Activities calendar

13 August 2017

22:18 - August 13, 2017

ఏఐసీసీ కార్యదర్శి ముధుయాష్కీతో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ చెప్పినవన్నీ ఉట్టిమాటలే అని అన్నారు. బీజేపీ, టీసర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మోడీ మన్ కీ చెబుతాడు కానీ..ప్రజల మనసు వినే టైమ్ లేదన్నారు. ఆయన ఎప్పుడూ ఫ్లైట్ మూడ్ లో ఉంటాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్.. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

22:06 - August 13, 2017
22:01 - August 13, 2017

ఢిల్లీ : శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన వైట్‌వాష్‌ దిశగా సాగిపోతోంది. శ్రీలంకను పసికూనను చేసి ఆటాడుకుంటోంది.  థర్డ్‌ టెస్ట్‌లో రెండో రోజు ఆతిథ్య జట్టుపై  టీమ్‌ ఇండియా పూర్తి ఆధిపత్యం సాధించింది. బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్యా శతకంతో  చెలరేగగా..భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బౌలింగ్‌లో కుల్‌దీప్‌, షమి, అశ్విన్‌ చెలరేగడంతో లంకేయులు నిలబడలేకపోయారు. బ్యాట్స్‌మెన్స్‌ వరుసగా పెవిలియన్‌ చేరారు. దీంతో శ్రీలంక 38 ఓవర్లలో 135 రన్స్‌ చేసి కుప్పకూలి ఫాలోఆన్‌ గండంలో పడింది.  టీమిండియాకు 352 పరుగుల ఆధిక్యం లభించింది. ఫాలోఆన్‌ ఆడుతున్న లంక ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 19 పరుగులతో నిలిచింది. 

21:58 - August 13, 2017

ఢిల్లీ : శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమ్‌ ఇండియా శ్రీలంకతో తలపడనుంది.  అయితే  యువరాజ్‌ సింగ్‌కు జట్టులో స్థానం లభించలేదు. వన్డే, టీ20 సిరీస్‌లో యువీకి చోటు లభించలేదు.   ఇక అశ్విన్‌ , జడేజాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.  మనీష్‌ పాండే మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈనెల 20 నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. 

21:56 - August 13, 2017

శ్రీనగర్ : జమ్ము, కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భద్రతా దళాలపై కాల్పులుకు తెగబడ్డారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. వీరిని కుల్గామ్‌కు చెందిన ఉమర్‌ మజీద్‌ మీర్‌, మల్దురా వాసి ఇర్ఫాన్‌ షేక్‌, సోపియాన్‌కు చెందిన ఆదిల్‌ మాలిక్‌గా గుర్తించారు. సోపియాన్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు ఇళయరాజా, గొవాయ్‌ సుమేధ్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. బందిపొరా జిల్లాలోని జైనాపొరలో  జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

21:24 - August 13, 2017
21:21 - August 13, 2017

కర్నూలు : జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ పీఎస్‌లో హల్‌చల్‌ చేశాడు. పీకల దాకా మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. పత్తికొండలోని సవారం కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఆస్పరి పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోన్నారు. కొన్నాళ్లుగా ఆయన స్థానిక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మహిళలు శ్రీనివాసరావుపై పత్తికొండ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు హాజరైన శ్రీనివాసరావు.. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఎస్సై, ఇతర పీఎస్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. 

 

21:15 - August 13, 2017

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురంలో భూ నిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపించారు. పరిహారం కోసం గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తున్న చంద్రమోహన్ అనే నిర్వాసితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేస్తునట్లు జడ్జికి చంద్రమోహన్ ఫిర్యాదు చేశాడు. పోలీసుల తీరుపై గోదావరిఖని మున్సిఫ్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

21:10 - August 13, 2017

బిగ్ బాస్ షో పై కత్తి మహేష్ తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన బిగ్ బాస్ షో గురించి మాట్లాడారు. షో.. రియాల్టీగానే ఉందన్నారు. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ 12 మంది క్యారెక్టర్ల గురించి మాట్లాడారు. బిగ్ బాస్ పై బుక్ రాస్తానని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:56 - August 13, 2017
20:54 - August 13, 2017

'అధునిక సమాజంలో అంబేద్కరిజం' అనే అంశంపై మాస్టర్ కీ సంస్థ ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు అసక్తిరమైన విషయాలు తెలిపారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లకు టీమిండియా ఎంపిక

హైదరాబాద్ : శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ లకు టీమిండియా ఎంపిక అయింది. 15 మంది సభ్యులతో టీమిండియా ఎంపిక చేశారు. అశ్విన్, జడేజాలకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చాహెల్ కు చోటు దక్కింది. యవరాజ్ కు చోటు దక్కలేదు. 

 

20:26 - August 13, 2017
20:23 - August 13, 2017
20:13 - August 13, 2017
20:10 - August 13, 2017

అనంతపురం : వైఎస్‌ జగన్‌పై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుని ఉరి తీయాలని జగన్‌ అనడం ఫ్యాక్షనిజానికి నిదర్శనమని.. తీరు మార్చకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఘాటుగా విమర్శించారు. అలాగే నంద్యాలలో టీడీపీనే గెలుస్తుందని పల్లె రాఘునాథ్‌ జోష్యం చెప్పారు. 

 

20:07 - August 13, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఖండించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు తొమ్మిది పేజీల లేఖ రాశారు. పోలవరం అడ్డుకుంటున్నట్లు నిరూపిస్తే రాజ్యసభ పదవిని వదులుకోవడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగతానంటూ సవాల్ విసిరారు. తనపై ప్రత్యేక కమిటీ వేసినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. లేని పక్షంలో తనపై వచ్చిన వార్తలను తప్పుడు ఆరోపణలుగా ఒప్పుకోవాలని కోరారు. 

 

20:05 - August 13, 2017

కర్నూలు : నంద్యాలలో కులాల ఆత్మీయ సభల పేరుతో టీడీపీ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారని వైసీపీ ఆరోపించింది. కులాల పేరుతో చంద్రబాబు ఏర్పాటు చేసిన కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లతో ఆయా కులాలకు ఒరిగిందేమీలేదని వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. కాపు కార్పొరేషన్‌ ఎంతమందికి రుణాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 
 

19:52 - August 13, 2017

నల్లొండ : జిల్లాలో జయ జానకి నాయక చిత్ర సభ్యులు సందడి చేశారు. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బెల్లంకొండ శ్రీను నగరంలోని నటరాజ సినిమా థియేటర్‌ పునఃప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. అనంతరం స్థానిక అభిమానులతో కలిసి జయ జానకి నాయక చిత్రాన్ని వీక్షించారు.

 

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ : షోపియాన్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మృతి చెందిన ఉగ్రవాదుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ ఐటో ఉన్నాడు.

 

 

19:44 - August 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం టీమాస్‌ ఫోరం పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  అన్ని సామాజిక తరగతులు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఒకరో ఇద్దరు అభివృద్ధి అయినంత మాత్రాన యావత్‌ తెలంగాణ అభివృద్ధి అయినట్టు కాదన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా గార్డెన్స్‌లో టీమార్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న తమ్మినేని.... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. గోరక్షణ దళాల పేరుతో దాడులు జరుగుతోంటే మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావుతోపాటు పలువురు సామాజిక, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

 

19:40 - August 13, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుపై పోలీసులు ఎంత హడావిడి చేశారో అంత త్వరగా నీరుగార్చారని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని మడ్‌ఫోర్డ్‌ మైదానంలో ఎన్‌ఎస్‌యుఐ అధ్వర్యంలో హైదరాబాద్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభం చేశారు. డ్రగ్స్‌ కేసులో పెద్ద తలకాయల హస్తాలున్నాయని దానం అనుమానం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ కేసులో అసలు మూలాలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. 

