Activities calendar

02 August 2017

22:07 - August 2, 2017
22:03 - August 2, 2017

హైదరాబాద్ : రాజకీయంగా ఎదగాలి...అందుకు సానుభూతి పొందాలి..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి...ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా పెట్టుకున్న విక్రం గౌడ్‌ తనపై తాను కాల్పులు జరిపించుకున్నారు...అందుకోసం అరకోటి సుపారీ ఒప్పందం చేసుకున్నారు... కాల్పుల ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా స్కెచ్ వేసిన విక్రంగౌడ్‌ను ఏ 1 గా చేర్చారు... హత్యాయత్నంతో సానుభూతితో పాటు ఫైనాన్షియర్ల నుంచి బయటపడాలని పథకం వేసి చివరకు దొరికిపోయాడు విక్రం...
అంతా తేలిపోయింది....
అంతా తేలిపోయింది....మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ తనయుడు విక్రంగౌడ్‌పై కాల్పుల ఘటనలో మిస్టరీ వీడిపోయింది... అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఐదు రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు...ఆరుగురు నిందితులను విచారించిన తర్వాత కొలిక్కి వచ్చిన కేసును పలు సెక్షన్లలో నమోదు చేసి వారిని అరెస్టు చూపించారు... ఆ ఐదుగురు చెప్పిన వివరాలు సేకరించిన పోలీసులు కాల్పుల ఘటనలో నిజాలను బయటకు తీశారు...నాలుగు నెలల క్రితమే పక్కా ప్లాన్ చేసిన విక్రంగౌడ్ తనపై కాల్పులు జరిపేలా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు...
50 లక్షల ఒప్పందంతో సుపారీ...
రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు..రాజకీయంగా ఎదగాలన్నా...తన ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలన్నా...అదే సమయంలో వ్యాపారంలో భాగస్వాములు...పెట్టుబడుల కోసం కోట్లలో అప్పులు ఇచ్చినవారికి ఝలక్ ఇవ్వాలన్నా ఒక్కటే మార్గమని తనపై తాను హత్యాయత్నానికి స్కెచ్ వేశాడు విక్రం...ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లుగా తనకు పరిచయాలున్న వారిని చేరదీసి వారికి కొంత డబ్బు ఇచ్చిన విక్రం నాలుగు నెలల క్రితం ప్లాన్ చెప్పాడు..తనపై కాల్పులు జరపాలని.. తద్వారా రాబోయే ఎన్నికల్లో సానుభూతి పొంది ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పడంతో అంతా సిద్దం చేసుకున్నారు....
అనుకున్నట్లుగానే కాల్పులు జరిపిన గ్యాంగ్..
నందకుమార్, షేక్ అహ్మద్, రయీజ్‌ఖాన్‌, గోవిందరెడ్డి, బాబుజాన్‌ వీరంతా ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసినవారిలో ఉన్నవారే...అనంతపురం జిల్లాకు చెందిన వీరంతా విక్రంకు పరిచయం..ఒక్కొక్కరూ ఒక్కో విధంగా పరిచయం ఏర్పడ్డం..అందులో గోవిందరెడ్డితో సినిమాలు నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకోవడం ఉన్నాయి...ఈ క్రమంలోనే గోవిందరెడ్డికి తన ప్లాన్ చెప్పిన విక్రం కాల్పులకు ముహూర్తం ఫిక్స్‌ చేశాడు...అనుకున్నట్లుగానే మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ చెందిన షార్ప్‌షూటర్ రయీజ్‌ఖాన్‌ను కలుసుకున్న వీరంతా ప్లాన్ అమలు చేశారు..శుక్రవారం రోజున తెల్లవారుజామున వచ్చిన వీరు కాల్పులు జరిపి పారిపోతూ తుపాకీని షేక్‌పేట చెరువులో పడేశారు....
అంతా ఫిక్స్‌ చేసింది విక్రమే...
ఇక అంతా అనుకున్నట్లే ప్లాన్ చేసుకున్న విక్రం అండ్‌ కో గ్యాంగ్‌కు మూడు రౌండ్లు కాల్చాలని చెప్పాడు..దీనిలో భాగంగానే వారు రెండు రౌండ్లు దిండులో పెట్టి చేతులపై కాల్పులు జరిపారు...బ్యాడ్‌లక్‌ ఓ బుల్లెట్ చేతుల్లోంచి దాటి దేహంలోని వెన్నుముక ప్రాంతంలోకి దూసుకెళ్లి ఆగిపోయింది....
విక్రంపైనే మొదటి నుంచి అనుమానాలు..
ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వీరి కోసం ఐదురాష్ట్రాల్లో గాలింపు చేశారు... అనంతలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత మద్యప్రదేశ్‌ ఇండోర్‌లో రయీజ్‌ను పట్టుకున్నారు...వీరి నుంచి సమాచారం..ఆ తర్వాత విక్రంను ఆస్పత్రిలో విచారించగా విషయం తేలిపోయింది. ప్రస్తుతం కార్పోరేట్ ఆస్పత్రిలో కోలుకుంటున్న విక్రంగౌడ్‌ డిశ్చార్జి కాగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు... ఈ కేసులో మరో ఇద్దరు ఉన్నారని ..వారి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

21:55 - August 2, 2017

ఢిల్లీ : బెంగళూరులో ఐటి దాడులు జరపడంపై పార్లమెంట్‌ దద్దరిల్లింది. పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌లో ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను భయపెట్టేందుకే ఐటి దాడులు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేవలం కర్ణాటక మంత్రి ఇళ్లపైనే దాడులు నిర్వహించినట్లు ప్రభుత్వం దాడులను సమర్థించుకుంది.
ఇది కక్షసాధింపు చర్య అంటూ నినాదాలు
బెంగళూరులో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంపై పార్లమెంట్‌లో తీవ్ర రగడ జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది కక్షసాధింపు చర్య అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. 
రాజ్యసభలో వాదోపవాదాలు 
రాజ్యసభలో ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలు, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మధ్య వాదోపవాదాలు జరిగాయి. రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలను భయపెట్టేందుకే మోది ప్రభుత్వం ఐటి దాడులకు పాల్పడిందని...ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌  దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలకు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలు బిజెపిపై ఉన్నందున ఆ పార్టీ నేతలపై దాడులు నిర్వహించాలన్నారు.
దద్దరిల్లిన లోక్‌సభ  
బెంగళూరులో ఐటి దాడులపై లోక్‌సభ కూడా దద్దరిల్లింది. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు.  కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. కాంగ్రెస్‌ ఆరోపణలపై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం చెబుతూ... గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్స్‌పై ఐటీ సోదాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు. ముందస్తు నిర్ణయం ప్రకారమే కర్ణాటక మంత్రి డికె శివకుమార్‌కు చెందిన స్థావరాలపైనే ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిందని జైట్లీ చెప్పారు.
9.5 కోట్లు స్వాధీనం 
కర్నాటక మంత్రి డికె శివకుమార్‌కు చెందిన 39 స్థావరాల ఐటి సోదాలు నిర్వహించింది. సుమారు 9.5 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్‌ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌లోని రూముల్లో సోదాలు నిర్వహించారు. 
లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు : కాంగ్రెస్‌ 
గుజరాత్‌లో ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. దీంతో భయపడ్డ కాంగ్రెస్‌ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గుజరాత్‌ నుంచి బెంగళూరు పంపించి క్యాంపు నిర్వహిస్తోంది. 44 మంది గుజరాత్‌ ఎమ్మెల్యేలకు కర్నాటక మంత్రి శివకుమార్‌ ఇన్‌చార్జ్‌గా  వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు నిర్వహించిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.  రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించింది. 

 

21:47 - August 2, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నేతలు..పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన బ్రహ్మానందరెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాబాయ్ భూమా నాగిరెడ్డి ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో.. అదే విధంగా తాను ఉంటానని .. ఆయన పేరు నిలబెడతానని స్పష్టం చేశారు. 

 

21:41 - August 2, 2017

హైదరాబాద్ : మంత్రిపదవిలో ఉండటానికి కేటీఆర్‌కు అర్హత లేదని వామపక్షాల నేతలు అన్నారు. మంత్రి కేటీఆర్‌ చట్టవిరుద్ధంగా శాసనభ్యుడిగా, మంత్రిగా కొనసాగుతున్నారని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వామపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం మంత్రి కేటీఆర్‌ శాసనభ్యత్వం డిస్‌క్వాలిఫై చేయాలన్నారు. హిమాన్షు మోటార్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న కేటీఆర్‌ తన సొంత కంపెనీకి ప్రభుత్వం తరపున 350కోట్ల రూపాయల బిజినెస్‌ ఆర్డర్‌ ఇచ్చారని లెఫ్ట్‌నేతలు స్పష్టం చేశారు. అయితే తాను 8 సంవత్సరాల క్రితమే కంపెనీతో సంబంధం తెంచుకున్నానని మంత్రి కేటీఆర్‌ చెప్పడం అబద్ధమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయన మంత్రిపదవిలో కొనసాగడానికి అర్హత లేదన్నారు. 

 

21:34 - August 2, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులపై కేసులు వేస్తూ కాంగ్రెస్‌ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రస్‌కు భవిష్యత్తు మీద బెంగపట్టుకుందన్నారు. కాంగ్రెస్‌పార్టీ వేస్తున్న కేసులవల్ల దాదాపు లక్షమంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంట్రాక్ట్‌ లెక్చర్స్‌, విద్యుత్‌ ఉద్యోగులు, హోం గార్డులకు జీతాలు పెంచడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. నెగెటివ్‌ ఆలోచనతో కాంగ్రెస్‌కే నష్టమని కేసీఆర్‌ అన్నారు.  

 

కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంపు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రెగ్యులరైజేషన్ కు కోర్టులు ఒప్పుకోవడం లేదు... అందుకే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. 
సచివాలయంలో పైరవీలు, దందాలు ఇప్పుడు లేవన్నారు. 

 

నేరెళ్ల ఘటన దళితులపై జరిగింది కాదు : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నేరెళ్ల ఘటన దళితులపై జరిగింది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. లారీలు తగులపెడితే వదిలిపెట్టాలా అని అన్నారు.

 

డ్రగ్స్ కేసులో నిబద్ధతతో పని చేస్తున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నిబద్ధతతో పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్ కేసులో కేబినెట్ మంత్రి ఉన్నా వదలొద్దని చెప్పానని తెలిపారు. డ్రగ్స్ పై ఎన్ సీబీ నివేదికలో తెలంగాణ అట్టడుగున ఉందన్నారు. 

కాంగ్రెస్ ది శిఖండి పాత్ర : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపిన నెహ్రూ తెలంగాణ గోస పోసుకుండని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ముల్కీ రూల్స్ ను రద్దు చేసి తెలంగాణ ఉద్యోగుల నోట్లో మట్టింది కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందన్నారు. 3 సంవత్సరాల్లో ఇసుక మీద వెయ్యి కోట్లు సంపాదించామని చెప్పారు. కాంగ్రెస్ చేతకానితన వల్లే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ నాశనమైందన్నారు. పిల్ లపై కాంగ్రెస్ వి పిల్లి శకునాలే అని అన్నారు. రెగ్యులరైజేషన్ చేయలేకపోయినా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచుతామని చెప్పారు.

కాంగ్రెస్...నెంబర్ వన్ విలన్ : కేసీఆర్

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై 20 రోజుల్లో 6 కేసులు వేశారని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయంటే కాంగ్రెస్ గుండెలు అదురుతున్నాయన్నారు. నిర్వాసితులకు కాంగ్రెస్ హయాంలో అరకొర సహాయమే అందిందని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ భూసేకరణలో కాంగ్రెస్ అడ్డుపుల్ల వేస్తుందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లపై కేసులు వేసి దివాళ కోరు రాజకీయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ దుస్థితికి నెంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అన్నారు.

 

20:41 - August 2, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే కమ్యూనిస్టులు, నవ తెలంగాణ పత్రికపై కస్సుబుస్సులాడారు. అధికారం ఆశించి కాంగ్రెస్ భంగపడిందన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ తమకే అధికారం వస్తదని ఆశపడి భంగపడిందని చెప్పారు. తెలంగాణ పోరాట సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన శైలి సక్రమంగా లేదన్నారు. కమిట్ మెంట్ లేకపోయిందన్నారు. ఓ ముఖ్యమంత్రి నిండు సభలో తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనంటే.. ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా ప్రశ్నించలేదని గుర్తించారు. అనేక అవమానాలు, చీత్కారాలు అనుభవించి రాష్ట్రం సాధించుకున్నామన్నారు. చిల్లర మల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందన్నారు. 
అభవృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ 
నీటి పారుదల ప్రాజెక్టులపై 164 కేసులు పెట్టారని తెలిపారు. అభవృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పై ఉద్యోగాలు ఇస్తే కేసులు, మిషన్ భగీరథపై కేసులు పెడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలి వేస్తోందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను చంద్రబాబు ప్రవేశపెడితే.. కాంగ్రెస్ పెంచి పోషించిందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ కే నష్టమన్నారు. కాంగ్రెస్ దుష్ట ఆలోచనను తిప్పికొడతామని చెప్పారు. కాళేశ్వరంపై 119 కేసులు పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్.. విషపూరిత విలన్ అని సీఎం కేసీఆర్ అభిర్ణించారు. తెలంగాణ దుస్థితికి కారణం కాంగ్రెస్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రజల పాలిట పిచాశి కాంగ్రెస్ అని చెప్పారు. 
కాంగ్రెస్.. నెంబర్ వన్ విలన్.. 
కాళేశ్వరం ప్రాజెక్టుపై 20 రోజుల్లో 6 కేసులు వేశారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయంటే కాంగ్రెస్ గుండెలు అదురుతున్నాయన్నారు. నిర్వాసితులకు కాంగ్రెస్ హయాంలో అరకొర సహాయమే అందిందని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ భూసేకరణలో కాంగ్రెస్ అడ్డుపుల్ల వేస్తుందన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లపై కేసులు వేసి దివాళ కోరు రాజకీయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ దుస్థితికి నెంబర్ వన్ విలన్.. కాంగ్రెస్ అన్నారు.
కాంగ్రెస్ ది శిఖండి పాత్ర 
హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపిన నెహ్రూ తెలంగాణ గోస పోసుకుండని గుర్తు చేశారు. ముల్కీ రూల్స్ ను రద్దు చేసి తెలంగాణ ఉద్యోగుల నోట్లో మట్టింది కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శిఖండి పాత్ర పోషిస్తోందన్నారు. 3 సంవత్సరాల్లో ఇసుక మీద వెయ్యి కోట్లు సంపాదించామని చెప్పారు. కాంగ్రెస్ చేతకానితన వల్లే తెలంగాణ మైనర్ ఇరిగేషన్ నాశనమైందన్నారు. పిల్ లపై కాంగ్రెస్ వి పిల్లి శకునాలే అని అన్నారు. రెగ్యులరైజేషన్ చేయలేకపోయినా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచుతామని చెప్పారు. తెలంగాణలో గుడుంబా, పేకాట బంద్ చేయించామని తెలిపారు. 
డ్రగ్స్ కేసులో నిబద్ధతతో పని చేస్తున్నాం...
డ్రగ్స్ కేసులో నిబద్ధతతో పని చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులో కేబినెట్ మంత్రి ఉన్నా వదలొద్దని చెప్పా.. డ్రగ్స్ పై ఎన్ సీబీ నివేదికలో తెలంగాణ అట్టడుగున ఉందన్నారు. 
నేరెళ్ల ఘటన దళితులపై జరిగింది కాదు..
నేరెళ్ల ఘటన దళితులపై జరిగింది కాదన్నారు. లారీలు తగులపెడితే వదిలిపెట్టాలా అని అన్నారు. రెగ్యులరైజేషన్ కు కోర్టులు ఒప్పుకోవడం లేదు... అందుకే కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నామని చెప్పారు. 
సచివాలయంలో పైరవీలు, దందాలు ఇప్పుడు లేవన్నారు. 
కమ్యూనిస్టు పార్టీలపై విసుర్లు
రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు గతించి పోయిన పార్టీలని ఎద్దేవా చేశారు. మూడు వందల సంఘాలు మహాకూటమిగా అయి.. 350 ఓట్లు రాలేదన్నారు. కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము 30 పార్టీలతో జతకట్టామని చెప్పారు.
నవతెలంగాణ పత్రికపై కస్సుబుస్సు...
నవతెలంగాణ పత్రికపై కస్సుబస్సులాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో వేములఘాట్ గ్రామస్తుల దుస్థితిపై కథనాలు రాసిన ఆ పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్ బిజెపి నేతలు ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. సింగూరు నీటిని బందు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని తానేనని అన్నారు.
 

