Activities calendar

01 August 2017

22:02 - August 1, 2017
21:59 - August 1, 2017
21:57 - August 1, 2017
21:57 - August 1, 2017
21:56 - August 1, 2017
21:54 - August 1, 2017

పాకిస్తాన్ : ముంబై ఉగ్ర దాడుల మాస్టర్‌ మైండ్ హఫీజ్‌ సయీద్‌ గృహ నిర్బంధాన్ని పొడిగించారు. హఫీజ్‌ సయీద్‌కు మరో 2 నెలల పాటు గృహ నిర్బంధం పొడిగిస్తూ పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ హోంశాఖ నిర్ణయించింది. జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ జనవరి 31 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. హఫీజ్‌కు చెందిన మరో నలుగురు సహచరులను ఉగ్రవాద నిరోధక చట్టం కింద పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

21:51 - August 1, 2017

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసి ఎన్నికయ్యారు. పాకిస్తాన్‌ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీపుల్స్‌ పార్టీకి చెందిన నవీద్‌ కమర్‌ను ఓడించారు. నేషనల్‌ అసెంబ్లీలో అబ్బాసికి 221 ఓట్లు రాగా...పీపుల్స్‌ పార్టీకి కేవలం 47 ఓట్లు వచ్చాయి. పాకిస్తాన్‌ తెహరీక్‌ ఎ ఇన్సాఫ్‌కు 33 ఓట్లు వచ్చాయి. అబ్బాసి ప్రధానిగా ఎంపికైనట్లు నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్ అయాజ్‌ సిద్ధిఖీ ప్రకటించారు. పాకిస్తాన్‌ రాష్ట్రపతి భవన్‌లో ప్రధానిగా ఎంపికైన అబ్బాసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పనామా కేసులో పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా పేర్కొనడంతో  ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో షాహిద్‌ ఖాకన్‌ అబ్బాసి ఎంపికయ్యారు. షాహిద్‌ ఖాకన్‌ తాత్కాలికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగనున్నారు. 45 రోజుల తర్వాత నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షాహబజ్‌ షరీఫ్‌ ప్రధానిగా ఎంపిక  చేయనున్నారు. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ పార్లమెంట్‌లో నవాజ్‌ పార్టీకి 188 ఎంపీలున్నారు. 

 

21:49 - August 1, 2017

శ్రీనగర్ : కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా హక్రిపొరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో కరుడుకట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా  కమాండర్‌ అబూ దుజానా కూడా ఉన్నారు. లష్కరేకే చెందిన మరో ఉగ్రవాది ఆరీఫ్‌ కూడా హతమయ్యాడు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు జరిగింది. హక్రిపొరలో మరో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంలో భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. అబూ దుజానా తలపై పది లక్షల రూపాయల  రివార్డు ఉంది. ఈ ఏడాది మే లో భద్రతా దళాలు చుట్టుముట్టినప్పుడు కళ్లుకప్పి తప్పించుకున్నాడు. అబూ దుజానా ఎన్‌కౌంటర్‌ తర్వాత హక్రిపొరలో హింస చెలరేగింది. దుజానా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఆందోళనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు, సైనికులు భాష్ఫబాయుగోళాలను ప్రయోగించారు. 

21:47 - August 1, 2017

ఢిల్లీ : వచ్చే ఏడాది నుంచి వంటగ్యాస్‌ ఎల్‌పిజిపై సబ్సిడీ ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యసభ దద్దరిల్లింది. కాంగ్రెస్‌, ఎస్పీ, వామపక్షాలు, బిఎస్పీ, టిఎంసి ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సబ్సిడీని వదులుకోవడానికి ప్రజలే ముందుకు వస్తున్నారని, పేదలకు మాత్రం సబ్సిడీ కొనసాగించాల్సిందేనని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. ప్రపంచంలో ఓ వైపు చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. జులై 1 నుంచి ప్రతినెల 4 రూపాయలు పెంచుతూ 2018 మార్చి నాటికి ఎల్‌పిజిపై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

21:45 - August 1, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు నోటా వినియోగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పార్లమెంట్‌లో దుమారం రేగింది. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని... రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా లేదని...అలాంటిది ఈ ఎన్నికల్లో నోటా తీసుకురావాలన్న నిర్ణయం రాజకీయ దురుద్దేశమేనని ఆనంద్‌శర్మ అన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. నోటాను ఎన్నికల కమిషన్‌ జారీ చేసిందని, దీనిపై చర్చించడానికి రాజ్యసభ వేదిక కాదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. విపక్షాల హంగామా మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నోటాను వినియోగించనుండడం గమనార్హం. 

 

21:42 - August 1, 2017

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బాలీవుడ్‌ నటి రేఖ రాజ్యసభకు హాజరు కావడం లేదన్న అంశాన్ని సమాజ్‌వాది పార్టీ ఎంపి నరేష్‌ అగర్వాల్‌ ప్రస్తావించారు. సభకు రాలేనప్పుడు వారు తమ సభ్యత్వానికి రాజీనామా చేయాలని సూచించారు. సచిన్‌, రేఖల హాజరు శాతం చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. విజయ్‌ మాల్యాను తొలగించినట్లే వీరిని ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. వివిధ రంగాల్లో పేరొందిన 12 మందిని గౌరవ సభ్యులుగా రాజ్యసభకు ఎంపిక చేయడం రివాజు. వీరిలో కొందరు సభకు మాత్రం హాజరు కావడం లేదు. 

 

21:40 - August 1, 2017

ఢిల్లీ : ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహాయం ప్రకటించింది.  అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరాంలకు 2 వేల కోట్లు సాయం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రకటించారు.  అస్సాంలో పర్యటించిన ప్రధాని ఆ రాష్ట్రానికి వంద కోట్లు, సహాయక చర్యల కోసం మరో 250 కోట్లు కేటాయించారు. గతనెల అసోంకు 300 కోట్లు విడుదల చేశారు. అస్సాంలోని గువహటిలో ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోది ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. వరదల కారణంగా మృతిచెందిన కుటుంబాలకు  2లక్షలు, క్షతగాత్రులకు  50వేల చొప్పున ఆర్థికసాయం ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి నుంచి అందించనున్నట్లు మోది తెలిపారు.

 

21:38 - August 1, 2017

హైదరాబాద్‌ : నగరంలో మరో లీడర్‌ పుత్రరత్నం మిత్రులతో కలిసి అర్థరాత్రి బీభత్సం సృష్టించారు...టోల్‌గేట్ వద్ద ఆపినందుకు సిబ్బందిపై దాడికి తెగబడ్డారు..ఆరుగురు యువకులు బర్త్‌డే పార్టీకి వెళ్లొస్తూ ఆపిన టోల్‌ సిబ్బందిపై విరుచుకుపడ్డారు...ఆరుగురిలో ఒకరు ఏకంగా చాకు తీసుకుని పొడిచేందుకు ప్రయత్నించాడు..ఇవన్నీ సెల్‌లో రికార్డు చేసిన సిబ్బంది పోలీసులకు అందించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు...
టోల్‌ప్లాజా వద్ద బీభత్సం..
హైదరాబాద్ శివార్లలోని కడ్తాల్ మైసిగండి టోల్‌గేట్ వద్ద అర్థరాత్రి దాటాక హంగామా జరిగింది..ఆరుగురు యువకులు కారులో వస్తూ టోల్‌ ఫీజు అడిగినందుకు బీభత్సం సృష్టించారు....సిబ్బందిలోని యువకుడిపై దాడి చేశారు...మరో యువకుడిని చితగ్గొట్టారు.. ఆరుగురు యువకుల్లో ఒకరు ఏకంగా చాకు తీసుకుని పొడిచేందుకు వెళ్లగా..వేరొకరు వచ్చి ఆపడంతో ఘోరం జరగలేదు.. 
చాకుతో రౌండప్..
ఎల్‌బీనగర్‌ అధికారపార్టీ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్, కార్పోరేటర్‌ లక్ష్మీప్రసన్న దంపతుల కుమారుడు మనీష్‌గౌడ్‌ తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి వరకు ఓ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు..అక్కడే మద్యం సేవించిన వీరంతా మనీష్‌ కారులో తిరుగు ప్రయాణం కాగా...మార్గమధ్యలోని కడ్తాల్‌ టోల్‌గేట్ వద్దకు రాగానే సిబ్బంది ఫీజు రశీదు అడిగారు..దీంతో వారు ఒక్కసారిగా టోల్‌ సిబ్బందిపై అటాక్ చేయడం మొదలుపెట్టారు...తమనే ఆపుతారా అంటూ యువకుల్లో కొందరు ఏకంగా చాకు తీసి భయోత్పాతాన్ని సృష్టించారు..ఇదంతా జరుగుతున్న సమయంలో టోల్‌ సిబ్బందిలో ఒకరు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు...కొద్ది సేపు బీభత్సం సృష్టించి సిబ్బందిలో ఇద్దరిని గాయాలపాలు చేసినవారు వెళ్లిపోయారు...
ఘటనపై పోలీసుల కేసు నమోదు..
ఇక జరిగిన ఘటనపై వచ్చినఫిర్యాదుతో కడ్తాల్ పోలీసులు కేసు నమోదు చేశారు... ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేయడంతో వారిని జైలుకు తరలించారు...
అధికారపార్టీ నేత కొడుకు కావడంతో కలకలం..
ఇదిలా ఉంటే కారు యజమాని...అరుగురిలో ఒకరైన మనీష్‌గౌడ్‌ ఎల్‌బీనగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రామ్మోహన్ గౌడ్, కార్పోరేటర్ లక్ష్మీ ప్రసన్నల కుమారుడు..దీంతో ఈ ఘటన కలకలం రేపింది..మనీష్‌గౌడ్‌ తన అనుచరులతో కలిసి బీభత్సం సృష్టించాడని...టోల్ సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడన్న వార్తలు ఆందోళన కలిగించాయి..అయితే దీనిపై గాయపడ్డ టోల్‌ సిబ్బంది యువకుడు, రామ్మోహన్‌గౌడ్‌లు మీడియాముందుకు వచ్చి మనీష్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు...
పోలీసులు కేసు నమోదు 
ఆరుగురు కలిసి ఉండడంతో పాటు కారు మనీష్‌ది కావడంతో సిబ్బందిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు...ఇందులో ఏ 4గా మనీష్‌గౌడ్‌ను చేర్చారు...అందరి బాధ్యత ఉండడంతో ఈ కేసులో అందరినీ చేర్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

 

21:23 - August 1, 2017

హైదరాబాద్ : కథ బాగుంది...స్క్రీన్‌ ప్లే అదిరింది...కాని నటీనటులే సరిగా చేయలేకపోయారు...చివర్లో అట్టర్‌ప్లాప్‌ అయింది..రీల్ లైఫ్‌లానే రియల్‌ లైఫ్‌లో కూడా ఏదైనా చేయొచ్చనుకున్నాడు...కాని కథ అడ్డం తిరిగింది..విక్రంగౌడ్‌ కాల్పుల ఎపిసోడ్‌ చివరి అంకం చేరింది...నేడో..రేపో పోలీసులు అరెస్టుల పర్వం మొదలుకానుంది...తనపై తాను హత్యాయత్నానికి సుపారీ ఇచ్చుకున్న విక్రం వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది..
తనపై హత్యాయత్నానికి సుపారీ...
ఒకవైపు ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి...మరోవైపు డబ్బు కోసం చేయరాని ప్రయత్నాలు...ఇంకోవైపు కన్నతండ్రి నుంచి స్పందన కరువు...అప్పులు చేసిన కొద్దీ తండ్రి ముఖేష్‌ గౌడ్‌ ఇస్తూ వెళ్లినా ఆగలేదు..దీంతో డబ్బు ఇవ్వడం ఆపేశాడు...ఇక అప్పులు పెరిగిపోయాయి...ఫైనాన్షియర్ల నుంచి భారీ స్థాయిలో ఒత్తిడి పెరిగింది..దీంతో ఒక్క బుల్లెట్‌తో అన్నింటికీ చెక్‌పెట్టాలనుకున్నాడు విక్రమ్ గౌడ్...ఆ వెంటనే ప్లాన్ చేసుకుని అనంతపురం జిల్లాకు చెందినవారితో తనపై హత్యాయత్నం చేసేలా సుపారీ ఇచ్చాడు..వారిలో కాంటాక్ట్‌ కుదుర్చుకుని ప్లాన్ చేసుకున్నాడు...అనుకున్నట్లుగానే గత శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో రక్తం చిందించాడు...
తెలిసిపోయిన విక్రంగౌడ్ ప్లాన్ 
భర్త అప్పులు...కష్టాలు...రాబడి ..ఇవన్నీ తెలిసిన భార్య షిఫాలి..అతను చేసిన ప్లాన్‌లో కూడా భాగస్వామ్యం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు...దీంతోనే కాల్పులు జరిగిన సమయంలో ఆ వెంటనే అక్కడి రక్తపు మరకలు లేకుండా చేసేందుకు ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు..పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు దంపతులిద్దరూ చేసిన ప్లాన్‌తో ఇప్పుడు వారినే వెక్కిరించినట్లయింది.. పోలీసులు దంపతులపై కేసులకు కూడా రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది...
పోలీసుల అదుపులో ముగ్గురు..
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై కాల్పులు జరిపిన కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఇప్పటికే అనంతపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది....విక్రమ్‌గౌడ్ డబ్బుల కోసమే కాల్పుల డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది...
కాల్పులు జరిపిన గన్‌ ఎక్కడ...
ఇదిలా ఉంటే ఇప్పుడు పోలీసులకు కావాల్సింది కాల్పులు జరిపిన గన్...ఇప్పుడది ఎక్కడ..? ఇదే విషయాన్ని తెలుసుకునేందకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి..అనంతలో పట్టుకున్న ముగ్గురు నిందితులను విచారిస్తే తుపాకీని షేక్‌పేట చెరువులో పడేసినట్లు వారు చెప్పారు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు షేక్‌పేట చెరువు వద్ద తనిఖీలు చేశారు..
అంతా పక్కా ప్లాన్ ప్రకారమే...
అంతా అనుకున్నట్లుగానే జరిగిపోయింది...కాని చివర్లో మాత్రం పోలీస్ బ్రెయిన్‌నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు.. శుక్రవారం తెల్లవారుజామున రెండున్నరకు ఇంటికి చేరిన విక్రం వస్తూనే గేట్‌ మూయొద్దంటూ వాచ్‌మెన్‌కు చెప్పడం...ఆ తర్వాత భార్యను రెడీ కావాలని చెప్పడం...ఇక తాను హాల్‌లో కూర్చుని ఉండగా కాల్పులు జరగడం..ఇదంతా మాస్టర్ మైండ్‌తో చేసిందే..కాని పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే అసలు విషయాలన్నీ బయటపడ్డాయి...కాల్పుల తర్వాత విక్రం, షిఫాలిలను వేర్వేరుగా మాట్లాడిన పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి...ఆ తర్వాత ఆ ఇంట్లోనే ఏం జరిగిందనేదానిపై ఆరా తీస్తూ..విక్రం ఫోన్‌ కాల్స్‌ లిస్టు ఆధారంగా నిజాలు తెలుసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు... 

