు..పాటలు..తదితర విషయాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. టాలీవుడ్ యంగ్ టైగర్ నటిస్తున్న

'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ లీక్ అయ్యిందని సోషల్ మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేస్తోంది.
మూడు పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో 'రాశీ ఖన్నా', 'నివేదా థామస్'లు హీరోయిన్స్ నటిస్తున్నారు. సెప్టెంబర్ 21న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తుండగా ఇటీవలే టీజర్ లోని కొన్ని దృశ్యాలు ఆన్ లైన్ లో లీకైన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యుడైన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మళ్లీ ఈ చిత్రంలోని పరిచయ గీతం లీకయ్యింది.

'రావణ..' అని సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్టీఆర్‌ 'జై' పాత్ర కోసం ఈ పాటను కంపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు భారీ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ప్రచార చిత్రం విడుదలైన 24గంటల్లోనే 7.5 మిలియన్స్ వ్యూస్ ను క్రాస్ చేయడం విశేషం. మరి లీక్ విషయంలో చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

11:00 - July 31, 2017

సిరిసిల్ల : కాంగ్రెస్‌ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ.. క్షణం క్షణం ఉత్కంఠను రేపుతోంది. ఓ వైపు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోలీసులు కాంగ్రెస్‌ నేతలను ముందస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. సభకు హాజరు కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వీ.హనుమంతరావు టెన్ టివితో మాట్లాడారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే...
'ఇది ప్రజాస్వామ్యం దేశం. ఆందోళన, ధర్నా, పోరాటాలకు అనుమతి లేదనడం అన్యాయం. కేసీఆర్ కు గతంలో ఆందోళనలు, పోరాటాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చాం. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆందోళనలు, పోరాటాలు, ధర్నాలకు అనుమతి ఇవ్వబోమనడం అన్యాయం. పోలీసులు చిత్ర హింసలు పెట్టిన నేరెళ్ల దళితులను పరామర్శించాం. వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. బర్లను, ఎడ్లను కొట్టినట్లు కొట్టారు. ఇసుకల పడేసి కొట్టారు. దళితులును చావకొట్టేందుకే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం దళితులు, బీసీలను చావకొట్టేందుకు వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబ సభ్యుల పాలన కొనసాగుతోంది. పారిపాలన పరంగా సర్కార్ ఇచ్చే గ్రేడ్లలోనూ కొడుకు కేటీఆర్ కు నెంబర్ వన్, హరీశ్ రావుకు నెంబర్ టు వచ్చారు. మియాపూర్ పూర్ భూ స్కాంపై ప్రశ్నిస్తే డ్రగ్స్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. టీసర్కార్ ఏర్పాటు చేసే ఏ ఎంక్వరీ ముందుకు రాదు. కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు' అని విమర్శించారు.

 

10:58 - July 31, 2017

తమ తమ చిత్రాలకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు. చిత్ర ప్రచార కార్యక్రమాలను కూడా భిన్నంగా నిర్వహిస్తూ అభిమానుల్లో ఉత్కంఠను కలిగిస్తుంటారు. ప్రేక్షకులు మరిచిపోకుండా ఉండడం కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ప్రచారం చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' కూడా ఇలాగే చేశారు.

షారూఖ్ ఖాన్..అనుష్క శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'జబ్ హ్యారీ మెట్ సెజల్' చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలోని 'బటర్ ఫ్లై' పాట సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. శనివారం అనుష్క..షారూఖ్ లు సినిమా ప్రచారం నిమిత్తం దుబాయ్ కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో విమానం ఎక్కిన 'షారూఖ్' బటర్ ఫ్లై పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను షారూఖ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకి తెగ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా విజయం సాధిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

ఉస్మానియాలో కొనసాగుతున్న జూడాల నిరసన

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రోలో జూడాల నిరసన కొనసాగుతోంది. సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదుట జూనియర్ డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. తమ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

తిరుమలలో నాయిని

తిరుమల: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న నాయినికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనవరాలు, మనవడు పుట్టెంట్రుకలు తీసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

10:45 - July 31, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కొడుకు విక్రమ్‌గౌడ్‌పై కాల్పుల ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కాల్పులకు అనంతపురం జిల్లాతో లింక్‌ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. విక్రమ్‌ ఫోన్‌కు అనంతపురం జిల్లా నుంచి మూడు ఫోన్ కాల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలను పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం జిల్లాకు పంపారు. మరోవైపు కాల్పులు జరిగిన రోజు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా విక్రమ్‌ ఇంటిముందు సంచరించినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. కాల్పులకు ఉపయోగించిన గన్‌ను బైక్‌పైవచ్చిన వ్యక్తులు తీసుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