 

19:37 - August 13, 2017

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ సైనికుని భూమిని కొందరు కబ్జాకోరులు ఆక్రమించారు. సంతోష్‌నగర్‌ కాలనీలో గల సర్వే నంబర్ 423, 424 లో ఉన్న భూమిని స్థానిక రాజకీయ నేతలు కబ్జా చేశారని మాజీ సైనికుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రోడ్డుపై పడ్డ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

 

19:34 - August 13, 2017

హైదరాబద్ : ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే... భక్షకులుగా మారుతున్నారు. అధికారం ఉందికదా అని చెలరేగిపోతున్నారు. ఓ భూ వ్యవహారంలో తలదూర్చిన నలుగురు పోలీసులు అధికారులపై కేసు నమోదయ్యింది. సైబరాబాద్‌ అదనపు డీసీపీ పులిందర్‌, రాయదుర్గం సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీ నారాయణపై కేసులు నమోదు చేశారు. గతంలో మాదాపూర్‌ పరిధిలో రెండు ఎకరాల స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ పులిందర్‌ కూతురు లీజ్‌ తీసుకున్నారు. అయితే ఇప్పుడు దాని లీజ్‌ ముగిసింది. ఈ భూమిని భూ యజమాకి ఇవ్వకుండా ఆ స్థలం తమదేనని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని బాధితులతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. దీంతో బాధితులు సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సందీప్‌ శాండిల్య... నలుగురిపైనా కేసు నమోదు చేయాలని మాదాపూర్‌ ఏసీపీని ఆదేశించారు. దీంతో నలుగురిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

 

19:28 - August 13, 2017

లక్నో : ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లోని చిన్నారుల మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని... నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి చిన్నారుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.  బీఆర్‌డీ ఆసుపత్రిని కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి  ఆయన సందర్శించారు. ఆక్సీజన్‌ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఆరా తీశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను , అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇవాళ కూడా మరో చిన్నారి ప్రాణవాయువు అందక చనిపోయింది.  సీఎం యోగి సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో దాదాపు 70మందికి పైగా చిన్నారులు ఆక్సీజన్‌ అందక మృతిచెందిన ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈఘటన జరుగడానికి రెండు రోజుల ముందే సీఎం ఇదే ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాణవాయువు సిలిండర్లు సరఫరా చేసే గుత్తేదారు సంస్థకు బీఆర్‌డీ ఆసుపత్రి బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలిపివేశారు. దీంతో 70మంది అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యోగి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో విచారణకు ఆదేశించారు.  మరోవైపు ఈ ఘటనపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

 

19:24 - August 13, 2017

హైదరాబాద్ : పట్టణాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.   తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ప్రజల వలసలు పెరిగాయన్నారు. పెరుగున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  సీపీఎం ఆధ్వర్యంలో  పట్టణాల్లో సమస్యలపై  జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

 

19:22 - August 13, 2017

 హైదరాబాద్ : టీడీపీకి  ధైర్యం ఉంటే నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు మూడేళ్ల పాలనకు రెఫరెండంగా పరిగణించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాలకు ఇన్ని వరాలు ప్రకటించేవారా ? అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పశ్నించారు. నంద్యాలకు వేల కోట్ల రూపాయల వరాలు ప్రకటించారని.. ఉప ఎన్నిక లేకపోతే ఇన్ని వరాలు ప్రకటించే వారా ? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంకు ఎందుకు వరాలు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఇతర ఎమ్మెల్యేలు ఏం తప్పుచేశారని వరాలు ఇవ్వలేదని నిలదీశారు. 

 

నలుగురు పోలీసులపై కేసు నమోదు

హైదరాబాద్‌ : నరగంలో నలుగురు పోలీసు అధికారులపై రాయదుర్గం పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. రాయదుర్గం సీఐ దుర్గాప్రసాద్‌, సైబరాబాద్‌ అదనపు డీసీపీ పులిందర్‌, ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణపై కేసులు నమోదు అయ్యాయి. 

19:15 - August 13, 2017

హైదరాబాద్‌ : నరగంలో నలుగురు పోలీసు అధికారులపై రాయదుర్గం పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. రాయదుర్గం సీఐ దుర్గాప్రసాద్‌, సైబరాబాద్‌ అదనపు డీసీపీ పులిందర్‌, ఎస్సై రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణపై కేసులు నమోదు అయ్యాయి. కొందరి నుంచి అదనపు డీసీపీ పులిందర్‌ కూతురు రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. గడువు పూర్తయినా భూమి తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పలుమార్లు ఇవ్వాలని కోరారు. దీంతో పులిందర్‌ ఆదేశాలతో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 

 

19:11 - August 13, 2017

ప్రకాశం : జిల్లాలోని కందుకూరు సాయి నగర్‌లో కాపురానికి తీసుకుపోవడం లేదని భర్త ఇంటి ముందు బైటాయించింది భార్య మౌనిక. మౌనికకు ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన పూనాటి బ్రహ్మయ్య కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే భార్యభర్తల మధ్య వివాదాలు రావడంతో మౌనికను తన ఇంటికి పంపించేశాడు. ఆనాటి నుండి భర్త తనను వేధిస్తున్నాడని, విడాకుల నోటీసులు పంపించారని మౌనిక తెలిపింది. కందుకూరులో తమ బంధువుల ఇంట్లో ఉన్న తనను ప్రవీణ్‌ తరచూ వేధిండేవాడని, ఆవిషయమై అడగడానికి ప్రవీణ్‌ ఇంటికి వెళ్తే, కొందరు వ్యక్తులతో కొట్టించి, బయటకు గెంటేశారని మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది.

 

19:08 - August 13, 2017

తూర్పు గోదావరి : మరోసారి రెడ్‌ మీ నోట్‌4 మొబైల్‌ లో మంటలు చెలరేగాయి. నెల క్రితం ఓ వ్యక్తి రిపేరింగ్‌ చేసే సమయంలో మంటలు వచ్చిన ఘటన మరవకముందే.. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. రావులపాలెంకి చెందిన సూర్యకిరణ్‌ అనే యువకుడు 20 రోజుల క్రితం మొబైల్‌ ఖరీదు చేశాడు. బైక్‌ పై వెళ్తుండగా అకస్మాత్తుగా జేబులో ఉన్న మొబైల్‌లో మంటలు చెలరేగాయి. జేబులో నుండి మొబైల్‌ తీసేంతలో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. ఘటనపై బాధితుడు న్యాయపోరాటానికి కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

 

భూ నిర్వాసితులపై పోలీసులు దాష్టీకం

పెద్దపల్లి : మంథని మండలం సిరిపురంలో భూ నిర్వాసితులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. పరిహారం కోసం గ్రామస్తులతో కలిసి నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. చంద్రమోహన్ అనే నిర్వాసితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 

 

19:00 - August 13, 2017

గుంటూరు : మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఏపీ డిజిపి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. ఈనెల 16న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. 10 నెలల వ్యవధిలోనే డీజీపి కార్యాలయాన్ని నిర్మించినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. పోలీస్ శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకు రావడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నామని సాంబశివరావు తెలిపారు. ముద్రగడ తన పాదయాత్రలో ఎలాంటి హింస, విధ్వంసం జరగదని హామీ ఇస్తే పాదయాత్రకు అనుమతి ఇస్తామని చెప్పారు. 

 

18:45 - August 13, 2017

అనంతపురం : వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఏపీ ఐద్వా కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా బార్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను రద్దు చేయాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఛలో వెలగపూడి కార్యక్రమాన్ని చేపడతామని రమాదేవి హెచ్చరించారు.

