Activities calendar

05 August 2017

22:14 - August 5, 2017

అర్ధరాత్రి సమయం... ఆ ఇల్లాలు ఒంటిరిగా లేదు.. తన పొలం వద్ద ఉంది. భర్త వెంటనే ఉన్నాడు.. తన ముగ్గురు పిల్లలతో కలిసి మాట్లాడుతుంది. ఇందులో తప్పేముంది ? కానీ అదే తప్పైంది. చీకట్లో ఆమె కనిపించింది. కనిపించిన ఆ కళ్లకు ఏమనిపించిందో...లేక ఆమె అందంగా ఉందనుకున్నారో.... 
అందులోనూ మత్తులో ఉన్నారు. ఏం పాపమో ఏమో... తప్పుచేస్తుందని అనుమానం వచ్చింది. నిలదీశారు.. హేలనగా మాట్లాడారు. అవమానించారు. ఇదంతా చూస్తున్న భర్త ఇదేంటనీ ప్రశ్నిస్తే.. చితక్కొట్టారు. ఇదంతా చీకట్లోనే..జీపు లైట్లలో జరిగిన ఘోర అవమానం. ఓ దళిత బిడ్డకు జరిగిన అన్యాయం.. ఇది చేసింది ఎవరో కాదు..ఓ పోలీసు అధికారి. ఇదీ కథకాదు..ఏ రియల్ స్టోరీ...పూర్తి వివరానలు వీడియోలో చూద్దాం...

21:52 - August 5, 2017
21:50 - August 5, 2017
21:45 - August 5, 2017

చిత్తూరు : మంచి మనుషులను రోడ్డు ప్రమాదం కాటేసింది. పైసా ఆశించకుండా అభాగ్యుల సేవలో సాగుతున్న వారిని మృత్యువు కబళించింది. చిత్తూరుజిల్లా మదనపల్లె దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెయిన్‌ దేశస్తుల మృతిపై సర్వత్రా దిగ్బ్రాంతి వ్యక్తం అవుతోంది. 
అభాగ్యులకు అండగా నిలిచారు
గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగు నింపే పనిలో సేవకుల్లా మారారు. పైసా ఆశించకుండా... సేవే పరమావధిగా పనిచేస్తున్నారు. ఎక్కడో పుట్టి.. తెలుగునేలపై అన్నార్తులు, అభాగ్యులకు కొండంత అండగా ఉండాలని నడుంకట్టారు. అనంతపురం జిల్లాలోని రూరల్‌ డెవలప్‌ మెంట్‌ ట్రస్టులో పనిచేస్తున్న స్పెయిన్‌ వాసులను రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విషాదాన్ని నింపింది. 
గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ ఆర్డీటీ 
గ్రామీణ అభివృద్ధి కోసం ఏర్పడిన స్వచ్చంద సేవా సంస్థ ఆర్డీటీ. 1969లో ఏర్పడిన ఆర్డటీని స్పెయిన్‌ దేశానికి చెందిన విన్సెంట్‌ ఫెర్రర్‌ ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాతల నుంచి విరాళాలు సేకరించి.. ఏపీ , తెలంగాణల్లోని గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతున్న  కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. పోషకాహారం, వైద్యం, విద్యలను ఉచితంగా కల్పిస్తూ.. ఎనలేని సేవలు అందిస్తోంది ఆర్డీటీ.  ఇలాంటి ఉన్నత ఆశయాల సాధనలో  సమిధలయ్యారు.  స్పెయిన్‌ పౌరుల మృతిపై సీఎం చంద్రబాబు సహా పలువురు  ప్రగాఢ సానుభూతి తెలిపారు. 
పుదుచ్చేరికి వెళుతుండగా ప్రమాదం 
ట్రస్ట్‌పనిలో భాగంగా పుట్టపర్తికి చేరుకుని అక్కడి నుంచి పుదుచ్చేరి బయలుదేరారు. ట్రావెల్‌ టెంపో వాహనంలో చిత్తూరు వైపుసాగుతున్న 12 మంది  స్పెయిన్‌ దేశస్తుల వాహనాన్ని ఎదురుగా  వచ్చిన కంటైనర్‌ లారీ వేగంగా ఢీకొట్టింది.  ఈప్రమాదంలో  డ్రైవర్‌ సహా నలుగురు అక్కడి కక్కడే  మృతిచెందగా.. ఆస‍్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. యాక్సిడెంట్‌ సమాచారం అందుకున‍్న పుంగనూరు, మదనపల్లి పోలీసులు సంఘటన స‍్థలానికి హుటాహుటిన  చేరుకున్నారు. గాయపడిన ఇద‍్దరు విదేశీ మహిళలను 108లో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతులు విన్సెంట్‌ పెరోజ్‌, ఫ్రాన్సికో పెడ్రోసా, జోసిఫా మెరాన్‌, నీపెస్‌ లోసా..గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఏడుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. 
బెంగళూరు బాప్టిస్ట్‌ ఆస్పత్రికి మృతదేహాలు 
స్పెయిన్‌ దేశస్తుల మృత దేహాలను బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్పెయిన్‌కు పంపే ఏర్పాటు చేస్తున్నారు. స్పెయిన్‌ పౌరుల మృతితో అనంతపురంలోని ఆర్డీటీ ట్రస్ట్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. 

 

21:40 - August 5, 2017

విజయవాడ : డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి అదృశ్యం కేసు విషాదాంతమైంది. కూనగుంట్ల లాకుల వద్ద ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈనెల ఒకటవ తేదీ మంగళవారం రాత్రి నుంచి సూర్యకుమారి అదృశ్యమయ్యారు. ఈమేరకు తమ కుమార్తె కనిపించడం లేదంటూ సూర్యకుమారి తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సూర్యకుమారి ద్విచక్రవాహనాన్ని రైవస్ కాల్వ పక్కన గుర్తించిన పోలీసులు.. కాలువలో గాలింపు చేపట్టారు. కూనగుంట్ల లాకుల వద్ద సూర్యకుమారి మృతదేహం లభ్యమైంది. ఆమె ఒంటిపైన ఆభరణాల ఆధారంగా డాక్టర్‌ సూర్యకుమారి మృతదేహాన్ని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సూర్యకుమారి మిస్సింగ్‌ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో.. ఆయన్ను విడిచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్‌తో ప్రేమ వ్యవహారం సానుకూలంగా సాగకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారా అన్నది తేలాల్సి ఉంది.

 

21:37 - August 5, 2017

కర్నూలు : జగన్‌ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ స్పందించింది. జగన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్‌ అధికారికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు కర్నూలు జిల్లా కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని జగన్‌కు నోటీసులు జారీ చేశారు.

 

21:27 - August 5, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. ఉత్తర కశ్మీర్‌లో అమర్‌గర్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు నిన్న అర్ధరాత్రి దాటాకా భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సిఆర్‌పిఎఫ్‌ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల నుంచి మూడు రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బందిపొరా జిల్లాలోని సంబోల్‌ ప్రాంతంలో భద్రతాబలగాల వాహనాలపై స్థానిక యువకులు రాళ్లతో దాడి చేశారు. అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు.

 

డా.సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుంది : విజయవాడ సీపీ

విజయవాడ : డా.సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందని విజవాయడ జాయింట్ సీపీ రమణ కుమార్ తెలిపారు. కాల్వలో దొరికిన మృతదేహం సూర్యకుమారిదేనని అన్నారు. జులై 31న ఇంటి నుంచి వెళ్లిన రోజే కాల్వలోకి దూకి డా.సూర్యకుమారి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతదేహం మీద ఉన్న చైన్, ఉంగరాలు,లాకెట్ ద్వారా సూర్యకుమారి అని గుర్తించామని చెప్పారు. 

21:03 - August 5, 2017

ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తో టెన్ టివి వన్ టు వన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటుందన్నారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉంటారని చెప్పారు. పార్టీ కోసం పని చేస్తా.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అధికారం కోసమే టీడీపీ, వైసీపీ పార్టీలు పుట్టాయని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలన చాలా బ్యాడ్ గా ఉందని విమర్శించారు. పలు ఆసక్తిరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:40 - August 5, 2017

సిరిసిల్ల జిల్లాల మళ్లొక యాక్సిడెంట్....కూలొళ్ళువోతున్న ఆటోను గుద్దిన లారీ, మెడికల్ కాలేజీ కోసం పొన్నం దీక్ష, కరీంనగర్ కాడ వేడెక్కిన లడాయి, గతపాలకులను పక్కన వెట్టుకున్నమంత్రి... మాజీ కాంగ్రెసోళ్లను తట్టిపోసిన హరీష్, నిందితున్ని కొట్టి సంపిన పోలీసోళ్లు.. సిరిసిల్ల జిల్లా పోలీసొళ్ల రికార్డులు, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మయ్య కథ..ఊర్లొపొంటి మట్టిఎత్కపోతున్నడట, దొంగతనం జేశి ఉత్తరం రాశిన దొంగ... నిజామాబాద్ జిల్లా కేంద్రంల గమ్మతి....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:28 - August 5, 2017

'దర్శకుడు' మూవీ టీమ్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అశోక్, హీరోయిన్ ఈషా మాట్లాడారు. దర్శకుడు సినిమా విశేషాలు తెలిపారు. షూటింగ్ విశేషాలు చెప్పారు. తమ సినీ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

డా.సూర్యకుమారి మిస్సింగ్ కేసు విషాదాంతం

విజయవాడ : డా.సూర్యకుమారి మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. కూనగుంట్ల వద్ద సూర్యకుమారి మృతదేహం లభ్యం అయింది. 

జగన్ కు షోకాజ్ నోటీసు జారీ

కర్నూలు : ఈసీ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. నంద్యాలలో చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ కు కలెక్టర్ కు ఆదేశించారు. 

 

19:55 - August 5, 2017
19:54 - August 5, 2017
19:52 - August 5, 2017

హైదరాబాద్ : ఇంతకీ ఎవరీ ఓవియా..? ఆమెకు ఎందుకింత క్రేజ్‌..? బిగ్‌బాస్‌షోలో ఎంటర్‌ కాక ముందు ఆమె పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఓవియా స్థాయి.. స్థానం ఏంటి..?  ఓవియా హెలెన్‌.. మలయాళ పొణ్ణు. కలవాణి సినిమాతో ఈమె తమిళంలో తెరంగేట్రం చేసింది. ఈమెకు సినీరంగం ద్వారా కంటే.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం ద్వారానే విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. 'బిగ్‌బాస్' షో లో జరిగిన కొన్ని ఘటనల కారణంగా, మిగతా పార్టిసిపెంట్స్ అంతా ఒక వైపు.. ఓవియా మాత్రమే మరో వైపుగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే.. తమిళ ప్రేక్షకులు, ఆమె మీద విపరీతమైన సానుభూతిని చూపిస్తున్నారు.
ఓవియా కోసమే బిగ్‌బాస్‌ చూస్తోన్న తమిళ ప్రేక్షకులు?
మిగతా కంటెస్ట్ంట్స్ అంతా కలిసి ఆమెను ఎలిమినేట్ చేయడానికి మూడు సార్లు నామినేట్ చేశారు. అయితే, ప్రతీసారి భారీగా ఓట్లు వేసి తమిళ ప్రేక్షకులు ఓవియానే గెలిపించారు.. తాజాగా, ఈ వారం కూడా ఆమె మరోసారి ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యింది.. సోషల్ మీడియాలో 'ఓవియన్స్‌' 'ఓవియా ఆర్మీ' అంటూ ఆమె కోసం ఓ ప్రత్యేక అభిమాన బృందాలు తయారయ్యాయి. వీరు ఓవియాకు ఓట్లు పడేలా భారీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. కేవలం ఓవియా కోసమే తమిళ జనాలు బిగ్‌బాస్ చూస్తున్నారనీ అంటున్నారు. 
ఓవియాకు మద్దతుగా కోలివుడ్‌ సెలబ్రిటీలు 
సగటు తమిళ ప్రేక్షకులే కాకుండా, కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. కెరీర్ మొదలుపెట్టి ఆరేడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు హీరోయిన్‌గా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. అయితే 'బిగ్‌బాస్‌' కారణంగా వచ్చిన క్రేజ్‌తో ఆమెతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం బడా దర్శక, నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారు.. తెలుగులో తరుణ్‌కు జోడీగా నటించిన లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధమవుతుండగా, తమిళంలో విలక్షణ హీరో విజయ్‌ సేతుపతికి జోడీగా నటించే అవకాశం వచ్చింది. ఇప్పటికే 'మెట్రో' హీరో శిరీష్‌ కొత్త చిత్రంలో ఓవియా హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే 'యామిరుక్క భయమే' సీక్వెల్‌లోను ఓవియాను నటింప జేయాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఓవియాకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 'బిగ్‌బాస్‌' ఇంటి నుంచి బయటకు రాగానే, ఆమె ఈ సినిమాల్లో నటిస్తారని ప్రచారం ఉంది. 

