Activities calendar

11 August 2017

22:05 - August 11, 2017
22:05 - August 11, 2017
22:04 - August 11, 2017

ఢిల్లీ : 13వ భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెంకయ్యనాయుడు చేత ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన పార్లమెంట్‌కు చేరుకుని రాజ్యసభ ఛైర్మన్‌లో ఆసీనులయ్యారు.స్వాతంత్ర్యానంతరం జన్మించినవారిలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి వెంకయ్యనాయుడు కావడం అరుదైన సందర్భమని ప్రధాని మోది అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సభాకార్యకలాపాలు తెలిసిన వ్యక్తి ఉప రాష్ర్టపతి కావడం సంతోషంగా ఉందన్నారు.వెంకయ్యనాయుడు మంచి ఉపన్యాసకులని, ఏ మాధ్యమంలోనైనా అనర్గళంగా మాట్లాడగలరని ప్రశంసించారు. తెలుగులో వెంకయ్య ప్రసంగం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా ఉంటుందని కితాబిచ్చారు. వెంకయ్యనాయుడు ప్రోద్బలంతోనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం విజయవంతమైందని మోది అన్నారు.

తెలుగువారికి గర్వకారణం
కాంగ్రెస్‌ పార్టీ తరపున వెంకయ్యనాయుడుకు గులాంనబీ ఆజాద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకయ్య సభను సరైన మార్గంలో నడిపిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వెంకయ్యతో పలు అంశాల్లో కలిసి పనిచేశామన్నారు. భావజాలం ఏదైనా ఉన్నత హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు న్యాయంగా వ్యవహరించాలని సీపీఎం రాజ్యసభ సభ్యుడు సీతారాం కోరారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభా చైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఉండటం తెలుగువారికి గర్వకారణమన్నారు. ఈసందర్భంగా గురజాడ అప్పారావు ప్రసిద్ధ సూక్తిని ప్రస్తావించారు. 'దేశమంటే మట్టికాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌' అనే సూక్తికి అనుగుణంగా వెంక్యయ వ్యవహరిస్తారని ఏచూరి ఆకాంక్షించారు. రాజ్యసభ ఛైర్మన్‌గా వెంకయ్యనాయుడు తొలిసారిగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. 1998లో తాను రాజ్యసభ సభ్యుడినయ్యానని...కానీ సభా బాధ్యతలు స్వీకరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అత్యున్నత పదవిని అధిష్టించడం ప్రజాస్వామ్యం గొప్పదనమని ఆయన తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్టీలకతీతంగా సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి ముందు వెంకయ్యనాయుడు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. వెంకయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు అమిత్‌షా, అద్వాని, ఎన్డీయే ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తదితరులు హాజరయ్యారు.

22:02 - August 11, 2017

కామారెడ్డి : జిల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గులాబీ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడిచేయగా... పోలీసులు జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌లోనే నిర్భందించారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. యాత్రను కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు.. అక్కడినుంచి టీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల హంగామా మొదలైంది.. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. బస్వాపూర్‌ గ్రామస్టేజీ నుంచి అరకిలోమీటర్ దూరంలోనే.. జాతీయ రహదారిపై కోదండరాం యాత్రను ఆపేశారు. అయితే ముందు అనుకున్న ప్రకారం అక్కడ కోదండరాం జెండాను ఎగురవేయాల్సిఉంది.. టీఆర్‌ఎస్‌ నేతల హడావుడితో జెండా ఎగురవేయకుండానే బిక్కనూరుకువచ్చారు.. అక్కడ పోలీసులు ఎంటరయ్యారు. ఎక్కువ వాహనాలకు అనుమతి లేదంటూ యాత్రను ఆపేశారు.. తమకు అనుమతి ఉందంటూ జేఏసీ నేతలు చెప్పినా వినకుండా జేఏసీ నేతల్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.. బయటకువెళ్లేందుకు ప్రయత్నించినా గేటువేసి నిర్భందించారు..

స్టేషన్‌లోనే ఆందోళన
పోలీసుల తీరుపై ఆగ్రహించిన టీజేఏసీ నేతలు... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. వీరిని పోలీసులు అడ్డుకొని పక్కకు తోసేశారు.. మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.జేఏసీ నిరసనను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు మధ్యాహ్నం కోదండరాంను భోజనం చేయాలని సూచించారు.. తాను ఆహారం తీసుకోనన్న కోదండరాం.. అక్కడే నిరాహారదీక్ష చేపట్టారు.అటు కామారెడ్డిలో జేఏసీ తలపెట్టిన బహిరంగసభ దగ్గరా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెచ్చిపోయారు.. సభదగ్గర టెంట్‌ను ధ్వంసం చేశారు.. సభకోసం ఏర్పాట్లు చేస్తున్న విద్యార్థి సంఘాలపై టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు.. ఈ ఘటనలో 30మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.. ఇందులో పృథ్వీరాజ్‌ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.. అతన్ని హైదరాబాద్‌కు తరలించారు.. మిగతావారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

పలువురి మద్దతు
కోదండరాం అరెస్ట్‌కు నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.. బాన్సువాడ అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, టీజీవీపీ, జీవీఎస్ విద్యార్థి సంఘాలు టీఆర్‌ఎస్‌ నేతల దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.. సిపిఐయంఎల్ న్యూడెమోక్రసి నేతలు కూడా సీఎం దిష్టిబొమ్మను దహనంచేసి నిరసన తెలిపారు.స్ఫూర్తియాత్రను అడ్డుకోవడంపై కోదండరాం సీరియస్‌గా స్పందించారు.. టీఆర్‌ఎస్‌ నేతలు గుండాల్లా ప్రవర్తించారని మండిపడ్డారు.. గతంలో ఉద్యమ సమయంలో ఇలాగే దాడులు చేశారని గుర్తుచేశారు.. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఇదే తరహాదాడులు చేయడం సిగ్గుచేటన్నారు.. టీఆర్‌ఎస్‌ ఎన్నిసార్లు దాడులుచేస్తే అంత బలం పెరుగుతుందని చెప్పారు.జేఏసీ నేతల్ని సాయంత్రం నాలుగు గంటలవరకూ నిర్భందించిన పోలీసులు.. ఆ తర్వాత వారందరినీ హైదరాబాద్‌కు తరలించారు.

21:59 - August 11, 2017

కర్నూలు : విపక్ష నేత వైఎస్‌ జగన్‌ చట్టానికి అతీతుడు కాదని... రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవరిపైనైనా ఈసీ చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుపై జగన్‌ వ్యాఖ్యలకు నిరసనగా నంద్యాలలో టీడీపీ భారీ ర్యాలీ చేపట్టింది. శ్రీనివాస్‌ సెంటర్‌ నుంచి టీడీపీ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన నిర్వహంచారు.

21:58 - August 11, 2017

కర్నూలు : నంద్యాలలో జరుగుతున్నది ధర్మయుద్ధమని... మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనదగ్గర అధికార బలం, ధన బలం లేదని.. విశ్వనీయత మాత్రమే ఉందని చెప్పారు. పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులివ్వడంపై జగన్‌ మండిపడ్డారు.

20:55 - August 11, 2017

నల్లగొండలో టీజేఏసీ నేతల ధర్నా

నల్లగొండ : టీజేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్ట్ కు నిరసనగా నల్లగొండలోని అమరవీరుల స్తూపం వద్ద టీ జేఏసీ ఆధ్యర్యంలో ధర్నా నిర్వహించారు.

కడప మైనింగ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కడప : జిల్లాలోని భూగర్భశాక కార్యాలయంలో ఏసీబీ దాడులు చేసింది. అధికారులు ఈ సోదాల్లో రూ.2.43లక్షలు స్వాదీనం చేసుకున్నారు. 

జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయింపు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి స్థలం కేటాయించింది. నిజాంపేటలో 32 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

20:46 - August 11, 2017

ఓ పక్క కాలా షూటింగ్ జరుగుతోంది.. మరోపక్క వాడి వేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఊహాగానాలు పెరుగుతున్నాయి.. వీటన్నిటిని చూస్తే తమిళనాట రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా? సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? రజనీ ఏ సంకేతాలిస్తున్నారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి? అదే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి కనిపించటం తమిళనాట కొత్త చర్చకు దారితీస్తోందా? ఇదే ఈ రోజు .దశాబ్దాల నుండి ఆ పీఠంపై సినీ తారలను, సినీరంగ ప్రముఖులను కూర్చోబెడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? ఆయన దారి రహదారి. ఇది సినిమాల్లోనేనా లేక పాలిటిక్స్ లో కూడానా. ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఉన్న దారిలోనే దూసుకొస్తారా? లేక కొత్త బాట వేసుకుంటారా? రజనీతో పాటు తెరపైకి వచ్చి వేడెక్కిస్తున్న కమల్ హసన్ దారెటు?రజనీ హడావుడి ఓ పక్క నడుస్తుండగానే కమల్ హాసన్ తెరపైకివచ్చారు.. కొద్ది నెలలుగా ట్వీట్లు స్టేట్ మెంట్లతో తమిళ రాజకీయరంగాన్ని వేడెక్కిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే పార్టీ కార్యక్రమానికి హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. తనకు గతంలోనే డీఎంకే నుంచి పిలుపు వచ్చిందంటున్న కమల్ ఇప్పుడు దాన్ని అంగీకరిస్తారా?సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని గాంధేయ మక్కల్‌ ఇయక్కం చెప్తోంది. రజనీ ఎంట్రీ ఇస్తే, కొత్త పార్టీతో తమిళ ప్రజల్లోకి ఆయన వస్తారా? ఇందుకు ఢిల్లీ వేదికగా కసరత్తులు సాగుతున్నాయా? సైలెంట్ గా న్యాయ నిపుణుల కమిటీలతో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో బిజీగా ఉన్నారా?

20:35 - August 11, 2017

మన నిజాంబాదు పోలీసోళ్లు ఎంత తెల్వికల్లోళ్లమ్మా..? అడ్డంబడెటోన్ని ఇడ్సిపెట్టి.. ఆపదలున్నోన్ని అరెస్టు జేశిండ్రంటే.. వాళ్ల ప్రతిభా పాఠవాలు మామూల్యేంగాదు.. తెలంగాణ జేఏసోళ్లు స్పూర్తి యాత్ర పేరు మీద నిజాంబాదుకు వోతుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు నడ్మిట్ల అడ్డం బడి ఆగమాగం జేయవోయిండ్రు.. మరి ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే.. అడ్డంబడెటోన్ని అరెస్టు జేయాల్నా..? జేఏసోళ్లను అరెస్టు జెయ్యాల్నా మీరే జెప్పుండ్రి..

ఆ నంద్యాల ఉపఎన్నికలళ్ల గెల్చెటోళ్లు ఎవ్వలో పొయ్యెటోళ్లు ఎవ్వలోగని.. రామచంద్రా.. తెల్గుదేశమోళ్లు అట్లనే మోపైండ్రు.. అటు జగన్ పార్టోళ్లు అట్లనే మోపైండ్రు.. ఎల్లిమీద మల్లి మల్లి మీద ఎల్లి.. వీళ్లు వాళ్లను తిట్ట వాళ్లు వీళ్లను తిట్ట.. నంద్యాల ఓటర్లే నోరెళ్ల వెట్టె పరిస్థితొచ్చింది.. అటు ఎన్నికల సంఘమోళ్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు దీస్కుంటున్నరు..

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పంచాదిల కొండను దొవ్వి ఎల్కను వట్టిండ్రుగదా ప్రభుత్వమోళ్లు.. మోకాళ్లు వల్గెతట్టు.. సంసారానికి పన్కిరానట్టు దళితులను గొట్టిన కేసుల తప్పంత ఎస్ఐ రవీందరుదేనటనుల్లా.. ఆ ఒక్కడు గొడ్తెనే ఎన్మిది మంది ఎందుకు పన్కిరాకుంటైండ్రట.. మరి అంత ధమ్మున్న ఎస్ఐని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పొంట నిలవడ్తె ఒక్కడన్న బత్కుతడా పాకిస్తాన్ ఉగ్రవాది..? ఏం తమాషనో పోండ్రి..

