Activities calendar

06 August 2017

జూబ్లిహిల్స్ లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమంలో.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కార్యకర్తపై దాడి చేసుకోవడంతో వివాదాస్పదమైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమపై.. కొత్తగా పార్టీలో చేరినవారు పెత్తనం చలాయిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపినాథ్‌ కావాలనే డివిజన్‌ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అంటున్నారు. 

22:12 - August 6, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన టీసర్కార్ పరిపాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. కేసీఆర్ వ్యూహాత్మక ద్రోహం చేస్తున్నారని అన్నారు. 2019సం.లో కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పని తీరును వివరించారు. పలు ఆసక్తరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

22:07 - August 6, 2017

హైదరాబాద్ : ప్రజలను చైతన్య వంతుల్ని చేయడంలో శాస్త్రవేత్త పి.ఎం భార్గవ ముందుండేవారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తగా సమాజానికి కొత్త ఆవిష్కరణలు  అందిస్తూనే సమాజంలో పేరుకుపోయిన అంధవిశ్వాసాలపై యుద్ధం చేశారని కొనియాడారు. ప్రజాశాస్త్రవేత్త అయిన భార్గవకు పలువురు  ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన భార్గవ సంతాప సభలో పలువురు వక్తలు పాల్గొన్నారు. భార్గవ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషిచేయాలని యువ శాస్త్రవేత్తలకు పిలుపు నిచ్చారు. 
పీఎం భార్గవ సంతాప సభ
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రలో పీఎం భార్గవ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక, విద్యావేత్తలు పాల్గొన్నారు. సంమాజంలో మూఢనమ్మకాల కారణంగా జీవితాలను బలితీసుకుంటున్న ప్రజలను చైతన్య వంతుల్ని చేయడంలో పి.ఎం భార్గవ ప్రత్యేక ద్రుష్టి సారించారని, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. శాస్త్రవేత్తగా సమాజానికి కొత్త ఆవిష్కరణలు  అందిస్తునే సమాజంలో పేరుకుపోయిన అంధవిశ్వాసాలపై యుద్ధం చేశారని  కొనియాడారు. రాజస్థాన్‌లో పుట్టిన భార్గవ.. దేశం, ప్రపంచం గురించేనిత్యం ఆలోచించారని ..ఆయన ఓ విశ్వమానవుడని నివాళులర్పించారు. 
శాస్త్రవేత్తలు సమాజంతో మమేకం కావాలి 
నేడు శాస్త్రవేత్తలు పరిశోధనలకు మాత్రమే పరిమితం అవుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శాస్త్రవేత్తలు అంటే సమాజంతో మమేకం కావాలని ఆయన అన్నారు. పీఎం భార్గవ చేసి చూపారని,  యువ శాస్త్రవేత్తలు  భార్గవను  ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శాస్త్రవేత్తగానే కాకుండా ప్రజలను సైన్స్ పట్ల అవగాహన కల్పించడంలో పి.ఎం భార్గవ ఎప్పుడూ ముందు ఉండేవారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. భార్గవపేరిట ప్రత్యేక సైన్స్ ఫౌండేషన్‌  ఏర్పాటు చేయడానికి విద్యావేత్తలు ముందుకు రావాలన్నారు. జన విజ్ఞాన వేధిక ఆధ్వర్యంలో ఏర్పాటు  చేసిన ఈ సంతాప సభలో పలువురు శాస్త్రవేత్త లు, అభిమానులు, సహచరులు, భార్గవ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

22:01 - August 6, 2017

హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమంలో.. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కార్యకర్తపై దాడి చేసుకోవడంతో వివాదాస్పదమైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమపై.. కొత్తగా పార్టీలో చేరినవారు పెత్తనం చలాయిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపినాథ్‌ కావాలనే డివిజన్‌ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అంటున్నారు. 

 

21:59 - August 6, 2017

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని సీపీఎం నిర్ణయించింది. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దళితుల విషయంలో కేసీఆర్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. నేరెళ్ల ఘటనలో ఎస్ పీపై కేసు నమోదు చేయాలని... పల్లెర్లలో కులదురహంకార హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలే ఎజెండాగా పోరాటాలు 
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. ప్రజాసమస్యలే ఎజెండాగా పోరాడాలని సమావేశాల్లో తీర్మానించారు.. ఎంబీ భవన్‌లో జరిగిన ఈ సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు, పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ నేతలు హాజరయ్యారు.
ఉద్యోగాలు కల్పన ప్రకటన అమలు కోసం కార్యాచరణ ప్రకటించాలి : రాఘవులు  
సీపీఎం కేంద్రకమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చట్టం డిమాండ్‌తో పోరాడాలని సమావేశంలో నిర్ణయించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ ప్రకటన అమలుకోసం కార్యాచరణ ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు.
తెలంగాణలో పాలన అస్తవ్యస్తం : తమ్మినేని 
తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందని తమ్మినేని వీరభద్రం అన్నారు.. సీఎంతో తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని... ప్రజలకుమేలు చేసే రాజకీయ విధానాల్లోనే విభేదాలున్నాయని తెలిపారు. ప్రాజెక్టులకోసం సేకరిస్తున్న భూమికి సరైన పరిహారం ఇవ్వడంలేదని తమ్మినేని విమర్శించారు. భూకుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ కుంభకోణం బయటకు తెచ్చారన్నారు తమ్మినేని. నేతల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కేసీఆర్‌ నయీం కేసును ఉపయోగించుకున్నారని ఆరోపించారు. దళితుల విషయంలో కేసీఆర్ అహంభావంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై దేశవ్యాప్తంగా ఉద్యమించాలని సీపీఎం సమావేశాల్లో నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 1 వరకూ ప్రచారోద్యమం చేయాలని తీర్మానించారు.

21:51 - August 6, 2017

కర్నూలు : నంద్యాలలో జగన్‌కి వస్తున్న ప్రజాధరణ చూసీ టీడీపీకి భయం పట్టుకుందని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలను టీడీపీ నేతలు భూతద్దంలోచూస్తున్నారని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్‌ రెడ్డి విమర్శించారు. 

21:29 - August 6, 2017

కృష్ణా : సూర్యకుమారి మృతి కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సూర్యకుమారి మృతితో తనకేమీ సంబంధం లేదని విద్యాసాగర్‌ అంటుండగా... అతనే తమ కుమార్తెను మోసం చేసి హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు బయటపడతాయని పోలీసులంటున్నారు. 
మిస్టరీగానే సూర్యకుమారి మృతి కేసు 
కృష్ణా జిల్లాలో డాక్టర్‌ సూర్యకుమారి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమారి మృతికి మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌ కారణమయ్యాడనే అభియోగంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టగా.. 15 రోజులపాటు రిమాండ్‌ విధించారు. 
కాలువలో సూర్యకుమారి మృతదేహం లభ్యం
జులై 31న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన సూర్యకుమారిని విద్యాసాగర్‌ ఏదో చేసి ఉంటాడని తొలినుంచి ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అన్ని కోణాల్లో విచారించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. అతడిని వదిలిపెట్టారు. శనివారం ఓ యువతి మృతదేహం నిడమనూరు వంతెన వద్ద కాలువలో దొరికింది. దుస్తులు, మెడలో ఉన్న లాకెట్‌ ఆధారంగా ఆ మృతదేహం సూర్యకుమారిదిగా గుర్తించారు. దీంతో విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. విద్యాసాగర్‌కు కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే... సూర్యకుమారి మృతితో తనకేమీ సంబంధం లేదని విద్యాసాగర్‌ అంటున్నాడు. జులై 31 అర్ధరాత్రి సూర్యకుమారి తన ఇంటికి వచ్చి వెళ్లిపోయిందంటున్నారు. విచారణలో పోలీసులకు అన్ని వివరాలు చెప్పానన్నాడు. సూర్యకుమారి మృతిలో తన ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దమే అన్నాడు విద్యాసాగర్‌. 
కుటుంబసభ్యులకు మృతదేహ అప్పగింత
ఇక పోస్ట్‌మార్టం అనంతరం సూర్యకుమారి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇదిలావుంటే... విద్యాసాగర్‌ చెప్పేవన్నీ అబద్ధాలని... తన కుమార్తెను నమ్మించి మోసం చేశాడని సూర్యకుమారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాసాగర్‌ను శిక్షించాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత సూర్యకుమారిది హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని పోలీసులంటున్నారు. 

 

21:23 - August 6, 2017

హైదరాబాద్ : ప్రజలకోసం చేపడుతున్న నిర్మాణాలపై 12శాతం జీఎస్టీ విధించడంపై రాజీలేని పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు.. జూన్‌ 30నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు జులై 1నుంచి అమలయ్యే జీఎస్టీని వర్తింపజేయడం సరికాదన్నారు.. నిర్మాణ పనులపై 12శాతం జీఎస్టీ విధించడంపై వివిధ విభాగాల అధికారులతో సీఎం చర్చించారు.. గతంలో 5శాతం వ్యాట్‌ అంచనాలతో ప్రాజెక్టుల అంచనాలు, బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయని అధికారులు కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు.. ఈ నిర్మాణాలపై 12 జీఎస్టీ విధించొద్దంటూ కేంద్రానికి లేఖ రాయాలని ముందు భావించారు.. అయితే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి సరైన గణాంకాలు పొందుపరచడంకోసం దీనిని వాయిదావేశారు.. సోమవారం మరోసారి అధికారులతో సమావేశం తర్వాత కేంద్రానికి లేఖ రాయాలని కేసీఆర్‌ నిర్ణయించారు..

 

నర్సంపేట ఆర్టీసీ డిపోలో కలకలం

గుంటూరు : నర్సంపేట ఆర్టీసీ డిపోలో కలకలం రేగింది. పురుగుల మందు డబ్బాతో శంకర్ గౌడ్ అనే డ్రైవర్ విధులకు హాజరయ్యారు. బలవంతంగా విధులు నిర్వర్తింపజేస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రెండు రాత్రులు, మూడు పగటి వేళల్లో వరుసగా డ్యూటీ చేయిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కఠినతరం విధులతో డ్రైవర్లు ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. 