 

19:44 - August 5, 2017
19:40 - August 5, 2017

ఢిల్లీ : గుజరాత్‌ పర్యటనలో రాళ్ల దాడుల వెనక బిజెపి హస్తం ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి కార్యకర్తలే తన కారుపై దాడి చేశారని స్పష్టం చేశారు. దాడులు చేయడం మోది, ఆర్‌ఎస్‌ఎస్‌ల నైజమని పేర్కొన్నారు. దాడులకు పాల్పడ్డవారే దాడిని ఎలా ఖండిస్తారని ప్రధాని నరేంద్ర మోది నుద్దేశించి రాహుల్‌ అన్నారు. తన కారుపై ఓ కార్యకర్త పెద్ద రాయి విసిరాగా అది తన గార్డుకు తగిలిందన్నారు. 

 

19:36 - August 5, 2017

సూర్యపేట : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ ఇంటి ముట్టడికి ప్రయత్నించి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అనవసరంగా ఉత్తమ్‌ నోరుపారేసుకుంటున్నాడంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా ఉరుకోనేది లేదని హెచ్చరించారు.

 

జగన్‌ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన ఈసీ

కర్నూలు : నంద్యాలలో జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. జగన్‌ వ్యాఖ్యలపై కర్నూలు కలెక్టర్‌ను ఈసీ  వివరణ అడిగింది. జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. 

19:33 - August 5, 2017

కర్నూలు : నంద్యాలలో జగన్‌ వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. జగన్‌ వ్యాఖ్యలపై కర్నూలు కలెక్టర్‌ను ఈసీ  వివరణ అడిగింది. జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఈసీ స్పష్టం చేసింది. 

 

19:31 - August 5, 2017

కాకినాడ : ఏపీ డిప్యూటి సీఎం చినరాజప్ప జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ వారసత్వంగా వచ్చిన ఫ్యాక్షన్‌ రాజకీయాలను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. తన తాత, తండ్రి చేసినట్టే కులాలను రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను ఆపుతూ, పనులను ఆపడం కోసమే ప్రతిపక్షం పని చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. 

 

19:26 - August 5, 2017

హైదరాబాద్ : సర్దార్‌సరోవర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని సామాజిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో వందలాది గ్రామాలు నీట మునిగి పోనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నర్మదా లోయ గ్రామాల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు జరిగింది. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండానే గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని నిర్వాసితుల తరపున హాజరైన ప్రతినిధులు అన్నారు. సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్‌ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణలోని సామాజిక సంఘాలు తెలిపాయి. 

 

19:24 - August 5, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సీఐటీయూ రాష్ట్రస్థాయి రౌంటేబుల్‌ సమావేశంలో సీఎం వైఖరిని ఖండించారు. కార్మిక సంఘాలు, మీడియాపై కేసీఆర్‌ దిగజారుడు వ్యాఖలు మానుకోవాలని హితవు పలికారు. సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మెకు దిగితే పోలీసులతో అణచాలని చూస్తున్నారని కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. కార్మికసంఘాలు, మీడియాపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తే హైదరాబాద్‌లోనే పెంచారని నేతలు అన్నారు. గ్రామపంచాయతీ ,మధ్యాహ్నభోజన సిబ్బంది, ఆశవర్కర్లకు వేతనాలు పెంచలేదన్నారు. వేతానాలు పెంచాలని అడిగితే  సీఎం అహంకారపూరింతా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మిక ఉద్యమాలపై సీఎం చులకన భావం ఉందన్నారు. 

 

19:15 - August 5, 2017

తూ.గో : కాకినాడ మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం 7వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 29 నాడు పోలింగ్‌.. సెప్టెంబర్‌ 1న ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ నోటిఫికేషన్‌ వ్యవహారమే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. న్యాయస్థానాల అడ్డంకులను అధిగమించి అసలు ఎన్నికలు జరుగుతాయా.. లేదా అనే చర్చ జరుగుతోంది. ఎన్నికపై ఉత్కంఠ ఎందుకు నెలకొందిన్న అంశంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు

ఢిల్లీ : భారత 15 వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఎన్ డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు విజయం సాధించారు. 272 ఓట్ల తేడాతో వెంకయ్యనాయుడు గెలుపొంచారు. వెంకయ్యనాయుడు 516 ఓట్లు పొందారు. గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. మొత్తం 771 ఓట్లు పోల్ అయ్యాయి.

19:12 - August 5, 2017

ఢిల్లీ : భారత 15 వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై ఎన్ డీఏ అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు విజయం సాధించారు. 272 ఓట్ల తేడాతో వెంకయ్యనాయుడు గెలుపొంచారు. వెంకయ్యనాయుడు 516 ఓట్లు పొందారు. గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. మొత్తం 771 ఓట్లు పోల్ అయ్యాయి.

 

19:01 - August 5, 2017

మహబూబ్‌ నగర్‌ : తమకు మంచినీటి వసతి లేదని మహిళలు ఖాళీ బిందెలతో జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రాస్‌ వాహనాన్ని అడ్డుకున్నారు... మహబూబ్‌ నగర్‌ జిల్లా, జడ్చర్ల మండలం, పెద్దకుంటా తాండా వాసులు. తమ తాండాలో ఆరు నెలల నుండి నీళ్లు లేవని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంబడి వచ్చిన అధికారులు తాండా వాసులను పక్కకు పంపి కలెక్టర్‌ వాహనాన్ని పంపించేశారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు స్థానిక ప్రజాప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు.

 

18:59 - August 5, 2017

హైదరాబాద్ : దేశంలో మోడి నియంత పాలన సాగిస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. గుజరాత్‌లో రాహుల్‌పై దాడిని ఖండించిన ఆయన మోడి అండతోనే దాడి జరిగిందని ఆరోపించారు. జడ్‌ క్యాటగిరి రక్షణ ఉన్న రాహుల్‌కే రక్షణ లేకపోతే ప్రభుత్వం ఇంకెవరికి రక్షణ కల్పిస్తుందన్నారు. దాడులు ఇలానే కొనసాగితే సివిల్‌ వార్‌ తప్పదని మల్లు రవి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 

18:54 - August 5, 2017

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ పాదయాత్రపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. రాజకీయంగా ఎదగాలన్నా.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నా పాదయాత్ర చేసి తీరాల్సిందేనని ఆయన అన్నారు. పాదయాత్ర చేయకపోతే.. ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ట్రాఫిక్‌ జాం వంటి సమస్యలు వచ్చినా.. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

 

18:52 - August 5, 2017

కృష్ణా : విజయవాడలో డాక్టర్‌ సూర్యకుమారి అదృశ్యం కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. రైవస్‌ కాలువలో సూర్యకుమారి బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. సూర్యకుమారి కోసం ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఐదురోజులుగా సూర్యకుమారి అదృశ్యం మిస్టరీ కొనసాగుతోంది. 

 

18:50 - August 5, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. ఎంపీలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. కాసేపట్లో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ఫలితాన్ని ప్రకటించనున్నారు. 

 

18:47 - August 5, 2017

చెన్నై : ఓవియా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వార్తలు సరికొత్త చర్చను తెరపైకి తెస్తోంది. దక్షిణాదికి ఇలాంటి రియాల్టీ షోలు అవసరమా..? వీటివల్ల నిర్వాహకులు ఏమి సాధించాలనుకుంటున్నారు..? ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు. వారి నిబంధనలు, కంటెస్టెంట్‌ల మానసిక, శారీరక దౌర్భల్యాన్ని పెంచుతున్నాయా..? ఇవన్నీ ఎడతెగని ప్రశ్నలు.  
బిగ్‌బాస్‌ రియాల్టీ షో
బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో.. తెలుగు కానీ, తమిళం కానీ.. కంటెస్టెంట్‌లు ఎక్కువగా బయటకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. తొలి రెండు వారాలు బాగా నిబ్బరంగా ఉన్నవారు కూడా.. తర్వాతి రోజుల్లో ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకిలా..?
షో నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటున్న ఓవియా 
ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌ ఓవియా కూడా ఈ షో నుంచి బయటకు వెళ్లిపోవాలని చాలాకాలంగా కోరుకుంటోంది. కన్ఫెషన్‌ రూమ్‌లో కూడా బిగ్‌బాస్‌ను ఇదే విషయమై అభ్యర్థించింది. ఆమె శారీరకంగా, మానసికంగా బాగా డిస్టర్బ్‌ సహనటి గాయత్రి కూడా బిగ్‌బాస్‌ షోలోనే చెప్పారు. ఇటు తెలుగులోనూ.. జ్యోతి, మధుప్రియలు ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూసినవారే. ఇక, సంపూర్ణేశ్‌బాబు అయితే.. బిగ్‌బాస్‌హౌస్‌నుంచి బయటపడేందుకు పెద్ద యుద్ధమే చేశారు. అక్కడుంటే.. తన గుండె పట్టేసినట్లుగా.. స్వేచ్ఛను హరించినట్లు ఉందంటూ సంపూ చేసిన కామెంట్స్‌.. బిగ్‌బాస్‌ వాతావరణాన్ని తేటతెల్లం చేస్తోంది. 
బిగ్‌బాస్‌షో నుంచి ఎలిమినేషన్‌కు ఓవియా నామినేట్‌ 
ఈ క్రమంలోనే.. ఈవారం కూడా ఓవియా బిగ్‌బాస్‌షో నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయింది. అయితే ఆమె ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కారణంగా ఆమె బయటకు వస్తారా లేదా అన్నది చూడాలి. ఇంకో సెక్షన్‌ నెటిజన్‌లు మాత్రం ఇదంతా డ్రామా అని కొట్టిపారస్తున్నారు. గతంలో జూలీ కడుపునొప్పి ఎపిసోడ్‌లాగానే.. ప్రజలను ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నమేనని అంటున్నారు. నిజంగానే.. ఇది వీక్షకుల అటెన్షన్‌ డ్రా చేసే ప్రయత్నమేనా..? టీఆర్‌పీలు పెంచుకునే కార్యక్రమమేనా..? 
ఓవియా ఆత్మహత్యాయత్నం గాలి వార్తలే : హిందూ
మరోవైపు, ఓవియా ఆత్మహత్యాయత్నానికి సంబంధించి మీడియా కథనాలు.. గాలివార్తలేనని హిందూ కొట్టిపారేసింది. ఓవియా సాధ్యమైనంత త్వరగా బిగ్‌బాస్‌హౌస్‌ను వీడాలని కోరుకుంటున్నారని, ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని విజయ్‌ టీవీ ప్రతినిధులు చెప్పినట్లు హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది.  ఏది ఏమైనా ఓవియా ఆత్మహత్యా యత్నమే నిజమైతే అది బిగ్‌బాస్‌షో నిబంధనలకు విరుద్ధం. ఆ రకంగా కూడా ఆమెను బయటకు పంపే చాన్స్‌ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏర్పడ్డ కన్ఫ్యూజన్‌ను బిగ్‌బాస్‌ తమిళ హోస్ట్‌ కమలహాసన్‌ ఈరోజు రాత్రి ప్రసారమయ్యే షోలో క్లియర్‌చేస్తారని భావిస్తున్నారు. 

 

ముగిసిన నంద్యాల ఉపఎన్నిక నామినేషన్ల గడువు

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 30 మంది అభ్యర్థుల నామినేషన్ వేశారు. టీడీపీ అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ నామినేషన్ దాఖలు చేశారు. 