 

శిల్పా చక్రపాణిరెడ్డితో మరోసారి శిల్పా మోహన్ రెడ్డి భేటీ

కర్నూలు : ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో మరోసారి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరిక అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

21:02 - August 1, 2017

టీకాంగ్రెస్ కెళ్లి డిగ్గీరాజా ఔట్...కుట్రను పసిగట్టేసిన ఢిల్లీ హ్యాండ్, నారా లోకేష్, కేటీఆర్ లు కొత్త బిచ్చగాళ్లు...ఎర్రజెండ నారాయణ కొరికిండు పండ్లు, జనం నెత్తిమీద గ్యాస్ బండేసిన మోడీ....అచ్చేదిన్ ల భాగంగా చూపెడుతుండు వాడి, కత్తిచేతులవట్న కార్పొరేటర్ కొడుకు... టోల్ గేటొళ్ల తోలుదీసి పరుగో పరుగు, శాస్త్రవేత్తలను సతాయిస్తున్న రోబో....సినిమా గాదు సుమా రియల్గనే, జగిత్యాల దిక్కు కప్పకు, చాపకు కళ్యాణం..భోజనాల టైమ్ కన్నా పొయిరావాలే మనం.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:50 - August 1, 2017

హైదరాబాద్ : సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన భార్గవ 21 ఏళ్లకే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే భార్గవ 2015లో పద్మభూషన్‌ అవార్డును వెనక్కి ఇచ్చేశారు.

 

20:46 - August 1, 2017

'గ్యాస్‌ బండ ఇక మరింత భారం కానుంది. సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ సిలిండర్ల ధర ఇక నుంచి ప్రతి నెలా పెరగనుంది. నెలకు రూ.4 చొప్పున పెంచాలంటూ కేంద్రం ..ఆయిల్‌ కంపెనీలను.. ఆదేశించింది. ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది'. వంట గ్యాస్‌ సిలిండర్ ధర పెంపు నిర్ణయం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, ఏపీఎస్ వో ప్రతినిధి రేఖ, ఐద్వా రమాదేవి, టీ.బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. వంట గ్యాస్‌ సిలిండర్ ధర పెంపుతో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రజలపై అధిక భారం పడుతుందని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రొఫెసర్ పీఎం భార్గవ కు సంతాపం తెలిపిన జెవివి

హైదరాబాద్: ప్రొఫెసర్ పీఎం భార్గవ(89) కు జెవివి సంతాపం తెలిపింది. జెవివి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదినారాయణ, శ్రీనాథ్, నగర కార్యదర్శి శ్రీనివాస్ సంతాపం తెలిపారు. సీపీఎం టీఎస్ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు సంతాపం తెలిపారు.

 

20:25 - August 1, 2017

గ్యాస్‌ బండ ఇక మరింత భారం కానుంది. సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ సిలిండర్ల ధర ఇక నుంచి ప్రతి నెలా పెరగనుంది. నెలకు రూ.4 చొప్పున పెంచాలంటూ కేంద్రం ..ఆయిల్‌ కంపెనీలను.. ఆదేశించింది. ఎల్‌పీజీపై అన్ని సబ్సిడీలను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. 
గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేతకు కేంద్రం నిర్ణయం
గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేతకు ... కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను నెలకు రూ.2 చొప్పున పెంచాలని ఆయిల్‌ కంపెనీలను ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. ఆ ప్రకారం గతేడాది జూలై నుంచి ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రతినెలా 2 రూపాయలు పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు దానిని ప్రభుత్వం 4 రూపాయలకు పెంచింది. 
సబ్సిడీ తొలగించేందుకే 
సిలిండర్‌పై.. సబ్సిడీని పూర్తిగా తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని లోక్‌సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. సబ్సిడీ పూర్తిగా తొలగిపోయే వరకు లేదా మార్చి 2018 వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు గ్యాస్‌ సిలిండర్లపై ప్రతినెలా రూ.4 చొప్పున పెంపు కొనసాగుతుందని ప్రధాన్‌ స్పష్టం చేశారు. అలాగే ఐదు కిలోల సబ్సిడీ సిలిండర్ల  ధర పెంపును ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయిస్తాయన్నారు. 
కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
అయితే కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 18.11 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులపై ఈ భారం పడనుంది. 

20:20 - August 1, 2017

తెలంగాణ రియల్ ఎస్టేట్ రూల్స్ విడుదల చేసిన సర్కార్

హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్ట్ట్ రూల్స్ ను సర్కార్ విడుదల చేసింది. జీవో నెం.202ను పురపాలక శాఖ విడుదల చేసింది. జనవరి 1, 2017 నుంచే కొత్త రూల్స్ ను అమలవుతాయని పేర్కొరింది. త్వరలో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఏర్పాటు చేస్తామని, అథారిటీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, 25 ఏళ్ల పాటు రియాల్టీ రంగంలో అనుభవమున్న వారు సభ్యులు వుంటారని తెలిపింది. అథారిటీ ఛైర్మన్, సభ్యుల ఎంపికకు హైకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అథారిటీలో రియాల్టీ వ్యాపారులు, ఏజెంట్లు, రియల్టర్లకు రిజిస్ట్రేషన్ తప్పని సరి అని చెప్పింది.

20:10 - August 1, 2017

హైదరాబాద్ : కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో టాలివుడ్‌ తొలివిడత విచారణ పూర్తయింది...మలివిడత నోటీసులు అందుతాయా..? ఎవరికి ఇస్తారు..? సిట్ అధికారుల లిస్టులో ఇంకా ఎంత మంది ఉన్నారు..? ఎవరి పేర్లు బయటకు రానున్నాయి...? ఇప్పడంతా టాలివుడ్‌లో ఇదే హాట్‌ హాట్‌గా ఉంది... రెండో లిస్టు ఉందన్న సంకేతాలు రావడంతో టాలివుడ్‌లో ఉత్కంఠ రేపుతుంది... నటుడు నందుతో విచారణ పూర్తి చేసిన అధికారులు 12 మంది నుంచి ఎంతో సమాచారం సేకరించారు..
ముగిసిన సిట్‌ విచారణలు..
కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో విచారణ నేటితో ముగిసినా టాలివుడ్‌ను మాత్రం వెంటాడుతున్నట్లు ఉంది...ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు విచారణ చేయగా..వారి నుంచి వచ్చిన సమాచారం...డ్రగ్స్‌ కింగ్‌పిన్‌లు కెల్విన్, జిషాన్‌ల ఫోన్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రెండో దఫా లిస్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది..అయితే సెకండ్ లిస్టు విషయంలో మాత్రం సిట్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికార సమాచారం చెప్పకపోయినప్పటికీ ఆ లిస్టు వస్తే...ఎవరెవరున్నారన్నది టాలివుడ్‌లో ఉత్కంఠ రేపుతుంది....
పూరీతో మొదలయి నందుతో ఎండ్..
గత నెల 2న డ్రగ్స్ కేసులో కెల్విన్‌ను ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ఇతనితో పాటు అబ్దుల్‌ వాహిద్, ఖుద్దూస్‌లను కూడా అరెస్టు చేసి విచారించడంతో టాలివుడ్‌లో లింకులు బయటపడ్డాయి...కెల్విన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాక అధికారులు రెండురోజులపాటు కస్టడీకి తీసుకోగా...కెల్విన్‌ టాలివుడ్‌ లింకులపై మరింత క్లారిటీ ఇవ్వడంతో వెంటనే నోటీసులు జారీ చేశారు... ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్‌తో మొదలయిన సిట్ విచారణకు శ్యాం.కె నాయుడు, నటులు తరుణ్, నవదీప్, సుబ్బరాజు, రవితేజ, తనీష్‌, ఆర్ట్‌డైరెక్టర్‌ చిన్నా నటీమణులు చార్మీ,ముమైత్‌ఖాన్‌ లతో పాటు చివరగా నందుతో ముగిసింది...మధ్యలో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును కూడా విచారించారు.. వీరందరినీ విచారించిన సిట్ అధికారులు టాలివుడ్‌లో డ్రగ్స్ ప్రభావంపై ఎంతో సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది..ఇప్పటికే సిట్ అధికారుల వద్ద టాలివుడ్‌లోని మరికొందరి పేర్లు ఉండగా విచారణలో తేలిన వాటితో పోల్చుకుని రెండో లిస్టు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది...
టాలివుడ్‌లో డ్రగ్స్, పబ్‌ కల్చర్‌పైనే ఆరా..
డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా వర్థమాన హీరో నందు  అలియాస్‌ ఆనంద కృష్ణను సిట్‌ అధికారులు ప్రశ్నించారు... నందు సిట్ అధికారుల ముందుకు వచ్చే ముందు అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి నేరుగా  నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్నారు...కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్‌ వ్యవహారంపై ప్రశ్నించనున్నామని సిట్‌ అధికారులు ఇప్పటికే వెల్లడించారు...ఈ విషయాలతో పాటు టాలివుడ్‌లో డ్రగ్స్, పబ్‌ కల్చర్‌పై పూర్తి వివరాలు ఆరా తీశారు...నందు విచారణతో తొలి విడత విచారణ పూర‍్తయింది.

 

'నేరెళ్ల ఘటన'లో 8 మందికి బెయిల్

కరీంనగర్ : నేరెళ్ల ఘటనలో అరెస్టయిన 8 మందికి షరతులతో కూడి బెయిల్ మంజూరు అయ్యింది. 2 వారాలకు ఒక సారి పీఎస్ లో హాజరు కావాలని, నెల రోజుల పాటు సిరిసిల్ల జిల్లా దాటి వెళ్లొద్దని కోర్టు షరతు పెట్టింది.

 

19:49 - August 1, 2017

ప్రొఫెసర్ పీఎం భార్గవ(89) కన్నుమూత....

హైదరాబాద్: సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పీఎం భార్గవ(89) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీఎం భార్గవ ఈ రోజు మృతి చెందారు. ఉప్పల్ ప్రశాంత్ నగర్ లోని నివాసంలో భార్గవ భౌతికాయం వుంది. పీఎం భార్గవకు ఓ కుమారుడు, కుమార్తె వున్నారు. 1928 ఫ్రిబవరి 22న అజ్మీర్ లో సీఎం భార్గవ జన్మించారు. 21 ఏళ్లకే సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రఈలో భార్గవ్ కు పీహెచ్ డీ పట్టా పొందారు. నేషనల్ నాలెడ్జ్ వైస్ ఛైర్మన్ పీఎం భార్గవ పనిచేశారు.

19:15 - August 1, 2017

ఢిల్లీ : టర్కీలో జరిగిన డెఫ్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ సహా 5 పతకాలు సాధించిన భారత డెఫ్‌ అథ్లెట్లకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్న 46 మంది అథ్లెట్లు..క్రీడా మంత్రి తమకు స్వాగతం పలకకపోవడంపై నిరసన తెలిపారు. తాము గెలుచుకున్న మెడల్స్‌ను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. క్రీడామంత్రి విజయ్‌ గోయల్‌తో పాటు శాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదని ఆరోపించారు. నిరసన తెలిపిన తెలుగు అమ్మాయి జఫ్రీన్‌ ఆమె తండ్రితో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

పిడుగుపడి ముగ్గురి మృతి

ప్రకాశం : దొనకొండ మండలం ఎర్రబాలెంలో విషాదంనెలకొంది. పిడుగుపాటకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు దంపతులు గురవయ్య(38), లక్ష్మి(30), కూలీ వెంకటేశ్వర్లు (70) వున్నారు.

సురేష్ ప్రభును కలిసిన టీఆర్ ఎస్ నేతలు

ఢిల్లీ: రైల్వే మంత్రి సురేష్ ప్రభును టీఆర్ ఎస్ ఎంపీలు, మంత్రి పద్మారావు కలిశారు. సికింద్రాబాద్ లో రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం కేటాయించాలని కోరినట్లు ఎంపి కవిత తెలిపారు. భూమి బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరామన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం పథకం కోసం రైల్వే భూమి ఇవ్వాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కోరినట్లు చెప్పారు. త్వరలోనే రైల్వే భూమి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

 

19:02 - August 1, 2017

విజయవాడ : పాత రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ పేపర్లను అధిక ధరలకి విక్రయిస్తున్న విజయవాడలోని ప్రైవేట్‌ షాపులపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాంధీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సమీపంలో అనధికారికంగా ఉన్న పాత తేదీలు కలిగిన స్టాంప్‌ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. చీటింగ్‌ కి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ అధికారి తెలిపారు.

 

18:57 - August 1, 2017

ప్రకాశం : లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డాడు ఒంగోలు చెందిన అగ్నిమాపక అధికారి. వ్యాపార నిమిత్తం ఫైర్‌ అనుమతులు కావాలంటూ ఓ వ్యక్తి అగ్ని మాపక కార్యాలయంలో సుబ్బారావు అనే అధికారికి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు ఇవ్వకుండా 50వేల రూపాయలను డిమాండ్‌ చేయడంతో బాదితుడు 35వేలకు ఒప్పుకొని... ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ సుబ్బారావు... లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 

18:56 - August 1, 2017

నెల్లూరు : ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని  చెలికంపాడు ఎస్‌.ఎస్‌ కాలువ వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు..

 

మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

అమరావతి: మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ తాజా రాజకీయ పరిణామలు, పార్టీ సంస్థాగత నిర్ణయాలపై చర్చిస్తున్నట్లుసమాచారం.

రౌడీ షీటర్లు నేరాలకు పాల్పడితే సహించం: డీసీపీ

విజయవాడ: వరుస నేరాలతో అప్రమత్తమైన రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ నేరాలకు పాల్పడితే సహించేది లేదని డీసీపీ కాంతి రాణా హెచ్చరించారు. పాత రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచామన్నారు. నేరాలను అదుపు చేసేందుకు నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పై నిఘా పెట్టామన్నారు. దుర్గ గుడి ఉద్యోగుల స్కాంలో మా పై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

18:53 - August 1, 2017

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించారు. సీఎం చంద్రబాబుతో భేటీ సందర్భంగా జరిగిన చర్చపై ఆయన లేఖలో ప్రశ్నలు సంధించారు. కాపు రిజర్వేషన్లకు కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని  బాబు అన్నట్టు వచ్చిన వార్తలపై... ముద్రగడ తన లేఖలో ఫైర్‌ అయ్యారు.   1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇచ్చిన జీవో 30ని హైకోర్టు కొట్టివేసిందని.. అందుకే తాము రిజర్వేషన్లపై ముందుకు వెళ్లలేక పోతున్నట్టు సీఎం పవన్‌తో ప్రస్తావించినట్టు వచ్చిన వార్తలను తన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. అదే నిజమైతే ఎన్నికల ముందు  కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితర నేతలు ఎందుకు హామీలు గుప్పించారని ముద్రగడ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మరిచిన చంద్రబాబును నమ్మవద్దని .. ఆయన వలలో పడొద్దని వవన్‌కు సూచించారు. 

