Activities calendar

07 August 2017

మేధాపాట్కర్ నిరాహార దీక్ష భగ్నం

మధ్యప్రదేశ్ : మేధాపాట్కర్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ధార్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్న మేధాపాట్కర్ ను  
ఆస్పత్రికి తరలించారు. 

22:02 - August 7, 2017

ఛండీఘర్ : హర్యానాలో ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వేధించిన కేసును బిజెపి నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.  బిజెపి నేత కుమారుడిని రక్షించేందుకు ఆ పార్టీ అన్ని యత్నాలు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి 5 ప్రాంతాల్లో సిసిటివి కెమెరా దృశ్యాలు మాయమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులపై ఒత్తిడి తేవడం ద్వారా కేసును పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది.

హరియాణా బిజెపి చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వేధించిన కేసును బిజెపి నీరుగార్చే యత్నం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు విచారణలో అత్యంత కీలకమని భావిస్తున్న  వికాస్‌ బరాలా కారులో యువతిని వెంబడించిన ఐదు ప్రదేశాల్లోని సిసిటివి కెమెరా దృశ్యాలు మాయమవ్వడమే ఇందుకు కారణం.

ఈ కేసులో వికాస్ బరాలా అతడి స్నేహితుడికి బెయిల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ మండిపడింది. బరాలాపై కిడ్నాప్‌ లాంటి సెక్షన్లు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు బిజెపి పోలీసులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించింది.

యువతిని వెంటాడి వేధించిన కేసులో విపక్షాల ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న బీజేపీ హరియాణ చీఫ్‌ సుభాష్‌ బరాలాకు సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అండగా నిలిచారు. కొడుకు తప్పు చేస్తే తండ్రిని శిక్షించడం సరికాదన్నారు.

ఐఏఎస్ అధికారి కూతుర్ని వేధించిన కేసులో వికాస్‌ బరాలా, అతడి స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షల్లో నిందితులు మద్యం తాగినట్టు  తేలడంతో వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. తమపై రాజకీయ ఒత్తిడి లేదన్నారు.

చండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న బరాల వికాస్, అతని  స్నేహితుడు ఆశిష్‌ తమ ఎస్‌యూవీ వాహనంలో ఆమెను వెంబడించి వేధింపులకు గురిచేశారు. వెంటనే ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరోజు రాత్రి తానెంతో భయపడ్డానని.... తాను ఐఏఎస్‌ అధికారి కూతుర్ని అయినందుకే తప్పించుకున్నానని ... ఓ సామాన్యుడి కూతురిని అయి ఉంటే తనపై అత్యాచారం, హత్య జరిగి ఉండేదేమోనని బాధితురాలు వెల్లడించారు. నాపై రేప్‌, హత్య వంటి దుర్మార్గాలు జరగకపోవడం నా అదృష్టమన్నారు. 
బైట్‌ బాధితురాలు


తన కూతురిని వేధించిన కేసులో రాజీపడే ప్రసక్తే లేదని, న్యాయం కోసం పోరాడతామని బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హర్యానా ఐఏఎస్‌ అధికారుల సంఘం ప్రధాని మోదికి లేఖ రాయాలని నిర్ణయించింది.

21:59 - August 7, 2017

72ఏళ్లక్రితం...  రెండు బాంబులు... రెండు నగరాలు..4లక్షల ప్రాణాలు.. అదొక విధ్వంస చరిత్ర..  రక్తపాతం నుంచి ఈ ప్రపంచం వికాసం దిశగా నడవాలని చెప్పే గుణపాఠం. ఒకనాడు 2రెండు బాంబులు వినాశనం సృష్టిస్తే, ఇప్పుడు 15వేలకుపైగా  అంతకంటే ఎన్నో రెట్ల బలమైన అణుబాంబులపై  ప్రపంచాన్ని నిలబెట్టారు. అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్టే.. ఆయుధాలు తయారు చేయటంలోనూ ప్రపంచం మరింత ముందడుగు వేసింది.  క్షణాల్లో ప్రపంచాన్ని నాశనం చేసే శక్తిని సాధించింది.. అలాంటి సందర్భం మళ్లీ వస్తుందా? ప్రపంచం మరో భీకర యుద్ధం దిశగా పయనిస్తోందా? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి. 

 

21:56 - August 7, 2017
21:56 - August 7, 2017
21:55 - August 7, 2017

ప్రకాశం : దేవరపల్లి దళితుల పోరు ఫలించింది. వీరి భూమిని లాక్కోవాలని భావించిన పాలకులు వెనక్కి తగ్గారు. దశాబ్దాలుగా దళితుల స్వాధీనంలోని భూమిని వారికే అప్పగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై.. దేవరపల్లి దళితులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు తొలి నుంచీ అండగా ఉన్న సీపీఎం రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 
ఎట్టకేలకు కదిలిన ప్రభుత్వం  
ప్రకాశం జిల్లా దేవరపల్లికి చెందిన దళితులు రెండేళ్లుగా సాగిస్తున్న పోరాటం.. ఎట్టకేలకు ప్రభుత్వాన్ని కదిలించింది. నీరు-మట్టి పథకం కింద చెరువు తవ్వేందుకు, దశాబ్దాలుగా 40 మంది దళితులు సాగు చేసుకుంటున్న 22 ఎకరాల భూమిని లాక్కోవాలని స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రయత్నించారు. అయితే.. దళితులు, వారికి దన్నుగా సీపీఎం నేతలు... చేసిన ఉద్యమాలతో.. ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దళితుల భూములను తీసుకోబోమని ప్రకటించింది. 
భూమిని లాక్కునేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
దేవరపల్లి గ్రామంలో.. మాలల నీటి కటకట చూడలేక, వందేళ్ల క్రితం క్రిష్ణంరాజు అనే దాత 42 ఎకరాల భూమిని, చెరువు తవ్వకం కోసం గ్రామ మాలలకు అంకితమిచ్చారు. అయితే వివిధ కారణాల వల్ల.. చెరువు తవ్వకం సాగలేదు. ఈ క్రమంలో 1966లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు ప్రోత్సహించే క్రమంలో.. ఈ భూమిని ఇందిరమ్మ సర్కారు దళితులకు నజరానాగా ఇచ్చింది. ఎకరా, అర ఎకరా లెక్కన 22 ఎకరాలను 40 మంది రైతులకు అందించారు. దీనిపై కన్నేసిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నీరు-మట్టి పథకం కింద చెరువు తవ్వే వంకతో దళితులకు భూమిని దూరం చేసే ప్రయత్నం చేశారు. తమ గోడు గురించి జిల్లా అధికారులందరికీ ఎన్ని విన్నపాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. దేవరపల్లి దళితులు సీపీఎం జిల్లా శాఖను ఆశ్రయించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. రెండు సార్లు ఈ గ్రామానికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని రెండుసార్లూ అరెస్టు చేశారు.  
దళితుల పక్షాన సీపీఎం పోరాటం 
అరెస్టులు.. నిర్బంధాలకు వెరవని.. సీపీఎం నాయకత్వం.. దేవరపల్లి దళితుల పక్షాన అలుపెరుగని పోరాటం కొనసాగించింది. ఈ క్రమంలోనే బలవంతంగా, గ్రామంలోకి మీడియా సహా మరెవరినీ రానీయకుండా, దళితుల భూముల్లో చెరువు తవ్వే ప్రయత్నం చేశారు. దీంతో.. బాధితులు జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌ దృష్టికీ తమ వేదనను తీసుకు వెళ్లారు. ఒకటి రెండు రోజుల్లో కమిషన్‌ ఈ గ్రామాన్ని సందర్శించనుందన్న సమాచారం నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ భూములను దళితులకే వదిలిపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్వాగతించారు. భూములు కోల్పోతామేనన్న ఆందోళనలో ఉన్న దేవరపల్లి దళితులు కూడా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

21:50 - August 7, 2017

కరీంనగర్ : కేసీఆర్‌ పచ్చి అబద్దాల కోరని... మూడేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజి ఏర్పాటు చేయాలంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన ఉత్తమ్‌.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొన్నం చేపట్టిన దీక్షకు విద్యార్థులు రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. కరీంనగర్‌లో మెడికల్‌ కాలేజీ కడతానని మాటతప్పింది ఎవరని ఉత్తమ్‌ ప్రశ్నించారు. 

21:47 - August 7, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలోని భూరికార్డులన్నీ ప్రక్షాళన చేయాలని.. సీఎం కేసీఆర్‌ అధికారుల్ని ఆదేశించారు... ఏ భూమి ఎవరిపేరుమీద ఉందో బహిరంగ పరచాలని సూచించారు.. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించి సర్వే సెటిల్‌మెంట్ చేయాలని కోరారు.. ఇకపైనుంచి భూమి అమ్మకాలు, కొనుగోళ్లన్నీ పూర్తి పారదర్శకంగా జరగాలని ఆదేశాలు జారీచేశారు.. పట్టాదార్‌ పుస్తకాలు మరింత సరళంగా ఉండాలన్నారు.. భూరికార్డుల ప్రక్షాళనకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారుపై అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమీక్షకు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.. 

 

21:45 - August 7, 2017
21:39 - August 7, 2017

ఊరువాడల జోరుగ రాఖీ పండుగ..ఉశ్కెదంద అపకుంటే పాతరవెడ్తం, డబుల్ బెడ్రూం పిల్లర్లకు పర్రెలు, స్కూటరుంటే సర్కార్ పత్కాలు కట్, మాయ మాటలు నమ్మొద్దన్న నాసా.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

21:34 - August 7, 2017

చేనేత కార్మికులకు చేయూత అందించాలని వక్తలు అన్నారు. ఈవాళ చేనేత కార్మిక దినోత్సవం. 'చేనేతకు ఏదీ చేయూత..? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్,  బీజేపీ నాయకురాలు కాట్రగడ్డ ప్రసన్న, చేనేత కార్మిక సంఘం నాయకులు రమేష్ పాల్గొని, మాట్లాడారు. చేనేతరంగంపై జీఎస్టీ భారం పడుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:27 - August 7, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. నామినేషన్లపై టీడీపీ, వైసీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. శిల్పామోహన్ రెడ్డి నామినేషన్ పై సంతకం చేసిన నోటరీ లైసెన్స్ ముగిసిందని టీడీపీ ఆరోపించింది. 