21:13 - August 6, 2017
21:02 - August 6, 2017

12 శాతం జీఎస్టీని తగ్గించే వరకు రాజీలేని పోరాటం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీని తగ్గించే వరకు రాజీలేని పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీపై మోడీకి రాసే లేఖలోని అంశాలపై చర్చించారు. జూన్ 30 నాటికే ప్రారంభమైన ప్రాజెక్టులకు జులై 1 నుంచి అమలయ్యే జీఎస్టీని వర్తింపజేయడం సమంజసం కాదన్నారు. గతంలో 5 శాతం వ్యాట్ తో ప్రాజెక్టులకు అంచనాలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. ఇప్పుడు వాటిని సవరించడం కూడా కుదరదని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

నెల్లూరు టూ టౌన్ సీఐగా పని చేసిన రామకృష్ణారెడ్డికి బ్రెయిన్ స్ర్టోక్

నెల్లూరు : టూ టౌన్ సీఐగా పని చేసిన రామకృష్ణారెడ్డికి బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. నెల్లూరులోని ఓ ఆస్పత్రికి రామకృష్ణారెడ్డిని తరలించారు. క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలున్నాయని రామకృష్ణారెడ్డిపై ఆరోపణలున్నాయి. 3 రోజుల క్రితం రామకృష్ణారెడ్డిని అధికారులు వీఆర్ కు పంపారు. 

20:12 - August 6, 2017

రియాల్టీ షోలో రియాల్టీ లేదని వక్తలు అన్నారు. రియాల్టీ షోలో రియాల్టీ ఎంత..? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు... సునీల్ కుమార్ రెడ్డి, సైకాలజిస్ట్.. రవికుమార్, సామాజిక వేత్త... దేవి, రమణారెడ్డి పాల్గొని, మాట్లాడారు. రియాల్టీ షోల్లో అన్ని నాటకాలే అన్నారు. రియాల్టీ లేదు... రిహార్సల్స్ అని అన్నారు. రియాల్టీ షోలు ప్రజలపై చెడు ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్ : ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జీఎస్టీపై మోడీకి రాసే లేఖలోని అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

లారీ దూసుకెళ్లడంతో 30 గొర్రెలు మృతి

జయశంకర్ భూపాలపల్లి : కొంపల్లి క్రాస్ వద్ద గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 30 గొర్రెలు మృతి చెందారు. దీంతో అగ్రహించిన గొర్రెల కాపరి గొడ్డలితో లారీ డ్రైవర్ పై దాడి చేశారు. పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

19:34 - August 6, 2017

విద్యార్థి పైనుంచి దూసుకెళ్లిన బస్సు... విద్యార్థి మృతి

కడప : ప్రొద్దుటూరు సమీపంలో తేజ అనే విద్యార్థి పైనుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. విద్యార్థి తేజ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. 

నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

కర్నూలు : నకిలీ సర్టిఫికెట్లు ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 22 మంది నుంచి 121 రకాల నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్. 

 

19:10 - August 6, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక కాక రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు,  రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వేడి పుట్టిస్తోంది. ఎలాగైనా గెలుపు తీరాలకు చేరాలని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను భారీగా రంగంలోకి దించాయి. మరి ఇంతకీ నంద్యాలలో గెలుపు ఎవరిది? నంద్యాల ప్రజల ఏర్పు ఇవ్వనున్నారు? నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరి పక్షం? నంద్యాల ఉప ఎన్నికపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
టీడీపీ వర్సెస్‌ వైసీపీ
భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి నంద్యాల ఉప ఎన్నికపైనే ఉంది. అటు సీఎం, ఇటు ప్రతిపక్ష నేత జగన్‌.. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు.  ఇరుపార్టీలు సీనియర్‌ నేతలను రంగంలోకి దింపాయి.  క్యాబినెట్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఇతర ముఖ్యనేతలంతా నంద్యాలలో మకాం వేశారు. 
ఈనెల 23న ఉప ఎన్నిక
ఈనెల 23న నంద్యాల ఉప ఎన్నిక జరుగబోతోంది. టీడీపీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీలో నిలవగా.. ఇక వైసీపీ తరపున శిల్పా మోహన్‌రెడ్డి బరిలోకి దిదారు.  ఈ ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ, వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇరు పక్షాలు భారీగా పార్టీ శ్రేణులను మోహరించాయి. అధికార టీడీపీ  ఇప్పటి వరకు ఏడుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలతోపాటు నలుగురు కార్పొరేషన్‌ చైర్మన్లను రంగంలోకి దింపింది.  వీరందరికీ సీనియర్‌ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుతూ  వాటిని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
టీడీపీ హామీల వర్షం
ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే అధికార టీడీపీ హామీల వర్షం కురిపించింది. 1600 కోట్లతో పలు అభివృద్ధి పనులకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. రోడ్ల విస్తరణ, 13వేల మందికి ఇళ్లు, తాగునీరు, సీసీరోడ్లు, కమ్యూనిటీహాళ్‌లు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఇప్పటికే కొన్ని పనులను ప్రారంభించారు. నంద్యాల నియోజయవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను తమవైపు తిప్పుకోవడానికి మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.  అంతేకాదు.. నౌమాన్‌ అనే మరో మైనార్టీ నేతకు.. ఉర్దూభాష అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా నామినేటెడ్‌ పదవి కట్టబెట్టారు. దీంతో ముస్లింల ఓట్లు తమకే పడతాయని అధికార టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఇక బలిజ కాపులను తమవైపు తిప్పుకునే పనిని మంత్రి నారాయణకు అప్పగించారు. ఆర్యవైశ్యులతో టీజీ వెంకటేష్‌ భేటీలు జరుపుతున్నారు. ఇక మిగతా యూనియన్లు, మిల్లర్లు, వ్యాపారస్తులు, వివిధ వర్గాలతో సోమిరెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.  ఇప్పటికే నారా లోకేష్‌ ఒకసారి ప్రచారానికి వచ్చి వెళ్లారు.  ఎన్నిక తేదీకి ముందు ఆరు రోజులపాటు చంద్రబాబు, లోకేష్‌ ఇక్కడే మకాం వేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాపు ఓటర్లను ఆకర్షించేందుకు ఈనెల 19 లేదా 20న పవన్‌ కల్యాణ్‌తో రోడ్‌షో నిర్వహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం 17,18 తేదీల్లో రోడ్‌షోలో పాల్గొంటారని పార్టీశ్రేణులు చెబుతున్నాయి.
నంద్యాల ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తోన్న వైసీపీ
నంద్యాల ఉప ఎన్నికను వైసీపీ 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తోంది. ఇక్కడ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి మరింత ఊపు వస్తుందని వైసీపీ అధినేత జగన్‌ భావిస్తున్నారు. అధికారపార్టీ సీనియర్‌ నేతలను భారీగా మోహరించడంతో... తామేమీ తీసిపోమన్నట్టుగా ఆపార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, 20మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. నంద్యాలలోని 42 వార్డులకు ఒక్కో వార్డు బాధ్యత ఒక్కోనేతకు అప్పగించారు. ఇక జగన్‌ ఈనెల 12 నుంచి 21 వరకు నంద్యాలలోనే మకాం వేయనున్నారు. 9 రోజులపాటు నంద్యాలలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలు రచించనున్నారు. కాపు సామాజిక వర్గ ఓటర్లు టీడీపీవైపు వెళ్లకుండా చూసే బాధ్యతను జగన్‌ బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుకు అప్పగించారు.  వీరిద్దరూ నేరుగా కాపు ఓటర్ల ఇళ్లకే వెళ్తున్నారు. మొత్తానికి నంద్యాల గెలుపు రెండు పార్టీలకు అనివార్యమైంది. దీంతో విజయం సాధించేందుకు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. మరి నంద్యాల ఓటర్లు ఎవరిపక్షమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
 

 

18:58 - August 6, 2017

చిత్తూరు : దళితులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన ప్రజాసంఘాల నేతలపై కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని... మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని మధు హెచ్చరించారు. 

 

18:28 - August 6, 2017

విజయవాడ : డాక్టర్ సూర్యకుమారి మృతి కేసులో విచారణ కొనసాగుతోంది. మిస్టరీగా మారిన డా.సూర్యకుమారి మృతి కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు బొబ్బిలి విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సూర్యకుమారి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో కేసు నమోదు చేశారు. విద్యాసాగర్‌ను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చగా.... 15 రోజుల రిమాండ్‌ విధించారు. గత నెల 31న రాత్రి ఒంటి గంట సమయంలో ఎవరికీ చెప్పకుండా విద్యాసాగర్‌ బైక్‌పై వెళ్లిన సూర్యకుమారి.. అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  
కూనగుంట్ల లాకుల వద్ద మృతదేహం లభ్యం 
డాక్టర్ కొర్లపాటి సూర్యకుమారి కూనగుంట్ల లాకుల వద్ద ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈనెల ఒకటవ తేదీ మంగళవారం రాత్రి నుంచి సూర్యకుమారి అదృశ్యమయ్యారు. ఈమేరకు తమ కుమార్తె కనిపించడం లేదంటూ సూర్యకుమారి తల్లి మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సూర్యకుమారి ద్విచక్రవాహనాన్ని రైవస్ కాల్వ పక్కన గుర్తించిన పోలీసులు.. కాలువలో గాలింపు చేపట్టారు. కూనగుంట్ల లాకుల వద్ద సూర్యకుమారి మృతదేహం లభ్యమైంది. ఆమె ఒంటిపైన ఆభరణాల ఆధారంగా డాక్టర్‌ సూర్యకుమారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్ ఎదుటు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్... విద్యాసాగర్ కు 15 రోజుల రిమాండ్ విధించింది. 

