Activities calendar

10 August 2017

21:49 - August 10, 2017

చెన్నై : ఒకే వేదికపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ దర్శనమిచ్చారు. తమిళనాడులో డీఎంకేపార్టీ పత్రిక 'మురసోలి' 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా.. చెన్నైలో ప్లాటినమ్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, ప్రభుతో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే వేదికపై కమల్‌ కూర్చోగా.. రజనీకాంత్‌ కింద మొదటి వరుసలో కూర్చున్నారు. మరోవైపు అనారోగ్య కారణాల వల్ల ఈ వేడుకల్లో కరుణానిధి పాల్గొనలేదు. దాంతో ఆయన కుమారుడు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీఎంకే అధినేత కరుణానిధికి 18ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ మురసోలి పత్రికను ప్రారంభించారు. ఆగస్టు 10, 1942న తొలి మురసోలి పత్రిక విడుదలైంది. 

21:48 - August 10, 2017

హైదరాబాద్ : మాదాపూర్‌ నారాయణ కాలేజ్‌ముందు ఎస్ఎఫ్ఐ, ఏఎల్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. కళాశాల యాజమాన్యం వేధింపులవల్లే నిన్న శ్రావ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి నేతలు ఆరోపించాయి.. విద్యార్థి మృతికి కారణమైన కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. కళాశాల భవనం అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

21:47 - August 10, 2017

హైదరాబాద్ : బేగంపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసులో 9 మంది నిందితులను నాంపల్లి కోర్టు నిర్దోషులుగా తేల్చింది....ప్రాసిక్యూషన్‌ ఆధారాలు చూపలేకపోయవడంతో 9 మంది నిందితులపై కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొత్తం 20 మంది నిందితులను గుర్తించగా 10 మందిని అరెస్ట్‌ చేశారు. ముగ్గురు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. కోర్టు తీర్పును డిఫెన్స్‌ లాయర్‌ స్వాగతించారు...ప్రాసిక్యూషన్‌ సాక్ష్యాధారాలు చూపకపోవడంతో నిందితులను నిర్దోషులుగా కోర్టు తేల్చిందని చెప్పారు. నిందితుల్లో కొందరు 12 ఏళ్లుగా జైలులో ఉన్నారని, మరికొందరు ఏడేళ్లుగా కారాగారవాసం గడుపుతున్నారని తెలిపారు. తీర్పు పూర్తి పాఠం చదివిన తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. 

హైదరాబాద్‌ నగరంలో తొలి మానవబాంబు
హైదరాబాద్‌ నగరంలో తొలి మానవబాంబు 12 సంవత్సరాల క్రితం బేగంపేటలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో జరిగింది... దాడి చేసిన అనంతరం హర్కతుల్ జిహాద్ ఇస్లామి బంగ్లాదేశ్ అనే ఉగ్రవాద సంస్ద చెందిన ఉగ్రవాదులు తామే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు ప్రకటించారు....ఈ పేలుళ్లతో విధుల్లో ఉన్న హోంగార్దుతో పాటు ఉగ్రవాది మరణించాడు..దీనిపై వేసిన సిట్‌ దర్యాప్తు చేసి 20 మంది మీద నేరారోపణ చేస్తూ 10 మందిని అదుపులోకి తీసుకున్నారు...ఆ తర్వాత దాఖలు చేసిన చార్జిషీటుతో విచారణ మొదలయింది...12 ఏళ్లుగా కొనసాగిన విచారణ ముగియడంతో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు నిందితులు నేరం చేశారని పోలీసులు చూపలేక పోవడంతో 10నిందితులను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించింది.12సంవ్త్సరాల తర్వాత నిందితులు జైలు నుండి విడుదల కావడంతో వారి కుటుంబాలు ఆనంద వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు మాత్రం కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

21:46 - August 10, 2017

అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు అన్నారు. అనంతపురం జిల్లాలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన పాలకుల తీరుపై మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు కొత్తగా పోస్టులు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రధాని మోదీ.. ఈ మూడేళ్లలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. 70 లక్షల ఉద్యోగులను తొలగిచారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రాఘవులు డిమాండ్‌ చేశారు. 

21:45 - August 10, 2017

హైదరాబాద్ : శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ సభలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్‌ చేపట్టే పనులు పారదర్శకంగా లేవన్నారు. నిపుణులతో చర్చించకుండా, ప్రగతి భవన్‌ నుండి రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించరన్నారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ సభ కాదు, ఇది కేసీఆర్‌ రాజకీయ పునరుజ్జీవ సభ అని పొన్నాల ఎద్దేవా చేశారు.

21:44 - August 10, 2017

ఖమ్మం : సామాజిక తెలంగాణ లక్ష్యంగా టీ మాస్‌ పలు రకాల కార్యక్రమాలు కొనసాగిస్తోంది.. తాజాగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది. ర్యాలీ తర్వాత భక్తరామదాసు కళాక్షేత్రంలో టీ-మాస్‌ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టఫ్ నాయకురాలు విమలక్క, ప్రజాగాయకుడు గద్దర్‌ హాజరయ్యారు. తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని.. బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని వక్తలు అన్నారు.

21:43 - August 10, 2017

గుంటూరు : అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు అంకురార్పణ జరిగింది. బీఆర్‌శెట్టి మెడిసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలం దొండపాడు వద్ద నిర్మిస్తున్న.. మెడిసిటీలో మెడికల్‌ వర్సిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్యపరికరాల తయారీ యూనిట్‌, నాచురోపతి, యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మెడిసిటీలో 800 మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారు. రాబోయే రోజుల్లో దుబాయ్‌ నుంచి పెద్ద ఎత్తున అమరావతికి పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పారు. అమరావతి మెడికల్‌ హబ్‌గా మారబోతోందన్నారు. శెట్టి సంస్థలు వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి,ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, బీఆర్ శెట్టి హాజరయ్యారు.

21:42 - August 10, 2017

నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పున‌రుజ్జీవ‌ పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఆ త‌ర్వాత ప్రాజెక్టు వ‌ర‌ద కాలువ వ‌ద్ద ఉన్న పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పోచంపాడ్‌లో జ‌రిగిన‌ బ‌హిరంగ స‌భ‌లో సీఎం ప్రసంగించారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్షం చేశారని కేసీఆర్‌ మండిపడ్డారు. మేడిగ‌డ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు పూర్తి చేసి ఎస్సారెస్పీలో 90 టీఎంసీల నీళ్లు నింపుతామని చెప్పారు. గోదావరిని శాశ్వత జీవధారగా మారుస్తామన్న ఆయన..వ‌చ్చే జూన్ నాటికి ఎస్సారెస్సీని కాళేశ్వరం నీళ్లతో నింపుతామ‌న్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 45లక్షల ఎకరాలకు సాగునీరందించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.

త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఆయ‌క‌ట్టుకు
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకుండా కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారని అన్నారు. ప్రాజెక్టులపై కేసులు వేస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఎక్కడికక్కడ నిలదీయాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అతి త‌క్కువ ముంపు, అతి త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఆయ‌క‌ట్టుకు నీళ్లు అందించే ప్రాజెక్టు పోచంపాడు అని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జీవం పోసి సీఎం కేసీఆర్‌ రైతాంగాన్ని ఆదుకున్నార‌న్నారు. వ‌ర‌ద కాలువ‌ను రిజ‌ర్వాయ‌ర్‌గా మార్చి రైతుల‌కు రెండు పంటలు నీళ్లు అందిస్తున్న ఘ‌న‌త కేసీఆర్‌కు ద‌క్కుతుంద‌న్నారు.

ట్రాఫిక్ జామ్..
మరోవైపు నిజామాబాద్ సభకు టీఆర్ఎస్ శ్రేణులు- జనాలను భారీగా తరలించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా మంది రోడ్లపైనే ఇరుక్కుపోయారు. సభకు బయలుదేరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా... ఆర్మూర్ వద్ద 2 గంటల పాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు ఆయన సభకు హాజరుకాలేకపోయారు. మరోవైపు నిజామాబాద్‌ సభకు వచ్చే జనానికి మద్యం, డబ్బులు పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో వైన్స్‌ల ముందు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. మరికొందరు డబ్బుల కోసం వాగ్వాదానికి దిగారు.

21:06 - August 10, 2017

కరీంనగర్ : జిల్లా నేరెళ్ల ఘటనలో ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలకు పునుకుంది. సీసీఎస్ ఎస్ఐ రవీందర్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రవీందర్ అత్యుత్సాహంతోనే లాఠీ ఛార్జ్ చేశారని విచారణ కమిటీ తెల్చింది. సస్పెన్షన్ విసయాన్ని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

విజయవాడలో అమానుషం

విజయవాడ : చల్లపల్లిలో అమానుషం చోటుచేసుకుంది. గుర్తుతెలియని మహిళలు  ఆసుపత్రికి వెళ్తున్న గర్భిణీని అపహరించి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. ప్రసవ అనంతరం  తల్లిని రోడ్డుపై వదిలి పసికందుతో ఆ మహిళలు పరారైయ్యారు. బాధితులరాలు మోపిదేవి మండలం కొప్పిలిగడ్డ కొత్తపాలెంకు చెందినదిగా గుర్తించారు. 

ఆందోళన విరమించిన ఈసీ ఏఎన్ఎంలు

హైదరాబాద్ : నగరంలోని కోఠి డీఈ కార్యలయం ముందు ఈసీ ఏఎన్ఎంలు ఆందోళన విరమించారు. మంత్రి లక్ష్మారెడ్డి పిలుపతో  ఆందోళ విరమిస్తున్నట్లు వారు తెలిపారు. రేపు ఉదయం ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో లక్ష్మారెడ్డితో 10 మంది ఏఎన్ఎంలు చర్చలు జరపానున్నారు.

శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు జరిమానా

హైదరాబాద్ : కార్పొరేటు కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ జరిమానా విధించింది. రూ.1.17కోట్ల జరిమానాను ఇంటర్ బోర్డుకు కాలేజీ యాజమాన్యాలు చెల్లించాయి. శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు అడ్మిషన్లు, ఇతర అంశాల్లో నిబంధనలు ఉల్లఘించిందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది.

నేరెళ్ల ఘటనలో సీపీఎస్ ఎస్ఐ సస్పెండ్

కరీంనగర్ : జిల్లాలోని సిరిసిల్ల నేరెళ్ల ఘటనలో సీసీఎస్ ఎస్ఐ రంవీందర్ ను  సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ ఎస్ఐ అత్యుత్సాహం వల్లే ఘటన జరిగిందని నిర్ధారణ చేశారు.

20:15 - August 10, 2017

క్యాండీ క్రష్, జెల్లీ సాగా, కలర్ స్విచ్, పియానో టైల్స్, పొకెమాన్, టెంపుల్ రన్, ఇవన్నీ పాతబడ్డాయి. ఇప్పుడు ఓ డెత్ గేమ్ ఎంటరయింది. వచ్చీ రాగానే చావుమేళం మోగిస్తోంది. సరిగ్గా 50 రోజుల్లో చిన్నారుల ఉసురు తీస్తోంది. తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది. అసలు చావుతో ఛాలెంజ్ చేసే పరిస్థితి లేతబుగ్గల చిన్నారులకు ఎందుకు వస్తోంది? ఎవరా పరిస్థితి కారణమౌతున్నారు? ఈ డెత్ గేమ్ ల బారినుండి పిల్లలను కాపాడేదెలా?.... సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. మధ్యలో నానా రకాల ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. వీడియో గేమ్ లు తెలుసు.యాండ్రాయిడ్ గేమ్ లూ తెలుసు..గంటలకు గంటలు మొబైల్ లో యాంగ్రీ బర్డ్స్ నుండి టెంపుల్ రన్ వరకు...ఇలా అనేక గేమ్ లు ఆడేవాళ్లను చూస్తూనే ఉంటాం.. ఫేస్ బుక్ లో ట్యాగ్ చేసే వాళ్లనూ చూస్తుంటాం. కానీ, ఈ బ్లూ వేల్ సంగతేంటి? ఎందుకిలా ప్రమాదకరంగా మారింది. ఈ బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్ ఓ హిప్నాటిక్ గేమ్.. రష్యాలో 130మందికి పైగా టీనేజర్లు బలయ్యారు. చూడటానికి జస్ట్..ఓ మొబైల్ గేమ్ అనిపిస్తుంది .. కానీ, 10 నుంచి 14 ఏండ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట లేత మనసులను దారుణంగా వేటాడేస్తుంది. భావోద్వేగాలతో పసి హృదయాలను మృత్యుముఖంలోకి తోసేస్తుంది. ఈ ప్రాణాంతక క్రీడను రూపొందించిన సైకో డెవలపర్ ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట ఇంటర్నెట్ లో వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది.ఇప్పుడు బ్లూ వేల్ ఛాలెంజ్.. సవాల్ విసురుతోంది. నిన్నటిదాకా పోకెమాన్ సంచలనం కలిగించింది. అంతకుముందు ఛోకింగ్ గేమ్ ఊపిరి తీసింది. అన్నిటికీ కారణం స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్.. ఇప్పుడు సమాచారం కోసం కంటే... వినోదానికి, అంతకంటే వికృత చేష్టలకు ఎక్కువగా ఉపయోగపడుతోంది. సాంకేతిక ప్రగతి ఎంటర్ టైన్ మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అదే సమయంలో వినోదాన్ని హై ఎండ్ కి తీసుకెళ్లే అప్లికేషన్లు కొన్ని, ప్రమాదాల అంచుకు లాక్కెల్లే గేమ్ లు మరికొన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మనుషులు బయటి ప్రపంచాన్ని వదిలేసి వర్చువల్ వాల్డ్ కి పరిమితం అవుతూ సామాజిక జీవనాన్ని మరచిపోతున్నారు. కానీ, రెండంచుల కత్తిలాంటి టెక్నాలజీని వాడుకోవటంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు జీవితమే చేజారుతుంది. 

20:12 - August 10, 2017

శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథ్కం పేరు మీద ఇయ్యాళ పర్దలు గుంజిండు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. అమ్మటాళ్ల యాళ్లకు వొయ్యి.. శంకుస్థాపనలు జేశి.. ఆడనే ఏర్పాటు జేశ్న జన బహిరంగ సభల జర్రశేపు మాట్లాడిండు.. నా జన్మధన్యమైపోయింది అన్నడు.. నా అంత అదురుష్టవంతుడు ఈ భూమ్మీద ఎవ్వలుండరని గూడ అన్నడు..

ఏమాట కామాట జెప్పుకోవాలెగని.. ఎంతైనా టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీదికి ఎవ్వలు రారు.. వాళ్లు ఏ పనిజేశ్నా.. సాటుకు జెయ్యరు నేటుగనే జేస్తరు.. కాంగ్రెస్ పార్టోళ్లు, పువ్వుగుర్తోళ్లు, తెల్గుదేశమోళ్లు మందిని సభలకు దీస్కపోయేదుంటే సాటుసాటుకు పైకమిచ్చి తీస్కపోతరుగదా..? వీళ్లు అట్లగాదు మంది జూస్తుంటెనే ఇస్తరు.. ధైర్యం ఉండాలే అట్ల జేస్తందుకు గూడ ఏమంటరు..?

