Activities calendar

08 August 2017

21:35 - August 8, 2017
21:34 - August 8, 2017

ఢిల్లీ : దేశవ్యాప్తంగా పాఠశాలల్లో యోగా సాధనను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు రోజు యోగా సాధన చేసేందుకు వీలుగా జాతీయ యోగా విధానాన్ని అమలుపరిచే దిశగా ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎంబీ లోకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. 'పాఠశాలల్లో ఏం బోధించాలో చెప్పడం మా పని కాదు. ఈ అంశంపై మేమెలా ఆదేశించగలం' అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. పాఠశాలల్లో ఏం బోధించాలనే అంశం ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది.

21:30 - August 8, 2017

చంఢీఘడ్ : చండీగఢ్‌లో ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వేధించిన కేసుకు సంబంధించిన సిసిటివి ఫుటేజీని తిరిగి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. హరియాణా బిజెపి చీఫ్ సుభాష్‌ బరాలా వికాస్‌ బరాలా కారులో యువతి కారును వెంబడించినట్లుగా సిసిటివి కెమెరా దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. తనని ఐదు కిలోమీటర్ల వరకు వెంబడించారని ఐఏఎస్‌ అధికారి కూతురు వర్ణికా కుందూ శుక్రవారం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐఏఎస్‌ కూతుర్ని వెంబడించిన దారిలో 6 ప్రదేశాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై టెక్నాలజీ పరంగా అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నరు. బాధితురాలి ఫిర్యాదుమేరకు వికాస్‌ బరాలా, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే వారు బెయిలుపై విడుదలయ్యారు. వీరిపై కిడ్నాప్‌ అభియోగాలను మోపకపోవడం పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో తమపై రాజకీయపరమైన ఒత్తిడి లేదని పోలీసులు చెప్పారు. 

21:27 - August 8, 2017

సిరిసిల్ల : నేరేళ్ల ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇసుక రవాణా చేయడంతో మొదలైన వాగ్వాదం లారీలు ధ్వంసం అయ్యే వరకూ వెళ్లింది. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఎందరో యువకులు ఆస్పత్రి పాలయ్యారు. బాధిత కుటుంబాలపై పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వాన్నే ఇరకాటంలోకి నెట్టేసింది. దీంతో పరిస్థితులను చక్కబెట్టేందుకు మంత్రి కేటీఆర్‌ నేరేళ్లకు వెళ్లారు. పోలీసుల లాఠీ దెబ్బలకు గాయపడి... వేములవాడ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేటీఆర్‌ పరామర్శించారు. బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడారు.

విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి
నేరేళ్ల ఘటనను విపక్షాలు రాద్ధాంతం చేస్తూ.. దొంగ కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. నేరేళ్ల ఘటన బాధాకరమన్న కేటీఆర్‌.. పోలీస్‌లపై డిఐజిచే విచారణ జరుగుతోందన్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపినట్లయితే వారికి కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజల ఆశీసులతోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తుందని, ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగదన్నారు. మిడ్‌ మ్యానేర్ డ్యాంలో నీరు నింపడం కోసం అందులో ఉన్న ఇసుకను తొలగించాలని ఇసుకను తరలిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. అంతేకాని అది ఇసుక మాఫియా కాదన్నారు. బాధితులకు టీఆర్‌ఎస్‌.. తరపున అండగా ఉంటామని వెల్లడించారు.అయితే ఇప్పటివరకూ పోలీసులపై ఎలాంటి విచారణకు ఆదేశించని ప్రభుత్వం తాజాగా అతిగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ జరుగుతుందని ప్రకటించడం, వారిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంపై పోలీసులను బాధ్యులుగా చూపే ప్రయత్నాలు మొదలయ్యాయనే అనుమానాలు కలుగుతున్నాయి.

21:14 - August 8, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలతోనే జగన్ మనస్తత్వం అర్ధమవుతుందని, ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ప్రస్తుతానికి లేవని ఆయన అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను ఏపీకే రానీయలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోశయ్యే చెప్పారని చంద్రబాబు తెలిపారు. పరిటాల రవీంద్ర,య శీవారెడ్డిల హత్యలతో తాను భావోద్వేగానికి గురయ్యానని చంద్రబాబు అన్నారు. తప భావోద్వేగంలోనూ ఎక్కడా మాట తూలలేదని ఆయన తెలిపారు. వైఎస్ అనుచరుడు గంగిరెడ్డికి నక్సలైట్లతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే అలిపిరి ఘటన తర్వాత వైఎస్ అడావిడి చేశాడని చంద్రబాబు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

గవర్నర్ తో చంద్రబాబు భేటీ

విజయవాడ : గేట్ వే హోటల్ లో ఏపీ సీఎం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ కలిశారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు.

21:04 - August 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేశారు. రెబల్స్ అమిత్ షాకు ఓటు వేసినట్లు తమ దగ్గర మీడియో పుటేజీ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జేడీయూ ఎమ్మెల్యే బీజేపీకి ఓటు వేశారని కేసీ త్యాగీ తెలిపారు. ఎన్నికలను రద్దు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. మరోవైపు ఎన్నికల కౌటింగ్ జరపాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిశాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

వారత్వం లేకున్నా జవసత్వంతో ఎదిగా : వెంకయ్య

హైదరాబాద్ : వాసత్వం లేకున్నా జవసత్వం వల్ల ఈ స్థాయికి వచ్చానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయా, పార్టీ తనకు తల్లిలాంటిదని ఆయన తెలిపారు. వ్యక్తిగత ద్వేషం, దూషణ తను అలవాటు చేసుకోలదని వెంకయ్య స్పష్టం చేశారు.

నయీంపై 227 కేసులు

హైదరాబాద్ : నయీం వ్యవహారంలో 227 కేసలు నమోదు చేసినట్టు అడిషనల్ డీజీ అంజన్ కుమార్ తెలిపారు. ఈ  కేసులో 25 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.

20:11 - August 8, 2017

నిజాయితీకి, నీతికి, స్వచ్ఛతకి తామే హోల్ అండ్ సోల్ బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకుంటారు. ఉపన్యాసాలు దంచుతారు. నీతులు వల్లెవేస్తారు. కానీ, అసలు విషయానికి వస్తే మాత్రం ఇంతకంటే దిగజారటానికి మరేమీ ఉండదనిపిస్తుంది. ఎన్ని ఎత్తులు.. ఎన్ని జిత్తులు.. ఎంత వికృత క్రీడ.. రాజకీయాలంటే అమ్మకాలు కొనుగోళ్లే అని ఏదో సినిమాలో చెప్పినట్టు.. అధికారం కోసం, పైచేసి కోసం, పట్టు సాధించటం కోసం.. దేనికైనా వెనుకాడని పరిస్థితి కమలదళంలో స్పష్టంగా కనిపిస్తోందా? అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు,బీహార్ లేటెస్ట్ గా గుజరాత్... ఇలా వరుసగా పలురాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యవహారశైలి ఇదే అంశాన్ని చెప్తోందా? ఈ గుజరాత్ మోడల్ నే దేశమంతా అనుసరించనున్నారా? ఈ మాట మన దేశంలో చాలా పాతది.. గోడదూకే రాజకీయాలకు, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి...పబ్బం గడుపుకునే పార్టీలకు మన రాజకీయాలు అడ్డాగా మారి ఎన్నో ఏళ్లయింది. అయితే.. తొండముదిరి ఊసరవెల్లిగా మారినట్టు.. మన పార్టీలు ఈ విషయంలో పీక్స్ కు చేరుతున్నాయి. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కనిపించిన పరిణామాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సభ్యులంతా ఆ పార్టీతోనే ఉంటే, ఆ ఒక్క సీటు గెలవటం, అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నిక అవటం నల్లేరుపై నడకే. కానీ, దానిపై బీజెపీ కన్నేసింది. దానికోసం పక్కాగా అడుగులు వేసింది. ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. చివరి క్షణం వరకు అడ్డదారిలో అధికారం కోసం అడుగులు వేస్తూనే ఉంది.. ఇప్పుడు ఇరకాటంలో పడింది.

వార్డెన్ చితకొట్టిన విద్యార్థినులు

సిద్దిపేట : కేసీఆర్ నగర్ లోని ప్రేమనిలయం చారిటీ హోం వార్డెన్ విద్యార్థునులను చితకొట్టారు. వార్డెన్ ప్రభాకర్ విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమనిలయం చారిటీ ట్రస్ట్ కు అనుమతులు లేవని అధికారలు తెలిపారు.

19:57 - August 8, 2017
19:55 - August 8, 2017

హైదరాబాద్ : మెట్రో పనుల్లో భాగంగా గ్రేటర్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేశారు. సికింద్రాబాద్‌ ఒలిఫెంటా బ్రిడ్జ్‌ మూసివేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:54 - August 8, 2017

హైదరాబాద్ :తెలంగాణలోని ప్రతి గుంట భూమినీ సర్వే చేయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట మండలంలోని మూడు చింతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి సేద్యపు పెట్టుబడి పథకాన్ని అమల్లోకి తెస్తామని, దీనికోసం ముందుగా భూముల వివరాలను సేకరిస్తామని సీఎం చెప్పారు. మూడు నెలల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, భూముల లెక్కలను ప్రక్షాళన చేస్తామన్నారు.సేద్యపు పెట్టుబడి పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి రైతుకూ వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. రైతుకు ఎన్ని ఎకరాలున్నాయన్న అంశాన్ని పట్టించుకోబోమన్నారు. పథకం అమలు కోసం.. ప్రతి గ్రామంలోనూ రైతు సంఘాలను, ఆరుగురితో గ్రామ రైతు సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి రైతుకూ.. ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు పంటలకు ఎనిమిదివేలు అందిస్తామన్నారు.

 ఏడాది రెండు పాడి పశువులు 
హరితహారం కార్యక్రమాన్ని సర్పంచులందరూ సీరియస్‌గా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఇంటి ముంగిటా ఆరు మొక్కలు నాటాలన్నారు. ఆరు చెట్లను బతికించే వారికి వచ్చే ఏడాది రెండు పాడి పశువులను ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రం నుంచి వలసలు బాగా తగ్గాయని, రైతులు బాగుపడాలంటే నీళ్లు, కరెంటు, పెట్టుబడి అవసరమన్న కేసీఆర్‌... రాష్ట్రంలో కరెంట్ కొరత పీడ శాశ్వతంగా పోయిందన్నారు. సాగునీటి సమస్య కూడా త్వరలోనే పోతుందన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. 

19:50 - August 8, 2017

సిద్దిపేట : కేసీఆర్ నగర్ లోని ప్రేమనిలయం చారిటీ హోం వార్డెన్ విద్యార్థునులను చితకొట్టారు. వార్డెన్ ప్రభాకర్ విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమనిలయం చారిటీ ట్రస్ట్ కు అనుమతులు లేవని అధికారలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:27 - August 8, 2017

మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి ఊరి జనం.. ఇయ్యాళ బువ్వదింటరో.. లేకపోతె అట్లనే నిద్రవోతరో.. ఎందుకంటె ముఖ్యమంత్రి కేసీఆరొచ్చిండు వాళ్ల ఊరికి.. మామూల్గ ప్రజలు కోరిక కోరితె నాయకుడు నెరవేరుస్తడు.. కని మన ముఖ్యమంత్రి ప్రజలకు ఆ ఛాన్సు ఇయ్యడు.. ఆయనకే కోరుతడు.. ఆయనే మంజూరు జేస్తరు జనం సప్పట్లు గొట్టాలే.. వీలైతె పోట్వమీద పాలు వొయ్యాలె గంతే..

నరరూప రాక్షసుడు నయింగానితోని ఏఏ రాజకీయ నాయకుడు సోపతి గట్టిండో.. వాడు ఎన్ని వందల వేల కోట్లు కూడవెట్టిండో.. వాని ఎన్క ఎవ్వలెవ్వలున్నరో.. వాని భూములు ఏడేడున్నయో.. ఇండ్లు ఏడున్నయ్ ఇవ్వన్ని తెల్సుకోవాలన్న ఆసక్తి ఉన్నదా..? ఎవ్వలికన్నా..? ఉంటే అవ్విటిని మర్శిపోండ్రి.. ఆ ముచ్చటనే మీకు తెల్వదని సప్పుడు జేక ఊకోండ్రి.. ఎందుకంటె సారు సచ్చి యాడాదైంది.. ఇంత మాస్కం బెట్టుకోని ఉండుండ్రి..

నేరెళ్ల దళితులను చావగొట్టి నెలనర్దమైంది.. ఇప్పటికి తీరిందమ్మా.. ఎంపీ వినోద్ కుమార్కు.. ఇగ కేటీఆర్కైతె మొఖమే లేదు అటెంకళ్ల వొయ్యెతందుకు.. ముఖ్యమంత్రి సంగతి మీకు ఎర్కున్నదేనాయే.. జనం ఏడ గెదుముతరో అని ఆ ముచ్చటనే ఎత్తుతలేడు.. ఇగ ప్రతిపక్షాలోళ్లకు పండుగైంది ఈ యవ్వారం.. ఎవ్వలొచ్చినా ఎవ్వలు వొయ్యినా.. రాజకీయ నాయకులకే లాభమున్నదిగని.. దళిత బహుజనులకు ఒర్గింది ఏం లేదు..

