Activities calendar

04 August 2017

22:27 - August 4, 2017
22:23 - August 4, 2017
22:12 - August 4, 2017

ఢిల్లీ : కొలంబో టెస్ట్‌లో కొహ్లీ సేనకు పోటీనే లేకుండా పోతోంది. రెండో రోజు సైతం టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో డామినేట్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ నమోదు చేసిన భారత్‌...విజయం సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.  
టీమిండియా తిరుగులేని ఆధిపత్యం 
కొలంబో టెస్ట్‌లో టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి రోజు బ్యాటింగ్‌లో డామినేట్‌ చేసిన
భారత్‌....రెండో రోజు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  మ్యాచ్‌పై పట్టు బిగించింది. పుజారా ట్రేడ్‌ మార్క్ ఇన్నింగ్స్‌,రహానే స్ట్రోక్‌ఫుల్‌ సెంచరీతో పాటు ....లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగడంతో  భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ నమోదు చేసింది.
9 వికెట్లకు 622 
3 వికెట్లకు 344 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌...ఓవర్‌నైట్‌ స్కోర్‌కు 278 పరుగులు జోడించింది.అశ్విన్‌, సాహా, జడేజా హాఫ్‌ సెంచరీలు చేయడంతో లంక బౌలర్లు తేలిపోయారు. 9 వికెట్లకు 622 పరుగులతో మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌  చేసిన టీమిండియా..శ్రీలంకకు సవాల్‌ విసిరింది. 
తడబడిన లంక  
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో లంక జట్టు ఆరంభం నుంచే తడబడింది. కరుణ రత్నే, ఉపుల్‌ తరంగాను అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌తో బోల్తా కొట్టించడంతో లంక టీమ్ భారత్‌కు ధీటుగా బదులివ్వలేకపోయింది. రెండో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక జట్టు ఇంకా 572 పరుగులు వెనుకబడింది. భారత బౌలర్లను ఢీకొని భారీ స్కోర్‌ నమోదు చేయడం..ప్రస్తుతం అనుభవం లేని లంక బ్యాటింగ్‌ లైనప్‌కు పెద్ద సవాలే. రెండో టెస్ట్‌లో విరాట్‌ ఆర్మీ ఇన్నింగ్స్‌ విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

22:09 - August 4, 2017

నాకు ఓటేయకపోతే నా రోడ్డుమీద నడవొద్దు... నడిరోడ్డు మీద కాల్చిపడేయాలి.. సన్నాసీ.. చవట దద్దమ్మా.. ఇవి సినిమా డైలాగులు కాదు.. నాటకంలో మాటలూ కాదు.. మన ప్రియతమ నేతలు.. చంద్రబాబు, జగన్, కెసీఆర్ లాంటి ప్రముఖులు ఉపయోగిస్తున్న భాష ఇది. సింపుల్ గా చెప్పాలంటే  టంగ్ ఓ రేంజ్ లో స్లిప్పవుతోంది. మాటలు కంట్రోల్ తప్పుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిపిస్తున్న సీన్ ఇది. అసలది నాలుకా, లేక తాటిమట్టా అనే అనుమానాలొస్తున్నాయి.. ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..

 

22:06 - August 4, 2017

ఢిల్లీ : తాను కొత్త పార్టీ పెట్టడం లేదని జెడియు ప్రముఖ నేత శరద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తన సన్నిహిత నేత భావోద్వేగంతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారే తప్ప అది వాస్తవం కాదన్నారు.  తాను పట్నాకు వెళ్లే కార్యక్రమం కూడా ఇప్పట్లో లేదని శరద్‌ యాదవ్‌ చెప్పారు. ఆగస్టు 8 శరద్‌ యాదవ్‌ పట్నాకు వస్తారని, 2019 ఎన్నికల్లో కలిసి పోరాడతామని ఆర్జేడి చీఫ్‌ లాలు ప్రకటించిన నేపథ్యంలో శరద్‌ యాదవ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్ బిజెపితో జతకట్టడంపై శరద్‌యాదవ్‌ ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకుని బిజెపి మద్దతుతో నితీష్ సిఎం పీఠాన్ని అధిష్టించడాన్ని శరద్‌ యాదవ్‌ వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా చేరేందుకు కూడా శరద్‌యాదవ్‌ నిరాకరించారు.

22:03 - August 4, 2017

ఢిల్లీ : 15వ ఉపరాష్ట్రపతి పదవికి రేపు పోలింగ్‌ జరగనుంది. ఎన్డీయే తరపున మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, విపక్షాల మద్దతుతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్‌ ఉభయసభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటారు. నామినేటెడ్‌ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లపై గుర్తులుండవు...అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. పార్లమెంట్‌ ఉభయ సభల్లో కలిపి మొత్తం 790 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో 233 మంది ఎంపీలు, 12 మంది నామినేటెడ్‌ సభ్యులుండగా...లోక్‌సభలో 543 మంది ఎంపీలు, ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులున్నాు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఫలితాలు కూడా రేపే ప్రకటిస్తారు. వరుసగా రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా కొనసాగిన హమీద్‌ అన్సారీ పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.

 

22:00 - August 4, 2017

కర్నూలు : నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తన ఇంటి నుంచి పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఆర్డీవో కార్యాలయంలో మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని, ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపిందన్నారు శిల్పా మోహన్‌ రెడ్డి. 

 

21:59 - August 4, 2017

చిత్తూరు : సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దహనం  చేయడంతో.. ప్రతిగా చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ లీడర్లు యత్నించారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

కుప్పంలో ఉద్రిక్తత

చిత్తూరు : సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దహనం  చేయడంతో.. ప్రతిగా చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ లీడర్లు యత్నించారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

21:47 - August 4, 2017

కేసీఆర్కు విపక్ష పార్టీలోళ్ల సుక్కలు..కమ్యూనిస్టుల జాడ జెప్పిన జనం, కిట్టు ఇప్పిసూపెడ్తున్న మంత్రి హరీష్, సెకండ్ హ్యాండ్ టికెట్లతోని దర్శనం దందా, విద్యార్థులను బూతులు తిట్టిన పోలీసోళ్లు, మార్చురీలో కూసున్న హన్మంతన్న....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:42 - August 4, 2017

నంద్యాల బైపోల్ సమరం హాట్‌హాట్‌గా మారింది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం. నంద్యాలలో జగన్ సభతో పెరిగిన హీట్ పెరిగింది. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇవాళ వైసీపీ నుంచి శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్ వేశారు. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేశారు. ఇరు పార్టీలకు నంద్యాల ప్రతిష్టాత్మకంగా మారింది. 'నంద్యాల ఉపఎన్నిక...జగన్ వ్యాఖ్యల'పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

21:37 - August 4, 2017
21:36 - August 4, 2017
21:35 - August 4, 2017
21:34 - August 4, 2017

హైదరాబాద్ : ప్రముఖ శాస్తవేత్త డాక్టర్ పిఎమ్ భార్గవ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిసాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజులు క్రితం మృతి చెందారు. ఉప్పల్ లో ఉన్న  ఆయన భౌతిక కాయానికి సీపీఎం తెలంగాణ రాష్ట కార్యదర్శి తమ్మినేని, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చుక్కా రామయ్య, గేయానంద్, సుద్దాల అశోక తేజ, సీసీఎంబీ శాస్తవేత్తలు, జన విజ్ఞాన వేదిక నేతలు ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించి... ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేశం ఒక్క గొప్ప శాస్తవేత్తను కోల్పోయిందని పలువురు వ్యాఖ్యానించారు. 

21:32 - August 4, 2017

ఢిల్లీ : రాబోయే రక్షాబంధన్‌ పండుగ రోజు ప్రతి సోదరి తన సోదరులకు రాఖీతో పాటుగా ఓ హెల్మెట్‌ ని బహూకరించాలని టీ.ఆర్‌.ఎస్‌ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. దీని ప్రచారం కోసం "సిస్టర్‌ ఫర్‌ చేంజ్‌" అనే వెబ్‌సైట్‌ ను రూపొందించారు.. ఈ వెబ్‌సైట్‌ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ద్విచక్రవాహనదారులు  హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో రోజు సుమారు 400 మంది మరణిస్తున్నారని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేసింది. హెల్మెట్‌ వాడే లా తమ సోదరులను చైతన్య పరిచే బాధ్యత సోదరీమణులే తీసుకోవాలని ఈ ప్రచార కార్యక్రమం చేపట్టామని తెలిపింది.

 

21:26 - August 4, 2017

కర్నూలు : శిల్పా మోహన్‌ రెడ్డి ఇంటివద్ద మహిళలు ధర్నాకు దిగారు. శిల్పా సోదరుడు చక్రపాణిరెడ్డి మహిళలను కించపరిచే విధంగా.. మాట్లాడారని మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో... శిల్పా మోహన్ రెడ్డి ఇంటివద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

21:24 - August 4, 2017

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పైసల పిచ్చి పట్టిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. సీఎంకు కల్చర్ లేదన్న ఆయన.. వేల కోట్ల రూపాయలు ఏంచేసుకుంటావని ప్రశ్నించారు. సిరిసిల్లలో జనం చస్తున్నా ఇసుక లారీలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తే ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుందని వీహెచ్ ప్రశ్నించారు. 

 

21:16 - August 4, 2017

మేడ్చల్ : రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలిచ్చే పరిస్థితి పోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. వ‌చ్చే ఏడాది గోదావ‌రి జ‌లాల‌తో ల‌క్ష్మాపూర్ చెరువును నింపుతామ‌ని సీఎం చెప్పారు. ల‌క్ష్మీదేవి ల‌క్ష్మాపూర్ గ్రామంలో తాండ‌వించాల‌ని అన్నారు. 365 రోజులు ల‌క్ష్మాపూర్ చెరువు నిండుగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. లక్ష్మాపూర్ గ్రామాభివృద్ధికి 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

21:12 - August 4, 2017

ఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబరం మ‌రిన్ని చిక్కుల్లో ప‌డ్డారు. ఫెమా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కేసులో కార్తీ చిదంబరానికి లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. కార్తి దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు సీబీఐ లుకౌట్‌ సర్కులర్‌ను విడుదల చేసినట్లు సమాచారం. దీనిని సవాల్‌ చేస్తూ కార్తీ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. లుక్ అవుట్ నోటీస్‌ను వెంటనే విరమించుకోవాలని  కార్తి చిదంబరం విజ్ఞప్తి చేశారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా హైకోర్టు హోంశాఖ‌ను ఆదేశించింది.. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేసింది. తాను దేశం వ‌దిలి ఎక్కడికీ పోవ‌డం లేద‌ని, విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని కార్తీ తెలిపారు.  కార్తీపై అవినీతి ఆరోపణలు, ఫారిన్‌ ఎక్సేంజ్‌ అక్రమాలు వంటివాటిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

 

21:03 - August 4, 2017

శ్రీకాకుళం : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూడటమే మానేశారు. కాయ కష్టం చేసినా, సేద్యానికి మదుపు దొరకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా రైతుల పరిస్థితి.
రైతన్నలకు చుక్కలు చూపిస్తున్న బ్యాంకులు  
శ్రీకాకుళం జిల్లాలో బ్యాంకులు రైతన్నలకు చుక్కలు చూపిస్తున్నాయి. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..అప్పు మాత్రం పుట్టడం లేదు.ఖరీఫ్‌ రుణ లక్ష్యం 1580 కోట్లు ఉండగా ఇప్పటి వరకు 436 మందికి మాత్రమే రుణాలు అందాయి. వీరికి కోటి పదమూడు లక్షల రూపాయల రుణాలను మాత్రమే బ్యాంకులు అందిచాయి. కొత్తగా దరఖాస్తు చేసిన వారికి రుణ అర్హత కార్డులు, సాగు విస్తీర్ణ ధృవపత్రాలున్నా ఇంకా రుణాలు మంజూరు చేయలేదు. 
కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి
శ్రీకాకుళం జిల్లాలో వరిసాగు విస్తీర్ణం రెండు లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందులో లక్షా ఎనబై వేల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బ్యాంకులు మొండి చేయి చూపించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. సేద్యానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని, బ్యాంకుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనమిది మండలాల పరిధిలో 500 మంది రుణ ధరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఇంకా దరఖాస్తు చేయని వారి సంఖ్య చాలానే ఉంది. ఈ తరుణంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేసి, పెట్టుబడికి సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో రుణాలు అందితే తప్ప ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. జిల్లాలో కౌలు రైతులకు జాయింట్‌ లయిబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసి పంట రుణాలు అందించాలని రైతు సంఘాలు డిమండ్‌ చేస్తున్నాయి. 

20:57 - August 4, 2017

అనంతపురం : జిల్లాలో రాగింగ్‌ భూతం కలకలం రేపింది. నగరంలోని అనంత లక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాలలో షఫీ అనే ఫస్టియర్‌ విద్యార్థి తలను సీనియర్స్‌ పగులగొట్టారు. దుర్భాషలాడుతూ దూషించడమే కాకుండా తాగి గొడవ చేశారు. తలకు గాయంతోనే షఫీ స్థానికంగా ఉన్న ఇటుకలపల్లి పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇది ర్యాగింగ్‌ మూలంగానే జరిగిందా లేక ఇతర కారణమేదైనా 
ఉందా అని విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

20:54 - August 4, 2017

విజయవాడ : గరగపర్రులో దళితులకు న్యాయం చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సంఘీభావ సమావేశాన్ని నిర్వహించారు. మరో 5 రోజుల్లో దళితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోతే ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు హెచ్చరించారు. ఈ ఆందోళన కోసం రాష్ట్రవ్యాప్తంగా దళితులను ఏకం చేస్తామన్నారు. గ్రామంలో దళితుల బహిష్కరణ జరిగి 3 నెలలు గడుస్తున్నా..చంద్రబాబు ప్రభుత్వం వారికి ప్రకటించిన హామీలను నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.  

ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ

అమరావతి : ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ చేయనునున్నారు. పునర్విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీఐజీ స్థాయి అధికారి సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. సిట్ పర్యవేక్షకుడిగా విజయవాడ సీపీ సవాంగ్ కు బాధ్యతలు అప్పగించారు. 2007 లో ఇబ్రహీంపట్నంలోని హాస్టల్ లో ఆయేషా మీరా హత్య గావించబడింది.

 

కానినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మళ్లీ సందిగ్ధత

తూర్పుగోదావరి : కానినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. 2013 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. డోలాయమానం, తూరంగిలో కలుపుకుని ఎన్నికల నిర్వహించాల్సి ఉండటంతో అస్పష్టత నెలకొంది. 

 

20:37 - August 4, 2017

కర్నూలు : వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ అంటే పైరవీలు చేసే పార్టీ అని విమర్శించారు. భూమా నాగిరెడ్డి ఆశయసాధన మేరకే నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు మొత్తంలో నంద్యాలలో ప్రచారం చేసినా.. గెలుపు మాత్రం టీడీపీదే అని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 23న ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. 

 

20:29 - August 4, 2017

గుజరాత్‌ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి జరిగింది.  బనాస్‌కాంతా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులనుద్దేశించి రాహుల్‌ మాట్లాడుతుండగా రాహుల్‌ కాన్వాయ్‌పై కొందరు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారు కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. రాహుల్‌ సెక్యూరిటి సిబ్బందికి గాయాలయ్యాయి.  మరికొందరు రాహుల్‌ పర్యటనను నిరసిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించారు. తన పర్యటన చూసి ఓర్వలేక రాళ్ల దాడి చేశారని వీటికి తాను భయపడనని రాహుల్‌ అన్నారు. బీజేపీ పార్టీకి చెందిన గూండాలు రాహుల్ కారును ధ్వంసం చేసిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనను అవ‌మాన‌క‌ర‌మైన దాడిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుర్జేవాలా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 

గుజరాత్‌లో రాహుల్ గాంధీ కారుపై దాడి

గుజరాత్‌ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి జరిగింది. బనాస్‌కాంతా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

20:23 - August 4, 2017

అనంతపురం : నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చెర్రీస్‌ తయారు చేస్తున్న కంపెనీని అనంతపురంలో విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. కుళ్లిన బొప్పాయి పండ్లతో పిల్లలు తినే చెర్రీస్‌ ని తయారు చేస్తున్న మణికంఠ ఫ్యాక్టరీని విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేసి సీజ్‌ చేశారు. 

20:21 - August 4, 2017

జార్ఖండ్ : ప్రకృతిని పరిరక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తే అది మనకు ప్రమాదకరంగా పరిణమిస్తుంది.. నల్ల బంగారానికి నిలయమైన జార్ఖండ్‌లోని ఝరియాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. భూగర్భంలోని బొగ్గు నుంచి అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. ఆ పొగలు ఉపరితలానికి వ్యాపిస్తుండటంతో  భూవాతావరణం అగ్ని గుండంగా మారుతోంది. మావవాళి మనుగడకు  ముప్పుగా  మారుతోంది. వందేళ్ల నుంచి రగులుతున్న ఝరియా బొగ్గు గనులపై ఒక లుక్కేద్దాం. 
విచ్చల విడిగా బొగ్గు దోచుకున్న ప్రైవేట్ కంపెనీలు 
ఝరియా.. ఒకప్పుడు ఉమ్మడి బీహార్‌ రాష్ట్రంలో ఉండేది. విభజన తర్వాత ఝార్ఖండ్‌లోకి వచ్చింది. బొగ్గు గనులకు నిలయం. ఒకప్పుడు ప్రైవేటురంగంలో ఉన్న ఝరిగా బొగ్గు గనులు ఆ తర్వాత 1971లో ప్రభుత్వరంగంలోని భారత్‌ కోకింగ్‌ కోల్‌ సంస్థ పరమయ్యాయి. సరైన రక్షణ చర్యలు చేపట్టకుండా విచ్చల విడిగా బొగ్గును దోచుకున్న ప్రైవేట్ కంపెనీలు... నల్ల బంగారం నిల్వలు అయిపోయిన తర్వాత వీటిని సరైగా మూసివేయకపోవడం పర్యావారణానికి ముప్పుగా పరిణమిస్తోంది. 
1894లో ఝరిగాయలో బొగ్గు తవ్వకాలు
ఈస్టిండియా కంపెనీ హయాంలో 1894లో ఝరిగాయలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1916లో ఈ గనుల్లో తొలిసారిగా మంటలు కనిపించాయి. 1930లో ఝరియా రెండు బొగ్గు గనులు కూలిపోయినప్పుడు వ్యాపించిన మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూనే ఉన్నాయి. భూమిలో మండుతున్న మంటలు కొన్ని చోట్ల పైకి కనిపించవు. భూగర్భం నుంచి వెలవడే పొగలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో నేల వేడెక్కుతోండటతో చెప్పులు లేకుండా నడవలేని పరిస్థితి. కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. మొత్తం 72 చోట్ల కనిపిస్తున్న ఈ మంటు ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వ చర్యతో కొన్ని చల్లబడ్డాయి. ఈ ఉద్రవం కారణంగా 3.7 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు వృథా అయ్యాయి. మరో 200 కోట్ల టన్నుల బొగ్గు తవ్వకానికి వీలులేకుండా పోయింది. ప్రైవేటు కంపెనీల స్వార్థంతో జాతి సంపద దోపిడీకి గురవ్వడమే కాకుండా, ప్రజలకు ముప్పుగా కూడా  పరిణమిస్తోంది.  
గనులను మూసివేయకపోవంతో ప్రమాదాలు 
బొగ్గు నిక్షేపాలు భూమికి రెండు, మూడు వందల మీటర్ల లోతులో ఉంటాయి. కానీ ఝరియాలో మాత్రం 15 మీటర్ల లోతులోనే బొగ్గు లభిస్తోంది. బొగ్గు తవ్వకాల్లో అశాస్త్రీయ విధానాలను పాటించడం, నిల్వలు హరించుకుపోయిన తర్వాత సరిగా మూసివేయకపోవడంతోనే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. బొగ్గును కొల్లగొట్టిన ప్రైవేటు కంపెనీలు శాస్త్రీయంగా మూసివేయకపోవడంతో భూగర్భంలో నిల్వవున్న కొద్దిపాటి నల్ల బంగారానికి మంటలు అంటుకుని సమీప ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కొన్నిసార్లు పిడుగుపాటుకు కూడా మంటలు అంటుకుంటున్నాయి.
బొగ్గు గనుల అక్రమ తవ్వకాలు 
ఝరియా ప్రాంతంలో బొగ్గు గనుల అక్రమ తవ్వకాలు కూడా పొరిగిపోయాయి. తవ్వి వదిలేస్తున్న గుంతల్లో పొరపాటును ఏ చిన్న నిప్పురవ్వ పడినా మంటలు వ్యాపిస్తున్నాయి. భూగర్భంలోని బొగ్గు మంటలు పైకి వ్యాపిస్తూ రైలు పట్టాలను తాకేంత వరకు పరిస్థితి వచ్చింది. దీంతో ధన్‌బాద్‌-చంద్రపుర  మార్గంలో రైళ్లను రద్దుచేయడంతోపాటు,  బస్జోరా మార్గంలో కొన్ని రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో పాట్న-హజారీబాగ్‌-రాంచీ జాతీయ రహదారిని మూసివేయాల్సి వచ్చింది. ప్రైవేటు కంపెనీల స్వార్థంతో ప్రజ్వరిల్లుతున్న ఈ బొగ్గు మంటలను పూర్తిగా అదుపుచేయడం సాధ్యంకాదని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్త చర్యలు చేపట్టవచ్చిన సూచిస్తున్నారు. భూమి పగుళ్లలోకు సిమెంటు పూత వేసి, గాలి చొరబడకుండా చేస్తే మంటలు విస్తరించకుండా అరికట్ట వచ్చని చెబుతున్నారు. దేశంలోని కొన్ని బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ఝరిలా లాంటి ఉపద్రవాలను గుర్తు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

20:15 - August 4, 2017

హైదరాబాద్ : నవతెలంగాణ పత్రికపై సీఎం కేసీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్‌ గన్‌పార్క్‌ వద్ద హెచ్ యూజే, టీయూడబ్ల్యుజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

 

20:11 - August 4, 2017
20:09 - August 4, 2017

జీనియస్ డైరక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ ద్వారా రెండోవ చిత్రంగా తెరకెక్కిన దర్శకుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశోక్, ఈషా రెబ్బా, హీరో హీరోయిన్లుగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ట్రైలర్స్ తోనూ టీజర్స్ తోనూ మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...
కథ...
కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుండి దర్శకుడు కావాలని తపన ఉన్న కుర్రాడు మహేష్. ఒక నిర్మాతకు తన కథను చెప్పి సినిమాను ఒకే చేసుకుంటాడు ఆకథలో లవ్ ట్రాక్ తగ్గిందని, లవ్ ట్రాక్ ను ఇంకా బెటర్మెంట్ చేసుకుని 15 రోజుల్లో ఫైనల్ వర్షన్ తీసుకు రమ్మని గడువు విధిస్తాడు  నిర్మాత. దీంతో రెండు రోజులు  తన సొంత ఊరికి వెళ్ళిన మహేష్ కి అక్కడా అనుకోకుండా నమ్రతాతో పరిచయం ఏర్పడుతుంది.. అది కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాని మహేషం్ మాత్రం తనలో ఉన్న దర్శకుడి వలన ప్రేమను కూడా సినిమా కోణంలోనే చూస్తుంటాడు.. దాంతో హర్ట్ అయిన నమ్రతా. అతనికి దూరం అవుతుంది. అలా ఆమె ప్రేమను కోల్పోయిన మహేష్,తను ప్రాణం పెట్టి డైరక్ట్ చేసిన సినిమాకి కూడా అనుకోకుండా దూరం అవుతాడు.. అలా ప్రేమను, సినిమాను రెండింటిని కోల్పోయిన మహేష్.. 
ఎలాంటి బాధను అనుభవించాడు. అసలు మహేష్ నుండి నమ్రత ఎందుకు దూరం అయ్యింది. తనలోని దర్శకుడికి ప్రేమికుడికి మధ్య సంఘర్షన ఎటువంటిది. చివరికి తన ప్రేమను గెలిచి దర్శకుడిగి మంచి పేరుతెచ్చుకున్నాడా లేదా అనేది తెరపై చూడాలి..
విశ్లేషణ... 
నటీనటుల విషయానికి వస్తే.. డైరక్టర్ విజన్ కు అనుగూణంగా 100 పర్సంట్ ఎఫర్ట్ ను పెట్టి, మెప్పించాడు అశోక్.. సినిమానే జీవితంగా భావించే దర్శకుడి వ్యక్తిత్వాన్ని, ఒక ప్రేమికుడి అనుభవాలను, భాగా పండించాడు అశోక్. 
హీరోయిన్ ఈషా రెబ్బా సహజమైన తన నటనతో ఆడియన్స్ ను కట్టి పడేసింది.. ఈషారెబ్బ కెరీర్ లో ఇదొక మంచి పాత్ర ఆమెకు దక్కింది అని చెప్పొచ్చు.. ఇక సుదర్శన్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు అని చెప్పాలి..  ప్రియదర్శి కనిపించిన ఒక్కసన్నివేశంలో అయిన నవ్వలు పూయించాడు.లోబో సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి.. మిగతానటీనటులు అందరూ డైరక్టర్ ఇమాజినేషన్ కి అనుగూణంగా మంచి ఔట్ పుట్ ఇచ్చారు.. 
టెక్నీషియన్స్...     
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. హరిప్రాసద్ జక్కా.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలతోటి మంచి కథను ఎంచుకున్నాడు అని చెప్పాలి.. తాను అనుకున్నదాని అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ప్రజంట్ చేయడానికి బాగానే కష్టపడ్డాడు.. కొన్ని సన్నివేశాలలో నటులచేత సరియైన ఔట్ పుట్ ను రాబట్టుకోవడంలో కొంచె తడబడ్డాడు.. ఇక సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఫ్రేమింగ్ సినిమాకు మంచి రిజ్ లుక్ ను తెచ్చింది.. సాయి కార్తీక్ పాటలు అంత క్యాచీగా లేకపోయినా. మంచి బ్యాగ్రౌండ్ స్కొర్ ను అందించాడు..ఎడిటింగ్ పర్వాలేదు.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే మంచి పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను అలరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ఫీల్ సెకండ్ ఆఫ్ లో కూడా కంటీన్యూ చేసి ఉంటే.. సినిమా ఓ రేంజ్ లో ఉండేది.బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి మరి

 