హురక మనం చాల మిస్సైపోయినయ్ నిన్నటి శ్రీరాంసాగర్ నీళ్ల సభకాడి ముచ్చట్లు.. అంటే ఇవ్వి సర్కారు కెమేరాల గనిపియ్యయ్ గదా..? ఏదో ప్రైవేటు కెమేరాలకే దొర్కుతయ్ గావట్టి ఆల్చంగొస్తున్నట్టున్నయ్.. అయితే నిన్న ఓదిక్కు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. సభ సంతోషంగున్నదనుకున్నంగని.. లోపటతం గంద్రగోళమే అయ్యిందట.. సూడుండ్రి..

ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. ఎంత మందున్నరు మీ కులపోళ్లు తెలంగాణల..? అంత తింపికొడ్తె.. అరశాతానికి ఎక్వలేరు.. మీరు గంత మంది ఎమ్మెల్యేలా..? గజ్వెల్లి కెళ్లి మొదలు వెడ్తె.. సిద్దిపేట మీరేనాయే.. సిరిసిల్ల మీరేనాయే.. వేములవాడ మీరేనాయే.. కోరుట్ల మీరేనాయే.? ఏంది తమాష మరి మా బీసీలంత ఎటువోవాలె అంటున్నడు అంబర్ పేట అన్మంతన్న... ఏందో మళ్లొకపారి జెప్పు..?

మహాత్మా జ్యోతి బాపూలే బడుల పొంట సద్వుతున్న పోరగాళ్లు సద్వుళ్ల సారం నేర్చుకోని ఎట్ల బత్కాలె అని నేర్చుకునుడు కంటే.. మన్షి అనెటోడు ఏ విధంగ బత్కొద్దు అనేదే నేర్చుకుంటున్నట్టున్నరు ఎక్వ.. ఎందుకంటె హాస్టళ్లు గట్టిండ్రు పయ్యాకన బాతురూములు మర్శిండ్రు.. రూములు నిర్మించిండ్రు.. కిటికీలు మర్శిండ్రు.. ఇన్ని అవస్థల నడ్మ వాడు వ్యవస్థ మీద ఏడపట్టుసాధిస్తడు చెప్పుండ్రి..

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు సూడుండ్రి..

కాలే ధన్ వాపస్ లాయెంగే.. యా నహి లాయెంగే... చేతులు ఇంత పొడ్గువెట్టి చెప్పిండు అప్పటి అభ్యర్థి.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ.. నల్లధనం వాపసు దెస్తాన్న మొనగాడు.. ఉన్నధనం విదేశాల పాలు జేశే పనిజేస్తున్నడట.. ఇన్నొద్దులు సర్కారు చేతులున్న రైల్వే సంస్థ.. ఇప్పుడు విదేశాలోళ్లకు అప్పజెప్పె కుట్రలు జేస్తున్నడట.. ఇగ రైల్వే కార్మికులు.. కండ్లెర్ర జేయవట్టిరి..

 

ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి

నిర్మల్ : జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లాక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి ఆసుపత్రి సబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రఖ్ పూర్ లో దారుణం

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు. మొత్తం వెంటలేటర్ పై 54మంది చిన్నారులుంటే అందులో 30 మంది చిన్నారలు మృతి చెందడం కలంకలం రేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితమే ఆసుపత్రి సందర్శించారు.

రేపు కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన జేఏసీ

కామారెడ్డి : టీజేఏసీ నేతలపై టీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా రేపు కామారెడ్డి బంద్ కు టీ జేఏసీ పిలుపునిచ్చింది.

20:19 - August 11, 2017

కరీంనగర్ : అమరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడాన్ని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ తప్పుపట్టారు. శాంతియుతంగా యాత్ర నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం సరికాదన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన ఉద్యమ శక్తులు ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రాళ్లు వేసినా.. రక్తాలు చిందించినా.. శాంతియుత యాత్ర కొనసాగుతుందన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఉద్యమ వ్యతిరేక శక్తులు ఎంత ఎక్కువ దాడులు చేస్తే తమ బలం అంత పెరుగుతుందని కోదండరామ్‌ అన్నారు.

20:18 - August 11, 2017

కామారెడ్డి : ల్లాలో టీ జేఏసీ అమరుల స్ఫూర్తియాత్రకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడంలేదంటూ జేఏసీ అమరవీరుల స్ఫూర్తియాత్ర చేపట్టింది. ఈ యాత్ర కామారెడ్డి జిల్లా బస్వాపూర్‌లో ప్రారంభించేందుకు జేఏసీ నేతలంతా అక్కడికి చేరుకున్నారు. జేఏసీ నేతల్ని గులాబీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. యాత్రకు అనుమతి లేదంటూ జేఏసీ నేతల్ని బిక్కనూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.. పోలీస్‌ స్టేషన్‌లో నిర్భందించారు.. పోలీసులతీరుపై ఆగ్రహించిన టీ జేఏసీ నేతలు... స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాయంత్రం భారీ బందోబస్తు మధ్య జేఏసీ నేతల్ని హైదరాబాద్‌కు తరలించారు.

20:17 - August 11, 2017

హైదరాబాద్ : గ్స్ వాడుతున్నారని 12 మంది టాలివుడ్‌ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు...రిపోర్టు అందిన వెంటనే సైంటిఫిక్ ఆధారాలతో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు..ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేసిన తర్వాత ఓ నిర్ధారణకు రాగా...ఆధారాల కోసం చూస్తున్నట్లు కన్పిస్తుంది.టాలివుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారంపై జల్లెడ పట్టిన సిట్ బృందం చివరకు తొలివిడతగా 12 మందిని విచారించింది... ఇందులో ప్రధానంగా దర్శకుడు పూరీజగన్నాథ్‌,ప్రముఖ నటులు రవితేజ, చార్మి, ముమైత్‌ఖాన్, నవదీప్, తరుణ్ లతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు, ఫోటోగ్రాఫర్ శ్యాం.కె.నాయుడు,సుబ్బరాజు తదితరులను విచారించిన సంగతి తెలిసిందే...వీరిని విచారించినప్పుడు సిట్ అధికారులు వేసిన క్రాస్‌ క్వశ్చన్స్‌తో అసలు కథ తెలిసిపోయింది..ఏదైతే అనుమానించారో అదే నిజాలు బయటపడ్డాయని సిట్ అధికారులంటున్నారు..దీంతోనే ఇప్పటికే ఆ 12 మందిలో ఇద్దరిపై పూర్తిగా నిర్ధారణకు వచ్చినా ఆధారాల కోసం వేచి చూస్తున్నట్లు ఎక్సైజ్ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్ చెబుతున్నారు.

చాలామందిని విచారించాల్సి ఉంది
సినిప్రముఖుల విచారణ పూర్తయినంత మాత్రానా... కేసు పూర్తయినట్టు కాదని ఇంకా చాలామందిని విచారించాల్సి వుందని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేస్తున్నారు...ఇప్పటికే 12 మంది పైన పూర్తి విచారణ నివేదికలు రెడీ చేశామంటున్నారు...అయితే విచారణతోనే కేసు క్లోజ్ చేశామన్న ప్రచారం సరైంది కాదంటున్నారు.డ్రగ్స్ కేసులో తెలంగాణా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలతో పాటు సిట్ బృందానికి పూర్తి స్వేచ్చను ఇవ్వడంతో దూకుడు పెంచుతున్నారు...12 మందిని విచారించిన అధికారులు వారి ద్వారా తెలుసుకున్న విషయాలతో పాటు స్వీయ శోధనలో చాలా మంది పేర్లు వచ్చాయి..ఇందులో కొందరు ప్రముఖులకు సంబంధించిన ఆధారాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది...దీంతోనే ముందుకు పోతున్న సిట్ అధికారులు రెండో విడత విచారణకు సిద్దం చేస్తున్నట్లు సమాచారం... ఇప్పటికే జాబితా రెడీ చేసిన అధికారులు తొలివిడతలోని వారిపై చర్యలు తీసుకుంటూనే ఈ లిస్ట్‌ను బయటపెట్టే అవకాశం కన్పిస్తుంది...నవంబర్ చివరాఖరికల్లా ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం వుందంటున్నారు సిట్‌ అధికారులు.

20:06 - August 11, 2017
20:04 - August 11, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో దారుణం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు. మొత్తం వెంటలేటర్ పై 54మంది చిన్నారులుంటే అందులో 30 మంది చిన్నారలు మృతి చెందడం కలంకలం రేపింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితమే ఆసుపత్రి సందర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

19:39 - August 11, 2017

ఈ రోజు విడుదలైన మరో మూవీ నేనే రాజు నేనే మంత్రి సీనియర్ డైరక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ ఎంటటైనర్ నేనే రాజు నేనే మంత్రి ఈ సినిమాలో రానా హీరోగా గజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రివ్యూ కోసం వీడియో చూడండి.

19:38 - August 11, 2017

ఈ రోజు విడుదలైన్ మరో మూవీ లై అనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ ఎంటటైనర్ ఈ లై మూవీ. నితిన్ మేఘ ఆకాశ్ జంటగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ అర్జున్ విలన్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాలో పాటలతో పాటు ఆర్ఆర్ కూడా కీలక పాత్ర పోషించాయి. ఈ మూవీ సంగీతం మణిశర్మ అందించారు. ఈ మూవీ టెన్ టివి రివ్యూ కోసం వీడియ్ క్లిక్ చేయండి.

19:36 - August 11, 2017

ఈ రోజు విడులైన సినిమాల్లో ఒటైన మూవీ జయజానకి నాయక. కమర్షిల్ డైరక్టర్ పేరు తెచ్చుకుని ఇటు కుటుంబ కథ చిత్రల్లో కూడా తన మార్క్ చూపిస్తున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా జయజానకినాయక ఈ సినిమా టెన్ టివి రివ్యూ కోసం వీడియో చూడండి.

19:14 - August 11, 2017

విజయవాడ : ఇది విజయవాడలోని జక్కంపూడి వైఎస్‌ఆర్‌ కాలనీ. ఇక్కడ మధ్య తరగతి ప్రజలు, ధనవంతులు ఉండరు. కరకట్ట ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ ఒక పూట తిని మరొక పూట పస్తులుండి జీవనం సాగించిన వాళ్లు ఉంటున్నారు. వీళ్లకు ఇంధ్రభవనం లాంటి ఇళ్లు ఇప్పిస్తామంటూ జక్కంపూడి వైఎస్‌ఆర్‌ కాలనీకి తరలించారు. కాలనీలో సరైన సౌకర్యాలు లేవని చెప్పినా.. మోడల్ కాలనీ వచ్చేస్తుందంటూ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. సీఎం చంద్రబాబు జక్కంపూడిని మోడల్ కాలనీగా మారుస్తామని చెప్పి ఆరు నెలలు గడిచినా.. ఇప్పటివరకు రాయి కూడా కదలలేదంటే బాబు మాటలు అధికారుల చేతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చుట్టూ చెట్లు.. నెలల తరబడి పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం. ఏ జంతువు చనిపోయినా దాన్ని తీసేవారు లేక వచ్చే దుర్వాసన. రాత్రుళ్లు దొంగలు ఏ ఇళ్లలో పడతారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. 10 రోజుల నుంచి 200 మందికి పైగా మలేరియా బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మంత్రి నిర్లాక్ష్యం....
ఈ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్కసారి కూడా ఇక్కడకు వచ్చి చూసిన పాపాన పోలేదు. కాలనీలో 3 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. దాదాపు 30 వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. అయితే మలేరియా ఎంతలా విజృంభించిందంటే ప్రతీ ఇంటిలో ఒకరు మలేరియాతో అల్లాడిపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని కాలనీవాసులంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా జక్కంపూడి ప్రాంతంలో జ్వరాలు, రోగాల సమస్యతో పాటు తాగేందుకు చుక్క నీరు కూడా లేదని.. కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మలేరియా కేంద్రాల్లో పరీక్షలు చేయించుకొని నిర్ధారణకు వచ్చినా మందుల సప్లై జరగడం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే 30 వేల జనాభా ఉంటే ఒక్క మలేరియా కేంద్రంతో సరిపెడుతున్నారని.. పేదలంటే మరీ అంత చులకన ఎందుకని సీపీఎం నేత సిహెచ్‌. బాబూరావు ప్రశ్నించారు. మోడల్ కాలనీగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు దిక్కూమొక్కూ లేదని మండిపడ్డారు. వెంటనే జక్కంపూడి కాలనీకి వైద్య బృందాలను పంపాలని డిమాండ్ చేశారు.

