Activities calendar

09 August 2017

21:55 - August 9, 2017

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకి గవర్నర్‌ పదవి దక్కబోతుందా ? ఇదే అంశంపై గతంలో చంద్రబాబు, మోదీతో జరిపిన చర్యలు ఫలించబోతున్నాయా ? ఈశాన్య రాష్ట్రానికి మోత్కుపల్లిని గవర్నర్‌ను చేసే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

21:53 - August 9, 2017

న్యూయార్క్ : అమెరికా, ఉత్తర కొరియాల మ‌ధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకున్నాయి. సై అంటే సై అని రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రపంచంలో ఎప్పుడూ జరగని విధంగా ఉత్తర కొరియాకు తగినరీతిలో బుద్ధి చెబుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. ప్యాంగ్‌యాంగ్‌ మిసైల్‌, అణు కార్యక్రమాలను విస్తరిస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంట‌ల్లోనే నార్త్ కొరియా కూడా అదే రీతిలో స్పందించింది. ఫసిపిక్‌ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన ద్వీపం గువామ్ ద‌గ్గర ఉన్న మిలిట‌రీ స్థావ‌రాల‌పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో దాడి చేస్తామని నార్త్ కొరియా హెచ్చరించింది. అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తుది నిర్ణయం త‌ర్వాత ఈ ప్రణాళిక‌కు తుది రూపు ఇచ్చి, దానిని ఆచ‌ర‌ణ‌లో పెడ‌తామ‌ని అధికార న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇటీవల కాలంలో క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. వాషింగ్టన్‌ పోస్ట్‌ సమాచారం ప్రకారం ఉత్తర కొరియా 60 అణ్వాయుధాలు కలిగి ఉంది. 

21:52 - August 9, 2017

చండీఘడ్ : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వెంబడించిన భయాందోళనకు గురిచేసిన కేసులో హరియాణా బిజెపి నేత సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వికాస్‌ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్‌లోని సెక్టర్ 26 పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసు కిడ్నాప్ ఆరోపణలను అదనంగా చేర్చుతూ సెక్షన్ 365, సెక్షన్ 511 ప్రకారం కేసు నమోదు చేశారు. వికాస్‌ బెయిలు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైంది. 6 ప్రదేశాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. వికాస్‌ బాధితురాలి కారును వెంబడించి వేధింపులకు గురిచేసినట్లు ధ్రువీకరించారు. వికాస్‌ బరాలా కారు తనని ఐదు కిలోమీటర్ల వరకు వెంబడించారని, ఆ సమయంలో తాను భయాందోళనకు గురయ్యానని ఐఏఎస్‌ అధికారి కూతురు వర్ణికా కుందూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తమ కుమారుడు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాడని బిజెపి నేత సుభాష్‌ బరాలా తెలిపారు. 

21:51 - August 9, 2017

రంగారెడ్డి : పోరాడి సాధించుకున్న తెలంగాణలో బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర నిరాశే మిగిలిందన్నారు.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కొడుకు బండారం బయటపెట్టినందుకే ప్రజాసంఘాలపై సీఎం కేసీఆర్‌ నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీమాస్‌ సభకు తమ్మినేని హాజరయ్యారు.. ప్రజాగాయకుడు గద్దర్‌, టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గద్దర్‌ ఆటాపాటా అందరినీ అలరించింది.

21:49 - August 9, 2017

హైదరాబాద్ : ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షంతో హైదరాబాద్‌వాసులు అష్టకష్టాలు పడ్డారు.. రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారిపోయాయి.. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి మురుగునీరు చేరింది.. సికింద్రాబాద్‌, మెట్టుగుడా, వారాసిగూడ, మహ్మద్‌గూడ, అంబేడ్కర్ నగర్, ఆజాద్ చంద్రశేఖర్ నగర్, ప్రకాశ్ నగర్, బోయిన్‌పల్లి, అడ్డగుట్టలో వర్షం హోరెత్తిపోయింది. ఉప్పల్‌లో భారీవర్షం జనాలకు చుక్కలు చూపించింది.. ఇళ్లలోకి నీరుచేరింది... వర్షంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.. రోడ్లపై గుంతలతో బయటకు రావాలంటే జనాలు భయపడిపోయారు.. పాతబస్తీ, మలక్‌పేట్‌, మోహదీపట్నం, కుతుబుల్లాపూర్‌లోనూ భారీవర్షం కురిసింది.

జనార్దన్‌ రెడ్డి పర్యటించారు...కూకట్‌పల్లి ధరణి నగర్‌, ఆల్విన్‌ కాలనీలో భారీ వర్షం పడింది.. కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్ గౌడ్‌, మున్సిపల్‌ అధికారులు సహాయక చర్యలను పరిశీలించారు.ఎల్‌బీ నగర్‌లో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.. నాగోల్‌ ఆదర్శనగర్‌లో మోకాళ్లలోతువరకూ నీరు చేరింది.. వనస్థలిపురం, హయత్‌ నగర్‌లో ఈదురుగాలుల ధాటికి వర్షాలు నేలకూలాయి.. రాజేంద్రనగర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది.గ్రేటర్‌ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాల్లో కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పర్యటించారు... పరిస్థితిని సమీక్షించారు.. ఎమర్జెన్సీ టీంలు రోడ్లపై నీటిని తొలగిస్తున్నాయని తెలిపారు.వర్షం హోరెత్తిపోవడంతో జీహెచ్‌ఎంసీకి వందకుపైగా ఫిర్యాదులు వచ్చాయి.. వాటిని అప్పటికప్పుడే పరిష్కరించామని అధికారులు చెప్పారు.

అత్యధికంగా అంబర్‌పేట్‌లో 5 సెంటీమీట!
సిటీలో అత్యధికంగా అంబర్‌పేట్‌లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.. ఫలక్‌నుమాలో 4 సెంటీమీటర్లు, హుస్మాన్‌ఘడ్‌లో 3.4 సెంటీమీటర్లు, నారాయణగూడలో 3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.. మరోవైపు వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగుతాయని వాతావరణ అధికారులు తెలిపారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

21:48 - August 9, 2017

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలతో పాటు.. తన వ్యక్తిగత అంశాలను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. నేరెళ్ల ఘటన దురదృష్టకరమన్నారు కేటీఆర్‌. బాధితులను చూస్తుంటే... పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బాధితులను రిమాండ్‌కు తరలించే వరకు తనకు ఈ విషయం తెలియదని... వాహనాలను దగ్ధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ప్రజలను కొట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని... డీఐజీ నివేదిక రాగానే పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు. ఇసుక మాఫియాను అరికట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనని... ఆదాయం పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు కేటీఆర్‌. హిమాన్స్‌ మోటార్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని... ఏడేళ్ల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశామన్నారు. ఈ విషయంలో తనపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

కోర్టుకు వెళ్లేందుకైనా సిద్దం
ఇక 2019 ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే అధికారమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో... ఐదు సీట్లను గెలవలేదని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌, ఐఐఎం, ఐఐటీఆర్‌, హైకోర్టు, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ సహా దేనికీ కేంద్రం సహకరించడం లేదన్నారు. ఇలా అయితే రాష్ట్రంలో బీజేపీ ఎలా బలపడుతుందన్నారు. ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాల్సిందేననన్నారు కేటీఆర్‌. చేనేత, గ్రానైట్‌పైనా కూడా జీఎస్టీ తగ్గించాలన్నారు. ఇప్పటివరకు జీఎస్టీపై ఏ రాష్ట్రం కోర్టుకు వెళ్లలేదని... కేంద్రం ఈ అంశాలను పరిశీలించకపోతే కోర్టుకు వెళ్లేందుకైనా సిద్దమన్నారు కేటీఆర్‌. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌పై స్పందించిన కేటీఆర్‌... రాజధానిలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క అందరూ తమకు రాజకీయ శత్రువులేనని స్పష్టం చేశారు.

హరీష్ రావుతో విభేదాలులేవు
ఇక హరీష్‌రావుతో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తలపై కేటీఆర్‌ స్పందించారు. తనకు, హరీష్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని... అన్ని విషయాల్లోనూ తమకు క్లారిటీ ఉందన్నారు. 2029లో కూడా కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకుంటునన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగర వాసులు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న మెట్రో మొదటి దశను ఈ ఏడాదే ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రోరైలు ప్రారంభిస్తామన్నారు.

8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెన్షన్

గుజరాత్ : వీప్ ఉల్లఘించిన 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఎమ్మెల్యేలను 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తు ప్రకటన చేశారు.

కేంద్రహోంశాఖకు కేంద్రం లేఖ

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేంద్రహోంశాఖ, ఈసీ, సీబీఐ, ఏసీబీలకు లేఖ రాశారు. గులాబీ కూలీ పేరిట మంత్రులు బహిరంగ అవినీతి పాల్పడ్డారని ఆయన ఆరోపణ చేశారు. 

20:43 - August 9, 2017
20:24 - August 9, 2017

అర్ధరాత్రి గంట ఎందుకు మోగించారో... దాని ఫలితాలేమిటో అంతా అయోమయం.. గందరగోళం..అసలు జీఎస్టీ గురించి దేశంలో అర్ధమయిన వారెందరు? ఆఖరికి మద్దతిచ్చిన ముఖ్యమంత్రులే ఇప్పుడు రివర్సవుతుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితేంటి? ఎంత భారం మొయ్యాలి? ఎన్ని నష్టాలు భరించాలి? జీఎస్టీ చివరికి సామాన్యుడి జేబుకే కాదు.. ఫెడరల్ స్ఫూర్తికి కూడా తూట్లుపొడుస్తోందా? వరంగా చెప్పుకొచ్చిన జీఎస్టీ పెద్ద బండ అని తేలిపోతోందా? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..కొత్త పన్ను క్షేత్ర స్థాయిలో ఎలా ఉంది? ఎవరు లాభపడుతున్నారు? ఎవరు ఇబ్బందులు పడుతున్నారు? ఆర్థిక రంగంపై ప్రభావం ఎలా ఉంది? రాష్ట్రాల స్పందన ఎందుకు మారుతోంది? అన్నీ ప్రశ్నలే.. ఇప్పుడు సమమాధానం వెతక్క తప్పని పరిస్థితి కనిపిస్తోంది..సమాఖ్య స్ఫూర్తికి తూట్లుపడుతోందా?రాష్ట్రాలు బలహీనంగా మారనున్నాయా? కేంద్రం చేతికి పెత్తనమంతా వచ్చేస్తోందా? మొదట్లో సమర్ధించిన కెసీఆర్ ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారు?జీఎస్టీ అంతిమంగా రాష్ట్రాలకు గుదిబండగా మారనుందా..పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

20:23 - August 9, 2017

ఏడ సంపాయించుకున్న ఇజ్జత్ ఆడనే పొడగొట్టుకున్నడు బీజేపీ పెద్ద పువ్వు అమీత్ షా... దాశి దాశి దయ్యాల పాలు జేశినట్టు.. రాజ్యసభ ఎన్నికలళ్ల ఇకమాతులు పడి పడి.. పరాయి పార్టోళ్ల పాలు జేశిండు.. అసలు ఈనకున్న బలానికి ఇద్దరే గెలుస్తరు.. అసొంటిది మూడో మన్షిని వెట్టిండంటేనే మోడీ మోకాలుకు షా బోడిగుండుకు ముడివడ్డట్టు అనిపిచ్చింది..

ఆ సూస్తుంటే కోదండరాం సారు.. కొనాకర్కి టీఆర్ఎస్ పార్టీని ఏదో జేస్తట్టే అనిపిస్తున్నదిగని.. అందరు అనుకున్నట్టు..సిద్దిపేట్ల యాత్రవెట్టె.. సిరిసిల్లల వెట్టె.. ఆఖరికి గజ్వెల్లిల గూడ వెట్టిండు.. ఇగ మిగిలిన నియోజకవర్గం ఏది..? ఆ నిజాంబాదు.. అగో నిజాంబాదుల గూడ అమరవీరుల స్పూర్తి యాత్ర వెట్టేశిండు.. ఈ పదకొండు తారీఖు సంది సుర్వట..

ఏంది సారూ మత్లావు.? నేరెళ్ల పంచాదిల కెళ్లి బైటవడెతందుకు మస్తుగ తన్లాడుతున్నట్టుండుగదా.?? ముఖ్యమంత్రి కొడ్కు కల్వకుంట్ల తారకరామారావుగారూ.. నిన్న బాధితుల తానికి వొయ్యి.. నేను మీకు అండగా ఉంట.. భయపడకుండ్రి అని భరోసా ఇచ్చిండ్రట.. మీరు అండగుండెపట్కెనేగద సారూ.. మమ్ములను ఇట్ల గొట్టిండ్రు.. మళ్ల వచ్చి మాకు అండగుంటాంటున్నవేంది అని బాధితుల బంధువులే పర్శానైండ్రట.. సరే అదెట్లున్నా.. కేటీఆర్ డ్యూయల్ మాటలు ఒక్కపారి జనం జూడాలే సూడుండ్రి ఎంటియో అవ్వి..

నేను జెప్పలేదా..? ఒక్క ఒరల రెండు కత్తులు ఇమ్డుడు కష్టమని అన్నట్టే అయితున్నది.. ఒక్కొక్క నియోజకవర్గంల ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండెట్లు ఉండే టీఆర్ఎస్ పార్టీకి.. ఇగ రేపో మాపో ఎన్నికలు దగ్గర వడ్తున్నయ్.. ఇప్పటి సందే గ్రూపులు.. క్యాంపులు మెంటన్ జేసుడు.. పంచాదులు దీసుడు.. సుర్వైతున్నయ్.. ఖానాపూర్ ఎమ్మెల్యేకు.. మాజీ ఎంపీకి నిన్న లడాయి తల్గింది..

ఆ జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ కొంప ముంచెతట్టే ఉన్నడు నంద్యాల ఉపఎన్నికలళ్ల.. ఏ పార్టీ లీడరైనా..? డిపాజిట్ రాకున్నాగని.. మేమే గెలుస్తం మాకే ప్రజలు పట్టంగడ్తరు.. బంపర్ మెజార్టీ వస్తదని చెప్పుకుంటరుగదా... కని జేసీ దివాకర్ రెడ్డి గారు మాత్రం.. గెలిస్తె గెలుస్తమేమో గని.. అంత మెజార్టీ రాకపోవొచ్చు అని ఓటమి అంచు ముచ్చట్లు జెప్పిండు..