కొలంబో టెస్టు.... ముగిసిన మూడో రోజుఆట

కొలంబో టెస్టు : మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోర్ 209/2. శ్రీలంక 230 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్..622/9 డిక్లేర్డ్. శ్రీలంక 183 ఆలౌట్ అయింది. 

 

అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ అమలవుతున్న విధానం, రాష్ట్రాల అభ్యంతరాలు, చేనేత వస్త్రాలపై 5 శాతానికి పన్ను విధింపు వంటి అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది. తెలంగాణ నుంచి కేటీఆర్, ఏపీ నుంచి యనమల హాజరయ్యారు. 

 

18:20 - August 5, 2017

చెన్నై : తమిళనాట బిగ్‌బాస్‌ రియాల్టీ షో.. వివాదాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. వర్తమాన రాజకీయాలపై కమలహాసన్‌ వరుస వ్యాఖ్యలు.. తమిళనాట ఇప్పటికే కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. హాట్ అండ్‌బ్యూటిఫుల్‌ స్టార్‌ ఓవియా ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలతో.. ఈ కార్యక్రమం మరోసారి వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో... పోలీసుల జోక్యంపైనా న్యూస్‌ స్ప్రెడ్‌ అయింది. దీంతో, బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌ కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది.
కంటెస్టెంట్‌ ఓవియా హెలెన్‌ ఆత్మహత్యాయత్నం..?
బిగ్‌బాస్‌ తమిళ వెర్షన్‌ మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. విఖ్యాత నటుడు కమలహాసన్‌ హోస్ట్‌ చేస్తున్న ఈ కార్యక్రమంలో.. అందాల తార ఓవియా హెలెన్‌ ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు.. కలకలం సృష్టిస్తున్నాయి. నటి ఓవియా, బిగ్‌బాస్‌ హౌస్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారని తమిళ మీడియాలో ప్రచారమవుతోంది.  ఇంతకీ ఒవియా ఆత్మహత్యలాంటి ఎక్సట్రీమ్‌ స్టెప్‌ ఎందుకు తీసుకుంది..?
ఆరవ్‌తో బ్రేకప్‌ వల్లే ఈ నిర్ణయమా?
బిగ్‌బాస్‌హౌస్‌లోని వాతావరణం, సహచర కంటెస్టెంట్‌ల ప్రవర్తనలే ఓవియా ఆత్మహత్యాయత్నానికి కారణమని తమిళ మీడియాలో ప్రచారమవుతోంది. సహచర కంటెస్టెంట్‌ ఆరవ్‌తో బ్రేకప్‌ కారణంగానే ఓవియా ఈ ఎక్సట్రీమ్‌ స్టెప్‌ తీసుకుందని తెలుస్తోంది. బిగ్‌బాస్‌హౌస్‌లో చేరిన రెండు, మూడు వారాలకే ఆమె ఆరవ్‌తో ప్రేమలో పడిందంటున్నారు. కంటెస్టెంట్‌ భరణి ఎలిమినేషన్‌ వ్యవహారంలో చాలామంది ఓవియా తీరును తప్పుబట్టారు. దీంతో ఆమె చాలాకాలం పాటు ఒంటరి అయ్యారు. ఆ సమయంలో కాస్త ప్రేమగా మాట్లాడిన సహచర కంటెస్టెంట్‌ ఆరవ్‌తో ఓవియా ప్రేమలో పడ్డారని, ఈమె వన్‌సైడ్‌ లవ్‌ను, ఆరవ్‌ తిరస్కరించడంతో.. ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందన్నది ఓ కథనం. ఆత్మహత్యకు యత్నించిన ఓవియాను నటులు గణేశన్‌, స్నేహన్‌లు రక్షించారని, గాయత్రి ఆమెను ఉపశమింప చేశారని ప్రచారంలో ఉంది. ఓవియా ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వార్తలు రాష్ట్రంలో దావానలంలా వ్యాపించాయి. ఈ వార్త సంచలనం నేపథ్యంలో.. పోలీసులు కూడా రంగప్రవేశం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. బిగ్‌బాస్‌హౌస్‌ను సందర్శించి, విచారణ ప్రారంభించినట్లు న్యూస్‌ స్ప్రెడ్‌ అయింది. 

 

18:14 - August 5, 2017

రంగారెడ్డి : బంగారు ఆభరణాలతో ఉడాయించిన...ఓ నగల వ్యాపారి షాపు ముందు బాధితులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఓ జ్యూవెలరీ షాపు యజమాని... తన కస్టమర్ల వద్ద తీసుకున్న బంగారం..నగదుతో ఉడాయించాడు. దీంతో మోసపోయిన ఐదు వందల మంది బాధితులు షాపు ముందు ధర్నా చేపట్టారు. అనంతరం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

18:13 - August 5, 2017

హైదరాబాద్ : సీపీఎం మాజీ ఎమ్మెల్యే  బోడేపూడి వెంకటేశ్వరరావు వర్థంతి హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఘనంగా జరిగింది. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు, తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు.. బోడేపూడికి నివాళులర్పించారు. బోడేపూడి ఆశయ సాధనలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బోడేపూడి ఆశయాల సాధనకు కృషిచేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవి రాఘవులు అన్నారు. ప్రజానాయకుడిగా బోడేపూడి నిత్యం గుర్తుంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు.

 

18:06 - August 5, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం పక్కదారి పడుతోంది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆటోల ఈఎంఐల చెల్లింపుల్లో ... అధికారులు కమీషన్‌లు దండుకుంటున్నారు. అలాగే ఆటోల నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తున్నారు. చెత్త సేకరణ కోసం అధికారులు... 1996 ఆటో టిప్పర్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం ప్రతినెల 2 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నారు. అయితే వీటి చెల్లింపుల్లో అధికారులు కమీషన్‌లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఆటోల నిర్వహణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఆరు నెలలు 15 ఆటోలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.

చెత్తశుద్ధిలో కరువైన చిత్తశుద్ధి

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం పక్కదారి పడుతోంది. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఆటోల ఈఎంఐల చెల్లింపుల్లో ... అధికారులు కమీషన్‌లు దండుకుంటున్నారు. 

 

18:00 - August 5, 2017

ఢిల్లీ : ఫాతిమా కాలేజ్ మెడికల్ విద్యార్ధులతో కలిసి ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు మంత్రి కామినేని చెప్పారు. సుప్రీం ఆదేశాల ప్రకారం తాము నడుచుకోబోతున్నట్లు కామినేని తెలిపారు. కోర్టు అంగీకరిస్తే ప్రభుత్వ కాలేజీల్లో ఫాతిమా విద్యార్ధులను చేర్చుకుని న్యాయం చేస్తామని తెలిపారు. 

 

17:57 - August 5, 2017

కరీంనగర్ : కాళేశ్వరం, మేడిగడ్డ ఎత్తిపోతల పథకం టన్నెల్‌ పనులను ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పరిశీలించారు. 180 మీటర్ల లోతులో జరుగుతున్న పంప్‌ హౌస్‌ పనుల తీరును పరిశీలించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కాంట్రాక్ట్‌ సంస్థ నిర్వాహకులతో 2 గంటల పాటు భూగర్భంలో పనులను సమీక్షించారు.

 

17:53 - August 5, 2017

ప్రకాశం : ఇది ఎండాకాలం కాదు... అయినా అక్కడ ప్రజల గొంతులెండుతున్నాయి. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు.  నీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా  పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. దీంతో తాగునీరు కోసం వారంతా పోరుబాట పట్టారు.  ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నీటి కష్టాలపై కథనం...
మంచినీరు దొరకక అల్లాడుతోన్న జనం 
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మంచినీరు దొరకక అల్లాడుతోంది. ప్రజల దాహం కేకలు మొదలయ్యాయి. యర్రగొండపాలెంలో కొంతకాలంగా తాగడానికి నీరులేక ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.  ఎస్‌టీ కాలనీ, మసీదు వీధుల్లో తాగునీరు లేక జనం అవస్థలు పడుతున్నారు. దాహంతో అల్లాడుతున్నారు. ఒకరోజు కాదు.. రెండు రోజులుకాదు... కొన్ని నెలలుగా ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. 
తాగునీటి సమస్య తీర్చాలి : స్థానికులు
తమ కాలనీల్లో తాగునీటి సమస్య తీర్చాలంటూ స్థానికులు ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నారు. తాగడానికి గుక్కెడు మంచినీరు లేక అల్లాడుతున్నామంటూ గోడు వెల్లబోసుకున్నారు. అధికారులచుట్టూ తిరిగారు. అయినా వారి సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.  దీంతో వారంతా పోరుబాట పట్టారు.  పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.  సర్పంచ్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
మహిళల ఆందోళనతో ట్రాఫిక్‌ జాం
మహిళల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు వారించడంతో మహిళలంతా ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయానికి వెళ్లారు.  అక్కడ అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడారు.  తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు హామీనివ్వడంతో వారు ఆందోళన విరమించారు. వారంలోగా సమస్య పరరిష్కారం కాకపోతే... మళ్లీ ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు.

 

17:49 - August 5, 2017

జనగామ : జిల్లాలోని చంపక్‌హిల్స్‌ ప్రాంతంలో లిక్కర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. వరంగల్‌ వెళ్తున్న కింగ్‌ఫిషర్‌ లిక్కర్‌ కి సంబందించిన సుమారు 1300 కాటన్ల బీరు బాటిళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 13లక్షల నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు లిక్కర్‌ కాటన్లను ఎత్తుకుపోకుండా రక్షణ కల్పించారు.

 

17:23 - August 5, 2017

ఖమ్మం : ఆ రైల్వేస్టేషన్‌ ఒకప్పుడు వందలాది సింగరేణి కార్మికుల కుటుంబాలతో కిటకిటలాడేది. అసలు సింగరేణి అనే పదం పుట్టిందే అక్కడ. ఆ రైలు మార్గం నుంచి వ్యాగన్ల సహాయంతో బొగ్గును ఎగుమతి చేస్తూ.. సింగరేణి, రైల్వే సంస్థలు కోట్లల్లో లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ లాభాలకు ప్రతిఫలంగా ఆ సంస్థలు ఏకంగా రైల్వేస్టేషన్‌నే ఆ ప్రాంతం నుంచి ఎత్తేశాయి. బ్రిటీష్‌వారు సింగరేణి కాలరీస్‌ అని పేరు పెట్టిన ఇల్లందు రైల్వేస్టేషన్‌ కనుమరుగుపై ప్రత్యేక కథనం. 
150 ఏళ్ల నుంచి లక్షల టన్నుల బొగ్గు
ఈ ప్రాంతం ప్రపంచానికి వెలుగును చూపించి బొగ్గును గర్భంలో దాచుకున్న ప్రాంతం. సుమారు 150 ఏళ్ల నుంచి కొన్ని లక్షల టన్నుల బొగ్గును ప్రపంచానికి అందించింది. బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో కళకళలాడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధిని చూపించిన ఇల్లందులో.. బ్రిటీష్‌ వారు వారి స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్న రైల్వేస్టేషన్‌ రద్దయి ఇలా వెలవెలబోతోంది. 
1928లో ఇల్లందు రైల్వే స్వేషన్‌ ఏర్పాటు 
ఇల్లందులో ఎక్కువ బొగ్గు ఉత్పత్తిని చూసిన బ్రిటీష్‌వారు వారి స్వలాభం, ధనార్జన కోసం బొగ్గును తరలించడానికి రైల్వేస్టేషన్‌ను 1928లోనే ఏర్పాటు చేశారు. సింగరేణి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ రైల్వేస్టేషన్‌ నుండి స్వీపర్ క్లాస్‌, ఫస్ట్‌ క్లాస్‌ భోగీలు ఉండేవి. అందులో కేవలం బ్రిటీష్‌వారు సింగరేణి అధికారులకే అనుమతి ఉండేది. కాల క్రమేణా ప్రధాన కార్యాలయం హెడ్‌ ఆఫీస్‌ కొత్తగూడానికి తరలించడంతో ఇల్లందు ప్రాముఖ్యం కోల్పోయింది. పైగా ఇల్లందు మీదగా ఇల్లందు-గాంధీనగర్‌-కొత్తగూడెం నుండి రైల్వే లైన్‌ వేయకుండా, కారేపల్లి-గాంధీనగర్‌-కొత్తగూడెం రైల్వేలైన్‌ వేశారు. రైల్వే, సింగరేణి అధికారులందరూ కలిసి ఇల్లందును ఏకాకిని చేశారు. 
2006లో సింగరేణి కాలరీస్‌ ప్యాసింజర్‌ రద్దు 
ప్రయాణికుల కోసం కారేపల్లి నుండి ప్రత్యేకంగా ఒక్క ప్యాసింజర్‌ను రోజుకు రెండు సార్లు నడపడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. 2006లో సింగరేణి కాలరీస్‌ ప్యాసింజర్‌ను రద్దు చేసి, 2015లో రైల్వేస్టేషన్‌ పూర్తిగా ఎత్తేశారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్‌ వెళ్లాలంటే ప్రైవేట్‌ వాహనాల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 
సర్వేకు కూడా నోచుకోని గాంధీనగర్‌, ఇల్లందు 
గాంధీనగర్‌-ఇల్లందుకు 10 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మించడానికి.. 2012 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్రప్రభుత్వం సర్వేను ఆమోదించింది. నిధుల మంజూరు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వెరసి కనీసం సర్వేకు కూడా నోచుకోలేదు. గత పాలకులు ఇల్లందును చీకటిలోకి నెట్టేశారు. అన్ని పార్టీల నేతలు ఎన్నికల ముందు ఇల్లందు రైల్వేస్టేషన్‌ని పునరుద్ధరిస్తామని చెప్పడం తమకు సర్వ సాధారణమైపోయిందని స్థానికులు వాపోతున్నారు.