పోరగాళ్ల బడులు నడిస్తేంది నడ్వకపోతేంది..? ఊర్లపొంటి సర్కారు బస్సులు వస్తేంది రాకపోతేంది..? టీఆర్ఎస్ పార్టీ సభ సక్సస్ అయ్యిందా లేదా..? అదిగావాలెగని..? స్కూళ్లు బందువెట్టి బస్సులు ఎత్కపోయిండ్రు.. ఆర్టీసీ బస్సులు మొత్తం అటే మల్పుకున్నరు.. ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నరు.. బడిపోరగాళ్లు బజార్లపొంట తిర్గుతున్నరు గివ్వేం ముచ్చట్లుల్లా..? అన్నితెల్సినోళ్లు గూడ..

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు బుద్ది జ్ఞానం లేదంట.. ఈ మాట అంటున్నది ఎవ్వలో తెల్సా..? కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగ గెల్చిన నల్లగొండ ఆణిముత్యం.. పేదల పెన్నిధి.. టీఆర్ఎస్ సన్నిధి.. శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిగారూ... కర్ణాటక రాష్ట్రంల కాంగ్రెస్ గౌర్మెంటే అధికారంలున్నదిగదా..? ఆల్మట్టి నీళ్లు ఇడ్సిపెట్టుమని కాంగ్రెసోళ్లు వొయ్యి ఎందుకు అడ్గుతలేరు అంటున్నడు..

వారెవ్వ ఇన్నారుల్లా ఈ ముచ్చట..? బాసర సరస్వతి దేవతున్నదిగదా.? ఆమె ఉత్సవ విగ్రహాన్ని ఎత్కపోయి బైట పూజలు జేస్తున్నరట పూజారులు.. అంటే దేవుని తానికి భక్తులు గాదు.. భక్తుల తానికే దేవున్ని గొంచవొయ్యిండ్రట పుణ్య అయ్యగార్లు.. ముచ్చట లోకమంత వాకిపొయ్యింది.. అయ్యగార్లు నల్గురిని సస్పెండ్ జేశిండ్రట.. ఏం బట్టెవాయిగాళ్లు మోపైండ్రు సూడుండ్రి..

భక్త జనులు రామకోటో.. శివకోటో.. అయ్యప్పకోటో రాస్కుంటరుగదా..? మన వర్ల రామయ్య సారు జగన్ కోటి రాస్కుంటున్నడు.. ఆయన నోరు తెరిస్తె సాలు.. జగన్ అనే పదంతోనే మొదలు వెట్టి.. జగన్ అనే పదంతోనే ఒడ్సిపోతది స్పీచు.. అంత మంచి భక్తుడు సారూ.. అట్లనిజెప్పి టీడీపీకి ద్రోహం జేస్తున్నడేమో అనుకునేరు.. అందరి పెయ్యిల ఎర్ర రక్తం బారితే.. వర్లరామయ్య సారు పెయ్యిల పస్పురక్తనే పారుతాఉంటది..

గౌరవనీయులైన.. వానదేవునికి తెలంగాణ హోంమంత్రి వర్యులు శ్రీ నాయిని నర్సింహారెడ్డిగారి తర్పున వినమ్ర నమస్కారాలు.. అయ్యా మీరు గడిచిన మూడేండ్ల సంది వానలు సక్కగ వడేస్తలేరట.. నాయిని నర్సన్న ఫుల్ ఫీలైపోతున్నడు.. నీ అల్కకు కారణం ఏందో కనుక్కుందామంటున్నడు.. నాయిని నర్సన్న అసొంటి పెద్దమన్షిని బాధపెట్టుడు బాగలేదు కావట్టి రెండు గట్టి వానలు నర్సన్న మీదనే వడెతట్టు జూడు తండ్రి..

యోగకే యోగాసనాలు నేర్పిచ్చె మన్షి మన రాందేవ్ బాబా. దేశ భక్తితోని టోకున వ్యాపారం జేస్తున్న ఈ మన్షి.. ఇప్పుడు విదేశీ సీన్మల భర్తం బడ్తాంటున్నడట.. ఇప్పటికే విదేశీ వస్తువుల మీద దండయాత్రలు జేస్తున్నడుగదా..? ఇప్పుడు హాలీవుడ్ సీన్మను శీరి శింతకు గట్టె పనిలె చాల బిజీగున్నడట.. మరి ఏం జేయవోతున్నడన్న సంగతి సూడుండ్రి..

మల్లన్న ముచ్చట్లు జూస్తున్న ప్రేక్షకులారా..? మీకు అవార్డొచ్చింది.. మన వార్తలల్ల జర్ర జన్గు బెన్కు ఏముండదట.. ఏది జెప్పినా ధైర్యంగ జెప్తరు మీరు అని యువకళావాహిని నాట్స్ సంస్థోళ్లు మీకు అవార్డు ఇచ్చిండ్రు.. ఇది మల్లన్న ముచ్చట్లకొచ్చిందంటే.. మీకొచ్చినట్టే గావట్టి మీ అందరికి అంకిత మిస్తున్నం ఈ అవార్డు.

19:47 - August 10, 2017

సింగర్ మధుప్రియతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. మధుప్రియ మాట్లాడుతూ ఫిదా సినిమాలో తన పాడిన పాట లైఫ్ గుర్తుండిపోయే పాటని, బిగ్ బాస్ షో నుంచి మొదట చేసిన పని ఫిదా సినమా చూడడమే అని ఆమె అన్నారు. బిగ్ బాస్ షో తను ఉండలేకపోయనని, అందరితో దూరంగా ఉన్న ఫిలింగ్ తనకు వచ్చిందని మధుప్రియ అన్నారు. తను కావాలనే బిగ్ బాస్ షో ఎలిమినెట్ చేయించుకున్నానని ఆమె తెలిపారు. బాగ్ బాస్ ఎన్టీఆర్ అన్న తనను స్వంత చెల్లిల చూసుకునే వారని, ఇప్పటి వరకు బిగ్ బాస్ షో ఉంటే ఎన్టీఆర్ అన్నకు రాఖీ విషెస్ తెలిపెదాన్ని అని మధుప్రియ అన్నారు. మధు ప్రియ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో క్లిక్ చేయండి.

19:07 - August 10, 2017

కర్నూలు : సీఎంను ఉరితీయలన్న జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ నంద్యాల 9వ వార్డులో మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. జగన్ మీద ఈసీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:03 - August 10, 2017

ఢిల్లీ : తమిళనాడులోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను.. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానానికి ఎదిగానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. బ్రాహ్మణకుటుంబానికి చెందిన తాను.. సూఫీ, రాజ్‌పుత్‌ దంపతులకు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. తన కుమారుడు ఓ ఇండియన్‌ అని రాజ్యసభలో ఏచూరి చెప్పారు. ఫేర్‌వెల్‌ సమావేశంలో పాల్గొన్న ఏచూరి సభలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

19:02 - August 10, 2017
18:59 - August 10, 2017

గుంటూరు : విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎస్ఎఫ్ఐఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు... వినూత్న నిరసన చేపట్టారు. చెట్ల కింద చదువుతూ తమ సమస్యలను తెలియజేశారు. విజయనగరంలో...ఎంఆర్‌ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్‌ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను పెంచాలని, విద్యాసంస్థలల్లో మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

ఫీజుల దోపీడిని అరికట్టాలి...

రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా కడప జిల్లాలోనూ విద్యార్థులు నిరసన బాట పట్టారు. విద్యార్థి నాయకులు... తెరిచి ఉన్న పాఠశాలలను, కళాశాలలను బంద్‌ చేయించారు. కార్పొరేట్‌, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపీడిని అరికట్టాలని.. డిమాండ్‌ చేశారు. అటు ప్రకాశం జిల్లాలోనూ విద్యార్థులు.. ఆందోళనలో భాగమయ్యారు. తరగతులు బహిష్కరించి... నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ధర్నా నిర్వహించి..ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా పలు చోట్ల ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది.

 

18:58 - August 10, 2017

తూర్పు గోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది.. చివరిరోజు దాదాపు 200మంది నామినేషన్లు వేశారు.. మొత్తంగా 48 డివిజన్లకు 330మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.. మరిన్ని వివరాలకు వీడియో చూడండి. 

18:57 - August 10, 2017

తూర్పు గోదావరి : కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసంలో రాష్ట్ర కాపు జెఎసీ సమావేశాన్ని నిర్వహించారు. పదమూడు జిల్లాలకు చెందిన కాపు నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమని, పాదయాత్రకు అనుమతివ్వాలని పోలీసులను కోరారు. 

18:56 - August 10, 2017

గుంటూరు : రాబోయే రోజుల్లో దుబాయ్‌ నుంచి పెద్ద ఎత్తున అమరావతికి పెట్టుబడులు వస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తాయని చెప్పారు.. అమరావతి మెడికల్‌ హబ్‌గా మారబోతోందన్నారు.. దొండపాడులో బీఆర్ శెట్టి మెడ్‌సిటీ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, బీఆర్ శెట్టి హాజరయ్యారు.

18:54 - August 10, 2017

కర్నూలు : ఓటమి భయంతోనే వైసీపీ అధినేత జగన్‌.. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్‌ వ్యాఖ్యలపై మరోసారి ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:53 - August 10, 2017

హైదరాబాద్ : నంద్యాల బైపోల్‌పై తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ స్పందించారు. జగన్‌ సంజాయిషీపై జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరినట్లు తెలిపారు. నివేదిక రాగానే ఎన్నికల కమిషనర్‌కు పంపుతామన్నారు. ఈ నెల 23 ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఇందుకోసం 255 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 28న ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుందని భన్వర్‌ లాల్ తెలిపారు. 

18:52 - August 10, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌.. గోస్పాడు మండలం దీబంగుట్లలో రోడ్‌ షో చేపట్టిన జగన్‌.. సీఎం చంద్రబాబు చేసిన నేరాలకు, మోసాలకు ఏ శిక్ష వేసినా తప్పులేదన్నారు.. మోసాలు, అన్యాయాలు చేసే చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తక్కువే అంటూ వ్యాఖ్యానించారు.

18:50 - August 10, 2017

తూర్పూ గోదావరి : కాకినాడ రూరల్ తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం రణరంగంగా మారింది. పంచాయతీ చెరువులో నిర్మించిన మండపం కూల్చివేసిన ఘటనపై డివిజనల్ పంచాయతీ అధికారి సమక్షంలో విచారణ జరుగుతోంది. విచారణకు వచ్చిన ఇరువర్గాలు... ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ... బాహాబాహీకి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో.. గమనించిన అధికారి... విచారణ వాయిదావేస్తూ వెనుదిరిగారు.

18:22 - August 10, 2017

గుంటూరు : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విపక్షాలు కూడా ఇదే అంశంపై అనేకసార్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సీఎం చంద్రబాబు అధికారులను పదేపదే హెచ్చరించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీపుల్‌ ఫస్ట్‌ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ముందుగా ప్రజలే లబ్ది పొందాలన్న భావనతో పీపుల్‌ ఫస్ట్‌ అనే కార్యక్రమం తీసుకొచ్చారు.

ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ 
సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం అనర్హులు లబ్ది పొందితే ప్రభుత్వానికి తెలియజేయం ఈ కార్యక్రమ ముఖ్యొద్దేశం. ప్రజల దగ్గరికే వెళ్లి... వారి నుంచే సమాచారాన్ని సేకరిస్తారు. ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వెళ్లనున్నారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు అంతా పల్లెబాట పట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాధిపతుల నెలలో ఏడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని , రెండు రోజులు పాటు గ్రామాల్లో రాత్రి నిద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు వారంలో రెండు రోజులు పాటు గ్రామాల్లో పర్యటించి.. ఒక రోజు గ్రామంలో నిద్ర చేయాలని ఆదేశించింది. ఇక జిల్లా స్థాయి అధికారులు కూడా వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని సూచించింది. మండల స్థాయి అధికారులు వారి ఉద్యోగ సమయాన్ని బట్టి, 10 నుండి 15రోజుల పాటు గ్రామాలకు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగులంతా పల్లెలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి.. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు. అధికారులు సేకరించిన వివరాలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక వెబ్ సైట్ రూపోందిస్తుంది. అధికారులు సేకరించిన సమాచారాన్ని ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విశ్లేషణ జరిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతినెలా మొదటివారంలో అందజేస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఉద్యోగులను ప్రజల్లోకి పంపాలన్న నిర్ణయం తీసుకున్నారు. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

18:20 - August 10, 2017

ఖమ్మం : ఇక్కడ పూజలు చేస్తున్న వారంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం డివిజన్‌లోని రైతులు. వానలు వచ్చి.. తమ పంటలు పండాలని వరుణుడికి పూజలు చేస్తున్నారు. ఓవైపు వీరిని ఆదుకోవాలని ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు తవ్విస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో వాటి పని తీరు సరిగా లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.నూతనంగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని భద్రాచలం డివిజన్‌లో మిషన్ కాకతీయ పనుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది.. అయితే చెరువుల నిర్మాణం పనుల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల పనితీరును తనిఖీ చేయకుండా అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని.. కోట్ల రూపాయలను జేబుల్లో నింపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం...
చెరువుల నిర్మాణంలో అధికారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువుల వద్ద అలుగులు, తూములు, గేట్లు నిర్మించాల్సి ఉండగా.. పాత తూములపైనే ఎత్తు పెంచి నిర్మాణాలు తూతూ మంత్రంగా చేపడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దానితో తమ పొలాల్లోకి నీరు వచ్చి పంటలు పండుతాయనుకుంటే తమ ఆశలు అడియాశలే అయ్యాయని రైతులు వాపోతున్నారు. మిషన్ కాకతీయ చెరువుల నిర్మాణంపై డివిజన్ ఈఈని వివరణ కోరగా అదంతా ఒట్టిదేనని కొట్టిపారేశారు. చెరువుల నిర్మాణం పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 

'మా ఉపాధిని దెబ్బతీయొద్దంటూ మేయర్ కు విజ్ఞప్తి'

హైదరాబాద్: మేయర్ బొంతు రామ్మోహన్ ను జీహెచ్ ఎంసీ వీధి దీపాల ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిశారు. తమ ఉపాధిని దెబ్బతీయొద్దంటూ మేయర్ కు విజ్ఞప్తి చేశారు. ఈఈ ఎస్ ఎల్ చేపడుతున్న ఎల్ ఈడీ ప్రాజెక్టులో తమను కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. కొంత మందినే విధుల్లోకి తీసుకుంటామంటున్న అధికారులు 3 రోజులుగా వీధి దీపాల పనులు నిలిచిపోయాయి.

పాదయాత్ర చేసి తీరుతా : ముద్రగడ

తూ.గో: పాదయాత్ర చేసి తీరుతా అని ముద్రగడ తేల్చి చెప్పారు. ఎన్నిసార్లు అడ్డుకున్నా వెనకడుగు వేసేది లేదన్నారు. కాపు జేఏసీ అభిప్రాయాలకు అణుగుణంగా కార్యాచరణ ఉంటుందని, చంద్రబాబు హామీ నిలుపుకుంటే ఆందోళన చేయాల్సిన అవసరం ఉండదన్నారు.