అటు ఆంధ్రల చంద్రబాబు గూడ బాగనే నేర్చుకుంటున్నట్టుండుగదా..? ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకునే యవ్వారాలు.. పిర్రగిచ్చి జోకొట్టినట్టు.. పేదోళ్లకు ఇగో ఇండ్ల పట్టాలిస్తున్నా అందుకోండ్రి ఒక ఒకదిక్కు జెప్పి.. ఇంకో దిక్కుకెళ్లి ఆ ఇండ్ల పట్టాలను గుంజుకుంటమని జీవోల జెప్పిండంటే.. ఈ ముచ్చటను ఏమంటరు ఏం లెక్క జర మీరు జెప్పాలే ఇగ..

హాస్టళ్ల ఆడివోరగాళ్లకు రక్షణ గల్పియ్యవల్సింది వార్డనేగదా..? ఆ వార్డనే కడ్పునిండ తాగొచ్చి ఆడివోరగాళ్లను ఆడ గిచ్చుడు ఈడ గిచ్చుడు వెడ్తె ఎట్లుంటది చెప్పుండ్రి..? చేశిండు ఒక వార్డన్ గాడు ఇట్లనే.. ఇగ ఆడివోరగాళ్లు ఓర్సుకునె కాడికి ఓర్సుకున్నరు వాని బాధ.. ఇగ నిన్న దొర్కిచ్చుకోని కొట్టిండ్రంటే మామూల్గ గొట్టలే వాని పచ్చలు వల్గినయ్..

తిరుమల కొండ మీదికి తుపాకి దీస్కపోయి మరి ఎవ్వల్ని సంపుదామనుకున్నడో ఏమో ఒకడు.. సాటు సాటుకు తుపాకి దీస్కోని కొండ మీదికి ఎక్కవోతుంటె పోలీసోళ్లు సూశి పట్టుకున్నరట.. పుసుక్కున వాడు మీదికి జేరితె.. ఏకంగ ఏడుకొండల ఎంకన్న సామికే గురివెట్టి ఆగం జేసునో ఏమో అనుకుంటున్నరు భక్త జనులు వాని కథ ఏందో సూద్దాం పాండ్రి..

20:19 - August 9, 2017

భారతదేశంలో ఇంతవరకు కాంగ్రెస్ కే అత్యధిక స్థానాలను గెలుచుకుందని, కానీ ఇప్పుడు బీజేపీ అత్యధిక స్థానాలను గెలిచిందని, ఈ ఎన్నికల్లో బీజేపీ ఫిరాయింపులను పోత్సహించిందని, డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున తురుపు ముక్కల అహ్మద్ పటేలు పనిచేస్తాడాని, బీజేపీ గ్రహించి ఓడించేందుకు సర్వశక్తులు ఒడిందని, చివరకు ఓటమి చెందిందని విశ్లేషుకులు తెలకపల్లి రవి అన్నారు. రాజ్యసభ లో ఎన్నికల్లో జేబీపీ దిగజారిపోతుందని కాంగ్రెస్ కార్తిక్ అన్నారు. 38 ఎమ్మెల్యేలు ఉండడంతో మేము ప్రయత్నం చేశామని బీజేపీ నేత శ్రీధర్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:01 - August 9, 2017

శ్రీకాకుళం : ల్లా కేంద్రంలో వంశీధార ప్రాజెక్టు నిర్వాసితులు, సీపిఎం నాయకులతో కలిసి నాల్గోరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుండి పొట్టి శ్రీరాములు కూడలి వరకు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా, పోలీసులతో స్థానికులను నిర్భందించి మొండిగా వ్యవహరిస్తోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులను పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని సిపిఎం నాయకులు ఆరోపించారు.

19:00 - August 9, 2017

ఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఉక్కు కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌ పరం చేయవద్దని కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కర్మాగార అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలని కోరారు. ఈ ధర్నాలో విశాఖ, సేలం, బద్రావతి, బిలాయ్‌, బొకారో, దుర్గాపూర్‌ ఉక్కు కర్మాగార కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

 

18:59 - August 9, 2017

గుంటూరు : విశాఖ మెడ్‌ టెక్‌ పార్క్‌పై కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, మెడ్‌టెక్‌లో ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. మెడ్‌టెక్‌ పార్క్‌ను ఓపెన్‌ టెండర్ల ద్వారా ఎంపిక చేశామని, సీఈవో మెయిల్స్‌ను హ్యాక్‌ చేసి కొందరు ఇ‌న్వెస్టర్లు పంపారని కామినేని చెప్పారు. వేరే రాష్ట్రాలకు లబ్ది చేకూరేలా కొందరు వ్యవహరించారని కామినేని ఆరోపించారు.

18:58 - August 9, 2017

విజయవాడ : కౌన్సిల్‌ సమావేశం రసాభాసాగా సాగింది. డొంక రోడ్డు వివాదం కాస్త వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య వివాదంగా మారడంతో అరుపులు, కేకలతో కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లింది. దీంతో మేయర్‌ కౌన్సిల్‌ను 45 నిముషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లను మేయర్‌ సస్పెండ్‌ చేశారు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహా అందిస్తారు.

18:57 - August 9, 2017

విశాఖ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విశాఖ జిల్లా అరకు నియోజకవర్గంలో వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలను గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గవర్నర్‌, సీఎంకు గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గిరిజన నృత్య ప్రదర్శనలను తిలకించారు.పర్యాటకానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కూచిపూడి నృత్యం తరువాత థింసా నృత్యానికి ఆ స్థాయిలో ప్రచారం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం దేశ, విదేశాల్లో థింసా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం ముఖ్యంగా అరకుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అరకు ఎకో టూరిజం సర్క్యూట్‌ను 110 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామన్నారు. లంబసింగి, దల్లాపల్లిలో రిసార్టుల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో ఆదాయ వనరులను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎంతో ఆదరణ ఉన్న ఆర్గానిక్‌ ఆహార పదార్థాలను సేద్యం చేస్తే.. గిరిజనులు ఆర్థికంగా బలపడతారన్నారు చంద్రబాబు. విద్యార్థులు చదువు, క్రీడలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని బాబు సూచించారు. గిరిజన విద్యార్థులు ఎవరెస్ట్‌ ఎక్కడం ఎంతో గర్వకారణమని... తల్లిదండ్రులందరూ విద్యార్థులను రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చేర్పించాలన్నారు చంద్రబాబు.

వర్నర్‌ అభినందన..
అరకు బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు. అరకులో నేచర్‌ క్యూర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు నరసింహన్‌. ఆదివాసీ దినోత్సవ వేడుకల సందర్భంగా గిరిజనులు చేసిన నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌, చంద్రబాబు కూడా గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో స్టెప్పులు వేశారు.

గులాబీ కూలీ పేరుతో నిధులు సేకరించిన టీఆర్ ఎస్:రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ, ఈసీ, ఏసీబీలకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. గులాబీ కూలీ పేరిట మంత్రులు బహిరంగ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టిఆర్ ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా గులాబీ కూలీ పేరుతో టిఆర్ ఎస్ మంత్రులు కోట్ల రూపాయలు నిధులు వసూలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ, ఈసీ, ఏసీబీలకు లేఖ రాశారు. ఈ వసూళ్ల పై విచారణ జరపాలని, చట్టపరంగా వారి పై చర్యలు తీసుకుని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని రేవంత్ ఫిర్యాదు చేశారు.

17:56 - August 9, 2017

వరంగల్ : వరంగల్‌ నిట్‌ విశ్వవిద్యాలయంలో వేల సంఖ్యలో విద్యార్థులు క్యాంపస్‌ రోడ్లపైకి వచ్చి ఉద్యమించారు. నిట్‌ డైరెక్టర్‌ విధానాలను, నిర్ణయాలను తప్పు పడుతూ విద్యార్థులు ధర్నాలు నిర్వహించారు. నిట్‌ పెద్దలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ విద్యార్థులు నిరసన తెలిపారు. నిట్‌లో ప్రతి ఏడాది అకాడమిక్‌ ప్రారంభమైన వెంటనే స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఈ ఏడాది ఎన్నికల కోసం నిట్‌ డైరెక్టర్‌ జీఆర్సీ రెడ్డి కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్టూడెంట్ కౌన్సిల్‌ ఎన్నికలకు సంబంధించి గతంలో లింగ్డో కమిటీ (సిజిపిఎ) కమ్యులేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ ఆవరేజ్‌ను 6.5 గా నిర్ణయించింది. దీని ప్రకారం స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరుగుతాయి. అయితే కొత్తగా నిట్‌ డైరెక్టర్‌ వేసిన కమిటీ మాత్రం సిజిపిఎను 7.5గా నిర్ణయించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మార్కులను 30 శాతం నుండి 35 శాతానికి పెంచింది. అలాగే విద్యార్థుల కాలేజి హాజరు శాతాన్ని 70 నుండి 75 కు పెంచింది. కొత్త నిబంధనలు లింగ్డో కమిటీకి వ్యతిరేకంగా ఉండటంతో ఆగ్రహించిన విద్యార్థులు, నిట్‌ డైరెక్టర్ జీఆర్సీ రెడ్డి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని క్యాంపస్‌లో ఐదు రోజుల పాటు ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు హమీ
నిట్‌ డైరెక్టర్‌ అందుబాటులో లేనప్పటికీ విద్యార్థులు కొత్త నిబంధనలపై తమ నిరసనలపై వెనక్కి తగ్గలేదు. ఈ విషయంపై వరంగల్ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి సహకారం అందించలేమని చేతులెత్తేశారు. దీంతో విద్యార్థులు ఎంహెచ్‌ఆర్డీ మినిస్టర్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు నిట్‌లో జరుగుతున్న కార్యకలాపాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. పాత విద్యార్థి నాయకులను తప్పించాలనే ఉద్యేశ్యంతోనే నిట్‌ డైరెక్టర్‌ కొత్త నిబంధనలను తీసుకువచ్చారని విద్యార్థులు ఆరోపించారు. కొత్త నిబంధనలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించడానికి వేల మంది విద్యార్థులు కదం తొక్కడంతో నిట్‌ డైరెక్టర్‌ స్పందించి, విద్యార్థి నాయకులతో చర్చలు జరిపారు. విద్యార్థుల డిమాండ్‌ మేరకు సిజిపిఎను 7.5 నుండి 6.5శాతానికి తగ్గించారు. మిగిలిన నిబంధనలకు కొనసాగిస్తామని విద్యార్థులకు హమీ ఇచ్చారు.

తగ్గకుండా పోరాడటం
నిట్‌ డైరెక్టర్‌ హమీతో శాంతించిన విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాల్ని నిలిపివేశారు. అయితే కౌన్సిల్‌ ఎన్నికల తర్వాత మిగిలిన నిబంధనలపై ఉద్యమించబోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నిట్‌ డైరెక్టర్‌ చర్యలకు వ్యతిరేకంగా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా పోరాడటం తాము సాధించిన విజయంగా విద్యార్ధులు చెప్పుకుంటున్నారు.  

17:55 - August 9, 2017

హైదరాబాద్ : కోఠిలో మేకరాజ్ భవన్‌ వద్ద ఏఎన్‌ఎంలు ఆందోళనకు దిగారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ. ఎంఆర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో 150 మంది ఏఎన్‌ఎంలను నిర్బంధించిన పోలీసులు... 40 మందిని అరెస్టు చేశారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

17:54 - August 9, 2017

నిర్మల్ : బాసర ఆలయ ఉత్సవ విగ్రహ తరలింపు వ్యవహారంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, స్థపతి ప్రణవ్ శర్మపై సస్సెన్షన్ వేటు వేశారు. విగ్రహ తరలింపు వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్‌ కుమార్‌పై ఆలయ ఈవో బాసర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

17:53 - August 9, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ అహంభావంతో ప్రతిపక్షాలపై అక్కసు వెళ్లగొక్కుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందని మాట్లాడడం సరికాదన్నారు. కేసీఆరే చట్టాలను ఉల్లంఘించి, ప్రాజెక్ట్‌లకు అడ్డంకులు సృష్టిస్తున్నారని.. దానిపై సమాధానం అడిగితే.. ప్రతిపక్షాలపై మండిపడుతున్నారని ఆయన అన్నారు.

17:52 - August 9, 2017

నిజామాబాద్ : ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని... తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.. రేపు శ్రీరాంసాగర్‌ పునర్జీవన పథకానికి శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్‌ వస్తున్నారని తెలిపారు.. ఈ పథకంద్వారా మూడు జిల్లాలు సస్యస్యామలవుతాయని పోచారం తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:51 - August 9, 2017

నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పునురుజ్జీవన పథకానికి గురువారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాలువల ఆధునీకరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం సఫలమైతే.. నిజామాబాద్ జిల్లా అన్నదాతల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తరచు తలెత్తుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం పేరిట.. ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. ప్రాజెక్టుతో పాటు.. దీనికిందనున్న కాలువల ఆధునికీకరణ పనులనూ ప్రభుత్వం చేపడుతోంది. దీనికి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం శంకుస్థాపన చేయనున్నారు.

పూడిక నిండిన ప్రాజేక్టు
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీస్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలు. అయితే.. ఎగువ ప్రాతాల నుంచి వచ్చే వరదనీటితో పాటు చెత్తాచెదారం కూడా చేరడంతో.. ప్రాజెక్టులో పూడిక భారీగా పేరుకుంది. ప్రస్తుతం 80.104 టీఎంసీల నీరే నిల్వ చేయగలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గడచిన యాభై సంవత్సరాల్లో దాదాపు 40 టీఎంసీల నీటి నిల్వను ప్రభావితం చేసే స్థాయిలో పూడిక చేరిందని సర్వేల ద్వారా తేలింది. పూడిక ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా ఆరు వరదగేట్లనూ ప్రాజెక్టులో భాగంగా డిజైన్‌ చేశారు. అయితే, వాటిని ఇంతవరకూ ఎత్తక పోవడంతో.. ఇప్పుడా గేట్లూ పూడికలో మూసుకుపోవడం గమనార్హం. ప్రాజెక్టు నుంచి పూడిక తీయడం కష్టసాధ్యం కావడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా.. కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌లో నింపడం పునరుజ్జీవ పథకం ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్‌కు నీటిని మళ్లించడానికి రూ.1067 కోట్లు.. కాలువల ఆధునీకరణ పనులకు మరో 8.63 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 58 వేల ఎకరాలకు నీరు అందుతుంది. పంటలకు నీరులేక అగచాట్లు పడ్డ రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది.