పాల్వంచ కేటీపీఎస్ ఎదుట ఉద్రిక్తత

భద్రాద్రి: పాల్వంచ కేటీపీఎస్ ఎదుట కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. జన్ కో క్రమబద్దీకరణలో తమకు అన్యాయం జరిగిందని నిరసనకు దిగారు. పెట్రోలు పోసుకుని కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మరో ఐదుగురు కార్మికులు సైలో ఎక్కారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

10:38 - July 31, 2017

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కాసేపట్లో సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. హార్వర్డ్‌ ప్రొఫెసర్లు, వైద్యులతోకలిసి సీఎంను కలవబోతున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలు, వాటి పరిష్కారంపై చంద్రబాబుతో చర్చిస్తారు. సీఎంతో సమావేశమయ్యేందుకు గన్నవరం వచ్చిన పవన్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి అమరావతికి గబ్బర్‌సింగ్ బయలుదేరారు. సచివాలయంలో చంద్రబాబును కలవనున్నారు. జనసేనాని రాక సమాచారంతో విజయవాడ సందడిగా మారింది. జనసేన కార్యకర్తలతో నిండిపోయింది. 

 

10:35 - July 31, 2017

హైదరాబాద్ : హీరో తనీష్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్‌ కేసులో తనీష్‌ ను సిట్‌ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరాపై తనీష్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. పబ్ కల్చర్ పై వివరాలను రాబట్టనున్నారు. కాల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా తనీష్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. రేపు నందును సిట్ విచారించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఢిల్లీ శాస్త్రి భవన్ అగ్ని ప్రమాదం...

ఢిల్లీ : శాస్త్రి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో రానున్న 12 గంటల్లో సాధారణం నుంచి ఓ మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెహిదీపట్నం, అత్తాపూర్, లంగర్‌హౌస్, రాజేంద్రనగర్, పాతబస్తీ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. కొన్నిప్రాంతాల్లో ఓ వైపు ఎండకాస్తూనే మరోవైపు వర్షం పడింది. రెండ్రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగడం, గాలిలో తేమ తగ్గడంతో కొంత ఉక్కపోత పరిస్థితి ఏర్పడింది.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య..

వికారాబాద్: జిల్లాలోని మర్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 9వ, తరగతి చదువుతున్న హారిక(14) పారశాల ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కరన్ కోట్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన హారిక అని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం గుర్తించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొనసాగుతున్న కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

హైదరాబాద్ : కాంగ్రెస్ 'చలో సిరిసల్ల' నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల సభకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంథని, సిద్ధిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హీరో తనీష్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నేడు సినీ నటుడు తనీష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు తనీష్ ఇంటి నుండి బయలుదేరినట్లు సమాచారం.

కాసేపట్లో సీఎం చంద్రబాబు తో పవన్ కల్యాణ్ భేటీ

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాన్ కాసేపట్లో సీఎం చంద్రబాబు తో భేటీ కానున్నారు. ప్రస్తుతం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న పవన్ విజయవాడకు బయలుదేరారు. ఉద్దాన్ కిడ్నీ బాధితలకు సంబంధించి వీరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

09:47 - July 31, 2017
09:46 - July 31, 2017

గుంటూరు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. అమరావతిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం అవుతారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై చర్చిస్తారు. డాక్టర్‌ జోసెఫ్‌ బోన్‌వెంట్రే నేతృత్వంలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ డాక్టర్ల బృందం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై అధ్యయనం చేసింది. వీరి పరిశీలనలో తెలిన అంశాలను పవన్‌ కల్యాణ్‌ నివేదిక రూపంలో చంద్రబాబుకు అందిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులతో పవన్‌తోపాటు హార్వర్డ్‌ వైద్య బృందం సమావేశమైన కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చిస్తారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మధ్యాహ్నం 12 గంటలకు  పవన్‌ బృందానికి చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇస్తారు. ఆతర్వాత  పవన్‌తోపాటు, హార్వర్డ్‌ వైద్యులకు చంద్రబాబు లంచ్‌ ఏర్పాటు చేశారు. 

09:45 - July 31, 2017

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నితీన్ సరసన మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది.