 

సూర్యకుమారి మృతి కేసులో కొనసాగుతున్న విచారణ

విజయవాడ : డా. సూర్యకుమారి మృతి కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్ ఎదుటు హాజరుపర్చారు. మెజిస్ట్రేట్... విద్యాసాగర్ కు 15 రోజుల రిమాండ్ విధించింది. సూర్యకుమారి మృతికి కారణమయ్యాడని విద్యాసాగర్ పై అభియోగం ఉంది. 

 

18:10 - August 6, 2017

యాదాద్రి : ఓవైపు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపడితే.. మరోవైపు ఓ ఉపాధ్యాయుడు స్కూల్లోని చెట్లను నరికించి సొమ్ము చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల పరిధిలోని బచ్చలగూడ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు స్కూలు ఆవరణలోని చెట్లను నరికి బేరం పెట్టాడు. దాంతో ఆగ్రహించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ అధికారులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

18:01 - August 6, 2017

హైదరాబాద్ : ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశారా? సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయారా? హెల్మెట్‌ లేకుండా వాహనం నడుపుతున్నారా? ఇకపై అదేపనిగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించారో మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయినట్టే. హైదరాబాద్‌లో అమలులోకి వచ్చిన సరికొత్త పాయింట్ల విధానంతో పెనాల్టీ కట్టడమేకాదు లైసెన్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రమాదాల్ని అరికట్టేందుకు ట్రాఫిక్ విభాగం అమలు చేస్తున్న సరికొత్త విధానం బాగానే ఉన్నా.. వాహనదారులకు అవగాహన కల్పించకుండా అమలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సైడ్ బిజీ:
పాయింట్ల విధానం 
ప్రమాదాల నివారణలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం విదేశీ తరహాలో పాయింట్ల విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులపై పాయింట్లు విధిస్తున్నారు. 
పాయింట్ల విధానంపై నో క్లారిటీ
ఇప్పటికే గ్రేటర్ నగరం అంతటా పాయింట్ల విధానం అమలులోకి వచ్చినా ఇంకా వాహనదారులకు మాత్రం క్లారిటీ లేదు. పైగా పాయింట్ల అమలులో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనదారులకు కొత్త విధానంపై అవగాహన కల్పించకుండా ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రోడ్లపై గుంతలతో నానా ఇబ్బందులు పడుతుంటే.. తమ సహనాన్ని పరీక్షించేలా కొత్త పాయింట్ల విధానం మరో భయాన్ని సృష్టిస్తోందని జనం విమర్శిస్తున్నారు. 
కొత్త విధానంలో ప్రజలకు లేని అవగాహన
ప్రజలకు కొత్త విధానాలపై, కొత్త చట్టాలపై అవగాహన కల్పించకుండా జీవో నంబర్‌ 117 అమలు చేయడం విడ్డూరంగా ఉందని న్యాయవాదులు అంటున్నారు. రోడ్ల వెడల్పు చేయడం.. గతుకులు సరిచేయడం లాంటి చర్యలు చేపట్టి .. ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించిన తరువాతనే కొత్త విధానాలు అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. 
ప్రజల్లో అవగాహన పెరిగిందంటున్న పోలీసులు
మరోవైపు పాయింట్ల విధానం వల్ల చాలామందిలో అవగాహన పెరిగిందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అందరూ నిబంధనలు పాటిస్తున్నారని అంటున్నారు. కొద్దిరోజుల్లోనే కొత్త విధానం పూర్తిగా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
ట్రాఫిక్ ఉల్లంఘన పాటిస్తే పాయింట్లు 
నిబంధనలు ఉల్లఘించే వాహనదారులకు ట్రాఫిక్ పాయింట్లు వర్తిస్తాయని చెబుతున్న పోలీసులు సహజ న్యాయ సూత్రాలను వివరించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు.. అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. 

 

17:48 - August 6, 2017

హైదరాబాద్ : స్వచ్ఛ్ భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ పై అవగాహన కల్పిస్తూ మల్కాజ్‌గిరిలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారి, రిహబిలైజేషన్‌, లయన్స్‌క్లబ్‌ సభ్యులతో పాటు.. పలువురు సినీ నటులు కూడా హాజరయ్యారు. సే నో టు డ్రగ్స్‌ అంటూ నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగహాన కల్పించారు. ర్యాలీని సఫిల్‌ గూడ మిని ట్యాంక్‌బండ్‌ నుంచి మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

17:43 - August 6, 2017

హైదరాబాద్‌ : నగరంలో మరో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టైన వారిలో నైజీరియన్‌కు చెందిన జాన్‌ బాస్కో, కాకినాడకు చెందిన మహ్మద్‌ జహరుల్లా ఉన్నారు. నిందితుల నుంచి 180 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ముంబై కేంద్రంగా డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. నిందితుల కాల్‌లిస్ట్‌ ఆధారంగా సినీ ఇండస్ట్రీ, ఐటీ లింకులతో ఉన్న సంబంధాన్ని ఆరా తీస్తున్నారు. నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. 

 

16:47 - August 6, 2017

మహబూబ్ నగర్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మక్తల్ మండలం కాచివార్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

సవాంగ్ వ్యాఖ్యలను ఖండించిన నన్నపనేని

విజయవాడ : ఆయేషా మీరా కేసులో సీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. నిర్దోషిగా బయటకు వచ్చిన సత్యంబాబును ప్రధాన నిందితుడని ఎలా అంటారని ఆమె అక్షేపించారు. ఆనాడు పోలీసులు అసలు నిందుతులని తప్పించి అమాయకుడి జీవితాన్ని నాశనం చేశారని నన్నపనేని ఆవేదన వ్యక్తం చేశారు. 

కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు జీఎస్టీపై బహిరంగ్ లేఖ రాశారు. జీఎస్టీతో రాష్ట్రానికి లాభమే తప్ప నష్టం లేదని ప్రజలను తప్పుదోవ పట్టించిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన అన్నారు. కాంట్రాక్టర్లకు నష్టం వస్తుందనే ఇప్పుడు జీఎస్టీపై మాట మార్చారాని , కేసులకు భయపడి కేసీఆర్ కేంద్రానికి మద్దతు ఇస్తాన్నారని రేవంత్ రెడ్డి లేఖ లో పేర్కొన్నారు.

16:36 - August 6, 2017

కృష్ణా : ఫ్రెండ్‌షిప్‌ డే సరదా ప్రాణాలు తీసింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వెన్నూతల గ్రామంలో విషాదం నింపింది.  గన్నవరం పామర్తినగర్‌కు చెందిన అజయ్‌కుమార్‌, భానుప్రసాద్‌ వెన్నూతలలో ఉండే మరో స్నేహితుడు భానుకు ఫ్రెండ్ షిప్  డే విషెష్‌ చెప్పడానికి బయలు దేరారు. మిత్రుణ్ని కలిసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తిరిగి వెళుతూ చెరువులో ఈతకొట్టడానికి దిగారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటంతో.. నీళ్లలో మునిగి ఊపిరాడక అజయ్‌కుమార్‌ చనిపోయాడు. మునిగిపోతున్న భానుప్రసాద్‌ను స్థానికులు కాపాడారు. 

 

16:32 - August 6, 2017
16:26 - August 6, 2017

హైదరాబాద్ : తెలంగాణలో పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా కాకుండా.. ఏకపక్షంగా కుటుంబపాలన సాగుతుందని తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి రావడమే  మానేశారని పేర్కొన్నారు. వాస్తును ముందుకు తీసుకొస్తున్నారని చెప్పారు. 

16:21 - August 6, 2017

హైదరాబాద్ : ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై ఆందోళనలు చేపడుతున్నట్లు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు ప్రకటించారు. ఈమేరకు ఆయన హైదరాబాలో మీడియాతో మాట్లాడారు. రైతులకు రుణమాఫీ, గిట్టుబాటు ధర, బ్యాంకు రుణాల కోసం కేంద్రం చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నారు. 

మహబూబ్ నగర్ లో ఘోర రోడ్డు ప్ర్రమాదం

మహబూబ్ నగర్ : జిల్లా మక్తల్ మండలం కాచివార్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగుగు అక్కకక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. 

16:03 - August 6, 2017

ఢిల్లీ : కొలంబో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్‌ గెలిచింది. రెండో టెస్ట్‌లో స్పిన్నర్ల హవాతో భారత్‌ గెలుపు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో జడేజా వీరవిహారం చేశారు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 622 పరుగులు చేసి.. డిక్లేర్డ్‌ చేసింది. తరువాత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. అనంతరం ఫాలో ఆన్‌ ఆడిన లంక... 386 పరుగులకు ఆలౌటైంది. మూడు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి... భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

 

అగ్రవర్ణాల కులదురహంకారం

ఖమ్మం : జిల్లాలో కూసుమంచి ముత్యాలమ్మ పండగ వేడుకల్లో అగ్రవర్ణాల కులదురహంకారంతో ఎస్సీ కులానికి చెందిన ఉపసర్పంచ్ వెంకన్న (సీపీఎం) కొబ్బరికాయ కొట్టకుండా అగ్రవర్ణల వారు అడ్డుకున్నారు. బోరున విలపిస్తూ వెంకన్న వెనుదిరగడంతో కోపొద్రిక్తులైన ఎస్పీ కులాల వారు వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

 

15:56 - August 6, 2017

హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావ్‌ అన్నారు. విశాఖలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన..ప్రధాని మోదీ అభిప్రాయానికి అనుగుణంగా కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ నిర్వాసితులకు ఎల్ ఆండ్ టీ కంపెనీ ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మించాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు. 

 

15:54 - August 6, 2017

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో అభిమానులను ఉర్రూతలూగించిన జమైకన్‌ చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కెరీర్‌లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్‌ చివరిసారిగా పాల్గొని మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బోల్ట్‌ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్నా... బోల్ట్‌ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించినా.. చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికన్ అథ్లెట్ జస్టిన్‌ గాట్లిన్‌ తొలిస్థానంలో నిలిచాడు. 
 