20:00 - August 4, 2017

సందీప్ కిషన్ రెజీన , ప్రజ్ఞా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్ లాంటి భారీ తారాగణంతో, క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ రూపోందించిన నక్షత్రం... విడుదలకు ముందే.. మంచి ఇంప్రషన్ ను క్రియేట్ చేసుకుంది... అయితే ఈరోజు థియేటర్ లోకి రిలీజ్ అయిన ఈ నక్షత్రం ఎంత వరకు మెరిసిందో ఇప్పుడు చూద్దాం..
కథ     
కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలి అనే మోటోతో ఉన్న రామారావు. ముందే డ్యూటీ చేస్తూ.అనుకోకుండా కమిషనర్ కొడుకుతో క్లాస్ అవుతాడు దాంతో ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి, ఎస్ఐ అవ్వాలి అని వెళ్తున్న రామారావు ని, కమీషనర్ కొడుకు అతని స్నేహితులు ఎటాక్ చేస్తారు. అతని సర్టిఫికెట్స్ కూడా కాల్చేస్తారు.. అతని కెరీర్ ను శాశ్వతంగా సమాది చేస్తారు.. అయినప్పటికీ రామారావు ప్రతీ ఫౌరుడు కూడా పోలీసేనని నమ్మి యూనీఫాం వేసుకుని డ్యూటీ చేస్తాడు.. అయితే అతను వేసుకున్న యూనీఫాం మీద ఉన్న అలగ్జాండర్ అనేనేమ్ టాగ్ వలన రామారావు చిక్కుల్లో పడతాడు... ఇంతకీ అలగ్జాండర్ ఎవరు.. కమీషనర్ కొడుకుతో రామారావుకి క్లాష్ ఎలా వచ్చింది.. తనకెదురైనా ఇబ్బందులను దాటుకుని రామారావు ఎస్ఐ అయ్యాడా లేదా... అనేది సినిమా చూసి తెలుసుకోవాలి... 
విశ్లేషణ...
నటీనటుల విషయానికి వస్తే... రామారావు పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు సందీప్ కిషన్ అయితే అతని క్యారక్టర్ లో బ్యాలంసింగ్ లేకపోవడంతో అదంతా వృదా అయిపోయింది..  ఇక కృష్ణ వంశీ మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్న రెజీన. గ్లామర్ డోర్స్ ను ఫుల్ గా ఎత్తేసింది ఎక్కడా కూడా మోహమాటపడ లేదు. పాటలు సీన్లు అన్న తేడా లేకుండా విచ్చల విడిగా అలరించింది.. ఇక రెజీనాకు సపోర్ట్ చేస్తు.. ప్రగ్యా జైస్వాల్ కూడా రెచ్చిపోయింది..  బికినీ వేసి బీచ్ లో మంచి ఫోటో షూట్ మోడల్ లా కనిపించింది.. అలాగే ఫైట్స్ కూడా చేయడం విషేషం.. లేట్ గా ఈ ప్రాజెక్ట్ లో ఎంటర్ అయ్యి..సాయిధరమ్ తేజ్ ఫర్ఫామెన్స్ పంరంగా మెప్పించాడు.. రొమాన్స్ కూడ బాగానే పండించాడు... ఇక తనీష్ విలన్ గా పర్వాలేదు అనిపించాడు.. మిగతా క్యారక్టర్స్ అన్నింటితో ఎక్కువగా షూటింగ్ చేయించడం వలన.. యాక్టింగ్ కన్నా.. అవే డామినేటింగ్ గా కనిపించాయి..    
టెక్నీషియన్స్..
ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకు డైరక్టర్ గా పూర్తిగా విఫలం అయ్యాడు కృష్ణ వంశీ.. కన్సిస్టెన్సీ లేని కథ. రొటీన్ కథనంతో పూర్తిగా గాడితప్పిన సినిమాను అలా అలా ఒడ్డుకు చేర్చాడు.. డైరక్టర్ గా కృష్ణ వంశీనుండి ఆశించిన మెరుపులు పెద్దగా కనిపించవు ఈ సినిమాలో.. ఇక లాజిక్ కు సంబంధం లేకుండా నడిపిన ఎపిసోడ్స్ మెయిన్ క్యారక్టర్స్ నుండి ఎండింగ్ జీర్ణించుకోవడం కష్టం. సినిమాటోగ్రాఫర్ గా శ్రీకాంత్ నారోజు సినిమాకు రిచ్ లుక్ తేవడం కోసం కష్టపడ్డాడు.. ముగ్గురు మ్యూజిక్ డైరక్టర్స్ భీమ్స్, భరత్, హరి పర్వాలేదు అనిపించే పాటలు ఇస్తే మణిశర్మ తన ఆర్ ఆర్ తో సినిమాను ఎలివేట్ చేయాలని ప్రయత్నించాడు.. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలి అనుకుంటే.. కొత్తదనం లేని కథ, నిలకడ లేని స్క్రీన్ ప్లేతో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన గ్లామర్ షో ఫైట్స్ వంటి హంగులను నమ్ముకున తెరకెక్కించిన నక్షత్రం... ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి..
ప్లస్ పాయింట్స్
ప్రగ్యా, రెజీనాల గ్లామర్
సినిమాటోగ్రాఫీ
నిర్మాణ విలువలు..
మైనస్ పాయింట్స్
డైరక్షన్
కథ,
నిలకడ లేని కథనం
ఆకట్టుకోలేని సంగీతం
పేలని డైలాగ్స్
రేటింగ్ 0.5

 

జగన్.. ప్రతినాయకుడని నిరూపించుకున్నారన్న దూళిపాళ్ల

హైదరాబాద్ : నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఖండించారు. జగన్.. ప్రతినాయకుడినని నిరూపించుకున్నారని విమర్శించారు.
 

గరగపర్రు దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మధు, రామకృష్ణ

పశ్చిమగోదావరి : గరగపర్రులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో సంఘీభావం సమావేశం ఏర్పాటు చేశారు. గరగపర్రు దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పి.మధు, రామకృష్ణ అన్నారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని తెలిపారు. 5 రోజుల్లో గరగపర్రు దళితులకు న్యాయం చేయకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని చెప్పారు. 

 

శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద మహిళలు ధర్నా

కర్నూలు : శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద మహిళలు ధర్నా నిర్వహించారు. శిల్పా చక్రపాణి రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని ఆరోపించారు. శిల్పా మోహన్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

కొలంబో టెస్టు....రెండో రోజు ముగిసిన ఆట

కొలంబో టెస్టు : రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 50
పరుగులు చేసింది. 

తుందుర్రులో సీపీఎం నేత మధు పర్యటన

ప.గో : తుందుర్రులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. మెగా ఆక్వాఫుడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈనెల 23 తర్వాత ఆక్వాఫుడ్ పార్క్ పై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 4 శాతం సీట్లు కూడా రావు అన్నారు. 

19:06 - August 4, 2017
19:02 - August 4, 2017

మహిళల వార్తల సమాహారం..మానవి న్యూస్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫెస్టివల్ మహిళల రొమ్ము క్యాన్సర్...త్వరలో ఖాకీ డ్రస్ వేసుకోనున్న హర్మన్ ప్రీత్ కౌర్ వంటి పలు మహిళల వార్తలపై ఇవాళ్టి మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

18:41 - August 4, 2017

సిరిసిల్ల : నేరెళ్లలో బాధిత దళిత కుటుంబాలను టీటీడీపీ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ డిమాండ్ చేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. నేరెళ్ల ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, లారీ యజమానులకు కఠిన శిక్షలు విధించాలన్నారు.  ఏ మాత్రం నైతిక విలువలున్నా కేటీఆర్‌ రాజీనామా చేయాలన్నారు. బాధితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.   

17:58 - August 4, 2017

సంగారెడ్డి : ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం తమ భూములు లాక్కునేందుకు సిద్ధమవుతోందని సంగారెడ్డి జిల్లా, కొల్లూరు రైతులు ఆరోపిస్తున్నారు. ఐటీ కారిడార్, డబుల్ బెట్ రూం ఇళ్ల కోసం తమ భూములు బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చేది లేదంటున్న కొల్లూరు రైతులతో ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. వారు తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం....

 

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్

ఢిల్లీ : రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఫలితాలు కూడా రేపే విడుదల కానున్నాయి. బరిలో వెంకయ్యనాయుడు, గోపాల కృష్ణ గాంధీ లో వున్నారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు రహస్య ఓటింగ్ ద్యారా బ్యాలెట్ ఓటు వేయనున్న విధానంలో వేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

17:55 - August 4, 2017

కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్ స్పందించారు. టీడీపీని ఆదరించని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని టిజి అన్నారు. తండ్రి వయసున్న చంద్రబాబును జగన్ దూషించడం చాలా దారుణమని.. మంచి భవిష్యత్ ఉన్న ఆయన ఇలాంటి దూషణలు మానుకోవాలని సూచించారు. టీడీపీని ఆదరించకపోతే నంద్యాల ప్రజలు అభివృద్ధిని కోల్పోతారని టిజి.వెంకటేష్ చెప్పారు. 

 

తుమ్మల ఆరోగ్యం బాగానే వుంది:యశోదా వైద్యులు

హైదరాబాద్: మంత్రి తుమ్మల ఆరోగ్యం బాగానే వుందని యశోదా వైద్యులు తెలిపారు. అల్సర్ వల్ల రక్తపు వాంతులు అయ్యాయని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

కేసులతో రాష్ట్రాభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోంది: మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట: ప్రజలు సంతోషంగా ఉండటాన్ని కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసులతో రాష్ట్రాభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని, ఎన్ని కేసులు వేశారో గాంధీభవన్ కు పంపిస్తానన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంగ్రెస్ ఎలా అడ్డుకుంటుందో పుస్తకం రూపంలో విడుదల చేస్తామన్నారు.

17:44 - August 4, 2017

ఢిల్లీ : కొలంబో టెస్టులో భారత్ 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండోరోజు 9 వికెట్లకు 622 పరుగులు చేసిన కోహ్లీ సేన.. లంకను బ్యాంటింగ్ చేసేందుకు ఆహ్వానించింది. భారత బ్యాటింగ్‌లో పుజారా 133 పరుగులు, రహానే 132, అశ్విన్ 54, వృద్ధిమాన్ సాహా 67పరుగులు చేశారు. చివర్లో జడేజా 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

 

నిలిచిపోయిన హైదరాబాద్ - తివేండ్రం ఎక్స్ ప్రెస్ రైలు

గుంటూరు : హైదరాబాద్ - తివేండ్రం ఎక్స్ ప్రెస్ రైల్లో సాంకేతిక లోపం తలెత్తింది. పిడుగురాళ్ల సమీపంలోని తుమ్మల చెరువు స్టేషన్ రైలు ను నిలిపివేశారు. గంట నుంచి రైలు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

17:35 - August 4, 2017

మేడ్చల్ : లక్ష్మాపూర్ చెరువును గోదావరి నీళ్లతో నింపుతామని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాది పొడువునా గ్రామ చెరువులో నీళ్లు ఉంటాయని తెలిపారు. లక్మాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ గ్రామంలో ఒక్క పోలీసు కేసు లేకుండా అందరూ కలిసి ఉండాలని సూచించారు. రైతు కుటుంబాలన్నీ బాధలో ఉన్నాయని చెప్పారు. ప్రపంచమంతా రైతుల పరిస్థితి దారుణంగానే ఉందన్నారు. రైతులంతా సంఘటితంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. రైతులకు పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రైతులంతా రైతు సమాఖ్యగా ఉండాలన్నారు. రైతు సమాఖ్య వల్ల రైతు దోపిడీకి గురికాడని తెలిపారు. రైతులకు కావాల్సినంత నాణ్యమైన కరెంట్ అందిస్తామన్నారు. రైతులకు ఎకరానికి 8 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:32 - August 4, 2017

మహారాష్ట్ర : తాగిన మైకంలో సరదాగా చేసిన పని ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఏడుగురు స్నేహితులు మహారాష్ట్రలోని పర్యాటక ప్రదేశం అంబోలీ ఘాట్‌కు విహారయాత్రకని వెళ్లారు. అందరూ సరదాగా మందు కొట్టారు. అందులో ఇద్దరు కిక్కు కోసం మందు కొడుతూ బ్రిడ్జి రెయిలింగ్‌పై సాహసకృత్యాలకు దిగారు. అక్కడే ఉన్న స్నేహితులు వారిని ఆపే ప్రయత్నం చేయకుండా వీడియో తీశారు.  మైకంలో ఉన్న ఆ యువకులు రైలింగ్‌ అవతలి వైపు చేతులు ఊపారు. తోటి స్నేహితులు ఎంత వారించినా వినలేదు. పట్టు తప్పడంతో ఇద్దరు యువకులు  బ్రిడ్జి పైనుంచి  2000 అడుగుల లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఇమ్రాన్‌ గరాడీ, ప్రతాప్‌ రాథోడ్‌లు కొల్హాపూర్‌లోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. యువకులు లోయలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

పల్లె జీవితం గొప్పగా ఉండాలి: సీఎం కేసీఆర్

మేడ్చల్ : పల్లె జీవితం గొప్పగా ఉండాలని, లక్ష్మాపూర్ లో లక్ష్మీదేవి తాండవించాలని సీఎం కేసీఆర్ అన్నారు. లక్ష్మాపూర్ గ్రామాభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రేపు సాయంత్రంలోగా అన్ని అభివృద్ధి పనులకు జీవోలు ఇస్తామన్నారు. మహిలల కోసం ప్రత్యేకంగా మహిళా భవన్ విలేజ్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామన్నారు. ఆరు నెలల్లో అన్ని పనులు పూర్తి కావాలని తెలిపారు.