యాక్షన్ ప్రధానంగా చిత్రం ఉంటుందని అందరికీ వినోదాన్ని కలిగిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన పాటలు..టీజర్ కు భారీ రస్పాన్స్ వస్తోందని, ఆగస్టు 11న చిత్రం విడుదల చేస్తామన్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళుతున్న 'నితిన్' ‘లై' చిత్రంలో మరోసారి భిన్నంగా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా పోస్టర్స్..టీజర్ చూస్తుంటే నిజమనిపిస్తోంది. 'నితిన్' కు విలన్ గా యాక్షన్ కింగ్ 'అర్జున్' నటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ఆగస్టు మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 

09:43 - July 31, 2017

సిరిసిల్ల : సిరిసిల్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగసభకు సిద్ధమైంది. ఈ ఆందోళనకు అనుమతిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. అయినా సభ నిర్వహించితీరతామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. మరోవైపు సభను అడ్డుకునేందుకు పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సిరిసిల్లలో భారీగా పోలీసుల్ని మోహరించారు. పలువురు నేతల్ని ముందస్తు అరెస్టులు చేశారు. 

 

గురుకుల పాఠశాలలో విద్యార్థిని బలవన్మరణం..

వికారాబాద్ : మర్పల్లి కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తొమ్మిదో తరగతి చదువుతున్న హారిక పాఠశాలలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

 

09:38 - July 31, 2017

హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో మిస్టరీ వీడడం లేదు. కాల్పుల ఘటనకు అనంతపురం జిల్లాతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు అనంతపురం జిల్లా నుంచి 3 ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లాకు రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు వెళ్లాయి. విక్రమ్ ఇంటి సమీపంలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బైక్ ఏపీకి చెందినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన గన్ ను బైక్ పై వచ్చిన వ్యక్తులు తీసుకుపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గేట్ వేయొద్దని విక్రమ్ గౌడ్... వాచ్ మెన్ కు చెప్పినట్లు పోలీసుల వాంగ్మూలంలో వెల్లడైంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:24 - July 31, 2017

సినిమాలో హీరో, హీరోయిన్ల పరిచయం..క్లైమాక్స్ సీన్లను భారీ ఎత్తున చిత్రీకరించేందుకు దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం భారీ బడ్జెట్ ను ఉపయోగిస్తుంటారు. ప్రముఖ తారల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుని చిత్ర నిర్మాణం చేపడుతుంటారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న 'స్పైడర్' ఓ సన్నివేశానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

మురుగదాస్..మహేష్ బాబు, రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న 'స్పైడర్' సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో 'ఎస్ జే సూర్య' ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. తమిళం..తెలుగు భాషాల్లో సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే మహేష్..సూర్యల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలకు రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. కేవలం 8 నిమిషాల పాటు ఈ పోరాట సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. వీరిద్దరి సన్నివేశమే సినిమాకు హైలెట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఎంతో ప్రాధాన్యత సంతరించుకొనే ఈ సన్నివేశానికి భారీగా గ్రాఫిక్ ను జోడించనున్నారని తెలుస్తోంది. కత్తి..తుపాకి హిట్ సినిమాలు అందించిన అనంతరం మురుగదాస్ తీస్తున్న ఈ చిత్రంపై కోలీవుడ్..టాలీవుడ్ లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

09:19 - July 31, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఇవాళ సిట్‌ ముందుకు హీరో తనీష్‌ హాజరుకానున్నారు. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్‌ సరఫరాపై తనీష్‌ను అధికారులు విచారించనున్నారు. కాల్విన్‌ కాల్‌ డేటా ఆధారంగా తనీష్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. రేపు నందును సిట్ విచారించనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

సిరిస్లిలో హై టెన్షన్ వాతావరణం..

కరీంనగర్ : సిరిసిల్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నేరెళ్ల బాధితులకు అండగా టి.కాంగ్రెస్ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగ ఏర్పాటు చేయనుంది. ఈ సభకు పోలీసులు అనుమతినివ్వలేదు. దీనితో కాంగ్రెస్ నేతలు పలు ప్రాంతాల్లో రాస్తారోకో..ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

09:15 - July 31, 2017

సిరిసిల్ల : నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగసభకు సిద్ధమైంది. ఈ ఆందోళనకు అనుమతిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. అయినా సభ నిర్వహించితీరతామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. మరోవైపు సభను అడ్డుకునేందుకు పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సిరిసిల్లలో భారీగా పోలీసుల్ని మోహరించారు. పలువురు నేతల్ని ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. సిరిసిల్ల జిల్లాలో దళితులకు అన్యాయం జరుగుతుందన్నారు. జైళ్లో పోలీసుల చిత్ర హింసలకు గురైన వారిని పరామర్శిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ప్రభుత్వం అంటున్న మాటలపై ఉత్తమ్ స్పందించారు. ఇసుక లారీల కింద ముగ్గురు చనిపోవడం, న్యాయం కోసం పోరాటం చేస్తోన్న వారిని పోలీసులు చిత్ర హింసలకు గురి చేయడంపై మాట్లాడడం అనవసర రాద్ధాంతం అవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ నియోజకవర్గం అయినా, కేటీఆర్ నియోజకవర్గం అయినా.... ఏ నియోజకవర్గంలోనైనా దళితులు, బీసీలకు ఏ సమస్య వచ్చినా ఆందోళన చేస్తామని చెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామన్నారు. టీఆర్ ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

వీడని విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటన..