 

18:41 - August 13, 2017

కర్నూలు : మూడున్నరేళ్ల నుంచి ఏపీని చంద్రబాబు దోచుకున్నారని... వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. మంచి చేసే ఆలోచన చంద్రబాబుకు లేదని ఫైర్ అయ్యారు. ఉప ఎన్నికలో వైసీపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.. నంద్యాలలో రోడ్‌ షో నిర్వహిస్తున్న జగన్‌... జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. 

 

18:39 - August 13, 2017

రంగారెడ్డి : మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి కూతురు వివాహం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కెఎల్ సీసీ కన్వెన్షన్‌లో జరిగింది. వివాహానికి ఎపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

18:27 - August 13, 2017

కర్నూలు : నంద్యాలలో అభ్యర్థుల హోరాహోరీ ప్రచారంతో గెలుపెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. సార్వ్రతిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌ పోరు ఉత్కంఠ రేపుతోంది.. రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటర్లు ఎక్కువ పట్టం కట్టారు?.. అసలు నియోజకవర్గం చరిత్ర ఏంటి... 10 టీవీ గ్రౌండ్‌ రిపోర్ట్...
ఏపీలో రాజకీయ వేడి 
విమర్శలు... ప్రతి విమర్శలు... సవాళ్లు... ప్రతిసవాళ్లు... హామీలు.... ప్రకటనలతో సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లకు ముందే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని.... అటు టీడీపీ, ఇటు వైసీపీ పట్టుదలగా ఉన్నాయి.. ఇంతటి హీట్‌ రాజేస్తున్న నంద్యాల నియోజకవర్గం చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు కనిపిస్తాయి.. 
విభిన్న జాతుల ప్రజలు నివాసం
నంద్యాల పట్టణంలోని 42 వార్డులు, 20 రూరల్ గ్రామాలు, గోస్పాడు మండలంలోని 21 గ్రామాలతోకలిసి ఈ నియోజకవర్గం ఏర్పడింది.. ఈ సిటీ దశాబ్దాల కాలం నుంచి వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతోంది. పాడిపంటలకు పుట్టినిల్లయిన ఈ నియోజకవర్గంలో వివిధ రకాల సంస్కృతులు, సాంప్రదాయలు, విభిన్న జాతుల ప్రజలు నివసిస్తున్నారు.. చుట్టూ ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నా ఆ ప్రభావం నంద్యాలపై పెద్దగా ప్రభావం లేదు... వేగంగా అభివృద్ధిచెందుతున్న నంద్యాల కర్నూలు నగరానికి గట్టి పోటీ ఇస్తోంది..
నంద్యాల నియోజకవర్గం 1952లో ఏర్పాటు
ఇక రాజకీయంగా నంద్యాల పాలిటిక్స్ విభిన్నంగా ఉంటాయి.. నంద్యాల నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు నిర్వహించారు...1952లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి ఎం. సుబ్బారెడ్డి మొదటి ఎమ్మెల్యేగా నిలిచారు.. 1955లోకూడా ఇండిపెండెంట్ అభ్యర్థి జి. రామిరెడ్డి శాసనసభ్యుడు అయ్యారు... 1959లో ఉపఎన్నిక జరగగా... కాంగ్రెస్ అభ్యర్థి జివి. రెడ్డి గెలిచారు... 
1962లో స్వతంత్ర అభ్యర్థి ఎమ్.సుబ్బారెడ్డి విజయం
ఆతర్వాత 1962లో జనరల్ ఎలక్షన్స్ నిర్వహించగా... స్వతంత్ర అభ్యర్థి ఎమ్. సుబ్బారెడ్డి విజయకేతనం ఎగురవేశారు... 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ బి. సబి సాహెబ్ గెలవడంతో ఈ స్థానం కాంగ్రెస్ వశమైంది... 1972, 1978 ఎన్నికల్లో జనతా అభ్యర్థి బొజ్జా వెంకటరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. 1983లో తొలిసారి
టిడిపి అభ్యర్థి సంజీవరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు... 1985లోమాత్రం మైనారిటీ నేత ఎన్. ఎమ్. డి ఫరూక్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.. 1989లో కాంగ్రెస్ ఐనుంచి రామనాథ రెడ్డి ఫరూక్‌పై గెలిచారు. ఇక 1994లో మహ్మద్‌ ఫరూక్‌.... 1999లో ఎన్‌ ఎం డి ఫరూక్‌ విజయం సాధించారు.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే పీఠాన్ని కైవసం చేసుకున్నారు... 2014 జనరల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. భూమా అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది..  
పోటీపడుతున్న 15మంది అభ్యర్థులు
ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికకు 15మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.... ప్రధాన పోటీమాత్రం టిడిపి, వైసీపి మధ్యే ఎక్కువగా ఉంది.. అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు అటు కాంగ్రెస్... ఇటు రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అభ్యర్థులు బరిలో వున్నారు... టీడీపీనుంచి భూమా బ్రహ్మానందరెడ్డి... వైసీపీనుంచి శిల్పా మోహన్‌ రెడ్డి పోటీపడుతున్నారు.. 
నంద్యాల పట్టణానికి 118 ఏళ్ల చరిత్ర 
నంద్యాల పట్టణానికి 118 ఏళ్ల చరిత్ర ఉంది. పట్టణం, జనాభా పెరిగినా ఆస్థాయిలో రోడ్ల విస్తరణ చేపట్టలేదు. అధికార పార్టీ నిర్వహించిన సర్వేలో 98 శాతం ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు... గాంధీ చౌక్ నుంచి సాయిబాబా నగర్ సెంటర్ వరకు రెండు ప్యాకేజీలుగా విభజించి 93 కోట్లతో రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు అడ్డంగా ఉన్న కట్టడాలను తొలగించారు. ఈ పనులనే ఓట్లుగా మార్చుకోవడానికి అధికారపక్షం ప్రయత్నిస్తోంది.
రహదారుల విస్తరణ, పక్కా ఇళ్ల నిర్మాణం
నంద్యాలలో గెలుపుకోసం టీడీపీ ముందునుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.. టిడిపి ప్రధాన హామీలైన రహాదారుల విస్తరణ, పక్కా ఇళ్ల నిర్మాణం, తాగునీటిపై చంద్రబాబు ఎక్కువ దృష్టిపెట్టారు.. ఈ పనులకు ఏకంగా 13 వందల కోట్లను కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని పనులూ ప్రారంభించి కోడ్ ప్రభావం లేకుండా చూసుకున్నారు... అధికారపార్టీ ప్రారంభించిన ప్రగతి పనులే ఇప్పుడు ఆ పార్టీ ప్రచారాస్ర్రాలుగా ఉన్నాయి.. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా మంత్రులు అఖిలప్రియ... కాల్వ శ్రీనివాసులు, అది నారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డిప్యూటి సీఎం కె.యి క్రిష్ణమూర్తి ఈ ఎన్నికకు వ్యూహ రచన చేస్తున్నారు.. మంత్రులంతా నంద్యాలలోనే మకాంవేసి ప్రచారం చేస్తున్నారు.. 
జోరుగా అభ్యర్థులు ప్రచారం  
పట్టణ, గ్రామ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.. జగన్‌ రోడ్‌ షోలద్వారా జోరుగా ప్రచారం సాగిస్తున్నారు.. టీడీపీపై ఫైర్‌ అవుతూ అధికార పార్టీని విమర్శలతో ఉతికేస్తున్నారు.. ప్రధానంగా 2014లో టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీలపై దృష్టిపెట్టారు.. 
నియోజకవర్గంలో 2,18,058మంది ఓటర్లు
ఓటర్ల విషయానికివస్తే... అధికారుల లెక్క ప్రకారం నంద్యాల నియోజకవర్గంలో రెండు లక్షల పద్దెనమిదివేల యాభై ఎనిమిదిమంది ఓటర్లు ఉన్నారు. నంద్యాల పట్టణంలో లక్షా 42వేల 200మంది, నంద్యాల రూరల్ గ్రామాల్లో 47 వేల ఏడు, గోస్పాడు మండలంలో 28వేల 844మంది ఓటర్ లిస్టులో ఉన్నారు.. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించడంలో పట్టణ ఓటర్లే కీలకం కానున్నారు.. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా విజయం తమదేనని వైసీపీ అభ్యర్థి ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రధానంగా నాలుగు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లున్నారు.... ముస్లిం మైనారిటీ, కాపు, ఎస్సీ, ఆర్య, వైశ్య ఓట్లు ఎన్నికలో కీలకంగా మారాయి.. ఈ నాలుగు సామాజిక వర్గాల ఓటర్లపైనే అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉంది.. 16వ సారి జరుగుతున్న ఈ ఎన్నికలో ఎవరూ గెలుస్తారో కొద్దిరోజుల్లో తేలిపోనుంది.. 