 

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

మేడ్చల్ : ఘట్ కేసర్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రజుపోతు కిరణ్ (32) అనేక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ వద్ద నుండి 34 గంజాయి ప్యాకెట్లు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

కేసీఆర్ ఏక్ నంబర్, కేటీఆర్ దస్ నంబర్: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కోసం పోరాడిన జాతులే ఇపుడు బాధలు పడుతున్నాయని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను ప్రశ్నిస్తే దాడులు, నందలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏక్ నంబర్, కేటీఆర్ దస్ నంబర్ అని, నేరళ్ల బాధితులను లాఠీలతో తొక్కించారని, నేరెల్ల బాధితులపూ కేసులు విరమించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఇసుక వ్యాపారం చేయలేదని తెలిపారు. జీఎస్టీ మీద న్యాయస్థానానికి వెళతామంటున్న కేసీఆర్.. మల్లన్న సాగర్ బాధితులు కోర్టుకు వెళ్లొద్దా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం, మీడియాపై పక్షపాత వైఖరి మానుకోవాలని రేవంత్ సూచించారు.

పలువురు కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి నారా లోకేష్

హైదరాబాద్: ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆ శాఖ సెక్రటరీ జితేందర్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అమర్జీత్ సిన్హా లతో భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకంలో ఏపీకి మెటీరియల్ బడ్జెట్ కింద రావాల్సిన రూ. 1352.81 కోట్లు, లేబర్ కింద రావాల్సిన రూ. 600కోట్లు త్వరగా విడుదల చేయాలని, 4772 కి.మీ రోడ్డు నిర్మాణం కోసం రూ.3,185 కోట్లు ఇవ్వాలని కోరానని లోకేష్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నుండి రావాల్సిన రెండో విడత నిధులు రూ. 165 కోట్లు విడదుల చేయాలని కోరినట్లు తెలిపారు.

17:27 - August 10, 2017

కడప : కడప జిల్లాలో చాలా ఏళ్ల నుంచి అన్నీ తానే అన్నట్టుగా సీఎం రమేశ్ వ్యవహరిస్తుంటారు. ప్రతీ నెలా జిల్లాలో కనీసం రెండు, మూడు సార్లయినా పర్యటించి.. ప్రభుత్వ పథకాల ప్రారంభ కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. జిల్లా తెలుగు దేశం పార్టీకి తానే పెద్ద దిక్కు అన్నట్టు ఉండేది సీఎం రమేశ్ వ్యవహారం. కానీ ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాక పరిస్థితి మారిపోయింది. సీఎం రమేశ్ కంటే పార్టీ శ్రేణులు మంత్రి ఆదినారాయణ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో పాటు జిల్లా పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఆదినారాయణ రెడ్డి వెంటే నడుస్తోంది. సీఎం రమేశ్‌కు ప్రాధాన్యం తగ్గినప్పటి నుంచి.. మంత్రి ఆదినారాయణ రెడ్డితో సైలెంట్‌ వార్‌ నడుపుతున్నారు సీఎం రమేశ్.

అధిపత్యం..
సీఎం రమేశ్‌, మంత్రి నారాయణ రెడ్డిలిద్దరిదీ జమ్మలమడుగు నియోజకవర్గమే. నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టున్న వ్యక్తి మంత్రి ఆదినారాయణ రెడ్డి. సీఎం రమేశ్‌కు రెండు, మూడు గ్రామాల్లో.. యర్రగుంట్ల మున్సిపాలిటీలో కొంత వరకు పట్టుంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆధిపత్యాన్ని సహించలేని సీఎం రమేశ్.. యర్రగుంట్ల మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులు ప్రారంభించడానికి.. అవసరమైన రిసొల్యూషన్‌ ఇవ్వకుండా తన వర్గం కౌన్సిలర్లతో అడ్డుకున్నాడు. దీంతో మంత్రి ఆది.. సీఎం రమేశ్ సొంతూరు పోట్లదుర్తి సమీపంలోని హనుమాన్‌ గుత్తి పంచాయితీలో కోటి రూపాయల అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకున్నారు. దీంతో పాటు జమ్మలమడుగులో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి బదిలీ విషయంలో కూడా మంత్రి సిఫార్సులను సీఎం రమేశ్ అడ్డుకోవడంతో.. ఇరువురి మధ్య వార్‌ తారాస్థాయికి చేరుకుంది. ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరులో నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడుతోందని స్థానికులు వాపోతున్నారు. పార్టీ అధినేత వీరిద్దరి మధ్య రాజీ కుదర్చకపోతే పార్టీకే నష్టమని సీనియర్ నేతలు చెబుతున్నారు. 

17:25 - August 10, 2017

విశాఖ : స్వర్ణ భారతి ఇండోర్‌ స్టేడియం వేదికగా జరిగే... ఎల్‌ఐసీ 'సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ లెవెల్‌ క్యారమ్స్‌, చెస్‌ టోర్నమెంట్‌' పోటీలను... జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 37 మంది పురుషులు, 36 మంది మహిళా క్రీడాకారులు తలపడతారని నిర్వాహకులు చెప్పారు. సౌత్‌జోన్‌ పరిధిలోని ఉన్న కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పనిచేస్తున్న ఎల్‌ఐసీ ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. రెండో రోజు సాయంత్రం 4 గంటలకు వేదిక వద్దే బహుమతుల ప్రదానం కూడా ఉంటుందని వివరించారు. 

17:24 - August 10, 2017

పశ్చిమ గోదావరి : ఎలమంచిలి మండలం... కొంతరు గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్‌కుమార్‌ ఆరు వేల రూపాయల లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు. సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన... కాంట్రాక్టర్‌ లక్ష్మణరావు .. బిల్లు కోసం ...పంచాయతీ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ను సంప్రదించగా... అతను లంచం డిమాండ్ చేశాడు. బిల్లు డబ్బులు సురేష్‌ కుమార్‌ ఖాతాలో పడగా ... అవి డ్రా చేసి ఇచ్చేందుకు అతను లంచం డిమాండ్‌ చేశాడు.. దీంతో లక్ష్మణరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.   

17:23 - August 10, 2017

హైదరాబాద్ : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని...హైదరాబాద్‌..ఉప్పల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు. పోషక ఆహారం... పరిశుభ్రతలు పాటించడంతో... నులిపురుగుల సమస్య తీరుతుందని కలెక్టర్‌ సూచించారు. మేడ్చల్‌ జిల్లా వ్యాప్తంగా 36 లక్షల నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా... 19 సంవత్సరాలు లోపు వారికి నులి పురుగుల నివారణ మాత్రలను అందించారు.

17:22 - August 10, 2017

ప్రకాశం : ఒంగోలు... కొత్తపట్నం బస్టాండ్‌లో... దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో రామారావు అనే వ్యక్తి... ఓ మహిళపై దాడి చేశాడు. గత కొంతకాలంగా పాదర్తి గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ....ఒంగోలుకు చెందిన రామారావు సహజీవనం సాగిస్తున్నారు..అయితే వెంకటేశ్వరమ్మ వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రామారావు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడిలో వెంకటేశ్వరమ్మ మెడ, తలపై తీవ్రగాయాలైయ్యాయి.. గాయపడిన వెంకటేశ్వరమ్మను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

17:21 - August 10, 2017

అనంతపురం : జీఎస్టీ పేరుతో ప్రధాని నరేంద్రమోదీ తుగ్లక్‌ పాలనను మరిపిస్తున్నారని..సీపీఐ ఆరోపించింది. జీఎస్టీకి వ్యతిరేకంగా అనంతపురం సీటీవో కార్యాలయం వద్ద సీపీఐనాయకులు నిరసన తెలిపారు. దేశంలో జీఎస్టీ పేరుతో కేంద్రప్రభుత్వం పేదలనడ్డి విరచి..సంపన్నులకు హారతులు పడుతున్నారని విమర్శించారు. కుటీర పరిశ్రమలు, చేనేత వర్గాలకు సైతం 28శాతం జీఎస్టీవిధించడంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఉందని తద్వారా ఉపాధి రంగాలు కనుమరుగవుతాయని అన్నారు. వెంటనే కేంద్రం స్పదించి జీఎస్టీపై పునరాలోచించి పేదవర్గాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

17:19 - August 10, 2017

కామారెడ్డి : సీఎం కేసీఆర్‌ సభకు భారీగా బస్సులు తరలించడంతో... కామారెడ్డి జిల్లా... బాన్స్‌వాడలో విద్యార్థులు , ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవన పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ప్రైవట్‌ పాఠశాలలను బస్సులను... సుమారు 80 RTC బస్సులను అక్కడకి తరలించారు. దీంతో స్థానికులు బస్సులు లేక నానా పాట్లు పడుతున్నారు. గమ్యానికి చేరుకోవడానికి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. 

17:18 - August 10, 2017

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా... పఠాన్‌చేరు పట్టణంలో జీఎమ్‌ఆర్‌ కన్వేన్షన్‌ సెంట్ర్‌లలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో ఉద్యోగం రాకపోయినా.. అభ్యర్థులు అధైర్యపడకూడదని... అందరికీ ఉద్యోగాలు వస్తాయని మహిపాల్‌రెడ్డి అన్నారు. అందరూ మంచి స్థాయిలో స్థిరపడతారని ఆకాంక్షించారు. కాగా ఈ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. 

17:17 - August 10, 2017

గుంటూరు : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ... గుంటూరులోని రైల్వే ఇనిష్యూట్‌లో... రైతు రుణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పార్టీ నాయకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆమ్‌ ఆద్మీ పార్లమెంట్ సభ్యులు భగవంత్‌మాన్‌, సోమనాధ్‌ భారతి హాజరవుతారని తెలిపారు. దేశంలో రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని... ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు రుణమాఫీ చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ దేశ వ్యాప్తంగా రైతు రుణభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.  

17:16 - August 10, 2017

విజయవాడ : రాజీవ్‌గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. చెన్నై నుంచి బయలుదేరిన రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు.. విజయవాడలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. రాజీవ్ జ్యోతి సద్భావనా యాత్ర ను ప్రతీ ఏటా నిర్వహిస్తున్నామని మీసాల రాజేశ్వరరావు అన్నారు. రాజీవ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. 

17:15 - August 10, 2017

విజయవాడ : రైతాంగ సమస్యలపై విజయవాడలోని ప్రెస్‌ క్లబ్‌ రైతు సంఘం నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని ఆరోపించారు. భూములపై ప్రశ్నించిన రైతులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రైతాంగ సమస్యలపై వచ్చే నెల విజయవాడలో భారీ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని రైతు సంఘం నేతలు తెలిపారు. 

17:14 - August 10, 2017

అనంతపురం : టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని... సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఒక్క నంద్యాల ఉపఎన్నికకు కోట్లు ఖర్చు పెడుతోందని మండిపడ్డారు.. జన్మభూమి కమిటీలు రాక్షస కమిటీలని ఫైర్ అయ్యారు.. దళితుల మీద దాడులు చేయడం, వారి భూములు లాక్కోవడం, శ్మశానాలను కబ్జా చేయడంలో ఈ కమిటీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.. అనంతపురంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు మధు హాజరయ్యారు.. మూడురోజులపాటు ఈ సమావేసాలు కొనసాగనున్నాయి. 

17:12 - August 10, 2017

హైదరాబాద్ : సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ టీడీపీ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేసింది. ఈ ఎగ్జిబిషన్‌లో నేరెళ్ల బాధితుల ఫొటోలను ప్రదర్శించారు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు L రమణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, జస్టిస్‌ చంద్రకుమార్‌ ఎగ్జిబిషన్‌లోని ఫొటోలను చూశారు.. నేరెళ్లలో ఇంత జరుగుతున్నా బాధితులను పరామర్శించే తీరిక సీఎం కేసీఆర్‌కులేదా? అని నేతలంతా మండిపడ్డారు.

17:11 - August 10, 2017

వనపర్తి : మహబూబ్‌ నగర్‌ జిల్లా వనపర్తిలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. సాగునీటి సౌకర్యం పుష్కలంగా ఉండే కరీంనగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పునరుజ్జీవనానికి రెండు వేల కోట్ల మంజూరుకు నిరసనగా ఆయన ఒక్కరోజు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్ డీఎస్ ప్రాజెక్టు పునరుజ్జీవంపై కేసీఆర్‌ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. 

17:10 - August 10, 2017

హైదరాబాద్ : లాంటి అనారోగ్య సమస్యలున్నా గాంధీ ఆస్పత్రికి వచ్చి చూపించుకోవాలని... ప్రజలను కోరారు. గవర్నర్‌ నరసింహన్‌... ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితి మారిందని.. మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని సూచించారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 65 పడకల ICUను నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ‌, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, మంత్రులు ల‌క్ష్మారెడ్డి, నాయిని న‌ర్సింహ‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్, ప‌ద్మారావు, ఎంపీ కేకే, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పాల్గొన్నారు.

17:09 - August 10, 2017

కరీంనగర్ : పోచంపాడులో జరిగే సీఎం కేసీఆర్ సభకు రాకుంటే 5వందల రూపాయలు జరిమానా కట్టాలని మహిళా గ్రూపుల లీడర్లు తమను బెదిరించినట్లు మహిళలు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కురావు పేట, బసునూర్ లంబడి తండా గ్రామాల నుంచి గ్రూపు లీడర్ల బెదిరింపులకు భయపడిన మహిళలు కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. 

17:08 - August 10, 2017

నిజామాబాద్ : సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్థానికులను తరలించడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గులాబీ నేతల అత్యుత్సాహంతో... చాలా మంది రోడ్లపైనే ఇరుక్కుపోయారు. సభకు బయలుదేరిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా... ఆర్మూర్ వద్ద 2 గంటల పాటు ట్రాఫిక్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు అతికష్టం మీద.. కేటీఆర్‌ నిజామాబాద్ చేరుకున్నారు.

17:07 - August 10, 2017

నిజామాబాద్ : తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ప్రాజెక్టులపై కేసులు వేస్తూ కోర్టులకు వెళ్తున్నారని.. దీంతో ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరగడం లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.  

17:05 - August 10, 2017

నిజామాబాద్ : వచ్చే సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు లోగా కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును నింపుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ నింపితే.. నిజామాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల రైతాంగానికి రెండు పంటలు పండించుకునే అవకాశం వస్తుందని అన్నారు. ఎస్సారెస్పీకి 54 ఏళ్ల జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారని.. అయితే అది ఇంత వరకు పూర్తి చేయలేదన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు బాగుండాలనేదే తన ధ్యేయమని సీఎం కేసీఆర్‌ అన్నారు.

17:04 - August 10, 2017

నిజామాబాద్ : ఒక్క ఊరు మునగకుండా, ఒక్క ఇళ్లు మునగకుండా అతి తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్న పోచంపాడు పునరుజ్జీవ ప్రాజెక్టుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్‌ నేతలు అడ్డుతగలడం సరికాదని ఆయన అన్నారు.