కరీంనగర్ కాడ మెడికల్ కాలేజీ కోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారు జేస్తున్న దీక్షను ఆగం జేశిండ్రు పోలీసోళ్లు.. ఆయన ఆరోగ్యం కరావైతున్నదటాని.. రాత్రి పూట ఒక్కటేపారి ఆయన టెంట్లకు జొర్రి అవుతలికి ఎత్తుకొచ్చి.. సక్కగ అంబులెన్సు ఎక్కిచ్చిండ్రు.. పాపం గాడ నిద్రలున్నడో.. నీరసంగున్నదో.. ఇది అంత అయితుంటే పొన్నం సారు నిద్రవొయ్యే ఉన్నడు..

తెలంగాణ ప్రజలారా.. మళ్లొక కుందనం సుర్వైతున్నది మీ ఊర్లపొంటి.. ఇన్నొద్దులు పడావు వడ్డట్టున్న మీ భూముల లెక్కలు అన్ని పక్కాగ దీస్తరట ప్రభుత్వమోళ్లు.. ఎవ్వలి భూమి ఎంత..? ఏడేడున్నది..? అది ఎవ్వలి పేరు మీదున్నది అంత లెక్కలు బైటికి దీస్తరట.. మళ్ల అవ్విటికి కొత్త పాస్ బుక్కులు ఇస్తరట.. భూములకు మళ్ల కొత్త నెంబర్లు ఇస్తరట..

ఆకలైతున్నది అన్నం బెట్టుండ్రి సారూ అని బుడ్డ బుడ్డ పోరగాళ్లకు ఫ్లకార్డులు వట్కోని కడప కలెక్టరేట్ ముంగట ధర్నాకు దిగిండ్రు.. మా ఒంట్లె రక్తం లేదు.. మాకు పౌష్టికాహారం లేదు.. మాకు ఆటబొమ్మలు గావాలె.. మేమేం పాపం జేశ్నమని..? పోరగాళ్లు జేశ్న ధర్నా అందర్ని ఆకర్శించింది జర్రశేపట్ల.. మరి ఆ పోరగాళ్ల ఆకలికి కలెక్టర్ ఏమన్న కదిలిండా ఏమైంది పాండ్రి సూద్దాం..

తేలు గరిస్తె ఎట్లుంటది కథ.. మంటో మంటని ఉర్కం దావఖాండ్ల పొంట.. అయితే ఒకతాన తేళ్లు మన్సులను గార్సుడుగాదు.. మన్సులే తేళ్లను గరుస్తున్నరు.. మామూల్గనైతె తెళ్లను జూశి మన్సులు భయపడ్తె.. ఆడ మట్టుకు మన్సులను జూశి తేల్లు భయపడ్తున్నయ్.. శ్రావనమాసంలొచ్చె మూడు సోమారం నాడు ఒక గుడికాడ అయ్యే ఈ పండుగ గమ్మతనిపిస్తున్నది..

నోట్లు రద్దుగాకముందుకు పిల్లికి గూడ బిచ్చమెయ్యలే ఒకడొకడు.. ఇగ రద్దైపోయి ఎక్కడ చెల్లువాటు కాకుంట అయ్యెవర్కళ్ల.. ఒకడు పెంటకుప్పల వడేస్తున్నడు.. ఒకడు ఏడదాయాల్నో తెల్వక దొర్కిపోతున్నడు.. పైకం లేకగాదు.. ఉండిపరేషాన్ అయితున్నరు చాలమంది.. అవ్వి చలామణిలున్నప్పుడు పేదోళ్లకో రూపాయి దాణం జేయలనిపియ్యలే.. సూడుండ్రి విశాఖపట్నంల ఎంత పైకం దొర్కిందో..

 

19:21 - August 8, 2017

హైదరాబాద్ : జీహెచ్ఎంసీకీ డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు భారంగా మారింది. ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీచే భూమి కొనుగోలు చేయించింది. కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో 95ఎకరాల భూములు కొనుగోలు చేసింది. అందుకోసం జీహెచ్ఎంసీ రూ.33కోట్లు వెచ్చించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:07 - August 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేశారు. రెబల్స్ అమిత్ షాకు ఓటు వేసినట్లు బ్యాలెట్ పేపర్ చూపించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. జేడీయూ ఎమ్మెల్యే బీజేపీకి ఓటు వేశారని కేసీ త్యాగీ తెలిపారు. ఎన్నికలను రద్దు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:45 - August 8, 2017
18:44 - August 8, 2017

ప్రకాశం : వామపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే దేవరపల్లిలో దళితులకు ప్రభుత్వం భూములు తిరిగి ఇచ్చిందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు. ప్రకాశం జిల్లా పర్చూరులో దేవరపల్లి సంఘీభావ సదస్సులో పాల్గొన్న మధు... ఈ భూములను సాగు చేసుకునేందుకు అనుకూలంగా తీర్చిదిద్ది ఇచ్చినప్పుడే ప్రయోజనం ఉంటుందన్నారు. లేకపోతే... మళ్లీ పోరాటం చేస్తామని మధు స్పష్టం చేశారు.

18:43 - August 8, 2017

కర్నూలు : రాష్ట్ర అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు తమని అడ్డుంటున్నారని భూమా అఖిలప్రియ విమర్శించారు. నంద్యల ఉప ఎన్నికల్లో ప్రజలందరూ భూమా కుటుంబాన్ని ఆదరిస్తారని అన్నారు. ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తామని అఖిలప్రియ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:42 - August 8, 2017

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పర్వం రసకందాయంలో పడుతోంది. ఈనెల 25న పోలింగ్‌ జరగనున్న నంద్యాల ఉప ఎన్నికను.. టీడీపీ వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇరు పక్షాల రాష్ట్రస్థాయి నాయకులు నంద్యాలలో మోహరించారు. కులాలు, మతాల వారీగా ఓటర్లను ఆకర్షించే దిశగా.. ఇరు పక్షాల నాయకులూ నంద్యాలలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. బుధవారం నుంచి నంద్యాలలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

జగన్‌ రోడ్‌ షోలు
బుధవారం ఉదయం నంద్యాల మండ‌లం రైతు న‌గ‌రం నుంచి జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభం కానుంది. నంద్యాల నియోజకవర్గం మొత్తాన్ని కవర్‌ చేసేలా జగన్‌ రోడ్‌ షోలను ప్లాన్‌ చేశారు. ఈనెల 13 వరకూ తొలి విడత ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌ ఇచ్చి రెండో విడత ప్రచారాన్ని 21వ తేదీ వరకు అంటే ప్రచార గడువు ముగిసే రోజు వరకూ నంద్యాలలో పర్యటిస్తారు. ఈనెల మూడున నిర్వహించిన సభలో తన వ్యాఖ్యల ద్వారా జగన్‌.. రాజకీయ కాకను పెంచారు. ఈ క్రమంలో బుధవారం నుంచి నిర్వహించబోయే ప్రచారం ఏమేరకు రాజకీయ దుమారాన్ని రేపుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

18:35 - August 8, 2017

ఈసీకి వివరణ ఇచ్చిన జగన్

హైదరాబాద్ : నంద్యాల సభలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు జగన్ వివరణ ఇచ్చారు. భావోద్వేగాంతో అన్న మాటలు తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని జగన్ వివరణ ఇచ్చారు.

రాజశేఖర్ రెడ్డి జగన్ ఏపీ రానియలేదు : చంద్రబాబు

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలతోనే జగన్ మనస్తత్వం అర్ధమవుతుందని, ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ప్రస్తుతానికి లేవని ఆయన అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను ఏపీకే రానీయలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోశయ్యే చెప్పారని చంద్రబాబు తెలిపారు.

18:33 - August 8, 2017

హైదరాబాద్ : నంద్యాల సభలో జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్ ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు జగన్ వివరణ ఇచ్చారు. భావోద్వేగాంతో అన్న మాటలు తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని జగన్ వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

18:32 - August 8, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలతోనే జగన్ మనస్తత్వం అర్ధమవుతుందని, ఇంతటి డొల్లతనం కలిగిన నాయకత్వాన్ని ఎప్పుడు చూడలేదని చంద్రబాబు అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేసే రాజకీయాలు ప్రస్తుతానికి లేవని ఆయన అన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను ఏపీకే రానీయలేదని, ఈ విషయాన్ని స్వయంగా రోశయ్యే చెప్పారని చంద్రబాబు తెలిపారు. పరిటాల రవీంద్ర,య శీవారెడ్డిల హత్యలతో తాను భావోద్వేగానికి గురయ్యానని చంద్రబాబు అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:38 - August 8, 2017
17:37 - August 8, 2017
17:35 - August 8, 2017

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో అరుణోదయ సమాఖ్యకు చెందిన వసంత్‌, యాది, శ్రీనివాసరెడ్డిలను అక్రమంగా అరెస్ట్‌ చేశారని... వారిని వెంటనే విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్‌ చేశారు. జనశక్తితో సంబంధం ఉందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు విమలక్క. కేసీఆర్‌ సర్కార్‌ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని ఈ సమావేశానికి హాజరైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌ అన్యాయాలను దేశవ్యాప్త దృష్టికి తీసుకెళ్లేందుకు జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని తమ్మినేని అన్నారు.

17:34 - August 8, 2017

మహబూబ్ నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకోమాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. మొన్నటి వరకు జీఎస్టీ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉందన్న కేసీఆర్‌... ఇప్పుడు ప్రజలపై భారం పడుతుందని వ్యాఖ్యానించడం వెనక ఉన్న మర్మమేంటో చెప్పాలన్నారు. ప్రజలకు మేలు చేయడం చేతకాక.. కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్నారన్నారు. భూనిర్వాసితులకు ఇచ్చే పరిహారం విషయంలోనూ ప్రభుత్వం పక్షపాతం చూపిస్తుందన్నారు డీకే అరుణ ఆరోపించారు.

17:33 - August 8, 2017

దివంగత వైఎస్ పై బాబు సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ : అలిపిరి ఘటన జరిగిన సమయంలో నిరసనలో దివంగత వైఎస్ పాల్గొన్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో బాబు మీడియాతో మాట్లాడారు. తన పేరు బయటకొస్తుందన్న భయంతోనే రాజశేఖరరెడ్డి నిరసనలో పాల్గొన్నాడని, గంగిరెడ్డి నక్సలైట్లకు సెల్ ఫోన్లు, డబ్బులు అందించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగిరెడ్డిని ఏకసభ్య కమిషన్ పట్టుకొంటే వైఎస్ పదే పదే ఫోన్ చేశాడని, సీఎం అయ్యాక వైఎస్..గంగిరెడ్డి ఇంటికి వెళ్లి కలిశాడన్నారు. గంగిరెడ్డి ఊరులో శుభకార్యం ఏర్పాటు చేసి అక్కడ కలిశారని తెలిపారు. కేంద్రం తనకు కల్పించిన భద్రతా సిబ్బందికి వైఎస్ ఏడాది పాటు ఎక్కడా వసతి కల్పించలేదన్నారు.

కేసీఆర్ కు సురవరం బహిరంగ లేఖ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర అభ్యంతకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడడం ప్రతిపక్షంగా తమ హక్కు అని దీనిపై ఎందుకంత అసహమని ప్రశ్నించారు. తాము చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామని, వీటిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 

స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు..

ముంబై : స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 259 పాయింట్లు నష్టపోయి 32,014 వద్ద ముగియగా 79 పాయింట్లు నష్టపోయి 9,978 వద్ద నిఫ్టీ ముగిసింది. 

ఆస్ట్రేలియా ప్రతినిధులతో లోకేష్ భేటీ..

విజయవాడ : అమరావతి సచివాలయంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ఫర్ సౌత్ ఇండియా సీన్ కెల్లీ, ఆస్ట్రేలియన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలో పర్యటించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులు మంత్రి లోకేష్ కు ఆహ్వానం పలికారు. 

సచివాలయంలో మీడియాతో బాబు..

విజయవాడ : అమరావతి సచివాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. నియోజకవర్గాల పునర్ విభజన చేయబోమని కేంద్రం అధికారికంగా చెప్పలేదని, పునర్ విభజన జరిగినా..జరగకపోయినా టిడిపికి ఢోకా లేదన్నారు. శనివారం, ఆదివారాల్లో సామాన్యులు సచివాలయం సందర్శించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

16:39 - August 8, 2017

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని 3 రాజ్యసభ స్థానాలకు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా 176 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆ రాష్ట్ర చీఫ్‌ ఎన్నికల అధికారి బీబీ.సావిన్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ రాజ్‌పుత్‌లు, కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌లు బరిలో నిలిచారు. బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కేంద్రమంత్రి స్మతీ ఇరానీ గెలుపు ఖాయమైనట్టే. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన బల్వంత్‌ సిన్హా రాజ్‌పుత్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌కు మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. విజయం సాధించాలంటే ఒక్కో అభ్యర్థికి 45ఓట్లు అవసరం కానున్నాయి. అహ్మద్‌ పటేల్‌ మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అహ్మాద్ ప‌టేల్‌కు తాను ఓటు వేయ‌లేద‌ని సీనియ‌ర్ నేత శంక‌ర్‌సింఘ్ వాఘేలా తెలిపారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు సమాచారం.