 

20:47 - August 7, 2017
20:44 - August 7, 2017

హైదరాబాద్ : జీఎస్‌టీపై మంత్రి ఈటెల, సీఎం కేసీఆర్ విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని... కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ కుమార్ ఆరోపించారు.. జీఎస్టీతో రాష్ట్రానికి 3వేల కోట్ల నష్టం వస్తుందని ఈటెల చెప్పారని గుర్తుచేశారు.. కేసీఆర్ మాత్రం 2వేల కోట్ల లాభం వస్తుందన్నారని... ఇందులో ఏది నిజమని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రుల సమావేశానికి కేటీఆర్ ఎందుకు హాజరవుతున్నారని ఢిల్లీలో మండిపడ్డారు. కేసీఆర్‌ తుగ్లక్‌ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు దద్దమ్మలని ఘాటుగా విమర్శించారు. విభజన హామీలు సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. 

 

20:40 - August 7, 2017

గుంటూరు : వెలగపూడిలో మంత్రి పత్తిపాటి పుల్లారావు తనిఖీలు చేశారు. ఎమ్ ఆర్ పీ ధరలకంటే ఎక్కువ ధరలకు వాటర్‌ బాటిల్స్, కూల్‌డ్రింక్స్‌ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో వీ స్క్వేర్‌ హొటల్‌కు వెళ్లారు. అక్కడ 12 రూపాయల విలువున్న సోడాను 35రూపాయలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇదేవిధంగా అమ్మితే లైసెన్స్‌ రద్దు చేస్తామని మంత్రి హొటల్‌ యాజమాన్యాన్ని హెచ్చరించారు.

20:37 - August 7, 2017

గుంటూరు : హజ్‌ యాత్రకువెళ్లే ముస్లింలకు ఆర్థిక సహకారం అందించారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌... ప్రతి ఏడాది హజ్‌కు వెళ్లేవారికి యరపతినేని ఒక్కొక్కరికి లక్ష రూపాయలచొప్పున సహాయం చేస్తున్నారు.. ఈ ఏడాది 20మంది యాత్రికులకు 20లక్షలను పిడుగురాళ్లలో అందజేశారు.. ఈ కార్యక్రమానికి మైనారిటీ నేత జలీల్‌ ఖాన్‌, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ హిదాయత్‌ హాజరయ్యారు..

నయీం కేసులో 128 మంది అరెస్టు : సిట్

హైదరాబాద్ : నయీం కేసులో ఇప్పటి వరకు 128 మందిని అరెస్టు చేశామని సిట్ తెలిపింది. 109 మందిని సిట్ కస్టడీలోకి తీసుకుంది.  890 సాక్షులను విచారించింది. 14 మంది గ్యాంగ్ స్టర్లపై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు సిట్ తెలిపింది. ఐదుగురు పోలీసు ఆఫీసర్లను సస్పెండ్ చేసినట్లు సిట్ తెలిపింది. 

 

నయీం ఎన్ కౌంటర్ జరిగి రేపటికి ఏడాది పూర్తి : సిట్ అధికారి

హైదరాబాద్ : నయీం ఎన్ కౌంటర్ జరిగి రేపటికి ఏడాది పూర్తి అయిందని సిట్ అధికారి నాగిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 227 కేసులు నమోదు అయ్యాయని, 9 చార్జ్ షీట్ లు దాఖలు చేశామని, 22 కేసుల విచారణ పూర్తి అయిందన్నారు. మిగతా కేసులు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. 

నంద్యాలలో వైసీపీ విజయం ఖాయం : శిల్పా చక్రపాణి రెడ్డి

కర్నూలు : నంద్యాలలో వైసీపీ విజయం ఖాయమని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ ఆరోపణలు చేస్తోందని చెప్పారు. 

భూ రికార్డులపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని భూ రికార్డులన్నీ ప్రక్షాళన చేయాలని సీఎం అన్నారు. ఏ భూమి ఎవరి పేరు మీదు ఉందో నిగ్గు తేల్చి బహిర్గత పరచాలని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సర్వే సెటిల్ మెంట్ చేయాలని పేర్కొన్నారు. 

నంద్యాల ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా

కర్నూలు : నంద్యాల ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలనలో హైడ్రామా కొనసాగింది. నామినేషన్లు చెల్లవంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అడ్వకేట్ రెన్యువల్ కు అప్లై చేసుకుంటే అఫిడవిట్ చెల్లుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. 

 

ముగిసిన నంద్యాల ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. దాఖలైన మొత్తం 30 నామినేషన్లలో ఆరు తిరస్కరణకు గురయ్యాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లను ఆమోదించారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ ఆమోదం తెలిపాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదించారు. 

ఏపీ చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అంబికా కృష్ణ

విజయవాడ : ఏపీ చలనచిత్ర, టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అంబికా కృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

19:50 - August 7, 2017

గుజరాత్ : గత కొన్నిరోజులుగా బెంగళూరులో రిసార్టులో ఉంటున్న 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఉద‌యం గుజ‌రాత్ చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని ఆనంద్‌ జిల్లాలోనిలోని నిజానంద్‌ రిసార్ట్‌కు త‌ర‌లించారు. రేపు జరిగే రాజ్యసభ ఎన్నిక‌ల ఓటింగ్‌ వ‌ర‌కు ఎమ్మెల్యేలు క్యాంప్‌లోనే ఉండ‌నున్నారు. ఆగస్టు 8న జరిగే గుజరాత్‌ రాజ్యస‌భ ఎన్నిక‌లకు సంబంధించి తమ ఎమ్మెల్యేలను బిజెపి బేరసారాలకు పాల్పడుతోందన్న భయంతో కాంగ్రెస్‌ వారిని జులై 29న బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించిన విషంయ తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీకి, పదవికి రాజీనామా చేయగా...అందులో ముగ్గురు బిజెపిలో చేరారు. కాంగ్రెస్ నేత అహ్మద్ ప‌టేల్‌ను  గెలుపు కోసం కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ప్రయ‌త్నిస్తోంది.

 

19:44 - August 7, 2017

కేరళ : క్రికెటర్‌ శ్రీశాంత్‌కు ఊరట లభించింది. అతనిపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది ఢిల్లీలోని ఓ కోర్టు కూడా స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ను నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పు అనంతరం తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ శ్రీశాంత్‌ బీసీసీఐని కోరినా.. బోర్డు తిరస్కరించింది. దీంతో శ్రీశాంత్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినా.. బోర్డు తనను కావాలని వేధిస్తున్నాడని శ్రీశాంత్‌ పిటిషన్‌ వేశాడు. తనకు అనుకూలంగా తీర్పు రావడంతో శ్రీశాంత్‌ ట్విట్టర్‌లో ఆనందం వ్యక్తం చేశాడు. 

 

19:42 - August 7, 2017

తిరువనంతపురం : కేరళలో పలుచోట్ల బిజెపి దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో తెలిపారు. దీనికి సంబంధించిన నిఘా రిపోర్టు ప్రభుత్వం వద్ద ఉందని...దాడులు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని విజయన్‌ వెల్లడించారు. బిజెపి దాడులకు సంబంధించి విచారణ కోసం సిబిఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని విజయన్‌ పేర్కొన్నారు. కేరళ అస్తిత్వాన్ని నాశనం చేసేందుకే బిజెపి తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని సిఎం ఆరోపించారు. 

 

19:39 - August 7, 2017

ఛండీఘర్ : హరియాణా బిజెపి చీఫ్ సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలా ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వేధించిన కేసులో సిసిటివి కెమెరా దృశ్యాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. వికాస్‌ బరాలా కారులో యువతిని వెంబడించిన ఐదు ప్రదేశాల్లోని సిసిటివి కెమెరా దృశ్యాలు మాయమయ్యాయి. ఈ కేసు విచారణలో అత్యంత కీలకమని భావిస్తున్న తరుణంలో సిసిటివి ఫుటేజి కనిపించడం లేదని పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బిజెపి అధిష్టానం తమ పార్టీనేత సుభాష్‌ బరాలాను రక్షించుకునే పనిలో పడింది. బిజెపి ఈ కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని  స్నేహితుడు ఆశిష్‌ తమ ఎస్‌యూవీ వాహనంలో వేధించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆరోజు రాత్రి తానెంతో భయపడ్డానని.... తాను ఐఏఎస్‌ అధికారి కూతుర్ని అయినందుకే తప్పించుకున్నానని ... ఓ సామాన్యుడి కూతురిని అయి ఉంటే తనపై అత్యాచారం, హత్య జరిగి ఉండేదేమోనని బాధితురాలు వెల్లడించారు.

 

19:36 - August 7, 2017

చెన్నై : బీజేపీ ఎంపీ పూన‌మ్ మ‌హాజ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ను క‌లిశారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని రజనీ నివాసంలో మహాజన్‌ కలుసుకున్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో బిజెపి ఎంపీ ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ స‌మావేశానికి రాజ‌కీయ ప్రాముఖ్యత లేద‌ని బీజేపీ స్పష్టం చేసింది. రజనీని కలుసుకోవడం సంతోషంగా ఉందని, వ్యక్తిగతంగా తనకు మద్దతు తెలిపారని ముంబై ఎంపీ పూన‌మ్ తెలిపారు. పూనమ్‌ రజనీకాంత్‌ భార్యతో కలిసి ఓ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌పై కలిసి పనిచేస్తున్నారు. 2006లో హత్యకు గురైన పూనమ్‌ తండ్రి ప్రమోద్‌ మహాజన్‌ కూడా రజనీకాంత్‌కు మిత్రుడే.

19:28 - August 7, 2017

పశ్చిమగోదావరి : ప్రగతి చిహ్నంలాంటి పోలవరం ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా సహించేదిలేదని... సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి మరో 12వేల కోట్లు అవసరం ఉందని చెప్పారు. ప్రాజెక్టు అంచనావ్యయంలో సవరణలకోసం కేంద్రం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భారీవర్షంలోనూ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయడానికి పలు సూచనలు చేశారు. ప్రాజెక్ట్ అధికారులతో సమీక్షాసమావేశం కూడా నిర్వహించారు. 

 

19:24 - August 7, 2017
19:14 - August 7, 2017
19:12 - August 7, 2017

ప్రకాశం : దేవరపల్లి దళితుల పోరాటం ఫలించింది. దళితులు విజయం సాధించారు. దళితుల భూములు దళితులకు సొంతమయ్యాయి. దేవరపల్లిలోని దళితుల భూములను తిరిగి వారికే ఇస్తామని మంత్రి నక్కా ఆనందబాబు ప్రకటించారు. దళితుల భూముల్లో తవ్విన చెరువును పూడ్చి వేస్తామన్నారు. చెరువు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చి దళితులకు అప్పచెబుతామన్నారు. భూములకు సంబంధించిన అన్ని సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని.. అందరం కలిసిమెలిసి ముందుకు సాగుదామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను మరిచి గ్రామస్తులంతా కలిసి మెలిసి ఉండాలని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. దేవరపల్లిలో దళితుల భూములపై..మంత్రి ఆనంద్‌బాబు ప్రకటనను స్వాగతిస్తున్నామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దళితులు ఐక్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. దేవరపల్లిలో పోరాటం జరిపిన వారందరికీ మధు అభినందనలు తెలిపారు.