 

ముగిసిన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాసేపట్లో పార్లమెంట్ హౌజ్ లో ఓట్లను కౌంటింగ్ ప్రారంభం  కానుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఎన్ డిఏ అభ్యర్థిగా ఎం.వెంకయ్యనాయుడు, మనువడు గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు. 

17:02 - August 5, 2017

హైదరాబాద్ : నగరంలో నడకే పాపంగా మారింది... పెద్ద పెద్ద కార్లు ... వాహనాలు లేకపోవడమే శాపమైంది. వాహనాల రాకపోకలతో..నిత్యం రద్దీగా ఉండడం... ఫుట్‌ పాత్‌లు లేకపోవడంతో ... పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు.  
రహదారులపై లేని ఫుట్‌పాత్‌లు
పాదచారులు సిటీలో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాహనాలతో రోడ్లు రద్దీగా ఉండడం... ఫుట్‌ పాత్‌లు లేకపోవడంతో పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా రోడ్లలో ఫుట్‌ పాత్‌లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.  దీంతో  పాదచారులు రోడ్లపైనే నడవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో 40శాతం వరకు పాదాచారులు చనిపోతున్నారు. ప్రతి నెల సరాస‌రి 20 మంది వ‌ర‌కు చ‌నిపోతున్నారు.   2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 13వేల వ‌ర‌కు రోడ్డు ప్రమాదాలు జరగగా... 2500 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 900  మందికి పైగా  పాదచారులు మరణించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.  
ఆక్రమణకు గురవుతున్న ఫుట్‌పాత్‌లు
నగరంలో చాలా రహదారులపై ఫుట్‌పాత్‌లు లేకపోగా ... ఉన్న ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి.  ఆరు వేల కిలో మీటర్ల రోడ్లలో  తప్పనిసరిగా ఫుట్‌పాత్‌లు నిర్మించాలి. కాని సిటీలో ప్రస్తుతం 200 కిలో మీటర్లకు మించి ఫుట్‌పాత్‌లు లేవు. ఉన్నవి కూడా కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వివిధ రూపాల్లో ఫుట్ పాత్‌లను క‌బ్జా చేస్తున్నారు. చాలామంది దుకాణదారులు... రోడ్డు సైడ్ ఉండే షాపింగ్ మాల్స్.... హోట‌ల్స్... వంటి బ‌డాబాబులు వాటిని పర్మినెంట్‌గా త‌మ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.  అలాగే  మెట్రో పనుల వల్ల ప్రధాన రోడ్లపై ఫుట్ పాత్‌లను తొలగిస్తున్నారు. రోడ్డు విస్తరణ తర్వాత తప్పని స‌రిగా ఫుట్‌ పాత్‌లు నిర్మాణం చేపట్టాలి. కానీ ఏళ్ల త‌ర‌బ‌డి  ఫుట్‌పాత్‌లు నిర్మించ‌కుండా అలానే వ‌దిలేస్తున్నారు. అలాగే ప‌లు చోట్లలో ఫుట్ పాత్‌లు అధ్వానంగా మారుతున్నాయి.  
ఫుట్‌పాత్‌ల నిర్మాణాల్లో పాటించని నిబంధనలు
ఇక ఫుట్‌ పాత్‌ల నిర్మాణాల్లో  అధికారులు ... ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఒకటిన్నర మీటర్ల నుంచి, రెండున్నర మీటర్ల వెడల్పు ఉండాలి. కంటిన్యూగా  రెండున్నర కిలోమీటర్లు పొడవు తగ్గకుండా ఉండాలన్నది నిబంధన. కానీ ఆ నిబంధనను అధికారులు ఏ మాత్రం పాటించడం లేదు. అలాగే ప్రమాదాలు జరుగకుండా  రక్షణ ఏర్పాట్లు చేయాలి. కానీ సిటీలో ఎక్కడ అలాంటి పరిస్థితి క‌నిపించ‌డం లేదు. 
హైటెక్‌ హంగులతో ఫుట్‌పాత్‌లు : మంత్రి హామీ
అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌కు నూతన పాలకమండలి వచ్చాక సిటీలో హైటెక్‌ హంగులతో కూడిన ఫుట్‌ పాత్‌లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రకటించారు. దానికనుగుణంగా జీహెచ్‌ఎంసీ ప్రత్యేక పాలసీని రూపొందించి... ఫుట్‌పాత్‌లను పునరుద్ధరించాలని డిసైడ్‌ చేశారు. జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకూ అన్ని ప్రమాణాలతో కూడా ఫుట్‌పాత్‌ను నిర్మించడానికి ప్లాన్‌ చేశారు.  కానీ ఈ ప్రణాళికలన్నీ  పేపర్లకే పరిమితమయ్యాయి. ఏడాది గడిచినా ఆచరణకు నోచుకోలేదు. సిటీలో దాదాపు 12వేల  కిలోమీట‌ర్ రోడ్లకు ఫుట్ పాత్ లు నిర్మించాల్సి ఉంటుంది. అందుకు భారీగా ఖర్చు అవుతుంద‌ని భావించిన బ‌ల్దియా అధికారులు ఈ ప్రాజెక్టును టేకప్‌ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా బల్దియా అధికారులు.. ఫుట్‌ పాత్‌లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

పాతబస్తీలో జర్నలిస్టులు ఆందోళన

హైదరాబాద్ : పాతబస్తీలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ప్రగతి భవన్ వద్ద మీడియాపై దురుసుగా ప్రవర్తించిన ఏసీపీపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. శాలిబండ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు అడ్డుకున్నారు. పలువురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. 

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ ఎస్ కార్యకర్తలు యత్నం

సూర్యపేట : కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ ఎస్ కార్యకర్తలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 

జగన్ కు ఓటమి భయం : పీతల సుజాత

కర్నూలు : నంద్యాలలో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. జగన్ సీఎం అయితే హత్యా రాజకీయాలు చేస్తారనడానికి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. నంద్యాల బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. 

జడ్చర్ల ఏసీటీవో సురేందర్ గౌడ్ వియ్యంకుడి నివాసంలో ఏసీబీ సోదాలు

నాగర్ కర్నూలు : జడ్చర్ల ఏసీటీవో సురేందర్ గౌడ్ వియ్యంకుడు రామన్ గౌడ్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

15:54 - August 5, 2017

సూర్యాపేట : జిల్లాలోని మోతె మండలంలో విషాదం నెలకొంది. రాఘావాపురానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంటడంతో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. 

 

15:52 - August 5, 2017

చిత్తూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పెయిన్‌ పౌరులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురికి చిత్తూరులో ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.  మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళు ఉన్నారు. అనంతపురంలోని ఆర్ డీటీ స్వచ్ఛంద సంస్థకు వెళ్లి అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లె  పుంగనూరు రహదారిపై ఎదురగా వస్తున్న మినీ లారీ ఢీకొట్టింది. మృతదేహాలను బెంగళూరులో బాప్టిస్ట్‌ ఆస్పత్రికి తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. స్పెయిన్‌ నుంచి వారి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత మృత దేహాలను వారికి అప్పగిస్తామని ఆర్డీటీ డైరెక్టర్‌ తిప్పేస్వామి చెప్పారు. 

 

15:23 - August 5, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో నెల రోజులుగా లెక్చరర్లు నిరసన బాట పట్టారు. బాసరలో యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుండి తాము కాంట్రాక్టు లెక్చరర్లుగానే కొనసాగుతున్నామని, తమకు ఉద్యోగ భద్రత కరువైందని లెక్చరర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. కెసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం....

 

15:14 - August 5, 2017

విశాఖ : నంద్యాలలో జగన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో టిడిపి నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. జగన్‌లో చనిపోయిన మానవత్వానికి అంతిమ యాత్ర పేరుతో జగన్‌ దిష్టి బొమ్మకు అంతిమ సంస్కారాలు చేసే ప్రయత్నం చేశారు. అయితే అనుమతి లేకుండా చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌కి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

 

దొండపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా : గుడివాడ మండలం దొండపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. చేపల చెరువు తవ్వుతుండగా స్థానికులు చేపల చెరువు యజమానులను అడ్డుకున్నారు. చేపల చెరువు యజమానులు, స్థానికుల మధ్య ఘర్షణ నెలకొంది. 10 మందికి గాయాలయ్యాయి. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

నంద్యాల ఉపఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ నామినేషన్

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అబ్దుల్ ఖాదర్ నామినేషన్ దాఖలు చేశారు. 

 

విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకుల మృతి

సూర్యపేట : మోతె మండలం రాఘవాపురంలో విషాదం నెలకొంది. వ్యవసాయ పనులు చేస్తుండగా విద్యుత్ వైరు తెగి పడటంతో విద్యుత్ షాక్ ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు శ్రీకాంత్ (23), మహేష్ (18)లుగా గుర్తించారు. మూడు నెలల క్రితం శ్రీకాంత్ కు వివాహం అయింది. 

 

13:29 - August 5, 2017

మంత్రి అఖిలప్రియపై రోజా నిప్పులు...

హైదరాబాద్: వైసీపీ నాయకురాలు రోజా భూమా అఖిల ప్రియను తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి చనిపోయిన వెంటనే చంద్రబాబు ఇచ్చే పదవి కోసం.. జగన్‌పై చేసిన విమర్శలు ప్రజలు మర్చిపోలేదన్నారు. శోభానాగిరెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. తల్లిదండ్రుల కంటే పదవే ముఖ్యమనుకున్నావన్నారు. నంద్యాలలో లక్ష మందితో మీటింగ్ పెట్టి.. మూడేళ్లలో ఇచ్చిన 6 వందల హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెబితే ప్రజలు ఓట్లు వేయాలో వద్దో ఆలోచిస్తారన్నారు. 

బాసర ట్రిపుల్‌ ఐటీలో లెక్చరర్ల నిరసన

అదిలాబాద్‌ : బాసర ట్రిపుల్‌ ఐటీలో నెల రోజులుగా లెక్చరర్లు నిరసన బాట పట్టారు. బాసరలో యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుండి తాము కాంట్రాక్టు లెక్చరర్లుగానే కొనసాగుతున్నామని, తమకు ఉద్యోగ భద్రత కరువైందని లెక్చరర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. కెసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని లెక్చరర్లు డిమాండ్ చేస్తున్నారు. 