 

16:38 - August 8, 2017

ఢిల్లీ : కొత్త నోట్ల ముద్రణపై రాజ్యసభలో దుమారం రేగింది. డినోమినేషన్‌ పేరిట ప్రభుత్వం రెండు రకాల 5 వందలు, 2 వేల నోట్లను ముద్రించి కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ సభ్యులు కపిల్‌ సిబల్‌ రెండు రకాలుగా ముద్రించిన నోట్లను రాజ్యసభలో ప్రదర్శించారు. రెండు నోట్లు ఆకారంలోనూ, డిజైన్‌లోనూ తేడా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రెండు రకాల నోట్లను ఎప్పుడు ముద్రించలేదని కాంగ్రెస్‌ నేత ఆజాద్‌ అన్నారు. బిజెపి ప్రభుత్వం పార్టీ కోసం ఒక తరహా...ప్రభుత్వానికి మరో విధంగా రెండు రకాల 5 వందలు, 2 వేల నోట్లను ముద్రించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ బాధ్యాతా రాహిత్య ప్రకటన చేసిందని, జీరో అవర్‌ను దుర్వినియోగం చేస్తోందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఎదురు దాడికి దిగారు.

16:37 - August 8, 2017

నెల్లూరు : జిల్లాలోని ఆమంచర్ల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హౌసింగ్‌ కార్పొరేషన్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పసుపులేటి కృష్ణమూరిగా మరొకరు బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్టర్‌ షాజాద్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

16:36 - August 8, 2017

హైదరాబాద్ : మెట్రో పనుల కారణంగా గ్రేటర్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు పెరిగిపోయాయి. ప్రధానంగా మైత్రీవనం, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:35 - August 8, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ వ్యవహారంపై హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో డ్రగ్స్‌ కేసు విచారణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. సిట్‌కు నిందితులను అరెస్ట్‌ చేసే అధికారం లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. సెక్షన్‌-7 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రెగ్యులేషన్‌ అధికారమున్నా... ప్రాసిక్యూషన్‌, ఇన్వెస్టిగేషన్‌ చేసే అధికారం లేదన్నారు పిటిషనర్‌. దీనిపై స్పందించిన హైకోర్టు... వివరణ ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. దీంతో వచ్చే వారం పూర్తి వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

16:21 - August 8, 2017

ప్రిన్స్ 'మహేశ్ బాబు'..'మురుగదాస్' కాంబినేషన్ లో నిర్మితమౌతున్న 'స్పైడర్' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన టీజర్స్..పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. రా ఏజెంట్ గా కనిపించబోతున్న 'మహేష్' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటించింది.

రా ఏజెంట్ గా నటిస్తున్న 'మహేష్ బాబు' సరసన 'రకూల్ ప్రీత్ సింగ్' నటిస్తోంది. ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేందుకు చిత్ర యూనిట్ వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా చిత్ర మొదటి సాంగ్‌ 'బూమ్‌ బూమ్‌..పల్లవితో సాగేదాన్ని విడుదల చేశారు. అంతేగాకుండా మరో టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఆగస్టు 9న 'మహేష్‌' పుట్టిన రోజున స్పెషల్‌ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు దర్శకుడు మురుగదాస్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని మురుగదాస్ ప్లాన్స్ వేశారు. మరి విడుదలయ్యే టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

గుజరాత్..రాజ్యసభ సభ్యులు ఎవరో..

ఢిల్లీ : గుజరాత్ లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగిసింది. ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనున్నారు. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుండి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్ సిన్హా, కాంగ్రెస్ నుండి అహ్మద్ పటేల్ లు పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. 

16:10 - August 8, 2017

యాదాద్రి : యాదాద్రి, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతల సమావేంలో గందరగోళం నెలకొంది. దేవరకొండ నియేజకవర్గ ఇన్ చార్జ్ జగన్ లాల్, మాజీ జడ్పీటీసీ నారాయణల వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వారు పరస్పరం కర్రలతో దాడికి దిగడంతో కొంత మంది కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చూడండి.

16:04 - August 8, 2017

కాకరకాయ, సోరకాయ (ఆనపకాయ), బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడి, దోసకాయ పంటలు ప్రసిద్ధి. వీటికి వేడి వాతావరణం అనుకూలం. అధిక దిగుబడిని పొందడానికి నీరు నిల్వని తేలికపాటి బంకమట్టి నేలలు అనువైనవి. ఇక ఆనపకాయను సోరకాయ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పలు రకాల వంటలు వండుకోచ్చనే సంగతి తెలిసిందే.

సోరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
సోడియం, పోటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో వండిన వంటలు తినడం వల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది.
సోరకాయలో అధికంగా నీరు ఉంటుంది. తరచూ అలసటగా ఉండే వారు సోరాకయ తినడం వల్ల త్వరగా శక్తి సమకూరుతుంది.
కొలెస్ట్రాల్ పాళ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది.
పీచుపాళ్లు తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పైల్స్ తో బాధ పడే వారు సోరకాయను ఎక్కువగా తింటే బెటర్.
కాలేయానికి కూడా మేలు చేస్తుంది. కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

సోరకాయ రసం..
వ్యాయామం చేసే సమయంలో కోల్పోయిన ద్రావణాలను తిరిగి పొందాలంటే సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో 'సోరకాయ రసం' ఒకటి. బరువు తగ్గడానికి మంచిగా ఉపయోగ పడుతుంది. తక్కువ క్యాలరీలు అందించి..అధిక పీచును కలిగి ఉంటుంది. సొరకాయలో కార్పొహైడ్రైట్లు ఆకలిని తగ్గిస్తుంది. ఐరన్‌, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా ఈ సొరకాయ రసంలో ఎక్కువే. ఇది మూత్రాశయ సంబంధిత అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

నగర స్కూళ్లకు బుధవారం సెలవు..

ముంబై : నగర స్కూళ్లు బుధవారం కూడా మూతపడనున్నాయి. మరఠా మార్చ్ నేపథ్యంలో స్కూళ్ల బంద్ ఉంటుందని, సబర్బన్ స్కూళ్లు మాత్రం పనిచేస్తాయని మంత్రి వినోద్ పేర్కొన్నారు. 

డార్జిలింగ్ సమస్యపై మమత స్పందన..

పశ్చిమ బెంగాల్ : డార్జిలింగ్ సమస్యపై అన్ని పార్టీలు చర్చించాలని సీఎం మమత బెనర్జీ సూచించారు. సమస్య పరిష్కారానికై ముందుకు రావాలని కోరారు. 

కొత్త రూ.500 నోట్లపై రాజ్యసభలో ఆందోళన..

ఢిల్లీ : కొత్త రూ. 500 నోటుపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. ఈ నోటు శతాబ్దంలో పెద్ద స్కాం అని కాంగ్రెస్ ఆరోపించింది. వేర్వేరు సైజులు..డిజైన్లు ఉన్న రెండు నోట్లను సభలో కాంగ్రెస్ నేత కపిల్ సబల్ చూపించారు. ఒకటి ప్రభుత్వం కోసం మరొకటి బీజేపీ కోసమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లేవనెత్తిన నోట్ల అంశాన్ని టీఎంసీ సమర్థించింది. దీనిపై కేంద్ర మంత్రి జైట్లీ స్పందించారు. కరెన్సీపై కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందని, ఈ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు..

యాదాద్రి భువనగిరి : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతల సమీక్షా సమావేశంలో దేవరకొండ ఇన్ ఛార్జీ జగన్ లాల్, మాజీ జడ్పీటీసీ నారాయణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కర్రలతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. 

15:38 - August 8, 2017

విశాఖ : జిల్లా పెందుర్తి మండలం సరిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ హెచ్5 విస్తరణ పనుల కోసం తమ భూములు లాక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. కొలతలు వేయడానికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు, పెందుర్తి తహసీల్దార్ సుధాకర్ నాయుడిల్ని రైతులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణకు అంగీకరించేది లేదని చెబుతున్నారు. 

15:37 - August 8, 2017

విజయవాడ : నగరంలోని బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు మరింత జాప్యమయ్యేలా కనిపిస్తున్నాయి. నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ ఫ్లైఓవర్‌కు సంబంధించిన టెండర్లపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దిలీప్‌కాన్‌ సంస్థ ఇటీవలే పనుల బాధ్యతలు చేపట్టగా.... ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచే ప్రక్రియను చేపడుతున్నారు.రాష్ట్రవిభజన తర్వాత విజయవాడ రాజధానిగా మారింది. సీఎం చంద్రబాబు సహా మంత్రులంతా ఇక్కడికే మకాం మార్చడంతో వీఐపీల తాకిడి పెరిగింది. సమస్యల పరిష్కారం కోసం రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి తరలివస్తుంటారు. దీంతో విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలు ఎక్కువయ్యాయి.

ఏడాదిలోపు నిర్మాణం...
విజయవాడ ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉంటూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ట్రాఫిక్‌ కష్టాలను తొలగించేందుకు ప్రభుత్వం బెంజిసర్కిల్‌లో ప్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. గతేడాది ఈ ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తవుతుందని పాలకులు ఆర్భాటంగా ప్రకటించారు.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థకు అప్పగించారు. ఈ ఫ్లైఓవర్‌ను 618 మీటర్లు నిర్మిస్తున్నారు. 2018 జులైకి దీన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌ పెట్టింది. అయితే నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పైవంతెన పనుల పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా పూర్తవ్వలేదు. దీంతో నిర్దేశిత సమయంలో ఫ్లైఓవర్‌ పనులు పూర్తయ్యే అవకాశమే కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లైఓవర్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి విజయవాడ ప్రజల కష్టాలను తీర్చాలని విపక్షాలు కోరుతున్నాయి.

విద్య ప్రాథమిక హక్కు..యోగా కాదు..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో యోగాను ఒక సబ్జెక్ట్ గా చేయాలని దాఖలైన పిటిషన్ సుప్రీం కొట్టేసింది. డిసైడ్ చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. విద్య ప్రాథమిక హక్కు కానీ యోగా కాదని కోర్టు తెలిపింది. కరికులమ్ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని స్పష్టం చేసింది. 

15:20 - August 8, 2017

హైదరాబాద్ : తనపై తను కాల్పులు జరిపించుకున్న విక్రమ్ గౌడ్ ను విచారించడానికి కోర్టు అంగీకరించింది. కోర్టు విక్రమ్ గౌడ్ ఒక్ రోజు పోలీసు కస్టడీ అనుమతి ఇచ్చింది. పోలీసులు విక్రమ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను విచారించనుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:19 - August 8, 2017

బాలీవుడ్ బాద్ షా 'షారూఖ్ ఖాన్' తాజా చిత్రం 'జబ్ హ్యారీ మెట్ సెజల్' ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. భారీగా వసూళ్లు రాబడుతుందని అనుకున్నా అంతగా కలెక్షన్లు లేవని సోషల్ మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షారూఖ్ సరసన అనుష్క శర్మ నటించింది. సయాని గుప్తా, ఎవ్లిన్ శర్మలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 3200 స్ర్కీన్లపై విడుదలైంది.

ఆగస్టు 4వ తేదీన వచ్చిన చిత్రంపై మిశ్రమ రివ్యూలు అందుకుంది. నాలుగు రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ. 52.90 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. శుక్రవారం రూ. 15.25 కోట్లు, శనివారం రూ. 15 కోట్లు, ఆదివారం రూ. 15.50 కోట్లు, సోమవారం రూ. 7.25 కోట్లు మొత్తం రూ. 52.90 కోట్లు వసూలు చేసినట్లు ట్వీట్ చేశారు.

కానీ షారూఖ్ సినిమాల్లో తొలి రోజు వసూళ్ల పరంగా అతి తక్కువ రాబట్టిన చిత్రంగా పేర్కొంటున్నారు. 2014లో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 44.97 కోట్లు, 2015లో దిల్ వాలే రూ. 21 కోట్లు, 2016లో ఫ్యాన్ రూ. 19.20 కోట్లు రాబట్టాయి. 

15:18 - August 8, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డి హైకోర్టు పిటిషన్ వేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్ స్వీకరించి విచారణ జరిపింది. రేవంత్ తన పిటిషన్ లో దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో డ్రగ్స్ కేసు విచారణ చేపట్టాలని, సెక్షన్ 7 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రెగ్యులేషన్ అధికారమున్నా ప్రొసిక్యూషన్ చేసే అధకారం లేదని పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్, ప్రొసిక్యూషన్ అధికారాలు ఉన్నాయా లేదా అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాడిని అడిగింది. వచ్చే వారం పూర్తి వివరాలు ఉసమర్పిస్తామని హైకోర్టుకు ప్రభుత్వ తరుపు న్యాయవాది తెలిపారు. కోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

టిడిపి నేతలపై కేసుల ఉపసంహరణపై విచారణ...

హైదరాబాద్ : ఏపీలో 215మంది టిడిపి నేతలపై కేసులు ఉపసంహరించుకుంటూ జీవో 120 జారీ చేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. కైంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. 