పునరుజ్జీవ పథకానికి పునాదులు
ఎస్పారెస్పీ వద్ద పునరుజ్జీవ పథకానికి పునాదులు వేసేందుకు బుధవారం రాత్రికే సీఎం కేసీఆర్ పోచంపాడు చేరుకుంటారు. గురువారం పథకం ప్రారంభోత్సవం అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే అధికారులు సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసారు. సభకు భారీగా జనాలు రానున్న నేపథ్యంలో వారిని తరలించేందుకు వేలాదిగా బస్సులను వినియోగిస్తున్నట్లు సమాచారం. 

పొన్నం ప్రభాకర్ దీక్ష విరమణ...

కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రిలో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ దీక్ష విరమించారు. పొన్నంకు మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న పొన్నం ప్రభాకర్‌ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. దీక్షాస్థలి నుంచి నేరుగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే పొన్నం మాత్రం వైద్యానికి నిరాకరించారు. కరీంనగర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని పొన్నం తేల్చిచెప్పిన విషయం విధితమే. అయితే ప్రభాకర్ ఎట్టకేలకు బుధవారం దీక్షను విరమించారు.

17:50 - August 9, 2017

ఖమ్మం : నగరంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల డివిజన్లలో మురికి కాలువలు పొంగిపొర్లాయి.. రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రభుత్వ కార్యాలయంల్లోకి నీరు చేరింది. వాన కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

 

17:49 - August 9, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. నేరెళ్ల ఘటనతో పాటు.. అనేక అంశాలపై తన మనసులోని మాటలు చెప్పారు. నేరెళ్లలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు కేటీఆర్‌. బాధితులను చూస్తుంటే ఈ విషయం అర్ధమవుతుందని... పూర్తి నివేదిక వచ్చిన తర్వాత బాధితులను కొట్టిన పోలీసులపై చర్యలు ఉంటాయన్నారు. ఇక ఈ ఘటనలో బాధితులను రిమాండ్‌కు తరలించే వరకు తనకు ఈ విషయం తెలియదని.... వాహనాలు తగలబెట్టిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా మారిందన్నారు. ఇదిలావుంటే తాము ఎవరినీ కొట్టమని చెప్పలేదని... అసలు ఈ ఘటనలో దళిత కోణం లేదన్నారు కేటీఆర్‌. ఇసుకతో ప్రభుత్వానికి లాభం వస్తుంటే... ప్రతిపక్షాలు మాఫియా ఉందనడం అర్ధం లేదన్నారు. ప్రతిపక్షాలకు పని లేక... ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు.

 

17:48 - August 9, 2017

హైదరాబాద్ : విక్రమ్‌గౌడ్‌ ఒక్కరోజు పోలీస్‌ కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టు అనుమతితో విక్రమ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు కాల్పుల ఘటనపై అనేక వివరాలు ఆరా తీశారు. కాల్పులకు ఉపయోగించిన వెపన్‌ ఎక్కడి నుంచి వచ్చింది.... కొనుగోలు చేసిన 20 బుల్లెట్లలో మిగతా 17 బుల్లెట్లు ఏమయ్యాయనే అంశాలపై విచారించారు. సాయంత్రం వరకు విచారించేందుకు సమయం ఉన్నప్పటికీ మూడున్నర గంటల పాటే విచారించిన పోలీసులు... అనంతరం విక్రమ్‌గౌడ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనలో మరో ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు.

17:47 - August 9, 2017

తూర్పు గోదావరి : కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ ఎన్నికల్లో CPM నుంచి మాజీ సైనికుడు తిరుమలశెట్టి నాగేశ్వరరావు బరిలోఉన్నారు.. ఆర్మీలో కెప్టెన్‌గా రిటైర్‌అయిన తిరుమలశెట్టికి మద్దతుగా పార్టీ నేతలు కాలనీలన్నీ చుట్టేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

17:46 - August 9, 2017

విశాఖ : అరుకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడానికి తాను అండగా ఉంటానని తెలిపారు. కూచిపూడి తర్వాత థింసా నృత్యానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. మరోవైపు అరకులో 5 లక్షల ఎకరాల్లో కాఫీ పంటలు పండించాలన్నారు. మిరియాలు, కాఫీ సహపంటలుగా పండిస్తే ఎకరానికి 70 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

 

లోయలో పడ్డ టెంపో: 9మంది మృతి

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ప్రయాణికులను బుధాన్‌ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది. సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నేరేళ్ల ఘటనలో పోలీసులది ఓవర్ యాక్షన్ : కేటీఆర్

హైదరాబాద్: నేరెళ్ల దళితులను కొట్టమని పోలీసులకు చెప్పలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ...నేరెళ్లలో బాధితుల దెబ్బలు చూశాక పోలీసుల ఓవర్ యాక్షన్ అని స్పష్టమైందని తెలిపారు. నేరెళ్ల ఘటనలో దళిత కోణం లేదు, నేరెళ్లకు పొలిటికల్ టూరిస్టులు ఎక్కువయ్యారు, అందుకే నేను ఆలస్యంగా వెళ్లా అని చిట్ చాట్ కేటీఆర్ తెలిపారు. వాహనాలను తగలబెట్టాకే విషయం సీరియస్ అయ్యిందన్నారు. బాధితులు రిమాండ్ అయ్యే వరకూ నాకు తెలియదన్నారు. నా తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం అన్నారు. హిమాన్షు సంస్థను ఎమ్మెల్యే అయ్యాక వదిలేశా అన్నారు. సంస్థ ఉంది కాబట్టే అఫిడవిట్ లో చూపానన్నారు.

నేరెళ్ల బాధితుల తరపున హైకోర్టులో విచారణ వాయిదా...

హైదరాబాద్: నేరెళ్ల బాధితుల తరపున హైకోర్టులో పౌర హక్కుల సంఘం పిటిషన్ దాఖలు అయ్యింది. సిరిసిల్ల ఎస్పీ వివ్వజిత్ పై చర్యలు తీసుకోవాలని నేరెళ్ల ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన నేరెళ్ల బాధితులకు వరంగల్ ఎంజీఎం వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించాలని రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. వచ్చే మంగళవారంలోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. నేరెళ్ల ఘటనలో బాధితుల ఆరోగ్యం బాగా క్షీణిస్తే వెంటనే నిమ్స్ కు తరలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

17:31 - August 9, 2017

కర్నూలు : జిల్లా గూడురులోమ విషాదం నెలకొంది. ఆగస్టు 15వేడుకల సందర్బంగా నిర్వహించిన ఆటల పోటీల భాగంగా పరుగు పందెంలో పాల్గొన్న దస్తగిరి అనే విద్యార్థి పరుగెడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపు దస్తగిరి మృతి చెందాడు. దస్తగిరి ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

సామాజిక తెలంగాణ కోసం టీమాస్ కృషి చేస్తోంది: తమ్మినేని

రంగారెడ్డి: ప్రజలు, ప్రజాసంఘాలు ఏకతాటిపైకి వచ్చి దొరల పాలనను అంతమొందించాలని సీపీఎం నేత తమ్మినేని పిలుపునిచ్చారు. మంత్రి పదవి పోతుందనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతన్నారని మండిపడ్డారు. కేటీఆర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థ వివరాలను ఎన్నికల కమిషన్ కు ఇచ్చామన్నారు. కేటీఆర్ మంత్రి పదవి పోవడం ఖాయమన్నారు. సామాజిక తెలంగాణ కోసం టీమాస్ కృషి చేస్తోందన్నారు.

మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు యత్నం: జగన్

నంద్యాల: ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. ఆయన నంద్యాల బై పోల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే సీఎం స్థానంలో నేనే ఉండేవాడినని జగన్ జోశ్యం చెప్పారు.

వేధింపుల కేసులో హర్యానా బిజెపి చీప్ కుమారుడు అరెస్ట్....

చండీగఢ్: యువతిని కారులో వెంబడించి వేధించిన కేసులో హర్యానా బిజెపి చీఫ్ బరాలా కుమారుడు వికాస్ అరెస్టు అయ్యాడు. తన కుమారుడి పై వేధింపుల కేసు బరాలా స్పందించారు. నేరం చేసిన వారిక శిక్ష పడాల్సిందే అని అది నా కుమారుడైన సరే అని తెలిపారు.

16:15 - August 9, 2017

కర్నూలు : జిల్లా నంద్యాల ఉపఎన్నికల్లో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ రోడ్డు షో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక ధర్మనికి అధర్మనికి మధ్య పోరాటమని అన్నారు. తనకు ఉన్న ఆస్తి వైఎస్ అభిమానం మాత్రమే అని జగన్ అన్నారు. చంద్రబాబు మాదిరిగా తన వద్ద పోలీసుల బలం లేదని, అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే గుణం తనకు లేదని ఆయన విమర్శించారు. మురింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

ముగిసిన విక్రమ్ గౌడ్ పోలీస్ కస్టడీ

హైదరాబాద్: కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ పోలీసు కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.తన పై కాల్పులు జరిపించుకునేందుకు విక్రమ్ గౌడ్ రూ. 50 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నాడు. తొలివిడదగా రూ. 13.5 లక్షలు సుపారీ గ్యాంగ్ కు విక్రమ్ గౌడ్ ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. రూ. 4 లక్షలు ఏ-2 నందాకు విక్రమ్ గౌడ్ ఇచ్చారు. రూ. 4 లక్షలను బెయిల్ ఖర్చుల కోసం వాడుకోవాలని సుపారీ గ్యాంగ్ కు విక్రమ్ గౌడ్ సూచించారు. సుపారీ గ్యాంగ్ తో కుదిరిన డీల్ ప్రకారం రూ. 50 లక్షలు విక్రమ్ ఎక్కడి నుంచి సమకూర్చుకున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

ఎదరు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ : పూల్వామా జిల్లా త్రాల్ లో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 216 పాయింట్ల నష్టంతో 31,798 వద్ద సెన్సెక్స్, 70 పాయింట్ల నష్టంతో 9,908 వద్ద నిఫ్టీ ముగిశాయి.

 

15:53 - August 9, 2017

చంఢీఘడ్ : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూతుర్ని వెంబడించిన భయాందోళనకు గురిచేసిన కేసులో హరియాణా బిజెపి చీఫ్ సుభాష్‌ బరాలా వికాస్‌ బరాలాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి వికాస్‌ బరాలా పోలీసుల ముందు హాజరయ్యాడు. ఈ కేసులో బరాలాను పోలీసులు విచారించనున్నారు. బాధితురాలిని వెంబడించిన దారిలో 5 ప్రదేశాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. వికాస్‌ బాధితురాలి కారును వెంబడించి వేధింపులకు గురిచేసినట్లు ధ్రువీకరించారు. దీంతో వికాస్‌ బరాలాకు పోలీసులు మంగళవారం సమన్లు జారీ చేయడంతో ఆయన పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. వికాస్‌ బరాలా కారు తనని ఐదు కిలోమీటర్ల వరకు వెంబడించారని, ఆ సమయంలో తాను భయాందోళనకు గురయ్యానని ఐఏఎస్‌ అధికారి కూతురు వర్ణికా కుందూ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో గత శనివారం వికాస్‌, అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. అదే రోజు వారంతా బెయిల్‌పై విడుదలయ్యారు.

15:50 - August 9, 2017

విజయనగరం : కన్నతల్లి పాషాళ హృదయురాలైంది. 14 ఏళ్లబాలుడికి వాతలు పెట్టింది.. విజయనగరం బూడివీధిలో మురళి, సీత నివాసం ఉంటున్నారు.. వీరికి 14ఏళ్లక్రితం వివాహమైంది.. వీరికి ఓ బాబుకూడా ఉన్నాడు.. కుటుంబకలహాలతో ఈ దంపతులు రెండేళ్లక్రితం విడిపోయారు.. చిన్నారిమాత్రం తండ్రిదగ్గరకు తరచూ వెళ్లేవాడు.. ఇదిచూసి ఆగ్రహించిన తల్లి కన్నకొడుకు అని కూడా చూడకుండా బాలుడికి వాతలుపెట్టింది.. వాతలతో ఒళ్లంతా గాయాలపాలైన బాధితుడు తండ్రికి విషయంచెప్పాడు.. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..

 

15:49 - August 9, 2017

గుంటూరు : జిల్లా... దాచేపల్లి మండలం భట్రుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. సరస్వతీ బాయ్‌ అనే వివాహిత హత్యకు గురైంది. అయితే భర్త కృష్ణనాయక్‌కే ఆమెను కొట్టి చంపాడని ... బంధువులు ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా సరస్వతీ బాయ్‌...అతని భర్త కృష్ణ నాయక్‌ మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న సరస్వతీ బాయ్‌ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో.. పొలానికి వెళ్తున్న ఆమెను...భర్తే బండరాయితో కొట్టి...హత్య చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

15:48 - August 9, 2017

అనంతపురం : జిల్లా.. కదిరి.. సింహకోటలో తొలిసారి భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌ నిర్మాణంలో ఉన్న... విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ... మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. 

15:47 - August 9, 2017

అనంతపురం : జిల్లా పామిడి మండలంలో భారీవర్షం హోరెత్తిపోయింది.. తెల్లవారుజామునుంచి ఎడతెరిపిలేకుండా కురిసినవర్షంతో నీలూరు, దేవరపల్లి, ఖదర్‌పేట గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి.. భారీగా వరదనీరు చేరడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.

15:45 - August 9, 2017

కర్నూలు : ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదని... వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు.. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు ఇప్పుడు చంద్రబాబు నంద్యాలకొచ్చారని మండిపడ్డారు.. ఉప ఎన్నికలప్రచారం కోసమే మంత్రులంతా నంద్యాలకొచ్చారని.. ఎన్నిక లేకపోతే వచ్చేవారా? అని ప్రశ్నించారు.. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జగన్‌ రైతు నగర్‌లో రోడ్‌ షో నిర్వహించారు.

వివాహితపై ఆత్మాచారం, హత్యచేసి....

నెల్లూరు: వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో పట్టపగలే దారుణం జరిగింది. లక్ష్మీ ఆశా జ్యోతి అనే వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి అనంతరం నగలతో దుండగులు పరారాయ్యారు.