 

పాక్ ప్రధానిగా అబ్బాసీ

హైదరాబాద్:పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(నవాజ్‌) నేత షహీద్‌ ఖాకన్‌ అబ్బాసీ ఎన్నికయ్యారు. దిగువసభ నేషనల్‌ అసెంబ్లీలో ఆయనకు మద్దతుగా 221 ఓట్లు లభించినట్లు పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని పదవి కోసం ఆరుగురు పోటీ పడగా.. చివరికి అబ్బాసీనే విజయం సాధించారు.

18:04 - August 1, 2017

భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. మున్సిపల్‌ కమిషనర్‌, చైర్‌పర్సన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే... అసలు విభేదాలకు కారణమేంటో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. అందరిని సమన్వయం చేసుకోవడంలో కమీషనర్‌ విఫలమయ్యాడని అన్ని పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. 
విభేదాలతో కుంటుపడుతోన్న పట్టణాభివృద్ధి 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పురపాలక సంఘంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పులి గీత, కమిషనర్‌ షఫీ ఉల్లా మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. వీరిద్దరి మధ్య విభేదాలతో పట్టణాభివృద్ధి కుంటుపడుతోంది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గీత కార్యాలయానికి రావడమే మానేశారు. ఏ కార్యక్రమాలు ఉన్నా... అలా వచ్చి వాటిలో పాల్గొని మళ్లీ పోతున్నారు. కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేందుకు కూడా ఆమె సుముఖత వ్యక్తం చేయడంలేదంటే వారిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయో అర్ధం చేసుకోవచ్చు. వీరిద్దరి విభేదాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలు పార్టీల నేతలు, ప్రజాసంఘాల నేతలంటున్నారు. 
విభేదాలకు కారణమేంటి..?
అయితే... వీరిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటి అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. లక్షలాది రూపాయల పనులు జరుగుతున్న నేపథ్యంలో కాంట్రాక్టులలో కమీషన్‌ కుదరకపోవడమే కారణమా ? అని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు కమిషనర్‌ వైఖరిపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కౌన్సిలర్లను పట్టించుకోకపోవడం, పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో అన్ని వర్గాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రథమ శ్రేణి పురపాలక సంఘానికి గ్రూప్‌-1 అధికారిని నియమించాల్సి ఉన్నప్పటికీ... ప్రజాప్రతినిధులు, తోటి సిబ్బందితో సమన్వయం లేని ఇలాంటి వ్యక్తిని కమిషనర్‌గా నియమించడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ మధ్య సమన్వయం లేకపోవడంతో పట్టణాభివృద్ధి కుంటుపడిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్తగూడెం పురపాలక సంఘానికి గ్రూప్‌-1 అధికారిని నియమించాలని పలువురు కోరుతున్నారు. 

 

ఏసీబీ వలలో కోవూరు పంచాయతీ కార్యదర్శి

నెల్లూరు : రూ. 30వేలు లంచం తీసుకుంటూ కోవూరు పంచాయతీ కార్యదర్శి మురళీ మోహన్ ఏసీబీ చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

సమ్మె విరమించిన ఉస్మానియా వైద్యులు..

హైదరాబాద్: ఉస్మానియా వైద్యులు సమ్మెను విరమించారు. జూనియర్ డాక్టర్లతో డీఎంఈ చర్చలు సఫలం అయ్యాయి. వైద్యుల డిమాండ్లను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో సమ్మెను విరిమించారు. తమ పై దాడులు జరగకుండా, సెక్యూరిటీ పెంచాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. 24 గంటల్లోపు సెక్యూరిటీ కల్పించకపోతే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు.

10న ఎస్సారెస్పీ పునర్జీవన పథకం ప్రారంభం : మంత్రి హరీష్

హైదరాబాద్: సాగునీటి రంగంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని, తెలంగాణ సాగునీటి రంగంలో మరో పథకం ఈ నెల 10న సీఎం చేతుల మీదుగా ఎస్సారెస్పీ పునర్జీవన పథకం ప్రారంభం అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్సారెస్పీ ఆదునీకరనఖు రూ. 1000 కోట్లు నిధులను సీఎం కేసీఆర్ కేటాయించారని తెలిపారు. రైతు సంక్షేమం గురించి సీఎం ఆలోచిస్తున్నారని, విద్యుత్, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా పోయిందన్నారు. 54 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను రికార్డ్ స్ఠాయిలో కొనుగోలు చేశామన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల కింద 45 లక్షల అదనపు సాగు అవుతోందన్నారు.

17:57 - August 1, 2017

నిజామాబాద్ : దట్టమైన మేఘాలు కమ్ముకుంటున్నాయి. భారీ వర్షం కురుస్తుందనే ఆశలు పుడుతున్నాయి.. కానీ అంతలోనే ఆ ఆశలు ఆవిరవుతున్నాయి. మేఘాలు వర్షించడం లేదు. నిజామాబాద్‌ ఇప్పటివరకు చిన్న చిన్న వర్షాలే తప్ప భారీ వర్షాలు కరువయ్యాయి. జలాశయాలలో నీటి మట్టాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లా కరువు కోరల్లో చిక్కుకోక తప్పదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సాధారణం కంటే తక్కువ వర్షాలు 
వరుణుడు మొహం చాటేశాడు. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. గతేడాది ఈ సమయానికి మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఈ సారి సీజన్‌ ప్రారంభం నుంచే మొహం చాటేశాయి. గత 15 రోజుల నుంచి దట్టమైన మేఘాలు జిల్లాను కమ్మేస్తున్నా.. చినుకు నేల రాలడం లేదు. 
16 సెంటిమీటర్ల వర్షం 
జూన్ నుంచి జూలై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా.. 20 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 16 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అదే గతేడాది ఈ సమయానికి 20 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అంటే ఈ ఏడాది దాదాపు 4 సెంటిమీటర్లు తక్కువగా ఉంది. వాస్తవానికి జూన్‌లో 20 సెంటిమీటర్లు, జూలైలో 30 సెంటిమీటర్లు, సెప్టెంబర్‌లో 15 నుంచి 20 సెంటిమీటర్ల వర్షాపాతం ఉండాలి. జిల్లాలో సగటున 90 నుంచి 100 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదు కావాలి. ఇంత మొత్తంలో వర్షాలు కురిసినా జిల్లాలో కరువు బాధ తప్పదు.  
4,88,750 ఎకరాలు సాగవుతుందని అంచనా 
నిజామాబాద్‌ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 4,88,750 ఎకరాలు సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరి 2.45 లక్షల ఎకరాలు.. సోయా 1.50 లక్షల ఎకరాలు.. వీటితో పాటు మొక్కొజొన్న 42 వేల ఎకరాలు, పసుపు 32 వేల ఎకరాలు, కంది 5 వేల ఎకరాలు, చెరకు 1500 ఎకరాలు, మినుములు 3 ఎకరాలు.. వీటితో పాటు ఇతర పంటలు మరో 2 వేల ఎకరాలలో సాగవుతాయని అంచనా వేశారు. వర్షాలు ఎక్కువగా లేకపోవటంతో రైతులు కొంత ముందు వెనకా అవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది తక్కువగానే వర్షాలు కురిశాయి. 
సగటు 90 సెంటిమీటర్లు 
జిల్లాలో సగటున వర్షాపాతం నాలుగు నెలలకు కలిపి 90 సెంటిమీటర్లు కాగా.. గతేడాది అంతకంటే ఎక్కువగా 111 సెంటిమీటర్లు వర్షాపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా మారటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

నంద్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్ ఖాదర్ : రఘువీరా

అమరావతి: నంద్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్ ఖాదర్ పేరును పీసీసీ చీఫ్ రఘువీరా ప్రకటించారు. నంద్యాల ఎన్నిక సైద్ధాంతిక ఎన్నికలు అని, నంద్యాలలో లౌకిక శక్తులు ఏకం కావాలన్నారు. నంద్యాలలో బాబు, జగన్ లకు ప్రజలు బుద్ధి చెబుతారని టిడిపి, వైసీపీ, బిజెపిలు రాజీపడి రాష్ట్రానికి మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2019లో బిజెపితో కలిసి పని చేసేందుకు టిడిపి, వైసీపీలు పోటీ పడుతున్నాయన్నారు.

'ఇసుక మాఫియా ఆస్తులు జప్తు చేసి బాధితులకు ఇవ్వాలి'

కరీంనగర్ : జిల్లా జైలులో నేరెళ్ల బాధితులను విరసం నేత వరవరరావు పరామర్శించారు. బాధితుల రహస్య భాగాలకు విద్యుత్ షాక్ పెట్టి పోలీసులు చిత్రహింసలు పెట్టారు అని పేర్కొన్నారు. చంద్రబాబు, వైఎస్ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను నేరెళ్ల ఘటనలో చూశాం అన్నారు. మంత్రి తలసాని వచ్చి బాధితులను చూస్తే అర్థమవతుందన్నారు. ఇసుక మాఫియా ఆస్తులు జప్తు చేసి బాధితులకు ఇవ్వాలన్నారు. బాధితులకు అండగా న్యాయ పోరాటం చేస్తామన్నారు.

17:39 - August 1, 2017

హైదరాబాద్ : మలేషియా టౌన్‌షిప్‌ లో హెచ్‌ఐజీ, ఎంఐజీ వాసులు ఎల్‌ఐజీ ఫ్లాట్ల యజమానులను వేరు చేశారు. ఎల్‌ఐజీ పాట్లు, హెఐజీ, ఎంఐజీ పాట్లకు మధ్య అడ్డుగోడ నిర్మించారు. టౌన్‌షిప్‌ మొత్తానికి ఉన్న ఉమ్మడి సౌకర్యాలకు ఎల్‌ఐజీ వాసుల దూరం అయ్యారు. ఉమ్మడి సౌకర్యాలు అందరికీ వర్తిస్తాయని జిల్లా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పును హెచ్‌ఐజీ నివాసితుల సంఘం పట్టించుకోలేదు. ఒకే లేఅవుట్‌లోని ఒకే టౌన్‌షిప్‌లో ఉంటున్న తమకు ఇన్ని ఆంక్షలు, అవరోధాలు ఏంటని ఎల్ ఐజీ ఫ్లాట్ల నివాసితులు ప్రశ్నిస్తున్నారు. లేఅవుట్‌ ప్లాన్‌కు విరుద్ధంగా అడ్డుగోడలు నిర్మించడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

17:25 - August 1, 2017

హైదరాబాద్ : కాలనీ ఒక్కటే. లే అవుట్‌ కూడా ఒక్కటే. కానీ ఆదాయ వ్యత్యాసాలు వారి మధ్య తరగని అంతరాన్ని పెంచాయి. తరగని వివక్షకు తెరలేపాయి. ఎల్‌ఐజీ ప్లాట్ల వాళ్లు తమ ప్లాట్లవైపు తొంగి చూడకూడదంటూ ఎంఐజీ, హెచ్‌ఐజీ ప్లాట్ల ఓనర్లు ఆంక్షలు పెట్టారు. ఉమ్మడి ఆస్తులైన పార్కులు, క్లబ్బులను వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. మనసుల్లోనే కాదు.. ఏకంగా కాలనీలోనే ఓ పెద్ద అడ్డుగోడను కట్టేశారు. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ మలేసియా టౌన్‌షిప్‌లో కొనసాగుతోన్న వివక్షపై 10టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్‌. 
ఆదాయ వ్యత్యాసాలతో అంతరాలు  
ఇది అప్పుడెప్పుడో శేఖర్‌ కమ్ముల తీసిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలోని దృశ్యం. ఇప్పుడు అచ్చంగా ఇట్లాంటి వ్యవహారమే హైదరాబాద్‌లోని ఓ టౌన్‌షిప్‌లోనూ చోటుచేసుకుంది. ఇది హైదరాబాద్‌ హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలోని మలేషియా టౌన్‌షిప్‌. ఆధునిక హంగులతో నిర్మించిన నయా నగరం. ఆదాయ వ్యత్యాసాలతో కాలనీ వాసుల మధ్య కొందరు పెద్దలు అంతరాలు సృష్టించారు, అడ్డుగోడలు నిర్మించారు.  
కాలనీ సంక్షేమ సంఘం ముసుగులో నిబంధనలకు నీళ్లు 
అన్ని ఆదాయవర్గాల వారికోసం నిర్మించిన మలేషియా టౌన్‌షిప్‌ను కొందరు తమ ఆధిపత్యానికి అడ్డగామార్చుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘం ముసుగులో కొందరు పెద్దలు నిబంధనలకు నీళ్లొదిలి కాలనీ మొత్తాన్ని తమ సొంత ఎస్టేట్‌గా మార్చుకుని దర్జా ఒలకబోస్తున్నారు. అంతటితో ఆగకుండా, ఆదాయంలో తమతో సరితూగరన్నభావనతో అధికాదాయ వర్గాల వారు అల్పదాయ వర్గాల వారిపై వివక్షను కనబరుస్తున్నారు. ఎల్ ఐజీ ఫ్లాట్ల వాసులను, కాలనీ ఉమ్మడి సౌకర్యాలైన పార్కులు, క్లబ్బులు, కమ్యూటీ సెంటర్‌ను ఉపయోగించుకోనీకుండా అడ్డుగోడలను నిర్మించారు. రోడ్లపై నడవనీయకుండా కాలనీ రహదారులను మూసివేశారు. పార్కులను ఉపయోగించుకోనివ్వడంలేదు.
అల్పదాయ వర్గాలపై అధికాదాయ వర్గాల వివక్ష
మలేసియా టౌన్‌షిప్‌ను 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఎల్ ఐజీ ఫ్లాట్లు 506 ఉన్నాయి. హెచ్ ఐజీ, ఎమ్ ఐజీ  గ్రూపులకు 1776 ఫ్లాట్లు నిర్మించారు. మలేషియా టౌన్‌సిష్‌లో ఉన్న క్లబ్‌లు, ఆటస్థలాలు, పార్కులు కాలనీలోని అందరూ ఉపయోగించుకునే విధంగా నిర్మించారు. అయితే హెచ్ ఐజీ, ఎమ్ ఐజీ నివాసితుల సంక్షేమ సంఘం  నాయకులు కబ్లులను అద్దెకించుకుంటూ అడ్డంగా ఆర్జిస్తూ, ఎల్ ఐజీ వాసులను రానివ్వడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 
ఉమ్మడి ఆస్తులపై వచ్చే అద్దెతో జల్సాలు?
మలేషియా టౌన్‌షిప్‌లోని ఎమ్ ఐజీ, హెచ్ ఐజీ సంక్షేమ సంఘం నాయకులు  ఉమ్మడి ఆస్తులను తమ సొంత జాగీరుగా మార్చుకుని మాఫియాలా వ్యవహరిస్తూ, ఎవరినీ రానివ్వడంలేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు మలేషియా టౌన్‌షిప్‌ హెచ్ ఐజీ, ఎమ్ ఐజీ నివాసితుల సంక్షేమ సంఘంతో కుమ్మక్కై ఎల్ ఐజీ కాలనీ వాసులను ఇబ్బంది పెడుతున్నారని ప్రజా సంఘాల ఆరోపిస్తున్నాయి. 
స్వప్రయోజనాలకు ఉమ్మడి ఆస్తులు 
మలేషియా కాలనీ పెద్దలు తమ హక్కులను కాలరాస్తున్నారంటూ ఎల్ ఐజీ ఫ్లాట్ల వాసులు నెత్తినోరు మొత్తుకుంటున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు కళ్లులేని కబోది పక్షల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చట్టాలను ఉల్లంఘిస్తూ ఉమ్మడి ఆస్తులను తమ స్వప్రయోజనాలకు వాడుకుంటున్న హెచ్ ఐజీ, ఎమ్ ఐజీ నివాసితుల సంక్షేమ సంఘం నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

'సిరిసిల్ల నుండి పోటీ చేసిన కేటీఆర్ గెలిస్తే ముక్కు నేలకు రాస్తా'

హైదరాబాద్: దమ్ముంటే కేటీఆర్ రాజీనామా చేయాలని దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల నుండి పోటీ చేసిన కేటీఆర్ గెలిస్తే ముక్కు నేలకు రాస్తా అని సవాల్ విసిరారు. ప్రభుత్వం పోలీసులతో హింసిస్తోందని, చిల్లర రాజకీయాలకు చిరునామా తలసాని అని ఎద్దేవా చేశారు. చదువురాని సన్నాసులు టీఆర్ ఎస్ నేతలు అని అన్నారు. దొంగ ఇసుక అమ్ముకునే వారు కాంగ్రెస్ పై విమర్శలా అని మండి పడ్డారు.