13:19 - August 5, 2017

బెంగళూరు : కర్ణాటక మంత్రి శివకుమార్‌ అక్రమాస్తుల బాగోతం తవ్వేకొద్దీ బయటపడుతూనే ఉంది.. శివకుమార్, అతని బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. పదుల సంఖ్యలో లాకర్లు, నేలమాళిగల్లో వందల సంఖ్యల స్థిర, చరాస్తులు... ధ్రువీకరణ పత్రాలు, నగదును అధికారులు గుర్తించారు.. భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.. 64చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.. శివకుమార్‌ వ్యాపార భాగస్వామి అనిల్‌కుమార్‌శర్మ ఇంట్లో 16 లాకర్లు, నేల మాళిగను గుర్తించారు.. ఇందులో వందల కోట్ల విలువ చేసే స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.. శివకుమార్‌ ఆప్తుల ఇంటినుంచి కిలోలకొద్దీ బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.. శివకుమార్‌కు విదేశాల్లోకూడా ఆస్తులుఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.. 

13:09 - August 5, 2017

హైదరాబాద్:అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ మైక్‌ కమింగాను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చంచలగూడ జైల్లో ఉన్న అతడిని సిట్ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకుని మూడు రోజులపాటు ప్రశ్నించనున్నారు. కమింగా కాల్ లిస్టులో ప్రముఖుల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సమాచారం. ఈ విచారణ ఆధారంగా మరి కొందరికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా కాల్విన్నె, జీశాన్ లతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ర్లాండ్స్‌కు చెందిన కమింగా నగరంలోనే నివాసం ఉంటున్నాడు. అతడు హైదరాబాద్ యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలకు సలహాదారుగా పనిచేస్తున్న కమింగా చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. కమింగా కాల్ లిస్టులో సుమారు1500 మంది సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ల ఫోన్‌ నంబర్లు ఉన్నాయని తెలుస్తోంది. మల్టీ నేషనల్ కంపెనీలకు డ్రగ్స్ సరఫరా చేయడంలోను కమింగా కీలక పాత్ర పోషించాడనిసిట్ అధికారులు భావిస్తున్నారు.

12:47 - August 5, 2017

హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. చెరువుల నుండి వచ్చే వరద నీరు అందక ప్రాజెక్టులన్నీ వెలవెల బోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని 19 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే తమ భవిష్యత్తు ఏమైపోతుందోనని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో 2.31 లక్షల ఎకరాల ఆయకట్టు ....

నిజాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో నిజమాబాద్‌, కామారెడ్డి జిల్లలలోని 2.31 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 84 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆయకట్టుకు నీరు అందుతోంది. నిజాంసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, నీటి నిలువ సామర్థ్యం 17.8 టీఎంసీలు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1378.60 అడుగులు కాగా, నిలువ సామర్థ్యం 1.72 టీఎంసీలుగా తగ్గిపోయింది. గత సంవత్సరం భారీగా వర్షాలు కురియడంతో నిజాం సాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. దీంతో నీటి కోసం రైతులు ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్నారు.

సాగర్‌ ప్రధాన కాలువపై ఆధార పడ్డ రైతులు

నిజాం సాగర్‌ ప్రాజెక్టు మొదటి ఆయకట్టు ప్రాంతంలోని నిజాం సాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల రైతులు, సాగర్‌ ప్రధాన కాలువపై ఆధారపడి ఉన్నారు. ఈ మండలాల్లో చెరువులు, బోరు బావులు లేకపోవడంతో, ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తే తప్ప సాగుకు నోచుకోని పరిస్థితి. నారుమడులు పోయాలన్నా ప్రాజెక్టు నీటిని విడుదల చేయాల్సిందే. ఈ ప్రాజెక్టు ఆయకట్టు ఎక్కువగా నిజామాబాద్‌ జిల్లాలో విస్తరించి ఉంది. అలీసాగర్‌ రిజర్వాయర్‌కు 49 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా, 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వర్ని, కోటగిరి, బోధన్‌, ఎడపల్లి మండలాల్లో ఆయకట్టు రైతులకు బోరుబావులు అందుబాటులో ఉండటంతో వ్యవసాయ పనులు ముందుగానే ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆయా మండలాల్లో రైతులు వరినాట్లు వేశారు. నీరు ఎక్కువగా అవసరం ఉన్నందున ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

సాగర్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సింగూరు ప్రాజెక్టు

మరోవైపు మంజీరా నదిపై నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 523.60 అడుగులు కాగా, నీటి నిల్వవ సామర్థ్యం 29.91 టీఎంసీలు. అయితే ప్రస్తుత నీటి మట్టం 521.25 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 19.78 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 93 జీవో ప్రకారం నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు 8.64 టీఎంసీల నీటిని విడుదల చేయాలని, అలాగే మిగతా నీటిని జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఉపయోగించాలని ఒప్పందం కుదుర్చుకుంది.

గతేడాది భారీవర్షాలతో పూర్తిగా నిండిన సాగర్‌ ప్రాజెక్టు

గతేడాది కురిసిన భారీ వర్షాలతో నిజాం సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో రైతులు ఆరుతడి పంటలు కాకుండా వరిని ఎక్కువగా సాగు చేశారు. నీటి అవసరం ఎక్కువ ఉన్నందున పంటలను గట్టెక్కించేదుకు ప్రాజెక్టు నుండి ఏడు విడతలుగా అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలకరి వానలు కురిసినా భారీ వర్షాలు లేకపోవడంతో పంట సాగు కోసం సింగూరు నుండి నీటని విడుదల చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆందోళన బాట పట్టిన రైతులు, వివిధ పార్టీలు...

ఈ నీటి విడుదల కోసం రైతులు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ నేతలు బాన్సువాడ నియోజక వర్గంలో రైతులతో పాటు ఆందోళన చేపట్టారు. సింగూరు నీటిని విడుదల చేసి తమ ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

12:43 - August 5, 2017

ఢిల్లీ : పార్లమెంట్‌ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.... ఎంపీల రాకతో పార్లమెంట్‌ ప్రాంగణం సందడిగా మారింది.. ఎంపీలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.. అక్కడినుంచి ఓటింగ్‌ హాల్‌కు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, ఎల్‌కే అద్వానీ ఓటు వేశారు.. మిగతా పార్టీల ఎంపీలుకూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.. సాయంత్రం 5గంటలవరకూ ఓటింగ్‌ కొనసాగనుంది... ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ... ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.. రాత్రి 7 గంటలకు ఫలితం ప్రకటించనున్నారు.. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతోంది.. 

12:41 - August 5, 2017

హైదరాబాద్‌ :నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.. బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు.. నిన్న గుజరాత్‌లో రాహుల్‌ గాంధీపై రాళ్లదాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు.. కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు... కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్‌ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

12:38 - August 5, 2017

కర్నూలు : చిన్న వయసులో మంత్రి పదవి రావడంతో అఖిలప్రియకు కొమ్ములు వచ్చాయని వైసీపీ నేత రోజాల అన్నారు. అఖిల ప్రియకు ఏం చేస్తుందో ఆమెకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత అఖిల ప్రియకు లేదన్నారు. తల్లి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అఖిల ప్రియ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తల్లిదండ్రుల కంటే పదవే ముఖ్యమనుకున్నావన్నారు. నంద్యాలలో లక్ష మందితో మీటింగ్ పెట్టి.. మూడేళ్లలో ఇచ్చిన 6 వందల హామీల్లో ఎన్ని నెరవేర్చారో చెబితే ప్రజలు ఓట్లు వేయాలో వద్దో ఆలోచిస్తారన్నారు.  తల్లిదండ్రుల కంటే నీతిమాలిన రాజకీయం చేస్తోందా నీవా? జగనా అని ప్రశ్నించింది. నీవు జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకోవడం ఏంటి అన్నారు. ఈ రోజు కూడా అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకుమొహం చెల్లక ప్రెస్ మీట్లు పెట్టి జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు.  ఇప్పటి వరకు లోకేష్ ఒక్కడే పప్పునుకున్నా... అఖిల ప్రియ లేడీ పప్పు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చుట్టూ మొత్తం పప్పు బ్యాచ్ చేరిందన్నారు. జగన్ నిప్పులాంటి వాడని కాబట్టే చక్రపాణి రెడ్డితో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు కు ధైర్యం వుంటే పార్టీమారిన 20 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తే ఎవరు పప్పో, ఎవరు నిప్పో ప్రజలే చెప్తారని తెలిపారు.

నగర బిజెపి ఆఫీసు వద్ద కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్: బిజెపి ఆఫీసు పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి యత్నించారు. నిన్న గుజరాత్ లో రాహుల్ పై దాడికి నిరసనగా దాడికి యత్నించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను నేతలు దహనం చేశారు.

తిరుమలలో లోయలో పడ్డ కారు.. భక్తులు సేఫ్

తిరుమల: శ్రీవారి పాదాలకు వెళ్లే దారిలో అదుపు తప్పిన కారు లోకయలోకి దూసుకెళ్లింది. స్వల్ప గాయాలతో కర్ణాటక భక్తులు బయటపడ్డారు.

11:59 - August 5, 2017

చిత్తూరు : పుంగనూరు మండలం యాతాల వంక సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్‌ను టెంపో ఢీకొట్టింది... ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు... ఇద్దరికి గాయాలయ్యాయి.. వీరిని ఆస్పత్రికి తరలించారు.. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..అనంతపురం నుంచి పుదుచ్చేరి వెళ్తున్న మినీ బస్సు రహదారిపై ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు స్పెయిన్‌ దేశస్థులు, డ్రైవర్‌ మృతి చెందారు. కొందరు స్పెయిన్‌ దేశస్థులు తమ సొంత నిధులతో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతుతున్నారు. వీరు అనంతపురంలో ఏర్పాటు చేసిన ఆర్డీటీ సెంటర్‌ను సందర్శించిన అనంతరం పాండిచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 9మంది స్పెయిన్‌ దేశస్థుల్లో నలుగురు చనిపోగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

11:55 - August 5, 2017

హైదరాబాద్: కరీంనగర్‌ ఉద్రిక్తత కొనసాగుతోంది.. కరీంనగర్‌లో మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుచేయాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆమరణదీక్షకు దిగారు.. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో తన ఇంటి దగ్గరే పొన్నం దీక్ష చేస్తున్నారు..

11:53 - August 5, 2017

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సింగూరు జలాలను ఎప్పుడు విడుదల చేస్తుందా అని.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సింగూరు జలాలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు ఉధృతమవుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభమై 2 నెలలైనా.. భారీ వర్షాలు కురవకపోవటంతో.. రైతులు సింగూరు జలాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో....

సింగూరు జలాలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందోనని.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవటంతో.. వేసిన పంటలకు నీరెలా అందుతుందోననే ఆందోళన రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు వచ్చిచేరలేదు.

వేల ఎకరాలలో వరి నాట్లు....

ప్రాజెక్ట్‌ నుంచి నీరు వస్తుందనే భరోసాతో ఆయకట్టు కింద రైతులు వేల ఎకరాలలో వరి నాట్లు వేశారు. కానీ నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌లో మాత్రం సాగుకు సరిపడా నీరు లేదు. ఇప్పటికే సింగూరు జలాలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయమంత్రి జిల్లాలలోనే ఇలా ఉంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 టీఎంసీల నీరు విడుదల ....

సింగూరు నుండి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో ఈ ఖరీఫ్‌ గట్టేక్కే అవకాశం ఉంది. గతంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీశ్‌రావుతో సింగూరు జలాల గురించి ఫోన్‌లో మాట్లాడారు. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. సింగూరు జలాలను నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వదలకుంటే ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది.

లక్ష ఎకరాల్లో వరి నాట్లు .....

ఇప్పటికే రెండు జిల్లాల ఆయకట్టు కింద సుమారు లక్ష ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా భూ గర్భ జలాలు పెరగటం లేదు. బీర్కూరు, నసురుల్లాబాద్, రుద్రూరు, కోటగిరి, బోధన్‌ తదితర మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు సింగూరు జలాల కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. సింగూరులో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉండటంతో తమ వాటా కింద రావాల్సిన 8 టీఎంసీల నీటికి బదులు.. 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వదలాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నీటిని ప్రభుత్వం జులైలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సింగూరు జలాలు విడుదల చేస్తేనే తమ పంటలు దక్కుతాయని రైతులు చెబుతున్నారు. 