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ పై కాల్పుల ఘటనలో మిస్టరీ వీడడం లేదు. కాల్పుల ఘటనకు అనంతపురం జిల్లాకు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు ముందు అనంతపురం జిల్లాకు నుండి మూడు ఫోన్స్ కాల్స్ వచ్చినట్లు, విక్రమ్ గౌడ్ ఇంటి సమీపంలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు సంచరించినట్లు తెలుస్తోంది. అనుమానాస్పదంగా తిరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్ ఏపీకి చెందినట్లు, కాల్పులకు ఉపయోగించని గన్ ను బైక్ పై వచ్చిన వ్యక్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు టాస్క్ ఫోర్స్ బృందం బయలుదేరింది. 

09:01 - July 31, 2017

సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు జరగడం తనకు బాధ కలిగించిందని.. మాజీ స్పీకర్ మీరాకుమార్‌ అన్నారు. నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు.. ఆమె సిరిసిల్ల వచ్చారు.. తను కలలు గన్న సామాజిక తెలంగాణ ఇది కాదని ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. నేరెళ్ల ఘటనలో దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలియగానే మసస్సు కలిచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

08:57 - July 31, 2017

సిరిసిల్ల : సిరిసిల్లలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగసభకు సిద్ధమైంది.. ఈ ఆందోళనకు అనుమతిలేదని పోలీసులు తేల్చిచెప్పారు.. అయినా సభ నిర్వహించితీరతామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు.. ఈ నిరసనలో పాల్గొనేందుకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు.. మరోవైపు సభను అడ్డుకునేందుకు పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.. సిరిసిల్లలో భారీగా పోలీసుల్ని మోహరించారు.. పలువురు నేతల్ని ముందస్తు అరెస్టులు చేశారు.. 

 

08:54 - July 31, 2017

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపార్వతి, కాంగ్రెస్ నేత కైలాష్, టీడీపీ నేత దుర్గాప్రసాద్, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు తక్షణం సహాయం చేసే చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్దానం కిడ్ని బాధితుల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ పోరాటంతో ప్రభుత్వంలో కొంత చలనం వచ్చిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తు పనులు..

చిత్తూరు : నేటి నుండి నెల రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తు పనులు చేపట్టనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మరమ్మత్తు పనులు జరుగనున్నాయి.

08:36 - July 31, 2017

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో తెలంగాణ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు కుమార్, వెంకటరమణ గుప్తా, జ్యోతి మాట్లాడారు. 'తెలంగాణలో రేషన్ డీలర్లు పోరుబాట పట్టారు. రేపటి నుంచి సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో రేషన్ డీలర్లు ఆత్మహత్యలు చేసుకుంటుండడం వీరు ఎదుర్కొంటున్న పరిస్థితికి అద్దంపడుతోంది. సిరిసిల్ల,  నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో రేషన్ డీలర్లు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో వీరి సమస్యలు ఎజెండా మీదకు వస్తున్నాయి. రేషన్ డీలర్ల సమస్యలపై వారు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

08:28 - July 31, 2017

నెల్లూరు : జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా కథ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు పట్టుబడడంతో.. బుకీల జాబితా బయటపడుతోంది. అయితే వీరిలో చాలామంది రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, ఖాకీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటివారైనా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తుండడంతో.. అందరిలోనూ టెన్షన్‌ మొదలైంది. 
చాపకింద నీరులా క్రికెట్‌ బెట్టింగ్‌ 
నెల్లూరు జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఉన్నత వర్గం నుంచి పేదవారి వరకు అందరూ ఈ విషవలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే అనేక కుటుంబాలు అప్పులపాలై రోడ్డునపడుతున్నాయి. ఓ కుటుంబమైతే... క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల బెదిరింపులకు భయపడి రామేశ్వరం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. మరోవ్యక్తి బుకీల చేతిలో మోసపోయి కోట్ల రూపాయలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలున్నాయి. 
క్రికెట్‌ బెట్టింగ్‌లపై ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి 
అయితే.. కొత్తగా వచ్చిన ఎస్పీ రామకృష్ణ క్రికెట్‌ బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించారు. చెన్నైలో అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ కృష్ణసింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించడంతో... అనేకమంది పాత్ర ఉన్నట్లు బయటపడింది. కృష్ణసింగ్‌ తెలిపిన బుకీల జాబితాలో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతల అనుచరులున్నట్లు తెలుస్తోంది. 
బుకీలకు పోలీసుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు 
ఇప్పటివరకు 50 మందికిపైగా బుకీలు, పంటర్లు, రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కృష్ణసింగ్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్న ప్రధాన బుకీలు శ్యాంప్రసాద్‌, గడ్డం సునీల్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, అరుణ్‌, పొట్టి ప్రసాద్‌లున్నారు. అలాగే... బుకీలలో చాలామందికి వైసీపీ, టీడీపీకి చెందిన నేతలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న ప్రధాన బుకీ శరత్‌చంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు బుకీలకు పోలీసుల అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు డీఎస్పీలు, ఐదారుగురు సీఐలు, మరో ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 
ఎలాంటివారైనా అరెస్ట్‌ చేయాలి : ప్రభుత్వం ఆదేశం 
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం... ఎలాంటివారైనా అరెస్ట్‌ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు... ఎస్పీ మాట్లాడినట్లు సమాచారం. బెట్టింగ్‌ మాఫియాతో ఎవరికి సంబంధమున్నా ఉపేక్షించేది లేదని మంత్రులంటున్నారు. అయితే... త్వరలోనే క్రికెట్‌ బెట్టింగ్‌లతో సంబంధమున్న వారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే ముఠాతో సంబంధమున్న ప్రముఖుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది. 