15:50 - August 6, 2017

నల్లగొండ : జిల్లాలోని దామరచర్లలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును.. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలి వెళ్లారు. దామరచర్ల ఎండీవో ఆఫీస్‌ పక్కన పాపను వదిలి వెళ్లినట్టుగా.. వాడపల్లి పోలీసులకు సమాచారం అందంది. వెంటనే పాపను దామరచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పాపకు వైద్య పరీక్షలు చేయించగా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అనంతరం శిశువును నల్లగొండ శిశువిహార్‌ సిబ్బందికి అప్పగించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారన్నదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

 

15:44 - August 6, 2017

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని.. టీడీపీ సీనియర్‌ నేత పితాని సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజా కోర్టులో నంద్యాల ఉప ఎన్నికకు తాము సిద్ధంగా ఉన్నామని పితాని తెలిపారు. కూనీకోరు రాజకీయాలకు నాంది పలకవద్దని హితవు పలికారు. 

 

మహిళపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్: కాచిగూడలో దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులు ఆ మహిళకు మత్తు మందు ఇచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. స్పృహ కొల్పోయిన మహిళను ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. బాధిత మహిళ కాచిగుడలో పీఎస్ లో ఫిర్యాదు చేసింది. 

రైతులపై గోల్ట్ స్టోన్ ప్రసాద్ అనుచరులు దాడి

రంగారెడ్డి: జిల్లాలో శంషాబాద్ (మం) ఘాన్సిమియాగూడలో గోల్ట్ స్టోన్ ప్రసాద్ అనుచరులు హల్ చల్ చేశారు. గోల్ట్ స్టోన్ ప్రసాద్ అక్రమిత భూమిలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులపై దాడికి యత్నం చేశారు. భూమి ఖాళీ చేయకుంటే చంపుతామని బెదిరించారు. వారి పైకి తిరగబడ్డ రైతులు, కాంగ్రెస్ నాయకులతో కలసి గోల్ట్ స్టోన్ ప్రసాద్ అనుచరులు వేధిస్తున్నారంటూ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.

 

కొలంబో టెస్టులో భారత్ ఘనవిజయం

స్పోర్ట్స్ : శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో శ్రీలంకపై ఇండియా గెలుపొందింది. ఇండియా మ్యాచ్ తో పాటు సీరిస్ కూడా కైవసం చేసుకుంది.

నార్కట్ పల్లి పీఎస్ లో వ్యక్తి అత్మహత్యాయత్నం

నల్లగొండ : జిల్లా నార్కట్ పల్లి పీఎస్ లో ఓ దొంగతనం కేసులో యాసిడ్ తాగి నాగరాజు అనే వ్యక్తి అత్మహత్యాయత్నం చేశాడు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

13:54 - August 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రేమ కలిగినా, కోపం వచ్చినా కష్టమే. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రంలో మోడీ సర్కార్‌తో మొదట్లో అటూఇటూగా ఉన్నా.. తర్వాత మోడీతో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఒక దశలో తెలుగు రాష్ట్రాల్లో మిత్ర పక్షమైన బాబు కంటే మోడీ దగ్గర కేసీఆర్‌కే పలుకుబడి ఎక్కువగా ఉందని.. త్వరలోనే కేంద్రప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ జాయిన్ అవుతుందని ప్రచారం కూడా జరిగింది. ఇంత మంచి సంబంధాలున్నా కేసీఆర్‌కి మాత్రం.. కేంద్రం వన్‌ సైడ్‌ లవ్‌గా చూస్తున్నట్లు కనిపిస్తోంది. నువ్వు నాకు సహకరించావు తప్ప.. నేను నీకు ఉపయోగపడను అన్నట్లు కేంద్రం తీరు కనిపిస్తోంది. దేశంలో మోడీ సర్కార్‌ తీసుకున్న కీలక నిర్ణయాలన్నింటికీ బీజేపీ దాని మిత్రపక్ష పార్టీల ప్రభుత్వాల కంటే ముందే.. టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక అన్నింటిలోనూ కేసీఆర్‌ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అదనంగా దాదాపు 20 వేల కోట్ల భారం
ఇంత చేసినా కేంద్రం నుంచి కేసీఆర్‌ అడిగిన సాయం మాత్రం అందడం లేదు. చేసిన ప్రతి విజ్ఞప్తికి చేద్దాం.. చూద్దాం అనే సమాధానమే దొరుకుతోంది. తాజాగా జీఎస్టీలో నీటి పారుదల రంగం, చేనేత పరిశ్రమ, గ్రానైట్, బీడి పరిశ్రమ వంటి రంగాలకు మినహాయింపు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. నీటి పారుదలపై ఏకంగా 18 శాతం జీఎస్టీతో.. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు 20 వేల కోట్ల భారం పడుతుంది. దీంతో కొత్త రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని జీఎస్టీని తగ్గించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కేసీఆర్‌, ఈటెల, అధికారులు కూడా ఎన్నోసార్లు విన్నవించారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు కోపం వస్తోంది.

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే
జీఎస్టీ విధానం అమలు విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న.. ఏక పక్ష విధానానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్‌ మరోసారి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఎవ్వరికైనా విషయం తన దాకా వస్తే కానీ అర్థం కాదంటే ఇదేనేమో. జీఎస్టీని ప్రారంభించేటప్పుడు దేశానికి మరోసారి అర్థరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని పొగడ్తల్లో ముంచేసి.. తీరా ప్రాక్టికల్స్‌లో చుక్కలు కనిపిస్తోంటే విమర్శలు, పోరాటాలు అంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమేనని విమర్శలు

గ్యాస్ సిలిండర్ పేలి తల్లి కొడుకులకు గాయాలు

కడప: జిల్లా జమ్మలమడుగులో పాతబస్టాండ్ వద్ద ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి తల్లి కొడుకులకు తీవ్ర గాయలైయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

13:52 - August 6, 2017

విజయవాడ : గుడివాడ రూరల్‌ మండలం దొండపాడులో దళితులపై దాడి జరిగింది. అక్రమంగా చేపల చెరువులు తవ్వొద్దన్నందుకు.. టీడీపీ వర్గీయులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీరికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో బీవీ శ్రీనివాస్‌, అనిల్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. బాధితులకు వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు అండగా నిలిచారు. దాడిచేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇంత జరిగినా.. గుడివాడ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ఘటనా స్థలికి చేరుకోలేదు. ఇదే విషయాన్ని గుడివాడ డీఎస్పీకి తెలియజేసినా స్పందించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. 

13:51 - August 6, 2017

విజయవాడ : ఆస్పత్రిలో..సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. సూర్యకుమారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సూర్యకుమారి అంత్యక్రియలు మధ్యాహ్నం జి.కొండూరు మండలం గడ్డమడుగులో జరగనున్నాయి. ఇదిలా ఉంటే తమ కూతురిని ఎంత మోసగించాలో అంత మోసగించారని.. సూర్యకుమారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కొవ్వాడలో అణువిద్యుత్ పార్కు....కేంద్రం సన్నహాలు

విశాఖ: జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ పార్కు ఏర్వాటుకు ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కళా వెంకట్రావ్ తెలిపారు. అణువిద్యుత్ పార్కు కొవ్వాడలోనే ఏర్వాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని ఆయన అన్నారు. నిర్మాణ బాధ్యతలను కేంద్రం చూసుకుంటుందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటమని ఆయన అన్నారు.

 

దళితులపై దాడి చేసిన టీడీపీ నేతలు

విజయవాడ : కృష్ణా జిల్లా రూరల్ మండలంలో దొండపాడులో దళితుల పై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వామపక్షాలు, కాంగ్రెస్,లోక్ సత్తా, వైసీపీ నాయకులు ధర్నా దిగారు. అక్రమంగా చేపల చెరువులు తవ్వొద్దనందుకు  టీడీపీ వర్గీయులు ఇనుప రాడ్లు,కర్రలతో దళితులపై దాడి చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలి అంటూ వారు డిమాండ్  చేశారు. దళితులకు సీపీఎం నాయకులు అండగా నిలిచారు. ఈ దాడిలో గాయాలైన వారికి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడి విషయాన్ని డీఎస్పీకి తెలియాజేసిన స్పదించాలేదని వారు ఆరోపించారు. 

 

13:44 - August 6, 2017
13:43 - August 6, 2017
13:42 - August 6, 2017

తూర్పు గోదావరి : జిల్లా కిర్లంపూడిలో మరోసారి పాదయాత్రకు సిద్ధమైన కాపు ఉద్యమనేత ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసం నుంచి మద్దతు దారులతో బయటకు వచ్చిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ... నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని ముద్రగడ, కాపు నేతలు నిరసన తెలిపారు.