 

19:01 - August 7, 2017
18:59 - August 7, 2017
18:58 - August 7, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నామినేషన్ల పరిశీలనల సమయంలో వైసీపీ, టీడీపీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదంటూ.. రిటర్నింగ్‌ అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను నోటరీ చేసిన న్యాయవాది రామతులసీ రెడ్డి సంతకం చెల్లదని,.. ఆయన లైసెన్సు గడువు ముగిసిందని ఫిర్యాదు చేశారు. అలాగే నామినేషన్‌కు జ్యుడీషియల్‌ స్టాంపు పేపర్‌ వాడలేదు కాబట్టి.. శిల్పా నామినేషన్‌ను తిరస్కరించాలన్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని వైసీపీ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసింది. బ్రహ్మానందరెడ్డి ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదని, అందువల్ల ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇరువర్గాలను పిలిచిన రిటర్నింగ్‌ అధికారి.. వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. 

 

18:55 - August 7, 2017

విశాఖ : నగరంలో రద్దైన పాత కరెన్సీని మార్చేందుకు యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో... ఈ వ్యవహారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కోటి 91 లక్షల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నోట్లు రద్దైన సమయంలో వీళ్లు భారీ ఎత్తున నగదు మార్పిడి చేశారని నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగేంద్రకుమార్‌ తెలిపారు. పాత నోట్లను మారుస్తామని ఎవరూ చెప్పినా నమ్మవద్దని పోలీసులు తెలిపారు.

 

18:43 - August 7, 2017

హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌కు రాంగోపాల్‌వర్మ బహిరంగ లేఖ రాశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిల్మ్‌ చాంబర్‌ లేఖ రాయడాన్ని వర్మ తప్పుపట్టాడు. నోటీసులు అందుకున్న వారు తప్పు చేసినట్లు అధికారులెవరూ ప్రకటించక ముందే... ప్రభుత్వానికి ఫిల్మ్‌ చాంబర్‌ ఎందుకు అపాలజీ చెప్పిందని ప్రశ్నించాడు. సినీ పరిశ్రమ మొత్తం సిగ్గుపడే విధంగా ఫిల్మ్‌ చాంబర్‌ వ్యవహరించిందని వర్మ ఆరోపించాడు. కొంతమంది చేసిన తప్పుకు పరిశ్రమ మొత్తం తలదించుకోవాల్సి వచ్చిందని లేఖలో ఫిల్మ్‌ చాంబర్‌ పేర్కొనడం బాధాకరమన్నారు వర్మ. అసలు పొరపాట్లు ఎవరు చేశారు... పొరపాట్లు చేసినట్లు ఎవరైనా ఫిల్మ్‌ చాంబర్‌కు చెప్పారా ? అని వర్మ ప్రశ్నించారు. 

 

18:41 - August 7, 2017

కర్నూలు : నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి నామినేషన్‌ చెల్లదని టీడీపీ ఫిర్యాదు చేసింది. జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ పెట్టలేదని ఫిర్యాదు చేసింది. నామినేషన్‌ నిబంధనల ప్రకారం లేదని ఫిర్యాదు చేశారు.

18:25 - August 7, 2017

హైదరాబాద్ : ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ ప్రస్తుతం మార్కెట్లను ముంచేస్తున్న ఓ సరికొత్త ఆట వస్తువు. ప్రపంచ దేశాలను ఉర్రూతలూగించి ఈ మధ్యే మన దేశానికి వచ్చిన ఈ టాయ్‌.. ఇప్పుడు మరింత క్రేజ్‌ సొంతం చేసుకుంది. ఫిడ్జెట్‌ స్పిన్నర్‌తో టెన్షన్‌ తగ్గించుకోవచ్చని జనం అంటుంటే.. అదంతా కల్పితం అని కొట్టిపారేస్తున్నారు నిపుణులు. 
ఎవరి చేతిలో చూసినా గిర్రునా తిరుగుతోన్న ఫిడ్జెట్ స్పిన్నర్ 
ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా గిర్రునా తిరుగుతోంది. చేతి వేళ్ల మధ్య ఇమిడిపోయే ఈ చిన్న ఆట వస్తువు ఇప్పుడు క్రేజీగా మారింది. ప్లాస్టిక్‌, మెటల్‌తో దీన్ని తయారు చేస్తారు. మధ్యలో ఓ బేరింగ్‌ వల్ల స్పిన్నర్‌ మూడు చివర్ల బరువు సమానంగా ఉంటుంది. ఈ వెయిట్‌ కారణంగానే ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ ఒకసారి తిప్పగానే కొన్ని నిమిషాలపాటు అలా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరగడమే ఈ ఆటలో ఉన్న అసలు స్పెషాలిటీ. 1993లో కనిపెట్టిన ఈ ఆటవస్తువు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రకరకాల రంగుల్లో, వివిధ రకాల ఆకృతుల్లో వీటిని తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని ఎల్‌ఈడీల కారణంగా వెలుగుతాయి. రీసెంట్‌గా డీజె మూవీలో అల్లు అర్జున్‌ ఈ స్పిన్నర్‌ను వాడటంతో మన రాష్ట్రంలో దీనికి మరింత పాపులారిటీ వచ్చింది. ఒక్కసారిగా ఈ ఆట వస్తువుకు క్రేజ్ పెరగడంతో నగరంలోని దుకాణంలో వీటికి మరింత గిరాకీ పెరిగింది. రోడ్లు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద వీటిని అమ్మి తమ పొట్ట నింపుకుంటున్నారు చిరువ్యాపారులు.
వారు ఆడితే కొంత ఫలితం 
ఏకాగ్రత కోరుకునే వాళ్లు, టెన్షన్‌తో బాధ పడేవాళ్లు ఈ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌తో ఆడితే కొంత ఫలితం ఉంటుందంటున్నారు ప్రజలు. ఈ స్పిన్నర్‌ను తిప్పితే రిలాక్సేషన్‌ ఉంటుందని స్ట్రెస్‌ బస్టర్‌గా పనిచేస్తుందని ఈ ఆటను ఆడేవారు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం కల్పితాలే అని కొట్టిపారేస్తున్నారు సైకాలజిస్టులు. స్పిన్నర్‌ కేవలం ఆట వస్తువు మాత్రమేనని.. దీని వల్ల కొంత వినోదం లభిస్తుంది తప్పితే ఒత్తిడి తగ్గడం లాంటికి జరగవని చెబుతున్నారు. 
స్పిన్నర్‌ను ఆట వస్తువుగా మాత్రమే చూడాలి : సైకాలజిస్టులు  
ఈ స్పిన్నర్‌ను ఓ ఆట వస్తువుగా మాత్రమే చూడాలని, అదే గనగ అలవాటుగా మారితే ప్రమాదం పొంచి ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆట విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

 

18:13 - August 7, 2017

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా ముందుకుసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మరో ఏడాదిన్నరే గడువు ఉండటంతో కమలనాథులకు అడ్డుకట్ట వేయాలని గులాబీదళం  నిర్ణయించుకుంది. విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
బీజేపీ దూరంగా పెట్టాలని టీఆర్ ఎస్ యోచన  
నిన్న, మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలన సమర్థించిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కమలనాథులను సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టాలని చూస్తోంది. ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినా.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులను బలపరిచింది. కానీ ఇప్పుడు ఒక ఎన్నికల హామీల అమలుపై కేంద్ర వైఖరి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 
హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి 
తెలంగాణ ఆవిర్భావం టీఆర్‌ఎస్‌కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వని బీజేపీ... పరిస్థితుల ప్రభావంతో ఆ తర్వాత కొద్దిగా చేరువయ్యింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్నిహితంగా మెలిగారు. విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. కొన్ని హామీ అమలుపై సానుకూలంగా స్పందించిన కేంద్ర, మరికొన్నింటిపై నాన్పుడు ధోరణి అవలంభిస్తోంది. అసెంబ్లీ  సీట్ల పెంపుపై కేంద్ర అవలంభిస్తున్న విధానాలను నచ్చని టీఆర్‌ఎస్‌ నేతలు... కమలనాథులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
అసెంబ్లీ సీట్ల పెంపుకు అడ్డుపడుతున్న బీజేపీ 
అసెంబ్లీ సీట్ల పెంపు తమకు పెద్ద ప్రాధాన్యత కాదని కేసీఆర్‌ చెబుతున్నా... ఇక్కడే టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య అగాథం పెరుగుతోంది. తెలంగాణలో విస్తరించే క్రమంలో అసెంబ్లీ సీట్ల పెంపుకు తెలంగాణ కమలనాథులు అడ్డుపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. దీనిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు... కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లుగా అమలుచేయని విభజన చట్టంలోని హామీలను తెరపైకి తీసుకొచ్చే ప్లాన్‌లో  గులాబీదళం ఉంది. అలాగే నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్‌టీ విధించడంపై ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాని భావిస్తున్నారు. అలాగే ఐఐఎం ఇవ్వని అంశంపై కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయించారు. ఏపీకి 42 పథకాలను మంజూరు చేసిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయం, నష్టాన్ని ప్రజలకు వివరించడం ద్వారా బీజేపీ ఎదుగుదలకు చెక్‌ పెట్టాలని టీఆర్‌ఎస్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్రాల మధ్య యుద్ధం మొదలైనట్టేనని భావిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో  భాగస్వామి అవుతుందని జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టేని విశ్లేషిస్తున్నారు. 