15:31 - August 9, 2017

నెల్లూరు : జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు లక్ష్మీ ఆశా జ్యోతి అనే వివాహిత పై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. దుండగులు మహిళను తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:18 - August 9, 2017

వరంగల్ : జిల్లాలోని వర్ధన్నపేటలో మంత్రాల నెపంతో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద సామూహిక క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ఐదుగురు మహిళలు, ఓ పురుషున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసలు వారిని అరెస్ట్ చేశారు. కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు ఏదో సోకిందని, గర్భం దాల్చడం లేదనే సాకుతో క్షుద్రపూజలు ఓ ప్రబుద్ధుడు క్షుద్రపూజలు చేస్తామని చెప్పడంతో నమ్మిన అమాయకులు క్షుద్రపూజ కోసం వచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:17 - August 9, 2017

హైదరాబాద్ : తనపై తను కాల్పులు జరిపించుకున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఒక రోజు పోలీసుల కస్టడీ ముగిసింది. కాల్పుల ఘటనలో విచారణ నిమిత్తం విక్రమ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు విక్రమ్ గౌడ్ మూడు గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం ఆయనను వైద్యపరీక్షల కోసం అపోల ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత విక్రమ్ ను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

12 ఏళ్ల తర్వాత 'ఈ' కేసులో తీర్పు

హైదరాబాద్: బేగంపేట టాస్క్ ఫోర్క్ కార్యాలయంలో బాంబు పేలుడు కేసులో రేపు తుది తీర్పు వెల్లడి కానుంది. 12 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. 2005లో అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై దా చేసిన హర్హతుల్ జీహాద్ ఇస్లామి బంగ్లాదేశ్ సంస్థ.

14:58 - August 9, 2017

ప్రస్తుతం ఉన్న పరిస్థితులో కుటుంబవ్యవస్థ కుచించకపోతుంది. మేము, మనం అనే ఫిలింగ్స్ నుంచి నేను నాది అనే ఫిలింగ్స్ చేరింది. అందులోను వివాహవ్యవస్థ మరి ఆధ్వనంగా మారి పోయింది. విడాకుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. విడాకుల సంఖ్య ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి...? ఎందుకు ఈ వ్యవస్థ ఈవిధంగా ముందుకెళ్తుతోంది. దీనిపై ప్రముఖ న్యాయవాది పార్వతితో మానవి మై రైట్.....పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

 

14:54 - August 9, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా..లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్యమంపై ప్రస్తావించారు. జీవింతంలో మంచి పరిణామాలను స్మరించుకోలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో జైలు జీవితం గడిపారన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేసినట్లు చెప్పారు. గాంధీజీ సందేశంతో అందరూ ఏకమయ్యారని.. ఆయన శాంతియుత ఉద్యమంతోనే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. చరిత్రాత్మక ఘటనలను యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. 

14:52 - August 9, 2017

ముంబై : ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని కోరుతూ మరాఠా సామాజిక వర్గం ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించింది. మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో భాయఖ్‌లా జూ నుంచి ఆజాద్‌ మైదాన్‌ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో సుమారు 6 లక్షల మంది మరాఠాలు పాల్గొన్నారు. దీంతో ముంబై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రిజర్వేషన్ల కోసం గత ఏడాది సెప్టెంబర్‌-అక్టోబర్‌లో మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లతో పాటు గత ఏడాది అహ్మద్‌నగర్‌లోని కోపర్దిలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌, హత్యకు పాల్పడ్డవారిని ఉరిశిక్ష వేయాలని మరాఠాలు డిమాండ్‌ చేస్తున్నారు. మరాఠా క్రాంతి మోర్చా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించింది. మరాఠాల ఉద్యమం వెనక రాజకీయ ప్రముఖులు ఎవరూ లేకపోవడం గమనార్హం. 

14:51 - August 9, 2017

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కేటీపీఎస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యకు నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్య చేసుకున్న నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికలు డిమాండ్‌ చేస్తున్నారు. కార్మికులకు సంఘీభావంగా వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అఖిలపక్షనేతలను అరెస్టు చేసి దమ్మపేట, అశ్వారావుపేట పీఎస్‌లకు తరలించారు. 15ఏళ్లుగా కేటీపీఎస్‌ లో పనిచేస్తున్నా తన పేరును క్రమబద్ధీకరణ లిస్టులో చేర్చలేదని కాంట్రాక్టు కార్మికుడు కే. నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగేశ్వరరావు ఆత్మహత్యకు కేటీపీఎస్‌ అధికారులే కారణం అంటూ ఆందోళనకు దిగారు. నాలుగు నెలల సీనియార్టీ ఉన్న వారికి కూడా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసిన అధికారులు.. 15ఏళ్లుగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు అన్యాయం చేశారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

14:49 - August 9, 2017

పశ్చిమ గోదావరి : స్నేహితురాలిని సామాజిక మీడియాలో వేధిస్తున్న కీచకుడిని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాసెంటర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌రహీమ్‌..తనతో పాటు పీజీ చేస్తున్న కోవెలగుడి ప్రాంతానికి చెందిన యువతితో స్నేహం చేశాడు. అప్పటికే పెళ్లి చేసుకున్న అతడు.. రెండో పెళ్లి చేసుకుంటానని యువతిని ట్రాప్‌ చేశాడు. మాయమాటలు చెప్పి వాంఛలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఏకాంతంగా ఉన్న ఫోటోలను కుటుంబ సభ్యులు, బంధువుల వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు పోస్ట్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీంతో బాధితురాలు మంగళవారం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా..స్థానికులు ఆమెను రక్షించారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడిని కటకటాల్లోకి నెట్టారు. నిర్భయ సహా 18 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

14:48 - August 9, 2017

హైదరాబాద్ : కుండపోత వర్షాలు హైదరాబాద్‌ను కుదిపేశాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, మెహిదీపట్నం, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మరోవైపు హుస్సేన్‌సాగర్‌కు పలు వైపులనుంచి వరదనీరు పోటెత్తింది. దీంతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేని వర్షంతో నగరంలో జనజీవనం స్తంభించింది. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్, చైతన్యపురి, సరూర్‌నగర్, హయత్‌నగర్, వనస్థలిపురంలో స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు నానా పాట్లు పడ్డారు. అటు ఉద్యోగులకు ఇదే పరిస్థితి ఎదురైంది.

ప్రధాన కూడళ్లలో నిలిచిన ట్రాఫిక్
మల్లాపూర్‌, తార్నాక, లాలాపేట్‌, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, మోండా మార్కెట్‌, పార్శీగుట్ట, వారాసిగూడ, చిలకలగూడ, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బాగ్‌లింగంపల్లి, నల్లకుంట, విద్యానగర్‌, బాగ్‌ అంబర్‌పేట్‌, మలక్‌పేట, అబిడ్స్, ముసారాంబాగ్, పాతబస్తీ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై నీరు వచ్చిచేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. పంజాగుట్ట, కాచిగూడలో సహాయక పనులను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. ఎల్బీనగర్‌లో 5.4, ఆస్మాన్‌గడ్‌లో 4.8, నారాయణగూడలో 4.6, నాంపల్లిలో 4.2, ఆసిఫ్‌నగర్‌లో 4.2 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

14:46 - August 9, 2017

హైదరాబాద్ : తెలంగాణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగుతుందని గిరిజన సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ సచివాలయం ముందు గిరిజన సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు.

విక్రమ్ గౌడ్ పోలీసుల విచారణకు లంచ్ బ్రేక్

హైదరాబాద్: కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ పోలీసుల విచారణకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తనపై కాల్పులు జరిపించుకునేందుకు రప. 50 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నట్లు విక్రమ్ గౌడ్ తొలి విడతగా రూ. 13.5 లక్షలు సుపారీ గ్యాంగ్ కు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

వర్ధన్న పేటలో క్షుద్ర పూజలు చేస్తున్న ముఠా అరెస్ట్....

వరంగల్: వర్ధన్న పేటలో మూఢనమ్మకాలు రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఐదుగురు మహిళలు, ఓ వ్యక్తితో కలిసి నగ్నంగా పూజలు చేస్తున్నారు. పెళ్లయిన జంటలకు ఏదో సోకిందని మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలతో నయం చేస్తానని మోసపు మాటలు చెప్పి క్షేద్ర పూజలు చేశాడు. క్షుద్ర పూజల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బాధితులు మహబూబాబాద్ జిల్లా వరంగల వాసులని తెలుస్తోంది. బాధితుల్లో జైలు శాఖ వార్డర్ భార్య కూడా ఉన్నట్లు సమాచారం.

8వ తరగతి విద్యార్థి గుండె పోటుతో మృతి

కర్నూలు : గూడురు జెడ్పీ హైస్కూల్ లో ఆగస్ట్ 15 సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. పరుగు పందెంలో 8వ తరగతి విద్యార్థి గుండె పోటుతో మృతి చెందారు.

 

అరసవెల్లి ఆలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం

శ్రీకాకుళం:అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారు. ఇద్దరు ప్రైవేటు లెక్కింపు దారులు రూ.35 వేలు దొంగిలించారు..

ప్రతి గిరిజన ఇంటికి 75 యూనిట్ల ఉచిత కరెంటు:చంద్రబాబు

విశాఖ : ఏజెన్సీలో ప్రతి గిరిజన ఇంటికి 75 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అరకులో ప్రపంచ ఆదివాసుల దినం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ ఆరోగ్య వెబ్ సైట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీసీసీ సబ్బుల ఫ్యాక్టరీలో కనీస వేతనం రూ.6 వేలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి సేద్యం పై గిరిజనులు దృష్టి పెట్టాలని, 5లక్షల ఎకరాల్లో కాఫీ, మిరాయల పంటలు పండించాలని సూచించారు.

విజయవాడ కౌన్సిల్ రసాభాస

విజయవాడ : నగర కౌన్సిల్ రసాభాస అయ్యింది.పార్టీ కండువాలతో వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ హాల్లోకి రావడం పై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. టిడిపి కార్పొరేటర్లు పచ్చ చొక్కాలతో ఎందుకు వచ్చారని వైసీపీ ఎదురు దాడి చేశారు. దీంతో టిడిపి, వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో కౌన్సిల్ ను 45 నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు.

నెహ్రూ పేరును మోదీ ప్రస్తావించకపోవడం దురదృష్టకరం: ఉత్తమ్...

హైదరాబాద్: క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ జాతీయ నేతలు జైలుకెళ్లారని, 14 ఏళ్లు జైల్లో ఉన్న నెహ్రూ పేరు మోదీ ప్రస్తావించకపోవడం దురదృష్టకరం అని టీ. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ వేదిక నుండి క్విట్ ఇండియా ఉద్యమం పురుడు పోసుకుందని ఉత్తమ్ కుమార్ తెలిపారు.

13:49 - August 9, 2017

సంగారెడ్డి : జిల్లాలో రైతుల భూములు లాక్కొనేందుకు రంగం సిద్ధమైంది. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం ఆర్‌సీ పురం మండలం కొల్లూరులోని రైతుల భూములపై ప్రభుత్వ కన్ను పడింది. రెండు పంటలు పండే భూములను సేకరించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తేలేదని రైతులు తెగేసి చెబుతున్నారు. పక్కనే ఉన్న బీడు భూములను లాక్కోవాలని సూచిస్తున్నారు. కొల్లూరు రైతుల ఆవేదనపై 10టీవీ కథనం...
రైతుల భూమిపై ప్రభుత్వ కన్ను
సీఎం కేసీఆర్‌ స్వంత జిల్లాలో అధికారుల భూదాహం తీరలేదు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాలు లాక్కొంటూనే ఉన్నారు. అరకొర పరిహారం ఇస్తూ రైతుల విలువైన భూములను బలవంతంగా లాక్కొంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి పుడమిని వేరుచేస్తున్నారు.  నిన్నమొన్నటి వరకు మల్లన్నసాగర్‌ పేరుతో రైతులను భయబ్రాంతులకు గురిచేసి వారి నుంచి భూములను లాక్కొన్న సర్కార్‌... ఇప్పుడు ఆర్‌.సీ.పురం మండలం కొల్లూరులోని రైతులు భూములపై కన్నేసింది.  కొల్లూరు రైతుల భూములను లాక్కోవడానికి రంగం సిద్ధమైంది. 
కొల్లూరు భూముల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మాణం
ఇళ్లులేని పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామంటూ కేసీఆర్‌ ఎన్నికల్లో హామీలు గుప్పించారు. మూడేళ్లైనా ఇంతవరకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల ఊసే లేదు. విపక్షాల నుంచి విమర్శల దాడి పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల స్కీమ్‌పై దృష్టి సారించింది. రాజధాని నగరం హైదరాబాద్‌లోని పేదలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు సిటీలో ఖాళీస్థలం దొరకకపోవడంతో అధికారుల కన్ను కొల్లూరుపై పడింది. కొల్లూరు నుంచి గచ్చిబౌలికి వెళ్లే అవుటర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని ఉన్న సర్వేనంబర్‌ 203లోని 96 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అవుటర్‌ రింగ్‌రోడ్డుకు 50 అడుగుల ఎత్తులో ఈ భూములు ఉండడంతో బహుళ అంతస్థుల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు తేల్చారు.  ఒక్కో భవనం 9 అంతస్థుల్లో నిర్మించాలని నిర్ణయించారు. 70 ఎకరాల్లో భవనాలు, మిగిలిన 26 ఎకరాల్లో పార్కులు, పాఠశాలలు, ఆలయాలు నిర్మించాలని అంచనా వేస్తున్నారు. 
భూమిపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం అధికారులు సమీకరించాలనుకుంటున్న భూములు బీడు భూములు కావు. ఈ భూముల్లో  సంవత్సరానికి రెండు పంటలు పండుతున్నాయి. సాగునీరు పుష్కలంగా ఉన్న ప్రాంతం. రైతులు భూములనే నమ్ముకుని జీవిస్తున్నారు. ఏడాదికి రెండు పంటలు తీస్తూ ఉన్నంతలో ఏకష్టాలు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా ప్రభుత్వం ఈ భూములు తీసేసుకుంటోందని తెలియడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 
కొల్లూరు భూములకు యమా డిమాండ్‌ 
ప్రస్తుతం కొల్లూరు రైతుల భూములకు మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంది. ఇక్కడ ఎకరం భూమి  4 నుంచి 5 కోట్ల రూపాయలకుపైబడి పలుకుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం వారికి ఎకరాకు కేవలం 35 లక్షల పరిహారం ఇస్తామని చెబుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేప్రసక్తేలేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వానికి అంతలా అవసరమైతే తమ భూముల పక్కనే బీడు భూములు ఉన్నాయని... వాటిని తీసుకోవాలని కోరుతున్నారు.
కొల్లూరు రైతులకు అండగా సీపీఎం
పూర్తిగా సాగుకు యోగ్యమైన భూములను తీసుకొని రైతుల  పొట్టకొట్టేందుకు ప్రభుత్వం పూనుకుందని సీపీఎం నేతలు మండిపడుతున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొంటే చూస్తూ ఊరుకోబోమని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి భీరం మల్లేష్‌ అన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు. వారి నుంచి భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే  ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొల్లూరు రైతులు తమ భూములు ఇవ్వబోమంటూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇతర భూములను ప్రభుత్వం వెతుక్కోవాలని కోరారు.  మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
 

 

13:42 - August 9, 2017

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో వీధిలైట్లు మెయిన్‌టైన్‌ చేసే కార్మికుల ఆందోళన బాటపట్టారు. ఎల్‌ఈడీ లైట్ల పేరుతో తమ ఉపాధిని దెబ్బకొడుతున్నారంటూ నిరసన తెలుపుతున్నారు. ఎంత వేతనం ఇస్తారో చెప్పకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి మృతి..