 

08:22 - July 31, 2017

కామారెడ్డి : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వ వైభవం రాబోతుంది. ఇన్నాళ్లు అన్యాక్రాంతమైన ఆస్తులన్నీ కాలేజీకే చెందడంతో యూజీసీ గుర్తింపు లభించింది. 20 ఏళ్ల తమ పోరాటానికి గుర్తింపు లభించినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
1964లో డిగ్రీ కళాశాల ప్రారంభం 
ఇది కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల. 1964లో అప్పటి కలెక్టర్‌ బి.ఎస్‌.రామన్‌ ఆధ్వర్యంలో కాలేజి ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించి ఈ కాలేజీని ప్రారంభించారు. 268 ఎకరాల్లో ప్రారంభించిన ఈ కాలేజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. అయితే ఆ తర్వాత... ఈ కాలేజీ ఆదరణకు నోచుకోకుండా పోయింది. కాలేజీ ఆస్తులన్నీ అన్యాక్రాంతమయ్యాయి. 
కాలేజీ ఆస్తులను కాపాడాలంటూ విద్యార్థులు పోరాటాలు 
కాలేజీ ఆస్తులను కాపాడాలంటూ విద్యార్థులు అనేక పోరాటాలు చేశారు. విద్యార్థులు పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. దీంతో 1987లో ఈ కాలేజీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే... సొసైటీ సభ్యులు కోర్టుకెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై మళ్లీ విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. దీంతో కాలేజీ ప్రభుత్వం చేతికైతే వచ్చింది గానీ... ఆస్తులు మాత్రం సొసైటీ చేతుల్లోనే ఉండిపోయాయి. కాలేజీ ఆస్తుల కోసం ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో కాలేజీకి యూజీసీ గుర్తింపురాకుండాపోయింది. ఆ తర్వాత నిధులు లేక కాలేజీ పరిస్థితి దారుణంగా తయారైంది. 
కాలేజీకి యూజీసీ గుర్తింపు  
అయితే... ఎన్నో ఏళ్లుగా విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. కాలేజీ పరిస్థితిపై 10టీవీ ఎన్నోసార్లు ప్రసారం చేసిన కథనాలు చూసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గంప గోవర్ధన్‌ స్పందించారు. ఎడ్యుకేషనల్‌ సొసైటీతో మాట్లాడి... ఆస్తులను కాలేజీకి అప్పగించేలా చేశారు. ఈ తీర్మాన కాపీలను సీఎం కేసీఆర్‌కు పంపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూజీసీ గుర్తింపు కాలేజీకి వచ్చింది. దీంతో కాలేజీకి ప్రతి ఏడాది 30-40 లక్షలు వస్తాయని విద్యార్థులు, లెక్చరర్లు అంటున్నారు. యూజీసీ నుంచి వచ్చే నిధులతో కాలేజీ మరింత అభివృద్ధి చెందుతుందని విద్యార్థి సంఘాల నేతలంటున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తాము చేసిన పోరాటానికి ఫలితం దక్కడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