'జామా మసీదు పేలుడు కేసులో అభియోగాలు నమోదు చేయండి'

ఢిల్లీ: జామా మసీదు పేలుడు కేసులో అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. యాసిన్ భత్కల్ సహా 11 మంది పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆధారాలు లేనందున ముగ్గురు సహ నిందితులను విడుదల చేశారు.

పవన్ కల్యాన్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ

తూ.గో: పవన్ కల్యాన్ కు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ సారాశం ఈ విధంగా ఉంది. ' హామీలు ఇచ్చి మాట తప్పి, చంద్రబాబు మాటలు నమ్మి మీ పరపతి తగ్గించుకోవద్దు. జీవో నెం 30 పై చంద్రబాబు పెంపుడు పత్రికలో వచ్చిన వార్తలు మీ అవగాహన లోపానికి అద్ధం పడుతున్నాయి. 7 నెలల్లో మంజునాథ కమిషన్ రిపోర్టు తెచ్చి ప్రజా సాధికారత సర్వేతో కాపు రిజర్వేషన్ సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు ఇచ్చిన మాటను మరిచి పోవద్దు. చంద్రబాబు అబద్ధాలు నమ్మడానికి మా జాతి సిద్ధంగా లేదు. మీరు వాటినే నమ్మడం విడ్డూరంగా ఉంది'. అని పద్మనాభం పేర్కొన్నారు.

16:56 - August 1, 2017

రంగారెడ్డి : కడ్తాల్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై మనీష్‌ గౌడ్‌ అనుచరుల దాడికేసులో నిందితులకు కల్వకుర్తి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మనీష్‌గౌడ్‌తో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బీఎన్‌ రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌ లక్ష్మీ ప్రసన్న తనయుడు మనీష్‌ గౌడ్ రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం మైసిగండి దగ్గర టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడికి దిగాడు. టోల్‌ ఫీజు అడిగినందుకు మనీష్‌ గౌడ్ కత్తితో దాడి చేశాడు. టోల్‌గేట్‌ సిబ్బందిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:49 - August 1, 2017

యాదాద్రి : ప్రభుత్వ ఆస్పత్రులు కొందరు వైద్యులకు కల్పవృక్షాలుగా మారుతున్నాయి. ఆస్పత్రికి వచ్చిన రోగులను సొంత క్లినిక్‌లకు తరలిస్తూ ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను..స్కానింగ్‌,ఆపరేషన్‌ ఏవైనా సరే తన సొంత క్లినిక్‌లో చేయించుకోవాలని డాక్టర్‌ సుభాషిణి, ఎనస్తిషియా డాక్టర్‌ శ్రీధర్‌తో కలిసి ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆస్పత్రిలో ఈ వ్యవహరాన్ని ఖండించినందుకు గైనకాలజిస్ట్‌ ప్రియాంకపై దాడికి తెగబడ్డారంటే వారి ఆగడాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోంది. తనపై దాడి చేసిన డాక్టర్‌ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని  బాధిత డాక్టర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:47 - August 1, 2017

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 31 నుంచి తన పదవి నుంచి వైదొలగనున్నారు. అమెరికాలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించడానికే పనగారియా రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే పనగారియా రాజీనామాకు గల కారణాలు తెలియలేదు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో కేంద్రప్రభుత్వం నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

16:40 - August 1, 2017

'అభయ ఫౌండేషన్'....అభాగ్యుల నేస్తంగా ఉంది. అభాగ్యులను అక్కున చేర్చుకుంటుంది. 'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు బాలచందర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సేవలను వివరించారు. అలాగే ఫౌండేషన్ స్థాపన, పని విధానం, సేవాదృక్పథం పలు అంశాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఆయేషా మీరా హత్య కేసు పై నివేదిక ఇవ్వండి: హైకోర్టు

హైదరాబాద్: ఆయేషా మీరా హత్య కేసును పునర్విచారించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దర్యాప్తు అధికారులపై అపెక్స్ కమిటి విచారణ జరిగిందా లేదా వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కర్నూలులో వాము రైతుల ఆందోళన

కర్నూలు: వ్యవసాయ మార్కెట్ లో వాము రైతులు ఆందోళన చేపట్టారు. తూకం సరిగా వేయడం లేదని ఏజెంట్ తో రైతులు వాగ్వాదానికి దిగారు. వాము రైతులే సరుకును తక్కువగా చూపుతూ మోసాలకు పాల్పడతున్నారని కమీషన్ ఏజెంట్లు అంటున్నారు.

16:28 - August 1, 2017

కరీంనగర్ : స్పెషల్‌ డీఎస్సీ వేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ కలెక్టరేట్‌ ముందు ముస్లిం మైనార్టీ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. అసెంబ్లీలో కేసీఆర్‌ స్పెషల్‌ డీఎస్సీ వేస్తామని చెప్పి.. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మైనార్టీ అభ్యర్థులు డిమాండ్‌ చేశారు.

 

చైనా సార్వభౌమత్వం, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు: జిన్ పింగ్

హైదరాబాద్: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 90వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ.. చైనా సార్వభౌమత్వం, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. చైనా భూ భాగంలోని ఏ ప్రాంతాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం అని జిన్ పింగ్ హెచ్చరించారు.

16:24 - August 1, 2017

తమిళనాడు రాష్ట్రంలోని సినిమాలకు మరో సమస్య వచ్చి పడింది. ఇటీవలే కేంద్రం విధించిన జీఎస్టీ అమలుతో థియేటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని సుమారు వేయి థియేటర్లు కొన్ని రోజులుగా మూతపడ్డాయి. దీనితో కోట్ల రూపాయల మేర అక్కడి సినీ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

తాజాగా సినిమా షూటింగ్ లకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తమ వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా ఆందోళన చేపట్టింది. దీనితో 20 సినిమాల షూటింగ్ లకు నిలిచిపోయాయి. ఇందులో అగ్ర హీరోల సినిమా కూడా ఉన్నాయని తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' సినిమా కూడా ఉందని తెలుస్తోంది. దాదాపు 25వేల సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. 

ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నేతలకు టీఎఫ్‌పీసీ మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు ముదిరిపోయాయి. ఈ నేపథ్యంలో కార్మికుల సంఘంలోని లేని వారితో షూటింగ్ లు చేసుకోవచ్చని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఇచ్చిన ఉచిత సలహాపై విమర్శలు చెలరేగుతున్నాయి. గతంలో కుదుర్చుకున్న వేతన ఒప్పందం జులై 31న ముగిసింది. మరో వేతన ఒప్పందం తీసుకరావాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. సినీ రంగ పనివారి డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని..ప్రత్యామ్నాయ మార్గాల్లో షూటింగ్‌లు కొనసాగించుకోవాలని టీఎఫ్‌పీసీ ప్రెసిడెంట్‌ విశాల్‌ సూచించారు. మరి ఆందోళనలు చేస్తున్న వారి సమస్య తీరుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

16:18 - August 1, 2017

కృష్ణా : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సిబ్బంది కాసుల కక్కుర్తి ఓ బాలింతరాలిని తీవ్రగాయాల పాలుచేసింది. జూలై 11న తాడిగడపకు చెందిన ప్రియాంక ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో కుట్లుసరిగా పడకపోవడంతో...అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  బాలింత ప్రియాంకకు ఎనీమా చేసే సమయంలో..అడిగినంత డబ్బుఇవ్వలేదన్న కోపంతో షరీఫా అనే ఆయా యాసిడ్‌ లాంటి ద్రావకం ఇవ్వడం వల్లే కాళ్ళ మీద బొబ్బలు వచ్చాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:14 - August 1, 2017

హైదరాబాద్ : బీఎన్‌రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న కుమారుడు మనీష్‌గౌడ్ దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కడ్తాల్ టోల్‌గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి మనీష్‌గౌడ్ దాడి చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కడ్తాల్ ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రియవ్ దేశాయ్ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రిట్వీట్ చేశారు. కేసులు నమోదు చేశామని తెలిపారు కేటీఆర్. ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడిన చర్యలు ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆరుగురు నిందితులపై సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. కత్తితో దాడి చేసిన అరుణ్ ఏ1గా, మనీష్‌గౌడ్‌ను ఏ4గా పోలీసులు పేర్కొన్నారు. 

 

 

16:08 - August 1, 2017

తూర్పుగోదావరి : పోలవరం నిర్వాసితులు ఆందోళన బాటపట్టారు.  2013 భూ సేకరణ చట్ట ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి జంక్షన్‌లో ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్‌ జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణ జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారంపై గ్రామసభల అభిప్రాయం తీసుకోవడం లేదని నిర్వాసితులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి పునరావాసంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. మరిన్ని వివారలను వీడియోలో చూద్దాం..

 

డిగ్గీరాజా మార్పు మా పార్టీ అంతర్గత వ్యవహారం:పొంగులేటి

హైదరాబాద్: టి.కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా వున్న దిగ్విజయ్ సింగ్ ను మార్చడం మా పార్టీ అంతర్గత వ్యవహారం అని కాంగ్రెస్ నేత పొంగులేటి అన్నారు. ఎవరిని ఏ బాధ్యతల్లో పెట్టాలో హై కమాండ్ కి తెలుసునని, అవసరాన్ని బట్టి మార్పులు చేస్తుంటారని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్లను బాధితులు గా చూడాలని, సీఎం అనడం కేసును నీరుగార్చడమే అని పొంగులేటి అన్నారు. డ్రగ్స్ వాడే వాళ్లందర్నీ నిందితులుగా చూడాలని, ట్రెరిస్టుల లానే డ్రగ్స్ మాఫియాను చూడాలని పొంగులేటి సూచించారు.

15:57 - August 1, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. గురుకుల డిగ్రీ లెక్చరర్ల రాతపరీక్షపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. దీంతో రాత పరీక్షకు మార్గం సుగమం అయింది. గురుకులాల్లోని మహిళా కళాశాలల్లో ఉద్యోగాలన్నీ మహిళలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కొంతమంది పురుష అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. దీంతో గత జులై 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత... ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఏకీభవించిన కోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో డిగ్రీ కళాశాలల లెక్కరర్ల రాత పరీక్ష జరగనుంది. 

గ్యాస్ ధర పెంపు పై భగ్గుమన్న విపక్షాలు

ఢిల్లీ: గ్యాస్ ధర పెంపు పై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, బీఎస్పీ, వామపక్ష ఎంపీలు నినాదాలు చేస్తున్నాయి.గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం నేత సీతారాం ఏచూరి డిమాడ్ చేశారు. ప్రతి నెల చిన్న మొత్తంలో గ్యాస్ ధర పెంచాలని 2010లో యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తామని పెంట్రోలియం మంత్రి ప్రధాన్ స్పష్టం చేశారు.

15:55 - August 1, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో నటుడు నందు విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు నందును ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో మొత్తం 12 మంది టాలీవుడ్ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. తొలి విడత విచారణ ఇవాళ్టితో ముగిసింది. కెల్విన్‌తో సంబంధాలపై సిట్‌ బృందం ఆరా తీసింది. డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:52 - August 1, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడింది. ఈ ఘటనలో విక్రమ్‌గౌడే కాల్పుల సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని హైదరాబాద్‌కు తరలించారు. తనపై కాల్పులు జరిపించుకుని... వారిని అనంతపురానికి పంపించాడు. సంఘటనాస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా క్లూస్‌టీమ్‌ ఈ కేసును ఛేదించింది. మొదటినుంచి విక్రమ్‌గౌడ్‌నే అనుమానిస్తున్న పోలీసులు.. 4 రోజుల్లోనే కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. విక్రమ్‌ గౌడ్‌ కాల్పుల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదికను.. ఇవాళ డాక్టర్లు పోలీసులకు అందజేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:46 - August 1, 2017

తల్లిపాలతో బిడ్డకు అనేక లాభాలుంటాయని వక్తలు అన్నారు. ఆగస్టు 1.. తల్లిపాల దినోత్సవం. ఈ సందర్భంగా 'తల్లిపాలు.. ప్రాధాన్యత' అనే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జెవివి ప్రతినిధి డా.రమ, పీడియాట్రిషియన్ డా.రమ పాల్గొని, మాట్లాడారు. మొదటి ఆరు నెలలు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలతో బిడ్డకు అనేక లాభాలు చేకూరుతాయని తెలిపారు. తల్లిపాలతో బిడ్డ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటాడని పేర్కొన్నారు. బిడ్డకు పోత పాలు ఇవ్వకూడదన్నారు. తల్లిపాలతో వచ్చే లాభాలపై తల్లికి అవగాహన కల్పించాలని వివరించారు. తల్లికి పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. పత్తెం ఉండకూడదని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల సందడి

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ చివరల్లో కొనుగోళ్ల సందడి కనిపించింది. 60 పాయింట్లు లాభపడి 32,575 వద్ద సెన్సెక్స్ ముగియగా, 37 పాయింట్లు లాభపడి 10,114 వద్ద నిఫ్టీ ముగిసింది.

నీతి ఆయోగ్ కు పనగారియా రాజీనామా

ఢిల్లీ: నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా రాజీనామా చేశాడు. ఈనెల 31 పనగారియా పదవీ కాలం ముగియనుంది. బోధన వైపు వెళ్లేందుకు రాజీనామా చేసినట్లు పనగారియా తెలిపారు.