ఎల్‌ఐసి మెయిన్‌ బ్రాంచ్‌లో దోపిడీ

విశాఖ : ద్వారకానగర్‌ ఎల్‌ఐసి మెయిన్‌ బ్రాంచ్‌లో లక్షా 72 వేల రూపాయలు మాయమయ్యాయి. నగదు అదృశ్యంపై ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎల్‌ఐసి సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యాష్‌ కౌంటర్‌లో 2 వేల రూపాయల నోట్లు 86 మాయమైనట్లు గుర్తించారు. ఎల్‌ఐసి సిబ్బంది ఫిర్యాదుతో ఘటనా స్థలానికి సీసీఎస్‌ ఎసిపి, ఎస్‌ఐ చేరుకున్నారు. సిసి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

 

20:20 - August 2, 2017

విశాఖ : ద్వారకానగర్‌ ఎల్‌ఐసి మెయిన్‌ బ్రాంచ్‌లో లక్షా 72 వేల రూపాయలు మాయమయ్యాయి. నగదు అదృశ్యంపై ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులపై ఎల్‌ఐసి సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యాష్‌ కౌంటర్‌లో 2 వేల రూపాయల నోట్లు 86 మాయమైనట్లు గుర్తించారు. ఎల్‌ఐసి సిబ్బంది ఫిర్యాదుతో ఘటనా స్థలానికి సీసీఎస్‌ ఎసిపి, ఎస్‌ఐ చేరుకున్నారు. సిసి ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

20:16 - August 2, 2017

తూర్పుగోదావరి : ప్రభుత్వాసుపత్రికి వెళ్తే  క్షేమంగా తిరిగి రామంటూ అందరూ సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. ఈ అభిప్రాయం తప్పని రుజువు చేసే ప్రయత్నం చేశారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి. ఏజెన్సీ ప్రాంతంలోని ఏరియా ఆసుపత్రిలో పురుడు పోసుకోవడం ద్వారా ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలపై ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
ఏరియా ఆసుపత్రిలో మహిళా సబ్ కలెక్టర్ ప్రసవం 
తన బిడ్డని చూసుకుని మురిసిపోతున్న ఈయన దినేష్‌కుమార్. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌. ఈయన సతీమణి విజయకృష్ణన్‌ కూడా ఐఏఎస్‌ అధికారిణే. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. విజయకృష్ణన్ బుధవారం ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అనుకోకండి. ఇక్కడే ఉంది అసలు కథ. ఏజెన్సీ ప్రాంతంలో ఆసుపత్రులంటే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. పేద ప్రజలకు ముఖ్యంగా గిరిజనులకు ప్రభుత్వ వైద్య సేవలపై భరోసా కల్పించేందుకు ఈ ఐఏఎస్ దంపతులు నిర్ణయించుకున్నారు. అందుకే, గర్భిణి అయిన విజయకృష్ణన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలని తీర్మానించుకున్నారు. ఆ ప్రకారమే, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుల్ని సంప్రదించి సూచనలు తీసుకున్నారు. వారి సూచన ప్రకారం బుధవారం విజయకృష్ణన్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చారు దినేష్ కుమార్. ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు బాబును క్షేమంగా బయటకు తీశారు. పేద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఐఏఎస్ దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. 

 

20:11 - August 2, 2017

కర్నూలు : టీడీపీ తనను తీవ్రంగా అవమానపరిచిందని శిల్పా చక్రపాణి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు ఫ్యాక్స్ చేశారు. గురువారం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో తాను వైసిపిలో చేరుతున్నట్లు శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని భుజాల మీద మోస్తానని చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. 

 

20:08 - August 2, 2017

హైదరాబాద్ : బెల్ట్‌ షాపులను పూర్తిగా తొలగించాలని... ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఇప్పటి వరకూ ఎన్ని బెల్ట్‌ షాపులను తొలగించారని.. ఎన్ని కేసులు నమోదు చేశారనే వివరాలను చంద్రబాబునాయుడు  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా... చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే... మద్యం షాపుల లైసెన్స్‌లను రద్దు చేయాలని సూచించారు. అలాగే అధక ధరలకు ఇసుక అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

 

విషపూరిత విలన్ కాంగ్రెస్ : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్.. విషపూరిత విలన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ దుస్థితికి కారణం కాంగ్రెస్ అని తెలిపారు. తెలంగాణ ప్రజల పాలిట పిచాశి కాంగ్రెస్ అని చెప్పారు. 

కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను పెంచిపోషించిన కాంగ్రెస్

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను చంద్రబాబు ప్రవేశపెడితే.. కాంగ్రెస్ పెంచి పోషించిందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కాంగ్రెస్ కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ కే నష్టమన్నారు. కాంగ్రెస్ దుష్ట ఆలోచనను తిప్పికొడుతామని చెప్పారు. కాళేశ్వరంపై 119 కేసులు పెట్టారని పేర్కొన్నారు. 

అధికారం ఆశించి కాంగ్రెస్ భంగపడింది : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : అధికారం ఆశించి కాంగ్రెస్ భంగపడిందని సీఎం కేసీఆర్ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై 164 కేసులు పెట్టారని తెలిపారు. అభవృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పై ఉద్యోగాలు ఇస్తే కేసులు, మిషన్ భగీరథపై కేసులు పెడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపాలని కాంగ్రెస్ కుట్రలు  చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే జాలి వేస్తోందన్నారు. 

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్ : కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఆశించి కాంగ్రెస్ భంగపడిందన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీ తమకే అధికారం వస్తదని ఆశపడి భంగపడిందని చెప్పారు. కాంగ్రెస్ వ్యవహరించిన శైలి, కమిట్ మెంట్ లేకపోయిందన్నారు. ఓ ముఖ్యమంత్రి నిండు సభలో తెలంగాణకు ఒక్కరూపాయి ఇవ్వనంటే.. ఒక్క కాంగ్రెస్ సభ్యుడు ప్రశ్నించలేదని గుర్తించారు. అనేక అవమానాలు, చీత్కారాలు అనుభవించి రాష్ట్రం సాధించుకున్నామన్నారు. చిల్లర మల్లర రాజకీయాలు చేయొద్దన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి  నెలకొందన్నారు. 

19:40 - August 2, 2017

హైదరాబాద్ : మంత్రి పదవిలో కొనసాగడానికి కేటీఆర్ అనర్హుడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. కేటీఆర్ మంత్రిగా కొనసాగుతూ ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్ గా ఉండటం చట్ట విరుద్ధమన్నారు. మంత్రి వర్గం నుంచి కేటీఆర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయాలన్నారు. ఈమేరకు లెఫ్ట్ పార్టీలు ఈసీని కలిసి, హిమాన్షు మైటార్స్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హిమాన్షు మోటార్స్ లో 3 లక్షల షేర్లు ఉన్నట్లు ఎన్నికల అఫడవిట్ లో మంత్రి కేటీఆర్ స్పష్టం చెప్పినట్లు తమ్మినేని చెప్పారు. 2017 సం.లో కేటీఆర్ డిజిటల్ సిగ్నేచర్ తో వార్షిక రిటర్న్స్ దాఖలు చేశారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పై ఆరోపణలపై సీఎం కేసీఆర్ స్పందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్ర ఎన్నికల అధికారులు హామీ ఇచ్చారని తమ్మినేని తెలిపారు. 

19:17 - August 2, 2017

హైదరాబాద్ : తమ పార్టీపై టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ను తాము అడ్డకుంటున్నట్టు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం తమ మ్యానిఫెస్టోలోనే పెట్టామని ఆయన తెలిపారు. అయితే..  ప్రభుత్వం పెట్టిన నింబంధనల ప్రకారం క్రమబద్దీకరణ జరగడంలేదని మాత్రమే తాము అంటున్నామని పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌వాళ్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి కాంగ్రెస్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టడం సరికాదన్నారు. 

 

18:59 - August 2, 2017

కరీంనగర్ : నేరెళ్ల బాధితులకు కరీంనగర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాసేపట్లో 8 మంది నిందితులు బయటకు రానున్నారు. 22 రోజుల పాటు శిక్ష అనుభవించిన నిందితులకు.. కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఇవాళ విడుదలవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:52 - August 2, 2017

ఢిల్లీ : బెంగళూరులో గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడుల చేయడంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని....ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీల నేతలపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్రం తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ మంత్రి ఇంటిపై ఐటి దాడులు నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి అనంతకుమార్‌ స్పష్టం చేశారు. గుజరాత్‌లో వరదలతో ప్రజలు సతమతమవుతుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఈగిలిటన్‌ రిసార్ట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

18:45 - August 2, 2017

ఢిల్లీ : బెంగళూరులో గుజరాత్‌ ఎమ్మెల్యేలు బస చేస్తున్న ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడుల చేయడంపై రాజ్యసభలో తీవ్ర రగడ జరిగింది. సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్‌ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది కక్షసాధింపు చర్య అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేస్తున్న రిసార్ట్స్‌పై ఐటీ అధికారులు  దాడి చేయడాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ తప్పుపట్టారు. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సమాధానం చెబుతూ... గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్స్‌పై ఐటీ దాడులు జరగలేదన్నారు. జైట్లీ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఉపాధ్యక్షుడు  కురియన్‌ రాజ్యసభను  కొద్దిసేపు వాయిదా వేశారు. 

18:37 - August 2, 2017

కర్నాటక : బెంగళూరులో గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఎమ్మెల్యేలు ఉంటున్న అన్ని గదుల్లో సోదాలు నిర్వహించారు. ముందుగా కర్నాటక మంత్రి శివకుమార్‌ నివాసంలో తనిఖీలు చేసిన ఐటీ అధికారులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు బసచేసిన ఈగిల్‌టన్‌ రిసార్ట్స్‌లోని రూముల్లో సోదాలు నిర్వహించారు. గుజరాత్‌లో ఈ నెల 8న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వలసోతున్నారు. ఐదుగురు శాసనసభ్యులు బీజేపీలో చేరారు. దీంతో భయపడ్డ కాంగ్రెస్‌ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు గుజరాత్‌ నుంచి బెంగళూరు పంపించి  క్యాంపు నిర్వహిస్తోంది. 42 మంది గుజరాత్‌ ఎమ్మెల్యేలకు కర్నాటక మంత్రి శివకుమార్‌ ఇన్‌చార్జ్‌గా  వ్యవహరిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున అహ్మద్‌పటేల్‌ పోటీ చేస్తున్నారు. అహ్మద్‌పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

18:22 - August 2, 2017

పనాజీ : గోవాలో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికల కోసం ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ ఇవాళ నామినేషన్‌ వేశారు. పణజీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. పణజి స్థానం నుంచి పారీకర్‌ ఐదు సార్లు ఎంపికయ్యారు. మోది ప్రభుత్వంలో రక్షణమంత్రిగా పనిచేసిన పారీకర్‌ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గోవా ఎన్నికల్లో బిజెపి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పారీకర్‌ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఆగస్ట్‌ 23న గోవాలో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. పారీకర్‌ కోసం బిజెపి ఎమ్మెల్యే సిద్ధాంత్‌ కున్‌కోలింకర్‌ పణజి స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోంది.

18:14 - August 2, 2017

తూర్పుగోదావరి : జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా తెలుగు దేశం పార్టికి చెందిన జ్యోతుల నవీన్‌,  వైస్‌ చైర్మన్‌గా పెండ్యాల నళినికాంత్ ఎన్నికయ్యారు. కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర వీరిచే ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని చైర్మన్‌ జ్యోతుల నవీన్‌ తెలిపారు. 

 

18:11 - August 2, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ బాలింత విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మిదేవిపల్లి మండలం సీతారాంపురానికి చెందిన నునావత్‌ కవిత ప్రసవం కోసం గత నెల 21న ఆస్పత్రిలో చేరింది. ఆమెకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి.. బిడ్డను అప్పగించారు. అయితే వైద్యులు వేసిన కుట్లు విడిపోయి..ఆమె నొప్పితో బాధపడుతుంది. కుట్లు విడిపోయాయని చెబుతుంటే వైద్యులు పట్టించుకోవడం లేదని .. అడిగితే ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లిపోమని అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

 

18:06 - August 2, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ కాల్పుల డ్రామాలో పోలీసులు ట్విస్ట్‌లు బయటపెట్టారు. తనపై కాల్పుల డ్రామాకు విక్రమ్‌గౌడ్‌ స్వయంగా ప్లాన్‌ చేసినట్టు హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. తన దగ్గర పనిచేసే ప్రసాద్‌ ద్వారా, గోవింద్‌రెడ్డి, అతనిద్వారా నందకుమార్‌..ఇలా నిందితులతో పరిచయం పెంచుకున్న విక్రమ్‌గౌడ్‌ కాల్పాలు డ్రామాకు తెరతీశారని తెలిపారు. దీనికోసం 50లక్షలతో డీల్‌ కుదుర్చుకున్నట్ట స్పష్టం చేశారు. అడ్వాన్స్‌గా గోవిందరెడ్డికి 5లక్షలు ఇచ్చినట్టు పోలీసులు వివరించారు. 