08:17 - July 31, 2017

నిర్మల్‌ : ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక ఆలోచన సమాజంలో మార్పును తీసుకొస్తుంది. ఒక ఆలోచన ఒక మంచి పనికి నాంది అవుతుంది. ఒక ఆలోచన మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. చిన్నారులు చేసిన ఓ ఆలోచన వారి గ్రామంలో పర్యావరణహితానికి నాంది అయ్యింది. అంతేకాదు... వారి ఆలోచన  గ్రామస్తులకు ఉపాధి చూపింది.  ఇంతకీ ఏమిటా ఆలోచన. ఎక్కడా గ్రామం. లెట్స్‌ వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ
సోషల్‌ మీడియాలో మార్మోగుతోన్న సింగాపూర్‌   
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్ మండలంలోని సింగాపూర్‌ ఓ మారుమూల పల్లె. ఈ గ్రామంలో ఒక వెయ్యి గడపవరకు  ఉంటుంది. వ్యవసాయం, కూలీపనులు చేస్తూ గ్రామస్తులు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ గ్రామం గురించి పెద్దగా తెలియదు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియాలో సింగాపూర్‌ గ్రామం పేరు మార్మోగుతోంది. ఎందుకో తెలుసా... చిన్నారులకు తట్టిన ఓ ఆలోచనే దీనికి కారణం.
సేంద్రీయ ఎరువుతో కూరగాయల సాగు
గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు  సైన్స్‌ ఉపాధ్యాయుడు ఓ పని అప్పగించారు.  పర్యావరణం - పరిరక్షణ ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా మధ్యాహ్న భోజనం కోసం వారానికి ఒకరోజు మోదుగ ఆకులతో విస్తరి తయారు చేయాలని ఆదేశించారు. ఇలా వారంలో ఒకరోజు మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరిలో విద్యార్థులు భోజనం చేసేవారు. భోజనం ముగిసిన తర్వాత విస్తరులను  అక్కడే ఏర్పాటు చేసిన  వర్మ్‌కంపోర్ట్‌ గుంతలో వేసేవారు. మిగిలిపోయిన భోజనాన్ని కూడా ఆ గుంతలోనే వేసేవారు. కొన్ని రోజుల తర్వాత అది ఎరువుగా మారింది. ఈ ఎరువును చిన్నారులు కూరగాయల సాగుకు ఉపయోగించారు. చుట్టూ ఉన్న  పరిసరాలను ఎలా వినియోగించుకోవాలో చిన్నారులు తమ తల్లిదండ్రులకు  విడమర్చి చెప్పారు.
ప్లాస్టిక్‌ వస్తులపై నిషేధం
సింగాపూర్‌లో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. వారానికి రెండు రోజులు జాతర జరుగుతుంది. ఈ జాతరకు నిర్మల్‌ జిల్లా నుంచేకాక... చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు. భక్తులు ప్లాస్టిక్‌ సంచులనే వాడడంతో అవి కుప్పలుగా పేరుకుపోయి సమీప పొలాలకు తీవ్ర నష్టం కలిగించాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలనుతిని  పశువులు ఎన్నో చనిపోయాయి కూడా. అయితే చిన్నారులు చేసిన ఆలోచన వీటన్నిటికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. గ్రామస్తులంతా గ్రామసభ పెట్టుకుని పెద్దమ్మ తల్లి జాతరలో ప్లాస్టిక్‌ వస్తులపై నిషేధం విధిస్తూ తీర్మానం చేశారు.  అంతేకాదు.. జాతరకు వచ్చే భక్తులు ఆకులతో చేసిన విస్తరిలనే వాడాలని షరతు పెట్టారు.  దీంతో గ్రామస్తులకు విస్తర్లు తయారు చేస్తుండడంతో వారికి ఉపాధి లభించినట్టైంది. ఒక్క ఆలోచన అటు పర్యావరణం సమస్యకు, ఇటు గ్రామంలోని మహిళల ఉపాధి సమస్యకు పరిష్కారం చూపింది.
అమెరికాకు పాకిన సింగాపూర్‌ చిన్నారుల ఆలోచన
సింగాపూర్‌లో చిన్నారుల ఆలోచన ఆనోటా..ఈనోటా పాకి చివరికి అమెరికాలోని ప్రవాసభారతీయులకు తెలిసింది.  ప్రవాసభారతీయులు ఈనెల 13న సింగాపూర్‌ గ్రామాన్ని సందర్శించనున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో  డిజిటల్‌ క్లాస్‌ల కొరకు 5 ల్యాప్‌టాప్‌లు, 10 ట్యాబ్లెట్స్‌ అందజేయనున్నారు. అంతేకాదు.. అమెరికా నుంచి వారికి డిజిటల్‌ క్లాసులు భోదించనున్నారు.  ఇందుకు కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి.  మొత్తానికి చిన్నారుల కొచ్చిన ఒక ఆలోచన ఆ గ్రామ రూపు రేఖలనే మార్చివేసింది.
 