15:18 - August 1, 2017

వారు మాత్రం సబ్సిడీలు వదులుకోరు..అన్ని రాయితీలు వారికి కావాలి..ఏ రాయితీలను..ఏ ప్రయోజనాలను మాత్రం వదులుకోరు..కానీ ప్రజలకిచ్చే రాయితీలను వదులుకోవాలని ఉచిత సలహా ఇచ్చేస్తుంటారు..'అచ్ఛే దిన్ ఆనేవాలే హై'..అంటూ కాషాయ నేతలు భారీ ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు దాటిపోయాయి. మరి వారు చెబుతున్న అచ్చే దిన్ వచ్చాయా ? గడిచిన కొద్ది రోజుల నుండి మోడీ ప్రభుత్వం మంచిదినాల స్వరూపం బయటపడుతోంది.

గ్యాస్ సబ్సిడీ..
ఓ చేత్తో ఇచ్చినట్టు చూపుతూ...మరో చేత్తో లాక్కోవటం ఎలా అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేయటం కామన్‌ అయిపోయింది. సబ్సిడీలను ఎత్తివేసేందుకు ప్రయత్నాలను చేపడుతోంది. సబ్సిడీలు రద్దు చేసే కార్యక్రమాల్లో భాగంగా వంటగ్యాస్‌పై ప్రతి నెల రూ.4 పెంచాలని నిర్ణయించి, ప్రభుత్వ ఇంధన రంగ సంస్థలకు ఆ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఈ పెంపుదల అమలు చేస్తున్నట్లు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ధరల పెంపుదల కొనసాగుతుందన్నారు.

రూ. 60వేల కోట్ల సబ్సిడీ..
ఒక వ్యాపారానికి లేదా ఆర్థిక రంగానికి చెల్లించే ఆర్థిక రూపంలోని సాయాన్ని రాయితీ (సబ్సిడీ) అంటారు. నోట్ల రద్దు..జీఎస్టీ లాంటి నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్..డీజీల్..కిరోసిన్ వంటి పెట్రోలియం ఉత్పత్తులకు కేంద్రం సబ్సిడీలకు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు పెరుగుదల..తగ్గుదల ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. గత మూడేళ్లుగా ఈ విధానికి మంగళం పాడేశారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సుమారు రూ.60 వేల కోట్ల సబ్సిడీని కేంద్రం మిగుల్చుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరికొన్ని భారీ సబ్సిడీలను రద్దు చేసేందుకు కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అక్రమాలకు చెక్‌ చెప్పాలని వాటిని తగ్గించుకుంటున్నట్లు చెప్పే ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. రైల్వేలో వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీకి ఎసరుపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కదులుతోందని తెలుస్తోంది. తొలుత వృద్ధుల టికెట్లపై 40 నుంచి 50% వరకు ఉన్న రాయితీని స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరుతోంది.
దేశంలోని పేదల అభివృద్ధికి సబ్సిడీలు ఉండాలని.. వాటికి కోసం పోరాటాల చేయాలని వామపక్షాలు..ఇతరులు పిలుపునిస్తుండడం తెలిసిందే. కొంత మంది ఉపయోగార్థం... పెద్ద మొత్తంగా ఉన్న ప్రజలకు నష్టం కలిగించే విధానాలకు స్వస్తి పలకాలని వారు సూచిస్తున్నారు. 

ఈ ప్రగతి ద్వారా మరింత మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు

అమరావతి: ఐటీని సామాన్యులకు చేరువ చేయటం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ దవ్ఆర వర్షం, తుపాన్ల పై సమాచారం ఇచ్చి రైతులను కాపాడగల్గుతున్నామని తెలిపారు. ఈ ప్రగతి అమలు పై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, ఈ ప్రగతి అమలు సాధ్యమే అని సీఎం అన్నారు. ఈ ప్రగతి ద్వారా మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. టెక్నాలజీ వినియోగ వల్ల డబ్బులు ఖర్చు అనే వాదనలు సరికావన్నారు.

15:12 - August 1, 2017

తూర్పుగోదావరి : పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మహా ధర్నా చేపట్టాయి. ఇందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసితులు, గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

15:06 - August 1, 2017

కర్నూలు : జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. టీడీపీలో కొనసాగాలా...  లేక వైసీపీలో చేరాలా..అన్న అంశంపై చర్చిస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులు టీడీపీపై మండిపడుతున్నారు. వైసీపీలో చేరేందుకు శిల్పా అనుచరులు మొగ్గుచూపుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:02 - August 1, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడింది. ఈ ఘటనలో విక్రమ్‌గౌడే కాల్పుల సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిని హైదరాబాద్‌కు తరలించారు. తనపై కాల్పులు జరిపించుకుని... వారిని అనంతపురానికి పంపించాడు. సంఘటనాస్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా క్లూస్‌టీమ్‌ ఈ కేసును ఛేదించింది. మొదటినుంచి విక్రమ్‌గౌడ్‌నే అనుమానిస్తున్న పోలీసులు.. 4 రోజుల్లోనే కాల్‌డేటా ఆధారంగా కేసును ఛేదించారు. విక్రమ్‌ గౌడ్‌ కాల్పుల ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్‌ నివేదికను.. ఇవాళ డాక్టర్లు పోలీసులకు అందజేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

మీరాకుమార్ ను తప్పుదోవ పట్టించారు: పల్లా

హైదరాబాద్‌: కాంగ్రెస్‌నేతలు మీరా కుమార్‌ను తప్పుదోవ పట్టించారని మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మీరా కుమార్‌ను సిరిసిల్లకు రప్పించి కాంగ్రెస్ నేతలు డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాకే ఇసుక మాఫియా అదుపులోకి వచ్చిందని ఆయన తెలిపారు. 21 వేల మందిని విద్యుత్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తే కోర్టు కెళ్ళి భంగపడ్డ నీచ చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన విమర్శించారు.

14:53 - August 1, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో నటుడు నందు విచారణ ముగిసింది. సుమారు 3 గంటల పాటు నందును ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్‌ కేసులో మొత్తం 12 మంది టాలీవుడ్ ప్రముఖులను సిట్ అధికారులు విచారించారు. తొలి విడత విచారణ ఇవాళ్టితో ముగిసింది. కెల్విన్‌తో సంబంధాలపై సిట్‌ బృందం ఆరా తీసింది. డ్రగ్స్‌ సరఫరా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని సిట్ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:51 - August 1, 2017

హైదరాబాద్ : టీపీసీసీ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ను తొలగిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ కార్యదర్శి కుంతియాకు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ కార్యదర్శిగా నితీష్‌ను నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

టీ. గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ల రాత పరీక్ష పై స్టే ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ల రాత పరీక్ష పై హైకోర్టు స్టే ఎత్తివేసింది. 500 పోస్టులను మహిళలకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ నిరుద్యోగులు పిటిషన్ వేశారు. త్వరలో గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టులకు టీఎస్ పీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది.

శెట్టి వద్ద జాతీయ రహదారి పోలవరం నిర్వాసితుల ధర్నా

తూ.గో చింతూరు(మం) శెట్టి వద్ద జాతీయ రహదారిలో పోలవరం నిర్వాసితులు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మిడియం బాబూరావు పాల్గొన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు రహదారిని దిగ్భంధిస్తామని పోలవరం నిర్వాసితులు భీష్మించుకు కూచున్నారు.

14:34 - August 1, 2017

ఆహారపు అలవాట్లు..జీవన శైలిలో మార్పులు తీసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అంటున్నారు వైద్యులు.

  1. ప్రతి రోజు పచ్చి కూరగాయల రసం తాగితే అనారోగ్యాల బారి నుండి కాపాడుకోవచ్చు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  2. యోగా..వ్యాయామం..ధాన్యం..లాంటి ప్రక్రియలతో మానసిక వత్తిడిని దూరం కావచ్చు.
  3. కుటుంబసభ్యులు..బంధు..మిత్రులతో మాట్లాడుతుండడి..ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి..
  4. ప్రతి రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయండి..
  5. పొగ..మద్యపానం..తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి..
  6. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
  7. విటమిన్ ఇ, విటమిన్ సి లభించే ఆహారాలను తరచుగా తీసుకోవాలి.
  8. ఆహారం మితంగా తీసుకోవాలి. ఇది ఎంతగానో మంచింది.
  9. వారంలో ఒక రోజుల పచ్చి కూరగాయల సలాడ్ తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయి.
  10. ఆలీవ్..ఆవనూనె..సన్ ఫ్లవర్ లను వంట పదార్థాల్లో ఉపయోగించాలి. సాధ్యమైన వంత వరకు ఫ్లై..వేపులకు సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. 

ఉత్తరకొరియా సంగతి మేం చూసుకుంటాం: ట్రంప్

హైదరాబాద్: ఉత్తర కొరియా సంగతి మేం చూసుకుంటాం అని కేబినెట్ భేటీ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియాను నిలువరించే శక్తి సామర్థ్యాలు మాదగ్గర ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.

ఒంగోలులో అగ్నిమాపక ఆఫీస్ పై ఏసీబీ దాడులు

ప్రకాశం: ఒంగోలులో అగ్నిమాపక ఆఫీస్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 35 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక అధికారి సుబ్బారావు ఏసీబీ చిక్కాడు. సుబ్బారావుతో పాటు మరో ఇద్ఇరిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

 

డ్రగ్స్ కేసులో ముగిసిన తొలి దశ విచారణ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో తొలి దశ విచారణ ముగిసింది. ఇప్పటి వరకు 12 మందిని సిట్ విచారించింది. విచారణలో పబ్బులు, కాల్విన్ కాల్ డేటాకు సంబంధించిన సిట్ అధికారులు ఆరాతీశారు. రెండో జాబితాకు సంబంధించి సిట్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

14:00 - August 1, 2017

ప్రిన్స్ మహేశ్ బాబు..మురుగదాస్ కాంబినేషన్ లో నిర్మితమౌతున్న 'స్పైడర్' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా టైటిల్..టీజర్..పోస్టర్స్ విషయాల్లో చిత్ర బృందం ఆలస్యంగా రిలీజ్ చేసింది. ఇటీవలే చిత్ర టీజర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

రా ఏజెంట్ గా నటిస్తున్న 'మహేష్ బాబు' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమా చివరి పాట షూటింగ్ నిమిత్తం చిత్ర బృందం విదేశాలకు పయనమైంది. పాట షూటింగ్ కంప్లీట్ చేసుకుని మిగతా వర్క్స్ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

తాజాగా చిత్ర మొదటి సాంగ్‌ 'బూమ్‌ బూమ్‌..పల్లవితో సాగేదాన్ని బుధవారం విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 9న 'మహేష్‌' పుట్టిన రోజున స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని మురుగదాస్ ప్లాన్స్ వేశారు. మరి విడుదలయ్యే పాట ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

బాలింతపై నర్సు యాసిడ్ దాడి...

కృష్ణా: విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. రోగులను కాపాడాల్సిన నర్సు కిరాతకంగా ప్రవర్తించింది. లంచంగా డబ్బులు ఇవ్వలేదనే ఆగ్రహంతో ఓ బాలింతపై నర్సే యాసిడ్‌తో దాడి చేసింది. దీంతో బాలింత తీవ్రంగా గాయపడింది. అయితే నర్సు తప్పేమీ లేదని పొరపాటున యాసిడ్ పడిందంటూ ఆస్పత్రి సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు పై స్పష్టత ఇచ్చిన కేంద్రం

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు పై స్పష్టత కేంద్రం ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరిస్తేనే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమవుతుందని కేంద్రం తెలిపింది. రాజ్యాంగ సవరణ చేయకపోతే 2006 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా సీట్ల పెంపుదల వుంటుందని హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారం తెలిపారు. లోక్ సభలో సీట్ల పెంపు పై ఎంపీలు మురళీ మోహన్, కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

13:41 - August 1, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. జూడాల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్‌లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించమని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూద్దాం.

13:41 - August 1, 2017

తెలంగాణ రాష్ట్రంలో 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎంపీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..తదితర అంశాలపై ఎంపీ కవితతో టెన్ టివి ముచ్చటించింది. ఈసందర్భంగా ఆమె విషయాలపై స్పందించారు. ప్రొ.కోదండరాం అంటే గౌరవం ఉందని..కూలంకుశంగా విమర్శలు చేస్తారని తాము ఆశించామన్నారు. ఉద్యమాల్లో ఆయన కలిసి పనిచేశారని, ప్రభుత్వంతో కలిసి పనిచేయలేదన్నారు. ప్రతిపక్షాలతో కలిసి ఆయన విమర్శలు చేయడం జరుగుతోందని, ఎవరితో కలిసి పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. తప్పుడు లెక్కలతో విమర్శలు చేయడం సరికాదని..కరెక్టు లెక్కలతో విమర్శలు చేయాలని సూచించారు. 60వేల ఉద్యోగాలు ఇచ్చామని ఘంటాపథంగా చెబుతామని, 4-5వేల ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను చూసి ప్రజలు నవ్వుతున్నారని తెలిపారు. విమర్శలు విని ఊరుకోవడానికి ప్రభుత్వం ఊరుకోదని, తిప్పి కొడుతామన్నారు. ఇంకా మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మిథాలీరాజ్ బీఎండబ్ల్యూ కారు బహుమానం..

హైదరాబాద్ : భారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చారు. ఇటీవల జరిగిన మహిళల ప్రపంచ కప్‌లో మిథాలీ ఆటతీరుపై చాముండేశ్వరీనాథ్ ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.

13:33 - August 1, 2017

తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలతో ప్రభుత్వం ముందుకెళుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. కానీ అలాంటి పరిస్థితి లేదని ఎంపీ కవిత పేర్కొన్నారు. టెన్ టివి ఫేస్ టు ఫేస్ లో ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు..ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో లక్షా 30వేల కోట్ల దాక బడ్జెట్ ఉందని..అందులో రూ. 30వేల కోట్లు సంక్షేమం మీద ఖర్చు పెడుతోందని తెలిపారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దీనిని బట్టి చూస్తే అర్థమౌతుందని, టీఆర్ఎస్ వరుసగా విజేయకేతనం ఎగురవేస్తోందన్నారు. మూడు సంవత్సరాల్లో ప్రజలకు వారి ఊర్లో మార్పు చేసి చూపించామని, కళ్యాణ లక్ష్మీ..కేసీఆర్ కిట్..తదితర ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఒక్క రాత్రిలో మార్పు రాదని..ప్రభుత్వం దృక్పథం..కమిట్ మెంట్ ఎలా ఉందో చూడాలని సూచించారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

టీ.కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ తొలగింపు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ ను తొలగించారు. ఆయన స్థానంలో కుంతియాను నియమించారు.