'గరగపర్రు దళితులకు న్యాయం చేయకపోతే మరోసారి ఉద్యమం'

ప.గో: గరగపర్రులో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పై అఖిలపక్షం ఆధ్వర్యంలో భీమవరంలో సంఘీభావ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు మధు, రామకృష్ణ పాల్గొన్నారు. గరగపర్రు దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని, 5 రోజుల్లో గరగపర్రు దళితులకు న్యాయం చేయకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

'ప్రతిపక్ష నేత కాదని ప్రతినాయకుడినని నిరూపించుకున్నారు'

హైదరాబాద్: జగన్ తాను ప్రతిపక్ష నేత కాదని ప్రతినాయకుడినని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వంచన, విశ్వసనీయత, ధర్మం, అధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు. ఏపీని మరో బీహార్ గా మార్చేందుకు వైసీపీ ప్రయత్నం చేసిందని, సీఎం పై జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనించాలన్నారు.

16:57 - August 4, 2017

కృష్ణా : విజయవాడలో కలకలం సృష్టిస్తున్న మహిళా డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ మూడు రోజులుగా కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు విద్యాసాగర్‌తో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యాసాగర్‌ను విచారిస్తే తమ కుమార్తె ఆచూకీ తెలుస్తుందని సూర్యకుమారి తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం వీడియోలో చూద్దాం...

గుజరాత్ లో రాహుల్ గాంధీ కారు ధ్వంసం

గుజరాత్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కారును ధ్వంసం చేశారు. బీజేపీ పార్టీకి చెందిన గూండాలు రాహుల్ కారును ధ్వంసం చేసిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న‌ది. గుజ‌రాత్‌లోని భ‌న‌స్‌కాంతా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నిన్న అస్సాంలో ప‌ర్య‌టించిన రాహుల్ ఇవాళ‌ గుజ‌రాత్‌, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లోని వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. కారుపై రాళ్ల‌తో దాడి చేసి కిటికీల‌ను ప‌గుల‌గొట్టారు. ఇది అవ‌మాన‌క‌ర‌మైన దాడి అని కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధి సుర్జేవాలా ట్విట్ట‌ర్‌లో ఆరోపించారు.

డెత్ సర్టిఫికెట్ కు ఆధార్ తప్పని సరి: కేంద్రం

హైదరాబాద్ : డెత్ సర్టిఫికెట్ కు ఆధార్ కార్డు తప్పని సరి అని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో ఆగని ర్యాగింగ్

అనంతపురం: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఆగలేదు. ఫస్టియర్ విద్యార్థి పై సీనియర్లు దాడి చేశారు. విద్యార్థి తలకు, మెడకు గాయాలయ్యాయి. గత వారం రోజులుగా సీనియర్ల ర్యాగింగ్ కొనసాగుతోంది. ర్యాగింగ్ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

16:36 - August 4, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నా చౌక్‌ను రద్దు చేయడం ద్వారా కేసీఆర్ దొరతనాన్ని బయటపెట్టారని తమ్మినేని ఆరోపించారు. రైతు కూలీ పోరాట సమితి నాయకులు శ్రీనివాసరెడ్డి, అరుణోదయ నాయకుడు యాదగిరిలను అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో తెలియట్లేదని.. ఇలా అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్న కార్యకర్తలకు తెలంగాణలో రక్షణ లేదని విమలక్క విమర్శించారు.

 

కేశవరానికి రూ.12 కోట్లు :సీఎం కేసీఆర్

మేడ్చల్ : శామీర్‌పేట మండలం కేశవరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించారు. కేశవరం గ్రామసభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. సర్పంచ్, జేసీని అడిగి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 12 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అవసరమైతే మరో రూ. 12 కోట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కేశవరం, లక్ష్మాపూర్ గ్రామ సమస్యలు తీరుస్తామని చెప్పారు సీఎం. గ్రామస్థులు రూ. 10 కోట్ల పనులు అడిగారు.. రూ. 12 కోట్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధి పనుల కోసం శనివారం మధ్యాహ్నం కల్లా జీవోలు ఇస్తామని చెప్పారు.

16:28 - August 4, 2017

చిత్తూరు : వివాదాస్పద నిర్ణయాలతో టీటీడీ పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఖానస ఆగమ విరుద్ధంగా వెండివాకిలికి ఇనుపమెట్లు ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. ఇనుపమెట్లపైనుంచే భక్తులను వెలుపలికి పంపిస్తున్నారు. మొత్తం తిరుమల ఆలయం మూడు ప్రాకారాల్లో నిర్మితం కాగా.. ఇందులో మహాద్వారగోపురం, వెండివాకిలి, ఆనందనిలయం.. ఉన్నాయి. వీటిలో రెండో ప్రాకారమైన వెండివాకిలిని 12వ శాతబ్దంలో నిర్మించారు. స్వామిని దర్శించుకున్న భక్తులు వెండివాకిలి నుంచే బయటికి వస్తారు. అయితే ఇది ఇరుకు ఉండటంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతో స్వామివారి ఆనందనిలయం కంటే ఎత్తులో ఇపుడు ఇనుప మెట్లు నిర్మించడం వివాదాస్పదంగా మారింది. ఇది ఆగమశాస్త్ర విఉద్ధమని పండితులు అంటున్నారు. అయితే టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాత్రం అత్యవసర పరిస్థితుల్లో  మాత్రమే ఉపయోగించడానికి ఈ ఇనుప మెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. 

 

టిఆర్ ఎస్ నేత యాకయ్య హత్య కేసులో 6గురు అరెస్ట్

మహబూబాబాద్ : టీఆర్‌ఎస్ నేత యాకయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. 10 వేలు, తుపాకీ, 2 సెల్‌ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో జూన్ 28న యాకయ్య హత్యకు గురైన విషయం విదితమే.

15:38 - August 4, 2017

హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపు వాంతులు చేసుకోవడంతో కలకలం రేగింది. టిడిపిలో ఉన్న తుమ్మల టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అనంతరం సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రోడ్లు, భవనాల శాఖకు ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. శుక్రవారం మంత్రి తుమ్మల ఆరోగ్యం విషమించింది. రక్తపు వాంతులవడంతో ఆయన్ను యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన కార్తి చిదంబరం..

చెన్నై : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఇమ్మిగ్రేషన్ బ్యూరో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ సర్క్యులర్‌ను జారీ చేసేందుకు అధికార పరిథి లేకపోయినప్పటికీ, నిరంకుశంగా జారీ చేశారని ఆరోపించారు. దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ జీ రాజగోపాలన్ స్పందిస్తూ ఈ సర్క్యులర్ జారీ అయిందా? లేదా? అనే అంశంపై సమాచారాన్ని సేకరించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణ ఈ నెల 7న జరుగుతుందని హైకోర్టు ప్రకటించింది.

15:21 - August 4, 2017

గ్రహణాలు..వచ్చాయంటే చాలు చాలా మంది నియమాలు పాటిస్తుంటారు..ఆహారం తినరు..నీళ్లు తాగరు..ఇల్లు శుద్ధి చేసే వరకు పనులు అస్సలు ముట్టరు..ముఖ్యమైన పనులు ఉంటే వాటిని అటకెక్కిస్తారు..గర్భిణీలకైతే తెగ కండీషన్ లు పెట్టేస్తుంటారు..చాలా మంది ఏంటా గ్రహం..ఇవేంటా నిబంధనలు..అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

ఆగస్టు 7...సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ తేదీపై తెగ వార్తలు వస్తున్నాయి. ఆ రోజున రాఖీ పండుగ ఉన్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఆ రోజున చంద్ర గ్రహణం కూడా వస్తోంది. గ్రహణ సమయంలో ఎన్నో నియమ నిబంధనలు పాటించాలని పెద్దలు చెబుతుండడం తెలిసిందే. ఆయా గ్రహణాల్లో అది చేయకూడదు..ఇది చేయకూడదు..అలా ఉండాలి..ఇలా ఉండాలి అంటూ నిబంధనలు పెట్టేస్తుంటారు. కొంతమంది ఆచరిస్తుండగా మరికొంతమంది పట్టించుకోరు.

పెద్దవాళ్లు పాటించడం..నమ్మడం ఒక కారణమైతే, చిన్నప్పటి నుండి మనకు పెద్దవాళ్లు చెప్పడం..వాటిని కొంతమంది పాటించడం చేస్తుంటారు. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవని, ఆరోగ్య ప్రదానమైనవని చెబుతుండడంతో కొంతమందిలో భయం..అపోహ పెరిగిపోతుంటాయి. దీనితో చాలా మంది ఆచరించడమే మేలు అని భావిస్తుంటారు. ఈసారి కూడా అదే జరుగుతోంది. ఆగస్టు 7వ తేదీన వచ్చే చంద్రగ్రహణం సందర్భంగా నిబంధనాలు పాటించాలని తెగ వార్తలు వైరల్ అయిపోతున్నాయి.

గ్రహణం సందర్భంగా ఆలయాలు కూడా మూసివేస్తుండడం తెలిసిందే. తరువాతి రోజున తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈసారి కూడా చిన్న ఆలయాలతో పాటు ప్రముఖ ఆలయాలు సైతం తలుపులకు తాళాలు పడనున్నాయి. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.

గ్రహణం సందర్భం నియమనిబంధనలు పాటించడం మూఢ నమ్మకాలని జనవిజ్ఞాన వేదిక పేర్కొంటుండడం తెలిసిందే. భోజనాలు చేయవద్దని..బయటకు వెళ్లరాదని..అపోహలు సృష్టిసున్నారని పేర్కొంటోంది. భోజనాలు చేయడం వల్ల ఏమీ కాదని గతంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

గ్రహణం అనేది గంటలోనో...గంటల్లోనో వదిలిపోతుంది. కానీ సంస్కృతికి పడుతున్న పట్టిన....గ్రహణం మాత్రం ఎన్నాళ్ళకి వదులుతుందో ఏమిటో..

15:18 - August 4, 2017

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భార్గవ పార్థివ దేహానికి మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరుపుతారు. ఉప్పల్‌లోని భార్గవ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ప్రముఖలు భార్గవ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. 
 

 

కేశవవరంలో గ్రామసభకు సీఎం కేసీఆర్

మేడ్చల్: శామీర్ పేట మండలం కేశవవరంలో గ్రామ సభ జరిగింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

 

 

4 గంటలకు టెట్ ఫలితాలు..

హైదరాబాద్ : టీఎస్ టెట్ 2017 ఫలితాలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ విడుదల చేయనున్నారు. జులై 23న టెట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం విదితమే. పేపర్-1 పరీక్షకు 88.59 శాతం మంది, పేపర్-2 పరీక్షకు 90.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,11,647 మంది పేపర్-1 పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 12,742 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 కోసం 2,56,265 మంది రాయాల్సి ఉండగా 25,384 మంది హాజరుకాలేదు.

14:58 - August 4, 2017

తూర్పుగోదావరి : నంద్యాల సభలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజమహేంద్రవరంలో గుడా చైర్మన్ గన్ని కృష్ణ త్రీ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జగన్ తీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని గన్ని కృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష నేత తీరు రౌడీయిజాన్ని తలపిస్తోందన్నారు. జగన్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. 

 

14:53 - August 4, 2017

గుంటూరు : నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. నేరస్వభావం ఉన్న జగన్‌ అన్ని విషయాల్లో ఉన్మాదిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ సమాజం నుంచి దూరంగా పంపాలని ఆనంద్‌బాబు అన్నారు. జగన్‌.. క్రిమినల్‌ మైండ్‌తో ఆలోచిస్తున్నారని పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. 

 

మంత్రి తుమ్మలకు తీవ్ర అస్వస్థత

హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రక్తపు వాంతులతో యశోదా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

పైబర్ నేరాలకు పాల్పడుతున్న 7గురు అరెస్ట్

హైదరాబాద్: సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు నైజీరియన్లు, ఇద్దరు ఇండియన్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

టిడిపి కి రాజీనామా చేసిన అన్నా వెంకటరాంబాబు

ప్రకాశం: గిద్దలూరులో టీడీపీకి షాక్ తగిలింది. టిడిపికి అన్నా వెంకటరాంబాబు రాజీనామా చేశారు. పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి నరికి చంపారు

వరంగల్ : హన్మకొండలో పెద్దగమ్మగడ్డలో హత్య జరిగింది. వ్యక్తి కళ్లలో కారంచల్లి దుండగులు నరికి చంపారు. స్కూల్ లో పిల్లలకు టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తిని మెడ కోసి గుర్తు తెలియని వ్యక్తు చంపారు.

కేసీఆర్ పిచ్చి పరిపాలన చేస్తున్నారు: మర్రి శశిధర్ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పిచ్చి పరిపాలన చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. సీఎం నిరుంకుశ పాలనపై ప్రజలు తిరగబడతారు అని హెచ్చరించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. టిఆర్ ఎస్ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోతోందన్నారు. జింఖానా గ్రౌండ్ ను ఏ కట్టడానికి అడుగుతున్నారో సీఎం కు స్పష్టత లేదని, సీఎం వ్యక్తిగత ప్రయోజనం కోసమే కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం అని మర్రి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: కర్నె

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టిఆర్ ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. జానారెడ్డితో సహా అందరూ ముక్కు నేలకు రాయలి, విపక్షాలు ఎలా పడితే అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కర్నె ఆరోపించారు. మీరు చేసే పనులను బట్టే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. కాంగ్రెస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని కర్నె ఎద్దేవా చేశారు.

14:01 - August 4, 2017

వంటిల్లు..భోజనాలు సిద్ధమయ్యేది ఇక్కడే. ఆరోగ్యకరమైన వంటకాలు చేసుకోవాలని పలువురు సూచిస్తుంటారు. వంటింట్లో ఉన్న కొన్ని వస్తువులతో ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు.