13:40 - August 6, 2017

జపాన్ : 1945.. ఆగస్టు 6న హిరోషిమా-నాగసాకిలపై జరిగిన అణుదాడి... లక్షలాది మంది మృత్యుఘోషతో... ఆగిపోలేదు.. ఆ అణుబాంబులు సృష్టించిన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఆ అణు యుద్ధం శకలాలకు ఎంతో మంది చిన్నారులు .. పసి వయసులోనే కన్నుమూశారు. దానికి సడకో ససకీ అనే చిన్నారి నిలువెత్తు సాక్ష్యం.. హిరోషిమాపై అణుదాడి జరిగే సమయానికి ఈ పాప వయసు కేవలం రెండేళ్లే. అయితే ఆ దాడి వల్ల ఏర్పడిన రేడియో ధార్మికత ప్రభావం ఆమెకు 11 ఏళ్లు నిండాక కనిపించింది. ఆ రేడియో ధార్మికత వల్ల సడకో ససకీకి రక్త క్యాన్సర్‌ సోకింది.అణు రక్కసి గురించి తెలియని సడకో ససకీ, వేయి కాగితపు పక్షులు చేస్తే...జబ్బు తగ్గిపోతుందని నమ్మి... రోజూ కాగితపు పక్షులు చేస్తూ ఉండేది... కానీ ఆ చిన్నారి ఆశ నెరవేరలేదు....ఆరోగ్యం క్షీణించి.. 644 పక్షులను మాత్రమే చేసి.. అర్ధాంతరంగా తనువు చాలించింది. సడకో కథ ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కదిలించింది. ప్రతి ఏడాది శాంతి ప్రేమికులెందరో కాగితపు పక్షులను తయారుచేసి జపాన్‌లో హిరోషిమా ప్రాంతంలో వెలిసిన శాంతి సంఘానికి పంపిస్తున్నారు. సడకో అందించిన స్ఫూర్తికి గుర్తుగా హిరోషిమా ప్రాంతంలో ఒక శాంతి స్తూపం కూడా కట్టారు. ఆ స్తూపంపై కాగితపు పక్షులను చేతితో చేస్తున్న సడకోససకి బంగారు విగ్రహం ఉంటుంది.

అణు విద్యుత్‌ కేంద్రాలకు స్వాగతం పలుకుతున్న భారత్
హిరోషిమా.. పొలికేకలు.. ఇంకా ధ్వనిస్తూనే ఉన్నా... భారత పాలకులు మాత్రం ఆ అణు విద్యుత్‌కు.. రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. అణు విధ్వంసపు ఆనవాళ్లు చెరగక ముందే... దేశంలో... అణు విద్యుత్‌ కేంద్రాలకు స్వాగతం పలుకుతున్నారు. దేశంలోని...అనేక రాష్ట్రాల్లో అణు కుంపట్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కోస్తా ప్రాంతంలో అణు ప్లాంట్లను పెట్టేందుకు పాలకులు సిద్ధమయ్యారు. దేశంలోనే అణు కేంద్రాల కూడలిగా ఆంధ్రప్రదేశ్‌ మారబోతుంది. 2031 నాటి లక్ష్యమైన 60వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిలో 32వేల మెగావాట్లకు పైగా విద్యుత్తును ఏపీలో నెలకొల్పబోయే అణు విద్యుత కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. నెల్లూరులోని... కావలి ప్రాంతంలో రష్యాకు చెందిన రోసాటం అనే అణుసంస్థ ఆరు అణు రియాక్టర్లను నిర్మించేందుకు రంగం సిద్ధమైంది.హిరోషిమా అణుదాడి ప్రభావంతో ఇప్పటికీ చాలామంది బాధపడుతూనే ఉన్నారు... అంతేకాకుండా.. అమెరికాలోని త్రీమైల్‌ ఐలాండ్‌, రష్యాలోని చెర్నోబిల్‌, జపాన్‌ ఫుకుషిమాలాంటి అణు విద్యుత్‌ కేంద్రాల్లో సంభవించిన భారీ ప్రమాదాలు...చాలా మంది ప్రాణాలు తీశాయి.

రేడియో ధార్మికతకు క్యాన్సర్‌
ఆ రేడియో ధార్మికతకు క్యాన్సర్‌ లాంటి భయంకరమైసన వ్యాధులతో లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ఆ అణు విధ్వంసం గురించి తెలిసిన ప్రజాస్వామిక... మేధావులు అణు విద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తున్నారు.. గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రలో స్థానిక ప్రజలు అణు ప్లాంట్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికైనా భారత పాలకులు దీనిని గుర్తించి.. అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటును నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. హిరోషిమా డే సందర్భంగా ఈ దిశగా సంకల్పించుకోవాల్సి ఉంది. 

13:37 - August 6, 2017

జపాన్ : హిరోషిమా ...! కోట్లాది మంది ఆక్రందన... రెండు నగరాల పొలి కేక...ఆ ఆక్రందనకు సరిగ్గా 72 ఏళ్లు నిండాయి. 1945 ఆగస్టు 6న జపాన్‌ పారిశ్రామిక నగరాలైన హిరోషిమా-నాగసాకిలపై అమెరికా అణు బాంబులతో విరుచుకుపడింది. మొదటగా హిరోషిమాపై లిటిల్‌ బాయ్‌ పేరుతో అణుబాంబు వేయగా.. ఆ దాడిలో లక్షా 40వేల మందికి పైగా మృతి చెందారు. తర్వాత ఫ్యాట్‌ మ్యాన్‌ పేరుతో నాగసాకి పట్టణంపై అణు బాంబు వేసింది. ఇందులో 80 వేలకు పైగా ప్రజలు మరణించారు.ఆ అణు యుద్ధంలో... ఎంతో మంది విగత జీవులవ్వగా.. మరెంతోమంది వికృతంగా మారారు. చాలామంది అనాథలుగా మారారు...అంతేనా... హిరోషిమా- నాగసాకి నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ అణుశకలాలు... చాలామందిని వ్యాధి గ్రస్థులుగా మారుస్తూనే ఉన్నాయి. ఆ విధ్వంసం నేటికీ కొనసాగుతూనే ఉంది. నాటి భయానక దృశ్యాలను గుర్తు చేసుకుంటూ.. భవిష్యత్తులో అనుసరించాల్సిన రీతులను అన్వేషిస్తూ.. అంతర్జాతీయ సమాజం.. ఆగస్టు 6ను హిరోషిమా దినంగాను, అణ్వస్త్ర వ్యతిరేక దినం గాను జరుపుకుంటోంది.

13:35 - August 6, 2017

అనంతపురం : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డిపై మండిపడ్డారు వైసీపీ సమన్వయ కర్త దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి.. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని.. జరిగే అన్ని పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని.. మూడేళ్లు మంత్రిగా పనిచేసినా... నియోజవర్గానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మించిన పవిత్ర క్షేత్రానికి ఎమ్మెల్యేగా ఉంటూ అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని శ్రీధర్ రెడ్డి అన్నారు.

13:34 - August 6, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రానికి చట్టపరంగా తన ప్రాంత వనరుల మీద అధికారం దక్కిందన్నారు టీజాక్‌ ఛైర్మన్‌ కోదండరామ్‌. అయితే రాష్ట్ర తర్పాత కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సమస్యాత్మకంగా ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటివరకు 20 వేల నియామకాలు కూడా చేపట్టలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన బాధ్యత రహిత్యంగా ఉందని.. కేసీఆర్‌ భాష సీఎం స్థాయికి తగినట్లుగా లేదని కోదండరామ్ అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

సూర్యకుమారి పొస్టుమార్టం పూర్తి

 

విజయవాడ : అస్పత్రిలో సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె మృతదేహన్ని చూడడానికి తల్లిరండ్రులు, బంధువులు భారీగా ఆస్పత్రి కి తరలి వచ్చారు.  ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తీని ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం గడ్డమడుగులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.    

12:21 - August 6, 2017

విజయవాడ : దొండపాడులో దళితులపై జరిగిన దాడులను అఖిలపక్ష నేతలు ఖండించారు. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వామపక్షాలు, కాంగ్రెస్, లోక్ సత్తా, వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. బాధ్యులపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలను నిలిపివేయాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12:11 - August 6, 2017

కృష్ణా : విజయవాడ ఆస్పత్రిలో..సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. సూర్యకుమారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సూర్యకుమారి అంత్యక్రియలు సాయంత్రం మైలవరం మండలం గడ్డమడుగులో జరగనున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:30 - August 6, 2017

కడప: జమ్మల మడుగు బస్ డిపోలో పనిచేస్తున్న జ్వాలా నరసింహ.. ఉదయం స్టవ్ వెలిగించగానే సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతయింది.

ఈ పేలడుతో ప్రక్కన ఉన్న మీ సేవ కూడా తెబ్బతింది.  గాయపడ్డ వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు వేకువజామున 3 గంటల ప్రాంతంలో  జ్వాల నరసింహ విధినిర్వహణలో భాగంగా లైట్ వేయడంతో అప్పటికే గ్యాస్ అలముకోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది.

11:27 - August 6, 2017

కృష్ణా : విజయవాడ ఆస్పత్రిలో..సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోంది. సూర్యకుమారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సూర్యకుమారి అంత్యక్రియలు సాయంత్రం మైలవరం మండలం గడ్డమడుగులో జరగనున్నాయి. 

కొవ్వాడలో అణువిద్యుత్ పార్క్ ఏర్పాటు: మంత్రి కళా

విశాఖ: కొవ్వాడలో అణువిద్యుత్ పార్క్ ఏర్పాటకు ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. అణువిద్యుత్ పార్క్ ను కొవ్వాడలోనే ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. నిర్మాణ బాధ్యతలను కేంద్రం చూసుకుంటుందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని మంత్రి తెలిపారు.

11:13 - August 6, 2017

సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం...

కృష్ణా : విజయవాడ ఆస్పత్రిలో సూర్యకుమారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సూర్యకుమారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సాయంత్ర మైలవరం మండం గడ్డమడుగులో అంత్యక్రియలు జరగనున్నాయి.

రెండో రోజు కొనసాతున్న పొన్నం దీక్ష...

కరీంనగర్: కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం నాటికి రెండో రోజుకు చేరింది. కరీంనగర్ లో మెడికల్ కాలేజీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ దీక్షకు దిగారు. కాగా... పొన్నం నిరాహారదీక్షకు పలువురు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... పొన్నం ఆరోగ్య పరిస్థితి విషమించక ముందే మెడికల్ కాలేజీపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

 

కెరీర్ చివరి మ్యాచ్‌ కాంస్యంతో ముగించిన ఉసేన్ బోల్డ్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో అభిమానులను ఉర్రూతలూగించిన జమైకన్‌ చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కెరీర్‌లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్‌ చివరిసారిగా పాల్గొని మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బోల్ట్‌ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్నా... బోల్ట్‌ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించినా.. చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు.