జగన్ చేసిన వ్యాఖ్యలో తప్పులేదు: జోగి రమేష్

విజయవాడ: నంద్యాల సభలో జగన్ చేసిన వ్యాఖ్యలో తప్పులేదని, జగన్ వ్యాఖ్యలపై మంత్రి దేవినేని కి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ సవాల్ విసిరారు. విశ్వసనీయత, విలువులకు జగన్ నిలువుటద్ధం అని, ఎమ్మెల్సీతో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. పార్టీ మారిని 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి దమ్ము చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించారు. జగన్ వి విలువులతో కూడిన రాజకీయాలని, చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలు అని జోగీ ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ పై దాడి పిరికిపంద చర్య: వీహెచ్

హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పై దాడి పిరికి పంద చర్యగా మాజీ ఎంపి వి. హనుమంతరావు అభివర్ణించారు. రాహుల్ గాంధీని చూసి మోదీ భయపడుతున్నారని, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ దుశ్చర్యను ఖండిస్తున్నామన్నారు. ఈ తరహా అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడితే 2019లో ప్రజలు బిజెపికి బుద్ధి చెబుతారని వీహెచ్ హెచ్చరించారు.

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపితో పొత్తు:చినరాజప్ప

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉంటుందని మంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు పై జగన్ వ్యాఖ్యలకు ఈసీ చర్యలు తీసుకుంటుందని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

11:21 - August 5, 2017

తూ.గో : మరోసారి ముద్రగడ పాదయాత్ర విఫలం అయ్యింది. ఇంటి ముందు వున్న గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్దే అరగంట సేపు నిలబడి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేశారు. అరగంట నిలబడి విమర్శలు, అనంతరం ప్లేట్లు, గరిటలతో నిరసన తెలియజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. కాపుల మీద చంద్రబాబు కక్ష కట్టారని మండిపడ్డారు. నిరవధిక పాదయాత్రకు పిలుపునిచ్చానని అందుకే ప్రతిరోజూ పాదయాత్రకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

2 రోజుల పోలీసు కస్టడికి కమింగ

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మైక్ కమింగును ఎక్సైజ్ పోలీస్ లు 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులు, ప్రముకులకు కమింగ విక్రయించాడు. అంతే కాకుండా కమింగ హైదరాబాద్ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

కల్తీపాల తయారీ కేంద్రం పై ఎస్ వోటీ పోలీసులు దాడులు

హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని మాధవ నగర్ లో కల్తీపాల తయారీ కేంద్రం పై ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. 200 లీటర్ల కల్తీ పాలు, 29 కేజీల కల్తీ పౌండర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఓటేసిన ప్రధాని మోదీ

ఢిల్లీ: ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం జరుగుతున్న ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోదీ ఇవాళ పార్ల‌మెంట్‌లో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఎంపీలంతా భారీ సంఖ్య‌లో ఓటింగ్‌కు హాజ‌ర‌య్యారు. ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వెంక‌య్య‌నాయుడు కూడా ఓటేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌లు కూడా ఓటు వేసేందుకు పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. 

10:48 - August 5, 2017

ఢిల్లీ: పార్లమెంట్‌ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.. సాయంత్రం 5గంటలవరకూ ఓటింగ్‌ కొనసాగనుంది... ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ... ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.. రాత్రి 7 గంటలకు ఫలితం ప్రకటించనున్నారు.. రహస్య ఓటింగ్‌ పద్ధతిలో ఈ ఎన్నిక జరుగుతోంది.. రెండుసార్లు ఉపరాష్ట్రపతిగాఉన్న హమీద్‌ అన్సారీ పదవీకాలం.. ఈ నెల 10తో ముగియనుంది... ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 790కాగా లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక స్థానం ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో మొత్తం సభ్యులు 545... ఇందులో బీజేపీ సభ్యులు 281మంది ఉన్నారు... ఇక ఎన్డీఏ బలం 338గా ఉంది.. ఇక 243 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి 58 మంది సభ్యులు.. కాంగ్రెస్‌కు 57 మంది సభ్యులు ఉన్నారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికలో విజయం సాధిస్తారు.. 

10:45 - August 5, 2017

విజయవాడ : కలకలం రేపుతున్న వైద్యురాలు సూర్యకుమారి మిస్సింగ్‌ మిస్టరీ కొనసాగుతూనే ఉంది...సూర్యకుమారి ఏమయింది..? ఆమె ఎక్కడుంది..? ఎలా ఉంది..? ఇలాంటి ఎన్నో విషయాలు..అనుమానాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు... ఓ ఐఏఎస్‌ సోదరి వైద్యురాలు సూర్యకుమారి మిస్సింగ్ కేసులో ప్రేమికుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు...మాచవరం పోలీసులు విద్యాసాగర్‌ను విచారిస్తూ సూర్యకుమారి గురించి వివరాలు తెలుసుకుంటున్నారు...అతని ఫోన్‌ కాల్స్ తో పాటు మెసేజ్‌లను పరిశీలించారు..అయితే తనకు ఏమీ తెలియదనే సమాధానం చెబుతున్న విద్యాసాగర్‌నుంచి అన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు...

కాల్‌డేటా ఆధారంగా విచారణ...

విద్యాసాగర్ ఇంటికి డాక్టర్ సూర్యకుమారి వెళ్లినట్లు సీసీ ఫుటేజీ దొరకడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. అయితే విద్యాసాగరే సూర్యకుమారిని ఎక్కడో దాచాడని...లేదంటే ఏదైనా చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న డాక్టర్ పేరెంట్స్ నుంచి వివరాలు తీసుకున్నారు...

పెళ్లయి పిల్లలున్న విద్యాసాగర్...

విజయవాడలోని క్రీస్తురాజపురం ఫిల్మ్‌నగర్‌ కాలనీకి చెందిన దంపతులకు నలుగురు కుమా ర్తెలు, కుమారుడు సంతానం. కుమారుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తెల్లో ఒకరు వేరే రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేస్తుండగా, ఇద్దరు కుమార్తె లు ఎమ్‌బీబీఎస్‌ పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు...వీరిలో 27 ఏళ్ల సూర్య కుమారి విసన్నపేట మండలం తెల్లదేవర పల్లిలోని పీహెచ్‌సీలో పని చేస్తున్నారు....

సాగర్‌తో చర్చిలో పరిచయం...

ఇద్దరి మధ్య బలపడ్డ స్నేహం...

డాక్టర్‌ సూర్యకుమారికి ఏడేళ్ల క్రితం మాజీ ఎమ్మెల్యే జయరాజు కుమారుడు బొబ్బిలి విద్యాసాగర్‌ అలియాస్‌ బాబి చర్చిలో పరిచయమయ్యాడు...అయితే విద్యాసాగర్‌కు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు..ఈ విషయం తెలిసిన సూర్యకుమారి అతనితో పరిచయం పెంచుకుంది...బీసెంట్‌రోడ్డులో బాబీకి బంగారం షాపు ఉండడంతో తరుచూ అక్కడే కలుసుకునేవారు...ఈ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలించి పెళ్లి చేస్తామంటూ ఒత్తిడి తెచ్చారు...దీంతో రెండ్రోజుల క్రితం సూర్యకుమారి అర్థరాత్రి ఇంట్లోంచి తన బైక్‌పై వెళ్లిపోయింది...వాహన శబ్దంతో మేల్కొన్న పేరెంట్స్ చూడగా ఆమె కన్పించింది..

సాగర్‌కు అన్నీ తెలుసంటున్న డాక్టర్ పేరెంట్స్..

డాక్టర్ సూర్యకుమారి ఇంట్లోంచి వెళ్లిపోయిన గంట తర్వాత విద్యాసాగర్‌ ఆమె ఇంటికి వచ్చి తల్లి మరియమ్మకు ఫోన్ ఇచ్చి వెళ్లాడు...దీంతో వెంటనే వారు మాచవరం పోలీసులను ఆశ్రయించి విద్యాసాగర్‌పైనే అనుమానాలు వ్యక్తం చేశారు.. పోలీసులు కేసులో సీరియస్‌గా దర్యాప్తు చేస్తూ డాక్టర్‌ కోసం గాలిస్తున్నారు...

10:41 - August 5, 2017

నల్గొండ : తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న ఆ సాగర్‌.. ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతోంది. లక్షల ఎకరాల్లో సాగునీరు.. రెండు రాష్ట్రాల్లోనూ జల విద్యుత్‌తో వెలుగులు నింపుతోన్న ఆ ప్రాంతం ఇవాళ కళా విహీనంగా మారింది. ప్రస్తుతం వట్టిపోయి కనిపిస్తోన్న మహోన్నత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్‌పై 10టీవీ ప్రత్యేక కథనం.

దాదాపు 21 లక్షల ఎకరాలు

నాగార్జున సాగర్‌ జలాశయం.. ఎప్పుడూ జల కళతో మనస్సుకు ఆహ్లాదం కలిగేలా చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణ. దీంతో రెండు రాష్ట్రాల పరిధిలోని.. దాదాపు 21 లక్షల ఎకరాలు సాగవుతాయి. అలాంటి ప్రాజెక్ట్ నీటిమట్టం పాతాళంలోకి పడిపోయింది. ప్రాజెక్ట్ చరిత్రలోనే డెడ్‌ స్టోరేజ్‌ కంటే 10 అడుగుల లోతు నీటి మట్టానికి పడిపోయింది. సాగర్‌ కుడి-ఎడమ కాలువల పరిధిలోని లక్షలాది ఎకరాల నీటి పారుదల ప్రశ్నార్థకంగా మారడంతో.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

4 వేల క్యూసెక్కుల నీరు

వరుణుడు కరుణించి ఇప్పటికే నిండు కుండలా మారాల్సిన జలాశయం.. ఇలా వెలవెలబోతోంది. గతంలో ఇదే సమయానికి ఎగువ ప్రాంతమైన శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి.. రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌-ఫ్లో రూపంలో వచ్చి చేరేది. ప్రస్తుతం అలా లేదు. కేవలం అట్టడుగు నీటి నిల్వ సామర్థ్యం అంటే డెడ్‌ స్టోరేజ్‌ 510 అడుగుల కంటే చాలా తక్కువగా 501 అడుగులకు పడిపోయింది.

సాగర్‌ నీటిమట్టం 590 అడుగులు

నాగార్జున సాగర్‌ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 320 టీఎంసీలుగా ఉండేది. డెడ్‌ స్టోరేజీగా 510 అడుగుల వద్ద నిర్ణయించారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయం నీటిమట్టం 501 అడుగులు అంటే పూర్తిగా డెడ్‌ స్టోరేజీ కంటే దిగువకు చేరింది.

కృష్ణా రివర్‌ బోర్డ్‌ ఆదేశాల ప్రకారం..

కృష్ణా రివర్‌ బోర్డ్‌ ఆదేశాల ప్రకారం.. వారం కిందటే కుడి, ఎడమ కాలువలకు ఒక్కో టీఎంసీ చొప్పున తాగు నీటి కోసమే రెండు టీఎంసీలు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ మెయిన్‌ పవర్‌ హౌజ్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ఎప్పుడో నిలిపేశారు.

ఏటేటా నాగార్జున సాగర్‌ జలాశయ నీటి నిల్వ సామర్థ్యం

ఏటేటా నాగార్జున సాగర్‌ జలాశయ నీటి నిల్వ సామర్థ్యం తగిపోతుండటం.. నిపుణులకు, రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ కాలం నాటికి జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 402 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం అది కాస్తా 320 టీఎంసీలకు పడిపోయింది.

వట్టిపోయిన సాగర్....

తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరున్న నాగార్జున సాగర్‌.. ప్రస్తుతం వట్టిపోయి కనిపిస్తోంది. నిండు కుండలా కనిపించాల్సిన సాగరం రాళ్లు, రప్పలతో దర్శనమిస్తోంది. ఇకనైనా వర్షాలు కురిస్తే తప్ప.. ఈ కృష్ణమ్మలో జలకళ కనిపించేలా లేదు. 

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎంపి పొన్నం

కరీంనగర్ : కరీంనగర్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఇంటి వద్దే పొన్నం దీక్ష చేస్తున్నారు.