 

17:04 - August 7, 2017

హైదరాబాద్ : వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు హారికకి 5 నెలల గర్భం తొలగించడానికి.. ప్రియుడు మధు అనూష మెటర్నిటీ హాస్పిటల్‌లో చేర్పించాడు. డాక్టర్‌తో 20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా గర్భం తొలగించే క్రమంలో.. తీవ్ర రక్తస్రావమైంది. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌లోని కమల హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ యువతి మృతి చెందింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మెటర్నిటీ హాస్పిటల్ డాక్టర్‌ గిరిజా రాణి, ప్రియుడు మధును పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

నంద్యాల ఉప ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల వేడి రగులుతోంది. నామినేషన్ల ప్రక్రియపై టిడిపి, వైసీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ టీడీపీ, భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ చెల్లదంటూ వైసీపీ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాయి. శిల్పా నామినేషన్ ను నోటరీ చేసిన న్యాయవాది నోటరీ లైసెన్స్ 2013 డిసెంబర్ తో ముగిసిందని టిడిపి ఆరోపిస్తోంది. భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఫిర్యాదు చేసుకున్నాయి.

దేవరపల్లిలో దళితులదే విజయం

ప్రకాశం : దేవరపల్లి దళితుల భూ సమస్యకు పరిష్కారం జరిగింది. దళితుల భూముల్లో అధికార పక్షం చేసే కుట్రకు సీపీఎం పోరాడింది. విజయం దళితులను వరించింది. దళితుల భూములను దళితలకే ఇస్తున్నాం అని మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. తవ్విన చెరువు భూములను చదును చేసి వ్యవసాయం చేసుకునేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రెవెన్యూ అదికారులు ఈ భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తారని, గతాన్ని మరిచిపోయి కలిసిమెలిసి ముందుకు సాగుదామని చెప్పారు.

ఆర్డీసీ బస్సు ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి

కృష్ణా : మోపిదేవి వద్ద కృష్ణా కరకట్ట పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదు : టిడిపి

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని టిడిపి ఈసీకి ఫిర్యాదు చేసింది. నామినేషన్ పై సంతకం చేసిన నోటరీ రెన్యువల్ కాలేదని, జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పెట్టలేదని, నామినేషన్ నిబంధనల ప్రకారం లేదని టిడిపి ఫిర్యాదు చేసింది.

కేరళలో రాష్ట్రపతి పాలన అవసరం లేదు : కేరళ సీఎం

తరువనంతపురం : కేరళలో రాష్ట్రపతి పాలన అవసరం లేదని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళ ప్రశాంతమైన రాష్ట్రం అని కేరళలో క్రైమ్ రేటు చాలా తక్కువ అని స్పష్టం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే నేరాల సంఖ్య ఎక్కువ అని కేరళకు చెడ్డ పేరు తెచ్చేందుకే అల్లర్లను సృష్టిస్తున్నారని మండి పడ్డారు. ఆర్ ఎస్ ఎస్ , బిజెపి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని సీఎం విమర్శించారు.

15:52 - August 7, 2017

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం చంద్రబాబుకు మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయారన్నారు. ఓ మహిళ మేయర్ తనకు ప్రాణ హాని ఉందని చెప్పినా కాపాడలేని దద్దమ్మ చంద్రబాబునాయుడు అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. నరకసారున్ని వధించిన సత్యభామలా, ప్రతి మహిళ టీడీపీ ప్రభుత్వాన్ని చీల్చి చండాడుతామని కనక దుర్గమ్మ సాక్షిగా ప్రతినభూనాలని, అప్పుడే మహిళకు రక్షణ కల్గుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత నంద్యాలలో అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలకు పాల్పడుతున్నాడని అన్నారు. ఎమ్మేల్యే చనిపోయి... ఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేస్తారా అని ప్రశ్నించారు. అఖిలప్రియ చుడీదార్ వేసుకున్నా... నైటీ వేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. వలువల గురించి మాట్లాడే టీడీపీ నేతలు విలువల గురించి మాట్లాడాలన్నారు. రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకుని గెలిచి, టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు ఫొటో పెట్టుకుని గెలవాలని సవాల్ విసిరారు. నైతిక విలువలను భ్రష్టుపట్టించారు. 

 

15:45 - August 7, 2017

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు తనయుడు...మంత్రి నారాలోకేష్‌కు టీడీపీ తెలుగు మహిళా నేత పీతల సుజాత రాఖీ కట్టారు. స్వీట్స్‌ తినిపించి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

 

విశాఖ బిజెపి ఎంపీ ఒక దద్దమ్మ: పి. మధు

విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధార్నకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు బయలుదేరారు. విజయవాడ రైల్వే స్టేషన్ లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సీపీఎం నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడుస్తోందని, స్టాల్ ప్లాంట్ వల్ల కేంద్రానికి లక్షల డివిడెంట్ల ఆదాయం వస్తోందని, ఆదాయం వచ్చే సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేందుకు మోదీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మధు మండి పడ్డారు. స్టీల్ ప్లాంట్ సేర్లను అమ్మితే తెలుగు జాతి చూస్తూ ఊరుకోమని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై చంద్రబాబు నోరు మెదపాలన్నారు.

15:44 - August 7, 2017

హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌కు ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. ఈ సందర్భంగా షర్మిల..తన అన్నయ్య జగన్‌కు ఆప్యాయంగా స్వీట్స్‌ తినిపించారు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.  షర్మిల తనకు రాఖీ కట్టిన ఫోటోను జగన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

 

15:41 - August 7, 2017

హైదరాబాద్ : సీబీఐ కేసుల నుంచి బయటపడటానికే సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే  మోదీకాళ్లపై పడ్డారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ అంశంలో తెగ హడావిడి చేసిన కేసీఆర్‌.. సాగునీటి ప్రాజెక్టులకు నష్టం కలుగుతోందని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిడ్డారు. జీఎస్టీని గుడ్డిగా సమర్థించి రాష్ట్రానికి చేటు తెచ్చారని పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నకేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం కలిగించారని చెప్పారు. ప్రభుత్వం ఒక్కటే కోర్టుకు వెళ్లితే ప్రయోజనం రాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. 

 

తెలుగు ఫిల్మ్ చాంబర్ కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ

హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ చాంబర్ కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ రాశారు. డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమ సిగ్గుపడాల్సిన అంశం కాదన్నారు. ఫిల్మ్ చాంబర్ క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం కాదని, సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా ఉందని, సిట్ విచారణ ఎదుర్కొన్న వారిలో ఏ ఒక్కరూ తప్పు ఒప్పుకున్నట్లు గానీ, తప్పు నిరూపించబడినట్లు కానీ రుజువు కాలేదన్నారు. అలాంటపుడు క్షమాపణ ఎందుకు చెప్పినట్లు ప్రశ్నించారు.

15:22 - August 7, 2017

కృష్ణా : విజయవాడకు చెందిన డాక్టర్‌ సూర్యకుమారి మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. మాచవరం పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. 4 కెమెరాల్లో రికార్డయిన సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. క్రీస్తు రాజపురంలోని సూర్యకుమారి ఇంటి నుంచి మొఘల్‌రాజ్‌పురంలోని విద్యాసాగర్‌ ఇంటి వరకు వెళ్లినట్లు విజువల్స్‌ రికార్డయ్యాయి. విద్యాసాగర్‌ ఇంటి నుంచి గాంధీనగర్‌లోని రైవస్‌ కాల్వ వరకు స్కూటీపై సూర్యకుమారి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. సూర్యకుమారిది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. సూర్యకుమారి, విద్యాసాగర్‌ కాల్‌ డేటాపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం....

 

15:15 - August 7, 2017

రంగారెడ్డి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇవాళ్టీ నుంచి ఈనెల 20 వరకు హైఅలర్ట్‌ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టులో బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్‌పోర్టు లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు అన్ని రకాల పాసులు రద్దు చేసి సందర్శకులకు అనుమతి నిరాకరించారు. 

 

పోలవరం లో భారీ వర్షం

ప.గో: పోలవరం లో భారీ వర్షం పడుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. పోలవరం పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఘట్ కేసర్ పరిధిలో భారీ వర్షం...

మేడ్చల్: ఘట్ కేసర్ పరిధిలోని పలు గ్రామాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లు జలమయమై విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ముగిసిన అమర్ నాథ్ యాత్ర...

జమ్మూకశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర ముగిసింది. 40 రోజుల పాటు అమర్ నాథ్ యాత్ర కొనసాగుతోంది. లింగాన్ని 206 లక్షల మంది యాత్రకులు సందర్శించుకున్నారు.

కేరళ హైకోర్టు లో శ్రీశాం కు ఊరట

తిరువనంతపురం: కేరళ హైకోర్టు లో శ్రీశాంత్ కు ఊరట లభించింది. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేయాలని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో 2013లో శ్రీశాంత్ పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

 

సూర్యకుమారిది ఆత్మహత్యే : పోలీసులు!

విజయవాడ: డాక్టర్ సూర్యకుమారి మృతి కేసులో మాచవరం పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. క్రీస్తురాజపురంలోని సూర్యకుమారి ఇంటి నుంచి మొఘల్ రాజ్ పురంలోని నిందితుడి విద్యాసాగర్ ఇంటి వరకు విద్యాసార్ ఇంటి నుంచి గాంధీ నగర్ లోని రైవస్ కాల్వ వరకు స్కూటీ పై సూర్యకుమారి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. సూర్యకుమారిది ఆత్మహత్యగానే పోలీసులు భావిస్తున్నారు. సూర్యకుమారి, విద్యాసాగర్ సెల్ ఫోన్ల కాల్ డేటా ఆధారంగా మరింత సమాచారాన్ని మాచవరం పోలీసులు సేకరిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలి: వెంకయ్యనాయుడు

తిరుపతి: స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో రూ. 124 కోట్లతో నిర్మించిన పద్మావతి మెడికల్ కాలేజీ విద్యార్థినుల హాస్టల్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మరో 7 భవన నిర్మాణాలకూ వెంకయ్య శంకుస్థాపన చేశారు. మొదటి అధికారిక కార్యక్రమంగా ఆస్పత్రి భవనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరగాలన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యులు సంఖ్య పెరగాలన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను క్రమ శిక్షణతోనే ఈ స్థాయికి చేరానని వెంకయ్య స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యకు విదేశీ విద్యార్థిని రాఖీ కట్టింది. రక్షా బందన్ మన దేశ సంస్కృతికి ప్రతీక అన్నారు.

కోణార్క్, లోక మాన్య రైళ్లలో గంజాయి పట్టివేత...