భద్రాద్రి కొత్తగూడెం: కొత్త‌గూడెం చాత‌కొండ పంచాయితీ ప‌రిధిలోని కిసాన్ న‌గ‌ర్ లో విషాదం చోటు చేసుకున్న‌ది. క‌రెంట్ షాక్ తో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. కిసాన్ న‌గ‌ర్ కు చెందిన ఇనుముల పురుషోత్తం (37) పొలం వ‌ద్ద మోట‌ర్ వేయ‌డానికి వెళ్లాడు. మోట‌ర్ వేస్తుండ‌గా క‌రెంట్ షాక్ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలొదిలాడు పురుషోత్తం. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

13:40 - August 9, 2017

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్ వీధుల్లో ప్రతీ రాత్రి వెలుగులు నింపేది వాళ్లే. రోజులో పద్దెనిమిది గంటలు వాళ్లు పని చేస్తేనే నగరంలో వెలుగు వస్తాయి. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌ వస్తోంది ఇక మీ అవసరం లేదంటున్నాయి బల్దియా వర్గాలు. ఎల్‌ఈడీ ప్రాజెక్ట్ పేరుతో.. తమ జీవనోపాధిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారంటోన్న కార్మికుల ఆవేదనపై ప్రత్యేక కథనం. 
గ్రేటర్‌లో 4 లక్షల 60 వేల వీధి లైట్లు 
గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో 4 లక్షల 60 వేల వీధి లైట్లు ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్‌ కోసం జీహెచ్‌ఎంసీ ప్రతీ యేటా 300 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ వీధి దీపాలను నేరుగా మెయింటెయిన్‌ చేస్తోంది. అవసరమైన మెటీరియల్‌ను కొని.. ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ద్వారా వాటిని పర్యవేక్షిస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం జీహెచ్‌ఎంసీలో ఎల్‌ఈడీ బల్బ్‌లను ఏర్పాటు చేయాలని బల్దియా అధికారులు డిసైడ్ చేశారు. దాంతో విద్యుత్‌ చార్జీలు భారీగా తగ్గించాలని ప్లాన్‌ చేశారు. 
751 మంది ఉద్యోగులు ఆందోళన
ఇదంతా బానే ఉన్నా.. ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను ఇక వద్దు పొమ్మంటున్నారు. తమకు ఎక్కువ సిబ్బంది అవసరం లేదంటూ ఎల్‌ఈడీ ప్రాజెక్ట్‌ నిర్వహకులు తేల్చి చెబుతున్నారు. దాంతో ఇప్పటి వరకు మెయింటెనెన్స్‌ విభాగంలో పని చేస్తోన్న 751 మంది ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు 1200 నుండి 1500 లైట్స్‌ను ఒక ఎలక్ట్రిషియన్‌, హెల్పర్‌ రోజూ పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఆరు టీమ్‌లకు కలిపి ఒక సూపర్‌ వైజర్‌ ఉంటారు. ఒక్కో టీమ్‌కు ప్రతీ రోజు 15 నుండి 20 వరకు కంప్లైంట్స్‌ వస్తాయి. అయితే వీటన్నింటినీ రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చూస్తారు. సాయంత్రం ఆరు గంటలకు వీధి దీపాలను ఆన్‌ చేసి.. 8 గంటల వరకు పర్యవేక్షిస్తారు. ఇప్పుడు ఎల్‌ఈడీ ప్రాజెక్ట్‌లో ఒక్క టీమ్‌ 4 వేల లైట్స్‌ను అటెంప్ట్‌ చేయాలని డిసైడ్ చేశారు. దాంతో తాము ఎలా పని చేయగలుగుతామని కార్మికులు అంటున్నారు. పూర్తి స్థాయి ఒప్పందాలు చేసుకోకుండా అధికారులు తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీనే నమ్ముకొని ఎంతోకాలంగా పని చేస్తున్న తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తే.. చివరికి ఇబ్బందులొచ్చాయని కార్మికులు ఆవేదనకు గురవుతున్నారు. 
కార్మికుల ఆందోళన 
జీహెచ్‌ఎంసీలో వీధిలైట్లు మెయిన్‌టైన్‌ చేసే కార్మికుల ఆందోళన బాటపట్టారు. ఎల్‌ఈడీ లైట్ల పేరుతో తమ ఉపాధిని దెబ్బకొడుతున్నారంటూ నిరసన తెలుపుతున్నారు. ఎంత వేతనం ఇస్తారో చెప్పకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు అంటున్నారు. 

 

13:33 - August 9, 2017

విశాఖ : అరకుకు చాలా భవిష్యత్ ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాల్లో పాల్గొని, మాట్లాడారు. ఇక్కడున్న వనరులను ఉపయోగించుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అరకులో మంచి మెడికల్, హెల్త్ హబ్ గా తయారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అరకులో టీటీడీ దేవాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. రూ.200రూపాయలతో ఇంటర్నెట్, టివి, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

 

సచివాలయ ముట్టడికి గిరిజన సంఘాల యత్నం...

హైదరాబాద్:తెలంగాణ సచివాలయ ముట్టడికి గిరిజన సంఘాలు యత్నించాయి. 9 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.

13:14 - August 9, 2017

హైదరాబాద్ : క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై తెలంగాణ టీడీపీ నేతలు కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీలను నియమించడంపై దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విధానాలపై పోరుచేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న టీటీడీపీ నేతల యాక్షన్‌ప్లాన్‌పై 10టీవీ కథనం.
పార్టీ బలోపేతానికి కసరత్తు 
2019 సార్వత్రిక ఎన్నికల కోసం టీ టీడీపీ నేతలు పార్టీని సన్నద్ధం చేసే పనిలో పడ్డారు.  క్షేత్ర స్థాయి నుండి పార్టీని బ‌లోపేతం చేసేందుకు  క‌స‌ర‌త్తు  మొద‌లు పెట్టారు.  తెలంగాణా లోని అన్ని నియోజ‌క వ‌ర్గాలకు ఇన్‌చార్జీలను నియమించడంతోపాటు... గ్రామ, మండ‌ల, డివిజ‌న్ స్థాయి ప‌రిశీల‌కుల పేర్లపై సమాలోచనలు జరుపుతోంది. గెలవడానికి అవకాశం ఉన్నచోటల్లా అంకితభావంతో పనిచేసే వారికి చాన్స్‌ ఇవ్వాలని టీ టీడీపీ ముఖ్యనేతలు భావిస్తున్నారు. 50 నియోజకవర్గాల్లో చురుకైన యువతకు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 
ఎన్నికల యాక్షన్‌ప్లాన్‌పై అధిష్టానం దృష్టి 
సార్వత్రిక ఎన్నికలకు యాక్షన్‌ప్లాన్‌ను రెడీ చేయడంపై అగ్రనాయకత్వం దృష్టిపెట్టింది.  ఇప్పటి వరకు చేసిన ప్లాన్‌ను, ఎక్సైర్‌సైజ్‌ను  అధినేత చంద్రబాబుకు వివరించేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిపిన ప్రజాపోరు యాత్రలు, రైతు గర్జనసభలు, మిర్చి రైతులకు మద్దతుగా చేసిన పోరాటాలను వివరించనున్నారు.  సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితుల సమస్యపై పార్టీ తీసుకున్న లైన్‌, వారిని పరామర్శించిన వివరాలు, డ్రగ్స్‌ మాఫియాకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను అధిష్టానానికి వివరించాలని భావిస్తున్నారు.
టీ. సర్కాన్‌ను ఎదుర్కొనేలా కార్యాచరణ 
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో సమర్థవంతంగా ఎండగట్టేందుకు కూడా టీటీడీపీ కార్యాచరణ రూపొందిస్తోంది.  నకిలీ విత్తనాలు, వర్షాభావ పరిస్థితులు, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రుణమాఫీతోపాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలని డిసైడ్‌ అయ్యింది. దళితులపట్ల జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఉద్యోగ నియామకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి,అక్రమ ఇసుక వ్యాపారం, మియాపూర్‌ ల్యాండ్‌స్కామ్‌, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, గల్ఫ్‌ బాధితులకు చేయూత అందించడంలాంటి అంశాలపట్ల లోతుగా అధ్యయనం చేసి.. వాటిని ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విధానాలు ఎండగడుతూనే మరోవైపు పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. మరి తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించనున్న ఉద్యమాలు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచి చూడాలి.

13:12 - August 9, 2017

మీడియా..సమాజంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది..సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకం. ఏ రంగంలోనైనా తప్పొప్పులు.. అన్యాయాలు.. ఆక్రమాలు.. దారుణాలను బాహ్య ప్రపంచానికి తెలియచేసేది. ప్రస్తుతం ఉన్న పాలనలో జరుగుతున్న ఘోరాలపై నిగ్గదీసి అడుగుతుంది. మీడియా ద్వారా పాలకులు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంటారు. అలాంటి మీడియాను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పక్కకు పెట్టడం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు పయనమయ్యారు. సిరిసిల్ల జిల్లాలో ఇసుక లారీల కింద పడి భూమయ్య అనే వ్యక్తి మరణంతో ఆగ్రహించిన స్థానికులు లారీ దగ్ధం చేయడం, ఆ పై పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడం.. ఆందోళనకారులను చిత్ర హింసల పాల్జేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై సీఎం కేసీఆర్ ఆలస్యంగా స్పందించారు.

తాజాగా ఘటన జరిగిన 15 రోజుల అనంతరం మంత్రి కేటీఆర్ నేరెళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కానీ పరామర్శించన సమయంలో బాధితులతో ఆయన మాట్లాడుతున్న సమయంలో మీడియాకు నో ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. పరామర్శించిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బాధితులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు..మీడియాను గౌరవిస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బాధితుల ఆగ్రహం ఎక్కడ మీడియా కవర్ చేస్తుందో ? మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కడ వస్తాయో అనే భావనతోనే మీడియాకు ఎంట్రీ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది.

పోలీసులు ఎందుకు హింసించారని బాధితులు ప్రశ్నించారని వారి ఆవేదనను గౌరవించి డీఐజీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజకీయ విమర్శలు సరికాదని..వారి తిట్లు దీవెనలు గానే భావిస్తానని పేర్కొన్నారు. మీడియా మిత్రులు అసౌకర్యానికి క్షమించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

కేసీఆర్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు:జగ్గారెడ్డి

సంగారెడ్డి: సంగారెడ్డికి కేటాయించిన మెడికల్ కాలేజీని సీఎంకేసీఆర్ సిద్దిపేటకు తరలించారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఈనెల 15న నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీని సాధించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. కేసీఆర్ వి బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని మండిపడ్డారు.

ఆ సమయంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు: సోనియా

ఢిల్లీ: స్వాతంత్ర్య పోరాట సమయంలో నెహ్రూ జైలు జీవితం గడిపారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గుర్తు చేశారు. లోక్ సభలో క్విట్ ఇండియా ఉద్యమానిక 75ఏళ్లు అయిన సందర్భంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ... కాంగ్రెస్ కార్యకర్తలు అనారోగ్యంతో జైలులోనే ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో అమరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

12:46 - August 9, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమానికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా..లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్యమంపై ప్రస్తావించారు. జీవింతంలో మంచి పరిణామాలను స్మరించుకోలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో జైలు జీవితం గడిపారన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎందరో బలిదానాలు చేసినట్లు చెప్పారు. గాంధీజీ సందేశంతో అందరూ ఏకమయ్యారని.. ఆయన శాంతియుత ఉద్యమంతోనే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకొచ్చారు. చరిత్రాత్మక ఘటనలను యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. 

 

గాంధీ భవన్ లో క్విట్ ఇండియా వేడుకలు

హైదరాబాద్: క్విట్ ఇండియా ఉద్యమానికి 75 పూర్తయిన సందర్భంగా గాంధీ భవన్ లో వేడుకలు జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జెండా ను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ, తదితరులుపాల్గొన్నారు.

 

మరాఠా క్రాంతి సేన ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన

ముంబై : మరాఠా క్రాంతి సేన ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన జరిగింది. రిజర్వేషన్లు కల్పించాలని మరాఠాలు డిమాండ్ చేస్తున్నారు.

'వాహనాల క్రయ, విక్రయాలకు ఆధార్ నమోదు తప్పనిసరి'

హైదరాబాద్: వాహనాల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ అంశాలలో ఆధార్ నమోదు తప్పసరిగా చేయాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయం డీ బ్లాక్ లో రవాణా, పోలీసు శాఖ అధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వాహనాల అమ్మకాలు, కొనుగోలుదారులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. వాహన సమచారం, ఈ – చలాన్, ఎం-వ్యాలెట్ లలో విహన క్రయ విక్రయ అంశాలు పొందుపరచాలని సూచించారు.

ఏపీ నుండి క్విట్ అవ్వండి : జగన్ ట్వీట్స్

అమరావతి: మోసగల్లారా.. దోపిడీ పాలకుల్లారా... ప్రజా వంచకుల్లారా ఏపీ నుండి క్విట్ అవ్వండి అని వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ లో ట్వీటారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.