 • వెల్లుల్లిలో విటమిన్స్..అయోడిన్..సల్ఫర్..ఆంటీ యాక్సిడెంట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి.
 • కొలెస్ట్రాల్‌ను కరిగించి ఒబిసిటీని దూరం చేస్తుంది. అజీర్ణం, జలుబు, చెవు నొప్పి, గ్యాస్ట్రిక్, మొటిమలు కూడా దూరమౌతాయి.
 • వెల్లుల్లి పేస్టును చర్మంపై..మొటిమలు..అలర్జీలపై రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 • రక్తనాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. రక్తపోటు ఉన్న వారు రోజు రాత్రి నిద్రించేముందు వెల్లుల్లిని పాలతో ఉడికించి కాస్త చల్లబడాక తాగాలి.
 • వెల్లుల్లి రసాన్ని మోకాలికి రాస్తే కీళ్ల నొప్పుల సమస్య తీరే అవకాశం ఉంది.
 • వెల్లుల్లిని ఆహారంలో ప్రతి రోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
 • వెల్లుల్లి రసాన్ని చెవుల్లో ఐదారు చుక్కలు పోస్తే చెవునొప్పి నయం అవుతుంది. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
13:54 - August 4, 2017
 • ప్రతి రోజు కనీసం రెండు..మూడుసార్లు గ్రీన్ టీ తాగండి. ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. జీర్ణప్రక్రియ వేగవంతమై ఉల్లాసంగా ఉండేలా గ్రీన్ టీ దోహదం చేస్తుంది.
 • మెంతులను బాగా నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే చండ్రు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 • చుండ్రు నివారణకు తరచూ షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ పూర్తిగా వదిలే వరకు మంచినీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. షాంపూ పూర్తిగా వదలకపోతే చుండ్రు సమస్య కొనసాగుతుంది.
 • భోజనానికంటే ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వు తగ్గుతుంది. రోజూ సూప్ తాగడం..మితహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
 • తలపై శిరోజాలు ఎక్కువ సేపు తడిగా ఉంటే చుండ్రు సమస్య పూర్తిగా పోదు. శిరోజాలు పూర్తిగా ఆరిపోయాక నూనె రాయం..జడ వేయడం చేయాలి.
 • కోడిగుడ్డులోని తెల్లటి సొనలో కొన్ని నీల్లు పోసి జుట్టుకు బాగా పట్టించాలి. కొద్దిసేపటి తరువాత మంచినీళ్లతో తలస్నానం చేయాలి. 

జోధ్ పూర్ కోర్టు కు సల్మాన్ ఖాన్

జోధ్‌పూర్: అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన్న కేసులో బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇవాళ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఈ కేసులో స‌ల్మాన్‌ను నిర్దోషిగా కోర్టు పేర్కొన్న‌ది. అయితే 20 వేల బెయిల్ బాండ్‌పై సంత‌కం చేయాల్సి ఉన్న కార‌ణంగా స‌ల్మాన్ ఇవాళ కోర్టుకు వ‌చ్చారు. అక్ర‌మ ఆయుధాలు క‌లిగి ఉన్న స‌ల్మాన్‌పై 1998 అక్టోబ‌ర్‌లో కేసు న‌మోదు అయ్యింది.

13:47 - August 4, 2017

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ పనులు అరకొరగా సాగుతున్నాయి. వ్యయాలు మాత్రం అంచనాలను మించిపోతున్నాయి. ప్రస్తుతం పోలవరం అంచనా వ్యయం 60వేల 431 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రాజెక్ట్‌ పనుల కూడా ఆలస్యంగా సాగుతున్నాయి. దీంతో పనుల జాప్యంపై కేంద్రం .. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అలాగే ప్రాజెక్ట్‌ కోసం గతంలో విడుదల చేసిన నిధులు ఖర్చుపై...స్పష్టమైన నివేదికలు పంపాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు పంపిన నివేదికల్లో కేంద్రం లోపాలు ఎత్తిచూపడంతో .. రాష్ట్ర ప్రభుత్వం ఖంగుతిన్నది. ఈ తరుణంలో...పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం పెరుగుతున్న కారణంగా... మరిన్ని నిధులు కావాలంటూ.. రాష్ట్రం ....కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమైంది. ప్రాజెక్ట్‌ నీటి పారుదల విభాగానికి 48వేల 231 కోట్ల 74 లక్షలు అవసరమంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని చూస్తోంది. కానీ పోలవరానికి నిధుల విడుదల చేసే విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

పరిహారం చెల్లింపులో వ్యత్యాసాల
అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి.. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులో ఉన్న వ్యత్యాసాలపై కూడా పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 1,61,857 ఎకరాల భూమిని సేకరించాలి. ఇప్పటికే 4వేల 115కోట్ల 34లక్షలను పరిహారంగా చెల్లించి 97వేల 269.58 ఎకరాలను సేకరించారు. అయితే పోలవరం రిజర్వాయర్‌లో ముంపునకు గురయ్యే భూమికి ఎకరం లక్ష రూపాయల నుంచి 9 లక్షల వరకు పరిహారంగా చెల్లించారు. కుడి కాలువ భూ సేకరణలో వీరవల్లిలో ఎకరానికి 52 లక్షల 90వేల చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఎకరాకు 44లక్షల 90 వేల చొప్పున, ఎడమ కాలువ భూ సేకరణలో తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం ఆరెంపూడిలో ఎకరానికి 18 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించి భూ సేకరణ చేశారు. దీనిపై పీపీఏ అభ్యంతరం తెలిపింది.

అంచనా వ్యయాలపై స్పష్టత కరవు
భూ సేకరణకు సహకరించకుండా కుడి కాలువ పనులకు అడ్డు తగులుతూ 2006లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులకు ఒకలా... మిగతా రైతులకు మరో విధంగా పరిహారాన్ని చెల్లించడాన్ని ఎత్తిచూపింది. అలాగే మిగిలిపోయిన 62వేల 455.33 ఎకరాల భూమికి 7వేల 331 కోట్లు అవసరమవుతాయని ఏ ప్రాతిపదికన అంచనా వేశారో తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పోలవరం ప్రాజెక్ట్‌లో మునిగిపోయే 371 గ్రామాలకు చెందిన కుటుంబాలకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు 20వేల 678 కోట్లు అవసరమని పంపిన ప్రతిపాదనలపైనా అనుమానం వ్యక్తం చేసింది.అసలు పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాలపై స్పష్టత ఉండడం లేదని స్థానిక నేతలు అంటున్నారు. ఇప్పటికైనా.. వీలైనంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా... ప్రాజెక్ట్‌ అంచనా వ్యయాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుద్యం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ కోసం మరిన్ని నిధులను కేంద్రం విడుదల చేస్తోందా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది.  

13:45 - August 4, 2017

కరీంనగర్ : మనుగడ కోల్పోతుందనే భయంతో కాంగ్రెస్‌ పార్టీ చిన్న విషయాలను సైతం రాద్ధాంతం చేస్తుందని మంత్రి ఈటెల రాజేందర్‌ విమర్శించారు. మెడికల్ కళాశాలను రద్దు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నేతలే ఆమరణ దీక్ష చేస్తామనడం సరికాదని అన్నారు. అలాగే 2018 జూలై నాటికి మేడిగడ్డ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రివర్స్‌ పంపింగ్‌ సిస్టం ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్‌ను నింపుతామన్నారు.

13:44 - August 4, 2017

మహబూబునగర్ : జిల్లా జడ్చర్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.. ఏసీటీవో సురేందర్‌గౌడ్‌ ఇంట్లో సోదాలు చేస్తున్నారు.. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు జరుపుతున్నారు.. సూర్యాపేట జిల్లా మోతెలో సురేందర్‌గౌడ్‌ కుమారుడు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ ఇంట్లోనూ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.. సోదాల్లో సురేందర్‌ గౌడ్‌కు జడ్చర్లలో రెండు ఇళ్లు, ఒక ప్లాట్‌, కొడుకు శ్రీకాంత్ పేరుమీద నాలుగు ప్లాట్లు, భార్యపేరుమీద రెండు ప్లాట్లు, కూతురుపేరుమీద ఒక ప్లాట్‌ ఉందని గుర్తించారు.. స్టేట్‌బ్యాంక్‌లో లాకర్‌ను తెరవాల్సిఉందని ఏసీపీ డీఎస్పీ తెలిపారు.

13:42 - August 4, 2017

విజయవాడ : నంద్యాల సభలో వైఎస్‌ జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని, టిడిపి యువనేత దేవినేని అవినాష్‌, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్‌ ప్రతి పక్షనేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నాడని అవినాష్‌ ఆరోపించారు.

 

13:41 - August 4, 2017

హైదరాబాద్ : నిన్న మీడియాతో మాట్లాడిన హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగులను సచివాలయంలోకి రాకుండా ఎంఎన్ఆర్ కాంట్రాక్టర్‌ అడ్డుకున్నారు. విధుల్లోకి రాకుండా సచివాలయం గేట్‌ ముందే నిలిపివేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్లు...విమర్శలు

తిరుమల: శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి వద్ద ప్రహరి మీదుగా ఇనుప మెట్లను టిటిడి ఏర్పాటు చేస్తున్నది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆలయంలో మార్పులు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేందకు వీలుగా ఇనుప మెట్లు ఏర్పాటు చేస్తున్నామని టిటిడీ వివరణ ఇచ్చింది. ఆగమ పండితుల అభిప్రాయం తీసుకొని మార్పులుచేస్తున్నామని టిటిడి ఈవో పేర్కొన్నారు.

  13:40 - August 4, 2017

  పెద్దపల్లి : జిల్లా మంథని పట్టణంలోని హన్‌మాన్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు అగ్నికి ఆహుతయ్యాడు. రాపెల్లి కాశి విశ్వనాథ్ ఆరవ తరగతి చదువుతున్నాడు. గత 3 రోజుల క్రితం తన అమ్మమ్మ ఇంట్లో ఓ టీవీ చానెల్‌లో వచ్చిన రియాలిటీ షో చూశాడు. గ్యాస్‌ నూనె నోట్లో పోసుకొని పైకి ఊది అగ్గిపుల్ల వెలిగించాడు. దీంతో మంటలు శరీరమంతా వ్యాపించాయి. విశ్వనాథ్‌ను వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ విశ్వనాథ్‌ మృతి చెందాడు. బాలుడు పెద్దపల్లిలో ఓ ప్రైవేట్‌ హాస్టల్లో చదువుతున్నాడు. విశ్వనాథ్‌ తల్లి కుటుంబ కలహాలతో ఉరేసుకొని చనిపోయింది. దీంతో విశ్వనాథ్‌ అతని చెల్లి అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

  13:40 - August 4, 2017

  టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ తీరుపై మరోసారి చర్చ జరుగుతోంది. అభిమానులు..ఇతరులతో దురుసుగా ఉంటారని టాక్ ఉందనే సంగతి తెలిసిందే. గతంలో కూడా బాలయ్య దురుసుగా ప్రవర్తించాడనే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

  తాజాగా ఆయన 102వ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. 101వ సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా మొదలెట్టేశారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమం పలువురు ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈవెంట్ కి వ‌చ్చిన సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రుగా దేవుని చిత్ర‌ ప‌టాల‌కు కొబ్బరి కాయ‌లు కొట్టారు. 'బాల‌య్య' కూడా త‌న షూస్ విప్పి దేవుని ద‌గ్గ‌ర కొబ్బ‌రి కాయ కొట్ట‌డానికి వెళ్ళే ముందు త‌న అసిస్టెంట్ త‌లపై కొట్టి షూస్ తీయ‌మ‌ని అన్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. పలువురు దీనిని పలువురు చిలిపి పనిగా భావిస్తున్నారు. 'న‌య‌న‌తార' ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బాల‌య్య 101వ చిత్రం 'పైసా వ‌సూల్' సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. 

  అధికారిక లాంఛనాలతో భార్గవ్ అంత్యక్రియలు: పీఎస్

  హైదరాబాద్: ప్రముఖ శాస్త్ర వేత్త భార్గవ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపాలని సీఎస్ ఎస్పీ సింగ్ ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో భార్గవ అంత్యక్రియలు జరగనున్నాయి.

  సచివాలయానికే రాని సీఎంకు కొత్తసచివాలయం ఎందుకు : విహెచ్

  హైదరాబాద్: సచివాలయానికే రానీ సీఎంకు కొత్త సచివాలం ఎందుకు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి విహెచ్ అన్నారు. ప్రజలను కలవడానికి కేసీఆర్ కు తీరిక లేదు కానీ చినజియర్ ను మాత్రం రోజూ కలుస్తారు అని మండిపడ్డారు. కేసీఆర్ పెళ్లి పత్రికలు తీసుకోవడానికి తప్ప మిగతా వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని విహెచ్ ఆరోపించారు. కేసీఆర్ ఏ ఊరికెళ్తే నేనూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు చెబుతానని హెచ్చరించారు. గుజరాత్ లో ఒక్క రాజ్యసభ సీటు కోసం బిజెపి ఈడిని వాడుకుంటోందని వీహెచ్ విమర్శించారు.

  'ప్రజాస్వామ్య హక్కును కాలరాసే చర్యలు మానుకోవాలి'

  సిద్దిపేట: తాళ్లపల్లిలో నలుగురు ప్రజాసంఘాల నేతలను పోలీసులు అక్రమంగా నిర్బంధించి కోర్టులో ప్రవేశపెట్టలేదని వారిని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని తమ్మినేని వీరభద్రం, వరవరావు, విమలక్క, విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ లో పోలీసుల రాజ్యం నడుస్తోందని, వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులపై ప్రభుత్వం నిర్బంధకాండను ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య హక్కును కాలరాసే చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.

  నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్ రెడ్డి

  కర్నూలు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ వేశారు.

  12:48 - August 4, 2017

  ఆదిలాబాద్ : బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది. శ్రావణ శుక్రవారం శుభముహూర్తాన్ని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బాసర క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

  12:47 - August 4, 2017

  విశాఖ : ఇంటి ముందు చెత్తవేశాడన్న కోపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెంలో జరిగింది.. శ్రీనివాసరావు అనే వ్యక్తి రావులమ్మపాలెంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆ ఇంటి పక్కన ఉంటున్నలంక అప్పలనాయుడు కుటుంబానికి, శ్రీనివాస్‌ కుటుంబానికి చెత్త విషయంలో గొడవ జరిగింది. తమ ఇంటి ముందు చెత్త వేశాడని అప్పలనాయుడు అతని కుటుంబసభ్యులు శ్రీనివాస్‌పై రాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

  నేరెళ్ల బాధితులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

  సిద్ధిపేట: నేరెళ్ల గ్రామస్తులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి తెలిపారు. నేరెళ్ల గ్రామస్తుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిరిసిల్ల ప్రజలకు మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు రూ.10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  12:43 - August 4, 2017

  ఢిల్లీ : తమకు న్యాయం చేయాలంటూ ... ఫాతిమా కాలేజ్‌ మెడికల్‌ విద్యార్థులు..ఢిల్లీలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ కాళ్లు పట్టుకున్నారు. . ఫాతిమా కాలేజీకి వసతులు లేవని MCI అనుమతులు రద్దు చేసింది. దీనిపై విద్యార్థులు వేసిన పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. దీంతో తమకు నష్టం కలగకుండా చూడాలని విద్యార్థులు..మంత్రిని వేడుకున్నారు. అయితే కళాశాల యాజమాన్యం వల్లే విద్యార్థులు నష్టపోయారని.. కోర్టును కాదని ఏమి చేయలేని పరిస్థితి ఉందని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. కోర్టు అంగీకరిస్తే.. ప్రభుత్వ కాలేజీల్లో ఫాతిమా విద్యార్థులను చేర్చుకుని న్యాయం చేస్తామని ఆయన అన్నారు.

  12:40 - August 4, 2017

  విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో... భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుని.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు వరలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

  12:36 - August 4, 2017

  అనంతపురం : జిల్లా చిగిచర్లలో ఆటో బోల్తా పడింది.. అదుపుతప్పిన ఆటో గుంతలో పడిపోయింది.. ఈ ఘటనలో ఎనిమిదిమంది డిగ్రీ విద్యార్థులకు గాయాలయ్యాయి.. వీరందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.. డ్రైవర్‌ నిర్లక్ష్యంవల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.. ప్రమాద సమయంలో ఆటో ధర్మవరం వెళుతోంది.

   

  12:36 - August 4, 2017

  హైదరాబాద్ : రెండు రోజుల క్రితం కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భార్గవ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉప్పల్‌లోని భార్గవ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

  12:35 - August 4, 2017

  విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో... భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకుని.. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు వరలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

  జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు: మంత్రి అచ్చెన్న

  అమరావతి : జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలుషితం చేశారు. నంద్యాల ప్రజలకు భయాందోళనకు గురి చేసేలా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి చీడపరుగులు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అలాంటి వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

  కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

  జయశంకర్ భూపాలపల్లి : తాడ్వాయి మండలం నర్సింగాపూర్ గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. దీంతో 15 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడు తనుగుల రవి ఆవేదన వ్యక్తం చేస్తూ.. తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నాడు.

  జగ్గయ్యపేటలో ఉద్యోగాల పేరుతో మోసం

  కృష్ణా: జగ్గయ్యపేటలో ఉద్యోగాల పేరుతో మోసం జరిగింది. ఎన్ ఎస్ పిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సూర్యిపేట ఇరిగేషన్ ఉద్యోగి రూ. 30 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగి రామకృష్ణ, కుమారుడు నరేస్ ను జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు.

  11:57 - August 4, 2017

  పోలీసులు ఎందుకు ఉన్నరు..రక్షించడానికా..భక్షించడానికా ? మానవ హక్కులు కాపాడటానికా ? కాలరాయడానికా ? ఫ్లెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీసింగ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని పలువురు ఎండగడుతున్నారు. ఫ్లెండ్లీ పోలీసింగ్ అంటే చావబాదడమేనా ? పాలకులు ఇచ్చిన హామీలు అమలునోచుకోకపోతే ఏం చేయాలి ? ప్రశ్నించవద్దా ? ప్రశ్నిస్తే ఇలాగే చేస్తారా ? అంటూ పలువురు ప్రశ్నలు కురిపిస్తున్నారు..

  ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరగుతున్న ఆందోళనలు..ఉద్యమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రశ్నించవద్దంటూ తరిమేస్తున్నారు. ఆందోళనలో పాల్గొంటున్న వారిని లాఠీలతో పరుగెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని..ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న వాటికి పరిష్కారం చూపాలంటూ వివిధ రంగాల వారు ఆందోళన చేపడుతున్నారు. తమ వాణిని ప్రభుత్వానికి వినిపించేందుకు ఉన్న ఒక్క స్థలం (ఇందిరాపార్కు)పై కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల వ్యవహార శైలిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట జరిగిన ఆందోళనలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. ఏకంగా ఓ లేడీ రిపోర్టర్ పై ఓ పోలీసు ఉన్నతాధికారి దురుసుగా ప్రవర్తించడాన్ని మీడియా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనే కాదు..ఎన్నో ఘటనలున్నాయి.

  ఇటీవలే నేరేళ్ల ఘటనలో పోలీసులు జరిపిన దాడిని ప్రజా సంఘాలు..మేధావులు..పలు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించాయి. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. నేరేళ్ల ఘటనపై ప్రభుత్వం..పోలీసుల చర్యలను తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమంటూనే దళితులని అనే బోర్డు ఉందా ? అని కేసీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇసుక ఆదాయంపై ఉన్న ప్రేమ..శ్రద్ధ...దళితులపై ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే నాంపల్లిలో ఇంటర్ ఓపెన్ స్కూల్ విద్యార్థులు హాల్ టికెట్ల కోసం ధర్నా చేశారు. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ట్రాఫిక్ లో ముందుకు రావడంతో అక్కడే ఉన్న ఎస్ఐ యాక్టివాపై వ్యక్తి ఉండగానే బండి ఎత్తేశాడు. ఎస్ఐ తీరుపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. మిరుదొడ్డి ఎస్ఐ ఓ వికలాంగుడిపై జరిగిన దాడిపై కూడా తీవ్ర ఆగ్రహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఓ భూ వివాదంలో ఎస్ఐ జోక్యం చేసుకున్నాడని..ఈ నేపథ్యంలో వాహనంపై ఉన్న వికలాంగుడిపై దాడి చేయడం సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీసులు ఒక లంచగొండికి వత్తాసు పలుకుతూ అమాయకుడిని చితకబాదారనే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. జనగాంలో జరిగిన కులదురంహకార హత్యలో పోలీసు పాత్రపై కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులపై చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. 

  ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీనీ నిలుపుకోకుండా, అన్ని వర్గాల్లోనూ విశ్వాసం కోల్పోయిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అసహనంతో రగిలిపోతూ ప్రశ్నించిన వారిపై పోలీసులను ఉసిగొలుపుతున్నారని పేర్కొంటున్నారు.

  దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీసు వ్యవస్థ నిలిచింది. కానీ నేడు అదే వ్యవస్థలో జరుగుతున్న సంఘటనలు ఏం చెబుతున్నాయి. ప్రజలకు, సమాజానికి పోలీసు వ్యవస్థ సేవలందిస్తోంది. కానీ పలు సంఘటనలకు కారణం పోలీసులపై ఉన్న పని భారమా? లేక ప్రభుత్వ వత్తిడి వల్లనా? 

  ఉండవల్లి వర్సెస్ మందడం, వెంకటాయపాలెం, పనుమాక రైతులు

  అమరావతి: సీతానగరం వద్ద కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించేందుకు వాటర్ రిసోర్స్ మేనేజ్ మెంట్ వచ్చింది. లిఫ్ట్ నిర్మించడంతో జరిగే నష్టాన్ని బృందానికి తెలిపేందుకు ఉండవల్లి గ్రామ ప్రజలు, రైతులు వచ్చారు. కావాలనే ప్రాజెక్టును అడ్డుపడుతున్నారని ఉండవల్లి రైతులను మందడం, వెంకటాయపాలెం, పెనుమాక రైతులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరుగుతుండడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

  ప్రేమ పెళ్లి చేసుకుంటన్నందని వేటకొడవలితో దాడి చేసిన తండ్రి

  కర్నూలు : బేతంచర్లలో కూతురిపై తండ్రి రామనర్సయ్య దాడి చేశారు. ప్రేమ వివాహం చేసుకుంటానన్న కూతురి పై వేటకొడవలితో దాడి చేశాడు. కూతురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పీఎస్ తో తండ్రి రామనర్సయ్య లొంగిపోయాడు.

  డ్రగ్స్ కేసులో 5గురికి పోలీసు కస్టడి

  హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఐదుగురిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సంగీత సహా ఐదుగురు నైజీరియన్స్ ను ఎల్బీనగర్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. విచారణ లో పలు కీలక అంశాలను తెలిపినట్లు సమాచారం.

  11:14 - August 4, 2017

  కర్నూలు : జిల్లా టెలికాం ఎక్సైజ్ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమించిందంటూ కన్నకూతురిని చంపేందుకు తండ్రి యత్నం చేశాడు. కూతురు నిద్రిస్తున్న సమయంలో వేటకొడవలితో దాడి చేశాడు. కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తండ్రి రామనర్సయ్య పోలీసుల ముందు లొంగిపోయాడు. 

  11:05 - August 4, 2017

  బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురవక చాలా రోజులైంది. టాలీవుడ్ చిత్రం 'బాహుబలి 2' చిత్రం భారీగా కలెక్షన్ల రాబట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన 'ట్యూబ్ లైట్' చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బాద్ షాగా పేరొందిన 'షారూఖ్ ఖాన్' చిత్రం రికార్డులు కొల్లగొడుతుందా ? లేదా ? అనే దానిపై చర్చ జరుగుతోంది.

  బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' లెటెస్ట్ ఫిల్మ్ 'జబ్ హారీ మెటల్ సెజల్' ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 'అనుష్క శర్మ' హీరోయిన్ గా నటించింది. పంజాబ్ వ్యక్తి హారీ క్యారెక్టర్ లో షారూఖ్..గుజరాతీ అమ్మాయి సెజల్ గా అనుష్క నటించారు. ఇటీవ‌ల‌ మూవీ కి సంబంధించి పాట‌ల‌ వీడియోల‌తో పాటు టీజ‌ర్, ట్రైల‌ర్ లను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ట్రైల‌ర్ లో డైలాగ్స్ తో పాటు షారూఖ్ , అనుష్క‌ల మ‌ధ్య కెమిస్ట్రీ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింది.

  ప్రేమ‌, జీవితం, అబ‌ద్దం, థ్రిల్, ఫ్రీడం, ఫాంట‌సీ లాంటి అంశాల నేప‌థ్యంలో చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. రికార్డులతో అదరగొట్టిన 'షారూఖ్' 'చెన్నయ్ ఎక్స్ ప్రెస్' విజయం అనంతరం ఎలాంటి మెరుపులు మెరిపించలేదు. రోమాంటిక్ సినిమాతో తాను హిట్ కొట్టడం ఖాయమని 'షారూఖ్' భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి జబ్ హారీ మెటల్ సెజల్ రికార్డులు నెలకొల్పుతుందా ? లేదా అనేది చూడాలి. 

  11:04 - August 4, 2017

  హైదరాబాద్ : రెండు రోజుల క్రితం కన్నుమూసిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ పీఎం భార్గవ మృతదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో భార్గవ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉప్పల్‌లోని భార్గవ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

  11:02 - August 4, 2017

  విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రి.. భక్తులతో కిటకిటలాడుతోంది. వరలక్ష్మీ వ్రతం ఉండటంతో.. మహిళలు పెద్ద ఎత్తున దుర్గమ్మ దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు. దుర్గ గుడిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. 

  ఆన్ లైన్లో శ్రీవారి సేవా టికెట్లు...

  తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. సేవా టికెట్లను ఆన్‌లైన్లో ఉంచారు. కల్యాణోత్సవం 10875, ఊంజల్ సేవ 2900, ఆర్జిత బ్రహ్మోత్సవం 6234, వసంతోత్సవం 12470, సహస్ర దీపాలంకరణ 13775, విశేషపూజ 1500 టికెట్లు విడుదల చేశారు. ఎలక్ట్రానిక్ డిప్ విధానం కింద 10,049 టికెట్లు విడుదల చేశారు. సుప్రభాతం 7269, తోమాల 120, అర్చన 120, అష్టదళం 240, నిజపాద దర్శనం 2300 సేవా టికెట్లు విడుదల చేశారు. డిప్ ఫలితాలు ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. ఫలితం మెసేజ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీకి వస్తుంది.