హైకోర్టులో డ్రగ్స్ కేసుపై విచారణ..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో జరుగుతున్న విచారణపై టిడిపి నేత రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. డ్రగ్స్ కేసును దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో విచారణ జరిపించాలని, సిట్ కు నిందితులను అరెస్టు చేసే అధికారం లేదని పిటిషన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సెక్షన్ 7 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రెగ్యులేషన్ అధికారమున్నా ప్రాసిక్యూషన్, ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదని పేర్కొన్నారు. అధికారాలు ఉన్నాయా ? లేదా ? అనే వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి పేర్కొనగా వారం రోజుల గడువు కోరారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిద వేసింది. 

ధర్నా చౌక్ పై హైకోర్టులో పిటిషన్..

హైదరాబాద్ : ఇందిరాపార్కు ధర్నా చౌక్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజ్యాంగం ప్రకారం ప్రతొక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను రెండు వారాలకు వాయిదా వేసింది. 

నేరెళ్ల ఘటన బాధాకరమన్న మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : నేరేళ్ల బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడాలనే మీడియాను అనుమతించలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నేరేళ్ల బాధితులను ఆయన పరామర్శించారు. నేరెళ్ల ఘటన బాధాకరమని, బాధితులకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తామని తెలిపారు. ఘటనపై డీఐజీ విచారణ జరుగుతోందని, పోలీసులు తప్పు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

టి.టిడిపి చలో నేరేళ్ల పాదయాత్ర..

హైదరాబాద్ : చలో నేరేళ్ల పాదయాత్ర చేపట్టాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. మోత్కులపల్లి నర్సింహుల ఆధ్వర్యంలో పాదయాత్ర జరగనుంది. దళితులపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈనెల 15న ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర చేపట్టనున్నారు. 

దేవరపల్లిలో అఖిలపక్షాల సంఘీభావ సభ..

ప్రకాశం : దేవరపల్లిలో అఖిలపక్షాల సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. అఖిలపక్షాల పోరాటంతో దేవరపల్లిలో విజయం సాధించామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు పేర్కొన్నారు. దేవరపల్లిలో దళితుల పక్షాల నిలబడి పాలకులను నిద్ర లేపామని, అందరి సహకారమే విజయానికి కారణమన్నారు.

 

14:46 - August 8, 2017

ప్రభుత్వ పాఠశాలలు ఎత్తివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా అన్నా ఆలోచన కల్గుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అసలు పెదవారి అందుబాటులో ఉండేదే ప్రభుత్వ పాఠశాలలు మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పాడింది. ఈ ప్రభావం బాలిక విద్యపై ఏ విధంగా పడనుంది. ఇదే అంశపై మానవి వేదిక ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ చర్చలో నేషనల్ ఉమెన్స్ ఫోరం ఆల్ ఇండియా కన్వీనర్ సంగీత, తెలంగాణ మహిళ టీచర్స్ అసోసిషన్ కార్యదర్శి మహేశ్వరి పాల్గొన్నారు. 

14:45 - August 8, 2017

రంగారెడ్డి : జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లో 314 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రిజర్వాయర్ నిర్మాణం పనుల్లో సహకరించిన అధికారులను స్వామిగౌడ్ అభినందించారు. స్వామిగౌడ్ వెంట ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వాటర్ వర్క్స్ అధికారులు, టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు. 

14:43 - August 8, 2017

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులను వేములవాడ మనోహర్‌ ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. ఘటనపై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆకస్మిక రాకతో వేములవాడ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  

14:24 - August 8, 2017

ఢిల్లీ : అయోధ్య పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సర్వోన్నత న్యాయస్థానం విచారణ కోసం త్రిసభ్య బెంచ్ ను ఏర్పాటు చేసింది. త్రిసభ్య బెంచ్ ఆగస్ట్ 11నుంచి వాదనలు విననుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

14:22 - August 8, 2017

హైదరాబాద్ : టీడీపీ నేతల పై కేసులు ఉపసంహరించడాన్ని వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి పిటిషన్ వేశారు. కోర్టు పైసీపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసుల ఎత్తివేత జాబితాలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాద్ లు ఉన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

నేరేళ్ల బాధితులకు కేటీఆర్ పరామర్శ..

కరీంనగర్ : నేరెళ్ల బాధితులనుమంత్రి కేటీఆర్ పరామర్శించారు. మనోహర్ ఆసుపత్రిలో నేరెళ్ల బాధితులు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఘటనపై వివరాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ రాకతో ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 

హైకోర్టులో వైసీపీ పిటిషన్..

హైదరాబాద్ : టిడిపి నేతలపై కేసులు ఉపసంహరించడాన్ని హైకోర్టులో వైసీపీ సవాల్ చేసింది. వైసీపీ పిటిషన్ ను హైకోర్టును స్వీకరించింది. హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. కేసుల ఎత్తివేత జాబితాలో డిప్యూటి సీఎం, స్పీకర్ లున్నట్లు తెలుస్తోంది. 

అంతరాష్ట్ర బదిలీలపై మార్గదర్శకాలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంతర్ రాష్ట్ర బదిలీలపై మార్గదర్శకాలను తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు విడుదల చేశారు. స్థానిక జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ వారీగా బదిలీలకు అనుమతినిచ్చారు. స్థానికత ఆధారంగా స్పౌజ్ కేసులో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్ రాష్ట్ర బదిలీలకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారు. 

13:46 - August 8, 2017

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' షూటింగ్ లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే మరో సినిమాకు కూడా 'మహేష్' గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'భరత్ అనే నేను' షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న అనంతరం మరో షెడ్యూల్‌ కోసం లక్నో వెళ్లేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది. ఈనెల 10వ తేదీన ఈ షెడ్యూల్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

లక్నోలోని జహంగీరాబాద్ ప్యాలెస్, నాద్వా కాలేజ్, లక్నో యూనివర్సిటీల్లో షూటింగ్ జరుగనుంది. ఈ సినిమాలో సీఎంగా 'మహేష్' కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ రావడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

13:45 - August 8, 2017
13:43 - August 8, 2017

హైదరాబాద్ : సదవర్తి భూములకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే లాయర్‌ పొన్నవోలు సుధాకర్‌ తెలిపారు. ఇది వైదిక విద్యను అభ్యసించే పేద బ్రాహ్మణ విద్యార్థుల విజయంగా అభివర్ణించారు. గతంలో నిర్వహించిన వేలంపాటను హైకోర్టు రద్దు చేసినట్లు ఆర్కే లాయర్‌ తెలిపారు. 

 

13:39 - August 8, 2017

హైదరాబాద్ : మిర్చిధరలు పెరిగాయి.. రైతుగుండెలు మండుతున్నాయి. కర్షకుడి నోట్లో మట్టిగొట్టారని రైతుసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంటకు ధర పెరిగితే సంతోషించాల్సిన అన్నదాతలు ఎందుకు కుమిలిపోతున్నారు..? మిర్చి రైతుల ఆగ్రహానికి కారణం ఏంటి..?  మార్కెట్‌ మాయాజాలంలో ప్రభుత్వాల పాత్ర ఎంత..? వాచ్ దిస్‌ స్టోరీ..
దారుణంగా నష్టపోయిన మిర్చి రైతులు 
క్వింటా మిర్చి ధర ఏకంగా 13వేల రూపాయలకు పైగా పలుకుతోంది.. సరిగ్గా ఇదే ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో  కర్షకుల కంట కన్నీరు పెట్టిస్తోంది. గత సీజన్‌లో తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులు దారుణంగా నష్టాలయ్యారు. క్వింటా మిర్చి ధర కేవలం 3వేల దిగువన పలకడంతో  లక్షలాది రూపాయల అప్పుల్లో కూరుకు పోయారు. అంతకు ముందు సీజన్‌లో 10వేల రూపాయల వరకు రేటు ఉంటంతో ఏపీ, తెలంగాణల్లో రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంటను సాగు చేశారు. ఇబ్బడి మబ్బడిగా దిగుబడి వచ్చింది. దీంతో ధరలు ఒక్కసారిగా  పడిపోయాయి.  దీంతో  పండిన పంటను నిల్వ చేసుకునే వీలు లేక.. అప్పుల వాళ్ల ఒత్తిడికి తాళలేక వచ్చినకాడికే పంటను తెగనమ్మకున్నారు. ఆలస్యంగా మేలుకున్న ప్రభుత్వం క్వింటాలుకు 5వేల మద్దతు ధరను, మరో 15వందలు ఖర్చుల కింద మొత్తం 6,500 రూపాయలను రైతుకు చెందేలా ఆదేశాలు జారీ చేసింది. కాని అప్పటికే పంటంతా చేజారి పోవడంతో రైతులు ఉసూరుమన్నారు. అగ్గువ ధరలకే మిర్చిని కొనుకున్న వ్యాపారులు సొంత గోడౌన్లలో రైతుల శ్రమను పోగేసుకున్నారు. చివరికి  రైతుకు దక్కాల్సిన మద్దతు ధరలు కూడా వ్యాపారుల జేబుల్లోకే చేరాయని  రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.  
వ్యాపారుల కొమ్ముగాస్తున్న ప్రభుత్వాలు..! 
ఇదంతా పాతకథేకదా.. ఇపుడు కొత్తగా రైతుగుండెలు ఎందుకు మండుతున్నాయో అంటే.. కర్షకుల చేతిలోనుంచి పంటంతా వ్యాపారుల గోడౌన్లలోకి చేరిపోయాక ఇపుడు ధరలు మిర్చిఘాటుతో పోటీ పడుతున్నాయి. నిన్నటిదాకా ఎక్స్‌పోర్టు లేదనే పేరుతో ధరలను తొక్కిపట్టిన వ్యాపార వర్గాలు .. ప్రస్తుతం  ఎగుమతులు పెరిగాయంటున్న వ్యాపారులు   తమ వద్ద నిల్వ చేసుకున్న మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లరూపాయలు గడిస్తున్నారు.  ప్రస్తుతం మార్కెట్లో తేజ, బాడిగ, 334రకం మిర్చికి  13,500 రూపాయల వరకు పలుకుతోంది.  దీంతో రైతన్నలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. తమకూ పంట నిల్వ చేసుకునే గోడౌన్ల సౌకర్యం ఉంటే.. ఆమేరకు తమ శ్రమఫలితాన్ని పొందేవారమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ధరలు పతనమైన సమయంలో రైతుకు ఏదో మేల చేస్తున్నట్టు నటిస్తున్న ప్రభుత్వాలు  పరోక్షంగా వ్యాపారుల కొమ్ముకాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
మిర్చిరైతులను ఊరిస్తున్న పెరిగిన ధరలు 
ఇక పెరిగిన ధరలు ఊరిస్తుంటే  మరోసారి  తెలుగు రాష్ట్రాల రైతన్నలు మిర్చిపంటను పెద్ద ఎత్తున సాగు చేసేందుకు సమాయత్తమయ్యారు. మంచి ధరలు పలికితే ఈసారన్నా అప్పుల బాదల నుంచి బయటపడొచ్చన్న ఆశాభవవంతో ఉన్నారు. అయితే తీరా పంట చేతికొచ్చేనాటికి  మళ్లీ ఎప్పటిలాగే ధరలు తగ్గుతాయేమోనన్న ఆందోళన కూడా అన్నదాతల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాపారుల మాయాజాలానికి అడ్డుకట్ట వేయాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

13:35 - August 8, 2017

మేడ్చల్ : మూడు చింతలపల్లికి గోదావరి జలాలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు. మేడ్చల్ జిల్లాలో 374 చెరువులను నింపుతామని చెప్పారు. మూడు చింతలపల్లిలో ప్రాథకమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వారంలో పీహెచ్ సీ భవనానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గోదావరి నది నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటామని చెప్పారు. గోదావరి నీళ్లు వస్తున్నాయి కనుక..బోర్లు వేసే బాధ తప్పుతుందన్నారు. గ్రామాలు బాగుపడాలని పేర్కొన్నారు. రైతుకు కులం లేదన్నారు. రైతులకు కావాల్సిన భూమి, నీరు, కరెంట్ అందివ్వాలని తెలిపారు. ప్రతి గ్రామానికి రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంవత్సరానికి ఎకరానికి 8 వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది రైతులందరికీ వర్తిస్తుందన్నారు. భూమి రికార్డులన్నీ సెట్ రైట్ కావాలన్నారు. ప్రతి ఊర్లో ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో తేలాలని తెలిపారు. గ్రామ గ్రామాన భూ సర్వే చేస్తామని చెప్పారు. లంచాలు ఇచ్చే దుస్థితి పోవాలన్నారు. రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. తెలంగాణలో రైతాంగం దెబ్బతిందని...అప్పుగానటువంటి పెట్టుబడి సమకూర్చాలన్నారు. సమైక్య రాష్ట్రంలో నదులు ఎండిపోయాయని పేర్కొన్నారు. 'ఆంధ్రవారు మన నోరు కొట్టి నీరు తీసుకపోయిండ్రు' అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 13 లక్షల మంది వలసలు పోయారని పేర్కొన్నారు. 

 

చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఎక్కడ ?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆరు వారాల్లో నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో భవన సముదాయాలు లేనందున ఇప్పుడు నియమించలేమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ తీరుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 

మూడు మాసాల పాటు భూ సర్వే - కేసీఆర్..