12:40 - August 9, 2017

కడప : యోగి వేమన యూనివర్సిటీ భూములపై కబ్జాకోరుల కన్ను పడింది. విశ్వవిద్యాలయం భూముల ఆక్రమణకు అధికార టీడీపీకి చెందిన కొందరు పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ఇష్టారాజ్యంగా విద్యాలయం భూములు అక్రమించుకుంటూ యథేచ్ఛగా నిర్మాణాల చేపడుతున్నా... యూనివర్సిటీ అధికారుల కళ్లులేని కబోది పక్షుల్లా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. యోగి వేమన యూనివర్సిటీ భూముల ఆక్రమణపై  10 టీవీ ప్రత్యేక కథనం... 
యూనివర్సిటీ 1100 ఎకరాల భూమి కేటాయింపు  
ఇది కడపలోని యోగి వేమన యూనిర్సిటీ. దేశానికి విలువైన మానవ వనరులను అందిస్తున్న ఉన్నత విద్యాసంస్థ. ఇప్పుడు ఈ సంస్థ భూములను కొందరు పెద్దలు దర్జాగా కబ్జా చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. 2006లో ఏర్పాటైన యోగి వేమన యూనివర్సిటీకీ అప్పటి ప్రభుత్వం 11 వందల ఎకరాల భూమి కేటాయించింది. ఆరు వందల ఎకరాలను పరిహారం కూడా  చెల్లించారు. కానీ కేటాయించిన భూమికి సరైన హద్దు లేవు. యూనివర్సిటీ  చుట్టూ అధికారులు ప్రహరీ గోడ కట్టించుకోలేదు. అయినా ఏ సర్వే నంబర్‌లో ఎంతెంత భూమి కేటాయించారన్న వివరాలు ఉన్నాయి. కానీ రికార్డుల నిర్వహణ సరిగాలేదు. దీంతో యూనివర్సిటీ భూమిని పరిరక్షించుకోవడం  సమస్యగా మారింది. ఈ విషయంలో అధికారుల అలసత్వమే కబ్జాకోరులకు వరంగా మారింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండదండలతో తెలుగుదేశం నేతలే ఈ భూములపై గద్దల్లా వాలిపోతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. విద్యార్థులు, ప్రజా సంఘాల నేతల పలుమార్లు భూ ఆక్రమణల విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదు. భూ కబ్జా ఫిర్యాదులపై యూనివర్సిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంతో ఎకరాలకు ఎకరాల భూమి అన్యాక్రాంతమైపోతోంది. 
బైట్‌ం నారాయణ, సీపీఎం నాయకుడు 
పట్టించుకోని అధికారులు   
యూనివర్సిటీ భూములన కబ్జా చేసిన పెద్దలు ఏకంగా రోడ్లను నిర్మించుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. ప్రజా సంఘాలు, విపక్ష  నాయకులు ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తెచ్చినా...  చర్యలు శూన్యం. యూనివర్సిటీ భూ కబ్జాల వెనుకు తెలుగదేశం నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసతత్వంతోనే యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న  విమర్శలు వెల్లువెత్తున్నాయి. యోగి వేమన యూనిర్సిటీలో జరుగుతున్న భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోపోతే ఉద్యమం తప్పదని ప్రజా సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 
అధికారులపై కబ్జా రాయుళ్లు రాజకీయ ఒత్తిడి 
భూ కబ్జాలపై అఖిలపక్ష నేతలు యూవర్సిటీ అధికారులన ప్రశ్నించినా... మౌనమే సమాధానం. దీనిని బట్టి పరిశీలిస్తే కబ్జా రాయుళ్లు అధికారులపై రాజకీయంగా ఒత్తిడి తెస్తున్నారన్న అర్థమవుతోంది. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం, యూనివర్సిటీ అధికారులు కలిసి కబ్జాకోరులపై కఠిన చర్యలు తీసుకోపోతే యోగి వేమన  విశ్వవిద్యాలయం భూమి హరతి కర్పూరంలా హరించుకుపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

12:32 - August 9, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నారని మండిపడ్డారు. ఏ పార్టీ నాయకుడు ఏం మాట్లాడినా కేసులు పెట్టి, జైలుకు పంపుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులను ప్రయోగించి, అణిచివేస్తున్నారని పేర్కొన్నారు. గాంధీ మార్గంలో ఉద్యమాలు చేస్తుంటే...ప్రభుత్వం అణగదొక్కి లాండ్ ఆండ్ ఆర్డర్ కు ఆటకం కల్గిస్తుందని ఆరోపించారు. స్వేచ్ఛ లేని తెలంగాణ రాష్ట్రంగా తయారైందన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటన చేసేవరకు ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. భవిష్యత్ కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. 

 

12:29 - August 9, 2017

ఛత్తీస్ గఢ్: తాము అధికారంలో ఉన్నామనే మదమో..తమను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంతో చెలరేగిపోతున్నారు..దేశంలోని పలు ప్రాంతాల్లో కాషాయ మూకలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే..దాడులు..వేధింపులు..ఇతరత్రా వివాదాల్లో చిక్కుకుంటున్నారు..వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ బీజేపీ అధ్యక్షుడు తనయుడు చేసిన నిర్వాకంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి...సొంత పార్టీ నేతలే ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలా (23). సీనియర్ ఐఏఎస్ అధికారి వీరేంద్ర కుమార్తె వర్నిక డిస్క్ జాకీగా పనిచేస్తోంది. చండీగఢ్ లో ఆగస్టు 4వ తేదీ రాత్రి కారులో ఇంటికి వెళుతోంది. వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశీష్ కుమార్ (27)లు మద్యం మత్తులో వర్నికను వెంబడించే ప్రయత్నం చేశారు. ఎస్‌యూవీలో వెంబడించి ఆమెను కిడ్నాప్‌ చేయబోయారు. వర్నిక ఫోన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వికాస్‌, ఆశీష్ లను అరెస్టు చేశారు.

ఈ కేసును నీరుగార్చేందుకు యత్నం...
ఇపుడు ఆ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బిజెపి నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో రాజకీయ, అధికార ప్రముఖులు ‘శక్తియుక్తులు’ ప్రదర్శిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. మొదట నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఖాకీలు.. తర్వాత కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అభియోగాల తీవ్రతను తగ్గించి.. నిందితులకు బెయిల్‌ ఇచ్చి సాగనంపారు. ఈ నేపథ్యంలో కోర్టు పర్యవేక్షణలో సాగేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ‘పిల్‌’ వేయనున్నట్లు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తెలిపారు. 

5 కి.మీ మేర సీసీ టీవి ఫుటేజీ మాయం...
వర్నికను వెంబడించిన రహదారిపై చాలా సీసీ కెమెరాలున్నాయి. కానీ అందులో ఉన్న దృశ్యాలు ఏకంగా మాయం కావడం కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పోలీసులు రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా.. కేంద్ర హోం శాఖకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ లలితా కుమార మంగళం పోలీసులకు లేఖ రాశారు. కాగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.

భాజపా ఎంపీ రాంవీర్‌ భట్టి వ్యాఖ్యలు హాస్యాస్పదం...
ఈ కేసుపై బీజేపీ నేతలు మాట్లాడిన తీరు వివాదాస్పదమౌతోంది. ‘తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని రాత్రిళ్లు బయటికి పంపకూడదు. అయినా వారికి రాత్రిళ్లు బయట ఏం పని?’ అని భాజపా ఎంపీ రాంవీర్‌ భట్టి వ్యాఖ్యానించారు. దీనిపై కిరణ్‌ ఖేర్‌ కాస్త ఘాటుగా స్పందించారు. ‘ఓ అమ్మాయి గురించి ఇలా మాట్లాడటానికి రాంవీర్‌కి నోరెలా వచ్చింది. ఆయన్ని పార్టీ కొలీగ్‌ అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది’ అని కిరణ్‌ మండిపడ్డారు.‘రాత్రి వేళలే ఎందుకు డేంజర్‌గా ఉంటున్నాయి? పగలు ఎందుకు ఉండడంలేదు. ముందు ఇంట్లో కూర్చోపెట్టాల్సింది అబ్బాయిల్ని. అమ్మాయిల్ని కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంవీర్‌ వ్యాఖ్యలకు బాధితురాలు వర్ణిక కూడా దీటుగా సమాధానం ఇచ్చింది. తాను ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అది ఇతరులకు అనవసరమని తాను బాధితురాలే కానీ నిందితురాల్ని కానని సమాధానమిచ్చింది. 
బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బరాలా ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ కూడా వినబడుతోంది. రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే....

11:57 - August 9, 2017

సినిమాల్లో ఆయా పాత్రల్లో జీవించి పోవాలని ఆశిస్తుంటారు. అందుకు తగిన విధంగా శిక్షణ తీసుకోవడం..ఆహార్యం..శరీరాన్ని కూడా మార్చేస్తుంటారు. అంతేగాకుండా సాహసాలు కూడా చేసేస్తుంటారు. సినిమా సినిమాకు రిస్క్ డోస్ లు పెంచేస్తున్నారు. విశాల్ సాహసం చేయడంలో ముందుంటాడు. పలు చిత్రాల్లో ఆయన చేసిన సాహసాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సాహసాలు చేస్తున్న ఇతడు గాయాలపాలవుతున్నాడు. షూటింగ్ లో పాల్గొంటున్న ఇతను ఇంటికి కట్టులు కట్టించుకుంటూ వెళుతున్నాడు. పందెం కోడి, మురుదు, కత్తిసెంతై షూటింగ్ లలో విశాల్ కు గాయాలైన సంగతి తెలిసిందే. 'తుప్పరివాలస్' అనే సినిమాలో 'విశాల్' హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ లో రిస్క్ చేసిన విశాల్ గాయపడ్డాడు. ఎడమకాలి గాయం కావడంతో ఇతడిని ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. 

11:52 - August 9, 2017

తూ.గో : జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. వరుసగా 15వ రోజు పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో కాపు జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ముద్రగడ నిప్పులు చెరిగారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:50 - August 9, 2017

చిత్తూరు : తిరుపతి అలిపిరి తనిఖీల కేంద్రం వద్ద అధికారులు సోదాలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నుంచి రివాల్వర్, 6 బుల్లెట్‌లు స్వాధీనం చేసుకొని.. అతన్ని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:49 - August 9, 2017

చిన్న చిత్రం..పెద్దగా అంచనాలు లేకుండానే విడుదల..విడుదలైన కొన్ని రోజులకే రికార్డులు కొల్లగొడుతోంది..అగ్రహీరోల రికార్డును బద్దలు కొడుతూ దూసుకెళుతోంది..ఆ సినిమానే 'ఫిదా'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'వరుణ్ తేజ్', 'సాయి పల్లవి' హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది.

టాలీవుడ్ సినిమాలో 'బాహుబలి 2' సినిమా రికార్డుల అనంతరం 'ఫిదా' కలెక్షన్లలో దూసుకెళుతుండడం టాలీవుడ్ లో సరికొత్త చర్చకు తెరలేపుతోంది. రూ. 1.8 మిలియన్ డాలర్లతో ముందు 'జనతా గ్యారేజ్' రికార్డును దాటేసిన ఈ చిత్రం మూడో వారంలో రూ. 1.92 మిలియన్ డాలర్ల వసూళ్లతో 'అత్తారింటికి దారేది' చిత్ర రికార్డును కూడా దాటేసింది. 'బాహుబలి', 'బాహుబలి 2', 'ఖైదీ నెంబర్ 150' 'నాన్నకు ప్రేమతో', 'శ్రీమంతుడు' 'అ..ఆ' సినిమాలు మాత్రమే రూ. 2 మిలియన్లు వసూళ్లు సృష్టించాయి.

తాజాగా 'ఫిదా' కూడా రూ. 2మిలియన్ల కలెక్షన్లను దాట వేయడానికి సిద్ధమౌతోంది. ఓవర్ సీస్ లో 'బాహుబలి' ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. 'శ్రీమంతుడు' 2.89 మిలియన్ డాలర్లు..'అ..ఆ' సినిమా రూ. 2.45 మిలియన్ డాలర్లు కొల్లగొట్టాయి. చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' రూ. 2.04 కలెక్షన్లు సాధించింది. 'ఫిదా' ప్రస్తుతం రూ. 1.92 మిలియన్ డాలర్లతో ముందుకెళుతోంది. చిన్న సినిమాగా మొదలైన 'ఫిదా' భారీ కలెక్షన్లు సాధిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ ప్రాంతంలోని అందాలు...భాష..యాస..పై అభిమానులు కూడా 'ఫిదా' అవుతున్నారు. 

11:47 - August 9, 2017

హైదరాబాద్ : కాల్పుల కేసులో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం విక్రమ్ గౌడ్ ను చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విక్రమ్ ను బంజారాహిల్స్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. విక్రమ్ తో పాటుగా గోవింద్‌రెడ్డి, నందకుమార్‌, రయీస్‌ఖాన్‌, షేక్‌ అహ్మద్‌, బాబుజాన్‌ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..
 

అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

విశాఖ: అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకోవాలి: ప్రధాని

ఢిల్లీ: క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయ్యిందని ప్రధాని మోదీ లోక్ సభలో గుర్తు చేశారు. జీవితంలో మంచి పరిణామలు స్మరించుకోవాలని, క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఆందోళనలను ఆంగ్లేయులు ఊహించలేదని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో నేతలు జైలు జీవితం గడిపారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో బలిదానాలు జరిగాయని, సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి పోరాటం చేశారని గుర్తు చేశారు.

11:42 - August 9, 2017

హైదరాబాద్‌ : నగంలో వానలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యార్థాలు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. రహదారులు చెరువులను తలపించడంతో.. రోడ్డు దాటేందుకు భయాందోళన చెందారు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. హైదరాబాద్‌లో వర్షం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు డ్యామేజి అయిన ప్రాంతాల్లో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్ల మీద నీరు చేరడంతో స్కూల్‌చిన్నారులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రఫిక్‌లో చిక్కుకున్నారు. మరిన్ని వివారాలను మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అలిపిరి వద్ద రివాల్వర్ కలకలం...

చిత్తూరు: తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ భక్తుడు, తన వెంట రివాల్వర్ తో రావడం కలకలం రేపింది. భద్రతా విభాగ అధికారి రవికృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర నుంచి తమ సొంత వాహనంలో అలిపిరికి వచ్చిన ఓ కుటుంబం, కారులోని సీటు కింద లైసెన్స్ ఉన్న రివాల్వర్ ను దాచింది. దానిలో ఆరు బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయి. తుపాకీ లైసెన్స్ మహారాష్ట్ర వరకూ మాత్రమే పరిమితమైనదని, ఇతర రాష్ట్రాల్లో దాన్ని వాడరాదని, ఆయుధాల చట్టం ప్రకారం, ఆ భక్తుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని రవికృష్ణ వెల్లడించారు.

11:38 - August 9, 2017

కొరటాల శివ...చేసిన సినిమాలు మాత్రం మూడే. కానీ ఈ సినిమాలు ఎంతగానో గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రభాస్ తో మిర్చి, మహేష్ బాబుతో శ్రీమంతుడు, జూ.ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాలు తీసిన సంగతి తెలిసిందే. సమాజానికి ఉపయోగపడే అంశాలను తెరకెక్కించడంలో ఆయన స్టైలే వేరు. స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఈ దర్శకుడు వివాదాలకు దూరంగా ఉంటాడు.

మొన్నీ మధ్య డ్రగ్స్ వ్యవహారంలో కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. కానీ తాజాగా ఆయన రాజకీయాలపై చేసిన కామెంట్స్ చర్చ జరుగుతోంది. రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయని, మురికి పట్టేశాయి..దేవుడొచ్చినా బాగు చేయలేడు..మనకు మనమే మారితే కానీ రాజకీయాలు మారవు అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో మహేష్ హీరోగా నటిస్తున్నారు. 'భరత్ అనే నేను' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని, మహేష్ ఇందులో సీఎం పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగానే కొరటాల రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన చేసిన కామెంట్స్ సినిమాకు ఎంతగా ఉపయోగపడుతాయో వేచి చూడాలి. 

డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పీవీ సింధు...

విజయవాడ: బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న ఏపీ భూపరిపాలన(సీసీఎల్‌ఏ) కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్న సింధు ఉద్యోగంలో చేరుతున్నట్లు సీసీఎల్‌ఏ ప్రధాన కమిషనర్‌ పునేఠాకు రిపోర్ట్‌ చేశారు.

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆయన ఈరోజు ఉదయం ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. దుర్గగుడి అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు గవర్నర్‌కు ఆశీర్వచనాలు, దుర్గగుడి ఈవో సూర్యకుమారి తీర్థప్రసాదాలు అందించారు.

చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసుకుని ముద్రగడ నిరస

తూ.గో: కాపు ఉద్యమ నేత విచిత్ర నిరసనకు దిగారు. చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసుకుని తన ఇంటి వద్ద నిరసన చేస్తున్నారు. మరో సారి పాదయాత్రకు యత్నించిన ముద్రగడను ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక విచిత్ర నిరసన చేపట్టారు.

11:23 - August 9, 2017

హైదరాబాద్ : దక్షిణ భారతంలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు కమలనాధులు అడుగులు వేస్తున్నారా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణపై ఫోకస్‌ పెట్టారా? ఆపరేషన్‌ ఆకర్ష్‌తో కారు పార్టీ ఎంపీలకు కాషాయం కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారా? అమిత్ షా ఫ‌స్ట్ టార్గెట్ టీఆర్‌ఎస్‌ ఎంపీలేనా ? ఆరుగురు ఎంపీలను లాగేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారా? అవును ఇదే అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. 
టీఆర్‌ఎస్‌ ఎంపీలకు వల 
రాజకీయ వ్యూహాలు పన్నడంలో సిద్ధహస్తుడిగా...విన్నర్‌ క్యాంపెయినర్‌గా పేరున్న అమిత్‌ షా తెలంగాణపై ఫోకస్‌ చేశారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా.. బీజేపీ అధినాయకుడు అడుగులు వేస్తున్నారు. సౌత్‌ ఇండియాపై దృష్టిసారించిన షా..టీఆర్‌ఎస్‌ ఎంపీలకు వల విసురుతున్నారట. ఇందుకోసం రాష్ట్ర నాయ‌క‌త్వంతో సంబంధం లేకుండా.. నేరుగా కేంద్ర నాయ‌కత్వం రంగంలోకి దిగింది. 
కారుపార్టీ జోరుకు బ్రేకులు వేసే దిశగా పావులు 
నిన్నటి వరకు గుజ‌రాత్ రాజ్యసభ ఎన్నిక‌ల‌తో బీజీగా ఉన్న అమిత్ షా..ఇప్పుడు ఆప‌రేష‌న్ తెలంగాణ‌కు శ్రీకారం చుట్టినట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కేసీఆర్‌తో స్నేహం కొన‌సాగించిన క‌మ‌లం పార్టీ..తెలంగాణలో కారుపార్టీ జోరుకు బ్రేకులు వేసే దిశగా పావులు కదుపుతోంది. దీనికి అమిత్ షా ఇప్పటికే తెర‌వెన‌క మంత్రాంగం న‌డిపిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో గులాబీ ఎంపీలను లాగేందుకు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. అర‌డ‌జ‌ను ఎంపీలతో అమిత్ షా ట‌చ్‌లో ఉన్నారట. టిఆర్ఎస్ గూటికి చేరిన వ‌ల‌స ఎంపీలు ముందువరుసలో ఉన్నార‌ట‌. కాంగ్రెస్, టిడిపి, వైసీపీ నుంచి కారు ఎక్కిన ఎంపీలు కేసీఆర్‌ తీరుపై అసంతృప్తిగా ఉండ‌టాన్ని షా అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నారట. అసంతృప్తుల్లో ముగ్గురు ఎంపీలు బీజేపీ అధ్యక్షుడితో మంత‌నాలు జరిపిన‌ట్లు ప్రచారం జ‌ర‌గుతోంది. 
కమలం గూటికి టిఆర్ఎస్ ఎంపీ ? 
ఇక కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరితో స‌న్నిహితంగా ఉండే ఓ టిఆర్ఎస్ ఎంపీ కమలం గూటికి వెళ్లేందుకు తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. మ‌హ‌రాష్ట్ర సరిహద్దులో ఉండే ఆ ఎంపీ....గడ్కరి సాయంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారట. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఓ బిసీ ఎంపీ, మరో ఎస్టీ ఎంపీ షా పిలుపు కోసం ఎదురుచూస్తున్నారట. ఇలా ఇప్పటివరకు ఆరుగురు టిఆర్ఎస్ ఎంపీలు అమిత్ వ‌ల‌లో ఉన్నట్లు కమలం పార్టీలో చర్చ సాగుతోంది. అంతా అనుకూలంగా జరిగి అమిత్‌ షా మంత్రాగం ఫలిస్తే.. త్వరలోనే ఆరుగురు ఎంపీలు క‌మ‌లం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. గతంలో షా తెలంగాణ టూర్‌ నేపథ్యంలో బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరిగినా..అది ఫలించలేదు. కానీ ఈ సారి అమిత్ పక్కా ప్లాన్‌తో రాష్ట్రానికి వ‌స్తున్నారట. అయితే షా వ్యూహాలు ఏ మేర‌కు ఫలిస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. షా ఎత్తులకు గులాబీ బాస్‌ ఎలా చెక్‌ పెడతారన్నది ఆసక్తి కలిగిస్తోంది.  

తెలంగాణ లో నాలుగు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్ :చత్తీస్‌గఢ్‌ నుంచితెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడుతున్నది. తెల్లవారుజాము నుంచి ఇప్పటివరకూ అంబర్ పేట్ లో 6 సెం.మీ చొప్పున, బండ్లగూడ, ఎల్బీ నగర్, నారాయణగూడల్లో 5 సెం.మీల చొప్పున, ముషీరాబాద్, బాలానగర్, మౌలాలీ, రామచంద్రపురంలలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు..

ఖమ్మం : తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. నాలుగు గేట్లు ఎత్తి 55200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

11:00 - August 9, 2017

హైదరాబాద్ : నగరంలో వానలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజామునుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో విద్యార్థాలు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. రహదారులు చెరువులను తలపించడంతో.. రోడ్డు దాటేందుకు భయాందోళన చెందారు. మరోవైపు కార్యాలయాలకు వెళ్లేందుకు వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. 
లోతట్టు ప్రాంతాలు జలమయం
రహదారులు చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలావరకు రోడ్లు దెబ్బతిన్నాయి. పంజాగుట్టలో రోడ్లను కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. ఉదయం నుంచే సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

10:56 - August 9, 2017

హైదరాబాద్ : ప్రిన్స్‌ మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా స్పైడర్‌ టీజర్‌ను విడుదల చేశారు. మహేష్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నఈ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్‌ కానుంది. 

 

కస్టడీలో విక్రమ్ గౌడ్..

హైదరాబాద్ : విక్రమ్ గౌడ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పీఎస్ కు తీసుకొచ్చారు. గోవింద్ రెడ్డి, నందకుమార్, రయీస్ ఖాన్, షేక్ అహ్మద్, బాబూ జాన్ లను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. 

కాళ్లు..చేతులు కట్టేసుకున్న ముద్రగడ..

తూర్పుగోదావరి : 15వ రోజు పాదయాత్ర చేసేందుకు ముద్రగడ ప్రయత్నించారు. పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతినివ్వకపోవడంపై చేతులు..కాళ్లను కట్టేసుకుని వినూత్నంగా ముద్రగడ నిరసన తెలుపుతున్నారు. 

10:53 - August 9, 2017

మంచిర్యాల : జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పంచాయితీ రాజ్‌ సబ్‌ డివిజన్‌ ఏఈ 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డండేపల్లి మండలం, మామిడిపల్లి గ్రామపంచాయితీ భవన నిర్మాణానికి సంబంధించి దాసరి నరేందర్ అనే కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశాడు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో డ్రీమ్స్‌ బేకరీలో డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ డీఎస్పీ పాపలాల్ పట్టుకున్నారు. 

 

అలిపిరి వద్ద పిస్టల్ స్వాధీనం..

చిత్తూరు : అలిపిరి వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో మరో పిస్టల్ లభ్యమైంది. ఇటీవలే ఓ వ్యక్తి వద్ద పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిపిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వ్యక్తి నుండి తుపాకీ, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

10:44 - August 9, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని కేటీపీఎస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యకు నిరసనగా కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి అఖిల పక్షనాయకులు మద్దతు తెలిపారు. కేటీపీఎస్‌ గేటు ముందు ధర్నాకు దిగిన కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. అఖిలపక్షనేతలను అరెస్టు చేసి దమ్మపేట పీఎస్‌కు తరలించారు. 15ఏళ్లుగా కేటీపీఎస్‌ పనిచేస్తున్నా తన పేరును క్రమబద్ధీకరణ లిస్టులో చేర్చలేదని కాంట్రాక్టు కార్మికుడు కే. నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో భగ్గున మండిన కార్మికులు నాగేశ్వరరావు ఆత్మహత్యకు కేటీపీఎస్‌ అధికారులే కారణం అంటూ ఆందోళనకు దిగారు. నాలుగు నెలల సీనియార్టీ ఉన్న వారికి కూడా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేసిన అధికారులు 15ఏళ్లుగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు అన్యాయం చేశారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

10:38 - August 9, 2017

హైదరాబాద్ : భారీ వర్షానికి హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.  రహదారులు చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలావరకు రోడ్లు దెబ్బతిన్నాయి. పంజాగుట్టలో రోడ్లను కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. ఉదయం నుంచే సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:29 - August 9, 2017

బీజింగ్ : చైనాలో సిచుయాన్‌లో కొన్ని గంటల తేడా రెండుసార్లు సంభవించిన భారీ భూకంపం 100మందిని పైగా పొట్టన పెట్టుకుంది. వేల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. గత రాత్రి 9 గంటల 20 నిముషాలకు మొదటిసారి భూమి కంపించింది.  భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.0గా గుర్తించారు. భూమిలో 20 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ ఉదయం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3 గా నమోదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

 

పోలీసు పహారా మధ్య జలాశయం పనులు...

శ్రీకాకుళం : హిరా మండలంలోని వంశధార జలాశయం పనులు పోలీసు పహారా మధ్య కొనసాగుతున్నాయి. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం గమనార్హం. నిర్వాసిత గ్రామాల ప్రజలతో అధికారుల చర్చలు విఫలమయ్యాయి. న్యాయం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. 

10:24 - August 9, 2017

విశాఖ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభకు అరకు ముస్తాబైంది. అరకు ఎన్టీఆర్‌ మైదానంలో ఈరోజు జరగనున్న  వేడుకలకు సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ హాజరవుతున్నారు. గిరిజన ఆచార, వ్యవహారాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 
ఏర్పాట్లు పూర్తి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విశాఖ జిల్లా అరకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతోపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ హాజరవుతున్నారు. అరకులోయలోని ఎన్టీఆర్ మైదానంలో ఈ కార్యక్రమాలను  ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 
పెదలబుడు గ్రామస్థులతో ముఖాముఖి 
విశాఖ నుండి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్ అరకులోయ చేరుకుంటారు. అనంతరం ఎన్టీఆర్‌ మైదానంలో జరిగే ఆదివాసీ దినోత్సవ సభలో పాల్గొంటారు. ఇదే వేదికపై సీఎం దత్తత పంచాయతీ పెదలబుడు గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇదే వేదికగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలో ఉన్న గిరిజనులు పెద్ద సంఖ్యలు హాజరుకానున్నారు. గిరిజన ఆచార, వ్యవహారాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా గిరిజన నృత్యాలను ప్రదర్శించనున్నారు. 

 

జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటన...

హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం నుండి నగరంలో భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మాన్ సూన్ టీమ్ లు అలర్ట్ గా ఉండాలని సూచించారు.

బీజేపీ తనయుడికి సమన్లు జారీ..

ఛండీగడ్ : ఐఏఎస్ కుమార్తె వర్నిక కుందును వేధించిన కేసులో హార్యానా బీజేపీ అధ్యక్షుడు తనయుడు వికాస్ బరాలా అతని స్నేహితుడికి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. కానీ సమన్లు తీసుకోవడానికి వికాస్ నిరాకరించడంతో ఇంటికి నోటీసులు అంటించారు. 

అజ్మీర్ బీజేపీ ఎంపీ కన్నమూత...

ఢిల్లీ : అజ్మీర్ బీజేపీ ఎంపీ సన్వర్ లాల్ జాట్ (62) కన్నుమూశారు. 2014-2016 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కిసాన్ అయోగ్ ఛైర్మన్ గా కూడా కొనసాగారు. 1955 జనవరి 1వ తేదీన అజ్మీర్ లో సన్వర్ లాల్ జన్మించారు. 

ఆంధ్రా బ్యాంక్ లో చోరీకి విఫలయత్నం

తిరుమల : ఆంధ్రా బ్యాంక్ లో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్ సిబ్బంది గుర్తించడంతో దొంగ పరారయ్యారు. సీసీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. 

 

09:50 - August 9, 2017

హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత విద్యుత్‌ సంస్కరణలను అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మిగులు విద్యుత్‌ అమ్మకానికి చర్యలు చేపడతారు. చార్జీల తగ్గింపుతోపాటు  పవన్, సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తారు. విద్యుత్‌ నిల్వ సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధితోపాటు వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ప్రోత్సహకాలు అందిస్తామని విజయవాడలో విద్యుత్‌ సౌధ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ప్రకటించారు. 
విజయవాడలో ఏపీ విద్యుత్‌ సౌధ ప్రారంభం
విజయవాడ గుణదలలో నిర్మించిన ఏపీ విద్యుత్‌ సౌధను ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. విద్యుత్‌ సరఫరా సంస్థైన ఏపీ ట్రాన్స్‌కో, కరెంటు ఉత్పత్తి సంస్థైన ఏపీ జెన్‌కో ప్రధాన కార్యాలయం ఇది. ఆధునిక హంగులతో  నిర్మించిన ఈ భవనంలోని సౌకర్యాలను నరసింహన్‌, చంద్రబాబు పరిశీలించారు. 
విద్యుత్‌ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా ఏపీ  
విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీ మిగులు రాష్ట్రంగా అవతరించింది. కొన్ని సందర్భాల్లో మిగులు విద్యుత్‌ను అమ్ముకోలేక ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీరంగాల్లో రెండో విడత సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. దీనిలో  ప్రాంతాల వారీగా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు చర్యలు తీసుకుంటారు. దీని వలన  ప్రసార, పంపిణీ నష్టాలు తగ్గడంతోపాటు ఉత్పత్తిదారులకు లాభసాటిగా ఉంటున్న అభిప్రాయం ఏపీ ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. చార్జీలను కూడా తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జల, థర్మల్‌, పవన విద్యుత్‌ ఉత్పత్తి కంటే సౌర విద్యుత్‌ ఎంతో మంచిదని భావిస్తున్నారు. సౌర విద్యుత్‌లో ప్రపంచంలో ఏ దేశానికిలేని అనుకూలతలు మన దేశంలో ఉన్నాయి. ఏపీలో ఇవి ఇంకా ఎక్కువ. దీంతో సౌర విద్యుత్‌ ఉప్పత్తిని ప్రోత్సహించడంతోపాటు ఎలక్ట్రిసిటీ నిల్వ టెక్నాలజీ పరిశోధనలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దిన చంద్రబాబును... తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
నరసింహన్‌తో చంద్రబాబు ప్రత్యేక భేటీ 
మరోవైపు విద్యుత్‌ సౌధ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన నరసింహన్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడు కేంద్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నరసింహన్‌ దృష్టికి తెచ్చిన చంద్రబాబు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్నా... అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న అమలు చేస్తున్న విషయాన్ని నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తోడ్పాటు ఇంకా ఎక్కువగా ఉంటే అభివృద్ధి, సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించొచ్చని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ నరసింహన్‌ ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. విభజన చట్టంలో ఇచ్చిన విశాఖ రైల్వే జోన్‌ హామీ అమలుకు నోచుకోని విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరులో కేంద్రం నుంచి ఎదురవుతున్న అవరోధాలను ఏపీ సీఎం బాబు... రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు.   రాజధాని అమరావతిలో  చేపట్టబోయే అసెంబ్లీ,   హైకోర్టు, సచివాలయం భవనాల ఆకృతులపై కూడా ఇద్దరూ చర్చించారు. విభజన చట్టంలోని 9, 10  షెడ్యూళ్లో ఉన్న ఆస్తుల విభజన అంశంపై కూడా ఇద్దరూ సమాలోచనలు జరిపారు. ఈ అంశాలన్నింటినీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారమయ్యేటా కృషి చేస్తానని గవర్నర్‌ నరసింహన్‌ చంద్రబాబుకు హామీ ఇచ్చారు. 

 

09:38 - August 9, 2017

గాంధీనగర్ : గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ విజయం సాధించారు. ఈ గెలుపుపై అహ్మద్‌పటేల్‌ సత్యమేవ జయతే అని ట్విటర్‌లో స్పందించారు. రాజసభ సీటు విజయంతో గుజరాత్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సహం వెల్లివిరుస్తోంది. పలు చోట్ల కార్యకర్తలు టపాసులు కాల్చి.. స్వీట్లు పంచుకున్నారు. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు సాధించింది. అమిత్‌షాకు 46 ఓట్లు, స్మృతి ఇరాని 46 ఓట్లు, అహ్మద్‌పటేల్‌కు 44 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై జెప్పిన బల్వంత్‌ సిన్హాకు 38 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఆయనకు ఓటమి తప్పలేదు. 

 

09:31 - August 9, 2017

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలావరకు రోడ్లు దెబ్బతిన్నాయి. పంజాగుట్టలో రోడ్లను కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి పరిశీలించారు. ఉదయం నుంచే సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించాలని ఇంజనీరింగ్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

అజ్మీర్ బీజేపీ ఎంపీ సన్వర్ లాల్ జాట్ కన్నుమూత

ఢిల్లీ : అజ్మీర్ బీజేపీ ఎంపీ సన్వర్ లాల్ జాట్ (62) కన్నుమూశారు. 2014 నుంచి 2016 వరకు కేంద్రమంత్రిగా పని చేశారు. రాజస్థాన్ కిసాన్ ఆయోగ్ చైర్మన్ గా ఉన్న సన్వర్ లాల్ జాట్ పని చేశారు. 1955 జనవరి 1న అజ్మీర్ లో సన్వర్ లాల్ జాట్ జన్మించారు. 

 

08:20 - August 9, 2017

గుజరాత్ రాజ్యసభ ఎన్నికలపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. గుజరాత్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాటకీయ పరిణాలు, హైడ్రామా కొనసాగింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీడీపీ నేత దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేంద్రలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ ఎస్, ఏపీలో టీడీపీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఓట్లను కొంటున్నారని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియ్లోలో చూద్దాం...

08:07 - August 9, 2017

హైదరాబాద్ : జంట నగరాల్లో రోడ్లు ఊడ్చేందుకు ఉపయోగిస్తున్న స్వీపింగ్‌ యంత్రాల పనితీరును జీహెచ్ ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. స్వీపింగ్‌ యంత్రాలు పనిచేయకుండానే పని చేస్తున్నట్టు వీటి సిబ్బంది రికార్డులు రాస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం..

08:05 - August 9, 2017

పాత పెన్షన్ విధానమే కావాలని తెలంగాణ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్ద చేసి.. పాత పెన్షన్ విధాన్ని కొనసాగించాలని కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా పోరాటాలు నడుస్తున్నాయి. వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు విభిన్న రీతుల్లో ఉద్యమిస్తున్నాయి. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ కి వ్యతిరేకంగా దర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పాత పెన్షన్ విధానమే కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇంతకీ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమలవుతోంది? ఉద్యోగులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత పెన్షన్ విధానానికి, కొత్త కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి వున్న తేడాలేమిటి? అసలు ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ లు ఎందుకు అమలు చేయాలి? ఇలాంటి అంశాలపై రవి మాట్లాడారు. 

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ : నగరంలో భారీ వర్షం కరుస్తోంది. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. రోడ్లలన్నీ జలయమం ఆయ్యాయి. అంబర్ పేటలో 6 సెం.మీ, ఎల్ బీనగర్, బండ్లగూడలో 5 సెం.మీ, నారాయణగూడలో 5 సెం.మీ, ముషీరాబాద్ లో 3, మౌలాలీ, బాలనగర్, రామచంద్రాపురంలో 2 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.

 

 

07:47 - August 9, 2017

హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలకు జంటనగరాల్లో దెబ్బతిన్న రోడ్లకు జీహెచ్ ఎంసీ అధికారులు రిపేర్లు చేస్తున్నారు. రాత్రుల్లో కూడా గంతలు పూడుస్తున్నారు. జరుగుతున్న పనులను అధికారులు దగ్గర ఉంచి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై  మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...

 

07:43 - August 9, 2017

గాంధీనగర్ : గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయినా లెక్కింపు వద్దకు వచ్చేసరికి బుధవారం తెల్లవారుజాము వరకు హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ విజయం సాధించినట్లు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అనధికారికంగా వెల్లడయింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో ప్రకటించింది. పటేల్‌ కూడా ట్విటర్‌ ద్వారా తన విజయాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. భాజపా అభ్యర్థులు అమిత్‌ షా, స్మృతి ఇరానీలు సులభంగానే గట్టెక్కినా పటేల్‌ విషయంలోనే గంటల తరబడి తీవ్ర ప్రతిష్టంభన కొనసాగింది. 
 

07:39 - August 9, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేయ‌బోతున్నారు..? రెండు రోజుల్లో త‌న నిర్ణ‌యాన్ని చెబుతాన్నప‌వ‌న్... ఎనిమిది రోజులైనా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..?  నంద్యాల బైపోల్‌కి దూరంగా ఉండిపోతారా..? లేక ఏదో ఒక పక్షానికి దన్నుగా నిలుస్తారా..? ఇప్పుడిదే అంశం నంద్యాల బరిలో హాట్‌టాపిక్‌గా మారింది.
పవన్‌ ఎవరి పక్షం..?
నంద్యాల ఉప ఎన్నిక‌ రాష్ట్ర రాజ‌కీయాలను వేడెక్కిస్తోంది. అదికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీల మ‌ద్య పోటీ తారాస్థాయిలో కొనసాగుతోంది. ఇరు పక్షాల నేతల మధ్య మాట‌లు తూటాల్లా పేలుతున్నాయి. సీఎం చంద్ర‌బాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్య‌ల ప్రకంపనం ఇప్పటికీ రాజ‌కీయాల్లో కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో.. జనసే అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. నంద్యాల ఎన్నిక‌ల్లో ఏ పక్షం వహిస్తారు అన్న అంశం ఆస‌క్తిగా మారింది...
భూమా కుటుంబంతో పవర్‌స్టార్‌కు సత్సంబంధాలు
పవన్‌ కల్యాణ్‌ తమ అభ్యర్థికే మద్దతునిస్తారని టీడీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో భూమా నాగిరెడ్డి దంపతులు చేరి.. విజయం సాధించారు. అప్పటి నుంచీ.. భూమా కుటుంబంతో పవన్‌ కల్యాణ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ పరిచయంతో భూమా అఖిలప్రియ పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరతారని, ఆయన కూడా భూమా బ్రహ్మానందరెడ్డిని సపోర్ట్‌ చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉద్దానం సమస్యపై ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత, నంద్యాల ఉప ఎన్నికపై రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అయితే ఎనిమిది రోజులు దాటినా పవర్‌ స్టార్‌ పెదవి విప్పలేదు. 
అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి పవన్‌
పవర్‌ స్టార్‌ మౌనానికి చాలా కారణాలే ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానన్న పవన్‌.. స్వీయ సత్తాను చాటుకునే ఉద్దేశంతోనే ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు నంద్యాలలో టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తే.. చంద్రబాబు జేబులోని వ్యక్తిగా తనపై ఉన్న అభియోగాన్ని నిజం చేసినట్లవుతుందని పవన్‌ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న ప్రయత్నాలకు విఘాతం కలిగుతుందని సన్నిహితులు పవన్‌ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నంద్యాల ఉప ఎన్నికలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా మౌనంగానే ఉండేందుకు పవన్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పైగా పార్టీ పిరాయింపుల అంశం కూడా ఇందులో ముడివడిన నేపథ్యంలో.. నంద్యాలపై సైలెంట్‌గా ఉండేందుకే పవన్‌ నిర్ణయించుకున్నారని భోగట్టా. 

 

07:34 - August 9, 2017

కర్నూలు : నంద్యాల ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు కోసం టీడీపీ, వైసీపీ నేతలు పక్కా వ్యూహాంతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇరు పార్టీల అధిష్టానాలు కూడా నంద్యాలలో ప్రచారం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇదిలావుంటే జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌లాంటి డొల్లతనం ఉన్న నాయకత్వాన్ని తానెప్పుడూ చూడలేదని ఆరోపించడం... చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఈసీకి వివరణ ఇచ్చారు. 
గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ప్రచారం 
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నువ్వా.. నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార టీడీపీ నుండి ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మంత్రులు, ఐదుగురు సీనియర్‌ నేతలు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కూడా నంద్యాలలో ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ఎన్నికల ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రెండు పార్టీలు డూ ఆర్‌ డైగా భావిస్తున్నాయి. ఇప్పటికే ఒక దఫా పర్యటించి నంద్యాల ప్రచారం చేసిన చంద్రబాబు, జగన్‌లు మళ్లీ ప్రచారానికి సిద్దమవుతున్నారు.  
జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
ఓవైపు నంద్యాలలో ప్రచారం ఊపందుకుంటుండగా... జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన చంద్రబాబు... జగన్‌లాంటి డొల్లనాయకత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. తనను కాల్చండంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మనస్తత్వం ఏంటో అర్ధమవుతుందన్నారు. వైఎస్‌ సీఎంగా ఉన్నంతకాలం జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రానీయ్యలేదని.. ఈ విషయాన్ని మాజీ సీఎం రోశయ్యే స్వయంగా చెప్పారన్నారు చంద్రబాబు. 
చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఈసీకి జగన్‌ వివరణ 
ఇక నంద్యాల సభలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై ఈసీకి జగన్‌ వివరణ ఇచ్చారు. చంద్రబాబును కాల్చండంటూ చేసిన వ్యాఖ్యల్లో.. తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నాడు... 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే.. ఆవేదనతో అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు జగన్‌ ఈసీకి వివరణ ఇచ్చారు. 
టీడీపీపై వైసీపీ విమర్శలు
నంద్యాలలో ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు కురిపిస్తున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు నంద్యాలను అభివృద్ధి చేయని చంద్రబాబు.. ఇప్పుడు అభివృద్ధి చేయడం అంతా ఎన్నికల జిమ్మిక్కేనని ఆరోపించారు. ఇక నంద్యాల ఉప ఎన్నికలో అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారం మొదలుపెట్టారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి కోడలు నాగిని ప్రచారం నిర్వహించారు... తన మామయ్యకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. 
విస్తృత ప్రచారానికి టీడీపీ వ్యూహాలు 
మరోవైపు ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. రాయలసీమలో అనేకమంది అభిమానులు ఉన్న బాలకృష్ణతో ప్రచారం చేయించాలని టీడీపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఎవరికీ వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు ఎవరికి వారు గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి విజయం ఎవరిని వరిస్తుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు. 

 

ప్రో కబడ్డీ.. నేడు బెంగుళూరు, బెంగాల్ ఢీ

హైదరాబాద్ : ప్రో కబడ్డీలో భాగంగా నేడు బెంగుళూరుతో బెంగాల్ తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు నంద్యాలలో జగన్ పర్యటన

కర్నూలు : నేడు నంద్యాలలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఒంటి గంటకు రైతునగర్ నుంచి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 

 

నేడు అరకులో సీఎం చంద్రబాబు పర్యటన

విశాఖ : నేడు అరకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ దంపతులు హాజరుకానున్నారు.
 

రాజ్యసభ ఎన్నికలో అహ్మద్ పటేల్ గెలుపు

గుజరాత్ : రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ గెలుపొందారు. ఐదోసారి రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. మొత్తం మూడు స్ధానాల్లో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి. 

 

Don't Miss