   

  10:55 - August 4, 2017

  మళ్లీ శుక్రవారం వచ్చేసింది. టాలీవుడ్ లో శుక్రవారం రోజున అధికంగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. శని..ఆదివారాలు వీకెండ్ కావడంతో తమ సినిమాలకు లాభాలు వస్తాయని పలువురు దర్శక..నిర్మాతలు భావిస్తుంటారు. శుక్రవారం రోజున విడుదల చేసేందుకు చిత్ర బృందం ఆసక్తి చూపుతుంటుంది. ఎప్పటిలాగానే ఈ వారం రోజు కూడా రెండు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. 'నక్షత్రం'..'దర్శకుడు' సినిమాలు శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి.

  నక్షత్రం..
  చాలా ఏళ్ల క్రితం సరైన హిట్ లేకుండా ఉన్న వారిలో 'కృష్ణవంశి' ఒకరు. తాజాగా ఆయన 'నక్షత్రం' సినిమాతో ముందుకొచ్చారు. పోలీసు గొప్పతనం గురించి చెబుతూ కథను తెరకెక్కించారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో 'సాయి ధరమ్ తేజ' కీలక పాత్రలో కనిపించనున్నారు. 'సందీప్', 'సాయి ధరమ్ తేజ', 'కృష్ణ వంశీ' లకు 'నక్షత్రం' సినిమా విజయం కీలకంగా మారనుంది. రెజీనా..ప్రగ్యాజైస్వాల్ అందాలు ఈ సినిమాకు బోనస్ అని చెప్పాలి.

  దర్శకుడు..
  ఇక ఈ వారమే మరో సినిమా రిలీజ్ అయ్యింది. దర్శకుడిగా ఉన్న సుకుమార్ 'దర్శకుడు' సినిమాతో నిర్మాతగా మారాడు. 'కుమారి 21ఎఫ్' విజయవంతమైన చిత్రం తరువాత 'సుకుమార్' డైలాగ్స్ తో ఈ సినిమా రూపొందింది. సుకుమార్ అన్నయ్య కుమారుడు 'అశోక్' హీరోగా కనిపించనున్నాడు. పూర్తిగా ఇండ్రస్ట్రీ నేపథ్యంలో ఈ చిత్ర తెరకెక్కిందని తెలుస్తోంది. అగ్ర హీరోలతో సినిమా ప్రచార కార్యక్రమాలను సుకుమార్ నిర్వహించాడు.

  మరి ఈ రెండు చిత్రాల్లో ఏది హిట్టో..ఫట్టో కొద్ది రోజుల్లో తేలనుంది. 

  వీడని డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ మిస్టరీ

  విజయవాడ: డాక్టర్ సూర్యకుమారి మిస్సింగ్ పై మిస్టరీ వీడలేదు. సూర్యకుమారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విద్యాసాగర్ ఇంటికి సూర్యకుమారి వెళ్లిన సీసీటీవి ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యకుమారి సెల్ఫోన్, కాల్ డేటా ఆధారంగా మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ రావు ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విద్యాసాగర్ ను మాచవరం పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను విద్యాసాగరే దాచి పెట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

  10:49 - August 4, 2017

  2019లో ఎన్నికలు..ఎలాగైనా అధికారంలోకి రావాలి..మళ్లీ పగ్గాలు చేపట్టాలి..అందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు అప్పుడే పదును పెడుతున్నారు. ఎందులో ప్రజలు అసంతృప్తిగా ఉంటున్నారో వాటిపై దృష్టి పెడుతున్నారు..పలు చర్యలు..నిర్ణయాలు..తీసుకుంటూ మళ్లీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తున్నారు.

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిడిపి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికారంలోకి వచ్చిన అనంతరం పలు నిర్ణయాలు తీసుకుంది. మూడేళ్లు అయిపోతున్నాయి. కానీ ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదనే సంగతి తెలిసిందే. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై సీఎం చంద్రబాబు కసరత్తు జరుపుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన 'జన్మభూమి కమిటీ'లను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఒక్క కలం పోటుతో 12వేల కమిటీలు రద్దయ్యాయి.

  ఫ్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేయడంలో అధికారులకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించేందుకు 'జన్మభూమి కమిటీ'లు ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీల్లో నియమించిన వారు అలాగే చేయాలి కదా..కానీ అలా కాలేదు. అసలు కమిటీల్లో ఉన్నవారంతా పచ్చచొక్కాలే అంటూ నేతలు విమర్శలు గుప్పించారు. కమిటీ సభ్యుల ఎంపిక ప్రారంభం నుండే వివాదాలు స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీ అనుచరులకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఈ కమిటీలు నిష్పక్షపాతంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం లేదని ఎన్నో విమర్శలు వచ్చాయి. త్వరలోనే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తామని బాబు పేర్కొన్నారు. కానీ ఈసారి కమిటీలు సరిగ్గా పనిచేస్తాయా ? కొంపలు ముంచుతాయా అనే చర్చ జరుగుతోంది.
  ప్రజస్వామ్యాన్ని, అధికార వ్యవస్థని గౌరవించేలా వ్యవహరించడం ఉత్తమం.

  ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం...

  జమ్ముకశ్మీర్: అనంతనాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన బలగాలకు ముగ్గురు ఆగంతకులు ఎదురుపడ్డారు. ఎన్‌కౌంటర్ నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకోగా వారికోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

  10:48 - August 4, 2017

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ లో వాడిన భాషపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ ఎత్తుతున్నాయి. విపక్షాలు...కమ్యూనిస్టులు..నవ తెలంగాణ పత్రికపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మేధావులు..కమ్యూనిస్టు నేతలు స్పందిస్తున్నారు. సంస్కారహీనమైన భాష అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. విమర్శలకు సరియైన విధంగా జవాబు ఇవ్వాల్సింది పోయి ప్రతిదాడి చేయడం కరెక్టు కాదని..ఆయనలో ఒకింత భయం..అసహనం మొదలైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  కమ్యూనిస్టులనుద్ధేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు అత్యంత గర్హనీయమని, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో నాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఘన చరిత్ర కమ్యూనిస్టులకుందని సీపీఎం నేతలు పేర్కొంటున్నారు. మహత్తర చరిత్ర గల కమ్యూనిస్టునుద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని..దిగజారుడుతనాన్ని తెలియచేస్తున్నాయని విమర్శిస్తున్నారు. ప్రెస్ మీట్ లో అసహనాన్ని మొత్తం వెళ్లగక్కాకరని, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిఘటన..ప్రతిస్పందన అవసరమని మేధావులు పేర్కొంటున్నారు. తెలంగాణలోని భూ స్వామ్య వర్గాల పదజాలంలోంచి వచ్చినవని, వీటిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిస్తున్నారు. నిరంకుశ పాలకులను ఎదిరించి పోరాడుతున్న కమ్యూనిస్టుల త్యాగాల ముందు ఆయన త్యాగమెంత అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
  ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శల జడి వానపై గులాబీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

  చట్టానికి లోబడే పాదయాత్రలు చేపట్టాం: ముద్రగడ

  తూ.గో: చట్టానికి లోబడే పాదయాత్రలు చేస్తున్నామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ రోజు కూడా పాదయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. హైవే పై, బెంజిసర్కిల్ లో చంద్రబాబు సభలు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. బంద్ లు, ధర్నాల కోసం ఉన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్ సాకుతో పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని ముద్రగడ మండిపడ్డారు.

  జడ్జర్ల ఏసీటీవో సురేందర్ గౌడ్ ఇంట్లో ఏసీబీ సోదాలు...

  మహబూబ్ నగర్ : జడ్జర్లలో ఏసీటీవో సురేందర్ గౌడ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జడ్జర్ల, మహబూబ్ నగర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా మోతెలో సరేందర్ గౌడ్ కుమారుడు ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఇంట్లో, మహబూబ్ నగర్ లో అల్లుడు మురళీధర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

  గుండె పోటుతో పినపాక తహసీల్దార్ మృతి

  భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సింగరేణి స్టేడియం గ్రౌండ్‌లో వాకింగ్ చేస్తున్న పినపాక తహసీల్దార్ ప్రసాదరావు(57) కుప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన సింగరేణి ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రసాదరావు మరో రెండు నెలల్లో రిటైర్డ్ కానున్నారు.

  తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

  తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.

  కాసేపట్లో భార్గవ అంత్యక్రియలు..

  హైదరాబాద్ : సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేసిన భార్గవ పార్థీవ దేహానికి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప్పల్ నుండి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రెండు రోజుల క్రితం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

  ముద్రగడను అడ్డుకున్న కాప్స్..

  తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటి నుండి బయటకు రాగానే అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..ముద్రగడ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ముద్రగడను నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. 

  మరో హిజ్బుల్ ఉగ్రవాది హతం..

  జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. హిజ్బుల్ ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు పరారయ్యారు.

   

  చెత్తవేశాడని రాళ్లతో కొట్టి చంపేశారు..

  విశాఖపట్టణం : సబ్బవరం మండలం రావులమ్మపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు చెత్తవేశాడనే కారణంతో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి పక్కింటి వారు చంపేశారు. 

  చట్టాలు ఉల్లంఘిస్తోంది సర్కారే - ముద్రగడ..

  తూర్పుగోదావరి : చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నామని, ప్రభుత్వమే చట్టాలు ఉల్లంఘిస్తోందని కాపు ఉద్యమ నేత ముద్రగడ మండిపడ్డారు. హైవేపై, బెంజి సర్కిల్ లో చంద్రబాబు సభలు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్ సాకుతో పాదయాత్రను అడ్డుకోవడం సరికాదన్నారు. 

  ఇంటి నుండి బయటకొచ్చిన ముద్రగడ..

  తూర్పుగోదావరి : కాపు ఉద్యమనేత ముద్రగడ మరోసారి ఇంటి నుండి బయటకు వచ్చారు. చలో అమరావతికి పాదయాత్ర చేసేందుక ప్రయత్నించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. 

  ఏసీటీవో ఇంటిపై ఏసీబీ దాడులు..

  మహబూబ్ నగర్ : జడ్చర్లలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీటీవో సురేందర్ గౌడ్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. జడ్చర్ల, మహబూబ్ నగర్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

  వాకింగ్ చేస్తున్న తహశీల్దార్ మృతి..

  భద్రాద్రి : కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో వాకింగ్ చేస్తూ పినబాక తహశీల్దార్ ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందాడు. 

  బెల్లంపల్లిలో దారుణం

  మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చన్నిబూదలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దశరథం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి భూవివాదమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. 

  10:04 - August 4, 2017

  మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చన్నిబూదలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దశరథం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి భూవివాదమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నింధితులు బాపు, అక్ష్మి సంజీవ్ పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

  09:08 - August 4, 2017

  మంచిర్యాల : జిల్లా బెల్లంపల్లి మండలం చన్నబూదలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో దశరథం అనే వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి భూవివాదమే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నింధితులు బాపు, అక్ష్మి సంజీవ్ పరారీలో ఉన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

  08:35 - August 4, 2017

  గాలే : చటేశ్వర్‌ పుజారా....ట్రెడిషనల్‌ ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉన్నాడు. టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్‌ శ్రీలంక సిరీస్‌లో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాణిస్తున్నాడు.గాలే టెస్ట్‌లో సెంచరీలో చెలరేగిన పుజారా....కొలంబో టెస్ట్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. ఆడుతున్న 50వ టెస్ట్‌లోనూ సెంచరీ నమోదు చేసి రికార్డ్‌ల మోత మోగించాడు.తొలి రోజు ట్రేడ్‌ మార్క్‌ ఇన్నింగ్స్‌తో మరోసారి భారత్‌ను ఆదుకున్నాడు.అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా క్రీజ్‌లో పాతుకుపోయాడు.రహానేతో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం జోడించిన పుజారా...టెస్టుల్లో 13వ సెంచరీ నమోదు చేశాడు.

  4వేల పరుగుల మైలురాయి
  164 బంతుల్లో సెంచరీ మార్క్‌ దాటిన పుజారా...ఆ తర్వాత కూడా పుజారా ఏ మాత్రం తడబడలేదు. ఇదే ఇన్నింగ్స్‌లో 36 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద పుజారా టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయి సైతం అధిగమించాడు.ః50వ టెస్ట్‌లో సెంచరీ చేసిన అతి కొద్ది మంది బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో పుజారా చోటు దక్కించుకున్నాడు.టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 4వేల పరుగుల మార్క్‌ దాటిన భారత బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో పుజారా రెండో స్థానంలో నిలిచాడు. 84 ఇన్నింగ్స్‌లో 4వేల పరుగుల మైలురాయి అధిగమించిన చటేశ్వర్‌...మాజీ క్రికెట్‌ దిగ్గజాలు సునీల్ గవాస్కర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌గా రికార్డ్‌ల మోత మోగిస్తోన్న పుజారా...ఇదే స్థాయిలో చెలరేగితే టీమిండియాకు తిరుగుండదు.సుస్థిరతకి కేరాఫ్‌ అడ్రెస్‌లా మారిన పుజారా...ట్రెడిషనల్‌ టెస్ట్‌ ఫార్మాట్‌లో మరిన్ని రికార్డ్‌లు బద్దలు కొట్టడం ఖాయం.