టీజాక్‌ ఆధ్వర్యంలో ఘనంగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి వేడుకలు

హైదరాబాద్: ప్రొఫెసర్‌ జయశంకర్‌ 83వ జయంతి వేడుకలను టీజాక్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. జయశంకర్‌ జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసమే త్యాగం చేశారని ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని.. ఆయనలేని రాష్ట్రాన్ని ఊహించుకోలేక పోతున్నామన్నారు. ఐక్యంగా పోరాటం చేయాలన్న ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని కోదండరామ్ అన్నారు.  

10:48 - August 6, 2017

ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పథకం అబాసుపాలవుతోంది. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామమైన గండగలపాడులో 20 ఇళ్లు మాత్రమే నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి.. లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో ఎక్కడా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పూర్తి కాలేదు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి....

ప్రొ.జయశంకర్ ను గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్:  ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయన్ను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఆంధ్రపదేశ్ లో విలీనమైన నాటి నుంచి మలిదశ తెలంగాణ ఆవిర్భావజాల వ్యాప్తికి జీవితాన్ని ధారపోశాడని జయశంకర్ ను కేసీఆర్ కొనియాడారు. ప్రొజయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూరర్తి ప్రదాతగానే నిలుస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు.

మరోసారి ముద్రగడ పాదయాత్ర విఫలం...

తూ.గో:మరోసారి పాదయాత్ర ను ముద్రగడ ప్రారంభించారు. వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. కిర్లంపూడిలోని తన ఇంటి ఎదుట నోటికి నల్ల రిబ్బన్ కుట్టుకొని ముద్రగడ నిరసన తెలియజేస్తున్నారు.

10:11 - August 6, 2017

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడిగా ఆర్థికవేత్త డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. తాను బోధనా వృత్తిని కొనసాగించేందుకు ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అరవింద్‌ పనగడియా ప్రకటించిన నేపథ్యంలో ఈ నియామకం చోటుచేసుకుంది. రాజీవ్‌తో పాటు నీతి ఆయోగ్‌ సభ్యుడిగా ఎయిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ వినోద్‌ పాల్‌ను ప్రభుత్వం నియమించింది. రాజీవ్‌కుమార్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి డాక్టర్‌ ఫిలాసఫీ, లఖ్‌నవూ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు.

మెట్రోరైలు ప్రాజెక్టు బాధ్యతల నుంచి తప్పుకున్న డీఎంఆర్ సీ

విజయవాడ: మెట్రోరైలు ప్రాజెక్టు బాధ్యతల నుంచి డీఎంఆర్ సీ తప్పుకున్నారు. అమరావతి మెట్రో కార్పొరేషన్ బాధ్యతల నుంచి తప్పించాలని ఏపీ సీఎస్ కు మెట్రోరైల్ సలహాదారు శ్రీధరన్ లేఖ రాశారు.

 

కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం

హైదరాబాద్ : నార్త్ జోన్ మరియు తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో యువతకు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ మహేందర్‌ రెడ్డి, నార్త్‌ జోన్ డీసీపీ సుమతి, నార్త్‌ జోన్‌లోని 11 పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామన్నారు సీపీ. మహేందర్‌ రెడ్డి. త్వరలో 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ రాబోతోందని..

తిరుమల శ్రీవారి ఆలయం మూపివేత...

తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 2 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని తెలిపారు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్ విఐపీలకు మాత్రం మినహాయింపు నిచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారిని ఏపీ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్ దర్శించుకున్నారు. 

09:32 - August 6, 2017

తిరుమల: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం 4:30 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 2 గంటల వరకు ఆలయం మూసి ఉంటుందని తెలిపారు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్ విఐపీలకు మాత్రం మినహాయింపు నిచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారిని ఏపీ చీఫ్‌ సెక్రటరీ దినేష్‌కుమార్ దర్శించుకున్నారు. 

09:30 - August 6, 2017

హైదరాబాద్: విద్యార్థుల మౌనం దేశానికే ప్రమాదకరం అని ప్రొ. కోదండరాం తెలిపారు. ఆయన ప్రొ.జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జయశంకర్ మానవతా వాది, ప్రజలందరూ సమానంగా ఎదగడానికి అవకాశాలు కావాలని కోరుకున్నారనిన తెలిపారు. ఎర్పడిన తెలంగాణ ఎలావుండాలో ఓ స్పష్టత కలిగిన వారు. తెలంగాణ వచ్చే దాకా రాష్ట్రం కోసం పోరాడాలి. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలందరిలో వెలుగు నింపడం కోసం పోరాడాలని హిత బోధ చేశారని.. అది ఇపుడు మాకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ప్రజలు కేంద్రంగా గల అభివృద్ధి సాధించగలిగింది అంటే జయశంకర్ వల్లే అని నమ్ముతున్నామని తెలిపారు. 

09:24 - August 6, 2017

విజయవాడ: గుడివాడ రూరల్ మండలం దొండ పాడులో దళితులపై దాడి జరిగింది. అక్రమంగా చేపల చెరువులు తొవ్వొద్దన్నందుకు ఇనుప రాడ్లు, కర్రలతో టీడీపీ వర్గాలు దాడి చేశాయి. దళితులకు అండగా సీపీఎం నాయకులు నిలిచారు. మహిళలను సైతం వదలకుండా దాడి చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడి లో 25 మందికి గాయాలు కాగా వారిలో సీపీఎం నేతలు బీవీ శ్రీనివాస్, అనిత్ కుమార్ కు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులు విజయవాడ ప్రభుత్వాస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీపీఎం, వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుని దాడిచేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇంత జరిగినా.. గుడివాడ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాడి జరిగి 24 గంటలు అవుతున్నా ఘటనా స్థలికి చేరుకోలేదు. ఇదే విషయాన్ని గుడివాడ డీఎస్పీకి తెలియజేసినా స్పందించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు. 

దొండపాడులో దళితులపై దాడి: నలుగురికి గాయాలు..

విజయవాడ: గుడివాడ రూరల్ మండలం దొండ పాడులో దళితులపై దాడి జరిగింది. అక్రమంగా చేపల చెరువులు తొవ్వొద్దన్నందుకు ఇనుప రాడ్లు, కర్రలతో టీడీపీ వర్గాలు దాడి చేశాయి. దళితులకు అండగా సీపీఎం నాయకులు నిలిచారు. టీడీపీ దాడి లో నలుగురికి గాయాలు కాగా వారిలో సీపీఎం నేతలు బీవీ శ్రీనివాస్, అనిత్ కుమార్ కు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులు విజయవాడ ప్రభుత్వాస్పతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీపీఎం, వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

08:48 - August 6, 2017

అమరావతి: నాణ్యమైన భూమి కలిగిన కృష్ణానది ఒడ్డున కాంక్రీటు బిల్డింగ్‌లు నిర్మించడం మంచిది కాదని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. కృష్ణానది పరిరక్షణ కమిటీ సభ్యులు, సామాజిక వేత్తలు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని లంక గ్రామాల్లో పర్యటించారు. ఉద్దండ్రాయినిపాలెం లంక గ్రామాల్లోని రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నదుల పరిరక్షణకు, రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని డా.రాజేంద్రసింగ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చిన సామాజిక వేత్తలను అధికారులు అడ్డుకోవడాన్ని సీపీఎం నేత సి.హెచ్.బాబురావు ఖండించారు. అమరావతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. 

08:07 - August 6, 2017

ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా తెలుగుతేజం ఎం. వెంకయ్యనాయుడు విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం పోలైన 771 ఓట్లలో వెంకయ్యకు 516 ఓట్లు రాగా గోపాల కృష్ణ గాంధీకి 244 ఓట్లు పడ్డాయి. వెంకయ్యనాయుడు విజయం పట్ల తెలుగు రాష్ట్రాల అధికార విపక్ష నేతలు అభినందనలు తెలిపారు. ఇవాళ వెంకయ్య శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు.

భారత 15వ ఉపరాష్ట్రపతి గా వెంకయ్య...

భారత 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి.. గాంధీజీ మనవడు గోపాలకృష్ణ గాంధీపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 785 ఓట్లకు గాను 771 ఓట్లు పోలయ్యాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 14 మంది ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోలేదు. వెంకయ్యకు 516ఓట్లు రాగా.. విపక్ష అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు వచ్చాయి. గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల తేడాతో వెంకయ్య విజయం సాధించారు. 11 ఓట్లు చెల్లలేదని రాజ్యసభ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి తెలిపారు. ఈ నెల 11న వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

వెంకయ్యకు గోపాలకృష్ణ అభినందనలు...

ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వెంకయ్య నాయుడుకు గోపాలకృష్ణ గాంధీ అభినందనలు చెప్పారు. తనకు మద్దతు పలికిన అందరికీ గోపాలకృష్ణ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.

తాము అనుకున్నదానికన్నా గోపాల కృష్ణ గాంధీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని కాంగ్రెస్‌ ఎంపీ గులాంనబీ ఆజాద్‌ అన్నారు.

వెంకయ్యనాయుడుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఏపీ విపక్ష నేత జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తనకు మద్దతిచ్చిన అందరికి ధన్యవాదాలు

భారతదేశ 15న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు తనకు మద్దతిచ్చిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సహకారం, మిత్రపక్షాల తోడ్పాడుతోనే ఇంత సులభంగా విజయం సాధ్యమైందన్నారు.