సికింద్రాబాద్ : కోణార్క్, లోక మాన్య రైళ్లలో గంజాయిని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఓ మహిళ తో పాటు ఏడుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

'అమరావతి డిక్లరేషన్ సమావేశం'

అమరావతి: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో అమరావతి డిక్లరేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్పీకర్ కోడెల, మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి పీతల, మహిళా ఐఏఎస్లు, విద్యార్థులు హాజరయ్యారు. మహిళల సమస్యలపై సమగ్ర సలహాలు, సూచనలు ఇవ్వాలని, పరిష్కార మార్గాల పై అమరావతి డిక్లరేషన్ లో చర్చించామన్నారు. డిక్లరేషన్ కు సంబంధించిన బుక్ సిద్ధం అయ్యిందని కోడెల స్పష్టం చేశారు. సీఎం చేతుల మీదుగా అమరావతి డిక్లరేషన్ బుక్ విడుదల చేస్తామన్నారు. అన్ని రంగాల్లో పని చేస్తున్న మహిళలకు డిక్లరేషన్ బుక్ లు అందజేస్తామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు.

13:41 - August 7, 2017

కరీంనగర్ : మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఆమరణ నిరాహార దీక్ష 3 వ రోజుకు చేరుకుంది. పొన్నం ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని డాక్టర్లు సూచిస్తున్నారు. పొన్నం శరీరంలొ నీటి శాతం పూర్తిగా పడిపోయిందని పల్స్, బీపి నార్మల్ గా ఉన్నాయని నీరు తీసుకోపోతే కిడ్నీలు, లివర్ చెడిపోయె ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దీక్ష విరమించాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. ఏ క్షణాన అయినా పొన్నం దీక్షను భగ్నం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే కరీంనగర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై హామీ వచ్చేంతవరకు దీక్ష కొనసాగిస్తానని పొన్నం తేల్చి చెబుతున్నారు. మరోవైపు దీక్ష కొనసాగిస్తున్న పొన్నం ప్రభాకర్‌కు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. 

13:40 - August 7, 2017

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రీకరణ సమయంలో బైక్‌ స్టంట్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానంటూ విష్ణు ఓ వీడియోలో వెల్లడిస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

13:40 - August 7, 2017

తూర్పుగోదావరి : అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని.. ఇవాళ ఉదయం 11 గంటలకు మూసేశారు. ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని మూసేశారు. రేపు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ చేసి.. ఉదయం 7 గంటల నుండి భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తారు. 

13:21 - August 7, 2017

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: ప్రగతి భవన్ లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.

'15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తాం'

తూ.గో : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి త్వరలోనే కార్యాచరణ చేపడతామన్నారు. తూగో జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరందిస్తామని, పోలవరం ప్రాజెక్టు ఖర్చు రు. 2వేల కోట్లు అవుతుందని, పోలవరం వ్యయం పై కేంద్రం అంచనాలు సవరించాల్సి ఉందని, పోలవరం నిర్వాసితుల పునరావాసానికి రూ.32 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నిర్వాసితుల విషయంలో కావాలనే రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

13:18 - August 7, 2017

మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరులో అక్రమ రేషన్ బియ్యం ముఠా గుట్టురట్టైంది. 10టివి ప్రతినిధుల చొరవతో బండారం బయపడింది. లారీ సహా 440 బస్తాల రేషన్ బియ్యన్ని సీజ్ చేశారు. తొర్రూరు కేంద్రంగా ఏపీ, చత్తీస్ ఘడ్ కు బియ్యం తరలిపోతున్నాయి. పోలీసులు సీజ్ చేసిన బియ్యాన్ని సైతం ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజారత్న విచారణ చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:16 - August 7, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నేదర్లాండ్స్ దేశస్థుడు కమింగాకు మూడు రోజలు పోలీసుల కస్టడీ ముగిసింది. కమింగాను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపర్చారు. మియాపూర్ కోర్టు కమింగాకు 14 రోజుల రిమాండ్ విధంచింది. సిట్ అధికారులు కమింగా నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. కమింగా సినీ ప్రముఖులు, ఐటీ ప్రతినిధులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సమాచారమిచ్చాడు. ప్రస్తుతం కమింగా ప్రముఖ సాఫ్టవేర్ కంపెనీలకు సహాదారుడిగా ఉన్నాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

13:13 - August 7, 2017
13:12 - August 7, 2017

విశాఖ : విశాఖలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. స్టీల్ కార్మికులు కదం తొక్కారు. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈ నెల 9న జరగబోయే మహాధర్నాకు.. విశాఖ నుండి ఢిల్లీకి వెయ్యి మంది కార్మికులు బయలుదేరారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు వారికి వీడ్కోలు పలికారు. బీజేపీ ప్రభుత్వం ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తోందని మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం నిలుపుకోనట్లయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 

చెర్లపల్లి జైలుకు కమింగ

హైద‌రాబాద్: డ్ర‌గ్స్ స్మ‌గ్ల‌ర్ క‌మింగ కు పోలీసుల క‌స్ట‌డి ముగిశాక ఈ రోజు అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు పోలీసులు. అనంత‌రం క‌మింగా ను చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు పోలీసులు త‌ర‌లించారు. గ‌త మూడ్రోజులుగా క‌మింగ‌ను శేరిలింగంప‌ల్లి ఎక్సైజ్ అధికారులు విచారించారు. క‌మింగ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచార‌ణ కొన‌సాగింది. నెద‌ర్లాండ్స్ కు చెందిన క‌మింగ డ‌చ్ వీసాతో చాలా సార్లు ఇండియాకు వ‌చ్చి డ్ర‌గ్స్ డీల‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు సిట్ ఆధారాలు సేక‌రించింది. ఎమ్మెన్సీ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న వ్య‌క్తుల‌కు నేరుగా క‌మింగ‌నే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు.

13:11 - August 7, 2017

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఘనంగా నిర్వహించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాల విద్యార్థులతో గవర్నర్‌ దంపతులు గడిపారు. ఈ సందర్భంగా చిన్నారులు గవర్నర్‌కు రాఖీ కట్టారు. పలు రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, ప్రముఖులు గవర్నర్‌ నరసింహన్‌కు రాఖీలు ప్రదానం చేశారు. పుష్పగుచ్చాలు సమర్పించి గవర్నర్ దంపతులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. 

13:10 - August 7, 2017

హైదరాబాద్ : పీపుల్స్‌ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం..చేనేతలను ప్రోత్సహిద్దాం అన్న పిలుపుతో వేడుకలకు హాజరైన ఆహుతులతో మంత్రి కేటీఆర్‌ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. నేతన్నకు చేయూత పేరిట కొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. నేతన్న 8 శాతం చెల్లించడానికి ముందుకొస్తే.. ప్రభుత్వం 16 శాతం చెల్లించనుందని చెప్పారు. దేశంలో చేనేత, టెక్స్‌టైల్‌ రంగానికి 1283 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొట్ట మొదటి ప్రభుత్వం తెలంగాణే అన్నారు. నూలు, రసాయనాలు, అద్దకాలపై 50 శాతం సబ్సిడీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.   

13:09 - August 7, 2017

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు సందర్భంగా ఈ నెల 20 వరకు హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు, సీఐఎన్ ఎఫ్, ఆర్ ఏ ఎక్స్ ఏతో పాటు డాగ్, బాంబ్ స్వ్కాడ్ తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే ఎయిర్ పోర్టులోకి అనుమతిస్తున్నారు. అన్ని రకాల పాసులు రద్దు చేసి, సందర్శకులకు అనుమతి నిరాకరించారు.

13:08 - August 7, 2017

హైదరాబాద్ : కేటీఆర్‌ నివాసంలో రాఖి సందడి నెలకొంది. ఎంపీ కవిత తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టి హెల్మెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు కేటీఆర్‌ కవితకు చేనేత చీరను బహుమతిగా అందజేశారు.

ప్రజా ఉద్యమాలను అణచివేసేలా సీఎం చర్యలు: పి.మధు

విజయవాడ: ప్రజా ఉద్యమాలను అణచివేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో వంశధార నిర్వాసితుల గొంతు నొక్కుతున్నారని, నిర్వాసిత ప్రాంతంలో పోలీసులను ఉపసంహరించాలని. నిర్వాసితులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వంశధార ప్రాజెక్టు పూర్తవుతున్నా పరిహారం చెల్లించకపోవడం దారుణం అన్నారు. దొండపాడు లో దళితులపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. దళితేలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

12:47 - August 7, 2017

వరంగల్ : విద్యుత్‌ స్తంభంపై నుంచి పడి కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాకతీయ వైద్యకళాశాల వద్ద విద్యుత్‌ తీగలను మరమ్మతు చేస్తుండగా రమేష్‌ అనే కార్మికుడు స్తంభంపై నుంచి కిందపడ్డాడు. అక్కడే గోడపై అమర్చిన ఇనుప చువ్వ రమేష్‌ తొడలోకి దూసుకెళ్లింది. స్థానికులు ఇనుప రాడ్‌ను కట్‌ చేసి ఆంబులెన్సులో MGM ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి ఇనుప చువ్వను తొలగిస్తామని వైద్యులు తెలిపారు.

రఘువీరాకు రాఖీలు కట్టిన మహిళా నేతలు..

హైదరాబాద్: ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మహిళా కాంగ్రెస్ నేతలు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతుండటంతో టామోటా, ఉల్లిపాయలు కానుకగా ఇచ్చారు. ప్రభుత్వం ధరలు స్థిరీకరణకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మహిలలకు చట్ట సభలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళాపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను ప్రభుత్వం మూయించాలని డిమాండ్ చేశారు.

ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా పుష్పరాజు

అమరావతి: ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గా పుష్పరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పుల్లారావు, పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం అన్నారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

12:27 - August 7, 2017

మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరులో అక్రమ రేషన్ బియ్యం ముఠా గుట్టురట్టైంది. 10టివి ప్రతినిధుల చొరవతో బండారం బయపడింది. లారీ సహా 440 బస్తాల రేషన్ బియ్యన్ని సీజ్ చేశారు. తొర్రూరు కేంద్రంగా ఏపీ, చత్తీస్ ఘడ్ కు బియ్యం తరలిపోతున్నాయి. పోలీసులు సీజ్ చేసిన బియ్యాన్ని సైతం ఇతర రాష్ట్రాలకు అక్రమార్కులు తరలిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాజారత్న విచారణ చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

మానవత్వం మరిచిన తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు

చెన్నై: సీఎం పళని స్వామి కాన్వాయ్ కోసం పేషెంట్ ఉన్న అంబులెన్స్ ను ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. మిగతా వాహనాలనూ పోలీసులు అనుమతించలేదు. ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. చేనేత రంగానికి రూ.1,280 కోట్ల బడ్జెట్ కేటాయించామని, చేనేత వస్త్రాల బై బ్యాక్ కోసం రూ. 147 కోట్లు కేటాయించామన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు.