19:12 - August 11, 2017

గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని ప్రాంత అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. టీడీపీ ప్రభుత్వం అటవీ భూములను ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తోంది. గతంలో ఈ విషయంపై అప్పటి కలెక్టర్‌కు అటవీ భూములను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాజిల్లాలో 30 వేల ఎకరాల అటవీ భూములను అధికారులు గుర్తించారు. రాజధాని ప్రాంత అభివృద్ధిని పరిగణలోకి తీసుకొని డీ నోటిఫికేషన్‌ చేస్తున్న నేపథ్యంలో.. వీటి వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను ఏపీ సీఆర్డీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. రాజధాని పరిధిలో కృష్ణాజిల్లాలో ఉన్న 5, 116 హెక్టార్ల అటవీ భూములను గుర్తించడం జరిగిది. వీటిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ భూములకు డీ నోటిఫై చేస్తే వేరే ప్రాంతాలలో అడవుల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ విధానంలో ఫోటోలు తీసి పంపించాలని కేంద్రం కోరింది. మ్యాపింగ్ చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపి నెలలు కావస్తున్నా.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటవీ విస్తీర్ణం చాలా తక్కువగా ఉందన్న వాదనలను కేంద్రం వినిపిస్తోంది. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు ఏడాదిన్నర కాలంగా అటవీ భూముల డీ నోటిఫైపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయలేకపోతోంది.

19:10 - August 11, 2017

విజయవాడ : ఏపీలో విపక్ష వైసీపీ సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీని టార్గెట్‌ చేస్తూ పెడుతున్న పోస్టింగ్‌లు హీట్‌పెంచుతున్నాయి. వైసీపీ దూకుడుపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సాధారణంగా టెక్నాలజీలో తనకంటే ఘనులు లేరని చెప్పుకునే చంద్రబాబునే ఉక్కిరిబిక్కిరి చేసేలెవల్లో వైసీపీ అభిమానులు పోస్టింగులు పెడుతున్నారు. ప్రశాంతకిషోర్‌ వ్యూహంలో భాగంగా సోషల్‌మీడియాలో వార్‌ మొదలు పెట్టినట్టు సమాచరం. దీనికోసం స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగానే వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా మారినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో ముందుండే చంద్రబాబును అదే టెక్నాలజీతో దెబ్బకొట్టాలన్న ప్లాన్‌ ను వైసీపీ చక్కగా అమలు చేస్తోంది. మరోవైపు జగన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్లతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాస్తవానికి జగన్‌ 2009నుంచి ప్రత్యక్షరాజకీయాల్లో బిజీగా మారినా.. సోషల్‌ మీడియాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇదంతా ప్రశాంతకిషోర్‌ వ్యూహంలతో భాగంగానే జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

ప్లాన్‌లో భాగంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో ఖాతాలు
వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంతకిషోర్‌ ప్లాన్‌లో భాగంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో ఖాతాలు ఓపన్‌ చేశారు. అయితే ఆ అకౌంట్లన్నీ నార్త్‌ఇండియా పేర్లతోనే ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్‌కిషోర్‌ టీం మెంబర్లే ఇలా వైసీపీ కార్యకర్తల్లా పోస్టింగులు పెడుతున్నారని టీడీపీ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రశాంతకిషోర్‌ టీమ్‌ ఇవేపేర్లతో సోషల్‌మీడియాలో కామెంట్లుపెడుతూ తాము వ్యూహకర్తులుగా ఉన్న పార్టీలకు సహకరించినట్టు తెలుస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నడుస్తున్న వైసీపీ పొలిటికల్‌ ప్రచారం అంతా బూటకమని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. దీనివెనుక ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ ఉందంటున్నారు. టీడీపీని, చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న సోషల్‌మీడియా అకౌంట్లన్నీ నార్త్‌ఇండియా పేర్లతో ఉండటమే దీనికి రుజువు అంటున్నారు. మొత్తానికి సోషల్‌మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మాటల యుద్ధం రాజకీయవేడిని పీక్‌స్టేజ్‌కి తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఈ టెక్నికల్‌వార్‌ ఏపీ పొలిటిక్స్‌ను ఎటుతీసుకెళతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

19:07 - August 11, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబుపై జగన్‌ వ్యాఖ్యలకు నిరసనగా నంద్యాలలో టీడీపీ ఆందోళన చేపట్టింది. శ్రీనివాస్‌ సెంటర్‌ నుంచి టీడీపీ కార్యాలయం వరకు మౌన ప్రదర్శన నిర్వహంచారు. ఇందులో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్‌.. జగన్‌ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

19:06 - August 11, 2017

హైదరాబాద్ : రాజధానిలో రైతుల భూములు లాక్కుని వారిని రోడ్డుపై పడేసిన చంద్రబాబుకు ఏం శిక్ష విధించాలో టీడీపీ నేతలు చెప్పాలని రోజా ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పేరుతో మోసం చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలని రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రోజా అన్నారు.

19:04 - August 11, 2017
19:01 - August 11, 2017

నిర్మల్ : జిల్లా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లాక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి నుంచి ఆసుపత్రి సబ్బంది పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

18:59 - August 11, 2017

హైదరాబాద్ : నిరుద్యోగ యువత ఆదుకునేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సిటీ పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జాబ్ కనెక్ట్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఐదు జోన్లలోని అన్ని పీఎస్‌ల పరిధిలో ఓ ప్రణాళిక ప్రకారం జాబ్ కనెక్ట్ వాహనం సంచరిస్తుంది. నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ జాబ్ కనెక్ట్ వాహనం ముఖ్య ఉద్దేశం. పదవ తరగతి పాసైనా కాకపోయిన, ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసీఏ, ఐటి సెక్టార్స్, ఫైనాన్సియల్ గ్రాడ్యుయేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ సెక్టార్లలో విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు జాబ్ కనెక్ట్ వాహనం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంటివద్దకు వచ్చే జాబ్ కనెక్ట్ వాహనం ప్రైవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను వారికి అందిస్తూ అనుసంధానం చేస్తుంది. ఇంటర్వ్యూలో ఒకవేళ జాబ్ రాకపోయినా ఏ కారణాల వల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారో.. ఆ అంశంపై ఉచితంగా శిక్షణను కూడా ఇస్తుంది.

సిటీవాసులు హర్షంజాబ్ కనెక్ట్ వాహనంలో యువత ఇచ్చే బయోడేటాలను సేకరించడంతో పాటు.. పూర్తి సమాచారం డాటాబేస్‌లో నిక్షిప్తం చేసేందుకు టెక్నికల్ టీంతో పాటు.. సిస్టమ్ అనాలసిస్ టీం సభ్యులు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే వేల సంఖ్యలో నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. జాబ్ కనెక్ట్ వాహనం ఏ విధంగా పనిచేస్తుందనే పూర్తి వివరాలను కూడా హ్యాక్ ఐ యాప్‌ ద్వారా అందరికి అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ సిటీ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల సిటీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

18:58 - August 11, 2017

హైదరాబాద్ : తనపై తాను కాల్పులు జరిపించుకున్న ఘటనలో.. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌కు కష్టాలు తప్పడం లేదు. బెయిల్ కావాలంటూ వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వారం రోజుల క్రితం.. కాల్పుల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. రెండోరోజుల క్రితం పోలీసులు... విక్రమ్‌ గౌడ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ కావాలంటూ పిటిషన్‌ కోరగా.. కోర్టు తిరస్కరించింది.

18:57 - August 11, 2017

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలో వేలకోట్ల రూపాయల కమిషన్లు దండుకున్నారని.. ఇప్పుడు పాత గోడలకు కొత్త రంగులు వేసినట్లు పాత ప్రాజెక్టులకు పునరుజ్జీవనం పేరుతో కొత్తగా కమిషన్లు దండుకునే కార్యక్రమం టీఆర్‌ఎస్‌ చేస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

17:02 - August 11, 2017

కామారెడ్డి : టీజేఏసీ చైర్మన్ కోదండరాం కామారెడ్డి జిల్లా చేస్తున్న అమరవీరుల స్పూర్తియాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ వెళ్లిన కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీఎస్ లో ఉన్న ఆయన భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో పోలీసులు కోదండరాంను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:57 - August 11, 2017
16:56 - August 11, 2017

చిత్తూరు : స్వాతంత్ర్య వేడుకలకు తిరుపతిలోని ఎస్ వీ యూనివర్శిటీ స్టేడియం ముస్తాబవుతోంది. ఈసారి పంద్రాగస్టు వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాలతో వేడుకలకు అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.. తరచూ కురుస్తున్న వర్షం ఈ పనులకు ఆటంకం కలిగిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:54 - August 11, 2017

కర్నూలు : త్రాగడానికి చుక్క నీరు లేకున్నా నంద్యాల ఉపఎన్నికల్లో మద్యం ఏరులైపారుతుందని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌ నాయకులు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి. భూమా వర్గీయులు, శిల్పా వర్గీయులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని దీనివల్ల కరువు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఓరిగేదేమీలేదని ఆరోపించారు. అధికార..ప్రతిపక్ష పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు.

16:52 - August 11, 2017

కామారెడ్డి :  విద్యార్థి సంఘాలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం సభకు వచ్చిన ఏఐఎస్‌ఎఫ్ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏఐఎస్‌ఎఫ్‌ నేత పృథ్వీ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విద్యార్థులపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై విద్యార్థిసంఘం నేతలు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పీఎస్ ఎదుట విద్యార్థి సంఘాలు బైఠాయించాయి. ఈ వార్త వ్యాప్తి చెందకుండా.. అధికారులు కామారెడ్డిలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

16:50 - August 11, 2017

ఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదితో భేటి అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సిఎం పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనమవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరు వర్గాలను ఒప్పించి అన్నాడిఎంకేను ఎన్డేయేలో చేర్చుకునే దిశగా బిజెపి ప్రయత్నిస్తోంది. శశికళవర్గాన్ని అన్నాడిఎంకే పార్టీ నుంచి దూరం చేసేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నియామకం చెల్లదని సీఎం నేతృత్వంలో అన్నాడీఎంకే అమ్మ శిబిరం ఇప్పటికే ప్రకటించింది. పార్టీకి అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శని పళనిస్వామి వర్గం పేర్కొంది.

16:49 - August 11, 2017

హైదరాబాద్ : తాము చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని చంద్రబాబు భావిస్తే.. నంద్యాల ఉప ఎన్నికను 2019 ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తారా అని వైసీపీ నేత తమ్మినేని సీతారాం సవాలు చేశారు. మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. నంద్యాలలో అంతమంది మంత్రులు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధి కోసం హడావుడిగా ఇచ్చిన జీవోలన్నీ ఎన్నిక తర్వాత బుట్టదాఖలవుతాయని తమ్మినేని సీతారాం విమర్శించారు.

16:48 - August 11, 2017

పశ్చిమగోదావరి : గరగపర్రులో బాధితుల ఉద్యమం ముగిసినా ఇప్పుడు మరో సమస్య తలెత్తింది. ఎస్సీ అట్రాసిటీ కేసు కింద ప్రభుత్వం కొందరికే నష్టపరిహారమిచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఏలూరులో కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బాధితులను పోలీసులు అడ్డుకుని... బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును ప్రజాసంఘాలు ఖండిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

16:26 - August 11, 2017

కామారెడ్డి : టీజేఏసీ చైర్మన్ కోదండరాం కామారెడ్డి జిల్లా చేస్తున్న అమరవీరుల స్పూర్తియాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ లో ఉన్న ఆయన భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో పోలీసులు కోదండరాంను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కు తరలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

భారీ బందోబస్త్ మధ్య హైదరాబాద్ కు కోదండరాం

కామారెడ్డి: భారీ బందోబస్త్ మధ్య ప్రొ. కోదండరాం ను హైదరాబాద్ కు తరలించారు. ఈ రోజు టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి లేదని బిక్నూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా పీఎస్ ఎదుట కోదండరాం బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీఎస్ నుంచి వెళ్లిపోతుండగా గేట్లు మూసివేసి కోదండరాంను పోలీసులు నిర్బంధించారు. 151 సీఆర్ పీసీ కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి పీఎస్ లో భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో కోదండరాం ను హైదరాబాద్ కు తరలించారు.