 

'48 మంది అధికారులపై అవినీతి కేసులు'

ఢిల్లీ: 48 మంది అధికారులపై అవినీతి కేసులు ఉన్నాయని కేంద్రం పార్లమెంట్ కు తెలిపింది. వీరిలో 23 మంది ఐఏఎస్ లు, ముగ్గురు ఐపీఎస్ లు, 22 మంది ఐపీఎస్ ఆఫీసర్ల పై ప్రాసిక్యూషన్ అనుమతిచ్చామని తెలిపింది. 2014 నుంచి ఇప్పటి వరకు 13 మందిని డిస్మిస్ చేశామన్నారు.

విశాఖ ఎల్ ఐసీ మెయిన్ బ్రాంచ్ లో దోపిడీ

విశాఖ: ఎల్ ఐసీ మెయిన్ బ్రాంచ్ లో దోపిడీ జరిగింది. రూ.1.70 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. దోపిడీకి పాల్పడింది. బీహార్ ముఠా అనుమానిస్తున్నారు.

17:48 - August 2, 2017

విజయనగరం : వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేచింది. పొలిటికల్‌ నిరుద్యోగులంతా నియోజకవర్గాల పెంపుపైనే ఆశలు పెంచుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కోసం వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  విజయనగరం జిల్లాలోని రాజకీయ నిరుద్యోగులు నియోజకవర్గాల పెంపుపై గంపెడాశలు పెంచుకున్నారు. విజయనగరం జిల్లాలోని పవర్‌ పాలిటిక్స్‌పై కథనం...
విజయనగరంలో ప్రస్తుతం 9 అసెంబ్లీ సీట్లు
విజయనగరం జిల్లాలో పునర్విభజనకు ముందు 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 9 అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం ఉన్నాయి. నియోజకవర్గాల పుర్విభజన తర్వాత ఉత్తరావల్లి, సతివాడ, తెర్లాం అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా రద్దయ్యాయి.  బొబ్బిలి పార్లమెంట్‌ స్థానాన్ని కూడా రద్దు చేశారు. విజయనగరం జిల్లాలోని ఒకేఒక్క ఎంపీ స్థానం నుంచి కేంద్రమంత్రి అకోశ్‌గజపతిరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు
2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్న వార్తలు వస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.  నియోజకవర్గ పునర్విభజన బిల్లును కేంద్రం ఏ క్షణంలోనైనా ఆమోదించవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగాసాగుతోంది. ఇదే జరిగితే విజయనగరం జిల్లాలో మరో రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న ప్రచారమూ సాగుతోంది.  విజయనగరం పట్టణం కేంద్రం ఒక నియోజకవర్గం, రూరల్‌ పరిధి మరో నియోజకవర్గంగా మారే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
అసెంబ్లీ సీట్లు పెరిగితే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధే
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ స్థానాలకు మరో రెండు జత కలుస్తాయి. దీంతో నియోజకవర్గాల సంఖ్య 11కు చేరుతుంది. ఇదే జరిగితే రద్దైన నియోజకవర్గాల్లో ఉనికి కోల్పోయిన నేతలకు రాజకీయ పునరావాసం లభించనుంది. ప్రధానంగా తెర్లాం నియోజకవర్గంలో దశాబ్దాలపాటు రాజకీయాలు చేసిన మాజీ ఎమ్మెల్యే తెంటు  జయప్రకాశ్‌ కుమారుడు లక్ష్మునాయుడు పోటీచేసే అవకాశం కనిపిస్తోంది.  గత ఎన్నికల్లో ఆయన బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీచేసి పరాజయం పొందారు. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి నుంచి ఆయన పోటీ చేయడానికి అవకాశాలు దాదాపులేనట్టే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరడంతో లక్ష్మునాయుడికి పోటీచేసే అవకాశం ఉండదు. మళ్లీ తెర్లాం నియోజకవర్గం ఏర్పడితే ఆయన పోటీచేయడానికి అవకాశం వస్తుంది. విజయనగరం రూరల్‌ నియోజకవర్గం ఏర్పడితే మరికొంతమంది పొలిటికల్‌ నిరుద్యోగులకు ఉపాధి లభించినట్టవుతుంది. ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యే స్థానం నుంచి మీసాలగీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో అశోక్‌గజపతిరాజు కుమార్తె అతిథి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మీసాల గీత రూరల్‌ నుంచి పోటీ చేసే ఛాన్స్‌ ఉంది.  మొత్తంమీద జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెరిగితే... మరికొంత మందికి పోటీచేసే ఛాన్స్‌ లభిస్తుంది. మరి కేంద్రం ఏపీలోని ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను పెంచుతుందా? లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

 

మంత్రి పదవిలో కొనసాగడానికి కేటీఆర్ అనర్హుడు: తమ్మినేని

హైదరాబాద్: కేటీ ఆర్ పై ఆరోపణల పై కేసీఆర్ స్పందించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రి గా కొనసాగుతూ ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్ గా ఉండటం చట్ట విరుద్ధమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. లెఫ్ట్ పార్టీ ఈసిని కలిశాయి. హిమాన్షు మైటార్స్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...హిమాన్షు మోటార్స్ లో 3 లక్షల షేర్లు ఉన్నట్లు ఎన్నికల అఫడవిట్ లో మంత్రి కేటీఆర్ స్పష్టం చెప్పినట్లు తమ్మినేని చెప్పారు.

17:43 - August 2, 2017

హైదరాబాద్ : ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి సీట్ల పెంపు తప్పదని అధికార పార్టీ భావిస్తుండగా... కేంద్రం తాజా ప్రకటనతో సందిగ్ధంలో పడింది. అయితే... ఎలాగైనా చంద్రబాబు కేంద్రంతో చర్చించి సీట్లు పెంచేందుకు యత్నిస్తారని.. అధికార పార్టీ నేతలంతా నమ్మకంతో ఉన్నారు. అయితే.. సీట్లు పెంచకపోవడం తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. విభజన బిల్లులో పెంపు అంశమే లేదని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతుండగా... పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. 
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు   
ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో అనేకమంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఖాయమని భావించిన టీడీపీ చేరిన ప్రతి ఒక్కరికీ పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే... అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందా ? లేదా ? అనే టెన్షన్‌ నేతల్లో కనిపిస్తోంది. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరగకపోతే... పోటీకి ఎవరికీ అవకాశమిస్తారోనన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నేతలంతా ఎదురుచూస్తున్నారు. అయితే... తన చాణక్యంతో చంద్రబాబు ఎలాగైనా నియోజకవర్గాల సంఖ్యను పెంచిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఇదిలావుంటే... జగన్‌ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికే వేరే వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. నియోజకవర్గాలు పెంచకపోతే తమకు కలిసివస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీలో పార్టీ చేరిన ఎమ్మెల్యేలు, పాత నేతలకు విభేదాలు తలెత్తుతాయని భావిస్తున్నారు. ఇవన్నీ తమకు అనుకూలంగా మారుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి కేంద్రం తాజా నిర్ణయంతో వైసీపీ సంతోషం వ్యక్తం చేస్తుండగా... అధికార పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. అయితే ఈ నిర్ణయం వైసీపీకి ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి. 

 

విద్యుత్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై హైకోర్టు స్టే

హైదరాబాద్: హైకోర్టులో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ కేసు విచారణ జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎలాంటి ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

17:38 - August 2, 2017

ఢిల్లీ : ఎస్సీలను ఏబీసీడీ  కేటగిరీలుగా వర్గీకరించాలని డిమాండ్‌ చేస్తూ... ఢిల్లీలోని  జంతర్‌మంతర్‌ వద్ద  మాదిగ జేఏసీ, టీఎంఆర్పీఎస్‌  మహా ధర్నా చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని  ఎంఆర్పీఎస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. వెంకయ్యనాయుడు మాదిగలను ఉపయోగించుకుని ఉప రాష్ట్రపతి అయ్యారని ఆరోపించారు.  బీజేపీ మాదిగలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని విమర్శించారు. 

 

17:36 - August 2, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై సీఎం కేసీఆర్‌ సైలెంట్‌గా ఉండటాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ వి.హన్మంతరావు ఖండించారు. హైదరాబాద్‌లో కూర్చొని స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా.. బాధితులను కలుసుకుని అసలేం జరిగిందో తెలుసుకోవాలన్నారు. ఇసుక మాఫీయా మాయలో పడి అమాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందని వీహెచ్‌ ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లే ముఖ్యమా.. మనుషుల ప్రాణాలు కాదా..? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమేనా..? హైదరాబాద్‌లో కుర్చునొ స్టేట్‌మెంట్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని విమర్శించారు.

మంత్రిగా వుంటూ డైరెక్టర్ గా ఉండటం చట్ట విరుద్ధం: తమ్మినేని

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రి గా కొనసాగుతూ ప్రైవేటు కంపెనీలో డైరెక్టర్ గా ఉండటం చట్ట విరుద్ధమని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం తెలిపారు. లెఫ్ట్ పార్టీ ఈసిని కలిశాయి. హిమాన్షు మైటార్స్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ...హిమాన్షు మోటార్స్లో 3 లోల షేర్లు ఉన్నట్లు ఎన్నికల అఫడవిట్ లో మంత్రి కేటీఆర్ స్పష్టం చెప్పినట్లు తమ్మినేని చెప్పారు.

ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్: ఇంటర్ బోర్డు కార్యదర్శి

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్, వర్చువల్ క్లాస్ రూమ్ లు అందుబాటులోకి స్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. ఇంటర్ విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

17:14 - August 2, 2017

హైదరాబాద్ : మాజీమంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ కేసులో అనేక విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉందని... కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్ అన్నారు.. విక్రమ్‌ గౌడ్‌ చెప్పినదానికి... ప్రస్తుతం వస్తున్న వార్తలకు మధ్య చాలా తేడాఉందని చెప్పారు.. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు..

 

17:11 - August 2, 2017

ఢిల్లీ : ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును 6.5 నుంచి 6శాతానికి , రివర్స్‌రెపోరేటును 6 నుంచి 5.75శాతం తగ్గించింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించింది. 

 

నేరేళ్ల బాధితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

కరీంనగర్ : నేరేళ్ల బాధితులకు కరీంనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాసేపట్లో 8 మంది బాధితులు బయటకు రానున్నారు. 22 రోజుల పాటు శిక్ష బాధితులు శిక్ష అనుభవించారు.

గ్రామీణ వికాస్ బ్యాంక్ లో సిట్ అధికారులు తనిఖీలు

ఖమ్మం : సీఎం బంజరలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

 

తెలంగాలో ముఖం చాటేసిన వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ లో జులై చివరి వారంలో వర్షాలు ముఖం చాటేశాయి. హైదరాబాద్ లో 91శాతం, రంగారెడ్డిలో 94 శాతం, ఆదిలాబాద్ లో 99 శాతం వర్షపాతం నమోదు అయ్యాయి. జులై చివరి వారంలో తెలంగాణ లో 76శాతం వర్షపాతం నమోదయ్యింది.

రాయలసీమలో మరోసారి కమ్మేసిన కరవు ఛాయలు

హైదరాబాద్: రాయలసీమలో మరోసారి కరువు ఛాయలు కమ్మేశాయి. జులైలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. చిత్తూరులో సగటు వర్షపాతం 102 మి.మీ కాగా జులైలో 67.2 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కడపలో సగటు వర్షపాతం 96.7 మి.మీ కాగా నమోదైన వర్షపాతం 46.0 మి.మీ లు నమోదు అయ్యింది. అనంతపురంలో జులైలో వర్షపాతం 67.4 మిమీ కాగా 31 మిమీ లు నమోదు అయ్యింది. కర్నూలు లో సగటు వర్షపాతం 117 మి.మీ కాగా 55.5 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

16:41 - August 2, 2017

మహిళలపై వరకట్న వేధింపులు, గృహ హిసంకు సంబంధించిన చట్టం ఐపీసీ 498ఎ అని లాయర్ పార్వతి అన్నారు. ఐపీసీ 498ఎ చట్టం...గురించి వివరించారు. మహిళలకు ఉన్న మంచి చట్టం 498 ఎ ఐపీసీ అని చెప్పారు. మహిళలను వివక్ష నుంచి కాపాడడం కోసం, హక్కుల పరిరక్షణ కోసం ఈ చట్టం తీసుకొచ్చారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఢిల్లీ : ఢిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌ నుంచి నాలుగు బోగీలు వేరు పడిన ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. యూపీలోని అలీఘర్‌ జిల్లా కుర్జా స్టేషన్‌ సమీపంలో ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంజిన్‌ నుంచి వేరుపడిన నాలుగు బోగీలు అక్కడే నిలిచిపోగా.. మిగిలిన బోగీలు, ఇంజిన్‌ కొంతదూరం పాటు ప్రయాణించాయి. అనంతరం మళ్లీ రైలుకు యథావిధిగా బోగీలను అనుసంధానించడంతో రైలు తిరిగి బయల్దేరింది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 98 పాయింట్లు నష్టపోయి 32,476 వద్ద సెన్సెక్స్ ముగియగా, 33 పాయింట్లు నష్టపోయి 10,081 వద్ద నిఫ్టీ ముగిసింది.

నంద్యాలలో నా సోదరుడి గెలుపు ఖాయం: చక్రపాణి రెడ్డి

కర్నూలు : టిడిపి అధిష్టానంతో విభేదాలు లేవని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి తెలిపారు. స్థానిక నాయకత్వంతో విభేదాలే రాజీనామాకు కారణం అని, రేపు నంద్యాలలో జగన్ సమక్షంలో వైసీపీ లో చేరతా అని స్పష్టం చేశారు. టీడీపీలోకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే అందుకు నేనూ సిద్ధమే అని శిల్పా చక్రపాణి శెలవిచ్చారు. నంద్యాలలో నా సోదరుడి గెలుపు ఖాయం అని స్పష్టం చేశారు.

ఏపీలో 10న విద్యాసంస్థ ల బంద్ కు పిలుపు

విజయవాడ: విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 10న విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.

శరద్ యాదవ్ కొత్త పార్టీ..?

పాట్నా: ఎన్డీయేతో నితీశ్ మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌డంపై అసంతృప్తిగా ఉన్న శ‌ర‌ద్ యాద‌వ్ జేడీ (యూ)ని వీడి మ‌రో కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏతో పొత్తుకు ఆయ‌న ఆస‌క్తి చూపుతున్నారు.

విక్రమ్ గౌడ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు: సీపీ

హైదరాబాద్: విక్రమ్‌గౌడ్ పక్కా ప్రణాళిక ప్రకారమే కాల్పులు జరిపించుకున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటనలో 8 మందిపై కేసులు నమోదు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...నిందితుల కోసం ఐదు రాష్ట్రాలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో విస్తృతంగా గాలించామని తెలిపారు.విక్రమ్ గౌడ్ కేసులో మొత్తం 9 మంది నిందితులుగా గుర్తించామని, విక్రమ్ గౌడ్ సహా ఆరుగురు పోలీసుల కస్టడీలో ఉన్నారన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే విక్రమ్ గౌడ్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెడతామన్నారు. ఇందులో విక్రమ్‌గౌడ్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు.

0.25 శాతం రెపోరేటును తగ్గించిన ఆర్బీఐ

ఢిల్లీ: 0.25 శాతం రెపోరేటును ఆర్బీఐ తగ్గించింది. రెపో రేటు 6.25 నుండి 6 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. ఏడేళ్ల కనిష్టస్థాయికి రెపోరేటు తగ్గింది. రివర్స్ రెపోరేటు 5.75 శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది. ఏప్రిల్, మే నెలల్లో పారీశ్రామిక రంగం పనితీరు మందగించిందని తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తగ్గించడమే లక్ష్యం అని ఆర్బీఐ పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడులను పునర్ నిర్మాణం చేయడం తక్షన అవసరమని ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ స్పష్టం చేశారు.

జంతర్ మంతర్ దగ్గర మాదిగ జేఏసీ, ఎమ్మార్పీఎస్ మహాధర్నా

ఢిల్లీ : జంతర్ మంతర్ దగ్గర మాదిగ జేఏసీ, ఎమ్మార్పీఎస్ మహాధర్నా చేపట్టింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం తెలుగు రాష్ట్రాల వరకైనా ఎస్సీ వర్గీకరణకు అవకాశమివ్వాలని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బిజెపికి వ్యతిరేకంగా ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు.

15:06 - August 2, 2017

విజయవాడ : ప్రతి నెల గ్యాస్‌ ధర నెలకు 4 రూపాయల చొప్పున పెంచాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో సిపిఎం నేతలు, మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రధాని మోది దిష్టిబొమ్మ దహనం చేశారు. గ్యాస్‌ ధర పెంపుపై ప్రజాసంఘాలు, మహిళలు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి 

 

14:57 - August 2, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో విక్రమ్‌గౌడ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నానికి అపోలో డాక్టర్లు బ్రేక్‌ వేశారు. కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్‌కు చికిత్స కొనసాగిస్తున్నామని పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ దశలో అరెస్టుకు వీలులేదని చెప్పారు.   దీంతో విక్రమ్‌ను అరెస్టు చేసేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెనుతిరిగి వెళ్లారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన తర్వాతే విక్రమ్‌గౌడ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. మరోవైపు  విక్రమ్‌ గౌడ్‌పై కాల్పుల కేసులో అరెస్టు చేసిన ఆరుగురు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇండోర్‌కు చెందిన షార్ప్‌ షూటర్‌ నందు, హైదరాబాద్‌కు చెందిన అహ్మద్‌తోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఆయుధాల చట్టంతోపాటు, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. 

14:51 - August 2, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. పీవీకేకే ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి చెందిన పీవీకేకే కాలేజీలో ర్యాగింగ్ భూతం జడలువిప్పింది. సీనియర్లు బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి నితీష్‌కుమార్‌ రెడ్డి గొంతు కోశారు. నితీష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నితీష్ కు 13 కుట్లు పడ్డాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

కాంగ్రెస్ లో వృత్తి నిపుణల విభాగం ఏర్పాటు

ఢిల్లీ: కాంగ్రెస్ లో వృత్తి నిపుణల విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి వైస్ ఛైర్మన్, వెస్ట్ జోన్ కో ఆర్డినేటర్ గా మిలింద్ దేవ్ రా, దక్షిణ సమన్వయ కర్తగా గీతారెడ్డి,తూర్పు సమన్వయ కర్తగా గౌరవ్ గగోయ్, ఉత్తరాది సమన్వయ కర్తగా సాల్వన్ సోజ్ నియమితులయ్యారు.

కరీంనగర్ లో మైహోం గ్రాండ్ రెస్టారెంట్ పై టాస్క్ ఫోర్స్ ఎటాక్

కరీంనగర్ : మైహోం గ్రాండ్ రెస్టారెంట్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. పాచిన, కుళ్లిన పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు నిర్ధారించారు.

14:13 - August 2, 2017

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఈ ప్రజాప్రతినిధులు.. అధికారాలను అనుభవించడమే కాదు.. జీహెచ్ ఎంసీ చట్టంలోని సెక్షన్ 630 ప్రకారం బాధ్యతగానూ వ్యవహరించాలి.. తమ డివిజన్లలో ప్రజల అవసరాలు గుర్తించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి. సమాజంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన వారు..వీరి తనయులు కూడా అదే స్థాయిలో వ్యవహరించాల్సి ఉంటుంది.. కానీ కొంతమంది కార్పొరేటర్లు..వారి తనయులు..అనుచరుల వ్యవహార శైలి తీవ్ర దుమారం రేపుతోంది. రోజు రోజుకు వారి దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయి.

కడ్తాల్ టోల్ గేట్ వద్ద జరిగిన బీభత్సంతో మరోసారి కార్పోరేటర్ల తనయుల సిత్రాలపై చర్చ జరుగుతోంది. బీఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, ఎల్ బినగర్ టీఆర్ఎస్ ఇన్ చార్జీ రామ్మోహన్ గౌడ్ కుమారుడు మనీష్ గౌడ్ బీభత్సం సృష్టించాడు. మనీష్ అతని స్నేహితులు కారులో వెళుతున్నారు. టోల్ సిబ్బంది ట్యాక్స్ కట్టాలని అడగడంతో ఆగ్రహంతో ఊగిపోయి కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంది.

గతంలో కూడా చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి కూడా వీరంగం సృష్టించిన దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేశాయి. బిల్డింగ్ నిర్మిస్తున్న ప్రాంతం వద్దకు అనుచరులతో వచ్చి హల్ చల్ చేయడం వివాదాస్పదమైంది. ఇక సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి అనుచరులు ఇటీవలే ఓ హోటల్ పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ రైస్ తో వండుతున్నారని ప్రశ్నించిన ఓ కస్టమర్ ను చితకబాదారు. ఏకంగా పీఎస్ లో కూడా వీరు హల్ చల్ చేయడం..ఈ దృశ్యాలన్నీ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వడ్డీ ఇవ్వాలంటూ సదరు కార్పొరేటర్ అనుచరులు ఓ వ్యక్తిని ఇష్టారాజ్యంగా కొట్టారు. దీనిపై సదరు వ్యక్తి పీఎస్ లో ఫిర్యాదు సైతం చేశాడని వార్తలు వచ్చాయి.

తామేం తక్కువ తినలేదంటూ సీతాఫల్‌మండి కార్పొరేటర్‌ సామల హేమ అనుచరులు హల్ చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధుడిపై దాడి చేయడంతో అతడి ఓ కన్ను పోగా.. మరో కన్నుకు 80 శాతం గాయాలయ్యాయకని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బాధితుడి కుటుంబానికి సహాయం చేయాలంటూ గౌడ సంఘం నాయకులు చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా కూడా చేశారు.

గతంలో కార్పొరేటర్ల విషయంలో ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించింది. ప్రగతి రిసార్ట్స్ లో జరిగిన ఈ తరగతుల్లో సీఎం కేసీఆర్ పాల్గొని విధులు..బాధ్యతల నిర్వాహణపై సూచనలు కూడా చేశారు. ఇప్పటికైనా కార్పొరేటర్లు..వారి కొడుకులు..అనుచరుల ప్రవర్తనలో మార్పు వస్తుందా ? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

14:02 - August 2, 2017

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌పై క‌ట్టిన సోనూ సాంగ్ పాట‌ వైర‌ల్‌గా మారింది. నెటిజన్లు లైకులతో హోరెత్తిస్తున్నారు. క‌రాచీ వింజ్ అనే గ్రూప్ ఈ సాంగ్‌ను పాడింది. మ‌రాఠీ భాష‌లో వైర‌ల్‌గా మారిన సోనూ సాంగ్‌ను పాకిస్థాన్‌కు చెందిన క‌రాచీ వింజ్ గ్రూప్ కాపీ కొట్టింది. మ‌రాఠీ సాంగ్‌ను ఓ ముంబై గ్రూప్ అక్క‌డ ఉన్న మున్సిపాల‌టీ స్థితిని వ‌ర్ణిస్తూ పాట రాసింది. అయితే పాక్ గ్యాంగ్ మాత్రం అదే స్ట‌యిల్‌లో ప‌నామా కేసులో ఇరుక్కున్న‌ ష‌రీఫ్ మీద పాట రాసింది. ఇమ్రాన్ నీ మీద న‌మ్మ‌కం ఉందంటూ ఆ సాంగ్‌ను క్రియేట్ చేశారు.

రామానాయుడు స్టుడియోకు ఎక్సైజ్ అధికారులు...

హైదరాబాద్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా పెను సంచ‌ల‌నం సృష్టిస్తున్న నేపథ్యంలో విదేశాల నుండి వ‌స్తున్న పార్సిల్స్ పై ఎక్సైజ్ అధికారులు ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో విదేశాల నుండి రామానాయుడు స్టూడియోకి వ‌చ్చిన పార్సిల్ ని ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెళ్ళారు. అయితే దీనిపై ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ .. వెన్ను నొప్పిని త‌గ్గించేందుకు రానా ఓ పరిక‌రాన్ని విదేశాల నుండి తెప్పించుకున్నాడు. అది ప‌రిశీలించ‌డానికే ఎక్సైజ్ అధికారులు స్టూడియోకి వ‌చ్చార‌ని తెలియ‌జేశాడు.

కర్ణాటకలో ఐటీ సోదాలు : రూ.7.5 కోట్లు స్వాధీనం...

బెంగళూరు: కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌కు చెందిన నివాసం, కార్యాలయాల్లో ఐటీశాఖ బుధవారం సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.7.5కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం ఏకకాలంలో 39 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీలో శివకుమార్‌కు చెందిన ఇంట్లో నుంచి రూ. 5కోట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మరో భవనంలో రూ. 2.5కోట్లు గుర్తించి సీజ్‌ చేశారు. పన్ను ఎగవేత కేసులో ఈ దాడులు చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

 

 

కాగజ్ నగర్ మున్సిపాలిటీకి విద్యుత్ సరఫరా కట్

కొమురంభీం: కాగజ్ నగర్ మున్సిపాలిటీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రూ. కోటికి పైగా బకాయిలు ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

13:35 - August 2, 2017

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ హార్టీకల్చర్‌ యూనివర్శిటీలో.. విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం వారం రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఉదయం అరెస్ట్‌ చేశారు. దీంతో స్టూడెంట్స్ ధర్నా నిర్వహించి.. రోడ్డుపై బైటాయించారు. విద్యార్థులకు మద్దతుగా టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను వెంటనే అరెస్ట్‌ చేశారు. తాము ఇన్ని రోజులుగా ఒక న్యాయమైన డిమాండ్‌ను వినిపిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.

 

13:32 - August 2, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. టీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకం రేగింది. సినియర్లు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి నితీష్ కుమార్ రెడ్డి గొంతుకోశారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

13:31 - August 2, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ అరెస్టు యత్నాలకు అపోలో డాక్టర్లు బ్రేక్ వేశారు. కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ చికిత్స కొనసాగిస్తున్నామని, వైద్యసేవలు అందిస్తున్న దశలో అరెస్టు చేయడం కుదరదని డాక్టర్లు తెలిపారు. విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసలు వెనుదిరిగారు. విక్రమ్ గౌడ్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాతే అరెస్టు చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

విక్రమ్ గౌడ్ అరెస్ట్ కు అపోలో డాక్టర్ల బ్రేక్

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ అరెస్టు యత్నాలకు అపోలో డాక్టర్లు బ్రేక్ వేశారు. కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్ కు చికిత్స కొనసాగిస్తున్నామని, వైద్య సేవలు అందిస్తున్న దశలో అరెస్టు చేయడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పారు. దీంతో విక్రమ్ ను అరెస్టు చేసేందుకు వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగారు.

13:15 - August 2, 2017

హైదరాబాద్ : మలక్ పేటలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం జరిగింది. ఆర్యన్ కాలేజీ ఆఫ్ హోటల్ మెనెజ్ మెంట్ యాజమాన్యం విద్యార్థులను మాల్దీవులకు పంపారు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా చిన్నరూంలో ఉంచారు. మాల్దీవుల్లో 25మంది తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారు నకిలీ వీసాలు, నకిలీ సర్టిఫికెట్లతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు, బంధువులకు తెలపడంతో వారు కాలేజీకి రావడంతో అక్కడ యాజమాన్యానికి సంబంధించి ఎవరు లకపోవడంతో వారు ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:03 - August 2, 2017

చిత్తూరు : మహారాష్ట్రలోని పుణె నుంచి తిరుమల వెళ్తున్న ఒక భక్తుడి నుంచి అలిపిరి చెక్‌పోస్టు వద్ద నిఘా సిబ్బంది గన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి 14 బెల్లెట్లతోపాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవవహారంతో సంబంధం ఉన్నముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:58 - August 2, 2017

రంగారెడ్డి : హార్టికల్చర్‌ విద్యార్థులపై పోలీసులతీరుకు నిరసనగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు.. హార్టికల్చర్‌ విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు.

12:57 - August 2, 2017

గద్వాల : జిల్లాలోని ఆర్టీసీ బస్ డిపో ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కాలేజీకి బస్సులు సంఖ్య పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిన్న కాలేజీ ముందు బస్సును డ్రైవర్ ఆపకుండావెళ్లిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

12:56 - August 2, 2017

హైదరాబాద్ : గురుకులా నియమాకాల్లో మొత్తం పోస్టులు మహిళలకు కేటాయించడానికి తీసుకొచ్చిన 1274 జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పురుష అభ్యర్థులు పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టే ను డివిజన్ బెంచ్ ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో గురుకులా పోస్టుకలు అడ్డంకులు తొలిగాయి. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

12:50 - August 2, 2017

హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో విషాదం జరిగింది. స్థానికంగా బార్ నిర్వహిస్తున్న బంటి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు చాపు కారణమైన వారి పేర్లు బయట పెట్టి, తన ఆత్మహత్యను సైతం సెల్ఫీ తీసుకున్నాడు. తన ఆత్మహత్యకు రాంబాబు, అశోక్, నవీన్, సాగర్, రాజ్, స్వామి అనే ఆరుగురు ఫైనాన్సర్తు కారణమంటూ ఆ బంటి వీడియో చెప్పారు. నింధితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి. 

టీపికేకే ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

అనంతపురం : టీపికేకే ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి నితీష్ కుమార్ గొంతు కోశారు. దీంతో ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

12:42 - August 2, 2017

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నూతనంగా ఎన్నికైనా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసారు. ఆయన తెలుగు రాష్ట్రాల పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి అయిన తరువాత తొలిసారి కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసనని నరసింహన్ తెలిపారు. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

రాజేంద్రనగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

రంగారెడ్డి : రాజేంద్ర నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హార్టీ కల్చర్ యూనివర్శిటీలో విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు యత్నించిన టిడిపి నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

12:38 - August 2, 2017

కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ విల్పాచక్రపాణి రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రేపు జరిగే బహిరంగసభలో జగన్ సమక్షంలో శిల్పాచక్రపాణిరెడ్డి చేరనున్నారు. తన అనుచరులతో కలిసి చక్రపాణి హైదరాబాద్ బయల్దేరారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు శిల్పామోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన కాసేపట్లో జగన్ భేటీ కానున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:36 - August 2, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ అరెస్టుకు రంగం సిద్ధమైదంది. పోలీసు బృందాలు అపోలో ఆసుపత్రికి చేరుకున్నాయి. ఇది ఇలాఉంటే విక్రమ్ గౌడ్ ను దానం నాగేందర్ పరామర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:35 - August 2, 2017

చిత్తూరు : తిరుమలలో శ్రీవారి పుష్కరిణికి మరమ్మత్తు పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. నెల రోజుల పాటు భక్తులను స్నానానికి అనుమతించకుండా మూసేసి.. మరమ్మత్తులతో పాటు నీటి శుద్ధి చేయనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:34 - August 2, 2017

హైదరాబాద్ : తనపై తాను కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పరామర్శించారు.అపోలో ఆడ్వాన్స్ క్రిటికల్ యూనిట్ టాస్క్ ఫోర్స్ బృందాలు చేరుకన్నాయి. విక్రమ్ గౌడ్ అరెస్టు చేసే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:33 - August 2, 2017

హైదరాబాద్ : గురుకులా నియమాకాల్లో మొత్తం పోస్టులు మహిళలకు కేటాయించడానికి తీసుకొచ్చిన 1274 జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో పురుష అభ్యర్థులు పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టే ను డివిజన్ బెంచ్ ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో గురుకులా పోస్టుకలు అడ్డంకులు తొలిగాయి. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

గద్వాల్ ఆర్టీసీ డిపో ముందు విద్యార్థుల ఆందోళన

జోగులాంబ గద్వాల : ఆర్టీసీ డిపో ముందు పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. కాలేజీకి వెళ్లడానికి బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, కాలేజీకి బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న కాలేజీ ముందు బస్సును ఆపకుండా డ్రైవర్ వెళ్లి పోయాడని, బస్సు ఎక్కే ప్రయత్నంలో విద్యార్థులకు గాయాలయ్యాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ తీరు తీరు పై విద్యార్థులు మండిపడుతున్నారు.

వనస్థలిపురంలో హైకింగ్ బార్ యజమాని ఆత్మహత్య

హైదరాబాద్: వనస్థలిపురంలో హైకింగ్ బార్ యజమాని మహేంద్రపాల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఆరుగురు ఫైనాన్షియర్లు కారణమని మహేంద్ర పాల్ సెల్ఫీ వీడియోను తీశాడు. నిందితలు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పార్టీలో ప్రాధాన్యత లేనందుకే రాజీనామా: శిల్పా చక్రపాణి

కర్నూలు : టిడిపి ఎమ్మెల్సీకి శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టిడిపి ఆఫీసుకు చక్రపాణి రెడ్డి ఫ్యాక్స్ చేశారు. పార్టీలో ప్రాధాన్యత లేనందుకే రాజీనామా చేస్తున్నా అని ఆ లేఖలో పేర్కొన్నారు.

12:06 - August 2, 2017

మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన 'వరుణ్ తేజ్' మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన సినిమా 'ఫిదా'పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తెలంగాణ భాష..నిజామాబాద్ లోని బాన్సువాడ ప్రాంతాన్ని అందంగా తెరకెక్కించిన తీరు..చిత్రంలో నటీ నటుల ప్రతిభను మెచ్చుకుంటున్నారు. శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన విధానం, సాయి పల్లవి యాక్టింగ్‌, వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవిల మధ్య సన్నివేశాలు, సంగీతం ఇలా అన్ని అంశాలు అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాకు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి.

తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్న 'వరుణ్ తేజ్' రికార్డుల వేట మొదలు పెట్టాడనే చెప్పవచ్చు. సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసినట్లు..ఓవర్సీస్ లో రూ. 1.62 మిలియన్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రూ. 2మిలియన్ మార్క్ సాధించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగాస్టార్ 'చిరంజీవి' నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమాతో రూ. 2.45 మిలియన్ల వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 'అత్తారింటికి దారేది' సినిమాతో 'పవన్ కళ్యాణ్' 1.90 మిలియన్లు సాధించాడు. ఈ వారాంతానికే 'పవన్' కలెక్షన్లను 'వరుణ్' దాటేస్తాడని భావిస్తున్నారు. చూడాలి మరి..

హోటల్ మేనేజ్ మెంట్ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్: మలక్ పేట పీఎస్ పరిధి మూసారాంబాగ్ లో హోటల్ మేనేజ్ మెంట్ ఉద్యోగాల పేరుతో మోసం చేశారు. మాల్ దీవుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 25 మంది విద్యార్థులను అర్బన్ హోటల్ మేనేజ్ మెంట్ కళాశాల యాజమాన్యం మల్దీవులకు పంపింది. నకిలీ వీసాలు, నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ పై విద్యార్థుల తల్లిదండ్రులు దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.

కాసేపట్లో విక్రమ్ ను అరెస్ట్ చేసే అవకాశం.

హైదరాబాద్: కాసేపట్లో విక్రమ్ గౌడ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అయితే కాంగ్రెస్ నేత దానం నాగేందర్ విక్రమ్ ను పరామర్శించేందుకు అపోలో ఆసుపత్రికి వచ్చారు. నాగేందర్ రాక ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతి కోవింద్ తో గవర్నర్ నరసింహన్ భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి కోవింద్ తో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను రాష్ట్రపతికి తెలియజేయనున్నారు.

సీఆర్ డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: సీఆర్ డీఏ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాజధానిలో ప్రభుత్వ ముఖ్యులు, అధికారుల నివాసాలపై చర్చించినట్లుసమాచారం.

మంత్రి ఇంటి పై ఐటీ దాడి.. రాజ్యసభలో విపక్షాల ఆందోళన..

న్యూఢిల్లీ: క‌ర్నాట‌క మంత్రి శివ‌కుమార్ ఇండ్ల‌పై ఐటీశాఖ దాడులు చేయ‌డం ప‌ట్ల రాజ్య‌స‌భ‌లో ర‌గ‌డ జ‌రిగింది. మంత్రి ఇంట్లో సోదాలు నిర్వ‌హించ‌డం ప‌ట్ల కాంగ్రెస్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంద‌ని అహ్మ‌ద్ ప‌టేల్ అన్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బెంగుళూరుకు చెందిన ల‌గ్జ‌రీ రిసార్ట్‌లో ఎటువంటి ఐటీ దాడులు జ‌ర‌గ‌లేద‌న్నారు. ఎమ్మెల్యేల‌ను సోదా చేయ‌లేద‌న్నారు. కేవలం క‌ర్నాట‌క మంత్రి ఇంట్లో మాత్ర‌మే సోదాలు నిర్వ‌హించిన‌ట్లు జైట్లీ తెలిపారు.

11:26 - August 2, 2017

టాలీవుడ్ టాప్ స్టార్ లలో ఒకరిగా ఉన్న 'పవన్ కళ్యాణ్' మేనియా అలాగే కంటిన్యూ అవుతోంది. సినిమాలు చేయకపోయినా..ఫ్లాపులు వచ్చినా ఆయన పవర్ లో ఎలాంటి మార్పు కనిపించదు. ఆయన్ను చూడాలని ఎంతో మంది అభిమానులు తహతహలాడుతుంటారు. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. కానీ ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరం కానున్నాడా ? అనే చర్చ జరుగుతోంది. అక్టోబర్ తరువాత రాజకీయాలకు పరిమితం కానున్నట్లు 'పవన్ కళ్యాణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే.

'పవన్ కళ్యాణ్'..సినిమా హీరో. ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'జనసేన' పార్టీ పెట్టి కార్యకర్తల నియామకం జరుపుతున్నారు. ఆయా సమస్యలపై 'పవన్' కూడా స్పందిస్తున్నారు. తాజగా ఉద్దానం సమస్యపై ఏపీ ప్రభుత్వంతో చర్చించడానికి వచ్చిన 'పవన్' మీడియాతో మాట్లాడారు. తాను అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు, అందులో భాగంగా తాను చేయాల్సిన సినిమా ఒక్కటుందని తెలిపారు. ఈ సినిమా అనంతరం ఎక్కువ భాగం రాజకీయాలకు సమయం కేటాయిస్తానని కూడా 'పవన్' ప్రకటించేశారు.

మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' తో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో ఇంజినీర్ గా కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 'కీర్తి సురేష్‌', 'అనూ ఇమ్మానుయేల్‌' లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల చేయాలని తొలుత భావించినా రిలీజ్ డేట్ ను సంక్రాంతికి మార్చారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అనంతరం సంతోష్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు 40 రోజుల పాటు కాల్షిట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ అక్టోబర్ నెలలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్న 'పవన్' ఈ సినిమాలు ఎలా కంప్లీట్ చేస్తారనేది తెలియరావడం లేదు.
సినిమాలకు దూరమయ్యే ఉద్ధేశ్యం లేదని..రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేయాలని 'పవన్' నిర్ణయించుకున్నట్లు టాక్. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. 

11:24 - August 2, 2017

నెల్లూరు : క్రికెట్ బుకిలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఇద్దరు డీఎస్పీలపై పోలీస్ శాఖ వేటు వేసింది. ఇద్దరు డీఎస్పీలను వీఆర్ కు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర డీఎస్పీ వెంకటరాముడు, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ ను వీఆర్ కు పంపిస్తూ పోలీస్ ఉన్నధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరిపై క్రికెట్ బెట్టింగ్ కాకుండా ఇసుక, ఎర్రచందనం అక్రమారవాణాకు సహకరించారంటూ విమర్శిలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

టీఎస్ గురుకుల ఉద్యోగ నియామకాలకు తొలగిన అడ్డంకి

హైదరాబాద్ : తెలంగాణ గురుకుల ఉద్యోగ నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. జీఓ 127 పై స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలకే అన్ని పోస్టులు కేటాయిస్తూ జీవో 1274 ను ప్రభుత్వం ఇచ్చింది.1274 జీవోను సవాల్ చేస్తూ పురుష అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ సింగిల్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ స్టేను డివిజన్ బెంచ్ ధర్మాసనం సస్పెండ్ చేసింది. త్వరలో పరీక్ష నిర్వహణకు టీఎస్ పీఎస్ సన్నాహాలు చేస్తోంది.

నోటాపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన గుజరాత్ కాంగ్రెస్

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో నోటాపై గుజరాత్ కాంగ్రెస్ సుప్రీం ను ఆశ్రయించింది. కాంగ్రెస్ పిటిషన్ పై సుప్రీంలో రేపు విచారణ జరగనుంది.

11:18 - August 2, 2017

కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ విల్పాచక్రపాణి రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. రేపు జరిగే బహిరంగసభలో జగన్ సమక్షంలో శిల్పాచక్రపాణిరెడ్డి చేరనున్నారు. తన అనుచరులతో కలిసి చక్రపాణి హైదరాబాద్ బయల్దేరారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు శిల్పామోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

11:10 - August 2, 2017

టాలీవుడ్ కు చెందిన హీరోలు ఇతర సినిమా పరిశ్రమలపై వైపు దృష్టి సారిస్తుంటారు. అక్కడా తమ క్రేజ్..రేంజ్ ను పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా తాము నటించిన చిత్రాలు ఆయా భాషల్లో విడుదల చేసేందుకు వ్యూహాలు రచిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తమిళ మార్కెట్ వైపు దృష్టి సారించారని టాక్ వినిపిస్తోంది.

తన చిత్రాల్లో ఏదో ఒక స్టైల్ కనిపించాలని 'బన్నీ' తహతహలాడుతుంటాడు. డ్యాన్స్..ఫైట్స్..లుక్..విలన్ ఇలా ఏదో ఒక కొత్త స్టైల్ ఉండేలా 'అల్లు అర్జున్' ప్రయత్నిస్తుంటాడు. 'దువ్వాడ జగన్నాథం' హిట్ అనంతరం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'బన్నీ' సరసన అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు..తమిళ భాషల్లో సినిమా రూపొందనుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే త్వరలో తమిళ దర్శకుడితో పనిచేయాలని 'బన్నీ' యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ కూడా ఫాలోయింగ్ ఉండడం తో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమిళ సినిమా పరిశ్రమలో పేరొందిన 'లింగుస్వామి' డైరెక్షన్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో లింగు స్వామి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాపై మరోసారి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2018లో సినిమా సెట్ పైకి వెళుతుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఉంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి. 

ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి రాజీనామా

కర్నూలు : ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపికి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి చక్రపాణి రెడ్డి హైదరాబాద్ కు బయలు దేరారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

మాజీ కేంద్ర మంత్రి సంతోష్‌ మోహన్‌దేవ్‌ మృతి

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంతోష్‌ మోహన్‌దేవ్‌(83) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన అసోం లోని సిల్‌చార్‌లో తుదిశ్వాస విడిచారు. ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన మోహన్‌దేవ్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

బీహార్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

హైదరాబాద్: బీహార్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కైమూర్-గయ ముగల్‌సరాయ్ రైల్వే లైన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 14 రైలు వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. దీంతో ఆ మార్గం వెంబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నారు.

పురుగు మందు తాగి వృద్ధ దంపతుల ఆత్మహత్య

సిద్దిపేట : చిన్న కోడూరులో దారుణం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు కొడుకులు ఉండి తిండి పెట్టడం లేదని మనస్థాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

తనిఖీల్లో 1.5 టన్నుల ఎర్రచందనం పట్టివేత

తిరుపతి: తమిళనాడు - ఏపీ సరిహద్దు ప్రాంతం అరపాక్కం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1.5 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా ఓ కారు, మినీ వ్యాన్ ను కూడా సీజ్ చేసి గురుప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల అదుపులో విక్రమ్ గౌడ్

హైదరాబాద్: విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు ఓ కొలిక్కి వచ్చింది. అపోలో ఆసుపత్రిలో విక్రమ్ గౌడ్ పోలీసుల అదుపులో వున్నాడు. డిశ్చార్జ్ తరువాత విక్రమ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. విక్రమ్ గౌడ్ పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఈ కే సులో ఏ1గా విక్రమ్, ఏ2 గా నందు, ఏ3గా అహ్మద్ ఖాన్ ముద్దాలుగా వున్నారు. నిందితులను 3గంటలకు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

కాసేపట్లో రాష్ట్రపతితో భేటీ కానున్న గవర్నర్

ఢిల్లీ : కాసేపట్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను గవర్నర్ రాష్ట్రపతికి వివరించనున్నట్లు సమాచారం.

కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఇంటిపై ఐటీ దాడులు

బెంగళూరు : కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్ ఇంటి పై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఆరోపణలతో ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో మంత్రి రిసార్ట్ లో వుంచారు. 8వ తేదీన గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి రాజకీయనాటకం అడుతోంది. ఇందులో భాగంగానే శివకుమార్ ఇంటి పై ఐటి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

10:43 - August 2, 2017

కరీంనగర్ : జిల్లా నేరెళ్ల కేసులో జైలులోఉన్న ఎనిమిదిమందికి కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది.. బెయిల్‌ మంజూరైన బాధితులు ఇవాళ మధ్యాహ్నం జైలునుంచి బయటకురానున్నారు.. 22రోజులనుంచి జైలులోఉన్న బాధితులపై పోలీసులు థర్డ్‌ ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

విజయవాడ ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం...

విజయవాడ: ఆటోనగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ 6 ఫైరింజన్లతో మంటలును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

10:39 - August 2, 2017

గుంటూరు : నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు..టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారంలో పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. అంతేకాదు పరిపాలనలో కీలకంగా వ్యవహరించాల్సిన మంత్రులనూ ఇందులో భాగస్వాములను చేశారు. ఒకరా ఇద్దరా ఏడుగురు మంత్రులను నంద్యాల బైపోల్‌ కోసం ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. దీంతో ఆయా శాఖల్లో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇన్‌చార్జ్ లుగా ఏడుగురు మంత్రులు
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు మినహా 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఏడుగురిని నంద్యాల ఉప ఎన్నికకు ఇన్‌చార్జ్ లుగా నియమించారు. సీనియర్ మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి, భూమా అఖిల ప్రియ, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నానాధ్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి ఉన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి కీలక సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో మంత్రి కె.ఈ.కృష్ణమూర్తి సచివాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. ఆగస్ట్ 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ..తదితర సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఖరీఫ్‌ సీజన్‌లో అధికారులను సమన్వయపరిచి వ్యవసాయంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నంద్యాలకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులకు రుణాలు అందకపోవడంతో...బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సబ్సిడీ విత్తనాలు, ఎరువులు దొరక్క అన్నదాతలు అగచాట్లు పడుతున్నా సోమిరెడ్డి మాత్రం బైపోల్‌ క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నారు.

సచివాలయానికి రావడం లేదు
గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు కొన్ని రోజులుగా సచివాలయానికి రావడం లేదు. కేబినెట్ సమావేశాలకు మాత్రం హాజరవుతూ...పూర్తిగా నంద్యాల ఉపఎన్నిక కోసం సమయం కేటాయిస్తున్నారు. మరోవైపు మొన్నటి దాకా ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న మంత్రి నారాయణ ఎన్నికలనోటిఫికేషన్ విడుదల కావడంతో నంద్యాలలో తిష్టవేశారు. వారం రోజులుగా మంత్రి నారాయణ భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకోసం నంద్యాలను చుట్టేస్తున్నారు. వీరితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి , టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి నంద్యాలలో మకాం వేశారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఎలా ఉన్నా.. సమస్యలు పరిష్కారం కాక ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

10:36 - August 2, 2017

హైదరాబాద్ : సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పీఎం భార్గవ కన్ను మూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భార్గవ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఉప్పల్‌ ప్రశాంత్‌నగర్‌లోని ఆయన నివాసంలో పార్థివ దేహం ఉంచారు. భార్గవకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1928 ఫిబ్రవరి 22న రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించిన భార్గవ 21 ఏళ్లకే సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పీహెచ్‌డీ పట్టా పొందారు. నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయన అందించిన సేవలకు గాను 1986లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే భార్గవ 2015లో పద్మభూషన్‌ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. ప్రొఫెసర్‌ భార్గవ మృతిపట్ల జనవిజ్ఞాన వేదిక సంతాపం ప్రకటించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:35 - August 2, 2017

కామారెడ్డి : జిల్లా నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై.. ఓ మహిళపై తన ప్రతాపం చూపాడు. మహిళని కూడా చూడకుండా విచక్షణా రహితంగా చితకబాదాడు. కోమలాంచ గ్రామానికి చెందిన బాలమణి కుమారుడిని.. పోలీసులు ఓ దొంగతనం కేసులో అరెస్ట్‌ చేశారు. అయితే దొంగతనం చేసిన సొమ్మును తన తల్లివద్ద ఉంచానని యువకుడు చెప్పాడంటూ.. పోలీసులు బాలమణి ఇంటికి వచ్చారు. దొంగతనం సొమ్మును ఎక్కడ దాచావంటూ ఎస్సై ఆమెను చితకబాదాడు. తన దగ్గర లేదని చెప్పినా వినిపించుకోకుండా కర్రలతో ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు. ఎస్సై దెబ్బలకు తట్టుకోలేక బాలమణి స్పృహ తప్పి పడిపోయింది. అయినా వదిలిపెట్టకుండా తనపైనున్న బంగారు ఆభరణాలు, 50 వేల నగదును ఎస్సై తీసుకెళ్లాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనపై దాడికి పాల్పడిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

10:20 - August 2, 2017

టాలీవుడ్ లో మాస్ మహారాజగా పేరొందిన 'రవితేజ' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 'బెంగాల్ టైగర్' సినిమా అనంతరం ఆయన ఏ సినిమా ఒప్పుకోలేదనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు.

కథలు నచ్చకపోవడం..ఇతరత్రా కారణాలతో 'రవితేజ' కొన్ని రోజుల వరకు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అనంతరం 'రాజా ది గ్రేట్'..'టచ్ చేసి చూడు' సినిమాలకు మాస్ మహారాజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా..దిల్ రాజు నిర్మాతగా 'రాజా ది గ్రేట్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'రవితేజ' అంధుడిగా నటించనున్నాడు. 'మెహరీన్' హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ లో చిత్ర షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ 12న సినిమాను విడుదల చేయాలని ప్లాన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా 'రాజా ది గ్రేట్' సినిమా టీజర్ ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. స్టోరీ లైన్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
చాలా కాలం అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'రవితేజ' 'రాజా ది గ్రేట్' టీజర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. 

10:19 - August 2, 2017

'భళీ..భళీ రా...భళీ..సాహోరో బాహుబలి' అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తాజా చిత్రం 'సాహో'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. యాక్షన్ చిత్రమా..సైన్స్ ఫిక్షన్..సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిత్రం ఉంటుందా అని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం తెలియరావడం లేదు. 'సాహో' చిత్రాన్ని మాత్రం హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టు రూపొందించనున్నారని టాక్.

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటించేందుకు 'ప్రభాస్' అంగీకరించారు. 'రన్ రాజా రన్' చిత్రం అనంతరం సుజీత్ చేస్తున్న సినిమా ఇదే. చిత్ర షూటింగ్ కంటే ముందుగానే చిత్రా టీజర్ విడుదల చేయడం గమనార్హం. చిత్ర హీరోయిన్స్..విలన్స్..ఇతరత్రా పాత్రలు ఎవరు పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దాదాపు రూ. 150 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'సాహో' పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా ఉంటుందని..హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని 'ప్రభాస్' పేర్కొన్నట్లు తెలుస్తోంది. సాహో కోసం బరువు తగ్గిపోయి స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే 'ప్రభాస్' కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' కు విలన్ గా బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటించనున్నట్లు తెలుస్తోంది. మరి 'ప్రభాస్' ఎలా మురిపిస్తాడో వెయిట్ అండ్ సీ...

10:18 - August 2, 2017

మీరు రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్నారా ? అయితే మీ వెంట ఒక రగ్గును తీసుకెళ్లండి ? ఎందుకు వారు సమకూరుస్తారు కదా ? అంటే ఇదివరకు ఉండేది..ఇప్పుడు ఆ సౌకర్యానికి చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ యోచిస్తోందంట.

రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి రైల్వే శాఖ రగ్గులు సరఫరా చేస్తుంటుంది. కానీ రైల్వే శాఖ కల్పిస్తున్న సౌకర్యాలపై ఇటీవలే కాగ్ ఆక్షేపించిన సంగతి తెలిసిందే. రైళ్లలో ఏసీ బోగీల్లో రగ్గులు అపరిశుభ్రంగా ఉంటున్నాయని కాగ్ పేర్కొంది. దీనితో రగ్గుల సరఫరా విషయంలో రైల్వే మంత్రిత్వ శాఖ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బోగీల్లో ఉష్ణోగ్రత నియంత్రించడం ద్వారా రగ్గులు కప్పుకొనే అవసరం లేకుండా చేయాలని యోచిస్తోంది. ఒక రగ్గును శుభ్రం చేసేందుకు రూ. 55 ఖర్చవతుండగా ప్రయాణీకుల నుండి రూ. 22 వసూలు చేసే వారు. తాజా విధానం అమల్లోకి వస్తే ఆర్థికంగా లాభం చేకూరనుంది. 'ఢిల్లీ - జమ్మూ మెయిల్' లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. రగ్గుల నిషేధంపై ప్రయాణీలకు అభిప్రాయాలు తెలుసుకుంటామని..ఒకవేళ ఎవరైనా ప్రయాణీకులు రగ్గులు కావాలని అనుకుంటే బోగీలో అందుబాటులో ఉంచుతామని రైల్వే శాఖ పేర్కొంటున్నట్లు సమాచారం. ప్రయాణీకుల నుండి వచ్చే స్పందన బట్టి అన్ని రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.

మరి ప్రయాణీకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

భార్యపై గొడ్డలితో దాడి..ఆపై..

కృష్ణా : ఇబ్రహీంపట్నం మండలం దామలూరులో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యపై గొడ్డలితో దాడి చేసి అనంతరం భర్త మస్తాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. 

అలిపిరి వద్ద గన్ తో భక్తుడు..

చిత్తూరు : తిరుపతి అలిపిరి పాయింట్ వద్ద గన్ కలకలం రేగింది. పూణెకు చెందిన భక్తుడు నుండి గన్, 14 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్ తీసుకెళుతున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని టిడిపి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 

విక్రమ్ గౌడ్ హెల్త్ కండీషన్..

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆరోగ్యంగానే ఉన్నాడని అపోలో వైద్యులు వెల్లడించారు. బుధవారం..గురువారం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఎర్రచందనం స్వాధీనం..

చిత్తూరు : తమిళనాడు - ఏపీ సరిహద్దు ప్రాంతం అరపాక్కం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 1.5 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు, మినీ వ్యాన్ సీజ్ చేయగా గురు ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 

కోవింద్ తో భేటీ కానున్న నరసింహన్..

ఢిల్లీ : ఉదయం 11గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో తెలుగు రాష్ట్రాల గవర్నర్ భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను కోవింద్ కు వివరించనున్నట్లు తెలుస్తోంది. 

ఆటోనగర్ లో భారీ ఫైర్ ఆక్సిడెంట్..

విజయవాడ : ఆటోనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆరు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

10:05 - August 2, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో కొత్త కోణం బయటపడింది. విక్రమ్ పై ఇండోర్ ముఠా కాల్పులు జరిపారు. విక్రమ్ కాల్పులకు ఆరు నెలల ముందు నుంచి ప్రణాళిక వేశారు. విక్రమ్ కాల్పులకు ఇండోర్ కు చెందిన ఓ షూటర్ ను నియమించుకున్నారు. హైదరాబాద్ లో కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ట్రయల్ నిర్వహించారు. విక్రమ్ గౌడ్ ప్రణాళిక అమలుకు కోసం ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆయన కాల్పులు జరిపాక వెళ్లే మార్గాలను షూటర్ ముఠాకు చూపించారు. విక్రమ్ గౌడ్ తనపై మూడు రౌండ్లు కాల్పులు జరపాలని సూచించారు. కానీ షూటర్ రెండు రౌండ్ల కాల్పులకే భయపడి పారిపోయడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

విక్రమ్ పై కాల్పులు జరిపింది..

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై జరిపిన కాల్పుల కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. దీనికంతటికి ప్రధాన సూత్రధారి విక్రమ్ గౌడ్ అని తేలిన సంగతి తెలిసిందే. తాజాగా కాల్పులు జరిపింది ఇండోర్ ముఠా అని పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల ముందు నుండి విక్రమ్ ప్రణాళికలు రచించినట్లు, ఇందుకు ఇండోర్ షూటర్ ను నియమించుకున్నాడు. రెండు రోజుల ముందు ట్రయల్ కూడా నిర్వహించారు. సీసీ కెమెరాలను కూడా విక్రమ్ గౌడ్ ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

09:25 - August 2, 2017

పెద్దపల్లి : జిల్లా గోదావరిఖనిలోని శ్రీసాయి జ్యువెలరీ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగింది. మరింత వివరాలకు వీడియో చూడండి.

09:20 - August 2, 2017

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేయడంతో పాటు యూనివర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం వీడియో చూడండి.

09:13 - August 2, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో కొత్త కోణం బయటపడింది. విక్రమ్ పై ఇండోర్ ముఠా కాల్పులు జరిపారు. విక్రమ్ కాల్పులకు ఆరు నెలల ముందు నుంచి ప్రణాళిక వేశారు. విక్రమ్ కాల్పులకు ఇండోర్ కు చెందిన ఓ షూటర్ ను నియమించుకున్నారు. హైదరాబాద్ లో కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ట్రయల్ నిర్వహించారు. విక్రమ్ గౌడ్ ప్రణాళిక అమలుకు కోసం ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆయన కాల్పులు జరిపాక వెళ్లే మార్గాలను షూటర్ ముఠాకు చూపించారు. విక్రమ్ గౌడ్ తనపై మూడు రౌండ్లు కాల్పులు జరపాలని సూచించారు. కానీ షూటర్ రెండు రౌండ్ల కాల్పులకే భయపడి పారిపోయడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

09:09 - August 2, 2017

నెల్లూరు : క్రికెట్ బుకీ డాన్‌ కృష్ణసింగ్ పోలీసుల విచారణలో బయటపెట్టిన పేరులో ఒకటిగా బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిగా తెలుస్తోంది.. ఇతను ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రధాన అనుచరుల్లో ఒకరు...ఉండేది మాగుంట లేఅవుట్...ఎమ్మెల్యేకు షాడోగా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కదిద్దేస్తారన్న పేరుంది...గతంలో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసిన శ్రీకాంత్‌రెడ్డి కృష్ణసింగ్‌తో దోస్తానా చేసి బెట్టింగ్‌ల్లో భాగస్వామ్యం పొందినట్లు ఆరోపణలున్నాయి.అధికారపార్టీ చెందిన యువత మాజీ అధ్యక్షుడు...మాజీ మంత్రి, బడాపారిశ్రామికవేత్తకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆ పెద్దాయన కూడా కృష్ణసింగ్ లిస్టులో ఉన్నాడని సమాచారం...నగరంలోని సంతపేటలో నివాసముంటున్న ఇతను బుకీలతో లింకులున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

మాన్యం శ్యాంప్రసాద్
క్రికెట్ బెట్టింగ్ లో మరో కీలక బుకీ మాన్యం శ్యాంప్రసాద్ అలియాస్ రాంప్రసాద్. ఇతన్ని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఒంగోలు నుంచి వచ్చి నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో స్దిరపడ్డాడు. మొదట్లో వ్యవసాయం, పాల అమ్మకం, డిష్ నిర్వహణ వంటివి చేసుకుని జీవించేవాడు. ఓ సందర్భంలో కృష్ణసింగ్ తో పరిచయమై జాతీయ స్థాయిలో క్రికెట్ బుకీగా మారాడు. ప్రస్తుతం బెంగుళూరు కేంద్రంగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడు. ఇటీవల పొదలకూరు ప్రాంతంలో 50 ఎకరాలకు పైగా పొలాలు, నెల్లూరులో అపార్ట్ మెంట్లు, స్థిరాస్తులు సంపాధించినట్లు సమాచారం. ఇతను ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి చాలా సన్నిహితుడు కూడా. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అనుమానిస్తున్న రూప్‌ కుమార్‌ యాదవ్‌ నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్..ప్రతిపక్ష పార్టీ చెందిన లీడర్‌ మొదటి నుంచి క్రికెట్ బెట్టింగ్ , పేకాటలతో లింకులున్నట్లు అనుమానిస్తున్నారు..ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు కూడా...రాజకీయాల్లోకి రాకముందు నుంచి కృష్ణసింగ్ , పలువురు క్రికెట్ బుకీలతో సంబంధాలుండడంతో కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ భారీగా పైసా వసూల్ చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు రూప్ కుమార్ యాదవ్ ను హైదరాబాదులోని ఓ హోటల్ లో పట్టుకున్నట్లు సమాచారం.

మాజీ ఆర్టీసీ చైర్మన్‌కు బంధువు
సూళ్లూరుపేటకు చెందిన జాతీయస్థాయి బుకీ అల్లూరు అనీల్ రెడ్డిని కూడా హైదరాబాదులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది...అనీల్ రెడ్డికి మొదటి నుంచి క్రికెట్ బెట్టింగ్ లు, బుకీగా ఎంతో పేరుంది. సూళ్లూరుపేటలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉంటూ ఆ పార్టీకి ఆర్థికంగా సహకరిస్తున్నట్లు సమాచారం...గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ లలో అనీల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.క్రికెట్ బెట్టింగ్ లతో సంబంధమున్న మరో టిడిపి మాజీ కార్పొరేటర్ శరత్ చంద్రారెడ్డి అలియాస్‌ చర పరారీలో ఉన్నట్లు సమాచారం...ఇతని కోసం పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు.. నగరంలోని కుక్కుల గుంటలో నివాసముంటున్న చర . బంగారు పని చేస్తూ ఎన్నో ఏళ్లుగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ, బుకీగా వ్యవహరిస్తున్నాడు. మరో తెలుగు యువత నాయకులు బ్రహ్మనాయుడు.. జిల్లాలో బెట్టింగ్ పాల్పడుతున్న వారిలో ఓ ప్రధానమైన వ్యక్తి. ఉండేది శెట్టిగుంటరోడ్డు . ఇతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం...మాజీ ఆర్టీసీ చైర్మన్‌కు బంధువు కూడా...రియల్ ఎస్టేట్ ముసుగులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం.

టిడిపి నాయకులు బాలకిషోర్
పోలీసుల అదుపులో ఉన్న మరో టిడిపి నాయకులు బాలకిషోర్...నవాబుపేటలో నివాసం. నవాబుపేటలోని శివాలయంకు ఛైర్మన్ . నెల్లూరు నగరంలోని ఓ ప్రముఖ టిడిపి నాయకుని అనుచరుడు. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. లిక్కర్ అండ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు , లిక్కర్ డాన్ మందాకిని రవి ని ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఈయనకు బార్లు, వైన్ షాపులు ఉండడంతో అక్కడే ఈ ఇల్లీగల్ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో మరో ప్రధాన బుకీ పొట్టి ప్రసాద్ . ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ప్రసాద్ అంతర్జాతీయ బుకీ కృష్ణసింగ్ కు ప్రధాన అనుచరుల్లో ఒకడు. బుచ్చిరెడ్డి పాలెం, కోవూరులలో ప్రధాన బుకీగా వ్యవహరిస్తూ చర, స్థిరాస్తులను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది...వల్లి రవి..కృష్ణసింగ్ ప్రధాన అనుచరుడు. పోలీసులతో సంబంధాలు నడుపుతూ తమ ఇల్లీగల్ దందా వ్యాపారాన్ని సజావుగా సాగిస్తుంటాడు. కృష్ణసింగ్ కు నమ్మకస్తుడు. కృష్ణసింగ్ పరిచయమైనప్పటి నుంచి అతనితో సన్నిహితంగా ఉంటూ నమ్మిన బంటుగా ఉండడమేకాక ఏళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహిస్తూ బుకీ అవతారమెత్తి భారీ స్థాయిలో నగదు, ఆస్తులును కూడ బెట్టాడని సమాచారం. డియస్సీ స్థాయి అధికారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని వారికి ముడుపులు, నజరానాలు ఇస్తుంటాడని సమాచారం..

సురేష్ కృష్ణ సింగ్ ప్రధాన అనుచరుడు
సురేష్ ..(కృష్ణసింగ్ గ్రూప్ ఫోటోలోని మధ్యలో ఉన్న వ్యక్తి) కృష్ణ సింగ్ ప్రధాన అనుచరుడు. కృష్ణసింగ్ కు హోల్ అండ్ సోల్ ఇతనే అన్న ఆరోపణలున్నాయి. కృష్ణసింగ్ నడిపే ఇల్లీగల్ దందాలో భాగస్వామ్యుడు. కొన్నేళ్లేుగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. మత్ప్యకార అనీల్ బాబు...బడా పంటర్ . పోలీసుల అదుపులోంచే తప్పించుకున్న ఘనుడు. ఇటీవల హైదరాబాదులో ఓ హోటల్ ఇతన్ని అదుపులోకి తీసుకోగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. దీంతో పోలీసులు మరోవ్యక్తిని ఆ ప్లేస్ లో పెట్టి ఎస్పీ వద్దకు తీసుకు రావడంతో పోలీస్‌ బాస్‌కు కోపం వచ్చింది...రెండు రోజుల్లో అతన్ని ఎలాగైనా పట్టుకుని రావాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో అనీల్ బాబు కోసం గాలిస్తున్నారు..

ఎమ్మెల్యేకు ఆప్తుడు...నాగార్జునరెడ్డి..
నాగార్జునరెడ్డి....ఓ ఎమ్మెల్యేకు మంచి ఆప్తుడు. ఆయన అనుచరుడు. ఆ ఎమ్మెల్యే ఏ కార్యక్రమం చేపట్టినా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ గురుభక్తిని చాటుకుంటుంటాడు. నగరంలోని ప్రధాన బుకీలు, బెట్టింగ్ రాయుళ్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తుననాడు. బెట్టింగ్ వ్యవహారంలోనే పోలీసులకు చిక్కిన వైసీపీ ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ తో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. చిత్తూరు జిల్లా పుత్తూరులో ధర్మరాజుల తిరునాళ్లకు నగరి MLA రోజా హాజరయ్యారు.. ద్రౌపతీదేవి అమ్మవారికి సారె సమర్పించారు.. ముందు తోపు దగ్గర శెల్వ వినాయకస్వామికి పూజలు చేశారు.. అక్కడినుంచి మంగళవాయిద్యాలమధ్య అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు.. అమ్మవారికి రోజా సారె సమర్పించారు.

09:07 - August 2, 2017

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం ఇప్పుడు ప్రముఖుల పీకకు చుట్టుకుంటుంది..ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కుచెందిన ఓ మంత్రి ప్రధాన అనుచరుడి ప్రమేయం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులకు అరెస్టుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది..అయితే ఇది ఆరంభంలోనే ఆగిపోయినట్లు కూడా ప్రచారంలో ఉంది...మంత్రిగారి అనుచరుడు కాబట్టి పైస్థాయిలో మేనేజ్ చేసినట్లు సమాచారం..దీంతో ఆయనగారి పేరు బయటకు రాకుండా లిస్టు రెడీ చేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది.

60 మందికి పైగా బుకీలు
క్రికెట్ బెట్టింగ్ మాఫియాగాళ్ల కోసం జిల్లా యస్పీ పిహెచ్ డి రామకృష్ణ చేపట్టిన వేట క్లైమాక్స్ దశకు చేరుకుంది... గత 10 రోజుల నుంచి పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ బుకీ కృష్ణసింగ్ ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే 60 మందికి పైగా బుకీలు, పంటర్లను పట్టుకుని విచారిస్తున్నారు. జిల్లాలో దాదాపు 90 శాతంపైగా బుకీలను, పంటర్లను ఏరిపారేశారు పోలీసులు. వీరిలో అధికార, ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులతోపాటు ఖాకీలు కూడా ఉన్నట్లు సమాచారం....పోలీసులు అదుపులోకి తీసుకున్నవారి లిస్టు పెద్దదిగా ఉంది..అయితే సర్కార్‌ నుంచి ఎవరినీ ఉపేక్షించవద్దని చెప్పడంతో పోలీసులు అరెస్టుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

మంత్రి అనుచరుడు
ఇప్పటివరకు క్రికెట్‌ బుకీ డాన్‌ కృష్ణసింగ్ చెప్పిన సమాచారంతో ఓ మంత్రి అనుచరుడిని మాత్రం తప్పిస్తున్నట్లు తెలుస్తోంది.. ఆ తర్వాత మిగతా వారందరినీ అరెస్టులకు రంగం సిద్దం చేశారు...ఇప్పటివరకు కృష్ణసింగ్ చెప్పిన లిస్టులో మంత్రి ముఖ్య అనుచరుడు, ఓ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల సన్నిహితులు, ఓ మాజీ ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు టిడిపి నాయకులు, ఓ మాజీ కార్పొరేటర్ , ఇద్దరు డియస్పీలు, 5 మంది సిఐలు, 6మంది ఎస్సైలు 25 మందికి పైగా బుకీల వివరాలు ఈ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.

మహిళపై ఎస్సై దాష్టికం

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో ఓ ఎస్సై మహిళపై దాడి చేశాడు. మహిళ అని చూడకుండా విచక్షణహితంగా ఆమెపై కర్రతో చితకబాదడు. దొంగతనం సొమ్మును ఎక్కడ దాచావంటూ ఎస్సై మహిళ అని చూడకుండూ ఇష్టం వచ్చిన చోట కొట్టడంతో బాధితురాలు బాలమణి స్ఫృహ తప్పి పడిపోయింది. 

హర్టికల్చర్ విద్యార్థుల దీక్షభగ్నం

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేయడంతో పాటు యూనివర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. 

విక్రమ్ కేసులో మరో మలుపు

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో కొత్త కోణం బయటపడింది. విక్రమ్ పై ఇండోర్ ముఠా కాల్పులు జరిపారు. విక్రమ్ కాల్పులకు ఆరు నెలల ముందు నుంచి ప్రణాళిక వేశారు. విక్రమ్ కాల్పులకు ఇండోర్ కు చెందిన ఓ షూటర్ ను నియమించుకున్నారు. హైదరాబాద్ లో కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ట్రయల్ నిర్వహించారు. విక్రమ్ గౌడ్ ప్రణాళిక అమలుకు కోసం ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 

08:24 - August 2, 2017

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ హార్టికల్చర్ యూనివర్సిటీ విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థులను అరెస్ట్ చేయడంతో పాటు యూనివర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. విద్యార్థులు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వారం రోజులుగా నిరహార దీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం వీడియో చూడండి.

08:23 - August 2, 2017

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ కాల్పుల కేసులో మరో కొత్త కోణం బయటపడింది. విక్రమ్ పై ఇండోర్ ముఠా కాల్పులు జరిపారు. విక్రమ్ కాల్పులకు ఆరు నెలల ముందు నుంచి ప్రణాళిక వేశారు. విక్రమ్ కాల్పులకు ఇండోర్ కు చెందిన ఓ షూటర్ ను నియమించుకున్నారు. హైదరాబాద్ లో కాల్పుల ఘటనకు రెండు రోజుల ముందు ట్రయల్ నిర్వహించారు. విక్రమ్ గౌడ్ ప్రణాళిక అమలుకు కోసం ఇంట్లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆయన కాల్పులు జరిపాక వెళ్లే మార్గాలను షూటర్ ముఠాకు చూపించారు. విక్రమ్ గౌడ్ తనపై మూడు రౌండ్లు కాల్పులు జరపాలని సూచించారు. కానీ షూటర్ రెండు రౌండ్ల కాల్పులకే భయపడి పారిపోయడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు నంద్యాల టీడీపీ అభ్యర్థి నామినేషన్

కర్నూలు : నేడు నంద్యాల ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.

 

 

జైలు నుంచి విడుదల కానున్న నేరెళ్ల బాధితులు

కరీంనగర్ : నేడు కరీంనగర్ జైలు నుంచి 8మంది నేరెళ్ల బాధితులు విడుదల కానున్నారు. వీరికి నిన్న కోర్టు షరుతలతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

07:32 - August 2, 2017

కేసీఆర్ ప్రభుత్వం ఏ విషయమైనా అరంభ శురత్వం మాత్రమే అని, నయీమ్ కేసు కూడా ఏం జరిగిందో మనకు తెలుసాని, చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంటుందని, ప్రభుత్వం ప్రముఖుల పేర్లు బయటకు రాకుండా చేస్తుందని, సినీ ప్రముఖులను లొంగదీసుకునే పనిలో ప్రభుత్వం ఉందని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. మియాపూర్ భూముల విషయాన్ని సైడ్ ట్రాక్ లో తీసుకొచ్చారని, కాంగ్రెస్ ఉన్నప్పుడు 6 పబ్బులకు అనుమతిచ్చారని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 50 పబ్బులకు అనుమతిచ్చారని, నయీమ్ కేసులో ప్రభుత్వం ఏం చేసిందో కనబడుతోందని కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో ఉందని నేరం రుజువు అయినప్పుడు చర్యలు తీసుకుంటామని, తెలంగాణ డ్రగ్స్ ములాలను తొలంగించడాని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని టీఆర్ఎస్ నేత సుధాకర్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

07:31 - August 2, 2017

2126అంగన్ వాడీ లను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయిత్నిస్తోంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం 400 నుంచి 600 మంది గర్భిణీలకు సేవా చేయడానికి అంగన్ వాడీ ఉంటుందని. గర్భిణీలకు అమృత హస్తం పథకం తీసుకొచ్చారని, పిల్లలకు స్కూల్ అలవాటు చేస్తున్నారని, గత ఎడు నెలలుగా అంగవాడీ కార్యకర్తల జీతాలు ఇవ్వలేదని, అంగన్ వాడీ సెంటర్లలో సౌర్యాలు కల్పించాలని, సెంటర్ల కుదింపు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని అంగన్ వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ దుర్గారావమ్మ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:30 - August 2, 2017

తూర్పు గోదావరి : పాలకుల మాటలు నీటిమూటలుగా మిలిగిపోతున్నాయని పోలవరం నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. తమ భూములు, నివాస ప్రాంతాలు తీసుకుని.. పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవవహరిస్తున్నారని నిరసనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి జంక్షన్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అరకొర పరిహారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు 2018-19 కి ప్రాజెట్టును పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. నిర్వాసితుల జీవితాలను మాత్రం గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక ప్యాకేజీ
ఇంతవరకు పునరావాసానికి సంబంధించిన భూ సేకరణే చేపట్టలేదంటున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ సర్వే కూడా అరకొరగానే పూర్తిచేశారని చెబుతున్నారు. ఇక నిర్వాసిత గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండిన పౌరులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం అలాంటి చర్యలేవీ చేట్టడంలేదు. పైగా గతంలో పరిహారం పొందిన వారికి 2013 చట్టప్రకారం పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాల్సి ఉన్నా.. సీఎం చంద్రబాబు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ ప్రకటించడంపై నిర్వాసిత ఉద్యమకారులు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కార్‌ 4 లక్షల మంది ప్రజలను నిండా ముంచడానికే సిద్ధం అయిందని ఆదేవన వ్యక్తంచేస్తున్నారు.