ముంబైలో ఉగ్రవాదుల కుట్ర భగ్నం

హైదరాబాద్: ముంబైలో ఉగ్రవాదుల కుట్రను పోలీసు భగ్నం చేశారు. ఏటీఎస్, ఆర్ పీఎఫ్ బలగాల జాయింట్ ఆపరేషన్ లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

రెండేళ్ల చిన్నారిని ఢీ కొట్టిన కారు... మృతి

హైద‌రాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి విష్ణు న‌గ‌ర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న రెండు సంవ‌త్స‌రాల చేత‌న అనే చిన్నారిని కారు ఢీకొట్టింది. దీంతో చిన్నారి అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయింది. వెంట‌నే కారు డ్రైవ‌ర్ కారు తో స‌హా అక్క‌డి నుంచి పారిపోయాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

 

పురుషోత్తమ పట్నం కు సీఎం చంద్రబాబు

తూ.గో : పురుషోత్తమ పట్నం కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని రైతులు సీఎంకు వినతిపత్రం అందజేశారు.

11:42 - August 7, 2017

హైదరాబాద్: ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా రూపొందుతున్న టాలీవుడ్ బిగ్ బాస్ పై వివాదాలు మొదలవుతున్నాయి. ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు.

 

11:35 - August 7, 2017
11:34 - August 7, 2017
11:33 - August 7, 2017

హైదరాబాద్ : వనస్థలీపురంలో దారుణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వైద్యురాలు రాణి ఆపరేషన్ చేసింది. ప్రియురాలు హారిక గర్భం దాల్చడంతో ఆపరేషన్ కోసం ప్రియుడు మధు ఆసుపత్రిలో చేర్పించాడు. అబార్షన్ కోసం డాక్టర్ తో రూ.20 వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. హారిక ఐదు నెలల గర్బవతి కావడంతో డాక్టర్ గర్భం తొలగించాడానికి ప్రయత్నించడంతో తీవ్ర రక్తస్రామై హారిక మృతి చెందింది. మృతదేహన్ని ఉస్మానియా మర్చారికి తరలించారు. హారిక ఇంజనీరింగ్ చదువుతోంది. ప్రియుడు మధు ఫోటో గ్రాఫర్ మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:31 - August 7, 2017

హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్ లో విషాదం నెలకొంది. విష్ణునగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రెండేళ్ల చిన్నారి చైత్ర అక్కడికక్కడే మృతి చెందింది.

సీఎంచంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకులు

అమారవతి: సీఎం చంద్రబాబు నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. చంద్రబాబుకు మంత్రి పరిటాల సుజాత, మాజీ మంత్రి పీతల సుజాత, శోభా హైమావతి, సీతక్క, గద్దె అనురాధ, ఇతర మహిళా నేతలు రాఖీ కట్టారు.

సీఎం కేసీఆర్ అధికారక నివాసంలో రాఖీ వేడుకలు

హైదరాబాద్: సీఎం అధికారక నివాసంలో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ కు మహిళలు రాఖీ కట్టారు.

అరాచకాలకు జగన్ పెట్టింది పేరు: మంత్రి జవహర్

అమరావతి: అరాచకాలకు జగన్ పెట్టింది పేరు అని మంత్రి జవహర్ అన్నారు. నంద్యాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, శిల్పా మోహనఠ్ రెడ్డి కులాలను విభజించి ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. పార్టీలు మారడంలో శిల్పా బ్రాండ్ అంబాసిరడ్ అని జవహర్ ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నికలలో టిడిపి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు. మహిళపై రోజా వ్యాఖ్యలు అభ్యంతరకరం అని, మహిళలు చుడిదార్ ధరించడంలో తప్పేంటని ప్రశ్నించారు. రోజా టీవీ షోల్లో ఎలాంటి డ్రెస్ లు వాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు.

వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్: జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌కు హాజ‌ర‌యిన మంత్రి కేటీఆర్.. ఈ సంద‌ర్భంగా చేనేత‌ వ‌స్త్ర ప్ర‌ద‌ర్శ‌నను ప్రారంభించారు.

 

11:04 - August 7, 2017

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం జై లవకుశ. ల‌వ కుమార్ పాత్ర కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను ఇవాళ రిల‌జ్ చేసింది మూవీ యూనిట్. సింపుల్ అండ్ స్టైలిష్ గా యంగ్ టైగ‌ర్ ఇచ్చిన ఫోజు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్న‌ది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్రలో విలన్ గా, మరొక పాత్రలో ల‌వ కుమార్ అనే ప్రభుత్వ ఉద్యోగిగా, వేరొక పాత్రలో క్లాసికల్ డ్యాన్సర్ గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్యారెక్ట‌ర్ పై పూర్తి అవ‌గాహ‌న లేన‌ప్ప‌టికీ.. ల‌వ కుమార్ ఎంతో స్టైలిష్ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ చూసి ల‌వ కుమార్ పాత్ర పై ఎన్టీఆర్ అభిమానులు భారీగానే అంచ‌నాలు పెట్టుకుంటున్నారు. 

మరోసారి పాదయాత్రకు ముద్రగడ యత్నం..

తూ.గో : మరోసారి ముద్రగడ పాదయాత్రకు యత్నించారు. కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద బైఠాయించి ముద్రగడ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

పురుషోత్తమ పట్నం నిర్వాసితల గృహ నిర్భంధం

తూ.గో: సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటన నేపథ్యంలో పురుషోత్తమ పట్నం నిర్వాసితల గృహ నిర్భంధం చేశారు. పరిహారం విషయంలో ఆందోళన చేస్తారేమోనని 13 మందిని హౌస్ అరెస్ట్ చేశారు.

ఎదురు కాల్పులో ఉగ్రవాది హతం

జ‌మ్ముక‌శ్మీర్: పుల్వామా జిల్లా సంబూర‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య గ‌త అర్ధ‌రాత్రి నుంచి ఎదురు కాల్పులు కొన‌సాగాయి. భార‌త సైన్యం కాల్పుల్లో అబు ఇస్మాయిల్ గ్రూప్ కు చెందిన‌ ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాది ఉమ‌ర్ హ‌త‌మ‌య్యాడు. మొత్తం ముగ్గురు ల‌ష్క‌రే తొయిబా ఉగ్ర‌వాదులు భార‌త సైన్యం పై కాల్పుల‌కు తెగ‌బ‌డి న‌ట్లు స‌మాచారం.

తిరుమలలో వెంకయ్యనాయుడు...

తిరుప‌తి: భార‌త‌ ఉప రాష్ట్ర‌ప‌తి గా గెలిచిన త‌ర్వాత బెంగ‌ళూరు కు వెళ్లిన వెంక‌య్య‌నాయుడు ఆ త‌ర్వాత అటునుంచి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుమ‌ల కు చేరుకున్నారు. ఆయ‌న‌కు టీటీడీ అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

10:33 - August 7, 2017

పూణె: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు స్వైన్ ఫ్లూ సోకింది. ఈ అంశాలన్ని అమీర్ తెలిపారు. ఈ రోజు పూణె లో జ‌రుగుతున్న పాని ఫౌండేష‌న్ కు చెందిన స‌త్య‌మేవ్ జ‌య‌తే వాట‌ర్ క‌ప్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొనవలసి వుంది. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో నుంచి లైవ్ వీడియో ద్వారా అమీర్ ఖాన్ మాట్లాడారు. స్వైన్ ఫ్లూ సోకినందు వ‌ల్ల ఈవెంట్ కు రాలేక‌పోయాన‌ని... వేరే వాళ్ల‌కు సోక కూడ‌ద‌నే అవార్డ్స్ ఈవెంట్ ను స్కిప్ చేశాన‌ని ఆయ‌న అన్నారు.

10:32 - August 7, 2017

హైదరాబాద్ : వనస్థలీపురంలో దారుణం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా వైద్యురాలు ఆపరేషన్ చేసింది. ప్రియురాలు హారిక గర్భం దాల్చడంతో ఆపరేషన్ కోసం ప్రియుడు మధు ఆసుపత్రిలో చేర్పించాడు. అబార్షన్ కోసం డాక్టర్ తో రూ.20 వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. హారిక ఐదు నెలల గర్బవతి కావడంతో డాక్టర్ గర్భం తొలగించాడానికి ప్రయత్నించడంతో తీవ్ర రక్తస్రామై హారిక మృతి చెందింది. హారిక ఇంజనీరింగ్ చదువుతోంది. ప్రియుడు మధు ఫోటో గ్రాఫర్ మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:32 - August 7, 2017

శ్రీకాకుళం : జిల్లాలోని వంశధార నిర్వాసిత ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతవరణం నెలకొంది. మూడు మండలాల నిర్వాసితులు భయ బ్రాంతులకు గురౌతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

10:31 - August 7, 2017

నిర్మల్ : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలో అపవిత్రం చొటుచేసుకుంది. మొదటి శ్రావణ శుక్రవారం రోజున ఓ పూజారి ఉత్సవ విగ్రహాన్ని పొలిమేర దాటించారు. ఆలయ ప్రధాన పూజారి సంజయ్ విగ్రహాన్ని పొలిమేర దాటించి పూజలు నిర్వహించారు. ఈవో పూజారి వివరణ ఇవ్వలని మెమో జారీ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

గుజరాత్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

అహ్మ‌దాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు ఉద‌యం గుజ‌రాత్ చేరుకున్నారు. వాళ్ల‌ను బ‌రోడాలోని ఓ రిసార్ట్ కు త‌ర‌లించారు. ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు క్యాంప్ లోనే ఎమ్మెల్యేలు ఉండ‌నున్నారు. 10 రోజ‌ల త‌ర్వాత బెంగ‌ళూరు నుంచి ఎమ్మెల్యేలు గుజ‌రాత్ వ‌చ్చారు. రేపు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ ఎమ్మెల్యేలు ఓటు వేయ‌నున్నారు. అయినా.. ఇంకా ఎమ్మెల్యేల పై అసంతృప్తిగానే ఉన్నారు కాంగ్రెస్ నేత‌లు. అహ్మ‌ద్ ప‌టేల్ గెలుపు కోసం తీవ్రంగా కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. 44 మంది ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ బెంగ‌ళూరు కు గ‌త నెల 29 న త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. 

మ.ఒంటిగంటకు బాసరదేవాలయం మూసివేత..