   

  08:34 - August 4, 2017

  హైదరాబాద్ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విద్యార్థి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. డ్రగ్స్‌ మత్తులో భవనంపైనుంచి కిందపడి ఓ విద్యార్థి మృతిచెందాడన్న ఆరోపణలొస్తున్నాయి.. గత నెల 31న సికింద్రాబాద్‌ మెట్టుగూడలో విద్యార్థి మెట్లపైనుంచి జారిపడ్డాడు.. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడు.. అయితే తల్లిదండ్రుల ఒత్తిడితో పోస్ట్‌మార్టం చేయకుండానే మృతదేహం అప్పగించారన్న వార్తలొస్తున్నాయి.. ముందు మత్తులో విద్యార్థి ప్రమాదానికి గురయ్యాడన్న తల్లిదండ్రులు... ఆ తర్వాత మాట మార్చారని ప్రచారం జరుగుతోంది.. తమ కొడుకు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవంటూ మృతదేహాన్ని తీసుకువెళ్లారని.... ఆ వెంటనే గుట్టుచప్పుడుకాకుండా దహనసంస్కారాలు చేశారని ఆరోపణలొస్తున్నాయి.

  08:08 - August 4, 2017

  ప్రకాశం : జిల్లా కనిరిగి మండలం కాశిరెడ్డి నగర్ లో రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లిబృందం బస్సు ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి తరలించారు. ఒంగోలు నుంచి వెలిగొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

  నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీల భేటీ

  ఢిల్లీ : నేడు సాయంత్రం 5గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలు భేటీ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సిన విధానం, పార్లమెంట్ సమావేశల్లో అనుసరించాల్సిన వ్యూహం చర్చించనున్నారు.

   

  నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం పర్యటన

  మేడ్చల్ : జిల్ల శామీర్ పేట మండలం కేశవరం, లక్ష్మాపూర్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. గ్రామల్లో జరిగే గ్రామ సభల్లో ఆయన పాల్గొననున్నారు.

  నేడు టీడీపీ ఛలో నేరెళ్ల బస్సు యాత్ర

  సిరిసిల్ల : నేడు టీడీపీ ఆధ్వర్యంలో ఛలో నేరెళ్ల బస్సు యాత్ర చేయనున్నారు. టీడీపీ నేతలు నేరెళ్ల బాధితులను పరామర్శించనున్నారు.

  ప్రకాశం లో రోడ్డు ప్రమాదం

  ప్రకాశం : జిల్లా కనిగిరి మండలం కాశిరెడ్డినగర్ లో రోడ్డుప్రమాదం జరిగింది. ఓ పెళ్లి బస్సు ఆగివున్న లారీని ఢీకొంది. 30 మంది గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

  నేడు అగ్రి ఉడాన్ స్టార్టప్ ప్రారంభం

  ఢిల్లీ : నేటి నుంచి అగ్రి ఉడాన్ స్టార్టప్ విధానం ప్రారంభం కానుంది. వ్యవసాయ స్టార్టప్ పోత్సాహకానికి కేంద్ర కొత్త విధానం తీసుకురానుంది.

  07:31 - August 4, 2017

  ప్రభుత్వానికి ఇది కొత్త కాదని వచ్చిన కొత్తలో టీవీ9, ఎబీఎన్ ఆంధ్రజ్యోతిని నిషేధించారని, మీడియా అనేది ప్రజాస్వామ్యనికి నాలుగో స్థంభంలాంటిదని, పోలీసులు తమ విచక్షణ కోల్పోయి చివరికి మహిళలపై కూడా దాడి చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ చట్టన్ని అధికమిస్తోందని, మల్లన్న సాగర్ వద్ద సంవత్సరం పాటు 144సెక్షన్ ఉంద నిజం కాద అని సీపీఎం నేత నంద్యాల నర్సింహ రెడ్డి అన్నారు. శాంతిభద్రతలు చేయిదటిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకుంటారని, పోలీసులను ఉసుగోల్పే ప్రయత్నం చేయదని టీఆర్ఎస్ నేత సమ్మరావు అన్నారు. నేరెళ్ల ఏ శాంతభద్రతలకు భంగం కల్గిందని వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. ఖమ్మంలో రైతులకు బేడిలు ఎందుకు వేశారు, మహిళ జర్నలిస్టుపై ఏ విధంగా దాడి చస్తారు అని కాంగ్రెస్ నేత బెల్లం నాయక్ అన్నారు.

   

  07:30 - August 4, 2017

  కొందరిని కొత్త కాలం వరకు మోసం చెయోచ్చు, ప్రభుత్వం అందరిని వాగ్ధనలతో మురిపిస్తున్నరని, ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, బస్సు డ్రైవర్ జీతం 22వేల జీతం కానీ అద్దె బస్సు డ్రైవర్ జీతం 10వేలు, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీం కోర్టు చరిత్రత్మక తీర్పు ఇచ్చంది. కానీ ప్రభుత్వలు తీర్పు అములు చేయడంలేదని, అసెంబ్లీ టీఆర్ఎస్ కు బలం ఉన్న బిల్లు పెట్టకుండా కోర్టులు కొట్టివేస్తున్నాయంటూ కాలయపన చేస్తున్నారని తెలంగాణ సీఐటీయూ కార్యదర్శి సాయిబాబు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

  07:28 - August 4, 2017

  ఆదిలాబాద్ : బాసర సరస్వతిదేవి ఆలయంలో భారీ అవినీతి జరుగుతోంది. దళారులు.. ఆలయ సిబ్బంది కుమ్మక్కై... టికెట్‌ల గోల్‌ మాల్‌కు పాల్పడుతున్నారు. గుడిలో... ఒకసారి వాడిన టికెట్‌నే మళ్లీ, మళ్లీ వాడుతున్నారు.. ఆటో డ్రైవర్ల సహాయంతో.. వాడేసిన టిక్కెట్లనే ... భక్తులకు మళ్లీ విక్రయిస్తున్నారు. ఈ టికెట్‌ల ద్వారా దళారులు వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పిల్లలతో మొదటి అక్షరాలు దిద్దించే ఆలయంగా బాసర సరస్వతీదేవి ఆలయం ప్రసిద్ధిగాంచింది. భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడే తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అయితే భక్తుల విశ్వాసాన్ని కొంతమంది క్యాష్‌ చేసుకుంటున్నారు. బాసర రైల్వే స్టేషన్‌లో దిగినప్పటి నుంచే ఆటో డ్రైవర్ల సహాయంతో భక్తులకు గాలం వేసి...నకిలీ టికెట్లను విక్రయిస్తున్నారు. తాజాగా బాబు అక్షరాభ్యాసానికి బెంగళూరు నుంచి వచ్చిన ఓ భక్తుడికి చినిగిపోయిన ఓ టికెట్‌ను విక్రయించడంతో అసలు విషయం బయటపడింది. భక్తుడి ఫిర్యాదు, 10 టీవీ చొరవతో వెలుగులోకి తెచ్చిన టికెట్‌ల గోల్‌మాల్‌పై ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి వెంటనే స్పందించి...ఒకరిని సస్పెండ్‌ చేశారు. మిగిలిన వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయంలో అక్రమాలు జరుగుతున్నట్టు గతంలో చాలా ఆరోపణలున్నాయి. గతంలో వీటిపై విచారణలు కూడా జరిగాయి. అయితే అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై సరైన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారుల అండతో సాగుతున్న ఈ దందాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.  

  07:26 - August 4, 2017

  శ్రీకాకుళం : సీపీఎం ఏపీ కార్యదర్శి మధు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని బేఖాతరు చేస్తూ.. ఆయన వంశధార నిర్వాసిత ప్రాంతాలను సందర్శించారు. ఇరపాడు, పాడలి గ్రామాల్లో పర్యటించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంశధార ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పన వంటి అంశాలపై ఆరా తీశారు. పరిహారం చెల్లింపు, పునరాసం కల్పనలో జరుగుతున్న జాప్యంపై నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.వంశధార ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిర్వాసితుల ప్యాకేజి విషయంలో గడచిన రెండేళ్లుగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రెండు సార్లు నిర్వాసిత ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నా పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మధు గురువారం నిర్వాసిత ప్రాంతాలకు చేరుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కడప జిల్లా గండికోటలో మాదిరి వంశధార ప్రాంతంలో గ్రామాల్లోకి నీళ్ళు వదిలేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ ఈ సందర్భంగా మధు ఆరోపించారు. మధు పర్యటనను అడ్డుకునేందుకు పోలీసుల విఫలయత్నం చేశారు. హీరమండలం గొట్టా బ్యారేజీ వద్ద కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మధు పర్యటనను నిలిపివేశారు. 

  07:25 - August 4, 2017

  తూర్పు గోదావరి : కాపులు బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో అమరావతికి పాదయాత్ర ప్రారంభించిన ముద్రగడ పద్మనాభంను పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. గృహ నిర్బంధం ముగియడంతో ఆయన గురువారం ఉదయం పాదయాత్రకు బయల్దేరారు. అయితే పాదయాత్రతో జిల్లాలో హింస జరిగే అవకాశం ఉందంటూ ముద్రగడను కిర్లంపూడిలోని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు.పాదయాత్రను అడ్డుకోవడంపై... ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడిలో ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తామంటే అడ్డుకోవడం సరికాదని పోలీసుల తీరుపై ముద్రగడ ఫైర్ అయ్యారు.. యాత్రకు అనుమతి ఇచ్చేవరకూ తన ప్రయత్నం కొనసాగుతుందని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్‌ హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ముద్రగడ పాదయాత్రకు మళ్లీ అడ్డుకోవడంతో కిర్లంపూడిలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ముద్రగడ నివాసం వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. 

  07:24 - August 4, 2017

  హైదరాబాద్ : కాంగ్రెస్‌ పిశాచి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీవెంత అంటూ కాంగ్రెస్‌ నేతలు గులాబీ బాస్‌పై విరుచుకుపడుతున్నారు. నిన్నటిదాకా సిరిసిల్ల దళితులపై థర్డ్‌డిగ్రీ అంశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగిన ఆరోపణలు.. కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌తో తారాస్థాయికి చేరింది. తమ పార్టీపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు ముప్పేటదాటికి దిగుతున్నారు.

  హస్తం నేతలు వరుస ప్రెస్‌మీట్లు
  కేసీఆర్ వ్యాఖ్యలను హస్తం నేతలు వరుస ప్రెస్‌మీట్లు పెట్టి ఏకి పారేస్తున్నారు. సీఎం అధికార పైత్యంతో మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ప్రతిపక్షంగా మా సహనానికి కూడా హద్దులుంటాయని హెచ్చరించారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు పిశాచి అయ్యిందా అంటూ షబ్బీర్‌అలీ కేసీఆర్‌ను నిలదీశారు. తన చేతగాని తనాన్ని కాంగ్రెస్‌పై రుద్దుతున్నారని మండిపడ్డారు.విద్యుత్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కాంగ్రెస్‌ అడ్డుకుంటుందని కేసీఆర్‌ మాట్లాడడం దారుణమన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఘటనలో దళితుల ఆగ్రహంతో కేసీఆర్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు పీసీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క. ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటుందన్న కేసీఆర్‌... ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు కట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని కేసీఆర్‌.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. సీఎంగా ఉండి... చౌకబారు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. కేసీఆర్‌ తన భాష మార్చుకోకపోతే... మేము కూడా మెదలుపెడతామన్నారు. మొత్తానికి కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా అనేక అంశాల్లో ప్రభుత్వ తీరును ఖండించిన హస్తం నేతలు.... ఇప్పుడు కేసీఆర్‌నే టార్గెట్‌ చేశారు. మరీ ఈ మాటల యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి! 

  07:22 - August 4, 2017

  గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వంద చదరపు అడుగులలోపు భూమిని ఆక్రమించుకున్న దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు.. 100 అడుగుల లోపు 2013 నాటి బేసిక్‌రేటులో 7.5 శాతం, 101 నుంచి 250 అడుగుల వరకు 15 శాతం,... 251 నుంచి 500 అడుగల వరకు 30 శాతం వసూలు చేయాలని తీర్మానించారు. 500 అడుగులకు మించితే ఆక్రమణలను తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జనవరి 2016 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు బకాయి ఉన్న డీఏను జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని... సెప్టెంబర్‌ నుంచి డీఏను ఉద్యోగుల ఖాతాలో జమ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.

  39 పోస్టులు మంజూరు
  ఇక పతంజలి సంస్థ వేలం ద్వారా కొనుగోలు చేసిన ఎర్రచందనం తీసుకెళ్లే గడువును పొడిగించడంతో పాటు.. పెనాల్టీని మినహాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తిరుపతిలోని ఏపీహెచ్‌ఆర్‌డిఐ రీజినల్‌ సెంటర్‌ కోసం కొత్తగా ఆరు పోస్టులను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మత్స్యకారుల చిన్నారుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ గురుకుల పాఠశాలల్లో 13 టీచింగ్‌ పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా విశాఖ, తిరుపతి, విజయవాడలోని ఏపీ భూసేకరణ, పునరావాస, రీసెటిల్‌మెంట్‌ అథారిటీ ప్రిసైడింగ్‌ అధికారి కార్యాలయాల్లో ఒక్కొక్క యూనిట్‌లో 13 పోస్టుల చొప్పున 39 పోస్టులు మంజూరు చేసింది.

  పంటల విత్తనాలకు 75 శాతం రాయితీ
  ఇక పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతాంగానికి 53.5 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలకు 75 శాతం రాయితీ, కలుపు తీసేందుకు 500 రూపాయలు రాయితీ, పురుగుల మందుకు 500 రూపాయల చొప్పున రెండుసార్లు రాయితీ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక తిరుపతిలో ఏర్పాటు చేస్తు్న సైన్స్‌ మ్యూజియం కోసం టీటీడీకి చెందిన 71.11 ఎకరాలను ఎలాంటి షరతులు లేకుండా లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లోని భూమిని ఏపీఐఐసీకి బదలాయించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

  Don't Miss