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించిన రికార్డులు అప్ డేట్ కావాల్సిందేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మూడు మాసాల పాటు గ్రామ గ్రామంలో భూముల సర్వే పూర్తి కావాలని పేర్కొన్నారు. 

మూడు చింతలపల్లిలో కేసీఆర్ గ్రామసభ..

మేడ్చల్ : మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్ గ్రామసభ నిర్వహిస్తున్నారు. వీరారెడ్డి పేరిట మూడు చింతలపల్లిలో ప్రాథమిక ఆరోగ్య భవనం నిర్మిస్తామని, వారంలో పీహెచ్ సీ భవనానికి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేస్తారని కేసీఆర్ తెలిపారు. వచ్చే జూన్ నాటికి గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి వస్తాయని, 374 చెరువులను నింపుతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షల గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 

మియాపూర్ భూముల కేసుపై విచారణ..

హైదరాబాద్ : మియాపూర్ భూముల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. అడిషనల్ అఫిడవిట్ దాఖలకు పిటిషనర్ రఘునందనరావు సమయం కోరడంతో తదుపరి విచారణను 16కి వాయిదా వేసింది. 

12:47 - August 8, 2017

విశాఖ : జిల్లాలోని పెందుర్తి మండలం సరిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెన్ హెచ్ 5విస్తరణ పనుల కోసం తమ భూములు లాక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. కొలతలు వేయడానికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు, పెందుర్తి తహసీల్దార్ సుధాకర్ నాయుడిల్ని రైతులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భూసేకరణకు అంగీకరించేది లేదని చెబుతున్నారు. 

 

12:44 - August 8, 2017

తూర్పు గోదావరి : జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ 14వ రోజు పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాపునేతలు భగ్గుమన్నారు. చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబు సర్కార్‌పై ముద్రగడ పద్మనాభం నిప్పులు చెరిగారు. కాపులను తీవ్రవాదులు చూస్తున్నారని.. ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేక బ్రిటిష్‌ పాలనలో ఉన్మామో తెలియడం లేదని మండిపడ్డారు. పోలీసులు కూడా విధులు ఎలా నిర్వహిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. 

 

12:43 - August 8, 2017

హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల కేసుపై హైకోర్టులో మళ్లీ విచారణ జరుగనుంది. ఆల్‌ ఇండియా భ్రమాన్స్‌ అసోసియేషన్‌ ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ ఇండోన్మెంట్ కమిషన్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే 27.44 లక్షలు చెల్లించారు. మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేచింది. 6 వారాల్లో అన్ని జాతీయ పత్రికల్లో పేపర్‌ ప్రకటనలు ఇవ్వాలని సూచించింది. వేలంలో పిటిషనర్‌ రామకృష్ణా రెడ్డి పాల్గొనచ్చని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

12:38 - August 8, 2017

ఢిల్లీ : రాహుల్‌ కారు దాడి ఘటనపై లోక్‌సభలో దుమారం రేగింది. రాహుల్‌ కారుపై దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేతలు హింసను ప్రేరేపిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఘటనపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌..గుజరాత్‌లో రాహుల్‌ టూర్‌కు సంబంధించి రాష్ట్ర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూట్‌ బందోబస్తు, మొబైల్‌ పెట్రోలింగ్, బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును ఏర్పాటు చేయడంతో పాటు.. 200లకు పైగా పోలీసులను భద్రత కోసం ఉపయోగించినట్లు తెలిపారు. అయితే భద్రతా అధికారుల మాట కాదని.. వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సలహా మేరకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు నుంచి మరో వాహనంలో వెళ్లారని చెప్పారు. హోంమంత్రి ప్రకటనపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

12:36 - August 8, 2017

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' పై ఓ వార్త ఎప్పుడూ చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు ? పెళ్లి చేసుకబోయే అమ్మాయి ఎవరు తదితర విషయాలపై అభిమానులు చర్చించుకుంటుంటారు. పెళ్లి మాటపై 'ప్రభాస్' మాత్రం అంతగా స్పందించరు. 'బాహుబలి-2' సినిమా అనంతరం వివాహంపై క్లారిటీ ఇస్తానని గతంలో 'ప్రభాస్' వెల్లడించిన విషయం విదితమే. కానీ ఆ సినిమా విడుదలై వంద రోజులు కావస్తోంది. కానీ 'ప్రభాస్' మాత్రం పెళ్లి విషయంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదు.

ఇదిలా ఉంటే రాఖీ పండుగ సందర్భంగా 'కృష్ణంరాజు' రెండో కుమార్తె సాయి ప్రకీర్తి మీడియాతో మాట్లాడింది. తాము ముగ్గురు అక్కాచెల్లెళ్లమని, తన అక్క పేరు సాయి ప్రసీద, చెల్లి పేరు సాయి ప్రదీప్తి అని చెప్పింది. ప్రతి రాఖీ పండుగకు అన్నయ్య 'ప్రభాస్‌'కు తాము ముగ్గురం రాఖీలు కడతామని చెప్పింది. రాఖీ కట్టగానే ఒక గిఫ్ట్ ఇస్తారని, తాము ఏది అడిగినా 'ప్రభాస్' కాదనడని పేర్కొంది. పెళ్లి ప్రస్తావన తెస్తే మాత్రం ఏదో ఒకటి చెప్పి దాటవేస్తాడని, అన్నయ్య పెళ్లి ఎప్పుడవుతుందా? అని ఎదురు చూస్తున్నామని మనసులోని మాట చెప్పేసింది. అన్నయ్య పెళ్లి సంగీత్‌లో డాన్స్ వేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకుంటున్నామని, అన్నయ్య పెళ్లిలో మంచి ఫుడ్‌ ఉంటుందని తెలిపింది. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో..చెల్లెళ్ల కోరిక ఎప్పుడు నెరవేరుస్తాడో చూడాలి. 

సరిపల్లిలో ఉద్రిక్తత..

విశాఖపట్టణం : పెందుర్తి మండలం సరిపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ హెచ్ 5 విస్తరణ కోసం అధికారులు భూ సేకరణకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు. కొలతలు వేయడానికి వచ్చిన డిప్యూటి కలెక్టర్ సుబ్బరాజు, పెందుర్తి తహసీల్దార్ సుధాకర్ నాయుడులను రైతులు అడ్డుకున్నారు. ఎవరూ వచ్చినా భూసేకరణకు అంగీకరించమని రైతులు పేర్కొంటున్నారు. 

ఐటీఐ పరీక్షలో మాస్ కాపీయింగ్..

విజయనగరం : టాట్ ఐటీఐలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతోంది. కళాశాల అధ్యాపకులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అబ్జర్వర్స్ కనిపించలేదు. అధ్యాపకులు ప్రజలకు సమాధానాలు చెబుతున్నారు. 

శ్రీరాంసాగర్ పునర్జీవ పనులకు శంకుస్థాపన..

నిజామాబాద్ : పదో తేదీన పోచంపాడులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి పోచారం తెలిపారు. ప్రాణహిత నుండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60టీఎంసీల నీరు వస్తుందని, కాంగ్రెస్ హాయంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. 

12:16 - August 8, 2017

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడి ఘటనపై హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. రాహుల్ కారుపై దాడి ఘటనను కాంగ్రెస్ నేతలు ఖండించారు. దాడి ఘటనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇటీవల గుజరాత్ లో రాహుల్ గాంధీ పర్యటించిన సందర్భంగా రాహల్ కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఈటెల..

నిజామాబాద్ : సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం కలుగకుండా చూడాలని జీఎస్టీ కౌన్సిల్ లో చెప్పడం జరిగిందని మంత్రి ఈటెల తెలిపారు. ప్రజలపై పన్ను భారాలు లేకుండా చూడాలని చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదని, రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే సహించబోమన్నారు. 

సదావర్తి సత్రం భూముల కేసుపై మరో ట్విస్టు..

హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. మరోసారి బహిరంగ వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని, వేలంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొనవచ్చని సూచించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఆల్ ఇండియా బ్రాహ్మణ అసోసియేషన్ వేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై ఈ విచారణ కొనసాగింది. 

12:00 - August 8, 2017

గుజరాత్‌ : రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మూడు రాజ్యసభ స్ధానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ ..కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌లు బరిలో ఉన్నారు. అహ్మద్ పటేల్‌ గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అహ్మద్‌ పటేల్‌ను ఓడించి గట్టి షాక్ ఇవ్వాలని బిజెపి .. ఎలాగైనా గెలిచి ధీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. చివరి క్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ బిజేపికి మద్దతు పలికింది. ఇక జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. గుజరాత్ నిజానంద రిసార్ట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 

 

11:58 - August 8, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు దర్యాప్తుపై హైకోర్టులో రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించనుంది. డ్రగ్స్‌ కేసులో ప్రముఖుల పేర్లు తప్పించారని పిటిషన్‌లో ఆరోపించారు. డ్రగ్స్‌ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:53 - August 8, 2017

రంగారెడ్డి : జిల్లాలోని హయత్ నగర్ మండలంలో విషాదం నెలకొంది. క్షణికావేశం ఓ విద్యార్థి నిండు ప్రాణం తీసింది. తండ్రి వీడియో గేమ్ సెటప్ కొనివ్వలేదని ఇంజనీర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుంట్లూరులో నివాసముంటున్న శ్రీనివాస్ కుమారుడు అభినవ్, నాదర్ గూల్ లోని ఎంవిఎస్ ఆర్ కాలేజీలో బీ.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో వీడియో గేమ్‌ సెటప్‌ పెట్టించమని అభినవ్... తండ్రి శ్రీనివాస్ ను అడిగాడు. అయితే బాగా చదువు తర్వాత కొనిస్తానని తండ్రి చెప్పాడు. వీడియోగేమ్ కొనివ్వలేదనే మనస్తాపంతో అభినవ్ బల్డింగ్ పై నుంచి దూకి కిందికి దూకాడు. అభినవ్ రెండు చేతులు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. అభినవ్ ది అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

అప్పుడు రాహుల్ కారులో లేరన్న రాజ్ నాథ్..

ఢిల్లీ : రాహుల్ గాంధీ కారు దాడి జరిగిన ఘటనపై గుజరాత్ సర్కార్ విచారణ జరుపుతోందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో ప్రకటన చేశారు. ఆయన భద్రత విషయంలో ఎక్కడా తగ్గలేదని, భద్రతా వర్గాల హెచ్చరికలను రాహుల్ పట్టించుకోలేదన్నారు. దాడి జరిగిన సమయంలో రాహుల్ కారులో లేరన్నారు. 

రాహుల్ కారు దాడి ఘటనపై కాంగ్రెస్ ఆందోళన..

ఢిల్లీ : లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ కారుపై దాడి ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 

అయేషా మీరా కేసుపై విచారణ..

హైదరాబాద్ : అయేషా మీరా కేసుపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు పర్యవేక్షణలో కేసు కేసు దర్యాప్తు జరిపించాలని రమా మెల్కోటి, పీవోడబ్ల్యూ సంధ్య, సజయ లు పిటిషన్ దాఖలు చేశారు. కేసు పురోగతిపై ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సిట్ లో ఉన్న సబ్యుల వివరాలు..ఇతరత్రా గురువారానికల్లా తెలియచేయాలని, తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

11:35 - August 8, 2017
11:29 - August 8, 2017

టాలీవుడ్ లో అగ్ర హీరోలు..యంగ్ హీరోస్ తో నటించి మెప్పించిన 'కాజల్' కోలీవుడ్ లో జోరు కొనసాగిస్తోంది. 'పళని' చిత్రంతో ఆమె కోలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పలు చిత్రాల్లో నటించినా అక్కడి ప్రేక్షకులకు దగ్గర కాలేపోయింది. అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇచ్చింది. 'తుపాకి' చిత్రంలోని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

అనంతరం అగ్రహీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంది. విజయ్..ధనుష్..విశాల్ వంటి పలువురు హీరోల సరసన నటించింది. తాజాగా 'అజిత్' హీరోగా వస్తున్న 'వివేగం' 'విజయ్' హీరోగా వస్తున్న 'మెర్సల్'..సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్ లో 'రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' అనే సినిమా తమిళంలో 'నాన్ అనైయిట్టాల్' గా విడుదల కానుంది. సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మే నటించింది. వివేగం..నాన్ అనైయిట్టాల్ సినిమాలు ఒకే నెలలోనే విడుదల కానున్నాయి. ఈ రెండూ ద్విభాషా చిత్రాలే కావడం విశేషం. మరి ఈ చిత్రాలతో మరిన్ని ఛాన్స్ లు కొట్టేస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

ముద్రగడ పాదయాత్ర చేస్తారా ?

తూర్పుగోదావరి : పాదయాత్ర చేపట్టాలని అనుకుంటున్న ముద్రగడ ఆశలు నెరవేరడం లేదు. 14వ రోజు పాదయాత్రకు ముద్రగడ యత్నాన్ని మళ్లీ పోలీసులు అడ్డుకున్నారు. తమ జాతిని సీఎం చంద్రబాబు నాయుడు చులకనగా చూస్తున్నారని, పాదయాత్రకు అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, కాపులను వ్రవాదులుగా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా బ్రిటీష్ పరిపాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. బాబు పాలనలో స్వేచ్ఛ లేకుండా పోయిందని ముద్రగడ వ్యాఖ్యానించారు. 