బాస‌ర: చంద్ర‌గ్ర‌హ‌ణం దృష్ట్యా స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి దేవాల‌యం బాస‌ర ను మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు మూసేయ‌నున్నారు ఆల‌య అధికారులు. రేపు ఉద‌యం 4 గంట‌ల‌కు ఆల‌య సంప్రోక్ష‌ణ‌, అభిషేకం అలంక‌ర‌ణ త‌ర్వాత‌... అమ్మవారికి మ‌హా హార‌తి సమ‌ర్పించి ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు.

కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత...

హైదరాబాద్‌: రక్షా బంధన్‌ పండుగ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి కవిత రాఖీ కట్టారు. ‘సిస్టర్‌ ఫర్‌ ఛేంజ్‌’కు పిలుపునిచ్చిన కవిత కేటీఆర్‌కు రాఖీ కట్టిన అనంతరం హెల్మెట్‌ను బహుకరించారు. అనంతరం కేటీఆర్‌ తన సోదరికి చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు.

09:14 - August 7, 2017

హైదరాబాద్ : గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్యర్యంలో 500మందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆరుగురు రౌడీ షీటర్లు, 26 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 52వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 

09:13 - August 7, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మైక్ కమింగా కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు ఇటీవలే నెదర్లాండ్ చెందిన కమింగాను అరెస్టు చేశారు. సిట్ మూడు రోజుల పాటు కమింగాను డ్రగ్స్ వ్యవహరంలో ప్రశ్నించారు. అతను హైదరాబాద్ చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చెసుకునట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డ్రగ్స్ కేసులో నేటితో కమింగా కస్టడీ పూర్తి

 హైదరాబాద్  : డ్రగ్స్ కేసులో మైక్ కమింగా కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు ఇటీవలే నెదర్లాండ్ చెందిన కమింగాను అరెస్టు చేశారు. సిట్ మూడు రోజుల పాటు కమింగాను డ్రగ్స్ వ్యవహరంలో ప్రశ్నించారు. అతను హైదరాబాద్ చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చెసుకునట్టు తెలుస్తోంది. 

 

08:28 - August 7, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో మైక్ కమింగా కస్టడీ నేటితో ముగియనుంది. పోలీసులు ఇటీవలే నెదర్లాండ్ చెందిన కమింగాను అరెస్టు చేశారు. సిట్ మూడు రోజుల పాటు కమింగాను డ్రగ్స్ వ్యవహరంలో ప్రశ్నించారు. అతను హైదరాబాద్ చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చెసుకునట్టు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

ఇనుప మెట్లపై వెనక్కు తగ్గిన టీటీడీ

చిత్తూరు : తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల అంశంపై టీటీడీ ఎనక్కి తగ్గింది. వెండివాకిలి వద్ద ఇనుప మెట్ల ఏర్పాటును టీటీడీ విరమించుకుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇనుప మెట్లను టీటీడీ అధికారులు పూర్తిగా తొలగించారు. ఆగమ పండితులు, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

08:18 - August 7, 2017

చిత్తూరు : తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల అంశంపై టీటీడీ ఎనక్కి తగ్గింది. వెండివాకిలి వద్ద ఇనుప మెట్ల ఏర్పాటును టీటీడీ విరమించుకుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇనుప మెట్లను టీటీడీ అధికారులు పూర్తిగా తొలగించారు. ఆగమ పండితులు, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

08:12 - August 7, 2017

హైదరాబాద్ : శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. ఆరోజే రాఖీ పండుగ జరుపుకుంటారు. అంతేకాదు జంధ్యాల పౌర్ణమి.. రక్షికా పూర్ణిమ, నారికేళ పూర్ణిమ ఇలా అనేక పేర్లతో భారతదేశమంతటా పండుగ చేసుకుంటారు. ఈరోజు పెళ్లిళ్లై ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఆడపిల్లలంతా పుట్టింటికి చేరుకుంటారు. అన్నదమ్ములకు రాఖీ కడతారు. రాఖీలోని రంగు రంగుల దారాలు వారి అనుబంధానికి గుర్తుగా నిలుస్తాయి. రాఖీ పండుగ రోజు అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారి క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ వేడుక ఉత్తరాదివారి సంప్రదాయమైనా దక్షిణాదికి కూడా సంక్రమించడంతో యావత్ భారత దేశంలో రాఖీ పండుగను జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టిన సందర్భంలో అన్నదమ్ములు వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు తమ తోబుట్టువుల రక్షణ బాధ్యతను తమ కర్తవ్యంగా భావించడం ఈ పండుగలోని అంతరార్థం. ఇక దేశ విదేశాల్లో ఉండేవారు పోస్టులోనైనా సరే అన్నదమ్ములకు రాఖీలు పంపుతారు. తమ అభిమానాన్ని చాటుకుంటారు. మరోవైపు అన్నదమ్ములు లేని ఆడపిల్లలు ఆత్మీయతను పంచే మగవారికి రాఖీలు కట్టి ఆ లోటును మర్చిపోతారు.

బంగారు, వెండి రాఖీలు 
రాఖీలు ఒకప్పుడు రంగు రంగుల దారాలు రాఖీలుగా కట్టేవారు. కానీ ఇప్పుడు రకరకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. రంగు రంగుల రాఖీలతో పాటు బంగారు, వెండి రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది చైనా రాఖీల అమ్మకాలు లేకపోవడంతో దేశీయ రాఖీలకు బాగానే డిమాండ్ కనిపిస్తోంది. 

08:11 - August 7, 2017

కర్నూలు : ఇదిగో ఇతని పేరు శ్రీనివాసులు. చేసేది గౌరవప్రదమైన ఉపాధ్యాయవృత్తి. కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చేది మంచి వేతనమే అయినా... ఆ పంతులుగారికి డబ్బు ఆశ తీరలేదు. ఏం చేసైనా ఇంకా డబ్బులు సాధించాలనుకున్నాడు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు.. అతనే వక్రమార్కం పట్టాడు. డబ్బు సంపాదనకు ఈ పంతులు గారు ఎంచుకున్న మార్గం నిరుద్యోగులను ముంచడం. ఉపాధి కోసం ఆశపడుతున్న నిరుద్యోగులను టార్గెట్‌ చేశాడు. వారి అవసరాలను ఆసరగా చేసుకుని అక్రమ దందాకు తెరలేపాడు. తనతోపాటు మరికొంతమందిని కలుపుకుని ముఠాగా ఏర్పడ్డాడు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం.. అవసరమైన వారికి నకిలీ డ్రైవింగ్‌ లైసెన్స్లు సృష్టించడంలో సారు ఆరితేరారు. ఇలా వందలాది మంది నిరుద్యోగులకు నకిలీ పత్రాలు సృష్టించి లక్షల్లో గడించాడు.

నకిలీ సర్టిఫికెట్లు
ఏపీలో ఇప్పుడంతా ఆన్‌లైన్‌ వ్యవస్థ అయ్యింది. అయితే పంతులు ముఠా తయారు చేస్తున్న సిర్టిఫికెట్లు చెల్లడం లేదు. దీంతో వీరి నుంచి నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న చాలా మంది నిరుద్యోగులు మోసపోయారు. కొంతమంది నిరుద్యోగులు నిలదీయగా ఎలాగోలా తప్పించుకున్నాడు. ఆ తర్వాత నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో ఈ ముఠా సభ్యులంతా సమావేశమై చర్చిస్తుండగా పోలీసులు అటాక్‌ చేశారు. ముఠా నాయకుడు హెడ్మాస్టర్‌ శ్రీనివాసులతోపాటు అతని ముఠా సభ్యులంతా పోలీసులకు చిక్కారు. అయితే శ్రీనివాస్‌ ప్రధాన అనుచరుడు ఆంజనేయులు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుబడిన ముఠా సభ్యుల నుంచి వివిధ కాలేజీలు, యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి డబ్బుపైనున్న యావతో అక్రమార్జనకు తెరలేపిన శ్రీనవాస్‌ ముఠా పోలీసులకు చిక్కింది. కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది.

08:09 - August 7, 2017

విశాఖ : ఆంధ్రా- ఒడిషా సరిహద్దు ప్రాంతంలో గంజాయి విస్తారంగా సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి ఎక్కడ బయటపడ్డ దాని మూలాలు ఏవోబీ ప్రాంతంతోనే ముడిపడి ఉంటున్నాయి. ఇక్కడ విస్తారంగా సాగు చేస్తున్న గంజాయి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేశ, విదేశాలకు అక్రమంగా రవాణా అవుతున్నది . అధికారిక లెక్కల ప్రకారమే ఈ ప్రాంతంలో దాదాపు 150 నుంచి 200 గ్రామాల్లో గంజాయి సాగవుతుందట. ఏటా వందల ఎకరాల్లో సాగు చేస్తూ సుమారు ఐదు వేల టన్నుల గంజాయిని ఉత్పత్తి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఏవోబీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయిని, దాని అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పోలీస్‌, ఎక్సైజ్‌శాఖలు చేస్తున్న ప్రయత్నాలు వివిధ కారణాలతో సఫలీకృతం అవ్వడం లేదు. గంజాయితోపాటు, దాని ద్వారా తయారు చేస్తున్న నల్లమందు, లిక్విడ్‌ గంజాయి వినియోగం విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు లాంటి పట్టణాల్లో ఎక్కువవుతోంది.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌
గంజాయిని కూకటివేళ్లతో ఇప్పటికైనా పెకిలించకపోతే రానున్న రోజుల్లో దీని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశముంది. ఎక్కువగా యువత దీనికి బానిసలయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే... గంజాయి నిర్మూలనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎర్ర చందనం అక్రమ రవాణా నివారణకు ఏర్పాటు చేసినట్లుగానే గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని డిసైడ్‌ అయ్యింది. పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్న యువకులతోపాటు, అవసరమైతే మరికొంతమందిని కొత్తగా రిక్రూట్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎస్‌టీఎఫ్‌లో సుమారు వెయ్యి మందిని నియమించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్లలో ఏవోబీలో గంజాయి సాగు, రవాణాను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్‌టీఎఫ్‌కు ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. మూరుమూల ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు జరపడం, గంజాయి పంటను, నిల్వలను ధ్వంసం చేయడం, గంజాయి రవాణాకు వినియోగిస్తున్న మార్గాలు, ట్రాన్సిట్‌పాయింట్‌లపై నిఘా ఉంచాలని ఎస్‌టీఎఫ్‌ భావిస్తోంది.