13:27 - August 1, 2017

హైదరాబాద్ : కాలనీ ఒక్కటే. లే అవుట్‌ కూడా ఒక్కటే. కానీ ఆదాయ వ్యత్యాసాలు వారి మధ్య తరగని అంతరాన్ని పెంచాయి. తరగని వివక్షకు తెరలేపాయి. ఎల్‌ఐజీ ప్లాట్ల వాళ్లు తమ ప్లాట్లవైపు తొంగి చూడకూడదంటూ ఎంఐజీ, హెచ్‌ఐజీ ప్లాట్ల ఓనర్లు ఆంక్షలు పెట్టారు. ఉమ్మడి ఆస్తులైన పార్కులు, క్లబ్బులను వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. మనసుల్లోనే కాదు.. ఏకంగా కాలనీలోనే ఓ పెద్ద అడ్డుగోడను కట్టేశారు. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ మలేసియా టౌన్‌షిప్‌లో ఫ్లాట్ల ఓనర్ల మధ్య వివక్ష కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

పంచాయతీ రాజ్ శాఖ నరేగా అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

అమరావతి: సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ నరేగా అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు పై చర్చించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల ఏర్పాటు చేయాల్సిన గ్రామాలు, యాక్షన్ ప్లాన్ వివరాలను కలెక్టర్ల నుండి సేకరించాలని, 2600 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 10 వేల కి.మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లను ఏర్పాటు చేసి నరేగా అనుసంధానంతో నాణ్యమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాట చేయాలని సూచించారు. డిసెంబర్ 31 నాటికి పనులు పూర్తి చేయాలని కూడా లోకేష్ ఆదేశించారు.

 

ఎన్నికల్లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: బుద్దా వెంకన్న

విజయవాడ: జగన్ సీఎం కావాలని పగటి కలలు కంటున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ప్రశాంత్ కిషోర్ తో ట్యూషన్లు చెప్పించుకున్నా సీఎం కాలేరని, జగన్ కు రాజకీయ గురువు కేసీఆర్ వెంకన్న ఎద్దేవా చేశారు. ఎన్ని సర్వే చేయించినా మళ్లీ టీడిపిదే అధికారం అని ఎన్నికల్లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం వెంకన్న జోస్యం చెప్పారు. తండ్రి చనిపోతే కన్నీళ్లు పెట్టుకోని జగన్ పట్టిసీమకు నీళ్లొస్తే కన్నీరు పెట్టుకుంటున్నారని మండి పడ్డారు. జగన్ పై ఉన్న కేసులకు వెంటనే జడ్జిమెంటు ఇవ్వాలని సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తామన్నారు.

13:22 - August 1, 2017

హైదరాబాద్ : హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నందును సిట్‌ విచారిస్తోంది. నందుతో ఈ కేసులో సినీ ప్రముఖుల విచారణ ముగుస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై నందును సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులో సిట్‌ ఇప్పటి వరకు 11 మంది విచారించగా, నందు 12వ వ్యక్తి. వీరిలో 11 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. రవితేజ డ్రైవర్‌ను కూడా సిట్‌ బృందం విచారించింది. గత నెల 19న పూరీ జగన్నాథ్‌లో ప్రారంభమైన విచారణ ఇవాళ నందుతో ముగుస్తోంది. శ్యామ్‌ కే. నాయుడు, సుబ్బరాజు, నవదీప్‌, తరుణ్‌, చార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, తనీష్‌లను సిట్‌ అధికారులు ప్రశ్నించి, డ్రగ్స్‌ కేసులో కీలక సమాచారం రాబట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

దళితులు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితులు లేవు: ఎమ్మెల్యే గువ్వల

హైదరాబాద్: దళితులు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితులు లేవని ఎమ్మెల్యే గువ్వల విమర్శించారు. దళితులను గౌరవించే నాయకురాలిగా పేరున్న మీరాకుమార్ ను సిరిసిల్లకు తీసుకొచ్చి దళితులను అవమానపరిచారని మండిపడ్డారు. బిజెపి దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాక కాంగ్రెస్ కు దళితులు గుర్తుకొచ్చారా అని గువ్వల ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్న భయంతోనే కాంగ్రెస్ ఇసుక మాఫియా ఆరోపణలు చేస్తోందని, కేటీఆర్ ను ఎంతగా బద్నామ్ చేయాలని చూస్తే ఆయన పేరు ప్రతిష్టలు అంతగా పెరుగుతాయని తెలిపారు.

ఫేక్ డెత్ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు

రంగారెడ్డి : ఫేక్ డెత్ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. హయత్ నగర్ పీఎస్ పరిధిలో ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో డెత్ సర్టిఫికెట్లు తయారు చేసి ఈ ముఠా భూ విక్రయాలు జరుపుతున్నారు. వారి వద్ద 11 నకిలీ డెత్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

13:06 - August 1, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ వీడింది. పోలీసులు వక్రమ్ గౌడే సూత్రధారిగా నిర్ధారించారు. పోలీసులు అనంతపురంలో జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్టు క్లూస్ టీమ్ కు సంఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మొదటి నుంచి విక్రమ్ గౌడేనే పోలీసులు అనుమానించారు. విక్రమ్ గౌడ్ ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు కొలిక్కి వచ్చింది. కాల్పుల కోసం ఉపయోగించిన తుపాకుల కోసం వెస్ట్ జోన్ పోలీసులు షేక్ పేట్ నాలాలలో వెస్ట్ జోన్ తనిఖీలు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే పోలీసలు కేసును చేధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

తట్టు, రుబెల్లా నివారణకు ఒకే టీకా

అమరావతి: తట్టు, రుబెల్లా నివారణకు ఒకే టీకా ఎంఆర్ ను ఏపీ ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

సంప్రదాయ ఇంధన వనరుల సలహా మండలి తొలి సమావేశం

ఢిల్లీ: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంప్రదాయ ఇంధన వనరుల సలహా మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుండి విద్యుత్ శాఖ మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుండి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న సంప్రదాయేతర విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేడయం పై చర్చిస్తున్నట్లు సమాచారం.

టీ.సర్కార్ కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పై హైకోర్టు ప్రభుత్వానికి ఊరట లభించింది. క్రమబద్దీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కోర్టు తిరస్కరించింది.

 

12:38 - August 1, 2017

తూర్పు గోదావరి : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి. చింతూరు కేంద్రంగా మహా ధర్నా జరుగుతోంది. గతంలో పరిహారం తీసుకున్న నిర్వాసితులకు కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:37 - August 1, 2017

హైదరాబాద్ : మీర్‌పేట్‌ విషాదం చోటుచేసుకుంది. అభుంశుభం తెలియని రెండేళ్ల బాలుడిని స్కూలు బస్సు బలితీసుకుంది. శివహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కిందపడి బాలుడు మృతి చెందినట్టు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:29 - August 1, 2017

దేశంలో ఎన్నో అవమానవీయ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంబులెన్స్ లు రాకపోవడంతో తమ కుటుంబసభ్యుల మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడిచిన ఘటనలు ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా అంబులెన్స్ లేకపోవడంతో ఓ గర్భిణీ 20 కిలోమీటర్ల మేర నడిచింది. ఈ ఘటనలో జన్మించిన శిశువు మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కత్ని జిల్లాలో చోటు చేసుకుంది.

బార్మాని గ్రామంలో బీనా అనే మహిళ నివాసం ఉంటోంది. ఈమె గర్భిణీ. బార్హి కమ్యూని హెల్త్ సెంటర్ 20 కి.మీటర్ల దూరంలో ఉంది. నొప్పులు రావడంతో అంబులెన్స్ కావాలని హెల్త్ సెంటర్ కు బీనా కుటుంబసభ్యులు సమాచారం అందించారు. కానీ అంబులెన్స్ రాకపోవడంతో నడిచివెళ్లేందుకు బీనా సిద్ధమైంది. కొద్దిదూరం నడిచిన అనంతరం బార్హి టౌన్ ప్రాంతంలో నడిరోడ్డుపై ప్రసవించింది. కానీ జన్మించిన శిశువు మృతి చెందింది.

దీనిపై సీఎంహెచ్ వో అధికారి అశోక్ ఓ జాతీయ వారా సంస్థతో మాట్లాడారు. మాసాలు సరిగ్గా నిండకపోవడం..ఏడో నెలలో ప్రసవించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. బార్హీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అంబులెన్స్ సదుపాయం లేదని, ఇది తమ కంట్రోల్ లో ఉండదన్నారు.

ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

12:24 - August 1, 2017

హైదరాబాద్ : మలేషియా టౌన్ షిప్ లో ఫ్లాట్ల ఓనర్ల మధ్య వివక్ష కొనసాగుతోంది. ధనవంతులు అల్పాదాయ వర్గాల వారిని చిన్నచూపు చూస్తున్నారు. మలేషియా టౌన్ షిప్ లో హెచ్ఐజీ, ఎంఐజీ, ఎల్ఐజీ ఫ్లాట్ల ఉమ్మగి ఆస్తులుగా పార్కులు, క్లబ్బుల నిర్మాణం జరిగింది. హెచ్ఐజీ, ఎంఐజీ వాసులు ఎల్ఐజీ వాసులను పార్కులు, క్లబ్బుల్లోకి రానివ్వడం లేదు. ఎల్ఐజీ ఫ్లాట్ల ఓనర్లు తమ వైపు రాకుండా అడ్డుగోడ నిర్మించారు. హెచ్ఐజీ, ఎంఐజీ సంక్షేమ సంఘం న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తున్నాయి. హెచ్ఐజీ కల్లబ్బులను అద్దెకు ఇచ్చుకుంటూ అక్రమార్జన చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

వైద్యురాలిపై తోటి వైద్యుల దాడి..

యాదాద్రి : చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలను తమ ప్రైవేటు క్లినిక్ లకు కొందరు వైద్యులు పంపుతున్నారు. తోటి డాక్టర్ ప్రియంక దీనికి అడ్డుతగలడంతో తోటి వైద్యులు ఆమెపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. 

వైసీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..?

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో రాజకీయ సమీకరనాలు మారిపోతున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం. కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరాలని సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. 

కాసేపట్లో కార్యకర్తలతో చక్రపాణి సమావేశం..

కర్నూలు : కార్యకర్తలతో చక్రపాణిరెడ్డి సమావేశం కానున్నారు. శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, బండి ఆత్మకూరు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

12:02 - August 1, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ వీడింది. పోలీసులు వక్రమ్ గౌడే సూత్రధారిగా నిర్ధారించారు. పోలీసులు అనంతపురంలో జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్టు క్లూస్ టీమ్ కు సంఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మొదటి నుంచి విక్రమ్ గౌడేనే పోలీసులు అనుమానించారు. నాలుగు రోజుల్లోనే పోలీసలు కేసును చేధించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:54 - August 1, 2017

రియోలో జరిగిన ఒలింపిక్స్..పారా ఒలింపిక్స్...పోటీల్లో పతకాలు దేశానికి వచ్చాయి..వారం రోజుల క్రితం మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ రన్నరప్ గా నిలిచింది...పతకాలు సాధించిన వారికి..మిథాలీ సేనకు అభిమానులు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశంసలు కురిపించాయి. అంతేగాకుండా వారికి ఘన స్వాగతాలు కూడా పలికాయి. మరి తాము కూడా పతకాలు సాధించామని..వారికిచ్చిన స్వాగతాలు తమకివ్వరా ? అంటూ డెప్లింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు.

డెప్లింపిక్స్..లో పతకాలు..
టర్కీలో డెప్లింపిక్స్ లో ఐదు పతకాలు (ఒక స్వర్ణంతో సహా) భారత క్రీడాకారులు గెలిచారు. క్రీడాకారులు..సహాయ సిబ్బందితో సహా మొత్తం 46 మంది డిప్లెంపిక్స్ పోటీలను ముగించుకుని మంగళవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వారికి నిరాశ ఎదురయ్యింది. ప్రభుత్వం నుండది ఊహించని స్వాగతం వస్తుందని తాము భావించామని, కానీ అలా జరగలేదని క్రీడాకారులు ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు.

కేంద్రానికి సమాచారం..
ఆగస్టు 1వ తేదీన స్వదేశానికి చేరుకుంటామని కేంద్ర మంత్రిత్వ శాఖకు ముందుగానే తెలియచేయడం జరిగిందని, డిప్లెంపిక్స్ లో గతంలో ఎన్నడూ సాధించని రీతిలో మన క్రీడాకారులు ఇప్పుడు స్వర్ణంతో సహా ఐదు పతకాలు కైవసం చేసుకున్నారని క్రీడాకారులు పేర్కొన్నారు. ఒలింపిక్స్..పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించి ఆటగాళ్లు స్వదేశం చేరుకున్న సమయంలో సంబరాలు చేసుకోవడం జరిగిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మన క్రీడాకారులు ఐదు పతకాలతో తిరిగి వచ్చారని ఆల్ ఇండియా డెవ్ కౌన్సిల్ ప్రతినిధి కేతన్ షా పేర్కొన్నారు. జులై 25వ తేదీన క్రీడల మంత్రి విజయ్ గోయెల్ కి ఆగస్టు 1న భారత్ చేరుకుంటామని..వారి నుండి ఎలాంటి స్పందన లేదని ఆయన పేర్కొన్నారు.

స్వాగత ఏర్పాట్లు కనిపించకపోవడం పట్ల తాము పతకాలు వెనక్కి ఇచ్చేస్తామని క్రీడాకారులు పేర్కొంటున్నారు. 

11:48 - August 1, 2017

బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి..

హైదరాబాద్ : మీర్ పేట శివాహిల్స్ లో స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

11:42 - August 1, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. జూడాల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్‌లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించమని జూనియర్‌ డాక్టర్లు స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూద్దాం.