 

కాంగ్రెస్ సభకు నో పర్మిషన్..

కరీంనగర్ : సిరిసిల్ల నేరెళ్ల బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. ఈ సభలో మాజీ స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతి లేదని పేర్కొన్నారు.

వేములవాడలో ఆర్జిత సేవల రద్దు..

రాజన్న సిరిసిల్ల : శ్రావణ సొమవారం సందర్భంగా వేముల వాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామి వారి దర్శనానికి 4గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేశారు.

07:55 - July 31, 2017

హైదరాబాద్ : ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై చర్యలకు గులాబీ బాస్‌ సిద్ధమవుతున్నారా? నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవా? ఇందుకోసం ఓ బిల్లును తీసుకురావాలని సర్కార్‌ యోచిస్తోందా? ప్రభుత్వాన్ని విమర్శించాలంటే  ప్రతిపక్షాలు వెనుకాముందు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయా? కాంగ్రెస్‌ నేతల విమర్శలపై టీఆర్‌ఎస్‌ నేతలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారా? 
పాలిటిక్స్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణలు 
రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు  సహజం. అధికారపార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అధికారపార్టీ వాటిని తిప్పికొడుతుంది. ఇవన్నీ పాలిటిక్స్‌లో సాధారణమైన అంశాలు. అయితే  టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం తమపై ఆరోపణలు చేస్తే వారికి ఆధారాలు చూపించాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొస్తోంది. తమపై ఆరోపణలు చేస్తే వాటిని నిరూపించాలని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిపక్షాలకు సవాల్‌ విసురుతున్నారు. ఆరోపణలు చేయాలంటే ప్రతిపక్షాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకునేలా శాసన సభలో ఓ బిల్లును కూడా తీసుకొస్తామని కేసీఆర్‌ ఇంతకుముందే ప్రకటించారు.
తలసానిపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు 
మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సంబంధాలున్నాయంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపణలు గుప్పించారు.  దీంతో తలసాని తనకు ఎలాంటి సంబంధంలేదంటూ వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ విమర్శలను అంతటితో వదిలేయకుండా... విమర్శలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆయన మొగ్గుచూపుతున్నారు.  ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌తోపాటు... కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యాలయానికి నోటీసులు పంపారు. అయితే కాంగ్రెస్‌ నుంచిగానీ.. దిగ్విజయ్‌సింగ్‌ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోర్టు మెట్లెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన విపక్షాలు
ప్రతిపక్షపార్టీలన్నీ మియాపూర్‌ భూకుంభకోణంపై ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమయ్యాయి. నిరసనలు హోరందుకుంటుండగా.... డ్రగ్స్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలన్నీ డ్రగ్స్‌ కేసుపై దృష్టిసారించాయి. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు ఊపిరి పీల్చుకున్నంత పనైంది. ఈ పరిస్థితుల్లో మంత్రి తలసాని దిగ్విజయ్‌సింగ్‌పై కోర్టుకు వెళ్లేందుకు కేసీఆర్‌ అనుమతిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు సర్కార్‌ పంపుతోంది. మరి ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

 

రేవంత్ రెడ్డి పాదయాత్ర..

హైదరాబాద్ : డ్రగ్స్ కు వ్యతిరేకంగా టిడిపి నేత రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ట్యాంక్ బండ్ నుండి ఎక్జైజ్ కార్యాలయం వరకు పాదయాత్ర జరగనుంది.

07:50 - July 31, 2017

హైదరాబాద్ : ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో జూడాలు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి చనిపోయాడంటూ.. మృతుడి బంధువులు వైద్యులపై దాడికి దిగారు. దీంతో జూడాలు ఆందోళన చేపట్టారు. తమకు భద్రత లేదని ఆరోపించారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వైద్యుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

07:47 - July 31, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. దళితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమని మండిపడ్డారు. లారీలు మనుషులను చంపితే తప్పు లేదా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలకన్న ఇసుకలారీలకే ప్రభుత్వం విలువ ఇస్తోందన్నారు. సభలు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.

 

పవన్ కు బాబు లంచ్..

విజయవాడ : ఉదయం 9.30గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హార్వర్డ్ వైద్యులు సచివాలయంలో ఉదయం 10.30గంటలకు సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ కానున్నారు. 11గంటల నుండి 12 వరకు పవన్..హార్వర్డ్ వైద్యులతో వైద్యారోగ్య అధికారులు భేటీ జరగనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పాల్గొననున్నారు. 12 నుండి 1గంట వరకు ఉద్దానం కిడ్నీ ఆదుకొనేందుకు తీసుకున్న చర్యలపై సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. 1.30కి పవన్..హార్వర్డ్ వర్సిటీ వైద్యులకు బాబు లంచ్ ఇవ్వనున్నారు.