ఒడిశా సరిహద్దులో
గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టడం ఎస్‌టీఎఫ్‌ ప్రధాన కర్తవ్యం. ఇందుకోసం కీలక ప్రాంతాల్లో పది ఎస్‌టీఎఫ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, ఒడిశా సరిహద్దులో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌టీఎఫ్‌కు ఆధునిక ఆయుధాలు, అధునాతన గాలింపు పరికరాలు వంటివి ప్రభుత్వం సమూకూర్చనుంది. గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే గాజువాక సమావేశంలో బహిరంగంగానే చెప్పారు. గంజాయి క్రమంగా విస్తరిస్తోందని... విద్యాసంస్థల్లోకి పాకుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. అందుకే గంజాయిని అరికడితేనే విద్యార్థుల భవిష్యత్‌ బాగుంటుందని తెలిపారు.ఏపీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా సర్కార్‌ పావులు కదుపుతోంది. మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

08:05 - August 7, 2017

నిజామాబాద్ : జిల్లాలో రైతుల ఆశలు ఆవిరవుతుననాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో వరుణుడు మురిపించాడు. దీంతో అన్నదాతలు ఆశతో విత్తనాలు విత్తారు. తీరా పైరు ఎదిగే క్రమంలో వరుణుడు ముఖం చాటేశాడు. అన్నదాతల ఆశల మేఘాలు ఆవిరై కరువు మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎటు చూసినా ఎండుతున్న పంటలు... వాటిని దిగాలుగా చూస్తున్న రైతులే కనిపిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్‌ కలిపి 3,79,553 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా.... వర్షాలు కురవకపోవడంతో కేవలం 2,64,979 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అంటే సుమారు 1,14,574 ఎకరాల్లో ఇప్పటికీ పంటలు వేయలేదు. ఇప్పటి వరకు సాగైన పంటల్లో వరి 40శాతం, మొక్కజొన్న 20శాతం, సోయా 10శాతం దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు. జూన్ -జులై మాసాల్లో వర్షాల మీద ఆధారపడి పంటలు వేశారు.

జూల్లై లో వర్షభవం
జూన్‌లో ఓ మోస్తారు వర్షం కురిసినా... జులైలో మాత్రం అంతగా పడలేదు. జూన్‌లో 150 మిల్లీ మీటర్ల వర్షం పడితేనే పంటలకు సరిపోతుంది. కానీ 120 మిల్లీ మీటర్ల వర్షపాతం మించలేదు. మొత్తం 27 మండలాల్లో కేవలం 9 మండలాల్లోనే సగటు వర్షపాతం నమోదు అయ్యింది. 18 మండలాల్లో సగటు కంటే తక్కువగానే నమోదు అయ్యింది. దీంతో పంటలపై వర్షభావ పరిస్థితి ప్రభావం చూపుతోంది. శ్రీరాంసాగర్‌, రామడుగు ప్రాజెక్టులతోపాటు కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతులు పంటలను వేశారు. కానీ తీవ్ర వర్షభావం కారణంగా చుక్క వరదనీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు కింద పంటలు సాగు చేసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాబోయే రోజుల్లోనైనా వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరైన సింగూరు జలాలను వదిలి ఆయకట్టు రైతులను నిజామాబాద్‌ రైతులను ఆదుకోవాలని రైతులు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు.

అడుగంటిన భూగర్భజలాలు
ప్రాజెక్టులు నిండకపోవడం, వర్షాలు కురవకపోవడం కారణంగా జిల్లాలో భూగర్భజలాలు కూడా తగ్గిపోయాయి. బోర్ల నుంచి వచ్చే నీరుకూడా బాగా తగ్గిపోయింది. దీంతో బోర్లకింద సాగుచేసిన పంటలకూ నీళ్లు అందడం లేదు. దీంతో పంట భూములన్నీ బీటలు వారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. అప్పుసప్పు చేసి వేసిన పంట కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు కూడా రాకపోతే అప్పులు ఎలా తీర్చాలని దిగాలు చెందుతున్నారు. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

08:01 - August 7, 2017

విజయవాడ : కృష్ణాజిల్లాలో డాక్టర్‌ సూర్యకుమారి మృతి కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. సూర్యకుమారి మృతికి మాజీ ఎమ్మెల్యే తనయుడు విద్యాసాగర్‌ కారణమయ్యాడనే అభియోగంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టగా.. 15 రోజులపాటు రిమాండ్‌ విధించారు. జులై 31న అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన సూర్యకుమారిని విద్యాసాగర్‌ ఏదో చేసి ఉంటాడని తొలినుంచి ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అన్ని కోణాల్లో విచారించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో.. అతడిని వదిలిపెట్టారు. శనివారం ఓ యువతి మృతదేహం నిడమనూరు వంతెన వద్ద కాలువలో దొరికింది. దుస్తులు, మెడలో ఉన్న లాకెట్‌ ఆధారంగా ఆ మృతదేహం సూర్యకుమారిదిగా గుర్తించారు. దీంతో విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి.. కోర్టులో ప్రొడ్యూస్‌ చేశారు. విద్యాసాగర్‌కు కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే... సూర్యకుమారి మృతితో తనకేమీ సంబంధం లేదని విద్యాసాగర్‌ అంటున్నాడు. తన కుమార్తెను

నమ్మించి మోసం చేశాడని
జులై 31 అర్ధరాత్రి సూర్యకుమారి తన ఇంటికి వచ్చి వెళ్లిపోయిందంటున్నారు. విచారణలో పోలీసులకు అన్ని వివరాలు చెప్పానన్నాడు. సూర్యకుమారి మృతిలో తన ప్రమేయం ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దమే అన్నాడు విద్యాసాగర్‌. ఇక పోస్ట్‌మార్టం అనంతరం సూర్యకుమారి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇదిలావుంటే... విద్యాసాగర్‌ చెప్పేవన్నీ అబద్ధాలని... తన కుమార్తెను నమ్మించి మోసం చేశాడని సూర్యకుమారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యాసాగర్‌ను శిక్షించాలని వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత సూర్యకుమారిది హత్యా, ఆత్మహత్యా అనేది తెలుస్తుందని పోలీసులంటున్నారు. 

08:00 - August 7, 2017

విజయవాడ : నంద్యాల సభలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు జగన్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. జగన్‌ ఫ్యాక్షన్‌ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఏపీ రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. నేరస్థుడి నోటివెంట నేరపూరితమైన భాషే వసుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్‌, వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిందామోపుతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

07:27 - August 7, 2017

ముఖ్యమంత్రిని కాల్చిచంపిన తప్పులేదన జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యన్ని అగౌవరపరిచినట్టేఅని, టీడీపీ ఈ వ్యాఖ్యలను తీవ్ర ఖండిస్తోందని, జగన్ కు ఏం చూసి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలని, ఎన్నికల సభకు వెళ్లినప్పుడు నీ హామీలు చెప్పాలి తప్ప ఇలాంటి వ్యాఖ్య చేయకూడదని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లా వాసులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని జగన్ ప్రశ్నించారని, ప్రభుత్వానికి నేరుగా సమాధానం చెప్పె ధైర్యం లేదని, దేశాన్ని అవమానించిన ముఖ్యమంత్రిని నిలదియడం తప్ప అని వైసీపీ నేత పార్థసారధి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని, ఉభయులు సాగదీయడం మంచిది కాదని, మంత్రి సొమిరెడ్డి వ్యాఖ్యల కూడా బాగాలేవని ప్రముఖ విశ్లేషుకులు తెలపల్లి రవి అన్నారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

07:26 - August 7, 2017

స్వాతంత్ర ఉద్యమంలో చేనేత రంగం ప్రముఖ పోరాటం చేసింది. యవత్ ప్రపంచాన్ని తన తిప్పుకున్న గాంధీగారు స్వదేశీ వస్త్రలను తయారు చేశారు. 1905 కాలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభించారు. చేనేత జీఎస్టీ మినయిహించలని సెప్టెంబర్ 11న ఢిల్లీలో ఆందోళన చేస్తామని, స్వదేశంలో తయారైన వస్త్రలపై జీఎస్టీ విధించడం బాధకరమని, జీఎస్టీ నుంచి చేనేత 18 నుంచి 5శాతం తగ్గిస్తామని అరుణ్ జైట్లీ చెప్పారని, ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి చేనేత కార్మికులు పోరాటనికి సిద్దంగా ఉన్నామని తెలంగాణ చేనేత నేత కూరపాటి రమేష్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కొండగట్టు ఆలయం మూసివేత

కరీంనగర్ : నేడు జిల్లాలోని కొండగట్టు అంజనేయస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్బంగా నేటి సాయంత్రం 4 గంటల నుంచి రేపు తెల్లవారుజామున 2గంటల వరకు మూసివేస్తారు.

నేడు వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్బంగా నేటి సాయంత్రం 4గంటల నుంచి రేపు తెల్లవారుజామున 2వరకు మూసివేస్తారు.

నేడు సింహాద్రి అప్పన్న ఆలయం మూసివేత

విశాఖ : జిల్లాలోని సింహచలంలో చంద్రగ్రహణం సందర్బంగా సింహాద్రిర అప్పన్న ఆలయాన్ని మూసివేయనున్నారు. సాయంత్రం 4.30 రేపు తెల్లవారుజామున 2వరకు ఆలయం మూసివేస్తారు.

తూ.గోలో సీఎం చంద్రబాబు పర్యటన

తూర్పు గోదావరి : జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆయన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథక పనులను పరిశీలించనున్నారు. 

నేడు శ్రీవారి ఆలయం మూసివేత

చిత్తూరు : జిల్లా తిరుమలలో చంద్రగ్రహణం సందర్బంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సాయంత్రం 4.30 నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున 2 వరకు మూసివేయనున్నారు.

కాకినాడ కార్పొరేషన్ కు నేటి నుంచి నామినేషన్లు

తూర్పుగోదావరి : జిల్లా కార్పొరేషన్ కు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది.  

టీఎస్ లో నేటి నుంచి బీసీ సంఘం ఆందోళన

హైదరాబాద్ : తెలంగాణ నేటి నుంచి బీసీ సంఘాల ఆందోళన ప్రారంభించనున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలు ఈ నెల 10 వరకు కొనసాగుతాయి. 

రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు

హైదరాబాద్ : నేడు రాజ్ భవన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు గవర్నర్ దంపతులు విద్యార్థులను కలవనున్నారు. 

గోల్కొండ పీఎస్ పరిధిలో కార్డన్ సర్చ్

హైదరాబాద్ : గోల్కొండ సీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. 54వాహనాలు స్వాధినం చేసుకున్నారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

Don't Miss