07:38 - August 6, 2017

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదని నంద్యాల బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన జగన్‌పై ఈసీ కన్నెర్ర జేసింది. జగన్‌ వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌కు నోటీసులు జారీ చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం భయపడుతోందా?, నంద్యాలలో ప్రజలు టిడిపికి గుణ పాఠం చెప్పాల్సిన అవసరం వుందా? అధికార, ప్రతిపక్షం విమర్శలు.. ప్రతివిమర్శలు మాని... ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం లేదా? ఇలాంటి అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత సీహెచ్ బాబూరావు, టిడిపి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, వైసీపీ నేత మల్లాది విష్ణు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

నడి రోడ్డు పై అపుడే పుట్టిన ఆడ శిశవు

న‌ల్ల‌గొండ‌: అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డు పై వదిలేసి వెళ్లారు. ఈ ఘటన దామరచర్ల మండల కేంద్రంలో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. గుర్తించిన స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అధికారులు శిశువును వైద్య‌శాల‌కు త‌ర‌లించారు. పాప ఆరోగ్యంగా ఉంద‌ని వైద్యులు తెల‌ప‌డంతో ఊప‌రి పీల్చుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని శిశువును శిశువిహార్‌కు త‌ర‌లించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి మొత్తం 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామివారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. అలాగే నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 3గంటల సమయం పడుతోంది. 

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

విశాఖ: వచ్చే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శనివారానికి వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆదివారంకల్లా అక్కడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శాఖ పేర్కొంది. దీంతో కోస్తా, తెలంగాణలో సోమవారం నుంచి వర్షాలు కురుస్తాయని, అల్పపీడనం వాయవ్యంగా పయనించే క్రమంలో తెలంగాణలో వర్షాలు పెరుగుతాయన్నారు.

మిథాలీ రాజ్ సన్మానించిన సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ

హైదరాబాద్: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ సత్కరించింది.రెండు సార్లు భారత జట్టును వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చేర్చి చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయమని ముఖ్య అతిధులు టీమిండియా కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.చిన్ననాటి నుంచి క్రికెట్‌ మెలకువలు నేర్చుకున్న సహచరులు, కోచ్‌ల సమక్షంలో సన్మానం జరగడం కలలా ఉందని మిథాలీ సంబరపడిపోతూ చెప్పింది.

భారత బాక్సర్‌ విజేందర్‌ విక్టరీ

హైదరాబాద్: భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌సింగ్‌... రింగ్‌లో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించాడు. చైనాకు చెందిన బాక్సర్‌ జుల్ఫికర్‌ మైమైటియాలితో జరిగిన బౌట్‌లో 3-0తో నెగ్గాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌తోపాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 31ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. విజేందర్‌కు చైనా బాక్సర్‌ నుంచి తీవ్ర పోటీయే ఎదురైంది. చైనా బాక్సర్‌ పంచ్‌లను తట్టుకుని.. అంతేవేగవంతమైన పంచ్‌లను విజేందర్‌ విసిరాడు.

జగన్‌ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నాడు: సుజాత

అమరావతి : నంద్యల ఉపఎన్నికల్లో ఓటమిని ఓర్వలేక జగన్‌ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. బహిరంగ సభలో జగన్‌ వ్యాఖ్యలు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. జగన్‌ రాజకీయాల్లోకి వస్తే హత్యారాజకీయాలు తప్పవని విమర్శించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ కు ఈసీ నోటీసు...

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చిచంపినా తప్పులేదని నంద్యాల బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన జగన్‌పై ఈసీ కన్నెర్ర జేసింది. జగన్‌ వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కర్నూలు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌కు నోటీసులు జారీ చేశారు. జగన్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ స్పందించి... సుమోటోగా విచారణకు స్వీకరించారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ నుంచి వివరణ కోరారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లైతే జగన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

టీ.సర్కార్ ఈసీ మొట్టికాయలు తప్పేలా లేదా..!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ మొట్టికాయలు తప్పేలా లేదు. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉంటూ ప్రైవేట్‌ మోటార్స్‌ కంపెనీకి డైరెక్టర్‌గా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్‌పై ఈసీ దృష్టి సారించింది. లెఫ్ట్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదును పంపింది. దీంతో కేటీఆర్‌పై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటున్నది ఆసక్తి రేపుతోంది.

కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ ల బృందం సందడి

కరీంనగర్‌ :జిల్లాలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బృందం సందడి చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని 19 సభ్యులగల బృందం సందర్శించింది. లక్ష్మీపూర్‌ దగ్గర నిర్మాణం జరుగుతున్న సొరంగాల నిర్మాణాలనూ భూగర్భంలోకి దిగి పనులను పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టు బృహత్తరమైన ప్రాజెక్టుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభివర్ణించగా.... ఇది తమకు మంచి విజ్ఞానాన్ని అందించిందని యువ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 18శాతం పన్ను సరికాదు: కేటీఆర్‌

హైదారబాద్: తెలంగాణలో సంక్షేమ పథకాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 18శాతం జీఎస్టీ పన్ను విధించడాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వ్యతిరేకించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పన్నును 12శాతానికి తగ్గించడానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒప్పుకున్నారన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులపై జీఎస్టీ తగ్గింపును ఆలోచిస్తామని చెప్పారన్నారు. టెక్స్‌టైల్‌ రంగంలోని జాబ్‌వర్క్స్‌పై ట్యాక్స్‌ను 5శాతం తగ్గించమని కోరామన్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకు అరుణ్‌జైట్లీ అంగీకరించారని తెలిపారు. 

జీఎస్టీ అమలుపై కేసీఆర్ అసంతృప్తి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్నును స్వాగతించిన సీఎం కేసీఆర్‌.. దాని అమలు విషయంలో తొలిసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. శనివారం జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ విధించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్టులపై పన్ను వల్ల తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఇవాళ ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

వైద్యురాలి అదృశ్యం కథ విషాదాతం...

కృష్ణా : విజయవాడలో అదృశ్యమైన డాక్టర్‌ సూర్యకుమారి కథ విషాదాంతమైంది. రైవస్‌ కాలువలో సూర్యకుమారి శవమై తేలింది. గాంధీనగర్‌ సమీపంలోని రైవస్ కాల్వ పక్కన ఆమె ద్విచక్రవాహనాన్ని గుర్తించిన పోలీసులు.. కాలువలో గాలింపు చేపట్టడంతో కూనగుంట్ల లాకుల వద్ద సూర్యకుమారి మృతదేహం లభించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. 

వెంకయ్య స్వగ్రామంలో సందడి

నెల్లూరు : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు విజయంతో ఆయన స్వగ్రామమైన నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది. ఒక రైతు బిడ్డ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రిగా వెంకయ్యనాయుడు తమ ఊరికి చేసిన సేవలను గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు.

'ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య వన్నె తీసుకొస్తారు'

హైదరాబాద్: వెంకయ్యనాయడు ఉపరాష్ట్రపతిగా గెలవడంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. వెంకయ్య విజయం తెలుగు వారందరికీ గర్వకారణమని కొనియాడారు. అనుకున్నదానికంటే మెజార్టీ పెరగడం వెంకయ్య వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. వెంకయ్య తప్పకుండా ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తీసుకొస్తారని ఆకాంక్షించారు. వెంకయ్యకు వారంతా శుభాకాంక్షలు తెలిపారు. 

06:55 - August 6, 2017

హైదారబాద్: తెలంగాణలో సంక్షేమ పథకాలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 18శాతం జీఎస్టీ పన్ను విధించడాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో వ్యతిరేకించినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పన్నును 12శాతానికి తగ్గించడానికి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒప్పుకున్నారన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులపై జీఎస్టీ తగ్గింపును ఆలోచిస్తామని చెప్పారన్నారు. టెక్స్‌టైల్‌ రంగంలోని జాబ్‌వర్క్స్‌పై ట్యాక్స్‌ను 5శాతం తగ్గించమని కోరామన్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ 21వ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకు అరుణ్‌జైట్లీ అంగీకరించారని తెలిపారు. 

06:53 - August 6, 2017

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు, సేవల పన్నును స్వాగతించిన సీఎం కేసీఆర్‌.. దాని అమలు విషయంలో తొలిసారి అసంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. శనివారం జరిగిన జీఎస్టీ పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ విధించడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్టులపై పన్ను వల్ల తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఇవాళ ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు.

06:51 - August 6, 2017

కరీంనగర్‌ :జిల్లాలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బృందం సందడి చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని 19 సభ్యులగల బృందం సందర్శించింది. లక్ష్మీపూర్‌ దగ్గర నిర్మాణం జరుగుతున్న సొరంగాల నిర్మాణాలనూ భూగర్భంలోకి దిగి పనులను పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టు బృహత్తరమైన ప్రాజెక్టుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు అభివర్ణించగా.... ఇది తమకు మంచి విజ్ఞానాన్ని అందించిందని యువ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుల అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అధికారులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రాజెక్టుల అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహించింది. 19మంది సభ్యులు గల బృందం మేడిగడ్డ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 8వ ప్యాకేజ్‌ కింద నిర్మాణం జరుగుతున్న టన్నెల్‌ పనులను పరిశీలించింది. నీటి పంపింగ్‌ చేయడానికి చేపట్టిన చర్యలను అధికారులు వారికి వివరించారు.

అనుభూతిని మిగిల్చాయని జూనియర్‌ ఐఏఎస్‌లు సంతోషం...

భూ ఉపరితలం నుంచి 140 మీటర్ల లోతులో జరుగుతున్న పనులను చూసి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. 2 గంటలపాటు అండర్‌గ్రౌండ్‌లో జరుగుతున్న నిర్మాణాలను ఆసక్తిగా తిలకిస్తూ ఒకరితో మరొకరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంతమంది అధికారులైతే ప్రతి దృశ్యాన్ని తమ మొబైల్స్‌లో చిత్రీకరించారు. సీనియర్‌ ఐఏఎస్‌లు జూనియర్లకు తమ అనుభవాలను, ప్రాజెక్టు నిర్మాణం ఆవశ్యకత, భవిష్యత్‌ పరిణామాలను వివరించారు. పూర్తి రక్షణతో ప్రణాళిక బద్దంగా నిర్మాణం జరుగుతున్న టన్నెల్‌ పనులు తమకు మరచిపోలేని అనుభూతిని మిగిల్చాయని జూనియర్‌ ఐఏఎస్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టిందని...