 

15:37 - August 13, 2017

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదగా డీజీపీ నూతన కార్యాలయం ప్రారంభం కాబోతోంది. దీనిపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:34 - August 13, 2017

సిరిసిల్ల : వేములవాడ మండలం మల్లారంలో కుల బహిష్కరణకు పాల్పడ్డారు. ఎస్సీలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు ఇందిరారెడ్డి అనే మహిళలను కులపెద్దలు బహిష్కరించారు. కులం కట్టుబాట్లను విస్మరిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

సిరిసిల్ల జిల్లాలో కుల బహిష్కరణ

సిరిసిల్ల : వేములవాడ మండలం మల్లారంలో కుల బహిష్కరణకు పాల్పడ్డారు. ఎస్సీలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినందుకు ఇందిరారెడ్డి అనే మహిళలను  కులపెద్దలు బహిష్కరించారు. కులం కట్టుబాట్లను విస్మరిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. 

15:12 - August 13, 2017

తూర్పు గోదావరి : కాకినాడ బీజేపీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సొంత ఆఫీస్ పైనే కార్యకర్తలు దాడి చేశారు. రాళ్లు విసిరి, ఫ్లెక్సీలను చింపేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై బీజేపీ కార్యకర్తలు పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని స్థానాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీ... టీడీపీతో పొత్తు పెట్టుకొని 9 సీట్లకు పోటీ చేస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

'పోలవరం'పై చంద్రబాబుకు కేవీపీ లేఖ

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు కేవీపీ లేఖ రాశారు. పోలవరానికి అడ్డుపతున్నానని చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పోలవరం గురించి మాట్లాడితే చంద్రబాబు ఎదురుదాడి చేయిస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయమని  కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదన్నారు. 

పశువుల వ్యర్థాలతో నూనే తయారీ

వికారాబాద్ : ధారూరు మండలం దోర్నల్ సమీపంలో ఓ ఫ్యాక్టరీ పశువుల వ్యర్థాలతో నూనే తయారీకి పాల్పడ్డారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల దాడుల్లో భారీగా కల్తీ నూనే, ఎముకలతో చేసిన పౌడర్ ను స్వాధీనం చే చేసుకున్నారు.

 

కాకినాడ బీజేపీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తల దాడి

తూర్పు గోదావరి : జిల్లాలోని కాకినాడ బీజీపీ కార్యలయంపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కేవలం 9 స్థానాల్లో పోటీ చేయడం పట్ల ఆగ్రహంతో వారు దాడి చేసినట్టు తెలుస్తోంది.

గోరఖ్ పూర్ సందర్శించిన యూపీ సీఎం

లక్నో : గోరఖ్ పూర్ ఆక్సీజన్ అందక చిన్నారులు మృతి చెందిన బీఆర్ డీ ఆసుపత్రిని యూపీ సీఎం అదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సందర్శించారు.

13:51 - August 13, 2017

విశాఖ : 23 వందల కోట్లతో నిర్మిస్తున్న అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి అనుబంధంగా మల్కన్ గిరి నుంచి బలిమెల, సీలేరు, చింతపల్లి, నర్సిపట్నం, చోడవరం మీదుగా సబ్బవరం వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. అలాగే రాజమండ్రి-పాడేరు-విజయనగరం మీదుగా మరో రహదారిని విస్తరించనున్నారు. మొత్తం 724 కిలోమీటర్ల మేర... 4900 కోట్లతో..ఈ ప్రాజెక్ట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో నర్సీపట్నం... చోడవరం మీదుగా... 284 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే రహదారికి 19 వందల కోట్లు ఖర్చువుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రాజమండ్రి -పాడేరు- విజయనగరం మీదుగా 440 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి 3 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.

నాలుగు భారీ వంతెనలు...
నర్సీపట్నం-తుని మధ్య నాలుగు బైపాస్‌లు, నర్సీపట్నం-సబ్బవరం మధ్య ఏడు బైపాస్‌లు నిర్మించనున్నారు. 55 కిలోమీటర్ల మేర బైపాస్‌లు నిర్మాణం జరగబోతుంది. నాలుగు భారీ వంతెనల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ఇందుకు మొత్తం 660 హెక్టార్ల భూములు అవసరమవుతాయని ప్రభుత్వం లెక్కలు వేసింది. బైపాస్‌ల కోసం 370 హెక్టార్ల భూములు... ఇక సబ్బవరం-నర్సీపట్నం మధ్య 210 హెక్టార్లు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ఎక్కువగా అటవీ భూములే సేకరించాల్సి ఉండడంతో రాష్ట్ర జాతీయ స్థాయిలో శాఖల మధ్య సమన్వయానికి ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి సమీక్ష నిర్వహిస్తున్నారు.

మావోయిస్టుల ప్రాబల్యాన్ని అణచివేసేందుకే
అయితే గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కోసం ఈ రెండు జాతీయ రహదారులను విస్తరిస్తున్నట్టు పాలకులు చెబుతున్నా... మావోయిస్టుల ప్రాబల్యాన్ని అణచివేసే ఉద్దేశంతో... రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.  

13:50 - August 13, 2017

గుంటూరు : ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి నక్కా ఆనంద బాబు సూచించారు. ఈ మేరకు గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో చైల్డ్‌ హెల్త్‌ మిషన్‌ మరియు ఆర్దోపెడిక్‌ ఆధ్వర్యంలో 5కె రన్‌ నిర్వహించారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో హెల్త్‌ కేర్‌పై అవగాహన వచ్చిందన్నారు. పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని నక్కా ఆనంద్‌బాబు అన్నారు.

13:49 - August 13, 2017

సిరిసిల్ల : ఇసుక తరలింపు విషయంలో తెలంగాణలో రెండు నెలలుగా విపక్షాలన్నీ ఏకమై.. నేరెళ్ల పైనే దృష్టి సారించాయి. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూ ప్రతిపక్ష పార్టీలు.. అధికార పార్టీని ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నాయి. దళితులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయం వెలుగు చూసినా అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆధారాలు చూపాలని మంత్రి కెటీఆర్‌ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఈ వివాదం రోజురోజుకీ పెరగుతుండటంతో నష్ట నివారణ చర్యలపై పార్టీ అధినేత దృష్టి సారించారు. ఎస్పీ విశ్వజిత్ ఆదేశాలతోనే పోలీసులు తమను అకారణంగా వేధించారని బాధితులు తమ గోడును అన్ని వేదికలపై వినిపించారు. రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశంపై ఎక్కువగా దృష్టి సారించడంతో గులాబి పార్టీ దిగిరాక తప్పలేదు. ఇప్పటికీ నేరెళ్ల వివాదంలో శాఖా పరమైన విచారణ పేరుతో పోలీసులు నివేదికలు ఇవ్వడంతో ఓ ఎస్‌ఐని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అధికార పార్టీ నేతలు అంతర్గత చర్చలు
అయితే బాధితులు తమ స్వరాన్ని ఇంకా పెంచుతుండటంతో అధికార పార్టీ ఎలా వ్యవహరిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. బాధితుల పక్షాన నిలుస్తోన్న ప్రతిపక్ష పార్టీలపై విరుచుకు పడుతున్నా.. మరోవైపు నేరెళ్ల ఘటన వేడిని తగ్గించేందుకు అధికార పార్టీ నేతలు అంతర్గత చర్చలను మొదలుపెట్టారు. బాధితులకు అండగా నిలుస్తామని గులాబి నేతలు హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రాంతం కావడంతో నేరెళ్ల ఘటనకు మరింత ప్రాధాన్యత పెరిగింది. 