11:23 - August 8, 2017

విశాఖ : డ్రగ్స్‌ మాఫియా.. కార్యకలాపాల విస్తరణకు కొత్త దారులు అన్వేషిస్తోంది. ఇంతకాలం డబ్బున్నోళ్లనే టార్గెట్‌ చేసుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తూ వచ్చిన మాఫియా.. ఇప్పుడు పేదోళ్ల ముంగిట్లోకీ డ్రగ్స్‌ను తీసుకు వెళుతున్నారు. అయితే.. పెద్దోళ్ల స్థాయి డ్రగ్స్‌ని కాకుండా.. మెడిసినల్‌ మత్తును పేదలకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో.. విద్యార్థులు, కూలీలే టార్గెట్‌గా మత్తు మాఫియా విస్తరిస్తోంది. 
విశాఖలో పెరిగిన డ్రగ్స్‌ వాడకం
విశాఖ నగరంలో కొద్ది కాలంగా డ్రగ్స్‌ వాడకం పెరుగుతూ వస్తోంది. హెరాయిన్‌, మార్ఫిన్‌ లాంటి మాదకద్రవ్యాల వినియోగం జోరందుకుంటోంది. డ్రగ్స్‌ మాఫియా.. చాపకింద నీరులా తమ కార్యకలాపాలను విస్తరిస్తూ వెళుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో రట్టయిన డ్రగ్స్‌ మాఫియా గుట్టుతో.. విశాఖ పోలీసులూ డ్రగ్స్‌ సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ గ్యాప్‌ను కూడా డ్రగ్స్‌ మాఫియా.. తమకు అనుకూలంగా మలచుకుంటోంది. 
కూలీలు, మధ్యతరగతి విద్యార్ధులు టార్గెట్‌ 
తాజాగా, మత్తు మాఫియా ధనవంతులు, వారి పిల్లలను కాదని, రోజు వారీ కూలీలు, మధ్యతరగతి విద్యార్ధులను టార్గెట్‌ చేస్తోంది. మార్ఫిన్‌, హెరాయిన్‌ లాంటి మాదకద్రవ్యాలు కొనాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంత సొమ్ము పెట్టి కొనుక్కొలేని వారికీ, మత్తును అలవాటు చేసేందుకు డ్రగ్స్‌ మాఫియా కదులుతోంది. మెడికల్‌ షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే అందించాల్సిన మందులను.. ఈ మాఫియా అడ్డదారుల్లో బయటకు తీసుకు వెళుతోంది. దగ్గు నియంత్రణకు ఉపయోగించే కోడెక్స్‌ సిరప్‌, ఎల్‌ పిల్‌ కిట్స్‌ లాంటివి.. సేవిస్తే.. చాలాసేపు మైకంలో.. ఉండిపోతారు. ఇలాంటి మందులను డ్రగ్స్‌ మాఫియా.. బ్లాక్‌ చేసి.. పేద, మధ్యతరగతి వర్గాల వారికి మత్తును అలవాటు చేస్తోంది. వీరికి మెడికల్‌ షాపుల యజమానులూ సహకరిస్తున్నారు. 
డ్రగ్స్‌ ముఠాను అరెస్టు 
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే డ్రగ్స్‌ ముఠాను విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మత్తును కలిగించే కోరెక్స్‌ తదితర మందులను స్వాధీనం చేసుకున్నారు. 20 లక్షలకు పైగా బిల్లులు లేకుండా  ఈ మెడిసిన్‌ ను అమ్మినట్టు గుర్తించారు. దీంట్లో  12 లక్షల 65వేల  కొడెక్స్‌ సిరప్‌ మరియు ఎల్‌-పిల్స్‌ కిట్లు స్వాధీనం చేసుకున్నారు.. ముగ్గురు మెడికల్‌ షాపు సిబ్బంది అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ ముఠాల ఆగడాలను అరికట్టేందుకు.. ఇకపై సంయుక్త దాడులు కొనసాగించాలని పోలీసు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిర్ణయించారు. 

 

రాహుల్ కారు దాడి ఘటనపై రాజ్ నాథ్ ప్రకటన..

ఢిల్లీ : లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాహుల్ కారుపై దాడి ఘటనను కాంగ్రెస్ ప్రస్తావించింది. దాడి ఘటనను కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఖండించారు. దాడి ప్రకటనపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేస్తున్నారు. 

డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగించాలన్న రేవంత్..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు దర్యాప్తుపై హైకోర్టులో టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసు సీబీఐకి అప్పగించాలని, ప్రముఖుల పేర్లను తొలగించాలని పిటిషన్ లో కోరారు. రేవంత్ పిటిషన్ పై మరికాసేపట్లో విచారణ జరగనుంది. 

వీడియో గేమ్ సెట్ పెట్టించడం లేదంటూ..

హైదరాబాద్ : హయత్ నగర్ లోని కుంట్లూరులో విషాదం చోటు చేసుకుంది. వీడియో గేమ్ సెటప్ ఇంట్లో పెట్టించడం లేదన్న కారణంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పటేల్ కు ఓటు వేయలేదన్న వాఘేలా..

ఢిల్లీ : అహ్మద్ పటేల్ కు తాను ఓటేయలేదని శంకర్ సింఘ్ వాఘేలా వెల్లడించారు. ఇటీవలే కాంగ్రెస్ కు ఆయన వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అహ్మద్ పటేల్ గెలుపు కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని, ఆ పార్టీ దగ్గరున్న 44 మంది ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీకి ఓటేస్తారని తెలిపారు. కీలకమైన ఎన్ సీపీ ఎమ్మెల్యే బీజేపీ సభ్యుడికి మద్దతిస్తారని తెలిపారు. మూడు రాజ్యసభ సీట్లను బీజేపీయే గెలుస్తుందని పేర్కొన్నారు. 

10:58 - August 8, 2017

గుజరాత్‌ : రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మూడు రాజ్యసభ స్ధానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ ..కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌లు బరిలో ఉన్నారు. అహ్మద్ పటేల్‌ గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అహ్మద్‌ పటేల్‌ను ఓడించి గట్టి షాక్ ఇవ్వాలని బిజెపి .. ఎలాగైనా గెలిచి ధీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. చివరి క్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ బిజేపికి మద్దతు పలికింది. ఇక జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. గుజరాత్ నిజానంద రిసార్ట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

బాబు జోస్యం..

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిదే విజయమని సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. టిడిపి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టే విధంగా చేసే వ్యాఖ్యలపై టిడిపి కార్యకర్తలెవరూ స్పందించవద్దని..వారిని ప్రజలే చూసుకుంటారని సూచించారు. 

10:43 - August 8, 2017

వరంగల్‌ : నగరంలోని  వాగ్దేవి ఆడిటోరియంలో ప్రముఖ నవలాకారుడు ప్రభాకర్‌ జైనీ రాసిన సినీవాలి నవలా పరిచయ సభ జరిగింది. బిక్కీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌, ఆంధ్రప్రభ ఎడిటర్‌ వైఎస్ ఆర్ శర్మ, కవులు రామాచంద్రమౌళి, వారాల ఆనంద్‌, సాధిక్‌, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

10:40 - August 8, 2017

కరీంనగర్ : కాంగ్రెస్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగురోజులుగా దీక్ష చేస్తున్న పొన్నంను పోలీసులు తెల్లవారు ఝామున అరెస్టు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిపి, సుగర్ లెవెల్స్ తగ్గుతుండటంతో  వైద్యులు చికిత్స చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వైద్యానికి పొన్నం నిరాకరించారు. మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించేవరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మరోవైపు పొన్నం అరెస్టుకు నిరసనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. 

10:38 - August 8, 2017

నల్లగొండ : జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజీ వద్ద రోయ్యల లారీ బోల్తా పడింది. దీంతో విజయవాడ, హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. లారీని తొలగిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. రొయ్యల లారీని ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో.. డ్రైవర్‌ సహా ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:35 - August 8, 2017

గుజరాత్‌ : రాజ్యసభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మూడు రాజ్యసభ స్ధానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి నుంచి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌సిన్హ్‌ ..కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌లు బరిలో ఉన్నారు. అహ్మద్ పటేల్‌ గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అహ్మద్‌ పటేల్‌ను ఓడించి గట్టి షాక్ ఇవ్వాలని బిజెపి .. ఎలాగైనా గెలిచి ధీటుగా సమాధానమివ్వాలని కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. చివరి క్షణంలో కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఎన్సీపీ బిజేపికి మద్దతు పలికింది. ఇక జేడీయూ, గుజరాత్ పరివర్తన్ పార్టీపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. 

 

10:30 - August 8, 2017

నంద్యాల ఉప ఎన్నికపై హాట్ హాట్ డిబేట్ జరిగింది. నంద్యాల ఉప ఎన్నిక నామినేషన్లు.. టీడీపీ, వైసీపీ పరస్పర ఫిర్యాదులు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత పట్టాబిరామ్, వైసీపీ కొణిజేటి రమేష్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

'ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలి'..

శ్రీకాకుళం : నిర్వాసితుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం తగదని, బాధితుల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా ప్రాజెక్టు పనులు చేపట్టడం సబబు కాదని సీపీఎం మానవ హక్కుల వేదిక, రైతు కూలీ సంఘం నేతలు పేర్కొన్నారు. వంశధార నిర్వాసిత గ్రామాల్లో ఎలాంటి ఘటనులు చోటు చేసుకున్నా జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులే బాధ్యత వహించాలన్నారు. 

పోలీసు పహారా మధ్య ప్రాజెక్టు పనులు..

శ్రీకాకుళం : హిరమండలం వంశధార నిర్వాసిత గ్రామాల్లో మూడు రోజులుగా పోలీసు పహారా కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు 41ఏ నోటీసులను నిర్వాసిత గ్రామాలకు అందచేశారు. ప్రాజెక్టు పనులు పోలీసు పహారా మధ్య కొనసాగుతున్నాయి.

 

సర్పంచ్ ను కాల్చి చంపిన మావోయిస్టులు..

ఒడిశా : కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రతిబాడి సర్పంచ్ ను మావోయిస్టులు కాల్చి చంపారు. అనంతరం ట్రాక్టర్, జీపును తగులబెట్టారు. 

తూ.గో..లో రద్దయిన నోట్లు స్వాధీనం..

తూర్పుగోదావరి : రాజమహేంద్ర వరంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన రూ. కోటి 10 లక్షల విలువైన రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్..

తూర్పుగోదావరి : అంతర్వేది గునిశెట్టి వారి కుంటలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీకేజీ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

కొనసాగుతున్న పోలింగ్..

ఢిల్లీ : గుజరాత్ లో మూడు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మూడు స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ నుండి అమిత్ షా, స్మృతి ఇరానీ, బల్వంత్ సిన్హా, కాంగ్రెస్ నుండి అహ్మద్ పటేల్ లు పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. 

ఒడిశాలో మావోయిస్టులు విధ్వంసం

ఒడిశా : కోరాపుట్ జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రతిబాడి సర్పంచ్ ను మావోయిస్టులు కాల్చి చంపారు. ట్రాక్టర్, జీపును తగలబెట్టారు. 

 

తెరుచుకున్న దుర్గగుడి ఆలయ తలుపులు

విజయవాడ : దుర్గగుడి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, స్నపనాభిషేకం అనంతరం.. భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. గ్రహణం సందర్భంగా నిన్న మధ్యాహ్నం ఆలయం మూసివేశారు. 
  

08:49 - August 8, 2017

అతి తక్కువ భూమిలో అతి తక్కువ ఖర్చుతో ఒక కుటుంబానికి సరిపడ ఆహారాన్ని, ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఎలా అన్న అంశంపై కేంద్రీకరించి పనిచేస్తున్న జట్టు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డొల్లు పారినాయుడుగారు ఇవాళ్టి జనపథంలో పాల్గొంటున్నారు. ఆయన రూపొందించిన నమూనా అనేకమందిని ఆకర్షిస్తోంది. ఆయన రూపొందించిన అన్నపూర్ణ సాగు అనే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, నాబార్డు ప్రామాణిక విధానంగా గుర్తించడం మరో విశేషం. గిరిజన సంక్షేమ పథకాల మీద గిరిజన యువతకు అవగాహన కల్పిస్తూ, వాటిని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కోసం ఆయన రూపొందించిన అగ్రికల్చర్ కిట్ పలువురి మన్ననలు పొందింది. వ్యవసాయ సాగు విధానాలు, ఎరువుల తయారీ, మనకు అందుబాటులో వున్న వనరులతో ఎలా చేసుకోవాలో కథల రూపంలో, సిడిల రూపంలో 18 పుస్తకాలతో కిట్ ను రూపొందించారు. ఈ కిట్ లో వున్న ప్రధానాంశాలు ఏమిటి? ఈ కిట్ ను ఎలా పొందవచ్చు? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

నల్గొండ : నకిరేకల్ మండలం చందంపల్లి స్టేజ్ వద్ద విజయవాడ...హైదరాబాద్ రహదారిపై రొయ్యల లారీ బోల్తా పడింది. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న సమయంలో ఏపీ ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ తో సహా ఏడుగురు ప్రయాణికులకు గాయాల్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

 

ప్రొ కబడ్డీలో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ప్రొ కబడ్డీలో భాగాంగా నేటి రాత్రి 8 గంటలకు గుజరాత్ వర్సెస్ హరియాణ మ్యాచ్, రాత్రి 9 గంటలకు బెంగళూరుతో టైటాన్స్ తలపడనుంది. 
  