జక్కంపూడిలో పోలీసుల నిర్బంద తనిఖీలు..

విజయవాడ : శివారు ప్రాంతాల్లో దొంగతనాలు, నేరాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో పోలీసులు నిర్బంద తనిఖీలు జరిపారు. ఇళ్లల్లో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు..వాహనాలు..వస్తువులపై ఆరా తీశారు. పలువురు అనుమానితులు, పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు.

రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ..

ఢిల్లీ : రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. నేడు సభకు తప్పకుండా హాజరు కావాలని విప్ లో పేర్కొంది.

గుజరాత్ లో డ్రగ్స్ పట్టివేత..

ఢిల్లీ : భారీ డ్రగ్స్ రాకెట్ ను భారత నావికాదళం గుట్టు రట్టు చేసింది. రూ.500 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. పనామాకు చెందిన నౌకలో 1500 కిలోల మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఇరాన్ నుంచి గుజరాత్‌లోని అలంగ్‌కు సరఫరాకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎనిమిది మందిని తీరరక్షణ దళం అదుపులోకి తీసుకుంది.

సిట్ ఎదుట తనీశ్..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నేడు సిట్ ఎదుట హీరో తనీశ్ హాజరు కానున్నారు. ఈ కేసులో రోజుకో సినీ ప్రముఖుడితో పాటు ఇతర రంగాలకు చెందిన వారిని సిట్ విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో డ్రగ్ ముఠా పట్టివేత..

ఢిల్లీ : డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురు ఆఫ్రికన్లను మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) అధికారులు పట్టుకున్నారు. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. వేర్వేరుగా నిర్వహించిన ఆపరేషన్లలో రూ.70లక్షల విలువైన 32.4 కిలోల ఎపిడ్రిన్, సూడోఎపిడ్రిన్ డ్రగ్స్‌ను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం..

ఢిల్లీ : పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న 12 గంటల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ముగిసిన అమరుల స్పూర్తి యాత్ర..

సిద్దిపేట : టీజేఏసీ నిర్వహించిన అమరుల స్పూర్తి యాత్ర ముగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం ములుగు మండలం వంటి మామిడి, ములుగు, వర్గల్‌ మండలం గౌరారం గ్రామాల్లో కోదండరాం రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై పలు విమర్శలు సంధించారు.

నేడు వైసీపీ విస్తృతస్థాయి సమావేశం..

హైదరాబాద్‌ : వైసీపీ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం సోమవారం జరుగనుంది. ఉదయం 10.30 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం..తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.

ఉద్దానం కిడ్నీ సమస్యపై నివేదిక..

శ్రీకాకుళం : ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధులపై హార్వర్డ్‌ వైద్య బృందం నివేదికను రూపొందించింది ఈ నివేదికను సోమవారం సీఎం చంద్రబాబుకు అందజేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఆగస్టు 3న నంద్యాలకు జగన్ రాక..

కర్నూలు : వైసీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 3వ తేదీన నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

హిల్ రిస్టార్ట్స్ లో నవాజ్ నివాసం..

ఇస్లామాబాద్ : పనామా పత్రాల కేసులో ప్రధాని పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్ తన అధికారిక నివాసాన్ని వీడారు. ముర్రే ప్రాంతంలోని హిల్ రిస్టార్ట్ కు కుటుంబంతో సహా చేరుకున్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో జూ. డాక్టర్ల ఆందోళన

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన చేపట్టారు. డాక్టర్లు, ఇద్దరు హౌజ్ సర్జన్ లపై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బంధువు చనిపోయిందని దాడి చేశారు. 

 

బాబుతో పవన్ భేటీ..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. హార్వర్డ్ వైద్యుల బృందం కూడా ఈ భేటీలో పాల్గొననుంది. ఉద్దానం కిడ్నీ బాధితుల సాయంపై చర్చించనున్నారు.

కాంగ్రెస్ చలో సిరిసిల్ల...

కరీంనగర్ : నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో సిరిసిల్ల కార్యక్రమం జరుగనుంది. నేరేళ్ల బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. మాజీ స్పీకర్ మీరా కుమారి, కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.

ఉస్మానియాలో జూ.వైద్యుల ఆందోళన..

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన నిర్వహించారు. డాక్టర్లు..ఇద్దరు హౌజ్ సర్జన్ లపై రోగి బంధువులు దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ బంధువు చనిపోయిందని దాడి చేశారు. అన్నం తినడం వల్లే రోగి చనిపోయిందని వైద్యులు పేర్కొంటున్నారు. దాడి జరిగిన విషయంలో న్యాయం కావాలంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss