Activities calendar

03 August 2017

22:50 - August 3, 2017
22:46 - August 3, 2017
22:23 - August 3, 2017

ఢిల్లీ : మోది ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల, ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయని విపక్షాలు మండిపడ్డాయి. అమెరికాతో స్నేహం ద్వారా భారత్‌.. ప్రపంచంలో తనని తాను దిగజార్చుకుందని విమర్శించాయి. ప్రధాని మోది ఎన్ని దేశాలు తిరిగినా భారత్‌కు పెట్టుబడులు తేలేక పోయారని విపక్షాలు రాజ్యసభలో ఎద్దేవా చేశాయి. చైనాతో వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించేందు కృషి చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
విదేశాంగ విధానంపై వాడి వేడి చర్చ 
భారత దేశ ప్రస్తుత విదేశాంగ విధానంపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. బహుళ దేశాల ప్రయోజనాలే పరమార్థంగా మోది సర్కార్‌ పనిచేస్తోందని సిపిఎం దుయ్యబట్టింది. స్వాతంత్రానికి పూర్వం నుంచి పాలస్తీనాతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉందని... మోది ఇజ్రాయిల్‌ పర్యటన దీనికి విఘాతం కల్పించిందని ఏచూరి అన్నారు. గతంలో అలీనవిధానం ద్వారా ప్రపంచానికే మార్గదర్శకంగా భారత్‌ నిలబడిందని ఏచూరి తెలిపారు. అణ్వాయుధాల విధ్వంసానికి భారత్‌ నేతృత్వం వహించిందని, రాజీవ్‌గాంధీ ఐక్యరాజ్యసమతిలో ఎజెండాను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఇండియా-అమెరికా అణు ఒప్పందం వల్ల భారత్‌కు జరిగిన మేలేంటి?  అమెరికా న్యూక్లియర్‌ టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేసిందా అని ప్రశ్నించారు.
కేంద్రాన్ని ఎండగట్టిన ఆనంద్‌శర్మ  
డోక్‌లామ్‌కు సంబంధించి చైనా భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత... పాకిస్తాన్‌, నేపాల్‌ తదితర ఇరుగు పొరుగు దేశాలతో మోది ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ కేంద్రాన్ని ఎండగట్టారు. 65 దేశాల్లో పర్యటించిన ప్రధాని దేశానికి ఏమి ఒనగూర్చారని నిలదీశారు. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశామని మోది గొప్పలు చెప్పుకుంటున్నా...ఇంతవరకు ఆ దేశం దాన్ని అంగీకరించలేదని ఆనంద్‌శర్మ చెప్పారు. ఇండియా-రష్యాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని, రష్యా పాక్‌తో సైనిక విన్యాసాలు జరపడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైనా విషయంలో కేంద్రం విధానం ఏంటో చెప్పాలని ఆనంద్‌శర్మ డిమాండ్‌ చేశారు. హెచ్‌ బి-1 వీసాపై అమెరికా ఎందుకు హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు.
విదేశాంగ విధానంపై సుష్మాస్వరాజ్‌ సమాధానం
భారత విదేశాంగ విధానంపై సుష్మాస్వరాజ్‌ విపక్షాలకు సూటిగా సమాధానమిచ్చారు. పాకిస్తాన్ విషయంలో రష్యాతో పాటు అమెరికా మద్దతు కూడగట్టడం గొప్ప విజయమని మంత్రి అన్నారు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా సంబంధాల్లో భారత్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. డోక్‌లామ్‌ వివాదాన్ని ప్రస్తావిస్తూ యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని సుష్మా చెప్పారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని...కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని సుష్మా సభకు తెలిపారు. 

 

22:19 - August 3, 2017

శ్రీకాకుళం : వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు సీపీఎం ఏపీ కార్యదర్శి మధు. శ్రీకాకుళం జిల్లా లోని వంశధార నిర్వాసిత ప్రాంతాలలో ప్రభుత్వ నిర్బంధాన్ని అధిగమించి మరీ పర్యటించారాయన. సీపీఎం ఏపీ కార్యదర్శి మధు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని బేఖాతరు చేస్తూ.. ఆయన వంశధార నిర్వాసిత ప్రాంతాలను సందర్శించారు. ఇరపాడు, పాడలి గ్రామాల్లో పర్యటించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పన వంటి అంశాలపై ఆరా తీశారు. పరిహారం చెల్లింపు, పునరాసం కల్పనలో జరుగుతున్న జాప్యంపై నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రామాల్లోకి నీళ్ళు వదిలేందుకు ప్రభుత్వం కుట్ర 
వంశధార ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిర్వాసితుల ప్యాకేజి విషయంలో గడచిన రెండేళ్లుగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రెండు సార్లు నిర్వాసిత ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధు గురువారం నిర్వాసిత ప్రాంతాలకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా గండికోటలో మాదిరి వంశధార ప్రాంతంలో గ్రామాల్లోకి నీళ్ళు వదిలేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ ఈ సందర్భంగా మధు ఆరోపించారు. మధు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం చేశారు. హీరమండలం గొట్టా బ్యారేజీ వద్ద కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మధు పర్యటనను నిలిపివేశారు. 

 

22:15 - August 3, 2017

హైదరాబాద్ : మీరాకుమార్‌ పై కేసీఆర్‌ అనుచితవ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఖండించారు. మీరాకుమార్‌ గురించి అనుచితంగా మాట్లాడిన కేసీఆర్‌ను దేశం మొత్తం అసహించుకుంటోందని అన్నారు. నేరెళ్ల ఘటనలో బాధితులను పరామర్శించిన లోక్‌సభా మాజీ స్పీకర్‌కు కనీస మర్యాద కూడా ఇవ్వడం ముఖ్యమంత్రికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

 

22:12 - August 3, 2017

హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటారు. జనం కనిపిస్తే మాత్రం వెర్రెత్తిపోయి.. లాఠిన్యాన్ని ప్రదర్శిస్తారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరు సామాన్యుడికి నరకాన్ని చూపుతోంది.  మొన్న నేరెళ్ల దళితులపై దాడి.. నిన్న కరీంనగర్‌ జిల్లాలోనే మరో మహిళపై ప్రతాపం.. ఇప్పుడు ఏకంగా మీడియాపైనే విరుచుకుపడడం.. ఇలా.. సందర్భం ఏదైనా.. తాము ఎన్నటికీ మారేది లేదని నిరూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు.
ప్రశ్నిస్తే పోలీసులతో దాడి 
ఉద్యమపార్టీగా చెప్పుకునే టీఆర్‌ఎస్‌  ఇపుడు  ఉద్యమం పేరెత్తితేనే ఉలిక్కిపడుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే.. పోలీసులచేత దాడిచేయిస్తోంది.   ధర్నాచౌక్‌ ఉద్యమం, నిరుద్యోగుల నిరసన, ఇసుక మాఫియాను ప్రశ్నించిన దళిత బహుజనులపై దాడి, తాజాగా జర్నలిస్టులపై దాడి.. ఇలా.. తనను ప్రశ్నించే వారే ఉండొద్దన్నట్టుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియంతపాలనను తలపిస్తోంది.
మహిళా జర్నలిస్టుపై ఏసీపీ వెంకటేశ్వర్లు దాడి 
ఎప్పటిలాగానే న్యూస్‌ కవర్‌ చేయడానికి ప్రగతి భవన్‌కు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. వైద్యశాఖలోని కాంట్రాక్టు సిబ్బంది రెగ్యులరైజేషన్‌ కోసం ఆందోళనకు దిగారు. నిరసనకారులను పశువులను ఈడ్చినట్లుగా లాగేస్తున్న దృశ్యాలను చిత్రీకరించిన మీడియా.. ఈ అఘాయిత్యంపై ఏసీపీ నుంచి వివరణ తీసుకునేందుకు ప్రయత్నించింది. సంయమనంగా సమాధానమివ్వాల్సిన ఏసీపీ.. ఆగ్రహంతో ఊగిపోతూ..  నోటికి వచ్చినట్టు తిడుతూ.. 10టీవీ సిబ్బంది సహా, అక్కడున్న మీడియా ప్రతినిధులపై భౌతికంగా దాడికి తెగబడ్డారు. చివరికి మహిళా జర్నలిస్టులపైనా చేయి చేసుకున్నారు. 
అసహనంతో ఖాకీలోతో దాడిచేయిస్తున్న సీఎం 
మీడియాపై పోలీసుల దాడిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఎన్నికలకు ముందిచ్చిన ఏ హామీనీ నిలుపుకోకుండా, అన్ని వర్గాల్లోనూ విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అసహనంతో రగిలిపోతూ  ప్రశ్నించిన వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 
సీఎం ప్రోద్బలంతోనే రెచ్చిపోతున్న పోలీసులు..! 
ప్రశ్నించడమే తప్పన్నట్టుగా పోలీసులు రెచ్చిపోవడం వెనుక ప్రభుత్వ  ప్రోద్బలం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నేరెళ్లలో ఇసుక మాఫీయాను ప్రశ్నించినందుకు దళిత, బహుజనులపై ఖాకీలను ప్రయోగించిందని టీమాస్‌ ఫోరం నేతలు మండిపడుతున్నారు.
టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా మారిన పోలీసులు 
రాష్ట్రంలో పోలీసులు టీఆర్‌ఎస్‌పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీమాస్‌ఫోరం నేతలు విమర్శిస్తున్నారు.  కేసీఆర్‌ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ కు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేస్తామని చెబుతున్న కేసీఆర్‌.. దళితుల ఓట్ల కోసమే  అంబేద్కర్‌ జపం చేస్తారని టీమాస్‌ ఫోరం నేతలు  మండిపడుతున్నారు. అంబేద్కర్‌ ప్రవచించిన  ఫ్రీడం ఆఫ్‌ స్పీచ్‌ అంటే పోలీసులతో దాడి చేయించడమేనా .. అని ప్రశ్నిస్తున్నారు. 
దాడికి నిరసనగా నిరసనలు  
మరోవైపు హైదరాబాద్‌లో జర్నలిస్టులపై పోలీసుల దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు సంఘీభావంగా వామపక్షాలు, విద్యార్థిసంఘాలు నిరసకు దిగాయి.
డీజీపీకి జర్నలిస్టుల సంఘాల ఫిర్యాదు 
ప్రగతి భవన్‌లో జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు, ముఖ్యంగా ఏసీపీ వెంకటేశ్వర్లుపై డీజీపీ అనురాగ్‌శర్మకు జర్నలిస్టుల సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమని  తెలంగాణ వర్కింగ్‌జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ హెచ్చరించారు. 
పోలీసుల దాడికి ప్రభుత్వానికి లింక్‌ పెట్టొదన్న ఎంపీ కవిత
ఈ వ్యవహారంపై నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ.. పోలీసుల దురుసు ప్రవర్తనపై  ప్రభుత్వం తరపున నివేదిక కోరతామన్నారు. పోలీసుల దాడికి ప్రభుత్వానికి లింక్‌ పెట్టడం సరికాదన్నారు. మొత్తమ్మీద పోలీసుల తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం  పోలీసుల దూకుడుకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

22:01 - August 3, 2017

హైదరాబాద్ : నంద్యాలలో జరిగేది ధర్మానికి.. అధర్మానికి మధ్య జరిగే ఎన్నికే అన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి. 12 అవినీతి కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు ఏ కేసూ లేని చంద్రబాబుకు మధ్య పోటీ జరుగుతుందని చెప్పారు. బై ఎలక్షన్‌ రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా గృహనిర్మాణ పథకం అమలవుతుందని సోమిరెడ్డి చెప్పారు. నంద్యాల అభివృద్ధిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని మండిపడ్డారు.

 

ఇవే..ఏపీ కేబినెట్ నిర్ణయాలు

గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. స్థలాలకు నిర్దేశిత  ఫీజును వసూలు చేయడంతో పాటు 2013 వాల్యూ ప్రకారం క్రమబద్ధీకరిస్తున్నట్లు కళా వెంకట్రావు చెప్పారు. మరోవైపు పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెంకటాపురంలోని 98 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మరో మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. 

21:57 - August 3, 2017

గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో పట్టణాల్లోని ప్రభుత్వ భూముల్లో పేదల ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపినట్లు మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. స్థలాలకు నిర్దేశిత  ఫీజును వసూలు చేయడంతో పాటు 2013 వాల్యూ ప్రకారం క్రమబద్ధీకరిస్తున్నట్లు కళా వెంకట్రావు చెప్పారు. మరోవైపు పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు అందించే అంశంపై కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెంకటాపురంలోని 98 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మరో మంత్రి ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. 

 

వీవోఏలకు రూ.3 వేల గౌరవ వేతనం

హైదరాబాద్ : తెలంగాణ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ)లకు రూ.3 వేల గౌరవ వేతనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18, 836 మంది వీవోఏలకు గౌరవ వేతనం ప్రకటించింది. 

 

21:44 - August 3, 2017

నంద్యాల రాజకీయం నవ్వుల పాలు...జనం మీద నాయకుల గావురాలు, ద్రౌపతికి వస్త్రాలిచ్చొచ్చిన రోజా..కలియుగంల శ్రీకృష్ణుని చెల్లె, కాంగ్రెస్ క్యాంప్ మీద బీజేపీ కంపు...రాజ్యసభ సీటు కోసం మోడీ గలీజు, తానం చేద్దామంటే నీళ్ల సుక్క లేదు...కన్నీళ్లువెడ్తున్న కస్తూర్బా పిల్లలు, హన్మకొండల డ్యాన్సు చేస్తున్న ఆటో వాలా... యాదాద్రి కొండల ఆందోళనలో డ్రైవర్లు, దళితుల స్మశాన వాటిక కబ్జా వెట్టిన రెడ్డి...భువనగిరి దిక్కు దిగిన నయా నయీం... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

21:33 - August 3, 2017

దేశం చీకటిలో మగ్గుతున్నప్పుడు వెలుగునిచ్చే వెలుగుదివ్వె కావాలి. మూఢనమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు రాజ్యమేలే కాలంలో ప్రశ్నించే గొంతుకలు ఎలుగెత్తాలి.. పాలక శక్తులు అణచివేతకు పాల్పడుతున్న కాలంలో ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఎదురు నిలిచే ధైర్యం కావాలి. ఏది నిజం, ఏది కల్పన తేల్చుకోని అజ్ఞానంలో తనదేశ ప్రజలను మగ్గుతున్నపుడు.. తన ప్రయోగశాలను సమాజం నడిబొడ్డున పెట్టుకుని ప్రజలతో మమేకమయ్యే సైంటిస్టు కావాలి. అలాంటి నికార్సైన ప్రజా శాస్త్రవేత్త.. పీఎం భార్గవకు టెన్ టీవీ నివాళులర్పిస్తోంది. శాస్త్రవేత్తలపై ఎన్డీయే ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగా పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇచ్చిన నిబద్ధత. ఆలోచనాత్మక, హేదువాద వ్యవస్థను కాంక్షించిన దార్శనికత... డాక్టర్ పీఎం భార్గవ సొంతం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జగన్ మాటలు బాధ కలిగించాయి : మంత్రి అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : నంద్యాలలో జగన్ మాటలు బాధ కలిగించాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ అధికార దాహంతో మాట్లాడినట్లుందని చెప్పారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సహనం కోల్పోకూడదని తెలిపారు. ప్రజా సమస్యలపై జగన్ ఏనాడైనా మాట్లాడారా అని అడిగారు. 

21:21 - August 3, 2017

అనంతపురం : కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి అనంతపురం జిల్లా సవేరా ఆసుపత్రి స్పందించి ప్రాణాలు బ్రతికించింది. పూర్తిగా బీపీ, పల్స్‌ పడిపోయిన గోవిందప్ప అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకోగా వైద్యులు అధునాతన సేవలు అందించి ప్రాణాలను కాపాడారు. ఇదంతా ఎన్టీఆర్‌ వైద్య సేవ కిందనే అందించినట్టు వైద్యులు తెలిపారు.  దీంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపాడు.

21:15 - August 3, 2017
21:13 - August 3, 2017

నెల్లూరు : రాష్ట్రంలోనే సంచలనంగా మారిన క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా కేసును ఈ రోజు నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణ ముగింపు పలికారు. ఇప్పటి వరకు 115 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బెట్టింగ్‌ మాఫియాతో సంబంధం ఉన్న ఎవరిని వదలే ప్రసక్తే లేదంటున్న నెల్లూరు జిల్లా ఎస్పీ రామకృష్ణతో టెన్ టివి ఫేస్ టు ఫేస్‌ నిర్వహించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:07 - August 3, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ పోటీలో ఉండటం వల్లే ఏపీ కేబినెట్‌ అంతా నంద్యాలలో మకాం వేసిందని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. వైసీపీ పోటీలో ఉండటం వల్లే నంద్యాలలో కొంత వరకు అభివృద్ధి పనులు చేపట్టారని ఆయన అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని.. టీడీపీ ప్రజలే బుద్ధి చెబుతారని జగన్‌ అన్నారు. 
నంద్యాల ఉపఎన్నిక 2019 ఎన్నికలకు నాంది
నంద్యాల ఉపఎన్నిక 2019 ఎన్నికలకు నాంది అని జగన్‌ అన్నారు. మూడున్నరేళ్ల చంద్రబాబు మోసపూరిత పాలనకు.. ధర్మానికి మధ్య ఈ ఎన్నిక జరుగుతుందన్నారు. చంద్రబాబు ఎన్ని డబ్బులు వెదజల్లినా ఓటు తీర్పుతో.. ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు.
ప్రజలను మోసగించిన చంద్రబాబు 
రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మూడున్నరేళ్లుగా మోసం చేస్తున్నారని జగన్‌ మండిపడ్డారు. కాపులను, యువతను, మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసి మోసం చేస్తున్నారని నంద్యాల సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అన్నివర్గాలకు సంక్షేమం చేస్తానంటూ కపటప్రేమ కురిపిస్తున్నారని జగన్‌ విమర్శించారు. 

జగన్ మాటలు హాస్యాస్పదం : మంత్రి సోమరెడ్డి

అమరావతి : నంద్యాలలో జగన్ మాటలు హాస్యాస్పదమని మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక లేకపోయినా నంద్యాలను అభివృద్ధి చేసేవాళ్లమని చెప్పారు. కేవలం నంద్యాలలోనే అభివృద్ధి చేస్తున్నామని అనడం వైసీపీ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. 

కారు ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

నెల్లూరు : అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి దగ్గర కారు కానిస్టేబుళ్ల బైక్ ను ఢీకొట్టింది. గిరిప్రసాద్, వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుళ్లు సోమశిల పీఎస్ లో పని చేసున్నారు. 

 

మధురై విమానాశ్రయంలో మాదకద్రవ్యాల పట్టివేత

చెన్నై : మధురై విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేసియాకు తరలిస్తున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి రూ.3.5 కోట్ల విలువైన 7.5 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

 

20:39 - August 3, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీకి ఓటేస్తే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, రౌడీయిజం పెరిగిపోతాయని ఆమె నంద్యాల సభలో అన్నారు. 

20:31 - August 3, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు విధానాలను ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నో కుయుక్తులకు పాల్పడుతున్న చంద్రబాబును కాల్చినా తప్పులేదని అన్నారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు కౌరవ సామ్రాజ్యాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. నంద్యాలలో జరుగుతున్నది ఉప ఎన్నిక మాత్రమే కాదు... నంద్యాలలో జరుగుతున్నది ధర్మ యుద్ధం అని అన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఏమనాలి..ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబును ఏమనాలన్నారు. చంద్రబాబు కేబినెట్ అంతా నంద్యాలలోనే ఉందన్నారు. నంద్యాల ఏకగ్రీవానికి అంగీకరించి ఉంటే..చంద్రబాబు ఒక్క రూపాయి అయినా విడుదల చేసే వారా అన్నారు. ఇంతమంది మంత్రులు నంద్యాలకు వచ్చేవారా అని చెప్పారు.
చంద్రబాబు ముఖ్యమంత్రా....కంత్రిమంత్రా..?
చంద్రబాబు ముఖ్యమంత్రా....కంత్రిమంత్రా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దొంగల పాలనా..? ప్రజా పాలనా...? ఉందా అని అన్నారు. చంద్రబాబు...సొంత మామను వెన్నుపోటు పొడిచాడని చెప్పారు. ఎన్ టీఆర్ సీఎం పదవి, ఆయన ట్రస్టు, ఆయన పార్టీని చీల్చారని పేర్కొన్నారు. ఎన్నికలొస్తే చంద్రబాబు ఎన్ టీఆర్ ఫోటోలకు దండలు వేసి, ప్రచారానికి వెళ్తారని చెప్పారు. చంద్రబాబు మిగతా పార్టీలో చిచ్చుపెడుతున్నారని తెలిపారు. 
మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు 
మైనార్టీలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ముస్లీం మైనారిటీలను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారని.. అధికారంలోకి  రాగానే కపట ప్రేమ చూపిస్తారని తెలిపారు. కేబినెట్ లో ఒక్క ముస్లీమైనార్టీ మంత్రి కూడా లేడన్నారు. ముస్లీం సోదరులను బలిపశువులను చేశారని చెప్పారు. హిందూపురం ముస్లీం స్థానాన్ని లాగేసి బాలకృష్ణకు ఇచ్చారని.. అబ్దుల్ గనీ కి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం చేశారని చెప్పారు. కాపు కులస్తులను వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. నంద్యాల ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ ను పిలిపించుకుంటారని విమర్శించారు. ఇదీ బాబు గారి నైజం అని ఎద్దేవా చేశారు. 
విపరీతమైన అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు   
ఇసుక నుంచి మొదలుకొని రాజధాని భూముల దాకా చంద్రబాబు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవైపు చంద్రబాబు అవినీతికి పాల్పడూ...మరోవైపు 'తన అంత నిప్పు ఎవడూ ఉండడు' అని చంద్రబాబు ఫోజులు కొడ్తడని విమర్శించారు. చంద్రబాబు లంచాలు మింగి ఆడియో, వీడియో టేపుల్లో దొరికారని తెలిపారు.
కుప్పంకు ఏ మేలు చేయని చంద్రబాబు  
కుప్పంకు ఏ మేలు చేయని చంద్రబాబు...నంద్యాలకు అది చేస్తా... ఇది చేస్తానని అంటున్నారని జగన్ విమర్శించారు. జీవితంలో ఒక్క అబద్ధం చెప్పని..వ్యక్తిని సత్యహరిశ్చంద్రుడు అంటారు... జీవితంలో ఒక్కనిజం కూడా చెప్పని వ్యక్తిని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు... ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో చంద్రబాబు కర్నూలుకు అనేక హామీలు ఇచ్చారని..వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబును కాల్చినా తప్పులేదన్నారు. చంద్రబాబు.. సీఎంమా..దొంగా..? అని అన్నారు. సత్యవంతులదే విజయం అవుతుందని..ఖురాన్, బైబిల్, భగవద్గీత అదే చెబుతుందన్నారు. 

 

తనపై వచ్చిన వార్తలను ఖండించిన డీ.శ్రీనివాస్

హైదరాబాద్ : తనపై వచ్చిన వార్తలను డీ.శ్రీనివాస్ ఖండించారు. తాను కాంగ్రెస్ లో చేరతున్నాననడం అవాస్తమమన్నారు. తన హోదాకు తగ్గట్టు కేసీఆర్ తనను గౌరించారని తెలిపారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. 

 

నిర్మల్ జిల్లాలో ప్రమాదం

నిర్మల్ : ముధోల్ మండలం చించాలలో ప్రమాదం జరిగింది. పొలంలో నాటు వేస్తుండగా ఐదుగురు మహిళలపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. మహిళలు సహా ట్రాక్టర్ బావిలో పడింది. మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

 

19:34 - August 3, 2017

కర్నూలు : నంద్యాల సభా వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన వైసీపీ సభలో జగన్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా గ్రామాల్లో తిరగనీయకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

19:21 - August 3, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో నాంపల్లి కోర్టు విక్రమ్‌గౌడ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇవాళ అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతనికి మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే విక్రమ్‌గౌడ్‌కు మెరుగైన వైద్యం అందించాలని విక్రమ్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. గాంధీ, లేక ఉస్మానియా ఆస్పత్రిలో విక్రమ్‌గౌడ్‌కు వైద్య చికిత్స అందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అనంతరం విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

 

19:11 - August 3, 2017

హైదరాబాద్ : అనుమతులు లేని విద్యాసంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని టీజాక్ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన పోరుగర్జన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులకు కావలిసిన బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 

 

19:07 - August 3, 2017

అనంతపురం : జిల్లాలోని కనేకల్‌ మండలం యారగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.  

 

కుప్పంకు ఏ మేలు చేయని చంద్రబాబు : జగన్

కర్నూలు  : కుప్పంకు ఏ మేలు చేయని చంద్రబాబు...నంద్యాలకు అది చేస్తా... ఇది చేస్తానని అంటున్నారని జగన్ విమర్శించారు. నంద్యాల సభలో ఆయన మాట్లాడారు. జీవితంలో ఒక్క అబద్ధం చెప్పని..వ్యక్తిని సత్యహరిశ్చంద్రుడు అంటారు... జీవితంలో ఒక్కనిజం కూడా చెప్పని వ్యక్తిని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు... ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సీఎం హోదాలో చంద్రబాబు కర్నూలుకు అనేక హామీలు ఇచ్చారని..వాటిలో ఏ ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబును కాల్చినా తప్పులేదన్నారు.

విపరీతమైన అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు : జగన్

కర్నూలు : ఇసుక నుంచి మొదలుకొని రాజధాని భూముల దాకా చంద్రబాబు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒకవైపు చంద్రబాబు అవినీతికి పాల్పడూ...మరోవైపు 'తన అంత నిప్పు ఎవడూ ఉండడు' అని చంద్రబాబు ఫోజులు కొడ్తడని విమర్శించారు. 

 

మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు

కర్నూలు : మైనార్టీలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముస్లీం మైనారిటీలను చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారని.. అధికారంలోకి  రాగానే కపట ప్రేమ చూపిస్తారని తెలిపారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం చేశారని చెప్పారు. కాపు కులస్తులను వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. నంద్యాల ఎన్నికలు వస్తే పవన్ కళ్యాణ్ ను పిలిపించుకుంటారని విమర్శించారు. ఇదీ బాబు గారి నైజం అని ఎద్దేవా చేశారు. 

 

చంద్రబాబుపై జగన్ ఫైర్

కర్నూలు : రాష్ట్రంలో దొంగల పాలనా..? ప్రజా పాలనా...? ఉందా అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు...సొంత మామను వెన్నుపోటు పొడిచాడని చెప్పారు. ఎన్ టీఆర్ సీఎం పదవి, ఆయన ట్రస్టు, ఆయన పార్టీని చీల్చారని పేర్కొన్నారు. ఎన్నికలొస్తే చంద్రబాబు ఎన్ టీఆర్ ఫోటోలకు దండలు వేసి, ప్రచారానికి వెళ్తారని చెప్పారు. చంద్రబాబు మిగతా పార్టీలో చిచ్చుపెడుతున్నారని తెలిపారు. 

 

17:56 - August 3, 2017

ఢిల్లీ : శ్రీలంక నేవీ అధికారులకు పట్టుబడుతున్న తమిళనాడు మత్స్యకారులను వదిలేయడానికి ఎంత సమయం పడుతోందని రాజ్యసభలో సిపిఐ సభ్యులు డి.రాజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారులు పడవలను స్వాధీనం చేసుకోవడం వల్ల వారు జీవనోపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్సకారులను నేవి అధికారులు పట్టుకోవడం  వారిని విడిపించడానికి కేంద్రం ఆ దేశంతో చర్చలు జరపడం సర్వ సాధారణమని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్నారు. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్ణీత సమయానికన్నా ముందుగానే మత్స్యకారులను విడిపించడం జరుగుతోందని మంత్రి చెప్పారు. ఇటీవల పట్టుబడ్డ ఏడుగురు మత్స్యకారులను ఆగస్టు 10 వరకు కోర్టు రిమాండ్‌ విధించినా...కేంద్రం చొరవతో వారిని జులై 28నే విడిపించడం జరిగిందని తెలిపారు. 2017లో ఇప్పటివరకు 251 మత్స్యకారులు, 42 పడవలను విడిపించడం జరిగిందని సుష్మా పేర్కొన్నారు.

 

17:49 - August 3, 2017

ఢిల్లీ : గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల ముందు సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌పై స్టే విధించాలని కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. నోటాపై స్టే విధించకపోతే ఎమ్మెల్యేల ఓట్లు ఇతర పక్షాలకు అమ్ముడు పోయే అవకాశం ఉందని దీంతో సదరు పార్టీ అభ్యర్థి ఓడిపోతారని కాంగ్రెస్‌ పిటిషన్‌లో పేర్కొంది. నోటాతోనే గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై చర్చ జరగాలని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్‌ పిటిషన్‌పై 2 వారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కు నోటీసు జారీ చేసింది. ఈ నెల 8న గుజరాత్‌లో 3 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా నోటా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. 2014 నుంటే బ్యాలెట్‌ పేపర్లో నోటా వినియోగిస్తున్నట్లు ఈసీ తెలిపింది.

 

17:37 - August 3, 2017

గుంటూరు : వ్యవసాయ శాఖలోని జీ.వో నంబరు 64ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా బాపట్ల కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ జీవోతో గుర్తింపులేని కళాశాలల నుండి డిగ్రీలను పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. కష్టపడి చదివిన విద్యార్ధులు నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే ప్రభుత్వం జీ.వో 64ను రద్దు చేసి జీ.వో 16 ను కొనసాగించాలని విద్యార్ధులు డిమాండ్‌ చేశారు.

 

17:19 - August 3, 2017

పశ్చిమగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కాపు నేతలు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ ప్రకటించేవరకు తమ పోరాటం ఆగదని కాపు సంఘ నేతలు హెచ్చరించారు. 

 

17:15 - August 3, 2017

నెల్లూరు : జిల్లాలో కలకలం రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సంబంధమున్న ఖాకీలపై పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలను వీఆర్ కు పంపగా.. మరో ఇద్దరు సీఐలు అబ్దుల్ కరీం, రామకృష్ణారెడ్డిపై వేటు పడింది. మరోవైపు పట్టుబడ్డ బుకీలు, బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు కోర్టుకు హాజరుపరచనున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు వందమండి పట్టుబడినట్లు సమాచారం. 

 

సెంచరీ చేసిన రహానే..344/3

కొలంబో: శ‌్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజే సెంచ‌రీల మోత మోగించారు చెతేశ్వ‌ర్ పుజారా, అజింక్య ర‌హానే. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల‌కు 344 ప‌రుగులు చేసింది. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే నాలుగో వికెట్‌కు అజేయంగా 211 ర‌న్స్ జోడించారు. 133 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో ఈ ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతూ.. లంక బౌల‌ర్ల‌కు చెక్ పెట్టారు. పుజారా త‌న‌దైన స్టైల్లో వికెట్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌గా.. ర‌హానే బౌండ‌రీల వ‌ర్షం కురిపించాడు. అనుభ‌వం లేని లంక బౌల‌ర్లతో ఇద్ద‌రూ ఆటాడుకున్నారు.

17:10 - August 3, 2017

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లిలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఘర్షణకు దిగారు. ఇసుకలారీలు నడపవద్దంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు కల్పించుకుని రెండు పార్టీల నేతలను అక్కడ నుంచి పంపిచారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాటతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. 

 

జర్నలిస్టుల పట్ల పోలీసు తీరును ఖండించిన ఎంపి కవిత

హైదరాబాద్: జర్నలిస్టుల పట్ల పోలీసుల తీరును టిఆర్ ఎస్ ఎంపి కవిత ఖండించారు. ప్రగతి భవన్ వద్ద జరిగిన ఘటనపై ప్రభుత్వం తరపున పోలీసులను నివేదిక కోరుతాం అని ఎంపి కవిత అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, జర్నలిస్టుల పట్ల పోలీసుల వ్యవహార శైలిని ప్రభుత్వానికి ముడి పెట్టడం సరికాదని కవిత పేర్కొన్నారు.

16:57 - August 3, 2017

హైదరాబాద్ : మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తనను టీయూడబ్ల్యుజే తీవ్రంగా ఖండించింది. ప్రగతి భవన్‌ ముందు వార్తను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు దాడి చేశారని.. దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ అనురాగ్‌శర్మకు టీయూడబ్ల్యుజే నేతలు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని... లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి విరహాత్‌ అలీ హెచ్చరించారు. 

 

నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ

కర్నూలు : నంద్యాలలో వైసీపీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు ముఖ్య అతిధిగా జగన్ హాజరు కాగా, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి కూడా హాజరయ్యారు.

16:52 - August 3, 2017

హైదరాబాద్ : మాజీ మంత్రి కుమారుడు విక్రమ్ గౌడ్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. విక్రమ్ గౌడ్ కు మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించింది. విక్రమ్‌ గౌడ్‌కు మెరుగైన వైద్యం అందించాలని లాయర్ విజ్ఞప్తి చేశారు. గాంధీ, ఉస్మానియాలో అతనికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:41 - August 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో వాక్‌స్వాతంత్ర్యం లేకుండా పోయిందని టీమాస్‌ఫోరం నేతలు అన్నారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని వారు ఖండించారు. దాడికి నిరసనగా ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. నేరెళ్లలో ఎస్సీ, బీసీలపై ప్రభుత్వమే దాడి చేయించిందని నేతలు అన్నారు. ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. సిరిసిల్ల జిల్లాలో దళిత, బహుజనులపై జరుగుతున్న దాడులపై ప్రశ్నించినందుకే కమ్యూనిస్టులపై సీఎం కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాలపై అహంకాపూరితంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలపై ప్రశ్నించినందుకే కమ్యూనిస్టులపై కేసీఆర్‌ అహంకారంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ ధర్నాలో టీ మాస్‌ఫోరం నేతలు విమలక్క, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

మీడియా ముందుకు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు...

నెల్లూరు:క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన పలువురు బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు, పంటర్లను మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. వారి వద్ద వున్న కమ్యూనికేషన్ సరికరాలు, ల్యాప్ టాప్ లు సెల్ ఫోన్లు, వాకీ టాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

చెట్టును ఢీ కొట్టిన కారు : ముగ్గురి మృతి

అనంతపురం: కనేకల్ మండలం ఎర్రగుంట సమీపంలో ఓ కారు చెట్టును ఢీ కొన్ని ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషయంగా ఉండడంతో రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు.

 

16:23 - August 3, 2017

తమిళనాడు రాష్ట్ర రైతుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గతంలో జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజుల పాటు ఆందోళన కొనసాగించిన రైతులు ముగించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయే సరికి మళ్లీ రోడ్డెక్కారు. తమ సమస్యలు తీర్చాలంటూ గళమెత్తుతున్నారు. కానీ పాలకులు మాత్రం కనికరించడం లేదు. రైతు రుణాలను మాఫీ చేయాలని...రూ. 40 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్నా చేస్తున్న రైతుల పరిస్థితి చూసి గురుద్వార కరిగిపోయింది..

తమిళనాడు రాష్ట్రానికి చెందని రైతులు దేశ రాజధాని జంతర్ మంతర్ వేదికగా చేసుకుని ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అందరికీ పట్టెడన్నం పెట్టే రైతు..ఆందోళనలు చేస్తూ ఎలా తింటాడు ? వారు అక్కడ ఎదుర్కొనే సమస్యలు ఎవరు తీరుస్తారు ? ఎక్కడ తినాలో తెలియదు..ఏం తినాలో తెలియదు..డబ్బులు కూడా అంతగా లేవు. మరి ఎలా ? దీనిని చూసిన బంగ్లా సాహిబ్ గురుద్వారా కరిగిపోయింది. అక్కడి గురుద్వారాలో లంగర్ పేరిట ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులకు కూడా ఉచితంగా చపాతీలను అందిస్తూ ఆ రైతన్న ఆకలిని తీరుస్తున్నారు. కానీ రైతులు అన్నం తింటారని తెలుసుకున్న యాజమాన్యం ప్రత్యేకంగా అన్నం వండించి వడిస్తోంది. అవసరమైతే రైతన్నలకు వసతి కల్పించేందుకు కూడా ఆ గురుద్వారా ముందుకొస్తోంది. దీనిపై తమిళ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. 

16:09 - August 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో హోమంత్రి నాయిని చాంబర్‌ ఎదురుగా ఉన్న డీ బ్లాక్‌లోని హౌస్‌కీపింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను ఉద్యోగాలను తొలగిస్తామని కాంట్రాక్టర్, సూపర్ వైజర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు జీతం పెంచమని విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

వైసీపీ లో చేరికపై శిల్పా చక్రపాణి రెడ్డి డైలమా

కర్నూలు : వైసీపీ లో చేరుతున్నానని ప్రకటించిన టిడిపి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని జగన్ సూచించినట్లు సమాచారం. దీంతో నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేస్తున్న శిల్పా మెహన్ రెడ్డి తో సోదరుడు చక్రపాణి రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు.

16:06 - August 3, 2017

ఆదిలాబాద్ : బాసర సరస్వతి ఆలయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాసర సరస్వతి ఆలయంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. టికెట్‌ల గోల్‌మాల్‌ వ్యవహారం బయటపడింది. వాడిన టిక్కెట్లే మళ్లీ వాడుతున్నారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది. 

16:06 - August 3, 2017

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 238 పాయింట్లు నష్టంతో 32,238 వద్ద సెన్సెక్స్ ముగియగా, 67 పాయింట్ల నష్టంతో 10,013 వద్ద నిఫ్టీ ముగిసింది.

ఏసీబీకి చిక్కిన భీమడోలు పంచాయితీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్

ప.గో :కాంట్రాక్టర్ నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ భీమడోలు పంచాయితీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ ఎంఏ సలీం ను ఏసీబీకి చిక్కాడు.

ప్రధాని మోదీ లేఖ నా హృదయాన్ని టచ్ చేసింది: ప్రణబ్ ముఖర్జీ

ఢిల్లీ : ప్రధాని మోదీ రాసిన లేఖ నా హృదయాన్ని ట్ చేసిందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతిగా ఆఖరి రోజున ప్రణబ్ ముఖర్జీకి మోదీ రాసిన లేఖను మాజీ రాష్ట్రపతి ముఖర్జీ సింపుల్ సిటీ, ఉన్నత విలువలు, నాయకత్వ లక్షణాలను లేఖ లో మోదీ కొనియాడారు. ఢిల్లీ వచ్చిన కొత్త రోజుల్లో మీరు నేర్పిన మార్గదర్శనం నాలో ఆత్మవిశ్వాసం పెంచిందని తెలిపారు. ఆ లేఖ లో ప్రణబ్ దా అని సంబోధించిన మోదీ ప్రణబ్ ను పితృ సమానులుగానూ, గురువుగానూ అభివర్ణించారు.

15:58 - August 3, 2017

ఉద్యోగం కోసం వెళితే ముందు దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. అందులో పేర్కొన్న అంశాలను నింపి దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఓ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ దరఖాస్తులో ఉన్న అంశాలను చూసి షాక్ తినాల్సిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. కొన్ని కాలమ్స్ లో ఉన్న అంశాలను చూసి దరఖాస్తుదారులు షాక్ తిన్నారంట. ఇలాంటి ఆప్షన్స్ ఏమిటి? అని దరఖాస్తు దారులు మండిపడుతున్నారు. 'కన్య' అనే ఆప్షన్ ఇచ్చారు. అసలు 'కన్య'నా? కాదా? అనే అప్షన్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పాలని పేర్కొనడం కరెక్టు కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి విడ్డూరమైన ఆఫ్షన్స్ ఇంకా ఉన్నాయి. 'నేను బ్రహ్మచారిని / వితంతువు / కన్య’ అనే ఆప్షన్లు ఇచ్చారు. 'నాకు ఒకే భార్య ఉంది'/ నాకు పెళ్లైంది/ ఒకరి కన్నా ఎక్కువమంది భార్యలున్నారు’/ ‘నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మరో భార్యలేదు/ ‘నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి మరో భార్య కూడా ఉంది’ అనే అప్షన్లను కూడా ఇచ్చారు.

ఈ ఆఫ్షన్ ను ఆసుపత్రి వర్గాలు సమర్థించుకుంటున్నాయంట. ఉద్యోగం వచ్చాక ఎవరైనా అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే దానిపై విచారణకు దరఖాస్తు దారులోని వివరాలను ఉపయోగపడుతాయని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. తీవ్ర విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

15:54 - August 3, 2017

హైదరాబాద్ : అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విక్రమ్‌గౌడ్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విక్రమ్‌ గౌడ్‌ను వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీల్‌చైర్‌పైనే నాంపల్లి కోర్టుకు తరలించారు. విక్రమ్‌ను నిన్ననే అరెస్ట్ చేయాల్సిఉన్నా... అతడు పూర్తిగా కోలుకోలేదని వైద్యులు తెలిపారు. వైద్యుల సూచనతో నిన్న విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇవాళ అతన్ని అపోలో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ వెంటనే విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పుల కేసులో విక్రమ్‌ గౌడే సూత్రదారి అని పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

విక్రమ్ గౌడ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

హైదరాబాద్ : కాల్పుల ఘటనలో విక్రమ్ గౌడ్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిసియల్ రిమాండ్ విధించింది. అయితే విక్రమ్ గౌడ్ తరుపు న్యాయవాదులు గాయాలు మానని కారణంగా చికిత్స అవసరం వుందని తెలపగా విక్రమ్ గౌడ్ ను గాంధీ ఆసుపత్రిలోగానీ, లేకఉస్మానియా ఆస్పత్రిలో కానీ అడ్మిట్ చేయాలని జైలు అధికారులకు నాంపల్లి కోర్టు ఆదేశించింది.

కర్ణాటక మంత్రి ఇళ్లలో కొనసాగుతున్న ఐటీ దాడులు

హైదరాబాద్: కర్ణాటక మంత్రి శివకుమార్ ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రూ.11.43 కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

15:49 - August 3, 2017

ఢిల్లీ : 2017 సంవత్సరానికి కేంద్రప్రభుత్వం.. ఖేల్‌రత్న, అర్జున అవార్డులు ప్రకటించింది. ఛటేశ్వర పుజారా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సర్దార్‌ సింగ్‌లు అర్జున అవార్డు అందుకోనున్నారు. తొలిసారి పారా ఒలింపియన్‌ దేవేంద్ర ఝాఝరియా, హాకీ మాజీ కెప్టెన్‌ సర్దార్‌సింగ్‌ ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. 

 

15:44 - August 3, 2017

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ఆమ్మే తనకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తల్లిదండ్రులు, కోచ్ నుంచి మంచి ప్రోత్సాహం ఉందన్నారు. తన క్రికెట్ కెరీర్ గురించి వివరించారు. క్రికెట్ అనుభవాలను తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

పుజారా సెంచరీ, రహానే హాఫ్ సెంచరీ...

కొలంబో: టీమిండియా బ్యాట్స్‌మ‌న్ చ‌తేశ్వ‌ర్ పుజారా మరో సెంచ‌రీ చేశాడు. టెస్టుల్లో అత‌నికిది 13వ సెంచ‌రీ కాగా.. ఈ సిరీస్‌లో వ‌రుస‌గా రెండో సెంచ‌రీ. అత‌ని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 163 బంతుల్లో పుజారా సెంచ‌రీ చేశాడు. గాలె టెస్ట్‌లోనూ అత‌ను సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. కెరీర్‌లో 50వ టెస్ట్ ఆడుతున్న పుజారా ఈ మ్యాచ్‌లోనే 4 వేల ప‌రుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. అటు అజింక్య ర‌హానే కూడా హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకోవ‌డంతో టీమ్ భారీ స్కోరు దిశ‌గా సాగుతున్న‌ది. ర‌హానేకు టెస్టుల్లో ఇది 13వ హాఫ్ సెంచ‌రీ. 8 సెంచ‌రీలు అత‌ని ఖాతాలో ఉన్నాయి.

తత్కాల్ టికెట్‌ కు పే ఆన్ డెలివరీ సౌకర్యం...

హైదరాబాద్: టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ఇంటికి తీసుకువచ్చి ఇచ్చే పే ఆన్ డెలవరీ సౌకర్యాన్ని ఐఆర్‌సీటీసీ ఇప్పుడు తత్కాల్ టికెట్‌కు కూడా పొడిగించింది. పే ఆన్ డెలివరీ సర్వీస్ ప్రొవడైర్‌గా పనిచేస్తున్న అండరిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటేడ్ ద్వారా తత్కాల్ టికెట్‌ను డోర్ డెలివరీ అందించనున్నారు. టికెట్ రిసీవ్ చేసుకున్న అనంతరం మీరు క్యాష్, క్రెడిట్ కార్డు, డిబెట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు.

15:38 - August 3, 2017

చిత్తూరు : వర్షాభావంతో రాయలసీమలో పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు డిమాండ్‌ చేసింది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించాలన్నారు. రాయలసీమ కరవు గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. నంద్యాల ఉప ఎన్నికపై రోజువారీ సమీక్షలు నిర్వహించడాన్ని తప్పుపట్టారు. 

 

బ్యాంకింగ్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం..

ఢిల్లీ: బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో సవరణలు చేసేందుకు తీసుకొచ్చిన బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) బిల్లు-2017 లోక్‌సభలో ఆమోదం పొందింది. బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు గాను మే నెలలో ఈ బిల్లును తీసుకొచ్చారు.

15:34 - August 3, 2017

ఢిల్లీ : ఎంపీ కవితతోపాటు పలువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని కలిశారు. తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. ప‌సుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుఇచ్చిన ముఖ్యమంత్రుల లేఖలను పీఎంకు అందజేశారు. బోర్డు ఉంటే పసుపు రైతులకు చాలా లాభం జరుగుతుందని తెలిపారు. తమ విజ్ఞప్తిపై మోదీ సానుకూలంగా స్పందించారని కవిత చెప్పారు.

 

కూనవరంలో రౌడీషీటర్ల హల్ చల్..

ఖమ్మం : కూనవరంలో రౌడీషీటర్లు హల్ చల్ చేశారు. పెట్రోల్ బంక్ యజమానిపై ఇనుస రాడ్లతో దాడికి యత్నించాడు. నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

15:29 - August 3, 2017

హైదరాబాద్ : మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తనను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ప్రగతి భవన్‌ ముందు జర్నలిస్టులతో పంజాగుట్ట ఏసీపీ ఓవరాక్షన్‌పై మండిపడ్డాయి. ఏసీపీ దురుసు ప్రవర్తనపై సీపీకి ఫిర్యాదు చేశాయి.. జర్నలిస్టుల ఫిర్యాదును స్వీకరించిన సీపీ... ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని వెస్ట్‌జోన్‌ డీసీపీని ఆదేశించారు.. హెల్త్‌ ఎంప్లాయీస్‌ ఆందోళనను కవర్‌ చేస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు.. కెమెరాను లాగి పక్కకు పడేశారు.. పోలీసులతీరుపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 

కోర్టు బెంచ్ ఎక్కి కానిస్టేబుల్ హల్ చల్..

తూర్పుగోదావరి : కాకినాడ జిల్లా కోర్టులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కోర్టు బెంచ్ ఎక్కి నానా హంగామా చేశాడు. కానిస్టేబుల్ ను అరెస్టు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించింది. 

15:23 - August 3, 2017

తూర్పుగోదావరి : కాపులు బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. పాదయాత్రతో జిల్లాలో హింస జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ముద్రగడను కిర్లంపూడిలోని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రను ఎన్నిసార్లు అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు. పోలీసులు, టీడీపీ ప్రభుత్వ తీరుపై ముద్రగడ మండిపడ్డారు. భారీగా కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు కిర్లంపూడికి చేరుకున్నారు. గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారీగా పోలీసు బలగాల మోహరించారు.
  

15:12 - August 3, 2017

నిర్మల్ : బాసర సరస్వతిదేవి ఆలయంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి వచ్చింది. 10 టీవీ చొరవతో టికెట్‌ల గోల్‌ మాల్‌ వ్యవహారం బయటపడింది. గుడిలో... ఒకసారి వాడిన టికెట్‌నే మళ్లీ, మళ్లీ వాడుతున్నారు.. ఆటో డ్రైవర్ల సహాయంతో.. వాడేసిన టిక్కెట్లనే ... భక్తులకు మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ టికెట్‌ల ద్వారా దళారులు వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్నారు.  దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుంది. బెంగళూరు నుంచి బాబు అక్షరాభ్యాసానికి వచ్చిన ఓ భక్తుడు కలిగిన సందేహంతో అసలు విషయం బయటపడింది. కాగా అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:08 - August 3, 2017

కర్నూలు : వైసీపీలో చేరే ముందు చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించాలని చెప్పారు. టీడీపీలో గుర్తింపు, గౌరవం లేకపోవడంతోనే వైసీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించడాన్ని రాజశేఖర్‌రెడ్డి తప్పుపట్టారు. చక్రపాణిరెడ్డికి టీడీపీ అధిష్టానం మంచి గుర్తింపు ఇచ్చిందని చెబుతున్నారు. చక్రపాణిరెడ్డిని టీడీపీ అధినాయకత్వం బాగా గౌరవించిందన్నారు. టీడీపీ నాయకత్వం అగౌరవపరిచిందని చక్రపాణిరెడ్డి చెప్పడం తగదని హితవు పలికారు. 

 

15:06 - August 3, 2017

విక్రమ్ గౌడ్ కు బెయిల్ వస్తుందా ?

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. విక్రమ్ గౌడ్ తరపున ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. 

జన్మభూమి కొత్త కమిటీల ఏర్పాటు..

విజయవాడ : టిడిపి సమన్వయ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. జన్మ భూమి కమిటీల ప్రక్షాళనకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెలాఖరు కల్లా జన్మభూమి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని బాబు ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం ఖాయమని అర్థమైపోయిందని, భారీ మెజార్టీపై దృష్టి సారించాలని బాబు సూచించారు. కాపు రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. 

14:52 - August 3, 2017

గుంటూరు : ఇవాళ మధ్యాహ్నం మూడుగంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం కాబోతోంది.. వెలగపూడి సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు.. ఈ సమావేశంలో ఉద్యోగులు కరువు భత్యం, నీటిపారుదల ప్రాజెక్టుల యాక్షన్ ప్లాన్... కాపు ఉద్యమం, బీసీ కమిషన్ రిపోర్ట్, రైతు రుణాల సమస్యలు, విశాఖ భూ కుంభకోణం పై సిట్ విచారణ,  వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:50 - August 3, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కొడుకు విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. వైద్యులు డిశ్చార్జ్‌ చేయగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. వీల్‌చైర్‌పైనే నాంపల్లి కోర్టుకు తరలించారు.. విక్రమ్‌ను నిన్ననే అరెస్ట్ చేయాల్సిఉన్నా... అతడు పూర్తిగా కోలుకోలేదని వైద్యులు తెలిపారు.. వైద్యుల సూచనతో నిన్న విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేదు.. ఇవాళ అతన్ని అపోలో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ చేశారు.. ఆ వెంటనే విక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. కాల్పుల కేసులో విక్రమ్‌ గౌడే సూత్రదారి అని పోలీసులు తేల్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

జర్నలిస్టు పై దాడి కేసీఆర్ రాక్షస పాలనకు నిదర్శనం: షబ్బీర్ అలీ

హైదరాబాద్: మీడియాపై పోలీసు దాడిని ఖండిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తెలిపారు. '10టివి' రిపోర్టర్ పై దాడి బాధాకరం అని, ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు సరికాదన్నారు. జర్నలిస్టు పై దాడి కేసీఆర్ రాక్షస పాలనకు నిదర్శనం అని షబ్బీర్ ఆరోపించారు.

కేసీఆర్ పాలన పైశాచిక పారాకాష్టకు చేరింది: పొంగులేటి

హైదరాబాద్: కేసీఆర్ పాలన పైశాచిక పారాకాష్టకు చేరిందని కాంగ్రెస్ నేత పొంగులేటి విమర్శించారు. ప్రతిపక్షాలు, మీడియాపై సీఎం కేసీఆర్ దారుణంగా వ్యవహరిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు.

మంత్రి నాయిని చాంబర్ ఎదుట హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళన

హైదరాబాద్ : హోం మంత్రి నాయిని చాంబర్ ఎదుట డీ బ్లాక్ లోని హౌస్ కీపింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టర్ ఎంఎన్ ఆర్, సూపర్ వైజర్ దౌర్జన్యానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

విక్రమ్ గౌడ్ కేసు విచారణకు లంచ్ బ్రేక్

హైదరాబాద్: కాల్పుల ఘటనలో అరెస్ట్ అయిన విక్రమ్ గౌడ్ కేసు విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చింది. లంచ్ విరామం తర్వాత విచారణ ప్రారంభం అవుతుందని తెలిపారు. లంచ్ విరామం తర్వాత విక్రమ్ గౌడ్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అర్జున, ఖేల్ రత్న అవార్డులను ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ: అర్జున, ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. క్రికెటర్ ఛటేశ్వర్ పుజార, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ కు, సర్దార్ సింగ్ లకుఅర్జున్ అవార్డులు, తొలిసారి పారా ఒలింపియన్ కు దేవంద్ర ఝాఝూరియాకు, హాకీ మాజీకెప్టెన్ సర్దార్ సింగ్ లకు ఖేల్ రత్నకు ఎంపిక చేసింది.

ఏసీపీ మీడియాతో వ్యవహరించిన తీరుపై రిపోర్టు ఇవ్వండి: సీపీ

హైదరాబాద్: పంజాగుట్ట ఏసీపీ మీడియాతో వ్యవహరించిన తీరును దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని వెస్ట్ జోన్ డీసీపీకి సీపీ ఆదేశాలు జారీ చేశాడు.

13:35 - August 3, 2017

తూర్పు గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్‌ గున్నీ చెప్పారు. పాదయాత్ర దరఖాస్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఇవాళ ఉదయం ముద్రగడ పాదయాత్ర కోసం బయటకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల కాపీని అందచేసినట్టు విశాల్‌ గున్నీ చెప్పారు. 

కొత్తూరు '10టివి' ప్రతినిధి ఆనంద్ పై సీఐ ప్రకాశ్ దౌర్జన్యం

శ్రీకాకుళం : కొత్తూరు '10టివి' ప్రతినిధి ఆనంద్ పై పాతపట్నం సీఐ ప్రకాశ్ దౌర్జన్యం ప్రదర్శించాడు. వంశధార నిర్వాసితుల సమస్యలపై దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఆనంద్ ను బెదిరించి వీడియోలను సీఐ ప్రకాశ్ తొలగించాడు.

13:30 - August 3, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడును కలిశారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు.. వెంకయ్యకు అభినందనలు తెలిపారు.. టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ ఎంపీలు పార్టీలకు అతీతంగా వెంకయ్య నాయుడుకు మద్దతు ప్రకటించారు.. ఈనెల 5న నిర్వహించబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని ఎంపీలకు వెంకయ్య వివరించారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, అశోక్ గజపతి రాజు పాల్గొన్నారు.

13:22 - August 3, 2017

అనంతపురం : జిల్లా కేంద్రలోని విజయనగర కాలనీలో ప్రభుత్వ స్థలంలో పేదల వేసుకున్న ఇళ్లను అధికారులు కూల్చివేడం ఉద్రక్తతలకు దారితీసింది. కూల్చివేతలను అడ్డుకున్న పేదలపై రెవెన్యూ, నీటిపాదుల, పోలీసు అధికారులు జులం ప్రదర్శించారు. అడ్డుకున్నవారిని బలవంతంగా పక్కకు నెట్టివేసి కూల్చివేతలు కొనసాగించారు. అందరూ నిద్రిస్తుండా అధికారులు ఒకస్కారిగా ఇళ్లను కూల్చివేయడంతో విజయనగర్‌ కాలనీ వాసులు భయపడ్డారు. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ కొందరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడం ఉద్రిక్తతలకు దారితీసింది. 

13:20 - August 3, 2017

'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టమాట'..ఏంటీ విడ్డూరం కాదు...స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఎస్బీహెచ్..ఆంధ్రాబ్యాంకు..ఇలా ఇతర బ్యాంకులు ఉంటాయి కానీ టమాట ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది నిజం. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో లో ఈ బ్యాంకు వెలిసింది. దీని గురించి పూర్తి వివరాలకు చదవండి..

టమాట..ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాశమైంది. టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో టమాటను ఏకంగా దొంగతనం చేసేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం టమాటల ధరలు దిగిరావడం లేదు. దీనితో చాలా మంది టమటాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో భారీగా పడుతున్న వర్షాలకు టమాట పంట ధ్వంసమౌతోంది.

మండుతున్న టమాట ధరలుకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ టొమాటో' పేరిట బ్యాంకును తెరిచారు. బుధవారం ఈ బ్యాంకు కూడా తెరిచేశారు. లోనుగా నగదు ఇస్తే ఈ బ్యాంకులో టొమాటోలను రుణాలుగా ఇస్తుంటారు. ఈ విషయం తెలిసిన పలువురు బ్యాంకుల ఎదుట బారులు తీరారంట. తమ వద్దనున్న టొమాటోలను డిపాజిట్ చేస్తే ఆరు నెలల అనంతరం రెట్టింపు మొత్తంలో టొమాటోలను వస్తాయని వెల్లడిస్తున్నారంట.

మరి బ్యాంకు ఏర్పాటు చేశారు సరే..టొమాటోలను భద్ర పరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చూడాలి. 

3 గంటలకు సీపీని కలవనున్న జర్నలిస్టు సంఘాలు

హైదరాబాద్: మధ్యాహ్నం 3 గంటలకు జర్నలిస్టు సంఘాలు సీపీని కలవనున్నాయి. ప్రగతి భవన్ వద్ద హెల్త్ వర్కర్ల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పోసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సీపీ ని కలవున్నట్లు సమాచారం.

13:18 - August 3, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్‌ముందు యూరోపియన్‌ హెల్త్ ఎంప్లాయీస్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.. తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.. వేతనాలు పెంచాలంటూ నినాదాలు చేశారు.. పదిహేనేళ్లనుంచి ఉద్యోగంచేస్తున్నా ఒక్కరూపాయి జీతం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. నిరసన వ్యక్తంచేస్తున్న ఉద్యోగులపై మగ పోలీసులు దౌర్జన్యం చేశారు.. మహిళలుఅనికూడా చూడకుండా వారిని తోసేశారు.. బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించారు.. వ్యాన్‌ నిండిపోయినా మరికొందరు మహిళల్ని అందులో కుక్కేశారు.. నొప్పితో బాధితులు విలవిలలాడిపోయినా అలాగే మరికొందరిని అందులోకి తోసేశారు.. పోలీసులవాదన తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాపైకూడా దురుసుగా ప్రవర్తించారు.. ఇష్టంవచ్చినట్లు తిడుతూ 10 టీవీ కెమెరాను పక్కకు నెట్టేశారు.

కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు సరికావు: జానారెడ్డి

హైదరాబాద్:కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ విమర్శలు సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హుందాతనం మరచి మాట్లాడుతున్నారని, ఎవరూ మాట్లాడ వద్దు ఇష్టానుసారంగా పాలన చేస్తామంటే ప్రతిపక్ష పార్టీగా సమయనంగా ఉన్నామని తెలిపారు. కోర్టులకు వెళ్లే వారిలో కాంగ్రెస్ సంబంధం లేదని, కడుపు మండిన వాళ్లే కోర్టుకు వెళ్లారని తెలిపారు. జాగృతిలో గతంలో సభ్యుడిగా ఉన్నవారే కేసు వేశారని పేర్కొన్నారు.

13:14 - August 3, 2017

హైదరాబాద్ : తనపై తను కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్ ఆపోలో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. విక్రమ్ డిశ్చార్జి అయిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విక్రమ్ గౌడ్ ను వీల్ చైర్ మీదనే కోర్టుకు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:12 - August 3, 2017

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. భార్య అంజలిభాయ్ పై అనుమానంతో భర్త హరినాయక్ హత్య చేశాడు. అంజలి జూలై 12న కనిపించకుండాపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వజ్రకరూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి ఆమె భర్తపై అనుమానంతో అతన్ని ప్రశ్నిస్తే నిజం బయటపడింది. హరినాయక్, అంజలిభాయి ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమెపై అనుమానంతో తన స్నేహితులతో కలసి భర్త హరినాయక్ హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని శింగనమల చెరువులో పూడ్చిపెట్టినట్టు నింధితులు తెలిపారు. పోలీసులు అంజలి మృతదేహాన్ని వెలికితీశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

భార్యపై అనుమానంతో హత్య చేసిన భర్త

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. భార్య పై అనుమానంతో స్నేహితుల తో కలిసి హర్త హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జులై 12న అంజలిభాయ్ కనిపించకుండా పోయింది. ఈ మేరకు అంజలి తల్లిదండ్రులు వజ్రకరూర్ పీఎస్ లో కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ లో ఆరు నెలల క్రితం చేసుకున్న అంజలిభాయ్, హరినాయక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంజలి భాయ్ పై అనుమానంతో తన స్నేహితులతో కలసి హత్య చేసినట్లు తెలిసింది. మృతదేహాన్ని శింగనమల చెరువులో నిందితులు పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

13:06 - August 3, 2017

టాలీవుడ్ యంగ్ టైగర్ 'జూ.ఎన్టీఆర్' నటిస్తున్న 'జై లవ కుశ'పై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాబి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా..నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఇటీవలే 'జై' పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కు బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఇక చిత్రంలోని రెండో పాత్ర 'లవ కుమార్' టీజర్ ను సిద్ధం చేస్తోంది. రాఖీ పౌర్ణమి సందర్బాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీ ఉదయం 10.35గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  టెంపుర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దసరా కానుకగా సెప్టెంబర్ 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

విక్రమ్ గౌడ్ అరెస్ట్

హైదరాబాద్: కాల్పుల ఘటనలో నాటకమాడిని విక్రమ్ గౌడ్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల ఘటనలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ఈ రోజు డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం విక్రమ్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలి: టీమాస్ ధర్నా

హైదరాబాద్: టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ఎన్నికల హామీలు అమలు చేయాలని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో తమ్మినేని వీరభద్రం, విమలక్క, ప్రొ.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

క్రికెట్ బెట్టింగ్ లో వీఆర్ కు మరో ఇద్దరు సీఐలు

నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు సీఐలు వన్ టౌన్ సీఐ అబ్దుల్ కరీమ్, టూటౌన్ సీఐ రామకృష్ణారెడ్డిని వీఆర్ కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరి కొందరు సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరు డీఎస్పీలపై వేటు పడిన విషయం తెలిసిందే.

12:56 - August 3, 2017

టాలీవుడ్ లో పలు సినిమాల షూటింగ్ లు పూర్తికాగానే 'గుమ్మడి కాయ' కొట్టే సంప్రదాయం మొదలైంది. సినిమాలు పూర్తి కాగానే గుమ్మడికాయ కొట్టిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. దీనితో ఆయా సినిమాల అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా 'బాలకృష్ణ' నటిస్తున్న 'పైసా వసూల్' చిత్రానికి కూడా గుమ్మడి కాయ కొట్టేశారు.

'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా విజయం అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'పైసా వసూల్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా 'శ్రియ' మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై చిత్రంపై మరింత అంచనాలు పెంచేసింది. బాలయ్య పలికిన డైలాగ్స్..ఆయన నటనకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత చిత్రాల కంటే భిన్నంగా బాలయ్య నటన ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. పక్కా పైసా వసూల్ చిత్రం అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో ఛార్మీ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారంతో పూర్తైంది. యూనిట్‌ సభ్యులు చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో బాలకృష్ణ, పూరీ, ఛార్మి తదితరులు చాలా ఉత్సాహంగా కనిపించారు. సెప్టెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

12:48 - August 3, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తాజా చిత్ర షూటింగ్ మొదలైపోయింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'. పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బన్సీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండడం విశేషం.

తన చిత్రంలో ఏదో ఒక స్టైల్ ను చూపించాలని 'అల్లు అర్జున్' ఉత్సాహం చూపుతుంటాడు. ఆయన నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథం' విజయం అనంతరం తదుపరి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే శరత్ కుమార్ కూడా ప్రతి నాయకుడిగా నటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమా పాత్ర కోసం బన్నీ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు, అమెరికాలో ఈ శిక్షణ తీసుకొంటాడని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు అందుతూ ఉండాలనీ .. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నాడని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2018, ఏప్రిల్‌ 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

12:44 - August 3, 2017

'కమ్యూనిస్టుల పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం'

హైదరాబాద్: కమ్యూనిస్టుల పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తమ్మినేని వీరభద్రం, విమలక్క, ప్రొ.విశ్వేశ్వరరావు తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కమ్యూనిస్టుల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, 2004,2009, 2014 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు కోసం కేసీఆర్ వెంపార్లాడారని, ఆనాడు కమ్యూనిస్టులు మంచి వాళ్నఇ కేసీఆర్ పొగాడరని గుర్తు చేశారు. నేను కమ్యూనిస్టులు ఎక్కుడున్నారని అంటున్నారని అలాంటి వారు సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ వద్ద మీడియాపై దాడిని ఖండిస్తున్నామని, ఘటనకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

12:40 - August 3, 2017

సంగారెడ్డి : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ కాస్తా జిల్లా కలెక్టర్‌ అయిపోయారు... అధికారుల నిర్లక్ష్యంపుణ్యమాని ఆయన పేరుతర్వాత ఐఏఎస్ వచ్చి చేరింది.. గుడుంబా నిర్మూలన, పునరావాస కార్యక్రమంలో వేసిన బ్యానర్‌ ఈ విచిత్రానికి వేదికైంది..ఎమ్మెల్యే ఫొటోకింద సిబ్బంది పొరపాటున కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌, ఐఏఎస్ పేరు వేశారు.. చాలాసేపటివరకూ ఈ తప్పును ఎవరూ గమనించలేదు.. చివరకు జరిగిన తప్పిదం గమనించిన ఎస్ సీ కార్పొరేషన్‌ జేడీ శ్రీధర్‌ సరిదిద్దే ప్రయత్నం చేశారు.

12:39 - August 3, 2017

హైదరాబాద్ : నాంపల్లి తెలుగు యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల పేపర్‌ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. 

12:35 - August 3, 2017

తూర్పు గోదావరి : కాకినాడ నగరాన్ని తొలివిడతలోనే స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేశారు. భారీగా నిధులు వస్తాయని ప్రచారం చేశారు. ఆ మాటలు ఎలా ఉన్నా అసలు నిధులు ఎన్ని వస్తున్నాయి. వచ్చిన నిధులు ఎక్కడ వినియోగిస్తున్నారన్న విషయాన్ని పరిశీలించడానికి కనీసం నగరంలో పాలకవర్గం కూడా లేదు. 2010లో తొలి పాలకవర్గం ముగిసిన తరువాత కార్పొరేషన్‌ ఎన్నికలు కలగానే మిగిలిపోయాయి. రెండు, మూడేళ్లుగా కాకినాడలో ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. రాజకీయ కారణాలతోనే ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే విమర్శలున్నాయి. కానీ కాకినాడ దగ్గరలో ఉన్న పలు గ్రామాల విలీన వివాదాలు మొదట ఎన్నికల వాయిదాకి కారణమయ్యాయి. ఆ తర్వాత న్యాయపరమైన సమస్యలన్నీ తొలగిపోయినా ఎన్నికలు జరగకపోవడంతో వ్యవహారం న్యాయస్థానాలకు చేరింది.

న్యాయస్థానం సీరియస్‌
చివరకు కోర్టు కూడా పలుసార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించే పరిస్థితి రావడంతో న్యాయస్థానం సీరియస్‌ అయినట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. డివిజన్ల విభజన, రిజర్వేషన్ల నిర్ణయం వంటి విషయాల్లో అఖిల పక్షం కూడా నిర్వహించినట్టు తెలిపారు. అయితే కార్పొరేషన్‌ అధికారుల తీరును పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా తూరంగి గ్రామాన్ని విలీనం చేసిన తర్వాత రిజర్వేషన్లు, డివిజన్ల నిర్ధారణ ఆ గ్రామంతోనే కలిపి చేయాల్సి ఉంది. దానిని మినహాయించి రిజర్వేషన్లు ఖరారు చేయడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వమే వివాదాలకు ఆజ్యం పోయడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రిజర్వేషన్ల నిర్ధారణ వ్యవహారం దానికి నిదర్శనంగా ఉంది. దాంతో కాకినాడ కార్పొరేషన్ పాలకవర్గానికి మోక్షం ఎప్పుడా అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. కోర్టులు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో.. న్యాయస్థానాల ఉత్తర్వులు ఎలా ఉంటాయోననే ఆసక్తి పెరుగుతోంది. 

12:34 - August 3, 2017

విశాఖ :  జిల్లాలో వెలుగుచూసిన భూ కుంభకోణం కేసులో కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తహశీల్దార్‌ స్థాయి అధికారులపైనే ఆరోపణలు వచ్చాయి. విశాఖ రూరల్‌ తహశీల్దారుగా పనిచేసి రిటైర్‌ అమిన రామారావుతోపాటు మరికొందరు అధికారులను సిట్‌ విచారించింది. అయితే ఈ కేసులో ఆర్డీవో స్థాయి అధికారుల ప్రమేయం ఉందని అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ చేసిన ఆరోపణలు చేయడంతో సిట్‌ విచారణ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం రామవరంలో 95 ఎకారాల భూమిని తప్పుడు రికార్డులతో పీలా సత్యనారాయణ ఆక్రమించుకున్నారని సిట్‌ అధికారులు తేల్చారు. అయితే ఈ కేసులో ఇప్పుడు పీలా ఎదురుదాడికి దిగారు. విశాఖ ఆర్డీవో వెంకటేశ్వర్లుపై ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

కక్ష కట్టి కేసులో ఇరికించారు..
తన తండ్రి నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఇవ్వమని ఆర్డీవో వెంకటేశ్వర్లు చెప్పిన మాటను వినకపోవడంతోనే తనపై ఆర్డీవో కక్ష కట్టి కేసులో ఇరికించారన్నది పీలా వాదన. ఆర్డీవో ఇచ్చిన నివేదిక అధారంగా సిట్‌ అధికారులు తనపై కేసు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. పీలా వ్యవహారంపై విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరని అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు. భూ కుంభకోణం కేసును ఆర్డీవోపైకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ వైఖరి సీపీఎం నేతలు తప్పుపడుతున్నారు. పీలా సత్యనారాయణ రెవెన్యూ అధికారులపై ఆరోపణల నేపథ్యంలో విశాఖ భూ కుంభకోణం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని వైసీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. భూ కుంభకోణం కేసులో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ విశాఖ ఆర్డీవోపై ఫిర్యాదు చేసిన తరుణంలో ఇప్పుడు సిట్‌ ఏంచేయబోతోందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్డీవో వెంకటేశ్వర్లును పిలిపించి విచారణ జరుపుతుందా ? లేదా ? అన్నది చూడాలి.

 

12:33 - August 3, 2017

రంగారెడ్డి : నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా.. రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. బాలకృష్ణ 102వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్‌నిచ్చారు. క్రిష్‌ కెమెరా స్విచ్‌ను ఆన్‌ చేశారు. 

12:31 - August 3, 2017

శ్రీకాకుళం : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. వంశధార నిర్వాసిత ప్రాంతాలైన ఇరపాడు, పాడలి గ్రామాల్లో పర్యటిస్తూ నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు పరిమారం చెల్లింపు, పునరావాసం కల్పిన వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. పరిహారం చెల్లింపు, పునరాసం కల్పనలో జరుగుతున్న జాప్యంపై నిర్వాసితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. 

ప్రధాని మోదీని కలిసిన నిజామాబాద్ ప్రజా ప్రతినిధులు

ఢిల్లీ: పార్లమెంట్ లో ప్రధాని మోదీని నిజామాబాద్ ఎంపి, ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.

12:24 - August 3, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముందు తమ డిమాండ్ల సాధనకు ఆందోళనకు దిగిన ఈయూ హెల్త్ ఎంప్లాయిస్ వార్తాను కవర్ చేయడానికి వెళ్లిన టెన్ టివి ప్రతినిధి రాధికతో ఏసీపీ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించాడు. మహిళ ప్రతినిధి అని చూడకుండా ప్రక్కకు నెట్టాడు. ఎవడైనా ఆడపిల్లను ఎడిపిస్తే లాగులో ఉచ్చపోసుకోవాలే అన్నా సీఎం కేసీఆర్ పోలీసులే మహిళతలో దురుసుగా ప్రవర్తించడంపై ఏ సమాధానం చెబుతారో చూడాలి. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

12:23 - August 3, 2017

హైదరాబాద్ : తనపై తనే కాల్పులు జరిపించుకోని ఆసుపత్రి పాలైనా విక్రమ్ గౌడ్ ను ఇవాళ అపోల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. విక్రమ్ డిశ్చార్జి అయిన వెంటనే వక్రమ్ గౌడ్ అరెస్ట్ చేసి కోర్టు తరలించే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:11 - August 3, 2017

'విపక్షాలవి దుర్మార్గపు రాజకీయాలు..వారా చెప్పేది..బతుకును చౌరస్తాలో ఎండగడుతాం..క్షుద్ర రాజకీయాలు..దుర్మార్గపు రాజకీయాలు..మీరా కుమారా..ఓరా కుమారా...వామపక్షాలది గతించిన గతం...మొగాడేనా..మాదే నిజమైన పాలన..బంగారు తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు' అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విపక్షాలపై నోరు పారేసుకున్నారు. బుధవారం సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మరోసారి విపక్షాలపై తనకున్న అసహనం..కోపం..మరోసారి బయట పెట్టారు.సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏ రాష్ట్రంలోనైనా అధికారపక్షం తప్పులు చేస్తే ప్రశ్నించడానికి విపక్షాలుంటాయి. కానీ ప్రశ్నించే వారు ఉండకూడదని పార్టీ ఫిరాయింపులని ప్రోత్సాహించారు. కానీ ప్రస్తుతం ఎక్కడో 'అసహనం', 'అభద్రతాభావం' ఇంకా అలాగే కేసీఆర్‌ని వెంటాడుతున్నాయని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భివించన అనంతరం ఎన్నో కేసులు వేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. పలు కేసుల్లో ప్రభుత్వాలకు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ప్రజా స్వామ్యంలో 'న్యాయస్థానాన్ని' ఆశ్రయించడం అనేది ఓ ప్రాథమిక హక్కు అనేది అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్ లో విపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉండేది కాదన..ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం శోభ ఉండదని అభిప్రాయాలు వ్యక్తం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం సబబేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

వామపక్షాలపై ఎందుకంత మండిపాటు ?
ఇక కమ్యూనిస్టులపై కూడా మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. వామపక్షాలది గతించిన గతం అంటూ ఆక్రోషాన్ని వెళ్లగక్కారు. మరి వామపక్షాలపై ఎందుకంత కోపం ? ఇటీవలే సీపీఎం నిర్వహించిన మహాజన పాదయాత్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. పాదయాత్రలో వచ్చిన ప్రజా స్పందన చూసిన నేతలు అప్పటి వరకు మాట్లాడిన నోళ్లు మూతబడ్డాయి. దీనితో పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధిని అడ్డుకోమని..అభివృద్ధి పేరిట జరుగుతున్న దోపిడి..అక్రమాలు..అన్యాయాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని వామపక్షాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చారో చర్చకు రావాలని విసిరిన సవాల్ ను స్వీకరించలేదనే సంగతి తెలిసిందే. విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన వారు ఎదురు దాడి చేయడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు.

కమ్యూనిజానికి చావు లేదు..
కమ్యూనిజానికి చావు లేదు..అజేయం.. కమ్యూనిజం..అంటనే పేదల కోసం మాట్లాడేది. పేదలకు అన్యాయం చేసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేది. కమ్యూనిస్టు పార్టీలున్నవి పేదల పక్షాన నిలబడడానికే. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ ఉద్యమం వరకు అనేక కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయువు పట్టుగా తెలంగాణ నిలిచింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం కమ్యూనిస్టులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా కమ్యూనిజంపై పలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ ధోరణి..ప్రమాదకరంగా ఉందని..నియంతృత్వంగా ఉందని..నిజాం వ్యవహరించే విధంగా ఉందని..విమర్శలు వినిపిస్తున్నాయి. 

పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలం: కేటీఆర్

రంగారెడ్డి : పెట్టుబడులకు హైదరాబాద్ అత్యంత అనుకూలం అని మంత్రి కేటీఆర్ అన్నారు. మహేశ్వరంలో హార్డ్ వేర్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

గుజరాత్ కాంగ్రెస్ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీం

ఢిల్లీ: గుజరాత్ కాంగ్రెస్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాజ్యసభలో ఎన్నికల్లో నోటా ఆప్షన్ ఉంటుందని సుప్రీం తేల్చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా' పై గుజరాత్ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

కల్యాణి రాఫెడ్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి : మహేశ్వరంలోని హార్డ్ వేర్ పార్కులో కల్యాణి రాఫెడ్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

జాబ్ కనెక్ట్ వాహనాన్ని ప్రారంభించిన డీజీపీ

హైదరాబాద్: నక్లెస్ రోడ్డులో జాబ్ కనెక్ట్ వాహనాన్ని డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నమోదు, ఉద్యోగ సమాచారం, దరఖాస్తు వివరాలు చేరవేసేందుకు జాబ్ కనెక్ట్ వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు.

కాసేపట్లో విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ .. వెంటనే అరెస్ట్

హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నుంచి కాసేపట్లో విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ కానున్నారు. కాల్పుల ఘటనలో ఏ1గా వున్న విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. విక్రమ్ ను అరెస్ట్ చేశాక నాంపల్లి కోర్టు హాజరు పరిచే అవకాశం ఉంది.

తెలుగు యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళన

హైదరాబాద్: నాంపల్లి తెలుగు యూనివర్శిటీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎంఫిల్, పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు యూనివర్శిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

11:21 - August 3, 2017
11:20 - August 3, 2017

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముందు తమ డిమాండ్ల సాధనకు ఆందోళనకు దిగిన ఈయూ హెల్త్ ఎంప్లాయిస్ వార్తాను కవర్ చేయడానికి వెళ్లిన టెన్ టివి ప్రతినిధి రాధికతో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించాడు. మహిళ ప్రతినిధి అని చూడకుండా ప్రక్కకు నెట్టాడు. ఎవడైనా ఆడపిల్లను ఏడిపిస్తే లాగులో ఉచ్చపొసుకోవాలే అన్నా సీఎం కేసీఆర్ పోలీసులే మహిళతలో దురుసుగా ప్రవర్తించడంపై ఏ సమాధానం చెబుతారో చూడాలి.

11:18 - August 3, 2017

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో రోజురోజుకి పోలీసుల దౌర్జన్యకాండ పెరుగుతోంది. మొన్న నేరెళ్ల బాధితులను మూడు రోజులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని పనిచేయడానికి వీలులేని విధంగా కొట్టిన సంఘటన మరిచిపోక ముందే తాజాగా ప్రగతి భవన్ ముందు మహిళలపై మగ పోలీసులు దౌర్జన్యంగా మహిళలను ఇష్టమోచ్చిన చోట పట్టుకుని వ్యాన్ లోకి ఎక్కించారు. 

టిస్ అధికారులతో గంటా భేటీ..

విజయవాడ : టిస్ అధికారులతో మంత్రి గంటా భేటీ అయ్యారు. డిగ్రీ స్థాయిలో ఫౌండేషన్ కోర్సుల అమలుపై చర్చ జరుగుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మరోసారి వేడెక్కిన అన్నాడీఎంకే రాజకీయాలు..

చెన్నై : అన్నాడీఎంకే రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈపీఎస్, ఓపీఎస్ లు బీజేపీలో విలీనమంటూ తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విలీనం వార్తలు బయటకు రావడంతో దినకరన్ అప్రమత్తమయ్యారు. ఈనెల 5వ తేదీన పార్టీ క్యాడర్ సమావేశానికి దినకరన్ పిలుపునిచ్చారు. దినకర్ ను పార్టీ తొలగించేందుకు రహస్య మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

శివకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు..

కర్నాటక : మంత్రి శివకుమార్ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలోని శివకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 

మీడియాను నెట్టివేసిన టి.పోలీసులు..

హైదరాబాద్ : ప్రగతి భవన్ ను కాంట్రాక్ట్ ఉద్యోగులు ముట్టడించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని వ్యాన్ లో కుక్కేశారు. అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.

 

డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు..

హైదరాబాద్ : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై బంజారాహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. డిశ్చార్జ్ అయిన వెంటనే విక్రమ్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అరెస్టు అయిన అనంతరం విక్రమ్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. 

మాచవరంలో యువతి అదృశ్యం..

విజయవాడ : మాచవరంలో యువతి అదృశ్యమైంది. అదృశ్యమైన యువతి కర్నాటకకు చెందిన ఐఏఎస్ అధికారికి సోదరి. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విసన్నపేటలో డాక్టర్ గా పనిచేస్తోందని తెలుస్తోంది. 

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈసీ హెల్త్ ఎంపాయీస్ ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులను పోలీసులు చెదరగొడుతున్నారు.

10:42 - August 3, 2017

హైదరాబాద్: నందమూరి నట సింహం బాలకృష్ణ 102వ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి సూపర్‌స్టార్లతో పలు సినిమాలు తెరకెక్కించిన కేయస్‌ రవికుమార్‌కి బాలయ్య102 వ సినియాకు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, డైరెక్టర్ కేఎస్ రవి కుమార్ దర్శకత్వం వహించారు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా చిరంతన్ భట్ చేస్తుండగా.. మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు 'జయసింహ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ వంటి సూపర్‌స్టార్లతో పలు సినిమాలు తెరకెక్కించిన కేయస్‌ రవికుమార్‌కి బాలయ్య ఎనర్జీ తోడయితే ఇక సినిమా ఎలా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అంబిక కృష్ణతో పాటు చిత్ర బృదం, తదితరులు పాల్గొన్నారు.

10:31 - August 3, 2017

హైదరాబాద్ : ఈసీ కాంట్రక్టు హెల్త్ ఎంప్లాయిస్ ప్రగతి భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన మహిళ ఉద్యోగులపై మగ పోలీసులు దౌర్జన్యం చేశారు. పలుపురు మహిళలకు గాయాలయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

మలక్ పేట పీఎస్ పరిధిలో కార్డన్ సర్చ్

హైద‌రాబాద్: మ‌ల‌క్ పేట్ పీఎస్ ప‌రిధిలోని స‌లీంన‌గ‌ర్, తీగ‌ల గూడ‌, అఫ్జ‌ల్ న‌గ‌ర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వ‌హించారు. సౌత్ జోన్ డీసీపీ స‌త్య‌నారాయ‌ణ, ఈస్ట్ జోన్ ఇన్ చార్జ్ డీసీపీ నేతృత్వంలో ఈ సెర్చ్ నిర్వ‌హించారు. ఆ ఏరియాల్లో 17 మంది నైజీరియ‌న్లు అక్ర‌మంగా ఉంటున్నార‌నే స‌మాచారంతో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. 52 మంది ఆఫ్రిక‌న్లను అదుపులోకి తీసుకొని వాళ్ల పాస్ పోర్ట్, వీసా ను ప‌రిశీలించారు. వీసా ప‌ర్మిట్ ముగిసిన ఇద్ద‌రు సూడాన్ దేశ‌స్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉన్న ఐదుగురు పాత నేర‌స్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10:24 - August 3, 2017

ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాయంత్రం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేరిపించారు. 94 సంవత్సరాలున్న దిలీప్ కుమార్ గత కొంతకాలంగా అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే దిలీప్ కుమార్ శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దిలీప్ ఆరోగ్యం మరింత క్షీణించిందని పుకార్లు షికారు చేశాయి. వీటిని ఆయన సతీమణి, నటి సైరా బాను ఖండించారు.

దిలీప్‌కుమార్ 1922 లో ప్రస్తుత పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించారు. ఆయన అసలు పేరు యూసుఫ్‌ఖాన్. దేవ్‌దాస్, ముఘల్ ఎ ఆజమ్, గంగా జమున, నయా దౌర్, మధుమతి వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. 1994లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కింది. 1998లో 'ఖిలా' చిత్రంలో నటించిన అనంతరం ఇతర చిత్రాల్లో నటించలేదు. 2015లో ఆయనకు పద్మ విభూషణ్ దక్కింది.

10:24 - August 3, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలోని విజయనగరకాలనీ చెరువులో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తునట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. అధికారులు చర్యలకు వ్యతిరేకంగా స్థానిక కార్పొరేటర్ ఉమామహేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు పురుగులమందుతాగి ఆత్మహత్యకు యత్నించారు. వారి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

వెంకయ్యకు అభినందనలు తెలిపిన తెలుగు ఎంపీలు

ఢిల్లీ: ఈ నెల 5న ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు వెంకయ్య నాయుడుని కలిసి అభినందనలు తెలిపారు.

10:22 - August 3, 2017

తూర్పు గోదావరి : మరో సారి పాదయాత్ర కు సిద్దమైన ముద్రగడను పోలీసులు మరో సారి అడ్డుకున్నారు. ముద్రగడ నివాసం వద్దే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర ఎన్ని సార్లు అడ్డుకుంటారని పోలీసులను ముద్రగడ నిలదీశారు. ఇప్పటికే కిర్లంపూడికి కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కిర్లంపూడిలో ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:21 - August 3, 2017

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ కుల్గామ్, సోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రత భద్రతా దళాల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి. కుల్గామ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. సోసియాన్ ఎన్ కౌంటర్ లో ఆర్మీ మేజర్ తో పాటు మరో జవాన్ మృతి చెందారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

హుమాయూన్ నగర్ పోస్టల్ సిబ్బంది పెరల్స్ సంస్థపై సీబీఐ కేసు

హైదరాబాద్: హుమాయూన్ నగర్ పోస్టల్ శాఖ సిబ్బంది చేటి వాటం ప్రదర్శించారు. నకిలీ బిల్లులతో పార్శిళ్లు పంపించి రూ. 7.66 కోట్లు పక్కదారి పట్టించినట్లు సీబీఐ గుర్తించింది. అబిడ్స్ లోని ప్రీషా పెరల్స్ కు సంబంధించిన పార్శిళ్లకు నకిలీ బిల్లుల చేర్చి 2 ఏళ్లలో 18 వేల పార్శిళ్లు పంపినట్లు తేలింది. హుమాయూన్ నగర్ పోస్టల్ సిబ్బంది పెరల్స్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.

వరంగల్ - సికింద్రాబాద్ రైల్వే లైను లో సాంకేతిక లోపం

యాదాద్రి: వరంగల్ - సికింద్రాబాద్ రైల్వే లైను లో సాంకేతిక లోపం తలెత్తింది. పెంబర్తిలో కాకతీయ, కృష్ణా ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఆలేరులో పుష్కల్, నాందెడ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, వంగపల్లిలో గరీభ్ రథ్ రైలు నిలిచిపోయాయి.

కాసేపట్లో టిడిపి సమన్వ కమిటీ భేటీ

అమరావతి: కాసేపట్లో టిడిపి సమన్వ కమిటీ భేటీకానుంది. ఈ భేటీలో నంద్యాల ఉప ఎన్నిక, శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ వీడటం, వచ్చే నెల నుంచి ఇంటింటికి టిడిపి ప్రచారం అంశాలపై చర్చించనున్నట్లుసమాచారం.

'కాళేశ్వరం'అధ్యయనానికి సీనియర్ ఐఏఎస్ ల బృందం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి సీనియర్ ఐఏఎస్ ల బృందం బయల్దేరింది. తొలి విడతలో 8 మంది ఐఏఎస్ లు అధ్యయనం చేయనుంది.

10:10 - August 3, 2017

బూమ్ బూబ్..బామ్ బామ్..భూకంపాల శబ్దమే కుట్ర..గట్ర..పుట్టేలోపే..ఇట్టేకాదా..అంతమే'.....అంటూ..'ఎ..స్పీ..వై వచ్చాడోయ్'..అనే పాటతో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురుగుదాస్ దర్శకత్వంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రంలోని ఒక పాటను యూ ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. సినిమా ఎలా ఉండబోతోంది..హీరో పాత్రనుద్ధేశిస్తూ ఈ పాటను రూపొందించారు.

మహేష్ బాబు హీరోగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. ఇటీవలే చిత్ర పోస్టర్స్..టీజర్స్ విడుదలయ్యాయి. సినిమాలో 'బూమ్ బూమ్' అనే పాట ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాట పూర్తి ఆడియోను విడుదల చేశారు. ఎన్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్ట్ 9న 'మహేష్‌' పుట్టిన రోజున స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని మురుగదాస్ ప్లాన్స్ వేశారు. 

ఎదురు కాల్పుల్లో ఆర్మీమేజర్, జవాన్ మృతి

జ‌మ్ముక‌శ్మీర్: షోపియాన్ లో ఇవాళ ఉద‌యం నుంచి భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజ‌ర్, జ‌వాను మ‌ర‌ణించ‌గా... ముగ్గురు ఆర్మీ ప‌ర్స‌న‌ల్ గాయ‌ప‌డ్డారు. షోపియాన్ కంటే ముందు కుల్గం జిల్లాలో ఎదురు కాల్పులు జ‌ర‌గ‌డంతో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. హిజ్బ్ ఉల్ ముజ‌హిదీన్ టెర్ర‌రిస్టులు ఇద్ద‌రు ఈ కాల్పుల్లో హ‌త‌మైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

రోజూపాదయాత్రకు ప్రయత్నిస్తా: ముద్రగడ

తూ.గో : పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదని కాపు ఉద్యమ నేత ముద్రగడ తెలిపారు. రోజూ పాదయాత్రకు ప్రయత్నిస్తామని, కాపులను అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని చంద్రబాబు గుర్తించకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

కొలొంబో :శ్రీలంక‌తో ఇవాళ ప్రారంభంకానున్న రెండ‌వ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇండియా మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. శ్రీలంక జట్టులో పుష్ప‌కుమార అరంగేట్రం చేయ‌నున్న‌ట్లు కెప్టెన్ చండీమాల్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున అభిన‌వ్ ముకుంద్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడ‌నున్నాడు. పిచ్ స‌ర్ఫేస్ బాగుంద‌ని, బ్యాటింగ్ కండీష‌న్స్‌ను ఉప‌యోగించుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు టాస్ గెలిచిన త‌ర్వాత కెప్టెన్ కోహ్లీ అన్నాడు. శ్రీలంక జ‌ట్టులో మొత్తం మూడు మార్పులు జ‌రిగాయి. ధ‌నుష్కా, కుమారా, అసెలా గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు.

 

అనంతపురంలో ఇళ్ల కూల్చివేత... ఉద్రిక్తత...

అనంతపురం: విజయనగరకాలనీ చెరువులో అక్రమంగా నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతకు నిరసనగా కార్పొరేటర్ ఉమామహేశ్వరరావుతో పాటు ఇద్దరు వ్యక్తులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం...

ఒడిశాలో అగ్నిప్రమాదం

ఒడిశా : భువనేశ్వర్ లోని లక్ష్మిసాగరంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

 

పాదయాత్రకు సిద్దమైన ముద్రగడ

తూర్పుగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ పధ్మనాభం మరో సారి సాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ముద్రగడ గృహ నిర్భంధం నిన్నటితో ముగిసింది. కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రకు సన్నాహాలు ఆయన చేసుకుంటున్నారు. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు కిర్లంపూడికి ఇప్పటికే చేరకున్నారు.

వేటకొడవళ్లతో దారుణ హత్య

అనంతపురం : జిల్లాలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ బాదన్న హత్య గురయ్యారు. కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వేటకొడవళ్లతో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. వాకింగ్ కు వెళుతుండగా దుండగులు దాడి చేయడంతో తీవ్ర గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు.

09:14 - August 3, 2017

తూర్పుగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ పధ్మనాభం మరో సారి సాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ముద్రగడ గృహ నిర్భంధం నిన్నటితో ముగిసింది. కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రకు సన్నాహాలు ఆయన చేసుకుంటున్నారు. కాపు జేఏసీ నేతలు, కార్యకర్తలు కిర్లంపూడికి ఇప్పటికే చేరకున్నారు. కిర్లంపూడిలో వాతవరణం ఉద్రిక్తతంగా మారడంతో పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

09:13 - August 3, 2017

అనంతపురం : జిల్లాలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బోయ బాదన్న హత్య గురయ్యారు. కల్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వేటకొడవళ్లతో గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. వాకింగ్ కు వెళుతుండగా దుండగులు దాడి చేయడంతో తీవ్ర గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ప్రస్తుతం బాదన్న ఏపీ రాష్ట్ర ఫెడరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. పోలీసులు నింధితులకోసం గాలిస్తున్నారు. 

జమ్మూకాశ్మీర్ లో ఎదురుకాల్పులు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ షోపియాన్ లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

అనంతపురంలో ఉద్రిక్తత

అనంతపురం : జిల్లా కేంద్రంలోని విజయనగరకాలనీ చెరువులో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తునట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. 

08:11 - August 3, 2017

అనంతపురం : జిల్లా కేంద్రంలోని విజయనగరకాలనీ చెరువులో నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తునట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేడు తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా మ్యాచ్

ప్రొ కబడ్డీ : నేడు తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా మ్యా చ్ జరగనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతోంది.