మరోసారి ముద్రగడ పాదయాత్రకు బ్రేక్

తూ.గో : మరోసారి ముద్రగడ పాదయాత్రకు బ్రేక్ పడింది. గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. గేటు వద్దే నిలబడి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదందంటూ నిలబడ్డ ముద్రగడకు మద్దతుగా జగ్గంపేటలో బంద్ చేపట్టారు. పాదాయత్రకు అనుమతి ఇవ్వాలని కాపు నేతలు ర్యాలీ చేపట్టారు.

కంటైనర్ - టెంపో ఢీ : 5గురి మృతి

చిత్తూరు: పుంగనూరు మండలం యతాలవంకలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ - టెంపో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం

ఢిల్లీ : ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రాత్రి 7 గంటలకు కౌటింగ్ జరుగుతుంది.  లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ఎంపీలు ఈ ఎన్నిక‌ల్లో ఓటేస్తారు. ఉపరాష్ర్టపతిగా ఎన్నికైన వారు రాజ్యసభకు చైర్మన్ గా ప్రాతినిధ్యం వహిస్తారు.

09:35 - August 5, 2017
09:02 - August 5, 2017

ప.గో : ఏలూరు పాత బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యయి. వీరి ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణ లో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది.

 

 

08:56 - August 5, 2017

నేటితో ముగియనున్న ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు

ఢిల్లీ: ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లుకు ఇవాళ్టితో గ‌డువు ముగియ‌నుంది. చివ‌రి రోజు కావ‌డంతో ఇవాళ అర్ధ‌రాత్రి వ‌ర‌కు ఐటీ కార్యాల‌యాలు తెరిచి ఉండ‌నున్న‌ట్లు ఐటీ డిపార్ట్ మెంట్ వెల్ల‌డించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2016-17) ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు గడువును ఆగస్టు 5 వరకు ఐటీ డిపార్డ్ మెంట్ పొడిగించిన విష‌యం తెలిసిందే. రిటర్నుల ఫైలింగ్‌లో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గడువును పొడిగించినట్లు ట్విట్టర్ ద్వారా ఐటీ శాఖ వెల్లడించింది.

జూబ్లీహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైద‌రాబాద్: న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో గత అర్ధ‌రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ డ్రైవ్ లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో స‌హా మొత్తం 12 మందిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. 10 కార్లు, 2 బైకుల ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ప్రేమపెళ్లి అంగీకరించడం లేదని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

ప్రకాశం : అర్థవీడులో ఆర్మీ జవాను అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం...

జ‌మ్ముక‌శ్మీర్: సోపోర్ ప్రాంతంలో ఈ రోజు ఉద‌యం సెక్యూరిటీ ఫోర్స్, ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాదుల మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ముగ్గురు ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఓ జ‌వాను కు గాయాల‌య్యాయి. కాల్పుల త‌ర్వాత 3 ఏకే 47 గ‌న్ ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. 

నేడు జీఎస్టీ మండ‌లి స‌మావేశం

ఢిల్లీ: నేడు జీఎస్టీ మండ‌లి స‌మావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో జీఎస్టీ అమ‌లును ప‌రిశీలించ‌డంతో పాటు యాంటీ ప్రాఫిటరింగ్ ఏర్పాటును కౌన్సిల్ ప‌రిశీలించ‌నుంది.

 

07:19 - August 5, 2017

హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ లో ఎన్నికల వేడి రగులుతోంది. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ దళితులు, మహిళలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులను అవమానపరిచేలా చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయా? ఇదే అంశం పై నేటి 'న్యూడ్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

ముంబైలో నెల్లూరుకు చెందిన సుధీర్ ఆత్మహత్య

నెల్లూరు : ముంబైలో నెల్లూరుకు చెకందిన కోవూరు సుధీర్ అనుమానాస్పద మృతి చెందాడు. ముంబై బిపిసిఎల్ కంపెనీలో 40 రోజుల క్రితం జాబ్ జాయిన్ అయ్యాడు. తోటి వారు ఉద్యోగానికి వెళ్లిన అంనతరం సుధీర్ తన క్వార్టర్ లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2010లో ఎస్ ఎస్ సీలో స్టేట్ టాపర్ నలిచి, 2017 గేట్ పరీక్ష లో ఆలిండియా లెవల్లో మెకానికల్ లో టాపర్ గా నిలిచాడు.

07:10 - August 5, 2017

నెల్లూరు : ముంబైలో నెల్లూరుకు చెందిన కోవూరు సుధీర్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సుధీర్‌ 2010లో ఎష్ ఎస్ సీ లో స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా 2017 గేట్‌ పరీక్షలో ఆలిండియా లెవల్లో మెకానికల్‌లో టాప్‌ ర్యాంక్‌ పొందాడు. బిపిసిఎల్ లో జాబ్‌ చేస్తున్న సుధీర్‌.. తాను ఉంటున్న క్వార్టర్‌లో ఉరేసుకున్నాడు. అయితే... సుధీర్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తిరుమలలో వివాదంగా మారిన ఇనుప మెట్ల నిర్మాణం

తిరుమల : ఏడుకొండలపైకి కాలినడకన చేరుకున్నా..కాసింత అలసిపోయినట్టు కూడా భక్తులు ఫీలవరు. తిరుమల శ్రీవారిని దర్శించామన్న ఆనందంలో బడిలిక మర్చిపోతారు. కోనేటి రాయుడిపై ఉన్న భక్తి అలాంటిది. స్వామివారు ఉన్నత స్థానంలో ఉండాలనే ఏ భక్తుడైనా కోరుకుంటాడు. కాని టీటీడీ చేపట్టిన కొత్త నిర్వాకం ఇప్పుడు వివాదంగా మారింది. 

యర్రగొండపాలెంలో తాగునీటికి కటకట

ప్రకాశం :ఇది ఎండాకాలం కాదు... అయినా అక్కడ ప్రజల గొంతులెండుతున్నాయి. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీటి కష్టాలు తీర్చాలంటూ ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడే కనిపించలేదు. దీంతో తాగునీరు కోసం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోరుబాట పట్టారు.  

శ్రీకాకుళంలో రుణాలందక ఆవేదన చెందుతున్న రైతులు

శ్రీకాకుళం :రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రైతాంగాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలా సాయం చేస్తామని సర్కార్‌ చెబుతున్నప్పటికీ.. సాగు చేసేందుకు రైతన్నలకు రుణాలు అందడం లేదు. బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేకుండాపోతుందని సిక్కోలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నేరేళ్ల బాధితులను పరామర్శించిన టిటిడిపి నేతలు

సిరిసిల్ల : నేరెళ్లలో బాధిత దళిత కుటుంబాలను టీటీడీపీ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ డిమాండ్ చేశారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. నేరెళ్ల ఘటనకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, లారీ యజమానులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. ఏ మాత్రం నైతిక విలువలున్నా కేటీఆర్‌ రాజీనామా చేయాలన్నారు. బాధితులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

రాహుల్ చేతిలో బీసీ కార్డ్

ఢిల్లీ: గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకే ప‌రిమితం అయిన‌ కాంగ్రెస్ పార్టీ 2019కి ప‌క్కాగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ న‌ష్టం జ‌రిగిందో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ .. మ‌ళ్లీ ఆ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా.. జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దీనిపైనే దృష్టిపెట్టారు కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ. 

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత

చిత్తూరు : సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు బాహాబాహీకి దిగారు. జగన్‌ దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దహనం చేయడంతో.. ప్రతిగా చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వైసీపీ లీడర్లు యత్నించారు. దీంతో వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

జగన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్న టిడిపి

అమరావతి: పసుపు పార్టీ ఎరుపెక్కింది. ఫ్యాన్‌ పార్టీపై నిప్పులు చెరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నంద్యాలలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు కౌంటర్‌ ఇవ్వగా... ఫ్యాక్షన్‌కు జగన్ రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నారని పయ్యావుల కేశవ్‌ ఫైర్‌ అయ్యారు. జగన్‌కు వారసత్వంగా వచ్చిన డీఎన్‌ఏ ఫ్యాక్షన్‌కు అనుగుణంగా ఉందని మంత్రి జవహర్‌ సెటైర్‌ వేశారు. 

గ్రామంలో లక్ష్మీదేవి తాండవించాలన్న కేసీఆర్

మేడ్చల్ : రైతులు దోపిడికి గురి కాకుండా ఉండాలంటే.. గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పడాలని సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌లో పర్యటించిన కేసీఆర్.. గ్రామంలో లక్ష్మీదేవి తాండవించాలన్నారు. గ్రామ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

06:48 - August 5, 2017

హైదరాబాద్: మరో అత్యున్నత పదవి కోసం కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా... ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ రంగంలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం వరకు కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో తేలనుంది.

దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి

దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉప రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం రాజ్యసభలో 233 మంది సభ్యులు, 12 మంది నామినేటెడ్‌ సభ్యులు ఉన్నారు. ఇక లోక్‌సభలో 543 మంది ఎన్నికైన ఎంపీలు, ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు ఉన్నారు. ఇందులో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతావాళ్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ మొత్తం రహస్య బ్యాలెట్‌ ద్వారానే జరగనుంది.

రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌

ఇక ఈ ఎన్నికల ప్రక్రియకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ కె. షీరిఫ్‌ వ్యవహరించనున్నారు. ఓటు వేసేందుకు ఈసీ సూచించిన పెన్నును మాత్రమే ఉపయోగించాలి. వేరే పెన్ను ఉపయోగించినట్లయితే ఆ ఓటును తిరస్కరిస్తారు. ఇక పోలింగ్‌ అనంతరం ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. స్పాట్‌..విజువల్స్‌..

వెంకయ్య వర్సెస్ గోపాలకృష్ణ గాంధీ....

ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీ చేస్తున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గోవా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మనోహర్‌ పారికర్‌, యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి మౌర్య కూడా ఓటు వేయనున్నారు. అయితే... కోర్టు తీర్పు కారణంగా బీజేపీ ఎంపీ పాశ్వాన్‌కు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదు. ఇక సాయంత్రం వరకు ఉపరాష్ట్రపతి ఎవరనేది తెలియనుంది. 

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్

హైదరాబాద్: మరో అత్యున్నత పదవి కోసం కాసేపట్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీయే అభ్యర్థి మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా... ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణగాంధీ రంగంలో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం వరకు కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో తేలనుంది.

06:45 - August 5, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ బీసీ కార్డ్‌కు ప‌దును పెడుతున్నారా..? రాహుల్‌ అమల్లో పెట్టనున్న బీసీఫార్ములా ఏంటీ..? 2019 ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటి నుంచే బీసీల కు మ‌రింత దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా..? కాంగ్రెస్‌ నేతల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

2019 ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ వ్యూహాలు

గత ఎన్నికల్లో ప్రతిపక్షాలకే ప‌రిమితం అయిన‌ కాంగ్రెస్ పార్టీ 2019కి ప‌క్కాగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎక్క‌డ న‌ష్టం జ‌రిగిందో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ .. మ‌ళ్లీ ఆ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా.. జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం దీనిపైనే దృష్టిపెట్టారు కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ.

మోదీని బీసీ నేతగా జరిగిన ప్రచారంతో దెబ్బతిన్న కాంగ్రెస్‌..!

గ‌త ఎన్నిక‌ల్లో మోదీని బీసీ నేత‌గా బీజేపీ ప్రచారం చేయ‌డం కూడా తమకు వ్యతిరేక ఫలితాన్నిచ్చిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి తోడు ఆయా రాష్ట్రాల‌లో రాష్ట్ర నాయ‌క‌త్వాల తీరుతో బీసీలు దూర‌మ‌య్యార‌ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు... వీట‌న్నిటిని స‌రిదిద్దుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారు. దీని కోసం ఇపుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోడానికి ఓవైపు స‌మాయ‌త్తం అవుతూనే... 2019 నాటికి హ‌స్తానికి బీసీల‌ను దగ్గర చేయ‌డానికి ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగా దేశ‌వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల‌లోని పార్టీ బీసీ నేత‌ల‌తో ప్రత్యేకంగా స‌మావేశమ‌వుతున్నారు.