గ్రామసభల అభిప్రాయం
గ్రామసభల అభిప్రాయం తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013 భూసేకరణ, పునరావాస చట్టప్రకారమే పరిహారం కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ దిగివచ్చే వరకు తమ ఆందోళన ఆగదని పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు పోలవరం ముంపు గ్రామాల ప్రజల పునరావాసంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీపీఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

 

 

07:28 - August 2, 2017

సిరిసిల్ల : నేరేళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం తెలంగాణలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలు నేరెళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. లెఫ్ట్‌ పార్టీలు నేరేళ్ల దళితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఆందోళన ప్రారంభించాయి. ప్రజాసంఘాలు, టీమాస్‌ ఫోరం కూడా దళితులకు అండగా నిలిచాయి. దళితులపై పోలీసుల వేధింపులు ఆపాలని, దళిత యువకులపై అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో నేరెళ్ల ఘటన రాష్ట్ర రాజకీయ తెరపైకి చేరింది. నేరేళ్ల దళితుల సమస్యపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా కదలింది. దళితుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అంతేకాదు... దళితులను వేధిస్తోన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ బహిరంగ జరిపింది. ఈ బహిరంగ సభ కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. లోక్‌సభ్‌ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ నేరెళ్ల బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇలా ప్రతిపక్షాలు నేరెళ్ల దళితులకు అండగా నిలుస్తుండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

నెలరోజులుగా నేరెళ్ల ఘటన
దాదాపు నెలరోజులుగా నేరెళ్ల ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో విపక్షాలు కూడా దీన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోందని.. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. నెల రోజులుగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుండడంతో ఎట్టకేలకు అధికార టీఆర్‌ఎస్‌లో చలనం వచ్చింది. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు గులాబీ బాస్‌ దళిత నేతలను రంగంలోకి దింపారు. ఇసుక వ్యాపారానికి , కేటీఆర్‌కు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ లేదంటూ ఎదురుదాడికి దిగారు. మొత్తానికి విపక్షాల వరుస ఆందోళనలతో అధికారపార్టీలో చలనమొచ్చింది. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి పూనుకుంటోంది. మరి అధికారపార్టీ విమర్శలను ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో, ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి.

07:27 - August 2, 2017

విజయవాడ : ఎన్నికలకు మరో రెండేళ్లు గడువు ఉన్నా... ఏపీలో మాత్రం అప్పుడే ఎన్నికల హీట్‌ మొదలైంది. అధికార పార్టీ ఇప్పటికే సమన్వయ కమిటీలు, సమావేశాలంటూ ఎన్నికల కసరత్తు మొదలుపెటారు. నేతలను ఎన్నికలకు చంద్రబాబు సమాయత్తం చేస్తున్నారు. ఇదిలావుంటే... మరో రెండు పార్టీలు కూడా ఎన్నికల కోసం అప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 2019లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ప్లీనరీ వేదికగా కార్యాచరణ రూపొందించుకున్న జగన్‌... నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్‌ 27 నుండి రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. అయితే... వైసీపీ రూపొందించిన పథకాలపై ప్రజల్లో చర్చ జరిగేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇక పాదయాత్ర మొదలయ్యే నాటికి పార్టీ కమిటీలు, సభ్యత్వ నమోదులాంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయనున్నారు.

అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్‌
ఇక తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు. ఇప్పటికే పార్టీ కోసం జనసైనికుల ఎంపిక చేపట్టిన జనసేనాని... ఇకపై ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశాడు. తన సినిమాలన్నీ పూర్తి చేసుకుని.. ముందుకు సాగేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. వరుస పర్యటనలు, సమావేశాలతో ప్రజల్లోకి రావడంతో పాటు.. అభిమానించే వారంతా సహకరిస్తే పాదయాత్ర కూడా చేస్తానని ప్రకటించాడు. ఇక ఇప్పటికే ప్రజా సమస్యలపై దృష్టి సారించిన జనసేనాని... సమస్యల పరిష్కారం కోసం ఆయా ప్రాంతాల్లోని మేధావులు, ప్రజాసంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు యువనేతలు అక్టోబర్‌ నుంచి ప్రజల్లోకి రానుండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కనుంది. అయితే... ప్రజలను ఆకట్టుకునేందుకు వారు రచించే వ్యూహాలు ఎంతవరకు సక్సెస్‌ అయితే చూడాలి.

07:26 - August 2, 2017

హైదరాబాద్ : మీరాకుమార్‌ సిరిసిల్ల పర్యటనతో కేసీఆర్‌ పీఠాలకు సెగ తాకిందని కాంగ్రెస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ అన్నారు. దొంగ ఇసుక అమ్ముకునే వారు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. దమ్ముంటే కేటీఆర్‌ రాజీనామా చేయాలని...మళ్లీ సిరిసిల్ల నుంచి పోటీ చేసి కేటీఆర్‌ గెలిస్తే నేను ముక్కు నేలకు రాస్తానని దాసోజు శ్రవణ్ సవాల్‌ విసిరారు.

 

07:25 - August 2, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్‌గా దిగ్విజ‌య్‌సింగ్‌ ప్రయాణం ముగిసింది. 2013 నుండి ఇంచార్జ్ బాధ్యత‌లు మోసిన దిగ్విజ‌య్‌సింగ్‌ ను త‌ప్పిస్తూ పార్టీ హైక‌మాండ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీ వ్యవ‌హారాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న దిగ్విజ‌య్‌ను బాధ్యత‌ల నుండి త‌ప్పించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014 లో పార్టీ ఓట‌మి త‌ర్వాత దిగ్విజ‌య్ ను త‌ప్పించాల‌ని చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఎన్నికల్లో ఓట‌మి, టీ-పీసీసీలో స‌మ‌న్వయం సాధించడంలో ఇంచార్జ్ గా దిగ్విజ‌య్ విఫ‌ల‌మ‌య్యార‌ని టీకాంగ్‌ నేతలు వరుసకట్టి మరీ ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే అధిష్టానం ఆ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు.

ఏఐసీసీ ప్రక్షాళ‌న
కాని సెప్టెంబ‌ర్‌లో ఏఐసీసీ ప్రక్షాళ‌న స‌మ‌యంలో మార్పులు ఉంటాయ‌న్న సంకేతాల‌ను రాష్ట్ర నేత‌లకు ఇస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పటికిప్పుడు దిగ్విజ‌య్‌ను త‌ప్పిస్తూ నిర్ణయం తీసుకోవ‌డం స్టేట్ లీడ‌ర్స్‌ను ఆశ్చర్యంలో ముంచింది. అయితే దిగ్విజ‌య్‌ను నిజంగానే హైక‌మాండ్ త‌ప్పించిందా..? లేక ఆయ‌నే త‌ప్పుకున్నారా..? ఇపుడు ఇదే అంశంపై పార్టీలో గుసగుసలు జోరుగా సాగుతున్నాయి. ఇంచార్జిగా ఉండి..అందరినీ కలుపుకుని పోవాల్సిన దిగ్విజయ్‌.. త‌న‌కు అనుకులంగా ఉన్న వారికి ప్రాధాన్యత క‌ల్పిస్తూ.. పార్టీకి ప‌నికి వ‌చ్చేవారిని దిగ్విజ‌య్ నిర్లక్ష్యం చేశారని టీకాంగ్‌ నేతలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ ఆశించిన విధంగా స‌మ‌యాన్ని కూడా దిగ్గిరాజా కేటాయించలేక పోయారనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో కేవ‌లం ట్విట్టర్ల కే పరిమితం కావ‌డంతో తెలంగాణ కాంగ్రెస్‌లో సమన్వయం కొరవడింది. దీంతో ఢిల్లీ అధిష్టానం ఆయన్ను తప్పిస్తూ.. ఆర్‌సీ కుంతియాకు కొత్తగా బాధ్యతలు అప్పగించిందని హస్తంపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

స్వంత రాష్ట్రం పై దిగ్విజ‌య్ చూపు
మ‌ధ్యప్రదేశ్ లో ఎన్నిక‌లు రానుండంట‌తో.. దిగ్విజ‌య్ చూపు స్వంత రాష్ట్రం పై ప‌డింద‌ని కొంద‌రు అంటున్నారు. అందుకే వ‌చ్చే నెల నుంచి .. న‌ర్మదా ప‌రిక్రమ యాత్రను త‌ల‌పెట్టారన్న చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా దిగ్విజ‌య్ ఆరు నెల‌ల పాటు పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఇది పూర్తి అధ్యాత్మిక యాత్ర అని పైకి చెబుతున్నా.. స్టేట్ పాలిటిక్స్‌పై ప‌ట్టుపెంచుకునేందుకు దీనిని ఉప‌యోగించుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రకు ఇప్పటికే సోనియా, రాహుల్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ మార్పు ..రాష్ట్రవ్యవహరాల ఇంచార్జ్ వ‌ర‌కే పరిమితం అవుతుందా.. లేక రాష్ట్ర నాయ‌కత్వానికీ, ముఖ్యంగా టీపీసీసీ పీఠాన్ని కూడా తాకుతుందా.. అసలు ఢిల్లీ పెద్దల మ‌న‌సులో ఏంవుందనేది టీ-కాంగ్రెస్‌ నేతలకు అంతుపట్టని విషయంగా మారింది. 

07:23 - August 2, 2017

హైదరాబాద్ : కాలేశ్వరంపై ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్దేశిత సమయంకన్నా ముందే పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకుంది. కాళేశ్వరం పంపు హౌజ్‌ పనులను 2018 మార్చి చివరికల్లా పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.పంపింగ్‌ స్టేషన్ల పూర్తిని టార్గెట్‌ పెట్టుకుని ఇరిగేషన్‌శాఖ పనిచేస్తోందని హరీశ్‌రావు ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. వచ్చే డిసెంబర్‌ కల్లా ప్యాకేజీ -6 పనులన్నీ పూర్తి చేయనున్నట్టు చెప్పారు. వివిధ పనులకు సంబంధించిన డెడ్‌లైన్లను ఖరారు చేశామని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పంప్‌హౌజ్‌ పనులు పుంజుకున్నాయని.. అవి 2018 మార్చికల్లా పూర్తి అవుతాయన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్‌లో సాగునీటిని అందించనున్నట్టు స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు హెచ్‌టి లైన్లు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

2018 మార్చిలోగా 10 సబ్‌స్టేషన్లు
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు విద్యుత్‌ సంస్థల సహకారం ఎంతో అవసరమని హరీశ్‌రావు అన్నారు. 2018 మార్చిలోగా 10 సబ్‌స్టేషన్లు పూర్తి చేయాలని హరీశ్‌ ఆదేశించారు. ఆరు 400 కెవి సబ్‌స్టేషన్లు, మూడు 220 కెవి సబ్‌స్టేషన్లు, రెండు 132 కెవి సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. పంపింగ్‌ స్టేషన్ల ప్రోగ్రెస్‌ను మంత్రి సమీక్షించారు. విద్యుత్‌ టవర్ల నిర్మాణం, హెచ్‌టి లైన్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. కాలేశ్వరం కోసం 59 టవర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ఇరిగేషన్‌, విద్యుత్‌ సంస్థలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇరిగేషన్‌, ట్రాన్స్‌కోకు చెందిన ఉత్సాహవంతులైన ఇంజనీర్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక్కో ప్రాజెక్టు దగ్గర కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని వాటిలో ఈ టీమ్‌ పనిచేయాలన్నారు.

07:21 - August 2, 2017

హైదరాబాద్ : సంచలనం సృష్టించిన విక్రమ్‌గౌడ్‌ కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. విక్రమ్‌గౌడే ప్రధాన సూత్రదారి అని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అనంతపురం నుంచి ఇప్పటికే హైదరాబాద్‌కు తరలించారు. నిందితులను విచారించిన పోలీసులు. శుక్రవారం తెల్లవారు జామున తనపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారని విక్రమ్‌గౌడ్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అయితే... ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. కావాలనే మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పుల బాధను తప్పించుకోవడానికే కాల్పుల నాటకం ఆడినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆరుగురు వ్యక్తులను తనే పురమాయించి ఉంటాడని అనుమానించారు. తనపై కాల్పులు జరపాలని అనంతపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు.. హైదరాబాద్‌కు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చాడు. పక్కా పథకం ప్రకారమే కాల్పులకు ప్లాన్‌ చేశాడు. తొలుత బంజారాహిల్స్‌లోని తన కార్యాలయం 'క్లాప్‌షార్ట్‌'లో కాల్చుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే... అక్కడే ఒక్కడే వాచ్‌మెన్‌ ఉండడంతో పాటు... రాత్రి ఒంటిగంటన్నర కావస్తుండడంతో తనకు సీరియస్‌ అయితే ఎవరూ ఆస్పత్రికి తీసుకువెళ్లరనే అనుమానంతో ప్లాన్‌ను ఇంటికి మార్చినట్లు తెలుస్తోంది.

స్వయంగా రెండువైపులా కాల్చుకుని
ఇక ఇంటికి వచ్చిన విక్రమ్‌ సుపారీ ఇచ్చినవారితో కాల్పించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వాచ్‌మెన్‌ను గేట్‌ వేయవద్దని చెప్పాడు. అయితే కాల్చే సమయంలో వారి గురి తప్పితే ప్రాణాలకు ప్రమాదముందని భయపడిన విక్రమ్‌ తానే స్వయంగా రెండువైపులా కాల్చుకుని... గన్‌ను వారికిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు విక్రమ్‌ గేమ్‌ ఆడుతున్నాడని గుర్తించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి అన్ని వివరాలు సేకరించారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

 

Don't Miss