తెలంగాణ ప్రభుత్వ బృహత్తరమైన ప్రాజెక్టు చేపట్టిందని... కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందన్నారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోయెల్‌. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కరువు చాయలు కనిపించకుండా పోతాయన్నారు. మొత్తానికి ప్రాజెక్టుల అధ్యయన యాత్ర యువ ఐఏఎస్, ఐపీఎస్‌లకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇలాంటి యాత్రలు మరిన్ని జరిగితే పూర్తి అవగాహన వస్తుందని యువ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

06:48 - August 6, 2017

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌పై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవిలో కొనసాగుతూనే ప్రైవేట్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఎలా కొనసాగుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రి పదవిలో కేటీఆర్‌ కొనసాగడం రాజ్యాంగ విరుద్దమని, తక్షణమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. లెఫ్ట్‌ పార్టీల నేతలు ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎన్నికల కమిషన్‌ ముందు ఉంచారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. హిమాన్షు కంపెనీకి కేటీఆర్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తక్షణమే కేటీఆర్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

విపక్షాల విమర్శలతో ఇరకాటంలో టీఆర్‌ఎస్‌

ఇటు వామపక్షాలు, అటు కాంగ్రెస్‌ పార్టీ కేటీఆర్‌ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించడంతో అధికారపార్టీ ఇరుకున పడింది. కేటీఆర్‌కు హిమాన్షు కంపెనీలో వాటా ఉన్న మాట వాస్తవమేనని... కానీ అది ఇప్పుడు యాక్టింగ్‌లో లేదని ఒకరు.... ఇప్పటికే దానికి రిజైన్‌ చేశారని మరొకరు గులాబీ నేతలు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆధారాలుంటే చూపాలని ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు.

లెఫ్ట్‌ పార్టీల ఫిర్యాదుపై కదలిన ఈసీ

కేటీఆర్‌కు హిమాన్షు కంపెనీలో వాటాలు, డైరెక్టర్‌ పదవిలో ఆయన కొనసాగుతున్నారన్న దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని లెప్ట్‌పార్టీలు ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. దీనిపై ఈసీ ఎట్టకేలకు కదిలింది. వామపక్షాల ఫిర్యాదుపై ఈసీ న్యాయ సలహా తీసుకుంటోంది. కేటీఆర్‌పై అందిన ఆధారాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతున్నట్టు ఈసీ భన్వర్‌లాల్‌ తెలిపారు. కేంద్రం కూడా ఈ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఇచ్చే నిర్ణయాన్ని బట్టి తమ చర్యలుంటాయని స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణలో యువరాజుగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ను హిమాన్షు మోటార్స్‌ , నేరెళ్ల దళితుల ఘటన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ కేటీఆర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

06:46 - August 6, 2017

అమరావతి : నంద్యల ఉపఎన్నికల్లో ఓటమిని ఓర్వలేక జగన్‌ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. బహిరంగ సభలో జగన్‌ వ్యాఖ్యలు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. జగన్‌ రాజకీయాల్లోకి వస్తే హత్యారాజకీయాలు తప్పవని విమర్శించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిలా కాకుండా వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

06:44 - August 6, 2017

హైదరాబాద్: భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌సింగ్‌... రింగ్‌లో తనకు ఎదురేలేదని మరోసారి నిరూపించాడు. చైనాకు చెందిన బాక్సర్‌ జుల్ఫికర్‌ మైమైటియాలితో జరిగిన బౌట్‌లో 3-0తో నెగ్గాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌తోపాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 31ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. విజేందర్‌కు చైనా బాక్సర్‌ నుంచి తీవ్ర పోటీయే ఎదురైంది. చైనా బాక్సర్‌ పంచ్‌లను తట్టుకుని.. అంతేవేగవంతమైన పంచ్‌లను విజేందర్‌ విసిరాడు. ఐదో రౌండ్‌ వరకు నున్వా నేనా అనే రీతిలో బౌట్‌ సాగింది. చివరికి అనూహ్యంగా పంచ్‌లు విసరడంతో విజేందర్‌ విక్టరీ సాధించాడు.

06:42 - August 6, 2017

హైదరాబాద్: భారత మహిళల జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీ సత్కరించింది.రెండు సార్లు భారత జట్టును వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చేర్చి చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌ ఎంతో మంది యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయమని ముఖ్య అతిధులు టీమిండియా కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.చిన్ననాటి నుంచి క్రికెట్‌ మెలకువలు నేర్చుకున్న సహచరులు, కోచ్‌ల సమక్షంలో సన్మానం జరగడం కలలా ఉందని మిథాలీ సంబరపడిపోతూ చెప్పింది.

06:40 - August 6, 2017

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడు కవి సినారె. అవును.. కష్టాల్లో ధైర్యాన్నిచ్చేది.. కష్టసుఖాల వల్ల వచ్చే బాష్పాలను మనతో సమానంగా ఆస్వాదించేది ఒక్క స్నేహితుడే. మిత్రుడు అన్న పదానికి ఎంరెందరో.. ఎన్నెన్నో నిర్వచనాలు ఇచ్చారు. కానీ, ప్రపంచమంతా నిన్ను దూరంగా ఉంచినప్పుడు.. నీ వెన్నంటి ఉండేవాడే స్నేహితుడు.. అన్న ఒక్క నిర్వచనం మాత్రం శాశ్వతత్వాన్ని పొందింది. స్నేహమాధుర్యాన్ని ఆస్వాదించేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు మొదటి ఆదివారం రోజును స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ శుభతరుణాన స్నేహితులకు, స్నేహపాత్రులు అందరికీ 10టీవీ శుభాకాంక్షలు అందిస్తోంది.

జీవితాల్లో స్నేహితుడి ముద్ర ఎంతలా ఉంటుందో ...

నీ స్నేహితుడెవరో చూపించు.. నీవెలాంటివాడివో చెబుతాను అన్నది జనాంతికం. ఇది వినడానికి చాలా సాదాసీదాగా కనిపించినా.. జీవితాల్లో స్నేహితుడి ముద్ర ఎంతలా ఉంటుందో నిక్కచ్చిగా తెలియజెప్పే వాస్తవం. అవును.. సృష్టిలో తియ్యనిది స్నేహమే. కన్నవారి వద్ద కూడా చెప్పుకోలేని విషయాలు.. స్నేహితుడి సమక్షంలో మన నోటి నుంచి అలవోకగా బయటపడిపోతాయి. స్నేహితులతో గడిపే ప్రతి క్షణం ఎంతో హాయినిస్తుంది. ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. ఆస్తులు లేనివారు ఉంటారేమో కానీ, స్నేహితులు లేని వారు మాత్రం ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

స్నేహితులంతా ఏటా కలిసి జరుపుకునే సంబరమే ఫ్రెండ్ షిప్ డే..

స్నేహితులంతా ఏటా కలిసి జరుపుకునే సంబరమే ఫ్రెండ్ షిప్ డే.. ఎక్కడెక్కడివారో.. ఒక్క చోటికి చేరి తమ అనుభవాల్ని, అనుభూతుల్ని ఒక్కసారి ఈరోజు ఒక్కసారైనా నెమరువేసుకుంటారు. 1935లో యూఎస్ కాంగ్రెస్ సూచన మేరకు ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పరపంచ దేశాలు నిర్ణయించాయి. అందులో భారతదేశం కూడా ఉంది.

అందరూ పరస్పరం శుభాకాంక్షలు

స్నేహితుల దినోత్సవం రోజు అందరూ పరస్పరం శుభాకాంక్షలు అందించుకుంటారు. ఇటీవలి కాలంలో ఫ్రెండ్షిప్‌ బ్యాండ్స్ కూడా ప్రాచుర్యం పొందుతున్నాయి. స్నేహం ఎక్కడ మొదలవుతుంది.. అంటే చెప్పలేం.. స్కూల్లో, కాలేజ్‌లో.. ఎదురింట్లో.. బస్సులో.. ట్రైన్ ఎక్కడైనా పుడుతుంది. అలా పుట్టిన స్నేహం గొప్ప బంధంగా మారుతుంది. స్నేహితులతో గడిపే ప్రతిరోజు ఓ పండగే.. స్నేహితుడు.. లాలనలో అమ్మను.. ఆదరణలో తండ్రిని.. అలిగిన వేళ నెచ్చెలిని.. తలపిస్తాడు. చిరుచిరు పొరపొచ్చాలు వచ్చినా స్నేహితుడిని మాత్రం నిజమైన మిత్రుడు ఎన్నటికీ వదులుకోడు..

చదువుకునే రోజుల్లో స్నేహితులు మనతోనే ...

చదువుకునే రోజుల్లో స్నేహితులు మనతోనే ఉంటారని ధీమా.. కానీ చదువులు పూర్తై కాలేజీ గేటు దాటుతుంటే మనసులు భారమవుతాయి. ఒకరికొకరు ఫేర్ వెల్ చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు. చదువుకున్న రోజుల్లో స్నేహితులతో పంచుకున్న అనుభవాల్ని ఏ ఒక్కరూ ఎప్పటికీ మర్చిపోలేరు.

స్నేహానికి కులం.. మతం... ధనిక.. పేద బేధాలుండవు.

స్నేహానికి కులం.. మతం... ధనిక.. పేద బేధాలుండవు. మనసులు కలిసిన స్నేహం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. చివరికి ప్రాణం కూడా ఇచ్చేస్తుంది. స్నేహితుల దినోత్సవం మన సంప్రదాయం కాకపోయినా.. ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాం. హడావిడి జీవితంలో స్నేహితులతో గడిపే సమయం దొరకట్లేదు. ఈరోజైనా ఒక్కసారి స్నేహితులంతా కలిస్తే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. మనసులోని మధుర జ్ఞాపకాల్ని మననం చేసుకోవచ్చు. 

06:39 - August 6, 2017

Don't Miss