నేటి నుంచి సూక్ష్మ సేద్యానికి అనుమతులు

హైదరాబాద్ : నేటి నుంచి సూక్ష్మ సేద్యానికి అనుమతులు ఇవ్వనున్నారు. సూక్ష్మ సేద్యం పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధించడంతో రాష్ట్రంలో సూక్మ సేద్యం నిలిచింది. 

08:02 - August 8, 2017

హైదరాబాద్ : ఇద్దరూ ప్రేమించుకున్నారు..హద్దులు దాటారు...ఇంజనీరింగ్ స్టూడెంట్‌ గర్భం దాల్చడంతో అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించాడు.. ఐదో నెలలో రిస్క్‌ అని తెలిసినా ఓ లేడీ డాక్టర్‌ 20 వేల రూపాయల కోసం కక్కుర్తి పడింది..అందుకు పర్యవసానం ఆ అమ్మాయి మరణించింది... ఆ డాక్టర్...ప్రియుడు ఇద్దరూ కటకటాలపాలయ్యారు..
అబార్షన్ కు రూ.20 వేల ఒప్పందం 
ఈమె హారిక...హైదరాబాద్‌ శివార్లలోని రాంచంద్రపురం బీరంగూడ చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ కూతురు హారిక బీఎన్‌రెడ్డినగర్‌లోని ప్రయివేటు హాస్టల్‌లో ఉంటూ షేర్‌గూడ ఇంజనీరింగ్ కాలేజీలో త్రిపుల్‌ ఈ సెకండ్ ఇయర్ చదువుతుంది... బంధువైన ఫోటో గ్రాఫర్ మధుతో సన్నిహితంగా ఉంటున్న హారిక అతనితో ప్రేమలో పడింది...ఆ ప్రేమ కాస్త హద్దులు దాటడంతో హారిక గర్భం దాల్చింది... ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మధు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నాలు చేశాడు..ఎక్కడా వీలుకాకపోవడంతో వనస్థలీపురం కమలానగర్‌లోని అనూష నర్సింగ్‌హోం వెళ్లి వైద్యురాలు గిరిజరాణిని కలిశాడు..అందుకు ఆమె 20 వేల రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది...
అబార్షన్ క్రిటికల్ అని తెలిసినా దుర్మార్గం..
ఇక హారికకు ఐదో నెలలో అబార్షన్ చేయడం కష్టమేనని తెలిసిన డాక్టర్ గిరిజ మాత్రం కాసులకు కక్కుర్తి పడింది..సాటి ఆడదానిగా కనీసం జాలి చూపకపోవడంతో పాటు వైద్యురాలిగా తెగించింది.. రిస్క్‌ తీసుకుంటున్నానంటూ 20 వేల కోసం అబార్షన్ చేసింది.
డాక్టర్‌ చేసిన పనికి హారిక మృతి 
డాక్టర్‌ చేసిన పనికి హారిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఖంగారు పడ్డ ప్రియుడు మధు తన స్నేహితురాలు శిరీషతో కలిసి ఉస్మానియా మార్చురీకి తరలించారు. విషయం వెలుగుచూడ్డంతో పోలీసులు రంగంలోకి దిగి మధు,డాక్టర్‌లను అరెస్టు చేశారు. ప్రాణం పోయాల్సిన డాక్టర్ ఓ నిండు ప్రాణం తీసింది..తనకు తెలిసి కూడా డబ్బు కోసం కక్కుర్తి పడింది..అదే సమయంలో ప్రేమించి ఆమెను తల్లిని చేసిన మధు కూడా దారుణంగా ఆలోచించి నమ్మిన ప్రియురాలి ప్రాణం తీశాడు..

 

07:50 - August 8, 2017

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఖాకీలకు, ఖద్దరు చొక్కాలకు సంబంధం లేదని చెప్పిన సర్కార్‌.. రాబోయే రోజుల్లో ఎలాంటి మెసేజ్‌ పంపనుంది? సిట్‌కు తెలియకుండానే హోంశాఖ నివేదిక సమర్పించిందా? అసలు నయీమ్‌ కేసులో ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఏంటీ? పోలీసులు దగ్గర ఉన్న డేటా ఏంటి? నమోదు చేసిన కేసులు  నిలవాలంటే... కోర్టులో గెలవాలంటే అధికారయంత్రాంగం ఏ వ్యూహం రచిస్తోంది?
నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో తెరపైకి కీలకాంశాలు
నయీమ్‌ ఎన్‌కౌంటర్‌తో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌ కబ్జా చేసిన భూముల వివరాలు,  బెదిరించి పోగేసిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్‌కు చెందిన డైరీని, పెన్‌డ్రైవ్‌లు, సీడీలతోహా ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీమ్‌ అకృత్యాలు, అఘాయిత్యాలు, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సిట్‌ అధికారులు వేగంగా విచారణ చేశారు. నయీమ్‌ బాధితులంతా నేరుగా సిట్‌ అధికారులకు ఫిర్యాదు చేసి తమ భూములను లాక్కొన్న తీరును వివరించి భోరుమన్నారు. దీంతో  హైదరాబాద్‌సహా తెలంగాణలో  జిల్లాల్లో మొత్తంగా 340కిపైగా కేసులు నమోదయ్యాయి.  నయీమ్‌ భార్య, అతడి కుటుంబ సభ్యులతోపాటు మొత్తం 270 మందికి పైగా అరెస్ట్‌ చేశారు.  ఇందులో నయీమ్‌ గ్యాంగ్‌కు చెందిన వారూ ఉన్నారు.
నయీమ్‌ డైరీలో కీలక ఆధారాలు
రాష్ట్రంలోనేకాక ఏపీ, గోవా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు గ్యాంగ్‌స్టర్‌ కేసు దర్యాప్తు విస్తరిస్తుందని అందరూ భావించారు.  కానీ దర్యాప్తు మాత్రం రాష్ట్ర సరిహద్దులను దాటలేకపోయింది. ముందు ఇక్కడ నయీమ్‌ అక్రమాలపై దర్యాప్తు జరిపాకే ఇతర రాష్ట్రాలపై దృష్టిని సారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు  మొదట చెప్పారు.  దర్యాప్తులో నయీమ్‌ అంటకాగిన వారిలో పొలిటికల్ లీడర్స్‌, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని  అతడి డైరీలో ఆధారాలు లభించాయి.  దీంతో కేసు విచారణ క్రమంగా వేగం తగ్గుతూ వచ్చింది.  గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ను మట్టికరిపించి, అతని నేర సామ్రాజ్యానికి అడ్డుకట్ట వేసిన పోలీసులు మాత్రం నేటికీ కేసులోని సంచలనాలను పటాపంచలు చేయలేకపోయారు.  మోస్ట్‌వాంటెడ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన  వారి వివరాలు బహిర్గతం చేయలేకపోయారు.  సంవత్సర కాలంగా ఈ కేసు ఊగిసలాడుతూ ఉసూరుమనిపిస్తోంది. ఇంకా ఈ కేసుకు సంబంధించిన  సంచలనాలు ఓ కొలిక్కి రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్‌, సైకో కిల్లర్‌ నయీమ్‌ కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా విచారణ సాగుతోంది.
ఎన్‌కౌంటర్‌ జరిగి ఏడాదైనా వీడని మిస్టరీ
గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మూలాలన్నిటినీ  పోలీసులు పెకలించి వేస్తారని బాధితులు ఆశించారు. కానీ ఇప్పటి వరకు నయీమ్‌తో కలిసి ఘోరమైన నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలున్న నయామ్‌ కుడిభుజం శేషన్నతోపాటు అతని 30మంది సభ్యుల ముఠా ఇంకా సిట్‌కు చిక్కకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  తాము గాలిస్తున్నామని, త్వరలోపట్టుకుంటామని  పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఏడాది కావొస్తున్నా ఫలితం లేకపోవడంతో బాధితులకు ఆందోళన కలిగిస్తోంది.  బెదిరించి, కిడ్నాప్‌లకు పాల్పడి తమ నుంచి నయీమ్‌ కబ్జా చేసిన వందల ఎకరాల భూమిని తిరిగి ఇప్పించే విషయమై ప్రభుత్వం నుంచి తగిన చర్యలు లేవని వందలాదిమంది బాధితులు వాపోతున్నారు. నయీమ్‌తో అంటకాగిన పోలీసుల విషయంతో తగిన దర్యాప్తు సాగం లేదని బాధితుల నుంచి విమర్శలున్నాయి. నయీమ్‌తో సన్నిహిత సంబంధాలున్న కొంతమంది ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న నేతల పట్ల నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో బాధితుల విమర్శల  దాడిని కొంతైనా తగ్గించడానికన్నట్టు పోలీసులు ఉన్నతాధికారులు కొంతమంది పోలీసులను సస్పెండ్‌ చేశారు.  మరికొంతమందిపై శాఖాపరమైన చర్యలుంటాయని తెలిపారు.  మొదట అత్యంత వేగంగా సాగిన నయీమ్‌ కేసు దర్యాప్తు  తర్వాత క్రమంలో మెత్తబడటానికి కారణం రాజకీయ క్రీనీడేనని కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.  నయీమ్‌ను హతమార్చాం, ఇంకేం కావాలంటూ అసలు మూలాల్ని తవ్వి తీయకుండా పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యత్నిస్తుందన్న ఆరోపణలున్నాయి.  నయీమ్‌ కేసులో అసలు పేర్లు ఎందుకు బయటకు రావడంలేదన్న సందేహం సర్వత్రా నెలకొంది. వీటన్నిటిని బట్టబయలు చేయాల్సిన బాధ్యత విచారణ అధికారులదే.

 

07:44 - August 8, 2017

హైదరాబాద్ : అతని పేరు వింటేనే హడల్‌. అతని నుంచి ఫోన్‌ వచ్చిందంటే వణుకు. అదే అతని బలం. ఆ బలంతోనే అమాయకులను బెదిరించాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. వేలాది ఎకరాలు బలవంతంగా లాక్కొన్నాడు. వేలకోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. ఒక వ్యక్తి నుంచి అరాచక శక్తిగా ఎదిగాడు. అతని ఎదుగుదలలో ఖాకీలు, ఖద్దరు చొక్కాల పాత్ర ఉంది. దశాబ్దకాలంగా తెలుగు రాష్ట్రాలను గడగడలాడించాడు. నేర సామ్రాజ్యాన్ని సృష్టించి అరాచకాలకు పాల్పడ్డారు. చివరికి పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఇంతకీ ఎవరతను? ఏమా నేర సామ్రాజ్యం కథ?
చీకటి రాజ్యాన్ని ఏలిన నయీమ్‌
నయీం. పరిచయం అవసరంలేని పేరు.  తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించిన మాఫియా డాన్‌. దశాబ్దకాలానికి పైగా నేర సామ్రాజ్యాన్ని ఏలాడు. బెదిరింపులు, మర్డర్‌లతో అమాయకుల నుంచి వేలాది ఎకరాల భూమిని కబ్జా చేశాడు. అంతేనా... వేల కోట్ల రూపాయలు పోగేశాడు. పోలీసులు, పొలిటికల్‌ లీడర్స్‌తో పరిచయం పెంచుకుంటూ... వారికి గిఫ్ట్‌లు ఇస్తూ నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. మానవ విలువలు మరచి కరడుగట్టిన  గ్యాంగ్‌స్టర్‌గా  మారాడు. చివరికి ఎవరినైనా శాసించే స్థాయికి ఎదిగాడు.  తాను చెప్పినట్టు చేశారా సరి... లేకుంటే అంతమొందిస్తానంటూ హెచ్చరించేవాడు. అప్పటికీ దారిలోకి రాకపోతే పొలిటికల్‌ లీడర్స్‌, పోలీసులను రంగంలోకి దించేవాడు. కాదూకూడదని వాదిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేసేవాడు. 
గతేడాది ఆగస్ట్‌ 8న నయీమ్‌ ఎన్‌కౌంటర్‌
సరిగ్గా సంవత్సరం క్రితం. అటే ఆగస్టు 8న షాద్‌నగర్‌లోని మిలీనియం కాలనీలో ఉదయం అలజడి చెలరేగింది.  చీకటి సామ్రాజ్యాన్ని ఏలిన గ్యాంగ్‌స్టర్‌ నయీం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.  రాష్ట్రంలోనేకాకుండా జాతీయ స్థాయిలోనూ సంచలనం రేపిన నయీం ఎన్‌కౌంటర్‌తో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  నయీం డెన్‌లలో నుంచి కోట్లాది రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.  నగలు, భూముల దస్తావేజులు, ఆయుధాలనూ స్వాధీన పర్చుకున్నారు. నయీమ్‌ కార్లను సీజ్‌ చేశారు.  నయీమ్‌ చెరలో చిక్కుకున్న కొంతమందిని విముక్తి చేశారు. నయీం రాసిన డైరీ, అతడు నేరాలను తెలిపే సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఒకపక్క సిట్‌... మరోపక్క మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, సైబరాబాద్‌, రాచకొండ, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం పోలీసులు నయీం కేసులో దర్యాప్తు జరిపారు.  340కిపైగా కేసులు నమోదు చేశారు. 
నయీంకు సహకరించిన పోలీసు అధికారులు
నయీమ్‌ ఒక వ్యక్తి నుండి ఇతరులను శాసించే గ్యాంగ్‌స్టర్‌ వరకు ఎదిగాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేతతో ఏర్పడిన పరిచయంకాస్తా దందాలకు, రౌడీయిజానికి దారితీసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసులతో ఉన్న సంబంధాలతో నేతల వద్దకు వచ్చే సెటిల్‌మెంట్లతో అతి తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు తన ఖాజానాలో వేసుకోగలిదాడు. వవాటిని ఒడిసి పట్టేందుకు మరిన్ని ఘోరాలు చేశాడు.  ఒకానొక సమయంలో పెళ్లి అంటేనే ఒక వరంగా భావించిన నయీమ్‌... ఆ తర్వాత బాలికల నుంచి యువతుల వరకు లైంగికంగా వాడుకున్నాడు. రాసలీలలు, రాజభోగాలకు నయీమ్‌ రుచిమరిగాడు.  నయీం ఒక అరాచకశక్తిగా ఎదిగేందుకు పోలీసులు సహకరించారు.  దానికి ప్రతిఫలంగా నయీమ్‌ ఖాకీలకు రాష్ట్రం నలువైపులా అనేక చోట్ల ల్యాండ్‌ డీలింగ్స్‌లో షేర్స్‌తోపాటు... విలువైన పేదల, రైతుల భూములను వారికి రిజిస్ట్రేషన్‌ చేయించి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇలా అతని నేర సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు. అడ్డువచ్చిన వారిని అంతం చేస్తూ ఎదిగాడు. చివరికి పోలీసుల చేతిలోదారుణంగా చనిపోయాడు.