11:41 - August 1, 2017

హైదరాబాద్ : నటుడు నందు సిట్ ఆఫీస్ చేరుకున్నారు. డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నందును సిట్‌ విచారిస్తోంది. నందుతో ఈ కేసులో సినీ ప్రముఖుల విచారణ ముగుస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై నందును సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసిన కెల్విన్‌తో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులో సిట్‌ ఇప్పటి వరకు 11 మంది విచారించగా, నందు 12వ వ్యక్తి. వీరిలో 11 మంది సినీ ప్రముఖులు ఉన్నారు. రవితేజ డ్రైవర్‌ను కూడా సిట్‌ బృందం విచారించింది. గత నెల 19న పూరీ జగన్నాథ్‌లో ప్రారంభమైన విచారణ ఇవాళ నందుతో ముగుస్తోంది. శ్యామ్‌ కే. నాయుడు, సుబ్బరాజు, నవదీప్‌, తరుణ్‌, చార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, తనీష్‌లను సిట్‌ అధికారులు ప్రశ్నించి, డ్రగ్స్‌ కేసులో కీలక సమాచారం రాబట్టారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:41 - August 1, 2017

తెలంగాణ వస్తే సమస్యలు తీరుతయి..ఎంతో ఆనందంగా ఉండొచ్చు..ఎలాంటి కష్టాలు పడుతున్నమో తెలుసుకున్న పాలకులు ఆ కష్టాలను తొలగిస్తారు..అంటూ కోరుకున్నారు. ఆ కోరుకున్న వారిలో 'రైతులు' కూడా ఉన్నరు. తెలంగాణ వచ్చేసింది..మూడేళ్లు దాటిపోతోంది..కానీ వారి సమస్యలు తీరాయా ? వారు ఆనందంగా ఉంటున్నరా ? సమైక్య పాలనలో ఇబ్బందులు పడిన రైతులు అలాంటి పరిస్థితి రానివ్వబోమని చెప్పిన పాలకులు ఆ దిశగా పాలిస్తున్నారా ? అంటే లేదు అనే సమాధానం వస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బ్యాంకుల ఎదుట పడిగాపులు..
ఆరుగాలం శ్రమించి పట్టెడన్నం పెట్టే రైతుకు ప్రస్తుతం అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నయి. వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నయి. కానీ ఆ రైతన్నకు రుణాలు మాత్రం లభించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని పలు బ్యాంకుల ఎదుట రైతులు పడిగాపులు పడుతున్నరు. రుణం పొందాలని ఇల్లు వదిలి..భార్య పిల్లలను వదిలి బ్యాంకుల ఎదుట నిరీక్షిస్తున్నారు. పనులన్నీ వదిలేసి పడిగాపులు పడుతున్నరు. బ్యాంకులు తెరవక ముందే భారీ క్యూలు...రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

అరకొర నగదు..
ధాన్యం డబ్బులు బ్యాంకుల్లో జమైన రైతులు వాటిని తీసుకోలేక పోతున్నారు. రైతులకు సాధారణంగా గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఖాతాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పలు బ్యాంకుల్లో నగదు నిండుకోవడం..దీనితో ఒక్కో చోట కేవలం రూ. 4 వేలు.. పది వేలు చేతిలో పెడుతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పనులు మానుకొని బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది..మళ్లీ వ్యవసాయానికి పెట్టుబడబి కావాలె..చేతిలో పైసల్లేక ఇబ్బంది అవుతంది అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీతో సహా పూర్తి రుణం కడితేనే కొత్త అప్పు ఇస్తామంటూ బ్యాంకులు కొర్రీ పెడుతున్నట్లు సమాచారం. అంతిమంగా బ్యాంకుల్లో రుణం అందక.. పెట్టుబడుల కోసం చేతిల చిల్లిగవ్వ లేక అన్నదాతలు అగచాట్లు పడుతున్నరు. ఇటీవలే దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నగదు కొరత తీవ్రంగా ఉన్నదని, తక్షణమే రూ.5వేల కోట్ల నగదును పంపాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని అప్పట్లో కోరారు. రైతులు తాము వేసుకున్న నగదు కోసం తామే బ్యాంకుల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగాల్సిన పరిస్థితి కొనసాగడమేమిటని కేంద్రంపై మండిపడ్డారు.
మరి రైతులు పడుతున్న రుణ ఆగచాట్లపై ప్రభుత్వం..బ్యాంకులు ఎలా స్పందిస్తాయో చూడాలి. 

11:40 - August 1, 2017

రంగారెడ్డి : జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని వట్టేపల్లిలో ఆకతాయిలు ఎక్కువయ్యారు. కొందరు ఆకతాయిలు నిత్యం యువతులను వెంబడిస్తూ వేధిస్తున్నారు. వట్టేపల్లి నుంచి ఆబిడ్స్‌కు ఆటోలో బయలుదేరిన ఇద్దరు యువతులను ఆరుగురు ఆకతాయిలు వేధించారు. ఆటో డ్రైవర్‌ను కిందకు దింపి యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. ఆకతాయిల బెదింపులకు లొంగకుండా బాధిత యువతులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీలను శాస్త్రిపురం వాసులుగా గుర్తించారు. 

కొనసాగుతున్న నెల్లూరు క్రికెట్ బెట్టింగ్ మాఫియా..

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై విచారణ కొనసాగుతోంది. 30 బుకీలు..పంటర్లను పోలీసులు విచారిస్తున్నారు. వీరి విచారణలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పేర్లు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి నేతలను వదిలి తమ పార్టీకి చెందిన నేతలను వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. డీఎస్పీ, సీఐలు కోట్లలో ముడుపులు తీసుకున్నారని, వీరిని తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. 

11:17 - August 1, 2017

సినీ నటుడు, జనసేన అధినేత 'పవన్ కళ్యాణ్' పూర్తిస్థాయి రాజకీయాల్లోకి త్వరలోనే వస్తున్నారు..అంటే సినిమాలకు దూరమవుతున్నారా ? ఇక సినిమాలు చేయరా ? 2019 ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే అంత ముందుగా ఎందుకు వస్తున్నట్లు ? ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే సమస్యలపై పోరాటం చేస్తారా ? ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎలాంటి వత్తిడి తెస్తారు ?
 

అక్టోబర్ నుండే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి దిగుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ పెట్టిన అనంతరం ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని..అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తాను అక్టోబర్ నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కానీ అక్టోబర్ నెలలోనే ఎందుకు ఎంచుకున్నట్లు అనే చర్చ జరుగుతోంది.

మూడేళ్లు..అమలు కాని హామీలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోతోంది. ఇచ్చిన హామీలు అమలు కాకపోతుండడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రైతులు..కార్మికులు..ఇతర రంగాలకు చెందిన వారు తమ సమస్యలు తీర్చాలంటూ ఆందోళనలు..ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఆందోళనలు..నిరసనలను పోలీసుల చేత అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వామపక్షాలు తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నంద్యాల ఉప ఎన్నిక..ముద్రగడ ఉద్యమాలతో రాష్ట్ర రాజకీయాలు వేడిగా ఉన్నాయి.

వైసీపీ ప్రయత్నాలు..
ప్రజల అసంతృప్తిని క్యాష్ చేసుకొనేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలుకంటోంది. 2019లో తమదే అధికారమని..తానే సీఎం అంటూ జగన్ అప్పుడే జోస్యం కూడా చెప్పేస్తున్నారు. అక్టోబర్ నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ఇటీవలే నిర్వహించిన ప్లీనరీ వేదికగా జగన్ ప్రకటించారు. ప్రజల్లో మమేకం కావడం..వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే పాదయాత్ర ఒక్కటే మార్గమమని జగన్ భావించి ఉండవచ్చని తెలుస్తోంది. కానీ ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతినిస్తుందా ? లేదా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

అక్టోబర్ నెలలో..
ఇదిలా ఉంటే ఉద్దానం సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు..హార్వర్డ్ వర్సిటీ వైద్యులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు. బాబుతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం చర్చించారనేది బయటకు పొక్కలేదు. ఈ భేటీలో నంద్యాల ఉపఎన్నిక..ముద్రగడ ఉద్యమం...జగన్ పాదయాత్ర..వెంకయ్య ఉపరాష్ట్రపతి..తదితర అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని టాక్. కార్యక్రమాలు ముగిసిన అనంతరం పవన్ మీడియాతో ముచ్చటించారు. తాను అక్టోబర్ నెల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలిపారు. జగన్ కూడా అక్టోబర్ నెలలోనే పాదయాత్ర చేపడుతుండడం..ఇదే నెలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని పవన్ ప్రకటించడం గమనార్హం. జగన్ ను కట్టడి చేసేందుకే 'పవన్' ను బాబు తెరమీదకు తెస్తున్నారని సోషల్ మాధ్యమాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటానన్న 'పవన్' ఏం చేస్తారో రానున్న రోజుల్లో చూడాలి. 

సభ్యుల గైర్హాజర్ పై షా గుస్సా..!

ఢిల్లీ : రాజ్యసభలో సోమవారం పార్టీ సభ్యులు గైర్హాజర్ కావడం పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పునారవృతం కావద్దని సూచించినట్లు తెలుస్తోంది. 

10:55 - August 1, 2017

'మనం బతకాలంటే వాడికి ఎదురెళ్లాలి..ఇది ధైర్యం కాదు..తెగింపు'..అంటూ అక్కినేని నాగ చైతన్య గళం వినిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'యుద్ధం శరణం గచ్చామి' టీజర్ విడుదలైంది. మాస్ పాత్రలో నటిస్తున్న 'నాగ చైతన్య' ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఆయన నటించిన 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం' విజయాలతో చైతూ దూసుకెళుతున్నాడు.

వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'చైతూ' సరసన 'లావణ్య త్రిపాఠి' హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి 'రేవతి' కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్ర పోషించాడు. 'యుద్ధం శరణం గచ్చామి' టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్..ఇటీవలే విడుదల చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ టీజ‌ర్‌ను 'నాగ‌చైత‌న్య' త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. నిమిషం పాటు ఉన్న ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను రేకెత్తిస్తోంది. డ్రోన్లు త‌యారు చేసుకుంటూ జీవించే ఓ యువ‌కుడి క‌థ నేఫ‌థ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది. 

10:53 - August 1, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. అతను నటిస్తున్న చిత్రంలోని ఫొటో..టీజర్..ఇతర విశేషాలు మాత్రం కాదండోయ్...ఆయన తన కుమార్తెకు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశాడు. ఈ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. లక్షల్లో లైకులు..కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా రంగంలో ఉన్న నటీ, నటులు నిత్యం షూటింగ్ లతో బిజీ బిజీగా ఉంటుంటారు. కాస్త విరామం దొరికితే తమ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపేందుకు మక్కువ చూపిస్తుంటారు. అందులో 'అల్లు అర్జున్' ఒకరు. షూటింగ్ కు విరామం..కాస్త విరామం దొరికితే భార్య స్నేహారెడ్డి, కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంటాడు. ఆయన 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

2016లో అల్లు అర్జున్..స్నేహారెడ్డిలకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అర్జున్ (arjun) ఆయన భార్య స్నేహ (sneha)ల ఇంగ్లీష్ పేర్లలోని మొదటి, చివరి అక్షరాలు ar, ha కలుపుతూ అర్హ (arha) అన్న పేరు పెట్టారట. ఈ పాప ఫొటోను ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ అభిమానులతో పంచుకున్నారు. 'నేను నా లిటిల్ ఏంజెల్ అల్లు అర్హ' అంటూ పాపను ఎత్తుకున్న దిగిన ఫొటోను ట్వీట్ చేశారు. 'కుమార్తెకు ఆమె తండ్రి మొదటి ప్రేమికుడు. చిరకాల హీరో' అంటూ వ్యాఖ్యను కూడా జత చేశాడు. 'ఎంత అందంగా ఉందో' అంటూ సమంత కితాబునిచ్చింది.

నీలం రంగు గౌను..తెల్లని బూట్లు వేసుకున్న అర్హ బోసి నవ్వులు నవ్వుతుంటే..అల్లు అర్జున్ ఆనందంతో ఉన్న ఫొటో మీరు చూడండి..

స్క్రీన్ ప్లే..దర్శకత్వం ముఖేష్ గౌడ్..

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల ఘటనలో మిస్టరీ వీడింది. విక్రమ్ గౌడే కాల్పుల సూత్రధారిగా నిర్ధారణయ్యింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్ కు తరలించారు. తనపై కాల్పులు జరిపించుకున్న అనంతరం వారిని విక్రమ్ గౌడ్ అనంతపురం జిల్లాకు తరలించాడు. సంఘటనాస్థలంలో ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిని అరెస్టు చేసేందుకు పోలీసులు కర్నాటకకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను సిట్ పోలీసులకు ఫోరెన్సిక్ బృందం అందచేయనుంది. 

యువతులను వేధించిన పోకిరీలు..

రంగారెడ్డి : మైలార్ దేవులపల్లి పరిధిలోని వట్టేపల్లిలో ఈవ్ టీజింగ్ ఘటన చోటు చేసుకుంది. వట్టేపల్లి నుండి ఆబిడ్స్ కు షాపింగ్ కోసం ఆటోలో వెళుతున్న ఇద్దరు యువతులను ఆరుగురు యువకులు వెంబడించి వేధించారు. ఆటో డ్రైవర్ ను కిందకు దించి యువతుల పట్ట అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. యువతులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వేధించిన యువకులు శాస్త్రీపురం వాసులుగా గుర్తించారు. 

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం..

జమ్మూ కాశ్మీర్ : పుల్వామాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా జమ్మూ కాశ్మీర్ చీఫ్ అబు డుజానా, లష్కరే కమాండర్ ఆరీఫ్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. అబూ డుజానాపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. 

10:33 - August 1, 2017

గుంటూరు : రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేయడంలేదని రైతు ఆందోళన చేస్తున్నారు. జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో శివరాకృష్ణ అనే రైతు టవర్ ఎక్కాడు. పాస్ పుస్తకాలు అందక జిల్లావ్యాప్తంగా రైతులు ఇబ్బందుకు గురౌతున్నారని, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు.

10:32 - August 1, 2017

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా హక్రిపొరలో జరిగిన ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజావనాతో పాటు ఆరీఫ్ ను సైన్యం హతమర్చింది. అబూ దుజనా తలపై రూ.10లక్షల రివార్డు ఉంది. దుజనా ఈ ఏడాది మేలో భద్రతా దళాలు చుట్టిముట్టినప్పుడు తప్పించుకున్నాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:18 - August 1, 2017

రంగారెడ్డి : నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తనయుడు మనీష్ గౌడ్ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసగండి టోల్ గేట్ దగ్గర సిబ్బందిపై దాడి చేశాడు. టోల్ చార్జ్ అడిగినందుకు కత్తులతో మనీష్ గౌడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మనీష్ గౌడ్ అతని స్నేహితులు కడ్తాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియే చూడండి. 

10:03 - August 1, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకునన్న నటుడు నందు కాసేపట్లో సిట్ ముందు హాజరుకానున్నారు. నందు పలు సినిమాల్లో హీరోగా నటించారు. డ్రగ్స్ కేసులో నేటితో సిట్ విచారణ ముగియనుంది. నందు చివరిగా విచారణకు వస్తుండడంతో ఏం చెబుతాగో సర్వత్ర ఆసక్తి నెలకొంది. సిట్ విచారణ పూరి జగన్నాథ్ తో మొదలై నందుతో ముగుస్తోంది. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి.

09:15 - August 1, 2017
09:04 - August 1, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకునన్న నటుడు నందు కాసేపట్లో సిట్ ముందు హాజరుకానున్నారు. నందు పలు సినిమాల్లో హీరోగా నటించారు. డ్రగ్స్ కేసులో నేటితో సిట్ విచారణ ముగియనుంది.సిట్ విచారణ పూరి జగన్నాథ్ తో మొదలై నందుతో ముగుస్తోంది. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి.

కార్పొరేటర్ తనయుడి దౌర్జన్యం

రంగారెడ్డి : నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తనయుడు మనీష్ గౌడ్ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసగండి టోల్ గేట్ దగ్గర సిబ్బందిపై దాడి చేశాడు. టోల్ చార్జ్ అడిగినందుకు కత్తులతో మనీష్ గౌడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మనీష్ గౌడ్ అతని స్నేహితులు కడ్తాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. 

08:20 - August 1, 2017

రంగారెడ్డి : నగరంలోని బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తనయుడు మనీష్ గౌడ్ టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసగండి టోల్ గేట్ దగ్గర సిబ్బందిపై దాడి చేశాడు. టోల్ చార్జ్ అడిగినందుకు కత్తులతో మనీష్ గౌడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. టోల్ గేట్ సిబ్బందిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మనీష్ గౌడ్ అతని స్నేహితులు కడ్తాల్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియే చూడండి. 