 

భారీ బందోబస్త్ మధ్య హైదరాబాద్ కు కోదండరాం

కామారెడ్డి: భారీ బందోబస్త్ మధ్య ప్రొ. కోదండరాం ను హైదరాబాద్ కు తరలించారు. ఈ రోజు టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి లేదని బిక్నూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా పీఎస్ ఎదుట కోదండరాం బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీఎస్ నుంచి వెళ్లిపోతుండగా గేట్లు మూసివేసి కోదండరాంను పోలీసులు నిర్బంధించారు. 151 సీఆర్ పీసీ కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి పీఎస్ లో భోజనం తీసుకునేందుకు నిరాకరించడంతో కోదండరాం ను హైదరాబాద్ కు తరలించారు.

 

16:18 - August 11, 2017

పశ్చిమ గోదావరి : జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలెక్టర్ ను కలిసేందుకు వచ్చిన గరగపర్రు బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో రూరల్ పీఎస్ వద్ద బాధితులు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వారికి సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం వారు పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్ కు ర్యాలీగా బయల్దేరారు. బాధితులందరికి నష్టపరిహారం చెల్లించాలని వారు కలెక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో బాధితులందరికి న్యాయం చస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:17 - August 11, 2017

కామారెడ్డి : జిల్లా ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు అమరవీరుల స్ఫూర్తియాత్రను అడ్డుకున్నారు. కోదండరాం రోడ్డుపై కొద్దిసేపు వేచిచూసి స్వయంగా మాట్లాడేందుకు పోలీస్ స్టేషనకు వెళ్లారు. ఆయన మాట్లాడుతూ బయటకువెళుతుండగా కోదండరాంను పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు మూసివేసి కోదండరాం పోలీసులు నిర్భంధించారు. అనుమతిలేని వేరే రూట్ లో వచ్చారని, వాహనాలు ఎక్కువ తెచ్చారని కోదండరాంపై 151సీఆర్ పీసీ కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కలెక్టర్ హామీ తో ఆందోళన విరమించిన గరగపర్రు దళితులు

ప.గో: గరగపర్రు దళితుల సమస్యలపై ఏలూరు కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో గరగపర్రు దళితులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్ నేతలు పాల్గొన్నారు. దళిత సంఘాల నేతలతో కలెక్టర్ చర్చలు జరుపుతున్నారు. బాధిత దళితులందరికీ న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో గరగపర్రు దళితులు ఆందోళన విరమించారు.

15:52 - August 11, 2017

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 318 పాయింట్ల నష్టంతో 31,213 వద్ద సెన్సెక్స్, 109 పాయింట్ల నష్టంతో 9,710 వద్ద నిఫ్టీ ముగిశాయి.

డీజీపీని కలిసిన అఖిల పక్షం నేతలు...

హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిల పక్షం నేతలు డీజీపీని కలిశారు. నేరేళ్ల ఘటనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

పోలీసుల నిర్బంధంలో కోదండరాం

కామారెడ్డి : టీజేఏసీ అమరుల స్ఫూర్తి యాత్రకు అనుమతి లేదని బిక్నూర్ లో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా పీఎస్ ఎదుట కోదండరాం బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీఎస్ నుంచి వెళ్లిపోతుండగా గేట్లు మూసివేసి కోదండరాంను పోలీసులు నిర్బంధించారు. 151 సీఆర్ పీసీ కింద కేసు నమోదు చేశారు. కోదండరాం ను సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జగన్ వ్యాఖ్యల్లో తీవ్ర కుట్ర: ఎమ్మెల్సీ రాంజేంద్ర ప్రసాద్

అమరావతి: జగన్ వ్యాఖ్యల్లో తీవ్ర కుట్ర దాగి ఉందని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. గొడవలు సృష్టించి ఉప ఎన్నికను ఆపడానికి జగన్ కుట్ర చేస్తున్నారని, ఈసీ జగన్ ను నంద్యాల నుంచి బహిష్కరించి కుట్రను భగ్నం చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ జగన్ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నట్లుందిన రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.

15:10 - August 11, 2017

కామారెడ్డి : జిల్లా బస్వాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీజేఏసీ అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారు. వాహనాలకు అనుమతి లేదని బికనూరు పోలీస్‌ స్టేషన్ ముందు పోలీసులు వాహనాలను నిలిపేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:09 - August 11, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు తొలిసారిగా సభ్యులనుద్దేశించి మాట్లాడారు. 1998లో తాను రాజ్యసభ సభ్యుడినయ్యానని...కానీ సభా బాధ్యతలు స్వీకరిస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని వెంకయ్య అన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను అత్యున్నత పదవిని అధిష్టించడం ప్రజాస్వామ్యం గొప్పదనమని ఆయన తెలిపారు. తాను రైతుగా చెప్పుకోవడానికి గర్విస్తానని చెప్పారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని...ఆమె ముఖాన్ని కూడా నేనెరగనని వెంకయ్య గద్గద స్వరంతో తెలిపారు. తనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్న సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా పార్టీలకతీతంగా సభను హుందాగా నడిపించేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు.

15:08 - August 11, 2017

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా, బస్వాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీజేఏసీ అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకున్నారు. జేఏసీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేశారు. వాహనాలకు అనుమతి లేదని బికనూరు పోలీస్‌ స్టేషన్ ముందు పోలీసులు వాహనాలను నిలిపేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:07 - August 11, 2017

పశ్చిమ గోదావరి : తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రత్యేక బస్సులో ఏలూరుకు చేరుకున్న గరగపర్రు బాధితుల్ని పోలీసులు అడ్డుకున్నారు. బస్సును త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో బాధితులు బస్సులోనే ఆందోళనకు దిగారు. బాధితుల్ని బలవంతంగా బస్సు నుండి దింపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పెనుగులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:02 - August 11, 2017
15:01 - August 11, 2017

న్యాయవిద్యలో ఓ అమ్మాయి సత్తా చాటింది..ఏకంగా 16 బంగారు పతకాలను గెలుచుకుంది..ఆమె బెంగళూరుకు చెందిన శృతి అశోక్.. ఆమెకు ఇంటర్మీడియట్ వరకు చట్టలంటే ఏమిటో తెలియని తనకు న్యాయ విద్యలో 16పతకాలకు అందుకోవడానికి ఉపయోగపడిన అంశలేమిటో మనం తెలుసుకుద్దాం.....

ఇంట్లో కుర్చోపెట్టాల్సింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను అంటున్నారు బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్.. మరి కిరణ్ ఖేర్ ఇంత ఘటుగా స్పందించడానికి కారణమేమిటో చూద్దాం...

ఎన్ని చట్టలు ఎంత చైతన్యం కలిగించిన సమాజంలో మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పుట్టినింటల్లో వివక్ష మెట్టినింట్టో వేధింపులు సర్వసాధారణమైయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు సమన్వయంతో మహిళలకు అండగా ఉండేందుకు ఉమెన్ హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకురానున్నాయి.....

బాలిక లింగనిష్పత్తి శాతంలో అతితక్కువగా ఉన్న హర్యానా రాష్ట్రంలో కూడా ఇటివలి కాలంలో బాలికల నిష్పత్తి గణనీయంగా పెరిగిదటా..దీనికి కారణం బేటీ బచావో బేటీ బడవో అంటున్నారు మంత్రి....

అత్తింటి వేధింపులకు గురౌతున్న మహిళల కోసం తెచ్చిన 498ఏ చట్టం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ చట్టం క్రింద కేసు నమోదైతె వెంటనే భర్త, అత్త,మామ అరెస్టు చేయకుడదని కోర్టు తెలిపింది...

నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం కాదని...సవాల్ గా తీసుకుంటున్నాం:కేఈ

కర్నూలు: జగన్ తనకు టీవీ, పత్రిక లేదని చెప్పుకోవడం హాస్యాస్పదం అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఈడీ అలాచ్ చేసిన ఆస్తులు ఎవరినో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గురించి ప్రజలకు మొత్తం తెలుసు అని నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం కాదని...సవాల్ గా తీసుకుంటున్నాం అని కేఈ అన్నారు.

విద్యార్థి సంఘాలపై టీఆర్ ఎస్ కార్యకర్తల దాడి: ఒకరి పరిస్థితి విషమం...

కామారెడ్డి : విద్యార్థి సంఘాలపై టీఆర్ ఎస్ కార్యకర్తల దాడి లో 9 మంది విద్యార్థులకు గాయాల్యయ్యాయి. గాయాలయిన వారిలో ఏఐఎస్ ఎఫ్ నేత పృధ్వీ పరిస్థితి విషయం గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొ. కోదండరాం సభకు వచ్చిన ఏఐఎస్ ఎఫ్ నేతల పై టీఆర్ ఎస్ కార్యకర్తలపై విద్యార్థులపై దాడి చేశారు. దీంతో సీఎస్ తో విద్యార్థి సంఘం నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పీఎస్ ఎదుట విద్యార్థి సంఘాల బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కామారెడ్డిలో విద్యుత్ అను అధికారులు నిలిపివేశారు.

సీఎం కేసీఆర్ అహంకార మాటలు మానుకోవాలి: వీహెచ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ అహంకార మాటలు మానుకోవాలని వీహెచ్ హితవు పలికారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులని కేటీఆర్ దొంగ చాటుగా వెళ్లి పరామర్శించాల్సిన అవసరమేంటని ఎస్పీని వదిలి ఎస్ ఐ పై వేటు వేయడం తగదన్నారు. థర్డ్ డిగ్రీకి కారణమైన ఎస్సీని తప్పిస్తేనే బాధితులకి న్యాయం జరుగుతుందా అని , 30 లోపు ఎస్పీ పై చర్యలు తీసుకోకుంటే దీక్ష చేపడతామన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడుతుంటే రాజకీయమంటూ నిందలు వేయడం తగదన్నారు. లారీ ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి రూ. 20లక్షలు, థర్డ్ డిగ్రీకి గురైన వారికి రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు.

గుజరాత్ కాంగ్రెస్ లో కొనసాగుతున్న ములసం

హైదరాబాద్: గుజరాత్ లో కాంగ్రెస్ ముసలం కొనసాగుతుంది. తాజాగా ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. నిన్న 8 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే...

 

14:12 - August 11, 2017

కర్నూలు : నంద్యాల ఉపెఎన్నికల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. నంద్యాల 31వ వార్డులో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని టీడీపీ కార్యకర్తలపై ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీకి ఓటు వేయకపోతే పించన్లు ఆగిపోతాయన హెచ్చరిచ్చినట్టు ఆరోపణలు రావడంతో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. తణకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

చంద్రబాబు పై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది: రోజా

హైదరాబాద్: రాయలసీమకు, నంద్యాలకు టీడీపీ అన్యాయం చేసిందని, ఓటమి భయంతోనే టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు రాయలసీమకు 13 ఏళ్లుగా చేస్తున్న అన్యాయాన్ని నంద్యాల ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. రాజధానిలో అన్యాయంగా రైతుల భూములు లాక్కొన్నారని, చంద్రబాబు పై జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందని రోజా సమర్థించుకున్నారు. చంద్రబాబువి వెన్నుపోటు రాజకీయాలని ఎద్దేవా చేశారు.

13:29 - August 11, 2017

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఏం తప్పు ఉందని టిడిపి నేత రోజా ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఓటమి భయతో టిడిపి రాజకీయ దిగుడు రాజకీయాలు చేస్తోందని, వారి నేతలు ఎగిరెగిరి పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రజా కోర్టులో ప్రజలే జడ్జీలనీ, వాళ్లు ఇచ్చే తీర్పును మనం గౌరవించాలన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

13:24 - August 11, 2017
13:22 - August 11, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసు క్లోజ్ అయ్యిందా ? గత కేసుల్లో లాగానే నీరుగారిపోతుందా ? ఇలాంటి అనుమానాలకు ఎక్జైజ్ శాఖ ఇన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెరదించారు. కేసు ఇంకా కొనసాగుతుందని, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. కెల్విన్ ముఠా పట్టుబడిన అనంతరం డ్రగ్స్ కేసులో సంచలాత్మకమైన విషయాలు బయటపడ్డాయి. సినీ రంగానికి చెందిన వారికి లింక్ ఉన్నట్లు గ్రహించిన సిట్ పలువురు సినీ ప్రముఖులను విచారించారు.
తాజాగా ఈ విషయంపై అకున్ సబర్వాల్ స్పందించారు. ఇఫ్లూ యూనివర్సిటీలో జరిగిన ఓ సెమినార్ లో ఆయన పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన వ్యక్తుల విచారణ పూర్తయ్యిందని, కేసు దర్యాప్తులో న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ తరువాత రెండో దఫా విచారణ జరుగుతుందని, ఎస్ఎఫ్ ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రిపోర్టు అందగానే ఛార్జీషీట్ దాఖలు చేస్తామన్నారు. తమపై ఎలాంటి వత్తిళ్లు లేవని అకుల్ సబర్వాల్ తెలిపారు. 

13:09 - August 11, 2017

నిజామాబాద్ : టీజేఏసీ నేతలపై గులాబీ శ్రేణులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. కామారెడ్డి జిల్లా బస్వాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారంటూ టీజేఏసీ అమరుల స్పూర్తి యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతలుగా యాత్ర పూర్తయ్యింది. నాలుగో విడుతలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నుంది. ఈ సందర్భంగా టీజేఏసీ ర్యాలీగా బయలుదేరింది. బస్వాపురంలో గులాబీ శ్రేణులు అడ్డుకుని కోదండరాం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనుమతి లేదని బిన్కూరు పీఎస్ యాత్ర జరుగపరిణామాలపై ప్రొ. కోఎదుట వాహనాలను పోలీసులు నిపిలివేయడం గమనార్హం. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో కుర్చీలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. జరుగుతున్న దండరాం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తమకు న్యాయం చేయాలంటూ పీఎస్ ఎదుట ఆయన బైఠాయించినట్లు తెలుస్తోంది. 

డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ తర్వాత రెండో దఫా విచారణ : సిట్

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సెప్టెంబర్ తర్వాత రెండో దఫా విచారణ చేపడతామని ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అధికారులు తెలిపారు. ఎస్ ఎఫ్ ఎల్ రిపోర్టు కోసం ఎదురుర చూస్తున్నామని, నివేదిక రాగానే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు.మాపై ఎవరి ఒత్తిళ్లు వేవని, విచారణ ఆగిపోలేదని, అంతా పారదర్శకంగా కొనసాగుతుందని అకున్ స్పష్టం చేశారు.సినీ రంగానికి చెందిన విచారణ పూర్తి అయ్యిందని, అన్ని కోణాల్లో న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామన్నారు.

ముత్తూట్ ఫైనాన్సే టార్గెట్ గా దోపిడీకి స్కెచ్: సీపీ శాండిల్య

హైదరాబాద్: ముత్తూట్ ఫైనాన్స్ కేసులో ప్రధాన నిందితుడు షరీఫ్ ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా తెలిపారు. షేరూఖాన్ తో కలిసి ముత్తూట్ లో షరీఫ్ దోపిడికి పాల్పడాడ్డని, తెలంగాణ కర్ణాటక, మహారాష్ట్ర వ్యాప్తంగా ముత్తూట్ ఫైనాన్సే టార్గెట్ గా దోపిడీకి స్కెచ్ వేశారని శాండిల్యా చెప్పారు. నిందితులను పట్టుకునే సమయంలో పోలీసోళ్ల పై దాడికి చేసేవారని, దోపిడీకి వాడిన వాహనం వేరే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారని చెప్పారు. షరీఫ్ పాత కేసులో ఏడేళ్లు జైల్లో గడిపారని శాండిల్య స్పష్టం చేశారు.

 

12:44 - August 11, 2017

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రావణమాసం మూడో శుక్రవారం కావడంతో.. ఉదయం నుంచే భక్తులు దుర్గమ్మ దర్శనం కోసం బారులు తీరారు. మహా మండపంలోని ఆరవ అంతస్థులో వరలక్ష్మి వ్రతంలో మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు. శ్రావణ మాసంలో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకున్నా కుటుంబ సభ్యులందరూ సుఖ, సంతోషాలతో ఉంటారని అర్చకులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

జేఏసీ నాయకులపై టిఆర్ ఎస్ నాయకుల దాడి

కామారెడ్డి: బస్సాపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. టీజేఏసీ అమరవీరుల స్పూర్తి యాత్రను అడ్డుకుని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జేఏసీ నాయకులపై టిఆర్ ఎస్ నాయకులు దాడి చేశారు. వాహనాలకు అనుమతి లేదని బిన్కూరు పీఎస్ ముందు వాహనాలను పోలీసులు నిలపివేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.

ఏలూరులో గరగపర్రు బాధితులు అరెస్ట్...

ప.గో: జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు ఏలూరు వచ్చిన గరగపర్రు బాధితులను పోలీసులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా త్రీటౌన్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బస్సులోనే బాధితులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

12:38 - August 11, 2017

చిత్తూరు : టీటీడీ చైర్మన్‌ రేసులో రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తోంది. ఒకరి తరువాత మరొకరి పేరు వినిపిస్తుండటంతో.. రోజురోజుకూ చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజాగా ఈ రేసులో పుట్టా సుధాకర్‌ యాదవ్ పేరు వినిపిస్తోంది. టీటీడీకి కొత్త పాలక మండలి ఏర్పాటుపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. గత పాలక మండలి గడువు ముగిసి మూడు నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త పాలక మండలి ఊసే లేదు. పలువురు సీనియర్ టీడీపీ నేతలు టీటీడీ చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నా.. సీఎం చంద్రబాబు ఎవరి పట్ల మొగ్గు చూపుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీటీడీ చైర్మన్‌గా ఎవరూ ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్‌ ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత హరికృష్ణ పేరు, రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీ నారాయణ పేర్లు వినిపించాయి. మొన్నటివరకు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేరు బలంగా వినిపించింది.పార్టీలో కీలక నేత యనమల రామకృష్ణుడుకు.. పుట్టా సుధాకర్‌ యాదవ్ స్వయానా వియ్యంకుడు. సుధాకర్‌ యాదవ్ ఇదివరకు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పని చేశారు. యనమలే తన వియ్యంకుడికి ఈ పదవి ఇప్పించారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఇప్పుడు టీటీడీ చైర్మన్‌ రేసులో సుధాకర్‌ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా టీటీడీ పీఠం కోసం రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో అంతకంతకు ఉత్కంఠ పెరుగుతోంది. అయితే టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబు ఎవరి పేరును ఎంపిక చేస్తారో చూడాలి. 

12:35 - August 11, 2017

ఢిల్లీ : తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా..? తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ చరిష్మా ఏ మేరకు ఉండబోతోంది..? అనిశ్చితిలో ఉన్న పాలిటిక్స్‌ను రజనీకాంత్‌ రాక ఉత్తేజాన్ని కలిగిస్తుందంటున్నారు సూపర్‌స్టార్‌ అభిమానులు. అక్టోబర్‌లోనే రజనీకాంత్‌ రాకీయ అరంగేట్రంఅంటూ సాగుతున్న ప్రచారంపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. జయలలిత మృతి, వయోభారంతో కరుణానిధి ఇంటికే పరిమితమయ్యారు. దీంతో మరోసారి తమిళనాట రాజకీయ అనిశ్ఛితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో తలైవా పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కొత్త పార్టీకి కచ్చితంగా స్పేస్‌ ఉందని సూపర్‌స్టార్‌ అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు. అధికార అన్నాడిఎంకెలో మూడు ముక్కలాట నడుస్తోంది.

ఈ రాజకీయ శూన్యతే రజనీకాంత్ రాజకీయ అరంగేట్రానికి నాంది పలికింది. అంతే.. హుటాహుటిన అభిమానులతో సమావేశం.. యుద్ధానికి సిద్ధంకండి అంటూ పిలుపునివ్వటం జరిగిపోయింది. తర్వాత అంతా రాజకీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తులంటూ రజనీ సన్నిహితులు, గురువులు హడావుడి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కాకపోతే ఎపుడూ కాదు అంటున్నారు రజనీ అభిమానులు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటూ వస్తున్న వార్తలు అభిమానుల గుండెల్లో షికార్లు చేస్తున్నాయి. రజనీ సెంటర్‌పాయింట్‌గా జరుగుతున్న కొత్తరాజకీయాల చర్చ.. తమిళనాట ద్రవిడ పార్టీలకు దడపుట్టిస్తోంది. ఈ నెలలోనే కాలా చిత్రం పూర్తివుతోంది. ఆ తర్వాత అక్టోబర్‌లో పార్టీ ఆవిర్భవానికి రజనీ ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం గుప్పుమంటోంది. దీంతో అభిమానులు, ద్రవిడ పార్టీల నేతల దృష్టంతా అక్టోబర్ నెలపైనే పడింది.

నిన్నటిదాకా రజనీకాంత్‌ జాతీయపార్టి పెట్టడానికే సిద్ధం అవుతున్నారని, లేదా బీజేపీకే మద్దతు ఇస్తారని..ఆయన వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ఉందని ఇలా రకరకాలుగా సాగిన ప్రచారం ప్రస్తుతం చప్పబడింది. దీనికీ ఓ కారణం ఉంది. దాదాపు 4దశాబ్దాల కిందటనే జాతీయ పార్టీలకు గుడ్ బై చెప్పిన తమిళ ఓటర్లు.. ద్రవిడ పార్టీలనే ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరంగ్రేట్రంతోనే రాజకీయంగా స్థిరత్వం సాధించాలంటే.. కచ్చితంగా ప్రాంతీయపార్టీపెట్టడమే మంచిదని రజనీ సన్నిహితులు సలహా ఇస్తున్నారు. దీంతో సూపర్‌స్టార్‌ ప్రాంతీయపార్టీకే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అయితే గత నలబైఏళ్లుగా ద్రవిడ అజెండాతో రాజకీయాలు నెరపుతున్న డీఎంకే, అన్నాడీఎంకే, ఇతర చిన్నాచితకా ప్రాంతీయపార్టీలు రాష్ట్రంలోని దాదాపు 70శాతం ఓటుబ్యాంకును కలిగిఉన్నాయి. ఇక మిగిలిన 30శాతం ఓటర్లలో 1, 2శాతం జాతీయపార్టీలకు పోను.. మిగిలిన ఓటర్లపైనై తలైవా పెట్టబోయే పార్టీ దృష్టిపెట్టాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం చీలికలు పీలికలుగా ఉన్న అన్నాడీఎంకే నుంచి రజనీ పార్టీ వైపు భారీగా ఓటర్లు స్వింగ్‌ అవుతారని ఆయన సన్నిహితులు ఊహిస్తున్నారు.

ఆదిశగానే పావులు కదుపుతూ .. ద్రవిడ నినాదంతోనే కొత్తపార్టీని పెట్టడానికి రజనీకి సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆర్ఎస్ఎస్, బీజేపీలతో తలైవా దూరంగా ఉంటున్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగేళ్ల సమయం ఉండటంతో.. పార్టీని ప్రజల్లో ఎస్టాబ్లిష్‌చేయడానికి ఆమాత్రం టైం అవసరమేనని తలైవా వ్యూహకర్తలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో పొలిటికల్‌ ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేసుకున్న రజనీకాంత్‌ను దేవుడు ఇంకా ఏమని ఆదేశిస్తాడో వేచి చూడాలి అంటున్నారు అభిమానులు.  

'ముత్తూ స్' కేసులో ప్రధాని నిందితుడు అరెస్ట్

హైదరాబాద్: ముత్తూ స్ ఫైనాన్స్ చోరీ కేసులో ప్రధాన నిందితుడు షరీఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట పోలీసులు హాజరు పర్చారు.

ముమ్మిడివరంలో ఏసీబీ అధికారులు సోదాలు

తూ.గో : ముమ్మిడివరంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నగర పంచాయితీ కార్యాలయంలో మేనేజర్ శ్రీలక్ష్మి రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

రాజ్యసభకు వెంకయ్య కొత్తకాదు : ఆజాద్

ఢిల్లీ: రాజ్యసభకు వెంకయ్య కొత్తకాదు అని గులాంనబీ ఆజాద్ అన్నారు. ఎంపీ, కేంద్ర మంత్రిగా పార్లమెంట్ వ్యవహారాలు నిర్వహించారని, వెంకయ్య సభను సరైన మార్గంలో నడిపిస్తారని విశ్వసిస్తున్నాని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంకయ్య కిందిస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఈ సభలో సభ్యుడిగా ఉండి అత్యున్నత పదవి చేపట్టడం గౌరవంగా ఉందన్నారు.

12:19 - August 11, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార..విపక్ష నేతల మధ్య విమర్శలు హద్దు మీరుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత జగన్ నిప్పులు చెరుగుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఆయన రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో మరోసారి బాబుపై ఫైర్ అయ్యారు. మూడున్నర ఏళ్లుగా చంద్రబాబు దుర్మార్గపు పాలన అందించారని, ప్రజల అభివృద్ధిని మరిచిపోయారన్నారు. అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతోందని..మూడున్నర సంవత్సరాల పథకాల పేరిట విపరీతమైన అవినీతి చేశారని..మొత్తంగా ఆయనకు ఈ పరిస్థితి ఎదురైందని జగన్ పేర్కొన్నారు. 

12:11 - August 11, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు కావడం సంతోషంగా ఉందని..మరోవైపు కొద్దిగా బాధగా ఉందని టిడిపి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ ప్రసంగించారు. ఉప రాష్ట్రపతి పదవిలో వెంకయ్య కూర్చొవడం తెలుగు..దేశ ప్రజలు సంతోషించదగిందన్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే వెంకయ్య కనబడే వారని, ఈ అవకాశం కోల్పోతుందనే బాధ ఉందన్నారు. దేశ అభివృద్ధి..ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి తోడ్పాటు అందిస్తానని వెంకయ్య అనడం సంతోషమన్నారు.

నెల్లూరు జిల్లాలో కాలేజీలో చదివే సమయంలో చిన్న తప్పు జరిగితే వెంకయ్య విద్యార్థి నాయకుడిగా నిలదీసే వారని, ఉదయగిరి నుండి మంచి మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఒక్కరే గెలిచారన్నారు. ఏపీ అసెంబ్లీలో వెంకయ్య ప్రసంగానికి సంబంధించిన వార్తలు..పేపర్లలో ఆనాడు తాము చూసేవారమని, అలాంటి ప్రసంగాలు ఇప్పుడు చూడలేమన్నారు. ఒక సామాన్యమైన కుటుంబం నుండి వెంకయ్య నాయుడు వచ్చేవారని, నాలుగు సార్లు రాజ్యసభలో ఉన్నారంటే మాములు విషయం కాదన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:04 - August 11, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవిలో నియమితులైన వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియచేస్తున్నట్లు ఈ సందర్భంగా గురజాడ మాటలు గుర్తు పెట్టుకోవాలని సీతారాం ఏచూరి సూచించారు. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగించారు. ఇక్కడ గురజాడ అప్పారావు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. 'దేశ మంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్' అని చెప్పారని, దీనికి అనుగుణంగా పనిచేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. వెంకయ్య నాయుడు ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొన్నారని, రాజ్యసభ పని విధానం అందరికంటే ఎక్కువ వెంకయ్యకు తెలుసన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

మోదీని కలిసిన సీఎం పళని స్వామి

ఢిల్లీ: ప్రధాని మోదీని తమిళనాడు సీఎం పళని స్వామి కలిశారు. తమిళనాడు రాజకీయాలు పలు మలుపులు తిరుగున్న నేపథ్యంలో పళని స్వామి మోదీని కలవడం ప్రాధాన్యత చోటు చేసుకుంది.

శామీర్ పేటలో గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రం పై దాడి

మేడ్చల్ : శామీర్ పేటలో గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రం పై బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. 45 చిన్న సిలిండర్లు, 6 పెద్ద సిలిండర్లు, వేయింగ్ మిషన్ నిప్పల్ స్వాధీనం చేసుకున్నారు.

11:55 - August 11, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ రాజకీయాలకతీతంగా పనిచేయాలని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆజాద్ ప్రసంగించారు. తన తరపున, తమ పార్టీ సభ్యుల తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు ఆజాద్ తెలిపారు. ఈ సభకు వెంకయ్య కొత్తేమీ కాదని..ఎంపీగా..మంత్రిగా..పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా..పనిచేశారని, ఆ సమయంలో ఆయనతో వాదనలు జరిగేవని, సభ నుండి బయటకు వచ్చిన అనంతరం ఆత్మీయంగా మాట్లాడేవారని తెలిపారు.

వివిధ పార్టీల్లో కష్టపడి పనిచేసి పైకి వస్తుంటారని ఆ విధంగానే కింది స్థాయి నుండి పై స్థాయి వరకు వెంకయ్య ఎదిగారన్నారు. వెంకయ్య విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదిగారని, రైతు కుటుంబం నుండి వచ్చి రాష్ట్రపతిగా ఎదిగారని పేర్కొన్నారు. చాలా కాలం పాటు వెంకయ్యతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

జగన్ లాంటి ఉన్మాదిని సమాజంలో తిరగనివ్వకూడదు: మంత్రి గంటా

అమరావతి: జగన్ లాంటి ఉన్మాదిని సమాజంలో తిరగనివ్వకూడదని మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. జగన్ మానసిక పరిస్థితి చూసి జాలేస్తుందని, విశాఖ హాస్పిటల్ లో చేర్పిస్తే ఖర్చులు మేమే పెట్టుంటామని తెలిపారు. జగన్ వ్యవహార శైలి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ రాద్ధాంతం చేస్తున్నారని గంటా ఆరోపించారు.

11:40 - August 11, 2017

ఢిల్లీ : రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య నాయుడు బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియచేశారు.

ఈ సందర్భంగా సభ్యులనుద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో అందరికీ పరిచయమైన వ్యక్తి అని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అత్యధిక కాలం వెంకయ్య నాయుడు సభ్యుడిగా ఉన్నారని, విద్యార్థి నేతగా వెంకయ్య తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని తెలిపారు.
 

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం రూపుదిద్దుకున్నది కేవలం వెంకయ్య ప్రోద్బలం వల్లనే అని కొనియాడారు. తెలుగులో వెంకయ్య ప్రసంగం సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా ఉంటుందని కితాబిచ్చారు. ఇది కేవలం పదాల ప్రయోగమే కాదని...ఆలోచలపై స్పష్టత, ప్రేక్షకులతో మమేకమై సంభాషించినప్పుడే..ప్రజల హృదయాలను చూరగొంటుందన్నారు. ఏపీలో విద్యార్థి నేతగా కొనసాగారని,  ఇంకా ప్రధాని మోడీ ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

నేటితో ముగియనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..

ఢిల్లీ: నేటితో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. 19రోజుల సమావేశాల్లో కేవలం 13బిల్లులకు మాత్రమే ఆమోదం లభించింది. ఒకవైపు సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి.

రైతు బిడ్డ ఉపరాష్ట్రపతిగా ఎదగడం ప్రజాస్వామ్య గొప్పతనం: ఆజాద్

ఢిల్లీ: 13వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపి ఆజాద్ మాట్లాడుతూ.. ఓ రైతు బిడ్డ ఉపరాష్ట్రపతి స్ఘాయికి ఎదగడం ప్రజాస్వామ్య గొప్పతనం అని పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడు రైతు బిడ్డ : మోదీ

ఢిల్లీ: 13వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్యనాయుడు రైతు బిడ్డ అని ప్రధాని మోదీ కొనియాడు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ... రైతు సమస్యలపై కేబినెట్ లో ఎక్కువ చర్చించేవారని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని, ప్రతి సమస్య మీద లోలుగా ఆలోచించేవారని మోదీ చెప్పారు. వెంకయ్య విద్యార్థి దశ నుంచి చాలా గొప్ప వ్యక్తిగా ఎదిగారన్నారు.

 

ఢిల్లీలో ఏపీ సీఎం ను కలిసిన ఫాతిమా మెడికలేజీ విద్యార్థులు

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కపడ ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎంపిలు, అధికారులకు సూచించారు.

పాదయాత్రకు అనుమతించే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటా: ముద్రగడ

తూ.గో: మరోసారి పాదయాత్రకు ముద్రగడ పద్మనాభం యత్నించారు. అయితే పోలీసులు గేటు వద్దే ముద్రగడను నిలిపివేశారు. పాదయాత్రకు అనుమతించే వరకూ ప్రయత్నిస్తూనే ఉంటానని మరోసారి ముద్రగడ స్పష్టం చేశారు.

కేసీఆర్ సారథ్యంలో మూడేళ్లలోనే గణనీయమైన పురోగతి:కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ బిల్డర్స్ ఫెడరేసన్ 3వ వార్షికోత్సవంలో తెలంగాణ ఉద్యమం పై విస్తృతంగా చర్చ జరిగింని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని, హైదరాబాద్ కు పెట్టుబడులు రావన్నారని అప్పటి నేతలన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మూడేళ్లలోనే గణనీయమైన పురోగతి సాధించాని తెలిపారు. మన కంటే ముందు ఏర్పడిన రాష్ట్రాలు ఇప్పటికీ కుదురుకోలేదని, దేశమంతా అబ్బురపడేలా కేసీఆర్ పాలనలో ముందున్నారని తెలిపారు. ఆదాయ వృద్ధి రేటు సహా 12 రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని స్పష్టం చేశారు.

పార్లమెంట్ కు చేరుకున్న వెంకయ్యనాయుడు

ఢిల్లీ: 13వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్యనాయుడు పార్లమెంట్ కు చేరుకున్నారు. అక్కడ వెంకయ్యకు ఘన స్వాగతం లభించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, ఎంపీలు వెంకయ్యనాయుడికి అభినంతలు తెలిపారు. పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

కాలువలో అపుడే పుట్టిన మగ శిశువు..

అనంతపురం: లక్ష్మీ నగర్ లో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కాలువలో పడేశారు. శిశువు శరీరం సగభాగాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. దాన్ని గుర్తించిన స్థానికులు మున్సిపాలిటీ వారికి అప్పగించారు.

10:31 - August 11, 2017

ఢిల్లీ : దేశంలో రెండో అత్యున్నత పదవి ఏది ? ఉప రాష్ట్రపతి..ఈ పదవిపై వెంకయ్య నాయుడు ఆసీనులయ్యారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హిందీలో వెంకయ్య ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ కురువృద్ధుడు అద్వాణీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల అధినేతలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంట్ హాల్ కు చేరుకున్నారు. అక్కడ పలువురు సభ్యులు వెంకయ్య నాయుడుకు అభినందనలు తెలియచేశారు. 11గంటలకు ఉభయ సభలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం రాజ్యసభలో అధికారికంగా వెంకయ్య నాయుడు కూర్చొబోతున్నారు.

మరోవైపు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పదవుల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులు నియమితులు కావడంపై చర్చ జరుగుతోంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై వీరు ఎలాంటి వైఖరి కనబరుస్తారనేది చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పార్టీలకి అనుకూలంగా తాము ఉండమని వారు పేర్కొన్నారు. రానున్న రోజులు కీలకంగా మారనున్నాయి. పలు కీలక బిల్లుల ఆమోదం కోసం వెంకయ్య నాయుడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. 

నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు భారీ జరిమానా...

హైదరాబాద్ : రాష్ట్రంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలు చెల్లించాల్సిన రూ.1.55 కోట్ల జరిమానాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వసూలుచేసింది. ఆయా కాలేజీలకు అనుమతులు తీసుకోకపోవడం, అదనపు సెక్షన్లు ఏర్పాటుచేయడం, ఆర్ట్స్ గ్రూపుల పేరుతో సైన్స్ కోర్సులను కొనసాగించడం, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడం, కనీస ప్రమాణాలు లేకపోవడం వంటి కారణాలతో శ్రీచైతన్య జూనియర్ కాలేజీలకు రూ.1.55 కోట్లు జరిమానా విధించినట్టు బోర్డు అధికారులు ధ్రువీకరించారు. ఆ మొత్తాన్ని ప్రస్తుతం వసూలు చేసినట్టు చెప్పారు. నారాయణ జూనియర్ కాలేజీల నుంచి రూ.62 లక్షల జరిమానాలు వసూలు చేశామని బోర్డు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ కు మోదీ, ఇవాంకా ట్రంప్

హైదరాబాద్: భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల (పారిశ్రామిక వ్యవస్థాపకులు) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్‌ 28 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు కూడా స్టాక్‌మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. గత నాలుగు రోజులు నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజూ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంలో ట్డేడ్ అవుతున్నాయి.

 

 

10:17 - August 11, 2017

అల్లం టీ..తాగుతున్నారా ? 'అల్లం' టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అనర్ధాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అల్లం టీ సేవించగానే కొంతమందికి పొట్టలో అలజడి గురి చేస్తుంది. ఎక్కువ అల్లం టీ తాగకూడదంట. కారం..మసాల దినుసల విధంగానే అల్లం కూడా మంట కలుగ చేస్తుందని..అల్లం టీ తాగితే రక్తపోటును బాగా తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 'అల్లం' టీ తాగటం వలన స్కిన్‌ రాషెస్‌ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది. బ్లీడింగ్‌ సమస్యలున్న వారు అల్లంటీ కి దూరంగా ఉండాలంట. 

రైలు పట్టాలపై సీనియర్ ఐఏఎస్ మృతదేహం...

ఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో గురువారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ పాండే రైలు పట్టాలపై దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బీహార్‌లోని బక్సర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో శవమై కనిపించారు. ఇంట్లో తరచూ జరుగుతున్న గొడవల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

10:12 - August 11, 2017

ఢిల్లీ : భారత 15వ ఉప రాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు.

అంతకంటే ముందు వెంకయ్య నాయుడు ప్రముఖులకు నివాళులర్పించారు. రాజ్ ఘాట్ కు చేరుకుని మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ విగ్రహానికి..సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల కు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడుని పలువురు కలిసి అభినందనలు తెలియచేశారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ...

తిరుమల : తిరుమలలోలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో నిండి వైకుంఠం వెలుపల కి.మీ మేర బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం, కాలినడకన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది.

13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ:13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ ధర్బార్ హాల్ లో రాష్ట్రపతి కోవింద్ వెంకయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంతులు, ఎన్డీఏ ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.

కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ: కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి కోవింద్ వెంకయ్యతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి భవన్ ధర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారం కార్యక్రమం జగరనుంది.

శిశువును కుక్కలు పీక్కుతింటుండగా..

అనంతపురం : లక్ష్మీ నగర్ మూడో క్రాస్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శిశువును కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గుర్తించారు. 

09:36 - August 11, 2017

చెన్నై : తమిళనాట రెండాకుల పంచాయితీ పరిష్కారందిశగా సాగుతోంది.. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.. పళనిస్వామికి సీఎం పదవి, పన్నీర్‌ సెల్వానికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు రెండువర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే రెండు టీంలు కలిసిపోనున్నాయని ప్రచారం జరుగుతోంది. శశికళ వర్గమైన దినకరన్‌కు పళనిస్వామి షాక్ ఇచ్చాక రెండువర్గాలమధ్య చర్చలు సానుకూలంగా సాగాయి.

పార్టీలో డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా దినకరన్‌ ఎన్నిక చెల్లదంటూ పళని తీర్మానం చేశారు.. ఈ నిర్ణయం తర్వాత పన్నీర్‌ కొంత శాంతించారు.. మొదటి నుంచీ శశికళ వర్గాన్ని వ్యతిరేకిస్తూవచ్చిన పన్నీర్‌ టీం... దినకరన్‌పై వేటు తర్వాత విలీనానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.. దీనిపై దినకరన్‌ వర్గీయులు కొంత ఘాటుగా స్పందిస్తున్నా.. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ధీటుగానే జవాబిస్తున్నాయి. ఇక విలీనం వార్తలు అన్నా డీఎంకే కార్యకర్తల్లో సంతోషం నింపుతున్నాయి.. సంబరాలు జరుపుకుంటున్న పార్టీ కేడర్‌ త్వరగా రెండు వర్గాలు కలిసే సమయంకోసం ఎదురుచూస్తున్నాయి.. 

09:23 - August 11, 2017

'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రంతో జాతీయస్థాయిలో పేరొందిన నటుడు 'ప్రభాస్' తాజా చిత్రంతో బిజీ బిజీగా మారిపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క సినిమాకే పని చేసిన ఆయన మరో చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

సుజీత్ సింగ్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలు కాకుండానే టీజర్ ను ముందుగా రిలీజ్ చేసి ఆసక్తిని రేకేత్తించారు. చాలా ఏళ్ల తర్వాత 'ప్రభాస్‌' తెర మీద మోడరన్‌ గెటప్‌తో కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈసినిమా వివరాలు మాత్రం ఏ మాత్రం బయటకు పొక్కడం లేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మది తమిళ మీడియాతో మాట్లాడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 రోజుల షూటింగ్‌ ముగిసిందని ఇంకా 180 రోజుల పాటు షూటింగ్‌ జరగాల్సి ఉందని అన్నారు. హీరోయిన్‌ ఎవరనేది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. 

09:14 - August 11, 2017

ఢిల్లీ : వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పీఠం కూర్చొబోతున్నారు. కాసేపట్లో 15వ ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

ప్రముఖులకు వెంకయ్య నివాళులు..
ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్ ఘాట్ కు చేరుకుని మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. దీన్ దయాళ్ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వెంకయ్య నాయుడుని పలువురు కలిసి అభినందనలు తెలియచేశారు.

హమీద్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలు..
రాజ్యాంగబద్ధమని భావించే ఈ పదవుల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం గల వ్యక్తులు నియామకం కావడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి పదవికి నేటితో గుడ్ బై చెప్పబోతున్న హమీద్ అన్సారీ చివరి ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌లో ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయని, దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయమ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల బీజేపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం సబబు కాదని పేర్కొంటున్నారు. 

రాజ్ ఘాట్ వద్ద వెంకయ్య నాయుడు..

ఢిల్లీ : ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెంకయ్య నాయుడు రాజ్ ఘాట్ ను సందర్శించారు. మహాత్మాగాంధీ సమాధికి ఆయన నివాళులర్పించారు. 

కేసీఆర్ ఢిల్లీ టూర్ రద్దు ?

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు 13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. 

08:21 - August 11, 2017

మల్లన్న ముచ్చట్లు చూస్తున్న ప్రేక్షక మహాశయుల్లారా ఇదిగో మీకు అవార్డు వచ్చింది..జెణుకు..బెణుకు ఏమీ లేకుండా ఏ ముచ్చటయినా ధైర్యంగా చెబుతున్నమట. అని చెప్పి యువ కళావాహిని నాట్స్ సంస్థ వోళ్లు మనకు అవార్డు ఇచ్చారు. ఇది మల్లన్న ముచ్చట్లు కొచ్చిందంటే అందరికీ వచ్చినట్టే. ఇది మనకందరికీ అంకితమన్నమాట..మరి ఏమిటా ముచ్చట సూడాలంటే వీడియో చూడండి. 

08:08 - August 11, 2017

చిత్తూరు : ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాలలో గురువారం థియేటర్ లో అగ్నిప్రమాదం జరగగా శుక్రవారం తెల్లవారుజామున చిత్తూరులో జిల్లాలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని చర్చి రోడ్డులోని మూడంతస్తుల భవనంలో అపూర్వ టెక్స్ టైల్ వస్త్ర దుకాణం ఉంది. గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈ దుకాణంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టూగా ఉన్న ఇతర భవనాలకు మంటలు వ్యాపిస్తాయా అని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న చిత్తూరు ఎమ్మెల్యే, మేయర్, టెక్స్ టైల్ యాజమాన్యం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు.

20-25 ట్యాంకర్ల నీటిని ఉపయోగిస్తూ సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదంలో టెక్స్ టైల్ దుకాణం పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. రూ. 5 కోట్ల పైబడి ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

07:48 - August 11, 2017

బాలీవుడ్ నటుడు 'సంజయ్ దత్' ఈజ్ బ్యాక్ అంటున్నారు ఆయన అభిమానులు. ఎందుకంటే ఆయన నటించిన తాజా చిత్రం 'భూమి' ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్ర ట్రైలర్ చూసిన ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జైలు శిక్ష కారణంగా సినిమాలకు దూరమైన సంజయ్ దత్.... శిక్ష ముగిసిన తర్వాత తొలి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'భూమి' చిత్రానికి ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ఆదితి..సంజయ్ దత్ లు తండ్రి కూతుళ్లుగా నటిస్తున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ లో సంజయ్ ఫెర్మామెన్స్ చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ట్రైలర్ చూసిన అనంతరం చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోయాయని పేర్కొంటున్నారు.

కూతురును ఎంతగానే ప్రేమించే తండ్రి పాత్రలో కనిపించిన సంజయ్.... కొన్ని సంఘటనల కారణంగా ఇబ్బందుల్లో పడ్డ తన కూతురును కాపాడుకోవడానికి ఏం చేశాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సెప్టెంబర్ 22, 2017న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

07:36 - August 11, 2017

ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకొంటోందని, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకపడ్డారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ పున‌రుజ్జీవ‌ పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ఆరేపల్లి మోహన్ (కాంగ్రెస్), రాకేష్ (టీఆర్ఎస్), వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెబాట..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. ఏపి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లోని 18 కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి.

07:01 - August 11, 2017

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెబాట పడుతున్నారు. ఏపి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లోని 18 కార్మిక సంఘాలు ఏకమవుతున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ సమ్మె నోటీసులిచ్చేందుకు 18 కార్మిక సంఘాలు తీర్మానించాయి. మరో అయిదు రోజుల్లో సమ్మె నోటీసు ఇవ్వబోతున్నాయి. ఇంత తీవ్ర నిర్ణయానికి దారితీసిన కారణాలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాలకాశి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

గూడ్స్ రైలులో సాంకేతిక లోపం..

గుంటూరు : గూడ్స్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దాచేపల్లి - నడికుడి మధ్య గూడ్స్ రైలు నిలిచిపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా సిఫార్సు ఉత్తరాలపై మంజూరు చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయి. నేటి నుండి నాలుగు రోజుల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారు. 

అపూర్వ టెక్స్ టైల్స్ లో ఫైర్ ఆక్సిడెంట్..

చిత్తూరు : చర్చి వీధిలోని అపూర్వ టెక్స్ టైల్స్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

06:53 - August 11, 2017

హైదరాబాద్ : భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీనియర్‌ పాత్రికేయులు పిలుపునిచ్చారు. మీడియాపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే పీడిత ప్రజల పక్షాన...నిలబడాల్సిన బాధ్యత జర్నలిస్ట్ లపై ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా-జర్నలిస్టులు-ప్రభుత్వ వైఖరి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయులు.. మీడియాపై జరుగుతున్న దాడులను ఖండించారు. విలేకరులపై, మీడియాపై దాడులు జరిగితే సంఘాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని సీనియర్‌ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌ పిలుపునిచ్చారు. ఉద్యమంలో మీడియాను వాడుకున్న కేసిఆర్ తనకు వ్యతిరేకంగా రాసిన పేపర్లపై, చానళ్లపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాత్రికేయులను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బానిసల్లా పనిచేయాలా ? 
జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా అని బానిసల్లాగా పనిచేయాలంటే సరి కాదని...ఏది చెబితే అదే రాయాలనే ధోరణి సరైంది కాదని మరో సీనియర్ పాత్రికేయులు.. మన తెలంగాణ ఎడిటర్‌ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను... ప్రశ్నిస్తుంటే.. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నవతెలంగాణ ఎడిటర్‌ వీరయ్య విమర్శించారు. రానున్న కాలంలో మీడియాపై జరిగే దాడులను సమష్టిగా ప్రతిఘటించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు.

గుణపాఠం తప్పదు..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అప్రజాస్వామిక వాతావరణం నెలకొందని... ముఖ్యమంత్రులే...జర్నలిస్ట్‌లను హేళనగా చూస్తున్నారని సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి అన్నారు. పత్రికా స్వేచ్ఛని హరించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులను కార్మిక సంఘాలు, మహిళా సంఘాల నేతలు ఖండించారు. పోలీసులు, ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జర్నలిస్ట్ లపై దాడుల నేపథ్యంలో సమావేశంలో రెండు తీర్మానాలు చేశారు. నవ తెలంగాణ ఇతర మీడియాపై సీఎం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని...ప్రగతి భవన్ వద్ద మహిళా జర్నలిస్ట్ పై దాడికి బాధ్యులైన ఏసీపీ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రకటనలు ఇవ్వాలని తీర్మానం చేశారు. 

06:49 - August 11, 2017

హైదరాబాద్ : డిమాండ్ల సాధన కోసం... పోరుబాట పట్టిన ఈసీ ఏఎన్ఎంలతో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. తమను రెగ్యులరైజ్‌ చేయాలని,.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ గురువారం రాత్రి పదిహేను మంది ఈసీ ఏఎన్ఎంలు డీఎంఈ బిల్డింగ్ ఎక్కారు. పెట్రోల్‌ బాటిళ్లను చూపుతూ తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కార్యాలయం ఎదుట మిగతా ఉద్యోగినులు ధర్నాకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళలతో చర్చించారు. మంత్రి లక్ష్మారెడ్డి చర్చలకు పిలుస్తున్నారని చెప్పడంతో వారంతా ధర్నా విరమించారు. వీరంతా రేపు ఉదయం లక్ష్మారెడ్డితో భేటీ కానున్నారు. 

06:43 - August 11, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్‌ చేస్తున్న విపరీత వ్యాఖ్యలు కొన్నిసార్లు వివాదాస్పదమవుతున్నాయి. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు... చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న జగన్‌ నోటి దురుసు వ్యవహారంపై చెలరేగిన వివాదం సద్దుమణక ముందే మళ్లీ కాంట్రవర్సియల్‌ కామెంట్లు చేశారు. చంద్రబాబును నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదంటూ

దీబంగుట్ల రోడ్‌ షోలో..
దీబంగుట్ల రోడ్‌ షోలో జగన్‌ చేసిన విపరీత వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజకీయ వేడి పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న జగన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్నారు. గోస్పాడు మండలం దీబంగుట్లలో రోడ్‌ షో పాల్గొన్న వైసీపీ అధినేత జగన్‌.. సీఎం చంద్రబాబు మరోసారి నోరు పారేసుకున్నారు. బాబు చేసిన నేరాలకు, మోసాలకు ఏ శిక్ష వేసినా తప్పులేదన్న వాదాన్ని వినిపించారు. మోసాలు, అన్యాయాలు చేసే చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తక్కువేనంటూ వ్యాఖ్యానించారు.

బాబే లక్ష్యం..
మరోవైపు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్‌ చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు మండిపడుతున్నారు. ఇంతకు ముందు నంద్యాల సభలో చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టే ఇప్పుడు కూడా కంప్లెంట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ దీబంగుట్ల రోడ్‌ షోలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఫ్యాక్షన్‌ సంస్కృతిని తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ వ్యాఖ్యలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. జగన్‌ నోటి వెంట నెత్తురు భాష వస్తోందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆగ్రహావేశాలు..
దీబంగుట్ల రోడ్‌ షోలో చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే నాగేశ్వర్‌రెడ్డి తప్పుపట్టారు. జగన్‌ కామెంట్ల వెనుక ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదన్న జగన్‌ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ వివాదం ఇంకా సద్దుమణగలేదు. దీనిపై టీడీపీ నేతల ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నోటీసుకు జగన్‌ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రసంగ ప్రవాహంలో యాధృశ్చికంగా వచ్చిన మాటలే కానీ... ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ విషయం ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ పరిశీలనలో ఉంది.

ఈసీ స్పందన..
ఒకసారి నోరు జారిన విషయంలో ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇచ్చుకున్న జగన్‌.. టీడీపీ నేతలు మరోసారి చేయనున్న ఫిర్యాదుపై ఈసీ స్పందన ఎలా ఉంటుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోసారి కూడా సంజాయిషీ నోటీసు జారీ చేస్తే జగన్‌ ఏ సమాధానం ఇస్తారో, ఈసీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. మరోవైపు జగన్‌ విపరీ వ్యాఖ్యలపై వైసీపీలోనే చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబును కాల్చి చంపినా, ఉరితీసినా తప్పులేదంటూ చేస్తున్న విపరీత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదని లోలోపల మదనపడుతున్నారు. మున్ముందు కూడా ఇలాంటి విపరీత వ్యాఖ్యలు కొనసాగిస్తే పార్టీ ప్రతిష్ఠ మసకబారే మసకబారే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది.  

06:37 - August 11, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి ఘటనపై ఐక్య పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ వ్యవహాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. నేరెళ్ల ఘటనపై గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ ఫిర్యాదు చేయడంతోపాటు తెలంగాణలో గ్రామ స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై పాదయాత్ర చేయాలని ప్రతిపాదించాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేందుకు విపక్షాలు ఉమ్మడిగా వ్యూహరచన చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై పోలీసులు చూపిన ప్రతాపం ఘటన రాజకీయంగా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న విపక్షాలు ఇప్పుడు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. నేరెళ్ల ఘటనపై హైదరాబాద్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను విపక్ష నేతలు తిలకించారు. ఆ తర్వాత జరిగిన రౌండ్‌ లేబుల్‌ సమావేశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. నేరెళ్ల ఘటనపై ఈనెల 15న ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేదర్‌ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గవర్నర్‌ నరసింహన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేయాలని తీర్మానించారు. ఈనెల 22న రాష్ట్రపతిని కలిసిన వినపతి పత్రం అందించాలని ప్రతిపాదించారు.

నేతల స్పందన..
నేరెళ్ల ఘటనకు ఇసుక మాఫీయానే కారణమని ఆరోపించిన టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌... ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నేరెళ్ల ఘటనతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హెచ్చరించారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకం, జనతా వస్త్రాలు, పటేల్‌, పట్వారీ వ్యవస్థ రద్దు వంటి ఎన్నో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకున్నా 1989లో ఎన్టీఆర్‌ నేతృత్వంలో టీడీపీ ఓటమితప్పలేదన్న విషయాన్ని టీ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిచస్తున్నదళిత వ్యతిరేక విధానాలే సర్కారుకు ముప్పు తప్పదని తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి హెచ్చరించారు.

మొత్తం మీద నేరెళ్ల ఘటనతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తన్న విపక్షాలు.. దీనిని అన్ని విధాల తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

06:32 - August 11, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా నేరెళ్ల ఘటనపై 10 టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో ప్రభుత్వం దిగి వచ్చింది. నేరెళ్ల ఘటన పై పూర్తి విచారణ జరిపించి, లాఠీ చార్జ్ ఘటనకు కారణమైన సీసీఎస్ ఎస్ ఐ రవిందర్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో నేరెళ్ల ఘటనపై నష్ట నివారణకు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించి వ్యవహరిస్తున్న తీరుపై 10 టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. నేరెళ్లలో ఇసుక లారీల యజమానులు అకృత్యాలు, ఆగడాలు, వీరికి వంతపాడుతూ... ప్రజలను చింత్రహింసలకు గురిచేసిన పోలీసులు తీరుపై ప్రభుత్వం స్పదించింది. ఇందుకు కారణమైన ఎస్‌ఐ రవీందర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.

గత నెల 2న..
గత నెల 2 నేరెళ్ల క్రాస్ రోడ్ వద్ద ఇసుక లారీ ఢీ కోని భూమయ్య మృతి చెందడంతొ నేరెళ్ల, జిల్లెల, రామచంద్రపురం గ్రామస్తుల ఆగ్రహానికి 5 ఇసుక లారీలు ఆహుతి అయ్యాయి. ఈ ఘటనలో 12 మంది పై కేసు నమోదు చేసిన పోలీస్ లు 8 మంది పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వివాదాస్పదంగా మారింది. అరెస్ట్ చేసిన 8మంది ని పోలీసులు మూడు రోజుల పాటు చిత్రహింసకు గురిచేయడంతో తీవ్రంగా గాయపడ్డ భాదితులు నెల రోజులుగా చికిత్స పోందుతునే ఉన్నారు. దళితుల పై పోలీస్ లు వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో చర్చకు రావడంతో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, బీజేపీ లతో పాటు ప్రజా సంఘాలు నెల రోజులుగా నేరెళ్ల భాదితుల పక్షాన న్యాయ పోరాటం చేస్తున్నాయి. నేరెళ్ల ఘటన, తదనంతర పరిణామాలు టీఆర్‌ఎస్‌ సర్కారుకు ఇబ్బందిగా పరిణమించాయి. విపక్షాల ముప్పేట దాడితో ఎక్కిరి బిక్కిరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం సమాదానం చెప్పలేని పరిస్థితుల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

పరామర్శించిన కేటీఆర్..
రెండు రోజుల క్రితం నేరెళ్ల భాదితులను పరామర్శించిన మంత్రి కెటిఆర్... ఈ ఘటన పై విచారణ జరిపించాలని డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించారు. దీంతో కరీంనగర్ రేంజ్‌ డీఐజీ రవి వర్మ... పోలీసులు, గ్రామస్తులు, భాదితులను విచారించి డీజీపీకి నివేదికను అందచేశారు. సీపీఎస్‌ ఎస్ ఐ రవిందర్ అత్యుత్సాహమే నేరెళ్ల ఘటనకు కారణమని డీఐజీ రవి వర్మ నివేదించారు. దీంతో రవిందర్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజి నాగి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందించారు.

థర్డ్ డిగ్రీ..
లారీలు దహనం చేసిన గ్రామస్థుల పై ఎస్ఐ రవిందర్ లాఠీ చార్జీ చేయడంతో పాటు...అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని విచారణ నివేదికలో ప్రస్తావించారు. నేరెళ్ల భాదితులు మొదటి నుంచి కూడా సీసీఎస్‌ ఎస్‌ఐ రవిందర్ తో పాటు జిల్లా ఎస్పీ విశ్వజిత్ పై ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తొలుత దీనిని తేలిగ్గా తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోడానికి బదులు, ఖాకీల ఓవర్‌ యాక్షన్‌ను సమర్ధించింది. చివరకు చినికి చినికి గాలివాన చందంగా మారి, సర్కారు మెడకు చుట్టుకునేంత వరకు రావడంతో మంత్రి కెటీఆర్ రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కరీంనగర్‌ రేంజ్‌ డీఐజీ రవివర్మ విచారణ నివేదిక ఆధారంగా నేరెళ్ల ఘటనకు బాధ్యులైన మరికొందరు పోలీసు అధికారుపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే నేరెళ్ల ఘటనలో భాదితులు మాత్రం తమకు జరిగిన అన్యాయం పై పోరాటం కోనసాగిస్తామని అంటున్నారు.

సీసీఎస్ ఎస్ ఐ రవిందర్ సస్పెండ్..

హైదరాబాద్ : నేరెళ్ల ఘటన పై పూర్తి విచారణ జరిపించి, లాఠీ చార్జ్ ఘటనకు కారణమైన సీసీఎస్ ఎస్ ఐ రవిందర్ ను సస్పెండ్ చేసింది.

అమరుల స్పూర్తి యాత్ర...

హైదరాబాద్ : నేటి నుండి నాలుగోదశ అమరుల స్పూర్తియాత్ర జరుగనుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు..సమగ్ర వ్యవసాయ విధానం తీసుక రావాలని..టీజేఏసీ ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది. సికింద్రాబాద్ లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పించనుంది. 

15వ ఉప రాష్ట్రపతిగా..

ఢిల్లీ : నేడు 15వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 

Don't Miss