13:45 - August 13, 2017

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎస్‌ఐ ఖలీల్, ట్రైనీ కానిస్టేబుల్ కీర్తి మృతదేహాలకు ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. రాత్రి అప్పా వద్ద జరిగిన ప్రమాదంలో ఎస్‌ఐ ఖలీల్‌ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఖలీల్‌తో పాటు కారులో ఉన్న ఇద్దరు ట్రైనీ లేడీ కానిస్టేబుల్స్ లో ఒకరు చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

13:44 - August 13, 2017
13:43 - August 13, 2017

భారత్ తొలి ఇన్నింగ్స్ 487 అలౌట్

పల్లెకలె : శ్రీలకంతో జరుగుతున్న మూడో టెస్ట్ లో భారత్ 487 పరుగులకు అలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్ ధావన్-119, పాండ్యా-108, రాహుల్-85, కోహ్లీ-42, అశ్విన్-31, కుల్దీప్-26, రహానె-17, సాహా-16, షమీ-8, ఉమేష్-3 పరుగులు చేశారు.

13:18 - August 13, 2017
12:24 - August 13, 2017
12:12 - August 13, 2017
12:10 - August 13, 2017

తూర్పు గోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు బయలుదేరాడు. ఆయనను పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. కాపు నేతలు ఆందోళనకు దిగారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడకు మద్దతుగా బైక్ ర్యాలీగా వస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. అటు చిల్లంగిలో ముద్రగడకు మద్దతుగా రోడ్డుపై కాపు వర్గీయులు వంటావార్పు నిర్వహించారు. మరింత సమాచారం కోసం వీడయో చూడండి.

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

విజయనగరం : జిల్లా భోగాపురం మండలం చాకివలసలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బయటకు వెళ్లిన పైడమ్మ కరెంట్ వైర్ పై కాలేయండంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైడమ్మను వెతుకుతూ మేనల్లుడు కూడా కరెంట్ వైర్ ను తాకడంతో ఆయన మృతి చెందాడు. 

కరెంట్ షాక్ తో ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

విజయనగరం : జిల్లా భోగాపురం మండలం చాకివలసలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బయటకు వెళ్లిన పైడమ్మ కరెంట్ వైర్ పై కాలేయండంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైడమ్మను వెతుకుతూ మేనల్లుడు కూడా కరెంట్ వైర్ ను తాకడంతో ఆయన మృతి చెందాడు. 

విశాఖలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా

విశాఖ : జిల్లాలోని తగరపువలసలో బ్రిడ్జిపై నుంచి గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఫైర్ సిబ్బంది ట్యాంకర్ వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రజలను స్థానిక ప్రజలను అగ్నిమాపక అధికారులు ప్రమాద స్థలం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. బోల్తా పడిన ట్యాంకర్ భారత్ గ్యాస్ కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు.

12:00 - August 13, 2017

ఇండోనేషియా : సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5 తీవ్రత నమోదైంది. బెంగకులు ప్రాంతానికి 73 కిలోమీటర్ల దూరంలో 35కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని కారణంగా సుమత్రా దీవులు, సింగపూర్‌లోనూ అక్కడకక్కడా ప్రకంపనలు వచ్చాయి. ప్రజలందరూ ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం రాలేదు. సునామీ హెచ్చరికలు కూడా జారీచేయలేదని అధికారులు తెలిపారు. 

11:59 - August 13, 2017

ఆర్మూర్ : ఇది నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్‌ గ్రామంలోని దుర్గాబాయి దేశ్‌ముఖ మహిళా శిశు వికాస కేంద్రం. దీన్ని 1988 మార్చిలో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంగణం పనిచేస్తోంది. ఈ మహిళా ప్రాంగణం ఏర్పాటు చేసి దాదాపు 29 సంవత్సరాలైంది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎంతోమంది మహిళలు, యువతులు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 36 రకాల కోర్సులను నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 6,183 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొందారు. వీరిలో 4541 మంది వివిధ రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, తల్లిదండ్రులు లేని అనాథ యువతులకు ఇక్కడ వృత్తివిద్యా కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత వారికి వివిధ కంపెనీల్లో ఇతర సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు. కంప్యూటర్‌ కోర్సులతోపాటు అల్లికలు, కుట్టు శిక్షణ, బ్యూటీషియన్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌, స్టేషనరీ, బుక్‌ బైండింగ్‌లాని ఎన్నో వృత్తివిద్యా కోర్సులు ఇక్కడ నేర్పిస్తున్నారు.

పూర్తిస్థాయిలో కొనసాగని శిక్షణ
ఈ మహిళా శిక్షణ కేంద్రానికి ... రాష్ర్ట మహిళా సహకార అభివృద్ధి సంస్థ, ఎస్సీ, మైనారిటీ, బీసీ కార్పొరేషన్లతోపాటు ఉమెన్స్ వెల్ఫేర్‌, జిల్లా పరిషత్ లు కేటాయించిన నిధులతో ట్రైనింగ్‌ జరుగుతోంది. అయితే సంవత్సరకాలంగా నిధుల కేటాయింపు తగ్గింది. దీంతో మహిళలకు పూర్తిస్థాయిలో శిక్షణ కొనసాగటం లేదు. ఎంతోమంది పేదింటి మహిళల జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న ఈ శిక్షణా కేంద్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ఇక్కడ పనిచేసే సిబ్బంది కోరుతున్నారు. మహిళా ప్రాంగణంలో మొత్తంగా 36 కోర్సులు ఉండగా... ట్రైనింగ్‌ ఇచ్చే వారు మాత్రం 15 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బందిని కూడా పెంచాలని పలువురు కోరుతున్నారు. నిధులు కూడా సక్రమంగా విడుదల చేస్తూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.

11:57 - August 13, 2017

హైదరాబాద్ : గోల్కొండలో ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను.. డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఆక్టోపస్, సీఆర్పీఎఫ్‌ ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో క్షణ్ణంగా తనికీ చేశామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

11:55 - August 13, 2017

సిరిసిల్ల : రాష్ట్ర వ్యాప్తంగా నేరెళ్ల ఘటన సంచలనంగా మారింది. నెల రోజులకు పైగా రాష్ట్ర రాజకీయమంతా నేరెళ్ల చుట్టే తిరుగుతుంది. లారీ దహనం కేసులో ఎనిమిది మందిపై పోలీసులు థర్డ్‌ డిగ్రి ప్రయోగించి చిత్రహింసలు గురిచేసిన ఘటన...ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. ప్రజాసంఘాలు మొదలుకొని.. ప్రధాన ప్రతిపక్షాల వరకు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి... ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అదే స్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి అధికార టీఆర్‌ఎస్‌ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

తమ వైపుకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నాలు
నేరెళ్ల ఘటనను మొదట అంతగా పట్టించుకోని ప్రభుత్వం.. ప్రతిపక్షాల రగడతో...ఇరకాటంలో పడింది. దీంతో బాధితులను తమ వైపుకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వ వ్యూహాలు మొదటి నుంచి బెడిసికొడుతూనే ఉన్నాయి. బాధితులతో రాజీ కుదుర్చుకునేందుకు పలుమార్లు చర్చలు జరిపినా... పోలీసులు కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ రాయబారాలు చేసినా...అవేమి ఫలించలేదు. ఇక మంత్రి కేటీఆర్‌ బాధితులను కలిసి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ కేటీఆర్‌ పర్యటన వల్ల సమస్య సద్దుమణగకపోగా... ఆయన కూడా... బాధితుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర మంతా చర్చ జరుగుతున్నా... తనకు తెలియదంటూ కేటీఆర్‌ చెప్పడంతో బాధితులు మండిపడ్డారు.