 

రామాలయంలో పవిత్రోత్సవాలు

కొత్తగూడెం : జిల్లాలోని భద్రచలం రామలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 7వరకు నిత్య కళ్యాణాలు జరగనున్నాయి.

నేడు వెంకయ్యతో తెలుగు ఎంపీల భేటీ

ఢిల్లీ : నేడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో తెలుగు రాష్ట్రాల ఎంపీలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీలో పాల్గొన్నానున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో నోటాపై సుప్రీంలో విచారణ

ఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో నోటాపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గుజరాత్ కాంగ్రెస్ నోటాపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. 

07:40 - August 3, 2017

ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి మాట్లాడారని, నిజంగా ప్రజల్లో అంత బలం ఉంటే అలా మాట్లాడం సబబు కాదని, సీఎం తన కొడుకుని కాపడుకోవాడనికి ప్రయత్నిస్తున్నారని, కేటీఆర్ 2009లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు హిమన్ష్ మోటర్స్ ఉందని తెలిపారని, ఆ కంపెనీకి జీవో 23 ప్రకారం మోటర్ సైకిళ్లు అర్డర్ ఇచ్చారని, మీడియాను ప్రభుత్వాన్ని బెదిరుస్తున్నారని, నేరెళ్ల ఇసుక లారీలు ఆరు నెలల కాలంలో 42 ప్రమాదాలు జరిగాయని సీపీఎం నేత వెంకట్ అన్నారు. చేతగాని వాడిల సీఎం మాట్లాడారని, ఆయన కొడుకును తప్పించే యత్నంలో సహనం కోల్పోయారని, మీడియాను బెదిరిస్తున్నారని, పోలీసులను పెట్టి భూములు గుంజుకుంటురని, నయీం కేసులో ఏం జరిగిందో తెలుసునని కాంగ్రెస్ నేత రమేష్ అన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ అడుతున్నారని, ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవరిస్తున్నారని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏం చేసిన ప్రతిపక్షాలు అడ్డుకుంటుందని టీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:39 - August 3, 2017

గత విద్యాసంవత్సరం మధ్యలో మున్సిపాల్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడాన్ని తము వ్యతిరేకించమని, దీంత ఆ కార్యక్రమాన్ని ఒక సంత్సరం వాయిదా వేశారని, మున్సిపాల్ పాఠశాలలో అడ్మిషన్ సమయంలో ఏ మీడియం రాయాలో ప్రిన్సిపాల్ అర్ధం కావడం లేదని, ఈ సమస్య ఉపాధ్యాయుల సంఘం ఈ రోజు నిరసన తెలపనున్నారని, విద్యార్థులు ఇష్టపూర్వకంగా ఇంగ్లీష్ మీడియంలో చేరలేదని ప్రభుత్వ ఒత్తిడితోనే వారు చేరారని, పిల్లలు ఒకేసారి ఇంగ్లీష్ మీడియంలో చదవలేరని, ప్రభుత్వానికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని ఏపీ యూటీఎఫ్ అధ్యక్షడు వెంకటేశ్వర్లు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:38 - August 3, 2017

కోలంబో : ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా...మరో సిరీస్‌ విజయంపై కన్నేసింది. శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో సునాయాసంగా నెగ్గిన భారత్‌..సెకండ్‌ టెస్ట్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఐసీసీ టెస్ట్ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు...7వ ర్యాంకర్‌ శ్రీలంక సవాల్‌ విసురుతోంది.టెస్ట్‌ ఫార్మాట్‌లో సిరీస్‌ ఓటమంటూ లేకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా...సెకండ్‌ టెస్ట్‌ నెగ్గి సిరీస్‌ సొంతం చేసుకోవాలని ప్లాన్‌లో ఉంది. తొలి టెస్ట్‌లో తేలిపోయిన లంక జట్టు సిరీస్‌ సమం చేయాలని పట్టుదలతో ఉండగా....గాలే టెస్ట్‌లో ఎదురులేని విరాట్‌ ఆర్మీ రెండో టెస్ట్‌లోనూ డామినేట్‌ చేసి విజయం సాధించాలని తహతహలాడుతోంది.

విరాట్‌ కొహ్లీ నాయకత్వంలో
యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్టుల్లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తుందో అందరికీ తెలిసిందే. శిఖర్‌ ధావన్‌, రహానే, పుజారా, విరాట్‌ వంటి టాప్‌ క్లాస్‌ టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు లోయర్‌ ఆర్డర్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ సాహా, అశ్విన్‌,జడేజా, హార్దిక్‌ పాండ్య వంటి ఆల్‌రౌండర్లతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ దుర్భేధ్యంగా ఉంది. తొలి టెస్ట్‌లో సెంచరీలతో చెలరేగిన ధావన్‌, పుజార, విరాట్‌ కొహ్లీ....మరో సారి అదే స్థాయిలో రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఉమేష్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమీ వంటి మేటి బౌలర్లతో పేస్‌ బౌలింగ్‌ లైనప్‌ పదునుగా ఉంది. టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న స్పిన్‌ ట్విన్స్‌ రవీందర్ జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో భారత్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. మరోవైపు రంగన హెరాత్‌ సారధ్యంలోని శ్రీలంక జట్టు బలహీనంగా ఉంది. దీంతో బ్యాటింగ్‌లో ఏంజెలో మాథ్యూస్‌, ఉపుల్‌ తరంగ బౌలింగ్‌లో హెరాత్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్ల ప్రదర్శన మీదనే లంక జట్టు భారం వేసింది.తొలి టెస్ట్‌లో తిరుగులేని టీమిండియా సింహళీ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జరుగనున్న సెకండ్‌ టెస్ట్‌లోనూ హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.జోరు మీదున్న కొహ్లీ అండ్‌ కోను ఓడించాలంటే ప్రస్తుతం శ్రీలంక జట్టుకు పెద్ద సవాల్‌ అనడంలో అనుమానమే లేదు. 

07:36 - August 3, 2017

పాట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ బిజెపితో జతకట్టడంతో అసంతృప్తిగా ఉన్న జెడియు ప్రముఖ నేత శరద్‌ యాదవ్‌ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శరద్‌ యాదవ్‌ సన్నిహితుడు సమాజ్‌వాది నేత విజయ్‌ వర్మ కొత్తపార్టీపై సంకేతలిచ్చారు. జెడియు నేతలను శరద్‌యాదవ్‌ కలుసుకోనున్నారని చెప్పారు. భావసారూప్య పార్టీలతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారని తెలిపారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బిజెపి మద్దతుతో నితీష్ సిఎం పీఠాన్ని అధిష్టించడాన్ని శరద్‌ యాదవ్‌ వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరేందుకు శరద్‌యాదవ్‌ నిరాకరించారు.

07:35 - August 3, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డు అఫిలియేషన్‌ లేకుండా కాలేజీలు నడిచే ప్రసక్తే లేదంటున్నారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో మొత్తం 1600 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా 1205 కాలేజీలకు అఫ్లియేషన్లు ఇచ్చింది ఇంటర్‌బోర్డు. ఇంకా పలు కాలేజీలకు అఫ్లియేషన్‌ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. అయితే సరైన వసతులు లేని... ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని కాలేజీల అఫిలియేషన్‌ రద్దు చేస్తామన్నారు. అయితే పెనాల్టీ చెల్లిస్తే అఫిలియేషన్‌ ఇచ్చే ప్రక్రియను పరిశీలిస్తామన్నారు. ఇప్పటివరకు అఫ్లియేషన్‌ రద్దు చేసినవాటిలో శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన 16 కాలేజీలు, నారాయణ కాలేజీకి చెందిన 13 కాలేజీలున్నాయి. చైతన్య విద్యాసంస్థల నుంచి కోటి 4 లక్షల 14 వేలు, నారాయణ కాలేజీల నుంచి 66 లక్షల 72 వేలు పెనాల్టీ విధించారు. ఇక అఫిలియేషన్‌ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో కొనసాగుతుందని... మధ్యలో ఎవరినీ కలిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.

246 కోట్లు ఖర్చు 
ఇంటర్‌ బోర్డులో ఎలాంటి అవకతకలకు తావులేదంటున్నారు అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో మౌలిక వసతుల కోసం 246 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇక కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని.... ఇప్పటివరకు 98 వేల అడ్మిషన్లు పూర్తయ్యాయన్నారు. మూడో దశ అడ్మిషన్‌ ప్రక్రియ ఈనెల పదో తేదీ వరకు కొనసాగుతుందని.. ఇంకా చాలామంది విద్యార్థులు చేరే అవకాశం ఉందన్నారు.

పెనాల్టీలు 
అఫిలియేషన్‌ లేకుండా ఎలాంటి కాలేజీలు నడిచే ప్రసక్తి లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే... భారీగా విధించిన పెనాల్టీలను కాలేజీలు చెల్లిస్తాయా ? లేకపోతే ఆ కాలేజీలపై ఇంటర్‌ బోర్డు చర్యలు తీసుకుంటుందా ? లేదా ? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

07:33 - August 3, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీలు.. 2019 ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఇందుకోసం ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలని ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే... తమ స్థానం తమకే దక్కుతుందని టీడీపీ భావిస్తుండగా... ఈ ఎన్నికలో గెలిచి.. అధికార పార్టీపై పైచేయి సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. పార్టీ ఫిరాయింపుతో కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీ అధినేత జగన్‌ పావులు కదుపుతున్నారు.

తొలి బహిరంగ సభ
నోటిఫికేషన్‌ వెలువడక ముందు నుంచే రంగంలోకి దిగిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రచారానికి మరింత పదునుపెట్టే పనిలో పడ్డాయి. సీఎం చంద్రబాబు ఇప్పటికే నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే... జగన్‌ ఇవాళ నంద్యాలలో తొలి బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ సభతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ సభలోనే ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఇక నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత జగన్‌ నంద్యాలలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు నియోజకవర్గంలోనే ఉండి ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయనున్నారు.

గెలుపు కోసం వ్యూహాలు
సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఈ ఫలితం వచ్చే ఎన్నికలపై ఉంటుందన్న అభిప్రాయంతో.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

 

07:30 - August 3, 2017

కరీంనగర్ : ఒంటినిండా గాయాలు.. నిలబడలేని పరిస్థితి. ఆపుకున్నా ఉబికి వస్తున్న కన్నీరు. ఇదీ నేరెళ్ల బాధితుల కన్నీటి గాథ. నేరెళ్ల బాధితులు బుధవారం కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వస్తూనే తమ గోడును వెల్లబోసుకున్నారు. లారీలకు నిప్పు పెట్టిన ఘటనలో తమకు ఎలాంటి సంబంధంలేకపోయినా పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బాధితులు ఆరోపించారు. స్టేషన్‌లో నాలుగు రోజులపాటు పోలీసులు తమను చిత్ర హింసలకు గురిచేశారని వాపోయారు. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ ఇస్తూ తమను ఎస్పీ,ఎస్సైసహా ఇతర పోలీసులు చావబాదారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. లేకపోతే తమ కుటుంబ సభ్యులపై గంజాయి కేసు పెడతామని బెదిరింపులకు దిగారన్నారు. మహిళలపై వ్యభిచార కేసులు నమోదు చేస్తామని ఎస్పీనే స్వయంగా బెదిరించినట్టు బాధితులు వెల్లడించారు.

బాధితులు కన్నీరుమున్నీర
బాధితులు కన్నీరుమున్నీరనేరం అంగీకరించనందుకు తమకు కరెంట్‌షాక్‌ పెట్టారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. ప్రత్యక్ష నరకం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దెబ్బలతో నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.దళితులపట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి వారిని చిత్రహింసలకు గురిచేసిన ఎస్పీసహా ఇతర పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మనిషి ప్రాణాలకంటే ఇసుక లారీలే ప్రభుత్వానికి ముఖ్యమైపోయాయని మండిపడ్డారు.

వాస్తవాలు బయటకు 
మొత్తానికి నేరెళ్ల బాధితులు జైలు నుంచి విడుదలవ్వడంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దళితులపై పోలీసుల దాష్టీకం వెలుగుచూస్తోంది. మరి దళితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా. పోలీసులపై చర్యలు తీసుకుంటుందా. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.

07:14 - August 3, 2017

హైదరాబాద్ :  మలక్‌పేటలోని అఫ్జల్‌నగర్, సలీమ్‌నగర్‌, తీగలగూడలో అర్థరాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి. సరైన పత్రాలులేని 62 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 52మంది విదేశీయుల వీసా పర్మిట్‌లను పరిశీలించారు. వీసా పర్మిట్‌ ముగిసిన ఇద్దరు సోమాలియన్‌ సుడాన్‌ దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురు పాతనేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

07:13 - August 3, 2017

హైదరాబాద్ : కింగ్‌కోఠిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. యాదాద్రి జిల్లాకు చెందిన సంధ్య అనే గర్భిణి చనిపోయింది. సంధ్యకు గతనెల 26న డాక్టర్లు ప్రసవం చేశారు. ఆపరేషన్‌ విఫలం కావడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. పరిస్థితి విషమంకావడంతో హుటాహుటిన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే సంధ్య ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య చనిపోయిందని సంధ్య భర్త ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న యూత్‌ కాంగ్రెస్‌ నేత అనిల్‌కుమార్‌ వైద్యుల నిర్లక్ష్యంతోనే సంధ్య చనిపోయిందని... బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు తెలిపారు. మరోవైపు సంధ్య భర్త శ్యామ్‌ వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

07:12 - August 3, 2017

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని హైడ్రోజన్‌ పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి చేసింది. ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో... పోలీసులు దాడి చేసి.. 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు యువతులు ఉన్నారు. ఇక పబ్‌ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Don't Miss