పంజాబ్, హ‌ర్యాణా, గుజ‌రాత్ బీసీ నేతలో రాహుల్‌ భేటీ

బీసీ వ్యూహంలో భాగంగా వరుసగా పంజాబ్, హ‌ర్యానా, గుజ‌రాత్ లకు చెందిన బీసీ నేత‌ల‌తో రాహుల్‌ భేటీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి అమల్లో పెట్టాల్సిన బిసి మంత్రాగాన్ని ఉప‌దేశించారని కాంగ్రెస్‌నేతలు చెబుతున్నారు.

తెలంగాణపై రాహుల్‌ ప్రత్యేక దృష్టి

ఇటు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్‌ ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాక‌పోవ‌డానికి పార్టీకి బీసీలు దూరం కావడం కూడా ఓ ప్రధానకార‌ణ‌మ‌ని రాహుల్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశ‌వ్యాప్తంగా ప్రయోగిస్తున్న బీసీ కార్డ్ తెలంగాణలో మ‌రింతగా కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పెద్దలు నమ్ముతున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలో భాగంగానే శ‌నివారం తెలంగాణకు చెందిన పార్టీ బీసీ నేత‌ల‌తో రాహుల్ భేటీ అవుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో బీసీల‌కు మ‌రింత దగ్గరయ్యేందుకు.. ఏలాంటి పథకాలు ప్రకటించాలన్న నేత‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకుంటారని టీ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ స‌మావేశంలో తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌పార్టీ బీసీ నేతలతో రాహుల్‌ చర్చలు జరపనున్నారు.

రాహుల్‌ బీసీ మంత్రాంగం కాంగ్రెస్‌కు కలిసి వచ్చేనా..!

మొత్తానికి రాహుల్ గాంధీ.. పార్టీ సార‌థ్య బాధ్యతలను భుజానికి ఎత్తుకోవ‌డానికి సిద్ధమవుతూనే.. 2019లో విక్టరీ కొట్టేందుకు ఇప్పడి నుండే పార్టీ ప్రణాళికలకు ప‌దును పెడుతున్నారు. మ‌రీ రాహుల్ ప్రయోగిస్తున్న బీసీ మంత్రం.. ఏమేర‌కు పార్టీని అధికారంలోకి తెస్తుందో వేచి చూడాలి అంటున్నారు రాజకీయవ విశ్లేషకులు.

06:41 - August 5, 2017

హైదరాబాద్: దేవుడు కరుణించినా వరం దక్కలేదన్నట్టుగా ఉంది సచివాలయంలోని హౌజ్ కీపింగ్ ఉద్యోగుల పరిస్థితి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచామని ముఖ్యమంత్రి కేసిఆర్ చెబుతుంటే.. సీఎం ఆదేశాలు జారీచేసిన సచివాలయంలోనే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. పెంచిన జీతాల సంగతి అటుంచితే చివరికి అసలు వేతనాల్లోనే కోతలు పెడుతున్నాడు కాంట్రాక్టర్లు. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై తమతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని సచివాలయ హౌస్‌కీపింగ్‌ ఉద్యోగుల వాపోతున్నారు.

సచివాలయం సాక్షిగా శ్రమ దోపిడి..

వెలుగునిచ్చే దీపం చుట్టే చీకటి ఉన్నట్టుగా తయారైంది తెలంగాణ సచివాలయంలోని ఔట్‌సోర్సింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పరిస్థితి. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కు జీతాలు పెంచామని, రాష్ట్ర మంతటా గొప్పగా అమలవుతోందని గొప్పగా చెప్పుకుంటున్న కేసీఆర్‌ సర్కార్‌.. సచివాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాల సంగతి మర్చిపోయింది.

జీతాలు పెంచి ఆకలి తీర్చుతామన్న సీఎం కేసీఆర్‌

రాష్ట్రం వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఔట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారి వేతనాలు పెంచి, అందరి ఆకలి తీరుస్తానన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనుకున్నట్లుగానే అందరికి వేతనాలు పెంచుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని ఏఏ స్ధాయిలో ఎవరికెంత వేతనాలు ఇవ్వాలో కూడా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు అన్ని సంస్ధలు వెనుకో ముందో ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి. కానీ పాలనపరమైన నిర్ణయాలకు గుండెకాయ లాంటి సచివాలయంలో మాత్రం చిరుఉద్యోగుల జీవితాల్లో వెలుగు రాలేదు. ముఖ్యమంత్రి ఎక్కడైతే నిర్ణయం తీసుకున్నారో అక్కడే ఆయన ఆదేశాలకు దిక్కులేకుండా పోయిందని కాంట్రాక్ట్‌ కార్మికులు కన్నీరుపెట్టుకుంటున్నారు.

రెండు సంస్థలకు సచివాలయ హౌస్‌కీపింగ్‌ కాంట్రాక్ట్‌

సచివాలయంలోని ఏ, బి, సి, డి బ్లాకుల్లో మొత్తం హౌజ్ కీపింగ్ విధానాన్ని రెండు సంస్ధలకు అప్ప చెప్పారు. ఇందులో ఒకటి ఎం ఎన్ ఆర్ సంస్ధ ఒకటి. ఈ సంస్ధ హౌజ్ కీపింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న నాటి నుంచి సచివాలయంలో శ్రమ దోపిడి ఎక్కువైపోయింది. పెంచిన వేతనాల సంగతి పక్కకు పెడితే...ఉన్న వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. అంతేకాదు కార్మికులను వేధించడంలో ఎంఎన్‌ఆర్‌ సంస్థ ఆరితేరింది. అనారోగ్యం పాలైనా సెలవులు ఇవ్వకపోవడం, పనిమానేశారంటూ ఇష్టానుసారం విధుల నుంచి తొలగించడం చేస్తున్నారు. అంతేకాదు మహిళాకార్మికుల పట్ల ఎంఎన్‌ఆర్‌ కాంట్రాక్టర్ అనుచితం ప్రవర్తించడం, మాటలతో కించపరచడంచేస్తూ ఆవేదనకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమతాబ్లాక్‌లోని ఓ ఉన్నతాధికారి అండదండలతోనే ఎంఎన్‌ఆర్‌ కాంట్రాక్టర్‌ రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. జీతాలెందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తే సూపర్‌వైజర్‌ నుంచి కూడా సరైన సమాధానం రావడంలేదు.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ కూడా కల్పించని ఎంఎన్‌ఆర్‌ కాంట్రాక్టర్‌

పెంచిన వేతనాల సంగతి అలావుంటే.. కనీసం పీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలు కూడా కల్పించకుండా ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీనిపై ఇటీవల లేబర్‌కమిషనర్‌ కు, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డికి కూడా ఫిర్యాదు చేసింది ఉద్యోగుల సంఘం. దీంతో ఎంఎన్‌ఆర్‌ కాంట్రాక్టర్‌ నర్సింగరావు మరింతగా రెచ్చిపోతున్నాడు. కాంట్రాక్టర్‌తో పాటు సూపర్‌వైజర్‌ వనజాక్షి కూడా ఉద్యోగులపై క్షక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పని సరిగా చేయడం లేదంటూ రోజు ఎవరో ఒకరికి నోటీసులు ఇస్తున్నారు. పనిలోకి రావొద్దంటూ సెక్రెటేరియట్‌ ఎంట్రీ పాసులు కూడా లాక్కుంటున్నారు.

మీడియాతో బాధలు చెప్పుకున్న కార్మికులు

అయినా కాంట్రాక్టర్‌ అగడాలు తగ్గపోగా మరింత పెరిగాయి.. తమ బాధలు చెప్పుకోడానికి ఉద్యోగులు మీడియాను ఆశ్రయించారు. దీంతో క్షమించరాని నేరం చేశారన్నట్టు ఎంఎన్‌ఆర్‌ కాంట్రాక్టర్‌ ఉద్యోగులను విధులను రావొద్దని ఆపేశారు. ఇక చేసేది లేక మరోసారి సచివాలయంలో నిరసనకు దిగిన కార్మికులు తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరోసారి కార్మికులను డ్యూటీలోకి తీసుకున్నారు. డ్యూటీకైతే తీసుకున్నారు కాని.. కుట్రలు మాత్రం మానలేదు. సచివాలయంలో ధర్నాకు దిగి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారంటూ సమస్యను మరింత పెంచుతున్నాడు కాంట్రాక్టర్‌.

ఉన్నతాధికారులను మేనేజ్‌ చేస్తున్న కాంట్రాక్టర్‌

నిజానికి హౌజ్ కీపింగ్ ఉద్యోగులు తమ పరిస్థితిని ఎప్పటికపుడు విన్నవించుకుంటున్నా... కాంట్రాక్టర్‌ మేనేజ్‌ చేయడంతో కొందరు ఉన్నతాధికారులు సైలెంట్‌ అయ్యారనే ఆరోపణలొస్తున్నాయి. తమ వేతనాల్లో కోతపెట్టిన కాంట్రాక్టర్‌.. ఉన్నధికారులకు కమీషన్లు ఇస్తున్నట్టు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్ నర్సింగ్ రావు, సూపర్ వైజర్ వనజాక్షి లపై వచ్చిన ఫిర్యాదులను విచారించి న్యాయం చేయాలంటూ కార్మికులు కోరుతున్నారు.  

06:37 - August 5, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్ల అవతారమెత్తి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. తమ దందాలకు అడ్డుచెప్పిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. అమాయకులపై అనుచరగణంతో దాడులకు ఉసిగొల్పుతున్నారు. నాగారం ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై 10టీవీ కథనం.

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం

వరంగల్‌ జిల్లాలో అధికారపార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పిందే వేదంలా మారింది. ఇష్టారాజ్యంగా మొరం తరలించుకుపోతున్నా పట్టించుకున్న అధికారులే లేరు.

కమలాపూర్‌లో రోడ్డు పనులు

వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాల మండలంలోని కమలాపూర్లో రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం నాగారం గ్రామ శివారులోని గుడికుంట చెరువులోని మట్టిని వినియోగిస్తున్నారు. జేసీబీలతో మట్టిని తోడుతున్నారు. రోడ్డు పనులకోసం అక్రమంగా మొరాన్ని తరలించుకుపోతున్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్‌ కాంట్రాక్టర్‌ కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మొరం తరలింపునకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా తరలిస్తున్నారు. గుండికుంట చెరువులో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో ఆ గుంతల్లో పడి ఓ పశువు చనిపోయింది. ఈమధ్యే బహిర్భూమి కోసం వెళ్లి ఒకరు చనిపోయాడు. అయినా అధికారులకు మాత్రం ఇదేమీ పట్టలేదు.

చల్లా ధర్మారెడ్డి తీరుపై నాగారం గ్రామస్తుల ఆగ్రహం

ఒక గ్రామస్తుడు, ఒక పశువు చనిపోవడం గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చెరువులో తవ్వకాలను అడ్డుకున్నారు. లారీలను నిలిపివేశారు. అయితే ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులను బెదిరింపులకు గురిచేశారు. ఎమ్మెల్యే కాంట్రాక్ట్‌ పనులకు అడ్డుచెబుతారా అంటూ దుర్భాషలాడారు. గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు.

గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్‌ మద్దతు

టీఆర్‌ఎస్‌ నేతల దౌర్జన్యం తెలుసుకున్న పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఇనుగాల వెంకటరమణారెడ్డి చెరువును పరిశీలించారు. గ్రామస్తుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అధికారపార్టీ నాయకులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తులపై దౌర్జన్యానికి పాల్పడుతోంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఆందోళనతో గ్రామానికి చేరుకున్న సీఐ జానీ నర్సింహులు

కాంగ్రెస్‌ నేతల ఆందోళనతో సీఐ జానీ నర్సింహులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం చెరువులో తవ్వకాల పనులు నిలిపివేయించారు. మరోవైపు తహసీల్దార్‌ కూడా విచారణ జరుపుతామని తెలిపారు. తమ చెరువులో అక్రమ తవ్వకాలను సహించే ప్రసక్తే లేదని గ్రామస్తులు తేల్చి చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల దౌర్జన్యంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

06:34 - August 5, 2017

Don't Miss