 

07:30 - August 8, 2017

హైదరాబాద్ : అధికార టీఆర్ ఎస్ నేతల మధ్య కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్ర మవుతున్నాయి.  ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీ పార్టీలో చేరిన నేతలకు....ఉద్యమకాలం  నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులకు మధ్య  అంతరం పెరుగుతోంది. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే  భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్‌ల విషయంలో టీఆర్ ఎస్ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.
నేతలు గ్రూపులు 
క్రమశిక్షణకు మారుపేరైన గులాబీ పార్టీలో నేతలు గ్రూపులు కడుతున్నారు. ముఠాలను పెంచి పోషిస్తున్నారు. వర్గపోరుతో పార్టీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది. నేతల కుమ్ములాటలతో టీఆర్ ఎస్ ప్రతిష్ఠ మంటకలుస్తోందన్న వాదనలు గులాబీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.   
బంగారు తెలంగాణ బ్యాచ్‌కు ప్రాధాన్యత 
టీఆర్‌ఎస్‌లో బి.టి. బ్యాచ్...... యు.టి. బ్యాచ్ లతో ప్రత్యేక విభాగాలుగా నేతలు చలామణి అవుతున్నారు. బంగారు తెలంగాణ బ్యాచ్ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత దక్కుతుందన్న విమర్శలను ఉద్యమ తెలంగాణ బ్యాచ్ నేతలు ముందు నుంచి చేస్తున్నారు.  టీఆర్ఎస్ తరపున 63 మంది ఎమ్మెల్యేలు  అసెంబ్లీకి ఎన్నికైనా... ఉప ఎన్నికలతో పార్టీ శాసనసభ్యుల  సంఖ్య 65కు పెరిగింది. మరో 25 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి  వచ్చి కారెక్కారు. దీంతో పార్టీలో గ్రూపులు పెరిగాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గాల్లో గ్రూపులు కడుతున్న ఇన్‌చార్జ్‌లు  
ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వలస వచ్చిన నియోజకవర్గాల్లో  నేతల అంతర్గత కుమ్ములాటలు గులాబీ  పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది.   ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన శాసనసభ్యులు తమ హోదాతో నియోజకవర్గాల్లో  కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వం  కూడా ఎమ్మెల్యేలకు సర్వాధికారాలు కట్టబెట్టి పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న ఆదేశాలు ఇస్తోంది. అయినా.....శాసనసభ్యులను ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన  నేతలు మాత్రం హైకమాండ్‌ నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదున్న ఫిర్యాదులు ఉన్నాయి.  నియోజకవర్గం ఇన్‌చార్జ్ లు, శాసనసభ్యులు కలిసి సమన్వయంగా పనిచేయాలన్న  ఆదేశాలు పార్టీ అధినాయకత్వం నుంచి లేకపోవడంతో ఎవరికి వారుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇన్‌చార్జ్ లు కూడా తమ వర్గాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో పట్టు  నిరూపించుకునే ప్నయత్నం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్  ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్....  ఓటమి చెందిన నేత మురళి వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమంలో ఇద్దరి మధ్య  నువ్వా...నేనా అన్న విధంగా వాగ్వాదం జరిగింది. పార్టీ హైకమాండ్ తో స్పష్టత ఇప్పిస్తానని ఎమ్మెల్యే గోపినాథ్ అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి కొత్త చిక్కులు 
రాబోయే ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి గొడవలు తెరపైకి రావడం టీఆర్‌ఎస్‌ అధినాయకత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. గులాబీ బాస్‌ జోక్యం చేసుకుని ఇలాంటి గొడవలను ఇలాంటి గొడవలు, ముఠాలు, గ్రూపులను ఆదిలోనే  అదుపుచేయకపోతే భవిష్యత్‌లో ముదిరిపాకాన పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

07:23 - August 8, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గెలుపే ధ్యేయంగా పెట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మీల్సీలు, ఎంపీలు, టీడీపీ సీనియర్‌ నేతలంతా నంద్యాలలోనే తిష్టవేశారు. నంద్యాలలో విజయం కోసం అనుచరించాల్సిన వ్యూహంపై నిత్యం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు, బాలయ్య, లోకేశ్‌ నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి  సిద్ధమవుతున్నారు. 
టీడీపీ, వైసీపీ...ప్రచారం కొత్త పుంతలు  
నంద్యాల ఉపఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. గెలుపును ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వ్యూహాత్మంగా ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థులు ఎత్తులను చిత్తు చేసేందుకు రెండు పార్టీల నేతలు రోజు రోజుకు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 
గెలుపే ధ్యేయంగా టీడీపీ ముందుకు 
నంద్యాలలో గెలుపే ధ్యేయంగా టీడీపీ ముందుకు సాగుతోంది. లక్ష్య సాధన కోసం చంద్రబాబునాయుడు ఆరుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు సీనియర్‌ నేతలను రంగంలోకి దింపారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అఖిలప్రియ నంద్యాలలోనే మకాంవేసి ప్రచారం చేస్తున్నారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు టీడీపీ శాసనసభ్యులు కూడా నంద్యాలలోనే తిష్టవేసి, తమ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిందరితో చంద్రబాబునాయుడు నిత్యం టెలికాన్ఫ్‌రెన్స్‌ నిర్వహిస్తూ.. ప్రచార సరళి, ఓటర్ల మనోగతంపై ఆరాతీస్తున్నారు. ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేందుకు అనుచించాల్సిన వ్యూహంపై దిశా, నిర్దేశం చేస్తున్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నంద్యాల ప్రచారాన్ని పర్యవేక్షించే బాధ్యతలను  పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నేతలు పోలింగ్‌ బూత్‌ల వార్గీగా ఉప పోరును పర్యవేక్షిస్తున్నారు. 
హోరెత్తుతోన్న టీడీపీ, వైసీపీల ప్రచారం 
నంద్యాలలో టీడీపీ, వైసీపీల ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు నంద్యాలలో పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి టూర్‌ చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. మూడు రోజుల పాటు నంద్యాలలోనే ఉండి టీడీపీ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించారు. మంత్రి లోకేశ్‌తోపాటు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా నంద్యాల ప్రచారానికి వెళ్లబోతున్నారు. ప్రచారం ముగింపు ముందు రెండు రోజులు బాలయ్య నంద్యాలలో టూర్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. 
ఈనెల 23న నంద్యాల పోలింగ్‌ 
ఇక వైసీపీ అధినేత జగన్‌ కూడా నంద్యాలలో మకాం వేసేందుకు ప్లాన్‌ చేసుకున్నారు. ఈనెల 9 నుంచి  నంద్యాలలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు  ఈనెల 23న పోలింగ్‌ జరుగుతుంది.  28న ఓట్ల లెక్కింపు చేపడతారు. హోరా హోరీ పోరులో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిల్లో  విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

07:13 - August 8, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డులన్నింటీని ప్రక్షాళలన చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఏ భూమి ఎవరి పేరుమీద ఉన్నదన్న విషయాన్ని నిగ్గు తేల్చేందుకు సర్వే చేపట్టాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సర్వే, సెటిల్‌మెంట్‌ అధికారులను కోరారు. స్పెషల్‌ డ్రైవ్‌ పూర్తైన తర్వాత భూ రికార్డులన్నింటీ బహిర్గతం చేయాలని నిర్ణయించారు. 
భూ రికార్డుల వ్యవస్థల ప్రక్షాళన 
భూ రికార్డుల వ్యవస్థలను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఏ భూమి ఎవరి పేరుమీద ఉందన్న విషయాన్ని తేల్చేందుకు సర్వే నిర్వహించాలని భూరిపాలన శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 
1936లో నిజాం పాలనలో భూ జమాబంది
భూ రికార్డులు ప్రక్షాళనకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏడు గంటలపాటు సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. 1936లో నిజాం పాలనాకాలంలో జమాబంది నిర్వహించి, తయారు చేసిన భూ రికార్డులను ఆ తర్వాత ప్రక్షాళన చేయలేదు. దీంతో సరైన రికార్డులు లేకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. భూ వివాదాలు కొన్ని సార్లు శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తున్నాయి. సమగ్ర భూ సర్వే ద్వారా ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు దేశంలోని వివిధ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ప్రతిపాదించారు. 
పట్టాదారు పాసు పుస్తకాలు, పహాణీ పత్రాలు సరళతరం 
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తైతే అమ్మకాలు, కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతాయని భావిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, పహాణీ పత్రాలు సరళంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. భూములకు సంబంధించి గందరగోళానికి దారితీసే అంశాలకు రికార్డుల్లో తావులేకుండా చేస్తారు. బ్యాంకు లావాదేవీలు ఎంత పారదర్శకంగా ఉంటాయో, భూ రికార్డుల నిర్వహణ కూడా అదే విధంగా ఉండే విధంగా చూస్తారు. గ్రామాన్నియూనిట్‌గా తీసుకుని సర్వే చేయాలని నిర్ణయించారు. 
పెట్టబడి సబ్సిడీ కోసం సర్వే 
వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు రెండు దఫాలుగా 4 వేల రూపాయల వంతున పెట్టబడి రాయితీ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ గ్రామాల్లో సర్వే నిర్వహించింది. కానీ రెవెన్యూ రికార్డుల్లోని వివరాలకు, వ్యవసాయ శాఖ సేకరిచిన సమాచారంతో సరిపోవడంలేదు. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం ఓ గ్రామలంలో 300 మంది రైతులు ఉంటే, రెవెన్యూ రికార్డుల్లో 1100 మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి రాయితీ ఎవరికి ఇవ్వాలన్న సమస్య తలెత్తుతోంది. ఈ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉండటంతో భూముల సర్వేకి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో ఉన్న 2.70 కోట్ల ఎకరాల భూమి యజమానులను ఈ సర్వే ద్వారా గుర్తిస్తారు. రాష్ట్రంలోని 10,850 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపడతారు. తెలంగాణలో ఉన్న 3,500 మంది రెవెన్యూ అధికారుల్లో ఒక్కొక్కర్ని మూడు గ్రామాలక ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తారు. గ్రాస్థులు, ప్రభుత్వం ఏర్పాటు చేసే రైతు సంఘాల ఆధ్వర్యంలో  ఒక్కో గ్రామాల్లో 15 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు. సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు వేరే పనులు అప్పగించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి భూమికి ప్రత్యేక సర్వే నంబర్‌ కేటాయిస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తైన తర్వాత అన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

రేవంత్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ చేపట్టనున్నారు. డ్రగ్స్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని రేవంత్ పిటిషన్ వేశారు. 

నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

మేడ్చల్ : నేడు సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. చింతపల్లి గ్రామసభలో సీఎం పాల్గొనునున్నారు. 

 

06:56 - August 8, 2017

కరీంనగర్‌ : కాంగ్రెస్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. మరోవైపు పొన్నం ఆస్పత్రిలో వైద్యానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నేటి నుంచి ఒలిఫెంటా బ్రిడ్జీ మూసివేత

హైదరాబాద్ : సికింద్రాబాద్ మెట్రో పనుల కారణంగా నేటి నుంచి 15 రోజులపాటు ఒలిఫెంటా బ్రిడ్జీ మూసివేయనున్నారు. 

కాంగ్రెస్‌ నేత పొన్నం దీక్ష భగ్నం

కరీంనగర్‌ : కాంగ్రెస్‌ నేత, కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి పొన్నం ప్రభాకర్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. 

Don't Miss