ఓ ఎస్‌ఐ సస్పెండ్‌..
అలాగే... ఈ ఘటనకు సంబంధించి ఓ ఎస్‌ఐను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానీ ఇది కూడా బాధితులకు ఏ మాత్రం ఓదార్పునివ్వలేదు. న్యాయం కోసం బాధితులు, ప్రతిపక్షాలు ఆందోళనలు... నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనతో సిరిసిల్లలో కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నియోజకవర్గంలో కేటీఆర్‌ పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలు... నేరెళ్ల ఘటన... కేటీఆర్‌పై ఎన్నడూ లేని వ్యతిరేకతను తీసుకువచ్చాయి. 2014 ఎన్నికల్లో కేటీఆర్‌ గెలుపుకు కారణమైనటువంటి నేరెళ్ల, తంగళ్ల పల్లి, రామచంద్రపురం గ్రామాల ప్రజలు కేటీఆర్‌ అంటేనే మండిపడుతున్నారు.మొత్తానికి నేరెళ్ల ఘటనతో కేటీఆర్‌ ఓటు బ్యాంకుకు గండి పడిందని.. రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

11:45 - August 13, 2017

విజయనగరం : జిల్లా భోగాపురం మండలం చాకివలసలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బయటకు వెళ్లిన పైడమ్మ కరెంట్ వైర్ పై కాలేయండంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైడమ్మను వెతుకుతూ మేనల్లుడు కూడా కరెంట్ వైర్ ను తాకడంతో ఆయన మృతి చెందాడు. 

11:44 - August 13, 2017

విశాఖ : జిల్లాలోని తగరపువలసలో బ్రిడ్జిపై నుంచి గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. ఫైర్ సిబ్బంది ట్యాంకర్ వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ప్రజలను స్థానిక ప్రజలను అగ్నిమాపక అధికారులు ప్రమాద స్థలం నుంచి ఖాళీ చేయిస్తున్నారు. బోల్తా పడిన ట్యాంకర్ భారత్ గ్యాస్ కంపెనీకి చెందినదిగా అధికారులు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు గోరఖ్ పూర్ లో యూపీ సీఎం, కేంద్ర పర్యటన

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ ఆసుపత్రిని ఈ రోజు ఆ రాష్ట్ర సీఎం యోగి, కేంద్ర ఆరోగ్యా శాఖ మంత్రి జేపీ నడ్డా సందర్శించనున్నారు. గోరఖ్ పూర్ ఆసుపత్రిలో ఆక్సీజన్ అందక 6 రోజుల్లో 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే....

షార్జా విమానంలో సాంకేతిక లోపం

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిపోర్ట్ నుంచి దుబాయి బయల్దేరిన షార్జా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కాసేపటికే ఫైలట్ విమానాన్ని ఎయిపోర్ట్ లో దింపాడు. విమాన ఇంజన్ లో సంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. విమానంలో ఉన్న ప్రయాణికుల సక్షితంగా ఉన్న అధికారలు ప్రకటించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం, వరుస సెలవులతో భారీగా పెరిగిన తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్ భక్తులతో కళకళడుతుంది. శ్రీవారిదర్శనానికి 14గంటల సమయం పడుతుంది. నడకదారిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. భక్తులు గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

09:53 - August 13, 2017

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీవర్షాలకు... కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. మనాలి - పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడుతుండటంతో.. ఆ రహదారిని మూసివేశారు. దీంతో ప్రయాణికులు రోడ్లపైనే చిక్కుకున్నారు. కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


 

09:52 - August 13, 2017

రంగారెడ్డి : జిల్లా హిమాయత్‌ సాగర్‌ అవుటర్‌ రింగ్‌రోడ్‌పై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఎస్ఐ జలీల్‌ మృతిచెందాడు.. కారులోఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ట్రైనింగ్‌లోఉన్న జలీల్‌ తన ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

09:51 - August 13, 2017

స్పోర్ట్స్ : అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశించిన జమైకా దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ తన అభిమానులను నిరాశపరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఇటీవల జరిగిన 100 మీటర్ల రేసులో మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సంతృప్తి చెందిన బోల్ట్.. శనివారం రాత్రి జరిగిన 4X100 మీటర్ల రిలే ఫైనల్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగాడు. బ్యాటన్ అందుకుని కొద్ది దూరం పరుగెత్తిన వెంటనే తొడ కండరాలు పట్టేయడం, మోకాలినొప్పితో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. దీంతో ఏ పతకం లేకుండానే అంతర్జాతీయ కెరీర్‌ను బోల్ట్ ముగించాల్సి వచ్చింది. 

09:50 - August 13, 2017

కరాచీ : పాకిస్తాన్‌లోని క్వెట్టా నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 15 మంది మరణించారు. మరో 32మంది తీవ్రంగా గాయపడ్డారు. క్వెట్టా నగరంలో అత్యంత భద్రత కలిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ బస్టాప్‌ వద్ద ఈ పేలుడు సంభవించింది. బస్టాప్ సమీపంలో పార్క్‌ చేసిన వాహనంలో బాంబును ఉంచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ 32 మందిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

09:14 - August 13, 2017

సినిమా : రిసెంట్ గా విడుదలై సినిమాల్లో ఒకటైన లై క్రమక్రమంగా జోరు పెంచుతుంది. రానా శ్రీనివాస్ వారి వారి స్థాయిలో వారు కలెక్షన్స్ రాబడుతుంటే నితిన్ మూవీ లై లై సినిమా కాస్త వెనుకబడింది. మొదటి రోజు మాత్రం కలక్షన్ల పరంగా నేనే రాజు నేనే మంత్రి హవా కనిపించి. దీనికి కారణం ప్రమోషన్లు తక్కువగా చేయడమే అయ్యుండొచ్చు. 

అత్యంత భారీ బడ్జెట్
నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "లై" సినిమా ప్రేక్షకులను చాలా అకట్టుకుంటోందని ఈ సినిమాలో అర్జున్ నటన మరియు నితిన్ హీరోయిజం మేజర్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ తో పాటు హీరో హీరియిన్స్ సాగే ప్రేమ కథతో పాటు హీరో మరియు అర్జున్ కి మధ్య వచ్చే సన్నివేశాలు దర్శకుడు బాగా తెరకెక్కించాడు. సినిమాలో కాస్ట్ లీ విజువల్స్- ట్విస్ట్- స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఉండడం వల్ల ఎ సెంటర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రాబ్లమ్ అంతా బి-సి సెంటర్లతోనే. విషయం ఏంటంటే.. సినిమాకు శనివారం హైదరాబాద్ వంటి నగరాల్లో ఆక్యుపెన్సీ రేట్ ఉన్నట్లుండి పెరిగింది. శుక్రవారం ఓపెనింగ్స్ తక్కువొచ్చాయ్ కాని.. శనివారం మాత్రం మౌత్ టాక్ బాగుండటంతో ఆటోమ్యాటిక్ గా ఊపందుకుంది. మరి బి-సె సెంటర్లలో పరిస్థితి ఏంటనేది రెండో రోజు కలక్షన్ల గ్రాఫ్ చూస్తేకాని తెలియదులే.