17:03 - August 10, 2017

కర్నూలు : నంద్యాల సాంబవరంలో వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికను న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న యుద్ధంగా చూడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇప్పటివరకు ఏ హామీ నెరవేర్చలేదని ఆరోపించిన జగన్‌.. ప్రజలు ధర్మంవైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు రాగానే బాబుకు నంద్యాల అభివృద్ధి గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. 

17:03 - August 10, 2017

కరీంనగర్ : ఎస్సారెఎస్పీ పునరుజ్జీవన సభను విజయవంతం చేయడానికి టీఆర్‌ఎస్ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కరీంనగర్ నుంచి పోచంపాడుకు బస్‌లలో భారీగా జనాన్ని తరలించేందుకు నేతలు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కిపోయారు. తీగల గుట్టపల్లిలో ప్రైవేటు బస్సులో సభకు తరలిస్తున్న వారందరికి ఒక్కొక్కరికి 5 వందల రూపాయలు చొప్పున పంచిపెట్టారు. అధినేత ఎదుట సత్తా చాటుకునేందుకు నేతలు ఇలా జనాలకు డబ్బులు ఎర వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

17:02 - August 10, 2017

నిజామాబాద్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవన పథకానికి సీఎం కేసీఆర్ ఘనంగా శంకుస్థాపన చేశారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌ ఆధునీకరణ పనులు పూర్తయితే జలాశయం ఏడాది అంతా జలకళతో కళకళలాడనుంది. రైతులకు 2 పంటలకు సాగునీరు అందనుంది. రివర్స్ పంపింగ్‌ విధానం ద్వారా ప్రాజెక్ట్‌ను నింపనున్నారు. 1067 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం పోచంపాడులో జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఊరట

చెన్నై: మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఊటర లభించింది. సీబీఐ నోటీసులపై హై కోర్టు స్టే ఇచ్చింది. ఆదాయపు పన్ను కేసులో గతంలో కార్తీకి నోటీసులు జారీ అయ్యాయి.

నంద్యాల ఉప ఎన్నిక పై భన్వర్ లాల్ స్పందన..

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి భన్వర్‌లాల్ మీడియాకు వెల్లడించారు. జగన్ సంజాయిషీ తమకు అందిందని, ఆయన సంజాయిషీపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరామని భన్వర్‌లాల్ తెలిపారు. ఆ నివేదిక అందగానే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని ఆయన స్పష్టం చేశారు. నేతలెవరైనా హుందాగా మాట్లాడాలని, వ్యక్తిగత దూషణలు చేయవద్దని భన్వర్‌లాల్ సూచించారు. ఇది ఓటర్లకు కూడా అర్థం అవుతుందని చెప్పారు. కొంత మంది మంత్రులపైన కూడా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తక్కువే: జగన్

కర్నూలు : నంద్యాల బై పోల్ లో జగన్ మరో సారి సీఎం చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు. గోస్పాడు మండలం దీబంగుట్లలో జగన్ రోడ్ షో నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...చంద్రబాబు చేసిన నేరాలకు, మోసాలకు ఏ శిక్ష వేసినా తప్పు లేదన్నారు. అంతే కాకుండా మోసాలు, అన్యాయాలు చేసే చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తక్కువేనన్నారు.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 256 పాయింట్ల నష్టంతో 31,531 వద్ద సెన్సెక్స్, 88 పాయింట్ల నష్టంతో 9,520 వద్ద నష్టంతో నిఫ్టీ ముగిసింది

సీపీ గౌతమ్ సవాంగ్ ను నియమించడపై అభ్యంతరం

విజయవాడ: సీపీ గౌతమ్ సవాంగ్ ను విచారణ అధికారిగా నియమించడపై ఆయేషా మీరా తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రోజా క్షమాపణలు చెప్పాలి: మంత్రి అఖిల ప్రియ

కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా నాగిరెడ్డి మృతి చెందిన అనంతరం కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు అసెంబ్లీకి వెళితే తప్పుపట్టడం సరికాదని మంత్రి అఖిల ప్రియ వ్యాఖ్యానించారు.

15:49 - August 10, 2017

ముంబై:‘వోగ్‌’ బ్యూటీ అవార్డ్స్‌ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్‌ కుటుంబం హాజరయ్యారు. ఈవెంట్‌లో కుటుంబం మొత్తంలో ఐశ్వర్యరాయ్‌.. అమితాబ్‌ పెద్ద మనవరాలు నవ్య నవేలీ నందలు హైలైట్‌గా నిలిచారు. ఈవెంట్‌లో నవ్య తన మేనత్త ఐశ్వర్య పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దాంతో ఈఫొటో కాస్తా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ ఫొటోకి తెగ లైక్‌లు కామెంట్లు ఇచ్చేస్తున్నారు. మరి మీరేంటారు...

15:47 - August 10, 2017

ఢిల్లీ : సీతారాం ఏచూరి రాజ్యసభలో మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను వివరించారు. తను బ్రహ్మణున్ని కాదు, హిందువును కాదు, ముస్లింను కాదు, క్రిస్టియన్ కాదు భారతీయున్ని అని తెలిపాడంతో సభలో అందరు ఆయనను అభినందించారు. 

సీఎం కేసీఆర్ సభలో హోర్డింగ్ ఎక్కిన బాలిక..

నిజామాబాద్: బాల్కొండలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో కలకలం చెలరేగింది. తనకు ఇల్లు కేటాయించాలని పోచంపాడుకు చెందిన ఓ బాలిక హోర్డింగ్ ఎక్కింది.

'ఆయేషా మీరా' హత్య కేసు.. సిట్ ఏర్పాటు

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసులో పునర్విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో సిట్ బృందం ఏర్పాటు అయింది. సభ్యులుగా డీఎస్పీలు హేమావతి, శ్రీలక్ష్మి, సీఐ సాహేరా వున్నారు. పనర్విఆచరణ చేసి డీజీపికి సిట్ నివేదిక ఇవ్వనుంది.

15:30 - August 10, 2017

హైదరాబాద్: దాదాపు రెండున్న‌ర ఏళ్ళ త‌ర్వాత భూమి అనే చిత్రంలో న‌టించిన సంజ‌య్ ద‌త్ తాజాగా త‌న చిత్ర ట్రైల‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ ట్రైల‌ర్ ప్ర‌తి ఫేం ఆడియ‌న్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ట్రైల‌ర్ చూసిన ఫ్యాన్స్ మూవీపై భారీగా హోప్స్ పెట్టుకున్నారు. చిత్రం త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భూమి చిత్రం తండ్రి, కూతురు నేపథ్యంలో రూపొందుతుండగా ఇందులో సంజయ్ కూతురిగా అదితి రావు హైదరి నటిస్తుంది. సందీప్ సింగ్ మరియు భూషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టీ- సిరీస్ బేనర్ పై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 22, 2017న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా ఈ చిత్రం ఫ్యాన్స్ కి ప‌క్కా ట్రీట్ ఇస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ మూవీ పూర్తైన త‌ర్వాత సంజ‌య్ ద‌త్ మ‌రికొన్ని సినిమాలు చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం అవి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.

15:21 - August 10, 2017

తూర్పుగోదావరి : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదరలేదు. బీజేపీ అభ్యర్థులు 34 డిజనల్లఓ నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు యనమల, మాణిక్యాలరావు చర్చర విఫలం కావడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

బిజెపి-టిడిపి మధ్య కుదరని పొత్తు

తూ.గో: కాకినాడ కార్పొరేషన్ లో టిడిపి- బిజెపి మధ్య పొత్తు కుదరలేదు. మంత్రులు యనమల, మాణిక్యాలరావు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. 34 వ డివిజన్లో బిజెపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ రోజు మధ్యాహ్నాం 3 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగిసింది.

కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలి: సీఎ కేసీఆర్

నిజామాబాద్: ప్రాజెక్టు పై ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలి అని కేసీఆర్ సూచించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...త్వరలో రైతులకు త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తామన్నారు. వచ్చే వేసవి నుంచి 24 గంటల పాటు విద్యుత్ ఇస్తామన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఉత్తర తెలంగాణను సస్యశ్యామం చేసే వరకు కృషి చేస్తానన్నారు.

14:54 - August 10, 2017

మహిళలపై హింస అనాధిగా కొనసాగుతునే ఉంది. ప్రస్తుతం అది పలు రూపల్లో విస్తరిస్తోంది. ఈ విషయం ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటున్నాం. దీనికి పరిష్కరం కనుచూపు మేర కానరావడం లేదు. మహిళల కోసం ఎన్నో చట్టలున్నాయి. అవి మహిళ హక్కుల కోసం పోరాడి సాధించుకున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింట హింసలకు గురౌతున్న మహిళ రక్షణ కోసం రూపొంందించిన చట్టం 498ఏ చట్టం. ఈ చట్టం సాక్ష్యత్ దేశ సర్వోన్నత న్యాయస్థానం పురుషులకు ఊరట కలిగిస్తూ మార్గదర్శకాలు విడుదలు చేసింది. ఈ అంశంపై నేటి మానవి ఫోకస్ మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

డోక్లామ్ ద‌గ్గర ఉన్న గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న ఆర్మీ...

ఢిల్లీ: ఇండియా, చైనా, భూటాన్ ట్రైజంక్ష‌న్ ద‌గ్గ‌ర ఉన్న వివాదాస్ప‌ద ప్రాంతం డోక్లామ్ ద‌గ్గర ఉన్న గ్రామాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. ఇండియా యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న‌దా? ఇండియ‌న్ ఆర్మీ తీసుకుంటున్న చ‌ర్య‌లు ఆ దిశగా సంకేతాన్నిస్తున్నాయి. నాతంగ్ అనే ఈ గ్రామంలో కొన్ని వంద‌ల మంది నివ‌సిస్తున్నారు. వీళ్లంతా వెంట‌నే ఖాళీ చేసి వెళ్లిపోవాల‌ని ఆర్మీ స్ప‌ష్టంచేసింది. డోక్లామ్‌కు ఈ గ్రామం 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

ఏడాదిలో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం: కేసీఆర్

పోచంపాడు : ఏడాదిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ...సమైక్యాంధ్రలో ఎన్నడూ తెలంగాణ ప్రాజెక్టుల పై దృష్టి సారించలేదన్నారు. బాబ్లీ పూర్తైన నాటి నుంచి ఎస్సారెస్పీ ఎప్పటికీ ఎండే పరిస్థితి ఉండదన్నారు. కాళేశ్వరం నీళ్లు మళ్లిస్తే ఎస్సారెస్పీ ఎప్పటికీ ఎండే పరిస్థితి రాదన్నారు. వచ్చే ఏడాదికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉంది: గవర్నర్..

సికింద్రాబాద్: ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ రోజు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ బ్లాక్ 65 పడక ఐసీయూ గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాని, వైద్య సేవల కోసం నేను కూడా గాంధీ ఆస్పత్రికి వస్తానన్నారు. ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం మరిన్ని పబ్కిల్ హెల్త్ సెంటర్లను ఆధునీకరించాలని అధునాతనవైద్య పరికరాలను తీసుకురావాలని,హెల్త్ సెక్టార్ల పై మంత్రి సమీక్షలు జరపాలని గరవ్నర్ సూచించారు.

గోదావరి నీళ్లతో ఎస్సారెస్పీ సస్యశ్యామలం : హరీష్ రావు

పోచంపాడు : గోదావరి నీళ్లతో ఎస్సారెస్పీ సస్యశ్యామలం అవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎస్సారెస్సీ పునర్జీవన పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ... రాత్రింబవళ్లు పనిచేసిన కాళేశ్వరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 12 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేసి ఎస్సారెస్పీకి నీరు తీసుకొస్తామన్నారు.

'విద్యార్థుల పై పెట్టిన కేసులు ఎత్తేయాలి'

గుంటూరు: విద్యార్థి సంఘాల నాయకులపై నగర పాలెం పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. కలెక్టరేట్ గోడలపై వాల్ పోస్టర్లు అంటించారని కేసులు పెట్టారు. ఈ కేసులను జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు ఖండించాయి. అంతే కాకుండా కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నేరెళ్ల ఘటనపై అఖిలపక్షం భేటీ

హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్ రెడ్డి, కోదండరామ్, లెఫ్ట్ నేతలు, మేధావులు, నేరెళ్ల బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

14:14 - August 10, 2017

చెన్నై : తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకు మలుపులు తిరుగుతన్నాయి. పన్నీరు సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనం కాబోతున్నట్లు తెలుస్తోంది. పన్నీరుకు డిప్యూటీ సీఎం, జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. విలీనం తర్వాత అన్నాడీఎంకే ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకరానికి వీరు హాజరుకాబోతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే నుంచి శశికళ, దినకరన్ లను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. డిప్యూటీ కార్యదర్శిగా దినకరన్ ఎంపిక అక్రమమని, దినకరన్న నియామకం చెల్లదంటూ పళని వర్గం తీర్మానం చేసింది. దినకరన్ నియమించిన 64మంది ఆఫీస్ బేరర్ల కూడా తొలగించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

65 పడకల ఐసీయూ ను ప్రారంభించిన గవర్నర్

సికింద్రాబాద్: గాంధీ ఆసుప‌త్రిలో 65 ప‌డ‌క‌ల ఐసీయూను గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్స‌వంలో కేంద్ర మంత్రి ద‌త్తాత్రేయ‌, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, మంత్రులు ల‌క్ష్మారెడ్డి, నాయిని న‌ర్సింహ‌రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్, ప‌ద్మారావు, ఎంపీ కేకే, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

13:29 - August 10, 2017

జనగాం : ప్రకృతిపై పగబట్టారు. బాంబుల మోతలు మోగిస్తున్నారు. ఓ వైపు నిద్ర పట్టనివ్వని క్రషర్‌ శబ్ధం. మరోవైపు ఎప్పుడూ మబ్బు పట్టినట్లు కనిపించే దుమ్ము. నిత్యం దుర్వాసనతో నరకం చూపే డాంబర్‌ ప్లాంట్‌. ఇదీ బ్రతుకే భారంగా, నరకంగా సాగుతోన్న కాశీమ్‌ నగర్‌ ప్రజల జీవనం. గుట్టు చప్పుడు కాకుండా గుండె చప్పుడు ఆపేలా సాగుతున్న కాశీమ్‌ నగర్‌ అక్రమ మైనింగ్‌పై 10 టీవీ ప్రత్యేక కథనం..మొన్నటివరకూ పచ్చని ప్రకృతిలో ఉన్నామనుకున్నారు. కానీ వీళ్లున్నది ప్రాణం పోయే ప్రమాదపు అంచునని ఇప్పుడు తెలిసొచ్చింది. కొత్తగా పెట్టిన క్రషర్‌తో ఇక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నివసించే ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

కాశీమ్‌నగర్‌ చిన్న గూడెం..
జనగాం జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఇప్పగూడెం కాశీమ్‌నగర్‌ చిన్న గూడెం. సుమారు 40 ఏళ్ల నుంచి 40 కుటుంబాల ప్రజలు ఇక్కడే బతుకుతున్నారు. క్రషింగ్ పెట్టిన గుట్టకే వెళ్లి వీరంతా క్వారీ పనులు చేసేవారు. తరువాత ఇళ్లకు చుట్టుపక్కల వ్యవసాయ భూములు కొని వ్యవసాయం చేస్తున్నారు. క్రషర్‌ పెట్టే ముందు వరకు వీరికి ఎలాంటి సమస్యలు లేవు. అడవిలో నిశ్శబ్దపు జీవనం సాగిస్తున్న వీళ్లంతా ఇప్పుడు స్టోన్‌ కట్టింగ్ క్రషర్, డాంబర్ ప్లాంట్ దెబ్బకు నరకం అనుభవిస్తున్నారు.

క్రషర్ ల వత్తిడి..
ఈ ప్రాంతానికి చెందిన వారు ఇప్పుడు గూడు కట్టుకుందామనుకున్నా.. వీల్లేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అనుమతులో.. ఆర్థిక ఇక్కట్లో కాదు.. ఈ క్రషింగ్‌ యూనిట్‌ సృష్టిస్తోన్న ప్రకంపనలే దీనికి కారణం. ఇక్కడ ఇళ్లు కట్టుకుందామనుకున్నవారు ఇప్పుడు క్రషర్‌ ఎఫెక్ట్‌తో వెనక్కి తగ్గారు. ఫలితంగా చాలా ఇళ్లు బేస్‌మెంట్‌ దగ్గరే ఆగిపోయాయి. క్రషర్‌ కోసం 80 నుంచి 100 ఫీట్ల వరకు డ్రిల్‌ చేసి పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. దీంతో 400 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లూ కంపిస్తున్నాయి. బాంబుల బ్లాస్టింగ్ తీవ్రతకు కాశీమ్‌నగర్‌లో గర్భిణులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలైతే ఉలికులికి పడుతున్నారు.

ప్రలోభం..కాదంటే భయ పెట్టడం..
ప్రలోభపెడుతున్నారు. కాదంటే భయపెడుతున్నారు. భూములు కౌలుకివ్వాలంటారు. లేదంటే అమ్మమంటారు. చిన్న క్రషర్‌ అని చెప్పి పెద్ద ఎత్తున భూములు లాక్కొని చేస్తున్న మైనింగ్‌తో యజమానులు పెద్ద ఎత్తున సంపాదిస్తుంటే.. ఉన్న భూముల్లో పంటలేసుకున్న రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలా మంది భూములు లాక్కుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భూమి ఇవ్వకపోతే..
క్రషర్‌కు భూమి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పిన సోమయ్య అనే రైతు భూమి మొత్తం.. ఇప్పుడు బ్లాస్టింగ్‌ రాళ్లతో నిండిపోయింది. చెప్పకుండా బ్లాస్ట్ లు చేస్తున్నారని.. బావి వద్ద పశువులను ఉంచాలంటే భయపడాల్సిన పరిస్థితని వాపోతున్నారాయన. లక్షల్లో పంట తీసుకొని బతుకుతున్నామనంటే ఎకరానికి ఐదు వేలు ఇస్తామని కౌలుకివ్వమని ఇబ్బంది పెడుతూ క్రషర్‌ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారంటున్నారు.

పాటించని నిబంధనలు..
అందరికీ బ్లాస్టింగ్ ఉందని చెప్పేందుకు సైరన్ వినిపించాలి. కానీ కాశీమ్‌ నగర క్రషర్‌ దగ్గర అలాంటి పరిస్థితి లేదు. వారి ఇష్టమొచ్చినట్లు బ్లాస్టింగ్‌ చేసి ఏం పట్టనట్లు ఉంటున్నారని రైతులు అంటున్నారు. బ్లాస్టింగ్‌లో ఎలుగుబంటి చనిపోయిందని తెలిసి చూద్దామని వెళ్లే సరికి దానిని మాయం చేశారని రైతులు చెబుతున్నారు. ఇక క్రషర్‌ నుంచి వచ్చే దుమ్ము పంట పొలాల్లో పడుతుండటంతో జంతువులు గడ్డిని మేయడం లేదు.

యజమానులకు నేతల సపోర్టు..
ఊర్లో నాయకులు క్రషర్‌ యజమానులకే సపోర్ట్‌ చేస్తున్నారు. అధికారులు, నాయకులు స్పందించకపోవడంతో గ్రామస్థులు సీపీఎం రాష్ట్ర నాయకులను ఆశ్రయించారు. చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ ఆపకపోతే పోరాటం తప్పదని సీపీఎం నాయకులంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కాశీమ్‌ నగర ప్రజలు జనగాం కలెక్టర్‌ దేవసేనను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే కలెక్టర్‌ మైనింగ్ ఏడీకి, మండల ఎమ్మార్వోకి విషయంపై విచారణ చేపట్టమని ఆదేశించారు. అధికారులు అక్కడికి వెళ్లారు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సీపీఎం పార్టీ ఆఫీసుకు వెళ్లి.. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి తమ బాధను వినిపించారు.
క్రషర్‌ విషయమై అధికారులను, గ్రామానికి సంబంధించిన నాయకులను సంప్రదించే ప్రయత్నం చేస్తే.. ఎవరూ మాట్లాడే ఆసక్తి చూపడం లేదు. 

13:21 - August 10, 2017

ఢిల్లీ : ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి ఏపీ మంత్రి నారాలోకేష్‌ అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రోడ్డులోని వెంకయ్యనాయుడి నివాసంలో ఆయనను మంత్రి లోకేష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్‌..తెలుగువారు ఉపరాష్ట్రపతి కావడం గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరు చేయని సేవలు వెంకయ్యనాయుడు చేశారని చెప్పారు. ఇవాళ కేంద్రమంత్రి నరేందర్‌ సింగ్‌ తోమర్‌తో తాను సమావేశమవుతున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. ఉపాధిహామీ పథకం, గ్రామీణాభివృద్ధి శాఖ పనులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్‌ నిధుల అంశంపై మంత్రితో చర్చిస్తానన్నారు.  

13:18 - August 10, 2017

హైదరాబాద్ : బేగంపేట టాస్క్ ఫోర్స్ ఆఫీసు పేలుడు కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు లేవని కేసును కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ కలింగ్, షకీల్, సయ్యద్ హాజీ, హజ్మల్ అలీఖాన్, హజ్మల్ అలీ,మహబూబ్ బురానవాలా, షేక్ అబ్దుల్ ఖాజా, నఫీజ్ బిశ్వాన్, బిలాహిద్దీన్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో వీరిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2005 ఆగస్టు 12న బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌పై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో బంగ్లాదేశ్ ఉగ్రవాదితో పాటు హోంగార్డు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 20 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో 10 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు నిచ్చింది. సరైన సాక్ష్యాధారాలు చూకపోవడంతో కోర్టు వారిపై కేసును కొట్టివేసినట్లు న్యాయవాది చెప్పారు. ఈరోజు వారు విడుదల అవుతున్నట్లు తెలిపారు. 

మాదాపూర్ నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: మాదాపూర్ నారాయణ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థిని శ్రావ్య ఆత్మహత్యకు నిరసనగా ఎస్ ఎఫ్ ఐ ఆందోళన చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలో కాలేజీలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. నారాయణ కాలేజీ గుర్తింపు రద్దు చేసి శ్రావ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

13:15 - August 10, 2017

ప్రకాశం : దగ్గుబాటి రామానాయుడుకు చెందిన థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ థియేటర్ లో 'దగ్గుబాటి రానా' నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రమాదం వార్త తెలుసుకున్న దగ్గుబాటి సురేష్ హైదరాబాద్ నుండి చీరాలకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

చీరాలా పట్టణంలో సురేష్ మహల్ ఏసీ థియేటర్ కొన్నేళ్లుగా ఉంది. ఈ మధ్యే థియేటర్ ను పునర్ నిర్మించారు. అనంతరం శుక్రవారం 'రానా' నటించిన సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో థియేటర్ ను అందంగా అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఏసీ పైపుల్లో షార్ట్ సర్క్యూట్ కావడం..పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం జరిగిపోయాయి. దీనితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. థియేటర్ లో ఫర్నీచర్..ఇతరత్రా మొత్తం అగ్నికి ఆహుతై పోయింది. రూ. 2 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ఒక్కటైన పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు

చెన్నై: పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటయ్యాయి. దినకరన్ కు వ్యతిరేకంగా సీఎం పళనీ తీర్మాం చేశారు.అన్నాడీఎంకే వర్గాలు దినకరన్ ను పట్టించుకోవద్ద ఆదేశించారు. అన్నా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ఎన్నిక చెల్లదని పళని స్వామి వర్గం స్పష్టం చేసిన. వచ్చే వాచరం ఎఐఏడీఎం కేలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు విలీనం కానున్నాయి.

 

12:45 - August 10, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన 'నాని'తో చిత్రం చేయాలని దర్శక..నిర్మాతలు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే 'నాని' బంగారు బాతుగా పోలుస్తుంటారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా విజయవంతమౌతున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ గా పేరొందిన ఈ నటుడు మళ్లీ బిజీ బిజీ అయిపోతున్నాడు.

'నేను లోకల్'తో బ్లాక్ బస్టర్ కొట్టిన 'నాని'..'నిన్ను కోరితే' మరో సూపర్ హిట్ కొట్టేశాడు.  'నిన్ను కోరి' సెట్స్ పై ఉండగానే 'ఎంసీఏ' కథ విని షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. ఈ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. 'దిల్' రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో 'సాయి పల్లవి' హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మేర్లపాక గాంధీతో ఓ చిత్రానికి 'నాని' సైన్ చేశాడు. ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' టైటిల్ ను ఫిక్స్ చేశారు. సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టారు. ప్రస్తుతం పొలాచ్చీలో షూటింగ్ కొనసాగుతోంది. చిత్రంలో 'నాని' కృష్ణా..అర్జున్ గా ద్విపాత్రాభినయం చేస్ఉతన్నాడని సమాచారం. ఈ సినిమా అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలో 'నాని' నటించబోతున్నాడు..మొత్తానికి వరుస చిత్రాలతో 'నాని' ఫుల్ బిజీగా మారిపోతున్నాడు. 

ఘనంగా మంత్రి పరిటాల సునీత కుమారుడి నిశ్చితార్థం

హైదరాబాద్: ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మాదాపుర్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో పరిటాల కుటుంబ సభ్యుల, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో సందడి చేశారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

చీరాలలో సురేష్ థియేటర్ లో అగ్ని ప్రమాదం

ప్రకాశం: చీరాలలో సురేష్ థియేటర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్చ్యూట్ తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ఎంత మేర నష్ట కలిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు.

నేరెళ్ల బాధితులకు వైద్య పరీక్షలు...

రాజన్న సిరిసిల్ల : హైకోర్టు ఆదేశాలతో వేముల వాడ ఆస్పత్రిలో నేరెళ్ల బాధితులకు ఎంజీఎం వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

12:33 - August 10, 2017

హైదరాబాద్ : బేగంపేట ఆత్మహుతి దాడి కేసులో పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారని న్యాయవాది పేర్కొన్నారు. 2005లో బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును వెలువరించింది. కొట్టును కొట్టివేస్తున్నట్లు, పది మందిని నిర్దోషులంటూ తీర్పును చెప్పింది. అనంతరం దీనిపై న్యాయవాది మీడియాతో మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ సంబంధించిన కేసు 2005లో స్టార్ట్ అయ్యిందని, 2006లో 20 మందిపై చార్జీషీట్ దాఖలైందని తెలిపారు. రెండు కేసుల్లో వీరందరూ నిర్దోషులని కోర్టు తీర్పు చెప్పిందని, పోలీసులు ఆధారాలు చూపించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. కొందరు 11 సంవత్సరాలుగా మరికొందరు 7 సంవత్సరాలుగా జైలులో ఉన్నారని న్యాయవాది తెలిపారు. వారిని అరెస్టు చేసిన అనంతరం చర్లపల్లి..చంచల్ గూడ ఇతర జైల్లో పెట్టారని తెలిపారు. తమకు న్యాయం జరిగిందని, విడుదలైన అనంతరం వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

హమిద్ అన్సారీకి ఘనంగా వీడ్కోలు..

ఢిల్లీ: ఉప‌రాష్ట్ర‌ప‌తి హమిద్ అన్సారీకి ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. రాజ్య‌స‌భ చైర్మెన్‌గా ఉన్న‌ ఆయ‌న‌కు ఇవాళే చివ‌రి రోజు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ స‌భ్యులు ఆయ‌న‌కు ఫేర్‌వెల్ ప‌లికారు. రాజ్య‌స‌భ‌కు ఆయ‌న ప‌దేళ్లు చైర్మెన్‌గా ఉన్నారు. హ‌మీద్ అన్సారీ గొప్ప దౌత్య‌వేత్త అని ప్ర‌ధాని మోదీ ఆయ‌న్ను కీర్తించారు. రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. అన్సారీ అంకిత‌భావ‌గం క‌లిగిన నేత అన్నారు. రాజ్య‌స‌భ చైర్మెన్‌గా సేవ‌లు అందించిన అన్సారీకి ప్ర‌ధాని థ్యాంక్స్ చెప్పారు. పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల త‌ర‌పున ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

చంద్రబాబు మంత్రివర్గం అంతా నంద్యాలలోనే: జగన్

కర్నూలు: గోస్పాడు మండలం చాబోలులో జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మంత్రివర్గం అంతా నంద్యాలలోనే కనిపిస్తోందని, నంద్యాలలో కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతి సామాజిక వర్గానికి టిడిపి ఎర వేస్తోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేయలేదని విమర్శించారు.

టాస్క్ ఫోర్సు ఆపీసు పై దాడి కేసు కొట్టివేత...

హైదరాబాద్: బేగంపేట టాస్క్ ఫోర్సు ఆపీసు పై దాడి కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ కేసులో 9మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. 2005 అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ కార్యాలయం పై మానవ బాంబు దాడి జరిగింది.

కాకినాడ కార్పొరేషన్ ఆఫీసు వద్ద నామినేషన్ల కోలాహలం..

తూ.గో : కాకినాడ కార్పొరేషన్ ఆఫీసు వద్ద నామినేషన్ల కోలాహలం నెలకొంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు పోటాపోటీగా జరిగిన నామినేషన్లు ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగినయనుంది. ఈ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకోవడంతో 40 డివిజన్లలో టిడిపి, 8 డివిజన్లలో బిజెపి పోటీ చేయనుంది.సాంకేతిక కారణాల వల్ల రెండు డివిజన్లలో నిలిచిపోయింది.

12:09 - August 10, 2017

హైదరాబాద్ : 2005లో హైదరాబాద్‌లో ఏం జరిగిందో గుర్తు ఉందా ? బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన పేలుడు అందరికీ గుర్తు ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసులో గురువారం నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టు చేసిన 10 మంది నిర్దోషులు అంటూ కీలకమైన తెర్పును వెలువరించింది. అనంతరం కేసును కొట్టివేసింది. 

ఆత్మాహుతి దాడి ఘటనలో హోం గార్డు తో పాటు ఉగ్రవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. 2005 అక్టోబర్‌ 12న ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామి సంస్థ ఈ ఘటనకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని సిట్‌, సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వంధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

శ్రీకాకుళం: వంధార ప్రాజెక్టు పనులను గార్లపాడు వద్ద నిర్వాసితులు అడ్డుకున్నారు. గార్లపాడు నిర్వాసితులతో నిన్న ఆర్డీవో చర్చలు విఫలం కావడంతో నిరసనకు దిగారు. పాకేజీ వర్తింజేయాలని డిమాండ్ చేస్తూ గార్లపాడు నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసు పహారాలో జరగుతున్న పనులను కూడా అడ్డుకోవడంతో పోలీసులు నిర్వాసితులను అదుపులోకి తీసుకుని హిర మండలం పీఎస్ కు తరలించారు.

వంధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్న నిర్వాసితులు

శ్రీకాకుళం: వంధార ప్రాజెక్టు పనులను గార్లపాడు వద్ద నిర్వాసితులు అడ్డుకున్నారు. గార్లపాడు నిర్వాసితులతో నిన్న ఆర్డీవో చర్చలు విఫలం కావడంతో నిరసనకు దిగారు. పాకేజీ వర్తింజేయాలని డిమాండ్ చేస్తూ గార్లపాడు నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసు పహారాలో జరగుతున్న పనులను కూడా అడ్డుకోవడంతో పోలీసులు నిర్వాసితులను అదుపులోకి తీసుకుని హిర మండలం పీఎస్ కు తరలించారు.

12:02 - August 10, 2017
12:01 - August 10, 2017

కర్నూలు జిల్లాలో నంద్యాలలో రాజకీయాలు వేడి ఎక్కుతున్నాయి. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార పక్షం..విపక్షం ప్రయత్నాలు జరుపుతున్నాయి. తామే గెలుపు సాధిస్తామని..కాదు తామే గెలుస్తామని ధీమాలు..జోస్యాలు ముందే చెప్పేస్తున్నారు. జనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంటున్నారు. కానీ ఈ నంద్యాల ఫలితం భవిష్యత్ కు సంకేతమని పలువురు చర్చించుకుంటున్నారు.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 23వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. వైసీపీ పార్టీ నుండి గెలిచి టిడిపిలోకి జంప్ అయిన భూమా నాగిరెడ్డి అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల బరిలో టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డి..వైసీపీ తరపున ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి (శిల్పా మోహన్‌రెడ్డి) నిలుచున్నారు.

కానీ నేతల మధ్య విమర్శలు..ఆరోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాజకీయ పోరాటం ఉండాలనే గాని ఇలాంటి ఆరోపణలు..విమర్శలు చేసుకోవడం కరెక్టు కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అధికారపక్ష మంత్రులు ఇక్కడనే తిష్ట వేయడంపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక నంద్యాలలో ధన ప్రవాహం విస్తృతంగా ప్రవహిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికపై జరుగుతున్న పరిణామాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ఇక ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా అధ్యక్షులు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ నంద్యాలలో మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారపక్షంపై విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈయన నియామకం అనంతరం ఎన్నిక జరుగుతుండడం విశేషం. ఈ ఎన్నికపై ఆయన దృష్టి పెట్టారా ? 2019 ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారా ? అనేది తెలియడం లేదు. సోషల్ మాధ్యమాలను కూడా వైసీపీ విస్తృతంగా వాడుతోంది.

ఇక అధికార పక్షం నేతలు తామేం తక్కువ తినలేదని చూపిస్తున్నారు. ఏకంగా మంత్రులు ఇక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లు ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి హామీలు, అభివృద్ది కార్యక్రమాలు, అధికార పార్టీ నుంచి పరోక్షంగా మరికొన్ని పంపిణీలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయానుభవాన్నంతా నంద్యాలలో పరీక్షకు పెడుతున్నారనిపిస్తుంది.

మరి ఈ ఫలితం భవిష్యత్ కు సంకేతం ఇస్తుందా వేచి చూడాలి. 

11:56 - August 10, 2017
11:53 - August 10, 2017

మెడిసిటీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి: తుళ్లూరు మండలం దొండపాడులో బీఆర్ ఎస్ మెడిసిటీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 750 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, త్రాస్టార్ హోటల్, సర్వీస్ అపార్ట్ మెంట్లు, యోగా కేంద్రం, స్టెమ్ సెల్ పరిశోధనా కేంద్రాలను బీఆర్ ఎస్ ఏర్పాటు చేయనుంది.

ఎస్సారెస్సీ పునరజ్జీవ పథకానికి పునాది వేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా శ్రీరాంసాగర్‌కు తిరిగి పునరుజ్జీవనం చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఇంతకు ముందున్న ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చనున్నారు.

ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రాక్షస పాలనా?: ముద్రగడ

తూ.గో: మరోసారి ముద్రగడ పాదయాత్రకు ప్రయత్నించారు. ముద్రగడ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడతో పాటు 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు ఉన్నారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక రాక్షస పాలనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

 

11:17 - August 10, 2017
11:16 - August 10, 2017
11:14 - August 10, 2017

హైదరాబాద్ : 2005లో హైదరాబాద్‌లో ఏం జరిగిందో గుర్తు ఉందా ? బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన పేలుడు ఘటనలో హోం గార్డు తో పాటు ఉగ్రవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం మధ్యాహ్నం నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 12 ఏళ్ల పాటు వాదనలు కొనసాగాయి. వాదనల అనంతరం ఈ తీర్పు వెలువడనుండడంతో ఉత్కంఠ నెలకొంది.
2005 అక్టోబర్‌ 12న ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్‌కు హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామి సంస్థ ఈ ఘటనకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని సిట్‌, సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. 

11:12 - August 10, 2017

హైదరాబాద్ : జీడిమెట్ల పారిశ్రామిక వాడ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం..ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. తాజాగా స్మైలాక్స్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. రియాక్టర్ దగ్గర కార్మికులు రాజు, అప్పలనాయుడులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్పలనాయుడు అక్కడికక్కడనే మృతి చెందాడని సమాచారం. తీవ్రంగా గాయపడిన రాజును, అప్పలనాయుడు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా యశోద ఆసుపత్రికి తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారీగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కంపెనీ లోపలికి వెళ్లకుండా కంపెనీ యాజమాన్యం సెక్యూర్టీ గార్డ్స్ ను ఏర్పాటు చేసింది. 

ఏబీసీకి చిక్కిన కొంతేరు గ్రామ కార్యదదర్శి....

ప.గో : మలమంచిలి మండలం కొంతేరు గ్రామ కార్యదర్శి సురేష్ ఏసీబీ వలకి చిక్కాడు. రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

కేసీఆర్ సభకు తరలిన సిటీ బస్సులు..

హైదరాబాద్: నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ సభకు హైదరాబాద్ నుంచి సిటీ బస్సులను తరలించారు. సిటీ బస్సులు లేక విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఎంఏ అండ్ యూడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

అమరావతి: సచివాలయం రెండో బ్లాక్ లో ఎంఏ అండ్ యూడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది.

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావం

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తా ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కొన్ని చోట్ల ఓ మాదిరి వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ఒంగోల్ లో మహిళపై కత్తితో దాడి..

ప్రకాశం: ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్‌ సమీపంలోని ఓ ఇంటిలో దుండగుడు బీభత్సం సృష్టించాడు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు తలుపులు మూసేసి ఒంటరిగా ఉన్న మహిళపై కత్తితో దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల

తిరుమల: తిరుమలలో శ్రీవారిని గురువారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, సినీనటులు నితిన్‌, మేఘా ఆకాష్‌, నిర్మాత డి.సురేశ్‌బాబు, తమిళనటుడు కార్తి తదితరులు దర్శించుకున్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుడ మండపంలో అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

జీడిమెట్ల స్కైలాక్స్ లేబొరేటరీలో అగ్ని ప్రమాదం:ఒకరి మృతి

హైదరాబాద్: జీడిమెట్ల స్కైలాక్స్ లేబొరేటరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అప్పలనాయుడు అనే కార్మికుడు మృతి చెందగా...మరో కార్మికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను యశోధా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లకుపైగా నష్టపోయాయి.

అమృత్ సర్ వెళ్తున్న రైల్లో బాంబు గుర్తింపు... నిర్వీర్యం..

యూపీ: అమృత్ సర్ వెళ్తున్న రైల్లో బాంబు గుర్తించారు. బాంబు తో పాటు హెచ్చరిక లేఖను దుండగులు వదిలి వెళ్లారు. గుర్తించిన పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. దీంతో ప్రయాణీకులు సురక్షితమయ్యారు.

శరద్ యాదవ్ పై నితీష్ గుస్సా

హైదరాబాద్: జేడీయూ నుండి శరద్ యాదవ్ ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ఉల్లంఘించారని శరద్ యాదవ్ పై నితీష్ కుమార్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

10:13 - August 10, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పొత్తులకు అడుగులు పడుతున్నాయా? దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌ ముందుకు సాగుతోందా? విజయం కోసం అలయన్స్ పాలిటిక్స్‌కు తెరలేపుతోందా?.. వారి వ్యూహం చూస్తే... అవుననే అనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా... పార్టీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నాయి.. గెలుపేలక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు సిద్ధం చేసుకుంటున్నాయి.. గత ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి తేరుకుంటున్న హస్తం పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది... అధికారంలోకి రావడానికి ప్రత్యేక ప్లాన్‌లు రచిస్తోంది.

టిడిపి, వామపక్షాలకు..
సీఎం కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్ తో కాంగ్రెస్‌ పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఈ బాధ నుంచి బయటపడ్డ హస్తం నేతలు.. ఈ ఎన్నికల్లో గెలుపుతో గులాబీదళపతికి చెక్‌పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటి నుంచే పక్కాప్రణాళికలు వేస్తున్నారు. తాము ఒక్కరమే పోరాడితే సరిపోదని... మిగతాపార్టీలను కలుపుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని హస్తం నేతలు భావిస్తున్నారు. కొత్త పొత్తులు పెట్టుకుంటే విజయం మరింత సులభమన్న ఆలోచనలోఉన్నారు. ఇందులో భాగంగా టీడీపీ, వామపక్షాలకు స్నేహహస్తం అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కోదండరాం కొత్త పార్టీ..
ఇక 2019లో జేఏసీ చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో తెలంగాణలో కొత్త పార్టీ వస్తుందన్న అంశంపైనా కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.. కోదండరాం పార్టీతో తమకు మేలే జరుగుతుందని హస్తం నేతలు అంచనావేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలు కోదండరాం వైపు మళ్లే అవకాశం ఉందని యోచిస్తున్నారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలన్న లక్ష్యంతో వస్తున్న ఆ పార్టీ త‌మ‌కు మిత్రప‌క్షమే అవుతుందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీని తమతో కలుపుకోవడం ద్వారా గులాబీ పార్టీపై విక్టరీ మరింత తేలికవుతుందని పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు సూచిస్తున్నారు. పార్టీల బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి సీట్ల పంప‌కంలో జాగ్రత్తలు తీసుకుంటే విజయం తమదేనని కాంగ్రెస్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.

పొత్తులు ఫలిస్తాయా ? 
మొత్తానికి 2019లో మిత్రపక్షాలను కలుపుకొని గులాబీ బాస్‌కు చుక్కలు చూపించాలని హస్తం నేతలు తహతహలాడుతున్నారు.. అయితే ఈ ప్రతిపాదనలు ఢిల్లీ గడపలో పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. దీనిపై అధిష్ఠానం సానుకూలంగా ఉంద‌ని ఆక్టోబ‌ర్‌లో గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీనుంచి క్లారీటీ రాగానే కొత్త స్నేహాలతో గులాబీ పార్టీని చిదిమేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ పొత్తులు ఎంతవరకూ ఫలిస్తాయో... వేచిచూడాలి..

బండ్లగూడ పీఎన్టీ కాలనీలో కార్డన్ సెర్చ్

రంగారెడ్డి : బండ్లగూడ పీఎన్టీ కాలనీలో కార్డన్ సెర్చ్ జరిగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో 10 మంది నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆసిఫ్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల సర్చింగ్

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నైజీరియా, సోమాలియా దేశస్థుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీసాగడువు ముగిసినా ఇక్కడే తిష్ట వేసిన నేజీరియన్లు డ్రగ్స్ వ్యాపారులుగా మారిని వారి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.

నేడు ఏపీలో విద్యా సంస్థల బంద్

అమరావతి: నేడు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది.

10:07 - August 10, 2017

కరీంనగర్ : జిల్లాలోని షాషాబ్ మొహాల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 టూ వీలర్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. అంతేకాకుండా యునానీ మందుల ఆసుపత్రిలో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, సరియైన ఆధారాలు లేవని తెలిపారు. శాంపిల్స్ ను లేబరేటరీకి పంపించినట్లు, ఈ ప్రాంతంలో గుట్కా విక్రయించడం లేదని పేర్కొన్నారు. ప్రజల్లో అభధ్రతా భావాన్ని పొగొట్టేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.

డ్రగ్స్ కేసులో మరో ఇద్దరి అరెస్ట్..

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్‌కౌకుర్‌లో ఇద్దరు నైజీరియన్‌లైన గాబ్రియేల్, అతని ప్రియురాలిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కొకైన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో నైజీరియా ముఠాకు గాబ్రియేల్ ప్రధాన సూత్రధారి. వీసా గడువు ముగిసినప్పటికీ నిందితులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. గతంలో గ్రాబ్రియేల్ డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. నిందితులు డ్రగ్స్‌ను గోవా నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు.

బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ డిశ్చార్జ్

ముంబై: బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ ముంబయిలోని లీలావతిఆస్పత్రిలో నుండి డిశ్చార్జి అయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన వారం పాటు ఐసీయూలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో బుధవారం డిశ్చార్జి అయ్యారు.

ఢిల్లీలో ఉగ్రవాది జిషాన్ అరెస్ట్...

ఢిల్లీ: అల్‌ఖ‌యిదా ఉగ్ర‌వాద సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న స‌య్యద్ మొహ‌మ్మ‌ద్ జిషాన్ అలీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. భార‌త భూభాగంలో జిషాన్ త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌ర్తిస్తున్నాడు. అత‌ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో కూడా ఉన్నాడు. సౌదీ అరేబియా నుంచి జిషాన్ త‌న ఉగ్ర కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే అత‌ను ఢిల్లీకి రావ‌డంతో అక్క‌డ అత‌న్ని అరెస్టు చేశారు. 2007లో బ్రిట‌న్‌లో జ‌రిగిన గ్లాస్‌గో పేలుళ్ల సూత్ర‌ధారి బంధువును జిషాన్‌ పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

09:52 - August 10, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఓ సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. 'శంకర్‌' దర్శకత్వంలో 'ముదల్వన్‌' తమిళనాట ఎంత విజయం సాధించిందో తెలిసిందే. 'అర్జున్‌' హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో 'ఒకే ఒక్కడు' పేరిట వచ్చింది.

ఈ సినిమాలో నటించాలని 'రజనీ'ని చిత్ర బృందం కలిసిందని..కానీ ఆయన మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదంట. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చేస్తే యాక్ట్ చేయడానికి 'రజనీ' ఆసక్తి చూపుతున్నారని సోషల్ మాధ్యమాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్‌ కథను సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే 'రజనీకాంత్' త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో ఆ సినిమా ఉండడం..రజనీకి కలిసొస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు శంకర్ అయితే కరెక్టుగా సరిపోతాడని అనుకుంటున్నారంట. సీఎంగా 'రజనీ' అయితే ఎలా ఉంటుందనే విషయాన్ని ముందుగా జనానికి తెలియజేసే ప్రయత్నంలో భాగమని అనుకుంటున్నారు.

మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 

09:40 - August 10, 2017

మాస్ చిత్రాలకు కేరాఫ్ 'వినాయక్'. యాక్షన్ మూవీస్ ను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికిస్తున్నారు. మాస్ మసాలాలు దట్టించడంలో ఇతను మేటి. క‌థ‌కు క‌మ‌ర్శియ‌ల్ అంశాలు జోడించాల‌న్నా..ప‌దునైనా సంభాష‌ణ‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌పై పంచ్ లు వేయాల‌న్నా మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ కే చెల్లింది. మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా అనంతరం మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగా కుటుంబం నుండి వచ్చిన 'సాయి ధరమ్ తేజ్' తో వినాయక్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సి. కల్యాణ్ నిర్మాతగా వినాయక్ దర్శకత్వంలో 'సాయి ధరమ్ తేజ్' హీరోగా వస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ఆశీస్సులు అందజేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

పోలీసుల అదుపులో 10 మంది నైజీరియన్లు..

హైదరాబాద్ : బండ్లగూడ పీఎన్టీ కాలనీలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో 10 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. 

కొనసాగుతున్న విద్యా సంస్థల బంద్..

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్ కొనసాగుతోంది. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ బంద్ కు పిలుపునిచ్చింది. 

09:29 - August 10, 2017

మావోయిస్టుల నూతన పంథా..

ఖమ్మం : దండకారణ్యంలో మావోయిస్టుల నూతన పంథాను కొనసాగిస్తున్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాడర్ ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. దండకారణ్యంలో ఎర్ర తోరణాలు, స్థూపాలు ఏర్పాటు చేసినట్లు, భారీ సంఖ్యలో వారోత్సవాలకు జనాలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పూర్వ వైభం సాధించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

08:27 - August 10, 2017

హైదరాబాద్ : 2005లో హైదరాబాద్‌లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన పేలుడు ఘటనలో నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించనుంది. 12 ఏళ్ల పాటు కొనసాగిన వాదనల అనంతరం ఈ తీర్పు వెలువడనుంది. 2005 అక్టోబర్‌ 12న జరిగిన ఈ ఘటనలో హోంగార్డుతో పాటు ఉగ్రవాది మృతి చెందారు. బంగ్లాదేశ్‌కు హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామి సంస్థ ఈ ఘటనకు పాల్పడింది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని సిట్‌, సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

కౌకూరులో డ్రగ్స్..గ్రాబియేల్ అరెస్టు..

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో గాబ్రియేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నైజీరియన్లు ఇచ్చిన సమాచారంతో కౌకూరులో ఓ అపార్ట్ మెంట్ లో పోలీసులు దాడి చేసి గ్రాబియేల్, అతని ప్రియురాలను అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ ముఠాకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీరి వద్ద కొకైన్, హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

07:30 - August 10, 2017

ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్థల బంద్ కి పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు కూడా బంద్ లో పాల్గొనబోతున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ స్కూలు ఇండిపెండెంట్ యాక్ట్ ను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ్టి విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు విద్యార్థి సంఘాలు పెడుతున్న డిమాండ్స్ ఏమిటి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రాము విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:26 - August 10, 2017

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకొంటోంది. ప్రతిపక్ష..అధికారపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలని ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. టిడిపి అభ్యర్థి గెలుపు కోసం మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో జీవీ రెడ్డి (ఏపీ కాంగ్రెస్), ఆదిమూలపు సురేష్ (వైసీపీ ఎమ్మెల్యే), సూర్యప్రకాష్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి నేతలు ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

సీపీఎం రాష్ట్ర మహాసభలు..

అనంతపురం : నేటి నుండి మూడు రోజుల పాటు సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. మొదటి రోజు సభకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొననున్నారు. 

జగన్ సెకండ్ డే రోడ్ షో..

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండో రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. గురువారం నూనెపల్లె నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. అయ్యలూరు వరకూ కొనసాగుతుందని వైసీపీ పేర్కొంటోంది. 

మరో 48 గంటల్లో..

హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 48 గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల సాధారణం నుంచి మోస్తారు, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

నయీం ముఠా బెదిరింపులు..

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నయీం ముఠా బెదిరింపులకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఓ తాజా ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. 

గాంధీ ఆసుపత్రికి రానున్న గవర్నర్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గాంధీ ఆసుపత్రికి రానున్నారు. ఆసుపత్రిలో 65 పడకల ఐసీయూ ఎమర్జెన్సీ బ్లాక్ ను ప్రారంభించనున్నారు. 

06:51 - August 10, 2017

ఢిల్లీ : క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం జరిగింది. దేశ స్వాతంత్ర్యంలో క్విట్‌ ఇండియా ఉద్యమం నిర్వహించిన పాత్రను అధికార విపక్షాలు నెమరేసుకున్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాయి. 1942లో జరిగిన ఉద్యమం దేశ స్వాతంత్ర పోరాటాల్లో అతి పెద్దదని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశ స్వాతంత్రం కోసం క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన మహాత్మా గాంధీ `కరో యా మరో' నినాదమిచ్చారని...దీంతో చిన్నా...పెద్దా అంతా ఏకమయ్యారని తెలిపారు. స్వాత్రంత్య పోరాటంలో గాంధీజీ సహా ఎందరో నాయకులు జైలు జీవితం గడిపారని...ఎన్నో బలిదానాలు జరిగాయని చెప్పారు. ఆనాటి జాతీయ నేతలను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అవినీతి అడ్డుకట్టగా మారిందని మోది అభిప్రాయపడ్డారు.

లోక్ సభలో..
లోక్‌సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పరోక్షంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ధ్వజమెత్తారు. దేశంలో చీకటి శక్తులు మళ్లీ పైకి లేస్తున్నాయని మండిపడ్డారు. లౌకిక, ఉదారవాద, స్వేచ్ఛాయుత ఆలోచనాధారకు ముప్పు వాటిల్లుతోందని... ప్రస్తుతం దేశంలో భయాందోళన వాతావరణం నెలకొందని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పరిరక్షించాలంటే క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తిగా చట్టవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని కొన్ని గ్రూపులు వ్యతిరేకించాయంటూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను వేలెత్తిచూపారు.

ఏచూరి గేయం..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, మతతత్వ పరిస్తితులపై రాజ్యసభలో సిపిఎం సభ్యులు సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు బ్రిటిష్‌వాళ్లను వెళ్లగొట్టడానికి క్విట్‌ ఇండియా నినాదమిస్తే...ప్రస్తుతం అమలవుతున్న ఆర్థిక విధానాలను ఇండియా నుంచి పారదోలాలన్నారు. పేదలు, ధనికుల మధ్య అంతరం రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు. కొన్ని శక్తులు దేశంలో మతపరంగా ప్రజలను రెండుగా విడదీయాలని చూస్తున్నాయని... దేశాన్ని మరోసారి ఇండియా, పాకిస్తాన్‌లుగా విడగొట్టవద్దని ఏచూరి హెచ్చరించారు. ఈ సందర్భంగా మతసామరస్యంపై ఏచూరి ఓ గేయాన్ని వినిపించారు. బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా 1857లో జరిగిన ఉద్యమంలో అగ్రవర్ణాలు దళితులు, మైనారీటీలు అన్న తేడా లేకుండా దేశం కోసం అందరూ సమైక్యంగా పోరాడారని ఏచూరి గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో క్విట్‌ ఇండియా నిర్వహించిన భూమికను ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు మరోసారి గుర్తు చేసుకున్నారు.

06:48 - August 10, 2017

హైదరాబాద్ : నయీం... పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమై ఏడాది గడిచిపోయినా... ఇతని అనుచరుల దందాలు ఇంకా ఆగలేదు. నయీం ముఠా సభ్యుల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. బెదిరింపులు, నిర్బంధ వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు. రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నయీం ముఠా బెదిరింపులకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఓ తాజా ఆడియో టేపే ఇందుకు నిదర్శనం. నయీం గ్యాంగ్‌ ఓ వ్యాపారిని బెదిరించారు. ఒక వ్యాపారి నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు, లేకపోతే స్థలాన్ని రిజిస్టర్‌ చేయాలని బెదిరించారు. చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామంటూ హెచ్చరించారు. ఫోన్‌లో వ్యాపారి పట్ల నానా దుర్భాషలాడారు. డబ్బులు ఇవ్వలేనని, స్థలం రిజిస్టర్‌ చేయలేనని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. పైగా ఎమ్మెల్యేలు, పోలీసులు కూడా ఏమీ చేయలేరని, ఏదైనా తేడా వస్తే వీరిని కూడా లేపేసే సత్తా కూడా మాకుందని హెచ్చరించారు. నయీం అనుచరులమంటూ బెదిరింపులకు దిగిన వ్యక్తి ఫోన్‌ ఆడియోను రికార్డు చేసిన బాధితుడు రాజేంద్రనగర్‌ పోలీసులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అజ్ఞాతంలో నయీం గ్యాంగ్‌ సభ్యులు
నయీం అనుచరులు ఆడియో టేపు వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెదిరింపులకు దిగింది నయీం ముఠా సభ్యులా ? లేక ఇతని అనుచరులా ? లేక నయీం పేరు చెప్పుకుని ఎవరైనా నిర్బంధ వసూళ్లకు పాలపడుతున్నారా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నయీం గ్యాంగ్‌కు సంబంధించిన కొందరు సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారు. వీరే స్వయంగా బెదిరింపులకు దిగుతున్నారా ? లేక ఎవరి ద్వారానైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా ? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికీ భువనగిరి జిల్లాలో ఇలాంటి బెదిరింపులు కొనసాగుతున్నాయి. నయీంకు సంబంధించిన చాలా గ్యాంగ్‌లు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. 

06:43 - August 10, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకే నంబర్‌తో ఆరు లారీలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తోంది. దీంతో ఇసుక అక్రమ రవాణా మూడు లారీలు... ఆరు ట్రిప్పులుగా కొనసాగుతోంది. కాంట్రాక్టర్లు నిబంధనలు అతిక్రమించి మరీ ఇసుకను తోడుకుపోతున్నారు. ఒక ప్రభుత్వం మద్య మానేరు రీచ్‌ నుంచి ఎలాంటి అక్రమ రవాణా కొనసాగడం లేదని ప్రకటించింది. అయితే జరుగుతుంది మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. అధికారుల పర్యవేక్షణ లోపం ఇసుక మాఫియాకు వరంగా మారింది. దీంతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.

ఒకే వేబిల్‌తో ఆరు లారీలు
వాస్తవానికి ఇసుక రీచ్‌ల వద్ద వేబిల్స్ చూసి ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా ఇసుక తరలింపు యధేచ్చగా కొనసాగుతోంది. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పర్యవేక్షణా లోపంతో ఇసుక మాఫియా మరింతగా రెచ్చిపోతోంది. తంగళ్లపల్లి మండల కేంద్రంలో 24 గంటలపాటు ఇసుక లారీలు తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయమేమంటే.. ఒకే నంబర్‌ ప్లేట్‌పై ఆరు నుంచి పది లారీలు తిరుగుతున్నా పట్టించుకునే వారే లేరు. మిట్ట మధ్యాహ్నమే ఇలా దర్జాగా ఒకే నంబర్‌ ప్లేట్‌తో లారీలు ఇసుకను తరలిస్తోంటే ఏ అధికారి పట్టించుకోరు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు వంతపాడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే అధికారులు మిన్నకుండిపోతున్నారని

ఇసుక దందా అరికడుతారా ? 
ఒకే నంబర్‌ ప్లేట్‌పై 6వరకు ఇసుక లారీలు తిరుగుతున్న అంశాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకే నంబర్‌ ప్లేట్‌పై వాహనాలు తిరుగడం చట్టవిరుద్ధమని... దీనిపై విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. ప్రజల ఇచ్చిన నంబర్‌తో ఏ లారీ రిజిస్టర్‌ కాలేదన్నారు. అదొక ఆటోకు కేటాయించిన నంబర్‌గా అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇసుక దందాను అరికట్టాలని, ఇసుక రీచ్‌లను తక్షణమే బంద్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

06:40 - August 10, 2017

విజయవాడ : రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాథం పెరుగుతోంది. లోటును పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఏపీ సర్కారు మూడేళ్లుగా అర్థిస్తున్నా పట్టించుకోవడంలేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆంధ్రా పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్రం పెట్టిన మెలికపై 10 టీవీ ప్రత్యేక కథనం.

వితండ వాదన..
నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వాల మధ్య స్నేహం నేతిబీరకాయ చందంగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైకి ఇద్దరూ కౌగిలించుకొని రాజకీయాలు చేస్తున్నా... ఏపీ ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వితండ వాదన చేస్తోంది. ఏపి రెవిన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఇది 16 వేల కోట్ల రూపాయలుగా ఉంది. దీనిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాడు, రాష్ట్ర మంత్రులు పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతోపాటు, పలుసార్లు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలసి విన్నవించారు. అయితే రాష్ట్రం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు 4,117.89 కోట్ల రూపాయలేని తేల్చింది. రాష్ట్ర విభజన తేది 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు 13,775. 76 కోట్ల రూపాయలు రెవిన్యూ లోటు ఉందని కాగ్‌ కేంద్రానికి నివేదించింది. ఈ లెక్కల వైరుధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి.

మంతనాలు ఎవరు జరుపుతారు..
ఏపీ ప్రభుత్వ వివిధ వర్గాల ప్రజకు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలను రెవెన్యూ లోటులో చూపడాన్ని కేంద్ర తప్పు పడుతోంది. రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 7,069.67 కోట్ల రూపాయలు చెల్లించింది. పెంచిన సామాజిక పెన్షన్ లు, విద్యుత్ బకాయిలకు అదనంగా 3,391.20 కోట్ల రూపాయలు వెచ్చింది. డిస్కంల విద్యుత్ బకాయిలకు గాను 1500 కోట్లు చెల్లించిదని కాగ్‌ కేంద్రానికి నివేదించింది. ఇవన్నీ రెవన్యూ లోటు కిందకు రావన్నది కేంద్రం వాదన. దీనితో రాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. దీంతో ఏంచేయాలో పాలుపోక రాష్ట్ర ప్రభుత్వం తలబాదుకుంటోంది. సమస్యల పరిష్కారానికి ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ద్వారా చంద్రబాబు ప్రయత్నించారు. వెంకయ్య ఉపరాష్ట్ర్రపతి కావటంతో ఇకపై ఈయన సేవలను ఉపయోగించుకునే వీలులేదు. దీంతో రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్రంతో మంతనాలు జరిపే బాధ్యతలను టీడీపీకి చెందిన మంత్రి సుజనాచౌదరి, విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు అప్పగించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వీరు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో చర్చలు జరుపుతున్నారు. రెవెన్యూ లోటు గణాంకాలను పునఃసమీక్షించాలని కోరుతున్నారు.
రెవెన్యూ లోటు భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో రాష్ట్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

తప్పుడు సంకేతాలు..
ఈ లెక్కల తేడా చూపి, లోటు పూడ్చకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని ఆయుధంగా మలచుకుని విపక్షాలు నానా యాగీ చేస్తే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని మదనపడుతోంది. ఈదేవిషయాన్ని సుజనా చౌదరి, కంభంపాటి హరిబాబు అరుణ్‌ జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెవెన్యూ లోటు భర్తీపై కాంగ్రెస్ ఎంపీ కెవీపీ రామచంద్రరావు రాజ్యసభలో లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఇచ్చిన సమాధానం టీడీపీ, బీజేపీలకు గట్టి షాక్‌గా మారింది. రాజ్యసభలో మంత్రి చెప్పిన గణాంకాలను వక్రీకరించడానికి వీలు లేదు. అదనంగా చెల్లించిన సబ్సిడీలు, రాయితీలను రెవెన్యూ లోటుగా పరిగణించలేమన్న కేంద్ర వాదన టీడీపీ, బీజేపీలకు ఇబ్బందికర పరిణామంగా మారింది.

ముందును నుయ్యి..వెనుక గొయ్యి..
ఈ సమస్య చంద్రబాబుకు ముందు చూస్తే నుయ్యి... వెనుక చూస్తే గొయ్యి... అన్న విధంగా మారింది. రెవెన్యూ లోటు భర్తీ విషంలో కేంద్రంతో తాడో, పేడో తేల్చుకోలేని దయనీయ పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. వైరం పెట్టుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని, ఎన్డీయేకి దూరమైతే, వైసీపీ చేరవయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో చంద్రబాబు సర్దుబాటు ధోరణి కొనసాగిస్తున్నారు. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. 

06:36 - August 10, 2017

విజయవాడ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పల్లెబాట పట్టబోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు తీరును స్వయంగా తెలుసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీపుల్స్‌ ఫస్ట్‌ కార్యక్రమంలో వీరంతా పల్లెబాటకు రెడీ అవుతున్నారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్థాయి అధికారి నుంచి మండల అధికారి వరకు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంక్షేమ కార్యక్రమాలు..
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విపక్షాలు కూడా ఇదే అంశంపై అనేకసార్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సీఎం చంద్రబాబు అధికారులను పదేపదే హెచ్చరించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీపుల్‌ ఫస్ట్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ముందుగా ప్రజలే లబ్ది పొందాలన్న భావనతో పీపుల్‌ ఫస్ట్‌ అనే కార్యక్రమం తీసుకొచ్చారు.

ప్రజల దగ్గరకు ఉద్యోగులు..
సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం అనర్హులు లబ్ది పొందితే ప్రభుత్వానికి తెలియజేయం ఈ కార్యక్రమ ముఖ్యొద్దేశం. ప్రజల దగ్గరికే వెళ్లి... వారి నుంచే సమాచారాన్ని సేకరిస్తారు. ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వెళ్లనున్నారు. ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్థాయి అధికారి నుంచి మండల స్థాయి అధికారి వరకు అంతా పల్లెబాట పట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాధిపతుల నెలలో ఏడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని, రెండు రోజులు పాటు గ్రామాల్లో రాత్రి నిద్ర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు వారంలో రెండు రోజులు పాటు గ్రామాల్లో పర్యటించి.. ఒక రోజు గ్రామంలో నిద్ర చేయాలని ఆదేశించింది. ఇక జిల్లా స్థాయి అధికారులు కూడా వారంలో మూడు రోజులు గ్రామాల్లో పర్యటించాలని సూచించింది. మండల స్థాయి అధికారులు వారి ఉద్యోగ సమయాన్ని బట్టి, 10 నుండి 15రోజుల పాటు గ్రామాలకు కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగులంతా పల్లెలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

ఉద్యోగుల స్పందన..ఎలా ఉంటుందో..
ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి.. వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు. అధికారులు సేకరించిన వివరాలతో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ ప్రత్యేక వెబ్ సైట్ రూపోందిస్తుంది. అధికారులు సేకరించిన సమాచారాన్ని ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విశ్లేషణ జరిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రతినెలా మొదటివారంలో అందజేస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఉద్యోగులను ప్రజల్లోకి పంపాలన్న నిర్ణయం తీసుకున్నారు. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

06:32 - August 10, 2017

ఆదిలాబాద్ : ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం. నువ్వా నేనా అంటూ సవాల్‌ విసురుకునే రాజకీయ ప్రత్యర్థులు. గత ఎన్నికల్లో ఆ ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది. అప్పుడు వారివి వేర్వేరు పార్టీలు. ఇప్పుడు ఇద్దరూ ఒకేపార్టీలో చేరారు. అయినా వారి మధ్య రాజకీయ వైరం మాత్రం తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పటి నుంచే వారి మధ్య పోరు రాజుకుంది. వివాదాలు రచ్చకెక్కాయి. ఇంతకీ ఎవరా నేతలు. ఆ ఇద్దరి మధ్య ఎందుకంత రాజకీయ వైరం.

ఆదిలాబాద్ జిల్లా..
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నది సామెత. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య లొల్లి షురూ అయ్యింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రధానంగా రెండు వర్గాలు ఉన్నాయి. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నది మొదటివర్గం అయితే.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వలస వచ్చినది రెండో వర్గం. ఈ రెండువర్గాల మధ్య ఇప్పుడు కోల్డ్‌వార్‌ నడుస్తోంది. అదికాస్తా ముదిరి ఇప్పుడు రెండువర్గాలు రచ్చకెక్కాయి. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌, మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ సమావేశంలోనే ఒకరినొకరు దూషించుకున్నారు. రేఖానాయక్‌ రమేష్‌ రాథోడ్‌పై సీరియస్‌ అయ్యారు. పద్ధతి మార్చుకో అంటూ స్వరం పెంచారు. రమేష్‌ రాథోడ్‌తో ఆమె వాగ్వాదానికి దిగడంతో అక్కడే ఉన్న ఇతర నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. గొడవ మరింత పెద్దదైంది. అంతేకాదు ఆ గొడవ పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.

రేఖానాయక్‌ను బలహీనపర్చే పనిలో రమేష్‌ రాథోడ్‌
ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రమేష్‌ రాథోడ్‌ సతీమణి ఎమ్మెల్యేగా పనిచేశారు. అదే స్థానం నుంచి ప్రస్తుతం రేఖా నాయక్‌ టీఆర్‌ఎస్‌ తరపున గెలిచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే రేఖానాయక్‌పై స్థానికంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని అధిష్టానం సర్వేలో తేలింది. దీంతో రమేష్‌ రాథోడ్‌ను పార్టీలోకి తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో రమేష్‌ రాథోడ్‌కే టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య వార్‌ నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు బస్తీమే సవాల్‌ అనుకుంటున్న వాతావరణం నెలకొంది. రేఖానాయక్‌ను మరింత బలహీన పర్చడం ద్వారా టీఆర్‌ఎస్‌లో బలం పెంచుకోవచ్చని రమేష్‌ రాథోడ్‌ భావిస్తున్నారు. టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన రాథోడ్‌కు పరిస్థితులు సరిగా అనుకూలించడం లేదు. దీంతో రేఖానాయక్‌ను టార్గెట్‌ చేశారని పార్టీవర్గాల భోగట్టా.

మంత్రి పదవి కోసం..
టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖానాయక్‌ మంత్రి పదవి కోసం సీరియస్‌గా లాబీయింగ్‌ చేశారు. ఎస్టీ, మహిళ కోటాలో కేబినెట్‌ హోదా కచ్చితంగా దక్కుతుందని ఆశపడ్డారు. తీరా మంత్రి పదవి దక్కకపోవడంతో అధిష్టానంపై ఆమె అలకబూనినంత పనిచేశారు. దీంతో అధిష్టానంతో ఆమెకు కొంత గ్యాప్‌ కూడా ఏర్పడింది. ఇదిలా ఉంటే మరోవైపు రమేష్‌ రాథోడ్‌ చేరికతో ఆమె మెడపై కత్తిపెట్టినంత పనైంది. దీంతో తాను దూకుడుగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన రేఖానాయక్‌...తనపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలా మారి రచ్చకెక్కాయి. జిల్లాలోని టీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు గ్రూపు రాజకీయాలు గుట్టుగా సాగాయి. రమేష్‌ రాథోడ్‌ కాకతో అవి బహిర్గతమయ్యాయి. మరి ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు అధిష్టానం ఎలా పుల్‌స్టాప్‌ పెడుతుందో వేచి చూడాలి.

06:28 - August 10, 2017

రంగారెడ్డి : దొరల పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రజా సంఘాలు ఐక్యం కావాలని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక పిలుపు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనకు బొందపెట్టేందుకు ఐద్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీ-మాస్‌ ఆవిర్భావ సభలో ప్రసంగించిన నేతలు చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు నిరాశే మిగిలిందని సామాజిక ప్రజా సంఘాల వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీ మాస్‌ ఆవిర్భావ సభ జరిగింది. తెలంగాణలో పలు ఉద్యమాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి. సామాజిక న్యాయం కోసం సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలైంది. ఈ చారిత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల వేదిక... టీ మాస్‌ ఆవిర్భావ సభను కూడా ఇబ్రహీంపట్నంలోనే నిర్వహించారు.

దొరల పాలనకు వ్యతిరేకంగా..
తెలంగాణలో సాగుతున్న దొరల పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు ప్రజా సంఘాలను ఏకం చేయాలని ఈ సమావేశంలో తీర్మానిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకులు పిలుపు ఇచ్చారు. దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్‌ మాయమాటలతో ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారని సభలో ప్రసంగించిన నేతలు మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబ పాలనలో ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌, కూతురు కవితలు సాగిస్తున్న దందాలను ప్రశ్నిస్తుంటే.. వీరిరువురు నోరు పారేసుకుంటున్న విషయాన్ని టీ మాస్‌ నేతలు ప్రస్తావించారు. కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నింటిని సంఘటితంచేసి... ఐక్య ఉద్యమానికి సిద్ధం చేయాలని నిర్ణయించారు.

టీమాస్ సభలు..
ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో స్కాముల స్వాములు ఎక్కువయ్యారని టీ మాస్‌ నేతలు విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుని దాచుకుంటోందని ఆరోపించారు. కేసీఆర్‌ నిరంకుశంగా పాలిస్తున్నారని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలను ఐక్యం చేసేందుకు టీ మాస్‌ సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయిచారు. 

06:24 - August 10, 2017

హైదరాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పునురుజ్జీవన పథకానికి ఇవాళ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. కాలువల ఆధునీకరణకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం సఫలమైతే.. నిజామాబాద్ జిల్లా అన్నదాతల సాగునీటి కష్టాలు తీరనున్నాయి.

నీటి సమస్య..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తరచు తలెత్తుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం పేరిట.. ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. ప్రాజెక్టుతో పాటు.. దీనికిందనున్న కాలువల ఆధునికీకరణ పనులనూ ప్రభుత్వం చేపడుతోంది. దీనికి సంబంధించిన పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం శంకుస్థాపన చేయనున్నారు.

భారీ స్థాయిలో పూడిక..
మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టులో భారీస్థాయిలో పూడిక పేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 112.02 టీఎంసీలు. అయితే.. ఎగువ ప్రాతాల నుంచి వచ్చే వరదనీటితో పాటు చెత్తాచెదారం కూడా చేరడంతో.. ప్రాజెక్టులో పూడిక భారీగా పేరుకుంది. ప్రస్తుతం 80.104 టీఎంసీల నీరే నిల్వ చేయగలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గడచిన యాభై సంవత్సరాల్లో దాదాపు 40 టీఎంసీల నీటి నిల్వను ప్రభావితం చేసే స్థాయిలో పూడిక చేరిందని సర్వేల ద్వారా తేలింది. పూడిక ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేలా ఆరు వరదగేట్లనూ ప్రాజెక్టులో భాగంగా డిజైన్‌ చేశారు. అయితే, వాటిని ఇంతవరకూ ఎత్తక పోవడంతో.. ఇప్పుడా గేట్లూ పూడికలో మూసుకుపోవడం గమనార్హం.

ప్రాజెక్టు నుంచి పూడిక తీయడం కష్టసాధ్యం కావడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులో భాగంగా.. కాళేశ్వరం నుండి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌లో నింపడం పునరుజ్జీవ పథకం ముఖ్య ఉద్దేశం. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్‌కు నీటిని మళ్లించడానికి రూ.1067 కోట్లు.. కాలువల ఆధునీకరణ పనులకు మరో 8.63 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 58 వేల ఎకరాలకు నీరు అందుతుంది. పంటలకు నీరులేక అగచాట్లు పడ్డ రైతుల కష్టాలు తీరే అవకాశం ఉంది.

వేలాదిగా బస్సులు..
ఎస్పారెస్పీ వద్ద పునరుజ్జీవ పథకానికి పునాదులు వేసేందుకు బుధవారం రాత్రికే సీఎం కేసీఆర్ పోచంపాడు చేరుకుంటారు. గురువారం పథకం ప్రారంభోత్సవం అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే అధికారులు సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసారు. సభకు భారీగా జనాలు రానున్న నేపథ్యంలో వారిని తరలించేందుకు వేలాదిగా బస్సులను వినియోగిస్తున్నట్లు సమాచారం. 

నిజామాబాద్ కు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులపై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

ఉప్పల్ లో బాసర సరస్వతి ప్రధాన అర్చకుడు..

హైదరాబాద్ : బాసర ప్రధాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు సజీవ కుమార్ ఉప్పల్ లో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై అమ్మవారి విగ్రహం దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏఈవో శ్రీనివాస్ వేధింపుల వల్లే అనారోగ్యం పాలయ్యాయనని సంజీవ కుమార్ పేర్కొన్నట్లు సమాచారం. 

సంగారెడ్డిలో రోడ్డు ఆక్సిడెంట్..

సంగారెడ్డి : ఆర్ సి పురం (మం) కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు జవహార్ సింగ్, షకీల్ గా గుర్తించారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది. 

ఢిల్లీ వెళ్లనున్న బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. 11వ తేదీన ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొననున్నారు. 

Don't Miss