నేటితో ముగియనున్న సిట్ విచారణ

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేటితో సిట్ విచారణ ముగియనుంది. చివరి రోజు నటుడు నందు సిట్ ముందుకు రానున్నారు. నందు పలు సినిమాల్లో హీరోగా నటించారు. సిట్ విచారణ పూరి జగన్నాథ్ తో మొదలై నందుతో ముగుస్తోంది.

సూత్రధారి విక్రమ్ గౌడే

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ వీడింది. పోలీసులు వక్రమ్ గౌడే సూత్రధారిగా నిర్ధారించారు. పోలీసులు అనంతపురంలో జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్టు క్లూస్ టీమ్ కు సంఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మొదటి నుంచి విక్రమ్ గౌడేనే పోలీసులు అనుమానించారు.

08:12 - August 1, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేటితో సిట్ విచారణ ముగియనుంది. చివరి రోజు నటుడు నందు సిట్ ముందుకు రానున్నారు. నందు పలు సినిమాల్లో హీరోగా నటించారు. సిట్ విచారణ పూరి జగన్నాథ్ తో మొదలై నందుతో ముగుస్తోంది. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి.

08:11 - August 1, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కొడకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ వీడింది. పోలీసులు వక్రమ్ గౌడే సూత్రధారిగా నిర్ధారించారు. పోలీసులు అనంతపురంలో జిల్లాలో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు. విక్రమ్ గౌడ్ తనపై కాల్పులు జరిపించుకున్నట్టు క్లూస్ టీమ్ కు సంఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మొదటి నుంచి విక్రమ్ గౌడేనే పోలీసులు అనుమానించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:26 - August 1, 2017

పవన్ కల్యాణ్ ఇప్పటివరకు క్లారిటీ లేదని, పవన్ పార్టీ ప్రశ్నించడానికా, పాలించడానికా అనేది నిర్ణయించుకోవాలని, ప్రశ్నించడాని అయితే ట్వీట్టర్, ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించవచ్చు లేక పాలించడానికి అయితే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తారా లేదా అని వారు నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన వారి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయిత్నిస్తోందని, వైసీపీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తమ బాద్యత అని, ప్రజ సమస్యల పరిష్కరానికి అన్ని పార్టీలతో కలసి పోరాడతామని వైసీపీ అధికార ప్రతినిధి గౌతము రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ మానవీయ కోణంలో స్పదిస్తున్నారని, ఇవాళ వైసీపీ కూడా రాజకీయం చేయకుండా ప్రభుత్వం దృష్టి సమస్యలు తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని, అంతేగాని పవన్ ఏజెంట్ కాదని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:25 - August 1, 2017

ప్రకాశం : ప్రకాశం జిల్లాలో టీడీపీ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొంతమంది నేతలైతే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబుపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త నేతలను తెచ్చి పాత నేతల నెత్తిన కూర్చోబెట్టారంటూ అధినేత తీరును ఎండగడుతున్నారు. ఓడినవారు ఊరకే ఉండిపోవాలనే అధినేత వ్యాఖ్యలను జిల్లాలోని తెలుగు తమ్ముళ్లు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రకాశం పాలిటిక్స్‌లో తలపండిన నేత కరణం బలరామ్‌ అధినేత తీరును తప్పుపడుతున్నారు. పార్టీకోసం ఎన్నో వ్యయప్రయాసల కోర్చామని... ఓటమిపాలైనంత మాత్రానా సైలెంట్‌గా ఎలా ఉండిపోతామని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలదే పూర్తి బాధ్యత అని చంద్రబాబు తేల్చేయడంతో మరికొంత మంది నేతలు చేసేదిలేక సర్ధుకుపోతూ సమయం కోసం వేచి చూస్తున్నారు.

అధినేత పైనే విరుచుకుపడుతున్నారు
ఇంకొందరు సమయం ఉందికదా అని మిన్నకుండిపోతున్నారు. ప్రకాశం జిల్లా టీడీపీనీ శాసించే కరణం బలరామ్‌ మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా అధినేత పైనే విరుచుకుపడుతున్నారు. బహిరంగ వేదికలపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత లాభాలకోసం పార్టీలు మారే వారికి పెద్దపీట వేస్తే.... ఇన్నాళ్లూ పార్టీకోసం కష్టపడుతున్న తమ సంగతేంటంటూ ప్రశ్నిస్తున్నారు.ప్రకాశం జిల్లాలో ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్‌, కరణం బలరామ్‌ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో పట్టుకోసం ఇరువురూ ప్రయత్నిస్తున్నారు. అధినేత కూడా స్థానిక ఎమ్మెల్యేదే నియోజకవర్గ బాధ్యతని సూచించారు. దీంతో కరణం బలరామ్‌ పార్టీ సమన్వయ బృందంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నియోజకవర్గంతో తన పాత్ర ఏంటో స్పష్టత ఇవ్వాలని కోరారు. తను ఏపని చేయాలో చెప్పాలని నిలదీశారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు అన్యాయం జరుగుతోందని.. దీన్ని ఉపేక్షించబోనమి తేల్చి చెప్పారు.

బలరామ్‌పై క్రమశిక్షణ చర్యలు
తన పనేంటో తేల్చుతారా.. లేదంటే పార్టీని వదిలేయమంటారా అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. దీంతో సమన్వయ బృందం ఈ వ్యవహారం మొత్తాన్ని చంద్రబాబుకు వివరించింది. అద్దంకి నియోజకవర్గం బాధ్యతను ఎమ్మెల్యే రవికుమార్‌కే ఇచ్చామని... కరణంకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చేటప్పుడే ఇది స్పష్టం చేశామన్నారు చంద్రబాబు. అవసరమైతే బలరామ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ సమన్వయ బృందానికి చంద్రబాబు హుకుం జారీచేశారు. చంద్రబాబు తీరుపై కరణం సీరియస్‌గా ఉన్నారు. తన పనిపై స్పష్టత ఇవ్వాలనేది కరణం వాదన. పార్టీతోనూ, అధినేత చంద్రబాబుతోనూ తనకున్న అనుంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఓర్పుతో అవమానాలు భరిస్తున్నట్టు కరణం అగ్రనాయత్వానికి వివరించినట్టు తెలిసింది. పరిస్థితి చేయిదాటి పోకుండా చూసుకోండంటూ ఆయన సమన్వయ బృందానికి వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. దీంతో జిల్లా టీడీపీలో ఎప్పుడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రకాశం జిల్లా నేతల మధ్య సమన్వయానికి అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. వర్గపోరు అధినేతకు కొత్తచిక్కులు తెచ్చిపెడుతోంది. మరి నేతల మధ్య సమన్వయం తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

07:24 - August 1, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికలకు ప్రచారవ్యూహాలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం చేసింది. అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్రకు ముందే 60 రోజుల్లో 3 ప్రధాన అంశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జగన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొని నేతలకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 11 నుంచి 29 వరకు నవరత్నాల సభలు నిర్వహించనున్నారు. పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉన్న ఇళ్లను పార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు వెళ్లి కలుస్తారు. నవరత్నాల హామీల ప్రాధాన్యం గురించి ప్రజలకు వివరించడంతో పాటు.. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైసీపీ విడుదల చేసిన ప్రజాబ్యాలెట్‌ గురించి అభిప్రాయాలు సేకరిస్తారు. కార్యక్రమం పురోగతిపై బూత్‌స్థాయి కమిటీలతో నియోజకవర్గ కన్వీనర్‌ సంప్రదిస్తారు. సమావేశ వివరాలను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వెల్లడించారు.

సభ్యత్వ కార్యక్రమం
ఇక సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2 వరకు వైఎస్సార్‌ కుటుంబం పేరుతో పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టనున్నారు. సభ్యత్వం తీసుకునేందుకు మొగ్గుచూపే వారు పార్టీ ఫోన్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే వారికి వైఎస్‌ జగన్‌ వాయిస్‌తో మెసేజ్‌ వెళ్తుంది. సభ్యత్వానికి ఎలాంటి రుసుము లేదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. అనుకూలంగా స్పందించించిన వారి ఇంటికి స్టిక్కర్‌ అతికిస్తారు. తద్వారా ఎంతమంది తమకు సానుకూలంగా ఉన్నారన్నే విషయాన్ని తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. అక్టోబర్‌ 2 నుంచి 25 వరకు విజయశంఖారావం కార్యక్రమం నిర్వహిస్తారు. పార్టీ నాయకులు పోలింగ్ బూత్‌ పరిధిలో సమావేశాలు పెట్టి జగన్‌ పాదయాత్రపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిషోర్ బృందం పర్యవేక్షించనుంది.

07:22 - August 1, 2017

గుంటూరు : అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు ఎక్కడా పొంతనలేకుండా పోయింది. అమరావతిలో రాజధాని ప్రకటించగానే దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులు దాదాపు 33వేల ఎకరాలకుపైగా ప్రభుత్వానికి భూములిచ్చారు. రైతుల నుంచి భూములు తీసుకున్న సర్కార్‌ వారికి ఎన్నో హామీలు ఇచ్చింది. రైతులకు కమర్షియల్‌ ప్లాట్స్‌ ఇస్తామని కూడా చెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. ప్లాట్‌ కేటాయించిన రైతులంతా రిజిస్ట్రేషన్‌ బాట పట్టారు. ఇక్కడే రైతులకు అసలు కష్టాలు మొదలయ్యాయి.

వారికి నిరాశే
ఏ గ్రామంలో రైతులు భూములు ఇచ్చారో వారికి అదే గ్రామంలో ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. అసైన్‌మెంట్‌ ల్యాండ్‌లు, ఇనాం భూములు, ఫారెస్ట్‌, దేవాలయ భూముల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చింది. ఇది తెలియక రైతులు తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వెళ్లగా అక్కడ వారికి నిరాశే ఎదురవుతోంది. రైతులకు ఇచ్చిన సర్వేనంబర్‌లు చెక్‌ చేసిన అధికారులు వాటిని రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదని తేల్చి చెప్తున్నారు. దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.రిజిస్ట్రేషన్‌ అధికారులు కూడా ఈ విషయంలో తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి ల్యాండ్‌ కన్వర్షన్‌ లెటర్‌ వస్తేకానీ తాము రిజిస్ట్రేషన్‌లు చేయడం కుదరదని తేల్చి చెబుతున్నారు.దేవాదాయ, ఫారెస్ట్‌, ఇనాం, అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లను కేటాయించడంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారులను నిలదీయడానికి వెళితే అక్కడ ఒక్క అధికారి కూడా ఉండడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. భూములు ఇచ్చేసమయంతో పగలు -రాత్రి తేడాలేకుండా తమ చుట్టూ తిరిగారని... ఇప్పుడేమో ఒక్కరూ కనిపించకుండా పోయారని మండిపడుతున్నారు. 

07:19 - August 1, 2017

హైదరాబాద్ : సాగునీటి పథకాలపై ఆధారపడిన తాగునీటి పథకాలపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్‌, మిషన్‌భగీరథ, పట్టణ తాగునీటి సరఫరాపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జలాశయాల్లో కనీస నీటి మట్టాలను నిర్ధారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ నాటికి మిషన్‌భగీరథ స్కీమ్‌ ద్వారా తాగునీటి సరఫరా ప్రారంభం కావల్సి ఉన్నందున జలాశయాల్లో కనీస నీటి మట్టాలను పాటించాలన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యెల్లంపల్లి, మిడ్‌మానేరు జలాశయాలను గోదావరి నీటితో నింపగలిగితే హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు, మిషన్‌భగీరథ ద్వారా వందలాది గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరుతుందన్నారు. ఈ దిశగా తాగునీటి పథకాల అధికారులు, తాగునీటిశాఖ అధికారుల మధ్య సమన్వయంతో పనులు ముందుకు సాగాలన్నారు.

డిసెంబర్‌ నాటికి పూర్తి
మొదటి దశలో యెల్లంపల్లి నుంచి 10టీఎంసీల నీటిని తరలించడానికి పనులు పూర్తయినట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరో 20టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి కేశవపురం వద్ద జలాశయం ఏర్పాటుకు డీపీఆర్‌ సిద్ధమైందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని వారు వివరించారు. మిషన్‌భగీరథ పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి నీటిని అందించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయని మిషన్‌ భగీరథ అధికారులు తెలిపారు. సాగునీటి పథకాలపై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని... అధికారులు చిత్తశుద్దితో పనిచేయకపోతే ఆ నిధులన్నీ వృథా అవుతాయని హరీశ్‌రావు అన్నారు. అందుకే అధికారులంతా ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు.

 

07:17 - August 1, 2017

కర్నూలు : ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సైలెన్స్‌గా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి సడన్‌గా ప్లేట్‌ ఫిరాయించారు. తమ్ముడు శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లడాన్ని వ్యతిరేకించిన ఆయన... ఇప్పుడు అన్నబాటలోనే పయనించేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా శిల్పామోహన్‌రెడ్డి... తమ్ముడిని కలిసి రెండు గంటలపాటు చర్చలు జరపడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని శిల్పామోహన్‌రెడ్డి.. చక్రపాణిరెడ్డిని కోరారు. అంతేకాకుండా వైసీపీలోకి రావాలని కోరాడు. అయితే... తనకు కొంత సమయం కావాలని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చక్రపాణిరెడ్డి చెప్పాడు. ఈనెల 3న నంద్యాలలో జగన్‌ పర్యటిస్తున్నారు. జగన్‌ సమక్షంలో చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉలిక్కిపడ్డ టీడీపీ అధిష్టానం
జరుగుతున్న పరిణామాలతో టీడీపీ అధిష్టానం ఉలిక్కిపడింది. వెంటనే మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎంపీ సీఎం రమేష్‌.. చక్రపాణిరెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. నాలుగైదు గంటలపాటు చర్చలు జరిపారు. అయితే.. ఈ సమావేశంలో చక్రపాణిరెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని.. పార్టీ కూడా వారికే పెద్ద పీట వేస్తుందని ఆవేదన వెళ్లగక్కాడు. పనిలో పనిగా ఎమ్మెల్సీ పదవితో తనకు సంతృప్తి లేదని.. మండలి చైర్మన్‌ పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పాడు. అయితే... వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన టీడీపీ నేతలు... చంద్రబాబుతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. చక్రపాణిరెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం అవాస్తవమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. అయితే... శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం పార్టీ తీసుకునే నిర్ణయం నంద్యాల ఉప ఎన్నికపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

06:40 - August 1, 2017

 

ఈ రోజు ఎంబీసీ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1,2తేదీల్లో కలెక్టరెట్ ల ముందు నిరసన తెలియాజేయాలని నిర్ణయించామని, బీసీల్లో 30 కులాలు అత్యంత వెనకబడ్డాయని, ఇప్పటికి బడ్జెట్ కొన్ని కులలాలు ప్రస్తావన లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసేల చూశామని, తెలంగాణ వస్తే అందరికి న్యాయం జరుగుతుందని అనుకున్నామని, అలా జరగడం లేదని, ఎంబీసీలో ఎన్ని కులలా వస్తాయే ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదని, ఎంబీసీ సంఘం అధ్యక్షుడు అశయ్య అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss