Activities calendar

12 August 2017

21:56 - August 12, 2017

గాలే : శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో మొద‌టి రోజు భార‌త్ ఆరు వికెట్ల న‌ష్టానికి 329 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్ 119, రాహుల్ 85, కోహ్లీ 42 పరుగులతో చెలరేగాయి. సాహా, పాండ్య క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌల‌ర్లలో పుష్ప కుమార 3 వికెట్లు, సంద‌క‌న్ 2, ఫెర్నాండో ఒక వికెట్ తీశారు. శిఖ‌ర్ ధావ‌న్ మూడో టెస్టులోనూ దుమ్మురేపాడు. టెస్టుల్లో ఆరో సెంచ‌రీ న‌మోదు చేశాడు. తొలి వికెట్‌కు ధావ‌న్‌, రాహుల్ 188 ర‌న్స్ జోడించారు. 85 పరుగుల చేసిన రాహుల్ మ‌రోసారి సెంచ‌రీ మిస్సయాడు. రాహుల్ వ‌రుస‌గా ఏడు టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేయడం విశేషం. 

21:55 - August 12, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల వరుస మరణాలు గుండెల్ని పిండేస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కి చేరింది. ఆస్పత్రిలో ద్రవరూప ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. గడిచిన 48 గంటల్లోనే 33 మంది చిన్నారులు మృతిచెందారు. గురువారం ఒక్కరోజే 23 మంది చనిపోగా.. శుక్రవారం ఏడుగురు.. శనివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నవజాత శిశువులూ ఉన్నారు.ఈ ఘటనపై యోగి సర్కార్‌ విచారణకు ఆదేశించింది. ఆక్సిజన్‌ సప్లయ్‌ గణనీయంగా తగ్గడం వల్లే పిల్లలు చనిపోయారన్న వార్తలను ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎమర్జెన్సీ సిలిండర్లను వినియోగించినట్లు పేర్కొంది. పిల్లల మరణాలకు వేరే కారణాలున్నాయని చెబుతోంది. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం బిఆర్‌డి ఆసుపత్రిని సందర్శించింది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆరోగ్యశాఖ మంత్రి సంబంధిత అధికారులు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 30 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. అంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..? అని ప్రశ్నించారు. ఆసుపత్రికి ఆక్సిజన్‌ సిలిండర్లు సప్లయ్‌ చేస్తున్న ప్రయివేట్‌ సంస్థ పుష్పా సేల్స్‌ యజమాని ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత సంస్థ యజమాని మనీష్‌ భండారి ఇంటి నుంచి పారిపోయాడు. బిఆర్‌డి ఆసుపత్రి కొద్ది నెలలుగా ఈ సంస్థకు డబ్బులు చెల్లించకపోవడంతో 70 లక్షలు బకాయిలు పేరుకుపోయాయి. పుష్పా సేల్స్‌ పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 9 నుంచి ఆసుపత్రికి ఆక్సిజన్ల సరఫరా నిలిపివేసింది. ఆరోగ్యశాఖ అధికారులు, మెడికల్‌ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై యోగి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

21:53 - August 12, 2017

ప్రకాశం : జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూముల్లో చెరువు తవ్వకంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నీరు, ప్రగతి కార్యక్రమంలోభాగంగా దళితుల భూముల్లో చెరువు తవ్వేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై 10 TV వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం... దళితుల భూముల్ని తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చింది. సర్కారు ప్రకటన స్థానికుల్లో సంతోషం నింపింది.. తమకు మద్దతుగా నిలిచిన 10 TVకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.


 

21:53 - August 12, 2017

హైదరాబాద్ : వర్షం జనాల్ని బెంబెలెత్తించింది... జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లో మధ్యహ్నంనుంచి వర్షం కురుస్తోంది.. ఉప్పల్, బోడుప్పల్, తార్నాక, కోటి, మెహిదీపట్నం, మాదాపూర్‌, గచ్చిబౌలీ, బోరబండతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం హోరెత్తిపోయింది. వరదనీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ జాంలతో వాహనదారులు గంటలకొద్దీ రోడ్లపైనే నిరీక్షించాల్సివచ్చింది.

21:52 - August 12, 2017

వనపర్తి : రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ టీ-మాస్‌ ఫోరం ఉంటుందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వనపర్తి జిల్లాలో తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన జిల్లా ఆవిర్భావ సదస్సుకు ప్రజాసంఘాల ప్రతినిధులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఏ ఒక్క వ్యక్తికో పదవి ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదని... ఆ సామాజిక వర్గంలోని అందరూ ఉన్నతస్థాయికి రావాలన్నారు... అన్ని వర్గాలకు సామాజిక న్యాయం దక్కేవరకు టీ-మాస్‌ పోరాడుతుందని తమ్మినేని స్ఫష్టం చేశారు.

21:51 - August 12, 2017

శ్రీకాకుళం : ప్రజాస్వామ్యానికి కావలసిన సేవా భావంతో కూడిన వ్యాఖ్యలు ఏనాడు జగన్‌ చేయలేదని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. జగన్‌ పార్టీని స్వార్థంతో నడుపుతున్నారని, రాజకీయ నాయకుడిగా ఆయన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. నంద్యాల ఎన్నికల్లో టిడిపిని గెలిపించి ప్రజలు జగన్‌కు బుద్ధి చెబుతారన్నారు.

21:50 - August 12, 2017

కర్నూలు : ఉప ఎన్నిక కోసం నంద్యాల నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ నాలుగో రోజు ప్రచారం నిర్వహించారు. గోస్పాడు నుండి ప్రారంభమైన రోడ్‌షో శ్రీనివాసపురం, యాలూరు మీదుగా కొనసాగింది. ఈ రోడ్‌షోలో భారీ ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు వైఎస్‌ జగన్‌. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. ఉద్యోగాల పేరుతో యువతను కూడా చంద్రబాబు మోసం చేశారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టిన బాబు... ఒకవేళ జాబు రాకపోతే నిరుద్యోగులు 2వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఆఖరికి పేదవాళ్లను కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదన్నారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్న చంద్రబాబు.. మూడున్నరేళ్లు గడిచినా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. ఇన్నాళ్లు నంద్యాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు... ఉప ఎన్నిక రాగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇక్కడే మకాం వేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు కూడా అది చేస్తా.. ఇది చేస్తానని హామీలు గుప్పిస్తున్నారన్నారు.ఇక ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే ఓటర్లను కొనుగోలు చేసేందుకు టీడీపీ సిద్దమవుతుందన్నారు జగన్‌. ప్రజలంతా లౌక్యంగా ఉండి... ధర్మం, న్యాయం వైపు ఓటేయ్యండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు వైసీపీ అధినేత. ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది అవుతుందన్నారు.

21:42 - August 12, 2017

ప్రేమ దీనికి సరైన అర్థం చెప్పిన వారు ఎవరు లేరు....ప్రేమను రకరకాలుగా చెప్పేవారున్నారు.... రకరకాలుగా పంచేవారున్నారు...అందులో ఓ అబ్బాయి ఆమ్మాయి మధ్య ప్రేమ మాత్రం విషాదాలను నింపుతుంది....మనోవేదనకు గురి చేస్తోంది...ప్రేమే జీవితం అనుకునే ఎందరో అబ్బాయిలు తమ బంగారు భవిష్యత్ ను కోల్పోతున్నారు. ఇది తెలుసుకోలేని ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. త్యాగం పేరుతో తుది శ్వాస విడుస్తున్నారు...ప్రేమ కోసం బలైతున్న వారిలో నరేష్ ఒకడు...తనకు ఆమె ప్రేమ దూరమైందని నరేష్ లోకాన్ని విడిచాడు. కానీ నరేష్ తెలుసుకోలేనిది ఒక్కటే తను దూరమైయ్యేది తన వారి నుంచి అని.....తనవారికి జీవితాంతం కన్నీటిని మిగుల్చుతున్నానని...అందరికి ఒక్కటే నరేష్ మరణం ఓ గుణపాఠం కావాలి....ఓ హెచ్చరిక కావాలి...ఓ ఆలోచను పంచాలి...ఇది కాథ కాదు ఏ రియల్ స్టోరీ..పూర్తి వివరాలుకు వీడియో చూడండి.

20:45 - August 12, 2017
20:43 - August 12, 2017

పాయకారావుపేట ఎమ్మెల్యే అనితతో టెన్ టివి వన్ టూ వన్ నిర్వహించింది. నంద్యాల్లో గెలుపు టిడీపీదే అని అనిత గారు అన్నారు. అనిత మదిలో మరేన్నో విషయాలు తెలుసుకోవడానికి వీడియే క్లిక్ చేయండి.

20:39 - August 12, 2017

టెన్ టివితో ఫిదా టీం చిట్ చాట్ చేసింది. శరణ్య , రాజా, ఆర్యన్ గారు టెన్ టివి తో చాలా విషయాలు చెప్పారు. వీరి గుంరించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీడియో క్లిక చేయండి.

20:18 - August 12, 2017

మెదక్ : అమరుల స్ఫూర్తి యాత్రకు వరుసగా రెండోరోజు పోలీసులు అడ్డు తగిలారు. హైదరాబాద్‌ నుంచి యాత్రకు బయలుదేరిన తెలంగాణ జేఏసీ నేతల్ని తుప్రాన్‌ మండలం అల్లాపూర్‌దగ్గర పోలీసులు ఆపేశారు.. టోల్‌గేట్‌ దగ్గర కోదండరాం టీంను అరెస్ట్ చేసి పలు పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.. కోదండరాంను కౌడిపల్లి పీఎస్‌కు పంపారు.. అరెస్ట్ విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు.స్ఫూర్తియాత్రకు ముందు... కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తి యత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని చెప్పారు.తెలంగాణ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు జేఏసీ స్ఫూర్తియాత్ర చేపట్టాలని రెండురోజులుగా ప్రయత్నిస్తోంది. శుక్రవారం కామారెడ్డి జిల్లాకు బయలుదేరిన జేఏసీ నేతల్ని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆపేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు పంపారు.. అరెస్టులకు భయపడమన్న జేఏసీ నేతలు... శనివారం మళ్లీ యాత్రకు వెళతామని ప్రకటించారు. ఈ సమాచారంతో శనివారం నిజామాబాద్‌కు వెళ్లే ప్రతి మార్గంలో తనిఖీలుచేసిన పోలీసులు... మళ్లీ జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకొని.. మళ్లీ హైదరాబాద్ తిప్పిపంపారు.

20:17 - August 12, 2017

హైదరాబాద్ : గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఆదివారం సాయంత్రం వరకూ ఈ పనులు పూర్తికానున్నాయి. గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

20:16 - August 12, 2017

గుంటూరు : దేశానికి స్వాతంత్ర్య తెచ్చిన అమరవీరులను గుర్తచేసుకోవడం.. భావితరాలకు తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు మంత్రులు జవహర్, నక్కా ఆనంద్ బాబు. స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వారి జ్ఞాపకార్థంగా తెనాలిలో ఏర్పాటు చేసిన రణరంగ్‌ చౌక్‌ వద్ద మంత్రులు నివాళులు అర్పించారు. క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో 1942 ఆగస్ట్‌ 12న గుంటూరు జిల్లా తెనాలీలో బ్రిటీష్‌ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణత్యాగం చేశారు. వారి జ్ఞాపకార్థం 7 స్థూపాలు నిర్మాణం చేసి... రణరంగ్‌ చౌక్‌ గా నామకరణం చేశారు. నేడు వారిని స్మరిస్తూ మంత్రులు, స్తానికులు నివాళులు అర్పించారు.

20:15 - August 12, 2017

తూర్పు గోదావరి : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో పర్యటించారు. యానాం గ్రామంలో మత్య్సకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ లక్ష్మినరసింహ్మ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. రాజమండ్రి విమానాశ్రయం నుండి ర్యాలీగా రావులపాలెం, కొత్తపేట, అమలాపురం మీదుగా యానాం చేరుకున్నారు. తన ఇష్టదైవం లక్ష్మినరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్టకి ఆహ్వానించినందుకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

20:14 - August 12, 2017

అనంతపురం : రాష్ట్రంలో వరుస కరువు కాటకాల నేపథ్యంలో రైతులకు రుణమాఫీకి, గిట్టుబాటు ధరలకు పార్లమెంట్‌లో చట్టం తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. అనంతపురంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న మధు... ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి... నంద్యాల ఉప ఎన్నిక కోసం మంత్రులంతా అక్కడే మకాం వేశారన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రకటించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని మధు స్పష్టం చేశారు.

20:13 - August 12, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్‌ ప్రజలను భయాందోళనకు గురిచేసేలా మాట్లాడుతున్నాడని డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును తుపాకీతో కాల్చి చంపాలి... ఉరి తీయాలి అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని కేఈ తెలిపారు.

20:12 - August 12, 2017

కర్నూలు : మూడున్నరేళ్లలో ఏమీ చేయని చంద్రబాబు... ఉప ఎన్నిక రాగానే నంద్యాలను అభివృద్ధి చేస్తానని అబద్దాలు చెబుతున్నాడన్నాడు వైఎస్‌ జగన్‌. నంద్యాల నియోజకవర్గంలో నాలుగో రోజు రోడ్‌షో నిర్వహిస్తున్న జగన్‌... నంద్యాల ఎన్నికలో వేసే ఓటు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు నాంది కావాలన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. 

19:39 - August 12, 2017

నటి జ్యోతితో టెన్ టివి చిట్ చాట్ చేసింది. బిగ్ బాస్ షో లో జ్యోతి ఎదుర్కొన్న సమస్యల గురించి ఆమె తెలిపారు. బిగ్ బాస్ షో లో అంత నటించడం జరుగుతుందని ఆమె తెలిపారు. జ్యోతి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

18:09 - August 12, 2017

గద్వాల : గద్వాల పట్టణంలో అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్‌ ఆడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మూడు రాష్ట్రాలకు చెందిన ఏజెంట్‌ల గురించిన సమాచారాన్ని నిందితుల నుండి రాబట్టినట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌ కు పాల్పడుతున్న వారందరినీ త్వరలో అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు. వీరి నుండి 11వేల నగదు, 26 సెల్‌ఫోన్‌లు, 50 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

18:08 - August 12, 2017

హైదరాబాద్ : రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాని సికింద్రాబాద్‌ రైల్వే జీఆర్‌పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుండి పుణేకి లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ యువతి కూడా ఉంది. వారి వద్ద నుండి దాదాపు 15 లక్షల విలువగల 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసలు సూత్రదారులు ఢిల్లీ, ముంబయిలో పోలీసులకు దొరకకుండా తప్పించు తిరుగుతున్నారని వారికోసం గాలిస్తున్నట్లు సికింద్రాబాద్‌ రైల్వే ఎస్‌.పి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

18:07 - August 12, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారింది. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వం ఇక్కడ సౌకర్యాలను, పరికరాలను ఏర్పాటుచేస్తోంది.. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 65 పడకలున్న ICUని గవర్నర్‌ ఈ మధ్యే ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో ఎంతో మెరుగైన వైద్యం అందించేందుకు ఇక్కడ ఏర్పాట్లు నడుస్తున్నాయి.. మరింత సమాచారం కోసం వీడియో చూడండి. 

18:04 - August 12, 2017

మెదక్ : అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న టీజాక్ చైర్మన్ ప్రొ.కోదండరామ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మధ్యాహ్నం ఆయనను తూప్రాన్ టోల్ ఏట్ వద్ద అరెస్టు చేసి.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీజేఏసీ నేతలు మండిపడుతున్నారు. 

నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థుల ఆందోళన

నిజామాబాద్: ధర్నా చౌక్ వద్ద టీజేఏసీ విద్యార్థి జేఏసీ ధర్నా చేపట్టింది. ప్రొ.కోదండరాం అరెస్ట్ కు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అవడంతో పోలీసులు మోమరించారు.

కర్ణాటక రాజకీయాల్లో మరో కొత్త పార్టీ

హైదరాబాద్: కర్నాటక రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. రాజకీయ పార్టీని స్థాపిస్తానంటూ 13 నిమిషాల ఆడియో ని నటుడు ఉపేంద్ర విడుదల చేశారు. ఎవరి దగ్గర పార్టీ ఫండ్ తీసుకోనని, రాత పరీక్షలు పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయాలని, బ్యానర్లు, పోస్టర్లు, ర్యాలీలు, ట్రాఫిక్ జాంలు లేకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తానని ఉపేంద్ర తెలిపారు.

16:56 - August 12, 2017

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు.. నెల్లూరులో రోజా వేషధారణలోఉన్న మహిళకు పూలు, గాజులు వేశారు.. ఓ మహిళవై ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం తగదంటూ మొట్టికాయలు వేశారు.

బ్యాంకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ఐబీఏ

హైదరాబాద్: 22న బంద్ కు బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు ఇచ్చింది. బ్యాంకు ఉద్యోగ సంఘాలను ఐబీఏ చర్చలకు పిలిచింది. 16న ఐబీఏ తో బ్యాంకు ఉద్యోగ సంఘాలు చర్చలు జరపనున్నాయి. 18వ తేదీన చీఫ్ లేబర్ కమిషనర్ తో బ్యాంకు ఉద్యోగులు చర్చించానున్నారు.

 

16:55 - August 12, 2017

అనంతపురం : జిల్లాలో కరవు.. రైతులకు తీరని మనో వేదనను మిగులుస్తోంది. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందస్తుగా రావడంతో ఖరీఫ్‌ పంటల సాగుపై రైతులు ఆశలు పెంచుకున్నారు. భూములు దున్ని విత్తన సాగుకు సిద్ధమయ్యారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అరకొరగా కురిసిన వర్షాలకు విత్తనాలు వేసినా .. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావంతో ఇవాళ్టికీ దుక్కులే పూర్తికాలేదు. మరోవైపు వర్షాభావంతో అంతంత మాత్రంగా మొలకెత్తిన పంట వర్షాభావంతో ఎండిపోతోంది. జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 2.08 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగైంది. ఎండుతున్న వేరుశనగ పంటకు రెయిన్‌ గన్‌ల ద్వారా రక్షక తడులు అందించడానికి.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినా అందుబాటులో నీటి వనరులు లేవు. భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయ బోర్లలో కూడా నీరు రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళ్లముందే ఎండుతున్న పంట 
25 వేల ఎకరాలకు రక్షక తడులు అందించడానికి ప్రణాళికలు రూపొందించినా అవి కార్యరూపం దాల్చలేదు. నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే తిష్ట వేశారు. దీంతో రక్షక తడుల ప్రణాళికలకు అతీగతీ లేకుండా పోయింది. కళ్లముందు ఎండుతున్న పంటలను చూసి రైతన్నలు విలవిలలాడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేద్దామన్నా విత్తన నిల్వలు లేవు. ఒకవేళ అష్టకష్టాలు పడి ప్రత్యామ్నాయ పంటలకు వేద్దామన్నా వర్షాలు వస్తాయో లేదో అనే ఆందోళన రైతులను కృంగదీస్తోంది. ఎండుతున్న వేరు సెనగ పంటలను వామపక్షాల నేతలు పరిశీలించారు. అనంత రైతులను ఆదుకోవడానికి కేంద్రం సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని అనంతపురం జిల్లా రైతులు కోరుతున్నారు.  

16:53 - August 12, 2017

విజయవాడ : చేనేతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో చేనేత సముదాయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే 17 చేనేత సహకార సంఘాలు దరఖాస్తు చేశాయి. వీటిలో మూడు క్లస్టర్ల ఏర్పాటకు అనుమతులతో పాటు నిధులు కూడా విడుదలయ్యాయి. పెడనలో నార్తు పెడన చేనేత సంఘం, బ్రహ్మపురం సదాశివలింగేశ్వర, వీరభద్రపురం చౌడేశ్వరి చేనేత సహకార సంఘాల పరిధిలో చేనేత కార్మికులకు నాణ్యమైన జాకార్డు, జిందానీ, ఉప్పాడ, చైన్ డాబీ రకాల నేత చీరలు నేయటంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఈ సంఘాలకు రూ.57.30 లక్షలు మంజూరయ్యాయి.పాత లెక్కల ప్రకారం కృష్ణాజిల్లాలో 29 మండలాల్లో 15 వేల 904 మంది చేనేత కార్మికులున్నారు. 54 చేనేత సంఘాల్లో 34 క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఈ సంఘాల్లో 5వేల 380 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవంగా ఎంతమంది కార్మికులున్నారో వారందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాల్ని చేరువ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన కార్వే సంస్థ సర్వే చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరానికి కృష్ణాజిల్లాలో 32 చేనేత సంఘాలకు రూ.66.35 లక్షల త్రిప్ట్ నిధులు మంజూరయ్యాయి. చేనేత కార్మికులకు కొన్నేళ్లుగా ఆరోగ్య బీమా పథకం నిలిచిపోవటంతో ఇబ్బందులు చవిచూస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కార్మికులు కోరుతున్నారు.

వీవర్స్ సర్వీస్ సెంటర్ సహకారంతో
చేనేత ఉపకరణాల్లో సాంకేతికతను పెంపొందించేందుకు విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ సహకారంతో కార్మికులకు శిక్షణ కల్పించబోతున్నారు. . అందుకోసం మూడు సంఘాలకు కలిపి రూ.20.20 లక్షలు మంజూరు చేశారు. ఒక్కొక్క సంఘం నుంచి బృందానికి 60 మంది కార్మికుల చొప్పున 180 మందికి రెండు నెలల ఉపకార వేతనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు నెలాఖరుకి సముదాయాలు మంజూరు చేసి సంఘాలు శిక్షణ ప్రారంభించేందుకు సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.మరోవైపు చేనేతను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుని .. ప్రోత్సహిస్తుందని మంత్రులు చెబుతున్నారు. చేనేతలో కొత్త డిజైన్లు, వృత్తి ఉపకరణాల రూపకల్పనకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చేనేత వస్త్రాల అమ్మకాలను ఆన్‌ లైన్‌లో కూడా పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదే ప్రోత్సాహం కొనసాగితే భవిష్యత్‌లో చేనేతల మనుగడ మెరుగుపడుతుందనడంలో సందేహం లేదు. 

రూ.30వేల ఎగువకు బంగారం ధర...

హైదరాబాద్ : మరోసారి బంగారం ధర రూ. 30వేల మార్క్ దాటింది.వెండి ధర రూ.40వేల మార్కును దాటింది. అమెరికా, ఉత్తర కొరియా ఉద్రిక్తత నేపథ్యలో బంగారం ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది.

16:52 - August 12, 2017

తూర్పు గోదావరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరం ప్రాజెక్టును సమాధి చేస్తున్నారని మాజి ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఇప్పటివరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగలేదని, అలాంటిది 2018 కల్లా ప్రాజెక్టును పూర్తిచేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నెల 18న పోలవరం పరిశీలనకు వస్తున్న పార్లమెంటరీ బృందానికైనా ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలని కోరారు.

16:51 - August 12, 2017

హైదరాబాద్ : అరెస్టుకు ముందు... టీ.జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్రద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తియత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు.

16:49 - August 12, 2017

కర్నూలు : వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి సోమిరెడ్డి. తన భాష పరిధి దాటి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ కంట్రోల్‌ తప్పి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు కూడా లెక్కచేయడం లేదని సోమిరెడ్డి అన్నారు. వైసీపీ నేతలు నంద్యాలలో డబ్బులు పంచుతున్నారంటూ ఓ వీడియోను సోమిరెడ్డి మీడియాకు విడుదల చేశారు

16:49 - August 12, 2017

కర్నూలు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలను మోసం చేశారని YCP అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ భృతి, పేదలకు ఇళ్లు అంటూ నమ్మబలికి మోసం చేసిన దుర్మార్గపు ఆలోచనలు చేశారని నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒంటివెలగలలో జరిగిన రోడ్‌ షోలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

చేపల చెరువులో విషంకలిపిన దుండుగులు

కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలులో దారుణం జరిగింది. దళితుల చేపల చెరువులో దుండగులు విషం కలిపారు. అగ్రకులానికి చెందిన వారి పనేనని హరిజన ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో విషాదం...

చిత్తూరు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సదుం మండలంలోని బూరగమంద పంచాయతీ కురవపల్లికి చెందిన ఈశ్వరమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఈ ముగ్గురినీ చికిత్సనిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా ఈశ్వరమ్మ ప్రాణపాయం నుంచి బయటపడగా.. కుమార్తెలు వర్షిణి (10నెలలు), వైష్ణవి (6) ప్రాణాలు కోల్పోయారు. భర్త నాగేంద్రతో మనస్పర్థలు కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఈశ్వరమ్మ తెలిపారు.

నగరంలో పలుచోట్ల భారీ వర్షం...

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్ల పై నీరు నిలిచి పోవడంతో వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరత కాదట: యూపీ ఆరోగ్య మంత్రి

లక్నో: గోరఖ్ పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీలో చిన్నారుల మృతికి ఆక్సిజన్ కొరత కారణం కాదని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ అంటున్నారు. వేరే వేరే కారణాలతో చిన్నారులు చనిపోయాని డొంక తిరుగులు వ్యాఖ్యలు చేస్తున్నారు. విషమ పరస్థితుల్లోనే మెడికల్ కాలేజీకి వస్తారని, ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా నిలిపివేత పై విచారణ జరిపిస్తామని చావు కబురు చల్లగా వినిపించారు. బీఆర్డీ మెడికల్ కాలేజీలో సీఎం పర్యటన సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత పై చర్చల జరగలేదని సెలవిచ్చారు.

గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్ట్....

సికింద్రాబాద్: సోలాపూర్ నుంచి గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.

15:57 - August 12, 2017

ఢిల్లీ : బిహార్‌లో బిజెపితో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న జెడియు సీనియర్‌ నేత శరద్‌యాదవ్‌పై నితీష్‌వర్గం చర్యలకు ఉపక్రమించింది. జెడియుకు చెందిన ఎంపీలు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసారు. రాజ్యసభలో జెడియు నేతగా శరద్‌యాదవ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఆర్‌సిపి సింగ్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో జెడియుకు 10 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో అలీ అన్వర్‌ను సస్పెండ్‌ చేయగా... నితీష్‌ వైఖరిని నిరసిస్తూ కేరళకు చెందిన ఎంపి వీరేంద్ర కుమార్‌ కూడా పార్టీకి దూరమయ్యారు. ఆగస్టు 19న జెడియు జాతీయ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి శరద్‌యాదవ్‌ హాజరు కాకుంటే పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అదేరోజు ఎన్డీయేలో చేరే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకోనుంది.

15:56 - August 12, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌లోని మెండర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పులు జరిపింది. పాక్‌ ఆర్మీ మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్వోసి వద్ద పాకిస్తాన్‌ సేనకు భారత్‌ తగినరీతిలో జవాబు చెప్పింది. పాకిస్తాన్‌ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 250 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరోవైపు కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అర్ధరాత్రి దాటాక దూరం నుంచి కాల్పులు జరిపారు. జవాబుగా ఆర్మీ కూడా కాల్పులు జరపడంతో చీకటిని ఆసరగా చేసుకుని ఉగ్రవాదులు పారిపోయారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

15:55 - August 12, 2017

హైదరాబాద్ : నగర అభివృద్ధికి, కొత్త ప్రాజెక్ట్‌ల అమలుకు, జీతాల చెల్లింపులకు, రోజువారి మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులను సమీకరించేందుకు కొత్త వ్యూహాలకు బల్దియా పదును పెడుతోంది. ప్రాపర్టీ టాక్స్‌ వసూళ్లలో దూసుకెళ్లేందుకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. అంతే కాకుండా అధికారులతో వీక్లీ రివ్యూ పెట్టి మరీ టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సునామీ సర్వే.. ఆస్తి పన్నులో ఉన్న లోపాలను రివ్యూ చేసి పన్నులు పెంచేందుకు ప్లాన్ చేశారు. బల్దియా ఎన్నికల సమయంలో 1200 రూపాయల లోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేశారు. అయితే వాటికి అసలు పన్ను ఎంత ఉంటుందని రివిజన్ చేసిన బల్దియా అధికారులు.

60 కోట్ల పన్ను
30 శాతం నుంచి 500 శాతం వరకు పన్నును విధించారు. దాంతో మొదట్లో రద్దైన పన్ను కంటే ఎక్కువ మొత్తంలో పన్ను డిమాండ్‌ను పెంచారు. దీంతో పాటు ఈ ఏడాది లెక్కలోకి రాని ఆస్తులు.. ఖాళీ స్థలాలను కూడా పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బల్దియా తీవ్ర కసరత్తు చేస్తోంది. వాటిపై 60 కోట్ల పన్ను రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 1100 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసిన బల్దియా.. ఈ ఏడాది 1450 కోట్ల వసూళ్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 541 కోట్ల ఆస్తిపన్ను వసూలు అయ్యింది. మార్చి నాటికి 909 కోట్లు వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రతీ వారం పన్ను వసూళ్లపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి ప్రతీ నెల 113 కోట్ల చొప్పున వసూలు చేయాలని టార్గెట్ ఫిక్స్‌ చేసుకున్నారు.

పన్నులు భారీగా పెంచనున్న జీహెచ్ఎంసీ
ఇక ట్రెడ్‌ లైసెన్స్‌ పన్ను ప్రకటనల పన్నులను కూడా భారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో ఉన్న హోర్డింగుల నిర్వహణను స్ట్రీమ్‌ లైన్‌ చేయడం ద్వారా 100 కోట్ల ఆదాయం వస్తుంది. గతేడాది ట్రేడ్‌ లైసెన్స్‌ ద్వారా 50 కోట్ల ఆదాయం ఆర్జించిన జీహెచ్‌ఎంసీ ఈ ఏడాది దానిని 100 కోట్లకు పెంచాలని చూస్తోంది. ఇందులో ఉన్న లోపాలను సవరించేందుకు ఇటీవలే స్టాండింగ్‌ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సిటీలో ఉన్న ప్రతీ వ్యాపారాన్ని లైసెన్స్ పరిధిలోకి తెచ్చి.. వారందరి నుంచి పన్ను రాబట్టాలని డిసైడ్ చేసింది. ఇక ప్రతీ యేటా టౌన్ ప్లానింగ్ ద్వారా వస్తున్న 600 కోట్ల ఆదాయాన్ని కూడా ఈ సారి భారీగా పెంచడానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సిటీ డెవలప్‌మెంట్ కోసం పలు భారీ ప్రాజెక్ట్‌లను ముందేసుకున్న బల్దియా.. వాటిని కంప్లీట్ చేసేందుకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది. ఈ ఏడాది కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయా.. లేదా అనేది మార్చి చివరికి తేలిపోనుంది. 

బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సస్పెన్షన్...

గోరఖ్ పూర్ :బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ పై సస్పెన్షన్ వేటు పడింది. 63 మంది చిన్నారుల మృతి ఘటనలో ప్రిన్సిపల్ పై వేటు పడింది.

 

15:53 - August 12, 2017

నిర్మల్ : జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో పసికందు మృతి కాంగ్రెస్‌, TRS నేతలమధ్య వాగ్వాదానికి దారితీసింది.. డెలివరీకోసం లలిత అనే గర్భిణీ గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరింది.. ఉదయం సిజేరియన్‌చేసిన వైద్యులు శిశువు మృతిచెందిందని తెలిపారు.. దీంతో ఆగ్రహించిన రోగి బంధువులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.. రోగి బంధువుల తీరుతో ఆగ్రహించిన డాక్టర్లు సామూహికంగా సెలవుపెట్టారు.. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు బాధితుల్ని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు.. అదేసమయంలో శిశువు మృతిపై విచారణకోసం వచ్చిన DCHS డాక్టర్‌ సురేశ్‌ను అడ్డుకున్నారు.. శిశువు మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేశారు.. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ గులాబీ నేతలు కాంగ్రెస్‌ నేతలకు అడ్డుతగిలారు.. రెండు వర్గాలమధ్య వాగ్వాదంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడం రెండువర్గాలకు నచ్చజెప్పిన పోలీసులు నేతల్ని ఇంటికి పంపేశారు.

కుంతియాకు ఘన స్వాగతం..

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా చేరుకున్నారు. ఎయిర్ పోర్టు లో కుంతియాకు పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్మెల్సీ షబ్సీర్ అలీ ఘన స్వాగతం పలికారు.

 

నాగర్ కర్నూలు జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం

నాగర్ కర్నూలు : జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపింది. జిల్లాలోని బిజ్నపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఓ వృద్ధుడికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలడంతో అతన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 12వైద్యబృందాలు స్వైన్ ప్లూ పై అవగాహన కల్పిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

కార్పొరేటర్స్ వాట్సప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలు

హైదరాబాద్ : నగరంలోని వెంగళరావునగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మనోహర్ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలు పొస్టు చేశారు. గ్రూప్ లో మహిళ కార్పొరేటర్లు ఉండడంతో చిత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్ ఫిర్యాదు చేయడానికి మహిళ కార్పొరేటర్లు సద్ధమౌతున్నారు. 

కోదండరాం అరెస్టుపై టీజాక్ ఆగ్రహం

మెదక్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న కోదండరాంను తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు, టీజేఏసీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.ఆయన అరెస్టుపై టీజాక్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

15:19 - August 12, 2017

నాగర్ కర్నూలు : జిల్లాలో స్వైన్ ప్లూ కలకలం రేపింది. జిల్లాలోని బిజ్నపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో ఓ వృద్ధుడికి వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలడంతో అతన్ని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఆ గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 12వైద్యబృందాలు స్వైన్ ప్లూ పై అవగాహన కల్పిస్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:12 - August 12, 2017

హైదరాబాద్ : నగరంలోని వెంగళరావునగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మనోహర్ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలు పొస్టు చేశారు. గ్రూప్ లో మహిళ కార్పొరేటర్లు ఉండడంతో చిత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్ ఫిర్యాదు చేయడానికి మహిళ కార్పొరేటర్లు సద్ధమౌతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

15:10 - August 12, 2017

మెదక్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న కోదండరాంను తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు, టీజేఏసీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.ఆయన అరెస్టుపై టీజాక్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:44 - August 12, 2017

హైదరాబాద్ :చేయని నేరానికి తనను అన్యాయంగా కేసులో ఇరికించారని అంటున్నాడు బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయం బాంబు దాడి ఘటనలో A9 గా ఉన్న ఖాజా. 8 సంవత్సరాల జైలు జీవితంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని చెప్పాడు. 2005 అక్టోబర్ 12న బేగంపేట టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడి జరిగిన ఘటనలో ఖాజా ఏ9 గా ఉన్నాడు. ఈ నెల 10న నాంపల్లి కోర్టు ఆరోపణలు ఎదుర్కున్న పదిమందిని నిర్దోషులుగా ప్రకటించిన నేపథ్యంలో ఖాజా విడుదలయ్యాడు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

14:43 - August 12, 2017

రంగారెడ్డి : జిల్లాలో స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లోని హనుమాన్‌ నగర్‌లో డ్రైవర్‌ బస్సును రివర్స్ తీసుకుని ముందుకు వెళ్లే సమయంలో పక్కనే ఉన్న చిన్నారి మానసను బస్సు ఢీ కొట్టిడంతో మానస అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సెలవు దినముగా, సెకండ్‌ సాటర్డే అయినప్పటికీ స్కూళ్లు తెరిచిఉంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

14:43 - August 12, 2017

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌ వైద్యులపై... రోగి బంధువులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆస్తమా, షుగర్‌ వ్యాధితో బాధపడుతూ అపస్మారక స్థితికి వెళ్లిన ఓ వృద్ధుడిని ... కొంతమంది మాధవ నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో ... వైద్యులు అతన్ని ఐసీయూకు తరలించారు. కానీ అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే .. వృద్ధుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ను చితకబాదారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన నర్స్‌లను కూడా కొట్టారు. ఆస్పత్రి ఫర్నిచర్‌ ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు..సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలో ఉన్న దాడి దశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

14:42 - August 12, 2017

మెదక్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు. అమర వీరుల స్ఫూర్తి యాత్రలో భాగంగా నిజామాబాద్ వెళ్తున్న కోదండరాంను తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. కోదండరాం అరెస్టు సమయంలో పోలీసులు, టీజేఏసీ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:40 - August 12, 2017

హైదరాబాద్: టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. వరసగా సెలవులు రావడంతో సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. దీంతో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. రెండో శనివారం, ఆదివారం, కృష్ణాష్టమి, ఆగస్టు 15 సెలవులు రావడంతో.. ప్రజలు సొంత గ్రామాలకు వెళ్లడానికి బారులు తీరారు. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డులో ఆర్టీసీ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పంతంగి, బీబీనగర్‌, కోర్లపాడు టోల్‌గేట్‌ల వద్ద ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు, భారీగా ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. 

13:38 - August 12, 2017

అనంతపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానలపై సీపీఎం పోరుబాట పడుతోంది. ఈనెల 15 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వామపక్ష పార్టీలన్నింటిని కలుపుకొని నిరసనలకు దిగుతామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీరాఘవులు అన్నారు. అనంతపురంలో జరగుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభత్వాలు ప్రజాకంటకంగా మారాయని రాఘువులు విమర్శించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుబాటుపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాని ఆందోళన చేస్తామని తెలిపారు. బీజేపీ కూటమి అధికారంతో దేశంలో లౌకికత్వానికి విఘాతం కలుగుతోందని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం ఒరగలేదన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:33 - August 12, 2017

కామారెడ్డి : జిల్లాలో ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజా, విద్యార్ధి సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడం.. కామారెడ్డి మున్సిపాల్ ఆఫీసు ముందు సభ టెంట్‌ ధ్వంసం చేయడం సిగ్గు చేటని సీఐటీయు నేతలన్నారు. అధికార పార్టీ అహంభావంతో దాడి చేయడం సరి కాదన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయకుండా.. దాడికి గురైనవారిని అరెస్ట్‌ చేయడంపై మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు అన్నారు. 

తిరుమలలో సైకో హల్ చల్

తిరుమల : తిరుమలలో సైక హల్ చల్ చేశాడు. టీఏసీ -4 వద్ద కార్మికురాలిని సైకో గాయపరిచాడు. కార్మికురాలికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

12:41 - August 12, 2017

చెన్నై: తమిళనాడులో అధికారపార్టీ రాజకీయం రాజ్‌భవన్‌కు చేరింది. అన్నాడీఎంకే వర్గాల కలయికపై నిన్నటిదాకా ఢిల్లీలో సాగిన మంతనాలు ఇపుడు చెన్నైకి చేరాయి. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ఇవాళ చెన్నైకి వస్తున్నారు. గవర్నర్‌ను కలవడానికి ఇప్పటికే అన్నాడీఎంకేలో ఇరువర్గాలు అపాయింట్‌మెంట్ తీసుకున్నాయి. సీఎం పళనిస్వామి. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గాలు విడివిడిగా గవర్నర్‌తో భేటీ కానున్నాయి. ఈ భేటీ తర్వాత ఓపీఎస్‌ వర్గం ప్రభత్వంలో చేరే విషయంపై క్లారిటీ రానుంది. పళనిస్వామి మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉండొచ్చన్న చర్చలు అధికారపార్టీలో జోరుగా సాగుతున్నాయి. 

12:39 - August 12, 2017

హైదరాబాద్: యూపీలో చిన్నారుల మృత్యుఘోష ఆగడంలేదు. ఘోరక్‌పూర్‌లోని బాబా రాందాస్‌ ఆస్పత్రిలో ఆరు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతిచెందారు. చిన్నారుల మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీరియస్‌ అయ్యారు. అధికారులతో అత్యవసరభేటీ నిర్వహించారు. మిరికొద్ద సేపట్లో ఆర్యోగ్యశాఖా మంత్రితో కలిసి సీఎం ఆదిత్యనాథ్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆస్పత్రిని సందర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మందులు సమయానికి అందక పోవడంతోనే పిల్లలు చనిపోతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే కంపెనీకి బాకీలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌దురు కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. బాబా రాఘ‌వ దాస్ మెడిక‌ల్ కాలేజీకి పుష్పా కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే బాకీలు చెల్లించ‌కుంటే స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని గ‌తంలో ఆ కంపెనీ హాస్ప‌ట‌ల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆగ‌స్టు ఒక‌ట‌వ తేదీన ఆ కంపెనీ ఈ అంశంపై లేఖ కూడా రాసింది. పాత బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగానే హాస్ప‌ట‌ల్‌కు ఆక్సిజ‌న్ అంద‌లేదా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. బిల్లుల గురించి తెలిసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఢిల్లీకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు. 

12:34 - August 12, 2017

కర్నూలు : గత ఎన్నికల్లో వున్న సైకిల్ ఈ సారి ఫ్యాన్ అయ్యింది.. గత ఎన్నికల్లో ఫ్యాన్ ఈ సారి సైకిల్ అయ్యిందని, వైసిపి, టీడీపీ చేస్తున్న మోసాల్ని ప్రజలు గమనిస్తున్నారని రాయలసీమ పరిరక్షణ కమిటీ సభ్యులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల బరిలో ఉన్నతమ సమితి అభ్యర్ధి పుల్లయ్య తరపున బైరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాయలసీమ ఆత్మగౌరవం కోసం నంద్యాల ప్రజలు తమను స్వాగతిస్తారని ఆయన ఆకాంక్షించారు. 14వ తేదీ నుండి చైతన్య యాత్ర చేపడుతున్నామని తెలిపారు. 18వ తేదీన నంద్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లను కలవడమే, వారిని కన్విన్స్ చేయడమే మా ధ్యేయం అని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

తార్నాకలో ఓయూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్: తార్నాకలో ఓయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. టీజేఏసీ అమరుల స్పూర్తియాత్రను అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేశారు. టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం పై దాడులకు పాల్పడ్డ టీఆర్ ఎస్ నేతలపై దాడులు చేస్తాం అని ఓయూ విద్యార్థులు హెచ్చరించారు.

హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన ధావన్, రాహుల్...

క్యాండీ: ఇండియ‌న్ ఓపెన‌ర్లు ధావ‌న్‌, రాహుల్‌లు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. క్యాండీలో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టుల్లో ఇద్ద‌రూ దూకుడు మీద ఆడుతున్నారు. భార‌త్ 22 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 114 ర‌న్స్ చేసింది. ధావ‌న్ 57, రాహుల్ 54 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రాహుల్‌కు వ‌రుస‌గా ఏడ‌వ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. 

అనాజ్ పూర్ లో నాటుతుపాకుల కలకలం....

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్ మెట్ అనాజ్ పూర్ లో నాటు తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు నాటుతుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జగన్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకోవాలి: మంత్రి దేవినేని

విజయవాడ: జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని, మహిళా ఎమ్మెల్యేలతో మంత్రులను తిట్టించే చిల్లర రాజకీయాలు జగన్ మానుకోవాలని మంత్రి దేవినేని ఎద్దేవా చేశారు. రాజకీయంగా మాట్లాడలని, వ్యక్తిగత విమర్శలు సరికావని సూచించారు. నోటికి అడ్డూ.. అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలను ఈసీ సుమోటోగా తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం యోగి ఆదిత్యనాధ్ క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్

యూపీ: గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్ధనాథ్ వెంటనే రాజీనామా చేయాలని, సీఎం యోగి ఆదిత్యనాధ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న దేవినేని..

విజయవాడ : జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని, మహిళా ఎమ్మెల్యేలతో మంత్రులను తిట్టించే చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి దేవినేని సూచించారు. 

11:36 - August 12, 2017

హైదరాబాద్ : టమాట దారిలోనే ఉల్లి పోతానంటోంది..కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తానంటోంది..గతంలో మాదిరిగానే మరోసారి ధర పెరుగుతానంటోంది...అవును..ఇది నిజం..మార్కెట్ లో ఉల్లి దిగుమతులు తగ్గిపోతున్నాయి. దీనితో ఉల్లిపాయ రేటును వ్యాపారులు అమాంతం పెంచేస్తున్నారు. ఒక్కసారి ఉల్లిగడ్డ ధర కూడా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మలక్ పేట మార్కెట్ కు దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కిలో ఉల్లి రూ. 40-రూ. 50 ధర పలుకుతోంది. 

11:32 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి మృత్యుకుహారాలుగా మారాయి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా 32 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. శుక్రవారం 30 మంది పిల్లలు కన్నుమూయగా శనివారం మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. సీఎం సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. రూ. 70 లక్షలు ఆసుపత్రి బకాయి పడిందనే కారణంతో సిలిండర్ల సరఫరాను కాంట్రాక్టర్ నిలిపివేశారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. మెదడు వాపు వ్యాధితోనే చిన్నారులు మృతి చెందుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

11:27 - August 12, 2017

కృష్ణా : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు..కుటుంబ కలహాలు..ఇతరత్రా కారణాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన చందర్లపాడు మండలం కొనాయపాలెంలో చోటు చేసుకుంది. దాసు..బుజ్జి దంపతులకు ఇద్దరు మగపిల్లలు..ఒక కుమార్తె ఉంది. ఇంట్లో కుటుంబ కలహాలు నెలకొనడం..అప్పులు ఎక్కువ కావడం..వత్తిడి అధికం కావడంతో దాసు..బుజ్జిలు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. కుమారులు..కుమార్తె కన్నీంటపర్యంతమయ్యారు. 

కామారెడ్డిలో 138 మంది రైతుల ఆత్మహత్య - కోదండరాం..

హైదరాబాద్ : పర్యటనలో చెప్పాలనుకున్న విషయాలు డాక్యుమెంట్ రూపంలో విడుదల చేస్తామని టీజేఏసీ ఛైర్మన్ ఫ్రొ. కోదండరాం పేర్కొన్నారు. కామారెడ్డిలో 138 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదన్నారు. పశుసంపద ఉన్న జిల్లాల్లో సదుపాయలు లేవని..కొత్త కంపెనీలు కూడా రాలేదన్నారు. అక్షరాస్యతలో కామారెడ్డి వెనుకబడిందని మహిళల అక్షరాస్యత 45 శాతం మాత్రమే ఉందన్నారు. ఉపాధి లేక విదేశాలకు వలసలుగా వెళుతున్నారని, బీడి కార్మికుల పరిస్థితి హీనంగా ఉందన్నారు. 

నిజామాబాద్ కు కోదండరాం..

హైదరాబాద్ : టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరారు. నిజామాబాద్, కామారెడ్డిలో అమరుల స్పూర్తి యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

చిన్నారుల మృతిపై సీఎం యోగి ఆదేశాలు..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించారు. 

రెట్టింపైన ఉల్లిధర

హైదరాబాద్ : ఉల్లిధర రెట్టింపైంది. ఏదిగుబడి తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచారు. మలక్ పేట మార్కెట్ కు దిగుమతులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కిలో ఉల్లి రూ. 40-రూ. 50 ధర పలుకుతోంది. 

పోలీసుల అదుపులో మావోయిస్టులు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. తొంగపాల పీఎస్ పరిధిలో సమావేశం జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్న వారిలో ముగ్గురు మల్కాన్ గిరి వాసులు గాకా ఇద్దరు ఒడిశా వాసులుగా గుర్తించారు. 

గార్ల ఒడ్డు గ్రామంలో ప్రమాదం..

ఖమ్మం : ఏనుకూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలో ప్రమాదం చోటు చేసుకుంది. సైకిల్..కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో సైకిల్ పై వెళుతున్న వ్యక్తి మృతి చెందగా కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. 

దంపతులు ఆత్మహత్య..

కృష్ణా : జిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు కన్నీటి దాసు, బుజ్జిలుగా గుర్తించారు. 

11:09 - August 12, 2017

హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ప్రజల హక్కు నిరసన తెలిపే అధికారం లేకుంటే ప్రజాస్వామ్యం బతకదని గతంలో చాల సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. టీజేఏసీ యాత్రను అడ్డుకోవడంపై ఆయన మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి లేదంటున్నందున నిజామాబాద్‌లో మీటింగ్‌ పెట్టుకుంటామని కోదండరామ్‌ అన్నారు. 

10:17 - August 12, 2017

'ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ తో ప్రేక్షకులను అలరించిన 'కైరా అడ్వాణీ' ప్రస్తుతం తెలుగు సినిమాలో నటిస్తోంది. 'మహేష్ బాబు – కొరటాల శివ' కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ అనే మూవీ లో కైరా నటిస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని..సీఎంగా మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రాజకీయాలపై కొరటాల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి కైరా అడ్వాణీ మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబుతో కలిసి నటించడం ఓ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. తాజాగా ముంబయి బాంద్రాలోని ఓ నూతన దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఇది నా తొలి తెలుగు చిత్రమని, ఆయనతో, విజయవంతమైన చిత్రాల్ని అందించిన కొరటాల శివతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అవకాశమన్నారు. ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోందని తెలుస్తోంది.

09:56 - August 12, 2017

సమాజంలో సొంతిళ్లు..ఆస్తి పాస్తులు ఉంటేనే గౌరవం..హోదా..పిల్లల భవిష్యత్ కోసం స్తిరాస్తులు సంపాదించడం ప్రతొక్కరికీ అవసరం. అభివృద్ధి చెందుతున్న పట్టణాలు..నగరాల్లో అన్ని సౌకర్యాలు ఉండే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు..అపార్ట్ మెంట్లు కొనాలనే పట్టుదలతో ఉంటారు. రిజిస్ట్రేషన్..ఇంటి లోన్స్..ఫర్నీచర్.. సమస్యలు..విల్లాలు..అపార్ట్ మెంట్ ధరలు..ఇలా..ఎన్నో వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి. 

గుత్తి వద్ద ఆర్టీఏ తనిఖీలు..

అనంతపురం : గుత్తి వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేటు బస్సులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరుకు ఈ బస్సులను తిప్పుతున్నారు. 

09:38 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : ఆగస్టు 15వ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ రోజున యూపీ రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఎగురవేయాలని..జాతీయ గీతం పాడాలని..సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటించాలని సీఎం యోగి ఆదిత్య నాథ్ ఆదేశాలు జారీ చేయడం వివాదాస్పదమౌతోంది. ఇప్పటికే ఆయన చేసిన ఆదేశాలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీటికి సంబంధించిన వీడియోలను రికార్డు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తమ దేశభక్తిని శంకించడం వల్లే ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని మదర్సా నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. తమ దేశభక్తిని రుజువు చేయడానికి ఎవరూ సర్టిఫికేట్ అవసరం లేదని, ఫొటోలు..వీడియోలు తీయడం రాజకీయమే తప్ప మరొకటి కాదన్నారు. 

09:33 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి చెందుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఆక్సిజన్ అందక 40 గంటల్లోనే 30 మంది చిన్నారులు మృత్యుముఖంలోకి వెళ్లిపోయారు. వీరంతా మెదడు వాపు వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ మెడికల్ ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో మొత్తం 54 మంది చిన్నారులున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆసుపత్రిని తనిఖీ చేసి వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యలు ఏకరవు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం హామీనిచ్చినట్లు తెలుస్తోంది. 

మరోసారి పాక్ సైన్యం కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : పాక్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ సెక్టార్ లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. 

పెరుగుతున్న చిన్నారుల మృతుల సంఖ్య..

ఉత్తర్ ప్రదేశ్ : గోరఖ్ పూర్ జీఆర్డీ ఆసుపత్రిలో చిన్నారులు మృతి చెందుతూనే ఉన్నారు. తాజాగా మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీనితో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. ఆక్సిజన్ అందక నిన్న 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. 

సైనిక శిబిరంపై కాల్పులు..

జమ్మూ కాశ్మీర్ : కుప్వారాలో సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ జవానకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

 

కొనసాగుతున్న కామారెడ్డి బంద్..

కామారెడ్డి : కోదండరాంపై టీఆర్ఎస్ నేతల దాడిని నిరసిస్తూ నేడు కామారెడ్డి బంద్ జరుగుతోంది. బంద్ కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. నిజాం సాగర్ చౌరస్తాలో జేఏసీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. భారీగా పోలీసులు మోహరించారు. 

09:06 - August 12, 2017

ప్రకాశం : మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు..హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని కందుకూరు ఏకలవ్యనగర్ లో మహిళ మృతదేహం బయటపడడం కలకలం రేగింది. ఎస్ఎస్ ట్యాంకు పక్కనే మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముఖం గుర్తు పట్టకుండా ఉంది. వివాహిత కావచ్చని, 22 సంవత్సరాలు వయస్సు ఉంటుందని..అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతున్నారు. 

ప్రార్థనలు చేస్తుండగా కాల్పులు..

కాబూల్‌ : ఉత్తర టఖార్ ప్రావిన్స్ లోని ఓ మసీదులో కాల్పుల ఘటన కలకలం రేగింది. ఓ సాయుధ దుండగుడు ప్రార్థనలు చేస్తున్న వారిపై కాల్పులు జరిపాడు. నలుగురు దుర్మరణం పాలవగా 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. 

08:21 - August 12, 2017

జోగులాంబ : ఇటిక్యాల (మం) బీచ్ పల్లి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బీచ్ పల్లి వద్ద ఆగి ఉన్న డీసీఎంను వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. దీనితో బొలెరో నుజ్జునజ్జయ్యింది. బొలెరోలో ఉన్న డ్రైవర్..మరో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. 

08:06 - August 12, 2017

నల్గొండ : ప్రైవేటు బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం..నిర్లక్ష్యంగా..నిబంధనలు పాటించకుండా ప్రైవేటు బస్సు యజమానులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు.

గోల్డెన్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతోంది. కట్టంగూరు (మం) ఐటీ పాముల వద్ద జాతీయ రహదారిపై బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఘాడ నిద్రలో ఉన్న వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. బస్సులో ఉన్న వారు ఇతరులకు సహాయం చేసి బయటకు తీశారు. ఈ ఘటనలో 40 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఘటన జరిగిన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. నిర్ధేశిత సమయానికి చేరుకొనేందుకు డ్రైవర్ అతివేగంగా నడిపినట్లు తెలుస్తోంది. 

08:00 - August 12, 2017

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు వీడియోలో సూడుండ్రి..

నంద్యాలలో జగన్ ఎన్నికల ప్రచారం..

కర్నూలు : నంద్యాలలో నేడు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఆయన రోడ్ షోలు నిర్వహిస్తూ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 

07:45 - August 12, 2017

నంద్యాల ఉప ఎన్నిక ప్రచార రసవత్తరంగా జరుగుతోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఏకంగా పాలనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, చంద్రబాబు నాయుడుని కాల్చి చంపాలని..ఉరి వేయాలని జగన్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమౌతోంది. దీనిపై టిడిపి నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. దీనితో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), సురేష్ (వైసీపీ), కూన రవికుమార్ (ఏపీ ప్రభుత్వ విప్) పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:29 - August 12, 2017

బస్సు బోల్తా..డ్రైవర్ పరార్..

నల్గొండ : కట్టంగూరు (మం) ఐటీ పాముల వద్ద జాతీయ రహదారిపై గోల్డెన్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ పరారయ్యాడు. నిర్ధేశిత సమయానికి చేరుకొనేందుకు డ్రైవర్ అతివేగంగా నడిపినట్లు తెలుస్తోంది.

 

06:55 - August 12, 2017

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా బైంసా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో నిద్రపోతున్న నర్సులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది... కుటుంబ సభ్యులపై చిందులు వేస్తూ ఏవో ఇంజక్షన్లు చేశారు. తర్వాత నొప్పులు తగ్గాయి... ఉదయం ఆపరేషన్‌ చేయగా... మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మరో శిశువు మృతి చెందాడు. ప్రసవం కోసం గత మంగళవారం జ్యోతి అనే గర్బిణీ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. సిజేరియన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... అనస్తషీయ రాలేదని ఆపరేషన్‌ను వాయిదా వేశారు. శుక్రవారం రోజున నొప్పులతో మళ్లీ ఆస్పత్రికి రావడంతో... వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో... ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే... వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో... యువతి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు... యువతి మృతికి కారణమైన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడుతారని ఎంతో నమ్మకంగా రోగులు ఆస్పత్రికి వస్తే... వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

06:51 - August 12, 2017

అనంతపురం : జిల్లాలో కల్తీ రాయుళ్లు రాజ్యమేలుతున్నారు. బేకరీలో వాడే డ్రై ఫ్రూట్స్ మొదలుకొని... కారం పొడి వరకు అన్నిటినీ కల్తీ చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లలు తాగే పాలనూ కల్తీ మాఫియా వదలటం లేదు. ప్రతీదాన్ని కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. కల్తీకి కాదేది అనర్హం అంటూ అనంతలో చెలరేగిపోతున్న మాఫియాపై టెన్‌టీవీ కథనం..గుట్టుచప్పుడు కాకుండా నిత్యావసర వస్తులను కల్తీ చేసేస్తున్నారు. ధనార్జనే లక్ష్యంగా సరుకులను కల్తీచేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ అక్రమ సంపాదనకు తెరలేపారు. దీంతో కల్తీదందా వేగంగా విస్తరిస్తోంది.

అనంతలో కల్తీ సరుకులు ఎక్కువవ్వడంతో కొన్నాళ్లుగా విజిలెన్స్ అధికారులు కల్తీదందాపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో పాలను కల్తీచేస్తున్న ముఠా విజిలెన్స్‌కు చిక్కింది. ప్రతిదినం వందల లీటర్ల పాలను కల్తీ చేస్తూ వాటిని వివిధ బేకరీలకు, స్వీట్‌ షాపులకు సప్లైచేస్తున్నట్టు విజిలెన్స్‌ గుర్తించింది. గతేడాదే పెద్ద ఎత్తున పాలను కల్తీ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. దాన్ని ఇంకా మరువక ముందే మళ్లీ అలాంటి కల్తీ దందా వెలుగు చూడడంతో అనంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కల్తీదందాను రూపుమాపడమే లక్ష్యంగా విజిలెన్స్ , ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఓ బేకరీలో నకిలీ చెర్రీఫ్రూట్స్‌ను తయారు చేస్తున్న విధానం బయటపడింది. మరోచోట శనగపిండిని కల్తీచేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. శనగపిండిలో బఠాణీల పిండిని కలుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతపురానికే అధికారులు పరిమితం కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ దాడులు ముమ్మరం చేశారు. కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీరాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

06:49 - August 12, 2017

హైదరాబాద్ : పేరుకు పెద్ద కాలేజీలు. కానీ అన్నీ అక్రమాలే.. అందుకే రాష్ట్రంలో పేరు మోసిన ఈ రెండు కాలేజీలపైన ఇంటర్ బోర్డు కొరడా ఝుళిపించారు. రెండు కోట్లకు పైగా జరిమానా విధించారు. ఫైన్‌ చెల్లించేంత వరకు గుర్తింపు ప్రక్రియ నిర్వహించకూడదన్న ఇంటర్ బోర్డు ఆంక్షతో దెబ్బకి దిగొచ్చాయి.. పేరు కార్పొరేట్‌ కాలేజీలైనా సౌకర్యాలు శూన్యం. కాలేజీల నిర్వహణపై సరైన పత్రాలు అందజేయకపోవడంతో ఇంటర్‌ బోర్డు నిఘాతో చైతన్య, నారాయణ విద్యా సంస్థలు చతికిలపడ్డాయి. ఇంటర్‌ బోర్డు దెబ్బకు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు దిగొచ్చాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న జరిమానాను నయా పైసాతో సహా చెల్లించాలంటూ ఇచ్చిన నోటీసుతో బకాయిల మొత్తం చెల్లించేశాయి.

ప్రవేశాల నుంచి కాలేజీల నిర్వహణ వరకు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలవి అన్నీ అక్రమాలే. నిబంధలనకు విరుద్ధంగా తరగతి గదుల్లో విద్యార్థులను బందిలదొడ్డిలో పశువుల మాదిరిగా బందిస్తున్నారు. సౌకర్యాలు శూన్యం. ఫీజులు జాస్తి. ప్రమాణాలకు అనుగుణంగాలేని ప్రయోగశాలలు, పరికరాలు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లోని ఈ దుస్థితిని పరిశీలించిన ఇంటర్‌ బోర్డు నిఘా విభాగం అధికారులు దఫదఫాలుగా విధించిన జరిమాన 2.17 కోట్లకు చేరింది. ఈ మొత్తంలో శ్రీచైతన్య వాటా 1.55 కోట్లు. నారాయణ విద్యాసంస్థల వాటా 62 లక్షల రూపాయలు.

చాలా కాలంగా ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో గుర్తింపు రద్దు చేస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలతో ఈ రెండు విద్యాసంస్థలు దిగొచ్చి ఫైన్‌ చెల్లించివేశాయి. ఫైన్‌ ఎగేసేందుకు ఈ రెండు విద్యాసంస్థలు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ వీరి ఎత్తులకు ప్రభుత్వం పైఎత్తులు వేసింది. ఆగడాగలకు చెక్‌ పెట్టింది. మరోవైపు ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు గుర్తింపు ప్రక్రియ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అయితే 200 కాలేజీలు సరైన పత్రాలు సమర్పించకపోవడంతో వీటికి గుర్తింపు ఇచ్చే అవకాశం లేదని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నారు. దీంతో ఈ కాలేజీల్లో చదువుతున్న సుమారు 60 వేల మంది ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్‌ పరీక్షల్లో దిల్‌సుఖ్‌నగర్‌లోని వాసవి జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. గుర్తింపు లేకపోవడంతో హాల్‌ టికెట్ల జారీని ఇంటర్‌ బోర్డు నిలిపివేయడంతో విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మరి ఈ రెండు వందల కాలేజీలకు గుర్తింపు ఇచ్చే విషయంలో ఇంటర్‌ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుదన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు మాత్రం పరిశీలిస్తామంటున్నారు. గుర్తింపు లేని కాలేజీల భవితవ్యం ఎలావుంటన్న విషయంపై వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

06:43 - August 12, 2017

హైదరాబాద్ : ఆర్టీసీకి అసలే అప్పుల కుప్పలు. ఆపై నష్టాల తిప్పలు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఆర్టీసీ పై జీఎస్టీ పిడుగులు. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్సీఈకి పన్నుల భారం తడిసిమోపెడవుతోంది. ఆర్టీసీకి జీఎస్టీ ప్రభావంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి రథ చక్రం.. ఆర్టీసి ప్రభుత్వ విధానాలతో కుదేలేవుతోంది. సంస్థను పటిష్టం చేయాల్సిన సర్కారు... ప్రైవేటు మాదిరిగానే ఆర్టీసీపై పన్నుల భారం మోపుతోంది. దీంతో సంస్థ సంక్షోభంలో చిక్కుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టీ ఆర్టీసికి శాపంగా పరిమణించింది. కోటి మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడంలేదు. ఆదాయ వ్యయాలకు మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ ఆర్టీసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చి నలభై రోజులు గడిచినప్పటికీ ఆర్టీసిపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై యాజమాన్యానికి స్పష్టత లేకపోయినా... ప్రజా రవాణ వ్యవస్థ విస్తరణకు జీఎస్‌టీ అవరోధంగా పరిమించే అవకాశం లేకపోతేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ వినియోగించే డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై అభ్యంతం వ్యక్తమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీజిల్‌పై అమ్మకం పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్‌పై 24.5 శాతం అమ్మకం పన్ను విధిస్తున్నారు. డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని పది వేలకు పైగా బస్సులు కలిగిన ఆర్టీసి కొత్త బస్ బాడీలు తయారు చేసేందుకు విడిభాగాలు, టైర్లు, ట్యూబ్‌లను పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిపై 18 నుండి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఇంతకు ముందు అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే, జీఎస్‌టీ చాలా ఎక్కువ. బస్ బాడీ తయారీకి వ్యాట్‌ ఐదు శాతం ఉంటే, జీఎస్టీలో ఇది 28 శాతానికి చేరింది. ఇది సంస్థకు భారమే.

జీఎస్టీ చట్ట నిబంధనల్లో 10 అంతకంటే ఎక్కువ సీట్లు సామర్థ్యం కలిగిన వాహనాలకు 15 శాతం సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి 28 శాతం కలిపితే మొత్తం 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సంస్థకు అదనపు భారమే. కొత్తగా కొనుగోలు చేయనున్న 1350 కొత్త బస్సుల కూడా జీఎస్‌టీ ప్రభావం పడుతుంది. మొత్తం మీదీ జీఎస్‌టీ ఆర్టీసీకి భారంగానే పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 

06:39 - August 12, 2017

విజయవాడ : ఏపీలో పొలిటికల్‌వార్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. సోషల్‌మీడియా వేదికగా అధికార, విపక్ష పార్టీలు హీట్‌ పెంచుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. వరుసగా పోస్టింగ్‌లతో అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజర్‌ ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగా నడుస్తున్న సోషల్‌ మీడియా వార్‌ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా టెక్నాలజీలో తనకంటే ఘనులు లేరని చెప్పుకునే చంద్రబాబునే ఉక్కిరిబిక్కిరి చేసేలెవల్లో వైసీపీ అభిమానులు పోస్టింగులు పెడుతున్నారు. ప్రశాంత్ కిషోర్‌ వ్యూహంలో భాగంగా సోషల్‌ మీడియాలో వార్‌ మొదలు పెట్టినట్టు సమాచరం. దీనికోసం స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహంలో భాగంగానే వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారినట్టు తెలుస్తోంది. టెక్నాలజీలో ముందుండే చంద్రబాబును అదే టెక్నాలజీతో దెబ్బకొట్టాలన్న ప్లాన్‌ ను వైసీపీ చక్కగా అమలు చేస్తోంది.

జగన్ యాక్టివ్..
మరోవైపు జగన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్లతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాస్తవానికి జగన్‌ 2009నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా మారినా.. సోషల్‌ మీడియాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇదంతా ప్రశాంతకిషోర్‌ వ్యూహంలతో భాగంగానే జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

వేల సంఖ్యలో ఖాతాలు..
వైసీపీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ప్లాన్‌లో భాగంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో ఖాతాలు ఓపెన్‌ చేశారు. అయితే ఆ అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతోనే ఉండటంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ టీం మెంబర్లే ఇలా వైసీపీ కార్యకర్తల్లా పోస్టింగులు పెడుతున్నారని టీడీపీ అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌ ఇవే పేర్లతో సోషల్‌మీడియాలో కామెంట్లుపెడుతూ తాము వ్యూహకర్తులుగా ఉన్న పార్టీలకు సహకరించినట్టు తెలుస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నడుస్తున్న వైసీపీ పొలిటికల్‌ ప్రచారం అంతా బూటకమని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. దీని వెనుక ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ ఉందంటున్నారు. టీడీపీని, చంద్రబాబును టార్గెట్‌ చేస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్లన్నీ నార్త్ ఇండియా పేర్లతో ఉండటమే దీనికి రుజువు అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మాటల యుద్ధం రాజకీయ వేడిని పీక్‌స్టేజ్‌కి తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఈ టెక్నికల్‌ వార్‌ ఏపీ పొలిటిక్స్‌ను ఎటు తీసుకెళతాయో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

06:36 - August 12, 2017

తూర్పుగోదావరి : కాకినాడలో కార్పొరేషన్‌ ఎన్నికల వేడి రాజుకుంది. 48 డివిజన్లకు.. 493 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని డివిజన్లలో వైసీపీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక అధికార టీడీపీ, బీజేపీ మధ్య సీట్లసర్థుబాటు కుదరక కోల్డ్‌వార్‌ నడుస్తోంది. దీంతో కాకినాడ కార్పొరేషన్‌ ఎవరి హస్తగతం అవుతుందన్న ఆసక్తి నెలకొంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కార్పొరేషన్‌ ఎన్నికల కాక మొదలైంది. ఏడేళ్ల తర్వాత నగర పాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 29న పోలింగ్‌ జరుగనుంది. కాకినాడ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా... 48 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్‌పై జెండా ఎగరవేసేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ వ్యూహరచనలో మునిగిపోయాయి. 10వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం అధికారులు స్ర్రూటినీ చేశారు. దీంతో మొత్తం బరిలో 493మంది అభ్యర్థులు నిలిచారు.

మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కిరాకపోవడంతో పలుచోట్ల ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీట్ల సర్ధుబాటును కొలిక్కి తీసుకొచ్చేందుకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్‌, మంత్రులు యనమల, చినరాజప్ప రంగంలోకి దిగారు. ఇక బీజేపీ తరపున మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌ రాజు కాకినాడలో మకాం వేశారు. ఇరుపార్టీల నేతలు రెండుసార్లు సమావేశమై సీట్ల సర్ధుబాటుపై చర్చించారు. మొత్తానికి బీజేపీకి 9సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. మరోవైపు ఒక్కో డివిజన్‌లో మూడు నుంచి 5మంది టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో వారిని నేతలు బుజ్జగిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం తనకే బీఫామ్‌ ఇవ్వాలని లేకపోతే రెబల్‌గా పోటీకి దిగుతామని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వారికి సర్దిచెప్పడం నేతలకు సవాల్‌గా మారింది.

ఇక ప్రతిపక్ష పార్టీ వైసీపీలోనూ సీట్లపోరు నడుస్తోంది. పార్టీ మొత్తం మూడు వర్గాలుగా విడిపోయింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కాకినాడ కో-ఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ తమ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు కన్నబాబు కూడా తన వర్గం నేతలతో పోటాపోటీగా నామినేషన్లు వేయించారు. వీరందరినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి జగన్‌ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. గెలిచే అభ్యర్థులను బరిలో నిలిపి... మిగతా వారిని పోటీనుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలను బుజ్జగిస్తూ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకునేలా ఒప్పిస్తున్నారు.

మొత్తానికి కాకినాడ కార్పొరేషన్‌పై జెండా ఎగురవేయాలని ఇటు టీడీపీ, అటు వైసీపీ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరి కాకినాడ ప్రజలు ఏ తీర్పు నివ్వనున్నారో మరికొద్ది రోజుల్లో తేలనుంది.

06:33 - August 12, 2017

హైదరాబాద్ : ఉద్యమంలో కలిసి పనిచేసిన రెండు సంఘాల మధ్య వార్ మొదలైంది. తెలంగాణ కోసం అందర్నీ ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించిన టీజేఏసీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధానికి దిగుతోంది. కోదండరాం చేస్తున్న అమరుల స్ఫూర్తి యాత్రను నిజామాబాద్ లో గులాబీ నేతలు అడ్డుకోవడంపై టీజాక్ మండిపడుతోంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుందని విమర్శలు ఎదుర్కొన్న.....టీజాక్ ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం వరకు ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆచి తూచి స్పందించిన జాక్....ఆ తర్వాత రూటు మార్చుకుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుబడుతూ వచ్చింది. టీజేఏపీ చైర్మన్‌ కోదండరాం... గులాబీ బాస్ కెసిఆర్ కు మధ్య రోజురోజుకు అంతరం పెరుగుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో టీజేఏసీ నేతలు ముఖ్యమంత్రిపై నేరుగా ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. అధికార పార్టీ నేతలు కూడా కోదండరాం... కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శిస్తూ రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీజాక్ చైర్మన్ కోదండరాం గులాబీ పార్టీ కీలక నేతల నియోజకవర్గాలనే టార్గెట్ గా చేసుకున్నారు. అమరుల స్ఫూర్తి యాత్రలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీకి ఎన్నికైన సిద్దిపేట, ముఖ్యమంత్రి తనయుడు, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోకవర్గాల్లో కోదండరాం యాత్ర పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో మొదలైన యాత్రకు పోలీసులు బ్రేకులు వేయడంతో పాటు గులాబీ దళాలను నుంచి ప్రతిఘటన ఎదురైంది. టీజాక్ ఏర్పాటు చేసుకున్న టెంట్లు పీకేయడం టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల పనేనని ఆరోపిస్తన్నారు. ప్రభుత్వం పోలీసులతో తమను అడ్డుకునే ప్రయత్నం చేసినా తాము యాత్రలను మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పోలీసుల ఓవర్ యాక్షన్ తో అవస్థలు పడుతున్న అధికార పార్టీ టీజాక్ యాత్రను కూడా అడ్డుకోవడం చర్చనీయంశంగా మారుతోంది.

06:27 - August 12, 2017

కర్నూలు : నంద్యాల ఉప ఎన్నిక వేడీ రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్షనేత జగన్‌... ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోరును రక్తికట్టిస్తున్నారు. అధికారపార్టీ సైతం తామేమీ తీసిపోమన్నట్టుగా మాటల దాడిని పెంచింది. దీంతో నంద్యాల ఉప ఎన్నిక పాలిటిక్స్ రసవత్తరంలో పడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుముందు ఏం జరుగుతుందోనని, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.

అధికారపార్టీ, చంద్రబాబుపై మాటల దాడి పెంచారు. వైసీపీ అభ్యర్థికి గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు టార్గెట్‌గా వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదంటూ అధికారపార్టీ తీరును ఎండగడుతున్నారు. అదే సందర్భంలో చంద్రబాబుపై ఒకింత ఘాటు విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదన్న జగన్‌... చంద్రబాబుకు ఉరిశిక్ష విధించినా తప్పులేదంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉప ఎన్నిక పోరు మరింతగా రక్తికట్టింది.

చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ కూడా కౌంటర్‌ ఇస్తోంది. టీడీపీ నేతలు అదేస్థాయిలో జగన్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలకు నంద్యాల ఎన్నికల్లో గెలుపు ముఖ్యకావడంతో పార్టీ నేతలంతా అక్కడే మకాం వేశారు. దాదాపు 8 మంత్రులు, మరికొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీడీపీ రంగంలోకి దింపింది. ప్రతిపక్ష వైసీపీ కూడా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను నంద్యాలలో మోహరించింది. సామాజిక వర్గాల వారీగా ఇరుపార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేపనిలో పడ్డాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇరుపార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రతి ఇంటిని టచ్‌ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ తమకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం తమవారి గెలుపుకోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇవి ఎక్కడికి దారితీస్తాయోనని నంద్యాల ప్రజల్లో టెన్షన్‌ మొదలైంది.

వికటించిన సైలేరియా మాత్రలు..

సిద్ధిపేట : కొమరవెల్లి (మం) మర్రి ముచ్యాలలో సైలేరియా మాత్రలు వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని మాతాశిశు కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 

ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు..

సిద్ధిపేట : హుస్నాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. కులం పేరిట దూషిస్తున్నారంటూ 8వ విద్యార్థి తండ్రి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

అర్బన్ అడ్మిన్ ఏఎస్పీ బదిలీ..

గుంటూరు : అర్బన్ అడ్మిన్ ఏఎస్పీ సాయికృష్ణ బదిలీ అయ్యారు. కృష్ణా జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా సాయికృష్ణను నియమించారు. గుంటూరు అడ్మిన్ ఏఎస్పీగా వైటీ నాయుడును నియమించారు. 

అలిపిరి వద్ద మరో పిస్తోల్..

చిత్తూరు : తిరుపతి వద్ద టిటిడి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ భక్తుడి నుండి డమ్మీ పిస్తోల్, ప్లాస్టిక్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. రక్షణ కోసం తీసుకొచ్చానంటూ భక్తుడు పేర్కొన్నట్లు సమాచారం. 

Don't Miss