వీకెండ్ లో 'లై' హవా
అసలే ఇండిపెండన్స్ డే వీకెండ్ కాబట్టి.. పాజిటివ్ టాక్ కాస్త వచ్చినా కూడా సినిమాకు ఈ నాలుగు రోజులు హౌస్ ఫుల్ కలక్షన్లే ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే.. నిధానంగా స్టార్ట్ అయిన 'లై' సినిమా నెమ్మదిగా ప్రభావం చూపించే ఛాన్సుంది. కాకపోతే సినిమాను భారీ బడ్జెట్ ను వసూలు చేయాలి కాబట్టి.. ఈ ప్రభావం ఎంత గట్టిగా చూపిస్తే అంతవర్కవుట్ అవుతుంది.

08:25 - August 13, 2017

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో చేపట్టిన బెంజ్ సర్కిల్ ప్లై ఓవర్ పనులు వేగం పుంజుకోనున్నాయి. పనులు వేగవంతం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆగస్టు చివరి నాటికి రెండవ దశ పనులకు జాతీయ రహదారుల సంస్థ బిడ్డింగ్ పిలిచే ఏర్పాట్లు చేస్తోంది. సదరు కన్సల్టెన్సీ సంస్థ నుంచి డీపీఆర్ వచ్చిన తర్వాత బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. అయితే బిడ్డింగ్ ప్రపోజల్స్ ను అధికారులు మొదట రూపొందిస్తారు. ఆ తర్వాత వాటిని ఎన్‌హెచ్‌ అధికారులు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు పంపిస్తారు. అక్కడే రెండో దశ పనుల టెండర్లు పిలిచి పాల్గొనే సంస్థలకు ఎన్‌హెచ్‌ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ ను విడుదల చేస్తారు. బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ మొదటి దశ పనుల కోసం జ్యోతి కన్వెన్షన్‌ నుంచి నిర్మలా జంక్షన్‌ వరకు మాత్రమే టెండర్లు పిలిచారు. తర్వాత ప్లైఓవర్‌ను పొడిగించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులు తిరస్కరించారు. ఈ దశలో విజయవాడ - మచిలీపట్నం నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులతో కలిసి ఫ్లైఓవర్‌కు కూడా సంయుక్తంగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్‌ను దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ దక్కించుకుంది.

డిజైన్‌ మార్పులు
ప్రస్తుతం సెంట్రల్ డివైడర్ స్థానంలో నాలుగు వరసల ఫ్లై ఓవర్ ను నిర్మించాల్సి ఉండగా దీని డిజైన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు మార్పులు చేశారు. ఫ్లైఓవర్‌ విజయవాడకు తలమానికంగా ఉండాలన్న సూచనలతో గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో మూడు లేన్లతో ఒక్కో ఫ్లై ఓవర్ ఉండేలా డిజైన్ రూపొందించారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక పార్ట్-2 ఫ్లై ఓవర్ పనులు వేగం పెరగాల్సిన అవసరం ఉంది. టీడీపీ నేతలు మాత్రం 2018 కల్లా అందుబాటులోకి తేస్తామని హామీ ఇచ్చారు. ఫ్లై ఓవర్ పనులు చూస్తే నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పైవంతెన ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని బెజవాడ వాసులు కోరుతున్నారు.

 

08:24 - August 13, 2017

నల్లగొండ : జిల్లా... చిట్యాల మండలంలో... కార్పొరేట్‌ దందా బయటపడింది. రాంకీ సంస్థ భూ దాహానికి... రైతులు బలయ్యారు. వారి భూముల నుంచి వారినే దూరం చేశారు. దీంతో రైతులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. వెలిమినేడు, గుండ్రాంపల్లి గ్రామాల మధ్య పలు పరిశ్రమలు పెట్టేందుకు సుమారు 1400 ఎకరాలను రాంకీ సంస్థ సేకరించింది. ఆరు సంవత్సరాల క్రితం ఎకరానికి 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు చెల్లించి... కొంతమంది రైతుల నుంచి భూమిని కొనుగోలు చేసింది. అయితే సంస్థ తమ అవసరాల కోసం భూముల్ని ముంబై బ్యాంకుల్లో మార్టిగేజ్ చేస్తూ.. సేల్ డీడ్‌ను ఎకరానికి 30 లక్షలుగా చూపించింది. దానికి సంబంధించిన ఆదాయపన్నును చెల్లించాలని ఐటి శాఖ ఇటీవల పలువురు రైతులకు నోటీసులు జారీ చేసింది. అయితే భూమిని అమ్మని రైతులకు కూడా ఈ నోటీసులు అందాయి. దీంతో వారంతా గందరగోళానికి గురయ్యారు. తర్వాత విషయం తెలిసి రైతులు ఆందోళనకు గురయ్యారు.

నకిలీ పత్రాలు సృష్టించి
రాంకీ సంస్థ తరపు భూ లావాదేవీలు జరిపిన కొందరు మధ్యవర్తులు... అక్రమంగా కొంతమంది రైతుల భూములను సొంతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వెలిమినేడు గ్రామానికి చెందిన రైతుల భూములను కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి చుట్టుపక్కల ఉన్న భూములను కూడా సదరు రైతులకు తెలియకుండా చౌటుప్పల్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇలా ఒక్క వెలిమినేడులోనే దాదాపు 30 మంది రైతుల నుంచి సుమారు 74 ఎకరాలకు పైగా నకిలీ పత్రాలు సృష్టించి రాంకీ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. గుండ్రాంపల్లిలోనూ ఇలా 40 ఎకరాలకు పైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు సమాచారం.

ఆత్మహత్యలే శరణ్యం
విషయం తెలుసుకున్న రైతులు... అధికారులను కలిసినా... వారు పట్టించుకోలేదు. దీంతో వారంతా సీపీఎం, ప్రజా సంఘాలను ఆశ్రయించారు. వారు వెలిమినేడులోని బాధిత రైతుల భూములను సందర్శించారు. భూముల పత్రాలను పరిశీలించారు. రాంకీ సంస్థతో కుమ్మక్కై అక్రమ రిజిష్ట్రేషన్‌కు రెవెన్యూ, రిజిష్ట్రేషన్ అధికారులు సహకరించారని.. వారి మద్దతు లేకుండా రిజిష్ట్రేషన్ జరగదని ప్రజాసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ భూముల్లో... రాంకీ సంస్థ నాటిన హద్దు రాళ్లను సైతం ప్రజాసంఘాల నేతలు తొలగించారు. రైతులను మోసం చేసిన రాంకీ సంస్థపైనా.. అధికారుల పైనా కఠిన చర్యలు తీసుకోవాలని..డిమాండ్‌ చేశారు. తమ భూములు తమకు అప్పగించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులపై... రాంకీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా చౌటుప్పల్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2012 ప్రాంతంలో పనిచేసిన ఓ మహిళా అధికారి ఈ భూబాగోతంలో కీలక పాత్ర పోషించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. 

 

 

08:22 - August 13, 2017

సిరిసిల్ల : రాష్ట్ర వ్యాప్తంగా నేరెళ్ల ఘటన సంచలనంగా మారింది. నెల రోజులకు పైగా రాష్ట్ర రాజకీయమంతా నేరెళ్ల చుట్టే తిరుగుతుంది. లారీ దహనం కేసులో ఎనిమిది మందిపై పోలీసులు థర్డ్‌ డిగ్రి ప్రయోగించి చిత్రహింసలు గురిచేసిన ఘటన...ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. ప్రజాసంఘాలు మొదలుకొని.. ప్రధాన ప్రతిపక్షాల వరకు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి... ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. అదే స్థాయిలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడానికి అధికార టీఆర్‌ఎస్‌ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.నేరెళ్ల ఘటనను మొదట అంతగా పట్టించుకోని ప్రభుత్వం.. ప్రతిపక్షాల రగడతో...ఇరకాటంలో పడింది. దీంతో బాధితులను తమ వైపుకు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేసింది. కానీ ప్రభుత్వ వ్యూహాలు మొదటి నుంచి బెడిసికొడుతూనే ఉన్నాయి. బాధితులతో రాజీ కుదుర్చుకునేందుకు పలుమార్లు చర్చలు జరిపినా... పోలీసులు కూడా ఆర్థిక సాయం చేస్తామంటూ రాయబారాలు చేసినా...అవేమి ఫలించలేదు. ఇక మంత్రి కేటీఆర్‌ బాధితులను కలిసి ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ కేటీఆర్‌ పర్యటన వల్ల సమస్య సద్దుమణగకపోగా... ఆయన కూడా... బాధితుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటనపై రాష్ట్ర మంతా చర్చ జరుగుతున్నా... తనకు తెలియదంటూ కేటీఆర్‌ చెప్పడంతో బాధితులు మండిపడ్డారు.అలాగే... ఈ ఘటనకు సంబంధించి ఓ ఎస్‌ఐను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానీ ఇది కూడా బాధితులకు ఏ మాత్రం ఓదార్పునివ్వలేదు. న్యాయం కోసం బాధితులు, ప్రతిపక్షాలు ఆందోళనలు... నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ప్రశ్నార్థకంగా  కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు
ఈ ఘటనతో సిరిసిల్లలో కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నియోజకవర్గంలో కేటీఆర్‌ పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాలు... నేరెళ్ల ఘటన... కేటీఆర్‌పై ఎన్నడూ లేని వ్యతిరేకతను తీసుకువచ్చాయి. 2014 ఎన్నికల్లో కేటీఆర్‌ గెలుపుకు కారణమైనటువంటి నేరెళ్ల, తంగళ్ల పల్లి, రామచంద్రపురం గ్రామాల ప్రజలు కేటీఆర్‌ అంటేనే మండిపడుతున్నారు.అలాగే... ఈ ఘటనకు సంబంధించి ఓ ఎస్‌ఐను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానీ ఇది కూడా బాధితులకు ఏ మాత్రం ఓదార్పునివ్వలేదు. న్యాయం కోసం బాధితులు, ప్రతిపక్షాలు ఆందోళనలు... నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మొత్తానికి నేరెళ్ల ఘటనతో కేటీఆర్‌ ఓటు బ్యాంకుకు గండి పడిందని.. రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

 

08:21 - August 13, 2017

హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట రెడీ అవుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లు శరవేగంగా జరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌ వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు ఇప్పటికే గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విస్తృతంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్స్‌, పోలీసు జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. గోల్కొండ కోటకు సుమారు రెండు కిలోమీటర్ల మేర పోలీసులు నిఘా పెట్టారు. స్వాతంత్ర్య వేడకుల కోసం దాదాపు 5వేల మంది పోలీసులు కోటపై మోహరించారు. డీసీపీలు, ఏసీపీలు, సీఐలతోపాటు ఎస్సైలు, కానిస్టేబుల్స్‌, హోంగార్డులో బందోబస్తులో పాల్గొంటున్నారు. కేవలం హైదరాబాద్‌ పోలీసులే కాదు.... జిల్లాల్లోని పోలీసు సిబ్బందికీ డ్యూటీలు వేశారు. వేడుకల్లో పాల్గొనే వీఐపీలు, వీవీఐపీలు , మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. త్రివర్ణ పతాకావిష్కరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. 

వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు 
వేడుకలు నిర్వహించే ప్రాంతంలో ప్రత్యేకంగా విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రిపూట అవి జిగేల్‌మంటూ ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్‌దీపాల వెలుగుల్లో గోల్కొండ కోట కాంతులీనుతోంది. కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేక గ్యాలరీని పోలీసులు ఏర్పాటు చేశారు. వీఐపీలు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

08:20 - August 13, 2017

హైదరాబాద్ : టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టిస్తుందన్నారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి. కేసీఆర్‌ ఇచ్చిన హమీలను అమలు చేయకపోవడంపై సమీక్ష జరిపించాలన్నారు. నేరేళ్ల ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఆలస్యంగా స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సభకు రక్షణ కల్పించలేక... పోలీసులు అడ్డుకోవడంపై చాడ తీవ్రంగా మండిపడ్డారు. 

08:08 - August 13, 2017

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం, వరుస సెలవులతో భారీగా పెరిగిన తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్ భక్తులతో కళకళడుతుంది. శ్రీవారిదర్శనానికి 14గంటల సమయం పడుతుంది. నడకదారిన భక్తులకు 3గంటల సమయం పడుతోంది. భక్తులు గదులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:22 - August 13, 2017

వైసీపీ సాక్షి పేపర్ ప్రాప్లెంట్ ల ఉపయోగిస్తున్నారని, వైసీపీ వారు డబ్బులు పంచుతున్న వీడియో మనం నీన్న చూశామని, ఎదెమైన టీడీపీదే విజయమని, జగన్ వాళ్ల నాన్న రాజశేఖర్ రెడ్డి ఎన్నడు కూడా అభివృద్ధి చేయాలలేదని, చంద్రబాబు గారు చొరవ తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని, గడిచిన మూడేళ్ల రాయసీమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని టీడీపీ అనురాధ అన్నారు. నంద్యాల పట్టణంలో ఎస్పీవై రెడ్డి లారీల్లో ప్రజలను రోజుకు రూ.500రూపాయాలు ఇస్తున్నారని, టీడీపీ వారు ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తున్నారని, ఏపీ కేబినెట్ మొత్తం నంద్యాల్లో మకం వేయడంతో పాలన కుంటుపడుతుందని వైసీపీ నేత రోశయ్య అన్నారు. రెండు పార్టీ భవిష్యత్ కు ఈ ఎన్నికలు సవాల్ గా మారాయని, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాని పార్టీలు కుని చేస్తున్నారని, జగన్ చెందినవారు అందరు అక్కడే, టీడీపీ చెందిన దాదాపు మొత్తం మంది మంత్రులు అక్కడే తిష్ట వేశారని, ఇప్పుడు బీజేపీ, టీడీపీతో ఉందా లేదా వైసీపీతో ఉందా అనేది చూడాలని విశాంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

నేడు శ్రీలంకతో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ఎంపిక

ఢిల్లీ : శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ కు నేడు భారత్ జట్టును ఎంపిక చేయానున్నారు. జట్టు సాయంత్రం ప్రకటించే అవకాశం ఉంది.

ప్రొకబడ్డీలో నేటి మ్యాచ్ లు

ప్రొకబడ్డీ : నేడు ప్రొకబడ్డీ లీగ్ లో రాత్రిమ 8 గంటలకు పట్నా వర్సెస్ యూపీ మ్యాచ్, రాత్రి 9గంటలకు గుజరాత్ వర్సెస్ జైపూర్ మ్యాచ్ జరగనుంది.

జూబ్లీహిల్స్ రోడ్డునెం.10 లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ : పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్డు నెం.10 డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 9కార్లు, 3బైక్ లను పోలీసులు సీజ్ చేశారు.

జమ్మూలో ఎన్ కౌంటర్

శ్రీనగర్ : జమ్మూలోని షోపియాన్ లో ఎదురుకాల్పులు ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు బంధించాయి.

Don't Miss